సాక్షి,హైదరాబాద్: అంబర్‌పేట్‌లో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను రామ్‌రాజ్(55), మాధవి(50), శశాంక్(24)లుగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తెల్లవారుజామున 3.15 గంటలకు స్నేహితుడు రవికి రామ్‌రాజ్ వాట్సాప్ మెసేజ్ చేశాడని.. రామ్‌రాజ్ ఇంటికి రవి వచ్చేసరికి ఉరివేసుకుని దంపతులు కనిపించారని డీసీపీ తెలిపారు.
ఆర్థిక సమస్యలతోనే ఆత్మహత్యకు పాల్పడ్డారని.. అప్పులిచ్చిన వారి బెదిరింపులతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలు ఉన్నాయని డీసీపీ పేర్కొన్నారు. అంబర్‌పేట్‌లో ల్యాండ్ మార్క్ హోటల్ రామ్ రాజ్ నడుపుతున్నారు. శశాంక్ మణికట్టు వద్ద కత్తితో కట్ చేసుకుని ఉరేసుకున్నాడు. సూసైడ్ నోట్ దొరికిందని డీసీపీ తెలిపారు.


