కేరళ: విరిగిపడిన కొండచరియలు.. ప్రమాదంలో 50 మంది కార్మికులు! | Landslide at Wayanad Tunnel Site: Dozens Feared Trapped as Rescue Operations Intensify | Sakshi
Sakshi News home page

కేరళ: విరిగిపడిన కొండచరియలు.. ప్రమాదంలో 50 మంది కార్మికులు!

Jul 7 2026 12:59 PM | Updated on Jul 7 2026 3:39 PM

Landslide at Wayanad Tunnel Site: Dozens Feared Trapped as Rescue Operations Intensify

వయనాడ్‌: కేరళలోని వయనాడ్ టన్నెల్ ప్రాజెక్టు నిర్మాణ స్థలంలో మంగళవారం భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షాల కారణంగా కల్లాడిలోని మీనాక్షి బ్రిడ్జి సమీపంలో ఉన్న సొరంగం నిర్మాణ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 30 నుంచి 50 మంది వరకు కార్మికులు భూగర్భంలో చిక్కుకుపోయినట్లు అనుమానిస్తున్నారు. నిర్మాణ సంస్థకు చెందిన తాత్కాలిక కార్యాలయ కంటైనర్లు, బస్సులు, కార్లు, జెసిబి యంత్రాలు పూర్తిగా మట్టి దిబ్బల కింద పూడుకుపోయాయి.

స్థానికులు కొందరు బాధితులను రక్షించి హారిసన్ మలయాళం ఎస్టేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్, రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ రంగంలోకి దిగి సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. భారీ వృక్షాలు కూలిపోవడం, సమీపంలోని చిన్న నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకం కలుగుతోంది. ముందస్తు జాగ్రత్తగా చుట్టుపక్కల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ఈ ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి వీడీ సతీశన్ అత్యవసర సమావేశం నిర్వహించి, పరిస్థితిని సమీక్షించారు.

LIVE: మళ్లీ వయనాడ్‌లో... ప్రమాదంలో 50 మంది కార్మికులు!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement