‘రామప్ప శిల్పకళ బాగుంది’ | - | Sakshi
Sakshi News home page

‘రామప్ప శిల్పకళ బాగుంది’

Feb 11 2026 7:46 AM | Updated on Feb 11 2026 7:46 AM

‘రామప్ప శిల్పకళ బాగుంది’

‘రామప్ప శిల్పకళ బాగుంది’

‘రామప్ప శిల్పకళ బాగుంది’

వెంకటాపురం(ఎం): రామప్ప శిల్పకళ బాగుందని శిక్షణ అధికారులు కొనియాడారు. మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని మంగళవారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న అధికారులు సందర్శించారు. భారత్‌ దర్శన్‌ స్టడీ టూర్‌లో భాగంగా శిక్షణ తీసుకుంటున్న 75 మంది అధికారులు ఆలయాన్ని సందర్శించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. పూజారులు వారికి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. నందీశ్వరుడిని దర్శించుకుని గ్రూప్‌ ఫొటోలు దిగారు. ఆలయ విశిష్టతను గైడ్‌ విజయ్‌కుమార్‌ వివరించారు. వారి వెంట ఎంసీహెచ్‌ఆర్‌డీ అధికారులు, టూరిస్ట్‌ పోలీసులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement