2400 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌ | Stock market updates on 03 February 2026 | Sakshi
Sakshi News home page

Stock Market Updates: భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

Feb 3 2026 9:31 AM | Updated on Feb 3 2026 10:57 AM

Stock market updates on 03 February 2026

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం భారీగా పెరిగాయి. ఈరోజు ఉదయం 9:22 సమయానికి నిఫ్టీ(Nifty) 757 పాయింట్లు పెరిగి 25,846 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 2467 ఎగబాకి 84,160 వద్ద ట్రేడవుతోంది.

మార్కెట్ల పెరుగుదలకు కారణాలు..

భారత్-అమెరికా చరిత్రాత్మక డీల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం మార్కెట్లకు అతిపెద్ద బూస్ట్‌గా నిలువనుంది. భారత ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న పరస్పర టారిఫ్‌లను 25% నుంచి 18%కు తగ్గించారు. ఇది చైనా (35%), పాకిస్థాన్ (19%) కంటే తక్కువ కావడం విశేషం.

రష్యా ఆయిల్ పెనాల్టీ తొలగింపు

రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్ల కారణంగా భారత్‌పై ఉన్న అదనపు పెనాల్టీలను అమెరికా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. దీనివల్ల ఇంధన ఖర్చులు తగ్గి, ఎగుమతిదారులకు భారీ ఊరట కలగనుంది.

ఆర్‌బీఐ వడ్డీ రేట్ల కోత అంచనాలు

ఫిబ్రవరి 4-6 తేదీల్లో జరగనున్న ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశంపై అందరి దృష్టి ఉంది. ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం, ఆర్థిక వృద్ధిని మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉండటంతో రెపో రేటును 0.25% తగ్గించే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వడ్డీ రేట్లు తగ్గితే బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ రంగాలు భారీగా లాభపడే అవకాశం ఉంది. ఇది స్టాక్‌ మార్కెట్‌కు కలిసొచ్చే అంశం.

బడ్జెట్ 2026-27 కేటాయింపులు

ఆదివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.12.2 లక్షల కోట్లు కేటాయించడం దీర్ఘకాలిక వృద్ధికి బాటలు వేసింది. సెమీకండక్టర్లు, ఫార్మా (బయోఫార్మా శక్తి), డిఫెన్స్, మౌలిక సదుపాయాల రంగాలకు బడ్జెట్ ఇచ్చిన ఊతం మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరుస్తోంది. డెరివేటివ్స్ (ఎఫ్‌ అండ్‌ ఓ)పై ఎస్‌టీటీ పెంపు వంటి స్వల్పకాలిక ప్రతికూలతలను అధిగమించి ఇన్వెస్టర్లు ఇప్పుడు దీర్ఘకాలిక వృద్ధిపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తుంది.

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్

Today Nifty position 03-02-2026(time: 9:24 am)

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement