సినిమా సూపర్ హిట్.. డైరెక్టర్‌కి కాస్ట్‌లీ కారు గిఫ్ట్ | Sivakarthikeyan Gifts mahindra BE6 Thaai Kizhavi Director | Sakshi
Sakshi News home page

Thaai Kizhavi Director: రూ.80 కోట్ల కలెక్షన్స్.. 100 రోజులు.. బహుమతిగా కారు

Jul 8 2026 7:26 PM | Updated on Jul 8 2026 7:45 PM

Sivakarthikeyan Gifts mahindra BE6 Thaai Kizhavi Director

సినిమా హిట్ అయితే హీరోలకు లేదా దర్శకులకు నిర్మాత.. కారు గిఫ్ట్ ఇవ్వడం లాంటివి టాలీవుడ్‌లో చూస్తూనే ఉంటాం. మిగతా ఇండస్ట్రీల్లోనూ ఈ ట్రెండ్ కొనసాగుతోంది. ఇప్పుడు అలా తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ నిర్మాతగానూ అడపాదడపా మూవీస్ చేస్తుంటాడు. అలా ఈ ఏడాది ఓ మూవీ నిర్మించగా అది ఊహించని సక్సెస్ అందుకుంది. ఇప్పడా చిత్ర దర్శకుడికే ఖరీదైన కారుని బహుమతిగా ఇచ్చాడు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: మళ్లీ పెళ్లి చేసుకున్న హీరోయిన్ 'కలర్స్' స్వాతి.. ఫొటోలు వైరల్)

రాధిక ప్రధాన పాత్రలో శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహించిన సినిమా 'థాయ్ కిళవి'. ఈ ఏడాది ఫిబ్రవరి చివరలో థియేటర్లలో రిలీజైంది. రీసెంట్‌గానే విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకుంది. ఫైనల్ రన్ పూర్తి చేసుకుని మొత్తంగా రూ.80 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఈ సందర్భంగా మూవీ టీమ్ అంతా కలిసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ కార్యక్రమం అనంతరం నిర్మాత శివకార్తికేయన్.. దర్శకుడు శివకుమార్‌కి రూ.20 లక్షలు విలువ చేసే మహీంద్రా బీఈ6 కారుని బహుకరించాడు.

ఇకపోతే శివకుమార్ మురుగేశ్ ప్రస్తుతం శివకార్తికేయన్ హీరోగా 'సెయాన్' అనే సినిమాని తీస్తున్నాడు. కుమారస్వామి నేపథ్య కథతో దీనిని తెరకెక్కిస్తున్నారు. కమల్ హాసన్ నిర్మాత కాగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్.

(ఇదీ చదవండి: ఓటీటీలో సూపర్ హిట్ సినిమా 'తాయ్ కిళవి' తెలుగు రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement