రైలు బోగినే హనీమూన్ సూట్‌గా మార్చిన ఘటన మరువక ముందే మరో రైలు ఘటన నెట్టింట వైరల్‌గా మారింది. కదులుతున్న రైలులో పూజ పరమైన కార్యక్రమాలు జరుగుతున్న వీడియో..నెట్టించ చర్చలకు దారితీసింది. భారతీయ రైల్వేలోనే ఇలాంటి వాటికి అనుమతి ఉంటుందా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆ వీడియలోఓ ప్రయాణికులు రైలు కోచ్ లోపల మతపరమైన పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు స్పష్టంగా కనిపించడంతోనే ఇలా కదులుతున్న రైలు ఇలాంటి ఆచారాలు నిర్వహించుకోవచ్చా అనే ప్రశ్నలు వెల్లువెత్తాయి. ఈ ఘటన ఉత్తర మధ్య రైల్వేలో చోటు చేసుకుంది.
అయితే రైలులో ఇలాంటి వాటికి అనుమతి ఉంటుందా అని అంతా అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై ఉత్తర రైల్వే ఇలా వివరణ ఇచ్చింది. ఈ వైరల్ వీడియో ఘటనతో ఉత్తరరైల్లే ఇలా వివరణ ఇచ్చింది. ఐఆర్‌సిటిసి (IRCTC) ద్వారా వాణిజ్య బుకింగ్ ద్వారా ప్రేవేట్‌గా బుక్ చేసుకున్న సెలూన్ కోచ్‌గా పేర్కొది. అందులోనే ఈ మతపరమైన ఆచారాలు జరిగినట్లు ఉత్తర రైల్వే స్పష్టం చేసింది. ఆ కార్యక్రమం సాధారణ ప్యాసింజర్ కోచ్‌లో కాకుండా IRCTC ద్వారా ఒక ప్రైవేట్ వ్యక్తి బుక్ చేసుకున్న సెలూన్ కోచ్‌లో జరిగిందని తెలిపింది.
ఈ సెలూన్ కోచ్ అనేది సీనియర్ రైల్వే అధికారులు, వీఐపీల కోసం ఉద్దేశించిన విలాసవంతమైన ప్రైవేట్ బోగీ. ఇందులో ఎయిర్ కండిషన్డ్ బెడ్‌రూమ్‌లు, ఒక చిన్న వంటగది, లివింగ్, డైనింగ్ రూమ్‌ల తోకూడిన వాష్‌రూమ్ సౌకర్యాలు ఉంటాయి. ఆ వ్యక్తి ఈ వాణిజ్య రిజర్వేషన్ కోసం అడ్వాన్స్‌గా రూ. 3 లక్షలకు పైగా జమ చేసినట్లు పేర్కొంది.
ఈ సెలూన్ కోచ్‌ను జూలై 10న న్యూఢిల్లీ (NDLS) నుంచి ముంబై (BDTS)కి వన్-వే ప్రయాణం కోసం రైలు నెం. 12926 పశ్చిమ్ ఎక్స్‌ప్రెస్‌కు జతచేయాల్సి ఉందని వెల్లడించింది. అదే సమయంలో ప్రయాణికుల భద్రత, రైళ్లు సజావుగా నడపడం తమ అత్యంత ప్రాధాన్యత అని రైల్వే అదికారులు నొక్కి చెప్పారు.
Hello @AshwiniVaishnaw, was this approved by @RailMinIndia? If so, What is the procedure? pic.twitter.com/9VUJP53lJQ
— Mohammed Zubair (@zoo_bear) July 12, 2026
(చదవండి: 15 ఏళ్లకే చదువుకి మానేసింది..! కట్‌చేస్తే రూ 7 వేల కోట్ల కంపెనీ..)


