breaking news
Jayashankar
-
నగదే నయం
భూపాలపల్లి: జేబిలో చిల్లిగవ్వ లేకపోయినా.. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. సెకన్లలో లావాదేవీలు జరిగిపోయేవి. అయితే అక్టోబర్ 15వ తేదీ నుంచి కేంద్రం అమల్లోకి తీసుకురానున్న డిజిటల్ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్)తో వ్యాపారులతోపాటు సామాన్యులపై సైతం భారం పడనుంది. కేంద్రం తీసుకొస్తున్న ఎండీఆర్‌తో చిరు, పెద్ద వ్యాపారులపై తీవ్ర భారం పడనుండగా సామాన్యులు కొన్ని రంగాల్లో పేమెంట్ల విషయంలో ఇబ్బంది ఎదుర్కోనున్నారు. విద్యుత్, నీటి బిల్లులు, గ్యాస్, స్కూల్, కాలేజీ ట్యూషన్ ఫీజులు, టెలికాం చార్జీలు, రైలు టికెట్లు, పెట్రోల్, డీజిల్, బీమా ప్రీమియం వంటి విభాగాల్లో యూపీఐ చెల్లింపులకు రూ.5 స్థిర ఎండీఆర్ ఛార్జీలు వసూలు చేస్తామని కేంద్రం ప్రకటించింది. అయితే ఆయా చార్జీలు సంబంధిత సంస్థల నుంచి వసూలు చేసే అవకాశం ఉన్నప్పటికీ పరోక్షంగా ప్రజల పైనే భారం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలోని కుటుంబాల సంఖ్య సుమారుగా 1,11,383. కుటుంబానికి నలుగురు చొప్పున అంచనావేసినా.. జిల్లా జనాభా 4,16,763 ఉంటుంది. ఇందులో ఒక్కో కుటుంబం నెలకు సుమారుగా రూ.10 వేల వరకు యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తుంది. విద్యుత్, నీటి, గ్యాస్ తదితర చెల్లింపులు రూ.2 వేల లోపే ఉంటుండగా మిగిలిన చెల్లింపులు 5,56,915 జరిగే అవకాశం ఉంది. వీటిపై కేంద్రం కొత్తగా విధించే ఎండీఆర్ సుమారు రూ.5 చొప్పున వేస్తే అదనంగా రూ.27,84,575 వరకు భారం పడనుంది.యూపీఐ చెల్లింపు వ్యవస్థ ప్రజల్లోకి బాగా విస్తరించి ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో యూపీఐ వ్యాపార లావాదేవీలపై ఎండీఆర్ విధించటంతో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడునుంది. వ్యాపార వర్గాలు ఈ రుసుముల భారాన్ని వస్తువు ఉత్పత్తుల ధరల పెంపు రూపంలో లేదా ఏదో ఒక విధంగా వినియోగదారుల పైనే మోపే ప్రమాదం ఉంది. ప్రభుత్వం మరోమారు ఆలోచించి పర్సన్ టు మర్చంట్‌కు చేసే అన్ని రకాల చెల్లింపులపై ఎండీఆర్ లేకుండా చూడాలని సామాన్యులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా విద్యాసంస్థల యజమానులు, ఇతర వ్యాపారులు యూపీఐ చెల్లింపులను అనుమతించకుండా నగదును ప్రోత్సహించే అవకాశం ఉంది. దీంతో యూపీఐ నుంచి మళ్లీ నగదు వైపునకు ప్రజలు మరలే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పడంలో అతిశయోక్తిలేదు.జిల్లాలోని కుటుంబాలు 1,11,383జనాభా 4,16,763నెలవారీ చెల్లింపులు రూ.111.38 కోట్లు రూ.2వేలు దాటే లావాదేవీలు 5,56,915వాటిపై పడే ఎండీఆర్ (రూ.5 చొప్పున) రూ.27,84,575 డిజిటల్ నుంచి మళ్లీ క్యాష్ వైపు! ఎండీఆర్‌తో సామాన్యుడిపై వేటు రూ.5 చార్జ్ చేస్తే.. జిల్లా ప్రజలపై నెలకు రూ.28 లక్షల భారం -
సాయుధ పోరాట స్ఫూర్తితో భూపోరాటాలు
భూపాలపల్లి అర్బన్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో పేదల కోసం భూపోరాటాలు కొనసాగిస్తామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన సాయుధ పోరాట వారోత్సవాల ర్యాలీ, సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. భూపాలపల్లిలోని కొమరయ్య భవన్ నుంచి బస్టాండ్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్తూపం వద్ద జరిగిన సభకు సీపీఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ అధ్యక్షత వహించారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘దున్నేవాడికే భూమి’ నినాదంతో సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ద్వారా భూములను పేదలకు పంపిణీ చేశారని గుర్తుచేశారు. నాటి పోరాట స్ఫూర్తితోనే నేడు పేదల భూ సమస్యలపై ఉద్యమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను బీజేపీ వక్రీకరిస్తోందని విమర్శించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పో రాటం, అమరవీరుల జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు, కార్మికులు, రైతులు, ప్రజా సంఘాల ప్రతినిధులు మోటపలుకుల రమేష్, సుధాకర్ రెడ్డి, సోతుకు ప్రవీణ్, శాంతి, కొరిమి సుగుణ, కౌన్సిలర్ వేముల జ్యోతి, నేరెళ్ల జోసెఫ్, శ్రీకాంత్, అన్నారపు రాజేందర్, ఆసిఫ్ పాషా,తాళ్ల పోశం, రవికుమార్, లావణ్య, శ్రావణి, స్వరూప, నాగమణి, సంధ్య, సుభద్ర, తదితరులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు -
27న పర్యాటక దినోత్సవం
భూపాలపల్లి అర్బన్: ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జిల్లా నోడల్ అధికారిగా అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా పర్యాటక అధికారి, డీపీఆర్వో, డీఈఓ, ఇంటర్మీడియట్, డీపీఓ, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల అధ్యాపకులు, జిల్లా సైన్స్ అధికారి సభ్యులుగా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ నెల 15న మండల స్థాయి పోటీలు నిర్వహించగా, 22న జిల్లా స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వ్యాసరచన, వక్తృత్వం, నాటిక, చిత్రలేఖనం వంటి తదితర అంశాల్లో పోటీలు ఉంటా యని చెప్పారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన విజేతలను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు. కార్యక్రమాలను నోడల్ అధికారి పర్యవేక్షణలో సంబంధిత కమిటీ సభ్యులు సమన్వయంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా పర్యాటక అధికారి రఘు, డీపీఆర్వో శ్రీనివాస్, డీఈఓ లలిత, ఇంటర్మీడియట్ అధికారి వెంకన్న, డీపీఓ శ్రీలత, జిల్లా సైన్స్ అధికారి స్వామి, తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి
భూపాలపల్లి రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా ఉపాధ్యాయులు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. భూపాలపల్లి మండలం కొంపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రీ–ప్రైమరీ పాఠశాలలను కలెక్టర్ రాహుల్‌శర్మ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న విద్య, మౌలిక వసతులను పరిశీలించారు. వేసవి సెలవుల్లో ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వాహనాలు ఏర్పాటు చేసుకుని ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న విద్యా సౌకర్యాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం ద్వారా విద్యార్థుల ప్రవేశాలను దాదాపు 50 శాతం పెంచడంపై కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. పాఠశాలలోని సైన్స్ ల్యాబ్‌ను పరిశీలించిన కలెక్టర్.. విద్యార్థులకు ప్రయోగాత్మక విద్య అందేలా చర్యలు తీసుకోవాలని, వసతులను సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పదో తరగతి విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడారు. వారి చదువు, భవిష్యత్ లక్ష్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. పలువురు విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్, ఇంజనీర్లు కావాలనే తమ ఆకాంక్షలను వెల్లడించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. విద్యతోపాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. ప్రీ–ప్రైమరీ పాఠశాలను పరిశీలించారు. చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో నాణ్యమైన విద్య అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన మోడల్ మరుగుదొడ్లను పరిశీలించారు. అనంతరం పాఠశాల అవరణలో మొక్క నాటారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్.. విద్యార్థులకు రుచికరంగా, నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. కార్యక్రమంలో డీఈఓ లలిత, సర్పంచ్ శ్రీకాంత్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ కొంపెల్లి ప్రభుత్వ పాఠశాల తనిఖీ -
కోతుల బెడద నివారణకు చర్యలు చేపట్టాలి
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి నియోజకవర్గంలో కోతుల బెడద ఎక్కువగా ఉందని, కోతుల నివారణకు చర్యలు తీసుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు బుధవారం అసెంబ్లీలో ప్రస్తావించారు. పంట చేలు, పండ్లతోటలను ధ్వంసం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కోతుల వల్ల ప్రమాదాల బారినపడి పలువురు కోమలోకి వెళ్లిన పరిస్థితులు ఉన్నాయన్నారు. అలాగే వ్యవసాయ సాగు విస్తీర్ణం 5.52 లక్షల ఎకరాలు ఉండగా.. ప్రస్తుతం 3.50 లక్షలకు తగ్గింది. దీనికి కారణం ఎంఎస్పీ లేకపోవడం, కోల్డ్ స్టోరేజీలు లేకపోవడమని స్టోరేజీలు పెంచాలని సంబంధిత మంత్రికి విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే సత్యనారాయణరావు -
‘రవాణా భత్యం’ విడుదల
పాఠశాల లేని నివాస ప్రాంతంలోని విద్యార్థులకు రవాణా భత్యం నిధులను సమగ్రశిక్ష మంజూరు చేసింది. జిల్లాల వారీగా సమగ్ర చిత్రం ఇలా..1 నుంచి ఎస్ఏ–1 పరీక్షలు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల విద్యార్థులకు సమ్మిటివ్ అసెస్మెంట్ పరీక్షలు అక్టోబర్ 1 నుంచి నిర్వహించనున్నారు. అసంఘటిత సంస్థలు15,369ములుగు జనగామ వరంగల్ భూపాలపల్లి మహబూబాబాద్ హనుమకొండ84,06713,971కార్మికులు38,26042,84128,72740,67835,90216,71646,40135,59480,25356,7291,26,908హనుమకొండ85,144 -
చంద్రగిరి గుట్టలపైనుంచే గురి!
● తెలంగాణ సాయుధ పోరాటయోధులకు రహస్య స్థావరం ● రజాకార్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసిన ఉద్యమకారులు ● చాందాలో శిక్షణ పొంది నిజాం సైన్యానికి చుక్కలుపరకాల: పరకాల సమీపంలోని చంద్రగిరి గుట్టలు తెలంగాణ సాయుధ పోరాటయోధులకు రహస్య స్థావరంగా మారాయి. జాతీయ జెండాతో ఊరేగింపు చేసినందుకు 1947 సెప్టెంబర్ 17న పరకాల చాపలబండ వద్ద రజాకార్ల ఊచకోతకు 13 మంది అమరులయ్యారు. రంగాపురంలో ముగ్గురిని చెట్టుకు కట్టి కాల్చిచంపారు. దీంతో పరకాల ప్రాంతంలో రజాకార్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు పోరాటం ఉధృతమైంది. ఇందులో భాగంగా రజాకార్ల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తూ.. మరోవైపు నిజాంపాలన కు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేశారు. నాడు తెలంగాణ సాయుధపోరాట యోధులు మందు గుండు సామగ్రి, తుపాకులు శత్రువులకు దొరకకుండా ఉండేందుకు గుట్టలపై దాచుకునేవారు. మహారాష్ట్రలోని చాందా (ముంబై) ప్రాంతంలో పరకాల ప్రాంతానికి చెందిన తెలంగాణ సాయుధపోరాట వీరులు బ్యాచ్‌ల వారీగా శిక్షణ పొందారు. సాయుధపోరాట యోధుడు కేవీ నర్సింగరావు ఆధ్వర్యంలో శిక్షణ పొందిన వారిని రహస్యంగా చంద్రగిరి గుట్టలకు చేర్చేవారు. అక్కడి నుంచి సాయుధపోరాట యోధులు నిజాం పోలీసులకు చుక్కలు చూపించేవారు. ఎత్తయిన గుట్టల పైనుంచి శత్రువు ల రాకను గమనించేవారు. దీంతో చంద్రగిరి గుట్టలు పోరాటాలకు అడ్డాగా పేరుగాంచాయి. హైదరాబాద్ స్టేట్‌లో కాంగ్రెస్ ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు తాలుకా కాంగ్రెస్ సేవా సమితి బాధ్యులు అనేక సమావేశాలు ఏర్పాటు చేశారు. నాటి సమావేశాలకు లేఖల ద్వారానే సమాచారం అందజేసేవారు. పరకాల పోరుగడ్డ బిడ్డలుగా చెప్పుకోవడం మాకు ఎంతో గర్వంగా ఉంటుంది. అందుకే నాటి తెలంగాణ సాయుధపోరాట యోధుల స్ఫూర్తితోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు చేశాం. దేశ భవిష్యత్ కోసం అన్యాయంపై ఎలాంటి పోరాటాలకై నా సిద్ధంగా ఉండాలనే ఆలోచన పెరిగింది. – ఏకు శంకర్, పరకాల -
పారదర్శకంగా సర్వే చేయాలి
టేకుమట్ల: మండలంలోని రామకిష్టాపూర్(వి)లో కొనసాగుతున్న నాన్–కెడస్ట్రల్ భూముల రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా కొనసాగించాలని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ అన్నారు. బుధవారం ఆయన సర్వే ప్రక్రియను పరిశీలించిన అనంతరం మాట్లాడారు. సర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్ధేశిత సమయంలో పూర్తి చేయాలన్నారు. సర్వే సమయంలో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ వేగం పెంచాలన్నారు. రైతులు, భూ సర్వే బృందాలు సమన్వయంతో పని చేయాలని, భూ హద్దులను స్పష్టంగా నిర్ధారించి రికార్డుల్లో ఎలాంటి తప్పిదాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డిజిటల్ భూ రికార్డులు పక్కాగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట సర్వే ఏడీ కుసుమ కుమారి, తహసీల్దార్ స్వరూపరాణి, రెవెన్యూ, సర్వే సిబ్బంది ఉన్నారు. అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ -
రోడ్లపైనే విక్రయం
నిరుపయోగంగా పండ్లు, కూరగాయల మార్కెట్ సముదాయాలుభూపాలపల్లి పట్టణంలో పండ్లు, కూరగాయల విక్రయాలకు ప్రత్యేక మార్కెట్ సముదాయాలు ఉన్నప్పటికీ.. వాటిని వినియోగంలోకి తీసుకురాకపోవడంతో వ్యాపారం రోడ్లపైనే కొనసాగుతోంది. దీంతో ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తడంతోపాటు పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో సుమారు ఐదేళ్ల క్రితం నిర్మించిన పండ్లు, కూరగాయల దుకాణాల సముదాయాలు ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్నాయి. మరోవైపు మంజూర్ నగర్లో నిర్మించ తలపెట్టిన కూరగాయల మార్కెట్ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. – భూపాలపల్లి అర్బన్ అంబేడ్కర్ సెంటర్, గణేశ్‌చౌక్, జయశంకర్ సెంటర్, మంజూర్‌నగర్ తదితర ప్రాంతాల్లో పలువురు వ్యాపారులు రోడ్లకు ఇరువైపులా, ఫుట్‌పాత్‌లపై బండ్లు ఏర్పాటు చేసుకుని పండ్లు, కూరగాయలు విక్రయిస్తున్నారు. వాహనాలు వెళ్లేందుకు పరిమిత స్థలం మాత్రమే మిగులుతోంది. కొనుగోలుదారులు కూడా రోడ్డుపైనే నిలపడంతో రద్దీ సమయాల్లో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోంది. బస్సులు, ఆటోలకు ఇబ్బందులు అంబేడ్కర్ సెంటర్, గణేశ్చౌక్లలో సమస్య తీవ్రంగా కనిపిస్తోంది. ప్రధాన రహదారికి ఆనుకుని పండ్లు, కూరగాయల దుకాణాలు ఏర్పాటు చేయడంతో ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ట్రాఫిక్ స్తంభిస్తోంది. రహదారిపై వ్యాపార కార్యకలాపాలు కొనసాగడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్మించినా.. వినియోగం లేదు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్మించిన మార్కెట్ సముదాయాలు వినియోగంలోకి రాకపోవడంపై స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మంజూర్‌నగర్‌లో నిలిచిపోయిన మార్కెట్ నిర్మాణాన్ని పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. దృష్టిసారించని మున్సిపల్, పోలీస్‌శాఖ పట్టణంలో రోడ్లు, ఫుట్‌పాత్‌లను ఆక్రమించి పండ్లు, కూరగాయలు విక్రయిస్తున్న వ్యవహారంపై మున్సిపాలిటీ, పోలీస్ శాఖ అధికారులు దృష్టి సారించడం లేదు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే హడావిడి చేసే అధికారులు ఆ తర్వాత అటువైపున కన్నెత్తి చూసే పరిస్థితి లేదు. ప్రధాన కూడళ్లలైన అంబేడ్కర్ సెంటర్, గణేశ్‌చౌక్, జయశంకర్ సెంటర్, మంజూర్‌నగర్ ప్రాంతాల్లో రహదారులపై వ్యాపారాల కారణంగా వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతున్న నేపథ్యంలో సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. అంబేడ్కర్ సెంటర్లో ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ఇతర వాహనాలు రాకపోకలు సాగించే సమయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రజల ఇబ్బందులు, ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకుని మున్సిపల్, పోలీస్ శాఖ అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని పట్టణవాసులు కోరుతున్నారు. నిలిచిపోయిన మంజూర్‌నగర్ మార్కెట్ పనులు రోడ్లు, ఫుట్‌పాత్‌ల ఆక్రమణ అంబేడ్కర్ సెంటర్లో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు ప్రమాదాలకు అవకాశం -
సింగరేణిలో ఘనంగా ఇంజనీర్స్ డే
భూపాలపల్లి అర్బన్: సింగరేణి భూపాలపల్లి ఏరియాలో మంగళవారం ఇంజనీర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. జనరల్ మేనేజర్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన కార్యక్రమానికి ఏరియా జీఎం ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర ఎంతో కీలకమన్నారు. విశ్వేశ్వరయ్య దేశ అభివృద్ధికి అందించిన సేవలు, ఇంజనీరింగ్ రంగానికి చూపిన మార్గదర్శకత్వం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. సింగరేణిలో ఉత్పత్తితో పాటు భద్రత, నాణ్యత, సాంకేతికత, ఉత్పాదకతకు ప్రాధాన్యమిస్తూ ఇంజనీర్లు విధులు నిర్వర్తించాలని సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ సంస్థ అభివృద్ధిలో మరింత కీలక పాత్ర పోషించాలని కోరారు. అనంతరం ప్రపంచ ఇంజనీర్స్ డే సందర్భంగా ఏజీఎం (సివిల్) రవికుమార్, ఏజీఎం (ఐఈడీ) జ్యోతిని జీఎం శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ టు జీఎం రామన్ వి.పాఠక్, కేటీకే–1 గ్రూప్ ఏజెంట్ ములుకుంట్ల తిరుపతి, వివిధ విభాగాల అధికారులు, గనుల అధికారులు, ఇంజనీర్లు పాల్గొన్నారు. -
ఓసీ–2లో కాపర్ వైరు చోరీకి యత్నం
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని ఓపెన్‌కాస్ట్–2 ప్రాజెక్ట్ (ఓసీ–2)లో కాపర్ వైర్ చోరీకి యత్నించిన ఘటనలో ముగ్గురిని సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. భూపాలపల్లి సీఐ శ్రీనివాస్ వివరాల ప్రకారం.. ఓసీ–2లో ఆది, సోమవారంలో రాత్రి వేళలో దుండగులు చోరీకి యత్నించారు. సోమవారం అర్ధరాత్రి ఓపెన్‌కాస్టులోని పీఓ కార్యాలయ సమీపంలో కాపర్‌వైర్‌ను కట్ చేస్తుండగా సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది ముగ్గురిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పెద్దపల్లి జిల్లా బేగంపేటకు చెందిన ఓదారి శశాంక్, సాదుల వివేక్, శివరాత్రి మహేశ్‌లతో పాటు కారును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శివరాత్రి రమేశ్, ఉదయ్ రాజ్‌కుమార్, రాజు పరారయ్యారు. ఘటనపై పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. అధికారికంగా నిర్వహించాలి భూపాలపల్లి రూరల్ : సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిషీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం బీజేపీ నాయకులు కలెక్టరేట్లో డీఆర్ఓ వసంతకుమారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నిషీధర్‌రెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో అత్యంత ప్రాధాన్యత కలిగిన రోజు అన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు సాగించిన వీరోచిత పోరాటం, ఎందరో మహనీయుల త్యాగాలు, ప్రజల పోరాట స్ఫూర్తి ఫలితంగా తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిందని పేర్కొన్నారు. కల్యాణం కమనీయం రేగొండ: కోటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణం మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్వామి వారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రతీ నెలలో కోటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కల్యాణం నిర్వహిస్తారు. అభిషేకంతో ప్రారంభమై, సుదర్శన నారసింహ హోమం కొనసాగించారు. అనంతరం కల్యాణాన్ని నిర్వహించారు. ఆరగింపుతో కల్యాణ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది శ్రావణ్, సుధాకర్, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడిగా తిరుపతి చిట్యాల: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడిగా మండల కేంద్రానికి చెందిన కనకం తిరుపతిని నియమించినట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఓరుగంటి ఆనంద్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కనకం తిరుపతి విద్యార్థి దశ నుంచి తెలంగాణ కోసం రాజీలేని పోరాటం చేశారని అన్నారు. ఉద్యమాలను గుర్తించి జిల్లా ఫోరం అధ్యక్షుడిగా నియమించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కనకం తిరుపతి మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కనకం కుమారస్వామి, ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ అధ్యక్షుడు చిలివేరు రమేశ్, రాష్ట అధ్యక్షుడు ఓరుగంటి ఆనంద్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. బకాయిలు చెల్లించాలి భూపాలపల్లి అర్బన్: సింగరేణి సంస్థను ఆర్థిక సంక్షోభం నుంచి కాపాడాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షుడు మంద నరసింహారావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సింగరేణి నుంచి జెన్కోకు సరఫరా చేసిన బొగ్గుకు, జెన్కో విద్యుత్‌ను ట్రాన్స్‌కోకు విక్రయించినందుకు రావాల్సిన బకాయిలు సుమారు రూ.54 వేల కోట్లకు చేరుకున్నాయని తెలిపారు. బకాయిలు పేరుకుపోవడంతో సంస్థ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. కార్మికుల జీతాలు, నిర్వహణ ఖర్చుల కోసం బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త బొగ్గు బ్లాకులను చేపట్టేందుకు కూడా నిధుల కొరత ఎదురవుతోందన్నారు. ఇటీవల కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేలతో సింగరేణి ఇన్చార్జ్ మంత్రి భట్టి విక్రమార్క నిర్వహించిన సమావేశంలో డీఎంఎఫ్, సీఎస్ఆర్ నిధుల అంశాలను ప్రస్తావించిన ఎమ్మెల్యేలు సంస్థకు రావాల్సిన బకాయిలపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. -
ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు భూపాలపల్లి: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్, నిర్మాణ పనులను వేగవంతంచేసి నిర్దేశిత లక్ష్యాలను త్వరగా సాధించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీలో కలెక్టర్ రాహుల్‌శర్మతో కలిసి గృహ నిర్మాణ శాఖ, ఎంపీడీఓలు, మున్సిపల్ అధికారులతో ఇళ్ల నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ.. గ్రౌండింగ్ నుంచి నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రతీ దశను అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. నిర్మాణంలో ఉన్న రెండు పడక గదుల ఇళ్ల పురోగతిపై మండలాల వారీగా సమగ్ర నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన క్షేత్రస్థాయి విచారణను వేగవంతం చేయాలని సూచించారు. అర్హుల ఎంపికలో పేదరికమే ప్రామాణికంగా తీసుకుని వివక్షకు తావులేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. రెండు పడక గదుల ఇళ్ల కాలనీల్లో విద్యుత్, తాగునీరు, డ్రెయినేజీ, రహదారులు తదితర మౌలిక వసతుల పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. కలెక్టర్ రాహుల్‌శర్మ మాట్లాడుతూ నిర్మాణ పనులకు సంబంధించిన ఎంబీ నమోదులను ఎప్పటికప్పుడు పూర్తిచేసి అర్హులైన లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులు ఆలస్యం కాకుండా చూడాలని సూచించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, హౌసింగ్ పీడీ శ్రీకాంత్, మున్సిపల్ కమిషనర్ ఉదయ్‌కుమార్, ఎంపీడీఓలు, హౌసింగ్ ఏఈలు పాల్గొన్నారు. -
వరంగల్ కమిషనరేట్ ముందంజ
దర్యాప్తు వేగం, ట్రాఫిక్ అమలులో..● శిక్షల శాతంలో భూపాలపల్లి, ములుగు, చార్జిషీట్లో మహబూబాబాద్ ● నేరాల నియంత్రణలో మనోళ్ల పెర్ఫార్మెన్స్ వెల్లడి ● ఎఫ్ఐఆర్నుంచి శిక్షల వరకు పనితీరుతో మార్కుల శాతం ● అన్ని విభాగాల్లో మెరుగైతేనే ఉమ్మడి వరంగల్‌లో నేరగాళ్లకు చెక్సాక్షి, వరంగల్ : నేరం చేసిన వ్యక్తిలో భయం కలగాలంటే కేవలం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే సరిపోదు. నిందితుడిని గుర్తించి పట్టుకోవడం, దర్యాప్తును వేగంగా పూర్తి చేయడం, పక్కా ఆధారాలతో చార్జ్‌షీట్ దాఖలు చేయడం...ఆపై కోర్టులో నేరం రుజువై శిక్ష పడేలా చేయడమే అసలైన పోలీసింగ్‌కు గీటురాయి. ఈ మొత్తం ప్రక్రియలో ఏ ఒక్క దశలో లోపం ఏర్పడినా నేరస్తుల్లో భయం తగ్గే అవకాశముంది. ఈ నేపథ్యంలో పోలీస్‌శాఖ గత ఆరు నెలల పనితీరుతో రూపొందించిన ‘క్లస్టర్ వైజ్ యూనిట్స్ పెర్ఫార్మెన్స్ స్కోర్‌కార్డు’ ఉమ్మడి వరంగల్ ప్రాంతంలోని నాలుగు పోలీస్ యూనిట్ల పనితీరులో ఉన్న తేడాలను స్పష్టం చేస్తోంది. దర్యాప్తు వేగం, ట్రాఫిక్ అమలులో వరంగల్ పోలీసు కమిషనరేట్ ముందంజలో ఉండగా, భూపాలపల్లి, ములుగు శిక్షల శాతంలో మంచి ఫలితాలు సాధించాయి. చార్జిషీట్ల నమోదులో మహబూబాబాద్ ముందుంది. ఇలా అన్ని యూనిట్లు అన్నింట్లోనూ మెరుగైతే ఉమ్మడి వరంగల్‌లో నేరాల నియంత్రణ సులభమై నేరగాళ్లలో వణుకు పుట్టనుంది.మహబూబాబాద్వరంగల్ కమిషనరేట్ కేసు నమోదైన తర్వాత దర్యాప్తు పూర్తిచేసి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేయడం న్యాయ ప్రక్రియలో అత్యంత కీలక దశ. ఈ విషయంలో మహబూబాబాద్ నాలుగు యూనిట్లలో ముందుంది. ముఖ్యంగా ములుగులో దర్యాప్తు పూర్తి చేసి చార్జ్‌షీట్ దాఖలు చేసే రేటు మిగిలిన యూనిట్లతో పోలిస్తే తక్కువగా ఉండటం కాస్త ఆందోళన కలిగించే అంశమని పోలీస్ వర్గాలు అంటున్నాయి. భూపాలపల్లి58.9357.04ములుగు 54.4546నేరాలను గుర్తించి నిందితులను పట్టుకోవడంలో జయశంకర్ భూపాలపల్లి ముందుంది. నేరం జరిగిన తర్వాత దాని వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించే ప్రక్రియలో ములుగు మరింత సమర్థంగా పనిచేయాల్సిన అవసరముందని గణాంకాలు చెబుతున్నాయి. వరంగల్ కమిషనరేట్ దర్యాప్తులో వరంగల్ వేగం... ఆరు నెలల పనితీరుపై రాష్ట్ర పోలీస్‌శాఖ స్కోర్‌కార్డు చార్జ్‌షీట్ నమోదు.. -
రెవెన్యూ సేవల్లో జాప్యం ఉండొద్దు
● సబ్‌కలెక్టర్ సౌరబ్ శర్మ మల్హర్: రెవెన్యూ సేవల్లో జాప్యం ఉండవద్దని కాటారం సబ్‌కలెక్టర్ సౌరబ్ శర్మ అధికారులను ఆదేశించారు. తాడిచర్ల తహసీల్దార్ కార్యాలయం, తాడిచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. కా ర్యక్రమంలో తహసీల్దార్ రవికుమార్, సర్పంచ్ బండి స్వామి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సబ్ కలెక్టర్‌కు నిర్వాసితుల వినతి తాడిచర్ల గ్రామంలో పర్యటించిన కాటారం సబ్ కలెక్టర్ సౌరబ్ శర్మను తాడిచర్ల సర్పంచ్ బండి స్వామి, ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా తాడిచర్ల డేంజర్ జోన్లో ఇండ్ల నష్టపరిహారం కోసం, స్థానికుల ఇండ్ల సర్వేలో జరిగిన అవకతవకలపై సర్పంచ్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. స్పందించిన సబ్ కలెక్టర్ త్వరలోనే నిర్వాసితుల సమస్యల పరిష్కారం చేస్తామని, పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేసి సకాలంలో నష్టపరిహారం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భూ నిర్వాసితుల కమిటీ సభ్యులు అశోక్‌రావు, కేసరపు చంద్రయ్య, బండి రాజయ్య, రామడి గట్టయ్య, అరని సత్తయ్య, అజ్మత్ అలీ, బూడిది రాజసమ్మయ్య పాల్గొన్నారు. -
గడువులోగా భూ రీ సర్వే పూర్తి
● అదనపు కలెక్టర్ అశోక్కుమార్మొగుళ్లపల్లి: అకినపల్లి గ్రామంలో జరుగుతున్న భూ రీ–సర్వే ప్రక్రియను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం అకినపల్లి గ్రామంలో రీ–సర్వే పనులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సర్వే జరుగుతున్న తీరును, భూ రికార్డులను పరిశీలించి సర్వే బృందాలకు పలు సూచనలు చేశారు. భూ యజమానులకు ఇబ్బందులు కలగకుండా రీ–సర్వేను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని సూచించారు. భూ సరిహద్దులకు సంబంధించి వివాదాలు ఉన్న ప్రాంతాల్లో రైతుల సమక్షంలోనే వివరాలను పరిశీలించి సమస్యలను పరిష్కరించాలన్నారు. భూ పరిమితులను కచ్చితంగా నిర్ధారించి రికార్డుల్లో నమోదు చేయాలని ఆదేశించారు. రీ–సర్వేలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలని, సర్వే వివరాలు, భూ రికార్డుల నమోదులో పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టంచేశారు. సర్వే బృందాలు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేసి పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్వే, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
తోపుడు బండి.. ఆయిల్ డబ్బాల శబ్దాలు
నర్సంపేట: నర్సంపేటలోని హైస్కూల్ సమీపంలో 20 మంది యువకుల కమిటీతో ఏర్పడ్డ ప్రగతి నగర్ గణేశ్ ఉత్సవ కమిటీ 50 ఏళ్లుగా వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తోంది. 1977లో ఏర్పడినప్పటి నుంచి కాలనీలోని సభ్యులంతా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మొదట్లో తోపుడు బండిలో వినాయకుడిని ఏర్పాటు చేసుకోగా, ఆ తర్వాత ఎడ్లబండిపై నిమజ్జన శోభాయాత్ర నిర్వహించారు. ప్రస్తుతం హైస్కూల్ సమీపంలో మండపాన్ని ఏర్పాటు చేసుకొని తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ నిమజ్జనాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు. 50 ఏళ్లక్రితం గణేశ్ ఉత్సవాలు ప్రారంభించాం. మొదట్లో నిమజ్జనం చేసేందుకు తోపుడు బండి పై వినాయకుడిని తీసుకెళ్లేవాళ్లం. నిమజ్జన శోభాయాత్రలో ఆయిల్ డబ్బాను కొట్టుకుంటూ శబ్దాలు చేస్తూ వెళ్లేవాళ్లం. అప్పటి ఆనందమే వేరు. ప్రస్తుతం డీజే పెట్టాల్సి వస్తోంది. – గీత గోవిందం సురేశ్, ఉత్సవ కమిటీ బాధ్యుడు -
ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి
భూపాలపల్లి: వినాయక నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వినాయక విగ్రహాల ప్రతిష్ఠాపన, ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలను శాంతియుతంగా, సురక్షితంగా, ప్రజలకు అసౌకర్యం కలగకుండా నిర్వహించేందుకు పోలీసుశాఖ సూచనలు పాటించాలన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా, ముప్పులేని ప్రదేశాల్లో విగ్రహ ప్రతిష్ఠాపన చేసుకోవాలన్నారు. అనధికారిక విద్యుత్ వినియోగించవద్దని, డీజేలకు అనుమతి లేదని, రాత్రి 10 గంటల తరువాత లౌడ్ స్పీకర్లను బంద్ చేయాలన్నారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అభ్యంతరకర పాటలు, కార్యక్రమాలు నిర్వహించవద్దన్నారు. ప్రశాంత వాతావరణంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమా లను నిర్వహించేలా ప్రజలు సహకరించాలని ఎస్పీ సంకీర్త్ కోరారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
కొండా దంపతుల ఢిల్లీ బాట!
సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్ తూర్పు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. శనివారం సాయంత్రమే వారు హనుమకొండలోని రాంనగర్ నివాసానికి చేరుకున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే కార్యకర్తలకు ఫోన్ చేసి సమావేశానికి హాజరు కావాలని కొండా మురళి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఈసమావేశంలో నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ కార్యక్రమాలు, స్థానిక సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా రానున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకోవడంతోపాటు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ కొండా దంపతులతో మాట్లాడారు. ఈనేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఆ భేటీలో రాష్ట్ర రాజకీయాలు, పార్టీ పరిస్థితులు, కొండా దంపతుల రాజకీయ పాత్రపై చర్చ జరిగినట్లు సమాచారం. అప్పటి నుంచే సురేఖకు పార్టీపరంగా కొత్త బాధ్యత దక్కవచ్చనే ఊహా గానాలు ఊపందుకున్నాయి. మరోవైపు, కొండా దంపతులకు వరంగల్ జిల్లాలో ఉన్న రాజకీయ ప్రభావాన్ని పార్టీ అధిష్టానం పరిగణనలోకి తీసుకుంటోందని వారి అనుచరులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించేందుకు, కేడర్‌ను సమన్వయం చేసేందుకు సురేఖ సేవలను వినియోగించుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇవన్నీ పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చలేనని, అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే అసలు విషయం స్పష్టమవుతుందని నాయకులు చెబుతున్నారు. ఆదివారం రాంనగర్లో జరగనున్న కార్యకర్తల సమావేశం, అనంతరం కొండా సురేఖ ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. సమావేశంలో కొండా దంపతులు చేసే వ్యాఖ్యలు, ఢిల్లీ పర్యటనపై వెల్లడించే వివరాలు, పార్టీ అధిష్టానంతో జరిగే చర్చలపై కాంగ్రెస్ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. కీలక బాధ్యత అప్పగిస్తారా? సమావేశం అనంతరం కొండా సురేఖ ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. అక్కడ కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలను కలిసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈపర్యటనకు సంబంధించి అధికారిక సమాచారం ఇంకా వెలువడాల్సి ఉంది. ఢిల్లీలో పార్టీ సంస్థాగత వ్యవహారాలు, తెలంగాణ రాజకీయ పరిస్థితులు, వరంగల్ ప్రాంతంలో పార్టీ బలోపేతం వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశముందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే, సురేఖకు కీలక బాధ్యత అప్పగించే అంశంపై పార్టీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీకి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన బాధ్యతను అప్పగించనున్నారా? లేక పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో ప్రత్యేక పాత్ర కల్పించనున్నారా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. దీనిపై స్పష్టత రావాలంటే ఢిల్లీ పర్యటన పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందేనని నాయకులు అంటున్నారు. రాంనగర్లో నేడు కార్యకర్తలతో కీలక భేటీ.. తర్వాత హస్తినకు పయనం శనివారం సాయంత్రం హనుమకొండకు చేరుకున్న ‘కొండా’ దంపతులు కొండా సురేఖకు ‘పెద్ద బాధ్యత’ ఏంటది? -
ఉమ్మడి వరంగల్ జిల్లాలో యాభై ఏళ్లకు పైగా గణనాథుడి ఉత్సవాలు
గోవిందరావుపేట: ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఐదు దశాబ్దాలుగా గణపతి నవరాత్రి ఉత్సవాల సంప్రదాయం కొనసాగుతోంది. సుమారు 50 ఏళ్ల క్రితం గ్రామస్తులు ఎడ్లబండిపై గ్రామ సమీపంలోని చెరువుకు వెళ్లి రేగడి మట్టిని తీసుకొచ్చి వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసి ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించారు. అప్పటి నుంచి నిర్విరామంగా ప్రతీ ఏడాది ఏటా మట్టితో తయారు చేసిన విగ్రహాలను నిర్వహిస్తున్నారు. కాకతీయుల కాలంలో నిర్మించిన రామలింగేశ్వర స్వామి ఆలయం ఒకప్పుడు జరిగిన దాడులు, ఘర్షణల కారణంగా శిథిలావస్థకు చేరుకోగా.. 2007లో ఆలయాన్ని నూతనంగా పునర్నిర్మించారు. కాలం మారుతున్నా.. ఆలయ రూపురేఖలు మారుతున్నా.. గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించే సంప్రదాయాన్ని మాత్రం ఇప్పటికీ అంతే భక్తిశ్రద్ధలతో కొనసాగిస్తూ వస్తున్నామని గ్రామానికి చెందిన వీరమాచినేని వెంకటేశ్వరరావు చెబుతున్నారు. ● అంబరాన్నంటేలా వేడుకలు ● సాంస్కృతిక కార్యక్రమాలు● సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న ఉత్సవ కమిటీలు, భక్తులు● అప్పుడు సాదాసీదాగా ఇప్పుడు ఆధునిక హంగులతో..సాక్షి, మహబూబాబాద్: డోర్నకల్‌లోని అంబేడ్కర్ నగర్లో 1968 నుంచి వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అంబేడ్కర్‌నగర్‌కు చెందిన పెయింటర్ దుప్పటి నాగేందర్ చెరువు మట్టిని తెచ్చి వినాయక విగ్రహాన్ని తయారు చేయగా, స్థానికులతో పాటు రైల్వే కాలనీకి చెందిన ఉద్యోగస్తుల కుటుంబాలతో కలిసి వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి నవరాత్రులు ఘనంగా నిర్వహించేవారు. తొమ్మిది రోజులు పూజలతోపాటు కోలాటాలు నాటికల ప్రదర్శనలతో కార్యక్రమాలను ఉత్సాహంగా నిర్వహించేవారు. నిమజ్జనానికి రైల్వే బాక్సులు మోసుకెళ్లే తోపుడు బండిని వినియోగించి బండిపై విగ్రహాన్ని ఊరేగించి సమీపంలోని రైల్వే బావిలో నిమజ్జనం చేసేవారు. మొదట మట్టి విగ్రహం నిమజ్జనం సమయంలో తోపుడు బండి, డప్పుచప్పుళ్లు ఉండగా తర్వాత ఎడ్ల బండి, బ్యాండ్ మేళం వినియోగించారు. 58 ఏళ్లుగా క్రమం తప్పకుండా అంబేడ్కర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నారు. ప్రస్తుతం ఈ వేడుకల కోసం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఊరూవాడా ఆధ్యాత్మిక సందడి -
వాతావరణం
జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం నుంచి వాతావరణం చల్లబడుతుంది. చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. హన్మకొండ కల్చరల్: ఒకప్పుడు పబ్లిక్‌గార్డెన్ వద్ద నిర్వహించిన గణేశ్ ఉత్సవాన్ని 1933లో హనుమకొండలోని రాజరాజనరేంద్రాంధ్రభాషా నిలయంలోకి మార్చారు. 67 సంవత్సరాల క్రితం వేయిస్తంభాల దేవాలయానికి మార్చగా.. అప్పటి నుంచి నూతన గజానన మండలి అధ్వర్యంలో గణపతి ఉత్సవాలు నిర్వహిస్తూ వచ్చారు. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టివినాయకులను ప్రతిష్ఠించాలని పర్యావరణ ప్రేమికుల సూచన మేరకు 15 ఏళ్లుగా మట్టి వినాయకులను ప్రతిష్ఠిస్తున్నారు. కాగా, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేయిస్తంభాల ఆలయంలోని గణపతి నవరాత్రి ఉత్సవాలకు భక్తులు తరలిరావడం ఇక్కడి ప్రత్యేకత. అదేవిధంగా నిమజ్జనం రోజున కూడా వేయిస్తంభాల దేవాలయం వినాయక నిమజ్జనోత్సవ రథాన్ని దర్శించుకోవడానికి ప్రజలు మంగళ హారతులతో ఎదురుచూస్తారు. -
హేమాచలుడికి పూజలు
మంగపేట : మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయం వందలాది మంది భక్తజనంతో శనివారం కిటకిటలాడింది. ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. అత్యంత భక్తిశ్రద్ధలతో ఆలయంలోని స్వయంభు స్వామివారిని దర్శించుకుని తిలతైలాభిషేకం పూజలో పాల్గొన్నారు. ఆలయ పూజారులు స్వామివారికి తిలతైలాభిషేకం పూజలు నిర్వహించి స్వామివారిని పట్టు వస్త్రాలతో అలంకరించారు. భక్తుల గోత్రనామాలతో అర్చనలు జరిపించారు. స్వామివారి విశిష్టత ఆలయ చరిత్రను వివరించారు. అనంతరం తిలతైలాభిషేకం పూజలో పాల్గొన్న భక్తులు మానవ శరీరాన్ని పోలి ఉన్న స్వయంభు స్వామివారిని నిజరూప దర్శనం చేసుకుని పులకించారు. -
పత్తి దిగుబడిపై దిగులు
పత్తి పంట ఎదగకపోవడంతో రైతులు దిగుబడిపై ఆందోళన చెందుతున్నారు. కనీసం పెట్టుబడి అయినా వస్తుందా అని దిగులు చెందుతున్నారు. చెరువుకెళ్లి మట్టిని తెచ్చేవాళ్లు. భక్తితో ప్రతిమలు తయారు చేసేవాళ్లు. నిష్టగా ఉపవాసం ఉండేవాళ్లు. భజనలు, కీర్తనలతో మండపాల వద్ద గడిపేవారు. ఉప్పు ఒకరు, పప్పు ఒకరు తోచిందల్లా తీసుకొచ్చి అన్నదానం చేసేవారు. తోపుడు బండ్లపై సమీప చెరువులకు నిమజ్జనానికి తీసుకెళ్లేవారు. నిమజ్జన శోభాయాత్రలో నూనె పీపలను కొట్టి శబ్దం చేసేవారు. ఆ మధుర జ్ఞాపకాలు రూపాంతరం చెందినా అంతే ఉత్సాహంగా నేటి తరం ఆ సంప్రదాయం కొనసాగిస్తోంది. ఐదు దశాబ్దాలు దాటిన ఆ జ్ఞాపకాలను సజీవంగా ఉంచుతూ ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు అందిస్తోంది. – సాక్షి నెట్వర్క్ -
బొగ్గు ఉత్పత్తికి బ్రేక్
● వర్షంతో ఓసీ–2, 3లో నిలిచిన ఉత్పత్తిభూపాలపల్లి అర్బన్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం సింగరేణి ఓపెన్‌కాస్ట్ గనులపై తీవ్ర ప్రభావం చూపింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి కురుస్తున్న వర్షంతో ఏరియాలోని ఓపెన్‌కాస్ట్–2, 3లో శనివారం బొగ్గు ఉత్పత్తి కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. గనుల్లోని పని ప్రదేశాలకు వరద నీరు చేరడంతో యంత్రాల నిర్వహణ, బొగ్గు, మట్టి వెలికితీత పనులు నిలిచిపోయాయి. వర్షపు నీటితో ఓపెన్‌కాస్ట్ పరిధిలోని అంతర్గత రహదారులు బురదమయంగా మారాయి. దీంతో బొగ్గు రవాణా వాహనాలు, యంత్రాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో కార్మికులు, సిబ్బంది పనులు నిర్వహించేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం కారణంగా భూపాలపల్లి ఏరియాలో సుమారు 8వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడినట్లు సమాచారం. గనుల్లో నిలిచిన నీటిని తొలగించి, రహదారులను అందుబాటులోకి తీసుకొచ్చిన అనంతరం ఉత్పత్తి పనులను పునరుద్ధరించే అవకాశం ఉంది. వర్షాకాలంలో ఓపెన్‌కాస్ట్ గనుల్లో నీటి నిల్వలు, బురద కారణంగా ఉత్పత్తి, రవాణా పనులకు తరచూ ఆటంకాలు ఎదురవుతున్నాయి. ప్రస్తుత వర్షాలతో గనుల్లో పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తూ నీటిని బయటకు పంపేందుకు చర్యలు చేపడుతున్నారు. -
3,378 కేసుల పరిష్కారం
● జాతీయ లోక్‌అదాలత్‌తో సత్వర న్యాయంభూపాలపల్లి అర్బన్: ప్రజలకు ఉచితంగా, సత్వర న్యాయం అందించడమే న్యాయసేవాధికార సంస్థల లక్ష్యమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, డీఎల్ఎస్ఏ చైర్పర్సన్ జీవన్‌కుమార్ తెలిపారు. డీఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్ ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాజీకి అవకాశం ఉన్న క్రిమినల్, మోటార్ వాహన ప్రమాదాలు, కుటుంబ వివాదాలను లోక్‌అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. కోర్టుల చుట్టూ ఏళ్ల తరబడి తిరగడం వల్ల సమయం, డబ్బు వృథా కావడంతోపాటు మనశ్శాంతి దెబ్బతింటుందన్నారు. ఇరువర్గాలు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా స్వచ్ఛందంగా రాజీకి రావాలని సూచించారు. జాతీయ లోక్‌అదాలత్‌లో భాగంగా ఒక్కరోజులోనే 40 సివిల్, 1,055 క్రిమినల్, 50 బ్యాంకు రికవరీ, 21 సైబర్ క్రైమ్, 2,212 ట్రాఫిక్ చలానా కేసులు పరిష్కరించారు. మొత్తంగా 3,378 కేసులకు ముగింపు పలికారు. లోక్‌అదాలత్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరి మధ్య భూ వివాదం కూడా పరిష్కారమైంది. భూపాలపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో 2024లో నమోదైన కేసులో ఇరువర్గాలు రాజీకి రావడంతో కేసును పరిష్కరించారు. కాటారం పోలీస్‌స్టేషన్ పరిధిలో భార్యాభర్తల మధ్య 2024లో నమోదైన కేసులోనూ రాజీ కుదిరింది. మూడేళ్లుగా కోర్టు చుట్టూ తిరిగిన దంపతులు కేసును విరమించుకుని కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఎల్ఎస్ఏ కార్యదర్శి తాడూరు మహతి వైష్ణవి, న్యాయమూర్తులు ఎస్.ఆర్.దిలీప్‌కుమార్ నాయక్, జి.అఖిల, ఆర్డీఓ పోరిక హరికృష్ణ, ప్రభుత్వ న్యాయవాది బొట్ల సుధాకర్, డీఎస్పీ సంపత్‌రావు, న్యాయవాదులు, పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. -
అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా
● చీఫ్ ఇంజనీర్ నాగప్రసాద్చిట్యాల/మొగుళ్లపల్లి: వినియోగదారులకు నాణ్య మైన, అంతరాయం లేకుండా విద్యుత్‌ను సరఫరా చేయాలని చీఫ్ ఇంజనీర్, నోడల్ అధికారి నాగప్రసాద్ అన్నారు. శుక్రవారం చిట్యాల మండలంకేంద్రంలోని 32/33 కేవీ సబ్‌స్టేషన్, మొగుళ్లపల్లి విద్యుత్ ఉపకేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రిడ్ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా జరిగేలా చూడాలని అన్నారు. రానున్న కాలంలో విద్యుత్ డిమాండ్‌ను తట్టుకునేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. సబ్‌స్టేషన్ పిరిధిలో ఎప్పటికప్పుడు పనులు సక్రమంగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి సూపరింటెండెంట్ ఇంజనీరు నాగెల్లి సదానందం, డీఈ పాపిరెడ్డి, అసిస్టెంట్ డివి జన్ ఇంజనీర్ పి.సుందర్‌కుమార్, చిట్యాల విద్యుత్ శాఖ ఏఈలు చంద్రశేఖర్, నగేష్ తదితరులు పాల్గొన్నారు. -
వేగంగా స్పందించాలి
టేకుమట్ల: అత్యవసర సమయంలో బాధితులు 108కి కాల్ చేస్తే అంబులెన్స్ పైలట్, ఈఎంటీ వేగంగా స్పందించాలని 108 జిల్లా మేనేజర్ రాజునాయక్ అన్నారు. శుక్రవారం మండలంలోని 108 వాహనాన్ని తనిఖీ చేశారు. అంబులెన్స్‌లోని వైద్య పరికరాలు, మందులు, రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అత్యవసర సమయంలో కీలకంగా వ్యవహరించి కాల్చేసిన వారికి 108లో సకాలంలో ప్రాథమిక చికిత్స అందిస్తూ సమీప ఆస్పత్రులకు చేర్చాలన్నారు. నిత్యం మందులు అందుబాటులో ఉండేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పైలట్ సత్యం, ఈఎంటీ బొమ్మ హరిప్రసాద్‌లకు సూచించారు. కేటీపీపీ సీఈ కార్యాలయం ముట్టడి గణపురం: యాద్రాది పవర్ ప్లాంటు(వైటీపీఎస్) ప్రైవేటీకరణను తక్షణమే నిలిపివేయాలని కేటీపీపీ జేఏసీ నాయకులు శుక్రవారం కేటీపీపీ సీఈ కార్యాలయాన్ని ముట్టడించారు. టీజీపీఈ జేఏసీ పిలుపు మేరకు జేఏసీ నాయకులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజల ప్రయోజనాలు, రాష్ట్ర విద్యుత్ రంగ భద్రత, ఉద్యోగుల హక్కులను దృష్టిలో ఉంచుకొని ప్రైవేటీకరణ చర్యలను విరమించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఇంజనీర్లు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలి కాళేశ్వరం(కాటారం): గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని కాటారం డీఎస్పీ సూర్యనారాయణ సూచించారు. శుక్రవారం మండలకేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో నిర్వాహకులు, ఆలయ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. వినా యక మండపాలు ఏర్పాటు చేసే ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా ఆన్లైన్ ద్వారా అనుమతి పొందాలని పేర్కొన్నారు. వినాయక మండపాల వద్ద నిబంధనలు పాటించాలని తెలిపారు. ఈ సమావేశంలో సీఐ నాగార్జునరావు, ఎస్సై శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. జిల్లాకేంద్రంలో కాంగ్రెస్ ధర్నా భూపాలపల్లి రూరల్: కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద దళితుల శాంతియుత నిరసన ప్రాంతాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేయడం కుల వివక్షకు నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ అన్నారు. బీఆర్ఎస్ నాయకుల అహంకారపూరిత, కుల వివక్షతను ప్రోత్సహించే చర్యలను నిరసిస్తూ శుక్రవారం జిల్లాకేంద్రంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కరుణాకర్ మాట్లాడుతూ శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తే, ఆ ప్రాంతాన్ని బీఆర్ఎస్ నాయకులు పసుపు నీళ్లతో శుద్ధి చేయడం అత్యంత అవమానకరమైన చర్య అని తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో పార్టీ పట్టణఅధ్యక్షుడు దాట్ల శ్రీనివాస్, మండల అధ్యక్షుడు రాంనేని రవీందర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
రెరా.. వెంచర్లపై ఆరా!
వ్యవసాయ భూమి పేరుతో ప్లాట్లు చేసే ప్రాజెక్టులపై దృష్టిసాక్షి, వరంగల్: ‘వ్యవసాయ భూమి’.. ‘ఫామ్ ల్యాండ్’.. ‘ఆర్గానిక్ ఫామ్’.. ‘వీకెండ్ ఫామ్’.. పేర్లు వేరైనా వ్యాపారం మాత్రం ఒక్కటే. ఎకరాల కొద్ది వ్యవసాయ భూమిని సేకరించి రోడ్లు వేయడం, చిన్నచిన్న భాగాలుగా విభజించడం, భవిష్యత్ విలువ పెరుగుతుందని వినియోగదారులకు ప్లాట్లను విక్రయించడం.. ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లాలో రియల్ ఎస్టేట్ విస్తరిస్తోంది. వ్యవసాయ భూమిని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేసి విక్రయించే వ్యవహారాలపై రెరా (రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ) నిబంధనలు కఠినంగా అమలు చేసేందుకు సిద్ధమైంది. తాజాగా ఎస్ఎస్ఎల్ ఇన్ఫ్రా డెవలపర్స్ వ్యవహారంలో తెలంగాణ రెరా, అనంతరం అప్పీళ్ల స్థాయిలో వెలువడిన తీర్పు నేపథ్యంలో ‘వ్యవసాయ భూమి కాబట్టి రెరా వర్తించదు’ అనే వాదనపై కొత్త చర్చ మొదలైంది. సేకరించిన భూమిని అభివృద్ధి చేసి ప్లాట్లు లేదా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా మార్కెట్ చేస్తే కేవలం భూమి రికార్డులో ‘వ్యవసాయ’ంగా ఉండడం ఒక్కటే రెరా నుంచి తప్పించుకునే ఆధారం కాదన్న దిశలో ఈ కేసు ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ప్రాజెక్టులో ఎనిమిదేళ్ల తర్వాత బైబ్యాక్ కింద రెట్టింపు మొత్తంతో పాటు 100 నెలల పాటు ఏటా రూ.1.92 లక్షలు లీజు ఇస్తామని, 2023 నుంచి లీజు మొత్తం చెల్లించకపోవడంతో ఓ వ్యక్తి రెరాలో ఫిర్యాదు చేయగా ఈ ఆదేశాలు రావడం గమనార్హం. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయభూముల పేరుతో రియల్ ఎస్టేట్ చేస్తున్న ప్రాజెక్టులను గుర్తించి, వాటిని రెరా చట్టం కింద రిజిస్ట్రేషన్ చేసేందుకు చర్యలు తీసుకోవాలనడంతో ఉమ్మడి వరంగల్‌లోని వ్యవసాయ భూముల పేరుతో వెంచర్లు చేస్తున్న వారిలో వణుకు మొదలైంది. వందలాది ఎకరాల్లో.. రూ.కోట్లలో ఈవ్యాపారం జరుగుతుందనే చెప్పాలి. కొనుగోలుదారుడికి లాభమేంటంటే? రెరా పరిధిలోకి వచ్చే ప్రాజెక్టుకు రిజిస్ట్రేషన్ ఉంటే కొనుగోలుదారుడికి ఆమోదిత లేఔట్, ప్రాజెక్టు వివరాలు, అభివృద్ధి దశ, బుకింగ్ స్థితి, అనుమతులు తదితర వివరాలు ఆన్లైన్లో చూసుకోవచ్చు. అలాగే, ప్రాజెక్జు రిజిస్ట్రేషన్‌కు ముందు మార్కెటింగ్, బుకింగ్, విక్రయాలపై కూడా రెరా చట్టం నియంత్రణ ఉంటుంది. రిజిస్ట్రేషన్ లేకుండా ప్రాజెక్టును ప్రచారం చేస్తే ప్రమోటర్‌పై చర్యలు, జరిమానా విధిస్తారు. టీజీ రెరా ప్రకారం ఉల్లంఘనకు ప్రాజెక్టు అంచనా వ్యయంలో 10 శాతం వరకు జరిమానా విధించే నిబంధన ఉంది. ఇటీవల రాష్ట్రంలో వ్యవసాయ భూమిని ‘ఫార్మ్ ప్లాట్లు’గా విభజించి, లేఅవుట్ అనుమతి, భూమి మార్పిడి, రెరా రిజిస్ట్రేషన్ లేకుండా విక్రయించిన వ్యవహారంలో టీజీ రెరా చర్యలు తీసుకుని జరిమానా విధించింది. చట్టబద్ధమైన వెంచర్లకు డిమాండ్.. ఇప్పటి వరకు ‘వ్యవసాయ భూమి’ పేరుతో తక్కువ ధరకు భూమి తీసుకుని, రోడ్లు, విద్యుత్, గేటెడ్ కమ్యూనిటీ, రిసార్టు, పార్కు, భవిష్యత్ విలువ వంటి అంశాలతో ప్రచారం చేసే మోడల్‌కు మార్కెట్లో డిమాండ్ ఉంది. ఇకపై ప్రాజెక్టు స్థాయి అభివృద్ధి ఉన్న చోట నియంత్రణ సంస్థల దృష్టి పెరగడంతో డెవలపర్లకు పత్రాలు, అనుమతులు, ప్రాజెక్టు వివరాలను స్పష్టంగా ఉంచాల్సిన అవసరముంది. దీంతో నిజంగా వ్యవసాయం కోసం భూమి కొనేవారు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో ప్లాట్ కొనేవారు అనే తేడా కనిపించనుంది. అనుమతులు లేకుండా కేవలం భవిష్యత్ విలువ పేరుతో విక్రయించే ప్రాజెక్టులకు డిమాండ్ తగ్గి, చట్టబద్ధంగా అభివృద్ధి చేసిన వెంచర్లకు ప్రాధాన్యం పెరగవచ్చని రియల్ ఎస్టేట్ వర్గాలు భావిస్తున్నాయి. 2025 మార్చి వరకు రెరా రిజిస్టర్ ప్రాజెక్టులు (పాత జిల్లాల గణాంకాల ప్రకారం)42714292612మహబూబాబాద్ వరంగల్ అర్బన్భూపాలపల్లివరంగల్ రూరల్జనగామప్రాజెక్టులు జిల్లా రెరా చట్టం కింద రిజిస్ట్రేషన్ చర్యలతో ఒక్కసారిగా చర్చ ఫలితంగా ఉమ్మడి వరంగల్‌లో రియల్ ఎస్టేట్‌పై ప్రభావం తాజా చర్యలతో కొనుగోలుదారులకు మరింత రక్షణఆరు జిల్లాల్లో భూములకు డిమాండ్ వరంగల్, హనుమకొండ, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లోని పట్టణాల చుట్టుపక్కల భూములకు డిమాండ్ పెరుగుతోంది. రైతుల నుంచి పెద్దఎత్తున భూములు కొనుగోలు చేసి వెంచర్లు చేసే సంస్కృతి పెరుగుతోంది. రెరా రిజిస్ట్రేషన్ లేకుండా ‘వెంచర్’, ‘ఫామ్ ప్లాట్’, ‘గేటెడ్ ఫామ్’ వంటి పేర్లతో మార్కెటింగ్ చేసే ప్రాజెక్టులపై అధికారులు దృష్టి సారించే అవకాశం ఉంది. అన్ని అంశాలను పరిశీలించాలి కొనుగోలుదారులకు ‘ప్లాట్ ఎక్కడ ఉంది?’ అన్నదానికంటే ‘ఆ ప్లాట్ ఏ అనుమతుల పరిధిలో ఉంది?’ అన్నదే కీలకం. రెరా నంబర్, ఆమోదిత లేఔట్, భూమి హక్కులు, భూమి వినియోగం, నిషేధిత జాబితా, ఎన్కంబరెన్స్ వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే పెట్టుబడి పెట్టడం సురక్షితం – అజిత్‌రెడ్డి, కుడా పీఓ -
అవగాహన తప్పనిసరి
● జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి లలిత భూపాలపల్లి అర్బన్: ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు విద్య, రక్షణ, సంరక్షణపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి ఎల్.లలిత అన్నారు. సమగ్ర శిక్ష తెలంగాణ, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాల విద్యార్థులు, తల్లిదండ్రులు, సీఆర్పీలు, ఎంఐఎస్‌లు, సీఓలు, కార్యాలయ సిబ్బందికి శుక్రవారం ఏఎస్ఆర్ గార్డెన్స్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. సీఎంఓ సామల రమేశ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి డీఈఓ హాజరై మాట్లాడారు. శారీరక, మానసిక, ఇంద్రియ, అభ్యసన సంబంధిత వైకల్యాలున్న విద్యార్థులకు సాధారణ పిల్లలతో పోలిస్తే ప్రత్యేక విద్యా విధానాలు, రక్షణ, సంరక్షణ అవసరమవుతాయని తెలిపారు. దృష్టి, శ్రవణ, వాక్–భాషా, చలన వైకల్యం, మతి స్థిమితం లేకపోవడం, అభ్యసన వైకల్యాలతో పాటు కమ్యూనికేషన్, సామాజిక పరస్పర చర్యల్లో ఇబ్బందులు ఉన్న విద్యార్థుల అవసరాలను గుర్తించి సహకరించాలన్నారు. రిసోర్స్ పర్సన్లు ప్రత్యేక విద్య, సమగ్ర విద్య, సమ్మిళిత విద్య విధానాలపై అవగాహన కల్పించారు. ప్రత్యేక అవసరాలున్న వారికి ప్రభుత్వం అమలుచేస్తున్న చట్టాలు, పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో 4 శాతం, విద్యలో 5 శాతం రిజర్వేషన్ వంటి అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంఓ పింగిళి విజయపాల్‌రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి బర్ల స్వామి, మండల విద్యాశాఖ అధికారి అజ్మీర దేవా, సీఆర్పీలు, ఐఈఆర్పీలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
అమరుల సేవలు మరువలేనివి
● కాళేశ్వరం జోన్ సీసీఎఫ్ ప్రభాకర్ భూపాలపల్లి: అటవీశాఖలో విధి నిర్వహణలో అమరులైన వారి సేవలు మరువలేనివని కాళేశ్వరం జోన్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(సీసీఎఫ్) డాక్టర్ బి.ప్రభాకర్ అన్నారు. అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని అటవీశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాకేంద్రంలో నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా అటవీ అధికారులు, సిబ్బంది తొలుత అటవీశాఖ కాంప్లెక్స్ ఆవరణలో అమరులను స్మరించుకొని మౌనం పాటించారు. అనంతరం గణేష్‌చౌక్ నుంచి అంబేడ్కర్ చౌరస్తా మీదుగా కేటీకే 5వ ఇంక్లైన్ ఆర్చ్ వరకు బైక్ ర్యాలీ చేశారు. కాంప్లెక్స్‌కు చేరుకున్న తరువాత రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ కిష్టాగౌడ్, ఎఫ్డీఓలు సందీప్‌రెడ్డి, అప్పలకొండ, ఎఫ్ఆర్ఓలు, సిబ్బంది పాల్గొన్నారు. మట్టి వినాయక విగ్రహాల పంపిణీ.. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి(టీజీపీసీబీ) ఆధ్వర్యంలో శుక్రవారం అటవీశాఖ జిల్లా కార్యాలయంలో 400 మట్టి వినాయక విగ్రహాలను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నోడల్ అధికారి డాక్టర్ శ్రీకాంత్, డీఎఫ్ఓ కిష్టాగౌడ్, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు. -
హాకీ పోటీల్లో రాణించాలి
● సింగరేణి జీఎం ఏనుగు రాజేశ్వర్రెడ్డిభూపాలపల్లి అర్బన్: క్రీడలు మానసికోల్లాసంతో పాటు ఆరోగ్యం, క్రమశిక్షణ, టీమ్ వర్క్‌ను పెంపొందిస్తాయని ఏరియా సింగరేణి జీఎం ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కృష్ణకాలనీలోని అంబేడ్కర్ స్టేడియంలో డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ ఆధ్వర్యంలో భూపాలపల్లి, రామగుండం–3 ఏరి యాల హాకీ రీజినల్ పోటీలకు జీఎం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. ఆధునిక జీవన విధానంలో వర్క్–లైఫ్ బ్యాలెన్స్‌కు క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు. ఉద్యోగులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడలను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. సింగరేణి చరిత్రలో తొలిసారిగా మైనింగ్, ఎలక్ట్రికల్, మెకా నికల్ విభాగాల్లో గణనీయంగా మహిళా అధికారులు నియమితులయ్యారని తెలిపారు. మహిళలు పురుషులతో సమానంగా భూగర్భ గనుల్లో విధులు నిర్వహిస్తున్నారని, మహిళా రెస్క్యూ టీమ్‌లను కూడా ఏర్పాటు చేశామన్నారు. సింగరేణిలో అన్ని రంగాలతో పాటు క్రీడల్లోనూ మహిళా ఉద్యోగులు స్ఫూర్తిగా ముందుకు రావాలని ఆకాంక్షించారు. త్వరలో జరిగే కోల్ ఇండియా క్రీడా పోటీల్లో సింగరేణిని అగ్రస్థానంలో నిలిపేందుకు క్రీడాకారులు ఆత్మవిశ్వాసంతో పతకాలు సాధించాలని కోరారు. క్రీడలను విజయవంతంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను, పోటీల్లో పాల్గొంటున్న ఉద్యోగులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్.శ్యామ్‌సుందర్, క్రీడల గౌరవ కార్యదర్శి సాయికృష్ణ, గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేశ్, ప్రాతినిథ్య సంఘం ఉపాధ్యక్షుడు బి.మధుకర్‌రెడ్డి, సీఎంఓఐ అధ్యక్షుడు నజీర్, స్పోర్ట్స్ సూపర్వైజర్ పర్స శ్రీనివాస్, భూపాలపల్లి స్పోర్ట్స్ కోఆర్డినేటర్ జి.నాగేశ్వర్రావు, ఆర్జీ–3 స్పోర్ట్స్ కోఆర్డినేటర్ బి.సదానందంతో పాటు క్రీడాకారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు
భూపాలపల్లి: వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఇబ్బందులు, లోటుపాట్లు లేకుండా సజావుగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్‌శర్మ ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ల ఏర్పాట్లపై శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో రెవెన్యూ, పౌరసరఫరాలు, సహకార, మార్కెటింగ్, వ్యవసాయ, డీఆర్డీఏ, ఎస్‌డబ్ల్యూసీ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కొనుగోలు కేంద్రాలు, గోదాములు, రైస్‌మిల్లులు, రవాణా, గన్నీ బ్యాగుల లభ్యత తదితర అంశాలపై శాఖల వారీగా చేపట్టాల్సిన చర్యలను సమీక్షించారు. ధాన్యం సేకరణ ప్రారంభానికి ముందే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి, సమస్యలకు తావులేకుండా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ సౌరవ్ శర్మ, అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, పౌరసరఫరాల డీఎం రాములు, సహకార అధికారి వాల్యనాయక్, మార్కెటింగ్ అధికారి ప్రవీణ్‌రెడ్డి, డబ్ల్యూసీఆర్ఎం దీపిక, అదనపు డీఆర్డీఏ చౌహాన్, ఏఎంవీఐ సుందర్‌లాల్ పాల్గొన్నారు.నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు జిల్లాలో ఈ నెల 23, 24 తేదీల్లో నిర్వహించనున్న వినాయక విగ్రహాల నిమజ్జనోత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో, అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం, గణపురం తదితర ప్రధాన నిమజ్జన ప్రాంతాల్లో చేపట్టాల్సిన ఏర్పాట్లు, విధులపై వివిధ శాఖలకు బాధ్యతలు కేటాయిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. కలెక్టర్ రాహుల్‌శర్మ -
ఐలమ్మ త్యాగం స్ఫూర్తిదాయకం
భూపాలపల్లి రూరల్: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ త్యాగాలు తరతరాలకు స్ఫూర్తి దాయకమని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ అన్నారు. చాకలి ఐలమ్మ 41వ వర్ధంతిని పురస్కరించుకుని గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ అధికారి ఇందిర ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్‌కుమార్ వివిధ బీసీ సంఘాల ప్రతినిధులతో కలిసి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం ఐలమ్మ సాగించిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. అన్యాయం, అణచివేతలకు వ్యతిరేకంగా ఆమె ప్రదర్శించిన ధైర్యసాహసాలు సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ రాజేశ్వరి, జిల్లా రజక సంఘం అధ్యక్షుడు పున్నం రవి, సంఘాల నాయకులు సాంబమూర్తి, పైడిపల్లి రమేశ్, సూరయ్య, గోపరాజు రాజు, శ్రవణ్, అనిల్, షఫీ, రవీందర్ పాల్గొన్నారు. -
ప్రకటనల హోరు.. పర్యవేక్షణ కరువు
జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన డిజిటల్ హోర్డింగ్, చినిగి వేలాడుతున్న ఫ్లెక్సీ (ఫైల్) భూపాలపల్లి పట్టణంలో 80వేల వరకు జనాభా నివసిస్తున్నారు. జిల్లాకేంద్రంతో పాటు మంజూర్‌నగర్‌లో కలిసి సుమారు 15వరకు హోర్డింగ్‌లు ఉన్నాయి. ఏడు ఏజెన్సీలు హోర్డింగ్‌లు ఏర్పాటుచేస్తున్నాయి. ఇవే కాక అనుమతులు లేకుండా కూడా హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు పదుల సంఖ్యలో ఏర్పాటు చేస్తున్నారు. వర్షాకాలం కావడంతో ఇవి ప్రమాదకరంగా మారుతున్నాయి. ప్రమాదకర హోర్డింగ్‌లను తొలగించాలని గత నెలలో నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అధికార కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. అయినా ఇప్పటి వరకు తొలగింపు ప్రక్రియ మాత్రం ప్రారంభం కాలేదు. దీంతో పట్టణ ప్రజలు ఎప్పుడు ప్రమాదం జరుగుతుందో అనే భయపడుతున్నారు. గతంలో పలువురికి గాయాలు.. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభంలో జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారిపై గల భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు కింద పడటంతో పలువురికి గాయాలయ్యాయి. పట్టణంలో ఇలాంటి ప్రమాదకర హోర్డింగ్‌లు చాలా ఉన్నాయి. జిల్లాకేంద్రం, మంజూర్నగర్లోనూ ఇలాంటివి ఉన్నాయి. పట్టణంలో ప్రమాదకర హోర్డింగ్‌లను తొలగించి ప్రమాదాల నివారణకు అధికారులు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. పర్యవేక్షణ లేక.. జిల్లాకేంద్రంలోని ప్రధాన రహదారి వెంట పలు ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటిపై పురపాలిక యంత్రాంగం పర్యవేక్షణ కరువైంది. ప్రచార ప్రకటనలతో పురపాలికకు రావాల్సిన రూ.లక్షల ఆదాయానికి గండిపడుతోంది. పురపాలిక మనుగడ సాగించాలంటే కేవలం నిధులపైనే ఆధారపడకుండా ఆదాయ మార్గాలను అన్వేషించాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఫలితంగా ఆస్తి పన్ను, ఇళ్లద్వారా వచ్చే రాబడి మాత్రమే దిక్కవుతోంది. ఆదాయ మార్గాలెన్నో ఉన్నా పక్కా ప్రణాళిక లేకపోవడంతో వెనకడుగే పడుతోంది. ఇకనైనా అధికారులు ఈ దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం హోర్డింగ్‌ల ద్వారా 7 ఏజెన్సీల ద్వారా ఏటా కేవలం రూ.2.50లక్షల వరకు మాత్రమే ఆదాయం వస్తోంది. సాధారణ ప్రజల నుంచి ప్రముఖుల వరకు..డిజిటల్ ఫ్లెక్సీలు వచ్చిన నాటి నుంచి సాధారణ ప్రజల నుంచి ప్రముఖుల వరకు రద్దీ ప్రాంతాలు, ప్రధాన కూడళ్లలో ప్రకటనలు చేసుకుంటున్నారు. అవి ఒకరోజు కాకుండా వారాల తరబడి అలాగే ఉంచుతున్నారు. ఇలాంటి వారి వద్ద పన్ను వసూలు చేసే దిశగా పురపాలిక అధికారులు చొరవ తీసుకోవాలి. దీంతో కొంతమేర ఆదాయం సమకూరే అవకాశం ఉందని స్థానిక ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రక్షణ పాటించకుండా రోడ్ల పక్కన, కూడళ్లలో ఇనుముతో భారీ హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తుండడంతో నిర్మాణాలు ఎప్పుడు పడిపోతాయోనన్న భయం పాదచారులు, వాహనదారులను వెంటాడుతోంది. ప్రధానంగా హోర్డింగ్ ఏర్పాటుపై నియంత్రణ, నిర్వహణలో పురపాలిక యంత్రాంగాలపై మితిమీరిన రాజకీయ జోక్యం, ప్రముఖ సంస్థల ఒత్తిళ్లు ఉన్నాయని వినికిడి. వీటిని తొలగిస్తేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.పట్టణంలో ప్రమాదకరంగా హోర్డింగ్‌లు చినిగి వేలాడుతున్న ఫ్లెక్సీలు మున్సిపల్ ఆదాయానికి గండిజిల్లాకేంద్రంలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ, హోర్డింగ్‌లు నిబంధనల ప్రకారమే ఉన్నాయి. ప్రమాదకరంగా మారిన హోర్డింగ్‌లను పరిశీలించి తొలగిస్తాం. హోర్డింగ్‌ల ద్వారా ఏడాదికి రూ.2.50లక్షల ఆదాయం వస్తుంది. మరింత ఆదాయం పెంచేందుకు కృషి చేస్తాం. – చంద్రశేఖర్, టీపీఓ -
రైతుబీమా అయోమయం
● రెన్యువల్ ప్రీమియం చెల్లింపుపై సందిగ్ధం ● మరణాల నమోదుకు అనుమతి ● పరిహారం చెల్లింపుపై స్పష్టత కరువుకాళేశ్వరం: రైతుబీమా పథకం రెన్యువల్ ప్రీమియం చెల్లింపులో చోటుచేసుకున్న తీవ్రజాప్యం అన్నదాతల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. 2025–26 సంవత్సర కాల పరిమితి ముగిసి నెలరోజులు అవుతున్నా 2026–27 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం ప్రీమియం చెల్లించకపోవడంతో పథకం కొనసాగుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మరోవైపు ఆగస్టు 14 తర్వాత రైతుల మరణాలను నమోదు చేయాలని వ్యవసాయశాఖ ఆదేశిస్తున్నప్పటికీ పరిహారం అందుతుందో లేదోనన్న సందేహాలు క్షేత్రస్థాయిలో వ్యక్తమవుతున్నాయి. 1,24,397 మంది రైతులు.. రైతు బీమా పథకానికి భూపాలపల్లి, కాటారం డివిజన్లో మొత్తం 1,24,397 మంది అర్హత కలిగిన రైతులు ఉన్నారు. వీరికి ప్రతీ సంవత్సరం ఒక్కో రైతు పేరిట ప్రభుత్వం రూ.3,500 ప్రీమియం చెల్లిస్తుంది. 2018–19 నుంచి 2025–26 వరకు మొత్తం 2,738 క్లైయిమ్లు నమోదు కాగా 2,685 పరిష్కారమయ్యాయి. ఒక్కో రైతు కుటుంబానికి రూ.5లక్షల చొప్పున జిల్లాలో 134.25 కోట్ల పరిహారం అందజేశారు. మరణాల నమోదు ఆగస్టు 14 నుంచి జరిగిన రైతుల మరణాలను నమోదు చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఏఈఓ, ఏఓలకు ఆదేశాలు అందించినట్లు తెలిసింది. దీంతో క్షేత్రస్థాయిలో ఏఈఓలు, ఏఓలు గ్రామాల వారీగా మరణించిన రైతుల వివరాలను నమోదు చేస్తున్నారు. గతంలో రైతుబీమా పథకం కింద అర్హత కలిగిన రైతు ఏ కారణంతో మరణించినా, నామినీ ఖాతాలో రూ.5లక్షల బీమా పరిహారం జమ అయ్యేది. ఇంటి పెద్దను కోల్పోయిన రైతు కుటుంబాలకు ఈ మొత్తం ఆర్థికంగా కొంతమేర అండగా నిలిచేది. కానీ గత నెల 14నుంచి రైతు బీమాపై ప్రభుత్వం ఎలాంటి సర్క్యులర్ కూడా ఇవ్వలేదు. మరణాల వివరాలు రికార్డు చేస్తున్నాం ఈ ఏడాది ఆగస్టు 14 తరువాత మరణించిన వారి వివరాలను ఏఈఓ, ఏఓలు నమోదు చేస్తున్నారు. రైతుల వివరాలను రికార్డు చేసి రిపోర్టు తయారు చేస్తున్నాం. రైతు బీమాపై సర్క్యులర్ రాలేదు. ప్రభుత్వ పాలసీ ప్రకారం సర్క్యులర్ వచ్చిన వెంటనే వివరాలను వెల్లడిస్తాం. – జాడి బాబురావు, జిల్లా వ్యవసాయ అధికారి -
‘డిఫాల్టర్లుగా చిత్రీకరించడం సరికాదు’
భూపాలపల్లి అర్బన్: రైస్ మిల్లింగ్ పరిశ్రమలోని వాస్తవ సమస్యలను పట్టించుకోకుండా మిల్లర్లందరినీ డిఫాల్టర్లుగా చిత్రీకరించడం సరికాదని జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పెరుమాళ్ల తిరుపతి, గౌరవ అధ్యక్షుడు కోరే రవి అన్నారు. గురువారం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన మహాధర్నాలో వారు మాట్లాడారు. మిల్లింగ్‌లో సార్టెక్స్, అధిక బ్రోకెన్స్, అకాల వర్షాలు, తేమ తగ్గడం తదితర కారణాలతో 18–20 శాతం వరకు వాస్తవ నష్టాలు ఉంటాయని తెలిపారు. ముడి బియ్యం కోసం అదనంగా కేటాయించిన 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఉడికించిన బియ్యంగా మార్చేందుకు అనుమతించాలని, లేదంటే వేలం వేయాలని కోరారు. సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని, డైనమిక్ క్రాప్ పాలసీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి యానం సంతోష్, ట్రెజరర్ రవీందర్‌రెడ్డి, సభ్యులు రాజు, సదానందం, భిక్షపతి, మహేందర్, శ్రీధర్ పాల్గొన్నారు. ఆధునిక వ్యవసాయ విధానాలపై ఆసక్తి రేగొండ: రైతులు ఆధునిక, లాభాదాయకమైన వ్యవసాయ విధానాలను అవలంభించుకోవాలని అదనపు కలెక్టర్ ఎల్.విజయలక్ష్మి అన్నారు. గురువారం మండలంలోని కొడవటంచ గ్రామంలో సమీకృత ఫాంపాండ్ ద్వారా కలిగే ప్రయోజనాలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంటల వైవిద్యీకరణపై రైతులకు అవగాహన కల్పించారు. పశువుల పెంపకం, భూగర్భ జలాల పెంపు, హార్టికల్చర్, డ్రాగన్స్ ప్రూట్ సాగు వంటి కార్యక్రమాల ద్వారా రైతులు అదనపు ఆదాయాన్ని పొందే అవకాశాలు ఉన్నాయని అన్నారు. రైతులు అందుబాటులో ఉన్న ప్రభుత్వ పధకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం రేగొండ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. చాకలి ఐలమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, ఏపీఓ జామీర్పాషా, అధికారులు పాల్గొన్నారు. అప్రమత్తంగా ఉండాలిరేగొండ: సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ డాక్టర్ మధుసూదన్ అన్నారు. గురువారం రాజక్కపల్లిలో నిర్వహించిన వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించారు. అక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కాలానికి అనుగుణంగా వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. వ్యాధులు రాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. దోమల వృద్ధిని అరికట్టేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏమైనా వ్యాధుల లక్షణాలు కనిపించినట్లతే సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి తగిన వైద్యం పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. -
వినాయక చవితికి పకడ్బందీ ఏర్పాట్లు
భూపాలపల్లి రూరల్: వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. గురువారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత శాఖల అధికారులతో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండపాల నిర్వాహకుల వివరాలను ప్రోఫార్మాలో నమోదు చేయించడంతో పాటు ప్రతీ మండపం వద్ద సైబర్ నేరాలపై అవగాహన పోస్టర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇబ్బందులు కలగకుండా, భక్తిశ్రద్ధలతో వినాయక ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నిమజ్జనానికి సంబంధించి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ సౌరవ్ శర్మ, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఏఎస్పీ నరేష్ కుమార్, డీఆర్ఓ వసంత కుమారి, ఆర్డీఓ హరికృష్ణ, సింగరేణి జీఎం రాజేశ్వర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్, డివిజనల్ పంచాయతీ అధికారి మల్లికార్జున్‌రెడ్డి, ఇరిగేషన్, విద్యుత్, ఆర్అండ్బీ, ఎకై ్సజ్ శాఖల అధికారులు పాల్గొన్నారు. దరఖాస్తుల స్వీకరణ జిల్లాలో వెనుకబడిన తరగతుల కులాలకు చెందిన నిరుద్యోగ బీసీ మహిళలకు ఉపాధి కల్పించడానికి ఇంటింటా ఆటోమేటిక్ ఇందిరమ్మ కుట్టుమిషన్లు వంద శాతం సబ్సిడీతో అందించేందుకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్‌శర్మ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 18 సంవవ్సరాల నుంచి 55 సంవత్సరాల లోపు వయస్సు కలిగినవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. పీఏసీఎస్ విక్రయకేంద్రం ప్రారంభం మహాముత్తారం: మండలకేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకారసంఘం (పీఏసీఎస్) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల విక్రయకేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువు, పురుగుల మందులను సరసమైన ధరలకు అందించడంతో పాటు పంపిణీ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, జిల్లా సహకార అధికారి వాల్యనాయక్, మహదేవపూర్ ఏడవే శ్రీపాల్, ఎంపీడీఓ నిశాంత్, మండల వ్యవసాయ అధికారి అనూష, పీఏసీఎస్ చైర్మన్ సోమ శాంతకుమార్, పీఏసీఎ సీఈఓ మార్క శ్రీధర్, పాలకవర్గ డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ -
నేరాల నియంత్రణలో రాజీలేని పోలీసింగ్
భూపాలపల్లి అర్బన్: ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ నేరాల నియంత్రణలో రాజీలేని విధంగా పనిచేయాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పోలీసు అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో జిల్లాలోని పోలీస్స్టేషన్ల పనితీరు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, శాంతిభద్రతలు, నేర నియంత్రణ చర్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి నాణ్యమైన దర్యాప్తు ద్వారా బాధితులకు న్యాయం అందించాలని సూచించారు. దొంగతనాల నియంత్రణకు గస్తీ, నిఘాను పెంచడంతో పాటు సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి నేరాలను ఛేదించాలని ఆదేశించారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, పోక్సో కేసుల్లో ప్రత్యేక శ్రద్ధతో దర్యాప్తు పూర్తిచేసి బాధితులకు సత్వర న్యాయం అందించాలన్నారు. సీసీటీఎన్ఎస్ కేసుల నమోదు, దర్యాప్తు వివరాలు, కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సూచించారు. సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, జూదం తదితర అసాంఘిక కార్యకలాపాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గ్రామస్థాయి పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. ఈ నెల 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా విస్తృతంగా అవగాహన కల్పించాలని చెప్పారు. రాజీకి అవకాశం ఉన్న కేసులను న్యాయశాఖ సమన్వయంతో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ నరేష్కుమార్, డీఎస్పీలు సంపత్‌రావు, సూర్యనారాయణ, సీఐలు, ఎస్సైలు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
యూత్ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌చార్జ్‌లు
సాక్షిప్రతినిధి, వరంగల్: తెలంగాణ ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ (టీపీవైసీ)లో సంస్థాగత మార్పులు చేపట్టారు. రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలకు కొత్త ఇన్చార్జులను నియమించారు. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ పరిధిలోని ఆరు జిల్లాలకు పలువురు నేతలకు బాధ్యతలు అప్పగించారు. వరంగల్ జిల్లాకు ముచల సాయి మనోజ్‌కుమార్ యాదవ్‌ను సెక్రటరీ ఇన్చార్జ్గా, హనుమకొండ జిల్లాకు పాడాల రాహుల్‌ను జనరల్ సెక్రటరీ ఇన్చార్జ్ గా నియమించారు. ఈ రెండు జిల్లాల వ్యవహారాలను రాష్ట్ర ఉపాధ్యక్షుడు హరిప్రసాద్ రూపవత్ పర్యవేక్షించనున్నారు. జనగామ జిల్లాకు జనరల్ సెక్రటరీగా చంద్రిక దుబ్బక, మహబూబాబాద్ జిల్లాకు జనరల్ సెక్రటరీగా అలువాల కార్తీక్, సెక్రటరీగా అశ్విన్ ఏకేలను నియమించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహిపాల్ ఒరుగంటి, ములుగు జిల్లాకు బండిగ రాకేశ్‌కు బాధ్యతలు అప్పగించారు. క్షేత్రస్థాయిలో సమన్వయం.. కొత్తగా నియమితులైన ఇన్చార్జులు తమ పరిధిలోని జిల్లా, అసెంబ్లీ, మండల స్థాయి కమిటీలతో సమన్వయం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర అధ్యక్షుడు నియామక ఉత్తర్వులో సూచించారు. నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపారు. యువతను పెద్దఎత్తున పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడంతోపాటు క్షేత్రస్థాయిలో యూత్ కాంగ్రెస్ సంస్థాగతంగా బలోపేతం చేయడంపై కొత్త బాధ్యులు దృష్టి సారించనున్నారు. ఉమ్మడి వరంగల్‌లో ఏడుగురు రాష్ట్ర నేతలకు బాధ్యతలు వరంగల్, హనుమకొండ జిల్లాలపై ప్రత్యేక దృష్టి -
రంగాపూర్ టు సింగపూర్
శుక్రవారం శ్రీ 11 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026ప్రభుత్వ బడి నుంచి అంతర్జాతీయ వేదికకు..భూపాలపల్లి అర్బన్: మారుమూల గ్రామం నుంచి ఉపాధ్యాయుడిగా ప్రస్థానం ప్రారంభించి ప్రభుత్వ పాఠశాలల విద్యాభివృద్ధికి కృషిచేస్తున్న తౌటం స్వామికి అంతర్జాతీయ విద్యా వేదికపై అధ్యయనం చేసే అవకాశం లభించింది. రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టీచర్స్ ఎక్స్‌పోసర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్సేంజ్ ప్రోగ్రాం టు సింగపూర్‌కు జిల్లా నుంచి స్వామి ఎంపికయ్యారు. ఈ నెల 12నుంచి 19వరకు జరిగే పర్యటనలో సింగపూర్ విద్యావిధానం, బోధనా పద్ధతులు, విద్యార్థి కేంద్రీకృత అభ్యసనం, పాఠశాల నిర్వహణ తదితర అంశాలను అధ్యయనం చేయనున్నారు. రంగాపూర్ నుంచి ప్రస్థానం మొగుళ్లపల్లి మండలం రంగాపూర్‌కు చెందిన స్వామి డీఎస్సీ 2006 ద్వారా ఎస్జీటీగా ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించారు. చింతలపల్లి, అంకుషాపూర్, పరకాల మండలం నాగారం పాఠశాలల్లో పనిచేసిన ఆయన ప్రస్తుతం ఎంపీపీఎస్ జంగేడులో ఎస్జీటీగా సేవలందిస్తున్నారు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే శిక్షకుడిగా, రిసోర్స్ పర్సన్‌గా, కంటెంట్ డెవలపర్‌గా విద్యాశాఖ కార్యక్రమాల్లో భాగస్వామ్యమయ్యారు. ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాల్లో కీలక పాత్ర ప్రాథమిక విద్యలో అభ్యసన ప్రమాణాలను పెంపొందించే ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంలో ఎస్ఆర్పీ, డీఆర్పీగా పలు శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. టీచర్స్ హ్యాండ్ బుక్స్(మాథ్యమెటిక్స్) రూపకల్పనలో కంటెంట్ డెవలపర్‌గా సేవలందించారు. ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో రూపొందించిన ఎన్ఏఎస్, ఎఫ్ఎల్ఎస్ ఐటెమ్ బ్యాంక్‌తో పాటు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను గురుకుల ప్రవేశ పరీక్షలకు సిద్ధం చేసేందుకు రూపొందించిన ‘సాధన’ మాడ్యూల్, రెకమండేషన్ మాడ్యల్ రూపకల్పనలోనూ భాగస్వామ్యమయ్యారు. పలు అవార్డులు 2023లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో ఉత్తమ రిసోర్స్ పర్సన్ అవార్డు, 2024లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. జిల్లా స్థాయి ఎఫ్ఎల్ఎన్, టీఎల్ఎం మేళా గణిత విభాగంలో ప్రథమ బహుమతి సాధించారు. సింగపూర్ నుంచి కొత్త పాఠాలు కృత్యాధారిత బోధన, టీఎల్ఎం వినియోగం, పాటలు, ఆటలు, కృత్యాల ద్వారా విద్యార్థులను అభ్యసనలో భాగస్వాములను చేయడం స్వామి బోధనా విధానంలో ప్రత్యేకతగా నిలుస్తోంది. సింగపూర్ పర్యటనలో అక్కడి ఉత్తమ విద్యా పద్ధతులను అధ్యయనం చేసి, ప్రభుత్వ పాఠశాలలకు అన్వయించగల అంశాలను గుర్తించి తోటి ఉపాధ్యాయులతో పంచుకోవాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. స్వామి సింగపూర్ విద్యా అధ్యయన పర్యటనకు ఎంపిక కావడంపై తోటి ఉపాధ్యాయులు, మండల, జిల్లా విద్యాశాఖ అధికారులు, పాఠశాల సిబ్బంది, గ్రామస్తులు అభినందనలు తెలిపారు. సింగపూర్ విద్యావిధాన అధ్యయనానికి తౌటం స్వామి ఎంపిక -
పోరాట ఫలితంగానే ఆదాయ పన్ను రద్దు
భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికులకు సంబంధించిన పెర్క్స్‌పై ఇన్‌కం ట్యాక్స్ రద్దు ఏఐటీయూసీ నిరంతర పోరాట ఫలితమేనని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ తెలిపారు. ఏరియాలోని కేటీకే ఓసీ–2 గనిలో బుధవారం ఫిట్ సెక్రటరీ కరీముల్లా అధ్యక్షతన నిర్వహించిన గేట్ మీటింగ్‌లో రాజ్‌కుమార్ మాట్లాడారు. ఇటీవల రీజినల్ లేబర్ కమిషనర్ (ఆర్ఎల్సీ) సమక్షంలో సింగరేణి యాజమాన్యంతో అనేక కార్మిక డిమాండ్లపై ఒప్పందాలు కుదిరాయని తెలిపారు. అందులో ముఖ్యంగా కార్మికుల పెర్క్స్‌పై ఇన్‌కం ట్యాక్స్ రద్దు చేయడమే కాకుండా, కార్మికుల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయడానికి యాజమాన్యం అంగీకరించిందన్నారు. 2016–17 జేఎంఈటీ ఉద్యోగులకు ఖాళీల ఆధారంగా కాకుండా ప్రమోషన్లు కల్పించేందుకు అంగీకారం లభించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ నాయకులు తోట రాంచందర్, డీఎస్ సింగ్, పి.నారాయణ, చేరాలు, కృష్ణ పాల్గొన్నారు. -
రోగులకు నాణ్యమైన వైద్యసేవలు
భూపాలపల్లి అర్బన్: జిల్లా ప్రధాన ఆస్పత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించడంతో పాటు అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్‌శర్మ వైద్యులను ఆదేశించారు. బుధవారం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ వివిధ విభాగాలు, ఆస్పత్రి మౌలిక వసతులను పరిశీలించారు. ఆస్పత్రి ఆవరణలో డంప్ యార్డ్ నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలం, డ్రెయినేజీ, సీసీ రోడ్డు పనులను తనిఖీ చేసి నాణ్యత పాటించాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న 140 పడకల సామర్థ్యాన్ని 230 పడకలకు పెంచేందుకు అవసరమైన భవనాలు, వైద్య పరికరాలు, సిబ్బంది తదితర వనరులపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణపై నిర్లక్ష్యం తగదని, ఆస్పత్రిలో పారిశుద్ధ్య నిర్వహణలో లోపాలపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ వసంతకుమారి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటరత్నం, మున్సిపల్ కమిషనర్ ఉదయ్‌కుమార్, ఎన్పీడీసీఎల్ డీఈ పాపిరెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్దివ్య, అసిస్టెంట్ డైరెక్టర్ యాదగిరి, ఆర్ఎంఓ డాక్టర్ రాజేశ్, టీజీఎంఐడీసీ అధి కారులు, వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు. పోషకాహారం తీసుకోవాలి భూపాలపల్లి: మహిళలు, చిన్నారులు తమ ఆరోగ్యం కోసం పోషకాహారం తీసుకోవాలని కలెక్టర్ రాహుల్‌శర్మ సూచించారు. ఈ నెల 9వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు నిర్వహించనున్న 9వ జాతీయ పోషణ్ మాసం కార్యక్రమాలకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఐడీఓసీ కార్యాలయంలోని తన చాంబర్లో కలెక్టర్ బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా సంక్షేమాధికారి మల్లేశ్వరి, సీడీపీఓలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. ఈవీఎం గోదాం పరిశీలన.. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లాకేంద్రంలోని ఈవీఎం గోదామును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోదాంలో భద్రపరిచిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వీవీ ప్యాట్ యంత్రాల భద్రతను పరిశీలించారు. సర్వే, డిజిటలైజేషన్ పూర్తి చేస్తాం.. జిల్లాల్లో మాన్యుస్క్రిప్టస్ (పాండులిపులు) సర్వే, డిజిటైజేషన్ కార్యక్రమాలను సమన్వయంతో నిర్వహించి విజయవంతం చేయాలని టూరిజం అండ్ కల్చర్ స్పెషల్ సెక్రటరీ వాణిప్రసాద్ సూచించారు. సచివాలయం నుంచి కలెక్టర్లతో జ్ఞాన్ భారత్ మిషన్ సర్వే, డిజిటైజేషన్, పర్యాటక ప్రదేశాల అభివృద్ధిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాళోజీ జీవితం ప్రతీ ఒక్కరికి ఆదర్శం కలెక్టర్ రాహుల్శర్మకాళోజీ జీవితం అందరికీ ఆదర్శం.. ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జీవితం ఆయన చూపిన మార్గం ప్రతీ ఒక్కరికి ఆదర్శప్రాయమని కలెక్టర్ రాహుల్‌శర్మ అన్నారు. కాళోజీ 112వ జయంతి సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కాళోజీ తన కవిత్వం, రచనలు, ఉద్యమ స్ఫూర్తితో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, డీఆర్ఓ వసంతకుమారి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ప్రజలకు నాణ్యమైన సేవలు
● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ టేకుమట్ల: శాంతి భద్రతల పరరిరక్షణలో పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ.. ప్రజలకు మరింత నాణ్యమైన, పారదర్శకమైన సేవలు అందించాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. బుధవారం మండలకేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం రికార్డులు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, సీసీ కెమెరాల పనితీరు, స్టేషన్ పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. కేసుల దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రతీఒక్కరు బాధ్యతాయుతంగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐ సతీష్, ఎస్సై అమూల్య, పోలీస్ సిబ్బంది ఉన్నారు. -
గురువారం శ్రీ 10 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
● ఈ నెలలో వర్షాలు కురవకుంటే కష్టాలే.. ● ఇప్పటికే పలు మండలాల్లో లోటు వర్షపాతం ● రెండు రోజులుగా మండుతున్న ఎండలు ● పొదుపుగా వాడితేనే జలసంరక్షణ భూపాలపల్లి రూరల్: ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో ఈసారి ఇప్పటివరకు సమృద్ధిగా వర్షాలు కురువలేదు. కొన్నిచోట్ల వానలు సాధారణం కంటే తక్కువగా పడ్డాయి. దీంతో ఆయా మండలాల్లో భూగర్భజలాలు లోతులో ఉన్నాయి. ఆగస్టు నెల వరకు జిల్లాలో భూగర్భ జలాల సగటు లభ్యత 10.22 మీటర్లు ఉండగా, గతేడాది ఇదే నెలలో జిల్లా సగటు చూస్తే 8.44 మీటర్లుగా ఉంది. ఇప్పటికీ జిల్లాలో గోదావరి తీరప్రాంతమైన మహదేవపూర్, పలిమెల ప్రాంతాల్లోనూ నీటి లభ్యత తక్కువగానే ఉంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కీలకమైన నైరుతి రుతుపవన కాలంలో వర్షాలు కురిస్తేనే చెరువులు, కుంటలు, సాగునీటి ప్రాజెక్టులు, గోదావరి నదిలోకి వరద చేరేది. ఈసారి రెండు సార్లు మినహా భారీగా వరదలు రాలేదు. దీంతో భూమిలోకి నీరు ఇంకకపోవడంతో నీటిలభ్యత తగ్గుతోంది. ఎండలు పెరిగితే.. రెండు రోజులుగా ఎండకాలాన్ని తలపిస్తూ ఉక్కపోత, వేడిమి పెరుగుతోంది. వానా కాలంలోనూ ఎండల తీవ్రత పెరుగుతోంది. దీంతో పంటలకు నీటి అవసరం ఎక్కువ అవుతుంది. మరోవైపు ఉష్ణోగ్రతలు పెరిగితే నీటి వాడకం పెరుగుతుంది. దీంతో భూగర్భజలాల వాడకంగా ఉన్న బావులు, బోర్ల నుంచి ఎక్కువ మొత్తంలో నీటిని తోడాల్సి వస్తుంది. వేసవి తరహాలోనే వానాకాలంలోనూ బోర్లు, బావులపై ఆధా రపడాల్సి వస్తోంది. దీంతో వేగంగా భూగర్భజలాలు పడిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే పలు మండలాల పరిధిలో నీటి లభ్యత లోతుకు చేరుతోంది. ఈ నెలలో వర్షాలు ఆశించిన మేర పడకపోతే నీటి లభ్యత తగ్గే అవకాశం ఉంది. అదే సమయంలో పంటలు కాపాడుకోవడానికి నీటిని అధికంగా వినియోగించాల్సి ఉంది. మరోవైపు గృహ, వాణిజ్య, పరిశ్రమల కోసం పట్టణాలు, జిల్లాకేంద్రంలో విచ్చలవిడిగా బోర్లు వాడుతున్నారు. దీంతో వేగంగా నీటి లభ్యత తగ్గుతోంది. నీటిని పొదుపుగా వాడుకోవాలని భూగర్భజల సంరక్షణ అధికారులు కోరుతున్నారు. భూగర్భ జలాలు (మీటర్లలో)..మండలం ఆగస్టు 2025 ఆగస్టు 2026ఈ నెలలో తగినంత వర్షం కురవకపోతే క్రమంగా భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఇప్పటికై తే జిల్లాలో సాధారణ స్థితిలోనే ఉన్నాయి. భూగర్భ జలాలను అందరూ అవసరం మేరకు పొదుపుగా వాడుకోవాలి. భూగర్భజలాలను పెంచుకునే విధంగా ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలి. – శైలశ్రీ, జిల్లా ఇన్చార్జ్ భూగర్భ జల అధికారి జిల్లాలో వర్షపాతం వివరాలు (మీ.మీ) నెల సాధారణం వర్షపాతం జూన్ 152.9 120.8 జూలై 322.9 367.8 ఆగస్టు 292.2 172.6 -
జంపన్నవాగులో ఇసుక తవ్వకాలు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: ఇందిరమ్మ ఇళ్ల పేరుతో పలువురు వ్యాపారులు మండల పరిధిలోని జంపన్నవాగు నుంచి యథేచ్ఛగా ఇసుకను తరలిస్తున్నారు. దీంతో మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరతో విడదీయరాని అనుబంధం ఉన్న జంపన్నవాగును భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. వాగు నీటిలో స్నానం చేస్తే పుణ్యం కలుగుతుందని నమ్మకం. అలాంటి వాగులో ఇందిరమ్మ ఇళ్ల పేరుతో పలువురు వ్యాపారులు అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో పలు విమర్శలు వస్తున్నాయి. జేసీబీలతో ఇసుక తీస్తూ.. జంపన్నవాగులో జేసీబీలతో పలువురు వ్యాపారులు ఇసుకను తీస్తూ ట్రాక్టర్లు, లారీల్లో ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇసుకను తరలిస్తున్నారు. గ్రామాలకు తరలిస్తూ జోరుగా ఇసుక దందాకు పాల్పడుతున్నారు. ప్రతిరోజూ 20 ట్రిప్పుల మేర ఇసుకను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక ట్రాక్టర్ లోడ్ ఇసుకకు దాదాపుగా రూ.3 వేలు, లారీ ఇసుకను రూ.5 వేలకు అమ్ముతూ వేలల్లో సంపాదిస్తున్నారు. ఇసుక తవ్వకాలతో ముప్పు వాగులో ఇసుక తవ్వకాలు చేపట్టడం వల్ల వాగు సహజ స్వరూపం దెబ్బతినే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. భారీగా ఇసుకను తొలగిస్తే వాగు లోతు పెరగడంతో పాటు నీటి సహజ ప్రవాహానికి ఆటంకం కలిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాగుకు ఇరువైపులా ఉన్న స్నానఘట్టాలు దెబ్బతినే అవకాశం సైతం ఉందని చెబుతున్నారు. వాగులోని ఇసుక వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాంటిది ఇసుకను తరలిస్తే భూగర్భ జలాల పెంపుపై ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో తరలింపు -
ఎన్ఎస్యూఐ ఆరు జిల్లాల అధ్యక్షుల నియామకం
సాక్షి ప్రతినిధి, వరంగల్: కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగమైన ఎన్ఎస్యూఐ బలోపేతంపై అధి ష్టానం దృష్టిపెట్టింది. ఈ మేరకు ఉమ్మడి వరంగల్ పరిధిలోని ఆరు జిల్లాలకు నూతన జిల్లా అధ్యక్షులను నియమించారు. సంఘం జాతీయ అధ్యక్షుడు వినోద్ ఝాకర్ ఆమోదంతో రాష్ట్ర అధ్యక్షుడు యాదవల్లి వెంకటస్వామి బుధవారం ఈ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. హనుమకొండకు వేణుచారి, వరంగల్–బొల్లం నితిన్‌కుమార్, జనగామ–దేశగాని హరగోపాల్‌గౌడ్, జయశంకర్ భూపాలపల్లి–పురుషోత్తం అనూప్, మహబూబా బాద్ – బి.చంటి, ములుగు–ఎం.నవనీత్‌ను నియమించారు. కొత్తగా నియమితులైన జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆయా జిల్లాల్లో విద్యార్థి సమస్యలను గుర్తించి పోరాటాలు చేపట్టడంతోపాటు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఎన్ఎస్యూఐ కార్యకలాపాలను విస్తరించే అవకాశం ఉంది. హక్కుల కోసం పోరాటం చిట్యాల: ఉద్యోగ, ఉపాధ్యాయుల హక్కుల సాధన కోసం పీఆర్టీయూ టీఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని సంఘం జిల్లా అధ్యక్షుడు రేగూరి సుభాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలకేంద్రంలోని మోడల్ స్కూల్లో మండల అధ్యక్షుడు బండి శ్రీనివాస్ అధ్యక్షతన మండల శాఖ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాన్ని మరింతగా బలోపేతం చేస్తామన్నారు. ఈ సందర్భంగా 23 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఎంఈఓ కోడెపాక రఘుపతి చేతుల మీదుగా ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కుసునపు కిరణ్‌కుమార్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఝాన్సీరాణి, వాసంతి, పీడీ సూదం సాంబమూర్తి, రమేశ్ పాల్గొన్నారు. దుకాణాలు తొలగించాలి భూపాలపల్లి అర్బన్: మున్సిపాలిటీ పరిధిలోని జాతీయ రహదారి వెంట ఫుట్‌పాత్‌లపై ఏర్పాటుచేసిన దుకాణాలను తొలగించాలని రోడ్ సేఫ్టీ టాస్క్‌పోర్స్ టీం అధికారులు యజమానులను ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్ నుంచి గణేష్‌చౌక్ వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణాలను బుధవారం పరిశీలించారు. దుకాణాల ఎదుట ఫుట్‌పాత్‌లపై ఏర్పాటు చేసిన వస్తువులు, తోపుడు బండ్లు, ఇతర వ్యాపారాలను తొలగించాలని యజమానులను ఆదేశించారు. రోడ్ల పక్కన దుకాణాలు ఏర్పాటు చేయడం, వస్తువులు, బోర్డులు ఏర్పాటు చేయడం వలన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, ఎన్‌హెచ్ డీఈ సింధూర, ఎస్సై శ్రావణ్‌కుమార్, ఆర్అండ్బీ, పోలీస్‌శాఖ అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్‌కు సర్పంచ్ల వినతి భూపాలపల్లి రూరల్: సర్పంచ్‌లకు మాత్రమే చెక్‌పవర్ ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా సర్పంచ్ల ఫోరం ఆధ్వర్యంలో బుధవారం కలెక్టర్ రాహుల్ శర్మకు విపతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్‌లు మాట్లాడుతూ సర్పంచ్‌లకు నెలకు రూ. 30 వేల వేతనం అందించాలన్నారు. ప్రత్యక్షంగా ఎన్నికై న తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించేలా అవసరమైన అధికారాన్ని కల్పించాలన్నారు. కాళోజీ ఆశయాలు ప్రజాసేవకు మార్గదర్శకం భూపాలపల్లి: తెలంగాణ ప్రజాకవి, ఉద్యమాల గొంతుక కాళోజీ నారాయణరావు ఆశయాలు ప్రజాసేవకు మార్గదర్శకమని అదనపు ఎస్పీ నరేష్కుమార్ అన్నారు. బుధవారం కాళోజీ జయంతిని పురస్కరించుకొని జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూల మాలలు వేశారు. అనంతరం ఏఎస్పీ మాట్లాడుతూ.. కవిత్వం ద్వారా తెలంగాణ ప్రజల సమస్యలను సమాజానికి ఎలుగెత్తి చాటిన మహోన్నత వ్యక్తి కాళోజీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐలు రత్నం, పూర్ణచందర్, కాశీరాం, ఆర్ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
ఎన్‌హెచ్‌పై ప్రమాదాలు జరగకుండా చర్యలు
● బ్లాక్స్పాట్లను పరిశీలించిన అధికారులు భూపాలపల్లి: జాతీయ రహదారిపై ప్రమాదాలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల జరిగిన రహదారి భద్రత కమిటీ సమావేశంలో కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఇచ్చిన సూచనల మేరకు జిల్లాలోని రేగొండ నుంచి మహదేవపూర్ వరకు గుర్తించిన బ్లాక్‌స్పాట్స్(ప్రమాదకర ప్రాంతాలు)ను నేషనల్ హైవే, రవాణా, పోలీసుశాఖ అధికారులు బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయా బ్లాక్స్పాట్లలో ప్రమాదాలకు గల ప్రధాన కారణాలు, రహదారి పరిస్థితులు, మలుపులు, వాహనాల వేగం తదితర అంశాలను పరిశీలించారు. ప్రమాదాల నివారణకు అవసరమైన చోట్ల హెచ్చరిక బోర్డులు, రేడియంట్ సైన్ బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడంతో పాటు మలుపుల విస్తరణ, ఇతర ఇంజినీరింగ్ చర్యలు చేపట్టేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ బ్లాక్ స్పాట్స్ వద్ద అవసరమైన తక్షణ, శాశ్వత నివారణ చర్యలను సమన్వయంతో చేపట్టాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ పరిశీలనలో నేషనల్ హైవే డీఈ సింధూర, సీఐ చెన్నూరి శ్రీనివాస్, డీటీఓ శ్రీనివాస్, డీసీఆర్బీ సీఐ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఓపెన్‌కాస్టుకు అడుగులు..
ములుగు: జిల్లాలోని వెంకటాపురం(ఎం) మండల కేంద్రం శివారులో పీవీ.నర్సింహారావు ఓపెన్‌కాస్టు గనిని ప్రారంభించేందుకు సింగరేణి సంస్థ సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 20 ఏళ్లలో 40 మిలియన్ టన్నుల బొగ్గును వెలికితీసేందుకు 2020 నవంబర్‌లో సింగరేణి సంస్థ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి భూమి పూజ చేశారు. దీంతో రామప్ప పరిరక్షణ కమిటీతోపాటు ప్రజాసంఘాలు.. ఓపెన్‌కాస్టు గనితో రామప్ప ఆలయానికి ముప్పు వాటిళ్లే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేయడంతో కేంద్ర పురావస్తు శాఖ ఉన్నతాధికారులతోపాటు సింగరేణి సంస్థ ఉన్నతాధికారులు సంయుక్తంగా పలుమార్లు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రామప్ప ఆలయానికి, ఓపెన్ కాస్టు గని ప్రారంభించే ప్రదేశానికి ఎంత దూరం ఉంది.. బ్లాస్టింగ్లు చేస్తే రామప్ప ఆలయం వైబ్రేషన్‌కు గురవుతుందా.. అనే అంశాలపై జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) అధికారులు సైతం సర్వే నిర్వహించారు. సర్వే వివరాలు వెల్లడి కాకముందే రామప్ప ఆలయానికి 2021 జూలై 25న యునెస్కో గుర్తింపు రావడంతో తాత్కాలికంగా ఓపెన్‌కాస్టు గని పనులను నిలిపివేయాలని కేంద్రం ఆదేశించింది. దీంతో గత 5 ఏళ్లుగా సింగరేణి సంస్థ ఎలాంటి పనులు చేపట్టలేదు. తాజాగా వారం రోజుల నుంచి సింగరేణి సంస్థ అధికారులు ఓపెన్‌కాస్టు గని ప్రాంతాన్ని పరిశీలిస్తూ గనిని ప్రారంభించేందుకు సన్నద్దమవుతున్నట్లు తెలుస్తుంది. అయితే సింగరేణి సంస్థ.. మైనింగ్, జియాలాజికల్, ఏఎస్ఐ శాఖ, పర్యావరణ అనుమతులు పొందినట్లు ప్రచారం జరుగుతుంది. వెంకటాపురం(ఎం) శివారులో నాణ్యమైన బొగ్గు ఉందని 2005లో సింగరేణి సంస్థ 9, 9ఏ ఇంకై ్లన్ బావులను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. బావుల వద్దకు వెళ్లేందుకు ప్రత్యేక రహదారి కోసం రైతుల నుంచి భూమిని సైతం సేకరించారు. కానీ, బావులు ప్రారంభించే సమయంలో నక్సల్స్ బెడద ఎక్కువ కావడంతో ఈ నిర్ణయంపై సింగరేణి వెనక్కి తగ్గింది. తిరిగి 2020 నవంబర్‌లో బావుల స్థానంలో ఓపెన్‌కాస్టు గని ప్రారంభించేందుకు సింగరేణి సంస్థ శ్రీకారం చుట్టింది. భూ సేకరణకు ఎంజాయ్మెంట్ సర్వే సైతం నిర్వహించింది. రైతులకు భూ పరిహారం అందించే ప్రక్రియను ప్రారంభించే సమయంలో 2021 జూలై 25న రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు లభించింది. దీంతో ఓపెన్‌కాస్టు గనిని తాత్కాలికంగా నిలిపివేయాలన్న ప్రభుత్వ ఆదేశాలతో పనులను నిలిపివేశారు. ప్రస్తుతం తిరిగి గనిని ప్రారంభించేందుకు సింగరేణి సంస్థ అన్ని శాఖల అనుమతి పొంది గని ద్వారా పాలంపేట డెవలప్మెంట్ కమిటీ ఇచ్చే ఎన్ఓసీ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి. పీవీ.నర్సింహారావు ఓపెన్‌కాస్టు గని ప్రారంభమైతే రాబోయే 20 ఏళ్లలో 40 మిలియన్ టన్నుల బొగ్గును వెలికితీయనున్నారు. ప్రతిఏటా 2.5 మిలియన్ టన్నుల నుంచి 3 మిలియన్ టన్నుల బొగ్గును వెలికితీయాలని సింగరేణి భావిస్తుంది. గని కోసం 2,648 ఎకరాల భూమిని అధికారులు సేకరించనున్నారు. ఇందులో 1,164 ఎకరాల అటవీభూమి, 941 ఎకరాల్లో రైతులకు చెందిన పట్టా భూములు, 429 ఎకరాల్లో అసైన్డ్ భూములు, 114 ఎకరాల్లో రెవెన్యూ భూమి ఉంది. భూసేకరణ కోసం రూ.245.51 కోట్లను సింగరేణి సంస్థ ఖర్చు చేయనుంది. గని పనులు ప్రారంభమైతే సీఎస్ఆర్ నిధులు నుంచి ప్రతిఏటా రూ.2 కోట్లు గ్రామాభివృద్ధికి కేటాయించడమే కాకుండా వెయ్యిమందికి ఉపాధి అవకాశాలు కల్పించసున్నట్లు సింగరేణి అధికారులు అనధికారికంగా వెల్లడిస్తున్నారు.వెంకటాపురం(ఎం)లో చేపట్టే ఓపెన్ కాస్టు గనిపై పాలంపేట డెవలప్మెంట్ అథారిటీ కమిటీ నుంచి అనుమతులు రావాల్సి ఉంది. ఏరియల్ సర్వే ప్రకారం ఓపెన్‌కాస్టు గనికి 5.8 కిలోమీటర్ల దూరంలో రామప్ప ఆలయం ఉందని సింగరేణి అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో ఓపెన్‌కాస్టు కోసం బ్లాస్టింగ్లు చేపట్టినా.. రామప్ప ఆలయానికి నష్టం వాటిల్లదని చెబుతూ సింగరేణి సంస్థ అనుమతులు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గని కోసం 30 మీటర్ల నుంచి 300 మీటర్ల లోతు వరకు తవ్వకాల కోసం బ్లాస్టింగ్లు చేస్తే కిలోమీటరు వరకే వైబ్రేషన్స్ వస్తాయని, ధ్వని మాత్రం ఎక్కువగా వినపడే అవకాశాలు ఉంటాయని సింగరేణి అధికారులు పేర్కొంటున్నారు. అన్ని శాఖల నుంచి అనుమతులు వచ్చాయని, పాలంపేట డెవలప్మెంట్ అథారిటీ కమిటీ నుంచి ఎన్ఓసీ లభిస్తే డిసెంబర్‌లోగా పనులు ప్రారంభించనున్నట్లు తెలిసింది. అన్ని శాఖల నుంచి అనుమతులు వచ్చినట్లు ప్రచారం సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో పనులకు త్వరలో శ్రీకారం? 20 ఏళ్ల పాటు 40 మిలియన్ టన్నుల బొగ్గు వెలికితీత -
హైస్కూల్ విద్యార్థులకు ఉ‘ప్రయోగం’!
విద్యారణ్యపురి: ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, పలు కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) సైన్స్ ప్రయోగశాలలను ఏర్పాటు చేయనున్నారు. 9, 10 తరగతుల విద్యార్థులకు ప్రయోగాత్మక బోధనకు శ్రీకారం చుట్టనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని హనుమకొండ, వరంగల్, జనగామ, ములుగు మహబూబాబాద్ జిల్లాల్లో ఎంపిక చేసిన 26 ఉన్నత పాఠశాలల(కేజీబీవీలతో కలిపి)కు రూ.6.76 కోట్లు సమగ్రశిక్ష నుంచి మంజూరు లభించింది. ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్, రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ (సమగ్ర శ్రిక్ష) నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో పాఠశాలకు రూ.26లక్షలు ఒక్కో పాఠశాలకు రూ.26లక్షల చొప్పున కేటాయించారు. ఈ నిధులతో సైన్స్ ల్యాబొరేటరీ గదుల నిర్మాణం, పరికరాల సేకరణ, సరఫరా, ఇన్స్టాలేషన్ టెస్టింగ్ కమిషనింగ్‌కు పరిపాలనా అనుమతి ఇచ్చారు. ల్యాబ్ గది నిర్మాణానికి రూ.25లక్షలు, పరికరాలకు రూ.లక్ష కేటాయించారు. పనులను రాష్ట్ర విద్యామౌలిక సదుపాయాల సంస్థ (టీజీఈడబ్లూ ఐడీసీ – హైదరాబాద్)కి అప్పగించారు. ఇ–ప్రొక్యూర్మెంట్ విధానంలో టెండర్లు ఆహ్వానించి కాంట్రాక్టర్లకు అప్పగించనున్నారు. జిల్లాల వారీగా పాఠశాలలు, నిధుల వివరాలు.. హనుమకొండ జిల్లాలో హైస్కూళ్లు, కేజీబీవీలు కలిపి తొమ్మిదింటికి రూ.2.34 కోట్లు మంజూరయ్యాయి. హసన్‌పర్తి, ధర్మసాగర్, ఆత్మకూరు, ఎల్కతుర్తి కేజీబీవీలు, తరాలపల్లి, కడిపికొండ, వంగపహాడ్ జెడ్పీహెచ్‌ఎస్‌లు, శాయంపేట జాగీర్, వడ్డేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ● వరంగల్ జిల్లాలో మూడు పాఠశాలలకు రూ.78లక్షలు మంజూరయ్యాయి. సంగెం కేజీబీవీ, చార్బౌలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పైడిపల్లి జెడ్పీహెచ్ఎస్ ఉన్నాయి. ● జనగామ జిల్లాలో నాలుగు పాఠశాలలకు రూ.1.04కోట్లు వచ్చాయి. కొడకండ్ల, నర్మెట, రఘునాథపల్లి కేజీబీవీలు, చెన్నూరు జెడ్పీహెచ్ఎస్ ఉన్నాయి. ● ములుగు జిల్లా మంగపేట జెడ్పీహెచ్‌ఎస్‌కు రూ.26లక్షలు మంజూరయ్యాయి. ● మహబూబాబాద్ జిల్లాలో 9 పాఠశాలలకు రూ.2.34కోట్లు మంజూరయ్యాయి. చిన్నగూడూరు, పెద్దగూడూరు, మరిపెడ, వంగర కేజీబీవీలు, దాట్ల, హరిపిరాల, జమాండ్లపల్లి, ఆలేర్, పెనుగొండ జెడ్పీహెచ్ఎస్లున్నాయి. ● జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు ఈ దశలో నిధులు విడుదల కాలేదు ఈ నిబంధనలు పాటించాల్సిందే.. సైన్స్ లేబొరేటరీలు నిర్మాణం పూర్తయ్యాక వర్క్స్టేషన్లు, పరికరాలు టీజీఈడబ్లూ ఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి సంయుక్తంగా తనిఖీ చేసి నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు ధ్రువీకరించాలి. ఆ తరువాత వాటిని ఆయా పాఠశాలల హెచ్ఎంలకు అప్పగించాల్సి ఉంటుంది. ఉన్నత పాఠశాలలు, కేజీబీవీలో సైన్స్ ప్రయోగశాలలు ఐదు జిల్లాల్లో 26 ఉన్నత పాఠశాలలకు రూ.6.76 కోట్లు మంజూరు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు కేటాయించని నిధులు -
ఓటరు జాబితా సవరణకు గడువు పొడిగింపు
భూపాలపల్లి అర్బన్: ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్ఐఆర్–2026) ప్రక్రియలో క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ గడువును అక్టోబర్ 7వరకు పొడిగించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్‌శర్మ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం నోటీసుల జారీ, క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిశీలన, పరిష్కార ప్రక్రియ నవంబర్ 5వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. గతంలో ఈ గడువు అక్టోబర్ 15తో ముగియాల్సి ఉండేదన్నారు. తుది ఓటర్ల జాబితా ప్రచురణ తేదీని అక్టోబర్ 19నుంచి నవంబర్ 9, 2026కు మార్చినట్లు తెలిపారు. 2026 అక్టోబర్ 1నాటికి ఓటరుగా నమోదు చేసుకునేందుకు అర్హత కలిగిన ప్రతీ పౌరుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్హులైన వారు కొత్తగా ఓటరుగా నమోదు కావడంతో పాటు, ఇప్పటికే ఉన్న ఓటర్ల వివరాల్లో మార్పులు, చేర్పులు లేదా సవరణలు అవసరమైతే నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రతీ పౌరుడు ఓటర్ల జాబితాలో తమ పేరు, వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని, ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని సూచించారు. అర్హులైన ప్రతీ ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకునేలా సమగ్రంగా, పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపొందించేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. కలెక్టర్‌ను కలిసిన ఎస్ఈ సదానందం భూపాలపల్లి రూరల్: విద్యుత్ ఎస్ఈగా బాధ్యతలు స్వీకరించిన నాగెల్లి సదానందం మంగళవారం కలెక్టర్ రాహుల్‌శర్మను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. వినియోగదారుల సమస్యలను ఎప్పటికప్పుడు సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లాను మరింతగా అభివృద్ధి చేసే దిశగా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. అర్చకులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులుభూపాలపల్లి అర్బన్: రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆలయాల్లో పనిచేస్తున్న ప్రతీ ధూప దీప నైవేద్య అర్చకుడు ప్రభుత్వ గుర్తింపు కార్డు కలిగి ఉండటం తప్పనిసరి అని ధూప దీప నైవేద్య అర్చకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవశర్మ అన్నారు. జిల్లాలోని అర్చకులకు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం జిల్లాకేంద్రంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన వాసుదేవశర్మ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ధూప దీప నైవేద్య పథకం కింద పనిచేస్తున్న అర్చకులకు ప్రభుత్వం ప్రతీ నెల ఒకటో తేదీన వారి బ్యాంకు ఖాతాల్లో గౌరవ వేతనం జమ చేస్తుందన్నారు. ధూప దీప నైవేద్య ఆలయాల అభివృద్ధికి అర్చకులు తమవంతు కృషి చేస్తూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. అర్చకులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఉండటం వల్ల రాష్ట్రవ్యాప్తంగా వారికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమరేశ్వర్ శర్మ, కోశాధికారి హరికృష్ణ, మాజీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దక్షిణమూర్తి, రాష్ట్ర మహిళా కన్వీనర్ విశాలాక్షి, నంది విజయ్‌కుమార్, సహాయ కార్యదర్శి శివకుమార్ పాల్గొన్నారు. 11న జాబ్‌మేళా భూపాలపల్లి అర్బన్: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 11న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి మల్లయ్య మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాబ్‌మేళాలో ఆదర్శ ఆటోమొబైల్స్, భూపాలపల్లి బ్రాంచ్ రిలేషన్షిప్ మేనేజర్ పోస్టులు 10 ఖాళీలు ఉన్నాయన్నారు. ఏదైనా డిగ్రీతో పాటు 20ఏళ్లు పైబడిన వారు అర్హులన్నారు. నెలకు రూ.12వేల నుంచి రూ.15వేల వరకు వేతనం అందించనున్నట్లు తెలిపారు. గ్రీన్‌హోండా కపిల్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 10 ఉన్నాయని ఇంటర్ లేదా ఏదైనా డిగ్రీ అర్హతతో 20 ఏళ్లు పైబడిన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. నెలకు రూ.15వేల వేతనం అందించనున్నారు. విద్యార్హతల సర్టిఫికెట్లతో కలెక్టరేట్లోని ఉపాధి కార్యాలయంలో జాబ్‌మేళాకు హాజరుకావాలని తెలిపారు. వివరాలకు 95024 68800లో సంప్రదించాలని సూచించారు. -
వీఆర్ విద్యార్థికి కాళోజీ పురస్కారం
● ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ● నేడు హైదరాబాద్‌లో ప్రదానం ● హర్షం వ్యక్తంచేసిన అంపశయ్య నవీన్, కవులుహన్మకొండ కల్చరల్ : వరంగల్‌కు చెందిన ప్రముఖ కవి, కాళోజీ ఫౌండేషన్ కార్యదర్శి వీఆర్ విద్యార్థికి ప్రజాకవి కాళోజీ–2026 పురస్కారం వరించింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నేడు (సెప్టెంబర్ 9) కాళోజి జయంతి సందర్భంగా నేడు హైదరాబాద్ రవీంద్రభారతిలో జరగనున్న ఆయన జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రుల చేతులమీదుగా వీఆర్ విద్యార్థి ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. విద్యార్ధి చిన్నప్పటినుంచి కాళోజీకి వ్యక్తిగతంగా దగ్గరివాడిగా, ఆయన అభిమానిగా, మిత్రమండలి సభ్యునిగా, వరవరరావులాంటి ఉగ్రమూర్తుల మిత్రుడిగా ఉన్నారు. కాళోజీ బడిలోనే కవిత్వం ఓనమాలు దిద్దుకున్నారు. యుద్ధంనుంచి శాంతిప్రవాహంలా సాగిన ఆయన కవితాయాత్రలో అలలు, పలకరింత, ఘర్మసముద్రం, మంచుమైదానం, ఖండాంతర , యుద్ధం, తుపాకీ శాంతి, తదితర కవితా సంకలనాలు వెలువరించారు. వీఆర్ విద్యార్థి గురించి.. వీఆర్ విద్యార్థి అసలు పేరు రాములు. పుట్టిన ఊరు వరంగల్‌లోని గవిచర్ల. భారతవైమానిక దళంలో పనిచేస్తున్న క్రమంలో రెండుసార్లు యుద్ధాల్లో పాల్గొన్నారు. అంతకన్నముందు కవిత్వంతో పెనవేసుకుపోతూ విద్యార్ధి కలం పేరుతో తన జీవితాన్ని సాహిత్యంలోకి మలుచుకునే క్రమంలో వీఆర్ విద్యార్థిగా మారారు. ఐదు దశాబ్దాలనుంచి తెలుగు సాహిత్యంలో విశేష కృషి చేస్తున్నారు. వచ్చిన అవార్డులివే.. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తిపురస్కారం, వానమామలై వరదాచార్య పురస్కారం, వరంగల్ సాంస్కృతిక మండలి వారిచే తెలుగు భాషా విశిష్ట పురస్కారం, దాశరథి– ద్వానా సాహిత్య పురస్కారం, యునైటెడ్ ఫోరం ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ వారిచే జాషువా పురస్కారం తదితర పురస్కారాలు అందుకున్నారు. పలువురి హర్షం.. విద్యార్థికి అవార్డు రావడం పట్ల కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్, కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షుడు నాగిళ్ల రామశాస్త్రి, విశ్రాంతాచార్యులు బన్న అయిలయ్య, కవులు పొట్లపల్లి శ్రీనివాసరావు, బిల్ల మహేందర్, వల్లంపట్ల నాగేశ్వరరావు, నెల్లుట్ల రమాదేవి, నిధి, రామా చంద్రమౌళి తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కాళోజీ పురస్కారం ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఇది కాళోజీ ఫౌండేషన్‌కు వచ్చినట్లుగా భావిస్తున్నా. కాళోజీ ప్రజలగురించి ప్రజల భాషలో కవిత్వం రాశారు. నగీషిల కవితలు రాయలేదు. పెద్ద ఉపన్యాసాన్ని సైతం కవిత్వంలా మల్చగలగడం కాళోజీ ప్రత్యేకత. వేమనలా నిజాల్ని కవితలలో పొందుపరిచారు. ఆయన జీవితమే ఉద్యమం. – వీఆర్ విద్యార్థి, కవి -
మూతబడిన డీఆర్సీ కేంద్రం..
మున్సిపాలిటీ నుంచి సేకరించిన చెత్తను వేరుచేసి తడి చెత్త కంపోస్టు ఎరువు, పొడి చెత్త నుంచి వనరులను వేరు చేయడానికి డ్రై వేస్ట్ రిసోర్స్ కలెక్షన్ సెంటర్ (డీఆర్సీసీ) ఏర్పాటు చేశారు. దీంతోపాటు వర్మీ కంపోస్టు కేంద్రంలో పది వరకు సెగ్రిగేషన్ షెడ్లు తదితర నిర్మాణాల కోసం రూ.60లక్షలు కేటాయించారు. వీటిని నిర్మించిన ప్రారంభంలో తడి, పొడి చెత్తను వేర్వేరు చేసినా.. తదనంతరం నిరుపయోగంగా మారాయి. గత ప్రభుత్వంలోనే బయోమైనింగ్ ప్లాంటు ఏర్పాటు చేసి ప్రైవేట్ ఏజెన్సీకి పనులు అప్పగించారు. సదరు ఏజెన్సీ కొన్ని నెలల పాటు ప్రారంభించి తర్వాత మధ్యలోనే ఆపేశారు. -
శుద్ధీకరణేది
డంపింగ్ యార్డులో పేరుకుపోయిన చెత్త 10 ఎకరాల్లో డంపింగ్ యార్డు.. భూపాలపల్లి పట్టణం బాంబులగడ్డ సమీపంలో సుమారు 10 ఎకరాల స్థలంలో డంపింగ్ యార్డును ఏర్పాటు చేశారు. ఇందుకోసం 14వ ఆర్థిక సంఘం నుంచి 2022లో రూ.60లక్షల నిధులను కేటాయించారు. కొంతకాలంగా డంపింగ్ యార్డు నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలన్న నిబంధనలు స్పష్టంగా ఉన్నా.. అమలు కావడం లేదు. నిత్యం పట్టణంలో సేకరిస్తున్న సుమారు 13 మెట్రిక్ టన్నుల చెత్త, ఇతర వ్యర్థాలను సిబ్బంది డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. దీంతో కుప్పులుగా చెత్త నిల్వలు డంపింగ్ యార్డులో పేరుకుపోయాయి. సుమారు 10వేల మెట్రిక్ టన్నులకు పైగా చెత్త వ్యర్థాలు నిల్వ ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. పొగతో ఇబ్బందులు.. చాలా సందర్భాల్లో ప్రమాదవశాత్తు డంపింగ్ యార్డులో మంటలు చెలరేగగా.. కొన్నిసార్లు సిబ్బందే చెత్తను తగలబెడుతున్నారని సమీప కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. దీంతో నిత్యం పొగలు అలుముకుంటున్నాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వేసవి కాలంలో అయితే గాలు లకే మంటలు చెలరేగుతాయి. దీంతో పరిసర ప్రాంతాలు గాలి కాలుష్యంతో పాటు దుర్వాసనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజురోజుకూ చెత్త నిల్వలు పేర్చుకుంటూ పోవడం తప్ప.. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడంతో పట్టణానికి చెత్తనిల్వలు సవాల్‌గా మారాయి. వ్యర్థాలు తరలించడంలో తప్పని తిప్పలు మున్సిపాలిటీలో కానరాని వ్యవస్థ క్షేత్రస్థాయిలో అమలుకాని ఉన్నతాధికారుల ఆదేశాలు నిర్వహణలో విఫలమవుతున్న యంత్రాంగం -
హామీలు అడిగితే దాడులా?
భూపాలపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తవుతున్నా.. 6 గ్యారెంటీలు, 420 హామీలు, మూడు డిక్లరేషన్లలో చాలావరకు అమలు కాలేదని.. హామీలు అడిగితే తమ నాయకులపై పోలీసులతో డాడులు చేయించారని బీఆర్ఎస్ నాయకురాలు, వరంగల్ మాజీ జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి విమర్శించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాకేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం అంబేడ్కర్ సెంటర్ నుంచి జయశంకర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గండ్ర జ్యోతి మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రజా సమస్యలను లేవనెత్తేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. ముఖ్యంగా మహిళా ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడం సరికాదని, ప్రశ్నించే హక్కును ప్రభుత్వం గౌరవించాలని అన్నారు. రాజకీయ కక్షలకు పాల్పడకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషిచేయాలని సూచించారు. అధికారం శాశ్వతం కాదని, ప్రజాతీర్పును అవమానిస్తే రాబోయే రోజుల్లో ప్రజలే తగిన సమాధానం చెబుతారని గండ్ర జ్యోతి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మాజీ జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి 1000 రోజుల పాలనపై అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం -
ఎమ్మెల్సీ తాతా మధు రాజీనామా చేయాలి
● కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ భూపాలపల్లి రూరల్: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు క్షమాపణ చెప్పడంతో పాటు పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ డిమాండ్ చేశారు. సోమవారం కాంగ్రెస్ శ్రేణులు జిల్లాకేంద్రంలో ధర్నా నిర్వహించాయి. ఈ సందర్భంగా కరుణాకర్ మాట్లాడుతూ మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్‌పై బాధ్యతారహితంగా, అనుచితంగా వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలను అవమానించడమేనన్నారు. స్పీకర్ పదవి పార్టీలకు అతీతమైన రాజ్యాంగబద్ధమైన అత్యున్నత బాధ్యత అని, అలాంటి పదవిలో ఉన్న వ్యక్తిపై వ్యక్తిగతంగా, అవమానకరంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు దాట్ల శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, పట్టణ మాజీ అధ్యక్షుడు దేవన్, మహిళా అధ్యక్షురాలు మాలతి, కోమల, గుగ్గిళ్ల లక్ష్మి, కౌన్సిలర్లు, పార్టీ జిల్లా, పట్టణ, మండల నాయకులు పాల్గొన్నారు. -
తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు నిధులు
విద్యారణ్యపురి: కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను ఏర్పాటుచేసి విద్యనందించనుంది. నియోజకవర్గానికి ఒక స్కూల్ ఏర్పాటుకు ప్రభుత్వం కొంతకాలం క్రితమే అనుమతినిచ్చింది. తొలుతగా కొన్నింటికి పరిపాలనా అనుమతులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిధులు మంజూరు చేసింది. ఎంపిక చేసిన పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన తదితర అభివృద్ధి కార్యక్రమాలకు ఈ నిధులు వినియోగించనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 9 పబ్లిక్‌స్కూళ్లు ఏర్పాటుకానున్నాయి. ఈ నిధులతో ఆయా స్కూళ్ల రూపురేఖలు మారనున్నాయి. ఇవి సెమీరెసిడెన్షియల్ స్కూళ్లుగా కొనసాగనున్నాయి. ఇక్కడ ప్రీ ప్రైమరీనుంచి ఇంటర్ వరకు ఉచితంగా విద్యనందించనున్నారు. జిల్లా వారీగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు పాఠశాల ఎంపిక.. నిధుల కేటాయింపు.. ● హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి జెడ్పీహెచ్ఎస్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు రూ 9.90కోట్లు, వర్ధన్నపేట నియోజకవర్గ పరిధి హసన్‌పర్తిలోని ప్రభుత్వ గర్ల్స్ హైస్కూల్‌కు రూ 6.80కోట్లు మంజూరు చేశారు. ● వరంగల్ జిల్లా కు సంబంధించి తూర్పు నియోజకవర్గ పరిధి ఖిలా వరంగల్ మండలం శంభునిపేట ప్రభుత్వ హైస్కూల్‌కు రూ 8.30కోట్లు, నర్సంపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల అండ్ ప్రభుత్వ హైస్కూల్‌కు రూ.9.99కోట్లు. ● జనగామ జిల్లా నర్మెట మోడల్ స్కూల్‌కు రూ 10.70కోట్లు. ● మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు ప్రభుత్వ హైస్కూల్‌కు రూ.7.50కోట్లు, డోర్నకల్ నియోజకవర్గ పరిధి నర్సింహులపేట జిల్లా పరిషత్ హైస్కూల్‌కు రూ 11.20కోట్లు. ● ములుగు జిల్లా బండారుపల్లిలోని టీజీఎంఎస్‌కు రూ.9.20కోట్లు. ● జయశంకర్ భూపాలపల్లి జిల్లా చల్లగరిగె జెడ్పీహెచ్‌ఎస్‌కు రూ.11.50కోట్ల నిధులు మంజూరు చేశారు. వసతులు, మెరుగైన విద్య ● రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ఒక మోడల్‌గా నిర్మించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆ స్కూల్‌ను ప్రారంభించి ఆయన ఆదేశం మేరకు ఆ తరువాత వివిధ జిల్లాలనుంచి ప్రతిపాదనలు తీసుకుని పరిపాలనపరమైన అనుమతులు, నిధులు మంజూరు చేశారు. ● ప్రస్తుతం ఉన్నత స్కూళ్ల భవనాలు, తరగతి గదులు ఉంచి అదనంగా గదులు సైన్స్ సబ్జెక్టులకు సంబంధించిన ల్యాబ్స్, క్రీడామైదానం, లైబ్రరీ, మోడల్ కిచెన్, డైనింగ్‌హాల్, డ్యాన్స్ హాల్ నిర్మిస్తారు. ● ఇంగ్లిష్ మీడియంలో బోధన ఉంటుంది. ● సుమారు నాలుగు ఎకరాల వరకు విస్తీర్ణం ఉన్న హైస్కూళ్లనే తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు ఎంపిక చేశారు. ప్రతిపాదిత ప్రభుత్వ, జిల్లాపరిషత్, మోడల్ స్కూళ్లలోనే ఏర్పాటు ప్రీ ప్రైమరీనుంచి ఇంటర్మీడియట్ వరకు సెమీ రెసిడెన్షియల్‌గా విద్యతోపాటు క్రీడలు -
డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం..
భూపాలపల్లి: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతీ సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణికి దరఖాస్తుల సంఖ్య తగ్గడం లేదు. సమస్యలు పరిష్కారం కాకపోవడంతో వచ్చిన వారే మళ్లీ మళ్లీ వచ్చి దరఖాస్తులు సమర్పిస్తున్నారు. దీంతో అధికారులు చేసేదేమీ లేక తమ పరిధిలో పరిష్కారమయ్యే వాటిని ఆన్లైన్ చేస్తూ, మిగిలిన వాటిని వదిలేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతీ వారం 60కి పైగా.. కలెక్టరేట్లో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి సుమారు వందకు పైగా దరఖాస్తులు వచ్చేవి. మండలకేంద్రాల్లో గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తుండటంతో కొద్దిరోజులుగా కలెక్టరేట్‌కు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 60మంది వరకు వస్తున్నారు. అందులో సగానికి పైగా వ్యవసాయ భూములకు పట్టాలు, పింఛన్ల మంజూరు, విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు సంబంధించినవే ఉంటున్నాయి. దీంతో జిల్లాస్థాయి అధికారులు వీలైన వాటిని పరిష్కరించి, మిగిలిన వాటిని మండలస్థాయి అధికారులకు పంపించి చేతులు దులుపుకుంటున్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 75 అప్లికేషన్లు రాగా అందులో సైతం పట్టాలు, పింఛన్లు, ఉద్యోగాలకు సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయి. ఆ దరఖాస్తులు ఆన్లైన్ చేయట్లే..? ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, పింఛన్లు, భూ తగాదాలు, అటవీ భూముల్లో బోర్లకు అనుమతి, అసైన్డ్ భూములకు పట్టాలు.. తదితర పరిష్కరించలేని వాటిని ఆన్లైన్లో చూపించట్లేదని తెలుస్తోంది. దీంతో ప్రతీ సోమవారం జరిగే ప్రజావాణికి సుమారు 60మందికి పైగా వస్తున్నప్పటికీ అధికారుల లెక్కలతో పోలడం లేదు. అధికంగా ఈ శాఖలకే.. ప్రజావాణిలో అధికంగా నాలుగైదు శాఖలకే దరఖాస్తులు అందుతున్నాయి. ఈ ఏడాది మే నెల నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు రెవెన్యూశాఖకు 18, పంచాయతీరాజ్‌కు 53, విద్యాశాఖకు 24, మహిళ శిశు సంక్షేమశాఖకు 32 అప్లికేషన్లు వచ్చాయి. ఆరుసార్లు ఫిర్యాదు చేశాడు..పదేళ్లుగా ఆశవర్కర్లుగానే.. ‘మాజీ’లను మరచిపోయారు... పక్క ఫొటోలో కనిపిస్తున్న వారంతా మావోయిస్టు ఉద్యమంలో పని చేసి సర్కారు సూచనలతో 15ఏళ్ల క్రితం జన జీవన స్రవంతిలో కలిశారు. వీరికి పునరావాసం కింద అందాల్సిన ఇంటి స్థలం, వ్యవసాయ భూమి ఇప్పటివరకు అందలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌ను వేడుకున్నారు. ఇతని పేరు కె.శ్రావణ్‌కుమార్‌రెడ్డి. మహాముత్తారం మండలం గండికామారం గ్రామానికి చెందిన ఈయన గ్రీవెన్స్ సెల్లో ఆరుసార్లు ఫిర్యాదు చేశాడు. అయినా ఫలితం లేకపోయింది. గ్రామానికి చెందిన పరంసింగ్ అనే వ్యక్తి పొలాలకు వెళ్లే దారిని సుమారు 20 ఫీట్ల వెడల్పుతో 30 గుంటల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నాడు. దీంతో ఆ భూమి అవతల ఉన్న రైతులు పంట పొలాలను సాగు చేసుకోవడం ఇబ్బందికరంగా మారింది. ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, పశువులు సైతం వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ విషయమై మూడేళ్లలో ఆరుసార్లు రెవెన్యూ అధికారులు, ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. అయినప్పటికీ ఎవరూ స్పందించకపోవడంతో శ్రావణ్‌కుమార్‌రెడ్డి సోమవారం మరోమారు ప్రజావాణికి వచ్చి ఫిర్యాదు అందజేశాడు. ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి భూపాలపల్లి పట్టణానికి చెందిన దివ్యాంగుడు మిర్యాల మల్లయ్య. 1991లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇతడి కుడిచేయిని పూర్తిగా కోల్పోయాడు. కూలీ పని చేసే అవకాశం లేకపోవడంతో భార్య గృహ నిర్మాణ పనులకు వెళ్తూ కుటుంబాన్ని సాకుతుంది. గడిచిన ఏడేళ్లుగా డబుల్ బెడ్ రూం ఇళ్లు కోసం దరఖాస్తు ఇస్తూనే ఉన్నాడు. అయినా ఇప్పటి వరకు ఇళ్లు మంజూరు చేయలేదు. దివ్యాంగుల కోటాలో తనకు ఇళ్లు మంజూరు చేయాలని వేడుకుంటున్నాడు. ఫొటోలో ఉన్న వారంతా ఎంపీహెచ్‌డబ్ల్యూ చదివి, శిక్షణ పూర్తి చేసి పదేళ్లుగా ఏఎన్ఎంగా పోస్టుల కోసం ఎదురుచూస్తూ జిల్లాలో ఆశ వర్కర్లుగా పనిచేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఎంపీహెచ్‌డబ్ల్యూ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. అనుభవం లేని కారణంగా వీరిని ఎంపిక చేయలేదు. ఖాళీగా ఉన్న ఏఎన్ఎం, ఎంపీహెచ్‌డబ్ల్యూ ఉద్యోగాలకు అవకాశం ఇవ్వాలని ఆశవర్కర్లు కోరుతున్నారు. వినతి పత్రం అందించేందుకు వచ్చిన మాజీ మావోయిస్టులు -
కాంగ్రెస్ ప్రభుత్వానికి పతనం తప్పదు
భూపాలపల్లి: ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పతనం తప్పదని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలను అమలుచేయాలని కోరుతూ కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణిలో ప్రజలతో కలిసి కలెక్టర్ రాహుల్‌శర్మకు దరఖాస్తు సమర్పించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకున్నందుకు, పోలీసులు దాడులకు పాల్పడినందుకు నిరసనగా కలెక్టరేట్ ఎదురుగా జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. 420 హామీలు, ఆరు గ్యారెంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఏ ఒక్క హామీని అమలు చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ రాక విద్యార్థులు, ఉద్యోగ నియామకాలు లేక నిరుద్యోగులు, సకాలంలో రైతు భరోసా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్, నాయకులు మేకల సంపత్‌కుమార్, గండ్ర హరీశ్‌రెడ్డి, మందల విద్యాసాగర్‌రెడ్డి, రాజిరెడ్డి, లత పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి -
మట్టి వినాయకులను పూజించాలి
భూపాలపల్లి అర్బన్: వినాయక చవితిని పర్యావరణహితంగా నిర్వహించేందుకు ప్రతీ ఒక్కరు మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించాలని కలెక్టర్ రాహుల్‌శర్మ పిలుపునిచ్చారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఆవరణలో ‘మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం’ వాల్‌పోస్టర్లు ఆవిష్కరించి మట్టి గణపతుల ఉచిత పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పీఓపీ విగ్రహాలు, రసాయనిక రంగుల వల్ల నిమజ్జనం సమయంలో నీటి వనరులు కలుషితమయ్యే అవకాశం ఉందన్నారు. ప్రకృతి సిద్ధమైన మట్టి విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణాన్ని, నీటి వనరులను కాపాడవచ్చని తెలిపారు. జిల్లావ్యాప్తంగా రెండు వేల మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, డీఆర్వో వసంతకుమారి, ఆర్డీఓ హరికృష్ణ, కాలుష్య నియంత్రణ మండలి ఏఈ శ్రీకాంత్, జిల్లా సైన్స్ అధికారి స్వామి పాల్గొన్నారు. మార్చికి పనులు పూర్తి చేయాలి.. రానున్న ఏడాది మార్చి నాటికి గోదావరి పుష్కరాలకు సంబంధించిన అభివృద్ధి పనులు, మౌలిక వసతుల ఏర్పాట్లు పూర్తిచేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ ఆదేశించారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయం నుంచి గోదావరి పరివాహక జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పుష్కర ఘాట్లు, ఆలయాల అభివృద్ధి, రోడ్ల విస్తరణ, భూసేకరణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఈ సందర్బంగా కలెక్టర్ రాహుల్‌శర్మ మాట్లాడుతూ..సరస్వతీ ఘాట్ నుంచి మెయిన్ ఘాట్ వరకు 18 ఎకరాల భూమి అవసరమని, భూసేకరణకు సుమారు రూ.5 కోట్లు వ్యయం అయ్యే అవకాశం ఉందన్నారు. త్వరలో భూసేకరణ నోటిఫికేషన్ జారీచేస్తామని తెలిపారు. ఓటర్ల జాబితాపై ప్రత్యేక దృష్టిఎన్నికల విధులు, ఓటర్ల జాబితా నిర్వహణలో అధికారులు జవాబుదారీతనంతో పనిచేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, ఆర్డీఓలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఓటర్ల మ్యాపింగ్, అనామలీస్ ఓటర్లకు నోటీసుల జారీపై సమీక్షించారు. నిర్లక్ష్యాన్ని సహించేది లేదని స్పష్టంచేశారు. జిల్లాలో ఇప్పటివరకు 32,636 నోటీసులు జనరేట్ కాగా, 21,894 నోటీసులు పంపిణీ చేయాల్సి ఉందని కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. వీటిని మూడు రోజుల్లో పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. కలెక్టర్‌ను కలిసిన సబ్ కలెక్టర్ కాటారం సబ్ కలెక్టర్‌గా నియమితులైన సౌరబ్ శర్మ కలెక్టరేట్లో కలెక్టర్ రాహుల్‌శర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు మొక్కను అందజేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా కలెక్టర్‌ను కలిసిన సబ్ కలెక్టర్ కాటారం డివిజన్లో పాలన, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారంపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ నూతన సబ్ కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. కలెక్టర్ రాహుల్‌శర్మ -
ప్రత్యేక అలంకరణలో గణపేశ్వరుడు
గణపురం: శ్రావణ చివరి సోమవారం సందర్భంగా గణపురం మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు నాగరాజు ఆధ్వర్యంలో తెల్లవారుజామునే అభిషేకాలు, పూజలు నిర్వహించారు. స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు పెద్దసంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. విద్యుత్ ఎస్ఈగా సదానందం భూపాలపల్లి రూరల్: విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్‌గా నాగెల్లి సదానందం సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇన్చార్జ్గా ఉన్న భిక్షపతి రిలీవ్‌కాగా భూపాలపల్లి ఎంఆర్టీ కన్స్ట్రక్షన్ డివిజనల్ ఇంజనీర్‌గా మూడేళ్లుగా పనిచేస్తున్న సదానందం పదోన్నతిపై ఎస్ఈగా బాధ్యతలు తీసుకున్నారు. ఉద్యోగుల హక్కుల కోసం.. భూపాలపల్లి అర్బన్: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెజిటెడ్ అధికారులు, కార్మికులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 10న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద నిర్వహించనున్న ‘చలో హైదరాబాద్–ఉద్యోగుల హక్కుల సాధన సభ’ను విజయవంతం చేయాలని టీజీఈజేఏసీ జిల్లా నాయకులు పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలో సోమవారం కలెక్టరేట్లో టీజీఈజేఏసీ జిల్లా చైర్మన్ బూరుగు రవి, కన్వీనర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ సభకు జిల్లా నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెజిటెడ్ అధికారులు, కార్మికులు, పెన్షనర్లు అధికసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది డీఎంహెచ్ఓ డాక్టర్ మధుసూదన్, దశరథ రామారావు, షఫీ, ఎస్కే అబ్బాస్, కుసునపు కిరణ్‌కుమార్, నక్క తిరుపతి, మందల రవీందర్‌రెడ్డి, పెండ మధుసూదన్, కొత్త కుమార్, తిరుపతిరెడ్డి, సేవానాయక్, భార్గవ్, వివిధ సంఘాల బాధ్యులు పాల్గొన్నారు. ఓపెన్‌కాస్టు గని పరిశీలన వెంకటాపురం(ఎం): మండలకేంద్రం శివారులో ప్రారంభించే ఓపెన్‌కాస్టు గని ప్రాంతాన్ని ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, సింగరేణి సంస్థ భూపాలపల్లి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి, ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ మురళీ మోహన్ సంబంధిత అధికారులతో కలిసి సోమవారం పరిశీలించారు. గని ప్రాంతం ఎంతమేర ఉంది అనే ఆంశాన్ని మ్యాప్ ద్వారా పరిశీలించారు. ప్రస్తుతం ఆ భూముల్లో సాగవుతున్న పంటలు ఏంటి.. అనే వివరాలను సేకరించినట్లు తెలిసింది. అనంతరం ములుగు కలెక్టరేట్లో కలెక్టర్ హేమంత్ సహదేవరావును సింగరేణి సంస్థ అధికారులు కలిసి మాట్లాడారు. ఓపెన్‌కాస్టు ప్రాంతంలో నిర్వహించిన శాసీ్త్రయ అధ్యయనాల్లో వెల్లడైన అంశాలు, వాటి ఆధారంగా చేపట్టాల్సిన చర్యలు, పర్యావరణ పరిరక్షణకు అమలు చేస్తున్న కార్యక్రమాలను కలెక్టర్‌కు వివరించారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో సింగరేణి ఉన్నతాధికారులతో పాటు ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ జనరల్ మేనేజర్ దేవేందర్, ఎన్విరాన్మెంట్ జనరల్ మేనేజర్ సిద్ధులు, ఎక్స్‌ఫ్లోరేషన్ జనరల్ మేనేజర్ కులశ్రేష్టతో పాటు సంబంధిత అధికారులు ఉన్నారు. -
తక్షణ పరిష్కారమే లక్ష్యం
భూపాలపల్లి అర్బన్: ప్రజల సమస్యలను తక్షణం పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదివస్‌లో ప్రజల నుంచి 18ఫిర్యాదులు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించి సంబంధిత సీఐలు, ఎస్ఐలతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీచేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పైరవీలు, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ప్రజలు నిర్భయంగా పోలీసులను ఆశ్రయించవచ్చన్నారు. చట్టబద్ధంగా ప్రతీ ఒక్కరికి న్యాయం జరిగేలా పోలీస్ శాఖ కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజలకు సత్వర, పారదర్శక సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
భద్రతకు అధిక ప్రాధాన్యం
భూపాలపల్లి అర్బన్: గనుల్లో భద్రతా ప్రమాణాలను పటిష్టంగా అమలు చేయడంతోపాటు ఉద్యోగులు, కార్మికుల ఆరోగ్యం, భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కార్పొరేట్ సేఫ్టీ జీఎం సాయిబాబు సూచించారు. ఏరియాలోని జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్హాల్లో సోమవారం ఆక్యుపేషనల్ కోడ్–2020, ఆక్యుపేషనల్ సేప్టీ హెల్త్, వర్కింగ్ కండిషన్స్ సెంట్రల్ రూల్స్–2026పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ.. ప్రతీ ఉద్యోగి, కార్మికుడి ప్రాణ భద్రత సంస్థకు అత్యంత ముఖ్యమన్నారు. ప్రతీ పని ప్రారంభానికి ముందే ప్రమాదాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. నిబంధనలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలుచేయాలని, భద్రతా ప్రమాణాలపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు. భూగర్భ గనుల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు వ్యక్తిగత రక్షణ పరికరాలను తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. ‘సేఫ్టీ ఫస్ట్’ భావనతో ప్రతీ ఒక్కరు విధులు నిర్వహించాలని, భద్రత అనేది కేవలం సేఫ్టీ విభాగానికే కాకుండా ప్రతీ ఒక్కరి సమష్టి బాధ్యత అని స్పష్టంచేశారు. అంతకు ముందు మొదటి షిఫ్ట్‌లో ఏరియా జీఎం ఏనుగు రాజేశ్వర్‌రెడ్డితో కలిసి సేఫ్టీ జీఎం సాయిబాబు, సేఫ్టీ ఆర్జీ రీజియన్ జీఎం కె.మల్లయ్య ఏరియాలోని కేటీకే 6వ భూగర్భ గనిని సందర్శించి అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఏరియా అధికారులు శ్యామ్‌సుందర్, జ్యోతి, మాటూరి రవీందర్, సాంబశివరావు, రామస్వామి, అన్ని గనుల ఏజెంట్లు, మేనేజర్లు, సేఫ్టీ ఆఫీసర్లు, ప్రాజెక్టు ఇంజనీర్లు, ఫిట్ ఇంజనీర్లు, గ్రూప్ ఇంజనీర్లు పాల్గొన్నారు. కార్పొరేట్ సేఫ్టీ జీఎం సాయిబాబు -
పోలీస్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
భూపాలపల్లి అర్బన్: పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అందించేందుకు జిల్లా పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆది వారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అభ్యర్థులకు శారీరక పరీక్షలు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా సుమారు 350 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అనంతరం సింగరేణి హైస్కూల్లో రాత పరీక్ష నిర్వహించారు. రాత పరీక్ష కేంద్రాన్ని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పరిశీలించారు. పరీక్షలు రాస్తున్న అభ్యర్థులతో మాట్లాడారు. ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి, అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. శారీరక, రాత పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు 70 రోజులపాటు ఉచితంగా క్లాసులతోపాటు గ్రౌండ్ కోచింగ్ అందిస్తామని అదనపు ఎస్పీ నరేష్కుమార్ తెలిపారు. పోలీస్ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో అభ్యర్థులు కష్టపడి చదవడంతోపాటు శారీరకంగా సిద్ధం కావాలని సూచించారు. కార్యక్రమంలో భూపాలపల్లి సీఐ శ్రీనివాస్, ఆర్ఐలు రత్నం, సంతోష్‌కుమార్, కాశీరాం, ఆర్ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం
● కాటారం డీఎస్పీ సూర్యనారాయణకాళేశ్వరం(కాటారం): యోగా సాధనతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతోపాటు ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని కాటారం డీఎస్పీ సూర్యనారాయణ అన్నారు. మండలకేంద్రంలోని ఆదర్శ హైస్కూల్లో జిల్లా యోగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జనగామ కరుణాకర్ రావు, జిల్లా అథ్లెటిక్స్ చైర్మన్ పంతకాని సమ్మయ్య ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా స్థాయి యోగాసన పోటీలు నిర్వహించారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి డీఎస్పీ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. వివిధ వయస్సు కేటగిరీల్లో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలు బంగారు, రజత, కాంస్య పతకాలను కై వసం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. చిన్న వయస్సు నుంచే పిల్లలు యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. యోగా కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, మనస్సును ప్రశాంతంగా ఉంచి ఒత్తిడిని తగ్గించేందుకు దోహదపడే సాధనమని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడలు, యోగాపై కూడా ఆసక్తి పెంచుకోవాలన్నారు. అంతకుముందు జిల్లా స్థాయి యోగాసన పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి సర్పంచ్ పంతకాని సడవలి, ఏఎంసీ చైర్ పర్సన్ పంతకాని తిరుమలసమ్మయ్య, సీడీపీఓ రాధిక, ఎస్సై శ్రీనివాస్ ప్రారంభించారు. కార్యక్రమంలో యోగా అసోసియేషన్ సెక్రెటరీ ఆత్మకూరి కుమార్‌యాదవ్, జనరల్ సెక్రెటరీ బుడిమే కుమార్, యోగా గురూజీలు వావిళ్ల కిష్టయ్య, వావిళ్ల మహేందర్, ఎడ్ల మధు, ఎడ్ల రాము, గౌరోజు సదానందం, కుమార్ యాదవ్, శ్రీనివాస్, వనిత, గోపాల్, మీనా, శ్రీలత రెడ్డి, డాక్టర్ రఫీ, రాజబాపు, నాగరాజు పాల్గొన్నారు. -
భూ రీసర్వే పరిశీలన
మొగుళ్లపల్లి: మండలంలోని ఆకినపల్లి గ్రామంలో కొనసాగుతున్న భూ రీ సర్వేను ఆర్డీఓ హరికృష్ణ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు రీ సర్వే ప్రాముఖ్యతను వివరిస్తూ, సర్వేలో ఏవైనా తేడాలు వస్తే రైతులు గ్రామసభలో తమ అభ్యంతరాలను తెలియజేయాలని సూచించారు. అభ్యంతరాలను పరిశీలించి వెంటనే పరిష్కరిస్తామని ఆర్డీఓ స్పష్టం చేశారు. భూ రీ సర్వే ప్రక్రియ వేగంగా పూర్తి కావడానికి అధికారులకు సహకరించాలని రైతులను కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ సునీత, మండల సర్వేయర్, జీపీఓ, సర్వేయర్లు, ఆకినపల్లి రైతులు పాల్గొన్నారు. -
హక్కుల సాధనకు ఉద్యమించాలి
భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికుల హక్కుల సాధనకు కామ్రేడ్ కొమురయ్య స్ఫూర్తితో ఉద్యమించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ రా ష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కొమురయ్య భవన్లో బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్ అధ్యక్షతన కొమురయ్య వర్ధంతిని ఆదివారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసందర్భంగా కొముర య్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఏరియాలోని అన్ని గనులు, విభాగాల్లోనూ కొమురయ్య వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. కార్మికు ల హక్కుల సాధన కోసం కొమురయ్య తన జీవి తాంతం పోరాడారని గుర్తు చేశారు. నేడు కార్మికులు పొందుతున్న పెన్షన్ సాధనలో కొమురయ్య పోరా టం కీలకమైందన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ వైస్ ప్రెసిడెంట్ మాతంగి రామచందర్, నాయకులు గురుజేపల్లి సుధాకర్‌రెడ్డి, నూకల చంద్రమౌళి, శ్రీనివాస్, ఆసిఫ్ పాషా, పోశం, రామచందర్, కరీ ముల్లా, శంకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ప్రణామ్ సెంటర్‌ను సేవా కేంద్రంగా తీర్చిదిద్దాలి
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుభూపాలపల్లి రూరల్: ప్రణామ్ డే కేర్ సెంటర్‌ను కేవలం భవనంగా కాకుండా వయోవృద్ధులకు నిజ మైన సేవా కేంద్రంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సూచించారు. జిల్లాలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో, మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వమోవృద్ధుల సంక్షేమ శాఖ సహకారంతో ఏ ర్పాటు చేసిన ‘ప్రణామ్’ వయోవృద్ధుల డే కేర్ సెంటర్‌ను ఎమ్మెల్యే సత్యనారాయణరావు ఆది వారం ప్రారంభించారు. అనంతరం సెంటర్లోని సదుపాయాలను పరిశీలించి వృద్ధులతో ముచ్చటించారు. వారి అవసరాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వయోవృద్ధులు తమ సమయాన్ని ఆనందంగా గడిపేలా ఆరోగ్యం, వినోదం, పరస్పర స్నేహభావం పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వృద్ధాప్యంలో వారికి ఆరోగ్య సంరక్షణతోపాటు ఆప్యాయత, భద్రత, గౌరవం, మానసిక ప్రశాంతత అవసరమని అన్నారు. అదేవిధంగా రెడ్ క్రాస్ భవన నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్, మున్సిపల్ చైర్మ న్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీని వాస్, జిల్లా సంక్షేమ అధికారి మల్లీశ్వరి, రెడ్ క్రాస్ అధ్యక్షుడు శ్రీనివాస్, రాజేందర్ పాల్గొన్నారు. తెలుగు సాహిత్యానికి పునర్జీవం తీసుకురావాలి భూపాలపల్లి అర్బన్: జిల్లాలో తెలుగు సాహిత్యానికి పునర్జీవం తీసుకువాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ సారస్వత సమితి ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షుడు గడ్డం లక్ష్మయ్య రచించిన ఉషోదయ సుభాషిత శతకం పుస్తకావిష్కరణ మహోత్సవాన్ని జిల్లా కేంద్రంలోని సింగరేణి కమ్యూనిటీహాల్లో ఆదివారం నిర్వహించారు. మందల రవీందర్‌రెడ్డి అధ్యక్షత నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై పుస్తకావిష్కరణ చేసి మాట్లాడారు. పాఠశాలల్లో విద్యార్థులకు తెలుగు భాషపై మక్కువ పెంచుతూ సాహిత్యంపై ముందుకు తీసుకెళ్లాలని సూ చించారు. మారుతున్న పరిస్థితులతో తెలుగు సాహిత్యం కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు. వర్తమాన కవులు, రచయితలకు తనవంతు సహకారం అందిస్తామన్నారు. సాహిత్యం, సంగీతాన్ని ప్రోత్సహిస్తున్న లక్ష్మయ్యను అభినందించారు. జిల్లాలో సమావేశం నిర్వహించేందుకు సాహిత్య కళాభవనం ఏర్పాటు చేయాలని గడ్డం లక్ష్మయ్య కోరారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, డీసీసీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు బుర్ర కొమురయ్య, అంబాల శ్రీనివాస్, ఏఎంఓ విజయపాల్‌రెడ్డి, రవి, భాస్కర్, నాగరాజుశర్మ, అబ్దుల్లా, శ్రీరామ్, శంకరయ్య, సాగర్, నాగరాజు, సురేష్, రాజ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యానశాఖ.. ఉద్యోగుల్లేక!
సిబ్బంది కొరతతో రైతులకు సలహాలిచ్చేవారు కరువు● హనుమకొండ, ములుగుకు మంజూరుకాని జిల్లా అధికారి పోస్టు ● 3 నుంచి 6 మండలాలకు ఒక్కరికే అదనపు బాధ్యతలు ● ఉమ్మడి జిల్లాలో 78 మండలాలకు 17 మంది హెచ్ఓలు మాత్రమే30 ఏళ్లుగా పదోన్నతులు కరువు..ఉద్యాన శాఖలో పనిచేస్తున్న హెచ్ఓలకు 30 ఏళ్లుగా పదోన్నతులు లేకపోవడం మరో సమస్యగా మారింది. దీంతో చాలా మంది పదోన్నతి పొందకుండానే రిటైర్డ్ అవుతున్నారని పలువురు హెచ్ఓలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర శాఖల్లో రెగ్యులర్‌గా పదోన్నతి కల్పిస్తున్న ప్రభుత్వం తమకు మాత్రం ఆ అవకాశం లేదంటున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి అర్హత కలిగిన హెచ్ఓలకు పదోన్నతి కల్పించడంతో పాటు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఉద్యాన అధికారులు, రైతులు కోరుతున్నారు. హన్మకొండ: ఉద్యానశాఖను ఉద్యోగుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. జిల్లాల పునర్విభజన జరిగి ఏళ్లు గడుస్తున్నా హనుమకొండ, ములుగు జిల్లాలకు జిల్లా ఉద్యాన అధికారి పోస్టులు మంజూరు కాలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 78 మండలాలకు కేవలం 17 మంది ఉద్యాన అధికారులు (హెచ్ఓలు) మాత్రమే ఉన్నారు. దీంతో రైతులకు సరైన సమయంలో అవసరమైన సలహాలు ఇచ్చే వారు కరువయ్యారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ఉద్యాన శాఖ, సూక్ష్మ సేద్యపు ప్రాజెక్టులు వేర్వేరుగా కొనసాగాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ రెండింటినీ ఉద్యాన శాఖ పరిధిలోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. జిల్లాల పునర్విభజన తర్వాత పట్టు పరిశ్రమ శాఖను ఉద్యానశాఖలో విలీనం చేసింది. ఉద్యోగుల రిటైర్మెంట్ మినహా కొత్తగా నియామకాలు లేవు. 89,161 ఎకరాల్లో ఉద్యాన పంటలు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 89,161 ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో వరికి ప్రత్యమ్నాయంగా ఉద్యానపంటల సాగు విస్తీర్ణం పెంచాలని ప్రభుత్వం సూచించింది. ఈ క్రమంలో ఉన్న ఉద్యాన అధికారులపై మరింత పనిభారం పెరుగుతోంది. ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా వివిధ పంటలకు రాయితీ అందిస్తోంది. ఈ రాయితీ పొందడానికి ప్రతి రైతు వివరాలను క్షేత్రస్థాయికి వెళ్లి సేకరించి ఆన్లైన్లో నమోదు చేయాలి. జిల్లా ఉద్యాన అధికారుల పోస్టులను ప్రభుత్వం మంజూరు చేయలేదు. రాష్ట్రంలో ములుగు, హనుమకొండ, నారాయణపేట జిల్లాకు జిల్లా ఉద్యానశాఖాధికారి పోస్టు మంజూరు కాలేదు. ఖమ్మం జిల్లాకు చెందిన హార్టికల్చర్ ఏడీ ములుగు జిల్లా అధికారిగా, వరంగల్ జిల్లా సూక్ష్మసేద్య ప్రాజెక్టు అసిస్టెంట్ డైరెక్టర్ హనుమకొండ జిల్లా ఉద్యాన అధికారిగా కొనసాగుతున్నారు. రెగ్యులర్ హెచ్ఓల కొరత.. ఉద్యాన పంటల సాగు విస్తరిస్తున్నప్పటికీ అందుకు అనుగుణంగా అధికారులు, సిబ్బందిని నియమించడం లేదు. దీంతో ఉన్న వారి పైనే అదనపు భారం పడుతోంది. ఒక్కో ఉద్యాన అధికారికి 3 నుంచి 6 మండలాల బాధ్యతలు అప్పగించారు. వీరు విధులతో పాటు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాల్సి వస్తోంది. దీంతో రైతులకు అందుబాటులో లేకుండా పోతున్నారు. ములుగు జిల్లాలో 10 మండలాలుండగా డిప్యుటేషన్‌పై ఇద్దరు మాత్రమే ఉద్యాన శాఖాధికారులున్నారు. ఇక్కడ రెగ్యులర్ హెచ్ఓలు లేరు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 11 మండలాలకు ఇద్దరు ఉద్యాన అధికారులు మాత్రమే ఉన్నారు. ఇందులో ఒక్క ఉద్యాన అధికారి.. జిల్లా ఉద్యాన అధికారిగా అదనపు పూర్తి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో ఈ జిల్లాలోని రైతులకు సరైన సేవలు అందడం లేదనే ఆరోపణలున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో 18 మండలాలకు ముగ్గురు ఉద్యాన శాఖాధికారులున్నారు. ఇందులో ఒక్కరు డిప్యుటేషన్‌పై పని చేస్తున్నారు. హనుమకొండ జిల్లాలో 14 మండలాలకు ఇద్దరు, వరంగల్ జిల్లాలో 13 మండలాలకు ఐదుగురు ఉద్యాన శాఖ అధికారులున్నారు. -
నేడు నాగేంద్రస్వామి విగ్రహ ప్రతిష్ఠ
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని కాళేశ్వరముక్తీశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయం నాగేంద్రస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 9.30 గంటలకు నిర్వహించనున్నట్లు ఈఓ మహేష్ ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ఇటీవల నూతనంగా నిర్మించిన ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన చేస్తున్నందున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. రామప్పలో అమెరికా దేశస్తుడు వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని అమెరికాకు చెందిన జాన్ చెర్మక్ ఆదివారం సందర్శించారు. రామప్ప రామలింగేశ్వర స్వామిని ఆయన దర్శించుకోగా అర్చకులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్‌లు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ చరిత్ర, శిల్పకళ ప్రాముఖ్యత గురించి టూరిజం గైడ్ తాడబోయిన వెంకటేశ్ వారికి వివరించారు. నాటక ప్రదర్శన పోస్టర్ ఆవిష్కరణ కాజీపేట రూరల్: సురభి నాటకాలను బతికించాలని కాజీపేట రైల్వే సీనియర్ డీఈఈ, రైల్వే జనరల్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ జి.సూర్యనారాయణ అన్నారు. కాజీపేట రైల్వే జనరల్ ఇనిస్టిట్యూట్ కళావేదికపై ఆదివారం సమ్మక్క సారలమ్మ జీవిత కథ సురభి నాటక ప్రదర్శన పోస్టర్‌ను సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ మన సంస్కృతీ, సంప్రదాయాలను బతికించాలని జానపద కళలు, ఆధ్యాత్మికత, మన దేశ రాజుల రాజ్యాల వీరగాథలను తెలిపేందుకు సురభి నాటక ప్రదర్శనకు సహకరిస్తున్న రైల్వే ఇన్స్టిట్యూట్ వారిని అభినందిస్తున్నట్లు తెలిపారు. ఇన్స్టిట్యూట్ సెక్రటరీ దేవులపల్లి రాఘవేందర్ మాట్లాడుతూ.. ఈ నెల 13న కాజీపేట రైల్వే కమ్యూనిటిహాల్‌లో సాయంత్రం 5 గంటలకు మేడారం సమ్మక్క సారలమ్మ జీవిత కథ సురభి నాటక ప్రదర్శన ఉంటుందని, ఈ ప్రదర్శనకు రైల్వే ఉద్యోగులు, కాజీపేట ప్రాంత ప్రజలు కుటుంబసమేతంగా వచ్చి నాటకాన్ని తిలకించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో కాజీపేట రైల్వే స్టేషన్ మేనేజర్ అగ్గి రవీందర్, సురభి నాటక సంస్థ అధ్యక్షుడు సింధురి కొండల్రావు, ట్రెజరర్ కార్తీక్, కార్యదర్శి సురభి సంతోశ్, సభ్యులు నాగరాజు, ఇన్స్టిట్యూట్ జాయింట్ సెక్రటరీ మెరుగు రాజయ్య, ట్రెజరర్ గిరిమిట్ల రాజేశ్వర్‌రావు, సంస్కృత విభాగం ఇన్చార్జ్ ధారవత్ రఘు, సభ్యులు పి.రవికిరణ్ పాల్గొన్నారు. జనగణనలో బీసీల లెక్కలు చేపట్టాలి కేయూ క్యాంపస్: కేంద్రం చేపట్టబోయే జనగణనలో ఓబీసీ వర్గాలకు ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేసి లెక్కలు చేపట్టాలని బీసీ కుల గణన సాధన సమితి కన్వీనర్, కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీమనోహర్ డిమాండ్ చేశారు. ఆదివారం కేయూలోని దూరవిద్యాకేంద్రంలో శ్రీజనగణనలో ఓబీసీల కాలమ్ ఏర్పాటుశ్రీ అంశంపై బీసీ సంఘాలతో, ముఖ్యులతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ కులగణన సాధన సమితి కన్వీనర్ మురళిమనోహర్ మాట్లాడుతూ.. కేంద్రం చేపట్టబోయే జనగణనలో బీసీల జనగణన చేపట్టకపోతే భవిష్యత్‌లో బీసీలు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో విపరీతంగా నష్టపోతారన్నారు. జనాభా దామాషా ప్రకారం బడ్జెట్, విద్యాసంస్థల్లో సీట్లు, రాజకీయ ప్రాతినిథ్యం దక్కాలంటే కచ్చితమైన లెక్కలు ఉండాలన్నారు. అదే డిమాండ్‌తో ఈనెల 11న హనుమకొండలోని ఏకశిల పార్కువద్ద ప్రత్యేకంగా నిరసన దీక్షలను చేపట్టాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈదీక్షలకు బీసీలంతా తరలిరావాలని పిలుపునిచ్చారు. బీసీ సంఘాల బాధ్యులు డాక్టర్ తిరుణహరిశేషు, వడ్లకొండ వేణుగోపాల్‌గౌడ్, తాడిశెట్టి క్రాంతికుమార్, డాక్టర్ సంగాని మల్లేశ్వర్, సాయిని నరేందర్, గొల్లపెల్లి వీరస్వామి పాల్గొన్నారు. గంగారం రేంజ్ అఽధికారిగా మయూరి గంగారం : గంగారం రేంజ్ అటవీశాఖ అధికారిగా మయూరి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. కాగా, సిబ్బంది మర్యాదపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు. -
హేమాచలక్షేత్రంలో భక్తుల రద్దీ
మంగపేట మండలంలోని హేమాచలక్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది. స్వయంభూ లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు వందల సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆదివారం ఆలయ క్షేత్రం కోలాహలంగా మారింది. శ్రావణమాసం ఆదివా రం సెలవు రోజు కావడంతో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వేలాదిగా తరలివచ్చారు. రాష్ట్రంలోని సుదూర ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రి నుంచి భక్తులు వివిధ వాహనాల్లో ఉదయాన్నే గుట్టపైకి చేరకున్నారు. ఆలయ సమీపంలో పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు రాజశేఖర్‌శర్మ, పవన్‌కుమార్, ఈశ్వర్‌చంద్‌శర్మ, అనిపెద్ది రాజీవ్ శర్మ స్వామివారికి నిర్వహించిన తిలతైలాభిషేకం పూజలో పాల్గొని భక్తులు మానవ శరీరాన్ని పోలి ఉండే లక్ష్మీనర్సింహ స్వామిని దర్శించుకుని పులకించారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు నాభిచందన ప్రసాదాన్ని పంపిణీ చేశారు. – మంగపేట -
ఆదివారం శ్రీ 6 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
భూపాలపల్లి: సింగరేణి పారిశ్రామిక ప్రాంతమైన భూపాలపల్లి పట్టణంలో వడ్డీ దందా జోరుగా సాగుతోంది. కొందరు స్థానిక, స్థానికేతర వ్యాపారులు అత్యంత విలువైన పత్రాలు, బంగారు నగలు తనాఖా పెట్టుకొని నెలకు నూటికి రూ.10 వరకు వడ్డీ తీసుకుంటున్నారు. ఈ దందాలో నష్టాలు లేకపోవడం.. ఏడాదిలోనే అసలు డబ్బు రెట్టింపు అవుతుండటంతో వ్యాపారంలోకి దిగే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రూ.10వరకు వడ్డీ వసూలు.. వడ్డీ వ్యాపారం కొనసాగిస్తున్న వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలను బేఖాతర్ చేస్తూ అధికంగా వడ్డీ వసూలు చేస్తున్నారు. అప్పు తీసుకునే వ్యక్తి అవసరాన్ని ఆధారంగా చేసుకొని నూటికి రూ.6 నుంచి రూ.10 వరకు వడ్డీ వసూలు చేస్తున్నారు. అప్పు ఇచ్చిన వ్యాపారే ప్రతీ నెల బ్యాంకుకు వెళ్లి తనాఖా ఉంచుకున్న ఏటీఎం కార్డు లేదా చెక్‌బుక్‌ల సహాయంతో డబ్బులను విడిపించుకుంటున్నాడు. తనకు రావాల్సిన వడ్డీ, అసలులో కొంతభాగాన్ని సొంతం చేసుకొని మిగిలిన డబ్బులను అప్పు తీసుకున్న వ్యక్తి ఇంటికి వెళ్లి తిరిగి ఇస్తున్నారు. ఈ తంతంగం అంతా వేతనాలు పొందే నెల మొదటి వారంలో పూర్తి చేస్తున్నారు. గిరిగిరితో కిరికిరి.. కొంతమంది వడ్డీ వ్యాపారులు చిరు వ్యాపారులను టార్గెట్ చేసి తమ దందాను సాగిస్తున్నారు. చిన్నచిన్న హోటళ్లు, పాన్‌షాపులు, పండ్లు తదితర వ్యాపారుల అవసరాన్ని ఆసరాగా తీసుకొని గిరిగిరి పేరిట అప్పు ఇస్తున్నారు. అప్పు తీసుకునే వ్యక్తి రూ.లక్ష తీసుకుంటే, ప్రామిసరీ నోటు రాయించుకొని రూ.90 వేలు మాత్రమే ఇస్తున్నారు. రూ.10వేలను ముందుగానే వడ్డీ కింద తీసుకుంటున్నారు. రూ.90 వేలను రోజుకు రూ.వేయి చొప్పున 90 రోజులు వసూలు చేస్తున్నారు. ఈ దందాలో భారీగా లాభాలు ఉండటంతో పలువురు దుకాణదారులు సైతం రంగంలోకి దిగారు. జిల్లాకేంద్రంలో జోరుగా సాగుతున్న ఈ వడ్డీ దందాపై ఇప్పటికై నా పోలీసులు ఉక్కుపాదం మోపాలని పట్టణ ప్రజలు, చిరు వ్యాపారులు కోరుతున్నారు. అనుమతులు లేకుండానే.. జిల్లా కేంద్రంలో గతంలో అనుమతులు పొందిన ఫైనాన్స్ కార్యాలయాలు ఉండగా కొన్నేళ్ల క్రితం వాటిని మూసివేశారు. దీంతో పట్టణానికి చెందిన, ఇతర ప్రాంతాలకు చెందిన సుమారు వందమందికి పైగా వ్యాపారులు ప్రభుత్వం నుంచి అనుమతులు, కార్యాలయాలు లేకుండానే ఇంటి వద్ద నుంచే తమ దందాను కొనసాగిస్తున్నారు. ఒక్కో వ్యాపారి సుమారుగా రూ.10 లక్షల నుంచి రూ. కోటి వరకు వ్యాపారం సాగిస్తున్నట్లు సమాచారం. వ్యాపారం దెబ్బతినకుండా ఉండేందుకు అప్పు ఇచ్చే ముందు పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ అప్పు తీసుకునే వ్యక్తి నుంచి బ్యాంకు ఖాతాబుక్, చెక్‌బుక్, ఏటీఎం కార్డు, బంగారు నగలు, భూమి రిజిస్ట్రేషన్ పత్రాలను తీసుకుంటున్నారు. వీటికి తోడు ప్రామిసరీ నోటుపై వివరాలు ఏమీ రాయకుండానే సంతకం చేయించుకుంటున్నారు. అలా అయితేనే డబ్బులు ఇస్తామని చెబుతుండటంతో బాధితులు చేసేదేమీ లేక వ్యాపారులు అడిగిన వాటినన్నింటినీ అప్పగిస్తున్నారు. అప్పటి నుంచి బాధితుడికి బాధలు మొదలవుతున్నాయి. నూటికి రూ.6 నుంచి రూ.10 వరకు మిత్తి లైసెన్సులు లేకుండానే విచ్చలవిడిగా దందా విలువైన పత్రాలు, బంగారు ఆభరణాలు తనఖా అడపదడపా పోలీసుల తనిఖీలు దాడులు చేస్తాం.. నిబంధనలు ఉల్లంఘిస్తూ వడ్డీ వ్యాపారం చేస్తున్న వారిపై దాడులు నిర్వహిస్తాం. గతంలో పలువురిపై కేసులు కూడా నమోదు చేశాం. అధిక వడ్డీ వసూలు చేస్తున్న వారి సమాచారం అందిస్తే వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం. – ఎ.సంపత్‌రావు, డీఎస్పీ, భూపాలపల్లి -
పౌష్టికాహారం అందించాలి
గణపురం: గర్భిణులు, బాలింతలకు ప్రతీ రోజు సమతుల్యమైన పౌష్టికాహారం అందించాలని జిల్లా వైద్యాధికారి ముధుసూదన్ అన్నారు. గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లె గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో శనివారం నిర్వహించిన పౌషకాహార వారోత్సవాల్లో ఆయన పాల్గొని అవగాహన కల్పించారు. అనంతరం మాట్లాడుతూ గర్భదారణ సమయంలో పౌషకాహారం తీసుకోవడం వలన తల్లి ఆరోగ్యంతో పాటు శిశువు ఎదుగుదల కూడా మెరుగ్గా ఉంటుందన్నారు. పిల్లల ఎదుగుదల, ఆరోగ్యానికి పౌష్టికాహారం ఎంతో అవసరమన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. రేపు పరీక్షలు భూపాలపల్లి అర్బన్: ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు అవసరమైన ఉచిత ఉపకరణాలను అందించేందుకు ఈ నెల 7న నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి ఎల్.లలిత, కమ్యూనిటీ మొబలైజింగ్ ఆఫీసర్ సామల రమేశ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ఆవరణలో భారత కృతిమ అవయవాల నిర్మాణ సంస్థ (అలిమ్కో), సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే 150మంది ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులను గుర్తించినట్లు తెలిపారు. ఉపకరణాలు అవసరమైన విద్యార్థులు రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, 40శాతానికి పైగా వైకల్యం ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన సదరం సర్టిఫికెట్ లేదా ప్రభుత్వ వైద్యుడు జారీచేసిన వైకల్య ధ్రువపత్రం, ఆధార్ కార్డు, ఆదాయ ధ్రువపత్రం లేదా రేషన్ కార్డుతో శిబిరానికి హాజరుకావాలని సూచించారు. విద్యార్థితో పాటు తల్లిదండ్రుల్లో ఒకరికి బస్‌చార్జీలు, భోజన సౌకర్యం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. నిర్మాణ పనుల పరిశీలన కాళేశ్వరం: కాళేశ్వరం దేవస్థానం ఆలయ నిర్మాణ పనులను ఈఓ మహేశ్, క్షేత్ర కన్సల్టెన్సీ ఇంజనీర్లు, ఆర్కిటెక్చర్లు, పాలవవర్గం డైరెక్టర్ మంచినీళ్లు దుర్గయ్య, దొడ్ల అశోక్ శనివారం పరిశీలించారు. జిల్లా అధ్యక్షుడిగా తిరుపతి భూపాలపల్లి రూరల్: ఈ–పంచాయతీ జిల్లా అధ్యక్షుడిగా గుండెబోయిన తిరుపతి ఎన్నికయ్యారు. జిల్లాకేంద్రంలో నిర్వహించిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ గౌరవ సలహాదారుడిగా చింతకింది రమేశ్, ఉపాధ్యక్షుడిగా కూరెందుల భాస్కర్, ప్రధాన కార్యదర్శిగా అమృతపు పవన్, కోశాధికారిగా ఇమ్రాన్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికై న బాధ్యులు మాట్లాడుతూ.. ఈ–పంచాయతీ సిబ్బంది, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల సాధనకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఈ–పంచాయతీ ప్రతినిధులు సభ్యులు పాల్గొన్నారు. రామప్పలో జియోలాజికల్ అధికారులు వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని శనివారం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అడిషనల్ డైరెక్టర్ జనరల్ వీవీ ముఘల్, డిప్యూటీ డైరెక్టర్ శేషాసాయిలు సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించగా అర్చకులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్‌లు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ చరిత్ర, శిల్పకళ ప్రాముఖ్యత గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్‌కుమార్ వారికి వివరించారు. వారి వెంట జీఎస్ఐ అధికారులు, సిబ్బంది, ఈవో ఇమ్మడి భాస్కర్, టూరిస్ట్ పోలీసులు అరుణ్, శ్రీకాంత్, భద్రు ఉన్నారు. -
ఢీ అంటే ఢీ
భూపాలపల్లి: జిల్లాకేంద్రమైన భూపాలపల్లి పట్టణంలో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు ఒకే చౌరస్తాలో దాదాపుగా ఒకే సమయంలో కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఇరు పార్టీల నాయకులు నినాదాలు చేసుకుంటూ దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు ఇరువర్గాలకు సర్దిచెప్పి పంపడంతో ఇబ్బంది తలెత్తలేదు. కాసేపు హై టెన్షన్.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వేయి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. పట్టణంలోని హనుమాన్ దేవాలయం నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, స్థానిక నాయకులు ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ సెంటర్‌కు చేరుకున్నాక ఎమ్మెల్యే.. విలేకరులతో మాట్లాడారు. అప్పటికే సినిమా థియేటర్లో వేచి ఉన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు అదే సమయంలో సెంటర్‌కు చేరుకున్నారు. విషయాన్ని గమనించిన పోలీసులు బీఆర్ఎస్ నాయకులను కాసేపు ఆపారు. ఇరుపార్టీల నాయకుల మధ్య అడ్డుగా నిలిచారు. అయినప్పటికీ కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు నినాదాలకు దిగారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే సత్యనారాయణరావు మాట్లాడటం పూర్తయ్యాక వెళ్లిపోయారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించాక అంబేడ్కర్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడారు. శనివారం జిల్లాకేంద్రంలో ఇరు పార్టీల కార్యక్రమాలు ఉండటంతో పోలీసులు ముందే భారీఎత్తున మొహరించారు. భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు ఆధ్వర్యంలో డివిజన్లోని సీఐలు, ఎస్సైలు, సిబ్బంది విధులు నిర్వర్తించి ఘర్షణలు చెలరేగకుండా చూశారు. అభివృద్ధి, సంక్షేమం మా ధ్యేయం.. ™èlÐ]l$ ´ëÈt A«¨M>Æý‡…-ÌZMìS Ð]l^éaMýS {ç³fÌS çÜ…„óSÐ]l$…, AÀ-Ð]l–§ól® «§ólÅĶæ$…-V> ç³° ^ólçÜ$¢-¯é²-Ð]l$° GÐðl$ÃÌôæÅ VýS…{yýl çÜ™èlÅ-¯éÆ>Ķæ$-׿Æ>Ð]l# A¯é²Æý‡$. C_a¯]l Ð]l*r {ç³M>Æý‡… OÆð‡™èl$-ÌSMýS$ Æý‡$׿Ð]l*-ïœ, OÆð‡™èl$ ¿ýæÆøÝë, E_™èl ѧýl$Å™Œæ, Ð]l$íßæ-âýæ-ÌSMýS$ E_™èl ºçÜ$Þ {ç³Ä¶æ*׿…, Æý‡*.500MóS V>Å‹Ü íÜÍ…yýlÆŠ‡ A…¨çÜ$¢-¯é²-Ð]l$° A¯é²Æý‡$. D M>Æý‡Å-{MýS-Ð]l$…-ÌZ M>…{VðS-‹Ü ´ëÈt hÌêÏ A«§ýlÅ„ýS$yýl$ ºr$t MýSÆý‡$×êMýSÆŠḥ, ç³rt׿ A«§ýlÅ-„ýS$yýl$ §érÏ }°Ðé‹Ü, Ð]l¬°Þç³ÌŒæ O^ðlÆý‡Ã¯Œl, OÐðl‹ÜO^ðl-Æý‡Ã¯ŒS-Ë$ º${Æý‡ MöÐ]l¬-Æý‡Ä¶æ$Å, A…»êÌS }°Ðé‹Ü, Mú°ÞÌSÆý‡$Ï, ¯éĶæ$-MýS$-Ë$, ™èl¨™èlÆý‡$Ë$ ´ëÌŸY-¯é²Æý‡$. ఒక్క హామీ కూడా అమలు చేయలేదు.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని వంద పడకల ఆస్పత్రిలో పూర్తి స్థాయి వైద్యం అందడం లేదని, ఫీజు రీయింబర్స్మెంట్ రాక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ చేపట్టిన కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు కటకం జనార్దన్, సెగ్గం సిద్ధు, గడ్డం కుమార్‌రెడ్డి, పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గండ్ర హరీశ్‌రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ విజయోత్సవం... బీఆర్ఎస్ ‘బాకీ కార్డుల’ పోరు ఒకే చౌరస్తాలో ఇరు పార్టీల కార్యక్రమాలు జిల్లా కేంద్రంలో కాసేపు ఉద్రిక్తత రంగంలోకి దిగి సర్దిచెప్పిన పోలీసులు -
ఐటీడీఏల ముట్టడిని విజయవంతం చేయాలి
వాజేడు: ఆదివాసీల ఉద్యోగాల కల్పనకు చేపట్టిన రాష్ట్రంలోని ఐటీడీఏల ముట్టడిని విజయవంతం చేయాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్‌కుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మండల కేంద్రంలోని పలు ఆదివాసీ సంఘాల నాయకులతో కలిసి ఆయన కొమురంభీమ్ విగ్రహానికి శనివారం పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఐటీడీఏల ముట్టడి కార్యక్రమాలకు సంబంధించిన వాల్‌పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 50 ఏళ్లుగా లంబాడాలు ఆదివాసీల హక్కులను పొందుతున్నారన్నారు. ఉద్యోగాలు, నిధులు నియామకాలలో నిత్యం ఆదివాసీలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీల హక్కులను కాపాడుకోవడానికి రేపు(సోమవారం) ఏటూరునాగారం ఐటీడీఏ ముట్టడి మార్చ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అదే విధంగా 16న ఊట్నూరు, 21న భద్రాచలం, 28న మన్ననూరు ఐటీడీఏల ముట్టడి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమాల్లో ఆదివాసీలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణరావు, జిల్లా కార్యదర్శి కోటేశ్వర్లు, జానకి రమణ, జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, జీఎస్పీ మండల అధ్యక్షుడు సుధాకర్, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ పాల్గొన్నారు. -
స్మారక చిహ ్నం.. చారిత్రక వైభ వం
జాతీయ సంపదైన రామప్ప రెండు ఉప ఆలయాలుప్రయోజనాలు.. ● ఆలయాల చుట్టూ ఉన్న భూమి పరిధి పూర్తిగా కేంద్ర రక్షిత ప్రాంతంగా మారిపోతుంది. ● ఆలయ పునరుద్ధరణ, అభివృద్ధి, భద్రతా బాధ్యతలను ఇకపై ఏఎస్‌ఐనే స్వయంగా చూసుకోనుంది. ● చారిత్రక కట్టడాల పరిరక్షణలో భాగంగా ఆలయ పరిసరాల్లో అక్రమ నిర్మాణాలు జరగకుండా కఠిన నిబంధనలు అమలుచేస్తారు. ● వీటి ప్రాశస్త్యాన్ని భవిష్యత్ తరాలకు అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటారు. యునెస్కో గుర్తింపుతో రామప్ప కళ నలుదిశలా పరివ్యాప్తి చెందింది. ఇక్కడ కట్టడాలను చూసేందుకు ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు వస్తున్నారు. అదే తరహాలో గత నెలలో రామప్ప సమీపంలోని గొల్లాల గుడిని, జూలైలో శివ తారకేశ్వరాలయాన్ని జాతీయ స్మారక చిహ్నంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈనేపథ్యంలో రామప్పకు మరింత పర్యాటక శోభ సంతరించుకోనుంది. ఈ ప్రాంతం సైతం అభివృద్ధి చెందనుంది. ఈనేపథ్యంలో పురావస్తు శాఖ పరిధిలోకి వెళ్లిన ఈ రెండు ఆలయాల ప్రత్యేకతలే ‘సాక్షి’ సండే స్పెషల్.. – ములుగు● భారత పురావస్తు శాఖ పరిధిలోకి గొల్లాల గుడి, శివ తారకేశ్వరస్వామి ఆలయాలు● నాటి త్రికూటాలయమే నేటి గొల్లాల గుడి ● నిర్మాణంలో కాకతీయుల శిల్పకళకాకతీయుల రాజ్య వైభవానికి, నాటి ఆలయ నిర్మాణాల నైపుణ్యానికి సజీవ సాక్ష్యం ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలో గల రామప్పలోని కట్టడాలు. రామప్ప ఆలయానికి 2021 జూలై 25న యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా లభించింది. ఈ ఆలయ పరిధిలోని ఒక ఉప ఆలయం గొల్లాల గుడి. రామప్ప ఆలయానికి నైరుతి దిశలో ఉన్న ఈ గొల్లాల గుడి మూడు గర్భగుడులతో కూడిన త్రికూటాలయం. తూర్పు ముఖంగా ఉన్న మండపం, మూడు గర్భాలయాలు, సున్నితంగా చెక్కిన ద్వారబంధాలు, హంసల వరుసలు, దేవతామూర్తుల శిల్పాలు నాటి శిల్పుల కళా నైపుణ్యాన్ని కళ్లకు కడతాయి. శతాబ్దాలుగా శిల్ప వైభవాన్ని కాపాడుకుంటూ వచ్చిన ఈ చారిత్రక కట్టడాన్ని తాజాగా కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా ప్రకటించింది. దీంతో ప్రపంచ వారసత్వ కట్టడమైన రామప్పకు గొల్లల గుడి మరో మణిహారంగా నిలవనుంది. వైభవానికి ప్రతీక త్రికూటాలయం రామప్ప పరిసరాల్లోని మరో అపురూప చారిత్రక కట్టడం గొల్లాల గుడి జాతీయ పురావస్తు సంరక్షణ పరిధిలోకి చేరింది. తూర్పు ముఖంగా ఉన్న మండపం చుట్టూ మూడు గర్భగుడులు ఉండేలా ఆలయ నిర్మాణం కొనసాగింది. ఆలయ ద్వారబంధాలు, ద్వారాలపై చెక్కిన హంసల వరుసలు, ద్వారపాలకుల శిల్పాలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. గుడి గోడలపై ఉన్న శిల్పాలు కాకతీయుల కళా వైభవానికి అద్దం పడుతున్నాయి. ఆలయానికి విష్ణు, లక్ష్మీ, గణేశ్, మహిషాసురమర్ధిని తదితర దేవతామూర్తులను అందంగా చెక్కారు. ఆలయ పీఠభాగంలో జంతువుల ప్రతిమలు, పుష్పాల ఆకృతులు కనిపిస్తాయి. ఎత్తయిన పీఠంపై నిర్మించిన ఈ ఆలయంలోని ప్రతీ నిర్మాణ భాగం నాటి శిల్పుల ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తోంది. తొలి స్మారక చిహ్నంగా శివ తారకేశ్వరస్వామి గుడి శివ తారకేశ్వరస్వామి(శివాలయం) ఆలయాన్ని జాతీయ ప్రాముఖ్యత స్మారక చిహ్నంగా గుర్తిసూ గత జూలై 6న భారత పురావస్తు సర్వేక్షణ (ఎఎస్ఐ) సంస్కృతి మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. ఇందులోనూ కాకతీయ కట్టడాల నిర్మాణశైలి ఉంటుంది. కాగా, ప్రస్తుతం ఈ ఆలయంలో కొంతభాగం కూలిపోగా, ఇనుపస్తంభాలు పెట్టి నిలబెట్టారు. కాకతీయ కాలపు నిర్మాణ చాతుర్యాన్ని ప్రదర్శించే రామప్పలోని 10 ఉప ఆలయాలను కూడా జాతీయ సంపదగా గుర్తించాలని పర్యాటకులు కోరుతున్నారు. -
ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం
భూపాలపల్లి అర్బన్: ఉపాధ్యాయ దినోత్సవాన్ని జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో శనివారం ఘనంగా నిర్వహించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేశారు. అనంతరం జరిగిన కార్యక్రమాల్లో పాఠశాలల్లో విద్యార్థులు ఉపాధ్యాయులను శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. భక్తిశ్రద్ధలతో హేమాచలుడికి పూజలు మంగపేట : మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కార్లు, ప్రైవేట్ బస్సులు, ఆటోలు తదితర వాహనాల్లో తరలిరావడంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. గంటల కొద్ది సమయం భక్తులు క్యూలైన్లలో వేచి ఉండి అత్యంత భక్తిశ్రద్ధలతో తిలతైలాభిషేకం పూజలో పాల్గొన్నారు. మానవ శరీరాన్ని పోలి ఉండే స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. పూజారులు పవన్‌కుమార్ ఆచార్యులు, రాజీవ్ శర్మ, ఈశ్వర్‌చంద్ రామనుజం భక్తుల గోత్రనామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు. -
నిర్ణీత సమయంలో భూ రీసర్వే
● కలెక్టర్ రాహుల్శర్మగణపురం: పొరపాట్లకు తావులేకుండా భూ రీ సర్వేను నిర్ణీత సమయంలో పూర్తిచేయాలని కలెక్టర్ రాహుల్‌శర్మ అధికారులను ఆదేశించారు. గణపురం మండలం అప్పయ్యపల్లె గ్రామ పంచాయతీ శివారు తూపురం వద్ద జరుగుతున్న భూ రీ సర్వేను శనివారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎంపిక చేసిన 70 గ్రామాల్లో సర్వే చేపట్టాల్సి ఉండగా.. ఇప్పటివరకు 12 గ్రామాల్లో రీ సర్వే జరుగుతుందన్నారు. మిగిలిన గ్రామాల్లో రీ సర్వే చేపట్టాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న సర్వేయర్ల భద్రతకు అవసరమైన గమ్ షూస్, ఇతర రక్షణ పరికరాలను కొనుగోలు చేయాలని ఆదేశించారు. రోవర్ తదితర ఇతర పరికరాలను సమర్థవంతంగా వినియోగిస్తూ సర్వే పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. గణపురం మండలంలో ఆరు గ్రామాలను రీ సర్వే కోసం ఎంపిక చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం మూడు గ్రామాల్లో సర్వే జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కుసుమ కుమారి, ఆర్డీఓ హరికృష్ణ, తహసీల్దార్ రాజేశ్వర్‌రావు, రైతులు పాల్గొన్నారు. -
‘ఆట’ ఆరంభం!
సాక్షి ప్రతినిధి, వరంగల్: కాంగ్రెస్ పార్టీ ఓరుగల్లు రాజకీయాల్లో ఆట మొదలైంది. ఒకవైపు కొండా సురేఖ రాజకీయ భవిష్యత్‌పై చర్చ.. మరోవైపు వరంగల్ తూర్పులో అంతర్గత సమీకరణాలపై ఆసక్తి.. వెరసి ‘కొండా’ దంపతులకు ‘అక్కడ సెగ.. ఇక్కడ పొగ..’ అన్నట్టుగా పరిస్థితి మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో సురేఖ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారానికి ఆమె స్వయంగా తెరదించారు. కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. దీంతో తక్షణ రాజకీయ సంక్షోభంపై కొంత స్పష్టత వచ్చింది. వరంగల్ తూర్పుపై ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ‘కుడా’ చైర్పర్సన్ గుండు సుధారాణి పట్టు బిగిస్తుండటం.. వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొండా దంపతుల వ్యూహం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో తూర్పులో కొండా కుటుంబానికి భిన్నంగా వేగమందుకున్న కాంగ్రెస్ నేతల కదలికలపై చర్చ మొదలైంది. కాంగ్రెస్‌లోనే.. సురేఖ స్పష్టత.. పార్టీ మారతారనే ప్రచారం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే చర్చ మధ్య సురేఖ తన వైఖరిని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని ప్రకటించారు. దీంతో వెంటనే పార్టీ మార్పు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా వంటి అంశాలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్టయింది. ఆమె ఎమ్మెల్యేగా కొనసాగుతూ కాంగ్రెస్‌లోనే తన రాజకీయ ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళ్లనున్నారు. మంత్రి పదవి లేకుండా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నేపథ్యంలో.. పార్టీలో తన రాజకీయ ప్రాధాన్యాన్ని ఎలా కొనసాగిస్తారు? స్థానికంగా తన వర్గాన్ని ఎలా సమన్వయం చేసుకుంటారు? అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. పెరుగుతున్న వ్యతిరేక స్వరం వరంగల్ తూర్పు కాంగ్రెస్‌లో కొండా సురేఖకు భిన్నమైన రాజకీయ వర్గాలు గతంలోనూ ఉన్నాయి. మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మాజీ మేయర్ గుండు సుధారాణి వంటి నేతలు వరంగల్ తూర్పు రాజకీయాల్లో తమదైన ప్రాధాన్యం కలిగిన నాయకులు. గత రాజకీయ పరిణామాల్లో కొండా కుటుంబంతో వీరికి భిన్నాభిప్రాయాలు కనిపించిన సందర్భాలున్నాయి. తాజాగా శుక్రవారం మీడియాతో మాట్లాడిన గుండు సుధారాణి.. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల చేస్తే ఊరుకునేది లేదని గట్టిగానే హెచ్చరించారు. దమ్ముంటే రాజీనామా చేసి ఇండిపెండెంట్ పోటీ చేయాలని, తాను సైతం ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటానని బస్వరాజు సారయ్య సురేఖకు సవాల్ విసిరారు. ఈ పరిస్థితుల్లో వీరి రాజకీయ వైఖరి ఎలా ఉంటుంది? కొండా సురేఖతో పార్టీ అంతర్గతంగా సమన్వయం జరుగుతుందా? లేక కాంగ్రెస్‌లో వేర్వేరు రాజకీయ శక్తులుగా కొనసాగుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ‘కొండా’ అనుచరవర్గంలో మౌనం తాజా పరిణామాల తర్వాత కొండా సురేఖకు మద్దతుగా ఉండే నాయకులు, కార్యకర్తల నుంచి పెద్దగా బహిరంగ ప్రకటనలు కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. దీనిని మొత్తం అనుచరవర్గం మౌనంగా ఉందని చెప్పడం కంటే.. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఆచితూచి వ్యవహరిస్తున్న వాతావరణంగా చూడాల్సి ఉంటుందన్న వాదన వినిపిస్తోంది. కొండా సురేఖ కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేసిన నేపథ్యంలో.. ఆమె అనుచరుల రాజకీయ వైఖరి కూడా పార్టీ నిర్ణయాలకు అనుగుణంగానే ఉండే అవకాశముంది. భవిష్యత్‌లో ఏదైనా కీలక రాజకీయ నిర్ణయం వస్తే.. స్థానికంగా ఆమె వెంట ఎవరెవరు నిలుస్తారన్నది అప్పుడే స్పష్టం కానుంది. దీంతోపాటు కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కొండా సురేఖకు ఇప్పుడు ప్రధాన సవాలు పార్టీ బయట కంటే సొంత పార్టీలోనే తన రాజకీయ స్థానాన్ని నిలబెట్టుకోవడమే. కాంగ్రెస్‌లోనే ఉంటూ రాజకీయ బలాన్ని పునర్నిర్మించుకోవడమా? పార్టీలోని విభేదాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడమా? వరంగల్ తూర్పులో తన కేడర్‌ను మరింత బలోపేతం చేసుకోవడమా? వీటిలో ఏ మార్గాన్ని ఎంచుకుంటారన్నది వారి తదుపరి రాజకీయ చర్యలతోనే స్పష్టం కానుంది. సైలెంట్ మోడ్‌లో సురేఖ అనుచరవర్గం పార్టీ, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయబోనని స్పష్టత ‘తూర్పు’ రాజకీయాల్లో వేగం పెరిగిన పరిణామాలు కొండా దంపతుల భవిష్యత్ వ్యూహం ఏమిటి? -
ముకుందా.. ముకుందా..
కాళేశ్వరం: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శుక్రవారం జిల్లావ్యాప్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగాశ్రీకృష్ణుడి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు ప్రైవేట్ పాఠశాలల్లోనూ వేడుకలు నిర్వహించారు. కృష్ణుడు, గోపిక, రాధ వేషధారణలో ఆకట్టుకున్నారు. ఉట్టి కొట్టే కార్యక్రమంలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. పలు ప్రాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కాళేశ్వరం దేవస్థానం నిర్మాణాల వేగిరం కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానం జీర్ణోద్ధరణలో భాగంగా విజయగణపతి ఆలయం నైరుతి మూలన నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రూ.198కోట్లతో ఆలయ నిర్మాణాలు చేపట్టారు. శుక్రవారం స్టోన్‌తో బేస్మెంట్ 12ఫీట్ల నుంచి నిర్మాణం చేపట్టారు. వెనుకాల ప్రాకారం నిర్మిస్తున్నారు. దీంతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి.టీచర్స్ డే వేడుకలకు బ్రేక్! భూపాలపల్లి అర్బన్: జిల్లాలో శనివారం నిర్వహించాల్సిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అనూహ్యంగా వాయిదా పడ్డాయి. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ సేవలందించిన ఉద్యోగులు, ఉపాధ్యాయులను సత్కరించేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ.. ఎంపిక చేసిన ఉత్తమ ఉద్యోగుల జాబి తాపై ఉన్నతాధికారుల సంతకాలు పూర్తికాకపోవడంతో కార్యక్రమానికి బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. జిల్లాస్థాయిలో నిర్వహించాల్సిన వేడుకలకు అధికారులు ఏర్పాట్లు చేసినప్పటికీ చివరి నిమిషంలో కార్యక్రమం నిలిచిపోవడంతో ఉపాధ్యాయులు, ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది. కార్యక్రమాన్ని తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై కూడా స్పష్టత లేకపోవడం గమనార్హం. అధికారికంగా కొత్త తేదీని ప్రకటించాల్సి ఉంది. ఘనంగా అభిషేకం రేగొండ: మండలంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామి వారికి వైభవంగా అభిషేకం జరిపించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారికి ప్రతీ శుక్రవారం అభిషేకం నిర్వహిస్తున్నట్లు ఈఓ శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్ సంపత్‌రావు, సర్పంచ్ మొగిళి, తదితరులు పాల్గొన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలి భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలో కార్మికులు, కాలనీవాసులు ఎదుర్కొంటున్న ఏడు ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బీఎంఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం జీఎం కార్యాలయం ఎదుట ఒకరోజు నిరసన దీక్షను ప్రారంభించి మాట్లాడారు. కార్మికులు, వారి కుటుంబాలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని, కాలనీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమా ండ్ చేశారు. భూపాలపల్లి ప్రాంతంలో బైపాస్ రోడ్డు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ దీక్షలో ఏరియా బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ వెలబోయిన సుజేందర్, కేంద్ర కమిటీ నాయకులు పి.మల్లేశ్, కె.శ్రీనివాస్, బ్రాంచ్ నాయకులు లక్ష్మణ్, రాజ్‌నాయక్, పునీత్‌రావు, శ్రీను పాల్గొన్నారు. -
శనివారం శ్రీ 5 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
విద్యార్థులతో ప్రయోగం చేయిస్తున్న ఉపాధ్యాయుడు రామ సంతోశ్ కుమార్ విద్యార్థులు తయారు చేసిన కృత్యాధార చిత్రాలతో ఉపాధ్యాయుడు రవి నడక నేర్పే నాన్న.. నడవడిక నేర్పే చదువు.. పలుకు నేర్పే అమ్మ. పలుకుబడినిచ్చే సమాజం. అజ్ఞానంనుంచి అందరూ కీర్తించేలా మార్చే దిక్సూచి.. నాలుగు గోడల నడుమ భవిష్యత్‌ను తీర్చిదిద్దే నిర్మాత.. చాక్‌పీస్ ముక్కలతో తలరాతను మార్చే ఆధునిక బ్రహ్మ అన్నీ ఉపాధ్యాయుడే. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జ్ఞాన తరంగాలను.. విజ్ఞాన భాండాగారాలను తయారు చేస్తున్న వారి సేవలకు సలాం పలుకుతూ నేడు (శనివారం) ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు. కృత్యాధార బోధన.. సామర్థ్యాల సాధనమహబూబాబాద్ రూరల్: విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టి పాఠ్యాంశంలోని విషయాలను అర్థం చేసుకుని సామర్థ్యాలను సాధించేలా విద్యాబోధన చేస్తున్నారు మహబూబాబాద్ మండలం కంబాలపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ఆవునూరి రవి. 14 ఏళ్లుగా ప్రయోగాత్మక కృత్యాధార బోధన చేస్తున్నారు. కృత్యాధార బోధనతో విద్యార్థుల్లో ఆంగ్ల భాషపై ఇష్టం పెంచుతున్నారు. నల్లబెల్లి: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం జెడ్పీఎస్‌ఎస్‌లో స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న రామ సంతోశ్ కుమార్ బోధనలో వినూత్న పద్ధతులు అవలంబిస్తున్నారు. పదో తరగతి విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో ఆయన నిత్యం ఉదయం 5 గంటలకే జూమ్ తరగతులు నిర్వహిస్తున్నారు. యూట్యూబ్ చానల్ ప్రారంభించి ఇప్పటి వరకు దాదాపు 50 పాఠ్యంశాల వీడియోలు అప్లోడ్ చేశారు. రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్, సైన్స్‌ఫేర్ గైడ్ టీచర్‌గా పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థుల్లో ఆసక్తి పెంచేందుకు ఇస్రో శాస్త్రవేత్తలతో అతిథి ఉపన్యాసాలు నిర్వహించారు. ఎన్సీఈఆర్టీ నిర్వహించే ఆన్లైన్ పోర్టల్ కోసం ఈ–కంటెంట్ రూపొందించి 40కి పైగా వీడియోలు అందించారు. మన టీవీలో ప్రత్యక్ష ప్రసారాల ద్వారా పాఠ్యాంశాలు బోధించారు.ఏటూరునాగారం: ములుగు మండలం జంగాలపల్లి క్రాస్‌కు చెందిన పోతు రాజశేఖర్ ఏటూరునాగారం నార్త్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన ఆ పాఠశాలలో చేరినప్పుడు విద్యార్థుల సంఖ్య 90 మాత్రమే. ప్రస్తుతం 170 మందికి చేరింది. దాతల సహకారంతో పాఠశాలలో నూతనంగా కంప్యూటర్ ల్యాబ్, రేకుల షెడ్డు, ప్రొజెక్టర్, టాయిలెట్ల నిర్మాణాలు చేపట్టారు. పాఠశాలలో గ్రంథాలయం ఏర్పాటు చేసి పుస్తక పఠనంపై మక్కువ పెంచుతున్నారు. ఇప్పటికీ ఏ విద్యార్థి బడికి రాకపోయినా ఇంటికి వెళ్లి బండిమీద పాఠశాలకు తీసుకొస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో పలువురు ఉపాధ్యాయుల అంకితభావం విద్యార్థుల నమోదు పెంపు.. అకుంఠిత దీక్షతో విధులు ఆదర్శంగా నిలుస్తూ బడులను కాపాడుతున్న టీచర్లు నేడు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం -
అడ్డుకున్నా.. పోరాటం ఆగదు
● మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికుల సమస్యలు తెలుసుకునేందుకు వస్తే గేట్లు వేసి అడ్డుకోవడం సరికాదని.. అడ్డుకున్నంత మాత్రాన పోరాటం ఆగదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం ఏరియాలోని కేటీకే–5వ గనిలో కార్మికులతో నిర్వహించిన గేట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. కార్మికులకు అవసరమైన షూస్, పనిముట్లు, డ్రిల్ బిట్స్ తదితర సామగ్రి సక్రమంగా అందడం లేదన్నారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు సరఫరా చేసిన బొగ్గుకు సంబంధించిన బకాయిలు సకాలంలో చెల్లించకపోతే సంస్థ ఆర్థికంగా ఎలా నిలదొక్కుకుంటుందని ప్రశ్నించారు. బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చుకుంటే తప్ప కార్మికులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఇది సంబరాల సమయం కాదని.. ఆత్మపరిశీలన సమయమన్నారు. -
నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం
వుులుగు: విద్యార్థులకు అత్యుత్తమ విద్యా ప్రమాణాలు, నాణ్యమైన విద్యను అందించడమే తమ ప్రధాన లక్ష్యమని సమ్మక్క, సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ వైఎల్.శ్రీనివాస్ అన్నారు. ఐఐటీ–హైదరాబాద్, టీఎస్–హైదరాబాద్‌తో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుని విద్యార్థులకు మెరుగైన విద్య, పరిశోధన, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. ములుగులోని యూనివర్సిటీలో గురువారం 2026–27 విద్యా సంవత్సర ఇండక్షన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఐఐటీ–హైదరాబాద్ అధ్యాపకులు బీటెక్ విద్యార్థులకు నేరుగా బోధించనున్నారని, టీఎస్–హైదరాబాద్ నిపుణులు ఎంఏ పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్ కోర్సు నిర్వహించనున్నారని తెలిపారు. విద్యార్థులు డిగ్రీ పూర్తిచేసే నాటికి ఉద్యోగాలు, పరిశోధన, స్టార్టప్ రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. అక్టోబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ యూనివర్సిటీ శాశ్వత క్యాంపస్‌కు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు ప్రకాశ్, బీఎస్ మూర్తి, రాంరెడ్డి పాల్గొన్నారు. సమ్మక్క సారక్క వర్సిటీ వీసీ వైఎల్ శ్రీనివాస్ -
మేయర్ తర్వాత.. ‘కుడా’ చైర్!
సాక్షిప్రతినిధి, వరంగల్ : పదవులు రావడం.. పోవడం రాజకీయాల్లో సహజమే. కానీ కొందరిని మాత్రం అదృష్టం వెంటాడుతూనే ఉంటుంది. వరంగల్ రాజకీయాల్లో గుండు సుధారాణి పరిస్థితి ఇందుకు తాజా ఉదాహరణగా నిలుస్తోంది. ఇటీవల గ్రేటర్ వరంగల్ మేయర్ పదవినుంచి మాజీ అయిన ఆమెకు.. కొద్ది రోజుల వ్యవధిలోనే మరో కీలక పదవి దక్కింది. సామాజిక సమీకరణల్లో భాగంగా ‘కుడా’ (కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) చైర్మన్ పదవి ఆమెను వరించింది. టీడీపీలో రాజ్యసభ సభ్యురాలిగా, బీఆర్ఎస్ హయాంలో మేయర్‌గా ఎన్నికై ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇప్పుడు ‘కుడా’ చైర్పర్సన్ పదవి వరించింది. కాగా, ప్రస్తుతం ఈ పదవిలో హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి కొనసాగుతున్నారు. ఆయనను తప్పించి సుధారాణికి బాధ్యతలు అప్పగించారు. సురేఖ బర్తరఫ్.. సమీకరణాల్లో మార్పు కొండా సురేఖను రాష్ట్ర మంత్రివర్గంనుంచి తప్పించడంతో ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో సామాజిక, ప్రాంతీయ సమీకరణలపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పద్మశాలి సామాజికవర్గానికి చెందిన గుండు సుధారాణికి కుడా చైర్మన్ పదవి ఇవ్వడం ద్వారా ఆ వర్గానికి రాజకీయ ప్రాధాన్యం కొనసాగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాగా, ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో కీలకంగా ఉన్న గుండు సుధారాణికి రాజకీయంగా కీలక పదవులు కొత్తేమీ కాదు. గ్రేటర్ వరంగల్ మేయర్‌గా పనిచేసిన ఆమె.. ఇటీవల మేయర్ పదవీకాలం ముగియడంతో ఆ పదవికి వీడ్కోలు పలికారు. దీంతో ఇక ఆమె రాజకీయ భవిష్యత్ ఏమిటన్న చర్చ జరుగుతున్న సమయంలోనే మరో కీలక బాధ్యత దక్కడం విశేషం. వరంగల్ రాజకీయాల్లో గుండు సుధారాణికి ‘ఒక పదవి పోతే.. మరో పదవి వెతుక్కుంటూ వచ్చిన’ పరిస్థితి ఏర్పడింది. అందుకే ప్రస్తుతం వరంగల్ రాజకీయ వర్గాల్లో ఆమెకు ‘అదృష్టం మరోసారి వరించింది’ అన్న చర్చ సాగుతోంది. ఇంటివద్ద సంబురాలు వరంగల్ చౌరస్తా : కుడా చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణి నియామకం పట్ల ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబురాలు జరుపుకున్నారు. గురువారం సాయంత్రం రామన్నపేటలోని సుధారాణి ఇంటి ఎదుట బాణసంచా పేల్చి, స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. గుండు సుధారాణికి మరో కీలక పదవి.. ‘కుడా’ చైర్‌పర్సన్‌గా నియామకం సురేఖ బర్తరఫ్‌తో మారిన సామాజిక సమీకరణలు పద్మశాలి వర్గానికి మళ్లీ ప్రాధాన్యం.. సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు.. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) చైర్‌పర్సన్‌గా పదవి ఇచ్చి నాపై సీఎం రేవంత్‌రెడ్డి ఉంచిన నమ్మకాన్ని నిలబెడతా. ఆయనకు కృతజ్ఞతలు. బీసీల అభ్యున్నతి, మహిళా సాధికారతకు కృషి చేస్తా. నా నియామకానికి సహకరించిన ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఏఐసీసీ, టీపీసీసీ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులకు ప్రత్యేక ధన్యవాదాలు. – గుండు సుధారాణి -
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
భూపాలపల్లి: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్, జిల్లా రోడ్డు భద్రతా కమిటీ చైర్మన్ రాహుల్‌శర్మ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌తో కలిసి పోలీస్, రవాణా, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, జాతీయ రహదారులు, మున్సిపల్, వైద్య తదితర శాఖల అధికారులతో జిల్లా రోడ్డు భద్రతా కమిటీ, డిస్ట్రిక్ట్ హైవే టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్‌శర్మ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రమాదాలు అధికంగా జరుగుతున్న 10 బ్లాక్ స్పాట్లను గుర్తించినట్లు తెలిపారు. గుర్తించిన ప్రాంతాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైన భద్రతా చర్యలపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అతివేగం, ఓవర్లోడింగ్, డ్రంకెన్ డ్రైవ్‌పై తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. అవసరమైన ప్రాంతాల్లో స్పీడ్ లిమిట్ బోర్డులు, రంబుల్ స్ట్రిప్స్, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రధాన రహదారులపై అనధికార పార్కింగ్‌ను నియంత్రించి, అవసరమైన చోట ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎస్పీ సంకీర్త్ మాట్లాడుతూ ప్రమాదాలు జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టేలా హైవేలపై పెట్రోలింగ్ వాహనాలు, క్రేన్లు, అంబులెన్స్‌లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. 1033 హెల్ప్‌లైన్‌పై ప్రజలకు అవగాహన కల్పించేలా హైవేల వెంట ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో డీఎస్పీ సంపత్‌రావు, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, ఆర్అండ్బీ ఈఈ మనో హర్, పీఆర్ ఈఈ విద్యాసాగర్, జాతీయ రహదారుల ఈఈ కిరణ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ ఉదయ్‌కుమార్, ఉప వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శ్రీదేవి, ఈ–డార్ డీఆర్ఎం లక్ష్మణ్‌తో పాటు పంచాయతీరాజ్, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. 10 బ్లాక్ స్పాట్లపై ప్రత్యేక దృష్టి కలెక్టర్ రాహుల్ శర్మ -
హామీలపై ప్రజల్లో చైతన్యం కల్పిస్తాం
భూపాలపల్లి అర్బన్: ఎన్నికల ముందు సింగరేణి కార్మికులకు అరచేతిలో స్వర్గం చూపించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొండిచేయి చూపుతోందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. గురువారం ఏరియాలోని కేటీకే–1వ గనిలో బీఆర్ఎస్, టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన గేట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. హామీల అమలుపై ప్రజల్లో చైతన్యం కల్పిస్తామన్నారు. విధుల్లో ఉండగా అనారోగ్యానికి గురైన కార్మికులకు మెడికల్ ఇన్వాలిడేషన్ కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. మెడికల్ బోర్డులు ఏర్పాటు చేయడంలో జాప్యం చేయడంతో పాటు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న కార్మికులను కూడా తిరస్కరిస్తున్నారని అన్నారు. దీంతో అనారోగ్య కార్మికుల్లో ఆందోళన నెలకొందన్నారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలను ప్రజలకు గుర్తుచేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వారం రోజులపాటు ‘సమరభేరి’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హామీల అమలుపై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని చెప్పారు. బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లను మున్సిపల్ అధికారులు తొలగించడాన్ని తప్పుబట్టారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, బీఆర్ఎస్ పట్టణ నాయకులు, టీబీజీకేఎస్ నాయకులు, సింగరేణి కార్మికులు పాల్గొన్నారు. -
శుక్రవారం శ్రీ 4 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
సాక్షి ప్రతినిధి, వరంగల్: మంత్రి పదవినుంచి బర్తరఫ్‌తో సుమారు 18 రోజుల కొండా సురేఖ ఎపిసోడ్‌కు గురువారం ఎండ్ కార్డు పడింది. పరకాల వేదికగా మొదలైన రాజకీయ వివాదం.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను దాటి ఢిల్లీకి చేరింది. అక్కడ కాంగ్రెస్ అధిష్టానం స్థాయిలో జరిగిన చర్చలు.. మంత్రివర్గం నుంచి బయటకు పంపే స్థాయికి చేరాయి. కూతురు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలతో మొదలైన ఈ వివాదం.. ఆ తర్వాత వరుస ఫిర్యాదులు, ఎమ్మెల్యేల నివేదికలు, క్రమశిక్షణ కమిటీ రిపోర్ట్, ఆమె మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారం.. హైకమాండ్‌ను ఆగ్రహానికి గురి చేశాయి. చివరకు సురేఖను కేబినెట్ నుంచి తప్పించారు. ఆగస్టు 16 తర్వాత మొదలైన పరిణామాలు గురువారం నాటి కొండా సురేఖ బర్తరఫ్ వరకు జరిగిన తంతు ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కూతురు మాటలనుంచి కేబినెట్ వేటు దాకా.. ఆగస్టు 16న సీఎం రేవంత్‌రెడ్డి పరకాల పర్యటన తర్వాత చోటుచేసుకున్న పలు ఘటనలు కొండా సురేఖ రాజకీయ ప్రస్థానంలో మరో కీలక మలుపునకు నాంది పలికాయి. సురేఖ జన్మదినం సందర్భంగా ఆగస్టు 19న ఆమె కుమార్తె సుస్మిత.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో తీవ్ర అసంతృప్తికి కారణమయ్యాయి. అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తాను బాధ్యురాలిని కాదని, వాటితో తనకు సంబంధం లేదని ఆమె స్పష్టం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. పార్టీ వర్గాల్లో మాత్రం సురేఖ వైఖరిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సురేఖపై ఈ ఒక్క అంశమే కాకుండా.. మరికొన్నింటితో కూడిన ఫిర్యాదుల ఫైల్ అధిష్టానం ముందుకు వెళ్లినట్లు ప్రచారం. కూతురు చేసిన వ్యాఖ్యల వివాదంపై రంగంలోకి దిగిన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సైతం సురేఖపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేయడం ఈ వ్యవహారంలో కీలక మలుపుగా మారింది. ఇదే సమయంలో సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌పై నమోదైన కేసు, అందులో వెలుగులోకి వచ్చిన ఆరోపణలు అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు చెబుతున్నారు. వీటన్నింటిపై సుదీర్ఘంగా చర్చించిన తర్వాత సురేఖ స్వచ్ఛందంగా తప్పుకునే పరిస్థితి లేదని భావించి బర్తరఫ్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఇప్పటికై తే ఇంతే.. ఎమ్మెల్యేగా సురేఖ మంత్రి పదవి పోయినా.. సురేఖ రాజకీయ ప్రస్థానం ముగి సినట్లు కాదు. ఇప్పటికే ఈ విషయమై మీడియా సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. తానేమీ తప్పు చేయలేదని, పదవిపోతే బాధ పడాల్సిన అవసరం లేదన్న ఆమె.. వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజల కోసం ఎమ్మెల్యేగా కొనసాగుతానన్నా రు. కేబినెట్ నుంచి బర్తరఫ్ అయినప్పటికీ సోనియా, రాహు ల్, ప్రియాంకా గాంధీలంటే ఇష్టమన్న ఆమె.. ఎమ్మెల్యేగా తన తదుపరి అడుగులు ఎలా ఉంటాయన్నది ఇప్పుడే చెప్పలేమనడం ఆసక్తికరంగా మారాయి. ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ రాజకీయాలపై ఈ పరిణామాలు భవిష్యత్‌లో ఎలాంటి ప్రభావం చూపుతాయన్న చర్చ పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది. హనుమకొండ రాంనగర్లో నిర్మానుష్యంగా ఉన్న తాజా మాజీ మంత్రి కొండా సురేఖ నివాసం ‘పరకాల’నుంచి మొదలైన మాటల దాడి.. ఎమ్మెల్యేల నివేదికలతో ముదిరిన పంచాయితీ క్రమశిక్షణ కమిటీ సిఫారసుతో కీలక మలుపు ఉత్కంఠ రేపిన ఢిల్లీ మంతనాలు.. చివరకు కేబినెట్‌నుంచి వేటు 18రోజులపాటు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌లో రాజకీయ ప్రకంపనలు -
అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
కాళేశ్వరం(మల్హర్): మల్హర్ మండలం నాచారం గ్రామపంచాయతీని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి, లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేసుకోవాలని సూచించారు. అనంతరం ఆన్సన్పల్లి గ్రామపంచాయతీ పరిధిలో జరుగుతున్న ఫాంపాండ్ పనులను సందర్శించి కూలీలకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ క్రాంతికుమార్, హౌసింగ్ డీఈ శ్రీకాంత్, ఏఈ రజినీకాంత్, ఎంపీఓ మల్లికార్జున్, ఏపీఓ గిరి హరీశ్ పాల్గొన్నారు. నిబంధనల మేరకు షాపులు నిర్వహించాలి గణపురం: ప్రభుత్వ నిబంధనల మేరకు మెడికల్ షాపులు నిర్వహించాలని జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ పావని ఆదేశించారు. బుధవారం గణపురం మండలకేంద్రంలో పలు మెడికల్ షాపులను ఆమె తనిఖీ చేశారు. షాపులలో మందులను ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అర్హత కలిగిన ఫార్మసిస్టులు మెడికల్ దుకాణాలలో ఉండాలన్నారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి మాత్రమే మందుల విక్రయాలు చేయాలని.. లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు చేస్తున్నారన్నా విషయం తెలుసుకున్న పలువురు మందుల షాపులను మూసివేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాటారం ఆర్డీఓకు గుండెపోటుకాళేశ్వరం(కాటారం): కాటారం ఆర్డీఓ డి.రవిందర్ మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లో కార్యాలయ పనుల్లో నిమగ్నమై ఉండగా గుండెపోటు రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే సిబ్బంది ఆయనను స్థానిక ఓ ఆస్పత్రికి తరలించారు. ఈసీజీతోపాటు ఇతర పరీక్షలు చేశారు. అనంతరం హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రాత్రి గుండెకు ఒక స్టంట్ వేసినట్లు అధికారుల ద్వారా తెలిసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. నాలుగు నెలల కిందట సబ్‌కలెక్టర్ మయాంక్‌సింగ్ బదిలీ కావడంలో ఆయన స్థానంలో ఆర్డీఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మంగళవారం కాటారం సబ్‌కలెక్టర్‌గా సౌరభ్శర్మను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడిన విషయం తెలిసిందే. మలేషియాలో ఉద్యోగాలకు అవకాశం భూపాలపల్లి అర్బన్: తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ, తెలంగాణ ప్రభుత్వం కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో మలేషియాలో వివిధ ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు నియామక ప్రక్రియ చేపడుతున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి మల్లయ్య బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మలేషియాలో అందుబాటులో ఉన్న ఉద్యోగాల్లో హౌస్ వర్కర్, పైప్ ఫిట్టర్, స్వీపర్, కుక్, ఎక్స్కవేటర్–బ్యాక్‌హో ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి. 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా, ఐటీఐ విద్యార్హత ఉన్న వారు అర్హులని అన్నారు. అభ్యర్థుల వయస్సు 20నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలని సూచించారు. నైపుణ్యం కలిగిన వారికి నెలకు రూ.40వేల నుంచి రూ.47వేల వరకు వేతనం లభించే అవకాశం ఉందని తెలిపారు. ఎంపికై న అభ్యర్థులకు వసతి, ఇతర సౌకర్యాలు నిబంధనల ప్రకారం ఉంటాయని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం టీఓఎంసీఓఎం అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని లేదా 080 35524946 నంబర్లో వివరాలు తెలుసుకోవాలని జిల్లా ఉపాధి అధికారి సూచించారు. కేవీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం ములుగు: వెంకటాపురం(ఎం) మండలం జవహర్‌నగర్‌లోని తెలంగాణ ఆదర్శ పాఠశాల ప్రాంగణంలో నూతనంగా ప్రారంభమైన కేంద్రీయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సీతారాం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 5వ తేదీలోగా అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
భూపాలపల్లి అర్బన్: ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలు, 420 హామీలు, 13 డిక్లరేషన్ల పేరుతో ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తయినా అమలు చేయడంలో విఫలమైందని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి ఆదేశాల మేరకు పార్టీ మాజీ మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో సమరభేరి కార్యక్రమం నిర్వహించారు. 420 అడుగుల ఫ్లెక్సీ ర్యాలీ, రాస్తారోకో, బాకీ కార్డుల పంపిణీ చేపట్టారు. నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లోనూ బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు చేపట్టాయి. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, రైతు రుణమాఫీ, రైతుభరోసా, రైతుబీమా, రూ.500కే గ్యాస్ సిలిండర్, నిరుద్యోగులకు ఉద్యోగాలు, భృతి తదితర హామీలను ఏం చేశారని ప్రశ్నించారు. రైతులకు రూ.41 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి అరకొరగా చేశారని ఆరోపించారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, బీమా సౌకర్యం కల్పిస్తామని ఇచ్చిన హామీని కూడా ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. హామీలను తక్షణమే అమలు చేయాలని, లేకపోతే దశలవారీగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు జనార్దన్, హరీశ్‌రెడ్డి, సాగర్‌రెడ్డి, రఘుపతిరావు, రాజు, నారాయణ, సిద్దు పాల్గొన్నారు. -
వేగవంతంగా రీ సర్వే పనులు
కాళేశ్వరం (కాటారం): డిజిటల్ భూ రీ సర్వే పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్‌శర్మ అధికారులను ఆదేశించారు. కాటారం మండలం ధన్వాడ గ్రామంలో కొనసాగుతున్న డిజిటల్ భూ రీ–సర్వే పనులను బుధవారం కలెక్టర్ తనిఖీ చేశారు. సర్వే వివరాలను ఏడీ కుసుమకుమారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 70 గ్రామాల్లో కొనసాగుతున్న డిజిటల్ భూ పునఃసర్వే పనులను వేగవంతం చేసి మొదటి విడత సర్వేను నవంబర్ నాటికి పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. సర్వే పనుల్లో వేగం పెంచాలని చెప్పారు. ప్రతీ మండలంలో రీ సర్వే పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సర్వే ప్రక్రియను పారదర్శకంగా, ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తూ నిర్దేశిత లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. లైసెన్స్డ్ సర్వేయర్లలో 54మంది విధులకు హాజరు కావడం లేదని ఏడీ కుసుమకుమారి కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వారికి కౌన్సెలింగ్ నిర్వహించి విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించడమే డిజిటల్ భూ సర్వే ప్రధాన ఉద్దేశమని తెలిపారు. సర్వే సమయంలో రైతులు తమ భూములకు సంబంధించిన వివరాలు, రికార్డులను అందుబాటులో ఉంచి సర్వే బృందాలకు పూర్తి సహకారం అందించాలని చెప్పారు. కలెక్టర్ వెంట సర్వేఅండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కుసుమ కుమారి, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ నవీన్‌రెడ్డి, సర్వే సిబ్బంది, లైసెన్స్డ్ సర్వేయర్లు, రైతులు పాల్గొన్నారు. భవనాల పరిశీలనకాళేశ్వరం: మహదేవపూర్ మండలకేంద్రంలో ఫైర్‌స్టేషన్, తహసీల్దార్ కార్యాలయ భవనాల ప్రారంభోత్సవాలకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్‌శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఫైర్‌స్టేషన్, తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని పరిశీలించారు. మౌలిక వసతులు, పార్కింగ్ సౌకర్యం తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఫైర్‌స్టేషన్ ప్రాంగణాన్ని పరిశీలించిన కలెక్టర్ అత్యవసర సమయాల్లో ఫైర్ ఇంజన్లు, విపత్తు నిర్వహణ వాహనాలు సులభంగా రాకపోకలు సాగించేలా పార్కింగ్, ప్రాంగణం అనువుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీఆర్ ఈఈ విద్యాసాగర్, ఎంపీడీఓ రవీంద్రనాధ్, అగ్నిమాపక అధికారి నాగరాజు, డీటీ యూసఫ్ పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ -
వైఎస్సార్ సంక్షేమ పాలన చిరస్మరణీయం
భూపాలపల్లి రూరల్: దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సంక్షేమ పాలన చిరస్మరణీయమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ అన్నారు. వైఎస్సార్ వర్ధంతి జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించారు. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బట్టు కరుణాకర్ మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, బలహీన వర్గాల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108, 104 అంబులెన్స్ సేవలు, మహిళలకు పావలావడ్డీ రుణాలు, రైతులకు రుణమాఫీ, ఉచిత విద్యుత్, జలయజ్ఞం వంటి అనేక సంక్షేమ పథకాలు నేటికీ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేశాయని చెప్పారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపిన మహానేతగా వైఎస్సార్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దాట్ల శ్రీనివాస్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ భువన సుందర్, నాయకులు చల్లూరు సమ్మయ్య, అప్పం కిషన్, వెంకీ, మహేష్, యాదవ్, మాలతి, జంపన్న, శీను, సహదేవుడు, అశోక్, సురేశ్, చల్లా రేణుక, శారద, పుష్ప, హైమద్ హఫీస్, గురజాల రవి, పొన్నగంటి శీను, అప్పల శ్రీనివాస్, భాస్కర్‌నాయక్, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
సైబర్ నేరాలపై అప్రమత్తం
భూపాలపల్లి: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రూపొందించిన ‘బీ సైబర్ స్మార్ట్’ అవగాహన పోస్టర్లను ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ బుధవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పండుగల సమయంలో సైబర్ నేరగాళ్లు వివిధ రకాల మోసాలకు పాల్పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తుతెలియని లింకులు, కోడ్లు, ఫోన్ కాల్స్, మెసేజ్‌లను నమ్మవద్దన్నారు. వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని తెలిపారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930కు సమాచారం అందించాలని సూచించారు. గణేశ్ ఉత్సవాలను ఆనందంగా జరుపుకోవడంతో పాటు సైబర్ భద్రతకు కూడా ప్రతీ ఒక్కరు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేష్కుమార్, సైబర్ సెక్యూరిటీ ఎస్సై శ్రీనివాస్, ఆర్ఎస్ఐ శివకుమార్, సైబర్ సెక్యూరిటీ వింగ్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ ఉద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణ జిల్లాలోని పోలీస్ ఉద్యోగ అభ్యర్థులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సెప్టెంబర్ 6న ఉదయం 7 గంటలకు ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో శారీరక, రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఉచిత డే స్కాలర్ తరగతులతో పాటు గ్రౌండ్ కోచింగ్ అందించనున్నట్లు తెలిపారు. ఎస్పీ సంకీర్త్ -
పెట్టుబడి మోపెడు..
భూపాలపల్లి రూరల్: వ్యవసాయం రోజురోజుకూ భారంగా మారుతోంది. ఆరుగాలం కష్టపడే రైతన్నలకు కష్టాలు తప్పటం లేదు. అతివృష్టి, అనావృష్టితో పాటు కూలీల కొరత, పెరిగిన ఎరువుల ధరలతో పాటు యాంత్రీకరణలో వెనుకంజ వెరసి సాగంటేనే అన్నదాతలు ఆందోళన చెందే పరిస్థితి వచ్చింది. పెరిగిన ధరలకు అనుగుణంగా కూలి రేట్లను పెంచుతుండటంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. తప్పని పరిస్థితుల్లో బతుకుదెరువు కోసం సాగు ఊబిలో దిగి అష్టకష్టాలు పడుతున్నారు. ప్రధాన పంటలకు ప్రాధాన్యం జిల్లాలో చెరువులు, బోరుబావుల కింద వరితో పాటు పత్తి, మిర్చి, మొక్కజొన్న ఇతర పంటలను సాగుచేస్తున్నారు. ఈ క్రమంలో ఉన్న కొద్దిపాటి భూములను ఎవరికి వారు సాగు చేస్తుండటంతో కూలీల కొరత అధికమైంది. ఎకరం భూమిలో దుక్కులు దున్నడం, నాట్లు వేయటం, మందు చల్లటం వంటి పనులు చేయాలంటే సుమారు 12మంది కూలీల అవసరం ఉంటుంది. ఇక పత్తి, మిర్చి పంటల్లో 20మంది వరకు కూలీల అవసరం ఉంటుంది. కానీ ఎవరి పొలాలను వాళ్లు సాగు చేస్తుండటంతో కూలీల కొరత అధికంగా ఉంది. దీంతో పరిసర పట్టణ ప్రాంతాల నుంచి కూలీలను తీసుకురావాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. అమాంతం పెరిగిన రేట్లు.. మారుతున్న కాలంలో పాటు పెరిగిన ధరలకు అనుగుణంగా కూలి రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. కూలీల కొరత ఉండటంతో రేట్లను అమాంతంగా పెంచేశారు. దీంతో పరిసర గ్రామాల కూలీలకు అడిగినంత కూలి చెల్లిస్తూ ప్రత్యేక వాహనాల్లో తీసుకురావాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. గతేడాది మహిళలకు కూలి రూ.300 వరకు ఉండేది. ఈ ఏడాది ఏకంగా రూ.400నుంచి రూ.500 వరకు పెరిగింది. పురుషులకు రూ.700 నుంచి రూ.900 వరకు చెల్లించాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. అందుబాటులోలేని యంత్రాలు వరి సాగుకు ఒక్క ట్రాక్టర్లు మాత్రం దున్నడానికి తప్పా.. కూలీల కొరతను అధిగమించేందుకు ఇతర యంత్రాలు ఏవీ ఈ ప్రాంతంలో అందుబాటులో లేవు. కొన్నిచోట్ల గొర్రు ట్రాక్టర్‌తో వేస్తున్నా.. అందుబాటులో లేనివారు ఇబ్బందులు పడుతున్నారు. నాట్లు వేసే యంత్రాలు మార్కెట్లోకి వచ్చినా స్థానికంగా ఇంకా వాడకంలోకి రాలేదు. దీంతో కూలీల వినియోగం తప్పనిసరి అయింది. దున్నడానికి మినహా అంచులు తీయడం, గొర్రు, నాటు వేయడం అన్నింటికి కూడా కూలీల అవసరం తప్పదు. దీంతో వారికి డిమాండ్ బాగా పెరిగింది. ఎరువుల ధరలు కూడా దాదాపు బస్తాకు రూ.200 నుంచి రూ.300 వరకు పెరగడంతో రైతులపై అదనపు భారం పడుతోంది. అమాంతం పెరిగిన కూలీల రేట్లు పెరిగిన ఎరువుల ధరలు రూ.900 వరకు డిమాండ్ -
పత్తి కొనుగోళ్లకు సన్నాహాలు
ఖిలా వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2026–2027 సీజన్‌కు సంబంధించిన పత్తి కొనుగోళ్లకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) సన్నాహాలు చేస్తోంది. ఈమేరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతోపాటు జిన్నింగ్ మిల్లుల్లో బేళ్ల కోసం టెండర్లు పిలిచి పూర్తి చేసింది. గతంలోని ధరలతోపాటు ఇతర నిబంధనలతో ఒకే టెండర్ ప్రకటన ఇచ్చే వారు. ఈ సీజనల్లో తొలివిడత ధరల ప్రస్తావన లేకుండా ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని టెండర్ ప్రకటన వచ్చింది. మరో రెండు నెలల్లో పత్తి పంట చేతికొచ్చి క్రయవిక్రయాలు ప్రారంభించే అవకాశం ఉంది. దీంతో వ్యాపారులతోపాటు సీసీఐ పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తోంది 7.24 లక్షల ఎకరాల్లో పత్తిసాగు.. ఉమ్మడి జిల్లాలో ఈ సీజన్లో పత్తి సాగు సుమారు 7.24 లక్షలకు పైగా ఎకరాలకు చేరుకుంది. 50.25 లక్షల క్వింటాళ్ల పత్తి వస్తుందని అధికారులు అంచనా వేశారు. మద్దతు ధరతో పత్తిని కొనుగోలు చేసే సీసీఐ.. పత్తిలో గింజలు తీసి బేళ్లుగా మార్చి ఎగుమతి చేయడానికి ఏటా టెండర్లు ఆహ్వానిస్త్తోంది. అదే తరహాలో టెండర్లను పిలిచింది. గత ఏడాది 6.53 లక్షల బేళ్లను సిద్ధం చేసి ఎగుమతి చేసింది. ఈ సీజనల్లో పత్తి క్రయవిక్రయాల్లో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో టెండర్లు పూర్తిచేసిన సీసీఐ 16 మార్కెట్ యార్డుల పరిధిలో 19 కేంద్రాలు ఏర్పాటు 50.25 లక్షల క్వింటాళ్ల పత్తి వస్తుందని అధికారుల అంచనాఉమ్మడి వరంగల్ జిల్లాలోని 16 మార్కెట్ యార్డుల పరిధిలో 19 సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ములుగు, కేసముద్రం–ఏ, బీ, తొర్రూరు, మహబూబాబాద్, కాటారం, చిట్యాల, భూపాలపల్లి, కొడకండ్ల, నర్సంపేట, జనగామ–ఏ,బీ, ఘన్పూర్, ఆత్మకూరు, రాంపూర్, పరకాల, ఎల్కతుర్తి, వరంగల్–ఏ,బీ కేంద్రాలు ఉన్నాయి. గతంలో ఏర్పాటు చేసిన కేంద్రాలను ఈసారి కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్రాల వారీగా కొనుగోలు చేసే పత్తిని బేళ్లుగా మార్చేందుకు ఏటా జిన్నింగ్ మిల్లులను అద్దెకు తీసుకుంటున్నారు. జిన్నింగ్ మిల్లులు, గిడ్డంగులు, బేళ్ల రవాణాకు వాహనాలు, తాత్కాలిక ఉద్యోగులు తదితర వాటికి కూడా టెండర్లను ఆహ్వానించినట్లు మార్కెటింగ్ శాఽఖ అధికారులు తెలిపారు. పత్తిని బేళ్లుగా మార్చేందుకు జిన్నింగ్ మిల్లులు అద్దెకు.. -
‘ఓవర్’ లోడ్.. భారీ మూల్యం!
సాక్షిప్రతినిధి, వరంగల్: ఇసుక లారీల్లో ఓవర్‌లోడ్‌కు ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే. ఇసుక రవాణాలో నిర్ణీత సామర్థ్యానికి మించి తరలించే ప్రతీ మెట్రిక్ టన్ను ఇసుకకు రూ.2 వేల చొప్పున జరిమానా విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా ఒకే వాహనం రెండు సార్లకు మించి ఓవర్‌లోడ్ ఉల్లంఘనలకు పాల్పడితే సాండ్ మేనేజ్మెంట్ సిస్టమ్‌లో ఆ వాహనాన్ని తదుపరి బుకింగ్‌లకు బ్లాక్ చేయనున్నారు. మైన్స్ సర్వేలెన్స్ సిస్టం ద్వారా ఓవర్‌లోడ్‌ను గుర్తించి జరిమానాను ఆన్లైన్లో వసూలు చేయాలని ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్ 28లో స్పష్టం చేసింది. ఈ నిబంధనలతో ఉమ్మడి జిల్లాలోని రీచ్‌లనుంచి అదనపు ఇసుక తరలించే వందలాది లారీలకు చెక్‌పడనుంది. కొన్ని రీచ్‌ల్లో నేరుగా భారీ వాహనాల్లో ఇసుక లోడ్ కాకుండా రీచ్ నుంచి స్టాక్‌యార్డుకు ట్రాక్టర్లు/చిన్న వాహనాల ద్వారా తరలించి, అక్కడినుంచి లారీల్లోకి రీలోడ్ చేసే విధానం ఉంది. తాడిచెర్ల తాజా టెండర్లలోనూ రీచ్ నుంచి స్టాక్‌యార్డుకు ఇసుక తరలించి, తిరిగి లారీల్లోకి లోడ్ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. అందువల్ల కొత్త నిబంధన కేవలం లారీ డ్రైవర్‌పైనే కాకుండా రీచ్–స్టాక్‌యార్డు–లోడింగ్–రవాణా మొత్తం వ్యవస్థపై జాగ్రత్త పెంచే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఓవర్‌లోడ్ పూర్తిగా నియంత్రితమైతే ఒక్క ట్రిప్పులో తరలించే ఇసుక పరిమాణం తగ్గుతుంది. మరోవైపు రోడ్లపై ఒత్తిడి, రోడ్డు నష్టం, ప్రమాదాల ముప్పు తగ్గే అవకాశం ఉంది. కొత్త జీఓతో అసలు సమస్య ఓవర్‌లోడ్ చేసే లారీలకే. ఒక లారీలో నిర్ణీత పరిమితికి మించి టన్ను ఇసుక ఉంటే రూ.2వేల జరిమానా. 3 టన్నులు అదనంగా ఉంటే రూ.6వేలు, ఐదు టన్నులు అయితే రూ.10వేలు.. అంటే ఒక్క ట్రిప్పులో ఎక్కువ ఇసుక వేసుకుని అదనపు ఆదాయం పొందాలనుకునే ప్రయత్నం జరిమానాతో పోలిస్తే నష్టదాయకంగా మారే అవకాశం ఉంది. జీఓ ప్రకారం జరిమానా అదనంగా తరలించిన ఇసుక పరిమాణంపై విధించనున్నారు. లారీ యజమానులకు ఇది మరింత కీలకమైన నిబంధన. రెండుకంటే ఎక్కువ ఓవర్‌లోడ్ ఉల్లంఘనలు గుర్తించిన వాహనాన్ని సాండ్ మేనేజ్మెంట్ సిస్టమ్‌లో తదుపరి బుకింగ్‌ల నుంచి బ్లాక్ చేయనున్నారు. రెండు కంటే ఎక్కువ ఓవర్‌లోడ్ ఉల్లంఘనలు నమోదైతే ఆ వాహనంతో టీజీఎండీసీ ఇసుకను బుక్ చేసుకునే అవకాశమే కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. గోదావరి పరీవాహక ప్రాంతం కారణంగా ఉమ్మడి వరంగల్‌లోని ముఖ్యంగా ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఇసుక తవ్వకాలు, రవాణా కార్యకలాపాలు సాగుతున్నాయి. టీజీఎండీసీ వివరాల ప్రకారం.. ములుగు జిల్లాలో టీజీఎండీసీ రికార్డుల్లో మారికాల, సూరవీడు, ముత్తారం, కొండాపురం, కొరకల్లు వంటి ఇసుక రీచ్‌ల వివరాలు ఉన్నాయి. ఉదాహరణకు మారికాల రీచ్‌కు1,59,680 మెట్రిక్ టన్నులు, కొరకల్లు రీచ్‌కు 99,948 క్యూబిక్ మీటర్ల పరిమాణం కేటాయించారు. సూరవీడు రీచ్‌కు 70 వేల క్యూబిక్ మీటర్లు, ముత్తారం రీచ్‌కు 99,400 క్యూబిక్ మీటర్ల ఇసుక తరలింపునకు అనుమతి ఉంది. జేఎస్ భూపాలపల్లి జిల్లాలో ఈ ఏడాది కూడా భారీ స్థాయిలో ఇసుక డీ–సిల్టేషన్ పనులకు టీజీఎండీసీ టెండర్లు పిలిచింది. తాడిచెర్ల–1, తాడిచెర్ల–2 రీచ్‌లలో సుమారు 14 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక డీ–సిల్టేషన్‌కు సంబంధించిన టెండర్ అయ్యింది. ఆయా రీచ్‌ల నుంచి ఇసుక తరలించే లారీలకు ‘ఓవర్‌లోడ్’ నిబంధన ప్రభావం పడనుంది. దీంతో ఇసుక వ్యాపారుల, లారీ ఓనర్ల లెక్కలు తారుమారు కానున్నాయి. రెండుసార్లు ఓవర్.. మూడోసారికి బుకింగ్ కట్ రీచ్ నుంచి స్టాక్‌యార్డు.. అక్కడినుంచి లారీ వరకు నిఘా కొత్త నిబంధనలు విధించిన రాష్ట్ర ప్రభుత్వం తారుమారు కానున్న వ్యాపారుల లెక్కలు -
సమష్టి కృషితో లక్ష్యాన్ని చేరుకోవాలి
● ఏరియా జీఎం ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి భూపాలపల్లి అర్బన్: ఏరియాలో నిర్దేశిత లక్ష్యాల మేరకు బొగ్గు ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఆగస్టు నెల ఉత్పత్తి, రవాణా వివరాలను వెల్లడించిన ఆయన.. సెప్టెంబర్ లక్ష్యాలను సాధించేందుకు అధికారులు, ఉద్యోగులు, కార్మికులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆగస్టులో ఏరియాకు 3.73 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా లక్ష్యం ఉండగా 1.60 లక్షల టన్నులు సాధించినట్లు తెలిపారు. లక్ష్యంలో 43 శాతం సాధించి రవాణా చేసినట్లు తెలిపారు. రోజువారీ సగటు ఉత్పత్తి 5,157 టన్నులుగా నమోదైందన్నారు. సెప్టెంబర్ నెలకు 3.84లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఉత్పత్తి పెంపునకు అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా ఎస్డీఎల్ యంత్రాల పనిగంటలను పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని, పక్కా ప్రణాళికతో అమలు చేయాలని ఆదేశించారు. గైర్హాజరు శాతాన్ని తగ్గిస్తే ఉత్పత్తిని మరింత పెంచవచ్చన్నారు. ఆరోగ్యం, ఉల్లాసానికి క్రీడలు దోహదం పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టేడియంలో సింగరేణి కార్మికులకు నిర్వహించిన క్రీడా పోటీలను ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు రవికుమార్, శ్యాంసుందర్, నాయకులు మోటపలుకుల రమేశ్, హుస్సేన్, సీఎంఓఏఐ అధ్యక్షుడు నజీర్, క్రీడల గౌరవ కార్యదర్శి సాయికృష్ణ, స్పోర్ట్స్ సూపర్వైజర్ పర్స శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఓపీఎస్ అమలు చేయాలి
● నల్లబ్యాడ్జీలతో నిరసన భూపాలపల్లి అర్బన్: సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను వెంటనే అమలు చేయాలని టీజీఈజేఏసీ జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహ దినాన్ని పురస్కరించుకుని మంగళవారం కలెక్టరేట్ ఆవరణలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా చైర్మన్ బూరుగు రవికుమార్, సెక్రటరీ జనరల్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బూరుగు రవికుమార్ మాట్లాడుతూ.. 2004 సెప్టెంబర్ 1నుంచి నియమితులైన ఉద్యోగులు, ఉపాధ్యాయుల పాలిట సీపీఎస్ విధానం శాపంగా మారిందన్నారు. సీపీఎస్ కారణంగా ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని, వారి భవిష్యత్ అంధకారంలో పడుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సీపీఎస్‌ను రద్దుచేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా కార్యదర్శి ఎ.దశరథరామారావు, నాయకులు షఫీ అహ్మద్, శ్రీనివాసరావు, రాజ్‌కుమార్, తిరుపతి, అజహర్, శ్రీనివాస్, శ్రీదేవి పాల్గొన్నారు. -
కాటారం సబ్ కలెక్టర్‌గా సౌరభ్‌శర్మ
మల్హర్(కాటారం): కాటారం సబ్ కలెక్టర్‌గా సౌరభ్ శర్మను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం కాటారం ఆర్డీఓగా రవీందర్ విధులు నిర్వహిస్తున్నారు. త్వరలోనే కాటారం సబ్ కలెక్టర్‌గా సౌరభ్ శర్మ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇన్చార్జ్ డీఈఓగా బాధ్యతల స్వీకరణ భూపాలపల్లి అర్బన్: జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారిగా ఎల్.లలిత మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. మంచిర్యాల జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఏడీగా విధులు నిర్వర్తిస్తున్న లలిత జిల్లాకు డిప్యూటేషన్‌పై వచ్చారు. డీఈఓ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ రాహుల్‌శర్మను మర్యాదపూర్వకంగా కలిసి పూలబొకే అందజేశారు. యాదగిరి క్షేత్రంలో భూపాలపల్లి ఎమ్మెల్యే పూజలు యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామిని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సంప్రదాయంగా స్వాగతం పలికారు. గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, ఆలయాధికారి సురేందర్‌రెడ్డి లడ్డూ ప్రసాదం అందజేశారు. రికార్డుస్థాయిలో బొగ్గు ఉత్పత్తి మల్హర్: మండలంలోని తాడిచర్ల ఓపెన్‌కాస్ట్‌లో రికార్డుస్థాయిలో బొగ్గు ఉత్పత్తి జరిగినట్లు ఏఎమ్మార్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్‌రెడ్డి మంగళవారం తెలిపారు. గని ప్రారంభమైన నాటినుంచి ఉత్పత్తి, డిస్పాచ్, రిసిప్ట్స్‌లో ఇదే అత్యధిక పనితీరు అని పేర్కొన్నారు. ఆగస్ట్ నెలలో 2,94,362 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి, డిస్పాచ్ 2,97,768 మెట్రిక్ టన్నులు, 2,96,827 రిసిప్ట్స్ అయినట్లు చెప్పారు. ఆగస్టు 10న 15,024 మెట్రిక్ టన్నులు, 9న డిస్పాచ్ 12,577.6 మెట్రిక్ టన్నులు, ఆగస్టు 25న 12,087 రిసిప్ట్స్ అయినట్లు పేర్కొన్నారు. ఏప్రిల్–2024లో 2,64,351 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి జరగగా, ఆగస్టులో గత రికార్డు దాటి అధిక ఉత్పత్తి సాధించినట్లు ఆయన వెల్లడించారు. ఆధునిక సాగు పద్ధతులపై శిక్షణ కాళేఽశ్వరం: ఆధునిక సాగు పద్ధతులపై మహదేవపూర్ మండలం కాళేశ్వరం రైతువేదికలో మంగళవారం రైతులకు శిక్షణ ఇచ్చారు. అనంతరం జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాపురావు మహదేవపూర్ మండలంలో పంటల క్షేత్ర సందర్శన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు సంప్రదాయ పద్ధతులతో పొందిన వ్యవసాయ అనుభవాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత మెరుగుపరుచుకోవడమే ఈ శిక్షణ ఉద్దేశమని తెలిపారు. వ్యవసాయ సహాయ సంచాలకులు శ్రీపాల్, మండల వ్యవసాయ అధికారిణి శ్రీజ, ఉద్యానవన అధికారి మణి, కాళేశ్వరం, మెట్పల్లి సర్పంచ్‌లు వెన్నపురెడ్డి మోహన్‌రెడ్డి, సంజీవరెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి రాంబాబు, ప్రజాప్రతినిధులు, అభ్యుదయ రైతులు పాల్గొన్నారు. 7న ఐటీడీఏ ముట్టడి పలిమెల: ఆదివాసీల హక్కులను కాపాడుకోవడం కోసం ఈనెల 7న నిర్వహిస్తున్న ఏటూరునాగారం ఐటీడీఏ ముట్టడికి జిల్లాలోని ఆదివాసీ యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మడె కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం మండలకేంద్రంలో తుడుందెబ్బ మండల అధ్యక్షుడు మట్టి కిషోర్ ఆధ్వర్యంలో కరపత్రం, పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ మండల ప్రధాన కార్యదర్శి పెద్ది శేఖర్, కార్యదర్శులు తోలెం భిక్షపతి, మట్టి ప్రసాద్, సలహాదారులు పెద్ది రాజు తదితరులు పాల్గొన్నారు. -
నెల రోజుల్లో 256 కేసులు
● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ భూపాలపల్లి: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఆగస్టు నెలలో అరైవ్ అలైవ్ ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమం నిర్వహించి 256 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో 256 కేసులు నమోదు చేసి 187 వాహనాలను సీజ్ చేశామన్నారు. అందులో 69 గూడ్స్ క్యారియర్ వాహనాలను సీజ్ చేశామని తెలిపారు. ఆయా వాహనదారులకు రూ.13.70 లక్షల జరిమానా విధించినట్లు చెప్పారు. ప్రతీ వాహనదారుడు తప్పనిసరిగా ఐఎస్ఐ ప్రమాణాల హెల్మెట్ ధరించాలని, సీటుబెల్ట్ వినియోగించాలని, నిర్ణీత వేగ పరిమితులను పాటించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దని ఎస్పీ సంకీర్త్ సూచించారు. -
నిబద్ధతతో పనిచేస్తే మన్ననలు
● అదనపు కలెక్టర్ విజయలక్ష్మి భూపాలపల్లి అర్బన్: ఉద్యోగ బాధ్యతలను నిబద్ధతతో, అంకితభావంతో నిర్వర్తించినప్పుడే సహచరులు, అధికారులు, ప్రజల మన్ననలు పొందగలరని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి అన్నారు. పదవీ విరమణ పొందిన జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ సన్మాన కార్యక్రమం మంగళవారం కలెక్టరేట్లో కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ విద్యాశాఖలో 42 ఏళ్లపాటు వివిధ హోదాల్లో పనిచేసిన రాజేందర్ తనకు అప్పగించిన బాధ్యతలను అత్యంత నిబద్ధతతో సమర్థవంతంగా నిర్వర్తించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ డీఈఓ లలిత, సీపీఓ క్రిష్టయ్య, ఎస్సీ అభివృద్ధి అధికారి సుకీర్తి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్, స్పోర్ట్స్ ఆఫీసర్ రఘు, డీసీఎస్ఓ కిరణ్‌కుమార్, డీపీఆర్ఓ శ్రీనివాస్, ఏఎంఓ విజయపాల్‌రెడ్డి, సెక్టోరియల్ అధికారులు రమేశ్, రాజగోపాల్, రామకృష్ణ, శైలజ, ఎంఈఓలు పాల్గొన్నారు. -
బుధవారం శ్రీ 2 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
ఈ ఫొటోలో కనిపిస్తున్నది భూపాలపల్లి ఆర్టీిసీ బస్టాండ్ సమీపంలోని కేటీకే 5వ గనికి వెళ్లే ప్రధాన రహదారి. ఇక్కడి నుంచి డిపో వెనుకాల, కూరగాయల మార్కెట్ రహదారి వెంట పాత ఎస్పీ కార్యాలయం వరకు ప్రతీ రోజు దారి పొడవునా చెత్త పేరుకుపోయి ఉంటుంది. ఈ రహదారి పక్కనే చెత్త కనిపిస్తున్నటికీ మున్సిపల్ అధికారులు, సింగరేణి అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. చెత్త తొలగింపుపై ఇరుశాఖల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో రోడ్డు పక్కన..కూరగాయల మార్కెట్ సమీపంలో.. -
22ఏ భూములపై సమగ్ర పరిశీలన
● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి: సెక్షన్ 22ఏ పరిధిలోని భూములకు సంబంధించి మండల, గ్రామాల వారీగా సమగ్రంగా పరిశీలించి వాస్తవమైన, ఖచ్చితమైన డేటాను సిద్ధం చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో భూముల రీ–సర్వే, భూ భారతి, సాదా బైనామా, రెవెన్యూ సదస్సు దరఖాస్తుల పరిష్కారం తదితర అంశాలపై రెవెన్యూ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలను సెక్టార్, గ్రామాల వారీగా ప్రత్యేక ప్రొఫార్మాలో సిద్ధం చేయాలని సూచించారు. డిసెంబర్ 2025 నాటికి సెక్షన్ 22ఏ కింద ఉన్న 1ఏ, 1బీ, 1సీ, 1డీ తదితర కేటగిరీల భూముల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, 2016, 2021 సంవత్సరాల్లో సిద్ధం చేసిన డేటాతో సరిపోల్చాలని తెలిపారు. మండల, గ్రామాల వారీగా భూముల విస్తీర్ణంలో వ్యత్యాసాలు ఉన్నట్లయితే వాటికి గల కారణాలను గుర్తించి, అవసరమైన సవరణలు చేపట్టాలని ఆదేశించారు. తహసీల్దార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉన్న పాత డేటాను సేకరించి, ప్రస్తుత వివరాలతో పోల్చి పూర్తిస్థాయి నివేదికలను సిద్ధం చేయాలని సూచించారు. ఇప్పటివరకు పూర్తికాని ల్యాండ్ రికార్డుల సవరణలు, ప్రతిపాదనలు, నివేదికల తయారీ పనులను వెంటనే ప్రారంభించి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. ఫారెస్ట్, ప్రాజెక్టులు, సింగరేణి భూములపై ప్రత్యేక దృష్టి ఫారెస్ట్ భూములు, సాగునీటి ప్రాజెక్టులు, సింగరేణి భూములకు సంబంధించి భూముల వాస్తవ స్వభావాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. ల్యాండ్ అక్విజిషన్యాక్ట్, అవార్డుల వివరాలను పరిగణనలోకి తీసుకుని వ్యవసాయ, వ్యవసాయేతర కేటగిరీలను నిబంధనల ప్రకారం నిర్ధారించాలని తెలిపారు. రీ–సర్వే పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. రీ–సర్వేకు సంబంధించిన శిక్షణ పొందిన లైసెన్స్డ్ సర్వేయర్లు, జీపీఓలను సమన్వయం చేసుకుంటూ ప్రక్రియను వేగవంతంగా పూర్తిచేయాలని సూచించారు. భూ సర్వే పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని, ప్రతీ వారం భూసర్వే పనులపై సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. 22ఏ భూముల డేటాలో తప్పులు, వ్యత్యాసాలు లేకుండా వాస్తవ వివరాలను సిద్ధం చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ స్పష్టంచేశారు. నిర్ణీత గడువులోగా అన్ని మండలాల అధికారులు సమన్వయంతో పూర్తి వివరాలతో కూడిన నివేదికలను కలెక్టర్ కార్యాలయానికి సమర్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ నవీన్‌రెడ్డి, అన్ని మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు. -
సింగరేణి ఉద్యోగి ఆత్మహత్య
మల్హర్: ఓ సింగరేణి ఉద్యోగి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మల్హర్ మండలం కొయ్యూరు పీవీనగర్ సమీపంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన కృష్ణచైతన్య (32) పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ఆజీ–3 ఏరియాలోని అడ్రియాల ప్రాజెక్టు ఏఎల్పీ మైన్‌లో ఓర్మెన్గా విధులు నిర్వహిస్తున్నాడు. సెంటినరీ కాలనీలోని సింగరేణి క్వార్టర్లో నివాసం ఉంటున్నాడు. కల్వచర్లలో ఓ ప్రైవేట్ పాఠశాల నడిపిస్తున్నాడు. మంగళవారం ఉదయం బైక్‌పై ఇంటినుంచి బయటకు వెళ్లాడు. సాయంత్రమైనా తిరిగి ఇంటికి రాకపోవడంతో భార్య పద్మావతి పలుమార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. అనుమానం వచ్చి బంధువులకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు ఆరా తీయగా కొయ్యూరు పీవీనగర్ సమీపంలో బైక్ పడి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. రాత్రి కావడంతో సెల్ సిగ్నల్ ఆధారంగా లొకేషన్ గుర్తించి వెళ్లగా ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నట్లు గుర్తించారు. మృతుడికి కుమారుడు, కూతురు ఉన్నారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కై ్లమాక్స్‌కు ‘కొండా’ ఎపిసోడ్!
● అధిష్టానం నుంచి పిలుపు.. హుటాహుటిన ఢిల్లీకి మంత్రి సురేఖ ● కొనసాగిస్తారా? లేక తప్పిస్తారా..? ● ఓరుగల్లు కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠసాక్షి ప్రతినిధి, వరంగల్ : కాంగ్రెస్‌లో కొంతకాలంగా కొనసాగుతున్న మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరినట్లే కనిపిస్తోంది. పార్టీ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఆమె మంగళవారం హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరడం రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ వర్గాల్లోనూ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తోపాటు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆమె కలిసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో సురేఖకు అధిష్టానంనుంచి వచ్చిన పిలుపు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అసలు ఏం జరుగుతోంది? మంత్రి సురేఖ కుమార్తె సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలతో వివాదం ముదిరిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సురేఖకు నోటీసు జారీ చేసి వివరణ కోరింది. అనంతరం కమిటీ నివేదికను అధిష్టానానికి పంపినట్లు కూడా పీసీసీ ప్రకటించిన విషయం విధితమే. ఇదే సమయంలో మంత్రి సురేఖ, ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య ఉన్న విభేదాలు కూడా పార్టీ పెద్దల దృష్టికి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించారన్న ఆరోపణలపై క్రమశిక్షణ కమిటీ పరిశీలన జరిపినట్లు సమాచారం. దీంతో ఈ వివాదానికి రాష్ట్రస్థాయిలో కాకుండా ఢిల్లీ స్థాయిలోనే ముగింపు పలికేందుకు అధిష్టానం ప్రయత్నిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. మూడింట్లో ఏది..! రాష్ట్రానికి చెందిన పలువురు ముఖ్య నేతలు కూడా ఢిల్లీకి వెళ్లనున్న నేపథ్యంలో అధిష్టానం సమక్షంలో సురేఖ అంశంపై విస్తృతంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. అధిష్టానం ఈ వ్యవహారాన్ని ఇక నాన్చే ఉద్దేశంలో లేదన్న అభిప్రాయాలు రాజకీయ విశ్లేషకులనుంచి వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా అధిష్టానం ముందున్న ప్రధానంగా మూడు అవకాశాలపై వరంగల్ కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సురేఖతో నేరుగా మా ట్లాడి వివాదానికి ముగింపు పలికి, ఇకపై పార్టీ క్రమశిక్షణకు లోబడి పనిచేయాలని స్పష్టమైన హెచ్చరిక చేసే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, కొండా సురేఖ కుటుంబం మధ్య నెలకొన్న విభేదాలకు రాజకీయ పరిష్కారం చూపి, సురేఖను మంత్రిగా కొనసాగించే ప్రయత్నం జరగవచ్చన్న చర్చ కూడా ఉంది. లేదంటే క్రమశిక్షణ కమిటీ సిఫారసులను పరిగణనలోకి తీసుకుని మంత్రి పదవికి రాజీనామా చేయాలని కోరడం, లేదా కేబినెట్ మార్పుల్లో భాగంగా ఆమెను తప్పించడం వంటి కఠిన నిర్ణయం తీసుకునే అవకాశంపై కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఓరుగల్లులో హీటెక్కిన రాజకీయాలు.. సురేఖకు ఢిల్లీ పిలుపు రావడంతో ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్‌లో ఒక్కసారిగా చర్చ మొదలైంది. పార్టీ నేతలు, కార్యకర్తలు తాజా పరిణామాలపై ఆరా తీస్తున్నారు. సురేఖకు ఏం జరుగుతుంది? అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది? మంత్రి పదవిలో కొనసాగుతారా? అన్నదే ప్రధాన చర్చగా మారింది. కొండా కుటుంబానికి ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా అధిష్టానం తీసుకునే నిర్ణయం స్థానిక రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశముందని పార్టీ వర్గాలు అ ంచనా వేస్తున్నాయి. ఢిల్లీ నుంచి వెలువడే నిర్ణయంతోనే ఈ రాజకీయ ఉత్కంఠకు తెరపడనుంది. -
చెత్త కుప్పలు
రోడ్ల పక్కనే వెంగల్రావు వెంచర్లో పిచ్చిమొక్కలతో నిండిన సైడ్ కాలువలుభూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డుల్లో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. చెత్త సేకరణ నిర్వహణ అధ్యానంగా మారింది. పట్టణంతో పాటు వీలిన గ్రామాల్లో ఏ మూలన చూసినా చెత్తకుప్పులు కుప్పులుగా పేరుకుపోయి కనిపిస్తోంది. పలు కాలనీల్లో డ్రెయినేజీలు లేకపోవడంతో మురుగునీరు ఇళ్ల ముందు నుంచే పారుకుంటూపోతుంది. పట్టణంలో ప్రతీ మూడు రోజులకు ఒక సారి చెత్త సేకరణ చేయడం వలన ప్రజలు ఇళ్లలోని చెత్తను తీసుకెళ్లి కాలనీ సమీపంలోని ఖాళీ స్థలాలు, రోడ్ల పక్కన పడేస్తున్నారు. రోజులు, నెలలు గడుస్తున్నా పడేసిన చెత్తను మున్సిపల్ సిబ్బంది తొలగించడం లేదు. వర్షాకాలం కావడంతో చెత్త కుళ్లిపోయి దుర్వాసన వ్యాపించడంతో పాటు ఈగలు దోమలు వృద్ధి చెందుతున్నాయి. సీజనల్ వ్యాధులు భారినపడుతున్న ప్రజలు మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్యలోపంలో దోమలు వృద్ధి చెందడం, వాతావరణ మార్పు వలన పట్టణ ప్రజలు సీజనల్ వ్యాధుల భారిన పడుతున్నారు. పట్టణంలోని 30 వార్డుల్లో సుమారు 70వేల జనాభా ఉన్నారు. దినదినం విస్తరిస్తున్న పట్టణానికి తగిన పారిశుద్ధ్య సిబ్బంది లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు అధికారులు తెలిపారు. పట్టణంలో కేవలం 66 మంది మాత్రమే పారిశుద్ధ్య సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. కాలనీలో ప్రతీ మూడు రోజులకు ఒక సారి చెత్తను సేకరించడం వలన మూడు రోజుల పాటు చెత్తను నిల్వ చేసుకోలేక కాలనీల్లో ఖాళీ స్థలాలు, రోడ్డు పక్కన, మురికి కాలవల్లో చెత్తను పడేస్తున్నారు. ఫాగింగ్ కూడా అంతంత మాత్రమే నిర్వహిస్తున్నారు. అరకొర యంత్రాలతో కాలం సాగదీస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమైన నాటి నుంచి ఒకటి, రెండు సార్లు మాత్రమే కాలనీల్లో బ్లీచింగ్ ఫౌడర్ చల్లినట్లు కాలనీవాసులు చెబుతున్నారు. రెండు నెలల్లో పట్టణంలో 8 డెంగీ, 7 మలేరియా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. కంపుకొడుతున్న భూపాలపల్లి పట్టణం కాలనీల శివారుల్లో దుర్వాసన ముదురుతున్న సీజనల్ వ్యాధులు పట్టించుకోని మున్సిపల్ శాఖ పట్టణ ప్రజలకు అవగాహన కరువు -
తక్షణ పరిష్కారమే లక్ష్యం
భూపాలపల్లి: ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించడం లక్ష్యమని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదివస్ కార్యక్రమంలో ఎస్పీ 13 ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన సూచనలు, ఆదేశాలు జారీచేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ చట్టబద్ధమైన విధానంలో ప్రతీ ఒక్కరికి న్యాయం జరిగేలా పోలీస్ శాఖ కట్టుబడి ఉందని, ప్రజలకు మరింత చేరువగా ఉండి శాంతి భద్రతలను పరిరక్షించడం పోలీసుల ప్రధాన బాధ్యతని తెలిపారు. పదవీ విరమణ సహజం ఉద్యోగ జీవితంలో పదవీ విరమణ సహజమని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పదవీ విరమణ వీడ్కోలు కార్యక్రమంలో ఎస్సైలు ఎస్.ఈశ్వరయ్య, ఎన్.సత్యనారాయణరావు, ఏఆర్ ఎస్సై పి.రవికుమార్, ఏఎస్సై సీహెచ్.కుమారస్వామి, హెడ్ కానిస్టేబుల్ పి.అశోక్‌లను ఎస్పీ సత్కరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ సుదీర్ఘకాలం పోలీసు శాఖకు సేవలందించి పదవీ విరమణ పొందడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరేష్ కుమార్, అడ్మిన్ ఆర్ఐ రత్నం, భూపాలపల్లి సీఐ శ్రీనివాస్, పోలీసు సంఘం అధ్యక్షుడు నరేష్, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
మంగళవారం శ్రీ 1 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
హనుమకొండ uవరంగల్ uజనగామ uములుగు uమహబూబాబాద్ uభూపాలపల్లి uఆరు జిల్లాల్లోని పాఠశాలలకు రూ.643.20 లక్షల నిధులు ● జీరో నుంచి 10 మంది విద్యార్థులుంటే కేటాయింపుల్లేవువిద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లకు గిరిజన సంక్షేమశాఖ పాఠశాలలకు 2026–27 సంవత్సరానికి కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ మంజూరు చేస్తూ ఇటీవల రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలలకు, పీఎంశ్రీ పాఠశాలలకు, జీరో నుంచి 10 మధ్య విద్యార్థుల నమోదు ఉన్న పాఠశాలలకు ఈ నిధులు మంజూరు చేయలేదు. పాఠశాలల వారీగా నిధులు ఒకటినుంచి 30 మంది విద్యార్థులున్న పాఠశాలలకు రూ.10 వేల చొప్పున, 31 నుంచి 100 మంది విద్యార్థులుంటే రూ.25 వేలు, 101 నుంచి 250 మంది ఉంటే రూ.50 వేలు, 251 నుంచి 1,000 మంది విద్యార్థులుంటే రూ.75 వేలు, 1,000పైన విద్యార్థులుంటే రూ.లక్ష చొప్పున నిధులు కేటాయించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఆరు జిల్లాలకు మొత్తం రూ.643.20 లక్షలు గ్రాంటు నిధులు మంజూరు చేశారు. ఈనిధులు వీటికి వినియోగించుకోవాలి.. ● పాఠశాలలకు అవసరమైన స్టేషనరీ చాక్‌పీస్‌లు, వైట్ పేపర్లు, రిజిస్టర్లు తదితరాలు సమకూర్చుకోవడం, పరీక్షల నిర్వహణకు వినియోగించుకోవడం. ● స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవం వంటి జాతీయ పండుగల నిర్వహణకు వినియోగించుకోవచ్చు. ● పాఠశాలలో ఇంటర్నెట్ చార్జీలకు వినియోగించుకోవాలి.. ● కంప్యూటర్లు, ప్రొజెక్టర్ కే–యాన్ టీవీ, తదితర పరికరాల మరమ్మతులకు వినియోగించుకోవాలి. ● తలుపులు, కిటికీలు, ఫ్లోరింగ్ వంటి చిన్న చిన్న మరమ్మతులకు వినియోగించుకోవచ్చు. ● తాగునీటి సదుపాయం కల్పించుకునేందుకు కూడా ఈగ్రాంట్లో 10 శాతం మొత్తాన్ని స్వచ్ఛత, యాక్షన్‌ప్లాన్‌లో భాగంగా చేతులు కడుక్కునేందుకు లిక్విడ్ సోప్, టాయిలెట్ శుభ్రపర్చే సామగ్రి తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ● దివ్యాంగ విద్యార్థులున్న పాఠశాలల్లో, పాఠశాల ఆవరణలో సురక్షితమైన అవరోధాలు లేని ప్రవేశం కోసం రెయిలింగ్ ఇతర చిన్న సదుపాయాల కోసం గ్రాంటు నుంచి నిధులు వినియోగించుకోవచ్చు. ● పాఠశాలల్లో ఆవరణను క్రమం తప్పకుండా శుభ్రపర్చాలి. శానిటైజ్ చేయాలి. తగిన వెంటిలేషన్‌లో డిస్ ఇన్స్పెక్ట్ చేయాలి. ● సబ్బు, హ్యాండ్ శానిటైజర్, క్లోరిన్ సొల్యూషన్ ఇతర శుభ్రపర్చే సామగ్రిని ఎల్లప్పుడూ నిల్వ ఉంచాలి. ● గ్రాంట్ వినియోగానికి సంబంధించి పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్ఎంసీ) అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ (ఏఏపీసీ) తీర్మానం చేసి రికార్డుల్లో పేర్కొనాలి. ● గ్రాంటును మార్గదర్శకాలకు అనుగుణంగా సక్రమంగా వినియోగించే బాధ్యత హెచ్ఎం/ప్రిన్సిపాళ్లదే.. మొత్తం పాఠశాలలుమొత్తం గ్రాంటు (లక్షల్లో) -
వడివడిగా భూ సర్వే
సాక్షి, మహబూబాబాద్ : ‘ఏ గ్రామంలో చూసినా భూ సమస్య కనిపిస్తోంది. భూమి ఒకరికి, హక్కు మరొకరికి అన్నట్లు ఉంది. వీటన్నింటికి పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో చేపట్టిన భూ సర్వేను వడివడిగా చేయాలి. ఈ ప్రక్రియను తహసీల్దార్లనుంచి కలెక్టర్ల వరకు పర్యవేక్షించాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా వారిపై వేటు తప్పదు’ అని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి, రాష్ట్ర గృహనిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెవెన్యూ, రీ–సర్వే, రిజిస్ట్రేషన్, హౌసింగ్ అంశాలపై మహబూబాబాద్ ఐడీఓసీ కార్యాలయంలో సోమవారం ఆయన మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, గహ నిర్మాణ శాఖల కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. భూ సర్వేలో నిర్లక్ష్యం వద్దు.. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతీ జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాలను లక్ష్యంగా ఎంపిక చేసి మొదటి విడత భూ సర్వేను నవంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రతీ అంగుళం భూమిని వ్యవసాయ, వ్యవసాయేతర, ఆబాదీ ఆస్తుల వారీగా శాసీ్త్రయంగా సర్వే చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని 31 నాన్–కెడస్ట్రల్ గ్రామాలకుగాను 18 గ్రామాల్లో రీ–సర్వే పనులు ప్రారంభమయ్యాయని, వీటిలో ఐదు గ్రామాల్లో సర్వే పూర్తయిందని, మరో 13 గ్రామాల్లో పనులు కొనసాగుతున్నాయని అధికారులు మంత్రికి వివరించారు. మిగిలిన 13 గ్రామాల్లో, భూపాలపల్లి జిల్లాలో 8, జనగామ జిల్లాలో 5 గ్రామాల్లో సర్వే పనులను తక్షణమే ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. సర్వే గ్రామాలకు తహసీల్దార్లు ప్రతీరోజు, నెలలో ఐదు రోజులు ఆర్డీఓలు, మూడు సార్లు కలెక్టర్లు పరిశీలించాలని, ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలని చెప్పారు. క్షేత్రస్థాయికి వెళ్లకుండా సర్టిఫికెట్లు జారీ చేయడం, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం వంటి చర్యలను ఏమాత్రమూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. 22–ఏ భూముల విషయంలో జాగ్రత్త.. ప్రతీ జిల్లాలో 22–ఏ కింద ఉన్న భూములు ఏవీ? వాటిలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు ఎన్ని? ఇతర వివరాలు ఏమిటి అనే అంశాలను నాలుగు కాలమ్స్‌తో కూడిన సమగ్ర నివేదికగా సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. సర్వేనంబర్ల వారీగా పూర్తి వివరాలను రెండు రోజుల్లో అధికారులకు సమర్పించాలని స్పష్టం చేశారు. 22–ఏ జాబితాలో పొరపాటున చేరిన రైతుల భూముల వివరాలను పరిశీలించి, అర్హత ఉన్న భూములను జాబితా నుంచి తొలగించే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. అటవీ, రెవెన్యూ భూముల సరిహద్దు వివాదాలను శాశ్వతంగా పరిష్కరించాలని ఆదేశించారు. కలెక్టర్లు, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా సమావేశమై, శాసీ్త్రయ పద్ధతుల్లో భూముల కొలతలు చేపట్టి సరిహద్దులు నిర్ధారించాలని సూచించారు. రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాల నిర్మాణాలు పూర్తిచేయాలి జూలై 7న జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నర్సంపేట, పరకాల, ములుగు, జనగామ, భూపాలపల్లి ప్రాంతాల్లో ఐదు సబ్–రిజిస్ట్రార్ కార్యాలయాలు, వరంగల్‌లో ఒక డీఐజీ కార్యాలయం మంజూరైనట్లు అధికారులు తెలిపారు. హనుమకొండ జిల్లా పలివేల్పులలో డీఐజీ కార్యాలయం కోసం ఎకరం 20 గుంటల ఎస్సారెస్పీ స్థలాన్ని కేటాయించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. పరకాలలో నూతన భవన నిర్మాణం 7 శాతం పూర్తయిందని తెలిపారు. భీమదేవరపల్లి, పరకాల భవన నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు హౌసింగ్ శాఖకు అప్పగించాలని నిర్ణయించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఆలస్యం వద్దు జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు సంతృప్తికరంగా కొనసాగుతున్నాయని, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో పురోగతి ఆశించిన స్థాయిలో లేదని మంత్రి పొంగులేటి అసంతృప్తి వ్యక్తం చేశారు. భూపాలపల్లి జిల్లాలో 4,600 ఇళ్లు మంజూరు కాగా 3,946 ఇళ్లకు ప్రాసెస్ పూర్తయినప్పటికీ ఇప్పటివరకు 854 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయని తెలిపారు. ములుగు జిల్లాలో కూడా ఇళ్ల పూర్తిశాతం 50 శాతానికిలోపే ఉందని పేర్కొన్నారు. పెండింగ్ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి సెప్టెంబర్ 15నాటికి గరిష్ట సంఖ్యలో పూర్తి చేసేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సంబంధిత కలెక్టర్లను ఆదేశించారు. రెండో విడతలో ప్రతీ నియోజకవర్గానికి 2వేల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి తెలిపారు. గుడిసెల్లో నివసిస్తున్న అర్హులైన కుటుంబాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీలు బలరాం నాయక్, కడియం కావ్య, ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దొంతి మాధవరెడ్డి, మురళీనాయక్, నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, యశస్వినిరెడ్డి, గ్రంథాలయ చైర్మన్లు, వెన్నం శ్రీకాంత్ రెడ్డి, మీసాల ప్రకాశ్, లాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ లోకేష్ కుమార్, రెవెన్యూ, రిజిస్టేషన్, స్టాంప్స్ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్‌గాంధీ హన్మంతు, భూ భారతి డైరెక్టర్, గృహనిర్మాణశాఖ ప్రత్యేక కార్యదర్శి గౌతమ్, కలెక్టర్లు స్నేహ శబరీష్, సత్యశారద, చాహత్ బాజ్‌పాయ్, సందీప్‌కుమార్ ఝా, భోర్ఖడే హేమంత్ సహదేవరావు, రాహుల్ శర్మ, అన్ని జిల్లాల అధికారులు పాల్గొన్నారు. తహసీల్దార్లనుంచి కలెక్టర్ల వరకు పర్యవేక్షించాలి ప్రతీ అంగుళం శాసీ్త్రయంగా ఉండాలి నిర్లక్ష్యం చేసే అధికారులపై వేటు తప్పదు నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లలో మొదటి ప్రాధాన్యం ఉమ్మడి జిల్లా సమీక్షలో రాష్ట్ర గృహనిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హాజరైన మంత్రి సీతక్క, ఎంపీలు, ఎమ్మెల్యేలుపట్టా తె చ్చిన సంబురం.. -
దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
భూపాలపల్లి: ప్రజావాణిలో వచ్చిన ప్రతీ దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులు ప్రాధాన్యతగా తీసుకుని పరిష్కరించాలని డీఆర్ఓ వసంతకుమారి ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 62 దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ.. ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యానికి తావులేకుండా పరిష్కరించి పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. ప్రజల సమస్యల పట్ల అధికారులు స్పందిస్తూ, వినతులు పరిష్కరించాలన్నారు. అనంతరం భూపాలపల్లి ఆర్డీఓగా విధులు నిర్వర్తించి, ప్రస్తుతం వికారాబాద్ డీఆర్ఓగా విధులు నిర్వహిస్తూ అకాల మరణం పొందిన మంగీలాల్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ మౌనం పాటించారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా భూపాలపల్లి రూరల్: పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ జిల్లా కన్వీనర్ రాదండి దేవేందర్, ధర్మ సమాజ్ పార్టీ నాయకులు శిలపాక హరీశ్ డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే అమలుచేయాలని గ్రీవెన్స్‌లో అధికారులకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిధులు సకాలంలో విడుదల చేయకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు రమేశ్, జోగుల సమ్మయ్య, సమ్మయ్య, నద్దునూరి రాజ్ కుమార్, పర్లపల్లి వంశీకృష్ణ, ధర్మ సమాజ్ పార్టీ నాయకులు చిలుముల శేషుకుమార్, చిలుముల కృష్ణ, బొడ్డుపాల్, చరణ్ పాల్గొన్నారు. డీఆర్ఓ వసంతకుమారి -
అర్హులందరికీ స్మార్ట్ రేషన్‌కార్డులు
గణపురం: అర్హులందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు అందించి నిరుపేదలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం నిలుస్తోందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. సోమవారం మండలంలోని బుద్దారంలో స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అర్హులందరికీ స్మార్ట్ కార్డులను ప్రభుత్వం అందిస్తోందని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతీ ఒక్కరికి అందేలా కృషి చేస్తామని భరోసా కల్పించారు. అనంతరం మండలంలోని ధర్మరావుపేటలో పెద్దమ్మతల్లి ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. నారాయణరెడ్డికి అవార్డు టేకుమట్ల: సమాజ సేవకు గానూ రాష్ట్ర సేవా పురస్కార్ జాతీయ అవార్డుకు మండలంలోని ద్వారకపేట గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయులు పింగిళి నారాయణరెడ్డి ఎంపికయ్యారు. ఏసియా ఇంటర్నేషనల్ కల్చర్ అండ్ రీసెర్చ్ స్ఫూర్తి అకాడమీ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అకాడమీ చైర్మన్ డాక్టర్ ఆకుల రమేశ్ అవార్డును అందించారు. ప్రత్యేక గ్రామ పంచాయతీ ఏర్పాటు, విద్యుత్ సదుపాయాల కల్పన, తాగునీటి కల్పన, అవినీతిపై తిరగబడి ప్రజలకు న్యాయం అందేలా కృషి చే సినందుకు అవార్డు అందించినట్లు తెలిపారు.జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారిగా లలిత భూపాలపల్లి అర్బన్: జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారిగా లలితకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న ఏడీ రాజేందర్ ఉద్యోగ విరమణ పొందారు. దీంతో మంచిర్యాల జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఏడీగా విధులు నిర్వర్తిస్తున్న లలితకు డిప్యూటేషన్‌పై పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో నేడు(మంగళవారం) బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఆదిముక్తీశ్వరుడి చెంతకు ఉసిరి చెట్టు కాళేశ్వరం: కాళేశ్వరం దేవస్థానంలో పడమర దిక్కున కొన్నేళ్లుగా ఉన్నటువంటి ఉసిరి చెట్టును అడవిలోని ఽశ్రీఆదిముక్తీశ్వరాలయం వద్ద నాటారు. కాళేశ్వరం దేవస్థానం జీర్ణోద్ధరణలో భాగంగా పాత ఆలయాన్ని తొలగించి పనులు ప్రారంభించిన విషయం విదితమే. తవ్వకాల మధ్యలో ఉసిరి చెట్టు ఉంది. హాని జరుగకుండా చెట్టు వేర్ల కింది నుంచి చుట్టూర తవ్వి తీశారు. అక్కడ తవ్వి తీసిన చెట్టును ఆదిముక్తీశ్వరాలయం వద్ద నాటారు. పర్యావరణ ప్రేమికులు, సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
మల్హర్: రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆదివారం మల్హర్ మండలం కొయ్యూరులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో ఐదు మండలాలకు కేంద్రంగా కాటారంలో మాత్రమే మరమ్మతు కేంద్రం ఉండేదని, ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులో జాప్యం జరగడంతో రైతులకు సకాలంలో సేవలు అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిని గుర్తించి కొయ్యూరులో మరో మరమ్మతు కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. పంటలకు మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తున్నామని, అదేవిధంగా నాగులమ్మ నుంచి తాడిచర్ల వరకు, తాడిచర్ల నుంచి ఖమ్మంపల్లి బ్రిడ్జి వరకు రోడ్డు నిర్మాణానికి హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ స్కీం కింద నిధులు మంజూరు చేశామని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. మల్లారం క్రాస్ రోడ్ నుంచి పెద్దతూండ్ల వరకు, పెద్దతూండ్ల నుంచి చిన్నతుండ్ల వయా మల్లారం వరకు రోడ్డు నిర్మాణానికి కూడా నిధుల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జెన్కో ఓపెన్ కాస్ట్ డేంజర్ జోన్ 500 మీటర్ల పరిధిలో ఉన్న తాడిచర్ల భూ నిర్వాసితులందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం కొయ్యూరులో ఏర్పాటు చేసిన నయారా పెట్రోల్ పంపును ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జంగిడి శ్రీనివాస్, ఈజీఎస్ చైర్మన్ దండు రమేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి అయిత రాజిరెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు, తాడిచర్ల సింగిల్ విండో చైర్మన్ ఇప్ప మొండయ్య, స్థానిక సర్పంచ్ కొండ రాజమ్మ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు -
తమ్ముడిని కాపాడబోయి అన్న..
ములుగు మున్సిపాలిటీ పరిధి గణేశ్‌లాల్‌పల్లిలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. గ్రామ సమీపంలోని మొండి కుంటలో పడి మాలోతు వినయ్ (15), రాజేశ్ (12) అన్నదమ్ములు మృతి చెందారు. మంగపేట మండలం కమలాపురానికి చెందిన వీరు రాఖీ పౌర్ణమి సందర్భంగా తల్లితో కలిసి అమ్మమ్మ ఇంటికి వచ్చారు. ఆదివారం సాయంత్రం బహిర్భూమికి వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు కుంటలో పడిపోయారు. ఇద్దరూ నీటిలో మునిగిపోవడంతో స్థానికులు బయటకు తీసి ములుగు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. -
కళాకారుల పాత్ర కీలకం
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుభూపాలపల్లి రూరల్: జానపద కళలు, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడంలో కళాకారుల పాత్ర కీలకమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గుర్తింపు జానపద కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు కార్డులు అందజేస్తున్న సందర్భంగా జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో కళాకారులు ఆదివారం కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే సత్యనారాయణరావు మాట్లాడుతూ కళాకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు. కార్డులు అందజేయడం ద్వారా సంక్షేమ పథకాలు చేరువవుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుతోజ్ కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. -
సద్వినియోగం చేసుకోవాలి..
జిల్లాలోని విద్యార్థులు విద్యార్థి విజ్ఞాన్ మంథన్ను సద్వినియోగం చేసుకోవాలి. ఈ పరీక్ష ద్వారా వారిలో దాగి ఉన్న సామర్థ్యం బయటకు వస్తుంది. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో పాల్గొనడం ద్వారా భవిష్యత్‌లో కూడా ఇటువంటి పరీక్షలపై భయం పోతుంది. ఈ పరీక్షకు సంబంధించిన పుస్తకాలు కూడా వెబ్సైట్లో ఉందుబాటులో ఉంటాయి. ప్రతిభ కనబర్చిన వారికి నగదు ప్రోత్సాహకాలు ఉంటాయి. ప్రతీ నెల స్కాలర్షిప్ అవకాశం ఉంటుంది. – బర్ల స్వామి, జిల్లా సైన్స్ అధికారిభూపాలపల్లి అర్బన్: విద్యార్థుల మెదడుకు పదును పెట్టి భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. విద్యార్థి విజ్ఞాన్ మంథన్(వీవీఎం)–2026–27 పేరిట జాతీయ స్థాయి సైన్స్ ప్రతిభా పరీక్షను ఏటా దేశవ్యాప్తంగా అక్టోబర్‌లో నిర్వహిస్తోంది. ఇందులో ప్రతిభ చూపిన వారికి ఉపకార వేతనాలు ఇస్తోంది. ఆన్లైన్ పరీక్షకు రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 6–10 తరగతి, జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులు అర్హులు. జిల్లాలో 414 ప్రభుత్వ పాఠశాలలు, 6 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. పరీక్ష నిర్వహణ ఇలా.. పాఠశాల నుంచి పాల్గొనే 6–9 తరగతి విద్యార్థులను జూనియర్లుగా, పదో తరగతి, ఇంటర్ విద్యార్థులను సీనియర్లుగా పరిగణిస్తారు. విద్యార్థులు తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌తోపాటు ఇతర మాధ్యమాల్లో పరీక్ష రాయవచ్చు. 90 నిమిషాల్లో 100 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. గణితం, భౌతిక, రసాయన, జీవశాస్త్రాల నుంచి 50శాతం, భారతదేశం కృషిపై 20శాతం, శాస్త్రవేత్తల పరిశోధనలపై 20శాతం, లాజికల్ రీజనింగ్‌పై 10శాతం ప్రశ్నలు ఉంటాయి. జూనియర్ కేటగిరీ విద్యార్థులు అక్టోబరు 28నుంచి నవంబరు 2వరకు, సీనియర్ కేటగిరిలో నవంబర్ 19–23 వరకు వారి తరగతిని బట్టి వారికి నచ్చిన తేదీల్లో ఆన్లైన్లో పరీక్ష రాయవచ్చు. 2026 జనవరి 4న రాష్ట్ర స్థాయిలో, 30న జాతీయస్థాయిలో పోటీలు ఉంటాయి. ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు పాఠశాల స్థాయిలో 18 మంది చొప్పున, జిల్లా స్థాయిలో సబ్జెక్టుకు ముగ్గురు చొప్పున ఎంపిక చేస్తారు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పాల్గొనే వారందరికీ ధ్రువపత్రాలు అందజేస్తారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభచూపిన తొలి ముగ్గురికి రూ.5వేలు, రూ.3వేలు, రూ.2వేలు బహుమతిగా అందజేస్తారు. జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన మొదటి ముగ్గురు విద్యార్థులకు రూ.25 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలు అందజేస్తారు. దేశంలోని పరిశోధన, అభివృద్ధి సంస్థలైన ఇస్రో, డీఆర్డీఓ, సీఎస్ఐఆర్, బీఏఆర్సీ వంటివి సందర్శించే అవకాశంతో పాటు సంస్థల శాస్త్రవేత్తలతో నేరుగా సంభాషించడం, శిక్షణ పొందే అవకాశం ఉంటుంది. ఏడాది పాటు నెలకు రూ.2వేల చొప్పున స్కాలర్షిప్ అందిస్తారు.ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ విజ్ఞాన్ మంథన్ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా స్వీకరిస్తున్నారు. అర్హులైన వారు పోటీల్లో పాల్గొనేందుకు సెప్టెంబర్ 30లోగా www.vvm.orf.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. యూజర్ ఐడీ పాస్‌వర్డ్‌తో లాగిన్ అయ్యి వివరాలు నమోదుచేయాలి. పరీక్ష రుసుం రూ.200. వచ్చే నెల మొదటి వారం నుంచి వెబ్సైట్లో పుస్తకాలు అందుబాటులో ఉంచారు. -
‘రామప్ప’ చరిత్ర గొప్పది..
చారిత్రక రామప్ప ఆలయం చరిత్ర ఎంతో గొప్పదని పలువురు పర్యాటకులు కొనియాడారు. ఈ మేరకు ఆదివారం దేవాలయాన్ని జర్మనీ దేశస్తులు కేబ్లిజ్ యంగ్, యులిస్టేయింబ్, చీకో స్టాన్లు సందర్శించారు. రామలింగేశ్వర స్వామిని వారు దర్శించుకోగా అర్చకులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్‌లు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ చరిత్ర, శిల్పకళ ప్రాముఖ్యత గురించి టూరిజం గైడ్ విజయ్ కుమార్ వారికి వివరించారు. అలాగే రామప్ప దేవాలయాన్ని ఐటీడీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గంట ప్రతాప్ కుటుంబ సమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా అర్చకులు వారికి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ చరిత్రను గైడ్ విజయ్ కుమార్ వారికి వివరించారు. అనంతరం రామప్ప చెరువు సందర్శించారు. వారి వెంట ఈవో ఇమ్మడి భాస్కర్, టూరిస్ట్ పోలీసులు, దేవాదాయ, పురావస్తు, టూరిజం శాఖల సిబ్బంది పాల్గొన్నారు. – వెంకటాపురం(ఎం) -
మోసం చేస్తున్న ప్రభుత్వాలు
● డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తిరుపతి భూపాలపల్లి అర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నాయని డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తిరుపతి విమర్శించారు. జిల్లా కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన డీవైఎఫ్ఐ జిల్లా నాలుగో మహాసభలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు యువతకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తుండటంతో ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేసే వరకు నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీని ప్రభుత్వం అమలు చేయడం లేదని, జాబ్ క్యాలెండర్ విడుదలలోనూ అలసత్వం ప్రదర్శిస్తోందని విమర్శించారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ప్రభుత్వ వైద్యాన్ని బలోపేతం చేసి ప్రైవేట్ వైద్య వ్యాపారాన్ని అరికట్టాలని, కోల్‌మైన్స్ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. యువత సమస్యల పరిష్కారం కోసం డీవైఎఫ్ఐ నిరంతరం పోరాడుతోందని తెలిపారు. ఈ మహాసభలో డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భూక్యా నవీన్‌నాయక్, జిల్లా గర్ల్స్ కన్వీనర్ అంబాల స్వర్ణలత, నాయకులు తోట జ్ఞానేశ్వరి, రవికుమార్, శంకర్ పాల్గొన్నారు. -
హేమాచలక్షేత్రంలో భక్తుల రద్దీ
మల్లూరు శ్రీ హేమాచలక్షేత్రంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. రాష్ట్రంలోని వివిధ సుదూర ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు వేలాదిగా తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలోని సహజ సిద్ధంగా వచ్చే చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు అర్చకులు పవన్‌కుమార్ ఆచార్యులు, నాగఫణిశర్మ స్వామివారికి తిలతైలాభిశేకం పూజలను జరిపించి పట్టు వస్త్రాలతో అలంకరించారు. మూడు గంటల పాటు వేచి ఉండి భక్తులు స్వామివారి అభిషేక పూజలో పాల్గొని ఆలయ చరిత్ర, స్వామివారి ప్రత్యేకతలను తెలుసుకుని పులకించారు. అనంతరం సంతానం కోసం వచ్చిన దంపతులు స్వామివారి నాభి చందన ప్రసాదాన్ని స్వీకరించారు. – మంగపేట -
ఏఐటీయూసీ పోరాట ఫలితమే
భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికుల 24 డిమాండ్లపై యాజమాన్యంతో సానుకూల ఒప్పందాలు కుదరడం ఏఐటీయూసీ పోరాట ఫలితమేనని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ అన్నారు. ఏరియాలోని కొమురయ్య భవన్లో అదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2009 నుంచి పెండింగ్‌లో ఉన్న పెర్క్స్‌పై ఆదాయపు పన్ను రీఫండ్ సాధించామని, దీనివల్ల ఒక్కో కార్మికుడికి ఏడాదికి సుమారు రూ.35వేల ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. 2027 ఏప్రిల్‌లో ఈ మొత్తం ఖాతాల్లో జమ అవుతుందన్నారు. సహజ మరణం పొందిన కార్మికుల కుటుంబాలకు అదనంగా రూ.20 లక్షలు అందించేలా అంగీకారం కుదిరిందన్నారు. మృతుల పిల్లలకు సూటబుల్ ఎంప్లాయ్మెంట్, 2012 నుంచి పెండింగ్‌లో ఉన్న ఎన్ఓసీ సమస్య పరిష్కారం, కట్ అయిన ఇంక్రిమెంట్ల పునరుద్ధరణ, క్యాడర్ స్కీమ్‌ల అమలు, క్లర్క్, సెక్యూరిటీ పోస్టుల పరీక్షలను రెండు నెలల్లో నిర్వహించేందుకు యాజమాన్యం అంగీకరించిందని తెలిపారు. రిఫరల్ వైద్యఖర్చులను భరించేలా చర్యలు, కాంట్రాక్ట్ కార్మికుల పిల్లలకు సింగరేణి పాఠశాలల్లో ఉచిత విద్య, రిటైర్డ్ కార్మికుల వైద్య పరిమితి రూ.8 లక్షలకు పెంపు వంటి ప్రయోజనాలు సాధించామని తెలిపారు. భూపాలపల్లి, శ్రీరాంపూర్, కొత్తగూడెంలో సీబీఎస్ఈ పాఠశాలల ఏర్పాటు, సొంతింటి పథకం కింద 200 గజాల స్థలం ఇచ్చేందుకు అంగీకారం కుదిరిందన్నారు. కొత్త గనుల సాధన, కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపు కోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు సుధాకర్‌రెడ్డి, జి.శ్రీనివాస్, ఐలయ్య, ఎండీ కరీముల్లా, వి.రాజేందర్, డి.శ్రీనివాస్, పి.శ్రీనివాస్ పాల్గొన్నారు. -
వనదేవతలకు మొక్కులు
మేడారం సమ్మక్క–సారలమ్మలను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులతో మేడారం పరిసరాలు సందడిగా మారాయి. ముందుగా జంపన్నవాగుకు చేరుకున్న భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం అమ్మవార్ల గద్దెలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పసుపు, కుంకుమ, ఎత్తు బంగారం(బెల్లం), చీర సారె, కానుకలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కొందరు భక్తులు తలనీలాలు సమర్పించారు. అలాగే దర్శనం అనంతరం భక్తులు మేడారం సమీపంలోని అటవీ ప్రాంతంలో వంటావార్పు చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. నార్లాపూర్ ఎస్సై కమలాకర్ ఆధ్వర్యంలో పోలీసులు గద్దెల వద్ద భద్రతా చర్యలు చేపట్టారు. మేడారం పరిసరాల్లో తాగునీటి సౌకర్యం అంతంతమాత్రంగానే ఉండడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. – ఎస్‌ఎస్‌తాడ్వాయి -
ఆర్టీసీకి గిరాఖీ
హన్మకొండ: రాఖీ పండుగతో టీజీఎస్ ఆర్టీసీకి భారీ ఆదాయం సమకూరింది. వరంగల్ రీజియన్‌లో రెగ్యులర్ బస్సులతో పాటు వివిధ రూట్లలో ప్రత్యేక బస్సులు నడిపి పెద్ద సంఖ్యలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు రీజియన్ పరిధిలో రెగ్యులర్ బస్సులకు తోడు 386 ప్రత్యేక సర్వీసులు నడిపారు. బస్సులు మొత్తం 12,52,897 కిలోమీటర్లు తిరిగి, 15,44,158 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసి రూ.8,62,41,648 ఆదాయం రాబట్టుకుంది. వరంగల్ ఆర్ఎం భవాని ప్రసాద్ నేతృత్వంలో డిప్యూటీ ఆర్ఎంలు, డిపో మేనేజర్లు ప్రయాణికుల రద్దీకి అనుకూలంగా డిమాండ్ ఉన్న రూట్లలో అదనపు, ప్రత్యేక బస్సులు సమకూర్చి సురక్షితంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేశారు. అధికారులు బస్టాండ్‌లో ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. వరంగల్ రీజియన్ పరిధిలో మూడు రోజుల్లో ప్రయాణికుల చేరవేత, ఆదాయం (రూ.లలో)తేదీ కిలోమీటర్లు ప్రయాణికులు ఆదాయం 26 3,91,916 4,27,281 2,28,75,620 27 4,16,861 5,16,877 2,83,14,190, 28 4,44,120 6,00,000 3,50,51,838 మూడు రోజులపాటు ప్రత్యేక సర్వీసులు ఆర్టీసీ ఆదాయం రూ.8,62,41,648 తిరిగిన కిలోమీటర్లు 12,52,897 చేరవేసిన ప్రయాణికులు 15,44,158 -
అంగన్వాడీలకు విద్యుత్ వెలుగులు
భూపాలపల్లి రూరల్: చిన్నారుల భవిష్యత్‌కు బంగారు బాటలు వేయడంలో కీలకపాత్ర పోషిస్తున్న అంగన్వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ ప్రత్యేక చర్యలు చేపడుతుందని భూపాలపల్లి సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ భిక్షపతి శనివారం ప్రకటనలో తెలిపారు. సర్కిల్ పరిధిలోని మొత్తం 644 అంగన్వాడీ కేంద్రాలకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్లు అందించినట్లు వెల్లడించారు. ప్రీస్కూల్ కార్యకలాపాలు, ఆటలు, అభ్యసన కార్యక్రమాలు, పోషకాహార పంపిణీ, ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలు సజావుగా నిర్వహించేందుకు విద్యుత్ సౌకర్యం ఎంతో దోహదపడుతుందన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం కల్పించడాన్ని సామాజిక బాధ్యతగా భావిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రతీ అంగన్వాడీ కేంద్రం విద్యుత్ వెలుగులతో కళకళలాడేలా అవసరమైన చర్యలు చేపడుతున్నామన్నారు. జిల్లాలో 644 కేంద్రాలకు విద్యుత్ కనెక్షన్లు -
వద్దన్నా.. వరిసాగే!
● జిల్లాలో 97,619 ఎకరాల్లో సాగు ● ఎల్‌నినో ప్రచారాన్ని పట్టించుకోని రైతులుఎల్నినో ప్రభావంతో వర్షాలు పడవని అధికారులు చెబుతున్నారు. మా భూములు ఆరుతడి పంటలకు అనుగుణంగా లేవు. ఇటీవల కురిసిన వర్షాలకు 6 ఎకరాల్లో వరి సాగు చేశా. – మామిండ్ల శివ, రైతు, టేకుమట్ల భూపాలపల్లి రూరల్: జిల్లాలో ఎల్‌నినో ప్రభావాన్ని లెక్క చేయకుండా రైతులు వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. వర్షాభావ పరిస్థితులు, చెరువుల్లో పరిమిత నీటి లభ్యత, భూగర్భ జలాల తగ్గుదల.. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా నిర్దేశించింది. గతేడాది 1.14 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఈ ఏడాది ఆరుతడి పంటల సాగు కోసం ప్రచార కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహించింది. అయినా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. జిల్లాలో ఇప్పటివరకు 97,619 ఎకరాల్లో వరి నాట్లు వేయగా కంది, పెసర, జొన్న, పసుపు, తదితర పంటలు కేవలం 16,498 ఎకరాల్లోనే సాగయ్యాయి. ఆరుతడి పంటల సాగు లక్ష్యం కాగితాలకే పరిమితమైంది. వ్యవసాయ శాఖ అంచనాకు మించి జిల్లాలో రైతులు వరి సాగు చేశారు. నీటి వినియోగం తగ్గించాలని.. నీటి వినియోగాన్ని తగ్గించేందుకు ఆరుతడి పంటల వైపు రైతులను మళ్లించాలని అధికారులు సూచిస్తున్నారు. వరి సాగుకు అధికంగా నీరు అవసరమవుతుండటంతో వీలైనంత మేర ఇతర పంటలను సాగు చేయాలని చెబుతున్నారు. అయితే వరికి మార్కెట్ ఉండటం, సాగు పద్ధతిపై అనుభవం ఉండటం, గతంలో మంచి దిగుబడులు రావడం తదితర కారణాలతో అన్నదాతలు వరి సాగుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. గతేడాది వానాకాలంలో జిల్లాలో 1.14లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, ప్రస్తుత 97,619 ఎకరాల్లో వరి సాగైంది. పత్తి పెద్ద ఎత్తున 1,09,442 ఎకరాల్లో సాగు చేశారు. ప్రస్తుతం జిల్లాలో ఇప్పటివరకు 2,23,554 ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేశారు. అయి తే వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోతే చెరువులు, ప్రాజెక్టులు, బోర్లపై ఆధారపడే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో యాసంగి సీజన్లో నీటి లభ్యతపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు భరోసా కల్పిస్తేనే.. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులను ఆరుతడి పంటలవైపు మళ్లించడం వ్యవసాయశాఖకు సవాలుగా మా రింది. ఆయా పంటలపై అవగాహన కల్పించడంతో పాటు మార్కెటింగ్ సౌకర్యాలు, మద్దతు ధర, కొనుగోలు భరోసా కల్పి స్తేనే ఆరుతడి పంటల వైపు రైతులు ఆసక్తి చూపే అవకాశం ఉందని వ్యవసాయశాఖ నిపుణులు తెలుపుతున్నారు.ఆరుతడి పంటల వివరాలు పంట ఎకరాల్లో కంది 869 పెసర 8,307 జొన్న 457 ఆయిల్‌పామ్ 584 కూరగాయలు 303 మిర్చి 2,487 పసుపు 242 ఇతర పంటలు 3,249 -
రాతి స్తంభాలు వెలుగులోకి..
‘కాళేశ్వరం’ పనుల్లోకాళేశ్వరం : మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయ జీర్ణోద్ధరణలో భాగంగా పునర్నిర్మాణ పనుల్లో పాత ఆలయాల కూల్చివేతలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా శని వారం ఈఓ మహేశ్, క్షేత్ర కన్సల్టెన్సీ అసిస్టెంట్ స్థ పతి గణేషన్, ఇంజనీర్లు, ఆర్‌అండ్‌బీశాఖ ఇంజనీర్ల పర్యవేక్షణలో గర్భగుడిని వారం క్రితం తొలగించగా మిగతా నాలుగు స్తంభాలను ప్రొక్లైయినర్తో ద్విలింగాలకు ఎలాంటి ప్రమాదం లేకుండా తీశా రు. ద్విలింగాలు( జోడులింగాలు) ఇప్పటికే ఇనుప కంచెలాగా ఓ బాక్స్ చేసి పదిలంగా అమర్చారు. రాతి స్తంభాలు వెలుగులోకి.. గర్భగుడికి ఆనుకుని ఉన్న నాలుగు రాతి స్తంభాలు కాకతీయుల కాలం నాటివని తెలిసింది. ఆ రాతి స్తంభాలకు 1978–82 మధ్య కాలంలో జీర్ణోద్ధరణ సమయంలో సిమెంట్‌తో ప్లాస్టింగ్ చేసి గర్భగుడిని పైనుంచి నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. ఆ రాతి స్తంభాలు ప్రస్తుతం వెలుగులోకి రావడంతో భక్తులు, స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. పురాతన రాతి నిర్మాణాలు బయటపడడంతో ఆలయ చరిత్రపై ఆసక్తి నెలకొంది. దేవస్థాన అధికారులు స్తంభాలపై సిమెంట్ తొలగింపు పనులు ముమ్మరం చేసి ఆరా తీస్తున్నారు. ఎలాంటి శాసనాలైనా ఉన్నాయా? మరేదైనా ఆనవాళ్లు లభిస్తాయా? అనే కోణంలో పరిశీలిస్తున్నారు. కాగా, ఇప్పటికే శ్రీశుభానందాదేవి అమ్మవారి ఆలయం కింద కూడా రాళ్లు బయటపడిన విషయం విధితమే. 21.5 ఫీట్ల పొడవు, వెడల్పుతో గర్భగుడి నిర్మాణం.. గర్భగుడి పునర్నిర్మాణానికి దేవాదాయశాఖ, కాంట్రాక్టర్లు, ఆర్‌అండ్‌బీశాఖ, క్షేత్ర కన్సల్టెన్సీల ఆధ్వర్యంలో మార్కింగ్ ఇచ్చి పునాది తవ్వకాల పనులు ప్రారంభించారు. మట్టిని 12 ఫీట్ల మేర తీస్తున్నారు. 21.5 ఫీట్ల పొడవు, 21.5 ఫీట్ల వెడల్పుతో గర్భాలయ నిర్మాణం జరగనుందని తెలిసింది. అదేవిధంగా విజయ గణపతి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా కాంక్రీట్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. దీంతో ప్రభుత్వ ఆలోచన దిశగా వచ్చే గోదావరి నది పుష్కరాల వరకు పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు జరుగుతున్నాయి. ప్రధాన గర్భగుడికి మార్కింగ్ చేసి పునాది తవ్వకాలు విజయగణపతి ఆలయానికి కాంక్రీట్ పనులు 21.5 ఫీట్ల పొడవు, వెడల్పుతో గర్భాలయం -
‘సర్’ ప్రక్రియ సకాలంలో పూర్తి
భూపాలపల్లి: పారదర్శకమైన తప్పులులేని ఓటరు జాబితా రూపొందించడమే లక్ష్యంగా జరుగుతున్న ప్రత్యేక ఓటరు సవరణ (సర్) ప్రక్రియను సకాలంలో పూర్తి చేస్తామని కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడించారు. శనివారం హైదరాబాద్ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి ‘సర్’ ప్రక్రియపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, ఈఆర్ఓలు, ఏఆర్ఓలతో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో నోటీసుల జారీ, పరిష్కార చర్యలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేసిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియపై మ్యాపింగ్ కాని ఓటర్లు, అనామలిస్ ఓటర్లుకు నోటీసులు జారీపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించామన్నారు. జిల్లాలో 11,739 మంది మ్యాపింగ్ కాని ఓటర్లు, 20,685 మంది అనామలీస్ ఓటర్లు మొత్తం 32,424 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు. ప్రక్రియ పూర్తి చేసేందుకు తహసీల్దార్లు, ఎంపీడీఓల ద్వారా నోటీసులు జారీ చేసి, వారం రోజుల్లో విచారణ పూర్తి చేయనున్నట్లు తెలిపారు. నోటీసులు జారీ చేసిన ఓటర్లు నిర్దేశిత తేదీల్లో విచారణకు హాజరై ఎన్నికల సంఘం ఆదేశాల ధృవీకరణ ఆధారాలను సమర్పించేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఈ వీసీలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, ఎన్నికల విభాగం డిప్యూటీ తహసీల్దార్ అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ -
లోక్ అదాలత్‌లో కేసుల సత్వర పరిష్కారం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవన్‌కుమార్ భూపాలపల్లి అర్బన్: సెప్టెంబర్ 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌లో పెద్ద ఎత్తున కేసులను పరిష్కరించేందుకు పోలీసు, ఎకై ్సజ్ అధికారులు కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ జె.జీవన్‌కుమార్ సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ఏర్పాట్లపై పోలీసు, ఎకై ్సజ్ అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, మోటారు వాహన ప్రమాద కేసులు, ఇతర సివిల్, తదితర కేసులను జాతీయ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. ఎక్కువ కేసులు రాజీమార్గంలో పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. లోక్ అదాలత్ ద్వారా కేసులు త్వరగా పరి ష్కారమవడంతో కక్షిదారులకు సమయం, ఖర్చు ఆదా అవుతుందన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ జూని యర్ సివిల్ జడ్జి జి.అఖిల, అడిషనల్ ఎస్పీ ఏ. నరేష్ కుమార్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏదులా పురం శ్రీనివాస్, డిస్టిక్ర్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి బి.కిరణ్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
ఉద్యోగుల సంక్షేమం, భద్రతకు ప్రాధాన్యం
భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో ఉద్యోగుల సంక్షేమం, భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. శనివారంభూపాలపల్లి ఏరియాలో ప్రాతినిధ్య కార్మిక సంఘం ఐఎన్టీయూసీ ప్రతినిధులతో స్టక్చ్రర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్హాల్లో జరిగిన ఈ సమావేశానికి జీఎం ముఖ్యఅతిథిగా హాజరై సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ ప్రతినిధులు ఉద్యోగుల సంక్షేమం, గనుల భద్రత, పని పరిస్థితుల మెరుగుదల, మౌలిక వసతులు, వైద్య సేవలు తదితర అంశాలకు సంబంధించిన పలు సమస్యలు, సూచనలను యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లారు. యూనియన్ ప్రతినిధులు లేవనెత్తిన సమస్యలపై సంబంధిత విభాగాల అధికారులు స్పందిస్తూ పరిష్కరించగల అంశాలపై తక్షణ చర్యలు చేపడతామన్నారు. అనంతరం జీఎం మాట్లాడుతూ ఐఎన్టీయూసీ ప్రతినిధులు ప్రస్తావించిన ప్రతీ సమస్యను సానుకూల దృక్పథంతో పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో ఏరియా అధికారులు శ్యామ్‌సుందర్, డాక్టర్ పద్మజ, రవికుమార్, జ్యోతి, ములుకుంట్ల తిరుపతి, శ్యామ్‌సుందర్, ఐఎన్టీయూసీ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ మధుకర్‌రెడ్డి, స్టక్చ్రర్ కమిటీ సభ్యులు హుస్సేన్, బొడ్డు అశోక్ తదితరులు పాల్గొన్నారు.గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్మహాముత్తారం: ఒడిశా నుంచి మేడారం మీదుగా కాటారం వైపు గంజాయి తరలిస్తున్న వ్యక్తిని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. భూపాలపల్లి సీసీఎస్, మహాముత్తారం పోలీ సులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో కాటారం గ్రామానికి చెందిన దానం శివకృష్ణ పట్టుపడ్డాడు. ఒడిశా నుంచి మేడారం మీదుగా కాటారం వైపు ఆటోలో ప్రయాణిస్తుండగా శివకృష్ణను అనుమానంతో పోలీసులు తనిఖీ చేయగా గంజాయి లభించింది. దీంతో శివకృష్ణను అదుపులోకి తీసుకుని రూ.70వేల వి లువైన 1.4 కేజీల గంజాయిని స్వాధీనం చే సుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమేశ్ తెలి పారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తప్పవన్నారు. రామప్పలో సౌత్ జోన్ సెంట్రల్ రైల్వే జీఎం వెంకటాపురం(ఎం): మండలపరిధిలోని చా రిత్రక రామప్ప దేవాలయాన్ని సౌత్‌జోన్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ శనివారం కుటుంబ సమేతంగా సందర్శించారు. రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించగా ఆలయ అర్చకులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్‌లు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ మండపంలో ఈఓ ఉమ్మడి భాస్కర్ వారిని శాలువాలతో సత్కరించారు. రామప్ప శిల్పకళ సంపద గురించి టూరిజం గైడ్ తాడబోయిన వెంకటేశ్ వివరించారు. -
ఈ సస్పెన్స్ కొద్దిరోజులే... ఢిల్లీ నిర్ణయమే కీలకం..
సీఎంతో భేటీ ఆధారంగా పార్టీ వివాదం సమసిపోయిందని చెప్పలేని పరిస్థితి. సుస్మిత వ్యాఖ్యలతో సంబంధం లేదన్న మంత్రి సురేఖ పేర్కొనగా.. కొండా మురళీధర్‌రావు ‘సుస్మితకు ప్లాన్–ఎ అది.. ప్లాన్–బీ ఏముందో చెప్పలేం కదా’ అని చేసిన వ్యాఖ్యలపై కూడా వారి వ్యతిరేకవర్గంలో చర్చ జరుగుతోంది. అమెరికా పర్యటనలో ఉన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తిరిగొచ్చిన తర్వాతే హైకమాండ్ నిర్ణయం వెలువడే అవకాశం ఉందని సమాచారం. రోజుకో మలుపు తిరుగుతున్న ఈ వివాదానికి ఎప్పుడు తెరపడుతుంది? సురేఖపై చర్యలు ఉంటాయా? ఉంటే ఎలాంటి నిర్ణయం వెలువడుతుంది? ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ వర్గాల్లో ఇదే హాట్‌టాపిక్‌గా మారింది. -
భక్తుల కోలాహలం
మంగపేట : మండల పరిధిలోని మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శనివారం భక్తుల కోలాహలం నెలకొంది. స్వయంభూ లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. గంటల కొద్ది సమయం భక్తులు క్యూలైన్లలో వేచి ఉండి అత్యంత భక్తిశ్రద్ధలతో తిలతైలాభిషేకం పూజలో పాల్గొన్నారు. మానవ శరీరాన్ని పోలి ఉండే స్వామివారిని నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. ఆలయ పూజారులు పవన్‌కుమార్ ఆచార్యులు, రాజీవ్ శర్మ, ఈశ్వర్‌చంద్ రామనుజం భక్తుల గోత్రనామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించారు. స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. -
సర్వేను వేగవంతం చేయాలి
భూపాలపల్లి: జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులతో పాటు గుడిసెల సర్వేను త్వరగా పూర్తి చేసేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ, డీఆర్డీఓ, ఎంపీడీఓలు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు, మున్సిపల్ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల, మున్సిపాలిటీ వారీగా మంజూరైన ఇళ్లు, నిర్మాణాల పురోగతి, పెండింగ్ పనులు, గుడిసెల సర్వే తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాకు మొత్తం 4,562 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటివరకు 851 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని వెల్లడించారు. వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని, ముఖ్యంగా ఆర్సీసీ, రూఫ్ లెవెల్ దశల్లో ఉన్న నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 15 నాటికి నిర్దేశిత లక్ష్యాలను సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. భూపాలపల్లి మండలంలో అదనంగా 200 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడంతో పాటు, భూపాలపల్లి నియోజకవర్గంలో మొత్తం 1,100 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీ పరిధిలో నిలిచిన నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఇప్పటివరకు నిర్మాణాలు ప్రారంభం కాని ఇళ్లకు సంబంధించి నిధుల సమస్య, లబ్ధిదారుల అనాసక్తి, సాంకేతిక లోపాలు లేదా ఇతర కారణాలను క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా నమోదు చేయాలన్నారు. భాస్కర్‌గడ్డ 2బీహెచ్‌కే లేఅవుట్లో డ్రెయినేజీ (సీవరేజ్), విద్యుద్దీకరణ, తాగునీటి సరఫరా పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ నెల 31వ తేదీ సోమవారం రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి నిర్వహించనున్న సమీక్షా సమావేశానికి నిర్మాణాల పురోగతి, పెండింగ్ అంశాలు, లక్ష్యాల సాధనపై పూర్తి నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఆర్డీఓ బాలకృష్ణ, పీఆర్ ఈఈ విద్యా సాగర్, శిక్షణా డిప్యూటీ కలెక్టర్ నవీన్‌రెడ్డి, గృహ నిర్మాణ శాఖ ఏఈ రాయలింగు, ఎంపీడీఓలు, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ -
స్నేహబంధానికి, పరస్పర రక్షణకు ప్రతీక రాఖీ: కలెక్టర్
భూపాలపల్లి: రాఖీ పండుగ స్నేహబంధానికి, పరస్పర రక్షణకు ప్రతీకకు నిలస్తుందని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. రాఖీ పండుగను పురస్కరించుకుని శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, కలెక్టరేట్ మహిళా సిబ్బంది కలెక్టర్ రాహుల్ శర్మకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. కార్యాలయ విధుల నిర్వహణలో కలెక్టర్ అందిస్తున్న మార్గదర్శకత్వం, సహకారానికి మహిళా సిబ్బంది కృతజ్ఞతలు తెలుపుతూ, ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లా ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ సీనియర్ సహాయకులు విజయ, అనురాధ, సుమలత, జూనియర్ సహాయకులు మౌనిక తదితరులు పాల్గొన్నారు. -
ఆయకట్టు కాల్వల మరమ్మతులకు నిధులు
● ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్ ధర్మ గణపురం: ఉమ్మడి వరంగల్ జిల్లాలో అతి పెద్ద చెరువుల్లో ఒక్కటైన గణపసముద్రం చెరువు ఆయకట్టు కాల్వల మరమ్మతులకు ప్రభుత్వం రూ.31 కోట్ల నిధులు మంజూరు చేసిందని ఐబీ ఇరిగేషన్‌శాఖ సీఈ ధర్మ తెలిపారు. శుక్రవారం గణపసముద్రం ఆయకట్టు కాల్వలను స్థానిక రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్తడి కాల్వ, పైడి కాల్వ, కోట కాల్వ, కొత్త కాల్వల అభివృద్ధికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గణపసముద్రం చెరువు ఆయకట్టు కాల్వల అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మాట్లాడి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. రైతాంగానికి సాగు నీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అందేందుకు కాల్వల మరమ్మతు పనులు ప్రారంభిస్తామన్నారు. మరో పదిరోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి 9 నెలల్లో పనులు పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ రాము, ఎస్సీ మోహన్ రావు, ఏఈలు సమ్మారావు, శ్రీనివాస్, సర్పంచ్ కట్కూరి రాధికశ్రీనివాస్, రైతులు ఉన్నారు. -
అక్క మృతిని తట్టుకోలేక తమ్ముడి ఆత్మహత్య
మహాముత్తారం: అక్క మృతిని తట్టుకోలేక మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన తమ్ముడు చికిత్సపొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం మహాముత్తారం మండలం స్తంభంపల్లి(పీపీ) లో చోటుచేసుకుంది. కుటుంబీకులు, పోలీసుల కథనం ప్రకారం.. స్తంభంపల్లి(పీపీ) గ్రామానికి చెందిన పసుల చిన్న మల్లయ్య (55)అక్క జంగిలి గట్టమ్మ పది రోజుల క్రితం మృతి చెందింది. అక్క మృతిని జీర్ణించుకోలేక మద్యానికి బానిసైన చిన్నమల్ల య్య ఈ నెల 26న గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. మృతుడి కుమారుడు నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మహాముత్తారం ఎస్సై రమేశ్ తెలిపారు. స్తంభంపల్లి(పీపీ)లో ఘటన -
ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం
భూపాలపల్లి అర్బన్: జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను కలెక్టరేట్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. భారత హాకీ దిగ్గజం, ఒలింపిక్ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాల్లో కలెక్టరేట్ ఏఓ శ్రీనివాస్, అసిస్టెంట్ కలెక్టర్ నవీన్‌రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ క్రీడారంగానికి ధ్యాన్ చంద్ అందించిన సేవలను వారు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ సిబ్బంది, స్థానిక క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు. నెమలి అప్పగింత చిట్యాల: మండలంలోని చల్లగరిగ గ్రామంలో శుక్రవారం నెమలి సంచరించగా.. గమనించిన గ్రామస్తులు అటవీశాఖ అధికారులు సమాచారం అందించారు. ఈ మేరకు అటవీశాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రత్న జ్యోతి గ్రామానికి చేరుకుని నెమలిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నెమలిని హనుమకొండలోని జంతు ప్రదర్శన శాలకు తరలించినట్లు ఆమె తెలిపారు. కాగా గ్రామస్తులు బాధ్యతగా వ్యవహరించి జనారణ్యంలో నుంచి వచ్చిన నెమలిని రక్షించి అటవీశాఖ అధికారులకు అప్పగించడంపై వారిని అభినందించారు. కేయూలో ఎంబీఏ స్పాట్ అడ్మిషన్లు కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలో ఈ విద్యాసంవత్సరం (2026–2027) ఎంబీఏ కోర్సులో ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.నర్సింహాచారి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ స్పాట్ అడ్మిషన్లు ఈనెల 31నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు ఉంటాయన్నారు. టీఎస్ఐసెట్–2026లో అర్హత సాధించిన అభ్యర్థులతో పాటు అర్హత సాఽధించని వారు కూడా హాజరుకావొచ్చునని తెలిపారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ ధ్రువపత్రాలతో పాటు అవసరమైన ఫీజు తీసుకురావాలని సూచించారు. స్పాట్ అడ్మిషన్ల ద్వారా ఎంబీఏ కోర్సులో ప్రవేశాలు పొందే అభ్యర్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులు కాదని పేర్కొన్నారు. మార్గదర్శకాలు టీజీఐసెట్ అధికారిక వెబ్‌సైట్‌తోపాటు యూనివర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల నోటీస్ బోర్డులో ఉంచామని ప్రిన్సిపాల్ నర్సింహాచారి వివరించారు. స్కూల్ ఆఫ్ లెర్నింగ్‌లోనూ.. కాకతీయ యూనివర్సిటీలోని దూరవిద్యాకేంద్రంలోని స్కూల్ ఆఫ్ లెర్నింగ్ (కేయూ ఎస్ఎల్)లో ఈ విద్యాసంవత్సరానికి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించనున్నట్లు దూరవిద్యాకేంద్రం డైరెక్టర్ బి.సురేష్‌లాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టీజీఐసెట్–2026 అర్హత సాధించిన, అర్హత సాధించని అభ్యర్థులు కూడా తమతమ సర్టిఫికెట్లతో ఈనెల 31నుంచి సెప్టెంబర్ 3వరకు హాజరై ప్రవేశాలు పొందవచ్చని తెలిపారు. నిట్‌లో తెలుగు భాషాదినోత్సవం కాజీపేట అర్బన్: నిట్ వరంగల్ని కెమికల్ ఇంజనీరింగ్ విభాగం సెమినార్ హాల్లో శుక్రవారం తెలుగు భాషా దినోత్సవం నిర్వహించారు. స్టూడెంట్స్ యాక్టివిటీస్ సెంటర్ అధ్యక్షుడు ప్రొఫెసర్ వెలగపూడి వాసు ఆధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ మార్క శంకర్ మాట్లాడుతూ.. నాడు గ్రంథాల్లో అచ్చమైన తెలుగు ఉండాలని గిడుగు రామ్మూర్తి పోరాడారని గుర్తు చేశారు. తెలుగు భాష కమ్మనైనది అనే పాటను ప్రొఫెసర్ వెలగపూడి వాసు ఆలపించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు సోమశేఖర్, రాజమోహన్, సూర్యనారాయణ, విద్యార్థులు పాల్గొన్నారు. -
‘మినరల్స్’ ఎక్కడో.. పోస్టింగ్ అక్కడే!
సాక్షి ప్రతినిధి, వరంగల్: మైనింగ్ అంటేనే కోట్లాది రూపాయల విలువైన ఖనిజ సంపద. ఇసుక, క్వారీలు, గ్రానైట్, బిల్డింగ్ స్టోన్, రోడ్ మెటల్.. ఇలా ప్రభుత్వానికి భారీగా ఆదాయం తెచ్చిపెట్టేవి. వీటికి అనుమతులు ఇవ్వడం, లీజులను పర్యవేక్షించడం, రాయల్టీ వసూలు చేయడం, అక్రమ మైనింగ్, అక్రమ రవాణాను అడ్డుకోవడం మైన్స్ అండ్ జియాలజీ శాఖ పరిధిలోని కీలక బాధ్యతలు. అలాంటి శాఖలో జిల్లాస్థాయి అధికారుల పోస్టింగులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. వనరులు, ఆదాయం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పోస్టింగ్ కోసం పైరవీలు, రాజకీయ పలుకుబడి, లావాదేవీలు జరుగుతున్నాయన్న ఆరోపణలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. తాజాగా భూపాలపల్లి జిల్లా మైన్స్ ఏడీ బొజ్జ జయరాజ్‌కు సంబంధించిన వ్యవహారంలో ఏసీబీ సోదాలు జరగడం ఈ చర్చకు మరింత ఊతమిచ్చింది. ఒక అసిస్టెంట్ డైరెక్టర్.. 12 జిల్లాల పర్యవేక్షణకు ఇన్చార్జ్.. భూపాలపల్లి మైన్స్ ఏడీగా పనిచేసి గురువారం ఏసీబీ దాడులకు గురైన బొజ్జ జయరాజు ములుగు జిల్లా మైన్స్ బాధ్యతల్లోనూ కొద్ది రోజులు ఇన్చార్జ్ గా ఉన్నారు. 2024 మార్చి 15న భూపాలపల్లి ఏడీగా వచ్చిన ఆయన 2025 అక్టోబర్ 8న వరంగల్ రీజియన్ (ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం)కు డిప్యూటీ డైరెక్టర్‌గా ఇన్చార్జ్ బాధ్యతల్లోకి వచ్చారు. రాజకీయ పలుకుబడి, ఉన్నతాధికారుల అండదండలతోనే ఈ అదనపు బాధ్యతలు దక్కాయన్న ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. దీంతో ఏడీతోపాటు పూర్వ వరంగల్, కరీంనగర్, ఖమ్మంలకు చెందిన 12 జిల్లాల మైనింగ్ పర్యవేక్షణ బాధ్యతలు కూడా డీడీగా ఈయనకే. ఇదిలా ఉండగా ఉమ్మడి వరంగల్‌లో ఏడీలకు వరంగల్, హనుమకొండలకు చాలాకాలం ఒక్కరే ఏడీగా బాధ్యతలు నిర్వహించారు. భూపాలపల్లి, ములుగులకు కూడా ఒక్కరే ఉన్నారు. ఇటీవల హనుమకొండకు పూర్తి కాలపు ఏడీ రాగా, మిగతా చోట్ల హెడ్ ఆఫీసు కనుసన్నల్లో ఉండే ఏజీలను ఏడీలుగా నియమించారంటే గనులశాఖలో పోస్టింగ్‌ల తీరును అర్థం చేసుకోవచ్చు. ‘మినరల్స్’ ఉన్న చోటే ఎందుకీ ఆసక్తి? ఉమ్మడి వరంగల్‌లోని అన్ని జిల్లాల్లో ఖనిజ వనరులు ఒకే రకంగా లేవు. భూపాలపల్లి, ములుగు ప్రాంతాల్లో గోదావరి పరీవాహక ప్రాంతం కారణంగా ఇసుక కార్యకలాపాలకు ప్రాధాన్యం ఉండగా.. ఇతర జిల్లాల్లో గ్రానైట్, బిల్డింగ్ స్టోన్, రోడ్ మెటల్, లేటరైట్, ఇతర ఖనిజాల తవ్వకాలు జరుగుతున్నాయి. మహబూబాబాద్‌లో ఇనుప ఖనిజం, లేటరైట్‌తోపాటు బ్లాక్, కలర్ గ్రానైట్, బిల్డింగ్ స్టోన్, రోడ్ మెటల్, ఎర్త్, గ్రావెల్ వంటి ఖనిజాలు ఉన్నట్లు అధికారిక మైన్స్ శాఖ వివరాలు చెబుతున్నాయి. అక్కడ 168 బ్లాక్ గ్రానైట్ మైనర్ మినరల్ లీజులు నమోదై ఉండగా.. 66 పనిచేస్తున్నట్లు జిల్లా శాఖ వివరాలు పేర్కొంటోంది. అందుకే ఖనిజ వనరులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మైన్స్ అధికారుల పోస్టింగులు సహజంగానే ప్రాధాన్యం సంతరించుకుంటాయి. ఈ నేపథ్యంలోనే మినరల్స్ బాగా ఉన్న ‘మంచి పోస్టింగ్’ల కోసం పైరవీలు చేసుకుని వస్తున్నట్లు ప్రచారం ఉంది. వారికి రాజకీయ పలుకుబడి, ఉన్నతస్థాయి అండదండలు పుష్కలంగా ఉంటాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో మీడియాకు కూడా శాఖాపరమైన సమాచారం ఇవ్వకుండా ‘టూర్’ల పేరిట తప్పుకున్న సందర్భాలు పలుసార్లు విమర్శలకు దారి తీశాయి. కాగా ఇటీవల ఏసీబీ దాడులు, అక్రమాస్తుల కేసులు వెలుగులోకి వస్తుండటంతో మైనింగ్ శాఖలో అధికారుల పోస్టింగులు, వారి పనితీరుపై మరోసారి చర్చ మొదలైంది. ఆరు జిల్లాల్లో.. మూడుచోట్ల ఇన్‌చార్జ్‌లే.. ఆగస్టు 2026లో ఆయా జిల్లాల అధికారిక వెబ్సైట్లలో కనిపిస్తున్న వివరాలను పరి శీలిస్తే ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాల్లో మూడు చోట్ల ఇన్చార్జ్ వ్యవస్థ కనిపిస్తోంది. హనుమకొండలో ఏడీ బాధ్యతలు ఇన్చార్జ్కి ఉండగా ఇటీవల రెగ్యులర్ ఏడీని నియమించారు. వరంగల్‌లో రెగ్యులర్ ఏడీ ఉన్నట్లు జిల్లా వెబ్సైట్ పేర్కొంటోంది. జనగామలో జిల్లా వెబ్సైట్, కేంద్ర మైన్స్ శాఖ డేటాలో అధికారి హోదాకు సంబంధించి వ్యత్యాసం కనిపిస్తోంది. ఇక్కడ కూడా అసిస్టెంట్ జియోలజిస్టు(ఏజీ)నే ఇన్చార్జ్ ఏడీగా నియమించినట్లు తెలిసింది. మహబూబాబాద్‌లో రెగ్యులర్ ఏడీ ఉన్నారు. భూపాలపల్లిలో డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారి ఇన్చార్జి ఏడీగా ఉన్నారు. ఆయన (బి.జయరాజు) గురువారం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీకి చిక్కారు. ఇందులో కొన్ని చోట్ల అసిస్టెంట్ జియాలజిస్ట్‌లు ఇన్చార్జ్ అసిస్టెంట్ డైరెక్టర్లుగా పోస్టింగ్‌లు తెచ్చుకున్నారు. ములుగులో ఇన్చార్జ్ ఏడీగా ఉన్న అసిస్టెంట్ జియోలజిస్ట్ భద్రాద్రి కొత్తగూడెం ఇన్చార్జ్ ఏడీగా కూడా వ్యవహరిస్తున్నారు. పొలిటికల్ అండ, ఉన్నతాధికారుల సపోర్టు ఒక్కొక్కరికీ రెండేసి జిల్లాలు.. ఏడీలకు డీడీ బాధ్యతలు ఆదాయానికి మించిన ఆస్తులు.. అక్రమ వ్యాపారులతో చెట్టాపట్టాల్ ఏసీబీ సోదాలతో మళ్లీ చర్చకు వచ్చిన పోస్టింగ్‌ల దందా -
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ● స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీభూపాలపల్లి రూరల్: పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శుక్రవారం భూపాలపల్లి మండలం కమలాపూర్, గొల్లబుద్దారం, అజంనగర్, గూడాడ్పల్లి, నేరేడుపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాల ఆవరణలో నిర్వహించిన కార్యక్రమాల్లో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ అనేక ప్రజాహిత కార్యక్రమాలను అమలు చేస్తుందని, అర్హత గల కుటుంబాలకు ఆహార భద్రత కల్పించాలనే లక్ష్యంతో స్మార్ట్ రేషన్ కార్డులను అందిస్తుందన్నారు. ఈ కార్డుల ద్వారా పారదర్శకంగా ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందనున్నాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభివృద్ధి, రైతుల సంక్షేమం, పేదల జీవన ప్రమాణాల మెరుగుదలకు కట్టుబడి పనిచేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అంతకు ముందు ఆయా గ్రామాల్లో మహిళా భవన నిర్మాణాలు, అంగన్వాడీ భవన నిర్మాణాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖ అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ప్రేమకు ప్రతిరూపం ‘రాఖీ’
జిల్లాలో ఘనంగా రక్షాబంధన్భూపాలపల్లి అర్బన్: అన్నాచెల్లెళ్ల ప్రేమానురాగాలకు, అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రతీ ఏటా శ్రావణ పౌర్ణమి వేళ వచ్చే రక్షాబంధన్ పండుగ..అన్నాచెల్లెళ్ల బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఉదయం 6 గంటల నుంచే ఇళ్లలో పండుగ వాతావరణం నెలకొంది. అక్కాచెల్లెళ్లు.. అన్నదమ్ములకు రాఖీలు కట్టి మిఠాయి తినిపించారు. ఆర్టీసీ అధికారులకు పండుగ నేపథ్యంలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినా.. బస్సుల కోసం ప్రయాణికులు పరుగులు తీశారు. పట్టణంలో రాఖీ, ఇతర దుకాణాలు అమ్మకాలతో రద్దీగా మారాయి. పలు పార్టీలు, ప్రజాసంఘాలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో రాఖీ పండుగ వేడుకలను పురస్కరించుకొని రాఖీలు కట్టి వేడుకలను నిర్వహించుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వృద్ధాశ్రయంలోని వృద్ధులకు రాఖీలు కట్టారు. -
తండ్రి బాధ్యత నెరవేర్చిన అన్న
శుక్రవారం శ్రీ 28 శ్రీ ఆగస్టు శ్రీ 2026కష్టమే రానివ్వనని ఒకరు. ఆపదొస్తే అండగా నిలుస్తానని మరొకరు. నీకు నేనున్నానంటూ ఇంకొకరు.. తోబుట్టువుకు సగం ఆస్తి రాసిచ్చిన అన్న ఒకరు. అక్కతో రాఖీ కట్టించుకోవడానికి విదేశాల నుంచి సొంతూరికి వచ్చిన తమ్ముడొకరు. ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ములు ప్రేమకు ప్రతిరూపంగా నిలుస్తున్నారు. రాఖీ పండుగకు అసలైన అర్థం చెబుతున్న వీరందరి గురించి రక్షాబంధన్ సందర్భంగా ‘సాక్షి’ స్పెషల్ స్టోరీ. కాశిబుగ్గ: కొత్తవాడకు చెందిన దువ్వ సాంబమూర్తి–రమాదేవి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ఒక కుమారుడు చనిపోగా, ఒక కుమారుడు రాజ్‌కుమార్, కుమార్తె శీరిష ఉన్నారు. వికలాంగుడైన తండ్రి సాంబమూర్తి కుమార్తె పెళ్లి చేసిన తర్వాత మరణించాడు. చెల్లెలిపై ప్రేమతో అన్న రాజ్‌కుమార్ (సాఫ్ట్వేర్ ఇంజనీర్) చెల్లి, బావకు కొత్తవాడలోని ఇంట్లోనే నివాసం కల్పించాడు. చెల్లెలిపై ప్రేమతో ఆరునెలల క్రితం పుర ప్రముఖుల సమక్షంలో 180 గజాల ఇల్లు స్థలంలో సగం 90 గజాల స్థలం రిజిస్ట్రేషన్ చేసి, కాగితాలు అప్పగించాడు. చెల్లిని కంటికి రెప్పలా చూసుకుంటున్న రాజ్‌కుమార్‌ను అందరూ అభినందిస్తున్నారు. లింగాలఘణపురం: జనగామ జిల్లా లింగాలఘణపురం మండల కేంద్రానికి చెందిన నక్కపల్లి ప్రసాద్ తల్లిదండ్రులు చనిపోయినప్పటికీ చెల్లెళ్లను ఉన్నత చదువులు చదివించాడు. అతడి చెల్లెళ్లు రాజేశ్వరి, అరుణ పెళ్లిళ్లు చేశాడు. అమ్మానాన్నల లోటు లేకుండా పెంచి పెద్ద చేసిన అన్న ప్రసాద్ అంటే వారికి ఎనలేని ప్రేమ. ఎక్కడున్నా అన్నకు ప్రతీ ఏడాది రాఖీ కడతారు. చెల్లెళ్లకు సైతం ప్రసాద్ తోచిన సాయం చేస్తూ అండగా నిలుస్తున్నాడు.ఎస్‌ఎస్‌తాడ్వాయి: తాడ్వాయి మండల కేంద్రంలోని ఇందిరానగర్‌కు చెందిన దుబ్బాక శ్రీనివాస్‌కు ఇద్దరు చెల్లెళ్లు స్వప్న, రవళి. శ్రీనివాస్ 17 ఏళ్ల వయస్సులో ఉన్న సమయంలో తల్లిదండ్రులను కోల్పోయారు. దీంతో చిన్న వయస్సులోనే కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకున్నాడు. ఇద్దరు చెల్లెళ్లను కంటికి రెప్పలా చూసుకుంటూ వారిపి ఉన్నత చదువులు చదివించాడు. ఇద్దరికీ పెళ్లిళ్లు చేసి తన వంతుగా బాధ్యత నెరవేర్చాడు. తమ కోసం అన్న పడిన కష్టాలను మరచిపోని స్వప్న, రవళి ప్రతీ ఏడాది ఎక్కడున్నా.. రాఖీ పండుగకు వచ్చి అన్నకు రాఖీ కడుతున్నారు. తల్లిదండ్రులు లేకపోయినా.. మేమున్నాం అని చెల్లెళ్లకు భరోసా ఇచ్చిన అన్నకు రాఖీ కట్టి కృతజ్ఞతలు చెబుతున్నారు. డోర్నకల్: డోర్నకల్‌లోని బ్యాంక్ స్ట్రీట్‌కు చెందిన కాలా యశోధర్ జైన్‌కు తొమ్మిది మంది అక్కాచెల్లెళ్లు. వీరంతా తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో నివాసం ఉంటున్నారు. ఏటా రాఖీ పండుగను పురస్కరించుకుని అక్కాచెళ్లెళ్లలో ఒకరి ఇంటికి తమ సోదరుడిని పిలిపించుకుంటారు. అందరూ అతడికి రాఖీలు కట్టి ఆనందంగా గడుపుతారు. ఇటీవల మహారాష్ట్రలోని అమరావతి జిల్లా పరత్వాడాలోని సోదరి ఇంటికి అందరూ చేరుకుని సోదరుడు యశోధర్జైన్కు రాఖీలు కట్టి దీవెనలు అందుకున్నారు.పర్వతగిరి: పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన శ్రీపాద వెంకటేశ్వర్లు, సరోజ దంపతులకు ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె. చిన్న కుమారుడు శ్రీపాద సురేశ్ ఆస్ట్రేలియాలో నివసిస్తున్నప్పటికీ చెల్లితో రాఖీ కట్టించుకోవడానికి ప్రతీ సంవత్సరం పర్వతగిరికి వస్తుంటాడు. మిగిలిన నలుగురు అన్నదమ్ములు సతీశ్, రఘు, రవి, రాము పర్వతగిరికి వచ్చి రాఖీ కట్టించుకుంటారు. ఐదుగురు అన్నదమ్ములంటే తనకు ప్రాణమని ఏటా వారికి రాఖీ కడతానని ప్రియాంక చెబుతోంది. తండ్రి ప్రేమను పంచిన పలువురు అన్నలు ఆస్తి కాదు.. అనుబంధమే ముఖ్యమంటున్న ఓ సోదరుడు అక్కాచెల్లెళ్లకు అండగా నిలుస్తున్న సోదరులు రాఖీ కట్టి రక్షగా నిలుస్తామంటున్న సోదరీమణులు నేడు రాఖీ పౌర్ణమి -
స్వయం సహాయక సంఘాల పాత్ర కీలకం
మొగుళ్లపల్లి: మహిళల ఆర్థిక సాధికారతకు స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. మండల పరిధిలోని రంగాపురం, ఇస్సిపేట, పాత ఇస్సిపేట, ఎల్లారెడ్డిపల్లి, కోర్కిశాల, గణేశ్‌పల్లి గ్రామాల్లో మహిళా సంఘాలకు సంబంధించిన వీవో భవనాల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అలాగే మొగుళ్లపల్లి, రంగాపురం, ఆకినపల్లి గ్రామాల్లోని రైతువేదికల్లో స్మార్ట్ రేషన్ కార్డులను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణారావు మాట్లాడుతూ వీవో భవనాల నిర్మాణంతో మహిళా సంఘాల సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు, ఆర్థిక కార్యకలాపాల నిర్వహణకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభివృద్ధి, రైతుల సంక్షేమం, పేదల జీవన ప్రమాణాల మెరుగుదలకు కట్టుబడి పనిచేస్తోందని వివరించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో తహసీల్దార్ సునీత, ఎంపీడీఓ సురేందర్, ఎంపీఓ సుభాశ్‌చంద్రబోస్, ఏపీఎం రమాదేవి, చిట్యాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎండీ రఫీ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడంతో పాటు తదితర సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్ ఎదుట టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీఈజేఏసీ చైర్మన్ బూరుగు రవి మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే పీఆర్సీ అమలు చేస్తామని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని హామీనిచ్చి 30 నెలలు గడిచినా అమలు చేయలేదన్నారు. మంచి ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయడంతో పాటు సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం టీజీఈజేఏసీ ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మి మాట్లాడుతూ నాలుగు నెలలుగా హెల్త్ స్కీమ్ సమస్యలు కొనసాగుతున్నాయన్నారు. అత్యవసర వైద్య పరిస్థితుల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వారి కుటుంబ స భ్యులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ జీఓ నంబర్ 25తో ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేస్తూ ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. విద్యారంగంలో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలన్నారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్, శ్రీనివాసరావు, రాజకుమార్, తిరుపతి, అజహర్, శ్రీనివాస్, శ్రీదేవి ప్రవీణ్, సాంబశివరావు, కిరణ్ కుమార్, నక్క తిరుపతి, దశరథ రామారావు, షఫీ అహ్మద్, జ్ఞానేశ్వర్ సింగ్, మురళీధర్‌రెడ్డి, కుమారస్వామి, మందల రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎదుట టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో ధర్నా -
ఏరియా స్పోర్ట్స్ క్రీడల కమిటీ నియామకం
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలో 2026–27 సంవత్సరానికి వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్(డబ్ల్యూపీఎస్) క్రీడల కమిటీని గురువారం ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన నియమించారు. స్పోర్ట్స్ కోఆర్డినేటర్‌గా ఏరియాలోని కేటీకే ఓసీ–3కి చెందిన ఫిట్టర్ జి.నాగేశ్వర్రావు, జనరల్ కెప్టెన్‌గా కేటీకే–5వ గనికి చెందిన సీహెచ్ ప్రసాద్‌ను నియమించినట్లు ఏరియా అధికార ప్రతినిధి ఎస్.శ్యాంసుందర్ తెలిపారు. కమిటీ అధ్యక్షుడిగా ఏరియా జీఎం ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా డి.శ్యాంసుందర్, ప్రధాన సమన్వయకర్తగా పర్సనల్ మేనేజర్ ఎస్.శ్యాంసుందర్, గౌరవ కార్యదర్శిగా సీనియర్ పర్సనల్ ఆఫీసర్ ఎం.సాయికృష్ణ, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా స్పోర్ట్స్ సూపర్వైజర్ పర్స శ్రీనివాస్‌లను నియమించారు. ఫుట్‌బాల్‌కు టి. పురుషోత్తం, హాకీ బి.విక్రమ్, క్రికెట్ పి.రాజు, కబడ్డీ టి.గణేశ్, వాలీబాల్ లక్ష్మణ్, బాల్ బ్యాడ్మింటన్ టి.తిరుపతి, బాస్కెట్‌బాల్ ప్రణయ్, లాన్ టెన్నిస్ శ్రీరాములు, క్యారమ్ ఎంవీ.రావు, చెస్ జి.రాజ్‌కుమార్, టేబుల్ టెన్నిస్ ఆకుల శ్రీనివాస్ తదితరులు ఎంపికయ్యారు. -
అర్హులందరికీ ఓటుహక్కు ఉండేలా చూడాలి
● కలెక్టర్ రాహుల్ శర్మ గణపురం: అర్హులైన ఓటర్లందరికీ ఓటుహక్కు ఉండేలా చూడాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. మండలకేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో గురువారం నిర్వహించిన సర్ ప్రత్యేక గ్రామసభకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో గుర్తించిన అనామలిస్, మ్యాపింగ్ కేసులు, నోటీసుల జారీ విచారణ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం సూచనల మేరకు గ్రామాల్లో, పట్టణ ప్రాంతాల్లోని ప్రతీ వార్డులో గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో రెండు నెలలుగా సర్ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. సర్‌లో భాగంగా బూత్‌స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలను అందించారని తెలిపారు. 2002 నాటి ఓటర్ల జాబితాలో మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టి ఫారాలను పూర్తి చేసినట్లు తెలిపారు. అనంతరం డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను ప్రచురించినట్లు వివరించారు. డ్రాఫ్ట్ జాబితాలో ప్రధానంగా నో మ్యాపింగ్, అనామలిస్ ఓటర్లను గుర్తించినట్లు తెలిపారు. ఈ కేటగిరిల్లో ఉన్న ఓటర్లకు బీఎల్ఓల ద్వారా నోటీసులు జారీ చేస్తామని వారు విచారణ హాజరై అవసరమైన ఆధారాలు సమర్పించాలని సూచించారు. జిల్లాలో సుమారు 35వేల అనామలీస్, నో మ్యాపింగ్ కేసులు ఉన్నాయని తెలిపారు. నోటీసులు జారీ విచారణ ప్రక్రియను వేగవంతం చేసి అర్హులకు తుది జాబితాలో చోటు కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మండలంలో డ్రాఫ్ట్ ప్రక్రియకు ముందు 33,493 మంది ఓటర్లు ఉండగా సర్ ప్రక్రియలో 3,371 ఓట్లు తొలగించడంతో ప్రస్తుతం 30,122 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. మండలంలో ప్రస్తుతం 36 పోలింగ్ స్టేషన్లు ఉండగా కొత్తగా మరో మూడు పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, తహసీల్దార్ రాజేశ్వర్‌రావు, స్థానిక సర్పంచ్ కట్కూరి రాధిక తదితరులు పాల్గొన్నారు.భూ రీసర్వేకు చర్యలుభూపాలపల్లి: జిల్లాలో భూదార్ కార్డుల జారీకి చేపట్టిన రీసర్వే పనులకు తగిన చర్యలు తీసుకోవడంతో పాటు 22ఏ నిషేధిత భూములపై అర్జీలు, భూభారతి, సాదాబైనామా, రెవెన్యూ సదస్సుల దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఆర్డీఓలు, తహసీల్దార్లు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులతో గురువారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడారు. ఈ నెల 31న రెవెన్యూ శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి రెవెన్యూ, హౌసింగ్ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నందున అధికారులు పూర్తి సమాచారంతో సన్నద్ధంగా ఉండాలన్నారు. జిల్లాలో గుర్తించిన 70 గ్రామాల్లో రీ సర్వేలో ఖచ్చితమైన కొలతలు నిర్వహించి పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, భూపాలపల్లి, కాటారం ఆర్డీఓలు హరికృష్ణ, రవీందర్, శిక్షణా డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కుసుమ కుమారి, సబ్ రిజిస్ట్రార్ బాలకిషన్, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ క్రీడా దినోత్సవంపై వర్చువల్ కార్యక్రమం
భూపాలపల్లి అర్బన్: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ‘ఖేలో ఇండియా సంవాద్ – ఖేల్ కీ బాత్, ప్రధానమంత్రి కే సాత్’ వర్చువల్ కార్యక్రమాన్ని భూపాలపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ ప్రసంగాన్ని విద్యార్థులు ప్రత్యక్షంగా వీక్షించారు. క్రీడలతో యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని మోదీ వివరించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రమణారావు మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడలకు సైతం సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ అధికారి రఘు, ఖేలో ఇండియా కోచ్ శ్రీనివాస్, మై భారత్ ప్రోగ్రాం ఆర్గనైజర్ సురేష్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ కవిత, కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
విజయగణపతితో మొదలు..
కాళేశ్వరం: కాళేశ్వరం దేవస్థానం రాతి కట్టడాలకు ఒక్కో అడుగు పడుతోంది. ఆలయ జీర్ణోద్దరణలో భాగంగా పాత ఆలయాల తొలగింపు పూర్తి కావడంతో సంబంధిత కాంట్రాక్టర్, ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో పనులు ప్రారంభించారు. డ్రాయింగ్, డిజైన్లలో స్వల్ప మార్పులు, చేర్పుల తర్వాత మార్కింగ్‌లు మొదలు పెట్టారు. పడమర, దక్షిణ గోపురాల మధ్య నైరుతి మూలన పూర్వం నుంచి ఉన్న విజయగణపతి ఆలయం స్థలంలోనే గురువారం మళ్లీ రాతి నిర్మాణానికి మార్కింగ్ ఇచ్చి ముగ్గుపోశారు. ప్రాకారానికి ముగ్గుపోసి మార్కింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. 12 ఫీట్ల మేర లోతు తవ్వకాలు జరిపి దిగువన భూమి నుంచి పైకి కాంక్రీట్, ఇనుముతో బేస్మెంట్ నిర్మాణం చేపట్టనున్నట్లు ఇంజనీర్లు తెలిపారు. క్రషర్ పనులు చేపట్టడానికి పక్కనే నీటి ట్యాంకు కూడా నిర్మించారు. ఇప్పటికే గ్రానైట్ స్టోన్, ఇనుము, సిమెంట్, ఇసుకను కాంట్రాక్టర్లు తెప్పించారు. పడమర వైపున నైరుతి నుంచి ఉత్తరం వైపున వాయువ్యం మూల వరకు 12 ఫీట్ల లోతు వరకు ప్రొక్లైయిన్తో తవ్వకాలు జరుపుతున్నారు. మొత్తం 360 ఫీట్ల పొడవుతో 280 ఫీట్ల వెడల్పుతో ఆలయ నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ప్రధాన ఆలయానికి ఆంధ్రప్రదేశ్‌లోని గురజపల్లిలో కృష్ణశిలకు ఆర్డర్ ఇచ్చినట్లు సమాచారం. చురుగ్గా కాళేశ్వరాలయ పునర్నిర్మాణ పనులు -
విధులకు సకాలంలో హాజరు కావాలి
● ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పోఎస్ఎస్తాడ్వాయి: వైద్యాధికారులు, సిబ్బంది విధులకు సకాలంలో హాజరు కావాలని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో సూచించారు. మండల పరిధిలోని కాటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని ఇన్‌పేషెంట్ రిజిస్టర్‌ను పరిశీలించారు. రోగుల వివరాలను సక్రమంగా నమోదు చేస్తున్నారా అని ఆరా తీశారు. రికార్డులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఆదేశించారు. రోగుల సహాయకులతో మాట్లాడి వైద్యసేవలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. దోమల నివారణకు నివాస ప్రాంతాల్లో ఇండోర్ రెసిడ్యువల్ స్ప్రేయింగ్ (ఐఆర్ఎస్) చేపడుతున్నారా అని ఆరా తీశారు. అన్ని నివాస ప్రాంతాల్లో ఐఆర్ఎస్ కవరేజీ ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. అనంతరం మందుల నిల్వ గదిని తనిఖీ చేసి మందుల గడువు తేదీలను పరిశీలించారు. పంపిణీ చేసే మందుల వివరాలను స్టాక్ రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు. అనంతరం ఫార్మసీని తనిఖీ చేసిన ఆయన రోగులకు మందులు పంపిణీ చేసే తీరును పరిశీలించారు. -
సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
రేగొండ: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సూచించారు. మండల కేంద్రంతోపాటు దమ్మన్నపేట, దుంపిల్లపల్లి, మడతపల్లిలో బుధవారం నిర్వహించిన ఆయా కార్యక్రమాల్లో ఆయన పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక ప్రజాహిత కార్యక్రమాలు చేపడుతోందని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో డీసీఎస్ఓ కిరణ్ కుమార్, డీఎం రాములు, తహసీల్దార్ శ్వేత, మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టయ్య, కోటంచ ఆలయ మాజీ చైర్మన్ సంపత్ రావు, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్వర రావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పున్నం రవి, సర్పంచులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. అలాగే, పంట పొలంలో కలుపు తీస్తుండగా నాటు బాంబు పేలి తీవ్ర గాయాలపాలైన మండలంలోని గూడెపల్లి గ్రామానికి చెందిన గుండె స్వర్ణలతను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పరామర్శించారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం చిట్యాల: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే సత్యనారాయణ రావు అన్నారు. మండలంలోని చల్లగరిగ, జూకల్, గోపాలపూర్, జడలపేట, నైన్పాక, వరికోల్‌పల్లి, బావుసింగ్‌పల్లి, ఒడితల, లక్ష్మీపూర్ తండా, పాసిగడ్డ తండా, దూత్‌పల్లి, కొత్తపేట, గిద్దెముత్తారం, కాల్వపల్లి, అందుకు తండా, చైన్పాక, వెంచరామి, తిర్మలాపూర్, రాంచంద్రాపూర్, ముచినిపర్తి, కైలాపూర్, గుంటూరుపల్లి, చిట్యాల, ఏలేటి రామయ్యపల్లి, నవాబుపేట, చింతకుంట రామయ్యపల్లి గ్రామాల్లో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రాములు, తహసీల్దార్ వసంతరావు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు -
భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి
● జీఎం ఏనుగు రాజేశ్వర్రెడ్డిభూపాలపల్లి అర్బన్: ఉత్పత్తి లక్ష్యాల సాధనతో పాటు ఉద్యోగుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు భూపాలపల్లి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి సూచించారు. ఏరియా జీఎం కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం నిర్వహించిన సేఫ్టీ రివ్యూ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఏరియా సేఫ్టీ అధికారి మాటూరి రవీందర్ సమావేశానికి అధ్యక్షత ఏర్పాటు చేసిన సమీక్షలో ఏరియాలోని అన్ని గనులు, విభాగాల్లో అమలవుతున్న భద్రతా చర్యలు, సేఫ్టీ నిబంధనల అమలు, ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న ముందస్తు చర్యలు, ఉద్యోగుల భద్రత, తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. ఆయా విభాగాల్లో భద్రతకు సంబంధించిన సమస్యలను జీఎం దృష్టికి అధికారులు తీసుకురాగా, వాటిపై చర్చించి అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు. భద్రతే ప్రధానం అనే భావనతో ప్రతీ అధికారి, ఉద్యోగి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని జీఎం తెలిపారు. సమావేశంలో ఏరియా ఇంజనీర్ సాంబశివరావు, సెక్యూరిటీ ఆఫీసర్ మురళీమోహన్, జీవీటీవీ మేనేజర్ నజీర్, సేఫ్టీ విభాగం అధికారులు పాల్గొన్నారు. -
నెల రోజుల్లో ధరల వ్యత్యాసం ఇలా..
భూపాలపల్లి: ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు నాగులో నాగన్న.. ధరలిట్లా మండవట్టె నాగులో నాగన్న అనే ఓ పాత సినిమా పాట ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతోంది. నెల రోజులుగా నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతుండడంతో పేద, మధ్య తరగతి కుటుంబాలు బెంబేలెత్తుతున్నాయి. కూలీనాలి చేయగా వచ్చిన డబ్బులతో కనీస సరుకులు కొనలేని దుస్థితి నెలకొందని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులుగా ౖపైపెకి నిత్యావసర సరుకుల ధరలు నెల రోజుల క్రితం వరకు కొంతమేర అదుపులో ఉండగా ప్రస్తుతం ఆకాశాన్ని అంటుతున్నాయి. ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, కందిపప్పు, వంటనూనెలు, మసాలాలు, కారంపొడి, ఎండు చేపలు, రొయ్యల ధరలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. చక్కెర, బొమ్మిడాయల ధరలు మాత్రం డబుల్ అయింది. పెరుగుతున్న ధరలను చూసి పేదలు ఖంగుతింటున్నారు. చక్కెర కిలో రూ.45 నుంచి రూ.70కి.. చక్కెర ధర వ్యాపారులు సైతం ఊహించని రీతిలో పెరిగింది. నెల రోజుల క్రితం వరకు కిలో ధర రూ.42 ఉండగా, అనంతరం రూ.43, 45, 48, రూ.50కి చేరుకొని ఇప్పుడు ఏకంగా రూ.70కి చేరువలో ఉంది. నాణ్యమైన మొదటి రకం చక్కెర రూ.73కు లభిస్తోంది. రాఖీ పండుగ సందర్భంగా స్వీట్లు ఎక్కువగా వినియోగిస్తారు. ఈ సమయంలో చక్కెన ధర పెరగడంతో వ్యాపారులు పలు రకాల స్వీట్ల ధరలను కూడా పెంచేశారు. ఘాటెక్కిన మసాలాలు వారం రోజుల క్రితం కిలో ఇలాచీల కిలో ధర రూ.4,200 ఉండగా, ఇప్పుడు రూ.5 వేలకు చేరింది. అలాగే, ధనియాల ధర నెల క్రితం కిలోకు రూ.160కి విక్రయించగా, ప్రస్తుతం రూ.220కి అమ్ముతున్నారు. అల్లం మాత్రం కొంత ఉపశమనం కలిగించింది. పది రోజుల క్రితం వరకు కిలో రూ.240కి లభించగా ఇప్పుడు కొత్త అల్లం మార్కెట్లోకి రావడంతో రూ.200కే విక్రయిస్తున్నారు. ఎండు చేపలు కొనలేం.. రాష్ట్రంలో సాధారణంగా కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు పెరిగిన సమయంలో ప్రత్యామ్నయంగా ఎండు చేపలు, రొయ్యలను ప్రజలకు ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే, ప్రస్తుతం సముద్ర తీర ప్రాంతాల్లో వర్షం కురుస్తుండడంతో మత్స్యకారులు వేటకు వెళ్లలేని పరిస్థితి. అంతేకాక పచ్చి వాటిని ఎండబెట్టేందుకు అవకాశం లేదు. దీంతో వాటి ధర డబుల్ అయింది. గతంలో బొమ్మిడాయలు కిలోకు రూ.450 ఉండగా, ఇప్పుడు రూ.900, ఎండు రొయ్యలు రూ.450 కాగా, ప్రస్తుతం రూ.700కు విక్రయిస్తున్నారు. ధర పెరిగినప్పటికీ బొమ్మిడాయలు లభించడం లేదని, నాణ్యత లేనివే వస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. అలాగే, మెత్తలు గతంలో రూ.380 నుంచి రూ.400 వరకు ఉండగా, ప్రస్తుతం కిలో రూ.450కి అమ్ముతున్నారు. పండుగల వేళ ధరల మోత శుక్రవారం రాఖీ పౌర్ణమి, అక్టోబర్‌లో బతుకమ్మ, దసరా పండుగలు ఉన్నాయి. ఈ సమయంలోనే నిత్యావసర సరుకులైన ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, మసాలాలు, పప్పు దినుసుల ధరలు విపరీతంగా పెరడంతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. అయితే, ధరలు ఇలాగే కొనసాగితే పండుగల సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు తప్పేలా లేవు. శ్రావణం ప్రభావంతో.. మసాలాలు, సరుకుల ధరలు తీవ్రంగా పెరుగుతుండగా శ్రావణమాస ప్రభావంతో కోడిగుడ్లు, చికెన్ ధరలు కొంత మేర తగ్గాయి. పక్షం రోజుల క్రితం వరకు ఒక కోడిగుడ్డును రూ.7కు విక్రయించగా, ఇప్పుడు రూ.6 నుంచి రూ.6.50 వరకు లభిస్తోంది. శ్రావణ మాసానికి ముందు చికెన్ ధర కిలో రూ.320 నుంచి రూ.340 వరకు ఉండగా, ఇప్పుడు విత్ స్కిన్ రూ.240, స్కిన్లెస్ రూ.260కి అమ్ముతున్నారు.సరుకులు పాత ధర ప్రస్తుత ధర (కిలో రూ.లలో) చక్కెర 45 70 ఉల్లిగడ్డ 35 60 ఎల్లిగడ్డ 120 250 పల్లీలు 145 180 వంటనూనె 170 185 కారంపొడి 300 340 కందిపప్పు 120 160 రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసరాల రేట్లు చక్కెర, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ పిరం నశాలానికి అంటుతున్న మసాలాలు ఎండు రొయ్యలు, బొమ్మిడాలు కొనలేని పరిస్థితి శ్రావణం ఎఫెక్ట్‌తో కాస్త తగ్గిన గుడ్లు, చికెన్ వెలలు -
మేడిగడ్డకు ప్రాణహిత వరద
కాళేశ్వరం: మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నది వరద మేడిగడ్డ బ్యారేజీకి పోటెత్తింది. బుధవారం ఉదయం 1.51 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఎగువ నుంచి తరలిరాగా, సాయంత్రానికి 1.29 లక్షల క్యూసెక్కులకు తగ్గి మేడిగడ్డకు చేరుతోంది. దీంతో బ్యారేజీలో మొత్తం 85గేట్లు ఎత్తి నీటిని దిగువకు అదేస్థాయిలో ఔట్‌ఫ్లో రూపంలో తరలిస్తున్నారు. కాగా, మంగళవారం 1.44 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో తరలిపోయింది. ఎగువ నుంచి వచ్చే వరద తగ్గుముఖం పడుతున్నట్లు ఇంజనీర్లు చెబుతున్నారు. నేటి నుంచి గ్రామసభలు ములుగు: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా నేటి నుంచి జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో గ్రామ, వార్డు సభలు నిర్వహించాలని ములుగు కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సభల్లో అధికారులు తమ పరిధిలోని ఓటరు జాబితాలను ప్రజల సమక్షంలో చదివి వినిపిస్తారని పేర్కొన్నారు. ఓటర్లు తమ పేరు, చిరునామా, ఇతర వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించుకునేందుకు అవకాశం కల్పిస్తారని వివరించారు. పేరు లేకపోయినా, కొత్త ఓటరు కావాల్సిన వారికి ఫామ్ 6తో దరఖాస్తు చేయాలని, ఫామ్ 7 సవరణలు, ఫామ్ 8 ద్వారా బదిలీ చేపట్టాలని వెల్లడించారు. 1950 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా మరింత సమాచారం తెలుసుకోవాలని కోరారు.రామప్పలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని రామప్ప దేవాలయాన్ని బుధవారం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయ్యంగార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్‌లు వారికి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ చరిత్ర, శిల్పకళ ప్రాముఖ్యత గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్‌కుమార్ వారికి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకతీయుల శిల్పకళకు తలమానికం రామప్ప దేవాలయమని కొనియాడారు. అనంతరం రామప్ప చెరువు సందర్శించి బోటింగ్ చేశారు. వారివెంట ఈఓ ఇమ్మడి భాస్కర్, టూ రిస్ట్ పోలీసులు శ్రీనివాస్, దేవాదాయ, పురా వస్తు,టూరిజం శాఖల అధికారులు ఉన్నారు. విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని వినతి ములుగు: జిల్లా కేంద్రంలోని కృష్ణకాలనీలో విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని విద్యుత్‌శాఖ ఏఈకి వినతి పత్రాన్ని కాలనీ వాసులు బుధవారం విద్యుత్‌శాఖ కార్యాలయం వద్ద బుధవారం అందజేశారు.కృష్ణకాలనీలోని 15వ వార్డులో లోవోల్టేజీ సమస్యతో ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోతున్నాయని వార్డు కౌన్సిలర్ వాణికుమార్ ఏఈకి వివరించారు. కార్యక్రమంలో కాలనీవాసులు సంపత్, గండ్రకోట కుమార్, రమేశ్, నాగేశ్వర్రావు, సుధాకర్, శంకర్, కుమార్, సంపత్, ఇక్బాల్ పాల్గొన్నారు. రాఖీ మహోత్సవం ఏటూరునాగారం: మండలంలోని చిన్నబోయిపల్లికి చెందిన సంతోష్, రాజేందర్, సమ్మయ్య తదితరుల ఆధ్వర్యంలో బుధవారం రాఖీ మహోత్సవాన్ని నిర్వహించారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థిని, విద్యార్థులకు 1200 మందికి కట్టించి రాఖీ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించినట్లు విశ్వహిందూ పరిషత్ నాయకులు ప్రవీణ్‌కుమార్ తెలిపారు. పాఠశాలల్లో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో పలు రకాల కార్యక్రమాలను చేపట్టినట్లు ప్రవీణ్ కుమార్ వివరించారు. -
35 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
భూపాలపల్లి అర్బన్: పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని భూపాలపల్లి సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. కలెక్టరేట్ సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం తనిఖీలు నిర్వహిస్తుండగా అక్రమంగా తరలిస్తున్న సుమారు 35 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని గుర్తించారు. ఈ సందర్భంగా టాటా ఏస్ ట్రాలీని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో పట్టణంలోని సీఆర్ నగర్‌కాలనీకి చెందిన పావనపు రాజు (డ్రైవర్), నీలుగొండ రమేష్ ఉన్నారు. నిందితులపై చట్టపరమైన చర్యల నిమిత్తం కేసును పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. -
ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు
● సీసీఎఫ్ డాక్టర్ ప్రభాకర్మల్హర్ (కాటారం): కాటారం మండలం ప్రతాపగిరి గ్రామపంచాయతీ పరిధిలోని గొంతెమ్మ గుట్టపై ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు చీఫ్ కన్జర్వర్టర్ ఆఫ్ ఫారెస్ట్ (సీసీఎఫ్) డాక్టర్ ప్రభాకర్ తెలిపారు. అటవీశాఖ అధికారులతో కలిసి గొంతెమ్మ గుట్టను ఆయన బుధవారం సందర్శించారు. ట్రెక్కింగ్ చేసి గుట్టపైకి చేరుకున్నారు. గొంతెమ్మ గుట్ట చరిత్ర, పర్యాటక విశేషాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాచీన ఆనవాళ్లు, ప్రాముఖ్యంపై ఆరా తీశారు. పర్యాటకం అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలు, పర్యాటకుల భద్రత, సౌకర్యాల కోసం చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీసీఎఫ్ ప్రభాకర్ మాట్లాడుతూ గొంతెమ్మ గుట్టను పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దడం కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం, వన మహోత్సవంలో భాగంగా ప్రతాపగిరి గ్రామపంచాయతీ పరిధిలో అధికారులతో కలిసి పలు మొక్కలు నాటారు. కార్యక్రమంలో మహాదేవపూర్, భూపాలపల్లి ఎఫ్డీఓలు సందీప్, అప్పలకొండ, ఎఫ్ఆర్ఓ స్వాతి, డిప్యూటీ రేంజర్ సురేందర్, ఎఫ్‌బీఓలు, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
గురువారం శ్రీ 27 శ్రీ ఆగస్టు శ్రీ 2026
కాజీపేట అర్బన్ : ‘నా దారి రహదారి.. బెటర్ డోంట్ కమిన్ టు మై వే’ అనే సినిమా డైలాగ్‌ను తలపిస్తూ ‘మెరుగైన రహదారుల నిర్మాణానికి అవసరమైన డేటా అందించడమే నా దారి’ అంటూ ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన సప్తగాన్ వాహనం ఇటీవల నిట్ వరంగల్‌కు చేరుకుంది. భారతదేశంలోనే తొలిసారిగా హరియాణా, గురుగ్రామ్‌లో అడ్వాన్స్ టెక్నాలజీ, రూ.30 కోట్ల వ్యయంతో దీన్ని రూపొందించారు. నిట్‌తో ఎంఓయూ..ఆధునిక టెక్నాలజీతో రూపకల్పన మెరుగైన రహదారుల నిర్మాణంలో కీలకం నిట్ వరంగల్‌తో ఎంఓయూ.. ఇటీవల పనితీరును పరిశీలించిన విద్యార్థులు ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ విద్యార్థుల పరిశోధనకు ఉపయుక్తంమెరుగైన రవాణా సౌకర్యం, రహదారుల నిర్మాణాల్లో లోపాన్ని పసిగట్టడం, ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ పరిశోధనలకు దేశవ్యాప్తంగా ఈ సప్తగాన్ ప్రయాణం చేస్తోంది. ఇందులో మన ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ విద్యార్థులను భాగస్వాములను చేసేందుకు ఇటీవల సప్తగాన్ ఏషియా సంస్థ నిర్వాహకులు, నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. భారత ప్రభుత్వం వికసిత్ భారత్, మేక్ ఇన్ ఇండియా విజన్‌లో భాగంగా ఈ వాహనాన్ని ఇక్కడికి తీసుకురాగా, వాహన పనితీరును విద్యార్థులు ప్రత్యక్షంగా వీక్షించారు. వాహన పనితీరుపై పూర్తిస్థాయిలో అవగాహన ఏర్పర్చుకున్నారు. -
వాతావరణం
జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురుస్తాయి. రాత్రి వర్షం కురిసే అవకాశం ఉంది.నిట్ వరంగల్‌లోని ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ విద్యార్థుల పరిశోధనలకు సప్తగాన్ ఏషియా వాహన పనితీరు తోడ్పడుతుంది. మెరుగైన రహదారులు, రవాణా సౌకర్యం నిర్మాణానికి ఆయా ప్రదేశాల డేటా అవసరం. అలాంటి డేటాను సప్తగాన్ అందజేస్తుంది. నేషనల్ హైవేలో నిర్మించే రహదారులపై అవసరమైన సూచనలు, పరిశీలన వివరాలను భారత ప్రభుత్వం.. నిట్ వరంగల్‌నుంచి కోరుతోంది. అలాంటి పరిశీలనలకు సప్తగాన్ ఏషియాతో ఒప్పందం ఎంతో ఉపయోగపడుతుంది. – శంకర్, సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్, సప్తగాన్ ఏషియా కో–ఆర్డినేటర్


