సాహసమే చేయ్‌రా డింభకా. అన్నది కదరా పాతాళభైరవి.
చొరవగా దూకకపోతే సాధించలేవురా నువ్వనుకున్నది అన్న పాట పాడుకుంటూ సాహసం చేయాల్సిందే అక్కడ కాఫీ కోసం. హాయిగా ఆస్వాదించే కమ్మటి కాఫీ కోసం అంత కష్టపడటం ఏంటి అనుకోకండి. ఎందకంటే ఇక్కడ కాఫీ షాపు వెళ్లడం అంటే డేరింగ్ టూర్ లాంటిది. నిజానికి ఇక్కడకు కాఫీ కోసం వెళ్తున్నట్లు ఉండదు..ఏదో పర్యాటకానికి వచ్చామా..అన్నట్లు ట్రెక్కింగ్‌లు, రకరకాల విన్యాసాలు చేసుకుంటూ పోవాలి. అలా అని వాళ్లేమి మనకు టాస్క్‌లు, సరదా గేమ్‌లు పెట్టడం లేదు. ఆ కాఫీ షాపుకు వెళ్లే వే అలా సాహసానికి కేరాఫ్‌గా ఉంటుంది. ఇంతకీ ఆ కాఫీ షాపు ఎక్కడుందంటే..
చైనాలోని యాంగ్షువో కౌంటీలోఈ వింతైన షాపు ఉంది. దీనిని 'ఎర్త్‌కోర్ ఎక్స్‌ప్లోరేషన్' అని పిలుస్తారు. ఒక గుహ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. అలా అని అంత ఈజీగా అది మనకు కనిపించదు. సాహసాలంటే ఇష్టపడే పర్యాటక ఔత్సాహికులకు ఈ కాఫీ షాప్ బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఇక్కడకు వెళ్లాలంటే అడుగడుగున ఓ సాహాసం చేయాలి, కొన్ని క్లిష్టమైన టాస్క్‌లు ఫేస్ చేయాల్సి ఉంటుంది.
వెళ్తునప్పుడూ మన కాఫీ కోసం వెళ్తున్నామా..లేక ఏదైనా ట్రెక్కింగ్ లేదా టూర్‌కి వచ్చామా అనే సందేహం కలుగకమానదు. అంతేకాదండోయ్ ఈ గుహ గుండా వెళ్లేటప్పుడూ హెల్మెట్, సురక్షితమైన బూట్లు తప్పనిసరి. గుహ గట్లు, ఇరుకైన మార్గాలు, లోతుగా ఉండే ప్రదేశాలు, కొన్నిచోట్ల తాళ్లు పట్టుకుని వెళ్లాల్సి ఉంటుంది. మరికొన్ని చోట్ల..నిర్జన చీకటి ప్రదేశం గుండా వెళ్లి..అక్కడ వంతెనలు ఎక్కాల్సి ఉంటుంది. అలా చివరికి కాఫీ కేఫ్‌కి చేరుకుంటాం.
అక్కడ సున్నపురాయి నిర్మాణాలు, స్టాలక్టైట్లు(మంచులా కనిపించే కాల్షియం కార్బొనేట్ అవపాతం), పైకప్పులు, చక్కటి లైటింగ్‌తో మరో ప్రపంచంలోకి అగుడుపెట్టిన అనుభూతి కలుగుతుంది. అరకరడ ఉన్న శ్వేత నేపథ్యానికి తగ్గట్టు ఉండే తెల్టి కుర్చీలు మొత్తం సెటప్ అదరహో అనిపిస్తుంది. భూగర్భ శాస్త్రాన్ని కాఫీ సంస్కృతితో కలుపుతున్నట్లుగా ఉంటుంది అక్కడి వాతావరణం.
ఈ కాఫీ కోసం ఎంతో శ్రమపడి వెళ్లి హాయిగా టేస్టీ కాఫీని ఆస్వాదించాల్సి ఉంటుంది మరి. మాములుగా కాఫీ తాగేస్తే మజా ఏం ఉంది..ఇలా డేరింగ్ ఫీట్లు చేస్తూ వెళ్లి కాఫీ తాగడంలోని కిక్కే వేరబ్బా..!. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోపై ఓ లుక్కేయండి.
(చదవండి: Fast Track Immigration: ఫాస్ట్-ట్రాక్ ఇమ్మిగ్రేషన్ అంటే..? సుస్మితా, రాణి ముఖర్జీలు సైతం..)


