వయనాడ్: సెకన్ల వ్యవధిలో చావును జయించి.. | Wayanad Meppadi Landslide Miracle Escape Survivors Shares Terrifying Experience, Watch Video Inside Trending On Social Media | Sakshi
Sakshi News home page

వయనాడ్: సెకన్ల వ్యవధిలో చావును జయించి..

Jul 8 2026 8:34 AM | Updated on Jul 8 2026 9:42 AM

Meppadi Landslide Miracle Escape Survivors Account

కల్లాడి (కేరళ): ‘అసలు ఏం జరుగుతోందో నాకు అర్థం కాలేదు. బురద, నీరు మెరుపు వేగంతో మా వైపు దూసుకురావడం చూసి ప్రాణాలు దక్కించుకోవడానికి పరుగెత్తాం. ఎంత వేగంగా పరిగెత్తినా, అసలు కదలడం లేదనే భావన కలిగింది. భయంతో కాళ్లు పూర్తిగా సహకరించలేదు’ అని వయనాడ్ సమీపంలోని మేప్పాడిలో సంభవించిన ఘోర కొండచరియల విపత్తు నుండి ప్రాణాలతో బయటపడిన కూడమ్మాల్ ఆ ఘోర ఉదంతాన్ని గుర్తుచేసుకున్నారు.
 

బ్యాంకుకు వెళ్లే ఉద్దేశ్యంతో బస్సు ఎక్కేందుకు కూడమ్మాల్, ఆమె భర్త స్థానిక బస్టాప్‌ వద్దకు నడుచుకుంటూ వెళ్లారు. బస్ షెల్టర్ వద్ద మరో కొన్ని నిమిషాలు ఉండి ఉంటే, తాము సజీవ సమాధి అయ్యేవాళ్లమని ఆమె పేర్కొన్నారు. మీనాక్షి వంతెన సమీపంలోని ఒక దుకాణంలో రికార్డైన సీసీటీవీ ఫుటేజ్ ఈ విపత్తు తీవ్రతను కళ్లకు కడుతోంది. వంతెనను తాకుతూ బురద, నీరు ఉధృతంగా ప్రవహించడాన్ని అందులో చూడవచ్చు. వారి వెనుకే ఒక భారీ వాటర్ ట్యాంకర్ లారీ బురద ప్రవాహంలో కొట్టుకుపోతుండగా, దంపతులిద్దరూ ప్రాణభయంతో పరుగెత్తడం ఆ వీడియోలో నమోదైంది. అదృష్టవశాత్తూ, కూడమ్మాల్, ఆమె భర్త ఇద్దరూ ఎటువంటి పెద్ద గాయాలు లేకుండా ప్రాణాలతో బయటపడ్డారు.



ఇది కూడా చదవండి: ముంబై రన్‌వేపై తృటిలో తప్పిన విమాన ప్రమాదం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement