మొగడంపల్లి: సంగారెడ్డి జిల్లా మొగడంపల్లి మండల్ సత్వర్ గ్రామ శివారులోని జాతీయ రహదారి 65పై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను ఆయిల్ ట్యాంకర్ ఢీకొని ఐదుగురు మృతి చెందారు. మరో ముగ‍్గురికి గాయాలయ్యాయి. మృతులది కర్ణాటక రాష్ట్రంలోని రాజగిరా గ్రామంగా పోలీసులు గుర్తించారు.
ఆటోలో మొత్తం 12 మంది ప్రయాణిస్తుండగా ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తీవ్రగాయాలపాలైన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అదే జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం
సంగారెడ్డి జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మూడు కార్లు ఢీ కొన్నఘటనలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. కోహిర్ మండలం కవేలిలో ఈ ప్రమాదం జరిగింది. దాంతో సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందినట్లయ్యింది.


