భారత్ - యూఎస్ డీల్: భారీ లాభల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు | Stock Market Closing Update 3rd February 2026 | Sakshi
Sakshi News home page

భారత్ - యూఎస్ డీల్: భారీ లాభల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Feb 3 2026 3:43 PM | Updated on Feb 3 2026 3:52 PM

Stock Market Closing Update 3rd February 2026

మంగళవారం ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి అదే ఊపులో ముగిశాయి. సెన్సెక్స్ ఏకంగా 2,072.67 పాయింట్ల (2.54 శాతం) లాభంతో 83,739.13 వద్ద, నిఫ్టీ 639.15 పాయింట్ల (2.55 శాతం) లాభంతో 25,727.55 వద్ద నిలిచాయి.

పారామౌంట్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్, ఫేజ్ త్రీ లిమిటెడ్, అవలోన్ టెక్నాలజీస్ లిమిటెడ్, ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, గర్వారే హై-టెక్ ఫిల్మ్స్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. పరాస్ పెట్రోఫిల్స్ లిమిటెడ్, ఆర్టెమిస్ మెడికేర్ సర్వీసెస్ లిమిటెడ్, TECIL కెమికల్స్ & హైడ్రో పవర్ లిమిటెడ్, కామత్ హోటల్స్ (ఇండియా) లిమిటెడ్, MPS లిమిటెడ్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి.

అందులో భారీ లాభాల్లో..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం మార్కెట్లు భారీ లాభాల్లో ముగియడానికి ప్రధాన కారణం. భారత ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న పరస్పర టారిఫ్‌లను 25% నుంచి 18%కు తగ్గించారు. ఇది చైనా (35%), పాకిస్థాన్ (19%) కంటే తక్కువ కావడం విశేషం.

Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

Advertisement
 
Advertisement
Advertisement