breaking news
Gold
-
ఐఫోన్ క్రేజ్ : భార్యామణి కోసం ఏకంగా గోల్డ్ అమ్మి మరీ!
ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ ఐఫోన్లకు క్రేజ్ అంతా ఇంతకాదు. ఎలాగైనా లేటెస్ట్ ఐఫోన్ దక్కించుకోవాలని ఉబలాట పడతారు ఐఫోన్ లవర్స్. భారతదేశంలో ఐఫోన్ 18 ప్రో (iPhone 18 Pro) సేల్ ప్రారంభం కావడంతో నోయిడాలోని యాపిల్ స్టోర్ వద్ద భారీ క్యూ లైన్లే ఇందుకు నిదర్శనం. తాజా ఐఫోన్‌ను దక్కించుకోవడం కోసం కొనుగోలుదారులుగంటల తరబడి వేచి చూశారు. ఈ సందర్బంగా భార్యకు కొత్త ఐఫోన్ కొనిచ్చేందుకు ఏకంగా బంగారాన్ని అమ్మేసిన వైనం నెట్టింట విచిత్రంగా నిలుస్తోంది. ఐఫోన్నుదక్కించుకునేందుకు ఒక్కొక్కరి కష్టాలు మామూలుగా లేవు. వ్యాపారవేత్తలు, ఉద్యోగులు, మహిళలు స్టోర్ ఓపెన్ చేయకముందు షాప్ ముందు క్యూ కట్టారు. కొందరు ఐఫోన్ దక్కిచంచుకోవడం కోంసం సెలవు కూడా తీసుకున్నారు.ప్రస్తుతం ఇవి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.బంగారం అమ్మి మరీ...ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి తన భార్య కోరిక మేరకు బర్గండీ రంగు ఐఫోన్ 18 ప్రో కొనుగోలు చేయడానికి బంగారం అమ్మినట్లు తెలిపారు. "ఆనాడు డబ్బులు లేవు, నేడు ఉన్నాయి, రేపు ఉంటాయో లేదో" అని చెబుతూ తన భార్య కోసం ఈ ఫోన్ కొన్నానని ఆయన వెల్లడించారు.తన భార్య 'బర్గుండి' (Burgundy) రంగులో ఉన్న iPhone 18 Proని తీసుకురమ్మని చెప్పిందని ఆయన తెలిపారు.పెళ్లి కానుకగా ఐఫోన్పంజాబ్కు చెందిన గుర్దితా సింగ్ అనే వ్యక్తి తన పెళ్లి కానుకగా కాబోయే భార్య కోసం ఐఫోన్ 18 ప్రో కొనుగోలు చేయడానికి ఉదయం 6 గంటల నుంచే క్యూలో నిలబడ్డారు. తనకోసం ఐఫోన్ 18 ప్రో మాక్స్‌తో కలిపి మొత్తం రెండు ఫోన్ల కోసం ఆయన రూ. 3.5 లక్షలకు పైగా వెచ్చించారు.ధరల పెంపు లెక్కే కాదుఐఫోన్ ధరలు గత ఏడాదితో పోలిస్తే పెరిగినప్పటికీ, ఐఫోన్ ప్రేమికులు ఈ ధరను చెల్లించడానికి వెనుకాడబోరని కొనుగోలుదారులు అభిప్రాయపడ్డారు. హర్యానాకు చెందిన విశాల్ అనే వ్యక్తి మాట్లాడుతూ ధరలు పెరిగినా తాము సర్దుబాటు చేసుకుంటామని తెలిపారు.ముందస్తు బుకింగ్స్స్టోర్ వద్ద తీవ్ర రద్దీ నెలకొనగా, ముందుగా ప్రీ-ఆర్డర్ చేసుకున్నవారికే మాత్రమే స్టోర్‌లోకి ప్రవేశం కల్పించారు. ముందస్తు బుకింగ్ చేసుకోని కొందరు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది.తొలి ఫోన్ అందుకున్న ఆనందం అంతేకాదు ఇండియాలో అందరికంటే ముందే తానే కొత్త ఐఫోన్నుసొంతం చేసుకోవాలనే ఆశతో ఏకంగా 10–12 గంటల పాటు క్యూలో నిలబడ్డావో వ్యక్తి. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ వద్ద రాత్రంతా వేచి చూసి, భారత్‌లో తొలి iPhone 18 ను సొంతం చేసుకుని సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైన సంగతి సోషల్‌మీడియాలో సందడిగా మారింది. -
డిజిటల్ గోల్డ్‌పై కొత్త రూల్స్?
మన దేశంలో బంగారానికి ఎప్పటినుంచో భారీ డిమాండ్ ఉంది. గోల్డ్ కేవలం ఆభరణాల కోసం మాత్రమే కాకుండా, పెట్టుబడిగా కూడా చూసేవారి సంఖ్య నేడు గణనీయంగా పెరిగింది. ఈ మధ్యకాలంలో ఫిజికల్ గోల్డ్‌తో పాటు డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో డిజిటల్ గోల్డ్ రంగంపై.. కేంద్ర ప్రభుత్వం మరింత నియంత్రణ తీసుకురావాలని ఆలోచిస్తోంది.ఫిజికల్ గోల్డ్ బ్యాకింగ్ప్రభుత్వం పరిశీలిస్తున్న ముఖ్యమైన ప్రతిపాదనల్లో ఒకటి ప్రతి డిజిటల్ గోల్డ్ యూనిట్‌కు తగినంత ఫిజికల్ గోల్డ్ బ్యాకింగ్ ఉండేలా నిబంధనలు తీసుకురావడం. అంటే.. ఆన్లైన్లో ఎంత బంగారం కస్టమర్లకు విక్రయించబడుతుందో, దానికి సరిపడే నిజమైన బంగారం కూడా భద్రపరిచి ఉండేలా చూడడం. దీనివల్ల పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడటంతో పాటు పారదర్శకత పెరిగే అవకాశం ఉంటుంది.ఆర్బీఐ, సెబీ పరిధిలోకి?డిజిటల్ గోల్డ్‌ను.. సెక్యూరిటీ కాంట్రాక్ట్ (రెగ్యులేషన్) యాక్ట్, 1956 కింద సెక్యూరిటీగా గుర్తించాలనే ప్రతిపాదనపై సంబంధిత వర్గాల్లో ఏకాభిప్రాయం ఏర్పడినట్లు సమాచారం. 2025లోనే సెబీ డిజిటల్ గోల్డ్‌పై పెట్టుబడిదారులను హెచ్చరించింది. ఇవి సెబీ నియంత్రించే సెక్యూరిటీ లేదా కమోడిటీ డెరివేటివ్స్ కాదని, అందువల్ల గోల్డ్ ఈటీఎఫ్ వంటి సెబీ రేగులేటెడ్ ఉత్పత్తులకు లభించే రేగులటరీ ప్రొటెక్షన్ వీటికి ప్రస్తుతం లేదని స్పష్టం చేసింది.అందుకే డిజిటల్ గోల్డ్‌కు డిమాండ్డిజిటల్ గోల్డ్‌కు ఆదరణ పెరగడానికి ప్రధాన కారణం.. చిన్న మొత్తంతోనే పెట్టుబడి పెట్టే అవకాశం ఉండటం. పరిశ్రమ అంచనాల ప్రకారం, దేశంలోని డిజిటల్ గోల్డ్ రంగంలో సుమారు 3 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులు ఉన్నాయని, సగటు పెట్టుబడి మొత్తం దాదాపు రూ.100గా ఉందని చెబుతున్నారు. అయితే.. నియంత్రణ లేకపోవడం వల్ల కొంతమంది అనధికార ఆపరేటర్లు రంగంలోకి రావచ్చనే ఆందోళనలు ఉన్నాయి. పెట్టుబడిదారుల రక్షణతో పాటు మనీలాండరింగ్ వంటి అంశాలపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.డిజిటల్ గోల్డ్ రంగం అభివృద్ధి చెందుతున్న సమయంలో.. దీనికి కొంత పర్యవేక్షణ అవసరమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఎంఎంటీసీ-పీఏఎంపీ మేనేజింగ్ డైరెక్టర్ సమిత్ గుహా మాట్లాడుతూ.. డిజిటల్ గోల్డ్, సిల్వర్‌కు వినియోగదారుల్లో ఆదరణ పెరుగుతున్నందున నియంత్రణ అవసరమని పేర్కొన్నారు. ఈ ఏడాది డిజిటల్ గోల్డ్ ప్లాట్‌ఫామ్‌లు కలిసి డిజిటల్ ప్రీషియస్ మెటల్స్ అష్యురెన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే స్వీయ నియంత్రణ సంస్థను ఏర్పాటు చేశాయి. ఇందులో ఎంఎంటీసీ-పీఏఎంపీ, సేఫ్‌గోల్డ్‌తో పాటుగా ఫోన్‌పే, భారత్‌పే, మొబిక్విక్, లెండెన్ క్లబ్, క్రెడ్ వంటి సంస్థలు కూడా ఉన్నాయి.ఇదీ చదవండి: బంగారం కొనేవారికి బిగ్ షాక్.. హాల్‌మార్కింగ్ ఛార్జీ పెంపు! -
తారుమారైన బంగారం ధరలు తులం ఎంతంటే?
-
బంగారం కొనేవారికి బిగ్ షాక్.. హాల్‌మార్కింగ్ ఛార్జీ పెంపు!
పండుగల సీజన్లో బంగారం కొనాలని చూస్తున్న వారికి ఇది కొంచెం నిరాశ కలిగించే వార్త. ఎందుకంటే.. బంగారు ఆభరణాలపై హాల్‌మార్కింగ్ చేయడానికి వసూలు చేసే ఫీజును బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) పెంచింది. ఇప్పటివరకు ఒక బంగారు వస్తువుకు రూ.45గా ఉన్న హాల్‌మార్కింగ్ ఫీజు.. ఇకపై రూ.75కి చేరనుంది. అంటే.. ఒక్కో వస్తువుపై రూ.30 అదనపు ఖర్చు పడుతుంది.హాల్‌మార్కింగ్ అంటేబంగారం కొనేటప్పుడు దాని స్వచ్ఛత ఎంత ఉంది?.. అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే.. మనం చెల్లించే డబ్బుకు తగ్గ నాణ్యత కలిగిన బంగారమే వస్తుందా? లేదా?.. అన్నది వినియోగదారుడికి తెలియాలి. ఇక్కడే హాల్‌మార్కింగ్ ఉపయోగపడుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే.. హాల్‌మార్కింగ్ అనేది బంగారం లేదా వెండి వంటి విలువైన లోహాల స్వచ్ఛతను పరీక్షించి, అది నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉందని ధృవీకరించే ప్రక్రియ. ఈ ప్రక్రియను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) పర్యవేక్షిస్తుంది.రూ.45 నుంచి రూ.75కు పెంపుకొత్త హాల్‌మార్కింగ్ సవరణ నిబంధనల ప్రకారం.. బంగారు ఉత్పత్తికి వసూలు చేసే ఫీజు రూ.45 నుంచి రూ.75కు పెరిగింది. అంటే దాదాపు 67 శాతం పెంపు అన్నమాట. అయితే వెండికి సంబంధించిన హాల్‌మార్కింగ్ ఫీజులో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం ఇది రూ.35గానే ఉంది.బంగారం విషయంలో ఒక్కో కన్సైన్మెంట్కు కనీసం రూ.200 ఫీజు వర్తిస్తుంది. వెండికి కనీస కన్సైన్మెంట్ ఫీజు రూ.150గా ఉంది. సాధారణంగా ఈ హాల్‌మార్కింగ్ ఫీజును నగల వ్యాపారులే చెల్లిస్తారు. కాబట్టి.. ఫీజు పెంపుపై జ్యువెలరీ పరిశ్రమ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరింది.హాల్‌మార్క్‌లో ఏముంటుంది?ప్రస్తుతం బంగారు ఆభరణాలపై ఉండే హాల్‌మార్క్‌లో కొన్ని ముఖ్యమైన వివరాలు ఉంటాయి. వాటిలో బీఐఎస్ లోగో, బంగారం క్యారెట్/ఫైనెస్ వివరాలు, ఆభరణానికి సంబంధించిన 6 అంకెల ఆల్ఫాన్యూమరిక్ HUID ఉంటాయి. ఇవి ఉండటం వల్ల వినియోగదారుడు తాను కొనుగోలు చేస్తున్న బంగారం ఏ ప్రమాణానికి చెందినదో తెలుసుకోవచ్చు.హాల్‌మార్కింగ్ ఇలా..నగల వ్యాపారి తయారు చేసిన ఆభరణాలను నేరుగా మార్కెట్లోకి పంపించే ముందు, బీఐఎస్ గుర్తింపు పొందిన అసెయింగ్, హాల్‌మార్కింగ్ సెంటర్‌కు పంపిస్తారు. అక్కడ ఆభరణాన్ని పరీక్షించి అందులోని బంగారం స్వచ్ఛతను నిర్ధారిస్తారు. పరీక్షలో బంగారం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉందని తేలితే, ఆ ఆభరణంపై హాల్‌మార్క్ వేస్తారు. అంటే హాల్‌మార్క్ అనేది కేవలం ఒక గుర్తు కాదు.. బంగారం స్వచ్ఛతకు సంబంధించిన అధికారిక ధృవీకరణ.బంగారం కొనేవారిపై ప్రభావం ఎంత?ఫీజు పెంపు వల్ల, నగల వ్యాపారుల ఖర్చు పెరుగుతుంది. అయితే.. వ్యాపారులు ఆ అదనపు ఖర్చును పూర్తిగా లేదా కొంతవరకు ఆభరణాల ధరలోకి బదిలీ చేస్తే, చివరికి దాని ప్రభావం వినియోగదారుడిపై పడవచ్చు. అయితే రూ.30 ఫీజు పెరిగిందని బంగారం ధర కూడా అదే మొత్తంలో పెరుగుతుందని చెప్పలేం. ఆభరణం మొత్తం ధరలో బంగారం మార్కెట్ ధర, తయారీ ఛార్జీలు, పన్నులు, ఇతర ఖర్చులు వంటి అనేక అంశాలు ఉంటాయి.ఇదీ చదవండి: పాత రూ.10 నోటు చూశారా.. ఈ విషయం తెలుసా? -
'80's ట్రెండ్'అని ఫోటో పోస్ట్ చేసి.. కటకటాల్లోకి..
వెంకి పెళ్లి సుబ్బిసావుకొచ్చింది అనే సామెత మనం తరచుగా వాడుతుంటాం... సరిగ్గా అటువంటి సన్నివేశమే ఇక్కడ సరిగ్గా సరిపోయింది. ఇటీవల 80'80's ట్రెండ్ పేరుతో సోషల్ మీడియాలో పిక్స్ పెట్టడం పెద్దఎత్తున వైరల్‌గా మారాయి. ఆ ట్రెండ్‌ని ఫాలో అవుతూ ఒక మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగా.. అదే తనను కటకటాల్లో పెట్టేలా చేసింది. దీంతో తలపట్టుకోవడం ఆ మహిళ వంతైంది.వివరాల్లోకి వెళితే... మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో 45 ఏళ్ల క్రితం ఓ స్వర్ణకారుడి దుకాణంలో ఒక మహిళ హారం దొంగలించి పరారైంది, అనంతరం తన పేరు మార్చుకుని వేరే ప్రాంతంలో జీవనం సాగిస్తోంది. అయితే ఇదిలా ఉండగా ఇటీవల వైరల్‌గా మారిన 80's ట్రెండ్‌లో పాల్గొని తన ఫోటోను కూడా 80's ట్రెండ్‌కు అనుగుణంగా మార్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అది చూసిన స్వర్ణకారుడు తన దుకాణంలో దొంగతనం చేసింది ఈమె అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.దీంతో ఈ కేసును రీఓపెన్ చేసిన పోలీసులు తనను పట్టుకొని విచారించగా తానే దొంగతనం చేసినట్టు ఒప్పుకుంది. దీంతో తనను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో వెంకి పెళ్లి సుబ్బి సావుకు రావడం అంటే ఇదేనేమో అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. -
'చరిత్రలో అతిపెద్ద క్రాష్ మొదలైంది': కియోసాకి హెచ్చరిక!
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి తాజాగా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో చరిత్రలోనే అతిపెద్ద క్రాష్ ప్రారంభమైందని పేర్కొన్నారు. ఇంతకీ కియోసాకి ఈ మాటలు ఎందుకు అన్నారు? నిజంగా.. అతిపెద్ద క్రాష్ వస్తుందా?, అనే విషయాలు ఈ కథనంలో చూసేద్దాం.తాను రాసిన 'రిచ్ డాడ్స్ ప్రొఫెసీ' అనే పుస్తకంలోనే భవిష్యత్తులో మార్కెట్ క్రాష్ రావచ్చని హెచ్చరించారు. ఆర్థిక సంక్షోభం ఇప్పటికే యూరప్, జపాన్‌లో ప్రారంభమై.. క్రమంగా ప్రపంచంలోని ఇతర దేశాలకు వ్యాపిస్తోందని కియోసాకి చెబుతున్నారు.సంక్షోభానికి కారణాలుకియోసాకి ప్రకారం.. ఆర్థిక సంక్షోభం రావడానికి అనేక ఆర్థిక, రాజకీయ సమస్యలు కారణమవుతున్నాయని సమాచారం. ఇందులో ఏఐపై అతిగా ఆధారపడటం, యుద్ధాలు.. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచవ్యాప్తంగా పెరిగిన అప్పులు, బేబీ బూమర్స్ పదవీ విరమణ ఉన్నాయి.రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్నవారికి హెచ్చరికఅమెరికాలో 401(k), ఐఆర్ఏ.. ఆస్ట్రేలియాలో సూపర్‌యాన్యుయేషన్, కెనడాలో ఆర్ఆర్ఎస్పీ వంటి రిటైర్మెంట్ ఖాతాల్లో చాలామంది తమ డబ్బును స్టాక్స్, బాండ్లలో పెట్టుబడి పెడతారు. ఒకవేళ స్టాక్, బాండ్ మార్కెట్లు రెండూ తీవ్ర నష్టాలను చవిచూస్తే.. రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్న వ్యక్తుల సంపదపై తీవ్ర ప్రభావం పడవచ్చని కియోసాకి హెచ్చరించారు.ప్రత్యేకంగా 40 ఏళ్లు దాటిన వారికి ఆయన జాగ్రత్త చెబుతున్నారు. ఎందుకంటే మార్కెట్ భారీగా పడిపోయినప్పుడు యువకులకు తిరిగి కోలుకోవడానికి సమయం ఉంటుంది. కానీ రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్న వ్యక్తులకు సమయం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ వయసులో ఇబ్బదులు ఎదుర్కోకుండా ఉండాలని చెబుతున్నారు.గతంలో 25 ఏళ్లుఒక పెద్ద ఆర్థిక సంక్షోభం ఏర్పడిన తరువాత.. దాని ప్రభావము కొన్ని సంవత్సరాల అలాగే ఉంటుంది. గత ఆర్థిక మాంద్యం 1929 నుంచి 1954 వరకు 25 సంవత్సరాల పాటు కొనసాగిందని కియోసాకి చెప్పారు.కియోసాకి సాధారణంగా తన సంపదను కేవలం నగదు, స్టాక్స్, బాండ్లలో ఉంచడం కంటే ఆదాయం వచ్చే ఆస్తులు కలిగి ఉండాలని చెబుతాడు. తాను వ్యక్తిగత వ్యాపారాలు, రియల్ ఎస్టేట్, చమురు ఉత్పత్తి చేసే బావులు, బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి వాటిలో పెట్టుబడులు పెడతానికి వెల్లడించారు.సురక్షితమైన ఆస్తులు ఇవే!భవిష్యత్తులో ప్రభుత్వం, కేంద్ర బ్యాంకులు సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి పెద్ద మొత్తంలో కొత్త డబ్బును సృష్టిస్తే, సాధారణ కరెన్సీ విలువ తగ్గవచ్చు. అలంటి సమయంలో బంగారం, వెండి, బిట్‌కాయిన్‌ను వంటివి సురక్షితమైన ఆస్తులుగా ఉంటాయని పేర్కొన్నారు.పెట్టుబడుల విషయంలో జాగ్రత్తఇక్కడ పెట్టుబడిదారులు తప్పకుండా గమనించాల్సిన విషయం ఏమిటంటే.. కియోసాకి చెప్పే ప్రతి విషయం ఖచ్చితంగా జరుగుతుందని భావించకూడదు. ఎందుకంటే భవిష్యత్తులో క్రాష్ వస్తుందని చెప్పలేము. కాబట్టి ఆర్ధిక సంక్షోభం వస్తుందని భయపడి వెంటనే అన్ని పెట్టుబడులను అమ్మేయడం మంచిది కాదు. ఆర్థిక పరిస్థితిని పరిశీలించుకోవాలి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి.BIGGEST CRASH IN HISTORY has started.In 2002 I released RICH DADS PROPHECY. This book was written to prepare people to profit and not be victims of the biggest stock and bond market crash in history…. a crash that was still coming. In 2026, that crash started, in Europe…— Robert Kiyosaki (@theRealKiyosaki) September 15, 2026 -
బేగంబజార్‌లో అద్భుతం.. ఏకంగా 48 కిలోల పుత్తడితో!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం దేశవ్యాప్తంగా జైజై గణేశా అనే నినాదాలు మార్మోగుతున్నాయి. భక్తులంతా బొజ్జ గణపయ్యను భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నారు.విభిన్న రుపాలలో వినాయకున్ని ప్రతిష్టించి నవరాత్రులు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ బేగంబజార్‌లో ఏకంగా 48 కిలోల ‘బంగారు గణేశుడిని ప్రతిష్టించారు. 24 క్యారెట్ల బంగారు పూతతో అత్యంత శోభాయమానంగా అలంకరించారు. ఈ బంగారు గణపతిని చూడడానికి పెద్దఎత్తున భక్తులు తరలివస్తున్నారు.వినాయక నవరాత్రుల్లో భాగంగా బేగంబజార్ ఫీల్ఖానాలో బంగారు గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 3.83 లక్షలకు పైగా అమెరికన్ డైమండ్స్‌తో నైపుణ్యం కలిగిన కళాకారుల హస్తకళా నైపుణ్యంతో విగ్రహాన్ని రూపొందించారు. బంగారం, వజ్రాల ధగధగలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న గణనాథున్ని దర్శించుకొని భక్తులంతా తన్మయం చెందుతున్నారు.ముంబయిలోని ప్రసిద్ధ లాల్బాగ్చా రాజా, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి రూపాలను స్ఫూర్తితో ఈ విగ్రహాన్ని రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ రెండు దివ్య రూపాల మేళవింపుతో కొలువుదీరిన ఈ స్వర్ణ గణపతి భక్తులకు అరుదైన రీతిలో దర్శనమిస్తున్నాడు. దీంతో ఈ విగ్రహం నగరంలోనే అత్యంత ప్రత్యేకమైనదిగా ప్రాచుర్యం పొందుతోంది.ఫీల్‌ఖానాకు చెందిన అనిల్ అగర్వాల్, ఆధార్ అగర్వాల్, నిఖితేష్ అగర్వాల్ అనే సోదరులు ఈ విగ్రహాన్ని తయారు చేయించారు. అక్కడ వారి దుకాణం వద్ద ఏర్పాటుచేసిన మండపంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. మూడు అడుగుల ఎత్తు, 48 కిలోల బరువు ఉన్న ఈ విగ్రహాన్ని మొత్తం 8 మంది కళాకారులు తయారు చేశారు. 11 రోజుల పాటు గణేషుడు పూజలు అందుకోనున్నారు. బేగంబజార్‌లో 48 కిలోల ‘బంగారు గణేశుడు’ వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఫీల్ఖానాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన దివ్య మూర్తి3.83 లక్షలకు పైగా అమెరికన్ డైమండ్స్, 24K బంగారు పూతతో అత్యంత శోభాయమానంగా అలంకరణనైపుణ్యం కలిగిన కళాకారుల హస్తకళా నైపుణ్యంతో రూపుదిద్దుకున్న అరుదైన విగ్రహం… pic.twitter.com/ZwYU9zvGnE— RTV (@RTVnewsnetwork) September 14, 2026 -
నిన్న బంగారంతో చైనా.. ఇవాళ సౌదీ అరేబియాకు జాక్‌పాట్!
రియాద్ : నిన్న బంగారం నిక్షేపాలతో చైనాకు జాక్‌పాట్ తగిలింది. ఇప్పుడు సౌదీ అరేబియా వంతు వచ్చింది. ఆ దేశ తలరాతను మార్చే భారీ యురేనియం నిధి వెలుగు చూసింది.పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో చైనాకు చెందిన పరిశోధక నౌక ‘జియాంగ్ యాంగ్ హాంగ్ 10’ చేపట్టిన సముద్ర గర్భ అన్వేషణలో సంచలన నిజాలు వెలుగుచూశాయి. సముద్రం అడుగున ఉన్న హై-టెంపరేచర్ హైడ్రోథర్మల్ ఫీల్డ్ ప్రాంతంలో శాస్త్రవేత్తలు సేకరించిన నమూనాలు విస్తుపోయేలా చేశాయి. ఇక్కడ లభించిన ఖనిజ నమూనాలలో టన్ను ముడి ఖనిజానికి ఏకంగా 15.4 గ్రాముల బంగారం, అలాగే 1,271 గ్రాముల వెండి ఉన్నట్లు తేలింది. సాధారణంగా భూమిపై దొరికే గనుల కంటే సముద్రం అడుగున ఈ విలువైన లోహాల గాఢత చాలా ఎక్కువగా ఉండటం గమనార్హం. దశాబ్దాలుగా నల్ల బంగారం (ముడి చమురు) మాత్రమే తమ తలరాతను మారుస్తుందని సౌదీ అరేబియా నమ్ముతూ వచ్చింది. ప్రపంచ దేశాల ఇంధన అవసరాలను తీరుస్తూ ఆర్థికంగా అగ్రస్థానానికి దూసుకెళ్లింది. కానీ, రేపు చమురు నిల్వలు కరిగిపోతే పరిస్థితి ఏమిటి? భవిష్యత్తు తరాల ఆర్థిక భద్రత మాటేమిటి? అనే ఆలోచనే సౌదీ పాలకులను ప్రత్యామ్నాయ వనరుల వేటలో పడేలా చేసింది. ఆ అన్వేషణే ఇప్పుడు ఒక అద్భుతమైన నిధిని వెలికితీసేలా చేసింది.సౌదీ అరేబియాలోని పవిత్ర మదీనా ప్రాంతం ఇప్పుడు కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాదు.. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించే సరికొత్త శక్తి కేంద్రంగా మారుతోంది. ఆ దేశ ఇంధన మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ ఇటీవల వెల్లడించిన వివరాలు ప్రపంచాన్ని విస్మయానికి గురిచేశాయి. ఆ ప్రాంతంలో ఏకంగా 110 మిలియన్ టన్నుల (11 కోట్ల టన్నులు) భారీ యురేనియం నిల్వలు ఉన్నట్లు ఆయన ప్రకటించారు. ఇది కేవలం ఒక మైనింగ్ అన్వేషణ మాత్రమే కాదు.. సౌదీ భవిష్యత్తు కలలకు దక్కిన అసలైన బలం.జాక్‌పాట్ ఎందుకంటే?చమురు ఎగుమతులపైనే పూర్తిగా ఆధారపడిన ఆర్థిక వ్యవస్థను మార్చడానికి, భవిష్యత్తులో రాబోయే ఇంధన సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ యురేనియం నిల్వలు సౌదీకి పెద్ద ఆసరాగా నిలుస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. భూమి పొరల్లో దాగున్న ఈ ముడి ఖనిజం అంతర్జాతీయ మార్కెట్లో ఆ దేశ ఆర్థిక శక్తిని ఊహకందని స్థాయికి తీసుకెళ్లే అస్త్రం కానుంది. రేపు సౌదీ గడ్డపై పౌర అణు విద్యుత్ కేంద్రాలు ఏర్పాటవుతాయి. దేశీయ అవసరాలు తీరగా మిగిలిన శుద్ధి చేసిన యురేనియంను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ.. గ్లోబల్ న్యూక్లియర్ మార్కెట్లో ఆ దేశం తిరుగులేని శక్తిగా అవతరించే అవకాశాలున్నాయి.అయినా ఇది అంత సులభం కాదు..భూగర్భంలో కోట్లాది టన్నుల ఖనిజం దొరికినంత మాత్రాన అది వెంటనే ఇంధనంగా మారిపోదు. ఈ ముడి ఖనిజం నుంచి యురేనియంను వేరుచేసి, వాణిజ్యపరంగా వినియోగించే స్థాయికి తీసుకురావడానికి కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది. దీనికోసం అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం, భారీ పెట్టుబడులు అవసరం. అయినప్పటికీ, మున్ముందు ప్రపంచాన్ని శాసించబోయే అణు శక్తి రంగంలో అడుగుపెట్టడానికి సౌదీ వేసిన ఈ తొలి అడుగు.. ఆ దేశ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు! -
3లక్షల అమెరికన్ డైమండ్స్ తో గణపతి.. చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే
-
బంగారం 80% డిస్కౌంట్‌తో కొనొచ్చా? కియోసాకి ఆసక్తికర పోస్ట్
బంగారం కొనుగోలు విషయంలో సాధారణ రిటైల్ ఇన్వెస్టర్లు మార్కెట్లో ఉన్న ధరనే చెల్లిస్తుంటే.. కొన్ని కంపెనీలు మాత్రం అదే బంగారాన్ని భారీ డిస్కౌంట్‌తో కొనుగోలు చేస్తున్నాయని ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ గురూ, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు. ప్రస్తుతం ఔన్సు బంగారం ధర సుమారు 4,600 డాలర్లుగా ఉంటే.. కొన్ని సంస్థలు కేవలం 920 డాలర్లకే అదే బంగారాన్ని కొనుగోలు చేసే విధంగా ఒప్పందాలు చేసుకుంటున్నాయని ఆయన వెల్లడించారు.ఈ మేరకు రాబర్ట్ కియోసాకి తన ఫేస్బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. సాధారణ పెట్టుబడిదారులు స్పాట్ ధరకు బంగారం కొనుగోలు చేస్తున్నారని, అయితే మైనింగ్ రంగంలోని కొన్ని ప్రత్యేక కంపెనీలు ముందుగానే ఒప్పందాలు చేసుకుని భవిష్యత్‌లో లభించే బంగారాన్ని చాలా తక్కువ ధరకు పొందుతున్నాయని ఆయన వివరించారు.మైనింగ్ కంపెనీలతో ఒప్పందాలుకియోసాకి వివరించిన విధానం ప్రధానంగా గోల్డ్ స్ట్రీమింగ్ వ్యాపార నమూనాకు సంబంధించినది. ఒక గోల్డ్ మైన్ కొత్త ప్రాజెక్టును నిర్మించడానికి లేదా ఉన్న గనిని విస్తరించడానికి పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరమైనప్పుడు.. స్ట్రీమింగ్ కంపెనీలు ముందుగానే ఆ మైనింగ్ సంస్థకు నిధులు అందిస్తాయి.దానికి ప్రతిఫలంగా, ఆ గనిలో భవిష్యత్‌లో ఉత్పత్తి అయ్యే బంగారంలో కొంత భాగాన్ని ముందుగా నిర్ణయించిన ధరకు కొనుగోలు చేసే హక్కును స్ట్రీమింగ్ కంపెనీ పొందుతుంది. ఈ ఒప్పందాలు కొన్ని సందర్భాల్లో అనేక సంవత్సరాలు లేదా దశాబ్దాల పాటు కొనసాగుతాయని కియోసాకి తెలిపారు.అంటే.. బంగారం మార్కెట్ ధర ఎంత పెరిగినా, ఒప్పందంలో నిర్ణయించిన తక్కువ ధరకు బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశం ఆ కంపెనీకి ఉంటుంది. కియోసాకి ఉదాహరణ ప్రకారం, ఔన్సుకు 4,600 డాలర్ల మార్కెట్ ధర ఉన్నప్పుడు సుమారు 920 డాలర్లకు కొనుగోలు చేసే ఒప్పందం ఉంటే.. అది మార్కెట్ ధరతో పోలిస్తే దాదాపు 80 శాతం తక్కువ అవుతుంది.‘రిచ్ డాడ్’ విధానం ఇదేనా?ఈ విధానాన్ని కియోసాకి తనకు ఇష్టమైన ‘పూర్ డాడ్–రిచ్ డాడ్’ పోలికతో వివరించారు. సాధారణ పెట్టుబడిదారుడు రిటైల్ ధరకు బంగారం కొనుగోలు చేస్తుంటే.. ‘రిచ్ డాడ్’ తరహా పెట్టుబడిదారుడు నేరుగా బంగారం కొనడం కంటే, బంగారం ఉత్పత్తి చేసే సంస్థతో ఒప్పందం చేసుకుని ప్రయోజనం పొందే విధానాన్ని ఎంచుకుంటారని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఒకప్పుడు తోపు రిచ్.. ఇప్పుడు టాప్ 10 కూడా దక్కలేదు!ఇది చట్టంలోని లొసుగు కాదని, మైనింగ్ పరిశ్రమలో ఇలాంటి ఒప్పందాలు బహిరంగంగా వెల్లడించే చట్టబద్ధమైన వ్యాపార విధానాలని కియోసాకి అన్నారు. చాలా కాలంగా ఈ విధానం కొనసాగుతున్నప్పటికీ.. ఎక్కువ మంది ఇన్వెస్టర్లు మాత్రం వార్తల్లో కనిపించే బంగారం స్పాట్ ధరపైనే దృష్టి పెడుతున్నారని పేర్కొన్నారు. -
భారీగా పెరిగిన బంగారం ధరలు
-
ఊహకందని బంగారం ధరలు.. వారం రోజుల్లో ఇలా..
భారతదేశంలో బంగారం ధరలు ఊహకందని రీతిలో మారిపోతున్నాయి. ఉదయం భారీగా తగ్గిన రేటు, సాయంత్రానికి పెరిగిపోతోంది. దీంతో పసిడి ప్రియులలో ఒకింత ఆందోళన మొదలైపోయింది. ఈ కథనంలో వారం (సెప్టెంబర్ 6 నుంచి 12 వరకు) రోజుల్లో బంగారం ధరల్లో జరిగిన మార్పులు ఏమిటి?, ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.సెప్టెంబర్ 06న హైదరాబాద్, విజయవాడలలో రూ.1,54,800 వద్ద ఉన్న 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం రేటు, సెప్టెంబర్ 12న రూ.1,54,580 వద్దకు చేరింది. అంటే.. వారం రోజుల్లో గోల్డ్ రేటు పెరుగుతూ తగ్గుతూ రూ.16 వేలకు చేరువవుతోందని తెలుస్తోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,900 నుంచి రూ.1,41,700 వద్దకు చేరింది.చెన్నైలో గత ఆదివారం (సెప్టెంబర్ 06) రూ.1,54,800 వద్ద ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం, శనివారం (సెప్టెంబర్ 12) నాటికి 1,54,580 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల ధర రూ. 1,41,900 నుంచి రూ.141700 వద్దకు చేరింది. వారం మధ్యలో ధరల్లో చాలా మార్పు వచ్చినప్పటికీ.. వారాంతం నాటికి కొంత పెరిగినట్లు తెలుస్తోంది.ఇక దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో గణనీయమైన మార్పు వచ్చాయి. వారం ప్రారంభంలో రూ.1,54,950 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు, వారాంతానికి 1,54,730 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు రూ.1,42,050 నుంచి రూ.1,41,850 వద్దకు చేరింది.ఇదీ చదవండి: ఒకేరోజు 20 లక్షల ట్రైన్ టికెట్స్ బుకింగ్! -
గంటల వ్యవధిలో మారిపోయిన బంగారం ధరలు!
బంగారం ధరల్లో ఊహకందని మార్పులు జరుగుతున్నాయి. ఈ రోజు (సెప్టెంబర్ 11) ఉదయం రూ.2620 తగ్గిన గోల్డ్ రేటు, సాయంత్రానికి పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని పసిడి ధరలు మారిపోయాయి. కొత్త ధరలు ఎలా ఉన్నాయి?, ఏ నగరంలో అధికంగా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడలలో ఉదయం రూ.1,40,150 వద్ద ఉన్న 10 గ్రాముల పసిడి ధర.. సాయంత్రానికి రూ.141550 వద్దకు చేరింది. 24 క్యారెట్ల రేటు రూ.1,52,890 వద్ద నుంచి రూ.1,54,420 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే.. బంగారం ధరలు గంటల వ్యవధిలో తారుమారు అయినట్లు స్పష్టంగా తెలుస్తోంది.చెన్నైలో కూడా బంగారం ధరలు, సాయంత్రానికే మారిపోయాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.152890 నుంచి రూ.154420 వద్దకు, 22 క్యారెట్ల రేటు రూ.140150 నుంచి రూ.141550 వద్దకు చేరింది. బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా పసిడి ధరలు కొంత పెరిగినట్లు తెలుస్తోంది.ఢిల్లీలో రూ.140300 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర, సాయంత్రానికి రూ.1400 పెరిగి రూ.141700 వద్దకు చేరింది. 24 క్యారెట్ల రేటు రూ.1,53,040 నుంచి రూ.1530 పెరిగి రూ.1,54,570 వద్దకు చేరింది. అయితే వెండి ధరల్లో.. సాయంత్రానికి ఎలాంటి మార్పు జరగలేదు.ఇదీ చదవండి: టోల్ వసూళ్లకు కొత్త ప్లాన్.. గడ్కరీ కీలక ప్రకటన! -
బంగారంలో పెట్టుబడి.. రూ.1 లక్షకు రూ.3.64 లక్షలు!
బంగారం ధరలు భారీగా పెరుగుతున్న వేళ.. ఇందులో పెట్టుబడులు పెట్టినవారు భారీ లాభాలను పొందుతున్నారు. కేవలం ఫిజికల్ గోల్డ్ కొన్నవాళ్లు మాత్రమే కాకుండా.. గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టిన వారికి కూడా మంచి రాబడి వచ్చింది. ముఖ్యంగా 2020లో సావెరిన్ గోల్డ్ బాండ్లను కొనుగోలు చేసిన వారికి ఇప్పుడు పెట్టుబడిపై భారీ లాభం కనిపిస్తోంది.కేంద్ర ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసే సావెరిన్ గోల్డ్ బాండ్లు బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఒక ప్రత్యామ్నాయ మార్గం. ఇందులో.. మనం నేరుగా బంగారం కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. మనం ఎన్ని గ్రాముల బంగారానికి పెట్టుబడి పెడతామో, దానికి అనుగుణంగా బాండ్లు మనకు లభిస్తాయి. బంగారం ధర పెరిగితే ఈ బాండ్ల విలువ కూడా పెరుగుతుంది. దీనికి అదనంగా ప్రభుత్వం వడ్డీ కూడా చెల్లిస్తుంది.గ్రాముపై రూ.11,118 లాభం2020 మార్చి 11న జారీ చేసిన సావెరిన్ గోల్డ్ బాండ్ 2019-20 సిరీస్ Xలో.. ఒక గ్రాము బంగారం ధర రూ.4,210గా ఉంది. ఇప్పుడు 2026 సెప్టెంబర్ 11న ముందస్తుగా రిడీమ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఈ సమయంలో ఒక గ్రాము బంగారం విలువ రూ.15,328గా నిర్ణయించారు. అంటే 4,210 రూపాయలతో కొనుగోలు చేసిన ఈ బాండ్ విలువ.. ఇప్పుడు రూ.15,328కు చేరింది. అంటే ఒక్క గ్రాముపై రూ.11,118 లాభం (దాదాపు 264 శాతం వరకు రాబడి) అన్నమాట.ఉదాహరణకు 2020లో ఒక వ్యక్తి రూ.1 లక్షను ఈ బాండ్లలో పెట్టుబడి పెట్టారని అనుకుందాం. అప్పుడు అతనికి సుమారు 23.75 గ్రాముల విలువైన SGB యూనిట్లు లభించేవి. ఇప్పుడు ఒక్క గ్రాము రూ.15,328 చొప్పున లెక్కిస్తే వాటి విలువ సుమారు రూ.3.64 లక్షలకు చేరుతుంది. అంటే రూ.1 లక్ష పెట్టుబడి దాదాపు రూ.3.64 లక్షలుగా మారినట్లు అర్థం.వడ్డీ కూడా..ఇక్కడ మరో ముఖ్యమైన ప్రయోజనం కూడా ఉంది. సావెరిన్ గోల్డ్ బాండ్లపై ప్రభుత్వం సంవత్సరానికి 2.5 శాతం వడ్డీని కూడా చెల్లిస్తుంది. ఈ వడ్డీని సాధారణంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి చెల్లిస్తారు. అంటే.. పెట్టుబడిదారుడికి బంగారం ధర పెరగడం ద్వారా ఒకవైపు లాభం వస్తే, మరోవైపు వడ్డీ రూపంలో కూడా ఆదాయం లభిస్తుంది.సాధారణంగా సావెరిన్ గోల్డ్ బాండ్ల మెచ్యూరిటీ కాలం ఎనిమిది సంవత్సరాలు. అయితే.. ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత కొన్ని నిర్ణీత తేదీల్లో ముందుగానే రిడీమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే 2020లో జారీ చేసిన ఈ బాండ్లకు ఇప్పుడు ప్రీమెచ్యూర్ రిడంప్షన్ అవకాశం వచ్చింది. -
పసిడి ధరలు తారుమారు.. ఒక్క గ్రాముకు ఎంత తేడా!
దేశంలో బంగారం ధరలు మళ్లీ కస్సుమన్నాయి. క్రితం రోజున భారీగా తగ్గిన పసిడి ధరలు నేడు అమాంతం ఎగిశాయి. దీంతో తగ్గుదల ఆశించిన పసిడి కొనుగోలుదారులకు ఈరోజు నిరాశే దక్కింది. ఇక వెండి ధరల్లో మాత్రం మిశ్రమ కదలికలు నమోదయ్యాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
బంగారానికి పోటీగా రాగి? మళ్లీ ఆనాటి పరిస్థితులు..
‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి బంగారం, వెండి, రాగి ధరల కదలికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన తన ఫేస్బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. సాధారణంగా బంగారం, రాగి ధరలు భిన్నమైన ఆర్థిక సంకేతాలను ఇస్తాయని కియోసాకి పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నప్పుడు పారిశ్రామిక డిమాండ్ కారణంగా రాగి ధర పెరుగుతుందని, ఆర్థిక వ్యవస్థపై నమ్మకం తగ్గినప్పుడు పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గుచూపుతారని వివరించారు.అయితే ప్రస్తుతం బంగారం, వెండి, రాగి ధరలు ఒకేసారి పెరుగుతుండటం విస్మరించలేని పరిణామమని కియోసాకి అన్నారు. గతంలో 1978, 1998, 2006 సంవత్సరాల్లో ఇలాంటి పరిస్థితులు కనిపించాయని ఆయన తన పోస్ట్‌లో గుర్తుచేశారు. ఆ తర్వాత 1980 మార్కెట్ కల్లోలం, డాట్‌కామ్ బబుల్ పతనం, 2008 ఆర్థిక సంక్షోభం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు.ద్రవ్యోల్బణం మాత్రమే కాదు.. నమ్మకం కోల్పోతున్నారా?బంగారం, వెండి, రాగి ధరలు ఒకేసారి పెరగడం కేవలం ద్రవ్యోల్బణానికి సంబంధించిన సంకేతం కాకపోవచ్చని కియోసాకి అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థలోని వివిధ ఆస్తులు, కరెన్సీలపై ప్రజలు గతంలో ఉన్నంత నమ్మకంతో లేకపోవడానికి ఇది సంకేతం కావచ్చని అన్నారు. స్టాక్స్, బాండ్లు, కరెన్సీలు అన్నీ ఒక రకంగా భవిష్యత్తుపై ఆధారపడిన ‘వాగ్దానాలు’ వంటివేనని, నమ్మకం తగ్గినప్పుడు పెట్టుబడులు హార్డ్ అసెట్స్ వైపు మళ్లే అవకాశం ఉందని వివరించారు.ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. 2022, 2023 సంవత్సరాల్లో కేంద్ర బ్యాంకులు ఒక్కో ఏడాది 1,000 టన్నులకు పైగా బంగారాన్ని కొనుగోలు చేశాయని కియోసాకి పేర్కొన్నారు. ఇది చరిత్రలోనే అతిపెద్ద కొనుగోలు దశల్లో ఒకటిగా ఆయన అభివర్ణించారు.భయపడొద్దు.. సిద్ధంగా ఉండాలిప్రస్తుత పరిణామాలు మార్కెట్లు ‘పానిక్’లో ఉన్నాయని చెప్పడం లేదని, అయితే పెట్టుబడిదారులకు ‘సిద్ధంగా ఉండండి’ అనే సంకేతాన్ని ఇస్తుండవచ్చని కియోసాకి అన్నారు. బంగారానికి ప్రభుత్వ హామీ అవసరం లేదని, వెండికి కూడా ప్రభుత్వ వాగ్దానంపై ఆధారపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. రాగికి పారిశ్రామికంగా నిరంతర డిమాండ్ ఉందని తెలిపారు.ఈ పరిణామాలను అర్థం చేసుకునే వారు భయపడరని, భవిష్యత్తు కోసం ముందుగానే సిద్ధమవుతారని కియోసాకి చెప్పారు. ఆర్థిక స్థిరత్వాన్ని సహజంగా భావించకుండా, అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొనేలా తమ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవడం ముఖ్యమని సూచించారు. -
అదరగొట్టిన బంగారం! 25 ఏళ్లలో ఇది మూడోది..
ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు ఆగస్టులో భారీగా పుంజుకున్నాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) ప్రకారం.. 2026 ఆగస్టులో బంగారం ధర 13 శాతం పెరిగి ఔన్స్‌కు 4,563 డాలర్ల వద్ద నెలను ముగించింది. గత 25 ఏళ్లలో నమోదైన మూడో అత్యధిక నెలవారీ రాబడి ఇదేనని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించింది.ఈ పెరుగుదలకు ప్రధాన కారణం విస్తృతంగా జరిగిన గోల్డ్ ఈటీఎఫ్ (Gold ETF) కొనుగోళ్లేనని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజాగా విడుదల చేసిన 'గోల్డ్ మార్కెట్ కామెంటరీ'లో పేర్కొంది. బలహీనపడిన అమెరికా డాలర్ కూడా బంగారం ధరలకు మద్దతుగా నిలిచిందని తెలిపింది. ఈటీఎఫ్‌లలోకి భారీగా పెట్టుబడులు రావడంతో పాటు, బంగారం ఆప్షన్లలో కొనుగోళ్లు పెరగడం కూడా ధరల పెరుగుదలకు దోహదం చేసినట్లు గోల్డ్ కౌన్సిల్ వివరించింది.ఆగస్టులో యూరప్ గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి 7.9 బిలియన్ డాలర్లు, ఉత్తర అమెరికా ఈటీఎఫ్‌ల్లోకి 7.8 బిలియన్ డాలర్లు ప్రవహించాయి. ఆసియా ఈటీఎఫ్‌లు మరో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాయి. ఇదే సమయంలో COMEXలో నెట్ మేనేజ్డ్ మనీ పొజిషనింగ్ 13 బిలియన్ డాలర్లు పెరిగినట్లు గోల్డ్ కౌన్సిల్ తెలిపింది.సెప్టెంబర్‌లో ఏం జరగొచ్చు?ప్రస్తుతం మార్కెట్ దృష్టి అమెరికా ఫెడరల్ రిజర్వ్ సెప్టెంబర్‌లో తీసుకునే వడ్డీ రేటు నిర్ణయంపై ఉంది. అమెరికా ఆర్థిక గణాంకాలు, ద్రవ్యోల్బణంపై ఆందోళనలు, భౌగోళిక రాజకీయ పరిణామాలు బంగారం ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, ఫెడ్ చైర్ వార్ష్ హాకిష్ వ్యాఖ్యలు, జాక్సన్ హోల్ సింపోజియం పరిణామాలు కూడా మార్కెట్ అంచనాలను ప్రభావితం చేస్తున్నాయి.ఇదీ చదవండి: ఆధార్‌కు భారీ అప్‌గ్రేడ్.. ఇక మూడింతలు! -
అమ్మాయి నిజంగా బంగారం! ఆ డ్రెస్ అక్షరాల రూ. 4 కోట్లుపైనే..
పసిడికే మాటొస్తే ‘ఏడు రంగులిచ్చే ఇంద్రధనుస్సు నీ మేని రంగు చూస్తే ఏమంటుందో’ అని కచ్చితంగా అని తీరేలా ఉంది కదూ ఈ అమ్మడి తీరు..నిజమే బంగారం తాపడం చేసుకుంటేనే గొప్ప అనుకునే ఈ రోజుల్లో నిలువెత్తు బంగారంతో చేసిన వస్త్రం కట్టిన వనితని ఆ మాత్రమైన పొగడక పోతే కనకానికి కనికరం లేనట్టే కదా..? ఈమె ఎవరో కాదు అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి నందా. ఆమె ధరించిన డ్రెస్ ధర అక్షరాల నాలుగు కోట్లు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్స్ అబుజాన్, సందీప్ ఖోస్లా ఫ్యాషన్ ప్రయాణానికి 40 వసంతాలునిండిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఈ తార మెరిసిందిలా... నవ్య స్కూలింగ్ అంతా లండన్‌లోనే! తర్వాత అమెరికాలో ఫోర్దామ్ యూనివర్సిటీలో డిజిటల్ టెక్నాలజీ అండ్ యూఎక్స్డిజైన్లో బీఏ, ఐఐఎం అహ్మదాబాద్ నుంచి ఎంబీఏ కూడా కంప్లీట్ చేసింది. ఇండియాలోనే అతిపెద్ద ఫిలిం ఫ్రెటర్నటీ నుంచి వచ్చినా నవ్యకి సినిమాలంటే ఆసక్తి లేదు. తన తండ్రి నిఖిల్ నందా వ్యాపారం, ట్రాక్టర్లు, స్టాక్ మార్కెట్లపైనే తన ఆసక్తి అంతా. మహిళా సాధికారత కోసం ‘ప్రాజెక్ట్ నవేలి’ని మొదలెట్టింది. మహిళల ఆరోగ్య రక్షణ కోసం ఏర్పాటైన ‘హెల్త్ టెక్’ కంపెనీకి కో ఫౌండర్‌గా వ్యవహరిస్తోంది. అలాగే తన తల్లి శ్వేత, అమ్మమ్మ జయా బచ్చన్‌తో కలిసి ‘వాట్ ద హెల్ నవ్య’ అనే పాడ్ కాస్ట్‌ను కూడా నిర్వహిస్తోంది. అలా స్టార్స్ కుటుంబం లో పుట్టినా తనకంటూ గుర్తింపు కోసం ప్రయత్నిస్తూ ఒక్కొక్క విజయాన్ని అందిపుచ్చుకుంటోంది. View this post on Instagram A post shared by Abu Jani Sandeep Khosla (@abujanisandeepkhosla) (చదవండి: ఒకప్పుడు సైన్యం కోసం రాకెట్లు..ఇవాళ చిన్నారుల ఫుడ్ బ్రాండ్ వ్యాపారం!) -
భారీగా తగ్గిన బంగారం ధరలు తులం ఎంతంటే?
-
గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)
-
బంగారం, వెండిలో పెట్టుబడులకు షగున్ సిప్
డిజిటల్ విధానంలో పసిడి, వెండిని కొనుగోలు చేసేందుకు ఉపయోగపడేలా ’షగున్ సిప్’ను ప్రవేశపెట్టినట్లు యాక్సిస్ ఎంఎఫ్ వెల్లడించింది.యాక్సిస్ గోల్డ్ ఫండ్, యాక్సిస్ సిల్వర్ ఫండ్ ఆఫ్ ఫండ్లలో గ్రాముల లెక్కన పెట్టుబడులు పెట్టేందుకు ఈ తరహా డిజిటల్ సిప్ ఫీచరును ప్రవేశ పెట్టడం పరిశ్రమలోనే ఇది తొలిసారని పేర్కొంది. 25 కేజీల దాకా బంగారం, 50 కేజీల వరకు వెండి కొనుగోలు కు అవసరమయ్యే మొత్తాన్ని పోగు చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. డిజిటల్‌గా ఇన్వెస్ట్ చేయడంతో ఫిజి కల్ రూపంలో అదనపు వ్యయాలు, భద్రపర్చు కోవాల్సిన భారం ఉండదని సంస్థ తెలిపింది. -
గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?
-
ధరల మోత.. నేరాల వాత
సాక్షి, అమరావతి: బంగారం ధర గుండె దడ పుట్టిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో తులం బంగారం(10 గ్రాములు) ధర రూ.లక్షన్నర పైమాటే. ఈ క్రమంలో చైన్ స్నాచింగ్స్, దొంగతనాలూ అంతకంతకూ పెరుగుతున్నాయి. తులం బంగారం చోరీ చేస్తే చాలు.. క్షణాల్లో రూ.లక్షన్నరకు పైగా సొమ్ము చేతికి వస్తుందనే దురాశతో దుండగులు రెచ్చిపోతున్నారు. గతేడాది ఏపీలో 13,176 చోరీలు జరగ్గా.. ఈ ఏడాది వాటి సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా. ఒంటరిగా వెళ్లే మహిళలపై ద్విచక్ర వాహనాలపై వచ్చి దాడిచేసి చైన్ స్నాచింగ్‌లకు పాల్పడటం, షాపుల్లో కస్టమర్లా చొరబడి మంగళసూత్రం లాక్కొని పారిపోవడం, బస్సు, రైలు ప్రయాణాల్లో బ్యాగుల నుంచి ఆభరణాలు కొట్టేయడం, బురఖా ధరించి జ్యువెలరీ షాపుల్లో దృష్టి మరల్చి బంగారు వస్తువులు అపహరించడం, పూజ, మంత్రాల పేరిట ఇంట్లోకి చొరబడి నిజమైన నగల స్థానంలో నకిలీవి పెట్టడం, బ్యాంకు గోల్డ్ లోన్ ఖాతాల్లో అంతర్గత మోసాలకు పాల్పడుతున్న ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాలతోపాటు చిన్నస్థాయి పట్టణాలు, గ్రామాల్లోనూ చైన్ స్నాచింగ్స్, ఇళ్లలో దొంగతనాలు విజృంభిస్తున్నాయి. దీంతో ‘బంగారం’ విషయంలో బీకేర్‌ఫుల్‌గా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. మహిళలే టార్గెట్.. బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరడంతో కేటుగాళ్ల దృష్టి నేరుగా మహిళల ఆభరణాలపై పడింది. ఉదయం వాకింగ్‌కు వెళ్లే మహిళలు, కాలనీల్లో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లేవారు, ఇంటి ముందు ముగ్గులు వేస్తున్నవారు, కిరాణా షాపులకు వెళ్లేవారే టార్గెట్‌గా చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. నంబర్ ప్లేట్లు లేకుండా దోచుకున్న బైక్‌లపై వచ్చి చోరీలకు పాల్పడుతున్నారు. ఇటీవల రైళ్లలో రిజర్వేషన్ బోగీల్లోనూ రెక్కీ నిర్వహిస్తున్న దొంగలు.. అప్పటి వరకు వేచి చూసి కదులుతున్న రైలు కిటికీలు, డోర్ దగ్గర నుంచి మహిళల మెడలో ఆభరణాలు తెంచుకుపోతున్నారు. రైళ్లలో ఈ తరహా చోరీలు ఇటీవల విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు వంటి ప్రధాన స్టేషన్లలో పెరిగాయి. బంగారం చోరీల్లో అంతర్రాష్ట్ర ముఠాలు రెచ్చిపోతున్నాయి. ఇటీవల ప్రకాశం జిల్లాలో పట్టుబడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా నుంచి రూ.1.70కోట్ల విలువైన బంగారాన్ని పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. ఆ ముఠా 13 చోరీలకు పాల్పడినట్టు లెక్కతేలింది. బిహార్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి వచ్చి తెలుగు రాష్ట్రాల్లో చోరీలకు తెగబడుతున్నారు. ప్రాణాలు తీసేస్తున్నారు.. ఇటీవల హైదరాబాద్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజ(62)ను హత్య చేసిన నేపాల్ ముఠా 225 గ్రాముల బంగారం, నగదు దోచుకుపోయిన ఘటన సంచలనం రేపింది. శ్రీకాకుళం జిల్లాలో 70 ఏళ్ల వృద్ధురాలు ఒక వేడుకకు బంగారం ధరించి వెళ్లి తర్వాత శవమై దొరికింది. బంగారం ధర పెరిగిన కొద్దీ, చోరీలకు పాల్పడుతున్న ముఠాల ఆగడాలు ప్రాణాలు తీసేవరకు వెళ్తున్నాయి. అప్రమత్తత అతి ముఖ్యం.. » బస్సులు, రైళ్లలో ప్రయాణిస్తున్న మహిళలు మెడలో బంగారు ఆభరణాలతోపాటు హ్యాండ్‌బ్యాగ్, ట్రాలీ బ్యాగ్‌లను తెరిచేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణంలో నిద్రపోయినా, బ్యాగ్ వదిలేసినా, అదే దొంగలకు అవకాశం. మన బ్యాగ్ కళ్లెదుటే ఉండేలా చూసుకోవాలి. » ఉదయం నడక, వివాహాలు, ఆలయాలకు నగలు ధరించి వెళ్లేటప్పుడు కేటుగాళ్లపై ఓ కన్నేసి ఉంచాల్సిందే. » ఇంట్లో నగలు ఉంచుకోకుండా లాకర్లో భద్రపరుచుకోవడం మేలు. పూజ, పేరంటం, శుభకార్యం పేరుతో ఎవరికీ బంగారం ఇవ్వకపోవడం మంచిది. -
భారీగా తగ్గిన బంగారం ధర
-
దీపా జ్యువెలర్స్‌కు ఇన్వెస్టర్ల క్యూ అన్ని కోట్లు వస్తాయా?
-
బంగారం ధరల్లో భారీ మార్పు.. బిగ్ రిలీఫ్!
దేశంలో బంగారం ధరలు పతనమయ్యాయి. రెండు రోజులుగా భారీగా ఎగిసిన పసిడి ధరలు నేడు దిగివచ్చాయి. దీంతో పసిడి కొనుగోలుదారులకు ఈరోజు భారీ ఊరట దక్కింది. ఇక వెండి ధరలు మాత్రం ఎలాంటి మార్పు లేకుండా నిలకడగా కొనసాగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే
-
బుసలు కొట్టిన బంగారం! తులం ఎంతంటే..
దేశంలో బంగారం ధరల పెరుగుదల కొనసాగుతోంది. వరుసగా రెండో రోజూ పసిడి ధరలు భగ్గుమన్నాయి. తగ్గుముఖం పట్టిన పుత్తడి ధరలు రెండు రోజుల క్రితమే మళ్లీ పుంజుకున్నాయి. దీంతో పసిడి కొనుగోలుదారులకు ఈరోజు కూడా నిరాశే మిగిలింది. ఇక వెండి ధరలు మాత్రం ఎలాంటి మార్పు లేకుండా నిలకడగా కొనసాగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
అందుకే.. బంగారం, వెండికి ఇంకా డిమాండ్!
పెట్టుబడిదారులకు బంగారం, వెండి మంచి ఎప్పుడూ మంచి ఎంపిక. అయితే.. ఇటీవలి కాలంలో వీటి ధరలు బాగా పెరగడంతో కొంతమంది ఇన్వెస్టర్లు తమ లాభాలను తీసుకున్నారు. దీంతో కొంతకాలంగా ధరలు తగ్గడం, పెరగడం వంటి మార్పులు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ.. కేంద్ర బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేయడం, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, వడ్డీ రేట్లు వంటి కారణాల వల్ల బంగారం, వెండికి డిమాండ్ భారీగానే ఉందని ఎంకే వెల్త్ మేనేజ్మెంట్ చెబుతోంది.గత ఆరు వారాలుగా బంగారం 4,060 డాలర్ల వద్ద, వెండి 58 డాలర్ల దగ్గర సాగుతున్నాయి. పసిడి ధర పెరగడానికి ప్రధాన కారణాల్లో కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు ఒకటి. చాలా దేశాలు తమ విదేశీ నిల్వల్లో బంగారం వాటాను పెంచుకుంటున్నాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు తగ్గితే బంగారానికి మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే బంగారం నుంచి వడ్డీ ఆదాయం రాదు. వడ్డీ రేట్లు తగ్గినప్పుడు బంగారం వంటివి.. పెట్టుబడిదారులకు మరింత ఆకర్షణీయంగా మారుతాయి. ఈ కారణంగానే గోల్డ్ రేటు ఇటీవల కొంత తగ్గడం జరిగింది.వెండికి కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అయితే.. బంగారంతో పోలిస్తే వెండిలో ధరలు ఎక్కువగా మారుతుంటాయి. ఎందుకంటే వెండిని పెట్టుబడి కోసం మాత్రమే కాకుండా పరిశ్రమల్లో కూడా ఉపయోగిస్తారు. జూలై 31, 2026 నాటికి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ సిల్వర్ ఈటీఎఫ్ ఒక సంవత్సరంలో 95.24% రిటర్న్స్ ఇవ్వగా, నిప్పన్ ఇండియా సిల్వర్ ఈటీఎఫ్ 94.55% రిటర్న్స్ ఇచ్చాయి. ఇదే సమయంలో గోల్డ్ ఈటీఎఫ్స్ కూడా ఒక సంవత్సరంలో 43% కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చాయి.ఎంకే వెల్త్ మేనేజ్మెంట్ అంచనా ప్రకారం.. బంగారంలో ఇంకా సుమారు 12% వరకు పెరిగే అవకాశం ఉంది. వెండి ధరలు కూడా ఇదే విధంగా ముందుగా సాగనున్నాయి. అయితే.. బంగారం, వెండి ధరలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. మధ్యలో కొంత తగ్గడం, మళ్లీ పెరగడం సాధారణమే. ముఖ్యంగా వెండిలో ధరల వ్యత్యాసం ఎక్కువగా ఉండటం వల్ల పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలి. -
మళ్లీ భారీగా పెరిగిన బంగారం ఎంత పెరిగిందంటే..!
-
ఏ క్యారెట్ బంగారం కొంటే లాభం? పెరుగుతున్న బంగారం ధరలు
-
బంగారం ఎందుకు కొనొద్దు? విదేశీ పర్యటనలు ఎందుకు వద్దు?
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే భారతీయులు అనవసర బంగారం కొనుగోళ్లను తగ్గించాలని, విదేశీ పర్యటనలకు బదులుగా దేశంలోనే పర్యటించాలని, విదేశాల్లో వివాహాలు నిర్వహించకుండా భారత్‌లోనే వివాహాలు చేసుకోవాలని సూచించారు. ఆయన ఎందుకు ఈ సూచనలు చేశారో, దాని వల్ల భారత్‌కు ఏయే ప్రయోజనాలు చేకూరుతాయో తెలుసా?బంగారం కొనుగోళ్లు ఎందుకు తగ్గించాలి?భారత్ బంగారం అవసరాల్లో ఎక్కువ భాగాన్ని దిగుమతుల ద్వారా తీర్చుకుంటోంది. బంగారం కొనుగోళ్లు పెరిగితే విదేశీ మారకద్రవ్య వ్యయం పెరుగుతుంది. దీనివల్ల వాణిజ్య లోటుపై ప్రభావం పడటంతో పాటు రూపాయి విలువపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది ఏప్రిల్‌తో ప్రారంభమైన ఆర్థిక సంవత్సరం తొలి 4 నెలల్లో బంగారం దిగుమతులు గత ఏడాదితో పోలిస్తే 32% కంటే ఎక్కువ పెరిగినట్లు వార్త పేర్కొంది.విదేశీ పర్యటనలు ఎందుకు వద్దంటున్నారు?విదేశీ పర్యటనల విషయంలోనూ ఇదే ఆలోచనను ప్రధాని ముందుకు తెచ్చారు. విదేశాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా, వినోదం కోసం భారతీయులు చేసే ఖర్చు విదేశీ వ్యాపారాలకు చేరుతుంది. విదేశాల్లో వివాహాలు నిర్వహిస్తే వేదికలు, వసతి, ఆహారం, ప్రయాణం వంటి వాటిపై మరింత విదేశీ వ్యయం జరుగుతుంది. ఆ ఖర్చులో కొంత భాగాన్ని భారత్‌లోనే పెట్టడం ద్వారా దేశీయ వ్యాపారాలు, ఉపాధికి ప్రయోజనం కలుగుతుందని ప్రధాని పేర్కొన్నారు.భారత్ ఆర్థిక వ్యవస్థ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 7.8% వృద్ధిని నమోదు చేసినా, అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశానికి ముప్పు కొనసాగుతోందని ప్రధాని తెలిపారు. భారత్ ముడి చమురు అవసరాల్లో 88% కంటే ఎక్కువ దిగుమతులపైనే ఆధారపడుతోంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలు, హార్మూజ్ జలసంధిపై అనిశ్చితి కారణంగా ఇంధన మార్కెట్లలో మరిన్ని అంతరాయాల ప్రమాదం ఉంది.స్వదేశీ విధానందేశంలో తయారయ్యే వస్తువులు, దేశీయ సేవలు, స్థానిక వ్యాపారాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రధాని మోదీ తాజా సూచన కూడా దేశీయ వినియోగం, స్వయం సమృద్ధిని పెంచే విస్తృత స్వదేశీ విధానంలో భాగమే. దేశీయ వినియోగాన్ని పెంచడం, స్వయం సమృద్ధిని ప్రోత్సహించడం కోసం ప్రధాని మోదీ చేస్తున్న విస్తృత ప్రయత్నంలో భాగమే ఈ ప్రకటన. “మనం స్వదేశీకి ఎంత ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామో, స్వయం సమృద్ధికి అంత ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లే” అని ఆయన అన్నారు. భారత్ తన అభివృద్ధి వేగాన్ని కొనసాగించగలదని, స్వాతంత్య్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారగలదన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇతర దేశాలపై ఆధారపడకుండా దేశ అవసరాలను దేశీయ ఉత్పత్తులు, వనరులు, సేవల ద్వారా ఎక్కువగా తీర్చుకునే సామర్థ్యాన్ని భారత్ పెంచుకోవాలి. -
బంగారం కొనుగోలుపై మోదీ కీలక వ్యాఖ్యలు
-
టూర్లు.. పెళ్లిళ్లు.. బంగారం: మోదీ కీలక పిలుపు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాలను మించి వృద్ధి రేటు నమోదు చేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, సంక్షోభాలు, సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు కొనసాగుతున్నప్పటికీ భారత్ శర వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు ‘స్వదేశీ.. వోకల్ ఫర్ లోకల్’ మంత్రాన్ని పాటించాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి పరోక్షంగా చురకలంటించారు.కిర్గిజిస్థాన్‌లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సుకు హాజరైన మోదీ.. మంగళవారం ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ‘‘7.8 శాతం వృద్ధి దేశ ప్రజల్లో ఆనందాన్ని నింపింది. ఇది ప్రజల సంకల్ప బలం, కష్టపడి పనిచేసే తత్వానికి ప్రతిబింబం’’ అని అన్నారు.‘ప్రపంచం యుద్ధంలో ఉంది’ప్రస్తుతం ప్రపంచం యుద్ధాలు, సంక్షోభాలతో సతమతమవుతోందని మోదీ పేర్కొన్నారు. కొవిడ్ కాలం 2020 నుంచి ఇప్పటివరకు ఎక్కడా పూర్తి స్థాయిలో స్థిరత్వం కనిపించలేదని, సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ భారత్ వేగంగా ముందుకు సాగుతోందని అన్నారు.విదేశీ టూర్లు వద్దు.. ‘వెడ్ ఇన్ ఇండియా’ఈ నేపథ్యంలో ప్రజలు దేశీయ ఉత్పత్తులు, సేవలకు ప్రాధాన్యమివ్వాలని ప్రధాని కోరారు. అవసరం లేని విదేశీ ప్రయాణాలకు దూరంగా ఉండాలని, విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్‌లు అసలే నిర్వహించవద్దని సూచించారు. పెళ్లిళ్లను దేశంలోనే నిర్వహిస్తూ ‘వెడ్ ఇన్ ఇండియా’ నినాదాన్ని పాటించాలని అన్నారు. అలాగే అవసరం లేకపోతే బంగారం కొనుగోలు చేయవద్దని పిలుపునిచ్చారు. స్వదేశీ ఉత్పత్తులు, సేవలను ఎంత ఎక్కువగా ప్రోత్సహిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ అంతగా బలోపేతమవుతుందని చెప్పారు.‘అబద్ధాల ప్రతిధ్వని’పై వ్యాఖ్యలుఇదే సమయంలో దేశంలో కొందరు నిరాశావాదంతో ‘జూట్ కీ గూంజ్’ (అబద్ధాల ప్రతిధ్వని) వ్యాప్తి చేస్తున్నారని మోదీ వ్యాఖ్యానించారు. అయితే ఇలాంటి విమర్శలు, నిరాశావాద ప్రచారాలను అధిగమిస్తూ భారత ఆర్థిక వ్యవస్థ 7.8 శాతం వృద్ధిని నమోదు చేసిందని అన్నారు. ‘‘దేశంలోనే కొందరు తీవ్ర నిరాశలో మునిగిపోయి అబద్ధాల ప్రతిధ్వనిని వ్యాప్తి చేస్తున్నారు. వాటన్నింటినీ అధిగమించి దేశం 7.8 శాతం వృద్ధిని సాధించింది. ఈ వేగాన్ని కొనసాగించాలి’’ అని మోదీ పేర్కొన్నారు.మోదీ చెప్పిన ‘జూట్ కీ గూంజ్’ పదప్రయోగం ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన ‘ఛాత్రోం కీ గూంజ్’ ప్రచారంపై కొనసాగుతున్న రాజకీయ విమర్శలకు సంబంధించి చేసిన వ్యాఖ్యగా భావిస్తున్నారు. రాహుల్‌గాంధీ వివిధ కార్యక్రమాల్లో చేసిన వ్యాఖ్యలను లక్ష్యంగా చేసుకుని బీజేపీ ఇప్పటికే తీవ్ర విమర్శలు చేసింది. ఆయన నాలుగు కార్యక్రమాల్లో చేసిన 40 ప్రకటనల్లో 29 అవాస్తవమైనవని, మరో 11 తప్పుదారి పట్టించేలా ఉన్నాయని బీజేపీ ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే మోదీ ‘అబద్ధాల ప్రతిధ్వని’ అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.7.8 శాతం వృద్ధిసోమవారం విడుదలైన గణాంకాల ప్రకారం.. 2026–27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో భారత జీడీపీ 7.8 శాతం వృద్ధి చెందింది. అంతకుముందు త్రైమాసికంలోని 8.6 శాతంతో పోలిస్తే వృద్ధి కొంత తగ్గినప్పటికీ.. అంచనాలను మాత్రం అధిగమించింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఇంధన మార్కెట్లలో అనిశ్చితి వంటి సవాళ్ల మధ్య ఈ వృద్ధి నమోదైంది.భారత్ స్వాతంత్ర్యం సాధించి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు కృషి చేయాలని మోదీ పిలుపునిచ్చారు. ‘‘విధానం సరైనది.. సంకల్పం స్పష్టంగా ఉంది.. 140 కోట్ల మంది భారతీయుల ఐక్య శక్తితో దేశాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తాం’’ అని తాజా వీడియో సందేశంలో ఉద్ఘాటించారు.ఇదీ చదవండి: రాహుల్ గాంధీ? విజయ్?? పీఎం అభ్యర్థి ఎవరసలు! -
ఈ రోజు బంగారం వెండి ధరలు ఇలా..
రెండు రోజుల వరుస తగ్గుదల తరువాత గోల్డ్ రేటు మరోమారు పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల్లో గణనీయమైన మార్పులు జరిగాయి. ఈ కథనంలో బంగారం ధర హైదరాబాద్, విజయవాడ, చెన్నై, ముంబై, బెంగళూరు, ఢిల్లీలలో ఎలా ఉందో తెలుసుకుందాం. -
పసిడి ప్రియులకు షాక్.. రూ.12,500 పెరిగిన గోల్డ్ రేటు!
బంగారం ధరలు ఊహకందని రీతిలో విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల్లో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. ఆగస్టు 01న రూ.1,44,220 వద్ద ఉన్న గోల్డ్ రేటు, ఈ రోజుకు (ఆగస్టు 31) రూ.1,56,770 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే.. నెల రోజుల్లో పసిడి ధరల్లో ఎంత మార్పు జరిగిందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.ఈ నెల (ఆగస్టు) ప్రారంభంలో హైదరాబాద్, విజయవాడలలో రూ.1,44,220 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు, ఆగస్టు 31కి రూ.1,56,770 వద్దకు చేరింది. అంటే నెల రోజుల్లో రూ.12550 పెరిగిందన్నమాట. 22 క్యారెట్ల రేటు రూ.1,32,200 నుంచి రూ.1,43,700 (రూ.11,500 పెరిగింది) వద్దకు చేరింది.ఢిల్లీ కూడా బంగారం ధరలలో చాలా మార్పులు జరిగాయి. ఇక్కడ నెల ప్రారంభంలో రూ.1,32,350 వద్ద ఉన్న 22 క్యారెట్ల గోల్డ్ రేటు నేటికి రూ.1,43,700 (రూ.11350 పెరిగింది) వద్దకు చేరింది. 24 క్యారెట్ల రేటు రూ.1,44,370 నుంచి రూ.1,56,770 (రూ.12400 పెరిగింది) వద్దకు చేరింది.ఇక వెండి ధరల విషయానికి వస్తే.. కేజీ సిల్వర్ రేటు 30 రోజుల్లో రూ.2.35 లక్షల నుంచి రూ.2.60 లక్షలకు చేరింది. అంటే నెల రోజుల్లో 25000 రూపాయలు పెరిగింది. ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. పెరిగే అవకాశం ఉందని స్పష్టంగా అర్థమైపోతుంది. -
ప్రీమియం రిటర్న్ ఇండియాఫస్ట్ లైఫ్ గోల్డ్ టర్మ్ ప్లాన్
జీవిత బీమా సంస్థ ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ సమగ్ర బీమా రక్షణ కల్పించే దిశగా గోల్డ్ టర్మ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో ప్రీమియం వాపసు వచ్చే లైఫ్ కవరేజీని కూడా ఎంచుకునే ఆప్షన్ ఉంటుంది. పాలసీదారు మరణించిన పక్షంలో జీవిత భాగస్వామికి అదనపు లైఫ్ కవరేజీ వర్తించేలా సోల్‌మేట్ బెనిఫిట్, నిర్దిష్ట వ్యవధిలోపల పాలసీని నిలిపివేస్తే అప్పటివరకు చెల్లించిన 100 శాతం ప్రీమియంలు వెనక్కి వచ్చేలా స్మార్ట్ ఎగ్జిట్ ఫీచరు ఉంది.పాలసీదారులకు ఏటా దాదాపు రూ. 75,000 విలువ చేసే హెల్త్ చెకప్‌లు, స్పెషలిస్ట్ కన్సల్టేషన్ తదితర హెల్త్ మేనేజ్మెంట్ సరీ్వసులు లభిస్తాయి. మహిళా కస్టమర్లకు ప్రత్యేక డిస్కౌంట్లు, ఇతర ప్రయోజనాలు ఉంటాయి. వచ్చే 12 నెలల్లో ఈ ప్లాన్‌తో తమ టర్మ్ ఇన్సూరెన్స్ వ్యాపారం రెట్టింపు అవుతుందని భావిస్తున్నట్లు సంస్థ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ సుమీత్ సాహ్ని తెలిపారు.మెట్రోలు, ప్రథమ..ద్వితీయ శ్రేణి నగరాల్లోని కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ పాలసీకి మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు తదితర మార్కెట్లలో డిమాండ్ ఉంటుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. -
పడిపోతున్న పసిడి ధరలు.. ఈరోజు ఇలా..
దేశంలో బంగారం ధరల తగ్గుదల కొనసాగుతోంది. మూడు రోజులుగా తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు నేడు మరింత దిగివచ్చాయి. దీంతో పుత్తడి కొనుగోలుదారులకు ఈరోజు కూడా ఊరట లభించింది. ఇక వెండి ధరలు మాత్రం ఎలాంటి మార్పు లేకుండా నిలకడగా కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
బంగారం అమ్ముకోవద్దు
భారతీయులకు బంగారంతో విడదీయలేని అనుబంధం. అయితే ప్రధాని నరేంద్ర మోదీ బంగారం కొనవద్దంటూ ఒకపక్క ప్రకటనలు చేస్తుంటే మరికొన్ని ప్రైవేటు సంస్థలు ‘అవసరాలకు మీ దగ్గరున్న బంగారం తాకట్టు పెట్టడం కాదు.. పూర్తిగా అమ్మేయండి’ అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఏమి చేయాలో సామాన్యులకు అర్థం కావడం లేదు. బంగారం ధరలు ఇంకా పెరుగుతాయా లేక తగ్గుతాయా.. కొనాలా లేక అమ్మాలా అన్న సందేహాలు వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం.. ఎప్పటికీ బంగారమేనని దీర్ఘకాలిక దృష్టితో ప్రతీ నెలా కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయడమే ఆర్థికంగా ఎంతో మంచిదని అంటున్నారు.. కమోడిటీస్ ఎక్స్పర్ట్, ఐలా కమోడిటీస్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ డైరెక్టర్ హరీశ్ గాలిపెల్లి. బంగారం ధరలు పెరుగుతుండటంతో గోల్డ్ లోన్స్ వ్యాపారం పెరిగిందని పేర్కొన్న ఆయన, ‘ఇప్పుడు పది గ్రాముల బంగారం ధర లక్షన్నరకు చేరడంతో అమ్మేయమంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని నమ్మి మీరు బంగారం అమ్ముకోవద్దు’ అని స్పష్టంచేస్తున్నారు. ‘సాక్షి’కి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో మరికొన్ని అంశాలు.. సాక్షి, అమరావతి: బంగారం దీర్ఘకాలిక చరిత్రను పరిశీలిస్తే అప్‌ట్రెండ్ కొనసాగుతోంది. 2000, 2008, 2014ల ర్యాలీని గమనిస్తే.. బాగా పెరిగిన తర్వాత 20 నుంచి 30 శాతం సర్దుబాటు జరిగి తిరిగి పెరగడం ప్రారంభించింది. ఇప్పుడు కూడా అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 5,600 డాలర్లకు చేరిన తర్వాత 4,000 డాలర్లకు పడిపోయింది. జూలైలో 4,100 డాలర్ల వద్దే కదలాడి ఆగస్టులో 4,500–4,600కు చేరింది. ప్రస్తుతం బంగారం కన్సాలిడేషన్ మూడ్‌లోనే ఉంది. సర్దుబాటు పూర్తయిన తర్వాత పాత రికార్డులను అధిగమించి సరికొత్త రికార్డు స్థాయిలకు వెళుతుంది. ప్రభావితం చేస్తున్న అంశాలేంటంటే.. ద్రవ్యోల్బణం, అమెరికా వడ్డీరేట్ల పెంపు, యుద్ధ భయాలు ప్రధానంగా బంగారం ధరలను నిర్దేశించే మూడు అంశాలు. వచ్చే 6 నెలల ధరలను ఈ మూడే ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు ధరల పెరుగుదల అనేది ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానమైనది. ద్రవ్యోల్బణం కట్టడి చేయడానికి అమెరికా వడ్డీరేట్లు పెంచితే డాలరు బలపడి ఆ సమయంలో బంగారం ధరలు మళ్లీ తగ్గే అవకాశం ఉంది. అప్పుడు కూడా 4,000–4,200 డాలర్ల వద్దే కదులుతుందని అంచనా. ఇది మంచి మార్గం పెట్టుబడి సాధనాల్లో బంగారం ప్రధానమైనదనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఒకేసారి కాకుండా క్రమానుగతంగా లేదా పడుతున్నప్పుడల్లా కొనుగోలు చేస్తూ ఉండాలి. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని గోల్డ్ బీస్, గోల్డ్ ఈటీఎఫ్ వంటి డిజిటల్ గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయండి. గడచిన ఐదేళ్లుగా గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్‌కు డిమాండ్ పెరిగింది. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్‌లానే గ్రామీణ ప్రాంతాల ప్రజలూ గోల్డ్ ఈటీఎఫ్‌లవైపు చూస్తున్నారు. నేరుగా బంగారం కంటే డిజిటల్ రూపంలో కొనాలి. సులభతర లావాదేవీలు, ఇన్వెస్ట్‌మెంట్‌కు ఇది మంచి మార్గం. -
బిట్‌కాయిన్‌పై సంచలన అంచనా.. త్వరలోనే $1 మిలియన్!
క్రిప్టో కరెన్సీ మార్కెట్లో బిట్‌కాయిన్ భవిష్యత్తుపై బినాన్స్ వ్యవస్థాపకుడు చాంగ్‌పెంగ్ జావో (CZ) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్కో బిట్‌కాయిన్ విలువ భవిష్యత్తులో 1 మిలియన్ డాలర్లకు (ప్రస్తుత మారక విలువ ప్రకారం సుమారు రూ.9.5 కోట్లు) చేరడం ఖాయమని, ఇందుకు 25 ఏళ్లు పట్టకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల హాంకాంగ్‌లో జరిగిన బిట్‌కాయిన్ ఆసియా 2026 సదస్సులో ‘బిట్‌కాయిన్ శతాబ్ధి’ పేరుతో జరిగిన చర్చలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.అయితే బిట్‌కాయిన్‌ను కేవలం ధర ఆధారంగా అంచనా వేయడం సరికాదని చాంగ్‌పెంగ్ జావో స్పష్టం చేశారు. రాబోయే దశాబ్దంలో దాని వినియోగం, చెల్లింపుల్లో వినియోగం, సంస్థాగత స్వీకరణ భారీగా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. పెద్ద ఎత్తున బిట్‌కాయిన్ చెల్లింపులు జరగడం, రిటైర్మెంట్ ఫండ్లు, పెన్షన్ ఫండ్లు, పెట్టుబడి నిధులు, ప్రభుత్వాల రిజర్వ్ ఆస్తుల్లో బిట్‌కాయిన్‌కు స్థానం లభించడం వంటి పరిణామాలు కీలక మైలురాళ్లుగా మారతాయని పేర్కొన్నారు.బంగారాన్ని మించుతుందా?భవిష్యత్తులో బిట్‌కాయిన్ ప్రాధాన్యత బంగారాన్ని మించే అవకాశం ఉందని చాంగ్‌పెంగ్ జావో అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా తదుపరి బుల్ మార్కెట్లో బిట్‌కాయిన్ మార్కెట్ విలువ పరంగా బంగారాన్ని అధిగమించవచ్చని ఆయన పేర్కొన్నట్లు ది బ్లాక్ నివేదించింది.అయితే ప్రస్తుతం ఈ రెండింటి మధ్య భారీ వ్యత్యాసం ఉంది. ఇటీవలి మార్కెట్ డేటా ప్రకారం బిట్‌కాయిన్ ధర ఆగస్టు చివర్లో సుమారు 80,000 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఆగస్టు 25న ఇది 80,600 డాలర్ల ప్రాంతాన్ని తాకింది. దీంతో 1 మిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరాలంటే ప్రస్తుత స్థాయి నుంచి బిట్‌కాయిన్ దాదాపు 12 రెట్లు పెరగాల్సి ఉంటుంది.AI, స్టేబుల్కాయిన్లదే తదుపరి దశక్రిప్టో రంగంలో వచ్చే పదేళ్లలో కేవలం బిట్‌కాయిన్ మాత్రమే కాకుండా స్టేబుల్కాయిన్లు, టోకెనైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), AI ఏజెంట్లు కీలక పాత్ర పోషిస్తాయని సీజెడ్ అంచనా వేశారు. టోకెనైజ్డ్ ఆస్తులు, డిజిటల్ చెల్లింపులు వేగంగా విస్తరించడంతో సంప్రదాయ ఆర్థిక వ్యవస్థతో క్రిప్టో రంగం అనుసంధానం మరింత బలపడుతుందని ఆయన అన్నారు.బిట్‌కాయిన్ ప్రధానంగా దీర్ఘకాలిక పొదుపు, రిజర్వ్ ఆస్తిగా ఎదగవచ్చని, మరోవైపు స్టేబుల్కాయిన్లు రోజువారీ చెల్లింపులు, ట్రేడింగ్, అలాగే AI ఏజెంట్ల మధ్య జరిగే మెషిన్-టు-మెషిన్ లావాదేవీల్లో కీలకంగా మారవచ్చని ఆయన వివరించారు. -
రవ్వంత బంగారంతో భారీ ఇల్లు కొన్న కియోసాకి!
ప్రముఖ రచయిత, పెట్టుబడులపై అవగాహన కల్పించే రాబర్ట్ కియోసాకి మరోసారి బంగారం ప్రాధాన్యంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తకంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కియోసాకి.. తన ఫేస్బుక్ ఖాతాలో చేసిన ఓ పోస్టులో తాను బంగారంతో 4.5 మిలియన్ డాలర్ల (సుమారు రూ.40 కోట్లకు పైగా) విలువైన ఇంటిని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.ఇంటి ధర 4.5 మిలియన్ డాలర్లు కాగా, దాన్ని సొంతం చేసుకోవడం కోసం తాను వినియోగించిన బంగారాన్ని అప్పట్లో 4.5 లక్షల డాలర్ల కొన్నట్లు రాసుకొచ్చారు. అంటే తాను 4.5 లక్షల డాలర్లకే కొన్న బంగారంతో ఇప్పుడు 45 లక్షల డాలర్ల విలువైన ఇంటిని కొనుగోలు చేశానన్నది ఆయన భావన. బంగారం విలువ ఎంతలా పెరిగిందో ఆయన ఈ విధంగా పేర్కొన్నారు.ఇది ఎలాంటి ఫోర్క్లోజర్ లేదా ప్రత్యేక డీల్ కాదని ఆయన స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్లుగా తాను బంగారు నాణేలను పొదుపు చేస్తూ వచ్చానని, వాటి విలువ పెరగడంతో చివరకు ఆ బంగారాన్ని ఇంటి కొనుగోలుకు ఉపయోగించానని పేర్కొన్నారు.ప్రస్తుతం వెండి ఔన్సుకు 45 డాలర్లు, బంగారం ఔన్సుకు 3,500 డాలర్ల స్థాయిలో ఉన్నాయని కియోసాకి తన పోస్టులో పేర్కొన్నారు. అయితే తాను వెండిని ఔన్సుకు కేవలం ఒక డాలర్ ఉన్నప్పటి నుంచే కొనుగోలు చేసి పొదుపు చేయడం ప్రారంభించానని చెప్పారు. సంప్రదాయ కరెన్సీపై ఆధారపడటానికి బదులుగా బంగారం, వెండి వంటి విలువైన ఆస్తులను కూడబెట్టుకోవడంపై తనకు నమ్మకం ఉందన్నారు.బ్యాంకులో డబ్బు దాచుకోవడం, కష్టపడి పనిచేయడం వంటి సంప్రదాయ ఆర్థిక సలహాలపై కూడా కియోసాకి విమర్శలు చేశారు. ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో కరెన్సీని ముద్రించడం వల్ల దాని విలువ క్రమంగా తగ్గుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగితపు డబ్బు విలువను కోల్పోతున్న సమయంలో బంగారం, వెండి వంటి ‘రియల్ మనీ’, రియల్ అసెట్స్‌లో పొదుపు చేయడం ప్రయోజనకరమని పేర్కొన్నారు.తాను ఏళ్లుగా బంగారాన్ని పొదుపు చేయడం వల్లే దాన్ని ఉపయోగించి భారీ విలువైన ఆస్తిని కొనుగోలు చేయగలిగానని కియోసాకి తెలిపారు. డాలర్లను పొదుపు చేయాలా, లేక బంగారం, వెండి వంటి విలువైన ఆస్తుల్లో పెట్టుబడి పెట్టాలా అనేది వ్యక్తిగత నిర్ణయమని తన పోస్టులో పేర్కొన్నారు. -
బంగారం ధరలు.. మూడు రోజుల్లో రూ.4,700 డౌన్!
న్యూఢిల్లీ: డాలర్ పుంజుకోవడం, ట్రేడర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో దేశీ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా మూడో రోజూ డీలా పడ్డాయి. శుక్రవారం ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పసిడి ధర 10 గ్రా. ఏకంగా రూ. 3,300 తగ్గి రూ. 1,62,400 స్థాయికి చేరింది. గడిచిన మూడు రోజుల్లోనే బంగారం ధర దాదాపు 3% (రూ. 4,700) మేర దిగొచ్చింది.మరోవైపు వెండి కిలో ధర రూ. 5,000 తగ్గి రూ. 2,45,500 వద్ద స్థిరపడింది. డాలర్ ఇండెక్స్ 99.15 స్థాయిని దాటి బలపడటం పసిడి క్షీణతకు కారణమైంది. దేశంలో స్మగ్లింగ్ పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీ (దిగుమతి సుంకం) తగ్గించే అవకాశం ఉందన్న వార్తలు దేశీయంగా ధరలను మరింత ఒత్తిడికి గురిచేశాయి.ఫెడ్ కఠిన సంకేతాలతో పసిడికి షాక్: ‘జాక్సన్ హోల్’ సదస్సులో ఫెడరల్ చైర్మన్ కెవిన్ వార్‡్ష మాట్లాడుతూ అమెరికాలో ద్రవ్యోల్బణం ఇంకా ఫెడరల్ రిజర్వ్ నిర్దేశించుకున్న 2% లక్ష్యానికి చేరలేదన్నారు. ధరలు అదుపులోకి తీసుకురావడానికే అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. వడ్డీ రేట్లు మరింత కాలం అధిక స్థాయిలో కొనసాగవచ్చన్న అంచనాలు బలపడ్డాయి. దీంతో గోల్డ్ ధర ఔన్సుకు 3% తగ్గి 4,520 డాలర్లను, వెండి 4% క్షీణించి 66.6 డాలర్లను తాకాయి. -
బంగారం కొనేందుకు ఇది మంచి ఛాన్స్.. ఎందుకంటే?
బంగారం ధరల వరుస తగ్గుదల నమోదైంది. గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల రేటు రూ.770 తగ్గి 1,63,130 రూపాయలకు చేరింది. అంతకు ముందు రోజు ఈ రేటు రూ.1,63,900 వద్ద ఉంది. అయితే వెండి మాత్రమే స్థిరంగా ఉండటంతో.. కేజీ సిల్వర్ రేటు రూ.2.60 లక్షల వద్ద నిలిచింది.రాఖీ పండుగకు ముందుశుక్రవారం రాఖీ పండుగ జరగనున్న నేపథ్యంలో బంగారం ధరలు తగ్గడం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా రాఖీ పండుగ సమయంలో అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకుంటారు. ఈ సందర్భంగా బంగారం, వెండి ఆభరణాలను కొనుగోలు చేసే వారు కూడా ఉంటారు. అందువల్ల పండుగకు ఒక రోజు ముందు బంగారం ధర తగ్గడం వినియోగదారులకు కొంత ఊరట కలిగించే అంశంగా చెప్పవచ్చు.బంగారం ధర తగ్గడానికి కారణంబంగారం ధర తగ్గడానికి ప్రధాన కారణాల్లో అమెరికా డాలర్ బలపడటం ఒకటి. అమెరికాలో అంచనాల కంటే ఎక్కువగా ద్రవ్యోల్బణం నమోదవడంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విషయంలో కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందనే అంచనాలు పెరిగాయి. దీంతో అమెరికా డాలర్‌తో పాటు ట్రెజరీ బాండ్ యీల్డ్స్ కూడా పెరిగాయి. సాధారణంగా బాండ్ యీల్డ్స్ పెరిగినప్పుడు వడ్డీ ఆదాయం ఇవ్వని బంగారం ఆకర్షణ కొంత తగ్గుతుంది. ఈ కారణంగానే అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరపై ఒత్తిడి కనిపించింది.వెండి మాత్రం స్థిరంబంగారం తగ్గినప్పటికీ.. దేశీయ మార్కెట్లో వెండి ధర రూ.2,60,000 వద్ద స్థిరంగా కొనసాగింది. ప్రారంభంలో కొంత అమ్మకాల ఒత్తిడి కనిపించినప్పటికీ తర్వాత వెండి ధర నిలదొక్కుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం వెండి కొంత మెరుగైన ప్రదర్శన చేసింది. స్పాట్ సిల్వర్ ధర 0.31 శాతం పెరిగి ఔన్స్‌కు 68.32 డాలర్లకు చేరింది.అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండిప్రపంచ మార్కెట్లో కూడా స్పాట్ గోల్డ్ స్వల్పంగా తగ్గి ఔన్స్‌కు 4,585.88 డాలర్ల వద్ద ట్రేడైంది. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాల తర్వాత డాలర్ సూచీ బలపడటం, ఫెడ్ వడ్డీ రేట్లపై కఠిన వైఖరి ఉండవచ్చనే అంచనాలు బంగారం ధరను ప్రభావితం చేశాయి. అయితే వెండికి మాత్రం సురక్షిత పెట్టుబడుల కోసం ఉన్న డిమాండ్ కొంత మద్దతు ఇచ్చింది. అందుకే అంతర్జాతీయ మార్కెట్లో వెండి బంగారం కంటే మెరుగ్గా నిలిచింది.కెవిన్ వార్ష్ ప్రసంగంపై మార్కెట్ దృష్టిఇప్పుడు పెట్టుబడిదారుల దృష్టి అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్ కెవిన్ వార్ష్ శుక్రవారం చేయనున్న జాక్సన్ హోల్ ప్రసంగంపై ఉంది. వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణంపై ఫెడ్ వైఖరి ఎలా ఉండబోతోందనే విషయంలో ఆయన చేసే వ్యాఖ్యలు మార్కెట్‌కు ముఖ్యమైన సంకేతాలు ఇవ్వవచ్చు. ఫెడ్ కఠినమైన వైఖరిని సూచిస్తే డాలర్, ట్రెజరీ యీల్డ్స్ మరింత బలపడే అవకాశం ఉంది. అప్పుడు బంగారం ధరపై మరింత ఒత్తిడి రావచ్చు. -
బంగారం ధరలు తగ్గే ఛాన్స్.. కేంద్రం కీలక ఆలోచన
-
గోల్డ్, సిల్వర్‌పై పన్ను తగ్గే ఛాన్స్.. కారణం ఇదే!
బంగారం, వెండిపై భారీగా ఉన్న దిగుమతి సుంకాలను తగ్గించే అంశంపై కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న అధిక పన్నుల కారణంగా.. చట్టబద్ధంగా దిగుమతి చేసుకునే బంగారం కంటే, అక్రమ మార్గాల్లో వచ్చే బంగారం చౌకగా మారే పరిస్థితి ఏర్పడుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని.. సుంకం తగ్గిస్తే స్మగ్లింగ్‌ను అడ్డుకోవచ్చా?, అనే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే.. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. బులియన్ వ్యాపారులు, జ్యువెలరీ రంగం మాత్రం ప్రస్తుత 15 శాతం సుంకాన్ని.. 6 శాతానికి తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతోంది. ఇదే జరిగితే ధరలు కొంత తగ్గే అవకాశం ఉంటుంది.సుంకం ఎందుకు పెంచారు?బంగారం దిగుమతులు భారీగా పెరగడంతో దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతుందన్న ఆందోళనతో ప్రభుత్వం మే 13, 2026న దిగుమతి సుంకాన్ని పెంచింది. భారత్ ప్రతి ఏడాది సుమారు 700-800 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. సుంకం పెంచడానికి ముందు ఏప్రిల్‌లో బంగారం దిగుమతులు ఏకంగా 82 శాతం పెరిగాయి. ఎక్కువగా బంగారం దిగుమతి చేసుకుంటే డాలర్లకు డిమాండ్ పెరగడంతో పాటు కరెంట్ అకౌంట్ లోటు కూడా పెరుగుతుంది. దీంతో రూపాయిపై ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంటుంది.పన్ను పెంచినా దిగుమతులు తగ్గలేదే?ప్రభుత్వం సుంకాన్ని పెంచినప్పటికీ బంగారం దిగుమతులు పూర్తిగా తగ్గలేదు. మేలో దిగుమతులు దాదాపు 34 శాతం పెరిగాయి. ఆ తర్వాత జూన్, జూలై నెలల్లో కలిపి బంగారం దిగుమతుల విలువ 5.5 శాతం పెరిగి 6.13 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో అధిక సుంకం విధించడం ద్వారా దిగుమతులను నియంత్రించాలన్న ప్రభుత్వ లక్ష్యం ఎంతవరకు నెరవేరిందనే ప్రశ్నలు వస్తున్నాయి.స్మగ్లింగ్ ఎందుకు పెరుగుతోంది?పరిశ్రమ వర్గాల వాదన ప్రకారం.. అధిక పన్ను కారణంగా చట్టబద్ధంగా దిగుమతి చేసుకునే బంగారం ఖరీదుగా మారుతుంది. అదే సమయంలో అక్రమ మార్గంలో వచ్చే బంగారంపై ఇలాంటి పన్ను ఉండదు. దీంతో రెండు మార్గాల మధ్య ధర వ్యత్యాసం పెరుగుతుంది. ఈ పరిస్థితి స్మగ్లింగ్‌కు ప్రోత్సాహం ఇవ్వొచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అందుకే సుంకాన్ని తగ్గిస్తే చట్టబద్ధమైన దిగుమతులు పెరగడంతో పాటు అక్రమ మార్గాల్లో బంగారం వచ్చే ప్రోత్సాహం కూడా తగ్గవచ్చని వారు భావిస్తున్నారు.వెండి, ప్లాటినంపైనా ప్రభావంకేంద్రం కేవలం బంగారం గురించే కాకుండా వెండి, ప్లాటినం దిగుమతి సుంకాలపై కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. వీటికి ఆభరణాల రంగంతో పాటు పారిశ్రామికంగా కూడా భారీ డిమాండ్ ఉంది. వెండిని సౌర విద్యుత్ పరికరాలు, ఎలక్ట్రానిక్స్ తయారీలో ఉపయోగిస్తారు. ప్లాటినం ఆటోమొబైల్, వైద్య రంగాల్లో కీలకంగా ఉంటుంది. కాబట్టి వీటిపై అధిక సుంకాలు విధించడం వల్ల పరిశ్రమలకు ముడి పదార్థాల ఖర్చులు పెరిగి, చివరకు ఉత్పత్తుల ధరలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.ప్రస్తుతం ప్రభుత్వం ఒకవైపు దేశ విదేశీ మారక నిల్వలను కాపాడుకోవాలని చూస్తోంది. మరోవైపు అధిక పన్నుల వల్ల స్మగ్లింగ్ పెరగడం, పరిశ్రమల ఖర్చులు పెరగడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. అందుకే.. సుంకాలను తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే 15 శాతం నుంచి 6 శాతానికి సుంకం తగ్గిస్తారా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు. ఒకవేళ సుంకం తగ్గిస్తే అధికారిక మార్గంలో బంగారం దిగుమతులు పెరగవచ్చు. అదే సమయంలో స్మగ్లింగ్ తగ్గుతుందా, విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి ఎలా ఉంటుంది అనేది కీలకంగా మారనుంది.ఇదీ చదవండి: బంగారం ధరలకు బ్రేక్.. ఒక్కరోజులో భారీ పతనం! -
బంగారం ధరలకు బ్రేక్.. ఒక్కరోజులో భారీ పతనం!
బుధవారం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి తగ్గాయి. పసిడి ధరలు భారీగా పెరిగి మే 14 తర్వాత అత్యధిక స్థాయికి చేరుకున్నప్పటికీ, బుధవారం మాత్రం ధరల తగ్గుదల నమోదైంది. దీనికి తోడు అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, వడ్డీ రేట్లపై అంచనాలు, డాలర్ బలపడటం వంటి అంశాలు కూడా బంగారం ధరపై ప్రభావం చూపాయి.అమెరికా ద్రవ్యోల్బణంఅమెరికాలో ద్రవ్యోల్బణ పరిస్థితిని అంచనా వేయడానికి ఫెడరల్ రిజర్వ్ ఉపయోగించే ముఖ్యమైన సూచికల్లో పీసీఈ ప్రైస్ ఇండెక్స్ ఒకటి. జూలై వరకు 12 నెలల్లో పీసీఈ ద్రవ్యోల్బణం 3.7 శాతంగా నమోదైంది. అయితే.. మార్కెట్ నిపుణులు దీనిని 3.6 శాతంగా అంచనా వేశారు. అంటే.. ద్రవ్యోల్బణం అంచనాల కంటే కొద్దిగా ఎక్కువగా నమోదైంది. దీంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వచ్చే నెలలో వడ్డీ రేట్లను పెంచవచ్చనే అంచనాలు కొంత బలపడ్డాయి.వడ్డీ రేట్లు పెరిగితేబంగారం ఎలాంటి వడ్డీ ఆదాయం ఇవ్వదు. అందువల్ల వడ్డీ రేట్లు పెరిగినప్పుడు పెట్టుబడిదారులు బంగారం కంటే వడ్డీ వచ్చే బాండ్లు, ఇతర ఆర్థిక సాధనాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ఇదే కారణంగా అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు అవకాశాలు పెరిగినప్పుడు బంగారం ధర తగ్గుతుంది. అయితే వచ్చే నెలలో రేట్లు పెరిగే అవకాశం 38 శాతంగా ఉంటుందని మార్కెట్ అంచనా వేస్తోంది.డాలర్ బలపడటంబంగారం అంతర్జాతీయంగా అమెరికన్ డాలర్లలోనే ధర నిర్ణయించబడుతుంది. బుధవారం డాలర్ విలువ 0.3 శాతం పెరిగింది. డాలర్ బలపడితే ఇతర దేశాల కరెన్సీలు ఉపయోగించే వారికి బంగారం ఖరీదుగా మారుతుంది. దీంతో బంగారం కొనుగోళ్లపై కొంత ప్రభావం పడుతుంది. అందుకే డాలర్ పెరుగుదల కూడా బంగారం ధర తగ్గడానికి ఒక కారణం అని తెలుస్తోంది.బంగారం ధర ఎంత తగ్గింది?బుధవారం స్పాట్ గోల్డ్ ధర 1.3 శాతం తగ్గి ఔన్సుకు 4,594.84 డాలర్లకు చేరింది. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ కూడా 0.9 శాతం తగ్గి 4,650.90 డాలర్లకు చేరాయి. అయితే దీనిని చూసి బంగారం భారీగా పతనమవుతోందని భావించాల్సిన అవసరం లేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా ధరలు బాగా పెరగడంతో పెట్టుబడిదారులు తమ లాభాలను కొంతవరకు తీసుకోవడం కూడా ఈ తగ్గుదలకు కారణం.మళ్లీ 5,000 డాలర్లకు బంగారంధరలు ప్రస్తుతం తగ్గినప్పటికీ, బంగారం దీర్ఘకాలికంగా మళ్లీ పెరిగే అవకాశం ఉందని కొందరు నిపుణులు భావిస్తున్నారు.పీటర్ గ్రాంట్ ప్రకారం.. ప్రస్తుత తగ్గుదల ఒక తాత్కాలిక స్థిరీకరణ మాత్రమే కావచ్చు. బంగారం మళ్లీ 5,000 డాలర్ల స్థాయిని దాటే అవకాశం ఈ ఏడాదిలోనే ఉంది అని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే 2027 రెండో త్రైమాసికం నాటికి బంగారం కొత్త రికార్డు గరిష్ఠాలను నమోదు చేసే అవకాశం కూడా ఉందని ఆయన చెప్పారు.ప్రపంచ రాజకీయ పరిస్థితుల ప్రభావంబంగారం ధరను కేవలం అమెరికా వడ్డీ రేట్లు మాత్రమే నిర్ణయించవు. ప్రపంచంలో జరిగే రాజకీయ పరిణామాలు కూడా ప్రభావం చూపుతాయి. ఇరాన్, ఒమన్ మధ్య 'హర్ముజ్'కు సంబంధించిన ఆదాయ పంపకంపై ఒప్పందం కుదిరినప్పటికీ, అమెరికా తమ షరతులను అంగీకరించకపోతే ఈ కీలక సముద్ర మార్గాన్ని తిరిగి తెరవబోమని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ పేర్కొన్నాయి.ఇలాంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగినప్పుడు ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి పెరుగుతుంది. అప్పుడు పెట్టుబడిదారులు సాధారణంగా బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా చూస్తారు. కాబట్టి ఇలాంటి పరిణామాలు భవిష్యత్తులో బంగారం ధరకు మద్దతు ఇవ్వవచ్చు.ఇతర లోహాల పరిస్థితివెండి: 1.1 శాతం తగ్గి 67.91 డాలర్లకు చేరిందిప్లాటినం: 1.2 శాతం తగ్గి 1,837.78 డాలర్లకు చేరిందిపల్లాడియం: 0.1 శాతం తగ్గి 1,325.10 డాలర్లకు చేరింది -
వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు
-
బంగారం ధరల వేళ TATA మ్యూచువల్ ఫండ్ కీలక నిర్ణయం
-
మేడారం జాతరలో 2.882 కిలోల బంగారం, 203 కిలోల వెండి
ములుగు జిల్లా: మేడారం సమ్మక్క – సారలమ్మ మహా జాతరలో భక్తులు సమర్పించిన మిశ్రమ బంగారం, వెండి కానుకల లెక్కింపు మంగళవారం పూర్తయింది. హనుమకొండ ఎస్టీఓలో భద్రపరిచిన ఆరు ట్రంకు బాక్సులను ధార్మిక భవన్‌కు తీసుకువచ్చి రెండు రోజులపాటు లెక్కించారు. 1994, 1996, 2000 జాతరలకు చెందిన మిశ్రమ వెండి బాక్సులు, 2004, 2006, 2008, 2010, 2012 జాతరలకు సంబంధించిన మిశ్రమ బంగారం, వెండి బాక్సులను తెరిచి లెక్కించారు. ఈ సందర్భంగా బంగారం, వెండి కాని వస్తువులను వేరు చేసి స్వచ్ఛతను నిర్ధారించారు. అధికారిక లెక్కల ప్రకారం మిశ్రమ బంగారం 2 కిలోల 882 గ్రాముల 500 మిల్లీగ్రాములు, మిశ్రమ వెండి 183 కిలోల 561 గ్రాములుగా తేలింది. 20 కిలోల స్క్రాప్‌తో కలిపి మొత్తం వెండి 203 కిలోల 561 గ్రాములుగా నమోదైనట్లు మేడారం ఈఓ వీరస్వామి తెలిపారు. కాగా, ఇంకా ఆరు జాతరల ట్రంక్ బాక్సుల లెక్కింపు చేయాల్సి ఉంది. -
పసిడి పరుగు.. వెండి వెనకడుగు!
పసిడి పరుగు నాన్‌స్టాప్‌గా కొనసాగుతోంది. వరుసగా నాలుగో సెషన్లోనూ అదే జోరు కొనసాగిస్తూ మరో రూ. 2,700 పెరిగింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం 10 గ్రాముల రేటు రూ. 1,67,100కి చేరింది.మరోవైపు, మూడు రోజుల ర్యాలీ అనంతరం ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో వెండి జోరు కాస్త ఆగింది. కేజీ ధర రూ. 3,500 తగ్గి రూ. 2,50,000కి పరిమితమైంది. అటు అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లలో బంగారం ధర ఔన్సుకి (31.1 గ్రాములు) 11.87 డాలర్లు (సుమారు 0.26 శాతం) క్షీణించి 4,639.51 డాలర్లకు, వెండి 1.04 శాతం తగ్గి 67.88 డాలర్లకు దిగి వచ్చాయి. -
రాసిపెట్టుకోండి.. తులం రెండు లక్షలు..!
-
బంగారం, వెండిపై బిగ్ న్యూస్.. ఎట్టకేలకు తగ్గుముఖం
దేశంలో బంగారం ధరలు ఎట్టకేలకు తగ్గుముఖం పట్టాయి. గత ఐదు రోజులుగా వరుసగా పెరిగిపోయిన పసిడి ధరలు నేడు దిగివచ్చాయి. దీంతో పుత్తడి కొనుగోలుదారులకు ఈరోజు ఉపశమనం లభించింది. ఇక వెండి ధరలు కూడా శాంతించాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
కియోసాకి హెచ్చరిక.. డాలర్‌పై ఆందోళన!
ప్రముఖ రచయిత, పెట్టుబడులపై అవగాహన కల్పించే రాబర్ట్ కియోసాకి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమెరికా ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తుండటం, డబ్బు సరఫరా పెరగడం, ద్రవ్యోల్బణం కొనసాగడం వంటి పరిణామాలు భవిష్యత్తులో డాలర్ విలువపై ప్రభావం చూపవచ్చని ఆయన హెచ్చరిస్తున్నారు.ప్రభుత్వాలు అవసరానికి మించి డబ్బును సృష్టించినప్పుడు.. కాలక్రమంలో ఆ కరెన్సీ కొనుగోలు శక్తి తగ్గుతుందని కియోసాకి అభిప్రాయపడుతున్నారు. గతంలో జర్మనీ, జింబాబ్వే, వెనిజులా వంటి దేశాల్లో చోటుచేసుకున్న తీవ్ర ద్రవ్యోల్బణ పరిస్థితులను దీనికి ఉదాహరణలుగా చూపిస్తూ.. చరిత్ర అబద్ధం చెప్పదని అన్నారు.డాలర్లు దాచుకుంటే..మన సంపద మొత్తాన్ని నగదు రూపంలోనే ఉంచుకోవద్దన్నది కియోసాకి చెబుతున్నారు. ద్రవ్యోల్బణం పెరిగితే బ్యాంకులో ఉన్న డబ్బు సంఖ్య మారకపోయినా.. ఆ డబ్బుతో కొనగల వస్తువుల విలువ తగ్గిపోవచ్చు. అందుకే.. ఆదాయం ఇచ్చే ఆస్తులను కలిగి ఉండటం ముఖ్యమని ఆయన చెబుతున్నారు. అద్దె ఆదాయం వచ్చే ప్రాపర్టీలు, నగదు ప్రవాహం ఉన్న వ్యాపారాలు వంటి వాటిని ఆయన ఉదాహరణలుగా ప్రస్తావిస్తున్నారు.బంగారం, వెండి, బిట్‌కాయిన్ ఎందుకు?కియోసాకి చాలాకాలంగా బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి ఆస్తులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రభుత్వాలు అవసరమైనంత బంగారం లేదా వెండిని సులభంగా సృష్టించలేవని, అందువల్ల కరెన్సీ విలువ పడిపోయే సమయంలో ఇవి ప్రత్యామ్నాయ ఆస్తులుగా ఉపయోగపడవచ్చని ఆయన భావిస్తున్నారు. బిట్‌కాయిన్‌ను కూడా పరిమిత సరఫరా ఉన్న డిజిటల్ ఆస్తిగా చూస్తున్నారు.అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. బంగారం, వెండి, బిట్‌కాయిన్ లేదా రియల్ ఎస్టేట్ ఎప్పుడూ పెరుగుతాయని చెప్పలేం. వీటి ధరల్లో కూడా భారీ హెచ్చుతగ్గులు ఉండొచ్చు. కాబట్టి కియోసాకి సూచనలను పెట్టుబడి హామీగా కాకుండా.. వైవిధ్యమైన ఆర్థిక ప్రణాళిక అవసరమనే కోణంలో చూడటం మంచిది.కియోసాకి సందేశంలో అసలు హైలైట్ “Hope is not a strategy” అనే మాట. అంటే భవిష్యత్తులో అంతా బాగానే జరుగుతుందని ఆశిస్తూ కూర్చోవడం కంటే.. ఏ పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేలా ముందుగానే సిద్ధంగా ఉండాలని ఆయన చెబుతున్నారు. ఒకే ఉద్యోగం లేదా ఒకే ఆదాయ వనరుపై ఆధారపడకుండా అదనపు ఆదాయ మార్గాలను ఏర్పాటు చేసుకోవాలని, సంపదను వివిధ రకాల ఆస్తుల్లో విభజించుకోవాలని సూచిస్తున్నారు.డాలర్ నిజంగానే కుప్పకూలుతుందా?ఇక్కడ కాస్త జాగ్రత్తగా చూడాల్సిన అంశం ఉంది. డాలర్ తప్పకుండా కుప్పకూలుతుంది, అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది అనేది నిర్ధారిత వాస్తవం కాదు. అది కియోసాకి వ్యక్తిగత అంచనా మాత్రమే.అమెరికా ఆర్థిక వ్యవస్థ, డాలర్ ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా ఉన్న స్థానం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే భవిష్యత్తును ఖచ్చితంగా అంచనా వేయడం అంత సులభం కాదు. ఆర్థిక పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కాబట్టి సంపాదించడం మాత్రమే కాకుండా, సంపదను ఎలా కాపాడుకోవాలి, ఆదాయానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఎలా సృష్టించుకోవాలి అనే దానిపై కూడా ముందుగానే ఆలోచించాలని కియోసాకి ఉద్దేశం.ఇదీ చదవండి: ట్రంప్ సర్కార్ కొత్త ప్లాన్.. భారతీయులకు భారీ షాక్? -
ఐదు నెలల గరిష్ఠానికి బంగారం ధర!
అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్స్, అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తత వల్ల డిమాండ్ పుంజుకోవడంతో పసిడి ధరలు మళ్లీ పరుగులు తీస్తున్నాయి. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర మరో రూ. 900 పెరిగి రూ. 1,64,400కి చేరింది. ఇది ఐదు నెలల గరిష్ట స్థాయి.చివరిసారిగా మార్చి 9న పుత్తడి రేటు రూ. 1,64,300 పలికింది. అటు వెండికూడా వరుసగా మూడో సెషన్లోనూ పెరిగింది. కేజీకి రూ. 3,500 పెరిగి రూ. 2,53,500కి చేరింది. అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో బంగారం రేటు ఔన్సుకి (31.1 గ్రాములు) 42.45 డాలర్లు (1 శాతం) పెరిగి 4,646.54 డాలర్లు పలికినట్లు కోటక్ సెక్యూరిటీస్ ఏవీపీ (కమోడిటీ రీసెర్చ్) కైనాత్ చైన్వాలా తెలిపారు.వెండి ధర ఫ్లాట్‌గా 69 డాలర్ల వద్ద ట్రేడయినట్లు పేర్కొన్నారు. బంగారం కీలకమైన 4,650 డాలర్ల చేరువకు వచ్చిన నేపథ్యంలో తదుపరి కదలికలు భౌగోళిక-రాజకీయ పరిస్థితుల కన్నా ద్రవ్యోల్బణంపైనే ఆధారపడి ఉంటాయని వివరించారు.ఇదీ చదవండి: దూసుకెళ్తున్న బిట్‌కాయిన్.. కారణాలివే! -
బంగారం కొనాలంటే జేబు ఖాళీ..! భారీగా పెరిగిన బంగారం ధరలు
-
భారీగా పెరిగిన బంగారం ధర
-
అంతకంతకూ పెరిగిపోతున్న బంగారం! ఇప్పుడు తులం..
దేశంలో బంగారం ధరలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. వరుసగా మూడు రోజులు పెరిగి క్రితం రోజున నిలకడగా ఉన్న పసిడి ధరలు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. దీంతో పుత్తడి కొనుగోలుదారులకు ఈరోజు కూడా నిరాశ తప్పలేదు. ఇక వెండి ధరలు కూడా ఇదే రీతిలో కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.ఇదీ చదవండి: బంగారం భారీ ధరలు.. కియోసాకి కామెంట్స్ -
దూసుకెళ్తున్న రేటు.. వచ్చేవారం బంగారం ధరలు ఇలా!
బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరుగుతున్న వేళ.. నిపుణులు కొత్త అంచనాలు వెల్లడించారు. వచ్చే వారం కూడా ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. అయితే.. ఇప్పటికే ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో కొంతమంది పెట్టుబడిదారులు లాభాలను తీసుకునే అవకాశం ఉంది.దేశీయ మార్కెట్లో బంగారం ధర ఒక్క వారంలోనే సుమారు రూ.7,900 పెరిగి 10 గ్రాములకు రూ.1.63 లక్షలకు చేరుకుంది. అంటే దాదాపు 5.13 శాతం పెరిగింది. వెండి కూడా అంతే జోరుగా పెరిగింది. కేజీ రేటు రూ.2.70 లక్షలకు చేరుకుంది.బంగారం ధర పెరగడానికి ప్రధాన కారణాల్లో పెట్టుబడిదారుల కొనుగోళ్లు పెరగడం, అమెరికా బాండ్ యీల్డ్స్ తగ్గడం, మార్కెట్లో నగదు లభ్యత మెరుగుపడటం వంటివి ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. అమెరికా మార్కెట్లో బంగారం ధర సుమారు 5.5 శాతం, వెండి ధర దాదాపు 7 శాతం పెరిగాయి.అయితే.. వచ్చే వారం బంగారం ధరల దిశను నిర్ణయించడంలో అమెరికా ఆర్థిక గణాంకాలు చాలా కీలకం కానున్నాయి. ముఖ్యంగా అమెరికా కోర్ పర్సనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్స్, జీడీపీ డేటాపై మార్కెట్లు దృష్టి పెట్టనున్నాయి. అమెరికా ఆర్థిక పరిస్థితి, ద్రవ్యోల్బణం ఆధారంగా.. వడ్డీ రేట్లపై పెట్టుబడిదారులు తమ అంచనాలను మార్చుకోవచ్చు. దీని ప్రభావం డాలర్, బాండ్ యీల్డ్స్తో పాటు బంగారం ధరలపైనా పడుతుంది.పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలు కూడా బంగారం ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు, హర్ముజ్ పరిస్థితి మార్కెట్లకు చాలా కీలకం. ప్రపంచంలో రాజకీయ ఉద్రిక్తతలు పెరిగినప్పుడు చాలామంది పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తారు. కాబట్టి పసిడి ధరలు పెరిగే అవకాలు మెండుగా ఉన్నాయి.ఇక ఆగస్టు 27 నుంచి 29 వరకు జరిగే జాక్సన్ హోల్ సమావేశంపైనా మార్కెట్ దృష్టి ఉంటుంది. ఫెడరల్ రిజర్వ్ ఛైర్ కెవిన్ వార్ష్ అక్కడ చేసే ప్రసంగంలో అమెరికా వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, ఆర్థిక వ్యవస్థపై ఏమైనా సంకేతాలు ఇస్తే.. వాటిని పెట్టుబడిదారులు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు. ఇది బంగారం ధరలను తప్పకుండా ప్రభావితం చేస్తుంది.ఇదీ చదవండి: ద్రవ్యోల్బణం ముప్పు తప్పదా?.. పీటర్ షిఫ్ సంచలన వ్యాఖ్యలు -
ద్రవ్యోల్బణం ముప్పు తప్పదా?.. పీటర్ షిఫ్ సంచలన వ్యాఖ్యలు
అమెరికన్ స్టాక్ బ్రోకర్, ఆర్థిక వ్యాఖ్యాత, యూరో పసిఫిక్ అసెట్ మేనేజ్మెంట్ సీఈఓ 'పీటర్ షిఫ్' (Peter Schiff) తన ట్వీట్లో అమెరికా ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా ఫెడరల్ రిజర్వ్ (Fed)పై పెట్టుబడిదారుల్లో పెరుగుతున్న అనుమానాల గురించి పేర్కొన్నారు. బంగారం, వెండి, చమురు, బిట్‌కాయిన్ ధరలను ఉదాహరణగా తీసుకుని.. ప్రజలు తమ డబ్బును ద్రవ్యోల్బణం నుంచి కాపాడుకునేందుకు ప్రత్యామ్నాయ పెట్టుబడుల వైపు వెళ్తున్నారని ఆయన చెబుతున్నారు.సాధారణంగా ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు డబ్బు విలువ తగ్గుతుందనే ఆందోళనతో కొంతమంది బంగారం వంటి ఆస్తులను సురక్షితమైన ఆస్తులుగా ఎంచుకుంటారు. ఇందులోనే పెట్టుబడులు పెడుతుంటారు.షిఫ్ అభిప్రాయం ప్రకారం.. ఫెడ్ ద్రవ్యోల్బణాన్ని 2 శాతానికి తిరిగి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, అమెరికా ప్రభుత్వ భారీ రుణభారం, అధిక వడ్డీ రేట్ల ప్రభావం వంటి కారణాల వల్ల అది కష్టంగా మారే అవకాశం ఉంది. అందుకే ఫెడ్ చివరికి ద్రవ్యోల్బణాన్ని పూర్తిగా అణచివేయడం కంటే కొంత ఎక్కువ ద్రవ్యోల్బణాన్ని సహించాల్సి రావచ్చని ఆయన భావిస్తున్నారు. అయితే ఇది ఫెడ్ అధికారిక ప్రకటన కాదు.. షిఫ్ చేసిన ఆర్థిక విశ్లేషణ మాత్రమే.పెట్టుబడిదారులు తమ డబ్బును కాపాడుకునేందుకు తమకు నచ్చిన ప్రత్యామ్నాయాలను ఎంచుకుంటున్నారు. కొందరు బంగారం, వెండి వైపు వెళ్తే, మరికొందరు బిట్‌కాయిన్ ఎంచుకోవచ్చు. మొత్తం మీద.. ఫెడ్ మీద నమ్మకం తగ్గుతున్న కొద్దీ, ద్రవ్యోల్బణం నుంచి తమ సంపదను కాపాడుకోవడానికి పెట్టుబడిదారులు ప్రత్యామ్నాయ ఆస్తుల వైపు చూస్తున్నారని షిఫ్ స్పష్టం చేశారు.Gold hitting $4,600, silver near $70, oil over $87, and Bitcoin's earlier spike above $79K show the Fed has lost all credibility on its commitment to returning inflation to 2%. Treasury made it clear the Fed will choose inflation, so investors are choosing their preferred hedge.— Peter Schiff (@PeterSchiff) August 21, 2026 -
డాలర్లు వస్తున్నాయ్.. జాగ్రత్త!
అమెరికా మరోసారి క్వాంటిటేటివ్ ఈజింగ్ (QE) పేరుతో డాలర్లను ముద్రించేందుకు సిద్ధమవుతోందని ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ (X) ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. అమెరికా ట్రెజరీ తీసుకునే ఇలాంటి చర్యలతో డాలర్ కొనుగోలు శక్తిని సూచించే డీఎక్స్‌వై (DXY) సూచీ పడిపోతుందని, ఫలితంగా ద్రవ్యోల్బణం పెరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు.డాలర్లలో పొదుపు చేసుకునే వారే అధికంగా నష్టపోతారని కియోసాకి హెచ్చరించారు. ఆర్థికంగా అవగాహన ఉన్న పెట్టుబడిదారులు విలువ పెరిగే బంగారం, వెండి, బిట్‌కాయిన్, కొంత రియల్ ఎస్టేట్ వంటి ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టి సంపదను పెంచుకుంటారని చెప్పారు. ఆర్థిక పరిజ్ఞానం లేని వారు విలువ కోల్పోయే ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టి నష్టపోతారని పేర్కొన్నారు.ఇదీ చదవండి: బంగారం భారీ ధరలు.. కియోసాకి కామెంట్స్‘ఆర్థిక విద్య ఖరీదైనదని మీరు భావిస్తే.. ఆర్థిక అజ్ఞానానికి చెల్లించే మూల్యం ఎంత?’ అని గతంలో తాను చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా కియోసాకి గుర్తుచేశారు. ఆర్థిక విద్య కోసం వెచ్చించే సమయం, డబ్బు కంటే.. ఆర్థిక అవగాహన లేకపోవడం వల్ల సంపాదించలేని డబ్బే అతిపెద్ద ఖర్చు అని తన ‘రిచ్ డాడ్’ చెప్పేవారని ఆయన పేర్కొన్నారు.PRINTING MORE FAKE $US Treasury announces another round of QE (Quantatative Easing) aka printing fake $.DXY (index of purchasing power of dollars) CRASHES, which means INFLATION Booms….which means savers of fake $ are the biggest losers.Don’t be a Loser.As stated in my…— Robert Kiyosaki (@theRealKiyosaki) August 22, 2026 -
పసిడి ప్రియులకు షాక్.. భారమైపోతున్న బంగారం!
బంగారం ధరలకు రెక్కలొచ్చాయా అన్నట్లుగా.. గోల్డ్ రేటు రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఈ రోజు కూడా గరిష్టంగా రూ.1520 పెరిగిన పసిడి ధర.. వారం రోజుల్లో ఏకంగా రూ.7,960 పెరిగి, జీవితకాల గరిష్టాలను తాకింది. ఈ కథనంలో ఏడు (ఆగస్టు 16 నుంచి 22 వరకు) రోజుల్లో బంగారం ధర ఏ నగరంలో ఎంత పెరిగిందనే వివరాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఆగస్టు 16న రూ.1,55,130 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర, ఆగస్టు 22 నాటికి 1,63,090 రూపాయల వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో పెరిగిన గోల్డ్ రేటు రూ. 7960 అన్నమాట. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు విషయానికి వస్తే.. ఏడురోజుల్లో 1,42,200 రూపాయల నుంచి రూ.1,49,500 వద్దకు (రూ.7300 పెరిగింది) చేరింది.చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,55,130 నుంచి రూ. 1,63,090 వద్దకు చేరింది. అంటే ఏడురోజుల్లో రూ. 7960 పెరిగింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,42,200 నుంచి రూ.1,49,500 (రూ.7300 పెరిగింది) వద్దకు చేరింది.దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో గణనీయమైన మార్పు కనిపించింది. ఇక్కడ రూ.1,55,280 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,63,240 వద్దకు (రూ.7960 పెరిగింది) చేరింది. 22 క్యారెట్ల రేటు రూ.1,42,350 నుంచి రూ.1,49,650 వద్దకు (రూ.7300 పెరిగింది) చేరింది.ఇదీ చదవండి: బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్! -
1 పైసా బిడ్‌తో రూ.755 కోట్ల కాంట్రాక్ట్
తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘తాయ్‌మామన్ తంగ మోదిరం’ (మేనమామ బంగారు ఉంగరం) పథకానికి సంబంధించి నిర్వహించిన గ్లోబల్ టెండర్లలో ప్రముఖ ఆభరణాల సంస్థ జోయాలుక్కాస్ సంచలన బిడ్‌తో ఎల్1 స్థానాన్ని కైవసం చేసుకుంది. సుమారు రూ.755.83 కోట్ల విలువైన ఈ ప్రాజెక్ట్‌లో ఒక గ్రామ్ 22 క్యారెట్ల బంగారు ఉంగరానికి కేవలం ‘1 పైసా’ మాత్రమే సర్వీస్ / తయారీ రుసుము (మేకింగ్ ఛార్జీలు, ట్రాన్స్పోర్ట్, ఇన్సూరెన్స్, హాల్‌మార్కింగ్)గా ఖరారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.ఈ పోటీలో పాల్గొన్న 11 ప్రముఖ సంస్థల్లో జీఆర్టీ జ్యువెలర్స్ రూ.410.97 (L2), వుమ్మిడి బంగారు జ్యువెలర్స్ రూ.822.97 (L3) ప్రతిపాదించగా జోయాలుక్కాస్ కోట్ చేసిన వ్యయం ఎవరికీ ఊహకందని విధంగా నిలిచింది. తమిళనాడు టెండర్ల పారదర్శకత చట్టం ప్రకారం, తక్కువ ధరను మ్యాచ్ చేసేందుకు ఇతర కంపెనీలకు అవకాశం ఇవ్వగా ఒక్క కల్యాణ్ జ్యువెల్లర్స్ మాత్రమే ముందుకు వచ్చింది. దాంతో ఈ మొత్తం ఆర్డర్లో 70 శాతం కోటాను జోయాలుక్కాస్‌కు, మిగిలిన 30 శాతాన్ని కల్యాణ్ జ్యువెలర్స్‌కు కేటాయిస్తూ టీఎన్ఎంఎస్సీ ఉత్తర్వులు జారీ చేసింది.తమిళనాడులోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించే దాదాపు 4.41 లక్షల మంది నవజాత శిశువులకు ఒక్కో గ్రాము బంగారు ఉంగరాన్ని సెప్టెంబర్ 15 నుంచి పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వం బంగారం అసలు ధరకు అయ్యే వ్యయాన్ని భరిస్తుండగా తయారీ, పంపిణీ బాధ్యతలను ఈ సంస్థలు నిర్వర్తిస్తాయి. వాణిజ్య లాభాల కంటే ప్రజారోగ్య సంక్షేమ పథకానికి మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతోనే రూపాయి రహిత లాభాల మార్జిన్‌తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జోయాలుక్కాస్ అధినేత జోయ్ ఆలుక్కాస్ వెల్లడించారు.మరోవైపు, ఒక పైసాకే ఎలా పనులు చేపడతారంటూ ప్రతిపక్ష ఏఐఏడీఎంకే ఈ ప్రక్రియపై సందేహాలు వ్యక్తం చేయగా, తమిళనాడు ఆరోగ్య శాఖ నిబంధనల ప్రకారమే పారదర్శకంగా అత్యంత నాణ్యమైన బీఐఎస్ హాల్‌మార్క్ బంగారాన్ని సేకరిస్తున్నామని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: అనలాగ్ పన్నీర్‌పై నిషేధం -
పసిడి మోత.. మూడో రోజూ మరింత..
దేశంలో బంగారం ధరల పెరుగుదల కొనసాగింది. వరుసగా మూడో రోజూ పసిడి ధరలు భారీగా ఎగిశాయి. దీంతో పుత్తడి కొనుగోలుదారులకు ఈరోజు కూడా నిరాశ తప్పలేదు. ఇక వెండి ధరలు మాత్రం నేడు శాంతించాయి. ఎటువంటి మార్పు లేకుండా నిలకడగా కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.ఇదీ చదవండి: బంగారం భారీ ధరలు.. కియోసాకి కామెంట్స్ -
ఏకంగా 50 గ్రాముల బంగారు కడ్డీని మింగేసిన చిన్నారి.. చివరికి!
పసిపిల్లలు కనిపించిన ప్రతీవస్తువును నోట్లో పెట్టుకోవడం, దాన్ని మింగేయడం చేస్తుంటారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఇలాంటి చర్యలు ఒక్కోసారి ప్రమాదకరంగా మారడం చాలా సార్లు విన్నాం. తాజాగా ఏకంగా బంగారు కడ్డీని మింగేసిందో చిన్నారి. దీంతో ఆమె ప్రాణాలమీదకు తెచ్చుకుంది. మరోవైపు అంత బంగారం పాపకు అందుబాటులో ఎందుకుంచారు అనేది నెట్టింట చర్చనీయాంశంగా మారింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం, ఉత్తర చైనాలో ఐదేళ్ల బాలిక ప్రమాదవశాత్తు 50 గ్రాముల బంగారు కడ్డీని మింగేసింది. ఆ బాలిక ఇంట్లో ఆడుకుంటుండగా ఆ బంగారు కడ్డీని పొరపాటున మింగింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. కానీ అక్కడ పరిస్థితి విషమించడంతో, గత ఆదివారం (ఆగస్టు 16) ఆ బాలికను బీజింగ్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో చేర్పించారు. ఎక్స్-రేలో వెల్లడైన ప్రకారం, 4 సెం.మీ. పొడవున్న ఆ చిన్న బంగారు కడ్డీ, బాలిక మింగిన తర్వాత కూడా కడుపులోనే ఇరుక్కుపోయింది. ఆ బంగారు కడ్డీ బాలిక జీర్ణాశయ కుహరంలో ఇరుక్కుపోయిందని వైద్యులు కనుగొన్నారు. ఆపరేషన్ చేయడానికి ఆ ప్రదేశం చాలా ఇరుకుగా ఉంటుంది. అయినప్పటికీ, వైద్యులు ఆపరేషన్ జరుగుతున్నప్పుడే ఎండోస్కోపీ చేసి, ఒక ఉచ్చు సహాయంతో ఆ కడ్డీని బయటకు తీసి, కుహరం నుండి జాగ్రత్తగా బయటకు తీశారు.ఆ బంగారు కడ్డీని తొలగించడానికి వైద్యుల బృందానికి కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే పట్టింది, కానీ అది చాలా సున్నితమైన ఆపరేషన్. ఆ బాలిక కూడా కోలుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బరువుగా, గట్టిగా ఉన్న ఆ బంగారు కడ్డీ ఆమె జీర్ణాశయ పొరను గీరివేసి, తీవ్రమైన అంతర్గత రక్తస్రావం , అవయవాలకు రంధ్రాలు పడే ప్రమాదాన్ని కలిగించేదన్నారు వైద్యులు. ఈ ఆపరేషన్ వార్త వైరల్ అవ్వడంతో, సోషల్ మీడియాలోని కొంతమంది వినియోగదారులు ఆ బాలిక అంత ఖరీదైన బంగారు కడ్డీని ఎలా అందుకుందని ప్రశ్నించగా, మరికొందరు తల్లిదండ్రులు ఆ వస్తువును అందుబాటులో లేకుండా ఉంచాల్సిందని అన్నారు.ఇదీ చదవండి: 14 ఏళ్లకే సోషల్ మీడియాలో సంచలనం ఎవరీ ‘ఏలియన్ స్టార్’ నెటిజన్ల రియాక్షన్స్ "ఐదేళ్ల చిన్నారికి 50 గ్రాముల బంగారు కడ్డీని అంత సులభంగా అందేలా చేయడానికి ఆ కుటుంబం ఎంత ధనవంతులై ఉండాలి?" అని ఒక వినియోగదారు ప్రశ్నించగా, మరొకరు బాధ్యతాయుతమైన తల్లిదండ్రులు ఎల్లప్పుడూ తమ పిల్లల ప్రవర్తనను గమనిస్తూ, ప్రమాదకరమైన వస్తువులను వారికి అందుబాటులో లేకుండా ఉంచాలని సూచించారు.ఇదీ చదవండి: మహిళతో వివాదంలో గ్యాంగ్ వార్ : ఒకరి దారుణ హత్యఇదీ చదవండి: పెల్లెట్ గన్ వివాదం: సాహిల్‌తో కలిసి రాహుల్‌గాంధీ ధర్నా -
ఒక్కసారిగా తారుమారు అయినా బంగారం, వెండి ధరలు తులం ఎంతంటే?
-
బంగారం, వెండి ధనాధన్.. కొత్త మార్క్‌కు నగల ధరలు
దేశంలో బంగారం ధరల పెరుగుదల కొనసాగింది. వరుసగా రెండో రోజూ పసిడి ధరలు ఎగిశాయి. దీంతో పుత్తడి కొనుగోలుదారులకు వరలక్ష్మీ వ్రతం పండుగ రోజున కూడా నిరాశ తప్పలేదు. ఇక వెండి ధరలు కూడా నేడు భగ్గుమన్నాయి. వరుసగా రెండో రోజూ దూసుకెళ్లాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.ఇదీ చదవండి: బంగారం భారీ ధరలు.. కియోసాకి కామెంట్స్ -
బంగారం, వెండి ధరల్లో భారీ జంప్.. తులం ఎంతంటే?
-
భారీగా పెరిగిన బంగారం.. ధర ఎంతంటే..!
-
బంగారం డిమాండ్ ‘జిగేల్’!
బంగారం ధరలు దిగిరావడం, మరింత స్థిరంగా కొనసాగడంతో దేశంలో పసిడి డిమాండ్ మళ్లీ మెరుగుపడుతోందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) మార్కెట్ అధ్యయనంలో వెల్లడించింది. రాబోయే పండుగ సీజన్లో బంగారం కొనుగోళ్లు జోరందుకుంటాయన్న అంచనాలు నెలకొన్నాయని పేర్కొంది. అయితే, తాజాగా పుత్తడి ధరలకు మళ్లీ రెక్కలు రావడం... నగల కొనుగోళ్లను ప్రభావితం చేయొచ్చని అభిప్రాయపడింది.డబ్ల్యూజీసీ మార్కెట్ అప్డేట్లో ముఖ్యాంశాలు...ఇటీవల బంగారం ధరల్లో హెచ్చుతగ్గులను వినియోగదారులు కొనుగోలు అవకాశంగా పరిగణిస్తున్నారు. జ్యువెలరీ డిమాండ్ పుంజుకుంటోంది.జూన్ తర్వాత ధరలు భారీగా తగ్గడం, జూలైలో స్థిరంగా ఉండటం, ఆగస్టులో మళ్లీ రికవరీ నేపథ్యంలో జ్యవెలరీ రిటైలర్లు రాబోయే పండుగ సీజన్ కోసం భారీగా నిల్వలను తిరిగి నింపుకోవడానికి దోహదం చేసింది.గత కొన్ని నెలలుగా వాయిదా వేస్తున్న కొనుగోలుదారులు మళ్లీ షోరూమ్‌లకు తిరిగొస్తున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్ల కోసం తప్పనిసరి కొనుగోళ్లే కాకుండా సాధారణ డిమాండ్ మార్కెట్లో నెలకొంటోంది.తయారీదారులకు ఆర్డర్లు పెరుగుదల మొదలైంది. సీజనల్ డిమాండ్ విషయంలో జ్యువెలర్లలో నమ్మకం పెరుగుతోందనడానికి ఇదే నిదర్శనం.పాత బంగారం ఎక్స్ఛేంజ్ కూడా జోరుగానే కొనసాగుతోంది. కొనుగోళ్లలో ఇది చాలా కీలక పాత్ర పోషిస్తోంది.భౌతిక పెట్టుబడుల డిమాండ్ గత గరిష్టాలతో పోలిస్తే తగ్గుముఖం పట్టింది. అయితే ధరల దిద్దుబాటు సమయంలో కొనుగోళ్లకు దన్నుగా నిలిచింది.ధరల తగ్గుదల పసిడిలో వ్యూహాత్మక పెట్టబడుల కోసం చూస్తున్న ఇన్వెస్టర్లను ఆకర్షించింది. ఇటీవల రేట్లు పుంజుకోవడంతో ఆసక్తి మరింత పెరుగుతోంది.రెండు నెలల బలహీన ధోరణి అనంతరం, జూలైలో బంగారం దిగుమతులు మళ్లీ జోరందుకున్నాయి. డిమాండ్ మెరుగుదలతో పాటు పండుగ సీజన్ కోసం తయారీదారులు, రిటైలర్లు నిల్వలు పెంచుకుంటున్నారనేదాన్ని ఇది సూచిస్తోంది. అయితే, జనవరి–మార్చిలో సగటున 11 శాతం దిగుమతుల వృద్ధితో పోలిస్తే, జూలైలో 5 శాతం మాత్రమే పెరుగుదల నమోదైంది.జూన్‌లో 1.97 బిలియన్ డాలర్ల విలువైన 20 టన్నుల పుత్తడి దిగుమతులు జరగ్గా.. జూలైలో రెట్టింపు స్థాయిలో 4.16 బిలియన్ డాలర్లకు (40–45 టన్నులు) ఎగబాకాయి. గోల్డ్ రీసైక్లింగ్, ప్రధానంగా పాత బంగారం మార్పిడి కొనసాగడం వల్ల కూడా సరఫరా పెరిగింది.ఇదీ చదవండి: యూట్యూబ్ వ్యూస్ లెక్కింపులో మార్పులు -
శ్రావణమాసం ఎఫెక్ట్.. భారీగా తగ్గిన బంగారం ధరలు
-
మారిన గోల్డ్ రేటు.. కొత్త ధరలు ఇలా..
బంగారం ధరలు రోజురోజుకి పెరుగుతూ.. ఈ రోజు కూడా పెరుగుదల దిశగానే అడుగులు వేసాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేటులో మార్పులు జరిగాయి. అయితే వెండి ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. ఈ కథనంలో లేటెస్ట్ గోల్డ్, సిల్వర్ ధరలకు సంబంధించిన వివరాలు చూసేద్దాం. -
సిద్దిపేటలో లేడీ కిల్లర్
సిద్దిపేటకమాన్: డబ్బు, బంగారం కోసం వరుస హత్యలకు పాల్పడుతున్న లేడీ కిల్లర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం సిద్దిపేట పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఏసీపీ రవీందర్‌రెడ్డితో కలిసి సీపీ రష్మీ పెరుమాళ్ కేసు వివరాలను వెల్లడించారు. దుబ్బాక మండలం రామక్కపేట గ్రామ శివారు రోడ్డు పక్కన ఈ నెల 8న పాక్షికంగా కాలిపోయిన గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మృతురాలు భూంపల్లిలోని డబుల్ బెడ్రూం కాలనీలో నివాసముండే అతికం విజయ (45)గా పోలీసులు గుర్తించారు. విచారణలో భాగంగా సీసీ కెమెరాల ద్వారా భూంపల్లి గ్రామానికి చెందిన చాకలి రజిత, ఆమె కుమారుడిని నిందితులుగా గుర్తించారు. వీరు స్థానికంగా కిరాణ దుకాణం, టీస్టాల్ నిర్వహిస్తున్నారు. రజిత భర్త అనారోగ్యంతో బెడ్‌పై ఉంటున్నాడు. రజిత తన మైనర్ కుమారుడితో కలిసి ఒంటరి మహిళలను హత్య చేసి, బంగారు ఆభరణాలు దొంగిలించి, వాటిని విక్రయించి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే వీరి ఇంటికి దగ్గర్లో ఒంటరిగా ఉంటున్న అతికం విజయ ఈ నెల 8న కిరాణ షాప్‌నకు రాగా ముందస్తు ప్రణాళిక ప్రకారం లోపలికి పిలిచి ఆమెను హత్య చేసి బంగారు ఆభరణాలు తీసుకున్నారు. అదే రోజు రాత్రి మృతదేహాన్ని ఎక్స్ఎల్ వాహనంపై రామక్కపేట శివారులో పెట్రోల్ పోసి కాల్చేశారు. ఈ ఏడాది మే 28న వీరి ఇంటి దగ్గర్లో నివాసముండే కుంట రేఖ కూడా కిరాణ షాపునకు రాగా ఆమెను కూడా హత్య చేసి, అచ్చుమాయిపల్లి గ్రామ శివారులో కాల్చివేశారు. 2025 జూన్‌లో భూంపల్లి గ్రామానికి చెందిన అన్నపూర్ణ ఉదయం వాకింగ్ చేస్తుండగా ఆమెపై దాడి చేసి 5 తులాల బంగారు పుస్తెలతాడును చోరీ చేశారు. మరో నలుగురు మహిళలను కూడా హత్య చేసి, వారి నుంచి బంగారం చోరీ చేయాలనే ప్రణాళిక రూపొందించినట్టు పోలీసుల విచారణలో చెప్పింది. అయితే అనారోగ్యంతో మంచంపై ఉన్న భర్తను కూడా హత్య చేయాలని నిందితురాలు ప్రణాళిక రచించిందని, ఇందుకు ఇన్సూరెన్స్ చేయించాలని ప్లాన్ చేసిందని పోలీసులు తెలిపారు. నిందితురాలిని అదుపులోకి తీసుకొని ఆమె నుంచి రూ.10 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదు వాహనం, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హత్యల కోసం కుమారుడికి జిమ్ ఏర్పాటు..మహిళలను హత్య చేయడానికి కుమారుడిని అన్ని విధాలుగా సిద్ధం చేసింది. దుకాణంలోనే జిమ్‌ను ఏర్పాటు చేయించి కొడుకుతో వ్యాయామం చేయించేది. దుకాణంలో పలు రకాల వ్యాయామ పరికరాలను పోలీసులు గుర్తించారు. -
అమెరికా అప్పులు.. కియోసాకి సంచలన వ్యాఖ్యలు!
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి తాజాగా చేసిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న అప్పులు పెరుగుతున్న నేపథ్యంలో.. భవిష్యత్తులో డబ్బు విలువ తగ్గే అవకాశం ఉందని, అందుకే బంగారం, వెండి వంటి ఆస్తులపై దృష్టి పెట్టాలని ఆయన సూచిస్తున్నారు.అమెరికా అప్పులుఅమెరికా అప్పు త్వరలో 40 ట్రిలియన్ డాలర్లకు చేరొచ్చని కియోసాకి పేర్కొన్నారు. ప్రభుత్వం ఎక్కువగా అప్పులు చేస్తే.. భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అప్పులు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగితే.. చేతిలో ఉన్న డబ్బు విలువ తగ్గుతుంది. ఇది ప్రజలపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది.బంగారం, వెండి భారీగా పెరుగుతాయా?కియోసాకి తనకు తెలిసిన ఆర్థిక నిపుణుడు జిమ్ రికార్డ్స్ వంటి వారు బంగారం, వెండి ధరలపై భారీ అంచనాలు వేస్తున్నారని చెప్పారు. వెండి ధర ఔన్సుకు 200 డాలర్లకు, బంగారం ధర ఔన్సుకు 10,000 డాలర్లకు చేరొచ్చన్న అంచనాలను ఆయన ప్రస్తావించారు. అయితే.. ఇవి ఖచ్చితమైన ధరలు కావు. కొందరు నిపుణులు చేస్తున్న అంచనాలు మాత్రమే. మార్కెట్ పరిస్థితులు మారితే ఈ అంచనాలు కూడా మారవచ్చు.కియోసాకి బంగారం, వెండి రెండింటినీ ప్రస్తావించినప్పటికీ.. 2026 ఆగస్టులో తనకు మాత్రం వెండే మంచి ఎంపికగా కనిపిస్తోందని కియోసాకి చెప్పారు. వెండికి ప్రత్యేకత ఏమిటంటే.. ఇది కేవలం పెట్టుబడి లోహం మాత్రమే కాదు. సౌర విద్యుత్, ఎలక్ట్రానిక్స్, ఇతర పారిశ్రామిక రంగాల్లో కూడా వెండిని ఉపయోగిస్తారు. దీంతో భవిష్యత్తులో పారిశ్రామిక డిమాండ్ పెరిగితే వెండికి అదనపు మద్దతు లభించవచ్చని భావిస్తున్నారు.$40 TRILLION US NATIONAL soon!!Q: What are you doing about it?Friends who are much smarter than me, such as Jim Rickards are predicting $200 an ounce for silver and $10,000 an ounce gold soon.Of the two…. I think silver is the best choice in August 2026.Q: What do you…— Robert Kiyosaki (@theRealKiyosaki) August 15, 2026 -
80 ఏళ్లలో 1711 రెట్లు పెరిగిన బంగారం!
భారతదేశంలో బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఈ కారణంగానే ధరలు మెల్లగా పెరుగుతూ.. ఇప్పుడు రూ.1.50 లక్షలకు (10 గ్రాములు) చేరింది. అయితే.. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు గోల్డ్ రేటు ఎలా ఉండేది?, ఆ తరువాత జరిగిన పరిణామం ఏమిటి?, అనే విషయాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.మనదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు(1947లో) 10 గ్రాముల బంగారం ధర కేవలం రూ.88.62 మాత్రమే. కానీ అదే 10 గ్రాముల గోల్డ్ రేటు ఇప్పుడు 2026 ఆగస్టు రూ.1,55,130 వద్దకు చేరింది. అంటే 80 ఏళ్లలో పసిడి ధర ఏకంగా 1711 రెట్లు పెరిగిందన్నమాట.అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. బంగారం ధర ఇంతగా పెరగడం ఒక్కసారిగా జరగలేదు. దాదాపు ఎనిమిది దశాబ్దాల పాటు నెమ్మదిగా, మధ్య మధ్యలో హెచ్చుతగ్గులతో ఈ ప్రయాణం సాగింది. 1950లో 10 గ్రాముల గోల్డ్ రేటు 99.18 రూపాయలుగా ఉండేది. ఆ తరువాత 1964లో రూ.63.25కు చేరింది. అంటే.. బంగారం ధర కూడా ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుందని చెప్పలేం. ఎందుకంటే కొన్నిసార్లు ధరలు తగ్గడం, మరికొన్ని సంవత్సరాలు పెద్దగా మార్పు లేకపోవడం జరిగింది.ఇదే సమయంలో వెండి ధర కూడా భారీగా పెరిగింది. 1970-71లో ఒక కిలో వెండి సగటు ధర రూ.536.08 మాత్రమే. 2026 ఆగస్టు 15 నాటికి అది రూ.2.55 లక్షలకు చేరింది. అంటే దాదాపు 56 ఏళ్లలో వెండి ధర సుమారు 390 రెట్లు పెరిగింది. అయితే.. వెండి ధర కూడా ఎప్పుడూ ఒకే విధంగా పెరగలేదు. 2011-12లో కేజీ వెండి ధర రూ.57,315.87కు చేరిన తర్వాత, 2015-16లో రూ.36,318.10కు పడిపోయింది. ఆ తర్వాత మళ్లీ ధర పెరుగుతూ వచ్చింది.బంగారం, వెండిని ధరలను పోల్చి చూస్తే ఒక ఆసక్తికరమైన విషయం కనిపిస్తుంది. 1984-85 నుంచి లెక్కిస్తే బంగారం ధర సుమారు 76 రెట్లు పెరిగింది. అదే సమయంలో వెండి ధర సుమారు 55 రెట్లు పెరిగింది. అంటే ఆ కాలంలో వెండితో పోలిస్తే బంగారం ధర పెరుగుదల ఎక్కువగా ఉందన్న విషయం స్పష్టమవుతుంది.ఈ రోజు ధరలుభారతదేశంలో ఈ రోజు గోల్డ్ రేటు రూ.1,55,130 (10 గ్రాముల 24 క్యారెట్స్ ధర) వద్ద ఉంటే.. 10 గ్రాముల 22 క్యారెట్స్ రేటు రూ.142200 వద్ద ఉంది. వెండి ధర రూ.2.55 లక్షలకు చేరింది. ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే గోల్డ్ రేటు ఎంత పెరుగుతుందనే విషయం తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: 79 ఏళ్లలో మారిపోయిన భారతీయుల ఖర్చు తీరు! -
పసిడి దూకుడు: తులం రేటు ఇప్పుడు..
దేశంలో బంగారం ధరల పెరుగుదల కొనసాగింది. వరుసగా రెండో రోజూ పసిడి ధరలు ఎగిశాయి. దీంతో పుత్తడి కొనుగోలుదారులకు ఈరోజు కూడా నిరాశ తప్పలేదు. ఇక వెండి ధరలు మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
బంగారం, వెండి కొనుగోళ్లకు కొత్త పోర్టల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్, ఈ–కామర్స్ సంస్థ నిహార్ ఇన్ఫో గ్లోబల్ తాజాగా పసిడి, వెండి కొనుగోళ్లకు సంబంధించి గోల్డ్‌ఎన్‌సిల్వర్.షాప్ పోర్టల్‌ను సరికొత్తగా తీర్చిదిద్దింది. భౌతిక, డిజిటల్, ఈటీఎఫ్‌ల రూపంలో బంగారం, వెండి నాణేలు, కడ్డీలు మొదలైన వాటిని పారదర్శకమైన విధంగా ఒకే చోట కొనుగోలు చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని సంస్థ డైరెక్టర్ బీఎస్ఎన్ సూర్యనారాయణ తెలిపారు.ప్రస్తుతం ప్రయోగాత్మకంగా అమలు చేస్తుండగా, డిసెంబర్ ఆఖరు నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. దీనికోసం ఎంఎంటీసీ–పీఏఎంపీ, ఆగ్మంట్, జిరోధా మొదలైన సంస్థలతో జట్టు కట్టినట్లు ఆయన వివరించారు. దీని ద్వారా ఆర్థిక సంస్థలతో కలిసి పసిడి రుణాలను కూడా అందించనున్నట్లు పేర్కొన్నారు. జనవరి నాటికి యాప్ వెర్షన్ కూడా తేనున్నట్లు పేర్కొన్నారు. -
గంటల వ్యవధిలోనే.. బంగారం ధరల్లో భారీ మార్పు!
భారతదేశంలో భారీగా పెరిగిన బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఎందుకంటే ఈ రోజు (గురువారం) ఉదయం రూ.1,55,130 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు, సాయంత్రానికి రూ.1,53,600 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే గంటల వ్యవధిలోనే పసిడి ధరలు తారుమారైనట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో వివరంగా చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడలలో గురువారం (13 ఆగస్టు) రూ.1,55,130 (24 క్యారెట్స్) రూ.1,42,200 (22 క్యారెట్స్) వద్ద ఉన్న 10 గ్రాముల బంగారం ధర.. సాయంత్రానికి రూ.153600, రూ.140800 వద్దకు చేరింది. అంటే ధరలు వరుసగా రూ.1530, రూ.1400 తగ్గాయన్నమాట. ఇదే ధరలు బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా ఉన్నాయి.ఇక ఢిల్లీలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ కూడా సాయంత్రానికి, ఉదయానికి రేట్లలో చాలా తేడా కనిపించింది. ఉదయం 1,42,350 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,40,950 వద్దకు చేరగా.. 24 క్యారెట్ల రేటు 1,55,280 రూపాయల నుంచి 1,53,750 రూపాయల వద్దకు చేరింది.చెన్నైలో మాత్రం పసిడి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి ఈ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు 1,42,200 వద్ద, 24 క్యారెట్ల ధర రూ.1,55,130 వద్దనే ఉన్నాయి. వెండి రేటు మాత్రం రూ.2.60 లక్షలు (కేజీ ధర) వద్ద ఉంది. -
ఇన్వెస్టర్లకు పండగే మళ్లీ పెరిగిన బంగారం ధరలు
-
హ్యాట్రిక్ కొట్టిన బంగారం.. తులం రేటు ఇలా..
దేశంలో బంగారం ధరలు ఆగకుండా పెరుగుతున్నాయి. మూడు రోజులుగా వరుసగా పెరుగుతున్న పసిడి ధరలు మళ్లీ హాట్రిక్ కొట్టేశాయి. దీంతో పుత్తడి కొనుగోలుదారులకు ఈరోజు కూడా ఉపశమనం దక్కలేదు. ఇక వెండి ధరలు మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(బంగారం కొనుగోలుపై కియోసాకి కీలక వ్యాఖ్యలు) -
బంగారం కొనుగోలుపై కియోసాకి కీలక వ్యాఖ్యలు
బంగారం మరోసారి ఆల్‌టైమ్ గరిష్ఠాన్ని తాకిన నేపథ్యంలో ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బంగారాన్ని సాధారణ రిటైల్ ఇన్వెస్టర్లు మాత్రమే కాకుండా, అమెరికా డాలర్లను పెద్ద మొత్తంలో కలిగి ఉన్న కేంద్ర బ్యాంకులు కూడా భారీగా కొనుగోలు చేస్తున్నాయని ఆయన తన ఫేస్బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు అమెరికా డాలర్లకు బదులుగా బంగారాన్ని నిల్వ చేసుకునే ధోరణి గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగిందని ఆయన అన్నారు.1971 ఆగస్టు 15న అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ డాలర్‌ను బంగారంతో మార్పిడి చేసే విధానాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించడాన్ని కియోసాకి ప్రస్తావించారు. అప్పట్లో ఇది తాత్కాలిక నిర్ణయమని చెప్పినా, 54 ఏళ్లుగా అది కొనసాగుతోందని అన్నారు. అంతకుముందు డాలర్ విలువకు బంగారం ఆధారం ఉండేదని, ఆ తర్వాత అది ప్రభుత్వంపై, దాని విశ్వసనీయతపై ఆధారపడే కరెన్సీగా మారిందని వివరించారు.అమెరికా అప్పులు భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రపంచ దేశాలు తమ డాలర్ నిల్వలను బంగారంగా మార్చుకునే ధోరణి పెరుగుతోందని కియోసాకి అభిప్రాయపడ్డారు. ‘‘ఎవరైతే హామీలు ఇస్తున్నారో.. వారే ఇప్పుడు ఆ హామీల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అనే అర్థంలో ఆయన వ్యాఖ్యానించారు.తన ‘రిచ్ డాడ్’ నుంచి నేర్చుకున్న పాఠాన్ని ప్రస్తావిస్తూ.. ఇతరుల హామీపై ఆధారపడే డబ్బు, ఎవరి హామీ అవసరం లేని డబ్బు అనే రెండు రకాల సంపద ఉంటాయని కియోసాకి పేర్కొన్నారు. అయితే బంగారాన్ని కేవలం కొనుగోలు చేసి భద్రపరచడం కంటే, బంగారాన్ని ఉత్పత్తి చేసే గనుల్లో పెట్టుబడి పెట్టడమే మెరుగైన వ్యూహమని ఆయన సూచించారు.బంగారు గనుల్లో పెట్టుబడి పెడితే బంగారం విలువతో పాటు గని ద్వారా వచ్చే ఆదాయం, భవిష్యత్తులో ఆ వ్యాపారం పెరిగే కొద్దీ లభించే విలువ కూడా పెట్టుబడిదారుడికి దక్కుతుందని కియోసాకి వివరించారు. ఈ సందర్భంగా ‘ది క్యాపిటల్ క్లబ్’ పేరుతో పెట్టుబడి అవకాశాలను అందించే సంస్థను, దాని ద్వారా బంగారం-వెండి మైనింగ్ ఆపరేషన్‌లో పెట్టుబడి అవకాశాన్ని ఆయన ప్రస్తావించారు. -
రికార్డు స్థాయికి బంగారం ధరలు..
-
ఇన్వెస్టర్ల దశ తిప్పిన స్కై గోల్డ్ అండ్ డైమండ్స్ షేర్
-
పసిడి తగ్గేదేలే..
న్యూఢిల్లీ: ఆయిల్ రేట్లు అంతర్జాతీయంగా అధిక స్థాయిలోనే కొనసాగుతున్నప్పటికీ బులియన్‌పై పెట్టుబడులకు సంబంధించి ట్రేడర్ల నుంచి గణనీయంగా డిమాండ్ నెలకొనడంతో పసిడి ధరలు పరుగులు తీస్తున్నాయి. వరుసగా ఆరో సెషన్లోనూ ర్యాలీ కొనసాగించి, మంగళవారం ఏకంగా రెండు నెలల గరిష్ట స్థాయికి చేరాయి. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9% స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,200 పెరిగి రూ. 1,57,200కి చేరింది. గత 6 ట్రేడింగ్ సెషన్లలో బంగారం రేటు రూ. 9,800 (సుమారు 6.65%) పెరిగింది. మరోవైపు, వెండి కూడా అదే ధోరణిలో కేజీకి ఇంకో రూ. 2,000 పెరిగి రూ. 2,42,000కి చేరింది. ఇది కూడా దాదాపు 2 నెలల గరిష్ట స్థాయి. -
ఇక సామాన్యులు గోల్డ్ కొనలేరా? తులం 2 లక్షలు?
-
కేంద్రానికి పసిడి పంట
బంగారం, వెండి, ప్లాటినం దిగుమతి సుంకాలను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కేంద్ర ఖజానాకు కాసుల వర్షం కురిపించింది. ఈ ఏడాది మే 13 నుంచి ఆగస్టు 2 వరకు స్వల్ప వ్యవధిలోనే విలువైన లోహాల దిగుమతుల ద్వారా కస్టమ్స్ సుంకాల రూపంలో ఏకంగా రూ.10,463 కోట్ల రాబడి సమకూరినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.ఆదాయంలో పసిడిదే అగ్రస్థానంమొత్తం కస్టమ్స్ వసూళ్లలో సింహభాగం బంగారం నుంచే లభించింది. బంగారం దిగుమతులపై రూ.10,040 కోట్లు, వెండి దిగుమతులపై రూ.328 కోట్లు, ప్లాటినం దిగుమతులపై రూ.95 కోట్లు సమకూరింది.సుంకాల పెంపునకు కారణాలుపశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ సంక్షోభం, హార్మూజ్ జలసంధి ఆటంకాల కారణంగా అంతర్జాతీయంగా ముడిచమురు, ఎరువుల ధరలు పెరిగాయి. దేశీయ విదేశీ మారక నిల్వలను (ఫారెక్స్) పరిరక్షించుకోవడానికి, అనవసర దిగుమతులకు అడ్డుకట్ట వేయడానికి కేంద్రం మే 13న పసిడి, వెండి దిగుమతి సుంకాన్ని 6 శాతాల నుంచి 15 శాతానికి, ప్లాటినం సుంకాన్ని 6.4 శాతం నుంచి 15.4 శాతానికి పెంచిన విషయం విదితమే. చమురు, నిత్యావసర పారిశ్రామిక ముడిసరుకుల దిగుమతులకు ఫారెక్స్ నిల్వలను ప్రాధాన్యత క్రమంలో కేటాయించడమే ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యం.స్మగ్లింగ్‌పై ఉక్కుపాదంపన్ను రేట్లు పెరగడంతో అక్రమ రవాణా పెరిగే అవకాశం ఉండటంతో తనిఖీ ఏజెన్సీలు నిఘాను తీవ్రతరం చేశాయి. మే 13 నుంచి జూన్ 30 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా వివిధ సరిహద్దుల్లో దాడి చేసి 161 కిలోల అక్రమ బంగారాన్ని జప్తు చేయడమే కాకుండా 116 మంది స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రపంచంలో చైనా తర్వాత రెండో అతిపెద్ద పసిడి వినియోగదారైన భారత్‌లో దిగుమతి సుంకాల పెంపు వల్ల పసిడి విక్రయాలు కొంత మందగించినప్పటికీ ప్రభుత్వానికి మాత్రం త్వరితగతిన భారీగా రెవెన్యూ సమకూరిందని ఆర్థిక విశ్లేషకులు పేర్కొంటున్నారు.ఇదీ చదవండి: పబ్లిక్ వైఫై వాడే ప్రయాణికులే టార్గెట్! -
బంగారం ధరలకు బ్రేక్.. వారం తరువాత భారీగా పతనం
-
బంగారం ధరల్లో మార్పు.. ఎట్టకేలకు గుడ్‌న్యూస్
దేశంలో బంగారం ధరలు తగ్గాయి. ఐదు రోజుల క్రితం నుంచి నాన్ స్టాప్‌గా దూసుకెళ్లిన పసిడి ధరలు నేడు స్వల్పంగా దిగివచ్చాయి. ఇక వెండి ధరలు మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
వచ్చేవారం బంగారం ధరలు ఇలా.. నిపుణుల అంచనా ఇదే!
బంగారం, వెండి ధరలు గత వారం రోజుల్లో భారీగా పెరిగాయి. ఇది వచ్చే వారం కూడా కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణం ఏమిటి?, ఎంతవరకు ధరలు పెరగనున్నాయి?, అనే విషయాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ద్రవ్యోల్బణ గణాంకాలు, పశ్చిమాసియాలో కొనసాగుతున్న పరిణామాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపనున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతమున్న పాజిటివ్ ట్రెండ్ ఇలాగే కొనసాగితే.. 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1.57 లక్షలు, వెండి ధర కేజీ రూ.2.80 లక్షల వరకు చేరే అవకాశం ఉందని జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ నిపుణుడు ప్రణవ్ మేర్ అంచనా వేశారు.దేశీయ మార్కెట్లో పసిడి ధరలు.. ఈ వారంలో దాదాపు 6 శాతం పెరిగి రూ.1.51 లక్షలకు చేరింది. వెండి రూ.2.49 లక్షలకు చేరింది. అమెరికా కార్మిక మార్కెట్.. అంచనాల కంటే బలహీనంగా ఉండటంతో.. అక్కడి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విషయంలో కొంత సడలింపు చూపించే అవకాశం ఉందనే అంచనాలు పెరిగాయి. దీంతో బంగారం, వెండిపై కొనుగోళ్లు పెరిగాయి. మరోవైపు డాలర్ బలహీనపడటం కూడా ధరలు పెరగడానికి కారణం అవుతోంది.అంతర్జాతీయ మార్కెట్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. బంగారం ధర దాదాపు 7 శాతం పెరగగా.. వెండి ఏకంగా 10 శాతం వరకు ఎగబాకింది. వచ్చే వారం అమెరికా ఆర్థిక గణాంకాలతో పాటు అమెరికా - ఇరాన్ మధ్య పరిణామాలు కూడా కీలకం కానున్నాయి. పశ్చిమాసియాలో ఏదైనా అనూహ్య పరిణామం చోటుచేసుకుంటే బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా మారే అవకాశం ఉంది.ఇదీ చదవండి: అమెరికా వెళ్లాలంటే.. ఎవరు ఏ వీసా తీసుకోవాలి? -
చాలు బంగారం.. చాలు
సాక్షి, అమరావతి: పసిడి ప్రియులకు పేరొందిన భారత దేశంలో బంగారం కొనుగోళ్లు, దిగుమతులు తగ్గిపోతున్నాయి. 2021–22 సంవత్సరంతో పోలిస్తే 2025–26 ఆర్థిక సంవత్సరంలో దిగుమతులు 17.23 శాతం క్షీణించాయి. 2021–22లో 868.4 టన్నుల బంగారం దిగుమతి కాగా.. 2025–26లో 718.74 టన్నులకు పడిపోయిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాజ్యసభకు లిఖితపూర్వకంగా తెలిపింది. అంతర్జాతీయంగా భారీగా పెరుగుతున్న బంగారం ధరలకు తోడు రూపాయి విలువ పడిపోవడం, బంగారం కొనుగోళ్లపై కేంద్రం ఆంక్షలు విధించడం దిగుమతులు తగ్గడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. బంగారం దిగుమతులను తగ్గించడానికి కేంద్రం ఈ ఏడాది మే నుంచి దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. మరోపక్క బంగారం కొనుగోళ్లు తగ్గించాలని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీనే పిలుపునివ్వడంతో అమ్మకాలపై గణనీయమైన ప్రభావం కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు బంగారం దిగుమతులు ఆరేళ్ల కనిష్ట స్థాయికి 120 టన్నులకు పరిమితమైనట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రధాని పిలుపుతో ఆభరణాల అమ్మకాలు 24 శాతం తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. అలాగే పాత బంగారం అమ్మడం కూడా దిగుమతులు తగ్గడానికి ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. ఇదే సమయంలో బంగారం ధరలు భారీగా పెరగడంతో స్మగ్లింగ్ పెరుగుతోంది. విలువ పరంగా 58 శాతం పెరుగుదలపరిమాణం పరంగా బంగారం దిగుమతులు తగ్గుతున్నా.. పసిడి దిగుమతుల బిల్లు మాత్రం భారీగా పెరిగిపోతోంది. 2021–22లో 868.4 టన్నుల దిగుమతికి ప్రస్తుత రూపాయి ధర ప్రకారం రూ.4,36,800 కోట్లు చెల్లించాల్సి వస్తే, 2025–26లో 718.74 టన్నులకు ఏకంగా రూ.6,88,320 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. అంటే దిగుమతులు తగ్గినా బిల్లు మాత్రం ఏకంగా 57.58 శాతం పెరిగిపోయింది. దీనికి ప్రధాన కారణం ఐదేళ్ల క్రితం ఔన్స్ బంగారం ధర 2,000 డాలర్లు ఉంటే ఇప్పుడది ఏకంగా 4,200 డాలర్లకు చేరడమే. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర రూ.1.40 లక్షల నుంచి రూ.1.50 లక్షల మధ్య కదులుతోంది. బంగారం ధరలు భారీగా పెరిగిపోవడంతో వినియోగదారులు తక్కువ బరువున్న ఆభరణాల కొనుగోలుకు మక్కువ చూపిస్తున్నట్లు వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. -
బంగారం నాన్‌స్టాప్.. మళ్లీ భారీ ధరలు
దేశంలో బంగారం ధరలు నాన్ స్టాప్‌గా దూసుకెళ్తున్నాయి. వరుసగా నాలుగు రోజులుగా భారీ ధరలతో బెంబేలెత్తిస్తున్నాయి. నేడు కూడా స్పీడ్ పెంచాయి. ఇక వెండి ధరలు మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
ఇదే జరిగితే.. బంగారం ధరలు మరింత పైకి!
బంగారం ధరలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు భారీగా పెరిగి ఔన్స్‌కు 4,300 డాలర్ల స్థాయిని దాటాయి. ఈ వారం మొత్తం చూస్తే.. బంగారం ధరలు 6 శాతానికి పైగా పెరిగాయి. ఈ ఏడాది జనవరి తర్వాత ఒక వారంలో నమోదైన అతిపెద్ద పెరుగుదల ఇదే కావడం గమనార్హం.బంగారం వైపు పెట్టుబడులుఅమెరికా ఆర్థిక పరిస్థితి, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు, డాలర్ విలువలో మార్పులు ప్రస్తుతం బంగారం ధరలను ప్రభావితం చేస్తున్న ప్రధాన అంశాలుగా మారాయి. ఆర్థిక అనిశ్చితి ఉన్న సమయంలో పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. ప్రస్తుతం అమెరికా వడ్డీ రేట్లపై స్పష్టత లేకపోవడం, ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు పెరగడంతో పెట్టుబడులు బంగారం వైపు వెళ్తున్నాయి.ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ సెప్టెంబర్‌లో వడ్డీ రేట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయం మార్కెట్లకు కీలకంగా మారింది. వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు పెరిగితే డాలర్ బలహీనపడుతుంది. దాని ప్రభావంతో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.బంగారం ధరలు మరింత పెరుగుతాయా?ఇక అమెరికా జూలై నెల ఉద్యోగాల నివేదికపై మార్కెట్ వర్గాల దృష్టి ఉంది. ఈ నివేదికలో కొత్తగా ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, నిరుద్యోగ రేటు ఎలా ఉంది, వేతనాల వృద్ధి ఎలా ఉందనే వివరాలు తెలుస్తాయి. మార్కెట్ అంచనాల ప్రకారం జూలైలో సుమారు 80 వేల కొత్త ఉద్యోగాలు రావచ్చని భావిస్తున్నారు. అయితే ఇటీవలి కాలంతో పోలిస్తే ఇది పెద్ద వృద్ధి కాదని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగాల డేటా బలంగా వస్తే ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై వెనక్కి తగ్గే అవకాశం ఉండటంతో డాలర్ బలపడవచ్చు, దీనివల్ల బంగారం ధరలు కొంత తగ్గవచ్చు.మరోవైపు అమెరికా ఉద్యోగాల నివేదిక బలహీనంగా వస్తే ఆర్థిక మాంద్యం భయాలు పెరిగే అవకాశం ఉంది. అప్పుడు పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తులైన బంగారం వైపు మరింతగా ఆకర్షితులవుతారు. డాలర్ బలహీనపడితే బంగారం ధరలు మరింత పెరిగి 4,380 డాలర్ల స్థాయిని చేరే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే మార్కెట్లో అనిశ్చితి కొనసాగితే ధరల్లో హెచ్చుతగ్గులు కూడా ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. -
దూకుడు తగ్గించిన పసిడి.. తులం ధర ఇలా..
దేశంలో బంగారం ధరల దూకుడు కాస్త తగ్గింది. రెండు రోజులుగా భారీగా దూసుకెళ్లిన పసిడి ధరలు నేడు కాస్త నెమ్మదించాయి. ఇక వెండి ధరలు కూడా నిలకడగా కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
కొత్త రికార్డుల దిశగా బంగారం!
ప్రపంచ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితుల మధ్య బంగారం ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. డాలర్ విలువ తగ్గడం, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గే అవకాశాలు ఉంటడం వల్ల గోల్డ్ మీద పెట్టుబడి పెట్టేవాళ్ల సంఖ్య పెరిగింది. దీంతో పసిడి ధరలు తారాస్థాయికి చేరాయి.స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 4,295 డాలర్ల వరకు పెరిగి, తర్వాత స్వల్పంగా తగ్గి 4,268 డాలర్ల వద్ద స్థిరపడింది. గోల్డ్ ఫ్యూచర్స్ కూడా 4,329 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. వరుసగా నాలుగో సెషన్లో బంగారం లాభాల్లో కొనసాగడం గమనార్హం.అమెరికాలో జూలై నెలలో ప్రైవేట్ ఉద్యోగాల వృద్ధి మందగించిందని ఒక నివేదిక వెల్లడించింది. దీంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు తగ్గుతాయని మార్కెట్ అంచనా వేస్తోంది. ఇక మధ్యప్రాచ్యంలో స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్‌ను తిరిగి తెరవడానికి జరుగుతున్న ప్రయత్నాలు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గే అవకాశాలు కూడా మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. అయితే, ఇటీవల పెరుగుదల ఉన్నప్పటికీ బంగారం ఇంకా గత గరిష్ఠ స్థాయిల కంటే తక్కువగానే ఉంది. భవిష్యత్తులో ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు, ప్రపంచ పరిణామాలు బంగారం ధరల దిశను నిర్ణయించనున్నాయి.భారతదేశంలో బంగారం ధరలుఇండియన్ మార్కెట్లో కూడా గోల్డ్ రేటు గురువారం గణనీయంగా తగ్గింది. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా.. బెంగళూరు, ముంబైలలో కూడా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.2650 పెరిగి రూ.1,37,250 వద్దకు చేరింది. 24 క్యారెట్ల రేటు రూ.2890 పెరిగి రూ.1,49,730 వద్ద నిలిచింది. పెరిగిన ధరలను బట్టి చూస్తుంటే.. ఈ మధ్య కాలంలో ఇదే గరిష్టం అని తెలుస్తోంది.ఇదీ చదవండి: గూగుల్ సంచలన నిర్ణయం.. యూజర్లకు షాక్! -
బంగారంపై 85% వరకు లోన్.. ముత్తూట్ ఫైనాన్స్ గోల్డ్ లోన్ ఆఫర్!
అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరమైతే.. చాలామంది తమ వద్ద ఉన్న బంగారంపై లోన్ తీసుకోవాలనుకుంటారు. అలాంటి వారికి ముత్తూట్ ఫైనాన్స్ (Muthoot Finance) ఒక మంచి గోల్డ్ లోన్ ఆఫర్ అందిస్తోంది. ఇందులో మీరు.. మీ బంగారం విలువలో 85 శాతం వరకు లోన్ తీసుకునే అవకాశం ఉంది.వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వ్యాల్యూ, స్పీడ్, సేవింగ్స్ అనే మూడు ప్రధాన ప్రయోజనాలను అందిస్తున్నట్లు ముత్తూట్ ఫైనాన్స్ వెల్లడించింది. తక్కువ సమయంలోనే లోన్ అందించడం, సులభమైన ప్రక్రియతో సేవలు అందించడం తమ ప్రత్యేకత అని సంస్థ చెబుతోంది.గోల్డ్ లోన్ కోసం దరఖాస్తు చేయాలనుకునే వారు మొబైల్ నెంబర్, పిన్‌కోడ్ ఎంటర్ చేసి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించవచ్చు. సంస్థ నిబంధనలు, షరతులకు అంగీకరించిన తర్వాత దరఖాస్తు పూర్తి చేయవచ్చు.ముత్తూట్ ఫైనాన్స్ గోల్డ్ లోన్ ప్రత్యేకతముత్తూట్ ఫైనాన్స్ గోల్డ్ లోన్ ప్రత్యేకత ఏమిటంటే.. లోన్ అందించే ప్రక్రియ చాలా వేగంగా ఉండటం. బంగారం విలువను అంచనా వేసిన వెంటనే లోన్ అందించే విధానాన్ని సంస్థ అనుసరిస్తోంది. అంతే కాకుండా.. వడ్డీ రేట్లు, కస్టమర్‌కు అనుకూలమైన సేవలతో మంచి గుర్తింపు పొందింది. దేశంలోనే అత్యధిక గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియో కలిగిన సంస్థగా ముత్తూట్ ఫైనాన్స్ రికార్డ్ క్రియేట్ చేసింది.ముత్తూట్ ఫైనాన్స్ దేశవ్యాప్తంగా 7,500కు పైగా శాఖలతో సేవలు అందిస్తోంది. రోజూ 2.5 లక్షలకు పైగా వినియోగదారులు తమ సేవలను వినియోగిస్తున్నారని, కేవలం ఒక్కసారి శాఖను సందర్శిస్తే వెంటనే గోల్డ్ లోన్ పొందే అవకాశం కల్పిస్తున్నామని కంపెనీ తెలిపింది.Gold Loan@Home గురించివినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సంస్థ Gold Loan@Home అనే ప్రత్యేక సేవను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవ ద్వారా ఇంటి నుంచే గోల్డ్ లోన్ పొందే అవకాశం ఉంది. దీనికోసం ముందుగా లోన్ కోసం రివెస్ట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత సంస్థ ప్రతినిధులు ఇంటికే.. వచ్చి బంగారం విలువను అంచనా వేస్తారు. ఆ తర్వాత డబ్బు నేరుగా వినియోగదారుడి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. దీంతో శాఖకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. ఇంటి నుంచే సౌకర్యవంతంగా లోన్ పొందవచ్చు. -
పసిడి ప్రియులకు ఊరట.. భారీగా తగ్గిన బంగారం ధరలు
-
బంగారు కోటలో అరుంధతి
కోచింగ్‌లకు సంబంధించి దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన రాజస్థాన్‌లోని కోటలో ఏ సబ్జెక్ట్‌కు సంబంధించి అయినా కోచ్‌లకు కొదవ లేదు. అయితే బాక్సింగ్ కోచ్ దొరకడం మాత్రం చా...లా కష్టం. అలాంటి కష్టం ఉన్నచోట బాక్సింగ్ రింగ్‌లోకి అడుగు పెట్టిన అరుంధతి చౌదరి ఒక్కో మెట్టు ఎక్కుతూ అంతర్జాతీయ స్థాయికి చేరింది. తాజా విషయానికి వస్తే... గ్లాస్గోలోని ఎస్ఇసి సెంటర్లో మహిళల 70 కేజీల విభాగంలో స్వర్ణం గెలుచుకుంది....మీరు డాక్టర్ కావాలి లేదా సాఫ్ట్వేర్ ఇంజినీర్ కావాలని మీ తల్లిదండ్రులకు బలంగా ఉండొచ్చు. మీకు మరేదో లక్ష్యం ఉండొచ్చు. ‘నా లక్ష్యం ఇది’ అని స్పష్టంగా చెప్పండి. వారు తప్పకుండా ఒప్పుకుంటారు. మీకు బలమైన ఆశీస్సులు అందిస్తారు. అరుంధతి కథ అలాంటిదే.→ అయినా సరే, ఆటలంటే ఇష్టం‘విద్యాపరంగా కోటకు ఎంత పెద్ద పేరు ఉందో అందరికీ తెలుసు. అరుంధతి చదువులో ముందుండేది. గణితంలో అత్యధిక మార్కులు వచ్చేవి. అందుకే ఐఐటీ లేదా ఐఏఎస్ పరీక్ష రాయించాలనుకునేవాడిని. ఆ రెండిటిలో కనీసం ఒకదానిలోనైనా అరుంధతి విజయం సాధిస్తుందని నాకు నమ్మకం ఉండేది. అందుకే ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించాను. అయితే తాను మాత్రం ఆటలు అంటే ఇష్టం అని చెప్పింది’ గతాన్ని గుర్తు చేసుకున్నారు అరుంధతి తండ్రి సురేష్ చౌదరి.→ రెండు ప్రశ్నలుఐఐటీ, ఐఏఎస్‌ల గురించి చెబుతున్నప్పుడు తండ్రిని ఒక ప్రశ్న అడిగింది అరుంధతి... ‘ఐఐటీ, ఐఏఎస్ ప్రవేశ పరీక్షలలో ఎంతమంది విద్యార్థులు ఉత్తీర్ణులవుతున్నారు?’ ‘ఐఏఎస్‌లో రెండువందల మంది, ఐఐటీలో పదివేల మంది’ అని చెప్పారు తండ్రి. ‘ఎంతమంది భారతీయులు ఒలింపిక్ స్వర్ణపతకాన్ని గెల్చుకున్నారు?’ అని రెండో ప్రశ్న వేసింది అరుంధతి. ఆయనకు అభినవ్ బింద్రా గురించి మాత్రమే తెలుసు! ఏ ఆటను ఎంచుకోవాలి అనే విషయంలో తండ్రీకూతుళ్ల మధ్య చాలాసేపు చర్చ నడిచింది.టబాక్సింగ్ అనేది ఒలింపిక్ క్రీడ అని తెలిసినప్పుడు అరుంధతి కళ్లలో మెరుపు కనిపించింది. అలా ఆమె మనసులోకి బాక్సింగ్ ప్రవేశించింది. బాక్సింగ్‌పై ఇష్టం సరే, మరి కోచ్ ఎవరు?ఎవరూ లేరు!చివరికి టైక్వాండో కోచ్ అశోక్ గౌతమ్ ఇంటికి వెళ్లారు. తండ్రీకూతుళ్లు తనకు బాక్సింగ్ గురించి ఏమీ తెలియదని గౌతమ్ చెప్పారు. అయితే ఆయన చేసిన మంచి పని... మహమ్మద్ అలి, మైక్ టైసన్‌ల గురించి తనకు తెలిసిన విషయాలను అరుంధతికి చెప్పడం. బాక్సింగ్ కోచ్‌లు అప్లోడ్ చేసిన శిక్షణా వీడియోలను చూసి ఆ విషయాలను అరుంధతికి అర్థమయ్యేలా చెప్పేవారు గౌతమ్.కట్ చేస్తే...యూత్ ఆసియా క్రీడల్లో (2019) లో కాంస్యం, సెర్బియాలో జరిగిన నేషన్స్ కప్(2019)లో స్వర్ణం, యూత్ వరల్డ్ చాంపియన్‌షిప్స్(2021)లో స్వర్ణం, 2025లో వరల్డ్ బాక్సింగ్ కప్‌లో స్వర్ణం గెలుచుకుంది అరుంధతి. తాజాగా...కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించింది.‘ఒలింపిక్స్ అంటే ఇంటి పై కప్పులాంటిది. ఒకేసారి పై కప్పుకు చేరుకోలేము. అక్కడికి చేరుకోవాలంటే మెట్లు ఎక్కాలి. కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్, వరల్డ్ ఛాంపియన్షిప్స్ అనేవి ఒలింపిక్ మెట్లలాంటివి’ అంటుంది అరుంధతి. 2028 ఒలిపింక్స్‌లో పతకం సాధించడం అరుంధతి లక్ష్యం. ఆమె లక్ష్యం సిద్ధించాలని ఆశిద్దాం. పట్టుదల పెంచేలా...పోటీలో ఓటమి ఎదురైనప్పుడు, నేను బాధగా కనిపించినప్పుడు అమ్మా,నాన్నలు నాకు ధైర్యం ఇచ్చేవారు. ‘నువ్వు కోల్పోయింది జీవితాన్ని కాదు ఆటను మాత్రమే’ అనేవారు. వారి మాటలు నాకు బలమైన టానిక్‌లా పనిచేసేవి. ఉత్సాహాన్ని పెంచేవి. ‘ఎలాగైనా ఈసారి గెలవాలి’ అనే పట్టుదలను పెంచేవి.– అరుంధతి చౌదరి -
తిరుపతిలో చోరీ కలకలం..
ఆంధ్రప్రదేశ్: తిరుపతి పోలీస్ స్టేషన్ పరిధి భవాని నగర్లో చోరీ ఘటన కలకలం రేపింది. ఒంటరిగా నివసిస్తున్న లక్ష్మి అనే మహిళ ఇంటిలో గుర్తుతెలియని దుండగుడు చోరీకి పాల్పడ్డాడు.బాధితురాలు ఇంటి ఆరుబయట నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దొంగ, బీరువాలో భద్రపరిచిన సుమారు 30 గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించినట్లు సమాచారం. ఉదయం లేచి చూసిన బాధితురాలు నగలు కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించింది.దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఈస్ట్ పోలీసులు ఎస్సై ప్రసాద్ ఆధారాలను సేకరించి, పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించారు. అయితే, నిందితుడిని గుర్తించి త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది. -
ఐపీఓ, ఈక్విటీ వైపు తెలుగు రాష్ట్రాల చూపు!
దేశంలోనే సాహసోపేతమైన, చొరవగల వ్యాపార వర్గాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నిలయంగా ఉన్నాయి. వ్యవసాయం, సంప్రదాయ పరిశ్రమల నుంచి ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల వరకు ఈ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఉన్నాయి. అయితే, గత ఐదేళ్ల ఐపీఓ దరఖాస్తులపై జరిగిన విశ్లేషణను పరిశీలిస్తే.. తెలుగు వారి తదుపరి ఆర్థిక వృద్ధి ప్రయాణం స్టాక్ మార్కెట్లలోనే ఉండబోతోందని స్పష్టమవుతోంది.ప్రైమరీ మార్కెట్లో భాగస్వామ్యందేశవ్యాప్తంగా 33 రాష్ట్రాలు, 785 పట్టణాల పరిధిలో నమోదైన 1.83 కోట్ల ఐపీఓ దరఖాస్తుదారులలో.. తెలంగాణ నుంచి 3.99 లక్షలు (2.17%), ఆంధ్రప్రదేశ్ నుంచి 4.41 లక్షలు (2.40%) నమోదయ్యాయి. మొత్తంగా 8.4 లక్షల మంది తెలుగు మదుపరులు ప్రైమరీ మార్కెట్లలో చురుగ్గా పాల్గొంటున్నారు. మహారాష్ట్ర, గుజరాత్ వంటి చారిత్రాత్మక మార్కెట్ లీడర్లతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈక్విటీ కల్చర్ మరింత ఎదగడానికి అపారమైన అవకాశాలు ఉన్నాయి.తలసరి దరఖాస్తుదారులను చూస్తే.. జాతీయ సగటు 12,841 కాగా తెలంగాణలో ప్రతి పది లక్షల మందికి 10,490, ఆంధ్రప్రదేశ్‌లో 8,316 మంది ఉన్నారు. ఇది వీరి ఆకాంక్షలు తక్కువగా ఉన్నాయని చెప్పడానికి నిదర్శనం కాదు. తెలుగు కుటుంబాల పొదుపు క్రమశిక్షణ చాలా బలమైనది. ఇప్పటివరకు భూమి, బంగారం వంటి సంప్రదాయ ఆస్తులకే ప్రాధాన్యమిచ్చిన వీరు ఇకపై తమ పొదుపులో కొంత భాగాన్ని లిస్టెడ్ ఈక్విటీల వైపు మళ్లించేందుకు బలమైన అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.మౌలిక వసతులు సిద్ధం.. అడ్డంకి లేని ప్రయాణంమదుపు విస్తరణకు కావలసిన డిజిటల్ మౌలిక వసతులు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ నుంచి 1.24 కోట్లు, తెలంగాణ నుంచి 61 లక్షల నమోదిత ట్రేడింగ్ ఖాతాలు ఉన్నాయి. ట్రేడింగ్ ఖాతాల లభ్యత సులువైనందున సాధారణ పొదుపుదారులను క్రియాశీల ఈక్విటీ మదుపరులుగా మార్చడం తదుపరి ప్రాథమిక లక్ష్యం కానుంది. రియల్ ఎస్టేట్, బంగారం స్థిరత్వాన్నిస్తాయి. బ్యాంక్ డిపాజిట్లు నమ్మకాన్నిస్తాయి. కానీ ఈక్విటీలు దీర్ఘకాలంలో దేశ వ్యాపార వృద్ధిలో ప్రత్యక్ష భాగస్వామ్యాన్ని, అధిక రాబడిని అందిస్తాయి. సెబీ ప్రోత్సహిస్తున్న సమతుల్య విధానం కూడా ఇదే.ఇదీ చదవండి: స్కూల్స్ వద్ద జంక్ ఫుడ్ బ్యాన్! -
బంగారం ధరలు రివర్స్.. కాస్త గుడ్‌న్యూస్
దేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు నేడు కాస్త తగ్గాయి. ఇక వెండి ధరలు మాత్రం వరుసగా నాలుగో రోజూ నిలకడగా కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(‘సామ్రాజ్యాలు కూలిపోతాయి.. బంగారం నిలుస్తుంది’) -
బంగారం ధరలు మరోసారి.. తులం రేటు ఇలా..
దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. క్రితం రోజున పెరుగుదల బాట పట్టిన పసిడి ధరలు నేడు వరుసగా రెండో రోజూ పెరుగుదలను కొనసాగించాయి. దీంతో నేటి కొనుగోలుదారులకు కాస్త నిరాశ తప్పడం లేదు. ఇక వెండి ధరలు మాత్రం వరుసగా మూడో రోజూ ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
దేశంలో పసిడికి తగ్గిన డిమాండ్... ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 6 శాతం డౌన్
-
పసిడి డిమాండ్ డౌన్
ముంబై: దేశీయంగా ప్రస్తుత సంవత్సరం ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో పసిడికి డిమాండ్ 6 శాతం మేర క్షీణించింది. 131.4 టన్నులకు పరిమితమైంది. సీజనల్‌గా విక్రయాలు తగ్గడం, కస్టమ్స్ డ్యూటీ పెరగడంతో పాటు పసిడి కొనుగోళ్లను తగ్గించుకోవాలంటూ స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను సూచించడంలాంటి అంశాలు ఇందుకు కారణమయ్యాయి. ’గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్’ పేరిట రూపొందించిన నివేదికలో వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) ఈ విషయాలు వెల్లడించింది. దీని ప్రకారం గతేడాది ఇదే వ్యవధిలో పసిడికి డిమాండ్ 139.7 టన్నులుగా నమోదైంది. పసిడికి పరిమాణంపరంగా డిమాండ్ నెమ్మదించినప్పటికీ విలువ మాత్రం రికార్డు స్థాయికి పెరిగినట్లు డబ్ల్యూజీసీ రీజినల్ సీఈవో (ఇండియా) సచిన్ జైన్ తెలిపారు. ‘2025 రెండో త్రైమాసికంలో వినియోగం విలువ రూ. 1,32,500 కోట్లుగా ఉండగా ఈసారి రూ. 1,98,100 కోట్లకు చేరింది. గతేడాది రెండో త్రైమాసికంతో పోలిస్తే దాదాపు 50 శాతం పెరిగింది. ధర ఎక్కువగా ఉన్నప్పటికీ పసిడి కొనుగోళ్లపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారనడానికి ఇది నిదర్శనం‘ అని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఏడాది మొత్తం మీద డిమాండ్ 650–750 టన్నులుగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు వివరించారు. అయితే, ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులు, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం మొదలైన వాటిని పరిగణనలోకి తీసుకుంటే ఈ శ్రేణిలో మధ్య స్థాయికి కూడా పరిమితం కావొచ్చన్నారు. బంగారం ధరలు మరింత కరెక్షన్‌కి లోనయ్యి, కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తే డిమాండ్ గరిష్ట స్థాయిలో ఉండొచ్చని వివరించారు. స్మగ్లింగ్ రిస్క్ లు.. సుంకాల పెంపుతో బ్లాక్ మార్కెటింగ్ పెరిగిందని జైన్ ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ మార్గాల్లో ఇప్పటికే మార్కెట్లోకి బంగారం ప్రవేశిస్తోందని చెప్పారు. స్మగ్లింగ్, అక్రమ మార్గాల్లో మార్కెట్లలోకి పసిడి వెల్లువెత్తుతుండటమనేది పరిశ్రమకు అతి పెద్ద రిస్క్ అని జైన్ చెప్పారు. ‘ప్రస్తుత ట్రెండ్స్ చూస్తే బంగారానికి సంప్రదాయ కోణంలోనే కాకుండా ఆర్థిక అనిశ్చితిలో అక్కరకొచ్చే వ్యూహాత్మక పెట్టుబడి సాధనం కూడా అనే కోణంలోనూ డిమాండ్ ఏర్పడుతోందని తెలుస్తోంది. ద్వితీయార్థంలో పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌తో మరింత డిమాండ్ పెరగొచ్చు‘ అని జైన్ పేర్కొన్నారు. నివేదికలో మరిన్ని విశేషాలు.. → త్రైమాసికంలో మొత్తం జ్యుయలరీ డిమాండ్ 88.8 టన్నుల నుంచి 15% తగ్గి 75.1 టన్నులకు నెమ్మదించింది. ఇన్వెస్ట్‌మెంట్‌పరంగా కడ్డీలు, నాణేలకు డిమాండ్ 9% పెరిగి 50.3 టన్నులకు చేరింది. ఇక అంతర్జాతీయంగా పెట్టుబడుల ఉపసంహరణ జరిగినప్పటికీ, మన గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి నికరంగా 4.2 టన్నుల పెట్టుబడులొచ్చాయి. → క్యూ1లో రీసైకిల్ చేసిన మొత్తం పసిడి పరిమాణం 23.1 టన్నుల నుంచి 17% క్షీణించి 19.2 టన్నులకు తగ్గింది. → దిగుమతులు 23% క్షీణించి 127.4 టన్నుల నుంచి 98.1 టన్నులకు తగ్గాయి. → పసిడి ఔన్సు ధర సగటున 4,506 డాలర్లుగా ఉంది. 2025లో ఇదే వ్యవధిలో రేటు 3,280 డాలర్లుగా నమోదైంది. -
బంగారం కొనుగోళ్లు.. రూ.1.98 లక్షల కోట్లు!
భారతీయులకు బంగారం అంటే ప్రత్యేకమైన అభిమానం. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. అయితే.. పండుగలు, పెళ్లిళ్లు లేదా ఇతర శుభకార్యాలకు ప్రజలు గోల్డ్ కొనుగోలు చేస్తూనే ఉంటారు. కానీ.. ఈసారి పసిడి ధరలు భారీగా పెరగడంతో 2026 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కొనుగోళ్ల పరిమాణం కొంత తగ్గినప్పటికీ.. బంగారంపై ప్రజలు ఖర్చు చేసిన మొత్తం మాత్రం రికార్డు స్థాయికి చేరుకోవడం విశేషం.వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఈ త్రైమాసికంలో దేశంలో బంగారం డిమాండ్ 130.9 టన్నులుగా నమోదైంది. గత ఏడాది(139.1 టన్నులు)తో పోలిస్తే ఈ ఏడాది 6 శాతం తక్కువే, కానీ.. ధరలు మాత్రమే గత సంవత్సరంతో పోలిస్తే.. ఈ ఏడాది దాదాపు 59 శాతం పెరిగింది. దీనివల్ల కొనుగోళ్లపై ప్రభావం పడిందని నివేదిక వెల్లడించింది.2026 ఏప్రిల్-జూన్ కాలంలో భారతీయులు బంగారం కొనుగోలు కోసం రూ.1.98 లక్షల కోట్లను ఖర్చు చేసినట్లు నివేదిక చెబుతోంది. ఇది గత ఏడాదితో పోలిస్తే 50 శాతం ఎక్కువ. అంటే ప్రజలు తక్కువ పరిమాణంలో బంగారం కొనుగోలు చేసినప్పటికీ, పెరిగిన ధరల కారణంగా ఖర్చు చేసిన మొత్తం పెరిగిందన్నమాట.ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రజలు బంగారం కొనుగోలు చేయడానికి వెనుకడుగు వేయడం లేదని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. పాత బంగారం ఇచ్చి కొత్త ఆభరణాలు తీసుకునే ఎక్స్చేంజ్ పద్ధతులు, ఈఎంఐ సౌకర్యాలు, తక్కువ బడ్జెట్లో విలువైన ఆభరణాల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో బంగారం డిమాండ్ అనేది ధరలపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పెళ్లిళ్లు, పండుగల సీజన్ కారణంగా రెండో అర్ధభాగంలో కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ.. ధరలు ఇలాగే అధికంగా కొనసాగితే ఆభరణాల కొనుగోళ్లపై కొంత ప్రభావం ఉండొచ్చని చెబుతున్నారు.ఇదీ చదవండి: రైలు ఏసీ కోచ్‌లో రెండు బెడ్షీట్లు ఎందుకు ఇస్తారో తెలుసా? -
బంగారం లాంటి సంపాదన.. అయినా ఐటీ జంట భయాందోళన!
చేతిలో మంచి ఆదాయం.. అప్పులు లేవు.. కోట్ల రూపాయల విలువైన బంగారం.. అమెరికా స్టాక్స్‌లో పెట్టుబడులు.. అయినా భవిష్యత్తుపై భయం. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఓ యువ ఐటీ దంపతులు తమ ఉద్యోగ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన తీరు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.‘హై ఎర్నర్.. కానీ ఇంకా రిచ్ కాదు’ అంటూ 27 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్ రెడిట్‌లో తన ఆర్థిక పరిస్థితిని పంచుకున్నాడు. తనకు, 23 ఏళ్ల తన భార్యకు కలిపి నెలకు సుమారు రూ.5 లక్షల నికర ఆదాయం వస్తుందని తెలిపాడు. చిన్న పట్టణంలో రిమోట్‌గా పనిచేస్తున్నామని పేర్కొన్నాడు. తమకు ఎలాంటి రుణాలు లేవని, తల్లిదండ్రుల ఇల్లు, సొంత కారు ఉన్నాయని వివరించాడు.రూ.95 లక్షలకు పైగా ఆస్తులురెడిట్ పోస్ట్ ప్రకారం.. ఈ జంట వద్ద సుమారు రూ.15 లక్షల విలువైన బంగారు నాణేలు, రూ.7 లక్షల అమెరికా స్టాక్స్, రూ.3 లక్షల ఎఫ్డీలు ఉన్నాయి. వీటికి అదనంగా తనకు, తన భార్య వద్ద సుమారు రూ.70 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయని చెప్పాడు. అంటే, పేర్కొన్న ఆస్తుల విలువే సుమారు రూ.95 లక్షలకు చేరుతుంది. దీనికి కారు, తల్లిదండ్రుల ఇల్లు వంటి అంశాలను కలిపితే వారి ఆర్థిక స్థితి మరింత బలంగా కనిపిస్తుంది. అంతేకాదు.. ఇద్దరికీ వ్యక్తిగత ఆరోగ్య బీమా కింద రూ.10 లక్షల చొప్పున, టర్మ్ ఇన్సూరెన్స్ కింద రూ.3 కోట్ల చొప్పున కవరేజీ ఉందని కూడా ఆ రెడిట్ పోస్ట్‌లో పేర్కొన్నాడు.ఐదేళ్లలో రూ.3–4 కోట్ల లక్ష్యంఇంత మంచి ఆదాయం, ఆస్తులు ఉన్నప్పటికీ ఈ యువకుడిని ప్రధానంగా వేధిస్తున్నది ఉద్యోగ భద్రత. AI వేగంగా అభివృద్ధి చెందుతున్నందున వచ్చే ఐదారు సంవత్సరాల్లో అనేక సంప్రదాయ ఉద్యోగాలు కనుమరుగయ్యే అవకాశం ఉందని అతను అభిప్రాయపడ్డాడు. అందుకే ప్రస్తుతం ఉన్న అధిక ఆదాయాన్ని ఉపయోగించుకుని రూ.3–4 కోట్ల సురక్షిత నికర సంపదను నిర్మించాలనుకుంటున్నట్లు తెలిపాడు.తన ప్రాథమిక పెట్టుబడి ప్రణాళికలో ప్రతి నెలా 10 గ్రాముల బంగారం కొనుగోలు చేయడం, రూ.2 లక్షలను ఎఫ్‌డీల్లో పెట్టడం, మిగిలిన మొత్తంలో సుమారు 1,500 డాలర్లను అమెరికా స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టడం వంటి అంశాలను ప్రస్తావించాడు. అయితే, తాము ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లమే కావడంతో తమ ప్రస్తుత ఉద్యోగాల స్థిరత్వంపై నమ్మకం తగ్గుతోందని అతను చెప్పాడు. కన్సల్టింగ్, సర్వీసెస్ ఆధారిత ఐటీ కంపెనీల భవిష్యత్తుపై కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు.ఈ రెడిట్ పోస్ట్‌పై స్పందించిన పలువురు నెటిజన్లు జంట ఆర్థిక పరిస్థితిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 27 ఏళ్ల వయసులో అప్పులు లేకుండా రూ.1 కోట్లకు దగ్గరగా ఆస్తులు కలిగి ఉండటం మంచి స్థితి అని కొందరు పేర్కొన్నారు. మరికొందరు మాత్రం పెట్టుబడుల్లో వైవిధ్యం అవసరమని సూచించారు. ఇంకొందరు ‘సంపాదన పెంచుకోవడం’పై దృష్టి పెట్టాలని, AI వల్ల ఉద్యోగాలు మారుతున్న సమయంలో కొత్త టెక్నాలజీలను నేర్చుకోవాలని సూచించారు. -
ఏకంగా 13 వేలు తగ్గిన బంగారం నేడు తులం ఎంతంటే?
-
మారిపోయిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..
దేశంలో బంగారం ధరలు ఎగిశాయి. గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు నేడు మళ్లీ పెరుగుదల బాటపట్టాయి. దీంతో నేటి కొనుగోలుదారులకు నిరాశ తప్పడం లేదు. ఇక వెండి ధరలు మాత్రం ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(‘సామ్రాజ్యాలు కూలిపోతాయి.. బంగారం నిలుస్తుంది’) -
ఓడలో బంగారం వస్తుందన్నాడు.. చివరికి
సాక్షి, హైదరాబాద్: విదేశీ బంగారం వ్యాపారాలతో తనకు ఉన్న పరిచయాలను వినియోగించుకుని, తక్కువ ధరకు బంగారాన్ని ఓడల్లో తెప్పిస్తానంటూ చెప్పి నగరానికి చెందిన వ్యక్తి నుంచి రూ.2 కోట్లు కాజేసిన నిందితుడిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఇదే పంథాలో మరికొందరిని మోసం చేసినట్లు, గతంలో ఆరు కేసులు ఉన్నట్లు తేలడంతో వ్యవస్థీకృత నేరగాడిగా పరిగణిస్తున్నట్లు డీసీపీ ఎస్.చైతన్యకుమార్ బు«ధవారం ప్రకటించారు.సనత్‌నగర్‌కు చెందిన రాకేష్ బలరాం గౌడ్‌కు లక్ష్మీకాంత్ రెడ్డితో పరిచయం ఉంది. తనకు విదేశీ బంగారం వ్యాపారులతో సంబంధాలు ఉన్నాయని, వారి నుంచి తక్కువ ధరకు పసిడి ఖరీదు చేస్తుంటానని చెప్పాడు. 2024 జూన్ 14న రాకేష్ ఇంటికి వెళ్లిన లక్ష్మీకాంత్ దుబాయ్ నుంచి శ్రీలంక మీదుగా ముంబైకి ఓడలో బంగారం దిగుమతి చేస్తున్నానని చెప్పాడు. మొబైల్లో బంగారు బిస్కెట్ల వీడియోలు చూపించి, అతి తక్కువ ధరకు 24 క్యారెట్ల బంగారం మూడు కిలోలు ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. 20 రోజుల్లో బంగారం అందజేస్తానని నమ్మించి మొత్తం రూ.2 కోట్లను తీసుకున్నాడు. ఇందులో రూ.1.86 కోట్లు అప్పుగా తెచ్చిన రాకేష్ ఇతడికి చెల్లించాడు. నెల రోజుల తర్వాత సంప్రదించిన లక్ష్మీకాంత్ శ్రీలంకలో 10 కిలోల బంగారంతో పోలీసులకు చిక్కానని చెప్పి పసిడి ఇవ్వలేనన్నాడు. అనంతరం మరో 500 గ్రాముల బంగారం రూ.25 లక్షలకు ఇప్పిస్తానని చెప్పి, 2024 డిసెంబర్ 15న రూ.5 లక్షలు, డిసెంబర్ 17న రూ.16 లక్షలు తీసుకున్నాడు. అనుమానం రావడంతో నగదు ఇస్తున్న సమయంలో బాధితుడు వీడియో రికార్డింగ్ చేశాడు.ఆ తర్వాత లక్ష్మీకాంత్ రెడ్డి తన ఫోన్ కాల్స్, సందేశాలకు స్పందించకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న ఏసీపీ మల్లికార్జున చౌదరి ఎస్సై గోపికిరణ్ రెడ్డి దర్యాప్తు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి ఆచూకీని అతడి స్వగ్రామం మహబూబ్‌నగర్ జిల్లా అయ్యవారిపల్లిలో గుర్తించారు. అక్కడే అతడిని పట్టుకున్న సీసీఎస్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. నిందితుడిపై గతంలో మహంకాళి, రాయదుర్గం, కేపీహెచ్‌బీ, మాదాపూర్‌లతో పాటు కోయిల్‌కొండ, ఏపీలోని పెందుర్తి ఠాణాల్లో కేసులు ఉన్నట్లు గుర్తించారు. -
‘సామ్రాజ్యాలు కూలిపోతాయి.. బంగారం నిలుస్తుంది’
ప్రపంచ ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత, ఇన్వెస్ట్మెంట్ నిపుణుడు రాబర్ట్ కియోసాకి మరోసారి బంగారం, వెండిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ చరిత్రలో ప్రతి సామ్రాజ్యం ఒకే చక్రాన్ని అనుసరిస్తుందని, అధికంగా కరెన్సీ ముద్రించడం చివరికి ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తుందని ఆయన తన ఫేస్బుక్ పోస్టులో పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాగితపు కరెన్సీ కంటే బంగారం, వెండి వంటి వాస్తవ ఆస్తులే సంపదను కాపాడగలవని ఆయన అభిప్రాయపడ్డారు.రోమన్ సామ్రాజ్యం నుంచి స్పెయిన్, బ్రిటన్ వరకు చరిత్రను పరిశీలిస్తే, కరెన్సీ విలువ తగ్గిన ప్రతిసారి బంగారం తన విలువను నిలబెట్టుకుందని కియోసాకి తెలిపారు. ప్రభుత్వాలు ఎంత డబ్బునైనా ముద్రించగలవని, కానీ బంగారం లేదా వెండిని ముద్రించడం సాధ్యం కాదని ఆయన చెప్పారు. అందుకే ధనవంతులు తమ సంపదను బంగారం, వెండి వంటి పరిమిత లభ్యత కలిగిన ఆస్తుల్లో నిల్వ చేస్తారని వివరించారు.ద్రవ్యోల్బణం ప్రజల కొనుగోలు శక్తిని క్రమంగా తగ్గిస్తుందని, అలాంటి సమయంలో బంగారం, వెండి కొనుగోలు శక్తిని రక్షించే సాధనాలుగా పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వాలపై నమ్మకం తగ్గినప్పుడు బంగారం ధరలు పెరుగుతున్నట్లు కనిపించినా, వాస్తవానికి కరెన్సీ విలువే తగ్గుతోందని ఆయన వ్యాఖ్యానించారు.తాను అమెరికా అంతమవుతుందని చెప్పడం లేదని, అయితే అమెరికా డాలర్ ఆధిపత్యం క్రమంగా తగ్గే దిశగా సాగుతోందని కియోసాకి అభిప్రాయపడ్డారు. చరిత్రలో కరెన్సీ విలువను అధికంగా తగ్గించిన ప్రతి సామ్రాజ్యం చివరకు తన ఆధిపత్యాన్ని కోల్పోయిందని గుర్తు చేశారు.బంగారం, వెండి ఒక్క రాత్రిలో ధనవంతులను చేసే పెట్టుబడులు కాదని, ఆర్థిక సంక్షోభాల నుంచి రక్షించే "ఫైనాన్షియల్ లైఫ్బోట్లు" అని ఆయన పేర్కొన్నారు. పరిస్థితులు మరింత క్లిష్టం అయ్యే వరకు వేచి చూడకుండా, చిన్న మొత్తంతో అయినా వెండి నాణెం లేదా చిన్న పరిమాణంలోని బంగారం కొనుగోలు చేసి నిజమైన సంపదను కూడబెట్టడం ప్రారంభించాలని తన ఫాలోవర్లకు సూచించారు. కాగితపు కరెన్సీలో మాత్రమే పొదుపు చేస్తే కాలక్రమంలో కొనుగోలు శక్తి తగ్గిపోతుందని, బంగారం, వెండి వంటి వాస్తవ ఆస్తులే దీర్ఘకాలంలో సంపదను రక్షిస్తాయని ఆయన తన పోస్టులో స్పష్టం చేశారు. -
బంగారం ధర ఒక్కసారిగా భారీగా పడిపోయింది..!
-
భారీగా పెరిగిన బంగారం ధరలు.. 10 గ్రాముల ధర మరీ ఇంతనా? తాజా రేట్లు చూసి షాక్ అవుతారు!
-
బంగారానికి మరింత ఊపు.. తులం భారీ రేటే!
దేశంలో బంగారం ధరల పెరుగుదల ఆగడం లేదు. మొన్న భారీగా పెరిగి, నిన్న నిలకడగా కొనసాగిన పసిడి ధరలు నేడు మరింత ఊపందుకున్నాయి. దీంతో నేటి కొనుగోలుదారులకు నిరాశ తప్పడం లేదు. ఇక వెండి ధరలు మాత్రం ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(బంగారం కొనేవాళ్లకు అలర్ట్.. ఆ మార్క్, కోడ్ ఉన్నాయా?) -
‘బంగారం, వెండి.. అందుకే అక్కడ దాచుకుంటున్నా’
‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత, ప్రముఖ పెట్టుబడి నిపుణుడు రాబర్ట్ కియోసాకి అమెరికా పెరుగుతున్న ప్రభుత్వ అప్పులపై మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో చేసిన తాజా పోస్టులో అమెరికా రుణభారం ప్రమాదకర స్థాయికి చేరిందని పేర్కొంటూ, కరెన్సీని పొదుపు చేయడం కంటే వాస్తవ ఆస్తులను (Real Assets) కూడబెట్టడం మంచిదని అభిప్రాయపడ్డారు.కియోసాకి ప్రకారం.. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం (GFC)కు ముందు అమెరికా ప్రభుత్వ రుణం సుమారు 9.5 ట్రిలియన్ డాలర్లు ఉండగా, ప్రస్తుతం అది 39 ట్రిలియన్ డాలర్లకు చేరువలో ఉందన్నారు. ఇదే సమయంలో అమెరికా బాండ్ మార్కెట్ కూడా ఒత్తిడిని ఎదుర్కొంటోందని ఆయన వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా ఆయన ఒక ఆసక్తికరమైన పోలికను ప్రస్తావించారు. "మీరు నిమిషానికి ఒక డాలర్ చొప్పున ఖర్చు చేస్తే ఒక ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేయడానికి 32 వేల సంవత్సరాలు పడుతుంది. కానీ అమెరికా ప్రభుత్వం దాదాపు ప్రతి 90 రోజులకు ఒక ట్రిలియన్ డాలర్ల మేర కొత్త అప్పు సృష్టిస్తోంది" అని పేర్కొన్నారు.ఈ పరిస్థితుల్లో ప్రజలు డబ్బును పొదుపు చేయాలా? అని ప్రశ్నిస్తూ, తన పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’లో చెప్పిన మూడు ప్రధాన ఆర్థిక సూత్రాల్లో ఒకటైన "ధనవంతులు నగదును పొదుపు చేయరు" అనే విషయాన్ని గుర్తు చేశారు.తాను 1965 నుంచి వెండి, 1971 నుంచి బంగారం, 2012 నుంచి బిట్‌కాయిన్, 2022 నుంచి ఎథీరియం కూడబెట్టుకుంటున్నానని కియోసాకి వెల్లడించారు. అలాగే తన బంగారం, వెండి నిల్వలను స్విట్జర్లాండ్ వెలుపల ఉన్న స్విస్ వాల్ట్‌లలో భద్రపరుస్తున్నానని చెప్పారు. గతంలో అమెరికా ప్రభుత్వం బంగారం వ్యక్తిగత యాజమాన్యాన్ని నిషేధించి స్వాధీనం చేసుకున్న చరిత్ర ఉందని కూడా ఆయన తన పోస్టులో ప్రస్తావించారు.ప్రపంచం ప్రస్తుతం ఆర్థికంగా అల్లకల్లోల పరిస్థితులను ఎదుర్కొంటోందని పేర్కొన్న కియోసాకి, "ఇవి ప్రపంచ చరిత్రలో అత్యంత అనిశ్చిత కాలాలు. జాగ్రత్తగా ఉండండి. నేను చేస్తున్నది ఇదే. మరి మీరు ఏమి చేస్తున్నారు?" అంటూ తన పోస్టును ముగించారు.HOW MUCH DEBT?FYI: In 2008, just before the GFC: (Great Financial Crisis) the US debt was approximately $9.5 trillion.Today, just as US Bonds are crashing, US Debt is approaching $39 trillion.Q: If you spent $1 a minute how long would it take you to spend $1 trillion?…— Robert Kiyosaki (@theRealKiyosaki) July 25, 2026 -
రూ.1.45 లక్షలకు చేరిన బంగారం ధర!
బంగారం ధరల్లో రోజురోజుకి ఊహకందని మార్పులు జరుగుతున్నాయి. ఒకరోజు తగ్గుముఖం పడితే.. మరోరోజు భారీగా పెరగడం. ఇంకోరోజు ధరలు స్థిరంగా ఉండిపోవడం. ఇలా గోల్డ్ రేటు ముందుకు సాగుతోంది. ఈ కథనంలో వారం (జులై 19 నుంచి 25 వరకు) రోజుల్లో పసిడి ధరలు ఎలాంటి మార్పునకు లోనైంది. తాజా ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడలలో గత ఆదివారం (జులై 19) రూ.1,43,290 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర జులై 25 నాటికి రూ.1,44,930 వద్దకు (రూ.1640 పెరిగింది) చేరింది. 22 క్యారెట్ల పసిడి రేటు రూ.1,31,350 నుంచి రూ.1,32,850 వద్దకు (రూ.1500 పెరిగింది) చేరింది.ఢిల్లీలో 24 క్యారెట్ల తులం బంగారం ధర ఏడు రోజుల్లో రూ.1,43,440 నుంచి రూ.1,45,080 వద్దకు (రూ.1640 పెరిగింది) చేరింది. 22 క్యారెట్ల ధర రూ.1,31,450 నుంచి రూ.1,33,000 వద్దకు (రూ.1550 పెరిగింది) చేరింది. దీన్ని బట్టి చూస్తే వారం రోజుల్లో గోల్డ్ రేటు ఎంత పెరిగిందో స్పష్టంగా అర్థమవుతోంది.చెన్నైలో కూడా బంగారం ధరల్లో గణనీయమైన మార్పులు కనిపించాయి. జులై 19న రూ.1,43,290 వద్ద ఉన్న 24 క్యారెట్ల తులం పసిడి ధర జులై 25 నాటికి రూ.1,45,090 వద్దకు చేరింది. 22 క్యారెట్ల ధర రూ.1,31,350 నుంచి రూ.1,33,000 వద్దకు చేరింది.వెండి ధరలుభారతదేశంలో సిల్వర్ రేటు కూడా వారం రోజుల్లో గణనీయమైన మార్పుకునకు లోనైంది. దీంతో కేజీ వెండి రేటు ఏడు రోజుల్లో రూ.2.35 లక్షల నుంచి రూ.1.40 లక్షలకు చేరింది. అంటే రూ.5000 పెరిగిందన్నమాట. -
తారుమారైన బంగారం ధరలు.. తులం ఎంతంటే..
దేశంలో బంగారం ధరలు ఒక్కరోజులోనే తారుమారయ్యాయి. క్రితం రోజున భారీగా తగ్గి కొనుగోలుదారులకు ఊరట కలిగించిన పసిడి ధరలు నేడు మళ్లీ పరుగును అందుకున్నాయి. ఇక వెండి ధరలు కూడా నిన్నటి స్థాయిలోనే ఎగిశాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(బంగారం కొనేవాళ్లకు అలర్ట్.. ఆ మార్క్, కోడ్ ఉన్నాయా?) -
పాతాళానికి పడిపోయిన బంగారం ధరలు ఈరోజు తులం ఎంతంటే?
-
‘బంగారం, వెండి కాదు.. భవిష్యత్తు ఆ లోహానిదే’
'రిచ్ డాడ్ పూర్ డాడ్' రచయిత, ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ నిపుణుడు రాబర్ట్ కియోసాకి మరోసారి ఇన్వెస్టర్ల దృష్టిని కమోడిటీ మార్కెట్‌పైకి మళ్లించారు. ఈసారి బంగారం, వెండి కాకుండా రాగి (కాపర్) భవిష్యత్తుపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాగి ధరలు గత ఏడాదిలో దాదాపు 50 శాతం పెరిగాయని, అయినప్పటికీ ఈ పెరుగుదల వెనుక ఉన్న అసలు కారణాలను చాలా మంది గుర్తించలేకపోతున్నారని ఆయన ఫేస్బుక్లో చేసిన పోస్టులో పేర్కొన్నారు.కియోసాకి ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా సెంటర్లు, విద్యుత్ గ్రిడ్ల విస్తరణ, ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి వేగంగా పెరుగుతుండటంతో రాగికి భారీగా డిమాండ్ ఏర్పడుతోంది. ఈ రంగాలన్నీ విడివిడిగా కాకుండా ఒకేసారి రాగిని అధికంగా వినియోగిస్తున్నాయని ఆయన వివరించారు. ప్రస్తుతం ప్రపంచ రాగి డిమాండ్ సుమారు 2.8 కోట్ల టన్నులుగా ఉండగా, 2040 నాటికి అది 4.2 కోట్ల టన్నులకు మించి పెరిగే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనాలను ఆయన ప్రస్తావించారు.అయితే మరోవైపు రాగి ఉత్పత్తి అంతే వేగంగా పెరగడం లేదని కియోసాకి పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాగి ఉత్పత్తిదారుల్లో ఒకటైన చిలీలో ఈ ఏడాది ఉత్పత్తి 9.5 శాతం తగ్గిందని, వచ్చే ఏడాదిలో కూడా ఉత్పత్తి తగ్గే అవకాశముందని గనుల సంస్థలు హెచ్చరిస్తున్నాయని చెప్పారు. గనుల్లో లభించే ఖనిజ నాణ్యత కూడా గత రెండు దశాబ్దాలుగా క్షీణిస్తుండటంతో, అదే పరిమాణంలో రాగిని పొందేందుకు గతంతో పోలిస్తే 20 శాతం ఎక్కువ రాళ్లను తవ్వాల్సి వస్తోందని వివరించారు.ఈ పరిస్థితిని కియోసాకి "కాపర్ సిజర్స్"గా అభివర్ణించారు. ఒకవైపు డిమాండ్ పెరుగుతుండగా, మరోవైపు సరఫరా తగ్గిపోతోందని, ఈ రెండు పరిస్థితులు కలిసి ధరలను మరింత పెంచే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు.సాంప్రదాయిక పొదుపు పథకాలపై మాత్రమే ఆధారపడే వారు ఈ పరిస్థితిలో నష్టపోయే ప్రమాదం ఉందని, మారుతున్న ఆర్థిక ధోరణులను అర్థం చేసుకుని పెట్టుబడి అవకాశాలను గుర్తించాల్సిన అవసరం ఉందని కియోసాకి సూచించారు. ఏ గనుల కంపెనీ విజయం సాధిస్తుందో ఊహించడం కంటే, ఏ సంస్థలు లేదా రంగాలు ఎలాంటి పరిస్థితుల్లోనూ లాభపడతాయనే దానిపై దృష్టి పెట్టాలని తన 'రిచ్ డాడ్' తనకు నేర్పిన పాఠమని ఆయన పేర్కొన్నారు. -
డబుల్ ధమాకా.. పడిపోయిన బంగారం, వెండి ధరలు
దేశంలో బంగారం, వెండి ధరల స్పీడ్‌కు బ్రేకులు పడ్డాయి. దాదాపుగా ఆరు రోజులుగా నాన్‌స్టాప్‌గా పెరిగిన పసిడి ధరలు నేడు భారీగా పడిపోయాయి. ఇక వెండి ధరలు కూడా నేడు గణనీయంగా క్షీణించాయి. దీంతో ధరల సెగతో అల్లాడుతున్న కొనుగోలుదారులకు ఉపశమనం లభించినట్లయింది. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(బంగారం కొనేవాళ్లకు అలర్ట్.. ఆ మార్క్, కోడ్ ఉన్నాయా?) -
గోల్డ్ లోన్ రంగంలోకి గోద్రెజ్ క్యాపిటల్!
ఎన్బీఎఫ్సీ గోద్రెజ్ క్యాపిటల్ పసిడి రుణాల రంగంలోకి అడుగుపెట్టింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కనకదుర్గ ఫైనాన్స్ గోల్డ్ లోన్ వ్యాపారాన్ని రూ.117 కోట్లకు కొనుగోలు చేసింది. తన అనుబంధ సంస్థ గోద్రెజ్ ఫైనాన్స్ ద్వారా ఈ కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసింది.2031 నాటికి రూ.1 లక్ష కోట్ల అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ (ఏయూఎం)ను చేరుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే 10 లక్షలకు పైగా వినియోగదారులకు సేవలు అందించాలన్న దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగానే ఈ వ్యూహాత్మక కొనుగోలును చేపట్టినట్లు వెల్లడించింది.కనకదుర్గ ఫైనాన్స్ గోల్డ్ లోన్ విభాగానికి ప్రస్తుతం రూ.280 కోట్ల ఏయూఎం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 54 శాఖలు, దాదాపు 12 వేల మంది వినియోగదారులు, సుమారు 250 మంది అనుభవం కలిగిన ఉద్యోగులు ఉన్నారు. ఈ కొనుగోలుతో గోల్డ్ లోన్ విభాగంలో కార్యకలాపాలను వేగంగా విస్తరించగలమని గోద్రెజ్ క్యాపిటల్ తెలిపింది.తొలి వ్యూహాత్మక కొనుగోలు‘‘కనకదుర్గ ఫైనాన్స్ గోల్డ్ లోన్ వ్యాపార కొనుగోలు గోద్రెజ్ క్యాపిటల్ ప్రయాణంలో కీలక మైలురాయి. రాబోయే అయిదేళ్లలో రూ.1 లక్ష కోట్ల ఏయూఎంను లక్ష్యంగా పెట్టుకున్న మా ప్రణాళికలో ఇదే తొలి వ్యూహాత్మక కొనుగోలు’’ అని గోద్రెజ్ క్యాపిటల్ ఎండీ, సీఈవో మనీష్ షా తెలిపారు. ప్రస్తుతం గోద్రెజ్ క్యాపిటల్ ప్రధానంగా ఎంఎస్ఎంఈ రుణాలు, గృహ రుణాల వ్యాపారంలో ఉంది. గత నెలలో గోద్రెజ్ క్యాపిటల్ వెల్త్ మేనేజ్మెంట్ సేవలను ప్రారంభించింది. -
గంటల వ్యవధిలో.. భారీగా తగ్గిన బంగారం రేటు!
బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు ఊహకందని మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు (గురువారం) ఉదయం రూ.770 పెరిగి రూ.1,47,280 వద్ద ఉన్న 24 క్యారెట్ల గోల్డ్ రేటు, సాయంత్రానికి భారీగా తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి రేట్లలో స్వల్ప మార్పు జరిగాయి. ఈ కథనంలో కొత్త ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు క్షుణ్ణంగా తెలుసుకుందాం.గురువారం (జులై 23) ఉదయం రూ.1,47,280 (తులం 24 క్యారెట్స్ గోల్డ్), రూ.1,35,000 (తులం 22 క్యారెట్స్ గోల్డ్) వద్ద బంగారం రేటు, సాయంత్రానికే రూ.1,46,180.. రూ.1,34,000 వద్దకు చేరింది. అంటే గంటల వ్యవధిలో రూ.1100, రూ.1000 తగ్గింది. దీన్నిబట్టి చూస్తే.. గోల్డ్ రేటు ఎంత మారిందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.ఢిల్లీలో కూడా బంగారం ధరలో గణనీయమైన మార్పు ఏర్పడింది. దీంతో ఉదయం, సాయంత్రం ధరలకు చాలా వ్యత్యాసం కనిపించింది. ఇక్కడ ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.146330 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ.1,34,150 వద్ద ఉంది. అయితే.. చెన్నైలో మాత్రం ఈ రోజు సాయంత్రానికి ధరల్లో మార్పు కనిపించలేదు. -
బంగారం నాన్‌స్టాప్ దౌడు.. తులం రేటు ఇలా..
దేశంలో బంగారం ధరల పరుగు ఆగడం లేదు. గత నాలుగు రోజులుగా పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. క్రితం రోజున భారీగా ఎగిసిన పుత్తడి రేట్లు నేడు కూడా గణనీయంగా పెరిగాయి. ఇక వెండి ధరలు మాత్రం కొనుగోలుదారులకు కాస్త ఊరటనిచ్చాయి. రెండు రోజులుగా పెరిగిన వెండి ధరలు నేడు నిలకడగా కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(బంగారం కొనేవాళ్లకు అలర్ట్.. ఆ మార్క్, కోడ్ ఉన్నాయా?) -
బంగారం కొనేవాళ్లకు అలర్ట్.. ఆ మార్క్, కోడ్ ఉన్నాయా?
బంగారం కొనుగోలు అనేది ప్రతి కుటుంబానికి ఒక ముఖ్యమైన పెట్టుబడి. అయితే బంగారం కొనే సమయంలో నాణ్యతను నిర్ధారించుకోవడం అత్యంత కీలకం. అందుకే భారత ప్రభుత్వం బంగారు ఆభరణాలపై హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేసింది. అయినప్పటికీ కొంతమంది వ్యాపారులు ఇప్పటికీ నిబంధనలు ఉల్లంఘిస్తూ హాల్‌మార్క్ లేని నగలను విక్రయిస్తున్నట్లు భారతీయ ప్రమాణాల బ్యూరో (BIS) ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో బయటపడింది.తెలంగాణలోని 13 జిల్లాల్లో జరిగిన సోదాల్లో భారీ మొత్తంలో హాల్‌మార్క్ లేని బంగారు నగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్క వరంగల్‌లోనే దాదాపు రూ.10 కోట్ల విలువైన బంగారం సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో హాల్‌మార్క్ అంటే ఏమిటి? హెచ్‌యూఐడీ (HUID) అంటే ఏమిటి? బంగారం కొనేటప్పుడు వినియోగదారులు ఏ విషయాలు తప్పనిసరిగా పరిశీలించాలి? తెలుసుకుందాం..హాల్‌మార్క్ అంటే ఏమిటి?హాల్‌మార్క్ అనేది బంగారు ఆభరణం స్వచ్ఛతకు ప్రభుత్వం ఇచ్చే నాణ్యత ధ్రువీకరణ. భారతీయ ప్రమాణాల బ్యూరో (BIS) నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా బంగారం స్వచ్ఛతను పరీక్షించిన తర్వాత మాత్రమే ఈ గుర్తును ఇస్తారు. దీంతో వినియోగదారు కొనుగోలు చేస్తున్న బంగారం పేర్కొన్న క్యారెట్ నాణ్యత కలిగి ఉందనే నమ్మకం ఉంటుంది.హెచ్‌యూఐడీ అంటే ఏమిటి?హెచ్‌యూఐడీ (HUID - Hallmark Unique Identification Number) అనేది ప్రతి హాల్‌మార్క్ చేసిన బంగారు ఆభరణానికి ప్రత్యేకంగా కేటాయించే ఆరు అంకెల ఆల్ఫా-న్యూమరిక్ కోడ్. ప్రతి నగకు ఒక ప్రత్యేక HUID ఉంటుంది. ఈ కోడ్ ద్వారా ఆ నగను ఏ అస్సేయింగ్ సెంటర్లో పరీక్షించారు, ఎప్పుడు హాల్‌మార్క్ చేశారు వంటి వివరాలను బీఐఎస్ రికార్డుల్లో గుర్తించవచ్చు.హాల్‌మార్క్ నగపై ఏమేమి ఉంటాయి?హాల్‌మార్క్ చేసిన బంగారు నగపై సాధారణంగా ఈ వివరాలు ఉంటాయి.🔹 BIS లోగో🔹 బంగారం స్వచ్ఛత (22K916, 18K750, 14K585 వంటివి)🔹 HUID కోడ్HUIDను ఎలా చెక్ చేయాలి?వినియోగదారులు BIS Care మొబైల్ యాప్ ద్వారా లేదా BIS వెబ్సైట్లో HUID నంబర్‌ను నమోదు చేసి ఆ నగకు సంబంధించిన వివరాలను ధ్రవీకరించవచ్చు. HUID సరిపోలకపోతే లేదా వివరాలు కనిపించకపోతే వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.హాల్‌మార్క్ ఎందుకంత ముఖ్యమంటే..కొనుగోలు చేసిన బంగారం నిజమైన స్వచ్ఛత కలిగి ఉందని హామీ లభిస్తుంది. తక్కువ నాణ్యత గల బంగారాన్ని అధిక ధరకు విక్రయించే అవకాశాలు తగ్గుతాయి. భవిష్యత్తులో అమ్మేటప్పుడు లేదా తాకట్టు పెట్టేటప్పుడు సరైన విలువ లభిస్తుంది.బంగారం కొనేటప్పుడు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సినవి🔹 హాల్‌మార్క్ ఉందో లేదో పరిశీలించండి.🔹 HUID కోడ్‌ను తప్పనిసరిగా వెరిఫై చేయండి.🔹 BIS రిజిస్టర్డ్ జువెలర్ వద్ద నుంచే కొనుగోలు చేయండి.🔹 బిల్లు తప్పనిసరిగా తీసుకోండి.🔹 బిల్లులో బంగారం స్వచ్ఛత, బరువు, HUID వివరాలు ఉన్నాయో లేదో చూసుకోండి.నిబంధనలు ఉల్లంఘిస్తే ఏం జరుగుతుంది?హాల్‌మార్కింగ్ నిబంధనలు పాటించని జువెలర్లపై BIS చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. జరిమానాలతో పాటు, తీవ్రమైన ఉల్లంఘనలపై లైసెన్స్ రద్దు చేసే అధికారమూ BISకు ఉంది. ఇటీవల తెలంగాణలో జరిగిన తనిఖీలు నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై ప్రభుత్వం అవలంబిస్తున్న కఠిన వైఖరికి నిదర్శనం. -
బంగారం @ 1,50,000? ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే..
-
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు తులం ఎంతంటే?
-
బంగారం, వెండికి మళ్లీ ఊపు..
దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. రెండు రోజుల కిందట వరకూ తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. ఇక వెండి ధరలు కూడా నేడు భారీగా ఎగిశాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
క్రెడిట్ కార్డుతో గోల్డ్ కొనడం మంచిదేనా?
భారతదేశంలో బంగారానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉందనే విషయం అందరికీ తెలుసు. పండుగలకు, పబ్బాలకు, పెళ్లిళ్లు, పేరంటాలకు లేదా పెట్టుబడి కోసం చాలా మంది ఎప్పటికప్పుడు గోల్డ్ కొనుగోలు చేస్తూనే ఉంటారు. అయితే ప్రస్తుతం.. బంగారం ధరలలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు క్రెడిట్ కార్డు ద్వారా కూడా బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇది అప్పటికి సౌకర్యవంతంగా అనిపించినా, కొన్ని ముఖ్యమైన విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలని, లేకుంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.నిపుణుల హెచ్చరికక్రెడిట్ కార్డు ద్వారా బంగారం కొనేవారు.. ముందుగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే.. క్రెడిట్ కార్డు అనేది మీ సొంత డబ్బు కాదు. అది బ్యాంకు ఇచ్చే రుణం. కాబట్టి.. బంగారం కొనుగోలు చేసిన తర్వాత క్రెడిట్ కార్డు బిల్లు గడువులోగా పూర్తిగా చెల్లించకపోతే భారీ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. కొన్ని బ్యాంకులు ఏడాదికి 36 నుంచి 42 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తాయి. దీనికి ఆలస్య రుసుములు, జీఎస్టీ వంటి అదనపు ఛార్జీలు కూడా జతవుతాయి. కాబట్టి.. కేవలం రివార్డ్ పాయింట్లు వస్తాయని క్రెడిట్ కార్డుతో బంగారం కొనడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇలా చేస్తే కొంత ప్రయోజనంఅయితే.. ఇక్కడ గుర్తుచుకోవాల్సిన విషయం ఏమిటంటే, బిల్లు సమయానికి పూర్తిగా చెల్లించేవారికి క్రెడిట్ కార్డు ఉపయోగకరంగా ఉంటుంది. కొన్ని బ్యాంకులు జీరో కాస్ట్ ఈఎంఐ, క్యాష్‌బ్యాక్, రివార్డ్ పాయింట్లు వంటి ఆఫర్లను అందిస్తున్నాయి. దీంతో కొంత మేర అదనపు ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది.నిబంధనలుక్రెడిట్ కార్డుతో బంగారం కొనుగోలుపై కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. 2013లో రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం.. క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసిన బంగారు నాణేలను, ఈఎంఐగా మార్చడానికి బ్యాంకులకు అనుమతి లేదు. అలాగే బ్యాంకు శాఖల్లో క్రెడిట్ కార్డుతో బంగారు నాణేలు విక్రయించకూడదని కూడా సూచించింది.అయితే.. బంగారు ఆభరణాల కొనుగోలుపై ప్రతి బ్యాంకు వేర్వేరు నిబంధనలు అమలు చేసే అవకాశం ఉంది. కాబట్టి కొనుగోలు చేసే ముందు మీ బ్యాంకు పాలసీని తప్పకుండా తెలుసుకోవాలి. ఈ విషయాన్ని మర్చిపోకూడదు.అధిక ఛార్జీలుఇంకో విషయం స్వైప్ ఛార్జీలు. చాలా జ్యువెలరీ దుకాణాలు క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేస్తే.. 2 నుంచి 3.5 శాతం వరకు అదనపు ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేసే అవకాశం ఉంది. బంగారం విలువ ఎక్కువగా ఉండటంతో ఈ ఛార్జీలు కూడా పెద్ద మొత్తంలో ఉండే అవకాశం ఉంది.మరోవైపు.. కొన్ని క్రెడిట్ కార్డులు ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్లలో బంగారం కొనుగోలు చేస్తే క్యాష్‌బ్యాక్ లేదా రివార్డ్ పాయింట్లు అందిస్తాయి. అయితే, ఈ ఆఫర్లకు కొన్ని షరతులు, పరిమితులు ఉంటాయి. కాబట్టి ఆఫర్ వివరాలను ముందుగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
పెరిగిన బంగారం.. తగ్గిన వెండి: తాజా ధరల ఇలా..
దేశంలో బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతూ ముందుకు దూసుకెళ్తున్నాయి. మొత్తం మీద వారం రోజుల్లో తులం గోల్డ్ రేటు గరిష్టంగా రూ.1,43,290 వద్దకు చేరింది. ఈ కథనంలో ఏడు రోజుల్లో పసిడి ధరల్లో జరిగిన మార్పులు ఏమిటి?, ప్రస్తుత ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు వివరంగా తెలుసుకుందాం.జులై 12న హైదరాబాద్, విజవాడలలో రూ.రూ.1,44,330 వద్ద ఉన్న 24 క్యారెట్ల తులం బంగారం రేటు జులై 18 నాటికి రూ.1,43,290 వద్దకు చేరింది. అంటే ఏడురోజుల్లో రూ.1040 పెరిగిందన్నమాట. 22 క్యారెట్ల రేటు 1,32,300 రూపాయల నుంచి రూ.1,31,350 వద్దకు (రూ. 950 పెరిగింది) చేరింది.ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో భారీ మార్పులు జరిగాయి. ఇక్కడ వారం రోజుల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,480 నుంచి 1,43,440 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు రూ.1,32,450 నుంచి రూ.1,31,450 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే ఏడురోజుల్లో గోల్డ్ రేటులో ఎంత మార్పు జరిగిందో స్పష్టమవుతోంది.చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,45,090 నుంచి రూ.1,43,290 వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు రూ.1,33,000 నుంచి 1,31,350 రూపాయలకు చేరింది. అంటే ఏడూ రోజుల్లో పసిడి ధరలు వరుసగా రూ.1800, రూ.1650 పెరిగింది.వెండి ధరలు ఇలాబంగారం ధరల్లో మాత్రమే కాకుండా.. వెండి ధరల్లో కూడా గణనీయమైన మార్పు జరిగింది. జులై 12న రూ.2.40 లక్షల వద్ద ఉన్న కేజీ సిల్వర్ రేటు.. జులై 18 నాటికి రూ.2.35 లక్షలకు చేరింది. అంటే వారం రోజుల్లో హైదరాబాద్‌లో వెండి రేటు రూ.5000 తగ్గింది. -
మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. ఈ రోజు తులం ఎంతంటే?
-
బంగారంపై మళ్లీ కియోసాకి ‘భారీ’ కామెంట్
‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత, ప్రముఖ ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకి మరోసారి బంగారం, వెండి పెట్టుబడులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ పెట్టుబడిదారుడు జిమ్ రోజర్స్ అభిప్రాయాలను ప్రస్తావిస్తూ, "బంగారం, వెండి ధరలు భవిష్యత్తులో భారీగా పెరిగి 'చంద్రుడి' దాకా వెళ్తాయి" అని ఆయన తన ఎక్స్ (X) ఖాతాలో పేర్కొన్నారు.అయితే ధరలు నేరుగా పెరగవని, మధ్యలో భారీ పతనాలు (రిట్రేస్మెంట్లు) కూడా తప్పవని జిమ్ రోజర్స్ చెప్పిన విషయాన్ని కియోసాకి గుర్తు చేశారు. ఇటీవల బంగారం గరిష్ట స్థాయి నుంచి గణనీయంగా తగ్గిందని, వెండి కూడా భారీ కరెక్షన్ను ఎదుర్కొందని తెలిపారు.చాలా మంది ఇన్వెస్టర్లు ధరలు గరిష్ట స్థాయికి చేరినప్పుడు కొనుగోలు చేసి, తర్వాత ధరలు పడిపోగానే భయంతో విక్రయిస్తారని కియోసాకి వ్యాఖ్యానించారు. తాను మాత్రం ఈ ధరల పతనాన్ని అవకాశంగా తీసుకుని మరింత బంగారం, వెండి కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.బంగారం, వెండి ఎందుకు కొనుగోలు చేస్తున్నారని ఒక స్నేహితుడు అడిగితే, "ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు ఈ సమస్యలను పరిష్కరిస్తాయనే నమ్మకం నాకు లేదు. నిజానికి అప్పులు, ద్రవ్యోల్బణం వంటి సమస్యలకు వారే కారణం. ఇవి ఇంకా పెరిగే అవకాశమే ఎక్కువ" అని తాను సమాధానం ఇచ్చినట్లు కియోసాకి తెలిపారు.చివరగా ఇన్వెస్టర్లను ఉద్దేశించి, "ఎక్కువ ధరకు కొనుగోలు చేసి, తక్కువ ధరకు అమ్ముతారా? లేక తక్కువ ధర వద్ద కొనుగోలు చేసి సంపదను సృష్టిస్తారా? బంగారం, వెండి ధరలు ఇంకా భారీగా పెరుగుతాయి" అంటూ తన పోస్టును ముగించారు. అయితే ఇవి ఆయన వ్యక్తిగత పెట్టుబడి అభిప్రాయాలేనని, పెట్టుబడులు పెట్టే ముందు సొంతంగా విశ్లేషించుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.“Gold and silver going to the moon.”Legendary investor Jim Rogers.Jim states further, that the prices of gold and silver will go to the moon, yet not without severe retracements. Gold and silver just went through a severe retracements.Recently gold hit a high of…— Robert Kiyosaki (@theRealKiyosaki) July 17, 2026 -
అదృశ్య బంగారం.. దొరికితే అదృష్టమే!
జపాన్‌కు దక్షిణాన పసిఫిక్ మహాసముద్రంలోని అగ్నిపర్వత సముద్రగర్భ ప్రాంతంలో ప్రపంచంలోనే అత్యధిక సాంద్రత కలిగిన "అదృశ్య బంగారం" (Invisible Gold)ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఆవిష్కరణ సముద్ర గర్భంలోని ఖనిజ సంపదపై ప్రపంచ దృష్టిని మళ్లీ ఆకర్షిస్తోంది. అయితే ఈ బంగారాన్ని తవ్వడం అంత సులభం కాదని, పర్యావరణ పరిరక్షణ కూడా పెద్ద సవాలేనని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.ఎక్కడ లభించింది?ఈ బంగారు నిల్వలు టోక్యోకు దక్షిణంగా సుమారు 350–360 కిలోమీటర్ల దూరంలో జపాన్ ప్రత్యేక ఆర్థిక మండలిలోని ‘హిగాషి-అయోగాషిమా నోల్ కాల్డెరా (Higashi-Aogashima Knoll Caldera)’ హైడ్రోథర్మల్ ఫీల్డ్‌లో గుర్తించారు. ఇది సముద్ర అడుగున ఉన్న క్రియాశీల అగ్నిపర్వత ప్రాంతం. ఇక్కడ 'బ్లాక్ స్మోకర్స్'గా పిలిచే హైడ్రోథర్మల్ వెంట్ల నుంచి అత్యంత వేడిగా ఉండే, ఖనిజాలతో నిండిన ద్రవాలు వెలువడుతుంటాయి. చల్లటి సముద్రజలాన్ని తాకగానే అవి ఘనీభవించి సల్ఫైడ్ నిక్షేపాలు, చిమ్నీ ఆకారపు నిర్మాణాలను ఏర్పరుస్తాయి. ఈ ప్రక్రియలో రాగి, జింక్, వెండి, బంగారం వంటి లోహాలు సహజంగానే కేంద్రీకృతమవుతాయి.కనిపించని బంగారాన్ని ఎలా గుర్తించారు?ఇప్పటి వరకు బంగారం సాధారణంగా చిన్న కణాలు లేదా రేణువుల రూపంలో ఉంటుందని భావించేవారు. కానీ ఈసారి శాస్త్రవేత్తలు ‘సెకండరీ అయాన్ మాస్ స్పెక్ట్రోమెట్రీ ’(SIMS) అనే అత్యాధునిక సాంకేతికతతో పరిశీలించగా, బంగారం ఎక్కువ భాగం ‘పైరైట్’ (Pyrite) అనే ఐరన్ సల్ఫైడ్ ఖనిజం స్ఫటిక నిర్మాణంలోనే అణు స్థాయిలో కలిసిపోయి ఉందని గుర్తించారు. అందువల్ల ఇది సాధారణ సూక్ష్మదర్శినితో కూడా కనిపించదు. దీనినే "ఇన్విజిబుల్ గోల్డ్"గా పేర్కొంటారు.రికార్డు స్థాయి సాంద్రతసైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో ఇటీవల ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ఈ ప్రాంతంలోని పైరైట్లో బంగారం సాంద్రత గరిష్ఠంగా 1.9 శాతం (19,000 పీపీఎంకు పైగా)నమోదైంది. ఇప్పటివరకు ప్రపంచంలోని సముద్రగర్భ హైడ్రోథర్మల్ నిక్షేపాల్లో నమోదైన అత్యధిక స్థాయిల్లో ఇదొకటిగా పరిశోధకులు పేర్కొన్నారు.తవ్వకాలు సాధ్యమేనా?ఈ ప్రాంతం లోతు ఇతర సముద్రగర్భ ఖనిజ ప్రాంతాలతో పోలిస్తే తక్కువగా ఉండటం, ఖనిజ నిక్షేపాలు సమృద్ధిగా ఉండటం వల్ల భవిష్యత్తులో వాణిజ్యపరంగా మైనింగ్‌కు అనుకూల ప్రాంతంగా భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం పైరైట్లో అణు స్థాయిలో దాగి ఉన్న బంగారాన్ని భారీ స్థాయిలో, ఆర్థికంగా లాభదాయకంగా వెలికితీసే సాంకేతికత ఇంకా అందుబాటులో లేదు. అందువల్ల తక్షణ మైనింగ్ అవకాశాలు లేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.పర్యావరణంపై ఆందోళనలుహైడ్రోథర్మల్ వెంట్ల చుట్టూ భూమిపై మరెక్కడా కనిపించని ప్రత్యేక సముద్ర జీవవ్యవస్థలు ఉంటాయి. అరుదైన పురుగులు, క్రస్టేషియన్లు, స్పాంజ్లు, పగడాలు, చేపలు వంటి జీవులు ఈ తీవ్ర పరిస్థితుల్లోనే జీవిస్తాయి. ఇలాంటి ప్రాంతాల్లో మైనింగ్ ప్రారంభిస్తే ఈ సున్నితమైన జీవవ్యవస్థలు శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉందని సముద్ర శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అందుకే వాణిజ్య తవ్వకాల కంటే ముందుగా సమగ్ర పర్యావరణ అధ్యయనాలు, కఠినమైన రక్షణ చర్యలు అవసరమని వారు సూచిస్తున్నారు. -
భారీగా పెరిగిన బంగారం ధరలు.. కొనాలా? వేచిచూడాలా?
-
భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు
-
భారీగా తగ్గిన బంగారం ఈ రోజు ఎంత తగ్గాయంటే?
-
100 డాలర్లు పెరిగిన బంగారం ధర!
అమెరికాలో జూన్ సీపీఐ.. అంచనాలకు మించి 0.4 శాతం తగ్గడంతో బంగారం ధర 100 డాలర్లు పెరిగిందని ప్రముఖ మార్కెట్ విశ్లేషకులు పీటర్ డేవిడ్ షిఫ్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఇది నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా చూసేద్దాం.బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం చమురు ధర 30 శాతం పడిపోవడమే అని షిఫ్ వెల్లడించారు. కానీ ప్రస్తుత పరిస్థితి మారుతోంది. జూలైలో చమురు ధరలు ఇప్పటికే సుమారు 20 శాతం పెరిగాయి. దీంతో భవిష్యత్తులో ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సాధారణంగా ద్రవ్యోల్బణం తగ్గితే.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంటుంది. వడ్డీ రేట్లు తగ్గితే.. బంగారం వంటి పెట్టుబడులకు డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే బంగారం వడ్డీ ఆదాయం ఇవ్వదు కాబట్టి, తక్కువ వడ్డీ రేట్ల సమయంలో ఇది మరింత ఆకర్షణీయంగా మారుతుంది.అయితే.. అధికారిక గణాంకాల్లో ద్రవ్యోల్బణం తగ్గినట్లు కనిపించినప్పటికీ.. ప్రజలు రోజువారీ జీవితంలో ఎదుర్కొంటున్న ధరల పెరుగుదల మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఇంధనం, రవాణా, ఇతర అవసరాల ధరలు పెరిగితే దాని ప్రభావం సాధారణ ప్రజలపై ఉంటుంది.జూన్ సీపీఐ తగ్గడం బంగారం ధరలకు తాత్కాలికంగా మద్దతు ఇచ్చింది. కానీ.. చమురు ధరల పెరుగుదల, వాస్తవ ద్రవ్యోల్బణ పరిస్థితులు, అమెరికా ఫెడ్ తీసుకునే నిర్ణయాలపై బంగారం భవిష్యత్ కదలికలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి, అధికారిక గణాంకాల కంటే ఆర్థిక వ్యవస్థలో జరుగుతున్న వాస్తవ మార్పులను కూడా గమనించడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.Gold is up $100 as the June CPI fell 0.4%, more than expected. But the main driver was a 30% drop in oil. Ignoring the fact that oil is already up 20% in July and headed higher, a lower official inflation rate merely gives the Fed an excuse to ignore the rise in actual inflation.— Peter Schiff (@PeterSchiff) July 14, 2026భారతదేశంలో బంగారం ధరలుఇండియన్ మార్కెట్లో గోల్డ్ రేటు గత కొంత కాలంగా తగ్గుతూ ఉంది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు హైదరాబాద్, విజయవాడలలో రూ. 1,42,800 వద్ద ఉంది. గత నెలతో పోలిస్తే.. బంగారం ధర ఈ నెలలో కొంత తక్కువే అని తెలుస్తోంది. -
రూ. 2 కోట్ల బంగారం పేస్ట్ : తమిళనాడు జంట అరెస్ట్
కొచ్చి: అంతర్జాతీయంగా, జాతీయంగా బంగారం ధరలు ఆకాశాన్ని చూస్తున్నాయి. దీంతో గోల్డ్‌ను దొడ్డిదారిన తరలించే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా దాదాపు రూ. 2 కోట్ల విలువైన బంగారాన్ని అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని, కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. బంగారాన్ని పేస్ట్ రూపంలో ప్యాంటు నడుము పట్టీలలో దాచి తరలిస్తుండగా తమిళనాడుకు చెందిన ఒక జంటను అరెస్ట్ చేసినట్టు పోలీసులు మంగళవారం తెలిపారు.నిందితులను తమిళనాడులోని పుదుకోట్టై జిల్లాకు చెందిన రిఫ్నాస్ హమీద్ మహమ్మద్ షరీఫ్ (26) అతని భార్య జానోఫర్ కదర్ బీవి ఉమర్ ఫరూక్ (23)గా గుర్తించారు. వీరు జూలై 13న అబుదాబి నుండి ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం IX 418లో విమానాశ్రయానికి వచ్చారు. వారి కదలికలపై అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు గా ఈ జంటను అడ్డగించి, క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దీంతో అసలు విషయం తెలిసి షాకయ్యారు. నడుము బెల్ట్‌లో దాచిన బంగారాన్ని వెలికితీశారు. అనంతరం సుమారు రూ. 1.94 కోట్ల విలువైన 1,353.92 గ్రాముల 24-క్యారెట్ బంగారం కలిగిన బంగారు పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ చట్టంలోని నిబంధనల ప్రకారం ఇద్దరు ప్రయాణికులను అరెస్టు చేశారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. ఇదీ చదవండి: చిన్నగొడవ, భర్తను మొబైల్‌తో కొట్టింది.. అంతే..!ఇదీ చదవండి: 82 ఏళ్ల వృద్ధుడి పెన్షన్ ఖాతాలో రూ. వందల కోట్లు, ఏం చేశాడో తెలుసా? -
బంగారం తగ్గిందోచ్.. లేటెస్ట్ ధరలు ఇవే!
-
తగ్గిన బంగారం, వెండి ధరలు!
దేశీయ విఫణిలో బంగారం ధరలు మరోమారు తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు (శనివారం) గోల్డ్ రేటు గరిష్టంగా రూ.490 తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని పసిడి ధరల్లో మార్పులు జరిగాయి. కాగా వెండి ధరలు కూడా ఈ రోజు రూ.5000 తగ్గడంతో.. కేజీ సిల్వర్ రేటు రూ.2.40 లక్షల వద్దకు చేరింది. ఈ కథనంలో గోల్డ్, సిల్వర్ లేటెస్ట్ ధరల వివరాలు వివరంగా చూసేద్దాం. -
పసిడి ప్రియులకు అలర్ట్.. మారిన బంగారం, వెండి ధరలు!
బంగారం ధరలు పెరుగుదల మళ్లీ మొదలైంది. వరుసగా రెండో రోజు దేశీయ విఫణిలో గోల్డ్ రేటు గరిష్టంగా రూ.380 పెరిగింది. దీంతో హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు మొదలైన నగరాల్లో పసిడి ధరల్లో మార్పులు కనిపించాయి. కాగా వెండి ధర మాత్రం రూ.5000 పెరిగింది. తాజా ధరలకు సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా చూసేద్దాం. -
Gold Price: గంటల వ్యవధిలో మారిపోయిన ధరలు!
నాలుగు రోజుల తరువాత గోల్డ్ రేటు ఒక్కసారిగా పెరిగింది. ఈ రోజు (గురువారం) ఉదయం గరిష్టంగా రూ.110 పెరిగిన బంగారం ధర, సాయంత్రానికి మరో 20 రూపాయలు పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇంకాస్త ముందుకు వెళ్ళింది. ఈ కథనంలో లేటెస్ట్ ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం. -
ఒక్క రోజులో అమాంతం పెరిగిన బంగారం ధరలు
-
ఈసారి బంగారం, వెండి కాదు! కియోసాకి కొత్త సూచన
ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో కొనసాగుతున్న అనిశ్చితి, బంగారం ధరల్లో తీవ్ర ఒడిదుడుకుల నేపథ్యంలో ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి చర్చనీయాంశంగా మారారు. అయితే ఈసారి ఆయన ఇన్వెస్టర్లకు బిట్‌కాయిన్, బంగారం లేదా వెండి కొనాలని కాకుండా.. ఒక పుస్తకం తప్పనిసరిగా చదవాలని సూచించడం విశేషం.ఇటీవల సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో చేసిన పోస్టులో మిక్కీ ఎం. మైనీ రచించిన 'ది ఎంట్రోపీ ట్రాప్' (The Entropy Trap) పుస్తకాన్ని ప్రస్తుత కాలంలో తప్పనిసరిగా చదవాల్సిన గ్రంథంగా పేర్కొన్నారు. ఈ పుస్తకానికి ప్రముఖ ఆర్థికవేత్త ‘జిమ్ రికార్డ్స్’ ముందుమాట రాశారని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో రాబోయే నిర్మాణాత్మక మార్పులను అర్థం చేసుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని కియోసాకి అభిప్రాయపడ్డారు.'నమ్మకంపై ఆధారపడిన ఆస్తులకు ప్రమాదం'ఈ పుస్తకం ప్రధానంగా "నమ్మకంపై ఆధారపడిన ఆస్తులు" (Trust-based Assets) భవిష్యత్తులో ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశాలపై చర్చిస్తుందని కియోసాకి తెలిపారు. అమెరికా ప్రభుత్వ బాండ్లు, ఈటీఎఫ్‌లు (ETFs), మ్యూచువల్ ఫండ్లు వంటి పెట్టుబడి సాధనాలు పూర్తిగా వ్యవస్థపై విశ్వాసంపై ఆధారపడి ఉన్నాయని, ఆ విశ్వాసం దెబ్బతింటే వాటి విలువ కూడా తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఇవి కియోసాకి వ్యక్తిగత అభిప్రాయాలేనని, వాటికి స్వతంత్ర ఆర్థిక ఆధారాలు లేవని గుర్తుంచుకోవాలి.'నేటి ధనవంతులే రేపటి పేదలు కావచ్చు'పాత ఆర్థిక నియమాలను మాత్రమే నమ్ముతూ పెట్టుబడులు పెట్టేవారు భవిష్యత్తులో నష్టపోయే ప్రమాదం ఉందని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో జరుగుతున్న మార్పులను ముందుగానే అర్థం చేసుకునే వారే రేపటి సంపన్నులవుతారని కియోసాకి తన పోస్టులో పేర్కొన్నారు. "సమాచారమే అసలు సంపద" అనే సందేశాన్ని ఆయన మరోసారి నొక్కిచెప్పారు.కొద్ది రోజుల క్రితమే బంగారం ధరలపై తన స్వల్పకాలిక అంచనా తప్పిందని కియోసాకి బహిరంగంగా అంగీకరించారు. బంగారం ఇంకా పడిపోతోందని, మార్కెట్లలో ఇలాంటి హెచ్చుతగ్గులు సహజమేనని పేర్కొన్నారు. అయినప్పటికీ, వచ్చే ఐదేళ్లలో బంగారం ఔన్స్‌కు 35,000 డాలర్ల స్థాయికి చేరుతుందన్న తన దీర్ఘకాలిక అంచనాను మాత్రం మార్చలేదు.VIB: Very Important BOOK.Best most important new book for this time in history became available on Amazon last week.WHY: is book so important.?A: Because book explains why today’s Rich will become tomorrows poor.WHY: Because the informed will be tommorrow’s ULTRA…— Robert Kiyosaki (@theRealKiyosaki) July 7, 2026 -
దిగొచ్చిన బంగారం ధర.. తులం ఎంతంటే?
-
చల్లబడిన బంగారం ధర.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
బంగారం కాదు..ప్రపంచాన్ని శాసిస్తున్న ఆ ‘చిన్న వస్తువు’ ఏంటో తెలుసా?
ప్రస్తుతం 21వ శతాబ్దంలో.. ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైనది, అత్యంత పవర్ఫుల్ వస్తువు ఏది? అని ఎవరినైనా అడిగితే.. చాలామంది బంగారం, ప్లాటినం లేదా ముడి చమురు (క్రూడ్ ఆయిల్) అని చెప్తారు. కానీ, ఒక జర్నలిస్ట్‌గా ప్రపంచ పరిణామాలను నిశితంగా గమనిస్తే అసలు నిజం వేరే ఉందని అర్థమవుతుంది. ఇవాళ ప్రపంచాన్ని గడగడలాడిస్తూ.. అగ్రరాజ్యాలను శాసిస్తున్నది బంగారం కాదు.. ఒక చిన్న ఇసుక రేణువుతో తయారయ్యే 'మైక్రోచిప్'.. దాన్నే సెమీకండక్టర్ అంటారు!అవును.. మీ చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్ మొదలు.. అంతరిక్షంలోకి దూసుకెళ్లే రాకెట్ వరకు.. మీ ఇంట్లోని స్మార్ట్ టీవీ నుంచి.. యుద్ధరంగంలో శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే అత్యాధునిక డ్రోన్లు, మిస్సైళ్లు, రాడార్ వ్యవస్థల వరకు.. ఈ చిన్న చిప్ లేకపోతే ఏదీ నడవదు.. కదలదు.. అంతా డెడ్! కేవలం మన గోరు పరిమాణంలో ఉండే ఈ చిన్న చిప్స్ కోసం.. ఇప్పుడు ప్రపంచ అగ్రరాజ్యాలైన అమెరికా, చైనాల మధ్య ఒక నిశ్శబ్ద, భయంకరమైన యుద్ధం జరుగుతోంది. అదే 'గ్లోబల్ సెమీకండక్టర్ వార్'.ఇది బుల్లెట్లతో, సైన్యంతో జరిగే యుద్ధం కాదు.. గ్లోబల్ టెక్నాలజీని తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి జరుగుతున్న ఒక మైండ్ గేమ్! ఈ డిజిటల్ యుగంలో.. ఈ 'చిప్ వార్' లో గెలిచినవాడే రేపటి ప్రపంచానికి ఏకఛత్రాధిపతి.. వాడే అసలైన గ్లోబల్ డాన్! దాని కథాకమామిషు ఏంటో ఇవాళ్టి ‘సాక్షి డిజిటల్’ పాడ్‌కాస్ట్‌లో తెలుసుకుందాం. వివరాలకు కింది వీడియోను క్లిక్ చేయండి.. -
భారీగా బంగారం కొంటున్న భారత్.. కారణం ఇదే!
బంగారం అంటే భారతీయులకు ఒకప్పటి నుంచి ఒక ప్రత్యేకమైన నమ్మకం. ఇప్పుడు అదే నమ్మకం.. దేశ ఆర్థిక విధానంలో కూడా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరగడం, మరోవైపు రిజర్వ్ బ్యాంక్ వరుసగా బంగారం కొనుగోలు చేయడంతో మన దేశంలో బంగారం నిల్వల విలువ 115.8 బిలియన్ డాలర్లను చేరుకుంది. ఈ విలువ గత రెండేళ్లతో పోలిస్తే దాదాపు రెట్టింపు కావడం విశేషం.భారతదేశంలోని విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా గణనీయంగా పెరిగింది. గత ఆరు నెలల గణాంకాల ప్రకారం, విదేశీ నిల్వల్లో బంగారం వాటా 17 శాతానికి చేరుకుంది. ఏడాది క్రితం ఇది 12 శాతం మాత్రమే ఉండేది. అంటే.. భారత్ కేవలం డాలర్ వంటి విదేశీ కరెన్సీలపైనే మాత్రమే ఆధారపడకుండా, బంగారాన్ని కూడా ఒక కీలక ఆస్తిగా భావిస్తోందన్నమాట.భారతదేశంలో బంగారం నిల్వల విలువ పెరగడానికి ప్రధాన కారణాలు రెండు. ఒకటి గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరగడం. రెండు ఆర్బీఐ నిరంతరంగా బంగారం కొనుగోలు చేయడం. 2024 ప్రారంభంలో ఔన్స్ బంగారం ధర సుమారు 2,000 డాలర్ల వద్ద ఉండగా, తరువాత కాలంలో అది 4,000 డాలర్లకు పైగా చేరింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వల విలువ ఒక్కసారిగా పెరిగింది.భారత్ మాత్రమే కాకుండా, ప్రపంచంలోని చాలా దేశాల కేంద్ర బ్యాంకులు కూడా తమ నిల్వల్లో బంగారం వాటాను పెంచుకుంటున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక ఆంక్షలు, కరెన్సీ విలువల్లో మార్పుల వచ్చినప్పుడు రక్షణ పొందేందుకు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా చూస్తున్నాయి. ఈ కారణంగా బంగారం నిల్వల విలువలను పెంచుకుంటున్నాయి.రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తరువాత మారిన పరిస్థితి!నిజానికి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా కొన్ని దేశాలు తమ విదేశీ నిల్వలను కేవలం అమెరికా డాలర్ వంటి కరెన్సీల్లో ఉంచడం ఎంతవరకు సురక్షితం అనే దానిపై ఆలోచించడం ప్రారంభించాయి. దీంతో అనేక దేశాలు బంగారం కొనుగోళ్లను పెంచడం ప్రారంభించాయి.బంగారం కొనుగోలు చేయడంలో పోలాండ్ ముందుంది. దీంతో కొన్ని సంవత్సరాల్లోనే.. తన బంగారం నిల్వలను భారీగా పెంచుకుంది. చైనా కూడా 2023 తర్వాత మళ్లీ బంగారం కొనుగోళ్లను వేగవంతం చేసింది. చెక్ రిపబ్లిక్ వంటి చిన్న దేశాలు కూడా తమ బంగారం నిల్వలను గణనీయంగా పెంచుకున్నాయి.ఆర్బీఐ వ్యూహంఇండియా కూడా గత కొన్నేళ్లుగా బంగారం నిల్వలను క్రమంగా పెంచుకుంటోంది. 2015లో ఆర్బీఐ వద్ద సుమారు 557.8 టన్నుల బంగారం ఉండేది. అది 2026 నాటికి అది 880.5 టన్నులకు చేరింది. ముఖ్యంగా 2019 తర్వాత ఆర్బీఐ మరింత బంగారం కొనుగోలు చేయడం ప్రారంభించింది. దీంతో దేశ విదేశీ నిల్వల్లో బంగారం ప్రాధాన్యత పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడినప్పుడు బంగారం ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందని కేంద్ర బ్యాంకులు భావిస్తున్నాయి.ఇక అమెరికా, జర్మనీ, ఇటలీ, బ్రిటన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం నిల్వలను కలిగి ఉన్నాయి. కాబట్టి ఇటీవల కాలంలో కొత్తగా.. పెద్ద మొత్తంలో కొనుగోళ్లు చేయాల్సిన అవసరం ఈ దేశాలకు తక్కువగా ఉంది. సౌదీ అరేబియా కూడా తన బంగారం నిల్వలను దాదాపు స్థిరంగా ఉంచుకుంది. అయితే చమురు ఎగుమతుల ద్వారా వచ్చే విదేశీ కరెన్సీ నిల్వలపై ఎక్కువగా ఆధారపడుతోంది. -
పాత బంగారాన్ని ఎందుకు అమ్ముతున్నారు? ఫ్యూచర్ లో గోల్డ్ పరిస్థితి ఇదే
-
GRT: ఆషాఢం ప్రారంభం.. బంగారం కొనేవారికి భారీ ఆఫర్లు!
-
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ఏకంగా 10 వేలు తగ్గిన బంగారం
-
రూ.10 వేలు తగ్గిన వెండి: బంగారం ధరలు ఇలా..
గత కొన్ని రోజులుగా పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు ఈ రోజు (సోమవారం) మరోసారి తగ్గుముఖం పట్టాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని గోల్డ్, సిల్వర్ రేట్లలో స్వల్ప మార్పులు కనిపించాయి. ఈ కథనంలో కొత్త ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం. -
నాకు ఇన్ఫోసిస్‌లో నెలకు రూ.1 లక్ష జీతం వస్తుంది!
మంగళగిరి టౌన్: ఓ కిలాడీ లేడీ తనకు పెళ్లి కాలేదంటూ మాయమాటలతో నమ్మించి, వివాహం చేసుకుని అనంతరం భారీగా నగలు, డబ్బు దోచుకుని పరారైన ఘటన మంగళగిరిలో చోటుచేసుకుంది. కిలాడీ వలలో పడి మోసపోయిన ఓ పోలీస్ శుక్రవారం మంగళగిరి పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. సేకరించిన వివరాల మేరకు.. మంగళగిరి పట్టణం ఎల్బీ నగర్లో నివాసముంటున్న సతీష్ 2013 బ్యాచ్‌కు చెందిన 16వ బెటాలియన్ ఏపీఎస్పీ కానిస్టేబుల్. ప్రస్తుతం విశాఖపట్నంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో జనవరి 28వ తేదీ జయశ్రీ పాండా అనే మహిళ సతీష్‌కు ఫోన్ చేసి తన వ్యక్తిగత సమస్యకు సంబంధించి డీజీపీ కార్యాలయంలో ఇచ్చిన ఫిర్యాదు గురించి అడిగింది. ప్రస్తుతం తాను అక్కడ పనిచేయడం లేదని, సంబంధిత అధికారులను సంప్రదించాలని సతీష్ సూచించాడు. కొంతకాలానికి ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అనంతరం జయశ్రీపాండా తన ప్లాన్‌ను అమల్లోకి తెచ్చింది. తనకు వివాహం కాలేదని, కుటుంబ సమస్యలు లేవని సతీష్‌ను నమ్మించింది. తన కుటుంబం నుంచి వచ్చే ఆస్తులు, ఇళ్లు, బంగారం ఉన్నాయని, ఇన్ఫోసిస్‌లో లక్ష రూపాయల జీతంతో ఉద్యోగం చేస్తున్నానని సతీష్‌కు చెప్పింది. ప్రస్తుతం ఐబీఎం కంపెనీలో ఏడాదికి రూ.15 లక్షల ప్యాకేజీకి ఎంపికైనట్లు నమ్మబలికి, తనను వివాహం చేసుకోవాలని కోరింది. సతీష్ తనకు అప్పటికే వివాహం జరిగిందని చెప్పాడు. మొత్తం విచారించానని, మీకు వివాహం జరిగి విడాకులు కూడా తీసుకున్నట్లు తెలిసిందని, తనకు అభ్యంతరం లేదంటూ సతీష్‌ను ఒత్తిడి చేసింది. చివరకు పెద్దల సమక్షంలో ఓ దేవాలయంలో మే 13న జయశ్రీపాండాను సతీష్ వివాహం చేసుకున్నాడు. జూన్ 13న ఇంట్లో ఉన్న సుమారు 200 గ్రాముల బంగారు ఆభరణాలతోపాటు నగదును తీసుకుని వెళ్లిపోయింది. బంగారం, నగదు గురించి సతీష్ అడగ్గా తానే తీసుకువెళ్లానని, తన అత్తయ్య వద్ద ఉంచానని చెప్పింది. వెంటనే ఫోన్ చేసి తన అన్నయ్య బంగారం, నగదు తీసుకువెళ్లినట్లు సతీష్‌కు చెప్పింది. పలాసకు వచ్చి నగదు రూపంలో సెటిల్మెంట్ చేసుకుని పెద్దల సమక్షంలో విడాకుల పత్రాలు రాసుకుందామంటూ సతీష్‌ను రమ్మంది. అంగీకరించకపోతే తప్పుడు కేసులు పెడతానని బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేస్తోందని సతీష్ తన ఫిర్యాదులో తెలిపాడు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి తీసుకువెళ్లిన నగదు, బంగారు ఆభరణాలను ఇప్పించి తనను నమ్మించి మోసం చేసిన జయశ్రీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. సతీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళగిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
ఇంట్లో బంగారం ఉందా.. ఈ స్కీమ్‌తో భారీ లాభం!
భారతదేశంలో బంగారానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. మన దేశ ప్రజలు బంగారాన్ని కేవలం ఆభరణంగా మాత్రమే కాకుండా.. భవిష్యత్తు కోసం భద్రమైన పెట్టుబడిగా కూడా భావిస్తారు. కాబట్టి ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం కొనుగోలు చేసే దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచింది. అయితే.. ఇళ్లలోని బంగారం, దేశ ఆర్థిక వ్యవస్థలో ఉపయోగపడకుండా అలాగే ఉండిపోతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ (Gold Monetisation Scheme)ను మరింత సమర్థవంతంగా మార్చేందుకు కొత్త రూపంలో తీసుకురావాలని యోచిస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది.గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. దీని ప్రధాన ఉద్దేశ్యం.. ప్రజలు తమ ఇళ్లలో ఉన్న బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో వినియోగించేలా చేయడం. బంగారం డిపాజిట్ చేసిన వారికి ప్రభుత్వం వడ్డీ కూడా చెల్లించేది. గడువు పూర్తయిన తర్వాత వారు బంగారం రూపంలో గానీ, దానికి సమానమైన నగదు రూపంలో గానీ తిరిగి పొందే అవకాశం ఉండేది. అయితే ఈ స్కీమ్ అనుకున్నంత సక్సెస్ కాలేదు.ఈ పథకం ఎందుకు విఫలమైంది?దాదాపు పది సంవత్సరాల కాలంలో ఈ పథకం ద్వారా కేవలం 38 టన్నుల బంగారం మాత్రమే సేకరించారు. కానీ భారతీయుల వద్ద సుమారు 25,000 టన్నుల బంగారం ఉందని అంచనా. దీన్నిబట్టి చూస్తే.. ఈ పథకం ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదని తెలుస్తోంది.➤భారతీయ కుటుంబాలు తమ పూర్వీకుల నుంచి వచ్చిన లేదా భావోద్వేగ విలువ కలిగిన నగలను డిపాజిట్ చేయడానికి ఆసక్తి చూపలేదు.➤పన్ను సంబంధిత విచారణలు వస్తాయనే భయం ప్రజల్లో ఉంది.➤బ్యాంకులకు ఈ పథకం ద్వారా పెద్దగా లాభం లేకపోవడంతో వారు దీనిని ప్రోత్సహించలేదు.➤ప్రభుత్వం వడ్డీతో పాటు బంగారం ధర పెరిగితే ఆ అదనపు మొత్తాన్ని కూడా చెల్లించాల్సి రావడంతో ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరిగింది.కొత్త మార్పులు ఏమిటి?గోల్డ్ మానిటైజేషన్ స్కీములో కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న ముఖ్యమైన మార్పు ఏమిటంటే, దేశవ్యాప్తంగా ఉన్న జ్యువెలర్లు (బంగారు నగల వ్యాపారులు) కూడా కలెక్షన్ పార్ట్నర్లుగా పనిచేసే అవకాశం కల్పించడం.అంటే.. ఇప్పటి వరకు బంగారాన్ని కేవలం బ్యాంకుల ద్వారానే మాత్రమే డిపాజిట్ చేయాల్సి వచ్చేది. ఇకపై ప్రజలు తమకు దగ్గరలో ఉన్న విశ్వసనీయ జ్యువెలర్ల వద్ద కూడా బంగారాన్ని ఇచ్చే అవకాశం ఉండవచ్చు. దీనివల్ల ప్రజలకు సౌకర్యం పెరుగుతుంది, అలాగే మరింత బంగారం ఈ పథకంలోకి వచ్చే అవకాశం ఉంటుంది.ఈ పథకం వల్ల కలిగే ప్రయోజనాలు➤ఇళ్లలో ఉపయోగం లేకుండా ఉన్న బంగారం దేశ ఆర్థిక వ్యవస్థలోకి వస్తుంది.➤విదేశాల నుంచి బంగారం దిగుమతుల అవసరం తగ్గుతుంది.➤డాలర్లపై భారతదేశం ఆధారపడటం తగ్గుతుంది.➤రూపాయి విలువ బలపడే అవకాశం ఉంటుంది.➤దేశంలో బంగారం ఆధారిత వ్యాపారాలు మరింత పారదర్శకంగా మారతాయి.➤దిగుమతులు తగ్గడం వల్ల, బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంది.ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం.. భారతీయుల వద్ద ఉన్న బంగారంలో కేవలం 5 శాతం మాత్రమే ఈ పథకం ద్వారా సమీకరించినా, సుమారు 1,250 టన్నుల బంగారం లేదా 80-90 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తి దేశ ఆర్థిక వ్యవస్థలోకి వస్తుంది. ఇది దాదాపు రెండేళ్ల పాటు బంగారం దిగుమతుల అవసరాన్ని తగ్గించే స్థాయిలో ఉంటుంది.ప్రధానమంత్రి పిలుపుఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలను ఒక సంవత్సరం పాటు కొత్త బంగారం కొనుగోళ్లను వాయిదా వేయాలని కోరారు. దీనివల్ల దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.


