మారుతి కారు.. అమ్మకాలు జోరు! | Maruti Victoris Crosses 50000 Sales Milestone In 4 Months | Sakshi
Sakshi News home page

మారుతి కారు.. అమ్మకాలు జోరు!

Feb 3 2026 4:47 PM | Updated on Feb 3 2026 5:24 PM

Maruti Victoris Crosses 50000 Sales Milestone In 4 Months

మారుతి సుజుకి.. మార్కెట్లో విక్టోరిస్ కారు అమ్మకాల్లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. సెప్టెంబర్ 2025లో లాంచ్ అయిన ఈ మోడల్ కేవలం నాలుగు నెలల కాలంలో 50,000 సేల్స్ సాధించగలిగింది. జనవరి 2026లో దీని అమ్మకాలు 15240 యూనిట్లు. నవంబర్ & డిసెంబర్‌లలో అమ్మకాలు వరుసగా 12,300 & 6,210 యూనిట్లు.

మారుతి సుజుకి విక్టోరిస్.. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు ధరలు రూ.10.50 లక్షల నుంచి రూ. 19.98 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉంది. ఇది మొత్తం మూడు పవర్‌ట్రెయిన్ ఎంపికలతో లభిస్తుంది. ఇందులోని 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ మైల్డ్-హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్, CNG టెక్నాలజీతో అందుబాటులో ఉంటుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్, e-CVT ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది.

మైల్డ్-హైబ్రిడ్ టెక్‌తో కూడిన 1.5-లీటర్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ & 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్‌తో లభిస్తుంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ e-CVTని పొందుతుంది, పెట్రోల్-CNG మోడల్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇవన్నీ మంచి పనితీరును అందిస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement