మళ్లీ పుంజుకున్న గోల్డ్, సిల్వర్: కొత్త ధరలు ఇలా.. | Gold and Silver Price Hike Again in India Know The Latest Rates | Sakshi
Sakshi News home page

మళ్లీ పుంజుకున్న గోల్డ్, సిల్వర్: కొత్త ధరలు ఇలా..

Feb 3 2026 7:11 PM | Updated on Feb 3 2026 7:59 PM

Gold and Silver Price Hike Again in India Know The Latest Rates

జనవరి 30 నుంచి భారీగా తగ్గిన గోల్డ్, సిల్వర్ రేటు మళ్లీ పెరుగుదల దిశగా పయనించింది. ఈ రోజు (మంగళవారం) ఉదయం రూ. 151750 వద్ద ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు సాయంత్రానికి మారిపోయింది. దీంతో పసిడి కొనుగోలుదారుల్లో మరోమారు ఒకింత ఆందోళన మొదలైంది. అయితే ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.

హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. సాయంత్రానికి రూ.1,53,930 (రూ.760 పెరిగింది) వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,41,100 వద్ద (రూ. 700 పెరిగింది) ఉంది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై మొదలైన నగరాల్లో కూడా ఉన్నాయి.

ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు వరుసగా రూ.740 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్), రూ.700 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్) పెరిగాయి. దీంతో 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,54,080 రూపాయల దగ్గర, 22 క్యారెట్స్ తులం పసిడి ధర రూ.1,41,250 వద్ద నిలిచాయి.

చెన్నైలో గోల్డ్ రేటు ఎలా ఉందనే విషయానికి వస్తే.. ఇక్కడ బంగారం ధర దేశంలోని ఇతర నగరాల కంటే ఎక్కువ పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 3,490 రూపాయలు పెరిగి రూ.1,55,670 వద్ద నిలిచింది. 22 క్యారెట్స్ తులం రేటు 3200 రూపాయలు పెరిగి రూ.1,42,700 వద్దకు చేరింది.

సిల్వర్ రేటు
మంగళవారం ఉదయం రూ.20 వేలు తగ్గిన సిల్వర్ రేటు.. సాయంత్రానికి అంతే పెరిగింది (రూ.20,000 పెరిగింది). దీంతో రూ. 2.80 లక్షల దగ్గర ఉన్న కేజీ వెండి రేటు రూ. 3 లక్షలకు చేరింది.

ఇదీ చదవండి: జియో, ఎయిర్‌టెల్.. బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే!

Advertisement
 
Advertisement
Advertisement