లా గోమోరా, స్పెయిన్
స్పెయిన్ లోని కేనరీ దీవుల్లో ఉన్న చిన్న ద్వీపం లా గోమెరాలో ఒక వింత సాంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. ఇక్కడి ప్రజలు కొన్ని సందర్భాల్లో మాటలతో కాకుండా ఈలల ద్వారానే మాట్లాడుకుంటారు.
ఈ ప్రత్యేక భాషను సిల్బో గొమెరో అని పిలుస్తారు. పర్వతాల మధ్య ఉన్న లోయలు, ఘాట్ రోడ్ల వల్ల దూరంగా ఉన్న వారికి సందేశం పంపడానికి ఈ పద్ధతి అనేక శతాబ్దాల నుంచి కొనసాగుతోంది. కొన్ని సందర్భాల్లో 5 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఈల శబ్దంతోనే సందేశాన్ని చేరవేస్తారట ఇక్కడ.
ఒకానొక సమయంలో రోడ్లు, ఫోన్లు ఎక్కువ అవడంతో ఈ సంప్రదాయం అంతరిస్తుందేమో అని చాలా మంది భయపడ్డారట. కానీ లా గోమెరా అధికారులు తమ ఈల భాషను రక్షింకునేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ఈ ద్వీపంలోని ప్రైమరీ, సెకండరీ స్కూల్స్‌లో సిల్బో గొమెరో అనే ఈల భాషను తప్పనిసరిగా బోధిస్తున్నారు. 2009లో యునెస్కో కూడా ఈ భాషను ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్‌గా గుర్తించి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చేసింది.
కొన్ని పరిశోధనల ప్రకారం ఈ ఈల శబ్దాలు విన్నప్పుడు వాటిని వినే వారి మెదడులో సాధారణ భాషను అర్థం చేసుకునే లాంగ్వేజ్ సెంటర్లు అలాగే పని చేస్తాయట. అంటే మన మెదడు శబ్దం ఎలా ఉన్నా కూడా దానిలో ఉన్న అర్థాన్ని డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తుంది అని ఈ పరిశోధనలు చెబుతున్నాయి. ఈ సాంకేతిక యుగంలో కూడా ఈ ఈల భాష ఇంకా వాడుకలో ఉండడం అనేది నిజంగా అద్భుతం. సిల్బో గొమెరో అనేది మానవ సజనాత్మకత, సంస్కతి, ప్రకతికి అనుగుణంగా మనిషి ఎలా మారగలడో చూపించే అరుదైన ఉదాహరణగా నిలిచింది.


