భార్యను గొడ్డలితో నరికి హత్య చేసిన భర్త | Husband Kills Wife In Nomula Ranga Reddy District | Sakshi
Sakshi News home page

భార్యను గొడ్డలితో నరికి హత్య చేసిన భర్త

Feb 24 2026 5:22 PM | Updated on Feb 24 2026 5:35 PM

Husband Kills Wife In Nomula Ranga Reddy District

రంగారెడ్డి: మరో దారుణం చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన భర్త.. భార్యను గొడ్డలితో నరికి హత్య చేసిన ఘటన రంగారెడ్డి జిల్లాలోని మంచాల మండలం నోములలో జరిగింది. భార్య నిద్రిస్తున్న సమయంలో భర్త ఈ ఘాతకానికి పాల్పడ్డాడు. 

వివరాల్లోకి వెళితే.. అమృత, బాబులు.. భార్యా భర్తలు.  అయితే మద్యానికి బానిసైన భర్త బాబు.. పదే పదే భార్య అమృతను వేధింపులకు గురి చేస్తున్నాడు. తాగొచ్చి తీవ్రంగా వేధిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇరువురి మధ్య తరుచు గొడవలు జరుగుతూ ఉండేవి. కాగా, అమృత నిద్రిస్తున్న సమయంలో ఆమెను గొడ్డలితో నరికి హత్య చేశాడు. భార్యను హత్య చేసిన అనంతరం భర్త బాబు పరారయ్యాడు. ప్రస్తుతం నిందితుడు బాబు కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది. 


 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement