అత్యంత ప్రజాదరణ పొందిన టెలికాం కంపెనీలు.. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు లెక్కకు మించిన రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతూనే ఉన్నాయి. ఇందులో నెల, మూడు నెలలు, ఏడాది ప్లాన్స్ ఉన్నాయి. అయితే ఈ కథనంలో 84 రోజుల పాపులర్ రీఛార్జ్ ప్లాన్స్ గురించి తెలుసుకుందాం.
ఎయిర్‌టెల్ రీఛార్జ్ ప్లాన్స్
రూ.469 ప్లాన్: కంపెనీ అందించే 84 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా.. అపరిమిత కాల్స్ లభిస్తాయి. అయితే డేటా లభించదు. నెంబర్ యాక్టివ్‌గా ఉంచుకోవాలన్నా.. కేవలం కాలింగ్ కోసం మాత్రమే రీఛార్జ్ చేసుకోవాలన్నా యూజర్లు ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవచ్చు.
రూ.548 ప్లాన్: 84 రోజుల పాటు అపరిమిత కాల్స్ మాత్రమే కాకుండా.. 7 జీబీ డేటా కూడా పొందవచ్చు. ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. డేటా ఎక్కువ కావాలనుకునే యూజర్లకు ఈ ప్లాన్ అంత ఉపయోగకరంగా ఉండదు.
రూ.979 ప్లాన్: రోజుకు 2జీబీ డేటా కావాలనుకునే యూజర్లకు ఇది బెస్ట్ ప్లాన్. 84 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్ ద్వారా అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. సోనీ లివ్ యాప్ యాక్సెస్ లభిస్తుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. మొత్తం 168 జీబీ డేటా లభిస్తుందన్నమాట.
రిలయన్స్ జియో
రూ.448 ప్లాన్: జియో అందిస్తున్న ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇందులో డేటా లభించదు. కానీ అపరిమిత కాలింగ్, 1000 ఎస్ఎంఎస్‌లు పొందవచ్చు. తక్కువ ఖర్చుతో కాల్స్ చేయాలకునేవారు లేదా నెంబర్ యాక్టివ్‌గా ఉంచుకోవాలకునేవారికి ఈ రీఛార్జ్ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది.
రూ.799 ప్లాన్: ఈ ప్లాన్ వ్యాలిడిటీ కూడా 84 రోజులే. అయితే రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. అపరిమిత కాలింగ్ మాత్రమే కాకుండా.. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పొందవచ్చు. జియో టీవీ, జియో ఎయిర్ క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్‌లు లభిస్తాయి.
రూ.859 ప్లాన్: రోజుకు 2 జీబీ డేటా కావాలనే వారికి ఈ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది. 84 రోజుల వ్యాలిడిటీ (168 జీబీ డేటా).. మూడు నెలలు జియో హాట్‌స్టార్‌కు ఫ్రీ యాక్సిస్ కూడా లభిస్తుంది. అంతే కాకుండా యూజర్లు గూగుల్ జెమినీ ప్రోకు 18 నెలలు సబ్‌స్క్రిప్షన్ కూడా పొందవచ్చు.


