చైనాలో తయారైన ‘సెక్యూరిటీ–చిప్’లకు... ఇండియా డేటాను నేరుగా చైనాకు పంపే ‘వెనుక తలుపులు’ఉండవచ్చనే అనుమానాలు ఉన్నాయి. ఇండియాలోని ప్రతి మూలలో జరిగే ప్రతిదీ తెలుసుకునే పనిలో ఉన్న ఆ దేశం నుండి వచ్చే హార్డ్‌వేర్‌పై ఆధారపడటం ప్రమాదకరం.
పెరటి ‘చిప్’లు పనికిరావా?
‘‘ప్రపంచం కోసం మన దేశం చిప్‌లను తయారుచేస్తుంది. కానీ మనం వాటిని ఉపయోగించం! నిజానికి ఇండియా ప్రపంచవ్యాప్తంగా రెండవ అతిపెద్ద చిప్ డిజైనర్ హబ్ కూడా! ఎన్విడియా, ఇంటెల్, మీడియా టెక్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలకు ఇండియాలో చిప్ డిజైన్ కేంద్రాలు ఉన్నాయి. అయితే ఈ అద్భుతమైన చిప్ డిజైన్‌లన్నీ ప్రపంచం కోసం! ప్రపంచ దేశాలకు ఎగుమతి కోసం! మన సొంత ఉపయోగం విషయానికి వస్తే, మనం దాదాపుగా 100 శాతం వరకు చిప్‌లను దిగుమతి చేసుకుంటున్నాం. ఇదొక వైరుద్ధ్యం. చిప్‌ల వృద్ధిలో సాంకేతికతల్ని రూపొందించే మెదళ్లు మన దగ్గర పుష్కలంగా ఉన్నాయి. కానీ మనం సొంత అవస రాల కోసం ఆ మెదళ్లను ఉపయోగించటం లేదు మనం!
ఒప్పందం వల్ల దెబ్బ తిన్నాం!
‘‘వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్లు్య.టి.ఒ.) ఒప్పందం మన ఎలక్ట్రానిక్స్ పరిశ్రమను చావు దెబ్బ తీసింది. 1999లో డబ్లు్య.టి.ఒ. ఐటీ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. 2005 నుండి ఇండియా ఆ ఒప్పందాన్ని అమలు చేయడం ప్రారంభించింది. ఒప్పందం మన మార్కెట్‌కు బార్లా తలుపులు తెరిచింది కానీ, మన సొంత ఎలక్ట్రానిక్స్ తయారీని దుర్బలం చేసింది. అదే సమయంలో చైనా, బ్రెజిల్ వంటి దేశాలు తమ పరిశ్ర మలను రక్షించుకుని, వాటిని వృద్ధి చేసుకున్నాయి.అంటే, పాశ్చాత్య దేశాలు మనల్ని ఈ ఒప్పందం ఉచ్చులోకి లాగి, అవి లబ్ధి పొందాయి.
చదవండి: రైలు ఏసీ కోచ్‌లో మ్యాగీ : వీడియో వైరల్, నెటిజన్లు ఫైర్
పేరుకే అన్నట్లుంది ప్రావీణ్యం!
‘‘ఎంత సేపటికీ మనం విడి పరికరాలను కలపటంతోనే సరిపెట్టుకుంటున్నాం. ‘మేక్ ఇన్ ఇండియా’ అంటే కేవలం నట్లు, బోల్ట్‌లు, స్క్రూలు బిగించటమేనా? డిజైన్ చేయటం కాదా! అదెందుకు అర్థం చేసుకోలేకపో తున్నాం? కేవలం భాగాలను కలిపే నైపుణ్యం మనల్ని ఎక్కడికీ తీసుకెళ్లదు. మనకు ఎలాంటి గుర్తింపునూ తీసుకురాదు. మనకు ఏ డిమాండునూ కల్పించదు. మేక్ ఇన్ ఇండియాకు ప్రస్తుతం మనం జోడిస్తున్న విలువ సున్నా. దిగుమతి చేసుకున్న భాగాలను కూర్చటం మాత్రమే చేస్తున్నాం. అలా కాకుండా మనమే ఇక్కడ డిజైన్‌కు, తయారీకి మారాలి. అప్పుడే మనం సెమీకండక్టర్లు, డ్రోన్లు, ఎలక్ట్రిక్ వాహనాల వంటి తుది ఉత్పత్తులను సృష్టించగలం.
ఇదీ చదవండి: భారత టెకీ కష్టాలు: రూ. 70 లక్షల ఉద్యోగం పోయింది, సేవింగ్స్ కూడా!
చైనా మీద అనుమానాలు
‘‘చైనీస్ చిప్‌లు, ఎలక్ట్రానిక్ పరికరాలు మన జాతీయ భద్రతకు ప్రమాదం. మనం ఉపయోగించే ప్రభుత్వ హాజరు యంత్రాలు (చైనా నుంచి దిగుమతి చేసు కున్నవి) చైనాకు మన డేటాను పంపుతున్నట్లు మేము కనిపెట్టాం. దేశ భద్రతకే ముప్పు తెచ్చిపెట్టే సమస్య ఇది. ప్రభుత్వ పరికరాలు మాత్రమే కాదు, మన స్మార్ట్‌ఫోన్‌లలో ఎక్కువ భాగం– ఏటా అమ్ముడవుతున్న 15 కోట్ల ఫోన్‌లలో దాదాపు 60 శాతం – చైనా˘కంపెనీలవే! భారతదేశంలోని ప్రతి మూలలో జరిగే ప్రతిదీ తెలుసుకునే పనిలో ఉన్న ఆ దేశం నుండివచ్చే హార్డ్ వేర్‌పై ఆధారపడటం దేశ సమగ్రతకే ప్రమాదం.
‘సేవలు’ తగ్గి, ఉత్పత్తి పెరగాలి!
‘‘భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా సేవా రంగాలపై ఆధారపడి ఉంది, ఇది దాదాపు 60 శాతం. మనం స్వయం సమృద్ధిగా ఉండాలనుకుంటే, ఉత్పత్తి ఆధారిత దేశంగా మనం రూపాంతరం చెందాలి. మొదటిసారిగా, ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలకు 50 సంవత్సరాల పాటు వడ్డీ లేని ‘పరిశోధన–అభివృది’్ధ నిధిగా రూ. 1 లక్ష కోట్లను కేటాయించింది. అది చాలా పెద్ద మొత్తం. మనం చేయవలసింది ఏమిటంటే, సాంకేతిక ఉత్పత్తుల కోసం ఆర్డర్‌లను పొందటం. వాటి తయారీకి భార తీయ కంపెనీలకు ప్రాధాన్యత ఇవ్వడం. బలమైన, స్వదేశీ సాంకేతిక పరిశ్రమను నిర్మించడానికి ఇది చాలా అవసరం’’.
- ఎడిటోరియల్ టీమ్
పాడ్‌కాస్ట్:
ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్ (ఎ.ఎన్.ఐ.)
అతిథి:
అజయ్ చౌధరీ, టెక్ విజనరీ, హెచ్.సి.ఎల్. కో–ఫౌండర్
హోస్ట్:
స్మితా ప్రకాశ్, ఎ.ఎన్.ఐ. ఎడిటర్
సంభాషణలో అజయ్ చౌధరీ వెల్లడించిన ముఖ్యాంశాలు:


