breaking news
china
-
సీమంతానికి సిద్ధమవుతున్న ప్రెగ్నెంట్ ‘రోబో’లు!!
‘‘ఇనుములో ఓ హృదయం మొలిచెనే’’ అన్నది రోబో సినిమాలో ఓ పాట. అదే పాట పదాలను కాస్త మారిస్తే ‘నర రూప రోబో’ ఒకటి పాడే పాటల్లో పదాలిలా ఉండొచ్చు... అవి... ‘‘ఐ యామ్ ఏ సూపర్ గాళ్. ‘కనిపెంచే’ రోబో గాళ్... కడుపున మోసే ప్రెగ్నెంట్ గాళ్!! ’’ ఈ పాటలూ, మాటలూ... అందులోని పదాల ప్రస్తావననే ఇప్పుడెందుకంటే మహిళలు తమ గర్భాన మొయ్యాల్సిన ప్రెగ్నెన్సీ బరువును ఇకపై రోబోలే కడుపున మోసే రోజులు త్వరలో రానున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా చైనా ఒక రోబోను రూపొందించింది. అవును... ఇనుములో హృదయానికి బదులు ఇప్పుడో గర్భసంచి నిజంగానే రూపొందింది. వచ్చే ఏడాదికి అందులో బిడ్డ ప్రసవమూ జరగనుందంటోంది చైనా. ఆ వివరాలేమిటో చూద్దాం. గ్వాంగ్‌ఝూ నగరంలోని కైవా టెక్నాలజీస్ సంస్థ ఓ హ్యూమనాయిడ్ రోబోను రూపొందించింది. ఆ రోబో ప్రత్యేకత ఏమిటంటే... దాని కడుపున బిడ్డను మోసేలా ఓ కృత్రిమ గర్భసంచిని ఏర్పాటు చేశారు అక్కడి శాస్త్రవేత్తలు. ఇప్పుడీ ‘ఆర్టిఫిషియల్ ఊంబ్’ అమరి ఉన్న ఆ రోబో వచ్చే ఏడాదికి మార్కెట్లోకి రానుందని చెబుతున్నారు ‘కైవా టెక్నాలజీస్’ సంస్థ వ్యవస్థాపకుడు ఝాంగ్ క్వి ఫెంగ్. ఆయన చెబుతున్న ప్రకారం ఆ రోబో ధర దాదాపు లక్ష యువాన్ల కంటే తక్కువే. డాలర్లలో చె΄్పాలంటే 13,900 డాలర్లు. అంటే మన భారత కరెన్సీలో అటు ఇటుగా దాదాపు రూ. 12 లక్షలు!అదెలాగంటే... ఇదెలా సాధ్యమని అనుకోడానికి ఇప్పుడు వీల్లేదు. మనకు అర్థమయ్యే భాషలో చె΄్పాలంటే... ఇక్కడ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలను కృత్రిమ గర్భంలాంటి ఇంక్యుబేటర్‌లో పెట్టి సాకినట్టే... ఆ రోబోకు ఓ కృత్రిమ ఇంక్యుబేటర్ అమరి ఉంటుంది. కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో రూపొందే ఆ ఇంక్యుబేటర్... బిడ్డ పెరుగుదలను బట్టి సమకూర్చాల్సిన సౌకర్యాలూ, అందించాల్సినపోషకాలూ ఇవన్నీ అందిస్తుంది.అంతేకాదు... స్వాభావికంగా రూపొందించిన పిండాన్ని కృత్రిమంగా ఏర్పాటు చేసిన ఉమ్మనీటిలో (ఆమ్నియాటిక్ ఫ్లుయిడ్లో) ఉంచుతూ, ఓ పైపు ద్వారా కృత్రిమపోషకాలతో పెంచుతూ... నెలలు నిండి బిడ్డ పూర్తి రూపం సంతరించుకోవడం (జెస్టేషన్) పూర్తయ్యాక ప్రసవం పూర్తి చేసి ఆ గడుసుపిండాన్ని మానవ మాతృమూర్తి చేతుల్లో పెడుతుందా రోబో గట్టి‘పిండం’. అలా తన గర్భాన పెంచి తన కడుపు పంటను మానవ మహిళ చేతుల్లో ఉంచుతుందా ‘యంత్రమాత’!! ఈ విధంగా సరోగసీలో అమ్మల అవసరాల్ని తీర్చడమే కాదు... కడుపున బిడ్డ భారం మోయలేని అమ్మలకూ ఓ వరప్రసాదంలా మారనుందంటున్నారు ఝాంగ్ క్విఫెంగ్. ఈ కాన్సెప్టును ఈ ఏడాది బీజింగ్‌లో నిర్వహించిన ఓ కాన్ఫరెన్స్‌లోనే వెల్లడించారాయన. ‘‘ఈ రోబో కేవలం ఓ లైఫ్‌సైజ్ ఇంక్యుబేటర్ మాత్రమే కాదు. ఇది కేవలం హ్యూమనాయిడ్ రోబో మాత్రమే కాదు... కడుపున పెంచడం మొదలుకొని, కనేవరకూ... యంత్రగర్భంలోంచి ప్రసవం వరకు కడుపున పెరిగే సమయంలో ఏయే కార్యకలా పాలు జరుగుతాయో వాటన్నింటినీ నెరవేరుస్తూ చిన్నారి బిడ్డను పెంచే ఓ యాంత్రిక మమకారాల ‘గర్భ’కోశం’’ అంటూ వివరించారు ఝాంగ్ క్విఫెంగ్. ఇలా ఆయన తన కాన్సెప్టును వివరించారో లేదో ఈ తరహా రోబోల గర్భధారణల తాలూకు నైతిక అంశాలపై ప్రస్తుతం అక్కడ తీవ్ర చర్చ మొదలయ్యింది. అయితే ప్రస్తుతానికి జవాబు దొరకాల్సిన అంశాలు ఇంకా కొన్ని ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేమిటంటే... పిండాన్ని పెంచే కృత్రిమ గర్భమైతే రూపొందింది గానీ, వీర్యకణం, అండం తాలూకు ఫలదీకరణమంతా ఈ కృత్రిమ గర్భంలో జరుగుతుందా లేక టెస్ట్‌ట్యూబ్ బేబీలోలా బయట ఫలదీకరణ జరి పాక అందులో ప్రవేశపెడతారా, ప్రసవం తాలూకు తీరుతెన్నులేమిటి, ఈ తరహా గర్భం తాలూకు చట్టబద్ధత, నైతికత లాంటి అనేక అంశాలపై హాట్ హాట్ డిబేట్లు జరుగుతున్నాయి. – యాసీన్అటు అమెరికాలోనూ...చైనాలోని గర్భవతులైన యాంత్రిక రోబోల తీరుతెన్నులిలా ఉంటే... ప్రపంచపు మరో పక్కన అమెరికాలోని న్యూయార్క్ సిటీ మిడ్‌టౌన్‌లో ‘కాయిడ్ (కే ఓ ఐ డీ)’ అనే బ్రాండెడ్ రోబో వీధుల్లో తిరుగుతూ బర్గర్లూ, హ్యాంబర్గర్లు కొంటూ యంత్రమానవుల్లా సంచరిస్తోంది. దాన్ని చూస్తూ, నవ్వుతూ, భయపడుతూ, ఫొటోలూ తీసుకుంటున్న కొందరు రకరకాల కామెంట్లు చేస్తూ ఉన్నారు. ‘‘దేవుడు చెప్పినట్టుగా సాతాన్ స్వైరవిహారాలు చేసే కాలం వచ్చేసిందనీ’’, ‘‘మొదటి లైట్ బల్బ్నూ, మొదటి కారునూ నేను చూళ్లేదు గానీ... మొట్టమొదటి మానవ రోబోను చూస్తున్న అనుభూతిని నాకు సొంతం చేసిందీ కాయిడ్’’ అంటూ పలుపలు విధాల కామెంట్స్ వినవస్తున్నాయి. దీనికి భిన్నంగా పాజిటివ్ కామెంట్సూ వినవస్తున్నాయి. అవేమిటంటే... ‘‘ఇదో అద్భుతం’’ అని కొందరూ; ‘‘కుక్కల బొచ్చు వల్ల అలర్జీలతో బాధపడేవారికి ఇవి వాచ్‌డాగ్స్‌లా, అసిస్టెంట్లుగా పనిచేస్తాయి’’ అంటూ ఇంకొందరూ, ‘‘మా ఇంట్లో పనిమనిషిలా వాడుకుంటా’’ అంటూ మరికొందరు మరో వైపున మరో తరహా కామెంట్లూ స్వైరవిహారం చేస్తున్నాయి. అన్నట్టు ఈ కాయిడ్ రోబో కూడా ‘యూనీ ట్రీ’ అనే చైనీస్ రోబోటిక్ సంస్థ రూపొందించగా లాంగ్ ఐలాండ్ బేస్డ్ రోబో స్టోర్ అనే స్టాన్ఫార్డ్ సాఫ్ట్వేర్ ఆధారంగా ఇది రూపొందిందంటున్నారు అక్కడి నిపుణులు. -
భారత్-చైనా సంబంధాల్లో మరో మలుపు.. ఎరువుల సరఫరాకు చైనా ఓకే
న్యూఢిల్లీ: భారత్- చైనా సంబంధాలు ఉద్రిక్తతల దశ నుంచి సాధారణ స్థాయికి క్రమంగా చేరుకుంటున్నాయి. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా వాంగ్ యి తమ దేశం భారత్‌కు అవసరమైన ఎరువులు, అరుదైన భూ ఖనిజాలు, టన్నెల్ బోరింగ్ యంత్రాలు (టీబీఎం) సరఫరాను తిరిగి ప్రారంభిస్తుందని హామీ ఇచ్చారు.గత నెలలో జైశంకర్ తన చైనా పర్యటనలో.. యూరియా, అరుదైన భూ ఖనిజాలు, టీబీఎం సరఫరాల అంశాన్ని చైనా మంత్రి వాంగ్ యి దగ్గర ప్రస్తావించారు. దీనికి ఇప్పుడు చైనా మంత్రి సానుకూలంగా స్పందించారు. కాగా తైవాన్ విషయంలో భారత వైఖరిలో ఎటువంటి మార్పు లేదని విదేశాంగ మంత్రి జైశంకర్ చైనా ప్రతినిధి ఎదుట స్పష్టం చేశారు.చైనా ఏడాదిగా భారత దిగుమతులపై బ్రేక్ వేసింది. అయితే ఇప్పుడు తాజాగా చైనా తమ దేశపు ఎరువులు, టీబీఎం, అరుదైన భూ ఖనిజాలను సరఫరా చేయడానికి అంగీకరించడం ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుతున్నాయడానికి ఉదాహరణగా నిలిచింది. ఇకపై చైనా దాదాపు 30 శాతం ఎరువులను భారతదేశానికి సరఫరా చేయనుంది. అలాగే అరుదైన భూ ఖనిజాలను పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి టన్నెల్ బోరింగ్ యంత్రాలను సరఫరా చేయనుంది.జైశంకర్-వాంగ్ సమావేశంలో సరిహద్దులకు సంబంధించిన చర్చలేవీ జరగలేదు. దీనిపై ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ చర్చించనున్నారని సమాచారం. వీరి భేటీ ప్రధానంగా 3488 కి.మీ వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ)పై బలగాల తీవ్రతను తగ్గించడంపై దృష్టి పెట్టనుంది. లడఖ్‌లో సరిహద్దు ఘర్షణ,పెట్రోలింగ్ సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. భారత్- చైనా సైన్య బలగాలు ఇప్పటికీ సరిహద్దుల్లో మోహరించి ఉన్నాయి. -
అందుకే భారత్‌పై సుంకాలు.. చైనా, ఈయూ దేశాలకు మినహాయింపు
రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు జరుపుతుందని.. తద్వారా ఉక్రెయిన్ యుద్ధంలో పరోక్షంగా ఆర్థిక సాయం అందిస్తోందని ఆరోపిస్తూ ట్రంప్ ప్రభుత్వం భారత్‌పై ఏకంగా 50 శాతం సుంకాలు(25 శాతం పెనాల్టీతో కలిపి) విధించింది. ఈ నిర్ణయాన్ని భారత్ తీవ్రంగా తప్పుబడుతూ.. అదే పని చేస్తున్న చైనా, ఈయూల విషయంలో మినహాయింపు దేనికని అమెరికాను నిలదీసింది. దీనికి తోడు చైనా విషయంలో ట్రంప్ ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంపైనా పలు అనుమానాలు వ్యక్తం చేసింది. అయితే..అమెరికా చైనాను ఎందుకు మినహాయించింది? ఇండియాపై భారీ టారిఫ్‌లు ఎందుకు? అనే ప్రశ్నలకు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో వివరణ ఇచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయనకు ఈ ప్రశ్నలు ఎదురు కావడంతో ఆయన వివరణ ఇచ్చారు. ‘‘భారత్, చైనాలు రష్యా నుంచి చమురు కొనుగోలు జరిపే దేశాలే. ఆ రెండు మాస్కోకు ప్రధాన భాగస్వాములే. అందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. కానీ, భారత్‌తో పోలిస్తే చైనా పరిస్థితులు అందుకు కాస్త భిన్నంగా ఉన్నాయి.... భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేసి లాభపడుతోంది. అదే రష్యా నుండి చమురు కొనుగొలు చేసి.. దాన్ని శుద్ధి చేసి ప్రపంచ మార్కెట్‌కు చైనా విక్రయిస్తోంది. ఒకవేళ.. చైనా మీద మీద గనుక అదనపు సుంకాలు విధించాల్సి వస్తే ఆ ప్రభావంతో ప్రపంచ చమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది’’ అని రుబియో వ్యాఖ్యానించారు.చైనాలో శుద్ధి అవుతున్న రష్యా చమురు గ్లోబల్ మార్కెట్లోకి వెళ్తోంది. ఒకవేళ చైనాపై అదనపు సుంకాలుగానీ, ఆంక్షలుగానీ విధించాల్సి వస్తే.. శుద్ధి చేసిన ఆ చమురు ప్రపంచ మార్కెట్‌కు అందదు. చమురు కొనుగోలు చేసే దేశాలు అధిక ధరలు చెల్లించాల్సి వస్తుంది. లేదంటే.. ప్రత్యామ్నాయ వనరులు వెతకాల్సి ఉంటుంది. అంతెందుకు.. చైనా నుంచి శుద్ధి చేయబడిన చమురును యూరప్ దేశాలే కొనుగోలు చేస్తున్నాయి. అదే సమయంలో.. యూరప్ దేశాలు స్వయంగానూ చమురు, సహజ వాయువును రష్యా నుంచి కూడా కొనుగోలు చేస్తున్నాయి. ఇంతకు ముందు.. చైనా, అమెరికాపై వంద శాతం సుంకాలు విధించాలనే సెనెట్ బిల్లు ప్రతిపాదనపై యూరోపియన్ దేశాలు పరోక్షంగా ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ ఆందోళన్నింటిని పరిగణనలోకి తీసుకునే ఆ పని చేయడం లేదు అని అన్నారాయన.మరి ఐరోపా దేశాలపై సుంకాలు?మరి రష్యా నుంచి చమురు, సహజ వాయువును కొనుగోలు చేస్తున్న యూరప్ దేశాలపై సుంకాలు విధిస్తారా? అనే ప్రశ్నకు రూబియో బదులిచ్చారు. యూరప్ నేరుగా ఆంక్షలు, సుంకాల విధింపు గురించి నా దగ్గర స్పష్టమైన సమాచారం లేదు. కానీ, పరోక్షంగా విధించే అవకాశాలు మాత్రం లేకపోలేదని అన్నారాయన. ఈ విషయంలో యూరోపియన్ దేశాలతో టిట్ ఫర్ టాట్ తరహా వాదనలు (tit-for-tat) చేయడం నాకు ఇష్టం లేదు. కానీ, ఈ సమస్యను పరిష్కరించడంలో యూరోప్ నిర్మాణాత్మక పాత్ర పోషించగలదని మాత్రం నమ్ముతున్నా అని రుబియో అభిప్రాయపడ్డారు. -
రక్తపోటును పెంచేస్తున్న సూరీడు!
వాషింగ్టన్: ఎండ తగిలితే ఒళ్లు వేడెక్కుతుంది. రాత్రిళ్లు ఒళ్లు చల్లబడుతుంది. కానీ రాత్రి పగలు అని తేడా లేకుండా ఎప్పుడైనా సరే మన రక్తపోటును సూరీడు ప్రభావితం చేస్తాడనే కొత్త విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆరు సంవత్సరాలపాటు చైనాలోని క్వింగ్డావో, వేహాయ్ నగరాల్లోని 5,00,000 మంది ప్రజల రక్తపోటు స్థాయిలను పర్యవేక్షించి శాస్త్రవేత్తలు ఈ కొత్త విషయాన్ని కనుగొన్నారు. సౌరతుపాన్ల కారణంగా భూమి మీదకు దూసుకొచ్చే ఉష్ణగాలులు మన భూ అయాస్కాంతావరణాన్ని ప్రభావితంచేసి చివరకు మన బీపీని పెంచేస్తాయని స్పష్టమైంది. సౌరతుపాన్ల కారణంగా భూ అయాస్కాంతావరణంలో సంభవించే మార్పులు మానవ ఆరోగ్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావాలు చూపతాయనే దానిపై అధ్యయనం సాగింది. ముఖ్యంగా మహిళల బీపీని సౌరతుపాను ప్రభావితం చేస్తుందని అధ్యయనంలో వెల్లడైంది. అయితే ఈ సౌరతుపాను దృగి్వషయం మన బీపీని ప్రమాదకరస్థాయిలో పెంచేస్తుందా? దీని ఇతర దుష్ప్రభావాలు ఏంటనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సౌర గాలులకు మానవ ఆరోగ్యానికి మధ్య సంబంధం ఉందని తెల్చే ఈ పరిశోధనా తాలూకు వివరాలు తాజాగా కమ్యూనికేషన్స్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. పరిశోధనలో భాగంగా మధ్యస్థాయి అయస్కాంతావరణం ఉండే చైనాలోని రెండు నగరాలను ఎంచుకున్నారు. అక్కడి 5లక్షలకుపైగా ప్రజల రక్తపోటు స్థాయిల రికార్డ్లను సౌరతుపాన్ల కాలంతో పోల్చిచూశారు. భూ అయస్కాంతావరణం(జీఎంఏ)లో మార్పులకు తగ్గట్లు అక్కడి ప్రజల బీపీలో హెచ్చుతగ్గులు ఉన్నట్లు కనుగొన్నారు. ముఖ్యంగా మహిళల బీపీ అనేది జీఎంఏకు అనుగుణంగా స్పందిస్తున్నట్లు స్పష్టమైంది. ఇప్పటికే రక్తపోటుతో బాధపడుతున్న వారికి సౌరశక్తి అనేది ప్రతికూలకంగా మారుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలు విధాన నిర్ణయాలు మరింత సమర్థవంతంగా తీసుకునేందుకు ఇలాంటి పరిశోధనలు దోహదపడతాయిన వారు చెప్పారు. సౌరతుపాన్లు ఇప్పటికే ఉపగ్రహాలు, కమ్యూనికేషన వ్యవస్థలు, విద్యుత్ గ్రిడ్లపై పెను ప్రభావం చూపుతున్న విషయం తెల్సిందే. ఇప్పుడీ జాబితాలోకి మానవ ఆరోగ్యం వచ్చిచేరింది. భూగోళం మీది వాతావరణంతోపాటు అంతరిక్ష అంశాలు సైతం మనిíÙపై ప్రభావం చూపుస్తాయని తాజా అధ్యయనం చాటుతోంది. -
మన ముందున్న 'ఏఐ' బాధ్యత
కశ్మీర్లో మళ్ళీ హింసాయుత సంఘట నలు పెచ్చుమీరడం చూశాక, రణ తంత్రంలో టెక్నాలజీ, ముఖ్యంగా జనరే టివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ (జెన్ ఏఐ) పాత్ర గురించిన ప్రశ్నలు నా మెదడును తొలవడం ప్రారంభించాయి. మీరు బత కండి, ఇతరులను బతకనివ్వండి అనే తాత్త్వికత భారతదేశానికి పునాది. అంత మాత్రాన దురాక్రమణను చూస్తూ ఊరు కుంటామని కాదు. ఫినాన్షియల్ సర్వీసులు, ఏరోస్పేస్, సెమీకండక్టర్లు, వస్తూత్పత్తి వంటి కీలకమైన పరిశ్రమల్లో ఏఐని బాధ్యతాయుతంగా వర్తింపజేసే పనిలో ఉన్న వ్యక్తిగా, మేం అభివృద్ధి చేసే సాధనాలకున్న కలవర పరచే ద్వంద్వ వినియోగ సామర్థ్యం గురించి నాకు బాగా తెలుసు. సామర్థ్యానికి, నవీకరణకు చోదక శక్తిగా పనిచేసే అదే టెక్నాలజీ హానికరమైన ఆయుధంగానూ పరిణమించవచ్చు. మనం కీలకమైన ఘట్టంలో ఉన్నాం. జెన్ ఏఐ సాంకేతిక పురోగతిగా చెప్పుకొనే స్థాయి నుంచి చాలా వేగంగా ప్రగాఢమైన భౌగోళిక రాజకీయ సాధనంగా మారుతోంది. ఏ గూటి ఏఐ...అధునాతన జెన్ ఏఐ సామర్థ్యాలను సంతరించుకున్న దేశా లకూ, విదేశాలలో అభివృద్ధి చెందిన సిస్టంలపై ఆధారపడిన దేశా లకూ మధ్యన కొట్టొచ్చినట్లు కనిపించే చీలిక వ్యూహపరంగా తీవ్ర మైన రిస్కులను రేకెత్తిస్తోంది. ఏఐని అభివృద్ధి చేస్తున్న ప్రధాన దేశాలు, ముఖ్యంగా అమెరికా, చైనాల ప్రయోజనాలు, పక్షపాతా లతో రూపుదిద్దుకున్న మోడళ్ళు అనివార్యంగా వాటిని సృష్టించిన వారి కథనాలనే వ్యాప్తి చేస్తాయి. అవి తరచూ ప్రపంచ నిష్పాక్షికతను నీరుగారుస్తాయి. ఓపెన్ ఏఐకి చెందిన జీపీటీ సిరీస్ లేదా చైనాకు చెందిన డీప్ సీక్ వంటి ఏఐ మోడళ్ళలో అంతర్లీనంగా నిక్షిప్తమైన పక్షపాతాలనే పరిశీలించండి. అవి చాలా శక్తిమంతంగా భౌగోళిక రాజకీయ అభి ప్రాయాలను ప్రతిబింబిస్తాయి. ఈ మోడళ్ళు వాటి మాతృదేశాలపై వచ్చే విమర్శలను తగ్గిస్తాయి. దానితో ఆగక పక్షపాతాల వల్ల అంత ర్జాతీయ ఉద్రిక్తతలను మరింత పెంచుతాయి. ఉదాహరణకు, చైనా ఏఐ దృక్పథం దాని జాతీయ విధాన వైఖరులను బలంగా చాటు తుంది. సరిహద్దు వివాదాలలో చైనా వైపునే న్యాయం ఉన్నట్లు చెప్పే స్తుంది. సార్వభౌమాధికారం ఉన్న సంస్థలను కూడా చట్ట బద్ధమైనవి కావని తోసిపారేస్తుంది. ఫలితంగా, అస్తుబిస్తుగా ఉన్న దౌత్యసంబంధాలు మరింత జటిలంగా మారతాయి. కశ్మీర్ వంటి సున్నిత మైన ప్రాంతాల్లో ఇది ఇంకా ఎక్కువ ప్రస్ఫుటమవుతుంది. సుస్థిరత కోసం డిజిటల్ పోటీగతంలో పరస్పరం విధ్వంసాన్ని చవిచూడటం ఆ యా దేశాల వద్దనున్న అణ్వాయుధాలపై ఆధారపడి ఉండేది. నేటి ఆయుధాల పోటీలో ‘డిజిటల్’ ఆ స్థానాన్ని ఆక్రమించింది. అంతర్జాతీయ సుస్థిర తకు కొత్త రూపునిచ్చే సామర్థ్యంలో ఏఐ అణ్వాయుధాలతో సమా నంగా ప్రాధాన్యం ఉన్నదే. కాలం చెల్లిన ఈ చట్రాన్ని మనం అత్య వసరంగా పునః పరిశీలించవలసి ఉంది. డిజిటైజేషన్ ద్వారా పర స్పరం పురోగతి సాధించే కొత్త విధానానికి మళ్ళాలని నేను చెప్ప దలచుకున్నాను. ఈ నమూనా విధ్వంసకర పోటీ నుంచి నలుగురితో కలసి అభివృద్ధిని, సాంకేతిక స్వావలంబనను సాధించేందుకు ప్రాధాన్యం ఇచ్చేట్లు చేస్తుంది. ఈ కొత్త నమూనాను అనుసరించేందుకు దేశాలు, ముఖ్యంగా టెక్నాలజీపరంగా దుర్బలంగా ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాలు స్వతంత్రమైనవి, సాంస్కృతిక పరిజ్ఞానం ఉన్నవి అయిన ఏఐదొంతరలను ఏర్పరచుకోవలసి ఉంటుంది. అటువంటి స్వయం ప్రతిపత్తి మాత్రమే స్థానిక చరిత్రలను, సంస్కృతులను, రాజకీయ పరమైన సూక్ష్మ భేదాలను ప్రతిబింబించగలుగుతుంది. అప్పుడే ఈ దేశాలు బాహ్యపరమైన మాయోపాయాలకు లోనుకాకుండా నిల బడగలుగుతాయి. సాంస్కృతిక వివరాలను పుష్కలంగా నిక్షిప్త పరచుకున్న ఏఐ, దుష్ప్రచారం నుంచి తమ దేశాన్ని కాపాడుకోవ డమే కాదు సిసలైన అంతర్జాతీయ చర్చలను పెంపొందించ గలుగు తుంది. సమతూకంతో కూడిన బహుళపక్ష ఏఐ ల్యాండ్‌స్కేప్ ఏర్ప డేందుకు తోడ్పడగలుగుతుంది. ప్రపంచంలో ప్రాబల్యం వహిస్తున్న ఏఐ మోడళ్ళు ప్రాథమికంగా ఇంగ్లీషు, చైనా భాషల్లో రూపొందినవి. అవి 22 అధికార భాషలు, వందలాది మాండలికాలతో కూడిన, భాషాపరంగా,సాంస్కృతికంగా బహుళత్వంతో నిండిన భారత్ వంటి వైవిధ్యభరి తమైన దేశాలను ప్రమాదకరమైన స్థితిలోకి నెడుతున్నాయి. భాషా పరంగా సూక్ష్మమైన భేదాలను పట్టుకోలేని ఏఐ అవగాహనా లోపా లను సృష్టించే అవకాశం ఎంతైనా ఉంది. అవి దౌత్యపరంగా తీవ్ర మైన పర్యవసానాలకు దారితీయవచ్చు. దీన్ని నివారించడానికిసాంస్కృతిక చైతన్యం కలిగిన అధునాతన ఏఐ మోడళ్ళను అభివృద్ధి చేయడం ఆవశ్యకం. మరాఠీ–గుజరాతీ లేదా తమిళం–కన్నడంవంటి సంబంధిత భాషలలో ఉన్న సారూప్యాలను బహుభాషా ఏఐ సిస్టంలు వినియోగించుకుని తీరాలి. అప్పుడు ఆ యా భాషల్లోఉండే గాఢతను, సూక్ష్మతరమైన భేదాలను విస్మరించకుండా వేగంగా ఆంతర్యాన్ని అందిపుచ్చుకోవడం సాధ్యమవుతుంది. నిర్ణయాధికారం మనిషిదే కావాలి!సామాజిక మౌలిక సదుపాయాలలోకి, నిర్ణయాలు తీసుకొనే ప్రక్రియలలోకి జెన్ ఏఐ మమేకం అయితే అది మానవ పాత్రలకు తప్పకుండా కొత్తరూపునిస్తుంది. సమర్థత విషయంలో ఆటోమేషన్ బ్రహ్మాండమైన ఆశలు రేపుతున్న మాట నిజమేకానీ, యుద్ధ తంత్రం వంటి జీవన్మరణ సందర్భాలలోనూ నిర్ణయం తీసుకునే బాధ్యతను ఏఐ సిస్టంలకు అప్పగించేయడం ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఈ సందర్భంగా నాకు, ప్రచ్ఛన్న యుద్ధ కాలానికి సంబంధించి 1983 నాటి ఉదంతం ఒకటి గుర్తుకువస్తోంది. ఆనాటి సోవియట్ లెఫ్టినెంట్ కల్నల్ స్టానిస్లావ్ పెట్రోవ్ సాంకేతిక తార్కిక ప్రమాద హెచ్చరి కల కన్నా మానవ అంతఃకరణనే ఎక్కువ లెక్కలోకి తీసుకున్నారు. ఫలితంగా, ఒక అణు వినాశనాన్ని నివారించగలిగారు. మనుషులు ఒక నిర్ణయం తీసుకునే లేదా ఆలోచించే పనిని ఇష్ట పూర్వకంగానే బీజగణితాలకు అప్పగించేస్తారేమోనని నన్నొక పెద్ద భయం వెన్నాడుతోంది. ఆ రకమైన భవిష్యత్తును మనం అంగీకరించకూడదు. మానవ విజ్ఞతకు ఏఐ ఉపయోగపడాలే కానీ, విజ్ఞత స్థానాన్ని అది ఆక్రమించకూడదని డిమాండ్ చేసే కర్తవ్యం, అలా జరగకుండా చూసే బాధ్యత నవీకరణవేత్తలుగా, టెక్నాలజిస్టులుగా, ప్రపంచ పౌరులుగా మనందరి మీదా ఉంది. మానవాళి విజ్ఞతను పక్కకు తోసేసే టెక్నాలజీని ఎన్నటికీ అనుమతించేది లేదని ఈ రోజే మనం ప్రతిన బూనుదాం.-వ్యాసకర్త ఏఐ కంపెనీ ‘ఆర్టికల్8’ వ్యవస్థాపక సీఈఓ(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)-అరుణ్ సుబ్రమణియన్ -
300 ఏళ్ల జిమ్ సభ్యత్వం ఓనర్ జంప్ : కోటి రూపాయలు గోవిందా!
ఫీజు రాయితీ వస్తుందని వన్ ఇయర్ సబ్స్క్రిప్షన్, టూ ఇయర్స్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం కామన్. కానీ ఒక వ్యక్తి 300 ఏళ్ల సభ్యత్వం అంటూ కోటి రూపాయలు చెల్లించాడు. ఆనక లబోదిబో మన్నాడు. కమీషన్లకు కక్కుర్తి పడి ఏకంగా 300 ఏళ్లకు సభ్యత్వాన్ని తీసుకోవడం వింతగా నిలిచింది. విషయం ఏమిటంటే..తూర్పు చైనాలోని ఒక వ్యక్తి జిమ్ కోసం 300 సంవత్సరాల పాటు చెల్లుబాటు అయ్యేలా సభ్యత్వం తీసుకున్నాడు. ఈ కోచింగ్ సెషన్ల కోసం 870,000 యువాన్లు (సుమారు రూ. 1 కోటి) వెచ్చించాడు. వన్ ఫైన్ మార్నింగ్ జిమ్ తెరిచి ఉంది ఓనర్ మాత్రం పరార్. అయితే రిసెప్షనిస్టులు, ఇతర సిబ్బంది మాత్రమే ఉన్నారని జెజియాంగ్ టీవీ నివేదించింది. దీంతో జిమ్ యజమాని తన డబ్బుతో అదృశ్యమయ్యాడని గ్రహించిన జిన్ పోలీసులను ఆశ్రయించాడు.సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (SCMP) నివేదిక ప్రకారం హాంగ్జౌలోని బింజియాంగ్ జిల్లాలోని రాంయన్ జిమ్‌లో మూడు సంవత్సరాలుగా క్రమం తప్పకుండా వెళ్లేవాడు. దీంతో మే నెలలో, ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ అతనికి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు: 8,888 యువాన్లకు (సుమారు రూ. 1 లక్ష) ఒక సంవత్సరం సభ్యత్వాన్ని కొనుగోలు చేసి, దానిని దాదాపు రెట్టింపు ధరకు కొత్త కస్టమర్లకు తిరిగి అమ్ముకోవాలని డీల్ సెట్ చేశాడు. ఒక వేళ రెండు నెలల్లోపు కార్డులు అమ్మకపోతే మార్కప్‌లో 90 శాతం వాటా, పూర్తి వాపసు ఇస్తానని జిన్‌కు హామీ కూడా ఇచ్చాడు.ఇదీ చదవండి: ఒత్తైన మెరిసే జుట్టు కోసం ఈ ఆయిల్ ట్రై చేశారా?మొదట్లో ఒకటీ రెండు డీల్స్‌కు బాగానే వర్కౌట్ అయింది. ఈ కమిషన్ ఆశతో మే 10-జూలై 9 మధ్య మొత్తం 300 ఏళ్లకు చెల్లుబాటు అయ్యేలా కోటి రూపాయల విలువ చేసే కాంట్రాక్ట్స్‌పై సంతకాలు చేశాడు. ఒప్పందం ప్రకారం జూలై 15 నాటికి కొంత భాగాన్ని తిరిగి ఇవ్వాల్సిన సమయానికి ఏవేవో కుంటి సాకులు చెప్పడం మొదలు పెట్టారు. అలా జూలై చివరి నాటికి జిమ్ ఓనరే అదృశ్యమయ్యాడు. జిమ్ నిర్వహణ, అమ్మకాల బృందం అదృశ్యం కావడంతో జిన్‌కు జ్ఞానోదయమైంది. క్షణాల్లో డబ్బు వస్తుందని నమ్మి మోసపోయాను అంటూ స్థానిక మీడియాతో వాపోయాడు జిన్. జిన్ తన నష్టాన్ని భర్తీ చేసుకోవడంతోపాటు, ఇతరులను హెచ్చరించే ఉద్దేశంతో కోర్టులు, మీడియాను ఆశ్రయించాడు. ఈ కేసు చైనా ఫిట్నెస్ పరిశ్రమలో దూకుడు, వినియోగదారుల రక్షణ లేకపోవడంపై బహిరంగ చర్చకు దారితీసింది.చదవండి: అమితాబ్ పరువు తీస్తోంది.. సిగ్గులేని మనిషి : జయపై కంగన ఫైర్ -
టారిఫ్‌లకు మరో 90 రోజుల విరామం
వాషింగ్టన్: ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన అమెరికా–చైనాల మధ్య ఉద్రిక్తతలకు కొంత విరామం దొరికింది. సోమవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి చైనాపై అమల్లోకి రావాల్సిన భారీ టారిఫ్‌లను 90 రోజులపాటు వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుపై సంతకం చేశానని సొంత ట్రూత్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. చైనా వాణిజ్య శాఖ కూడా ఇదే రకమైన ప్రకటన చేసింది. అమెరికా ఉత్పత్తులపై అదనంగా విధించిన టారిఫ్‌లకు 90 రోజుల పాటు విరామమిస్తున్నట్లు తెలిపింది.ఈ పరిణా మంతో రెండు దేశాలు తమ మధ్య విభేదా లను చర్చల ద్వారా పరిష్కరించుకునే వెసు లుబాటు లభించినట్లయింది. అంతేకాదు, ఈ ఏడాది చివర్లో జరగాల్సిన ట్రంప్– జిన్‌పింగ్‌ల శిఖరాగ్రానికి మార్గం సులువైనట్లేనని భావిస్తున్నారు. తాజా పరిణామాన్ని చైనాతో వాణిజ్యం చేసే అమెరికా కంపెనీలు స్వాగతించాయి. ప్రమాదకర డ్రగ్ ఫెంటానిల్‌పై ఒప్పందం కుదిరితే, అమెరికా టారిఫ్‌లు తగ్గుతాయి, చైనా ప్రతీకార చర్యలను ఉపసంహరించుకుంటుందని అమెరికా–చైనా బిజి నెస్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సీన్ స్టెయిన్ అభి ప్రాయపడ్డారు.దాదాపు అన్ని దేశాలపైనా అత్యధికంగా టారిఫ్‌లు, పన్నులు విధించడం ద్వారా ప్రపంచ వాణిజ్య వ్యవస్థను కకావికలం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా విషయంలో మాత్రం తాత్సారం చేస్తు న్నారు. కీలక ఖనిజాలు, ఎలక్ట్రిక్ వాహ నాలు మొదలు జెట్ విమానాల ఇంజన్ల వరకు వాడే మాగ్నెట్లపై చైనా ఆధిపత్యం ఉండటమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఈ ఏడాది మేలో చైనా ఉత్పత్తులపై 145 శాతం టారిఫ్‌లను ట్రంప్ ప్రకటించగా, అమెరికా ఉత్పత్తులపై డ్రాగన్ దేశం 125శాతం టారిఫ్ లను విధించింది. అనంతరం, రెండు దేశాలు వెనక్కి తగ్గి, జెనీవాలో చర్చలు మొదలుపెట్టాయి. -
మళ్లీ డ్రాగన్‌తో విమాన బంధం!
న్యూఢిల్లీ: కోవిడ్ సంక్షోభం, గల్వాన్ ఉద్రిక్తతలతో బీటువారిన చైనా, భారత్ బంధానికి భారతీయ విమానాలు మళ్లీ ఆకాశ మార్గాన స్నేహవారధి నిర్మించను న్నాయి. నాలుగేళ్లుగా ఆగిపోయిన భారత్, చైనా నేరుగా విమానసర్వీసులను త్వరలో పునరు ద్ధరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. టియాజిన్ సిటీలో జరగబోయే షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సు కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనాలో పర్యటించనున్న నేపథ్యంలో భారత్–చైనా మధ్య నేరుగా విమాన సర్వీసులు పునరు ద్ధరణ బాటలో పయనిస్తుండటం విశేషం.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎడాపె డా టారిఫ్‌ల మోత మోగించడంతో విసిగి పోయిన భారత్, చైనాలు మళ్లీ స్నేహగీతాన్ని ఆలపించనున్నాయని, అందులో భాగంగానే నేరుగా విమానసర్వీసుల పునర్‌ప్రారంభానికి శ్రీకారం చుడుతున్నారని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. నాలుగు సరిహద్దు రాకపోకల మార్గాల గుండా సరకు రవాణాకు ఇరుదేశాలూ మొగ్గు చూపుతు న్నవేళ నాలుగేళ్ల తర్వాత ఎట్టకేలకు డైరెక్ట్ ఫ్లైట్ సేవలు అందుబాటులోకి రానున్నాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.నూతన ఎయిర్సర్వీసుల ఒప్పందం త్వరలో ఖరారు కాబోతోందని ఆయా వర్గాలు తెలిపాయి. ఇది ఒకవేళ ఖరారుకాక పోయినాసరే పాత విధానంలో విమాన సర్వీసులను మొదలు పెట్టాలని చూస్తున్నారు. ఎయిర్ఇండియా, ఇండిగో వంటి దేశీయ పౌర విమానయా సంస్థలు ఇకపై నేరుగా చైనాకు విమాన సర్వీసులను మొదలెట్టాలని మోదీ సర్కార్ సూచించినట్లు తెలుస్తోంది. గల్వాన్ నుంచి గట్టిబంధం దిశగా2020 మేలో తూర్పు లద్దాఖ్‌లో ఇరు దేశాల సైనికుల మధ్య ఉద్రిక్తతకు బీజం పడింది. జూన్‌లో గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ముష్టిఘాతం, పిడిగుద్దులు, ఘర్షణ కారణంగా ఇరువైపులా జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో సరిహద్దు వెంట గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో భారీ ఎత్తున సైన్యాన్ని మోహరించి ఉద్రిక్తతలను మరింత పెంచారు. దీంతో భారత్, చైనా సత్సంబంధాలు అడుగంటాయి. పాస్‌పోర్ట్‌లు, దిగుమతులు, అనుమతులు మొదలు మరెన్నో రంగాల్లో సత్సంబంధానికి బీటలు పడ్డాయి.అయితే ట్రంప్ ఇష్టారీతిన విధించిన దిగుమతి సుంకాల భారంతో ఇబ్బందులు పడుతున్న భారత్, చైనాలు ఉమ్మడిగా ఈ సమస్యను పరిష్కరించుకుందామని భావిస్తున్నాయి. ఇందుకోసం మళ్లీ స్నేహగీతం పాడక తప్పని నెలకొంది. గత కొద్దినెలలుగా ఇందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. చైనా జాతీయులకు పర్యాటక వీసాలు ఇచ్చేందుకు భారత ప్రభుత్వం గత నెలలో అంగీకారం తెలిపింది. దాదాపు ఏడేళ్ల తర్వాత ప్రధాని మోదీ చైనాలో పర్యటనకు సిద్ధపడ్డారు.చైనాతో బంధం బలపడాలని తాము కోరుకుంటున్నామని ఆదేశ పర్యటనను ఖరారుచేసి మోదీ సూచనప్రాయంగా చెప్పారు. భారత్ వంటి దేశాలపై టారిఫ్‌ను అమెరికా పెంచడాన్ని చైనా సైతం తీవ్రంగా పరోక్షంగా ఖండించింది. ఇలా నెమ్మదిగా బలపడుతున్న మైత్రీ బంధాన్ని నేరుగా విమానసర్వీసుల ద్వారా మరింత పటిష్టంచేయాలని భారత్ ఆశిస్తోంది. చివరిసారిగా మోదీ చైనాలో 2018 జూన్‌లో పర్యటించారు. ఆ తర్వాతి ఏడాది అక్టోబర్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించారు. -
చైనాతో ట్రంప్ ఆచితూచి అడుగులు.. వాణిజ్య ఒప్పందానికి 90 రోజులు గడువు పెంపు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల విషయంలో చైనా పట్ల తమ వైఖరిని వెల్లడించేందుకు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తాజాగా ఆయన చైనాతో వాణిజ్య ఒప్పందాన్ని మరో 90 రోజులు పొడిగించారు. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య తలెత్తబోయే సుంకాల వివాదాన్ని ట్రంప్ మరికొంత కాలం వాయిదా వేశారు.ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో చైనాతో వాణిజ్య ఒప్పందాల విషయంలో పొడిగింపు కోసం కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశానని, అయితే ఒప్పందంలోని అన్ని ఇతర అంశాలు అలాగే ఉంటాయని తెలియజేశారు. నిజానికి ట్రంప్ చైనాకు ఇచ్చిన గడువు మంగళవారం (ఆగస్టు 12) మధ్యాహ్నం 12:01 గంటలకు ముగియనుంది. ఒకవేళ ట్రంప్ గడువు ఇవ్వకుంటే అమెరికా.. చైనా దిగుమతులపై 30శాతం అధిక పన్నులను పెంచివుండేది. ( @realDonaldTrump - Truth Social Post )( Donald J. Trump - Aug 11, 2025, 8:00 PM ET )I have just signed an Executive Order that will extend the Tariff Suspension on China for another 90 days. All other elements of the Agreement will remain the same. … pic.twitter.com/ho0n2AaE6x— Donald J Trump Posts TruthSocial (@TruthTrumpPost) August 12, 2025సుంకాల ఒప్పందం విషయంలో కుదిరిన విరామం రెండు దేశాలు పరస్పరం చర్చించుకునేందుకు అవకాశం ఏర్పడనుంది. అలాగే ఈ సంవత్సరం చివర్లో ట్రంప్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మధ్య జరిగే శిఖరాగ్ర సమావేశానికి మార్గం సుగమం చేస్తుంది. అమెరికా-చైనా బిజినెస్ కౌన్సిల్ అధ్యక్షుడు సీన్ స్టెయిన్ మాట్లాడుతూ ఈ పొడిగింపు రెండు ప్రభుత్వాలకు వాణిజ్య ఒప్పందంపై కీలక చర్చలు జరపడానికి ఉపయోగపడుతుందన్నారు. ఈ విరామం చైనాలో తమ మార్కెట్ యాక్సెస్‌ను మెరుగుపరుస్తుందని, కంపెనీలు మధ్యస్థ, దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించడానికి అవసరమైన ఖచ్చితత్వాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. యూరోపియన్ యూనియన్, జపాన్ తదితర వాణిజ్య భాగస్వాములు ట్రంప్‌తో వాణిజ్య ఒప్పందాలకు అంగీకరించాయి. యేల్ విశ్వవిద్యాలయంలోని బడ్జెట్ ల్యాబ్ తెలిపిన వివరాల ప్రకారం సగటు యూఎస్ సుంకం ఈ ఏడాది ప్రారంభంలో దాదాపు 2.5 శాతం నుండి 18.6 శాతానికి పెరిగింది. ఇది 1933 తర్వాత అత్యధికం. -
తొమ్మిది పదుల వయసులో ఆ తల్లి లా పుస్తకాలతో కుస్తీ! ఎందుకో తెలుసా?
అవధులు లేని ప్రేమ తల్లి ప్రేమ. అందుకే కాబోలు అమ్మ ప్రేమ కోసం..చరిత్రలో ఎందరో మహానుభావులు తమ సర్వస్వాన్ని త్యజించేందుకు సిద్ధపడ్డారు. వెలకట్టలేని ఆ గొప్ప ప్రేమకు దైవుడు సైతం తలవంచుతాడని ఆర్యోక్తి. ఇదంతా ఎందుకంటే..నేరమే చేసినా..ఆ తల్లి మాత్రం తన కొడుకుని మంచివాడనే అంటుంది. అలాంటి అసామాన్యమైన ఘటనే ఇక్కడ చోటుచేసుకుంది. ఈ ఉదంతం తల్లిప్రేమ అనంతం ..బిడ్డ కోసం ఎంతటి సాహసానికైనా ఒడిగడుతుంది అని మరోసారి రుజువు చేస్తోంది.అంతులేని తల్లిప్రేమకు నిదర్శనం ఈ ఘటన. ఇది చైనాలో చోటుచేసుకుంది. ఒక హైప్రొఫైల్ కేసులో లిన్(57) అనే వ్యక్తి అరెస్టు అయ్యాడు. అతడు నగరంలో స్థానిక వ్యవస్థాపకుడు హువాంగ్ అనే వ్యక్తి సుమారు రూ. 140 కోట్లు బ్లాక్మెయిల్ చేసిన కేసులో అరెస్టు అయ్యాడు. ఈ కేసు చైనా జెజియాంగ్ ప్రావిన్స్‌లోని జౌషాన్ మున్సిపల్ ఇంటర్మీడియట్ కోర్టులో విచారణ కొనసాగుతోంది. చివరి విచారణ గత నెల జూలై 30న జరిగింది. ఈ విషయం తెలుసుకున్న లిన్ తల్లి హి తల్లిడిల్లిపోయింది. తన కొడుకు ఏ నేరం చేయలేదంటూ కన్నీరుమున్నీరుగా విలపించింది. పైగా ఆ ఆరోపణలు ఆవాస్తవం అని ఆమె బలంగా విశ్వస్తిస్తుండటం విశేషం. అంతేగాదు తన కొడుకుని ఈ కేసు నుంచి బయటపడేసేలా ఏదైనా చేయాలని పలు రకాలుగా అన్వేషించింది. ఇక ఏ లాయర్ని నమ్మాలనుకోలేదో లేక తానే రక్షించుకోగలనన్న నమ్మకమో..! గానీ ఆ తల్లి హి లా పుస్తకాలు కుస్తీ పట్టి మరి తన కొడుకుని రక్షించుకోవాలని స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యింది. కుటుంబ సభ్యులు 90 ఏళ్ల వయసులో ఎందుకు ఈ రిస్క్ అదంతా తాము చూసుకుంటామని చెప్పినా..ససేమిరా అంటూ చట్టం గురించి తెలుసుకోవాలని మంకుపట్టుపట్టి.. క్రిమినల్ లా పుస్తకాలను కొనుగోలు చేసి మరి చదివేందుకు సిద్ధమైంది ఆ తల్లి. దగ్గర దగ్గర తొంభైఏళ్లు పైనే ఉంటాయి ఆ వృద్ధురాలికి. కానీ ఆమె వయోసంబంధిత భారాన్ని ఖాతారు చేయకుండా తగ్గేదేలా అంటూ ప్రతినిత్యం కోర్టుని సందర్శిస్తూ..ఆ కేసుకి సంబంధించిన పూర్వపరాలన్నింటిని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తోందామె. కేసు వివరాలు..లిన్ స్థానిక వ్యవస్థాపకుడు హువాండ్తో గ్యాస్ ఉత్పత్తి బిజినెస్ చేస్తున్నారు. 2009 వరకు చైనాలో టాప్ ధనవంతుల్లో ఒకడిగా మంచి లాభాలు అందుకున్నాడు లిన్. అయితే తరచుగా చెల్లింపులను సకాలంలో చెల్లించడంలో విఫలమవ్వడంతో ఫ్యాక్టరీలో ఉత్పత్తిని నిలిపివేయాల్సి వచ్చేది. దాంతో బిజినెస్ తీవ్ర నష్టాలకు దారితీసింది. ఆ నేపథ్యంలోనే 2014 నుంచి 2017 మద్య లిన్ తన అకౌంటెంట్‌తో కలిసి అక్రమదారుల్లో పయనించాడు. తన పార్టనర్ హువాంగ్‌ని అక్రమ పద్ధతిలో వ్యాపారం చేస్తున్నట్లు ఏజెన్సీలకు చెబుతానంటూ బ్లాక్ మెయిల్ చేసి దాదాపు రూ. 140 కోట్లు వసూలు చేశాడు. అతడి ఆగడాలకు తాళ్లలేక 2023లో పోలీసులను ఆశ్రయించాడు హువాంగ్. పోలీసుల విచారణలో అది నిజమని తేలడంతో లిన్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. కొడుకు చేతికి వేసిన సంకెళ్లను చూసి 'హి'కి గుండె ఆగినంత పనైంది. ఆ నేపథ్యంలోనే ఆ తల్లి తన కొడుకుని రక్షించుకునేందుకు ఇలా లా పుస్తకాలను చేతబట్టింది. తన కొడుకు లాంటి మిగతా కేసులను స్టడీ చేసి మరీ రక్షించుకోవాలని ఆశిస్తోందా తల్లి. ఈ విధంగానైనా తన కొడుకునే కనులారా చూసుకోవాలని కోర్టుకి హాజరవుతూనే ఉంటోంది ఆ వృద్ధురాలు. కొడుకుని చూసి భావోద్వేగానికి గురై స్ప్రుహ తప్పుతున్నా..ఆమెకు కేటాయించిన అంబులెన్స్ వైద్యులచే చెకప్ చేయించుకునేందుకు అస్సలు ఇష్టపడటం లేదు. ఆమె ధ్యాసంతా కొడుకుని ఈ కేసు నుంచి ఎలా బయటపడేయాలన్నదే. ఈ తల్లి హి కథ నెట్టింట అందర్నీ తెగ ఆకర్షించడమే గాక తల్లి ప్రేమ మించినది మరొకటి లేదు అని వ్యాఖ్యానిస్తున్నారు. అంతేగాదు ఆమె కొడుకు అతి త్వరలోనే రిలీజ కావాలని భంగవంతుడిని ప్రార్థిస్తున్నాం అంటూ పోస్టులు పెడుతుండటం గమనార్హం.(చదవండి: 'స్ట్రీట్‌లైట్ ఆంటీ': భద్రతకు వెలుగుగా నిలిచింది..!) -
డాల్ డామినేషన్!
ఆ బొమ్మ మొహం చూస్తేనే ‘అమ్మో! బొమ్మ!’ అని భయపడిపోతాం. కాని, చూసే కొద్దీ ప్రేమలో పడిపోతూనే ఉంటాం. అదే లబుబు మ్యాజిక్! ఒక వైపు దెయ్యంలా మొహం, మరోవైపు క్యూట్‌నెస్! ఇది చిన్న పిల్లల బొమ్మలా కనిపిస్తుంది. కానీ, ఇప్పుడిది ప్రపంచం మొత్తాన్ని చుట్టబెట్టేస్తోంది.హాంకాంగ్ కళాకారుడు కాసింగ్ లంగ్ 2015లో ఈ లబుబు బొమ్మను సృష్టించాడు. నార్డిక్ పురాణాల ప్రేరణతో రూపొందించిన ‘ది మాన్స్టర్స్’ అనే కామిక్ షో ఆధారంగా ఈ బొమ్మ పుట్టింది. పుట్టాక మూడేళ్లు ఇంట్లోనే ఉండిపోయింది. కానీ, 2019లో చైనా టాయ్ కంపెనీ ‘పాప్ మార్ట్’ దీన్ని మొదటిసారిగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఎలా అంటే బ్లైండ్ బాక్స్‌లుగా– ఏ బొమ్మ వస్తుందో తెలియని థ్రిల్‌తో పాపం పిల్లల జేబుల్ని ఖాళీ చేస్తూ మార్కెట్‌ను ముంచెత్తింది. దీనికి తోడు 2024లో కొరియన్ పాప్ సింగర్ లీసా దీన్ని సోషల్ మీడియాలో చూపించడంతో, థాయ్లండ్లోని పాప్ మార్ట్ స్టాల్స్ వద్ద లబుబు కోసం మానవ సముద్రమే కనిపించింది. దాని క్రేజ్ అక్కడితో ఆగలేదు, ఖండాలు దాటి, మార్కెట్లో వేలాకోట్ల డాలర్ల టర్నోవర్‌ను ఒక్క ఏడాదిలోనే దాటేసింది. ఎందుకంటే, లబుబు అప్పటికే సెలబ్రిటీల చేతుల్లోకి కూడా చేరిపోయింది హాలీవుడ్ సెలబ్రిటీలు రిహానా, డువా లిపా, లిజ్జో లాంటి వాళ్లు దీన్ని చేతిలో పట్టుకుని ఫొటోలు తీసుకున్నారు. చాలామంది లబుబుని ఓ స్నేహితురాలు, మూడ్ బస్టర్ అంటూ వారి బ్యాగ్‌కి తగిలించుకుని తిరగడం ఫ్యాషన్‌గా మారింది. వీరిలో కొందరు లబుబుకి పేర్లు పెడతారు. డ్రస్సులు మార్చేస్తారు. ఫొటోషూట్లు కూడా చేస్తారు. దీనిని కేవలం బొమ్మగా కాదు, తమ చిన్న ప్రపంచంలో స్పెషల్ వీఐపీలా చూసుకుంటూ సంబరపడిపోతున్నారు. ఇప్పుడిప్పుడే ఇండియాలో! లబుబు ఫీవర్ ఇప్పుడు బాలీవుడ్‌కు కూడా వచ్చింది. నటి అనన్యా పాండే ఈ మధ్యనే తన పింక్ లబుబుతో జెన్‌జీ స్టయిల్ని సెట్ చేసింది. నటి శార్వరీ వాఘ్ క్యాజువల్‌గా కీచెయిన్‌లా వాడుతూ ట్రెండ్ సెట్టర్‌గా మారింది. సింగర్ నేహా కక్కర్– తన స్ట్రీట్ స్టయిల్ ఫ్రెండ్ అంటూ బ్లూ లబుబును చేతిలోనే తిప్పుకుంటూ తిరుగుతోంది. ఇక నటి ఉర్వశి రౌతేలా అయితే, ఏకంగా ఒకేసారి నాలుగు లబుబులతో షాక్ ఇచ్చింది, ట్రెండ్‌కు ఏజ్‌తో సంబంధం లేదని నటి ట్వింకిల్ ఖన్నా తన లబులును చూపించింది. అలా ఇప్పుడిది సెలెబ్రిటీ హ్యాండ్‌బ్యాగ్‌లలో మెరిసే క్యూట్ లగ్జరీ స్టేటస్‌గా మారిపోయింది. బొమ్మే కాదు, బిల్లు చూస్తే భయం! పాప్ మార్ట్ స్టోర్ ధరల ప్రకారం, సాధారణ బాక్స్ లబుబు ధర రూ. 1,200 నుంచి రూ. 1,800. అదే స్పెషల్ ఎడిషన్లు అయితే రూ. 2,500 నుంచి రూ. 5,000. కానీ అదృష్టం ఉంటే రేర్ బొమ్మ దొరుకుతుంది. ఆ బొమ్మకు అయితే రూ. 40,000 కూడా తక్కువే! ఇక హ్యూమన్ సైజ్ లబుబు కావాలంటే? ఏకంగా రూ. 1.25 కోట్లు! ఔను, కోట్లే! దీన్ని ఇంట్లో పెట్టుకోవాలంటే, ముందు మీ ఇంటిని అమ్ముకోవాలి! ఇక బ్లాక్ మార్కెట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. లబుబు దొరక్కపోతే ధర పదిరెట్లు కూడా కడుతున్నారు. ఇది చూసి చాలామంది, ‘వీళ్లు బొమ్మలు అమ్ముతున్నారా లేక బంగారమా!’ అంటూ నోరెళ్లబెడుతున్నారు. క్రేజ్‌తో క్యాష్ !అసలు లబుబు దొరకక ఇబ్బంది పడుతున్నఫ్యాన్స్, ఇప్పుడు ప్రత్యామ్నాయ లబుబు బొమ్మలతో పండగ చేసుకుంటున్నారు. ఈ క్రేజ్‌నే చాలా వ్యాపారాలు క్యాష్ చేసుకుంటున్నాయి! మార్కెట్లోకి ఇప్పటికే వివిధ రకాల వస్తువులు లబుబు టచ్‌తో రిఫ్రెష్ అయ్యాయి. లబుబు డిజైన్స్‌తో ఉంటే డాల్స్, కీచెయిన్లు, బ్యాగ్స్, స్టికర్లు, స్టేషనరీ, బెడ్ షీట్లు, కుషన్లు వంటి వస్తువులన్నీ వచ్చేశాయి. చిన్న బొమ్మగా మొదలైన లబుబు, ఇప్పుడు వాల్ నుంచి వాచ్ వరకు మారిపోయి, ఇంటినిండా సందడి చేస్తోంది. ఈ ఎక్స్ట్రీమ్ డిమాండ్‌కి తగ్గట్టు ధరలు కూడా అలాగే ఉన్నాయి. చిన్న స్టికర్కైనా సరే కేవలం ‘ఇది లబుబు బ్రాండ్’ అన్న ట్యాగ్ తో ధరల్లో కొండెక్కి కూర్చుటోంది. లబుబు బొమ్మ కాదు, ఒక కమర్షియల్ సంచలనం!(చదవండి: బ్రహ్మజెముడు మొక్కతో ప్లాస్టిక్ తయారీ..!) -
ప్రధాని మోదీని స్వాగతించిన చైనా
బీజింగ్: ప్రధాని మోదీ త్వరలో చైనాలో పర్యటించబోతున్నారు. ఈ నెల 31న, వచ్చే నెల 1న చైనాలో జరిగే షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ఎస్సీఓ సదస్సుకు నరేంద్ర మోదీని స్వాగతిస్తున్నట్లు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గుయో జియాకున్ శుక్రవారం పేర్కొన్నారు. ఈ సదస్సు భాగస్వామ్యపక్షాలకు స్నేహపూర్వక, ఫలవంతమైన ఫలితాలను ఇస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఎస్సీఓ సభ్యదేశాలతోపాటు మొత్తం 20 దేశాల అధినేతలు సదస్సులో పాల్గొంటారని వెల్లడించారు. -
చైనాపై పగబట్టిన వరుణుడు! మెరుపు వరదలు పోటెత్తి..
వరుణుడు పగబట్టాడేమో అనేంతగా చైనా భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. కిందటి నెలలో ఉత్తర బీజింగ్‌లో కురిసిన భారీ వర్షాలకు 44 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా.. మెరుపు వరదలు పోటెత్తి పది మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గల్లంతు కాగా.. వాళ్ల ఆచూకీ కోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. చైనా గాన్సు ప్రావిన్స్‌లో శుక్రవారం ఇది చోటు చేసుకుంది.చైనాలో శుక్రవారం ఘోరం జరిగింది. మెరుపు వరదలు పోటెత్తడంతో పది మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో జనాల ఆచూకీ లేకుండా పోయింది. దీంతో అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అన్నిరకాల మార్గాలతో సహయక చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.గురువారం గాన్సు ప్రావిన్స్‌లోని యూజోంగ్లో కుంభవృష్టి కురిసింది. ఫలితంగా శుక్రవారం వేకువ జామునే మెరుపు వరదలు పోటెత్తాయి. వరదల ఉధృతికి లాంజౌ నగర శివారులో కొండ చరియలు విరిగిపడినట్లు అక్కడి మీడియా సంస్థ సీసీటీవీ కథనాలు ఇస్తోంది. జింగ్లాంగ్ పర్వత శ్రేణి గుండా నాలుగు గ్రామాలకు కరెంట్, సెల్‌ఫోన్ సేవలు నిలిచిపోయాయి.చైనాలో సాధారణంగా జూన్ నుంచి ఆగస్టు దాకా వానలు కురుస్తుంటాయి. ఈ కాలంలో దక్షిణ, తూర్పు ప్రాంతాలు మాన్సూన్ ప్రభావానికి లోనవుతాయి. తద్వారా భారీ వర్షాలు కురుస్తాయి. అయితే.. ఈసారి గాలి ప్రవాహ మార్పులు అంటే.. పశ్చిమ గాలులు, సముద్రపు తేమ గల గాలులు ఒకే ప్రాంతంలో కలుస్తుండడం వల్ల వర్షాలు అధికంగా పడుతున్నాయి. గ్వాంగ్డాంగ్, గుయాంగ్సీ, హునాన్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల 300 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ఇది సాధారణ స్థాయికి మించి ఉంది. చైనా భారీ వర్షాలు, పోటెత్తిన వరదలు తీవ్ర స్థాయిలో ప్రజల జీవితం, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. వరదల వల్ల చైనాకు ఇప్పటిదాకా 54.11 బిలియన్ యువాన్ (ఆరున్నర లక్షల కోట్లకు పైగా) నష్టం వాటిల్లిందని అత్యవసర నిర్వహణ మంత్రిత్వ శాఖ తెలిపింది. వరదల వల్ల సుమారు 80 వేలమందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.ఇదిలా ఉంటే.. ప్రపంచంలోనే అత్యధికంగా గ్రీన్‌హౌజ్ ఉద్గారాలను వదిలే దేశంగా చైనా ఉంది. ఫలితంగా అక్కడి వాతావరణంలో ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నది విశ్లేషకుల మాట. అదే సమయంలో.. చైనా ప్రపంచ పునరుత్పాదక శక్తి రంగంలో శక్తివంతమైన దేశంగానూ నిలవడం గమనార్హం. ఈ క్రమంలోనే 2060 నాటికి కార్బన్-న్యూట్రల్ (కార్బన్ ఉద్గారాలు లేకుండా) చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
‘ఎట్టిపరిస్థితుల్లోనూ తలొంచద్దు’.. ట్రంప్ సుంకాలపై భారత్‌కు చైనా మద్దతు
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కక్షగట్టిన రీతిలో భారతదేశంపై అత్యధికంగా 50 శాతం సుంకం విధించారు. అలాగే ఇతర దేశాలకూ సుంకాలు ప్రకటించారు. అయితే భారత్‌పై అత్యధిక సుంకాలు విధించడంపై చైనా మండిపడుతూ, భారత్‌కు మద్దతు ప్రకటించింది. ఎట్టిపరిస్థితుల్లోనూ ట్రంప్‌కు తలవంచవద్దంటూ భారత్‌కు చైనా సలహా ఇచ్చింది.భారతదేశంలోని చైనా రాయబారి జు ఫీహాంగ్ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిర్ణయాన్ని దుయ్యబట్టారు. ట్రంప్‌ను ‘బెదిరింపులకు గురి చేస్తున్న దొంగ’గా అభివర్ణించారు. ఆయన తన ‘ఎక్స్’ పోస్టులో ‘ఒక దొంగకు ఒక అంగుళం అవకాశం ఇస్తే.. అతను ఒక మైలు దూరం వరకూ వెళ్తాడు’ అని కామెంట్ చేశారు. చైనా రాయబారి తన పోస్టులో..‘ఇతర దేశాలను అణచివేయడానికి సుంకాన్ని ఆయుధంగా ఉపయోగించడం ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను ఉల్లంఘించడమే అవుతుంది. ఇది ప్రపంచ వాణిజ్య సంస్థ నియమాలను బలహీనపరుస్తుంది. ఇది ప్రజాదరణ లేనిది, అస్థిరమైనది’ అని పేర్కొన్నారు. కాగా ట్రంప్ బృందంతో వ్యాపార ఒప్పందంపై సంతకం చేసిన మొదటి దేశాలలో ఒకటిగా ఉండాలని భారతదేశం ఆశించింది. అయితే రష్యన్ చమురు కొనుగోళ్ల కారణంగా అమెరికా-భారత్ వాణిజ్య చర్చలు ఐదు రౌండ్ల తర్వాత కూడా ముందుకు కదలలేదు. Give the bully an inch, he will take a mile. pic.twitter.com/IMdIM9u1nd— Xu Feihong (@China_Amb_India) August 7, 2025వైట్ హౌస్‌లో చైనాపై సుంకాలు విధించే ప్రణాళిక గురించి మీడియా ట్రంప్‌ను అడిగినప్పుడు ఆయన తాను ఇప్పుడే ఏమీ చెప్పలేదనని, భారతదేశానికి ఏదైతే చేశామో.. బహుశా మరికొన్ని దేశాలతో కూడా అలాగే చేస్తామని, వాటిలో చైనా ఒకటి కావచని’ ట్రంప్ వ్యాఖ్యానించారు. మరోవైపు శుక్రవారం నాటికి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగియకపోతే, తాను ద్వితీయ సుంకాలను విధిస్తానని కూడా ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో చైనా- అమెరికాల మధ్య సుంకాల యుద్ధం ప్రారంభమైంది. అమెరికా తన సుంకాలను 145 శాతానికి పెంచగా, చైనా తన సుంకాలను 125 శాతానికి పరిమితం చేసింది. చైనాతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిపేందుకు ఈ ఏడాది చివర్లో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ను కలవబోతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. -
మూడు దేశాలు ఒక్కటైతే..!
అగ్రరాజ్యమన్న దురహంకారం, ఆధిపత్యధోరణితో ట్రంప్ టారిఫ్‌ల బాంబులు విసిరితే బాధిత దేశాలు జట్టుకట్టి పోరుసల్పే ప్రయత్నాలు మొదలెట్టాయా? అంటే తాజా అంతర్జాతీయ పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. వినిమయ ప్రపంచంగా పేరొందిన అమెరికాకు అన్ని దేశాల వస్తూత్పత్తులు పోటెత్తుతాయి. చాలా దేశాల ఖజానా నిండటానికి అమెరికా కొనుగోళ్లే కారణం. దీనిని అలుసుగా తీసుకుని, ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని కారణంగా చూపి తమతో వాణిజ్యంచేసే దేశాలపై ట్రంప్ టారిఫ్‌ల గుదిబండలు పడేస్తుండటంతో ఆయా దేశాల్లో ఆగ్రహజ్వాలలు పెల్లుబికాయి. భారత్, చైనా వంటి దేశాలు అంతటితో ఆగకుండా రష్యాతో జట్టుకట్టి అగ్రరాజ్య దుందుడుకు చర్యలకు ముకుతాడు వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలు ఈ వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. ఇప్పటికే భారత జాతీయ భద్రతా సలహదారు అజిత్ దోవల్ రష్యాలో పర్యటిస్తున్నారు. రష్యా జాతీయ భద్రతా మండలి కార్యదర్శి సెర్గీ షోయిగుతో గురువారం ఎన్ఎస్ఏ ధోవల్ సమావేశమయ్యారు. ఇంధన, రక్షణ రంగంలో ద్వైపాక్షిక సహకారంపై చర్చలు జరిపానని ధోవల్ చెబుతున్నప్పటికీ వాస్తవానికి ట్రంప్‌ను ఎలా నిలువరించాలనే దానిపైనే ప్రధానంగా చర్చ జరిగిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ట్రంప్ దూకుడుకు ఎలా కళ్లెం వేయాలని అంశంపై చర్చించేందుకు త్వరలో భారతవిదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ సైతం రష్యాకు వెళ్లి పుతిన్ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడనున్నారు. గల్వాన్ లోయలో ఇరుదేశాల జవాన్ల ముష్టిఘాతం, ఘర్షణలు, 20కిపైగా భారత జవాన్ల వీరమరణంతో ఎగసిపడిన కోపాన్ని సైతం కాసేపు పక్కనబెట్టి ప్రధాని మోదీ త్వరలో చైనాలో పర్యటించనున్నారు. చైనాకు బద్దశత్రువైన అమెరికాను ఆర్థికాంశాల్లో ఎలా ఎదుర్కోవాలనే దానిపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మోదీ చర్చించనున్నట్లు వార్తలొచ్చాయి. మారుతున్న భారత్ వ్యూహం చైనాతో మైత్రీ విషయంలో ఇన్నాళ్లూ సమదూరం పాటించిన భారత్ ఇకపై అమెరికా కారణంగా స్నేహబంధాన్ని బలపర్చుకునే అవకాశముంది. చైనా, భారత్, రష్యా కూటమిలో తానూ చేరతానని ఇప్పటికే బ్రెజిల్ సూచనప్రాయంగా తెలిపింది. వ్యవసాయం, డైయిరీ రంగంలో అమెరికన్ కంపెనీల రాకను భారత్ అడ్డుకుంటుండటంతో ఒక దెబ్బకు రెండు పిట్టలు తరహాలో అటు సుంకాలతో, ఇటు వాణిజ్య ఒప్పందంలో తనకు అనుకూల షరతులతో భారత్ మెడలు వంచాలని ట్రంప్ చూస్తున్నారు. ఇందుకు భారత్ ససేమిరా అనడంతో ఆగ్రహంతో ట్రంప్ మోపిన టారిఫ్ ఇప్పుడు భారత్‌ను చైనాకు దగ్గరచేస్తోందని తెలుస్తోంది. ఏడేళ్ల తర్వాత మోదీ చైనా పర్యటన ఖరారుకావడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనాను నిలువరించేందుకు ఇన్నాళ్లూ భారత్‌ను మచి్చకచేసుకునేందుకు గత అమెరికా ప్రభుత్వాలు చేసిన సఫలయత్నాలను ట్రంప్ ఒక్క టారిఫ్ దెబ్బతో నాశనంచేస్తున్నారు. 25 శాతం టారిఫ్ అమల్లోకి వచి్చనరోజు మాస్కోలో దోవల్ పర్యటించడం యాదృచి్ఛకం కాదని తెలుస్తోంది. ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందం చేసుకోవాలంటూ ట్రంప్ పంపిన దూత, అమెరికా ఉన్నతాధికారి స్టీవ్ విట్కాఫ్.. వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయిన కొద్దిగంటల తేడాతోనే ధోవల్ సైతం మాస్కోలో కీలక చర్చలు జరపడం గమనార్హం. షాంఘై శిఖరాగ్ర సదస్సు వేదికగా.. త్వరలో చైనాలో జరగబోయే షాంఘై సహకార సంఘం శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు మోదీ చైనాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కలిసి ట్రంప్ ప్రభుత్వ వ్యతిరేక వ్యూహాలను రచించనున్నట్లు వార్తలొచ్చాయి. ఇటీవలికాలంలో చైనా, భారత్ మధ్య సారూప్యతలు కనిపిస్తున్నాయి. రష్యా ముడిచమురును చైనా, భారత్‌లు అత్యధికంగా కొనుగోలుచేస్తున్నాయి. ట్రంప్ బెదిరింపులను భారత్, చైనా రెండూ చవిచూశాయి. దేశ స్వప్రయోజనాలు, జాతీయ భద్రతకే తాము పెద్దపీట వేస్తామని చైనా, భారత్ ఒకే తరహాలో తమ వాణిని గట్టిగా వినిపించాయి. యురేనియం, ఎరువులు, ఇతర కీలక మిశ్రమ ధాతువులను రష్యా నుంచి కొంటూ మాకు సుద్దులు నేర్పుతావా? అని రెండు దేశాలు అమెరికాపై ఆగ్రహం వ్యక్తంచేశాయి. శత్రువుకు శత్రువు మిత్రువు అన్న సూత్రాన్ని భారత్, చైనాలు తూ.చ. తప్పకుండా పాటిస్తాయని తెలుస్తోంది. కలిసి నడుస్తానన్న బ్రెజిల్ తమపై ఏకంగా 50 శాతం టారిఫ్ విధించడంపై అమెరికాపై బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డసిల్వా గుర్రుగా ఉన్నారు. ‘‘ ఇంతటి భారం మోపిన ట్రంప్‌కు అస్సలు ఫోన్ చేయను. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, భారత ప్రధాని మోదీకి ఫోన్చేస్తా. ప్రపంచ వాణిజ్య సంస్థలో ఈ టారిఫ్‌లపై తేల్చుకుంటాం. ఈ దేశాలతో కలిసి నడుస్తా’’ అని డసిల్వా అన్నారు. రష్యా, ఇండియా, చైనా త్రయం మళ్లీ క్రియాశీలకం కావాల్సిన తరుణం వచి్చందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వెలుగులు విరజిమ్మిన వృక్షం
క్రీడల నిర్వహణలోనే కాదు... పోటీల ప్రారంబోత్సవంలో కూడా అంచనాలకు మించి అద్భుతాలను చూపించడంలో చైనా ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా 12వ వరల్డ్ గేమ్స్ సందర్భంగా ఇది మరోసారి కనిపించింది. చైనాలోని చెంగ్డూలో గురువారం మొదలైన ఈ పోటీలు ఆగస్టు 17 వరకు జరుగనున్నాయి. ఈ ఈవెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా తమ చరిత్ర, సంస్కృతి తెలిపే వివిధ ఘట్టాలను చైనా ప్రేక్షకుల ముందు ఉంచింది. వీటిలో బాణాసంచాతో ప్రత్యేకంగా రూపొందించిన వెలుగులు విరజిమ్మే చెట్టు ఆకారాన్ని ప్రదర్శించడం హైలైట్‌గా నిలిచింది. శాంతి, స్నేహానికి ప్రతిరూపంగా చెంగ్డూలోని మ్యూజియంలో ఉన్న ‘ట్రీ ఆఫ్ ఫ్రెండ్షిప్’ను స్ఫూర్తిగా తీసుకుంటూ ఈ చెట్టును ప్రదర్శించారు. ఈ 12వ వరల్డ్ గేమ్స్‌లో 116 దేశాలకు చెందిన 3,942 మంది అథ్లెట్లు 34 క్రీడాంశాల్లో పోటీ పడుతుండగా... ఆర్చరీలో భారత ఆటగాళ్లు బరిలోకి దిగారు. -
ప్రత్యామ్నాయాలపై భారతీయ తయారీదారుల కన్ను
ప్రపంచవ్యాప్తంగా రేర్ ఎర్త్ అయస్కాంతాల కొరత వాహన తయారీదారులకు సవాలుగా మారుతోంది. ముఖ్యంగా ఇది ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) రంగంలోని వారికి తీవ్ర సంకటంగా మారింది. దీనికి తక్షణ పరిష్కారం కనిపించకపోవడంతో ఇండియన్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్స్ (ఓఈఎం) ఎలక్ట్రిక్ మోటార్లలో అంతర్భాగమైన రేర్ ఎర్త్ అయస్కాంతాలను భర్తీ చేయడానికి ప్రత్యామ్నాయ పదార్థాలు, సాంకేతికతలను అన్వేషిస్తున్నాయి.ఈవీ ఉత్పత్తిపై ప్రభావంఎలక్ట్రిక్ వాహనాలకు శక్తినిచ్చే అధిక పనితీరు మోటార్లకు రేర్-ఎర్త్ అయస్కాంతాలు అవసరం. ఇవి వాహనం సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ పదార్థాలకు సంబంధించి భారత్ దిగుమతులపైనే ఆధారపడుతోంది. ముఖ్యంగా భారీగా దిగుమతి చేసుకునే రేర్-ఎర్త్ రకాలపై ప్రపంచ సరఫరాలో 80% పైగా నియంత్రించేది చైనానే. ఈ దేశం అక్కడి అవసరాలకు భారీగా వినియోగిస్తుంది. ఈ సరఫరా గొలుసు అంతరాయం ఆటోమోటివ్ పరిశ్రమ అంతటా ఆందోళనలు కలిగిస్తోంది. దాంతో భారతీయ ఓఈఎంలు ఒత్తిడికి గురవుతున్నాయి.చైనాకు దరఖాస్తులురేర్ ఎర్త్ అయస్కాంతాల స్థిరమైన సరఫరా కోసం భారత ఆటోమొబైల్ కంపెనీలు చైనాకు 30కి పైగా దరఖాస్తులను సమర్పించాయి. బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ ఈ అంశంపై మాట్లాడుతూ.. ‘హెవీ రేర్ ఎర్త్ మాగ్నెట్స్ కోసం ఎటువంటి దరఖాస్తులు ఇంకా ఆమోదించలేదు. సరఫరా ఎప్పుడు పునప్రారంభమవుతుందో చెప్పలేని స్థితిలో ఉన్నాం’ అని తెలిపారు.ప్రత్యామ్నాయాల వైపు అడుగులురేర్-ఎర్త్ అయస్కాంతాల సంక్షోభం తీవ్రతరం కావడంతో వీటిపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఓఈఎంలు ప్రత్యామ్నాయ పదార్థాలు, సాంకేతికతలను అన్వేషిస్తున్నాయి. ఏదేమైనా ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో వీటి అవసరాలు అధికమవుతున్నాయి. సిరామిక్ అయస్కాంతాలు, గ్రాఫీన్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానం, నానో స్ఫటిక పదార్థాలు, సింథటిక్ మెటిరియోరైట్ అయస్కాంతాలు, ఐరన్ నైట్రైడ్ సూపర్ అయస్కాంతాలు వంటి ప్రత్యామ్నాయాలు అభివృద్ధి దశలో ఉన్నాయి. అయితే వీటి సామూహిక ఉత్పత్తికి వాణిజ్యపరంగా ఆచరణీయ మార్గాలు పరిమితంగా ఉన్నాయని ప్రిమస్ పార్టనర్స్ సలహాదారు అనురాగ్ సింగ్ తెలిపారు. ఇదీ చదవండి: యాపిల్‌కు ట్రంప్ వణుకు?మహీంద్రా అండ్ మహీంద్రా ఈ కొరతను అధిగమించడానికి ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఎంఅండ్ఎం ఆటో అండ్ ఫార్మ్ సెక్టార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈఓ రాజేష్ జెజురికర్ మాట్లాడుతూ..‘వచ్చే త్రైమాసికానికి రేర్-ఎర్త్ అయస్కాంతాల స్థానంలో తేలికపాటి రేర్-ఎర్త్ ప్రత్యామ్నాయాలు వాడుతాం. ఈమేరకు చర్యలు ప్రారంభించాం’ అని చెప్పారు. -
31న చైనాకు ప్రధాని మోదీ.. దౌత్య సంబంధాలపై చర్చ?
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్లు 31న చైనాకు వెళ్లనున్నారు. అక్కడ జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. 2019 తరువాత ప్రధాని మోదీ చైనాకు వెళుతున్న తొలి పర్యటన ఇది. తూర్పు లడఖ్, ఇండో పసిఫిక్ ప్రాంతంలో సరిహద్దు వివాదాలపై భారత్ చైనా మధ్య ఉద్రిక్తతలు పూర్తిగా సద్దుమణగని ప్రస్తుత తరుణంలో ప్రధాని మోదీ పర్యటన ఆసక్తికరంగా మారింది.ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనాకు వెళ్లనున్నారు. ఈ సమావేశం టియాంజిన్‌లో జరగనున్నది. ఈ ఉన్నత స్థాయి దౌత్య భేటీ రెండు ఆసియా దిగ్గజాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచనున్నది. తూర్పు లడఖ్‌లో సరిహద్దు ప్రతిష్టంభనతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. బీజింగ్‌లో జరిగే షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం.. ఇటీవలే పూర్తి సభ్యత్వం పొందిన రష్యా, పాకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిజ్స్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, ఇరాన్‌లతో సహా ఎనిమిది సభ్య దేశాల నేతలను ఒకచోట చేర్చనుంది. మోదీ చేస్తున్న ఈ పర్యటన పర్యటన చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో వ్యక్తిగత సమావేశానికి మార్గం సుగమం చేయనుంది. 2020లో గల్వాన్ లోయ ఘర్షణల తర్వాత వీరి మధ్య భేటీ జరగడం ఇదే మొదటిసారి.ఈ ఇరువురు నేతలు ఇటీవల జరిగిన ప్రపంచ శిఖరాగ్ర సమావేశాలలో తారసపడినప్పటికీ, ద్వైపాక్షిక చర్చలు జరగలేదు. అధికారిక ప్రకటన లేనప్పటికీ ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఈ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా చర్చలు జరగనున్నాయి.2020 మేలో జరిగిన గల్వాన్ ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు మరణించారు. చైనా కూడా కొందమంది సైనికులను కోల్పోయింది. అయితే వారి సంఖ్యను చైనా బహిరంగంగా వెల్లడించలేదు. కాగా త్వరలో జరగబోయే ద్వైపాకక్షిక సమావేశంలో భారత్- చైనా మధ్య ప్రత్యక్ష విమాన సంబంధాలను తిరిగి ప్రారంభించడంపై చర్చ జరగనున్నదని సమాచారం. అలాగే వీసాలను సులభతరం చేయడానికి, సరిహద్దుల్లో నదులకు సంబంధించిన సమాచారాన్ని పంచుకునేందుకు ప్రతిపాదనలు జరగనున్నాయని తెలుస్తోంది. -
'స్ట్రీట్‌లైట్ ఆంటీ': భద్రతకు వెలుగుగా నిలిచింది..!
సాయం అంటే కోట్లు కొద్దీ డబ్బు కుమ్మరించడం కాదు. కేవలం డబ్బు రూపంలో కాదు..ఏ రూపంలోనైన తోడ్పాటుని అందించొచ్చని ప్రూవ్ చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు చాలామంది. సాయం చేయాలన్న సంకల్పంల ఉంటే.. ఏ విధంగానైనా చెయ్యొచ్చని తమ చేతలతో చెప్పకనే చెబుతున్నారు వారంతా. అచ్చం అలాంటి స్టోరీనే నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఆ మహిళ విశాల హృదయానికి ఫిదా అవ్వుతూ..ప్రశంసలతో ముంచెత్తుతున్నారు నెటిజన్లు.60 ఏళ్ల సన్ మెయిహువా చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో ఒక చిన్న కిరాయి దుకాణం నుడుపుతోంది. అయితే ఆ దుకాణం వెలుపల లైట్లు ఆ దారిన వెళ్లే బాటసారుల కోసం ప్రతిరోజు సాయంత్రం ఆన్ అయ్యే ఉంటాయి. అంతేగాదు తన దుకాణం మూసివేసే టైమింగ్స్‌ని కూడా మార్పు చేసుకుంది. రాత్రి రెండు గంటల వరకు లైట్లు ఆన్ అయ్యేలా చూస్తుంది సన్. అలా ఎందుకంటే..ఆ సమయంలో వచ్చే ఆడపిల్లలు, వృద్ధులు, మహిళలు భయం లేకుండా భద్రంగా ఇంటికి వెళ్లేందుకు ఆ వెలుగు దారి చూపిస్తుందనేది ఆమె నమ్మకం. ఆ మహిళ మంచి మనసుని తెలుసుకున్న స్థానికులు కూడా ఆమెకు అనతికాలంలోనే అభిమానులుగా మారడమే గాక నమ్మకస్తురాలైన స్నేహితురాలిగా సన్ను విశ్వసించారు. అంతేగాదు అక్కడి వాళ్లు ఊరెళ్లటప్పుడూ తమ ఇంటి తాళాలు కూడా ఆమెకే ఇచ్చేలా స్థానికుల నమ్మకాన్ని గెలుచుకుంది. దాంతో అక్కడి వాళ్లంతా ముద్దుగా ఆమెను స్ట్రీట్ లైట్ ఆంటీగా పిలుస్తుంటారు. అలాగే తన దుకాణం వద్ద ఒక ల్యాండ్‌లైన్ ఫోన్‌ని కూడా ఏర్పాటు చేసింది. మొబైల్ ఫోన్ లేని పిల్లలు, వృద్ధులకు ఉచితంగా కాల్ చేసుకునేలా ఈ సదుపాయన్ని ఏర్పాటు చేసేందామె. ఆ మహిళ, తన భర్త అక్కడే 20 ఏళ్లుగా నివాసిస్తున్నారు. తాము కష్టాల్లో ఉన్నప్పుడూ ఈ సమాజమే తమను ఆదుకుందని, అందుకే తమ వంతుగా ఈ విధంగా తిరిగి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని నవ్వుతూ చెబుతున్నారు ఆ దంపతులు. ఆమె కథ ఆన్లైన్లో తెగ వైరల్ అవ్వడంతో ..దాతృత్వం, శ్రద్ధకు నిర్వచనం ఆమె అని అంటున్నారు. ఇలా వెలుగుతో దారి చూపేలా చొరవ చూపేందుకు ధైర్యం, ఓపిక ఎంతో కావాల్సి ఉంటుంది. అంత ఈజీగా చేసే సేవా కార్యక్రమం కూడా కాదది అంటూ స్ట్రీట్‌లైట్ ఆంటీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. (చదవండి: Independence Day: నో ఫోన్ అవర్..! స్వేచ్ఛ కోసం ఆత్మీయ పిలుపు..) -
భారత్‌కు సుంకాల బెదిరింపు.. ట్రంప్‌పై నిక్కీ హేలీ సెటైర్లు
వాషింగ్టన్: ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యాను నిలువరించే సత్తాలేని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిక్కుతోచని స్థితిలో భారత్‌పై తన అక్కసు వెళ్లగక్కుతున్నారు. మంగళవారం (భారత కాలమాన ప్రకారం) భారత్‌పై సుంకాల మోత మోగిస్తానంటూ ట్రంప్ ప్రకటించారు. అయితే, ఈ హెచ్చరికలపై మాజీ అమెరికా రాయబారి నిక్కీ హేలీ.. ట్రంప్‌పై విరుచుకుపడ్డారు. అత్యంత కీలక సమయాల్లో ఇలా వ్యవహరిస్తే అమెరికా-భారత్‌ల మధ్య సంబంధాలు సన్నగిల్లే అవకాశం ఉందని హెచ్చరించారు.భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయకూడదు. కానీ రష్యా, ఇరాన్ దేశాల నుంచి చమురును అత్యధికంగా కొనుగోలు చేస్తున్న చైనాకు మాత్రం 90 రోజుల పాటు ఎలాంటి సుంకాలు విధించకుండా మినహాయింపు ఇవ్వొచ్చా? అని ప్రశ్నించారు. చైనాకు మినహాయింపు ఇచ్చి.. భారత్‌తో ఉన్న బంధాన్ని దెబ్బతీయకండి’ అని హితువు పలికారు.అమెరికా-భారత్‌ల సంబంధాలకు నిక్కీ హేలీ సుదీర్ఘంగా మద్దతు ఇస్తూ వస్తున్నారు. ఇండో-పసిఫిక్‌లోని ప్రజాస్వామ్య దేశాలతో, ముఖ్యంగా భారత్‌తో సన్నిహిత భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడం ద్వారా ప్రపంచ దేశాల్లో చైనా ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందంటూ తరచూ తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలో మరోసారి అమెరికా-భారత్ సంబంధాలను హైలెట్ చేస్తూ.. సుంకాలు విధించే విషయంలో ట్రంప్ నిర్ణయాన్ని తూర్పారబట్టారు.India should not be buying oil from Russia. But China, an adversary and the number one buyer of Russian and Iranian oil, got a 90-day tariff pause. Don’t give China a pass and burn a relationship with a strong ally like India.— Nikki Haley (@NikkiHaley) August 5, 2025 -
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు ఆగ్రహం
-
రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీని సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించిది. భారత సైన్యం గురించి రాహుల్ చేసిన వ్యాఖ్యలపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. 2 వేల కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని మీరు (రాహుల్)ఎలా చెబుతున్నారని కోర్టు ప్రశ్నించింది. భారత్ జోడోయాత్రలో రాహుల్ గాంధీ ఆర్మీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని ఉదయ్ శంకర్ అనే వ్యక్తి పరువు నష్టం దావా కింద క్రిమినల్ కేసు వేశారు. అయితే ఈ ఫిర్యాదులో విచారణ పై స్టే విధించాలంటూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఏసీ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ మేరకు రాహుల్ వ్యాఖ్యలను అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది. భారత్ భూభాగాన్ని చైనా ఆక్రమించిందనే విషయం మీకెలా తెలుసని ప్రశ్నించింది. ప్రతిపక్షనేత హోదా కలిగిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని హెచ్చరించింది. నిజమైన భారతీయులు ఇలాంటి వ్యాఖ్యలు చేయరని మండిపడింది.కాగా గతంలో భారత్ జోడో యాత్ర సందర్భంగా..2,000 కిలోమీటర్లకు పైగా భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. 2020 జూన్‌లో లబ్దఖ్లోని గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన హింసాత్మక ఘర్షణ అనంతరం, మోదీ ప్రభు త్వం చైనాకు లొంగిపోయిందని, 2,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని డ్రాగన్ దేశం చట్టవిరుద్ధంగా ఆక్రమించిందని ఆరోపించారు. అయితే రాహుల్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి, వాదనలు వినిపించారు. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ.. ఏదైనా సమస్య లేదా విషయంపై మాట్లాడాలంటే పార్లమెంటులోనే మాట్లాడాలని.. సోషల్ మీడియాలో కాదని మండిపడింది. ఈ కేసులో విచారణను నిలిపివేసినప్పటికీ.. రాహుల్‌కు మాత్రం నోటీసులు జారీచేసింది. -
ప్రభుత్వ ఉద్యోగులను విదేశాలకు వెళ్లనీయని చైనా
ప్రభుత్వ ఉద్యోగులపై చైనా ప్రభుత్వం వింత వింత ఆంక్షలు పెడుతోంది. ఉపాధ్యాయులు, వైద్యులు సహా ప్రభుత్వ యాజమాన్యంలోని వివిధ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులెవరినీ దేశం దాటి విదేశాలకు వెళ్లనీయడం లేదు. ప్రజల్లో సైద్ధాంతిక భావాలు సడలకుండా ఉండేందుకు, విదేశీ ప్రభావాన్ని అరికట్టడానికి, జాతీయ భద్రతను పెంచడానికి చైనా ప్రభుత్వం ఈ చర్యలకు పూనుకుంది.కీలక ఆంక్షలు ఇవే..పాస్ పోర్ట్ సరెండర్: చాలా మంది ప్రభుత్వ రంగ ఉద్యోగులు ఇప్పుడు తమ పాస్ పోర్ట్ లను స్థానిక అధికారులకు అప్పగించాల్సి ఉంటుంది.వ్యక్తిగత ప్రయాణానికి అనుమతి తప్పనిసరి: విదేశాలలో వ్యక్తిగత సెలవులను కూడా యజమాన్యాలు లేదా స్థానిక ప్రభుత్వ విభాగాలు ఆమోదించాలి. అయితే విదేశీ పర్యటనలకు అనుమతులు ఇవ్వకుండా నిరాకరిస్తున్నారు.విదేశాల్లో చదువుపై నిషేధం: చాలా ప్రావిన్సుల్లో విదేశాల్లో చదువుకున్న వ్యక్తులు ఇప్పుడు కొన్ని ప్రభుత్వ పదవులకు అనర్హులు.వ్యాపార ప్రయాణ ఆంక్షలు: సాధారణ పరిశోధన, అధ్యయనం ప్రయాణాలను కూడా అనేక ప్రాంతాలలో నిషేధించారు.ఇదంతా ఎందుకంటే..తమ దేశ ప్రజలపై ముఖ్యంగా విద్యావేత్తలు, ప్రభుత్వ ఉద్యోగులలో విదేశీ సైద్ధాంతిక ప్రభావం గురించి చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కువగా ఆందోళన చెందుతోంది. రాజకీయ క్రమశిక్షణ, పార్టీ పట్ల విధేయతను బలోపేతం చేసే విస్తృత ప్రచారంలో భాగంగా ఈ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. విదేశాలతో ఉద్యోగుల వ్యక్తిగత, కుటుంబ సంబంధాలను కూడా అధికారులు మ్యాపింగ్ చేస్తున్నారు.ఆంక్షల పరిధి, ప్రభావంచైనా ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ ఆంక్షలు చైనా శ్రామిక శక్తిలో విస్తృత భాగాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ప్రభుత్వ పట్టణ స్థానిక సంస్థలలో పనిచేసే సుమారు 16.7 కోట్ల మందిపై వీటి ప్రభావం పడుతోంది. కొన్ని నగరాల్లో రిటైరైన వారు కూడా తమ పాస్‌పోర్టులను తిరిగి పొందడానికి రెండేళ్లు వేచి ఉండాల్సి వస్తుంది. కొంతమంది ఉద్యోగులనైతే సోషల్ మీడియా ఖాతాలను బహిర్గతం చేయాలని, తమ నివాస నగరాన్ని విడిచి వెళ్లేటప్పుడు రిపోర్ట్ చేయాలని అడుగుతున్నారట. -
చైనాలో గోల్డ్ రష్..!
బీజింగ్: ఒకటీరెండూ కాదు..ఏకంగా 20 కిలోల బంగారం, వెండి నగలు...బంగారం, డబ్బు నిండుగా ఉన్న ఇనుప బీరువా..! చైనాలోని ఓ ఊళ్లో జనం వీటిని సొంతం చేసుకునేందుకు తెగ వెతుకుతున్నారు. కొందరు బురద మట్టిని తవ్వి మరీ చూస్తున్నారు. మరికొందరైతే ఏకంగా మెటల్ డిటెక్టర్లను పట్టుకుని తిరుగుతున్నారు. ఇదంతా నిధీ నిక్షేపాల కోసం మాత్రం కాదు..వరదల్లో కొట్టుకుపోయిన సొత్తు కోసం సాగుతున్న ఎడతెగని అన్వేషణ..! ఏం జరిగిందంటే..జూలై 25వ తేదీన షాంగ్జి ప్రావిన్స్‌లోని వుక్వి కౌంటీలో భారీ వర్షాలతో అనూహ్యంగా వరదలు వచ్చాయి. కొన్ని నిమిషాల వ్యవధిలోనే మీటరు ఎత్తున వరద ఉప్పొంగి పట్టణాన్ని ముంచెత్తింది. ఆ వరద లావోఫెంగ్ జియాంగ్ దుకాణంలోకి కూడా ప్రవేశించింది. అధికార యంత్రాంగం వరద హెచ్చరికలతో ఆ రాత్రంగా జాగారం చేసిన దుకాణం సిబ్బంది, ఉదయం పూట యథా ప్రకారం దుకాణం తెరిచేందుకు ఉద్యుక్తులవుతున్నారు. బంగారం, ఇతర విలువైన సామగ్రిని సురక్షితంగా భద్రపర్చడం మర్చిపోయారు. సరిగ్గా ఆ సమయంలో ఎవరూ ఊహించని విధంగా ఒక్కసారిగా వేగంగా వరద ప్రవాహం దుకాణంలోకి చేరింది. తేరుకునేలోపే నగలున్న ట్రేలు, కాబిన్లను ఊడ్చిపెట్టుకుపోయింది. నగదు, నగలతోపాటు ఒక ఐరన్ సేఫ్ సైతం వరదతో పాటు మాయమైంది. బంగారం గొలుసులు, ఉంగరాలు, గాజులు, బ్రాస్లెట్లు, వజ్రపు ఉంగరాలు, వెండి ఆభరణాలు, పచ్చలు పోయిన వాటిల్లో ఉన్నాయి. ఐరన్ సేఫ్‌లో పెద్ద మొత్తంలో నగదుతోపాటు, కరిగించిన బంగారం, కొత్త బంగారు వస్తువులు ఉన్నాయి. వెరసి దుకాణదారుకు వాటిల్లిన నష్టం మార్కెట్ ధర ప్రకారం రూ.12 కోట్లని అంచనా. ఈ సొత్తు కోసం దుకాణం యజమాని కుటుంబంతోపాటు సిబ్బంది రెండు రోజులుగా కాళ్లకు బలపం కట్టుకుని మరీ ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. పోయిన వాటిలో సుమారు కిలో బంగారు ఆభరణాలు దొరికినట్లు అధికారులు చెబుతున్నారు. వరదల కారణంగా పట్టణంలో కరెంటు సరఫరా నిలిచిపోయింది. దీంతో, సీసీటీవీ ఫుటేజీ వ్యవస్థ దెబ్బతింది. దీనివల్ల వరద సమయంలో దుకాణంలో ఏం జరిగిందో తెలుసుకునేందుకు సరైన ఆధారమంటూ లేకుండా పోయింది. ఎవరైనా ఈ వస్తువులను తీసుకెళ్లారా? లేక వరదలోనే కొట్టుకుపోయాయా అనేది నిర్థారించడం సైతం కష్టంగా మారింది. తమ నగల దుకాణానికి సంబంధించిన విలువైన వస్తువులను ఎవరైనా ఉద్దేశ పూర్వకంగా తీసుకున్నట్లు తెలిస్తే చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తామని యజమాని హెచ్చరిస్తున్నారు. దుకాణంలోని వస్తువులు వరదల్లో కొట్టుకుపోయినట్లు సమాచారం తెలుసుకున్న స్థానికులు సైతం గాలింపు మొదలుపెట్టారు. వరదలకు కొట్టుకు పోయి న బురద, మట్టిని తవ్వి మరీ చూస్తున్నారు. కొందరు మెటల్ డిటెక్టర్లతోనూ వెదుకుతున్నారు. ఈ గోల్డ్ రష్కు సంబంధించిన వీడియోలు ఆన్లైన్లో ప్రత్యక్షమవుతున్నాయి. అయితే, స్థానికులెవరూ దొరికిన వస్తువులను తమకివ్వలేదని దుకాణం యజమాని చెబుతున్నారు. అలా ఎవరైనా తీసుకుపోయినట్లు తెలిస్తే సమాచారమివ్వాలని స్థానికులను కోరుతున్నారు. తెచ్చిన వారికి ఆ వస్తువు విలువను బట్టి బహుమతులను సైతం ఇస్తామని ఆశచూపుతున్నారు.బీజింగ్‌లో వర్షాలు, వరదల్లో 44 మంది మృతి చైనా రాజధాని బీజింగ్‌ను భారీ వర్షాలు, వరదలు కకావికలం చేశాయి. శనివారం కురిసిన కుండపోత వానలు, వరదల్లో కనీసం 44 మంది చనిపోగా, 9 మంది గల్లంతయ్యారు. గత నాలుగు రోజులుగా బీజింగ్ సహాయక, రక్షణ కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో మరోసారి భీకరంగా వాన కురియడంతో రహదారులు తెగిపోవడంతోపాటు, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని జనాన్ని సురక్షిత ప్రాంతాలకు యంత్రాంగం తరలిస్తోంది. బీజింగ్‌లో ఉత్తరాన ఉన్న పర్వతప్రాంత మియున్, యాంగ్వింగ్ జిల్లాల్లో అత్యధిక నష్టం వాటిల్లిందని అధికార వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. -
వరదల్లో కొట్టుకుపోయిన 20 కేజీల బంగారం.. తర్వాత ఏం జరిగిందంటే?
చైనాను కొన్ని రోజులుగా భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వరదలు కారణంగా షాంగ్జీ ప్రావిన్స్‌లో ఓ బంగారం షాపులో నుంచి గోల్డ్, వెండి ఆభరణాలు కొట్టుకుపోయాయి. దీంతో వాటిని వెతికేందుకు వీధుల్లో జనం పోటీపడ్డారు. షాంగ్జీ ప్రావిన్స్‌లోని వుచి కౌంటీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.సముద్ర తీరానికి సమీపంలో ఉండే ఈ ప్రాంతం భారీ వర్షాలతో వరదమయంగా మారింది. బంగారు నగల షాపును ఎప్పటిలాగే జులై 25న ఉదయం తెరిచారు. దీంతో వరద నీరు దుకాణంలోకి దూసుకొచ్చింది. దీంతో షాపులోని నగలు కొట్టుకుపోయాయి. సేఫ్ బాక్సులో రీసైకిల్ చేసిన బంగారంతో పాటు భారీగా నగదు కూడా ఉన్నట్లు ఆ షాపు యజమాని పేర్కొన్నారు. దాదాపు 20 కిలోల బంగారం, వెండి గల్లంతయ్యాయి. మొత్తం నష్టం విలువ 10 మిలియన్ యువాన్ (రూ.12 కోట్లు)గా అంచనా. A gold shop in Wuqi County, Shaanxi says around 20kg of jewelry was lost in recent floods. About 1kg has been recovered so far. Police are investigating, and local authorities are urging anyone who found gold to return it. #Shaanxi #floods pic.twitter.com/kZQsaLqJnz— Spill the China (@SpilltheChina) July 27, 2025 అయితే, బంగారం కొట్టుకుపోయిన విషయం తెలియగానే స్థానికులు భారీగా వీధుల్లోకి చేరుకుని బంగారం కోసం వెతుకులాట ప్రారంభించారు. మెటల్ డిటెక్టర్లు ఉపయోగించి మరి ఆభరణాల కోసం వెతుకుతున్నారు. ఇప్పటివరకు 1 కిలో బంగారం మాత్రమే తిరిగి లభించింది. కొంతమంది స్వచ్ఛందంగా తిరిగి ఇచ్చారు కానీ చాలా మంది తిరిగి ఇవ్వలేదని దుకాణ యజమాని తెలిపారు. బంగారాన్ని దొంగిలించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ ఆయన హెచ్చరించారు. -
కండలు తిరిగిన వైద్యురాలు..! ఏకంగా 600కి పైగా..
వైద్యులు అనగానే ఎలా ఉంటారో చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఒక కళ్లజోడు..చూడగానే స్మార్ట్గానో లేదా ఓ మోస్తారు లావుగానో ఉంటుంది వారి ఆహార్యం. చాలామటుకు వైద్యులంతా ఇలానే ఉంటారనే చెప్పొచ్చు. కానీ అలాంటి మూసపద్ధతులన్నీ బద్దలు కొట్టి ఇక్కడొక వైద్యురాలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. అంతేగాదు నెట్టింట ఆ వైద్యురాలు ఎవరా..? అంటూ చర్చలు మొదలయ్యాయి. చైనాలోని చాంగ్కింగ్లో 26 ఏళ్ల యాన్యన్ ఫోరెన్సిక్ డాక్టర్ బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ మాదిరిగా కండలు తిరిగిన వైద్యుడు. సాధారణంగా డాక్టర్లు కనిపించేలా స్మార్ట్‌గా కాకుండా..వెయిట్‌లిఫ్టర్ మాదిరిగా..ఉంటుందామె. ఆమె శరీరాకృతి వైద్యరంగంలో ఉండే మూసపద్ధతులకు అత్యంత విభిన్నంగా ఉంటుంది ఆమె ఆహార్యం. ఆ కారణంగానే ఆమె నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. ఆమె అద్భుతమైన బలానికి, ఫిట్నెస్కి పేరుగాంచిన వైద్యురాలు. ఆమె చైనాలోని చాంగ్కింగ్ మునిసిపాలిటీలోని ఫోరెన్సిక్ ప్రయోగశాలలో పనిచేస్తున్న తొలి మహిళా ఫోరెన్సిక్ ఫాథాలజిస్ట్. ఆమె ఫోరెన్సిక్ మెడిసిన్‌లో పట్టా పొందిన వెంటనే విధుల్లో చేరారు. అప్పటి నుంచి దాదాపు 600కు పైగా మృతదేహాల అనుమానాస్పద మరణ కేసులను నిర్వహించింది. అంతేగాదు యూన్యన్ సుమారు 120 కిలోలు బరువులను ఎత్తగలదు. ఒంటి చేత్తో చైన్సా (Chainsaw) అనే శక్తివంతమైన పోర్టబుల్ కట్టింగ్ సాధనాన్ని ఆపరేట్ చేయగలదు. కేవలం మూడు నిమిషాల్లో బ్రెయిన్‌కి సంబంధించిన క్రానియోటమీ సర్జరీని పూర్తి చేస్తుందామె. ఈ విశిష్ట సామర్థ్యమే ప్రత్యేక మహిళా వైద్యురాలిగా గుర్తింపుతెచ్చి పెట్టాయి. ఆమె ఫిట్నెస్ శిక్షణ తన ఉద్యోగ విధులను సులభంగా నిర్వర్తించేందుకు ఎంతగానో ఉపకరిస్తుందట. ఎందుకుంటే తరుచుగా దాదాపు 150 కిలోలు వరకు బరువు ఉండే మృతదేహాలను కదలించడంలో ఈ దేహధారుడ్యం తనకు ఎంతగానో హెల్ప్ అవుతోందని చెబుతోంది యాన్యన్. అంతేగాదు తన సోషల్ మీడియా ఖాతాలో ఫిట్నెస్కి సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటుంటుంది. యాన్యన్ మహిళలు ఇలాంటి ఉద్యోగాలకు పనికిరారు అనే భావనను సవాలు చేయడమే లక్ష్యంగా తనను స్ట్రాంగ్‌గా చేసుకుంటూ సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నానని చెబుతోంది. ఈ ఫోరెన్సిక్ రంగంలో ఇప్పటికీ వివక్ష ఉందని, కొన్ని సంస్థలు పురుషులకే ప్రాధాన్యత ఇస్తాయని వాపోయింది. అలాగే చాలామంది ప్రజలు తన వృత్తి పట్ల ప్రతికూలంగా మాట్లాడుతుంటారని, కనీసం షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి కూడా నిరాకరిస్తారంటూ బాధగా చెప్పుకొచ్చింది. అయితే తాను అవేమి పట్టించుకోనని, తన వృత్తి ధర్మం ప్రకారం..చనిపోయిన మృతులకు న్యాయం చేకూరేలా తన వంతు సాయం చేస్తుంటానని పేర్కొంది యాన్యన్. ఆమెకు బాడీబిల్డర్‌గా ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టడం, వృత్తి రెండు కళ్లులాంటివి అని, అందుకే ఆ రెండింటికి సమన్యాయం చేస్తుంటానని చెబుతోంది. తన ఉద్యోగానుభవం..జీవితంలోని దర్భలమైన పరిస్థితులను గుర్తుచేస్తూ..ప్రతి క్షణాం మంచిగా ప్రవర్తించమనే పాఠాన్ని నేర్పిస్తుందని అంటోంది యాన్యన్.(చదవండి: జస్ట్ 15 వారాల్లో 50 కిలోలు ..! కానీ ఆ వ్యాధి కారణంగా..) -
హ్యూమనాయిడ్ రోబో కేవలం రూ.5 లక్షలే!
భలే మంచి చౌక బేరము.. రూ.5.12 లక్షలకే హ్యూమనాయిడ్ రోబో అంటోంది చైనాకు చెందిన ఓ కంపెనీ. రోబో.. అంటేనే ఖరీదైన వ్యవహారం. అందులోకి, అచ్చం మనిషిలా ఉండి, మనిషి చేయగలిగే చాలా పనులు చేసే హ్యూమనాయిడ్ రోబో అంటే.. ఇంకా ఖరీదు. కానీ.. అస్సలు కాదు అంటోంది చైనా దిగ్గజం యూనిట్రీ రోబోటిక్స్. రోబోల తయారీలో మంచి పేరున్న ఈ కంపెనీ ఆర్1 హ్యూమనాయిడ్‌ను తయారుచేసింది. దీని ధర కేవలం 5,900 డాలర్లు (రూ.5.12 లక్షలు) మాత్రమేనట. కంపెనీ గతంలో అందుబాటులోకి తెచ్చిన జీ1తో పోలిస్తే కొత్త మోడల్ ధర 63 శాతం తక్కువ కావడం విశేషం. – సాక్షి, స్పెషల్ డెస్క్యూనిట్రీ రోబోటిక్స్ ఆర్1 హ్యూమనాయిడ్.. పరుగెడుతుంది, నడుస్తుంది, పిల్లిమొగ్గలు వేస్తుంది, చేతుల మీద నిలబడుతుంది. మనం ఇచ్చే వాయిస్ ఆదేశాలకు ప్రతిస్పందిస్తుంది. పరిసరాలను అర్థం చేసుకుంటుంది. ప్రయోగాలకు అనువుగా ఇది పనిచేస్తుంది. అంటే టెక్ కంపెనీలు ఈ హ్యూమనాయిడ్‌ను మరింతగా అభివృద్ధి చేసేందుకు వీలు కూడా ఉండటం దీనిలోని మరో ప్రత్యేకత. ఆఫీసులు, ఇంటి పనుల కోసం పని మనుషులను పెట్టాలనుకునేవాళ్లు దీన్ని ట్రై చేయొచ్చు అంటోంది కంపెనీ.గంటపాటు నిర్విరామంగా..» ఈ హ్యూమనాయిడ్ ఎత్తు 121 సెంటీమీటర్లు, వెడల్పు 35.7 సెం.మీ. మందం 19 సెం.మీ. » వాయిస్ గుర్తించేందుకు నాలుగు మైక్రోఫోన్ ్స, అల్ట్రావైడ్ యాంగిల్ విజువల్స్ కోసం బైనాక్యులర్ కెమెరా పొందుపరిచారు. వైఫై 6, బ్లూటూత్ 5.2 కనెక్టివిటీ ఉంది. » కేవలం 25 కేజీల బరువే ఉండటం కూడా వాడకందారులకు చాలా సౌలభ్యం. » బ్యాటరీ ఒకసారి రీచార్జ్ చేస్తే రోబో గంటపాటు పనులు చక్కబెడుతుంది. » మాన్యువల్ రిమోట్ కంట్రోల్‌తో పనిచేస్తుంది. » పూర్తి కస్టమైజేబుల్.. అంటే కస్టమర్ కోరిన విధంగా మార్పులు చేసి కూడా తయారు చేస్తారు.ఆర్1.. ఒక మైలురాయిఫ్యాక్టరీలు, ఇంటి పనులకు సంబంధించి హ్యూమనాయిడ్ల తయారీలో ఇంతవరకు అమెరికన్ కంపెనీల ఆధిపత్యం ఉండేది. ఇప్పుడు చైనా కంపెనీలు ఈ రేసులోకి ‘తక్కువ ధరకే’ ట్యాగుతో వచ్చాయి. ఇవి పై రెండు రకాల పనులతోపాటు మిలటరీలో కూడా ఉపయోగపడతాయట. చైనాలోని పరిశోధనా ప్రయోగశాలలు, పాఠశాలల్లో వాడుతున్న యూనిట్రీ కంపెనీ తయారీ జీ1 రోబో ధర 16,000 డాలర్లుగా ఉంది. మరింత అధునాతన, పెద్ద సైజులో ఉండే హెచ్1 మోడల్ ధర 90,000 డాలర్ల కంటే ఎక్కువ. అందరికీ అందుబాటు ధరలో ఏకంగా 5,900 డాలర్లకే ఇప్పుడు ఆర్1 హ్యూమనాయిడ్‌ను తీసుకొచ్చింది. ఇది సంక్లిష్ట హ్యూమనాయిడ్ల విభాగంలో ఒక మైలురాయిగా నిలుస్తుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.రోజువారీ జీవితంలో మమేకం..» మీరు ఉదయం లేవగానే మీ కదలికలను రోబో గుర్తిస్తుంది. » కాఫీ మెషీన్ ను ఆన్ చేస్తుంది. » ఒకవేళ మీకు కళ్లజోడు అలవాటు ఉంటే.. అది ఎక్కడ ఉన్నా తెచ్చి మీ చేతికి ఇస్తుంది. » ఆ రోజు చేయాల్సిన మీ షెడ్యూల్‌ను చదువుతుంది.» మీ బిడ్డకు సైన్స్, మ్యాథ్స్.. ఇలా ఏదైనా సబ్జెక్టులో సందేహాలు ఉంటే సమాధానాలతో సహాయపడుతుంది. సంభాషణను సరదా క్విజ్గా కూడా మారుస్తుంది.» అమ్మమ్మ, తాతయ్యల వంటి పెద్దలకు.. ఎతై ్తన షెల్ఫ్ నుండి మందులను తీసుకొచ్చి చేతిలో పెడుతుంది. » ఇంటికి బంధువులు, స్నేహితులు వస్తే వారిని ఆకట్టుకోవడానికి పిల్లిమొగ్గల వంటివి వేస్తుంది. -
అమెరికాకు స్మార్ట్ఫోన్ల ఎగుమతుల్లో భారత్ టాప్
న్యూఢిల్లీ: టారిఫ్‌ల వివాదాలతో అమెరికాకు చైనా స్మార్ట్ఫోన్ల ఎగుమతులు నెమ్మదించడాన్ని భారత్ అవకాశంగా మల్చుకుంటోంది. 2025 రెండో త్రైమాసికంలో తొలిసారిగా అగ్రరాజ్యానికి చైనాకన్నా అధికంగా స్మార్ట్ఫోన్లను ఎగుమతి చేసింది. కన్సల్టెన్సీ సంస్థ కెనాలిస్ నివేదికలో ఈ అంశం వెల్లడైంది. దీని ప్రకారం అమెరికాకు స్మార్ట్ఫోన్ల ఎగుమతుల్లో చైనాలో అసెంబుల్ చేసిన ఫోన్ల వాటా గతేడాది ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో 61 శాతంగా ఉండగా ఈ ఏడాది అదే వ్యవధిలో 25 శాతానికి తగ్గింది. అదే సమయంలో భారత్ వాటా 13 శాతం నుంచి 44 శాతానికి (సుమారు 240 శాతం వృద్ధి) పెరిగింది. క్యూ2లో ఐఫోన్ల ఎగుమతులు వార్షికంగా 11 శాతం తగ్గి 1.33 కోట్ల యూనిట్లకు పరిమితం కాగా, శాంసంగ్ ఫోన్ల ఎగుమతులు 38 శాతం పెరిగి 83 లక్షల యూనిట్లకు పెరిగాయి. టాప్ 5 ఫోన్లకు సంబంధించి అమెరికాకు మోటరోలా ఫోన్ల ఎగుమతులు రెండు శాతం పెరిగి 32 లక్షల యూనిట్లకు, గూగుల్ 13% పెరిగి 8 లక్షల యూనిట్లకు చేరగా, టీసీఎల్ 23% క్షీణించి 7 లక్షల యూనిట్లకు పరిమితమైంది. క్యూ2లో తొలిసారి...అమెరికాకు ఎగుమతయ్యే స్మార్ట్ఫోన్లకు సంబంధించి క్యూ2లో భారత్ తొలిసారిగా అగ్రగామి తయారీ హబ్‌గా నిల్చిందని కెనాలిస్ ప్రిన్సిపల్ అనలిస్ట్ సన్యమ్ చౌరాసియా తెలిపారు. అమెరికా–చైనా మధ్య వాణిజ్య అనిశ్చితి వల్ల యాపిల్ తమ సరఫరా వ్యవస్థను భారత్‌కు మళ్లిస్తుండటం ఇందుకు దోహదపడిందని వివరించారు. చైనా ప్లస్ వన్ వ్యూహంలో భాగంగా యాపిల్ గత కొన్నేళ్లుగా భారత్‌లో తమ ఉత్పత్తుల తయారీని పెంచుకుంటోందని చౌరాసియా చెప్పారు. అయితే, ఐఫోన్ 16 సిరీస్, ప్రో మోడల్స్ తయారీని భారత్‌లో ప్రారంభించినప్పటికీ, పెద్ద స్థాయిలో సరఫరా కోసం యాపిల్ ఇప్పటికీ చైనా తయారీ ప్లాంట్లపైనే ఎక్కువగా ఆధారపడుతోందని ఆయన వివరించారు. యాపిల్ తరహాలోనే మోటరోలా ఫోన్లకు కూడా ప్రధాన తయారీ హబ్‌గా చైనా నిలుస్తోంది. మరోవైపు, యాపిల్‌తో పోలిస్తే కాస్త తక్కువ పరిమాణమే అయినప్పటికీ అమెరికాకు ఎగుమతి చేసే ఉత్పత్తుల తయారీని శాంసంగ్, మోటరోలా కూడా భారత్‌లోనే ఎక్కువగా చేపడుతున్నాయని చౌరాసియా పేర్కొన్నారు. శాంసంగ్ అత్యధికంగా స్మార్ట్ఫోన్లను వియత్నాంలో ఉత్పత్తి చేస్తోంది. -
చైనా బలం ఏమిటి?!
ప్రపంచాన్ని కొన్ని వందల సంవత్సరా లుగా పాలించి శాసిస్తున్న పాశ్చాత్య దేశా లను తట్టుకుని నిలవాలని, వాటితో సమాన స్థాయికి ఎదగాలని భావిస్తున్న చైనా... ఆ లక్ష్యం వైపు ముందుకు సాగుతున్నట్లుగానే కనిపిస్తోంది. అయితే తన లక్ష్య సాధన కోసం చైనా వ్యూహం ఏమిటి? ఆ వ్యూహంలోని బలమెంత? అనే ఆలోచనలు– చైనా గురించి కొంత తెలిసి ఉండి, కొన్నాళ్లు అక్కడికి వెళ్లి గమనించిన మీదట కలుగుతాయి. అవమానాల శతాబ్దం (1839 –1949) నుంచి పునరుజ్జీవన శతాబ్దం (1949–2049) లోకి ప్రవేశించదలచిన చైనా, అందుకు అవసరమైన విధంగా వరుసగా కొన్ని పాఠాలను చరిత్ర నుంచి, వర్తమానం నుంచి తీసుకుంటూ వస్తున్నది. చైనా వ్యూహానికి పునాదులు వేసినది ఆ పాఠాలే! మావో ప్రయోగాల ప్రభావంచైనాకు మొదట అవమానాల శతాబ్ది ఎదురు కావటానికి ప్రధాన కారణం... చివరిదైన ఛింగ్ రాజ వంశ కాలంలో ఫ్యూడల్ వ్యవస్థాపరమైన అభివృద్ధి నిజంగానే గొప్పగా ఉండినా, ఆ కాలపు యూరప్, జపాన్లలో వలె పరిశ్రమలు, సైన్స్, టెక్నాలజీ, సైన్యం, చైనాలో ఆధునికం కాకపోవటం. ఇక రెండవ కారణం... సువిశాల దేశమైన చైనాలోని వేర్వేరు ప్రాంతాలు, ప్రజల మధ్య తగిన ఐక్యత లేకపోవటం. కనుక, కమ్యూనిస్టు విప్లవం తర్వాత పునరుజ్జీవన కాలంలో ఈ రెండూ సాధించటం చైనా ప్రాధాన్య లక్ష్యం అయింది.అయితే, మావో ఒక సోషలిస్టు స్వాప్నికుడు అయినందున, ఆర్థికా భివృద్ధిని కోరుకుంటూనే సామాజిక సమానత్వానికి అంతకన్న పెద్ద పీట వేయాలని భావించటంతో 1976 వరకు ఆయన జీవిత కాలంలో పలు ప్రయోగాల వల్ల చైనా ఒడుదొడుకులకు లోనైంది. మరొకవైపు, అవమానాల శతాబ్ది నాటి సైనిక పరాజయాలు గుర్తున్నందున కొరియా యుద్ధంలో, ఇతరత్రా కూడా తమ సైన్యం బలహీన మైనదయినప్పటికీ అమెరికా, రష్యా, జపాన్‌లను ధిక్కరించి చైనా నిలిచింది తప్ప గతంలో వలె లొంగిపోలేదు. అది చైనా ప్రజలకు స్ఫూర్తిదాయకమైన ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది.‘తియానన్మెన్’ తిరుగుబాటుమావో అనంతరం డెంగ్ శియాగో పింగ్ కాలం మొదలుకొని చైనా, ప్రపంచాన్ని చూసి ఆధునీకరణ పాఠాలు నేర్చుకోవటం ఆరంభించింది. ఆర్థికంగా, సైనికంగా, విద్యా–వైజ్ఞానికపరంగా. ఆర్థికసంస్కరణలు అందుకు తొలి అడుగయ్యాయి. అదే సమయంలో – పేదరికం, నిరుద్యోగం వల్ల విద్యార్థులు, యువకుల నుంచి సామా జికంగా ఒక పెద్ద కుదుపు మొదలై 1989లో తియానన్మెన్ స్క్వేర్ తిరుగుబాటు తలెత్తింది. తియానన్మెన్ తిరుగుబాటు... సామాజికాభి వృద్ధితో పాటు, ఆర్థికాభివృద్ధి కూడా వేగంగా జరిగి, అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకూ చేరాలన్న పాఠాన్ని చైనాకు నేర్పింది. ఇరాక్ –అమెరికా కూటమి మధ్య జరిగిన గల్ఫ్ యుద్ధం (1991), సైనికంగా ఇరాక్ వంటి స్థితిలోనే గల తమపై ఒకవేళ అమెరికా దాడి జరిపితే ఏమి కావచ్చునో అర్థం చేయించింది. తర్వాత అదే సంవ త్సరం (1991) చివరలో సాటి సోషలిస్టు దేశమైన సోవియెట్ యూనియన్ పతనం చైనాకు అనేక పాఠాలను నేర్పింది. ఒక విధంగా ఈ మూడు పరిణామాలు లేదా పాఠాలు చైనా నాయకత్వపు ఆలోచ నలకు, భవిష్యత్ వ్యూహానికి పదును పెట్టాయి. వ్యూహాత్మకంగా ‘డబ్ల్యూటీ వో’లోకి! భవిష్యత్తులో ఏమి సాధించాలన్నా ఆర్థికాభివృద్ధి అందుకు ప్రాతిపదిక కాగలదని బోధపడటంతో, ఒకవైపు అంతర్గతంగాసంస్కరణలను కొనసాగిస్తూనే మరొకవైపు విదేశీ సాయాలు, పెట్టు బడులు, వాణిజ్యం కోసం డబ్ల్యూటీవోలో చేరటం తప్పనిసరి అనే నిర్ణయానికి చైనా వచ్చింది. అందుకు అమెరికా అంగీకారం అవసరం గనుక, ‘ఎంత ఎదిగినా ఒదిగి ఉండు’ అనే వ్యూహాన్ని పాటిస్తూ అమెరికాను మెప్పించి 2001లో ఆ సంస్థలో సభ్యత్వం సంపాదించింది. అప్పటినుంచి చైనా ఇక వెనుదిరిగి చూడలేదు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. కమ్యూనిస్టు రష్యా కూలిన తర్వాత కమ్యూనిస్టు చైనా బలహీనపడాలని అమెరికా కోరుకోవాలి గానీ, డబ్ల్యూటీవోలో చేరి బలపడాలని ఎందుకు భావిస్తుంది? దీనికి స్వయంగా అమెరికన్లు ఇచ్చే వివరణను బట్టి అప్పటి అధ్యక్షుడు జార్జ్ బుష్, చైనా ఆర్థికంగా అభివృద్ధి చెందే కొద్దీ వారి సంపదలు, కోరికలు, సమాజం, సంస్కృతి వంటివి మారి క్రమంగా పాశ్చాత్య సమాజం వలె మారుతుందని, దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కోరుకున్న తియానన్మెన్ నాటి ధోరణి బలపడుతుందని, ఆ విధంగా కమ్యూనిజం అంతర్ధానమై పెట్టుబడిదారీ వ్యవస్థ, పశ్చిమ దేశాల తరహా ప్రజాస్వామ్యం రాగలవని అంచనా వేశారు. కానీ, అది గ్రహించిన చైనా నాయకత్వం తన తరహా వ్యవస్థను తాను నిర్మించు కుంటూ ముందుకు సాగింది. బుష్ ఆలోచన నెరవేరలేదు.కేంద్రీకృత మార్క్సియన్ పాలనఇప్పుడు వెనుదిరిగి సమీక్షిస్తే చైనాకు తన తరహా వ్యవస్థ అంటే ఏమిటి? ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుతం మనకు కనిపిస్తున్నవి. అవి : దేశ అవసరాలు, ప్రజల అవసరాలు, రక్షణ అవసరాలు, విద్యా వైజ్ఞానిక అవసరాలు తీరటంతో పాటు; తమ అంతర్గత పెట్టుబడు లకు, విదేశాలలో పెట్టుబడులకు, అమెరికా కూటమి ఒత్తిళ్లను తట్టు కునేందుకు చాలినంతగా సంపదలు వృద్ధి చెందటం. ప్రజల అవస రాలు తీరి, తలసరి ఆదాయాలు పెరుగుతూ, పేదరికం వేగంగా తొల గిపోతూ తియానన్మెన్ వంటి పరిస్థితులు మళ్లీ తలెత్తకుండా ఉండ టం. ఈ తరహా వృద్ధి అన్నదే చైనీస్ సోషలిజంగా స్థిరపడి క్లాసికల్ సోషలిజం భావన మరుగున పడటం. అదే సమయంలో ఈ నమూ నాకు ఆటంకాలు అంతర్గతంగా కానీ, బయటి నుంచి గానీ ఎదురవ కుండా, కేంద్రీకృత మార్క్సియన్ పాలనా వ్యవస్థ అమలు అవటం. అసలు వ్యవస్థనే వ్యతిరేకించని మేరకు ప్రజలు స్వేచ్ఛగా ఉండటం.‘బహుళ ధ్రువ’ నినాదంఈ క్రమంలో, తమ నమూనా సరైనదని చైనా నాయకత్వానికి గల నమ్మకాన్ని మరింత పెంచిన పరిణామాలు మరొక రెండు చోటు చేసుకున్నాయి. మొదటిది, 2008లో పాశ్చాత్య ప్రపంచం ఆర్థికసంక్షోభంలో చిక్కుకుని 1930ల నాటి ఆర్థిక మాంద్యాన్ని గుర్తు చేయగా, చైనాలో వృద్ధి రేటు మరింత పెరిగింది. ఆ తర్వాత 2019లో కోవిడ్ సమస్యను అమెరికా ఎదుర్కొనలేకపోగా, చైనా సమర్థవంతంగా బయటపడింది. ఇదే 21వ శతాబ్దంలో మరో స్థాయిలోఇంకొకటి కూడా జరిగింది. తమ పలుకుబడిని ప్రపంచవ్యాప్తం చేసుకుంటూ పోతేగానీ అమెరికాను తట్టుకుంటూ, క్రమంగా అమె రికాను బలహీనపరచలేమని భావించిన చైనా నాయకత్వం అందుకు తగిన వ్యూహం తయారు చేసింది. ఆ ప్రకారం 2009 నుంచి బ్రిక్స్‌ను, 2013 నుంచి బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్‌ను బలోపేతం చేస్తూ, ఏకధ్రువ ప్రపంచం స్థానంలో బహుళ ధ్రువ ప్రపంచమే వాంఛనీయ మన్న నినాదాన్ని ముందుకు తెచ్చింది. ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందం, ప్రపంచ ఆరోగ్యసంస్థ, అంతర్జాతీయ న్యాయస్థానం, యునిసెఫ్ మొదలైన వాటిని అమెరికా తన స్వార్థం కోసం బలహీనపరుస్తున్నందున, వాటిని ప్రపంచ దేశాలు పరిరక్షించుకోవాలని వాదిస్తున్నది. ఈ క్రమంలో తాజాగా తలెత్తిన సమస్య... డబ్ల్యూటీవో నిబంధనలకు పూర్తి విరుద్ధంగా అమెరికా అన్ని దేశాలపై ఏకపక్షంగా సుంకాలు పెంచి, వారిని ఒత్తిడి చేసి, తమకు అనుకూలంగా ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకోవటానికి ప్రయత్నించటం. ఆ తీరును చైనా తీవ్రంగా వ్యతి రేకించటం మిగతా సభ్యదేశాలను ఆకర్షిస్తున్నది. ఈ విధమైన ఆంతరంగిక, ప్రాపంచిక విధానాలు, వ్యూహాలూ కలిసి చైనా సమగ్ర, దీర్ఘకాలిక వ్యూహానికి బలంగా మారుతున్నట్లు కనిపిస్తున్నది. 2049 నాటికి పునరుజ్జీవనం పూర్తయి, తైవాన్ విలీనంతో ప్రపంచంలో ఆర్థి కంగా చైనా మొదటి స్థానానికి చేరటం జరుగుతుందా? వేచి చూడాలి. -వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు- టంకశాల అశోక్ -
వరద బీభత్సం..చైనా అతలాకుతలం (ఫొటోలు)
-
చైనాలో భారీ వరదలు
బీజింగ్: ఉత్తర చైనాలో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా 30 మంది మరణించారు. 130 గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లు, వంతెనలు తెగిపోయాయి. భారీ వర్షాలు కురి సే అవకాశం ఉండటంతో లక్ష మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రాణనష్టాన్ని నివారించడానికి పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపట్టాలని అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆదేశించారు. దేశ రాజధాని వరదలతో అతలాకుతలమైంది. రాజధానిలోనే 80,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వేలాది మందిని ఖాళీ చేయవలసి రావడంతో రాత్రంతా సహాయక చర్యలు కొనసాగాయి. బీజింగ్ సమీపంలోని షాంగ్జీ, హెబీ ప్రావిన్సులు కూడా కుండపోత వర్షాల వల్ల దెబ్బతిన్నాయి. హెబీలోని బావోడింగ్ నగరంలో దాదాపు 20,000 మందిని వారి ఇళ్ల నుంచి తరలించారు. హువైరౌ జిల్లాలో వరదలతో ఒక వంతెనను కూపోయింది. మియున్ జిల్లాలోని ప్రాంతాన్ని భా రీ వర్షం ముంచెత్తిన తరువాత, ఉబ్బిన కింగ్షుయ్ నది రహదారులు దెబ్బతిన్నాయి. బీజింగ్ అంతటా డజన్ల కొద్దీ రోడ్లు మూసివేయబడ్డాయి లేదా దెబ్బతిన్నాయి. మియున్ జిల్లాలో నది ఉప్పొంగుతోంది. షాంగ్జీ ప్రావిన్స్‌లోని లిన్ఫెన్ సిటీలోని జిక్సియన్ కౌంటీలో ఎల్లో రివర్ ఉధృతంగా ప్రవహిస్తోంది. మంగళవారం సాయంత్రం వరకూ వరద కొనసాగింది. కొండలన్నీ జలపాతాలు అయ్యాయి. కార్లు సెయిలింగ్ బోట్లను తలపి ంచాయి. దక్షిణ చైనాలో కూడా భారీ వర్షాలు కురిశాయి. హాంకాంగ్ ఈ సంవత్సరం మొదటిసారిగా అత్యధిక వర్షపు తుఫాను హెచ్చరికను జారీ చేసింది. బీజింగ్‌కు దక్షిణంగా, కో–మే తుఫాను సమీపిస్తుండటంతో జెజియాంగ్, జియాంగ్సు, అన్హుయ్ ప్రావిన్సుల్లో కూడా భారీ వర్షాలు కురవనున్నాయి. పూర్తి స్థాయిలో సహాయక చర్యలు : జిన్‌పింగ్ వరద ప్రభావిత ప్రంతాల్లో సహాయక చర్యలు పూర్తి స్థాయిలో చేపట్టాలని అధ్యక్షుడు జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. తప్పిపోయిన వారని వెదకడానికి, వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి వేగంగా చర్యలు తీసుకోవాలన్నారు. సాధ్యమైనంతవరకు ప్రాణనష్టాన్ని తగ్గించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది సంభవించిన ప్రకృతి వైపరీత్యాల వల్ల చైనాకు 54.11 బిలియన్ యువాన్లు (ఆరున్నర లక్షల కోట్లు ) నష్టం వాటిల్లిందని అత్యవసర నిర్వహణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో 90శాతానికి పైగా వరదల వల్లే కలిగాయని వెల్లడించింది. 🇨🇳中国の国営メディアによると、北京と近隣地域で大雨と洪水により30人以上が死亡し、数万人以上が首都から避難した。https://t.co/E1o1IachDH pic.twitter.com/GJxbcB8W5I— カントリーママ (@0327tnumata) July 29, 2025వరుస వరదలు.. బీజింగ్‌లో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు కొత్తేమీ కాదు. ఈ వేసవిలో చైనాలోని అనేక ప్రాంతాలు తీవ్రమైన వాతావరణాన్ని ఎదుర్కొన్నాయి. ఈ నెల ప్రారంభంలో దేశంలోని తూర్పు ప్రాంతంలో రికార్డు స్థాయిలో వేడిగాలులు వీచగా, దేశంలోని నైరుతి ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. సోమవారం, బీజింగ్ సమీపంలోని చెంగ్డే నగరంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో నలుగురు మరణించారు. ఎనిమిది మంది గల్లంతయ్యారు. ఈ నెల ప్రారంభంలో, టైఫూన్ విఫా తూర్పు చైనాను తాకినప్పుడు, షాన్డాంగ్ ప్రావిన్స్‌లో ఇద్దరు మరణించారు. 10 మంది గల్లంతయ్యారు. ఈ నెల ప్రారంభంలో నైరుతి చైనాలోని యాన్ నగరంలో కొండచరియలు విరిగిపడి ముగ్గురు మరణించారు. 2023లో భారీ వర్షాలు, వరదల కారణంగా 33 మంది మృతి చెందారు. 18 మంది గల్లంతయ్యారు. జూలై 2012లో వరదలు 79 మందిని బలిగొన్నాయి. ఇప్పటివరకు ఇదే అత్యంత తీవ్రమైన విపత్తు. -
షావోలిన్ గురువుపై చైనా విచారణ
బీజింగ్: ప్రపంచవ్యాప్తంగా పేరున్న షావోలిన్ టెంపుల్ అధిపతి షి యోంగ్ జిన్‌పై చైనా ప్రభుత్వం దర్యాప్తు చేపట్టింది. లంచాలు తీసుకోవడం, పలువురు మహిళలతో అనైతిక సంబంధాలు నెరపడం, అక్రమ సంతానాన్ని కలిగి ఉండటం వంటి ఆరోపణలను ఆయనపై మోపిందని టెంపుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. వివిధ విభాగాలు దర్యాప్తు చేపట్టాయంది. దాదాపు 1,500 ఏళ్ల చరిత్ర కలిగిన షావోలిన్ టెంపుల్ సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో ఉంది. ప్రపంచవ్యాప్తంటా ఏటా వేలాదిగా శిష్యులు ఇక్కడికి వచ్చి మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందుతుంటారు.షి యోంగ్ జిన్ ఈ షావోలిన్ టెంపుల్ అధిపతిగా 1999 నుంచి కొనసాగుతున్నారు. షావోలిన్ టెంపుల్ పేరును అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత సొంతం చేసుకున్న ఈయనకు సీఈవో మాంక్ అనే పేరూ ఉంది. షి హయాంలోనే షావోలిన్ టెంపుల్ చైనా వెలుపల కూడా స్కూళ్లను ప్రారంభించింది. సన్యాసుల బృందాలు షావోలిన్ కుంగ్‌ఫూ విన్యాసాల్లో పాల్గొనడం మొదలైంది. ‘షి యోంగ్జిన్ చర్యలు తీవ్రమైనవి, బౌద్ధ వర్గం, సన్యాసుల ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసేలా ఉన్నాయి’అని బుద్ధిస్ట్ అసోసియేషన్ ఆఫ్ చైనా ఒక ప్రకటనలో పేర్కొంది. -
China Floods 2025: చైనాపై ప్రకృతి కన్నెర్ర లక్ష మంది..
-
భూమి మీద నుంచే శాటిలైట్లపై దాడి!
ఎల్రక్టానిక్స్, టెక్స్టైల్స్, ఆటోమొబైల్స్సహా ఎన్నో రంగాల్లో ప్రపంచ అగ్రగామిగా వెలుగొందుతున్న చైనా ఇప్పుడు మరో అసాధారణ, శక్తివంతమైన ఆయుధ తయారీలో తలమునకలైంది. అగ్రరాజ్యం అమెరికాను తలదన్నేలా ఎన్నెన్నో ఆవిష్కరణలు చేసిన చైనా ఇప్పుడు దేశ భద్రత, రక్షణే పరమావధిగా కీలక ఆయుధాన్ని సృష్టిస్తోంది. తమ వైమానిక, అణు స్థావరాలు, వ్యూహాత్మకప్రాంతాల గుట్టుమట్టు చెప్పే విదేశీ, శత్రు ఉపగ్రహాలను అంతరిక్షంలోనే తునాతునకలు చేసే లేజర్ కాంతి ఆయుధాన్ని అభివృద్ధిచేస్తోంది. కాంతి సాధారణ స్థాయిలోకాకుండా ప్రత్యేకమైన స్ఫటికాల గుండా ప్రసరించినప్పుడు మరింత శక్తివంతంగా మారుతుంది. అత్యంత తీక్షణతో ప్రసరిస్తూ ఆ లేజర్ కాంతి ఎంతటి కఠినమైన పదార్థాౖన్నైనా సునాయాసంగా కోసేస్తుంది. భవిష్యత్తులో పనికిరాకుండా సర్వనాశనంచేసేస్తుంది. లేజర్ కాంతి ఎంతటి శక్తివంతమైందో ఇప్పటికే పరిశ్రమ రంగంలో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడీ లేజర్ కాంతిని అంతరిక్షంలో చక్కర్లు కొట్టే శత్రుదేశాల ఉపగ్రహాలపైకి చైనా ప్రయోగించనుంది. భూమి నుంచి ఎన్నో కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమించే ఉపగ్రహాలను నేలమీద నుంచే గురిచేసి కొట్టడం అంత తేలికైనపని కాదు. అందుకే బేరియం గాలియం సెలినైడ్(బీజీసీఈ) కృత్రిమ స్ఫటికాన్ని చైనా అభివృద్ధి చేసింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్రిస్టల్ అని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది. ఎంత పెద్ద ఇనుపగుండుతో దెబ్బ కొడితే అంతగా బీభత్సం స్థాయికి పెరుగుతుంది. అలాగే బీజీసీఈ క్రిస్టల్ నుంచి వెలువడే లేజర్ కాంతి సృష్టించే వినాశనం కూడా అంతే భారీ స్థాయిలో ఉంటుంది. సూక్ష్మం నుంచే సర్వనాశనం.. బీజీఈసీతో తయారైన లేజర్ కాంతి పుంజం వ్యాసం కేవలం 6 సెంటీమీటర్లు మాత్రమే. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది ఒక ఖడ్గం అంచుకు ఉండే పదునులాంటిది. కత్తి అంచును ఎంత సానబడితే అంత పదునెక్కుతుంది. అలాగే ఈ స్ఫటికం ఎంత పారదర్శకంగా ఉంటే అందులోంచి వెలువడే లేజర్ కాంతి అంత ప్రాణాంతకంగా మారుతుంది. ఇది ఆకాశంలో చాలా కిలోమీటర్ల దూరం వరకు తీవ్రత ఏమాత్రం తగ్గకుండా అదే తీక్షణతతో దూసుకెళ్తుంది. అలా అది ఏకంగా ఉపగ్రహాలను సైతం ముక్కలుగా కోసేస్తుంది. స్వల్పశ్రేణి పరారుణకాంతి పుంజాలను అత్యంత సుదూరమైన లేజర్ కాంతి పుంజాలుగా, మారణాయుధాలుగా మార్చేందుకు బీజీఈసీ స్ఫటికం అక్కరకొస్తుంది. ‘‘చదరపు సెంటీమీటర్ల విస్తీర్ణంలో ఏకంగా 550 మెగావాట్ల లేజర్ కాంతిని ఈ స్ఫటికం ప్రసరింపజేస్తుంది. ఇంతటి తీక్షణత ధాటికి ఎంతటి కఠినమైన మూలకంతో తయారైన ఉపగ్రహ ఉపరితల పొరనైనా ముక్కలవడం ఖాయం. వందల కిలోమీటర్ల ఎత్తు నుంచి తమపై నిఘా పెట్టిన శత్రు ఉపగ్రహాలను ఉన్నచోటులోనే ఉన్నపళంగా నిరీ్వర్యంచేసే శక్తి ఈ క్రిస్టల్ పరారుణ కాంతి ఆయుధానికి ఉంది’’అని ప్రొఫెసర్ వూ హైక్సిన్ అన్నారు. ఈయన సింథటిక్ క్రిస్టల్ జర్నల్‌లో ప్రచురించబడిన పరిశోధనాపత్రానికి ముఖ్యరచయితగా వ్యవహరించారు.అత్యంత సురక్షితం, అతి సామర్థ్యం.. ఇంతటి తీక్షణమైన కాంతి పుంజాన్ని వెదజల్లేటప్పుడు ఈ ఆయుధవ్యవస్థ బాగా వేడెక్కుతుంది. అలాంటప్పుడు వేడికి అదే కాలిపోతుంది. అలాంటి పరిస్థితులురాకుండా దీనిని తయారుచేస్తున్నారు. గతంలో అమెరికా అచ్చం ఇలాంటి ప్రయోగమే చేసి చేతులుకాల్చుకుంది. 1997లో అమెరికా నావికాదళం మిడ్ ఇన్ఫ్రారెడ్ అడ్వాన్స్డ్ కెమికల్ లేజర్(మిరాకిల్) పేరిట ఒక ప్రయోగంచేసింది. సొంత ఉపగ్రహాన్నే పలుమార్లు పరారుణకాంతితో కరిగించేందుకు ప్రయత్నించి విజయవంతమైంది. కానీ ఆ లేజర్‌బీమ్‌ను వెదజల్లే వ్యవస్థ సైతం కరిగిపోయింది. ఈ పరిస్థితి తలెత్తకుండా చైనా పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. బేరియం గాలియం సెలినైడ్(బీజీసీఈ) కృత్రిమ స్ఫటికాన్ని చైనా శాస్త్రవేత్తలే తొలిసారిగా 2010లో అభివృద్ధిచేశారు. వెంటనే దీనిని తమ ఆయుధవ్యవస్థల్లో అమర్చుకునేందుకు పలు దేశాల రక్షణశాఖలు ప్రయత్నించినా అది ఎందుకో సఫలంకాలేదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చైనాలో ఇంత అభివృద్ధి ఎలా?
చైనా పేరు వినగానే సర్వసాధారణంగా తోచే ప్రశ్నలు కొన్నున్నాయి. అక్కడ ఇంతటి అభివృద్ధి ఎందుకు? మార్క్సిజం, సోషలిజం పరిస్థితి ఏమిటి? ప్రజలకు స్వేచ్ఛలు ఉంటాయా? వంటివి. ఇవి ఎంత ముఖ్యమైన ప్రశ్నలో వాటన్నింటి మధ్యగల పరస్పర సంబంధం కూడా అంత ముఖ్యమైనది. ఈ విషయాల గురించి ఎంతో చదువుతుంటాం, వింటుంటాం. కానీ అక్కడి పరిస్థితులను కళ్లారా చూడటం, వారితో మాట్లాడి తెలుసుకోవటం వేరు. చైనాలో కొద్ది వారాల పాటు పర్యటించిన తర్వాత కలిగిన అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయి.రెండు శతాబ్దాలుఅభివృద్ధి గురించి మాట్లాడేవారు గుర్తించనిది ఏమంటే, ఈ భావనకు, అభివృద్ధి చెంది తీరాలన్న పట్టుదలకు మూలాలు చరిత్రలో ఉన్నాయి. అవి 1949 నాటి కమ్యూనిస్టు విప్లవంతో మొదలయ్యాయి. వారిలో విప్లవం కోసం ఎంత తపన ఉండేదో, బలమైన అభివృద్ధి కోసం అంత ఉండేది. ఆ మేరకు వారి ఆలోచనలు ఏమిటి? చైనా, భారతదేశం గొప్ప చరిత్ర, సంస్కృతి, ఆర్థికాభివృద్ధి ఉండిన దేశాలు. విదేశీయుల ఆధిపత్యం, దోపిడీ వల్ల దెబ్బ తిన్నాయి. చైనాకు సంబంధించి 1839 నాటి మొదటి నల్లమందు యుద్ధంతో మొదలై సరిగా 110 సంవత్సరాల తర్వాత 1949లో కమ్యూనిస్టు విప్లవం విజయవంతమయే వరకు గల కాలాన్ని కమ్యూనిస్టులు ‘అవమానాల శతాబ్దం’ (సెంచరీ ఆఫ్ హ్యూమిలియేషన్) అన్నారు. తమ నాయకత్వాన ఆ తర్వాతి నూరేళ్లు 1949 నుంచి 2049 కాలం ‘పునరుజ్జీవన శతాబ్దం’ (సెంచరీ ఆఫ్ రిజువనేషన్) కావాలని గట్టిగా తీర్మానించుకున్నారు.చైనా చరిత్రను, సంస్కృతిని విస్తారంగా అధ్యయనం చేసినట్లు పేరున్న మావో కాలంలో జరిగిన ఈ తీర్మానం ప్రకారం ఈ రోజు వరకు అన్ని ప్రభుత్వాలు కూడా ఏకదీక్షతో పనిచేస్తూ వస్తున్నాయి. తమ లక్ష్యం సాధనకు అవసరమైన అవగాహనలు, ప్రణాళికలు, వాటి అమలులో పట్టుదల, అందుకు కావలసిన ఆర్థిక, శాస్త్ర–సాంకేతిక, మానవ వనరులు అన్నీ వారికున్నాయి. ప్రజల సహకారం ఉంది. అందువల్లనే, ‘పునరుజ్జీవన శతాబ్దం’ 1949లో మొదలై ఇప్పటికి 75 సంవత్సరాలు గడిచి ఇంకా 25 సంవత్సరాలు మిగిలి ఉన్న దశకు చేరేసరికి, చైనా ఇంతటి అభివృద్ధిని సాధించగలిగింది. ఈ లక్ష్య సాధన కోసం వారు చేస్తున్న గమనార్హమైన ప్రయత్నం మరొకటి ఉంది. కమ్యూనిస్టు విప్లవానికీ, అవమానాల శతాబ్దం, పునరుజ్జీవన శతాబ్దం అనే భావనలకూ బీజాలు ఏ విధంగానైతే వారి చరిత్ర, సంస్కృతులలో ఉన్నాయో, అదే ప్రకారం ఆ చరిత్ర, సంస్కృతి, జాతీయ భావన, దేశభక్తి భావనల పునాదిగా ప్రజలను పాజిటివ్‌గా సమీకృతం చేస్తూ, వారిని ఈ అభివృద్ధి మహా యజ్ఞంలో భాగస్వాములను చేయగలుగుతున్నారు. ఆ అభివృద్ధి ఫలాలను మొత్తం మానవజాతి చరిత్రలోనే ఎక్కడా ఎప్పుడూ లేని విధంగా ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. ఇది సాక్షాత్తూ ఐక్యరాజ్యసమితి మాట.కళ్లకు కట్టిన అభివృద్ధిఇక ఆ అభివృద్ధి తీరుతెన్నులపై అనేక కథనాలు తరచు వెలువడుతున్నవే అయినందున, ఆ వివరాలు, గణాంకాలలోకి ఇక్కడ వెళ్లటం లేదు. వాటిలో పేర్కొననివి, నేను స్వయంగా చూసి సంభ్రమం చెందినవి కూడా అనేకం ఉన్నాయి. అందులో ఒకటి మాత్రం చెప్తాను. నేను బీజింగ్ నుంచి శియాన్ నగరానికి వెళ్లిన హైస్పీడ్ రైలు వేగం గంటకు 350 కి.మీ.లు. అది గాక 450 కి.మీ. రైలు మరొక మార్గంలో ఉంది గానీ అందులో ప్రయాణించలేదు. అయితే, 600 కి.మీ.ల రైలుపై ప్రయోగాలు జరుగుతున్నట్లు విన్నాను. చైనా నుంచి ఇండియా చేరిన తర్వాత 48 గంటలలో వచ్చిన వార్త ఆ ప్రయోగం విజయవంతమైందని, ఆ రైలు వేగం 620 కి.మీ.లకు చేరిందని. అక్కడి హైస్పీడ్ రైళ్లు ఏవీ నేలపై నడవవు. వందల, వేల కి.మీ.లు ఎలివేటెడ్ కారిడార్లలోనే (హైదరాబాద్ మెట్రో తరహాలో) నడుస్తాయి. చైనా అభివృద్ధి లక్ష్యం 2049 నాటికి ప్రస్తుత రెండవ స్థానం నుంచి మొదటి స్థానానికి చేరాలని. అవమానాల శతాబ్ది, పునరుజ్జీవన శతాబ్దిగా మారాలన్న లక్ష్యం ఆ విధంగా నెరవేరగలదన్నది ఆలోచన. ప్రచారంలోకి రాలేదు గానీ ఈ ఆలోచన మావో కాలంలోనే మొదలై నేటికీ కొనసాగుతున్నది. ఆ రోజులలో అందుకు సవాళ్లు పలు అభివృద్ధి చెందిన అన్ని దేశాల నుంచి ఉండేవి. ఇపుడు మిగిలింది అమెరికా ఒక్కటే. ఇది అన్నింటికి మించిన సవాలు. ఇక్కడి తరహా లోనే...ప్రస్తుతానికి మాత్రం చైనా అభివృద్ధికి స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలు సజావుగానే సాగుతున్నట్లు కనిపిస్తున్నది. అందువల్లనే ఆర్థికంగా రెండవ స్థానానికి చేరింది. పర్చేజింగ్ పవర్ పేరిట (సమానమైన సరకులు, సర్వీసులకు అయే ఖర్చు అమెరికా కన్న చైనాలో తక్కువ కావటం)లో అమెరికాను 2017లోనే మించిపోవటం, నౌకా బలంలో అమెరికాను దాటడం, వైమానిక శక్తిపై పెట్టుబడులు, ఆధునిక పరిశోధనలు గణనీయంగా పెంచుతుండటం, సైన్స్–టెక్నాలజీ రంగంలో దరిదాపులకు వస్తుండటం, కొన్నింటిలో ఇప్పటికే అమెరికా కన్న ముందుకు పోవటం వంటివి ఇప్పటికే కనిపిస్తున్నాయి. ఏక ధ్రువ ప్రపంచం నుంచి బహుళ ధ్రువ ప్రపంచం అనే నినాదం, బ్రిక్స్, బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బిఆర్ఐ) వంటి సంస్థలు, ఇతర దేశాలతో అమెరికా కూటమికి భిన్నంగా విన్–విన్ పాలసీ (మీరు, మేము ఉభయులమూ లాభపడాలి) అనే ఆర్థిక సంబంధాలు, మీ అంతర్గత విషయాలలో అమెరికా కూటమి వలె జోక్యం చేసుకోబోమనే రాజకీయ విధానం, సైన్స్ – టెక్నాలజీ బదిలీలు మొదలైనవి దీర్ఘకాల ఆర్థిక – రాజకీయ వ్యూహాలు అవుతున్నాయి. అందుకు ఒక మంచి ఉదాహరణను చెప్పాలంటే, నేను చైనాలో ఉన్న రోజులలోనే బ్రిక్స్ సమావేశాలు బ్రెజిల్లో జరిగాయి. ఆ సంస్థలో చేరే దేశాలపై పెద్ద ఎత్తున అదనపు సుంకాలు విధించగలమని గతం నుంచి హెచ్చరిస్తుండిన ట్రంప్, అదే హెచ్చరిక తిరిగి చేశారు. కానీ, అదేమీ లెక్క చేయకుండా ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాల నుంచి మరొక 16 దేశాలు కొత్తగా చేరాయి. ఇవన్నీ అమెరికా పలుకుబడిని తగ్గించి చైనా పలుకుబడిని పెంచేవి. చైనా 2049 నాటికి అగ్రరాజ్యమయ్యేందుకు తోడ్పడగలవి.ఇవే రంగాల గురించి తెలుసుకోగలది ఇంకా చాలా ఉంది గానీ అదంతా ఇక్కడ చెప్పుకోలేము గనుక మొదట ప్రస్తావించిన ప్రశ్నలలో రెండు ముఖ్యమైన వాటి గురించి కొద్దిగా చూద్దాము. అక్కడ మార్క్సిజం, సోషలిజం, క్యాపిటలిజం పరిస్థితి ఏమిటన్నది ఒకటి. ప్రజలకు గల స్వేచ్ఛలు ఏమిటన్నది రెండవది. క్యాపిటలిజం పెట్టుబడులు, వ్యాపారం, లాభాలు అక్కడి ప్రభుత్వపరంగా, సంపన్నులైన చైనీయులపరంగా, బయటి దేశాలతో ఉమ్మడి పెట్టుబడుల పరంగా బాగా వర్ధిల్లుతున్నాయి. ఈ విధానాలు డెంగ్ శియావో పింగ్ సంస్కరణలు, 2001లో డబ్ల్యూటీవోలో చైనా చేరటం నుంచి మొదలై సాగుతున్నాయి. ఆ విధంగా ఒనగూరే లాభాలు, సమాజంలో కింది స్థాయి వరకు లభిస్తున్న ఆదాయాలూ క్లాసికల్ సోషలిజానికి ప్రత్యామ్నాయంగా మారాయి. సోషలిజం విత్ చైనీస్ క్యారక్టరిస్టిక్స్ అన్న డెంగ్ సూత్రీకరణకు రూపం, సారం ఇదేననుకోవాలి. అడుగడుగునా కెమెరాల నిఘాలు, మౌలికంగా వ్యవస్థకు వ్యతిరేకమైన చర్యలను సహించక పోవటం, ఒకే పార్టీ వ్యవస్థల వల్ల ఎన్నికలు గ్రామస్థాయిలో తప్ప ఇతరత్రా లేకుండటం మినహా, ఇక్కడ ఉన్న స్వేచ్ఛలన్నీ అక్కడా కనిపించాయి. చదువులు, ఉద్యోగ వ్యాపారాలు, దేశ విదేశాలకు ప్రయాణాలు, సంపాదనలు, ఖర్చులు, అవినీతి, విలాసాలు, కోరుకున్నట్లు బట్టలు వేసుకోవడం, కొన్ని అవలక్షణాలు, సంప్రదాయికమైన నమ్మకాలు, ఆచారాలు అన్నీ ఉన్నాయి. చివరకు నైట్ లైఫ్ వీధులు, మసాజ్ పార్లర్లు, సెక్స్ టాయ్ షాపులు సహా. సగటు మనిషికి ఇంతకన్న కావలసిన స్వేచ్ఛలేమిటి?టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
‘మీ ఎకానమీని కూల్చేస్తాం’.. భారత్, చైనాలకు అమెరికా వార్నింగ్
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాను ఆర్ధికంగా దెబ్బకొట్టేందుకు అమెరికా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా అమెరికా కాంగ్రెస్ (పార్లమెంటు) సభ్యుడు లిండ్సే గ్రాహం భారత్, చైనాతో పాటు ఇతర దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు. ధర తక్కువగా ఉందని రష్యా వద్ద క్రూడాయిల్‌ను కొనుగోలు చేయాలని చూస్తే మీ ఆర్ధిక వ్యవస్థను నిట్ట నిలువునా కూల్చేస్తామని ఆయా దేశాలకు వార్నింగ్ ఇచ్చారు.ఇంతకు ముందు గ్రాహం రష్యా నుంచి ఆయా ఉత్పత్తుల్ని కొనుగోలు చేస్తున్న దేశాలపై 500 శాతం టారిఫ్ విధించాలనే ప్రతిపాదనలు తెచ్చారు. ఈ క్రమంలో మరోసారి టారిఫ్ ధరల్ని ప్రస్తావిస్తూ ఆయా దేశాలపై విమర్శలు గుప్పించారు. ఫాక్స్ మీడియాతో మాట్లాడుతూ.. ‘రష్యా వద్ద తక్కువ ధరకే ఆయిల్ దొరుకుతుందని కొనుగోలు చేస్తున్న బ్రెజిల్,చైనాతో పాటు భారత్‌కు నేను చెప్తున్నది ఒకటే. కీవ్ వద్ద ఆయిల్ కొనుగోలు చేస్తున్న దేశాలతో ఈ యుద్ధం(టారిఫ్) కొనసాగుతుంది. ఈ యుద్ధంలో సంబంధిత దేశాల్ని చీల్చి చెండాడుతాం. ఆర్ధిక వ్యవస్థను కూల్చేస్తామని పునరుద్ఘాటించారు. మీరు (భారత్,చైనా, బ్రెజిల్) చేస్తున్నది రక్తపాతం. ఎవరైనా అతన్ని ఆపే వరకు అతను (పుతిన్) ఆగడు అంటూనే.. రష్యాపై ప్రత్యక్షంగా బెదిరింపులకు దిగారు. ట్రంప్‌తో ఆటలాడుకోవాలని చూస్తే ప్రమాదాన్ని ఏరికోరి తెచ్చుకున్నట్లే. మీ చేష్టల ఫలితంగా మీ దేశ ఆర్ధిక వ్యవస్థకే నష్టం వాటిల్లుతుందని ధ్వజమెత్తారు. కాగా, ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా తీరును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పుబడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో యుద్ధాన్ని ఆపేలా చర్చలకు రావాలని ట్రంప్.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఆదేశించారు. ఈ బెదిరింపుల్ని రష్యా ఖండించింది. అమెరికా మాపై ఎలాంటి ఆంక్షలు విధించినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. Lindsey Graham: Here’s what I would tell China, India and Brazil. If you keep buying cheap Russian oil… we will tariff the hell out of you and we’re going to crush your economy pic.twitter.com/x05J3G8oOk— Acyn (@Acyn) July 21, 2025 -
ఈసారైనా మెరిసేనా!
చాంగ్జౌ: ఈ సీజన్లో నిరాశాజనక ప్రదర్శన కనబరుస్తున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మరో టోర్నమెంట్‌కు సిద్ధమైంది. నేడు మొదలయ్యే చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోరీ్నలో సింధు తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. బుధవారం జరిగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో జపాన్ ప్లేయర్, ప్రపంచ ఆరో ర్యాంకర్ టొమాకా మియజాకితో సింధు తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 0–1తో వెనుకబడి ఉంది. గత ఏడాది స్విస్ ఓపెన్ ప్రిక్వార్టర్ ఫైనల్లో మియజాకి చేతిలో సింధు ఓడిపోయింది. చైనా ఓపెన్‌లో సింధు తొలి రౌండ్ అడ్డంకిని దాటితే ప్రిక్వార్టర్ ఫైనల్లో ఉన్నతి హుడా (భారత్) లేదా క్రిస్టీ గిల్మోర్ (స్కాట్లాండ్)లలో ఒకరితో ఆడాల్సి ఉంటుంది. ప్రిక్వార్టర్ ఫైనల్లోనూ సింధు గెలిస్తే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మాజీ చాంపియన్ అకానె యామగుచి (జపాన్) లేదా బుసానన్ ఒంగ్‌బమ్‌రుంగ్‌ఫన్ (థాయ్‌లాండ్)లలో ఒకరితో ఆడవచ్చు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 16వ స్థానంలో ఉన్న సింధు ఈ ఏడాది ఇండియా ఓపెన్, ఇండోనేసియా మాస్టర్స్, ఆల్ ఇంగ్లండ్ ఓపెన్, స్విస్ ఓపెన్, మలేసియా మాస్టర్స్, సింగపూర్ ఓపెన్, ఇండోనేసియా ఓపెన్, జపాన్ ఓపెన్‌లతోపాటు ఆసియా చాంపియన్íÙప్, సుదిర్మన్ కప్ టోర్నీలలోఆడింది. ఇండియా ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరడమే ఈ సీజన్లో సింధు అత్యుత్తమ ప్రదర్శన కావడం గమనార్హం. చైనా ఓపెన్‌లో భారత్ నుంచి సింధు, ఉన్నతిలతోపాటు అనుపమ కూడా బరిలో ఉంది. మంగళవారం జరిగే తొలి రౌండ్లో చైనీస్ తైపీ ప్లేయర్ లిన్ సియాంగ్ టితో అనుపమ ఆడుతుంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత్ నుంచి లక్ష్య సేన్, ప్రణయ్ మాత్రమే బరిలో ఉన్నారు. బుధవారం జరిగే తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ లీ షి ఫెంగ్ (చైనా)తో లక్ష్య సేన్; కోకి వతనాబె (జపాన్)తో ప్రణయ్ పోటీపడతారు. ముఖాముఖి రికార్డులో లీ షి ఫెంగ్‌పై లక్ష్య సేన్ 7–5తో ఆధిక్యంలో ఉండగా... వతనాబెతో ఒకేసారి తలపడ్డ ప్రణయ్ ఓడిపోయాడు. పురుషుల డబుల్స్‌లో భారత్ నుంచి సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ మాత్రమే ఈ టోర్నీలో ఆడనుంది. తొలి రౌండ్లో కెన్యా మిత్సుహాíÙ–హిరోకి ఒకమురా (జపాన్)లతో సాతి్వక్–చిరాగ్ తలపడతారు. మహిళల డబుల్స్‌లో భారత్ నుంచి సెల్వం కవిప్రియ–సిమ్రన్; రుతపర్ణ–శ్వేతాపర్ణ పాండా, అమృత–సోనాలీ సింగ్ జోడీలు ఆడుతున్నాయి. తొలి రౌండ్లో యియుంగ్ ఎన్గా టింగ్–యియుంగ్ పుయ్ లామ్‌లతో రుతపర్ణ–శ్వేతాపర్ణ; సియె పె షాన్–హుంగ్ ఎన్ జులతో అమృత–సోనాలీ; లౌరెన్ లామ్–అలీసన్ లీ (అమెరికా)లతో కవిప్రియ–సిమ్రన్ పోటీపడతారు. మిక్స్డ్ డబుల్స్‌లో తెలంగాణ అమ్మాయి గద్దె రుతి్వక శివాని–రోహన్ కపూర్ (భారత్) జంట; అశిత్ సూర్య–అమృత జోడీలు బరిలో ఉన్నాయి. తొలి రౌండ్లో వోంగ్ టియెన్ సి–లిమ్ చియె సియెన్ (మలేసియా)లతో రుతి్వక–రోహన్; రెహాన్–గ్లోరియా (ఇండోనేసియా)లతో అశిత్–అమృత తలపడతారు. చైనా ఓపెన్ టోర్నమెంట్ చరిత్రలో భారత్ నుంచి ఇప్పటి వరకు ముగ్గురు చాంపియన్స్‌గా నిలిచారు. 2014లో కిడాంబి శ్రీకాంత్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సాధించాడు. 2014లో సైనా నెహా్వల్, 2016లో సింధు మహిళల సింగిల్స్‌లో టైటిల్‌ను సొంతం చేసుకున్నారు.చైనా ఓపెన్ టోర్నమెంట్లో చైనా క్రీడాకారులు సాధించిన టైటిల్స్. 1986 నుంచి నిర్వహిస్తున్న ఈ టోరీ్నలో చైనా నుంచి పురుషుల సింగిల్స్‌లో 19 మంది... మహిళల సింగిల్స్‌లో 25 మంది విజేతగా నిలిచారు. పురుషుల డబుల్స్‌లో చైనా నుంచి 9 జోడీలు... మహిళల డబుల్స్‌లో 29 జోడీలు... మిక్స్డ్ డబుల్స్‌లో 19 జోడీలు టైటిల్స్ గెలిచాయి. -
బ్రహ్మపుత్రపై డ్యామ్ పనులు మొదలెట్టిన చైనా
బీజింగ్: చైనా ప్రపంచంలోనే అత్యంత భారీ జలవిద్యుత్ ప్రాజెక్ట్‌ను బ్రహ్మపుత్ర నదీ ప్రవాహ మార్గంలో మొదలెట్టింది. సరిహద్దు రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాంల నీటి అవసరాలు తీర్చే బ్రహ్మపుత్రపై ఇంతటి భారీ ప్రాజెక్ట్ నిర్మిస్తే తమపై పెను ప్రతికూల ప్రభావం పడుతుందని భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసినా అవేం పట్టించుకోకుండా చైనా ఏకపక్షంగా వ్యవహరించింది. 167.8 బిలియన్ డాలర్ల అంచనావ్యయంతో ఈ డ్యామ్‌ను నిర్మిస్తోంది. బ్రహ్మపుత్ర నదిని చైనాలో యార్లాంగ్ జాంగ్బోగా పిలుస్తారు. నింగ్చీ నగరంలో శనివారం చైనా ప్రధాని లీ కియాంగ్ భూమి పూజ చేసి నిర్మాణ పనులను మొదలుపెట్టినట్లు చైనా అధికారిక మీడియా ప్రకటించింది. టిబెట్ ప్రాంతంలోని నింగ్చీ మెయిన్లింగ్ జలవిద్యుత్ కేంద్రం వద్ద ఈ పనులు శనివారం మొదలయ్యాయి. ఈ హైడ్రోపవర్ ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అత్యంత భారీ మౌలికసదుపాయాల ప్రాజెక్టుగా రికార్డులకెక్కనుంది. ప్రాజెక్ట్‌లో భాగంగా 1.2 ట్రిలియన్ యువాన్ల అంచనావ్యయంతో వేర్వేరు చోట్ల ఐదు హైడ్రోపవర్ స్టేషన్లను నిర్మించనున్నారు. 2023నాటి ఓ నివేదిక ప్రకారం ఈ జలవిద్యుత్ ప్రాజెక్ట్ పూర్తయితే దీని ద్వారా ఏటా ఏకంగా 300 బిలియన్ కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యంకానుంది. ఇది 30 కోట్ల మంది చైనీయుల ఏడాది అవసరాలను సరిపోతుంది. ప్రాజెక్ట్ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను అధికశాతం విదేశాలకు సరఫరాచేయనున్నారు. కీలక ప్రాంతంలో నిర్మాణాన్ని తప్పుబట్టిన భారత్ ఒకవేళ రెండు దేశాల మధ్య సంఘర్షణ సంభవిస్తే చైనా ఈ కొత్త డ్యామ్ నుంచి ఒక్కసారిగా భారీ పరిమాణంలో నీటిని విడుదల చేస్తే అక్కడి భూభాగాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని ఇప్పటికే భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. తనకు నచ్చినప్పుడు నీటిని విడుదలచేస్తూ, నీటిని డ్యామ్‌లో పట్టి ఉంచుతూ నదీజలాలపై చైనా గుత్తాధిపత్యం వహించే ప్రమాదముందని భారత్ అభ్యంతరాలను ఇప్పటికే వెల్లడించింది. మరోవైపు తరచూ భూకంపాలు సంభవించే ప్రాంతంలోనే ఈ డ్యామ్‌ను నిర్మిస్తుండటంతో డ్యామ్ పటిష్టతపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ పైకప్పుగా పిలిచే టిబెట్ పీఠభూమి ప్రాంతంలో ఈ డ్యామ్ నిర్మిస్తున్నారు. అద్భుత నిర్మాణాలకు పేరెన్నికగన్న చైనా ఈ డ్యామ్‌ను అత్యంత పటిష్టంగా నిర్మించనుందని వార్తలొస్తున్నా భారత్ తన నదీజలాల పరిరక్షణ ప్రమాదంలో పడిందని ఇప్పటికే చైనాకు అధికారికంగా సమాచారమిచ్చింది. గతేడాది డిసెంబర్ 18న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. -
భారత్‌లో టెస్లా బ్రాండ్ బాజా బారాత్!
విశాల భారతావని.. 140 కోట్లకుపైగా జనాభా. విభిన్న తరాలు.. ఖర్చుల్లో అంతరాలు. పది రూపాయలకూ వెనుకడుగు వేసే కస్టమరే కాదు.. బ్రాండ్ కోసం రూ.10 కోట్లకూ సై అనే వినియోగదార్లు ఉన్నారు. ఇలా ప్రీమియం ధర చెల్లించే కొనుగోలుదారులు ఉన్నారు కాబట్టే భారత్‌లో టెస్లా రేస్ ప్రారంభించింది. పైగా ప్రపంచవ్యాప్తంగా ఈ బ్రాండ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ‘బ్రాండ్స్’ అంటే భారతీయులకు మక్కువ. రూ.50 లక్షలకుపైగా విలువ చేసే లగ్జరీ కార్లు సగటున గంటకు ఆరు రోడ్డెక్కుతున్న మార్కెట్ మనది. ఇలాంటి మార్కెట్లో రిటైల్‌తో పరుగు మొదలుపెట్టిన ఈ అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం రానున్న రోజుల్లో తయారీ చేపట్టే అవకాశమూ లేకపోలేదు.ప్రస్తుతం బీఎండబ్ల్యూ నం.1భారత్‌లో ప్రీమియం కార్ల మార్కెట్ విభాగంలో 2024–25లో 51,406 యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. మెర్సిడెస్–బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి, జాగ్వార్ ల్యాండ్ రోవర్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఇప్పటికే దేశీయంగా బలమైన తయారీ, సర్వీస్ నెట్వర్క్ వ్యవస్థలను నిర్మించాయి. ప్యాసింజర్ వాహనాల (పీవీ) రంగంలో 2025 జూన్ నాటికి ఈవీల వాటా 4.5 శాతం మాత్రమే. లగ్జరీ పీవీల విభాగంలో ఈవీల వాటా 10 శాతం. ఇందులో బీఎండబ్ల్యూ 53 శాతం మార్కెట్ వాటాతో ఆధిపత్యం చెలాయిస్తోంది. 33 శాతం వాటాతో రెండో స్థానంలో మెర్సిడెస్–బెంజ్ పోటీపడుతోంది. టెస్లాకు ఇప్పటికే ఉన్న సవాళ్లకు తోడు ఈ సంస్థకు ప్రపంచ పోటీదారుగా ఉన్న చైనా దిగ్గజం బీవైడీ ఇండియాలో ఇప్పటికే అడుగుపెట్టింది. వియత్నాం కంపెనీ విన్ ఫాస్ట్ ఇక్కడ అడుగుపెట్టబోతోంది.పదేళ్ల నిరీక్షణ తర్వాత మనదేశంలోకి టెస్లా ఎంట్రీ ఇచ్చింది. తొలి ఎక్స్‌పీరియెన్స్ సెంటర్‌ను ముంబైలో ఆవిష్కరించింది. పూర్తిగా తయారైన కార్లకు దిగుమతి సుంకం భారత్‌లో 100 శాతం వరకు ఉంది. మనదేశంలో తయారీ చేపడితేనే ప్రయోజనాలు ఇస్తామని భారత్ స్పష్టం చేసింది. ఈ అంశాలే టెస్లా రాక ఆలస్యానికి కారణమయ్యాయి. మొత్తానికి పాలసీ అడ్డంకులు, సుంకాల సంక్లిష్టతలు, ఇతర బ్రాండ్లతో పోటీ, భౌగోళిక రాజకీయ ఒత్తిడి.. ఇవన్నీ అధిగమించి ఎట్టకేలకు అరంగేట్రం జరిగింది. దేశీయంగా తయారీ చేపట్టే అంశానికి కట్టుబడేముందు ఇక్కడి మార్కెట్‌ను పరీక్షిస్తామని టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ పలు సందర్భాల్లో పునరుద్ఘాటించారు. సుమారు రూ.60 లక్షల ధరతో తొలుత వై మోడల్‌ను టెస్లా ప్రవేశపెడుతోంది. ప్రపంచంలో అత్యధిక సుంకం ఉన్నది భారత్‌లోనే అని టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. అందువల్లే, ఇతర దేశాలతో పోలిస్తే టెస్లా కారు ధర మనదేశంలోనే ఎక్కువ.టెస్లానా మజాకా!యూఎస్, జర్మనీ, చైనాలో టెస్లాకు తయారీ కేంద్రాలున్నాయి. ఇవి ఏటా 25–30 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేయగలవు. 2019లో చైనాలో ఎలక్ట్రిక్ వాహనాల వాటా 3.8 శాతం మాత్రమే. అదే ఏడాది డిసెంబర్లో టెస్లా మార్కెట్లోకి ప్రవేశించింది. అప్పటి నుంచి చైనాలో ఎలక్ట్రిక్ వాహనాల వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. 2024లో ఇది 24.6 శాతానికి చేరడంలో టెస్లా కీలకపాత్ర పోషించింది. ఆటో దిగ్గజాల మాదిరిగా కాకుండా ప్రకటనల విషయంలో టీవీలు, ఇతర మాధ్యమాలకు బదులు సెలబ్రిటీల ప్రభావం, నోటి మాటగా ప్రచారంపై టెస్లా ఆధారపడింది. ప్రీమియం, ప్రత్యేక బ్రాండ్‌గా కంపెనీ ఇమేజ్ను నిలబెట్టడంలో ఈ విధానం సహాయపడింది. నటుడు బ్రాడ్ పిట్, గూగుల్ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్, ‘ఈబే’ మొదటి అధ్యక్షుడు జెఫ్ స్కోల్, షావొమీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ లే యూ.. ఇలా ఎందరో ప్రముఖులు టెస్లా కస్టమర్ల జాబితాలో ఉన్నారు.డెలివరీలు తగ్గాయ్అంతర్జాతీయంగా 2025 జనవరి–మార్చిలో టెస్లా డెలివరీలు 13% పడిపోయాయి. గడిచిన మూడేళ్లలో ఇది అత్యంత భారీ క్షీణత. పెరుగుతున్న ప్రపంచ పోటీ, నూతన మోడళ్ల రాక ముఖ్యంగా మోడల్–వై ఆలస్యం కావడం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు సలహాదారుగా ఎలాన్ మస్క్ పాత్రపై పెరుగుతున్న వ్యతిరేకత వంటివి ఈ క్షీణతకు దారితీశాయి. ఒకప్పుడు టెస్లాకు బలమైన మార్కెట్లలో ఒకటైన చైనాలో సంస్థ ఈవీ వాటా 2025 మొదటి ఐదు నెలల్లో 7.6%కి పడిపోయింది. ఇది గత సంవత్సరం 10%, 2020లో గరిష్ట స్థాయిలో 15%గా నమోదైంది. బీవైడీ, షావొమీ వంటి ప్రత్యర్థులు ఫీచర్–రిచ్ మోడళ్లు, పోటీ ధరలతో సవాల్ విసిరి మార్కెట్ వాటాను పెంచుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా టెస్లా 2025 జనవరి–మార్చి కాలంలో 3,36,681 వాహనాలను విక్రయించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 3,86,810గా నమోదైంది. -
చైనా యూటర్న్?.. పాక్‌కు షాక్.. అమెరికాకు మద్దతు?
న్యూఢిల్లీ: ఇంతకాలం పాకిస్తాన్‌కు మద్దతు పలుకుతూ, అమెరికాను వ్యతిరేకిస్తున్నట్లు కనిపించిన చైనా ఇప్పుడు తన పంథాను మార్చుకుంది. భారత్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ప్రతిస్పందనను చూసి, చైనా తన తీరు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. తాజాగా పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిచిన చైనా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తన కఠిన వైఖరిని పునరుద్ఘాటించింది.చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్)ను ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించడాన్ని సమర్థించారు. ఉగ్రవాదానికి వ్యతిరేక సహకారాన్ని మరింతగా పెంచుకోవాలని ఆయన ప్రాంతీయ దేశాలకు పిలుపునిచ్చారు. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి టీఆర్ఎఫ్ బాధ్యత వహించింది. ఇది లష్కరే తోయిబాకు ప్రాక్సీ సంస్థ. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఏప్రిల్ 25న ఈ దాడిని ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో 2025, ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించారు. ఈ దాడికి ప్రతీకారంగా భారత్ మే 7న పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రారంభించింది. నాలుగు రోజుల పాటు సరిహద్దుల్లో డ్రోన్,క్షిపణి దాడులు సాగాయి. అనంతరం ఈ సంఘర్షణ ముగింపునకు భారత్- పాకిస్తాన్ ఒక అవగాహనకు వచ్చాయి. -
రెండు ధ్రువాలతో సమతూకం ఎలా?
అమెరికాలో కొత్త ప్రభుత్వ సమర్థతను మదింపు చేసేందుకు సాధారణంగా, అధ్య క్షుడి మొదటి 100 రోజుల పాలనను లెక్క లోకి తీసుకుంటారు. కానీ, ట్రంప్ రెండవ విడత పాలన మొదలై 180 రోజులు గడు స్తున్నా వాణిజ్య వివాదాలకు పరిష్కారం ఒక కొలిక్కి రాలేదు. ఉక్రెయిన్, గాజాలలో సైనిక కార్యకలాపాలు ఇంకా కొనసాగుతున్నాయి. వ్యూహాత్మక భాగస్వామి అమెరికా, ముఖ్య మైన ఆర్థిక పోషక దేశం చైనాలతో సంబంధాలలో సమతూకం పాటించేందుకు ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథొని ఆల్బనీస్ జూలై నెల మధ్యలో 6 రోజుల పర్యటనపై చైనా వెళ్ళారు. దౌత్యం, వాణిజ్యంతో వ్యవహరిస్తున్న భారత దౌత్యవేత్తలు కూడా అలాంటి సందేహ డోలనే ఎదుర్కొంటున్నారు. ‘బ్రిక్స్’ శిఖ రాగ్ర సభలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆ మధ్య బ్రెజిల్ వెళ్ళారు. ఆయన భారత్‌కు తిరిగి వచ్చే మార్గ మధ్యంలో ఉన్నప్పుడే బ్రెజిల్ అధ్యక్షుడు లూల డ సిల్వా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు మధ్య వాగ్వాదం నెలకొంది. వారి మధ్య మాట మాట పెరగడానికి విదేశాంగ విధానంపై అభిప్రాయ భేదాలు కారణం కాదు.బ్రెజిల్ ఆంతరంగిక వ్యవహారాలలో ట్రంప్ బాహాటంగా జోక్యం చేసుకోవ డమే తగాదాకు దారితీసింది. బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జాయిర్ బొసొనారొపై విచారణకు స్వస్తి పలకాలని ట్రంప్ డిమాండ్ చేశారు. దీనిపై అమెరికా జోక్యాన్ని లూల తిరస్కరించారు. అమెరికా దండి స్తున్నట్లుగా సుంకాలు విధిస్తే తామూ ప్రతీకార చర్యలకు దిగాల్సిఉంటుందని హెచ్చరించారు. చైనాతో సవ్యంగా లేకపోయినా...ఆ విధంగా, ప్రజానీకం నేడు రెండు ధ్రువాల ప్రపంచాన్ని ఎదు ర్కొంటోంది. ‘నాటో’ దేశాల మద్దతు ఎంతవరకు లభిస్తుందో తెలియకపోయినా, వాటిని తోడు చేసుకుని అమెరికా ఒక ధ్రువంగా ఉంది. చైనా–రష్యా ఇరుసు రెండవదిగా ఉంది. ప్రచ్ఛన్న యుద్ధం నాటి స్థితితో పోలిస్తే, ఒక్కటే తేడా కనిపిస్తోంది. చైనా–అమెరికా ప్రత్యర్థులే కావచ్చు కానీ, వాణిజ్యం, సాంకేతికతల విషయంలో అవి ప్రస్తుతం ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి.ప్రచ్ఛన్న యుద్ధ ప్రత్యర్థులైన సోవియట్ యూనియన్, అమెరికా మధ్య అప్పట్లో అలాంటి సంబంధాలు ఉండేవి కావు. దాంతో, బ్రెజిల్, భారత్ లాంటి ప్రవర్ధమాన దేశాలకు ఈ రెండు ధ్రువాల మధ్య సమతౌల్యం పాటించడం కష్టంగా మారుతోంది. చైనాతో మనకు సరిహద్దు వివాదం ఉండటం, మనల్ని చైనా ఒక బలమైన ప్రత్యర్థిగా చూస్తూండటం వల్ల, మన పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోంది. ఆగస్టు 1లోగా, ఏదో ఒక అంగీకారానికి రాకపోతే, ‘ప్రతిగా ఎదురు కాగల సుంకాలను’ తప్పించుకునేందుకు అమెరికాతో ఒక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకోవడం భారత్‌కు తక్షణ సమస్యగా ఉంది. అధ్యక్షుడు ట్రంప్ సుంకాలపై తడవకో మాట మాట్లాడుతున్నారు. ఇదంతా అనిశ్చితిని పెంచుతోంది. ‘విముక్తి దినం’గా ప్రకటించిన ఏప్రిల్ 2 నుంచి రెండు డజన్లకు పైగా పర్యాయాలు సుంకాలపై తలకిందుల ధోరణిని చూశాం. సుంకాల పేరిట అమెరికా బెదిరింపులు పరిపాటిగా మారడంతో కాబోలు,అంతర్జాతీయ మార్కెట్లు కూడా వాటిని పెద్దగా లెక్కలోకి తీసు కోవడం మానేశాయి. ‘90 రోజులలో 90 ఒప్పందాలు’ అంటూట్రంప్ చేసిన వాగ్దానం నీటిమీద రాతగా మారింది. ఒక్క వియత్నాం, బ్రిటన్లతోనే వాణిజ్య ఒప్పందాలు కుదిరాయి. చైనాతో పాక్షికంగా మాత్రమే అవగాహన కుదిరింది. వాణిజ్య ఒప్పందం కొరవడిన నేపథ్యంలో, ఆగస్టు 1 తర్వాత, అమెరికా 30% సుంకాల బెదిరింపును అమలు జరిపితే తామువిధించగల ప్రతీకార సుంకాల జాబితా సిద్ధంగా ఉందని యూరోపి యన్ యూనియన్ వెల్లడించింది. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథొని ఆల్బనీస్ బాటనే భారత్ కూడా అనుసరించింది. షాంఘై సహకార సంస్థ సమావేశాలలో పాల్గొనేందుకు బీజింగ్ వెళ్ళిన భారతవిదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, భారత్–చైనా సంబంధాలను తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. అయితే, వాస్తవాధీన రేఖ వద్ద సేనల ఉపసంహరణ ఇప్పటికీ పూర్తి కాలేదు. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా, పాకిస్తాన్‌కు చైనా క్రియాశీల సహాయం అందించిన సంగతి తెలిసిందే. వీటికితోడు, దలైలామా 90వ పుట్టిన రోజు ఈ సమయంలోనే వచ్చింది. దలైలామాకు క్రియాశీల మద్దతు ఇవ్వడం ద్వారా, టిబెట్‌పై తమ పట్టును తగ్గించడంలో భారత్ తోడుదొంగగా వ్యవహరిస్తోందని చైనా భావిస్తోంది. అదే సమయంలో, ట్రంప్ కల్లోలిత ప్రపంచంలో, భారతీయ మార్కెట్ ప్రాధాన్యాన్ని చైనా గ్రహించింది. పాకిస్తాన్‌కు అమెరికా స్నేహహస్తంఅమెరికాతో తాత్కాలిక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసు కునేందుకు భారత్ కడపటి ప్రయత్నాలలో ఉంది. భారతీయదృక్కోణం నుంచి చూసినప్పుడు వ్యావసాయిక, పాడిపరిశ్రమ మార్కెట్లను సంరక్షించుకోవడం ప్రాధాన్యంగా ఉంది. ఎలాన్ మస్క్ సంస్థ ‘టెస్లా’ ముంబయిలో తన మొదటి షోరూమ్ తెరవడం, సాధారణ పరిస్థితులలోనైతే, సానుకూల సంకేతంగానేఉండేది. కానీ, ఆయనకు, అధ్యక్షుడు ట్రంప్‌కి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. భారత్–అమెరికా వాణిజ్య వివాదాన్ని పరిష్క రించడంలో మాట సాయం చేయగల స్థితిలో లేనని మస్క్ చేతులు ఎత్తేయవచ్చు. భారత్ దౌత్యపరంగా పెద్ద సవాల్నే ఎదుర్కొంటోంది. అమె రికాతో పెంచిపోషించుకుంటూ వచ్చిన సన్నిహిత సంబంధాలు ఏ మేరకు ప్రతిఫలాలు చూపగలవో తెలియడం లేదు. పాకిస్తాన్‌కు అమెరికా చాస్తున్న స్నేహ హస్తమే ఇందుకు నిదర్శనం. జైలులో ఉన్న పాకిస్తాన్ తెహ్రీక్–ఏ–ఇన్సాఫ్ నాయకుడు ఇమ్రాన్ ఖాన్‌తో సయోధ్య కుదుర్చుకోవలసిందిగా పాక్ సైన్యాన్ని అమెరికా ప్రభుత్వం ముందుకు తోస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అమెరికా నిర్దేశించిన 50 రోజుల గడువు లోగా ఉక్రెయిన్‌తో రష్యా కాల్పుల విరమణకు రాకపోతే, రష్యా నుంచి చమురు కొనే అన్ని దేశాలను అమెరికా లక్ష్యం చేసుకోగల కత్తి కూడా భారత్ మెడపై వేలాడుతోంది. చైనాకు దగ్గరయ్యేందుకు ఆస్ట్రేలియా ప్రధాని చేసిన ప్రయత్నం చూసిన అమెరికా, ఆస్ట్రేలియాతో (బ్రిటన్‌తో కలుపుకొని) ఉన్న వ్యూహాత్మక త్రైపాక్షిక పొత్తును సమీక్షిస్తామని సంకేతాలుపంపుతోంది. ఆ పొత్తు ప్రకారం ఆస్ట్రేలియాకు అణు జలాంత ర్గాములు అందవలసి ఉంది. తైవాన్ విషయంలో చైనాతో సైనిక ఘర్షణ తలెత్తితే, తమకు అండగా ఉంటామంటూ హామీ ఇవ్వాలని జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియాలను పెంటగాన్ కోరుతున్నట్లు తెలుస్తోంది. ఒకపక్క వివిధ దేశాలపై ఏకపక్షంగా సుంకాలు విధించు కుంటూపోతున్న అమెరికా, ఒకవేళ చైనాతో ఏదైనా ఘర్షణ తలెత్తితే, వ్యూహాత్మక మిత్ర దేశాల నుంచి క్రియాశీల సైనిక మద్దతు ఆశించడం కష్టమన్న వాస్తవాన్ని మాత్రం విస్మరిస్తోంది. అయితే, ట్రంప్ తాను మొదలెట్టిన వాణిజ్య యుద్ధానికి తానే త్వరలో ఒక పరిష్కారం కనుగొనక తప్పని స్థితిలో పడవచ్చు.ఎందుకంటే, లైంగిక నేరాలకు పాల్పడిన జెఫ్రీ ఎప్‌స్టైన్‌కు సంబంధించిన పత్రాలు ప్రస్తుతం అమెరికా న్యాయ శాఖ వద్ద ఉన్నాయి. ఆ నేరాలతో మరికొందరు ప్రముఖుల పేర్లు కూడా ముడిపడి ఉన్నాయి. వాటిలో ట్రంప్ పేరు కూడా ఉందని మస్క్ వెల్లడించారు. ట్రంప్ ఆ రొంపి నుంచి బయటపడే హడావిడిలో కూడా ఉన్నారు. అమెరికా నుంచి చమురు కొనుగోళ్ళను భారత్ ఇప్పటికే పెంచింది. భారత్ తమ నుంచి రక్షణ సామగ్రిని ఎక్కువ కొనుగోలు చేయాలని అమెరికా కోరుకోవడం మరో సమస్యగా ఉంది. కానీ, సైనిక పరంగా అమెరికాపై మితిమీరి ఆధారపడటం వ్యూహాత్మకంగా పెద్ద పొరపాటు అవుతుంది. ప్రస్తుత ప్రపంచ రాజకీయ–ఆర్థిక స్థితిగతులు ‘ప్రతి ఒక్కరినీ ఊహాగానాలకు లోను చేస్తు న్నాయి’ అని ఎకనామిస్ట్ మ్యాగజైన్ ఇటీవల వ్యాఖ్యానించడంలో వింతేముంది?-వ్యాసకర్త విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి (‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో)-కె.సి. సింగ్ -
ఇది కదా హ్యూమన్ స్పిరిట్ .. ఓ వైపు పెళ్లి.. మరో వైపు అంత్యక్రియలు
కౌలాలంపూర్: నేటి సమాజంలో మంటగలుస్తున్న మానవత్వానికి మచ్చుతునక ఈ ఉదంతం. జూలై 5న మలేషియాలోని నెగెరి సెంబిలాన్ రాష్ట్రంలోని టంపిన్ పట్టణంలో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఓ వైపు భారతీయ కుటుంబం వివాహ వేడుకను నిర్వహిస్తుండగా, అదే వీధిలో చైనా కుటుంబం 94 ఏళ్ల మహిళకు అంత్యక్రియలు నిర్వహించింది.చైనా కుటుంబానికి చెందిన వాంగ్ అనే రాజకీయ నాయకుడు తన తల్లి మరణాన్ని ‘జాయ్‌ఫుల్ ఫ్యూనరల్’గా పేర్కొన్నారు. అంటే, వృద్ధాప్యంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా మరణించడం చైనా సంస్కృతిలో శుభంగా భావిస్తారు. అయితే, తన తల్లి మరణంతో వాంగ్ భారతీయ కుటుంబాన్ని సంప్రదించారు. ‘రాత్రి ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు ఉండవు. మీరు మీ వేడుకను కొనసాగించవచ్చు అని వారికి భరోసా ఇచ్చారు. దీంతో భారతీయ కుటుంబం పెళ్లి వేడుక ఘనంగా నిర్వహించింది. సంగీతాన్ని తగ్గించి, అతిథులను అంత్యక్రియల ప్రదేశానికి దూరంగా వాహనాలు పార్క్ చేయమని సూచించింది.ప్రస్తుతం ఈ ఘటనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఇది నిజమైన మలేషియన్ స్పిరిట్ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. సాంస్కృతిక భిన్నత్వం ఉన్నా.. పరస్పర గౌరవం, సానుభూతి ఎలా మానవత్వాన్ని ముందుకు తీసుకెళ్తాయో ఇది ఒక అద్భుత ఉదాహరణగా నిలిచిందని కామెంట్లు చేస్తున్నారు. -
తగ్గుతున్న అమెరికా ఇమేజ్
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా ప్రజాభిప్రాయంలో మార్పు వస్తోంది. అందరి హాట్ ఫేవరెట్‌గా ఉన్న అమెరికా ఇమేజ్ తగ్గిపోతోంది. అంతేకాదు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్ల సానుకూలత గణనీయంగా తగ్గిపోతోంది. చైనా, ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్ పట్ల ఆదారణ పెరుగుతోంది. ప్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన కొత్త సర్వే ఈ విషయాలు వెల్లడించింది. గతంలో నిర్వహించిన సర్వేల్లో అమెరికా అగ్రస్థానంలో ఉండగా.. చైనా పట్ల వ్యతిరేకత ఉండేది. కానీ.. తీరు మారుతోంది. ఇటీవలి సంవత్సరాలతో పోలిస్తే.. ఇప్పుడు రెండు అగ్రరాజ్యాలు సమానంగా అభిమానాన్ని సంపాదించుకుంటున్నాయి. 8 దేశాలు అమెరికా వైపు.. 7 దేశాలు చైనా వైపు.. జనవరి 8 నుంచి ఏప్రిల్ 26 వరకు యూఎస్ సహా 25 దేశాలలో 30,000 మందికి పైగా వ్యక్తులను ప్యూ సర్వే చేసింది. 24 దేశాల్లో నిర్వహించిన తాజా సర్వేలో, ఎనిమిది దేశాలలో అమెరికాను గొప్పగా అభివరి్ణంచారు. ఏడు దేశాలలో చైనాను పొగిడారు. మిగిలిన దేశాల్లో రెండింటికీ సమాన గౌరవం లభించింది. ముఖ్యంగా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీతో సహా 10 అధిక ఆదాయ దేశాల్లో 35% మంది మాత్రమే అమెరికా పట్ల సానుకూల అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. గత సంవత్సరం 51% ఉండగా.. ఇప్పుడది 35 శాతానికి పడిపోయింది. ఈ ధనిక దేశాల్లో 32% మంది చైనా పట్ల సానుకూల అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. ఇది గత సంవత్సరం 23% మాత్రమే ఉంది. అంటే తొమ్మిది శాతం పెరిగింది. ఇక అధ్యక్షుడు జిన్‌పింగ్‌పై తమకు నమ్మకం ఉందని 22% మంది చెప్పారు. ఇది గత సంవత్సరం 17%గానే ఉంది. అంటే ఈ ఏడాదికి 5శాతం పెరిగింది. ట్రంప్ విదానాలే కారణం! ఈ మార్పునకు కారణమేంటనేదీ ప్యూ రీసెర్చ్ సెంటర్ తేల్చలేకపోయింది. అయితే.. అభివృద్ధి చెందుతున్న భౌగోళిక రాజకీయ మార్పులు, నాయకత్వం అవగాహన ఈ ఫలితాలకు కారణమై ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అధ్యక్షుడు ట్రంప్ పరిపాలన విదేశాంగ విధాన నిర్ణయాలపై విమర్శలు పెరుగుతున్న తరుణంలో ఈ ఫలితాలు వెలువడ్డాయి. విదేశీ సహాయాన్ని తగ్గించడం, సాంప్రదాయ మిత్రదేశాలపై సుంకాలను విధించడం, అంతర్జాతీయ విద్యార్థులను ప్రభావితం చేసే వలస విధానాలను కఠినతరం చేయడం వంటి వరుస విధాన చర్యలు అమెరికా పట్ల విశ్వసనీయతను పోగొడుతున్నాయని డెమొక్రాట్ సెనేటర్ల బృందం ఆరోపించింది. అమెరికావైపే ఇజ్రాయెలీలు.. ఇక.. ఇజ్రాయెల్ ప్రజలు మాత్రం.. పాలస్తీనా, ఇరాన్‌లపై తమ యుద్ధానికి మద్దతు ఇచ్చిన అమెరికా పట్లనే ఎక్కువ సానుకూలంగా ఉన్నారు. 83% మంది ఇజ్రాయేలీలు అమెరికాను ఇష్టపడుతుండగా.. 33% మంది చైనా పట్ల తమ సానుకూలతను తెలిపారు. వారిలో 69% మంది ట్రంప్‌పై తమకు నమ్మకం ఉందని చెబుతుండగా, 9% మంది మాత్రమే జిన్‌పింగ్ పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. -
ఇకనైనా చైనా మారేనా?
గల్వాన్ లోయలో భారత, చైనాల మధ్య ఘర్షణలు జరిగిన అయిదేళ్లకు మన విదేశాంగ మంత్రి జైశంకర్ చైనాలో అడుగుపెట్టారు. షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) విదేశాంగ మంత్రుల సదస్సుకు హాజరైన సందర్భంగా ఆయన మంగళవారం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను ఇతర దేశాల విదేశాంగమంత్రులతోపాటు కలవటమేకాక, చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్‌తో ముందు రోజు భేటీ అయ్యారు. చైనా విదేశాంగమంత్రి వాంగ్ యీతో కూడా విడిగా భేటీ అయ్యారు. ఇరుగుపొరుగన్నాక సమస్యలు రావటం సహజం. అందునా చైనా వంటి దేశం పొరుగున వుంటే ఇవి మరింత క్లిష్టం కావటం, అవి ఘర్షణలుగా రూపాంతరం చెందటంలో ఆశ్చర్యం లేదు. సరిహద్దుల్లో ఎవరి భూభాగం ఎంతవరకూ వుందన్న అంశంలో మాత్రమే కాదు... పాకిస్తాన్‌తో మనకు సమస్య తలెత్తినప్పుడల్లా ఆ దేశాన్ని నెత్తిన పెట్టుకోవటం చైనాకు అలవాటైంది. ఉగ్రవాద దాడులకు కారణమైన సంస్థల్ని, ఉగ్రవాదుల్ని నిషేధ జాబితాలో చేర్చాలని భద్రతా మండలిలో కోరినప్పుడల్లా చైనా మోకాలడ్డుతోంది. ఇలాంటి సమస్యలెన్ని వున్నా సామర స్య వాతావరణంలో చర్చించుకుని పరిష్కరించుకోవటమే విజ్ఞత. అందుకే అయిదేళ్ల జాప్యం తర్వాతైనా ఈ పరిణామం చోటుచేసుకోవటం హర్షించదగ్గది. నిరుడు అక్టోబర్‌లో రష్యాలో జరిగిన బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కలుసుకున్నారు. ఉభయ దేశాల సంబంధాలనూ మళ్లీ పూర్వ స్థితికి తీసుకెళ్లాలని ఆ సమావేశంలో నిర్ణయించు కున్నారు. అటు తర్వాత మధ్య మధ్యలో చైనా వ్యవహార శైలివల్ల ఇబ్బందులేర్పడినా ఇరు దేశాల మధ్య సంబంధాలూ ఎంతో కొంత మెరుగయ్యాయని చెప్పాలి. సరిహద్దుల్లోని డెమ్చోక్,డెస్పాంగ్ ప్రాంతాల్లో సైన్యాలను వెనక్కి పిలవాలని ఇరు దేశాలూ నిరుడు అక్టోబర్‌లో నిర్ణయించ టంతో పరిస్థితుల్లో గణనీయంగా మార్పు వచ్చింది. కానీ మొన్న ఏప్రిల్‌లో హఠాత్తుగా విద్యుత్ వాహనాల తయారీలో, ఏఐ సహా అధునాతన సాంకేతికతల్లో తోడ్పడే అత్యంత కీలక ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించింది. అంతర్జాతీయ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) ఒడంబడిక ప్రకారం ఇది సరైంది కాదని మన దేశం చెబుతూ వచ్చింది. ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడటానికి కూడా ఇలాంటి ఆంక్షలు ప్రతిబంధ కమవుతాయి. ఈ సంబంధాలు మెరుగుపడటం, అభివృద్ధి చెందటం అంత సులభంగా సాధ్య పడలేదని, జాగ్రత్తగా వ్యవహరించి దీన్ని సుస్థిరపరుచుకోవాల్సిన అవసరం వున్నదని చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్ అన్నట్టు అక్కడి మీడియా తెలిపింది. ఈ విషయంలో చైనా నిజంగా చిత్తశుద్ధి ప్రదర్శిస్తే, కీలక ఖనిజాల ఎగుమతులపై వున్న నిషేధాన్ని తొలగిస్తే ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడతాయి. ప్రపంచంలో రెండూ అతి పెద్ద మార్కెట్లు. కానీ వృథా వివాదాల కారణంగా వాటిని వినియోగించుకోలేని నిస్సహాయత రెండు దేశాలనూ ఆవరిస్తోంది. ఈ ఏడాది చివరిలో ఎస్సీఓ దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు చైనాలో జరగబోతోంది. దానికి ప్రధాని నరేంద్ర మోదీ వెళ్తున్నారు. కనుక ఈలోగా ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంచు కోవటానికి కృషి చేయాల్సి వుంది. కశ్మీర్‌లోని పెహల్గాంలో పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు దాడిచేయటం, అనంతరం ‘ఆపరేషన్ సిందూర్’తో మన దేశం గట్టిగా జవాబీయటం వంటి పరిణామాల్లో చైనా, పాకిస్తాన్ వైపే నిలబడింది. ఇక దలైలామా వారసుడి నిర్ణయం తమ అంతర్గత వ్యవహారమంటూ చైనా వాదిస్తోంది. గత నెలలో బంగ్లాదేశ్, పాకిస్తాన్లతో కలిసి చైనా త్రైపాక్షిక సమావేశం నిర్వహించటాన్ని కూడా సాధారణ విషయంగా పరిగణించటానికి వీల్లేదు. ఈ సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యతేమీ లేదని బంగ్లాదేశ్ చెప్పినా, పాకిస్తాన్ మాత్రం భవిష్యత్తు త్రైపాక్షిక సమావేశాలకు ఇది ఆరంభమని ప్రకటించింది. ఇదిగాక అమెరికాలో ట్రంప్ ఆగమనం తర్వాత ఆ దేశం బంగ్లాదేశ్ వ్యవహారాల్లో ఏ పాత్ర పోషిస్తుందనేది ఇంకా అస్పష్టంగా వుంది. చైనాకు వ్యతిరేకంగా ఇండో–పసిఫిక్ ప్రాంతంలో మనతో కలిసి కూటమి కట్టిన అమెరికా, దానిపై కూడా తన వైఖరేమిటని చెప్పటం లేదు. తన మనసులోని మాట చెప్పకుండా ఈ మధ్య జపాన్, ఆస్ట్రేలియాలతో జరిపిన సమావేశంలో తైవాన్ విషయంలో చైనా దూకుడు నిర్ణయం తీసుకుంటే మీ చర్యలెలావుంటాయంటూ ట్రంప్ ఆరా తీశారు. అమెరికా ఏం చేస్తుందో, ఏ విషయంలో ఎలా వ్యవహరిస్తుందో తెలియకుండా హామీ ఇవ్వటానికి రెండు దేశాలూ నిరాకరించాయి. ఆస్ట్రేలియా అయితే నేరుగానే అది తన సమస్య కాదన్నట్టు మాట్లాడింది. కనుక స్వీయ ప్రయోజనాల రీత్యా చైనా విషయంలో మనం కూడా ఆచితూచి అడుగేయక తప్పదు.అయితే మన భద్రత విషయంలో రాజీ పడాల్సిన పనిలేదు. ఎస్సీఓలో మంగళవారం మాట్లాడిన జైశంకర్ నిర్మొహమాటంగానే మన వైఖరేమిటో చెప్పారు. ఉగ్రవాదం, వేర్పాటు వాదం, తీవ్రవాదం అనే మూడు దుష్టశక్తులతో పోరాడాల్సి వుంటుందని ఆయన ప్రకటించారు. పెహల్గాం దాడి జమ్మూ కశ్మీర్ పర్యాటకాన్ని దెబ్బతీసేందుకు జరిగిన కుట్రని చెప్పటంతోపాటు ఎస్సీఓ తన ప్రకటిత లక్ష్యాలకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు. ఎస్సీఓకు నేతృత్వం వహిస్తూ దాని లక్ష్యాలకు భిన్నంగా పాకిస్తాన్‌కు మద్దతీయటం సరికాదని చైనా గుర్తించక తప్పదు. స్నేహ సంబంధాలుంటే వాటిని పెంపొందించుకోవటానికి ఇతరేతర మార్గాలున్నాయి. అంతేతప్ప పాక్ తప్పులన్నిటినీ భుజాన మోసుకెళ్లటం తన ఎదుగుదలకు కూడా చేటు తెస్తుందని చైనా గుర్తించాలి. -
జిన్‌పింగ్‌తో జైశంకర్ భేటీ.. కీలక అంశాలివే..
బీజింగ్: భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బీజింగ్‌లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను కలుసుకుని, భారత్-చైనాల మధ్య సంబంధాలపై చర్చించారు. 2020లో భారత్- చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్న తర్వాత జైశంకర్ మంగళవారం తొలిసారి చైనాలో పర్యటించారు.జిన్‌పింగ్‌తో సమావేశానికి సంబంధించిన ఒక ఫొటోను జైశంకర్ ‘ఎక్స్’లో పంచుకుంటూ, భారత్- చైనా ద్వైపాక్షిక సంబంధాలలో పురోగతిపై జిన్‌పింగ్‌తో మాట్లాడానని, దీనిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారని తెలిపారు. జిన్‌పింగ్‌ను జైశంకర్ కలిసినప్పుడు ఆయనతోపాటు ఎస్సీఓ సభ్య దేశాల ప్రతినిధులు కూడా ఉన్నారు. 2020లో వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంబడి గాల్వాన్ లోయలో తలెత్తిన ఘర్షణల కారణంగా సరిహద్దు ఉద్రిక్తతలు తలెత్తాయి. Called on President Xi Jinping this morning in Beijing along with my fellow SCO Foreign Ministers. Conveyed the greetings of President Droupadi Murmu & Prime Minister @narendramodi. Apprised President Xi of the recent development of our bilateral ties. Value the guidance of… pic.twitter.com/tNfmEzpJGl— Dr. S. Jaishankar (@DrSJaishankar) July 15, 2025జైశంకర్ బీజింగ్‌లో చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్‌ను కలుసుకున్నారు. భారత్- చైనాల మధ్య చర్చలు జరగాలని కోరారు. గత సంవత్సరం అక్టోబర్ నుంచి భారత్- చైనాల మధ్య సంబంధాలు గణనీయంగా మెరుగుపడుతూ వస్తున్నాయి. 2024 అక్టోబర్‌లో కజాన్‌లో ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారు. అనంతరం లడఖ్‌లోని డెప్సాంగ్, డెమ్చోక్లలో సైన్యాన్ని ఉపసంహరించుకునే ప్రణాళికను భారత్-చైనాలు ప్రకటించాయి. -
రయ్.. రయ్.. విమానంతో పోటీపడే రైలు.. గంటకు 600 కిలోమీటర్లు..
బీజింగ్: డ్రాగన్ దేశం చైనా సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. గత కొన్నేళ్లుగా హైస్పీడ్ రైలు నెట్‌వర్క్‌పై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన చైనా.. తాజాగా విమానంతో పోటీపడే రైలును తయారు చేసింది. ఈ రైలు వేగం గంటకు 600 కిలోమీటర్లు అని తెలుస్తోంది. తాజాగా 17వ మోడ్రన్ రైల్వే ఎగ్జిబిషన్లో మాగ్లెవ్ రైలును చైనా ప్రదర్శించింది. దీంతో, ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.చైనా విజయవంతంగా మాగ్నెటిక్ లెవిటేషన్ (మాగ్లెవ్) టెక్నాలజీతో సరికొత్త హైస్పీడ్ రైలును ఆవిష్కరించింది. విమానంతో పోటీ పడే రైలును ప్రపంచానికి పరిచయం చేసింది. 17వ మోడ్రన్ రైల్వే ఎగ్జిబిషన్లో మాగ్లెవ్ రైలును చైనా ప్రదర్శించింది. ఇది కేవలం 7 సెకన్లలోనే 600 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని అధికారులు తెలిపారు. ఇక, ఇది అందుబాటులోకి వస్తే.. బీజింగ్ నుంచి షాంఘై మధ్య ఉన్న 1200 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 150 నిమిషాల్లో చేరుకుంటుందని అంచనా. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య ప్రయాణానికి 5.30 గంటల సమయం పడుతోంది.Ever wondered what 600 km/h feels like on the ground? 🚄Hop on the world’s fastest train and get ready for an insane, mind-blowing ride.This isn't sci-fi — it’s happening in China! 🇨🇳💨#FastestTrain #ChinaSpeed #Maglev #NextLevelTravel #FutureIsNow #HighSpeedRail #600kmh… pic.twitter.com/1Eq4Flm6U1— Chengdu China (@Chengdu_China) July 14, 2025కాగా, డోంఘు లాబొరేటరీలోని ఇంజనీర్లు 2025 చివరి నాటికి తమ హై-స్పీడ్ ట్రాక్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారు. దీనికి ఏఐ గైడెడ్ సస్పెన్షన్ వ్యవస్థలు.. ఖచ్చితమైన విద్యుదయస్కాంత నియంత్రణకు తోడ్పడనున్నట్టు అధికారులు తెలిపారు. హైస్పీడ్ సమయంలో ఇవి ప్రయాణికులకు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం చేస్తాయన్నారు.ఇదిలా ఉండగా.. మ్యాగ్నెటిక్ లెవిటేషన్ (మాగ్లెవ్) టెక్నాలజీతో ఈ రైలు అధిక వేగంతో దూసుకెళ్లగలదు. ఈ టెక్నాలజీ అయస్కాంత వ్యతిరేక క్షేత్రాలను ఉపయోగించుకొని.. ట్రాక్ నుంచి రైలును పైకి లేపడానికి సాయపడుతుంది. అప్పుడు ఫ్రిక్షన్ తగ్గి రైలు నిశ్శబ్దంగా, వేగంగా వెళ్లగలుతుందని బీజింగ్ అధికారులు వెల్లడించారు. ఈ రైలు బరువు 1.1 టన్నులుగా ఉండనుంది. ఇక, ఇది వినియోగంలోకి వస్తే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలుగా చరిత్ర సృష్టించనుంది. ఈ ఏడాది జూన్‌లో చైనా ఇంజినీర్లు దీన్ని పరీక్షించారు. తాజాగా ప్రదర్శించారు. దీంతో, అందరి దృష్టి ఈ రైలు పడింది. 🇨🇳🚄China is redefining the world’s high-speed rail development.The 600km/h driverless high-speed maglev train debuts! pic.twitter.com/1VghGaC1DQ— Shen Shiwei 沈诗伟 (@shen_shiwei) July 12, 2025 -
ఐదేళ్ల తర్వాత చైనాకు జైశంకర్.. ఎందుకెళుతున్నారంటే..
న్యూఢిల్లీ: భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వచ్చే వారం చైనాను సందర్శించనున్నారు. ఐదేళ్ల తర్వాత ఆయన చైనా పర్యటనకు వెళుతున్నారు. ఇటీవల రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చైనాలో జరిగిన రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొన్నారు. ఇది జరిగిన మూడు వారాల తర్వాత చైనాలో జైశంకర్ పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ)వెంబడి 2020 నాటి సైనిక ప్రతిష్టంభన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.ఈ పర్యటనలో జైశంకర్ షాంఘై సహకార సంస్థ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొననున్నారు. దీనికి ముందు ఆయన బీజింగ్‌లో చైనా ప్రతినిధి వాంగ్ యితో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. కాగా సరిహద్దు వివాదంపై భారతదేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో చర్చలు జరిపేందుకు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి త్వరలో భారతదేశాన్ని సందర్శించనున్నారని వార్తా సంస్థ పీటీఐ గతంలో తెలిపింది. ఇరు దేశాలు తమ మధ్య దెబ్బతిన్న సంబంధాలను సరిదిద్దుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.భారత్- చైనా సంబంధాలు సానుకూల దిశగా పయనిస్తున్నాయని జైశంకర్ ఇటీవల అన్నారు. ఈ పర్యటనలో జైశంకర్.. సరిహద్దు వివాదాలు, దలైలామా వారసత్వం, భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతలు, రెండు దేశాల మధ్య ప్రత్యక్ష విమానాల పునఃప్రారంభం తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. 2020 మే నెలలో గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణ ఇరు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసింది. దాదాపు ఐదేళ విరామం తర్వాత గత నెలలో ఇరు దేశాలు కైలాస మానసరోవర యాత్రను తిరిగి ప్రారంభించాయి. -
మనపై చైనా వాటర్ బాంబ్
బ్రహ్మపుత్రా నది పై చైనా తలపెట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆనకట్ట ‘మెడోగ్’భారత్ పాలిట ‘నీటి బాంబు’గా మారనుందని అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ ఆందోళన వెలిబుచ్చారు. ఈశాన్యంలోని సరిహద్దు రాష్ట్ర ప్రజలకు, వారి జీవనోపాధికి ఈ ప్రాజెక్టు పెను ముప్పు అవుతుందన్నారు. ‘‘ఏ అంతర్జాతీయ జల ఒప్పందాలపైనా సంతకం చేయని చైనా ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు. ఆ డ్యామ్‌ను మనపైకి నీటి బాంబుగా కూడా ఉపయోగించొచ్చు’’అని హెచ్చరించారు. దాంతో మెడోగ్ డ్యామ్ మరోసారి చర్చల్లో నిలిచింది. గోప్యతపై అనుమానాలు... టిబెట్‌లోని యార్లుంగ్ సాంగ్సో (బ్రహ్మ పుత్ర) నదిపై ప్రపంచంలోనే అతి పెద్ద ఆనకట్టను చైనా నిర్మిస్తోంది. ఈ నది అరుణాచల్‌లో సియాంగ్‌గా, అస్సాంలో బ్రహ్మపుత్రగా మారి, బంగ్లాదేశ్‌లోకి ప్రవహిస్తుంది. అక్కడి నుంచి సముద్రంలో కలుస్తుంది. మెడోగ్ డ్యామ్ ద్వారా ఏకంగా 60 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తిని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. ఇది భారత సరిహద్దుకు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందుకే దీన్ని ‘టిక్‌టిక్ అంటున్న వాటర్ బాంబ్’గా ఖండు అభివరి్ణంచారు. మెడోగ్ కేవలం నదీప్రవాహ ప్రాజెక్టు అని చైనా అంటున్నా ఆ ముసుగులో అతి భారీ జలాశయాన్ని నిర్మిస్తోందని చెబుతున్నారు. ఇది భారీగా నీటిని నిల్వ చేస్తుందని, దిగువ ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుందని అంటున్నారు. ఆనకట్ట నిర్మాణానికి ఆమోదం లభించినట్లు 2024లో వార్తలొచ్చాయి. ఈ ప్రాజెక్టుపై చైనా ఆద్యంతం గోప్యత పాటిస్తుడటం, అంతర్జాతీయ జల ఒప్పందాలపై సంతకం చేయడానికి నిరాకరించడం పర్యావరణంగా, భౌగోళికంగా, రాజకీయపరంగా భారత్‌కు పెను ఆందోళన కలిగిస్తోంది. అంతేగాక ప్రాంతీయ ఉద్రిక్తతలను కూడా రాజేస్తోంది. ఈ ఆనకట్టను అరుణాచల్ అస్తిత్వానికే ముప్పుగా నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు.‘గ్రేట్ బెండ్’ వద్దే నిర్మాణం అరుణాచల్‌కు సమీపంలో సాంగ్సో నది ఉన్నట్టుండి వలయాకారంగా వంపు తిరుగుతుంది. సరిగ్గా ఈ ‘గ్రేట్ బెండ్’వద్దే చైనా ఆనకట్ట కడుతోంది. అక్కడి నుంచి నేరుగా అరుణాచల్‌కు చేరుతుంది. ఈ నేపథ్యంలో నదీ ప్రవాహంలో ఎలాంటి అసాధారణ మార్పులు జరిగినా భారీ వరదలు తప్పవు. అదే జరిగితే సియాంగ్ బెల్ట్ మొత్తం నాశనమవుతుంది. అక్కడి ఆదిమ తెగలు, ఇతర వర్గాలతో పాటు విస్తారమైన అటవీ ప్రాంత అస్తిత్వం కూడా ముప్పులో పడుతుంది. ఎగువ దేశంగా నదీ ప్రవాహంపై చైనాకు అతి కీలకమైన వ్యూహాత్మక నియంత్రణ ఉండటమే ఇందుకు కారణం. నీటిని అది ఏకపక్షంగా మళ్లిస్తే భారత్‌తోపాటు బంగ్లాదేశ్‌కు కూడా తీవ్ర నష్టం తప్పదు. నీటి ప్రవాహాన్ని తగ్గితే ఈశాన్య రాష్ట్రాలతో పాటు బంగ్లాలో సాగు, మత్స్యకార కార్యకలాపాలు, జీవనోపాధికి నష్టం వాటిల్లుతుంది. అందుకే ఈ డ్యామ్ నిర్మాణంపై భారత్ గట్టిగా అభ్యంతరాలు వ్యక్తం చేయాలని చైనాలోని భారత మాజీ రాయబారి అశోక్ కాంత సూచించారు. ‘మెడోగ్ కేవలం ప్రాజెక్టు కాదు. చాలా క్లిష్టమైన ప్రాంతంలో వ్యూహాత్మకంగా నిర్మిస్తున్న అతి భారీ జలాశయం. ఇది చాలా ప్రమాదకర పరిణామం. అత్యంత బాధ్యతారహితమైన ప్రాజెక్టు’’అని హెచ్చరించారు. మరికొందరు నిపుణులు మాత్రం భయాందోళనలు అవసరం లేదంటున్నారు. ఈ ఆనకట్ట ద్వారా బ్రహ్మపుత్రా జలాలను మనపైకి ఆయుధంగా వాడటం చైనా ఉద్దేశం కాబోదని చెబుతున్నారు. నదిలోని భారీ ప్రవాహాన్ని చైనా ఆపజాలదని చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రఫేల్ యుద్ధ విమానాలతో ఫొటోలు.. చైనా పౌరుల అరెస్టు
ఏథెన్స్: గ్రీస్ దేశంలోని తనగ్రాలో రఫేల్ యుద్ధ విమానాలను ఫొటోలు తీసినందుకు నలుగురు చైనా జాతీయులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒక మహిళ ఉన్నట్లు తెలిసింది. తనగ్రాలో గ్రీస్ వైమానిక, సైనిక స్థావరాలు ఉన్నాయి. హెలినిక్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ(హెచ్ఏఐ) ఇక్కడే ఉంది. తాజాగా చైనా పౌరులు ఈ ప్రాంతంలో రఫేల్ యుద్ధ విమానాలతోపాటు ఇతర రక్షణ సదుపాయాలను కెమెరాల్లో బందిస్తున్నట్లు హెలినిక్ ఎయిర్‌ఫోర్స్ పోలీసులు గుర్తించారు. దూరంగా వెళ్లిపోవాలని ఆ నలుగురిని హెచ్చరించారు. దాంతో వారు కొంతదూరం వెళ్లి మళ్లీ ఫొటోలు తీస్తుండడంతో అనుమానం వచ్చి వెంటనే అదుపులోకి తీసుకొని, స్థానిక లా అండ్ ఆర్డర్ పోలీసులకు అప్పగించారు. రక్షణపరంగా తనగ్రా చాలా సున్నితమైన ప్రాంతం కావడంతో ఈ ఫొటోల వ్యవహారాన్ని అధికారులు తీవ్రంగా పరిగణించారు. స్థానికంగా హైఅలర్ట్ ప్రకటించారు. చైనా జాతీయుల ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని, వారు గూఢచారులు కావొచ్చన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. రక్షణపరంగా భారత్–గ్రీస్ మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. ఇరు దేశాలు కలిసి తరచుగా సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. భారత వైమానిక దళం ఇటీవల ఆపరేషన్ సిందూర్‌లో రఫేల్ ఫైటర్ జెట్లతో పాకిస్తాన్‌పై దాడి చేసింది. ఈ ఫైటర్ జెట్ల గుట్టుమట్లు తెలుసుకోవడానికే చైనా పౌరులు వాటిని ఫొటోలు తీశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
చైనాలో ప్రాణాంతక మైనింగ్
అత్యంత అరుదైన ఖనిజాలు(రేర్ ఎర్త్ మినరల్స్)... రెండు అగ్రరాజ్యాలైన అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదానికి దారితీస్తున్న అంశమిది. తమకు తక్కువ ధరకే ఈ ఖనిజాలు సరఫరా చేయాలని చేయాలని అమెరికా డిమాండ్ చేస్తుండగా, డ్రాగన్ దేశం అందుకు ఒప్పుకోవడం లేదు. ఎంతో అరుదైన, విలువైన ఈ ఖనిజాలు చైనా గడ్డపై ఉండడం, అవి తమకు సులువుగా దక్కకపోవడం సహజంగానే అమెరికాకు రుచించడం లేదు. అందుకే చైనాపై ఒత్తిడి పెంచుతూనే ఉంది. రాజకీయంగా, ఆర్థికంగా అమెరికాను చైనా బహిరంగంగా ధిక్కరిస్తోంది అంటే అందుకు కారణం ఈ ఖనిజాలే అనే చెప్పొచ్చు. ఆధునిక యుగంలో స్మార్ట్ఫోన్లు, బ్లూటూత్ స్పీకర్లు, కంప్యూటర్లు, టీవీ స్క్రీన్లు, ఎలక్ట్రిక్ వాహనాలతోపాటు సోలార్ ప్యానెళ్లు, ఎంఆర్ఐ మిషన్లు, జెట్ ఇంజన్లు, విదుŠయ్త్ పరికరాల్లో రేర్ ఎర్త్ మినరల్స్ వాడకం తప్పనిసరిగా మారింది. ఇదే ఇప్పుడు చైనా పంట పండిస్తోంది. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న ఈ ఖనిజాల్లో సగానికిపైగా చైనా నుంచే వస్తున్నాయి. అరుదైన ఖనిజాల మైనింగ్, శుద్ధి, ఎగుమతుల విషయంలో చైనా మొదటి స్థానంలో నిలుస్తోంది. ఇదంతా నాణేనికి ఒకవైపే. మరోవైపు ఏముందో చూస్తే... నీరు, భూమి కలుషితం చైనాలో ఉత్తరాన ఉన్న ఇన్నర్ మంగోలియా ప్రాంతంలోని బయాన్ ఓబో, దక్షిణాన జియాంగ్జీ ప్రావిన్స్‌లోని గాంగ్ఝౌలో రేర్ ఎర్త్ ఖనిజాల గనులున్నాయి. ఆయా ప్రాంతాల్లో దశాబ్దాలుగా తవ్వకాలు సాగుతున్నాయి. భారీ యంత్రాలు, వాహనాల రొదతో అవి నిత్యం దద్దరిల్లుతుంటాయి. పొరలు పొరలుగా భూమిని పెకిలించి వేస్తున్నారు. బడా కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలతోపాటు ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపిస్తున్న గనులు స్థానికులకు మాత్రం నరకానికి నకలుగా మారిపోయాయి. పచ్చని మైదానాలు మసిబారిపోయాయి. గడ్డి భూములు ప్రమాదకరమైన దుమ్ము ధూళితో నిండిపోయాయి. లోతైన గనుల నుంచి దట్టమైన దుమ్ము మేఘాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. భూమాతకు గాయాలవుతూనే ఉన్నాయి. గాలి, నీరు, భూమి దారుణంగా కలుషితం అవుతున్నాయి. చట్టవిరుద్ధంగా తవ్వకాలు గనుల నుంచి వెలువడే రేడియోయాక్టివ్ బురదను నిల్వ చేయడానికే సమీపంలో కృత్రిమంగా సరస్సులు నిర్మించారు. కాలుష్యం కారణంగా స్థానికులు రోగాల బారినపడుతున్నారు. పెద్దలకు క్యాన్సర్లతోపాటు శిశువులకు పుట్టుకతో లోపాలు పరిపాటిగా మారాయి. ఇదంతా బాహ్య ప్రపంచానికి తెలియకుండా చైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అపరిచితులను గనుల వైపు అనుమతించడం లేదు. మైనింగ్ ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుద్ధి చేస్తున్నామని అధికారులు చెబుతున్నా అందులో వాస్తవం లేదని నిపుణులు అంటున్నారు. గనుల తవ్వకంతో వెలువడే మట్టి, బురదలో ప్రాణాంతకమైన భార లోహాలు, రేడియోయాక్టివ్ అవశేషాలు ఉంటున్నాయి. టన్నుల కొద్దీ అమ్మోనియం సల్ఫేట్, అమ్మోనియం క్లోరైడ్తోపాటు ఇతర రసాయనాలు భూ ఉపరితలంపై పేరుకుపోతున్నాయి. చైనాలో వేలాది మైనింగ్ సైట్లు ఉన్నాయి. వీటిలో చట్టవిరుద్ధమైనవే ఎక్కువ. ఒక చోట తవ్వకానికి అనుమతులు తీసుకొని మరికొన్ని చోట్ల అక్రమంగా మైనింగ్ చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. గనుల నియంత్రణకు ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది. మైనింగ్ లైసెన్స్‌ల సంఖ్య తగ్గించింది. అయినప్పటికీ అక్రమ గనులు సంఖ్య పెరిగిపోతోంది తప్ప తగ్గడం లేదు. కేవలం ఒక టన్ను ఖనిజాలు కావాలంటే ఏకంగా 2,000 టన్నుల మట్టిని తవ్వాల్సి ఉంటుంది. గ్రామాలకు గ్రామాలే ఖాళీ గనుల వల్ల జరగాల్సిన నష్టం చాలావరకు ఇప్పటికే జరిగిపోయింది. మైనింగ్ ప్రాంతాల్లో అడవులు అంతరించిపోయాయి. భూముల్లో గోతులే మిగిలాయి. నదులు, పంట పొలాలు పనికిరాకుండా పోయాయి. భూగర్భ జలాలు సైతం విషతుల్యంగా మారుతున్నాయి. ఒక విధానం అంటూ లేకుండా తవ్వకాలు సాగిస్తుండడంతో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. మైనింగ్ కంపెనీలు రైతుల పొలాలను కూడా వదలిపెట్టడం లేదు. వారు ఎంత మొర పెట్టుకున్నా ఫలితం శూన్యం. బడా కంపెనీలపై చట్టపరంగా కోర్టుల్లో పోరాడే శక్తి లేక మిన్నకుండిపోతున్నారు. కొన్నిచోట్ల గ్రామాలకు గ్రామాలే ఖాళీ అవుతున్నాయి. మరోవైపు గనుల తవ్వకం ఆపాల్సిందేనని పర్యావరణవేత్తలు డిమాండ్ చేస్తున్నాయి.– సాక్షి, నేషనల్ డెస్క్ -
స్విమ్మింగ్ పూలే ఆఫీసు
సిబ్బంది ఒత్తిడిని దూరం చేయడం కోసం కొన్ని సంస్థలు ఆఫీసులోనే జిమ్, స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేస్తుంటాయి. కానీ.. ఓ చైనీస్ కంపెనీ మాత్రం.. స్విమ్మింగ్ పూల్‌నే ఆఫీసుగా మార్చేసింది. ఆఫీస్‌గా మారిన పూల్ ఫొటోలు, వీడియోలు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. స్విమ్మింగ్ పూల్ చుట్టూ.. ఫ్లోర్ సాకెట్లు, ఎక్స్టెన్షన్ కేబుళ్లతో ఉన్న వర్క్‌స్టేషన్ ఇప్పుడు ఉద్యోగుల భద్రత గురించి ఆందోళనలు రేకెత్తించడంతో చివరకు ఖాళీ చేయాల్సి వచి్చంది. చైనాకు చెందిన లుబాన్ డెకరేషన్ గ్రూప్ అనే డెకరేషన్ కంపెనీ ఖాళీగా ఉన్న ఈత కొలనును తాత్కాలిక వర్క్‌స్పేస్‌గా మార్చింది. జిమ్ పక్కన ఉన్న గాజు తలుపు నుంచి పూల్ ఆఫీస్‌లోకి వస్తారు. పూల్‌లో ఉన్న సైడ్ నిచ్చెనలు ఉపయోగించి తమ డెస్క్ దగ్గరకు వెళ్తారు. అలాగే.. వాటి ద్వారా తిరిగి బయటికి వస్తారు. సిబ్బంది రెండు నెలలుగా అక్కడ పనిచేస్తున్నారు. ఈ విచిత్రమైన సెటప్‌కు సంబంధించిన వీడియో ఒకటి సిబ్బంది ఆన్లైన్లో పెట్టడంతో చర్చనీయాంశమైంది. ఉద్యోగులు తన డెస్క్ నుండి కిందికి చూస్తే, కనిపించే పూల్ లేన్ గుర్తుల కారణంగా వారు చిన్న డైవింగ్ ట్యాంక్‌లో ఉన్నట్లు అనిపిస్తుంది. తాము ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాలో ఉన్నట్లు అనిపిస్తుందని, వింతగా ఉన్నప్పటికీ బాగుందని తెలిపారు. కొందరు ఇది సృజనాత్మకంగా ఉందంటే.. మరికొందరేమో ఉద్యోగుల భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఏదైనా అత్యవసర సమయాల్లో తరలింపు మార్గాలు లేకపోవడం, అవసరమైన అగి్నమాపక భద్రతా లక్షణాలు లేకపోవడం ఆన్లైన్లో చర్చకు దారితీసింది. పూల్ ప్రాంతంలో పనిచేసే ఉద్యోగుల భద్రత గురించి ఆందోళనలు తలెత్తాయి. ‘ఈ కార్యాలయ సెటప్ నిజంగా ప్రత్యేకమైనది. మీరు నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం కష్టమే’అని కొందరు, ‘ఈ కార్యాలయం ట్రెండీగా కనిపించవచ్చు, కానీ తేమ వల్ల రుమాటిజం రావచ్చు. లోతైన చివరలో ఎక్కువ గంటలు కూర్చోవడం వల్ల కీళ్ళకు నష్టం జరగుతుంది’అని మరికొందరు హెచ్చరించారు. అయితే.. ఆఫీస్ పునరుద్ధరణ కారణంగా పూల్‌కు మార్చా మని, ఈ సెటప్ తాత్కాలిక పరిష్కారమేనని సంస్థ తెలిపింది. అయినప్పటికీ.. కంపెనీ తాత్కాలిక కార్యాలయాన్ని పరిశీలించిన స్థానిక అగి్నమాపక విభాగం ఆ స్థలాన్ని ఖాళీ చేయించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఐఫోన్ 17: చైనా టెకీలు వెళ్లిపోయినా పర్లేదు..
యాపిల్ వెండార్ల ప్లాంట్లలో పని చేసే చైనా టెకీలు స్వదేశాలకు వెళ్లిపోయినా భారత్‌లో ఐఫోన్ 17 ఫోన్ల ఉత్పత్తి ప్రణాళికలు యథాతథంగానే కొనసాగుతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. చైనా నుంచి, ఐఫోన్ల తయారీలో కీలకమైన యంత్రపరికరాల దిగుమతులు ఇటీవలి కాలంలో మెరుగుపడ్డట్లు వివరించాయి.భారత్‌లో ఫాక్స్‌కాన్, టాటా ఎల్రక్టానిక్స్ సంస్థలు యాపిల్ ఫోన్లను తయారు చేస్తున్నాయి. గత రెండు నెలలుగా ఫాక్స్‌కాన్ ఇండియా యూనిట్లలో పని చేస్తున్న వందలకొద్దీ చైనా నిపుణులు స్వదేశానికి వెళ్లిపోయినట్లు సమాచారం. వీరంతా అసెంబ్లీ లైన్స్, ఫ్యాక్టరీ డిజైన్, ఇతరత్రా సిబ్బందికి శిక్షణనిచ్చే విధులు నిర్వర్తించేవారు.దీనితో ఐఫోన్ల తయారీపై ప్రతికూల ప్రభావం పడొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. కానీ, భారత్‌లో ఐఫోన్ల ఉత్పత్తిని 3.5–4 కోట్ల స్థాయి నుంచి ఈ ఏడాది 6 కోట్లకు పెంచుకోవాలన్న యాపిల్ టార్గెట్‌లో ఎలాంటి మార్పు లేదని సంబంధిత వర్గాలు వివరించాయి. -
గంజితో గట్టి మేలు.. ఎలా వాడాలి?
న్యూఢిల్లీ: ఉరుకులు పరుగుల జీవితంలో నఖశిఖపర్యంతం మనిషికి ఎన్నో ఆరోగ్య సమస్యలు. అన్ని ఆరోగ్య సమస్యలు అవతలి వాళ్లకు చూడగానే కనిపించవు. కానీ జుట్టు సరిగాలేకపోయినా, జుట్టు ఊడిపోయినా ఎదుటి వాళ్లు ఇట్టే కనిపెడతారు. జుట్టు రాలిపోయే సమస్యకు ఇప్పుడు ఎంతో మంది వందల రూపాయలు ఖర్చుపెట్టి ఎన్నో రకాల ఖరీదైన షాంపూలు ఉపయోగిస్తున్నారు.అయితే ప్రత్యేకంగా ఎలాంటి ఖర్చుపెట్టకుండానే జుట్టు రాలే సమస్యను గంజితో పరిష్కరించుకోవచ్చని పలువురు నిపుణులు చెబుతున్నారు. చైనా, జపాన్లలో శతాబ్దాలుగా గంజిని జుట్టు పోషణ కోసం విరివిగా ఉపయోగిస్తున్నా భారత్‌లో గంజి వినియోగం అంతంతే. ఈ నేపథ్యంలో గంజిని వృథాగా పారబోయకుండా ఒత్తయిన జుట్టు కోసం సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. జుట్టు కుదుళ్లు బలంగా ఉండేందుకు జపాన్, చైనాలో గంజిని ఉపయోగిస్తారు.గంజి వాడకంతో జుట్టు ఆరోగ్యం మెరుగుపడటంతోపాటు వెంట్రుకల కొనలు పగిలిపోవడంలాంటివి బాగా తగ్గుతాయి. గంజి వినియోగంతో జుట్టు మరింతగా మెరుస్తూ, పొడవు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. గంజిలో బి–విటమిన్, ఇ–విటమిన్‌తోపాటు ఐనోసైటోల్, నియాసినమైడ్ వంటి కీలకమైన అమ్లాలు ఉంటాయి. ఇవన్నీ జుట్టు పోషణకు ఎంతో మేలుచేకూరుస్తాయి. పాడైన జుట్టును రిపేర్ చేయడంలో ఐనోసైటోల్, నియాసినమైడ్లు కీలకపాత్ర పోషిస్తాయి. శతాబ్దాలుగా వినియోగం గంజితోపాటు చాలా సేపు బియ్యాన్ని నానబెట్టడం ద్వారా వచ్చే నీరు కూడా జుట్టుకు ఎంతో మేలుచేస్తుంది. బియ్యాన్ని ఉడకబెట్టాక గిన్నెలోకి వొంపే గంజిలో అత్యావశ్యకమైన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు, కొంతమేర అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఈ గంజిని జుట్టుకు పట్టిస్తే కేశనాళికలు బలంగా మారతాయి. అమైనో యాసిడ్లు, ప్రోటీన్ల కారణంగా జుట్టు బలంగా తయారవుతుంది. జుట్టు పట్టులాగా మృదువుగా మారుతుంది. జుట్టు రాలడం తగ్గిపోతుంది. వెంట్రుక మందం సైతం పెరుగుతుంది.గంజిలో ఉండే ఐనోసైటోల్ అనే కార్బోహైడ్రేడ్ ఇందుకు చాలా దోహదంచేస్తుంది. ఐనోసైటోల్ కారణంగా కేశాలు మరింత దృఢంగా మారతాయి. కేశాల మరమ్మతు, పెరుగుదలకు ఐనోసైటోల్ బాగా పనికొస్తుంది. గంజిలోని సిసీŠట్న్, మిథియోనైన్లు జుట్టును బలంగాచేస్తాయి. దాంతో జుట్టు అంత త్వరగా కొనలు విరిగిపోవు. చిట్లిపోవడం వంటి సమస్యలు బాగా తగ్గుతాయి. ఆరోగ్యవంతమైన, అందమైన జుట్టుకు ఈ అమైనా యాసిడ్లు భరోసా ఇస్తాయి. ప్రాచీన జపాన్‌లోనూ మహిళలు గంజిని విరివిగా ఉపయోగించారని తెలుస్తోంది.చైనాలోని హువాంగ్లూ గ్రామంలో యావో మహిళల జుట్టు పొడవుగా, బలంగా, అందంగా ఉంటుంది. గంజితో జుట్టును శుభ్రం చేసుకోవడం వల్లే తమ కేశాలు ఇలా ఆరోగ్యంగా ఉన్నాయని వాళ్లు చెప్పారు. గంజిలోని గొప్పదనాన్ని ఇప్పటికే కనిపెట్టిన కొన్ని బహుళజాతి సంస్థలు తమ ఉత్పత్తులను గంజి ఆధారంగా తయారుచేసి మార్కెట్లోకి తెస్తున్నాయి. హెయిర్ మాస్‌్కలు, కండీషనర్లు ఇలా కేశ సంబంధ ఉత్పత్తుల్లో ఇప్పుడు ప్రధాన సరుకు గంజే. గంజిని ఎలా వాడాలి? రోజూ వంటలోకి వండుకున్నట్లే బియ్యాన్ని ఏమాత్రం దుమ్ము, ధూళి, మట్టిలేకుండా చక్కగా జల్లెడ పట్టుకున్నాక నీళ్లుపోసి బియ్యాన్ని ఉడకబెట్టుకోవాలి. చిక్కని గంజిని తర్వాత గిన్నెలోకి ఒంపుకోవాలి. ఈ గంజిని వెంటనే జుట్టుకు పట్టించకూడదు. గది ఉష్ణోగ్రత వద్ద కనీసం 24 నుంచి 48 గంటలపాటు అలాగే పాత్రలోనే ఉంచాలి. పాత్రపై మూత బదులు వస్త్రంతో కప్పి కొనల వెంట రబ్బర్‌తో చుట్టాలి. ఇలా ఒకటి, రెండు రోజులు పులియబెట్టాక నేరుగా జుట్టుకు పట్టించండి. నెమ్మదిగా కుదుళ్ల వద్ద మసాజ్ చేయండి.దీంతో గంజి జుట్టుకు సమంగా అంటుకుంటుంది. రక్తప్రసరణ సైతం సరిగా అవుతుంది. తలస్నానం చేశాక కూడా జుట్టు ఆరిన తర్వాత ఇలా గంజి పట్టించవచ్చు. ఒక 20 లేదా 30 నిమిషాల తర్వాత సాధారణ నీటితో జుట్టు కడుక్కుంటే సరిపోతుంది. వారానికి కనీసం రెండు సార్లు ఇలా చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది. అతిగా వాడితే మాత్రం దురద వంటి కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయి. అలాంటప్పుడు వైద్యుల సలహాతో ఈ చిట్కాను కొనసాగించవచ్చు. -
ఫ్రాన్స్ సంచలన ఆరోపణలు.. చైనా, పాక్‌లు కలిసి..!
తమ యుద్ధ విమానాల అమ్మకాలపై చైనా దుష్ర్పచారాం చేస్తోందని ప్రాన్స్ సంచలన ఆరోపణలు చేసింది. తాము ఎంతో ప్రతిష్టాత్మకంగా తయారు చేస్తున్న రఫెల్ యుద్ధ విమానాల అమ్మకాలను చైనా దెబ్బతీస్తోందని ఫ్రాన్స్ ఆరోపించింది. పలు దేశాల్లో చైనా రాయబార కార్యాలయాల్లో పని నేసే దౌత్య, రక్షణ ప్రతినిధులు ఈ ప్రచారానికి నాయకత్వం వహిస్తున్నారని ఫ్రాన్స్ మండిపడుతోంది. ఫేల్ విమానాలను కొనుగోలు చేయవద్దని, వాటి స్థానంలో చైనా తయారీ జెట్లను తీసుకుంటే మంచిదని వివిధ దేశాలను ఒప్పించే యత్నాలు జరగుఉతున్నాయని ఫ్రెంచ్ వర్గాల వెల్లడించాయి. తమ దేశం అధికంగా విమానాల అమ్మకాలనై అత్యధికంగా ఆధారపడిన దేశమని, దాన్ని చైనా దెబ్బ కొట్టడానికి తీవ్ర యత్నాలు చేస్తున్నట్లు ప్రాన్స్ చెబుతోంది. చైనా తన అధికారిక బలంతో ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు ఫ్రాన్స్ అంటోంది. పాకిస్తాన్, చైనా కలిసి ఈ తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని ఫ్రాన్స్ విమర్శించింది. ఈ దుష్ప్రచారంలో భాగంగా, గత మే నెలలో భారత్‌తో జరిగిన ఘర్షణలో మూడు రఫేల్ విమానాలతో సహా ఐదు భారత విమానాలను కూల్చివేశామని పాకిస్తాన్ చేసిన వాదనలను చైనా వాడుకుంటోందని ఫ్రాన్స్ అధికారులు తెలిపారు. ఆన్లైన్లో కూడా ఈ ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్నారని తెలిపింది. ఏఐతో మార్ఫింగ్ చేసిన యుద్ధ విమానాల శిథిలాలను చూపిస్తూ చైనా టెక్నాలజీ అమోఘమనే భావనను వారు కల్గిస్తున్నారని తెలిపింది. రఫెల్ అనేది యుద్ధ విమానం మాత్రమే కాదని, అది ఫ్రాన్స్ వ్యూహాత్మక సామర్థ్యానికి, నమ్మకానికి ప్రతీక ఫ్రాన్స్ పేర్కొంది. ఇప్పుడే దాన్నే చైనా తన అధికారిక బలాన్న ఉపయోగించి దుష్ప్రచారానికి దిగినట్లు ఫ్రాన్స్ ధ్వజమెత్తింది.రఫెల్ యుద్ధ విమానాలకు తయారు చేసే డసెల్ట్ ఏవియేషన్ 533 జెట్స్‌ను వివిద దేశాలకు అమ్మింది. ఈజిప్ట్, భారత్, ఖతర్, గ్రీస్, క్రొయేషియా, యూఏఈ, సెర్బియా, ఇండోనేషియా తదితర దేశాలకు ఫ్రాన్స్ తమ యుద్ధ విమానాలను విక్రయించింద. ఇప్పటివరకూ ఇండోనేషియా 42 యుద్ధ విమానాలను ఫ్రాన్స్ నుండి కొనుగోలు చేయగా, మరిన్ని రఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడాన్ని పరిశీలిస్తోంది. -
‘ఇతరుల జోక్యం లేకుండా’.. దలైలామాకు అమెరికా శుభాకాంక్షలు
వాషింగ్టన్: ఈరోజు (జూలై 6) టిబెటన్ల ఆధ్మాత్మిక గురువు దలైలామా పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు ప్రపంచం నలుమూలల నుంచి శుభాకాంక్షలు అందుతున్నాయి. అయితే అమెరికా దలైలామాకు ప్రత్యేక సందేశంతో శుభాకాంక్షలు తెలిపింది. ఒకవైపు టిబెటిన్లకు మద్దతు పలుకుతున్నట్లు, మరోవైపు చైనాను హెచ్చరిస్తున్నట్లు అమెరికా సందేశం ఉండటం విశేషం.90వ పుట్టినరోజు జరుపుకుంటున్న దలైలామాకు అమెరికా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. టిబెటన్లు తమ మత పెద్దలను స్వేచ్ఛగా, ‘ఇతరుల జోక్యం లేకుండా’ ఎన్నుకునే సామర్థ్యాన్ని కాపాడుకునేందుకు అమెరికా మద్దతు ఇస్తుందని పేర్కొంది. ప్రపంచానికి దలైలామా ఐక్యత, శాంతి, కరుణల సందేశాన్ని అందిస్తూ, ప్రజల్లో శాంతి నెలకొల్పుతున్నారని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో పేర్కొన్నారు.చైనా పేరు ఎత్తకుండానే రూబియో.. టిబెటన్ల సాంస్కృతిక, మత స్వేచ్ఛకు అమెరికా మద్దతు ఇస్తుందనే సందేశాన్ని తెలియజేశారు. టిబెటన్ల హక్కులు, ప్రాథమిక స్వేచ్ఛల పట్ల గౌరవాన్ని పెంపొందించేందుకు యునైటెడ్ స్టేట్స్ కట్టుబడి ఉందన్నారు. టిబెటన్ల ప్రత్యేక భాష, సాంస్కృతిక, మతపరమైన వారసత్వాన్ని కాపాడే ప్రయత్నాలకు తాము మద్దతు ఇస్తున్నామని, ఇతరుల జోక్యం లేకుండా వారు మత పెద్దలను స్వేచ్ఛగా ఎన్నుకునే సామర్థ్యాన్ని కాపాడుతామని అన్నారు. తదుపరి దలైలామాను ఎన్నుకునే హక్కు తమకే ఉందని చైనా చెబుతున్న ప్రస్తుత తరుణంలో అమెరికా వ్యాఖ్యలు కీలకంగా మారాయి. కాగా టిబెట్‌పై చైనా చారిత్రక అధికారాన్ని డిమాండ్ చేస్తోంది. సామ్రాజ్య యుగం నాటి సంప్రదాయాలను గుర్తుచేస్తూ, తదుపరి దలైలామాను ఆమోదించే హక్కు తమకే ఉందని బీజింగ్ తరచూ చెబుతోంది. టిబెట్‌లో అనుసరించే మతపరమైన ఆచారాలపై కఠినమైన నియంత్రణను కొనసాగిస్తోంది. -
జిన్‌పింగ్ (చైనా అధ్యక్షుడు) రాయని డైరీ
నువ్వు నీ పైనున్న వాడితో పూర్తి సమ్మతిని కలిగి ఉన్నావంటే, లేదా నీ కింద ఉన్నవాడు నీతో పూర్తి సమ్మతిని కలిగి ఉన్నాడంటే మీరిద్దరూ కలిసి త్వరలోనే దేనినో నాశనం చేయబోతున్నారనే! లేదా, ఇప్పటికే నాశనం చేసేశారని! అది ఏదైనా కావచ్చు. ఒక పెద్ద సంస్థ. ఒక పెద్ద వ్యవస్థ లేదా, ఒక పెద్ద దేశం.‘సమ్మతి’ అనేది దాపరికాల నిశ్శబ్దం. అసమ్మతి లేనేలేదని పెద్దగా అరచి చెప్పే అబద్ధం. నేనెప్పుడూ నిశ్శబ్దాన్ని కోరుకున్నది లేదు. నేనెన్నటికీ నా నిష్క్రమణకు సమ్మతంగా ఉండేదీ లేదు.‘‘కామ్రేడ్ జిన్‌పింగ్... పార్టీ మిమ్మల్ని తక్షణం తప్పుకోమంటోంది’’ అని పార్టీ కార్యాలయం నుంచి కొందరు వచ్చి చెప్పారు. ‘‘కామ్రేడ్ జిన్‌పింగ్... చైనా మిమ్మల్ని తక్షణం తప్పుకోమంటోంది’’ అని అధ్యక్ష భవనం నుంచి కొందరు వచ్చి చెప్పారు. ‘‘కామ్రేడ్ జిన్‌పింగ్... సైన్యం మిమ్మల్ని తక్షణం తప్పుకోమంటోంది’’ అని లిబరేషన్ ఆర్మీ నుంచి కొందరు వచ్చి చెప్పారు.నన్ను తప్పుకోమంటున్నారంటే – ప్రెసిడెంటు గానో, జనరల్ సెక్రెటరీ గానో, చైర్మన్ గానో తప్పుకోమన్నట్లు కాదు నాకు. ప్రజల్లోంచి తప్పుకోమన్నట్లు. ప్రజల్లో ఉండే మనిషి ప్రజల్లోంచి తప్పుకుని ఎక్కడికి వెళతాడు? ఆ మాటే వారితో అన్నాను. ‘‘మీరు కొన్నాళ్లు ప్రజల్లోంచి అదృశ్యం అయిపోయారు. కొన్నాళ్లుగా మీరు మీ ఆరోగ్యాన్ని ప్రజల నుంచి దాచి పెడుతున్నారు. ఇది కూడా ప్రజల్లో ఉండటమేనా కామ్రేడ్ జిన్‌పింగ్?’’ – అని ఆ వచ్చిన వాళ్లు!‘‘అదృశ్యమూ కాదు, అనారోగ్యమూ కాదు. ప్రజల గురించి ఆలోచిస్తూ కొంత దూరం నడుచుకుంటూ వెళ్లటమది’’ అన్నాను. ‘‘మీ భాష కూడా మారిపోతోంది కామ్రేడ్ జిన్‌పింగ్. మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థం అవుతోందా?’’ అన్నారు వాళ్లు.నవ్వాన్నేను. వాళ్లెవరూ తిరిగి నవ్వేంత తీరికతో వచ్చిన వారు కాదు. నన్ను తప్పించిపోదామని వచ్చినవాళ్లు.‘‘డియర్ కామ్రేడ్స్, నేను వెళ్లానే గానీ, ఒంటరిగా వెళ్లలేదు. నాతో మరో ఇద్దరు కలిసి నడిచారు. ఆ ఇద్దరిలో ఒకరు చైనా రిపబ్లిక్ అధ్యక్షుడు కామ్రేడ్ జిన్‌పింగ్. మరొకరు ఆర్మీ చైర్మన్ కామ్రేడ్ జిన్‌పింగ్. ఇక నేను పార్టీ జనరల్ సెక్రెటరీ కామ్రేడ్ జిన్‌పింగ్. నేనొక్కడినే ముగ్గురు కామ్రేడ్లుగా వెళ్లి, నాలోని ఆ ఇద్దరు కామ్రేడ్లలో ఒకరి నుంచి మంచిని ఎంచుకున్నాను. మరొకరిని చూసి నన్ను నేను సవరించుకున్నాను’’ అని చెప్పాను. అప్పుడు నవ్వారు వాళ్లు! ‘‘కామ్రేడ్ జిన్‌పింగ్... దశాబ్దాల క్రితమే కన్ఫ్యూషియస్‌ను చైనా వదిలేసింది. మీరింకా ఆయన్ని పట్టుకునే ఉన్నారు!’’ అన్నారు.‘‘ఎవరైనా ఇద్దరితో కలిసి నడుస్తున్నప్పుడు ఆ ఇద్దరినీ నేను నా గురువులుగా భావిస్తాను... ఒకరిని మంచి కోసం, ఇంకొకరిని వారిలోని చెడును చూసి నన్ను నేను మార్చుకోవటం కోసం...’’ అని కన్ఫ్యూషియస్ చెప్పిన మాట వారికీ గుర్తుందంటే వారూ కన్ఫ్యూషియస్‌ను వదల్లేదనే కదా! ‘‘కామ్రేడ్ జిన్‌పింగ్... మిమ్మల్ని లి–రుయిహువాన్, వెన్ జియాబావో వంటి పదవీ విరమణ పొందిన పార్టీ పెద్దలు సమ్మతించటం లేదు. విదేశాలలో స్థిరపడిన చైనా వారసత్వ యువరాజులు సమ్మతించటం లేదు. జాంగ్ యూషియా వంటి సైనిక నాయకులు సమ్మతించటం లేదు. మధ్యతరగతి ప్రజలు, వ్యాపారాలు చేసుకునే వారు సమ్మతించటం లేదు. ఇక మీరేమో సమష్టి నాయకత్వాన్ని సమ్మతించటం లేదు. చెప్పండి కామ్రేడ్ ఏం చేద్దాం?’’ అన్నారు వాళ్లు. ఏదైనా చేయాల్సిన అవసరం ఏముంది?!చైనా బలమే అసమ్మతి. చైనాకు ఉన్న మరొక బలం ఆ అసమ్మతికి తలొగ్గని నాయకత్వం. ప్రజల సమ్మతి కోసమే ‘పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా’ ఎల్లప్పుడూ తన పైకి తను సకల అసమ్మతులను తలెత్తనివ్వనిస్తుంది. -
ధూళి రాకుండా ‘గాలి మేడ’
మనలో చాలామంది తమ ఊహలకు రూపం వచ్చేలా కల్పించుకొని చాలాసార్లు చేతులతో ‘గాల్లో మేడలు’ కడుతుంటారు. నిజంగా అలా గాల్లో మేడలు వెలిస్తే అదో అద్భుతం. అంతలా కాకపోయినా చైనా నేరుగా గాలితోనే మేడ కట్టింది. అవును.. చైనాలోని జినాన్ అనే ప్రాంతంలో ఓ నిర్మాణ స్థలంలో ధూళి, నిర్మాణ సమయంలో వెలువడే శబ్దాలను కట్టడి చేసేందుకు 50 మీటర్ల ఎత్తు, 20,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో గాలితో బుడగలాంటి డోమ్ నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఈమేరకు ఓ వీడియో వైరల్‌గా మారింది.చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ అధికారిక ఫేస్బుక్ పోస్ట్ ద్వారా దీనికి సంబంధించిన అంశాలు పంచుకున్నారు. అందులోని వివరాల ప్రకారం.. 50 మీటర్ల ఎత్తు, 20,000 చదరపు మీటర్ల గాలితో కూడిన డోమ్ నిర్మాణాన్ని చైనా ఆవిష్కరించింది. జినాన్లోని ఒక నిర్మాణ ప్రదేశంలో ఏర్పాటు చేసిన ఈ డోమ్ శబ్ద కాలుష్యం, ధూళి నుంచి చుట్టుపక్కల పర్యావరణాన్ని రక్షిస్తుంది. ప్రధాన కట్టడం పూర్తయ్యాక దాన్ని తొలగిస్తారు. సోషల్ మీడియాలో దీని వీడియో ఒకటి వైరల్‌గా మారడంతో నెటిజర్లు భిన్నంగా స్పందిస్తున్నారు. చాలా మంది యూజర్లు దీన్నో ‘చైనీస్ టెక్నోలాజియా’ అని అన్నారు.🚨 China has built a 50m-tall inflatable dome over a construction site in Jinan to protect the surroundings from dust and noise. pic.twitter.com/CLSrZAWS2g— Indian Tech & Infra (@IndianTechGuide) July 3, 2025ఇదీ చదవండి: టాటా కొత్త ఈవీ తయారీ ప్రారంభం.. ధర ఎంతంటే..‘చైనా ఇలాంటి నిర్మాణాలతో ప్రతిసారీ ప్రజలను ఆశ్చర్యపరుస్తుంది’ అని ఒక యూజర్ రిప్లై ఇచ్చారు. అయితే కొందరు మాత్రం ఈ నిర్మాణంపై ఆందోళన వ్యక్తం చేశారు. అందులో పనిచేసే వారి సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్మాణం కింద కార్మికుల దుస్థితిని ఊహించండంటూ తెలుపుతున్నారు. ఇది అత్యవసర పరిస్థితుల్లో లోపల ఉన్న కార్మికులను ఊపిరాడకుండా చేస్తుందని మరొకరు రాశారు. ఇది భూకంపం లేదా సునామీ కంటే ప్రాణాంతకం కావచ్చని మరొకరు రిప్లై ఇచ్చారు. -
బిడ్డను కంటే రూ.12 లక్షలిస్తాం
బీజింగ్: జననాల రేటు ఏటికేడు పడిపోతుండటంపై చైనాలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి బెంగపట్టుకుంది. ఇదే కొనసాగితే భవిష్యత్తులో దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని భయపడుతోంది. అందుకే, కొత్త పథకంతో ముందుకు వచ్చింది. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ తర్వాత పుట్టే ప్రతి బిడ్డకు నెలకు 3,600 యువాన్లు(సుమారు రూ.42 వేలు) అందిస్తామని ప్రకటించింది.ఆ చిన్నారి తల్లిదండ్రులకు ఇలా మూడేళ్లపాటు మొత్తం రూ.12 లక్షలను చెల్లిస్తామని తెలిపింది. ఇందుకు సంబంధించిన పథకంపై భారీ ఎత్తున ప్రచారం చేస్తోందని బ్లూమ్‌బర్గ్ తెలిపింది. చైనా ప్రభుత్వం దశాబ్దాలపాటు కొనసాగించిన ఒకే సంతానం విధానానికి 2016లో ముగింపు పలికింది. ఆ తర్వాత కూడా దంపతులు ఒకరికి మించి సంతానాన్ని కనేందుకు మొగ్గు చూపక పోవడంతో చైనా ఈ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. -
చైనాతో దోస్తీకి దేశాల ఉబలాటం
అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా దేశాల కూటమిని ‘క్వాడ్’గా పిలుస్తున్నారు. ఈ కూటమి జూలై 1న వాషింగ్టన్ డి.సి.లో సమావేశమై ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేసింది. దీన్ని పరిశీలించినవారికి ‘క్వాడ్’ దాని సుదీర్ఘ పయనంలో మొదటిసారిగా అస్పష్టతకు స్వస్తి పలికి, తన ప్రధాన కర్తవ్యాన్ని వెల్లడించినట్లుగా కనిపించింది. సముద్ర జలాలలో చైనా చర్యలను అది ఈసారి గతంలోకన్నా ఎక్కువగా వేలెత్తి చూపుతూ విమర్శలను గుప్పించింది. ఇతర దేశాలను ఆర్థికంగా లొంగదీసుకునేందుకు అనుసరిస్తున్న ఎత్తుగడలు, ధరలలో కపటత్వం, సరఫరాలకు అవాంతరాలు కల్పించడం, కీలక ఖనిజాల ఉత్పత్తిపై దృష్టి కేంద్రీకరించేందుకు మార్కెటేతర సూత్రాలను ఉపయోగించుకోవడం వంటివాటిని ప్రస్తావిస్తూ చైనాను కడిగేసింది. అదే సమయంలో, ప్రకటనకు ఉపయోగించిన భాషలో దౌత్యపరమైన యుక్తిని ప్రదర్శించింది. తేటతెల్లమైన చైనా తీరు‘క్వాడ్’ సమావేశమైన ప్రతిసారీ బీజింగ్‌పై కత్తులు నూరుతూనే ఉంది. కానీ, ఈ వారంలో జరిగిన సమావేశం తమ లక్ష్య సాధనపై సంకోచాలకు తావు ఇవ్వలేదు. అవి సముద్ర జలాల్లో భద్రత, ఆర్థిక భద్రత, కీలక, ప్రవర్ధమాన టెక్నాలజీలు, మానవతా సహాయంలో సహకారాన్ని పెంపొందించుకోవాలని నిర్ణయించాయి. కానీ దృష్టి అంతా చైనాపైనే ఉండటంతో ఎజెండాలోని అంశాలు మరుగున పడ్డాయి. కానీ, దౌత్యపరంగా చైనాను తీవ్రంగా మందలించడం అరుదైన విషయం కనుక ‘క్వాడ్’ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఐదేళ్ళ విరామం తర్వాత, చైనా భౌగోళిక రాజకీయ యవనికపై తిరిగి తన పాత్రను చేజిక్కించుకునే ప్రయత్నంలో ఉండటం వల్ల అదే పెద్ద అంశంగా మారింది.కోవిడ్–19 మహమ్మారి 2020 ప్రారంభంలో ప్రపంచ దేశాలను అతలాకుతలం చేయడం ప్రారంభించింది. సమాచారాన్ని బయటకు పొక్కనీయని వ్యవస్థల వల్ల ఏర్పడే ప్రమాదాలు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి విధ్వంసకర పర్యవసానాలకు దారితీయగలవో ఆ సందర్భంగా ప్రపంచానికి తెలిసి వచ్చింది. తూర్పు లద్దాఖ్ లోకి చైనా దళాలు చొచ్చుకు రావడంతో భారత్ అప్రమత్తమైంది. భారతీయ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించేందుకు సుముఖంగా ఉన్న, మొండిగా మారిన పొరుగుదేశం నుంచి ఎదురుకాగల ప్రమాదాలను ఇండియా గ్రహించింది. తూర్పు చైనా సముద్రం, దక్షిణ చైనా సముద్రాలలో, తైవాన్ చుట్టుపక్కల జలాలలో చైనా దూకుడు కొనసాగుతూండటంతో చైనాకున్న ప్రాదేశిక, సాగర జలాల ఆకాంక్షలు ఆ ప్రాంతంలోని దేశాలకు తేటతెల్లమయ్యాయి. అభివృద్ధికి ఊతంగా నిలుస్తామనే సాకుతో రుణాలు, పెట్టుబడుల రూపంలో కొన్ని దేశాలలోకి చైనా ప్రవేశించి తర్వాత అక్కడ స్థావరాలు ఏర్పరుచుకుని మాటువేయడం, వనరులను చేజిక్కించుకునే ప్రయత్నం చేయడంతో ప్రపంచంలోని పేద దేశాలు అది మేకవన్నె పులిలా వ్యవహరిస్తోందని తెలుసుకున్నాయి. సాంకేతిక, సైనిక, ఆర్థిక రంగాల్లో చైనా ముందడుగు వేయడంతో అది తనకు ‘సమ–స్థాయి పోటీదారు’గా అవతరించిందని అమెరికా ఉలిక్కిపడింది. 2025తో మారిన పరిస్థితిట్రంప్, బైడెన్లతోపాటు కొందరు ఇండో–పసిఫిక్ నాయకులు చైనాకు ముకుతాడు వేయక తప్పదని నిర్ణయానికి వచ్చారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రాబల్యానికి అడ్డుకట్ట వేసేందుకు అమెరికా కొత్త కూటమిలను నిర్మించడం మొదలెట్టింది. అమెరికా వ్యూహాత్మక, రక్షణ అవసరాలను వ్యాపార అవకాశాలతో ముడివేసింది. అంతవరకు నిర్లక్ష్యం చేస్తూ వచ్చిన పసిఫిక్ దీవుల వంటి ప్రాంతాలకు అది తన అభివృద్ధి, వాతావరణ, భద్రతా అడుగుజాడలను విస్తరింపజేసింది. సరిగ్గా అదే సమయంలో, చైనా ఆంతరంగిక బలహీనతలు మరింత ప్రస్ఫుటమయ్యాయి. కోవిడ్–19 సందర్భంగా, బీజింగ్ చేపట్టిన అణచివేత చర్యలు ఎదురుతన్నాయి. స్థిరాస్తులు, మౌలిక సదుపాయాల రంగాలు సృష్టించిన విజృంభణ గాలి బుడగలా పేలి సంక్షోభానికి కారణమైంది. మితిమీరిన ఉత్పత్తితో పోల్చి చూస్తే దేశీయ వినిమయం సన్నగిల్లింది. సాపేక్షంగా చూస్తే ఈ ప్రాంతంలో దానికి మిత్రదేశాలు ఏవీ లేనట్లు కనిపించింది. చైనాతో ఎడమొహం పెడమొహంగా వ్యవహరించే అంతర్జాతీయ ధోరణి 2020 నుంచి 2024 వరకు కొనసాగింది. కానీ చైనాతో చెలిమి చేయాలని మళ్ళీ ప్రతి దేశం కోరుకుంటున్న స్థితికి 2025 అంకురార్పణ చేసినట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే, ఐరోపా–అట్లాంటిక్ మధ్య, ఇండో–పసిఫిక్ మధ్య సంబంధాలను పటిష్టపరిచే ప్రయత్నం చతికిలపడింది. రష్యా–చైనా మరింత కలసిగట్టుగా పనిచేస్తున్నాయి. ‘నాటో’, ఇండో–పసిఫిక్ మిత్ర దేశాల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించేందుకు అమెరికా చేస్తున్నది ఏమీ లేదు. ఎవరి రక్షణను వారు సమాంతరంగా పెంపొందించుకోవాల్సిందిగా అది రెండింటిపైన ఒత్తిడి తెస్తోంది. అందుకే ద హేగ్ ‘నాటో’ శిఖరాగ్ర సదస్సుకు దూరంగా ఉండాలని ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, జపాన్ నిర్ణయించుకున్నాయి. చైనాతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని ఐరోపా దేశాలు సమష్టిగానూ, విడివిడిగానూ కూడా కోరుకుంటున్నాయి. ఎప్పుడు ఎలా వ్యవహరిస్తుందో తెలియని అమెరికా వైపు మొగ్గేకన్నా, చైనాతో సన్నిహిత కార్యనిర్వాహక సంబంధాలను నెలకొల్పుకోవడమే మేలని ఐరోపాలోని అనేక మందికి అనిపిస్తోంది. సాక్షాత్తూ అమెరికాయే చైనాతో ఒప్పందం కుదుర్చుకోవాలని కోరుకుంటున్నట్లుగా సంకేతాలు పంపిస్తోంది. ట్రంప్ ఒక అగ్రస్థాయి వ్యాపార ప్రతినిధి బృందంతో చైనాను సందర్శించే ఆలోచనలో ఉన్నారని వార్తలు వెలువడుతున్నాయి.పొరుగు దేశాలూ అదే బాటలో...భద్రతాపరంగా చైనాతో జపాన్‌కు ప్రాథమికంగానే వైరుధ్యం ఉంది. దానికి తోడు టోక్యోకు పరిస్థితులను ట్రంప్ మరింత విషమంగా మార్చారు. అమెరికాతో మంత్రిత్వ స్థాయి చర్చలను జపాన్ రద్దు చేసుకుంది. మోటారు వాహనాల సుంకాలపై అది అమెరికాతో బాహాటంగానే తగవు పడుతోంది. దక్షిణ కొరియాలో ఇంతకుముందరి ప్రభుత్వం అమెరికాకు అనుకూలంగా ఉండేది. ప్రస్తుత నూతన ప్రభుత్వం విదేశాంగ విధానంలో మరింత సమతూకంతో కూడిన దృక్పథాన్ని ప్రదర్శిస్తోంది. ‘ఆకస్’ ఒడంబడికను సమీక్షించాలనే పెంటగాన్ అభిప్రాయం ఆస్ట్రేలియాను అస్థిమితానికి గురి చేసింది. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ను ట్రంప్ ఇంతవరకూ కలుసుకోలేదు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ సైనిక ప్రతిస్పందన వెనుకనున్న శక్తి చైనాయే అయినప్పటికీ, చైనాతో సరిహద్దు సమస్యలు ఉన్నప్పటికీ, చైనాతో సయోధ్యకు వెనుకాడబోమనే సంకేతాలను భారత్ బహిరంగంగానే పంపుతోంది. చైనాతో తేల్చుకోవాల్సిన అంశాలు భారత్‌కు చాలానే ఉన్నాయి. వస్తూత్పత్తి రంగంలో చైనా ప్రాబల్యం వల్ల వాణిజ్యపరంగా చాలా అసమతౌల్యం ఉంది. దక్షిణాసియాలో భారతదేశానికి వ్యతిరేకంగా పావులు కదపడంలో బీజింగ్ బిజీగా ఉంది. కానీ తాను మధ్యవర్తిత్వం నెరపడం వల్లనే భారత్–పాక్ ఇటీవల యుద్ధాన్ని విరమించాయనే ట్రంప్ అసత్య వచనాలతో అమెరికాతో న్యూఢిల్లీకి రాజకీయపరమైన సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. వాణిజ్యంపై చర్చలు కూడా పూర్తిగా ఒక కొలిక్కి రాలేదు. ఇవన్నీ చైనాకు సంతోషం కలిగించేవే. గత నాలుగేళ్ళలో, చైనా కుప్పకూలేంత స్థితికి వెళ్ళలేదు. దాన్ని ఏకాకినీ చేయలేకపోయారు. అలా అని చైనా ఇపుడు ప్రపంచంపై పెత్తనం చలాయించగల స్థితిలోనూ లేదు. కానీ, బీజింగ్‌కు అనుకూలంగా పరిస్థితులు పరిణమిస్తున్నాయి. దౌత్యపరంగా ఉన్న ఈ ప్రతికూల వాతావరణాన్ని లెక్కలోకి తీసుకుంటూ విశ్వసనీయమైన, పటిష్టమైన ఎజెండాను రూపొందించే సవాల్‌ను ‘క్వాడ్’ తదుపరి అధ్యక్ష హోదాలోకి వచ్చే భారత్ ఎదుర్కోవాల్సి ఉంటుంది.-వ్యాసకర్త జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)-ప్రశాంత్ ఝా -
మీరు అలా ఎలా అంటారు?: భారత్ వైఖరిపై చైనా
బీజింగ్: ప్రస్తుతం టిబెటన్ల ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా వారసుడి ఎంపికపై చర్చ నడుస్తోంది. తమ అదుపులో ఉండే వ్యక్తిని నియమించుకోవాలని చైనా ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. అయితే 15వ దలైలామా ఎంపిక ప్రక్రియ పూర్తిగా ప్రస్తుత దలైలామా చేతుల్లోనే ఉందని, ఆయన వారసుడిని నిర్ణయించే హక్కు ఆయనకు మాత్రమే ఉందని భారత్ స్పష్టం చేసింది. దీనిపై చైనా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇందులో టిబెటన్ల జోక్యాన్ని నివారించేందుకు భారత్ చొరవ చూపితే బాగుంటుందని పేర్కొంది. అత్యంత గౌరవప్రదమైన ఈ వ్యవహారంలో టిబెటన్ల జోక్యాన్ని పక్కకు పెట్టేందుకు సహకరించాలని భారత్‌కు విన్నవించింది చైనా. ఇక ప్రస్తుత 14వ దలైలామా వ్యతిరేక వేర్పాటువాద స్వభావాన్ని భారత్ స్పష్టంగా తెలుసుకుని మాట్లాడితే మంచిదని, టిబెట్ సంబంధిత అంశాలపై తమ నిబద్ధతలను గౌరవించాలని పేర్కొంది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. భారత కేంద్రమంత్రి కిరణ్ రిజుజు చేసిన వ్యాఖ్యలపై అడిగిన ప్రశ్నలకు పై విధంగా సమాధానమిచ్చారు.ఇదీ చదవండి: ఆ హక్కు ఆయనది మాత్రమే.. దలైలామా వారసుడి ఎంపికపై భారత్ -
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్‌కు చైనా, తుర్కియే సాయం
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్‌కు దాని మిత్రదేశం చైనా సహకరించిందా? ఇండియాకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు చేరవేసిందా? అంటే అవుననే చెబుతున్నారు భారత డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్.సింగ్. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్‌పై భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది. మే 7 నుంచి 10వ తేదీ దాకా నాలుగు రోజులపాటు ఆ ఆపరేషన్ కొనసాగింది. భారత సైన్యం దాడిలో పాకిస్తాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లోని ఉగ్రవాద శిబిరాలు, లాండ్ప్యాడ్లు ధ్వంసమయ్యాయి. అయితే, ఆ సమయంలో పాకిస్తాన్‌కు చైనా సహకరించిందని, ఇండియన్ ఆర్మీ కదలికలకు సంబంధించి రియల్ టైమ్ సమాచారం చేరవేసిందని రాహుల్ ఆర్.సింగ్ తెలియజేశారు. తుర్కియే సైతం పాక్‌కు అండదండలు అందించిందని, కొన్ని రకాల ఆయుధాలు సరఫరా చేసిందని పేర్కొన్నారు. ఢిల్లీలో శుక్రవారం ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ‘నూతన తరంలో సైనిక సాంకేతికతలు’ అనే అంశంపై ఆయన మాట్లాడారు. భా రత సైన్యం దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న పాకి స్తాన్‌కు చైనా, తుర్కియేలు చేతనైనంత సాయం చేశాయని పేర్కొన్నారు. ఆ మూడు దేశాల కుట్రను తాము ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పారు. తెరపైన కనిపించింది పాకిస్తాన్ కాగా, తెరవెనుక చైనా, తుర్కియే ఉన్నాయని వెల్లడించారు. #WATCH | Delhi: At the event 'New Age Military Technologies' organised by FICCI, Deputy Chief of Army Staff (Capability Development & Sustenance), Lt Gen Rahul R Singh says, "Air defence and how it panned out during the entire operation was important... This time, our population… pic.twitter.com/uF2uXo7yJm— ANI (@ANI) July 4, 2025అరువు తెచ్చుకున్న కత్తి చైనా తన ఆయుధాల సామర్థ్యం పరీక్షించుకోవడానికి పాకిస్తాన్‌ను ప్రయోగశాలగా వాడుకుంటోందని రాహుల్ ఆర్.సింగ్ స్పష్టంచేశారు. ఆ ఆయుధాలను చైనా గడ్డపై నుంచి ఇతర దేశాలపైకి ప్రయోగిస్తోందన్నారు. పాక్‌కు చైనా సహకరించడంలో ఆశ్చర్యం ఏమీ లేదన్నారు. గత ఐదేళ్ల గణాంకాలు చూస్తే పాకిస్తాన్‌కు 81 శాతం మిలటరీ హార్డ్‌వేర్ చైనా నుంచే వచ్చినట్లు స్పష్టమవుతోందని వెల్లడించారు. పాక్ భూభాగం చైనాకు లైవ్ ల్యాబ్‌గా మారినట్లు తేల్చిచెప్పారు. యుద్ధక్షేత్రంలోకి నేరుగా అడుగుపెట్టకుండా ఇండియాపైకి పాకిస్తాన్‌ను ఉసిగొల్పడమే డ్రాగన్ వ్యూహమని రాహుల్ ఆర్.సింగ్ తెలిపారు. ‘అరువు తెచ్చుకున్న శక్తితో శత్రువును చంపడం’ చైనా ప్రాచీన యుద్ధతంత్రంలో భాగమని గుర్తుచేశారు. సరిహద్దుల్లో ఘర్షణ పడడం కంటే పాకిస్తాన్‌ను ముందుపెట్టి భారత్‌కు ఇబ్బందులు సృష్టించడం చైనా ధ్యేయంగా కనిపిస్తోందని చెప్పారు. ఇదిలా ఉండగా, భారత్–పాక్ మధ్య కాల్పుల విరమణ ప్రక్రియ అమల్లోకి వచ్చిన కొద్దిరోజులకే తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో సమావేశమైన సంగతి తెలిసిందే. ఇరుదేశాల మధ్య పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని అప్పట్లో వారు నిర్ణయించుకున్నారు. తుర్కియే అందిస్తున్న సహకారానికి షెహబాజ్ షరీఫ్ కృతజ్ఞతలు తెలియజేశారు. -
కామ్రేడ్ కథ ముగిసిందా?
-
ఏంటీ కిరికిరి?..అమెరికా-పాక్‌ల మధ్య అసలేం జరుగుతోంది?
అమెరికా పర్యటనకు ఇటీవలే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ వెళ్లి వచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో డిన్నర్ పార్టీలో సుదీర్ఘంగా మాట్లాడారు. మరి ఇప్పుడు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధూ అమెరికా పర్యటనలో ఉన్నారు. పాక్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమెరికాకు వెళ్లడం దశాబ్దం తర్వాత ఇదే తొలిసారి. ఇక్కడ పాకిస్తాన్ ప్రధాని షెహబాబ్ షరీఫ్ మాత్రం గుమ్మనంగా ఉన్నారు. ఇది పాకిస్తాన్ వ్యూహాత్మకమ చర్యా లేక ప్రధానిని పక్కన పెట్టేశారా? అనేది ప్రస్తుతానికి ప్రశ్నగానే ఉంది. భారత్ చేపట్టిన ఆపరేషన్సింధూర్ తర్వాత పాక్ ప్రధాని మనకు సోయలో కూడా కనిపించడం లేదు. పాక్‌లో ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అనంతరం ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట ఎక్కడా వినిపించకపోవడం ఒకటైతే, పాక్‌కు చెందిన రక్షణ వ్యవస్థలోని కీలక అధికారులు వాషింగ్టన్లో దర్శనమిస్తూనే ఉన్నారు. భారత్ కొట్టిన దెబ్బతో పాక్ ఆర్మీ ఎంత పేలవంగా ఉందో తేలిపోవడంతో ఇప్పుడు దానిపై వారు దృష్టి సారించినట్లు వార్తలు వస్తున్నప్పటికీ అమెరికా-పాకిస్తాన్ల మధ్య ఏదో జరుగుతుందనే అనుమానం మాత్రం ప్రతీ ఒక్కరికీ ఏదో మూలన తొలుస్తూనే ఉంది. భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనే చర్యలకు అమెరికాతో కలిసి కుట్రలు చేస్తుందా అనేది మరొక కోణంలో చూడాల్సి వస్తుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్(ఫైల్‌ఫోటో)చైనాను దెబ్బతీయాలన్నేదే లక్ష్యమా?పాక్‌కు భారత్ శత్రువు అయితే, అమెరికాకు చైనా శత్రువు అనేది కాదనలేని సత్యం. మరి భారత్, చైనాల సరిహద్దుల్లో ఉన్న దేశం పాకిస్తాన్. మరి చైనాను దెబ్బతీయాలన్నా కూడా అమెరికాకు పాక్ సాయం అవసరం. దీన్ని దృష్టిలో పెట్టుకునే పాకిస్తాన్ ఆర్మీనే పదే పదే యూఎస్‌కు ట్రంప్ పిలుపించుకుంటున్నారా అనే అనుమానం కలుగుతోంది. ఆ క్రమంలోనే పాకిస్తాన్‌ను కాకాపట్టి.. చైనా దెబ్బకొట్టాలనే ఉద్దేశంలో ట్రంప్ ఉన్నారా? అనేది ప్రధానంగా అనుమానించాల్సి వస్తోంది. ప్రజాస్వామ్య దేశంలో ప్రధానికి ఉండే విలువ ఏమిటో అందరికీ తెలిసిందే. మరి అటువంటింది పాక్ ప్రధానిని పక్కన పెట్టి మరీ రక్షణ రంగంలోని కీలక అధికారులతో అమెరికా సమావేశాలేంటో ఎవరికీ అర్థం కావడం లేదు.పునః నిర్మాణంలో ఉగ్రస్థావరాలుఇటీవల సమకూరిన నిధులతో పాక్‌లోని ఉగ్రస్థావరాలను, ఆర్మీ క్యాంపులను మరమ్మత్తులు చేసే పనిలో పడ్డ పాక్.. ఇప్పడు అమెరికా యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి సిద్ధమైందనేది ప్రముఖంగా వినిపిస్తోంది. అమెరికాకు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాలకు పాకిస్తాన్ కొనుగోలుకు ఇప్పటికే పాక్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక్కడ పాక్‌కు అమెరికా ఎంత సపోర్ట్‌గా ఉందనేది తేటతెల్లమవుతుండగా, భారత్‌తో మాత్రం అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తోంది అగ్రరాజ్యం. కొన్ని రోజుల క్రితం కెనడా పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీని ట్రంప్ ఆహ్వానించినా, అందుకు మోదీ వెళ్లలేదు. ఇది స్వయంగా మోదీ చెప్పినమాట. అమెరికా కుతంత్రాలు ఇప్పటికే ప్రధాని మోదీకి అర్ధం కావడంతోనే ట్రంప్ డిన్నర్ ఆహ్వానాన్ని మోదీ సున్నితంగా తిరస్కరించారు. ఇరుదేశాల మధ్య ఏదో కిరికిరి..?ఇక చైనా కూడా పాక్‌కు అండగానే ఉంటుంది. ఇటీవల భారత్‌తో జరిగిన యుద్ధంలో కూడా పాక్‌కే సపోర్ట్ చేసింది చైనా. అదే సమయంలో ‘చైనా యుద్ధ సామాగ్రినే’ పాక్ ఎక్కువగా కొనుగోలు చేస్తూ వస్తోంది. ఇప్పుడు అమెరికా వైపు చూస్తోంది. అంటే ఏదో కిరికిరి ఉందనేది కామన్ మ్యాన్‌కు అర్థం అవుతున్న విషయం. విలువకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వని పాకిస్తాన్.. చైనాను పక్కన పెట్టడం కూడా పెద్ద పనేం కాదు. పెద్దన్నగా చెప్పుకునే అమెరికా అండదండలు పాకిస్తాన్‌కు ఉండటంతో తన పాత మిత్రుడు చైనాను దూరం చేసుకోవడానికి కూడా వెనుకాడని దేశం అది. అసలు అమెరికా వ్యూహం ఏమిటి?, పదే పదే వాషింగ్టన్లో పాక్ ఆర్మీ అధికారుల దర్శనం ఏమిటి?, అమెరికా-పాక్‌ల మధ్య ఏం జరుగుతోంది? అనేది ఇప్పుడు చర్చకు దారి తీసింది. -
ఆ హక్కు ఆయనది మాత్రమే.. దలైలామా వారసుడి ఎంపికపై భారత్ స్పందన
దలైలామా 90వ పుట్టినరోజు వేడుకలకు ధర్మశాల ముస్తాబయ్యింది. మెక్లియోడ్గంజ్లోని ప్రధాన ఆలయమైన సుగ్లగ్ఖాంగ్లో వేడుకలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు భారత ప్రభుత్వం తరఫున హాజరు కాబోతున్నారు. తాజాగా.. దలైలామా వారసత్వం ఎంపికపై చర్చ నడుస్తుండడంతో ఆయన స్పందించారు. న్యూఢిల్లీ: తన వారసుడి ఎంపిక ప్రక్రియ పూర్తిగా ప్రస్తుత దలైలామా చేతుల్లోనే ఉంటుందని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు గురువారం ప్రకటించారు. టిబెట్‌ను గుప్పిట పెట్టుకోవడానికి తమ అదుపులో ఉండే వ్యక్తిని దలైలామా వారసుడిగా ఎంపిక చేయాలని చైనా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దలైలామాదే అంతిమ నిర్ణయమని కిరణ్ రిజిజు అన్నారు. ‘‘15వ దలైలామా ఎంపిక ప్రక్రియ పూర్తిగా ప్రస్తుత దలైలామా చేతుల్లోనే ఉంటుంది. దలైలామా వారసుడిని నిర్ణయించే అధికారం టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడు తప్ప మరెవరికీ లేదు. దలైలామా స్థానం టిబెటన్లకు మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అనుచరులందరికీ అత్యంత ముఖ్యమైనది. తన వారసుడిని నిర్ణయించే హక్కు దలైలామాకే ఉంది’’ అని కిరణ్ రిజిజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.కొత్త దలైలామాను తామే ఎన్నుకుంటామంటూ చైనా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై 14వ దలైలామా టెన్జిన్ గ్యాట్సో బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దలైలామా ఎంపిక 600 సంవత్సరాలుగా బౌద్ధ సంప్రదాయాల ఆధారంగానే జరుగుతోందని, తాను ఏర్పాటు చేసిన గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్ తదుపరి దలైలామా ఎంపిక ప్రక్రియను చేపడుతుందని, ఇందులో ఎవరి జోక్యం ఉండబోదని కుండబద్ధలు కొట్టారు. దలైలామా తన వారసుడు చైనా వెలుపల జన్మించాలని, బీజింగ్ నుంచి ఎంపిక చేసిన వ్యక్తిని ఎవరినైనా తిరస్కరించాలని ఆయన సూచించారు. అయితే చైనా 14వ దలైలామా ప్రకటనపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. టిబెట్ చైనాకి చెందిన భూమిగా పేర్కొంటూ.. దలైలామా ఎంపికపై తమకే హక్కు ఉందని డ్రాగన్ వాదిస్తోంది. దలైలామా, పాంచెన్ లామా, ఇతర ప్రముఖ బౌద్ధ గురువుల ఎంపిక తప్పనిసరిగా 'గోల్డెన్ అర్న్' పద్ధతిలో.. అదీ చైనా ప్రభుత్వ ఆమోదంతోనే జరగాలి అని చైనా విదేశాంగ ప్రతినిధి మావో నింగ్ తెలిపారు. ఈ పద్ధతి 18వ శతాబ్దంలో చింగ్ వంశాధిపతి ప్రవేశపెట్టిన విధానమని పేర్కొన్న ఆమె.. చైనా ప్రభుత్వం మత స్వేచ్ఛకు కట్టుబడి ఉందని, అలాగని మత సంబంధిత వ్యవహారాలపై నియంత్రణలు, బౌద్ధ గురువుల నియామకాల కోసం ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి అని ఆమె గుర్తు చేశారు.దలైలామా (Dalai Lama) వారసుడి (successor) ఎంపికను బీజింగ్ ఆమోదించాలన్న చైనా (China) డిమాండ్‌పై అమెరికా ఇప్పటికే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇందుకోసం ఆ దేశ పార్లమెంట్లో ఓ ప్రత్యేక చట్టాన్ని కూడా చేసింది. వారసత్వంలో జోక్యం చేసుకోవడం మానేయాలని, మత స్వేచ్ఛను గౌరవించాలని చైనాను కోరుతూనే ఉంటుందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు తాజాగా తెలిపారు. ఇప్పుడు భారత్ కూడా ఆ జాబితాలో చేరింది. 14వ దలైలామా ఎంపిక తర్వాత.. టిబెటన్ సంప్రదాయంలో.. ఒక సీనియర్ బౌద్ధ సన్యాసి ఆత్మ అతని మరణం తర్వాత ఒక చిన్నారి శరీరంలోకి ప్రవేశించి.. పునర్జన్మ పొందుతుందని నమ్ముతారు. జూలై 6, 1935న టిబెట్ క్వింఘై ప్రావిన్స్‌లోని ఒక రైతు కుటుంబంలో జన్మించిన టెన్జిన్ గ్యాట్సోను.. రెండేళ్ల వయసులో 14వ దలైలామా గుర్తించారు. అయితే కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ నేతృత్వంలోని చైనా దళాలు టిబెట్‌ను ఆక్రమించుకున్నాయి. 1959లో టిబెట్ ధైవభూమి లాసాలో తిరుగుబాటు విఫలం తర్వాత వెయ్యి మందికిపైగా బౌద్ధ సన్యాసులతో దలైలామా భారత్‌కు శరణార్ధిగా వచ్చి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. -
జిన్‌పింగ్ శకానికి తెర?
చైనాలో షీ జిన్‌పింగ్ శకం ముగిసిందా? పలువురు అధ్యక్షులకు పట్టిన గతే ఆయనకు కూడా పట్టనుందా? నెల రోజులుగా డ్రాగన్ దేశంలో జరుగుతూ వస్తున్న పలు అనూహ్య పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. మే 21 నుంచి జూన్ 5 దాకా జిన్‌పింగ్ రెండు వారాల పాటు ఆచూకీ లేకుండాపోయారు. అధికారిక కార్యక్రమాలు వేటిలోనూ పాల్గొనలేదు. కనీసం బహిరంగ వేదికలపై కూడా కన్పించలేదు. ఆయన చైనా పగ్గాలు చేపట్టిన గత 12 ఏళ్లలో ఇలా జరగడం ఇదే తొలిసారి. దానికి తోడు అధ్యక్షుని గురించిన వార్తలను ప్రతి రోజూ ఫ్రంట్ పేజీల్లో విధిగా ప్రముఖంగా ప్రచురించే చైనా అధికార మీడియాలోఆ రెండు వారాల పాటు ఎక్కడా కనీసం ఆయన ప్రస్తావన కూడా రాలేదు! అధ్యక్షుని గైర్హాజరీపై ప్రపంచమంతా జోరుగా చర్చ జరిగినా చైనా ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. అధికారిక మీడియాలోనూ ఖండన వంటివి రాలేదు. చివరికి జూన్ 5 తర్వాత జిన్‌పింగ్ తిరిగి దర్శనమిచ్చినా ఆయనలో ముందున్న కళాకాంతులేవీ కన్పించలేదు. బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకòÙంకోతో జరిగిన భేటీలో బాగా అనాసక్తంగా దర్శనమిచ్చారు. ‘‘జిన్‌పింగ్ బాగా నీరసించి, ఆరోగ్యంగా కన్పించారు’’ అని భేటీ తర్వాత బెలారస్ అధ్యక్షుని తరఫున వెలువడ్డ అధికారిక మీడియా ప్రకటన పేర్కొంది. దీనికి తోడు జిన్‌పింగ్‌కు భారీ స్థాయిలో ఉండే వ్యక్తిగత భద్రత కూడా కొద్దిరోజులుగా బాగా తగ్గిపోయింది. ఆయన తండ్రి పేరిట ఏర్పాటు చేసిన మ్యూజియానికి అధికారిక హోదాను తొలగించారు. అంతేకాదు, ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జిన్‌పింగ్ ఫోన్లో సంభాషించారు. దాన్ని గురించిన చైనా అధికార టీవీ సంస్థ ప్రసారం చేసిన వార్తా కథనంలో జిన్‌పింగ్‌ను ఎలాంటి హోదా లేకుండా సంబోధించడం విశేషం! అతి శక్తిమంతమైన డ్రాగన్ దేశాన్ని ఇనుప పిడికిలితో శాసిస్తూ వస్తున్న జిన్‌పింగ్‌కు పాలనకు నూకలు చెల్లాయనేందుకు ఇవన్నీ స్పష్టమైన సంకేతాలేనంటూ జోరుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పాలక కమ్యూనిస్టు పారీ్టలో నెలకొన్న తీవ్ర అంతర్గత విభేదాలు అంతిమంగా జిన్‌పింగ్‌ను తప్పించే దిశగా సాగుతున్నాయంటూ ప్రవాస చైనా మేధావులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. జిన్‌పింగ్‌కు ముందున్న అధ్యక్షుడు హూ జింటావో కూడా అధికారాంతానికి ముందు అచ్చం ఇలాగే కొతంకాలం పాటు అనూహ్యంగా కనబడకుండా పోవడం విశేషం. ఆ తర్వాత జిన్‌పింగ్ పగ్గాలు చేపట్టారు. అనతికాలంలోనే పార్టీలోని తన విరోధులు, వ్యతిరేకుల ఆట కట్టించి అధికారాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఇప్పుడు జిన్‌పింగ్‌కు కూడా అదే గతే పడుతోందంటూ ఆయన వ్యతిరేకులు సంబరపడిపోతున్నారు. నిజానికి జిన్‌పింగ్‌పై తిరుగుబాటుకు పథక రచన చేసింది, నిశ్శబ్దంగా తెర వెనక పావులు కదిపింది 82 ఏళ్ల జింటావోనే అని కూడా చెబుతున్నారు. ఇవేమీ నిజం కాదని, అధ్యక్షుడు తీవ్ర అనారోగ్యం పాలై చికిత్స పొందుతున్నారని మరో వాదన కూడా వినిపిస్తోంది. మొత్తానికి ఈ ఉదంతం ప్రస్తుతం అంతర్జాతీయంగా పెను కలకలం రేపుతోంది. బ్రెజిల్‌లోని రియో డిజనిరోలో శనివారం నుంచి జరగనున్న 17వ బ్రిక్స్ సదస్సుకు కూడా జిన్‌పింగ్ హాజరు కావడం లేదు. దీన్ని చైనా అధికారికంగా ధ్రువీకరించింది. మూడు రోజుల సదస్సుకు ఆయన బదులుగా ప్రధాని లీ కియాంగ్ భేటీలో పాల్గొంటారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ బుధవారం మీడియాకు వెల్లడించారు. దీనికి కారణం ఏమిటన్న ప్రశ్నలకు ఆమె సమాధానం దాటవేశారు. బ్రిక్స్ సదస్సుకు జిన్‌పింగ్ డుమ్మా కొడుతుండటం గత 12 ఏళ్లలో ఇదే తొలిసారి! ఈ పరిణామం ఆయన భవితవ్యంపై అనుమానాలను మరింతగా పెంచుతోంది. జాంగ్ హవా! అధ్యక్షుడు జిన్‌పింగ్ అధికార కమ్యూనిస్టు పార్టీకి ప్రధాన కార్యదర్శి మాత్రమే గాక సర్వశక్తిమంతమైన సెంట్రల్ మిలిటరీ కమిషన్ (సీఎంసీ)కి చైర్మన్ కూడా. అయితే ప్రస్తుతం చైనాలో అధికార వ్యవహారాలన్నీ సీఎంసీ వైస్ చైర్మన్ జనరల్ జాంగ్ యూక్సియా కనుసన్నల్లో నడుస్తున్నాయని చెబుతున్నారు. జిన్‌పింగ్ చైనా చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో వరుసగా మూడోసారి అధ్యక్ష పదవి దక్కించుకునేందుకు సహకరించిన వారిలో జాంగ్ ముఖ్యుడు కావడం విశేషం! శక్తిమంతమైన 24 మందితో కూడిన కమ్యూనిస్టు పార్టీ పొలిట్‌బ్యూరోలో ఆయన సభ్యుడు. అంతేగాక పారీ్టలోని సీనియర్ సభ్యుల్లో అత్యధికులు ప్రస్తుతం జాంగ్‌కు దన్నుగా నిలిచినట్టు వార్తలొస్తున్నాయి. మాజీ అధ్యక్షుడు జింటావో అనుయాయులైన వారంతా జిన్‌పింగ్‌ను తొలినుంచీ లోలోపల వ్యతిరేకిస్తూ వస్తున్న వారేనని సమాచారం. నిజానికి సైనిక, ఆర్థిక తదితర కీలక వ్యవహారాల్లో కొన్నాళ్లుగా జిన్‌పింగ్ మాట సాగడం లేదని చెబుతున్నారు. అంతేగాక ఆయన అనుయాయులైన డజన్ల కొద్దీ సైనిక జనరళ్లు కొద్ది రోజులుగా అనూహ్యంగా మాయమవుతున్నారు. మరికొందరికి ఉన్నట్టుండి ఉద్వాసన పలికారు.వారసుడు వాంగ్! చైనా చైనా కమ్యూనిస్టు పార్టీ సారథిగా ఇటీవలే నియమితుడైన వాంగ్‌యాంగ్ త్వరలో జిన్‌పింగ్ స్థానంలో అధ్యక్షునిగా పగ్గాలు చేపడతారని వార్తలొస్తున్నాయి. టెక్నోక్రాట్ అయిన వాంగ్‌కు మృదు స్వభావిగా, మార్కెట్ శక్తుల అనుకూలునిగా పేరుంది. అందుకే సంస్కరణవాది అయిన నాయకునిగా కమ్యూనిస్టు పార్టీ ఆయనను దేశ నాయకత్వ బాధ్యతలకు సిద్ధం చేస్తోందని అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బోయింగ్ విమానంలో కుదుపులు : ప్రయాణికులు హడల్, కడసారి సందేశాలు
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర ఎయిరిండియా విమాన ప్రమాదం ప్రపంచ వ్యాప్తంగా విమాన ప్రయాణీకులను పీడకలలా వెంటాడుతోంది. దీంతో విమానంలో చీమ చిటుక్కుమంటే చాలు ప్రాణభయంతో ఉలిక్కి పడుతున్నారు. తాజాగా జపాన్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737 విమానంలో ఏర్పడిన సాంకేతిక లోపంతో ప్రయాణీకులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆ తరువాత ఏం చేశారో తెలుసా? జూన్ 30న షాంఘై పుడాంగ్ విమానాశ్రయం - టోక్యో నరిటా విమానాశ్రయానికి బయలుదేరిన విమానంలో ఏం జరిగిందో పదండి తెలుసుకుందాం.సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం జపాన్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737 విమానం 36వేల అడుగుల ఎత్తులో శరవేగంగా దూసుకుపోతోంది. 191 మంది ప్రయాణికులతో ఈ విమానం చైనాలోని షాంఘై నుండి జపాన్ రాజధాని నగరం టోక్యోకు వెళుతోంది. సీట్లలో అలా కూర్చుని, సీట్ బెల్ట్ తీసి అలా రిలాక్స్ అవుతున్నారో లేదో ఒక్కసారిగా కలకలం రేగింది. విమానం యాంత్రిక సమస్యను ఎదుర్కొంది. ఫలితంగా 10 నిమిషాల్లోపు దాదాపు 36,000 అడుగుల నుండి 10,500 అడుగుల కంటే తక్కువ ఎత్తుకు దిగిపోయింది విమానం. క్యాబిన్లో ఒత్తిడి తగ్గడంతో, ఫ్లైట్ అటెండెంట్స్ మాస్క్‌లు ధరించాలనే సూచనలు అందించారు. ఆక్సిజన్ మాస్క్‌లు ధరించిన ప్రయాణికుల వణికిపోయారు. విమానం కూలిపోతోందనే భయంతో హడలిపోయారు. నిద్రలో ఉన్న ఒక్క కుదుపుతో మేల్కొన్నారు. మరికొందరు ప్రయాణికులు వీడ్కోలు సందేశాలు రాయడం మొదలు పెట్టారు. బ్యాంక్ పిన్లు ,బీమా సమాచారం వంటి వ్యక్తిగత వివరాలతో ప్రియమైనవారికి సందేశాలు పంపడం ప్రారంభించారు.A #JapanAirlines #flight from #Shanghai to #Tokyo made an emergency landing at Kansai Airport last night after a cabin depressurization alert. The #Boeing 737-800, carrying 191 people, landed safely. No injuries reported. #China #Japan pic.twitter.com/wCneZ3nkk0— Shanghai Daily (@shanghaidaily) July 1, 2025"> మరోవైపు ఈ పరిణామంతో పైలట్ అత్యవసర పరిస్థితిని ప్రకటించి విమానాన్ని ఒసాకాలోని కాన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. పైలట్ చాకచక్యంగా విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రయాణీకులంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా గత నెలలో, అహ్మదాబాద్-లండన్ మార్గంలో బోయింగ్ విమానం జరిగిన వినాశకరమైన ప్రమాదంలో 275 మంది మరణించారు. అప్పటి నుండి, బోయింగ్ విమానాలతో సంబంధం ఉన్న అనేక ప్రమాదాలు, తయారీదారు భద్రతా వ్యవస్థపై అనేక అనుమానాలు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. -
చైనా కుతంత్రం.. దలైలామా సంచలన ప్రకటన
టిబెటన్ ఆధ్మాత్మిక గురువు దలైలామా(Dalai Lama) సంచలన ప్రకటన చేశారు. తన తదనంతరమూ ‘దలైలామా’ పదవీ సంప్రదాయం మనుగడలో కొనసాగుతుందని తెలిపారాయన. మరణానంతరం కూడా దలైలామా పదవి కొనసాగుతుందని.. ఈ ఎంపిక ప్రక్రియలో చైనా ప్రమేయం ఎట్టిపరిస్థితుల్లో ఉండబోదని కుండబద్ధలు కొట్టారాయన. దలైలామా పదవి 600 సంవత్సరాలుగా కొనసాగుతున్న బౌద్ధ సంప్రదాయం. తదుపరి దలైలామా ఎంపిక కోసం చైనా కుతంత్రాలు చేస్తోంది. అయితే తన మరణానంతరం బౌద్ధ మతాధిపతిని ఎంచుకునే బాధ్యతను గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్(Gaden Phodrang Trust) అనే సంస్థకు ఆయన అప్పగించారు. ఈ ట్రస్ట్‌ను దలైలామానే 2015లో స్థాపించారు. ఇది భవిష్యత్ దలైలామాను గుర్తించే అధికారిక సంస్థగా వ్యవహరిస్తుందని బుధవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారాయన. అంతేకాదు.. తన వారసత్వం కొనసాగాలని 14 ఏళ్లుగా టిబెట్, హిమాలయ, మంగోలియా, రష్యా, చైనా మద్దతుదారుల నుంచి అభ్యర్థనలు వస్తూనే ఉన్నాయని వెల్లడించారాయన. Statement Affirming the Continuation of the Institution of Dalai Lama(Translated from the original Tibetan)On 24 September 2011, at a meeting of the heads of Tibetan spiritual traditions, I made a statement to fellow Tibetans in and outside Tibet, followers of Tibetan… pic.twitter.com/VqtBUH9yDm— Dalai Lama (@DalaiLama) July 2, 2025అయితే టిబెట్‌పై ఆధిపత్యం చెలాయిస్తున్న చైనా ప్రభుత్వం గోల్డెన్ అర్న్ అనే పద్ధతిలో తమకు అనుకూల వ్యక్తిని దలైలామాగా నియమించాలని భావిస్తోంది. ఈ ప్రయత్నాన్ని తాజాగా దలైలామా ఖండించారు. ధర్మాన్ని నమ్మని కమ్యూనిస్టులు పునర్జన్మ వ్యవస్థలో జోక్యం చేసుకోవడం అనుచితం అని వ్యాఖ్యానించారాయన. తద్వారా తన వారసత్వాన్ని ఆధ్యాత్మిక సంప్రదాయాల ప్రకారం కొనసాగించాలన్న సంకల్పాన్ని వ్యక్తపరిచారు. తన 90వ పుట్టినరోజు కంటే నాలుగు రోజుల ముందుగానే(జులై 6న) దలైలామా తాజా ప్రకటన చేయడం చైనా ప్రభుత్వానికి గట్టి సవాలుగా మారింది.చైనా రియాక్షన్ ఇదిదలైలామా ప్రకటనపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ బుధవారం స్పందించింది. "దలైలామా, పాంచెన్ లామా, ఇతర ప్రముఖ బౌద్ధ గురువుల ఎంపిక తప్పనిసరిగా 'గోల్డెన్ అర్న్' పద్ధతిలో.. అదీ కేంద్ర ప్రభుత్వ ఆమోదంతోనే జరగాలి అని ఆ శాఖ ప్రతినిధి మావో నింగ్ తెలిపారు. ఈ పద్ధతి 18వ శతాబ్దంలో చింగ్ వంశాధిపతి ప్రవేశపెట్టిన విధానమని పేర్కొన్న ఆమె.. చైనా ప్రభుత్వం మత స్వేచ్ఛకు కట్టుబడి ఉందని, అలాగని మత సంబంధిత వ్యవహారాలపై నియంత్రణలు, బౌద్ధ గురువుల నియామకాల కోసం ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి అని మావో నింగ్ గుర్తు చేస్తున్నారు.ప్రస్తుత దలైలామా అసలు పేరు టెన్జిన్ గ్యాట్సో(89).. 14వ దలైలామా. ఈయన 1935లో టిబెట్‌లోని టాక్సేర్ గ్రామంలో జన్మించారు. 1940లో 14వ దలైలామాగా గుర్తింపు పొందారు. టిబెట్‌లో లాసా బౌద్ధ యాత్రికులకు అత్యంత పవిత్రమైన ప్రాంతం. ఆ ప్రాంతం కేంద్రంగా దలైలామా బౌద్ధ మత ప్రచారం, ఇతర కార్యకలాపాలు నిర్వహించేవారు. 1950లో చైనా టిబెట్‌ను ఆక్రమించింది. అయితే 1959లో ఆ ఆక్రమణకు వ్యతిరేకంగా లాసాలో తిరుగుబాటు జరగ్గా.. చైనా దానిని అణచివేసింది. అంతేకాదు ప్రపంచమంతా ఇప్పుడు శాంతికాముడిగా భావించే దలైలామాను.. అప్పట్లో వేర్పాటువాదిగా, తిరుగుబాటుదారుడిగా చైనా ముద్ర వేసింది. దీంతో ఆయన భారత్‌లోని ధర్మశాలకు వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. అప్పటి నుంచి చైనా టిబెట్ సంబంధాల్లో లాసా ఓ కీలక రాజకీయ కేంద్రంగా కొనసాగుతోంది. ఇక.. టిబెటన్ బౌద్ధులు మాత్రం, పారంపరిక పద్ధతుల ప్రకారమే దలైలామా ఎంపిక జరగాలని కోరుకుంటున్నారు. కానీ..టిబెట్ చైనా స్వభూమిగా పేర్కొంటూ.. దలైలామా ఎంపికపై తమకే హక్కు ఉందని డ్రాగన్ వాదిస్తోంది. మరోవైపు దలైలామా వ్యవహారంలో చైనా జోక్యాన్ని అగ్రరాజ్యం అమెరికా సైతం ఖండిస్తూ వస్తోంది. దలైలామా ఎంపికపై చైనాకు ఎలాంటి హక్కు లేదు అని చెబుతోంది. 2020లో అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛ రాయబారి శామ్యూల్ డీ బ్రౌన్బ్యాక్.. ధర్మశాలలో టిబెటన్ శరణార్థులతో సమావేశమై, ఈ విషయాన్ని పునరుద్ఘాటించారు. అంతేకాదు.. చైనా జోక్యాన్ని ఖండిస్తూ అమెరికా కాంగ్రెస్ 2020లో "టిబెట్ పాలసీ అండ్ సపోర్ట్ యాక్ట్" అనే చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం.. చైనా జోక్యం లేకుండా దలైలామా ఎంపిక జరగాలి. ఒకవేళ ఈ ప్రక్రియలో గనుక చైనా అధికార యంత్రాంగం జోక్యం చేసుకుంటే వాళ్లపై ఆంక్షలు విధించవచ్చు. -
రష్యాతో భారత్ స్నేహం.. అమెరికా కక్షసాధింపు హెచ్చరిక
వాషింగ్టన్: భారత్, చైనా విషయంలో అమెరికా మరో సంచలన ప్రకటన జారీ చేసింది. రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే భారత్, చైనాలపై 500 శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించింది. దీంతో, అగ్రరాజ్యం అమెరికా తీరు తీవ్ర చర్చకు దారి తీసింది. ఇక, ఇటీవలే భారత్‌తో బిగ్ డీల్ ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక, తాజాగా ఇలా మాట మార్చడం గమనార్హం.రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రష్యా, ఉక్రెయిన్ మధ్య పరిస్థితులను గమనిస్తున్నాం. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై తప్పకుండా చర్చలు ఉంటాయి. ఉక్రెయిన్‌కు సాయం చేయని దేశాల ఉత్పత్తులపై 500 శాతం సుంకం విధిస్తాం. రష్యా నుంచి చమురును భారత్, చైనాలు 70శాతం కొనుగోలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ రెండు దేశాలపై సుంకం విధించే అంశం పరిశీలిస్తున్నామని అన్నారు. ఇదే సమయంలో ఆగస్టులో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఈ బిల్లుపై ట్రంప్ కూడా ఓకే చెప్పారని వెల్లడించారు. అయితే, ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో రష్యా కాల్పులు విరమణకు అంగీకరించలేదు. ట్రంప్ సూచనలు, హెచ్చరికలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లెక్క చేయలేదు. దీంతో, రష్యాను అమెరికా టార్గెట్ చేసింది. రష్యాను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసే యూఎస్ ప్రయత్నాల్లో ఇది ఒకటిగా తెలుస్తోంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే.. రష్యా నుంచి పెద్దమొత్తంలో ముడి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది మన ఔషధాలు, వస్త్రాలు వంటి ఎగుమతులపై ప్రభావం పడుతుంది. ఇక, ఉక్రెయిన్‌కు మద్దతు ఇచ్చే దేశాల కోసం లిండ్సే మరో ఒప్పందాన్ని ప్రతిపాదించనున్నట్లు తెలుస్తోంది.ట్రంప్ బిగ్ డీల్ ప్రకటన..ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే భారత్‌తో బిగ్ డీల్ ఉండనున్నట్టు తెలిపారు. త్వరలోనే భారత్‌తో ఒప్పందం కుదుర్చుకోనున్నాం. అది ఒక కొత్త డీల్ అవుతుంది. ప్రస్తుతం భారత్ ఇంకా దాన్ని అంగీకరించలేదు. వాళ్లు డీల్‌కు ఒప్పుకుంటే తక్కువ సుంకాలు విధించేలా ఒప్పందం కుదురుతుందని అన్నారు. జూలై తొమ్మిదో తేదీ నాటికి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. దీనిపై చర్చలు సైతం జరుగుతున్నట్టు తెలుస్తోంది. -
చైనా అధ్యక్షుడిగా వాంగ్ యాంగ్?
గత మే 21-జూన్ 5 తేదీల మధ్య సుమారు 15 రోజులపాటు చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ (72) జనానికి కనిపించలేదు. దీంతో ఎన్నో ప్రశ్నలు, సందేహాలు. మరి పాలనా పగ్గాలు వాస్తవంగా ఎవరి చేతిలో ఉన్నట్టు? ఈ పరిణామం చైనా కమ్యూనిస్టు పార్టీలో నాయకత్వ మార్పుకు సంకేతమా? అంటే... డ్రాగన్ ముఖచిత్రం అలాగే దర్శనమిస్తోంది. ఈ నెల 6, 7 తేదీల్లో బ్రెజిల్ దేశంలో జరగనున్న బ్రిక్స్ సదస్సుకూ జిన్ పింగ్ హాజరుకాబోవడం లేదు. తాను గద్దెనెక్కాక బ్రిక్స్ శిఖరాగ్రానికి జీ హాజరుకాకపోవడం ఇదే తొలిసారి! ఆయన బదులు చైనా ప్రధాన మంత్రి లీ కియాంగ్ బ్రిక్స్ సదస్సుకు వెళ్లనున్నారు.సమస్య బ్రిక్స్ గురించి కాదు. అసలు చైనాలో ఏం జరుగుతోంది? జిన్ పింగ్ కేవలం దేశాధ్యక్షుడే కాదు... చైనీస్ కమ్యూనిస్టు పార్టీ (సీసీపీ) ప్రధాన కార్యదర్శి, సెంట్రల్ మిలిటరీ కమిషన్ (సీఎంసీ) ఛైర్మన్ కూడా. సీఎంసీ తొలి వైస్ ఛైర్మన్ అయిన జనరల్ జాంగ్ యూక్సియా (జహంగ్ యూషా) చేతిలో ప్రస్తుతం దేశ పాలనా పగ్గాలు ఉన్నట్టు సమాచారం. కమ్యూనిస్టు పార్టీలో శక్తిమంతమైన 24 మంది సభ్యుల పొలిట్ బ్యూరోలో జాంగ్ సభ్యుడు. దేశ మాజీ అధ్యక్షుడు హు జింటావోకు విశ్వాసపాత్రులైన పార్టీ సీనియర్ సభ్యులు పలువురు జాంగ్ యూక్సియాకు మద్దతిస్తున్నట్టు తెలుస్తోంది. చైనాలో కీలక ఆర్థిక, సైనిక రంగాలపై జీ జిన్ పింగ్ ప్రభావం సన్నగిల్లుతోంది. ఆయన భావజాలపు ముద్ర బలహీనపడుతోంది. జీ నాయకత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరిగింది.ఆర్థిక రంగం ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. నిరుద్యోగం బాగా ప్రబలుతోంది. రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. జిన్ పింగ్ రాజకీయ వారసుడిగా టెక్నోక్రాట్ వాంగ్ యాంగ్ (70) తెరపైకొస్తున్నారు. ఉదారవాదిగా, సంస్కర్తగా వాంగ్ యాంగ్ కు పేరుంది. ఇక జిన్ పింగ్ సన్నిహితులుగా ముద్రపడిన జనరల్స్ ఉద్వాసనకు గురవుతున్నారు. అలా జిన్ పింగ్ క్రమంగా ‘మసకబారుతున్నారు’. కాదు... పార్టీ నాయకత్వమే ఆయన్ను పక్కకు తప్పిస్తోంది. మూడేళ్ళ క్రితం 2022లో చైనా కమ్యూనిస్టు పార్టీ సమావేశంలో... జిన్ పింగ్ పక్కన ఆశీనుడైన దేశ మాజీ అధ్యక్షుడు హు జింటావోను... తాను ‘రాను రానంటున్నా’... సిబ్బంది అమర్యాదకరంగా, బలవంతంగా బయటికి లాక్కెల్లిన దృశ్యాలను ఎవరు మరువగలరు? ఆ చర్యను జిన్ పింగ్ నిలువరించే ప్రయత్నం చేయకపోగా కనీసం అటు వైపు కన్నెత్తి చూడలేదు. హై ప్రొఫైల్ నేతలను ఇలా సాగనంపడం చైనాకు కొత్త కాదు. తమ దేశంలో తలెత్తే అంతర్గత వివాదాల ఒత్తిళ్ల నుంచి ఉపశమనం కోసం బహిర్గత (విదేశాంగ) వ్యవహారాలను ఉపయోగించుకోవడం చైనాకు రివాజు కనుక... ప్రస్తుత సమయంలో మన దేశం జాగ్రత్తగా ఉండాలనేది నిపుణుల హెచ్చరిక. ఇండియాపై సైబర్ దాడులను చైనా తీవ్రతరం చేయవచ్చు. అలాగే భారతదేశ ప్రతిష్టను అంతర్జాతీయంగా డ్రాగన్ దెబ్బతీసే అవకాశాలూ లేకపోలేదు. - జమ్ముల శ్రీకాంత్ -
5 వేల కిలోమీటర్ల దూరం నుంచి రెండుగంటల్లో సర్జరీ : విప్లవాత్మక అడుగు
చైనా వైద్యులు వైద్యచరిత్రలో విప్లవాత్మకమైన పురోగతి సాధించారు. ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి 5,000 కిలోమీటర్ల దూరం నుండి రిమోట్ రోబోటిక్ ఆపరేషన్ నిర్వహించి రికార్డు సృష్టించారు. శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా ఇలా శస్త్రచికిత్స చేయడం ప్రపంచంలోనే ఇది తొలిసారి. టిబెట్‌లోని లాసాలో ఉన్న వైద్య బృందం బీజింగ్‌లోని 5000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇద్దరు రోగులకు రోబోటిక్ సాయంతో కాలేయ శస్త్రచికిత్స నిర్వహించింది. PLA జనరల్ హాస్పిటల్‌కు చెందిన ప్రొఫెసర్ రోంగ్ లియు నేతృత్వంలో కాలేయ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఉపగ్రహ కమ్యూనికేషన్‌ను ఉపయోగించి ఇప్పటివరకు నిర్వహించిన అతి పొడవైన దూర శస్త్రచికిత్సగా నిలిచింది.Apstar-6D ఉపగ్రహం ద్వారా 68 ఏళ్ల కాలేయ కేన్సర్ రోగి, 56 ఏళ్ల హెపాటిక్ హెమాంగియోమాకు ఈ రెండు శస్త్రచికిత్సలు నిర్వహించారు. కేవలం 125 నిమిషాల్లో బ్లడ్ లాస్ లేకుండా చేయడమే కాదు, 24 గంటల్లో రోగులు పూర్తిగా కోలుకోవడం విశేషం. ఉపగ్రహ శస్త్రచికిత్స, సిద్ధాంతపరంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పటికీ, సిగ్నల్ ఆలస్యం కారణంగా సవాళ్లను ఎదుర్కొంది. వీటిని అధిగమించడానికి, ప్రొఫెసర్ లియు బృందం మూడు ప్రధాన ఆవిష్కరణలను ప్రవేశపెట్టింది: 632 ms జాప్యంలో కూడా రోబోటిక్ హ్యాండ్ లోపాన్ని 0.32 mmకి పరిమితం చేసేలా న్యూరాల్ నెట్‌వర్క్‌ను వినియోగించింది. అలాగే ఉపగ్రహం విఫలమైతే తక్షణమే 5G బ్యాకప్‌కు మారే ద్వంద్వ-లింక్ వ్యవస్థను, HD ఇమేజింగ్‌ను కొనసాగిస్తూనే, డేటా లోడ్‌ను 62శాతం తగ్గించేందుకు డైనమిక్ బ్యాండ్‌విడ్త్ కేటాయింపును వాడింది.ఇదీ చదవండి: కొడుకు స్నేహితుడితో పెళ్లి, త్వరలో బిడ్డ : వ్యాపారవేత్త లవ్ స్టోరీ వైరల్రిమోట్,విపత్తు ప్రభావిత ప్రాంతాలకు అధునాతన శస్త్రచికిత్స సేవలు అందించడంలో ఇది కీలక మలుపు అని ప్రొఫెసర్ లియూ చెప్పారు. ముఖ్యంగా వైద్యులు సకాలంలో చేరుకోలేని వార్ జోన్స్, ప్రకృతి వైపరీత్యాలలో క్లిష్టమైన రెస్క్యూ మిషన్లకు ఇది చక్కటి పరిష్కారం అన్నారు. చైనా ఇప్పుడు ఉపగ్రహ సాంకేతికతో చేసే ఆపరేషన్ల మోడల్‌ను విస్తృత జాతీయ ఆరోగ్య సంరక్షణ వ్యూహాలలో చేర్చాలని యోచిస్తోంది. ఇది అంతరిక్ష ఆధారిత వైద్యం విషయంలో కొత్త యుగానికి నాంది పలికిందని నిపుణులు పేర్కొంటున్నారు.చదవండి: 900 గంటలు, 180 బటన్స్ : ఆమె స్పెషల్ వెడ్డింగ్ గౌను విశేషాలు -
కొడుకు స్నేహితుడితో పెళ్లి, త్వరలో బిడ్డ : వ్యాపారవేత్త లవ్ స్టోరీ వైరల్
50 ఏళ్ళ వయసులో ఒక చైనా మహిళ తన కొడుకు స్నేహితుడిని పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది. అంతేకాదు ఇపుడు ఒక బిడ్డకు తల్లి కాబోతోంది. ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ కథేంటో తెలుసుకుందాం పదండిఆగ్నేయ చైనాకు చెందిన ఈ-కామర్స్ వ్యవస్థాపకురాలు "సిస్టర్ జిన్". తన కొడుకు రష్యన్ క్లాస్‌మేట్‌ను పెళ్లాడింది. 30 ఏళ్ళ వయసులో మొదటి భర్తనుంచి విడాకులు తీసుకున్న ఆమె కొడుకు, కుమార్తెను స్వతంత్రంగా పెంచి పెద్ద చేసింది. సబర్బన్ విల్లా, చెఫ్, డ్రైవర్ ఇలా సకల హంగులతో అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడిపే ఆమె చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ డౌయిన్‌లో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది. 13,000 మందికి పైగా ఫాలోయర్లు ఉన్నారు.ఆరేళ్ల ప్రేమ తరువాత పిల్లల ఆమోదంతో కొడుకు కైకై రష్యన్ ఫ్రెండ్ డైఫును పెళ్లి చేసుకుంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం న్యూ ఇయర్ పార్టీ సందర్భంగా కొడుకు తన ఫ్రెండ్స్‌ను ఇంటికి ఆహ్వానించినపుడు డైఫుతో పరిచయం ఏర్పడింది. సిస్టర్ జిన్ వంటలకు ఆతిథ్యానికి ఫిదా అయిన డైఫు తన సెలవులను పొడిగించుకున్నాడు. చైనాలో చాలా సంవత్సరాలు గడిపిన తర్వాత చైనీస్ భాషను కూడా మాట్లాడే డైఫు, జిన్‌తో టచ్‌లో ఉంటూ, అనేక గిఫ్ట్‌లు ఇచ్చి పుచ్చుకున్నాడు. అచ్చమైన ప్రేమికుల్లాగానే వీరిద్దరి మధ్య అనేక సర్ప్రైజ్లు కూడా ఉన్నాయి. 20 ఏళ్ల వయసు తేడా, ఎత్తులో తేడా, గతంలో విఫలమైన వివాహం తదితర కారణాల రీత్యా జిన్ తొలుత వ్యతిరేకించినా, ఆ తరువాత ఇవేవీ వీరి ప్రేమకు అడ్డంకి కాలేదు. కొడుకు ప్రోత్సాహంతో అతడి ప్రేమను స్వీకరించింది. ఈ జంట ఈ ఏడాది ప్రారంభంలో అధికారికంగా తమ వివాహాన్ని నమోదు చేసుకున్నారు. చైనా అంతటా విస్తృతంగా పర్యటించారు. (యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్లతో ముప్పు ; షెఫాలీ ప్రాణం తీసింది అవేనా?)చివరికి జూన్8న తన ప్రెగ్రెన్నీని ప్రకటించింది. లేట్ ఏజ్ ప్రెగ్నెన్సీ ప్రమాదమే కానీ, డైఫుతో జీవితం చాలా బావుంది అంటూ సిస్టర్ జిన్ సోషల్ మీడియాలో ఒక వీడియో ద్వారా తన గర్భధారణను ప్రకటించింది ఆన్లైన్ వినియోగదారులు వీరి వివాహ చట్టబద్ధతను ప్రకశ్నించారు. అయితే కాలమే తమ ప్రేమను రుజువు చేస్తుందని సమాధానమిచ్చింది. పుట్టబోయే బిడ్డను స్వాగతించేందుకు ఉత్సాహంగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదీ చదవండి: Today Tip బరువు తగ్గాలంటే.. జామ ఆకూ ఔషధమే -
కొండను కదిలించడం అంటే ఇదే!
వందేళ్ల పురాతనమైన ఇటుక కట్టడం.. 44 వేల చదరపు అడుగుల నిర్మాణం.. 8270 టన్నుల బరువు.. చిన్నసైజు కొండలా ఉంటుంది. కానీ.. మనిషి సంకల్పం ముందు మాత్రం దూదిపింజె చందంగా తేలికగా మారిపోయింది. ఇటు నుంచి అటుకు.. కొంత సమయం తరువాత అటు నుంచి ఇటుకు వచ్చేసింది. చైనాలో జరిగిందీ అద్భుతం. భూగర్భంలో ఓ షాపింగ్ సెంటర్ కట్టేందుకు అడ్డుగా ఉందని.. షాంఘైలోని హయాన్లీ షికుమెన్ భవనాన్ని చెక్కు చెదరకుండా పక్కకు తరలించారు. మల్టీ లెవల్ అండర్‌గ్రౌండ్ షాపింగ్ మాల్ నిర్మాణం పూర్తి కాగానే యథాతథ స్థితికి చేర్చేశారు.వివరాలు... ఇప్పుడంటే మాయమయ్యాయి కానీ.. ఒకప్పుడు చైనాలో నడవా ఇళ్లు భారీ ఎత్తునే ఉండేవి. నడవ ఇల్లు అంటే అర్థం కాకపోతే.. విశాలమైన సెంట్రల్ కోర్టు ఉన్న అపార్ట్మెంట్ కాంప్లెక్స్ అనుకోండి. 1920, 30లలో కట్టిన ఓ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఈ హుయాన్లీ షికుమెన్ కాంప్లెక్స్. కాలం మారిపోయింది. షాంఘై మహా నగరమైంది. ప్రజల అవసరాలు పెరిగిపోయాయి. ఇందుకు తగ్గట్టుగా ఈ కాంప్లెక్స్ ఉన్న చోట ఓ భారీ భూగర్భ షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలని ప్రభుత్వం తీర్మానించింది. అయితే వందేళ్ల చరిత్ర ఉన్న హుయాన్లీ కాంప్లెక్స్‌ను కూల్చేసేందుకు స్థానిక ప్రభుత్వానికి మనసు రాలేదు. దాన్ని కాపాడుకుంటూనే అండర్‌గ్రౌండ్ షాపింగ్ కాంప్లెక్స్ కట్టేద్దామని తీర్మానించారు.ఈ ప్రాజెక్టు కాంట్రాక్ట్ దక్కించుకున్న షాంఘై కన్స్ట్రక్షన్ నెం:2 సంస్థ భవనాన్ని నఖశిఖ పర్యంతం పరిశీలించి.. త్రీడీ స్కానింగ్ చేసి... పక్కనే ఉన్న ఖాళీ స్థలంలోకి తరలించాలని, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం తరువాత మళ్లీ ముందు ఉన్న చోటికి తెచ్చేయాలని ప్రణాళిక సిద్ధం చేసింది. అత్యాధునిక కృత్రిమ మేధ సాయంతో పనిచేసే డ్రిల్లింగ్ రోబోలు రంగంలోకి దిగాయి. మట్టికి, నిర్మాణానికి మధ్య తేడాను స్పష్టంగా అర్థం చేసుకోగల ఈ రోబోలు భవనం చుట్టూ ఒక పద్ధతి ప్రకారం తవ్వడం మొదలుపెట్టాయి. అడుగుభాగంలోకి చేరి ఒక్కటొక్కటిగా 432 హైడ్రాలిక్ వాకింగ్ రోబోలను నిలిపాయి.ఒక్కోటి పది టన్నుల బరువును మోయగల సామర్థ్యం ఉన్నవి. సెన్సర్ల సాయంతో పీడనం, కంపనలు వంటివి గుర్తిస్తూ వాకింగ్ రోబోలు అన్నీ సమన్వయంతో నెమ్మదిగా కదలుతూ భవనం మొత్తాన్ని పక్కనున్న ఖాళీస్థలంలో ఏర్పాటు చేసిన ర్యాంప్‌పైకి చేర్చాయి. ఒక రోజుకు కేవలం 33 అడుగుల దూరం మాత్రమే ప్రయాణిస్తూ... భవనం చెక్కు చెదరకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. 2023లో మొదలైన ఈ తరలింపు కొద్ది రోజుల్లోనే ముగిసింది కానీ.. ఆ తరువాత ఖాళీ స్థలంలో అండర్‌గ్రౌండ్ షాపింగ్ కాంప్లెక్స్‌తోపాటు ఒక భూగర్భ మెట్రో రైలు స్టేషన్, పార్కింగ్ ఏర్పాట్లు వంటివన్నీ పూర్తి చేశారు. ఈ ఏడాది మే నెల 19న హుయాన్లీ కాంప్లెక్స్‌ను మళ్లీ యథాతథ స్థితికి తీసుకొచ్చే పని మొదలై 19 రోజుల్లోనే ముగించారు. జూన్ ఏడవ తేదీకల్లా భవనం తన సొంత పునాదులపై నిలిచింది.ఇదే తొలిసారా?ఊహూ కానేకాదు. భారీ భవంతులను పక్కకు జరిపడం గతంలోనూ చాలాసార్లు జరిగింది. 1985లో టెక్సస్‌లోని సాన్ ఆంటోనియలో ఉండే ఫెయిర్‌మౌంట్ హోటెల్ను కూడా ఆరు బ్లాకుల దూరం కదిలించారు. భారీ క్రేన్, డంప్ ట్రక్కుల సాయంతో జరిగిందీ తరలింపు. చక్రాలపై కదిలిన అతి భారీ భవంతిగా ఇప్పటికీ గిన్నిస్ రికార్డు కొనసాగుతోంది. దీని బరువు 14.5 లక్షల కిలోలు లెండి!1930లో ఇండియానా బెల్ అనే టెలిఫోన్ కంపెనీ ఏడు అంతస్తుల తన ప్రధాన కేంద్ర భవనాన్ని ఒక దిక్కు నుంచి ఇంకో దిక్కుకు మళ్లించడం కూడా ఒక రికార్డే. పైగా ఇలా ఈ భవనాన్ని తిప్పేస్తున్నప్పుడు దాంట్లో కార్యకలాపాలు ఏ మాత్రం నిలిపివేయకపోవడం ఇంకో విశేషం! 1962లో చైనా కూడా సుమారు 22 అంతస్తుల భవనం ఒకదాన్ని 90 డిగ్రీల మేరకు పక్కకు తిప్పేయడం కొసమెరుపు!- గిళియారు గోపాలకృష్ణ మయ్యా! -
రాష్ట్ర ఈవీ రంగానికి ఆర్ఈఈల కొరత
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన రంగాల్లో కీలకమైన అరుదైన భూగర్భ ఖనిజాలు (రేర్ ఎర్త్ ఎలిమెంట్స్) ఆర్ఈఈ ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించడంతో తెలంగాణలో సంబంధిత రంగాలకు చెందిన పరిశ్రమల్లో ఆందోళన నెలకొంది. ఎలక్ట్రానిక్స్, ఈవీల ఉత్పత్తికి అవసరమైన రేర్ ఎర్త్ మ్యాగ్నెట్లు, ముడిపదార్థాలు, రసాయనాలను ఎక్కువగా చైనా నుంచే తెలంగాణ దిగుమతి చేసుకుంటోంది. అయితే అమెరికాతో ట్రేడ్ వార్‌లో భాగంగా ఆర్ఈఈల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించింది. ఏప్రిల్ 4న మొదలైన నిషేధం మరింతకాలంపాటు కొనసాగితే తెంలగాణలో తయారీ రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఆర్ఈఈలు లభ్యమయ్యే ప్రత్యామ్నాయ మార్గాలు, ప్రణాళికలు, వ్యూహాలు లేకపోవడంతో సమస్య తీవ్రమయ్యే సూచన కనిపిస్తోంది. మరోవైపు ఆర్ఈఈల ఉత్పత్తి పెంచేందుకు రూ. 5 వేల కోట్లతో కేంద్రం ప్రకటించిన దీర్ఘకాలిక పథకంతో తక్షణ ఉపశమనం లభించే అవకాశం కనిపించకపోవడంతో ఈవీ, ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమలు ఆందోళన చెందుతున్నాయి. ఉత్పాదకతపై ప్రతికూల ప్రభావం ఎలక్ట్రానిక్ వాహనాలు, స్మార్ట్ఫోన్లతోపాటు విండ్ టర్బైన్లకు అవసరమయ్యే శాశ్వత మ్యాగ్నెట్ల తయారీలో నియోడిమియం, డిస్ప్సోసియం, టెర్బియం వంటి అరుదుగా లభించే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అత్యంత కీలకం. ప్రపంచంలోకెల్లా ఈ ఆర్ఈఈల వెలికితీత, శుద్ధి, ఎగుమతుల్లో 80 శాతం మార్కెట్‌ను చైనా నియంత్రిస్తోంది. గతేడాది చైనా నుంచి భారత్ 2,270 టన్నుల ఆర్ఈఈలను దిగుమతి చేసుకుంది. చైనా విధించిన ఆంక్షల మూలంగా ఆర్ఈఈల లభ్యత, ధరల పెరుగుదల వంటి సమస్యలను తెలంగాణ పరిశ్రమలు ఎదుర్కొంటున్నాయి.తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్, ఈవీ మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణకు ప్రాధాన్యతను ఇస్తుండగా అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొనడం వల్ల పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం పడుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్ర అవసరాల మేరకు దిగుమతులు లేకపోవడంతోపాటు ఉత్పాదనలో ఆలస్యం వల్ల నష్టాలు పెరిగి ఉద్యోగ కల్పనపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందని అంటున్నాయి. దీర్ఘకాలంపాటు ఇదే పరిస్థితి కొనసాగితే అంతర్జాతీయ మార్కెట్‌తో పోటీ పడలేమనే భయం పరిశ్రమ వర్గాల్లో నెలకొంది. ప్రత్యామ్నాయ మార్గాలు ఫలితమిచ్చేనా? ఈ ఏడాది చివరి నాటికి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులను 3 బిలియన్ డాలర్లకు చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. మరోవైపు 2030 నాటికి ప్రజారవాణా రంగంలో వంద శాతం ఎలక్ట్రానిక్ వాహనాలను ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేస్తోంది. పునరుత్పాదక ఇంధన రంగం ద్వారా 2030 నాటికి 20 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఆ్రస్టేలియా, కెనడా వంటి దేశాల నుంచి ఆర్ఈఈల దిగుమతి కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్‌కు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఇటీవల వినతిపత్రం ఇచ్చారు. -
చైనాలో ప్రక్షాళన.. నేవీ చీఫ్, అణు శాస్త్రవేత్తకు ఉద్వాసన
బీజింగ్: చైనాలో శక్తివంతమైన రక్షణ, భద్రతా విభాగాల్లో ప్రక్షాళన కొనసాగుతోంది. తాజాగా ఉద్వాసనకు గురైన వారిలో, నేవీ చీఫ్, అగ్రశ్రేణి అణు శాస్త్రవేత్త ఉన్నారు. చైనా సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీ(పీఎల్ఏఎన్) చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ లి హన్జున్, చైనా నేషనల్ న్యూక్లియర్ కార్పొరేషన్ డిప్యూటీ చీఫ్ లియు షిపెంగ్లకు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్(ఎన్పీసీ) సభ్యత్వాలను రద్దు చేశారు. శుక్రవారం ముగిసిన ఎన్పీసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా, సెంట్రల్ మిలటరీ కమిషన్(సీఎంసీ)సభ్యుడిగా ఉన్న టాప్ జనరల్ మియావో హువా అధికారాలకు సైతం కత్తెరవేశారు. చైనా మిలటరీ అత్యున్నత నిర్ణాయక విభాగం సీఎంసీ. దీనికి బాస్ అధ్యక్షుడు జిన్ పింగ్ కావడం గమనార్హం. చైనా మిలటరీలో చిన్న వయస్సులోనే ఉన్నత స్థాయికి చేరుకున్న మియా తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అధికార కమ్యూనిస్ట్ పార్టీపై పూర్తిస్థాయి పట్టు కలిగిన అధ్యక్షుడు జిన్ పింగ్ ఇటీవలి కాలంలో ఇద్దరు రక్షణ మంత్రులను సైతం తొలగించి, తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. -
సమస్యల పరిష్కారానికి ‘నిర్మాణాత్మక రోడ్‌మ్యాప్’
ఖింగ్‌డావో/న్యూఢిల్లీ: భారత్, చైనా మధ్య నెలకొన్ని సంక్లిష్టమైన సమస్యలను నిర్మాణాత్మక రోడ్‌మ్యాప్ ద్వారా పరిష్కరించుకుందామని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపాదించారు. ఆయన చైనా రక్షణ శాఖ మంత్రి డాంగ్ జున్‌తో సమావేశమయ్యారు. ఇరుదేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించుకోవడం, వివాదాలకు తావులేకుండా స్పష్టమైన సరిహద్దులను గుర్తించడానికి ప్రస్తుతం ఉన్న యంత్రాంగాన్ని పునరుత్తేజితం చేయడం వంటి చర్యలతో స్నేహ సంబంధాలు బలోపేతం చేసుకుందామని చెప్పారు. చైనాలో ఖింగ్‌డావో నగరంలో షాంఘై సహకార సంస్థ సదస్సు సందర్భంగా గురువారం రాజ్‌నాథ్ సింగ్, డాంగ్ జున్ ప్రత్యేకంగా సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ప్రధానంగా వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద శాంతియుత పరిస్థితులను కొనసాగించడంపై చర్చించారు. పరస్పర ప్రయోజనాల పరిరక్షణ కోసం భారత్, చైనా కలిసి పనిచేయాలని, ‘చక్కటి పొరుగుదేశం’గా ఇరుదేశాలు సహకరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజ్‌నాథ్ అభిప్రాయపడ్డారు. 2020లో తూర్పు లద్ధాఖ్‌లో జరిగిన ఘర్షణ తర్వాత నెలకొన్న అపనమ్మకాన్ని తొలగించుకోవడానికి క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలన్నారు. చైనాతో తాము ఎలాంటి ఘర్షణ కోరుకోవడం లేదన్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు బలోపేతం కావాలన్నదే తమ ఆకాంక్ష అని వివరించారు. ఆపరేషన్ సిందూర్ గురించి రాజ్‌నాథ్ చైనా రక్షణ మంత్రికి వివరించారు. సరిహద్దుల్లో సైన్యాన్ని, ఉద్రిక్తతలు తగ్గించుకోవడమే లక్ష్యంగా వేర్వేరు స్థాయిల్లో సంప్రదింపులు కొనసాగించాలని రాజ్‌నాథ్, డాంగ్ జున్ నిర్ణయించుకున్నారు. డాంగ్ జున్‌కు రాజ్‌నాథ్ ‘ట్రీ ఆఫ్ లైఫ్’ అనే మధుబని పెయింటింగ్‌ను బహూకరించారు.‘సుఖోయ్’ ఆధునీకరణ ఖింగ్‌డావో సిటీలో రాజ్‌నాథ్ సింగ్ ర ష్యా రక్షణ శాఖ మంత్రి ఆండ్రీ బెలో సోవ్‌తో భేటీ అయ్యారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిణామాలు, సీమాంతర ఉగ్రవాదం, ఇండో–రష్యా రక్షణ సంబంధాలు, పరస్పర సహకారంపై వారు అభిప్రాయాలు పంచుకున్నారు. ముఖ్యంగా సుఖోయ్–30ఎంకేఐ యుద్ధ విమానాల ఆధునీకరణపై చర్చించారు. గగనతలానికి ప్రయోగించే క్షిపణుల తయారీ, ఎస్–400 మిస్సైల్ వ్యవస్థ రెండో బ్యాచ్ పంపిణీపై చర్చలు జరిపారు. భారత వైమానిక దళం వద్ద రష్యా అందజేసిన 260 సుఖోయ్–30ఎంకేఐ ఫైటర్ జెట్లు ఉన్నాయి. వీటిని రష్యా సహకారంతో అప్‌గ్రేడ్ చేయాలని భారత రక్షణ శాఖ నిర్ణయించింది. ఇదే అంశాన్ని రష్యా రక్షణ మంత్రి వద్ద రాజ్‌నాథ్ సింగ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. -
రాజ్‌నాథ్ నిర్ణయం సరైందే: జైశంకర్
న్యూఢిల్లీ: షాంఘై సహకార సంఘం(ఎస్సీవో) ఉమ్మడి ప్రకటనలో ఉగ్రవాదం గురించిన ప్రస్తావన తప్పనిసరిగా ఉండాలని భారత్ కోరుకుందని విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ చెప్పారు. కానీ, ఒకే ఒక్క సభ్య దేశానికి అది ఆమోదయోగ్యం కాదని, పాకిస్తాన్‌ను ఉద్దేశించి ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఉగ్రవాదంపై పోరాటమనే ప్రధాన లక్ష్యంతో ఎస్సీవో రక్షణ మంత్రులు చైనాలో సమావేశమయ్యారని గుర్తు చేసిన జై శంకర్..ఆ ప్రస్తావనే లేకుండా రూపకల్పన చేసిన ఉమ్మడి ప్రకటనపై సంతకం చేయరాదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సమర్థించారు. శుక్రవారం మంత్రి జై శంకర్ మీడియాతో మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడిని, సీమాంతర ఉగ్రవాదానికి పాక్ ఆజ్యపోయడంపై భారత్ ఆందోళనను పట్టించుకోకుండా తయారు చేసిన ప్రకటనపై భారత్ సంతకం చేయని విషయం తెల్సిందే. పైపెచ్చు, ఆ ప్రకటనలో భారత్ ప్రోద్బలంతో బలూచిస్తాన్‌లో భారత్ ఉగ్ర కార్యకలాపాలను ప్రేరేపిస్తోందంటూ పాకిసాŠత్న్ ఒక పేరాను కలిపేందుకు ప్రయత్నించడం గమనార్హం. -
నిలవాలంటే గెలవాలి
బెర్లిన్: పరాజయాల పరంపరకు బ్రేక్ వేయడమే లక్ష్యంగా భారత మహిళల జట్టు చైనాతో పోరుకు సిద్ధమైంది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్‌లో అమ్మాయిల జట్టు వరుసగా ఆరు మ్యాచ్‌ల్లోనూ ఓడింది. దీంతో తీవ్రమైన ఒత్తిడిలో కూరుకుపోయిన భారత్ ఎలాగైన చైనాపై జరిగే పోరులో గెలవాలనుకుంటుంది. ఈ మ్యాచ్ కూడా ఓడితే సలీమా టెటె సారథ్యంలోని భారత జట్టు ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ నుంచి నిష్క్రమించడం దాదాపు ఖాయమవుతుంది. మొత్తం 9 జట్లు తలపడుతున్న ఈ టోర్నీలో 14 మ్యాచ్‌లాడిన మహిళల జట్టు 10 పాయింట్లతో అట్టడుగున ఉంది. ప్రొ లీగ్ నిబంధనల ప్రకారం అట్టడుగున నిలిచిన జట్టు ప్రస్తుత లీగ్‌లో చోటు కోల్పోతుంది. మళ్లీ ప్రొ లీగ్‌లో స్థానం కోసం ఎఫ్ఐహెచ్ నేషన్స్ కప్‌లో ఆడాల్సి ఉంటుంది. ఇలాంటి దుస్థితి నుంచి తప్పించుకోవాలంటే భారత్... చైనాపై గెలిచి తీరాలి. అప్పుడు అథమ స్థానం నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. హెడ్ కోచ్ హరేంద్ర సింగ్ కూడా తమ జట్టు ఈ యూరోపియన్ అంచెలో బోణీ చేయాలని గట్టిగా ఆశిస్తున్నాడు. ఈ ఏడాది సొంతగడ్డపై జరిగిన ప్రొ లీగ్‌లో రాణించిన జట్టు యూరోపియన్ అంచెకు వచ్చేసరికి చతికిలబడటం అనూహ్య పరిణామం. ఆ్రస్టేలియా, అర్జెంటీనా, బెల్జియంలతో జరిగిన రెండేసి మ్యాచ్‌ల్లో... మొత్తం ఆరు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవడం కోచ్ హరేంద్రకు ఏమాత్రం రుచించడం లేదు. కెపె్టన్ సలిమా టెటె ఈ డబుల్ హెడర్ (చైనాతో రెండు మ్యాచ్‌లు) కీలకమని చెప్పింది. భారత పురుషుల జట్టులాగే ఆఖర్లో బెల్జియంపై గెలిచినట్లే తాము కూడా చైనాపై గెలుస్తామని పేర్కొంది. చైనాతో చివరి సారిగా ఆడిన మ్యాచ్‌ల్లో భారత మహిళల జట్టు పైచేయి సాధించింది. గత నవంబర్‌లో బిహార్‌లో జరిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో లీగ్ దశలో 3–0తో గెలిచిన అమ్మాయిల జట్టు... ఫైనల్లో 1–0తో గెలిచి ట్రోఫీ కైవసం చేసుకుంది. ఇప్పుడు ఈ సానుకూల పరిస్థితుల్నే అనుకూలంగా మలచుకొని విజయం సాధించాలనే పట్టుదలతో భారత మహిళల జట్టు బరిలోకి దిగుతోంది. -
భూకంపం.. బుల్లి బకాసురుడు
ఓవైపు.. భూకంపం వచ్చి భవనాలన్నీ ఊగిపోతున్నాయి. ఆ టైంలో ఎవరైనా ఏం చేస్తారు?. ప్రాణ భయంతో బయటకు పరుగులు తీస్తారు కదా. కానీ, ఇక్కడ ఓ బుడతడు చేసిన పని నెట్టింట వైరల్ అవుతోంది. చైనాలో ఇటీవల జరిగిన భూకంపం సమయంలో ఓ చిన్నారి చేసిన పని ఇప్పుడు ఇంటర్నెట్ను నవ్వులు పూయిస్తోంది. జూన్ 23న గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్‌లోని క్వింగ్యువాన్లో రిక్టర్ స్కేల్‌పై 4.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. అయితే పెద్దగా నష్టం జరగలేదు. అయితే ఈ సందర్భంగా ఓ ఇంట్లో జరిగిన ఘటన తాలుకా వీడియో బయటకు వచ్చింది. ఓ ఇంట్లో ఓ తండ్రి తన ఇద్దరు కొడుకులతో భోజనం చేస్తున్నాడు. సరిగ్గా ఆ టైంలో భూమి కంపించింది. తండ్రి తన చిన్న కుమారుడిని ఎత్తుకుని తలుపు వైపు పరుగెత్తాడు. పెద్ద కుమారుడు కూడా వెంటపడ్డాడు. కానీ.. ఆ చిన్నారి ఒక్కసారిగా తిరిగి వచ్చి, టేబుల్ దగ్గరికి వెళ్లి తినడం ప్రారంభించాడు. పైగా బౌల్లో ఉన్న తిండిని తీసుకుని బయటకు పరిగెత్తే ప్రయత్నమూ చేశాడు. ఈలోపు అవతలి నుంచి తండ్రి.. పరిగెత్తు! అని అరిచాడు. అయినా ఆ బుడ్డోడు భోజనం ముందు అన్నట్లు వ్యవహరించాడు. ఈ వైరల్ వీడియోపై ఆ తండ్రి మీడియాతో మాట్లాడుతూ.. మా బిడ్డకు తినడం చాలా ఇష్టం. కానీ, ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వాడికి తిండి కంటే జీవితం ముఖ్యమని ఇక మీదటైనా నేర్పించాలి అని అన్నాడు. నెటిజన్ల స్పందన.. ఈ పిల్లవాడి ప్రాధాన్యతలు అద్భుతం!, భూకంపం వచ్చినా, తిండిని వదలడు!.. - “Snack first, survive later!.. భూకంపం.. బుల్లి బకాసరుడు ఈ కామెంట్లతో వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ వీడియో మీరూ చూసేయండి..Nothing comes between this kid and his meal not even an earthquake.pic.twitter.com/eWs218JHUH— Science girl (@gunsnrosesgirl3) June 25, 2025 -
భారత్‌తో బోర్డర్ టెన్షన్స్.. చైనా మంత్రితో రాజ్‌నాథ్ మాస్టర్ ప్లాన్
బీజింగ్: భారత్, డ్రాగన్ కంట్రీ చైనా మధ్య సరిహద్దుల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడటం, సరిహద్దు ఉద్రిక్తతల పరిష్కారానికి నాలుగు అంశాల ఫార్ములాను భారత రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీంతో, భారత్ సరిహద్దుల్లో ప్రశాంత వాతావరణం నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సభ్యదేశాల రక్షణ మంత్రుల సదస్సులో పాల్గొనేందుకు భారత రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చైనాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా రాజ్‌నాథ్ సింగ్.. చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్‌జున్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడటం, కొత్త సంక్లిష్టతలు రాకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలపై వీరిద్దరూ చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతల పరిష్కారానికి నాలుగు అంశాల ఫార్ములాను రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.Held talks with Admiral Don Jun, the Defence Minister of China, on the sidelines of SCO Defence Minitsers’ Meeting in Qingdao. We had a constructive and forward looking exchange of views on issues pertaining to bilateral relations. Expressed my happiness on restarting of the… pic.twitter.com/dHj1OuHKzE— Rajnath Singh (@rajnathsingh) June 27, 2025ఈ క్రమంలో 2024లో కుదిరిన బలగాల ఉపసంహరణకు కట్టుబడి ఉండటం, ఉద్రిక్తతలను తగ్గించేందుకు నిరంతర ప్రయత్నాలు, సరిహద్దుల గుర్తింపు-నిర్థారణ లక్ష్యాలను సాధించే విషయంపై చర్చించారు. అలాగే, ఇరు దేశాల మధ్య విభేదాలను తొలగించి ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా ప్రత్యేక ప్రతినిధుల వ్యవస్థను కొనసాగించడం వంటి నాలుగు అంశాలతో రాజ్‌నాథ్ ఈ ప్రణాళికను సూచించినట్టు తెలుస్తోంది. దీంతో, రెండు దేశాల మధ్య సరిహద్దుల విషయంలో ఉద్రికత్తలు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో చైనా.. అరుణాచల్ ప్రదేశ్ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అరుణాచల్‌లో పలు ప్రాంతాల పేర్లను చైనా మార్చేసింది. దీన్ని భారత్ పలుమార్లు ఖండించింది. -
దారి మరిచిన ఎస్సీవో!
ఆర్భాటంగా ఏర్పడటం, ఘనంగా లక్ష్యాలు చాటుకోవటం, కీలక సమయాల్లో మొహం చాటేయటం ప్రాంతీయ సహకార సంస్థలకు అలవాటుగా మారింది. సంక్షుభిత ప్రపంచంలో సమస్యలు రావటం సహజమే అయినా, దేశాల మధ్య తలెత్తే విభేదాలు అలాంటి సంస్థల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఆ సంస్థల వల్ల ఉద్రిక్తతలు ఉపశమిస్తాయనుకోవటం అమాయకత్వమని రుజువు చేస్తున్నాయి. సరిగ్గా 24 ఏళ్ల క్రితం ఆవిర్భవించిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) అవస్థ అలాగే ఉంది. ఆ సంస్థ రక్షణ మంత్రుల స్థాయి శిఖరాగ్ర సదస్సు రెండు రోజులు జరిగి గురువారం చైనాలోని చింగ్దావ్లో ముగిశాక విడుదల కావాల్సిన ఉమ్మడి ప్రకటన భారత్ కారణంగా మూలన పడింది. ఆ ప్రకటనపై సంతకం చేసేందుకు మన రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నిరాకరించటంతో చేసేదేమీ లేక ఉమ్మడి ప్రకటన ఆలోచనే విరమించుకున్నారు. ఈ సదస్సుకు మన దేశంతోపాటు చైనా, రష్యా, పాకిస్తాన్, ఇరాన్, కిర్గిజ్ రిపబ్లిక్, కజఖ్‌స్తాన్ తదితర దేశాల రక్షణమంత్రులు హాజర య్యారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనటం ఎలా అనే అంశంపై సదస్సు జరిగింది. ఎస్సీవో 2001లో షాంఘైలో ఏర్పడినప్పుడు అది అందరిలో ఆశలు రేకెత్తించింది. ఎందుకంటే మధ్య ఆసియా దేశాల భద్రత, అభివృద్ధిపైనే ప్రధానంగా కేంద్రీకరిస్తామని సంస్థ తెలిపింది. భారత్, చైనాల మధ్య ఏనాటి నుంచో సరిహద్దు వివాదాలున్నాయి. ఇక పాకిస్తాన్ నాలుగు దశా బ్దాలుగా సరిహద్దు చొరబాట్లను ప్రేరేపిస్తూ ఉగ్రవాద ఘటనలకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో ఎస్సీవో వల్ల చైనా, పాక్‌లతో ఉన్న సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుందన్న ఆశ ఉండేది. 2005 నుంచి మన దేశం పరిశీలక హోదాలో సదస్సులకు హాజరవుతూ వచ్చింది. 2017లో రష్యా అధినేత పుతిన్ చొరవతో భారత్ పూర్తి స్థాయి సభ్యదేశమైంది. కానీ, సభ్య దేశాల వ్యవహార శైలి దేని దారి దానిదే! ఎస్సీవో స్థాపనలో కీలక పాత్ర పోషించిన చైనాయే 2020 జూన్‌లో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)వద్ద చొరబాటు యత్నం చేసింది. చైనా సైన్యం రాళ్లతో, కర్రలతో, రాడ్లతో దాడి చేసి 21 మంది మన జవాన్ల ప్రాణాలు తీసింది. అంతకుముందూ, ఆ తర్వాతా చైనా తీరు అదే.తాజా శిఖరాగ్ర సదస్సులో విభేదాలకు దారితీసిన అంశం ఆశ్చర్యం కలిగిస్తుంది. మొన్న మార్చిలో పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) మిలిటెంట్లు జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్ చేసి పలువురు పాక్ సైనికులను హతమార్చారు. పాక్ సైన్యం కూడా ప్రతీకార దాడికి దిగి ఆ ఘటనలో పాల్గొన్న మిలిటెంట్లలో అత్యధికుల్ని కాల్చిచంపింది. ఆ మరుసటి నెలలో కశ్మీర్‌లోని పెహల్గామ్లో పాక్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు నిరాయుధులైన పర్యాటకులపై దాడి చేసి 26 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ రెండు దాడుల్లో కేవలం బలూచిస్తాన్ ఘటనను ఉమ్మడి ముసాయిదా ప్రకటన ప్రస్తావించి పెహల్‌గామ్‌ను మినహాయించింది. ఆ ఉదంతం తర్వాత మన దేశం ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడి చేయటం, పాక్ సైన్యం దాడుల్ని తిప్పికొట్టడానికి వారి వైమానిక స్థావరాలను ధ్వంసం చేయటం పతాక శీర్షికలకెక్కాయి. ఆ ఘటనల పరంపర జరిగి నిండా నెల్లాళ్లు కాకుండానే ఎస్సీవో ఎలా మరిచి పోతుంది? చైనా, పాక్‌ల మధ్య సాన్నిహిత్యం ఉంది గనుక ఆ దేశం చెప్పి నట్టల్లా ఆడి ఉమ్మడి ప్రకటన రూపొందించటం, దానిపై మన దేశం సంతకం చేయాలని కోరుకోవటం తెలివితక్కువతనం కాదా? అసలు ఇలాంటి తీరుతెన్నులు సమష్టి తత్వాన్ని దెబ్బ తీస్తాయన్న స్పృహ ఉండొద్దా?ఎస్సీవో స్థాపించిన కాలంకన్నా ఇప్పుడు ప్రాంతీయంగా సవాళ్లు ఎన్నో రెట్లు పెరిగాయి. ఉగ్రవాదం వల్ల ఈ ప్రాంత శాంతికీ, భద్రతకూ ముప్పు ఏర్పడుతోంది. దేశాల మధ్య పరస్పరం అవిశ్వాసం కూడా గతంతో పోలిస్తే ఎంతగానో పెరిగింది. ఈ సమయంలో ఎస్సీవో వంటి సంస్థ ఈ సమస్యలకు అర్థవంతమైన పరిష్కారం ఆలోచించాలి. కానీ జరిగిందంతా వేరు. ఈ సదస్సులో ప్రసంగించిన రాజ్‌నాథ్ సింగ్ అన్నట్టు రాజ్యేతర శక్తుల వల్లా, ఉగ్రవాద ముఠాల వల్లా ప్రమాద కరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. వీటి వెనకున్న దేశాలు ఆ పరిస్థితుల పర్యవసానాలను ఎదుర్కొని తీరాలని కూడా ఆయన అన్నారు. రాజ్‌నాథ్ ప్రసంగంలో పెహల్గామ్, ‘ఆపరేషన్ సిందూర్’ ప్రస్తావనకొచ్చాయి. అయినా ముసాయిదా ప్రకటన వాటిని మరిచినట్టు నటించింది.ఎస్సీవోను సభ్యదేశాలు తమ స్వప్రయోజనాలకు ఉపయోగించుకోవాలని చూస్తున్నాయి తప్ప సమష్టిగా అడుగులేయాలన్న సంకల్పం ప్రదర్శించటం లేదు. ఈ సంస్థ చాటున తన బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్ఐ)నూ, పలుకుబడినీ పెంచుకోవటమే చైనా ఎజెండా. సంస్థను మధ్య ఆసియా దేశాలకు మించి విస్తరింప జేయాలన్న ఉద్దేశంలోని ఆంతర్యం కూడా అదే. ఇక రష్యాకు ప్రధానంగా పాశ్చాత్య దేశాలతో లడాయి ఉంది. వాటిని ఎదుర్కొనటానికి సంస్థ ఎంతో కొంత తోడ్పడుతుందన్న ఆశ ఉంది. ఎస్సీవోను చిత్తశుద్ధితో నిర్వహిస్తే ఈ ప్రాంత దేశాలకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఎస్సీవో వాటా 23 శాతం. ప్రపంచ జనాభాలో వాటా 42 శాతం. సంస్థ పెట్టినప్పుడు సభ్య దేశాలమధ్య సైనిక సహకారం, నిఘా నివేదికల్ని పంచుకోవటం, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనటం, విద్య, ఇంధనం, రవాణా రంగాల్లో సహకరించుకోవటం వంటి ఉద్దేశాలున్నాయి. కానీ ఇవన్నీ మరిచి ముఠాలు కట్టి నచ్చినవారికి అనుకూలంగా వ్యవహరించదల్చుకుంటే ఇలాంటి సంస్థలెందుకు? ఈ గంభీరమైన లక్ష్య ప్రకటనలెందుకు? అందుకే ఎస్సీవో తీరు మారాలి. -
ఉమ్మడి ప్రకటనపై సంతకానికి నో
ఖింగ్‌డావో: ఆనవాయితీకి భిన్నంగా ఉమ్మడి ప్రకటన జారీ చేయకుండానే షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సదస్సు గురువారం ముగిసింది. 26 మంది పర్యాటకులను బలితీసుకున్న పహల్గాం ఉగ్రవాద దాడితోపాటు భారత్‌కు వ్యతిరేకంగా కొనసాగుతున్న సీమాంతర ఉగ్రవాదం, ముష్కరుల దాడుల పట్ల భారత్ ఆందోళన గురించి ఈ ప్రకటన ముసాయిదాలో మాటమాత్రంగానైనా ప్రస్తావించకపోవడం గమనార్హం. పైగా పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో స్థానిక వేర్పాటువాద ఉద్యమకారులకు, సైన్యానికి మధ్య జరుగుతున్న ఘర్షణల వెనుక భారత్ హస్తం ఉండొచ్చనే వాదనను ఈ జాయింట్ డాక్యుమెంట్ ముసాయిదాలో పొందుపర్చడం వివాదాస్పదంగా మారింది. దీనిపై సంతకం చేసేందుకు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నిరాకరించారు. ఫలితంగా ఏకాభిప్రాయం కుదరలేదన్న కారణంతో ఉమ్మడి ప్రకటన జారీ చేయకుండానే ఎస్సీఓ సదస్సును ముగించాలని నిర్ణయించారు. చైనాలోని తీరప్రాంత నగరం ఖింగ్డావోలో ఎస్సీఓ దేశాల రక్షణ శాఖ మంత్రుల సదస్సు బుధవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. చైనా ఆతిథ్యం ఇచి్చన ఈ సదస్సులో ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు చేపట్టిన చర్యలపై విస్తృతంగా చర్చించారు.🚨Breaking News: Rajnath Singh refused to sign the SCO joint statement. Why? Pakistan and China tried to weaken the conversation on terrorism. India stood firm on PulwamaAnd Rajnath Singh maintained a strong anti-terror stance#scosummit #RajnathSingh pic.twitter.com/ujsP9JiO9I— Priyanshi Bhargava (@PriyanshiBharg7) June 26, 2025 పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్, చైనా రక్షణ మంత్రి డాంగ్ జున్ తదితరులు సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. ఇండియాలో అశాంతి సృష్టించాలన్న లక్ష్యంతో సీమాంతర పొరుగుదేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని పరోక్షంగా పాకిస్తాన్‌పై మండిపడ్డారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తూ ఆర్థికంగా అండగా నిలస్తోందని, సీమాంతర ఉగ్రవాదాన్ని ఒక విధానంగా మార్చుకుందని దుయ్యబట్టారు. ఉగ్రవాదులను ఏరిపారేసే విషయంలో ద్వంద్వ ప్రమాణాల పాటించొద్దని హితవు పలికారు. ఉగ్రవాదాన్ని ఎగదోసే దేశాలపై కఠినంగా వ్యవహరించేందుకు ఏమాత్రం వెనుకాడొద్దని షాంఘై సహకార సంస్థకు సూచించారు. ఉగ్రవాదులను, వారి పోషకులను చట్టం ముందు నిలబెట్టి, శిక్షించాల్సిందేనని తేల్చిచెప్పారు. -
పాక్‌కు రాజ్‌నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్.. దెబ్బకు చైనా సైలెంట్!
బీజింగ్: చైనా గడ్డపై దాయాది దేశం పాకిస్తాన్‌కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చుక్కలు చూపించారు. ఉగ్రవాదాన్ని అడ్డుకునేందుకు ఆపరేషన్ సిందూర్ చేపట్టినట్టు తెలిపారు. ఆపరేషన్ సిందూర్ భారత్ హక్కు అని కుండబద్దలు కొట్టారు. శాంతి, ఉగ్రవాదం ఎప్పటికీ కలిసి ఉండలేవు అని చెప్పుకొచ్చారు.చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ(SCO) రక్షణ మంత్రుల సమావేశంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ..‘కొన్ని దేశాలు సీమాంతర ఉగ్రవాదాన్ని ఒక విధాన సాధనంగా ఉపయోగించుకుంటున్నాయి. తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉగ్రవాదులను పెంచి పోషించే దేశాలు అందుకుతగ్గ పరిణామాలు ఎదుర్కోక తప్పదు. పలు దేశాలు (పరోక్షంగా పాకిస్తాన్) ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నాయి. అలాంటి ద్వంద్వ ప్రమాణాలకు చోటు ఉండకూడదు. ఎస్సీఓ అలాంటి దేశాలను విమర్శించడానికి వెనుకాడకూడదు. శాంతి, ఉగ్రవాదం ఎప్పటికీ కలిసి ఉండలేవు. అలాంటి వారి చేతుల్లో విధ్వంసాలకు కారణమయ్యే ఆయుధాలు ఉండకూడదు. ఈ సవాళ్లను ఎదుర్కోడానికి నిర్ణయాత్మకమైన చర్య అవసరం. సామూహిక భద్రత కోసం ఈ దుష్టశక్తులకు వ్యతిరేకంగా పోరాడేందుకు మనమంతా ఐక్యం కావాలి’ అని పిలుపునిచ్చారు.#WATCH | Qingdao, China | At the SCO Defence Ministers' meeting, Defence Minister Rajnath Singh says, "It is my pleasure to be here in Qingdao to participate in the SCO Defence Ministers meeting. I would like to thank our hosts for their warm hospitality. I would also like to… pic.twitter.com/c9SyHOaZDp— ANI (@ANI) June 26, 2025ఇదే సమయంలో రాజ్‌నాథ్.. ఇటీవల జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని గురించి కూడా ప్రస్తావించారు. ఉగ్రవాదులకు దాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి కూడా వివరించారు. ‘సీమాంతర ఉగ్రవాదాన్ని నిరోధించడానికే భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. మా దేశంపై ఉగ్రదాడులు జరిగిన కారణంగా.. ఆపరేషన్ చేపట్టాం. ఆపరేషన్ సిందూర్ భారత్ హక్కు. ఉగ్రవాదుల విషయంలో మేము సహనంతో ఉండే అవకాశమే లేదు. ఉగ్రవాద కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడానికి వెనుకాడబోం. మన యువతలో రాడికలైజేషన్ వ్యాప్తిని నిరోధించడానికి కూడా మనం సరైన చర్యలు తీసుకోవాలి’ అని వ్యాఖ్యలు చేశారు.Defence Minister @rajnathsingh attends the SCO Defence Ministers’ Meeting in Qingdao, China.Mr Singh says India’s zero tolerance for terrorism is manifest today through its actions. This includes our right to defend ourselves against terrorism. We have shown that epicentres of… pic.twitter.com/Hy2W98l7uT— All India Radio News (@airnewsalerts) June 26, 2025ఇదిలా ఉండగా.. ఎస్ఈవో రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొనడానికి రాజ్‌నాథ్ సింగ్ చైనా వెళ్లారు. 2020లో గల్వాన్ లోయ వివాదం తర్వాత నరేంద్ర మోదీ మంత్రివర్గంలోని సీనియర్ మంత్రి చేసిన మొదటిసారిగా చైనా పర్యటనకు వెళ్లారు. ఈ సమావేశంలో పాల్గొనడం తనకు ఆనందంగా ఉందని రాజ్‌నాథ్ చెప్పుకొచ్చారు. ఇక, గురువారం సమావేశం ప్రారంభమయ్యే ముందు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్, పాకిస్తాన్, ఇరాన్, కజకిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ వంటి సభ్య దేశాల రక్షణ మంత్రులు గ్రూప్ ఫోటో కోసం సమావేశమయ్యారు. -
ఖండాంతర క్షిపణి అభివృద్ధి కోసం పాక్ యత్నాలు
వాషింగ్టన్: పాకిస్తాన్ తన క్షిపణి సామర్థ్యాన్ని భారీగా పెంచుకునేందుకు ప్రయత్నిస్తోందని అమెరికా ‘విదేశీ వ్యవహారాల’ నిఘా నివేదిక వెల్లడించింది. అణ్వస్త్ర సామర్థ్యంతో కూడిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ఐసీబీఎం) తయారీ యత్నాలను ముమ్మరం చేస్తోందని పేర్కొంది. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి 5,500 కిలోమీటర్లకు పైగా దూరంలోని లక్ష్యాలను చేధించగలదు. చైనా సహకారంతో పాక్ ఇందుకు పూనుకున్నట్టు సమాచారం. ఐసీబీఎంలు తయారుచేస్తే పాక్‌ను అమెరికా తన అణ్వస్త్ర శత్రువుగా ప్రకటించడం ఖాయమని ఆ దేశ ఉన్నతాధికారులు స్పష్టంచేసినట్లు నివేదిక పేర్కొంది. అమెరికా భూభాగాన్ని తాకగలిగే స్థాయిలో సుదూరం నుంచి క్షిపణులను ప్రయోగించే సత్తా ఉన్న రష్యా, చైనా, ఉత్తర కొరియాను అమెరికా ‘అణ్వస్త్ర విరోధులు’గా ప్రకటించింది. ‘‘ఖండాంతర క్షిపణితో అమెరికాను లక్ష్యంగా చేసుకునే ఏ దేశాన్నీ అమెరికా తన మిత్రుడిగా భావించదు’’ అని ఆ దేశ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.ఐసీబీఎంలు లేని పాక్పాక్ వద్ద ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి సాంకేతికత లేదు. ఐసీబీఎం క్షిపణులు లేవు. 2022లో భూతలం నుంచి భూతలం మీదకు ప్రయోగించే మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి షాహీన్–3ను ప్రయోగించింది. ఇది 2,700 కి.మీ.కు పైగా ప్రయాణించగలదు. భారత్‌లోని ఎన్నో నగరాలు దాని పరిధిలోకి వచ్చాయి. దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు పాక్‌పై అమెరికా పలు ఆంక్షలు విధించింది. క్షిపణులను రూపొందించే ‘నేషనల్ డెవలప్మెంట్ కాంప్లెక్స్’, మరో మూడు సంస్థలపై నిషేధం విధించింది. వీటితో వ్యాపారంచేసే తమ దేశీయ సంస్థల ఆస్తులను స్తంభింపజేస్తామని గతంలోనే అల్టిమేటమిచ్చింది. ఈ చర్యలను పాక్ తప్పుబట్టింది. అమెరికా స్వప్రయోజనాలకే పెద్దపీట వేస్తోందని ఆరోపించింది. ఎన్పీటీపై సంతకం చేయని పాక్ వద్ద 170 అణువార్హెడ్లు పోగుబడినట్లు పాత నివేదికలు వెల్లడిస్తున్నాయి. -
పాక్ టార్గెట్ అమెరికా??.. ఇది జోక్ కాదు బాస్!
ఎవ్వడ్రా వీడు.. ఘోల్లుమనే జోక్ వేశాడు అనుకుంటున్నారా?. కానీ ఇదే నిజం. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై ప్రపంచమంతా దృష్టిసారించిన వేళ..పాక్ రహస్యంగా శక్తివంతమైన.. అదీ న్యూక్లియర్ బాలిస్టిక్ మిసైళ్ల తయారీ చేపట్టింది!. ఈ విషయాన్ని అమెరికా నిఘా వర్గాలు వెల్లడించినట్లు ఫారిన్ ఎఫైర్స్ అనే పత్రిక కథనం ప్రచురించింది. దీర్ఘ శ్రేణి నూక్లియర్ బాలిస్టిక్ మిసైళ్ల(ICBM) తయారీని పాకిస్థాన్ రహస్యంగా చేపడుతోంది. వీటి సామర్థ్యం ఏకంగా.. అమెరికాకు చేరుకోగలదని వెల్లడించింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత.. చైనా సాయంతో పాక్ వీటిని అభివృద్ధి చేస్తోంది. ఒకవేళ పాకిస్థాన్ అలాంటి క్షిపణులను సమకూర్చుకుంటే.. ఆ దేశాన్ని అణ్వస్త్ర శత్రువుగా అమెరికా గుర్తించడం ఖాయమని వాషింగ్టన్ నిఘా వర్గాలు స్పష్టం చేశాయని సదరు కథనం పేర్కొంది.అమెరికాను తాకగలిగే అణ్వాయుధాలను కలిగి ఉన్న దేశం ఏదైనా సరే.. అమెరికాకు శత్రువుగానే చూడాల్సి వస్తుందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యలను సదరు నివేదిక ప్రముఖంగా పేర్కొంది. ఈ కథనాన్ని వైట్‌హౌజ్ వర్గాలు ధృవీకరించాల్సి ఉంది. ఐసీబీఎం అంటే.. ఖండాలను దాటగలిగే సామర్థ్యం ఉన్న క్షిపణులు. ఇందులో అణ్వాయుధాలతో పాటు సాధారణ యుద్ధ క్షిపణులు కూడా ఉంటాయి. వీటి లక్ష్యం.. 5,500 కిలోమీటర్లు దాకా ఉండొచ్చు. అయితే ప్రస్తుతానికి పాక్ దగ్గర అలాంటి క్షిపణలేం లేవు. ప్రస్తుతం అమెరికా జాబితాలో రష్యా, చైనా, ఉత్తర కొరియాలు ఉన్నాయి.భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ తన ఆర్థికాభివృద్ధిని పణంగా పెట్టి.. ఆయుధాల కొనుగోళ్లపై దృష్టిపెట్టిందని ఆ దేశ మీడియా నుంచే కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే దేశ రక్షణ బడ్జెట్‌ను 20 శాతం పెంచింది. ఏకంగా 9 బిలియన్ డాలర్లకు కేటాయించింది. షెహ్బాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాక్ ప్రభుత్వం ఆ దేశ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ డిమాండ్లను సంతృప్తిపర్చేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఈ బడ్జెట్లో పెంచిన నిధులతో ఆపరేషన్ సిందూర్‌లో దెబ్బతిన్న టెర్రర్ క్యాంప్‌లను మళ్లీ పునరుద్ధరించనుందని తెలుస్తోంది. అలాగే చైనా నుంచి భారీగా ఆయుధ సంపత్తిని పాక్ దిగుమతి చేసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతానికైతే ఆ దేశ విధానంలో.. షార్ట్, మీడియం రేంజ్ మిస్సైల్స్ మాత్రమే ఉన్నాయి. చివరగా.. 2022లో పాక్ మీడియం రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ షాహీన్-3ను ప్రయోగించింది. దీని పరిధి.. 2,700 కిలోమీటర్లు. ఇదిలా ఉంటే.. తమ దేశం చేపట్టే అణు పరీక్షలు భారత్ ముప్పును ఎదుర్కొనేందుకేనని పాక్ పలుమార్లు బాహాటంగానే ప్రకటించుకుంది. కిందటి ఏడాది.. పాక్ మీద లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్స్ కార్యక్రమంపై అమెరికా ఆంక్షలు విధించగా.. పాక్ వాటిని పక్షపాత ధోరణిగా ప్రకటించింది.ప్రస్తుతం పాక్ దగ్గర 170 న్యూక్లియర్ వార్‌హెడ్స్ ఉన్నాయి. తద్వారా న్యూక్లియర్ నాన్ ప్రొలైఫ్రేషన్ ట్రీటీ(NPT)కి పరిధిని ఉల్లంఘించింది. న్యూక్లియర్ వెపన్స్‌ను కట్టడి చేయడం, తద్వారా అణు శక్తిని పరిమితంగా(శాంతి పరిధికి లోబడి) ఉపయోగించుకోవాలని చెప్పడం ఈ ఒప్పంద ఉద్దేశం.ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత సైన్యం.. మే నెలలో పాక్ ఉగ్రశిబిరాలపై, ఆ దేశ ప్రధాన ఎయిర్‌బేస్‌లపై దాడులు జరిపింది. ఆ సమయంలో పాక్ తన హైపర్సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగించిందని.. అయితే భారత రోబస్ట్ ఎయిర్‌డిఫెన్స్ సిస్టమ్ దానిని అడ్డుకుందనే ప్రచారం జోరుగా నడిచింది. అటుపై భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు కేంద్రమంత్రులు పాక్ న్యూక్లియర్ కార్యకలాపాలపై దృష్టిసారించాలని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీని కోరారు. పాక్ అలాంటి ఆయుధాల విషయంలో హద్దులు మీరి ప్రవర్తించదనే ఆశిస్తున్నట్లు రాజ్‌నాథ్ కూడా వేరుగా ఓ ప్రకటన చేశారు. -
జపాన్ భూభాగంపై తొలి క్షిపణి పరీక్ష
టోక్యో: చైనాకు ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో జపాన్ తన సైనిక పాటవాన్ని వేగంగా పెంచుకునే ప్రయత్నాల్లో పడింది. ఇందులో భాగంగా తొలిసారిగా మంగళవారం తన భూభాగంపై మొట్టమొదటి క్షిపణి ప్రయోగాన్ని చేపట్టింది. హొక్కైడై దీవిలోని షిజునాయ్ యాంటీ ఎయిర్ ఫైరింగ్ రేంజ్ నుంచి టైప్ 88 సర్ఫేస్ టు షిప్ తక్కువ శ్రేణి క్షిపణి ప్రయోగాన్ని చేపట్టినట్లు వెల్లడించింది.40 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఈ క్షిపణి ఛేదించిందని తెలిపింది. పరిమిత స్థలం, రక్షణ పరమైన జాగ్రత్తల రీత్యా ఇప్పటి వరకు జపాన్ తన క్షిపణి ప్రయోగాలను విస్తారభూభాగాలున్న అమెరికా, ఆస్ట్రేలియాల్లో చేపడుతూ వచ్చింది. ఈ మేరకు ఆయా దేశాలతో ఒప్పందం కుదుర్చుకుంది. సైనికపరమైన స్వయం సమృద్ధత సాధించే దిశగా మంగళవారం తన భూభాగంలోనే క్షిపణి పరీక్ష చేపట్టింది. -
52 ఏళ్లుగా కడుపులోనే టూత్ బ్రెష్..!ఐతే సడెన్‌గా..
అనుకోకుండా ఏదైనా వస్తువుని పొరపాటున మింగితే అప్పటికీ ఎలాంటి సమస్య తలెత్తదు కొందరికి. కానీ ఒక్కోసారి అనారోగ్యం పాలైనప్పుడూ లేదా శరీరంలో ఇమ్యూనిటీ పవర్ తగ్గినప్పుడూ..ఆ వస్తువు ప్రాణాంతకంగా మారిపోతుంది అందుకు నిదర్శనమే ఈ ఘటన. అసలేం జరిగిందంటే..ఈ విచిత్రమైన ఘటన చైనాలో చోటుచేసుకుంది. యంగ్ అనే 64 ఏళ్ల వ్యక్తి కొన్ని రోజుల క్రితం విపరీతమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వచ్చాడు. అయితే ఇది గ్యాస్ నొప్పా లేక మరేదైనా అని క్షుణ్ణంగా పరిశోధించినా.. సమస్య ఏంటన్నది తేలలేదు. దీంతో అతడి జీర్ణవ్యవస్థలో ఏదైనా సమస్య ఉందా.. ? అని వైద్య పరీక్షలు చేస్తుండగా చిన్న పేగుల్లో ఒక వస్తువుని చూసి అవాక్కయ్యారు వైద్యులు. దాన్ని క్లియర్‌గా స్కాన్ చేయగా టూత్ బ్రష్ అని తేలింది. ఆ విషయమై సదరు పేషెంట్ యంగ్‌ని వైద్యులు ప్రశ్నించారు. అతడు తానెప్పుడో చిన్నతనంలో టూత్ బ్రెష్ మింగేసిన విషయం గుర్తు తెచ్చకున్నాడు. సుమారు 12 ఏళ్ల వయసులో టూత్ బ్రష్‌ని మింగేశానని, అయితే తల్లిదండ్రులు తిడతారని ఆ విషయం వారికి చెప్పలేదని నాటి ఘటనను గుర్తుతెచ్చుకున్నాడు యంగ్. అది విని వైద్యులే కంగుతిన్నారు. ఏంటీ 52 ఏళ్లుగా కడుపులోనే ఈ టూత్ బ్రష్ ఉండిపోయిందా.. ? అని ఆశ్చర్యపోయారు వైద్యులు. నిజానికి టూత్ బ్రష్ పేగుల్లోకి చేరి తిరుగుతూ కణజాలాన్ని పంక్చర్ చేసే ప్రమాదం లేకపోలేదన్నారు. అలా జరిగితే పేగుల్లో చిల్లులు ఏర్పడి ప్రాణాంతకంగా మారుతుందన్నారు. కానీ ఇక్కడ యంగ్ విషయంలో అదృష్టవశాత్తు టూత్ బ్రష్ పేగు వంపులో చిక్కుకుపోయి..దశాబ్దాలుగా అక్కడే ఉండిపోయిందన్నారు వైద్యులు. అయితే ఇది ఇప్పుడు పేగుల్లో కదలడం మొదలవ్వడంతోనే.. యంగ్ విపరీతమైన కడుపునొప్పిని అనుభవించినట్లు తెలిపారు. అయితే వైద్యులు చాలా గంటలు శ్రమించి ఆ టూత్ బ్రష్‌ని విజయవంతంగా కడుపులోంచి వేరు చేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఐదు దశాబ్దాలుగా టూత్బ్రష్తోనే జీవించాడా వ్యక్తి.. ? అని ఆశ్చర్యపోతున్నారు. ఇన్నాళ్లు అతడికి ఎటువంటి హాని కలిగించకపోవడం అనేది నిజంగా అదృష్టం అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: యవ్వనంగా ఉండాలంటే.. చర్మంపై ఫోకస్ తప్పనిసరి..!) -
మీరు ఇచ్చే సందేశం ఏమిటి? : అమెరికాపై చైనా ధ్వజం
ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడులను చైనా తీవ్ర స్థాయిలో ఖండించింది. ఆపరేషన్ మిడ్నైట్ హమ్మర్ పేరుతో ఇరాన్‌పై యూఎస్ చేస్తున్న దాడులు ఎంతమాత్రం సరికాదని హెచ్చరించింది. అసలు ఈ దాడులతో ప్రపంచానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారని చైనా ప్రశ్నించింది. ‘ మీరు చేస్తున్న దాడులతో ప్రపంచానికి తప్పుడు సందేశం పంపించారు. ఇది చెడు సంకేతాన్ని సృష్టించారు’ అంటూ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి పేర్కొన్నారు. ఇప్పటికే యుద్ధం భీకర రూపం దాల్చిన తరుణంలో దాన్ని శాంతింప చేయాల్సింది పోయి.. అగ్నికి ఆజ్యం పోస్తారా? యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను వాంగ్ యి ప్రశ్నించారు. ప్రస్తుతం ఇజ్రాయిల్, అమెరికాలు చేస్తున్న యుద్ధంతో భవిష్యత్‌లో పెను ముప్పు ఏర్పడే అవకాశం ఉందన్నారు. సోమవారం బీజింగ్‌లో బ్రిటిష్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో జరిగిన సమావేశంలో వాంగ్ ఈ వ్యాఖ్యలు చేసిన విషయాన్ని చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇరాన్ అణుస్థావరాలే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న దాడులతో టెహ్రాన్‌లో భయానక వాతావరణం ఏర్పడింది. అక్కడ ప్రజలు కూడా తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వేడుకుంటున్నారు. అదే సమయంలో ఇజ్రాయిల్ సైతం.. టెహ్రాన్‌లో ఉన్న ప్రజలను ఖాళీ చేయించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో ఇరాన్ అత్యవసర సమావేశాలు నిర్వహిస్తోంది. అటు రష్యాతో ఇప్పటికే చర్చలు జరిపిన ఇరాన్.. యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్‌తో అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. ఇరాన్‌కు సాయం చేస్తాంఇరాన్పై అమెరికా దాడులను రష్యా అధ్యక్షుడు పుతిన్ ఖండించారు. ఇరాన్‌పై అమెరికా దాడులను తాము సమర్ధించడం లేదని స్పష్టం చేశారు. అదే సమయంలో ఇరాన్ ప్రజలకు సాయం చేయడానికి తాము అండగా ఉంటామన్నారు. -
ఇరుకున పడ్డ ఇరాన్!
అగ్రరాజ్యం అమెరికా సైతం తమపై కత్తికట్టడంతో ఇప్పుడు ఇరాన్ తాడోపేడో తేల్చుకోవాల్సిన తరుణమొచ్చింది. అయితే ఈ కష్టకాలంలో కాడెత్తేయకుండా కడదాకా తమకు తోడుగా నిలిచే నిజమైన నేస్తలెందరో ఇప్పుడు ఇరాన్ లెక్కబెట్టుకుంటోంది. యుద్ధంలో పైచేయి సాధించేందుకు పనికొచ్చే ప్రత్యామ్నాయాలు ఎన్ని ఉన్నాయో బేరీజువేసుకుంటోంది. ఇజ్రాయెల్, అమెరికాలకు దీటుగా చైనా, రష్యా ఏమేరకు తనకు సైనిక సాయం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఇస్తాయోనని ఇరాన్ సమీక్ష జరుపుతోంది. హోర్ముజ్ జలసంధి మీదుగా చమురు నౌకల రాకపోకలను అడ్డుకుంటే తనకు ఒనగూరే లాభమెంతో లెక్కేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇరాన్ ముందు ఆప్షన్లు ఎన్ని అనే అంశం ప్రధానంగా అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. హోర్ముజ్ జలసంధిని ఆపేస్తే?సముద్రం ద్వారా రావాణా అయ్యే చమురులో దాదాపు 25 శాతం ఈ హోర్ముజ్ జలసంధి ద్వారానే సరఫరా అవుతోంది. కేవలం 33 కిలోమీటర్ల వెడల్పుండే ఈ జలమార్గం గుండా చమురు, సహజవాయువు రవాణా నౌకలను అడ్డుకుంటే ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరిగే ప్రమాదం పొంచి ఉంది. పెట్రోల్, డీజిల్ ధరల మంటలు పైకి ఎగిస్తే ప్రపంచార్థికం దెబ్బతినడం ఖాయం. ఈ భయాలను బూచిగా చూపి తమపై దాడులను ఆపాలని అమెరికా, ఇజ్రాయెల్ కూటమి దేశాలను ఇరాన్ హెచ్చరించే వీలుంది. వేగంగా దూసుకెళ్లే బోట్ల ద్వారా వేలాదిగా మెరైన్ మైన్(సముద్ర మందుపాతర)లను జలసంధి మార్గంలో ఇరాన్ మొహరించిందనే వార్తలు వెలువడ్డాయి. వీటిలో నిజమెంతో ఎవరికీ తెలీదు. అదే నిజమైతే నౌకలు అటు వెళ్లేందుకు వణుకుతాయి. పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై ముప్పేట దాడి?అమెరికా భూభాగం నుంచి నేరుగా దాడులు చేయడం కష్టం. పశ్చిమాసియాలో దశాబ్దాలుగా తిష్టవేసి ఏర్పాటుచేసుకున్న సమీప స్థావరాల నుంచే అమెరికా దాడిచేయగలదు. కువైట్, బహ్రెయిన్, ఖతార్, యుఏఈలోని అమెరికా వైమానిక స్థావరాలపై ఇరాన్ మెరుపుదాడులు చేసి ప్రతిదాడులను నిలువరించవచ్చు.ఈ భయంతోనే అమెరికా ఇప్పటికే ఒకటి, రెండు స్థావరాల నుంచి యుద్ధవిమానాలను వేరేచోటుకు తరలించినట్లు ప్రైవేట్ శాటిలైట్ తాజా చిత్రాలతో స్పష్టమైంది. అమెరికా గడ్డపై తమ మద్దతుదారుల ద్వారా పేలుళ్లు జరిపి మారణహోమం సృష్టించే ఛాన్సుంది. అందుకే ఈ విషయంలో అమెరికా ఇప్పటికే అప్రమత్తమై పలు ప్రధాన ప్రాంతాల్లో నిఘాను కట్టుదిట్టంచేసిందని వార్తలొచ్చాయి.పెంచిపోషించిన సాయుధ సంస్థల సాయంతో..గాజాలో హమాస్, లెబనాన్‌లో హెజ్బొల్లా, యెమెన్‌లో హౌతీ రెబల్స్, ఇరాక్‌లో మిలీషియా సంస్థలకు ఆర్థిక, ఆయుధసాయం చేసి ఇరాన్ తన పరోక్ష సైన్యంగా తీర్చిదిద్దుకుంది. వీటిని ఒకరంగా ప్రతిఘటన దళంగా పేర్కొంటారు. అయితే 20 నెలలుగా ఇజ్రాయెల్‌తో పోరాడి హమాస్ తన అగ్రనాయకత్వాన్ని కోల్పోయి ఒకరకంగా అలసిపోయింది. హెజ్బొల్లా ఉగ్రసంస్థ పోరాడే వీలుంది. ఇరాన్‌తో కలిసి నడుస్తామని మూడ్రోజుల క్రితమే హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. ఎర్రసముద్రంలో విదేశీ చమురు నౌకలు అడ్డుకుంటామని చెప్పారు. ఇరాక్‌లోని మిలీషియా సంస్థలు ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే మిలీషియాలు, హౌతీలకు డ్రోన్లు, చిన్నపాటి క్షిపణులను ప్రయోగించడంలో నైపుణ్యముంది. వీళ్లు ఇరాన్‌కు తోడు నిలిచే అవకాశముంది.చైనా, రష్యాల పరోక్ష సాయంచైనా ఇప్పటికే కొన్ని చమురునౌకల ముసుగులో కొన్ని ఆయుధాలను ఇరాన్‌కు తరలించి సాయపడినట్లు తెలుస్తోంది. యుద్దం తీవ్రతరమైతే తమ చిరకాల మిత్రుడు ఇరాన్‌కు సాయంగా రష్యా, చైనాలు ముందడుగు వేసే వీలుంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులను ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్ తప్పుబట్టారు. ఈ విషయమై ఇటీవలే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో పుతిన్ ఫోన్లో మాట్లాడారు.అణుకార్యక్రమం ఆగకపోవచ్చా?యురేనియం శుద్ది కర్మాగారాలపై ఇజ్రాయెల్, అమెరికా క్షిపణి, బాంబు దాడులు ఇరాన్‌ను అణ్వాయుధం తయారుచేయకుండా మరికొన్ని వారాలు, నెలలు అడ్డుకో గలవుగానీ శాశ్వతంగా ఆపలేవని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. న్యూక్లియర్ సెంటర్లలోకాకుండా వేరేచోట్ల యురేనియంను నిల్వచేస్తే అమెరికా, ఇజ్రాయెల్‌ల పరిస్థితి ఏంటనే అంశం తెరమీదకొచ్చింది. తన దేశ ఉనికి, అస్థిత్వం ప్రశ్నార్థకంగా మారే పరిస్థితే వస్తే ఇరాన్ ఎంతకైనా తెగిస్తుందనే విశ్లేషణల నడుమ ఈ సమరం ఏ దిశలో పయనిస్తుందో ఇప్పుడే ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇది దుస్సాహసాల యుగం
ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు దిగింది. కానీ అదంత తేలిక కాలేదు. ఇప్పటికీ తన లక్ష్యం సాధించలేక పోయింది. చైనాపై ఆధారపడటం అనివార్యమైంది. ఇటీవలి ఉక్రెయిన్ డ్రోన్ దాడులు దాన్ని మరీ ఉక్కిరిబిక్కిరి చేశాయి. అయితే రష్యా ఏం ఓడలేదు. పైగా, 2022 ఫిబ్రవరి తర్వాత ఎన్నడూ లేనంత బలీయంగా ఇప్పుడు రూపొందింది. అంతర్జాతీయంగా రష్యాను ఏకాకి చేయాలన్న పథకం నీరుగారి పోయింది. ఈ పథక రచనలో ప్రధాన సూత్రధారి అమెరికా భంగపడింది. ఎలాగోలా రష్యాతో ఒప్పందం చేసుకోవాలని ఈ అగ్రరాజ్యం ఇప్పుడు అంగలారుస్తోంది. యూరోపియన్ యూనియన్ భద్రత మీద, ఉక్రెయిన్ సార్వభౌమికత మీద చేస్తున్న వ్యయం తగ్గించుకోవాలని భావిస్తోంది. యుద్ధం ద్వారా కాకుండా దౌత్యంతోనే ఈ ఊబి నుంచి బయటపడాలనుకుంటోంది.రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇందుకు ససేమిరా అన్నా ఆశ్చర్యపోయేదేం లేదు. మనిషిని అతడి అనుభవాలు రూపుదిద్దుతాయి. ‘దుస్సాహసం ఫలిస్తుంది’ అన్నది పుతిన్ తన అనుభవాల నుంచి నేర్చుకున్నపాఠం. ఒక దేశం మీద దండెత్తాడు. ఇప్పటిదాకా నెగ్గుకొచ్చాడు. మరింత ఉక్రెయిన్ భూభాగంపై పట్టు సాధించగలనన్న, తద్వారా తన విదేశాంగ విధానం ఎలా ఉండాలో నిర్ణయించుకునే శక్తి రష్యాకు సమకూరుతుందన్న, తూర్పు మధ్య యూరప్ ప్రాంతాల భద్రతకు ఢోకా ఉండదన్న ఆలోచన ఇలాగే కొనసాగవల్సిందిగా పుతిన్‌ను పురిగొల్పి ఉంటుంది. దుస్సాహసం ఫలిస్తుంది!గాజా మీద ఇజ్రాయెల్ దురాక్రమణకు దిగింది. హమాస్ టెర్రరిజం ప్రస్తుత సంక్షోభానికి పురిగొల్పింది అనడంలో సందేహం లేదు. అయితే, అందుకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ మితిమీరి ప్రతిస్పందించింది. అంతర్జాతీయ విశ్వసనీయతను కోల్పోయింది. ఇజ్రాయెల్ అంటే అదో జాతి నిర్మూలన శక్తి అని ప్రపంచవ్యాప్తంగా ఒక తరం మనస్సులో శాశ్వతంగా ముద్ర పడింది. ఈ దాడి ఆ దేశ వనరులను హరించివేసింది. పొరుగున ఉన్న అరబ్బు దేశాలతో సాధారణ సంబంధాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఇజ్రాయెల్ దీర్ఘకాలిక భద్రత కూడా ప్రమాదంలో పడినట్లే!అయితే ఇజ్రాయెల్ ఏం ఓడలేదు. ఆ దేశపు దూరదృష్టి లేని వ్యూహకర్తలు కోణం నుంచి చూస్తే, హమాస్ నాయకత్వాన్ని తుదముట్టించడంతో పాటు వారి సైనిక స్థావరాలను ధ్వంసం చేసిన ఇజ్రాయెల్ ఈ పోరులో విజయం సాధించింది. హెజ్బొల్లా నాయకత్వాన్ని, సైనిక సదుపాయాలను నిర్మూలించి, లెబనాన్ పాలనలో మార్పు తెచ్చింది. సిరియా ప్రభుత్వ మార్పుకు పరోక్షంగా దోహదపడింది. నెతన్యాహూ ఇలాగే ముందుకు సాగి ఇరాన్ మీద దాడి చేశాడంటే అందులో ఆశ్చర్యపోయేదేం లేదు. మనిషిని అతడి అనుభవాలు తీర్చిదిద్దుతాయి. పుతిన్ అనుకున్నట్లే, నెతన్యాహూకు కూడా అతడి అనుభవం పాఠం నేర్పింది. ఆ పాఠం: దుస్సాహసం ఫలిస్తుంది. అంతర్జాతీయ న్యాయసూత్రాలను అన్నింటినీ ఉల్లంఘించాడు. యుద్ధఖైదీ అభియోగం మోపి అరెస్టు చేయాలన్న ఇంటర్నేషనల్ వారెంటును పట్టించుకోలేదు. పాలస్తీనా కలలను చిదిమివేసిన అనుభవమే మరో దేశంపై దండెత్తడానికి, ఆ దేశ అణుశక్తి కార్యక్రమాలను వమ్ము చేయడానికి, అక్కడ ప్రభుత్వాన్ని కూలదోయడానికి నెతన్యాహూను పురిగొల్పి ఉంటుంది.ప్రత్యక్ష ఆక్రమణలు కాకపోయినా...వీగర్ల స్వయంప్రతిపత్తి ప్రాంతమైన షిన్జియాంగ్ను చైనా జైలుగా మార్చేసింది. టిబెట్‌లో జనాభా స్వరూప స్వభావాలను మార్చింది. హాంకాంగ్‌ను హస్తగతం చేసుకుని రెండు వ్యవస్థల విధానాన్ని అమలు చేస్తామన్న చట్టబద్ధ హామీని విస్మరించింది. సౌత్ చైనా సముద్రంలోని ద్వీపాలను సైనిక స్థావరాలుగా చేసుకుంది. తన సరిహద్దుల వెలుపల తైవాన్‌తోపాటు, ఇతర తూర్పు ఆసియా దేశాల్లో పరోక్ష అధికారం చలాయిస్తోంది. ఇవేవీ కూడా ప్రత్యక్ష ఆక్రమణలు కాకపోవచ్చు. కానీ ఇవన్నీ కలిపి చూస్తే, తన ఆధిపత్యాన్ని క్రమంగా పెంచుకుంటూ పోయి చివరకు పూర్తిగా కబళించివేస్తున్నట్లు అర్థమవుతుంది. ఈ చర్యలతో చైనా ప్రతిష్ఠ మసకబారింది. చైనా ప్రాబల్యాన్ని అడ్డుకునేందుకు వీలుగా పలు దేశాలు కూటములుగా జట్టు కట్టేందుకు, చైనా వస్తు సరఫరాలకు ప్రత్యామ్నాయాలు వెతుక్కునే పరిస్థితికి దారితీసింది. అయినా చైనా ఏం ఓడలేదు. వాస్తవానికి, తన ఆక్రమణలు అన్నిటినీ ‘న్యూ నార్మల్’గా మార్చేయగలిగింది. సాగర జలాల్లో తన అధికార ప్రదర్శనను కొనసాగించగలనని, లేదా తైవాన్ను ఆక్రమించుకోగలనని జిన్‌పింగ్ అనుకుంటే అందులో ఆశ్యర్యపడేదేం లేదు. ఒక మనిషిని అతడి అనుభవాలు రూపుదిద్దుతాయి. పుతిన్, నెతన్యాహూల మాదిరిగానే జిన్‌పింగ్ కూడా అనుభవాల నుంచి పాఠం నేర్చుకున్నాడు. ఆ పాఠం: దుస్సాహసం ఫలిస్తుంది. ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాను హస్తగతం చేసుకున్నాడు. దేశానికి శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. ప్రత్యర్థులను అణచివేయడానికి అవినీతి వ్యతిరేక ఉద్యమాలను ఉపయోగించుకున్నాడు. హిమాలయాల్లో కానీ, సాగరాల్లో కానీ, పసిఫిక్ లేదా యూరేషియాలో కానీ ఇలాగే ముందుకు సాగాలని ఈ అనుభవమే జిన్‌పింగ్‌ను పురిగొల్పి ఉంటుంది. ఉగ్రవాద దుస్సాహసంఏప్రిల్ 22న పాకిస్తాన్ తైనాతీలు మరోసారి ఇండియాపై పహల్గామ్లో ఉగ్రదాడికి తెగబడ్డారు. అలాంటి ఘటన, దాని పర్యవసానాలు... టెర్రరిజం ఎగుమతుల కేంద్రంగా పాకిస్తాన్ పొందిన గుర్తింపును ఇంకా బలపరిచాయి. అంతంత మాత్రంగా ఉన్న ఆర్థిక సామర్థ్యాన్ని మరింత కుంగదీశాయి. సైనిక పరంగా పాకిస్తాన్ బలహీనతలను బహిర్గత పరచాయి. దేశ సౌభాగ్యానికి అవసరమైన ప్రాదేశిక సమగ్రతను మరింత దూరం చేశాయి.అయితే తాను ఓడిపోయానని పాకిస్తాన్ అనుకోవడం లేదు. పైగా, రావల్పిండిలోని మిలిటరీ జనరళ్ల దృష్టిలో పాకిస్తాన్ గెలిచింది. తామే తప్పూ చేయడం లేదన్న యుద్ధోన్మాద ధోరణి ఇకమీదటా చెల్లిపోతుందని ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్ అనుకుంటే అందులో ఆశ్చర్యపడేదేం లేదు. మనిషిని అతడి అనుభవాలు రూపుదిద్దుతాయి. జిన్‌పింగ్, పుతిన్, నెతన్యాహూల మాదిరిగానే, తన అనుభవాలు అతడికి పాఠం నేర్పాయి. ఆ పాఠం: దుస్సాహసం ఫలిస్తుంది. మునీర్ ద్వేషం రగిల్చే ప్రసంగాలు చేశాడు. ఉగ్రవాద తైనాతీలను ప్రోత్సహించాడు. ప్రత్యర్థిని సైనిక ఘర్షణలోకి దించాడు. అంతర్జాతీయ పాత్ర కోసం అభ్యర్థన చేశాడు. కాల్పుల విరమణను విజయంగా ప్రకటించుకున్నాడు. కొన్ని తరాల ప్రజలను శోకంతో తపించేలా చేసినా, పాకిస్తాన్‌కు కావల్సిన ప్రచారాన్ని, ప్రజల్లో చీలికను సాధించిపెట్టిన ఇలాంటి ఉగ్రదాడులతోనే ముందుకుసాగేందుకు మునీర్‌ను అతడి అనుభవం పురిగొల్పవచ్చు. మరో దేశం మీద దండెత్తడం, ప్రజలను ఆకలితో అలమటింపజేయడం దుస్సాహసం (అడ్వెంచరిజమ్) అవుతుంది. టెర్రరిజానికి ఆశ్రయం ఇవ్వడం లేదా మరొకరి భూభాగాన్ని కైవసం చేసుకోవడం దుస్సాహసం అవుతుంది. అన్ని అంతర్జాతీయ నియమాలనూ, చట్టాలనూ ఉల్లంఘించడం, ట్రైబ్యునల్ ఉత్తర్వులను తిరస్కరించడం దుస్సాహసం అవుతుంది. మానవ సమాజాలు ఏర్పడినప్పటి నుంచీ దుస్సాహసం ఉంది. దీన్ని అడ్డుకునేది చట్టం, ఆచారం, స్వీయ నిగ్రహం... ఇవేవీ కావు. విఫలమవుతామన్న భయం, అందుకు చెల్లించాల్సిన మూల్యం మాత్రమే దుస్సాహసాన్ని అడ్డుకోగలవు. విషాదం ఏమిటంటే, ఇప్పుడు ఈ వైఫల్యభీతి అంతరించింది. అడ్వెంచరిజం ఫలించే యుగం ఇది.ప్రశాంత్ ఝా వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ ఎనలిస్ట్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
మేకిన్ ఇండియాతో చైనాకే లాభం.. మనకు నష్టం
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’తో మన దేశానికి ఎలాంటి లాభం లేకపోగా చైనాయే ఎక్కువగా లాభపడిందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ తీవ్రంగా విమర్శించారు. 2014 తర్వాత భారత్‌లో తయారీ రంగం జీడీపీలో 14 శాతానికి పడిపోవడం, చైనా నుంచి దిగుమతులు రెట్టింపు కావడాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రధాని మోదీ నినాదాలు ఇవ్వడంలో మాస్టర్ అని.. పరిష్కారాలు చూపడంలో కాదని రాహుల్ ఎద్దేవా చేశారు. శనివారం రాహుల్ తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ఖాతాలో ఒక పోస్ట్‌పెట్టారు. ‘మేక్ ఇన్ ఇండియా పరిశ్రమల బూమ్కి మోదీ సర్కార్ హామీ ఇచి్చంది. అయితే తయారీరంగం ఎందుకు చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయికి దిగజారింది? యువత అత్యధిక స్థాయిలో నిరుద్యోగాన్ని ఎదుర్కొంటోంది. చైనా నుంచి దిగుమతులు రెట్టింపయ్యాయి. నినాదాలు ఇచ్చే కళలో మోదీ విపరీతమైన నైపుణ్యం సాధించారు. కానీ పరిష్కారాలు చూపడంలో ఘోరంగా విఫలమయ్యారు’’అని రాహుల్ విమర్శించారు. అంతా అసెంబ్లింగ్ ఢిల్లీలో ప్రముఖమైన ఎల్రక్టానిక్స్ విక్రయ దుకాణ సముదాయం అయిన నెహ్రూ ప్లేస్‌ను రాహుల్ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి మొబైల్ రిపేర్ టెక్నీషియన్స్ అయిన సైఫ్, శివమ్‌లతో కొద్దిసేపు మాట్లాడారు. సంబంధిత వీడియోనూ ‘ఎక్స్’లో రాహుల్ షేర్చేశారు. ‘‘‘నిజం ఏంటంటే.. ఇతర దేశాల నుంచి విడిభాగాలను దిగుమతి చేసుకుంటున్నాం. వాటికి బిగించే అసెంబ్లింగ్ పనిచేస్తున్నాం. అంతేగానీ ఇక్కడ ఉత్పత్తిచేయట్లేము. అందుకే మన కారణంగా చైనా లాభపడుతోంది. చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్రక్టానిక్ మార్కెట్‌గా వెలుగొందుతోంది. ఇంతపెద్ద మార్కెట్ మరేచోటా లేదు. మనం ఐఫోన్ విడిభాగాలను దిగుమతిచేసుకుని అసెంబ్లింగ్ చేస్తున్నాం. ఇది అతికొద్ది మంది పారిశ్రామికవేత్తల కనుసన్నల్లో జరుగుతోంది. ఇకపై మనమే ఐఫోన్లను తయారుచేసే స్థాయికి ఎదుగుదాం. అప్పుడే ఈ పరిశ్రమ పురోగతి సాధిస్తుంది. ఇతర దేశాల వస్తువులకు భారత్ అనేది మార్కెట్‌గా ఉండకూడదు. స్థానికంగా ఉత్పత్తులను తయారుచేసి ఎగుమతి చేసే మార్కెట్‌గా భారత్ అవతరించాలి. ఇందుకోసం ప్రాథమికస్థాయిలోనే సంస్కరణలు రావాలి. లక్షల కొద్దీ తయారీదారులు తయారుకావాలి. ఇందుకు ఎంతో నిజాయతీతో కూడిన సంస్కరణలు, ఆర్థిక దన్ను అవసరం. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం(పీఎల్ఐ) ప్రయోజనాలనూ ప్రభుత్వం గుట్టుచప్పుడుకాకుండా నెమ్మదిగా ఉపసంహరించుకుంటోంది. ఇది కూడా ప్రభుత్వ వైఫల్యమే’అని రాహుల్ గాంధీ మండిపడ్డారు. విమర్శించిన బీజేపీ రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. ‘‘దేశంలో భారీ సంస్కరణలు, దేశ పురోగతిని అందరూ కళ్లారా చూస్తున్నారు ఒక్క రాహుల్ తప్ప. దేశ ప్రగతిని తక్కువ అంచనా వేయంలో రాహుల్ బిజీగా మారారు. భారత స్వావలంభనకు ఆపరేషన్ సిందూర్ తాజా తార్కాణం. చైనా తయారీ డ్రోన్లను భారత తయారీ డ్రోన్లు నేలకూల్చాయి’’అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ అన్నారు. -
దేశీ కంపెనీలకు రేర్ తిప్పలు!
న్యూఢిల్లీ: రేర్ ఎర్త్ మాగ్నెట్స్ ఎగుమతులపై చైనా నియంత్రణలను కఠినతరం చేయడంతో భారతీయ కంపెనీలు విలవిల్లాడుతున్నాయి. ప్రధానంగా వాహన విడిభాగాల పరిశ్రమను ఈ అనిశ్చితి వెంటాడుతోంది. నేరుగా చైనా నుంచి రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ల దిగుమతి కోసం లైసెన్స్‌లకు దరఖాస్తులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన రెండు వారాల్లో దేశీ కంపెనీల దరఖాస్తుల సంఖ్య రెట్టింపైనట్లు పరిశ్రమ వర్గాల సమాచారం. జూన్ మధ్య నాటికి సుమారు 21 కంపెనీలు మీడియం, హెవీ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ దిగుమతి పరి్మట్ల కోసం చైనా వాణిజ్య శాఖకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎగుమతిదారులు కొనుగోలుదారు నుంచి ఎండ్–యూజర్ సరి్టఫికెట్‌ను తీసుకోవడం సహా అధికారిక అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేస్తూ చైనా ఏప్రిల్ 4న ఆదేశాలు చేసిన నేపథ్యంలో వీటి ఎగుమతులకు తీవ్ర అండ్డంకులు నెలకొన్నాయి. ఈ రేర్ ఎర్త్ మాగ్నెట్ మెటీరియల్స్‌ను ఎలాంటి ఆయుధాల ఉత్పత్తిలోనూ ఉపయోగించబోమని హామీ ఇవ్వడంతో పాటు నిర్దిష్ట డిక్లరేషన్లు ఈ సరి్టఫికెట్లో ఉంటాయి. చైనాకు దరఖాస్తు చేసిన కంపెనీల్లో బాష్ ఇండియా, మారెల్లి పవర్‌ట్రెయిన్ ఇండియా, మాహల్ ఎలక్ట్రిక్ డైవŠస్ ఇండియా, టీవీఎస్ మోటార్స్, యూనో ఇండియా తదితర దిగ్గజాలు ఉన్నాయి. విధానపరమైన కారణాలతో గతంలో తిరస్కరణకు గురైన సోనా కామ్స్టర్ తిరిగి దరఖాస్తు చేసుకుంది. చైనా ఆమోదం కోసం వేచి చూస్తోంది. 52 కంపెనీలు... భారతీయ వాహన తయారీ సంస్థల సంఘం (సియామ్) వివరాల ప్రకారం భారతీయ ఆటోమబైల్ కంపెనీలకు సరఫరా చేయడం కోసం దాదాపు 52 కంపెనీలు పూర్తిగా చైనా మాగ్నెట్లపైనే ఆధారపడుతున్నాయి. వీటిలో చాలా వరకు తమ తాజా పర్మిట్ల కోసం అన్ని లాంఛనాలను పూర్తి చేసి చైనా సరఫరాదారులకు డాక్యుమెంట్లను పంపించాయి. అయితే, చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ నుంచి వాటికి ఇంకా తప్పనిసరి ఎగుమతి లైసెన్స్ రాకపోవడంతో ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. మరోపక్క, భారతీయ అధికారులు కూడా చైనాతో చర్చల కోసం దౌత్యపరమైన ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, పెద్దగా పురోగతి కనిపించడం లేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అమెరికా, యూరోపియన్ సంస్థలు మాత్రం ఈ విషయంలో వేగంగా చర్యలు తీసుకున్నాయి. వాస్తవానికి యూఎస్ సుంకాలకు ప్రతిగా చైనా రేర్ ఎర్త్ మాగ్నెట్లపై నిబంధనలను కఠినతరం చేయగా.. అమెరికా ప్రభుత్వం వాటి సరఫరా విషయంలో ఇప్పటికే ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం. యూరప్ వాహన విడిభాగాల తయారీ సంస్థలకు కూడా అనుమతులు లభించాయి. భారతీయ కంపెనీలు మాత్రం అనుమతుల కోసం నానాతప్పలు పడుతున్నాయి.ఉత్పత్తికి విఘాతం... వీలైనంత త్వరగా లైసెన్స్‌లు దక్కకపోతే తయారీకి తీవ్ర విఘాతం కలుగుతుందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మన పరిశ్రమ స్థాయితో పోలిస్తే రేర్ ఎర్త్ మాగ్నెట్ల దిగుమతుల విలువ తక్కువే అయినప్పటికీ.. వాటిని ఉపయోగించి తయారు చేసే ఒక్క విడిభాగం లేకపోయినా వాహనాల తయారీ నిలిచిపోతుందని ఆటోమొబైల్ కంపెనీకి చెందిన ఒక ఎగ్జిక్యూటివ్ పేర్కొన్నారు. 2024–25లో భారత్ రూ.306 కోట్ల విలువైన 870 టన్నలు రేర్ ఎర్త్ మాగ్నెట్లను దిగుమతి చేసుకుంది. ప్రస్తుతం కంపెనీల వద్దనున్న నిల్వలు జూన్ మొదటి నాటికి పూర్తిగా అయిపోతాయని కంపెనీలు హెచ్చరిస్తున్నాయి. -
మోడ్రన్ బామ్మ..! ఆమె చేసే వర్కౌట్లు చూస్తే షాకవుతారు!
తొమ్మిది పదుల వయసులో చాలా చలాకీగా ఓ బామ్మ వ్యాయామాలు చేసేస్తోంది. ఆ క్రమంలోనే ఆమె ఒక్కసారిగా నెటిజన్లను ఓ రేంజ్లో ఆకర్షించింది. యంగ్‌గా ఉండేవాళ్లు సైతం చేయలేని వ్యాయమాలను ఈ బామ్మ 90ల వయసులో సునాయాసంగా చేసి ఆశ్చర్యపరుస్తోంది. ఆ ఏజ్‌లో ఉండే కీళ్ల సమస్యలు, కాళ్ల నొప్పులు వంటివి ఏమి లేవు ఆమెకు. పైగా వృద్ధాప్యాన్ని ఇంతలా ఆరోగ్యకరంగా నిర్వహించుకోవచ్చని చాటిచెప్పింది. జీవితం అనేది ఆస్వాదించడానికేనని, అది మన చేతుల్లోనే ఉంది అని క్లియర్‌గా చెప్పింది. ఇంతకీ ఎవరా బామ్మ అంటే..చైనాకు చెందిన ఈ బామ్మ పేరు లీ. ఆమెకు పుష్ అప్, సిట్ అప్లు చేయడం వెన్నతో పెట్టిన విద్య అన్నట్లు వేస్తుందామె. ఇరవై, ముప్పైలలో ఉండే యువత సైతం చేయడానికి ఇబ్బండిపడే కష్టతరమైన వర్కౌట్లన్ని బామ్మ లీ హుషారుగా చేసేస్తుంది. ఆమె హునాన్ ప్రావిన్స్‌లోని జియాంగ్వా యావో అటానమస్ కౌంటీలో నివసిస్తోంది. నిజానికి ఆ ప్రాంతంలో నిరంతరం వర్షాలు పడుతూనే ఉంటాయి. అయితే ఆ వర్షం కూడా ఆమె ఉత్సాహాన్ని నియంత్రించలేకపోయింది. అంటే ఆమె తన వ్యాయామాలు ఇంట్లోనే చేసుకునేలా చక్కగా సర్దుబాటు చేసుకుంది. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం ఆమె అభిరుచి అని చెప్పొచ్చు. అంతలా నిబద్ధతతో చేస్తోందా బామ్మ. పైగా ఆమె ప్రతిరోజూ 200 పుష్-అప్లు, 100 సిట్-అప్ల మిస్అవ్వకుండా చూసుకుంటుందట. జూన్ ప్రారంభంలో యావో ఎత్నిక్ మైనారిటీ మెడిసిన్ ఫెస్టివల్ సందర్భంగా ఆ బామ్మ తన ఆరోగ్యకర అలవాట్లు వెలుగులోకి వచ్చి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అంతేగాదు ఆమె తన దీర్ఘాయువు సీక్రెట్‌ని కూడా షేర్ చేసుకుంది. ప్రతి రాత్రిపూట పాదాలను వేడినీళ్లలో ఉంచే అవాట్లతో కాళ్ల నొప్పులను తగ్గించుకున్నానంటోంది. మంచి ఆహారపు అలవాట్లతో జుట్టు నెరిసిపోకుండా చూసుకుంటుందట. ఇక తన చలాకి కదలికలకు కారణం 1959లో చాంగ్షాలోని కళాశాల నుండి పట్టభద్రురాలైన వెంటనే కిండర్ గార్టెన్ టీచర్‌గా పనిచేయడమేనని అంటోందామె. ఎందుకంటే పిల్లలు కదలికలు చాలా అద్భుతంగా ఉంటాయి. వారిలో ఉండే చురుకుదనం తనకెంతో ఇష్టమని అంటోంది. అలానే యాక్టివ్‌గా జీవితాంతం ఉండాలనే ఆకాంక్ష..ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేలా చేసిందని అంటోంది బామ్మ లీ.వయస్సుతో పాటు మన శరీర కదలికలు తగ్గుతాయి..దాన్ని గమనించి మంచి ఆరోగ్య అలవాట్లు, జీవనశైలిని సరిచేసుకుంటే.. వృద్ధాప్యంలో ఎవ్వరిపై ఆధారపడకుండా..ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆశ్వాదించగలమని చెబుతోంది ఈ బామ్మ. నెటిజన్లు సైతం ఆమె కథని విని..ఆమె మాములు బామ్మ కాదంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.(చదవండి: UK: సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్‌కు సారథిగా ఆమె..! 115 ఏళ్ల చరిత్రలో..) -
గల్వాన్ గాయానికి ఐదేళ్లు.. కల్నల్ సంతోష్ సహా 20 మంది వీరమరణం
సాక్షి, నేషనల్ డెస్క్: గల్వాన్ లోయ ఘర్షణ. నిరాయుధులైన భారత జవాన్లపై చైనా సైనికులు చేసిన సాయుధ దాడి. మూడు వందలకు పైగా సైనికులు దొంగ దెబ్బ తీసినా.. భారత జవాన్లు వెన్ను చూపలేదు. ప్రాణాలకు ఎదురొడ్డి పోరాడారు. ఈ వీరోచిత పోరాటంలో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కో ల్పోయారు. దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఈ గల్వాన్ ఘర్షణ జరిగి జూన్ 15తో ఐదేళ్లయింది. ఇది భారత్, చైనా మధ్య సంబంధాలను తీవ్రంగా దెబ్బతీసింది. ఈ ఐదేళ్లలో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి మన సరిహద్దు రక్షణ, వ్యూహాల్లో భారీ సంస్కరణలు చోటు చేసుకున్నాయి. సరిహద్దులో మౌలిక సదుపాయాలను పునరుద్ధరించడమే కాదు.. సైనిక సంసిద్ధతను కూడా భారత్ పెంచింది. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు ఇటీవల కాస్త మెరుగుపడ్డాయి.ఐదేళ్లలో అభివృద్ధి గల్వాన్ ఘటన తరువాత మన ఆర్మీ వాస్తవా«దీన రేఖ వెంబడి, ప్రత్యేకించి తూర్పు లడఖ్‌లో సాయుధ దళాలను అధిక మొత్తంలో పెంచింది. అలాగే.. యుద్ధ పరికరాలను కూడా మహరించింది. నిఘా వ్యవస్థను పటిష్టం చేసింది. గల్వాన్ సంఘటన ముఖ్యంగా మౌలిక సదుపాయాల విస్తరణ జరిగింది. కేంద్రం 2024లోనే రూ.2,236 కోట్ల విలువైన 75 ప్రాజెక్టులను పూర్తి చేసింది. ఇక 2025–26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో రక్షణ శాఖకు రూ.6.81 లక్షల కోట్లు కేటాయించింది. ఇది గతేడాది కంటే కంటే 9.53% ఎక్కువ. ఇందులో రూ.7,146 కోట్లు సరిహద్దు రహదారుల సంస్థ (బీఆర్ఓ)కు కేటాయించారు.వీటితో లడఖ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్ వంటి వ్యూహాత్మక ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు నిర్మించారు. వీటిలో ఉమ్లింగ్ లా (19,024 అడుగులు) వద్ద ప్రపంచంలోనే ఎత్తైన మోటారు రహదారి నిర్మాణంతోపాటు ప్రస్తుతం నిర్మిస్తున్న న్యోమా ఎయిర్‌ఫీల్డ్, షింకు లా మధ్య సొరంగం కూడా ఉన్నాయి. ఈ ఐదేళ్లలో వాస్తవాధీన రేఖ వెంబడి డిజిటల్ ల్యాండ్‌స్కేప్ కూడా మారిపోయింది. భారత సైన్యం, భారతీ ఎయిర్టెల్ సంయుక్తంగా గల్వాన్, డెమ్‌చోక్‌తో సహా లడఖ్‌లోని మారుమూల గ్రామాలను 4జీ నెట్‌వర్క్‌ను అనుసంధానించారు. ఇది టెలిమెడిసిన్, డిజిటల్ విద్య, ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు చేర్చడానికి తోడ్పడింది. అంతేకాదు.. దీనివల్ల పర్యాటక రంగం అభివృద్ధి చెంది, స్థానికుల జీవనోపాధిని మెరుగుపడింది.దౌత్యంలో పురోగతి... దౌత్య పరంగానూ ఇరు దేశాలు పురోగతిని సాధించాయి. 2020 నుంచి ఇప్పటివరకూ వివిధ స్థాయిల్లో 30 దశలకు పైగా చర్చలు జరిగాయి. అనేక ఘర్షణ పాయింట్ల నుంచి సైనాన్ని ఉపసంహరించుకున్నారు. జూలై 2020లో గల్వాన్, ఫిబ్రవరి 2021లో పాంగోంగ్ త్సో, ఆగస్టు 2021లో పీపీ17ఏ (గోగ్రా–హాట్ స్ప్రింగ్స్), సెపె్టంబర్ 2022లో పీపీ15, అక్టోబర్ 2024లో డెమ్చోక్, డెప్సాంగ్‌లలో చైనా తమ శిబిరాలను తొలగించింది. వీటితోపాటు అత్యున్నత స్థాయి దౌత్య సమావేశాలు జరిగాయి. ఈ ఫలితంగా మానస సరోవర్ యాత్ర పునఃప్రారంభమైంది.ఇక ఈనెల 12న భారత పర్యటనకు వచ్చిన చైనా విదేశాంగ మంత్రి సన్ వీడాంగ్‌తో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలతోపాటు ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సేవలను తిరిగి ప్రారంభించే అంశాన్ని కూడా చర్చించారు. వీసాను సులభతరం చేయడంతోపాటు మీడియా మార్పిడి, 75 సంవత్సరాల భారతదేశం–చైనా దౌత్య సంబంధాల స్మారక వేడుకలపైనా చర్చించారు. అయితే... ఆయా ప్రాంతాల నుంచి సైన్యాన్ని పాక్షికంగా ఉపసంహరించి నప్పటికీ భారత్ అప్రమత్తంగానే ఉంది. వాస్తవాధీన రేఖ వెంబడి నిఘా కొనసాగిస్తోంది. ఆరోజు ఏం జరిగింది?..భారత్–చైనా సరిహద్దులోని గల్వాన్ నది కీలకమైన ప్రాంతం. ఇక్కడ చైనా బలగాలు వాస్తవా«దీన రేఖను దాటి ముందుకొచ్చాయి. వారిని మన జవాన్లు అడ్డుకోవడంతో పలుమార్లు ఘర్షణ జరిగింది. పరిస్థితి తీవ్రమవ్వడంతో సమావేశమైన ఇరు దేశాల ఆర్మీ అధికారులు బలగాలను వెనక్కి రప్పించాలని నిర్ణయించారు. గల్వాన్‌లోని భారత భూభాగంలో చైనా ఏర్పాటు చేసిన శిబిరాలను పరిశీలించేందుకు బిహార్ రెజిమెంట్ కమాండింగ్ అధికారి, తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు జవాన్లతో కలిసి వెళ్లారు. చైనా తన శిబిరాలను తొలగించకపోవడంతో సంతోష్ బృందం వాటిని నేలమట్టం చేసింది. దాంతో చైనా సైనికులు మన జవాన్లపై దాడికి దిగారు. వంద మంది కూడా లేని భారత జవాన్లపై 300 మందికి పైగా చైనా సైనికులు దాడికి తెగబడ్డారు. అయినా ఈ దొంగ దెబ్బను మనవాళ్లు తెగువతో ఎదుర్కొన్నారు. జూన్15న సాయంత్రం మొదలైన మారణకాండ అర్ధరాత్రి దాకా సాగింది. అక్కడ ఆయుధాలు వాడకూడదన్న ప్రోటోకాల్‌ను మన సైనికులు పాటించగా చైనా ముష్కరులు మాత్రం ముందే ఏర్పాటు చేసుకున్న ఇనుప రాడ్లతో దాడికి దిగారు. గాయపడ్డ మన సైనికులను గల్వాన్ నదిలో తోసేశారు. ఈ క్రమంలో కమాండింగ్ అధికారి కల్నల్ సంతోష్ తీవ్ర గాయాలపాలయ్యారు. అయినా యుద్ధమైదానం వీడలేదు. తోటి జవాన్లను వెన్నంటి నడిపించారు. ఈ ఘర్షణలో ఆయనతో పాటు 20 మంది జవాన్లు ప్రాణాలరి్పంచారు. చైనా కూడా భారీగా సైనికులను కోల్పోయింది. ఆ సంఖ్యను అధికారికంగా ఇప్పటికీ వెల్లడించలేదు. 41 మంది గాయపడ్డారని ప్రకటించింది. చైనా 41 మంది సైనికులను కోల్పోయినట్టు రష్యా, ఆ్రస్టేలియా పరిశోధన తేల్చింది. -
ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాలు.. 2025లో భారత్ ఎక్కడంటే.. (ఫొటోలు)
-
‘రేర్’ మ్యాగ్నెట్ల కోసం రేసు..
అరుదైన లోహ అయస్కాంతాల (రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ – ఆర్ఈఎం) సరఫరాపై చైనా ఆంక్షలు విధించడం, దిగుమతి చేసుకున్న మ్యాగ్నెట్స్ నిల్వలు త్వరలోనే ఖాళీ అయిపోనుండటంతో ప్రత్యామ్నాయ అవకాశాలను దొరకపుచ్చుకోవడంపై భారత్ మరింతగా కసరత్తు చేస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలు, గృహోపకరణాలు మొదలైన వాటిల్లో ఉపయోగించే మ్యాగ్నెట్స్ కొరత వల్ల ఉత్పత్తి దెబ్బతినే ముప్పు ఏర్పడటంతో ఆర్ఈఎం సరఫరా కోసం ఇతర దేశాలతో సంప్రదింపులు జరుపుతోంది. అమెరికా, రష్యా, వియత్నాం, ఇండొనేషియా, జపాన్‌లాంటి దేశాలతో చర్చిస్తోంది. అదే సమయంలో ప్రధాన సరఫరాదారైన చైనాతో కూడా చర్చలు జరుపుతోంది. ఇతర దేశాలతో భారత్ ఒప్పందాలు కుదుర్చుకున్నా సరఫరా వ్యవస్థను సిద్ధం చేసుకునేందుకు 45–60 రోజులు పడుతుందని అంచనా. ఆసియా దేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు 45 రోజులు, అమెరికా.. రష్యా నుంచి దిగుమతులకు 60 రోజుల వ్యవధి పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశీయంగా దిగుమతి చేసుకున్న నిల్వలు జూన్ ఆఖరు వరకే సరిపోతాయని అంచనా. దీంతో, ఒప్పందాలు కుదుర్చుకునేందుకు భారత్ వేగంగా పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం భారత్ ఏటా 809 టన్నుల ఆర్‌ఈఎంను దిగుమతి చేసుకుంటోంది. అమెరికాతో టారిఫ్‌ల యుద్ధంతో అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో కీలకమైన ఈ మ్యాగ్నెట్ల ఎగుమతులను ఏప్రిల్ మధ్య నుంచి చైనా నిలిపివేసింది. అంతర్జాతీయంగా ఆర్ఈఎం ఉత్పత్తిలో ఏకంగా 70 శాతం, ప్రాసెసింగ్‌లో 90 శాతం వాటాతో చైనా ఆధిపత్యం చలాయిస్తుండటంతో సరఫరా నిలిపివేత సెగ అన్ని దేశాలనూ తాకుతోంది. ప్రత్యామ్నాయాలపైనా దృష్టి.. ఆసియా దేశాల్లో చూస్తే జపాన్‌లో కూడా ఆర్ఈఎం ఉన్నప్పటికీ చైనా మ్యాగ్నెట్లంత నాణ్యంగా ఉండవని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ముందుగా వియత్నాం, ఇండొనేషియా నుంచే ఆర్‌ఈఎంను దిగుమతి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వివరించాయి. అందులోనూ, సరఫరా వ్యవస్థను తక్షణం ఏర్పాటు చేసుకునే వీలున్నందున వియత్నాం నుంచి వెంటనే దిగుమతి చేసుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నాయి. మరోవైపు, కంపెనీలు మ్యాగ్నెట్లను విడిగా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేకుండా మొత్తం అసెంబ్లీలను లేదా సబ్–అసెంబ్లీలను దిగుమతి చేసుకునేందుకు అనుమతించేలా ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే, ఇందుకోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) స్కీముల నిబంధనలు మార్చాల్సి ఉంటుందని పరిశీలకులు తెలిపారు. దిగుమతి చేసుకున్న వాటికి దేశీయంగా అదనంగా విలువ జోడిస్తేనే ప్రోత్సాహకాలు గానీ సబ్సిడీలు గానీ పొందడానికి వీలుంటుందని పీఎల్ఐ నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. మొత్తం అసెంబ్లీలను దిగుమతి చేసుకున్నా ప్రోత్సాహకాలు వర్తించేలా ప్రభుత్వం నిబంధనలు సడలిస్తే కాస్త ప్రయోజనకరంగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. స్మార్ట్‌వాచీలు, ఇయర్బడ్స్కూ ఎఫెక్ట్ .. ఆర్ఈఎం కొరత కేవలం ఆటోమొబైల్ పరిశ్రమపైనే కాకుండా స్మార్ట్‌వాచీలు, వైర్లెస్ ఇయర్‌బడ్స్ (టీడబ్ల్యూఎస్) ఉత్పత్తిపై కూడా ప్రతికూల ప్రభావం చూపనుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇలాంటి ఎల్రక్టానిక్స్ ఉత్పత్తుల్లో సదరు మ్యాగ్నెట్ల వినియోగం తక్కువగానే ఉన్నప్పటికీ, కీలకమైన విడిభాగం కావడం వల్ల అది లేకపోతే ప్రోడక్టు అసంపూర్ణంగా ఉంటుందని పేర్కొన్నాయి. ఈ పరిశ్రమకు సంబంధించి మ్యాగ్నెట్ల నిల్వలు మరికొద్ది నెలల పాటు సరిపోవచ్చని, ఆ తర్వాత కూడా సరఫరా లేకపోతే సమస్యలు తీవ్రమవుతుందని వివరించాయి. అలర్టులు, నోటిఫికేషన్లు వచ్చినప్పుడు ఇయర్‌బడ్స్, స్మార్ట్ వాచీలు వైబ్రేట్ అయ్యేందుకు ఉపయోగపడే మోటార్లలో ఈ మ్యాగ్నెట్లను వినియోగిస్తారు. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్లపై చైనా ఆంక్షలు కొనసాగిస్తే, వాటిపై ఆధారపడే స్మార్ట్ వాచీలు, ఇతర డివైజ్‌ల కొరతకు దారి తీయొచ్చని విశ్లేషకులు చెప్పారు. కౌంటర్‌పాయింట్ నివేదిక ప్రకారం 2025 తొలి క్వార్టర్లో స్మార్ట్ వాచీల అమ్మకాలు 5% పెరిగినప్పటికీ, వార్షికంగా మాత్రం 33% క్షీణించిన పరిస్థితి నెలకొంది. అయితే, మ్యాగ్నెట్ల కొరతతో ఉత్పత్తి పడిపోయి, క్రమంగా సరఫరాకు మించిన డిమాండ్ ఏర్పడితే స్మార్ట్ వాచీల ధరలు పెరగొచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. చైనాకు భారత ఆటో పరిశ్రమ బృందం ఆర్ఈఎంల దిగుమతి ప్రక్రియను వేగవంతం చేయడం కోసం ఆటో పరిశ్రమ ప్రతినిధుల బృందం చైనాకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే 40–50 మంది కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లకు వీసా అనుమతులు వచ్చాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై భేటీ అయ్యేందుకు చైనా వాణిజ్య శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నట్లు వివరించాయి. ఖరీదు తక్కువే అయినా కీలక భాగమైన ఆర్ఈఎంల ఎగుమతులపై చైనా ఆంక్షలు కొనసాగినా, క్లియరెన్సుల్లో జాప్యం జరిగినా భారత ఆటోమోటివ్ పరిశ్రమకు రిసు్కగా పరిణమిస్తుందని క్రిసిల్ రేటింగ్స్ పేర్కొంది. – సాక్షి, బిజినెస్‌డెస్క్ -
అమెరికాకు ఎగుమతులు 35 శాతం పతనం: చైనా
బీజింగ్: అమెరికా–చైనా మధ్య వాణిజ్యంలో అనిశ్చితి నెలకొంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మే నెలలో అమెరికాకు ఎగుమతులు 35 శాతం పడిపోయినట్లు చైనా వెల్లడించింది. ఈ ఎగుమతుల విలువ 28.8 బిలియన్ డాలర్లు. గత ఏడాది మే నెలలో ఎగుమతుల విలువ 44 బిలియన్ డాలర్లుగా ఉంది. మరోవైపు అమెరికా–చైనా మధ్య వాణిజ్య చర్చలకు రంగం సిద్ధమవుతోంది. అతిత్వరలో లండన్‌లో ఈ చర్చలు జరుగనున్నట్లు తెలుస్తోంది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా అధికారంలోకి వచ్చిన తర్వాత చైనా ఉత్పత్తులపై భారీగా సుంకాలు పెంచిన సంగతి తెలిసిందే. -
పటిష్ఠ క్వారంటైన్‌తోనే చెక్!
చైనా తమపై ఆగ్రో టెర్రరిజానికి పాల్పడిందని ఇటీవల అమెరికా ప్రకటించింది. ‘ఫ్యూసేరియం గ్రామినిరమ్’ అనే ప్రమాదకరమైన శిలీంధ్రాన్ని చైనా నుంచి అక్రమంగా అమెరికాలోకి తీసుకువచ్చిన నేరానికి చైనా పౌరురాలు, మిచిగాన్ యూనివర్సిటీ పరిశోధకురాలు యుంకింగ్ జియాన్(33), ఆమె చైనా ప్రియుడు జున్యాంగ్ లియు(33)లను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది ఖచ్చితంగా చైనా పనిగట్టుకొని చేయిస్తున్న ‘ఆగ్రో టెర్రరిస్టు’ చర్యేనని అమెరికా ఆరోపించింది. శత్రు దేశంలో జీవ భద్రతను, వ్యవసాయ– ఆహార భద్రతను విచ్ఛిన్నం చేసే ఉగ్రవాద చర్యలను ‘ఆగ్రో టెర్రరిజం’ అని వ్యవహరిస్తారు. ఈ వార్తతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. ఈ నేపథ్యంలో.. అసలు ‘ఫ్యూసేరియం గ్రామినిరమ్’ శిలీంధ్రం పంటలకు ఎంతవరకు ప్రమాదకరం? ఒక దేశం నుంచి మరో దేశానికి ఏదైనా శిలీంధ్రాలు, వైరస్లు, సూక్ష్మజీవులు, విత్తనాలను పరిశోధనల కోసం అధికారిక అనుమతులతో తీసుకెళ్లే వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంటుంది? దాని అవసరం ఏమిటి? వంటి విషయాలను పరిశీలిద్దాం.కొత్త వాతావరణమే సమస్యఒక దేశం మరో దేశంపై ఆయుధాలతో విరుచుకుపడితే ఆ దాడి నష్టం ఏపాటిదో అప్పటికప్పుడే తెలిసిపోతుంది. అదే గనక.. ఒక విధ్వంసక శిలీంధ్రాన్నో, సూక్ష్మజీవినో, వైరస్నో జీవాయుధంగా ప్రయోగిస్తే ఈ ఆగ్రో టెర్రరిస్టు చర్య వల్ల కలిగే నష్టం వెంటనే తెలియదు. కొన్నేళ్లు పట్టొచ్చు. ఎందుకంటే, ఒక దేశంలో ఉండే శిలీంధ్రం లేదా వైరస్ వేరు దేశపు కొత్త వాతావరణ పరిస్థితుల్లోకి ప్రవేశించినప్పుడు ఆ వాతావరణం నప్పితే చెలరేగిపోవచ్చు. అక్కడి పంట పొలాల్లో విధ్వంసం సృష్టించి ఆ దేశపు ఆహారోత్పత్తి పునాదుల్నే కదిలించి, కోలుకోలేని దెబ్బ తీయవచ్చు. లేదంటే, ఆ కొత్త వాతావరణం సరిపడకపోతే తేలిపోనూవచ్చు. ఆ కొత్త వాతావరణంలోని ఉష్ణోగ్రత, వర్షపాతం, గాలిలో తేమపై ఈ శిలీంధ్రం, సూక్ష్మజీవి, వైరస్, విత్తనాల ప్రవర్తన తీరు ఎంత విధ్వంసకరంగా ఉంటుందన్న విషయం ఆధారపడి ఉంటుంది. అందుకే పరిశోధనల కోసం విదేశాలకు ఇలాంటివి తీసుకెళ్లాలంటే పటిష్టమైన పరీక్షలు, నియమనిబంధనలతో కూడిన క్వారంటైన్ వ్యవస్థ ఏర్పాటైంది. అదేమీ లేకుండా ఫంగస్‌ను పంపటం ద్వారా చైనా ‘ఆగ్రో టెర్రరిస్టు (వ్యవసాయ ఉగ్రవాద)’ చర్యకు ఒడిగట్టిందని అమెరికా మండిపడింది. ‘ప్రమాదకరమైన జీవాయుధాన్ని అక్రమంగా దేశంలోకి తీసుకురావటం వ్యవసాయ సంబంధమైన ఉగ్రవాద చర్య. ఇది పంటలకే కాదు మనుషులు, పశువుల ఆరోగ్యానికి కూడా గొడ్డలిపెట్టు. యావత్ జాతి భద్రతకే ప్రత్యక్ష ముప్పు’ వంటిదని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బిఐ) డైరెక్టర్ కష్ పటేల్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.అన్ని దేశాల్లోనూ ఉన్నదే! ‘ఫ్యూసేరియం గ్రామినిరమ్’ శిలీంధ్రంను ‘కిల్లర్ ఫంగస్’ అని కూడా అభివర్ణిస్తున్నారు. ‘గ్రామినే’ కుటుంబానికి చెందిన వరి, మొక్కజొన్న, గోధుమ, బార్లీ వంటి ప్రధాన ఆహార ధాన్యపు పంటలకు కంకి దశలో సోకటం ద్వారా దిగుబడిని దెబ్బతీసి తీవ్ర ఆర్థిక నష్టం కలిగిస్తుంది అయితే, ఇది ఇప్పటికే దాదాపు అన్ని దేశాల్లోనూ ఉన్న శిలీంధ్రమేనని నిపుణులు చెబుతున్నారు. ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు, కేంద్ర ప్రభుత్వ జాతీయ మొక్కల జన్యు వనరుల సంస్థ (ఐసిఎఆర్–ఎన్‌బిపిజిఆర్) హైదరాబాద్ కేంద్రం మాజీ సంచాలకులు డాక్టర్ బలిజేపల్లి శరత్‌బాబు ‘సాక్షి సాగుబడి’తో మాట్లాడుతూ.. ‘ఇది కొత్త శిలీంధ్రం కాదు. అమెరికా, భారత్, పాకిస్తాన్, చైనా సహా చాలా దేశాల్లో ఇప్పటికే ఉనికిలో ఉంది. అనేక పంటల కంకులను ఆశించి, దిగుబడికి పెను నష్టం చేస్తుంటుంది. ఇది సోకిన ధాన్యం తింటే వికారం, వాతులు వంటి సమస్యలు వస్తాయి. అయితే, పంటలకు విధ్వంసకమైనదైనప్పటికీ ఇది ప్రాణహాని కలిగించినట్లు ఆధారాలు లేవు. నిజానికి పప్పులు, మిరపకాయలు, వేరుశనగలను ఆశించే అఫ్లోటాక్సిన్లు దీనికన్నా ప్రమాదకరం. ఒక్కోసారి కేన్సర్ కారకం కూడా కావచ్చు’ అన్నారు.దిగుమతి, ఎగుమతికి క్వారంటైన్ తప్పనిసరి!శిలీంధ్రం, సూక్ష్మజీవి, వైరస్, విత్తనాలు, మొక్కలు వంటి జీవ పదార్థాలను ఒక దేశం పరిశోధనల కోసం, వ్యాపార రీత్యా అధికారికంగా ఎగుమతి చేయాలన్నా, దిగుమతి చేసుకోవాలన్నా అంత సులువేమీ కాదు. అంతర్జాతీయ మొక్కల సంరక్షణ ఒడంబడిక (ఐపిపిసి)లో పేర్కొన్న విధంగా కఠినమైన క్వారంటైన్ నియమ నిబంధనలను రెండు దేశాలూ త్రికరణశుద్ధితో పాటించాల్సిందే.ఎగుమతి చేసే దేశం ప్రమాదం లేదని ఫైటో శానిటరీ సర్టిఫెకెట్ ఇవ్వాలి. దిగుమతి చేసుకునే దేశ ప్రభుత్వం దిగుమతి చేసుకునే సంస్థ/వ్యక్తికి ఇంపోర్ట్ పర్మిట్ ఇవ్వాల్సి ఉంటుంది. దిగుమతి చేసుకున్న తర్వాత ఒక సీజన్లో క్వారంటైన్ చట్టాల ప్రకారం ప్రయోగాలు చేసి, అందులో హానికారక చీడపీడలు ఏవీ రవాణా కావటం లేదని నిర్థారించుకున్న తర్వాతే ఆ దేశపు సహజ వాతావరణంలోకి ప్రవేశపెట్టడానికి అనుమతిస్తారు. ఇదంతా జరగడానికి చాలా సమయం పడుతుంది. చదవండి: జాబ్స్ టియర్స్.. కొత్త మిల్లెట్ పంట!ప్రపంచ వాణిజ్య సంస్థ సభ్యదేశాలన్నీ సాధారణ వ్యవసాయోత్పత్తుల ఎగుమతి, దిగుమతులకు కూడా శానిటరీ, ఫైటో శానిటరీ నియమాలు పాటించాల్సిందే. ఈ నియమాలను అమలుచేసే పటిష్ట క్వారంటైన్ వ్యవస్థ అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో అమల్లో ఉంటుంది. ఎయిర్‌పోర్టులు, సీపోర్టుల్లో తనిఖీలు అతి కఠినంగా ఉంటాయి. అమెరికా ప్రధాన భూభాగానికి దూరంగా ఉన్న హవాయి రాష్ట్రం నుంచి దాదాపు అన్ని రకాల పండ్లు కూరగాయలు వేరే రాష్ట్రాలకు తీసుకెళ్లడానికి నిర్దిష్టమైన ఆంక్షలు అమల్లో ఉన్నాయన్నారు డాక్టర్ శరత్‌బాబు.మన క్వారంటైన్ వ్యవస్థ బలహీనం చైనా నుంచి ‘ఫ్యూసేరియం గ్రామినిరమ్’ శిలీంధ్రాన్ని అమెరికాకు తీసుకెళ్లింది పరిశోధనల కోసమైనప్పటికీ క్వారంటైన్ నిబంధనలు పాటించలేదు. అనుమతులు లేవు కాబట్టే ఈ పనిని ‘వ్యవసాయ ఉగ్రవాద’ చర్యగా అమెరికా సీరియస్‌గా పరిగణించింది. జియోపొలిటికల్ ఉద్రిక్తతలు కూడా దీనికి కారణమై ఉండొచ్చు. ఈ శిలీంధ్రం అన్ని దేశాల్లోనూ ఉన్న జాతే. అయినా, వేర్వేరు దేశాల్లో అనేక ఉపజాతులు ఉంటాయి. ఒక ఉపజాతి ఒక దేశంలో పెద్ద సమస్య కాకపోయినా, వేరే దేశంలోని విభిన్న వాతావరణంలోకి వెళ్లిన తర్వాత పెను విపత్తు సృష్టించవచ్చు లేదా నిద్రాణంగా ఉండిపోవచ్చు. అందుకే జీవపదార్థాలేవైనా దేశ సరిహద్దులు దాటించేటప్పుడు కఠినమైన క్వారంటైన్ పరీక్షలు చెయ్యటం తప్పనిసరి. మన దేశంలో ఈ క్వారంటైన్ వ్యవస్థ బలహీనంగా ఉంది. ఇకనైనా పటిష్టం చెయ్యాలి.– డాక్టర్ బలిజేపల్లి శరత్‌బాబు, అధ్యక్షులు, ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, మాజీ సంచాలకులు, జాతీయ మొక్కల జన్యు వనరుల సంస్థ (ఐసిఎఆర్–ఎన్‌బిపిజిఆర్) హైదరాబాద్ కేంద్రం. -
అస్థిర ధరలు.. చైనా ఈవీకి సవాళ్లు
అధిక ధరలు మార్కెట్ అస్థిరతకు కారణం అవుతుండడంతో చైనా ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) రంగం ఒడిదొడుకులకు లోనవుతోంది. దాంతో చైనా ఈవీలో ప్రధాన పాత్ర పోషిస్తున్న బీవైడీ ధరల తగ్గింపు నిర్ణయాలు చేపడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇది మార్కెట్ స్థిరత్వం, పోటీతత్వంపై ఆందోళనలను రేకెత్తిస్తుంది. ఇదిలాఉండగా, చైనా ప్రభుత్వం రంగంలోకి దిగి స్థానిక కంపెనీలు స్వీయ నియంత్రణ పాటించాలని, తక్కువ ధరకు తమ ఉత్పత్తులు అమ్ముకోవద్దని కోరింది.ధరల యుద్ధానికి మూలంఈ పరిణామాలకు కారణం డిమాండ్ కంటే అధిక సరఫరా ఉండడమేనని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చైనా తయారీదారులు మార్కెట్లోని డిమాండ్ కంటే చాలా ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేస్తున్నారు. డిమాండ్ తగ్గడంతో కంపెనీలు అమ్మకాల ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి. దాంతో చేసేదేమిలేక ధరల తగ్గింపు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. దీనివల్ల ప్రధాన బ్రాండ్ల లాభాల మార్జిన్లు తగ్గుతాయని, చిన్న కంపెనీలు పూర్తిగా నష్టాల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. బీవైడీ మే చివరి నుంచి ఇప్పటివరకు 21.5 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను కోల్పోయింది.ప్రభుత్వ జోక్యంమితిమీరిన రాయితీల వల్ల ‘మేడ్-ఇన్-చైనా’ ఎలక్ట్రిక్ వాహనాల దీర్ఘకాలిక ప్రతిష్ఠ మసకబారుతుందని అధికారులు భయపడుతున్నారు. భారీగా ధరల తగ్గింపు వల్ల చైనా బ్రాండ్ విశ్వసనీయత దెబ్బతింటుందని చెబుతున్నారు. ఇది వినియోగదారులు ఉత్పత్తుల నాణ్యత, విలువను ప్రశ్నించేలా చేస్తుంది. దీన్ని పరిష్కరించడానికి చైనా ప్రభుత్వం వాహన తయారీదారులకు ధరల క్రమశిక్షణను పాటించాలని పిలుపునిచ్చింది. పరిశ్రమను దెబ్బతీసే పద్ధతులను నివారించాలని కోరింది. తక్కువ ధరకు తమ ఉత్పత్తులు అమ్ముకోవద్దని వేడుకుంది.ఇదీ చదవండి: బీసీసీఐకి ఐపీఎల్ బంగారు బాతుఎగుమతులపై ప్రభావందేశీయ సవాళ్లకు అతీతంగా చైనీస్ ఈవీ తయారీదారులు గ్లోబల్ మార్కెట్లలో దూకుడుగా విస్తరిస్తున్నారు. అయితే స్వదేశంలో అస్తవ్యస్తమైన సప్లై-చెయిన్ వల్ల ఏర్పడిన ధరల యుద్ధం విదేశాల్లో విశ్వసనీయతను దెబ్బతీస్తుంది. అంతర్జాతీయ పట్టును కోరుకునే కంపెనీలు పోటీ ధరలతో స్థిరమైన లాభదాయకతను సమతుల్యం చేయాల్సి ఉంటుంది. బ్యాటరీ, ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిలో చైనా ఆధిపత్యాన్ని పాశ్చాత్య దేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. -
అబ్బాయిలకు ఫుల్ డిమాండ్.. ఒక్క ‘హగ్’ ఇవ్వండి.. 600 తీసుకోండి..
బీజింగ్: మారుతున్న జీవనశైలి కారణంగా ఉరుకులు పరుగుల జీవితం నడుస్తోంది. ప్రేమ, ఆప్యాయతలకు, కుటుంబాలకు కొందరు దూరం అవుతున్నారు. డబ్బు సంపాదించే క్రమంలో ఒత్తిడికి గురవుతున్నారు. ఈ క్రమంలో ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇందులో భాగంగానే చైనాలో ఓ కొత్త ట్రెండ్ హాట్ టాపిక్‌గా మారింది. ఒత్తిడికి గురవుతున్న యువతులు.. అబ్బాయిలను హగ్ చేసుకుంటున్నారు. ఈ హగ్ ఊరికే కాదు.. ఒక్కసారి హగ్ చేసుకుంటే సదరు యువతి.. 50 యువాన్లు (భారత కరెన్సీలో దాదాపు 600 రూపాయలు) చెల్లించి ఉంటుంది. దీంతో, చైనా అబ్బాయిలకు ఫుల్ గిరాకీ నడుస్తోంది.సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం.. ఒత్తిడి అధిగమించేందుకు చైనాలోని యువతులు ఓ వినూత్న పద్ధతిని అనుసరిస్తున్నారు. మానసిక సాంత్వన కోసం డబ్బులు చెల్లించి 'మ్యాన్ మమ్స్' (man mums) అని పిలవబడే వ్యక్తుల నుంచి కొద్దిసేపు హగ్ పొందుతున్నారు. గతంలో 'మ్యాన్ మమ్స్' అనే పదాన్ని కండలు తిరిగిన శరీరంతో జిమ్‌లో కసరత్తులు చేసే పురుషులను ఉద్దేశించి వాడేవారు. అయితే, ఇప్పుడు ఈ పదం అర్థం మారింది. శారీరకంగా ధృడంగా ఉంటూనే, సున్నితత్వం, ఓర్పు, ఆప్యాయత వంటి లక్షణాలున్న పురుషులను 'మ్యాన్ మమ్స్'గా పరిగణిస్తున్నారు. వీరు అందించే కౌగిలింతలు ఒత్తిడిని తగ్గించి, ఓదార్పునిస్తాయని యువతులు భావిస్తున్నారు. చైనా ప్రస్తుతం మ్యాన్ మమ్స్ ట్రెండ్‌లోకి వచ్చింది. ఇక, ఈ ట్రెండ్ ప్రకారం.. అమ్మాయికి ఎవరైనా అబ్బాయి ఐదు నిమిషాల పాటు హగ్ ఇస్తే రూ. 600 చెల్లిస్తారు అమ్మాయిలు. ఎవరైనా అబ్బాయిలు.. ఐదు నిమిషాల పాటు హగ్ ఇస్తే రూ. 200 నుంచి రూ. 600 వరకు పే చేస్తున్నారు. ఆన్ లైన్లో ముందుగానే ఈ హగ్స్ కోసం అమ్మాయిలు.. నచ్చిన కుర్రాడిని బుక్ చేసుకుంటారు. ఆ తర్వాత మాల్స్, పార్కులు, అండర్ గ్రౌండ్ రోడ్లు.. ఇలా పబ్లిక్ ప్లేసుల్లో ఇలా చేస్తున్నారు. ఇలా నచ్చినవారిని హగ్ చేసుకోవడం వల్ల తమ ఒత్తిడి తగ్గిపోతుందని అమ్మాయిలు భావిస్తున్నారు.In China, some young women are paying strangers — not for therapy or romance, but for something far simpler: a five-minute hug.They’re called “man mums” — gentle, muscular men who offer warmth and emotional comfort in public spaces. The cost? Just US$3 to US$7 for five minutes.… pic.twitter.com/4kD1FpPpws— Ashwini Roopesh (@AshwiniRoopesh) June 7, 2025ఈ సందర్భంగా ఒక యువతి మాట్లాడుతూ.. మూడు గంటల పాటు ఓవర్‌టైమ్ పని చేసిన తర్వాత, ఒక 'మ్యాన్ మమ్'ను కలుసుకున్నాను. అతను మూడు నిమిషాల పాటు నన్ను కౌగిలించుకున్నాడు. ఉద్యోగం, ఆఫీసు ఒత్తిడికి సంబంధించి ఆవేదన వ్యక్తం చేస్తుండగా అతడు నెమ్మదిగా నా భుజం తట్టాడు. దీంతో, ఒత్తిడి దూరమే ప్రశాంతంగా అనిపించింది’ అని చెప్పుకొచ్చింది.అంతకుముందు.. ఒక విద్యార్థిని, తనకు ఓదార్పునిచ్చేందుకు దయగల, ఫిట్‌గా ఉండే 'మ్యాన్ మమ్' నుంచి కౌగిలింత కావాలని, అందుకు డబ్బులు చెల్లిస్తానని ఆన్లైన్లో పోస్ట్ చేసింది. ‘నాకు సెకండరీ స్కూల్లో ఉన్నప్పుడు ఒకసారి ఇలాగే కౌగిలించుకుంటే చాలా సురక్షితంగా అనిపించింది. మనం ఒక అండర్‌గ్రౌండ్ స్టేషన్లో ఐదు నిమిషాలు కౌగిలించుకుంటే చాలు’ అని ఆమె రాసుకొచ్చింది. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది, లక్షకు పైగా కామెంట్లు వచ్చాయి. -
మరో కరోనా మహమ్మారి!
బీజింగ్: ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్ల క్రితం ఉధృతంగా మొదలై ఇప్పటికీ మరణశాసనం రాస్తున్న కరోనా వైరస్ కుటుంబానికి చెందిన కొత్త వైరస్లు పుట్టుకొస్తున్నట్లు అమెరికా పరిశోధకులు గుర్తించారు. కోవిడ్–19కు మూలకారణంగా భావిస్తున్న చైనాలోని గబ్బిలాల్లో ఈ వైరస్ల ఉనికిని కనిపెట్టారు. వీటిలో మరొక్క చిన్నపాటి ఉత్పరివర్తనం(మ్యుటేషన్) జరిగితే మనుషులకు ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని చెబుతున్నారు. వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా పరిశోధనలు నిర్వహించిన ఈ అధ్యయనం వివరాలను నేచర్ కమ్యూనికేషన్స్ పత్రికలో ప్రచురించారు. ఈ మిస్టరీ వైరస్లు కరోనా మాదిరిగానే మెర్స్–కోవ్ కుటుంబానికి చెందుతాయని తెలిపారు. కరోనా వైరస్ సృష్టిస్తున్న ఉత్పాతం గురించి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి బారినపడిన వారిలో 34 శాతం మంది మరణించినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. → మెర్స్–కోవ్ కుటుంబంలోని ఉపవర్గమైన మెర్బికో వైరస్‌లపై అమెరికా సైంటిస్టులు నిశితంగా దృష్టిపెట్టారు. ఈ ఉపవర్గంలోని హెచ్‌కేయూ5 వైరస్‌లతో ముప్పు ముంచుకొస్తున్నట్లు పేర్కొంటున్నారు. → హెచ్‌కేయూ5 వైరస్ల గురించి ఇప్పటిదాకా తెలిసింది తక్కువే. మనుషుల్లో కణాలను తీవ్రంగా ప్రభావితం చేసే శక్తి వీటికి ఉందని వైరాలజిస్టు డాక్టర్ మైఖేల్ లెట్కో చెప్పారు. వీటిలో మరో మ్యుటేషన్ జరిగి, మనుషులకు సోకితే ప్రాణాంతకంగా మారే పరిస్థితిని కొట్టిపారేయలేమని వెల్లడించారు. → సార్స్–కోవ్–2 అనే వైరస్ కోవిడ్–19 వ్యాధిని కలిగించినట్లుగానే హెచ్‌కేయూ5 వైరస్లు స్పైక్ ప్రొటీన్ ఆధారంగా మనుషుల కణాల్లోకి ప్రవేశించి, నాశనం చేయగలవు. → చైనాలో గబ్బిలాల నుంచి మింక్స్ అనే జంతువులకు వ్యాప్తి చెందినట్లు చెబుతున్నారు. ఇతర జీవులకు సైతం వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. → హెచ్‌కేయూ5 వైరస్ల విషయంలో ఇప్పటికిప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్ మైఖేల్ లెట్కో సూచించారు. అయినప్పటికీ అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. -
తరుముకొస్తున్న మరో మహమ్మారి?.. శాస్త్రవేత్తల హెచ్చరిక
కోవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని ఎంతగా వణికించిందో అందరికీ తెలిసిందే. దీని బారినపడి లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. నేటికీ కోవిడ్-19 ప్రపంచ దేశాలను పూర్తిగా వీడనే లేదు. అయితే ఇంతలోనే శాస్త్రవేత్తలు ప్రపంచాన్ని ముంచెత్తనున్న మరో ముప్పుపై హెచ్చరిస్తున్నారు. అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన ‘నేచర్ కమ్యూనికేషన్స్’లో తాజాగా ప్రచురితమైన ఒక అధ్యయనం ఇప్పుడు ఆందోళనను రేకెత్తిస్తోంది. వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ, కాల్టెక్, యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా బృందాలు తమ పరిశోధనలో మెర్బెకోవైరస్లలోని ఉప వేరియంట్ అయిన హెచ్‌కేయూ5 వైరస్‌లపై దృష్టి సారించారు. ఇవి 2019లో ఉద్భవించిన ప్రాణాంతక కరోనా వైరస్‌కు కారణమైన సార్స్-కోవ్‌తో సంబంధం కలిగినవి. ఇవి సుమారు 34 శాతం మరణాల రేటును కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు.హెచ్‌కేయూ5 వైరస్‌లపై ఇంకా పూర్తిగా అధ్యయనం చేయలేదని, అయితే తమ పరిశోధన ప్రకారం అవి మానవులకు సోకే సామర్థ్యానికి కొంత దూరంలో ఉండవచ్చని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ వైరాలజిస్ట్ డాక్టర్ మైఖేల్ లెట్కో తెలిపారు. కోవిడ్-19 వెనుక ఉన్న వైరస్ అయిన సార్స్ కోవ్-2 మాదిరిగా ఈ బ్యాట్ వైరస్లు కణాలపై దాడి చేయడానికి స్పైక్ ప్రోటీన్లను ఉపయోగిస్తాయన్నారు. ప్రస్తుతానికి హెచ్‌కేయూ5 వైరస్లు గబ్బిలాలలో మాత్రమే ఏసీఈ2తో అనుసంధానమై ఉన్నాయని, అయితే అవి చిన్నపాటి జన్యు మార్పుతో మానవులలోకి ప్రవేశించేందుకు అవకాశం ఉన్నదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పరిశోధకులు ఈ స్పైక్ ప్రోటీన్లు ఎలా అభివృద్ధి చెందుతాయనేది తెలుసుకునేందుకు అత్యాధునిక ఏఐ సాధనం ఆల్ఫాఫోల్డ్ 3ని ఉపయోగించారు.ఇది కూడా చదవండి: ఖైరతాబాద్ గణేష్ విగ్రహ తయారీకి అంకురార్పణ -
The Labubu Doll : సెలబ్రిటీలందరి నోటా లబుబు డాల్... అసలేంటిది?
విచిత్రమైన దంతాలు , ఇంతింత కళ్లు, కుందేలు చెవులు ఇపుడు ఎక్కడ చూసినా ఈ లబుబు డాల్స్ (The Labubu Doll) ట్రెండ్ ప్రముఖంగా నిలుస్తోంది. ఇంత పాపులరైన ఈ లబుబు బొమ్మలను చైనీస్ బొమ్మల కంపెనీ పాప్ మార్ట్ ఉత్పత్తి చేస్తోంది. బ్లాక్‌పింక్ లిసా, రిహన్న, అనన్య పాండే ఇంకా అనేక మంది సెలబ్రిటీలు, డాల్ లవర్స్ ఈ బొమ్మల పట్ల ఎందుకంత క్రేజీగా ఉన్నారో తెలుసుకుందామా..‘బొమ్మల్లో లబుబు బొమ్మలు వేరయా!’ అంటన్నారు డాల్స్ ప్రేమికులు. సామాన్యుల నుంచి అనన్య పాండేలాంటి సెలబ్రిటీల వరకు లబుబు బొమ్మలకు ‘లవ్ యూ’ చెబుతున్నారు. View this post on Instagram A post shared by Sufi motiwala (@sufimotiwala)> జానపద కథల నుంచి స్పూర్తి పొంది హాంకాంగ్ ఆర్టిస్ట్ కసింగ్ లుంగ్ ‘లబుబు’ను రూపొందించాడు. విశాలమైన నేత్రాల ఈ బొమ్మ 2019లో మార్కెట్లోకి వచ్చింది. బ్యాగులు, కీచైన్లు....మొదలైన ఎన్నో రూపాల్లో లబుబు బొమ్మలను రూ పొందించారు. లబుబును ‘అన్బాక్సింగ్ ట్రెండ్’ అని పిలుస్తున్నారు. ఎందుకంటే వీటిని బ్లైండ్ బాక్సుల్లో మాత్రమే విక్రయిస్తుంటారు. అన్బాక్సింగ్ తరువాత మాత్రమే ఆ బొమ్మ గురించి తెలుసు కోగలుగుతాం.‘లబుబు’కు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న స్పందనకు ఆ బొమ్మ సృష్టికర్త కసింగ్ లుంగ్ సంతోషిస్తున్నాడు. ‘నా చిన్నప్పుడు గేమ్ కన్సోల్స్, కంప్యూటర్లు లేవు. పెన్నుతో రకరకాల బొమ్మలను పేపర్‌పై గీసేవాడిని. బొమ్మలు తయారుచేయాలనే ఆసక్తి చిన్న వయసులోనే ఉండేది’ అంటున్నాడు కసింగ్ లుంగ్. -
అదానీ, చైనాలకు ‘నరేందర్–సరెండర్’
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ విమర్శల దాడిని పెంచింది. పారిశ్రామికవేత్త అదానీతోపాటు చైనాకు సైతం నరేందర్– సరెండర్ అంటూ వ్యాఖ్యానించింది. షోలే సినిమాలో జై–వీరూల జోడీని అదానీ, మోదీల ధ్వయం మించిపోయిందని కాంగ్రెస్ నేత అజొయ్ కుమార్ ఎద్దేవా చేశారు. గురువారం ఆయన కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నో సంవత్సరాల ప్రాక్టీస్ తర్వాత ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు లొంగిపోవడమనే ప్రక్రియ పూర్తయింది. నరేంద్ర మోదీ ఎక్కడికెళ్లిన, అదానీ కోరిన విధంగా ఒక కాంట్రాక్ట్ మాత్రం గ్యారెంటీ. భారత ప్రధాని దౌత్య సంబంధాలు అంతర్జాతీయంగా పోర్టులు, ఎయిర్‌పోర్టులు, విద్యుత్, బొగ్గు గనులు, ఆయుధాలు వంటి రంగాల్లో పారిశ్రామిక వేత్త అదానీకి అనుకూలంగా ఉంటాయి’అని పేర్కొంటూ ఆయన కొన్ని ఉదాహరణలను ప్రస్తావించారు. మోదీ చైనాకు సైతం మోకరిల్లారన్న అజొయ్ కుమార్.. 2020లో భారత భూభాగాన్ని ఆక్రమించినా కూడా ఆ దేశానికి క్లీన్చిట్ ఇచ్చిన ‘నరేందర్– సరెండర్’దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
3,000 కొత్త కార్లు సముద్రంపాలు!
యాంకరేజ్: ఏకంగా 3,000 కొత్త కార్లతో చైనా నుంచి మెక్సికోకు బయల్దేరిన భారీ సరుకు రవాణా నౌకలో అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నికీలలు మరింతగా విస్తరిస్తుండటతో నౌకను సిబ్బంది నడిసంద్రంలో వదిలేయాల్సి వచ్చింది. లైఫ్‌బోట్ సాయంతో 22 మంది సిబ్బందిని రక్షించగలిగారు. లండన్ కేంద్రంగా పనిచేసే జోడియాక్ మేరిటైమ్ సంస్థ ఈ ‘ది మార్నింగ్ మిడాస్’నౌకను నిర్వహిస్తోంది. పసిఫిక్ మహాసముద్రంలో అమెరికాలోని అలాస్కా రాష్ట్ర పరిధిలోని అడాక్ దీవి సమీపంలో ఈ అగ్ని ప్రమాద ఘటన జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు సమీపంలో ప్రయాణిస్తున్న కోస్కో హెలాస్ సరకు రవాణానౌకలోని సిబ్బంది అప్రమత్తమై మిడాస్ నౌకలోని 22 మంది సిబ్బందిని రక్షించారు. ఘటన జరిగినప్పుడు నౌకలో 800 కొత్త విద్యుత్ కార్లు సహా 3,000 కార్లు ఉన్నాయి. అగ్నికీలలను ఎలా అదుపులోకి తేవాలనే దానిపై జోడియాక్ సంస్థతో సంప్రతింపులు జరుపుతున్నామని అమెరికా తీరగస్తీ 17వ జిల్లా కమాండర్ రియర్ అడ్మిరల్ మెగాన్ డీన్ చెప్పారు. చైనాలో తయారైన ఈకార్లతో మే 26వ తేదీన నౌక బయల్దేరింది. మెక్సికోలోని లజారో కార్డెనాస్ నౌకాశ్రయానికి ఇది చేరుకోవాల్సి ఉండగా మార్గమధ్యంలో ఇలా అగ్నిప్రమాదంలో చిక్కుకుంది. ఈ నౌకను 2006లో చైనాకు చెందిన నౌకాతయారీ సంస్థ తయారుచేసింది. ఈ నౌక బరువు ఏకంగా 46,800 టన్నులు. -
డొనాల్డ్ ట్రంప్ ట్రాప్‌లో జిన్‌పింగ్!
వాషింగ్టన్: అమెరికా-చైనాలు తమకు అవకాశం వచ్చినప్పుడల్లా కత్తులు దూసుకుంటూ ఉంటాయనేది జగమెరిగిన సత్యం. అమెరికా పేరెత్తితే చైనా, డ్రాగన్ పేరెత్తితే అగ్రరాజ్యం అంత ఎత్తున పైకి లేచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇటీవల కాంలో వీరి మధ్య మాటల యుద్ధం ఎంతటి తారాస్థాయిలో జరిగిందో అందరికీ తెలిసిందే. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో సుంకాల ఆంక్షలు ఒకటి. ఈ నిర్ణయాలను చైనా తీవ్రంగా విభేదించింది కూడా. జిన్‌పింగ్‌కు ట్రంప్ ఫోన్..అయితే తాజాగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడారు. జిన్‌పింగ్‌తో ట్రంప్ ఫోన్లో సంభాషించిన విషయాన్ని ఈరోజు(గురువారం) ట్రంప్ తన సోషల్ మీడియా సైట్ ‘ట్రూత్’లో వెల్లడించారు. “నాకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అంటే ఇష్టం. ఆయన ఎప్పుడూ ఇష్టమే, ఆయనతో ఒప్పందం కుదుర్చుకోవడం చాలా కష్టం” అని ట్రంప్ పోస్ట్ చేశారు. సంకాల ‘వార్’సుంకాల ఆంక్షలతో చైనాను విపరీతమైన ఒత్తిడిలోకి నెట్టే యత్నం చేశారు ట్రంప్. అయితే చైనా కూడా ట్రంప్ చర్యలకు ప్రతీ చర్యగా అమెరికా వస్తువులపై కూడా సుంకాలను పెంచుతున్నట్లు ప్రకటించి షాకిచ్చింది. ఈ క్రమంలోనే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. అమెరికాకు వార్నింగ్ కూడా ఇచ్చారు. ‘ భయపెడితే భయపోతాం అనుకుంటున్నారా.. చర్యకు ప్రతిచర్య సిద్ధం’ అంటూ సవాల్ చేశారు. అక్కడ నుంచి ఇరు దేశాల మధ్య కోల్డ్ వార్ మొదలైంది. చైనా వస్తువులపై 145 సుంకాన్ని ట్రంప్ విధించగా, అమెరికా వస్తువులపై 125 శాతం సుంకాన్ని చైనా విధించింది. అయితే ఆ తర్వాత 145 శాతం సుంకాన్ని 30 శాతానికి తగ్గించగా, 125 శాతం సుంకాన్ని 10కి పరిమితం చేసింది చైనా . ఇలా ఇరు దేశాలు ఒక రాజీకి రావడంతో సమస్య తెరపడినట్లయ్యింది. -
అమెరికాపై చైనా.. ‘ఆగ్రో టెర్రరిజం’
ఆగ్రో టెర్రరిజానికి పాల్పడిన ఇద్దరు చైనీయులను అమెరికా పోలీసులు అక్కడి కాలమానం ప్రకారం మంగళవారం అరెస్ట్ చేయటంతో ప్రపంచ దేశాలు ఒక్కసారి ఉలిక్కిపడ్డాయి. పంటలకు తీవ్రనష్టం కలిగించటం ద్వారా వ్యవసాయ, ఆహార భద్రతకు విఘాతం కలిగించే ఉగ్రవాద చర్యలను ఆగ్రో టెర్రరిజంగా చెబుతారు. అదే దురుద్దేశంతో ‘ఫ్యూసేరియం గ్రామినిరమ్’అనే ప్రమాదకరమైన శిలీంధ్రాన్ని అక్రమంగా, కుట్రపూరితంగా అమెరికాలోకి తెచ్చారన్న ఆరోపణపై చైనా పౌరులైన యుంకింగ్ జియాన్, ఆమె సన్నిహితుడు జున్యాంగ్ లియులను అమెరికా పోలీసులు అరెస్ట్ చేసి, విచారణ జరుపుతున్నారు. ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా కూడా చైనా నుంచే వ్యాప్తిలోకి వచ్చిందన్న అనుమానాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఇటీవల అమెరికా.. చైనా నుంచి వస్తువుల దిగుమతిపై సుంకాలు అతి భారీగా పెంచిన నేపథ్యంలో తాజా ఆగ్రో టెర్రరిజం చర్య చర్చనీయాంశమైంది. చైనా కమ్యూనిస్టు పార్టీ కుతంత్రమే యుంకింగ్ జియాన్ చైనా కమ్యూనిస్టు పార్టీ విధేయురాలని, ఈ ప్రమాదకర శిలీంధ్రంపై చైనాలో పరిశోధన చేసిన ఆమెకు చైనా ప్రభుత్వం నిధులు ఇచ్చినట్లు కూడా ఆధారాలున్నాయని కాష్ పటేల్ తెలిపారు. ‘సహ నిందితుడైన ఆమె సన్నిహితుడు జున్యాంగ్ లియు కూడా చైనా యూనివర్సిటీలో ఇదే శిలీంధ్రంపైనే పరిశోధనలు చేస్తుండేవాడు. ఈ శిలీంధ్రంపై మిచిగాన్ యూనివర్సిటీలో పరిశోధనల కోసమే డెట్రాయిట్ మెట్రోపాలిటన్ ఎయిర్పోర్ట్ ద్వారా గత ఏడాది అక్రమంగా రవాణా చేసినట్లు లియు తొలుత బుకాయించినా, తర్వాత తప్పు అంగీకరించారని తెలిపారు. వీరిద్దరిపైనా కుట్ర, అమెరికాలోకి వస్తువుల స్మగ్లింగ్, తప్పుడు స్టేట్మెంట్లు,వీసా అక్రమాలకు సంబంధించిన అభియోగాలు నమోదు చేశా’మని కాష్ పటేల్తెలిపారు. అమెరికా ఆహార వ్యవస్థను దెబ్బతీయటం ద్వారా తీవ్ర పరిణామాలు కల్పించి అమెరికా ప్రజల జీవితాలను, ఆర్థిక వ్యవస్థను పెనుప్రమాదంలోకి నెట్టాలన్న కుతంత్రంతో చైనా కమ్యూనిస్టు పార్టీ అనుక్షణం పనిచేస్తోందని ఆయన ఆరోపించారు. ఈ దుర్భిద్ధితోనే పరిశోధకులను, ఇతరులను అమెరికా సంస్థల్లోకి పనిగట్టుకొని చొప్పిస్తోందని చెప్పటానికి ఇదొక ప్రబల నిదర్శనం అని కాష్ పటేల్ అన్నారు. ఈ కుతంత్రాలను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు ఎఫ్బిఐ అవిశ్రాంతంగా కృషి చేస్తూనే ఉంటుందన్నారు. నష్టం జరగకముందే ఈ ముప్పును పసిగట్టడంలో డెట్రాయిట్ ఎఫ్బిఐ బృందం, కస్టమ్స్–సరిహద్దు భద్రతా దళాలు సమన్వయంతో సమర్థవంతంగా పనిచేశారని ప్రశంసించారు. ఆగ్రో టెర్రరిజం మూలాలు.. మధ్య ప్రాచ్యానికి చెందిన అస్సిరియన్ అనే జాతి వారు క్రీ.పూ. 660లోనే వ్యవసాయసంబంధమైన ఉగ్రవాదచర్యకు తొలిసారి పాల్పడ్డారని చరిత్ర చెబుతోంది. ధాన్యపు పంటలను నాశనం చేసే ఎర్గోట్ అనే శిలీంధ్రాన్ని ప్రయోగించి శత్రువుల నీటి వనరులను అస్సిరియన్లు కలుషితం చేశారు. ఆధునిక కాలంలో తొలి ప్రపంచ యుద్ధంలో జర్మనీ గ్లాండర్స్, ఆంథ్రాక్స్ క్రిములను శత్రువుల గుర్రాలపై ప్రయోగించింది. యూరప్‌లో శత్రు సేనలకు సరఫరా అయ్యే ధాన్యాగారాలపై ఈ ఫంగస్‌లను ప్రయోగించినట్టు చెబుతారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో.. బ్రిటన్‌లోని బంగాళా దుంపల పొలాలను ‘కొలరాడో పొటాటో బీటిల్స్’సాయంతో నాశనం బ్రిటన్ చేయాలని ప్రయత్నించింది. విమానం సాయంతో వీటిని పొలాల్లోకి విడిచిపెట్టింది. ప్రమాదకరమైన ఫంగస్‘ప్రమాదకరమైన జీవాయుధాన్ని అక్రమంగా దేశంలోకి తీసుకురావటం వ్యవసాయ సంబంధమైన ఉగ్రవాద చర్య. యావత్ జాతి భద్రతకే ఇది ప్రత్యక్ష ముప్పు’వంటిదని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ)డైరెక్టర్ కాష్ పటేల్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘‘యుంకింగ్ జియాన్ అనే యువతి మిచిగాన్ యూనివర్సిటీలో పరిశోధనల కోసం ఫ్యూసేరియం గ్రామినిరమ్ అనే ప్రమాదకరమైన శిలీంధ్రాన్ని దేశంలోకి అక్రమంగా తీసుకువచ్చినట్లు భావిస్తున్నాం.గోధుమ, వరి, మొక్కజొన్న, బార్లీ తదితర పంటల్లో ‘కంకి ఎండు తెగులు’ను కలిగించటం ద్వారా దిగుబడిని తీవ్రంగా నష్టపరిచే అత్యంత ప్రమాదకరమైన ఫంగస్ ఇది. ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల డాలర్ల మేర ఆర్థిక నష్టానికి కారణమవుతున్న ఈ శిలీంధ్రం.. పంటలను దెబ్బతీయటంతో పాటు మనుషులు, పశువుల తీవ్రమైన అనారోగ్య సమస్యలను సృష్టించగలదు’అని ఆయన పేర్కొన్నారు. పాక్ ద్వారా మన దేశంలోకీ.. చైనా, పాకిస్థాన్ సరిహద్దుల ద్వారా భారత్‌కు కూడా ఆగ్రో టెర్రరిజం ముప్పు పొంచి ఉందన్న చర్చ జరుగుతోంది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డిఆర్డిఓ) పత్రాల ప్రకారం.. బంగ్లాదేశ్‌లో కనిపించిన ఒక ప్రమాదకర ఫంగస్ 2016లో పశ్చిమ బెంగాల్‌లోని 2 జిల్లాల్లోకి ప్రవేశించింది. గోధుమ పంటను నాశనం చేసే ఆ ఫంగస్‌ను ప్రభుత్వం సమర్థంగా నాశనం చేసింది. మూడేళ్ల పాటు గోధుమ పంట వేయకుండా ఆదేశాలు జారీచేసి, ఆ ఫంగస్ విస్తరించకుండా చేయగలిగింది. అంతకుముందు 2015లో పత్తి పంటను నాశనం చేసే ప్రమాదకర వైరస్ పాకిస్థాన్ నుంచి దక్షిణ పంజాబ్ ప్రాంతంలోకి ప్రవేశించింది. దాదాపు మూడింట రెండొంతుల పత్తి పంట నాశనమైపోయింది. సుమారు 670 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. పంట నష్టాన్ని భరించలేక సుమారు 15 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.- సాక్షి, స్పెషల్ డెస్క్ -
అడుక్కునే స్థితిలో ఉన్నామంటే.. ఆదుకునే పరిస్థితుల్లేవ్: పాక్ ప్రధాని ఆవేదన
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ దేశ నోట ఆర్థిక దుస్థితికి అద్దం పట్టే వ్యాఖ్యలు వెలువడ్డాయి. నిత్యం చిప్ప పట్టుకుని దేహీ అంటూ అర్థించడాన్ని మిత్రదేశాలు కూడా హర్షించడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. తమ దేశ ప్రజలు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారని కన్నీరు పెట్టుకున్నంత పని చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఆదివారం క్వెట్టాలో ఆయన సైనికాధికారులను ఉద్దేశించి పాక్ ప్రధాని షరీఫ్ మాట్లాడారు. ఈ సందర్భంగా షెహబాజ్ షరీఫ్.. ‘చైనా, సౌదీ అరేబియా, తుర్కియే వంటివి పాక్‌కు విశ్వసనీయమైన మిత్రులు. కానీ చీటికీమాటికీ అప్పులివ్వాలని కోరుతుంటే అవి కూడా చిరాకు పడుతున్నాయి. విద్యా, వర్తకం, ఆరోగ్యం, పరిశోధనల వంటి రంగాల్లో మనం కూడా పెట్టుబడులు పెట్టాలని ఆశిస్తున్నాయి. ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్‌తోపాటు ఆర్థిక భారాన్ని మోస్తున్న చివరి వ్యక్తిని తానేనని అన్నారు. దేశంలో సహజ వనరులతోపాటు మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని, వాటిని సమర్థమంతంగా ఉపయోగించుకోవడం ద్వారా ఆర్థిక సవాళ్లను అధిగమించవచ్చు’ అని చెప్పుకొచ్చారు. 🚨Utterly Humilating!!Pakistan PM Shehbaz Sharif's another SHOCKING admission after admitting BrahMos strikes:“Even trusted allies like China, Saudi Arabia, Turkey, Qatar & UAE don’t want Pakistan constantly begging with a bowl in hand.” pic.twitter.com/pyrYwRXhmD— Megh Updates 🚨™ (@MeghUpdates) May 31, 2025ఇదిలా ఉండగా.. పాకిస్తాన్ కొంతకాలంగా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. సాయం కోసం ప్రపంచదేశాలను అభ్యర్థిస్తోంది. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్‌కు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ బెయిల్ అవుట్ ప్యాకేజీ ప్రకటించింది. ఇందులో భాగంగా ఇటీవల ఒక బిలియన్ డాలర్ల నిధులు మంజూరు చేసింది. ఇందుకోసం అనేక షరతులను విధించిన ఐఎంఎఫ్.. భారత్‌తో ఉద్రిక్తతలు పెంచుకుంటే పాక్‌కే ఎక్కువ సమస్యలు వస్తాయని, దేశంలో ఆర్థిక, ఇతర సంస్కరణల లక్ష్యాలకు ముప్పు కలిగిస్తాయని చురకలు అంటించింది. ఈ క్రమంలో కొన్ని షరతులను సైతం విధించింది. -
చైనాతో పెట్టుకోవద్దు.. అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్
బీజింగ్: అమెరికా, చైనా మధ్య మరోసారి మాటల యుద్ధం చోటుచేసుకుంది. తాజాగా అమెరికాకు డ్రాగన్ చైనా గట్టి హెచ్చరికలు జారీ చేసింది. చైనాను అదుపు చేసేందుకు తైవాన్ విషయంలో అమెరికా తలదూర్చడం సరికాదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇందులో మూడో దేశం జోక్యం చేసుకోవడం తగదని వార్నింగ్ ఇచ్చింది.చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి లిన్ జియాన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. తైవాన్ అంశాన్ని హెగ్సెత్ ప్రస్తావించడం కరెక్ట్ కాదు. చైనాను అదుపు చేసేందుకు తైవాన్ సమస్యను అమెరికా తీసుకురావడం సరికాదు. తైవాన్ అంశం చైనా అంతర్గత వ్యవహారం. ఇందులో మూడో దేశం జోక్యం మానుకోవాలి. నిప్పుతో ఆడుకోవద్దంటూ అమెరికాకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.Chinese Foreign Ministry Spokesperson’s Remarks on US Defense Secretary Pete Hegseth’s Negative Comments on China at the Shangri-La DialogueHegseth deliberately ignored the call for peace and development by countries in the region, and instead touted the Cold War mentality of… pic.twitter.com/PaO14RW6kE— Lin Jian 林剑 (@SpoxCHN_LinJian) June 1, 2025ఇక, అంతకుముందు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ సింగపూర్‌లో జరిగిన అంతర్జాతీయ భద్రతా సదస్సుల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెగ్సెత్ మాట్లాడుతూ.. భౌగోళిక, సముద్ర వివాదాల పరిష్కారంతో పాటు తైవాన్ విషయంలో చైనా ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్నారు. భవిష్యత్తులో ఆ దేశం నుంచి వచ్చే ముప్పును.. ముఖ్యంగా తైవాన్‌పై దాని దూకుడు ప్రదర్శనను ఎదుర్కోవడానికి అమెరికా.. విదేశాల్లో తన రక్షణను బలోపేతం చేస్తోందన్నారు.MUST-SEE: Pete Hegseth declares the US will not be pushed out or intimidated by China."We do not seek conflict with communist China. We will not instigate nor seek to subjugate or humiliate." "President Trump and the American people have immense respect for the Chinese… pic.twitter.com/l6USFabG66— Resist the Mainstream (@ResisttheMS) June 1, 2025ఇదే సమయంలో తైవాన్ను స్వాధీనం చేసుకోవడానికి చైనా దాని చుట్టూ సముద్రజలాల్లో యుద్ధ విమాన వాహక నౌకలను మోహరిస్తూ బెదిరింపులకు పాల్పడుతోందని పేర్కొన్నారు. లాటిన్ అమెరికాపైనా చైనా కన్నేసిందనీ.. పనామా కాలువపై తన ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు కృషి చేస్తోందని చెప్పారు. చైనా నుంచి ఆర్థిక, సైనిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న ఇండో పసిఫిక్ ప్రాంత మిత్రదేశాలను గాలికి వదిలేయలేం. ఆయా దేశాలు తమ రక్షణ వ్యయాన్ని పెంచుకోవాలి. చైనా దూకుడు ప్రదర్శిస్తే అమెరికా దాన్ని అడ్డుకుంటుంది అని చెప్పుకొచ్చారు. దీనికి చైనా కౌంటర్ ఇచ్చింది. -
చైనాతో తక్షణ ప్రమాదం వాస్తవం
సింగపూర్: డ్రాగన్ దేశం చైనా నుంచి ఇండో–పసిఫిక్ దేశాలకు తక్షణ ముప్పు పొంచి ఉందని, ఇది నిజమని అమెరికా విదేశాంగ మంత్రి పీటర్ హెగ్సెత్ హెచ్చరించారు. చైనా నుంచి ఎదురయ్యే సైనిక, ఆర్థికపరమైన ఒత్తిడుల నేపథ్యంలో ఈ ప్రాంతంలోని మిత్ర దేశాలను ఒంటరిగా వదిలేయబోమని హామీ ఇచ్చారు. అదే సమయంలో, ఆయా దేశాలు రక్షణపరంగా మరింత బలోపేతం కావాలని సూచించారు. జీడీపీలో 5 శాతం మేర రక్షణ రంగానికి కేటాయించాలని సూచించారు. యూరప్ దేశాలు సైతం ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చైనా నుంచి వేగంగా పెరుగుతున్న ముప్పును, ముఖ్యంగా తైవాన్ విషయంలో దుండుడుకు చర్యలకు ముకుతాడు వేసేందుకు అమెరికా రక్షణ చర్యలను ముమ్మరం చేస్తుందని ప్రకటించారు. తైవాన్ను ఆక్రమించుకునేందుకు చైనా ఆర్మీ రిహార్సల్స్ చేస్తోందని హెగ్సెత్ వ్యాఖ్యానించారు. ఇదే లక్ష్యంతో సైన్యానికి రోజువారీ శిక్షణ అందిస్తోందన్నారు. 2027 నాటికి తైవాన్ను విలీనం చేసుకోవాలనే లక్ష్యాన్ని సాధించే సత్తా తమకుందని చైనా ఇప్పటికే చేసిన ప్రకటనపై ఆయనీ వ్యాఖ్యలు చేశారు. సింగపూర్‌లో జరుగుతున్న అంతర్జాతీయ భద్రతా సదస్సు ‘షంగ్రీ లా డైలాగ్’లో హెగ్సెత్ శనివారం కీలకోపన్యాసం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెక్యూరిటీ స్టడీస్ ఏర్పాటు చేసింది. చైనా విస్తారమైన దక్షిణ చైనా సముద్రంలో కృత్రిమ ద్వీపాలను ఏర్పాటు చేసి మిలటరీ ఔట్ పోస్టులను నెలకొల్పుతోంది. అత్యంత అధునాతన హైపర్సోనిక్ క్షిపణులను తయారు చేయడంతోపాటు అంతరిక్షంలోనూ పైచేయి సాధించేందుకు వేగంగా పావులు కదుపుతోంది. ఈ బెడదను దృష్టిలో ఉంచుకునే అమెరికా ‘గోల్డె న్ డోమ్’క్షిపణి రక్షణ వ్యవస్థ ఏర్పాటుకు సిద్ధమైంది. పనామా కాలువ సహా లాటిన్ అమెరికా ప్రాంతంలోనూ పలుకుబడిని పెంచుకునేందుకు చైనా ప్రయత్నిస్తోందని హెగ్సె త్ ఆరోపించారు. ఈ ప్రాంతంలోని కొన్ని దేశాలు అమెరికా సైనిక మద్దతును పొందుతూనే చైనాతో ఆర్థికంగా సంబంధాలు నెరుపుతుండటం ప్రమాదకరమైన వ్యవహా రమని హెగ్సెత్ పేర్కొన్నారు. యూరప్ దేశాలు తమ సొంత భద్రతను చూసుకోవా లని, ఇండో–పసిఫిక్ బాధ్యతను అమెరికాకు వదిలేయాలన్నారు. అనంతరం మాట్లాడిన ఈయూ ఉపాధ్యక్షురాలు కాజా కల్లాస్ హెగ్సె త్ వ్యాఖ్యలను ఖండించారు. ‘ఉత్తరకొరియా బలగాలు రష్యా తరఫున ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్నాయి. అదే సమయంలో, రష్యాకు చైనా మద్దతుగా నిలుస్తోంది. యూరప్, ఆసియాల భద్రత ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి’అని పేర్కొన్నారు.హాజరు కాని చైనా రక్షణ మంత్రిఏటా జరిగే ఈ సదస్సుకు చైనా తన రక్షణ మంత్రిని పంపిస్తుంటుంది. అమెరికాతో నడుస్తున్న టారిఫ్ విభేదాల నేపథ్యంలో ఈసారి దిగువ స్థాయి అధికారులతో కూడిన బృందాన్ని పంపించింది. హెగ్సెత్ వ్యాఖ్యలను ఈ బృందంలోని చైనా నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ హు గంగ్ఫెంగ్ తీవ్రంగా ఖండించారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. -
ఆర్ఐసీని పునరుద్ధరిద్దాం: రష్యా
మాస్కో: రష్యా–భారత్–చైనా త్రయం బంధాన్ని పునరుద్ధరించాలని రష్యా పిలుపునిచ్చింది. లద్దాఖ్‌లో సైనిక ప్రతిష్టంభనకు సంబంధించి భారత్, చైనా అవగాహనకు వచ్చిన నేపథ్యంలో మూడు దేశాలూ మరింతగా కలసి సాగాలని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ పేర్కొన్నారు. ‘‘రష్యా–భారత్–చైనా (ఆర్ఐసీ) కార్యకలాపాల పునరుద్ధరణపై మేం ఆ సక్తిగా ఉన్నాం. రష్యా మాజీ ప్రధాని యెవగనీ ప్రిమ కోవ్ చొరవతో చాలా ఏళ్ల క్రితం స్థాపించిన ఆర్ఐసీ పునరుద్ధరణ కోసం వేచి చూస్తున్నాం. వాటి మధ్య గతంలో ఏకంగా 20సార్లకు మించి అత్యున్నత స్థాయి సమావేశాలు జరిగాయి. సరిహద్దులో పరిస్థితిని సుల భతరం చేయడంపై భారత్, చైనా మధ్య అవగా హన కుదిరింది. కనుక ఆర్ఐసీ పునరుద్ధరణకు ఇదే సరైన సమయం’’ అని లావ్రోవ్ అన్నారు. పెర్మ్‌లో జరిగిన అంతర్జాతీయ సామాజిక, రాజకీయ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌ను చైనా వ్యతి రేక కుట్రలోకి లాగేందుకు నాటో ప్రయ త్నిస్తోందని ఆరోపించారు. 2020 జూన్‌లో గల్వాన్ సంక్షోభం అనంతరం ఆర్ఐసీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. -
అమెరికా స్వేచ్ఛ అబద్ధం: చైనా
బీజింగ్: కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలున్నాయన్న నెపంతో తమ విద్యార్థుల వీసాలను రద్దు చేసిన అమెరికా చర్యను చైనా ఖండించింది. ఇది ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీసే రాజకీయం ప్రేరేపిత వివక్షతో కూడిన చర్యని పేర్కొంది. ఈ అంశంపై అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో చేసిన వ్యాఖ్యలపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ గురువారం తీవ్రంగా స్పందించారు. ఈ విషయంపై చైనా అమెరికాలో ఉన్న తమ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతోందన్నారు. అమెరికా చెప్పుకునే స్వేచ్ఛ, నిష్కపట విలువలు బూటకమని వ్యాఖ్యానించారు. ఇది అమెరికా ప్రతిష్టను, విశ్వసనీయతను మరింత దెబ్బతీస్తుందన్నారు. ‘జాతీయ భద్రత సాకుతో చైనా విద్యార్థుల వీసాలను అన్యాయంగా రద్దు చేయడం వారి చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీసింది. రెండు దేశాల మధ్య సాధారణ ప్రజల మధ్య రాకపోకలకు కూడా అంతరాయం కలిగిస్తుంది. ఈ చర్యలను చైనా గట్టిగా వ్యతిరేకిస్తుంది’అని ప్రకటించారు. కాగా, చైనా కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధాలు ఉన్న వారితో సహా కొన్ని కీలకమైన రంగాలలో చదువుతున్న చైనా విద్యార్థుల వీసాలను అమెరికా ప్రభుత్వం రద్దు చేస్తుందని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో బుధవారం ప్రకటించారు. గందరగోళంలో విద్యార్థుల భవితవ్యం ఇప్పటికే అమెరికాలో విదేశీ విద్యార్థులపై పెరుగుతున్న అనిశి్చతికి తోడుగా వెలువడిన ఈ ప్రకటనతో చైనీస్ విద్యార్థులు భవితవ్యం గందరగోళంలో పడింది. అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థుల్లో భారత్ తరువాత రెండో అతిపెద్ద దేశం చైనా. 2023–2024 విద్యా సంవత్సరంలో 270,000 కంటే ఎక్కువ మంది అంతర్జాతీయ విద్యార్థులు చైనా నుంచే వచ్చారు. ఇది యూఎస్‌లోని మొత్తం విదేశీ విద్యార్థులలో దాదాపు నాలుగింట ఒక వంతు. విదేశాలలో చదువుతున్న చైనా విద్యార్థుల సమస్య చాలా కాలంగా ద్వైపాక్షిక సంబంధంలో ఉద్రిక్తతకు దారితీసింది. ట్రంప్ మొదటి పదవీకాలమైన 2019లో వీసాల తగ్గింపు, తిరస్కరణల రేట్లు పెరగడంతో విద్యార్థులను చైనా విద్యా శాఖ విద్యార్థులను హెచ్చరించింది. ఇక గతేడాది అమెరికా చేరుకున్న అనేక మంది చైనా విద్యార్థులను అన్యాయంగా విచారించి విమానాశ్రయాల నుంచి వెనక్కి పంపింది. ఈ నేపథ్యంలో కోవిడ్ తరువాత చాలామంది చైనా విద్యార్థులు యూకే వైపు మొగ్గుచూపుతున్నారు. మరోవైపు హాంకాంగ్ సైతం చైనా విద్యార్థులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. హార్వర్డ్‌కు విదేశీ విద్యార్థులను చేర్చుకునే మోదాను రద్దు చేసిన తరువాత.. ఆ విద్యార్థులను ఆహా్వనిస్తూ పోస్ట్చేసింది. అయితే.. వీసా రద్దులు అమెరికాకు మేలు చేయవని, ఇది చైనా అభివృద్ధికే సానుకూల మార్పు కావచ్చని బీజింగ్‌లో విద్యావేత్తలు అంటున్నారు. ప్రతిభావంతులైన వ్యక్తులు సింఘువా లేదా పెకింగ్ విశ్వవిద్యాలయంలో లేదా చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌తోపాటు చైనాలోని ఇతర అగ్రశ్రేణి సంస్థల్లో చేరతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది దేశీయ శాస్త్ర, సాంకేతిక అభివృద్ధికి ప్రయోజనం చేకూరుస్తుందని చెబుతున్నారు. -
చైనా విద్యార్థులకు భారీ షాక్!
వాషింగ్టన్: అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికాలో చైనా విద్యార్థుల వీసాలు రద్దు చేయడానికి ట్రంప్ యంత్రాంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రూబియో ఓ ప్రకటనలో వెల్లడించారు. దీంతో, చైనా విద్యార్థుల్లో టెన్షన్ మొదలైంది.మంత్రి మార్కో రూబియో తాజాగా ట్విట్టర్ వేదికగా..‘అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో చైనా విద్యార్థుల వీసాలను రద్దు చేయడానికి అమెరికా విదేశాంగ శాఖ హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖతో కలిసి పని చేస్తుంది. చైనా విద్యార్థుల వీసాలను రద్దు చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తాం.వీరిలో చైనా కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధాలు ఉన్నవారు, కీలక రంగాలలో చదువుతున్నవారు కూడా ఉన్నారు. దీనికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలపై విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఇక, అమెరికాలో భారత్, తర్వాత చైనా విద్యార్థులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అంతర్జాతీయ విద్యార్థుల్లో చైనా విద్యార్థులే రెండో స్థానంలో కొనసాగుతున్నాయి. 2023-2024 విద్యా సంవత్సరానికి గాను చైనా నుండి 2,70,000 మంది విద్యార్థులు అమెరికాలో చదువుతున్నారు.The U.S. will begin revoking visas of Chinese students, including those with connections to the Chinese Communist Party or studying in critical fields.— Secretary Marco Rubio (@SecRubio) May 28, 2025ట్రంప్ vs హార్వర్డ్మరోవైపు.. హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో కొత్త అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకోకుండా తాత్కాలికంగా నిలిపివేసింది. వర్సిటీలోని పరిశోధన భాగస్వామ్యాల ద్వారా విద్యార్థులు.. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీతో సమన్వయం చేసుకుంటున్నట్టు ఆరోపించింది. హార్వర్డ్ ఒక చైనీస్ పారామిలిటరీ గ్రూప్ సభ్యులకు శిక్షణ ఇస్తోందని డీహెచ్ఎస్ వ్యాఖ్యానించింది. చైనా విద్యార్థులు వామపక్ష భావజాలంతో విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపణలు చేసింది.ఇదిలా ఉండగా.. అమెరికా వీసాల విషయంలో ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. యూఎస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అమెరికన్లు చేసే పోస్టులను, కామెంట్లను సెన్సార్ చేయడానికి ప్రయత్నించే విదేశీ అధికారులపై కొత్తగా వీసా నిషేధాన్ని ప్రకటించింది. అంతేకాకుండా తమ దేశానికి చెందిన సామాజిక మాధ్యమాలకు కంటెంట్‌ను తీసేయమని నోటీసులు పంపడం, ఒత్తిడికి గురిచేసిన వారిపైనా ఈ వీసా నిషేధం అమలుకానున్నట్లు అమెరికా పేర్కొంది. ఇటీవల పలు దేశాల ప్రభుత్వాల నుంచి యూఎస్ సోషల్ మీడియా కంపెనీలకు ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.‘అమెరికా పౌరులు లేదా నివాసితులు తాము సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌లను, కామెంట్లను తొలగించమని ఒత్తిడికి గురిచేయడం, అరెస్టు వారెంట్లు జారీ చేయడం, యూఎస్ టెక్ కంపెనీలను సైతం ఒత్తిడికి గురిచేసే విదేశీ అధికారులను లక్ష్యంగా చేసుకొని ఈ కొత్త పాలసీ తీసుకొచ్చాం’ అని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పేర్కొన్నారు. ఈ సందర్బంగా విదేశీ అధికారులు ఇలా అమెరికా పౌరులను, టెక్ కంపెనీలను ఒత్తిడికి గురిచేయడం అనైతికం అన్నారు. అంతేకాకుండా గ్లోబల్ కంటెంట్ మోడరేషన్ విధానాలు అవలంభించడం లేదా వారి అధికార పరిధి దాటి సెన్సార్షిప్ కార్యకలాపాల్లో పాల్గొనాలని ఇతర దేశాల అధికారులు యూఎస్ టెక్ కంపెనీలను డిమాండ్ చేయడం ఆమోదయోగ్యం కాదన్నారు. అయితే ఏ దేశం పేరును గానీ, అధికారులను గానీ ఆయన నేరుగా ప్రస్తావించలేదు. -
పెరుగుతున్న చైనా ప్రాబల్యం
పహల్గామ్లో ఉగ్రదాడిపై భారత్ స్పందించిన తీరు, తదనంతర పరిణా మాలు ప్రాంతీయ భౌగోళిక రాజకీయాల్లో మౌలికంగా తీసుకొచ్చిన మార్పులేమీ లేకపోవచ్చు. కానీ, దక్షిణాసియాలో రూపు దిద్దుకుంటున్న ప్రాబల్య సమతూకానికి సంబంధించి అవి కొన్ని ముఖ్యమైన దృక్కోణాలను బయటపెట్టాయి. ఈసారి భారత్–పాకిస్తాన్ల మధ్య నెలకొన్న తాజా సైనిక ప్రతిష్టంభన మునుపటి దృష్టాంతాలకు భిన్నమైంది. భారత్ –పాక్‌ల మధ్య సైనిక ఘర్షణ పరస్పరం అణ్వాయుధాలను ప్రయో గించుకోగల స్థితికి చేరుతోందని అమెరికా పొరపడింది. ఘర్షణ తీవ్ర రూపం దాల్చకుండా రెండు దేశాల నాయకులకూ రాత్రికి రాత్రి అమె రికా ఫోన్లు చేసి ఉండవచ్చు. కానీ, ఒకటి మాత్రం స్పష్టం. ఇది ప్రాంతీయ ఆధిపత్య సమతూకపు స్థితిగతులను మార్చి వేసింది. సూటిగా చెప్పాలంటే, దక్షిణాసియాను అత్యంత ప్రభావితం చేయగలి గిన శక్తిగా అమెరికా స్థానాన్ని చైనా ఆక్రమించిందని చెప్పడం సబబు.ఇండియాకు గట్టి మద్దతివ్వని రష్యాప్రపంచవ్యాప్తంగా అత్యంత బలమైన సైనిక శక్తిగా అమెరికా ఇప్పటికీ కొనసాగుతున్నప్పటికీ, భౌగోళిక రాజకీయాలను ప్రభా వితం చేయగల అవకాశం సదరు దేశపు శక్తితోపాటు అభిమతంపైన కూడా ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రాంతానికి సంబంధించి స్పష్టమైన వ్యూహాత్మక ప్రయోజనం అమెరికాకు కొరవడినట్లుగా కని పిస్తోంది. ఫలితంగా, ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని శాసించగల శక్తిగా ఉన్న అమెరికా ఇపుడు నామమాత్రపు పాత్రధారి స్థాయికి కుంచించుకుపోయింది. అటూఇటూగా వాషింగ్టన్ స్థానాన్ని బీజింగ్ ఆక్ర మించింది. ఆర్థికంగా బలమైన దేశంగా ఉన్న చైనా దౌత్యపరమైన యుక్తిని ప్రదర్శిస్తూ ఆయుధాల సరఫరాదారుగా, మధ్యవర్తిగా ఈ ప్రాంతపు పరిణామాలను నిర్దేశించగల స్థితిలో ఉంది. ప్రాంతీయ సైనిక ఘర్షణలు, దౌత్యపరమైన ప్రతిష్టంభనలు, రాజకీయ వాద వివాదాలకు తీర్పరిగా వ్యవహరించాలని చైనా కోరు కుంటోంది. ఇటీవల పాక్‌కు అందించినట్లుగానే హైటెక్ ఆయుధాల సరఫరా ద్వారా, లేదా దౌత్యపరంగా ప్రత్యక్షంగా జోక్యం చేసు కోవడం, ఆర్థికపరమైన ఒత్తిడిని తీసుకురావడంతో అది ఆ యా పను లను చక్కబెట్టాలని భావిస్తోంది. దక్షిణాసియా, ఇండో–పసిఫిక్‌లో పెరుగుతున్న చైనా ప్రాబల్యం ఇప్పటికే కనిపిస్తోంది. కానీ, అది సైనికపరంగా వత్తాసు ఇస్తానని పాక్‌కు చెప్పడం, తాజా భారత–పాక్ ఘర్షణలో ప్రధానాంశం.అలాగే, భారతదేశానికి వ్యూహాత్మక భాగస్వామిగా అండగా నిలవడంలో రష్యా సామర్థ్యం తగ్గిన సంగతిని గమనించవలసిఉంది. ఇటీవలి ప్రతిష్టంభనలో రష్యా వైఖరి సాధారణంగా ఇతర దేశాలు చూపే మాదిరిగానే ఉంది. అది భారతదేశానికి బాహాటంగా మద్దతు ప్రకటించలేదు. పాకిస్తాన్ పేరును నేరుగా ప్రస్తావించలేదు సరికదా, భారత సైనిక చర్యలకు ఆమోదం కూడా తెలుపలేదు. ‘‘ఉగ్రవాద చర్యలను రష్యా తీవ్రంగా ఖండిస్తోంది. అవి ఏ రూపంలో వ్యక్తమైనా వ్యతిరేకిస్తోంది. ఈ రాక్షసత్వంపై సమర్థంగా పోరాడటా నికి మొత్తం ప్రపంచ దేశాలన్నీ ఏకోన్ముఖంగా ప్రయత్నాలు సాగించవలసిన అవసరం ఉందని భావిస్తోంది’’ అని రష్యా విదేశీ వ్యవ హారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఘర్షణలు మరింత ముదరకుండా సంయమనం పాటించవలసిందని రష్యా రెండు పక్షాలనూ కోరింది. ఒక రకంగా, రష్యా–ఉక్రెయిన్ల మధ్య ఘర్షణ సందర్భంలో భారత్ ఏం చెప్పిందో, భారత్–పాక్ ఘర్షణపై రష్యా అదే చెప్పింది. రష్యా–పాశ్చాత్య దేశాల మధ్య భారత్ సమతూకం పాటించినట్లు గానే, భారత్–చైనాల మధ్య సమతూకం పాటించేందుకు రష్యా ప్రయత్నించింది. దక్షిణాసియాలో రష్యాకున్న ప్రయోజనాలు పరిమితమే కావచ్చు. కానీ, ఇస్లామాబాద్‌తో బీజింగ్ అంటకాగుతోంది. బీజింగ్‌తో సన్నిహితంగా మెలిగే మాస్కో, తీరా చైనా ప్రయోజనాలు పణంగా ఉన్నపుడు భారతదేశానికి వీలైనంత తక్కువ సహాయాన్నే అందిస్తుంది. దానర్థం – భారత్ ప్రాంతీయ ప్రయోజనాలకు భంగం కలిగించాలని రష్యా కోరుకుంటోందని కాదు. చైనా ప్రయోజనాలను తక్కువ చేసేదిగా కనబడటం రష్యాకు ఇష్టం లేదు. ఏమైతేనేం, అది పాకిస్తాన్‌కే ప్రయోజనకారి అవుతుంది. రష్యాతో ఉన్న దోస్తీని ఉపయోగించుకుని చైనా నడవడికలో మార్పు తేగలమని మనం ఒకప్పుడు అనుకున్న రోజులున్నాయి. బహుశా ఇప్పుడు భారత దేశంతో రష్యాకున్న మైత్రిని నిగ్రహించగల శక్తి తనకుందని చైనా చాటుకోవడాన్ని మనం చూస్తున్నాం. రష్యా పట్ల భారత ఆసక్తి సన్నగిల్లుతున్నట్లుగానే, భారత్ పట్ల రష్యా ఆసక్తి కూడా రంగు, రుచి కోల్పోతోంది. ఇది మనం అంగీకరించక తప్పని వాస్తవం. క్షీణిస్తున్న ఈ స్నేహ బంధాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు ఉన్న మార్గాలను మనం గుర్తించవలసి ఉంది. ఒంటరిగానే పోరాడగలగాలి!ఇక భారతదేశానికున్న బాహ్య సమతూక (అంటే ఇతర దేశాలతో చెప్పించడం లేదా వాటిని పావులుగా వాడుకునేందుకు ఉన్న) అవకాశాలు అంతర్నిహితంగా పరిమితంగానే ఉండటం ఇటీ వలి ప్రతిష్టంభనలో వెలుగు చూసిన మరో గణనీయమైన అంశం. దక్షిణాసియాలో అణు యుద్ధం సంభవించవచ్చనే (అటువంటి అవకాశం లేశ మాత్రంగానే ఉన్నప్పటికీ) భయాలు అంతర్జాతీయంగా భారతదేశంతో స్నేహంగా మెలిగే చాలా దేశాలకున్నాయి. ఘర్షణలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని మనం ఉక్రెయిన్ విషయంలో చెబుతూ వస్తున్నాం. పాశ్చాత్య దేశాలు ఇప్పుడు అదే పల్లవి అందుకుంటున్నాయి. ఇతరుల సంక్షోభ సమయాల్లో మనం ఎలా వ్యవహరిస్తామో వారూ మన పట్ల అలానే వ్యవహరిస్తారని ఇటీవలి పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ఎటువంటి సైనిక కూటమిలోనూ చేరకూడదని మనం ఉద్దేశపూర్వకంగానే నిర్ణయించుకుని ఉండవచ్చు. బహుశా, అది సక్రమమైన నిర్ణయమే కావచ్చు కూడా! కానీ, దాని పర్యవసానాలను కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. మన యుద్ధాలను మనమే చేయాలి. అందుకు అనుసరించవలసిన విధానం స్పష్టమవుతూనే ఉంది. జాతీయ భద్రత సన్నద్ధతకు గణనీయమైన మొత్తాలను వెచ్చించడం ద్వారా మనం మొదట అంతర్గత సమతూకానికి ప్రయత్నించాలి. ప్రైవేటు సంస్థలు రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు మరింత ప్రోత్సాహం, అనువైన వాతావరణం అవసరం. స్థానిక, అంతర్జాతీయ భాగస్వాముల ద్వారా రక్షణ సామగ్రిని ఉత్పత్తి చేసుకోవాలి.ఉగ్రవాదంపై మనం స్పందించే తీరు ఇకపై ఇదే మాదిరిగా ఉండబోతోందని లిఖితపూర్వకంగా కాకపోయినా ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసింది కనుక, ఆపరేషన్ సిందూర్‌ను వివిధ కోణాల నుంచి నిష్పక్షపాతంగా మదింపు చేసేందుకు ఒక ఉన్నత స్థాయి కర్తవ్య నిర్వహణ బృందాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. భవిష్యత్తులో పాటించవలసిన రక్షణ సన్నద్ధత, నిఘా, వ్యూహ్మాతక కమ్యూనికేషన్లు, ఇతర కీలక అంశాలపై ఈ బృందం అవసరమైన చర్యలను సూచిస్తుంది. ఇటీవలి పరిణామాలను నిష్పాక్షికంగా పరిశీ లించి, భవిష్యత్తుకు వ్యూహాత్మక దిశా నిర్దేశాలు చేసేందుకు కార్గిల్ సమీక్షా కమిటీ తరహాలో పహల్గామ్ సమీక్షా కమిటీని ఏర్పాటు చేసేందుకు సమయం ఆసన్నమైంది. చివరగా, ఇంత తీవ్రతతో కూడిన ఈ తరహా సైనిక ప్రతిష్టంభనలు దేశపు విశాల వ్యూహాత్మక లక్ష్యాలను కూడా పక్కనపెట్టేవిధంగా మన దృష్టిని మళ్ళించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నేటి భారతదేశం దక్షిణాసియాకు మాత్రమే పరిమితమై ఉండలేదు. కేవలం పాక్ పైనే మన దృష్టినంతటినీ నిలిపి ఉండలేం. ఇప్పటికే పరిమితంగా ఉన్న రాజకీయ, దౌత్య, సైనిక వనరులను ఇతర విశాల లక్ష్యాల వైపు మళ్ళించడానికి లేకుండా సతమతమవుతున్నాం. పాక్‌నే బూచిగా చూస్తూ కూర్చుంటే ఆ సామర్థ్యాలు మరింత పరిమిత మవుతాయి. పాక్ నుంచి తరచూ ఎదురుకాగల ఉద్రిక్తతల వలయంలో చిక్కుకుపోకుండా నిలవడమే భారత్ ముందున్న అతి పెద్ద వ్యూహాత్మక సవాల్!హ్యాపీమాన్ జాకబ్ వ్యాసకర్త జేఎన్‌యూలో ఇండియా విదేశాంగ విధాన బోధకులు (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
బంగ్లాదేశ్‌లో ముసలం!
జవాబుదారీతనం లేని అధికారం అరాచకానికి దారితీస్తుంది. దేశ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తుంది. బంగ్లాదేశ్‌లో నిరుడు ఆగస్టు తిరుగుబాటు తర్వాత జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఈ అభిప్రాయం కలుగుతుంది. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ఆర్థిక నిపుణుడు మహమ్మద్ యూనస్ ప్రధాన సలహాదారుగావున్న అక్కడి తాత్కాలిక ప్రభుత్వం ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నది. ఒకపక్క సత్ప్రవర్తన లేని ప్రభుత్వోద్యోగులకు త్వరగా ఉద్వాసన పలికేవిధంగా సర్వీసు నిబంధనలు మార్చటం, మరోపక్క అరకొర జీతాలతో నెట్టుకొస్తున్న ఉపాధ్యాయులకు మెరుగైన వేతనాలివ్వటంలో విఫలం కావటం వగైరాలు అసంతృప్తికి దారితీసి నాలుగు రోజులుగా దేశవ్యాప్తంగా సమ్మె సాగుతోంది. ఈలోగా అమెరికా ఒత్తిడికి లొంగి లోపాయకారీగా సెయింట్ మార్టిన్స్ దీవిని కట్టబెట్టేందుకు యూనస్ పావులు కదిపారు. అంతేకాదు... దాని ఆదేశాలతో చిట్ట గాంగ్– రఖినే కారిడార్‌ను ‘మానవతా సాయం’ అందించటానికి వీలుగా అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండింటిపైనా దేశంలో తీవ్ర నిరసనలు వ్యక్తంకావటంతో పాటు సైన్యం నుంచి సైతం వ్యతిరేకత వచ్చింది. పర్యవసానంగా పది నెలలకు పైగా బాధ్యత లేని అధికారం చలాయి స్తున్న ప్రభుత్వం చిక్కుల్లో పడింది. గత్యంతరంలేని స్థితిలో తన నిర్ణయాలను వెనక్కు తీసుకుంది.తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు దేశంలో వరస వైపరీత్యాలు చోటు చేసుకుంటున్నాయి. ఛాందసవాదులు కత్తులు కటార్లతో రోడ్లపైకొచ్చి ముస్లిం మహిళలు బురఖా ధరించాలని హుకుం జారీచేస్తూ హడావిడి మొదలుపెట్టారు. దాన్ని బేఖాతరు చేసిన మహిళలను నడిరోడ్డుపై దండించటం, జైళ్లపాలు చేయటం కొనసాగాయి. మైనారిటీ హిందువులపై దాడులు, దౌర్జన్యం, అక్రమ అరెస్టులు మామూలే. వీటని సరిదిద్దటానికి బదులు అంతా మీడియా సృష్టి అని యూనస్ దబాయింపులకు దిగారు. ఒకనాడు తూర్పు పాకిస్తాన్‌గా వున్న తమపై పాక్ పాలకుల అకృత్యాలను మరిచి, దాన్ని నెత్తినపెట్టుకోవటం మొదలుపెట్టారు. చైనాకు పోయి దాంతో మరింత సాన్నిహిత్యానికి ప్రయత్నించారు. దేశానికి పనికొచ్చేదేదో, ప్రయోజనకరమైనదేదో గ్రహించి నిర్ణయాలు తీసుకోవటం మాని భారత్‌ను చీకాకు పెట్టడమే లక్ష్యంగా యూనస్ వ్యవహారశైలివుంది.ఎల్లకాలమూ ఇలాగే సాగిపోతుందనుకుంటే చెల్లదు. పాత ప్రభుత్వం పతనమై పది నెలలు దాటుతున్నా ప్రభుత్వం ఎన్నికల గురించి ఆలోచించదేమన్న ప్రశ్నలు మొదలయ్యాయి. 2026 మధ్య వరకూ ఎన్నికలు జరిపే ఉద్దేశం లేదన్నట్టు యూనస్ ప్రభుత్వం ఈమధ్య లీకులిస్తుండగా,బంగ్లా ఆర్మీ చీఫ్ వాకర్–ఉజ్–జమాన్ ఈ ఏడాది ఆఖరిలోగా ఎన్నికలు జరిగి తీరాలని నిర్దేశించారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకొస్తే తాము తిరిగి బ్యారక్లకు వెళ్లిపోతామని ఒక సభలో మాట్లా డుతూ ఆయన ప్రకటించారు. సహజంగానే ఇది యూనస్‌కు మింగుడు పడలేదు. అలాగని ప్రభు త్వాన్ని నడపటం ఆయనకు చేతకావటం లేదు. ప్రభుత్వంలోని మత ఛాందసవర్గం, విద్యార్థి నాయకులు చెప్పినట్టల్లా చేస్తూ ఆయన ఇప్పటికే ప్రతిష్ఠ పోగొట్టుకున్నారు. షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్‌ను నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయం ఆ బాపతే.బంగ్లా అధీనంలోవున్న సెయింట్ మార్టిన్స్ దీవి వ్యూహాత్మకంగా కీలకమైనది. బంగాళాఖాతంలో మన దేశం, మయన్మార్ కూడా దీనికి సమీపంగా ఉంటాయి. పదివేలమంది బంగ్లా పౌరులు నివసించే ఈ దీవిలో సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవాలని అమెరికా ఏనాటి నుంచో కలలుగంటున్నది. హిందూ మహా సముద్రంలో డీగో గార్షియా దీవిలో స్థావరం ఉన్నా, బంగాళాఖాతంలో లేని లోటు దాన్ని పీడిస్తోంది. ఈ దీవిపై అమెరికా మాత్రమే కాదు... చైనా కన్ను కూడా పడింది. మయన్మార్ సైతం వీలైతే దాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తోంది. అంతర్జాతీయ సాగర చట్టాల ట్రిబ్యునల్ 2012లో ఈ దీవి బంగ్లాదేశ్‌కు చెందుతుందని, 12 నాటికల్ మైళ్ల మేర ప్రాంతం ఆ దేశానిదేనని తీర్పునిచ్చినా అడపా దడపా మయన్మార్‌తో సమస్యలు తప్పడం లేదు. ఆ దేశ సైన్యం అక్కడ మసిలే బంగ్లా పౌరులను అపహరించటం, కాల్పులు జరపటం రివాజుగా మారింది. దీన్ని అమెరికాకూ లేదా చైనాకూ అప్పగిస్తే మన దేశ భద్రతకు ముప్పు కలుగుతుంది. కానీ యూనస్ భారత్‌పై వ్యతిరేకతతో ఈ దీవిని అమెరికాకు అప్పగించాలనుకున్నారు. ఈ ప్రతిపాదనను కూడా బంగ్లా సైన్యం తీవ్రంగా వ్యతిరేకించింది. దేశ భవిష్యత్తును నిర్దేశించే ఇలాంటి కీలక నిర్ణయాలు ఎన్నికైన ప్రభుత్వానికే వదలాలని సూచించింది. అలాగే చిట్టగాంగ్–రఖినే కారిడార్ విషయంలోనూ సైన్యం పట్టుదలతో ఉంది. మయన్మార్‌లో సైనిక ముఠా ప్రభుత్వ దాడుల్లో చిక్కుకున్న రఖినే ప్రాంతానికి నిత్యావసరాలు, మందులు, ఆహారం అందించాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చిన మాట వాస్తవం. అమెరికా సైతం ఈ కృషిలో పాలుపంచుకుంటామని తెలిపింది. అయితే ఈ మాటున కారిడార్ ఆనుపానులన్నీ అమెరికా తెలుసుకుంటుందన్నది బంగ్లా సైన్యం బెంగ.తన నిర్ణయాలను హసీనాయే కాదు... బీఎన్పీ నేత ఖలీదా జియా, సైన్యం, పౌర సమాజం తీవ్రంగా వ్యతిరేకించటంతో యూనస్‌కు ఎటూ పాలుపోలేదు. అందుకే రాజీనామా బెదిరింపులకు దిగారు. కానీ దానికెవరూ కంగారు పడిన దాఖలా లేకపోవటంతో వెనక్కి తగ్గారు. నిర్ణయాత్మకంగా వ్యవహరించటం చేతకాని తన వ్యవహారశైలితో బంగ్లాదేశ్‌ను ఏం చేద్దామనుకుంటున్నారో యూనస్ ఆలోచించుకోవాలి. నడమంత్రపు సిరిలా వచ్చిపడిన అధికారం అండతో దేశాన్ని భ్రష్టుపట్టించటం మానుకోవాలి. సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించటమే గౌరవప్రదమని గ్రహించాలి. -
ఇక నుంచి భారత్ వస్తువులే కొందాం.. మేకిన్ ఇండియాను సాధిద్దాం: ప్రధాని మోదీ
గాంధీనగర్: మనం మేకిన్ ఇండియాను సాధించాలంటే మన దగ్గర తయారు చేసిన వస్తువులనే కొందామంటూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. విదేశీ మార్కెట్‌ను విపరీతంగా పంచేస్తున్న మనం.. ఇక నుంచి మన మార్కెట్‌కే పెద్ద పీఠ వేయాలయన్నారు. ఈ రోజు(మంగళవారం) గుజరాత్ లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ.. చైనా తయారు చేసే విదేశీ తరహా వస్తువుల్ని కొనాల్సిన అవసరం లేదనే సంకేతాలిచ్చారు. ఇక నుంచి ఏ వస్తువైనా మేడిన్ ఇండియాది అయితేనే కొందామని దేశ ప్రజలకు విజ్క్షప్తి చేశారు. హెలీ, దీపావళి, గణేష్ చతుర్థి.. ఏ పండుగ అయినా మేడిన్ వస్తువులనే కొందామంటూ ప్రధాని మోదీ పిలుపు నిచ్చారు. ‘ దేశ ప్రజలకు ఇదే నా విన్నపం. ప్రొడక్టులు కొనేటప్పుడు జాగ్రత్త వహించండి. ఒకటికి రెండుసార్లు చెక్ చేసి కొనండి. మన ఇండియా వస్తువులనే ఇక నుంచి ఎక్కువగా వాడదాం. అవసరం అయితే తప్పితే దిగుమతులుపై పెద్దగా ఆధాపడవద్దు. చైనా ప్రొడక్టులు అస్సలే కొనొద్దు. వస్తువులు కొనేటప్పుడు చైనా డంప్ ను తనిఖీ చేయండి. ఆపరేషన్ సిందూర్ అనేది 140 కోట్ల భారతీయల బాధ్యత’ అని మోదీ స్పష్టం చేశారు.మనం విదేశీ మార్కెట్‌ను పెంచుతున్నాం.. గ్రహించండిభారత మార్కెట్లను విదేశీ దిగుమతులు ఏ రకంగా ముంచెత్తుతున్న ఉదాహరణలను ఉటంకిస్తూ, దురదృష్టవశాత్తు, గణేష్ విగ్రహాలు కూడా విదేశాల నుండే వస్తున్నాయి, చిన్న కళ్ల గణేష్ విగ్రహాలు కూడా కళ్ళు సరిగ్గా తెరవవు. హోలీ రంగులు కూడా విదేశీ తయారీవే. అవి తక్కువ ధరకే రావడంతో మనం వాటిని కొనేస్తున్నాం.. వారి మార్కెట్ ను ఇక్కడ పెంచుతున్నాం. ఇక్కడ మన కళాకారుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇక నుంచి వాటికి దూరంగా ఉండండి. మేడిన్ ఇండియా ఉత్పత్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వండి’ అని పేర్కొన్నారు.ఇది మీకు టాస్క్..తాను దేశ ప్రజలకు ఒక టాస్క్ ఇస్తున్నానని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు. ‘ ఇక నుంచి ప్రతీ భారతీయుడు చేయాల్సిన టాస్క్ ఒకటి ఉంది. మన రోజువారీ జీవితంలో విదేశీ వస్తువుల్ని ఎన్ని వాడుతున్నాం అనేది లిస్ట్ రాసుకోండి. ఒక భారతీయుడిగా మీకు ఇస్తున్న టాస్క్ ఇది. 24 గంటల్లో విదేశీ వస్తువుల్ని ఎన్ని కొన్నాం అనేది ఒక లిస్ట్ తయారు చేసుకోండి. అయితే ఇక్కడ ఏది విదేశీ వస్తువు అనేది మీరు గ్రహించలేరు. మీరు కొనే హెయిర్ పిన్, దువ్వెన కూడా విదేశీ వస్తువే అనేది గ్రహించండి. ఇంతలా విదేశీ వస్తువులు కొనడానికి మొగ్గుచూపుతున్నాం. మేడిన్ ఇండియా ప్రొడక్టులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. భారత్ ను మీరు రక్షించాలనుకుంటే ఇక నుంచి మన వస్తువుల్నే ఎక్కువగా కొందాం. మేకిన్ ఇండియాలో భాగంగా ప్రతీ పౌరుడు ఇది చేయాలి. భారత్ మరింత ఎదగాలంటే ఇది తప్పనిసరి. పాకిస్తాన్ కుట్రకు బదులిచ్చిన ఆపరేషన్ సిందూర్ అనేది మన బలగాల బాధ్యతే కాదు. 140 కోట్ల దేశ ప్రజల బాధ్యత అనేది గుర్తుంచుకోండి’ అని మోదీ పేర్కొన్నారు. -
ఒక ముద్దు, ఓ పాట..అద్భుతమే చేశాయ్..!
భార్య అందం తగ్గిందని వదిలేసే ప్రబుద్ధులు ఉన్న ఈ రోజుల్లో.. ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారా..? అని విస్తుపోతారు. ఎందుకంటే..భార్య మంచానికే పరిమితమైతే..వదిలేసే భర్తలెందరో ఉన్నారు ఈ సమాజంలో. అంతేగాదు తన అవసరాలన్నీ తీరిస్తేనే..భార్య. లేదంటే అనవసరం అనే మగవాళ్లనే చూశాం. కానీ ఈ వ్యక్తి మాత్రం అనారోగ్యంతో పోరాడుతుందని తెలిసి పెళ్లి చేసుకున్నాడు. అక్కడితో ఆగకుండా..తాను చేయగలిగంతా చేసి కాపాడుకునే యత్నం చేశాడు. అయినా విధి కన్నెర్రజేసి భార్య కోమాలోకి వెళ్లిపోయేలా చేసినా..ఆశను వదులుకోలేదు. బతికి బట్టగలిగేలా చేసుకున్నాడు. భర్త అంటే ఇలా ఉండాలి అని అంతా కుళ్లుకునేలా నెటిజన్ల మనసుని గెలుచుకున్నాడు.అతడే చైనాలోని గ్వాంగ్జీ ప్రావిన్స్‌కు చెందిన 30 ఏళ్ల డెంగ్ యూకాయ్. తన భార్య యే మెయిడీ ప్రాణాంతక కేన్సర్‌తో పోరాడుతున్నా..ఆమె చేయిని వదలలేదు. ఉద్యోగాన్ని కూడా వదిలేసి పూర్తిగా తనకే అంకితమై కంటిపాపలా కాచుకున్నాడు. అయితే ఆ కేన్సర్..డెంగ్ ప్రేమను ముక్కలు చేసేలా విజృభించి భార్యను కోమాలోకి వెళ్లిపోయిలా చేసింది. డాక్టర్లు సైతం చేతులెత్తేసిన వేళ కూడా.. తన ప్రేమతోనే భార్యను బతికించుకోవాలనుకున్న ఓ గొప్ప భర్త స్టోరీ ఇది.ఇక డెంగ్, మెయిడీల ప్రేమ కథ 2016లో ఓ స్నేహితుడిలో వివాహంలో ప్రారంభమైంది. ఇక్కడ మెయిడీ తీవ్ర బ్రెయిన్ కేన్సర్‌తో బాధపడుతోంది. ఆ విషయం తెలిసినప్పటికీ..ఆమెనే ప్రేమించాలని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యాడుడెంగ్. మెయిడీ తన ప్రేమను అంగీకరించేంత వరకు ఆమె చుట్టూనే తిరిగాడు. అయితే మెయిడీ తనెంతో కాలం బతకననే ఉద్దేశ్యంతో అతడి ప్రేమను అంగీకరించలేదు. కానీ డెంగ్ తనని ఎట్టి పరిస్థితిలో వదిలేయనని, అన్ని విధాల చేదోడువాదోడుగా ఉంటూ చూసుకుంటానని హామీ ఇచ్చి మరీ పెళ్లి చేసుకున్నాడు. అలా వారిద్దరూ 2019లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. వారికి 2021లో హన్హాన్ అనే కుమార్తె జన్మించింది. ఆ ఒక్క ఏడాది తర్వాత ఆమె పరిస్థితి దారుణంగా క్షీణించటం ప్రారంభమైంది. కోమాలో చేరువైపోయే స్థితికి చేరుకుంది. ఆ సమయంలో మెయిడీ తన చికిత్స కోసం ఖర్చు చేయొద్దని..లాభం లేదని భర్త డెంగ్కి చెప్పేసింది. ఎందుకంటే అప్పటికే డెంగ్ ఆమె వైద్యం కోసం దాదాపు రూ. 2 కోట్లుపైనే ఖర్చేపెట్టేశాడు. ఆ తర్వాత కొద్దిరోజులకుపూర్తిగా కోమాలోకి వెళ్లిపోయింది మెయిడీ. అయితే డెంగ్ ఆశను వదులుకోవడానికి ఇష్టపడలేదు. మెయిడీని ఇంటికి తీసుకువచ్చి..కుటుంబసభ్యులతో వీడ్కోలు మాదిరిగా పలుకుతూ..తన కుమార్తెతో కలి మెయిడీ బుగ్గపై ప్రేమగా ముద్దుపెట్టారు.అంతేగాదు ఆ అపురూపమైన భావోద్వేగా దృశ్యాన్ని క్లిక్‌మనిపించి.. సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. అంతే నెట్టింట డెంగ్కి భావోద్వేగ మద్ధతు తోపాటు భారీగా విరాళలు వచ్చాయి. ఆ సాయంతో భార్యను ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స అందించాడు. అంతే జస్ట్ మూడు నెలల్లో మెయిడీ కోలుకోవడం..మళ్లీ యథావిధిగా మాట్లాడటం ప్రారంభించింది. అంతేగాదు ఆ మూడు నెలలు డెంగ్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి..ఆమెకు పూర్తికాల సంరక్షకుడిగా కంటికి రెప్పలా కాచుకున్నాడు. అంతేగాదు స్ప్రుహలోకి వచ్చేలా ఆమె ముందు పాడుతూ..డ్యాన్స్ చేస్తూ..ఉత్సాహాం నింపేవాడు. దాంతో త్వరితకాలంలోనే మెయిడీ ఏదో మిరాకిల్ చేసినట్లుగా కోలుకోవడమే గాక ఎవరీ సాయం లేకుండా నడిచేలా ఆరోగ్యవంతంగా కోలుకుంది. ఇప్పుడామె భర్తకు ఆర్థిక తోడ్పాటును అందించేలా వీధి దుకాణం నడపటం విశేషం. చివరగా డెంగ్ మాట్లాడుతూ.."ఆమె మమ్మల్ని వదిలివెళ్లడం నాకస్సలు ఇష్టం లేదు. ఎలాగైన బతికించుకోవాలన్న తపన, ఆమెపై ఉన్న అచంచలమైన ప్రేమ తదితరాలతోనే తన భార్యను తిరిగి దక్కించుకున్నానని సంతోషంగా చెబుతున్నాడు." డెంగ్. అంతేగాదు భారతీయ వివాహ వ్యవస్థలో ఉండే 'నాతి చరామీ' అనే పదానికి అసలైన అర్థం చెప్పాడు ఈ చైనా భర్త డెంగ్ -
Nehru Death Anniversary: చైనాతో ఓటమిని జీర్ణించుకోలేక..
1964.. మే 27.. భారతదేశం తన తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ(Pandit Jawaharlal Nehru)ను కోల్పోయింది. నాడు ఆయన ఆకస్మిక మరణం యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయనకున్న ప్రజాదరణ ఎంతటిదంటే.. ఆయన మరణ వార్త ప్రపంచవ్యాప్తంగా పలు వార్తాపత్రికలలో ప్రముఖంగా వచ్చింది. నాడు భారత ప్రధాని నెహ్రూ మరణ వార్తను న్యూయార్క్ టైమ్స్ తన మొదటి పేజీలో రెండవ ప్రధాన వార్తగా ముద్రించింది.భారత తొలి ప్రధాని జవహర్లాల్ మరణించిన సమయానికి దేశానికి స్వాతంత్యం సిద్ధించి, కొన్నేళ్లే అయ్యింది. దీనికి తోడు 1962లో చైనాతో జరిగిన యుద్ధంలో భారతదేశం ఓటమి పాలయ్యింది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే జవహర్లాల్ నెహ్రూ ఈ లోకాన్ని వీడటం యావత్ దేశాన్ని ఆవేదనలోకి నెట్టివేసింది. చైనా(China) చేతిలో భారత్ ఓటమి దరిమిలా ప్రధాని నెహ్రూ ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైందని చెబుతారు. ఈ యుద్ధంలో భారతదేశం ఓటమిని నెహ్రూ తట్టుకోలేకపోయారని అంటారు.1962, నవంబర్ 20న అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. చైనా నుంచి తమ సైనిక ఓటమిని అంగీకరించారు. వాలాంగ్, సిల్లా, బోమ్డిలా ప్రాంతాలలో భారత సైన్యం ఓడిపోయిందని ఆయన ప్రకటించారు. ఇదేవిధంగా ఆయన పార్లమెంటులోనూ చైనాతో జరిగిన యుద్ధంలో భారత్ ఓడిపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సందర్భంలో అప్పటి భారత రాష్ట్రపతి ఎస్. రాధాకృష్ణన్(President S. Radhakrishnan) కూడా సొంత ప్రభుత్వంపైనే తీవ్రమైన ఆరోపణలు చేశారు. భారత ప్రభుత్వం చైనాను తేలికగా నమ్ముతోందని, వాస్తవాలను విస్మరిస్తున్నదని ఆయన విమర్శించారు. ఈ ప్రశ్నలు ప్రధాని నెహ్రూను అమితంగా బాధించాయని చెబుతారు.ఈ విమర్శల దరిమిలా నాటి ప్రధాని నెహ్రూ అప్పటి యుద్ధంలో భారత ఓటమికి చైనా చేసిన ద్రోహమే కారణమని భావించారు. ఆ తరువాత అనారోగ్యానికి గురయ్యారు. ఈ సమయంలో ఆయన ఒక ఏడాదిపాటు కశ్మీర్లో గడిపారు. 1964 మే నెలలో నెహ్రూ ఢిల్లీకి తిరిగి వచ్చారు. మే 27న ఉదయం బాత్రూమ్ నుండి తన గదిలోనికి వస్తూ, స్పృహ కోల్పోయి, అపస్మారక స్థితికి చేరుకున్నారు. వెంటనే అక్కడి సిబ్బంది వైద్యులను పిలిపించారు. అదేరోజు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గుండెపోటుతో మరణించారని వైద్యులు ప్రకటించారు.ప్రముఖ రాజకీయ నేత ములాయం సింగ్ యాదవ్ ఒకప్పుడు దేశ రక్షణ మంత్రిగా కూడా ఉన్నారు. నెహ్రూ శకాన్ని చూసిన కొద్దిమంది నేతలలో ఆయన ఒకరు. ఒక సభలో ఆయన మాట్లాడుతూ ‘పండిట్ నెహ్రూకు ఎటువంటి వ్యాధి లేదు. 1962లో చైనా.. భారతదేశంపై దాడి చేసింది. ఆయుధాల కొరత ఉన్నప్పటికీ మన సైన్యం ధైర్యాన్ని ప్రదర్శించింది. అయినప్పటికీ భారత్.. చైనా ముందు నిలువలేకపోయింది. దీంతో నెహ్రూ తీవ్రంగా కలత చెందారు. ఈ ఆవేదనతోనే నెహ్రూ మృతి చెందారు’ అని అన్నారు.జవహర్లాల్ నెహ్రూ భద్రతా అధికారిగా పనిచేసిన కె.ఎం. రుస్తమ్జీ ‘ఐ వజ్ నెహ్రూ షాడో’ అనే పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకంలో తాను నెహ్రూ భద్రతా బాధ్యతలను స్వీకరించినప్పుడు, ఆయన వయస్సు 63 ఏళ్లని రాశారు. అయినా ఆయన 33 ఏళ్ల వ్యక్తిలా కనిపించేవారని పేర్కొన్నారు. నెహ్రూ ఎప్పుడూ లిఫ్ట్ ఉపయోగించలేదని, ఉత్సాహంగా మెట్లు ఎక్కేవారని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ‘జగన్నాథ్’ పేరుపై హక్కులెవరివి? -
విదేశీ భార్యల మోజులో పడొద్దు
ఢాకా: బంగ్లాదేశ్‌కు చెందిన ఆన్లైన్ డేటింగ్, పెళ్లిళ్ల బ్యూరోల వలలో పడొద్దని చైనా ఎంబసీ తమ పౌరులను హెచ్చరించింది. తమ దేశంలో యువతుల కొరత ఏర్పడటంతో కొందరు అక్రమ మార్గంలో పెళ్లిళ్లు చేసుకుంటున్నట్లు చైనా ప్రభుత్వం గుర్తించింది. అయితే, వీటి కారణంగా కొత్త సమస్యలు ఉత్పన్నమవుతు న్నట్లు గుర్తించింది. దీనిపై తాజాగా పౌరులకు హెచ్చరికలు జారీ చేసిందని చైనా ప్రభుత్వ ‘గ్లోబల్ టైమ్స్’పేర్కొంది. ఆన్లైన్లోని షార్ట్ వీడియో వేదికలపై వచ్చే మోసపూరిత ‘క్రాస్–బోర్డర్ డేటింగ్’వలలో పడొద్దని కోరింది. అనధికార నెట్‌వర్క్‌లు, పెళ్లిళ్ల బ్యూరోల్లో ‘ఫారిన్ వైవ్స్’అంటూ వచ్చే ప్రకటనలను చూసి మోసపోవద్దని పేర్కొంది. ఇలాంటి వాటిపై చైనాలో నిషేధం ఉందని వెల్లడించింది. విదేశీయులను భార్య లుగా తెచ్చుకోవాలన్న ఆలోచన మానుకోవాలంది. బంగ్లాదేశీ యులను పెళ్లి చేసుకునేముందు అన్ని వివరాలను కూలంకషంగా తెలుసుకోవాలని సూచించింది. ఒకే సంతానం అనే కఠిన మైన విధానాన్ని చైనా ప్రభుత్వం ఎత్తి వేయడం, జంటలు మగ సంతానం వైపు చూపుతున్న మొగ్గుతో జనాభాలో లింగపరమైన అసమతుల్యత తీవ్రరూపం దాల్చింది. చైనాలో ప్రస్తుతం దాదా పు 3 కోట్లు మంది పురుషులు అవివాహితులుగా మిగిలిపోయి నట్లు అంచనా. దీంతో, విదేశీ మహిళలను పెళ్లి చేసుకునే ఆలోచనలో ఎక్కువమంది ఉంటున్నారు. పెళ్లి పేరుతో బంగ్లాదేశీ మహిళలను చైనీయులకు విక్రయించిన కేసులు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. ఈ అక్రమ రవాణా దందా వెనుక నేరగాళ్ల ముఠాలు ఉన్నట్లు తేలింది. బెదిరించి, చట్ట విరుద్ధంగా చేసుకునే ఇలాంటి పెళ్లిళ్లతో న్యాయపరమైన సమస్యలు ఏర్పడుతున్నట్లు గుర్తించారు. అక్రమ పెళ్లిళ్ల దందాకు వేదికగా మారిన పెళ్లిళ్ల బ్యూరోలపై చైనా ప్రభుత్వం నిషేధం విధించింది. అక్రమ సంబంధాలు, పెళ్లిళ్ల బాధితులు ఎవరైనా ఉంటే వెంటనే తమను సంప్రదించాలని కూడా చైనా రాయబార కార్యాలయం కోరింది. బంగ్లాదేశ్ మహిళలతో చట్ట విరుద్ధంగా లైంగిక సంబంధాలు పెట్టుకునే వారు మానవ అక్రమ రవాణా కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. బంగ్లాదేశ్ చట్టాల ప్రకారం మానవ అక్రమ రవాణాకు పాల్పడిన వారికి కనిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా, గరిష్టంగా జీవిత ఖైదు, రూ.16 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. కొన్ని ముఠాలు బంగ్లాదేశ్ మహిళలను పొరుగునున్న భారత్‌కు అక్రమంగా తరలిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. టిక్‌టాక్ ద్వారా మహిళలను వేశ్యావృత్తిలోకి దించుతున్న 11 మందిని గతంలో ఢాకా పోలీసులు అరెస్ట్ చేశారు. -
స్నేహ బంధం గెలిచినా.. విషాదం తప్పలేదు
బంధాలన్నీ వేటికవే ప్రత్యేకం. బాల్యం నుంచి మొదలు కడదాకా స్నేహ బంధంలో కలిసి నడిచేవాళ్లు ఎంతో మంది ఉంటారు. కాబట్టి ఆ బంధపు మాధుర్యం గురించి చెప్పుకుంటే పోతే బోలెడన్ని కబుర్లు. అయితే ఇక్కడ తమ మిత్రుడి కోసం ఇప్పటిదాకా ఎవరూ చేయని ప్రయత్నం చేశారు కొందరు విద్యార్థులు. ఈ ప్రయత్నంలో స్నేహ బంధం గెలిచినా.. విషాదం మాత్రం తప్పలేదు.చైనా సిచువాన్ ప్రావిన్స్(Sichuan Province)లోని యిలాంగ్ మిడిల్ స్కూల్ విద్యార్థి రెన్(15). ప్రాణాంతక క్యాన్సర్‌తో ఏడాది నుంచి చికిత్స తీసుకున్నాడు. మెరుగైన వైద్యం కోసం ఎన్ని ఆస్పత్రులు తిరిగినా లాభం లేకపోయేసరికి.. చివరకు సొంతూరిలోనే ఓ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స కారణంగా అతని ఏడాది చదువు పోయింది. మరో నెలలో ఆ అకడమిక్ ఇయర్ ముగియనుంది. ఈలోపు.. రెన్కు చదువు చెప్పిన టీచర్‌కు ఓ ఆలోచన వచ్చింది. దానికి అతని క్లాస్మేట్స్, రెన్ తల్లిదండ్రులు అంగీకరించారు.మే 17వ తేదీన.. బడి నుంచి కాలినడకన రెండున్నర కిలోమీటర్లు ప్రయాణించి రెన్ (Ren) ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆస్పత్రికి చేరుకున్నారు. లోపలికి వెళ్లి అతనికి యూనిఫాం తొడిగి బయటకు తీసుకొచ్చారు. ఆ ప్రాంగణంలోనే అంతా కలిసి గ్రూప్ ఫొటో దిగారు. ఆపై అతను త్వరగా కోలుకోవాలంటూ పుష్ఫ గుచ్చాలతో పాటు కానుకలపై సంతకాలు చేసి మరీ అతనికి అందించారు. ఈ చర్యతో నెట్టింట జనం మురిసిపోయారు. ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆశించారు. కానీ, జరిగింది మరొకటి. గ్రూప్ ఫొటో దిగిన కొన్ని గంటలకే(ఆ మరుసటి ఉదయం) రెన్ కన్నుమూసినట్లు అతని తల్లిదండ్రులు ప్రకటించారు. ఈ విషాదాంతం అందరినీ షాక్‌కు గురి చేసింది. మరో నెలలో అతని 16వ ఏడులోకి అడుగుపెట్టాల్సి ఉంది. ఈలోపు తుదిశ్వాస విడవడంతో ఆ తల్లిదండ్రులు, అతని స్నేహితులు గుండెలు అవిసేలా రోదించారు. ఈ గ్రాడ్యుయేషన్ ఫొటో(China Graduation Photo).. ప్రపంచంలోని అత్యుత్తమ ఫొటోగా నెట్టింట అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆ మధుర క్షణం కోసమే అప్పటిదాకా అతని ఊపిరి ఆగిపోలేదేమోనని కొందరు కామెంట్ చేయగా.. వచ్చే జన్మలోనైనా ఆ చిన్నారి ఆరోగ్యకరమైన జీవితం గడపాలని మరికొందరు కోరుకుంటూ నివాళులర్పిస్తున్నారు.ఇదీ చదవండి: పాక్.. చివరకు ఇలా కూడా పరువు తీసుకుందా? -
ఇదెక్కడి విడ్డూరం.. ఇలా కూడా పరువు పొగొట్టుకుంటారా?
హుర్రే.. ఆపరేషన్ సింధూర్‌కి కౌంటర్‌గా ఆపరేషన్ భున్యన్తో భారత్‌పై విజయం సాధించాం అంటూ పాక్ చేస్తున్న వేడుకలు, వరుస ప్రకటనలు నవ్వులు పూయిస్తున్నాయి. ఒకదానికి తర్వాత మరొకటి తప్పుడు ప్రచారాలతో పరువు పొగొట్టుకుంటోంది ఆ దేశం. తాజాగా..ఆ దేశ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిం మునీర్(Asim Munir) చేసిన పని.. విపరీతంగా ట్రోల్ అవుతోంది. ఆపరేషన్ భున్యాన్ సక్సెస్ పేరిట ఆయనో డిన్నర్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ దేశ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షెహ్బాజ్ షరీఫ్, విదేశాంగ మంత్రి ఇషాక్ దర్, సెనేట్ చైర్మన్ యూసుఫ్ రజా గిలానీ, ఇతర రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే.. ఆపరేషన్ భున్యన్(Operation Bunyan) విక్టరీకి గుర్తుగా ఆ దేశ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్‌కు ఆర్మీ చీఫ్ అసిం మునీర్ ఓ పెయింటింగ్ బహుకరించారు. కానీ.. అందులో ఉన్న తప్పును కొందరు టక్కున పట్టేశారు. నాలుగేళ్ల కిందట చైనా జరిపిన మిలిటరీ ఆపరేషన్ తాలుకా చిత్రమది. ఆ చిత్రాన్ని ముందూ వెనుక చూడకుండా ఆపరేషన్ భున్యాన్ చిత్రమంటూ అదీ ఆర్మీ చీఫ్ ప్రధాని బహుకరించడం విడ్డూరంగా పేర్కొంటున్నారు కొందరు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) చేపట్టి పాక్, పాక్ ఆక్రమిత కశ్మీరంలోని ఉగ్ర శిబిరాలను నాశనం చేసి ఉగ్రవాదులను మట్టుబెట్టింది భారత్. అయితే.. ఆపరేషన్ భున్యన్ ఉన్ మర్సూస్తో తామూ భారత్‌పై దాడులు జరిపి ఘన విజయం సాధించామని పాక్ ప్రకటించుకుంటూ వస్తోంది. కానీ, అంతర్జాతీయ సమాజానికి తగిన ఆధారాలు మాత్రం చూపించకపోయింది. వరుసగా.. ఇలాంటి ఫేక్ ప్రచారాలతో పాక్ పరువు మళ్లీ మళ్లీ పోగొట్టుకుంటూ వస్తోంది. భారత్‌పై విజయం అంటున్నారు కదా.. దానికి తగిన ఆధారం ఒక్కటైనా చూపించలేని స్థితిలో పాక్ ఉందంటూ పలువురు జోకులు పేలుస్తున్నారు.ఇదీ చదవండి: నన్ను ఆపేస్తే నీ సంబంధం బయటపెడతా! -
అమ్మాయిల కొరత.. దొడ్డిదారి పడుతున్న చైనా యువత
పెళ్లికి యువతుల కొరతతో చైనాలో యువకులు దొడ్డిదారి పడుతున్నారు. అక్రమ మార్గంలో వధువులను వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలో పొరుగు దేశం బంగ్లాదేశ్ నుంచి సంబంధాలు తెచ్చుకుంటున్నారు. అయితే ఈ పరిణామాలను చైనా ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది.ఢాకా/బీజింగ్: సరిహద్దు అవతల నుంచి అమ్మాయిలతో వివాహాలను గుర్తించిన అధికారులు.. అప్రమత్తంగా ఉండాలని చైనా యువతకు సూచిస్తున్నారు. ఇలాంటి వివాహాలు చట్టప్రకారం చెల్లవని, పైగా మానవ అక్రమ రవాణా(Human Trafficking) కింద తీవ్ర నేరంగా పరిగణిస్తామని హెచ్చరించింది. అదే సమయంలో దేశ భద్రతకు సంబంధించిన ముప్పు కూడా వాటిల్లే అవకాశం ఉండడంతో ఇలాంటి స్కామ్‌లకు దూరంగా ఉండాలంటోంది. మరీ ముఖ్యంగా ఆన్లైన్ మ్యాట్రిమోనీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని బంగ్లాదేశ్‌లోని చైనా రాయబార కార్యాలయం అడ్వైజరీ జారీ చేసింది. చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్(Global Times) కథనం ప్రకారం.. అక్కడి షార్ట్ వీడియో ప్లాట్‌ఫారమ్‌లలో క్రాస్-బార్డర్ డేటింగ్ వ్యవహారం నడుస్తోంది. తద్వారా వధువులను చైనా యువకులను ఎంచుకుంటున్నారని తేలింది. అయితే బయటి దేశాల నుంచి భార్యలను తెచ్చుకోవాలనుకునే ప్రయత్నాలు(foreign wife) మంచివికావని, మరీ ముఖ్యమంగా బంగ్లాదేశీ యువతుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆ అడ్వైజరీ సూచించింది. బంగ్లాదేశ్ చట్టాల ప్రకారం.. యువతలు అక్రమ రవాణాను తీవ్ర నేరంగా పరిగణించి కఠిన శిక్షలు విధిస్తారు. ఇదిలా ఉంటే చైనాలో వధువ కొరత అక్కడి యువతను వెంటాడుతోంది. అందుకు అక్కడి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే కారణం. ఓ అంచనా ప్రకారం.. మూడు కోట్ల మందికి అమ్మాయిలే దొరకడం లేదట. మరోవైపు.. వివాహాల పేరుతో బంగ్లాదేశ్ నుంచి మహిళలను చైనాకు కొన్ని ముఠాలు అక్రమ రవాణా చేస్తూ వ్యభిచార కూపంలోకి దించుతున్నాయి. ఈ పరిణామాలను తీవ్రంగా భావించిన అక్కడి ప్రభుత్వం.. వాటిని కట్టడి చేయడానికి చర్యలకు ఉపక్రమించింది.మరోవైపు.. గతంలో బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు కూడా ఇదే తరహాలో అమ్మాయిల అక్రమ రవాణా నెట్వర్క్ నడించింది. 2021లో టిక్‌టాక్ ద్వారా బాధితులకు గాలం వేసి వ్యభిచారంలోకి లాగిన 11 మందితో కూడిన ముఠాను ఢాకా పోలీసులు అరెస్ట్ చేశారు. -
భారత్‌తో మనుగడకే ప్రమాదం
ఇస్లామాబాద్: భారత్ వల్ల తన అస్తిత్వమే ప్రమాదంలో పడిందని పాకిస్తాన్ భయపడుతోంది. సైనికపరంగా పైచేయిగా ఉన్న భారత్‌ను నిలువరించేందుకు తనకున్న ఏకైక మార్గం అణ్వస్త్రాలే అని భావిస్తోంది. అందుకే, తన వద్ద ఉన్న అణ్వ్రస్తాలను ఆధునీకరించుకునే పనిలో పడింది. ఇందుకోసం సైనిక, ఆర్థిక పరమైన సాయం అందిస్తోంది’..ఈ విషయాలు ఆదివారం అమెరికా రక్షణ నిఘా విభాగం(యూఎస్‌డీఐఏ) వరల్డ్ త్రెట్ అసెస్మెంట్ పేరుతో విడుదల చేసిన నివేదికలో ఉన్నాయి. రాబోయే సంవత్సరాల్లో పొరుగు దేశాలతో సరిహద్దుల్లో ఘర్షణలను ఎదుర్కోవడం పాకిస్తాన్ మిలటరీ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని నివేదిక పేర్కొంది. ఇందులో భాగంగానే అణ్వస్త్రాల నవీకరణ కొనసాగించాలని నిర్ణయించుకుంది. ఈ ఆయుధ సంపత్తిని భద్రంగా కాపాడుకోవడం, కమాండ్ కంట్రోల్ వంటి వాటిపైనా పాక్ మిలటరీ దృష్టి పెట్టిందని తెలిపింది. సామూహిక జన హననాని(డబ్ల్యూఎండీ)కి అవసరమయ్యే ఆయుధ సామగ్రిని విదేశీ ఉత్పత్తి సంస్థలు, దళారుల ద్వారా సేకరించడం ఆర్మీ తప్పనిసరని భావిస్తోంది. డబ్ల్యూఎండీ తయారీ, అభివృద్ధిలో వాడే సామగ్రి, సాంకేతికతను ప్రధానంగా చైనా నుంచి పొందుతోంది. ఇందులో కొన్నిటిని హాంకాంగ్, సింగపూర్, తుర్కియే, యూఏఈల ద్వారా తెప్పించుకుంటోందని యూఎస్‌డీఐఏ నివేదిక తెలిపింది. ‘పాక్‌కు ప్రధాన ఆయుధ సరఫరాదారు చైనా కొనసాగుతున్నప్పటికీ, పాక్‌లో వివిధ ప్రాజెక్టుల కోసం పనిచేసే చైనీయులపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్న ఘటనలు రెండు దేశాలకు ఇబ్బందికరంగా మారాయి. రెండు మిత్ర దేశాల మధ్య ఇవి ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి’అని పేర్కొంది. నివేదికలో భారత్ గురించి ఏముంది? జమ్మూకశీ్మర్‌లోని పహల్గాంలో ఏప్రిల్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా క్షిపణులను ప్రయోగించిన విషయాన్ని కూడా యూఎస్‌డీఐఏ తన నివేదికలో ప్రస్తావించింది. ‘మే 7 నుంచి 10వ తేదీ వరకు క్షిపణి, డ్రోన్, ఆర్టిలరీ కాల్పులు చోటు చేసుకున్నాయి. 10వ తేదీన రెండు దేశాల సైన్యాలు పూర్తి స్థాయి కాల్పుల విరమణకు అంగీకరించాయి’అని పేర్కొంది. ‘చైనా పలుకుబడికి చెక్ పెట్టేందుకు భారత్ కూడా వ్యూహాత్మకంగా హిందూ మహా సముద్ర తీర, ద్వీప దేశాలతో ద్వైపాక్షిక రక్షణ భాగస్వామ్యాలను పెంచుకుంటోంది’అని నివేదిక తెలిపింది. భారత్–చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల ప్రస్తావన సైతం ఇందులో ఉంది. ‘తూర్పు లద్దాఖ్‌లోని వివాదాస్పద వాస్తవా«దీన రేఖ వెంబడి చిట్టచివరి రెండు ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి ఇరు దేశాలు సైన్యాలను ఉపసంహరించుకున్నప్పటికీ సరిహద్దు విభజన వివాదం అపరిష్కృతంగానే ఉండిపోయింది’అని పేర్కొంది. మిలటరీ ఆధునీకరణ, ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకునే క్రమంలో దేశీయ రక్షణ పరిశ్రమను బలోపేతమయ్యేలా భారత్ ‘మేడ్ ఇన్ ఇండియా’కార్యక్రమాన్ని కొనసాగించే అవకాశముంది. -
భారత్ టార్గెట్.. పాకిస్తాన్‌కు అండగా చైనా మరో ప్లాన్
ఇస్లామాబాద్: భారత్‌కు వ్యతిరేకంగా మరోసారి దాయాది పాకిస్తాన్, డ్రాగన్ చైనా కొత్త కుట్రలకు ప్లాన్ చేస్తున్నాయి. భారత్ దాడులకు కుదేలైన పాకిస్తాన్ ఆర్మీకి సపోర్ట్ అందించేందుకు చైనా మళ్లీ ముందుకు వచ్చింది. ఆపరేషన్ సిందూర్ కారణంగా దెబ్బతిన్న పాకిస్తాన్ ఆర్మీకి శాటిలైట్ సపోర్టు అందించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సమావేశం జరిగింది.వివరాల ప్రకారం.. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కారణంగా పాకిస్తాన్‌కు చుక్కలు కనిపించాయి. పాకిస్తాన్‌లోని రావల్పిండి, లాహోర్, సియాల్ కోట్తో సహా 11 వైమానిక స్థావరాలపై భారత్ అత్యంత ఖచ్చితమైన దాడులు జరిపింది. దీంతో, పాకిస్తాన్ రక్షణ వ్యవస్థ, శాటిలైట్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌కు సాయం చేసేందుకు చైనా మరోసారి ముందుకు వచ్చింది. పాకిస్తాన్‌కి శాటిలైట్ కవరేజ్ పెంచడం, పాకిస్తాన్ సైన్యానికి మద్దతు ఇవ్వడం, భారత కార్యకలాపాల గురించి వారికి తెలియజేయడమే లక్ష్యంగా చైనా ఈ సాయాన్ని అందిస్తోంది. రియల్ టైమ్ కో-ఆర్డినేషన్, నిఘా సామర్థ్యాలను పెంపొందించడానికి 5G కమ్యూనికేషన్ వ్యవస్థల ఏకీకరణపై కూడా రెండు దేశాలు దృష్టి సారించాయి. దీనిపై ఇరు దేశాల మధ్య గత వారం చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. చైనా తన బీడౌ ఉపగ్రహ వ్యవస్థలను పాకిస్తాన్ సైన్యం యాక్సెస్ చేయడానికి మే 16న చైనా, పాకిస్తాన్ సైనిక అధికారుల మధ్య వ్యూహాత్మక సమావేశం జరిగింది.మరోవైపు.. ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా పాకిస్తాన్ తన శాటిలైట్ సేవల్ని పాకిస్తాన్ సైన్యానికి అందించినట్లు తెలుస్తోంది. ఈ సాయం అందినప్పటికీ భారత్ దాడులను తప్పించుకోలేకపోయింది. పాకిస్తాన్ సైన్యం ఉపయోగించే చైనా నిర్మిత జెట్లు, క్షిపణి వ్యవస్థలను భారత స్వదేశీ ఆయుధాలు ఉపయోగించి ధ్వంసం చేసింది. సరిహద్దు వెంబడి పాకిస్తాన్ దళాల కదలికల్ని, కార్యకలాపాలను పర్యవేక్షించడానికి భారత్ ఏకంగా 10 శాటిలైట్స్‌ని మోహరించింది. S-400 వైమానిక రక్షణ వ్యవస్థలను కూడా మోహరించింది. దీంతో ఆపరేషన్ సిందూర్ విజయవంతమైంది. -
అయ్యయ్యో చైనా.. ఎంత కష్టమొచ్చే?
శత్రువుకి శత్రువు.. మిత్రుడు. అలాగే శత్రువుకి మిత్రుడు కూడా శత్రువే కదా!. కానీ, ఆ శత్రువునే తమ మిత్రుడిగా మార్చుకునేందుకు ఆఘమేఘాల మీద చైనా చేస్తున్న ప్రయత్నాలపై ‘‘అయ్యో.. పాపం’’ అనే చర్చ నడుస్తోంది ఇప్పుడు. సీపీఈసీ ప్రాజెక్టును ఆప్ఘనిస్థాన్ వరకు పొడిగించాలని నిర్ణయించడమే ఇందుకు కారణం.పాక్, అఫ్గనిస్తాన్ ప్రతినిధుల మధ్య బుధవారం చైనా ఆధ్వర్యంలో ఓ సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌కు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మధ్యవర్తిత్వం వహించారు. ఈ భేటీ తర్వాత చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటన చేసింది. ఆ ఇరు దేశాలు దౌత్యపరమైన సంబంధాలను బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నాయని ఆ ప్రకటన పేర్కొంది. ఇందుకుగానూ ఇరు దేశాల పరస్పరం రాయబారులను నియమించుకునేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. సీపీఈసీ ప్రాజెక్టు ఒప్పందం అదే విషయం. అయితే.. పాక్-అఫ్గన్ దేశాల మధ్య బంధం ఎంతటి ధృడమైందో యావత్ ప్రపంచానికి తెలుసు. అఫ్గనిస్తాన్‌ను ఉగ్రవాదుల స్వర్గధామంగా పాక్ తరచూ అభివర్ణిస్తూ ఉంటుంది. అయితే అఫ్గన్ మాత్రం ఆ ఆరోపణలను తోసిపుచ్చుతూ వస్తోంది. ఇదిలా ఉంటే.. 2024 డిసెంబర్లో అఫ్గన్ పాక్టికా ప్రావిన్స్‌లో పాక్ వైమానిక దాడులు జరిపి 50 మందిని పొట్టనబెట్టుకుంది. ఈ ఘోరంలో మరణించింది ఎక్కువగా మహిళలు, పిల్లలే. అయితే తాము ఉగ్ర శిబిరాలపై దాడి చేశామంటూ పాక్ ప్రకటించుకోవడం గమనార్హం. ఈ పరిణామంపై అఫ్గన్ రగిలిపోతూ వస్తోంది. అలాంటిది.. ఇప్పుడు, ఈ ఇరు దేశాలు ఇప్పుడు దగ్గరయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయంటూ చైనా ప్రకటించడం ఆసక్తికర చర్చకు దారి తీసింది.ఎందుకీ తొందర?2021లో అమెరికా బలగాల ఉపసంహరణ తర్వాత తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడింది. కానీ, ప్రపంచంలోని ఏ దేశం కూడా ఆ ప్రభుత్వానికి గుర్తింపు ఇవ్వలేదు. దీంతో అది తాత్కాలిక ప్రభుత్వంగానే కొనసాగుతోంది. అయితే చైనా, పాక్, రష్యా,ఇరాన్ దేశాలు సత్సంబంధాలు కొనసాగించేందుకు ప్రయత్నిస్తూ వస్తున్నాయి. ఉగ్రవాద లిస్ట్ నుంచి ఆ దేశాన్ని తొలగించాయి. అయితే తాలిబన్ సర్కార్‌కు గుర్తింపు ఇవ్వకున్నా.. ఆ దేశం తరఫున తమ దగ్గర రాయబారికి అనుమతించింది చైనా. ఇక..భారత్ అఫ్గన్ తాలిబన్ ప్రభుత్వానికి గుర్తింపు ఇవ్వలేదు. కానీ, వాళ్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచే సంబంధాలు కొనసాగిస్తూ వస్తోంది. ఈ క్రమంలో సరిహద్దు ప్రధానాంశంగా పలుమార్లు చర్చలు కూడా జరిపాయి. వాటిలో పురోగతి లేకున్నా.. మానవతా సాయం, అక్కడి పౌరుల బాగోగుల మీద దృష్టిసారిస్తూనే వస్తోంది. ఇది ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగు పడేందుకు దోహదపడ్డాయి. ఈ క్రమంలోనే.. దౌత్యపరమైన సమావేశాలు గత ఏడాది కాలంలో చాలానే జరిగాయి. ఈ ఏడాది జనవరిలో భారత విదేశాగం కార్యదర్శి విక్రమ్ మిస్రీ, తాలిబన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముట్టాఖితో దుబాయ్‌లో భేటీ అయి కీలక అంశాలపై చర్చించారు. తాజాగా భారత విదేశాంగ మంత్రి జై శంకర్ కూడా అమీర్ ఖాన్ ముట్టాఖితో కీలక సంప్రదింపులు జరిపారు. ఈ పరిణామం.. భారత్‌లో దౌత్యవేత్తల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, కాన్సులర్ సేవలతో పాటు పలు నగరాల్లో వ్యాపార, విద్య, వైద్యం కోసం వచ్చే అఫ్గన్ పౌరులకు సేవల అనుమతికి అంగీకారం తెలపడం లాంటి నిర్ణయాలకు వేదికైంది. ఇది ఓర్వలేక.. కుటిల బుద్ధితో.. భారత్ వ్యతిరేకిస్తున్న సీపెక్‌లో అఫ్గన్‌ను భాగం చేసిందని, హడావిడిగా తాలిబన్లకు చైనా ప్రాధాన్యం ఇస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇప్పుడు. -
175 బిలియన్ డాలర్లతో ట్రంప్ ‘గోల్డెన్ డోమ్’.. చైనా, రష్యా ఆందోళన..
వాషింగ్టన్: ప్రపంచంలోని పలు దేశాల మధ్య యుద్ధం వాతావరణం కొనసాగుతోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్-హమాస్ వార్.. ఇక, ఇటీవల భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన సైనిక ఘర్షణ వంటి పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో, రక్షణ వ్యవస్థల గురించి చాలా చర్చలు జరిగాయి. ఇలాంటి యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఆ దేశానికి కొత్త క్షిపణి రక్షణ వ్యవస్థను రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి ‘గోల్డెన్ డోమ్’ అని పేరు పెట్టారు. ఈ ‘గోల్డెన్ డోమ్’ కోసం ఏకంగా దాదాపు రూ.15 వేల కోట్లకు పైగా( 175 బిలియన్ డాలర్లు)ఖర్చు చేస్తామని వెల్లడించారు.వివరాల ప్రకారం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా కోసం కొత్త క్షిపణి రక్షణ వ్యవస్థను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అమెరికాను క్షిపణి దాడుల నుంచి రక్షించుకోవడానికి మూడేళ్లలోనే ‘గోల్డెన్ డోమ్’ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతానికి 25 బిలియన్ డాలర్ల ప్రారంభ నిధులు కేటాయిస్తున్నామని, అంతిమంగా 175 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తామని వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రజల కోసం రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు.అత్యంత సాంకేతికతతో కూడిన మిస్సైల్ డిఫెన్స్ షీల్డ్ ఏర్పాటు చేస్తాం. ఈ ప్రాజెక్ట్ ను ఆమోదిస్తున్నందుకు సంతోషంగా ఉందని ట్రంప్ తెలిపారు. గోల్డెన్ డోమ్ అందుబాటులోకి వచ్చాక ప్రపంచం అవతలి నుంచి అమెరికాపై క్షిపణి దాడులు చేసినా ఇది తిప్పికొడుతుందని స్పష్టం చేశారు. స్పేస్ నుంచి దాడులు చేసినా అమెరికాకు ఏమీ కాదన్నారు. మన దేశం విజయంలో.. మనం భూమి మీద నివసించాలంటే ఇలాంటివి అవసరం అని ట్రంప్ పేర్కొన్నారు.🚨 #BREAKING: President Trump and Secretary Hegseth have announced the GOLDEN DOME missile defense system for the U.S."Golden Dome will be capable of catching missiles from across the world or even SPACE.""We'll be completing the job Reagan started 40 years ago!"Trump also… pic.twitter.com/MX1URx1fa0— Nick Sortor (@nicksortor) May 20, 2025యూఎస్ స్పేస్ ఫోర్స్ జనరల్ మైఖేల్ గుట్లీన్ నాయకత్వంలో గోల్డెన్ డోమ్ నిర్మాణం జరుగుతుందని ట్రంప్ పేర్కొన్నారు. దీని నిర్మాణంలో భాగం కావడానికి కెనడా సైతం ఆసక్తిని చూపినట్లు తెలిపారు. డోమ్ నిర్మాణానికి 175 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని ట్రంప్ పేర్కొన్నప్పటికీ.. దీనికి 542 బిలియన్ డాలర్ల వ్యయం అవుతుండొచ్చని కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీస్ అంచనా వేసింది. పెంటగాన్ చీఫ్ పీట్ హెగ్సేత్ మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దేశాన్ని క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులు, హైపర్సోనిక్ క్షిపణులు, డ్రోన్లు, అణు దాడుల నుంచి రక్షించడమే లక్ష్యంగా దీని ఏర్పాటుకు వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.చైనా, రష్యా ఆందోళన..ఇక, ఇప్పటికే ఇజ్రాయెల్.. ఐరన్ డోమ్ వ్యవస్థను 2011 నుంచి ఉపయోగిస్తోంది. ప్రత్యర్థుల క్షిపణులు దూసుకొచ్చినా.. ఉక్కు కవచంలా వాటిని అడ్డుకునేందుకు టెల్అవీవ్ ఈ డోమ్‌ను ఉపయోగిస్తుంది. దీని నిర్మాణానికి అమెరికా పూర్తిగా సాయం చేసింది. దీంతో అటువంటి గోల్డెన్ డోమ్‌ను అభివృద్ధి చేసుకునేందుకు అమెరికా (USA) సైతం సిద్ధమయ్యింది. అయితే, ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై చైనా, రష్యా దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ విధానం వల్ల అంతరిక్షం యుద్ధభూమిగా మారే ప్రమాదం ఉందని పేర్కొన్నాయి. ప్రపంచంలో అస్థిర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేశాయి. . @SecDef "The Golden Dome for America’s game changer. A generational investment in security in America and Americans..." pic.twitter.com/uazlPcCytR— DOD Rapid Response (@DODResponse) May 20, 2025 -
ఇండియా, చైనాల మధ్య ఇంత వ్యత్యాసమా?
నేను బీజింగ్ నుండి తిరిగి వచ్చి పదిహేను సంవత్సరాలు గడిచింది కానీ, నేను ఇంకా దాని గురించి రాయబోతున్నాను. అప్పట్లోనే చైనా రాజధాని నన్ను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పడం దాన్ని తక్కువ చేసినట్లే అవుతుంది. నిజం ఏమిటంటే బీజింగ్‌లో ఆనాడు నేను చూసిన, కనుగొన్న అంశాలు నన్ను ఆశ్చర్యచకితుడిని చేశాయి. ఇప్పుడు అదనంగా, చాలా కాలం క్రితం పరిష్కృతమైందని నేను భావించిన వాస్తవం, పాత చర్చను మళ్ళీ రేకెత్తించింది.నేను బీజింగ్‌లో మూడు రోజులు మాత్రమే ఉన్నాను. రాజధానిలో ఒక చిన్న భాగాన్ని మాత్రమే చూశానని చెప్పాలి. కానీ గ్రేట్ వాల్, మింగ్ సమాధులను దర్శించాను. నగరంలో, గంటల తరబడి డ్రైవింగ్ చేస్తూ గడిపాను. కానీ నేను చూసిన ప్రతిదీ అభివృద్ధి చెందిన మొదటి ప్రపంచాన్ని సూచించింది. రోడ్లు, భవనాలు, దుకాణాలు, ప్రజల వేషధారణ, వారి ప్రవర్తన... మూడవ ప్రపంచ నగరాన్ని కాదు, యూరోపియన్ లేదా ఉత్తర అమెరికా మహానగర సంçస్కృతిని తలపింపజేశాయి. ఏ అర్థంలో చూసినా ఈ అంశాలలో దేనిలోనూ ఢిల్లీ పోటీపడలేదు.బీజింగ్ నమ్మశక్యం కాని విధంగా శుభ్రంగానూ, ఆశ్చర్యకరంగా స్నేహపూర్వకంగానూ ఉంది. చైనీయులు బహిరంగంగా ఉమ్మివేస్తుంటారని నాకు చెప్పారు. నేను చైనాలో గడిపిన మూడు రోజుల్లో అలా ఉమ్మి వేసినవారిని అరడజను మందిని కూడా చూడలేదు. మింగ్ సమాధులు లేదా ఫర్బిడెన్ సిటీ వద్ద వేలాది మంది ఉన్నారు కానీ వారిలోనూ ఈ అలవాటును చూడలేదు. కాలిబాటలపై చెత్త లేదు, గోడలపై పాన్ మరకలు లేవు, దుకాణాల వెలుపల పారవేసిన సిగరెట్ పీకలు, చిరిగిన పాలిథిన్ సంచులు కూడా లేవు.అంతేకాకుండా చైనీయులు స్నేహపూర్వకంగా ఉన్నారు. నేను హోటల్ నుండి తియానన్మెన్ స్క్వేర్‌కు వెళుతున్నప్పుడు అపరి చితులు తరచుగా నడుచుకుంటూ వచ్చి కబుర్లు చెప్పారు. వారు అడుగులో అడుగు వేసి, అది సహజమైన, స్పష్టమైన పని అన్నట్లుగా సంభాషణను ప్రారంభించారు. వారిలో చాలామంది ఇంగ్లిష్ అభ్యసించే విద్యార్థులే అంటే సందేహం లేదు, కానీ మరే ఇతర నగరంలోనూ ఇంత స్వేచ్ఛాయుతమైన ప్రవర్తనను ఎప్పుడూ చూడలేదు.ఏది మంచి వ్యవస్థ?వాస్తవానికి 1962 నాటికి చైనాతో మనకు ఏర్పడిన సంక్లిష్ట పరిస్థితిపై, చైనా–ఇండియా పోటీపై స్పష్టమైన భారతీయ దృక్పథంతో నేను బీజింగ్‌కు వెళ్లాను. కానీ, చైనా పట్ల తీవ్రతకు తగ్గని ఆకర్షణ, ఏకపక్షతతో తిరిగి వచ్చాను. కానీ ఇప్పుడు అది పాత భావజాల ఘర్షణను మళ్లీ రగిలించింది.నిరంకుశ రాజ్యమైన చైనా – ఆర్థిక వృద్ధిని, అభివృద్ధిని తన ప్రాథమ్యంగా చెప్పుకొంటుంది. స్వేచ్ఛా వ్యక్తీకరణ, సహకారం, రాజకీయ ఎంపికలకు సంబంధించిన ఉదారవాద హక్కులను విస్మరిస్తుంది. క్రమశిక్షణ అనేది అక్కడ స్వేచ్ఛా వ్యక్తీకరణ కంటే ముఖ్యమైనది. భిన్నాభిప్రాయాన్ని తీవ్రంగా శిక్షిస్తారు. దీనికి విరుద్ధంగా, భారతదేశం స్వేచ్ఛా పత్రికా వ్యవస్థ, బహుళ, పోటీ రాజకీయ పార్టీలు, స్వతంత్ర న్యాయవ్యవస్థతో పాటు సిద్ధాంతపరంగా తాము కోరుకున్నది చేయడానికి స్వేచ్ఛ ఉన్న వ్యక్తులతో కూడిన ప్రజా స్వామ్యం. మనం తరచుగా మన ప్రభుత్వాలను మారుస్తాం. తరచుగా మన రాజకీయ నాయకులను పక్కన పెడుతుంటాం. స్పష్టంగా చెప్పాలంటే, భారత్‌తో పోలిస్తే చైనా తక్కువ ఆహ్వానించదగిన దేశంగా కనిపిస్తుంది.కానీ ఈ విషయాన్ని కాస్త భిన్నంగా చూడండి: చైనా తన ప్రజలకు ఆర్థిక భద్రత, మెరుగైన జీవనశైలి, అధిక తలసరి ఆదాయం ఇచ్చింది. 1947లో (లేదా 1949లో, పీపుల్స్ రిపబ్లిక్ పుట్టినప్పుడు) భారత్, చైనాలు ఒకే ఆర్థిక స్థితిలో ఉన్నాయి. 2010లో, నేను చైనాను సందర్శించినప్పుడు, దాని తలసరి ఆదాయం నాలుగు రెట్లు ఎక్కువ. వారి పిల్లలలో 7 శాతం మందే పోషకాహార లోపంతో ఉన్నారు; కానీ మన పిల్లలలో 46 శాతం మంది పోషకాహార లోపంతో ఉన్నారు. దేశంలో పరిస్థితులు మారాయనడంలో సందే హం లేదు. కానీ భారతీయులు పేదరికం నుంచి పూర్తిగా బయట పడతారనే భావన సందేహంగానే ఉంటుంది!కాబట్టి రెండు దేశాలకు సంబంధించి ఏది మంచి వ్యవస్థ? అత్యవసర పరిస్థితి సమయంలో గంటల తరబడి దీనిపై తీవ్రమైన చర్చను నిర్వహించిన విషయం నాకు గుర్తుంది. 1977 ఎన్నికలు ఈ విషయాన్ని పరిష్కరించాయని నేను అనుకున్నాను. భారత ప్రజలు స్వేచ్ఛ కోసం ఓటు వేసి, ఇందిరా గాంధీ వేసిన పురోగతి, అభివృద్ధి అనే ఎరను తిరస్కరించారు. కానీ చైనా ఆ ప్రశ్నను తిరిగి మేల్కొలిపింది. ముప్పై సంవత్సరాలుగా చైనా సాధిస్తూ వచ్చిన 10 శాతం వృద్ధి, భారత్ సాధించిన దానికి స్పష్టమైన, ఆకర్షణీయమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తోంది. పైగా రానురానూ ఈ అంతరం పెరు గుతూ ఉండవచ్చు.నేను నా భావనలను స్థిరం చేసుకునే ముందు చైనా గురించి ఇంకా చాలా తెలుసుకోవాలి, చూడాలి. కానీ నా విశ్వాసం దెబ్బతింది. తద్వారా వచ్చిన ప్రశ్నలు నన్ను కలవరపెడుతున్నాయి.కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
గతి తప్పుతున్న చైనా ఆధిపత్యం
ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, మిలిటరీ అప్లికేషన్లతో సహా హై-టెక్ పరిశ్రమలకు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ (ఆర్ఈఈ-స్కాండియం, యిట్రియం, లాంథనం, సీరియం, సెమారియం.. వంటి అరుదుగా దొరికే లోహాలు) కీలకం. దశాబ్దాలుగా చైనా ఎర్త్ మైనింగ్, లోహశుద్ధిలో ఆధిపత్య శక్తిగా ఉంది. ప్రపంచ ఉత్పత్తిలో 70% వరకు దాదాపు అన్ని ప్రాసెసింగ్ కార్యకలాపాలను ఇది నియంత్రిస్తుంది. ఇటీవల పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఆర్ఈఈకు సంబంధించి చైనాపై ఆధారపడడాన్ని తగ్గించాలని ఇతర దేశాలు యోచిస్తున్నాయి. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాయి. ఆర్ఈఈలను స్వతంత్రంగా ప్రాసెసింగ్ చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాయి.లైనాస్ రేర్ ఎర్త్స్అరుదైన లోహాల ఉత్పత్తిలో ‘లైనాస్ రేర్ ఎర్త్స్’ సంస్థ కీలకంగా మారుతుంది. ఇది చైనా వెలుపల భారీ అరుదైన లోహాల వాణిజ్య ఉత్పత్తిదారుగా ఉంది. ఆర్ఈఈ ప్రాసెసింగ్‌పై చైనా గుత్తాధిపత్యాన్ని విచ్ఛిన్నం చేయడంలో మలేషియా కేంద్రంగా ఈ ప్లాంట్ పని చేస్తుంది. ప్రపంచ అరుదైన లోహాల సరఫరాలకు వ్యూహాత్మక ప్రత్యామ్నాయంగా దాని పాత్రను బలోపేతం చేసుకుంటోంది. లైనాస్కు యూఎస్ ప్రభుత్వం నుంచి మద్దతు లభిస్తోంది.ఇదీ చదవండి: ఈజ్ మై ట్రిప్ సీఈఓను విచారించిన ఈడీప్రత్యామ్నాయాలుచైనీస్ రేర్ ఎర్త్ సరఫరాలపై ఆధారపడటం వల్ల కలిగే ఆర్థిక, భద్రతా ప్రమాదాలను గుర్తించి అనేక దేశాలు తమ సొంత వనరులను అభివృద్ధి చేసుకుంటున్నాయి. స్థానికంగా మైనింగ్ కార్యకలాపాలను మెరుగుపరచడానికి తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి.అక్లారా రిసోర్సెస్ (బ్రెజిల్): యూఎస్ ప్రాసెసింగ్ ప్లాంట్‌కు సరఫరా చేయడానికి ఈ రేర్ ఎర్త్ గనిని అభివృద్ధి చేస్తున్నారు. ప్రపంచ ఆర్ఈఈ సరఫరా గొలుసులో లాటిన్ అమెరికా పాత్రను ఇది మరింత పెంచుతుందని భావిస్తున్నారు.యుకోర్ రేర్ మెటల్స్ (యూఎస్): అమెరికా రక్షణ శాఖ నిధులతో ఈ సంస్థ చైనా ప్రాసెసింగ్ పద్ధతులపై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో కొత్త సెపరేషన్ టెక్నాలజీపై పనిచేస్తోంది.ఆస్ట్రేలియా, కెనడా: ఈ దేశాలు తమ రేర్ ఎర్త్ మైనింగ్ సామర్థ్యాలను వేగంగా విస్తరిస్తున్నాయి. బహుళ కంపెనీలు స్థానిక నిక్షేపాలను అన్వేషిస్తున్నాయి. -
ప్రపంచంలోనే తొలి AI హాస్పిటల్: డాక్టర్లు, నర్సులు అంతా రోబోలే..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాజ్యమేలుతోంది. దాదాపు అన్ని రంగాల్లో కృత్రిమ మేధ హవా కొనసాగుతోంది. ఇప్పటికే చాలా రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఏఐ.. వైద్య రంగంలో కూడా అద్భుతాలు సృష్టిస్తోంది. ఆధునిక వైద్య శాస్త్రాన్ని పునర్నిర్వచించగల చర్యలో భాగంగా.. చైనా ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి AI ఆధారిత ఆసుపత్రి (ఏజెంట్ హాస్పిటల్)ని ప్రారంభించింది.సింఘువా యూనివర్సిటీ పరిశోధకులు ఏఐ బేస్డ్ "ఏజెంట్ హాస్పిటల్"ను సృష్టించారు. ఇక్కడ ఉన్న డాక్టర్లు, నర్సులు అన్నీ కూడా రోబోలే. ఇక్కడ ఏఐ డాక్టర్లు.. ఉబ్బసం, గొంతునొప్పి వంటి సుమారు 30 రకాల జబ్బులకు చికిత్స అందిస్తాయి. ఈ వినూత్న ప్రయత్నం వైద్య చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది.ఏజెంట్ హాస్పిటల్ రీసర్చ్ టీమ్ లీడర్ 'లియు యాంగ్' మాట్లాడుతూ.. ఏఐ డాక్టర్లు రోగులకు చికిత్స చేయడానికి మాత్రమే కాకుండా.. వైద్య విద్యార్థులకు మెరుగైన శిక్షణను అందించడానికి కూడా ఉపయోగపడతాయని అన్నారు. ఎందుకంటే.. ఈ ఏఐ ఏజెంట్లు యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ (USMLE)లో 93.06 శాతం స్కోర్ సాధించాయని పేర్కొన్నారు.కొన్ని వారాలలోనే.. సంవత్సరాల క్లినిక్ అనుభవాన్ని పొందగల ఏఐ డాక్టర్లు రోగ నిర్దారణలో కూడా ప్రావీణ్యం పొంది ఉన్నాయని అన్నారు. ఏఐ వైద్య సిబ్బంది.. లైసెన్సింగ్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించగలిగితే.. శస్త్రచికిత్సలు సైతం చేయగలవు. ఏజెంట్ హాస్పిటల్లో 14 మంది ఏఐ డాక్టర్లు, నలుగురు ఏఐ నర్సులతో కూడిన సిబ్బంది ఉన్నారు. వీరందరూ.. రోజుకు 3000 మంది రోగులతో.. పరస్పర చర్య చేయగలరని లియు యాంగ్ అన్నారు.ఇదీ చదవండి: 'అమెరికాలో ఉంటున్న భారతీయులకు హెచ్చరిక'టెక్నాలజీ అభివృద్ధి చెందటం.. వైద్య రంగంలో ఏఐ డాక్టర్లు పుట్టుకురావడం బాగానే ఉంది. ఇవన్నీ యంత్రాలు కాబట్టి.. ఇవి భావోద్వేగాలకు అతీతం. కాబట్టి ఏదైనా చిన్న పొరపాటు జరిగినా.. రోగుల ప్రాణాలు పోయే అవకాశం ఉంది. కాబట్టి వైద్య రంగంలో సహాయకులుగా, వైద్య విద్యార్థులు బోధించడానికి ఏఐ సిబ్బంది ఉపయోగపడినప్పటికీ, ఆపరేషన్స్ చేయడం వంటివి ఏ మాత్రం సమంజసం?.. అనేది ఆలోచించాలి. -
భారత్ దిశగా చైనా గూఢచార నౌక
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్ర ఘటన అనంతరం భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ డ్రాగన్ దేశం కపటబుద్ధి మరోసారి బయట పెట్టుకుంది. ఆ దేశానికి చెందిన గూఢచార నౌక ‘ద యాంగ్ యి హవో’ భారత్ దిశగా వస్తోంది. ఈ విషయాన్ని డామియెన్ సిమోన్ అనే ఓపెన్‌సోర్స్ ఇంటెలిజెన్స్ నిపుణుడు తెలిపారు. చైనాకున్న గూఢచార నౌకల్లో ఇదొకటి. వీటిని పరిశోధన నౌకలని చైనా చెప్పుకుంటున్నప్పటికీ, వీటిని నిఘా నౌకలుగానే భారత్ తదితర దేశాలు పరిగణిస్తున్నాయి. శాస్త్రీయ పరిశోధనలతో పాటు పౌర, సైనిక అవసరాలను తీర్చేలా వీటిని రూపొందించారు. సముద్ర జలాల్లో పరిశోధనలు, సముద్ర గర్భం మ్యాపింగ్, ఖనిజ, జీవ వనరుల అన్వేషణ పేరుతో సంచరించే ఈ నౌకలు క్షిపణుల గమనాన్ని ట్రాక్ చేయగలవు, సబ్మెరీన్ల కదలికలను పసిగట్టడం వంటివి చేయగలవు. తాజాగా, మలక్కా నుంచి బయలుదేరిన ఈ నౌక శ్రీలంక దక్షిణ తీరం దిశగా సాగుతున్నట్లు మ్యాప్‌ను బట్టి సిమోన్ విశ్లేషించారు. ఈ నౌకతో ప్రమాదమేమంటే.. ఇందులో మనుషులతో అవసరం లేకుండా సముద్రం అడుగున సంచరిస్తూ నిఘా కార్యకలాపాలను నిర్వహించే వాహనాలుంటాయి. సముద్రం అడుగున మందుపాతరలు, ఇతర సైనిక కార్యకలాపాలను కనిపెట్టి మ్యాపింగ్ చేస్తాయి. భారత్‌లో క్షిపణి పరీక్షలు, ఇతర సైనిక కార్యకలాపాల సమయంలో చైనా నిఘా నౌకలు పొరుగుదేశాలకు చేరుకుని గూఛచర్యం చేయడం ఇటీవలి కాలంలో మామూలై పోయింది. గతేడాది ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అగ్ని–5ను ప్రయోగించిన సమయంలో చైనాకే చెందిన జియాంగ్ యాంగ్ హాంగ్ 01 అనే గూఢచర్య మన దేశ సమీపానికి వచ్చింది. ఒడిశాలోని బాలాసోర్ తీరం వెంబడి క్షిపణి పరీక్షలప్పుడు సైతం చైనా నిఘా నౌకలు తూర్పు తీరానికి సమీపంలోకి వచ్చినట్లు తెలిసింది. విశాఖ తీరంలోని సబ్మెరీన్లలోని అణు క్షిపణుల సిగ్నళ్లను సైతం ఇవి కనిపెట్టే అవకాశముందని సమాచారం. -
మళ్లీ చైనా ‘నామకరణోత్సవం’
కయ్యానికి కాలుదువ్వటం, గిల్లికజ్జాలకు దిగటం చైనాకు అలవాటైన విద్య. అందులో భాగంగానే మన అరుణాచల్‌ప్రదేశ్ ప్రాంతాలకు మాండరిన్ పేర్లు తగిలించి మళ్లీ పేచీకి దిగింది. తమ దేశంలో పేర్లు మార్చుకుంటే అది అంతర్గత వ్యవహారమవుతుంది. దాని వెనక ఏ సెంటిమెంటువున్నదో బయటివారికి అనవసరం. కానీ పొరుగు ప్రాంతాలకు కొత్త పేర్లు ఆలోచించే భారాన్ని ఎందుకు నెత్తినేసుకున్నట్టు? ఏదైనా ప్రాంతాన్ని సొంతం చేసుకునేముందు ఆ ప్రాంతానికి తమదైన పేరు తగిలిస్తే సరిపోతుందని చైనా నేతలు భావిస్తున్నట్టున్నారు. సంబంధాలు మెరుగుపడతాయనుకున్న ప్రతిసారీ కొత్త పేచీకి దిగటం చైనాకు రివాజైంది.2020లో గల్వాన్ లోయలో అకారణంగా ఘర్షణ లకు దిగి మన జవాన్లు 20మందిని బలితీసుకుంది. తాను కూడా మన జవాన్ల చేతుల్లో భారీ నష్టం చవిచూసింది. చర్చోపచర్చల తర్వాత ఇప్పుడిప్పుడే సంబంధాలు మెరుగవుతు న్నాయి. మానస సరోవర యాత్రకు మన యాత్రికులను అనుమతిస్తామని నాలుగేళ్ల తర్వాత ఇటీ వలే చైనా ప్రకటించింది. ఈలోగానే హఠాత్తుగా ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చింది. అరుణాచల్‌పై ఏదోరకంగా ఆధిప త్యాన్ని చాటుకునే ప్రయత్నం చేయటం, దాన్ని ‘వివాదాస్పద ప్రాంతం’గా అభివర్ణించటం చైనా ఎప్పుడూ మానుకోలేదు.ఇరు దేశాల మధ్యా సుహృద్భావ సంబంధాలు ఏర్పడి అయిదు దశాబ్దాల వుతోంది. శిఖరాగ్ర సమావేశాలు జరగటం, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు కుదరటం, ఇరువైపులా పౌరులు రాకపోకలు సాగించటం వంటివన్నీ కొనసాగుతున్నాయి. కానీ మన అధినేతలెవరైనా అరుణాచల్ వెళ్లినప్పుడల్లా మతిభ్రమించినట్టు గొడవకు దిగటం అలవాటైంది. గగనతలాన్ని అతిక్రమించి అరుణాచల్‌లోకి చైనా యుద్ధ విమానాలు చొచ్చుకురావటం కూడా షరా మామూలే. ఈ చిత్ర విచిత్ర విన్యాసాల్లో భాగమే అరుణాచల్‌లోని ప్రాంతాలకు కొత్త పేర్లు పెట్టడం. మొదటగా 2017లో దీన్ని ప్రారంభించింది. అటు తర్వాత 2021నుంచి వరసగా ఇదే పని చేస్తోంది. మళ్లీ తాజాగా మరోసారి తన పైత్యాన్ని ప్రదర్శించింది. 2017లో మొత్తం ఆరు ప్రాంతాలకు కొత్త పేర్లు పెట్టింది. ఇంచుమించు ఆ రాష్ట్రం నలుదిక్కులావున్న ప్రాంతాలు ఇందులో ఉన్నాయి. 2021లో 15 జనావాస ప్రాంతాలూ, నాలుగు పర్వతాలూ, రెండు నదులూ, ఒక పర్వతప్రాంత మార్గమూ ఎంపిక చేసుకుని మాండరిన్ పేర్లు పెట్టింది. 2023లో 11, ఆ మరుసటేడాది 30 ప్రాంతాలు ఎంపిక చేసుకుని పేర్లు మార్చింది.తాజాగా 27 ప్రాంతాలకు చైనా కొత్త పేర్లు పెట్టింది. ఇందులో రెండు భూభాగాలూ, రెండు జనావాస ప్రాంతాలూ, అయిదు పర్వత శిఖరాలూ, రెండు నదులతోసహా అనేకం ఉన్నాయి. ఈసారి అదనపు విశేషం ఏమంటే... వీటిని పాలనాపరమైన సబ్ డివిజన్లుగా విభజించి ఏవి ఏ పరిధిలోకొస్తాయో ఏకరువు పెట్టింది. పైకి చూడటానికి ఇదంతా తెలివితక్కువతనంగా, పనికిమాలిన చర్యగా అనిపించవచ్చు. కానీ భవిష్యత్తులో ఆ ప్రాంతాలు తనవేనని దబాయించటానికే ఇంత శ్రమ తీసుకుంటున్నదని వ్యూహాత్మక వ్యవహారాల నిపుణులంటారు. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో దీవులకు కూడా ముందు ఈ మాదిరిగానే పేర్లు తగిలించి, అటుతర్వాత అవి ఎప్పటినుంచో తమవని పేచీకి దిగింది. జపాన్‌తోనూ సెంకాకు దీవుల విషయంలో ఇదే మాదిరిగా గొడవ ప్రారంభించింది.అరుణాచల్‌లో దాదాపు 90,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని తనదిగా చెప్పుకోవటం చైనాకు ఎప్పటినుంచో అలవాటు. మన దేశం బ్రిటిష్ వలసపాలకుల ఏలుబడిలోవుండగా 1914లో సిమ్లాలో భారత్, టిబెట్ల మధ్య సరిహద్దు ఒప్పందం కుదిరింది. దాని ఆధారంగా ఉనికిలోకొచ్చిన మెక్మెహన్ రేఖ రెండు ప్రాంతాలనూ విభజిస్తుంది. ఆ సమయంలో చర్చల్లో పాల్గొన్న చైనా ప్రతినిధి ఇందుకు ఆమోదం తెలిపేందుకు నిరాకరించాడు. అంతర్జాతీయ ఒప్పందాలు కుదుర్చు కునే స్వాతంత్య్రం టిబెట్‌కు లేదని వాదించాడు. 1949లో అక్కడ కమ్యూనిస్టులు అధికారంలోకొచ్చాక వారు కూడా ఈ వాదననే తలకెత్తుకున్నారు.చారిత్రకంగా అరుణాచల్... టిబెట్‌లో అంతర్భాగమని చెబుతూ అందుకు తవాంగ్, లాసాల్లోని బౌద్ధారామాల మధ్య ఉన్న సంబంధాలను ఏకరువు పెడుతోంది. అరుణాచల్‌ను దక్షిణ టిబెట్‌గా భావిస్తూ తనదైన మాండరిన్లో జంగ్నాన్ అనటం, అక్కడివారికి విడి వీసాలు జారీచేయటం కూడా పాత ధోరణే. ఒకపక్క వాస్తవాధీనరేఖ వద్ద అయిదేళ్ల క్రితం జరిగిన ఘర్షణలపై చర్చలు సాగుతూ, ఇప్పుడి ప్పుడే సాధారణ పరిస్థితులు ఏర్పడుతుండగా మళ్లీ పేర్ల జోలికి పోవటంలో మతలబువుంది. ఇటీవలి ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాకిస్తాన్‌కు చైనా అందించిన ఆయుధ సామగ్రి సంగతి వెల్లడైంది. అవి మన త్రివిధ దళాల శక్తిముందు సరిపోలేదు. మనతో చెలిమికి చిత్తశుద్ధితో ప్రయత్ని స్తున్నట్టు కనబడుతూనే ఈ వివాదంలో పాక్ పక్షం చేరింది.ఈ సమయంలో పేర్ల వివాదం రాజేస్తే దృష్టి మళ్లించటం సులభమవుతుందని చైనా అంచనా వేసుకున్నట్టు కనబడుతోంది. వ్యూహాత్మకంగా అరుణాచల్ మనకెంతో ముఖ్యమైనది. ఈశాన్య భారత్‌కు ఇది రక్షణకవచంగా ఉపయోగపడు తుంది. ఈ ప్రాంతాన్ని ఎలాగైనా సొంతం చేసుకుంటే ఆగ్నేయాసియా దేశాలతో సాన్నిహిత్యం మరింత పెరుగుతుందని చైనా ఆశిస్తోంది. అదీగాక ఇక్కడ సహజవనరులు పుష్కలంగావున్నాయి. జల విద్యుదుత్పత్తికి వీలుంటుంది. ఈ ప్రాంత నదుల్ని గుప్పెట్లో పెట్టుకుంటే భవిష్యత్తులో నీటిని ఆయుధంగా వాడుకోవచ్చు. ఇంత దురాలోచనతో చైనా వేస్తున్న ఎత్తుగడలను మొగ్గలోనే తుంచటం, పేర్లు మార్చినంతమాత్రాన భౌగోళిక వాస్తవికతలు తారుమారు కావని చెప్పటం అవసరం. -
Earthquake: చైనాలో భూకంపం
బీజింగ్: చైనాలో భూకంపం సంభవించింది. శుక్రవారం ఉదయం రిక్టర్ స్కేలుపై 4.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) వెల్లడించింది.భారత కాలమానం ప్రకారం ఉదయం 6:29 గంటలకు ఈ ప్రకంపనలు సంభవించాయి. భూమి లోతులో 10 కిలోమీటర్ల లోపల భూకంపం నమోదైనట్లు ఎన్సీఎస్ అధికారులు తెలిపారు. ఈ మేరకు భూకంప వివరాలను ఎన్సీఎస్ తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈనెల మే 12న తెల్లవారుజామున 2:41 గంటలకు టిబెట్, చైనా పలు ప్రాంతాల్లో 5.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ భూకంపం భూమిలో 9 కిలోమీటర్ల లోతులో నమోదైంది.EQ of M: 4.5, On: 16/05/2025 06:29:51 IST, Lat: 25.05 N, Long: 99.72 E, Depth: 10 Km, Location: China. For more information Download the BhooKamp App https://t.co/5gCOtjcVGs @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/08mQNfOwyd— National Center for Seismology (@NCS_Earthquake) May 16, 2025 -
భారత్ కు వ్యతిరేకంగా ఒక్కటైన దుష్ట కూటమి
-
ఒంటరిగా ఎదుర్కోలేక.. దుష్ట కూటమిగా..!
-
పాక్, చైనాకు చావు దెబ్బ.. భారత్ సూపర్ ప్లాన్
ఢిల్లీ: పహల్గాం దాడికి పాకిస్తాన్‌పై భారత్ ప్రతీకారంగా తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్, పీవోకేపై భారత దళాలు దాడులు చేశాయి. ఈ క్రమంలో దాదాపు వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. అనంతరం, భారత్ దాడులపై పాక్ ప్రతి దాడులు చేసి బిత్తరపోయింది. భారత్ దాడులను అడ్డుకోలేకపోయింది. దాయాది పాకిస్తాన్‌కు డ్రాగన్ దేశం చైనా అండగా నిలిచినప్పటికీ.. భారత్‌ను ఎదుర్కోలేకపోయింది.ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత్ దాడులను అడ్డుకోవడానికి పాకిస్తాన్ చైనా ఎయిర్ డిఫెన్స్ వాడుకుంది. అయినప్పటికీ పాకిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చైనా వైమానిక రక్షణ వ్యవస్థలను, రాడార్లను భారత్ కేవలం 23 నిమిషాల్లోనే ధ్వంసం చేసింది. మొదట వాటిని జామ్ చేసింది. ఆ తర్వాత పూర్తిగా పని చేయకుండా ధ్వంసం చేసేసింది. కచ్చితమైన లక్ష్యాలతో విజయవంతంగా ఆపరేషన్‌ను పూర్తి చేశామని భారత ఆర్మీ అధికారులు తెలిపారు.ఇందులో చైనాకు చెందిన పీఎల్-15 క్షిపణులు, టర్కీకు చెందిన యూఏవీలు, దీర్ఘ శ్రేణి రాకెట్లు, క్వాడ్ కాప్టర్లు, డ్రోన్లు లాంటి వాటిని భారత్ ఎయిర్ ఫోర్స్ ధ్వంసం చేసింది. పాకిస్తాన్ అధునాతన ఆయుధాలను ఉపయోగించినప్పటికీ, భారతదేశ స్వదేశీ వైమానిక రక్షణ, ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలను ఏమీ చేయలేకపోయిందని అధికారులు వెల్లడించారు.IAF jammed Pakistan's China made air defence system, completed Operation sindoor in just 23 mins ..😳🔥🙌🏻 Jai hind 🇮🇳 Jai hind ki sena ❤️ 🇮🇳 #BalochLiberationArmy #IndianAirForce #IndiaPakistanWar pic.twitter.com/pH5TXcETc1— NEHA (@Neha09857) May 14, 2025టార్గెట్ ఫినిష్..భారత వైమానిక దళం నూర్ ఖాన్, రహీమ్ యార్ ఖాన్ వంటి కీలకమైన పాకిస్తాన్ వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. దాంతో పాటూ ఆత్మాహుతి డ్రోన్లను సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా శత్రు రాడార్లు, క్షిపణి వ్యవస్థలు, అధిక-విలువ లక్ష్యాలను ధ్వంసం చేసింది. లాటరింగ్ మందుగుండు సామగ్రి అనేవి ఆయుధ వ్యవస్థలు, ఇవి లక్ష్య ప్రాంతంపై ప్రదక్షిణలు చేసి, తగిన లక్ష్యం కోసం వెతుకుతాయి, ఆపై దాడి చేస్తాయి. వీటినే భారత్ ఉపయోగించింది. భారత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలతో ఆపరేషన్ సిందూర్‌ను విజయవంతం చేశామని చెప్పారు.సిందూర్ ఆపరేషన్‌లో ఇస్రో పాత్రభారత అంతరిక్ష సంస్థ ఇస్రో కూడా కీలక పాత్ర పోషించిందని భారత ఆర్మీ పేర్కొంది. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా మే 11 నుంచి దేశ పౌరుల భద్రత, వ్యూహాత్మక ప్రయోజనం కోసం కనీసం 10 ఉపగ్రహాలు 24 గంటలూ పనిచేస్తున్నాయని అధికారులు వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్ కేవలం వ్యూహాత్మక విజయం కాదు. ఇది భారతదేశ రక్షణ స్వదేశీకరణ విధానాలను ప్రపంచానికి చాటిచెప్పింది. వాయు రక్షణ వ్యవస్థల నుండి డ్రోన్ల వరకు భారత్ స్వదేశీ సాంకేతికతను అత్యంత ముఖ్యమైన సమయంలో అందించింది. భారత్ 21వ శతాబ్దంలో హైటెక్ సైనిక శక్తిగా తన పాత్రను విజయవంతం చేసిందని తెలిపారు. -
చైనా పత్రికలపై భారత్
న్యూఢిల్లీ: చైనా పాల్పడుతున్న భారత వ్యతిరేక ప్రచారంపై కేంద్రం కన్నెర్రజేసింది. పాకిస్తాన్‌కు అనుకూలంగా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నందుకు గ్లోబల్ టైమ్స్, జిన్హువా పత్రికల ఎక్స్ ఖాతాలను నిషేధించింది. అవి రెండూ చైనా కమ్యూనిస్ట్ పార్టీ కరపత్రాల వంటివి. భారత ప్రభుత్వం ధ్రువీకరించని విషయాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్న చైనా మీడియాకు మన రాయబార కార్యాలయం గతంలోనే హెచ్చరికలు జారీ చేసింది. అయినా అదే ధోరణి కొనసాగడంతో తాజా చర్యలు తీసుకుంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత మూడు భారత యుద్ధ విమానాలను పాక్ కూల్చేసిందని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. ఇలా పచ్చి అబద్ధాలు ప్రచురించడం బాధ్యతారాహిత్యమని, జర్నలిజం విలువలకు విరుద్ధమని భారత రాయబార కార్యాలయం విమర్శించింది. భారత్–పాక్ ఉద్రిక్తతలపై తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేయడంపై ఆగ్రహించింది. అయితే గ్లోబల్ టైమ్స్పై నిషేధాన్ని బుధవారం అర్ధరాత్రి ఎత్తేసింది. -
చైనా మీడియా సంస్థ ఎక్స్ అకౌంట్ నిలిపివేత
-
చైనా, తుర్కియేకు షాకిచ్చిన భారత్
ఢిల్లీ: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల వేళ ఓవరాక్షన్ చేస్తున్న చైనా, తుర్కియే విషయంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. చైనా ప్రభుత్వ మీడియా (Chinese State Media) గ్లోబల్ టైమ్స్‌కు చెందిన ఎక్స్ ఖాతాను భారత్ బ్లాక్ చేసింది. అలాగే, తుర్కియో బ్రాడ్కాస్ట్ టీఆర్టీపై భారత్ నిషేధం విధించింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు ఈ మేరకు చర్యలు తీసుకున్నట్టు భారత్ స్పష్టం చేసింది.వివరాల ప్రకారం.. జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై చైనా తప్పుడు కథనాలు రాసుకొచ్చింది. చైనా అధికారిక మీడియా అయినా గ్లోబల్ టైమ్స్.. పాక్‌కు అనుకూలంగా ప్రచారం చేసింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసింది. ఈ నేపథ్యంలో చైనా చర్యలకు భారత్ కౌంటరిచ్చింది. ఆ సంస్థకు చెందిన ఎక్స్ ఖాతాను భారత్‌లో బ్లాక్ చేసేసింది. కాగా, ఉగ్రవాదులు, వారి స్థావరాలను ధ్వంసం చేసిన భారత్ తీరును ప్రపంచదేశాలను సమర్థిస్తుంటే.. ఈ అంశంలో మాత్రం చైనా తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. ఈ మేరకు ఆ సంస్థ ఎక్స్ అకౌంట్‌ను విత్‌హెల్డ్‌లో ఉంచింది.The 'X' account of Chinese propaganda media outlet 'Global Times' withheld in India. pic.twitter.com/B9Q941FTjX— ANI (@ANI) May 14, 2025 ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత్ ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న 9 ప్రదేశాల్లో 24 ఖచ్చితమైన క్షిపణి దాడులు చేసింది. కానీ పాకిస్తాన్‌కు అనుకూలంగా చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ మాత్రం పాత ఫోటోలతో భారత్ యుద్ధ విమానాలను పాకిస్తాన్ కూల్చేసిందని తప్పుడు కథనాలను ప్రచురించింది. ఈ మేరకు భారత రాయబార కార్యాలయం స్పందిస్తూ..‘ఆపరేషన్ సిందూర్‌పై పాక్ అనుకూల సోషల్ మీడియాలో నిరాధారమైన వార్తలను విస్తృతంగా ప్రచారం చేస్తుండగా, మీడియా సంస్థలు వాటి మూలాలను నిర్ధారించకుండా ఈ దుష్ప్రచారాన్ని వ్యాపింపజేయడం జర్నలిజం నైతికతకు విరుద్ధం’ అని వ్యాఖ్యానించింది. భారత సమాచార శాఖకు చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) Fact Check వెల్లడించిన విషయాల ప్రకారం, గతంలో కూలిన యుద్ధ విమానాల దృశ్యాలను ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో కూలిపోయినవిగా ప్రచారం చేస్తున్నట్టు స్పష్టం చేసింది. -
మరోసారి వక్రబుద్ధిని ప్రదర్శించిన చైనా
-
భారత్, పాక్ ఉద్రిక్తతలు.. అరుణాచల్‌లో చైనా దూకుడు
ఢిల్లీ: భారత్ విషయంలో డ్రాగన్ దేశం చైనా మరోసారి వక్రబుద్ధిని చూపించింది. ఈశాన్య భారతంలో సరిహద్దు రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్‌లో పలు స్థలాల పేర్లను చైనా మార్చింది. ఈ నేపథ్యంలో చైనాపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పేరు మార్చినంత మాత్రాన, వాస్తవాలు మారవని తెలుసుకోవాలన్న భారత విదేశాంగ శాఖ హితవు పలికింది.భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ చైనా మరోసారి తన వక్రబుద్దిని చూపించింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని స్థలాలను సౌత్ టికెట్‌గా చైనా పేర్లు మార్చింది. ఈ నేపథ్యంలో చైనాపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ స్పందిస్తూ..‘అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమే. అరుణాచల్ ప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాల పేరు మార్చడాన్ని ఖండిస్తున్నాం. పేరు మార్చినంత మాత్రాన, వాస్తవాలు మారిపోవు. అరుణాచల్‌లోని పలు ప్రదేశాలకు పేర్లు పెట్టడానికి చైనా వ్యర్థ, విఫల ప్రయత్నాలు చేస్తున్నట్లు మేం గమనించాం. ఇది మా వైఖరికి విరుద్ధం. అలాంటి ప్రయత్నాలను కచ్చితంగా తిరస్కరిస్తాం’ అని చెప్పుకొచ్చారు.Here's the actual names and places of Arunachal Pradesh which China has renamed! 👇@MEAIndia has reiterated that creative naming will not alter the undeniable reality that Arunachal Pradesh was, is, and will always remain an integral and inalienable part of India. pic.twitter.com/o4rcgiflfK— Sashanka Chakraborty (@SashankGuw) May 14, 2025అయితే, అరుణాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల పేర్లను చైనా ఇప్పటికే పలుమార్లు మార్చింది. పేర్లను మార్చేందుకు ప్రయత్నిస్తూ నాలుగు జాబితాలను విడుదల చేసింది. 2017లో ఆరు ప్రదేశాలకు పేర్లు మార్చుతూ ఓ జాబితా విడుదల చేసింది. ఆ తర్వాత 2021లో 15 ప్రాంతాలకు, 2023లో 11 ప్రాంతాలకు, 2024లో మరో 30 ప్రాంతాలకు పేర్లను మార్చుతూ చైనా జాబితాను విడుదల చేసింది. చైనా చేస్తున్న వాదనలకు భారత్ ఎప్పటికప్పుడు గట్టి సమాధానమిస్తోంది. గత ఏడాది అరుణాచల్‌ప్రదేశ్‌లోని 30 ప్రాంతాలకు చైనీస్, టిబెటెన్ పేర్లను పెట్టింది. ఇలాంటి ప్రయత్నాలను భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది.India’s Foreign Ministry slams China for presenting new names of cities in the state of Arunachal Pradesh, which China claims as its own:"Creative naming won’t alter the undeniable fact that Arunachal Pradesh was, is & will always remain an integral & inalienable part of India” pic.twitter.com/hsbLg3jbC7— DR Yadav (@DrYadav5197) May 14, 2025 -
వెనక్కి తగ్గిన అమెరికా – చైనా
వేలంపాట తరహాలో అమెరికా, చైనాలు ఒకరిపై ఒకరు సుంకాలు పెంచుకుంటూ పోయిన వైనంతో బెంబేలెత్తిన ప్రపంచ మార్కెట్లూ, ఆర్థిక వ్యవస్థలూ నేల చూపులు చూస్తున్న వేళ జెనీవా నుంచి సోమవారం ఒక చల్లని కబురు వినబడింది. ఆర్థికంగా ప్రపంచంలోనే ఒకటి, రెండు స్థానాల్లో ఉన్న ఇరు దేశాలూ ప్రస్తుతానికి వెనక్కి తగ్గాలని నిర్ణయించుకున్నాయన్నదే దాని సారాంశం. ఇది బుధవారం నుంచి అమల్లోకొచ్చి తొంభై రోజులపాటు... అంటే మూణ్ణెల్లపాటు అమల్లో వుంటుందనీ, రెండు దేశాల ప్రతినిధులతో ఏర్పడిన సలహా యంత్రాంగం ద్వైపాక్షిక ఆర్థిక, వాణిజ్య సమస్యలను చర్చించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తుందనీ ఉమ్మడి ప్రకటన వివరిస్తోంది. ఈ సలహా యంత్రాంగంలో చైనా తరఫున ఆ దేశ ఉపప్రధాని హో లిఫాంగ్ , అమెరికా తరఫున ఆర్థికమంత్రి స్కాట్ బిసెంట్, వాణిజ్య ప్రతినిధి జెమిసన్ గ్రీయర్‌లుంటారు. మూర్ఖత్వంలో ఎవరికెవరూ తీసిపోని ఈ రెండు పక్షాలూ చివరికేం చేస్తాయన్నది ఇంకా చూడాల్సేవున్నా ఇప్పటికైతే ఒక ముప్పు తాత్కాలికంగానైనా ఉపశమించిందని సంతోషించక తప్పదు. మొన్న జనవరిలో అమెరికాలో అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ ప్రపంచాన్ని హడలెత్తిస్తూ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న వరస నిర్ణయాల్లో ఈ సుంకాల పెంపు వ్యవహారం అతి పెద్దది. గత నెల 2 నుంచి అమల్లోకొచ్చిన ఈ పెంపు చైనా మినహా వేరే దేశాలపై తాత్కాలికంగా ఆపేస్తున్నట్టు ట్రంప్ ఆ వెంటనే ప్రకటించారు. కానీ కోడెల పోట్లాటల మధ్య లేగల కాళ్లు విరిగినట్టు అమెరికా–చైనా సుంకాల యుద్ధంతో ప్రపంచమంతటికీ సమస్యలు తలెత్తాయి. తాజా ఒప్పందం పర్యవసానంగా అమెరికా విధించిన 145 శాతం సుంకాలు కాస్తా 30 శాతానికి తగ్గుతాయి. అలాగే అమెరికా దిగుమతులపై చైనా విధించిన 125 శాతం సుంకాలు 10 శాతానికి దిగొస్తాయి. ఈ వారం ఆఖరులోగా తాను చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో చర్చిస్తానని ట్రంప్ చెప్పటం కూడా సంతోషించదగ్గది. చైనాతో సుంకాల విషయమై చర్చలు సాగుతున్నాయని ఆ మధ్య ట్రంప్ పదే పదే ప్రకటించగా చైనా ఖండించింది. చివరకు స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో చర్చలు సాకారమయ్యాయి. చైనాను దెబ్బతీసే ఉద్దేశం తమకు మొదణ్ణించీ లేదని ట్రంప్ ప్రకటించారు. ఇది స్వాగతించ దగ్గదే అయినా బడాయి మాటనే చెప్పాలి. ఎందుకంటే ఆ దేశాన్ని దెబ్బతీయటం సంగతలా వుంచి అమెరికాలోని తయారీరంగ పరిశ్రమలు ముడిసరుకులు దొరక్క ఇబ్బందులుపడుతూ దివాలా దశకు చేరాయి. ఉద్యోగాలకు కోతబెట్టాయి. వినియోగదారులు సైతం ఉత్పత్తులు అందుబాటులో లేకపోవటంతో పాటు, లభ్యమైన సరుకు ధర ఆకాశాన్నంటడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఉద్యోగాలు కోల్పోయి సతమతమవుతుంటే సరుకును రెట్టింపు, అంతకన్నా ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సి రావటం వారిని కుంగదీసింది. చైనాలోనూ పరిస్థితి ఏమంత సజావుగా లేదు. అనేక కంపెనీలు మూతబడ్డాయి. కొన్ని సంస్థలు ఆగ్నేయాసియా దేశాలకు ఎగుమతులపై దృష్టి సారించాయి. ట్రంప్ అధికారంలోకొస్తూనే దేశంలో యువత ప్రాణాలు తీస్తున్న మత్తు పదార్థం ఫెంటానిల్ విచ్చలవిడిగా దొరకటంలో చైనా పాత్రవుందని ఆరోపిస్తూ ఆ దేశం నుంచి వచ్చే దిగుమతులపై 20 శాతం అదనంగా సుంకాలు పెంచారు. గత నెల 2 నుంచి దానికి మరో 34 శాతం జోడించారు. ఇలా తమ నుంచి వెళ్లిన సరుకులపై 54 శాతం సుంకాలు విధించటాన్ని జీర్ణించుకోలేని చైనా దానికి ప్రతీ కారంగా అమెరికా దిగుమతులపై 34 శాతం మేర అదనపు సుంకాలు విధించింది. ఇక అక్కడి నుంచి ఇద్దరిమధ్యా ‘చంపుడు పందెం’ మొదలైంది. నిజానికి ట్రంప్‌కు ముందు ఫెంటానిల్‌తో చైనాకు లంకె పెట్టినవారెవరూ లేరు. అధ్యక్ష ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాలను ఆశించి ఆయన దాన్ని ఎక్కువచేసి చూపారు. మొత్తానికి అమెరికా 145 శాతం, చైనా 125 శాతం సుంకాల దగ్గర ఆగాయి. ఇప్పుడు కుదిరిన ఒప్పందం పర్యవసానంగా గంపగుత్తగా అన్ని రకాల సరుకులపైనా సుంకాలు తగ్గిపోవు. చైనా సరుకులపై అమెరికా విధించిన 30 శాతం సుంకాలు కొనసాగుతాయి. అలాగే విద్యుత్ వాహనాలు, ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై ఇంతకన్నా ఎక్కువగానే సుంకాలున్నాయి. అవన్నీ గత కొన్ని సంవత్సరాల్లో విధించినవి కనుక ఈ ఒప్పందం వాటి జోలికిపోదు.అవతలిపక్షం నుంచి ఎలాంటి రాయితీలూ పొందకుండా, తమకనుకూలమైన ముగింపు వైపుగా చర్యలేమీ కనబడకుండా ఒప్పందానికి రావటం బలహీనతను సూచిస్తుంది తప్ప బలాన్ని కాదు. ప్రస్తుత ఒప్పందం వ్యూహాత్మకమైనదని చెప్పుకున్నా, మున్ముందు దేశానికేదో ఒరుగుతుందని అంటున్నా... అధిక సుంకాల మోత నుంచి వెనక్కి తగ్గమని ట్రంప్‌పై దేశంలో అన్నివైపుల నుంచీ ఒత్తిళ్లు వచ్చాయన్నది వాస్తవం. నిరుటి గణాంకాలు గమనిస్తే రెండు దేశాలూ వాణిజ్య పరంగా పరస్పరం ఆధారపడినవేనని తెలుస్తుంది. చైనా ఎగుమతుల్లో అమెరికా వాటా 12.9 శాతం. అలాగే అమెరికా మొత్తం ఎగుమతుల్లో చైనా వాటా 14.8 శాతం. కెనడా, మెక్సికోల తర్వాత స్థానం చైనాదే. అధిక సుంకాల యుద్ధం చివరకు ప్రపంచ ఆర్థికాభివృద్ధిని మందగింపజేస్తుందని, ఉత్పత్తుల కొరతను సృష్టించి ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని... ఇదంతా చిట్టచివరకు అమెరికాను మాంద్యం ఊబిలోకి నెడుతుందని నిపుణులు మొదణ్ణించీ హెచ్చరిస్తూనే ఉన్నారు. సర్వజ్ఞుణ్ణని భావించేవారికి చెప్పటానికి ప్రయత్నించటం వృథా ప్రయాస. ఏదైనా అనుభవంలోకొస్తే తప్ప తత్వం బోధపడదు. మొత్తానికి ఈ చర్చల వల్ల ఇప్పటికైతే అర్థవంతమైన పరిష్కారం లభించలేదు. మున్ముందు ఏమవుతుందన్నది రెండు దేశాల విజ్ఞతకూ పరీక్ష. -
అమెరికా–చైనా టారిఫ్ డీల్...
న్యూఢిల్లీ: టారిఫ్‌ల పెంపును 90 రోజుల పాటు నిలిపివేయాలన్న అమెరికా, చైనా నిర్ణయంతో భారత్‌కు సవాళ్లు ఉన్నప్పటికీ, నిర్దిష్ట వ్యాపార అవకాశాలు కూడా ఉంటాయని ఎగుమతిదారులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గడమనేది అంతర్జాతీయంగా వాణిజ్య స్థిరత్వానికి సానుకూలాంశమని ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ ఎస్సీ రాల్హన్ తెలిపారు. టారిఫ్‌ల తగ్గింపు వల్ల, ఎల్రక్టానిక్స్, మెషినరీ, రసాయనాలు వంటి అధిక విలువ చేసే ఉత్పత్తులకు సంబంధించి అమెరి–చైనా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ఎగియవచ్చని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ పరిణామంతో భారత ఎగుమతిదార్లకు సవాళ్లు ఎదురుకావచ్చన్నారు. అమెరికా–చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటీవలి కాలంలో ఆగ్నేయాసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలాంటి మార్కెట్లో చొచ్చుకుపోయిన భారత ఎగుమతిదార్లకు పోటీ పెరగవచ్చని రాల్హన్ చెప్పారు. కానీ, ఆ రెండు దేశాల వాణిజ్య పరిధిలోకి రాని ఇతర రంగాలపై మరింతగా దృష్టి పెట్టేందుకు అవకాశం లభించగలదన్నారు. ఫార్మా ఏపీఐలు, ఐటీ ఆధారిత సరీ్వసులు, రత్నాభరణాలు, ఇంజినీరింగ్ ఉత్పత్తులు, ఆర్గానిక్ రసాయనాల్లాంటి ఎగుమతులను పటిష్టపర్చుకోవచ్చని రాల్హన్ చెప్పారు. విశ్వసనీయమైన ప్రత్యామ్నాయ సరఫరాదారుగా ఉంటుందనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ వాణిజ్యంలో మరింత ప్రాధాన్యం దక్కేలా అమెరికాతో భారత్ క్రియాశీలకంగా సంప్రదింపులు జరపడం శ్రేయస్కరమని ఆయన పేర్కొన్నారు. అలాగే టారిఫ్‌ల తగ్గింపనేది తాత్కాలికమే కావడం వల్ల భవిష్యత్తులో సమస్యలు ఎదురవకుండా హెడ్జింగ్ చేసుకునేందుకు కంపెనీలు పీఎల్ఐ (ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు) స్కీమ్, మేకిన్ ఇండియా కార్యక్రమం కింద భారత్‌లో ఉత్పత్తిని పెంచుకునేందుకు మొగ్గు చూపవచ్చని రాల్హన్ చెప్పారు. చైనా నుంచి భారత్‌లోకి దిగుమతులు వెల్లువలా వచి్చపడకుండా ప్రభుత్వం ఓ కన్నేసి ఉంచాలని మరో ఎగుమతిదారు చెప్పారు. వ్యయాలు తగ్గించుకోవాలి.. మన ఎగుమతులపై అమెరికాలో సుంకాల రేటు చైనాతో పోలిస్తే తక్కువే ఉన్నప్పటికీ.. వ్యత్యాసం గణనీయంగా తగ్గిపోతోందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ వ్యాఖ్యానించారు. కొద్ది రోజుల క్రితమే చైనా ఉత్పత్తులపై అమెరికా 145 శాతం టారిఫ్‌లు విధించినప్పుడు 10 శాతం శ్లాబ్‌లో ఉన్న భారత్ వైపు మొగ్గు ఎక్కువగా కనిపించిందని పేర్కొన్నారు. ప్రస్తుత 30 శాతంతో పోల్చినప్పుడు మనం ఇంకా మెరుగైన స్థితిలో ఉన్నప్పటికీ.. గతంలో ఉన్నంత ప్రయోజనం ఉండదని శ్రీవాస్తవ చెప్పారు. టారిఫ్‌లను ప్రతిపాదిత 26 శాతానికి పెంచకుండా, 10 శాతం స్థాయిలోనే కొనసాగించేలా అమెరికాతో సంప్రదింపుల ద్వారా భారత్ స్మార్ట్ డీల్ కుదుర్చుకునేందుకు ప్రయతి్నంచాలని ఆయన సూచించారు. వాణిజ్య విధానానికే పరిమితం కాకుండా భారత్ అత్యవసరంగా ఉత్పత్తి వ్యయాలను తగ్గించుకోవాలని, లాజిస్టిక్స్‌ను ప్రక్షాళన చేయాలని, నిబంధనలు అంచనాలకు అందే విధంగా ఉండేలా విధానాలను మెరుగుపర్చుకోవాలని పేర్కొన్నారు. వాణిజ్య వివాదాలను పరిష్కరించుకోవడంపై సంప్రదింపులు జరుగుతున్నందున 90 రోజుల పాటు చాలా మటుకు సుంకాలను గణనీయంగా తగ్గించుకునేందుకు అమెరికా, చైనా అంగీకారానికి వచ్చాయి.ఫార్మా రేట్ల కోతతో భారత్‌పై ఒత్తిడి: జీటీఆర్ఐప్రి్రస్కిప్షన్ ఔషధాల రేట్లను 30–80 శాతం వరకు తగ్గించాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రణాళికలతో అంతర్జాతీయంగా ఫార్మా రేట్లలో మార్పులు చోటు చేసుకుంటాయని జీటీఆర్ఐ తెలిపింది. అమెరికాలో వాటిల్లే నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు ఫార్మా సంస్థలు ఇతర దేశాల్లో తాము ధరలు పెంచుకునేందుకు ప్రయతి్నస్తాయని పేర్కొంది. ఇందుకోసం పేటెంట్ చట్టాలను మార్చే విధంగా భారత్‌లాంటి దేశాలపై ఒత్తిడి తేవొచ్చని జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. ప్రపంచానికి చౌకగా ఔషధాలను అందించేందుకు ఉపయోగపడుతున్న తన పేటెంట్ చట్టాల విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు లొంగరాదని సూచించారు. మన జనరిక్స్‌పై ప్రపంచం ఆధారపడి ఉన్న నేపథ్యంలో ఈ మోడల్‌ను పరిరక్షించడమనేది భారత్‌కి ప్రయోజనం చేకూర్చడమే కాకుండా, ప్రపంచానికి కూడా అవసరమని వివరించారు. -
సీజ్ఫైర్.. బుల్ జోష్!
ముంబై: భారత్–పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో దలాల్ స్ట్రీట్‌లో బుల్ పరుగులు తీసింది. అమెరికా–చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరడం కూడా బుల్‌కు జోష్‌నిచ్చాయి. ఫలితంగా సూచీలు గడిచిన నాలుగేళ్లలో (2021) తర్వాత ఒకరోజులో అతిపెద్ద లాభాన్ని గడించాయి. సెన్సెక్స్ 2,975 పాయింట్లు లాభపడి 82,430 వద్ద, నిఫ్టీ 917 పాయింట్లు బలపడి 24,925 వద్ద నిలిచింది. ఈ ముగింపు ఇరు సూచీలకు ఏడు నెలల గరిష్టం ముగింపు. సూచీల 4% ర్యాలీతో స్టాక్ మార్కెట్లో ఒక్కరోజే రూ.16.15 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే, బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.432.56 లక్షల కోట్ల(5.05 ట్రిలియన్ డాలర్లు)కు చేరింది. రోజంతా లాభాలే: గత వారాంతాన భారత్, పాక్‌ల మధ్య సీజ్ఫైర్, అమెరికా చైనాల మధ్య ట్రేడ్ ఒప్పందాల పరిణామాల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే భారీ లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 1,350 పాయింట్లు బలపడి 80,804 వద్ద, నిఫ్టీ 412 పాయింట్లు ఎగసి 24,420 వద్ద మొదలయ్యాయి. ఇంట్రాడేలో అన్ని రంగాల్లో కొనుగోళ్ల పర్వం కొనసాగడంతో సూచీలు మరిన్ని లాభాలు ఆర్జించగలిగాయి. ఒకానొక దశలో సెన్సెక్స్ 3,041 పాయింట్లు దూసుకెళ్లి 82,496 వద్ద, నిఫ్టీ 937 పాయింట్లు ఎగసి 24,945 వద్ద గరిష్టాన్ని తాకాయి. → సెన్సెక్స్ సూచీలో ఇండస్ఇండ్ (–3.57%), సన్‌ఫార్మా(–3.36%) మినహా 28 షేర్లూ లాభపడ్డాయి. సూచీల్లో ఐటీ 6.75%, రియల్టీ 6%, మెటల్, టెక్, యుటిలిటీ, పవర్ ఇండెక్సులు 5% రాణించాయి. ఇండస్ట్రీయల్, బ్యాంకెక్స్ సూచీలు 4–3% లాభపడ్డాయి. → మార్కెట్ అనూహ్య ర్యాలీలో రక్షణ రంగ, డ్రోన్ల తయారీ కంపెనీల షేర్లకు డిమాండ్ కొనసాగింది. యాక్సిస్కేడ్స్ టెక్నాలజీస్ 5%, డేటా ప్యాటర్న్స్ 4%, మిశ్ర ధాతు నిగమ్ 3.50%, భారత్ ఎల్రక్టానిక్స్ 2%, పెరిగాయి. ఐడియాఫోర్జ్ టెక్నాలజీ 6%, డ్రోణాచార్య ఏరియల్ 5% పెరిగాయి.లాభాలు ఎందుకంటే: → పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, సరిహద్దుల్లో కాల్పులు పరిణామాలతో భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్ధ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. అయితే అమెరికా మధ్యవర్తిత్వంలో, అనేక దౌత్యప్రయత్నాల తర్వాత ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. దీంతో ఒక్కసారిగా దలాల్ స్ట్రీట్‌లో ఒక్కసారిగా ఊపువచ్చింది. → అమెరికా–చైనాల మధ్య ‘టారిఫ్ వార్’ సైతం ఒక కొలిక్కి వచ్చింది. స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన చర్చలు సఫలమై ఇరు దేశాలు వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. తమ టారిఫ్‌లను 115% మేర తగ్గించుకోవడంతో పాటు కొత్త సుంకాలకు 90 రోజులపాటు విరామం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాయి. అగ్రదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరడంతో ప్రపంచ మార్కెట్లకు ఫుల్ జోష్ వచ్చింది. → ఈక్విటీ ఫండ్లలోకి సిప్ల ద్వారా ఏప్రిల్‌లో రికార్డు స్థాయి రూ.26,632 కోట్లు పెట్టుబడులు రావడం, అంతర్జాతీయ క్రిడెట్ రేటింగ్ ఏజెన్సీ మారి్నంగ్‌స్టార్ డీబీఆర్ఎస్ భారత సావరిన్ క్రిడెట్ రేటింగ్‌ను దీర్ఘకాలానికి బీబీబీ(కనిష్టం) నుంచి బీబీబీ(స్థిరత్వం)కి అప్‌గ్రేడ్ చేయడం తదితర అంశాలు మార్కెట్ల ర్యాలీకి దన్నుగా నిలిచాయి.భారీ లాభాల్లో అమెరికాచైనాతో వాణిజ్య ఒప్పందంలో భాగంగా వాణిజ్య యుద్ధానికి 90 రోజుల విరామం ప్రకటించడంతో అమెరికా ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఎస్అండ్పీ 500 ఇండెక్సు 2.70%, డోజోన్స్ సూచీ 2%, నాస్డాక్ ఇండెక్సు 4% లాభాల్లో ట్రేడవుతున్నాయి. ట్రెజరీ ఈల్డ్స్, డాలర్ ఇండెక్సులూ పెరిగాయి. -
పాక్‌కు సైనిక సామగ్రి తరలింపు అబద్ధం: చైనా
బీజింగ్: పాకిస్తాన్‌కు సరుకు రవాణా విమానంలో సైనిక సామగ్రిని తాము సరఫరా చేశామంటూ వస్తున్న వార్తలను చైనా ఖండించింది. ఇటువంటి వదంతులను వ్యాప్తి చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. జియాన్ వై–20 రకం విమానంలో పెద్ద మొత్తంలో సామగ్రిని పాకిస్తాన్ తరలించినట్లు ఆన్లైన్లో వస్తున్న వార్తలు అసత్యాలని పేర్కొంది. ‘ఇంటర్నెట్ చట్టానికి అతీతం కాదు. సైనిక సంబంధమైన వదంతులను, అసత్యాలను వ్యాప్తి చేసే వారిని బాధ్యులను చేస్తాం’అని స్పష్టం చేసింది. భారత్‌తో కాల్పుల విరమణకు అంగీకారం కుదిరాక పాక్‌కు అత్యవసరమైన సామగ్రిని చైనా పంపించిందంటూ ఆన్లైన్లో వార్తలు షికారు చేశాయి. పాక్, చైనాల మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్న విషయం తెల్సిందే. పాక్ ఆయుధ సామగ్రి, వ్యవస్థల్లో ఏకంగా 81 శాతం చైనా నుంచి కొనుగోలు చేసినవేనని స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(సిప్రి) తెలిపింది. -
అమెరికా, చైనా డీల్: ఒక్కసారిగా తగ్గిన బంగారం ధరలు
అమెరికా ప్రతీకగా సుంకాల కారణంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి, బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. దేశంలో గోల్డ్ రేటు ఏకంగా లక్ష మార్కును దాటేసింది. అయితే తాజాగా జరిగిన అమెరికా - చైనా దేశాలను టారిఫ్స్ కొంత తగ్గిస్తున్నట్లు.. ఇవి 90 రోజులు అమల్లో ఉంటాయని ప్రకటించాయి. దీంతో పసిడి ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి.అంతర్జాతీయ మార్కెట్లో 3400 డాలర్ల కంటే ఎగువన ట్రేడ్ అయిన ఔన్స్ బంగారం ధర.. ఏకంగా 3218 డాలర్లకు దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగానే భారతదేశంలో కూడా గోల్డ్ రేటు గణనీయంగా తగ్గింది. వెండి ధరలు కూడా బంగారం బాటలో పయనించిందా అన్నట్లు.. తగ్గుముఖం పట్టింది. దీంతో దేశం మొత్తం మీద బంగారం, వెండి ధరలు తగ్గినట్లు స్పష్టంగా తెలుస్తోంది.చైనా.. అమెరికాపై విధించిన 125 శాతం సుంకాన్ని 10 శాతానికి పరిమితం చేయగా.. అమెరికా, చైనాపై విధించిన సుంకాన్ని 145 శాతం నుంచి 30 శాతానికి పరిమితం చేసింది. ఇదీ చదవండి: అంబానీ మామిడి తోట: ఏటా ఎన్ని కోట్ల ఆదాయమో తెలుసా?ఇరు దేశాలు (చైనా, అమెరికా) కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. ఈ సుంకాల తగ్గింపు 90 రోజులు మాత్రమే అమలులో ఉంటాయని తెలుస్తోంది. కొత్త సుంకాలు మే 14 నుంచి అమలులోకి రానున్నాయి. ఆ తరువాత తగ్గింపు సుంకాలే కొనసాగుతాయా?, ముందుకు విధించిన సుంకాలు కొనసాగుతాయా?, అనే విషయం తెలియాల్సి ఉంది. -
అమెరికా, చైనా మధ్య టారిఫ్ వార్ కు బ్రేక్..
-
90 రోజుల పాటు కొత్త సుంకాలు: అమెరికా, చైనా మధ్య డీల్
నువ్వా నేనా అంటూ ప్రతీకార సుంకాలను అంతకంతకూ పెంచుకుంటూ పోయిన అమెరికా, చైనా దేశాలు టారిఫ్‌ల విషయంలో ఓ డీల్ కుదుర్చుకున్నాయి. తాజా ఒప్పందం ప్రకారం.. చైనా.. అమెరికాపై విధించిన 125 శాతం సుంకాన్ని 10 శాతానికి పరిమితం చేయగా.. అమెరికా, చైనాపై విధించిన సుంకాన్ని 145 శాతం నుంచి 30 శాతానికి పరిమితం చేసింది. ఇరు దేశాలు (చైనా, అమెరికా) కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. ఈ సుంకాల తగ్గింపు 90 రోజులు మాత్రమే అమలులో ఉంటాయని తెలుస్తోంది. కొత్త సుంకాలు మే 14 నుంచి అమలులోకి రానున్నాయి. ఆ తరువాత తగ్గింపు సుంకాలే కొనసాగుతాయా?, ముందుకు విధించిన సుంకాలు కొనసాగుతాయా?, అనే విషయం తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: అంబానీ మామిడి తోట: ఏటా ఎన్ని కోట్ల ఆదాయమో తెలుసా?అమెరికా ప్రపంచ దేశాల మీద ప్రతీకార సుంకాలను విధించిన సమయంలో.. చైనా కూడా అమెరికాకు ధీటుగా సుంకాలను పెంచింది. దీంతో వాణిజ్య యుద్ధం మొదలైంది. ఈ ప్రభావం స్టాక్ మార్కెట్ల మీద విపరీతమైన ప్రభావం చూపింది. దిగ్గజ పారిశ్రామిక వేత్తలు కూడా భారీ నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. అయితే తాజాగా.. ఇరుదేశాల మధ్య స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన వాణిజ్య చర్చల్లో భాగంగా ఈ సుంకాలను తగ్గించుకోవడానికి నిర్ణయం తీసుకున్నారు. -
‘నూర్ఖాన్’ నేలమట్టం
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌పై భారత్ చేస్తున్న మెరుపుదాడుల్లో ఆ దేశ వైమానిక స్థావరాలు నేలమట్టమవుతున్నాయి. తాజాగా ఇస్లామాబాద్, రావల్పిండి జంట నగరాల సమీపంలోని నూర్ ఖాన్ వైమానిక స్థావరం మీదా భారత్ దాడులు చేసిన విషయం తాజాగా చైనా ఉపగ్రహ చిత్రాలతో స్పష్టమైంది. చైనాకు చెందిన కృత్రిమ ఉపగ్రహాల సంస్థ ‘మిజాజ్విజన్’ తీసిన తాజా శాటిలైట్ ఫొటోలు భారత దాడి తీరును బహిర్గతం చేశాయి. ఇప్పటికే రఫీఖీ, మురీద్, నూర్ ఖాన్, ఛునియన్, సుక్కూర్‌లలో వైమానిక స్థావరాలపై దాడి చేసినట్లు భారత్ ప్రకటించింది. ఈ దాడులను పాకిస్తాన్ సైతం ధృవీకరించింది. రావల్పిండిలోని నూర్‌ఖాన్‌తోపాటు ఛక్వాల్‌లోని మురీద్ స్థావరం, పంజాబ్ ప్రావిన్స్‌లోని ఝంగ్ జిల్లాలోని రఫీఖీ బేస్‌పైనా బాంబులు పడ్డాయని పాకిస్తాన్ సైన్యం అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మెద్ షరీఫ్ వెల్లడించారు. పాక్ రాజధాని ఇస్లామాబాద్‌కు అత్యంత సమీపంలోని నూర్ఖాన్ బేస్ ఆ దేశానికి చాలా కీలకమైన వైమానిక స్థావరం. ఇక్కడ చాలా ప్రధానమైన స్క్వాడ్రాన్లు ఉంటాయి. సైనిక, సరకు రవాణా సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. సీ–130 హెర్క్యులస్, సాబ్ –2000 సైనిక ఉపకరణాల రవాణా విమానాలను ఇక్కడే నిలిపి ఉంచుతారు. గాల్లోనే విమానాలకు ఇంధనాన్ని నింపే ఐఎల్–78 వంటి రీఫ్యూయిలర్ విమానాలతోపాటు పాక్‌లోని వీవీఐపీలకు సంబంధించిన చిన్న విమానాలకూ ఇదే కీలక స్థావరం. -
పాకిస్తాన్‌కు మద్దతుపై చైనా కీలక ప్రకటన
బీజింగ్: పాకిస్తాన్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, జాతీయ స్వాతంత్య్రం కోసం తమ మద్దతు కొనసాగుతుందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ స్పష్టంచేశారు. పాక్‌కు అండగా ఉంటామని ఉద్ఘాటించారు. ఆయన శనివారం పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాఖ్ దార్‌తో ఫోన్లో మాట్లాడారు. భారత్–పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, తాజా పరిణామాలను ఇషాఖ్ దార్ వివరించారు.ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ నాయకత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని వాంగ్ యీ ప్రశంసించారు. పాక్ సంయమన ధోరణిని కొనియాడారు. మిత్రదేశమైన పాక్‌కు తమ మద్దతు ఉంటుందని స్పష్టంచేశారు. మరోవైపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్, తుర్కియే విదేశాంగ మంత్రి హకన్ ఫిదాన్తోనూ ఇషాఖ్ దార్ ఫోన్లో మాట్లాడారు. -
భారత్-పాక్ యుద్ధం.. మరోసారి స్పందించిన చైనా
భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి చైనా స్పందించింది. ఇరు దేశాలు సంయమనం పాటించాలని గట్టిగా కోరింది. పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నామని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించింది. ఈ సమస్యను ముగింపు పలికేందుకు అవసరమైతే నిర్మాణాత్మక పాత్ర పోషించేందుకు సిద్ధమేనని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఉద్రిక్తత పెరగడం పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.భారత్-పాకిస్థాన్‌ల మధ్య జరుగుతున్న సైనిక దళాల ఘర్షణపై చైనా.. నిన్న కూడా(శుక్రవారం) స్పందించిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది. చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి లిన్ జియాన్ మాట్లాడుతూ.. భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా కానీ చైనా వ్యతిరేకిస్తుందంటూ ఆయన స్పష్టం చేశారు.కాగా, భారత్–పాక్ సైనిక ఘర్షణలో జోక్యం చేసుకోవటం మా పని కాదు’ అని అగ్రరాజ్య ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ విస్పష్టమైన ప్రకటన చేశారు. అలాగే.. భారత్-పాకిస్తాన్ మధ్య ఘర్షణలు పూర్తిగా ఆగిపోవాలని కోరుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించిన సంగతి తెలిసిందే. ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరారు. కుక్కకాటుకు చెప్పుదెబ్బ అన్నట్టుగా భారత్–పాక్ మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయని వెల్లడించారు. మొదట ఉగ్రవాదులు దాడి చేశారు కాబట్టి తర్వాత భారత సైన్యం ప్రతిదాడి చేసిందని పరోక్షంగా అంగీకరించారు -
అంచనాలు మించిన చైనా ఎగుమతులు
బీజింగ్: అమెరికా భారీ టారిఫ్‌లతో బాదేసినా, ఎగుమతుల పరంగా చైనా తన బలాన్ని చాటుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో అంచనాలకు మించి ఎగుమతులు నమోదు చేసింది. ఏప్రిల్ నెలలో ఎగుమతులు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 8.1 శాతం వృద్ధితో 315.69 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు చైనా ప్రభుత్వం ప్రకటించింది. అమెరికాకు ఎగుమతులు 21 శాతం తగ్గినప్పటికీ, చైనా ఎగుమతుల్లో సానుకూల వృద్ధిని నమోదు చేయడం విశేషం. ఏప్రిల్ నెలలో చైనా ఎగుమతులు కేవలం 2 శాతమే పెరగొచ్చన్నది విశ్లేషకుల అంచనాగా ఉంది. ఇక ఈ ఏడాది మార్చి నెలలో చైనా ఎగుమతుల్లో వృద్ధి 12.4 శాతంతో పోల్చి చూసినప్పుడు ఏప్రిల్‌లో కొంత నిదానించినట్టు తెలుస్తోంది. చైనా దిగుమతులు 0.2 శాతం తగ్గాయి. చైనా ఉత్పత్తులపై టారిఫ్‌లను అమెరికా 145 శాతానికి పెంచడం తెలిసిందే. దీనికి ప్రతిగా అమెరికా ఎగుమతి చేసే వాటిపై 125 శాతం టారిఫ్‌లను చైనా అమలు చేస్తోంది. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో యూఎస్, చైనా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యంపై చర్చలు జరగడానికి సరిగ్గా ఒక రోజు ముందు ఈ డేటా విడుదల కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. యూఎస్‌తో తగ్గిన వాణిజ్య మిగులు అమెరికాతో చైనాకి వాణిజ్య మిగులు 2024 ఏప్రిల్ నాటికి 27.2 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2025 ఏప్రిల్ నాటికి 20.5 బిలియన్ డాలర్లకు తగ్గింది. గడిచిన నాలుగు నెలల్లో అమెరికాకు చైనా ఎగుమతులు 2.5 శాతం క్షీణించాయి. అదే సమయంలో యూఎస్ నుంచి దిగుమతులు 4.7 శాతం తగ్గాయి. అమెరికాకు ఎగుమతులు తగ్గిన నేపథ్యంలో ఇతర దేశాలకు ఎగుమతులను పెంచుకోవడం ద్వారా ఏప్రిల్‌లో వృద్ధి నమోదైనట్టు తెలుస్తోంది. దక్షిణాసియా దేశాలకు చైనా ఎగుమతులు ఏప్రిల్‌లో 11.5 శాతం పెరిగాయి. లాటిన్ అమెరికాకు 11.5 శాతం, భారత్‌కు విలువ పరంగా 16 శాతం చొప్పున పెరిగాయి. ఆఫ్రికాకు సైతం 15 శాతం, వియత్నాంకు 18 శాతం, థాయిలాండ్‌కు 20 శాతం చొప్పున ఎగిశాయి. చైనా ఎగుమతుల వృద్ధి ఆర్థిక విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. ఎగుమతుల డేటా ఆశ్చర్యకరంగా ఉందని, తన అంచనా 2–3 శాతం మించి వృద్ధి నమోదైనట్టు సీనియర్ చైనా ఆర్థికవేత్త (ఎకనామిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్) షు టియాంచెన్ తెలిపారు. యూఎస్ టారిఫ్‌ల పూర్తి ప్రభావం డేటాలో ఇంకా ప్రతిఫలించనట్టు ఉందన్నారు. యూరేషియా గ్రూప్‌లో చైనా డైరెక్టర్‌గా ఉన్న డాన్ వాంగ్ సైతం బలమైన ఎగుమలు వృద్ధిని ఊహించలేదన్నారు. చైనా సోలార్ గ్లాస్‌పై యాంటీ డంపింగ్ సుంకాలు అయిదేళ్ల పాటు అమల్లో న్యూఢిల్లీ: చైనా, వియత్నాం నుంచి దిగుమతయ్యే నిర్దిష్ట రకం సోలార్ గ్లాస్‌పై టన్నుకు 570 డాలర్ల నుంచి 664 డాలర్ల వరకు యాంటీ–డంపింగ్ సుంకాలు విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇవి అయిదేళ్ల పాటు అమల్లో ఉంటాయని ఆర్థిక శాఖ ఒక నోటిఫికేషన్లో వెల్లడించింది. ఈ రెండు దేశాల నుంచి చౌకగా దిగుమతయ్యే ఉత్పత్తుల నుంచి దేశీ తయారీ సంస్థలకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సాధారణంగా సోలార్ ప్యానెల్స్‌లో ఉపయోగించే ఈ తరహా గాజును సోలార్ గ్లాస్, సోలార్ పీవీ గ్లాస్ తదితర పేర్లతో వ్యవహరిస్తారు. ఇటీవలి కాలంలో చైనా, వియత్నాం నుంచి ఈ గ్లాస్ దిగుమతులు గణనీయంగా పెరిగినట్లు వాణిజ్య శాఖలో భాగమైన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ (డీజీటీఆర్), దేశీ పరిశ్రమ తరఫున నిర్వహించిన విచారణలో వెల్లడైంది. డీజీటీఆర్ సిఫార్సుల మేరకు ప్రభుత్వం సుంకాల విధింపు నిర్ణయం తీసుకుంది.