సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 47.01 పాయింట్లు లేదా 0.061 శాతం లాభంతో 77,616.40 వద్ద, నిఫ్టీ 4.10 పాయింట్లు లేదా 0.017 శాతం లాభంతో 24,211.00 వద్ద నిలిచాయి.
తైన్‌వాలా కెమికల్స్ & ప్లాస్టిక్స్ (ఇండియా) లిమిటెడ్, బీఎఫ్ యూటిలిటీస్ లిమిటెడ్, బోరోసిల్ లిమిటెడ్, జీఎన్ఎ యాక్సిల్స్ లిమిటెడ్, సంగమ్ (ఇండియా) లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. శ్రద్ధా రియల్టీ లిమిటెడ్, యూనికెమ్ లాబొరేటరీస్ లిమిటెడ్, శ్రీ కృష్ణ దేవ్‌కాన్ లిమిటెడ్, కాంకర్డ్ ఎన్విరో సిస్టమ్స్ లిమిటెడ్, ఎస్జీ మార్ట్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


