మున్సిపోల్‌కు సిద్ధం
భూపాలపల్లి పురపాలికలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి
భూపాలపల్లి అర్బన్: మున్సిపల్ ఎన్నికలను నేడు (బుధవారం) నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. భూపాలపల్లి మున్సిపాలిటీలో 30 వార్డులు ఉండగా 86 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తంగా 52,726 మంది ఓటర్లు ఉండగా పురుషులు 26,786, మహిళలు 25,936 ఉన్నారు. నలుగురు ఇతరులు ఉన్నారు. జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో బ్యాలెట్ బాక్సుల డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను ఏర్పాటుచేయగా.. మంగళవారం సామగ్రితో ఎన్నికల నిర్వహణ సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేశారు. తాగునీరు, టెంట్ సౌకర్యాలు కల్పించి, వీల్‌చైర్లు అందుబాటులో ఉంచారు.
6 జోన్లు.. 8 రూట్లు
30 వార్డుల్లోని 86 పోలింగ్ కేంద్రాలను 6 జోన్లు, 8 రూట్లుగా విభజించారు. ఎన్నికల నిర్వహణకు 561 మంది పోలింగ్ అధికారులు, సిబ్బందిని నియమించారు. పీఓ, ఏపీఓ, ఓపీఓ, ఆర్‌ఓ, ఏఆర్‌ఓ, మైక్రోఅబ్జర్వర్లు, వెబ్ కాస్టింగ్ సిబ్బందిని నియమించారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. ఓటర్లు పోలింగ్ బూత్‌ల వివరాలను తెలిపేందుకు బీఎల్‌ఓలను అందుబాటులో ఉంచనున్నారు.
పోలింగ్ సందర్భంగా ఎటువంటి ఘటనలూ చోటు చేసుకోకుండా, ఓటింగ్ సరళిని పరిశీలించేందుకు పోలింగ్‌్ కేంద్రాల్లో అసౌకర్యాలు, ఓటర్ల ఇబ్బందులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రతీ పోలింగ్ కేంద్రంలో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశారు. 86 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ సిబ్బందిని నియమించారు. 27 మంది మైక్రో పరిశీలకులను నియమించారు.
30 వార్డులు.. 86 బూత్‌లు
పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లిన
పోలింగ్ సిబ్బంది


