మళ్లీ పెళ్లి చేసుకున్న 'కలర్స్' స్వాతి.. ఫొటోలు వైరల్ | Actress Swati Ties Knot With Director Srikanth Nagothi | Sakshi
Sakshi News home page

Colors Swati Wedding: దర్శకుడితో స్వాతి వివాహం.. సడన్ సర్‌ప్రైజ్

Jul 8 2026 5:10 PM | Updated on Jul 8 2026 5:45 PM

Actress Swati Ties Knot With Director Srikanth Nagothi

'కలర్స్' స్వాతిగా గుర్తింపు తెచ్చుకున్న తెలుగు హీరోయిన్ మళ్లీ పెళ్లి చేసుకుంది. అది కూడా ఓ టాలీవుడ్ దర్శకుడినే కావడం విశేషం. ఇందుకు సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియాలో పంచుకుని అందరికీ షాకిచ్చింది. ఇప్పుడీ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.

(ఇదీ చదవండి: 'టాక్సిక్' రొమాంటిక్ వీడియో సాంగ్.. పెద్దలకు మాత్రమే)

తెలుగమ్మాయి అయిన స్వాతి.. 'కలర్స్' ప్రోగ్రాంతో యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. 2005లో విడుదలైన 'డేంజర్' అనే తెలుగు సినిమాతో నటిగా పరిచయమైంది. 'అష్టాచమ్మా' మూవీతో హీరోయిన్ అయిపోయింది. తర్వాత గోల్కొండ హైస్కూల్, కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్రాజు, కార్తికేయ, స్వామి రారా, పంచతంత్రం, మంత్ ఆఫ్ మధు తదితర మూవీస్ చేసింది.

చివరగా ఈమె 2023లో 'మంత్ ఆఫ్ మధు' మూవీ చేసింది. అయితే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన శ్రీకాంత్ నాగోతితో ఎప్పుడు ప్రేమలో పడిందో ఏమో గానీ ఇప్పుడు బుధవారం(జూలై 08) ఇతడిని పెళ్లి చేసుకుంది. ఇంట్లోనే సింపుల్‌గా ఈ వేడుక జరిగినట్లు ఈమె పోస్ట్ చేసిన ఫొటోల బట్టి అర్థమవుతోంది. 2018లో ఈమె వికాస్ వాసు అని పైలెట్‌ని వివాహం చేసుకుంది. కానీ వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్న విషయం బయటకు రాలేదు. ఇప్పుడు మళ్లీపెళ్లి చేసుకుని అందరికీ స్వాతి షాకిచ్చింది.

(ఇదీ చదవండి: ఓటీటీలో సైకలాజికల్ డార్క్ కామెడీ సినిమా.. తెలుగు రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement