చైనా మాంజాతో పక్షులకు ప్రమాదం
● సీసీఎఫ్ డాక్టర్ ప్రభాకర్
భూపాలపల్లి: సంకాంత్రి పండుగ సందర్భంగా పతంగులు ఎగురవేసే సమయంలో చైనా మాంజా వాడటం వలన మనషులతో పాటు పక్షులకు సైతం ప్రమాదం వాటిల్లుతుందని కాళేశ్వరం జోన్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (సీసీఎఫ్) డాక్టర్ ప్రభాకర్ అన్నారు. మాంజా వాడితే కలిగే నష్టాలను వివరించి.. వాల్‌పోస్టర్‌ను మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆయన కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. చైనా, సింథటిక్, గ్లాస్‌తో తయారు చేసిన మాంజాను జాతీయ హరిత ట్రిబ్యునల్, తెలంగాణ ప్రభుత్వం నిషేధించిందన్నారు. ఈ మాంజా దారం తగిలి ప్రతీ ఏటా మనుషులు, పక్షులు మృత్యువాత పడుతున్నాయని అన్నారు. ఎవరైనా ఈ మాంజా విక్రయించినా, వినియోగించినా అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 18004255364కు కాల్ చేసి తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎఫ్‌డీఓ అప్పలకొండ, ఎఫ్‌ఆర్‌ఓ నరేష్, అటవీశాఖ అధికారులు, ఎన్జీవోలు పాల్గొన్నారు.


