breaking news
Jayashankar District News
-
ఫలితాలు మెరుగుపడేనా?
భూపాలపల్లి అర్బన్: ఇన్చార్జ్ అధికారుల పాలన, అంతకుమించి పనిఒత్తిడి, హెచ్ఎం, ఉపాధ్యాయులకు సర్వేలు తదితర బోధనేతర పనులు అప్పగించడంతో ఈసారి విద్యార్థుల ఉత్తీర్ణతపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోవైపు పదో తరగతి, ఇంటర్ వార్షిక పరీక్షల తేదీలు ఖరారు కావడంతో విద్యార్థులతోపాటు ఉసాధ్యాయులకు కూడా పరీక్షగా మారింది. ఎంఈఓలు, డీఈఓ ఇన్‌చార్జ్‌లే.. విద్యాశాఖలో ఎంఈఓల నుంచి డీఈఓ వరకు ఇన్‌చార్జ్‌ల పాలన సాగుతోంది. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు పాఠశాలల్లో బోధన పనుల కంటే ప్రభుత్వ కార్యక్రమాలు, సర్వేలు, ఎన్నికల విధులు వంటివి అధికంగా నిర్వహిస్తున్నారు. అసలే ఇన్‌చార్జ్‌ల పాలన ఆపై వివిధ రకాల విధులతో బోధన, విద్యార్థులపై పర్యవేక్షణ కొరవడినట్లు కనిపిస్తోంది. గతేడాది పదో తరగతి, ఇంటర్మీడియట్లలో చెప్పుకోదగిన ఫలితాలు రాలేదు. ఈ ఏడాది సబ్జెక్ట్ టీచర్లు ఉన్నా ఇతర పనులు ఎక్కువ కావడంతో పర్యవేక్షణ లేకుండా పోయింది. దీంతో విద్యార్థుల ఉత్తీర్ణతపై ప్రభావం పడే అవకాశం ఉంది. కొనసాగుతున్న ప్రత్యేక తరగతులు పదో తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. మెరుగైన ఫలితాల కోసం పదో తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఇక ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సాయంత్ర వేళ గంటపాటు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ వార్షిక పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని 122 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, గురుకుల నుంచి 3,548 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. వీరితోపాటు మరో 8 మంది సప్లిమెంటరీ విద్యార్థులు కూడా పరీక్షకు హాజరుకానున్నారు. గతేడాది పదో తరగతి పరీక్షల్లో జిల్లా రాష్ట్ర స్థాయిలో 22వ స్థానంలో నిలువగా 92.96శాతం ఉత్తీర్ణత సాధించింది. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 56.46శాతం, ద్వితీయ సంవత్సరంలో 72.7 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, రాష్ట్ర స్థాయిలో జిల్లాకు 6వ స్థానం లభించింది. ఫిబ్రవరి 25నుంచి ఇంటర్ పరీక్షలు ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఇంటర్ ఫస్టియర్ 1,644 మంది విద్యార్థులు, సెకండియర్‌లో 1,566 మంది విద్యార్థులు వార్షిక పరీక్షలు రాయనున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలు ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మార్చి 17వ తేదీ వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 18వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ప్రాక్టికల్ పరీక్షలు మొదలు కానున్నాయి. ఉత్తీర్ణత పెంచేందుకు చర్యలుజిల్లాలో పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత పెంచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. సాయంత్రం ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నాం. స్లిప్ టెస్టులను నిర్వహించి, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాం. గతేడాదికంటే ఈ ఏడాది ఉత్తీర్ణత పెరుగుతుంది. – రాజేందర్, ఇన్చార్జ్ డీఈఓ పదో తరగతి, ఇంటర్ వార్షిక పరీక్షల తేదీలు ఖరారు ఇన్చార్జ్ పాలనలో కొనసాగుతున్న విద్యాశాఖ గతేడాది కంటే ఈసారి ఉత్తీర్ణత పెరిగేనా?మార్చి 14నుంచి పదో తరగతి..పదో తరగతి వార్షిక పరీక్షలు మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు నిర్వహించనున్నారు. జనవరిలో ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రీ ఫైనల్ పరీక్షల్లో వచ్చే మార్కుల ఆధారంగా వెనుకబడిన విద్యార్థులను గుర్తిస్తామని, అనంతరం వారిపై ప్రత్యేక శ్రద్ధ పెడతామని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. గతేడాది కంటే ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నామని పేర్కొంటున్నారు. -
యమబాధలు తొలగి.. ముక్తి పొంది
కాళేశ్వరం : కాళేశ్వరముక్తీశ్వరుడిని దర్శించుకుంటే యమబాధలు తొలగి..ముక్తి పొందుతారని ఉత్తర్‌ప్రదేశ్‌లోని మలూక్ పీఠాధితి రాజేంద్రదాస్‌జీ వృందావన్ భక్తులకు ప్రవచనంలో వినిపించారు. సోమవారం స్వామిజీ మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామివారి గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేశారు. కల్యాణ మండపం వద్ద స్వామిజీని ఈఓ మహేష్ కండువాతో సన్మానించారు. ఈ సందర్భంగా స్వామిజీ మాట్లాడుతూ..అలహాబాద్‌లోని గంగా, యమున, సరస్వతి ఎంత ప్రసిద్ధి చెందినవో.. ఇక్కడ గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిణి సరస్వతి నదుల్లో భక్తులు స్నానాలు చేస్తే అంతటి మహాభాగ్యం పొందుతారని అన్నారు. 2026, మే 21నుంచి జూన్ 1వరకు సరస్వతినదికి అంత్యపుష్కరాలు జరుగుతాయని, భక్తులు పుణ్యస్నానాలు చేసి పునీతులు కావాలని కోరారు. ఆయా రాష్ట్రాల నుంచి సుమారుగా 600మంది సాధువులు, మండలేశ్వరులు, మహామండలేశ్వరులతో కలిసి గోదావరి పరిక్రమణ (ప్రదక్షిణ) యాత్రలో భాగంగా కాళేశ్వరం క్షేత్రానికి విచ్చేశారు. కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై తమాషారెడ్డిలు పోలీసు బందోబస్తు నిర్వహించారు. ఆలయ ఉద్యోగి జేబునుంచి నగదు చోరీ కాళేశ్వరాలయ ఉద్యోగి జేబులో నుంచి రూ.48వేల నగదును గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన పీఠాధిపతి మలూక్ రాజేంద్రదాస్‌జీ వస్తున్న క్రమంలో ఆలయ ఉద్యోగి రాజశేఖర్ తన ప్యాంటు జేబులో రూ.48వేల నగదు పెట్టుకున్నాడు. దీంతో భక్తజనం గుండా ఓ గుర్తుతెలియని వ్యక్తి తన జేబులోని నగదును దొంగిలించాడు. అక్కడి సీసీ కెమెరాలో ఉద్యోగి వద్దకు దొంగ వచ్చే వరకు మాత్రమే నిక్షిప్తమైంది. తర్వాత జేబు చూసుకొని ఉద్యోగి కంగుతిన్నాడు. ఈఓ మహేష్‌కు తెలుపడంతో పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ డబ్బులు దేవస్థానం గదుల కిరాయికి సంబంధించినవని ఆ ఉద్యోగి పేర్కొన్నాడు. అంత్య పుష్కరాల్లో స్నానాలు చేయాలి యూపీలోని మలూక్ పీఠాధితి రాజేంద్రదాస్‌జీ -
ఎన్నికల విధులు అత్యంత కీలకం
భూపాలపల్లి : ఎన్నికల విధులు అత్యంత కీలకమని కలెక్టర్ రాహుల్ శర్మ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండోదశలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల విధులకు గైర్హాజరైన 73 మంది పీఓ, ఓపీఓలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. విధులకు హాజరు కాని సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేసి, ఎన్నికల సంఘం నిబంధనల మేరకు క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు వివరించారు. నిర్దేషిత గడువులోగా సరైన వివరణ ఇవ్వని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మూడోవిడతకు ఏర్పాట్లు చేయాలి.. స్థానిక సంస్థల మూడో విడత ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయం నుంచి ఎన్నికలు జరుగనున్న కాటారం, మల్హర్, మహదేవపూర్, మహాముత్తారం మండలాల రెవెన్యూ, ఎంపీడీఓలు, మండల ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణలో భాగంగా 16న పోలింగ్ సామగ్రి పంపిణీ, 17న పోలింగ్, 2 గంటల తదుపరి ఓట్ల లెక్కింపు తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు. విధులు కేటాయించిన సిబ్బంది 16వ తేదీ ఉదయం 10 గంటల వరకు మెటీరియల్ పంపిణీ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు విధులు కేటాయించిన సిబ్బందికి మూడో విడత ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు నిర్వహించినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ నవీన్‌రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. మూడో విడతకు పకడ్బందీ ఏర్పాట్లు గైర్హాజరైన 73 మందికి షోకాజ్ నోటీసులు కలెక్టర్ రాహుల్ శర్మ -
ప్రలోభాల పర్వం
ముగిసిన మూడో విడత ఎన్నికల ప్రచారంకాటారం: గ్రామపంచాయతీ ఎన్నికల మూడో విడత ఘట్టం తుది దశకు చేరుకుంది. జిల్లాలోని కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్ మండలాల్లో మూడో విడతలో భాగంగా సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు కొనసాగనున్నాయి. దీంతో గ్రామాల్లో రాజకీయం వేడెక్కింది. మూడో విడతలో భాగంగా నాలుగు మండలాల్లో ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ 9న అభ్యర్థుల తుది జాబితా, గుర్తుల కేటాయింపు జరిగింది. అభ్యర్థుల ప్రచారాలు సోమవారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. వారం రోజుల పాటు మైకుల హోరు.. అభ్యర్థులు, నాయకుల ప్రసంగాల జోరుతో సందడిగా ఉన్న పల్లెలు ప్రస్తుతంగా ప్రశాంతంగా మారిపోయాయి. ఓటింగ్‌కు కేవలం ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉండటంతో అభ్యర్థులు ఓటర్లను ప్రత్యేకంగా ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. తమదైన స్థాయిలో ఓటర్లకు ప్రలోభాలు ఎరవేస్తూ ఓటును దక్కించుకునే పనిలో ఉన్నారు. నగదు, మద్యం, మాంసం పంపిణీ చేస్తూ ఓటర్లను తమ గుప్పిట్లోకి తెచ్చుకుంటున్నారు. 4 మండలాలు.. 81 సర్పంచ్ స్థానాలు జిల్లాలో గ్రామపంచాయతీ మూడో విడత ఎన్నికలు కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్ మండలాల్లో కొనసాగనున్నాయి. నాలుగు మండలాల్లో 81 సర్పంచ్ స్థానాలు, 696 వార్డు స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. తుది జాబితా అనంతరం మూడు సర్పంచ్ స్థానాలు, 126 వార్డు సభ్యుల స్థానాలు ఏకగీవ్రం కావడంతో 78 సర్పంచ్ స్థానాలకు, 570 వార్డు స్థానాలకు ఎన్నికలు కొనసాగుతున్నాయి. 297 మంది సర్పంచ్ అభ్యర్థులు, 1,423 మంది వార్డు సభ్యుల అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రలోభాలు షురూ.. ఓటింగ్‌కు ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉండటంతో అభ్యర్థులు గెలుపు కోసం నానా పాట్లు పడుతున్నారు. అభ్యర్థులు తమ తమ గ్రామపంచాయతీల్లో ఓటర్లను పలు రకాలుగా ప్రలోభాలకు గురి చేస్తూ తమ గుప్పిట్లోకి తెచ్చుకుంటున్నారు. ఓటర్లను నేరుగా కలుస్తూ నగదు, మధ్యం పంపిణీ చేయడం ప్రారంభించారు. పెద్ద గ్రామపంచాయతీల్లో ఓటుకు రూ.1000 నుంచి రూ.2 వేలు, చిన్న గ్రామ పంచాయతీల్లో రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు సర్పంచ్ అభ్యర్థులు పోటాపోటీగా పంపిణీ చేయడం మొదలు పెట్టారు. కాటారం, గంగారం, మహాముత్తారం మండలం మహాముత్తారం, నర్సింగాపూర్, మీనాజీపేట, బోర్లగూడెం, మహదేవపూర్ మండలం మహదేవపూర్, కాళేశ్వరం, అంబట్పల్లి, మల్హ ర్ మండలం తాడిచెర్ల, అన్సాన్పల్లి, వలెంకుంట, కొయ్యూర్, ఎడ్లపల్లి గ్రామపంచాయతీల్లో పోటీ హోరాహోరీ ఉండగా డబ్బు, మందు, ఇతర గిఫ్టులు ప్రభావం చూపనున్నాయి. హోరాహోరీగా ప్రచారం.. మూడో విడత గ్రామపంచాయతీల్లో ప్రచారం సోమవారం చివరి రోజు హోరెత్తించారు. సర్పంచులు, వార్డు సభ్యులు గెలుపు కోసం ఇంటింటా తిరిగి ఓట్లు అభ్యర్థించారు. పలు మండలాల్లోని గ్రామపంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు పోటా పోటీగా ర్యాలీలు నిర్వహించారు. గ్రామపంచాయతీ అభివృద్ధికి తమ సొంత మేనిఫెస్టోలను ప్రకటిస్తూ ఓటు వేసి గెలిపించాలని కోరారు. వలస ఓటర్లను రప్పించే పనిలో... కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్ మండలాల్లోని పలు గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు వలుస ఓటర్లపై నిఘా పెట్టారు. పట్టణాలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లను ఓటింగ్ రోజు రప్పించే పనిలో నిమగ్నమయ్యారు. అధిక మంది ఓటర్లు పట్టణ ప్రాంతాల్లో ఒకే చోట ఉంటే అభ్యర్థులు అక్కడికే వెళ్లి నేరుగా వారిని కలుస్తున్నారు. అంతేకాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్న యువ ఓటర్లకు రవాణా చార్జీలు సైతం పంపించి వారిని ఓటు కోసం ఇక్కడకు వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. మద్యం దుకాణాలు క్లోజ్ మూడో విడత ఎన్నికల్లో భాగంగా సోమవారం సాయంత్రం నుంచి కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్ మండలాల్లోని మద్యం దుకాణాలు మూసుకున్నాయి. సాయంత్రం 5 గంటల తర్వాత పది వైన్ షాపులకు ఎకై ్సజ్ అధికారులు సీల్ వేశారు. బెల్టు దుకాణాలు, మద్యం సరఫరాపై పోలీస్, ఎకై ్సజ్ అధికారులు దృష్టి సారించారు. రేపు కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్ మండలాల్లో పంచాయతీలకు పోలింగ్ ఓటర్లను ఆకట్టుకునే పనిలో అభ్యర్థులు గెలుపు కోసం నానా పాట్లు నగదు, మందు, మాంసం పంపిణీ -
ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించాలి
● అదనపు కలెక్టర్ విజయలక్ష్మి కాటారం : స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఓటింగ్, కౌంటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి అధికారులకు సూచించారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. నమోదైన పోస్టల్ బ్యాలెట్ల వివరాలు, ఎన్నికల సామగ్రి, కౌంటింగ్ ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోస్టల్ బ్యాలెట్‌ను భద్రపర్చాలని తెలిపారు. ఓటింగ్, కౌంటింగ్ సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల సామగ్రి పంపిణీ, కౌంటింగ్‌కు పూర్తి ఏర్పాట్లు చేయాలని కోరారు. ఎంపీడీఓ బాబు, ఎంపీఓ వీరస్వామి, ఆర్ఓలు ఉన్నారు. -
శాంతిభద్రతలకు విఘాతం కలగొద్దు
● మద్యం, నగదు పంపిణీపై దృష్టిసారించాలి ● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ భూపాలపల్లి/కాళేశ్వరం : కాటారం సబ్‌డివిజన్‌లో మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరిగే నాలుగు మండలాల్లో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగొద్దని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పోలీసు అధికారులకు, సిబ్బందికి ఆదేశించారు. సోమవారం ఆయన కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ ఎన్.వెంకటేశ్వర్లుతో కలిసి మహదేవపూర్ మండలంలో పర్యటించారు. కాళేశ్వరంలోని అంతర్రాష్ట్ర చెక్‌పోస్టును పరిశీలించి, పోలీసు స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి భద్రత ఏర్పాట్ౖలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సమయంలో అక్రమ రవాణా, నగదు, మద్యం తరలింపుపై ప్రత్యేక దృష్టిసారించాలని, నిరంతర తనిఖీలు కొనసాగించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుంపులుగా చేరడం పూర్తిగా నిషేధమని హెచ్చరించారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తే చర్యలు తప్పవన్నారు.పోలింగ్ ముగిసిన అనంతరం విజయోత్సవ ర్యాలీలు, సంబురాలు నిర్వహించడం నిషేధించామని ఎస్పీ సంకీర్త్ పేర్కొన్నారు. ఎస్పీతో కాళేశ్వరం, మహదేవపూర్ ఎస్సైలు తమాషారెడ్డి, పవన్‌కుమార్, రెండో ఎస్సై సాయిశశాంక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
రెండు ఓట్లతో గెలుపు
వెంకటాపురం(ఎం) : మండలంలోని మల్లయ్యపల్లి గ్రామానికి చెందిన జాటోత్ గణేష్ ప్రత్యర్థిపై రెండు ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆదివారం జరిగిన రెండో విడత ఎన్నికల్లో జర్పుల హేమాపై గణేష్ రెండు ఓట్లతో విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. తొలుత ఒక్క ఓటుతోనే గణేష్ గెలుపొందినట్లు అధికారులు ప్రకటించగా, రీకౌంటింగ్ కావాలని ప్రత్యర్థి హేమా కోరడంతో వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ తలెత్తడంతో సమాచారం అందుకున్న ములుగు డీఎస్పీ రవీందర్, సీఐ సురేష్, ఎస్సై రాజు పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఇరువురి మధ్య వీడియో చిత్రీకరిస్తూ ఓట్లను లెక్కించారు. చివరిగా రెండు ఓట్లు ఎక్కువ రావడంతో గణేష్ గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. అయితే గత పంచాయతీ ఎన్నికల్లో జాటోత్ రుక్మాబాయిపై ఒక్క ఓటు తేడాతో జాటోత్ గణేష్ భార్య లతశ్రీ ఓడిపోయారు. ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో గణేష్ రెండు ఓట్లతో గెలుపొందడం కొసమెరుపు. గడువులోగా పనులు పూర్తిచేయాలిపంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఎస్‌ఎస్‌తాడ్వాయి : మేడారం సమ్మక్క–సారలమ్మ గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం పనులను నాణ్యతతో పాటు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కాంట్రాక్టర్లను ఆదేశించారు. మండల పరిధిలోని జీపీ ఎన్నికలు సోమవారం మేడారంలోని అమ్మవార్ల గద్దెల పునరుద్ధరణ అభివృద్ధి పనులను, పగిడిద్దరాజు, గోవిందరాజు నూతన గద్దెల రాతి నిర్మాణం పనులను మంత్రి సీతక్క పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటించడంతో పాటు పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముందుగా మంత్రి సీతక్క భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులు అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా వ్యవసాయశాఖ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు పాల్గొన్నారు. జనావాసాల మధ్య సెల్‌టవర్ వద్దుగోవిందరావుపేట : జనావాసాల మధ్య సెల్‌టవర్ నిర్మించొద్దని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలో ఓ వైపు గుడి, మరోవైపు పాఠశాలలు ఉండగా వాటి నడుమ సెల్ టవర్ నిర్మాణానికి ప్రయత్నించడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. రేడియేషన్ వల్ల చిన్నారులు, మహిళలు, వృద్ధుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందన్న వైద్య నిపుణుల హెచ్చరికలను టవర్ కంపెనీ విస్మరిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థాని కుల కథనం ప్రకారం.. టవర్ నిర్మాణం చేపట్టిన సంస్థ ప్రజలతో ఎలాంటి అవగాహన సమావేశం నిర్వహించలేదని, గ్రామసభ లేదా స్థానిక సంస్థ అనుమతి తీసుకోలేదని, పాఠశాలలు, దేవాలయం ఉన్న విషయాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి లాభాల కోసమే కంపెనీ వ్యవహరిస్తోందా? అనే అనుమానాలు బలపడుతున్నాయి. నిర్మాణాన్ని అడ్డుకున్న ప్రజలు సెల్ టవర్ నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో స్థానికులు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకోని నిర్మాణాన్ని అడ్డుకున్నారు. ఇక్కడ టవర్ వద్దు పిల్లల ప్రాణాలతో చెలగాటం వద్దు అంటూ నినాదాలు చేశారు. తమ డిమాండ్ నెరవేర్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. -
సాంకేతిక పరిజ్ఞానంతో ప్రమాదాల నివారణ
భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని సింగరేణిలో ఆధునిక పరిజ్ఞానంతో చేసిన రక్షణ పరికరాలను వినియోగిస్తూ ప్రమాదాల నివారణ చేపడుతున్నట్లు ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. రక్షణ పక్షోత్సవాల్లో భాగంగా సోమవారం ఏరియాలోని సింగరేణి వర్క్‌షాపులో రక్షణ కమిటీ కన్వీనర్ దామోదర్‌రావు ఏరియా సింగరేణి జీఎం రాజేశ్వర్‌రెడ్డితో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్బంగా జీఎం మాట్లాడుతూ రక్షణ నియమాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయన్నారు. ప్రతీ ఉద్యోగి ఆరోగ్యంగా ఉన్నప్పుడే సంస్థ బాగుంటుందని, ప్రతిఒక్కరూ మంచి ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఎర్రన, దామోదర్, రాహల్, సుధాకర్, నాగసాయి. కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రతిభను వెలికితీసేందుకు వెల్‌బేబీ షో చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు వెల్‌బేబీ షోను నిర్వహించినట్లు ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. సింగరేణి దినోత్సవ వేడుకల సందర్భంగా సోమవారం స్థానిక ఏరియా ఆస్పత్రిలో వెల్‌బేబీ షో ఏర్పాటు చేశారు. జీఎం, ఏరియా సేవ అధ్యక్షురాలు సునీతరాజేశ్వర్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. శిశువుల ఆరోగ్యం సమాజ భవిష్యత్‌కు పునాది అని, పుట్టిన మొదటి రోజు నుంచే సరైన వైద్య సంరక్షణ, పోషణ అందించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. సింగరేణి యాజమాన్యం కార్మిక కుటుంబాల సంక్షేమానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్‌లో కూడా కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీఎంఓ డాక్టర్ పద్మజ, వైద్యులు, కార్మిక సంఘాల నాయకులు, చిన్నారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. సింగరేణి జీఎం రాజేశ్వర్‌రెడ్డి -
పారితోషికం చెల్లింపులో కోత!
● అన్నంకు బదులుగా ఉప్మా భూపాలపల్లి అర్బన్: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వర్తించిన పీఓలకు చెల్లించాల్సిన పారితోషికం చెల్లింపులో అధికారులు కోత విధించారు. పీఓగా విధులు నిర్వర్తించిన అధికారులకు రూ.2వేలకు బదులుగా కేవలం రూ.1500మాత్రమే చెల్లించారు. ఇతర జిల్లాలో రూ.2వేలు చెల్లించినట్లు అధికారులు తెలిపారు. రెండు రోజులు ట్రైనింగ్, రెండు రోజులు ఎన్నికల విధులు నిర్వర్తించిన పారితోషికం తక్కువగా చెల్లించడం పట్ల అధికారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎంపీడీఓలను పలువురు అడగగా కలెక్టర్ ఆదేశాల మేరకే పారితోషికం తగ్గించి ఇస్తున్నట్లు ఎంపీడీఓ సమాధానం ఇచ్చారు. పోలింగ్ ముగించుకొని బ్యాలెట్ బాక్స్‌లు, ఎన్నికల సామగ్రిని తిరిగి అధికారులకు అప్పగించిన తరువాత సిబ్బంది అన్నం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. టేకుమట్ల, చిట్యాల మండలాల్లో ఆదివారం రాత్రి సిబ్బందికి అన్నంకు బదులుగా నాటు రవ్వతో చేసిన ఉప్మా పెట్టి ఇంటికి పంపడం పట్ల ఎన్నికల సిబ్బంది అసహనం వ్యక్తం చేశారు. తిరుగు ప్రయాణంలో ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. -
మేడారంలో భక్త జనసందడి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం సెలవు రోజు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఛతీస్‌గఢ్, మహారాష్ట్రతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు మేడారానికి తరలివచ్చారు. జంపన్నవాగు స్నానఘాట్టాల వద్ద ఏర్పాటు చేసిన బ్యాటరీ ట్యాప్ కింద స్నానాలు ఆచరించారు. అనంతరం అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, కానుకలు, ఒడిబియ్యం, ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మేడారం పరిసరాల ప్రాంతాల్లో విడిది చేసి వంటావార్పు చేసుకుని సహఫంక్తి భోజనాలు చేసి సందడి చేశారు. సుమారుగా 20వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. సమ్మక్క సారలమ్మ గద్దెలు భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయాయి. ఉదయం నుంచి మొదలైన భక్తుల తాకిడి సాయంత్రం వరకు కొనసాగింది. వేలాది మంది భక్తులు తరలిరావడంతో అమ్మవార్ల గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు కిటకిటలాడారు. భక్తుల రద్దీ పెరగడంతో ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి సమ్మక్క గద్దె వద్ద భారీకెడ్లను ఏర్పాటు చేసి భక్తులను క్రమపద్ధతిలో దర్శనానికి పంపించారు. వేలాది మంది ప్రైవేట్ వాహనాల్లో తరలిరావడంతో జంపన్నవాగు నుంచి మేడారం గద్దెల వద్దకు వచ్చే దారిలో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలకు పోలీసులు వాహనాలను మళ్లీంచారు.జాతరలా తరలివచ్చిన భక్తులు వేలాదిగా వచ్చిన ప్రైవేట్ వాహనాలు కోలాహలంగా గద్దెల ప్రాంగణం -
నేటితో మూడో విడత ప్రచారానికి తెర
సబ్ డివిజన్లో ఇలా..కాటారం మహాముత్తారం మహదేవపూర్ మల్హర్ 106 93 56 421523718 47 39347142439388465కాళేశ్వరం: మంథని నియోజకవర్గంలోని కాటారం సబ్‌డివిజన్‌లో గ్రామపంచాయతీ ఎన్నికల జోష్ తారాస్థాయికి చేరుకుంది. మూడో విడతలో మహదేవపూర్, కాటారం, మహాముత్తారం, మల్హర్ మండలాల్లో 12 రోజులుగా హోరెత్తిన ప్రచారం నేడు (సోమవారం) సాయంత్రం 5గంటలకు తెరపడనుంది. ఈ నెల 17న పోలింగ్ జరుగనుంది. 81 పంచాయతీల్లో 297 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉండడంతో గ్రామాల్లో ఉత్కంఠ నెలకొంది. మల్హర్ మండలంలో దుబ్బపేట, చిన్నతూండ్ల జీపీలు ఏకగ్రీవం అయ్యాయి. 79పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. పార్టీ నేతలు గ్రామాలను చుట్టేస్తూ అభ్యర్థుల గెలుపు కోసం శ్రమిస్తున్నారు. ర్యాలీలు, సమావేశాలు చేపడుతున్నారు. ఇదే సమయంలో అధికారులు భద్రత, పోలింగ్ ఏర్పాట్లను కట్టుదిట్టంగా పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల వేడి పెరిగిన నేపథ్యంలో 10 మద్యం దుకాణాలు బంద్ చేయడానికి ఎకై ్సజ్‌శాఖ సిద్ధమైంది. ఇప్పటికే గ్రామాల్లో రహస్యంగా మద్యం డంపింగ్, స్టాక్ తరలింపుతో పోరు మరింత వేడెక్కింది. నేటితో ముగింపు.. సోమవారం సాయంత్రం పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచార నిషేధం అమల్లోకి రానుండడంతో అభ్యర్థులకు మద్దతుగా పలువురు జిల్లా స్థాయి నాయకులు తిరుగుతూ అభివృద్ధి హామీలు ఇస్తున్నారు. అధికార, ప్రతిపక్షాలతో పాటు స్వతంత్రులు ప్రజల వద్దకు వెళ్లి తమ తరఫున నిలిచిన అభ్యర్థులకు ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రతిచోట పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తూ అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ కట్టుదిట్టంగా పర్యవేక్షిస్తోంది. ఆటోలు, ఇతర వాహనాలకు మైకుల మోతతో దద్దరిల్లిన గ్రామాలు నిశబ్ద ప్రచారం, ప్రలోబాలు మొదలు పెట్టనున్నారు. నేడు మద్యం దుకాణాలు బంద్ కాటారం సబ్‌డివిజన్‌లోని 10 మద్యం దుకాణాలను బంద్ చేయడానికి ఎకై ్సజ్‌శాఖ అధికారులు సిద్ధమయ్యారు. డిసెంబర్ 17న పోలింగ్, అదే రోజు కౌంటింగ్ పూర్తయి విజేతలకు ధృవపత్రాలు అందించే వరకూ వైన్‌షాపులు మూసి ఉంచాలి. ప్రచార సమయంలో చివరి రెండు రోజులు కీలకం కావడంతో కొన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున మద్యం డంపింగ్ చేశారు. 90ఎంఎల్, క్వార్టర్లు, ఆఫ్, ఫుల్ బాటిళ్లు భారీగా స్టాక్ చేసుకుని, పోలింగ్‌కు ముందు రోజు ఓటర్లకు పంపిణీ చేసేందుకు రహస్య ప్రదేశాలకు తరలిస్తున్నట్లు సమాచారం. హోరాహోరీగా ర్యాలీలు, ఊరేగింపులు నాలుగు మండలాల్లో 79 జీపీలు, బరిలో 297 మంది సర్పంచ్ అభ్యర్థులు మల్హర్ మండలంలో ఇద్దరు సర్పంచ్‌లు ఏకగ్రీవం నేడు సాయంత్రం 5గంటల నుంచి మద్యం దుకాణాల బంద్ -
రెండోసారి పైచేయి
2వ దఫా ఎన్నికల్లోనూ అధికార పార్టీదే హవా రెండో విడత సర్పంచ్‌లు వీరే.. ఎన్నికల మరిన్ని వార్తలు 9లో.. 8లో..భూపాలపల్లి: రెండో విడత జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ విజయ డంఖా మోగించింది. ఏకగ్రీవాలతో పాటు అత్యధిక సర్పంచ్ స్థానాలను కై వసం చేసుకుంది. రెండో స్థానంలో బీఆర్ఎస్ నిలువగా, మూడో స్థానంలో స్వతంత్రులు నిలిచారు. 46 స్థానాల్లో కాంగ్రెస్.. జిల్లాలోని భూపాలపల్లి, పలిమెల, చిట్యాల, టేకుమట్ల మండలాల్లోని 85 గ్రామ పంచాయతీలకు రెండో దఫా ఎన్నికలు జరిగాయి.ఇందులో 10 స్థానాలను కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఏకగ్రీవంతో చేజిక్కించుకున్నారు. మిగిలిన 75 స్థానాలకు ఆదివారం ఎన్నికలు జరుగగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 36మంది, బీఆర్ఎస్ 30మంది, బీజేపీ ఇద్దరు, స్వతంత్రులు ఏడుగురు గెలుపొందారు. పలిమెల మండలం కాంగ్రెస్ వశం.. పలిమెల మండలంలో 8 గ్రామ పంచాయతీలు ఉండగా పలిమెల మండలకేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏకగ్రీవం కాగా మిగిలిన ఏడు పంచాయతీల్లో ఆరు కాంగ్రెస్, ఒకటి స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. 2 ఓట్ల తేడాతో విజయం భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి మండలం పెద్దాపూర్ సర్పంచ్‌గా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారు మూ ల స్రవంతి కాంగ్రెస్ రెబల్ మద్దతుదారు ముక్కెర సునీతపై రెండు ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు. దీంతో పార్టీ నాయకులు, బంధువులు, కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. ఐదు ఓట్ల తేడాతో.. టేకుమట్ల: మండలంలోని ఆశిరెడ్డిపల్లి సర్పంచ్‌గా స్వతంత్ర అభ్యర్థి జక్కుల కుమారస్వామి 5 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ మద్దతుదారుపై విజయం సాధించారు. బీఆర్ఎస్ మద్దతుదారు వెలిశెట్టి సురేష్‌కు 179 ఓట్లు రాగా.. జక్కుల కుమారస్వామికి 184 ఓట్లు వచ్చాయి. భూపాలపల్లి చిట్యాల పలిమెల టేకుమట్ల12 13 0 1 15 10 1 0 7 0 0 1 12 7 1 5కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇతరులు ఏకగ్రీవంతో కలిపి ఎవరికి ఎన్ని 10 సర్పంచ్ స్థానాల ఏకగ్రీవంతో పాటు 36 స్థానాల్లో గెలుపు బీఆర్ఎస్కు 30, బీజేపీకి 2, ఇతరులు ఏడు స్థానాల్లో విజయం -
కాళేశ్వరంలో సాధువుల బస
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో వివిధ రాష్ట్రాలకు చెందిన సాధువులు బస చేశారు. గోదావరి పరిక్రమణ(ప్రదక్షిణ)యాత్రలో భాగంగా యానాం నుంచి ఆదివారం రాత్రి ఉత్తర్‌ప్రదేశ్‌లోని వ్రిందావన్ పీఠాఽనికి చెందిన మలూక్పీత్ శ్రీరాజేంద్రదాస్జీ మహారాజ్‌తో పాటు పలు రాష్ట్రాలకు చెందిన సాధువులు, మండలేశ్వరులు, మహామండలేశ్వరులు సుమారుగా 500 వరకు స్థానిక దేవస్థానం 86 గదులు, ఇతర వసతి రూముల్లో రాత్రి బస చేశారు. అంతకు ముందు ఆ బృందంలోని ఓ శిశ్యుని గృహంలో అల్పాహారం తీసుకున్నారు. సోమవారం(నేడు) ఉదయం ముందుగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేయనున్నారు. తరువాత శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడికి అభిషేక పూజలు చేస్తారు. వారికోసం కొంత మంది ముఖ్యులకు పూర్ణకుంభస్వాగతం పలికేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతో రాత్రిపూట దేవస్థానం వద్ద సాధువులతో పాటు వారి వాహనాలతో సందడి నెలకొంది. గోదావరి పరిక్రమణ యాత్రకు తరలివస్తున్న సాధువులు నేడు కాళేశ్వరాలయంలో పూజలు -
85.25 శాతం
23,921 83.24భూపాలపల్లి 28,737రెండో విడతలో పోటెత్తిన ఓటర్లు ● ఉదయం 9గంటల నుంచి 11 గంటల మధ్య పెరిగిన పోలింగ్ శాతం 24,068 84.55చిట్యాల28,4664,015 86.38పలిమెల4,648భూపాలపల్లి: జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోరు ప్రశాంతంగా ముగిసింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు తగిన ఏర్పాట్లు చేయడంతో ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. 9 గంటలకు పెరిగిన పోలింగ్.. జిల్లాలోని భూపాలపల్లి, పలిమెల, చిట్యాల, టేకుమట్ల మండలాల్లో ఆదివారం రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంత ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం అయినప్పటికీ తొలుత పోలింగ్ అంతంత మాత్రంగానే జరుగగా.. 9 గంటల నుంచి 11 గంటల వరకు ఊపందుకుంది. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు 26.40 శాతం.. 9 గంటల నుంచి 11 గంటల వరకు 62.37, పోలింగ్ ముగిసే సమయం ఒంటిగంట వరకు 85.25 శాతం నమోదైంది. మహిళల ఓటింగ్ 84.65 శాతం నమో దు కాగా.. పురుషుల శాతం 85.89 నమోదైంది. టేకుమట్ల మండలంలో అధిక శాతం.. జిల్లాలోని నాలుగు మండలాల్లో ఎన్నికలు జరుగగా భూపాలపల్లి మండలంలో 83.24 శాతం పోలింగ్ నమోదు కాగా, టేకుమట్ల మండలంలో అధికంగా 88.72 శాతం నమోదైంది. అత్యధికంగా కలికోటలో 91.88 శాతం చిట్యాల మండలం వరికోల్పల్లిలో 93 శాతం, టేకుమట్ల మండలం కలికోట జీపీలో అత్యధికంగా 94.4 శాతం పోలింగ్ నమోదైంది. 18,522 88.72టేకుమట్ల20,877 పోలైన ఓట్లు పోలింగ్ శాతం -
నేడు వెల్‌బేబీ షో
భూపాలపల్లి అర్బన్: సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు (సోమవారం) వెల్‌బేబీ షోను నిర్వహించనున్నట్లు ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక ఏరియా ఆస్పత్రి ఆవరణలో ఉదయం 10గంటలకు నిర్వహించినట్లు తెలిపారు. సింగరేణి ఉద్యోగుల పిల్లలకు మాత్రమే అవకాశం ఉంటుందన్నారు. 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాలలోపు చిన్నారులకు నిర్వహించినట్లు తెలిపారు. పాల్గొనేవారు ఉద్యోగుల ఐడీ కార్డు, తమ పిల్లల జనన ధృవీకరణ పత్రం, రోగ నిరోధక కార్డులను తీసుకురావాలని సూచించారు. అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత కాటారం: కాటారం నుంచి మహాముత్తారం వైపుగా కారులో అక్రమంగా తరలిస్తున్న మద్యం ఆదివారం మండలంలోని పోతుల్వాయి బ్రిడ్జి వద్ద పట్టుకున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. వాహన తనిఖీల్లో భాగంగా పోలీసులు మహాముత్తారం వైపుగా వెళ్తున్న కారును తనిఖీ చేయగా అందులో మద్యం సీసాలను గుర్తించారు. రూ.20వేల విలువైన 142 మద్యం సీసాలను స్వాధీనపర్చుకున్నట్లు ఎస్సై తెలిపారు. మద్యం తరలిస్తున్న వలెంకుంటకు చెందిన కొండ శ్రావణ్, కొర్లకుంటకు చెందిన బొబ్బిలి వినోద్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. రామప్పలో యునెస్కో భారత రాయబారి వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని పారిస్ నుంచి వచ్చిన యునెస్కో భారత రాయబారి, శాశ్వత ప్రతినిధి విశాల్ వి.శర్మ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, (ఏఎస్ఐ) రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంరక్షణ, పరిరక్షణ చర్యలను ఆయన సమీక్షించారు. యునెస్కోకు సంబంధించిన ప్రతిష్టాత్మక ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సెషన్‌కు విశాల్ వి.శర్మ చైర్మన్‌గా వ్యవహరించారు. ఈ కీలక పదవిని నిర్వహించిన మొదటి భారతీయుడు. ఇటీవల ఢిల్లీలోని ఎరక్రోటలో జరిగిన ఇంటర్ గవర్నమెంటల్ కమిటీ ఫర్ సేఫ్ గార్డింగ్ ది ఇంటాంజబుల్ కల్చరల్ హెరిటేజ్ 20వ సెషన్‌కు కూడా అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలోనే దీపావళిని యునెస్కోకు చెందిన ఐసీహెచ్ జాబితాలో చేర్చారు. 2021లో రాయబారి విశాల్ వి.శర్మ సారథ్యంలోనే రామప్ప ఆలయం కూడా ప్రపంచ వారసత్వ జాబితాలో చేరింది. ఇన్కోయిస్ (ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్) కార్యక్రమానికి హైదరాబాద్‌కు వచ్చిన ఆయన.. పరిరక్షణ చర్యలను సమీక్షించేందుకు జిల్లాలో పర్యటించారు. ఏఎస్ఐ నుంచి డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్టు డాక్టర్ హెచ్.ఆర్. దేశాయ్, డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియాలజికల్ ఇంజనీర్ కృష్ణ చైతన్య, అసిస్టెంట్ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్టు డాక్టర్ రోహిణి పాండే అంబేడ్కర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ నాగోజీరావు తదితరులు పాల్గొన్నారు. హేమాచలంలో భక్తజనం మంగపేట: మండలంలోని మల్లూరు శ్రీ హేమాచల క్షేత్రం వందలాది మంది భక్త జనంతో ఆదివారం కిటకిటలాడింది. స్వయంభు స్వామివారిని దర్శించుకునేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రి వంటి పట్టణాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షుల నియామకంకాజీపేట: అఖిల భారతీయ బ్రాహ్మణ సేవా సంఘం (చాణ్యక్య దళ్)ను పటిష్టంగా తీర్చిదిద్దడంలో భాగంగా రాష్ట్రంలోని పలు జిల్లాలకు నూతనంగా జిల్లా అధ్యక్షులను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు అయినవోలు మల్లికార్జున శాస్త్రి తెలిపారు. కాజీపేటలో ఆదివారం సంఘం సభ్యులతో కలిసి జిల్లా అధ్యక్షులను ప్రకటించారు. చిలుకపాటి వెంకటశివకుమార్ (హనుమకొండ), గూడా వెంకటరమణ శర్మ (వరంగల్ అర్బన్), కాంచనపల్లి సిద్ధేశ్వర శర్మ (వరంగల్), యల్లంబట్ల కరుణాకర శర్మ (జనగామ), కొట్లావజ్జుల రామమూర్తి శర్మ (మహబూబాబాద్), విరాళ చంద్రశేఖర్ శర్మ (సిద్దిపేట), చిన్నోజుల లక్ష్మిరాజాం శర్మ (రాజన్న సిరిసిల్ల), జి.శ్రావణ్ కుమార శర్మ (జయశంకర్ భూపాలపల్లి)ను నియమించారు. ఈ మేరకు నూతన అధ్యక్షులకు నియామక పత్రాలను అందజేసి అభినందించారు. -
హోరెత్తిస్తున్న మైకులు !
కాళేశ్వరం: మూడో విడత ఎన్నికల్లో భాగంగా పల్లెల్లో సర్పంచ్, వార్డుసభ్యుల ప్రచారం జోరందుకుంది. ఎన్నికల ప్రచారానికి రెండు రోజులే గడువు ఉండడంతో బరిలో నిలిచిన వారు ప్రచారాన్ని తీవ్రం చేశారు. కాటారం సబ్ డివిజన్లోని కాటారం, మహదేవపూర్, మల్హర్, మహాముత్తారం మండలాల్లో సర్పంచ్‌లుగా పోటీచేస్తున్న వారు ఆటోలు, ఇతర వాహనాలను ఏర్పాటు చేసి మైకులతో హోరెత్తిస్తున్నారు. కాలనీలు, వార్డుల్లో వాహనాలను తిప్పుతూ ఓటర్లను ఓటు వేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. కాలినడకన ఓ వైపు ఇంటింటా ప్రచారం చేస్తుండగా.. మరోవైపు వాహనాల ప్రచారం ఊపందుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వాహనాలతో మైకులు అమర్చి ఎంపీ, ఎమ్మెల్యే, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థాయిలో ప్రచార పర్వం కొనసాగిస్తున్నారు. పోటాపోటీ ప్రచారంతో ఓటరు ఆలోచనలో పడుతున్నారు. దీంతో సందడి వాతావరణం నెలకొంది. ఈనెల 17న మూడో విడతకు పోలింగ్ ఉండగా, 15న సాయంత్రం వరకు ప్రచారానికి తెర పడనుంది. దీంతో మైకుల మోతతో పల్లెలు దద్దరిల్లుతున్నాయి. -
మైనింగ్ అధికారుల వేధింపులు ఆపాలి
భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని కేటీకే 1వ గనిలో కార్మికులపై మైనింగ్ అధికారుల వేధింపులు ఆపాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం బ్రాంచ్ ఉపాధ్యక్షుడు సమ్మయ్య డిమాండ్ చేశారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1వ గనిలో కొంత మంది మైనింగ్ అధికారులు కార్మికులను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నట్లు తెలిపారు. ఫిల్లింగ్ పనులు నిర్వహిస్తున్న కార్మికులపై అనవసరమైన ఒత్తిడి, అవమానకరమైన ప్రవర్తన కొనసాగుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. హాజరు విషయంలో కార్మికులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఆరోపించారు. ప్రశ్నించిన కార్మికులను వ్యక్తిగతంగా వేధిస్తున్నారని చెప్పారు. ఈ సమావేశంలో నాయకులు రత్నం అవినాష్, దేవరకొండ మధు, కుమారస్వామి, మల్లారెడ్డి, మొగిలి, రమేష్, పాష పాల్గొన్నారు. ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష భూపాలపల్లి అర్బన్: జిల్లాలో రెండు పరీక్ష కేంద్రాల్లో శనివారం నిర్వహించిన నవోదయ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ తెలిపారు. భూపాలపల్లి, కాటారం మండల కేంద్రాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పరీక్ష నిర్వహించినట్లు చెప్పారు. 451 మంది విద్యార్థులకు గాను 314 మంది పరీక్షకు హాజరుకాగా 137 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేసి పరీక్ష నిర్వహించినట్లు చెప్పారు. క్రీడలతో ఆరోగ్యం ఏరియా సింగరేణి సేవాసమితి అధ్యక్షురాలు సునీత భూపాలపల్లి అర్బన్: క్రీడలు గెలుపోటములకే కాకుండా ఆరోగ్యం, ఉత్సాహానికి ఉపయోగపడతాయని ఏరియా సింగరేణి సేవాసమితి అధ్యక్షురాలు సునీత తెలిపారు. సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఏరియాలోని అంబేడ్కర్ స్టేడియంలో మహిళలకు వివిధ రకాల క్రీడాపోటీలు నిర్వహించారు. సునీత ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సేవ అధ్యక్షురాలు మాట్లాడుతూ.. క్రీడా పోటీలు కేవలం ఆటలు మాత్రమే కాదని, మనలో ఉన్న సహకారం, క్రమశిక్షణ, ఆరోగ్యం, ఉత్సాహం వంటి విలువలను మరొకసారి మనకు గుర్తు చేస్తాయన్నారు. పోటీలో పాల్గొన్న ప్రతీ ఒక్కరు విజేతలే అని గెలుపోటములు సహజమన్నారు. ధైర్యం, కలిసికట్టుగా ముందుకు సాగే తపన అదే నిజమైన విజయమని చెప్పారు. సేవ సభ్యులు సేవాభావం, అంకితభావం సంస్థకు, సమాజానికి అమూల్యమైనవని అన్నారు. క్రీడాపోటీలను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులకు, ఉత్సాహంగా పాల్గొన్న సేవ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ పోటీలలో గెలుపొందిన వారికి ఈనెల 23న జరిగే సింగరేణి ఆవిర్భావ వేడుకల్లో బహుమతులను అందజేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏరియా పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, పర్సనల్ ఆఫీసర్ శ్రావణ్ కుమార్, స్పొర్ట్స్ సూపర్వైజర్ పర్స శ్రీనివాస్, సేవా కార్యదర్శి రుబీనా, సభ్యులు పాల్గొన్నారు. -
గుడులు కట్టిస్తాం.. బడులు బాగు చేస్తాం
మేడారంలో బస్టాండ్ క్యూలైన్ పనులు షురూఎస్ఎస్తాడ్వాయి: మేడారంలో ఆర్టీసీ బస్టాండ్‌లో క్యూలైన్ పనులు శనివారం ప్రారంభించారు. 28 ఎకరాల ఆర్టీసీ బస్టాండ్ స్థలాన్ని చదును చేయడంతోపాటు జిల్లాల వారీగా క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆర్టీసీ అధికారులు, సిబ్బంది కోసం తడుకలతో గదులను ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల రద్దీని పర్యవేక్షించేందుకు సీసీ పుటేజీల కోసం తాత్కాలికంగా జీఐ షీట్స్ రేకులతో గది ఏర్పాటు చేశారు.మీరేదంటే అదే!పరకాల మండలానికి చెందిన ఓ మేజర్ గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్‌గా పోటీ చేస్తున్న అభ్యర్థి ఒకరు ఓ సామాజిక వర్గానికి చెందిన ప్రజల డిమాండ్ నెరవేర్చేందుకు అడిగిందే తడవుగా గుడి కట్టిస్తానని హామీ ఇచ్చారు. ఇది తెలిసిన మరో అభ్యర్థి సైతం ఆ సామాజిక వర్గం ఓటర్ల వద్దకు వెళ్లి తన సంసిద్ధతను వ్యక్తం చేయడం వివాదాస్పదమైంది. ఇద్దరూ తేల్చుకునేలోపే రెండో విడత ప్రచారం ముగిసింది. వరంగల్ జిల్లా దుగ్గొండి, నల్లబెల్లి, గీసుకొండ మండలాల్లో వివిధ గ్రామాల నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులు గుడులు, బడుల మరమ్మతులకు హామీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. మూడో విడత ప్రచారానికి రేపు తెరపడనుండగా.. నర్సంపేట, చెన్నారావుపేట, ఖానాపురం మండలాల్లో అభ్యర్థుల హామీల పరంపరతో ప్రచారం కొనసాగుతోంది. సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాల్లో రోజులు గడిచినా కొద్ది గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం పీక్కు చేరుతోంది. ‘మీరేం అడిగితే అది చేస్తాం. అభివృద్ధికి పాటుపడతాం. గుడులు కడతాం, బడులు బాగు చేస్తాం’ అంటూ అలవి కాని హామీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు సర్పంచ్ అభ్యర్థులు. రెండో విడత ప్రచారానికి శుక్రవారం తెరపడగా.. శనివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 15న (సోమవారం) సాయంత్రం 5 గంటలకు మూడో విడత ప్రచారం ముగియనున్న నేపథ్యంలో ప్రచారం కొత్తపుంతలు తొక్కుతోంది. వ్యూహాలతో ముందుకు వెళ్తూ.. మొదటి విడతలో 555 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 53 ఏకగ్రీవమయ్యాయి. 502 చోట్ల ఈనెల 11న పోలింగ్ నిర్వహించారు. 333 జీపీలను కాంగ్రెస్ మద్దతుదారులు కైవసం చేసుకోగా, బీఆర్ఎస్ 148, బీజేపీ 17, సీపీఐ 1, ఇతరులు 56 చోట్ల గెలుపొందారు. ఈ ఫలితాలపై పోస్టుమార్టం నిర్వహించిన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు.. రెండు, మూడు విడతల్లో మరింత మెరుగైన ఫలితాల కోసం వ్యూహాలు రూపొందిస్తున్నారు. కొంచెం ఎఫర్ట్ పెడితే మరిన్ని స్థానాలు పెరిగేవని కాంగ్రెస్ నేతలు చెప్పుకొస్తుండగా, మరింత వ్యూహాత్మకంగా ముందుకు సాగుతామని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. బీజేపీ సైతం తమ మద్దతుదారులను గెలిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామంటున్నారు. ఇదే సమయంలో మొదటి విడతలో తలెత్తిన లోపాలను గుర్తించిన ఆ మూడు పార్టీల అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. రెండో విడతలో ఉమ్మడి జిల్లాలో మొత్తం 564 పంచాయతీలకు 57 ఏకగ్రీవం కాగా, 507 గ్రామాల్లో ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు జరిగే పోలింగ్ కోసం ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాల నుంచి శనివారం రాత్రే అధికారులు, సిబ్బంది సామగ్రితో కేంద్రాలకు చేరుకున్నారు. జోరుగా ప్రలోభాలు.. పంపకాలు రెండో విడత అభ్యర్థుల గెలుపు కోసం అన్ని పార్టీల నాయకులు శనివారం రాత్రి నుంచే విచ్చలవిడిగా ధనప్రవాహానికి శ్రీకారం చుట్టారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు గ్రామ పంచాయతీలను బట్టి ఓటుకు రూ.500ల నుంచి రూ.2,500ల వరకు పంపిణీ చేశారన్న ప్రచారం ఉంది. ఒక ఇంట్లో నలుగురు ఓటర్లుంటే ఫుల్‌బాటిల్.. కిలో చికెన్ చొప్పున చాలా గ్రామాల్లో సరఫరా చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ సాగిందనే ఆరోపణలూ ఉన్నాయి. ఎన్నికల సంఘం కళ్లుగప్పి విచ్చల విడిగా పోల్ చిట్టీలతో పాటు డబ్బుల్ని పంపిణీ చేసేలా ఏర్పాటు చేసుకున్న కొందరు నాయకులు చాలా గ్రామాల్లో రెండో విడత కోసం శనివారం రాత్రంతా కొనసాగించారు. ఇదిలా ఉండగా, రెండో విడత పోలింగ్ సందర్భంగా పోలీసులు పోలింగ్ కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు విధించారు. ఎన్నికలను సజావుగా శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు దీన్ని అమలు చేస్తున్నట్లు వారు ప్రకటించారు. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు, ఆందోళనలు చేపట్టవద్దన్నారు. కాగా ఆదివారం పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లోని బ్రాందీషాపులు, బార్లను అబ్కారీశాఖ అధికారులు శనివారం సాయంత్రం మూసివేశారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థుల పాట్లు డబ్బు, మద్యం కానుకల ఎర గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల నేతలు రెండో విడతకు నేడు పోలింగ్.. 564లో 57 ఏకగ్రీవం 507 పంచాయతీలకు హోరాహోరీ ‘రెండో’ పోరులో గెలిచేదెవరో? పోలింగ్ కేంద్రాలకు చేరిన సామగ్రి భారీగా భద్రత ఏర్పాట్లు చేసిన పోలీసులు -
ఓటు హక్కును వినియోగించుకోవాలి
ఎస్సైతో మాట్లాడుతున్న ఎస్పీ సంకీర్త్ పోలింగ్ సామగ్రి పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ శర్మ● కలెక్టర్ రాహుల్ శర్మ చిట్యాల: మండలంలోని అన్ని గ్రామాలలోని ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ రాహుల్‌శర్మ కోరారు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు సంబంధించిన సామగ్రిని శనివారం మండలకేంద్రంలోని ఉన్నత పాఠశాల ఆవరణలో పరిశీలించి మాట్లాడారు. ఆదివారం జరిగే పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు ఇబ్బందులు కలుగకుండా తగు జాగ్రత్తలు పాటించాలని అధికారులను కోరారు. ప్రతీ ఓటరు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మండల ప్రత్యేక అధికారి మల్లేశ్వరి, ఎంపీడీఓ జయశ్రీ, తహసీల్దార్ షేక్ ఇమామ్‌బాబా, ఎంపీఓ రామకృష్ణ, ఏపీఓ హలీంపాషా పాల్గొన్నారు. శాంతి భద్రతలు కట్టుదిట్టం చేయాలి: ఎస్పీ సంకీర్త్ ఎన్నికలకు భారీ బందోబస్తు నిర్వహిస్తూ శాంతి భద్రతల పట్ల పోలీసులు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ సంకీర్త్ అన్నారు. మండలకేంద్రంలోని ఉన్నత పాఠశాలలో పోలింగ్ సామగ్రి పంపిణీని పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఇబ్బందులు కలుగకుండా విధులు నిర్వహించాలని అన్నారు. ఇబ్బందులు ఉంటే సంబందిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ఆయన వెంట సీఐ మల్లేష్, ఎస్సై శ్రావన్‌కుమార్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. -
పల్లెల్లో చలి పంజా
మంచు తెరలను చీల్చుతూ ఉదయిస్తున్న సూర్యుడు తెల్లవారుజామున మంచుతో కప్పేసిన పొగమంచురెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలతో వాతావరణం హీటెక్కింది. మరో వైపు పల్లెల్లో చలి పంజాతో గజగజ వణికిపోతున్నారు. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి పగటిపూట 28 డిగ్రీలు, రాత్రి పూట 13.5 డిగ్రీలకు తగ్గి చల్లనిగాలులు వీస్తున్నాయి. శనివారం కాళేశ్వరంలో తెల్లవారుజామున మంచుదుప్పటి కప్పేసింది. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో చలికి ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. సాయంత్రం ఆరు దాటితే చలి తీవ్రత పెరగడంతో మూడో విడతలో పల్లెల్లో సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు రాత్రిపూట ప్రచారాలకు ఆటంకం కలుగుతోంది. – కాళేశ్వరం -
ఇసుక పనుల్లో మతలబేంటి?
ములుగు: మేడారం జంపన్నవాగులో ఇసుక లెవలింగ్ పనులపై విజిలెన్స్ అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. జంపన్నవాగులో భక్తుల సౌకర్యార్థం ఇరిగేషన్‌శాఖకు రూ.4.96కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో రూ.1.29 కోట్లతో ఇసుక లెవలింగ్ పనులు చేస్తున్నారు. ప్రతీ ఏటా మహాజాతర సమయంలో గోవిందరావుపేట మండలంలోని లక్నవరం చెరువు నుంచి జంపన్నవాగులోని భక్తుల పుణ్యస్నానాల కోసం నీటిని విడుదల చేస్తారు. రెడ్డిగూడెం నుంచి చిలకలగుట్ట వరకు వాగు సమాంతరంగా ఉండేందుకు ఇసుకను లెవలింగ్ చేస్తున్నారు. ఇసుక చదును పనుల్లో లోపాలు ఉన్నాయా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయని విజిలెన్స్ అధికారులకు అందిన ఫిర్యాదు మేరకు ఇసుక లెవలింగ్ పనులను సంబంధించిన ఎస్టిమేషన్ పత్రాలను, రికార్డులను ఇరిగేషన్‌శాఖ నుంచి తీసుకున్నట్లు తెలిసింది. వాగులో ఇసుక చదును పనులపై విజిలెన్స్ బృందం శనివారం మేడారానికి వస్తున్నారనే సమాచారం ఇరిగేషన్‌శాఖ ఉన్నతాధికారుల నుంచి మొదలుకుని కింది స్థాయి వరకు మేడారానికి ఇసుక పనులకు సంబంధించిన అన్ని రికార్డులతో మేడారానికి వచ్చినట్లు సమాచారం. పనులు నిలిపివేత మేడారం జంపన్నవాగులో ఇసుక చదును పనులను శనివారం నిలిపివేశారు. విజిలెన్స్ బృందం అధికారులు తనిఖీ నిర్వహించేంత వరకు పనులు ఆపేవేయాలని ఆదేశించడంతోనే నిలిపివేసినట్లు తెలుస్తోంది. భక్తుల జల్లు స్నానాల కోసం స్నానఘట్టాలపై బ్యాటరీ ఆఫ్ ట్యాబ్స్ నల్లాలను ఏర్పాటు చేస్తున్నారే తప్ప ఇసుక చదును పనులు మాత్రం పూర్తిగా నిలిచిపోయాయి. ఈనెల 12న మేడారం జాతర అభివృద్ధి పనులను పరిశీలించేందుకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్కలు వచ్చిన సమయంలో ఇరిగేషన్‌శాఖ అధికారులు సమయానికి అందుబాటులో లేకపోవడంతోపాటు సమీక్ష సమావేశానికి కొంత ఆలస్యంగా హాజరు కావడంతో మంత్రి ఆగ్రహించినట్లు తెలిసింది. జంపన్నవాగు ఇసుక లెవలింగ్ పనులపై విజిలెన్స్ అధికారుల ఆరా? -
నేడే రెండో విడత తీర్పు
నాలుగు మండలాల్లో 75 సర్పంచ్, 547 వార్డు స్థానాలకు ఎన్నికలుభూపాలపల్లి అర్బన్: పోలింగ్ సామగ్రిని సరి చూసుకుంటున్న సిబ్బంది భూపాలపల్లి: రెండో దశ గ్రామపంచాయతీ పోరుకు అంతా సిద్ధమైంది. జిల్లాలోని భూపాలపల్లి, చిట్యాల, టేకుమట్ల, పలిమెల నాలుగు మండలాల్లో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగనుండగా, నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. బరిలో 1,560 మంది అభ్యర్థులు.. భూపాలపల్లి, చిట్యాల, పలిమెల, టేకుమట్ల మండలాల్లో మొత్తం 85 జీపీలు, 694 వార్డులు ఉండగా అందులో 10 సర్పంచ్ స్థానాలు, 147 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో మిగిలిన 75 సర్పంచ్, 547 వార్డు స్థానాలకు నేడు ఎన్నికలు జరుగనున్నాయి. సర్పంచ్ స్థానాలకు 244, వార్డులకు 1,316 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమై ఒంటిగంటకు ముగుస్తుంది. తదుపరి కౌంటింగ్ నిర్వహించి గెలుపొందిన అభ్యర్థులను ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు. విధుల్లో చేరిన పోలింగ్ అధికారులు.. ఎన్నికల నిర్వహణ అధికారులు శనివారమే విధుల్లో చేరారు. ఉదయం ఆయా మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో మెటీరియల్‌ను తీసుకొని అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాల్లో పోలింగ్ స్టేషన్లకు చేరుకొని రాత్రి అంతా సిద్ధం చేసుకున్నారు. ఉదయం ఏడు గంటలకు సజావుగా ఎన్నికల నిర్వహణను ప్రారంభించేందుకు సంసిద్ధంగా ఉన్నారు. నాలుగు మండలాల్లో 1,846 మంది ఎన్నికల అధికారులు, సిబ్బంది, అబ్జర్వర్లు, వెబ్ కాస్టింగ్ సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు.. రెండో దశ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 600 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల సందర్భంగా భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్) 2023 లోని సెక్షన్ 163 ప్రకారం నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయని వెల్లడించారు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ప్రచారం నిర్వహించడం, ఓటర్లను ప్రలోభపరిచే చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. 10 సర్పంచ్, 147 వార్డులు ఏకగ్రీవం ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం -
కార్మికులకు ఈఎస్ఐ అమలు చేయాలి
భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులకు ఈఎస్ఐ తప్పనిసరిగా అమలు చేయాలని ఈఎస్ఐ బ్రాంచ్ మేనేజర్ రమేష్ తెలిపారు. ఏరియాలోని కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర ప్రభుత్వ బీమా పథకం(ఈఎస్ఐ)పై శుక్రవారం స్థానిక జీఎం కార్యాలయంలో కాంట్రాక్టర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ.. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు తప్పనిసరిగా ఈఎస్ఐ అమలు చేయాలన్నారు. లేనిపక్షంలో ప్రమాదాలు జరిగినప్పడులు ప్రయోజనాలు ఉండవని చెప్పా రు. ఈఎస్ఐ ఉండటం వలన కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. కాంట్రాక్టర్లకు కలిగే చట్టపరమైన పరిణామాలు, ఈఎస్ ఐ నిబంధనల ప్రకారం విధించే పెనాల్టీలు, బకాయిల వసూలు, తనిఖీలలో లోపాలు కనబడినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సివిల్ ఏజీఎం రవికుమార్, పీఎం శ్యాంప్రసా ద్, గనుల సంక్షేమ అధికారులు పాల్గొన్నారు. కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకోవడానికి వివిధ రాష్ట్రాలకు చెందిన సాధువులు గోదావరి పరిక్రమణ యాత్ర పేరిట ఈనెల 14న ఆదివారం కాళేశ్వరం రానున్నారు. 15న సోమవారం ఉదయం ముందుగా త్రివేణి సంగమగోదావరిలో పుణ్యస్నానాలు చేయనున్నారు. అనంతరం స్వామివారి గర్భగుడిలో అభిషేక పూజలు చేస్తారని ఆలయ వర్గాల ద్వారా తెలిసింది. సాధువులు, మండలేశ్వరులు, మహామండలేశ్వరస్వాములు 500మంది వరకు తరలి రానున్నారని తెలిసింది. దీంతో వారిని దర్శించుకోవడానికి పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలిరానున్నారు. ములుగు రూరల్: రైతులకు నష్టం చేస్తున్న అబ్బాయిగూడెం ఇసుక రీచ్‌ను నిలిపివేయాలని కోరుతూ శుక్రవారం అబ్బాయిగూడెం రైతులు ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ ముంజాల భిక్షపతి గౌడ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా భిక్షపతి మాట్లాడుతూ అబ్బాయిగూడెంలోని ఇసుక రీచ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. రైతుల పంటలకు నష్టం కలిగేలా విద్యుత్ స్తంభాలను విరగొట్టారని వివరించారు. దీంతో రైతుల పంట పొలాలు ఎండి పోతున్నాయని వాపోయారు. అధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఇసుక రీచ్‌ను నిలిపి వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తోట నాగేశ్వర్రావు, బొల్లె రాంబాబు, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ములుగు రూరల్: పోక్సో కేసులో ఓ వ్యక్తికి 20 సంవత్సరాల జైలుశిక్ష విధిస్తూ జిల్లా పోక్సో ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించినట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం నిర్వహించిన విచారణలో నిందితుడు దోషిగా తేలడంతో న్యాయమూర్తి ఎస్వీపీ సూర్యచంద్రకళ 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 6 వేల జరిమానా విధిస్తూ తీర్పు ప్రకటించారు. ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలో బండారుపల్లి గ్రామానికి చెందిన కొడబోయిన మహేందర్ పోక్సో కేసు 2020లో అదే గ్రామానికి చెందిన ఎల్పుల రవితేజపై ఫిర్యాదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. కేసు విచారణ దర్యాప్తు అధికారిగా దేవేందర్‌రెడ్డి, ఎస్సై ఫణి, కోర్టు మానిటరింగ్ డీఎస్ కిశోర్, కోర్టు లియాసోనింగ్ అధికారి ఎస్సై లక్ష్మణ్, కోర్టు సీడీఓ స్రవంతిలను ఎస్పీ అభినందించారు. మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామిని హిమాలయ యోగి సంత్ సదానందగిరి మహారాజ్ శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు, పూజారులు మర్యాద పూర్వకంగా ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో స్వయంభు స్వామివారికి ఆయన గోత్రనామాలతో అర్చన జరిపించారు. ఆలయ పురాణం, స్వామివారి విశిస్టతను ఆర్చకులు వివరించి వేద మంత్రోచ్చరణలతో ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి శేష వస్త్రాలను, తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మికత మన సనాతన ధర్మం అన్నారు. మల్లూరు కేసీఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన ధ్యాన మందిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. -
ప్రలోభాలు షురూ..
రెండో విడతలో జరుగనున్న భూపాలపల్లి, చిట్యాల, టేకుమట్ల, పలిమెల మండలాల్లో వలస ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడి వారు జీవనోపాధి, ఉద్యోగ, ఉపాధి రీత్యా హనుమకొండ, హైదరాబాద్ పట్టణాల్లో నివసిస్తున్నారు. ఒక్కో గ్రామంలో సుమారు వంద మంది ఓటర్లు ఇతర ప్రాంతాల్లో ఉన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా గెలుపుపై ప్రభావం చూపనుంది. దీంతో వలస ఓట్లపై ప్రధాన పార్టీలు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు దృష్టి సారించారు. పట్టణాల్లో ఉన్న వారికి రవాణా ఖర్చులతో పాటు ఓటుకు రూ.వేయి నుంచి రూ.1,500 ఇస్తామని చెప్పి.. తప్పకుండా ఓటు వేసేందుకు రావాలని వేడుకుంటున్నారు. ఈ మేరకు ముందస్తుగా ఆన్లైన్ పేమెంట్లు సైతం చేస్తున్నారు. ఎన్నికల బరిలో ఉన్న ప్రధాన పార్టీలకు చెందిన సర్పంచ్ అభ్యర్థులు ఎలాగైనా గెలుపొందాలనే ఉద్దేశంతో గ్రామంలో ఉన్న సమస్యలు అన్నింటినీ పరిష్కరిస్తామని హామీలు గుప్పించారు. గ్రామంలో కోతులు, కుక్కల బెడదను తీరుస్తామని, కుల సంఘాలకు చెందిన దేవాలయాలు నిర్మిస్తామని, ప్రతీ కాలనీకి సీసీ రోడ్లు, వీధి దీపాలు ఏర్పాటు చేయిస్తామని, అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేయిస్తామని హామీలు ఇస్తున్నారు. భూపాలపల్లి: గ్రామ పంచాయతీ ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. మొదటి దఫాలో అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఎక్కువ స్థానాలను కై వసం చేసుకున్నారు. దీంతో రెండో విడతలో అధికార పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపు కోసం తహతహలాడుతున్నారు. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. రేపు భూపాలపల్లి, చిట్యాల, టేకుమట్ల, పలిమెల మండలాల్లో ఎన్నికలు గెలుపు కోసం అభ్యర్థుల పడరాని పాట్లు ఓటుకు నోటుతో పాటు మద్యం, చీరలు, వస్తువుల పంపిణీ గ్రామాల్లో ఎక్కడ చూసినా విందులే వలస ఓటర్లకు ప్రత్యేక ఆఫర్లు -
సహజారెడ్డి అంత్యక్రియలు పూర్తి
● అమెరికాలో ఎనిమిది రోజుల క్రితం అగ్నిప్రమాదంలో మృతి స్టేషన్‌ఘన్‌పూర్: అమెరికా బర్మింగ్ హోమ్ ప్రాంతంలో ఓ అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో భారత కాలమాన ప్రకారం ఈనెల 5న రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో మృతిచెందిన ఉడుముల సహజారెడ్డి అంత్యక్రియలు ఆమె స్వగ్రామమైన జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం సముద్రాల గ్రామశివారు గుంటూరుపల్లిలో శుక్రవారం సాయంత్రం క్రైస్తవ సంప్రదాయంలో నిర్వహించారు. వివరాలిలా ఉన్నాయి. గుంటూరుపల్లికి చెందిన ఉడుముల జయాకర్‌రెడ్డి, గోపు మరియశైలజ కుటుంబం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌లో సెటిల్ అయ్యారు. వారి పెద్ద కుమార్తె సహజారెడ్డి నాలుగేళ్ల క్రితం ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లింది. అమెరికాలో బర్మింగ్‌హోమ్‌లో ఓ అపార్ట్మెంట్లో ఉంటున్న ఆమె ఎనిమిది రోజుల క్రితం అగ్నిప్రమాదంలో మృతిచెందింది. కాగా ఆమె మృతదేహాన్ని గుంటూరుపల్లికి శుక్రవారం తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ముందుగా విశాఖపట్నం అగ్రపీఠాధిపతి బిషప్ ఉడుముల బాల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్ధనలు చేపట్టారు. -
14న షైన్ స్కాలర్ షిప్ టెస్ట్
హన్మకొండ : హనుమకొండ బాలసముద్రంలోని షైన్ జూనియర్ కళాశాలలో ఈనెల 14న షైన్ స్కాలర్ షిప్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు షైన్ విద్యాసంస్థల చైర్మన్ మూగల కుమార్‌యాదవ్ తెలిపారు. శుక్రవారం కళాశాలలో స్కాలర్షిప్ టెస్ట్ బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ టెస్ట్‌లో 96 నుంచి 100 శాతం మార్కులు సాధించిన విద్యార్థులకు ఇంటర్ ప్రవేశంలో పూర్తి రాయితీ అందించనున్నట్లు తెలిపారు. 91 నుంచి 95 మార్కులు సాధించిన విద్యార్థులకు 75 శాతం, 86 నుంచి 90 మార్కులు సాధించినవారికి 50 శాతం, 81 నుంచి 85 మార్కులు సాధించిన విద్యార్థులకు 25 శాతం ట్యూషన్ ఫీజు రాయితీ మొదటి ఐదుగురు విద్యార్థులకు అందించనున్నట్లు వివరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో షైన్ విద్యాసంస్థల డైరెక్టర్లు మూగల రమ, ఏ.కవిత, మూగల రమేష్, ప్రిన్సిపాల్స్ పి.శ్రీనివాస్, ప్రశాంత్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
లక్ష్యానికి నవోదయం !
ఖిలా వరంగల్: నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశానికి పరీక్ష నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేడు(శనివారం) జరిగే ప్రవేశ పరీక్షకు మొత్తం 28 పరీక్ష కేంద్రాలను 14 బ్లాకులుగా విభజించి ఏర్పాటు చేశారు. 5,648 మంది ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందులో 3,207 బాలురు, 2,439 బాలికలు ఉన్నారు. మొత్తం 80 సీట్లు ఉండగా.. పట్టణ(నగర) పరిధిలో 20 సీట్లకు 1,934 మంది, గ్రామీణ ప్రాంత పరిధిలో 60 సీట్లకు 3,714 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. సీటు వస్తే నవోదయమే.. మామునూరు జవహర్ నవోదయ విద్యాలయంలో ఒక్కసారి సీటు లభిస్తే ఆరో తరగతి మొదలు 12వ తరగతి (ప్లస్ టూ) వరకు ఉచితంగా చదువు కొనసాగించవచ్చు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయం మామునూరులోనే ఉంది. ఈ విద్యాలయంలో ఏటా ప్రవేశానికి పోటీ భారీగా ఉంటోంది. శనివారం ఎంపిక పరీక్ష నిర్వహించనున్న నేపధ్యంలో పాటించాల్సిన మెలకువలను నవోదయ ప్రిన్సిపాల్ పూర్ణిమ వివరించారు.నేడు నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఉమ్మడి జిల్లాలో 28 పరీక్ష కేంద్రాలు పరీక్ష కేంద్రానికి గంట ముందే అనుమతి పరీక్ష రాసే విద్యార్థులు 5,648 మంది -
జాతర పనులు త్వరగా పూర్తి చేయాలి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం జాతర పనులన్నీ త్వరగా పూర్తి చేయాలని రెవెన్యూ, హౌసింగ్, పౌరసంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. అమ్మవార్ల గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం, మేడారంలో రోడ్ల విస్తర్ణ పనులతోపాటు భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న పనులన్నీ ఈనెల 30 వరకు పూర్తి చేయాలని ఇది లాస్ట్ డెడ్‌లైన్ అని మంత్రి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన మంత్రి సీతక్కతో కలిసి అమ్మవార్ల గద్దెల ప్రాంగణం అభివృద్ధి పనులు, సమ్మక్క సారలమ్మ గద్దెల పునరుద్దరణ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల రాతి నిర్మాణాలు, గద్దెల ప్రాంగణంలో ఫ్లోరింగ్ పనులు, రాతి స్తంభాల స్థాపన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం రోడ్ల నిర్మాణం, జంపన్న వాగు వద్ద ఏర్పాట్లు, వాగులో ఇసుక లెవలింగ్ పనులను పరిశీలించారు. అనంతరం జాతర అభివృద్ధి పనులపై ఆయాశాఖల అధికారులతో మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించి జాతర పనుల పురోగతి వివరాలపై ఆరా తీశారు. గద్దెల ప్రాంగణం సాలహారం, గద్దెల విస్తర్ణ, ఆర్చీ ద్వారా స్థంబాల స్థాపన పనుల్లో నెమ్మదిగా సాగుతున్నాయని పూజారులు మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఈసందర్భంగా పొంగులెటి మాట్లాడుతూ.. గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం పనులతోపాటు, జాతర అభివృద్ధి పనులన్నీ ఈనెల 30 వరకు పూర్తి చేయాలని అధికారులను అదేశించారు. పనులు త్వరగా పూర్తి చేసేందుకు కార్మికుల సంఖ్యను పెంచడంతోపాటు అదనంగా మరో రెండు క్రేన్లను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. క్యూలైన్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులు, గుత్తేదారులను ఆదేశించారు. అంతకుముందు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్శన్ రేగ కల్యాణి. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు పాల్గొన్నారు. పనులను పరిశీలించిన మంత్రులు పొంగులేటి, సీతక్క ఈనెల 30 లాస్ట్ డెడ్‌లైన్ అధికారులతో సమీక్ష సమావేశం -
‘మంత్రిపై చర్యలు తీసుకోవాలి’
ములుగు రూరల్: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్కపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు. రెండో విడత ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీంతో సాయంత్రం 5 గంటలు దాటి న తర్వాత సభలు, సమావేశాలు, మైక్‌లతో ప్రచారం నిర్వహించకూడదు. ఈ మేరకు సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత జాకారంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని మంత్రి సీతక్క ప్రచారం నిర్వహించారు. ఎన్నికల సంఘం నిబంధనలు అతిక్రమించిన మంత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
బందోబస్తులో సమస్యలు రావొద్దు
● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ భూపాలపల్లి: పోలీసు బందోబస్తు విషయంలో సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని ఎం.టీ(పార్క్)విభాగం, డాగ్ స్క్వాడ్ యూనిట్‌ను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాహనాల రికార్డులు, రోజువారీ మెయింటనెన్స్ రిజిస్టర్, ఫ్యూయల్ వినియోగ వివరాలు, వాహనాల స్థితిగతుల గురించి సమగ్రంగా పరిశీలించారు. బందోబస్తు బాధ్యతల్లో వాహనాలకు సమస్యలు లేకుండా పనిచేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. డాగ్ స్క్వాడ్ విషయంలో కేనైన్ల ఆరోగ్య పరిస్థితి, ట్రెయినింగ్ రికార్డులు, స్పందన సామర్థ్యం, విభాగం పనితీరు, పరికరాల లభ్యతను పరిశీలించి యూనిట్‌ను మరింత బలోపేతం చేసే చర్యలు తీసుకోవాలని ఎస్పీ సంకీర్త్ ఆదేశించారు. -
రెండో దశ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు
భూపాలపల్లి: జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహణకు 13వ తేదీన పోలింగ్ మెటీరియల్ పంపిణీ, 14వ తేదీన పోలింగ్, ఓట్లు లెక్కింపు తదితర అంశాలపై శుక్రవారం ఐడీఓసీ కార్యాలయం నుంచి రెవెన్యూ, మండల ప్రత్యేక అధికారులు, పంచాయతీరాజ్ తదితర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎక్కువ గ్రామ పంచాయతీలు ఉన్న మండలాల్లో గ్రామాల వారీగా మూడు భాగాలుగా విభజించి ఇన్‌చార్జ్‌లను నియమించాలన్నారు. వెబ్ క్యాస్టింగ్ లేని చోట మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, డీపీఓ శ్రీలత, జిల్లా, మండల అధికారులు పాల్గొన్నారు. ర్యాండమైజేషన్ పూర్తి.. రెండో విడత జరుగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సిబ్బంది మూడో ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఈనెల 14వ తేదీన జరుగనున్న భూపాలపల్లి, టేకుమట్ల, చిట్యాల, పలిమెల మండలాల్లో ఎన్నికల విధులు నిర్వహించే పీఓ, ఓపీలకు శుక్రవారం కలెక్టర్ చాంబర్లో మూడో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించారు. ప్రత్యేక పోర్టల్ రూపకల్పన.. జిల్లాలో ఇంజినీరింగ్ పనుల పర్యవేక్షణను మరింత సులభతరం చేసి పారదర్శకతను పెంచే దిశగా ప్రత్యేక పోర్టల్ రూపొందించినట్లు కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో ఇరిగేషన్, ఆర్అండ్బీ, జాతీయ రహదారులు, పంచాయతిరాజ్, ఆర్డబ్ల్యూఎస్ తదితర శాఖలకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ శాఖలకు ఏ పథకం కింద ఎంత నిధులు కేటాయించబడ్డాయి, ఏ పనులు చేపట్టారు, వాటి పురోగతి ఎంత, పూర్తి చేయాల్సిన గడువు, ప్రారంభం కాని పనులు, కాంట్రాక్టర్ల సమస్యలు, స్థల సంబంధిత ఇబ్బందులు వంటి అన్ని అంశాలను ఒకే వేదికలో సమగ్రంగా పొందుపరుస్తూ పోర్టల్ రూపొందించామని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, వివిధ శాఖల ఇంజనీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు. అనుమతులు లేకుంటే చర్యలు.. జిల్లాలో అనుమతులు లేకుండా ప్రైవేట్ ఆస్పత్రులు నిర్వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్ శర్మ హెచ్చరించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్, రిజిస్ట్రేషన్ అథారిటీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పాటు చేసే ఆస్పత్రులకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకోవాలని, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తేనే అనుమతులు ఇవ్వాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, అదనపు ఎస్పీ నరేష్, డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ మధుసూదన్, ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ కేఎస్ కిరణ్ పాల్గొన్నారు. ఓటర్లకు ఇబ్బంది రానివ్వొద్దు అనుమతి లేని ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు కలెక్టర్ రాహుల్ శర్మ -
పెద్ద పంచాయతీలే టార్గెట్
భూపాలపల్లి అర్బన్: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ధన ప్రవాహం, ప్రభావం ఎక్కువగా కనిపించింది. ముఖ్యంగా మేజర్ గ్రామపంచాయతీల్లో భూములు అమ్ముకుని మరీ పోటీలో ఉన్న అభ్యర్థులు కూడా ఉన్నారు. కొంతమంది హోదా కోసం, మరికొంత మంది రాజకీయ బలం కోసం ఇలాంటి పరిస్థితులు తొలిపోరులో కనిపించాయి. గెలిచిన వారు ఉత్సాహంగా ఉంటే, ఓడినవారు తాము ఖర్చు చేసిన డబ్బును వసూల్చేసే పనిలో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తొలి విడత ఎన్నికలు ధనప్రవాహం కనిపించింది. లక్షలు ఖర్చు పెట్టయినా కొన్ని పంచాయతీల్లో గెలిచేందుకు అభ్యర్థులు తహతహలాడుతున్నారు. మండలాలుగా ఉన్న గ్రామపంచాయతీల్లో, ఇతర పెద్ద పంచాయతీల్లో ఎలాగైనా గెలవాలని ఇటు పార్టీలతో పాటు అభ్యర్థులు భావిస్తున్నారు. దీనికి సాక్ష్యంగా తొలివిడత ఎన్నికలే కనిపిస్తున్నాయి. లక్షలు ఖర్చుపెట్టి ఓడిపోయిన వారు తీవ్ర నిరాశలో ఉన్నారు. మరికొంత మంది ఓటర్లకు పంచిన డబ్బును వసూలుచేసే పనిలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఏకగ్రీవమైనవి దాదాపుగా 19 పంచాయతీలు ఉంటే వాటిలో ఉన్నవన్ని చిన్నపంచాయతీలే కావడం విశేషం. పెద్దపంచాయతీల్లో అందరూ పోటీకే ఆసక్తి చూపిస్తున్నారు. ఆదాయం ఉన్న చోటే ఆసక్తి జిల్లాలో 12 మండలాలు ఉంటే వాటిలోని 11 మండల కేంద్రాలు పంచాయతీలుగానే ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని పంచాయతీలు ఆదాయం పరంగా, అభివృద్ధి పరంగా ముందున్నాయి. ఈ విధమైన అనుకూలతలు ఉన్న పంచాయతీల్లో ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్లు ఎక్కువ మొత్తంలో దాఖలయినప్పటికీ చివరకు కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతుదారుల మధ్యే పోటీ నెలకొనే అవకాశం ఉంది. దాదాపు అన్ని మండలకేంద్రాల్లో పోటీ తీవ్రంగా ఉంది. ముఖ్యంగా కాళేశ్వరం, మహదేవపూర్, కాటారం, మల్హర్, దామెరకుంట, చిట్యాల, టేకుమట్ల గొర్లవీడు, చల్లగరిగే వంటి గ్రామపంచాయతీల్లో పోటీ తీవ్రంగా ఉంది. మొదటి విడత ఎన్నికలు జరిగిన గణపురం, చెల్పూర్, రేగొండ, కొత్తపల్లిగోరి, మొగుళ్లపల్లి, రంగాపూర్ పంచాయతీల్లో తీవ్రమైన ఉత్కఠంలో ఎన్నికలు జరిగి గెలుపు నువ్వా నేనా అనే స్థాయిలో అందరి దృష్టిని ఆకర్శించాయి. కాళేశ్వరం, కాటారం, మహదేవపూర్, దామెరకుంట వంటి పంచాయతీలు కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను అనుకుని ఉండటం, ఇసుక క్వారీలు ఉండటంతో ఈ పంచాయతీలకు విపరీమైన పోటీ నెలకొంది. తాడిచెర్ల పంచాయతీ పరిధిలో జెన్కో బొగ్గు గనులు ఉండటంతో పోటీ నెలకొంది. గణపురం, చెల్పూర్ పంచాయతీలు జిల్లా కేంద్రం భూపాలపల్లిని అనుకుని ఉండటం థర్మల్ పవర్ ప్రాజెక్ట్ వంటివి ఉండటంతో ఈ పంచాయతీల్లో గెలిచిన వారి పంట పండినట్లేనని ప్రజలు అనుకుంటున్నారు. దీంతో ప్రధాన పార్టీల మద్దతుదారుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అన్నింటి కన్నా ముఖ్యంగా అందరి నోళ్లలో నానుతున్న కాళేశ్వరం పంచాయతీలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కావడంతో ఇక్కడ కూడా పోటీ ఎక్కువగా ఉంది. ఖర్చుకు వెనకాడని అభ్యర్థులు అభివృద్ధి ప్రాజెక్ట్‌లు ఉన్న గ్రామపంచాయతీల్లో గెలవడానికి ఎంతైనా పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రజలు అనుకుంటున్నారు. కాళేశ్వరం, కాటారం, మహదేవపూర్, తాడిచర్ల వంటి జీపీల్లో లక్షల్లో ఖర్చు పెట్టేందుకు అభ్యర్థులు సిద్ధమయ్యారు. పంచాయతీ రిజర్వేషన్లు ఖరారయినప్పటి నుంచే డబ్బులు సర్దుబాటు చేసుకునే పనిలో అభ్యర్థులు ఉన్నారు. ఈ స్థానాల్లో పోటీ చేసేందుకు మండల స్థాయి నేతలు కూడా పోటీ పడుతున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీల కన్నా సర్పంచ్‌గా గెలిచేందుకే మొగ్గు చూపిస్తుండటం విశేషం. గోదావరి పరివాహక గ్రామపంచాయతీల్లో ఇసుక క్వారీలు ఉండటం, దీంతో ఆదాయం కూడా పెద్ద ఎత్తున వస్తుందని పోటీలో ఉన్న అభ్యర్థులు లెక్కలేసుకుంటున్నారు. దీంతో ప్రధానంగా పోటీలో ఉన్న అభ్యర్థులు రూ.30 లక్షల నుంచి రూ.50లక్షల వరకు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. తొలి విడతలో అన్ని గ్రామపంచాయతీల్లో ధనప్రభావం కనిపించింది. ముఖ్యంగా పెద్ద గ్రామపంచాయతీల్లో కనీసం రూ.15 లక్షలకు తక్కువ కాకుండా ఖర్చు చేశారు. కొన్నిచోట్ల ఈ మొత్తం రెట్టింపు కూడా అయింది. ఉదాహరణకు జిల్లాకేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న గ్రామపంచాయతీల్లో ఒక్కో అభ్యర్థి రూ.50లక్షల దాకా ఖర్చుచేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంత ఖర్చుపెట్టి ఓడిపోయిన అభ్యర్థి తన పంచిన డబ్బును వసూలు చేసే పనిలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జిల్లాకేంద్రానికి కొద్దిదూరంలో ఉన్న పంచాయతీల్లో ఓడిపోయిన అభ్యర్థులు తాము పంచిన డబ్బులను వసూలు చేసుకునే పనిలో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కొంతమంది హోదా కోసం, మరికొంత మంది రాజకీయంగా పైచేయి సాధించడం కోసం లక్షల రూపాయలను మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు పెడుతున్నారు. తొలివిడతలోనే ఇలా ఉంటే వచ్చే రెండో, మూడో విడత ఎన్నికల్లో ఎలా ఉంటుందో అని పోటీలో ఉన్న అభ్యర్థులతో పాటు, ప్రజలు అనుకుంటున్నారు. ఆదాయం, అభివృద్ధి ఉన్న జీపీల్లో గెలవాలని భావిస్తున్న అభ్యర్థులు తొలి విడతలో పెద్ద పంచాయతీల్లో ధన ప్రవాహం కొన్ని చోట్ల రూ.50లక్షల దాకా ఖర్చు చేసిన అభ్యర్థులు -
వెట్టి చాకిరీపై.. కదిలిన యంత్రాంగం
వరంగల్ క్రైం: విద్యార్థులతో బలవంతంగా అంట్లు తోమించి.. టిఫిన్లు తయారు చేయించిన ఓగ్లాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వ్యవహారంపై శుక్రవారం సాక్షిలో ‘చిట్టి చేతులు.. వెట్టి చాకిరీ’ పేరిట కథనం ప్రచురితమైంది. దీంతో రాష్ట్ర, జిల్లా అధికారులు కదిలారు. సాక్షి కథనంపై స్పందించిన పరకాల కోర్టు న్యాయమూర్తి జి.సాయి శరత్ పాఠశాలను సందర్శించడంతో వెట్టి చాకిరీ వ్యవహారం ఒక్కసారిగా వెడెక్కింది. దామెర తహసీల్దార్, జ్యోతి వరలక్ష్మి, డీసీఓ ఉమామహేశ్వరి, భద్రాది కొత్తగూడెం జోనల్ అధికారి అలివేలు, దామెర ఎస్సై అశోక్ కుమార్, ఎంఈఓ రాజేష్ ఉదయం పాఠశాలను సందర్శించారు. ముందుగా టిఫిన్ చేసిన విద్యార్థులను వేర్వేరుగా ప్రశ్నించారు. విచారణలో విద్యార్థులు తమతో బలవంతంగా పనులు చేయించినట్లు అధికారులకు చెప్పినట్లు సమాచారం. పాఠశాలలో పనిచేస్తున్న సంబంధిత కాంట్రాక్టర్ తన దగ్గర వంట మనుషులు లేకపోవడంతో విద్యార్థులను పనిలో పెట్టుకున్నట్లు అధికారులకు చెప్పినట్లు తెలిసింది. చిట్టి వెట్టి చాకిరి కథనంపై స్పందించిన న్యాయమూర్తి సాయి శరత్ ఈఅంశాన్ని సుమోటాగా తీసుకుని పాఠశాల లో విచారణ చేపట్టి నివేదికను జిల్లా ప్రధాన న్యాయమూర్తికి అందజేసినట్లు తెలిసింది. సమస్యల స్వాగతం.. పాఠశాలలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉండడంతో అధికారులు ప్రిన్సిపాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్లు తెలిసింది. పాఠశాలలో చోటుచేసుకున్న ఘట నపై లోతుగా విచారణ చేసినట్లు తెలిసింది. భద్రా ది కొత్తగూడెం జోనల్ అధికారి అలివెలు, విద్యార్థులు, ఉపాధ్యాయులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించి వివరాలు సేకరించారు. విద్యార్థులు టిఫిన్ వండటం, విద్యార్థులను కులం పేరుతో దూషించిన ఘటనలపై సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శికి నివేదిక సమర్పిస్తామని, ఆ తర్వాత శాఖాపరమైన చర్యలు ఉంటాయని జోనల్ అధికారి అలివేలు తెలిపారు. ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలి: విద్యార్థి సంఘాలు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్న ప్రిన్సిపాల్ సమ్మయ్య ను సస్పెండ్ చేయాలని కోరుతూ టీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కన్నం సునిల్, టీజీవీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడ రంజిత్ కుమార్, విద్యార్థి సంఘాల జేఏసీ కోఆర్డినేటర్ అనిల్ భద్రాది కొత్తగూడెం జోనల్ అధికారికి వినతి పత్రం అందజేశారు. విద్యార్థులతో మాట్లాడిన పరకాల జడ్జి ప్రిన్సిపాల్ సస్పెన్షన్‌కు విద్యార్థి సంఘాల డిమాండ్ ‘సాక్షి’ కథనంతో రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు -
లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రారంభం
భూపాలపల్లి అర్బన్: వయోవృద్ధుల సంక్షేమం, వారి పరిరక్షణ కోసం జిల్లాకేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో లీగల్ ఎయిడ్ క్లినిక్ ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్ఆర్ దిలీప్‌కుమార్‌నాయక్ తెలిపారు. ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను శుక్రవారం జడ్జి దిలీప్‌కుమార్‌నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. వయోవృద్ధుల సంక్షేమం, పరిరక్షణ చట్టాన్ని అనుసరిస్తూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల, ఆర్డీఓ రవి, గవర్నమెంట్ లీడర్ బొట్ల సుధాకర్, అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసచారి, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ శ్రీనివాస్, కంప అక్షయ, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ ఇందారపు శివకుమార్, న్యాయవాదులు కనపర్తి కవిత, సంగెం రవీందర్ పాల్గొన్నారు. కాటారంలో.. కాటారం: వయోవృద్ధుల సంక్షేమం, పరిరక్షణ కోసం లీగల్ ఎయిడ్ క్లినిక్ ఉపయోగపడుతుందని జిల్లా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్ఆర్.దిలీప్‌కుమార్‌నాయక్ అన్నారు. కాటారం మండల కేంద్రంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను జడ్జి దిలీప్‌కుమార్ నాయక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జి.అఖిల, గవర్నమెంట్ ప్లీడర్ బొట్ల సుధాకర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసచారి, స్పెషల్ పిపి విష్ణువర్ధన్, అసిస్టెంట్ పీపీ శివకుమార్ పాల్గొన్నారు. -
సాయంత్రం కాంగ్రెస్.. రాత్రి బీఆర్ఎస్
● కండువాలు మార్చిన నాయకులువెంకటాపురం(ఎం): ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండల కేంద్రంలో ద్వితీయ శ్రేణి నేతలను తమ వైపు తిప్పుకునేందుకు అధికార, ప్రతిపక్షనేతలు పోటీ పడుతుండడంతో విచిత్ర రాజకీయ సమీకరణాలు నెలకొన్నాయి. బీఆర్ఎస్కు చెందిన కొంతమంది వ్యక్తులు గురువారం సాయంత్రం మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్కు చెందిన ముఖ్య నేతలు గురువారం రాత్రి అదే నేతలను తిరిగి బీఆర్ఎస్లో చేర్చుకుని పార్టీ కండువా కప్పి ఫొటోలు దిగారు. శుక్రవారం ఉదయం విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు మళ్లీ వారికే కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్‌లోనే కొనసాగుతారని ఫొటోలు దిగి వారితో నినాదాలు చేయించారు. దీంతో ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో చేరుతున్నారో.. ఎవరికి మద్దతు ఇస్తున్నారో అర్థంకాక ఇరుపార్టీల అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
రేగొండ: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని తెలంగాణ ఫారెస్ట్ ఫోర్స్ హెడ్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సువర్ణ అన్నారు. శుక్రవారం మండలంలోని రావులపల్లి శివారులోని పాండవులగుట్టలను సీసీఎఫ్ కాళేశ్వరం ప్రభాకర్, ఎస్పీ సంకీర్త్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా పర్యాటక అభివృద్ధికి తగు చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. అనంతరం రాపెల్లింగ్, ట్రెక్కింగ్‌లో పాల్గొన్నారు. ప్రతాపగిరి గుట్టను సందర్శించిన పీసీసీఎఫ్ కాటారం: కాటారం అటవీశాఖ రేంజ్ పరిధిలోని ప్రతాపగిరి గుట్టను ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్ సువర్ణ శుక్రవారం సందర్శించారు. అటవీశాఖ అధికారులు, సిబ్బందితో కలిసి కాలినడకన గుట్టపైకి చేరుకున్నారు. గుట్ట చరిత్ర, ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఏకో టూరిజంగా తీర్చిదిద్దడానికి అనుగుణంగా ఉండే అంశాలపై పీసీసీఎఫ్ జిల్లా అటవీశాఖ అధికారులతో చర్చించారు. నివేదికను తయారు చేసి పంపించాలని ఆదేశించారు. పీసీసీఎఫ్ వెంట కాళేశ్వరం జోన్ సీసీఎఫ్ ప్రభాకర్, డీఎఫ్ఓ నవీన్‌రెడ్డి, ఎఫ్డీఓ సందీప్, కాటారం ఎఫ్ఆర్ఓ స్వాతి, డిప్యూటీ రేంజర్ సురేందర్, సెక్షన్, బీట్ అధికారులు ఉన్నారు. -
కొడుకు చేతిలో తండ్రి హత్య
గూడూరు: మద్యం మత్తులో గొడవపడిన తండ్రిని కుమారడు కొట్టి చంపిన ఘటన మానుకోట జిల్లా గూడూరు మండలంలోని దామరవంచ శివారు హఠ్యతండాలో గురువారం అర్ధరాత్రి జరిగింది. శుక్రవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హఠ్యతండాకు చెందిన ధారావత్ నందీరాంనాయక్ (45) భార్యా పిల్లలతో హైదరాబాద్‌లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు. గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటు వేయడానికి స్వగ్రామానికి వచ్చారు. గురువారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన నందీరాం గొడవ చేస్తున్నాడు. గొడవ వద్దని చెప్పిన భార్యపై మద్యం మత్తులో రోకలితో దాడి చేయడానికి యత్నించాడు. గుర్తించిన కుమారుడు కృష్ణ అదే రోకలితో తండ్రి ఛాతిపై కొట్టాడు. వెంటనే కింద పడి స్ప్రృహకోల్పోయాడు. కొద్దిసేపటికి గుర్తించిన కుటుంబ సభ్యులు గూడూరు సీహెచ్‌సీకి తరలించారు. వైద్యుడు పరీక్షించి, అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. ఈ సంఘటనపై మృతుడి తల్లి ధారావత్ సోమ్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గిరిధర్‌రెడ్డి తెలిపారు. -
పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ
కాటారం: ఎన్నికల నిర్వహణ పారదర్శకంగా కొనసాగించడానికి పోలింగ్ స్టేషన్లకు కేటాయించిన పీఓ, ఏపీఓలు, సిబ్బంది కృషి చేయాలని కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్ తెలిపారు. కాటారం మండలకేంద్రంలోని బీఎల్ఎం గార్డెన్స్‌లో శుక్రవారం ఎన్నికల విధులపై పీఓ, ఓపీఓలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పోలింగ్ ప్రక్రియలో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నిబంధనలు, ఓటింగ్, కౌంటింగ్ విధానాలపై మాస్టర్ ట్రైనర్ పోలింగ్ అధికారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్ మాట్లాడుతూ పొరపాట్లకు తావివ్వకుండా ఎన్నికల నిర్వహణ చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ బాబు, ఎంపీఓ వీరస్వామి, పీఓ, ఓపీఓలు పాల్గొన్నారు. మహాముత్తారంలో.. మహాముత్తారం మండలకేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల విధులు, నిర్వహణపై అధికారులు పీఓ, ఓపీలకు అవగాహన కల్పించారు. నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణ చేపట్టాలని అభ్యంతరాలకు తావివ్వవద్దని వివరించారు. కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్ -
రక్షణలో భాగస్వాములు కావాలి
మల్హర్: ఓపెన్ కాస్ట్లో ఉద్యోగులు, కార్మికులు రక్షణలో భాగస్వాములు కావాలని సేప్టీ కమిటీ కన్వీనర్ వెంకటరమణ సూచించారు. 56వ రక్షణ పక్షోత్సవాల్లో భాగంగా శుక్రవారం మండలంలో తాడిచర్ల ఓపెన్‌కాస్ట్ మైన్‌ను వెంకట్వేర్‌రావు సందర్శించి, రక్షణ ఏర్పాట్లు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడాతూ.. ప్రతీ ఉద్యోగి విధి నిర్వహణలో రక్షణ సూత్రాలు పాటించాలని సూచించారు. కార్మికుల రక్షణపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తే ప్రమాదాలకు దూరంగా ఉండవచ్చని పేర్కొన్నారు. రక్షణ సూత్రాలు పాటిస్తూ లక్ష్యాలను సాధించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రమాద రహిత ఓపెన్‌కాస్ట్ మైన్‌గా నిలిచేలా ప్రతీ ఒక్కరు పాటుపడాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్ఓపీ, సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ ప్రకారం సంస్థ నియమ నిబంధనలను అనుసరించి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త వహించాలని వివరించారు. కార్యక్రమంలో మైన్ ఏజెంట్ జీవన్‌కుమార్, సభ్యులు జాకీర్ హుస్సేన్, వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, జెన్కో జీఎం మోహన్‌రావు, ఏఎమ్మార్ వైస్ ప్రెసిడెంట్లు శ్రీధర్, కేఎస్ మూర్తి, మైన్ మేనేజర్ శ్రీనివాస్, సేప్టీ అధికారి సురేష్‌బాబు పాల్గొన్నారు. -
హస్తం హవా
భూపాలపల్లి: జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థులు సత్తా చాటారు. పలు జీపీలను ఏకగ్రీవంతో చేజిక్కించుకోవడంతోపాటు బరిలో నిలిచిన స్థానాల్లోనూ అధిక స్థానాలను కై వసం చేసుకున్నారు. రెండో స్థానంలో బీఆర్ఎస్ నిలువగా, నాలుగు స్థానాల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. అధికార పార్టీ జోరు.. తొలి విడతలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ మద్దతుదారులు సత్తా చాటారు. గణపురం, రేగొండ, కొత్తపల్లిగోరి, మొగుళ్లపల్లి మండలాల్లోని 82 సర్పంచ్, 712 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో 9 సర్పంచ్ స్థానాలను ఏకగ్రీవంతో కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. అలాగే ఎన్నిక జరిగిన స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అత్యధిక సర్పంచ్ స్థానాలను కై వసం చేసుకున్నారు. గంటగంటకు పెరిగిన పోలింగ్.. గణపురం, రేగొండ, గోరికొత్తపల్లి, మొగుళ్లపల్లి మండలాల్లో గురువారం మొదటి విడత పంచాయ తీ ఎన్నికలు జరిగాయి. ఈ మండలాల్లో మొత్తం 1,07,690 మంది ఓటర్లు ఉండగా, 88,588 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నా రు. మొత్తంగా 82.26 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే పోలింగ్ ఉద యం 7 గంటలకు ప్రారంభం కాగా గంటగంటకు పోలింగ్ శాతం పెరుగుతూ వచ్చింది. గణపురం మండలంలో 77.05, కొత్తపల్లి గోరిలో 84.82, మొగుళ్లపల్లిలో 84.08, రేగొండలో 84.26 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.మండలం జీపీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇతరులు గణపురం 17 11 5 0 1 రేగొండ 23 11 6 1 5 కొత్తపల్లిగోరి 16 12 1 2 1 మొగుళ్లపల్లి 26 17 8 1 0 మొత్తం 82 51 20 4 7 అధిక సర్పంచ్ స్థానాలు అధికార పార్టీ కై వసం రెండో స్థానంలో నిలిచిన బీఆర్ఎస్ పలుచోట్ల అర్ధరాత్రి వరకు సాగిన ఓట్ల లెక్కింపు గంటగంటకూ పెరిగిన పోలింగ్ శాతం -
పార్ట్ టైం లెక్చరర్ల నియామకానికి ఓకే..
● కేయూ స్టాండింగ్ కమిటీలో నిర్ణయం కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని వివిధ విభాగాల్లో, యూనివర్సిటీ కాలేజీల్లో విద్యాబోధనకు పార్ట్‌టైం లెక్చరర్ల నియామకానికి త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఈమేరకు గురువారం సాయంత్రం కేయూ స్టాండింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. విద్యార్హతలతోపాటు ఇంటర్వ్యూల ద్వారా రోస్టర్ ద్వారా పార్ట్‌టైం లెక్చరర్లను నియమించనున్నారు. ఏవిభాగంలోని ఆవిభాగం అధిపతి, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్, డీన్, ఇద్దరు సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్‌తో ఇంటర్వ్యూలు నిర్వహించాలని నిర్ణయించారు. ఏదైనా కోర్సులో సబ్జెక్టులో గోల్డ్‌మెడల్‌కు ఎవరైనా తమపేరును పెట్టాలనుకుంటే ఇక నుంచి రూ.5 లక్షలు యూనివర్సిటీకి చెల్లించాల్సి ఉంటుంది 2025–26 వరకు ఆయా కోర్సుల్లో డిటెన్షన్‌ను ఎత్తి వేయాలని స్టాండింగ్ కమిటీలో నిర్ణయించారు. కేయూ పరిధి ఏ పీజీ కోర్సులోనైనా ఈవిద్యాసంవత్సరంలో ప్రథమ సంవత్సరంలో 15లోపు విద్యార్థులు ప్రవేశాల సంఖ్య ఉంటే.. వేరేచోటకు షిఫ్ట్ చేయాలని స్టాండింగ్ కమిటీలో నిర్ణయించారు. కేయూ స్టూడెంట్స్ అఫైర్స్ డీన్, యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ల పదవులకు స్టాండింగ్ కమిటీలో అప్రూవల్ లభించింది. సుమారు 4:30 గంటలపాటు నిర్వహించిన ఈ కమిటీ సమావేశంలో వివిధ కోర్సుల సిలబస్‌లపై చర్చించారు. 35 అంశాలకుపైగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో కేయూ వీసీ ఆచార్య కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం, వివిధ విభాగాల అధిపతులు, డీన్లు, ప్రిన్సిపాళ్లు, స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ పాల్గొన్నారు. -
దరఖాస్తుల స్వీకరణ
భూపాలపల్లి అర్బన్: వివిధ ట్రేడ్లలో ఐటీఐ (ఎన్సీవీటీ) అప్రెంటిస్‌షిప్ శిక్షణకు సింగరేణి యాజమాన్యం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఏరియా జీఎం రాజేశ్వర్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్‌ఏపీసీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉన్న అభ్యర్థులు మాత్రమే అర్హులని స్పష్టం చేశారు. ఎన్ఏపీఎస్ పోర్టల్‌లో నమోదై ఉంటేనే ఎస్సీసీఎల్ పోర్టల్ రిజిస్ట్రేషన్ చెల్లుబాటు అవుతుందని తెలిపారు. అర్హత గల అభ్యర్థులు ఈ నెల 25వ తేదీలోపు www. apprenticeshipindia. org వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అనంతరం ఆన్లైన్ దరఖాస్తు జిరాక్స్ సెట్‌ను వీటీసీ కార్యాలయంలో అందించాలని తెలిపారు. భూపాలపల్లి అర్బన్: జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 21న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి నాగరాజ్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో స్థానిక న్యాయవాదులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీమార్గాన్ని ఎంచుకొని వివాదరహిత జీవితాలను గడిపేలా కక్షిదారులను ప్రోత్సహించాలని సూచించారు. రాజీమార్గం ద్వారా అధిక సంఖ్యలో కేసులు పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. జూనియర్ సివిల్ జడ్జి ఎస్ఆర్ దిలీప్‌కుమార్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసచారి, డీప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అక్షయ, న్యాయవాదులు పాల్గొన్నారు. భూపాలపల్లి అర్బన్: 56వ వార్షిక భద్రత పక్షోత్సవాలు ఏరియాలో కొనసాగుతున్నాయి. ఈ మేరకు గురువారం ఏరియాలోని కేటీకే 6వ గనిలో భద్రత తనిఖీ బృందం పర్యటించారు. ఏరియా జీఎం రాజేశ్వర్‌రెడ్డి, భద్రత కమిటీ కన్వీనర్ శ్రీనాథ్ హాజరై ఉద్యోగులకు భద్రత చర్యలు, ప్రమాదాల నివారణ గురించి వివరించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు లక్ష్మణ్, రాధాకృష్ణ, అఫ్సర్‌పాషా, కిరణ్‌కుమార్, అమర్నాథ్, శ్రీనివాసరావు, ఏరియా అధికారులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. భూపాలపల్లి అర్బన్: 2026 మార్చి 14వ తేదీ నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నట్లు జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏప్రిల్ 16వ తేదీ వరకు పరీక్షలు కొనసాగుతాయని తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల పరీక్ష ఉంటుందని తెలిపారు. భౌతిక, జీవశాస్త్రలకు మాత్రం ఉదయం 11 గంటల వరకు ఉంటుందన్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రతి పరీక్షకు 4 నుంచి 5 రోజుల వ్యవధి ఉంటుందని విద్యార్థు ఈ విరామ సమయాన్ని వినియోగించుకుని పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించాలని తెలిపారు. కాటారం : మండలంలోని గంగారం గ్రామానికి చెందిన బొమ్మన జైపాల్‌రెడ్డి రాజేశ్వరికావ్యల కూతురు శ్లోక ఫాల్గునరెడ్డి విభిన్న రంగాల్లో బహుముఖ ప్రతిభ కనబరుస్తూ మన్నలను పొందుతుంది. క్రీడలు, కళలు, వ్యక్తిత్వ అభివృద్ధి రంగాల్లో తనదైన ప్రతిభ చాటుతూ ముందుకెళ్తుంది. తాజాగా శ్లోక ఫాల్గునరెడ్డి బీసీసీఐ అండర్–19 వన్డే మహిళా క్రికెట్ జట్టులో చోటు దక్కించుకుంది. ఈ నెల 13 నుంచి ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరగనున్న మహిళల వన్డే క్రికెట్ టోర్నమెంట్లో హెచ్‌సీఏ తెలంగాణ జట్టు తరఫున ఆడనుంది. గతంలో ఆమె లక్నోలో జరిగిన జాతీయ స్థాయి అండర్–14 మహిళా క్రికెట్ ఫైనల్లో ఉమ్మడి తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. శ్లోక ఫాల్గునరెడ్డి కేవలం క్రికెట్లోనే కాకుండా చెస్ జాతీయ స్థాయి పోటీల్లో, త్రోబాల్ రాష్ట్రస్థాయి పోటీల్లో విజయం సాధించింది. అంతర్జాతీయ స్థాయిలో కూచిపూడి ప్రదర్శనలు ఇచ్చిన శ్లోక ఫాల్గునరెడ్డి నాట్య మయూరి ఇంటర్నేషనల్ అవార్డును అందుకోవడంతోపాటు 2024లో మిస్ హైదరాబాద్ టైటిల్‌ను గెలుచుకుంది. శ్లోక ఫాల్గునరెడ్డి మహిళా క్రికెట్ జట్టుకు ఎంపికవడంపై తల్లిదండ్రులతోపాటు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు. -
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
గణపురం: మెదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గురువారం గణపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల, గాంధీనగర్‌లో సీఎస్ఐ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా.. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతున్నాదా..లేదా.. అని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ ప్రశాంతంగా నిష్పక్షపాతంగా కొనసాగుతున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల పరిశీలన రేగొండ: మండలంలోని పలు గ్రామాల్లో మొదటి విడత ఎన్నికలు నిర్వహిస్తున్న పోలింగ్ కేంద్రాలను గురువారం అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. కేంద్రంలో ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే స్పందించి పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. మండల ప్రత్యేకాధికారి సునీల్ కుమార్, తహసీల్దార్ శ్వేత పాల్గొన్నారు.మరిన్ని ఫొటోలు, వార్తలు -
శాస్త్రితోనే వేదశాస్త్రాలు పరివ్యాప్తం
హన్మకొండ కల్చరల్: తొలి వేద పాఠశాలను ఏర్పా టు చేసి, వేలాది మంది వేద పండితులను అందించిన విశ్వనాథ శాస్త్రి కృషితోనే వేద శాస్త్రాలు పరివ్యాప్తమయ్యాయని తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ అన్నారు. వరంగల్ శంభునిపేటలోని నాగేశ్వరస్వామి దేవస్థానం కల్యాణ మండపంలో తెలంగాణ వైతాళికులు, జ్ఞాననిధి, ఆయుర్వేద ఆచార్యులు శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి జయంతోత్సవం వైభవంగా నిర్వహించారు. శృంగేరి శారదాపీఠం దర్శనం పత్రిక సంపాదకులు మరుమాముల వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు జ్యోతిప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. విశ్వనాథ శాస్త్రి పాదుకలకు శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం కల్యాణ మండపంలో గురు వందనం, గురుచరణ పూజ, సభ నిర్వహించారు. కార్యక్రమంలో వేదపండితులు శాస్త్రుల వెంకటేశ్వరశర్మ, పురాణం మహేశ్వరశర్మ, నరసింహామూర్తి, ఎల్లంభట్ల సీతారామశాస్త్రి, రామకృష్ణ, రమేశ్‌శర్మ, నాగరాజు శర్మ, జాగర్లపూడి శ్రీరామశర్మ, అయ్యప్పశర్మ, ఫణిశర్మ, సాయి సుందరశర్మ, జగన్మోహనశర్మ, ఆర్యవైశ్య నాయకులు తోట నరసయ్య, గట్టు మహేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ విశ్వనాథ శాస్త్రి జయంత్యోత్సవం -
రండీ బాబు.. రండీ!
కాళేశ్వరం: గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల సందడి ఓటర్లను కిక్కెక్కిస్తుంది. తొలి విడత ఎన్నికలు గురువారంతో ముగిసాయి. ఈనెల 14న రెండో, 17న మూడో విడత ఎన్నికలకు అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు. అభ్యర్థుల ఇళ్లలో హడావుడితోపాటు వార్డుల్లో కూడా అదే ఉత్సాహం కనిపిస్తోంది. హైదరాబాద్‌తోపాటు చైన్నై, తమిళనాడు, ముంబాయి తదితర ప్రాంతాలు, ఇతర జిల్లాలో ఉన్న తమ గ్రామ ఓటర్లను తీసుకొచ్చేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. వలస కూలీలు, సాఫ్ట్వేర్, ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్న వారిని పోలింగ్ రోజున రప్పించడానికి రవాణా చార్జీలు భ్యర్థులు భరించడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఎన్ని ఓట్లు ఉంటే అంత మొత్తంలో ఖర్చులు భరించడానికి సిద్ధం అవుతున్నారు. పట్నం ఓటర్లే కీలకం నాయకులు, కార్యకర్తలు, యువకులు, అభిమానులు, బంధువులు, గ్రామస్తులు ఎవరికి వారే పనుల్లో బిజీ అయ్యారు. తమ ఓటర్లు ఎక్కడెక్కడ ఉన్నారనే సమాచార జాబితాను తయారు చేశారు. ఓటరు లిస్టువారీగా తమ వైపు తిప్పుకునేందుకు ప్రాంతానికి ఒక్కో నాయకునికి బాధ్యతలను అప్పగిస్తున్నారు. ‘అన్నా హైదరాబాద్‌లో ఉన్న మనోడు వచ్చాడా.. చైన్నై నుంచి బయలు దేరారా’ అనే చర్చలు పల్లెల్లో జోరుగా సాగుతున్నాయి. సోషల్ మీడియాలో సైతం ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ‘అన్నా పోలింగ్ రోజు తప్పకుండా గ్రామానికి రావాలి.. మీ అమూల్యమైన ఓటు వేయాలి..’ అంటూ వాట్సాప్‌లో మెసేజ్‌లు వెళ్లువెత్తుతున్నాయి. ఊరి ఓటర్లతోపాటు గెలుపులో పట్నం ఓటర్లు కింగ్ మేకర్లుగా మారనున్నారు. ఎవరు ఎక్కడ పనిచేస్తున్నారు. ఎక్కడ ఉంటున్నారు.. ఎప్పుడు వస్తారు. ఖర్చు ఎంత అనే బిజీలో అభ్యర్థుల అనుచరులు నిమగ్నమయ్యారు. మరికొంత మంది అభ్యర్థులు తమ ఓటర్లకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి మద్దతు కోరుతున్నారు. వలసల పెరుగుదలతో ఇప్పుడు గ్రామ రాజకీయాల్లో పట్నం ఓటర్ల ప్రభావం పెరిగింది. అందుకే అభ్యర్థులందరూ వారిపై గంపెడాశలు పెట్టుకుంటున్నారు. ఒక్క ఓటు చాలు.. ఒక్క ఓటు ఫలితాన్ని తారుమారు చేసే పరిస్థితి ఉంది. ప్రతి అభ్యర్థి వలస ఓటర్లను రప్పించుకోవడానికి చేసే హడావుడి అంతా ఇంతా కాదు. గతంలో చివరి క్షణంలో జిల్లాలో పలు ప్రాంతాల్లో ఒక్క ఓటే పదుల సంఖ్యలో అభ్యర్థుల ఆశలను తలకిందులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం బరిలో నిలిచిన అభ్యర్థులు ఒక్క ఓటు కూడా చేజారిపోకుండా జాగ్రత్త పడుతున్నారు. 14న రెండో విడతలో చిట్యాల, టేకుమట్ల, భూపాలపల్లి, పలిమెల మండలాలు, 17న మూడో విడతలో మల్హర్, మహదేవపూర్, మహాముత్తారం, కాటారం మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి.గ్రామాల్లో ఓటర్లను ఆకర్షించే విధంగా విందు రాజకీయాలకు తెర లేపుతుండగా, పట్నంలో ఉన్న వలస వెళ్లిన వారికి సైతం తమవైపు తిప్పుకునేందుకు బరిలో ఉన్న ప్రతి అభ్యర్థి ఆయా ప్రాంతాల్లో వారికి డిజిటల్ పే ద్వారా డబ్బులు పంపుతున్నారు. పట్నం ఓటర్లు ఏఏ ప్రాంతాల్లో ఉన్నారనే లెక్కల మేరకు వారిని పోలింగ్ తేదీ వరకు వచ్చేవిధంగా ప్లాన్ చేశారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలను తలదన్నే రీతిలో సర్పంచ్ ఎలక్షన్లలో డబ్బుల ప్రవాహం ఏరులైపారుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. పట్టణాల్లో ఉంటున్నవారికి అభ్యర్థుల ఫోన్లు రవాణా చార్జీల చెల్లింపు? కొనసాగుతోన్న రెండు, మూడో విడతల ప్రచారం -
వాహనాల దారి మళ్లింపు
ములుగు రూరల్: మల్లంపల్లి వద్ద జాతీయ రహదారిపై వంతెన మరమ్మతు పనుల్లో భాగంగా నేడు(శుక్రవారం) వాహనాలు దారి మళ్లిస్తున్నట్లు కలెక్టర్ టీఎస్.దివాకర గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నేడు ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు మల్లంపల్లి వంతెన మీదుగా వాహనాల రాకపోకలు నిలిపి వేస్తున్నట్లు వివరించారు. లారీలు, ట్రక్కులు, వ్యాన్లు, గూడెప్పాడు–పరకాల– రేగొండ–జంగాలపల్లి మీదుగా వెళ్లాలని సూచించారు. కెనాల్‌పై బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా ఫ్రీకాస్ట్ గ్రిడర్ల ఏర్పాటుకు భారీ క్రేన్లతో పనులు చేపడుతున్న కారణంగా వాహనాలను దారి మళ్లించినట్లు కలెక్టర్ వివరించారు. -
ఉమ్మడి జిల్లాలో ‘చెయ్యె’త్తిన ఓటర్లు
సాక్షిప్రతినిధి, వరంగల్ : గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా గ్రామీణ ఓటర్లు కాంగ్రెస్ మద్దతుదారులకు జైకొట్టారు. రాత్రి 11 గంటలకు ఏకగ్రీవాలు కలిపి 555 గ్రామ పంంచాతీల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో 333 కాంగ్రెస్ మద్దతుదారులు, 148 బీఆర్ఎస్, 17 బీజేపీ, ఒకటి సీపీఐ మద్దతుదారులు విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. 56 చోట్ల రెబల్స్, స్వతంత్రులు గెలుపొందగా, వారిని సైతం పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు మంతనాలు చేస్తున్నట్లు సమాచారం. ఉదయం 9 గంటల నుంచి పోటెత్తిన ఓటర్లు ఉదయం 9 గంటల నుంచి పోటెత్తిన ఓటర్లు మధ్యాహ్నం వరకు ఓటు వేసేందుకు క్యూ కట్టారు. పోలింగ్ సమయం 1 గంట దాటినా.. చాలాచోట్ల మధ్యాహ్నం 2 గంటల తర్వాత కూడా ఓటుహక్కును వినియోగించుకున్నారు. మెజారిటీ గ్రామాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా.. ముందుగా వార్డు సభ్యుల ఓట్లను లెక్కించారు. ఆ తర్వాత సర్పంచ్ అభ్యర్థుల ఓట్లు లెక్కించారు. రాత్రి 11 గంటల వరకు ఉమ్మడి జిల్లాలో ఫలితాలు వెలువడ్డాయి. ఉమ్మడి వరంగల్‌లో మొదటి విడతలో 555 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఇందులో 53 ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 502 పంచాయతీలకు పోలింగ్, కౌంటింగ్ జరిగింది.జిల్లా గ్రామాలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ సీపీఐ/సీపీఎం ఆదర్స్ హనుమకొండ 69 33 19 08 01 08 వరంగల్ 91 63 24 – – 04 జేఎస్ భూపాలపల్లి 82 50 20 04 – 08 ములుగు 48 36 11 – – 01 జనగామ 110 64 26 – – 20 మహబూబాబాద్ 155 87 48 05 – 15 555 333 148 17 01 56 మొదటి విడతలో హనుమకొండ జిల్లాలో 69 పంచాయతీలకు గాను ఐదు జీపీలు ఏకగ్రీవం కాగా 4 గ్రామాల్లో సర్పంచ్‌లు, వార్డు సభ్యులు ఏకగ్రీవం అయ్యారు. ఒక ఊరిలో సర్పంచ్ మాత్రమే అయ్యారు. వరంగల్ జిల్లాలో 91 గ్రామ పంచాయతీలకు 11 జీపీలు ఏకగ్రీవమయ్యాయి. ములుగు జిల్లాలో 48 గ్రామ పంచాయతీలకుగాను 9, జనగామ జిల్లాలో 110 గ్రామ పంచాయతీలకు గాను 10 పంచాయతీలు ఏకగ్రీవం అయినట్లు అధికారులు ప్రకటించారు. జేఎస్ భూపాలపల్లి జిల్లాలో 82 గ్రామ పంచాయతీలకు గాను 9 పంచాయతీలు, మహబూబాబాద్ జిల్లాలో 155 పంచాయతీలకుగాను 9 ఏకగ్రీవం అయ్యాయి. రెండో స్థానంలో బీఆర్ఎస్... 56 మంది ఇతరుల విజయం స్వతంత్రులతో కాంగ్రెస్, బీఆర్ఎస్ల మంతనాలు -
ధాన్యం కొనుగోళ్లు వేగంగా చేపట్టాలి
కాళేశ్వరం: ధాన్యం కొనుగోళ్లు వేగంగా చేపట్టాలని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జ్‌లను ఆదేశించారు. బుధవారం ఆయన మహదేవపూర్ మండలంలోని బొమ్మాపూర్, సురా రం, మహదేవ్పూర్, కాళేశ్వరం ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈసందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. రైతులు తీసుకొస్తున్న ధాన్యం తేమ శాతం రోజువారీగా నిర్ధారించి పర్యవేక్షణ చేయాలని సూచించారు. ట్యాబ్ ఎంట్రీలను తప్పనిసరిగా 24 గంటలలోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. తేమ శాతం నమోదు రిజిస్టర్, డైలీ ప్రొక్యూర్మెంట్ అప్డేషన్ రిజిస్టర్లను పరిశీలించి, రికార్డుల నిర్వహణలో ఖచ్చితత్వం, పారదర్శకత, సమయానుకూల సంరక్షణకు సంబంధించి అవసరమైన సూచనలు జారీ చేశారు. అనంతరం కాళేశ్వరంలో ఏర్పాటు చేసిన బోర్డర్ చెక్ పోస్టును పరిశీలించారు. ఆయన వెంట పౌరసరఫరాల అధికారి కిరణ్‌కుమార్, డీఎం రాములు, డీసీఓ వాలియానాయక్ తదితరులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ -
రాజ్యాంగ హక్కులపై అవగాహన అవసరం
భూపాలపల్లి అర్బన్: భారత రాజ్యాంగం కల్పించిన మానవ హక్కులను తెలుసుకొని వినియోగించుకోవాలని జిల్లా అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల విద్యార్థులకు సూచించారు. మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని జంగేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జడ్జి అఖిల హజరై మాట్లాడుతూ.. యావత్ ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనకు ఉందని ఎందరో మహనీయుల కృషి ఫలితంగా మానవ హక్కుల, విధుల రూపకల్పన జరిగిందన్నారు. ఎక్కడైతే హక్కులకు భంగం వాటిల్లుతుందో అక్కడ చట్టం న్యాయం పనిచేయడం ప్రారంభిస్తుందని తెలిపారు. జీవించే హక్కు సమానత్వ హక్కుతోపాటు విద్యాహక్కు కూడా ఉందని అన్నారు. చదువుతోనే ఏదైనా సాధించే అవకాశం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శ్రీ పుప్పాల శ్రీనివాస్, పాఠశాల ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయులు సేవానాయక్, న్యాయవాది మంగళపల్లి రాజ్‌కుమార్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.జిల్లా అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల -
జోరందుకున్న రెండో విడత ప్రచారం
భూపాలపల్లి రూరల్: రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అభ్యర్థులు ఇప్పటికే పోటాపోటీగా ఓట్ల వేట ప్రారంభించారు. రెండోవిడత ఎన్నికల పోలింగ్ ఈ నెల 14న జరగనుంది. ఓటింగుకు 48 గంటల ముందే ప్రచారం నిలిపి వేయాల్సి ఉంటుంది. దీంతో బహిరంగ ప్రచారానికి ఒకరోజే మిగిలింది. సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి తమను గెలిపించాలని కోరుతున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలు బలపరిచిన అభ్యర్థుల తరపున జిల్లా నాయకులు గ్రామాల్లోకి వెళ్లి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇప్పటికే పల్లెల్లో మైకులు, రికార్డింగ్ ఆడియోలతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రచారం చేయిస్తున్నారు. గెలుపు కోసం వాడవాడల్లో ప్రతీగడపకు తిరుగుతూ ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. మహిళలు, యువత ఓట్లు అధికంగా ఉన్న చోట్ల వారిపై ప్రత్యేక దృష్టి సారించి మద్దతు కోరుతున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తరఫున అభ్యర్థులతోపాటు స్వతంత్ర అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. సర్పంచ్, వార్డు స్థానాల్లో మద్దతుదారులతో కలిసి అందుబాటులో ఉన్న ఓటర్లను కలుస్తున్నారు. వలస ఓటర్లకు ఫోన్లు.. గ్రామాల నుంచి పలు నగరాలు, పట్టణాలకు వలస వెళ్లిన వారిలో అనేకమంది ఓటర్లు ఉన్నారు. ఊళ్లో ఓటు ఉండి విద్య, ఉపాధి, ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌తోపాటు పొరుగు జిల్లాలకు వలస వెళ్లారు. ఆ ఓటర్లకు అభ్యర్థులు ఫోన్లు చేస్తూ బరిలో ఉన్నామని చెబుతూ మద్దతు కోరుతున్నారు. పోలింగ్ రోజు ఓటేసేందుకు గ్రామానికి రావాలని ముందుగానే ఓ మాట చెబుతున్నారు. ఎన్నికల ప్రచారానికి కిక్కు.. అనుచరులతో అభ్యర్థులు ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఈసారి తప్పకుండా తమనే గెలిపించాలని కోరుతున్నారు. మహిళా అభ్యర్థుల పక్షాన భర్తలు మందుండి ప్రచారం చేస్తున్నారు. అనుచరులతోపాటు ఓటర్లకు దావతులు ఏర్పాటు చేసి ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు సమాచారం.పంచాయతీ ఎన్నికల ప్రచారం సోషల్ మీడియాలో హోరెత్తుతోంది. వాట్సాప్, ఫేస్బుక్, ఇస్ర్ట్రాగాం తదితర సామాజిక మాధ్యమాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. తమ గుర్తును వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేస్తున్నారు. ఎన్నికల కోసం ప్రత్యేకంగా గ్రూపులు ఏర్పాటు చేసి విస్తృతంగా పాటలు, వీడియోలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఒకరికి మించి ఒకరు అన్నట్లుగా పల్లెల్లో ఎన్నికలతో వాట్సాప్ గ్రూపులు నిండిపోతున్నాయి. వేగం పెంచుతున్న సర్పంచ్ అభ్యర్థులు రంగంలోకి జిల్లాస్థాయి నాయకులు ఇంటింటికీ వెళ్తూ ఓటు అభ్యర్థిస్తున్న నేతలుభూపాలపల్లి, టేకుమట్ల, చిట్యాల, పలిమెల పంచాయతీలు 75 వార్డు స్థానాలు 547 సర్పంచ్ అభ్యర్థులు 254 వార్డు సభ్యుల అభ్యర్థులు 1,463 -
తొలిపోరు నేడే..
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో మొదటి విడతలో గణపురం, రేగొండ, కొత్తపల్లిగోరి, మొగుళ్లపల్లి నాలుగు మండలాల్లో నేడు(గురువారం) ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఎన్నికల నిర్వహణ సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు బుధవారం సాయంత్రం చేరుకున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఎన్నికలను నిర్వహించనున్నారు. నాలుగు మండలాల్లో 73 గ్రామ పంచాయతీలు, 559 వార్డు స్థానాలకు ఎన్నికలు నేడు పోలింగ్ జరుగనుంది. ఎన్నికల నిర్వహణకు 1,939 మంది పోలింగ్ అధికారులు, సిబ్బందిని కేటాయించారు. ఎన్నికలు జరిగే మండలాలు, గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నాలుగు మండలాలకు సుమారు 800 మంది పోలీస్ అధికారులు, సిబ్బందిని కేటాయించారు. సమస్యాత్మక గ్రామాల్లో అదనపు బలగాలను నియమించి భద్రతను మరింత పటిష్టం చేశారు. 2 గంటల నుంచి కౌంటింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఓటింగ్.. అనంతరం అధికారులు 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు అన్ని గ్రామాల్లో ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. నాలుగు మండలాల్లో 1,14,007 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. సర్పంచ్ అభ్యర్థులుగా 259 మంది, వార్డు సభ్యులుగా 1,282 మంది పోటీలో ఉన్నారు. పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది ఎన్నికలు నిర్వహణకు అధికారులు సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. మండల కేంద్రాల్లో ఎంపీడీఓ కార్యాలయాల్లో బ్యాలెట్ బ్యాక్స్, ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాల్లో పోలీస్ భద్రతనడుమ ఎన్నికల నిర్వహణ అధికారులు, సిబ్బంది బుధవారం సాయంత్రం పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఏర్పాట్ల పరిశీలన మొదటి విడత ఎన్నికలు జరిగే నాలుగు మండలాల్లో బ్యాలెట్ బాక్స్‌లు, ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకుడు ఫణీంద్ర, కలెక్టర్ రాహుల్‌శర్మ అధికారులతో కలిసి పరిశీలించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. ఎక్కడైనా ఇబ్బంది ఉంటే వెంటనే ఉన్నతాధికారులకు సూచించాలని తెలిపారు. 73 సర్పంచ్, 559 వార్డు స్థానాలకు.. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ మధ్యాహ్నం తర్వాత కౌంటింగ్ సాధారణ ఎన్నికల పరిశీలకుడు ఫణీంద్ర రెడ్డి గణపురం: మండలంలో మొదటి విడతలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా జరుపుకోవాలని సాధారణ ఎన్నికల పరిశీలకుడు ఫణీంద్రరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మండలంలో పోలింగ్ మెటీరియల్ పంపిణీ కేంద్రాన్ని పరిశీలించి, మాట్లాడారు. మెటిరీయల్ పంపిణీ కేంద్రాల్లో ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. పోలింగ్ ప్రక్రియ పారదర్శకంగా సాగేలా ప్రతి దశలో పని చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయణ స్వామి, ఎంపీడీఓ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలి
రేగొండ: ఎన్నికల్లో విధులు నిర్వహించే అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికా రి, కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. బుధవారం రేగొండ, కొత్తపల్లిగోరి మండలాల్లోని ఉన్నత పాఠశాలల్లో కలెక్టర్ రాహుల్‌శర్మ క్షేత్రస్థాయిలో పర్యటించి, ఎన్నికల సామగ్రిని పరిశీలించారు. సమయానికి పోలింగ్ ప్రారంభమై, ముగిసేలా చూడాలని అధికారులకు సూచించారు. అనంతరం లెక్కింపు పూర్తి చేసి పరిశీలకుల అనుమతితో విజేతలను ప్రకటించాలని సూచించారు. పోలింగ్ సామగ్రి తరలింపునకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో రేగొండ మండల ప్రత్యేక అధికారి సునీల్ కుమార్, తహసీల్దార్లు శ్వేత, లక్ష్మీరాజయ్య, ఎంపీడీఓలు వెంకటేశ్వరరావు, రాంప్రసాద్, ఎంఈఓ రాజు, రిటర్నింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్‌శర్మ -
అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలి
మొగుళ్లపల్లి: అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలని ఎస్పీ సంకీర్త్ అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక పోలీంగ్ స్టేషన్లను బుధవారం ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సందర్శించారు. ఈ సందర్భంగా మొగుళ్లపల్లి మండలంలోని ఇస్సీపేట పోలింగ్ స్టేషన్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని కోరారు. ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు పోలీసులకు ప్రతీ ఒక్కరు సహకరించాలని ఆయన కోరారు.పోలింగ్ స్టేషన్లను సందర్శించిన ఎస్పీ -
యాక్షన్ ప్లాన్ రెడీ!
సాక్షిప్రతినిధి, వరంగల్: యాసంగి పంటలకు సాగునీటి విడుదలపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఉమ్మడి వరంగల్‌లో 9,48,114 ఎకరాలకుగాను 5,29,726 ఎకరాలకు నీటిని విడుదల చేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది. 15 రోజులు ఆన్.. 15 రోజులు ఆఫ్ పద్ధతిన యాసంగి పంటలకు సాగునీరు అందించేందుకు కార్యాచరణ రూపొందించారు. ఈనెల 24 నుంచి వరంగల్, ములుగు ఇరిగేషన్ సర్కిళ్ల పరిధిలోని 5,29,726 ఎకరాల తడి, మెట్ట భూములకు 41.28 టీఎంసీల నీటి లభ్యత ఉన్నట్లు కూడా రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (స్కివం) ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈమేరకు యాసంగి పంటలకు సాగునీరు అందేలా అధికారులు కార్యాచరణతో ముందుకు సాగాలని అధికారులకు ఆదేశాలు అందాయి. ఎక్కడెక్కడ ఎలా? ఇరిగేషన్ వరంగల్ చీఫ్ ఇంజినీర్ పరిధిలో మొత్తం 7,92,894 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ యాసంగిలో 4,35,172 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ఇందులో 2,68,598 ఎకరాల తడి, 1,66,574 ఎకరాల మెట్ట భూములు ఉన్నాయి. జేసీఆర్ దేవాదుల ఎత్తిపోతల ద్వారా 1,95,095 ఎకరాలకు 11.30 టీఎంసీలు, ఎస్సారెస్పీ కాకతీయ కాలువ (ఎల్ఎండీ దిగువ) ద్వారా 1,57,038 ఎకరాలకు 12.88 టీఎంసీలు, ఎస్సారెస్పీ స్టేజ్–2 కింద 83,039 ఎకరాలకు 6.82 టీఎంసీలు సరఫరా చేయనున్నారు. నీటి లభ్యతను బట్టి యాసంగి పంటలకు సాగునీరు అందేలా నీటిపారుదలశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈమేరకు రైతులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. అత్యధికంగా ఆరుతడి పంటలపై మొగ్గు చూపాలని సూచిస్తున్నారు. ములుగు ఇరిగేషన్ సర్కిల్లో ఇలా.. ములుగు ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ కార్యాలయం పరిధిలో మొత్తం 1,55,220 ఎకరాల ఆయకట్టు ఉంది. 94,554 ఎకరాలకు ఈ యాసంగిలో సాగునీరు అందించనున్నారు. ఇందులో తడి 34,958 ఎకరాలు కాగా, మెట్ట 59,596 ఎకరాలు. ఇందుకోసం 10.28 టీఎంసీల నీరు సిద్ధంగా ఉన్నట్లు నీటిపారుదలశాఖ ప్రతిపాదనల్లో పేర్కొంది. ఇదిలా ఉంటే ఎస్సారెస్పీ కాకతీయ కెనాల్ (ఎల్ఎండీ దిగువన) కింద 1,03,883 ఎకరాలకు గాను 58,901 ఎకరాలకు ఆరు టీఎంసీలు సరఫరా చేయనున్నారు. పాకాల చెరువు కింద 18,193 ఎకరాలకు మొత్తంగా, రామప్ప లేక్ కింద 5,180 ఎకరాలకుగాను 1,600 ఎకరాలకు అదనంగా కలిపి 6,780 ఎకరాలకు ఈ యాసంగిలో సాగునీరు అందించనున్నట్లు శ్రీస్కివంశ్రీ కమిటీ పేర్కొంది. అలాగే లక్నవరం చెరువు కింద 8,794 ఎకరాలకు గాను 4,550లు, మల్లూరు వాగు కింద 7,500 ఎకరాలకు 1,500లు, పాలెంవాగు ప్రాజెక్టు కింద 7,500 ఎకరాలకు గాను 1,500 ఎకరాలకే ఈ సారి సాగునీటిని అందించనున్నట్లు ఇరిగేషన్ అధికారులు ప్రకటించారు. ఆన్‌అండ్‌ఆఫ్ పద్ధతే.. ఉమ్మడి వరంగల్‌లో ఎస్సారెస్పీ స్టేజ్–1, స్టేజ్–2, దేవాదుల, రామప్ప, పాకాల, లక్నవరం సరస్సులు, చిన్ననీటి వనరుల ద్వారా స్థిరీకరించిన ఆయకట్టు కింద 9,48,114 ఎకరాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులు, నీటి లభ్యతను బట్టి 5,29,726 ఎకరాలకు ఆన్ అండ్ ఆఫ్ (వారబందీ) పద్ధతిన సరఫరా చేయనున్నారు. అయితే, గత యాసంగిలో 6,46,664 ఎకరాలకు నీరిచ్చిన అధికారులు ఈసారి 5,29,726 ఎకరాలే ప్రతిపాదించారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి 1,16,938 ఎకరాలు తగ్గింది. కాగా, 15 రోజులు విడుదల చేసి 15 రోజులు ఆఫ్ చేసే పద్ధతిలో ఈ నెల 24 నుంచి ఆయకట్టుకు నీటి విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఎల్ఎండీ, దేవాదుల, రామప్ప, లక్నవరం, మల్లూరు వాగు, పాలెం వాగుల పరిధి ఆయకట్టు రైతులు సాగుకు సన్నద్ధమయ్యారు. గత యాసంగిలో 6,46,664 ఎకరాలకు సాగు నీరు ప్రస్తుతం 5,29,726 ఎకరాలకు అందించేలా ప్రణాళిక గతేడాదితో పోలిస్తే తగ్గిన 1,16,938 ఎకరాలు వరంగల్ ములుగు ఇరిగేషన్ సర్కిళ్ల పరిధి మెట్ట భూములకు 41.28 టీఎంసీలు 5.30 లక్షల ఎకరాలు.. 41.28 టీఎంసీలు! యాసంగి యాక్షన్ ప్లాన్ రెడీ చేసిన ఇరిగేషన్ శాఖ వరంగల్, ములుగు సర్కిళ్లలో ఆయకట్టుకు సాగునీరు 15 రోజులకోసారి ఆన్‌అండ్‌ఆఫ్ -
రక్షణ సూత్రాలు పాటించాలి
భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో విధులు నిర్వర్తిస్తున్న ప్రతి ఉద్యోగి రక్షణ సూత్రాలు పాటిస్తూ ప్రమాదాలను నివారించాలని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి కోరారు. రక్షణ తనిఖీ బృందం బుధవారం ఏరియాలోని కేటీకే 8వ గనిని సందర్శించారు. ఈ సందర్భంగా బొగ్గు ఉత్పత్తికి సంబంధించిన పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జీఎం మాట్లాడారు. ప్రమాదాలు లేని సింగరేణే లక్ష్యమని అన్నారు. ఇతర సంస్థలకు సింగరేణిని ఆదర్శంగా నిలపాలని కోరారు. కార్యక్రమంలో రక్షణ కమిటీ బృందం అధికారులు శ్రీనాథ్, లక్ష్మణ్, రాధాకృష్ణ, అప్సర్‌పాషా, కిరణ్‌కుమార్, అమరనాథ్ పాల్గొన్నారు. కాటారం: కాటారం మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు. పాఠశాలకు చెందిన క్రీడాకారులు రాంచరణ్, దేవేందర్, అభిషేక్ 69వ ఎస్జీఎఫ్ అండర్ 19 హ్యాండ్ బాల్ జిల్లాస్థాయి పోటీల్లో అత్యంత ప్రతిభ కనబర్చారు. దీంతో నిర్వాహకులు వీరిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు ప్రిన్సిపాల్ మాధవి బుధవారం తెలిపారు. ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు మహబూబ్‌నగర్‌లో జరిగే రాష్ట్రస్థాయి టోర్నమెంట్లో క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులను వైస్ ప్రిన్సిపాల్ వెంకటయ్య, బలరాం, మహేందర్, శ్రీనివాస్, వెంకటేశ్ అభినందించారు. భూపాలపల్లి రూరల్: మతిస్థిమితంలేని వ్యక్తిని ఖమ్మం జిల్లాకు చెందిన అన్నం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీనివాసరావు చేరదీశాడు. వివరాలిలా ఉన్నాయి.. భూపాల్లిపల్లి –కాళేశ్వరం ప్రాంతంలో ఓ వ్యక్తి అడవిలో ఒంటరిగా తిరుగుతున్నాడు. ఈక్రమంలో అన్నం సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీనివాసరావు తమ సిబ్బందితో కాళేశ్వరం మీదుగా బుధవారం ఖమ్మం వెళ్తుండగా.. మతిస్థిమితం లేని వ్యక్తిని గమనించారు. అతనికి భోజనం పెట్టించి భూపాలపల్లి పోలీసుల సమక్షంలో అతన్ని భూపాలపల్లి నుంచి అన్నం ఫౌండేషన్ అంబులెన్స్‌లో ఖమ్మం తరలించారు. ఆహారం అందించి, వైద్యం చేయించి అతను కోలుకున్నాక కుటుంబ వివరాలు తెలిస్తే వారికి చట్టపరంగా అప్పగిస్తామని శ్రీనివాసరావు తెలిపారు. మొగుళ్లపల్లి: మండలంలోని వివిధ గ్రామాల్లో జరుగుతున్న స్థానిక ఎన్నికల నేపథ్యంలో బందోబస్తు విధుల్లో పోలీసులు జాగ్రత్తగా ఉండాలని డీఎస్పీ నారాయణ నాయక్ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఎన్నికల పోలీంగ్‌కు వచ్చిన పోలీస్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీంగ్ కేంద్రాల వద్ద పోలీస్ సిబ్బంది అప్రమంత్తంగా ఉండాలని తెలిపారు. ఏమైనా అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటే వెంటనే సంబంధిత ఉన్నతాధికారులకు సమాచా రం అందించాలని తెలిపారు. ఎన్నికల్లో సుమా రు 300 మంది పోలీసులతో బందోబస్తు ఏ ర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సీఐ మల్లేష్, ఎస్సైలు ఆశోక్, శ్రావన్‌కుమార్ సుధాకర్ పాల్గొన్నారు. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించుకోవాలి రేగొండ: ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కాటారం డీఎస్పీ సూర్యనారాయణ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల నిర్వహణకు 150 మంది పోలీస్ సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వ ద్ద చట్టవ్యతిరేక చర్యలను అరికట్టేందుకు ప్రత్యే క బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొత్తపల్లిగోరిలో అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్ ఎన్నికల బందోబస్తు బాధ్యతలపై అధికారలకు, సిబ్బందికి సూచనలు చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు కనిపిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయతీ రాజ్ చట్టం – సెక్షన్ 219 ప్రకారం పోలింగ్ కేంద్రం, సమీప ప్రాంతాల్లో ప్రచారం చేయడం నిషేధమని తెలిపారు. -
ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాలి
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన వద్ద ఏర్పాటుచేసిన చెక్‌పోస్టును జిల్లా ఎలక్షన్ అబ్జర్వర్, ఐఏఎస్ ఫణింద్రరెడ్డి మంగళవారం పరిశీలించారు. ఆయన ముందుగా శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆయనను శాలువాతో సన్మానించి తీర్థప్రసాదం అందజేశారు. అనంతరం గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా అంతర్రాష్ట్ర చెక్ పోస్టు వద్ద ఏర్పాటుచేసిన గణాంక పర్యవేక్షణ బృందం కేంద్రాన్ని సందర్శించారు. ఆ బృంద సభ్యులతో మాట్లాడుతూ మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి వచ్చే ప్రతీ ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. వాహనాలలో ప్రభుత్వం నిర్దేశించిన మొత్తం కంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు కలిగి ఉండి సరైన సాక్షాలు లేకుండా డబ్బులు ఉన్నట్లయితే ఎన్నికల కమిషన్ నిబంధన మేరకు సీజ్ చేయాలని ఆదేశించారు. మెట్పల్లి గ్రామపంచాయతీలో ఏర్పాటుచేసిన పోలింగ్‌కేంద్రాన్ని పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలో ఉన్న వసతులు, తాగునీరు, కరెంటు, మూత్రశాల వసతులు తప్పకుండా ఉండాలని పంచాయతీ కార్యదర్శి మంజూర్కు సూచించారు. ప్రతీ ఒక్కరు పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తగా విధులు నిర్వహించాలని సిబ్బందికి పలు సూచనలు జారీచేశారు. ఆయన వెంట మహదేవపూర్ ఎంపీడీఓ రవీంద్రనాథ్, కాళేశ్వరం ఎస్సై తమాషారెడ్డి, పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ ఉన్నారు. ఎలక్షన్ అబ్జర్వర్ ఫణింద్రరెడ్డి అంతర్రాష్ట్ర వంతెన చెక్‌పోస్టు పరిశీలన -
విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలి
చిట్యాల: పాఠశాలలో విద్యార్థులకు విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలని జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి పింగిలి విజయపాల్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం మండలంలోని జూకల్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పదో తరగతి విద్యార్థుల తరగతులను పరిశీలించారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో అమలు అవుతున్న విద్యా కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. పదో తరగతి పరీక్షలలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు విద్యార్థులు ప్రణాళికతో చదువుకోవాలని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న విద్యా పథకాలను తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లి విద్యార్థుల నమోదును పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గిరగాని కృష్ణ, ఉపాధ్యాయులు ఉన్నారు. భూపాలపల్లి అర్బన్: విశ్వబ్రాహ్మణ పురోహిత సంఘం జిల్లా ఎన్నికలను జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించారు. ఓటింగ్ పద్ధతి ద్వారా నిర్వహించిన ఎన్నికలలో జిల్లా అధ్యక్షుడిగా స్థానిక అయ్యప్ప టెంపుల్ ప్రధాన పూజా రి కుదురుపాక కృష్ణమాచార్యులు, ప్రధాన కార్యదర్శిగా బలబత్తుల రాజేశ్వరాచార్యులు, కోశాధికారిగా తంగేళ్లపల్లి వెంకటాచార్యులు ఎన్నికయ్యారు. వారితో కమిటీ సభ్యులు, పూర్తి స్థాయి కమిటీని ఎన్నుకున్నారు. ● ట్రాక్టర్‌కింద పడి బాలుడి మృతి.. ● తల్లిదండ్రులకు అప్పగించకుండా పూడ్చివేత గణపురం: ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌కింద పడి ఓ బాలుడు చనిపోయాడు. ఆ ట్రాక్టర్ డ్రైవర్ గుట్టుచప్పుడు కాకుండా ఆ బాలుడి మృతదేహాన్ని ఓపెన్‌కాస్ట్ మట్టి డంపింగ్‌యార్డులో పూడ్చిపెట్టాడు. ఈ విషయం గణపురంలో మండలంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. గణపురం ఎస్సై ఆశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మరావుపేట గ్రామానికి చెందిన బందెల రాకేష్ (6) ఈ నెల8వ తేదీన ఇంటి వద్ద ఆడుకుంటుండగా అదే గ్రామానికి చెందిన గంపల శంకర్ ట్రాక్టర్లో వడ్లు తీసుకొని ఐకేపీ సెంటర్‌కు వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఆ బాలుడిపైనుంచి వెళ్లింది. దీంతో బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు. కాగా, తన కుమారుడు రాకేష్ కనిపించకపోవడంతో తండ్రి రాజు పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ అయినట్లు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులకు శంకర్‌ను అనుమానితుడిగా అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అతను బాలుడు రాకేష్ మృతదేహాన్ని గ్రామ శివారులో ఓసీ–3 డంపుయార్డుకి తీసుకువెళ్లి మట్టిలో పూడ్చివేసినట్లు ఒప్పుకున్నాడు. కాగా, శంకర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై తెలిపారు. -
తెలంగాణ స్ఫూర్తి వికసించాలి
భూపాలపల్లి: తెలంగాణ స్ఫూర్తి తరతరాల పాటు వికసించాలని కలెక్టర్ రాహుల్‌శర్మ అన్నారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ.. ప్రజల్లో ఐక్యత, ఆత్మగౌరవాన్ని పెంపొందించే ప్రతీకగా తెలంగాణ తల్లి నిలుస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధిలో ప్రతీ వ్యక్తి పాత్ర ఎంతో ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, ఆర్డీఓ రవి, అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సేవల్లో పారదర్శకత ఉండాలి.. అవినీతి నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా అవినీతి నిరోధక శాఖ పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన అవినీతి నిర్మూలన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. డిసెంబరు 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు అవినీతి నిర్మూలన వారోత్సవాలను పురస్కరించుకుని వివిధ విభాగాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలు పొందే ప్రతీ పౌరుడు అవినీతి విషయమై జాగ్రత్తగా ఉండాలన్నారు. ఏదైనా అవినీతి ఘటనలు గమనించినప్పుడు వెంటనే అవినీతి నిరోధక శాఖకు సమాచారం తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ డీఎస్పీ సాంబయ్య, సీఐ రాజు, సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నికల గోదాం తనిఖీ.. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఎన్నికల ఈవీఎం గోదాంను పలు రాజకీయ పార్టీల నాయకులతో కలిసి కలెక్టర్ రాహుల్ శర్మ తనిఖీ చేశారు. అనంతరం లాక్ బుక్‌లో కలెక్టర్ సంతకం చేశారు. సాధారణ తనిఖీల్లో భాగంగా గోదాం తనిఖీ చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ డీటీ అబ్బాస్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. అవినీతి నిర్మూలనలో భాగస్వాములు కావాలి కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడించారు. మొదటి దశ ఎన్నికల నిర్వహణపై మంగళవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సాధారణ, వ్యయ పరిశీలకులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ఈ కాన్ఫరెన్స్‌కు జిల్లా నుంచి కలెక్టర్ రాహుల్ శర్మతో పాటు ఎస్పీ సంకీర్త్, ఎన్నికల సాధారణ పరిశీలకుడు ఫణింద్రరెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, ఆర్డీఓ రవి, డీపీఓ శ్రీలత, నోడల్ అధికారులు పాల్గొన్నారు. -
ఆదమరిస్తే అంతే..!
చిట్యాల మండల కేంద్రం నుంచి టేకుమట్లకు వెళ్లే ప్రధాన రహదారిలో పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డు ప్రమాదకరంగా ఉంది. వర్షాలకు చెరువు నిండి రోడ్డు కోతకు గురికావడంతో అదే ప్రాంతంలో తుమ్మ చెట్లు మొలిశాయి. దీంతో ఆ రోడ్డు కనబడకుండా అయింది. ఎదురెదురుగా ఏమైనా పెద్ద వాహనాలు వస్తే ఈ రోడ్డుకు సైడ్ దిగితే మాత్రం పెద్ద ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆర్అండ్బీ అధికారులు కనీసం కోతకు గురైన రోడ్లను పట్టించుకోవడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – చిట్యాల -
అవినీతి నిర్మూలనలో యువత పాత్ర కీలకం
● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ భూపాలపల్లి: అనినీతి నిర్మూలనలో యువత పాత్ర కీలకమని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. అవినీతి నిర్మూలన వారోత్సవాల ముగింపు సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో పట్టణంలో నిర్వహించిన ర్యాలీని ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అవినీతిని ఎవరూ ప్రోత్సహించవద్దని, ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగితే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1064కు కాల్ చేయాలన్నారు. పారదర్శక పరిపాలన, అవినీతి నిర్మూలన కోసం పోలీసులు ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నారని ఎస్పీ పేర్కొన్నారు. -
తొలి పోరుకు సిద్ధం
భూపాలపల్లి అర్బన్: తొలి దశ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలోని ఆరు మండలాల్లో మొదటి విడతలో 73 సర్పంచ్, 559 వార్డు స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది. ఇప్పటికే సిబ్బందికి శిక్షణ సైతం పూర్తిచేసింది. గ్రామాల్లో ఎన్నికల ప్ర చారం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. 4 మండలాల్లో ఎన్నికలు.. జిల్లాలో 248 గ్రామాలు ఉండగా, మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి విడతలో గణపురం, రేగొండ, కొత్తపల్లిగోరి, మొగుళ్లపల్లి మండలాల పరిధిలో 82 సర్పంచ్, 712 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, వీటిలో 9 సర్పంచ్, 153 వార్డుస్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగితా 73 సర్పంచ్ 559 వార్డు స్థానాలకు పోలింగ్ జరుగనుంది. విధుల్లో 1,939 మంది సిబ్బంది పోలింగ్‌కు ఎన్నికల సిబ్బందికి ఇప్పటికే శిక్షణ పూర్తి చేశారు. మొదటి విడతలో మొత్తం 1,939 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. వీరిలో 855 మంది ప్రిసైడింగ్ అధికారులు (పీఓలు) 1,084 మంది ఏపీఓలు, 77మంది రిటర్నింగ్ అధికారులు ఉన్నారు. వీరిలో మొత్తంగా 20శాతం మంది అధికారులు, సిబ్బందిని అదనంగా నియమించారు. అత్యవసరంగా ఎవరైనా విధుల నుంచి తప్పుకుంటే అదనంగా కేటాయించిన వారు విధుల్లో పాల్గొంటారు. వారితో పాటు 36మంది మైక్రోఅబ్జర్వర్లు, జోనల్ ఆధికారులు 14, ఫ్లయింగ్ స్వ్కాడ్లు ఎన్నికల విధుల్లో ఉంటారు. 800 మంది పోలీసులతో బందోబస్తు ఎన్నికల సందర్భంగా 800 మంది పోలీసులతో గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. మొదటి విడతలో 10 సమస్యాత్మక గ్రామాలను గుర్తించిన పోలీసులు, పంచాయతీరాజ్ తరఫున అన్నింటిలో సీసీ కెమెరాలతో పాటు ఒక ఎస్సై, అదనపు పోలీస్ బలగాలను నియమించారు. అదనపు ఎస్పీ, ప్రతి మండలానికి ఒక డీఎస్పీని కేటాయించారు. 30 మంది సీఐలు, 50 మంది ఎస్సైలు, స్పెషల్ ఫోర్స్, ఏఆర్, సివిల్‌తో పాటు మొత్తం 800 మంది పోలీసులను బందోబస్తుకు కేటాయించారు. ఎస్పీ, అదనపు ఎస్పీ ఎప్పటికప్పుడు ఎన్నికల నిర్వహణపై సమీక్షించనున్నారు. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభం గురువారం ఉదయం ఆరు గంటలకు ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించి అనంతరం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించునున్నారు. ఒంటి గంట వరకు లైన్లో నిల్చున్న ఓటర్లకు మాత్రమే టోకెన్లు అందిస్తారు. ఆ తర్వాత వచ్చిన ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉండదు. రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపును ప్రారంభించనున్నారు. జిల్లాలో జరగనున్న మొదటి విడత ఎన్నికలకు కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. ఎన్నికల విధులు కేటాయించి సిబ్బంది నేడు(బుధవారం) ఉదయం 10గంటలకు కేటాయించిన మెటీరియల్ పంపిణీ కేంద్రాలకు హాజరుకావాలని తెలిపారు. అనంతరం పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలన్నారు. ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించి పోలింగ్ ప్రారంభించాలన్నారు. ఎన్నికలు ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా ప్రతీ ఒక్కరు అత్యంత జాగ్రత్తతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలింగ్ సిబ్బందికి మూడో విడత ర్యాండమైజేషన్ కార్యక్రమాన్ని జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకులు ఫణింద్రరెడ్డి, జిల్లా ఎన్నికల అఽధికారి, కలెక్టర్ రాహుల్‌శర్మ నిర్వహించారు. 73 సర్పంచ్.. 559 వార్డు స్థానాలకు పోలింగ్ ఏర్పాట్లు పూర్తిచేసిన యంత్రాంగం రేపు ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్నికలు అనంతరం ఓట్ల లెక్కింపు -
మరో వారం హడావుడి
మొదటి విడత ఎన్నికలు గురువారం జరగనుండగా.. రెండో విడత 14, మూడో విడత ఎన్నికలు 17న నిర్వహించనున్నారు. మొదటి విడత ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. గురువారం ఉమ్మడి జిల్లాలోని 555 పంచాయతీలకు ఏకగ్రీవాలను మినహాయించి 512 జీపీలకు ఎన్నికలు జరగనున్నాయి. 4,901 వార్డులకు కూడా ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు ప్రకటించారు. బుధవారం ఉదయం నుంచి పోలింగ్ అధికారులు, సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు చేరుకుని పోలింగ్ సామగ్రితో కేంద్రాలకు తరలేలా ఏర్పాట్లు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొదటి విడతలో గణపురం, రేగొండ, కొత్తపల్లిగోరి, మొగుళ్లపల్లి మండలాల పరిధిలో 73 సర్పంచ్, 559 వార్డు స్థానాలకు పోలింగ్ జరుగనుంది. -
మైక్రో అబ్జర్వర్ల పాత్ర అత్యంత కీలకం
● జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు ఫణీంద్రరెడ్డి భూపాలపల్లి అర్బన్: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర అత్యంత కీలకమని గ్రామ పంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకుడు ఫణీంద్రరెడ్డి తెలిపారు. మైక్రో అబ్జర్వర్లకు పోలింగ్ విధులు, ఓట్ల లెక్కింపు విధానాలపై సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాల్లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్‌శర్మతో కలిసి నిర్వహించిన శిక్షణా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్ల విధులు అత్యంత ముఖ్యమైనవని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ప్రతీ చర్యను నిశితంగా పరిశీలించాలన్నారు. ఏ పరిస్థితుల్లోనూ పోలింగ్ నిర్వహణలో జోక్యం చేసుకోకూడదని సూచించారు. నియమావళి ప్రకారం తమ విధులను కచ్చితంగా నిర్వర్తించి, ఏవైనా అనుమానాస్పద పరిస్థితులు గమనిస్తే వెంటనే ఉన్నతాధికారులకు నివేదించాలని మైక్రో అబ్జర్వర్లకు సూచించారు. 28 అంశాలతో కూడిన నివేదికను సీల్డ్ కవర్లో అందచేయాలని తెలిపారు. -
ప్రతీ రూపాయి లెక్క చెప్పాల్సిందే
నామినేషన్ నుంచి ఎన్నికలు ముగిసే వరకు● నూతన బ్యాంకు ఖాతా ద్వారానే చెల్లింపులు ● 45 రోజుల్లో లెక్క చూపకుంటే పదవి గోవిందా ● మూడేళ్లు అనర్హత వేటుభూపాలపల్లి అర్బన్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఓడినా, గెలిచినా ప్రచారం కోసం పెట్టిన ప్రతీ రూపాయి ఖర్చు లెక్క ఎన్నికల కమిషన్‌కు చెప్పాలి. ఏ విడత జరిగే ఎన్నిక అయినా నామినేషన్ వేసిన రోజు నుంచి పోలింగ్ ముగిసే రోజు వరకు (15 రోజులు) సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసిన ప్రతీ అభ్యర్థి ఎన్నికల కోసం నిర్వహించిన లావాదేవీలు నమోదు చేయాల్సిందే. అందుకు ప్రతీ అభ్యర్థి బ్యాంకులో కొత్తగా ఖాతా తెరిచి, ఆ ఖాతా ద్వారానే ఎన్నికలకు ఖర్చు చేయాలి. పాత ఖాతాను వినియోగించినట్టయితే అందులో నిర్వహించే ఇతర లావాదేవీలకు సైతం వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది అభ్యర్థులకు తల నొప్పిగా మారుతోంది. అందుకే కొత్త ఖాతాలు తెరవాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. నామినేషన్ పత్రంతో పాటు బ్యాంకు ఖాతా జిరాక్స్ ప్రతిని కూడా జతపరచడం తప్పనిసరి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 5వేల జనాభాకు మించిన గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు రూ.2.50లక్షలు, వార్డు సభ్యుడు రూ.50వేలు మాత్రమే ఎన్నికల వ్యయం చేయాలి. 5 వేల జనాభాలోపు గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు రూ.1.50లక్షలు, వార్డు సభ్యుడు రూ.30వేల వరకు ఖర్చు చేయవచ్చు. ఖర్చు పరిమితి మించితే వేటు పడుతుంది.గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థులు మూడు విడతలుగా ఖర్చుల వివరాలను అధికారులకు సమర్పించాలి. ప్రచార ప్రారంభంలో మొదటిసారి, ప్రచారం మధ్య దశలో రెండోసారి, పో లింగ్‌కు ముందు రోజు మూడోసారి లెక్కలు ఇవ్వాలి. ఎన్నికల ఫలితాలు వెలువడిన 45 రోజుల్లో అభ్యర్థులు వారి ఖర్చు లెక్కలు ఎన్నికల అధికారులకు తగిన బిల్లులతో సమర్పించాలి. ఎన్నికల ఖర్చులు నామి నేషన్ పత్రంలో సూచించిన బ్యాంకు ఖాతా ద్వా రానే నిర్వహించాలి. ఓడినా, గెలిచినా ఖర్చు లెక్కలు ఇవ్వాల్సిందే. గెలిచిన అభ్యర్థులు ఖర్చు లెక్కలు ఇవ్వకుంటే పదవి పోతుంది. ఓడిన అభ్యర్థులు ఇవ్వకుంటే మూడేళ్ల వరకు ఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు పడుతుంది. -
స్వేచ్ఛగా ఓటు వేయండి
మంగళవారం శ్రీ 9 శ్రీ డిసెంబర్ శ్రీ 2025తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో గల జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు సన్నద్ధంగా ఉన్నాం. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాత నేరస్తులపై నిఘా, మద్యం, డబ్బు పంపిణీ కాకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై ఫిర్యాదుల కోసం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. ఎస్పీతో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ. వివరాలు ఆయన మాటల్లోనే.. – భూపాలపల్లిజిల్లాలో మూడు విడతల్లో 12 మండలాల్లోని 248 జీపీలు, 2,102 వార్డుల్లో పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో కొన్ని పంచాయతీలు, వార్డు స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం అయినప్పటికీ జిల్లావ్యాప్తంగా సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను ముందే గుర్తించాం. మొదటి విడత ఎన్నికలు జరుగనున్న మండలాల్లో 108, 2వ విడతలో 90, 3వ విడతలో 114.. మొత్తంగా 312 సమస్యాత్మక పోలింగ్ బూత్‌లను గుర్తించాం. ప్రతీ పోలింగ్ కేంద్రంలో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు తగు ఏర్పాట్లు చేశాం. పోలింగ్ స్టేషన్, రూట్, క్లస్టర్, మండలాలుగా విభజించుకొని ఎస్సై నుంచి డీఎస్పీ స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించాం. ఒక్కో విడత ఎన్నికలకు 500 మందికి పైగా పోలీసు అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. గ్రామాల్లో ఎన్నికల నిబంధనల ఉల్లంఘన, మద్యం, డబ్బు, వస్తువుల పంపిణీ, ఘర్షణలు, అల్లర్లు ఏమైనా చోటు చేసుకుంటే తక్షణమే జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎలక్షన్ సెల్ నంబర్ 87126 58178 కు కాల్ చేసి తెలియజేయాలని ఎస్పీ సంకీర్త్ సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు. జిల్లాలో 312 సమస్యాత్మక పోలింగ్ బూత్‌లు పాత నేరస్తుల బైండోవర్, ప్రతీరోజు గ్రామాల్లో గస్తీ మద్యం, డబ్బు రవాణా జరగకుండా పకడ్బందీ చర్యలు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
కులపోళ్ల.. ఓట్లెన్ని
● మెజార్టీ ఓటర్లపై నజర్ ● గెలుపే లక్ష్యంగా పంచాయతీల్లో పాగా ● ఓట్ల లెక్కల్లో మునిగిన అభ్యర్థులుభూపాలపల్లి అర్బన్: ఒకనాడు ప్రేమ, ఆప్యాయత, అనురాగం విలసిల్లిన పల్లెలు నేడు కులాలు, వర్గాలు, గ్రూపులుగా మారిపోయాయి. పంచాయతీ ఎన్నికలంటే గుర్తొచ్చేది కులపోళ్ల ఓట్లు. మన కులం ఓట్లు ఎన్నున్నాయి. పక్క కులపోళ్ల ఓట్లు ఎన్ని పడే అవకాశం ఉంది.. ఇలా సామాజిక విశ్లేషణలో అభ్యర్థులు మునిగి తేలుతున్నారు. పలు గ్రామాల్లో మెజార్టీ కులాలకు సంబంధించిన సంఘాల పెద్దలను ప్రసన్నం చేసుకుంటున్నారు. జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ఈనెల 11న జరుగనున్నాయి. పేరుకే రాజకీయ రహిత ఎన్నికలైనప్పటికీ పార్టీ గుర్తు లేకపోవడం తప్పా.. అందరూ కూడా ఏదో ఒక పార్టీ మద్దతుతోనే ఎన్నికల రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే పల్లెల్లో ప్రధాన పార్టీలు తమ మద్దతుతో బరిలో నిలిపేందుకు అభ్యర్థులను ఖరారు చేశాయి. మూడు విడతలుగా ఎన్నికలు జరుగుతున్న మండలాల్లోని గ్రామాల్లో ఇప్పటికే అన్నిపార్టీలు అభ్యర్థులను ప్రకటించి నామినేషన్ వేయించాయి. స్థానికసంస్థల ఎన్నికలను అన్ని పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తమ పార్టీల మద్దతుతో పోటీచేసే అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. అన్ని పార్టీలు కూడా సామాజిక కోణంపై దృష్టి సారించాయి. జిల్లాలో 248 గ్రామపంచాయతీల్లో 2,102 వార్డులు ఉన్నాయి. వీటిలో ఎస్టీ కేటగిరీలో 89 వార్డులు మహిళలకు, 133 జనరల్ రిజర్వ్ చేశారు. ఎస్సీ మహిళలకు 155 వార్డులు, ఎస్సీ జనరల్ 261 వార్డులు, బీసీ కేటగిరీల్లో మహిళలకు 167 వార్డులు, 257 జనరల్, జనరల్ మహిళలకు 475 వార్డులు, జనరల్ కింద 565 వార్డులు రిజర్వేషన్లు కల్పించారు. ఎన్నికల్లో ఓట్లను పొందేందుకు లెక్కలు వేస్తున్నారు. గ్రామాల్లో రిజర్వేషన్ల ప్రకారం అభ్యర్థులు పోటీలో ఉండగా.. ఏయే సామాజిక వర్గాల ఓట్లు ఎంత మేరకు ఉన్నారు? ఎన్నికల్లో వీరి ఓట్ల ప్రభావంతో ఏ పార్టీల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. తమ మద్దతుతో పోటీచేసున్న అభ్యర్థులకు అనుకూలంగా ఓటర్లను తిప్పుకోవడం ఎలా? అన్న అంశాలపై స్థానిక ఎమ్మెల్యేలు, రాజకీయ పార్టీల నాయకులు విశ్లేషణల్లో నిమగ్నమయ్యారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులంతా ఓట్ల లెక్కల్లో మునిగిపోయారు. గ్రామాల్లో మెజార్టీ కులాలకు సంబంధించిన సంఘాల పెద్దలను కూడా ప్రసన్నం చేసుకుంటున్నారు. ఈ మేరకు ఆయా పార్టీల్లోని నేతలతో గ్రామాల్లోని పరిస్థితిపై కులసంఘాల పెద్దలతో సంప్రదింపులు కూడా జరిగినట్లు తెలిసింది. చాలా గ్రామాల్లో బీసీలు అధిక శాతం ఉన్నారు. మెజార్టీ ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకునేందుకు అధికార కాంగ్రెస్‌తో పాటు బీఆర్ఎస్, బీజేపీలు దృష్టిసారించాయి. అన్నిపార్టీలు స్థానికంగా బలపడే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి.మండలం ఎస్సీ ఎస్టీ బీసీ ఇతరులు మొగుళ్లపల్లి 6,846 152 20,044 3311 గణపురం 6,173 2,164 21,358 3,540 కొత్తపల్లిగోరి 2,925 403 12,233 885 రేగొండ 6,436 932 22,315 4,290 ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతీ గ్రామపంచాయతీలోనూ కులాలవారీగా ఓటర్ల గణనను సిద్ధం చేసుకున్నాయి. గ్రామాల్లో చేపట్టేబోయే అభివృద్ధి పనులపై ఓటర్లకు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఏయే సామాజిక వర్గాలనుంచి ఎంత మేరకు ఓటింగ్ పొందవచ్చన్న లెక్కల్లో నిమగ్నమయ్యారు. గతంలో పోటీచేసి అనుభవం ఉన్న సీనియర్ నాయకులు అభ్యర్థుల గెలుపులో కీలకపాత్ర పోషించే అవకాశం ఉన్నందున వారి సేవలను వినియోగించుకుంటున్నారు. మాజీ ప్రజాప్రతినిధులతోనూ తాజా రాజకీయ పరిస్థితులపై సంప్రదింపులు జరుపుతున్నారు. అభ్యర్థుల గెలుపు కోసం తీసుకోవాల్సిన వ్యూహాలతో పాటు సామాజికవర్గాల ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 248 గ్రామపంచాయతీలు ఉండగా మహిళలకు 59 స్థానాలు, జనరల్ కింద 64 స్థానాలకు రిజర్వేషన్లు కల్పించారు. వీటిలో జిల్లాలోని 100 శాతం ఎస్టీ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలతోపాటు పలు గ్రామాల్లో ఎస్టీ జనాభా ఆధారంగా జిల్లాలో 11 స్థానాలు మహిళలకు, 17 స్థానాలు జనరల్‌కు కేటాయించారు. ఎస్సీ మహిళలకు 23 గ్రామపంచాయతీలు, ఎస్సీ జనరల్‌లో 28 పంచాయతీలు, 21 బీసీ మహిళలకు, 25 బీసీ జనరల్‌కు, జనరల్ కేటగిరీలో 59 మహిళలకు, 64 జనరల్‌గా రిజర్వేషన్లు కేటాయించారు. -
భద్రత కార్మికుడి బాధ్యత
భూపాలపల్లి అర్బన్: భద్రత అనేది సంస్థ అమలు చేసే నియమం మాత్రమే కాదని ప్రతీ కార్మికుడి వ్యక్తిగత బాధ్యత అని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి, భద్రత కమిటీ కన్వీనర్ శ్రీనాద్ తెలిపారు. 56వ వార్షిక భద్రత పక్షోత్సవాలను సోమవారం ఏరియాలోని కేటీకే 1వ గనిలో ప్రారంభించారు. ఈ పక్షోత్సవాల ప్రారంభోత్సవానికి జీఎం, భద్రత కమిటీ కన్వీనర్ హాజరై జెండా ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతీ వ్యక్తికి భద్రత అనేది ఇంటి నుంచే ప్రారంభమవుతుందని తెలిపారు. సింగరేణి సంస్థలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందన్నారు. ప్రతీ ఉద్యోగి విధులు ముగించుకొని ఇంటికి సురక్షితంగా చేరడమే సంస్థ లక్ష్యమన్నారు. ఉద్యోగుల నిర్లక్ష్యం, చిన్న తప్పిదం వల్ల పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రతీ ఒక్కరు భద్రత పరికరాలను వినియోగించుకోవాలని సూచించారు. భద్రత పక్షోత్సవాలు ఉద్యోగుల్లో అవగాహన పెంపుతో పాటు, సమగ్ర భద్రతా సంస్కృతిని నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తాయని సూచించారు. అనంతరం ఉద్యోగులతో కలిసి రక్షణ ప్రతిజ్ఞ చేపట్టారు. ఈ కార్యక్రమంలో అధికారులు లక్ష్మణ్, రాధాకృష్ణ, తిరుపతి, అఫ్సర్‌పాషా, కిరణ్‌కుమార్, అమరనాథ్, శ్రీనివాసరావు, డాక్టర్ రాహుల్, రాజు, కిరణ్‌కుమార్, కార్మిక సంఘాల నాయకులు రమేష్, హుస్సేన్, కృష్ణప్రసాద్, రవీందర్, తిరుపతి, సదయ్య పాల్గొన్నారు. గైర్హాజరు ఉద్యోగులకు కౌన్సెలింగ్ కేటీకే ఓపెన్‌కాస్ట్–2ప్రాజెక్ట్‌లో గైర్హాజరు ఉద్యోగులకు గని మేనేజర్ రమాకాంత్ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించి మాట్లాడారు. నవంబర్ నెలలో 20 మస్టర్లకు తక్కువ నమోదు చేసిన ఉద్యోగులకు కౌన్సెలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. ఉద్యోగుల గైర్హాజరు సంస్థ ఉత్పత్తి, ఉత్పాదకతపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. దీంతో వార్షిక లక్ష్యాలను చేరుకోవడం కష్టసాధ్యంగా మారుతుందని తెలిపారు. ఉద్యోగులు క్రమం తప్పకుండా విధులకు హాజరై సంస్థ అభివృద్ధికి తోడ్పడుతూ సంస్థ అందించే సంక్షేమ ఫలాలను పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పర్సనల్ ఆఫీసర్ సాధన్, ఐఎన్టీయూసీ ఫిట్ కార్యదర్శి కృష్ణ, సీనియర్ అసిస్టెంట్ శివ పాల్గొన్నారు.ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి -
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం
భూపాలపల్లి అర్బన్: జాప్యం లేకుండా వేగవంతంగా ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్ రాహుల్‌శర్మ ఆదేశించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్‌హాల్‌లో పౌర సరఫరాలు, సహకార, డీఆర్డీఏ, మార్కెటింగ్, వ్యవసాయ, ఇతర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 12వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగినట్లు తెలిపారు. వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్న సందర్భంగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. వరి రాబడి గరిష్ట స్థాయికి చేరుతున్న ఈ సమయంలో కొనుగోలు కేంద్రాల వద్ద రద్దీ, ఆలస్యం జరుగకుండా తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పీక్ సీజన్ సమయంలో ప్రత్యేక నిఘా బృందాలు ఫీల్డ్‌లో నిరంతరం పర్యటించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, పౌర సరఫరాల అధికారి కిరణ్ కుమార్, డీఎం రాములు, సహకార అధికారి వాలియా నాయక్, డీఆర్డీఓ బాలకృష్ణ, వ్యవసాయ అధికారి బాబురావు, మార్కెటింగ్ అధికారి ప్రవీణ్‌రెడ్డి పాల్గొన్నారు. నేడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని నేడు(మంగళవారం) ఆవిష్కరించనున్నట్లు కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సోమవారం ఆర్అండ్బీ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్అండ్బీ ఈఈ రమేష్, డీఈ దేవేందర్ పాల్గొన్నారు. యంత్రాంగం పటిష్టంగా పర్యవేక్షించాలి గ్రామ పంచాయతీ మెదటి విడత ఎన్నికలకు నేడు(మంగళవారం) సాయంత్రం ఐదు గంటలకు ప్రచారానికి తెరపడుతుందని, జిల్లా యంత్రాంగం పటిష్టంగా పర్యవేక్షించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్‌శర్మ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోలింగ్ ముగియడానికి 44 గంటల ముందు నుంచి ఆయా మండలాల్లో సైలెన్స్ పీరియడ్ అమలులోకి వస్తుందన్నారు.కలెక్టర్ రాహుల్‌శర్మ -
ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి
భూపాలపల్లి అర్బన్: ప్రజాదివస్‌లో స్వీకరించిన ఫిర్యాదులను తక్షణమే స్పందించి పరిష్కరించాలని ఎస్పీ సిరిశెట్టి సంక్తీర్ ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదివస్ కార్యక్రమంలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆరుగురు అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. వారితో మాట్లాడి సమస్యలను వివరంగా తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల సౌకర్యార్థం ప్రతీ సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డే ద్వారా పోలీస్ శాఖను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యమని తెలిపారు. స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడి, వినతులను స్వీకరించి క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగంగా స్పందించేలా సూచనలు జారీ చేశారు. కాటారం(మహాముత్తారం): ప్రభుత్వ వైద్యశాలలు, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లలో నిరంతరం వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్ సూచించారు. మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం డీఎంహెచ్ఓ తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి మందుల నిల్వ, రోగులకు అందుతున్న వైద్యసేవలు, సౌకర్యాలపై ఆరా తీశారు. వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి నాణ్యమైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం పెగడపల్లి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్‌ను సందర్శించారు. డీహెంఎచ్ఓ వెంట జిల్లా ప్రోగ్రామింగ్ అధికారి డాక్టర్ సందీప్, డాక్టర్ దీప్తి, డీడీఎం మధుబాబు పాల్గొన్నారు. రేగొండ: రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ అన్నారు. సోమవారం మండలంలోని రూపిరెడ్డిపల్లి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యంలో తేమ శాతాన్ని పరిశీలిస్తూ కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. కొనుగోలు పూర్తికాగానే టాబ్‌లలో ఎంట్రీ చేయాలన్నారు. రికార్డుల నిర్వహణలో కచ్చితత్వం, పారదర్శకత, సమయపాలన పాటించాలని సిబ్బందిని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీఓ వాల్యనాయక్, ఏసీఎస్ఓ వేణు, సివిల్ సప్లై ఆర్ఐ రాజు, రెవెన్యూ ఆర్ఐ భరత్ కుమార్ పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో హేమాచలుడికి పూజలు
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీహేమాచలక్షేత్రానికి భక్తులు ఆదివారం భారీగా తరలివచ్చి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు వేలాది మంది తరలివచ్చి ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారికి నువ్వుల నూనెతో తిలతైలాభిషేకం పూజలు నిర్వహించారు. స్వామివారిని పట్టు వస్త్రాలు, పూలతో అలంకరించగా దర్శించుకున్న భక్తుల గోత్రనామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించారు. స్వామివారి చరిత్ర, ఆలయ పురాణాన్ని వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు. లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుంటున్న భక్తులు -
చిన్నారులకు మిల్క్
ఏటూరునాగారం: అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు చిక్కటి పాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ములుగు జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ఈ మేరకు గత నెల 17వ తేదీన పంచాయతీరాజ్, సీ్త్ర, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 3 నుంచి 6 ఏళ్ల చిన్నారులకు రోజుకూ 100 ఎంఎల్ చిక్కటి పాలను అందించాలని అధికారులను ఆదేశించారు. ములుగు జిల్లా వ్యాప్తంగా 549 ప్రధాన అంగన్వాడీ సెంటర్లు ఉండగా 91 మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల్లో 3 నుంచి 6 ఏళ్ల పిల్లలు 8,273 మంది ఉండగా ఈ పథకం ద్వారా పాలను అందిస్తున్నారు. దీంతో పేద కుటుంబాలకు చెందిన పిల్లల్లో పౌష్టికాహార లోపం తలెత్తకుండా సెంటర్ల నిర్వహకులు చూస్తున్నారు. పాలతో ప్రొటీన్స్ ప్రతిరోజూ 100 ఎంఎల్ చిక్కటి పాలను చిన్నారులు తాగడం వల్ల ఎముకలు, దంతాలు ధృడంగా ఉంటాయి. పాలలో ఉండే కాల్షియం, భాస్వరం, విటమిన్ డీతో పాటు ఏ విటమిన్ వంటి పోషకాలు చిన్నారులకు అంది చక్కటి ఫలితాన్ని ఇస్తాయి. అంతే కాకుండా ప్రొటీన్స్, విటమిన్లతో పాటు పొటాషియం వంటి ఇతర ముఖ్యమైన పోషకాలను కూడా అందిస్తాయి. అలాగే అధిక బరువు పెరగకుండా చూస్తాయి. చిన్నారులకు పాలతో పాటు మహాలక్ష్మీ పథకం కింద కోడిగుడ్డు, అన్నం, కురుకురేలు, బాలామృతం, బాలామృతం ఫ్లస్ వంటివి కూడా అంగన్వాడీ టీచర్లు అందజేస్తున్నారు. పాలు అందుతున్నాయి..ప్రతిరోజూ అంగన్వాడీ కేంద్రంలో 100 ఎంఎల్ పాలు ఇస్తున్నారు. రోజు అంగన్వాడీ కేంద్రానికి తీసుకొచ్చి వదిలిపెడితే పిల్లలకు టీచర్లు పాలు ఇవ్వడంతో పాటు ఆటపాటలతో విద్యాబోధన చేస్తున్నారు. దీనివల్ల ఏజెన్సీ గ్రామాల్లోని పిల్లలకు మరింత మేలు జరుగుతుంది. పిల్లలు కూడా అంగన్వాడీ బడికి రావడానికి ఇష్టపడుతున్నారు. – ఎట్టి మానస, చిన్నబోయినపల్లి, తల్లిఅంగన్వాడీ కేంద్రాల్లో 3 నుంచి 6 ఏళ్ల పిల్లలకు పంపిణీ పైలెట్ ప్రాజెక్టుగా ములుగు జిల్లా ఎంపిక గత నెల 17న లాంఛనంగా పథకాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క జిల్లాలో 8,273 మంది పిల్లలు జిల్లాలోని అంగన్వాడీ సెంటర్లు, చిన్నారుల వివరాలుప్రాజెక్టులు సెంటర్లు చిన్నారులుములుగు 142 2,536 ఎస్ఎస్ తాడ్వాయి 124 1,430 వెంకటాపురం(కె) 168 1,624 ఏటూరునాగారం 206 2,683 -
లక్ష్యం ఏకగ్రీవం..
రెండు విడతల్లో 17 పంచాయతీలు యునానిమస్భూపాలపల్లి అర్బన్: జిల్లాలో పంచాయతీ ఎన్నికల హడావుడి ప్రారంభమైనప్పటి నుంచి అందరి దృష్టి ఏకగ్రీవ పంచాయతీలపై పడింది. గతంలో కన్నా ఈసారి ఎక్కువగా ఏకగ్రీవం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 9వ తేదీన మూడో విడత నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది కావడంతో ఈలోపు మరిన్ని పంచాయతీలు ఏకగ్రీవం కావడానికి అధికార పార్టీ ప్రయత్నిస్తోంది. కొన్ని పంచాయతీల్లో ఏకగ్రీవం అయిన వ్యక్తి కూడా సొంత డబ్బులు చెల్లించి అభివృద్ధి పనులు చేపట్టాలని గ్రామస్తులు తీర్మానాలు చేసుకుంటున్నారు. డబ్బులు చెల్లించే విషయాలు బయటకి పొక్కకుండా కొన్ని గ్రామ పంచాయతీల్లో ఒకటికి మించి నామినేషన్లు దాఖలు చేశారు. మరికొన్ని పంచాయతీల్లో గ్రామాభివృద్ధికి ఒప్పుకున్న డబ్బులు పూర్తిగా ఇవ్వకపోవడంతో ఒకటికి మించి నామినేషన్లు వేశారు. గ్రామాభివృద్ధికి ఇవ్వాల్సిన మొత్తం పూర్తిగా ఇస్తేనే నామినేషన్ ఉపసంహరించుకుంటామని చెబుతున్నట్లు సమాచారం. గ్రామాల్లో ప్రధానంగా దేవాలయాలు, బొడ్రాయి, బోర్లు, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని హామీలు ఇచ్చిన వారిని ప్రజలు ఏకగ్రీవం చేస్తున్నారు. 8 మండలాల్లో 17 ఏకగ్రీవం మొదటి, రెండో విడతలోని 8 మండలాల్లోని 167 గ్రామపంచాయతీలకు జరుగనున్న ఎన్నికల్లో 17 గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మూడో విడత ఎన్నికలు జరిగే నాలుగు మండలాల్లో మరో 8 గ్రామపంచాయతీల్లో ఏకగ్రీవం కావడానికి నామినేషన్లు వేసిన సభ్యులు ఒప్పుకున్నట్టు సమాచారం. అత్యధికంగా చిట్యాల మండలంలో ఐదు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా కొత్తపల్లి గోరి, రేగొండ, మొగుళ్లపల్లి, టేకుమట్ల, భూపాలపల్లి మండలాల్లో రెండేసి చొప్పున గణపురం, పలిమెల మండలాల్లో ఒక్కో సర్పంచ్ ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవం కోసం సంప్రదింపులు నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత నుంచే కాటారం, మల్హర్, మహాముత్తారం, మహదేవపూర్ మండలాల్లోని పలు గ్రామపంచాయతీల్లో ఏకగ్రీవం కోసం సంప్రదింపులు ప్రారంభమయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 9వ తేదీ కావడంతో ఈ రెండు రోజుల్లో మరిన్ని పంచాయతీలు ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. వీటిలో రెండు, మూడు నామినేషన్లు దాఖలయిన పంచాయతీల్లో ఏకగ్రీవం కోసం చర్చలు జరుపుతున్నారు. ముఖ్యంగా అధికారపార్టీ ఏకగ్రీవం కోసం విపరీతంగా కష్టపడుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధం ఉన్న అభ్యర్థులు ఎక్కువ మంది పోటీలో ఉంటే విత్‌డ్రా చేసుకునే విధంగా బుజ్జగింపులు జరుగుతున్నాయి. పెద్ద గ్రామపంచాయతీల్లో మాత్రం ఏకగ్రీవం కోసం ప్రయత్నించినా పోటీలో ఉన్న అభ్యర్థులు ఒప్పుకునే పరిస్థితి లేదంటున్నారు. ఇప్పటి వరకు ఏకగ్రీవం అయిన పంచాయతీల్లో ఒక్కటి కూడా పెద్ద గ్రామ పంచాయతీ లేకపోవడం గమనార్హం. 2019 పంచాయతీ ఎన్నికల్లో 22 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. గతంలో ఏకగ్రీవం అయి ఈసారి కూడా ఏకగ్రీవం అయిన పంచాయతీల్లో చిట్యాల మండలం బావుసింగ్‌పల్లి, చైన్పాక, రేగొండ మండలం చెంచుపల్లి గ్రామపంచాయతీలు మాత్రమే ఉన్నాయి. గుడులు, బొడ్రాయి, స్థలాలపై హామీలు అభివృద్ధి ఎజెండాగానే జిల్లాలో పంచాయతీల ఏకగ్రీవ ప్రక్రియ జరుగుతోంది. ఈ విషయంలో చిట్యాల, గణపురం, రేగొండ, భూపాలపల్లి మండలాల్లోని పంచాయతీల్లో గ్రామస్తులు, గ్రామంలోని పెద్ద మనుషుల సమక్షంలో అభివృద్ధి ప్రధానంగా ఏకగ్రీవం ప్రక్రియ జరిగింది. వీటితో పాటు మిగిలిన మండలాల్లో ఏకగ్రీవం అయిన పంచాయతీల్లో అభివృద్ధి పనులపైనే చర్చ జరిగింది. ముఖ్యంగా గ్రామాల్లో గుడులు, గుడి నిర్మాణాలకు స్థలాలు, తాగునీటి సదుపాయం కోసం బోర్లు, గ్రామాల్లో బొడ్రాయి ఏర్పాటు వంటివి ప్రధానంగా చర్చకు వచ్చాయి. గ్రామాల్లో ఏకగ్రీవం అయిన వ్యక్తులు సొంత ఖర్చులతో ఇవన్నీ చేయించిన వారికే మద్దతు ఉంటుందని కొన్ని పంచాయతీల్లో తీర్మానాలు కూడా జరిగాయి. మూడో విడతలో మరిన్ని అయ్యే అవకాశం గుడులు, బొడ్రాయి, బోర్ల పనులే ఎజెండా -
కొవ్వొత్తులతో నివాళి
సాయి ఈశ్వరాచారి ఆత్మకు శాంతి చేకూరాలని స్వర్ణకార సంఘం సభ్యులు, కుల సంఘ పెద్దలు ఆదివారం రాత్రి పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ సెంటర్లో సాయి ఈశ్వరాచారి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం జిల్లా అధ్యక్షుడు రామగిరి సదానందం, నాయకులు కట్ట శంకరమూర్తి, రాజేష్, మోహన్‌చారి, బీబీ చారి, నవీన్ కుమార్, సురేష్, సాంబమూర్తి, రాజకుమార్, శివకుమార్, రమేష్, హరీశ్, తిరుమల పాల్గొన్నారు. – భూపాలపల్లి రూరల్ -
మేడారంలో భక్తుల కోలాహలం
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు ప్రైవేట్ వాహనాల్లో తరలిచ్చారు. జంపన్నవాగులో స్నానాలు ఆచరించి అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, ఎత్తు బంగారం, కానుకలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజుకు పూజలు చేశారు. కోళ్లు, యాటలను అమ్మవార్లకు జడతపట్టి మొక్కుగా సమర్పించారు. సుమారుగా 20వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. మొక్కుల అనంతరం భక్తులు మేడారం, చిలకలగుట్ట, శివరాంసాగర్ పరిసరాల ప్రాంతాల్లో విడిది చేసి వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు. దీంతో మేడారం పరిసరాల్లో ఎటు చూసినా భక్తజనమే కనిపించారు. భారీగా తరలివచ్చిన భక్తజనం వనదేవతలకు మొక్కుల చెల్లింపు రోడ్ల నిర్మాణ పనులతో భక్తుల ఇక్కట్లు -
కాళేశ్వరంలో భక్తుల పూజలు
కాళేశ్వరం: ఆదివారం సెలవురోజు కావడంతో మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ముందుగా త్రివేణి సంగమ గోదావరిలో స్నానాలు చేశారు. అనంతరం స్వామివారి గర్భగుడిలో అభిషేక పూజలు నిర్వహించారు. దీంతో ఆల య పరిసరాలు, గోదావరి తీరం వద్ద భక్తుల సందడితో కోలాహలంగా కనిపించింది. ఆర్టీఐ రక్షక్ జిల్లా అధ్యక్షుడిగా కమల్మిత్ర భూపాలపల్లి అర్బన్: ఆర్టీఐ రక్షక్ కమిటీ జిల్లా అధ్యక్షుడిగా లూయిస్ కమల్ మిత్రను నియమించినట్లు వ్యవస్థాపక అధ్యక్షుడు సతీష్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా కట్ట సురేష్‌బాబును నియమించారు. జిల్లాలో సమాచార హక్కు చట్టంపై ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించడానికి బాధ్యతలు స్వీకరించినట్లు కమల్మిత్ర తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులకు సంబంధించిన వివరాలను పరిశీలించేందుకు ప్రతీ పౌరుడికి సమాచారం సేకరించే హక్కు ఉందని తెలిపారు. ఈ బాధ్యత అప్పగించినందుకు వ్యవస్థాపక అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రస్థాయిలో విద్యార్థుల ప్రతిభ టేకుమట్ల: మండలకేంద్రంలోని శాంతినికేతన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు కుంగ్‌ఫూ–కరాటేలో రాష్ట్ర స్థాయిలో చాంపియన్‌షిప్ ట్రోఫీ సాధించినట్లు కరస్పాండెంట్ హరీశ్‌కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతినికేతన్ విద్యార్థులు వేములవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కుంగ్‌ఫూ– కరాటే చాంపియన్‌షిప్ 2025లో పాల్గొని విజయం సాధించినట్లు చెప్పారు. పిల్లలు చూపిన క్రమశిక్షణ, ధైర్యం, నైపుణ్యం అందరినీ ఆకట్టుకుందని చెప్పారు. అనంతరం విద్యార్థులను అభినందించారు. వేయిస్తంభాల ఆలయంలో పల్లకీసేవ హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో ఆదివారం మార్గశిర బహుళ తదియ ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీరుద్రేశ్వరీరుద్రేశ్వస్వామి వార్లకు ఆదివారం పల్లకీసేవ నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు మణికంఠశర్మ, అర్చకులు సందీప్‌శర్మ, ప్రణవ్, శ్రవణ్ ఉదయం ప్రభాతసేవ, గణపతి పూజ, రుద్రేశ్వరస్వామికి రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. 121 మంది దంపతులు సామూహిక రుద్రాభిషేకాలు జరుపుకున్నారు. అనంతరం శ్రీరుద్రేశ్వరీశ్రీరుద్రేశ్వస్వామి వార్లను పల్లకీసేవలో ప్రతిష్టించి మంగళవాయిద్యాలతో, హారతులతో ఆలయ పరిక్రమచుట్టూ పల్లకీసేవ నిర్వహించారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈఓ అనిల్‌కుమార్ పర్యవేక్షించారు. -
సోషల్ మీడియా ప్రచార వేదిక
కాళేశ్వరం: జిల్లాలో ఎక్కడ చూసినా ఎన్నికల సందడే కనిపిస్తోంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు పలు వ్యూహాలు రచిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాను తమ ప్రచారాస్త్రంగా ఉపయోగిస్తున్నారు. తాము గెలిస్తే ఏం అభివృద్ధి చేయాలనుకుంటున్నారో ప్రజలకు వివరించేందుకు అదే వేదిక ద్వారా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, యూట్యూబ్, ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాలను విరివిగా అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారానికి వినియోగిస్తున్నారు. డిజిటల్ యుగంలో సోషల్ మీడియాను ఉపయోగించి తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల నామినేషన్లకు ముందు నుంచే ప్రత్యేక వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, ఇతర సోషల్ మీడియాలో వారి మద్దతుదారులు, గ్రామస్తుల సెల్‌ఫోన్ నంబర్లతో ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామంలో చేపట్టే పనులపై మినీ మేనిఫెస్టోలు, నేతల సందేశాలు, ఇతర హామీలు, రోజువారీ కార్యక్రమాలను పోస్ట్ చేస్తున్నారు. ప్రత్యర్థులు పెట్టే పోస్టులకు భిన్నంగా, ఆసక్తికరంగా ఉండేవిధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అభ్యర్థి అనుచరగణం, కుటుంబ సభ్యులు కూడా వీటినే ఉపయోగించుకుంటూ మద్దతు కూడగడుతున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రచారం చేసుకునేందుకు అవకాశం ఉండటంతో చాలా మంది అభ్యర్థులు వీటినే ప్రధాన ప్రచార అస్త్రాలుగా వినియోగిస్తున్నారు. నిఘా తీవ్రం.. జిల్లాలో 12 మండలాల్లో 248 పంచాయతీల్లో ఈనెల 11న మొదటి, 14న రెండో, 17న మూడు విడతల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సోషల్ మీడియా ప్రచారాలు ఊపందుకున్నారు. దీని కోసం యువకులు రాత్రిపగలు శ్రమిస్తున్నారు. అభ్యర్థులకు ఈజీగా ఉండడంతో ఎక్కువ ప్రచారాన్ని సోషల్‌మీడియా వేదికనే నమ్ముకున్నారు. ఎస్బీ, ఇంటిలిజెన్స్, పోలీసు నిఘా విభాగాలు ఆయా వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, యూట్యూబ్, ట్విట్టర్ ఇతర సోషల్ మీడియాలపై నజర్ వేశారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపడుతున్నారు. మొత్తం మీద అభ్యర్థులు తక్కువ ఖర్చులతో ఎక్కువ ప్రచారాన్ని ప్రజల వద్దకు చేర్చుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల సరికొత్త ట్రెండ్ సామాజిక మాధ్యమాలే వేదికగా విస్తృతంగా ప్రచారం జిల్లాలో ఏ పల్లె చూసినా పంచాయతీ ఎన్నికల ఫీవర్ -
రెండో విడతలో 10 పంచాయతీలు ఏకగ్రీవం
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో 10 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవయ్యాయి. రెండో విడతలో నాలుగు మండలాల్లో 85 గ్రామ పంచాయతీలు, 694 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. చిట్యాల, భూపాలపల్లి, టేకుమట్ల, పలిమెల మండలాల్లో శనివారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. చివరిరోజు కావడంతో నామినేషన్ దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. సింగిల్ నామినేషన్ ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. వివిధ మండలాల్లో పలు వార్డులు కూడా ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవ పంచాయతీలివే.. పలిమెల జవ్వాజి పుష్పలత, భూపాలపల్లి మండలంలో బావుసింగ్‌పల్లి పోనగంటి ముత్తమ్మ, శ్యాంనగర్ ఓరుగంటి రజిత, టేకుమట్ల మండలంలో వెలిశాల బొడ్డు తిరుపతి, పెద్దంపల్లి వ్యాసనవేణి శ్రీలేఖ, చిట్యాల మండలంలో ముచినిపర్తి ఇంగిలి రాజేందర్, పాశిగడ్డతండా లావుడ్య రవీందర్, బావుసింగ్‌పల్లి ఎర్రబెల్లి రాజేశ్వర్‌రెడ్డి, చైన్పాక మాంత మనోహర్, ఏలేట్టరామయ్యపల్లి కొడారి అశోక్ ఏకగ్రీవ సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. వార్డులు కూడా.. భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మండలం శ్యాంనగర్ గ్రామపంచాయతీలో ఎనిమిది వార్డులు ఏక్రగీవమయ్యాయి. ఆరు కాంగ్రెస్ మద్దతుదారులు, రెండు బీఆర్ఎస్ మద్దతుదారులు ఎన్నికయ్యారు. బావుసింగ్‌పల్లి పంచాయతీలోనూ 8 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. -
రీజినల్ స్థాయి క్రికెట్ పోటీలు
భూపాలపల్లి అర్బన్: సింగరేణి వర్క్ పీపుల్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ (డబ్ల్యూపీఎస్) భూపాలపల్లి, రామగుండం–3 ఏరియాల క్రికెట్ రీజినల్ స్థాయి క్రికెట్ పోటీలను శనివారం ఏరియాలోని అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించారు. ఈ పోటీల ప్రారంభోత్సవానికి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. సింగరేణి సంస్థలో ప్రతీ ఏడాది మాదిరిగా క్రీడలను నిర్వహించడం ఆనందకరమన్నారు. ఉద్యోగులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, క్రీడలు రోజు వారి మన కార్యకలాపాలలో భాగం చేసుకోవాలని సూచించారు. ఈ పోటీల్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ తీసుకున్న భూపాలపల్లి జట్టు 20 ఓవర్లకు 6 వికెట్ల నష్టపోయి 184 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆర్జీ–3 జట్టు 20 ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయి 160 పరుగులు మాత్రమే చేసింది. 24 పరుగుల తేడాతో భూపాలపల్లి ఏరియా జట్టు విజయం సాధించింది. ఈ కార్యక్రమంలో ఏరియా పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, క్రీడల గౌరవ కార్యదర్శి శ్రావణ్‌కుమార్, కార్మిక సంఘాల నాయకులు రమేష్, బొడ్డు అశోక్, స్పోర్ట్స్ సూపర్వైజర్ పర్స శ్రీనివాస్, భూపాలపల్లి స్పోర్ట్స్ కోఆర్డినేటర్ పాక దేవయ్య, క్రీడాకారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
అంబేడ్కర్‌కు నివాళి
భూపాలపల్లి రూరల్: అంబేడ్కర్ వర్ధంతిని వివిధ పార్టీల నాయకులు, సంఘాల నాయకులు శనివారం జిల్లాకేంద్రంలో నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్‌తో కలిసి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. అంబేడ్కర్ బడుగు, బలహాన వర్గాలవారికి రక్షణ కల్పించిన మహనీయుడన్నారు. ఆయన రచించిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని ప్రతిజ్ఞ చేయించారు. మాజీ ఎమ్మెలే గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ, ధర్మసమాజ్ పార్టీ నాయకులు అంబేడ్కర్ విగ్రహానికి నివాళ్లర్పించారు. -
పోలీస్‌శాఖకు అండగా హోంగార్డులు
● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్భూపాలపల్లి అర్బన్: అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ హోంగార్డులు జిల్లా పోలీస్‌శాఖకు బలమైన అండగా నిలుస్తున్నారని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. 63వ హోంగార్డ్ వ్యవస్థాపక దినోత్సవాన్ని జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 104 మంది హోంగార్డులు అంకితభావంతో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. అత్యవసర పరిస్థితులలో స్పందన, బందోబస్తు విధులు, ప్రజా రక్షణ చర్యల్లో హోం గార్డుల సేవలు అమూల్యం అని వివరించారు. విధుల్లో ప్రతిభ కనబరిచిన 10 మంది హోం గార్డులను ఎస్పీ ప్రశంసపత్రాలతో అభినందించారు. ఇటీవల మరణించిన హోంగార్డు శంకర్ కుటుంబానికి రూ.15వేల చెక్కును అందించారు. వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన వాలీబాల్, ఇతర క్రీడా పోటీల్లో విజయం సాధించిన సిబ్బందికి ట్రోఫీలు, బహుమతులు ప్రదానం చేశారు. క్రీడా కార్యక్రమాలు హోంగార్డులలో శారీరక సామర్థ్యం, మానసికోల్లాసం పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరేష్కుమార్, డీఎస్పీలు సంపత్‌రావు, సూర్యనారాయణ, సీఐ నరేష్కుమార్, అడ్మిన్ ఆర్ఐ రత్నం, హోంగార్ వెల్ఫేర్ ఆర్ఐ పూర్ణచందర్, ఆపరేషన్ ఆర్ఐ కాశీరాం, ఎస్సైలు, ఆర్ఎస్ఐలు, పోలీస్ సంఘం ప్రతినిధి మర్కాల యాదిరెడ్డి, హోం గార్డ్ సిబ్బంది, ఇతర శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. -
అంతులేని అవినీతి..!
సాక్షిప్రతినిధి, వరంగల్ : హనుమకొండ కలెక్టరేట్లో రూ.60వేల లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన అడిషనల్ కలెక్టర్, ఇన్చార్జ్ డీఈఓ ఎ.వెంకట్‌రెడ్డిపై ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. ఓ వైపు భూ నిర్వాసితులు, మరోవైపు కొందరు రైస్‌మిల్లర్లు తమగోడును వెళ్లబోసుకుంటున్నారు. దామెర, ఊరుగొండ గ్రామాలకు చెందిన గ్రీన్‌ఫీల్డ్ హైవే బాధిత రైతులు ఏకంగా హనుమకొండ కలెక్టరేట్ ఎదుట ‘మా ఉసురు తాకింది’అంటూ టపాసులు పేల్చి సంబురాలు చేసుకున్నారు. సీఎంఆర్ వేధింపులకు గురైన రైస్‌మిల్లర్లు కొందరు సీఎస్ కార్యాలయంలో వెంకట్‌రెడ్డిపై ఫిర్యాదులు చేయడం కలకలం రేపుతోంది. ఆదినుంచి వివాదాస్పదుడే... రెవెన్యూశాఖలో వివిధ హోదాల్లో పనిచేసిన ఎ.వెంకట్‌రెడ్డి ఆదినుంచి వివాదాస్పదుడే. ఏ పార్టీ ప్రభుత్వం ఉంటే.. ఆ ప్రభుత్వంలోని తన సామాజిక నేపథ్యం ఉన్న నేతల పేర్లు చెబుతూ ఉన్నతాధికారులను మెప్పించే ప్రయత్నం చేసేవారన్న ఆరోపణలున్నాయి. జనగామ ఆర్డీఓగా, సూర్యాపేట అడిషనల్ కలెక్టర్‌గా పనిచేసిన సమయంలోనూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. భువనగిరి – వరంగల్ 563 జాతీయ రహదారి భూసేకరణలో ఈయన చేయని అక్రమాలు లేవన్న ఫిర్యాదులు ఉన్నతాధికారులకు చేరాయి. జనగామ ఆర్డీఓగా పని చేసిన సమయంలో అప్పుడున్న నియోజకవర్గ కీలక నేత, ఆయన బావమరుదులు, బంధువుల ఒత్తిళ్లకు తలొగ్గి అసైన్డ్, ప్రభుత్వ భూములను పట్టాభూములుగా చిత్రీకరించి రూ.లక్షల్లో పరిహారం చెల్లించారన్న ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు కూడా ఆదేశించింది. సూర్యాపేటలో డిఫాల్టర్లయిన రైసుమిల్లర్ల నుంచి భారీగా వసూళ్లు చేసి సీఎంఆర్ కింద వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కట్టబెట్టినట్లు ఫిర్యాదుల నేపథ్యంలో అక్కడా విచారణ ఎదుర్కొన్నారు. అక్రమార్కులకు సీఎంఆర్.. ఉదంతాలు అనేకం.. ● హనుమకొండ అడిషనల్ కలెక్టర్‌గా వెంకట్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాలో సీఎంఆర్ కేటాయింపులకు తీసుకునే నజరానాలు రెండింతలు పెరిగాయని కొందరు రైస్‌మిల్లర్లు పౌరసరఫరాలశాఖ కమిషనర్ కార్యాలయంలో చేసిన ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ● ఒక్కో సీజన్‌కు ఒక్కో రైసుమిల్లు నుంచి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపించారు. ● ఇన్‌టైంలో సీఎంఆర్ ఇచ్చిన రైసుమిల్లర్లను పక్కన పెట్టి.. డిఫాల్టర్లయిన వారు ముడుపులివ్వగానే వారికి పెద్ద మొత్తంలో ధాన్యం కేటాయించారు. ● కమలాపూర్‌లో రెండు రైస్‌మిల్లులున్న ఓ వ్యాపారి సుమారు రూ.16 కోట్ల వరకు బకాయి ఉన్నా తిరిగి ఈ సీజన్లో భారీగా ధాన్యం కేటాయింపులకు ఆదేశాలిచ్చిన వెంకట్‌రెడ్డి.. ‘కన్నయ్య’కు అన్నయ్యలా మారాడని రైస్‌మిల్లర్లు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. ● సీతంపేట శివారులోని ఓ రైసుమిల్లర్కు రూ.15 కోట్ల మేరకు ధాన్యం కేటాయించగా.. ఏడాది గడుస్తున్నా ఇప్పటివరకు తిరిగి బియ్యం చెల్లించలేదని చెబుతున్నారు. ● ఇలా పలువురు రైస్‌మిల్లర్లకు ఇష్టారాజ్యంగా సీఎంఆర్ కేటాయించి.. ఉన్నతాధికారులకు ప్రభుత్వంలోని కొందరు కీలక ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పి బెదిరింపు ధోరణిని కూడా ప్రదర్శించే వారన్న పేరు వెంకట్‌రెడ్డికి ఉంది. ● పౌరసరఫరాలశాఖలోని ఓ కింది స్థాయి ఉద్యోగి సీఎంఆర్ లావాదేవీలలో కీలకంగా వ్యవహరించగా.. ఇద్దరు ఉన్నతాధికారులు సైతం కొమ్ముకాశారన్న విమర్శలున్నాయి. ఆ ముగ్గురిపై సస్పెన్షన్ వేటు...? అవినీతి నిరోధక శాఖకు చిక్కిన ముగ్గురిపై సస్పెన్షన్ వేటు పడినట్లు తెలిసింది. రూ.60 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన అడిషనల్ కలెక్టర్ ఎ.వెంకట్‌రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ కన్నెబోయిన మనోజ్, సీనియర్ అసిస్టెంట్ మహ్మద్ గౌసుద్దీన్లకు ఏసీబీ అధికారులు శనివారం హనుమకొండ ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. ఈ మేరకు విచారణ జరిపిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి క్షమా దేశ్‌పాండే ముగ్గురికి ఈ నెల 19 వరకు రిమాండ్ విధిస్తూ తీర్పు ఇవ్వగా, ఖమ్మం జిల్లా జైలుకు తరలించినట్లు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు. హనుమకొండ అడిషనల్ కలెక్టర్ వెంకట్‌రెడ్డిపై ఫిర్యాదుల పరంపర తవ్విన కొద్దీ అవినీతి, అక్రమాలు.. సీఎంఆర్‌లో అవకతవకలు కలెక్టరేట్ ఎదుట టపాసులు కాల్చి రైతుల సంబురాలు రెండో రోజు నాగోల్, హనుమకొండలో సోదాలు రూ.30.30లక్షల నగదు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు భూసేకరణ, సీఎంఆర్ రికార్డులపైనా విచారణవెంకట్రెడ్డి టీమ్‌పై ఏసీబీ ఆరా.. ఏసీబీ అధికారులు శుక్రవారం ఘటనా స్థలంలోనే రసాయన పరీక్షలు చేసి, లంచం డబ్బు వెంకట్‌రెడ్డి చేతిలో ఉండటాన్ని ధ్రువీకరించిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత కలెక్టరేట్లో తనిఖీలు చేసిన ఏసీబీ టీమ్ పలు ఆధారాలను స్వాధీనం చేసుకుంది. ఈ లావాదేవీకి సంబంధించిన డాక్యుమెంట్లు, మొబైల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆయన కార్యాలయ గదిలోని డాక్యుమెంట్లు, కంప్యూటర్లు, ఫైళ్లను స్కాన్ చేశారు. ఈ రైడ్స్‌లో అదనపు ఆస్తులు, మరిన్ని అవినీతి ఆధారాలు దొరికినట్లు సమాచారం. సీఎంఆర్, భూసేకరణల్లో భారీ అక్రమాలు జరిగాయన్న నిర్ధారణకు వచ్చిన ఏసీబీ.. ఈ రెండు అంశాల్లో అతనికి అత్యంత సన్నిహితంగా మెలిగిన రెవెన్యూ, సివిల్‌సప్లయీస్ అధికారులు, సిబ్బంది వివరాలపై ఆరా తీస్తోంది. హనుమకొండ, నాగోల్‌లోని ఆయన ఇళ్లలో తనిఖీలు చేసి రూ.30 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. -
పదికి పక్కా ప్రణాళిక
కాటారం: టెన్త్ విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రభుత్వ పాఠశాలల్లో పక్కా ప్రణాళికను రూపొందించారు. ఇప్పటికే సిలబస్ పూర్తిచేసిన ఉపాధ్యాయులు పాఠశాల సమయంలో రివిజన్ తరగతులు బోధిస్తూ స్టడీ అవర్స్ సమయంలో విద్యార్థుల సందేహాలు నివృత్తి చేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అధిక ఉత్తీర్ణత శాతం సాధించేలా ఉపాధ్యాయులు ప్రణాళికతో శ్రమిస్తున్నారు. జిల్లాలో 67 ప్రభుత్వ హైస్కూల్స్ ఉండగా 1,216 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. పదో తరగతి విద్యార్థులకు 20 మార్కులు ఇంటర్నల్ కాగా, 80 మార్కులకు రాత పరీక్షలు ఉంటాయి. సీసీఈ ప్రశ్నావళి విధానంతో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నందున వీటిని దృష్టిలో ఉంచుకొని ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా ఉపాధ్యాయులు ప్రత్యేక శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. ముందస్తుగా అవగాహన.. ప్రైవేట్ పాఠశాలల స్థాయిలో ఉదయం, సాయంత్రం అదనంగా ఒక గంట పాటు స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారు. ఎలా చదవాలి, ఎక్కువ మార్కులు వచ్చేందుకు ఏం చేయాలనే అవగాహన కల్పిస్తున్నారు. రోజుకో పరీక్ష నిర్వహించి బిట్స్ ఎలా రాయాలో ప్రిపేర్ చేయిస్తున్నారు. విద్యార్థుల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వారిని తీర్చిదిద్దుతున్నారు. స్నాక్స్‌పై సందిగ్ధం.. ప్రభుత్వ పాఠశాలల్లో స్టడీ అవర్స్‌కు హాజరయ్యే తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం స్నాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. స్టడీ అవర్స్ మొదలై వారం దాటినా ఇప్పటివరకు స్నాక్స్ అందజేతపై సందిగ్ధం కొనసాగుతోంది. గతేడాది కలెక్టర్ ఆదేశాలతో ప్రత్యేక నిధులు కేటాయించి స్నాక్స్ అందించారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు రాలేదని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. ప్రత్యేక తరగతులు ప్రారంభం వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యం పరీక్షలపై విద్యార్థులకు ముందస్తు అవగాహన స్నాక్స్ పంపిణీపై సందిగ్ధంసందేహాలను నివృత్తి చేస్తూ.. పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. రోజు వారీగా సబ్జెక్ట్ స్టడీ అవర్స్ నిర్వహిస్తూ విద్యార్థుల సందేహాలను తీరుస్తున్నారు. – రాజేందర్, జిల్లా విద్యాశాఖ అధికారిప్రత్యేక ప్రిపరేషన్ చేయిస్తున్నారు.. స్టడీ అవర్స్ మాకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ప్రిపరేషన్ చేపిస్తున్నారు. పాఠాల్లో వచ్చిన సందేహాలను ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తున్నారు. – ఆరెల్లి శ్రీజ, పదో తరగతి విద్యార్థిని, టేకుమట్ల -
ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలి
● జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్శర్మగణపురం: గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్‌శర్మ ఆదేశించారు. శనివారం గణపురం మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రిసైడింగ్ అధికారులు, స్టేజ్ 2 అధికారులకు జరుగుతున్న శిక్షణా కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయితీ ఎన్నికల నిర్వహణలో సందేహాలుంటే సిబ్బంది శిక్షణ తరగతుల్లో నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో పొరపాటుకు తావులేకుండా ప్రశాంతంగా నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి డాక్టర్ కుమారస్వామి, తహసీల్దార్ సత్యనారాయణస్వామి, ఎంపీడీఓ భాస్కర్, మాస్టర్ ట్రైనర్లు ఎస్.శ్రీధర్, రఘునాధరెడ్డి పాల్గొన్నారు. రెండో విడత ఎన్నికల ర్యాండమైజేషన్ పూర్తి భూపాలపల్లి అర్బన్: రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా శనివారం కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్‌శర్మ రెండో దశ ర్యాండమైజేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్‌శర్మ మాట్లాడుతూ.. విధులు కేటాయించిన పోలింగ్ సిబ్బందికి సకాలంలో నియామక ఉత్తర్వులు అందేలా సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో అంతరాయాలు లేకుండా ముందస్తు ఏర్పాట్లు పక్కాగా ఉండాలన్నారు. ఎన్నికల నిర్వహణలో శిక్షణ ఎంతో కీలకమైందని, శిక్షణా తరగతులకు హాజరు కావడం తప్పనిసరని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, డీపీఓ శ్రీలత, ఈడీఎం శ్రీకాంత్ పాల్గొన్నారు. -
ముగిసిన జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్
భూపాలపల్లి అర్బన్: రెండు రోజుల పాటు జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్స్పైర్ మేళా శనివారం ముగిసింది. ముగింపు సమావేశానికి జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు అవార్డులు అందించి మాట్లాడారు. విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగడానికి వైజ్ఞానిక ప్రదర్శన దోహదం చేస్తుందన్నారు. విద్యార్థుల ఉత్సాహం, సృజనాత్మకత, విజ్ఞాన పరంపరకు అద్దం పట్టిందన్నారు. విద్యార్థులు తమ ప్రాజెక్టులను ప్రదర్శించి, తమ శాసీ్త్రయ నైపుణ్యాలను ఆవిష్కరించారని అభినందించారు. సైన్స్ ఫెయిర్ రెండో రోజు వివిధ పాఠశాలల నుంచి 3వేల మందికి పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు సందర్శించినట్లు తెలిపారు. జిల్లాలో ప్రతిభ కనబర్చిన 27 ఎగ్జిబిట్లు రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి బర్ల స్వామి, డీసీఈబీ కార్యదర్శి చంద్రశేఖర్, ఏఎంఓ విజయ్‌పాల్‌రెడ్డి, సీఎంఓ రమేష్, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ట్రస్మా నాయకులు పాల్గొన్నారు. -
సందేహాలుంటే నివృత్తి చేసుకోవాలి
మొగుళ్లపల్లి: నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. శనివారం మండలంలోని రైతు వేదికలో ప్రిసైడింగ్ అధికారులు, స్టేజ్ 2 అధికారులకు జరుగుతున్న శిక్షణా కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఏమైనా సందేహాలుంటే సిబ్బంది శిక్షణా తరగతుల్లో నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో చాలా జాగ్రత్తగా ఉండాలని, పొరపాట్లకు తావులేకుండా ప్రశాంతంగా నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సురేందర్, మాస్టర్ ట్రైనర్స్ పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల తనిఖీ మొగుళ్లపల్లి, ఇస్సిపేట, రంగాపూర్ గ్రామాల్లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అందుతున్న సౌకర్యాలు, తూకపు యంత్రాల పనితీరు, తేమ శాతం కొలిచే పరికరాల పనితీరు, ధాన్యం రవాణా ఏర్పాట్లు వంటి అంశాలను పరిశీలించారు. రైతులు ఇబ్బందులు పడకుండా పారదర్శకంగా ధాన్యం కొనుగోలు జరగాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల అధికారి కిరణ్ కుమార్, సహకార అధికారి వాలియా నాయక్ పాల్గొన్నారు. -
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
చిట్యాల: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా సంక్షేమ అధికారి మల్లేశ్వరి అన్నారు. అంతర్జాతీయ మహిళా హింస నిర్మూలన వారోత్సవాలలో భాగంగా శనివారం మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో ఐకేపీ వీఓ సభ్యులు, సీఏలు, సభ్యులతో కలిసి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లేశ్వరి మాట్లాడుతూ మహిళలకు వరకట్న వేధింపులు, ఉద్యోగ రీత్యా కార్యాలయాలలో, ఇంటి వద్ద ఎన్నో రకాలుగా అనేక బెదిరింపులకు గురి చేస్తున్నారని అన్నారు. వాటిని అరికట్టాలంటే చిన్నప్పటి నుంచే ఆడ పిల్లలకు ఆత్మ విశ్వాసం, ఽధైర్య సాహాసాలు, చదువుతో పాటు అన్ని రంగాలలో అవగాహన కలిగి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ జయప్రద, అనూష, మమత, ఐకేపీ ఏపీఎం రాజేందర్ పాల్గొన్నారు. సైబర్ నేరాలపై అవగాహన ఉండాలి కాటారం: సైబర్ నేరాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండి తమ తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారికి వివరించి అప్రమత్తంగా ఉంచాలని కాటారం డీఎస్పీ సూర్యనారాయణ అన్నారు. కాటారం మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఫ్రాడ్ కా ఫుల్ స్టాఫ్ కార్యక్రమంలో భాగంగా సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఆన్లైన్ మోసాలకు గురికాకుండా ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అపరిచిత నంబర్లు, సందేశాలకు స్పందించవద్దని, ఫోన్లో వచ్చే ఓటీపీలు షేర్ చేయవద్దని పేర్కొన్నారు. సైబర్ నేరాల బారిన పడితే 1930 నంబర్‌కు వెంటనే సమాచారం అందించాలని తెలిపారు. అనంతరం సైబర్ నేరాల అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించి విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సీఐ నాగార్జునరావు, ఎస్సైలు రాజశేఖర్, మానస, ప్రిన్సిపాల్ నాగలక్ష్మి, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ‘తీన్మార్ మల్లన్న నిర్బంధం అక్రమం’ భూపాలపల్లి రూరల్: తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తీన్మార్ మల్లన్నను పోలీసులు అక్రమంగా హౌస్ అరెస్టు చేయడం అక్రమమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ అన్నారు. మల్లన్న అక్రమ నిర్బంధాన్ని నిరసిస్తూ... పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్లో శనివారం టీఆర్పీ నాయకులు నిరసన చేపట్టారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ.. సాయి ఈశ్వరాచారి అంత్యక్రియలకు మల్లన్న వెళ్లకుండా అడ్డుకోవడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ప్రణయ్ రాజ్, కరుణాకర్, సురేందర్, సునీల్, శ్రీలత, సంపత్, శ్రీను, నరసయ్య, ప్రణీత్, శ్రీకాంత్, శ్రీనివాస్, జినుకల శ్రీను, కృష్ణ, అశోక్ పాల్గొన్నారు. గద్దెల ప్రాంగణం పనుల పరిశీలన ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారంలోని సమ్మక్క– సారలమ్మ గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం పనులను ములుగు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ శనివారం పర్యవేక్షించారు. గద్దెల ప్రాంగణం సాలహారం నిర్మాణం చుట్టూ ఏర్పాటు చేస్తున్న రాతి పిల్లర్లను పరిశీలించారు. జాతర సమయంలో పోలీస్ అత్యవసర సేవలకు అనుగుణంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఎస్పీ సూచనలు చేశారు. జాతర సమయంలో భారీగా మేడారానికి తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గద్దెల ప్రాంగణంలో భక్తుల భద్రతా ఏర్పాట్లు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను, అత్యవసర సేవలు, సమన్వయం వంటి అంశాలపై సంబంధిత అధికారులతో ఎస్పీ చర్చించారు. తొలుత అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. -
దివ్యాంగుల అభ్యున్నతికి కృషి
భూపాలపల్లి రూరల్: దివ్యాంగుల అభ్యున్నతికి సింగరేణి సంస్థ తనవంతు సహాయ సహకారం అందిస్తుందని సింగరేణి ఏరియా జీఎం రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని భూపాలపల్లి ఏరియాలోని కృష్ణకాలనీ మినీ ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటల పోటీలను రాజేశ్వర్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు క్రీడలు దోహదపడుతాయని చెప్పారు. విజేతలకు బహుమతులను ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్. శ్యాంసుందర్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్.శ్యాంసుందర్, గుర్తింపు సంఘం ఏఐటీయూసీ బ్రాంచీ సెక్రటరీ మోటపలుకుల రమేశ్, నాయకులు పాల్గొన్నారు. క్రీడాకారులకు అభినందనలు కాటారం: జాతీయ, రాష్ట్ర స్థాయి హ్యాండ్‌బాల్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, అథ్లెటిక్స్ పోటీల్లో అత్యంత ప్రతిభ కనబర్చి గోల్డ్‌మెడల్ సాధించిన మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులను గురుకులాల ఆర్సీఓ హరిసింగ్ అభినందించారు. శుక్రవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్సీఓ విద్యార్థులను అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్సీఓ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో ముందుకెళ్లి ప్రతిభ కనబర్చాలని సూచించారు. రానున్న రోజుల్లో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీసీఓ శ్రీనివాస్‌రెడ్డి, ప్రిన్సిపాల్ మా ధవి, వైస్ ప్రిన్సిపాల్ వెంకటయ్య, బలరాం, బాలికల పాఠశాల ప్రిన్సిపాల్ నాగలక్ష్మి, పీడీ మహేందర్, పీఈటీ శ్రీనివాస్, కోచ్ వెంకటేశ్, ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు. మేడారంలో మొక్కుల సందడిఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మలను దర్శించుకునేందుకు శుక్రవారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. జంపన్నవాగులో స్నానాలు ఆచరించిన భక్తులు అమ్మవార్లకు పుట్టువెంట్రుకలను సమర్పించుకున్నారు. తల్లుల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, ఎత్తు బంగారం, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మేడారంలో గద్దెల ప్రాంగణంలో పునర్నిర్మాణం పనులు చేస్తున్న కార్యికులు, భక్తుల రద్దీతో గద్దెల ప్రాంగణం సందడిగా మారింది. మొక్కుల అనంతరం భక్తులు మేడారం పరిసర ప్రాంతాల్లో విడిది చేసి వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారిగా కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం ప్రొఫెసర్ కె.రాజేందర్‌ను మరో ఏడాదిపాటు కొనసాగిస్తూ శుక్రవారం రిజిస్ట్రార్ రామచంద్రం ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు వీసీ ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ చేతులమీదుగా రాజేందర్ ఉత్తర్వులు అందుకున్నారు. పెద్దాపూర్ క్లస్టర్ తనిఖీ భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన క్లస్టర్‌ను అదనపు కలెక్టర్ విజయలక్ష్మి శుక్రవారం తనిఖీ చేశారు. ఎంపీడీఓ తరుణి ప్రసాద్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పలు గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, వసతులపై ఆరా తీశారు. పోలింగ్ కేంద్రాల్లో వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. -
శనివారం శ్రీ 6 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
నర్సంపేటలో జరిగిన ప్రజా పాలన–ప్రజా విజయోత్సవ సభలో సీఎం రేవంత్‌రెడ్డి, పక్కన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, ధనసరి సీతక్క, ఎంపీ బలరాంనాయక్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, కడియం శ్రీహరి, నాయిని, ప్రకాశ్‌రెడ్డి, రాంచంద్రునాయక్, గండ్ర సత్యనారాయణరావు, ఎమ్మెల్సీ సారయ్యఅభివాదం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డినర్సంపేట సీఎం సభ సక్సెస్.. కార్యకర్తల్లో జోష్ ● భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులుహెలిపాడ్ వద్ద రేవంత్‌రెడ్డికి ఘనస్వాగతం ● పంచాయతీ ఎన్నికలపై దిశానిర్దేశం ● పోలీసుల భారీ బందోబస్తుసాక్షి, వరంగల్/నర్సంపేట/నర్సంపేట రూరల్ : నర్సంపేటలో కాంగ్రెస్ శ్రేణులు కదంతొక్కాయి. పట్టణంలో శుక్రవారం జరిగిన ప్రజాపాలన–ప్రజావిజయోత్సవ సభ సక్సెస్ కావడంతో కార్యకర్తల్లో జోష్ నెలకొంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సీఎం అయిన తర్వాత తొలిసారి నర్సంపేట వచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం 3.32గంటలకు చేరుకున్న సీఎంకు ఉమ్మడి జిల్లా నేతలు ఘనస్వాగతం పలికారు. అక్కడినుంచి ప్రజాపాలన–విజయోత్సవ సభావేదిక వద్దకు భారీ కాన్వాయ్‌తో బయలుదేరారు. సీఎం రేవంత్‌రెడ్డి రోడ్డుపొడువునా ప్రజలకు అభివాదం తెలుపుతూ సభాస్థలికి చేరుకున్నారు. ముందుగా సభా వేదిక వద్ద సుమారు రూ.600 కోట్లతో అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ ప్రసంగించారు. పంచాయతీ ఎన్నికల్లో యువత, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సభకు నర్సంపేట డివిజన్లోని ఆరుమండలాలనుంచే కాకుండా ఉమ్మడి జిల్లానుంచి పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ప్రజల రాకతో సభాప్రాంగణమంతా జనంతో నిండిపోయింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా వరంగల్ సీపీ సన్‌ప్రీత్‌సింగ్ నేతృత్వంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్, ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, పింగిలి శ్రీపాల్‌రెడ్డి, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండీ.రియాజ్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్.నాగరాజు, డాక్టర్ మురళీనాయక్, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి హెలికాప్టర్ రాజుపేట గ్రామ శివారులోని హెలిపాడ్ వద్ద దిగింది. హెలికాప్టర్ నుంచి బయటకు వచ్చిన సీఎంకు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ధనసరి అనసూయ( సీతక్క), కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితోపాటు మరి కొందరు ఎమ్మెల్యేలు పుష్పగుచ్ఛాలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. శాలువాలతో సన్మానించారు. ఔటర్ రింగ్ రోడ్డు, యూజీడీ తీసుకొస్తున్నాం కొత్త ఏడాది మేడారం జాతరకు మళ్లీ వస్తా నర్సంపేట సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి -
కలల సాకారానికి కృషి అవసరం
భూపాలపల్లి అర్బన్: విద్యార్థులు కలలు కనాలి.. వాటి సాకారానికి నిరంతరం కృషి చేయాలని కలెక్టర్ రాహుల్‌శర్మ పిలుపునిచ్చారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని శాంతినికేతన్ పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన 53వ విద్యా, వైజ్ఞానిక సదస్సుకు కలెక్టర్ రాహుల్‌శర్మ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం కలెక్టర్ ప్రసంగించారు. విద్యార్థులు విద్యార్థి దశ నుంచే శాసీ్త్రయ దృక్పథాన్ని అలవర్చుకోవాలన్నారు. కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా, సమాజానికి ఉపయోగపడే ఎన్నో నూతన ఆవిష్కరణలు విద్యార్థుల నుంచి రావాలని ఆకాంక్షించారు. ఆకాశంలో ఎగిరే పక్షులను చూసే రైతు సోదరులు విమానాన్ని తయారు చేశారని, ప్రకృతిని, పరిసరాలను గమనించడం ద్వారా అద్భుతాలు సృష్టించవచ్చని విద్యార్థులకు గుర్తుచేశారు. మానవ జీవితంలో సైన్స్ ఎంతో కీలకమని, అది మన జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని తెలిపారు. విద్యార్థులు తమ కలలను నిజం చేసుకునే దిశగా అడుగులు వేయాలని సూచించారు. ప్రతి సంవత్సరం రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఆదేశానుసారం జిల్లాలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్స్పైర్ మేళాను నిర్వహించుకుంటున్నామని, దీనికి అనుగుణంగా డిసెంబరు 5, 6 తేదీలలో జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్, ఇన్స్పైర్ మేళాను నిర్వహించుకుంటున్నామన్నారు. సైన్స్ ఫెయిర్‌లో 222 సైన్స్ ఫెయిర్ ప్రాజెక్టులు, 77 ఇన్స్పైర్ ప్రాజెక్టులు ప్రదర్శించిన విద్యార్థులను అభినందించారు. విద్యా వైజ్ఞానిక స్టాళ్లను పరిశీలించి అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఇన్చార్జ్ డీఈఓ రాజేందర్, ఎంపీడీఓ తరుణ్‌ప్రసాద్, జిల్లా సైన్స్ అధికారి స్వామి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్‌శర్మ ఉత్సాహంగా జిల్లా స్థాయి సైన్స్‌ఫెయిర్ 299 ఎగ్జిబిట్ల ప్రదర్శన -
సర్పంచ్‌లకు 686.. వార్డులకు 1,804
కాటారం: గ్రామపంచాయితీ ఎన్నికల మూడో విడత నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. శుక్రవారం సెంటిమెంట్ కావడంతోచివరి రోజు కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్ మండలాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు అందజేశారు. కాటారం సర్పంచ్ స్థానానికి మాజీ జెడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి భర్త జక్కు రాకేశ్ నామినేషన్ దాఖలు చేశారు. మల్హర్ మండలం దుబ్బపేట గ్రామపంచాయతీ సర్పంచ్, నాలుగు వార్డు స్థానాలకు ఒక్కో నామినేషన్ మాత్రమే రావడంతో ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాటారం మండలంలోని పలు నామినేషన్ కేంద్రాలతో పాటు మహదేవపూర్ మండలం అన్నారంలో నామినేషన్ల ప్రక్రియ రాత్రి వరకు కొనసాగింది. కాటారం, మహదేవపూర్ నామినేషన్ కేంద్రాలను అడిషనల్ ఎస్పీ నరేశ్‌కుమార్, అన్నారం, కాళేశ్వరం నామినేషన్ కేంద్రాలను డీఎస్పీ సూర్యనారాయణ పరిశీలించారు. చివరి రోజు కాటారం మండలంలో సర్పంచ్ స్థానాలకు 145 నామినేషన్లు, వార్డు సభ్యులకు 378 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా మహాముత్తారం మండలంలో సర్పంచ్ స్థానాలకు 121 మంది, వార్డు స్థానాలకు 336 మంది, మహదేవపూర్ మండలంలో సర్పంచ్ స్థానాలకు 102 మంది, వార్డు స్థానాలకు 308 మంది, మల్హర్ మండలంలో సర్పంచ్ స్థానాలకు 59 మంది, వార్డు స్థానాలకు 198 మంది నామినేషన్లు వేశారు.మండలం సర్పంచ్ వార్డు సభ్యులు కాటారం 214 559 మహదేవపూర్ 164 469 మల్హర్ 115 339 మహాముత్తారం 193 437 ముగిసిన మూడో విడత నామినేషన్లు -
స్వచ్ఛ్ విద్యాలయాలు
భూపాలపల్లి అర్బన్: ‘స్వచ్ఛ ఏవమ్ హరిత్ విద్యాలయ రేటింగ్’ కార్యక్రమంలో జిల్లా నుంచి ఎనిమిది పాఠశాలలు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాయి. క్షేత్రస్థాయిలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, గురుకులాలు, కేంద్రీయ, నవోదయ విద్యాలయాల్లో ఆరు ప్రధాన అంశాల ఆధారంగా ద్వారా రేటింగ్ ఇచ్చి, ప్రోత్సాహక నిధులు, పురస్కారాలు ఇచ్చేందుకు కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ సెప్టెంబర్‌లో కార్యాచరణ మొదలు పెట్టింది. జాతీయ స్థాయికి ఎంపికై తే కేంద్రం నుంచి ప్రోత్సాహకాలు అందనున్నాయి. ఆరు అంశాల్లో మదింపు జిల్లా వ్యాప్తంగా ఉన్న 504 పాఠశాలల్లో 42వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆయా పాఠశాలల్లో పరిశుభ్రత, పచ్చదనం, పిల్లల్లో ఆహ్లాదకర, స్నేహపూరిత వాతావరణం పెంపొందించడం, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం వంటి అంశాల ప్రతిపాదికన స్వచ్ఛ ఎస్‌హెచ్‌వీఆర్ యాప్ ద్వారా ఆన్లైన్లో నమోదుకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఇందులో పాల్గొన్న పాఠశాలలకు రేటింగ్ కేటాయించడంతో అక్టోబర్‌లో జిల్లాలోని దాదాపు 96 పాఠశాలలు 4, 5 స్టార్లు సాధించాయి. జిల్లాలోని 28 కాంప్లెక్స్ హెచ్ఎంలు వీటిని మరోసారి పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేశారు. 96 పాఠశాలలకు రెండు కేటగిరీలుగా విభజించారు. అందులో నుంచి రూరల్ నుంచి 6, అర్బన్‌నుంచి రెండు పాఠశాలలను గుర్తించారు. మూడు రోజుల క్రితం జిల్లాస్థాయి ప్రత్యేక బృందం 5 స్టార్ సాధించిన 8 పాఠశాలల నుంచి కేటగిరి 1, 2 ద్వారా రూరల్ విభాగంలో ఆరు, కేటగిరి 1, 2 ద్వారా అర్బన్ విభాగంలో రెండు పాఠశాలల చొప్పున ఎంపిక చేశారు. పాఠశాలల వివరాలు రూరల్: కేటగిరి 1: ఎంపీయూపీఎస్ పిడిసిల్ల(మొగుళ్లపల్లి), ఎంపీపీఎస్ సూరారం, ఎస్సీకాలనీ (మహదేవపూర్), ఎంపీయూపీఎస్ కొయ్యారు (మల్హర్) కేటగిరి 2: జెడ్పీహెచ్ఎస్ మొగుళ్లపల్లి, జెడ్పీహెచ్ఎస్ పీఎంశ్రీ చెల్పూర్(గణపురం), జెడ్పీహెచ్ఎస్ పీఎంశ్రీ గొల్లబుద్దారం(భూపాలపల్లి) అర్బన్: కేటగిరి 1: ఎంపీపీఎస్ సెగ్గంపల్లి (భూపాలపల్లి), ఎంజేపీటీబీఆర్ బాలికలు గాంఽధీనగర్ (భూపాలపల్లి) నేడు అవార్డుల పంపిణీ జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి ఎంపికై న స్వచ్ఛ ఏవమ్ హరిత్ విద్యాలయాలకు నేడు(శనివారం) జిల్లా అవార్డులను అందించునున్నారు. 8 పాఠశాలలకు నేడు విద్యాశాఖ ఆధ్యర్యంలో జరిగే కార్యక్రమంలో కలెక్టర్ అవార్డులు ప్రదానం చేయనున్నారు. రాష్ట్ర స్థాయికి ఎంపికై న పాఠశాలలు జాతీయ స్థాయికి వెళ్లేలా చర్యలు తీసుకుంటాం. ప్రతి పాఠశాలలో స్వచ్ఛత, ప రిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. – రాజేందర్, ఇన్చార్జ్ డీఈఓ జాతీయ స్థాయికి ఎంపికై తే కేంద్రం నుంచి ప్రోత్సాహకాలు -
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలి
భూపాలపల్లి అర్బన్: మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు సంబంధిత ఎంపీడీఓ కార్యాలయాలలో దరఖాస్తులు సమర్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్‌శర్మ సూచించారు. పోస్టల్ బ్యాలెట్‌కు అర్హత ఉన్న సిబ్బంది తప్పనిసరిగా నిర్ణీత గడువులోగా సంబంధిత ఎంపీడీఓ కార్యాలయాలల్లో ఏర్పాటు చేసిన ఫెలిసిటీషన్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. నేటి నుంచి (శనివారం) 8వ తేదీ వరకు ఆయా ఎంపీడీఓ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ఫెలిసిటీషన్ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. శిక్షణ కార్యక్రమాలకు హాజరుకావాలి గ్రామ పంచాయతీల మొదటి విడత ఎన్నికల నిర్వహణలో భాగంగా విధులు కేటాయించిన సిబ్బంది నేడు (శనివారం) జరగనున్న శిక్షణ కార్యక్రమాలకు తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్‌శర్మ సూచించారు. శిక్షణ తరగతులకు హాజరు విషయంలో మినహాయింపు ఉండదని, గైర్హాజరైన పక్షంలో ఎన్నికల నిబంధనలు, నియమావళి ప్రకారం తగు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటలకు కేటాయించిన శిక్షణా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో శిక్షణ చాలా కీలకమని సూచించారు. నిబంధనలకు లోబడి ఖర్చుపెట్టాలి సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు గరిష్ట ఖర్చు పరిమితులపై రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనలు పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ తెలిపారు. 5వేల జనాభా కలిగిన గ్రామాల్లో రూ.2.50లక్షలు, 5వేల లోపు జనాభా ఉన్న గ్రామ పంచాయతీ సర్పంచ్ రూ.1,50లక్షలు, వార్డుసభ్యులు 5 వేల మందికి పైగా జనాభా కలిగిన గ్రామ పంచాయతీ రూ.50వేలు, 5వేల లోపు జనాభా ఉన్న గ్రామ పంచాయతీ రూ.30వేల చొప్పున ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్‌శర్మ -
శుక్రవారం శ్రీ 5 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
పెద్ద లీడర్లు సర్పంచ్ పదవులు ఆశిస్తే రెండో క్యాడర్ లీడర్లంతా ఉపసర్పంచ్ రేసులో దూసుకుపోతున్నారు. కొంత మందికి రిజర్వేషన్లు లేకపోవడంతో ఉపసర్పంచ్ పీఠంపై కన్నేశారు. ఆయా వార్డుల్లో నిత్యం తిరుగుతూ ఓటర్లను కలుస్తున్నారు. గ్రామంలోని వార్డులన్నింటిలో తమ ప్యానల్ ఏర్పాటు చేస్తున్నారు. కొంత మందికి తమ స్వంతంగా డబ్బులు పెట్టి మరీ రంగంలోకి దించుతున్నారు. యూత్ రాజకీయాల్లోకి రావాలని, తమతోనే అభివృద్ధి సాధ్యమనే నినాదంలో ముందుకు సాగుతున్నారు. రోజూ ఓటర్లకు దావత్‌లు, నజరానాలు ప్రకటిస్తున్నారు. సర్పంచ్‌తో సమానంగా అభివృద్ధి చేస్తానంటూ మాటిస్తున్నారు. దీంతో రాత్రివేళల్లో ఓటర్ల ఇళ్ల వద్ద హడావుడి కనిపిస్తుంది. మొదటి విడతలో గణపురం, కొత్తపల్లిగోరి, రేగొండ, మొగుళ్లపల్లి మండలాల్లో 82 జీపీలకు 712 వార్డులు, 1,14,007 మంది ఓటర్లు ఉన్నారు. ఈనెల 11న ఎన్నికలు జరుగనున్నాయి. అదే రోజున ఎన్నిక ఫలితాలు వెల్లడిస్తారు. రెండో విడతలో చిట్యాల, టేకుమట్ల, భూపాలపల్లి, పలిమెల మండలాల్లో 85 జీపీలకు 694 వార్డులు, 88,562 ఓటర్లు ఉన్నారు. ఈనెల 14న ఎన్నికలు జరుగనున్నాయి. అదే రోజున ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నారు. మూడోవిడతలో మల్హర్, మహదేవపూర్, మహాముత్తారం, కాటారం మండలాల్లో 81 జీపీలకు 696 వార్డులు, 99,578 మంది ఓటర్లు ఉన్నారు. 17న ఎన్నికలు జరుగనున్నాయి. అదేరోజున ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నారు.మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్వగ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆశావహులు కొంత మంది మంత్రిని బుధవారం కలిశారు. దీంతో ఆయన సర్పంచ్, ఉపసర్పంచ్ స్థానాలన్నీ మనోళ్లు గెలువాలని ఆదేశాలు జారీ చేశారని కాంగ్రెస్‌పార్టీ నాయకులు చెబుతున్నారు. దీంతో ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులకు పెద్ద లీడర్లు సూచనలు చేశారు. అదే రూటులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కూడా గట్టి పోటీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రిజర్వేషన్లు కలిసిరాక, ఖర్చుకు భయపడి ఉపసర్పంచ్‌పై దృష్టి వార్డు సభ్యుల పోటీకి పెరిగిన డిమాండ్ రోజూ విందులు, నజరానాలతో ఓటర్లకు ఎర -
పోస్టల్ బ్యాలెట్లపై అవగాహన ఉండాలి
భూపాలపల్లి అర్బన్: పోస్టల్ బ్యాలెట్ల జారీపై సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. కలెక్టరేట్లోని మీటింగ్‌హాల్‌లో గురువారం అన్ని విభాగాల నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటి దశకు ఈ నెల 11వ తేదీన పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో విధులు నిర్వహించే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్లకు జారీ, పంపిణీ ప్రక్రియలో రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు పాటించాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ 38, మైక్రో అబ్జర్వర్లు 36మంది విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి ఇందిర పాల్గొన్నారు. రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి పోలింగ్ సిబ్బందికి రెండో విడత ర్యాండమైజేషన్ కార్యక్రమాన్ని సాధారణ ఎన్నికల పరిశీలకులు ఫణీంద్రరెడ్డి, కలెక్టర్ రాహుల్‌శర్మ కలెక్టరేట్లో నిర్వహించారు. కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీపీఓ శ్రీలత పాల్గొన్నారు. ఈసీ వీడియోకాన్ఫరెన్స్ అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, ఇతర అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్‌శర్మ -
డీటీడీఓగా నాగసాగర్
ఏటూరునాగారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా డీటీడీఓగా గొట్టిముక్కుల నాగసాగర్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలో హనుమకొండ పరిపాలన అధికారిగా పనిచేస్తున్న నాగసాగర్‌కు డీటీడీఓగా బాధ్యతలు అప్పగించారు. ఆయన నేడు (శుక్రవారం) విధుల్లో చేరనున్నారు. హత్యాయత్నం కేసులో ఐదేళ్లు జైలు కాటారం(మహాముత్తారం): మహాముత్తారం మండలంలో జరిగిన హత్యాయత్నం కేసులో డొంగిరి వంశీకి ఐదు సంవత్సరాల జైలు శిక్ష, రూ. 5వేలు జరిమానా విధిస్తూ భూపాలపల్లి జిల్లా అసిస్టెంట్ సెషన్ జడ్జి నాగరాజు గురువారం తీర్పు వెల్లడించారు. మహాముత్తారం ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మహాముత్తారం మండలం యామన్‌పల్లి గ్రామానికి చెందిన అట్టెం దేవేందర్‌పై ఏప్రిల్ 25, 2021న వెల్డింగ్ షాప్ వద్ద వంశీ ఇనుపరాడుతో దాడిచేశాడు. దేవేందర్ తీవ్రగాయాలపాలవగా ఆయన చెల్లి అట్టెం దేవిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎస్సై శ్రీనివాస్ హత్యాయత్నం కేసు నమోదు చేసి చార్జ్‌షీట్ దాఖలు చేశారు. విచారణలో భాగంగా గురువారం ప్రభుత్వం తరఫున అడిషనల్ పీపీ రఫిక్ వాదనలు వినిపించారు. సాక్షాధారాలు పరిశీలించగా నేరం రుజువు కావడంతో నిందితుడు వంశీకి ఐదు సంవత్సరాల జైలు శిక్ష, రూ.ఐదు వేలు జరిమానా విధించారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు నిందితుడిని చర్లపల్లి జైలుకు తరలించారు. నిందితుడికి శిక్ష పడటంలో ప్రతిభ కనబర్చిన అధికారులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. కుటుంబ నియంత్రణ ప్రతీ ఒక్కరి బాధ్యత భూపాలపల్లి అర్బన్: కుటుంబ నియంత్రణ ప్రతీ ఒక్కరి బాధ్యతని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ తెలిపారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నిర్వహిస్తున్న కుటుంబ నియంత్రణ చికిత్స శిబిరాన్ని గురువారం డీఎంహెచ్ఓ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పురుషులకు కోత కుట్టులేని కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తున్నామన్నారు. శిబిరాన్ని పురుషులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆపరేషన్ తర్వాత ఎలాంటి సమస్యలు ఉండవని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంసీహెచ్ ప్రోగ్రాం అధికారిని డాక్టర్ శ్రీదేవి, డెమో శ్రీదేవి, టెక్నికల్ సిబ్బంది పాల్గొన్నారు. హోంగార్డ్ రైజింగ్‌డే వేడుకలు భూపాలపల్లి అర్బన్: హోంగార్డ్ రైజింగ్ డే వేడుకలను జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ సంకీర్త్ హాజరై వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. హోంగార్డ్‌లకు వాలీబాల్ క్రీడలను ప్రారంభించారు. అనంతరం ఎస్పీ మాట్లాడారు. డ్రైవర్లు జాగ్రత్తలు పాటించాలి జిల్లాలో చలితీవ్రత పెరిగిన నేపథ్యంలో పొగమంచు కారణంగా రోడ్లపై వాహనాల డ్రైవర్లు జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ సంకీర్త్ ప్రకటనలో సూచించారు. చలికాలం రోడ్డు భద్రత ప్రతి డ్రైవర్ బాధ్యతన్నారు. పోలీసుల సూచనలు పాటిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చన్నారు. -
వరాలు కురిపిస్తారా..!?
సాక్షిప్రతినిధి, వరంగల్ : ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సుమారు 35 రోజుల తర్వాత మళ్లీ ఓరుగల్లులో పర్యటిస్తున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటకు శుక్రవారం తొలిసారి వస్తున్న ఆయన... ‘ప్రజాపాలన – ప్రజావిజయోత్సవాల’ సందర్భంగా పలు అభివృద్ధి పథకాలకు ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కావస్తున్న తరుణంలో నర్సంపేట సభలో ప్రసంగించనున్న ముఖ్యమంత్రి గతంలో ప్రకటించిన పథకాలు, నిధులపై స్పష్టత ఇస్తారని భావిస్తున్నారు. గ్రేటర్ వరంగల్‌తోపాటు ఉమ్మడి వరంగల్‌పై ఏం వరాలు కురిపిస్తారనే చర్చ జరుగుతోంది. అలాగే ‘మొంథా’ తుపాన్ నష్టం సందర్భంగా ఇళ్లు కూలిపోయిన వారికి ఒక్కొక్కరికి రూ.15వేలకు చెల్లించిన ప్రభుత్వం.. పంటల నష్టంపై నివేదికలు పంపినా చాలామందికి పరిహారం అందలేదు. వీటిపైన సీఎం ప్రకటన చేసే అవకాశం ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు. డీపీఆర్ స్థాయిలోనే ‘గ్రేటర్’పనులు.. ఉమ్మడి వరంగల్‌కు కావాలి నిధులు.. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వరంగల్‌పై ముఖ్యమంత్రి పలు హామీలు కురిపించారు. హైదరాబాద్‌తో పోటీ పడేలా అభివృద్ధి పనులు చేపడతామని పేర్కొన్నారు. ఈ మేరకు సుమారు దశల వారీగా రూ.6,500 కోట్ల వరకు నిధులు మంజూరు చేశారు. ఇందులో మామునూరు ఎయిర్‌పోర్టుకు రూ.150 కోట్ల వరకు నిధులు విడుదలై భూసేకరణ జరుగుతోంది. భద్రకాళి చెరువు పూడిక, మాఢ వీధులు నిర్మాణం తదితర పనులు నడుస్తున్నాయి. వరంగల్ నగరంలో సుమారు నాలుగు వేల కోట్ల విలువైన అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణ ప్రతిపాదనలు డీపీఆర్‌ల దశలో ఉన్నాయి. ఔటర్ రింగ్‌రోడ్డు, ఇన్నర్ రింగ్రోడ్డులతోపాటు పలు అభివద్ధి పథకాలకు నిధులు మంజూరైనా ఆ పనులు సాగడం లేదు. స్మార్ట్‌సిటీ పనులకు తోడు రాష్ట్రం వాటా కింద నిధులు మరిన్ని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌కు రావాల్సి ఉంది. అలాగే ఉమ్మడి వరంగల్‌లో మేడారం అభివృద్ధి, గిరిజన యూనివర్సిటీలకు మరిన్ని నిధులు అవసరం ఉందని ఇటీవల ప్రజాప్రతినిధులు సీఎంను కోరారు. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కూడా ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. ఆ మూడు పథకాలపై స్పష్టత... కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి ఇటీవల వరంగల్‌లో పర్యటించారు. కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ (ఆర్ఎంయూ), కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, మామునూరు ఎయిర్పోర్ట్ పనులను ఆయన ప్రత్యేకంగా పరిశీలించి సమీక్షించారు. ఈ సందర్భంగా 7 మెగా టెక్స్ టైల్ పార్కుల్లో ఒకటైన కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు పనులపై కేంద్రం మొత్తం రూ.200 కోట్లతో చేపట్టగా రూ.1,700 కోట్ల పెట్టుబడులు వస్తాయని, 12,500 మందికి ఉపాధి కలుగుతుందన్నారు. వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టు విషయంలో 696 ఎకరాల భూమి ఎయిర్ పోర్టు అధికారుల వద్ద ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం సుమారు 243 ఎకరాల భూమి సేకరించి ఎయిర్ పోర్టు అథారిటీకి అందజేస్తే త్వరగా నిర్మాణం ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందన్నారు. కాజీపేటలోని రైల్ మానుఫ్యాక్చరింగ్ యూనిట్ త్వరగా నిర్మాణం పూర్తి చే యాలని కేంద్రం భావిస్తుందన్నారు. ఈ మూడు పథకాల విషయంలో పలుమార్లు రాష్ట్ర, కేంద్ర ప్ర భుత్వాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు జరిగా యి. తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించి స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుందని పార్టీవర్గాల సమాచారం. ఉమ్మడి జిల్లా నేతలతో భేటీ కానున్న సీఎం? ప్రజాపాలన – ప్రజా విజయోత్సవ సభ’లో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం సభలో మాట్లాడనున్న ఆయన ఉమ్మడి వరంగల్‌పై నిధుల జల్లు కురిపిస్తారన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. అంతకు ముందు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉందని పార్టీకి చెందిన ముఖ్య నేత ఒకరు చెప్పారు. ఉమ్మడి జిల్లాలో తాజా పరిస్థితి ఏమిటి? పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఏం జరుగుతోంది.. ? అని మాట్లాడనున్నారు. మెజార్టీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు గెలిచేలా రేవంత్‌రెడ్డి మరోసారి మార్గదర్శనం చేయనున్నారని తెలిసింది.సాక్షి, వరంగల్/నర్సంపేట/నర్సంపేట రూరల్: నర్సంపేట నియోజకవర్గానికి తొలిసారి వస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఈ సభకు జనసమీకరణ చేయనున్నారు. ప్రజాపాలన–ప్రజా విజయోత్సవ సభలో భాగంగా నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి రూ.1,023 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు సీతక్క, కొండా సురేఖతో పాటు ఎమ్మెల్యేలు, నాయకులు భారీగా హాజరుకానున్నారు. పటిష్ట బందోబస్తు.. పట్టణంలోని సర్వాపురం శివారులో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల, జనరల్ ఆస్పత్రి ఎదుట సభా స్థలిని ఏర్పాటుచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి.. సభా స్థలికి వెళ్లేందుకు ప్రత్యేకంగా రోడ్డు నిర్మించారు. స్టేజీపై సుమారు 50 మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. నర్సంపేట డివిజన్లోని ఆరు మండలాలల నుంచి 50 వేల మందిని సభకు తరలించనున్నారు. ఇందుకోసం 135 ఆర్టీసీ బస్సులు, 60 ప్రైవేట్ బస్సులను సిద్ధం చేశా రు. ఏర్పాట్లను నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్, కలెక్టర్ డాక్టర్ సత్యశారద, ఆర్డీఓ ఉమారాణి, ఏసీపీ రవీందర్ పరిశీలించారు. హెలిపాడ్, సభా ప్రాంగణాన్ని బాంబ్ స్క్వాడ్ బృందాలు, జాగీలాలు తనిఖీ చేశాయి. గత పర్యటనలో రూ.6,500 కోట్లు మంజూరు చేసిన సీఎం.. మందకొడిగా పనులు.. ఇటీవల జిల్లాకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. మామునూరు, కేఎంటీపీ, ఆర్ఎంయూలపై వ్యాఖ్యలు ఈ మూడు ప్రాజెక్టులలో రాష్ట్రం పాత్రపై సీఎం స్పష్టత ఇచ్చే అవకాశం ఉమ్మడి వరంగల్ అభివృద్ధికి మరిన్ని నిధులపై ఆశలు -
పోలింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
కాటారం: ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశించారు. కాటారం మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ గురువారం సందర్శించారు. స్టేషన్లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు, పెండింగ్ కేసులు, రికార్డుల నిర్వహణపై ఆరా తీశారు. ఎన్నికల సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు, నిబంధనలపై పోలీస్ అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్పీ సూర్యనారాయణ, కాటారం సీఐ నాగార్జునరావు, ఎస్సై శ్రీనివాస్ ఉన్నారు. ఓటు హక్కును వినియోగించుకోవాలి మల్హర్: ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సంకర్త్ అన్నారు. కొయ్యూరులోని సర్పంచ్, వార్డుల సభ్యుల నామినేషన్ ప్రక్రియను ఎస్పీ సంకీర్త్ పరిశీలించారు. అనంతరం కొయ్యూరు పోలీసుస్టేషన్ సందర్శించి రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో డీఎస్పీ సూర్యనారాయణ, కొయ్యూరు ఎస్సై నరేశ్ పాల్గొన్నారు.ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
సైన్స్ పండుగ..
భూపాలపలి అర్బన్: విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు సైన్స్ ఎగ్జిబిషన్లు ఎంతగానో దోహదపడుతాయి. విద్యార్థుల ప్రతిభకు నాంది పలుకుతాయి. ఇందులో భాగంగా నేడు(శుక్రవారం), రేపు (శనివారం) జిల్లాలో స్థాయి సైన్స్(వైజ్ఞానిక ప్రదర్శన) ఎగ్జిబిషన్‌ను నిర్వహించనున్నారు. జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలోని శాంతినికేషన్ హైస్కూల్లో నిర్వహించే ఈ ఎగ్జిబిషన్లో జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, కేజీబీవీ, మోడల్, గురుకులాలు, ప్రైవేట్ పాఠశాలల నుంచి ఎగ్జిబిట్లను ప్రదర్శించాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాలు జారీచేశారు. సుమారు 275 ఎగ్జిబిట్లను ప్రదర్శించే అవకాశం ఉంది. జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రదర్శిన కనబర్చిన వారిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయనున్నారు. జిల్లా నుంచి 14 నమూనాలను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయనున్నారు. ఎగ్జిబిట్ల ప్రదర్శన కోసం ఆయా పాఠశాలల ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఏర్పాట్లు చేసుకున్నారు. 8, 9, 10వ తరగతులను సీనియర్ విభాగంగాను 6, 7 తరగతులను జూనియర్ విభాగంగాను ఎంపిక చేశారు. ప్రతి పాఠశాల నుంచి ఒక్కో అంశానికి ఒక ఎగ్జిబిట్ చొప్పున గరిష్టంగా జూనియర్, సీనియర్ విభాగాలను కలుపుకొని రెండు ఎగ్జిబిట్లను ప్రదర్శించవచ్చు. సబ్జెక్టును బోధించే ఉపాధ్యాయుడు ఒక టీఎల్ఎమ్ను ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది. నేడు, రేపు జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్ ఏర్పాటు పూర్తిచేసిన అధికారులు సుస్థిర వ్యవసాయం వ్యర్ధ పదార్థాల నిర్వహణ, ప్రత్యామ్నాయ మొక్కలు హరితశక్తి (పునరుత్పాదకశక్తి) అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు వినోద భరిత గణిత నమూనాలు ఆరోగ్యం, పరిశుభ్రత నీటి సంరక్షణ–నిర్వహణ ప్రదర్శించే ఎగ్జిబిట్‌ను చూపించాలి వెయ్యి పదాలకు మించని అబ్స్ట్రాక్ట్ ఉండాలి ఎగ్జిబిట్ పేరు, చార్టును ప్రదర్శించాలి ఎగ్జిబిట్లలో థర్మకోల్, ప్లాస్టిక్ వాడొద్దు -
సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు
భూపాలపల్లి రూరల్: షిర్డీ సాయిబాబా ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకోని బుధవారం పట్టణంలోని కారల్ మార్క్స్కాలనీలోని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్, పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్‌తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం నిర్వాహకులు ఎమ్మెల్యేకు శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులతో పాటు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు మహాన్నదానం నిర్వహించారు. -
నామినేషన్ కేంద్రాల పరిశీలన
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం అంబట్పల్లి క్లస్టర్లలోని నామినేషన్ కేంద్రాలను గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా జిల్లా ఎన్నికల అబ్జర్వర్ ఫణీంద్రరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. బుధవారం మొదటిరోజు నామినేషన్ కేంద్రంలో సర్పంచ్, వార్డు సభ్యులకు పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలు స్వీకరిస్తున్న తీరును రిటర్నింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంపీడీఓ రవీంద్రనాథ్, ఎంపీఓ భవాని, ఏపీఓ సునీత తదితరులు ఉన్నారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి పలిమెల: గ్రామ పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని ఎన్నికల పరిశీలకులు ఫణీంద్రరెడ్డి అధికారులను ఆదేశించారు. మండలకేంద్రంలో నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. ఆర్ ఓ, ఏఆర్ఓలతో నామినేషన్ పత్రాల పరిశీలన, రికా ర్డుల నిర్వహణ, నమోదు అభ్యర్థులకు అందించే మార్గదర్శకాలను అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీ ఓ సాయి పవన్, ఎస్సై రమేష్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
దిగుబడి కష్టమే..
భూపాలపల్లి రూరల్: జిల్లాలో మిర్చి పంట సాగు చేస్తున్న రైతుల పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. గతేడాది తెగుళ్ల బెడతతో దిగుబడి తగ్గి ఇబ్బందులు పడగా.. ఈసారి కూడా అదే పరిస్థితి నెలకొంది. పంటకు నల్లతామర, పండుతెగులు, ఆకుముడత, ఎండు తెగుళ్లు వ్యాప్తి చెందడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఎకరాకు ఇప్పటికే సుమారు రూ.1లక్ష పెట్టుబడి పెట్టిన రైతులు దిగుబడిపై దిగులు చెందుతున్నారు. జిల్లాలో గతేడాది 19,635 ఎకరాల్లో మిర్చి సాగు చేయగా తెగుళ్లు సోకి దిగుబడి రాక రైతులు నష్టపోయారు. దీంతో ఈ ఏడాది 9,521 ఎకరాల్లో సాగు చేసినట్లు అధికారుల లెక్కలు తెలుపుతున్నాయి. 2251 వండర్‌హాట్, తేజ 341531 రకాలను ఎక్కువగా సాగు చేశారు. మిర్చికి ప్రతీ ఏడాది ఆశించే నల్లతామరతోపాటు ఈ ఏడాది అదనంగా పండు తెగులు, ఆకుముడత, ఎండుతెగులు, వేరుకుళ్లు వ్యాప్తిచెందుతుంది. ఇప్పటికే జిల్లాలో రేగొండ, చిట్యాల, భూపాలపల్లి తదితర ప్రాంతాల్లో తెగుళ్ల బెడదను అధికారులు గుర్తించారు. దిగుబడిపై దిగులు.. జిల్లాలో బోర్లు, బావుల కింద నల్లరేగడి భూముల్లో వర్షాధారం కింద మిర్చి పంటను సాగు చేస్తున్నారు. ఎకరాకు సాధారణ దిగుబడి 15 నుంచి 18 కింటాళ్లు రావాల్సి ఉండగా తెగుళ్ల కారణంగా 10 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. ఇప్పుడు కూడా తెగుళ్లు పంటను ఆశించడంతో రైతులు దిగుబడి ఎంత వస్తుందని ఆందోళన చెందుతున్నారు. గతేడాది క్వింటా ధర రూ.11 వేలు పలికింది, ఈసారి జిల్లాలో మిర్చి సాగు సగానికి తగ్గింది. ధర ఎలా ఉంటుందోనని రైతులు మదనపడుతున్నారు. నివారణకు పురుగు మందుల పిచికారీ చేస్తున్న రైతులు పెరుగుతున్న పెట్టుబడి జిల్లాలో 9,521 ఎకరాల్లో మిర్చి సాగుఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు భూపాలపల్లి మండలం గండ్రపల్లికి చెందిన బట్టు శ్రీను. రెండెకరాల్లో దొడ్డు (నగరం) మిర్చి రకం సాగు చేశాడు. తోటకు ఆకుముడత నివారణకు పురుగుల మందు పిచికారీ చేస్తున్నాడు. అయినా నయం కావడం లేదు. పెట్టుబడి ఇప్పటికే ఎకరానికి రూ.1లక్షకు పైగా పెట్టాడు. తోటలోని మొక్కలు పండు పండుతున్నాయి. చివరికి తెగుళ్లతో పంట చేతికి వస్తుందో లేదోనని ఆందోళన చెందుతున్నాడు. ఇలా జిల్లా వ్యాప్తంగా మిర్చి పంట సాగు చేస్తున్న రైతుల పరిస్థితి ఇలాగే ఉంది. -
జాతరలో పనిచేయడం సేవగా భావించాలి
● ఎస్పీ సుధీర్ రాంనాఽథ్ కేకన్ ఎస్‌ఎస్‌తాడ్వాయి:మేడారం మహాజాతరలో పనిచేసే అధికారులంతా సేవగా భావించాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. మండల పరిధిలోని మేడారంలో జాతర విజయవంతంపై సమ్మక్క– సారలమ్మ పూజారులు, గిరిజన అభ్యుదయ సంఘం యువకులతో ఆయన బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అధికారులంతా నిబద్ధతతో పనిచేస్తేనే జాతర విజయవంతం అవుతుందన్నారు. గత పుణ్యం వల్లే ఈ జాతరలో తల్లులకు సేవ చేసే అదృష్టం మనందరికీ లభిస్తుందని వివరించారు. పూజారులు, యువత కోసం ప్రత్యేక పాసులు జారీ చేస్తామని, పోలీస్ శాఖ మధ్య సమన్వయ లోపం లేకుండా కృషి చేస్తామని సూచించారు. మేడారం పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి పనులు జోరుగా సాగుతుండడంతో భక్తుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. జాతరలో 10 వేల మందికి పైగా పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. అభివృద్ధి పనులపై కలెక్టర్ దివాకరతో సమీక్షించి పెండింగ్ పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని కోరారు. గత జాతర అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు లేకుండా మెరుగైన ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. జాతరకు వచ్చే ప్రతీ భక్తుడు సులభంగా దర్శనం చేసుకుని సురక్షితంగా తిరిగి ఇంటికి చేరేలా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. పూజారులు, యువత, మేడారం ప్రజలు, పోలీసులు అంతా ఒక కుటుంబంలా కలిసి పనిచేసి, ఆచార సంప్రదాయాలను పాటిస్తూ మహాజాతరను విజయవంతం చేయాలని ఎస్పీ కోరారు. ఈ సమావేశంలో డీఎస్పీ రవీందర్, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, పస్రా సీఐ దయాకర్, ఎస్ఎస్ తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో ఆస్పత్రి భవనాల నిర్మాణాల పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో పంచాయతీరాజ్, టీజీఈడబ్ల్యూఐడీసీ, ప్రణాళికశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆస్పత్రుల నిర్మాణాలకు స్థల సమస్య ఉంటే కాటారం సబ్ కలెక్టర్, భూపాలపల్లి ఆర్డీఓకు నివేదికలు అందించాలన్నారు. వైద్య కళాశాలల్లో రూ.75 లక్షల వ్యయంతో చేపడుతున్న అదనపు తరగతి గదుల భవనం త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తేవాలన్నారు. జిల్లా ప్రధాన ఆస్పత్రిలో సిబ్బంది సమయపాలన పాటించాలని, పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరం చేయాలని సూచించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కొనసాగుతున్న నిర్మాణ పనులను పూర్తి చేయాలని కలెక్టర్ రాహల్‌శర్మ ఆదేశించారు. సివిల్ పనులు, భవిత కేంద్రాలు నిర్వహణ, మరుగుదొడ్లు, చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడ్స్ సదుపాయాలు, కేజీబీవీలు, మోడల్ పాఠశాలల అభివృద్ధి పనులు, ఇతర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, సీపీఓ బాబురావు, టీజీఈడబ్ల్యూఐడీసీ ఈఈ అరుణ్‌కుమార్, పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి భూపాలపల్లి రూరల్: దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో మహిళా, శిశు, వయోవృద్ధుల దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల, ఎస్పీ సంకీర్త్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగుల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని రకాల సహకారాలు అందిస్తోందన్నారు. ఇటీవల అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించిన క్రీడాపోటీల్లో ప్రతిభ కనబర్చిన వారికి ప్రశంసపత్రాలు అందించారు. అలాగే జడ్జి అఖిల, ఎస్పీ సంకీర్త్ మాట్లాడుతూ దివ్యాంగులు అనేక రంగాల్లో ప్రతిభ కనబర్చి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మహిళా సంక్షేమ అధికారి మల్లేశ్వరి, డీఈఓ రాజేందర్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్, డీఆర్డీఓ బాలకృష్ణ, మెప్మా పీడీ రాజేశ్వరి, హెచ్ఎంఆర్టీ సంస్థ అధ్యక్షురాలు రజిత, ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ అధ్యక్షుడు అయిలి మారుతి, పారా ఒలంపిక్స్ జిల్లా అధ్యక్షుడు కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్‌శర్మ -
కొనుగోళ్లు పారదర్శకంగా నిర్వహించాలి
మల్హర్: రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ ఆదేశించారు. బుధవారం మండలంలో రుద్రారం, ఎడ్లపల్లి, కొయ్యూ రు, కొండంపేట్, వల్లెకుంట, తాడిచర్ల గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సెంటర్ నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ రైతుల నుంచి ఎఫ్ఏక్యూ గ్రేడ్ ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ట్యాగ్ చేసిన రైస్ మిల్లులకు తరలించాలన్నారు. అ లాగే కొనుగోలు కేంద్రాల్లో రోజువారీగా కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు, చెల్లింపుల పురోగతి ట్యాబ్‌లో నమోదు చేయాలన్నారు. రైతులకు అవసరమైన మౌలిక వసతులు తాగునీరు, నీడ, కొలతల యంత్రాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. డీసీఎస్ఓ కిరణ్‌కుమార్, తహసీ ల్దార్ రవికుమార్, మండల వ్యవసాయ అధికారి శ్రీజ, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. -
మూడో విడత నామినేషన్లు షురూ
కాటారం: గ్రామపంచాయతీ ఎన్నికలల్లో భాగంగా బుధవారం నుంచి మూడో విడత నామినేషన్లు ప్రారంభమయ్యాయి. కాటారం సబ్ డివిజన్ పరిధిలోని కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్ మండలాల్లో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగింది. మొదటి రోజు సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు అంతంత మాత్రంగానే నామినేషన్లు నమోదయ్యాయి. నాలుగు మండలాల్లో 81 సర్పంచ్ స్థానాలకు 106 నామినేషన్లు, 696 వార్డులకు 175 నామినేషన్లు దాఖలైనట్లు ఆయా మండలాల ఎంపీడీఓలు తెలిపారు. కాటారం మండలంలో 24 గ్రామపంచాయతీలకు సంబంధించి అధికారులు 9 క్లస్టర్లను ఏర్పాటు చేసి నామినేషన్లు స్వీకరించారు. మహదేవపూర్‌లో 18 గ్రామపంచాయతీలకు గాను ఐదు క్లస్టర్లు, మహాముత్తారం మండలంలోని 24 గ్రామపంచాయతీలకు గాను 6 క్లస్టర్లు, మల్హర్ మండలంలో 15 గ్రామపంచాయతీలకు గాను 5 క్లస్టర్లును అధికారులు ఏర్పాటు చేయగా అభ్యర్థులు నామినేషన్లు అందజేశారు. కాటారంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో రాత్రి 7గంటల వరకు నామినేషన్ ప్రక్రియ కొనసాగింది. సమయం ముగిసినప్పటికీ అభ్యర్థులు సమయానికి ముందుగానే కేంద్రంలోకి రావడంతో అధికారులు నామినేషన్ స్వీకరించారు. మహదేవపూర్ మండలం ఎలికేశ్వరం, అంబట్పల్లి క్లస్టర్ల నామినేషన్ కేంద్రాలను సాధారణ ఎన్నికల పరిశీలకులు ఫణీంద్రరెడ్డి, కాటారం మండలం కొత్తపల్లి నామినేషన్ కేంద్రాన్ని కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్ పరిశీలించారు. నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న తీరు, ఏర్పాట్లు, సౌకర్యాలపై ఆరా తీశారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అలర్లు జరగకుండా డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది బందోబస్తు చర్యలు నిర్వహించారు.మండలం జీపీ సర్పంచ్ వార్డులు నామినేషన్లు కాటారం 24 34 210 68 మహదేవపూర్ 18 20 162 41 మహాముత్తారం 24 22 192 19 మల్హర్ 15 30 128 47తొలిరోజు సర్పంచ్‌కు 106, వార్డు స్థానాలకు 175 నామినేషన్లు -
మూడున్నరేళ్లుగా నిధుల్లేవ్!
కాటారం: రైతులకు క్షేత్రస్థాయిలో వ్యవసాయశాఖ సేవలను అందించడం కోసం నిత్యం వ్యవసాయశాఖ అధికారులు గ్రామాల్లో అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం క్లస్టర్ల వారీగా నిర్మించిన రైతువేదికల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. 2021లో నిర్మించి ప్రారంభించిన రైతు వేదికల నిర్వహణ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి ఏడాది సక్రమంగా నిధులు మంజూరు చేసింది. మూడున్నర ఏళ్లుగా నిధుల మంజూరు లేకపోవడంతో రైతు వేదికల నిర్వహణ ఏఈఓలకు గుదిబండగా మారింది. సొంత ఖర్చులతో వెల్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది. క్షేత్రస్థాయిలో సేవలు అందేలా.. ఒక్కో క్లస్టర్‌కు ఒక్కో వ్యవసాయశాఖ విస్తరణాధికారిని నియమించి రైతువేదికల ద్వారా వ్యవసాయశాఖ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. రైతువేదికల్లో తాగునీరు, విద్యుత్ సరఫరా వసతుల ఏర్పాటుతో పాటు స్టేషనరీ, పారిశుద్ధ్యం నిర్వహణ, ప్రతీ మంగళవారం రైతు నేస్తం, రైతు శిక్షణ కార్యక్రమాల నిర్వహణ జరుగుతుంది. రైతువేదికల్లో సమావేశాలు నిర్వహించినప్పుడు హాజరైన రైతులు, ఇతరులకు టీ, బిస్కెట్లు అందజేయడంతో పాటు ఇతరత్రా వాటి కోసం కొంత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ నిర్వహణ ఖర్చుల కింద గత ప్రభుత్వం రూ.9వేలు అందిస్తామని ప్రకటించింది. నిలిచిన నిధులు.. జిల్లాలో 45 క్లస్టర్లలో 45 రైతువేదికలు ఉన్నాయి. ఇందులో డిసెంబర్ 2021 నుంచి ఏప్రిల్ 2022 వరకు ఐదు నెలల పాటు నెలకు రూ.9వేల చొప్పున గతంలో ప్రభుత్వం నిధులు అందజేసినట్లు అధికారులు చెబుతున్నారు. 2022 మే నుంచి ఇప్పటి వరకు నిధులు విడుదల చేయకపోవడంతో విస్తరణ అధికారులు నెల నెలా ఖర్చులు చెల్లించలేక అవస్థలు పడుతున్నారు. ఈ లెక్క చొప్పున ఒక్కో రైతు వేదికకు నెలకు రూ.9 వేల చొప్పున 42 నెలలకు గాను సుమారు రూ. 3,78 లక్షలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. అన్నింటి భారం ఏఈఓలపైనే.. రైతు వేదికల నిర్వహణకు ప్రభుత్వం దీర్ఘకాలికంగా నిధులు మంజూరు చేయకపోవడంతో ఏఈఓలపై భారం పడుతోంది. కనీసం మరుగుదొడ్ల నిర్వహణ, పారిశుద్ధ్యం, కరెంటు బిల్లుల చెల్లింపు, రైతులతో సమావేశాలు, ప్రభుత్వ చేపట్టిన రైతునేస్తం ముఖాముఖి కార్యక్రమాల నిర్వహణ సమయంలో టీ, బిస్కెట్లు, స్వీపర్ జీతం వంటి వాటికి నిధులు లేకపోవడంతో అన్నింటినీ తామే భరించాల్సి వస్తుందని ఏఈఓలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు వేదికల్లో ప్రజా ఉపయోగ కార్యక్రమాలు, వివిధ శాఖల సమావేశాల నిర్వహణ సైతం జరుగుతుంది. సమావేశం తర్వాత వేదికను శుభ్రం చేసుకోవాల్సిన బాధ్యత ఏఈఓలపై పడుతోంది. రైతువేదికల్లో అటెండర్ నుంచి ఏఈఓ వరకు అన్ని పనులు ఏఈఓలే చూసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. వర్షాలు, వరదలు, కోతుల బెడద కారణంగా జిల్లాలోని పలు రైతు వేదికల్లో మరమ్మతు పనులు నెలకొనగా నిధులు లేక అవి అలానే ఉండిపోతున్నాయి. జిల్లాలోని రైతు వేదికల నిర్వహణకు సంబంధించి ప్రస్తుతం మూడున్నర సంవత్సరాలుగా ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదు. నిర్వహణలో ఇబ్బందులు తలెత్తుతున్న విషయం వాస్తవమే. విద్యుత్ బిల్లుల చెల్లింపు, పారిశుద్ధ్య నిర్వహణ కష్టతరంగా ఉంది. ప్రభుత్వం నిధులు మంజురు చేస్తుందేమో చూడాలి. – బాబురావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఏఈఓలపై భారం తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ కోసం పాట్లు ఇబ్బందులు పడుతున్న వ్యవసాయశాఖ అధికారులు -
మంత్రుల ఆదేశాలు అమలయ్యేనా..?
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ గద్దెల వరుస క్రమంలో గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను పునర్నిర్మిస్తున్నారు. నూతన గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై ఈనెల 4వ తేదీన (గురువారం) పూజారులు ధ్వజస్తంభాల పునఃప్రతిష్ఠ పూజా కార్యక్రమాలను నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. గత నెల 28న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, ధనసరి సీతక్క గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం పనులను పరిశీలించి రెండు గద్దెలపై రాతి పిలర్ల ఏర్పాటు పనులన్నీ ఈనెల 3 వతేదీ కల్లా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కానీ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై స్టోన్స్ ఏర్పాట్ల పనులు ఇంకా పూర్తి కాలేదు. మంత్రుల ఆదేశాల మేరకు బుధవారం నాటికల్లా పూర్తయ్యేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు పరిశీలించినా పనులు అంతంతే.. ప్రతిరోజూ జిల్లాస్థాయి ఉన్నతాధికారి మేడారం జాతర అభివృద్ధి పనులను పరిశీలిస్తూ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నా పనుల్లో ఆశించిన పురోగతి కనిపించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. పనుల పురోగతి విషయంలో కాంట్రాక్టర్లు, సంబంధిత అధికారుల పనితీరులో మార్పు రావడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల పునర్నిర్మాణం పనులు పూర్తి కాకపోవడంపై ఆర్‌అండ్‌బీశాఖ అధికారులు హైరానా పడుతున్నారు. బుధవారంకల్లా రాతి పిలర్ల పనులు పూర్తి కాకపోతే మంత్రులనుంచి ఎలాంటి మాట వస్తుందోనన్న టెన్షన్ మొదలైనట్లు తెలుస్తోంది. రేపే గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై ధ్వజస్తంభాల పునఃప్రతిష్ఠ ముహూర్తం ఖరారు చేసిన పూజారులు మిగిలింది ఒక రోజే.. గద్దెల పనులు పూర్తయ్యేది అనుమానమేగోవిందరాజు, పగిడిద్దరాజులను పునర్నిర్మిస్తున్న గద్దెలపై పునఃప్రతిష్ఠ పూజా కార్యక్రమాలకు ఒక రోజు మాత్రమే మిలిగింది. రెండు గద్దెల చుట్టూ రెండు వరుసల స్టోన్స్ ఏర్పాటు చేశారు. ఆదివాసీ సంస్కృతీసంప్రదాయాలతో లిఖించిన రాతి పిల్లర్‌ను మంగళవారం పగిడిద్దరాజు గద్దైపె ఏర్పాటు చేయడం కనిపించింది. రెండు గద్దెల చుట్టూ రాతి పిలర్ల ఏర్పాటుతోపాటు డిజైన్‌కు సంబంధించిన స్టోన్స్‌లను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ పనులన్నీ బుధవారం ఒక రోజులోనే పూర్తి చేస్తారా అన్న అనుమానాలు పూజారులు వ్యక్తం చేస్తున్నారు. -
పారదర్శకంగా ఎన్నికల ఏర్పాట్లు
భూపాలపల్లి: గ్రామ పంచాయతీ ఎన్నికలకు మూడో విడత షెడ్యూల్ నేడు(బుధవారం) ప్రకటించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటికే మొదటి, రెండో విడత ఎన్నికల నిర్వహణకు నామినేషన్ ప్రక్రియ జరుగుతుందన్నారు. మొదటి విడతలో నేడు(బుధవారం) నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని, సాయంత్రం పోటీలో ఉండే అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. మంగళవారంతో రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ముగిసిందన్నారు. మొదటి దశకు ఈ నెల 11న, రెండో దశకు 14న, మూడో దశకు 17వ తేదీన పోలింగ్ నిర్వహిస్తామన్నారు. జిల్లావ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ, పోలింగ్, లెక్కింపు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి.. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆర్అండ్బీ శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో రెవెన్యూ, ఆర్అండ్బీ, ప్రణాళిక శాఖల అధికారులతో రోడ్డు నిర్మాణ పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మేడారం జాతరను దృష్టిలో ఉంచుకొని, జాతరకు అనుసంధానం చేసే రోడ్ల పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. ఎవరైనా కాంట్రాక్టర్ పనుల విషయంలో అలసత్వం వహిస్తే వారిని తొలగించి, వేరొక కాంట్రాక్టర్‌తో పనులు పూర్తి చేపించాలని తెలిపారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. నేడు మూడో విడత ఎన్నికల షెడ్యూల్ కలెక్టర్ రాహుల్ శర్మ -
రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక
మల్హర్: మండలంలోని ఎడ్లపల్లి మోడల్ స్కూల్ సీఈసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని ఎం ప్రవళిక రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై నట్లు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పూర్ణచందర్రావు తెలిపారు. హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నట్లు చెప్పారు. రాష్ట్రస్థాయికి ఎంపికవడం పట్ల ఉపాధ్యాయులు, నాయకులు ఆమెను అభినందించారు. మట్టి పరీక్షలను అడ్డుకున్న రైతులు కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని వీఐపీ ఘాటు నుంచి మెయిన్ ఘాటు వరకు నిర్మిస్తున్న పుష్కరఘాటు పనుల్లో భాగంగా మట్టి పరీక్షలను భూనిర్వాసిత రైతులు మంగళవారం అడ్డుకున్నారు. మట్టి పరీక్షలకు జేసీబీతో మట్టి తోడుతుండగా భూనిర్వాసిత రైతులు అడ్డుకున్నారు. నోటీసులు ఇవ్వకుండా తమ చేనుల్లోకి ఎలా వస్తారని ప్రశ్నించారు. దీంతో అధికారులు పనులు నిలిపివేశారు. పరిహారం చెల్లించకుండా పనులు చేస్తుండడంతో రైతులు ఆగ్రహించారు. రెవెన్యూ అధికారులు తమతో సంప్రదింపులు చేసిన తరువాతనే పనులు ప్రారంభించాలని తెలిపారు. ఏఆర్ సీఐని కలిసిన నాయకులు భూపాలపల్లి అర్బన్: జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఆర్ సీఐగా విధులు నిర్వర్తిస్తున్న కాశీరాంనాయక్ను ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. లంబాడీ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు అజ్మీర తిరుపతి, జిల్లా ఉపాధ్యక్షుడు బానోత్ రాకేష్, ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు అజ్మీర సమ్మయ్య, మాజీ జెడ్పీటీసీ జోగుల సమ్మయ్య, హరినాథ్, సురేష్, హరీశ్ కలిసి శాలువతో సత్కరించి జ్ఞాపికను అందించారు. ఎమ్మెల్యే స్వగ్రామంలో సర్పంచ్ ఏకగ్రీవం గణపురం: భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు స్వగ్రామం గణపురం మండలం బుద్ధారం సర్పంచ్ ఏకగ్రీవమైంది. విడిదినేని శ్రీలత కాంగ్రెస్ మద్దతుతో నామినేషన్ వేయగా.. కొంరాజు అమృత బీఆర్ఎస్ మద్దతుతో నామినేషన్ దాఖలు చేశారు. అమృత మంగళవారం నామినేషన్ విత్‌డ్రా చేసుకోవడంతో శ్రీలత ఏకగ్రీవం లాంఛనమైంది. అమృత విత్‌డ్రా చేసుకున్నట్లు అధికారులు నామినేషన్ కేంద్రం ఎదుట పత్రం అంటించారు. శ్రీలత ఏకగ్రీవ అయినట్లు అధికారికంగా బుధవారం అధికారులు ప్రకటించనున్నారు. బుద్ధారం గ్రామంలో 12 వార్డులు ఉండగా 9 వార్డులు ఏకగీవ్రమయ్యాయి. మిగతా 3 వార్డులు కూడా ఏకగ్రీవం చేసేందుకు స్థానిక నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని కేటీకే ఓసీ–2 ప్రాజెక్ట్ ప్రభావిత గ్రామాలకు నష్టపరిహారం చెల్లించాలని ఫక్కీర్‌గడ్డ గ్రామ బాధితులు, పలువురు భూనిర్వాసితులు మంగళవారం ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డికి వినతిపత్రం అందజేవారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓపెన్ కాస్ట్ ప్రభావిత గ్రామాలైన ఆకుదారువాడ, ఫక్కీర్‌గడ్డ, హనుమాన్‌నగర్, మదీనాకాలనీ, శాంతినగర్ కాలనీలకు చెందిన నివాసగృహాలు, వ్యవసాయ భూములు డేంజర్ జోన్ పరిధిలో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో భూ నిర్వాసితుల కమిటీ నాయకులు బుర్ర రమేష్, బుర్ర అనిల్, మనోజ్ గౌడ్, సెగ్గం శంకర్, బుర్ర రాజయ్య, ఆముదాల రమేష్, బాబు పాల్గొన్నారు. -
ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు
● అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ కాటారం: కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు చేపట్టాలని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ ఆదేశించారు. కాటారం మండలం కొత్తపల్లి, చింతకాని, రేగులగూడెం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం అదనపు కలెక్టర్ పరిశీలించారు. కేంద్రాల్లో ధాన్యం నిల్వ, కొనుగోలు ప్రక్రియ, రవాణా తదితర అంశాలపై ఆరా తీశారు. తూకం విధానం, తేమ కొలిచే పరికరాల పనితీరు, సౌకర్యాలు, గన్నీసంచుల వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, రైతులకు చెల్లింపులు సకాలంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ పారదర్శకంగా కొనుగోళ్లు సాగించాలని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ వెంట జిల్లా పౌరసరఫరాల అధికారి కిరణ్‌కుమార్, తహసీల్దార్ నాగరాజు, వ్యవసాయశాఖ అధికారులు ఉన్నారు. -
మహిళదే పైచేయి
● జనరల్ స్థానాల్లో సైతం పోటీ.. ● జిల్లాలో మహిళల ఓట్లే అధికంభూపాలపల్లి అర్బన్: జిల్లాలోని గ్రామపంచాయతీల్లో పోటీచేసే అభ్యర్థుల గెలుపు ఓటములతోపాటు ప్రాతినిధ్యం వహించడంలోనూ మహిళలే కీలకంగా మారనున్నారు. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో మహిళలకే అగ్రపీఠం దక్కనుంది. చాలా గ్రామపంచాయతీల్లో మహిళలు ప్రజాప్రతినిధులుగా మారి పాలించే అవకాశం కలగనుంది. మహిళలకు కేటాయించిన స్థానాలతోపాటు జనరల్ స్థానాల్లో సైతం వారు పోటీ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. జిల్లాలో 248 గ్రామ పంచాయతీలు, 2,102 వార్డు స్థానాలు ఉండగా 114 సర్పంచ్, 886 వార్డు స్థానాలను మహిళలకు కేటాయించారు. 50శాతం వరకు రిజర్వేషన్లు సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులకు 50శాతం వరకు మహిళలకు రిజర్వేషన్లు కల్పించారు. ఓట్ల పరంగానే కాకుండా సీట్లలో కూడా మహిళలే ముందు వరుసలో ఉన్నారు. జిల్లాలో భూపాలపల్లి నియోజకవర్గంతో పాటు మంథని నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. జిల్లాలో 3,02,147 ఓటర్లు ఉండగా అందులో మహిళలు 1,54,744.. పురుషులు 1,47,388 మంది ఉన్నారు. 7,356కు పైగా మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. స్థానిక ఎన్నికలే కాకుండా శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో సైతం మహిళలే గెలుపోటములు నిర్ణయించనున్నారు. జనరల్ స్థానాల్లో మహిళల పోటీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు కేటాయించిన స్థానాల్లో కాకుండా జనరల్ స్థానాల్లోసైతం పోటీ పడుతున్నారు. పురుషులపై మహిళలు పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. పలు మండలాల్లో ఇప్పటికే సర్పంచ్, వార్డు సభ్యులకు నామినేషన్లు దాఖలు చేయగా మిగితా మండలాల్లో కూడా పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. టేకుమట్ల మండలం వెలిశాల సర్పంచ్ స్థానం జనరల్‌కు కేటాయించగా నలుగురు పురుషులు పోటీ చేస్తుండగా ఒక మహిళ కూడా నామినేషన్ దాఖలు చేసింది. మహదేవపూర్ మండలం మద్దులపల్లిజనరల్ స్థానంలో బీసీ మహిళ నామినేషన్ వేయనున్నారు.జిల్లాలో పంచాయతీ స్థానాలు 248 జనరల్ స్థానాలు 134 మహిళలకు కేటాయించిన స్థానాలు 114 మొత్తం వార్డులు 2,102 మొత్తం జనరల్ స్థానాలు 1,216 మొత్తం మహిళా స్థానాలు 886 -
ఓటర్లు ఆలోచించండి!
ఎన్నికలపై విద్యార్థుల అవగాహనకాళేశ్వరం: ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో అమూల్యమైన ఓటుతో మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. గ్రామానికి అందుబాటులో ఉండే నాయకుడే మీకు మంచి చేస్తాడు. ఎన్నికల సమయంలో డబ్బులు, చీరలు, మద్యం ఇతర తైలాలు ఇచ్చే వారిని నమ్మొద్దని మహదేవపూర్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు మడక మధు ఆధ్వర్యంలో ఓటర్లకు మంగళవారం అవగాహన కల్పించారు.ఒక పూట వండుకు తినే నాటు కోడి రూ.వెయ్యికి తక్కువ కాదు. మన భావితరాల భవిష్యత్‌ను రూ.500కి, రూ.వెయ్యికి, రాత్రి తాగి పొద్దున్నే జీర్ణమైపోయే మద్యం చుక్కకో, ఓ చీరకో అమ్మేసుకుంటే అది మనం చచ్చిన కోడికన్నా, గాడిద కన్నా దిగజారడమే. అందుకే నిజాయిగల మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. – సాత్విక, విద్యార్థి, మహదేవపూర్ఓటు మన భవిష్యత్‌కు బంగారు తాళం చెవి. ఆ తాళం చెవిని నోటుకు అమ్మేయొద్దు. భవిష్యత్ తరాలకు బంగారు బాటలు వేయగలిగే సమర్థుడైన నాయకుడికే ఓటు వేయండి. ప్రచార సమయంలో రోజుకు నాలుగైదు సార్లు వచ్చి వంగివంగి దండాలు పెట్టే వారికి మీ ఓటు వద్దు. మీ ఊరు అభివృద్ధికి అహర్నిషలు కృషి చేసే వారికి ఓటేయండి. పదవి ఉన్నా, లేకున్నా ఎల్లప్పు డూ మీ పక్కనే ఉండి మీ ఆపదలో మీ సంతోషంలో తోడుగా నిలిచే నాయకుడిని ఎన్నుకోండి. – దినేష్, విద్యార్థి, మహదేవపూర్ప్రతీ ఓటరు మద్యం, చీరలు, డబ్బు వంటి ప్రలోబాలకు లొంగకుండా తన ఓటు హక్కును బాధ్యతతో వినియోగించాలి. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో విద్యార్థులతో ఓటర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాం. – మడక మధు, ఫిజికల్ సైన్స్ టీచర్, మహదేవపూర్ -
నియామకమెప్పుడో..
ఐదు నెలల క్రితం ‘ప్రీ ప్రైమరీ టీచర్ల’ నోటిఫికేషన్ విడుదలరాష్ట్రంలో రెండు నెలల క్రితం నుంచే ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించారు. ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన వెంటనే పలు జిల్లాల్లో విద్యాశాఖ అధికారులు టీచర్ల, ఆయాల నియమకాలు చేట్టారు. జిల్లాలో మాత్రం ఇప్పటి వరకు పూర్తి చేయలేదు. విద్యాశాఖ అధికారులు తయారుచేసిన టీచర్ల, ఆయాల ఎంపిక జాబితా పారదర్శకంగా లేకపోవడంతో దానిని సవరించాలని ఆదేశించినట్లు తెలిసింది. రెండో జాబితాను తయారు చేసి కలెక్టర్ వద్దకు మళ్లీ పంపించినట్లు సమాచారం. జిల్లాలో జాబితా ఎంపిక నిర్లక్ష్యంగా ఆలస్యం అవుతుందని పలువురు చర్చించుకుంటున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సైతం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.టీచర్లు, ఆయాల ఎంపికకు విద్యార్హత, స్థానికత, వయస్సు సంబంధిత అర్హతలు విధించారు. ఈ అర్హత గల వారిని ఎంపిక చేసినట్లు తెలిసింది. ఆయా పాఠశాలల్లో తాము సిఫారసు చేసిన వ్యక్తులను మాత్రమే నియమించాలని అధికార పార్టీకి చెందిన నాయకులు విద్యాశాఖ అధికారులను కోరినట్లు తెలిసింది. తాము సూచించిన వారికి, పార్టీకి చెందిన వారికే అవకాశాలు కల్పించాలని తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చినట్లు సమాచారం. భూపాలపల్లి అర్బన్: ప్రాథమిక విద్య, ప్రాథమిక పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పూర్వ ప్రాథమిక (ప్రీప్రైమరీ) తరగతులు ప్రారంభించేందుకు ఈ ఏడాది జూలై మాసంతో ఆదేశాలు జారీ చేస్తూ ఈ ఏడాది నుంచే అమల్లో తీసుకురావాలని మార్గదర్శకాలు జారీ చేసింది. అయినప్పటికీ జిల్లాలో నేటి వరకు ప్రభుత్వ ఆదేశాలు అమలు కావడం లేదు. ఇందుకు సంబంధించిన టీచర్లు, ఆయాలను నియమించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు కనిపిస్తోంది. విద్యా సంవత్సరంలో సగం నెలలు గడిచిపోయినా ఇంకెప్పుడు నియామకాలు చేపట్టి ప్రీప్రైమరీ ప్రారంభిస్తారని పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో 55 పాఠశాలలు ఎంపిక జిల్లాలోని 12 మండలాల పరిధిలో 55 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేసి ఈ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించేందుకు గుర్తించారు. చిన్నారులకు చదువు నేర్పించేందుకు ఒక్కో పాఠశాలకు ఒక్కో టీచర్‌ను, వారి అవసరాలు తీర్చేందుకు ఆయాను నియమించాల్సి ఉంటుంది. మొత్తం 55 మంది టీచర్లు, 55 ఆయాలను నియమించనున్నారు. జిల్లాలో 55 పాఠశాలల్లో 2025–26విద్యా సంవత్సరానికి టీచర్లు, ఆయాలను తాత్కాలిక పద్ధతిలో నియమించేందుకు జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి ఆగస్టు 22వ తేదీన దరఖాస్తుల స్వీకరణకు నోటీఫికేషన్ జారీచేసి 28వ తేదీలోపు దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలో వచ్చే ఏడాదిపై ప్రభావం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం ఆదేశాలు జిల్లాలో అమలు కాకపోవడంతో వచ్చే విద్యా సంవత్సరం జిల్లాలో విద్యార్థుల సంఖ్య పెంపుపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ లేకపోవడంతో తల్లిదండ్రులు నేరుగా అంగన్వాడీల నుంచి ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నారు. ఈ ఏడాది రెండు నెలల క్రితం ప్రీ ప్రైమరీ ప్రారంభించినట్లయితే ప్రతీ పాఠశాలలో కనీసం 10 నుంచి 20 మంది వరకు విద్యార్థులు చేరేవారని అంచనా వేస్తున్నారు. కలెక్టర్ వద్ద ఫైల్ పెండింగ్..! నాలుగు నెలల్లో ముగియనున్న విద్యా సంవత్సరం పట్టించుకోని ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు ఎవరి నిర్లక్ష్యం..!రాజకీయ జోక్యం.. -
ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు రావొద్దు
భూపాలపల్లి: ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సివిల్ సప్లయీస్, ట్రాన్స్పోర్ట్, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ, కోఆపరేటివ్, మార్కెటింగ్ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్ని కొనుగోలు కేంద్రాలలో నిర్వాహకులు అందుబాటులో ఉండడం లేదని, ట్యాబ్ ఎంట్రీ చేసి నివేదికలు అందించే విషయం ఆలస్యం అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, డీసీఎస్ఓ కిరణ్‌కుమార్, డీఎం రాములు, డీటీఓ సంధాని, మార్కెటింగ్ అధికారి ప్రవీణ్‌రెడ్డి పాల్గొన్నారు. సర్వేలో భాగస్వామ్యం కావాలి.. రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమ రంగంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం రైజింగ్ విజన్ –2047 డాక్యుమెంట్ రూపొందిస్తుందని, ఈ సర్వేలో ఉద్యోగులందరూ పాల్గొనాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందిస్తున్న ఈ విజన్ 2047 డాక్యుమెంటరీ తయారీలో ప్రతీ పౌరుడు భాగస్వామ్యం అయ్యేలా సిటిజన్ సర్వే చేపట్టారని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది నమోదుపై నివేదికలు అందజేయాలని ఆయా శాఖల జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పారదర్శకంగా నామినేషన్ ప్రక్రియ భూపాలపల్లి రూరల్: గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ రెండో విడత ప్రక్రియ పారదర్శకంగా, వేగంగా, అవాంతరాలు లేకుండా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. సోమవారం భూపాలపల్లి మండల పరిధిలోని కమలాపూర్, ఆముదాలపల్లి, రాంపూర్, గొల్లబుద్ధారం, లంబాడీ తండా (బి), దూదేకులపల్లిలలో నామినేషన్ కేంద్రాలను ఆకస్మికంగా పరిశీలించారు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ తరుణి ప్రసాద్, రిటర్నింగ్ అధికారులు సదానందం, అనిల్ కుమార్, ఎంపీఓ నాగరాజు పాల్గొన్నారు. దివ్యాంగుల క్రీడలు ప్రారంభం అవకాశాలు కల్పిస్తే దివ్యాంగులు అన్ని రంగాలలో రాణిస్తారని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి దివ్యాంగుల క్రీడాపోటీలను జిల్లాకేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టేడియంలో సోమవారం నిర్వహించారు. కలెక్టర్ రాహుల్ శర్మ ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి క్రీడలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి మల్లేశ్వరి, జిల్లా క్రీడా శాఖ అధికారి రఘు పాల్గొన్నారు కలెక్టర్ రాహుల్ శర్మ -
మహాజాతర మరో 56 రోజులే !
సాక్షిప్రతినిధి, వరంగల్: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరకు వేళవుతోంది. రెండేళ్లకోసారి ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారంలో జరిగే సమ్మక్క–సారలమ్మ జాతరకు కోటి మందికిపైగా భక్తులు తరలివస్తారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ కుంభమేళాను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని తలపెట్టింది. ఇందుకోసం సుమారు రూ.150 కోట్లు కేటాయించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా సెప్టెంబర్ 23న మేడారం సందర్శించి వివరాలు వెల్లడించారు. వంద రోజుల్లో పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఆశయాలు, ఆకాంక్షల మేరకు క్షేత్రస్థాయిలో పనులు వేగంగా జరగట్లేదు. ఈనెల నుంచే భక్తజనం.. 2026 జనవరి 28 నుంచి 31వ తూదీ వరకు జరిగే మహాజాతరకు సమయం మరో 56 రోజులే మిగిలి ఉంది. ఈనెల రెండో వారం నుంచే భక్తుల తాకిడి పెరుగుతోంది. ప్రతీ జాతరకు కనీసం నాలుగైదు నెలల ముందు నుంచి నిర్వహణ ఏర్పాట్లు, అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. ఈసారి జాతర కోసం ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖకు రూ. 51.30 కోట్లు, రహదారులు, భవనాల శాఖకు రూ.9.95 కోట్లు, నీటిపారుదల శాఖకు రూ.5.90 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖకు రూ.8.57 కోట్లు.. ఇలా సుమారు 21 శాఖల ద్వారా మొత్తం రూ.150 కోట్ల నిధులతో పనులు చేపట్టారు. వంద రోజుల్లోనే పనులు పూర్తి చేయాలని సీఎం ఉన్నతాధికారులకు పదే పదే సూచించారు. ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వారంలో రెండు రోజులు ఈ పనులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇప్పటికీ మేడారంలో మూడు పర్యాయాలు, హైదరాబాద్‌లో రెండుసార్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా మంత్రులు, అధికారులతో సమీక్షించారు. ప్రధానంగా రహదారుల విస్తరణ, సీసీ, బీటీ రోడ్ల నిర్మాణం, క్యూలైన్లు సహా పలు ముఖ్యమైన పనులు మాత్రం ఇంకా ముగింపు దశకు చేరుకోలేదు. పనుల వేగవంతానికి ఆదేశం.. జాతర సమయం సమీపిస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, తన సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో పాటు ఉన్నతాధికారులతో ఆయన జాతర పనులు, ఏర్పాట్లపై ఆరా తీశారు. కొన్ని ప్రధాన పనుల ఆలస్యంపై అధికారులపై సీరియస్ అయినట్లు తెలిసింది. కాగా, మేడారంలో పురోగతిలో ఉన్న పనులపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ‘గద్దెల దగ్గరలో ఉన్న చెట్లను తొలగించవద్దు. నాణ్యతలో ఏమాత్రం రాజీ పడొద్దు. నిర్మాణంలో విమర్శలకు తావివ్వొద్దు. గద్దెల సమీపంలో నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలి’ అని సీఎం అధికారులకు సూచించారు. గద్దెల దగ్గర నాలుగు వైపులా ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసి, గ్రాండ్ లుక్ వచ్చేలా లైటింగ్ ఏర్పాటు చేయాలని, గుడి చుట్టూ పచ్చదనం పెంపొందించాలని ఆదేశించారు. భక్తుల రద్దీ పెరగనున్నందున ఆలస్యం చేయకుండా పనులు పూర్తి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించినట్లు తెలిసింది. ఇప్పటికై నా పనుల్లో వేగం పెరుగుతుందన్న చర్చ అన్ని వర్గాల్లో జరుగుతోంది. సుమారు రూ.150 కోట్లతో కొసాగుతున్న పనులు సెప్టెంబర్ 23న సీఎం సందర్శన.. వంద రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశం హైదరాబాద్‌లో అత్యవసర సమీక్ష.. పనుల తీరుపై సీఎం సీరియస్ -
5, 6 తేదీల్లో జిల్లా స్థాయి సైన్స్‌ఫెయిర్
భూపాలపల్లి అర్బన్: ఈ నెల 5, 6వ తేదీల్లో నిర్వహించనున్న జిల్లా స్థాయి సైన్స్‌ఫెయిర్‌ను విజయవంతం చేయాలని జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ కోరారు. శాంతినికేతన్ పాఠశాలలో రెండు రోజుల పాటు నిర్వహించే ఇన్స్పైర్ నిర్వహణకు సోమవారం పాఠశాల ఆవరణలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. ఇన్స్పైర్ ప్రాజెక్ట్, ఎగ్జిబిట్స్ ప్రదర్శించాలన్నారు. మొత్తం ఏడు అంశాలలో జూనియర్, సీనియర్ విభాగాల్లో నమోదు చేయాలన్నారు. ఆయా కమిటీల కన్వీనర్లు, కో కన్వీనర్లు సమర్థవంతంగా పనిచేసి విజయవంతం చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా సైన్స్ అధికారి బర్ల స్వామి, ఏఎంఓ పింగిలి విజయపాల్‌రెడ్డి, డీసీఈబీ కార్యదర్శి చంద్రశేఖర్, ఎంఈఓ దేవానాయక్, వివిధ మండలాల ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
68 శాతం బొగ్గు ఉత్పత్తి
● ఏరియా జీఎం రాజేశ్వర్‌రెడ్డి భూపాలపల్లి అర్బన్: నవంబర్ మాసంలో ఏరియాలో 68శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు ఏరియా జీఎం రాజేశ్వర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, మట్టి వెలికితీత, రవాణా వివరాలు వెల్లడించారు. 2025–26 ఆర్థిక సంవత్సరం నవంబర్ మాసానికి సంబంధించి నిర్దేశించిన బొగ్గు ఉత్పతి లక్ష్యాలలో 4.45లక్షల టన్నులకు 3.02లక్షల టన్నులు సాధించినట్లు చెప్పారు. ఓబీ వెలికితీతలో 51.50 క్యుబిక్ మీటర్లగాను 37.69 క్యూబిక్ మీటర్లతో 73శాతం ఓవర్ బర్దన్ వెలికి తీసినట్లు చెప్పారు. ఏరియాలో ఈ నెలలో కొత్త జిమ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో ఏరియాకు కేటాయించిన ఉత్పత్తి లక్ష్యాలు సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వార్షిక లక్ష్యాలు సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని తెలిపారు. రెండో రోజు 76 నామినేషన్లు భూపాలపల్లి రూరల్: గ్రామపంచాయతీ రెండో విడత నామినేషన్ల ప్రక్రియలో భూపాలపల్లి మండలంలో రెండో రోజు సోమవారం సర్పంచ్‌లకు 36, వార్డు మెంబర్లకు 40 నామినేషన్లు దాఖలైనట్లు భూపాలపల్లి ఎంపీడీఓ తరుణి ప్రసాద్ తెలిపారు. నేడు (మంగళవారం) నామినేషన్లకు ఆఖరిరోజు కావడంతో ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. -
ధాన్యాన్ని మిల్లుకు తరలించాలి
● అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ చిట్యాల: తేమ శాతం తక్కువ వచ్చిన వరి ధాన్యాన్ని త్వరితగతిన మిల్లులకు తరలించాలని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ అన్నారు. సోమవారం మండలకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ ధాన్యం కొనుగోలు చేయాలని కొనుగోలు కేంద్రం ఇన్‌చార్జ్‌తో చెప్పారు. వ్యవసాయ శాఖ అధికారులు ప్రతీ రోజు కొనుగోలు కేంద్రాలను సందర్శించి కొనుగోలు కార్యకలాపాలను పర్యవేక్షించి తగు సూచనలు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి–సత్యం, డీసీఎస్ఓ కిరణ్‌కుమార్, తహసీల్దార్ షేక్ఇమామ్బాబా, సివిల్ సప్లయీస్ ఆర్ఐ రాజు, వెలుగు సీసీ రమాదేవి, ఏఈఓ సన్నీ, సందీప్ పాల్గొన్నారు. అన్‌లోడింగ్‌ను వేగవంతం చేయాలి మండలంలోని శాంతినగర్ శివారులోని శ్రీ వేంకటేశ్వర పారా బాయిల్ రైస్‌మిల్లును అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ సందర్శించారు. మిల్లులో ధాన్యం అన్లోడింగ్ వేగవంతం చేయాలని అన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రం పరిశీలిన టేకుమట్ల: మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ పరిశీలించారు. అనంతరం మాట్లాడారు. ఆయన వెంట డీసీఎస్ఓ కిరణ్‌కుమార్, తహసీల్దార్ విజయలక్ష్మి, ఆర్ఐ సంతోష్‌కుమార్, సివిల్ సప్లయీస్ ఆర్ఐ ఉన్నారు. -
ఎయిడ్స్ రహిత జిల్లాగా మారుద్దాం
● అడిషనల్ సివిల్ జూనియర్ జడ్జి అఖిల భూపాలపల్లి అర్బన్: జిల్లాను ఎయిడ్స్ రహిత జిల్లాగా మారుద్దామని అడిషనల్ సివిల్ జూనియర్ జడ్జి జి అఖిల, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ చల్లా మధుసూదన్ అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పట్టణంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని జడ్జి అఖిల, డీఎంహెచ్ఓ డాక్టర్ మధుసూదన్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్హాల్లో జిల్లా ఎయిడ్స్, లెప్రసీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఉమాదేవి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో జడ్జి అఖిల మాట్లాడారు. ఎయిడ్స్ నిర్ధారణ రోగులకు ఏఆర్టీ మందులతో పాటు వారి జీవన విధానంలో మార్పు తీసుకొని రావడానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. డీఎంహెచ్ఓ మధుసూదన్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా అన్ని సబ్ సెంటర్లతో పాటు గ్రామాల్లో కూడా హెచ్ఐవీ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. త్వరలో భూపాలపల్లి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఐసీటీసీ, ఏఆర్టీ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ ఉమాదేవి, జిల్లా లీగల్ ఎయిడ్ సర్వీస్ అథారిటీ సెక్రెటరీ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ఉదయ్‌కుమార్, దిశ డీఎండీఓ సాయికుమార్, ఐసీటీసీ కౌన్సిలర్ గాదె రమేష్, మారి స్వచ్ఛంద సంస్థ ప్రోగ్రాం మేనేజర్ సదానందం, ట్రాన్స్ జెండర్ జిల్లా టీం లీడర్ గౌరి పాల్గొన్నారు. -
నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ చిట్యాల: మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ కోరారు. ఆదివారం మండలంలోని చల్లగరిగ, చిట్యాల గ్రామ పంచాయతీలలో ఏర్పాటుచేసి నామినేషన్ కేంద్రాలను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించబడిన ప్రాంతాలలో భద్రతా ఏర్పాట్లు, బందోబస్తు విధులు, సిబ్బంది నిర్వహణను సమీక్షించి పలు సూచనలు అందించారు. పోలీస్‌శాఖ నుంచి ప్రజలకు అవసరమైన సేవలు అందిస్తామన్నారు. నిర్భయంగా, భయబ్రాంతులకు లోను కాకుండా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఆయన వెంట సీఐ మల్లేష్, ఎస్సై శ్రావన్‌కుమార్, ఈశ్వరయ్య, పోలీస్ సిబ్బంది ఉన్నారు. -
స్కూల్ వ్యాన్ డ్రైవర్ల వేతనాలు పెంచాలి
భూపాలపల్లి అర్బన్: స్కూల్ వ్యాన్ డ్రైవర్లు, క్లీనర్ల వేతనాలు పెంచాలని భూపాలపల్లి పట్టణ అఖిల పక్ష పార్టీల నాయకులు, విద్యార్థి యువజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం ది కాకతీయ ప్రైవేట్ స్కూల్స్ వ్యాన్ డ్రైవర్స్, క్లీనర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష పార్టీల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సీపీఐ, కాంగ్రెస్, బీజేపీ, డీఎస్పీ, టీఆర్పీ, ఏఐటీయూసీ, విద్యార్థి యువజన సంఘాలు ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యూఐ, ఏఐవైఎఫ్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయ పార్టీలు, సంఘాల నాయకులు సోత్కు ప్రవీణ్‌కుమార్, రాజేందర్, గీసా సంపత్, సతీష్, రవీందర్, రవిపటేల్, వేముల శ్రీకాంత్, నేరెళ్ల జోసెఫ్, సురేష్ మాట్లాడారు. ది కాకతీయ స్కూల్ వ్యాన్ డ్రైవర్ క్లీనర్ అసోసియేషన్ మూడు డిమాండ్లతో ఒక రోజు సమ్మె చేపట్టినట్లు తెలిపారు. డ్రైవర్ వేతనం నెలకు రూ.20వేలు, క్లీనర్ వేతనం రూ.10వేలు, 12 నెలల జీతం చెల్లించాలని, ఇద్దరు పిల్లలకు ఉచిత విద్యను అందించాలని కోరారు. ఈ డిమాండ్లతో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం (ట్రస్మా) దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఏ ఒక్క డిమాండ్ కూడా పరిష్కారం కాలేదన్నారు. ప్రైవేట్ పాఠశాలలు ప్రతి సంవత్సరం స్కూల్ ఫీజులు పెంచుతూ యాజమాన్యం లాభాల్లో ఉన్నప్పటికీ డ్రైవర్లకు, క్లీనర్లకు జీతాలు పెంచకపోవడం చాలా దారుణమన్నారు. సమ్మెకు అన్ని రాజకీయ, విద్యార్థి, యువజన సంఘాల మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో ది కాకతీయ ప్రైవేట్ స్కూల్ వ్యాన్స్, క్లీనర్ అసోసియేషన్ నాయకులు నాతరి ప్రదీప్, పువ్వాడ రాంబాబు, జైద నర్సింగ్, మీసాల శ్రీనివాస్, జైద మధు, బొల్లపల్లి అశోక్, ఓరిగంటి కిరణ్, ఎండీ షఫీ, నేలి మొగిలి, దుబ్బాక సందీప్ పాల్గొన్నారు. ఒక రోజు సమ్మె -
బుజ్జగింపులు
నామినేషన్ ఉపసంహరించుకునేలా ప్రయత్నాలుభూపాలపల్లి అర్బన్: మొదటి దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం శనివారంతో ముగిసింది. మొదటి రోజు తక్కువగా నామినేషన్లు దాఖలు అయినా.. తర్వాతి రెండు రోజుల్లో పెద్ద ఎత్తున అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బరిలో ఎవరుంటారు.. ఎవరు విత్‌డ్రా చేసుకుంటారనేది ఈనెల 3న తేలనుంది. నిన్న మొన్నటి వరకు బరిలో ఉంటామనుకున్న వారు చివరికి పోటీ నుంచి తప్పుకుంటున్నారు. దీంతో కొత్త మొహాలు తెరపైకి వచ్చాయి. పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు తక్కువగా ఉండటంతో అభ్యర్థులు ప్రతీ ఓటును కీలకంగా భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రధాన పార్టీల నుంచి మద్దతు పొందుతున్న అభ్యర్థులకు పోటీలో ఉన్న మిగతా వారు ఆడ్డంకిగా మారబోతున్నారు. దీంతో బరిలో నిలిచిన వ్యక్తులతో కొందరు బేరసారాలకు తెరలేపుతున్నారు. పెద్ద గ్రామపంచాయతీలు, మండల కేంద్రాలుగా ఉన్న గ్రామపంచాయతీలలో గెలుపును పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో నడిచిన ధన ప్రభావం నుంచి ఇంకా పల్లెలు బయటపడకపోవడంతో బలంగా ఉన్న అభ్యర్థులు ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడటం లేదు. పెద్ద గ్రామపంచాయతీలే టార్గెట్ జిల్లాలో మొదటివిడతలో నాలుగు మండలాలు 82 గ్రామపంచాయతీలు, 712 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యంగా మేజర్ గ్రామపంచాయతీలు, మండల కేంద్రాలుగా ఉన్న పంచాయతీల్లో గెలుపొందాలని పలు పార్టీల మద్దతు ఉన్న అభ్యర్థులు భావిస్తున్నారు. ఈ పంచాయతీల్లో గెలుపొందేందుకు అభ్యర్థులు ఎంతైనా ఖర్చు పెడదాం అనే ధోరణిలో ఉన్నట్లు సమాచారం. పెద్ద పంచాయతీల్లో తమ ఉనికి నిలుపుకోవాలని ప్రధాన పార్టీలన్నీ భావిస్తున్నాయి. తమ పార్టీ మద్దతు ఇస్తున్న వ్యక్తిని గెలిపించుకోవడానికి కష్టపడుతున్నాయి. ముఖ్యంగా గణపురం, చెల్పూర్, రేగొండ, కొత్తపల్లిగోరి, చిన్నకొడెపాక, మొగుళ్లపల్లి, రంగాపూర్, కొడవటంచ పంచాయతీల్లో గెలుపు కోసం ఎంతైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు మాట్లాడుకుంటున్నారు. మొదలైన బుజ్జగింపులు చాలా రోజుల తర్వాత తమ వర్గానికి రిజర్వేషన్ రావడంతో చాలా మంది అవకాశాన్ని వదులుకునేందుకు ఇష్టపడటం లేదు. ఎంత ఖర్చయినా గెలవాలనే ఉద్దేశంతో ఉన్నారు. దీంతో గ్రామాల్లో ప్రలోబాలకు, బుజ్జగింపులకు తెరలేపారు. ఒకే పార్టీలో ఉంటున్న వారు ఇద్దరిద్దరు చొప్పున నామినేషన్లు వేయడంతో వారిని బుజ్జగించే ప్రయత్నంలో ఆయా పార్టీల నాయకులు ఉంటున్నారు. ముఖ్యంగా ఒకే వర్గం నుంచి ఇద్దరు బరిలో ఉంటే తమ వర్గపు ఓట్లు చీలకుండా మరొకరు ఉపసంహరించుకునేందుకు పావులు కదుపుతున్నారు. కొద్దిగా అంగబలం, అర్థబలం ఉన్న వారు ఎంతో కొంత ముట్టజెప్పి నామినేషన్ విత్‌డ్రా చేయించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. మరోవైపు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో తక్కువ ఓటర్లు ఉంటారు కాబట్టి ప్రతీ ఓటు కూడా కీలకమని అభ్యర్థులు భావిస్తున్నారు. దీనికి అనుగుణంగా గ్రామంలోని పెద్దమనుషుల, కులపెద్దల మద్దతు కోరుతున్నారు. నిజానికి ఎన్నికల రిజర్వేషన్లు ఖరారయినప్పటి నుంచే పోటీలో ఉండే అభ్యర్థులు విందులు ఏర్పాట్లు చేసి ఓటు పట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలల్లో విపరీతంగా ఖర్చయిన మాదిరిగానే గ్రామపంచాయతీల్లో ఖర్చు కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో కూడా పెద్దఎత్తున ఖర్చు తప్పకపోవచ్చని చాలా మంది పోటీలో ఉన్న వారు భావిస్తున్నారు. ఇప్పటికై తే నామినేషన్ దాఖలు చేసినా.. మూడో తేదీ తర్వాత ఎంత మంది ఉంటారో తెలియనుంది. కొన్ని చోట్ల ఖర్చులకు భయపడి అవగాహనతో ఏకగ్రీవం వైపు ఆలోచిస్తున్నారు. అధికార పక్షానికి సర్పంచ్, ప్రతిపక్షానికి ఉపసర్పంచ్ అన్న రీతిలో ఏకగ్రీవం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సర్పంచ్ కాకపోయినా కనీసం ఉపసర్పంచ్ పదవైనా దక్కించుకోవాలని వార్డు మెంబర్లకు గాలం వేస్తున్నారు. పూర్తయిన మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ 3న తేలనున్న అభ్యర్థులు ఖర్చుకు జడుస్తున్న క్యాండిడేట్స్ -
కోలుకునేదెప్పుడో..?
కౌలు రైతులను గుర్తించని ప్రభుత్వాలుమల్హర్ మండలంలో కౌలు రైతు సాగు చేసిన మిర్చి పంట● అనేక పథకాలకు దూరం ● ప్రతీ సీజన్లో నష్టాలపాలు ● అప్పులతో సాగుతున్న వ్యవసాయం కాటారం: సొంత భూమి లేక, వ్యవసాయం తప్ప మరోదారి లేక ఇతరుల భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్న కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. వాతావరణ పరిస్థితులు, ప్రభుత్వ విధానాలతో దీర్ఘకాలంగా కన్నీళ్లే మిగులుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కౌలు రైతులపై దృష్టి సారించడం లేదు. దీంతో కౌలు రైతులు ప్రతీ ఏటా ఆర్థికంగా నష్టపోతూ కోలుకోలేని స్థితికి చేరుతున్నారు. కనీసం కౌలు రైతులు అధికారిక గుర్తింపునకు నోచుకోకపోవడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అన్ని పథకాలకు దూరమే.. కౌలు రైతులకు అధికారిక గుర్తింపు లేకపోవడంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ఏ పథకానికి కూడా వీరు అర్హత పొందలేకపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాలకు సైతం వీరు దూరం కావాల్సి వస్తుంది. దీనికి తోడు బ్యాంకు రుణాలు కూడా పొందలేక పోవడంతో వడ్డీ వ్యాపారుల వద్ద అడ్డగోలు వడ్డీకి తెచ్చుకొని కౌలు రైతులు చితికిపోతున్నారు. పంట అమ్ముకోవాలన్నా తిప్పలే.. కౌలు రైతులు ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలను చివరకు అమ్ముకోవడానికి కూడా అష్టకష్టాలు పడుతున్నారు. ప్రస్తుతం పత్తి, వరి పంటలను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ద్వారా పత్తి సీసీఐ కేంద్రాలు, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. పంట నమోదు ప్రకారం గతంలో ఏ భూ యజమాని ఎంత మేర ఏఏ పంటలు సాగు చేశారనేది వ్యవసాయశాఖ అధికారులు ఆన్లైన్లో నమోదు చేశారు. భూ యజమాని పేరు మాత్రమే ఆన్లైన్లో నిక్షిప్తమై ఉంటుంది తప్ప క్షేత్ర స్థాయిలో పంట సాగు చేసే కౌలు రైతు పేరు ఎక్కడ కూడా నమోదు లేదు. దీంతో పంట విక్రయించే సమయంలో కౌలు రైతు భూమి కౌలుకు ఇచ్చిన యజమానిపై ఆధారపడాల్సి వస్తుంది. పంటను భూ యజమాని పేరు మీదనో లేక ఆయన భూ రికార్డుల ఆధారంగా వ్యవసాయశాఖ ద్వారా కౌలుపత్రం తీసుకొని కొనుగోలు కేంద్రాల్లో సమర్పించి అమ్ముకోవాల్సి వస్తుంది. పంట విక్రయించే విషయంలో కౌలు రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేవు..కౌలు రైతుల గుర్తింపు కార్డుల జారీకి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలూ లేవు. వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు అన్ని రకాల ప్రోత్సాహం అందిస్తాం. వ్యవసాయశాఖ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవలను రైతులు వినియోగించుకోవాలి. – బాబురావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారికౌలు రైతులను గుర్తించాలి..ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించి వ్యవసాయం ప్రోత్సహించాలి. కౌలు రైతులకు ప్రత్యేక గుర్తింపుకార్డులు ఇవ్వాలి. వర్షాభావ పరిస్థితుల కారణంగా పంట నష్టపోయిన కౌలు రైతులకు పరిహారం అందించాలి. రైతు భరోసా అందించి ఆదుకోవాలి. – సదయ్య, కౌలు రైతు, అంకుషాపూర్●అమలుకు నోచుకోని ప్రభుత్వ హామీ..జిల్లాలో సుమారు 25వేల మందికి పైగానే కౌలు రైతులు ఉన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులు కౌలు రైతులను గుర్తిస్తామని హామీ ఇచ్చారు. రైతుల మాదిరిగానే ప్రాధాన్యత కల్పిస్తామని పథకాలు అందేలా ప్రత్యేక గుర్తింపు కల్పిస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు నెరవేరలేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు అందజేసి బ్యాంకు రుణాలు అందజేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్తో పాటు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం వీరిపై ఏ మాత్రం కరుణ చూపడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. బ్యాంకు రుణాలు అందక కౌలు రైతులు పెట్టుబడి కోసం ప్రైవేట్‌గా అప్పలు తెచ్చి వడ్డీలు కట్టలేక ఆర్థికంగా నష్టపోతున్నారు. కౌలు రైతులకు వ్యవసాయం తప్ప మరో దారి లేక పంట సాగులో నష్టాలు వచ్చినప్పటికీ కౌలు చెల్లించి వ్యవసాయన్నే కొనసాగిస్తున్నారు. -
రాష్ట్ర స్థాయికి ఎంపిక
కాళేశ్వరం: మహదేవపూర్ మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన వెలగందుల తరుణి 6వ తరగతి, వెలగందుల తణ్మయి 8వ తరగతి విద్యార్థులు వీవీఎం (విద్యార్థి విజ్ఞాన్ మంథన్) పరీక్షకు రాష్ట్రస్థాయి ఎంపికై నట్లు జిల్లా వీవీఎం కోఆర్డినేటర్, పాఠశాల ఫిజికల్ సైన్స్ టీచర్ మడక మధు ఆదివారం తెలిపారు. వచ్చే నెలలో హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పరీక్షలో పాల్గొంటారని పేర్కొన్నారు. విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపికై నందుకు పాఠశాల హెచ్ఎం జి.శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యాయ బృందం సరిత, సుధారాణి, సరితాదేవి, వలిపాషా, శ్రీనివాస్, రజిత, లీలారాణి, సమ్మయ్య, వీరేశం, దీపిక, వసుధప్రియా, ప్రసూనా, సాహెదాబేగం, పూర్ణిమ విద్యార్థులను అభినందించారు. తరుణి తన్మయి -
నిస్వార్థ సేవ.. వెలిశాల తోవ
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మండలం రెడ్యాలకు చెందిన వెలిశాల రాధాకృష్ణ 1975 నుంచి 1995 వరకు నాలుగు పర్యాయాలు సర్పంచ్‌గా పనిచేశారు. అనంతరం 2000 నుంచి 2005వ సంవత్సరం వరకు మళ్లీ ఎన్నికై ప్రజలకు సేవలందించారు. గ్రామ అభివృద్ధికి తనవంతుగా కృషి చేశారు. భూ సమస్యలు, కుటుంబ తగాదాలను పరిష్కరించారు. మృధుస్వభావిగా ఉంటూ అందరి మన్ననలు పొందారు. నిస్వార్థంగా సేవ చేసిన ఆయన 2006 మార్చిలో మృతిచెందారు. పలు పార్టీల నేతలు, గ్రామస్తుల సహకారంతో 2014 జనవరి 27న రాధాకృష్ణ విగ్రహాన్ని గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేశారు. -
కేసీఆర్ సంకల్ప బలంతోనే తెలంగాణ
● మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లి అర్బన్: గాంధీ చూపిన మార్గంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సంకల్ప బలంతో సాధించుకున్నామని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్ అధ్యక్షతన శనివారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన దీక్ష దివస్ కార్యక్రమానికి గండ్ర వెంకటరమణారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి హాజరయ్యారు. దీక్షా దివస్ ఫొటో గ్యాలరీని నాయకులు, కార్యకర్తలతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. 2009 నవంబర్ 29న మహానేత కేసీఆర్ దీక్షా దివస్ పేరుతో చేసిన నిరవధిక నిరాహార దీక్షతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిందన్నారు. అనంతరం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రోగులకు గండ్ర జ్యోతి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంఽథాలయ సంస్థ మాజీ చైర్మన్ బుర్ర రమేష్, పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్‌కుమార్, నాయకులు సెగ్గం వెంకటరాణిసిద్దు, గండ్ర హరీశ్‌రెడ్డి, రాజిరెడ్డి, బడితెల సమ్మయ్య పాల్గొన్నారు. -
ఊరు వెలగాలని మూడెకరాలు అమ్మేశారు..
పాలకుర్తి టౌన్: పాలకుర్తి మండలం వావిలాల గ్రామంలో రెండు పర్యాయాలు సర్పంచ్‌గా సేవలందించిన గంట సోమయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి 1981–1994 వరకు సర్పంచ్‌గా ప్రజలకు విశిష్ట సేవలందించారు. చివరకు తనకున్న ఆస్తినంతా ప్రజా సేవకు ధారపోశారు. అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిని వావిలాల గ్రామానికి రప్పించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి గ్రామానికి బస్సు సర్వీసులు నడిపించారు. గ్రామంలో 13 నీళ్ల ట్యాంకులు నిర్మించారు. ప్రధాని రాజీవ్‌గాంధీ చేతుల మీదుగా ఉత్తమ సర్చంచ్‌గా పురస్కారం అవార్డు, ప్రశంసపత్రం అందుకున్నారు. గ్రామంలో టెలిఫోన్ ఎక్చేంజ్, విద్యుత్ సబ్సేష్టన్ మంజూరు చేయించారు. 1991 ఆగస్టు 19న సీపీఐ(ఎంఎల్) పీపుల్స్‌వార్ నాగన్న దళం సర్పంచ్ సోమయ్యను కిడ్నాప్ చేయడంతో అప్పటి కలెక్టర్ బీపీ ఆచార్య చొరవతో నాలుగు రోజుల తర్వాత విడుదలయ్యారు. 2021లో కన్నుమూశారు. గ్రామ ప్రజలు ఆయన సేవలకు గుర్తుగా 2022 ఏప్రిల్‌లో వావిలాల ప్రధాన కూడలిలో విగ్రహం ఏర్పాటు చేశారు. దుగ్గొండి: మండలంలోని తిమ్మంపేట గ్రామ సర్పంచ్‌గా విశిష్ట సేవలందించిన సారంపల్లి రాజిరెడ్డి 1970 నుంచి 11 ఏళ్లపాటు సర్పంచ్‌గా పనిచేశారు. ఈసమయంలో ఇంటింటికీ విద్యుత్‌ను తీసుకొచ్చేందుకు తన మూడెకరాల పొలాన్ని అమ్మేశారు. నాలుగు కిలోమీటర్ల దూరంలో లక్నెపల్లి గ్రామం నుంచి విద్యుత్ లైన్ వేయించారు. గ్రామంలోని ప్రభుత్వ స్థలాన్ని వందలాది మంది పేదల ఇళ్ల కోసం ఇచ్చారు. ఆయన మరణానంతరం 2008లో రాజిరెడ్డి విగ్రహాన్ని గ్రామ పంచాయతీ ఎదుట ప్రధాన రహదారి పక్కన గ్రామస్తులంతా కలిసి ప్రతిష్టించారు. ఇప్పటికీ రాజిరెడ్డి పేరు ప్రస్తావన రాగానే కరెంట్ తెచ్చిన మహానుభావుడు అంటూ గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఆయనను గుర్తు చేసుకుంటారు. ఆస్తిని ధారపోశారు.. ప్రజల గుండెల్లో నిలిచారు -
మోహన్రావుది వీర మరణం!
టేకుమట్ల: జయశంకర్ భూపాలపల్లి జిల్లా, టేకుమట్ల మండలంలోని రామకిష్టాపూర్(వి) గ్రామానికి చెందిన లింగంపల్లి మోహన్‌రావు నాలుగు పర్యాయాలు సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ సేవలందించారు. సొంత ఖర్చులతో రోడ్ల విస్తరణ, సబ్‌స్టేషన్ ఏర్పాటు రోడ్లు, డ్రెయినేజీ, నీటి వసతి ఇలా అనేక సేవలందించారు. సర్పంచ్‌గా కొనసాగుతున్న సమయంలోనే 2009లో మావోయిస్టులో చేతిలో హతమయ్యారు. దాంతో ఆయన అభివృద్ధ్దికి గుర్తుగా గ్రామస్తుల కోరిక మేరకు గ్రామ పంచాయతీ వద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆయనది వీరమరణమని ఇప్పటికీ స్థానికులు చెప్పుకుంటారు.. -
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు కృషి
● ఎన్నికల సాధారణ పరిశీలకుడు ఫణీంద్ర రెడ్డిరేగొండ: గ్రామపంచాయతీ ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఎన్నికల సాధారణ పరిశీలకుడు ఫణీంద్ర రెడ్డి అన్నారు. శనివారం రేగొండ, రంగయ్యపల్లి, దమ్మన్నపేటలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా నామినేషన్ కేంద్రాలలో సౌకర్యాలను, నామినేషన్ల స్వీకరణ విధానాన్ని సమీక్షించారు. ఎంపీడీఓలు, తహసీల్దార్లు పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికలను శాంతియుతంగా, నిబంధనలకు లోబడి నిర్వహించేందుకు అన్ని శాఖలతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం రూపిరెడ్డిపల్లి వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్‌ను తనిఖీ చేసి ప్రతీ వాహనాన్ని నిశితంగా పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. చెక్‌పోస్టుల తనిఖీ మొగుళ్లపల్లి: గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని సాధారణ ఎన్నికల పరిశీలకులు ఫణీంద్రరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని రంగాపురం ప్రభుత్వ పాఠశాలలో పోలింగ్ కేంద్రంతో పాటు మొగుళ్లపల్లి, రంగాపూర్ చెక్‌పోస్టులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నామినేషన్ స్వీకరణ విధానాన్ని సమీక్షించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. -
తొలి సర్పంచ్ కందుకూరి కాంతయ్య
హసన్‌పర్తి: హనుమకొండ మండలం గోపాలపురానికి చెందిన కందుకూరి కాంతయ్య గ్రామానికి తొలి సర్పంచ్. 1979 నుంచి 1995 వరకు వరుసగా 17 ఏళ్ల పాటు సర్పంచ్‌గా సేవలందించారు. హనుమకొండ సమితి డిప్యూటీ ప్రెసిడెంట్‌గా, ఏనుమాముల మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా, వరంగల్ కో–ఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్‌గా పదవులు నిర్వర్తించారు. మాజీ మంత్రి హయగ్రీవాచారికి ముఖ్య అనుచరుడిగా వ్యవహరించారు. 1999లో ఆయన హత్యకు గురయ్యారు. ఆయన సేవలకు గుర్తుగా గ్రామస్తులు పంచాయతీ కార్యాలయం వద్ద కాంతయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఏటా కాంతయ్య వర్ధంతి, జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. కాంతయ్య స్ఫూర్తితో ఆయన కుటుంబీకులు రాజకీయంలో రాణిస్తున్నారు. -
రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకం
● రెండో విడతకు నేడు నోటిఫికేషన్ జారీ ● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. శనివారం ఐడీఓసీ కార్యాలయంలో స్టేజ్–2 రిటర్నింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని ముఖ్య సూచనలు అందించారు. ఎన్నికల నిర్వహణలో లాజిస్టిక్స్, మ్యాన్ పవర్ వినియోగం, నామినేషన్ స్వీకరణ నుంచి ఓట్ల లెక్కింపు వరకు ప్రతి దశలో రిటర్నింగ్ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఎన్నికల నిర్వహణను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా కొనసాగించేందుకు స్టేజ్–2 అధికారులు పర్యవేక్షణ, సమన్వయం, భద్రత, పోలింగ్ సిబ్బంది శిక్షణ, పోలింగ్ మెటీరియల్ పంపిణీ, తిరిగి స్వీకరణ వంటి ప్రక్రియలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, ఆర్డీఓ రవి, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ నవీన్‌రెడ్డి, ఎంపీడీఓలు, స్టేజ్–2 అధికారులు, మండల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. నోటిఫికేషన్ జారీచేయాలి... రెండో విడత ఎన్నికల నిర్వహణకు ఆదివారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఆదివారం 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్, అనంతరం 30వ తేదీ నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు ఉదయం 10.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని తెలిపారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు వీలుగా కలెక్టరేట్లో 24 గంటలు పనిచేసేలా 90306 32608 సహాయక కేంద్రం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. నాణ్యమైన విత్తనాలు అందించాలి.. ప్రస్తుత వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడానికి, నకిలీ విత్తనాలపై నిషేధం విధించడానికి, విత్తనాల దిగుమతిని సరళీకరించడానికి మరియు రైతు హక్కులను రక్షించడానికి నూతన విత్తన చట్టం ముసాయిదా ప్రతిపాదించడం జరిగిందని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. శనివారం ఐడీఓసీ కార్యాలయ సమావేశపు హాల్లో నూతన విత్తన చట్టం 2025 ముసాయిదాపై వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో పోలీసు, ఉద్యాన, విత్తన కంపెనీలు, ఇన్పుట్ డీలర్లు, రైతుల ఉత్పత్తి సంఘాలు అనుబంధ సంస్థలు, రైతులతో అభిప్రాయ సేకరణ చర్చా సదస్సుకు ముఖ్యఅతిథిగా కలెక్టర్ హాజరై మాట్లాడారు. ఈ సమావేశంలో ఏఎస్పీ నరేష్కుమార్, డీఏఓ బాబూరావు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి సునిల్‌కుమార్, ఏడీఏలు పాల్గొన్నారు. -
ఆదివారం శ్రీ 30 శ్రీ నవంబర్ శ్రీ 2025
వసతుల కల్పన.. అభివృద్ధి రూపకల్పనదామెర: హనుమకొండ జిల్లా దామెర మండలం కోగిల్వాయికి చెందిన గట్ల మల్లారెడ్డి సేవలు ఇప్పటికీ గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారు. 1984–90, 1996–2001 రెండు పర్యాయాలు సర్పంచ్‌గా సేవలందించారు. గ్రామంలో ప్రైమరీ, హై స్కూల్ నిర్మించారు. పలు గ్రామాల్లో వాటర్ ట్యాంకులు, పైప్‌లైన్, బస్‌షెల్టర్ నిర్మాణం, అంతర్గత రోడ్లు, వీఽధి దీపాలు ఏర్పాటు వంటి ఎన్నో సేవలు చేశారు. ఆయన సేవలకు గుర్తుగా గ్రామంలోని కూడలిలో మల్లారెడ్డి ప్రతిమను ప్రతిష్టించారు. మల్లారెడ్డి కుమారుడు గట్ల విష్ణువర్ధన్ రెడ్డి అమెరికా నుంచి వచ్చి 2018 నుంచి 2024 వరకు సర్పంచ్‌గా, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడిగా సేవలందించారు. -
పరిశీలన.. సమీక్ష
● కల్యాణమండపం పనుల అలసత్వంపై అసంతృప్తి ● కాజీపేట రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ తనిఖీ.. పనులపై ఆరా ● వరంగల్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వెల్లడి ● ‘గ్రేటర్’లో రోజంతా బిజీబిజీగా గడిపిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ● వరంగల్ రైల్వే స్టేషన్ పరిశీలన.. క్యాంటిన్లో చాయ్‌పే చర్చ ● శ్రీభద్రకాళి, వేయిస్తంభాల ఆలయాల్లో పూజలువేయిస్తంభాల ఆలయ కల్యాణ మండపాన్ని పరిశీలిస్తున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, చిత్రంలో బీజేపీ నాయకులు -
10గంటల తర్వాతే..
8.45 గంటల నుంచి ఓపీ కోసం లైన్లో నిల్చున్న రోగులు భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ఓపీ నిర్వహించాల్సి ఉంటుంది. 9గంటలకు ప్రారంభం కావాల్సిన ఓపీ సేవలు 10గంటలు దాటితేకాని ప్రారంభంకావడం లేదు. అనా రోగ్య సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రికి రోగులు ఉదయం 8.30గంటల నుంచే వస్తున్నారు. ఓపీ లైన్ వద్ద బారులు దీరుతున్నారు. నిల్చోని అలసిపోయి నేలపైనే కూర్చుంటున్నారు. కనీసం కూర్చోవడానికి కుర్చీలు కూడా లేని పరిస్థితి. శుక్రవారం ‘సాక్షి’ ఆస్పత్రిని పరిశీలించింది. ఉదయం 9.22 గంటలకు ఫార్మసీ తెరిచారు. 9.39 గంటలకు ఓపీ రిజిస్ట్రేషన్, 9.30 గైనకాలజీ సేవలు, 9.40గంటలకు ఎస్‌ఆర్‌లు ఓపీ సేవలు ప్రారంభించారు. 10గంటల తరువాత పలు విభాగాలు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు ఆస్పత్రికి చేరుకొని మెడికల్ కళాశాలలో సమావేశం ఉందని వెళ్లిపోయారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ శుక్రవారం సెలువులో ఉన్నట్లు తెలిసింది. బాధితులు దూర ప్రాంతాల నుంచి వచ్చి ఆస్పత్రిలో వైద్యుల కోసం గంటల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితులు దాపురించాయి. వైద్యులు సమయపాలన పా టించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఇష్టారాజ్యం 8.30గంటల నుంచి క్యూలో రోగులు.. -
నో డ్యూ మస్ట్!
కాళేశ్వరం: ఒరేయ్ ఎంకన్న నీ ఇంటిపన్ను కడుతారా.. అరే మామ నీ కరంటు బిల్లు మొత్తం క్లియర్ చేస్తా .. అరే బామ్మర్ధి బ్యాంకులో ఎంతో కొంత అ ప్పు ఉన్నా.. నేను చెల్లిస్తా రా అంటూ గ్రామాల్లో ఓటర్ల వెంట అభ్యర్థులు పడుతున్నారు. నామినేషన్ కు నో డ్యూ సర్టిఫికెట్ తప్పనిసరి కావడంతో మొండి బకాయిలు పలు చోట్ల వసూలు అవుతున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే వారికి నామినేషన్ పత్రాలతో పాటు ధృవ పత్రాల సమర్పణ తలనొప్పిగా మారింది. అన్ని సర్టిఫికెట్లు సమకూర్చుకునేందుకు నాయకులు హైరానా పడుతున్నారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో సమర్పణకు అతి తక్కువ సమయం ఉంది. వివి ధ పత్రాల కోసం కార్యాలయాలకు పరుగులు పెడుతున్నారు. లోకల్ బ్యాంకులో కొత్త ఖాతాతో పాటు అప్పులు లేనట్టు నో డ్యూ సర్టిఫికెట్ కూడా అవసరం కావడంతో బ్యాంకులకు క్యూ కడుతున్నారు. నామినేషన్ పత్రం దాఖలు చేసేటప్పుడు ఈసీ విధించిన నిబంధనలు పాటించాలి. సూచించిన పత్రాలు తప్పనిసరిగా సమర్పించాలి. ఏ ఒక్కటి మిస్సయినా నామినేషన్ తిరస్కరణకు గురువుతుంది. అభ్యర్థులు అన్ని పత్రాలను సేకరించడంతో పాటు బకాయిలు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. మొత్తం కట్టుడే.. నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు వారిని బలపరిచేవారికి అప్పులు, బకాయిలు ఉండొద్దు. వారి పేరిట గ్రామ పంచాయతీ నుంచి నో డ్యూ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. దీంతో గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్ను బకాయిలు మొత్తం చెల్లించేస్తున్నారు. వారిని బలపరిచే వారి పన్నులు అభ్యర్థులే కట్టేస్తున్నారు. ఇన్నాళ్లు ఎలాంటి అవసరం పడకపోవడంతో పన్నుల చెల్లింపులకు మొండికేసిన వారున్నారు. అలాంటి వారు దేవుడా అంటూ మొత్తం కట్టేస్తున్నారు. అభ్యర్థి పేరిట ఉన్న ఇంటి కరెంటు బిల్లు కూడా పూర్తిగా చెల్లించి బాకీ లేనట్టు పత్రం జతచేయాలి. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీచేసే వారు పదుల సంఖ్యలో ఉండగా వారిని బల పరిచేవారు సైతం బిల్లులు క్లియర్ చేస్తున్నారు. బ్యాంకుల్లోని పాత అప్పులు చెల్లించడం, వడ్డీ కట్టి రిన్యూవల్ చేసుకొని అప్పులేనట్టు ధృవపత్రం తీసుకుంటున్నారని తెలిసింది. ఎన్నికల పుణ్యమా అని ఇంటి పన్ను బకాయిలు, కరెంటు పెండింగ్ బిల్లులు క్లియర్ అవుతున్నాయి. జిల్లాలో ఇలా: మొదటి విడతలో నాలుగు మండలాలు, 82 పంచాయతీలు,712 వార్డులకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. రెండవ విడతలో నాలుగు మండలాలు, 85పంచాయతీలు, 694 వార్డులు, మూడో విడతలో నాలుగు మండలాలు, 81 పంచాయతీలు, 696 వార్డులు ఉన్నాయి. వీటిలో రెండు, మూడు విడతల్లో ఇంకా నామినేషన్లు ప్రారంభం కావలసి ఉంది. ఇంకా జిల్లా వ్యాప్తంగా అన్నీ జీపీల్లో కొన్ని నెలలుగా పంచాయతీలకు నిధులు రాక సిబ్బంది జీతాలు చెల్లించలేని పరిస్థితి ఉన్న సమయంలో ఈ పన్నుల వసూలు కాస్త ఊరట కలిగిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై మహదేవపూర్ ఎంపీడీఓ రవీంద్రనాథ్ను సంప్రదించగా ప్రతి ఒక్కరు నోడ్యూస్ సర్టిఫికెట్తో నామినేషన్‌కు రావాలి. నోడ్యూస్ లేని వారి నామినేషన్ తిరస్కరణకు గురవుతుందని తెలిపారు.మొగుళ్లపల్లి మండలంలో 26 గ్రామ పంచాయతీలు, 212 వార్డులు ఉన్నాయి. శనివారం వరకు నామినేషన్ల ప్రక్రియ ముగియనుండగా శుక్రవారం వరకు సర్పంచ్ స్థానాలకు 37, వార్డు స్థానాలకు 85 నామినేషన్లు వచ్చాయి. అయితే సర్పంచ్, వార్డు స్థానాలకు బరిలో నిలవనున్న అభ్యర్థులను మరొకరు బలపరచాల్సి ఉంటుంది. పోటీలో నిల్చొనే అభ్యర్థి నామినేషన్ ఫీజుతో పాటు, అతడి, బలపరిచే ఓటరు ఇంటి పన్ను పూర్తి స్థాయిలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఈ ఒక్క మండలంలోనే నామినేషన్ల రూపంలో గురు, శుక్రవారాల్లో సుమారు రూ. 76 వేలు వచ్చాయి. ఇంటి పన్ను బకాయిలు రూ. సుమారు 97,600 వరకు వసూలు అయ్యాయి. చివరి రోజు(నేడు) నామినేషన్ల సంఖ్య పెరిగి ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది. ఎన్నికలు పూర్తయ్యే లోపు జిల్లాలోని పంచాయతీల్లో పాత బకాయిలు వసూలు అయి గల్ల పెట్టె గలగల అనబోతుందని తెలుస్తోంది. బ్యాంకుల్లో పాత అప్పులు కూడా క్లియర్ నామినేషన్‌కు నో డ్యూ సర్టిఫికెట్ తప్పనిసరి కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ పరుగులు నిండుతున్న ఖజానా -
నిబంధనలు పాటించాలి
రేగొండ: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల సంఘం నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్ రాహుల్‌శర్మ అన్నారు. శుక్రవారం రేగొండ, గూడెపల్లి గ్రామపంచాయతీలలో నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. నామినేషన్ కేంద్రాల వద్ద శాంతియుత వాతావరణం ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. నామినేషన్లకు శనివారం చివరి రోజు కావడంతో అభ్యర్థులు అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉండటంతో తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, పీఆర్ డీఈ రవికుమార్, ఇరిగేషన్ డీఈ గిరిధర్ పాల్గొన్నారు. బ్యాంకు ఖాతాలు అందించాలి భూపాలపల్లి అర్బన్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల వ్యయ వివరాల కోసం బ్యాంకు ఖాతా ప్రారంభించడంలో ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్‌శర్మ బ్యాంకర్లను ఒక ప్రకటనలో ఆదేశించారు. జాప్యానికి అవకాశం లేకుండా బ్యాంకర్లు సహకరించాలన్నారు.కలెక్టర్ రాహుల్‌శర్మ -
ఎన్నికల విధానం చూస్తే బాధేస్తోంది..
సాక్షి, మహబూబాబాద్ : ‘స్వాతంత్య్ర ఉద్యమం, నిజాంపాలన చూశాను. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా. సర్పంచ్ పదవితో రాజకీయ అరంగ్రేటం చేసి నాలుగుసార్లు ఎమ్మెల్యే, నాలుగుసార్లు ఎంపీగా పనిచేశా. అప్పటి రాజకీయాలకు ప్రస్తుత రాజకీయాలకు పొంతన లేదు. అప్పుడు మంచి నాయకుడిని ఎన్నుకోవాలనే తపన ప్రజల్లో ఉండేది. అభ్యర్థులను గెలిపించే బాధ్యత నాయకులు, కార్యకర్తలు తీసుకునేది. జీపులు.. డీజిల్ ఖర్చు తప్ప, ఇతరత్రా వ్యయాలు ఉండేవి కాదు. ఇప్పుడు ఓట్లు పడాలంటే డబ్బులు ఖర్చుపెట్టాలి. ఈ విధానం చూస్తే బాధేస్తోంది’ అని మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నాటి పరిస్థితులను ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. సర్పంచ్‌గా అరంగ్రేటం చదువుకునే రోజులు.. అప్పటివరకు నాకు రాజకీయాలు తెలియదు. అందరి ప్రోత్సాహంతో 1960లో మహబూబాబాద్ జిల్లా మరిపెడ గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యా. ఏకగ్రీవం కావడంతో పెద్దగా డబ్బులు ఖర్చుపెట్టలేదు. నాకు ఇప్పుడు 95ఏళ్లు.. నేను సర్పంచ్‌గా గెలిచినప్పుడు ముప్పై సంవత్సరాలు కూడా లేవు. అయినా సర్పంచ్ అంటే గ్రామంలో ప్రత్యేక ఆదరణ. నాయకుడికి కూడా గ్రామం అన్నా.. గ్రామస్తులు అన్నా.. ప్రాణంగా పనిచేసేవారు. గ్రామాల అభివృద్ధికి ఎంతదూరమైనా పోయేవాళ్లం. ఎన్నికల్లో డబ్బులు పంచడం అంటే తెలియదు. గ్రామాల్లోకి వెళ్తే.. అక్కడి నాయకులే భోజనాలు పెట్టేవారు. పార్లమెంట్ ఎన్నికలకు నాకు అయిన ఖర్చు రూ.7,500 మాత్రమే.. ఇప్పుడు ఒక్క ఓటుకు రూ.5వేల నుంచి రూ.10వేల వరకు ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి. ఈ పరిస్థితి చూస్తుంటే బాధేస్తోంది. కమ్యూనిస్టులతో పోటీ.. ఆ రోజుల్లో ఇన్ని పార్టీలు లేవు. కమ్యూనిస్టు, కాంగ్రెస్ రెండు పార్టీల మధ్యనే పోటీ ఉండేది. 1967లో ఎంపీగా ఎన్నికై న సమయంలో తొలి దశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకుంది. అప్పుడు మర్రి చెన్నారెడ్డి ఇతర నాయకులు నన్ను తెలంగాణ పార్లమెంటరీ సమితి కన్వీనర్‌గా ఎన్నుకున్నారు. 1969లో హైదరాబాద్‌లో పదివేల మందితో సత్యాగ్రహ కార్యక్రమం చేశాం. జైలుకు వెళ్లిన సంఘటనలు ఉన్నాయి. అయితే అప్పుడు కమ్యూనిస్టులు ప్రజాప్రతినిధులతో పనులు చేయించేలా పోటీ పడేవారు. అభివృద్ధిని ఆకాంక్షించేవారు. పనిచేసిన వారిని అభినందించే సంస్కృతి ఉండేది. ఇప్పుడు అలాంటి వాతావరణం కనిపించడం లేదు. ఓటుకు డబ్బులు ఇవ్వడం అంటే.. అవినీతిని ప్రోత్సహించడమే ఎన్నికల కమిషన్, సుప్రీంకోర్టు ప్రత్యేక దృష్టి పెట్టాలి ‘సాక్షి’తో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రామసహాయం సురేందర్ రెడ్డి సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే, ఎంపీగా ఎదిగిన రామసహాయం నాడు గ్రామానికి సేవ చేసే నాయకులను ఎన్నుకునేవారు. ఇప్పుడు డబ్బులు ఖర్చుపెట్టే వారికి టికెట్లు ఇస్తున్నారు. ప్రజలు వారికి ఓట్లు వేసి ఎన్నుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఈ వాతావరణం మంచిదికాదు. డబ్బులు లేనివారు ప్రజాప్రతినిధులు అయ్యే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. డబ్బులు పంచి పెట్టడం అంటే అవినీతికి అవకాశం ఇవ్వడమే.. ఈ సంస్కృతి మారాలి. ఎన్నికల కమిషన్, సుప్రీంకోర్టు కలగజేసుకొని డబ్బులకు, ఎన్నికలకు ఉన్న సంబంధాన్ని విడగొట్టాలి. లేకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. -
రెండో రోజు 161 నామినేషన్లు
● సర్పంచ్‌లకు 48.. వార్డులకు 113 ● నేడు చివరి రోజు భూపాలపల్లి అర్బన్: జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరిగే నాలుగు మండలాల నుంచి శుక్రవారం 161 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. సర్పంచ్‌లకు 48, వార్డు సభ్యులకు 113 నామినేషన్లు దాఖలు చేశారు. నేటితో (శనివారం) మొదటి విడత నామినేషన్ల గడువు ముగియనుంది. నేడు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసే అవకాశాలు ఉన్నా యి. రెండు రోజుల్లో సర్పంచ్‌లకు 93, వార్డు సభ్యులకు 148 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. గణపురం మండలంలో సర్పంచ్‌కు 14, వార్డులకు 14, కొత్తపల్లిగోరిలో సర్పంచ్‌కు 13, వార్డులకు 28, మొగుళ్లపల్లిలో సర్పంచ్ 37, వార్డులకు 85, రేగొండలో సర్పంచ్‌కు 29, వార్డులకు 21 నామినేషన్లు దాఖలయ్యాయి. కోటగుళ్లను సందర్శించిన అమెరికా దేశస్తుడు గణపురం: మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లను అమెరికా దేశానికి చెందిన స్టర్ట్ ఫ్రీమాన్ శుక్రవారం సందర్శించారు. భారతదేశంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించడంలో భాగంగా కోటగుళ్లను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ శిల్ప సంపద అద్భుతంగా ఉందని కొనియాడారు. ఆయన తనవెంట తెచ్చుకున్న కెమెరాలలో ఆలయ శిల్ప సంపదను చిత్రీకరించుకున్నారు. పూలేకు నివాళి భూపాలపల్లి రూరల్: పూలే వర్ధంతిని పురస్కరించుకొని పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద జ్యోతిరావు పూలే చిత్రపటానికి వివిధ సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు తాటి కంట రవికుమార్, ఎస్సీ, ఎస్టీ, బీసీ కోఆర్డినేటర్ కొత్తూరు రవీందర్, బీసీ జేఏసీ చైర్మన్ పైడిపల్లి రమేష్, భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దొంగల రాజేందర్, భూపాలపల్లి పట్టణ అధ్యక్షుడు గీసా సంపత్, బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షుడు గట్ల రాజయ్య పాల్గొన్నారు. పెరిక సంఘం జిల్లా అధ్యక్షుడిగా రవీందర్ భూపాలపల్లి రూరల్: పెరిక కుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా సూరం రవీందర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గటిక విజయ్‌కుమార్ తెలిపారు. శుక్రవారం జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిటీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై న రవీందర్‌ను సన్మానించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యనిర్వాహన కార్యదర్శి కేతే విజయ్‌కుమార్, చింతం సదానందం, సంఘం నాయకులు పాల్గొన్నారు. శాసీ్త్రయ వైఖరిని పెంపొందించాలి భూపాలపల్లి అర్బన్: విద్యార్థులలో శాసీ్త్రయ వైఖరిని పెంపొందించాలని జిల్లా సైన్స్ అధికారి బర్ల స్వామి సూచించారు. జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జిల్లాస్థాయి ప్రతిభ పాటల, చెకుముకి పోటీలు జిల్లాకేంద్రంలోని మాంటిసోరి పాఠశాలలో శుక్రవారం నిర్వహించారు. జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు పొగాకుల రాధాకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి బర్ల స్వామి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నిత్యజీవితంలో సైన్స్ పట్ల ప్రతి ఒక్కరూ మక్కువ పెంచుకోవాలన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని, జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతి ఏటా విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఉన్న అభిరుచిని పెంచడానికి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. జిల్లాస్థాయిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మహాముత్తారం ఇన్చార్జ్ ఎంఈఓ రవీందర్‌రెడ్డి, పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ సీన్ జోన్స్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
నామినేషన్ కేంద్రాల పరిశీలన
గణపురం: మండలకేంద్రంలోని పలు నామినేషన్ కేంద్రాలను ఎన్నికల సాధారణ పరిశీలకులు, టీసీఎంఎస్ఐడీసీ మేనిజింగ్ డైరెక్టర్ ఫణీంద్ర రెడ్డి, ఎస్పీ సంకీర్త్ వేర్వేరుగా పరిశీలించారు. గాంధీనగర్, మైలారం గ్రామంలోని నామినేషన్ కేంద్రాలను ఫణీంద్ర రెడ్డి పరిశిలీంచగా.. గాంధీనగర్, గణపురం ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని ఎస్పీ సంకీర్త్ పరిశీలించి సంబంధిత అదికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా చూడాలి రేగొండ: గ్రామపంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. శుక్రవారం మండలంలో ఏర్పాటు చేసిన ఎన్నికల చెక్‌పోస్ట్‌తో పాటు నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెక్‌పోస్ట్‌ల వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి అక్రమ నగదు, మద్యం అరికట్టాలని సూచించారు. నామినేషన్ కేంద్రాల వద్ద శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే వారిపై ఎన్నికల నియమావళి ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎస్పీ వెంట సీఐ కరుణాకర్, ఎస్సై రాజేష్ ఉన్నారు. -
పోలీసులపై ఆకతాయిల జులుం
టేకుమట్ల: పోలీస్‌స్టేషన్ సమీపంలో పోలీసులపైనే ఆకతాయిలు జులుం ప్రదర్శించిన ఘటన చోటుచేసుకుంది. వైన్‌షాప్ సమీపంలో కొంతమంది యువకులు గురువారం టేకుమట్ల–ఆశిరెడ్డిపల్లి ప్రధాన రోడ్డుపక్కన మద్యం సేవిస్తున్నారు. విధుల్లో ఉన్న పోలీసులు అక్కడకు చేరుకుని ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది.. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పారు. మద్యం మత్తులో కొంతమంది యువకులు పోలీసులపై ఎదురు తిరిగారు. ‘మా ఇష్టం’ అంటూ జులుం ప్రదర్శించారు. అంతటితో ఆగకుండా పోలీ సులే ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని వీడియోను సైతం ఓ యువకుడు తన సెల్ఫోన్లో తీశాడు. అంతటితో ఆగని యువకులు హెడ్ కానిస్టేబుల్ ద్విచక్రవాహనాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేయడంతో స్వల్పంగా దెబ్బతిన్నది. దాంతో పోలీసులు యువకుడి సెల్‌ఫోన్ తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిపోయారు. అనంతరం యువకుడు అల్లకొండ రమేశ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై దాసరి సుదాకర్ తెలిపారు. యువకుడిపై కేసు నమోదు పోలీస్‌స్టేషన్ సమీపంలోనే ఘటన -
కలెక్టర్‌ను కలిసిన ఎన్నికల పరిశీలకులు
గ్రామ పంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకులు, టీజీఎంఎస్ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఫణింద్రరెడ్డి గురువారం కలెక్టర్ రాహుల్‌శర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జిల్లాలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు, పోలింగ్ నిర్వహణకు తీసుకుంటున్న ముందస్తు చర్యలపై చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపడుతున్నామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో లోపాలు లేకుండా సక్రమంగా నిర్వహిస్తామన్నారు. కలెక్టర్‌ను కలిసి పూలమొక్క అందజేస్తున్న ఎన్నికల సాధారణ పరిశీలకులు ఫణింద్రరెడ్డి -
అయ్యయ్యో.. ‘చే’జారిందే!
సాక్షిప్రతినిధి, వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుల ఎంపికపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. కొందరు నేతలు తమ పేర్లు సిఫారసు చేయకపోవడం వల్లే చాన్స్ చేజారిందని ఆశావహులు వాపోతుతుండగా, దరఖాస్తు చేసుకున్నా అవకాశం దక్కని సీనియర్లు అధిష్టానం తమపై చిన్నచూపు చూసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ప్రకటన వెలువడిన నాలుగైదు రోజులకు చాపకింది నీరులా అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఉమ్మడి వరంగల్ పరిధిలోని ఆరు జిల్లాలకు గాను ఇద్దరు షెడ్యూల్ కులాలు, ఒక మైనారిటీ, ఒక బీసీ, ఒక జనరల్, ఒక షెడ్యూల్ తెగలకు చెందిన నాయకులకు జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించారు. ఈ విషయంలో సామాజిక, సమన్యాయం పాటించినట్లు పార్టీ అధిష్టానం, సీనియర్లు చెబుతుండగా, సిఫారసులు ఫలించని, అవకాశం దక్కని నేతలు మాత్రం అసంతృప్తిగా ఉన్నట్లు అనుచరవర్గాలు చెప్తున్నాయి. వరంగల్‌పై పోటాపోటీ సిఫారసులు.. వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మైనార్టీ వర్గానికి చెందిన మహ్మద్ అయూబ్‌కు అనూహ్యంగా అవకాశం దక్కిందని చెప్పొచ్చు. తూర్పు నియోజకవర్గంలో రెండు వర్గాలుగా పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు. మంత్రి కొండా సురేఖ దంపతులు ఒక వర్గంగా, మిగిలిన నాయకులు మరో వర్గంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొండా దంపతులు మినహా మిగిలిన వారంతా డీసీసీ అధ్యక్షురాలిగా మాజీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణను ప్రతిపాదించారు. వర్ధన్నపేట, పరకాల ఎమ్మెల్యేలతోపాటు ఆ నియోజకవర్గాలకు చెందిన నాయకులు కూడా స్వర్ణను ప్రతిపాదించారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వర్ధన్నపేట నియోజకవర్గం ఏనుగల్లుకు చెందిన బొంపెల్లి దేవేందర్‌రావుకు డీసీసీ పదవీ ఇవ్వాలంటూ ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలిసింది. కొండా దంపతులు గోపాల నవీన్రాజుకు గానీ, లేని పక్షంలో మీసాల ప్రకాశ్‌కు ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. కాగా, మైనార్టీ వర్గానికి చెందిన మహ్మద్ అయూబ్ పేరును డీసీసీ అధ్యక్షుడిగా ఎవరు ప్రతిపాదించలేదు. సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్‌లకు సన్నిహితంగా, ఛత్తీస్‌గఢ్‌కు పార్టీ పరిశీలకుడిగా వెళ్లడంతో మీనాక్షి నటరాజన్ దృష్టిలో పడడం, మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆ కోటాలో ఆయూబ్ పేరును చేర్చినట్లు తెలిసింది. మాజీలకు ఇవ్వొద్దని, కనీసం ఐదేళ్ల నుంచి పార్టీలో కొనసాగుతుండాలన్న నిబంధనలను పరిగణనలోకి తీసుకోవడంతో స్వర్ణ, నవీన్రాజులు అనర్హులయ్యారు. దీంతో మంత్రి కొండా సురేఖ దంపతులు, వారి అనుచరులు అసంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. మహబూబాబాద్‌లో ఎంపీ వర్గం.. జనగామలో ‘కొమ్మూరి’ వర్గం కినుక జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్ భార్య ఉమకు కేటాయించడం పట్ల కొందరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పదవి ఆశించిన మరికొందరు అసంతప్తిగా ఉన్నారు. మాజీ డీసీసీ అధ్యక్షుడు భరత్చందర్ రెడ్డి వర్గానికి దక్కడం పట్ల ఆయన వర్గం సంతోషంగా ఉంది. కానీ, ఎంపీ బలరాం నాయక్ వర్గానికి చెందిన నునావత్ రాధకు ఇవ్వకపోవడం పట్ల ఆయన అసంతప్తిగా ఉన్నట్లు అనుచరవర్గంలో చర్చ జరుగుతోంది. మొదటినుంచీ డీసీసీ అధ్యక్షుడు పదవి వస్తుందని భావించిన పీసీసీ సభ్యుడు వెన్నం శ్రీకాంత్ రెడ్డి కూడా అసంతృప్తిగానే ఉన్నారు. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి అనుచరుడిగా ఉన్న గణపురం అంజయ్య కూడా అధ్యక్ష పదవి వస్తుందని ప్రచారం చేసుకున్నారు. అందరిని సమన్వయం చేసుకునేందుకు మురళి నాయక్ దంపతులు ప్రయత్నాలు చేస్తున్నారు. జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌గా పనిచేసిన లకావత్ ధన్వంతి లక్ష్మీనారాయణ నాయక్‌ను నియమించగా, మాజీ ఎమ్మెల్యే, మాజీ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి, ఆయన అనుచరులు అసంతృప్తిలో ఉన్నట్లు పార్టీవర్గాల సమాచారం. పార్టీ స్థాపించిన నాటినుంచి నేటివరకు ఒకే పార్టీలో ఉండడం లకావత్ ధన్వంతికి తగిన గుర్తింపు ఇచ్చిందన్న చర్చ జరుగుతుండగా, ఎస్టీ సామాజిక వర్గం, మహిళ కావడంతో గొడవలకు ఫుల్స్టాప్ పెట్టవచ్చని ఉద్దేశంతో ఆమెను జిల్లా అధ్యక్షురాలిగా ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, యశస్వినిరెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, పలువురు కూడా బలపరిచినట్లు ప్రచారం జరుగుతోంది. ములుగు డీసీసీ అధ్యక్షుడిగా మళ్లీ పైడాకుల అశోక్‌కే చాన్స్ దక్కింది. ఈ విషయంలో మంత్రి సీతక్క సిఫారసు మేరకు ఆయనకు మరోసారి అవకాశం దక్కిందన్న చర్చ పార్టీలో ఉంది. పార్టీలోని ఒక్కరిద్దరు సీనియర్లు అసంతృప్తికి గురైనట్లు వారి అనుచరులు చెబుతున్నారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, జయశంకర్ భూపాలపల్లి అధ్యక్షుడిగా బట్టు కరుణాకర్లను నియమించడంలో ఎమ్మెల్యేల మాట చెల్లుబాటయ్యింది. భూపాలపల్లి నుంచి మాజీ మావోయిస్టు నేత గాదర్ల అశోక్ అలియాస్ ఐతు ప్రయత్నించినా ఆయనకు చాన్స్ రాలేదు. హనుమకొండ నుంచి సుమారు 20మందికిపైగా ఆశించినా సీనియర్ నేత వెంకట్రాంరెడ్డికే అధిష్టానం పార్టీ పగ్గాలు అప్పగించింది. ఉమ్మడి జిల్లాలో డీసీసీ అధ్యక్షుల ఎంపికపై మోదం, ఖేదం పార్టీ సీనియర్లనుంచీ భిన్న స్వరాలు.. వరంగల్‌పై మంత్రి సురేఖ శిబిరంలో అసంతృప్తి? మంత్రి సీతక్క అనుచరుడికే మళ్లీ ములుగు పగ్గాలు.. హనుమకొండ, భూపాలపల్లిల్లో ఎమ్మెల్యేల మాటే చెల్లుబాటు మహబూబాబాద్ డీసీసీపై ఎంపీ వర్గం కినుక.. -
తడిసి మోపెడు!
ఖర్చులకు భయపడుతున్న ఆశావహులు● గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలు ● గ్రామాల్లో దావత్‌లు, మందు పార్టీల జోరు ● చివరి విడత ఆశావహులకు తలకుమించిన భారం ● మొదటి విడత నామినేషన్ల స్వీకరణ షురూకాళేశ్వరం: పల్లెల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి జోరందుకుంది. ఆశావహులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి దావత్‌లు, మందు పార్టీల కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఆశావహులు ఖర్చు చేస్తున్నప్పటికీ వారికి డబ్బుల టెన్షన్ పట్టుకుంది. మూడు విడతల్లో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడత జరిగే ఎన్నికల అభ్యర్థులకు ఖర్చులు కలిసి వచ్చే అంశం కాగా చివరి విడత వారు అదనపు భారం మోయాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి నుంచి 20 రోజుల పాటు ఎన్నికల ప్రచారంతో పాటు క్యాడర్‌ను కాపాడుకునేందుకు వారి కోరికలు తీర్చడం లాంటి ఖర్చులు భరించాల్సి ఉంటుంది. ఓటర్లను ప్రభావితం చేసే పెద్దలను, కుల, మహిళా సంఘాలు, యూత్ లీడర్లను మచ్చిక చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల ఖర్చుల అంచనా లెక్కలు చూసి ఆశావహులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎంత ఖర్చయినా మంచిదే అంటూ డబ్బులు.. దారబోస్తే గెలువకపోతే ఎలా అనే భయం మరో వైపు కనబడుతోంది. గెలుపు గుర్రాలపై ప్రధాన పార్టీలు ఆరా తీయడంతో పాటు డబ్బులు ఖర్చు చేసే వారిని సంప్రదిస్తున్నారు. దసరా పండగ సమయంలో వేసిన స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌తో కూడా కొంత మంది ఆశావహుకులు డబ్బులు ఖర్చుచేసి రద్దు కావడంతో చేసేదేమీ లేక క్యాడర్‌ను కాపాడుతున్నారని తెలిసింది. పరిమితికి మించి.. స్థానిక సంస్థల ఎన్నికల ఖర్చులకు ఎన్నికల కమిషన్ వ్యయపరిమితిని విధించింది. ఐదు వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీల్లో రూ.2.50 లక్షలు, వార్డు సభ్యుడికి రూ.50 వేలు, ఐదు వేల కంటే తక్కువ జనాభా ఉన్న జీపీల్లో సర్పంచులు రూ.1.50 లక్షలు, వార్డు సభ్యుడు 30 వేలు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎన్నికల అనంతరం ఖర్చులన్నింటినీ ఆధారాలతో సహా ఈసీకి సమర్పించాలి. అభ్యర్థుల ఎన్నికల ఖర్చులపై అధికారుల నిఘా ప్రతినిత్యం ఉంటుంది. ఎన్నికల వ్యయానికి ఈసీ విధించిన పరిమితులకు మించి ఎనిమిది నుంచి పది రేట్ల వరకు ఖర్చులు ఉంటాయనేది బహిరంగ రహస్యమే అంటున్నారు. జిల్లాలో ఇలా... జిల్లాలో 12 మండలాల్లో 248 గ్రామ పంచాయతీలు, 2,102 వార్డులు ఉన్నాయి. మొత్తం 3,02,147 మంది ఓటర్లు ఉన్నారు. ఒకటో విడత డిసెంబరు 11న గణపురం, రేగొండ, కొత్తపల్లిగోరి, మొగుళ్లపల్లి, రెండో విడత డిసెంబరు 14న చిట్యాల, టేకుమట్ల, భూపాలపల్లి, పలిమెల మండలాలు, మూడో విడత డిసెంబరు 17న మంథని నియోజకవర్గంలోని మల్హర్, మహదేవపూర్, మహాముత్తారం, కాటారం మండలాల్లో జరుగుతాయి. గురువారం నుంచి మొదటి విడత నామినేషన్ల స్వీకరణ మొదలైంది.ఆశావహుకులు ఖర్చులు కూడా మొదలు పెట్టారు. రిజర్వేషన్.. స్థానాన్ని బట్టి ఖర్చులు గ్రామ పంచాయతీ రిజర్వేషన్లను బట్టి ఎన్నికల ఖర్చులు మారనున్నాయి. జనరల్, బీసీ స్థానాల్లో ఖర్చు ఎక్కువ ఉండనుండగా, ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో ఒకింత తక్కువ ఖర్చు ఉండనుంది. ఈ సారి జనరల్ స్థానాలే ఎక్కువ ఉండటంతో ఆర్థికంగా బలంగా ఉన్నవారు పోటీ పడేందుకు సిద్ధపడుతున్నారు. ఇప్పటికే పదవులు చేపట్టిన వారితో పాటు కొత్త వారు సైతం పోటీకి సై అంటున్నారు. గత ఎన్నికల్లోనే సర్పంచులుగా గెలిచేందుకు లక్షల్లో ఖర్చు చేయగా మళ్లీ ఈ ఎన్నికల్లో ఖర్చులు పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూడో విడత ఎన్నికలు కాటారం, మహదేవపూర్, మల్హర్, మహాముత్తారం మండలాల్లో జరగనున్నాయి. మూడో విడతలో ఉన్న మండలాల జీపీల్లో ఆశావహులు ఇప్పటి నుంచి 20 రోజులకు పైగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మొదటి విడత వారితో పోల్చుకుంటే వారి ఖర్చులు రెట్టింపు కానున్నాయని ఆశావహులు ఆందోళన పడుతున్నారు. ఇప్పటికే కొంత మంది పోటీలో ఉన్నామని బయటపడగా మరి కొంత మంది ఖర్చులకు భయపడి బయటకు రావడం లేదు. ఇప్పటికే ఆశవాహులు యూత్లీడర్లు, వార్డు లీడర్లకు పార్టీలకతీతంగా దావత్‌లు, పార్టీల్లో ముంచుతున్నారు. దీంతో ఖర్చులు తడిసిమోపడవుతున్నాయని తలలు పట్టుకుంటున్నారు. -
టీ–పోల్ యాప్‌లో ఎన్నికల సమాచారం
భూపాలపల్లి అర్బన్: గ్రామ పంచాయతీ ఎన్నిక సమాచారం టీ–పోల్ మొబైల్‌యాప్‌లో అందుబాటులో ఉన్నట్లు కలెక్టర్ రాహుల్‌శర్మ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టీ–పోల్ యాప్ ద్వారా ఓటర్ల పోలింగ్ కేంద్ర వివరాలు, ఓటర్ స్లిప్పుల నమోదు సమాచారం సులభంగా తెలుసుకోవచ్చని తెలిపారు. ప్రతి ఓటర్ ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో ఓటరు అవగాహన, ప్రజలు ప్రలోబాలకు గురికాకుండా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. సైన్స్‌పై ఆసక్తిని పెంపొందించుకోవాలి విద్యార్థులలో సైన్స్‌పై ఆసక్తిని పెంపొందించడంతో పాటు నాణ్యమైన విజ్ఞాన విద్యను అందించేందుకు ప్రథమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్టెమ్ ఎడ్యుకేషన్ ఫర్ ఇన్నివేషన్ కార్యక్రమాన్ని అన్ని పాఠశాలల్లో అమలు చేయనున్నట్లు కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో గురువారం కలెక్టర్ చాంబర్లో ప్రథమ్ ఫౌండేషన్ బృందంతో కలిసి, జిల్లాలోని పాఠశాలల్లో సైన్స్ బలోపేతానికి చేపట్టనున్న కార్యక్రమాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు సైన్స్ అంశాలపై అవగాహన పెంచేలా ఆన్లైన్ వీడియోలు, టీచర్లకు ప్రత్యేక గైడెన్స్, స్టెమ్ ఆధారిత బోధన విధానాలు అమలు చేయనున్నట్లు వివరించారు. ప్రథమ్ ఫౌండేషన్ ద్వారా అందించే స్టెమ్ ప్రోగ్రామ్‌ను జిల్లాలోని ప్రతి పాఠశాలలో సమర్థవంతంగా అమలు చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఫౌండేషన్ అందించే బోధన సామగ్రి (మెటీరియల్) అన్ని పాఠశాలలకు చేరే విధంగా జిల్లా విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, జిల్లా సైన్స్ అధికారి స్వామి, ఏఎంఓ విజయపాల్‌రెడ్డి, ప్లానింగ్ ఆఫీసర్ రాజగోపాల్, సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టుల రిసోర్స్ పర్సన్స్, ప్రథమ్ ఫౌండేషన్ బృంద సభ్యులు పాల్గొన్నారు. -
అమల్లోకి పోలీస్‌యాక్ట్
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీస్ యాక్ట్–1861 నిబంధనలు అమల్లో ఉంటాయని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా డీజే సౌండ్ సిస్టమ్ వినియోగించవద్దని, శాంతిభద్రతలకు భంగం కలిగించే, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే చట్ట వ్యతిరేక చర్యలు చేపట్టరాదన్నారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు నిరంతరం శ్రమిస్తున్న నేపథ్యంలో, ప్రజలు పోలీసులకు సంపూర్ణ సహకారం అందించాలన్నారు. హత్య కేసులో శిక్ష జిల్లాకేంద్రంలోని రాజీవ్‌నగర్‌కాలనీలో మద్యం మత్తులో భార్య, కుమారుడిని హత్య చేయడానికి ప్రయత్నించిన మార్త రాజేష్‌కు భూపాలపల్లి అసిస్టెంట్ సెషన్స్ జడ్జి నాగరాజు గురువారం శిక్ష విధించినట్లు ఎస్పీ సంకీర్త్ తెలిపారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. 2023 మార్చి 13వ తేదీన మద్యం మత్తులో ఇంటికి వచ్చిన రాజేష్‌ను తాగవద్దని మందలిస్తున్న భార్య రమ, కుమారుడు ఉదయ్‌కుమార్‌పై గొడ్డలితో రాత్రి 11గంటలకు దాడి చేసి గాయపర్చినట్లు తెలిపారు. నేరం నిరూపితం కావడంతో నిందితుడికి 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ.5వేల జరిమాన విధించినట్లు తెలిపారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడే విధంగా లోతైన, సమగ్ర దర్యాప్తు నిర్వహించిన పోలీసు అధికారులను, కోర్టు కానిస్టేబుల్, సంబంధిత సిబ్బందిని అభినందించారు. ఎస్పీని కలిసిన జీఎం ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ను గురువారం ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందించారు. ఈ సందర్భంగా ఏరియాలో సింగరేణి స్థితిగతులు, భద్రత ఏర్పాట్లను ఎస్పీతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎస్టేట్ అధికారి కార్తీక్, సెక్యూరిటీ అధికారి మురళీమోహన్, వెల్ఫేర్ అధికారి సాయికృష్ణ పాల్గొన్నారు. -
ప్రతీ ఒక్కరు ఎన్నికల కోడ్ పాటించాలి
కాళేశ్వరం: స్థానిక ఎన్నికల నియమావళిని ప్రతీ ఒక్కరు పాటించాలని, ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. బుధవారం ఆయన మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వరున్ని దర్శించుకున్నారు. జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా ఆలయానికి వచ్చిన ఆయనకు అర్చకులు, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈసందర్భంగా ఎస్పీ.. స్వామివారికి అభిషేక పూజలు చేశారు. శ్రీశుభానందదేవి, శ్రీసరస్వతి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈఓ మహేష్ ఎస్పీని సన్మానించగా, అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. రానున్న స్థానిక ఎన్నికలను శాంతియుతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో పలు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక పోలీస్ బలగాలను నియమించి నిఘా మరింత బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. స్థానిక ఎన్నికలు సజావుగా జరిగేలా సహకరించాలని కోరారు. ఆయన వెంట మహదేవపూర్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై తమాషారెడ్డి, పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు. నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు ఓటర్లు ప్రలోభాలకు లొంగకుండా ఓటుహక్కును వినియోగించుకోవాలి ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ కాళేశ్వరాలయంలో పూజలు -
రాజ్యాంగం దేశ పాలనా వ్యవస్థకు దిక్సూచి
కాటారం: మన రాజ్యాంగం పవిత్రమైన గ్రంథం అని దేశ పరిపాలన వ్యవస్థకు దిక్సూచిలా రాజ్యాంగం వ్యవహరిస్తుందని గురుకులం భూపాలపల్లి, ములుగు జిల్లాల రిజినల్ కోఆర్డినేటర్(ఆర్సీఓ) హరిసింగ్ అన్నారు. మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలుర కళాశాలలో బుధవారం రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజ్యాంగం ఆవశ్యకత, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గొప్పతనం గురించి విద్యార్థులకు వివరించారు. పలువురు విద్యార్థులు రాజ్యాంగం, అంబేడ్కర్ విశిష్టతను తెలియజేసేలా ఉపన్యాసాలు ఇచ్చి పాటలు పాడారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాజేందర్, వైస్ ప్రిన్సిపాల్ మాధవి, వెంకటయ్య, బలరాములు, రాజబాబు, కృష్ణమాచారి, నీలిమ, స్వప్న, గోపాలకృష్ణ, శ్రవణ్, నరసింహ, సర్దార్‌సింగ్, పీడీ మహేందర్, పీఈటీ శ్రీనివాస్, కోచ్ వెంకటేశ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
నువ్వా.. నేనా..?
భూపాలపల్లి: పల్లెల్లో నువ్వా.. నేనా.. అన్న రీతిలో పోరు సాగబోతుంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో గ్రామాల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తొలిదశ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కా నుండడంతో ‘స్థానికం’లో గెలుపు కోసం ప్రధాన రాజకీయ పార్టీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. బుజ్జగింపులు షురూ... జిల్లాలో తొలి విడతలో భాగంగా భూపాలపల్లి నియోజకవర్గంలోని గణపురం, కొత్తపల్లిగోరి, రేగొండ, మొగుళ్లపల్లి మండలాల్లోని 82 సర్పంచ్, 712 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. నేటి నుంచి నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో సర్పంచ్ స్థానాలకు దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. పోటీదారులు బరిలో నిలువకుండా ఉండేందుకు పలువురు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాక కుల, యువజన సంఘాలను మచ్చిక చేసుకొని విందులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా యువత, రైతులను ఆకర్షించుకునేందుకు ఆశావహులు పడరాని పాట్లు పడుతున్నారు. మరోవైపు 500 ఓట్ల వరకు ఉన్న చిన్నచిన్న గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవం చేసుకునేందుకు కొందరు యత్నిస్తున్నారు. ఇందుకోసం గ్రామంలో నెలకొన్న సమస్యల పరి ష్కారం కోసం సొంతగా డబ్బులు వెచ్చిస్తామని హా మీ ఇస్తున్నారు. అయినప్పటికీ పోటీదారులు అంగీ కరించకపోవడంతో సమరానికి సిద్ధమవుతున్నారు. మొదటిసారి కుర్చీలో కూర్చునేదెవరో.. గత పంచాయతీ ఎన్నికల్లో జిల్లాలోని 241 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగగా, ఈసారి కొత్తగా ఏడు జీపీలు ఏర్పడ్డాయి. భూపాలపల్లి మండలంలోని గొర్లవీడు తండా, కొంపెల్లి తండా, కొత్తగా ఏర్పడిన కొత్తపల్లి గోరి మండలంలో కొత్తపల్లి(కె), బాలయ్యపల్లి, మొగుళ్లపల్లిలో బద్ధంపల్లి, చిట్యాలలో రామచంద్రాపురం, టేకుమట్ల మండలంలో కలికోట గ్రామాలు.. పంచాయతీలుగా ఏర్పడ్డాయి. ఈ జీపీల్లో తొలి సర్పంచ్ స్థానంలో కూర్చునేది ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది. పంచాయతీ ఎన్నికలపై ప్రధాన రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గ్రామీణ ఓట్లు కీలకం కానుండటంతో, తమ పార్టీ మద్దతుదారులు సర్పంచ్, వార్డు స్థానాలను కైవసం చేసుకునేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఆయా పార్టీల నేతలు.. గెలుపు గుర్రాలను ఎంపిక చేసుకొని, వారికి మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు బుధవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో సమావేశాలు నిర్వహించడం గమనార్హం. మొదటిదశలో ఎన్నికలు జరగనున్న పంచాయతీలకు సంబంధించిన పార్టీల నాయకులు, కార్యకర్తలతో మాట్లాడి దిశా నిర్దేశం చేశారు. నామినేషన్లు వేసిన అనంతరం ప్రజా మద్దతు ఉన్న వారిని గుర్తించి వారికి మాత్రమే మద్దతుగా నిలవనున్నట్లు తెలుస్తోంది. పల్లెల్లో మొదలైన విందులు.. ఆకర్షణలు మొదటి దశకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ‘స్థానికం’లో గెలుపు కోసం ప్రధాన పార్టీల యత్నాలు -
నిబంధనల మేరకు ధాన్యం కొనుగోలు చేయాలి
గణపురం: రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా ఏఫ్ఏక్యూ ప్రమాణాల మేరకే ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అ ధికారి కిరణ్‌కుమార్ అన్నారు. గాంధీనగర్, బుద్దా రం, గణపురంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను సీఎస్సీ రాములు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధా న్యం కొనుగోలు చేసిన వెంటనే సంబంధిత మిల్లులకు తరలించేలా చర్యలు చేపట్టాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం, బిల్లింగ్, రవాణా ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా బాధ్యతాయుతంగా పని చేయాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందిలేకుండా చూడాలన్నారు. -
ముగిసిన తేనెటీగల పెంపకంపై శిక్షణ
కాటారం: జాతీయ మొక్కల ఆరోగ్య నిర్వహణ సంస్థ(ఎన్ఐపీహెచ్ఎం) ఆధ్వర్యంలో భారత ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, జాతీయ తేనెటీగల బోర్డు సారథ్యంలో కాటారం వ్యవసాయ మార్కెట్లో వారం రోజులపాటు నిర్వహించిన తేనెటీగల పెంపకం ఉచిత శిక్షణ కార్యక్రమం బుధవారం ముగిసింది. జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన 25 మంది రైతులకు తేనెటీగల పెంపకంపై అవగాహన కల్పించారు. శ్రీ నేచురల్ హనీ వ్యవస్థాపకురాలు తాళ్లపెల్లి సంజన–రఘుతోపాటు వివిధ ప్రైవేట్ సంస్థల నిపుణులు శిక్షణలో రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. తేనెటీగల వర్గీకరణ, తేనెటీగ పెట్టె, ఉపకరణాల గుర్తింపు, కాలనీ నిర్వహణ, కాలానుగుణంగా నిర్వహణ, తేనె సంగ్రహణ, వ్యాధి, తెగుళ్ల నిర్వహణ వంటి అంశాలపై సైద్ధాంతిక, ఆచరణాత్మక శిక్షణ అందించారు. రైతులు తేనెటీగల పెంపకంతో అదనపు ఆదాయం పొందవచ్చని పలువురు సూచించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్ పర్సన్ పంతకాని తిరుమల, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, ఆత్మకూరి కుమార్‌యాదవ్, పంతకాని మల్లికార్జున్, బొమ్మన భాస్కర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


