Nifty
-
పడేసిన పొదుపు పిలుపు
ముంబై: పశ్చిమాసియా యుద్ధంతో తలెత్తిన అనిశ్చితులు, ముడి చమురు ధరలు దూసుకెళ్లడంతో మంగళవారం దలాల్ స్ట్రీట్ 2% క్షీణించింది. దేశ ప్రజలు ‘పొదుపు చర్యలు’ పాటించాలంటూ ప్రధాని మోదీ పిలుపు ప్రభావం రెండో రోజూ కొనసాగింది. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, ఫారెక్స్ మార్కెట్లో రూపాయి క్షీణత అంశాలు సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీశాయి. ఫలితంగా సెన్సెక్స్ 1,456 పాయింట్లు కోల్పోయి 74,559 వద్ద ముగిసింది. నిఫ్టీ 436 పాయింట్లు క్షీణించి 23,380 వద్ద నిలిచింది. సూచీలకిది నాలుగోరోజూ నష్టాల ముగింపు. నష్టాలతో మొదలైన సూచీలు క్రమంగా తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఐటీ షేర్లు భారీ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఒకదశలో సెన్సెక్స్ 1566 పాయింట్లు పతనమై 74,449 వద్ద, నిఫ్టీ 468 పాయింట్ల క్రాష్‌తో 23,348 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. ⇒ ఇరాన్ యుద్ధం సుదీర్ఘంగా కొనసాగొచ్చనే ఆందోళనలు, క్రూడాయిల్ ధరలు పెరగడం, అధిక ద్రవ్యోల్బణ భయాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు నష్టాల బాటపట్టాయి. ఆసియాలో కొరియా (–2.34%), ఇండోనేషియా(–0.68%), చైనా (–0.25%), హాంగ్‌కాంగ్(–0.22%) నష్టపోయాయి. జపాన్(0.52%), తైవాన్ (0.22%) సింగపూర్(0.07%) లాభపడ్డాయి. యూరప్‌లో బ్రిటన్(–0.39%), ఫ్రాన్స్(–0.98%), జర్మనీ(–1.52%) పతనమయ్యాయి. అమెరికా స్టాక్ మార్కెట్లు అరశాతం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ⇒ స్టాక్ మార్కెట్ వరుస పతనంలో భాగంగా గడిచిన నాలుగు రోజుల్లో రూ.16.77 లక్షల కోట్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మొత్తం క్యాపిటలైజేషన్ రూ.456.02 లక్షల కోట్లకు దిగివచి్చంది. మంగళవారం ఒక్కరోజే రూ.10.16 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ⇒ సెన్సెక్స్ 30 షేర్లలో ఎస్బీఐ(0.12%) మాత్రమే లాభంతో గట్టెక్కింది. మిగిలిన 29 షేర్లూ నష్టాలతో ముగిశాయి. టెక్ మహీంద్రా(–4.44%), అదానీపోర్ట్స్ (–4.39%), హెచ్‌సీఎల్ టెక్ (–4.11%), టీసీఎస్(–3.84%), టైటాన్(–3.06%) షేర్లు అత్యధికంగా పతనమయ్యాయి. ⇒ బీఎస్ఈలో రంగాల వారీ ఇండెక్సుల్లో రియల్టీ 4.22%, ఐటీ 3.61%, సర్విసెస్ 3.51%, కన్జూమర్ డ్యూరబుల్స్ 3.35% పతనమయ్యాయి. ⇒ మార్కెట్ పతనంలో భాగంగా అదానీ గ్రూప్ షేర్లు బేర్మన్నాయి. అదానీ పవర్ 6%, అదానీ గ్రీన్ 5.87%, అదానీ పవర్ 5.63%, ఎన్డీటీవీ 4.78% అదానీ టోటల్ గ్యాస్ 4.77% క్షీణించాయి. అదానీ పోర్ట్స్ 4.39%, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 4.41%, అదానీ ఎంటర్ప్రైజెస్ 3.82% పతనమయ్యాయి. దీంతో అదానీ గ్రూప్ మార్కెట్ విలువ రూ.16.70 లక్షల కోట్లకు దిగివచ్చింది. ⇒ పసిడి కొనుగోళ్లు ఏడాది పాటు వాయిదా వేసుకోవాలంటూ ప్రధాని పిలుపుతో ఆభరణాల షేర్లు రెండోరోజూ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. తంగమయిల్ జ్యువెలరీ 8.32%, సెంకో గోల్డ్ 6.39%, పీసీ జ్యువెలర్ 6.19%, కళ్యాణ్ జ్యువెలరీస్ 6.10%, స్కై గోల్డ్ 5.94%, త్రిభువన్ దాస్ భీంజీ జువేరీ 5.84%, టైటాన్ 3.6% పడ్డాయి. ⇒ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న బేరీష్ ట్రెండ్‌కు తోడు, ఏఐ–డిఫ్లేషన్, ఓపెన్ఏఐ ‘డిప్లాయ్‌మెంట్ కంపెనీ’ ప్రకటనతో టెక్ మహీంద్రా(–4.44%), హెచ్‌సీఎల్ టెక్ (–4.11%), టీసీఎస్(–3.84%), విప్రో(–3.59%), ఇన్ఫోసిస్ (–3.09%), హెక్సావేర్ టెక్ (–1.42%) నష్టపోయాయి. బీఎస్ఈ ఐటీ ఇండెక్సు 3.67 శాతం పతనమైంది.ఇన్వెస్టర్లలో దెబ్బతిన్న విశ్వాసంప్రస్తుత మార్కెట్ పతనం సాధారణ లాభాల స్వీకరణ వల్ల జరిగింది కాదు; మార్కెట్ పట్ల ఇన్వెస్టర్లలో ‘నమ్మకం దెబ్బతినడం’ వల్ల సంభవించిన పతనం ఇది. రాబోయే రోజుల్లో ఆర్థిక సవాళ్లు మరింత కఠినంగా ఉండబోతున్నాయనే సంకేతాలు ఇన్వెస్టర్లను కలవరపెడుతున్నాయి. బ్యారెల్ ముడిచమురు ధర 105–107 డాలర్లకు చేరడం, రూపాయి విలువ జీవితకాల కనిష్టానికి పడిపోవడం, విదేశీ ఇన్వెస్టర్లు వరుసగా విక్రయాలకు పాల్పడటం వంటి అంశాలు మార్కెట్‌పై తీవ్ర ఒత్తిడిని పెంచాయి.దీనికి తోడు, ఇరాన్ శాంతి ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరిస్తూ, కాల్పుల విరమణ ఒప్పందం (సీజ్ఫైర్) ప్రస్తుతం ‘లైఫ్ సపోర్ట్’పై ఉన్నంత బలహీన స్థితిలో ఉందంటూ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ ఉద్రిక్తతలను పెంచి, మార్కెట్ల పతనానికి ప్రధాన కారణంగా నిలిచాయి – కే. హరిప్రసాద్, లివ్‌లాంగ్ వెల్త్ ఫౌండర్, -
స్టాక్ మార్కెట్ క్రాష్: రూ.10 లక్షల కోట్లు ఆవిరి!
భారతీయ స్టాక్ మార్కెట్‌కు ఈ రోజు 'బ్లాక్ ట్యూస్డే'గా మారింది. ఒక్కరోజులోనే భారీ స్థాయిలో అమ్మకాల ఒత్తిడి రావడంతో దలాల్ స్ట్రీట్‌లో తీవ్ర పతనం చోటు చేసుకుంది. సెన్సెక్స్ 1,450 పాయింట్లకుపైగా కుప్పకూలడంతో, పెట్టుబడిదారుల సంపదలో సుమారు రూ.10 లక్షల కోట్ల నష్టం జరిగింది. ఉదయం వరకు స్థిరంగా కనిపించిన మార్కెట్.. మధ్యాహ్నానికి పూర్తిగా నష్టాల్లోకి జారిపోవడం పెట్టుబడిదారుల్లో భయాందోళనలు పెంచింది. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 467 లక్షల కోట్ల నుంచి రూ. 456.9 లక్షల కోట్లకు పడిపోయింది.ఈ భారీ పతనానికి ప్రధాన కారణం పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. మధ్యప్రాచ్య కాల్పుల విరమణ ఒప్పందం ప్రమాదంలో ఉందని ఆయన హెచ్చరించడంతో.. మళ్లీ యుద్ధ భయం పెరిగింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి పెరిగి, భారత మార్కెట్ కూడా దాని ప్రభావాన్ని ఎదుర్కోవలసి వచ్చింది.అంతేకాకుండా.. ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగా కొనసాగుతుండటం కూడా భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని పెంచుతోంది. రూపాయి విలువ చరిత్రాత్మక కనిష్ఠ స్థాయికి పడిపోవడం విదేశీ పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగించింది. ఫలితంగా విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) భారీగా షేర్లను అమ్ముతూ భారత మార్కెట్ నుంచి డబ్బును వెనక్కి తీసుకుంటున్నారు. మార్చి నెలలోనే వారు రూ.1 లక్ష కోట్లకు పైగా పెట్టుబడులను ఉపసంహరించుకోవడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది.పలు రంగాల షేర్లు ఈ పతనంలో తీవ్రంగా దెబ్బతిన్నాయి. బ్యాంకింగ్ రంగంలో ద్రవ్యోల్బణ ప్రభావంతో రుణాలు తిరిగి రాకపోవచ్చనే భయాలు కనిపించాయి. ఐటీ రంగంలో టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు భారీ పతనాన్ని చూశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి పెద్ద కంపెనీలు కూడా చమురు ధరల అస్థిరత కారణంగా నష్టాలను చవిచూశాయి.మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పశ్చిమాసియా సంక్షోభం ఇలాగే కొనసాగితే, భారత మార్కెట్‌పై మరింత ఒత్తిడి కొనసాగే అవకాశం ఉంది. సరఫరా వ్యవస్థ దెబ్బతింటే దేశ ఆర్థిక వృద్ధి కూడా మందగించే ప్రమాదం ఉందని బ్రోకరేజ్ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో భయం, అనిశ్చితి, పెట్టుబడిదారుల నమ్మకం కోల్పోవడం వంటి అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.ఇదీ చదవండి: ఉద్యోగులపై నిఘా.. యువతి ఫైర్ (వీడియో) -
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 1,456.04 పాయింట్లు లేదా 1.92 శాతం నష్టంతో 74,559.24 వద్ద, నిఫ్టీ 436.30 పాయింట్లు లేదా 1.83 శాతం నష్టంతో 23,379.55 వద్ద నిలిచాయి.బటర్‌ఫ్లై గాంధీమతి అప్లయన్సెస్ లిమిటెడ్, ఏషియన్ స్టార్ కంపెనీ లిమిటెడ్, జాగల్ ప్రీపెయిడ్ ఓషన్ సర్వీసెస్ లిమిటెడ్, సెమాక్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్, సాస్కెన్ టెక్నాలజీస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. డైనమిక్ కేబుల్స్ లిమిటెడ్, ప్రేమ్కో గ్లోబల్ లిమిటెడ్, జీఏసీఎం టెక్నాలజీస్ లిమిటెడ్, మనోరమ ఇండస్ట్రీస్ లిమిటెడ్, రీగల్ రిసోర్సెస్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
620 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:56 సమయానికి నిఫ్టీ(Nifty) 171 పాయింట్లు తగ్గి 23,648 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 621 పాయింట్లు నష్టపోయి 75,397 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.11బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 104.9 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.42 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.19 శాతం పెరిగింది.నాస్డాక్ 0.1 శాతం పుంజుకుంది.Today Nifty position 12-05-2026(time: 09:56 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మరోసారి భగ్గుమన్న క్రూడాయిల్ ధరలు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ప్రధాని మోదీ పొదుపు చర్యల గురించి చేసిన వ్యాఖ్యలతో దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం దాదాపు 1.5% పతనమైంది. డాలర్‌తో మారకంలో రూపాయి (95.28) సరికొత్త జీవితకాల కనిష్టానికి దిగిరావడం, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సెంటిమెంట్‌ను మరింత బలహీనపరిచాయి. సెన్సెక్స్ 1,313 పాయింట్లు క్షీణించి 76,015 వద్ద ముగిసింది. నిఫ్టీ 360 పాయింట్లు కోల్పోయి 23,816 వద్ద నిలిచింది. సూచీలు దాదాపు 2% పతనంతో స్టాక్ మార్కెట్లో రూ.6 లక్షల కోట్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. ఫార్మా, హాస్పిటల్స్ మినహా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. రంగాల వారీగా బీఎస్ఈ ఇండెక్సుల్లో కన్జూమర్ డ్యూరబుల్స్ 3.76%, రియల్టీ 2.74%, పీఎస్‌యూ బ్యాంక్స్ ఇండెక్స్ 2.28%, ప్రైవేట్ బ్యాంక్స్ ఇండెక్స్ 2.60%, కన్జూమర్ డి్రస్కేషనరీ 2.14%, విద్యుత్ 2.13% పతనమయ్యాయి. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 1.09%, 0.44 శాతం నష్టపోయాయి.విదేశీ మారక నిల్వలు పొదుపు లక్ష్యంగా దేశ ప్రజలు ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను వాయిదా వేయాలని ప్రధాని పిలుపుతో ఆభరణాల షేర్ల అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. కళ్యాణ్ జ్యువెలర్స్ 9.23%, శాన్కో గోల్డ్ 8.61%, త్రిభువన్దాస్ భీంజీ జవేరీ 7.52%, టైటాన్ 6.83%, స్కై గోల్డ్ అండ్ డైమండ్స్ లిమిటెడ్స్ 6.63%, తంగమయిల్ జ్యువెలరీ 5.69%, పీసీ జ్యువెలర్ 4.94 శాతం పతనమయ్యాయి.విదేశీ ప్రయాణాల విషయంలో నియంత్రణ పాటించాలని మోదీ కోరడంతో పర్యాటక, ప్రయాణ సంబంధిత సరీ్వసెస్, ఏవియేషన్ షేర్లు నేలచూపులు చూపాయి. యాత్ర ఆన్లైన్ 5.41%, థామస్ కుక్ 3.88%, ఈజీ ట్రిప్ ప్లానర్స్ 3.27% పతనమయ్యాయి. ఇండిగో 4.94%, స్పైస్‌జెట్ 4.72% నష్టపోయాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ వాడకాన్ని వీలైనంత తగ్గించుకోవాలని ప్రధాని అభ్యర్థనతో ఎలక్ట్రిక్ వాహన కంపెనీల షేర్లకు డిమాండ్ నెలకొంది. ఏథర్ ఎనర్జీ 6%, జేబీఎం ఆటో 4.75%, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ 2.47%, ఒలక్ట్రా గ్రీన్‌టెక్ 2.16 శాతం రాణించాయి.నష్టాలకు 4 కారణాలుప్రధాని పొదుపు పిలుపుతో కార్పొరేట్ సంస్థల ఆదాయంతో పాటు దేశ ఆర్థిక వృద్ధి కూడా నెమ్మదించే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే కారణంతో మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతిని సూచీలు ప్రభావితమయ్యాయి.అమెరికా–ఇరాన్ శాంతి చర్చలు విఫలం: పశ్చిమాసియాలో నెలరోజులకు పైగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా పంపిన ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించింది. అందుకు ప్రతిస్పందనగా... లెబనాన్‌లో యుద్ధాన్ని ఆపాలని, యుద్ధ నష్టపరిహారం చెల్లించాలని, తమపై ఉన్న ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలని ఇరాన్ ఎదురు షరతులు విధించింది. అయితే, ఈ ప్రతిపాదనలు ‘అంగీకరించలేనివి అని అధ్యక్షుడు ట్రంప్ చెప్పడంతో చర్చలు విఫలమయ్యాయి. భగ్గుమన్న క్రూడాయిల్ ధరలు: అమెరికా–ఇరాన్ శాంతి చర్చల వైఫల్యంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా ఎగబాకాయి. బ్రెంట్ క్రూడ్ 4 శాతానికి పైగా పెరిగి బ్యారెల్‌కు 105 డాలర్ల వద్దకు, నైమెక్స్ క్రూడ్ 3 శాతం వృద్ధితో 98 డాలర్లకు చేరుకుంది. తమ చమురు అవసరాల కోసం 85–90 శాతం దిగుమతులపైనే ఆధారపడే భారత్ వంటి దేశాలకు ఈ పరిణామం పెను సవాలుగా మారింది. పెరిగిన ధరల వల్ల ద్రవ్యోల్బణం ఎగసి దేశ స్థూల ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఆగని విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు: దేశీయ స్టాక్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు ఆగడం లేదు. వరుసగా అయిదో రోజూ నికర అమ్మకందారులుగానే కొనసాగారు. తాజాగా సోమవారం రూ. 8,437.56 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు. ఈ నెల తొలి వారంలోనే రూ. 14,231 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.ఇదీ చదవండి: కరెన్సీ మార్కెట్లో ఆర్బీఐ జోక్యం తగ్గాలి -
భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు!
సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయంలో కూడా భారీ నష్టాలను చవిచూశాయి. దీంతో సెన్సెక్స్ 1,312.91 పాయింట్లు లేదా 1.70 శాతం నష్టంతో 76,015.28 వద్ద, నిఫ్టీ 360.30 పాయింట్లు లేదా 1.49 శాతం నష్టంతో 23,815.85 వద్ద నిలిచిఆహాయిజీఏసీఎం టెక్నాలజీస్ లిమిటెడ్, సాస్కెన్ టెక్నాలజీస్ లిమిటెడ్, లాటీస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఎల్ప్రో ఇంటర్నేషనల్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. సికా ఇంటర్‌ప్లాంట్ సిస్టమ్స్ లిమిటెడ్, జెనెసిస్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ లిమిటెడ్, 3P ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్, శ్రీ రామ మల్టీ-టెక్ లిమిటెడ్, ఆర్తి సర్ఫాక్టెంట్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
930 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:35 సమయానికి నిఫ్టీ(Nifty) 261 పాయింట్లు తగ్గి 23,911 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 938 పాయింట్లు నష్టపోయి 76,395 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.07బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 105.8 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.39 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.84 శాతం పెరిగింది.నాస్డాక్ 1.71 శాతం పుంజుకుంది.Today Nifty position 11-05-2026(time: 09:35 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారీ ఆటుపోట్లకు చాన్స్
ప్రధానంగా పశ్చిమాసియాలో కొనసాగనున్న పరిస్థితులు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్‌ను నిర్దేశించనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వీటికితోడు ముడిచమురు ధరలు, డాలరుతో రూపాయి మారకానికీ ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు. వెరసి ఈ వారం భారీ ఆటుపోట్ల మధ్య మార్కెట్లు ట్రేడ్‌కానున్నట్లు అంచనా వేశారు. వివరాలు చూద్దాం.. – సాక్షి, బిజినెస్ డెస్క్కొద్ది వారాలుగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణంపై ఇన్వెస్టర్లు మరింత దృష్టి పెట్టనున్నారు. ప్రధానంగా యూఎస్, ఇరాన్ మధ్య పరిస్థితులు దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు స్టాక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. గత కొద్ది రోజులుగా రెండు దేశాల మధ్య సయోధ్య కుదిరే వీలున్న వాతావరణం నెలకొనడంతో ప్రపంచవ్యాప్తంగా ఆశావహ పరిస్థితులు కనిపించినప్పటికీ ఇటీవల తిరిగి ఉద్రిక్తతలు తలెత్తడంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరగవచ్చని నిపుణులు విశ్లేషించారు. దీంతో గత మూడు వారాలుగా హెచ్చుతగ్గుల మధ్య కన్సాలిడేషన్ బాటలో సాగుతున్న దేశీ స్టాక్ మార్కెట్లు ఇకపైనా తీవ్ర ఆటుపోట్ల మధ్య సానుకూలంగా కదిలే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు అంచనా వేశారు.గణాంకాలపై ఫోకస్12న ఏప్రిల్ నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ), 14న టోకు ధరల వివరాలు(డబ్ల్యూపీఐ) వెల్లడికానున్నాయి. మార్చిలో సీపీఐ 3.2% నుంచి 3.4%కి పెరిగింది. డబ్ల్యూపీఐ మరింత అధికంగా 2.13% నుంచి 3.88 శాతానికి ఎగసింది. దీంతో ఆర్బీఐ భవిష్యత్ పరపతి విధానాలపై ధరలు ప్రభావం చూపనున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. దీనికితోడు పశి్చమాసియాలో మళ్లీ ఆందోళనలు పెరుగుతుండటంతో ముడిచమురు ధరలు బ్యారల్ 100 డాలర్ల సమీపంలో కదులుతున్నాయి. ఫలితంగా డాలరుతో మారకంలో రూపాయి 95 స్థాయికి బలహీనపడిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ నెల 15న ఏప్రిల్ నెలకు వాణిజ్య గణాంకాలు విడుదలకానున్నాయి. మార్చిలో వాణిజ్య లోటు 20.67 బిలియన్ డాలర్లుగా నమోదైంది.మరోపక్క చైనా, యూఎస్.. ద్రవ్యోల్బణం, ఉపాధి, వాణిజ్యం తదితర గణాంకాలు సైతం వెలువడనున్నాయి. ఈ అంశాలు సైతం కీలకంగా నిలవనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు.. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వెల్త్‌మేనేజ్‌మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా, ఎన్రిచ్ మనీ సీఈవో ఆర్. పొన్మూడి, స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా వివరించారు. అయితే యూఎస్, ఇరాన్ మధ్య ఆశావహ పరిస్థితులు నెలకొంటే చమురు ధరలు దిగివచ్చే వీలున్నట్లు పేర్కొన్నారు. ఇది ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నివ్వగలదని అభిప్రాయపడ్డారు.క్యూ4 జాబితాలో ..ఇప్పటికే ముగింపు దశకు చేరుకున్న 2025–26 చివరి త్రైమాసిక (క్యూ4) ఫలితాల సీజన్లో భాగంగా మరికొన్ని దిగ్గజాలు పనితీరు వెల్లడించనున్నాయి. ఫలితాలు ప్రకటించనున్న జాబితాలో కెనరా బ్యాంక్, టాటా పవర్, ఎయిర్టెల్, డీఎల్ఎఫ్, హెచ్‌పీసీఎల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఇండియన్ హోటల్స్, డాక్టర్ రెడ్డీస్ తదితరాలున్నాయి.గత వారమిలాహెచ్చు తగ్గుల మధ్య గత వారం మార్కెట్లు స్వల్పంగా బలపడ్డాయి. సెన్సెక్స్ 415 పాయింట్లు(0.53 శాతం), నిఫ్టీ 179 పాయింట్లు(0.75 శాతం) చొప్పున ఎగశాయి. వెరసి 77,328 వద్ద, 24,176 వద్ద ముగిశాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ మరింత అధికంగా 3.4 శాతం, 4.3 శాతం చొప్పున జంప్‌చేయడం గమనార్హం!ఎఫ్‌పీఐల షాక్కొద్ది రోజులుగా భారీ అమ్మకాలతో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ స్టాక్ మార్కెట్లకు షాక్నిస్తున్నారు. ఈ నెల తొలి వారంలోనే రూ. 14,231 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. దీంతో 2026లో ఇప్పటివరకూ రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నట్లయ్యింది! వెరసి 2025లో నమోదైన రూ. 1.6 లక్షల కోట్ల విలువైన అమ్మకాలను దాటేశాయి. ఎఫ్‌పీఐలు గత నెలలో రూ. 60,847 కోట్లు, మార్చిలో ఏకంగా రూ. 1.17 లక్షల కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన విషయం విదితమే. అయితే ఫిబ్రవరిలో మాత్రం అంతక్రితం 17 నెలల్లోనే అత్యధికంగా రూ. 22,615 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఇందుకు పశి్చమాసియాసహా చమురు ధరలు తదితర పలు అంశాలు ప్రభావం చూపుతున్నట్లు ఆర్థికవేత్తలు తెలియజేశారు.సాంకేతికంగా చూస్తే..ఈ వారం సాంకేతిక నిపుణుల అంచనాల ప్రకారం దేశీ స్టాక్ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య సానుకూలంగా కదిలే వీలుంది. కొద్ది వారాలుగా నిఫ్టీ 23,600–24,700 పాయింట్ల శ్రేణిలో కన్సాలిడేట్ అవుతోంది. ఈ శ్రేణి నుంచి బయటపడితే అంటే 23,600 దిగువన 23,100–23,000 పాయింట్ల వద్ద సపోర్ట్ లభించవచ్చు. ఇలాకాకుండా బలపడి 24,700 పాయింట్లను దాటితే 25,000ను తాకవచ్చు. -
290 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:29 సమయానికి నిఫ్టీ(Nifty) 90 పాయింట్లు తగ్గి 24,238 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 296 పాయింట్లు నష్టపోయి 77,546 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.2బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 101.1 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.39 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.38 శాతం తగ్గింది.నాస్డాక్ 0.13 శాతం నష్టపోయింది.Today Nifty position 08-05-2026(time: 09:30 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు!
గురువారం ఉదయం స్వల్ప లాభాల వద్ద ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 114.00 పాయింట్లు లేదా 0.15 శాతం నష్టంతో 77,844.52 వద్ద నిలిచాయి. నిఫ్టీ 4.30 పాయింట్లు లేదా 0.018 శాతం నష్టంతో 24,326.65 వద్ద నిలిచాయి.ఎంబసీ డెవలప్మెంట్స్ లిమిటెడ్, గోద్రెజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, అప్కోటెక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, వి విన్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. సాకర్ హెల్త్‌కేర్ లిమిటెడ్, హెచ్బి ఎస్టేట్ డెవలపర్స్ లిమిటెడ్, గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, రూబికాన్ రీసెర్చ్ లిమిటెడ్, భిల్వారా టెక్నికల్ టెక్స్టైల్స్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలోకి చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
ఫ్లాట్‌గా కదలాడుతున్న మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఫ్లాట్‌గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:40 సమయానికి నిఫ్టీ(Nifty) 17 పాయింట్లు పెరిగి 24,348 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 18 పాయింట్లు పుంజుకొని 77,974 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 97.98బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 102.01 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.35 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.46 శాతం పెరిగింది.నాస్డాక్ 2.02 శాతం పుంజుకుంది.Today Nifty position 07-05-2026(time: 09:40 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
బుధవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 940.73 పాయింట్లు లేదా 1.22 శాతం లాభంతో 77,958.52 వద్ద, నిఫ్టీ 298.15 పాయింట్లు లేదా 1.24 శాతం లాభంతో 24,330.95 వద్ద నిలిచాయి.రేమండ్ రియల్టీ లిమిటెడ్, మీడియా మ్యాట్రిక్స్ వరల్డ్‌వైడ్ లిమిటెడ్, హెచ్బి ఎస్టేట్ డెవలపర్స్ లిమిటెడ్, బీఎన్ ఆగ్రోకెమ్ లిమిటెడ్, రేమండ్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. షిల్చార్ టెక్నాలజీస్ లిమిటెడ్, క్వాలిటీ పవర్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ లిమిటెడ్, ప్రెసిషన్ వైర్స్ ఇండియా లిమిటెడ్, మనాక్సియా కోటెడ్ మెటల్స్ & ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఏషియన్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
350 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:37 సమయానికి నిఫ్టీ(Nifty) 126 పాయింట్లు పెరిగి 24,158 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 359 పాయింట్లు పుంజుకొని 77,369 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.31బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 108.01 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.42 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.81 శాతం పెరిగింది.నాస్డాక్ 1.03 శాతం పుంజుకుంది.Today Nifty position 06-05-2026(time: 09:37 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఈరోజు స్టాక్ మార్కెట్లో కుదుపులు ఎందుకంటే..
భారతీయ స్టాక్ మార్కెట్లు నేడు తీవ్ర ఒడిదొడుకులకు లోనయ్యాయి. అంతర్జాతీయ పరిణామాలు, ముఖ్యంగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం ఇన్వెస్టర్లలో ఆందోళనను పెంచగా, దేశీయ సూచీలు భారీ హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో నిఫ్టీ ఒకానొక దశలో 23,882 పాయింట్లకు పడిపోయి, ఆ తర్వాత కోలుకుని 24,032 పాయింట్ల వద్ద ముగిసింది. అటు సెన్సెక్స్ కూడా 76,515 పాయింట్ల డే కనిష్టాన్ని తాకి చివరకు 77,017 పాయింట్ల వద్ద స్థిరపడింది.మార్కెట్ ఒడిదొడుకులకు కారణాలు(అంచనా)పశ్చిమాసియా యుద్ధంపశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇరాన్-అమెరికా మధ్య కొనసాగుతున్న వివాదం, ముఖ్యంగా ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన హార్మూజ్ జలసంధి వద్ద నెలకొన్న ప్రతిష్టంభన ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఈ ప్రాంతంలో నెలకొన్న అస్థిరత, భౌగోళిక రాజకీయ అనిశ్చితి మార్కెట్లో భయాన్ని పెంచాయి.క్రూడాయిల్ ధరల సెగచమురు సరఫరాలో అంతరాయాల భయం క్రూడాయిల్ ధరలను రికార్డు స్థాయిలకు చేర్చింది. భారత్ తన చమురు అవసరాల కోసం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతుండటంతో క్రూడాయిల్ ధరలు పెరగడం దేశ ఆర్థిక వ్యవస్థపై, ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది బ్యాంకింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది.ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల భయంఅంతర్జాతీయంగా పెరుగుతున్న ఇంధన ధరలు ద్రవ్యోల్బణాన్ని మరింతగా పెంచే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ద్రవ్యోల్బణం పెరిగితే కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉండదని, పైగా అవి మరింత పెరగవచ్చనే ఆందోళనలు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల్లో కనిపిస్తున్నాయి. ఇది పెట్టుబడుల ఉపసంహరణకు దారితీస్తోంది.లాభాల స్వీకరణ, అప్రమత్తతగత కొద్ది రోజులుగా మార్కెట్ స్వల్పంగా కోలుకోవడంతో లాభాల్లో ఉన్న ఇన్వెస్టర్లు అప్రమత్తమై లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. ముఖ్యంగా కీలకమైన ప్రతిఘటన స్థాయిల వద్ద (రెసిస్టెన్స్ లెవల్స్) ఇన్వెస్టర్లు అమ్మకాల ఒత్తిడిని పెంచడం వల్ల సూచీలు ఒక దశలో బలహీనపడ్డాయి.నెక్ట్స్ ఏంటి?ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్ కాన్సాలిడేషన్లో ఉందని తెలుస్తుంది. నిఫ్టీ 23,800-24,300 శ్రేణిలో కదలాడుతోంది. అంతర్జాతీయంగా యుద్ధ పరిస్థితులు సద్దుమణిగి, క్రూడాయిల్ ధరలు స్థిరీకరణ చెందితే తప్ప మార్కెట్ పురోగతిని సాధించడం కష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇన్వెస్టర్లు ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా భౌగోళిక పరిణామాలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండటం మంచిదని మార్కెట్ నిపుణుల సూచన.ఇదీ చదవండి: స్మార్ట్‌ఫోన్ తయారీలోకి ఓపెన్ఏఐ ఎంట్రీ? -
నష్టాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు!
మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 243.41 పాయింట్ల నష్టంతో 77,025.99 వద్ద, నిఫ్టీ 90.10 పాయింట్ల నష్టంతో 24,029.20 వద్ద ముందుకు సాగుతున్నాయి.ఒమాక్స్ ఆటోస్ లిమిటెడ్, డైనాకాన్స్ సిస్టమ్స్ & సొల్యూషన్స్ లిమిటెడ్, ఎంఎంపీ ఇండస్ట్రీస్ లిమిటెడ్, శ్రీ కృష్ణ దేవ్‌కాన్ లిమిటెడ్, కాలిఫోర్నియా సాఫ్ట్వేర్ కంపెనీ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. అవ్రో ఇండియా లిమిటెడ్, సౌత్ వెస్ట్ పినాకిల్ ఎక్స్‌ప్లోరేషన్ లిమిటెడ్, నాథ్ బయో-జీన్స్ (ఇండియా) లిమిటెడ్, డి నోరా ఇండియా లిమిటెడ్, జ్యోతి ల్యాబ్స్ లిమిటెడ్ వంటివి నష్టాల్లో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
మార్కెట్ గ్రీన్.. సన్ టీవీ రెడ్!
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైం దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 355.90 పాయింట్లు లేదా 0.46 శాతం లాభంతో 77,269.40 వద్ద, నిఫ్టీ 121.75 పాయింట్లు లేదా 0.51 శాతం లాభంతో 24,119.30 వద్ద నిలిచాయి.కాలిఫోర్నియా సాఫ్ట్వేర్ కంపెనీ లిమిటెడ్, ఐఎఫ్బి ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్, వాలర్ ఎస్టేట్ లిమిటెడ్, స్టాన్లీ లైఫ్‌స్టైల్స్ లిమిటెడ్, ఒమాక్స్ ఆటోస్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. రేతాన్ టిఎమ్‌టి లిమిటెడ్, మనోమయ్ టెక్స్ ఇండియా లిమిటెడ్, ఇన్సోలేషన్ ఎనర్జీ లిమిటెడ్, జెన్ టెక్నాలజీస్ లిమిటెడ్, కేఎస్‌బి లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.స్టాక్ మార్కెట్లు లాభాల్లోనే ముగిసినప్పటికీ.. తమిళనాట ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న సమయంలో.. కలానిధి మారన్ స్థాపించిన 'సన్ టీవీ నెట్వర్క్' షేర్స్ మాత్రం భారీ పతనం చవిచూడాల్సి వచ్చింది. సంస్థ షేర్స్ ట్రేడింగ్ క్లోసీ అయ్యే సమయానికి 5.38 శాతం పడిపోయాయి. ఉదయం 10:40 గంటలకు, సన్ టీవీ షేర్లు 8% తగ్గి ఒక్కో షేరుకు రూ. 557.65 వద్ద ట్రేడవుతున్నాయి. ఆగస్టు 2024 తర్వాత ఈ స్టాక్ ఒకే రోజులో అత్యంత భారీ పతనాన్ని నమోదు చేసింది.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
స్టాక్ మార్కెట్‌కు ఎన్నికల ఫలితాల జోష్..
దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ఐదు రాష్ట్రాల (పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళం, అస్సాం, పుదుచ్చేరి) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలో భారత స్టాక్‌మార్కెట్లు నేడు ఊహించినట్టే ఆసక్తికరమైన కదలికలను నమోదు చేస్తున్నాయి. ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ బయటకు వస్తున్న కొద్దీ సెన్సెక్స్, నిఫ్టీ సూచీల్లో ఉత్సాహం కనిపిస్తోంది. అసలు ఎన్నికల ఫలితాలకు, స్టాక్‌మార్కెట్ కదలికలకు ఉన్న సంబంధం ఏమిటి? ఈ అంశాల వెనుక ఉన్న అసలైన ఆర్థిక కారణాలేమిటో విశ్లేషిద్దాం.రాజకీయ స్థిరత్వానికే ప్రాధాన్యతస్టాక్మార్కెట్కు అత్యంత ఇష్టమైన అంశం స్థిరత్వం. ఎన్నికల ఫలితాలు ఒక స్పష్టమైన మెజారిటీని ఇస్తే అది పాలనాపరమైన స్థిరత్వానికి సంకేతంగా మార్కెట్లు భావిస్తాయి. రాజకీయ అనిశ్చితి తొలగిపోయి పాలనలో స్థిరత్వం వస్తుందనే నమ్మకం కలిగినప్పుడు మార్కెట్లు సానుకూలంగా స్పందిస్తాయి. ఒకే పార్టీ లేదా కూటమి గెలిచినప్పుడు ప్రస్తుతం అమలులో ఉన్న ఆర్థిక విధానాలు, సంస్కరణలు అలాగే కొనసాగుతాయనే ధీమా ఇన్వెస్టర్లలో పెరుగుతుంది.ఎందుకు ఇలా?ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు మార్కెట్లు ఎందుకు పైకి లేస్తాయో, ఎందుకు కొన్నిసార్లు పడిపోతాయో అర్థం చేసుకోవడం ముఖ్యం. పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు మౌలిక సదుపాయాలు, రైల్వేలు, విద్యుత్ రంగానికి సంబంధించిన షేర్లపై ప్రభావం చూపుతాయి. కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి, రాష్ట్రంలో గెలిచిన పార్టీకి మధ్య సయోధ్య ఉంటే ప్రాజెక్టుల అమలు వేగవంతమవుతుందని ఇన్వెస్టర్లు భావిస్తారు. ప్రస్తుత మార్కెట్ విశ్లేషణలను చూస్తే రాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఒక రోజు లేదా రెండు రోజుల సెంటిమెంట్‌ను మాత్రమే ప్రభావితం చేస్తాయి.మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రస్తుత మార్కెట్‌ను నడిపిస్తున్నది కేవలం ఎన్నికల ఫలితాలు మాత్రమే కాదు. ముడి చమురు ధరలు, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వంటి కీలక అంశాలు కూడా మార్కెట్ దిశను నిర్ణయిస్తున్నాయి.ఇన్వెస్టర్లు గమనించాల్సిన అంశాలునేడు మార్కెట్లో ఊపును చూసి రిటైల్ ఇన్వెస్టర్లు ఏమాత్రం ఆవేశపడకూడదు. ఎందుకంటే.. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వచ్చిన స్వల్పకాలిక ర్యాలీని ఆసరాగా చేసుకుని పెద్ద సంస్థాగత పెట్టుబడిదారులు లాభాలను స్వీకరించే అవకాశం ఉంది. దీనివల్ల కొంత సమయానికి మార్కెట్లలో ఒడిదుడుకులు పెరగవచ్చు. ఎన్నికల ఫలితాల కంటే కంపెనీల త్రైమాసిక ఫలితాలు, వడ్డీ రేట్ల నిర్ణయాలు, ద్రవ్యోల్బణం వంటి అంశాలే దీర్ఘకాలంలో స్టాక్‌మార్కెట్ దిశను నిర్ణయిస్తాయి.మొత్తంగా చెప్పాలంటే మే 04, 2026 నాటి ఈ ఎన్నికల ఫలితాలు మార్కెట్‌కు ఒక తాత్కాలిక బూస్ట్‌ను ఇచ్చినప్పటికీ సుస్థిరమైన ప్రయాణం కోసం ఇన్వెస్టర్లు అంతర్జాతీయ పరిణామాలను కూడా గమనించాలి. ఎన్నికల ఫలితాలు కేవలం ఒక ఈవెంట్ మాత్రమే, కానీ ఆర్థికాభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. కాబట్టి, సెంటిమెంట్‌కు ప్రాధాన్యత ఇస్తూనే బేసిక్ ఫండమెంటల్స్ బలహీనపడకుండా చూసుకోవడం ఇన్వెస్టర్ల బాధ్యత.ఇదీ చదవండి: భారతీయ కార్మికులపై తైవాన్ నిరసన -
816 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:35 సమయానికి నిఫ్టీ(Nifty) 235 పాయింట్లు పెరిగి 24,244 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 816 పాయింట్లు పుంజుకొని 77,724 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.2బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 108.33 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.37 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.29 శాతం పెరిగింది.నాస్డాక్ 0.89 శాతం పుంజుకుంది.Today Nifty position 04-05-2026(time: 09:35 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్స్‌కు ఎఫ్‌పీఐల షాక్
గత కొద్ది రోజులుగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ స్టాక్స్‌లో భారీ అమ్మకాలు చేపడుతున్నారు. ఫలితంగా ఏప్రిల్‌లో నికరంగా రూ. 60,847 కోట్ల(6.5 బిలియన్ డాలర్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఈ బాటలో 2026 తొలి 4 నెలల్లో(జనవరి–ఏప్రిల్) రూ. 1.92 లక్షల కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. వెరసి 2025 పూర్తి కేలండర్ ఏడాదిలో నమోదైన రూ. 1.66 లక్షల కోట్లకంటే అధికంగా అమ్మకాలకు తెరతీశారు. పశ్చిమాసియా సంక్షోభానికితోడు ప్రపంచ ఆర్థిక అనిశ్చితి ఇన్వెస్టర్ల రిస్క్ సామర్థ్యాలను దెబ్బతీయడం ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. గత 4 నెలల్లో ఫిబ్రవరిలో మాత్రమే ఎఫ్‌పీఐలు(రూ. 22,615 కోట్లు) ఇన్వెస్ట్ చేశారు. ఇది అంతక్రితం 17 నెలల్లోనే అత్యధికంకావడం గమనార్హం! అయితే మార్చిలో ఏకంగా రూ. 1.17 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం ప్రస్తావనార్హం!!గత వారమిలా.. తొలుత క్యూ4 ఫలితాలతో మార్కెట్లు బలపడినప్పటికీ ఇరాన్–యూఎస్ యుద్ధంతో చివర్లో డీలా పడ్డాయి. వెరసి గత వారం సెన్సెక్స్ నికరంగా 249 పాయింట్లు(0.3 శాతం) పుంజుకుంది. 76,914 వద్ద ముగిసింది. నిఫ్టీ 100 పాయింట్లు(0.4 శాతం) వృద్ధితో 23,998 వద్ద స్థిరపడింది. అయితే బ్యాంక్ నిఫ్టీ 2.2 శాతం పతనమైంది. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.3 శాతం లాభపడగా.. స్మాల్ క్యాప్ 2 శాతం జంప్‌చేయడం గమనార్హం! సాంకేతికంగా చూస్తే..ఈ వారం సైతం మార్కెట్లు ఆటుపోట్ల మధ్య స్వల్పంగా బలపడే వీలున్నట్లు సాంకేతిక నిపుణుల అంచనా. వీటి ప్రకారం నిఫ్టీకి 23,800–23,700 పాయింట్ల స్థాయిలో సపోర్ట్ లభించవచ్చు. తదుపరి 23,500 వద్ద బలమైన మద్దతుకు వీలుంది. ఒకవేళ బలపడితే 24,600 పాయింట్లను తాకవచ్చు. ఆపై 24,700– 27,800కు చేరే అవకాశముంది. సెన్సెక్స్ 76,000 పాయింట్ల స్థాయిలో సపోర్ట్ తీసుకునే వీలుంది. 77,500వరకూ పుంజుకోవచ్చు. 78,000 దాటితే 78,500 పాయింట్లను తాకే అవకాశముంది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 582.86 పాయింట్లు లేదా 0.75 శాతం నష్టంతో 76,913.50 వద్ద, నిఫ్టీ 180.10 పాయింట్లు లేదా 0.74 శాతం నష్టంతో 23,997.55 వద్ద నిలిచాయి.సెమిండియా ప్రాజెక్ట్స్ లిమిటెడ్, కాలిఫోర్నియా సాఫ్ట్వేర్ కంపెనీ లిమిటెడ్, ఎంటీఏఆర్ టెక్నాలజీస్ లిమిటెడ్, బీసీపీఎల్ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, ఆర్పీజీ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఇన్వెస్కో ఇండియా గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్, వేదాంత లిమిటెడ్, వారీ ఎనర్జీస్ లిమిటెడ్, హెచ్ఈజీ లిమిటెడ్, ఇండియన్ మెటల్స్ & ఫెర్రో అల్లాయ్స్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
940 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:31 సమయానికి నిఫ్టీ(Nifty) 305 పాయింట్లు తగ్గి 23,879 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 945 పాయింట్లు నష్టపోయి 76,544 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.97బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 113.05 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.42 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.04 శాతం తగ్గింది.నాస్డాక్ 0.04 శాతం పెరిగింది.Today Nifty position 30-04-2026(time: 09:31 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్లలో బుల్ రన్.. ఈరోజు లాభాలకు కారణాలు
భారత స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం (ఏప్రిల్ 29, 2026) వృద్ధిని కనబరిచాయి. అంతర్జాతీయ ప్రతికూలతలను అధిగమిస్తూ ఇన్వెస్టర్లు కొనుగోళ్ల వైపు మొగ్గు చూపడంతో దలాల్ స్ట్రీట్ కళకళలాడింది. మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 609 పాయింట్లు లాభపడి 77,496 వద్ద స్థిరపడగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 181 పాయింట్లు పుంజుకుని 24,177 స్థాయికి చేరుకుంది.లాభాలకు కారణాలు(నిపుణుల అంచనా)ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల సడలింపు ఆశలుగత కొద్దివారాలుగా ప్రపంచ మార్కెట్లను వణికించిన ఇరాన్-అమెరికా మధ్య యుద్ధ వాతావరణం కొంత సడలినట్లు కనిపిస్తోంది. యుద్ధం మరిన్ని ప్రాంతాలకు వ్యాపించకుండా అంతర్జాతీయ దౌత్య ప్రయత్నాలు ఫలిస్తున్నాయన్న సంకేతాలు ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని నింపాయి. ముఖ్యంగా హార్మూజ్ జలసంధి గుండా చమురు రవాణాకు ఆటంకాలు తొలగుతాయన్న వార్తలు మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచాయి.క్రూడాయిల్ ధరల తగ్గుదలమధ్యప్రాచ్యంలో నెలకొన్న సంక్షోభం కారణంగా మార్చి నెలాఖరులో బ్రెంట్ క్రూడ్ ధర 120 డాలర్ల మార్కును దాటినప్పటికీ ప్రస్తుతం అది క్రమంగా తగ్గుముఖం పట్టి 111 డాలర్ల స్థాయికి చేరుకుంది. దీనికి తోడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మే నెలలో ఒపెక్ నుంచి నిష్క్రమిస్తుందన్న వార్తలు చమురు సరఫరా పెరుగుతుందన్న అంచనాలు భారత ఆర్థిక వ్యవస్థకు ఊరటనిచ్చాయి. మన దేశం దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతుంది కాబట్టి చమురు ధర తగ్గడం మార్కెట్లకు సానుకూల అంశంగా మారింది.యూఎస్ ఫెడ్ నిర్ణయంపై దృష్టిఅమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈరోజు తన వడ్డీ రేట్ల నిర్ణయాన్ని ప్రకటించనుంది. ప్రస్తుతం వడ్డీ రేట్లను మార్చకుండా 3.50% - 3.75% వద్దే కొనసాగించవచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందన్న ఆశాభావంతో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తిరిగి భారత మార్కెట్లోకి నిధులను మళ్లించడం గమనార్హం.భౌగోళిక ఉద్రిక్తతలు ఇంకా పూర్తిగా సద్దుమణగనప్పటికీ భారత కంపెనీల ఆర్థిక పటిష్టత, అంతర్జాతీయంగా చమురు ధరల స్థిరీకరణ నేటి లాభాలకు ప్రధాన కారణమయ్యాయి. రాబోయే రోజుల్లో యుద్ధ పరిణామాలు, అమెరికా ఫెడ్ ఇచ్చే దిశానిర్దేశం మార్కెట్ గమనాన్ని నిర్ణయించనున్నాయి.ఇదీ చదవండి: ‘ఎండీ పదవీకాలం పొడిగించవద్దు’ -
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
మంగళవారం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 416.73 పాయింట్లు లేదా 0.54 శాతం నష్టంతో 76,886.91 వద్ద, నిఫ్టీ 97.00 పాయింట్లు లేదా 0.40 శాతం నష్టంతో 23,995.70 వద్ద నిలిచాయి.అబాన్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, ఏజీఐ గ్రీన్‌ప్యాక్ లిమిటెడ్, వెరాండా లెర్నింగ్ సొల్యూషన్స్ లిమిటెడ్, ఊర్జా గ్లోబల్ లిమిటెడ్, బి&ఎ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఎమామి రియల్టీ లిమిటెడ్, యూనికామర్స్ ఇ-సొల్యూషన్స్ లిమిటెడ్, లక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, విసాగర్ పాలిటెక్స్ లిమిటెడ్, ఆన్లాన్ హెల్త్‌కేర్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 639.42 పాయింట్లు లేదా 0.83 శాతం లాభంతో 77,303.63 వద్ద, నిఫ్టీ 194.75 పాయింట్లు లేదా 0.81 శాతం లాభంతో 24,092.70 వద్ద నిలిచాయి.ఎలక్ట్రోథర్మ్ (ఇండియా) లిమిటెడ్, కోహాన్స్ లైఫ్‌సైన్సెస్ లిమిటెడ్, శ్రీ కృష్ణ దేవ్‌కాన్ లిమిటెడ్, ఐఆర్ఎం ఎనర్జీ లిమిటెడ్, తాన్లా ప్లాట్‌ఫారమ్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఏబీ కాట్స్పిన్ ఇండియా లిమిటెడ్, బి&ఎ లిమిటెడ్, వినీత్ లాబొరేటరీస్ లిమిటెడ్, ఆన్లాన్ హెల్త్‌కేర్ లిమిటెడ్, కంచి కర్పూరం లిమిటెడ్ వంటివి నష్టాల్లో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
లాభాల్లో స్టాక్ మార్కెట్.. 24,000 దాటిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:43 సమయానికి నిఫ్టీ(Nifty) 118 పాయింట్లు పెరిగి 24,016 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 378 పాయింట్ల లాభంతో 77,042 వద్ద ట్రేడవుతోంది.విస్తృత మార్కెట్లు బెంచ్ మార్క్ సూచీలను అధిగమించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.16 శాతం, 1.05 శాతం పెరిగాయి.రంగాల వారీగా, నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ ఫార్మా బెంచ్ మార్క్ సూచీలను అధిగమించాయి. ఇదిలా ఉండగా, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ తక్కువ పనితీరు కనబరిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారీ నష్టాలతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్
-
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 982.71 పాయింట్లు లేదా 1.27 శాతం నష్టంతో 76,681.29 వద్ద.. నిఫ్టీ 275.10 పాయింట్లు లేదా 1.14 శాతం నష్టంతో 23,897.95 వద్ద నిలిచాయి.ఇమామి రియల్టీ లిమిటెడ్, ఖైతాన్ (ఇండియా) లిమిటెడ్, కంచి కర్పూరం లిమిటెడ్, శేఖావతి ఇండస్ట్రీస్ లిమిటెడ్ , మాస్క్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఆన్లాన్ హెల్త్‌కేర్ లిమిటెడ్, ఏబీ కాట్స్పిన్ ఇండియా లిమిటెడ్, యూటీఐ అసెట్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ లిమిటెడ్, ఖైతాన్ కెమికల్స్ & ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
కుప్పకూలిన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 10:05 సమయానికి నిఫ్టీ(Nifty) 176 పాయింట్లు తగ్గి 23,994 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 671 పాయింట్లు నష్టపోయి 76,984 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.88బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 105.94 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.33 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.41 శాతం తగ్గింది.నాస్డాక్ 0.89 శాతం దిగజారింది.Today Nifty position 24-04-2026(time: 10:05 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. డీలా పడ్డ బ్యాంక్ షేర్లు!
గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 852.49 పాయింట్లు లేదా 1.09 శాతం నష్టంతో 77,664.00 వద్ద, నిఫ్టీ 219.60 పాయింట్లు లేదా 0.90 శాతం నష్టంతో 24,158.50 వద్ద నిలిచాయి.డెల్టా కార్ప్ లిమిటెడ్, డాలర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, జోడియాక్ ఎనర్జీ లిమిటెడ్, మాస్క్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్, ఐఆర్ఎం ఎనర్జీ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ లిమిటెడ్, డంగీ డమ్స్ లిమిటెడ్, సర్లా పెర్ఫార్మెన్స్ ఫైబర్స్ లిమిటెడ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, థామస్ కుక్ (ఇండియా) లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
నష్టాల్లో కదలాడుతున్న మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:45 సమయానికి నిఫ్టీ(Nifty) 137 పాయింట్లు తగ్గి 24,241 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 546 పాయింట్లు నష్టపోయి 77,974 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.69బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 103.44 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.31 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.05 శాతం పెరిగింది.నాస్డాక్ 1.64 శాతం పుంజుకుంది.Today Nifty position 23-04-2026(time: 9:45 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భగ్గుమన్న పశ్చిమాసియా
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ పతనాన్ని మూటగట్టుకున్నాయి. గత మూడు రోజులుగా కొనసాగుతున్న సానుకూల ధోరణికి బ్రేక్ వేస్తూ బుధవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్, నిఫ్టీలు కుప్పకూలాయి. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇరాన్-అమెరికా మధ్య ముదురుతున్న యుద్ధ మేఘాలు మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. నేటి ట్రేడింగ్ సెషన్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 756 పాయింట్లు పతనమై 78,516 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 198 పాయింట్లు నష్టపోయి 24,378 వద్ద ముగిసింది.విశ్లేషకుల అంచనా ప్రకారం పతనానికి కారణాలుముదురుతున్న అనిశ్చితిపశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తోంది. అమెరికా విధించిన ఆంక్షలు, ఇరాన్ ప్రతిచర్యల నేపథ్యంలో హార్మూజ్ జలసంధి మూతపడటం చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ మార్గం గుండానే ప్రపంచంలోని 20% చమురు రవాణా జరుగుతుంది. తాజా దాడుల వార్తలు ఇన్వెస్టర్లలో ఆందోళన నింపడంతో సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు.చమురు ధరల సెగ - ద్రవ్యోల్బణ ముప్పుయుద్ధం కారణంగా ఇటీవల ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 120 డాలర్ల మార్కును దాటడం భారత్ వంటి దిగుమతి దేశాలకు పెద్ద దెబ్బ. చమురు ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. తాజా గణాంకాల ప్రకారం, మార్చి నెలలో ద్రవ్యోల్బణం ఊహించిన దానికంటే ఎక్కువగా 3.3% కి పెరగడం, భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశం ఉండటం మార్కెట్‌పై ఒత్తిడి పెంచింది.వడ్డీ రేట్ల తగ్గింపుపై సందేహాలుద్రవ్యోల్బణం అదుపులోకి రాకపోవడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తాయన్న ఆశలు ఆవిరయ్యాయి. ‘వడ్డీ రేట్లు తగ్గకపోగా, ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి బ్యాంకులు మరింత కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది’ అనే వార్తలు టెక్నాలజీ, బ్యాంకింగ్ షేర్లలో భారీ అమ్మకాలకు దారితీశాయి.ఇప్పుడేం చేయాలి?ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్ తీవ్రమైన ఒడుదొడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. ఇరాన్ యుద్ధ పరిణామాలు, ముడిచమురు ధరల కదలికలను బట్టి రానున్న రోజుల్లో మార్కెట్ దిశ నిర్దేశించబడుతుంది. చిన్న ఇన్వెస్టర్లు తొందరపడి అమ్మకాలు జరపకుండా నాణ్యమైన షేర్లలో దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి సారించడం ఉత్తమం.ఇదీ చదవండి: టిఫిన్, కర్రీ ప్యాకెట్ ధర 50 శాతం పెంపు! -
స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్!
మంగళవారం ఉదయం శుభారంభం పలికిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 753.03 పాయింట్లు లేదా 0.96 శాతం లాభంతో 79,273.33 వద్ద, నిఫ్టీ 211.75 పాయింట్లు లేదా 0.87 శాతం లాభంతో 24,576.60 వద్ద నిలిచాయి.శ్యామ్ టెలికాం లిమిటెడ్, ఏస్ ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్స్ లిమిటెడ్, మనాక్సియా స్టీల్స్ లిమిటెడ్, వైశాలి ఫార్మా లిమిటెడ్, రోలెక్స్ రింగ్స్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. పశుపతి కాట్స్పిన్ లిమిటెడ్, సైబర్ మీడియా (ఇండియా) లిమిటెడ్, తంబోలి ఇండస్ట్రీస్ లిమిటెడ్, అక్షిత కాటన్ లిమిటెడ్, సోలార్‌వరల్డ్ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
350 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:36 సమయానికి నిఫ్టీ(Nifty) 94 పాయింట్లు పెరిగి 24,462 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 351 పాయింట్లు ఎగబాకి 78,872 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.13బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 95.06 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.25 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.24 శాతం తగ్గింది.నాస్డాక్ 0.26 శాతం నష్టపోయింది.Today Nifty position 21-04-2026(time: 9:36 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 58.42 పాయింట్లు లేదా 0.074 శాతం నష్టంలో 78,435.12 వద్ద, నిఫ్టీ 26.90 పాయింట్లు లేదా 0.11 శాతం వద్ద 24,326.65 వద్ద నిలిచింది.అరిహంత్ ఫౌండేషన్స్ & హౌసింగ్ లిమిటెడ్, బట్లిబోయ్ లిమిటెడ్, రాజపాలయం మిల్స్ లిమిటెడ్, సికాజెన్ ఇండియా లిమిటెడ్, కోవై మెడికల్ సెంటర్ అండ్ హాస్పిటల్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. గ్రావెయిల్ అండ్ వెయిల్ (ఇండియా) లిమిటెడ్, గుడ్ఇయర్ ఇండియా లిమిటెడ్, ఇషాన్ డైస్ అండ్ కెమికల్స్ లిమిటెడ్, ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్, శ్రీ రామ న్యూస్‌ప్రింట్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
ఫ్లాట్‌గా కదలాడుతున్న మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఫ్లాట్‌గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:40 సమయానికి నిఫ్టీ(Nifty) 4 పాయింట్లు తగ్గి 24,352 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 79 పాయింట్లు ఎగబాకి 78,569 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.28బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 95.38 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.26 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.2 శాతం పెరిగింది.నాస్డాక్ 1.52 శాతం పుంజుకుంది.Today Nifty position 20-04-2026(time: 9:40 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఊగిసలాడుతున్న మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఫ్లాట్‌గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:45 సమయానికి నిఫ్టీ(Nifty) 14 పాయింట్లు పెరిగి 24,211 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 101 పాయింట్లు ఎగబాకి 78,085 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.25బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 98.15 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.31 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.26 శాతం పెరిగింది.నాస్డాక్ 0.36 శాతం పుంజుకుంది.Today Nifty position 17-04-2026(time: 9:45 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో నిఫ్టీ, సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:45 సమయానికి నిఫ్టీ(Nifty) 73 పాయింట్లు పెరిగి 24,303 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 242 పాయింట్లు ఎగబాకి 78,356 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 97.93బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 94.9 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.27 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.8 శాతం పెరిగింది.నాస్డాక్ 1.59 శాతం పుంజుకుంది.Today Nifty position 16-04-2026(time: 9:45 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
1000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:42 సమయానికి నిఫ్టీ(Nifty) 311 పాయింట్లు పెరిగి 24,153 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 1026 పాయింట్లు ఎగబాకి 77,882 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.2బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 95.06 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.24 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.18 శాతం పెరిగింది.నాస్డాక్ 1.96 శాతం పుంజుకుంది.Today Nifty position 15-04-2026(time: 9:42 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
తల్లడిల్లిన దలాల్ స్ట్రీట్!
భారతీయ స్టాక్ మార్కెట్లు నేడు తీవ్ర ఒడిదుడుకులకు లోనై భారీ నష్టాలతో ముగిశాయి. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తోడు అంతర్జాతీయ పరిణామాలు ప్రతికూలంగా మారడంతో మదుపర్లు అమ్మకాలకే మొగ్గు చూపారు. ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు కీలక మద్దతు స్థాయిలను కోల్పోయి ఇన్వెస్టర్ల ఆందోళనను పెంచాయి.మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలువిఫలమైన శాంతి చర్చలుపశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు ఎటువంటి పురోగతి లేకుండానే ముగియడం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఇరాన్‌పై అమెరికా కొత్త ఆంక్షలు విధించే అవకాశం ఉందన్న వార్తలు, హార్మూజ్ జలసంధిని మూసివేస్తామన్న ఇరాన్ హెచ్చరికలు ప్రపంచ మార్కెట్లలో భయాందోళనలు సృష్టించాయి. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధం వస్తుందన్న భయంతో ఇన్వెస్టర్లు సురక్షిత మార్గాలవైపు మళ్లుతున్నారు.సెగ పుట్టిస్తున్న క్రూడాయిల్ ధరలుయుద్ధ వాతావరణం కారణంగా చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడటంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధర భారీగా పెరిగింది. నేడు బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 102 డాలర్ల మార్కును అధిగమించింది. భారత్ తన చమురు అవసరాల కోసం దిగుమతులపైనే అధికంగా ఆధారపడుతున్న నేపథ్యంలో పెరుగుతున్న ధరలు ద్రవ్యోల్బణానికి దారితీస్తాయన్న ఆందోళన మార్కెట్‌ను కుంగదీసింది.ఫెడ్ రిజర్వ్ కఠిన వైఖరిఅమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై వెనక్కి తగ్గడం మరో ప్రధాన కారణం. ద్రవ్యోల్బణం ఇంకా అదుపులోకి రాకపోవడంతో 2026లో వడ్డీ రేట్ల తగ్గింపు కేవలం ఒక్కసారి మాత్రమే ఉండొచ్చన్న సంకేతాలు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లను (ఎఫ్ఐఐ) ఆందోళనకు గురిచేశాయి. ఫలితంగా భారత మార్కెట్ల నుంచి భారీగా నిధుల ఉపసంహరణ జరిగింది.నేటి మార్కెట్ గణాంకాలు (క్లోజింగ్ సమయానికి)సూచీముగింపునష్టం (పాయింట్లు)శాతం (%)సెన్సెక్స్76,842-702-0.90%నిఫ్టీ23,842-207-0.86% -
8 నిమిషాల్లో 8 లక్షల కోట్ల సంపద ఢమాల్
స్టాక్ మార్కెట్లపై హర్ముజ్ సంక్షోభం ఎఫెక్ట్ పడింది. చర్చలు విఫలమై చమురు ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయి భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 1,350 పాయింట్లకుపైగా.. నిష్టీ 400 పాయింట్లకు పైగా నష్టపోయాయి. ఈ ప్రభావంతో కేవలం 8 నిమిషాల్లో 8 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరయ్యింది.హర్ముజ్ జలసంధి సంక్షోభం ప్రభావంతో ఇవాళ్టి ట్రేడింగ్ సెషన్లో భారతీయ స్టాక్ మార్కెట్లు తీవ్రంగా కుదేలయ్యాయి. చర్చలు విఫలమవడంతో గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా 8 శాతం పెరగడంతో పెట్టుబడిదారులు ఆందోళనకు గురయ్యారు. ఈ పరిణామం వెంటనే మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది.సెన్సెక్స్ 73,000 స్థాయికి చేరగా, నిఫ్టీ 23,600 కంటే దిగువకు పడిపోయింది. కేవలం ఎనిమిది నిమిషాల్లోనే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిదారుల సంపద ఆవిరైపోయింది. ఈ పతనంతో మార్కెట్లో భయాందోళనలు పెరిగి, చిన్న పెట్టుబడిదారులు పెద్ద నష్టాలను ఎదుర్కొంటున్నారు. చమురు ధరల పెరుగుదలతో ఎయిర్‌లైన్స్, పెయింట్స్, ఫర్టిలైజర్స్ వంటి రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఇంధన ఖర్చులు పెరగడంతో ఇండిగో, ఏషియన్ పెయింట్స్ వంటి కంపెనీల షేర్లు గణనీయంగా పడిపోయాయి. మరోవైపు, ఎనర్జీ-అప్‌స్ట్రీమ్ రంగం, డిఫెన్స్ సంబంధిత షేర్లు మాత్రం కొంత స్థిరంగా నిలిచాయి. నిపుణుల అంచనా ప్రకారం.. హర్ముజ్ సంక్షోభం కొనసాగితే భారత ఆర్థిక వ్యవస్థపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. దిగుమతి ఖర్చులు పెరగడం, ద్రవ్యోల్బణం అధికమవడం, వృద్ధి మందగించడం వంటి సమస్యలు తలెత్తవచ్చని హెచ్చరిస్తున్నారు. పెట్టుబడిదారులు తాత్కాలికంగా రిస్క్ ఉన్న రంగాల నుండి దూరంగా ఉండి, స్థిరమైన రంగాల వైపు దృష్టి మళ్లించాలని సూచిస్తున్నారు. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్
శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 918.60 పాయింట్లు లేదా 1.20 శాతం లాభంతో 77,550.25 వద్ద, నిఫ్టీ 275.50 పాయింట్లు లేదా 1.16 శాతం లాభంతో 24,050.60 వద్ద నిలిచాయి.డీపీ వైర్స్ లిమిటెడ్, గ్లోటిస్ లిమిటెడ్, ఆర్ట్ నిర్మాణ్ లిమిటెడ్, హింద్ రెక్టిఫయర్స్ లిమిటెడ్, అట్లాస్ సైకిల్స్ (హర్యానా) లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఆర్ఎమ్ డ్రిప్ అండ్ స్ప్రింక్లర్స్ సిస్టమ్స్ లిమిటెడ్, ఇన్వెంచర్ గ్రోత్ & సెక్యూరిటీస్ లిమిటెడ్, ధని సర్వీసెస్ లిమిటెడ్, లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, శేషాసాయి టెక్నాలజీస్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
450 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:28 సమయానికి నిఫ్టీ(Nifty) 151 పాయింట్లు పెరిగి 23,926 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 458 పాయింట్లు ఎగబాకి 77,122 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.89బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 96.2 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.29 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.62 శాతం పెరిగింది.నాస్డాక్ 0.83 శాతం పుంజుకుంది.Today Nifty position 10-04-2026(time: 9:29 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్వల్ప నష్టాల్లో నిఫ్టీ, సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం స్వల్ప నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:29 సమయానికి నిఫ్టీ(Nifty) 25 పాయింట్లు తగ్గి 23,970 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 172 పాయింట్లు నష్టపోయి 77,393 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.05బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 96.6 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.29 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 2.51 శాతం పెరిగింది.నాస్డాక్ 2.8 శాతం పుంజుకుంది.Today Nifty position 09-04-2026(time: 9:29 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
కాసుల వర్షం: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికా, ఇరాన్ కాల్పుల విరమణకు అంగీకరించడం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యథాతథ స్థితిని కొనసాగించడంతో నిఫ్టీ 50, సెన్సెక్స్ ఐదు రోజుల లాభాల పరంపరను నమోదు చేశాయి.నిఫ్టీ 3.78 శాతం లేదా 873.70 పాయింట్ల లాభంతో 23,997.35 వద్ద, సెన్సెక్స్ 3.95 శాతం లేదా 2,946.32 పెరిగి 77,562.90 వద్ద ముగిశాయి.ముఖ్యంగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లో లిస్టయిన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ (Market Capitalization) రూ. 16.59 లక్షల కోట్లు పెరిగింది. దీంతో మొత్తం మార్కెట్ క్యాప్ రూ. 446 లక్షల కోట్ల మార్కును చేరుకుంది.శ్రీరామ్ ఫైనాన్స్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, అదానీ ఎంటర్ప్రైజెస్ నిఫ్టీ 50 ఇండెక్స్‌లో టాప్ గెయినర్లుగా నిలిచాయి.విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 4.03 శాతం, 4.39 శాతం లాభపడ్డాయి. రంగాల వారీగా.. నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ ఆటో సహచర రంగాలను అధిగమించాయి. అదే సమయంలో నిఫ్టీ ఐటీ తక్కువ లాభాలతో తక్కువ పనితీరు కనబరిచింది.ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ ఏప్రిల్ సమీక్షలో బెంచ్‌మార్క్ పాలసీ రెపో రేటును 5.25 శాతంగా ఉంచాలని నిర్ణయించింది. పర్యవసానంగా, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్ఎఫ్) రేటు, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్డిఎఫ్) రేటు కూడా వరుసగా 5 శాతం, 5.5 శాతం వద్ద మారలేదు. -
బుల్‌రన్.. 2600 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం భారీ లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:29 సమయానికి నిఫ్టీ(Nifty) 761 పాయింట్లు పెరిగి 23,890 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 2602 పాయింట్లు ఎగబాకి 77,198 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.9బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 94 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.24 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.08 శాతం పెరిగింది.నాస్డాక్ 0.1 శాతం పుంజుకుంది.Today Nifty position 08-04-2026(time: 9:39 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
వీడిన యుద్ధ మేఘాలు.. మార్కెట్లలో జోష్!
గత కొద్ది రోజులుగా ప్రపంచాన్ని వణికించిన అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధ భయాలు తాత్కాలికంగా సద్దుమణిగాయి. పశ్చిమాసియాలో ముంచుకొస్తున్న పెను ప్రమాదాన్ని నివారిస్తూ ఇరాన్‌పై తలపెట్టిన సైనిక చర్యను రెండు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ పరిణామంతో అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి తొలగి పెట్టుబడిదారుల్లో ఒక్కసారిగా ఉత్సాహం వెల్లివిరిసింది. ఈ ఉదయం గిఫ్ట్ నిఫ్టీ ఏకంగా 2 శాతంపైగా లాభపడటం భారత మార్కెట్లలో బుల్ రన్‌కు సంకేతాలు పంపుతోంది.ట్రంప్ వ్యూహాత్మక అడుగుఏప్రిల్ 8, 2026 ఉదయం 4:30(అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 8 గంటలు) వైట్ హౌస్ నుంచి ట్రంప్ ఈ కీలక ప్రకటన చేశారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌ల మధ్యవర్తిత్వంతో ఇరాన్ చర్చలకు సుముఖత వ్యక్తం చేయడంతో సైనిక దాడులను 14 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ‘వినాశకరమైన యుద్ధం కంటే శాంతికి మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించాం. అయితే హార్మూజ్ జలసంధిని తక్షణమే సురక్షితంగా తెరిస్తేనే ఈ వెసులుబాటు వర్తిస్తుంది’ అని ట్రంప్ స్పష్టం చేశారు.చమురు ధరల పతనం..యుద్ధం వాయిదా పడటంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. డబ్ల్యూటీఐ క్రూడ్ దాదాపు 18 శాతం తగ్గి 92.60 డాలర్లు వద్దకు చేరింది. బ్రెండ్ క్రూడ్ 6 శాతం తగ్గి 103.40 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. హార్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకోనుండటం వల్ల సరఫరా పునరుద్ధరిస్తారనే ఆశలు చిగురించాయి. ప్రపంచ ఇంధన అవసరాల్లో 20 శాతానికి పైగా ఈ మార్గం నుంచే సాగుతుండటంతో గడిచిన నెల రోజులుగా ఆకాశాన్ని తాకిన ధరలు ఇప్పుడు కిందికి దిగివస్తున్నాయి.దలాల్ స్ట్రీట్‌లో పండగభారతీయ కాలమానం ప్రకారం ఈ రోజు ట్రేడింగ్ ప్రారంభానికి ముందే గిఫ్ట్ నిఫ్టీ 450 పాయింట్ల పైగా లాభంతో ఉంది. దీని ప్రభావంతో సెన్సెక్స్, నిఫ్టీలు ఈరోజు చారిత్రాత్మక గరిష్టాలను తాకే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆసియా మార్కెట్లో నికాయ్, హాంగ్ సెంగ్ మార్కెట్లు ఇప్పటికే 2-3 శాతం లాభాల్లో కొనసాగుతున్నాయి.ఇంతకాలం యుద్ధం వస్తుందేమో అన్న ఆందోళనతో నగదును వెనక్కు తీసుకున్న ఇన్వెస్టర్లకు ఇదొక గొప్ప ఊరట. ఇరాన్ తన 10 సూత్రాల శాంతి ప్రణాళికను అమలు చేస్తే ఈ రెండు వారాల విరామం శాశ్వత శాంతికి దారి తీయవచ్చు. భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు చమురు ధరల తగ్గింపు బూస్టర్ డోస్ లాంటిది. అయితే, ఇది కేవలం రెండు వారాల గడువు మాత్రమేనని, మధ్యవర్తిత్వ చర్చల ఫలితాలను బట్టే మార్కెట్ల తదుపరి దిశ ఉంటుందని పెట్టుబడిదారులు గమనించాలి.ఇదీ చదవండి: చల్లారిన పసిడి వేడి! తులం ఎంతంటే.. -
నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 509.73 పాయింట్ల లాభంతో 74,616.58 వద్ద, నిఫ్టీ 155.40 పాయింట్ల లాభంతో 23,123.65 వద్ద నిలిచింది.ఆల్కలీ మెటల్స్ లిమిటెడ్, ఆల్ఫాజియో (ఇండియా) లిమిటెడ్, లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, ఉమా ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్, ల్యాండ్‌మార్క్ ప్రాపర్టీ డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్ వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. రాజ్ టెలివిజన్ నెట్వర్క్ లిమిటెడ్, జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ లిమిటెడ్, అమీర్ చంద్ జగదీష్ కుమార్ (ఎక్స్‌పోర్ట్స్) లిమిటెడ్, నెక్స్ట్ మీడియావర్క్స్ లిమిటెడ్, ధని సర్వీసెస్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
500 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:26 సమయానికి నిఫ్టీ(Nifty) 149 పాయింట్లు నష్టపోయి 22,819 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 505 పాయింట్లు దిగజారి 73,694 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.11బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 111 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.34 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.44 శాతం పెరిగింది.నాస్డాక్ 0.54 శాతం పుంజుకుంది.Today Nifty position 07-04-2026(time: 9:27 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్ 787.30 పాయింట్లు లేదా 1.07 శాతం లాభంతో 74,106.85 వద్ద, నిఫ్టీ 255.15 పాయింట్లు లేదా 1.12 శాతం లాభంతో 22,968.25 వద్ద నిలిచింది.అల్పా లాబొరేటరీస్ లిమిటెడ్, STL గ్లోబల్ లిమిటెడ్, బ్రూక్స్ లాబొరేటరీస్ లిమిటెడ్, క్రెబ్స్ బయోకెమికల్స్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఆర్కేఈసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఏషియన్ హోటల్స్ (వెస్ట్) లిమిటెడ్, రాజ్ టెలివిజన్ నెట్వర్క్ లిమిటెడ్, అమీర్ చంద్ జగదీష్ కుమార్ (ఎక్స్పోర్ట్) లిమిటెడ్, హరియోమ్ పైప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, గీకే వైర్స్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
ఫ్లాట్‌గా స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఫ్లాట్‌గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:40 సమయానికి నిఫ్టీ(Nifty) 4 పాయింట్లు నష్టపోయి 22,707 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 89 పాయింట్లు దిగజారి 73,226 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.15బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 109.84 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.35 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.11 శాతం పెరిగింది.నాస్డాక్ 0.18 శాతం పుంజుకుంది.Today Nifty position 06-04-2026(time: 9:41 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
క్రాష్ టు బౌన్స్‌బ్యాక్!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ భారీ పతనం నుంచి అనూహ్యంగా కోలుకొని స్వల్ప లాభంతో ముగిసింది. ఐటీ, బ్యాంకుల షేర్లలో బలమైన కొనుగోళ్లు, ఫారెక్స్ మార్కెట్లో రూపాయి గణనీయమైన రికవరీ అంశాలు కలిసొచ్చాయి. ఇంట్రాడేలో 1,588 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ చివరికి 185 పాయింట్ల లాభంతో 73,320 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఇంట్రాడే కనిష్టం నుంచి 530 పాయింట్లు కోలుకుంది. ఆఖరికి 34 పాయింట్లు పెరిగి 22,713 వద్ద స్థిరపడింది. ఆసియా మార్కెట్లో దక్షిణ కొరియా 4.67%, జపాన్ 2.43%, ఇండోనేసియా 2.24%, తైవాన్ 1.85% క్షీణించాయి. చైనా, హాంగ్‌కాంగ్ 1%, సింగపూర్ అరశాతం నష్టపోయాయి. యూరప్‌లో ఫ్రాన్స్, జర్మనీ ఇండెక్సులు అరశాతం పతనమయ్యాయి. బ్రిటన్ సూచీ 1% పెరిగింది. అమెరికా స్టాక్ సూచీలు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఆరంభంలో భారీ క్రాష్: రానున్న 2–3 వారాల్లో ఇరాన్‌పై భీకర దాడులు చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుద్ధ హెచ్చరికలు, క్రూడాయిల్ ధరలు ఎగసిపడటం, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల ప్రభావంతో దేశీయ స్టాక్ ఉదయం భారీ నష్టాలతో మొదలైంది. సెన్సెక్స్ 1,588 పాయింట్లు కుప్పకూలి 71,546 వద్ద, నిఫ్టీ 497 పాయింట్లు క్షీణించి 22,183 వద్ద ఇంట్రాడే కనిష్టాలు నమోదు చేశాయి. రికవరీ కారణాలు ఇవే: ఆర్బీఐ నియంత్రణ చర్యలతో డాలర్ మారకంలో రూపాయి విలువ గత 12 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా 152 పైసలు బలపడింది. మిడ్ సెషన్ నుంచి ఐటీ, బ్యాంకింగ్ రంగాలకు చెందిన లార్జ్‌క్యాప్ షేర్లలో వాల్యూ బయింగ్ కొనుగోళ్లు చోటుచేసుకున్నాయి. ఫలితంగా సెన్సెక్స్ ఇంట్రాడే కనిష్టం (71,546) నుంచి 2023 పాయింట్లు ఎగసి 73,569 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ సైతం ఇంట్రాడే కనిష్టం (22,183) నుంచి 600 పాయింట్లు ర్యాలీ చేసి 22783 వద్ద గరిష్టాన్ని అందుకుంది.సాయి పేరెంటరల్స్ లిస్టింగ్ సక్సెస్ఫార్మాస్యూటికల్ కంపెనీ సాయి పేరెంటరల్స్ లిస్టింగ్ మెప్పించింది. ఇష్యూ ధర (రూ.392)తో పోలిస్తే బీఎస్ఈలో 3% ప్రీమియంతో రూ.405 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 6.17% పెరిగి రూ.416 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 3.67% లాభంతో రూ.406 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.1,795.44 కోట్లుగా నమోదైంది.→ పవర్ సొల్యూషన్స్ ప్రొవైడర్ పవరికా లిస్టింగ్‌లో నిరాశపరిచింది. ఎన్ఎస్ఈలో ఇష్యూ ధర (రూ.395)తో పోలిస్తే 7.34% డిస్కౌంటుతో రూ.366 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 365 – 397 శ్రేణిలో ట్రేడైంది. చివరికి 2.53% నష్టంతో రూ.385 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.4,872 కోట్లుగా నమోదైంది.→ బాస్మతి బియ్యం ఎగుమతి సంస్థ అమీర్ చంద్ జగదీష్ కుమార్(ఎక్స్‌పోర్ట్స్) పేలవంగా లిస్టయింది. బీఎస్‌లో ఇష్యూ ధర (రూ.212)తో పోలిస్తే 8% డిస్కౌంటుతో రూ.195 వద్ద లిస్టయ్యింది. రోజంతా నష్టాల్లో ట్రేడవుతూ చివరికి 11% పతనంతో రూ.189 వద్ద ముగిసింది. -
నష్టాల నుంచి లాభాలు.. స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్!
గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 182.26 పాయింట్లు లేదా 0.25 శాతం లాభంతో 73,316.58 వద్ద, నిఫ్టీ 33.70 పాయింట్లు లేదా 0.15 శాతం లాభంతో 22,713.10 వద్ద నిలిచాయి.రుచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, బైక్ హాస్పిటాలిటీ లిమిటెడ్, బాంబే సూపర్ హైబ్రిడ్ సీడ్స్ లిమిటెడ్, ఓరియంటల్ ట్రైమెక్స్ లిమిటెడ్, బ్రూక్స్ లాబొరేటరీస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. అమీర్ చంద్ జగదీష్ కుమార్ (ఎక్స్పోర్ట్) లిమిటెడ్, మహారాష్ట్ర అపెక్స్ కార్పొరేషన్ లిమిటెడ్, ఏవీజీ లాజిస్టిక్స్ లిమిటెడ్, అక్యూటాస్ కెమికల్స్ లిమిటెడ్, హిల్టన్ మెటల్ ఫోర్జింగ్ లిమిటెడ్ సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
భారీ నష్టాల్లో దేశీయ మార్కెట్లు
-
మళ్లీ నష్టాల్లోకి స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:29 సమయానికి నిఫ్టీ(Nifty) 431 పాయింట్లు నష్టపోయి 22,247 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 1411 పాయింట్లు దిగజారి 71,741 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.96బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 106.41 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.37 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.72 శాతం పెరిగింది.నాస్డాక్ 1.16 శాతం పుంజుకుంది.Today Nifty position 02-04-2026(time: 9:30 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
కొత్త ఆర్థిక సంవత్సరం బుల్ స్టార్ట్!
ముంబై: కొత్త ఆర్థిక సంవత్సరాన్ని(2026–27) దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో మొదలుపెట్టింది. పశ్చిమాసియా యుద్ధం 2–3 వారాల్లో ముగిస్తుందనే ఆశలు సూచీలను పరుగులు పెట్టించాయి. క్రూడాయిల్ ధరలు దిగిరావడం కలిసొచ్చిది. ఫలితంగా బుధవారం సెన్సెక్స్ 1,187 పాయింట్లు పెరిగి 73,134 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 348 పాయింట్లు బలపడి 22,679 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే భారీ లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 2,017 పాయింట్లు ఎగసి 73,964 వద్ద, నిఫ్టీ 610 పాయింట్లు బలపడి 22,941 వద్ద ఇంట్రాడే గరిష్టాలు నమోదు చేశాయి. అయితే ట్రేడింగ్ చివరి గంటలో లాభాల స్వీకరణ కారణంగా సూచీల లాభాలు సగానికి తుడిపెట్టుకుపోయాయి. తాజా ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.9.60 లక్షల కోట్లు పెరిగి రూ. 422.01 లక్షల కోట్లకు చేరింది. → ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా 8%, జపాన్ 5%, తైవాన్ 4% ర్యాలీ చేశాయి. ఇండోనేíÙయా, హాంగ్‌కాంగ్, సింగపూర్ 2%, చైనా, థాయ్‌లాండ్ 1.55% పెరిగాయి. యూరప్ మార్కెట్లు 1.5% – 2% లాభపడ్డాయి. అమెరికా స్టాక్ సూచీలు 1% లాభంతో ట్రేడవుతున్నాయి. → ఫార్మా షేర్లలో లాభాల స్వీకరణ చోటుచేసుకుంది. రంగాల వారీ ఇండెక్సుల్లో సరీ్వసెస్ 5%, పీఎస్‌యూ బ్యాంక్ 3.66%, ఇండ్రస్టియల్స్ 3.40%, క్యాపిటల్ గూడ్స్ 3.29%, కన్జూమర్ డి్రస్కేషనరీ 2.79%, కమోడిటీస్ 2.72%, ఐటీ 2.40% పెరిగాయి. సెన్సెక్స్‌లో ఎన్టీపీసీ (–1.64%), సన్‌ఫార్మా (–1.64%), పవర్‌గ్రిడ్ (–1.13%), అ్రల్టాటెక్ (–0.29%) మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 26 షేర్లూ లాభపడ్డాయి. బుల్ పరుగులు ఎందుకంటే ..ఎలాంటి ఒప్పందం లేకుండానే ఇరాన్ యుద్ధాన్ని 2–3 వారాల్లో ముగించే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. మరోవైపు భవిష్యత్తులో తమపై దాడులు జరగవని హామీ ఇస్తే యుద్ధం ముగింపునకు సిద్ధమేనని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తెలిపారు. దీంతో భారత్‌తో సహా అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో రిలీఫ్ ర్యాలీ చోటు చేసుకుంది. బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 4% క్షీణించి 100 డాలర్ల దిగువకు దిగివచ్చాయి. మూడునెలల గరిష్టానికి చేరిన అమెరికన్ బాండ్లపై రాబడులు అనూహ్యంగా దిగివచ్చాయి. దలాల్ స్ట్రీట్ మార్చిలో 11% భారీ పతనం తర్వాత షార్ట్ కవరింగ్, వాల్యూ బయింగ్ కొనుగోళ్లు చోటుచేసుకున్నాయి. → జెట్ ఫ్యూయెల్ ధరలు పరిమితంగానే పెరగడంతో ఏవియేషన్ రంగానికి చెందిన ఇండిగో షేరు 6%, స్పైస్‌జెట్ 2% పెరిగాయి. -
1850 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:27 సమయానికి నిఫ్టీ(Nifty) 567 పాయింట్లు పెరిగి 22,901 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 1874 పాయింట్లు ఎగబాకి 73,833 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.83బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 105.19 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.29 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 2.91 శాతం పెరిగింది.నాస్డాక్ 3.83 శాతం పుంజుకుంది.Today Nifty position 01-04-2026(time: 9:27 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
2025-26కు నష్టాల వీడ్కోలు.. బేర్ బాజా!
ముంబై: ఆర్థిక సంవత్సరం 2025–26కు దలాల్ స్ట్రీట్ నష్టాలతో వీడ్కోలు పలికింది. పశ్చిమాసియా యుద్ధం ఐదో వారంలోకి ప్రవేశించడం, క్రూడాయిల్ ధరలు పెరగడంతో మార్కెట్ రెండోరోజూ ‘బేర్’ మంది. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, రూపాయి జీవితకాల కనిష్టానికి పతనం సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీశాయి. ఫలితంగా సోమవారం సెన్సెక్స్ 1,636 పాయింట్లు కుప్పకూలి 71,948 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 488 పాయింట్లు పతనమై 22,331 వద్ద నిలిచింది. ఒక దశలో సెన్సెక్స్ 1,809 పాయింట్లు 71,774 పాయింట్లు వద్ద, నిఫ్టీ 536 పాయింట్లు క్షీణించి 22,284 వద్ద ఇంట్రాడే కనిష్టాలు నమోదు చేశాయి. ఆసియాలో జపాన్ 3%, దక్షిణ కొరియా 3%, తైవాన్ 2%, హాంకాంగ్ 1% పతనమయ్యాయి. యూరప్ మార్కెట్లు 1–0.5% లాభపడ్డాయి. అమెరికా సూచీలు అర శాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. కాగా, దేశీ స్టాక్ మార్కెట్ 2025–26 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 7% పతనాన్ని చవిచూసింది. సెన్సెక్స్ 5,467 పాయింట్లు, నిఫ్టీ 1,188 పాయింట్లు పడ్డాయి. → రంగాల వారీ బీఎస్ఈ ఇండెక్సుల్లో పీఎస్‌యూ బ్యాంక్ 4.60%, ప్రైవేట్ బ్యాంక్స్ ఇండెక్స్ 3.50%, ఫైనాన్సియల్ సర్వీసెస్ 3.46%, టెలికమ్యూనికేషన్ 3.09%, రియల్టీ 3.03% క్షీణించాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 3.13%, 2.14% పతనమయ్యాయి. సెన్సెక్స్ సూచీలో పవర్‌గ్రిడ్ (0.27%) మాత్రమే స్వల్ప లాభంతో గట్టెక్కింది. మిగిలిన 29 షేర్లూ నష్టాలతో ముగిశాయి. బజాజ్ ఫైనాన్స్ (–5.09%), ఎస్బీఐ (–3.95%), ఇండిగో (–3.80%), బజాజ్‌ఫిన్‌సర్వ్ (–3.71%) అత్యధికంగా నష్టపోయాయి. కీలక దశలోకి పశ్చిమాసియా యుద్ధంఎన్ని దాడులు చేసినా ఇరాన్ లొంగే పరిస్థితి కని్పంచకపోవడంతో అమెరికా ఆఖరి అస్త్రంగా భూతల దాడులు చేయడానికి సిద్ధమైంది. దాడులు జరిపేందుకు 3,500 మంది మెరైన్లు, సైనికులతో అమెరికా యుద్ధ నౌక యూఎస్ఎస్ ట్రిపోలీని పశ్చిమాసియాకు తరలించారు. యూఎస్ భూతల దాడులు చేస్తే, ఎదుర్కోడానికి సిద్ధమేనని ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మహమ్మద్ బఘర్ ఖలీబాఫ్ హెచ్చరించారు. పశ్చిమాసియా యుద్ధం కీలక దశకు చేరుకోవడంతో బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 115 డాలర్లకు చేరుకుంది. బ్యాంకింగ్ షేర్లలో వెల్లువెత్తిన విక్రయాలుఆర్బీఐ విధించిన ఫారెక్స్ ఆంక్షల ప్రభావంతో బ్యాంకింగ్ షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. కొత్త నిబంధనల ప్రకారం బ్యాంకులు తమ నికర ఓపెన్ ఫారెక్స్ పొజిషన్లను రోజువారీ ట్రేడింగ్ ముగిసే సరికి 100 మిలియన్ డాలర్లకు పరిమితం చేయాల్సి ఉంటుంది. దీనితో ఆర్బిట్రాజ్ పొజిషన్ల అన్‌వైండింగ్ నేపథ్యంలో డాలర్ విక్రయాలు పెరిగే అవకాశముంది. ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి వచ్చే ఈ నిర్ణయం రూపాయికి తాత్కాలిక ఊరట ఇచ్చినా, బ్యాంకింగ్ షేర్లపై తీవ్ర ఒత్తిడిని పెంచింది. ప్రభుత్వరంగ బ్యాంకులకు ప్రాతినిథ్యం వహించే బీఎస్ఈ పీఎస్‌యూ ఇండెక్స్ 4.60 క్షీణించగా, ప్రైవేట్ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బీఎస్ఈ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ 3.50% పతనమైంది. ఎక్స్పైరీ ఒత్తిడితో తీవ్ర ఊగిసలాటనిఫ్టీ నెలవారీ ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టుల ఎక్స్పైరీ నేపథ్యంలో ట్రేడర్లు తమ పొజిషన్లలో మార్పులు చేసుకోవడంతో ఇంట్రాడేలో సూచీలు భారీ ఊగిసలాటలకు లోనయ్యాయి. సాధారణంగా నెలవారీ ఎక్స్పైరీ నెల చివరి మంగళవారం జరుగుతుంది. అయితే మహావీర్ జయంతి సందర్భంగా మార్కెట్లకు సెలవు కావడంతో ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ సోమవారం నిర్వహించారు. ఆగని ఎఫ్ఐఐల విక్రయాలుపశ్చిమాసియా యుద్ధం అయిదో వారంలోకి ప్రవేశించడంతో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ మరింత ఊపందుకుంది. గడిచిన 20 రోజులుగా ఎఫ్ఐఐలు నికర అమ్మకందారులుగా నిలుస్తుండం మన మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది. సోమవారం ఒక్క రోజే రూ.11,163 కోట్లు అమ్మకాలకు పాల్పడటం పతనం తీవ్రతకు నిదర్శనం.సీఎంపీడీఐ.. లిస్టింగ్ నిరాశకోల్ ఇండియా అనుబంధ సంస్థ సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్(సీఎంపీడీఐ) షేరు లిస్టింగ్‌లో నిరాశపరించింది. ఇష్యూ ధర (రూ.172)తో పోలిస్తే 5.43 శాతం డిస్కౌంటుతో రూ.163 వద్ద లిస్టయ్యింది. మార్కెట్ పతనంలో భాగంగా ఒక దశలో 11.45% క్షీణించి రూ.152 ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 10.43% నష్టంతో రూ.154 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,999 కోట్లుగా నమోదైంది.2 రోజుల్లో రూ.18.60 లక్షల కోట్ల ఆవిరిబేర్ ఎటాక్‌తో రెండు రోజుల్లో రూ.18.60 లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.412.41 లక్షల కోట్లకు దిగివచి్చంది. తాజాగా సోమవారం ఒక్కరోజే రూ.9 లక్షల కోట్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. పశ్చిమాసియా యుద్ధం మొదలైన తర్వాత ఫిబ్రవరి 28 నుంచి మార్చి 23 మధ్య) సెన్సెక్స్ 9,339 పాయింట్లు (11.48%) క్షీణించింది. -
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు: సెన్సెక్స్, నిఫ్టీ ఇలా..
సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,635.67 పాయింట్లు లేదా 2.22 శాతం నష్టంతో 71,947.55 వద్ద, నిఫ్టీ 488.20 పాయింట్లు లేదా 2.14 శాతం నష్టంతో 22,331.40 వద్ద నిలిచాయి.హిల్టన్ మెటల్ ఫోర్జింగ్ లిమిటెడ్, యారో గ్రీన్‌టెక్ లిమిటెడ్, దాల్మియా భారత్ షుగర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, నిన్టెక్ సిస్టమ్స్ లిమిటెడ్, సెక్‌మార్క్ కన్సల్టెన్సీ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. వండర్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, ఖండ్వాలా సెక్యూరిటీస్ లిమిటెడ్, రామ స్టీల్ ట్యూబ్స్ లిమిటెడ్, సూరత్వాలా బిజినెస్ గ్రూప్ లిమిటెడ్, ఓస్వాల్ ఆగ్రో మిల్స్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.గమనిక: రేపు (మార్చి 31) మహావీర్ జయంతి సందర్భంగా స్టాక్ మార్కెట్ సెలవు.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
మళ్లీ బేర్ ఎటాక్!
ముంబై: పశ్చిమాసియా యుద్ధం మరింత భీకరంగా మారడంతో దలాల్ స్ట్రీట్ మళ్లీ బేర్ గుప్పిట్లోకి వచ్చింది. అమెరికా–ఇరాన్ మధ్య జరగాల్సిన శాంతి చర్చలు ఇంకా ప్రతిష్టంభనలోనే కొనసాగుతున్నాయి. చమురు సరఫరా ఆందోళనలతో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్ 107 డాలర్లకు ఎగసింది. రూపాయి విలువ రికార్డు కనిష్టానికి దిగివచ్చింది. విదేశీ ఇన్వెస్టర్లు గత 19 రోజులుగా దేశీయ ఈక్విటీలను విక్రయిస్తూనే ఉన్నారు. అమెరికాలో ట్రెజరీ బాండ్లపై రాబడులు అనూహ్యంగా పెరిగాయి. ఈ పరిణామాలతో శుక్రవారం సెన్సెక్స్ 1,690 పాయింట్లు కోల్పోయి 73,583 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 487 పాయింట్లు పతనమై 22,820 వద్ద నిలిచింది. సూచీల 2% పతనంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.8.86 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.422.15 లక్షల కోట్లకు దిగిచ్చింది. ఆసియాలో జపాన్, ఇండోనేషియా, తైవాన్, థాయిలాండ్ మార్కెట్లు 1–50% నష్టపోయాయి. చైనా, హాంగ్‌కాంగ్, సింగపూర్ సూచీలు 0.50% మేర లాభడ్డాయి. యూరప్‌లో జర్మనీ డాక్స్ ఇండెక్సు 1.37%, ఫ్రాన్స్ సీఏసీ సూచీ 0.72%, బ్రిటన్ ఎఫ్టీఎస్ఈ ఇండెక్సు 0.30 శాతం నష్టపోయాయి. అమెరికా స్టాక్ సూచీలు 1.50 శాతం పతనంతో ట్రేడవుతున్నాయి. రోజంతా అమ్మకాలు...బలహీన అంతర్జాతీయ సంకేతాలతో ఉదయమే సూచీలు నష్టాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ఆద్యంతం అమ్మకాలు ఒత్తిడితో సూచీలు రోజంతా నష్టాల్లో కదలాడాయి. ఒకానొక దశలో సెన్సెక్స్ 1,739 పాయింట్లు క్షీణించి 73,534 వద్ద, నిఫ్టీ 501 పాయింట్లు పతనమై 22,805 వద్ద ఇంట్రాడే కనిష్టాలు నమోదు చేశాయి. అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. బీఎస్ఈలో రంగాల వారీగా ప్రభుత్వరంగ బ్యాంక్ సూచీ 4%, రియల్టీ 3.10% పతనమయ్యాయి. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 2.12%, 1.77 శాతం నష్టపోయాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరగడం, ప్రభుత్వం డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై మళ్ళీ ‘విండ్‌ఫాల్ టాక్స్’ విధించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 4.55% క్షీణించి రూ.1,348 వద్ద స్థిరపడింది. -
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!
శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,690.23 పాయింట్లు లేదా 2.25 శాతం నష్టంతో 73,583.22 వద్ద, నిఫ్టీ 486.85 పాయింట్లు లేదా 2.09 శాతం నష్టంతో 22,819.60 వద్ద నిలిచాయి.హిల్టన్ మెటల్ ఫోర్జింగ్ లిమిటెడ్, హెచ్ఈజీ లిమిటెడ్, కృతి ఇండస్ట్రీస్ (ఇండియా) లిమిటెడ్, సుప్రీం పెట్రోకెమ్ లిమిటెడ్, RPSG వెంచర్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. నాగ ధున్సేరి గ్రూప్ లిమిటెడ్, మిట్టల్ లైఫ్ స్టైల్ లిమిటెడ్, MBL ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, షెమరూ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్, ఆర్చీస్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాల్లో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ(Nifty) 243 పాయింట్లు నష్టపోయి 23,063 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 841 పాయింట్లు పడిపోయి 74,445 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.84బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 107.06 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.42 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.74 శాతం నష్టపోయింది.నాస్డాక్ 2.38 శాతం పడిపోయింది.Today Nifty position 27-03-2026(time: 9:30 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
గ్రీన్‌లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:46 సమయానికి నిఫ్టీ(Nifty) 295 పాయింట్లు పెరిగి 23,207 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 888 పాయింట్లు పుంజుకొని 74,962 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.28బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 99.76 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.34 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.37 శాతం నష్టపోయింది.నాస్డాక్ 0.84 శాతం పడిపోయింది.Today Nifty position 25-03-2026(time: 9:46 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
వార్‌కు బ్రేక్.. బుల్‌కు జోష్!
ముంబై: ఇరాన్ ఇంధన వనరులు, విద్యుత్ కేంద్రాలపై దాడులను 5 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో దలాల్ స్ట్రీట్‌లో రిలీఫ్ ర్యాలీ నెలకొంది. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ కూడా చర్చల పట్ల సానుకూలంగా ఉన్నట్టు వార్తలు రావడం... క్రూడ్ ధర దిగిరావడం తదితర అంశాలు ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 1,372 పాయింట్లు పెరిగి 74,068 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 400 పాయింట్లు బలపడి 22,912 వద్ద నిలిచింది. సూచీల 2% ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.7.56 లక్షల కోట్లు పెరిగి రూ.422.78 లక్షల కోట్లకు చేరింది. అదిరిపోయే ఆరంభం: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే భారీ లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 1,793 పాయింట్లు ఎగసి 74,489 వద్ద, నిఫ్టీ 544 పాయింట్లు బలపడి 23 వేల స్థాయిపైన 23,057 వద్ద ఇంట్రాడే గరిష్టాలు నమోదు చేశాయి. ట్రేడింగ్ అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్లు లభించడంతో రోజంతా లాభాల్లో కదలాడాయి. సెన్సెక్స్ సూచీలో 30 షేర్లలో పవర్‌గ్రిడ్ (–0.81%), సన్‌ఫార్మా (–0.20%), ఎస్బీఐ(–0.09%) మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 27 షేర్లూ లాభడ్డాయి. రంగాల వారీ ఇండెక్సుల్లో సర్వీసెస్ 3.46%, ఇండ్రస్టియల్స్ 3%, ప్రైవేటు బ్యాంక్స్ 2.63%, కన్జూమర్ డ్యూరబుల్స్ 2.46%, కన్జూమర్ డి్రస్కేషనరీ 2.39%, ఫైనాన్షియల్ సర్వీసెస్ 2.34%, ఆటో 2.30%, కమోడిటీస్ 2.19 శాతం పెరిగాయి. ‘ఇరాన్ ఇంధన సదుపాయాలపై అమెరికా దాడులు తాత్కాలికంగా నిలివేయడం పశి్చమాసియాలో ఉద్రిక్తతలు మరింత తగ్గే అవకాశానికి సంకేతంగా భావించవచ్చు. అందుకే స్టాక్ మార్కెట్లో రిలీఫ్ ర్యాలీ చోటు చేసుకుంది. అయినప్పట్టకీ.., హర్మూజ్ జలసంధి చుట్టూ జరిగే రాజకీయ, భౌగోళిక పరిణామాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీస్తున్నాయి. దౌత్య సంబంధాలు ఏ మాత్రం బెడిసికొట్టినా మార్కెట్లపై మళ్లీ బేర్స్ పట్టుబిగించే వీలుంది. భారీ పతనం తర్వాత షార్ట్ కవరింగ్, వేల్యూ బయింగ్ కారణంగా ర్యాలీ సర్వసాధారణం. ఇలాంటి పరిస్థితిని ఇన్వెస్టర్లు తక్కువ ధరల్లో నాణ్యమైన షేర్లను కొనుగోళ్లకు అవకాశంగా వినియోగించుకోవాలి’ అని లైవ్ లాంగ్ వెల్త్ రీసెర్చ్ విశ్లేషకుడు హరిప్రసాద్ తెలిపారు.ప్రపంచ మార్కెట్లు..నష్టాల్లోంచి లాభాల్లోకియుద్ధంపై చర్చలకు సంబంధించి అమెరికా నుంచి సంకేతాలు అందాయంటూ ఇరాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి స్పష్టం చేయడంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లోంచి పుంజుకున్నాయి. ఆసియా మార్కెట్లలో హాంగ్‌కాంగ్ 3%, దక్షిణ కొరియా 2.67%, చైనా 1.75%, జపాన్ 1.41%, థాయిలాండ్ 1%, సింగపూర్ అరశాతం పెరిగాయి. ఇంట్రాడేలో 2% పతనమైన యూరప్ మార్కెట్లు నష్టాలను దాదాపు భర్తీ చేసుకున్నాయి. జర్మనీ డాక్స్ 0.25% స్వల్ప నష్టంతో ముగిసింది. ఫ్రాన్స్ సీఏసీ సూచీ 0.1% లాభపడగా, బ్రిటన్ ఎఫ్టీఎస్ఈ ఇండెక్సు 0.5% పెరిగింది. యూఎస్ ప్రధాన సూచీల్లో నాస్డాక్ 0.45% నష్టాల్లో ట్రేడవుతోంది. డోజోన్స్ 0.25%, ఎస్అండ్పీ–500 సూచీ స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి.సరికొత్త కనిష్టానికి రూపాయి... 23 పైసలు బలహీనపడి 93.76 వద్దకు.. డాలర్ మారకంలో రూపాయి విలువ 23 పైసలు బలహీనపడి జీవితకాల కనిష్టం 93.76 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ బలపడటం, క్రూడాయిల్ ధరల రికవరీ, పశి్చమాసియా సంక్షోభంతో విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు తదితర అంశాలు దేశీయ కరెన్సీపై ఒత్తిడి పెంచాయి. ఉదయం ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి 93.66 వద్ద మొదలైంది. రోజంతా అమ్మకాల ఒత్తిడికి లోనైంది. చివరికి ఇంట్రాడే కనిష్టం(93.76) వద్ద స్థిరపడింది. రానున్న రోజుల్లో 93.65 – 94.25 శ్రేణిలో ట్రేడవొచ్చని నిపుణులు భావిస్తున్నారు. కాగా ఈ మార్చిలో రూపాయి 4.5 శాతం కరిగిపోయింది. జీఎస్పీ క్రాప్ సైన్స్ లిస్టింగ్ సక్సెస్ ఆగ్రోకెమికల్ కంపెనీ జీఎస్పీ క్రాప్ సైన్స్ లిస్టింగ్ మెప్పించింది. ఇష్యూ ధర రూ.320తో పోలిస్తే బీఎస్ఈలో 4% ప్రీమియంతో రూ.332 వద్ద లిస్టయ్యింది. మార్కెట్ ర్యాలీలో భాగంగా ఒకదశలో 14% ఎగిసి రూ.364 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 11% లాభంతో రూ.356 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.1,656.53 కోట్లుగా నమోదైంది. -
పుంజుకున్న స్టాక్ మార్కెట్లు.. లాభాల్లో సూచీలు!
మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,372.06 పాయింట్లు లేదా 1.89 శాతం లాభంతో 74,068.45 వద్ద, నిఫ్టీ 412.25 పాయింట్లు లేదా 1.83 శాతం లాభంతో 22,924.90 వద్ద నిలిచాయి.హ్యాండ్స్ఆన్ గ్లోబల్ మేనేజ్మెంట్ (HGM) లిమిటెడ్, DCX సిస్టమ్స్ లిమిటెడ్, NOCIL లిమిటెడ్, బర్న్‌పూర్ సిమెంట్ లిమిటెడ్, మంగళం గ్లోబల్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఇన్నోవిజన్ లిమిటెడ్, రామ స్టీల్ ట్యూబ్స్ లిమిటెడ్, జెహెచ్ఎస్ స్వెండ్‌గార్డ్ లాబొరేటరీస్ లిమిటెడ్, యాక్సిస్ గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్, బైక్ హాస్పిటాలిటీ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
950 పాయింట్లు పుంజుకున్న సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:36 సమయానికి నిఫ్టీ(Nifty) 305 పాయింట్లు పెరిగి 22,818 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 956 పాయింట్లు పుంజుకొని 73,651 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.36బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 104.21 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.38 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.15 శాతం పెరిగింది.నాస్డాక్ 1.38 శాతం పుంజుకుంది.Today Nifty position 24-03-2026(time: 9:36 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మార్కెట్లో వార్ విధ్వంసం
ముంబై: ఒకపక్క ‘ఇరాన్ వార్, మరోపక్క ‘చమురు ధరల బాంబ్’తో దలాల్ స్ట్రీట్ మరోసారి దద్దరిల్లింది. డాలర్ మారకంలో రూపాయి విలువ రోజుకో కొత్త కనిష్టానికి నమోదుచేస్తోంది. దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగుతున్నాయి. ఈ అంశాలూ మార్కెట్ వర్గాలను కలవరపెట్టాయి. ఫలితంగా సోమవారం సెన్సెక్స్ 1,837 పాయింట్లు(2.46%) క్షీణించి 72,696 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 602 పాయింట్లు(2.60%) కుప్పకూలి 22,513 వద్ద నిలిచింది. బలహీన అంతర్జాతీయ సంకేతాలతో ఉదయమే సూచీలు భారీ నష్టాలతో మొదలయ్యాయి. అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో ట్రేడింగ్ సమయంలో అమ్మకాల సునామీ వాతావరణం నెలకొంది. ఒకానొక దశలో సెన్సెక్స్ 1,975 పాయింట్లు క్షీణించి 72,558 వద్ద, నిఫ్టీ 644 పాయింట్లు పతనమై 22,471వద్ద ఇంట్రాడే కనిష్టాలు నమోదు చేశాయి.ఇండెక్సులన్నీ నష్టాల్లోనేఅన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. బీఎస్ఈలో రంగాల వారీ ఇండెక్సుల్లో కన్జూమర్ డ్యూరబుల్స్ 5%, మెటల్ 4.76%, సరీ్వసెస్ 4.70%, ప్రభుత్వ రంగ బ్యాంకులు 4.39%, కమోడిటీస్ 4.35%, ఇండ్రస్టియల్స్ 4.05%, క్యాపిటల్ గూడ్స్ 3.99 శాతం పతనమయ్యాయి. మిడ్, స్మాల్ క్యాప్‌లు వరుసగా 3.82%, 3.66 శాతం నష్టపోయాయి. సెన్సెక్స్ సూచీలో 30 షేర్లలో హెచ్‌సీఎల్‌టెక్ 1.83%, పవర్‌గ్రిడ్ 1.39%, ఇన్ఫోసిస్ 0.28% మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన 27 షేర్లూ నష్టపోయాయి.యుద్ధం మొదలయ్యాక రూ.48.29 లక్షల కోట్లు ఆవిరి పశి్చమాసియా యుద్ధం మొదలైన తర్వాత ఫిబ్రవరి 28 నుంచి మార్చి 23 మధ్య) ఇన్వెస్టర్లు మొత్తం 15 ట్రేడింగ్ సెషన్లలో రూ.48.29 లక్షల కోట్లు కోల్పోయాయి. సెన్సెక్స్ 8,591 పాయింట్లు (10.56%), నిఫ్టీ 2,666 పాయింట్లు(10.58%) నష్టపోయాయి. తాజా గా సోమవారం ఒక్కరోజే రూ.14 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. దీంతో బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.414.77 లక్షల కోట్లకు దిగివచి్చంది.నష్టాలు ఎందుకంటేహార్మూజ్ జలసంధి అంశంపై అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో తాజా యుద్ధ భయాలు మార్కెట్లను కుదిపేశాయి. జలసంధి మూసివేత హెచ్చరికలతో క్రూడ్ బ్యారెల్ 110 డాలర్లపైకి చేరుకుంది. దీంతో ద్రవ్యోల్బణం మరింత పెరగడమే కాకుండా, వృద్ధి మందగమన ఆందోళనలు తలెత్తాయి. చమురు దిగుమతుల భారం, ఎఫ్ఐఐల భారీ అమ్మకాలతో రూపాయి సరికొత్త కనిష్టాలను తాకింది. యుద్ధం మొదలైన తర్వాత విదేశీ ఇన్వెస్టర్ల భారీ విక్రయాలు మార్కెట్‌ను మరింత బలహీనపరిచింది.ఆసియా మార్కెట్లు డౌన్..లాభాల్లోకి యూరప్, యూఎస్పశి్చమాసియా యుద్ధం ఇప్పట్లో ఆగకపోవచ్చనే ఆందోళనలతో ఆసియా మార్కెట్ల పతనం కొనసాగింది. ఫలితంగా దక్షిణ కొరియా 7%, చైనా 4%, జపాన్ 3.60%, హాంగ్‌కాంగ్ 3.54%, తైవాన్ 2.50%, సింగపూర్ 2.22 శాతం క్షీణించాయి. మన మార్కెట్ ముగిసిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో పరిస్థితులు తారుమారయ్యాయి. పశి్చమాసియాలో నెలకొన్న ఘర్షణలకు ‘సంపూర్ణ, శాశ్వత పరిష్కారం’ కనుగొనే దిశగా ‘ఫలప్రదమైన చర్చలు’ జరిగినట్లు ట్రంప్ తెలిపారు. ఇందులో భాగంగా ఇరాన్ విద్యుత్ ప్లాంట్లు, ఇంధన మౌలిక సదుపాయాలపై చేయాలనుకున్న ‘అన్ని రకాల దాడులను అయిదు రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు’ ట్రంప్ ప్రకటించారు. దీంతో యూరప్, అమెరికా స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా బౌన్స్‌బ్యాక్ అయ్యాయి. జర్మనీ డాక్స్ ఇండెక్స్ 3%, జర్మనీ సూచీ సీఏసీ సూచీ 2%, బ్రిటన్ ఎఫ్టీఎస్ఈ 1% పెరిగాయి. అమెరికా నాస్డాక్ ఇండెక్స్ 2.25%, డోజోన్స్ 2.50%, ఎస్అండ్పీ–500 సూచీ 2% లాభాల్లో ట్రేడవుతున్నాయి. -
స్టాక్ మార్కెట్ క్రాష్: రూ.14 లక్షల కోట్లు ఆవిరి!
సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. భారీ నష్టాల్లోనే ముగిశాయి. అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వల్ల మదుపర్ల సంపద ఏకంగా రూ.14 లక్షల కోట్లు ఆవిరైపోయింది. నిరంతరాయంగా విదేశీ నిధులు తరలిపోవడం కూడా పెట్టుబడిదారుల సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది.సోమవారం ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సరికి.. సెన్సెక్స్ 1,836.57 పాయింట్లు లేదా 2.46 శాతం నష్టంతో 72,696.39 వద్ద, నిఫ్టీ 601.85 పాయింట్లు లేదా 2.60 శాతం నష్టంతో 22,512.65 వద్ద నిలిచాయి. దీంతో ఈరోజును నిపుణులు బ్లాక్ మండేగా అభివర్ణించారు.స్టాక్‌ల విషయానికొస్తే, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పార్ట్‌టైమ్ ఛైర్మన్ 'అటాను చక్రవర్తి' (Atanu Chakraborty) రాజీనామా నేపథ్యంలో, గత రెండు సెషన్లలో 7.4 శాతం క్షీణించిన తర్వాత ఆ బ్యాంక్ షేరు సుమారు 2.5 శాతం పడిపోయింది. 2024 అసెస్మెంట్ సంవత్సరానికి గాను ఆదాయపు పన్ను శాఖ నుండి రూ. 6,337 కోట్ల పన్ను డిమాండ్ అందిన తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేరు 3.6 శాతం పడిపోయింది. 16 ప్రధాన రంగాల సూచీలన్నీ నష్టాల్లో ముగిశాయి. విస్తృత సూచీలు కూడా భారీ నష్టాలను చవిచూశాయి, నిఫ్టీ స్మాల్‌క్యాప్100, నిఫ్టీ మిడ్‌క్యాప్100 వరుసగా 3.82 శాతం, 3.45 శాతం మేర పడిపోయాయి. -
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. భారీ నష్టాల్లో సూచీలు!
నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 1,836.57 పాయింట్లు లేదా 2.46 శాతం నష్టంతో 72,696.39 వద్ద, నిఫ్టీ 601.85 పాయింట్లు లేదా 2.60 శాతం నష్టంతో 22,512.65 వద్ద నిలిచాయి.హ్యాండ్స్ఆన్ గ్లోబల్ మేనేజ్మెంట్ (HGM) లిమిటెడ్, డీసీఎక్స్ సిస్టమ్స్ లిమిటెడ్, NOCIL లిమిటెడ్, బర్న్‌పూర్ సిమెంట్ లిమిటెడ్, మంగళం గ్లోబల్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఇన్నోవిజన్ లిమిటెడ్, రామ స్టీల్ ట్యూబ్స్ లిమిటెడ్, జెహెచ్ఎస్ స్వెండ్‌గార్డ్ లాబొరేటరీస్ లిమిటెడ్, యాక్సిస్ గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్, బైక్ హాస్పిటాలిటీ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
మార్కెట్లపై బేర్ పంజా.. నష్టాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:34 సమయానికి నిఫ్టీ(Nifty) 411 పాయింట్లు తగ్గి 22,711 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 1269 పాయింట్లు నష్టపోయి 73,268 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.67బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 112.8 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.4 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.51 శాతం పడిపోయింది.నాస్డాక్ 2.01 శాతం నష్టపోయింది.Today Nifty position 23-03-2026(time: 9:34 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 325.72 పాయింట్లు లేదా 0.44 శాతం లాభంతో 74,532.96 వద్ద, నిఫ్టీ 112.35 పాయింట్లు లేదా 0.49 శాతం లాభంతో.. 23,114.50 వద్ద నిలిచింది.వెబ్‌సోల్ ఎనర్జీ సిస్టమ్స్ లిమిటెడ్, బ్రెయిన్‌బీస్ సొల్యూషన్స్ లిమిటెడ్, కెఐఓసిఎల్ లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. మహారాష్ట్ర అపెక్స్ కార్పొరేషన్ లిమిటెడ్, నెక్స్ట్ మీడియావర్క్స్ లిమిటెడ్, ఫిన్‌కర్వ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, నోవా అగ్రిటెక్ లిమిటెడ్, రేవతి ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
గ్రీన్‌లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:41 సమయానికి నిఫ్టీ(Nifty) 260 పాయింట్లు పెరిగి 23,259 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 811 పాయింట్లు పుంజుకొని 75,019 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.44బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 106.59 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.25 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.27 శాతం పడిపోయింది.నాస్డాక్ 0.28 శాతం నష్టపోయింది.Today Nifty position 20-03-2026(time: 9:41 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్ క్రాష్.. ముంచేసిన చమురు!
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీగా పతనమయ్యాయి. యుఎస్, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న సంఘర్షణ చమురు మౌలిక సదుపాయాలకు మరింత నష్టం కలిగించడంతో ఇంధన ధరలు పెరగడంతో నిఫ్టీ 50, సెన్సెక్స్ క్షీణించాయి.ఎన్ఎస్ఈ నిఫ్టీ 775.65 పాయింట్లు లేదా 3.26 శాతం క్షీణించి 23,002.15 వద్ద ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 2496.89 పాయింట్లు లేదా 3.26 శాతం తగ్గి 74,207.24 వద్ద స్థిరపడింది.సెన్సెక్స్ లోని అన్ని స్టాక్స్ నష్టాలలో ముగిశాయి. పవర్ గ్రిడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎన్టీపీసీ ఈ జాబితాలో ఉన్నాయి.విస్తృత మార్కెట్ సూచీలు నెత్తురు కక్కాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 3.19 శాతం, స్మాల్ క్యాప్ 100 2.94 శాతం నష్టపోయాయి. కౌంటర్లలో భారీ అమ్మకాలు కనిపించాయి. అన్ని రంగాల సూచీలు నష్టాలను చవిచూశాయి.మార్కెట్ సమయంలో, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ కు 11 శాతం పెరిగి 119.5 డాలర్లకు చేరుకుంది. కీలకమైన రిఫైనర్లు దెబ్బతిన్న తరువాత సౌదీ అరేబియా యాన్బు నౌకాశ్రయంలో చమురు లోడ్ చేయడాన్ని నిలిపివేసిందని నివేదికలు వచ్చిన తరువాత బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 11 శాతం పెరిగింది. -
మళ్లీ నేలకరిచిన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. గడిచిన మూడు సెషన్లలో లాభాల్లోకి చేరిన మార్కెట్లు ఈరోజు నష్టాల్లోకి వెళ్లాయి. ఈరోజు ఉదయం 9:28 సమయానికి నిఫ్టీ(Nifty) 459 పాయింట్లు తగ్గి 23,312 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 1526 పాయింట్లు దిగజారి 75,201 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.09బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 111.37 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.27 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.36 శాతం పడిపోయింది.నాస్డాక్ 1.46 శాతం నష్టపోయింది.Today Nifty position 19-03-2026(time: 9:28 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
క్రమంగా పుంజుకుంటున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:37 సమయానికి నిఫ్టీ(Nifty) 142 పాయింట్లు పెరిగి 23,723 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 423 పాయింట్లు ఎగబాకి 76,485 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.59బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 100.97 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.18 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.25 శాతం పెరిగింది.నాస్డాక్ 0.47 శాతం పుంజుకుంది.Today Nifty position 18-03-2026(time: 9:37 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 514.24 పాయింట్ల లాభంతో 76,017.09 వద్ద, నిఫ్టీ 150.00 పాయింట్ల లాభంతో 23,558.80 వద్ద నిలిచాయి.డిసిఎం శ్రీరామ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, గోకుల్ ఆగ్రో రిసోర్సెస్ లిమిటెడ్, MOIL లిమిటెడ్, ఆయిల్ కంట్రీ ట్యూబులర్ లిమిటెడ్, మిట్టల్ లైఫ్ స్టైల్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. LMW లిమిటెడ్, ప్రుడెన్షియల్ షుగర్ కార్పొరేషన్ లిమిటెడ్, జెల్ప్మాక్ డిజైన్ అండ్ టెక్ లిమిటెడ్, శ్యామ్ టెలికాం లిమిటెడ్, ధని సర్వీసెస్ లిమిటెడ్ మొదలైన సంస్థలు నష్టాల జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:49 సమయానికి నిఫ్టీ(Nifty) 68 పాయింట్లు పెరిగి 23,476 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 212 పాయింట్లు ఎగబాకి 75,713 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.89బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 102.87 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.23 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.01 శాతం పెరిగింది.నాస్డాక్ 1.22 శాతం పుంజుకుంది.Today Nifty position 17-03-2026(time: 9:49 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:38 సమయానికి నిఫ్టీ(Nifty) 81 పాయింట్లు పెరిగి 23,227 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 244 పాయింట్లు ఎగబాకి 74,823 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.26బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 104.12 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.25 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.61 శాతం పడిపోయింది.నాస్డాక్ 0.93 శాతం నష్టపోయింది.Today Nifty position 16-03-2026(time: 9:38 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
అదే భయం... అదే పతనం
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతోపాటు.. చమురు ధరలు మండుతుండటంతో దేశీ స్టాక్ మార్కెట్లు బేర్‌మంటున్నాయి. వరుసగా మూడో రోజు అమ్మకాలు వెల్లువెత్తడంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,580 పాయింట్లు పడిపోయి 74,455కు చేరింది. ఆసియా, యూరప్ మార్కెట్లు సైతం నీరసించడం సెంటిమెంటును దెబ్బతీసింది.ముంబై: చమురు ధరల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరగనున్న అంచనాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలకు తెరతీస్తున్నాయి. దీనికితోడు ఇంధన కొరత ఆర్థిక వ్యవస్థల వృద్ధికి విఘాతం కలిగించనున్న అంచనాలు పెరుగుతున్నాయి. దీంతో ఆసియాసహా అమెరికావరకూ స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు కొనసాగుతున్నాయి. దేశీయంగా మూడో రోజూ మార్కెట్లు పతనమయ్యాయి. సెన్సెక్స్ 1,471 పాయింట్లు పడిపోయి 74,564 వద్ద ముగిసింది. నిఫ్టీ 488 పాయింట్లు కోల్పోయి 23,151 వద్ద నిలిచింది. మిడ్‌సెషన్‌కల్లా సెన్సెక్స్ 1,580 పాయింట్లు క్షీణించి 74,455 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ సైతం 23,112 వరకూ నీరసించింది. మెటల్స్ మెల్టింగ్.. ఎన్ఎస్ఈలో అన్నిరంగాలూ నీరసించగా.. మెటల్స్ 5 శాతం పతనమైంది. క్రూడ్ సెగతో ఆటో, పీఎస్‌యూ బ్యాంక్స్, మీడియా, కన్జూమర్ డ్యురబుల్స్, కెమికల్స్ 3.6–2.7 శాతం మధ్య క్షీణించాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎల్అండ్టీ 7.5 శాతం పడిపోగా.. హిందాల్కో, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ, గ్రాసిమ్, ఎస్బీఐ, బజాజ్ ఆటో, టీఎంపీవీ, మారుతీ, ఎంఅండ్ఎం, ఐషర్, అల్ట్రాటెక్, యాక్సిస్ బ్యాంక్ 6–3 శాతం మధ్య డీలాపడ్డాయి. కేవలం టాటా కన్జూమర్, ఎయిర్టెల్ 2–1 శాతం బలపడ్డాయి. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు పీపా ధర 102 డాలర్లకు ఎగువన కదులుతుండటంతో సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో వాణిజ్య లోటు, ద్రవ్యోల్బణం పెరగనున్నట్లు తెలియజేశారు. చిన్న షేర్లు విలవిల తాజా అమ్మకాలతో బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 2.5 శాతం పతనమయ్యాయి. ట్రేడైన షేర్లలో 3,439 నష్టపోగా.. కేవలం 858 లాభపడ్డాయి. నగదు విభాగంలో తాజాగా ఎఫ్‌పీఐలు రూ. 10,717 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. డీఐఐలు రూ. 9,977 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. గత 4 రోజుల్లోనూ ఎఫ్‌పీఐలు రూ. 24,320 కోట్లకుపైగా పెట్టుబడులు వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 27,450 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి. కాగా.. ఈ నెల 2–6 మధ్య సైతం ఎఫ్‌పీఐలు రూ. 21,000 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన విషయం విదితమే.మరో 10 లక్షల కోట్లు ఆవిరిఅమ్మకాల సునామీతో ఒక్క రోజులోనే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల విలువకు రూ. 10.24 లక్షల కోట్ల మేర చిల్లు పడింది. రెండు వారాల్లో సెన్సెక్స్ 8.3% (6,723 పాయింట్లు) పతనంకాగా.. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో బీఎస్ఈ మార్కెట్ విలువలో రూ. 33.68 లక్షల కోట్లు ఆవిరైంది. వెరసి మార్కెట్ క్యాప్ రూ. 429.82 లక్షల కోట్లు (4.65 ట్రిలియన్ డాలర్లు)కు పరిమితమైంది. -
యుద్ధ సంక్షోభం : రూ. 19 లక్షల కోట్లు ఢమాల్!
Iran War: ప్రపంచవ్యాప్తంగా ఏ ఉపద్రం వచ్చినా, భౌగోళికంగా ఎలాంటి సంక్షోభం తలెత్తినా ముఖ్యంగా యుద్ధం వచ్చిందంటే ముందుగా ప్రభావితమయ్యేది దేశీయ స్టాక్ మార్కెట్లు. తాజాగా ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో మధ్యప్రాచ్య అనిశ్చితి, హార్ముజ్ జలసంధి మూసివేత, చమురు సంక్షోభం భారత మార్కెట్లను తీవ్రంగా దెబ్బతీసింది. ఫలితంగా గత నాలుగేళ్లలో అత్యంత దారుణమైన వారంగా ఈ వారం నిలిచింది. ఈ దారుణ పతనంతో పెట్టుబడిదారులు దాదాపు రూ.19 లక్షల కోట్లు నష్టపోయారు. ఈ అనిశ్చితి ప్రపంచ మార్కెట్లను కూడా బలహీనపరిచిందని, కోలుకోవడానికి కొంత సమయం పట్టవచ్చంటున్నారు విశ్లేషకులు.75వేల దిగువకు సెన్సెక్స్, మార్కెట్ క్యాప్ నష్టంఈ వారం వీకెండ్ శుక్రవారం రోజు సెన్సెక్స్ 1,442 పాయింట్లు కోల్పోయి 75వేల పాయింట్ల (74,592 పాయింట్ల వద్ద ముగిసింది)దిగువకు చేరింది. ఒక రోజులో దాదాపు రూ.9.8 లక్షల కోట్ల సందప తుడిచి పెట్టుకుపోయింది. ఫలితంగా రూ.19 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. మార్కెట్ వాల్యుయేషన్ రూ.430 లక్షల కోట్లకు చేరింది. FIIలు అమ్మకాల భారీగా కొనసాగుతున్నాయి. ఎల్ అండ్ టీ టాటా స్టీల్ , SBI, భారత్ ఎలక్ట్రానిక్స్ , మారుతి టాప్ లూజర్స్‌గా నిలిచాయి. మునుపటి శుక్రవారం అంటే మార్చి 6న బీఎస్సీ సెన్సెక్స్ 78,918 వద్ద ముగిసింది. అప్పటి మార్కెట్ వాల్యుయేషన్ రూ.449.35 లక్షల కోట్లుగా ఉంది.ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి, మార్కెట్లు మొత్తం రూ.25 లక్షల కోట్లను కోల్పోయాయి. ఇదీ చదవండి: మోదీకి, యోగీకి విజ్ఞప్తి : మహిళ సూసైడ్ వీడియో వైరల్నిఫ్టీ నష్టాలు ఇలా..ఇక నిఫ్టీ 468 పాయింట్లు క్షీణించి 23,170 పాయింట్ల వద్ద స్థిరపడింది. జనవరి 5న నమోదైన గరిష్ట స్థాయి 26,373 పాయింట్లు. అంటే 10 శాతం క్షీణించింది. భారత మార్కెట్లు చివరిసారిగా ఈ స్థాయిలో నష్టాలను చవిచూసింది 2022 జూన్‌లో మాత్రమే. బ్రెంట్ ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 102 డాలర్లకు పెరగడం ఈ వారం పెట్టుబడిదారులకు ఒక పీడకల చెప్పవచ్చు.ఇదీ చదవండి: మోజ్తాబా ఖమేనీని ఖతం చేస్తాం.. నెతన్యాహూ సంచలన వ్యాఖ్యలుయుద్ధం చమురు సంక్షోభం- మార్కెట్లు ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. చమురు సరఫరాపై ప్రభావం ముడిచమురు ధరలను అమాంతం పెరిగాయి. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి, మార్కెట్లు మొత్తం రూ.25 లక్షల కోట్లను కోల్పోయాయి. ప్రధాన ఆసియా మార్కెట్లలో, దక్షిణ కొరియా, జపాన్, చైనా , హాంకాంగ్‌ల సూచీలు దిగువన ముగిశాయి. (తీవ్ర గాయాలతో కోమాలో ఖమేనీ? సంచలనంగా బ్రిటీష్ మీడియా కథనాలు) -
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!
శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,470.50 పాయింట్లు లేదా 1.93 శాతం నష్టంతో.. 74,563.92 వద్ద, నిఫ్టీ 468.70 పాయింట్లు లేదా 1.98 శాతం నష్టంతో 23,170.45 వద్ద నిలిచాయి.ఐసీడీఎస్ లిమిటెడ్, కంప్యూకామ్ సాఫ్ట్వేర్ లిమిటెడ్, సుమిత్ వుడ్స్ లిమిటెడ్, సెంట్రమ్ క్యాపిటల్ లిమిటెడ్, బర్న్‌పూర్ సిమెంట్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. కృతిక వైర్స్ లిమిటెడ్, ఎస్ఈపీసీ లిమిటెడ్, అకీ ఇండియా లిమిటెడ్, సూపర్ స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్, లోరెంజిని అప్పారల్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
కరుగుతోన్న ఇన్వెస్టర్ల సంపద
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:26 సమయానికి నిఫ్టీ(Nifty) 217 పాయింట్లు తగ్గి 23,422 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 694 పాయింట్లు దిగజారి 75,357 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.72బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 100.8 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.25 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.52 శాతం పడిపోయింది.నాస్డాక్ 1.78 శాతం నష్టపోయింది.Today Nifty position 13-03-2026(time: 9:26 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
క్రూడ్ మంట.. బేర్ పంజా!
మళ్లీ ముడిచమురు ధరల మంటతోపాటు పశ్చిమాసియాలో యుద్ధ భయాలు పెరగడంతో దేశీ స్టాక్ మార్కెట్లకు వరుసగా రెండో రోజు షాక్ తగిలింది. రోజంతా అమ్మకాలదే పైచేయి కావడంతో మార్కెట్లు నష్టాలలోనే కదిలాయి. ఒక దశలో సెన్సెక్స్ 76,000 పాయింట్ల దిగువకు సైతం పడిపోయింది. బ్రెంట్ చమురు పీపా ధర 10 శాతం ఎగసి 100 డాలర్లను దాటింది.ముంబై: చమురు ధరలకు రెక్కలు రావడంతో మరోసారి దేశీ స్టాక్ మార్కెట్లు దెబ్బతిన్నాయి. సెన్సెక్స్ 829 పాయింట్లు పతనమై 76,034 వద్ద ముగిసింది. ఒక దశలో అమ్మకాలు పెరగడంతో 993 పాయింట్లు నీరసించి 76,000 దిగువన 75,871ను తాకింది. ఇక నిఫ్టీ 228 పాయింట్లు క్షీణించి 23,639 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 23,556కు చేరింది. యుద్ధానికి ముగింపు పలకనున్నట్లు యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించినప్పటికీ దాడులు కొనసాగుతుండటంతో ఇన్వెస్టర్లు ఆందోళనకు లోనవుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. మరోపక్క ముడిచమురు ధరలు సైతం తిరిగి జోరందుకోవడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు తెలియజేశారు. ఆసియా, యూరప్ మార్కెట్ల బలహీనతలు సైతం వీటికి జత కలిసినట్లు వెల్లడించారు. బుధవారం సెన్సెక్స్ 1,342 పాయింట్లు, నిఫ్టీ 395 పాయింట్లు కోల్పోయిన విషయం విదితమే. ఆటో రివర్స్ గేర్ ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఆటో, ఎఫ్ఎంసీజీ ప్రయివేట్ బ్యాంక్స్, రియల్టీ సూచీలు 3–2% మధ్య క్షీణించాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎంఅండ్ఎం, టీఎంపీవీ, ఐషర్, ఎల్అండ్టీ, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, ట్రెంట్, గ్రాసిమ్, టాటా కన్జూమర్, అదానీ పోర్ట్స్, హెచ్‌యూఎల్, అ్రల్టాటెక్, అపోలో హాస్పిటల్స్, ఇండిగో, ఐటీసీ, యాక్సిస్, ఐసీఐసీఐ 4–2 శాతం మధ్య డీలాపడ్డాయి. అయితే కోల్ ఇండియా, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్, జియో ఫైనాన్స్, టెక్ మహీంద్రా, అదానీ ఎంటర్ప్రైజెస్, హిందాల్కో, హెచ్‌సీఎల్ టెక్ 5–0.5 శాతం మధ్య లాభపడ్డాయి. చిన్న షేర్లు డీలా బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6% చొప్పున నీరసించాయి. ట్రేడైన షేర్లలో 2,645 నష్టపోగా.. 1,598 బలపడ్డాయి.రూ. 23.44 లక్షల కోట్లు హుష్‌కాకి పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులకు బీజం పడ్డాక దేశీ స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో ఫిబ్రవరి 28 మొదలు ఇప్పటివరకూ మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 5,253 పాయింట్లు(6.5 శాతం) క్షీణించింది. అయితే అన్ని రంగాలలోనూ అమ్మకాలు కొనసాగుతుండటంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల విలువ రూ. 23.44 కోట్లమేర హరించుకుపోయింది. వెరసి బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ.4,40,06,434 కోట్ల (4.77 ట్రిలియన్ డాలర్లు)కు పరిమితమైంది.రికార్డ్ కనిష్టానికి రూపాయి 24 పైసలు క్షీణతతో 92.25కుచమురు ధరల సెగ మరోసారి దేశీ కరెన్సీని దెబ్బతీసింది. డాలరుతో మారకంలో రూపాయి 24 పైసలు క్షీణించి 92.25 వద్ద ముగిసింది. వెరసి ఇంతక్రితం ఈ నెల 9న నమోదైన సరికొత్త కనిష్టం 92.21ను తుడిచి పెట్టింది. కాగా, ఇంట్రాడేలో 92.36 వద్ద తాజాగా చరిత్రాత్మక కనిష్టాన్ని తాకింది.కిచెన్ అప్లయెన్సెస్ షేర్ల జోరుఇండక్షన్ కుక్‌టాప్, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లకు భారీ గిరాకీఅమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం కార ణంగా చమురు ధరల మంటకుతోడు.. గ్యాస్ రవాణా నిలిచిపోవడంతో దేశీయంగా కిచెన్ అప్లయెన్సెస్‌కు ఉన్నట్టుండి డిమాండ్ పెరిగింది. ఇండక్షన్ కుక్‌టాప్, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లకు భారీ గిరాకీ ఏర్పడటంతో వరుసగా మూడో రోజు కిచెన్ అప్లయెన్సెస్ త యారీ కంపెనీల కౌంటర్లు వెలుగులో నిలిచా యి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో తాజాగా జైపాన్ ఇండస్ట్రీస్ 14 శాతం, టీటీకే ప్రెస్టీజ్ 8.3 శాతం చొప్పున జంప్‌చేశాయి. బజాజ్ ఎలక్ట్రికల్స్, వీగార్డ్ 1.5 శాతం మధ్య లాభపడ్డాయి. గత మూడు(9–11) రోజుల్లో బటర్‌ఫ్లై, టీటీకే, స్టవ్‌క్రాఫ్ట్ 35 శాతానికిపైగా దూసుకెళ్లిన విషయం విదితమే. రెస్టారెంట్లకు సెగఎల్పీజీ కొరత నేపథ్యంలో రెస్టారెంట్ కౌంటర్లు అమ్మకాలు ఎదుర్కొంటున్నాయి. యునైటెడ్ ఫుడ్‌బ్రాండ్స్ 7 శాతం, వెస్ట్‌లైఫ్ ఫుడ్‌వరల్డ్ 3 శాతం, జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ 2 శాతం క్షీణించగా.. రెస్టారెంట్ బ్రాండ్స్, ఎటర్నల్, స్విగ్గీ 1 శాతం చొప్పున డీలా పడ్డాయి. ఐటీసీ హోటల్స్ 2.4 శాతం క్షీణించి రూ. 158కు చేరింది. ఇది ఏడాది కనిష్టంకాగా.. లెమన్ ట్రీ హోటల్స్ రూ. 101 వద్ద, స్విగ్గీ రూ. 271 వద్ద 52 వారాల కనిష్టాన్ని తాకాయి. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం నష్టాల్లో మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 829.29 పాయింట్ల నష్టంతో 76,034.42 వద్ద, నిఫ్టీ 227.70 పాయింట్ల నష్టంతో 23,639.15 వద్ద నిలిచాయి.ఐసీడీఎస్ లిమిటెడ్, రీగాల్ రిసోర్సెస్ లిమిటెడ్, డీసీఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, కాన్ఫిడెన్స్ పెట్రోలియం ఇండియా లిమిటెడ్, ఉషా మార్టిన్ ఎడ్యుకేషన్ & సొల్యూషన్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ప్రజయ్ ఇంజనీర్స్ సిండికేట్ లిమిటెడ్, క్రియేటివ్ ఐ లిమిటెడ్, అవాన్మోర్ క్యాపిటల్ & మేనేజ్మెంట్ సర్వీసెస్ లిమిటెడ్, అక్యూస్ లిమిటెడ్, కేంబ్రిడ్జ్ టెక్నాలజీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
మార్కెట్ సూచీలు నేల చూపు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:33 సమయానికి నిఫ్టీ(Nifty) 255 పాయింట్లు తగ్గి 23,606 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 809 పాయింట్లు దిగజారి 76,045 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.51బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 100.92 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.23 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.08 శాతం పడిపోయింది.నాస్డాక్ 0.08 శాతం పెరిగింది.Today Nifty position 12-03-2026(time: 9:34 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఆసియా మార్కెట్లు ఢమాల్..
అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు నేడు భారత స్టాక్ మార్కెట్‌ను కుదిపేసేలా కనిపిస్తున్నాయి. నేడు (గురువారం) ట్రేడింగ్ ప్రారంభానికి ముందే గ్లోబల్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా ఆసియా స్టాక్ మార్కెట్ సూచీలు భారీ పతనం దిశగా పయనిస్తుండటంతో మన దేశీయ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు నేడు గ్యాప్ డౌన్‌తో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఆసియా మార్కెట్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. జపాన్ సూచీ నిక్కీ, కోస్పీ-దక్షిణ కొరియా మార్కెట్, గిఫ్ట్ నిఫ్టీ.. వంటి ముందస్తు దిక్సూచిగా భావించే సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇది భారత మార్కెట్లు కనీసం 1.5% నుంచి 2% నష్టంతో ప్రారంభమవుతాయని సూచిస్తోంది.మార్కెట్ల పతనానికి ప్రధాన కారణాలుఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ కూటమి మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు మార్కెట్లను భయపెడుతున్నాయి. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి గుండా చమురు రవాణా నిలిచిపోవచ్చనే వార్తలు ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తున్నాయి.యుద్ధ భయాలతో బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కసారిగా భారీగా పెరిగింది. భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఇది ద్రవ్యోల్బణ ముప్పుగా పరిణమించనుంది.గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) షేర్ల ర్యాలీకి బ్రేక్ పడింది. టెక్ దిగ్గజాల వాల్యుయేషన్లపై అనుమానాలు మొదలవడంతో అంతర్జాతీయ స్థాయిలో టెక్ షేర్లను ఇన్వెస్టర్లు వదిలించుకుంటున్నారు.భారత మార్కెట్‌పై ప్రభావం ఎలా ఉండబోతోంది?నిపుణుల అంచనా ప్రకారం.. మార్కెట్ అవర్స్‌లో బ్యాంక్ నిఫ్టీ, ఐటీ రంగాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. ఎఫ్ఐఐలు పెద్ద ఎత్తున నిధులను ఉపసంహరించుకునే అవకాశం ఉంది. మార్కెట్లు పడిపోతున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో నేడు బంగారం పెరిగే అవకాశం ఉంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మరింత బలహీనపడవచ్చు.‘ప్రస్తుత అస్థిరత నేపథ్యంలో రిటైల్ ఇన్వెస్టర్లు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మార్కెట్ స్థిరపడే వరకు వేచి చూడటం లేదా నాణ్యమైన షేర్లలో దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం ఈ పతనాన్ని అవకాశంగా మార్చుకోవడం ఉత్తమం’ అని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: చమురు, గ్యాస్.. తర్వాత దీని వంతే! -
పడగొట్టిన పశ్చిమాసియా
ముంబై: యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ పశ్చిమాసియాలో యుద్ధానికి త్వరలోనే ముగింపు పలకనున్నట్లు చేసిన ప్రకటనపై స్టాక్ మార్కెట్లు ఒక్క రోజులోనే విశ్వాసాన్ని కోల్పోయాయి. మరోపక్క ముడిచమురు ధరలు సైతం తిరిగి జోరందుకోవడంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరిగాయి. వెరసి సెన్సెక్స్ 1,342 పాయింట్లు పతనమైంది. 76,864 వద్ద ముగిసింది. నిఫ్టీ 395 పాయింట్లు కోల్పోయి 23,867 వద్ద నిలిచింది. దీంతో బీఎస్ఈ మార్కెట్ విలువలో రూ. 5.14 లక్షల కోట్లు ఆవిరైంది. తొలుత ఆసియా మార్కెట్ల సానుకూలతలతో స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు చమురు ధరల సెగతో వెనువెంటనే డీలా పడ్డాయి. ఉదయం లండన్ మార్కెట్లలో బ్రెంట్ చమురు ధర పీపాకు 6 శాతం ఎగసింది. 93 డాలర్లకు చేరింది. యూరోపియన్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభంకావడంతో మిడ్‌సెషన్ నుంచీ సెంటిమెంటు మరింత బలహీనపడింది. ఫలితంగా సమయం గడిచేకొద్దీ అమ్మకాలు పెరిగిపోయాయి. దీంతో చివర్లో సెన్సెక్స్ 1,447 పాయింట్లు పడిపోయి 76,759ను తాకగా.. నిఫ్టీ 23,834వరకూ క్షీణించింది. ఫైనాన్స్, ఆటో వీక్..: ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఆటో, బ్యాంకింగ్, రియల్టీ, కెమికల్స్, ఐటీ, ఎఫ్ఎంసీజీ 3–1% మధ్య నష్టపోయాయి. నిఫ్టీ దిగ్గజాలలో బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్, బజాజ్ ఫిన్సర్వ్, ఐషర్, బజాజ్ ఆటో, కొటక్ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ, మారుతీ, శ్రీరామ్ ఫైనాన్స్, ట్రెంట్, టీఎంపీవీ, టీసీఎస్, ఎయిర్టెల్ 5–2% మధ్య డీలాపడ్డాయి..గ్యాస్, జల్ జీవన్ పుష్.. గ్యాస్ కొరత ప్రభావంతో అదానీ టోటల్ గ్యాస్ 18 శాతం ఎగసింది, ఇండక్షన్ స్టవ్‌లకు డిమాండ్ పెరగడంతో టీటీకే ప్రెస్టీజ్, స్టవ్‌క్రాఫ్ట్ షేర్లు 12 శాతం చొప్పున జంప్‌చేశాయి. కేంద్ర ప్రభుత్వం జల్‌జీవన్ మిషన్‌కు మరింత మద్దతివ్వడంతో శక్తి పంప్స్, రోటో పంప్స్, జైన్ ఇరిగేషన్, జిందాల్ సా, ఎన్విరో ఇన్ఫ్రా, ఇండియన్ హ్యూమ్ పైప్, ఎస్పీఎంఎల్ తదితరాలు 20–13 శాతం మధ్య దూసుకెళ్లాయి.సెడెమాక్ లిస్టింగ్ భేష్ పతన మార్కెట్లోనూ ఆటో విడిభాగాల(పవర్‌ట్రెయిన్ కంట్రోల్స్) తయారీ కంపెనీ సెడెమాక్ మెకట్రానిక్స్ లాభాలతో లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 1,352తో పోలిస్తే ఎన్ఎస్ఈలో రూ. 1,535 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఇది 13.5 శాతం అధికం కాగా.. బీఎస్ఈలో 12 శాతం లాభంతో రూ. 1,510 వద్ద లిస్టయ్యింది. చివరికి 7.4 శాతం బలపడి రూ. 1,452 వద్ద ముగిసింది. -
స్టాక్ మార్కెట్లో ‘బ్లడ్ బాత్’
దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం భారీ నష్టాల్లో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ ఏకంగా 394 పాయింట్లు నష్టపోయి 23,866 వద్దకు చేరింది. సెన్సెక్స్ 1342 పాయింట్లు దిగజారి 76,863 వద్దకు చేరింది. దీంతో మార్కెట్లో ఈ ఒక్కరోజే దాదాపు రూ.8 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైనట్లు అయింది.అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, పెరుగుతున్న ముడిచమురు ధరలు దేశీయ మార్కెట్లను కుదిపేశాయి. ఈరోజు (మార్చి 11, 2026) ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్, నిఫ్టీలు భారీ పతనాన్ని చవిచూశాయి. ప్రధానంగా ఎనర్జీ, బ్యాంకింగ్, ఐటీ రంగాల్లో వెల్లువెత్తిన అమ్మకాల ఒత్తిడి సూచీలను పాతాళానికి నెట్టింది.సూచీల పతనానికి ప్రధాన కారణాలుఇంధన సంక్షోభం: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ అతలాకుతలమైంది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హార్ముజ్ జలసంధి మూసివేత భయాలు మార్కెట్‌ను భయపెట్టాయి. బ్రెంట్ క్రూడ్ ధర పెరుగుతోంది. భారత్ లాంటి చమురు దిగుమతి దేశానికి పెద్ద దెబ్బగా మారింది.ఎనర్జీ సెక్టార్లో అమ్మకాలు: ముడిచమురు ధరల పెరుగుదల వల్ల ముడి పదార్థాల వ్యయం పెరుగుతుందన్న ఆందోళనతో ఎనర్జీ ఇండెక్స్ ఏకంగా కుప్పకూలింది.ఎఫ్ఐఐల విక్రయాలు: విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ అనిశ్చితి వల్ల వారు సురక్షితమైన బాండ్లు, బంగారం వైపు మళ్లుతుండటంతో దేశీయ మార్కెట్లలో లిక్విడిటీ తగ్గిపోతోంది.రూపాయి రికార్డు పతనం: చమురు దిగుమతుల కోసం డాలర్లకు డిమాండ్ పెరగడం, ఎఫ్ఐఐల నిష్క్రమణతో రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే రికార్డు స్థాయిలో పడిపోయింది. ఇది దిగుమతి చేసుకునే వస్తువుల ధరలను పెంచి, దేశీయ ద్రవ్యోల్బణానికి దారితీస్తుందన్న భయం నెలకొంది.కీలక రంగాలు పతనం: బ్యాంకింగ్, ఐటీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగాలు రెడ్ మార్క్‌లో ట్రేడయ్యాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ వంటి హెవీ వెయిట్ ఉన్న షేర్లు నష్టపోవడం సూచీల పతనానికి ఆజ్యం పోసింది.ప్రస్తుతానికి మార్కెట్ అనిశ్చితిలో ఉంది. నిఫ్టీకి 23,700 వద్ద కీలక సపోర్ట్ ఉంది. ఒకవేళ యుద్ధ పరిస్థితులు సద్దుమణిగి, చమురు ధరలు తగ్గితే తప్ప తక్షణ రికవరీ కష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు. రిటైల్ ఇన్వెస్టర్లు ఈ అస్థిర సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా, నాణ్యమైన షేర్లలో సిప్ పద్ధతిని కొనసాగించడం శ్రేయస్కరమని సూచిస్తున్నారు.ఇదీ చదవండి: రీఛార్జ్ ముగిస్తే ఇన్కమింగ్ కాల్స్ ఎందుకు ఆపేస్తారు? -
స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్వల్ప నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:33 సమయానికి నిఫ్టీ(Nifty) 43 పాయింట్లు తగ్గి 24,221 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 182 పాయింట్లు దిగజారి 77,988 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.82బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 87.65 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.14 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.21 శాతం పడిపోయింది.నాస్డాక్ 0.01 శాతం పెరిగింది.Today Nifty position 11-03-2026(time: 9:35 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
క్రూడ్ కూల్.. బుల్ చల్!
వారం రోజులుగా భగభగలాడి చప్పున చల్లారిన చమురు ధరలతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్ అయ్యాయి. ఆసియా, యూరోపియన్ మార్కెట్లు 2 శాతంపైగా బలపడటంతో దేశీయంగానూ ఇండెక్సులు జోరందుకున్నాయి. వెరసి ఒక దశలో సెన్సెక్స్ 960 పాయింట్లు జంప్‌చేసింది.ముంబై: పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ధ సంక్షోభం త్వరలోనే ముగియనున్న అంచనాలకుతోడు.. ముడిచమురు ధరలు ఒక్కసారిగా చల్లబడటంతో ప్ర పంచవ్యాప్తంగా సెంటిమెంటు మెరుగుపడింది. దీంతో తొలి నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో నేలక్కొట్టిన బంతిలా మార్కెట్లు పైకెగశాయి. సెన్సెక్స్ 640 పాయింట్లు జంప్‌చేసి 78,206 వద్ద ముగిసింది. నిఫ్టీ 234 పాయింట్లు జమ చేసుకుని 24,262 వద్ద స్థిరపడింది. ఆసియా, యూరప్ మార్కెట్లు 5–2 శాతం మధ్య పుంజుకోవడంతో ఇన్వెస్టర్లకు జోష్‌వచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 960 పాయింట్లు ఎగసి 78,526ను తాకగా.. నిఫ్టీ 24,303వరకూ బలపడింది. ఐటీ డీలా ఎన్ఎస్ఈలో ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్(0.4 శాతం)మినహా మిగిలిన అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా ముందురోజు పతనమైన ఆటో, బ్యాంకింగ్, కన్జూమర్ డ్యూరబుల్స్, కెమికల్స్ 3–1.6 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో శ్రీరామ్ ఫైనాన్స్ 8 శాతం దూసుకెళ్లగా.. ఇండిగో, ఎంఅండ్ఎం, ఐషర్, టీఎంపీవీ, ఐసీఐసీఐ, మారుతీ, యాక్సిస్, అల్ట్రాటెక్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, ఎస్బీఐ లైఫ్, జేఎస్‌డబ్ల్యూ 3.5–2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. బ్లూచిప్స్‌లో ఇన్ఫోసిస్, ఎటర్నల్, రిలయన్స్, ఎయిర్టెల్, టీసీఎస్ మాత్రమే ప్రస్తావించదగ్గ స్థాయిలో 1.4–0.4 శాతం మధ్య నీరసించాయి. చల్లారిన చమురు...ఉదయం సెషన్లో లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు పీపా ధర 9 శాతం పతనమై 90 డాలర్లకు చేరగా.. న్యూయార్క్‌లో లైట్ స్వీట్ చమురు బ్యారల్ 87 డాలర్లకు దిగివచ్చింది. ఫలితంగా ఏవియేషన్, ఆటో, బ్యాంకింగ్ తదితర రంగాల కౌంటర్లకు డిమాండ్ పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. పశి్చమాసియా ఆందోళనలకు త్వరలోనే ముగింపు పలకనున్నట్లు యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించడంతో సెంటిమెంటుకు ప్రోత్సా హం లభించినట్లు తెలియజేశారు. దీంతో బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ మరింత అధికంగా 2 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 3,053 లాభపడితే.. 1,231 మాత్రమే డీలా పడ్డాయి. ఎఫ్‌పీఐల వెనకడుగు ఇటీవల దేశీ స్టాక్స్‌లో అమ్మకాలకే మొగ్గు చూపుతున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) నగదు విభాగంలో తాజాగా రూ. 4,673 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. దేశీ ఫండ్స్ (డీఐఐలు) మాత్రం రూ. 6,333 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 6346 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 9,014 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ నెల తొలి నాలుగు రోజుల్లో(2–6)నూ ఎఫ్‌పీఐలు రూ. 21,000 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించడం గమనార్హం.రూపాయి రయ్.. 36 పైసలు అప్– 91.85కు చమురు ధరలు దిగిరావడంతో దేశీ కరెన్సీకి జోష్ వచ్చింది. డాలరుతో మారకంలో 36 పైసలు బలపడింది. వెరసి చరిత్రాత్మక కనిష్టం 92.21 నుంచి కోలుకుని 92 దిగువన 91.85 వద్ద ముగిసింది. రోజంతా 91.71– 92.19 మధ్య ఊగిసలాడింది. సోమవారం 39 పైసలు క్షీణించి 92.21 వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ సైతం 0.5 శాతం క్షీణించి 98.65కు చేరింది.ఎరువుల షేర్లకు బలిమి గ్యాస్ కేటాయింపులలో ఎల్పీజీ, సీఎన్జీ, పీఎన్జీ తదుపరి ఎరువులకు ద్వితీయ ప్రాధాన్యతనిస్తున్నట్లు కేంద్రం ప్రకటించడంతో ఫెర్టిలైజర్ కౌంటర్లకు ఒక్కసారిగా డిమాండ్ పుట్టింది. దీంతో రాష్ర్టీయ కెమికల్స్(ఆర్సీఎఫ్) 16%, నేషనల్ ఫెర్టిలైజర్స్(ఎన్ఎఫ్ఎల్) 13%, దీపక్ ఫెర్టిలైజర్స్, పారదీప్ ఫాస్ఫేట్స్, చంబల్ ఫెర్టిలైజర్స్ 5%, కోరమాండల్ ఇంటర్నేషనల్ 4% చొప్పున దూసుకెళ్లాయి. -
స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్
మంగళవారం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 639.82 పాయింట్లు లేదా 0.82 శాతం లాభంతో 78,205.98 వద్ద, నిఫ్టీ 233.55 పాయింట్లు లేదా 0.97 శాతం లాభంతో 24,261.60 వద్ద నిలిచాయి.ఆటమ్ ఇన్వెస్ట్మెంట్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, ది ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ లిమిటెడ్, డీసీఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ లిమిటెడ్, ఫుడ్స్ & ఇన్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. హిందూస్తాన్ ఆయిల్ ఎక్స్‌ప్లోరేషన్ కంపెనీ లిమిటెడ్, ఆంటెలోపస్ సెలాన్ ఎనర్జీ లిమిటెడ్, డీసీఎం నౌవెల్ లిమిటెడ్, అక్షర్‌కెమ్ (ఇండియా) లిమిటెడ్, పాలీక్యాబ్ ఇండియా లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
నష్టాలకు బ్రేక్.. లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:45 సమయానికి నిఫ్టీ(Nifty) 92 పాయింట్లు పెరిగి 24,127 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 334 పాయింట్లు ఎగబాకి 77,905 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.91బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 93.87 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.11 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.83 శాతం పుంజుకుంది.నాస్డాక్ 1.38 శాతం పెరిగింది.Today Nifty position 10-03-2026(time: 9:46 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మార్కెట్ పై క్రూసేడ్!
విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరలు భగ్గుమనడంతో దేశీయంగా అమ్మకాలు వెల్లువెత్తాయి. పశ్చిమాసియాలో చమురు క్షేత్రాలపై దాడులతో చమురు ధరలు తొలుత పీపాకు 30 శాతంపైగా ఎగశాయి. దీంతో ప్రారంభంలో 2,494 పాయింట్లకుపైగా పడిపోయిన సెన్సెక్స్ చివరికి 1,353 పాయింట్లు కోల్పోయి 77,566 వద్ద ముగిసింది. మొదట్లో 753 పాయింట్లు పతనమైన నిఫ్టీ సైతం.. చివరికి 422 పాయింట్ల క్షీణతతో 24,028 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 76,425 దిగువకు చేరగా.. నిఫ్టీ 23,698 వద్ద కనిష్టాన్ని తాకింది. దీంతో ఒక్క రోజులో బీఎస్ఈ మార్కెట్ విలువలో రూ. 8 లక్షల కోట్లకుపైగా ఆవిరైంది. ధరల మంట... లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ ధర ఉదయం 120 డాలర్లను తాకింది. న్యూయార్క్‌లో లైట్ స్వీట్ క్రూడ్ సైతం 119.5 డాలర్లకు చేరడంతో ఇన్వెస్టర్లలో ఒక్కసారిగా ఆందోళనలు తలెత్తాయి. వెరసి దాదాపు అన్ని రంగాలలోనూ అమ్మకాలకు పరుగుతీశారు. అయితే మిడ్‌సెషన్‌కల్లా చమురు ధరలు కాస్త ఉపశమించాయి. మరోపక్క యూఎస్ మార్కెట్ల ఫ్యూచర్స్ నష్టాలు సైతం సగానికి తగ్గాయి. దీంతో దేశీ స్టాక్ మార్కెట్లలో కొంతమేర రికవరీ కనిపించింది. గత వారం నైమెక్స్ క్రూడ్ 36 శాతం, బ్రెంట్ 28 శాతం జంప్ చేయడం తెలిసిందే. అమ్మకాల షాక్: ఎన్ఎస్ఈలో ఐటీ నష్టపోకుండా నిలదొక్కుకోగా.. ఆటో, పీఎస్‌యూ, ప్రయివేట్ బ్యాంక్స్, మెటల్, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్అండ్ గ్యాస్, కెమికల్స్ 4–2% మధ్య పడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో అల్ట్రాటెక్, టీఎంపీపీ, మారుతీ, ఎంఅండ్ఎం, ఐషర్, బజాజ్ ఆటో, ఓఎన్జీసీ, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, జేఎస్‌డబ్ల్యూ, కొటక్ బ్యాంక్ 5.3–3.5% మధ్య పతనమయ్యాయి. అయితే విప్రో, ఆర్ఐఎల్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్ 1.6–0.6 మధ్య బలపడ్డాయి. చిన్న షేర్లు డీలా బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 2 శాతంపైగా నీరసించాయి. చమురు మంటతో టైర్లు, ఆటోమొబైల్, పెయింట్లు, ఎయిర్‌లైన్స్, ఎఫ్ఎంసీజీ తదితర రంగాలపై ప్రతికూల ప్రభావం పడనున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. ధరలకు రెక్కలురానుండటంతో ఆర్బీఐ కఠినతర విధానాలవైపు మొగ్గు చూపవలసి వస్తుందని తెలియజేశారు. దీంతో బ్యాంకింగ్ కౌంటర్లు సైతం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నట్లు వివరించారు. ఆసియా, యూరప్ మార్కెట్లు సైతం బలహీనపడటం సెంటిమెంటును దెబ్బతీసినట్లు పేర్కొన్నారు. చమురు సెగతో చమురు దెబ్బకు ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజాలు బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐవోసీ 6–4.3% మధ్య పడిపోయాయి. షాలిమార్, ఇండిగో, ఏషియన్, నెరోలాక్, బెర్జర్ పెయింట్స్ 4–2% మధ్య, జేకే, సియట్, ఎంఆర్ఎఫ్, అపోలో టైర్స్ 6–2% మధ్య క్షీణించాయి. ఏటీఎఫ్ వ్యయాలపై భయాలతో ఇంటర్‌గ్లోబ్ 4 శాతం పడింది.ఎఫ్‌పీఐల భారీ అమ్మకాలుయుద్ధ భయాలతో ఇటీవల దేశీ స్టాక్స్‌లో అమ్మకాల యూటర్న్ తీసుకున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నగదు విభాగంలో తాజాగా రూ. 6346 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. అయితే దేశీ ఫండ్స్ (డీఐఐలు) రూ. 9,014 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. కాగా.. ఈ నెల తొలి నాలుగు రోజుల్లో(2–6)నూ ఎఫ్‌పీఐలు రూ. 21,000 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించడం గమనార్హం. -
పేకమేడల్లా కుప్పకూలిన సూచీలు.. కారణాలు
దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 449 పాయింట్లు నష్టపోయి 24,001 వద్దకు చేరింది. సెన్సెక్స్ 1424 పాయింట్లు దిగజారి 77,494 వద్దకు చేరింది.భారత స్టాక్ మార్కెట్లో సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే సూచీలు పేకమేడల్లా కూలిపోయాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల పెరుగుదల సెన్సెక్స్, నిఫ్టీలను పాతాళానికి నెట్టేశాయి. కేవలం ఒక్క రోజులోనే ఇన్వెస్టర్లు దాదాపు ఒకనొక సమయంలో రూ.13 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు.మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలుగత వారాంతంలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్ కాల్పుల విరమణకు నిరాకరించడం, యుద్ధం సుదీర్ఘంగా కొనసాగే సూచనలు కనిపిస్తుండటంతో గ్లోబల్ మార్కెట్లలో రిస్క్ సెంటిమెంట్ పెరిగింది.యుద్ధ భయాలతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఏకంగా 26% పెరిగింది. భారత్ తన చమురు అవసరాల్లో 85% దిగుమతులపైనే ఆధారపడుతున్న నేపథ్యంలో ఈ ధరల పెరుగుదల ద్రవ్యోల్బణాన్ని పెంచి దేశ ఆర్థిక వ్యవస్థపై భారం మోపుతుందనే ఆందోళన ఇన్వెస్టర్లను కలవరపెట్టింది.డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ 92.33 కనిష్ట స్థాయికి పడిపోయింది. విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం రూపాయిపై ఒత్తిడిని పెంచింది.అమెరికాలో 10 ఏళ్ల బాండ్ యీల్డ్స్ 4.20% స్థాయికి చేరడం, డాలర్ ఇండెక్స్ బలపడటం వల్ల అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుంచి పెట్టుబడులు సురక్షితమైన అమెరికా బాండ్ల వైపు మళ్లుతున్నాయి.వడ్డీ రేట్లు తగ్గుతాయనే ఆశలు ఆవిరి కావడంతో బ్యాంకింగ్ స్టాక్స్ కుదేలయ్యాయి.ఇదీ చదవండి: ‘చైనాతో చేసిన పొరపాటు భారత్‌తో చేయం’ -
స్టాక్ మార్కెట్ క్రాష్.. రూ.12 లక్షల కోట్లు ఆవిరి!
గత వారం నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. సోమవారం ఉదయం కుప్పకూలాయి. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ కూడా దాదాపు 3% పడిపోయాయి. సెన్సెక్స్ దాదాపు 2,400 పాయింట్లు పడిపోయి 76,424కి చేరుకోగా, నిఫ్టీ 700 పాయింట్లకు పైగా పడిపోయి 23,750కి చేరుకుంది.బీఎస్ఇలో జాబితా చేసిన అన్ని కంపెనీల మొత్తం.. మార్కెట్ క్యాపిటలైజేషన్ నుంచి ప్రారంభమైన 10 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలోనే రూ.12.39 లక్షల కోట్లకు పైగా తుడిచిపెట్టుకుపోయింది. సెన్సెక్స్‌లోని అన్ని భాగాలు నష్టాల్లో కూరుకున్నాయి. ఇండిగో షేర్లు దాదాపు 8% నష్టపోయాయి. టాటా స్టీల్, ఎల్ అండ్ టి, ఎస్బీఐ, మారుతి సుజుకి & ఎటర్నల్ షేర్లు వరుసగా 5% నష్టపోయాయి.ఎన్ఎస్ఈలో నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 5% కంటే ఎక్కువ పడిపోయి భారీ నష్టాన్ని చవిచూసింది. నిఫ్టీ ఆటో దాదాపు 4% పడిపోయింది, నిఫ్టీ రియాలిటీ అండ్ నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ సూచీలు ఒక్కొక్కటి 3% పైగా పడిపోయాయి.పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణలు ప్రపంచం ఇంధన సరఫరాకు తీవ్ర ఆటంకాన్ని కలిగిస్తున్నాయి. దీంతో చమురు ధరలు భారీగా పెరిగాయి. తాజాగా బ్యారెల్ ముడిచమురు ధర 100 డాలర్ల మార్క్ దాటేసింది. మూడున్నర సంవత్సరాల కాలంలో ఒక బ్యారెల్ ధర ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇలాంటి సమయంలో ధరల పెరుగుదల శాశ్వతం కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. -
బేర్మన్న స్టాక్ మార్కెట్లు.. నష్టాల్లో ప్రారంభం!
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.20 గంటలకు సెన్సెక్స్ 2,284.27 పాయింట్లు లేదా 2.89 శాతం నష్టంతో 76,634.63 వద్ద, నిఫ్టీ 703.35 పాయింట్లు లేదా 2.88 శాతం నష్టంతో 23,747.10 వద్ద సాగుతున్నాయి.క్యుపిడ్ లిమిటెడ్, కంట్రీ క్లబ్ హాస్పిటాలిటీ & హాలిడేస్ లిమిటెడ్, శ్రీ హవిషా హాస్పిటాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, శేషసాయి టెక్నాలజీస్ లిమిటెడ్, ఆంటెలోపస్ సెలాన్ ఎనర్జీ లిమిటెడ్ టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. జింకుశల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ లిమిటెడ్, ట్రిజిన్ టెక్నాలజీస్ లిమిటెడ్, నోయిడా టోల్ బ్రిడ్జ్ కంపెనీ లిమిటెడ్, మీషో లిమిటెడ్ సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:35 సమయానికి నిఫ్టీ(Nifty) 101 పాయింట్లు నష్టపోయి 24,659 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 353 పాయింట్లు పడిపోయి 79,662 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.96బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 84.51 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.13 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.56 శాతం పడిపోయింది.నాస్డాక్ 0.26 శాతం నష్టపోయింది.Today Nifty position 06-03-2026(time: 9:35 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మార్కెట్లకు జోష్.. భారీ లాభాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ!
దేశీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి సెన్సెక్స్ 811.21 పాయింట్లు (1.03 శాతం) పెరిగి 79,927.40 వద్ద, నిఫ్టీ 285.40 పాయింట్లు (1.17 శాతం) పెరిగి 24,765.90 వద్ద నిలిచాయి.ఎల్గీ రబ్బర్ కంపెనీ లిమిటెడ్, మోడరన్ థ్రెడ్స్ (ఇండియా) లిమిటెడ్, సెంచరీ ఎక్స్‌ట్రూషన్స్ లిమిటెడ్, ఆకాష్ ఎక్స్‌ప్లోరేషన్ సర్వీసెస్ లిమిటెడ్, ఇంటిగ్రే ఎసెన్షియా లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. అక్విలాన్ నెక్సస్ లిమిటెడ్, పిఎన్‌జిఎస్ రేవా డైమండ్ జ్యువెలరీ లిమిటెడ్, ఆర్చాస్ప్ లిమిటెడ్, ఇన్ఫోబీన్స్ టెక్నాలజీస్ లిమిటెడ్, శ్రద్ధ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.స్టాక్ మార్కెట్స్ పెరగడానికి కారణంభారతీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పెరగడానికి ప్రధాన కారణం.. ఇరాన్ తన న్యూక్లియర్ ప్రోగ్రామ్ వదిలివేయడానికి కొన్ని షరతులతో సిద్ధంగా ఉందని వదంతులు రావడమే. దీంతో అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గవచ్చని భావించి పెట్టుబడిదారులు మార్కెట్లో కొనుగోళ్లు పెంచారు.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
స్టాక్ మార్కెట్ సూచీల దారెటు?
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ(Nifty) 117 పాయింట్లు పెరిగి 24,596 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 375 పాయింట్లు పుంజుకొని 79,502 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 05-03-2026(time: 9:26 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
దలాల్ స్ట్రీట్‌లో నెత్తురోడిన సూచీలు! ఎందుకీ పరిస్థితి?
పశ్చిమ ఆసియాలో నెలకొన్ని యుద్ధ మేఘాల సెగ భారత స్టాక్ మార్కెట్లను చేరింది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ముదురుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తుండగా ఇటీవల దేశీయ మార్కెట్లు భారీ పతనాన్ని మూటగట్టుకున్నాయి. నిన్న ఒక్క రోజే ఇన్వెస్టర్ల సంపద సుమారు రూ.8.75 లక్షల కోట్లు ఆవిరైపోయింది.బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి మార్కెట్ పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. సెన్సెక్స్ 1,122.66 పాయింట్లు (1.40%) నష్టపోయి 79,116.19 వద్ద స్థిరపడింది. ఒక దశలో ఇది 1,795 పాయింట్ల వరకు పడిపోవడం గమనార్హం. నిఫ్టీ 385.20 పాయింట్లు (1.55%) కోల్పోయి 24,480.50 వద్ద ముగిసింది. రంగాల వారీగా ఎనర్జీ సెక్టార్‌కు చెందిన షేర్లు అత్యధికంగా 14.90% పతనమయ్యాయి. రియల్టీ, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్ సూచీలు కూడా 3% పైగా నష్టపోయాయి.మార్కెట్లు ఎందుకు కుప్పకూలాయి?ముడి చమురు సెగ: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మూతపడటం మార్కెట్లను భయపెట్టింది. బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కసారిగా బ్యారెల్‌కు 82 డాలర్లకు చేరింది. చమురు ధరలు పెరిగితే భారత్ లాంటి దేశాల్లో ద్రవ్యోల్బణం పెరిగి, కరెంట్ అకౌంట్ లోటు పెరిగే ప్రమాదం ఉంది.రూపాయి రికార్డు పతనం: అంతర్జాతీయ అనిశ్చితి వల్ల డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఆల్‌టైమ్ కనిష్టానికి (92.17) పడిపోయింది. ఇది దిగుమతులపై భారాన్ని పెంచుతోంది.ఎఫ్ఐఐల అమ్మకాలు: విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. గత మూడు సెషన్లలోనే దాదాపు రూ.14,400 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.ఆసియా మార్కెట్ల ప్రభావం: జపాన్ నిక్కీ, దక్షిణ కొరియా కోస్పి వంటి ఇతర ఆసియా మార్కెట్లు కూడా భారీ నష్టాల్లో ఉండటం దేశీయ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.ఇన్వెస్టర్లు, ట్రేడర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలుఇలాంటి సంక్షోభ సమయాల్లో భావోద్వేగాలకు లోనై నిర్ణయాలు తీసుకోవడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.భయం వద్దు.. మార్కెట్లు పడిపోగానే కంగారుపడి క్వాలిటీ షేర్లను విక్రయించకూడదు. యుద్ధం వంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తాత్కాలికమే. చరిత్రను పరిశీలిస్తే ఇలాంటి పతనం తర్వాత మార్కెట్లు మరింత బలంగా పుంజుకున్నాయి.సిప్ కొనసాగిచాలి: మార్కెట్ కనిష్టాల్లో ఉన్నప్పుడు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు ఎక్కువ యూనిట్లు లభిస్తాయి. దీనివల్ల రూపీ కాస్ట్ యావరేజింగ్ ప్రయోజనం చేకూరుతుంది.నగదు నిల్వలు: పోర్ట్‌ఫోలియోలో కొంత భాగాన్ని నగదు రూపంలో ఉంచుకోవడం మంచిది. మంచి షేర్లు తక్కువ ధరలో లభించినప్పుడు కొనుగోలు చేయడానికి ఇది మీకు ఒక అవకాశం ఇస్తుంది.స్టాప్ లాస్ తప్పనిసరి: ట్రేడర్లు ట్రేడింగ్ చేసేటప్పుడు కచ్చితంగా స్టాప్ లాస్ పాటించాలి. మార్కెట్ సూచీల ఊగిసలాట ఎక్కువగా ఉన్నప్పుడు అధిక లివరేజ్ తీసుకోవడం రిస్క్‌తో కూడుకున్న పని.ప్రపంచ రాజకీయాలు ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్నాయి. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు త్వరగా తగ్గకపోతే చమురు ధరలు 100 డాలర్లకు చేరే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. కాబట్టి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను పునసమీక్షించుకోవాలి. అనవసరమైన రిస్క్ తీసుకోకుండా వేచి చూసే ధోరణి అవలంబించడం ఉత్తమం.ఇదీ చదవండి: ఇంధన సంక్షోభం.. చైనా రిఫైనరీల కీలక నిర్ణయం! -
యుద్ధం దెబ్బ.. ఇన్వెస్టర్ల సంపద ఆవిరి
-
యుద్ధ భయాలు.. మార్కెట్లో నీలినీడలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:22 సమయానికి నిఫ్టీ(Nifty) 486 పాయింట్లు తగ్గి 24,384 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 1580 పాయింట్లు నష్టపోయి 78,661 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.15బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 82.2 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.06 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.94 శాతం నష్టపోయింది.నాస్డాక్ 1.02 శాతం దిగజారింది.అమెరికా, ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతుండటం అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేస్తోంది. ప్రధానంగా చమురు, సహజ వాయువు, పెట్రోలియం ఆధారిత ఇంధనాలను గణనీయంగా ఉపయోగించే దేశాల స్టాక్ మార్కెట్లు, కంపెనీలను కుదేలు చేస్తోంది. అటు ఆసియా, యూరప్ సూచీలు కూడా భారీగా తగ్గాయి.దక్షిణ కొరియా కోస్పి స్టాక్ ఇండెక్స్ ఏకంగా 7.2 శాతం పతనమైంది. ఆరు నెలలకు పైగా సరిపడే ఆయిల్ నిల్వలున్నప్పటికీ జపాన్ నికాయ్ 225 సుమారు 3 శాతం క్షీణించగా, జర్మనీకి చెందిన డాక్స్ సూచీ 3.9 శాతం పతనమైంది. మంగళవారం హోలీ సందర్భంగా సెలవు కావడంతో దేశీ మార్కెట్లు పనిచేయలేదు.అంతర్జాతీయంగా ప్రామాణికమైన బ్రెంట్ క్రూడాయిల్ రేటు బ్యారెల్‌కి 7% పైగా పెరిగి 82.2 డాలర్ల వద్ద, నైమెక్స్ 7.5 శాతం పెరిగి 76.60 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. మరోవైపు, ఔన్సు (31.1 గ్రాముల) పసిడి 3 శాతం పైగా నష్టపోయి 5,133 డాలర్ల వద్ద, సిల్వర్ 6 శాతం పైగా క్షీణించి 83.42 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి.Today Nifty position 04-03-2026(time: 9:22 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
యుద్ధం ఎఫెక్ట్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్నా యుద్ధం కారణంగా.. సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 1,048.34 పాయింట్ల నష్టంతో 80,238.85 వద్ద, నిఫ్టీ 312.95 పాయింట్ల నష్టంతో 24,865.70 వద్ద నిలిచాయి.జిందాల్ డ్రిల్లింగ్ & ఇండస్ట్రీస్ లిమిటెడ్, తేజస్ నెట్వర్క్స్ లిమిటెడ్, ధ్రువ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్, భాగ్యనగర్ ఇండియా లిమిటెడ్, ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. వర్వీ గ్లోబల్ లిమిటెడ్, కృధాన్ ఇన్ఫ్రా లిమిటెడ్, AKG Exim లిమిటెడ్, క్లీన్ మాక్స్ ఎన్విరో ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్, ఫింకుర్వే ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
1000 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ(Nifty) 283 పాయింట్లు తగ్గి 24,886 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 1004 పాయింట్లు నష్టపోయి 80,294 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 97.8బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 77.3 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.98 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.43 శాతం నష్టపోయింది.నాస్డాక్ 1.18 శాతం దిగజారింది.ఉన్నట్టుండి పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ధపరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లను దెబ్బతీసే వీలున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇరాన్‌పై యూఎస్, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఆ దేశం సైతం.. దుబాయ్, తదితర గల్ఫ్‌అరబ్ దేశాలపై మిసైళ్లను ప్రయోగించడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు తెలియజేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతుడైనట్లు వెల్లడికావడంతో ఆదివారానికల్లా మధ్యప్రాచ్యంలో పలు దేశాలకు విమాన సరీ్వసులు రద్దయ్యాయి.హుర్ముజ్ ప్రాంతంలో నౌకల రవాణాకు అంతరాయాలు, ఇరాన్లో పరిస్థితులు చమురు సరఫరాలను దెబ్బతీయనున్నాయి. ఈ నేపథ్యంలో ముడిచమురు ధరలకు రెక్కలురానున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముడిచమురు ధరలు పెరిగితే దేశీయంగా దిగుమతులు బిల్లు పెరిగిపోనుంది. ఫలితంగా ఓవైపు వాణిజ్య లోటు పెరిగపోనుండగా.. మరోపక్క దేశీ కరెన్సీ బలహీనపడే వీలుంది.Today Nifty position 02-03-2026(time: 9:26 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. భారీ నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:27 సమయానికి నిఫ్టీ(Nifty) 91 పాయింట్లు తగ్గి 25,403 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 269 పాయింట్లు నష్టపోయి 81,971 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 97.81బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 70.8 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.54 శాతం నష్టపోయింది.నాస్డాక్ 1.18 శాతం దిగజారింది.Today Nifty position 27-02-2026(time: 9:28 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్
గురువారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి మిశ్రమ ఫలితాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 45.52 పాయింట్ల నష్టంతో 82,230.55 వద్ద, నిఫ్టీ 14.05 పాయింట్ల లాభంతో 25,496.55 వద్ద నిలిచాయి.ఎక్స్‌టిగ్లోబల్ ఇన్ఫోటెక్ లిమిటెడ్, రుద్ర గ్లోబల్ ఇన్ఫ్రా ప్రొడక్ట్స్ లిమిటెడ్, తేజస్ నెట్వర్క్స్ లిమిటెడ్, సనోఫీ కన్స్యూమర్ హెల్త్‌కేర్ ఇండియా లిమిటెడ్, రినైసాన్స్ గ్లోబల్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఆర్ఎమ్ డ్రిప్ అండ్ స్ప్రింక్లర్స్ సిస్టమ్స్ లిమిటెడ్, ఉషా మార్టిన్ ఎడ్యుకేషన్ & సొల్యూషన్స్ లిమిటెడ్, జిందాల్ పాలీ ఫిల్మ్స్ లిమిటెడ్, ట్రాన్స్‌వారంటీ ఫైనాన్స్ లిమిటెడ్, వీఎల్ ఈ గవర్నెన్స్ & ఐటీ సొల్యూషన్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
25,500 మార్కు వద్ద నిఫ్టీ సూచీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:21 సమయానికి నిఫ్టీ(Nifty) 51 పాయింట్లు పెరిగి 25,536 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 148 పాయింట్లు పుంజుకొని 82,424 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 97.58బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 71.01 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.04 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.81 శాతం పెరిగింది.నాస్డాక్ 1.26 శాతం పుంజుకుంది.Today Nifty position 26-02-2026(time: 9:22 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:32 సమయానికి నిఫ్టీ(Nifty) 152 పాయింట్లు పెరిగి 25,573 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 501 పాయింట్లు పుంజుకొని 82,722 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 97.82బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 71.4 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.04 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.77 శాతం పెరిగింది.నాస్డాక్ 1.05 శాతం పుంజుకుంది.Today Nifty position 25-02-2026(time: 9:32 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మార్కెట్ అనిశ్చితిలో ఇన్వెస్టర్లు ఏం చేయాలి?
భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఇటీవల తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పులు, కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో వస్తున్న పెనుమార్పులు దలాల్ స్ట్రీట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. గడిచిన ట్రేడింగ్ సెషన్లో సెన్సెక్స్ సుమారు 1,068 పాయింట్లు కుప్పకూలి 82,225 వద్ద ముగియగా, నిఫ్టీ 25,400 స్థాయికి దిగువన సరిపెట్టుకుంది. నేటి మార్కెట్ గమనాన్ని శాసించే కొన్ని అంశాలను పరిశీలిద్దాం.ట్రంప్ టారిఫ్‌లు - యూఎస్ సుప్రీంకోర్టు తీర్పు ప్రభావంఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కఠినమైన దిగుమతి సుంకాలపై అక్కడి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తోంది. అంతర్జాతీయ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ (ఐఈఈపీఏ) కింద అధ్యక్షుడు నేరుగా టారిఫ్‌లు విధించడాన్ని కోర్టు తప్పుబట్టింది. ఇది తాత్కాలికంగా ఊరటనిచ్చినా ట్రంప్ వెంటనే మరో చట్టం (సెక్షన్ 122) కింద 15% అంతర్జాతీయ టారిఫ్‌లను ప్రకటించడం ఇన్వెస్టర్లలో ఆందోళన పెంచింది.భారత్‌పై ప్రభావం: ఐటీ, ఫార్మా వంటి ఎగుమతి ఆధారిత రంగాలు ఈ అనిశ్చితి కారణంగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరే వరకు ఈ వెయిట్ అండ్ వాచ్ ధోరణి కొనసాగవచ్చని నిపుణులు చెబుతున్నారు.ఆంత్రోపిక్ ప్రకంపనలుటెక్నాలజీ రంగంలో ప్రస్తుతం సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్(సాస్)లు కొనసాగుతున్నాయి. ఆంత్రోపిక్ సంస్థ విడుదల చేసిన క్లాడ్ కోవర్క్, కోబాల్ వంటి ఏజెంటిక్ ఏఐ సర్వీసులు ఐటీ కంపెనీల పనితీరుపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, డేటా అనాలిసిస్ వంటి పనులను ఈ ఏఐ సర్వీసులు ఆటోమేట్ చేయడంతో మానవ ఆధారిత వ్యాపారం చేసే భారతీయ ఐటీ కంపెనీల మార్జిన్లు తగ్గుతాయని మార్కెట్ భయపడుతోంది.అంతర్జాతీయ అనిశ్చితులుమిడిల్ఈస్ట్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, చమురు ధరల హెచ్చుతగ్గులు, ఎఫ్ఐఐల నిరంతర అమ్మకాలు మార్కెట్‌ను బేరిష్ జోన్లోకి నెట్టాయి. ఈరోజు గిఫ్ట్ నిఫ్టీ కూడా బలహీనమైన సంకేతాలనే ఇస్తోంది.పెట్టుబడిదారులకు సూచనలునగదు ఉండాల్సిందే: మార్కెట్ కనిష్ట స్థాయిలను తాకినప్పుడు కొనుగోలు చేయడానికి కొంత నగదును సిద్ధంగా ఉంచుకోండి.ఐటీ రంగంపై జాగ్రత్త: ఐటీ కంపెనీలు ఏఐని ఎంత త్వరగా తమ వ్యాపారంలోకి స్వీకరిస్తున్నాయో గమనించండి. కేవలం తక్కువ ధరకు దొరుకుతున్నాయని ఐటీ స్టాక్స్‌ను భారీగా కొనకండి.సిప్: దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు మార్కెట్ ఒడిదుడుకులను పట్టించుకోకుండా క్రమానుగతంగా పెట్టుబడులు కొనసాగించడం మేలు.గమనిక: స్టాక్ మార్కెట్ పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌లకు లోబడి ఉంటాయి. పెట్టుబడి పెట్టే ముందు మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి. -
కోబాల్ షాక్
ముంబై: అమెరికా ఏఐ స్టార్టప్ ఆంథ్రోపిక్ కొత్త అప్డేట్ తీసుకొచ్చినప్పుడల్లా ‘ఐటీ మార్కెట్’ వణికిపోతోంది. తాజాగా కోబాల్ వంటి పాత ప్రోగ్రామింగ్ భాషలతో పనిచేస్తున్న సిస్టమ్‌లు కొత్త టెక్నాలజీకి అనుగుణంగా మార్చేందుకు తమ ‘క్లాడ్ కోడ్’ టూల్ ఉపయోగపడుతుందని ప్రకటించింది. ఈ కోడింగ్ టూల్స్‌తో ఐటీ రంగంలో సాఫ్ట్వేర్ ప్రాజెక్టులపై వ్యయాలు తగ్గి, కంపెనీల ఆదాయాల పరిమితం కావొచ్చని పరిశ్రమ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామంతో ఐటీ షేర్లలో వెల్లువెత్తిన విక్రయాలతో దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం ఒకశాతానికి పైగా పతనమైంది.అంతర్జాతీయ వాణిజ్య సంబంధిత అనిశి్చతులు, క్రూడాయిల్ ధరలు, అమెరికా–ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతలు సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీశాయి. ఫలితంగా సెన్సెక్స్ 1069 పాయింట్లు పతనమై 82,226 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 288 పాయింట్లు నష్టపోయి 25,425 వద్ద నిలిచింది. ఒక్కరోజే రూ.2.85 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.466 లక్షల కోట్లకు దిగివచ్చింది. అంతర్జాతీయంగా డాలర్ పుంజుకోవడం, క్రూడాయిల్ ధరలు పెరగడంతో డాలర్ మారకంలో రూపాయి విలువ 6 పైసలు బలహీనపడి 90.95 వద్ద స్థిరపడింది. బలహీనంగా మొదలై.. భారీ నష్టాల్లోకి..అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే బలహీనంగా మొదలయ్యాయి. ట్రేడింగ్ గడిచే కొద్ది మరింత అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ముఖ్యంగా ఏఐ భయాలు ఇన్వెస్టర్లను ఆందోళనలకు గురిచేయటంతో ఐటీ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడితో చిత్తు అయ్యాయి. రియల్టీ, మీడియా స్టాక్స్ కూడా భారీగానే నష్టపోయాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,360 పాయింట్లు క్షీణించి 82 వేల స్థాయి దిగువన 81,934 వద్ద, నిఫ్టీ 385 పాయింట్లు పతనమై 25,328 వద్ద ఇంట్రాడే కనిష్టాలు నమోదు చేశాయి. అలాగే మంగళవారం నిఫ్టీ డెరివేటివ్స్ కాంట్రాక్టుల వీక్లీ ఎక్స్పైరీ కావడంతో ట్రేడర్లు తమ పొజిషన్లను మార్పు, చేర్పులు చేసుకోవడంతో ఇంట్రాడేలో సూచీలు భారీ ఊగిసలాటలకు లోనయ్యాయి. ⇒ ఆంథ్రోపిక్ తాజా అప్డేట్ ప్రకటనతో భారత ఐటీ రంగ షేర్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. ఎల్టీఐఎం 6.50%, టెక్ మహీంద్రా 6.17%, పెర్సిస్టెంట్ 6%, హెచ్‌సీఎల్ టెక్ 5.83%, కోఫోర్జ్ 5.24% క్షీణించాయి. ఎంఫసిస్ 3.67%, టీసీఎస్ 3.56%, ఇన్ఫోసిస్ 3.56%, విప్రో 3% పతనమయ్యాయి. ఎన్ఎస్ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్సు 4.8% నష్టపోయింది. కృత్రిమ మేధ ఆందోళనలతో నిఫ్టీ ఐటీ ఇండెక్సు ఈ ఫిబ్రవరిలో ఏకంగా 21% కుప్పకూలింది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం(2008) తర్వాత ఈ సూచీ ఒక నెలలో ఆ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. ⇒ బీఎస్ఈలో రంగాల వారీ ఇండెక్సుల్లో ఐటీ 5%, రియల్టీ 2.61%, టెలీకమ్యూనికేషన్ 1.79%, కన్జూమర్ డి్రస్కేషనరీ 1.12%, ఇండ్రస్టియల్స్ 0.91%, క్షీణించాయి. స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు 0.68%, 0.54% చొప్పున క్షీణించాయి. ⇒ ప్రపంచ దేశాలపై ట్రంప్ విధించిన సుంకాలు చెల్లవంటూ యూఎస్ సుప్రీం కోర్టు తీర్పు తర్వాత కూడా ఇతర చట్టాల ద్వారా టారిఫ్‌లు విధిస్తామని ట్రంప్ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. ఆసియా మార్కెట్లలో ఇండోనేíÙయా 1.4%, హాంగ్‌కాంగ్ 1.85%, సింగపూర్ 0.4% పతనమయ్యాయి. యూరప్‌లో ఫ్రాన్స్, జర్మనీ సూచీలు అరశాతం వరకు పతనమయ్యాయి. అమెరికా స్టాక్ సూచీలు ఆరంభంలో భారీగా పడి, వెంటనే కోలుకుని లాభాలతో ట్రేడవుతున్నాయి.ఐబీఎంకు ఆంథ్రోపిక్ భయంఐబీఎం సిస్టమ్స్‌లో ఉపయోగించే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోబాల్‌ను తమ ‘క్లాడ్ కోడ్ టూల్ ఆధునికీకరించగలదంటూ ఆంథ్రోపిక్ చేసిన ప్రకటనతో ఐబీఎం షేరు కుప్పకూలింది. సోమవారం ఏకంగా 13.2% క్షీణించి 223.35 డాలర్ల వద్ద ముగిసింది. 2000 అక్టోబర్ తర్వాత ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. షేరు భారీ పతనంతో కంపెనీ మార్కెట్ విలువకు ఒక్కరోజే 40 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది.టెక్ నిపుణులు నెలల పాటు శ్రమించి రూపొందించే కోడ్ లాంగ్వేజీని స్వల్ప వ్యవధిలో పూర్తి చేసే కోబాల్ క్లాడ్ కోడ్ టూల్ ఆవిష్కరణతో ఐబీఎంతో పాటు అంతర్జాతీయంగా సైబర్ సెక్యురిటీ, సాఫ్ట్వేర్ యాస్ ఏ సర్వీస్ (సాస్) రంగంలోని దిగ్గజ కంపెనీల షేర్లు భారీ నష్టపోయాయి. ఈ ప్రభావమూ దేశీయ ఐటీ సంస్థల షేర్లపై పడింది. సోమవారం భారీ నష్టం నుంచి తేరుకున్న ఐబీఎం షేరు మంగళవారం ఇంట్రాడేలో 4.27% లాభంతో 232.88 డాలర్లను తాకింది. -
స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్: సెన్సెక్స్ & నిఫ్టీ ఇలా..
మంగళవారం ఉదయం స్వల్ప నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 974.77 పాయింట్ల నష్టంతో 82,319.89 వద్ద, నిఫ్టీ 253.65 పాయింట్ల నష్టంతో 25,459.35 వద్ద నిలిచాయి.డాల్ఫిన్ ఆఫ్‌షోర్ ఎంటర్ప్రైజెస్ (ఇండియా) లిమిటెడ్, రీగాల్ రిసోర్సెస్ లిమిటెడ్, తమిళనాడు టెలికమ్యూనికేషన్స్ లిమిటెడ్, ఎంబీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, డీఈఈ డెవలప్మెంట్ ఇంజనీర్స్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. అకీ ఇండియా లిమిటెడ్, యాత్ర ఆన్లైన్ లిమిటెడ్, భండారీ హొజియరీ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్, సిగ్మా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్, ఆరే డ్రగ్స్ & ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:36 సమయానికి నిఫ్టీ(Nifty) 198 పాయింట్లు తగ్గి 25,512 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 706 పాయింట్లు దిగజారి 82,587 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 97.78బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 72.07 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.04 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.04 శాతం తగ్గింది.నాస్డాక్ 1.13 శాతం దిగజారింది.Today Nifty position 24-02-2026(time: 9:36 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మార్కెట్‌కు ‘యూఎస్ సుప్రీం’ జోష్
ముంబై: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై విధించిన సుంకాలు(టారిఫ్‌లు) చెల్లవంటూ యూఎస్ సుప్రీం కోర్టు ఇచి్చన తీర్పు ఈక్విటీ మార్కెట్లకు ఉత్సాహాన్నిచ్చింది. ఫలితంగా సెన్సెక్స్ 480 పాయింట్లు పెరిగి 83,295 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 142 పాయింట్లు బలపడి 25,713 వద్ద నిలిచింది. సూచీలకిది రెండోరోజూ లాభాల ముగింపు. ఉదయమే సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు లాభాలతో ముందుకు కదిలాయి. స్థిరమైన డిమాండ్, ఆర్థిక పునరుద్ధరణపై ఆశావహ అంచనాలతో ప్రభుత్వ బ్యాంకులు, ఎఫ్ఎంసీజీ, కన్జూమర్ డి్రస్కేషనరీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఒక దశలో సెన్సెక్స్ 671 పాయింట్లు పెరిగి 83,486 వద్ద, నిఫ్టీ 200 పాయింట్లు ఎగసి 25,771 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేశాయి.బీఎస్ఈలో రంగాల వారీ ఇండెక్సుల్లో ప్రభుత్వ రంగ బ్యాంక్స్ 1.4%, సరీ్వసెస్ 0.97%, హెల్త్‌కేర్ 0.89%, విద్యుత్ 0.76%, ఆటో 0.71%, ఫైనాన్సియల్ సరీ్వసెస్ 0.65%, ఎఫ్ఎంసీజీ 0.54%, యుటిలిటి 0.52 శాతం పెరిగాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.41% లాభపడగా, మిడ్‌క్యాప్ సూచీ 1.56% నష్టపోయింది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేరు డీలాహరియాణా ప్రభుత్వానికి చెందిన ఖాతాల్లో రూ.590 కోట్ల మోసం జరిగిందంటూ వార్తలు వెలుగులోకి రావడంతో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేరు ఇంట్రాడేలో 20% క్షీణించి రూ.66.85 వద్ద లోయర్ సర్క్యూట్ తాకింది. చివరికి 16% నష్టంతో రూ.70 వద్ద స్థిరపడింది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకుతో పాటు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకును ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణ నుంచి హరియాణా ప్రభుత్వం తొలగించింది. దీంతో ఏయూ బ్యాంక్ షేరు 5.30% పతనమై రూ.974 వద్ద స్థిరపడింది. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 479.95 పాయింట్ల లాభంతో 83,294.66 వద్ద, నిఫ్టీ 132.70 పాయింట్ల లాభంతో 25,703.95 వద్ద నిలిచాయి.అక్మే ఫిన్‌ట్రేడ్ (ఇండియా) లిమిటెడ్, మోర్పెన్ లాబొరేటరీస్ లిమిటెడ్, అరిహంత్ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్, డీఈఈ డెవలప్మెంట్ ఇంజనీర్స్ లిమిటెడ్, ఇండో టెక్ ట్రాన్స్ఫార్మర్స్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ లిమిటెడ్, యూపీఎల్ లిమిటెడ్, గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా లిమిటెడ్, ఈ2ఈ నెట్వర్క్స్ లిమిటెడ్, 63 మూన్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:51 సమయానికి నిఫ్టీ(Nifty) 174 పాయింట్లు పెరిగి 25,746 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 582 పాయింట్లు పుంజుకొని 83,381 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 97.47బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 71.1 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.08 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.69 శాతం పెరిగింది.నాస్డాక్ 0.9 శాతం పుంజుకుంది.Today Nifty position 23-02-2026(time: 9:52 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 316.57 పాయింట్ల (0.38 శాతం) లాభంతో 82,814.71 వద్ద, నిఫ్టీ 116.90 పాయింట్ల (0.46 శాతం) లాభంతో 25,571.25 వద్ద నిలిచాయి.VL E-గవర్నెన్స్ & IT సొల్యూషన్స్ లిమిటెడ్, BLB లిమిటెడ్, ట్రీ హౌస్ ఎడ్యుకేషన్ & యాక్సెసరీస్ లిమిటెడ్, సకార్ హెల్త్‌కేర్ లిమిటెడ్, ఆకాష్ ఎక్స్‌ప్లోరేషన్ సర్వీసెస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. విక్రమ్ సోలార్ లిమిటెడ్, న్యూజెన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ లిమిటెడ్, ట్రాన్స్‌వరల్డ్ షిప్పింగ్ లైన్స్ లిమిటెడ్, శివ్ ఓమ్ స్టీల్స్ లిమిటెడ్, కెఎన్ అగ్రి రిసోర్సెస్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
25,480 మార్కు వద్ద నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఫ్లాట్‌గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:48 సమయానికి నిఫ్టీ(Nifty) 33 పాయింట్లు పెరిగి 25,486 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 40 పుంజుకొని 82,552 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 97.96బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 71.9 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.06 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.28 శాతం తగ్గింది.నాస్డాక్ 0.31 శాతం దిగజారింది.ఇరాన్‌తో అణు చర్చలు విఫలమైతే అమెరికా యుద్ధానికి సిద్ధమైంది. అమెరికా కీలక వడ్డీ రేట్ల విషయంపై ఫెడరల్ రిజర్వ్ సభ్యులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు జనవరి 27–28 జరిగిన ఫెడ్ సమావేశ మినిట్స్‌లో వెల్లడైంది. ఫెడ్ వడ్డీ రేట్ల కోతలను ఆలస్యం చేసినా లేదా రేట్లు పెంచినా, భారత ఈక్విటీ మార్కెట్లకు ప్రతికూలం. మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం నెలకొనడంతో క్రూడాయిల్ ధరలు భగ్గుమన్నాయి. భారత్‌కు దిగుమతి అయ్యే బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 71 డాలర్లపైకి చేరింది.Today Nifty position 20-02-2026(time: 9:48 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నిలకడగా స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఫ్లాట్‌గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:31 సమయానికి నిఫ్టీ(Nifty) 2 పాయింట్లు తగ్గి 25,819 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 41 దిగజారి 83,696 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 19-02-2026(time: 9:32 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫ్లాట్‌గా స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఫ్లాట్‌గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:31 సమయానికి నిఫ్టీ(Nifty) 4 పాయింట్లు తగ్గి 25,721 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 47 దిగజారి 83,405 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 18-02-2026(time: 9:32 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఆదుకున్న బ్యాంకులు
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఐటీ, క్యాపిటల్ గూడ్స్ షేర్లు రాణించడంతో దేశీయ స్టాక్ మార్కెట్ రెండో రోజూ లాభంతో ముగిసింది. సెన్సెక్స్ 174 పాయింట్లు పెరిగి 83,451 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 43 పాయింట్లు బలపడి 25,725 వద్ద నిలిచింది. ఆసియా మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం నష్టాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ఆద్యంతం లాభ నష్టాల మధ్య ఊగిసలాడాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 611 పాయింట్ల పరిధిలో 82,987 – 83,598 శ్రేణిలో ట్రేడైంది. నిఫ్టీ 25,570 వద్ద కనిష్టాన్ని, 25,764 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. ఇన్వెస్టర్ల సంపద భావించే బీఎస్ఈలోని నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.1.52 లక్షల కోట్లు పెరిగి రూ.470.11 లక్షల కోట్లకు చేరింది. లూనార్ కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా చైనా, దక్షిణ కొరియా, హాంగ్‌కాంగ్, తైవాన్, సింగపూర్ మార్కెట్లు పనిచేయలేదు. జపాన్ ఇండెక్సు 0.50% నష్టపోయింది. ఆరంభ నష్టాలు భర్తీ చేసుకున్న యూరప్ మార్కెట్లు స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. అమెరికా స్టాక్ సూచీలు స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి. ⇒ బీఎస్ఈ రంగాల వారీ ఇండెక్సుల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల సూచీ 2.36% పెరిగింది. ఐటీ 1.15%, ఇండ్రస్టియల్స్ 1.13%, సర్వీసెస్ 0.98% ఐటీ 0.94%, ఎఫ్ఎంసీజీ 0.87%, కన్జూమర్ డ్యూరబుల్స్ 0.85%, క్యాపిటల్ గూడ్స్ 0.76% పెరిగాయి. స్మాల్, మిడ్ క్యాప్ ఇండెక్సులు 0.49%, 0.26% లాభపడ్డాయి. మరోవైపు మెటల్, కమోడిటీస్, ఇంధన, రియల్టీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ⇒ హెచ్‌సీఎల్ టెక్ 1.50 శాతం, విప్రో 1.21శాతం, ఎల్‌అండ్‌టీఎం 1 శాతం లాభపడ్డాయి. టీసీఎస్, టెక్ మహీంద్రా, పెర్సిస్టెంట్ షేర్లు 0.50 శాతం పెరిగాయి. ⇒ భారత పర్యటనలో ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్... ప్రధాని మోదీతో భేటీ నేపథ్యంలో మరిన్ని రఫేల్ ఫైటర్ జెట్ల కొనుగోళ్ల ఒప్పందం కుదరొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. ఫలితంగా డిఫెన్స్ షేర్లకు డిమాండ్ లభించింది. కొచి్చన్ షిప్‌యార్డ్ 4%, భారత్ ఎల్రక్టానిక్స్ 2%, యూనిమెక్ ఏరోస్పేస్ 4%, భారత్ ఫోర్జ్ 1.38%, పరాస్ డిఫెన్స్, జెన్ టెక్నాలజీస్ 1%, హెచ్ఏఎల్ 0.50% లాభపడ్డాయి. -
స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్స్
మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 173.81 పాయింట్ల లాభంతో 83,450.96 వద్ద, నిఫ్టీ 42.65 పాయింట్ల లాభంతో 25,725.40 వద్ద నిలిచాయి.యూనికామర్స్ ఈసొల్యూషన్స్ లిమిటెడ్, కొఠారి ప్రొడక్ట్స్ లిమిటెడ్, ఈజీ ట్రిప్ ప్లానర్స్ లిమిటెడ్, ఆర్చాస్ప్ లిమిటెడ్, కెల్టన్ టెక్ సొల్యూషన్స్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఇండోవిండ్ ఎనర్జీ లిమిటెడ్, కామధేను వెంచర్స్ లిమిటెడ్, సీఎల్ ఎడ్యుకేట్ లిమిటెడ్, సూపర్ స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్, యుకెన్ ఇండియా లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయు.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్‌గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:36 సమయానికి నిఫ్టీ(Nifty) 78 పాయింట్లు తగ్గి 25,603 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 171 దిగజారి 83,096 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 97.13బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 68.3 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.03 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.05 శాతం పెరిగింది.నాస్డాక్ 0.22 శాతం దిగజారింది.Today Nifty position 17-02-2026(time: 9:36 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్
సోమవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 650.39 పాయింట్ల లాభంతో 83,277.15 వద్ద, నిఫ్టీ 211.65 పాయింట్ల లాభంతో 25,682.75 వద్ద నిలిచాయి.భారత్ సీట్స్ లిమిటెడ్, ఆర్.ఎ.సి.ఎల్. గేర్‌టెక్ లిమిటెడ్, ఈజీ ట్రిప్ ప్లానర్స్ లిమిటెడ్, ప్రెసిషన్ వైర్స్ ఇండియా లిమిటెడ్, ఆసియన్ హోటల్స్ (నార్త్) లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో ఉన్నాయి. బీటా డ్రగ్స్ లిమిటెడ్, సార్థక్ మెటల్స్ లిమిటెడ్, డెల్ఫీ వరల్డ్ మనీ లిమిటెడ్, టీఐఎల్ లిమిటెడ్, ధ్రువ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
ఫ్లాట్‌గా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు క్రితం సెషన్‌తో పోలిస్తే సోమవారం ఫ్లాట్‌గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:26 సమయానికి నిఫ్టీ(Nifty) 13 పాయింట్లు పెరిగి 25,489 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 45 పుంజుకొని 82,646 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 16-02-2026(time: 9:28 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నేడు దలాల్ స్ట్రీట్ దారి ఎటువైపు?
భారతీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు (ఫిబ్రవరి 16, 2026) ఒత్తిడికి లోనయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గత శుక్రవారం సెన్సెక్స్ 1,000 పాయింట్లకు పైగా, నిఫ్టీ 330 పాయింట్లకు పైగా భారీగా పతనమైన నేపథ్యంలో నేడు కూడా మార్కెట్ బేరిష్(తగ్గుదల) ట్రెండ్‌ను కొనసాగించే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. గ్లోబల్ మార్కెట్ల నుంచి వస్తున్న ప్రతికూల సంకేతాలు, అంతర్జాతీయ రాజకీయ అనిశ్చితులు దీనికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.అంతర్జాతీయ అనిశ్చితులు - టెక్ రంగంలో ప్రకంపనలుఅమెరికా మార్కెట్లలో ముఖ్యంగా టెక్నాలజీ (ఐటీ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) షేర్లలో చోటుచేసుకున్న భారీ అమ్మకాలు భారతీయ ఐటీ రంగంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. నాస్డాక్ పతనం కారణంగా దేశీయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ షేర్లు ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. అలాగే, పెరుగుతున్న అమెరికా బాండ్ ఈల్డ్స్, డాలర్ ఇండెక్స్ బలపడటం కూడా విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల నిష్క్రమణకు దారితీస్తోంది.క్రూడాయిల్ ధరలు.. భారత్‌పై ప్రభావంప్రస్తుతానికి అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్‌కు సుమారు 67 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇరాన్ అణు చర్చల నేపథ్యంలో సరఫరా అంతరాయాలు తగ్గుతాయన్న ఆశలు ఉన్నప్పటికీ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పూర్తిగా సద్దుమణగలేదు. క్రూడాయిల్ ధరలు పెరిగితే అది భారతదేశ ద్రవ్యోల్బణంపై, కరెంటు ఖాతా లోటు (క్యాడ్)పై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ఇది రూపాయి విలువ క్షీణతకు కారణమై మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసే ప్రమాదం ఉంది.ఆర్బీఐ, ఫెడ్ రిజర్వ్ భవిష్యత్తు నిర్ణయాలుఇటీవలి ఫిబ్రవరి మానిటరీ పాలసీ సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 5.25% వద్ద స్థిరంగా ఉంచింది. అయితే, ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నప్పటికీ ఆహార ధరల పెరుగుదల, అంతర్జాతీయ అనిశ్చితుల దృష్ట్యా ఆర్బీఐ తన తటస్థ వైఖరిని కొనసాగిస్తోంది. భవిష్యత్తులో వడ్డీ రేట్ల తగ్గింపుపై స్పష్టత లేకపోవడం మార్కెట్లలో కొంత నిరుత్సాహాన్ని నింపింది. అమెరికాలో ద్రవ్యోల్బణ గణాంకాలు అంచనాల కంటే ఎక్కువగా ఉండటంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపును మరింత ఆలస్యం చేసే అవకాశం ఉంది. ఈ అనిశ్చితి గ్లోబల్ లిక్విడిటీపై ప్రభావం చూపుతోంది.టెక్నికల్ లెవల్స్‌పై నిపుణుల అంచనాటెక్నికల్ చార్టుల ప్రకారం, నిఫ్టీకి 25,400 స్థాయి అత్యంత కీలకమైన సపోర్ట్‌గా ఉంది. ఒకవేళ నిఫ్టీ ఈ స్థాయి కంటే దిగువకు పడిపోతే అది 25,200 నుంచి 25,000 వరకు వెళ్లే ప్రమాదం ఉంది. సెన్సెక్స్‌కు 82,500 - 82,400 జోన్ బలమైన సపోర్ట్‌గా పనిచేస్తుంది. ఇన్వెస్టర్లు ప్రస్తుతం దూకుడుగా పెట్టుబడులు పెట్టడం కంటే వేచి చూడటం ఉత్తమమని, ముఖ్యంగా ఐటీ, మెటల్ రంగాల షేర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: ఉఫ్.. బిగ్ రిలీఫ్! -
కుప్పకూలిన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:35 సమయానికి నిఫ్టీ(Nifty) 257 పాయింట్లు తగ్గి 25,548 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 809 దిగజారి 82,868 వద్ద ట్రేడవుతోంది.భారతీయ స్టాక్ మార్కెట్లు నేడు (ఫిబ్రవరి 13, 2026) భారీ పతనాన్ని చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన బలహీన సంకేతాలు, ముఖ్యంగా ఐటీ రంగంలో చోటుచేసుకున్న భారీ అమ్మకాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.అమెరికాకు చెందిన ఏఐ స్టార్టప్ ఆంత్రోపిక్ కార్పొరేట్ లీగల్ విధులను ఆటోమేట్ చేసే కొత్త టూల్‌ను విడుదల చేయడం భారత ఐటీ రంగానికి శాపంగా మారింది. ఈ సాంకేతికత వల్ల ఐటీ కంపెనీల భవిష్యత్తు ఆదాయాలపై నీలి నీడలు కమ్ముకోవడంతో ఇన్వెస్టర్లు బెంబేలెత్తిపోయారు.అమెరికాలో జనవరి నెలకు సంబంధించి వెలువడిన ఉద్యోగ గణాంకాలు అంచనాల కంటే మెరుగ్గా ఉన్నాయి. ఇది ఆర్థిక వ్యవస్థకు శుభసూచకమే అయినప్పటికీ, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపును మరింత ఆలస్యం చేసే అవకాశం ఉందన్న సంకేతాలు మార్కెట్లను కలవరపెట్టాయి.‘ప్రస్తుత పతనం ప్రధానంగా ఐటీ, గ్లోబల్ సెంటిమెంట్ వల్ల జరిగింది. అయితే, నిఫ్టీకి 25,500 వద్ద బలమైన మద్దతు ఉంది. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు నాణ్యమైన షేర్లలో ఈ పతనాన్ని కొనుగోలు అవకాశంగా చూడవచ్చు’ అని నిపుణులు సూచిస్తున్నారు.Today Nifty position 13-02-2026(time: 9:36 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 558.72 పాయింట్ల నష్టంతో.. 83,674.92 వద్ద, నిఫ్టీ 146.65 పాయింట్ల నష్టంతో 25,807.20 వద్ద నిలిచాయి.టాప్ గెయినర్స్ జాబితాలో జీఈ పవర్ ఇండియా లిమిటెడ్, క్రౌన్ లిఫ్టర్స్ లిమిటెడ్, రత్నమణి మెటల్స్ & ట్యూబ్స్ లిమిటెడ్, అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్ లిమిటెడ్, అవంతి ఫీడ్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు చేరాయి. ధ్రువ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్, నెట్వర్క్ పీపుల్ సర్వీసెస్ టెక్నాలజీస్ లిమిటెడ్, యూనిటెక్ లిమిటెడ్, కిలిచ్ డ్రగ్స్(ఐ) లిమిటెడ్, నోవా అగ్రిటెక్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
నష్టాల్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:43 సమయానికి నిఫ్టీ(Nifty) 114 పాయింట్లు తగ్గి 25,853 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 381 దిగజారి 83,836 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 12-02-2026(time: 9:43 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
26,000 మార్కు చేరువలో నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:24 సమయానికి నిఫ్టీ(Nifty) 49 పాయింట్లు పెరిగి 25,985 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 110 పుంజుకొని 84,386 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 11-02-2026(time: 9:26 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్స్
మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 208.17 పాయింట్ల (0.25 శాతం) లాభంతో 84,273.92 వద్ద, నిఫ్టీ 67.85 పాయింట్ల (0.26 శాతం) లాభంతో 25,935.15 వద్ద ఉన్నాయి.పావ్నా ఇండస్ట్రీస్ లిమిటెడ్, లుమాక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, లక్ష్మి కోట్స్‌పిన్ లిమిటెడ్, క్షితిజ్ పాలీలైన్ లిమిటెడ్, ఏబీఎమ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. పెర్ల్ గ్లోబల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, లాయల్ టెక్స్టైల్స్ మిల్స్ లిమిటెడ్, కిరి ఇండస్ట్రీస్ లిమిటెడ్, జూబిలెంట్ అగ్రి అండ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, స్పేస్‌నెట్ ఎంటర్ప్రైజెస్ ఇండియా లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
స్టాక్ మార్కెట్లో కొనసాగుతోన్న లాభాలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:34 సమయానికి నిఫ్టీ(Nifty) 52 పాయింట్లు పెరిగి 25,921 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 185 పుంజుకొని 84,269 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 10-02-2026(time: 9:34 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి అదే ఊపుతో ముగిశాయి. సెన్సెక్స్ 485.35 పాయింట్లు పెరిగి 84,065.75 వద్ద, నిఫ్టీ 173.60 పాయింట్ల లాభంతో 25,867.30 వద్ద నిలిచాయి.నీరాజ్ ఇస్పాత్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఇజ్మో లిమిటెడ్, అపోలో పైప్స్ లిమిటెడ్, లాయల్ టెక్స్టైల్స్ మిల్స్ లిమిటెడ్, హిటాచీ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. సీఎల్ ఎడ్యుకేట్ లిమిటెడ్, మహేశ్వరి లాజిస్టిక్స్ లిమిటెడ్, ఆశాపురా మినెకెమ్ లిమిటెడ్, సోలారా యాక్టివ్ ఫార్మా సైన్సెస్ లిమిటెడ్, శివ్ ఓమ్ స్టీల్స్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలోకి చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:23 సమయానికి నిఫ్టీ(Nifty) 127 పాయింట్లు పెరిగి 25,822 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 419 పుంజుకొని 84,002 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 97.61బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 67.3 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.22 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.97 శాతం పెరిగింది.నాస్డాక్ 2.18 శాతం పుంజుకుంది.Today Nifty position 09-02-2026(time: 9:24 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం స్వల్ప నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 266.47 శాతం లాభంతో.. 83,580.40 వద్ద, నిఫ్టీ 50.90 పాయింట్ల లాభంతో 25,693.70 వద్ద నిలిచాయి.నీరాజ్ ఇస్పాత్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఐజెడ్ఎంఓ లిమిటెడ్, అపోలో పైప్స్ లిమిటెడ్, లాయల్ టెక్స్టైల్స్ మిల్స్ లిమిటెడ్, హిటాచీ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. సీఎల్ ఎడ్యుకేట్ లిమిటెడ్, మహేశ్వరి లాజిస్టిక్స్ లిమిటెడ్, ఆశాపురా మినెకెమ్ లిమిటెడ్, సోలారా యాక్టివ్ ఫార్మా సైన్సెస్ లిమిటెడ్, శివ్ ఓమ్ స్టీల్స్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 514.66 పాయింట్ల లాభంతో.. 83,303.02 వద్ద, నిఫ్టీ 135.30 పాయింట్ల లాభంతో 25,640.70 వద్ద నిలిచాయి.మహేశ్వరి లాజిస్టిక్స్ లిమిటెడ్, నీరాజ్ ఇస్పాత్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, లాయల్ టెక్స్టైల్స్ మిల్స్ లిమిటెడ్, బార్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్, టిజారియా పాలీపైప్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. సరళ పెర్ఫార్మెన్స్ ఫైబర్స్ లిమిటెడ్, బయోఫిల్ కెమికల్స్ & ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, జువారీ ఆగ్రో కెమికల్స్ లిమిటెడ్, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:24 సమయానికి నిఫ్టీ(Nifty) 86 పాయింట్లు తగ్గి 25,691 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 251 నష్టపోయి 83,568 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 05-02-2026(time: 9:24 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:28 సమయానికి నిఫ్టీ(Nifty) 49 పాయింట్లు పెరిగి 25,780 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 85 ఎగబాకి 83,819 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 97.35బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 67.7 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.27 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.84 శాతం తగ్గింది.నాస్డాక్ 1.43 శాతం నష్టపోయింది.Today Nifty position 04-02-2026(time: 9:28 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మార్కెట్లో ర్యాలీ.. ఇప్పుడేం చేయాలంటే..
భారత స్టాక్ మార్కెట్లు ఫిబ్రవరి 3, 2026 నాటి ట్రేడింగ్ సెషన్లో భారీగా పెరిగాయి. ఇన్వెస్టర్ల సంపద కేవలం ఒక్కరోజులోనే సుమారు రూ.12.5 లక్షల కోట్లకు పైగా పెరగడం విశేషం. ఈ భారీ ర్యాలీకి దారితీసిన కారణాలు, రాబోయే రోజుల్లో మదుపర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.సెన్సెక్స్, నిఫ్టీ భారీ జంప్మంగళవారం మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 2,072.67 పాయింట్లు (2.54%) పెరిగి 83,739.13 వద్ద స్థిరపడగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 629.75 పాయింట్లు (2.51%) లాభంతో 25,718.15 వద్ద ముగిసింది.మార్కెట్ ర్యాలీకి కారణాలుభారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన చర్చల ఫలితంగా ప్రకటించిన ట్రేడ్ డీల్ ఈ భారీ ర్యాలీకి కీలకంగా నిలిచింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల నేపథ్యంలో గతంలో విధించిన 25% అదనపు పెనాల్టీ సుంకాలను అమెరికా పూర్తిగా ఎత్తివేసింది. అలాగే భారత ఉత్పత్తులపై ప్రాథమిక సుంకాలను 25% నుంచి 18%కి తగ్గించడం ఐటీ, ఫార్మా, టెక్స్టైల్ వంటి ఎగుమతి రంగాలకు పెద్ద ఊరటనిచ్చింది.ఆసియా మార్కెట్ల సానుకూల ప్రభావం.. భారత్-అమెరికా డీల్ వార్తలతో అంతర్జాతీయ ఇన్వెస్టర్లలో ఉత్సాహం పెరిగింది. జపాన్ నిక్కీ (Nikkei 225) 2.44%, దక్షిణ కొరియా కోస్పి (Kospi) 5% వరకు పెరగడం భారత మార్కెట్లకు సానుకూల సంకేతాలను ఇచ్చింది.బడ్జెట్ అనంతరం స్పష్టత.. కేంద్ర బడ్జెట్ 2026లో ఎఫ్‌అండ్‌ఓపై ఎస్టీటీ పెంపు వంటి అంశాల వల్ల ఏర్పడిన అనిశ్చితిని ఈ వాణిజ్య ఒప్పందం వార్తలు మరుగునపడేశాయి. పెట్టుబడిదారులు తిరిగి దేశీయ మార్కెట్లపై నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.లాభాల స్వీకరణకు అవకాశం ఉందా?మార్కెట్లు భారీగా పెరిగినప్పుడు సహజంగానే మదుపర్లు గరిష్ఠ స్థాయిల వద్ద లాభాలను స్వీకరించే అవకాశం ఉంటుంది. దీనివల్ల స్వల్పకాలంలో మార్కెట్ కొంత ఒడిదుడుకులకు లోనవ్వొచ్చు. ఫిబ్రవరి 3 నాటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ మార్కెట్ ప్రారంభంలో వెళ్లిన గరిష్ఠాల నుంచి కొంత మేర తగ్గడం దీనికి సంకేతంగా చూడవచ్చు.ఇన్వెస్టర్లు పాటించాల్సిన జాగ్రత్తలుమార్కెట్ గరిష్ఠాల వద్ద ఉన్నప్పుడు గుడ్డిగా పెట్టుబడులు పెట్టడం ప్రమాదకరం. నిపుణుల సూచనల ప్రకారం కింది జాగ్రత్తలు తీసుకోవాలి.ఒక్కసారిగా పెట్టుబడి పెట్టవద్దు.. మార్కెట్ గరిష్ఠ స్థాయిలో ఉన్నప్పుడు పెద్ద మొత్తంలో కాకుండా క్రమానుగతంగా పెట్టుబడులను కొనసాగించడం మంచిది.నాణ్యమైన షేర్లకే ప్రాధాన్యత.. అమెరికా సుంకాల తగ్గింపు వల్ల లాభపడే ఐటీ, ఫార్మా, టెక్స్టైల్, కెమికల్ రంగాల్లోని నాణ్యమైన కంపెనీలను ఎంచుకోండి.స్టాప్ లాస్ తప్పనిసరి.. స్వల్పకాలిక ట్రేడర్లు మార్కెట్ అస్థిరతను దృష్టిలో ఉంచుకుని కచ్చితమైన స్టాప్ లాస్ పాటించడం అవసరం.పోర్ట్‌ఫోలియో రీ-బ్యాలెన్సింగ్.. ఇప్పటికే మంచి లాభాల్లో ఉన్న షేర్లలో కొంత మేర లాభాలను స్వీకరించి నగదును సిద్ధంగా ఉంచుకోవడం వల్ల మార్కెట్ తగ్గితే తిరిగి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: భారమైన బహుమతులు.. దూరమవుతున్న బంధాలు -
సెన్సెక్స్ సునామీ
ముంబై: భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో మంగళవారం దలాల్ స్ట్రీట్‌లో బుల్ లాభాల రంకె వేసింది.భారత్–అమెరికా ట్రేడ్ డీల్ ఇన్వెస్టర్లలో భారీ ఉత్సాహాన్ని నింపింది. ఫలితంగా సెన్సెక్స్ 2,073 పాయింట్లు ఎగసి 83,739 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 639 పాయింట్లు దూసుకెళ్లి 25,728 వద్ద నిలిచింది. గతేడాది 2025, మే 12 తర్వాత గడిచిన 8 నెలల్లో సూచీలకు ఒకరోజులో అతిపెద్ద ర్యాలీ ఇదే కావడం విశేషం.ఇంట్రాడే ట్రేడింగ్‌లో రికార్డు: ఉదయమే ఉత్సాహంగా మొదలైన సెన్సెక్స్ 3,657 పాయింట్ల లాభంతో 85,323 వద్ద, నిఫ్టీ 1,220 వద్ద పాయింట్లు పెరిగి 26,308 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. దలాల్‌స్ట్రీట్ చరిత్రలోనే మునుపెన్నడూ లేనంతంగా ఇంట్రాడే లాభాలు ఆర్జించాయి. సెన్సెక్స్ ఏకంగా 4,205 పాయింట్లు (5.14%) ఎగసి 85,872 వద్ద, నిఫ్టీ 1,253 పాయింట్లు దూసుకెళ్లి 26,341 వద్ద గరిష్టాలు తాకాయి. తద్వారా సూచీలు ఇంట్రాడేలో అత్యధిక లాభాలు ఆర్జించిన కొత్త రికార్డు నమోదైంది. ఇన్వెస్టర్లకు లాభాల పంట: స్టాక్ మార్కెట్ రెండున్నర శాతం ర్యాలీతో ఇన్వెస్టర్లకు లాభాల పంట పండింది. ఒక్కరోజే రూ. 12.10 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.467.14 లక్షల కోట్లకు చేరుకుంది. ⇒ సెన్సెక్స్ సూచీలోని 30 షేర్లలో టెక్ మహీంద్రా (–0.47%), బీఈఎల్(–0.02%) మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 28 షేర్లు లాభపడ్డాయి. అత్యధికంగా అదానీ పోర్ట్స్ 9.12%, బజాజ్ ఫైనాన్స్ 6.68%, ఇండిగో 5.51%, పవర్‌గ్రిడ్ 4.85%, సన్‌ఫార్మా 4.54 శాతం పెరిగాయి. ⇒ స్టాక్ మార్కెట్ ర్యాలీలో అన్ని రంగాల షేర్లూ పాలుపంచుకున్నాయి. బీఎస్ఈలో రంగాల వారీ సూచీల్లో సరీ్వసెస్ 4.86%, రియల్టీ 4.79%, పవర్ 4.79%, యుటిలిటీస్ 3.92%, క్యాపిటల్ గూడ్స్ 3.71%, ఇండస్ట్రియల్స్ 3.44%, కన్జూమర్ డిస్క్రేషనరీ 3.06%, మెటల్స్ 2.85%, ఫార్మా 2.83%, ఫైనాన్షియల్స్ సర్వీసెస్ 2.83% లాభపడ్డాయి. అమెరికా ట్రేడ్ డీల్ ఎఫెక్ట్... టెక్స్టైల్, లెదర్ స్టాక్స్: గోకుల్దాస్ ఎక్స్‌పోర్ట్స్ 20%, వెల్స్పన్ లివింగ్ 19.85%, గర్వారే టెక్నికల్ ఫైబర్స్ 17.07%, కేపీఆర్ మిల్స్ 15.31 శాతం ర్యాలీ చేశాయి.ఎస్పీ అప్పరెల్స్ 14.19% వర్ధమాన్ టెక్స్టైల్స్ 12.12%, ట్రిడెంట్ 11.27%, అర్వింద్ లిమిటెడ్ 10.23%, పేజ్ ఇండస్ట్రీస్ 3.79%, రేమాండ్ లైఫ్‌స్టయిల్ 3.39 శాతం లాభపడ్డాయి. సీఫుడ్స్ ఎక్స్‌పోర్ట్స్ షేర్లు: అవంతీ ఫీడ్స్, అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్ 20% ర్యాలీ చేసి వరుసగా రూ.961, రూ.351 వద్ద అప్పర్ సర్క్యూట్ తాకాయి. జీల్ ఆక్వా 10.58%, కింగ్స్ ఇన్ఫ్రా 7.64%, ముక్కా ప్రోటీన్స్ 5.01%, కోస్టల్ కార్పొరేషన్ 5% లాభపడ్డాయి. స్పెషాలిటీ కెమికల్స్: ఆర్తి ఇండస్ట్రీస్ 15.10%, గుజరాత్ ఫ్లోరో 6.82%, నవీన్ ఫ్లోరైన్ 6.22%, నియోజెన్ కెమ్ 6.19% పెరిగాయి. అతుల్ ఇండస్ట్రీస్ 5.25%, వినతి ఆర్గానిక్స్ 4.67%, ఎస్ఆర్ఎఫ్ 3.76%, ఆక్విటాస్ కెమ్ 1.26% లాభపడ్డాయి. వజ్రాభరణాల షేర్లు: గోల్డియమ్ ఇంటర్నేషనల్ 20%, వైభవ్ గ్లోబల్ 9.13%, కళ్యాణ్ జ్యువెలరీ 4.91%, శ్రింగార్ హౌస్ 4.51% మెరిశాయి. టైటాన్ 3%, పీఎన్ గాడ్గిల్ జ్యువెలర్స్ 1.52%, పీసీ జ్యువెలర్ 0.29% లాభపడ్డాయి. ఆటో ఉపకరణాల కంపెనీల షేర్లు: బెల్రైజ్ ఇండస్ట్రీస్ 7.37%, భారత్ ఫోర్జ్ 6.56%, సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ 6.44% బీఎల్డబ్ల్యూ ప్రిసిషన్ ఫోర్జింగ్స్ 6.13%, సుందరం ఫాస్టెనర్స్ 4%, భాష్, యూఎన్ఓ మిండా 3% పెరిగాయి. అదానీ షేర్ల పరుగులు: స్టాక్ మార్కెట్ ర్యాలీలో భాగంగా అదానీ కంపెనీల షేర్లు పరుగులు పెట్టాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ 10.61%, అదానీ ఎంటర్‌ప్రైజస్ 10.38%, అదానీ ఎనర్జీ సొల్యూ షన్స్ 10.23%, అదానీ పోర్ట్స్ 9.12%, అదానీ పవర్ 6.76%, అదానీ టోటల్ గ్యాస్ 4.52%, సంఘీ ఇండస్ట్రీస్ 3.60% లాభపడ్డాయి. -
భారత్ - యూఎస్ డీల్: భారీ లాభల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి అదే ఊపులో ముగిశాయి. సెన్సెక్స్ ఏకంగా 2,072.67 పాయింట్ల (2.54 శాతం) లాభంతో 83,739.13 వద్ద, నిఫ్టీ 639.15 పాయింట్ల (2.55 శాతం) లాభంతో 25,727.55 వద్ద నిలిచాయి.పారామౌంట్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్, ఫేజ్ త్రీ లిమిటెడ్, అవలోన్ టెక్నాలజీస్ లిమిటెడ్, ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, గర్వారే హై-టెక్ ఫిల్మ్స్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. పరాస్ పెట్రోఫిల్స్ లిమిటెడ్, ఆర్టెమిస్ మెడికేర్ సర్వీసెస్ లిమిటెడ్, TECIL కెమికల్స్ & హైడ్రో పవర్ లిమిటెడ్, కామత్ హోటల్స్ (ఇండియా) లిమిటెడ్, MPS లిమిటెడ్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి.అందులో భారీ లాభాల్లో..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం మార్కెట్లు భారీ లాభాల్లో ముగియడానికి ప్రధాన కారణం. భారత ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న పరస్పర టారిఫ్‌లను 25% నుంచి 18%కు తగ్గించారు. ఇది చైనా (35%), పాకిస్థాన్ (19%) కంటే తక్కువ కావడం విశేషం.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
2400 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం భారీగా పెరిగాయి. ఈరోజు ఉదయం 9:22 సమయానికి నిఫ్టీ(Nifty) 757 పాయింట్లు పెరిగి 25,846 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 2467 ఎగబాకి 84,160 వద్ద ట్రేడవుతోంది.మార్కెట్ల పెరుగుదలకు కారణాలు..భారత్-అమెరికా చరిత్రాత్మక డీల్అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం మార్కెట్లకు అతిపెద్ద బూస్ట్‌గా నిలువనుంది. భారత ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న పరస్పర టారిఫ్‌లను 25% నుంచి 18%కు తగ్గించారు. ఇది చైనా (35%), పాకిస్థాన్ (19%) కంటే తక్కువ కావడం విశేషం.రష్యా ఆయిల్ పెనాల్టీ తొలగింపురష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్ల కారణంగా భారత్‌పై ఉన్న అదనపు పెనాల్టీలను అమెరికా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. దీనివల్ల ఇంధన ఖర్చులు తగ్గి, ఎగుమతిదారులకు భారీ ఊరట కలగనుంది.ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత అంచనాలుఫిబ్రవరి 4-6 తేదీల్లో జరగనున్న ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశంపై అందరి దృష్టి ఉంది. ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం, ఆర్థిక వృద్ధిని మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉండటంతో రెపో రేటును 0.25% తగ్గించే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వడ్డీ రేట్లు తగ్గితే బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ రంగాలు భారీగా లాభపడే అవకాశం ఉంది. ఇది స్టాక్ మార్కెట్‌కు కలిసొచ్చే అంశం.బడ్జెట్ 2026-27 కేటాయింపులుఆదివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.12.2 లక్షల కోట్లు కేటాయించడం దీర్ఘకాలిక వృద్ధికి బాటలు వేసింది. సెమీకండక్టర్లు, ఫార్మా (బయోఫార్మా శక్తి), డిఫెన్స్, మౌలిక సదుపాయాల రంగాలకు బడ్జెట్ ఇచ్చిన ఊతం మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరుస్తోంది. డెరివేటివ్స్ (ఎఫ్ అండ్ ఓ)పై ఎస్టీటీ పెంపు వంటి స్వల్పకాలిక ప్రతికూలతలను అధిగమించి ఇన్వెస్టర్లు ఇప్పుడు దీర్ఘకాలిక వృద్ధిపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తుంది.Today Nifty position 03-02-2026(time: 9:24 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
యూఎస్-భారత్ డీల్.. మార్కెట్లు జోరందుకుంటాయా?
యూఎస్-భారత్ చరిత్రాత్మక వాణిజ్య ఒప్పందం దేశీయ స్టాక్ మార్కెట్లలో కొత్త ఉత్సాహాన్ని నింపనుంది. ఈరోజు గిఫ్ట్ నిఫ్టీ ఏకంగా 320 పాయింట్ల వరకు లాభపడటం చూస్తుంటే, నేడు దలాల్ స్ట్రీట్‌లో బుల్ రన్ పక్కా అనిపిస్తోంది. అమెరికా పన్నుల తగ్గింపు, ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత అంచనాలు, బడ్జెట్ 2026 కేటాయింపులు వెరసి ఇన్వెస్టర్లలో ఆశావాదాన్ని పెంచుతున్నాయి.మార్కెట్ జోరుకు ప్రధాన కారణాలు(అంచనా)భారత మార్కెట్లు నేడు భారీ గ్యాప్-అప్‌తో ప్రారంభం కావడానికి సిద్ధంగా ఉన్నాయని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.భారత్-అమెరికా చరిత్రాత్మక డీల్అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం మార్కెట్లకు అతిపెద్ద బూస్ట్‌గా నిలువనుంది. భారత ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న పరస్పర టారిఫ్‌లను 25% నుంచి 18%కు తగ్గించారు. ఇది చైనా (35%), పాకిస్థాన్ (19%) కంటే తక్కువ కావడం విశేషం.రష్యా ఆయిల్ పెనాల్టీ తొలగింపురష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్ల కారణంగా భారత్‌పై ఉన్న అదనపు పెనాల్టీలను అమెరికా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. దీనివల్ల ఇంధన ఖర్చులు తగ్గి, ఎగుమతిదారులకు భారీ ఊరట కలగనుంది.ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత అంచనాలుఫిబ్రవరి 4-6 తేదీల్లో జరగనున్న ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశంపై అందరి దృష్టి ఉంది. ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం, ఆర్థిక వృద్ధిని మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉండటంతో రెపో రేటును 0.25% తగ్గించే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వడ్డీ రేట్లు తగ్గితే బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ రంగాలు భారీగా లాభపడే అవకాశం ఉంది. ఇది స్టాక్ మార్కెట్‌కు కలిసొచ్చే అంశం.బడ్జెట్ 2026-27 కేటాయింపులుఆదివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.12.2 లక్షల కోట్లు కేటాయించడం దీర్ఘకాలిక వృద్ధికి బాటలు వేసింది. సెమీకండక్టర్లు, ఫార్మా (బయోఫార్మా శక్తి), డిఫెన్స్, మౌలిక సదుపాయాల రంగాలకు బడ్జెట్ ఇచ్చిన ఊతం మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరుస్తోంది. డెరివేటివ్స్ (ఎఫ్ అండ్ ఓ)పై ఎస్టీటీ పెంపు వంటి స్వల్పకాలిక ప్రతికూలతలను అధిగమించి ఇన్వెస్టర్లు ఇప్పుడు దీర్ఘకాలిక వృద్ధిపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తుంది.ఇన్వెస్టర్లు ఏం చేయాలి?అంతర్జాతీయ పరిణామాలు భారత్‌కు అనుకూలంగా ఉండటంతో ఐటీ, టెక్స్టైల్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ వంటి ఎగుమతి ఆధారిత కంపెనీల షేర్లలో కొనుగోళ్ల జోరు కనిపించవచ్చు. అయితే మార్కెట్ గరిష్టాల వద్ద ఉన్నప్పుడు లాభాల స్వీకరణ జరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి.ఇదీ చదవండి: ఒరాకిల్ నిధుల వేట.. రూ.14 లక్షల కోట్లు కావాలట! -
ఫ్లాట్‌గా కదలాడుతున్న మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఫ్లాట్‌గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:23 సమయానికి నిఫ్టీ(Nifty) 7 పాయింట్లు తగ్గి 24,836 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 141 పెరిగి నష్టపోయి 80,872 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 02-02-2026(time: 9:24 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సండే స్టాక్ మార్కెట్.. నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ
సాధారణంగా ఆదివారం రోజు స్టాక్ మార్కెట్లకు సెలవు. అయితే యూనియన్ బడ్జెట్ 2026 కారణంగా.. ఈ రోజు (ఫిబ్రవరి 1) కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు యధావిధిగా కొనసాగుతున్నాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు ఆదివారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:25 గంటలకు 290.58 పాయింట్ల నష్టంతో 82,275.79 వద్ద, నిఫ్టీ 117.45 పాయింట్ల నష్టంతో 25,301.45 వద్ద కొనసాగుతున్నాయి.యునైటెడ్ ఫుడ్‌బ్రాండ్స్ లిమిటెడ్, సర్వోటెక్ రెన్యూవబుల్ పవర్ సిస్టమ్ లిమిటెడ్, రాజ్‌దర్శన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, IKIO టెక్నాలజీస్ లిమిటెడ్, ఫుజియామా పవర్ సిస్టమ్స్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. హిందూస్తాన్ కాపర్ లిమిటెడ్, ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ గోల్డ్ ఈటీఎఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ గోల్డ్ ఈటీఎఫ్, ఇంటెలెక్ట్ డిజైన్ అరీనా లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలోకి చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
త్వరలో బడ్జెట్.. నష్టాల్లో మార్కెట్!
శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 296.59 పాయింట్ల నష్టంతో 82,269.78 వద్ద, నిఫ్టీ 98.25 పాయింట్ల నష్టంతో 25,320.65 వద్ద నిలిచాయి.పరాస్ పెట్రోఫిల్స్ లిమిటెడ్, రేమండ్ రియాల్టీ లిమిటెడ్, రేమండ్ లైఫ్‌స్టైల్ లిమిటెడ్, భారత్ బిజ్లీ లిమిటెడ్, భారత్ రోడ్ నెట్వర్క్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. సౌత్ ఇండియన్ బ్యాంక్ లిమిటెడ్, యాక్సిస్ గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్, హిందూస్తాన్ జింక్ లిమిటెడ్, కోటక్ గోల్డ్ ఈటీఎఫ్, వేదాంత లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
బడ్జెట్ సెషన్‌కు ముందు ఊగిసలాడుతున్న నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:38 సమయానికి నిఫ్టీ(Nifty) 167 పాయింట్లు తగ్గి 25,247 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 522 పాయింట్లు నష్టపోయి 82,071 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 30-01-2026(time: 9:38 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్ అప్డేట్: నష్టాల నుంచి లాభాల్లోకి..
గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 221.69 పాయింట్ల (0.27 శాతం) లాభంతో.. 82,566.37 వద్ద, నిఫ్టీ 76.15 పాయింట్ల (0.30 శాతం) లాభంతో 25,418.90 వద్ద నిలిచాయి.హిందూస్తాన్ కాపర్ లిమిటెడ్, పరాస్ పెట్రోఫిల్స్ లిమిటెడ్, క్యూబెక్స్ ట్యూబింగ్స్ లిమిటెడ్, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, జింకుశల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. తారా చంద్ ఇన్ఫ్రాలాజిస్టిక్ సొల్యూషన్స్ లిమిటెడ్, డిజికాంటెంట్ లిమిటెడ్, ఫైవ్-స్టార్ బిజినెస్ ఫైనాన్స్ లిమిటెడ్, సువిధా ఇన్ఫోసర్వ్ లిమిటెడ్, జిందాల్ డ్రిల్లింగ్ & ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
రెండు రోజుల లాభాలకు బ్రేక్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. వరుసగా రెండు రోజుల నుంచి లాభాల్లో కదలాడిన మార్కెట్లు ఈరోజు ఉదయం 9:39 సమయానికి నిఫ్టీ(Nifty) 115 పాయింట్లు తగ్గి 25,223 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 436 పాయింట్లు నష్టపోయి 81,898 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 29-01-2026(time: 9:39 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ట్రేడ్ డీల్ జోష్
ముంబై: ఐరోపా సమాఖ్య(ఈయూ)తో మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలోని సానుకూల సంకేతాల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం లాభాలతో ముగిసింది. బ్యాంకులు, మెటల్ షేర్లకు భారీ కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా సెన్సెక్స్ 320 పాయింట్లు పెరిగి 81,857 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 127 పాయింట్లు బలపడి 25,175 వద్ద నిలిచింది.⇒ దేశీయ ఆటో రంగ కంపెనీల షేర్లు భారీగా నష్టపోయాయి. భారత్–ఈయూల మధ్య కుదిరిన స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందంతో ఐరోపా దేశాల నుంచి దిగుమతి అయ్యే లగ్జరీ కార్లు చౌకగా లభించనున్నాయి. దీంతో మార్కెట్లో మరింత పోటీతత్వం పెరుగుతుందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఫలితంగా మహీంద్రాఅండ్‌మహీంద్రా 4%, హ్యుందాయ్ మోటార్స్ 4% పతనమయ్యాయి. మారుతీ సుజుకీ 1.50%, టాటా మోటార్స్ పీవీ 1.22%, ఎంఆర్ఎఫ్ 1.20%, అశోక్ లేలాండ్ 0.50% నష్టపోయాయి. ⇒ ఈయూతో స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందంతో రెడీమేడ్ గార్మెంట్స్, కాటన్, హోమ్ టెక్స్టైల్స్ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు తగ్గి ఎగుమతులు మరింత పెరగొచ్చనే ఆశావహ అంచనాలతో దేశీయ టెక్స్టైల్స్ కంపెనీ షేర్లకు డిమాండ్ నెలకొంది. ఇండో కౌంట్ ఇండస్ట్రీస్, కేఆర్పీ మిల్స్ 6% ర్యాలీ చేశాయి. వెల్స్పన్ లివింగ్ 4.22%, అలోక్ ఇండస్ట్రీస్ 2.50%, ట్రిడెంట్ 2%, అరవింద్ అరశాతం లాభపడ్డాయి. భారత టెక్స్టైల్, రెడీమేడ్ వ్రస్తాల ఎగుమతులకు అమెరికా తర్వాత యూరోపియన్ యూనియన్ రెండో అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. -
స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్
మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 319.77 పాయింట్ల లాభంతో.. 81,857.48 వద్ద, నిఫ్టీ 126.75 పాయింట్ల లాభంతో 25,175.40 వద్ద నిలిచాయి.టాప్ గెయినర్స్ జాబితాలో ఆంటెలోపస్ సెలాన్ ఎనర్జీ లిమిటెడ్, ఆటోమోటివ్ స్టాంపింగ్స్ అండ్ అసెంబ్లీస్ లిమిటెడ్, హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ కంపెనీ ఇండియా లిమిటెడ్, అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్ లిమిటెడ్, కామధేను లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. వన్‌సోర్స్ స్పెషాలిటీ ఫార్మా లిమిటెడ్, ఐఎఫ్బీ ఇండస్ట్రీస్ లిమిటెడ్, సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్, SBFC ఫైనాన్స్ లిమిటెడ్, ఇన్ఫోబీన్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.


