కొత్త సంవత్సరంలో బంగారం ధరలు తగ్గుతాయనుకుంటున్న పసిడి ప్రియులకు నిరాశే మిగులుతోంది. ఈ రోజు (డిసెంబర్ 5) కూడా గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 2400 పెరిగింది. నిజానికి ఉదయం 1580 రూపాయలు పెరిగిన రేటు.. సాయంత్రానికి రూ. 2400కు చేరింది. అంటే గంటల వ్యవధిలోనే పసిడి ధరలు మరో 820 రూపాయలు పెరిగింది. ఇక దేశంలోని వివిధ నగరాల్లోని లేటెస్ట్ గోల్డ్ రేట్ల విషయానికి వస్తే..
హైదరాబాద్, విజయవాడ నగరాల్లో ఉదయం 1,37,400 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. సాయంత్రానికి 1,38,220 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే 24 గంటల వ్యవధి పూర్తి కాకుండానే బంగారం రేటు భారీగా పెరిగిందని స్పష్టమవుతోంది. 22 క్యారెట్ల రేటు 2200 రూపాయలు పెరిగి కూడా రూ. 1,26,700 వద్దకు చేరింది.
చెన్నైలో తాజా బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,39,200 వద్ద, 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 127600 వద్ద ఉంది.
దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు పెరిగింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,38,370 వద్ద, 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1,26,850 వద్దకు చేరింది. పసిడి ధరలు మాత్రమే కాకూండా.. వెండి రేటు కూడా గణనీయంగా పెరిగింది.


