మందుల కొరత లేకుండా చూసుకోవాలి
మల్హర్: ఆస్పత్రుల్లో మందుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలని జిల్లా వై ద్యాధికారి మధుసూదన్ ఆదేశించారు. ఈ మే రకు మండలంలోని అన్సాన్‌పల్లి గ్రామ పంచా యతీ పరిధిలోని పల్లె దవాఖానాను బుధవా రం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి రి కార్డులను పరిశీలించి, స్టేట్, ఎన్‌హెచ్‌ఎం ప్రోగ్రాం వివరాలు, ఇమ్యూనైజేషన్ గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దవాఖానాలో మందుల నిల్వలను ఎప్పటికప్పడు సరిచూసుకోని తె ప్పించుకోవాలన్నారు. వాక్సినేషన్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సందీప్, డీడీఎం మధుబాబు, డాక్టర్ కె. ప్రత్యూష, ఏఎన్‌ఎం, ఆశలు పాల్గొన్నారు.
మల్హర్ (కాటారం): చిన్న కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చిన్న కాల్వల నిర్మాణానికి చేపట్టే భూ సేకరణ నిమిత్తం మండలంలోని దామెరకుంట గ్రామంలో బుధవారం ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రమేశ్ ఆధ్వర్యంలో భూ సేకరణ గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా దామెరకుంట గ్రామ పంచాయతీ ఆవరణలో 6.02 ఎకరాలు, మల్లారంలో 17.15, గూడురులో 6.01 ఎకరాలు, జాదరావుపేటలో 5.04 ఎకరాలు మొత్తం దామెరకుంట క్లస్టర్ పరిధిలోని 34.22 ఎకరాల భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డుల ఆధారంగా రైతుల పేర్లును తహసీల్దార్ నాగరాజు గ్రామసభలో చదివి వినిపించారు. అలాగే పలువురి రైతుల నుంచి వచ్చిన అభ్యంతరాలపై దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈ వెంకన్న, ఎస్సై శ్రీనివాస్, ఆర్‌ఐ వెంకన్న, అధికారులు, రైతులు పాల్గొన్నారు.
భూపాలపల్లి రూరల్: సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణలో యువత కీలక పాత్ర పోషించాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. బుధవారం జిల్లాలోని ఓ పంక్షన్ హాల్‌లో సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు అవగాహనతో పాటు బా ధ్యతాయుత పౌరులుగా వ్యవహారించి, తాము నేర్చుకున్న విషయాలను కుటుంబ సభ్యులు, స్నేహితులకు తెలియజేయాలన్నారు. ఆన్‌లైన్ మోసాలు, ఓటీపీలు, అనువాంచిన లింక్‌లు, సోషల్ మీడియా హ్యాకింగ్‌పై అవగాహన కల్పించారు. ఎవరైన సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతీఒక్కరూ హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల కలిగే ప్రమాదాలు, అధిక వేగం కారణంగా జరిగే ప్రాణాంతక ప్రమాదాలపై వీడియోల ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్, భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు, కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, డీటీఓ సంధాన్, సీఐలు, ఎస్సైలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మొగుళ్లపల్లి/ చిట్యాల: గ్రంథాలయాల్లో సమయపాలన పాటించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు అన్నారు. బుధవారం మొగళ్లపల్లి, చిట్యాల మండలకేంద్రాల్లోని గ్రంథాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసి రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠకులకు అందుబాటులో ఉండాలన్నారు. గ్రంథాలయం అనేది చాలా విలువైనదని, రోజు గ్రంథాలయాలకు వచ్చే అలవాటు చాలా మందికి ఉంటుందన్నా రు. నిరుద్యోగులకు పోటీ పరీక్షలకు కావాల్సిన మెటీరియల్‌ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. గ్రంథపాలకురాలు రాణి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, బుర్ర వెంకటేష్, నాయకులు పాల్గొన్నారు.
మందుల కొరత లేకుండా చూసుకోవాలి
మందుల కొరత లేకుండా చూసుకోవాలి
మందుల కొరత లేకుండా చూసుకోవాలి


