పింక్‌ బనారసి పట్టు చీరలో అందమైన గులాబీలా నీతా అంబానీ..! | Nita Ambanis pink Banarasi silk saree pays tribute to Varanasis Gulab Holi | Sakshi
Sakshi News home page

పింక్‌ బనారసి పట్టు చీరలో అందమైన గులాబీలా నీతా అంబానీ..!

Jul 13 2026 11:10 AM | Updated on Jul 13 2026 11:38 AM

Nita Ambanis pink Banarasi silk saree pays tribute to Varanasis Gulab Holi

రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ సాంప్రదాయ శైలి చీరలతో ఆకట్టుకోవడంలో ముందుంటారు. తరుచుగా అద్భుతమైన చేనేత చీరలు, విలువైన ఆభరణాలతో మెరిస్తుంటారు. తాజాగా మరోసారి అద్బుతమైన చేనేత చీరలో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఆమె వారణాసిలో ఫార్చ్యూన్‌ మోస్ట్‌ పవర్‌ఫుల్‌ ఉమెన్‌ కార్యక్రమం కోసం స్వదేశ్‌ వారి అద్భుతమైన తంచోయ్‌ బనారసీ పట్టు చీరను ఎంచుకున్నారు. 

వారణాసిలో భక్తి, పండుగ ఆనందాల్లో ప్రధాన పాత్ర పోషించే గులాబీ రేకులలో నిండిపోయే హోలీ వేడుక స్ఫూర్తితో రూపొందిచారు నీతా తంచోయ్‌ బనారసీ పట్టు చీరను. ఈ చీరలో నీతా రాజసంగా కనిపించారు. ఈ లేత గులాబీ రంగు ఆ పవిత్ర నగర ప్రసిద్ధ పండుగతో ముడిపడి ఉన్న ప్రశాంతతను అందంగా ఆవిష్కరించింది నీతా పింక్‌ బనారసీ చీర. 

ఆమె దీన్ని వారణాసి గులాబ్‌ హోలీకి నివాళిగా ధరించారు. ఈ చీరపై అంత్యంత క్లిష్టమైన పూల జాలీ డిజైన్‌ ఉంది. దీనిపై  లేత ఐవరీ, పురాతన బంగారు రంగులలో సుందరంగా నేసిన పూల బుట్టాలతో డెకరేట్‌ చేశారు. ఈ వివరమైన డిజైన్లు చీరకు గొప్ప ఆకృతిని, ప్రకాశవంతమైన మెరుపుని అందించాయి. ఈ నేత రెండు వైపులా ఒకలా ఉండి ఎటునుంచైనా ధరించేలా ఉండటమే దీని ప్రత్యేకత. దీన్ని ప్రఖ్యాత కళాకారులు ఆరుషి లోహియా, కృష్ణ లోహియా రెండు నెలల పాటు చేతితో నేశారు. 

ఈ బనారసీ పట్టు చీర నేత వారసత్వానికి, హస్త కళా నైపుణ్యానికి ప్రతీక. ఈ చీరకు సరిపోయే లేత గులాబీ రంగు బ్లౌజ్‌ వింత్ మోచేతి వరకు ఉండేలా జత చేశారు. ఈ బ్లౌజ్‌ క్లాసిక్‌ స్వేర్‌ నెక్లైన్‌ ఉంది. ఈ చీరకు అనుగుణంగా పూల స్టడ్ చెవిపోగులు, సున్నితమైన గుండె ఆకారపు డైమండ్ పెండెంట్, టెన్నిస్ బ్రాస్‌లెట్, ఒక స్టేట్‌మెంట్ రింగ్‌, లగ్జరీ వాచ్‌లను ధరించారు. 

ఈ చీర అందంగా కనిపించేలా చాలా తక్కువ ఆభరణాలనే ధరించారు నీతా. ఇక తన బ్యూటీ లుక్‌ కోసం నేచురల్‌ గ్లామర్‌నే ఎంచుకుంది. సాంప్రదాయా మహిళలా ఎర్రటి బొట్టు, పాపిడి తీసి జుట్టుని చక్కటి కొప్పులా తీర్చిదిద్దుకుంది. ఆ కార్యక్రమానికి అనుగుణంగా శక్తిమంతమైన సాంప్రదాయ శైలిలో హుందాగా కనిపించింది నీతా అంబానీ.

 

(చదవండి: వాకింగ్‌'కి అత్యంత అనుకూలమైన నగరం అదే..! కానీ హారన్‌ కొట్టారో..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement