భారత్‌కు చెందిన ఇద్దరు ట్రక్ డ్రైవర్లను డ్రగ్స్ కేసులో అమెరికాలోని ఇండియానా పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. 63.01 కోట్ల విలువైన 309 పౌండ్ల కొకైన్ రవాణా చేస్తూ పట్టుబడ్డారు. ఇది లక్షకు పైగా (1,13,000)అమెరికన్లను చంపేంత ప్రమాదకరమని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) ట్రిసియా మెక్‌లాఫ్లిన్ తెలిపారు.
గురుప్రీత్ సింగ్ (25) జస్వీర్ సింగ్ (30) అమెరికాలోని ఇండియానాలో అదుపులోకి తీసుకున్నారు. వీకెండ్ హైవే తనిఖీల్లో అనుమానాస్పందగా ప్రయాణిస్తున్న వీరి వాహనాంలో కొకైన్ తరలిస్తున్నట్టు గమనించి స్నిఫర్ డాగ్ యూనిట్ అధికారులను అప్రమత్తం చేశారు. కోర్టు రికార్డుల ప్రకారం, "ట్రక్కు సెమీ-ట్రక్కు స్లీపర్ బెర్త్‌లో దుప్పటితో కప్పిన అట్టపెట్టెల్లో 140 కిలోల కొకైన్‌ను పోలీసులు గుర్తించారు. దీంతో ఇద్దరు డ్రైవర్లను అరెస్ట్ చేసి పుట్నం కౌంటీ జైలుకు తరలించారు. నిందితులు మాదకద్రవ్యాలను విక్రయించారన్ననేరారోపణలు ఎదుర్కొంటున్నారని, బహిష్కరణ చర్యలు తీసుకుంటామని ఇండియానా రాష్ట్ర పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: బిచ్చగాడిలా బతికాడు, చనిపోయాక డబ్బు కట్టలు చూసి అందరూ షాక్!
అయితే నిందితులు దీన్ని ఖండించారు. ట్రక్కు లోపల ఏముందో తమకు తెలియదని, తమ ట్రక్కింగ్ కంపెనీ ట్రక్కును రిచ్‌మండ్‌లోని ఒక భారతీయ రెస్టారెంట్‌కు తీసుకెళ్లి లోడ్ కోసం వేచి ఉండమని ఆదేశించిందని చెప్పారు. గురుప్రీత్ సింగ్ 2023, మార్చి 11న అరిజోనా నుండి అక్రమంగా యుఎస్‌లోకి ప్రవేశించగా, జస్వీర్ సింగ్ 2017 ,మార్చి 21న కాలిఫోర్నియా నుండి అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించాడని అధికారులు పేర్కొంటున్నారు. వీరిద్దరికీ కాలిఫోర్నియా వాణిజ్య డ్రైవింగ్ లైసెన్స్‌లను మంజూరు చేసింది. మరోవైపు కాలిఫోర్నియాలోని శాన్ బెర్నార్డినోలో చోరీ కేసులో జస్వీర్‌ను గత నెలలో అరెస్టు చేశారు.
ఇదీ చదవండి: మహిళను కాల్చి చంపిన ఇమ్మిగ్రేషన్ ఏజెంట్, వీడియో వైరల్


