కలెక్టర్ల జీతభత్యాల మాటేంటి? | District Collector salary allowances in Telugu states | Sakshi
Sakshi News home page

కలెక్టర్ల జీతభత్యాల మాటేంటి?

Jul 7 2026 8:33 AM | Updated on Jul 7 2026 12:10 PM

District Collector salary allowances in Telugu states

ఒక జిల్లాకు శాంతిభద్రతల పరిరక్షణ నుంచి సంక్షేమ పథకాల అమలు వరకు సర్వం తానై నడిపించే సారథి జిల్లా కలెక్టర్. తెలుగు రాష్ట్రాల్లో ఐఏఎస్ అధికారులకు ఉండే క్రేజ్, గౌరవం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నీలివెలుగుల వాహనం, ఖాకీల సెల్యూట్లు, వందలాది మంది సిబ్బంది.. ఇవన్నీ చూసే ప్రతి యువకుడు తానూ ఒక కలెక్టర్ కావాలని కలలుకంటాడు. అయితే ఇటీవల తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీ నేపథ్యంలో ప్రతిష్టాత్మక అధికారాలు చలాయించే జిల్లా కలెక్టర్ల అసలు వేతనం ఎంత? వారికి లభించే అలవెన్స్‌లు, రాజభోగాలు ఎలా ఉంటాయో క్షేత్రస్థాయి అధికారిక విశ్లేషణ కింద చూద్దాం.(కేడర్‌నుబట్టి వారి జీతభత్యాల్లో స్వల్ప తేడాలుంటాయని గమనించాలి)

7వ వేతన సంఘం ప్రకారం జీతాల వర్గీకరణ

భారతదేశంలో ఐఏఎస్ అధికారుల వేతనాలు కేంద్ర ప్రభుత్వపు 7వ వేతన సంఘం నిర్దేశించిన పే మ్యాట్రిక్స్ ఆధారంగా ఖరారవుతాయి. సర్వీసులో వారు పూర్తి చేసిన కాలం, ప్రమోషన్ల ఆధారంగా ఈ వేతనం మారుతుంది.

ప్రారంభ స్థాయి (జూనియర్‌ టైమ్‌ స్కేల్‌- లెవల్‌ 10): సివిల్స్ పాసై శిక్షణ పూర్తి చేసుకున్న కొత్తలో అసిస్టెంట్ కలెక్టర్ / సబ్ కలెక్టర్ హోదాలో ఉన్నప్పుడు ప్రాథమిక వేతనం(బేసిక్‌ పే) రూ.56,100 గా ఉంటుంది.

కలెక్టర్ స్థాయి (జూనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ గ్రేడ్‌-లెవల్‌ 12): సాధారణంగా 9 నుంచి 12 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకుని పూర్తిస్థాయి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టే అధికారి ప్రాథమిక వేతనం రూ.78,800 నుంచి ప్రారంభమవుతుంది.

సీనియర్ కలెక్టర్ స్థాయి (సెలక్షన్‌ గ్రేడ్‌-లెవల్‌ 13): దాదాపు 13 నుంచి 16 ఏళ్ల అనుభవంతో సీనియర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసే వారి బేసిక్ పే రూ.1,18,500కి పెరుగుతుంది.

జీతాన్ని పెంచే అలవెన్స్‌లు (భత్యాలు)

ప్రాథమిక వేతనానికి అదనంగా ప్రభుత్వం కల్పించే భత్యాల వల్లే కలెక్టర్ల నెలవారీ గ్రాస్ శాలరీ భారీగా పెరుగుతుంది. అందులో ముఖ్యమైనవి..

కరువు భత్యం (డీఏ): ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా రెండు సార్లు (జనవరి, జులై) డీఏని సవరిస్తుంది. ప్రస్తుతం ఇది ప్రాథమిక వేతనంలో కీలక శాతంగా ఉంటూ జీతాన్ని రెట్టింపు స్థాయికి చేరుస్తుంది.

ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ): పోస్టింగ్ ఉన్న నగరం / జిల్లాను బట్టి (X, Y, Z కేటగిరీలు) బేసిక్ పే లో 8% నుంచి 24% వరకు హెచ్‌ఆర్‌ఏ లభిస్తుంది. అయితే, కలెక్టర్‌ కేడర్‌ ఉద్యోగులకు ప్రభుత్వం అధికారిక బంగ్లా కేటాయిస్తుంది కాబట్టి వీరికి హెచ్‌ఆర్‌ఏ వర్తించదు.

ప్రయాణ భత్యం (టీఏ): అధికారిక ప్రయాణాల నిమిత్తం నెలకు నిర్ణీత రవాణా భత్యం అందుతుంది. దీనికి కూడా డీఏ తోడవుతుంది.

అలవెన్స్‌లకు మించిన అధికారిక వసతులు

నిజానికి కలెక్టర్ల జీతం కంటే ప్రభుత్వం వారికి కల్పించే హోదా, సౌకర్యాలే అత్యంత విలువైకనవి. ఒక జిల్లా అధిపతిగా వారికి లభించే రాజభోగాలు ఇవే..

వసతి రకంకల్పించే సౌకర్యాల వివరాలు
అధికారిక నివాసంవిశాలమైన ల్యాన్, క్యాంప్ ఆఫీస్‌తో కూడిన కలెంట్ బంగ్లా. దీని నిర్వహణ, తోటపని అంతా ప్రభుత్వ ఖర్చుతోనే జరుగుతుంది.
రవాణా సౌకర్యండ్రైవర్‌తో కూడిన విలాసవంతమైన ప్రభుత్వ వాహనం. ఇంధన ఖర్చులు, రిపేర్లు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది.
భద్రతకలెక్టర్ నివాసానికి గన్‌మెన్లు, హోంగార్డుల ప్రత్యేక భద్రత ఉంటుంది. అవసరాన్ని బట్టి ఎస్కార్ట్ వాహనం కూడా కేటాయిస్తారు.
ఉచిత సేవలుఉచిత విద్యుత్ (పరిమితులకు లోబడి), హైస్పీడ్ ఇంటర్నెట్, ల్యాండ్‌లైన్‌, మొబైల్ కనెక్షన్లు.
సిబ్బందిఇంటిపనుల కోసం ప్రత్యేక సహాయకులు (డొమెస్టిక్ స్టాఫ్), వంట మనుషులు, క్యాంప్ క్లర్కులు అందుబాటులో ఉంటారు.

ఇదీ చదవండి: వినియోగదారులను ముంచే ‘ఉత్తుత్తి’ ప్రకటనలు

district collector salary1
1/2

district collector salary2
2/2

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement