జర్నలిస్ట్‌ను పెళ్లాడిన ‘ఆర్‌జీ కర్‌’ దర్శకుడు.. రూమర్లకు ఎండ్‌కార్డ్‌! | BJP Leader Shankudeb Panda Marries TV Journalist Swarnali Mita Sarkar In Kolkata, Watch Video Viral On Social Media | Sakshi
Sakshi News home page

జర్నలిస్ట్‌ను పెళ్లాడిన ‘ఆర్‌జీ కర్‌’ దర్శకుడు.. రూమర్లకు ఎండ్‌కార్డ్‌!

Jul 13 2026 9:05 AM | Updated on Jul 13 2026 10:24 AM

BJP leader Shankudeb Panda marries TV journalist Swarnali Mita Sarkar

కోల్‌కతా: ప్రముఖ బీజేపీ నేత, సినీ దర్శకుడు శంకుదేబ్ పాండా తాజాగా టెలివిజన్ జర్నలిస్ట్, రిపబ్లిక్ బంగ్లా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ స్వర్ణాలి మితా సర్కార్‌ను కోల్‌కతాలో వివాహం చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం సంప్రదాయ బెంగాలీ పద్ధతిలో వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. గత కొన్నేళ్లుగా వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై వస్తున్న ఊహాగానాలకు ఈ పెళ్లితో తెరపడింది. ఈ వివాహ వేడుకకు రాజకీయ, వినోద, మీడియా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
 

వివాహ వేడుకలో శంకుదేబ్ పాండా ఎరుపు రంగు కుర్తా, ధోవతి ధరించగా.. స్వర్ణాలి మితా సర్కార్ సాంప్రదాయ బంగారు ఆభరణాలు, ఎరుపు రంగు బనారసి చీరలో మెరిసిపోయారు. పెళ్లికి ముందు జరిగిన ‘గాయే హోలుద్’వేడుక ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. శంకుదేబ్ పాండా రాజకీయాలతో పాటు సినిమా రంగంలోనూ కొనసాగుతున్నారు. ఆర్జీ కర్ ఆస్పత్రి అత్యాచారం, హత్య ఉదంతం ఆధారంగా ఆయన త్వరలో ‘అభయ శక్తి’ అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. రాణా సర్కార్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆగస్టులో ప్రారంభం కానుంది. ఈ ఘటనకు సంబంధించిన కీలక పరిణామాలను ఈ చిత్రంలో చూపించనున్నట్లు, ఇది కేవలం సినిమా మాత్రమే కాదని, ఒక ఉద్యమమని శంకుదేబ్ పేర్కొన్నారు. వివాహ బంధంతో సరికొత్త జీవితాన్ని ప్రారంభించిన ఆయన, త్వరలోనే ఈ సినిమా పనుల్లో బిజీ కానున్నారు.

ఇది కూడా చదవండి: అయోధ్య విరాళాల గోల్‌మాల్‌: ఆరెస్సెస్ నమ్మకం ఇదే.. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement