breaking news
Road Accident
-
సిద్ధిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, సిద్ధిపేట: జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. అదుపు తప్పిన కారు బావిలోకి దూసుకెళ్లడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో దంపతులతో పాటు ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామ శివారులో గురువారం అర్ధరాత్రి సమయంలో చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బల్వంతపూర్‌కు చెందిన రాజు(35), భాగ్య(22) దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి కారులో ప్రయాణిస్తున్నారు. సిద్ధిపేటలో బంధువు మృతి చెందడంతో అక్కడికి వెళ్లి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో కారు అదుపు తప్పింది. వేగంగా వెళ్తున్న సమయంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి కారు దూసుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు.అర్ధరాత్రి దాటినా కుటుంబం ఇంటికి చేరుకోకపోవడంతో బంధువులు ఆందోళనకు గురయ్యారు. రాజు, భాగ్యలకు ఫోన్ చేయగా రెండూ స్విచ్ఛాప్ రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చేపట్టగా అప్పనపల్లి శివారులోని బావిలో కారు ఉన్నట్లు గుర్తించారు.సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు కారులో నుంచి నలుగురి మృతదేహాలను వెలికి తీశారు. మృతులను రాజు, ఆయన భార్య భాగ్య, వారి ఇద్దరు పిల్లలుగా గుర్తించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ప్రమాదాలకు నిలయంగా సిద్ధిపేట రోడ్లు..సిద్ధిపేట జిల్లాలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. జాతీయ రహదారులు, ప్రధాన మార్గాల్లో వాహనాల రద్దీ పెరగడం, వేగ నియంత్రణ లేకపోవడం, ప్రమాదకరమైన మలుపులు, రహదారి భద్రతా లోపాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణించే వాహనదారులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు సూచిస్తున్నారు.ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో బలవంతపూర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నారులను కోల్పోయిన కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కలచివేశాయి. -
మాదాపూర్‌లో విషాదం.. కారు ఢీకొని యువతి మృతి
హైదరాబాద్: రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు ఓ యువతిని ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మాదాపూర్ ఇన్స్పెక్టర్ కేవీ సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం... ఇనార్బిట్ మాల్లోని లైఫ్‌స్టైల్ స్టోర్‌లో పనిచేస్తున్న భారతిముఖి(26), పూడా అశోక్ అలోన్(26) ఈ నెల 16న మధ్యాహ్నం సమీపంలోని ఐటీసీ కోహినూర్ ప్రాంతంలో భోజనం చేశారు. తిరిగి వస్తూ ఇనార్బిట్‌మాల్ ఎదురుగా రోడ్డు దాటుతుండగా సంజుస్ అనే వ్యక్తి నిర్లక్ష్యంగా, అతివేగంగా కారు నడిపి భారతిముఖిని బలంగా ఢీ కొట్టాడు. ఆమె తలకు తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే ఆమెను అదే వాహనంలో జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
చీరతో కట్టేసి.. కర్రతో కొట్టి..
మేడిపల్లి: భర్తను హత్యచేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన భార్య ను మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీర్జాదిగూడకు చెందిన సత్యనారాయణ (51) సునీత దంపతులు. రాత్రి విధులు ముగించుకొని ఆగస్టు 6న మధ్యాహ్నం సత్యనారాయణ ఇంటికి వచ్చాడు. రోజువారీ పనులకు వెళ్లిన సునీత కూడా మధ్యాహ్నం 1.30కు ఇంటికి వచ్చింది. సత్యనారాయణ మద్యం సేవించి రావడంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.భర్త ప్రవర్తనతో తీవ్ర ఆగ్రహానికి గురైన సునీత.. మద్యం మత్తులో ఉన్న సత్యనారాయణ కాళ్లను చీరతో కట్టేసి సెంట్రింగ్ కర్రతో తలపై, ఇతర భాగాలపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన సత్యనారాయణ స్పృహ కోల్పోయాడు. కాగా, దాడి అనంతరం సునీత కుమారుడికి ఫోన్ చేసి సత్యనారాయణ వాహనంనుంచి కింద పడినట్లు చెప్పింది. మొదట బోడుప్పల్‌లోని ఓ ఆసుపత్రికి, అక్కడి వైద్యుల సూచన మేరకు గాంధీ ఆసుపత్రికి తరలించగా.. రాత్రి 10.18 గంటలకు సత్యనారాయణ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.పోలీసులు కేసును మొదట రోడ్డు ప్రమాదంగా నమోదు చేసినప్పటికీ అనంతరం దర్యాప్తులో సత్యనారాయణను భార్య హత్యచేసినట్లు గుర్తించారు. తనను, పిల్లలను మానసికంగా, శారీరకంగా వేధించడంతోనే హత్యచేసినట్లు సునీత అంగీకరించింది. కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం సునీతను కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు. -
రోడ్డు బాలేదు.. బిడ్డ దక్కలేదు
సోంపేట: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలోని సోంపేట మండలం గొల్లవూరు పంచాయతీ దామోదరపురం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి వెళ్లే రోడ్డు అధ్వానంగా తయారవ్వడంతో ఓ గర్భిణి తీవ్ర రక్తస్రావానికి గురై బిడ్డను కోల్పోయింది. ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన వివరాలివీ.. వ్యాపారరీత్యా భువనేశ్వర్‌లో ఉంటున్న యజ్జల లోలాక్షి కుటుంబం శుక్రవారం ఏరినమ్మ పూజ నిమిత్తం స్వగ్రామం దామోదరపురం వచ్చారు. రోడ్డు సరిగ్గా లేకపోవడంతో గర్భిణి లోలాక్షి తీవ్ర ఇబ్బందులుపడి ఇంటికి చేరుకుంది. అప్పటికే రక్తస్రావం కావడంతో ఆస్పత్రికి వెళ్లేందుకు ఆటోలకు ఫోన్‌చేయగా అధ్వాన రోడ్డు కారణంగా వాహనాలు పాడైపోతున్నాయని, తాము రాలేమని చెప్పారు. చివరికి ఓ వ్యక్తిని అతికష్టంమ్మీద ఒప్పించి సోంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యుల సూచనతో అక్కడ నుంచి బరంపురం ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ తల్లీబిడ్డ అపస్మారక స్థితికి చేరుకున్నారు. అనంతరం.. బిడ్డ ప్రాణాలు పోయాయని, తల్లి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. బాధిత తల్లికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అత్యవసర పరిస్థితిలో కనీసం అంబులెన్స్ వాహనం కూడా రాని దుస్థితిలో రోడ్డు ఉన్నందున, ఈ మృతిని ప్రభుత్వ హత్యగా పరిగణనలోకి తీసుకుని బాధితులకు తగిన న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. -
ముందు కొడుకు, తర్వాత భర్త.. ఇప్పుడు తల్లి!
వెంటాడిన మృత్యువు.. రెండేళ్ల వ్యవధిలో ఆ కుటుంబాన్ని పూర్తిగా కబళించింది. మొదట కొడుకు.. ఆ తర్వాత భర్త.. ఇప్పుడు ఆ తల్లే అనంతలోకాలకు వెళ్లిపోయారు. తాడ్వాయి మండలం కొండపర్తి సమీపంలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జిల్లా మార్కెటింగ్ అధికారి కలకోట్ల సురేఖ మృతి చెందడంతో హనుమకొండ జూలైవాడలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబంలో వరుసగా చోటుచేసుకున్న విషాదాలు బంధువులు, స్థానికులను కలచివేశాయి.వరంగల్: ఆ కుటుంబాన్ని విధి పగబట్టింది. మృత్యువు ఒక్కొక్కరిని తన ఒడికి చేర్చుకుంది. రెండేళ్లలో కుటుంబాన్ని మొత్తం కబళించింది. రెండేళ్ల క్రితం కొడుకు, ఐదు నెలల క్రితం భర్త మృతి చెందగా.. శనివారం భార్య సైతం అనంతలోకాలకు చేరుకుంది. హనుమకొండ పెద్దమ్మగడ్డకు చెందిన వరంగల్ మార్కెటింగ్ శాఖ అధికారి (డీఎంఓ) కలకోట్ల సురేఖ(43) శనివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందని తెలుసుకున్న స్థానికుల రోదనలతో పెద్దమ్మగడ్డ దుఃఖసాగరంలో మునిగిపోయింది. మృత్యుపాశమైన ఇసుకలారీ..హనుమకొండలోని పెద్దమ్మగడ్డకు చెందిన కలకోట్ల సురేఖ వరంగల్ డీఎంఓగా విధులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ ఇన్చార్జ్ సెక్రటరీగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. శనివారం ఆమె గుడెప్పాడ్ మార్కెట్ యార్డులో స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం వ్యక్తిగత పనుల నిమిత్తం కారులో చింత విజయబాబు అనే వ్యక్తితో కలిసి ఏటూరునాగారం వైపు వెళ్తున్నారు. ఎదురుగా వస్తున్న ఇసుకలారీ ఢీకొట్టడంతో సురేఖతోపాటు విజయబాబు కూడా దుర్మరణం చెందారు. రోడ్డు ప్రమాదంలో కొడుకు.. అనారోగ్యంతో భర్తసురేఖ, కిరణ్ స్వస్థలం హనుమకొండలోని పెద్దమ్మగడ్డ అయినప్పటికీ పదిహేనేళ్ల క్రితం జూలైవాడలో ఇల్లు నిర్మించుకుని ఉంటున్నారు. సురేఖ ఒక్కగానొక్క కుమారుడు సుక్రీత్ (16) రెండేళ్ల క్రితం క్రికెట్ ఆడేందుకు స్కూటీపై వెళ్తుండగా.. బాలసముద్రంలోని హయగ్రీవాచారి గ్రౌండ్ వద్ద ఓ ప్రైవేట్ స్కూల్ బస్ ఢీకొట్టడంతో అతడు మృతి చెందాడు. సురేఖ భర్త బొక్క కిరణ్ (50) అనారోగ్యంతో బాధపడుతూ ఐదు నెలల క్రితం మృతిచెందాడు. శనివారం సురేఖ కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రెండేళ్లలో కుటుంబమంతా మృత్యు ఒడిలోకి చేరినట్లయ్యిందని కుటుంబీకులు కన్నీటి పర్యంతమవుతున్నారు. చివరి స్టేటస్‌లో కొడుకు జ్ఞాపకాలు..పతాకావిష్కరణ అనంతరం సురేఖ తన విధి నిర్వహణకు సంబంధించిన ఫొటోలను వాట్సాప్‌లో స్టేటస్‌గా పెట్టుకున్నారు. అదే సమయంలో తన కుమారుడు బతికున్నప్పుడు పాఠశాలలో దిగిన ఫొటోలు, అతడితో సరదాగా గడిపిన సందర్భాల ఫొటోలను కూడా స్టేటస్‌గా ఉంచుకున్నారు. తల్లిదండ్రులకు తీరని శోకంకొడుకు, భర్త మరణించిన తర్వాత సురేఖ తన వృద్ధ తల్లిదండ్రులతో కలిసి జూలైవాడలోని ఇంట్లో నివసిస్తున్నారు. సురేఖ తండ్రి సురేందర్ సీపీఓ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. కూతురుకు వరుసగా ఎదురైన విషాదాలను తలచుకుంటూ ఇప్పుడు ఆ వృద్ధ దంపతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ‘ముందు మనవడిని.. ఆ తర్వాత అల్లుడిని కోల్పోయాం.. ఇప్పుడు కూతురిని కూడా కోల్పోయాం.. ఈ ఘోరాన్ని ఎలా భరించాలి..?’ అంటూ బంధువులను పట్టుకుని వారు గుండెలవిసేలా రోదించడం అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. సురేఖకు ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. సురేఖ మృతదేహానికి ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విషాదంలో పాలకవర్గం, సిబ్బందిఅప్పటివరకు తమతో ఉన్న అధికారి రోడ్డు ప్రమాదంలో మృతిచెందారన్న విషయం తెలియగానే గూడెప్పాడ్ మార్కెట్ పాలకవర్గం, సిబ్బంది, వరంగల్ మార్కెటింగ్‌శాఖ అధికారులు విషాదంలో మునిగిపోయారు. మంచి అధికారిని కోల్పోయామని పాలకవర్గం విచారం వ్యక్తం చేసింది. సిబ్బంది.. అధికారి సురేఖతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కంటతడి పెట్టుకున్నారు. -
బోనాలకు పండగకు వెళ్తుండగా..
హైదరాబాద్: బోనాల పండగ కోసం కుటుంబ సభ్యులతో కలిసి సొంతూరుకు వెళ్తుండగా.. మృత్యురూపంలో వచ్చిన ఓ లారీ.. యువతిని బలి తీసుకుంది. ఈ విషాదకర ఘటన ఘట్కేసర్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వారాసిగూడలో ఉంటున్న గూబ సురేశ్, ఉమారాణి దంపతులు కూతురు శ్రావణి (30)తో కలిసి ఆదివారం జరిగే బోనాల పండగకు సొంతూరైన వరంగల్ జిల్లా రాయపర్తి మండలం సన్నూర్ గ్రామానికి ద్విచక్ర వాహనంపై శనివారం బయలుదేరారు. ఘట్కేసర్ బైపాస్ రోడ్డులో వందన హోటల్ హెచ్‌పీ పెట్రోల్ పంపు వద్దకు చేరుకోగానే అతివేగంతో వచ్చిన లారీ వెనక వైపు నుంచి వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. దీంతో ద్విచక్ర వాహనం రోడ్డుపై పడిపోగా వెనక కూర్చున్న తలకు తీవ్రగాయాలు కావడంతో శ్రావణి అక్కడికక్కడే దుర్మరణం చెందింది. సురేశ్, ఉమారాణికి స్వల్ప గాయాలయ్యాయి. లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కేంద్ర ప్రభుత్వ పీఎఫ్ ఉద్యోగిని మేధ మృతి
బొమ్మనహళ్లి: బెంగళూరు నగర శివారులోని ఆనేకల్ తాలూకా హెబ్బగోడి దగ్గర అనంతనగరలో బైక్‌పై వెళ్తున్న యువతి గుంతల రోడ్డుకు బలైంది. కేరళకు చెందిన మేధ (32) మృతురాలు. ఆమె ఎలక్ట్రానిక్ సిటీలోని కేంద్ర ప్రభుత్వ పీఎఫ్ ఆఫీసులో ఉద్యోగిని. వివరాలు.. మేధ తన స్నేహితుడు అజయ్ గురుతో కలిసి బుధవారం సాయంత్రం బైక్‌పై వెళ్తోంది. ఈ సమయంలో, ముందు వెళ్తున్న కారు డ్రైవర్ గుంతను చూసి హఠాత్తుగా బ్రేకులు వేశాడు. వెనుక వస్తున్న అజయ్ బైక్ గాభరాపడి బ్రేక్ నొక్కగా అదుపుతప్పి కింద పడిపోయారు. వెనుక నుంచి వస్తున్న ఓ గూడ్స్ వ్యాన్ మేధ మెడపై నుంచి దూసుకెళ్లింది. ఆమెకు తీవ్ర రక్తస్రావమై అక్కడే మరణించింది. ఇదంతా క్షణాల్లోనే జరిగింది.స్థానికుల నిరసనఈ ఘోరాన్ని చూసిన స్థానికులు, వాహనదారులు రోడ్డును దిగ్బంధించారు. కొవ్వొత్తులు వెలిగించి, మేధ ఆత్మశాంతి కోసం ప్రార్థించారు. ఎలక్ట్రానిక్ సిటీ పరిసరాల్లోని రోడ్లు చాలా అధ్వాన్నంగా, గుంతలతో నిండి ఉన్నాయని, అందువల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తక్షణం రోడ్లను బాగు చేయాలని కోరారు. హెబ్బగోడి, ఎలక్ట్రానిక్ సిటీ ట్రాఫిక్ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. -
తిరుగు ప్రయాణంలో విషాదం.. అన్నదమ్ముల పిల్లలు మృత్యు ఒడికి!
హైదరాబాద్, మోతీనగర్: మూడు కుటుంబాలు కలిసి దైవ దర్శనం చేసుకున్నాయి. తిరుగు పయనంలో నగరానికి బయలుదేరాయి. ఈ క్రమంలో వీరు వస్తున్న వాహనం అదుపుతప్పడంతో ఇద్దరు బాలురు మృతి చెందిన విషాదకర ఘటన షోలాపూర్‌లో చోటుచేసుకుంది.వివరాలు ఇలా ఉన్నాయి.. కూకట్పల్లి పరిధి గాయత్రీనగర్ డివిజన్ శ్రీ వివేకానంద నగర్‌లోని మూడు కుటుంబాలకు చెందిన సుమారు 15 మంది బుధవారం తెల్లవారుజామున మహారాష్ట్రలోని తుల్జా భవానీ మాత దర్శనానికి వెళ్లి ఇదేరోజు తిరిగి నగరానికి వస్తుండగా.. షోలాపూర్ ఉమగ్రా వద్ద ఉదయం 10.30 గంటలకు వాహనం అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఉజ్వల్ చౌదరి (12), దివేష్ చౌదరి (11) మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రంగా, ఇద్దరికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఇంటర్ విద్యార్థిని డింపుల్ (17) తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.మూలమలుపు కారణంగా వాహనాలు సరిగా కనిపించకపోవడంతో రోడ్డు ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతి చెందిన చిన్నారులు ఉజ్వల్, దివేష్ వరుసకు అన్నదమ్ములు. 6వ తరగతి చదువుతున్నారు. ఉజ్వల్ చౌదరి తండ్రి గణేష్, తల్లి రేఖ. దివేష్ చౌదరి తండ్రి చోగారాం, తల్లి చంపాదేవి. వీరు ఇరువురు కూడా వరుసకు అన్నదమ్ములే. వీరంతా బంగారం వ్యాపారం చేస్తుంటారు. మృతులకు గురువారం వి.రామారావు నగర్‌లోని హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిపారు. బాధిత కుటుంబ సభ్యులను కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తదితరులు పరామర్శించారు. -
పది నిమిషాల్లో చేరుకోవాలి!
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదాల బాధితులకు సత్వర చికిత్స అందించే లక్ష్యంతో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాద సమాచారం అందుకున్న పది నిమిషాల్లోపు ప్రమాద స్థలానికి చేరుకోవాలని, లేదంటే రూ.పదివేల జరిమానా విధిస్తామని అంబులెన్సు సరీ్వసులను హెచ్చరించింది. ఈ నిబంధన ప్రమాద స్థలికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్ని అంబులెన్సులకు వర్తిస్తుందని తెలిపింది. అంతేకాకుండా... అంబులెన్సులు టికెట్‌ను అంగీకరించిన గంటలోపు బాధితులను సమీప ఆసుపత్రులకు తీసుకు రావాలని స్పష్టం చేసింది. ఈ గడువును ఉల్లంఘించినా ఒక్కో ఘటనకు రూ.పదివేల జరిమానా తప్పదని తెలిపింది. ఈ మేరకు ఎన్హెచ్ఏఐ తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రమాద స్థలం పది కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉంటే దూరాన్ని బట్టి చేరుకోవాల్సిన సమయాన్ని పెంచుతామని జీపీఎస్ డేటా/ఐఎంఎస్ కేర్ డ్యాష్‌బోర్డ్ ద్వారా ధ్రువీకరిస్తామని ఎన్హెచ్ఏఐ వివరించింది. ఎన్హెచ్ఏఐ పరిధిలో సుమారు 50,000 కిలోమీటర్ల రహదారులను కవర్ చేస్తూ దాదాపు 3,000 అంబులెన్స్‌లు, 1,000 పెట్రోలింగ్ వాహనాలు, క్రేన్లు ఉన్నాయి. అత్యవసర సమయాల్లో అంబులెన్సులు టికెట్ తిరస్కరించినా రూ.10 వేల జరిమానా విధిస్తామని తెలిపింది. ఎన్హెచ్ఏఐతో చేసుకున్న ఒప్పందాల ప్రకారం అంబులెన్సులు అన్ని పరికరాలు, మందులు, సిబ్బందిని అందుబాటులో ఉంచాలని తెలిపింది. లేకపోతే రూ.10 వేల జరిమానా విధిస్తామని పేర్కొంది. -
తీర్థయాత్రలో విషాదం
ఆర్మూర్ టౌన్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం గోవింద్‌పేట్ సమీపంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతిచెందారు. పోలీ సులు తెలిపిన వివరాలు.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వట్ ప్రాంతానికి చెందిన భక్తులు హైదరాబాద్‌లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించడానికి రెండు టూరిస్ట్ బస్సులలో బయలు దేరారు. ఆర్మూర్ మండల పరిధిలోని గోవింద్‌పేట్ బ్రిడ్జి సమీపంలో జాతీయ రహ దారిపై ఓ బస్సు టైర్ పంక్చర్ కావడంతో దానిని డివైడర్ పక్కనే నిలిపివేశారు. ఆ బస్సు నలుపు రంగులో ఉండటంతో వెనకనుంచి వచ్చే వాహనాలకు కనిపించదన్న ఉద్దేశంతో రెండో బస్సును దాని వెనకాలే నిలిపారు.కొందరు టూరిస్ట్‌లు కిందికి దిగి డివైడర్‌పై కూర్చున్నారు. ఇదే సమయంలో వెనక నుంచి వేగంగా వచ్చిన ఓ లారీ.. ఆగి ఉన్న టూరిస్ట్ బస్సును బలంగా ఢీకొట్టింది. దీంతో ఆ బస్సు ముందుకు కదిలి డివైడర్ ప్రాంతంలో కూర్చున్న మహిళలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సుజాత (54), మాధవి (47) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడడంతో వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. -
కళ్లు చెదిరే వేగం.. ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాగ్‌పూర్‌లోని పవన్గావ్–భరత్వాడా వి-పాయింట్ రోడ్డుపై వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. బుధవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదం దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.సీసీటీవీ ఫుటేజ్‌లో కారు అత్యంత వేగంగా దూసుకొస్తూ ఎలాంటి బ్రేకులు వేయకుండానే ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టినట్లు కనిపిస్తోంది. ఢీకొన్న వేగానికి కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద తీవ్రతకు కారులో ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడటంతో అతడిని ఆస్పత్రికి తరలించారు.మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన యువకుడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కలమ్నా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు. సీసీటీవీ ఫుటేజ్మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతినాగ్పూర్లోని భరత్వాడా చౌక్ వద్ద అతివేగంగా దూసుకొచ్చి ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారుదీంతో కారులో ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించగా, తీవ్ర గాయాలపాలైన మరో యువకుడు pic.twitter.com/k2Q3moSozR— Telugu Scribe (@TeluguScribe) August 13, 2026 -
సాహస రైడ్ సరదా తీరకముందే..
బైక్ రైడ్ అంటే ఆమెకు ఎంతో ఇష్టం. ఆ ఆసక్తితోనే తరచూ సాహస యాత్రలు చేసే ఆమె.. మరో ప్రయాణానికి ఎంతో ఉత్సాహంగా బయలుదేరింది. కానీ ఆ సాహస యాత్ర కాస్తా విషాదాంతంగా మారింది. ఎదురుగా వచ్చిన భారీ ట్రక్కు ఆమె బైక్‌ను ఢీకొట్టి కొంత దూరం ఈడ్చుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించినా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన బైకింగ్ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.ముంబైకి చెందిన 24 ఏళ్ల యువ బైకర్ రిద్ధి థక్కర్(Riddhi Thakkar) ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. బైక్ ప్రయాణాలంటే ఎంతో ఆసక్తి ఉన్న రిద్ధి.. వాటిని వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలోనూ పాపులారిటీని సంపాదించుకున్నారు. అయితే.. బస్తర్ టూర్‌కు వెళ్లిన మహిళా బైకర్ల బృందంలో ఉన్న ఆమె అనూహ్య రీతిలో ప్రాణాలు పొగొట్టుకున్నారు. దీంతో.. బైకింగ్ కమ్యూనిటీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ఢీ కొట్టి.. ఆపై ఈడ్చుకెళ్లి..ముంబై కందివలీ వెస్ట్‌కు చెందిన రిద్ధి థక్కర్.. దాదాపు 23 మంది మహిళా బైకర్ల బృందంతో ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతాన్ని సందర్శించేందుకు బయలుదేరారు. రాయ్‌పూర్ నుంచి కాంకేర్ వైపు వెళ్తుండగా ధమ్తరి జిల్లా మార్కటోలా ఘాట్ సమీపంలో ఈ ఘోరం జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. బైకర్ల బృందంలోని పలువురు ముందుకు వెళ్లిపోగా, రిద్ధి మరికొందరు వెనుక వస్తున్నారు. ఈ సమయంలో ఎదురుగా వచ్చిన భారీ ట్రైలర్ ఆమె బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు రిద్ధి రోడ్డుపై పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు.ఆస్పత్రికి తరలించినా దక్కని ప్రాణంప్రమాదాన్ని గమనించిన తోటి బైకర్లు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. అత్యవసర సేవలకు సమాచారం అందించి రిద్ధిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ధమ్తరిలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.పరారీలో డ్రైవర్.. కొనసాగుతున్న దర్యాప్తుప్రమాదం అనంతరం ట్రక్కు డ్రైవర్ వాహనంతో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాద స్థలంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తూ వాహనం, డ్రైవర్‌ను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. రిద్ధి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ధమ్తరి జిల్లా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆమెతో కలిసి ప్రయాణించిన ఇతర బైకర్ల నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న ధమ్తరి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం యువతి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ విషాద సమయంలో కుటుంబానికి అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. -
రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం
విశాఖపట్నం: భీమిలి మండలం తాళ్లవలస పంచాయతీ పరిధిలో ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొనడంతో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా, మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లా రాజాంలోని జీఎంఆర్‌ఐటీ కళాశాలలో బీటెక్ చదువుతున్న ఆర్.గౌతమ్ (22), పోతురాజు రవికిరణ్ (21) భీమిలిలోని ఒక హోటల్లో ఇంటర్న్íÙప్ కోసం వచ్చారు. మంగళవారం సాయంత్రం వీరు బైక్‌పై జేవీ అగ్రహారం నుంచి తాళ్లవలస వైపు వెళ్తుండగా, భీమిలి–క్రాస్‌రోడ్డు రహదారి దాటుతున్న సమయంలో విశాఖ నుంచి భీమిలి వైపు వస్తున్న ‘999’ నంబర్ గల ఆర్టీసీ బస్సు వీరి బైక్‌ను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో గౌతమ్ అక్కడికక్కడే మృతి చెందగా, రవికిరణ్ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని వెంటనే విశాఖలోని ఒక కార్పొరేట్ ఆస్పత్రిలో చేరి్పంచారు. గౌతమ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు గౌతమ్ స్వస్థలం పెందుర్తి కాగా, గాయపడిన రవికిరణ్ విజయనగరం జిల్లా తెర్లాం మండలం గంగన్నపాడుకు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8మంది మృతి
-
జంగారెడ్డిగూడెంలో ఘోర బస్సు ప్రమాదం.. 30 మంది ప్రయాణికులు..
సాక్షి, ఏలూరు: ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. జంగారెడ్డిగూడెం పుట్లగట్లగూడెం గ్రీన్ ఫీల్డ్ హైవేపై ఆగి ఉన్న లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. దీంతో, హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.వివరాల ప్రకారం.. పుట్లగట్లగూడెం గ్రీన్ ఫీల్డ్ హైవేపై బుధవారం తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని ఇంటర్సిటీ స్మార్ట్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉండటంతో వారంతా తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకున్న గాయపడిన వారిని ఆసుపత్రి తరలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
రెండు రోడ్డు ప్రమాదాలు.. 8మందిమృతి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి /జహీరాబాద్ టౌన్: సంగారెడ్డి జిల్లా పరిధిలో 65వ జాతీయరహదారిపై మంగళవారం జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 8 మంది మృతి చెందారు. కర్ణాటక సరిహద్దుల్లోని జహీరాబాద్ మండలం సత్వార్ వద్ద ఆటోను వెనుక నుంచి ట్యాంకర్ బలంగా ఢీ కొట్టడంతో నలుగురు మహిళా కూలీలు రేఖ, శ్రీదేవి, కవిత, రేష్మ, ఆటో డ్రైవర్ దేవదాస్ అక్కడికక్కడే మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆటో డ్రైవర్ భార్య, కూలీ నిఖిత మృతి చెందింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జయింది. మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. గాయాలపాలైన ఏడుగురిని బీదర్, సంగారెడ్డి ఆస్పత్రులకు తరలించారు. మృతులంతా కర్ణాటకలోని రాజ్పూర్ గ్రామానికి చెందిన వారు. వీరంతా పనుల కోసం జహీరాబాద్ ప్రాంతానికి వచ్చి.. పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న ఆటో జహీరాబాద్ వైపు నుంచి కర్ణాటకలోని తమ సొంతూరు రాజ్పూర్ వైపు వెళ్తుండగా ఓ లారీ యూ టర్న్ తీసుకుంటోంది. ఆ లారీని తప్పించబోయిన డ్రైవర్ ఆటోను పక్కకు తీయడంతో వెనుక నుంచి వేగంగా వస్తున్న ట్యాంకర్ ఢీకొని ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. వెనుక వైపు నుంచి వస్తున్న వాహనాన్ని గమనించకుండా పక్కకు తిప్పడంతో ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఆటోలో మొత్తం 12 మంది ప్రయాణిస్తున్నారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలాన్ని సంగారెడ్డి ఎస్పీ పరితోశ్ పంకజ్ పరిశీలించారు. డివైడర్‌ను ఢీకొట్టి ఎగిరి పడిన కారు సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం వెంకటాపూర్ చౌరస్తా వద్ద ఇదే హైవేపై జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. జహీరాబాద్ వైపు నుంచి హైదరాబాద్‌కు వేగంగా వెళ్తున్న కారు డివైడర్‌ను ఢీకొని ఎగిరి రోడ్డుకు అవతలి వైపు ఎదురుగా వస్తున్న మరో కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎంఆర్ఎఫ్ కంపెనీ ఉద్యోగి మల్లన్న, శంకర్ మృతి చెందారు. వీరు సదాశివపేటకు చెందిన వారుగా భావిస్తున్నారు. సీఎం దిగ్భ్రాంతి: సత్వార్ రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంపై మంత్రి దామోదర రాజనర్సింహ, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మాజీ మంత్రి హరీశ్‌రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
సంగారెడ్డి జిల్లాలో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు.. 7గురి మృతి
మొగడంపల్లి: సంగారెడ్డి జిల్లా మొగడంపల్లి మండల్ సత్వర్ గ్రామ శివారులోని జాతీయ రహదారి 65పై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను ఆయిల్ ట్యాంకర్ ఢీకొని ఐదుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. మృతులది కర్ణాటక రాష్ట్రంలోని రాజగిరా గ్రామంగా పోలీసులు గుర్తించారు. ఆటోలో మొత్తం 12 మంది ప్రయాణిస్తుండగా ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తీవ్రగాయాలపాలైన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.అదే జిల్లాలో మరో రోడ్డు ప్రమాదంసంగారెడ్డి జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మూడు కార్లు ఢీ కొన్నఘటనలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. కోహిర్ మండలం కవేలిలో ఈ ప్రమాదం జరిగింది. దాంతో సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందినట్లయ్యింది. -
బయటికి రావాలంటే రూ.84 లక్షల బ్లడ్‌మనీ చెల్లించాల్సిందే..
నిజామాబాద్: పొట్టకూటి కోసం వలస వెళ్లిన యువకుడు సౌదీ అరేబియా దేశంలోని రియాద్ జైలులో మగ్గుతున్నాడు. అతడిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న దివ్యాంగురాలైన భార్య చంటి బిడ్డను పట్టుకుని భర్త రాకకోసం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. తమ బిడ్డ తిరిగి రావాలని ఆ యువకుడి తల్లిదండ్రులు దేవుళ్లను వేడుకుంటున్నారు. కుటుంబాన్ని కష్టాల నుంచి గట్టెక్కిస్తాననే ఆశతో వలస వెళ్లిన యువకుడు శ్రావణ్‌కుమార్ కుటుంబ పరిస్థితి ఇది. సాలూర మండలం కుమ్మన్‌పల్లి గ్రామానికి చెందిన కుమ్మరి రామయ్య, రాజమణి దంపతుల కుమారుడు శ్రావణ్‌కుమార్ (32). జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం చింతల్‌పేటకు చెందిన దివ్యాంగురాలు మమతను 2022లో శ్రావణ్ పెళ్లి చేసుకున్నాడు. 2023 నవంబర్‌లో ఉపాధి కోసం సౌదీ అరేబియా దేశం రియాద్‌కు వెళ్లిన శ్రావణ్ అక్కడి ఓ ప్రైవేట్ మెడికల్ రీసెర్చ్ కంపెనీలో అంబులెన్స్ డ్రైవర్‌గా పనిలో చేరాడు. మంచి ఉద్యోగం రావడంతో తన కలలు సాకరమవుతాయని సంబురపడిన శ్రావణ్‌పై కోలుకోలేని దెబ్బపడింది. 2024 మే 6వ తేదీన శ్రావణ్ నడుపుతున్న అంబులెన్స వాహనం రోడ్డు ప్రమాదానికి గురికాగా.. ఈ ప్రమాదంలో స్థానికులైన భార్యాభర్తలు మృతి చెందారు. ఇద్దరు పిల్లలకు తీవ్రగాయాలయ్యాయి. అక్కడి పోలీసులు శ్రావణ్‌ను అరెస్టు చేసి జైలు తరలించారు. కొన్ని నెలల్లోనే అక్కడి న్యాయస్థానం తీర్పు వెలువరించింది. రోడ్డు ప్రమాద ఘటనకు శ్రావణ్‌కుమార్‌ను నేరస్థుడిగా నిర్ధారించింది. రూ.3.30 లక్షల సౌదీ రియాళ్లు (బ్లడ్ మనీ – రక్తపరిహారం) బాధితకుటుంబానికి చెల్లించాలని తీర్పులో పేర్కొంది. మన దేశ కరెన్సీలో ఆ మొత్తం సుమారు రూ.84 లక్షలు. బాధిత కుటుంబాల అంగీకారం మేరకు పరిహారం చెల్లిస్తే శ్రావణ్‌కుమార్‌కు జైలు నుంచి విముక్తి పొందే అవకాశం కలుగుతుంది. పరిహారం చెల్లించకపోతే జైలు నుంచి విడుదలయ్యే పరిస్థితి ఉండదు. అంత పెద్ద మొత్తంలో పరిహారం చెల్లించే ఆర్థిక స్థోమత లేక శ్రావణ్‌కుమార్ కుటుంబీకులు నిస్సహాయ స్థితిలో ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. శ్రావణ్‌కుమార్ పై అక్కడి దేశం ట్రావెలింగ్ బ్యాన్ ఆంక్షలు పెట్టింది. గడపగడపకు వెళ్తున్న మమత తన భర్తను జైలు నుంచి విడిపించాలని దివ్యాంగురాలైన మమత కొన్ని నెలలుగా ప్రజాప్రతినిధులను వేడుకుంటోంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌తోపాటు నిజామాబాద్, జగిత్యాల జిల్లాకు చెందిన ఎంపీకి, పలువురు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు వినతి పత్రాలు అందజేసింది. ఈ ఏడాది మే 29న హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రవాసీ ప్రజావాణిలో తమ పరిస్థితిని వివరించింది. తన భర్తను తీసుకురావాలని వేడుకుంది. ప్రభుత్వం ఆదుకోవాలి మాది నిరుపేద కుటుంబం. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న నా కొడుకు రెండేళ్ల నుంచి సౌదీ అరేబియా జైలులో ఉన్నాడు. రెక్కల కష్టంపై బతుకుతున్నాం. మాకు ఎలాంటి ఆస్తులు లేవు. లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకురావాలి. – కుమ్మరి రామయ్య, శ్రావణ్‌కుమార్ తండ్రి మమ్మల్ని ఆదుకోండి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, మానవతావాదులు స్పందిస్తేనే మా కుటుంబం ఈ గండం నుంచి గట్టెక్కుతుంది. నేనే దివ్యాంగురాలిని చంటి బిడ్డను పట్టుకుని తిరుగుతున్నా. మా అత్తామామలు తల్లడిల్లుతున్నారు. సౌదీ అరేబియా కోర్టు చెప్పిన జరిమానా చెల్లించే స్థోమత మాకు లేదు. – మమత, శ్రావణ్‌కుమార్ భార్య -
హెల్మెట్ లేకపోవడం వల్లే 54 వేల మందికి పైగా మృతి.. గడ్కరీ షాకింగ్ నిజాలు!
న్యూఢిల్లీ: మన దేశంలో రోడ్డు ప్రమాదాల తీవ్రతపై కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో యుద్ధాలు, వ్యాధుల కంటే రోడ్డు ప్రమాదాలే ఎక్కువ ప్రాణాలను బలితీసుకుంటున్నాయని అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన రోడ్డు భద్రతా కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడారు. దేశంలో ప్రతి ఏడాది దాదాపు 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటిలో 1.8 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మృతుల్లో 66 శాతం మంది యువతే ఉండటం అత్యంత బాధాకరం. గతేడాది హెల్మెట్ ధరించకపోవడం వల్లే 54,132 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం రోడ్డు ప్రమాద మరణాల్లో 45 శాతం ద్విచక్ర వాహనదారులవే. ‘ప్రతి గంటకు మన రోడ్లపై 20 మంది చనిపోతున్నారు. ఇంతటి స్థాయిలో మరణాలు యుద్ధాల్లో, వ్యాధుల్లో కూడా కనిపించవు’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.బ్లాక్ స్పాట్ల తొలగింపునకు రూ.40 వేల కోట్లుప్రమాదాలకు కారణమవుతున్న ప్రమాదకర ప్రాంతాలు (బ్లాక్ స్పాట్లు) తొలగించేందుకు కేంద్రం రూ.40 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. దేశవ్యాప్తంగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న 100 జిల్లాలను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. భారత్ ప్రస్తుతం అమెరికా, చైనాల తర్వాత ప్రపంచంలోనే మూడో అతిపెద్ద రోడ్డు నెట్వర్క్ కలిగిన దేశంగా ఎదిగింది. అదే సమయంలో ప్రపంచంలోనే అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరిగే దేశంగా ఉండటం విచారకరం. మానవ ప్రవర్తనే అతిపెద్ద సమస్యరోడ్డు ప్రమాదాల నియంత్రణలో మౌలిక వసతులు, చట్టాల అమలుతో పాటు ప్రజల ప్రవర్తనలో మార్పు కూడా అవసరం. మానవ ప్రవర్తనే మన అతిపెద్ద బలహీనత అన్న ఆయన రోడ్డు భద్రతపై చిన్న వయసు నుంచే అవగాహన కల్పించేందుకు 10, 12 తరగతుల విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాం. రోడ్డు ప్రమాదాల కారణంగా దేశ జీడీపీలో ప్రతి ఏడాది దాదాపు 3 శాతం నష్టం వాటిల్లుతోంది. రోడ్డు భద్రత ప్రభుత్వానిదే బాధ్యత కాదు. ప్రజలు, సంస్థలు, పరిశ్రమలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత.. జాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం ద్వారా వేలాది ప్రాణాలను కాపాడవచ్చని గడ్కరీ పిలుపునిచ్చారు. -
హైదరాబాద్ రోడ్ యాక్సిడెంట్ లో జవాన్ మృతి
-
నర్సాపూర్ అర్బన్ పార్క్‌కు వెళ్లి వస్తుండగా.. విషాదం!
హైదరాబాద్: మెదక్ జిల్లాలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన విద్యార్థి దుర్మరణం చెందారని నర్సాపూర్ ఎస్సై రంజిత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మియాపూర్‌కు చెందిన షేక్ హసిన్ మెహతా(19) బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు.స్నేహితులు వెంకటగిరీష్, చంద్ర, దేవ సునందన్ సాయితో కలిసి మియాపూర్ నుంచి ఆదివారం ఉదయం నర్సాపూర్ అటవీ ప్రాంతంలోని అర్బన్ పార్క్ సందర్శనకు బైక్‌లపై వచ్చారు. అనంతరం తిరుగుప్రయాణంలో కొండాపూర్ సమీపంలోని టర్నింగ్ వద్ద బైక్ అతివేగంగా రెయిలింగ్‌ను ఢీకొట్టగా హసిన్ మెహతాకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని వెంటనే నర్సాపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
రోడ్డు ప్రమాదంలో డీసీపీ కుమార్తె దుర్మరణం
గుంటూరు రూరల్: గుంటూరు జిల్లా ఏటుకూరు బైపాస్ వద్ద హైవేపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షేక్ షిరీన్‌బేగం కుమార్తె అఫీఫా(24) దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయపడ్డారు. అఫీఫా తాడేపల్లిలో జిమ్‌కు వెళుతుంటారు. జిమ్ యజమాని రుతి్వక్, రోజూ జిమ్‌కు వచ్చే వంశీ, సుదీర్, అవినాష్ లు ఆమెకు స్నేహితులయ్యారు. వీరు ఆదివారం చీరాల బీచ్‌కి వెళ్లేందుకు విజయవాడ నుంచి కారులో బయలుదేరారు. ఏటుకూరు బైపాస్ వద్ద హైవేలో వెళుతుండగా ముందువెళుతున్న ప్రభుత్వ పౌరసరఫరాలశాఖ రేషన్ తరలించే లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో వెనుక వస్తున్న కారు అదుపు తప్పి లారీని, డివైడర్‌ను ఢీకొంది. కారు డ్రైవ్ చేసు్తన్న అవినాష్, సుధీర్, వంశీ, రుత్విక్‌లు గాయపడ్డారు. కారు వెనుక సీట్లో కూర్చున్న అఫీఫా తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి, గాయపడినవారిని హైవేలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం విషయం తెలిసి ఆస్పత్రికి చేరుకున్న డీసీపీ షిరీన్.. తన కుమార్తె మరణించిందన్న విషయం తెలిసి స్పృహ కోల్పోయారు. ఆమెకు వైద్యులు చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అఫీఫా మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. నల్లపాడు సీఐ భాస్కర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అత్యంత బాధాకరం: మాజీ సీఎం జగన్ సాక్షి, అమరావతి: విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం కుమార్తె అఫీఫా(24) రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. గుంటూరు ఏటుకూరు బైపాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అఫీఫా మృతి చెందడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుమార్తెను కోల్పోయిన షిరీన్ బేగం, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి,అనంతపురం: హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని పామిడి మండలం పొగరూరు పరిధిలో వేగంగా ప్రయాణిస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, ఎదురుగా వస్తున్న ఐషర్ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ప్రైవేట్ బస్సు నియంత్రణ కోల్పోయి, హైవేపై ఉన్న ఒక కల్వర్టు పైనుంచి కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 18 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం కారణంగా రెండు వాహనాల ముందు భాగాలు పూర్తిగా నలిగిపోవడంతో, బస్సు, ఐషర్ వాహనాల డ్రైవర్లు క్యాబిన్లలోనే ఇరుక్కుపోయారు. పోలీసులు, స్థానిక ప్రజలు తీవ్రంగా శ్రమించి, వాహనాల భాగాలను కట్ చేసి ఇద్దరు డ్రైవర్లను సురక్షితంగా వెలుపలికి తీశారు. గాయపడిన డ్రైవర్ల పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులందరినీ వెంటనే చికిత్స నిమిత్తం పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ ప్రమాదంతో హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, పోలీసులు వాహనాలను పక్కకు తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఘోర బస్సు ప్రమాదం.. ఏడుగురు మృతి, 11 మందికి గాయాలు
సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. చంబా జిల్లాలోని తిస్సా-బైరాగఢ్ మార్గంలో శనివారం ఉదయం ఓ ప్రైవేట్ ప్రయాణికుల బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా.. మరో 11 మంది గాయపడ్డారు. బస్సు సుమారు 100 అడుగుల లోతైన లోయలో పడిపోయినట్లు అధికారులు తెలిపారు.వివరాల మేరకు.. బైరాగఢ్-తిస్సా ప్రాంతంలోని చలుంజ్ మోడ్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు రహదారి నుంచి అదుపుతప్పి లోయలో పడటంతో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, పోలీసులు, సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. లోయలో చిక్కుకున్న వారిని బయటకు తీసి చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తాజా సమాచారం. మరో 11 మంది గాయపడగా.. వారిలో కొందరి పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతం కొండలు, లోయలతో కూడిన క్లిష్టమైన భూభాగం కావడంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురైనట్లు సమాచారం. బస్సు అదుపుతప్పడానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం, రహదారి పరిస్థితులు, కొండ ప్రాంతంలోని ప్రమాదకర మలుపులు వంటి అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి ముందు బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారన్న దానిపైనా అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. మృతుల వివరాలను గుర్తించే ప్రక్రియ కూడా కొనసాగుతోంది. Tragic bus accident in Tissa, Chamba.A private bus travelling from Bairagarh to Chamba fell off the road near Chaluj Mor this morning. 7 people have died and 11 are injured. A total of 18 passengers were reportedly on board.Rescue operations are underway. pic.twitter.com/omtd94ugif— Naughty Himachal (𑚝𑚵𑚔𑚯 𑚩𑚮𑚢𑚭𑚏𑚥) (@NaughtyHimachal) August 8, 2026 చంబా జిల్లాలో కొండ ప్రాంత రహదారులపై వరుస ప్రమాదాల నేపథ్యంలో తాజా ఘటన మరోసారి ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్‌లో వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో రహదారులపై కొండచరియలు విరిగిపడటం, రాళ్లు జారిపడే ప్రమాదం కూడా ఉందని వాతావరణ హెచ్చరికలు ఉన్నాయి. దీంతో కొండ మార్గాల్లో ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తాజా ప్రమాదంపై మరిన్ని వివరాలు దర్యాప్తు పూర్తయ్యే కొద్దీ వెల్లడయ్యే అవకాశం ఉంది. -
అసాద్ నుంచి ఆబాన్ వరకు.. మృత్యుపాశంలో అతీక్ కుటుంబం!
లక్నో: మాఫియా డాన్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ కుటుంబంలో గత మూడేళ్లుగా వరుస విషాదాలు అలుముకున్నాయి. ఉమేష్ పాల్ హత్య కేసుతో మొదలైన పోలీసుల ఏరివేత చర్యలు, ఆ తర్వాత అతీక్, ఆయన తమ్ముడు అష్రఫ్‌ల హత్యలు, తాజాగా మరో కుమారుడు ఆబాన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఈ కుటుంబం పూర్తిగా చిన్నాభిన్నమైంది. గత మూడేళ్ల కాలంలో జరిగిన ఈ పరిణామాలు ఇలా ఉన్నాయి.ఉమేష్ పాల్ హత్య(ఫిబ్రవరి 24, 2023)ప్రయాగ్‌రాజ్‌లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) మాజీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్య కేసు ప్రధాన సాక్షి ఉమేష్ పాల్, ఆయన ఇద్దరు భద్రతా సిబ్బందిని కొందరు దుండగులు నడిరోడ్డుపై కాల్చి చంపారు. ఈ హత్య కేసులో అతీక్ అహ్మద్, అతని ముఠాపై ప్రధాన ఆరోపణలు వచ్చాయి. దీంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) నిందితులపై ఉక్కుపాదం మోపడం ప్రారంభించాయి.వరుస ఎన్కౌంటర్లు (ఫిబ్రవరి - ఏప్రిల్ 2023)ఫిబ్రవరి 27, 2023: ఉమేష్ పాల్ హత్య జరిగిన మూడు రోజులకు నిందితుడు అర్బాజ్‌ను పోలీసులు నెహ్రూ పార్క్ సమీపంలో చుట్టుముట్టారు. పోలీసులపై జరిపిన కాల్పులకు ప్రతిగా జరిగిన ఎదురుకాల్పుల్లో అతను హతమయ్యాడు. ఉమేష్ హత్యలో ఉపయోగించిన కారును అతనే నడిపినట్లు పోలీసులు నిర్ధారించారు.మార్చి 6, 2023: ఈ కేసులో మరో నిందితుడైన విజయ్ చౌదరి అలియాస్ ఉస్మాన్ పోలీసు ఎన్కౌంటర్లో మరణించాడు. ఉమేష్‌పై తొలి కాల్పులు జరిపింది ఇతనే అని పోలీసులు తెలిపారు.ఏప్రిల్ 13, 2023: దాదాపు 50 రోజులు పరారీలో ఉన్న అతీక్ మూడో కుమారుడు అసాద్ అహ్మద్, అతని సహచరుడు గులామ్‌ను ఝాన్సీలో యూపీ ఎస్టీఎఫ్ మట్టుబెట్టింది. అసాద్‌పై 5 లక్షల రూపాయల రివార్డు ఉంది. ఈ ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.ఏప్రిల్ 15, 2023: అసాద్ అంత్యక్రియలు ముగిసిన రెండు రోజుల తర్వాత, ప్రయాగ్‌రాజ్‌లో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. వైద్య పరీక్షల నిమిత్తం అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌ను పోలీసులు ఆస్పత్రికి తరలిస్తుండగా, మీడియా ముఖంగా జర్నలిస్టుల వేషంలో వచ్చిన ముగ్గురు దుండగులు అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అతీక్, అష్రఫ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ హత్య చేసిన లవ్లేష్ తివారీ, అరుణ్ మౌర్య, సన్నీ సింగ్‌లను పోలీసులు వెంటనే అరెస్టు చేశారు.తాజాగా రోడ్డు ప్రమాదంలో ఆబాన్ మృతిఅతీక్ కుటుంబంపై మృత్యు నీడ ఇంకా వీడలేదు. తాజాగా అతీక్ కుమారుడు ఆబాన్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. జైలులో ఉన్న తన అన్న అలీ అహ్మద్‌ను కలిసేందుకు వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. 2023లో మైనర్లుగా ఉన్న ఆబాన్, ఎహజమ్లను బాలల సంరక్షణ కేంద్రంలో ఉంచగా, ఆ తర్వాత అక్టోబర్ 2023లో వారు విడుదలయ్యారు.ప్రస్తుతం అతీక్ కుటుంబంలో.. షైస్తా పర్వీన్ (భార్య): ఉమేష్ పాల్ హత్య కేసులో పరారీలో ఉన్నారు.ఉమర్ అహ్మద్ (పెద్ద కుమారుడు): లక్నో జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు.అలీ అహ్మద్ (రెండో కుమారుడు): నైని సెంట్రల్ జైలులో ఉన్నాడు.ಅసాద్ అహ్మద్ (మూడో కుమారుడు): ఏప్రిల్ 2023లో పోలీసు ఎన్కౌంటర్లో మరణించాడు.ఆబాన్ (నాల్గో కుమారుడు): తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.ఎహజమ్ (చిన్న కుమారుడు): అక్టోబర్ 2023లో విడుదలైన తర్వాత తన మేనత్త సంరక్షణలో ఉంటున్నాడు. కాగా గత మూడేళ్లలో జరిగిన వరుస పరిణామాలు, పోలీసుల చర్యలు, హత్యలు, ప్రమాదాల కారణంగా అతీక్ అహ్మద్ సామ్రాజ్యం, అతని కుటుంబం పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితికి చేరింది.ఇది కూడా చదవండి: శ్రీదేవితో రహస్య వివాహం నుంచి భార్య బెదిరింపుల వరకు.. -
భద్రాచలం ఎమ్మెల్యే కారును ఢీ కొట్టిన లారీ
తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. అయితే, హైదరాబాద్‌కు వెళ్తున్న సమయంలో పతంగి టోల్గేట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.టోల్గేట్ వద్ద ఆగి ఉన్న ఎమ్మెల్యే వెంకట్రావు కారును వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకట్రావు సురక్షితంగా బయటపడ్డారు. దీంతో ఒక్కసారిగా ఈ ప్రమాదం సంభవించడంతో ఎమ్మెల్యే కొంత అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘నన్ను కాపాడండి..’.. రక్తపు మడుగులో అతీక్ కొడుకు చివరి క్షణాలు
లక్నో: నాలుగు దశాబ్దాల పాటు ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ (ప్రయాగ్‌రాజ్) ప్రాంతాన్ని తన నేరసామ్రాజ్యంతో గజగజలాడించిన మాఫియా డాన్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. అతీక్ అహ్మద్‌కు ఉన్న ఐదుగురు కుమారులలో అందరికంటే చిన్నవాడైన అబాన్ అహ్మద్ గురువారం ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. అబాన్ అహ్మద్ రోడ్డు ప్రమాదంలో మరణించిన ఉదంతంలో అత్యంత షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మితిమీరిన వేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, కారులో చిక్కుకున్న అబాన్ అహ్మద్ తన చివరి క్షణాల్లో ‘నన్ను కాపాడండి’ అంటూ ఆర్తనాదాలు చేశాడని ఘటనా స్థలంలో ఉన్న ప్రత్యక్ష సాక్షి దీపక్ యాదవ్ వెల్లడించారు. ప్రత్యక్ష సాక్షి దీపక్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదం జరిగిన సమయంలో అబాన్ అహ్మద్ ప్రయాణిస్తున్న హ్యుందాయ్ క్రెటా కారు అత్యంత వేగంగా వెళ్తోంది. ఆ సమయంలో అకస్మాత్తుగా జాతీయ రహదారిపైకి ఒక దూడ అడ్డుగా వచ్చింది. దానిని తప్పించే క్రమంలో కారు డ్రైవర్ అకస్మాత్తుగా స్టీరింగ్‌ను తిప్పగా, అదే సమయంలో ఎదురుగా ఒక మోటార్ సైకిల్ కూడా వచ్చింది. అంతటి వేగంలో కారును కంట్రోల్ చేయలేక, ఆ బైకును తప్పించే క్రమంలో కారు రోడ్డు డివైడర్‌ను అత్యంత బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతతో డివైడర్‌ను ఢీకొట్టిన కారు గాల్లోకి లేచి రోడ్డుపై పల్టీలు కొడుతూ కిందపడింది. ప్రమాదం జరగడం చూడగానే నేను కారులో ఉన్న ప్రయాణికులను రక్షించేందుకు పరుగున వెళ్లాను. కారు డోర్లు తెరిచేందుకు ప్రయత్నించినా అవి పూర్తిగా లాక్ అయిపోయాయి. సాధ్యం కాకపోవడంతో వెంటనే సమీపంలో ఉన్న ఒక ఇనుప రాడ్డును తెచ్చి కారు డోర్లను బద్దలు కొట్టాను. అనంతరం పోలీసులకు సమాచారం అందించాను. డోర్లు తెరిచేసరికి కారు ముందు ప్యాసింజర్ సీట్లో రక్తపు మడుగులో పడి ఉన్న అబాన్ అహ్మద్ తీవ్ర నొప్పితో విలవిలలాడుతూ.. 'నన్ను కాపాడండి' అని వేడుకుని, ఆ వెంటనే స్పృహ కోల్పోయాడు అని దీపక్ యాదవ్ వివరించాడు. గాయపడిన ముగ్గురిని పూంచ్ పోలీసులు వెంటనే మోంథ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ఝాన్సీ మెడికల్ కాలేజీకి తరలించారు.రోడ్డు ప్రమాదంపై ఝాన్సీ ఎస్ఎస్పీ బీబీజీటీఎస్ మూర్తి మాట్లాడుతూ..ప్రమాదం జరిగే సమయంలో అబాన్ కారు గంటకు 120 కిలోమీటర్లు అంతకంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అంతేకాకుండా, ఆ సమయంలో కురిసిన తేలికపాటి వర్షం కారణంగా హైవే రోడ్డు తడిగా మారిందని, మితిమీరిన వేగం వల్లే బ్రేకులు వేసినా కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టిందని పోలీసులు స్పష్టం చేశారు. అయితే, కారులో ఉండి ప్రాణాలతో బయటపడిన ఉమర్ అహ్మద్ అనే మరో యువకుడు మాత్రం.. రోడ్డుపై ఉన్న ఒక ఇటుకను కారు బలంగా ఢీకొట్టడం వల్లే వాహనం నియంత్రణ కోల్పోయిందని పోలీసులకు తెలిపాడు. -
కారు ప్రమాదంలో అక్కాచెల్లెలు మృతి..!
తిరుపతి జిల్లా: స్వగ్రామానికి వెళుతుండగా మంగళవారం చైన్నె– బెంగళూరు ఎక్స్‌ప్రెస్ హైవేపై జరిగిన ప్రమాదంలో అక్కాచెల్లెలు దుర్మరణం పాలయ్యారు. వివరాలు.. తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం జగవాండ్లపల్లె పంచాయితీ బోడిరెడ్డి గారిపల్లెకు చెందిన అనిల్ కుమార్ బెంగళూరులో సాప్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆయన తన భార్య మానస(35) మరదలు గౌతమి(32)తో కలిసి కారులో స్వగ్రామం బయలుదేరారు. బెంగళూరు కార్నర్‌లోని బట్టరహళ్లి వద్ద పరంధామరెడ్డి, జ్ఞానేంద్రరెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు లిఫ్ట్ అడగడంతో కారులో ఎక్కించుకున్నారు. ఈ క్రమంలో వి.కోట మండలం రామాపురం వద్ద హంద్రీ–నీవా కాలువ వద్ద కారు అదుపుతప్పి రోడ్డు పక్కన పొలాల్లోకి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా అనిల్ కుమార్ మరదలు గౌతమి(32) కారులో నుంచి బయట పడి అక్కడికక్కడే మృతిచెందింది. తీవ్రంగా గాయపడిన మానసను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించింది. అనిల్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. లిప్ట్ అడిగి ప్రయాణిస్తున్న పరంధామరెడ్డి, జ్ఞానేంద్రరెడ్డి క్షేమంగా బయటపడినట్టు సీఐ సోమశేఖర్‌రెడ్డి, ఎస్ఐ షేక్షావలీ తెలిపారు. అక్కాచెల్లెలు మృతదేహాలను పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. -
రోడ్డు ప్రమాదంలో అతీక్ అహ్మద్ కుమారుడు మృతి
ఝాన్సీ(ఉత్తరప్రదేశ్): గ్యాంగ్‌స్టర్, రాజకీయ నేత అతీక్ అహ్మద్ కుమారుడు అబాన్ అహ్మద్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఝాన్సీ జైలులో ఉన్న తన అన్నయ్య అలీ అహ్మద్‌ను కలిసేందుకు కారులో వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అబాన్ అహ్మద్ ప్రయాణిస్తున్న కారు అతివేగంగా వెళ్తుండగా అకస్మాత్తుగా అదుపుతప్పింది. రోడ్డు మధ్యలోని డివైడర్‌ను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు తీవ్రంగా దెబ్బతినింది. తీవ్ర గాయాలపాలైన అబాన్ అహ్మద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.ఉమేష్ పాల్ హత్య కేసులో అశ్రద్తో పాటు అతీక్ అహ్మద్ పోలీసు కస్టడీలో ఉన్న సమయంలోనే 2023 ఏప్రిల్‌లో హత్యకు గురయ్యారు. అంతకుముందు అతీక్ కుమారుడు అసద్ పోలీసు ఎన్కౌంటర్లో మరణించారు. ఈ ఘటనలు జరిగి మూడేళ్లు దాటిన తర్వాత, ఇప్పుడు అతీక్ చిన్న కుమారుడు అబాన్ రోడ్డు ప్రమాదంలో మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. కాగా అతీక్ మరో కుమారుడు అలీ అహ్మద్ పలు క్రిమినల్ కేసుల్లో ప్రస్తుతం ఝాన్సీ జైలులో రిమాండ్‌లో ఉన్నాడు. ఆయనను చూసేందుకు వెళ్తున్న సమయంలోనే అబాన్ రోడ్డు ప్రమాదానికి గురికావడం గమనార్హం.ఇది కూడా చదవండి: ‘రక్త సంబంధం’.. ఇది సీరియల్ కాదు.. సినిమా కానే కాదు! -
ఒంటరిగా ఉన్నా యువతితో డెలివరీ బాయ్ వికృత చేష్టలు!
యశవంతపుర: బెంగళూరులో మద్యం మత్తులో డెలివరీ బాయ్ యువతి ఇంట్లో రచ్చ చేశాడు. బాధిత యువతి అనేరి ఠక్కర్ ఇన్‌స్టాలో వివరించింది. ఆమె ఒక్కరే ఉండగా డెలివరీ బాయ్ వచ్చాడు. ఆమెతో అతి ప్రేమగా మాట్లాడడం మొదలుపెట్టాడు, మొబైల్లో చార్జింగ్ పెట్టుకుంటానని, ఇక్కడే ఉండి సిగరెట్ తాగుతానని ఆమెను ఒత్తిడి చేశాడు. ఇంట్లోకి చొరబడడానికి యత్రించాడని యువతి వాపోయింది. చివరకు ఎలాగో అతన్ని వెనక్కి పంపించినట్లు, అతడు పనిచేసే కంపెనీకి ఫిర్యాదు చేయగా, విచారణ చేస్తామని చెప్పారని పేర్కొంది. View this post on Instagram A post shared by Aneri Thakkar | Growth Mindset | People skills | Relationships (@anerithakkar_) -
టీచర్ ప్రాణం తీసిన మైనర్ డ్రైవింగ్
గౌలిపురా: నడుచుకుంటూ వెళ్తున్న టీచర్‌ను వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొనడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. భవానీనగర్ ఇన్స్పెక్టర్ ఎ.కరుణాకర్ తెలిపిన మేరకు...న్యూ నల్లకుంట తిలక్‌నగర్ ప్రాంతానికి చెందిన స్వరూపరాణి (50) మొఘల్‌పురాలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో కాంట్రాక్ట్ పద్ధతిలో టీచర్‌గా పనిచేస్తోంది. రోజూ ఎంఎంటీఎస్‌లో కాచిగూడ నుంచి యాకుత్‌పురా వచ్చి..అక్కడినుంచి నడుచుకుంటూ పాఠశాలకు వెళ్తుంది. సోమవారం ఉదయం పాఠశాలకు వెళ్తుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొంది.అంతటితో ఆగకుండా కారు ఆటో, స్కూటీ, ఇతర వాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లింది. స్వరూపరాణిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. స్వరూపరాణి భర్త బాల్‌రాజ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా కారును ఓ మైనర్ బాలుడు (17) నడుపుతున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో బాలుడితోపాటు కుటుంబసభ్యులను పోలీసులు విచారిస్తున్నారు. -
హైదరాబాద్‌కు శ్రీపతి దీపారెడ్డి పార్థీవదేహం
హైదరాబాద్: చంపాపేట డివిజన్ శిఖరా ఎన్క్లేవ్ కాలనీకి చెందిన శ్రీపతి దీపారెడ్డి (42) అమెరికా న్యూజెర్సీలో గతనెల 28న రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. దీపారెడ్డి 15 సంవత్సరాలు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన తర్వాత గత మూడు సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు.గత నెల 28న భర్త రామకృష్ణారెడ్డిని కారులో కార్యాలయంలో దించి ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న దీపారెడ్డి కారును, ఓ మెడికల్ విద్యార్థి కారుతో ఢీకొట్టడంతో ఆ ప్రమాదంలో దీపారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరిన మొదట్లో ఆమె అవయవాలను మెడికల్ విద్యార్థులకు అందజేస్తానని అంగీకరించడంతో ఆమె అవయవాలు ప్రభుత్వం సేకరించినట్లు సమాచారం. సంబరపడే లోపే..రెండు రోజుల్లో మాదాపూర్‌లో ఇటీవల కొనుగోలు చేసిన ఫ్లాట్ గృహప్రవేశానికి వస్తుందని సంబరపడ్డాం.. అన్ని ఏర్పాట్లు చేశాం, ఈవిధంగా వస్తుందని కలలో కూడా అనుకోలేదని ఆమె కుటుంబ సభ్యులు భోరున విలపిస్తుండటంతో స్థానికులు కంటతడి పెట్టారు. నేడు చంపాపేటలో అంత్యక్రియలు దీపారెడ్డి పార్థివ దేహాన్ని ఆదివారం నగరానికి తీసుకురానున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. చంపాపేటలోని రెడ్డి శ్మశానవాటికలో అంత్యక్రియలు జరపనున్నట్లు ఆమె బంధువులు తెలిపారు. -
లారీని ఢీకొట్టిన కారు.. యువకుడు సజీవ దహనం
మహబూబ్‌నగర్: కర్నూల్ జిల్లా గుత్తిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరికల్ మండలానికి చెందిన ఓ యువకుడు సజీవంగా దహనమైన ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. మండలంలోని బూడెగానితండాకు చెందిన రవినాయక్ (35)తో పాటు గాజులయ్యతండాకు చెందిన దేఘావత్ జాడోనాయక్, రవినాయక్ కలిసి బుధవారం రాత్రి కారులో కర్నూల్ జిల్లా గుత్తికి వెళ్లారు. గురువారం తెల్లవారుజామున గుత్తి శివారులో జాతీయ రహదారిపై వెళ్తున్న లారీని వెనక నుంచి వీరి కారు ఢీకొట్టింది. కారులో డీజిల్ డబ్బాలు ఉండటంతో మంటల చెలరేగాయి. గాజులయ్యతండాకు చెందిన జాడోనాయక్, రవినాయక్ కారులో నుంచి బయటకు దూకేయగా.. డ్రైవింగ్ చేస్తున్న బూడెగానితండాకు చెందిన రవినాయక్ అందులో ఇరుక్కుపోయాడు. కారుకు మంటలు తీవ్రంగా వ్యాపించడంతో కారుతో పాటే సజీవంగా దహనమయ్యాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
టార్గెట్ సీదిరి!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘నేరపూరిత హత్య..నేర పూరిత కుట్ర.. తప్పుడు సాక్ష్యాలను సృష్టించడం.. సాక్ష్యాలను మాయం చేయడం..నేరస్తుడిని కాపాడేందుకు తప్పుడు సమాచారం.. అబద్ధమని తెలిసినా సమాచారాన్ని అధికారులకు ఇవ్వడం.. నేరానికి ప్రేరేపించడం..’ఇవీ రోడ్డు ప్రమాదం కేసులో సంబంధం లేని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై మోపిన అభియోగాలు. అసలు యాక్సిడెంట్ సమయంలో అప్పలరాజు అక్కడ లేరు. ప్రమాదం జరిగిందని తెలుసుకుని వెళ్లిన అప్పలరాజే పోలీసులకు సమాచారం అందించారు. అలాంటప్పుడు అప్పలరాజుపై అభియోగాలు మోపడం రాజకీయ కుట్ర కాకపోతే ఏమనాలి.. కక్ష సాధింపులో భాగమని అనడానికి ఇంకేం చెప్పాలి.. రోడ్డు ప్రమాదంలో దానయ్య చనిపోవడానికి కారణం సిద్ధార్ద్ త్యాడి కాదని, సీదిరి తనయుడు ఆరవ్ వర్మ కారకుడని పోలీసులు అప్పలరాజుకు చెప్పివుంటే, ఆ తర్వాత కూడా కొడుకును తప్పించడానికి త్యాడిని ఇరికించి ఉంటే కచ్చితంగా నేరమవుతుంది. లేదూ దానయ్య మరణాన్ని దాచేసి అసలు అటువంటిది జరగలేదని బుకాయిస్తే అది ఇంకా పెద్ద నేరమవుతుంది. కానీ, సీదిరి కుమారుడు ఆరవ్ ఫోన్ నుంచే సంఘటన స్థలం నుంచి 108కు ఫోన్ వెళ్లింది. ఇక సీసీ టీవీలు ప్రైవేటు వ్యక్తులవే అయినా అందులో ఫుటేజ్ ఏమాత్రం పోలేదు. అలాంటప్పుడు ఇందులో హత్య కోణం ఎక్కడుందో పోలీసులు..వారిని ప్రేరేపించిన పాలకులే చెప్పాలి. ఇన్ని సెక్షన్లా? సీదిరి అక్రమ అరెస్టు కేసులో నమోదైన సెక్షన్లు చూసిన వారెవరైనా రోడ్డు ప్రమాదం కేసులో ఇన్ని సెక్షన్లు పెట్టొచ్చా అని ఆశ్చర్యపోతున్నారు. న్యాయ కోవిదులు కూడా పోలీసుల తీరును ఆక్షేపిస్తున్నారు. యు/ఎస్ 105 ఆర్/డబ్లూ 61(2) అఫ్ బీఎన్ఎస్, 231,238,240, 242,249 ఆర్/డబ్ల్యూ 49బిఎన్ఎస్ సెక్షన్లను సీదిరి అప్పలరాజుపై కాశీబుగ్గ పోలీసులు బనాయించారంటే దానివెనక ఎంత రాజకీయం నడించిందో ఇట్టే అర్ధమవుతుంది. పాలకులు కావల్సినట్టు పోలీసులు వ్యవహరించారని స్పష్టమవుతుందంటూ ఆరోపణలు ఉన్నాయి. 41 నోటీసు ఇచ్చి స్టేషన్ బెయిల్‌పై విడుదల చేయాల్సిన ఘటన కేసులో తొలుత కుమారుడిని, ఆ తర్వాత తండ్రిని అరెస్టు చేశారంటే ఎంత క«థ నడిచిందో అర్ధమవుతోంది. చంద్రబాబు అండ్‌కో పగ.. వెనకబడిన, మత్స్యకార సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గరి నుంచి కక్ష కట్టింది. తొలి రోజు నుంచే వేధింపులకు గురి చేస్తోంది. ప్రతి చిన్న విషయానికి కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతోంది. ఎన్ని కేసులు పెట్టినా జైలు పంపించలేకపోయామన్న కసితో కక్ష సాధింపునకు ఎదురు చూసింది. ఈనేపథ్యంలో కాశీబుగ్గలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంపై కుట్రలకు దిగి, సీదిరి అప్పలరాజును ఇరికించింది. సంబంధం లేని కేసులో ఏ3గా పెట్టి అరెస్టు చేసి జైలుకు పంపించింది. పెదబాబు, చినబాబు డైరెక్షన్లో, జిల్లాకు చెందిన నేతల ఒత్తిళ్లతో పోలీసులు కథ నడిపించారన్న ఆరోపణలు ఉన్నాయి. మత్స్యకార సామాజిక వర్గ నాయకుడిగా, విద్యా, వైద్య వేత్తగా, మాజీ మంత్రిగా అనతికాలంలో బలమైన నేతగా ఎదిగిన సీదిరి అప్పలరాజును అరెస్టు చేసే సమయంలో పోలీసు అధికారులు అనుచితంగా వ్యవహరించారు. అప్పలరాజు చొక్కా పట్టుకుని లాగడమే కాకుండా, ఆయన సోదరుడిపైనా చేయి చేసుకున్నారు. -
స్పోర్ట్స్ బైక్‌తో ఢీకొట్టి.. 100 మీటర్లు ఈడ్చుకెళ్లి..
ముంబై: గురు పౌర్ణమి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రకు వెళ్లేందుకు సిద్ధమైన ఓ మహిళను రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. స్పోర్ట్స్ బైక్‌తో ఆమెను ఢీకొట్టిన యువకుడు కూడా ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన సోమవారం రాత్రి ముంబైలోని మహిమ్ ప్రాంతంలో చోటుచేసుకుంది.పోలీసుల వివరాల ప్రకారం.. మహిమ్ కాజ్‌వేకు చెందిన మంగళ అశోక్ టాండెల్ (46) సోమవారం రాత్రి 9.30 గంటల సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి గురు పౌర్ణమి సందర్భంగా సోలాపూర్ జిల్లాలోని అక్కల్కోట్లో ఉన్న శ్రీ స్వామి సమర్థ మఠం దర్శనానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ప్రయాణానికి సంబంధించిన సామాన్లు సర్దుకుని, బంధువులు సిద్ధమయ్యారా అని తెలుసుకోవడానికి ఆమె లేడీ జంషెడ్జీ రోడ్డును దాటుతుండగా ప్రమాదం జరిగింది.బాంద్రా వైపు అత్యంత వేగంగా వెళ్తున్న ఓ స్పోర్ట్స్ బైక్ ఆమెను బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వేగం తీవ్రంగా ఉండటంతో మంగళను బైక్ దాదాపు 100 మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. అనంతరం ఆమెను వెంటనే రాహేజా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి భర్త ప్రభుత్వ రంగ బ్యాంకులో ఉద్యోగి కాగా, వారికి సలోనీ (22), సానియా (20) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారని పోలీసులు తెలిపారు.ఇదే ప్రమాదంలో బైక్ నడుపుతున్న ధ్రువ్ గురవ్ (21) కూడా తీవ్రంగా గాయపడ్డాడు. మహిమ్ ఫిషర్మెన్ కాలనీకి చెందిన అతడిని భాభా ఆస్పత్రికి తరలించగా, చికిత్స ప్రారంభించేలోపే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.పోలీసుల సమాచారం ప్రకారం, ధ్రువ్ తన తల్లిని బాంద్రా నుంచి ఇంటికి తీసుకురావడానికి బయలుదేరిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అతని తల్లిదండ్రులు గతంలో వివిధ ఆర్కెస్ట్రా బృందాలతో గాయకులుగా పనిచేసేవారని, ప్రస్తుతం వివిధ కార్యక్రమాల్లో పాటలు పాడుతూ జీవనం సాగిస్తున్నారని వెల్లడించారు.ధ్రువ్, అతని అన్న ఇద్దరికీ స్పోర్ట్స్ బైక్‌లపై ప్రత్యేక ఆసక్తి ఉండేదని, వారి కుటుంబం వద్ద ఒకటి కంటే ఎక్కువ స్పోర్ట్స్ బైక్‌లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ధ్రువ్ గతంలో కూడా ఒకసారి రోడ్డు ప్రమాదానికి గురైనట్లు వెల్లడించారు.ఈ ఘటనపై పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS), 2023లోని సెక్షన్ 106 (నిర్లక్ష్యంతో మరణానికి కారణం కావడం), సెక్షన్ 281 (బహిరంగ రహదారిపై నిర్లక్ష్యంగా వాహనం నడపడం)తో పాటు మోటారు వాహనాల చట్టంలోని ఇతర నిబంధనల కింద మృతుడైన ధ్రువ్ గురవ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
ఔటర్‌పై ఆగిఉన్న లారీని ఢీకొన్న స్విఫ్ట్
హైదరాబాద్: ఓఆర్ఆర్పై ఆగిఉన్న సిమెంట్ లారీని ఢీకొట్టడంతో స్విఫ్ట్ కారులోని యువకుడితో పాటు ఓ యువతి దుర్మరణం చెందిన ఘటన గచ్చిబౌలి పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ కె.సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి– భువనగిరి జిల్లా బొమ్మలరామారం మరియాల గ్రామానికి చెందిన కత్రావత్ సురేందర్ (19), ప్రణతి రెడ్డి (19) ఎల్బీనగర్ అనుష్కపూర్లోని ఓ కళాశాలలో ఇంజినీరింగ్ విద్యనభ్యసిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం సురేందర్ స్విఫ్ట్ కారు కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం బొమ్మలరామారం నుంచి కారులో బయలుదేరాడు. మంగళవారం ఉదయం కళాశాల హాస్టల్ వద్ద స్నేహితురాలు ప్రణతి రెడ్డిని పికప్ చేసుకున్నాడు. సాయంత్రం 5.45 గంటల సమయంలో వట్టినాగులపల్లి నియోపొలిస్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై ఆగి ఉన్న సిమెంట్ లారీని కారు అతివేగంతో ఢీకొంది. లారీలోకి కారు చొచ్చుకుపోయి ముందు భాగం నుజ్జునుజ్జయింది. సురేందర్, ప్రణతి అక్కడికక్కడే మృతి చెందారు. లారీలో ఇరుక్కు పోయిన కారును క్రేన్ సహాయంతో తీసి మృతదేహాలను వెలికి తీశారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు డ్రైవర్ నిర్లక్ష్యంగా రోడ్డుపై లారీ నిలిపాడని, ప్రమాదం జరగగానే పారిపోయాడని పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి
వాషింగ్టన్: అమెరికా న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన శ్రీపాతి దీప (42) మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన ఈమె న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. న్యూజెర్సీలో కారులో ప్రయాణిస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో సంభవించిన ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.మృతురాలు ఆమనగల్లు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు శ్రీపాతి శ్రీనివాసరెడ్డి సోదరుడైన శ్రీపాతి పుల్లారెడ్డి చిన్న కోడలు. స్థానిక వివరాల ప్రకారం.. దీప ఐటీ ఉద్యోగిని అమెరికాలోని న్యూజెర్సీలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో తన భర్తతో కారులో వెళ్తూ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగిన సమయంలో, మరొక కారు వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం అందింది. శ్రీపాతి దీప మరణవార్త విన్న హైదరాబాద్‌లోని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. దీప మరణంతో ఆకుతోటపల్లి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. -
నేను వితంతువుని కాదు సర్!
నా పేరు వెంకటరామరాజు. మాది రైల్వే కోడూరు. రోడ్డు ప్రమాదంలో దివ్యాంగుడిగా మారాను. 69 శాతం వికలత్వం ఉండడంతో నాకు పింఛన్ మంజూరు చేయాలని కోరడంతో పింఛన్ మంజూరు చేశారు. అయితే దివ్యాంగుడుగా ఉన్నప్పటికీ వితంతువు పింఛన్ మంజూరు చేశారు. ఆ విషయం ముందు నాకు తెలియదు. ఆ తర్వాత తెలవడంతో వితంతువు పింఛన్ రూ.4 వేలు.. దివ్యాంగుడి పింఛన్‌గా మార్పు చేయాలని క్షేత్ర స్థాయి అధికారుల నుంచి మండల, డివిజన్ చివరికి కలెక్టరేట్ అధికారుల చుట్టూ తిరుగుతున్నాను. అర్జీలిస్తున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. – తిరుపతి అర్బన్ -
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చెల్లూరు జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.రోడ్డు ప్రమాద మృతులను విశాఖ జిల్లా పద్మనాభం మండలం బొచ్చపేటకు చెందిన రాంబాబు (50), నారాయణరావు (50), మోహన్‌నాయుడు (8)గా గుర్తించారు. ప్రమాదంలో మరికొందరు తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
చాయ్ కోసం వెళ్తూ అనంతలోకాలకు!
సాక్షి, హైదరాబాద్/మూసాపేట: ఆదివారం కావడంతో ఆటవిడుపు కోసం క్రికెట్ ఆడేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన ఇద్దరు మైనర్లను మృత్యువు కబళించింది. ఈ ఉదంతంతో మరో బాలుడు గాయపడ్డాడు. యూసుఫ్‌గూడలోని బ్రహ్మశంకర్ నగర్‌కు చెందిన బేగరి మహేశ్, మన్నే లక్ష్మీతేజ, పులి కిరణ్‌కుమార్ స్నేహితులు. 17 ఏళ్ల వయసున్న ముగ్గురూ అమీర్‌పేట్‌లోని వేర్వేరు కాలేజీల్లో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. సెలవు రోజుల్లో వీళ్లు యూసుఫ్‌గూడలోని కృష్ణకాంత్ పార్క్ వద్ద క్రికెట్ ఆడుతుంటారు.ఆదివారం కూడా తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో తన ఇంటి నుంచి బయటకు వచ్చిన మహేశ్ మిగిలిన ఇద్దరినీ కలిశాడు. ముగ్గురూ కలిసి కిరణ్‌కుమార్‌కు చెందిన ద్విచక్ర వాహనంపై కృష్ణకాంత్ పార్క్‌కు బయలుదేరారు. అయితే ఆట ప్రారంభించడానికి ముందు తరచూ వెళ్లినట్లే కూకట్‌పల్లిలోని మహాలక్ష్మి కేఫ్‌కు వెళ్లి చాయ్ తాగాలని భావించారు. కిరణ్ వాహనం నడుపుతుండగా వెనుక మహేశ్, లక్ష్మీతేజ కూర్చున్నారు. 4:55 గంటల సమయంలో కూకట్‌పల్లిలోని మెట్రో పిల్లర్ నం.796 వద్ద వెనుక నుంచి మితిమీరిన వేగంతో వచ్చిన టిప్పర్ వీరి వాహనాన్ని గుద్దింది.దీంతో మహేశ్, లక్ష్మీతేజ ఎగిరి ఎడమవైపునకు పడిపోయారు. వాహనం నడుపుతున్న కిరణ్ కుడివైపు పడ్డాడు. మహేశ్, లక్ష్మీ తేజలపై టిప్పర్ టైరు ఎక్కడంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే చనిపోయారు. గాయాల పాలైన కిరణ్ మహేశ్ తండ్రి సంగప్పకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో ఆయన హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. అప్పటికే ఈ ప్రమాదంపై సమాచారం అందుకుని ఘటనాస్థలికి వచ్చిన కూకట్పల్లి పోలీసులు మృతదేహాలను గాంధీ ఆస్పత్రి మార్చురీకి, కిరణ్‌ను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి
రామాయంపేట, హవేళి ఘణపూర్ (మెదక్)/హైదరాబాద్: మెదక్ జిల్లా రామాయంపేట అటవీ రేంజ్ పరిధిలోని హవేళి ఘణపూర్ మండలం గంగాపూర్వద్ద రోడ్డు దాటుతున్న చిరుతను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న జిల్లా అటవీ అధికారి జోజి, మెదక్, రామాయంపేట రేంజ్ అధికారులు విద్యాసాగర్, రమేశ్, ఇతర అధికారులు సంఘటనాస్థలిని సందర్శించారు. చిరుతను ఢీకొన్న వాహనం ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు డీఎఫ్‌వో తెలిపారు.కాగా, రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి చెందడంపై అటవీశాఖ మంత్రి కొండా సురేఖ ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు. ఈ విషయమై విచారణకు ఆదేశిస్తున్నట్లు పేర్కొన్నారు. చిరుత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి శాస్త్రీయ ఆధారాలతో పూర్తి స్థాయిలో నివేదిక సమరి్పంచాలని మంత్రి ఆదేశించారు. అటవీ ప్రాంతాల పరిధిలో ఉన్న కేంద్ర, రాష్ట్ర రహదారులపై వన్యప్రాణుల సంచరించే ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతోపాటు వైల్డ్‌లైఫ్ క్రాసింగుల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సూచించారు. అటవీ ప్రాంత పరిధిలో వాహన చోదకులు నిరీ్ణత వేగంతో వెళ్లాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. -
గంటకు 21 మంది మృతి.. రోడ్డు భద్రతపై ఆందోళన!
భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రతి రోజు వందలాది మంది ప్రాణాలు కోల్పోతుండగా, వేలాది మంది గాయాలతో జీవితాంతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా.. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో మరోసారి గుర్తు చేస్తున్నాయి.కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లోక్‌సభలో వెల్లడించిన వివరాల ప్రకారం.. 2025లో దేశవ్యాప్తంగా 5,13,563 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అంటే.. సగటున ప్రతి గంటకు 59 ప్రమాదాలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదాల్లో 1,83,382 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే ప్రతి గంటకు 21 మంది, రోజుకు సగటున 502 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.రాష్ట్రాల వారీగా చూస్తే.. తమిళనాడులో అత్యధికంగా 71,387 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. అయితే మరణాల సంఖ్యలో మాత్రం ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. అక్కడ ఒక్క ఏడాదిలోనే 27,550 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. దీన్నిబట్టి చూస్తే.. రోడ్డు భద్రత విషయంలో వాహనదారులు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుస్తుంది.ఇక గత కొన్నేళ్లతో పోలిస్తే.. పరిస్థితి మరింత దిగజారినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2023లో దేశంలో 4.8 లక్షలకు పైగా ప్రమాదాలు నమోదవగా, 2024లో ఆ సంఖ్య మరింత పెరిగింది. ఇప్పుడు 2025లో ఐదు లక్షలకు పైగా ప్రమాదాలు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఆశించిన స్థాయిలో ఫలితాలు కనిపించడం లేదు.ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం '4E' (Education, Engineering, Enforcement, Emergency Care) వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇందులో ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంచడం, రహదారులు.. వాహనాల నాణ్యతను మెరుగుపరచడం, ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేయడం, ప్రమాద బాధితులకు అత్యవసర వైద్య సేవలను వేగంగా అందించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది.అయితే.. రోడ్డు ప్రమాదాలను పూర్తిగా తగ్గించాలంటే ప్రభుత్వ చర్యలతో పాటు ప్రజల సహకారం కూడా చాలా అవసరం. మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం, ట్రాఫిక్ నిబంధనలను పట్టించుకోకపోవడం, హెల్మెట్ లేదా సీటుబెల్ట్ ధరించకపోవడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వంటి నిర్లక్ష్యాలే చాలా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. -
పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువతి దుర్మరణం
హైదరాబాద్: త్వరలో పెళ్లి జరగాల్సిన ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. వివాహం నిశ్చయమై జీవితాంతం కలిసి ఉండాల్సిన కాబోయే దంపతులు దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి మృతి చెందింది. హైదరాబాద్‌లోని శాస్త్రీపురం ప్రాంతానికి చెందిన సానియాబేగం (20), ఫలక్‌నుమాకు చెందిన మునీర్ (24)కు ఇటీవల వివాహం నిశ్చయమై, ఎంగేజ్మెంట్ కూడా ఘనంగా జరిగింది. ఈ క్రమంలో మొక్కు చెల్లించుకునేందుకు కాబోయే దంపతులిద్దరూ శనివారం ఇళ్లలో చెప్పి బైక్‌పై జేపీదర్గాకు వెళ్లారు. దర్శనం ముగించుకుని తిరిగి వెళ్తుండగా తిమ్మాపూర్ సమీపంలోని హెచ్ఐఎల్ పరిశ్రమ వద్ద వెనుక నుంచి అతివేగంగా వచి్చన ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సానియాబేగం తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మునీర్‌కు గాయాలయ్యాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని షాద్‌నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి ఖైరాఉనీ్మసా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
సైదాబాద్ (హైదరాబాద్): అమెరికాలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో నగరంలోని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో అక్కడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి.. ఐఎస్‌సదన్ డివిజన్ వాణీనగర్‌లో నివసించే వాణిజ్య పన్నుల శాఖ రిటైర్డ్ అధికారి షేక్ అబ్దుల్ సయీద్ కుమారుడు షేక్ అబ్దుల్ నవీద్ (48) ఉద్యోగరీత్యా కుటుంబంతో కలిసి పదేళ్ల క్రితం అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో వెళ్లారు. అక్కడి మెక్ ఫార్మా కంపెనీలో డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య నజియా సల్మా (45), కుమార్తె నేహా నహీన్ షేక్ (19), కుమారుడు హఫీజ్ ఉమర్ షేక్ (14), మరో కుమార్తె ఖతీజా షేక్ (8) ఉన్నారు. కాగా నవీద్ కుటుంబంతో కలిసి కారులో తాను నివసిస్తున్న ప్రాంతం నుంచి కారులో నవేడా అనే ప్రాంతానికి విహార యాత్ర (ఫ్యామిలీ టూర్)కు బయలుదేరారు. అయితే భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నజియా సల్మా, నేహా నహీన్ షేక్, హఫీజ్ ఉమర్ షేక్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలకు గురైన షేక్ అబ్దుల్ నవీద్, ఖతీజా షేక్‌లను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వాణీనగర్‌లో విషాద ఛాయలు యాకుత్‌పురా నియోజకవర్గం ఐఎస్‌సదన్ డివిజన్ వాణీనగర్‌కు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు దుర్మరణం పాలవడంతో కాలనీలో విషాదఛాయలు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న యాకుత్‌పురా ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, ఎంబీటీ నాయకుడు అమ్జదుల్లా ఖాన్లు వాణీనగర్‌కు చేరుకుని నవీద్ కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం వెంటనే తనకు, తన భార్య నజీమున్నీసా, సోదరుడు షేక్ అబ్దుల్ జావీద్‌లకు అమెరికా వీసాలు ఇప్పించాలని నవీద్ తండ్రి షేక్ అబ్దుల్ సయీద్ అభ్యరి్థంచారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు హైదరాబాద్ వాసులు మృతి
సాక్షి,హైదరాబాద్: అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటనలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడిన ఈ కుటుంబం ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైనట్లు ప్రాథమిక సమాచారం.కాలిఫోర్నియాలోని ఓ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు హైదరాబాద్ వాసులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, వారిని స్థానిక అత్యవసర సేవల సిబ్బంది సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అతివేగం కారణమా? లేక మరో వాహనం ఢీకొట్టిందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న కాలిఫోర్నియా పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై హైదరాబాద్‌లోని బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో వారి ఇళ్లలో తీవ్ర విషాదం నెలకొంది. -
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
సంగారెడ్డి: జిల్లాలోని కల్హేర్ మండలంలో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని బచేపల్లి గ్రామం వద్ద 161 జాతీయ రహదారిపై ప్రయానిస్తున్న స్కార్పియో కారు ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయింది. ప్రమాదావశాత్తు అదుపుతప్పి పల్టీలు కొట్టడంతో కారులో ఉన్నటువంటి భార్యభర్తలతో పాటు 4ఏళ్ల కూతురు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతులు నాందేడ్ వాసులుగా తెలుస్తోంది. -
పలాసలో రోత రాజకీయాలు
ఈ ఫొటోలో ప్రధానంగా కనిపిస్తున్న వారిలో పలాస నియోజకవర్గానికి చెందిన టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి లొడగల కామేశ్వరరావు, పలాస, కాశీబుగ్గ పట్టణ ప్రధాన కార్యదర్శి సప్ప నవీన్ తదితరులు ఉన్నారు. పలాసలోని రామకృష్ణాపురం నుంచి కాశీబుగ్గ వస్తుండగా జరిగిన బైక్ యాక్సిడెంట్లో చనిపోయిన దుబ్బ దానయ్య కుటుంబానికి న్యాయం చేయాలని, దానికి కారకులుగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై చర్యలు తీసుకోవాలని ఇటీవల చేసిన నిరసన కార్యక్రమానికి నేతృత్వం వహించింది వీరే. ఇక్కడ విశేషమేమింటే అంతకుముందు ఆ యాక్సిడెంట్‌కు సంబంధించి వీరితో పాటు అంబటి కృష్ణమూర్తి, శంకర్ తదితరులు రాజీ చేసి, బాధిత కుటుంబానికి పరిహారం అందించేలా ఒప్పందం చేశారు. తర్వాత వారిపై ఎవరి ఒత్తిళ్లు వచ్చాయో తెలియదు గాని మాట మార్చి ఏకంగా నిరసనకు దిగారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పలాసలో రాజకీయం వింత దోవన వెళుతోంది. రోడ్డు ప్రమాదాలను రాజకీయ ఎదుగుదలకు, వైరి పక్షాన్ని అణగదొక్కేందుకు వాడుకుంటున్న వైఖరి జనాలకు విస్తు గొలుపుతోంది. రామకృష్ణాపురం నుంచి కాశీబుగ్గకు వచ్చే క్రమంలో జరిగిన బైక్ యాక్సిడెంట్‌కు సంబంధించి జరుగుతున్న పరిణామాలు, తిరుగుతున్న మలుపులు అధికా ర పక్ష నాయకులు విపక్షంపై ఏ మేరకు కక్ష పెంచుకున్నారో జనాలకు వివరిస్తున్నాయి. దేశంలో అత్యధికంగా రాజీ జరిగే కేసులేమైనా ఉన్నాయంటే అవి రోడ్డు ప్రమాద కేసులే. ఇప్పుడు వాటిపైనా రాజకీయాలు మొదలుపెట్టారు. ఈ రోడ్డు ప్రమాదంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఉన్న విషయం తెలుసుకు ని.. దాన్ని కక్ష సాధింపునకు వాడుకోవాలని గట్టిగా అనుకున్నారు. ఇంకేముంది పెదబాబు, చినబాబు దగ్గరి నుంచి ఇన్చార్జి మంత్రి, ఎమ్మెల్యే వరకు తెగ హడావుడి చేశారు. ప్రెస్మీట్లు, సోషల్ మీడియా పోస్టింగులతో హోరెత్తించారు. రోడ్డు ప్రమాదంలో బాధితులుగా మిగిలిన గొర్రెల కాపరి దానయ్య కుటుంబానికి సాయం చేయడాన్ని ఎవరూ తప్పు పట్టలేదు. అన్ని పారీ్టల వారూ స్వాగతించారు. కానీ అదే సహృదయతను ఇతర ప్రమాద బాధితులకు చూపకపోవడం, పైగా స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష ‘అన్ని రోడ్డు ప్రమాద బాధితులకు ఎందుకు పరిహారం ఇస్తాం.. అక్కడ నిరుపేద కుటుంబం కావ డం వల్ల ఇన్చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పెద్దలతో మాట్లాడి పరిహారం ప్రకటించారు’ అని ఓ వీడియోలో మాట్లాడుతూ స్పందించడం రాజకీయ కోణాన్ని చెప్పకనే చెప్పింది. వీళ్లెందుకు కనిపించలేదు..? ఇదే పలాస నియోజకవర్గంలో ఈ నెల 12వ తేదీన టీడీపీ నాయకుడు, మందస పట్టణ టీడీపీ అధ్యక్షుడు గార కృష్ణారావు ఆటో యాదవ సామాజిక వర్గానికి చెందిన నర్తు వెంకటరమణను ఢీకొట్టగా.. వెంకటరమణ ప్రాణాలు కోల్పోయారు. ఆ సమ యంలో డ్రైవింగ్ చేస్తున్నది గార కృష్ణారావా? సునీలా? అన్నదానిపై అనుమానాలున్నా.. పోలీసులు మాత్రమే రకరకాల విచారణలు చేసి సునీలే డ్రైవింగ్ చేసినట్టు నిర్ధారించేశారు. ఇక్కడ చనిపోయిన వారిదీ నిరుపేద కుటుంబమే. చనిపోయిన వ్యక్తికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన భార్య గుండెజబ్బుతో బాధ పడుతున్నారు. కానీ వీరిని పరామర్శించడం, సాయం చేయడం తమ పనే కాదన్నట్టు అధికార పక్ష పెద్దలు వ్యవహరించారు. కేవలం సీదిరి టార్గెట్‌గా చేసుకున్నారు కాబట్టే.. రామకృష్ణాపురం రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేయడం చర్చనీయాంశమైంది. ఈ విషయంపై సొంత పార్టీ నేతలే పాలకుల వైఖరిని తప్పు పడుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఫేస్బుక్లో టీడీపీ నేత చేసిన పోస్టింగ్, దానికి స్పందిస్తూ మరో టీడీపీ నాయకుడు చేసిన కామెంట్లు ఇవి. సెటిల్మెంట్ చేసింది కూడా మన నాయకుడే కదా పది లక్షలు.. రెండు లక్షలు అతనికి అని పులారి దుర్యోధన్ కామెంట్ చేయగా తర్వాత ఒక ఇన్చార్జి మినిస్టర్ వచ్చి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాక ప్రజ లు అసహ్యించుకుంటున్నారు అని తలగాన నరసింహా స్పందించిన పోస్టు సారాంశమిది. ఫేస్‌బుక్‌లోనే తలగాన నరసింహ చేసిన పోస్టింగ్ ఇది. ‘నిన్న మా పార్టీ హుటాహుటిన స్పందించి బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చెయ్యడం చాలా గొప్ప విషయం. ఒకింత ఆశ్చర్యం కూడా. అయితే నాకు ఒకతను నిన్న ఒక విషయం అడిగాడు. ఏ యాక్సిడెంట్ జరిగినా మన పార్టీ(తెలుగుదేశం) 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తుందా లేక మినిస్టర్, ఎమ్మెల్యే కొడుకులు చేసిన యాక్సిడెంట్‌కి మాత్రమే ఇది వర్తిస్తుందా అని అడిగితే.. అతనితో అది నా స్థాయి కాదు. మా సీనియర్ నాయకులని అడిగి చెబుతా అన్నాను దయచేసి ప్రజలకు క్లారిటీ ఇవ్వండి’ అంటూ చేసిన పోస్టు చేశారు. -
విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
-
15 రోజుల క్రితమే పెళ్లి.. నవ వధువు దుర్మరణం
కర్ణాటక: 15 రోజుల క్రితమే ఎన్నో ఆశలతో దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టిన ఓ నవ వధువును రోడ్డు ప్రమాదం కబళించింది. నూరేళ్ల పంట మూణ్నాళ్ల ముచ్చట అయ్యింది. మృతురాలు మైసూరు తాలూకా మాకనహుండికి చెందిన మేఘన (20). వివరాలు.. మేఘనకు రెండు వారాల క్రితం బిదరగూడువాసి పునీత్‌తో పెద్దలు ఘనంగా పెళ్లి చేశారు. భార్యభర్తలిద్దరూ శుక్రవారం బంధువులను కలవాలని బైక్‌లో మైసూరుకు వచ్చారు. సాయంత్రం ఆర్టీ నగర వద్ద అతివేగంగా ఇంటికి వెళుతున్న వారి బైక్ స్కిడ్ అయి పడిపోయారు. మేఘనకు తీవ్ర గాయాలు కావడంతో ఘటనాస్థలిలోనే మరణించింది. భర్త పునీత్‌కు తల, చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. అతనిని చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించారు. ఘటనాస్థలినికి పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మేఘన హెల్మెట్ ధరించలేదని, ధరించి ఉంటే చనిపోయి ఉండేది కాదని అన్నారు. ఈ విషాదంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. -
విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
సాక్షి,విశాఖ: అనకాపల్లి - ఆనందపురం జాతీయ రహదారి రక్తసిక్తమైంది. ఆదివారం తెల్లవారు జామున జాతీయ రహదారిలో గండిగుండం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. బాధితులు టెక్కలిలో శుభకార్యానికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులు గుంటూరు జిల్లా వాసులుగా గుర్తించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నాలుగు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురి దుర్మరణం
హైదరాబాద్: రహదారులు రుధిర ధారలుగా మారాయి. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. గ్రేటర్ పరిధిలో గురువారం అర్ధరాత్రి, శుక్రవారం మధ్యాహ్నం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఒకరు పాఠశాల విద్యార్థి, మరొకరు ఇంటర్మీడియట్ విద్యార్థి, ఓ మహిళ ఉన్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..మేడ్చల్‌లో బైక్‌ను ఢీకొట్టడంతో.. నగర శివారు ఐడీపీఎల్ దిల్‌కుష్‌నగర్‌కు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి సొహైల్ (18), కుత్బుల్లాపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థి సుమిత్ గైక్వాడ్ (17) గురువారం అర్ధరాత్రి మేడ్చల్ నుంచి కొంపల్లి వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. మార్గంమధ్యలో ఓఆర్ఆర్ అండర్ బ్రిడ్జి సమీపంలోకి రాగానే వీరి బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో సొహైల్, సుమిత్ గైక్వాడ్ రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందారు. మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి కారణమైన వాహనం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సమీప ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.కీసర ఓఆర్ఆర్పై..మెదక్ జిల్లా పాపన్నపేటకు చెందిన రషీద్ (40) మటన్ షాప్ యజమాని. అదే గ్రామానికి చెందిన డ్రైవర్ రాములు (60), గౌస్ కలిసి బొలేరో వాహనంలో గొర్రెల లోడ్‌తో నగర శివారు చెంగిచర్లలోని మండీకి వెళ్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు నిద్ర రావడంతో కీసర ఓఆర్ఆర్పై రాంపల్లి దాయర వద్ద బొలేరో వాహనాన్ని ఎడమ వైపు ఆపి నిద్రించారు. గుర్తు తెలియని వాహనం వెనక నుంచి వచ్చి బొలేరో వాహనాన్ని ఢీకొట్టి వెళ్లిపోయింది. వాహనంలో నిద్రిస్తున్న రషీద్, రాములు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. గౌస్‌కు కాలు విరిగింది. వాహనంలోని కొన్ని గొర్రెలు సైతం మృతిచెందాయి. మృతుడు రషీద్‌కు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. రాములుకు భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కీసర సీఐ ఆంజనేయులు చెప్పారు. మెట్రో పిల్లర్‌ను బైక్ ఢీ..జగిత్యాల జిల్లా బీజ్పూర్ మండలం నర్సింహుల పల్లె గ్రామానికి చెందిన చెర్పూరి అఖిలేష్ యాదవ్ (24) నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీలోని ఓ హాస్టల్లో ఉంటూ ఆస్పత్రిలో ఎలక్ట్రిషియన్‌గా పని చేస్తున్నాడు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నానికి చెందిన మహమ్మద్ యూనిస్ (26) ప్రైవేట్ ఉద్యోగ చేస్తూ ఇక్కడి హాస్టల్లో ఉంటున్నాడు.వీరిద్దరూ కలిసి గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత బైక్‌పై జేఎన్టీయూ నుంచి కూకట్పల్లి వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో కూకట్పల్లి భాగ్యనగర్ బస్టాప్ వద్ద వీరి బైక్ అదుపుతప్పి మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టడంతో అఖిలేష్ యాదవ్ అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ వెనక కూర్చున్న మహమమ్మద్ యూనిస్‌ను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. అఖిలేష్ తండ్రి నారాయణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
అమెరికాలో ఏపీ యువతి మృతి
అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి మృతి చెందింది. మృతురాలిని పల్నాడు జిల్లా వినుకొండ మండలం ఉమ్మడివరం గ్రామానికి చెందిన మక్కెన ప్రసన్నగా గుర్తించారు. ఆమె ఉన్నత చదువుల కోసం 2022లో అమెరికా వెళ్లారు. ఇటీవలే చదువు పూర్తి చేసిన ప్రసన్న ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు.న్యూజెర్సీలో ప్రసన్న తన స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమె స్నేహితులకు గాయాలు కాగా, ప్రసన్న అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పెద్ద కుమార్తె మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆమె స్వగ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రసన్న భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా స్వగ్రామానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని.. సాయం అందించాలని కుటుంబ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
కారు అదుపు తప్పి బోల్తా.. వైద్య విద్యార్థిని మృతి
హైదరాబాద్: ఔటర్ రింగ్‌రోడ్డుపై కారు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో వైద్య విద్యార్థిని మృతి చెందినట్లు శంషాబాద్ ఇన్స్పెక్టర్ కె.నరేందర్‌రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్‌లోని అమ్స్రీ సెంట్రల్ కోర్టు నివాసి అద్దంకి అమూల్య(21) ఎంఎన్ఆర్ కళాశాలలో డెంటల్ విద్య అభ్యసిస్తోంది. ఈ నెల 13న అర్ధరాత్రి దాటిన తర్వాత స్నేహితుడు సిద్ధార్థ్‌తో కలిసి శంషాబాద్ చూడటానికి కారులో వచి్చంది. మంగళవారం తెల్లవారుజామున సికింద్రాబాద్ బయలుదేరారు. వీరు దారి తప్పి ఔటర్‌పైకి వచ్చి పెద్ద అంబర్పేట్ వైపు వెళ్తూ పెద్దగోల్కొండ టోల్గేట్ దాటగానే ప్రమాదానికి గురయ్యారు. అతివేగంగా వెళ్తున్న వీరి కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డు అవతలి వైపునకు వెళ్లి బోల్తా పడింది. డ్రైవింగ్ చేస్తున్న అమూల్య కారులోంచి రోడ్డుపై పడడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడిన సిద్ధార్థ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పెట్రోలింగ్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రి మార్చురికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఉపాధికై నగరానికి వచ్చి.. నిండు ప్రాణాలు కోల్పోయి
ఉపాధి కోసం.. పని వెదుక్కుంటూ.. కూతురుని చూసేందుకు.. నగరానికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. వేర్వేరుచోట్ల జరిగిన ఈ దుర్ఘటనల్లో ఏపీలోని ప్రకాశం జిల్లా వారు ఇద్దరు యువకులు, రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాకు మహిళ మృతి చెందారు. నిజాంపేట్: ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాచుపల్లి పోలీసులు తెలిపిన మేరకు.. ఏపీలోని ప్రకాశం జిల్లా పల్లమల్లి గ్రామానికి చెందిన ఎల్రక్టీíÙయన్ శివసాయి పవన్ (25) బాచుపల్లిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో ఉంటున్నాడు. స్నేహితుడు ఉమాప్రసాద్ (23)తో కలిసి ఆదివారం అర్ధరాత్రి బైక్‌పై బాచుపల్లి నుంచి ప్రగతి నగర్ వైపు బయలుదేరారు. బైక్ అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివసాయి పవన్‌కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న ఉమాప్రసాద్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు.ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి..హయత్‌నగర్: ముందు వెళుతున్న ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. హయత్‌నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన ఆదినారాయణ (35) హయత్‌నగర్‌లోని సూర్యనగర్‌లో నివాసముంటూ కూలి పనులు చేస్తూ జీవిస్తున్నాడు. సోమవారం ఉదయం ఆటోనగర్ నుంచి ఇంటికి వెళ్తుండగా, హయత్‌నగర్‌లో వెనుక నుంచి వేగంగా వచి్చన ఆర్టీసీ బస్సు ఆదినారాయణ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఆయన తల బస్సు చక్రాల కింద నలిగిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
రహదారి భద్రతపై నిర్లక్ష్యమా?
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నిర్లక్ష్య వైఖరిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రహదారి భద్రతకు సంబంధించి తాము గతంలో ఇచ్చిన మార్గదర్శకాలు, నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలోని కమిటీ చేసిన సిఫార్సుల అమలుపై పూర్తిస్థాయి నివేదికలు సమర్పించాలని పేర్కొంది. ఇందుకు నాలుగు వారాల గడువును నిర్దేశించింది. రహదారిపై భద్రతపై దాఖలైన పలు ప్రజా ప్రయోజన వాజ్యాలపై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సంజయ్ కుమార్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. తాము స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇంకా నివేదికలు సమర్పించకపోవడం ఏమిటని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ప్రశ్నించింది. పౌరుల ప్రాణాలతో ముడిపడి ఉన్న అత్యంత సున్నితమైన, ప్రాధాన్యత కలిగిన ఇలాంటి అంశాల్లో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని తప్పుబట్టింది. నిబంధనల అమలుపై స్టేటస్ లేదా కంప్లయన్స్ రిపోర్టులను తమ ముందు ఉంచాలని తేల్చిచెప్పింది. మోటారు వాహనాల(సవరణ) చట్టంలోని నిబంధనల అమలు, రహదారులపై భద్రతా చర్యలు, ప్రమాదాల నివారణకు క్షేత్రస్థాయిలో తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ సమగ్ర అఫిడవిట్లు దాఖలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇప్పటివరకు కంప్లయన్స్ నివేదికలు సమర్పించని రాష్ట్రాలకు ఇదే చివరి అవకాశమని తేల్చిచెప్పింది. రాబోయే నాలుగు వారాల్లోగా నివేదికలు సమర్పించని పక్షంలో సంబంధిత రాష్ట్రాల అధికారులపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రహదారి భద్రత కోసం ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీ చేసిన కీలక సిఫార్సులను అన్ని రాష్ట్రాలు విధిగా అమలు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. -
తమిళనాడులో రెండు బస్సులు ఢీ.. ఆరుగురి మృతి
సాక్షి, చెన్నై: తమిళనాడులోని మదురై జిల్లా మేలూరు సమీపంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. 20 మందికిపైగా స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాదంపై తమిళనాడు సీఎం జోసఫ్ విజయ్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. మరణించిన ఆరుగురి కుటుంబాలకు రూ.3లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు. తీవ్ర గాయాలతో ఐసీయూలో చికిత్స పొందుతున్న ఏడుగురికి రూ.లక్ష చొప్పున గాయపడిన మరో 15 మందికి రూ.50వేలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. -
లేడీ డాక్టర్ కారు బీభత్సం
ఒంగోలు టౌన్ : లేడీ డాక్టర్ కారు అదుపు తప్పడంతో ఓ కానిస్టేబుల్ ప్రాణాలను కోల్పోయాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలో రెండ్రోజులుగా గైనకాలజిస్టుల రాష్ట్రస్థాయి వార్షిక సదస్సు జరుగుతోంది. పాండిచ్చేరిలో పీజీ చేస్తున్న నగరానికి చెందిన డాక్టర్ మేఘ ఈ సదస్సులో పాల్గొనడానికి ఒంగోలు వచ్చారు. ముంగమూరు సెంటర్లో స్నేహితులతో కలిసి కాఫీ తాగి ఆ తర్వాత బయల్దేరారు. కారు నగరంలోని పాత ఎన్‌హెచ్–5 పద్మ టవర్స్ వద్దకు రాగానే అదుపుతప్పింది. తొలుత మున్సిపల్ చెత్త బండిని ఢీకొట్టింది.దాని డ్రైవర్ వసంతరావుకు గాయాలయ్యాయి. అప్పటికీ మేఘ వాహనాన్ని నియంత్రించలేకపోవడంతో కారు సైకిల్ మీద వెళ్తున్న ఏఆర్ కానిస్టేబుల్ సురభి మరియదాసు (32)ను వెనక నుంచి ఢీకొట్టింది. తలకు బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావమై కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతిచెందాడు. బల్లికురవ మండలం కూకట్లపల్లి గ్రామానికి చెందిన మరియదాసు ఒంగోలు జిల్లా సాయుధ రిజర్వ్ (డీఏఆర్)లో ఏఆర్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. రోల్‌కాల్‌కు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదంలో మరణించాడు. అతడికి భార్య భారతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.అయినా ఆగని కారు అయితే, ఈ ప్రమాదం తరువాత కూడా కారు ఆగలేదు. మోటారు బైకుపై చర్చికి వెళ్తున్న కొప్పేలు రామ్మోహన్‌రావును కూడా ఢీకొట్టింది. కానిస్టేబుల్ దాసు భార్య సురభి భారతి ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసులు మేఘపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స కోసం జీజీహెచ్‌కు తరలించారు. కారులో మరో ఇద్దరు లేడీ డాక్టర్లు కూడా ఉన్నట్లు సమాచారం. ఎస్పీ కార్యాలయానికి కూత వేటు దూరంలోనే ఈ ప్రమాదం జరిగింది. కొద్ది రోజుల క్రితం ఇదే తరహాలో వేగంగా వస్తున్న కారు ఢీకొన్న దుర్ఘటనలో ఇద్దరు మహిళలు మృత్యువాతపడ్డారు. -
హైదరాబాద్ ఫిలింనగర్లో ఫెరారీ స్పోర్ట్స్ కారు బీభత్సం!
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఈరోజు తెల్లవారుజామున ఓ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం లేదు. ఫిలింనగర్ సైట్ 2 రోడ్ నంబర్ 5 లో ఉదయం 4 గంటల సమయంలో ఫెరారీ స్పోర్ట్స్ కార్ బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన ఉన్నటువంటి హిల్ వ్యూ అపార్ట్మెంట్ గేటు బద్దలు కొట్టి లోనికి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం పూర్తిగా డ్యామేజ్ అయింది. ప్రమాదం జరిగిన వెంటనే యువకులు ఘటనాస్థలం నుంచి పరారయ్యారు.సమాచారం అందుకున్న ఫిలింనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, మద్యం మత్తులో ఉన్న యువకులు ఓవర్ స్పీడ్ కారణంగా కారు అదుపుతప్పడంతో ప్రమాదానికి గురైందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫెరారీ స్పోర్ట్స్ కారును క్రేన్ సహాయంతో టోయింగ్ వెహికల్ లో ఫిలింనగర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అయితే, ఈ ప్రమాదం మద్యం మత్తులో ప్రమాదం జరిగిందా? లేదంటే నెగ్లిజెన్సీ రాష్ డ్రైవింగ్ కారణమా? ఇంకా తెలియాల్సి ఉంది. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
రోడ్డు ప్రమాదంలో ట్యాంకర్ టైరు కింద నలిగి..
హైదరాబాద్, గచ్చిబౌలి: వేగంగా దూసుకొచ్చిన వాటర్ ట్యాంకర్ ఢీ కొట్టడంతో ఓ యువతి మృతి చెందగా మరో యువతి గాయపడింది. గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ బాలరాజు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కాట్రపల్లికి చెందిన మల్లం భవాని(23) ఇందిరానగర్ పీజీ హాస్టల్లో ఉంటూ టెలికాంనగర్‌లోని గోకలర్స్‌లో సేల్స్ గర్ల్‌గా పని చేస్తోంది.మరో సేల్స్ గర్ల్ ఎస్.సుహాసిని(30) అంజయ్యనగర్‌లోని లక్ష్మీ హాస్టల్లో నివాసం ఉంటోంది. గురువారం రాత్రి 11.20 గంటల సమయంలో సుహాసిని, భవాని కలిసి భోజనానికి వెళ్లారు. ట్రిపుల్ ఐటీ నుంచి గచ్చిబౌలి ఫ్లై ఓవర్ సమీపంలో వెనక నుంచి వాటర్ ట్యాంకర్ వేగంగా వచ్చి ఢీ కొట్టింది. వెనక కూర్చున్న భవాని టైర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. సుహాసిని తీవ్రంగా గాయపడింది. -
శంషాబాద్ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్ జామ్
సాక్షి, శంషాబాద్: హైదరాబాద్ శివారులోని శంషాబాద్ ప్రాంతంలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన ఓ బొలెరో వాహనం బస్టాండ్‌లో వేచి ఉన్న మహిళలపైకి దూసుకెళ్లడంతో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.సతమరాయి సమీపంలో ఈ వేకువజామున ఈ ఘోరం జరిగింది. ఉదయం సమయంలో రోడ్డుపై వెళ్తున్న బొలెరో.. ముందు వెళ్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో అదుపు తప్పినట్లు తెలుస్తోంది. వేగంగా వచ్చిన వాహనం నేరుగా రోడ్డు పక్కన ఉన్న బస్టాండ్‌లోకి దూసుకెళ్లింది. అక్కడ బస్సు కోసం వేచి ఉన్న మహిళలను ఢీకొట్టడంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. అయితే అప్పటికే ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.ఈ ప్రమాదంతో శంషాబాద్–సతమరాయి మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డుపై ప్రమాదానికి గురైన వాహనం, సహాయక చర్యల కారణంగా ట్రాఫిక్ స్తంభించింది. దీంతో అధికారులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే చర్యలు చేపట్టారు. ప్రమాదానికి అసలు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
అమెరికాలో రోడ్డుప్రమాదం..
మూలపాడు (ఇబ్రహీంపట్నం): అమెరికాలోని న్యూయార్క్ ప్రాంతంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడుకు చెందిన అట్లూరి ప్రసన్నలక్ష్మి (30) దుర్మరణం పాలైంది. మూలపాడుకు చెందిన రైతు అట్లూరి వసంతరావు, మల్లేశ్వరి దంపతులకు కుమార్తె ప్రసన్నలక్ష్మి, ఒక కుమారుడు ఉన్నారు. ప్రసన్నలక్ష్మిని అమెరికాలో ఎంఎస్ చదివించారు. అక్కడే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఆమెకు ఉద్యోగం వచ్చింది. న్యూజెర్సీలో ఉంటున్న ఆమె జాబ్ కాల్‌లెటర్‌కు పూజ చేయించేందుకు కారులో స్నేహితులతో కలిసి బయలుదేరింది.న్యూయార్క్ ప్రాంతంలో రోడ్డుపై సిగ్నల్స్ వద్ద ప్రసన్నలక్ష్మి ప్రయాణిస్తున్న కారును మరోకారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృత్యువాతపడింది. ప్రసన్నలక్ష్మి దుర్మరణం వార్త తెలియడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ప్రమాదంలో మరో యువతి కూడా మరణించినట్లు తెలిసింది. కారులోని మరో ఇద్దరు గాయపడగా ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. -
మరణాన్ని జయించిన మానవత్వం
గంభీరావుపేట(సిరిసిల్ల): బుడిబుడి నడకలను చూసి సంబురపడ్డ తల్లిదండ్రుల ఆనందం ఎక్కువ కాలం నిలువలేదు. అంబులెన్స్ రూపంలో వచ్చిన మృత్యువు బాలుడిని ఢీకొట్టగా బ్రెయిన్‌డెడ్ అయ్యాడు. ఇంత విషాదంలోనూ ఆ కుటుంబ సభ్యులు బాలుడి అవయవాలను దానం చేసి మరో ఆరుగురికి పునర్జన్మను ప్రసాదించారు. బాలుడు తను వెళ్లిపోతూ ఆరుగురి రూపంలో ఈ లోకంలోనే ఉండిపోయాడు. రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన బొంబాయి పాపారావు కూతురు సౌమ్య, అల్లుడు రఘు ఉద్యోగరీత్య తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలి జిల్లా రాధాపురంలో ఉంటున్నారు. వీరి రెండో కుమారుడు యశ్వన్(7) గత నెల 29న సైకిల్ తొక్కుకుంటూ ఉండగా అతివేగంగా వచ్చిన అంబులెన్స్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడి తలకు తీవ్ర గాయాలై బ్రెయిన్‌డెడ్ అయ్యింది. ఎంత ప్రయత్నించినా బాలుడిని కాపాడుకోలేకపోయారు. ఇంత విషాదంలో యశ్వన్ తల్లిదండ్రులు, తాత పాపారావు బాలుడి అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకున్నారు. రెండు కిడ్నీలు, కాలేయం, గుండె కవాటం, రెండు కంటి పాపలను ఇతరులకు మార్పిడి చేశారు. ఆరుగురికి కొత్త జీవితాన్ని ప్రసాదించిన యశ్వన్ తన మరణానంతరం చిరంజీవిగా నిలిచిపోయాడు. చిన్న వయస్సులోనే ఈ లోకాన్ని విడిచిపోయిన యశ్వన్ భౌతికంగా లేకపోయినా అతని గుండెచప్పుడు, చూపు, జీవం మరో ఆరుగురిలో కొనసాగుతోంది. -
సోదరి నిశ్చితార్థానికి వెళ్లొస్తూ..
హైదరాబాద్, శంషాబాద్: ఔటర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందగా వదినకు తీవ్ర గాయాలయ్యాయి. శంషాబాద్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె.నరేందర్‌రెడ్డి తెలిపిన మేరకు.. కాకినాడ రామచంద్రాపురం మండలం యెరుపల్లికి చెందిన చల్లా రాఘవేంద్ర ప్రసాద్ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ కిస్మత్పూర్లో నివాసముంటున్నాడు.వరుసకు సోదరుడైన చల్లా మనోహర్ (25) సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడే ఉంటున్నాడు. రాఘవేంద్రప్రసాద్ సోదరి నిశ్చితార్థం కోసం వారి స్వగ్రామం యెరుపల్లికి ఈ నెల 4న ప్రసాద్, అతని భార్య భవాని (31), కొడుకు కార్తికేయ (2)తో పాటు మనోహర్ వెళ్లాడు. శుభకార్యం తర్వాత వీరంతా ఈ నెల 5న సాయంత్రం హైదరాబాద్ బయలుదేరారు.వెనక నుంచి లారీని ఢీకొట్టి.. కారును రాఘవేంద్రప్రసాద్ నడుపుతుండగా.. పక్క సీట్లో మనోహర్, వెనక సీట్లో భవాని, కార్తికేయ కూర్చున్నారు. సోమవారం తెల్లవారుజామున వీరు ఔటర్‌పై పెద్దగోల్కొండ శివారులోకి రాగానే.. ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. రాఘవేంద్ర గమనించకపోవడంతో కారు అదుపుతప్పి వెనక నుంచి ఢీకొట్టింది.లారీని కారు ఎడమవైపు భాగం బలంగా ఢీకొనడంతో మనోహర్‌కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కారు వెనక సీట్లో కూర్చున్న భవానికి తీవ్ర గాయాలవడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న శంషాబాద్ పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రావెల్స్ బస్సు డ్రైవర్ అతివేగానికి..
చిట్యాల: విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివారులో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. చిట్యాల ఎస్ఐ మామిడి రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని మధురానగర్(యూసుఫ్‌గూడ)లో నివాసముంటున్న మలిరెడ్డి వీర వెంకట నాగ వరప్రసాద్‌బాబు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో ఉద్యోగం చేస్తున్నాడు. అతడి స్వస్థలం ఏపీలోని కాకినాడ కాగా.. ఉద్యోగ రీత్యా కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లో నివాసముంటున్నాడు. వరప్రసాద్‌బాబు, అతడి భార్య విజయలక్ష్మి(40), కుమార్తె శ్రియ(17), కుమారుడు ప్రభవ్(12)తోపాటు వారికి తెలిసిన వ్యక్తి అయిన హైదరాబాద్‌లోని గుండ్లపోచంపల్లిలో నివాసముంటున్న సినీ ఎడిటర్ కట్టా శ్రీకర్ ప్రసాద్(62)తో కలిసి తమ కూతు రుకు మెరుగైన వైద్యచికిత్స కోసం శనివారం ఉదయం చెన్నై వెళ్లారు. తిరిగి శనివారం రాత్రి చెన్నై నుంచి కారులో హైదరాబాద్‌కు బయల్దేరారు. మార్గమధ్యలో ఆదివారం తెల్లవారుజామున చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివారులో విజయవాడ–హైదరాబాద్ హైవేపై గల యూటర్న్ వద్దకు రాగానే అతివేగంగా వస్తున్న ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు వెనుక సీట్లో కూర్చున్న విజయలక్ష్మి, శ్రియ, ప్రభవ్‌తో పాటు ముందు కూర్చున్న కట్టా శ్రీకర్ ప్రసాద్ అక్కడికక్కడే మృతిచెందారు. కారు డ్రైవింగ్ చేస్తున్న వరప్రసాద్‌బాబుకు తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. సమాచారం తెలుసుకున్న చిట్యాల ఎస్ఐ మామిడి రవికుమార్, తన సిబ్బందితో వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడిన వరప్రసాద్‌బాబును చికిత్స నిమిత్తం నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. ట్రావెల్స్ బస్సు డ్రైవర్ అతివేగంగా, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఘటనా స్థలాన్ని నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ పరిశీలించారు. రోడ్డు ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. -
పురోహితుడి ప్రాణం తీసిన కొబ్బరి బొండం
వివాహ వేడుక ముగించుకుని హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి కారులో బయలుదేరిన పురోహితుడు దువ్వూరి హరిప్రసాద్ (52) విజయవాడ సమీపంలోని గొల్లపూడి క్రాస్‌రోడ్డు వద్ద కారు అదుపుతప్పి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. ఆ సమయంలో కారులో వెనుక సీటులో ఉన్న కొబ్బరిబోండం ఎగిరి వచ్చి బ్రేక్, క్లచ్ మధ్య ఇరుక్కోవడంతో కారు నియంత్రణ కోల్పోయి ముందున్న కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.కృష్ణాజిల్లా: వెస్ట్ బైపాస్‌పై జక్కంపూడి షాబాద్‌ల మధ్య శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. ఆయా కుటుంబాల్లో పెద్ద దిక్కుగా ఉన్న ఇద్దరు వ్యక్తులను కబళించింది. అందులో ఒకరు తన కుమారుడి పెళ్లి వేడుక చేసి తిరిగి కారులో ఇంటికి వస్తుండగా.. మరొకరు బైక్‌పై తన కొడుకుతో ప్రయాణిస్తున్నారు. వివరాలు ఇవి.. రాజమండ్రి సీతంపేటకు చెందిన దువ్వూరి హరిప్రసాద్(52) పురోహితుడిగా చేస్తుంటాడు. హరిప్రసాద్ చిన్న కుమారుడి వివాహం ఉండటంతో కుటుంబం మొత్తం హైదరాబాద్ వెళ్లింది. పెళ్లి ముగించుకుని తర్వాత మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి పెళ్లి కొడుకు, పెళ్లికూతురుతో పాటు మిగిలిన వారందరూ ఒక కారులో, హరిప్రసాద్ తన బంధువుతో పాటు పెళ్లి సామగ్రి తీసుకుని మరో కారులో బయలుదేరారు. తన బంధువును గొల్లపూడి వద్ద దింపిన హరిప్రసాద్.. కారును వెస్ట్ బైపాస్ వైపు మళ్లించాడు. మొదట బైక్.. ఆపై కంటైనర్‌ను ఢీకొట్టి.. జక్కంపూడి, షాబాద్‌ల మధ్య అండర్ పాస్ వద్దకు వచ్చే సరికి ఎదురు వెళ్తున్న బైక్‌ను హరిప్రసార్ కారు ఢీ కొట్టింది. ఆపై రోడ్డుకు పక్కనే నిలిపి ఉన్న కంటైనర్‌ను వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. దీంతో ఆ కారు నడుపుతున్న హరిప్రసాద్ అక్కడి కక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న పాయకాపురానికి చెందిన సూరిబోయిన హరికృష్ణ స్వల్పంగా, అతని తండ్రి గురవయ్యలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుకున్న కొద్దిసేపటికే గురవయ్య మృతి చెందాడు. గురవయ్య బోయమడుగులకు వీఆర్ఏగా విధులు నిర్వర్తిస్తున్నాడు. గురవయ్య కొంత కాలం కిందట గుండె ఆపరేషన్ చేయించుకోగా, మందుల కోసం గుంటూరు వెళ్లి తిరిగి పాయకాపురానికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో రెండు కుటుంబాలకు చెందిన ఇద్దరు పెద్దలు చనిపోవడంతో ఆసుపత్రి ప్రాంగణం రోదనలతో విషాధ చాయలు అలముకున్నాయి. -
కంభం రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: కంభం పట్టణంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి సహా నలుగురు మృతి చెందడం పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.పెళ్లి వేడుకకు హాజరై ఆలయానికి వెళ్లిన వారు ఈ విధంగా ప్రమాదానికి గురికావడం అత్యంత బాధాకరమని ఆయన పేర్కొన్నారు. వివాహ వేడుకల ఆనందం నిండిన కుటుంబంలో ఇలాంటి పెను విషాదం నెలకొనడం హృదయ విదారకమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. తీవ్రంగా గాయపడినవారి వైద్య ఖర్చులను ప్రభుత్వం భరించాలని, బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.కాగా, మార్కాపురం జిల్లా కంభం వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో కూడిన ఆటోను లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, 8 మంది గాయపడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడం విషాదం నింపింది. మృతి చెందిన వారిలో అలకనంద (19), అంకాలు (20), నగేశ్ (17) , నాగేశ్వరి (2) గిద్దలూరు నల్లబండ బజారు వాసులుగా గుర్తించారు. కాగా పెళ్లి కూతురు వీరక్కకు తీవ్ర గాయాలయ్యాయి. -
బలూచిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 40 మంది దుర్మరణం
క్వెట్టా/ఇస్లామాబాద్: పాకిస్థాన్ దక్షిణ పశ్చిమ రాష్ట్రం బలూచిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు లోయలో పడిపోవడంతో 40 మంది మృతి చెందారు. మరో 8 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.శుక్రవారం ఉదయం క్వెట్టా నుంచి దేశ రాజధాని ఇస్లామాబాద్ వైపు వెళ్తున్న ఈ బస్సు షెరాని–జోబ్ హైవేపై దనసర్ ప్రాంతంలో అదుపుతప్పి లోతైన లోయలో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో ఎంతమంది ఉన్నారన్నదానిపై స్పష్టత లేదు. రెస్క్యూ బృందాలు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి.Very sad news 😢💔At least 40 killed, 8 injured as passenger bus falls into ravine near Balochistan-KP border.#Balochistan #Accident pic.twitter.com/N222P3v64y— Balochistan Ko Bachao (BKB) (@balochistankb) July 3, 2026బస్సు ఒవర్‌లోడ్ కారణంగానే ప్రమాదం జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మార్గమధ్యంలో మరో బస్సు చెడిపోవడంతో అక్కడి ప్రయాణికులను కూడా ఈ బస్సులోకి ఎక్కించారని వెల్లడించారు. దీంతో ప్రయాణికుల సంఖ్య పెరగడం.. బస్సు అదుపు తప్పి ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. షెరాని డిప్యూటీ కమిషనర్ హజ్రత్ వాలి కకర్ మాట్లాడుతూ, గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నామని, మృతదేహాలను వెలికితీసే పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.మెడికల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ (MERC) వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకు 40 మృతదేహాలను వెలికితీశారు. గాయపడిన ఎనిమిది మందిని వెంటనే జోబ్ ట్రామా సెంటర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. నీటి ప్రవాహంలో కాకుండా బండ రాళ్ల మీద బస్సు పడడంతో.. ప్రమాద తీవ్రత ఎక్కువగా నమోదైందని చెబుతున్నారు. ప్రమాద స్థలంలో ఆరు అంబులెన్సులు, 12 మంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు, పది లైట్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు సహాయక చర్యల్లో వచ్చి చేరాయి. స్థానిక అధికారులతో పాటు సమీప ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంత రెస్క్యూ బృందాలు కూడా ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయి. -
కంభం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
మార్కాపురం జిల్లా కంభం వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో కూడిన ఆటోను లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, 8 మంది గాయపడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడం విషాదం నింపింది. మృతి చెందిన వారిలో అలకనంద (19), అంకాలు (20), నగేశ్ (17) , నాగేశ్వరి (2) గిద్దలూరు నల్లబండ బజారు వాసులుగా గుర్తించారు. కాగా పెళ్లి కూతురు వీరక్కకు తీవ్ర గాయాలయ్యాయి. -
నాకు చిన్న పిల్లలున్నారయ్యా... ఎవరైనా కాపాడండి...
గుంటూరు జిల్లా: ఒక లారీ డ్రైవర్ నిర్లక్ష్యం.. పెను ప్రమాదానికి దారి తీసింది. ఏకంగా మూడు కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. నుజ్జునుజ్జయిన లారీ క్యాబిన్లలో ఇరుక్కుపోయి బయటకు రాలేక వారు పెట్టిన హాహాకారాలు, మీదకొస్తున్న అగ్ని కీలల నుంచి కాపాడమని చేసిన ఆర్తనాదాలు చూపరులను కలచివేశాయి. లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు.. ముగ్గురిని అక్కడికక్కడే సజీవ దహనం చేసింది. ఏ మృతదేహం ఎవరిదో కూడా గుర్తుపట్టలేని స్థితిలో పూర్తిగా కాలిపోయిన విషాద ఘటన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం బోయపాలెం హైవేపై చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలు... నంద్యాల జిల్లా బేతంచర్ల నుంచి నాపరాయి లోడుతో మచిలీపట్నం వైపు ఓ లారీ వెళుతోంది. మరోవైపు బుధవారం వేకువజామున గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం బోయపాలెం 16వ నంబరు జాతీయ రహదారిపై డీజిల్ అయిపోయి మధ్య లైనులో కోళ్ల దాణా లోడు లారీ అడ్డంగా నిలిచిపోయింది. దీనిని తప్పించబోయి.. అదుపు తప్పిన మొదటి లారీ అక్కడి డివైడర్‌ను ఢీకొట్టి, అవతల రోడ్డులోకి దూసుకెళ్లింది.అదే సమయంలో భద్రాచలం నుంచి బెంగళూరుకు పేపర్ బండిల్స్ లోడుతో వెళ్తున్న లారీని నాపరాయి లోడు లారీ ఎదురు నుంచి ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో నాపరాయి లోడు లారీ నడుపుతున్న నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం నేరేడుచర్ల గ్రామానికి చెందిన మేకల రవికుమార్ (36), అదే గ్రామానికి చెందిన డ్రైవరు రమేశ్ (35)తోపాటు పేపర్ లోడ్‌లారీ నడుపుతున్న కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా శెట్టిగన్‌పల్లి గ్రామానికి చెందిన ధర్మపతి (26) మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ఏ మృతదేహం ఎవరిదో కూడా కనుక్కోలేని విధంగా పూర్తిగా ఆహుతయ్యాయి. చిన్న పిల్లలున్నారయ్యా.. ప్రమాదంలో నాపరాయి లోడు లారీ నడుతుపుతున్న డ్రైవర్ మేకల రవికుమార్ పెట్టిన ఆర్తనాదాలు గుండెలను పిండేశాయి. ‘నాకు ఇంటి దగ్గర చిన్న పిల్లలున్నారయ్యా, ఎవరైనా కాపాడండి’ అంటూ పెద్దగా కేకలు వేశాడు. గమనించిన స్థానికులు కొందరు క్యాబిన్లో ఇరుక్కుపోయిన ఆయన్ను డోర్లు తీసి బయటకు లాగేందుకు తీవ్రప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ లోతుగా ఇరుక్కుపోవడంతో సాధ్యపడలేదు. ఇంతలో మంటలు చెలరేగి అందరూ చూస్తుండగానే రవికుమార్ అగ్నికి ఆహుతయ్యాడు. ఆయన ఆఖరి మాటలు అందరి హృదయాలను కలిచివేశాయి. రవికుమార్‌కు భార్య, ఒకటో తరగతి చదువుతున్న అని్వక, ఐదో తరగతి చదువుతున్న మనోజ్‌లు ఉన్నారు. శాశ్వత నిద్రలోనికి.. ఇదే లారీలో డ్రైవరుగా ఉన్న రమేశ్ ప్రమాదం జరిగిన సమయంలో క్యాబిన్లో ఉన్న బెడ్‌పై గాఢ నిద్రలో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఎదురుగా లారీని బలంగా ఢీకొట్టడంతో నిద్రిస్తున్న రమేశ్ బెడ్‌పై నుంచి ముందుకొచ్చి లారీ లోపల ముందు భాగంలో బోర్లా పడి ఇరుక్కుపోయాడు. మంటల్లో చిక్కుకుని గిలగిల కొట్టుకుంటూ తుదిశ్వాస విడిచాడు. పేపర్ లోడు లారీ నడుపుతున్న ధర్మపతి నుజ్జునుజ్జుయిన క్యాబిన్లో చిక్కుకుపోయాడు. మంటలు క్షణాల వ్యవధిలోనే వ్యాపించడంతో బయట పడలేకపోయాడు. మృతదేహం అగ్ని కీలల్లో చిక్కుకుని 70 శాతం వరకు కాలిపోయింది. మిగిలిన ఇద్దరి మృతదేహాల ఆనవాళ్లు బయటకు కనిపిస్తున్నప్పటికీ ధర్మపతి మృతదేహం ఎక్కడుందో కూడా గుర్తుపట్టడం కొంత ఇబ్బందికరంగా మారింది. ప్రమాదం గుంటూరు–పల్నాడు జిల్లాల సరిహద్దులో జరగడంతో పరిధి ఎవరిదనే అంశంపై కొంత సేపు మీమాంస చోటుచేసుకుంది. అనంతరం రెవెన్యూ అధికారులు సరిహద్దు నిర్ధారించడంతో ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. జేసీబీల సాయంతో సుమారు ఎనిమిది గంటలు శ్రమించి లారీ శకలాలను పక్కకు తీయించారు. సాయంత్రం మూడు గంటల సమయానికి ఒకవైపు హైవే ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. -
రాజస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
జైపూర్: విలాసవంత స్లీపర్ కోచ్ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల బతుకులు తెల్లవారుజామున తెల్లారిపోయాయి. ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్ నుంచి బయల్దేరిన బస్సు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరానికి వెళ్తూ మార్గమధ్యంలో రాజస్తాన్ గుండా ప్రయాణిస్తుండగా ప్రమాదానికి గురై బుగ్గిపాలైంది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరు తలకు తీవ్రమైన గాయాలతో ప్రాణాలు కోల్పోయారు. 24 మంది గాయాలపాలయ్యారు. వీరిలో 14 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.రాజస్తాన్‌లోని దౌసా జిల్లాలోని కోల్వా పోలీస్‌స్టేషన్ పరిధిలో ధనావ్డా ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ప్రయాణికులున్న ఒక ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాలు రోడ్డు దాటి పక్కకు వెళ్లి మంటల్లో చిక్కుకున్నాయి. ‘‘వేగంగా ఢీకొనడంతో బస్సులోంచి నా భార్య ఎగిరిపడి ట్రక్కు, బస్సు మధ్యలో ఇరుక్కుని నా కళ్లముందు మంటల్లో కాలిపోయింది’’అని ఒకతను ఏడుస్తూ చెప్పారు. ‘‘మేం జమ్మూకశీ్మర్‌లో వైష్ణోదేవి ఆలయాన్ని దర్శించుకుని తిరిగొస్తున్నాం. ముందున్న ట్రక్కును బస్సు వేగంగా ఢీకొనడంతో మంటలొచ్చాయి. నా భర్త జాడ తెలీడంలేదు’’అని ఒకావిడ కన్నీటిపర్యంతమయ్యారు. -
రమ్యను మర్చిపోయారా?.. పదేళ్లైనా న్యాయం దక్కలేదు!
"ఆ రోజు మా జీవితాలను చీకటిలోకి నెట్టేసింది... కానీ పదేళ్లు గడిచినా న్యాయం మాత్రం దక్కలేదు.".. ఓ కుటుంబం ఆవేదన. 2016 జూలై 1... తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ఘటన జరిగిన రోజు. మద్యం మత్తులో వేగంగా దూసుకొచ్చిన కారు ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. 10 ఏళ్ల చిన్నారి రమ్య, ఆమె బాబాయి, తాత.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆ ప్రమాదంలో చనిపోయిన వారి జ్ఞాపకాలు మాత్రమే కాదు.. న్యాయం కోసం ఆ కుటుంబం ఎదురుచూస్తున్న బాధ కూడా ఇప్పటికీ అలాగే ఉంది.2016 జూలై 1న బంజారాహిల్స్ ప్రాంతంలో మద్యం మత్తులో వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న వాహనంపై పడింది. ఆ ప్రమాదంలో నాలుగో తరగతి చదువుతున్న 10 ఏళ్ల చిన్నారి రమ్య తీవ్రంగా గాయపడింది. ఆమె బాబాయి రాజేశ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. రమ్య కొద్ది రోజుల తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. గాయాల కారణంగా ఆమె తాత మధుసూదనాచారి కూడా కన్నుమూశారు. ఒకే ప్రమాదంలో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.డ్రంక్ అండ్ డ్రైవ్‌పై అప్పట్లో దేశవ్యాప్త చర్చఈ కేసులో నిందితులంతా 20 ఏళ్ల లోపే కావడం.. అదీ ఇంజనీరింగ్ విద్యార్థులు కావడం గమనార్హం. రమ్య కేసు తర్వాత హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై విస్తృత చర్చ జరిగింది. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పబ్‌ల నియంత్రణను మరింత కఠినతరం చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. తాగి వాహనాలు నడపకండంటూ తెలుగు రాష్ట్రాల్లో ఫ్లకార్డులతో జనాలు రోడ్డెక్కి నిరసనలు చేశారు. పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించినప్పటికీ.. ఇలాంటి ప్రమాదాలు పూర్తిగా ఆగలేదు.పదేళ్లలో ఒక్కసారే విచారణ?ఈ కేసులో న్యాయం కోసం పదేళ్లుగా పోరాడుతున్నామని బాధిత కుటుంబం చెబుతోంది. కానీ ఈ పదేళ్లలో కోర్టులో కేవలం ఒక్కసారి మాత్రమే విచారణ జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసు విచారణ ముందుకు సాగకపోవడం, తరచూ వాయిదాలు పడుతుండటంతో న్యాయం ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి నెలకొన్నదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు.అయితే దీనిపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.విదేశాల్లో నిందితుడు.. అదో మిస్టరీ!ఈ కేసులో శ్రవిల్, విష్ణు వినీత్‌లు ప్రధాన నిందితులుగా ఉన్నారు. వెంట మరో నలుగురు కుర్రాళ్లు ఉన్నప్పటికీ.. వాళ్ల గురించి స్పష్టత లేదు. అయితే కేసు తర్వాత విష్ణు వినీత్ విదేశాలకు పారిపోయాడని.. అతన్ని తిరిగి భారత్‌కు తీసుకురావడానికి పోలీసులు చర్యలు చేపట్టినట్లు పలుమార్లు ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు స్పష్టమైన ఫలితం కనిపించలేదని కుటుంబ సభ్యులు అంటున్నారు. నిందితుడిని భారత్‌కు తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టాలన్న తమ డిమాండ్ ఇప్పటికీ నెరవేరలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.'ప్రతీకారం కాదు.. న్యాయం కావాలి'పదేళ్లు గడిచినా రమ్య జ్ఞాపకాలు ప్రతి రోజూ వెంటాడుతున్నాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తమకు ఎవరిపైనా ప్రతీకారం అవసరం లేదని.. కానీ చట్టం తన పని చేసి బాధ్యులకు శిక్ష పడాలని మాత్రమే కోరుకుంటున్నామని అంటున్నారు. కేసు విచారణను వేగవంతం చేసి నిందితులను చట్టం ముందు నిలబెట్టాలని ప్రభుత్వాన్ని, న్యాయవ్యవస్థను వారు కోరుతున్నారు. -
పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు సజీవదహనం
-
రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. ఏడుగురి సజీవదహనం
రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై హరిద్వార్ నుంచి ఇండోర్‌కు వెళ్తున్న ప్రైవేట్ లగ్జరీ స్లీపర్ బస్సు.. ముందు వెళ్తున్న ఓ భారీ ట్రక్కును బలంగా ఢీకొట్టింది. దీంతో అదుపు తప్పిన బస్సు రోడ్డు పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఏడుగురు ప్రయాణికులు సజీవదహనమయ్యారు. మరో 15 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దౌసా జిల్లా కొల్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ రెస్ట్ ఏరియా సమీపంలో తెల్లవారుజామున 2 నుంచి 3 గంటల మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హరిద్వార్ నుంచి ఇండోర్‌కు సుమారు 39 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు, ముందున్న ట్రక్కును ఢీకొట్టింది. ఢీకొన్న వేగానికి బస్సు లోయలోకి పడిపోగా, వెనుక భాగంలో మంటలు చెలరేగి క్షణాల్లోనే వాహనం మొత్తం వ్యాపించాయి.ప్రమాదం జరిగిన సమయంలో ఎక్కువ మంది ప్రయాణికులు గాఢనిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా జరిగిన ఢీకొట్టడంతో అప్పర్ బెర్త్‌లపై ఉన్న ప్రయాణికులు కిందపడిపోయారు. మహిళలు, చిన్నారులు సహా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మంటలు మరింత వ్యాపించేలోపే కొందరు ప్రయాణికులు బస్సు కిటికీల అద్దాలు పగులగొట్టి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే మంటల్లో చిక్కుకున్న ఏడుగురు బయటకు రాలేక సజీవదహనమయ్యారు.సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్‌లు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను బయటకు తీసి దౌసా జిల్లా ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన కొందరిని మెరుగైన చికిత్స కోసం ఇతర ఆస్పత్రులకు తరలించారు.అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురాగా, పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ట్రక్కును ఢీకొట్టిన కారణంగానే ఈ ప్రమాదం జరిగిందా? లేక డ్రైవర్ నిద్రమత్తు లేదా మరో సాంకేతిక లోపం కారణమా? అన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. Dausa, Rajasthan: A road accident took place in Dausa after a tourist bus carrying around 37 pilgrims from Haridwar to Indore collided with a truck on the Delhi–Mumbai Expressway in the early hours today. Following the collision, both vehicles caught fire. The passengers managed… pic.twitter.com/wp5zGGi96W— IANS (@ians_india) July 1, 2026 -
విజయవాడ వెస్ట్ బైపాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి,గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని బీబీ గూడెం వద్ద విజయవాడ పశ్చిమ బైపాస్‌పై మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ల కుమారుడు సహా తల్లి, మరో వ్యక్తి దుర్మరణం చెందారు. పోలీసుల కథనం మేరకు.. ఏలూరు జిల్లా కైకలూరు మండలం పెంచికలపర్రు గ్రామానికి చెందిన జయమంగళ వెంకటవిజయ్కుమార్, వెంకటరాజు సోదరులు పొక్లెయిన్లు నడుపుతుంటారు. ఈ నేపథ్యంలో విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి తల్లి రమాదేవి చూసేందుకు కుటుంబ సభ్యులతో కారులో వచ్చారు.వెంకరాజు భార్య, పిల్లలు ఆస్పత్రి వద్ద ఆగిపోగా, మిగిలిన వారు కైకలూరుకు తిరుగు ప్రయాణమయ్యారు. జాతీయ రహదారి పశ్చిమ బైపాస్‌పై బీబీ గూడెం సమీపంలోకి రాగనే వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్ లారీ ముందు టైరు పంక్చర్ కావడంతో ఒక్కసారిగా అదుపుతప్పింది. ముందు వెళ్తున్న ట్యాంకర్ లారీతో పాటు వీరి కారును ఢీకొట్టి కొంత దూరం పాటు ఈడ్చుకువెళ్లింది.ఈ ప్రమాదంలో కంటైనర్, ట్యాంకర్ మధ్య కారు ఇరుక్కుపోయి పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో కారులో వెనుక సీటులో కూర్చోన్న వెంకటవిజయ్కుమార్ భార్య బాలవెంకటనాగదుర్గ (28), కుమారుడు కారుణ్య నాగసాయి(4) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలోనే ట్యాంకర్ లారీ ఢీకొని స్కూటీపై వెళ్తున్న విజయవాడ సింగ్‌నగర్‌కు చెందిన హోటల్ కార్మికుడు దాసరి వెంకటేశ్వరరావు (49)కు బలమైన గాయాలు కావడంతో మృతి చెందాడు.కారు నడుపుతున్న వెంకటరాజు, ముందు సీట్లో కూర్చున్న వెంకటవిజయ్కుమార్ గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. సమాచారం అందుకున్న గన్నవరం సీఐ బి.వి.శివప్రసాద్, పలువురు ఎస్ఐలు, సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. వెంకటేశ్వరరావుతో పాటు కారులో ఇరుక్కుపోయిన తల్లి, కుమారుడి మృతదేహాలను అతికష్టం మీద బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనతో పశ్చిమ బైపాస్‌పై గంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. అనంతరం ప్రమాదానికి గురైన వాహనాలను పోలీసులు, హైవే సిబ్బంది పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు. -
ప్రయాణం మధ్యలో RTC బస్సు బోల్తా.. అసలు ఏం జరిగింది?
-
ఒక్క క్షణం.. ఒక మలుపు.. నలుగురి ప్రాణాలు బలి
-
వనపర్తిలో ఆర్టీసీ బస్సు బోల్తా.. 10 మందికి పైగా గాయాలు
సాక్షి, మహబూబ్‌నగర్: హైదరాబాద్ బెంగుళూరు జాతీయ రహదారి 44 పై బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. దీంతో ప్రయాణీకులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. కర్నూల్ నుంచి వనపర్తి జిల్లా వైపుగా వస్తున్న బస్సు రంగాపూర్ వద్ద ప్రమాదావశాత్తు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పదిమందికి పైగా గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు క్షతగాత్రులను 108 లో దగ్గరలో గల ఆసుపత్రికి తరలించారు.అయితే డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. బస్సులో దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నట్టు చెబుతున్నారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. -
రోడ్డు ప్రమాదం: తల్లిదండ్రుల కళ్లెదుటే తెగిపడిన తల
మంచిర్యాల జిల్లా: సెలవు రోజు కావడం.. బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండడంతో మంచిర్యాలకు చెందిన దంపతులు, ఒక్కగానొక్క కొడుకుతోపాటు నానమ్మను తీసుకుని వెళ్లారు. శుభకార్యం అనంతరం సాయంత్రం తిరిగి ఇంటికి బయల్దేరారు. రోడ్డుపక్కన ఆగిఉన్న లారీ రూపంలో మృత్యువు కాపు కాచింది. కారు వెనుకనుంచి లారీని ఢీకొట్టడంతో కొడుకు తల మొండెం వేరయ్యాయి. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం క్రాస్ రోడ్డు వద్ద జరిగింది. జైపూర్ ఎస్సై భూమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. లక్షెట్టిపేటకు చెందిన పద్మ–కృష్ణమోహన్ దంపతులు. వీరికి ఇంటర్ పూర్తిచేసిన వెంకటసాయి సుశీల్(18) కొడుకు ఉన్నాడు. పద్మ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. ప్రస్తుతం మంచిర్యాలలో నివాసం ఉంటున్నారు. ఆదివారం వారి దగ్గరి బంధువులు పెద్దపల్లిలో శుభకార్యం ఏర్పాటు చేశారు. పద్మ,–కృష్ణమోహన్ దంపతులతోపాటు కుమారుడు వెంకటసాయి సుశీల్, కృష్ణమోహన్ తల్లి ఉదయలక్ష్మితో కలిసి సొంత కారులో ఉదయం వెళ్లారు. శుభకార్యం అనంతరం అందరూ తిరిగి మంచిర్యాలకు బయల్దేరారు. ఇందారం క్రాస్ దాటి ఎన్‌హెచ్ 63పైకి చేరుకున్నాక, రోడ్డుపక్కన ఓ లారీ నిలిపి ఉంది. కారు నడుపుతున్న కృష్ణమోహన్ వేగంగా వెళ్లి లారీని వెనుకనుంచి ఢీకొట్టాడు. కారు వేగం ఎక్కువగా ఉండడంతో ప్రమాదం ధాటికి కారులో ఎడమవైపు కూర్చున్న వెంకటసాయి సుశీల్ తల, మొండెం వేరయ్యాయి. వెనుక సీటులో ఎడమవైపు కూర్చున్న ఉదయలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. కృష్ణమోహన్, పద్మ స్వల్పంగా గాయపడ్డారు. అప్పటి వరకు తల్లిదండ్రులతో సరదాగా కబుర్లు చెబుతూ వచి్చన ఒక్కగానొక్క కొడుకు సుశీల్ రెప్పపాటులో విగతజీవిగా మారాడు. భయంకరమైన ఆ దృశ్యాన్ని చూసి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. కారులో వెంకటసాయి సుశీల్ మృతదేహం ఇరుక్కుపోవడంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. సుమారు అరగంటపాటు శ్రమించి వెలికి తీశారు. గాయపడిన ఉదయలక్ష్మి, పద్మ, కృష్ణమోహన్‌ను మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని జైపూర్ సీఐ నవీన్‌కుమార్ సందర్శించారు. పద్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భూమేశ్ తెలిపారు. -
ఈ సమయంలో డ్రైవింగ్ ప్రమాదం!
భారతదేశంలో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని జూనో జనరల్ ఇన్సూరెన్స్ వారి 'ఇండియా రోడ్ సేఫ్టీ రిపోర్ట్ (IRSR) 2026' దేశంలోని డ్రైవింగ్ అలవాట్లపై కీలకమైన విషయాలను వెల్లడించింది.జూనో స్మార్ట్‌డ్రైవ్ యాప్ ద్వారా సేకరించిన మొత్తం సమాచారం.. 17 రాష్ట్రాల్లో 45 లక్షల ప్రయాణాలు, 5.5 కోట్ల కిలోమీటర్ల డ్రైవింగ్ డేటా ఆధారంగా రూపొందించారు.ఈ నివేదిక ప్రకారం.. రాత్రి 9 గంటల నుంచి 10 గంటల మధ్య వాహనం నడపడం రోజులో అత్యంత ప్రమాదకరమైన సమయం. ఎందుకంటే రాత్రి 8 గంటల తర్వాత డ్రైవింగ్ నాణ్యత గణనీయంగా తగ్గుతుంది. అయితే.. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య డ్రైవింగ్ చేయడం అత్యంత సురక్షితమైన సమయంగా గుర్తించారు.ఈ అధ్యయనం ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేసింది. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం వయస్సు లేదా లింగం కాదు, డ్రైవింగ్ ప్రవర్తనే. భారతదేశంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో 80 శాతానికి పైగా ప్రమాదాలు డ్రైవింగ్ అలవాట్ల వల్లే సంభవిస్తున్నాయని నివేదిక పేర్కొంది.మహిళలు పురుషుల కంటే తక్కువ నైపుణ్యంతో డ్రైవ్ చేస్తారనే అభిప్రాయాన్ని ఈ నివేదిక పూర్తిగా ఖండించింది. మహిళల సగటు డ్రైవింగ్ స్కోర్ 92.86 కాగా, పురుషుల స్కోర్ 92.43గా నమోదైంది. అంటే.. ఇద్దరి మధ్య భద్రత పరంగా పెద్దగా తేడా లేదని ఈ అధ్యయనం వెల్లడించింది.భారతీయ డ్రైవర్లలో ప్రధాన బలహీనతలు ఆకస్మికంగా బ్రేక్ వేయడం, హఠాత్తుగా వేగం పెంచడం అని నివేదిక తెలిపింది. ఈ అంశాల్లో డ్రైవర్లు తక్కువ స్కోర్లు సాధించారు. అయితే వర్షాకాలం లేదా చలికాలం వంటి వాతావరణ మార్పులు డ్రైవింగ్ స్కోర్లపై పెద్దగా ప్రభావం చూపలేదని కూడా అధ్యయనం పేర్కొంది.భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారు 1.73 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగే రోడ్డు మరణాల్లో దాదాపు 11 శాతం. ఈ ప్రమాదాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా భారీ నష్టం జరుగుతోంది. రోడ్డు ప్రమాదాల కారణంగా భారత జీడీపీలో 3 నుంచి 5 శాతం వరకు నష్టం వాటిల్లుతోంది.రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా నష్టపోతున్నవారు ద్విచక్ర వాహనదారులు, పాదచారులు. మొత్తం మరణాల్లో 44 శాతం ద్విచక్ర వాహనదారులు, 19 శాతం పాదచారులు ఉన్నారు.భారతదేశంలో 2030 నాటికి రోడ్డు ప్రమాదాల మరణాలను 50 శాతం తగ్గించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి రహదారుల నిర్మాణం మాత్రమే సరిపోదని, డ్రైవర్ల ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి సాంకేతికత ఆధారిత పరిష్కారాలు అవసరమని జునో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ షనాయ్ ఘోష్ అభిప్రాయపడ్డారు. -
అప్పుడు అన్న... ఇప్పుడు తమ్ముడు.. అదే ప్రమాదం!
నిజామాబాద్ భిక్కనూరు: మండలంలోని బస్వాపూర్ గ్రామంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గీత కార్మికుడు మృతి చెందినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. గ్రామానికి చెందిన కాసాల రమేశ్ గౌడ్ (50) గ్రామంలో ఉదయం వ్యక్తిగత పనుల నిమిత్తం మెదక్ జిల్లా రామాయంపేటకు వెళ్లి అక్కడ పనులు ముగించుకొని తిరిగి బస్వాపూర్ వచ్చేందుకు ఆటో ఎక్కాడు.బస్వాపూర్ శివారులోని జాతీయ రహదారిపై వస్తుండగా ముందు వెళ్తున్న లారీని డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపటంతో వెనుక వస్తున్న ఆటో ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న రమేశ్ గౌడ్ అక్కడికక్కడే మృతి చెందగా, ఆటో డ్రైవర్ శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు ప్రయాణికులు లక్ష్మి, శ్వేతలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.మృతుడికి భార్య స్వప్న, కుమారుడు ధనుష్, కుమార్తె విదూష ఉన్నారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై వివరించారు. ప్రమాదం జరిగిన వెంటే లారీ డ్రైవర్ పరారయ్యాడని ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.15 ఏళ్ల క్రితం అన్న..గురువారం మృతి చెందిన రమేశ్ గౌడ్ అన్న కూడా గతంలో ఆటో ప్రమాదంలోనే మృతి చెందారు. దాదాపు 15 ఏళ్ల క్రితం బస్వాపూర్ గ్రామానికి చెందిన కాసాల శ్రీనివాస్ గౌడ్, పొందుర్తి శివారులోని జాతీయ రహదారిపై జరిగిన ఆటో ప్రమాదంలో మృతి చెందాడు. ప్రస్తుతం ఆయన సోదరుడు రమేశ్ గౌడ్ కూడా ఆటో ప్రమాదంలో మృతి చెందడం గ్రామస్తులు, బంధువులను తీవ్రంగా కలిచివేసింది. -
హైదరాబాద్ గచ్చిబౌలిలో ఘోర ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలిలో ఈ ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఏఎంబీ(AMB) ఫ్లైఓవర్‌పై జరిగిన యాక్సిడెంట్లో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. రాంగ్ రూట్లో వస్తున్న స్కూటీని ఎదురుగా వచ్చిన బుల్లెట్ బైక్ బలంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వాళ్లను శ్రీకాంత్, విఠల్ పోలీసులు గుర్తించారు. తీవ్రంగా గాయపడిన బుల్లెట్ బైక్ రైడర్ వినోద్‌ను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.స్థానికుల ప్రకారం.. ఈ ఫ్లైఓవర్‌పై తరచూ వాహనాలు రాంగ్ రూట్లో ప్రయాణిస్తున్నాయి. పోలీసుల పర్యవేక్షణ, కఠిన చర్యలు లేకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. సరైన నియంత్రణ ఉంటే ఈ ప్రాణనష్టం తప్పించుకోవచ్చని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
-
పల్నాడులో ఘోర ప్రమాదం.. హైదరాబాద్ వాసుల దుర్మరణం
సాక్షి, పల్నాడు: జిల్లాలో శుక్రవారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మాచర్ల సమీపంలోని నగరవనం వద్ద ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన తుఫాను (SUV) వాహనం వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద తీవ్రతకు వాహనం పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో మృతదేహాలను బయటకు తీసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు.ప్రాథమిక సమాచారం ప్రకారం.. మృతులంతా హైదరాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు. కుటుంబ బంధువులు మరణించడంతో అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ప్రకాశం జిల్లా పామూరుకు వెళ్తున్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో తుఫాను వాహనంలో పది మందికి పైగానే ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. మృతుల్ని కదిరి వెంకటేశ్వర్లు ,కదిరి శారద, పిడుగు సత్యనారాయణ, పిడుగు అంజలిగా పోలీసులు ప్రకటించారు. ప్రమాదానికి అతివేగం కారణమా, లేక డ్రైవర్‌కు నిద్రమత్తు వచ్చిందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దుర్ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఒక విషాదంలో.. ఒక్కసారిగా నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో మరో విషాదం చోటు చేసుకోగా వాళ్ల స్వస్థలాల్లో శోకసంద్రం అలుముకుంది. -
వైకల్యాన్ని బట్టి పరిహారమా?
సాక్షి, న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి, శాశ్వత అంగవైకల్యం బారినపడే బాధితులకు పరిహారం చెల్లించే విధానంపై సుప్రీంకోర్టు అత్యంత కీలక తీర్పు వెలువరించింది. ప్రమాదాల్లో శరీర భాగాలను కోల్పోవడం వల్ల వైద్యపరంగా నిర్ధారించే భౌతిక వైకల్యం శాతాన్ని బట్టి మాత్రమే పరిహారాన్ని నిర్ణయించకూడదని స్పష్టం చేసింది. బాధితుడి ఉపాధి, సంపాదనపై చూపే ప్రభావం ఆధారంగానే పరిహారాన్ని సమగ్రంగా లెక్కించాలని తేల్చిచెప్పింది. రోడ్డు ప్రమాదంలో కుడి కాలును మోకాలి పైవరకు కోల్పోయిన ఓ తాపీ మేస్త్రీ వైకల్యాన్ని 100 శాతంగా పరిగణించాల్సిందేనని పేర్కొంది. వైకల్యాన్ని కేవలం 70 శాతంగా కిందికోర్టులు నిర్ధారించడాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. బాధితుడికి చెల్లించాల్సిన పరిహారాన్ని రూ.29.01 లక్షల నుంచి రూ.40.29 లక్షలకు పెంచుతూ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్.వి.అంజారియాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అసలేం జరిగిందంటే.. తమిళనాడులో నామక్కల్–సేలం జాతీయ రహదారిపై 2017 ఏప్రిల్ 18న ఎం.పరమేశ్ (30) అనే తాపీ మేస్త్రీ సైకిల్‌పై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన ఓ లారీ ఢీకొట్టింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో పరమేశ్ కంటికి, దవడకు బలమైన గాయాలు కావడంతోపాటు కుడి కాలును మోకాలి పైవరకు తొలగించాల్సి వచ్చింది. తాపీ మేస్త్రీగా పనిచేస్తూ నెలకు రూ.20 వేలు సంపాదిస్తున్నానని, తన కాలు కోల్పోవడంతో జీవనాధారం పూర్తిగా పోయిందని బాధితుడు మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రిబ్యునల్‌ను(ఎంఏసీటీ) ఆశ్రయించాడు. తగిన పరిహారం ఇప్పించాలని విజ్ఞప్తి చేశాడు. కింది కోర్టుల లెక్కింపు ఇలా.. విచారణ చేపట్టిన ట్రిబ్యునల్.. బాధితుడి నెలవారీ ఆదాయాన్ని కేవలం రూ.6 వేలుగా పరిగణనలోకి తీసుకుంది. వైద్యులు ధ్రువీకరించిన విధంగా భౌతిక వైకల్యాన్ని 70 శాతంగా లెక్కించింది. అతడికి రూ.10.84 లక్షల పరిహారాన్ని 7.5 శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది. దీనిపై అసంతృప్తి వ్యక్తంచేస్తూ బాధితుడు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. వైకల్యాన్ని 70 శాతంగానే పరిగణించిన మద్రాస్ హైకోర్టు పరిహారాన్ని సుమారు రూ.29.01 లక్షలకు పెంచింది. భౌతిక వైకల్యాన్ని ప్రామాణికంగా తీసుకొని పరిహారం లెక్కించడాన్ని తప్పుబడుతూ బాధితుడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. లెక్కింపు సవరణ.. పెరిగిన పరిహారం బాధితుడి వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు పరిహారాన్ని స్వయంగా తిరిగి లెక్కించింది. బాధితుడి నెలవారీ ఆదాయాన్ని రూ.12 వేలుగా నిర్ధారించి, దానికి 40 శాతం భవిష్యత్ ప్రయోజనాలను జోడించింది. వైకల్యాన్ని 100 శాతంగా లెక్కకట్టింది. బాధితుడు జీవితాంతం కృత్రిమ కాలును ఉపయోగించాల్సి ఉంటుందని, కాలానుగుణంగా దాని నిర్వహణ, మారి్పడికి అయ్యే వైద్య ఖర్చులను రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచింది. మొత్తంగా బాధితుడికి అందాల్సిన పరిహారాన్ని రూ.40,29,730గా ఖరారు చేసింది. ఈ మొత్తంపై ఏటా 7.5 శాతం వడ్డీ చెల్లించాలని తెలిపింది. సవరించిన ఈ పరిహారాన్ని ఆరు వారాల్లోగా జమ చేయాలని బీమా సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. వాస్తవిక పరిస్థితుల ఆధారంగా బాధితులకు పరిహారం అందేలా చూడాలని ఈ తీర్పు ద్వారా సుప్రీంకోర్టు కింది కోర్టులకు స్పష్టమైన సూచనలు అందించింది. -
అమ్మ ఊరు వెళ్లిందన్నారు కదా.. ఎప్పుడు వస్తుంది?
భద్రాచలం అర్బన్: ‘అమ్మ ఊరు వెళ్లిందన్నారు కదా.. ఎప్పుడు వస్తుంది?’ అంటూ రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు, సోదరుడిని కోల్పోయిన ఓ చిన్నారి అడుగుతున్న ప్రశ్న బంధువులు, స్థానికులను కంటతడి పెట్టించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భద్రాచలానికి చెందిన దూడల సాయిప్రకాశ్–సంధ్య దంపతులతోపాటు వారి చిన్నకుమారుడు మోక్షిత్ మృతిచెందగా సాయిప్రకాశ్ తల్లి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాలను భద్రాచలంలోని సాయిప్రకాశ్ కుటుంబం నివసించిన అద్దె ఇంటికి బంధువులు తీసుకెళ్లగా అప్పటికే యజమాని ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. యజమానికి స్థానిక సీపీఎం నేతలు సర్దిచెప్పినా ఉపయోగం లేకపోయింది. దీంతో స్థానికులు నివాళులర్పించాక ముగ్గురి మృతదేహాలను సంధ్య స్వస్థలమైన ఏపీలోని పురుషోత్తపట్నం (భద్రాచలం సరిహద్దున ఉన్న గ్రామం) తీసుకెళ్లారు. ప్రమాద సమయంలో అమ్మమ్మ ఇంట్లో ఉన్న సాయిప్రకాశ్ పెద్ద కుమారుడు రిత్విక్ తన తల్లిదండ్రులు, సోదరుడి మృతదేహాలను తీసుకురాగానే వారు మరణించారన్న విషయం తెలియక అమ్మ ఎప్పుడు వస్తుందంటూ పదేపదే అడగడం మొదలుపెట్టాడు. దీంతో బంధువులు అతని దృష్టిమళ్లిస్తూ ఏదో ఒకటి సర్దిచెబుతూ వచ్చారు. సోమవారం సాయంత్రం మృతదేహాలకు దహన సంస్కారాలను రిత్విక్తో తాత వెంకటేశ్వరరెడ్డి (సంధ్య తండ్రి) చేయించారు. -
తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, తూర్పుగోదావరి: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రంగంపేట మండల పరిధిలోని వడిశలేరు-రంగంపేట మధ్య ప్రయాణిస్తున్న టాటా ఏస్ వాహనం టైర్ పంచర్ కావడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు.సామర్లకోట ప్రాంతానికి చెందిన కూలీలు బాపట్ల కొల్లూరులో నిర్మాణ పనులకు వెళ్లేందుకు టాటా ఏస్ వాహనంలో బయలుదేరారు. వడిశలేరు-రంగంపేట మధ్యకు చేరుకోగానే వాహనం టైర్ ఒక్కసారిగా పంచర్ కావడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో వాహనం రోడ్డుపై బోల్తా పడింది.ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో వాహనంలో ప్రయాణిస్తున్న బాబు, మురమర్ల రాజు, కాకాడ రాజు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా సామర్లకోటకు చెందిన వాళ్లుగా గుర్తించారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడగా, స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.ఉదయం పనుల కోసం బయలుదేరిన కూలీలు ప్రమాదానికి గురవడంతో సామర్లకోట ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. -
ఆర్టీసీ బస్సుపైకి దూసుకొచ్చిన లారీ
సాక్షి,అమరావతి/పుల్లంపేట: తిరుపతి జిల్లాలో సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు..తిరుపతి–కడప నాన్‌స్టాప్ ఎక్స్‌ప్రెస్ బస్సు పుల్లంపేట మండలంలోని ఉడుంవారిపల్లె వద్దకు రాగానే..దాన్ని యర్రగుంట్ల నుంచి తిరుపతి వైపు సిమెంట్ లోడుతో వెళుతున్న లారీ ఢీకొట్టింది. ఆర్టీసీ డ్రైవర్ ప్రమాదాన్ని తప్పించబోయే క్రమంలో రోడ్డుకు పక్కనే వున్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టాడు. అయినప్పటికీ నిద్రమత్తులో వాహనాన్ని అదుపు చేయలేక లారీ డ్రైవర్ బస్సును, దాని డ్రైవర్ వెనుక వైపు ఉన్న సీట్లను పూర్తిగా ఢీకొట్టుకుంటూ పోయాడు.దీంతో డ్రైవర్ వెనుక వైపు సీట్లలో కూర్చున్న 17 మందికి కాళ్ళు, చేతులు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో శ్రీకాళహస్తికి చెందిన పురుషోత్తం(2) అక్కడికక్కడే మృతి చెందగా, నెల్లూరుకు చెందిన యశ్విత (16) గాయపడి చికిత్స కోసం తిరుపతికి తరలిస్తుండగా మరణించింది. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రులకు తరలించారు. అలాగే, తీవ్రగాయాలపాలైన ప్రమాదానికి కారణమైన రైల్వేకొండాపురానికి చెందిన లారీ డ్రైవర్ కొమ్ము నాగేంద్రను రిమ్స్ ఐసీయూలో చేర్చారు. ప్రమాద సమయంలో లారీని క్లీనర్ నడిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు.చిన్నారుల మరణం కలచివేసింది: వైఎస్ జగన్ ఉడుంవారిపల్లె వద్ద ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో చిన్నారి పురుషోత్తం, యశ్విత మృతి చెందడం అత్యంత విషాదకరమని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం తనను కలచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ తీరని విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని వారికి దేవుడు ప్రసాదించాలని ప్రారి్థంచారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి, వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. బాధిత కుటుంబాలకు అండగా నిలిచి, తగిన సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి
సంతమాగులూరు (అద్దంకి): ప్రకాశం జిల్లాలో ఆదివారం రాత్రి, సోమవారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. సంతమాగులూరు మండలం కామేపల్లి సమీపంలో లారీని ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతిచెందారు. ఆరుగురికి గాయాలయ్యాయి. అందరూ పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామానికి చెందిన వారు. మృతుల్లో దావులూరి ఏడుకొండలు (50), ముండ్రు రవణమ్మ (52) అక్కడికక్కడే మృతిచెందగా, ఎలవర్తి సుబ్బులు (70) నరసరావుపేట వైద్యశాలలో చికిత్స పొందుతూ చనిపోయింది. తీవ్రగాయాలైన బోయపాటి అనూరాధ, బోయపాటి లక్ష్మీదేవమ్మ చికిత్స పొందుతున్నారు. డి.చిన్న యోగమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. సంతమాగులూరు ఎస్ఐ పట్టాభిరామయ్య ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాళ్లగుట్టలపైకి దూసుకెళ్లి.. మర్రిపూడి మండలం రాజుపాలెం సమీపంలో రాళ్ల గుట్టలపైకి బైక్ దూసుకెళ్లిన ప్రమాదంలో కర్ణాటకకు చెందిన గ్రానైట్ క్వారీ డంపింగ్ ఆపరేటర్ చిన్న బసప్ప (51) మృతి చెందాడు. బసప్ప తన స్నేహితుడు పాపత్తు బల్లూరెడ్డితో కలిసి కనిగిరి మండలం ఎనిమిరెడ్డిపల్లిలో జరిగిన పోలేరమ్మ పొంగళ్లు కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తూ రాజుపాలెం సమీపంలోని హైవేపై ఉన్న రాళ్ల గుట్టలను గమనించకుండా బైక్ నడపడంతో అదుప#తప్పింది. ఈ ఘటనలో చిన్న బసప్ప అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రగాయాలైన బల్లూరెడ్డిని ఒంగోలు జీజీహెచ్‌కి తరలించారు. మరోవైపు ఆటో, ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో మ«ద్యప్రదేశ్కు చెందిన దయాకర్ జైస్వాల్ (44) మృతి చెందిన ఘటన మర్రిపూడి మండలంలోని గార్లపేట పంచాయతీ సిద్దారెడ్డిపల్లి సమీపంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. -
వాహనాలు తనిఖీ చేస్తుండగా...
భూపాలపల్లి/సాక్షిప్రతినిధి, వరంగల్/హైదరాబాద్: వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో బొగ్గులారీ ఢీకొని జయశంకర్ భూపాలపల్లి జిల్లా రవాణాశాఖాధికారి (డీటీఓ) దుర్మరణం చెందాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. డీటీఓ మద్దోజు వెంకన్న(45) సోమవారం ఉదయం గణపురం మండలంలోని మోరంచపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ట్యాక్స్ చెల్లించని ఒక హార్వెస్టర్‌ను పట్టుకొని చెల్పూరు సమీపంలోని జిల్లా రవాణాశాఖ కార్యాలయానికి తరలించారు.తాను సైతం కారులో కార్యాలయం వద్దకు చేరుకుని రహదారిపై నిలబడి మళ్లీ వాహన తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాను పట్టుకున్న హార్వెస్టర్ డివైడర్ వైపు నుంచి కార్యాలయం లోపలికి వెళ్తుండగా భూపాలపల్లి నుంచి ఉప్పల్ వెళ్తున్న బొగ్గు లారీ హార్వెస్టర్ ముందు భాగాన్ని ఢీకొట్టి ఎడమవైపున ఉన్న డీటీఓ వెంకన్నపైకి దూసుకెళ్లింది. దీంతో అతను లారీ టైర్ల కింద పడి నడుము భాగం నుజ్జునుజ్జయింది. రవాణాశాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని డీటీఓ వెంకన్నను ఆస్పత్రికి తీసుకెళ్ళేందుకు ప్రయతి్నంచినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే ఆయన మృతిచెందాడు. కాగా, వెంకన్న ఈ నెల 5వ తేదీనే భూపాలపల్లికి బదిలీపై వచ్చారు. సరిగ్గా 17 రోజులకే ఈ సంఘటన జరగడంతో జిల్లా రవాణాశాఖలో విషాదం అలుముకుంది.లారీడ్రైవర్ మహ్మద్ తస్లీమ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గణపురం ఎస్ఐ రాజశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. వెంకన్న స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా మరిపెడ గ్రామం. మృతుడికి భార్య స్వప్న, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడున్నారు. వెంకన్న కుటుంబానికి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని, ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపిస్తామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ వరంగల్‌లో స్పష్టం చేశారు.కాగా, ఆయన పారి్థవదేహాన్ని హనుమకొండలో ఆశోక కాలనీలోని నివాసానికి తీసుకువచ్చారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ గౌడ్, ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు చాహత్ బాజ్‌పాయ్, సత్యశారదలు వెంకన్న పార్థివదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. విచారణకు ఆదేశించిన ప్రభుత్వం వెంకన్న మృతి చెందిన ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ ప్రమాదం యాదృచి్ఛకంగా జరిగిన రోడ్డు ప్రమాదమా? లేక కుట్రకోణం దాగి ఉందా? అన్నది విచారణలో తేలనుంది. రవాణాశాఖ కేంద్ర కార్యాలయంలో జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌గా పనిచేస్తున్న ఎం.చంద్రశేఖర్ గౌడ్‌ను విచారణాధికారిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను తేల్చటంతోపాటు, సాధారణ ప్రమాదమే అయి ఉంటే, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన అంశాలపై సిఫారసులు కూడా ఆయన ఇవ్వనున్నారు.వీలైనంత త్వరలో నివేదిక అందించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిభూపాలపల్లి డీటీఓ వెంకన్న వాహనాల తనిఖీలు చేస్తుండగా బొగ్గు లారీ ఢీకొని చనిపోవటం పట్ల సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకన్న కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు. కాగా డీటీఓ వెంకన్న మృతిపై రవాణాశాఖ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ విచారం వ్యక్తం చేసింది. విధుల్లో ఉన్న సమయంలో లారీ ఢీకొని మృతి చెందాల్సిన పరిస్థితి రావటం దారుణమని, ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నామని అసోసియేషన్ అధ్యక్షులు రవీందర్, ప్రధాన కార్యదర్శి సురేశ్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన కుటుంబానికి అసోసియేషన్ అండగా నిలుస్తుందని, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధమని ప్రకటించారు. -
తిరుపతి రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: తిరుపతి జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా పుల్లంపేట మండలం ఉడుమువారిపల్లె వద్ద ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో చిన్నారి పునీత్ సాయి, విద్యార్థిని యస్విత మృతి చెందడం అత్యంత విషాదకరమని వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.చిన్న వయసులోనే ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందని ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ తీరని విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని వారికి దేవుడు ప్రసాదించాలని ప్రార్థించారు. అదేవిధంగా ఈ ప్రమాదంలో గాయపడిన వారందరికీ అత్యవసరంగా మెరుగైన వైద్య సేవలు అందించి, వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలిచి, తగిన సహాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. -
వాహనాలు తనిఖీ చేస్తుండగా DTOపైకి దూసుకెళ్లిన లారీ
-
రోడ్డు దాటుతుండగా విషాదం..!
వర్గల్(గజ్వేల్): బైక్ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు గృహిణిని కబళించింది. ఈ దుర్ఘటన శనివారం రాత్రి మండలంలోని గౌరారం వద్ద రాజీవ్‌రహదారిపై చోటు చేసుకుంది. గజ్వేల్ రూరల్ సీఐ రవిరాజు, స్థానికులు కథనం ప్రకారం... గౌరారం గ్రామానికి చెందిన పూదరి వెంకటేశ్‌గౌడ్ ప్రైవేటు ఉద్యోగి. ఆయనకు భార్య మంజుల(37), పద్మాలుగేళ్లలోపు అనీశ్‌గౌడ్, శాంక్‌గౌడ్ ఇద్దరు కుమారులున్నారు. శనివారం రాత్రి గ్రామంలోని తమ బంధువుల ఇంటికి వెళ్లి, నడుచుకుంటూ ఇంటికి తిరిగొస్తున్నది. మామిడ్యాల కమాన్ వద్ద రోడ్డు దాటుతుండగా చేర్యాలకు చెందిన కాత అజయ్ బైక్‌పై హైదరాబాద్ వైపు నుంచి మితిమీరిన వేగంతో వెళ్తూ ఆమెను ఢీకొట్టాడు. ఈ ఘటనలో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందింది. అప్పటివరకు బంధుగణంతో, కుటుంబీకులతో మాట్లాడుకుంటూ సంతోషంగా గడిపిన మంజుల కొద్ది సేపట్లోనే మృతిచెందడంతో కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు చేశారు. -
వాహన తనిఖీల్లో టిప్పర్ బీభత్సం.. ఆర్టీవో అధికారి మృతి
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఆర్టీవో కార్యాలయం ఎదుట వాహనాలు తనిఖీ చేస్తున్న ఆర్టీవో అధికారి పైకి బొగ్గు టిప్పర్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం, టిప్పర్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండలం చెల్పురు శివారులోని ఆర్టీవో కార్యాలయం ఎదుట సోమవారం ఉదయం అధికారులు స్కూల్ బస్సులు, వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వేగంతో వచ్చిన బొగ్గు టిప్పర్‌ను ఆపే ప్రయత్నం చేయగా.. ఆర్టీవో అధికారి వెంకన్నపైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడిన వెంకన్న అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం, టిప్పర్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలా ఊహించని ప్రమాదం కారణంగా వెంకన్న చనిపోవడంతో అధికారులు ఒక్కసారిగా షాకయ్యారు. కాగా, కొద్దిరోజుల క్రితమే బదిలీల్లో భాగంగా వెంకన్న గణపురం వచ్చినట్టు సమాచారం. -
భోజనానికి వెళ్లి శవాలుగా తిరిగొచ్చిన కుటుంబం
ఆదివారం జరిగిన మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతిచెందారు. మృతుల్లో మూడేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో ఈ ప్రమాదాలు జరిగాయి. ఒక్కసారిగా అదుపుతప్పి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మాధారం–పూసుగూడెం మధ్య అటవీ ప్రాంతంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలతోపాటు ఓ చిన్నారి మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అతివేగం వల్ల కారు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. మృతులను భద్రాచలానికి చెందిన దూడల సాయిప్రకాశ్ (28), సంధ్య (25) దంపతులకు మోక్షిత్ (3)గా గుర్తించారు. సాయిప్రకాశ్ తండ్రి శ్రీనివాసరావు ఆరు నెలల క్రితం మృతిచెందగా ములకలపల్లికి చెందిన ఆయన తమ్ముడు కాశీరామేశ్వరం కొన్ని నెలలుగా హైదరాబాద్‌లో ఉండటం వల్ల సంప్రదాయం ప్రకారం అన్న కుటుంబాన్ని నిద్రకు పిలవడం కుదరలేదు. ఇటీవలే హైదరాబాద్ నుంచి ములకలపల్లి చేరుకున్న ఆయన.. సాయిప్రకాశ్ కుటుంబాన్ని భోజనానికి ఆహ్వానించారు. దీంతో సాయిప్రకాశ్ తన పెద్ద కుమారుడిని అమ్మమ్మ ఇంట్లో దిగబెట్టి భార్య, చిన్నకుమారుడితోపాటు తల్లి జ్యోతితో కలిసి ఆదివారం ములకలపల్లికి వచ్చారు. మధ్యాహ్న భోజనం అనంతరం తిరిగి బయలుదేరిన 10 నిమిషాలకే మాధారం అటవీ ప్రాంతంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో సాయిప్రకాశ్ డ్రైవింగ్ సీట్లోనే ప్రాణాలు వదలగా ఆయన భార్య, చిన్నకుమారుడు రోడ్డుపై ఎగిరిపడి మృతిచెందారు. ఆయన తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను 108 వాహనంలో పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులు, తమ్ముడు మరణించడంతో రిత్విక్ ఒంటరి వాడయ్యాడు. కాగా, కారు నడుతుపున్న సాయికుమార్ చేతిలో పలీ్టపట్టి ఉండటంతో అది తినే క్రమంలో స్టీరింగ్‌పై చెయ్యి వదిలేయడంతో కారు అదుపు తప్పిందా లేక ఏదైనా వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో ప్రమాదం జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. అయితే అజాగ్రత్తగా, అతివేగంగా నడపడంతోనే ప్రమాదం చోటుచేసుకుందని ఎస్సై మధుప్రసాద్ వెల్లడించారు. హైదరాబాద్ నుంచి స్వగ్రామం బయలుదేరగా.. సిద్దిపేట జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు పమ్రాదంలో స్కూటీపై వెళ్తున్న దంపతులు మృతిచెందారు. కుకునూరుపల్లి ఎస్సై బాలకృష్ణ కథనం ప్రకారం... మంచిర్యాల జిల్లా కొండాపూర్‌కు చెందిన చందనగిరి దీక్ష, మహేందర్ దంపతులు ఆదివారం ఉదయం స్కూటీపై హైదరాబాద్ నుంచి సొంతూరైన కొండాపూర్‌కు వెళ్తున్నారు. ఈ క్రమంలో లక్డారం గ్రామ శివారులో వ్యవసాయ పొలం పనుల కోసం నాగళ్లు జతచేసిన ట్రాక్టర్ డ్రైవర్ అతివేగంగా వెళ్తూ అకస్మాత్తుగా మల్లన్న వనం వద్ద బ్రేక్ కూడా వేశాడు. దీంతో వెనకాల వస్తున్న మహేందర్ దంపతులు ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ఘటనలో మహేందర్ అక్కడికక్కడే మృతిచెందగా తీవ్రంగా గాయపడిన దీక్ష ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. లక్డారం గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ నాగపురి స్వామిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరిలో.. ద్విచక్రవాహనాలు ఢీకొని ముగ్గురు దుర్మరణం చెందిన ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. పర్వతగిరికి చెందిన బుద్దె చరణ్ (16), సోమారం గ్రామానికి చెందిన ఎండీ అహ్మద్ (58), వడ్లకొండకు చెందిన మాజీ సర్పంచ్ వడ్లకొండ ఎల్లాగౌడ్ (58) మృతి చెందారు. చరణ్ అతడి స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంపై వరంగల్ వైపు నుంచి పర్వతగిరికి వస్తున్నాడు. ఈ క్రమంలో ఇద్దరు బైక్‌పై పర్వతగిరి నుంచి సోమారం వైపు వెళ్తున్నారు. వేగంగా వచి్చన ద్విచక్ర వాహనాలు కారంపొడి మిల్లు వద్ద ఢీకొనడంతో ముగ్గురు మరణించారు. చరణ్ స్నేహితుడి పరిస్థితి విషమంగా ఉంది. -
తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం..
సాక్షి, తిరుపతి: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. పుల్లంపేట మండలం ఉడుంవారిపల్లి సమీపంలో సోమవారం తెల్లవారుజామున లారీ, బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో, వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.వివరాల ప్రకారం.. పుల్లంపేట మండలంలోని కడప-చెన్నై ప్రధాన రహదారిపై సోమవారం తెల్లవారుజామున లారీ, బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడాది బాలుడు, శ్రీకాళహస్తి కి చెందిన యస్విత అనే విద్యార్థి మృతి చెందారు. ప్రమాదం కారణంగా బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టారు. -
భద్రాద్రి కొత్తగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి,భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మాదారం గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఒక కారు అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.మృతులను భద్రాచలానికి చెందిన దూడల సాయి ప్రకాష్, ఆయన భార్య సంధ్య, మరియు వారి కుమారుడు మోక్ష్గా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో సాయి ప్రకాష్ తల్లి తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్‌లో తరచూ ఇక్కడే యాక్సిడెంట్లు
సాక్షి, హైదరాబాద్: నగరంలో రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గించడానికి సన్నాహాలు చేస్తున్న నగర ట్రాఫిక్ విభాగం అధికారులు బ్లాక్‌స్పాట్స్‌పై దృష్టి సారించారు. తరచూ ప్రమాదాలకు కారణమవుతున్న ప్రాంతాలను గుర్తించి, కారణాలను అధ్యయనం చేయడంతో పాటు నివారణ చర్యలకు కసరత్తు చేస్తున్నారు. నగరంలోని ట్రాఫిక్ పోలీసుస్టేషన్ల పరిధిలో 2023–25 మధ్య నిర్వహించిన అధ్యయనం ఆధారంగా 49 ప్రాంతాల్లో బ్లాక్‌స్పాట్స్ ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో మూడేళ్లలో 398 ప్రమాదాలు జరగ్గా.. 279 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆయా చోట్ల ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ సంబంధిత విభాగాలకు లేఖలు రాశారు. జాతీయ రహదారులపైనే అత్యధికం.. నగర ట్రాఫిక్ పోలీసుస్టేషన్ల పరిధిలో కేవలం కొన్నింటిలో మాత్రమే బ్లాక్‌స్పాట్స్ లేవని తేలింది. అత్యధిక ఠాణాల పరిధిలో తరచూ ప్రమాదాలు చోటు చేసుకునే బ్లాక్స్పాట్లు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. మొత్తం 49 బ్లాక్‌స్పాట్స్‌లో 26 జాతీయ రహదారుల పైనే ఉన్నాయని ట్రాఫిక్ విభాగం అధికారులు గుర్తించారు. ఎన్‌హెచ్ నం.44పై 11, ఎన్‌హెచ్ నం.65పై 13 ఉండగా.. ఎన్‌హెచ్ నం.765, 163లపై ఒకొక్కటి చొప్పున ఉన్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు సహా ఇతర రహదారులపై మిగిలినవి ఉన్నట్లు ట్రాఫిక్ పోలీసుల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అనేకం ‘చావు’రస్తాలే... నిత్యం ప్రమాదాలు చోటు చేసుకునే ప్రాంతాల్లో అత్యధికం చౌరస్తాలు, జంక్షన్లే. రద్దీ వేళలు, సిగ్నళ్లు యాక్టివ్‌గా ఉండే సమయంలో కంటే మిగిలిన సమయాల్లోనే ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఈ 49 బ్లాక్‌స్పాట్స్‌లో 40 శాతం చౌరస్తాల్లో ఉన్నవే. ఆయా ప్రాంతాలు సైతం హైదరాబాద్–సైబరాబాద్–మల్కాజిగిరి సరిహద్దుల్లో కొన్ని ఉండటం గమనార్హం. వీటిలో చోటుచేసుకుంటున్న ప్రమాదాల్లో మరణించిన/క్షతగాత్రులైన వారిలో పాదచారులు, ద్విచక్ర వాహనచోదకులే ఎక్కువగా ఉన్నారు. ప్రమాదాలకు కారణాలివే ⇒ పరిమితికి మించిన వేగం, మద్యం తాగి వాహనాలు నడపటం ⇒ మలుపులున్న చోట్ల డివైడర్లు, మీడియమ్స్ లేకపోవడం ⇒ అత్యంత సమస్యాత్మకంగా (బ్లైండ్) ఉన్న మలుపులు ⇒ కీలక సూచనలు చేసే సైనేజ్ బోర్డులు లేకపోవడం ⇒ ఇరుకైన రోడ్లు, ఆపై అక్కడే ఉంటున్న ఆక్రమణలు ⇒ రోడ్ ఇంజినీరింగ్‌ను పట్టించుకోకుండా రహదారి నిర్మాణం ⇒ రహదారులపై హఠాత్తుగా చేపడుతున్న మరమ్మతులు ⇒ క్యారేజ్ వేలో తొలగించకుండా వదిలేసిన చెట్లు, కరెంటు స్తంభాలు ⇒ అవసరమైన స్థాయిలో విద్యుత్ దీపాలు లేకపోవడం ⇒ వాహనచోదకులు రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం ⇒ నో–ఎంట్రీల్లోకి వాహనాలతో దూసుకుపోవడం ⇒ రోడ్ మార్కింగ్ పక్కగా లేకపోవడం, శాస్త్రీయత కొరవడటంచదవండి: బుడ్డోడి సరదా.. లగ్జరీ కారు గోవిందా! గ్రే స్పాట్లే కీలకం బ్లాక్ స్పాట్స్‌తో పాటు గ్రే స్పాట్స్ గుర్తింపునకు ప్రాధాన్యం ఇవ్వాలి. తరచూ ప్రమాద ప్రాంతాలు బ్లాక్ స్పాట్స్ కిందికి వస్తే.. ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉన్నవి గ్రే స్పాట్స్. గ్రే స్పాట్లను గుర్తించి ముందే చర్యలు తీసుకుంటే ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడవచ్చు. – ఎం.ప్రకాష్ కుమార్, రవాణా రంగ నిపుణుడు -
అక్కడ ప్రమాదం.. ఇక్కడ విషాదం!
రామగుండం: హైదరాబాద్ సమీపంలోని రాజీవ్ రహదారిపై తుర్కపల్లి –మురారిపల్లి మధ్య గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల కేంద్రంలోని ఒకేకుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలవడం తీవ్రవిషాదం నింపింది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఊశెట్టి గణపతి(సీనియర్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు) చిన్నకుమారుడు చంద్రశేఖర్ హైదరాబాద్‌లో రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆయన భార్య రేఖ. రేఖ చెల్లెలి కుమారుడు లోహిత్(3)ను తీసుకుని తమ కారులో బుధవారం కొండగట్టు శ్రీఆంజనేయస్వామిని దర్శనం చేసుకున్నారు. అదేరోజురాత్రి కారులో హైదరాబాద్‌కు పయనమయ్యారు.ఈ క్రమంలో తుర్కపల్లి–మురారిపల్లి గ్రామ సమీపంలోని రాజీవ్ రహదారిపై కారు అదుపు తప్పి లారీని ఢీకొంది. ఈ ఘటనలో చంద్రశేఖర్(40) అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన భార్య రేఖ(35), చెల్లెలు కుమారుడు లోహిత్(3) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించగా.. కుటుంబసభ్యులు, బంధువులు స్వగ్రామానికి తీసుకొచ్చారు. ముగ్గురి మృతదేహాలను చూసి గ్రామస్తులు కంటతడిపెట్టారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంపై అంతర్గాంతోపాటు సమీప గ్రామాల్లోనూ విషాదం నెలకొంది. -
దూసుకొచ్చిన లారీ.. అదుపుతప్పిన కారు
లింగాల ఘణపురం/మేడ్చల్ రూరల్: రాష్ట్రంలోని రెండు హైవేలపై బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతిచెందారు. అతివేగంగా దూసుకొచ్చిన ఇసుక లారీ ఓ సరుకు రవాణా వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందగా అదుపుతప్పి డివైడర్ పైనుంచి దూసుకెళ్లిన ఓ కారు.. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న ఘటనలో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.సాయం కోసం వచ్చి.. రోడ్డు ప్రమాదానికి బలై..సహచర వాహనదారుడికి సాయం చేసేందుకు అర్ధరాత్రి లారీ ఆపిన ఒకరు.. సోదరుడి మాటను కాదనలేక వచ్చిన తమ్ముడు.. రోడ్డుపై వాహనాన్ని మరమత్తు చేస్తూ ఇంకొకరు.. ఇలా ముగ్గురూ జనగామ జిల్లా నెల్లుట్ల బ్రిడ్జి వద్ద హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. మృతులను దేవరుప్పులకు చెందిన రోహిత్ (22), యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం బండ కొత్తపల్లికి చెందిన ననబాల మహేశ్ అలియాస్ మధు (23), మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బీరిశెట్టి గూడానికి చెందిన డినికెని రాజేందర్ (27)గా గుర్తించారు.హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వస్తుండగా..ప్రత్యక్ష సాక్షులైన లారీ డ్రైవర్ హరీశ్, దిలీప్‌ల కథనం ప్రకారం.. దేవరుప్పులకు చెందిన కిరాణా వ్యాపారి దిలీప్ బుధవారం రాత్రి 10:30 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుంచి తన సరుకు రవాణా వాహనంలో కిరాణా సామానుతో స్వగ్రామానికి బయలుదేరాడు. అర్ధరాత్రి దాటాక నెల్లుట్ల బ్రిడ్జి సమీపం వద్దకు రాగానే టైర్ పంక్చర్ కావడంతో టైర్ విప్పేందుకు జాకీ కోసం రోడ్డుపై వెళ్తున్న వాహనాలను ఆపడం మొదలుపెట్టాడు. ఎవరూ వాహనాలు ఆపకపోవడంతో దేవరుప్పులలోని తన తమ్ముడు రోహిత్‌కు ఫోన్ చేసి జాకీ తీసుకురావాలని చెప్పాడు. అతను జాకీ తీసుకొని రాత్రి 1:30 గంటలకు వాహనం వద్దకు చేరుకున్నాడు. ఈలోగా హరీశ్ అనే లారీ డ్రైవర్ లారీని ఆపి జాకీ ఇచ్చాడు. దీంతో సరుకు రవాణా వాహన డ్రైవర్ మహేశ్ వాహనం కింద జాకీ పెట్టి టైర్ విప్పే ప్రయత్నం చేస్తుండగా రోహిత్ రోడ్డుపై కర్ర పట్టుకొని నిలబడి వచ్చిపోయే వాహనాలను అప్రమత్తం చేస్తున్నాడు. హరీశ్‌తోపాటు వచ్చిన అతని బావమరిది డినికెల రాజేందర్ తిరిగి లారీ ఎక్కేందుకు వెళ్తున్నాడు. లారీ డ్రైవర్ హరీష్, దిలీప్ ఇద్దరు రోడ్డు పక్కన డివైడర్‌పై కూర్చున్నారు. ఇంతలో ఒక్కసారిగా అతివేగంగా దూసుకొచ్చిన ఇసుక లారీ రోహిత్‌ను, ఆ తర్వాత సరుకు రవాణా వాహనాన్ని ఢీకొట్టడంతో దాని కింద ఉన్న డ్రైవర్ మహేశ్, లారీ ఎక్కేందుకు వెళ్తున్న రాజేందర్‌పై సరుకు రవాణా వాహనం పడటంతో ముగ్గురూ దుర్మరణం చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్ఐ శ్రావణ్‌కుమార్.. మృతదేహాలను జనగామ జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. ఇసుక లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.అదుపుతప్పి డివైడర్ దాటి.. లారీని ఢీకొని..మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మురహరిపల్లిలో బుధవారం అర్ధరాత్రి దాటాక రాజీవ్ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. మేడ్చల్ ఏసీపీ శంకర్‌రెడ్డి, పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని మల్కాజ్గిరి న్యూ మిర్జల్‌గూడలో నివసించే చంద్రశేఖర్ (33) రైల్వే శాఖలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నారు. బుధవారం గోదావరిఖనిలో తన అత్తగారి ఇంటి నుంచి చంద్రశేఖర్ తన కుటుంబం, అతని బావమరిది కుటుంబం రెండు కార్లలో హైదరాబాద్ బయల్దేరారు. రాజీవ్ రహదారిలో అలియాబాద్ మున్సిపల్ పరిధి మురహరిపల్లి వద్దకు రాగానే చంద్రశేఖర్ నడుపుతున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను దాటి కుడి పక్కకు వెళ్లింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో చంద్రశేఖర్ (33)అక్కడికక్కడే మృతిచెందగా ఆయన భార్య రేఖ (30), కుమారుడు లోహిత్, రేఖ అక్క కుమారుడు నిహాల్ (2) తీవ్రంగా గాయపడ్డారు. వారి వెనుకగా మరో కారులో వస్తున్న రేఖ సోదరుడు రాజశేఖర్ ప్రమాదాన్ని గమనించి వెంటనే 108, పోలీసులకు సమాచారం అందించారు. 108 అంబులెన్సు రాగానే సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రేఖ, నిహాల్ మృతిచెందగా లోహిత్ పరిస్థితి విషమంగా ఉంది. -
2026 నుంచి ప్రతి వాహనంలో ఇదే తప్పనిసరి!
-
ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకుల మృతి
మడకశిర: శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కళ్ళుమరి సమీపంలోని త్రిమూర్తి ఆగ్రో ఫార్మ్ వద్ద ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ముగ్గురు యువకులు తీవ్రంగా దెబ్బతిన్నారు. ఈ ఘటనలో క్యాంపురం గ్రామానికి చెందిన ఆది (30), మహేంద్ర (23) అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడు టిల్లు (24) తీవ్ర గాయాలతో హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించబడ్డాడు.ఈ ప్రమాదంతో మడకశిర ప్రాంతంలో విషాదం నెలకొంది. గ్రామస్థులు మృతుల కుటుంబాలను పరామర్శిస్తూ, గాయపడిన యువకుడి ఆరోగ్యం కోసం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
టిప్పర్ ఢీకొని యువకుడి దుర్మరణం!
మహబూబాబాద్ రూరల్ : టిప్పర్ ఢీకొని యువకుడు మృతిచెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహం సెంటర్ వద్ద శనివారం చోటుచేసుకుంది. టౌన్ సీఐ రఘుపతిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని కేసముద్రం మండలం బడితండాకు చెందిన భూక్య సేవియా, లలిత దంపతులకు ముగ్గురు కుమారులు భరత్, నవీన్ (22) గణేష్ ఉన్నారు. రెండో కుమారుడు నవీన్ శుభకార్యాల డెకరేషన్లు, ఈవెంట్ ఆర్గనైజింగ్ పనులతోపాటు కూలి పనులు చేస్తుంటాడు.ఈ క్రమంలో జిల్లా కేంద్రంలోని మూడు కోట్ల సెంటర్ వైపు నుంచి కోర్టు సెంటర్ వైపు బైక్ పై వస్తున్నాడు. సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహం సెంటర్ వద్దకు నవీన్ చేరుకుంటుండగా వెనుకనుంచి టిప్పర్ వాహనం అతడిని ఢీకొట్టగా అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని టిప్పర్‌ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నవీన్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం గదికి తరలించారు. టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సమాచారం. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని సీఐ తెలిపారు. -
అక్కకు స్వీట్ ఇచ్చి.. తిరిగి వెళ్తుండగా..
మూసాపేట: కొత్త ఫోన్ కొన్న తరువాత అక్కకు స్వీట్లు ఇచ్చి ఇంటికి వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.కూకట్పల్లి పోలీసులు తెలిపిన మేరకు.. ఒరిస్సాకు చెందిన రాజేష్ (30) ఇందిరానగర్‌లో నివాసముంటూ అడ్డా కూలీగా పనిచేస్తున్నాడు. బుధవారం కొత్త మొబైల్ ఫోన్ కొనడంతో మూసాపేటలో ఉన్న తన అక్కకు స్వీట్ బాక్స్ ఇచ్చి బైక్‌పై అర్ధరాత్రి బయలుదేరాడు. ఐడీఎల్ చెరువు నుంచి జాతీయ రహదారిపైకి వెళుతుండగా వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఫిబ్రవరి నెల నుంచి రాజేష్ శివమాలలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఓ మై ఘాట్..
రంపచోడవరం: మూడు రాష్ట్రాలను అనుసంధానం చేసే మారేడుమిల్లి – భద్రాచలం ఘాట్ రోడ్డులో ప్రయాణికులకు భద్రత కరవైంది. ఈ రోడ్డులో అనేక ప్రమాదకరమైన మలుపులు ఉన్నా కనీస రక్షణ చర్యలు తీసుకోవడం సంబంధిత అధికారులు విఫలమయ్యారు. అనేక సార్లు భారీ వాహనాలు నిలిచిపోవడంతో ఘాట్ రోడ్డులో రాకపోకలు స్తంభించిపోతున్నాయి. వాహనాల్లోనే ప్రయాణికులు గంటలు తరబడి నరకయాతన పడుతున్నారు. ఇటీవల ఘాట్ రోడ్డులో వ్యాన్ బోల్తా పడి 17 మంది గాయపడ్డారు. ఘాట్ రోడ్డులో భద్రత వైఫల్యాలతో ఇప్పటికే అనేక ప్రమాదాలు జరిగి ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదకర మలుపులు మారేడుమిల్లి – చింతూరు ఘాట్ రోడ్డు పాములేరు నుంచి ప్రారంభమై సోకులేరు వ్యూ పాయింట్ వద్ద ముగుస్తుంది. ఈ రోడ్డు సుమారు 30 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఈ మధ్యలో పది వరకు అత్యంత ప్రమాదకర మలుపులు ఉన్నాయి. ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు కలిపే మార్గం కావడంతో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇటువంటి ఘాట్ రోడ్డులో ఆర్అండ్బీ అధికారులు నిర్వహణ పనులు, రక్షణ చర్యలు పటిష్టంగా చేపట్టలేదు. ప్రతిపాదించినా.. ఘాట్ రోడ్డు సేప్టీ పనులు కోసం రూ.2 కోట్ల 60 లక్షలతో ప్రతిపాదనలు పెట్టినా, రెండేళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం చిల్లిగవ్వ కూడా విడుదల చేయలేదు. ప్రయాణికుల భద్రత చర్యలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేసే అధికారులు ఆ తర్వాత ఏమాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఘాట్ రోడ్డులోని ప్రమాదకర మలుపుల్లో రక్షణ కోసం ఐరన్ గడ్డర్లు ఏర్పాటు చేయాలి.కానీ అనేక చోట్ల రక్షణ చర్యలు లేవు. ఇటీవల రోడ్డు భవనాలు భవనాల శాఖ గోతులమాయంగా ఉన్న ఘాట్‌లో నాలుగు కిలోమీటర్లు మేర కొత్త రోడ్డును నిర్మించింది. పాములేరు నుంచి సింగిల్ రోడ్డు ఉండడంతో అనేక సార్లు వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆర్అండ్బీ శాఖ కిలోమీటరన్నర రోడ్డు నిర్మాణం కోసం ప్రతిపాదనలు పెడితే కేవలం 700 మీటర్ల మేర నిర్మాణానికే నిధులు మంజూరు చేశారు. ప్రమాదాల్లో కొన్ని.. ఘాట్ రోడ్డులో గత ఏడాది యాత్రికుల బస్సు అదుపు తప్పి లోయలో పడి తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. మరో 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 2019 అక్టోబర్ 15న కర్ణాటకకు చెందిన యాత్రికులు వాహనం మలుపు తిప్పుతుండగా లోయలో పడింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా అనేక సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు.రక్షణ చర్యలు తీసుకుంటున్నాం ఘాట్ రోడ్డులో రక్షణ చర్యలు తీసుకుంటున్నాం. సింగిల్ రోడ్డును డబుల్ చేసేందుకు పనులు మొదలు పెడతాం. ఇటీవల నాలుగు కిలోమీటర్లు మేర రోడ్డు నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. త్వరలో మిగిలిన సింగిల్ రోడ్డు పనులు పూర్తి చేస్తాం. ప్రయాణికులు భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ పటిష్టమైన రక్షణ చర్యలు తీసుకుంటాం. – ప్రదీప్, జేఈ, ఆర్అండ్ బీ అవగాహన లేక.. ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ నిబంధనలు అమల్లో ఉన్నాయి. కొన్నిసార్లు భారీ వాహనాలు వెళ్లిపోతున్నాయి. అటువంటి సందర్భాల్లోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినప్పటికి కొందరు డ్రైవర్లకు ఘాట్ రోడ్డుపై అవగాహన లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. – ఐ.శ్రీనివాసరావు, ఎస్ఐ, మారేడుమిల్లి అధికారులు స్పందించాలి ఘాట్ రోడ్డులో ప్రయాణించే వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఘాట్ రోడ్డులో జరుగుతున్న ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు సేప్టీ చర్యలు తీసుకోవాలి. – బాలు అక్కిస, హ్యూమన్ రైట్ వాచ్ చైర్మన్, రంపచోడవరం -
ఆమె.. దేశ నిర్మాత
‘ఆడవాళ్లు ఇంటి నాలుగు గోడలకే పరిమితం కావాలి’.. ‘భార్య అంటే పనిమనిషి’ ‘ఇంట్లో గృహిణులు చేసే పనికి విలువ కట్టాల్సిన పనిలేదు’... ఇలాంటి పురుషాధిపత్య భావజాలానికి చెంప పెట్టులాంటి తీర్పు ఇచ్చింది సుప్రీం కోర్టు. వేతనం లేని ఇంటి చాకిరీకి ఇటీవలి కాలంలో లభించిన అత్యంత బలమైన, న్యాయపరమైన గుర్తింపులలో ఈ తీర్పు ఒకటని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. గృహశ్రమ అనేది కొలవదగిన, ఆర్థిక, సామాజిక విలువ కలిగిన ఉత్పాదకశ్రమ అనే భావనను సుప్రీం తీర్పు మరింత బలపరుస్తోంది.‘గృహాలను నడిపే వ్యక్తులను కేవలం గృహిణులుగా అభివర్ణించడం వారి సహకారాన్ని తక్కువ చేసి చూడడమే అవుతుంది’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. గృహిణుల ప్రమాద మరణాలకు సంబంధించిన ఒక నష్టపరిహార కేసులో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.భవిష్యత్ తరాలను తీర్చిదిద్దుతూ...మహిళల పాత్ర కేవలం ఇంటి పనులకే పరిమితం కాలేదు. కుటుంబాలు, భవిష్యత్ తరాలను తీర్చిదిద్దడం, దేశనిర్మాణానికి తోడ్పడం వంటి అనేక అంశాలకు ఆమె ప్రాతినిధ్యం వహిస్తోంది. గృహిణులు చేసే ఇంటి పనులు, సంరక్షణ సేవలకు ఆర్థిక విలువ ఉందని, మానవ అభివృద్ధికి దోహద పడడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తోందని జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ‘ఆమెను కేవలం గృహిణి అని పిలవడానికి బదులుగా దేశనిర్మాత అని పిలవాలి’ అని కోర్టు పేర్కొంది.అదేకాదు...అంతకు మించి!ఇంటి పట్టున మహిళ చేసే పని ప్రభావం కేవలం ఆ ఇంటి నాలుగు గోడలకే పరిమితం కాదని, అంతకు మించి ఉంటుందని కోర్టు నొక్కి చెప్పింది. పెళ్లి అంటే పనిమనిషిని నియమించుకోవడం కాదంటూ, వివాహవ్యవస్థలోని లోటుపాట్లపై కూడా వ్యాఖ్యలు చేసింది కోర్టు. ఇంటి పనుల పూర్తి బాధ్యతను మహిళ ఒక్కరే తీసుకునే ఏర్పాటుగా వివాహాన్ని చూడకూడదని స్పష్టం చేసింది. గృహ బాధ్యతలనేవి భార్యాభర్తల ఉమ్మడి బాధ్యతలని నొక్కి చెప్పింది.పెళ్లయిందనే ఒకే ఒక్క కారణంతో వృత్తిపరమైన లక్ష్యాలు, ఆశయాలను మహిళలు త్యాగం చేయనవసరం లేదని పేర్కొంది.అది క్రూరత్వం కాదు...ఒక మహిళ తన పిల్లలకు స్థిరమైన వాతావరణాన్ని కల్పిస్తూనే డాక్టర్‌గా, వృత్తినిపుణురాలిగా, మరే ఇతర రంగాలలోనైనా తన వృత్తిని కొనసాగించాలని కోరుకుంటే అది భర్త, అత్తమామల పట్ల క్రూరత్వంగా పరిగణించరాదని కోర్టు పేర్కొంది.పెళ్లి తరువాత మహిళ గుర్తింపు ముగిసి పోదుగృహిణులు చేసే వ్యక్తిగత త్యాగాలు పెద్దగా గుర్తింపు పొందవని కోర్టు తెలియజేసింది. ఇంటి పనుల కోసం తమ సమయాన్ని, శక్తిని వెచ్చించే మహిళలు కుటుంబం నిలబడడానికి, కుటుంబ సంపదకు గణనీయంగా దోహదపడతారని, వారి కృషిని సామాజికంగా, ఆర్థికంగా తగిన విధంగా గుర్తించాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సంవత్సరాల తరబడి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా చేసే ఇంటిపనులు, పిల్లల సంరక్షణ ద్వారా వారు అందించే అమూల్యమైన సహకారాన్ని దృష్టిలో పెట్టుకొని ఉమ్మడిగా సంపాదించిన కుటుంబ ఆస్తులలో గృహిణులు సమాన వాటాకు అర్హులని పేర్కొంది.గృహిణుల శ్రమకు ఆర్థిక విలువ ఉంది...కుటుంబం, సమాజం సజావుగా నడవడానికి గృహ కార్మికుల శ్రమ అత్యవసరం అయినప్పటికీ, సంప్రదాయ ఆర్థిక లెక్కల్లో ఇది చాలాకాలంగా కనిపించకుండా పోయిందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఒక గృహిణి చేసే సేవ కేవలం వంట చేయడం, ఇల్లు శుభ్రం చేయడం, ఇంటిపనులు చూసుకోవడానికి పరిమితం కాదని ధర్మాసనం తెలిపింది. పిల్లలను పెంచడంలో, వారిలో విలువలను పెంపొందించడంలో, కుటుంబ సభ్యులకు అండగా నిలవడంలో, తర్వాత తరాన్ని తీర్చిదిద్దడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తుంది. మానవ వనరుల అభివృద్ధికి, తద్వారా జాతీయ అభివృద్ధికి ఆమె కృషి నేరుగా దోహదపడుతుందని కోర్టు అభిప్రాయపడింది.స్పష్టమైన సందేశంపరిహారం అనేది కేవలం ఆర్థిక నష్టాన్ని అంచనా వేయడానికి మాత్రమే పరిమితం కాకూడదని, కుటుంబం కోల్పోయిన గృహసంరక్షణ సేవల విలువను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు తెలిపింది. పరిహార దావాలను అంచనా వేసేటప్పుడు కోర్టులు ఉపయోగించే ప్రస్తుత ప్రమాణాలతోపాటు ఈ సూత్రం ఒక అదనపు మార్గదర్శకంగా పనిచేస్తుందని ధర్మాసనం పేర్కొంది. కుటుంబ సంక్షేమం, సామాజిక అభివృద్ధిలో గృహిణుల పాత్ర కాలక్రమేణా పెరుగుతూనే ఉంటుందని గుర్తిస్తూ, వారి భవిష్యత్ సహకారానికి సంబంధించిన లెక్కలను కూడా పరిహార మంజూరులో పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు పేర్కొంది. తమ శ్రమకు ఎలాంటి ప్రతిఫలం లేదా గుర్తింపు దొరకని లక్షలాది మంది మహిళలకు అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన సందేశం ఇచ్చింది...‘ఇంటి బాధ్యతలు నిర్వహించే వ్యక్తి కేవలం గృహిణి మాత్రమే కాదు ఆమె దేశ నిర్మాత’. -
గృహిణి సేవలకు ‘సుప్రీం’ విలువ!
ఇంటికి దీపం అని భావించే ఇల్లాలి సేవల విలువ ఎంత? భార్య రోడ్డు ప్రమాదంలో మరణిస్తే భర్తకు జరిగే లోటును ఎంత మొత్తంతో భర్తీ చేయవచ్చు? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు దేశ అత్యున్నత న్యాయస్థానం గురువారం సమాధానమిచ్చింది. మోటార్ వెహికల్స్ యాక్ట్ కింద చెల్లించే నష్ట పరిహారంలో భార్య అందించే కుటుంబ సేవలకు వేరుగా విలువకట్టి చెల్లించాలని చెప్పింది. ఈ మొత్తం నెలకు రూ.30,000గా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. రోడ్డు ప్రమాద కేసుల్లో ఏడాది లోగా నష్టపరిహారం చెల్లించాలని స్పష్టం చేసింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్ కే సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఇచ్చిన ఈ తీర్పు పూర్వాపరాలు...రోడ్డు ప్రమాద బాధితులకు చెల్లించే నష్టపరిహారం విషయంలో 2017 నాటి సుప్రీంకోర్టు తీర్పు (ప్రణయ్ సేథీ తీర్పుగా పిలుస్తారు) మార్గదర్శకాలకు ఇది అదనం అని తెలిపింది. ‘‘ప్రణయ్ సేథీ కేసు విషయంలో చెప్పిన వాటికి భార్య మరణం వల్ల కుటుంబ సేవలకు కలిగే నష్టాన్ని అదనంగా చేరుస్తున్నాం. గృహిణికి ఇప్పుడైనా నేషన్ బిల్డర్ హోదా లభిస్తుందని నమ్ముతున్నాం’’ అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. దేశంలోని అన్ని రాష్ట్ర హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు కూడా మోటార్ వెహికల్ యాక్ట్ కేసుల ప్రగతిని పర్యవేక్షించాలని సత్వర న్యాయం దక్కేలా చేయాలని కోరింది.సెక్షన్ 169 కింద ఇచ్చిన సమ్మరీ ప్రోసీజర్‌ను కచ్చితంగా అనుసరించడం ద్వారా బాధిత కుటుంబాలు సుదీర్ఘ న్యాయ పోరాటం నుంచి ఉపశమనం పొందవచ్చునని తెలిపింది. నష్ట పరిహారానికి సంబంధించిన మార్గదర్శకాలను అక్షర, భావ స్ఫూర్తితో అనుసరించాలని కోరింది. హోం మేకర్ అనగానే అందరికీ ఓ మహిళ రూపం కళ్ల ముందు మెదులుతుందని అయితే ఇది అన్ని సందర్భాలకూ వర్తించక పోవచ్చునని సుప్రీంకోర్టు బెంచ్ తన తీర్పులో పేర్కొంది. కొన్ని అసాధారణ పరిస్థితుల్లోనో, దురదృష్టవశాత్తో పురుషుడు కూడా హోం మేకర్ పాత్ర పోషించే అవకాశాలు లేక పోలేదని తెలిపింది. వీరికి దక్కాల్సిన గౌరవం ఇస్తూనే ప్రస్తుత కేసులో మాత్రం భార్య అందించే కుటుంబ సేవలకు మాత్రమే విలువ కట్టామని వివరించింది.ప్రణయ్ సేథీ తీర్పు ప్రకారం...రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన నష్ట పరిహారం చెల్లింపు విషయంలో 2017 నాటి ప్రణయ్ సేథీ కేసు తీర్పు నిర్ణయాత్మకమైంది. ఈ కేసులో జారీ చేసిన మార్గదర్శకాలను పాటించడం బీమా కంపెనీలకు తప్పనిసరిగా మారింది ఈ తీర్పుతోనే. చని పోయిన వారు భవిష్యత్తులో ఎంత ఆదాయం సంపాదించగలరు అన్నదాన్ని ఎలా లెక్కించాలో ఈ తీర్పులో స్పష్టంగా వివరించారు. ఏ ఏ విషయాల్లో నష్టపరిహారం చెల్లించాలి, వేటిని మినహాయించాలి అన్నది కూడా ఈ తీర్పు ద్వారా స్పష్టం చేశారు. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏ.కే.సేక్రీ, జస్టిస్ ఏ.ఎం.ఖాన్విల్కర్, జస్టిస్ డాక్టర్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం వెలువరించిన ఈ తీర్పు ప్రకారం...⇒ నలభై ఏళ్ల లోపు వయసుండి శాశ్వత ఉద్యోగం కలిగి ఉన్న వారైతే...నష్టపరిహారంలో వారి వేతనంలో సగాన్ని ఆదాయంగా పరిగణించాలి (వేతనమంటే అన్ని రకాల పన్నులు మినహాయించిన తరువాతి మొత్తం)⇒ నలభై నుంచి యాభై ఏళ్ల మధ్య వయస్కులైతే వేతనంలో 30 శాతాన్ని, యాభై నుంచి అరవై ఏళ్ల మధ్య వయసు వారైతే 15 శాతాన్ని ఆదాయంగా పరిగణించాలి. ⇒ స్థిరమైన వేతనంతో సొంతంగా ఉద్యోగం కలిగి ఉండి నలభై ఏళ్ల కంటే తక్కువ వయసు ఉంటే వేతనంలో 40 శాతాన్ని ఆదాయానికి జోడించాలి. ⇒ 2009 నాటి సరళ వర్మ, డీటీసీ కేసు మార్గదర్శకాల ప్రకారం నష్ట పరిహారం నుంచి వ్యక్తిగత ఖర్చులను మినహాయిస్తారు. ⇒ లాస్ ఆఫ్ ఎసెట్స్ (బతికి ఉంటే సంపాదించే అవకాశమున్న ఆస్తులు, ఆదాయం) కింద రూ.15,000, అంత్యక్రియలకు అయ్యే ఖర్చు కింద రూ.15,000, భార్య/భర్త సాంగత్యాన్ని కోల్పోయినందుకు రూ.40,000 కూడా చెల్లించాల్సిన నష్టపరిహారాల జాబితాలోకి చేరుతుంది.⇒ ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని ప్రతి మూడేళ్ల కాలానికి పది శాతం చొప్పున పరిహారం పెరగాలి.శిశుపాల్ వర్సెస్ సుర్జీత్మోటారు వాహన ప్రమాద పరిహారానికి సంబంధించిన ‘శిశుపాల్ వర్సెస్ సుర్జీత్’ కేసులో దాఖలైన అప్పీలును సుప్రీంకోర్టు విచారించింది. ప్రమాదాల్లో గృహిణులు మృతి చెందినప్పుడు లేదా వికలాంగులుగా మారినప్పుడు వారి సేవలకు తగిన ఆర్థిక విలువ కట్టడం లేదన్న వాదనలు న్యాయస్థానం ముందుకొచ్చాయి. గృహిణులకు ఎలాంటి ప్రత్యక్ష ఆదాయం లేనందున కింది కోర్టులు, ట్రిబ్యునళ్లు పరిహారం చెల్లింపుల్లో తక్కువ మొత్తాలను ఖరారు చేస్తున్న తీరును కోర్టు పరిగణనలోకి తీసుకుంది. దీనిపై స్పందించిన న్యాయస్థానం... గృహిణుల సేవలకు కచ్చితమైన, గౌరవప్రదమైన విలువను ఆపాదించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.పరిహారం లెక్కింపుపై స్పష్టమైన తీర్పు బాధిత కుటుంబం కోల్పోయే ‘గృహ సంరక్షణ’ను ఇకపై ఒక స్వతంత్ర ప్రాతిపదికగా పరిగణించి పరిహారం లెక్కించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. గతంలో ప్రణయ్ సేథీ కేసులో ఇచ్చిన తీర్పులో నిర్దేశించిన పరిహారాలకు అదనంగా ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. అలాగే, ప్రమాద పరిహార క్లెయిమ్‌లను త్వరితగతిన పరిష్కరించేందుకు మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 169 ప్రకారం సత్వర చర్యలు తీసుకోవాలని, దీనిని క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో అమలు చేయాలని సూచించింది. పరిహార కేసుల విచారణలు సకాలంలో పూర్తయ్యేలా, తీర్పులోని సూత్రాలు అమలయ్యేలా అన్ని రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు పర్యవేక్షించాలని మార్గదర్శకాలను జారీ చేసింది. – సాక్షి, న్యూఢిల్లీపాతికేళ్ల క్రితం నాటి కేసు...2001లో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన ఈ కేసులో చివరకు 2026 జూన్ నెలలో తీర్పు వెలువడింది. జీపులు రెండు ఢీకొన్న ప్రమాదంలో కక్షిదారు భార్య మరణించింది. పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు 2024లో తీర్పునిస్తూ... బాధితుడికి, ముగ్గురు పిల్లలకు ఎనిమిది లక్షల రూపాయల పరిహారం చెల్లించాల్సిందిగా ఆదేశించింది. అయితే బాధితుడు ఈ తీర్పును సవాలు చేస్తూ గత ఏడాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
కాశీయాత్రలో విషాదం
సంగం: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం నుంచి కాశీ యాత్రకు 43 మందితో బయలుదేరిన టూరిస్టు బస్సు బిహార్ రాష్ట్రంలోని గయ జిల్లా బుద్ధగయ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి ప్రమాదానికి గురైంది. ఎదురుగా వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో బస్సులోని ముగ్గురు యాత్రికులు దుర్మరణం చెందారు. 15 మంది తీవ్రంగా గాయపడగా, పలువురు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. మృతుల్లో సంగంకు చెందిన టూరిస్టు బస్సు నిర్వాహకుడు, విశ్రాంత ఆర్టీసీ కండక్టర్ పసుపులేటి వెంకటేశ్వర్లు (64), వంట మాస్టర్ చవడం హజరత్తయ్య (57), ఆత్మకూరుకు చెందిన సోమా పద్మావతి (43) ఉన్నారు.తీవ్రంగా గాయపడిన వారిలో సంగంకు చెందిన బొమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, లక్ష్మమ్మ, నీలం శీనయ్య, పద్మ, వింజమూరు శివరంగయ్య, లక్ష్మమ్మ, కంటాబత్తిన సంపూర్ణమ్మ, కంటాబత్తిన కామాక్షమ్మ, గురవయ్య, డి.రమణమ్మ, జి.శ్రీదేవి, డి.మల్లేశ్వరి ఉన్నారు. ఆత్మకూరు, దుత్తలూరుకు చెందిన పలువురు యాత్రికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులకు గయలోని అనుగ్రహ నారాయణ మగధ మెడికల్ కళాశాలలో చికిత్స అందిస్తున్నారు. కాగా క్షతగాత్రులకు హిందీ భాష తెలియక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వైద్యులు మాత్రం క్షతగాత్రులకు చికిత్స అందించి కాపాడారు. సరైన ఆహారం దొరక్క ఇబ్బందులు పడుతున్నారు.బస్సు ప్రమాదం బాధాకరం: వైఎస్ జగన్సాక్షి, అమరావతి: నెల్లూరు జిల్లా నుంచి కాశీయాత్రకు వెళ్తున్న ప్రైవేట్ బస్సు బీహార్‌లోని ఔరంగాబాద్ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురై ముగ్గురు భక్తులు మృతిచెందిన ఘటనపై మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం అత్యంత విషాదకరమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో సంగం మండలానికి చెందిన ఇద్దరు, ఆత్మకూరుకు చెందిన ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు.మృతుల కుటుంబాలకు వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ఈ తీరని విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని దేవుడు ప్రసాదించాలని ప్రార్థించారు. ప్రమాదంలో గాయపడిన 15 మంది యాత్రికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. -
ఊహించని మలుపు.. ఒకే కుటుంబంలో 9 మంది మృతి
ఇంటి పెద్దను కోల్పోయిన బాధలో ఉన్న ఆ కుటుంబాన్ని ఊహించని ప్రమాదం కబళించింది. అంత్యక్రియలు, అస్థికల నిమజ్జనం పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం బారినపడింది. దీంతో ఆ కుటుంబంలోని తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో.. మృతుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది.పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్-ఫజిల్కా రహదారిపై ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. జలాలాబాద్‌కు చెందిన ఓ కుటుంబంలో ఇంటి పెద్ద(మహిళ) మరణించింది. దీంతో అంత్యక్రియలు, అనంతర కర్మలు పూర్తి చేసుకుని ఆ కుటుంబం పికప్ వాహనంలో స్వగ్రామానికి తిరుగు ప్రయాణమైంది. కుటుంబ సభ్యులు, బంధువులు కలిపి మొత్తం 28 మంది వాహనంలో ఉన్నట్లు సమాచారం.గత అర్ధరాత్రి దాటిన తర్వాత వాహనం ఫిరోజ్‌పూర్-ఫజిల్కా మార్గంలో ప్రయాణిస్తుండగా ఓ ప్రమాదకర కొండ మలుపు వద్ద ఎదురుగా వస్తున్న భారీ ట్రైలర్‌తో కొట్టింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. పికప్ వాహనం అధిక వేగంతో వెళ్తుండటంతో డ్రైవర్ మలుపు వద్ద వాహనాన్ని అదుపు చేయలేకపోయినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ట్రైలర్‌ను తప్పించుకునే అవకాశం లేకపోవడంతో రెండు వాహనాలు బలంగా ఢీకొన్నాయి.ఢీకొట్టిన తీవ్రతకు పికప్ వాహనం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ప్రమాదం జరిగిన వెంటనే ముగ్గురు పురుషులు, ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించగా.. చికిత్స పొందుతూ మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది.ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు, అత్యవసర సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వాహనంలో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసి సమీప ఆస్పత్రులకు తరలించారు. తీవ్రంగా గాయపడిన పలువురిని ఫరీద్‌కోట్‌లోని ప్రత్యేక వైద్య కేంద్రాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక విచారణలో అతివేగం, ఇరుకు రహదారి, ప్రమాదకర మలుపు కలిసి ప్రమాదానికి కారణమైనట్లు అనుమానిస్తున్నారు. స్థానికులు కూడా ఇదే మార్గంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఫిరోజ్‌పూర్-ఫజిల్కా రహదారిలోని ఈ భాగం చాలా కాలంగా ప్రమాదాల కేంద్రంగా మారిందని, రహదారి విస్తరణ చేపట్టాలని పలుమార్లు ప్రభుత్వాన్ని కోరినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.#BREAKING SEVEN TO NINE killed and 15 injured in Ferozepur, Punjab, when a truck collided with a jeep carrying a family to immerse ashes. SSP Bhupinder Singh confirmed. #Punjab #Ferozepur #RoadAccident @PunjabPoliceInd https://t.co/3CbYUL1g3A pic.twitter.com/k8W1AxtjUP— jarvis ☠️ (@Vishii14) June 6, 2026 -
రాపిడో బైక్ ప్రమాదం.. మహిళా ఇంజినీర్ మృతి
తిరువొత్తియూరు: రాపిడోలో వెళుతున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళా ఇంజినీర్ మృతి చెందారు. ఆవడి సమీపంలోని తిరుముల్లైవాయల్ ప్రాంతానికి చెందిన గోమతి (30) అనే మహిళ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఈమె రామాపురం ప్రాంతంలోని ఓ ప్రముఖ ఐటీ సంస్థలో ఉద్యోగి. గురువారం ఉదయం ఆమె యధావిధిగా కార్యాలయానికి వెళ్లేందుకు రాపిడో (బైక్ టాక్సీ) బుక్ చేసుకున్నారు. కొద్దిసేపటికే వచ్చిన రాపిడో బైక్ డ్రైవర్, గోమతిని ఎక్కించుకుని మదురవాయల్ బైపాస్ రోడ్డు మీదుగా వెళ్తున్నారు. పోరూర్ టోల్ ప్లాజా సమీపంలో వెళ్తుండగా, ముందు వెళ్తున్న కారును మోటార్ సైకిల్ ఢీకొట్టింది. ఇందులో నియంత్రణ కోల్పోయిన గోమతి, రాపిడో డ్రైవర్ ఇద్దరూ కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో గోమతి తలకి తీవ్ర గాయాలవ్వడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గోమతి వద్ద హెల్మెట్ ఉన్నప్పటికీ, ఆమె దానిని ధరించకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. రాపిడో డ్రైవర్ స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. సమాచారం అందుకున్న మదురవాయల్ ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ విభాగం ఇన్స్పెక్టర్ విజయకుమార్, గోమతి మృతదేహాన్ని స్వా«దీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కీల్పాకం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే, ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరా ఫుటేజీని సేకరించి, ప్రమాదానికి కారణమై పరారైన వాహనం కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. -
NRI : అమెరికాలో రోడ్డు ప్రమాదం..
సాక్షి, హైదరాబాద్/మన్సూరాబాద్: మాజీ ఎంపీ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ సతీమణి డాక్టర్ సుచియాష్కీ అమెరికాలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తమ చిన్న కుమార్తె డాక్టర్ గగనయాష్కీని బోస్టన్లోని హార్వర్డ్ యూనివర్సిటీ అనుబంధ ఆసుపత్రిలో ఎండీ కోర్సులో జాయిన్ చేసి న్యూయార్క్‌కు వస్తుండగా భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు.ప్రమాద సమయంలో వర్షం కురుస్తుండటంతో ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా కొట్టిందని, ఈ ప్రమాదంలో డాక్టర్ సుచియాష్కీకి పక్కటెముకలు విరిగిపోయాయని వెల్లడించారు. ప్రస్తుతం ఆమె స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు చెప్పారు. కాగా, మధుయాష్కీ కూడా అమెరికాలోనే ఉన్నారు. చిన్న కుమార్తె డాక్టర్ గగన న్యూయార్క్ మెడికల్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగా, కాన్వొకేషన్‌కు హాజరయ్యేందుకు యాష్కీ దంపతులు అమెరికా వెళ్లారు.కుమార్తెను ఎండీ కోర్సులో జాయిన్ చేసి వచ్చే సమయంలో సుచి ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. ఆ సమయంలో వేరే కారులో మధుయాష్కీ కూడా ఉన్నారని, భార్యకు ప్రమాదం జరిగిన నేపథ్యంలో గురువారం ఇండియాకు రావాల్సిన యాష్కీ, అక్కడే ఉండిపోయారని కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ ఫోన్లో మధుయాష్కీని పరామర్శించారు. -
రెండు కాళ్లు విరిగిపోయి, పండుకి ఘోర ప్రమాదం
-
రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం
సిద్దిపేటఅర్బన్: రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు దుర్మరణం చెందగా, కారులో ఉన్న కొడుకు, కోడలుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి శివారులో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. త్రీటౌన్ పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన కొలిపాక రవిచంద్రకాంత్ (49) కుటుంబంతో కలిసి పదేళ్ల క్రితం సిద్దిపేటకు బతుకుదెరువుకు వచ్చాడు. గోల్డెన్ ఫ్రేమ్స్ పేరిట ఫ్లెక్సీ ప్రింటింగ్, ఫొటో ఫ్రేమ్స్ నిర్వహిస్తున్నాడు. ఇతనికి భార్య సునీత (45), కుమారుడు అజయ్, కూతురు ఉన్నారు. అజయ్‌కు ఏడాదిన్నర క్రితం పెళ్లి జరిగింది. వేసవి కావడంతో స్వగ్రామం మణుగూరుకు నాలుగు రోజుల క్రితం వెళ్లారు. మంగళవారం ఉదయం 4.30 గంటలకు కారులో సిద్దిపేటకు బయల్దేరారు. ఉదయం 9గంటల ప్రాంతంలో మిట్టపల్లి శివారులోకి రాగానే వేబ్రిడ్జి పక్కన నిలిపిన ఇసుక లారీని వెనక నుంచి ఢీకొట్టడంతో కారు సగ భాగం చొచ్చుకెళ్లింది. దీంతో కారు నడుపుతున్న రవిచంద్రకాంత్, అతని భార్య సునీత అక్కడికక్కడే మృతి చెందారు. వెనక సీట్లో కూర్చున్న కొడుకు అజయ్, కోడలు అర్చన తలకు తీవ్ర గాయాలు కాగా కుడి కాలు కూడా విరిగింది. స్థానికులు వెంటనే క్షతగాత్రులను సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. అర్చన తండ్రి అంకం ప్రకాశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
విశాఖ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఢీ ఫేమ్ పండుకు తీవ్ర గాయాలు
-
స్పాట్ పెట్టేస్తున్నాయ్.. సైబరాబాద్ పరిధిలో 43 బ్లాక్స్పాట్లు!
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 43 ప్రమాదకర ప్రాంతాలు (బ్లాక్ స్పాట్స్) ప్రాణాంతకంగా మారాయి. గత మూడేళ్లలో 320 రోడ్డు ప్రమాదాలు జరగగా.. 251 మంది మరణించారు. మూల మలుపులు, అసంపూర్ణ రహదారి పనులు, వెలుతురు సరిగా లేకపోవడం, వాహనాల మార్గానికి అడ్డంగా చెట్లు ఉండటం వంటి కారణాలుగా గుర్తించారు. అనేక ప్రమాదకర ప్రాంతాల చుట్టూ నివాస కాలనీలు, వాణిజ్య సంస్థలు, పెట్రోల్ బంక్‌లు, మెట్రో కారిడార్లు ఏర్పడ్డాయి. దీంతో ఆయా మార్గాలలో పాదచారులు, స్థానిక ప్రయాణికులు నిత్యం రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు.ట్రాఫిక్ పోలీసు అధికారులు, శాంతి భద్రతల పోలీసు స్టేషన్లు, మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు, రోడ్ ఇంజినీరింగ్ ఏజెన్సీల బాధ్యులు బ్లాక్ స్పాట్లను తనిఖీ చేసి నివేదిక రూపొందించారు. గుర్తించిన ప్రమాదకర ప్రాంతాల్లో 90 శాతానికి పైగా మేడ్చల్ జోన్ పరిధిలోకి వస్తాయి. 50 శాతానికి పైగా ప్రమాదకర ప్రాంతాలలో ఎన్‌హెచ్–65 మార్గం అత్యంత ప్రమాదకరమైందిగా గుర్తించారు. 43 బ్లాక్ స్పాట్లలో 22 ముంబై హైవే (ఎన్‌హెచ్–65)కి చెందినవే ఉండటం గమనార్హం.అత్యంత ప్రభావిత ప్రాంతాలివీ..పటాన్చెరు శాంతి నగర్ కమాన్ నుంచి బజాజ్ ఎల్రక్టానిక్స్ మార్గం అత్యంత ప్రభావితమైన ప్రాంతాలలో ఒకటి. ఇక్కడ 24 ప్రమాదాలు జరగగా.. 11 మంది మరణించారు.పటాన్‌చెరులోని ఇస్నాపూర్ క్రాస్ రోడ్లో అలాగే ఆర్సీపురంలోని శ్రీమణికాంత షాపింగ్ కాంప్లెక్స్ నుంచి ఏషియన్ జ్యోతి థియేటర్ వరకు ఒక్కో మార్గంలో 10 మరణాలు సంభవించాయి.పటాన్‌చెరులోని నోవాపన్ టీ–జంక్షన్ మరో ప్రమాదకర ప్రాంతంగా నిలిచింది. ఇక్కడ 10 రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మరణించారు.ఎన్‌హెచ్–765డీ పై కుత్బుల్లాపూర్ ఎక్స్ రోడ్ నుంచి మాంగల్య షాపింగ్ మాల్ వరకు ఉన్న మార్గంలో 16 ప్రమాదాల్లో 10 మంది మృత్యువాత పడ్డారు. గండిమైసమ్మ ఎక్స్ రోడ్లో 14 ప్రమాదాల్లో 14 మంది చనిపోయారు.ఎన్‌హెచ్–65తో పాటు అధికారులు ఎన్‌హెచ్–44 నాగ్‌పూర్ రోడ్డుపై 7, ఎన్‌హెచ్–765డీ మెదక్–నర్సాపూర్ రోడ్డుపై 6, స్టేట్ హైవే (ఎస్‌హెచ్–1) రాజీవ్ రహదారిపై ఒకటి, నల్లగండ్ల ఫైఓవర్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మెయిన్ గేట్ నుంచి ఓల్డ్ ముంబై హైవే వరకు ఉన్న మార్గంలో 5 ప్రమాదాలతో సహా 7 ప్రమాదకర ప్రాంతాలను గుర్తించారు.ఎన్‌హెచ్–44పై రేకులబాయి క్రాస్ రోడ్, భారత్ పెట్రోల్ మధ్య మార్గంలో 11 ప్రమాదాల్లో 11 మంది చనిపోయారు. మేడ్చల్‌లోని ఎస్సీ హోటల్, సంప్రదా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి మధ్య మార్గంలో 10 యాక్సిడెంట్లలో 8 మంది మృత్యువాత పడ్డారు.కారణాలివీ..అసంపూర్తిగా ఉన్న నిర్మాణ పనుల వల్ల అనేక మార్గాలు ప్రభావితమయ్యాయి. రోడ్లను తవ్వి చాలాకాలం పాటు అసంపూర్తిగా వదిలేశారు. రోడ్లపైనే నిర్మాణ సామగ్రి పెట్టడం, దెబ్బతిన్న క్యారేజ్‌వేలు, పాక్షికంగా పూర్తి చేసిన రోడ్డు పనులు అనేక ప్రాంతాలలో రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి.రోడ్డు పక్కన ఉన్న చెట్లు క్యారేజ్‌వేల పైకి చొచ్చుకురావడం, చెట్లు ఎండిపోయి అనేక ప్రాంతాలలో క్యారేజ్వేలకు అడ్డుగా ఉన్నట్లు తనిఖీలలో పోలీసులు గుర్తించారు. మూలమలుపులు, ఎత్తుపల్లాలు ఉండటం, రాత్రి వేళల్లో ఆయా మార్గాలలో వీధి దీపాలు లేకపోవడం, ఉన్నా వెలుతురు సరిగా లేకపోవడం. రాత్రి వేళల్లో అధిక వేగంతో వాహనాలు తిరిగే హైవే మార్గాలలో హెచ్చరిక బోర్డులు లేకపోవడం. -
ఘోర ప్రమాదం.. పండు మాస్టర్‌కి తీవ్ర గాయాలు
'ఢీ' ఫేమ్ పండు మాస్టర్ తీవ్రంగా గాయపడ్డాడు. డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ అయిన ఇతడు ప్రమాదానికి గురయ్యారు. ఒక ప్రైవేట్ కార్యక్రమం కోసం విశాఖపట్నం వెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.విశాఖపట్నంలో జరిగే ఒక ఈవెంట్లో పాల్గొనేందుకు పండు మాస్టర్ తన టీమ్‌తో ప్రయాణమవుతుండగా ఆనందపురం మండలం లొతగలవానిపాలెం హైవేపై అర్థరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఆయనను సమీపంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.ఆగి ఉన్న రెండు వాహనాలను బొలెరో కోళ్ల వ్యాన్ ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న డాన్స్ మాస్టర్ పండుకు రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ముగ్గురికి స్వల్ప గాయాలవగా ఆసుపత్రికి తరలించారు. నిద్రమత్తు, అతివేగమే ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు. ప్రమాదానికి గురైన మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఘటన స్థలాన్ని పరిశీలించారు. -
గాజువాకలో ఘోర ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
గాజువాక: విశాఖ జిల్లా గాజువాకలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. ఇద్దరు పిల్లలతో సహా తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గాజువాక పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం... తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో బొగ్గు లోడుతో గంగవరం పోర్టుకు వెళ్తున్న టిప్పరు లారీ గాజువాక శ్రీనగర్ జంక్షన్ దాటిన తర్వాత టైరు పేలిపోవడంతో జాతీయ రహదారిపై కుడివైపున ఆగిపోయింది. కొద్దిసేపటి తర్వాత రాజమండ్రి నుంచి పార్వతీపురం వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఆ లారీని బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో సాలూరుకు చెందిన ఆర్టీసీ బస్సు కో డ్రైవర్ రాయిపల్లి రాంబాబు(50), రాజమండ్రి సీతంపేటకు చెందిన ఆర్.రాధామాధవి(35), విజయనగరం జిల్లా బొండపల్లి మండలం జె.గుమడాం గ్రామానికి చెందిన లెంక ఈశ్వరమ్మ(55) ఘటనాస్థలంలోనే మృతిచెందారు. గాజువాక పోలీసులు వచ్చి బస్సు సీట్లలో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన బస్సు డ్రైవర్ ఎస్.జమ్మయ్య, ప్రయాణికులు ఎస్ఎస్ నాగేశ్వరరావు(41), ఎం.శ్రీనివాస్(45), కె.రాజు(61), కె.లలిత(55), ప్రశాంతి(31), కె.రామకృష్ణ(70), ఆర్.తన్విత(5), ఎం.నివేదిత(7)ను 108 అంబులెన్స్‌లో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. కొద్దిసేపు ఆగుదామని ప్రయాణికులు కోరినా... బస్సు డ్రైవర్ మితిమీరిన వేగంతో నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెప్పారు. బస్సు అతివేగంగా వెళుతుండటంతో సీట్లలో కూర్చోలేకపోతున్నామని, లగేజీ బాక్స్‌లో పెట్టిన వస్తువులు కిందపడిపోతున్నాయని, నెమ్మదిగా వెళ్లాలని డ్రైవర్‌కు సూచించామని తెలిపారు. అయినా పట్టించుకోకుండా వేగంగా వెళుతుండటంతో టీ తాగేందుకు బస్సును ఆపాలని కోరామని చెప్పారు. దీంతో అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం జంక్షన్లో బస్సును ఆపాడని వివరించారు.డ్రైవర్ నిద్ర మత్తులో ఉన్నట్టు గుర్తించి కొద్దిసేపు విరామం తీసుకొని బయలుదేరుదామని చెప్పినా వినిపించుకోలేదని, నిద్ర మత్తులోనే బస్సును వేగంగా నడుపుతూ లారీని ఢీకొట్టాడని ఆవేదన వ్యక్తంచేశారు. మరోవైపు లారీ డ్రైవర్ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. టైర్ పేలిపోయిన లారీని రహదారికి ఎడమవైపున కాకుండా కుడివైపున నిలిపివేశాడని, వెనుక కనీసం ఇండికేటర్ లైట్లు, రేడియం స్టిక్కర్లు లేకపోవడంతో బస్సు డ్రైవర్ గుర్తించలేక వేగంగా వచ్చి ఢీకొట్టినట్లు అంచనాకు వచ్చారు.వైఎస్ జగన్ దిగ్భ్రాంతిసాక్షి, అమరావతి: విశాఖ నగరంలోని గాజువాక శ్రీనగర్ ప్రాంతంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందడంపై మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ప్రమాదంలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు కూలీల దుర్మరణం
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చిక్కబళ్లాపూర్ జిల్లా బాగేపల్లి టౌన్ సమీపంలోని జాతీయ రహదారి 44పై జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు వలస కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితులు బాగేపల్లి టౌన్ శివారులోని గంగోత్రి పెట్రోల్ బంక్ సమీపంలో తమ విధులు ముగించుకుని ఆటోలో ఇంటికి తిరిగి వస్తుండగా, వేగంగా వచ్చిన ఒక ట్రక్కు వారి ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆటోను ట్రక్కు బలంగా ఢీకొట్టడంతో పెద్ద శబ్దం వచ్చింది. దీంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. నుజ్జు నుజ్జు అయిన ఆర్టీసీ బస్సు
-
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకుల దుర్మరణం
కర్నూలు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. బైక్‌పై వెళుతుండగా ఆటో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు గణేకల్ గ్రామానికి చెందిన వీరేష్, మహేంద్ర, విశ్వనాథ్లుగా గుర్తించారు. -
ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుకునేలోపే విషాదం
నాగర్‌కర్నూల్ జిల్లా: భర్త, కుమారుడితో కలిసి ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుకోవాల్సిన ఓ మహిళను రోడ్డుపై ఉన్న గుంత బలి తీసుకుంది. ఈ హృదయ విషాధకర ఘటన బల్మూర్ మండలంలోని అచ్చంపేట, నాగర్‌కర్నూల్ ప్రధాన రహదారిలోని తుమ్మెన్‌పేట కాజ్వే వద్ద చోటు చేసుకుంది. ఎస్ఐ రాజేందర్ తెలిపిన వివరాలు.. మండలంలోని తుమ్మెన్‌పేట గ్రామానికి చెందిన మద్దెలగండ్ల దివ్య (20), భర్త హరికృష్ణతో పాటు ఆరు నెలల కుమారుడితో కలిసి బుధవారం రాత్రి ద్విచక్రవాహనంపై అచ్చంపేట నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు.ఈ క్రమంలో మార్గ మధ్యలోని తుమ్మెన్‌పేట స్టేజీ సమీపంలో ఉన్న కాజ్వే వద్ద ఎదురుగా వస్తున్న బస్సు లైట్ల ఫోకస్‌కు రోడ్డుపై ఉన్న గుంతలోకి బైక్ దించడంతో వెనకాల కుమారుడిని పట్టుకొని కూర్చున్న దివ్వ పట్టు తప్పి కింద పడిపోయింది. దీంతో ఆమె తలకు బలమైన గాయం కాగా.. సృహ తప్పిపోవడంతో చికిత్స నిమిత్తం నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతురాలి తండ్రి చింతల సురేష్ ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసి, మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించినట్లు ఎస్ తెలిపారు. -
నుజ్జునుజ్జైన కారు.. అక్కడికక్కడే ఐదుగురి దుర్మరణం
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో మరోసారి ఘోర రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. చిత్రదుర్గం జిల్లా తుమకుర్లహళ్లి సమీపంలో కారు–లారీ ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యిందని తెలుస్తోంది.ప్రాథమిక సమాచారం ప్రకారం.. వేగంగా వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను బయటకు తీశారు. క్షతగాత్రులు ఉన్నట్లయితే వారిని సమీప ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.మృతుల వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. ప్రమాదానికి అతివేగం, డ్రైవర్ నిద్రమత్తు లేదా నియంత్రణ కోల్పోవడం కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రెండ్రోజుల కిందట ఇదే జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఓకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. -
రోడ్డు ప్రమాదంలొ ప్రముఖ టీవీ నటుడు దుర్మరణం, సీఎం సంతాపం
ఒకరు ప్రముఖ మరాఠీ టీవీ నటుడు ఏళ్ల నటుడు మహేష్ పవార్ (25) ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో వారు ప్రయాణిస్తున్న ఎస్యూవీ (SUV) వాహనం దాదాపు 1,000 అడుగుల లోతునున్న లోయలోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మహేష్ పవార్‌తో పాటు ప్రయాణిస్తున్న మరో ఏడుగురు కూడా అక్కడికక్కడే మరణించినట్లు అధికారులు సోమవారం వెల్లడించారు. దీంతో పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది.ముంబైకి సుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలాడ్‌పూర్-మహాబలేశ్వర్ రోడ్డులోని అంబెనాలి ఘాట్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని పీటీఐ (PTI) నివేదించింది. కొండల మధ్య ఉన్న ఈ ప్రమాదకరమైన ఘాట్ రోడ్డులో వాహనం అదుపు తప్పి లోయలో పడిపోయింది. బాధితుల చివరి మొబైల్ లొకేషన్ ఆధారంగా, అంబెనాలి ఘాట్ విభాగంలో పోలీసులు శోధించగా, లోయలో పడి ఉన్న వాహనాన్ని గుర్తించారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమిక విచారణలో తేలింది.బాధితులు ఎవరు?పోలీసుల సమాచారం ప్రకారం.. మరణించిన వారంతా 19 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులు. వీరంతా ఆదివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో దాపోలిలోని హర్నే నుండి బయలుదేరారు. అయితే వారు గమ్యస్థానమైన సతారాకు చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.మృతులను సతారాకు చెందిన రితేష్ లోఖండే (22), సుహాస్ లోఖండే (20), ఉత్కర్ష్ షింగ్తే (21), నిఖిల్ షింగ్తే (25), మహేష్ పవార్ (25), ఆదిత్య సాలుంఖే (21), రాజేష్ కట్కర్ (35) రత్నగిరికి చెందిన అన్ష్ చవాన్ (19)లుగా అధికారులు గుర్తించారు.ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సంతాపంఈ ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలను "యుద్ధప్రాతిపదికన" నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎనిమిది మంది స్నేహితులు విహారయాత్రకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగిందని, మృతదేహాలను వెలికితీసేందుకు జిల్లా యంత్రాంగం వెంటనే ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించిందని సీఎం పేర్కొన్నారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) , స్వచ్ఛంద రెస్క్యూ టీమ్‌ల సహాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. మహేష్ పవార్ ప్రముఖ మరాఠీ టెలివిజన్ షో 'అప్పి ఆమ్చీ కలెక్టర్' లో తన నటన ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన అకాల మరణం మరాఠీ చిత్ర పరిశ్రమను ,ఆ సీరియల్ ప్రేక్షకులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. -
రోడ్డు ప్రమాదంలో ఉప సర్పంచ్ మృతి
సుల్తానాబాద్‌రూరల్/పెద్దపల్లి/ఓదెల: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి శివారులోని రాజీవ్ రహదారిపై బుధవారం ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టగా ఉప సర్పంచ్ కోట నిరంజన్‌రెడ్డి((39) మృతి చెందాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ కోట నిరంజన్‌రెడ్డి, నాంసానిపల్లెకు చెందిన పోతగంటి రాజు కలిసి ద్విచక్ర వాహనంపై కరీంనగర్‌కు పనినిమిత్తం వెళ్తున్నాడు. ఈక్రమంలో కాట్నపల్లి శివారులో వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ముందు టైర్ ఎక్కగా నిరంజన్‌రెడ్డి మృతి చెందాడు. రాజుకు తీవ్ర గాయాలు కావడంతో సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. పోలీసుల అదుపులో లారీ డ్రైవర్ ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. మృతుడి కుటుంబసభ్యులను విప్ విజయరమణరావు పరామర్శించారు. ఉప సర్పంచ్ మృతితో ఆయన స్వగ్రామం మడకలో విషాదం అలముకుంది. -
నెల్లూరులో టూరిస్టు బస్సు బోల్తా
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద చోటుచేసుకుంది. ఓ టూరిస్టు బస్సు అదుపు తప్పి బోల్తా పడిపోయింది. ఈ క్రమంలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడటంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, డ్రైవర్ నిద్ర మత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. నెల్లూరు హైవేపై ఏలూరు నుండి చైన్నై వైపు వెళ్తున్న టూరిస్ట్ బస్సు గురువారం ఉదయం బోల్తా పడింది. నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ జంక్షన్ వద్ద అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ప్రమాదం సమయంలో బస్సులో సుమారు 38 మంది పెద్దలు, ఐదుగురు ప్రయాణిస్తున్నారు. అయితే, డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలికి పోలీసులు, సహాయక బృందాలు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి
గోకవరం: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన ఘటన తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లి శివారులో మంగళవారం జరిగింది. వివరాలు.. జగ్గంపేట మండలం మల్లిసాలకు చెందిన కందికట్ల ముసలయ్య, భార్య దుర్గ, కుమారుడు కందికట్ల లక్కీ (1), కుమార్తె నవ్యతో పాటు ముసలయ్య తమ్ముడు రమణకుమార్, దుర్గ సోదరి బల్లెల పద్మ (19), మరో యువకుడు కొండేపూడి వివేక్ (19) కారులో రంపచోడవరం వెళ్లారు.మల్లిసాలకు తిరిగి వస్తున్న క్రమంలో కొత్తపల్లి దాటిన తరువాత జీడిపిక్కల ఫ్యాక్టరీ సమీపంలో కారు అదుపు తప్పి ట్రాన్స్ఫార్మర్ను, గోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో వివేక్, పద్మ అక్కడికక్కడే మృతి చెందగా, ఏడాది వయసున్న లక్కీ గోకవరం ప్రభుత్వాస్పత్రిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న ముసలయ్య తీవ్రంగా గాయపడగా, అతని పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. గోకవరం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రక్తమోడిన రహదారులు
సాక్షి నెట్వర్క్: ఉమ్మడి నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో రహదారులు రక్తమోడాయి. ఈ ఉమ్మడి జిల్లాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మొత్తం పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇందులో ఉమ్మడి నల్లగొండ ప్రమాదాల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, ఉమ్మడి వరంగల్‌లో ఐదుగురు మృత్యువాత పడ్డారు. నేపాల్‌కు చెందిన మీనాబుల్ (21), రవీబుల్ (28) యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని ఓ బేకరీలో పనిచేస్తున్నారు. ఆదివారం రాత్రి వారిద్దరూ బైక్‌పై ఆలేరు నుంచి జనగామ వైపు వెళ్తుండగా.. వెనుక నుంచి లారీ వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు.మరో ఘటనలో సూర్యాపేట జిల్లా మునగాల మండలం మొద్దుల చెరువు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని తండ్రి, కుమార్తె మృతి చెందారు. వెంకట్రాంపురం గ్రామానికి చెందిన కీత రాజయ్య(65)కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సోమవారం రాజయ్య రెండో కుమార్తె సునీత (43)తో కలిసి మునగాలలోని బ్యాంక్‌కు వచ్చి స్వగ్రామానికి వెళ్తుండగా మొద్దుల చెరువు గ్రామ స్టేజీ వద్దకు రాగానే గుర్తుతెలియని వాహనం వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. సునీతను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది.సూర్యాపేట జిల్లాలోనే మోతె మండలం రాఘవాపురం క్రాస్ రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఖమ్మం పట్టణంలోని ద్వారకానగర్‌కు చెందిన రామిశెట్టి వెంకటరమణమ్మ (63), రామిశెట్టి వెంకాయమ్మ (70) కొన్నిరోజుల క్రితం హైదరాబాద్‌లోని తమ బంధువుల వద్దకు వెళ్లారు. సోమవారం బంధువుల అబ్బాయితో కలిసి కారులో తిరిగి ఖమ్మంకు వెళ్తుండగా.. మార్గమధ్యలో రాఘవాపురం క్రాస్ రోడ్డు వద్దకు రాగానే.. పక్కన ఆగి ఉన్న లారీ ఒక్కసారిగా రోడ్డు మీదకు రావడంతో వెనుక వస్తున్న కారు దానిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వెంకటరమణమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. వెంకాయమ్మను సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బచ్చన్నపేట మండలం బసిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ నల్ల సిద్దినర్సమ్మ, మల్లయ్యల కుమారుడు వెంకటేశ్ (24) సోమవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో బైక్‌పై జనగామ నుంచి బసిరెడ్డిపల్లికి వస్తుండగా లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో వెంకటేశ్ తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే చనిపోయాడు. మరో ప్రమాదంలో జయశంకర్ భూ పాలపల్లి జిల్లా కాటారం నుంచి ధర్మసాగర్ వైపు వెళ్తున్న కారు గుమ్మళ్లపల్లి శివారులోకి రాగానే అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లి చెట్టును బలంగా ఢీకొట్టింది.కారులో ప్రయాణిస్తున్న శ్రావణ్(22) మృతిచెందగా శశివరణ్, రాజుకుమార్ల కు తీవ్ర గాయాలయ్యాయి. ఇదే జిల్లా గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లెకి చెందిన బొక్కల ఐలయ్య (75) సోమవారం తెల్లవారు జామున జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తుండగా ఓ కారు వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం గురిజాలకు చెందిన మచ్చిక సాయికుమార్ (25) ఆదివారం మేడారం వెళ్లి తిరిగి వస్తుండగా కారు అదుపు తప్పి రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయాడు. మరో ఘటనలో వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో సోమవారం రాత్రి నడుచుకుంటూ వెళుతున్న మద్ది సాంబయ్య (36)ను ద్విచక్రవాహనం ఢీకొనడంతో మృతిచెందాడు. కారు ఢీకొని హెడ్‌కానిస్టేబుల్ మృతి కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన హెడ్‌కానిస్టేబుల్ జాడి బాపురావు (59) సోమవారం మధ్యాహ్నం డ్యూటీ ముగియడంతో ఇంటికి వెళ్లేందుకు ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. కొద్ది దూరం వెళ్లగానే పులికుంట వద్ద జాతీయ రహదారిపై వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో బాపురావు తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. -
Bangladesh: ఇనుప రాడ్ల ట్రక్కు బోల్తా.. 15 మంది మృతి
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు వాయువ్యంగా 83 కిలోమీటర్ల దూరంలో ఉన్న టాంగైల్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం అందరినీ కలచివేసింది. ఈద్-ఉల్-అదా(ఈద్) పండుగ కోసం తమ స్వగ్రామాలకు వెళ్తున్న కూలీలతో వెళ్తున్న ఒక ట్రక్కు, అదుపు తప్పి బోల్తా పడటంతో 15 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.ఈద్ వేళ విషాదంప్రమాదం జరిగిన సమయంలో ట్రక్కులో ఇనుప రాడ్లతో పాటు, ప్రయాణీకులు కూడా ఉన్నారు. సోమవారం ఉదయం 5 గంటల సమయంలో టాంగైల్ జిల్లాలోని సోరటోయిల్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కూలీలు తమ కుటుంబాలతో కలిసి ఈద్ వేడుకలు జరుపుకోవడానికి ఇంటికి బయలుదేరగా, విధి వారిని మార్గమధ్యలోనే బలిగొంది. మృతుల్లో ఎక్కువ మంది రోజువారీ కూలీలేనని అధికారులు తెలిపారు.అదుపు తప్పిన వాహనంస్థానిక పోలీస్ చీఫ్ ఫువాడ్ హుస్సేన్ వెల్లడించిన వివరాల ప్రకారం, వాహనాన్ని నియంత్రించలేక డ్రైవర్ చేసిన పొరపాటు వల్లే ఈ ప్రమాదం జరిగింది. ట్రక్కు డ్రైవర్ అదుపు తప్పడంతో వాహనం బోల్తా పడింది. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, అధికారులు రంగంలోకి దిగి, ట్రక్కు కింద చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్నం చేశారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.నిత్యం వెంటాడుతున్న మరణ మృదంగంబంగ్లాదేశ్లో రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. ట్రాఫిక్ నిబంధనలు సరిగ్గా అమలు కాకపోవడం, రహదారుల దుస్థితి, నైపుణ్యం లేని డ్రైవర్ల వల్ల ఏటా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దేశంలో ప్రయాణ భద్రతపై కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇలాంటి విషాదకర సంఘటనలు పదేపదే పునరావృతమవుతున్నాయి. -
ఏడాది జైలుశిక్ష.. ఒక్కరోజుతో సరి
బెంగళూరు: రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు అందుకు కారకులు పరారవుతుంటారు. కానీ ఓ డ్రైవరు గాయపడినవారిని తన కారులోనే ఆస్పత్రికి తీసుకెళ్లినందుకు, మరింత పరిహారం ఇస్తానన్నందుకు హైకోర్టు శిక్షను తగ్గించింది. వివరాలు.. దక్షిణ కన్నడ జిల్లా పక్షికెర నివాసి, డ్రైవరు రియాజ్ అహ్మద్ కారులో వెళ్తూ ఓ బైకిస్టును ఢీకొనడంతో గాయపడ్డాడు. అతనిని తన కారులో ఆస్పత్రికి తీసుకెళ్లాడు. చికిత్స పొందుతూ బాధితుడు చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి చార్జిïÙటు దాఖలు చేశారు. స్థానిక కోర్టు రియాజ్‌కు ఏడాది జైలు శిక్ష విధించింది. తరువాతి రోజుల్లో రియాజ్ గాయపడి, చేతికి రాడ్ వేయించుకున్నాడు. డ్రైవరు వృత్తి చేయలేక కూలిపనులు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో శిక్షను రద్దుచేయాలని హైకోర్టును ఆశ్రయించాడు. న్యాయమూర్తి జస్టిస్ వీ.శ్రీషానంద విచారించారు. నిందితుని పరిస్థితిని చూసి, బాధిత కుటుంబానికి మరింత పరిహారం ఇస్తే శిక్ష తగ్గిస్తానని తెలిపారు. రూ. లక్ష ఇవ్వడానికి నిందితుడు అంగీకరించాడు. ఈ నేపథ్యంలో ఏడాది కారాగార శిక్షను ఒక్కరోజుకు జడ్జి తగ్గించారు. జూన్ 30లోగా పరిహారం చెల్లించాలి. ఒకవేళ చెల్లించకపోతే, సంవత్సరం శిక్ష తప్పదని జడ్జి హెచ్చరించారు. -
అర్ధరాత్రి ఆగిన ఊపిరి
సాక్షి, బళ్లారి, రాయచూరు రూరల్: బంధువుకు అనారోగ్యంగా ఉండడంతో ఉదయమే ఊరి నుంచి మరో ఊరికి వచ్చారు. అర్ధరాత్రి తిరిగి బయల్దేరారు. కొంతసేపు ఉంటే క్షేమంగా చేరేవారే. కానీ మృత్యువు లారీ రూపంలో ఎదురొచ్చి పొట్టనబెట్టుకుంది. ట్రాక్స్ క్రూయిజర్‌ను లారీ ఢీకొగా, 5 మంది క్షణాల్లోనే చనిపోయారు. కలబుర్గి జిల్లా చిత్తాపూర్ తాలూకా లాడ్లాపూర్ సమీపంలో జాతీయ రహదారి– 50 పై జరిగింది. తుక్కయిన క్రూయిజర్ చిత్తాపూర్ తాలూకా వాడి పట్టణం దగ్గర ఇంగళిగి గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన 5 మంది క్రూయిజర్‌లో యాదగిరికి వచ్చి శుక్రవారం అర్ధరాత్రి తిరిగి వెళ్తున్నారు. ఈ సమయంలో ఎదురుగా వచ్చిన తమిళనాడు లారీ అతివేగంతో ఢీకొట్టింది. ఆ ధాటికి క్రూయిజర్ గుర్తుపట్టలేనంతగా తుక్కయింది. అందులోని మహ్మద్ హుస్సేన్ (60), ఫాతిమా (40), రసూల్‌బీ (40), మహబూబ్ (34), టోలూసాబ్ కాశ్వర్ (27) అనే అందరూ మరణించారు. మృతదేహాలు వాహనంలో చిక్కుకుపోయాయి. ఇతర వాహనదారులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, స్థానికులతో కలిసి బయటకు తీసి సమీప ఆస్పత్రికి తరలించారు. పోలీసులు లారీ డ్రైవరు కోసం గాలిస్తున్నారు. ఐదుమంది మరణంతో స్వగ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. -
నీకు పెళ్లి చేయాల్సిన చేతులతో తలకొరివి పెడుతున్నా బిడ్డా..
నల్లగొండ: అమెరికాలో ఈ నెల 16న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన నార్కట్‌పల్లి మండలం చెరువుగట్టు గ్రామానికి చెందిన గడుసు శ్రీనివాస్‌రెడ్డి–శోభ దంపతుల పెద్ద కుమార్తె నవ్య(24) మృతదేహం ఆరు రోజుల తర్వాత శుక్రవారం ఉదయం 10 గంటలకు స్వగ్రామానికి చేరుకుంది. నవ్య బీటెక్ పూర్తిచేసి ఎంఎస్ చేసేందుకు రెండున్నరేళ్ల క్రితం అమెరికాకు వెళ్లింది. అక్కడ చికాగో రాష్ట్రంలోని రోజ్‌వెల్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతోంది. ఈ నెల 16న రాత్రి కారులో వెళ్తుండగా.. వెనుక నుంచి మరో కారు వచ్చి ఢీకొట్టడంతో నవ్య అక్కడికక్కడే మృతిచెందింది. కాగా.. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన తమ కుమార్తె విగతజీవిగా తిరిగి రావడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. నవ్య మృతదేహానికి ఆమె తల్లి శోభ బొట్టు పెట్టి సొమ్మసిల్లి పడిపోయింది. ‘నీకు పెళ్లి చేసి అత్తగారింటికి పంపియ్యాలనుకున్న బిడ్డా.. కానీ నీకు తలకొరివి పెట్టే కర్మ పట్టింది.. ఏ తండ్రికి నాలాంటి బాధ రావొద్దు బిడ్డా..’ అంటూ నవ్య తండ్రి గడుసు శ్రీనివాస్‌రెడ్డి రోదించిన తీరు గ్రామస్తులు, బంధువులను కంటతడి పెట్టించింది. అనంతరం మధ్యాహ్నం అంత్యక్రియలు పూర్తిచేశారు. నవ్య భౌతికకాయానికి ఆమె తండ్రి తలకొరివి పెట్టారు. స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం చెప్పారు. అంతిమయాత్రలో స్థానిక సర్పంచ్ నేతగాని కృష్ణ, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, చెరువుగట్టు ఆలయ చైర్మన్ వరాల రమేష్, మాజీ సర్పంచ్ మల్గా బాలకృష్ణ, నవీన్‌రెడ్డి, పున్నం రాజు యాదగిరి అంతిమయాత్రలో పాల్గొని నివాళులరి్పంచారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సహకారంతో ఆరు రోజుల్లోనే నవ్య మృతదేహం స్వగ్రామానికి చేరుకోవడంతో ఆయనకు నవ్య కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
కారుతో ఢీకొట్టి.. ప్రమాదాన్ని దాచేసి!
సాక్షి, అమరావతి: పర్యాటకాభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ)లో ఇన్చార్జి బాస్‌గా రాజ్యమేలుతున్న ఓ అధికారి నిర్లక్ష్యానికి ఓ ఉద్యోగి కోమాలోకి వెళ్లిన దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పరిశ్రమల శాఖకు చెందిన అ అధికారి రెండేళ్లుగా ఏపీటీడీసీలో ఎటువంటి పొడిగింపు ఆర్డర్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా అధికారిక హోదాలో కొనసాగడమే కాకుండా జీతం సైతం తీసుకుంటూ ఏపీటీడీసీపై పెత్తనం చెలాయిస్తున్నారు. ఇటీవల ఎండీ సైతం సెలవుపై వెళ్లడంతో ప్రభుత్వం ముందూవెనుక చూడకుండా సదరు అధికారికి ఏపీటీడీసీకి ఇన్చార్జి బాస్‌ని చేసేసింది.శుక్రవారం సాయంత్రం సదరు ఇన్చార్జి బాస్ ఏఎన్‌యూ వర్సిటీకి ఎదురుగా ఉన్న హైటెక్ భవంతుల్లోని తన నివాసానికి డ్రైవర్‌తో పాటు విజయవాడ నుంచి కారులో వెళ్తుండగా కాజా టోల్ గేట్‌కు సమీపంలో ఓ వ్యక్తిని బలంగా ఢీకొట్టారు. తీవ్ర గాయాలపాలైన ఆ వ్యక్తి కోమాలో వెళ్లిపోయాడు. బాధిత వ్యక్తి ఏపీసీఆర్డీఏలో అవుట్ సోర్సింగ్ విభాగంలో చిరుద్యోగిగా కొద్ది నెలల కిందటే చేరారు. గుంటూరు వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఏపీటీడీసీ ఇన్చార్జి బాస్ కారు బలంగా ఢీకొట్టినట్టు సమాచారం. దీనిపై పోలీసు కేసు నమోదు చేయకుండా సదరు ఇన్చార్జి బాస్ బాధిత కుటుంబాన్ని బెదిరించినట్టు తెలుస్తోంది. సమాచారం తెలిసినప్పటికీ మంగళగిరి పోలీసులు సైతం ఫిర్యాదు రాలేదనే కారణంతో ఘటనను పట్టించుకోలేదు.అంతా గుట్టుగానే..ఆ ఇన్చార్జి బాస్ ఇప్పుడు కొత్త కారుకు మారిపోయారు. రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత ఆ కారును బయట తిప్పకుండా దాచేశారు. బాధితుడికి గుంటూరులోని ఓ ఆస్పత్రిలో రహస్యంగా చికిత్స చేయిస్తున్నట్టు సమాచారం. బాధితులు గొడవ చేయకుండా చూసే బాధ్యతను ఏపీటీడీసీలోని ఓ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌కు అప్పగించినట్టు భోగట్టా. ప్రభుత్వ వాహనం ఢీకొని ఎవరైనా గాయపడితే తొలుత సదరు డ్రైవర్, వాహనంలో ఉన్న అధికారి స్థానిక పోలీసు స్టేషన్లో సమాచారం ఇవ్వాలి. సంబంధిత ప్రభుత్వ విభాగానికి వెంటనే నివేదించాలి.ఇది 24 గంటల్లోగా చేయాల్సిన ప్రాథమిక ప్రొటోకాల్. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వాహనాన్ని స్వా«దీనం చేసుకోవడంతో పాటు మోటారు వాహనాల చట్టం ప్రకారం డ్రైవర్ నిర్లక్ష్యమా? ప్రమాదం ఎందుకు జరిగిందనే అంశాలపై దర్యాప్తు చేస్తారు. దీనికి సమాంతరంగా ప్రమాదానికి కారణంపై పని చేస్తున్న ప్రభుత్వ కార్యాలయానికి నివేదించాలి. అధికారిక వాహన వినియోగానికి సంబంధించి అంతర్గతంగా శాఖాపరమైన విచారణ చేసి వాస్తవాలు నిగ్గుతేల్చి మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఇవన్నీ చేస్తే బాధిత వ్యక్తికి ఏదైనా జరిగితే చట్టపరమైన బీమా లభిస్తుంది.అంతేగానీ, రహస్యంగా వైద్యం చేయిస్తే తాత్కాలిక ఉపశమనం లభించినా తర్వాత ఎదైనా సమస్య తలెత్తితే బాధిత కుటుంబానికి ఆసరా కరువవుతుంది. ఇక్కడ, ప్రమాద ఘటనను దాచి పెట్టేందుకు ఏపీటీడీసీ ఇన్చార్జి బాస్ ఎందుకు ప్రయతి్నస్తున్నారో అర్థంకాని పరిస్థితి. ఒకవేళ వాహనం ఫిట్నెస్ లేకుండానే వాడేస్తున్నారా? మితిమీరిన వేగంతో కారు నడిపారా? రోడ్డు నిబంధనలు బేఖాతరు చేశారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో ఓ ఉద్యోగి సంస్థ వాహనాన్ని తీసుకెళ్లి భారీ యాక్సిడెంట్ చేసి కనీసం ఏపీటీడీసీ కార్యాలయంలో నివేదించకుండా గుట్టుగా వర్క్‌షాప్‌లో మరమ్మతు చేసి ఆఫీసులో పెట్టేయడం గమనార్హం. -
అమెరికాలో బాపట్ల యువకుడి మృతి
బాపట్లటౌన్: అమెరికాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాపట్ల యువకుడు మృతిచెందగా, అతని కుటుంబ సభ్యులు తీవ్రగాయాల పాలయ్యారు. వివరాలు ఇలా.. బాపట్ల పట్టణం యాదవపాలేనికి చెందిన ఆవుల పూర్ణగోపి (35) పదేళ్ల క్రితం అమెరికా వెళ్లి ఎంఎస్ పూర్తి చేసి ప్రస్తుతం మెక్సికోలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. అతని తమ్ముడు మురళి కూడా మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లి అక్కడే చదువుకుంటున్నాడు. తల్లిదండ్రులు ఆవుల శ్రీనివాసరావు, నళిని దంపతులు నెల క్రితం అమెరికా వెళ్లారు. అక్కడ కుటుంబ సభ్యులంతా విహార యాత్రకు వెళ్లి ఇంటికి వెళ్తుండగా కారు డ్రైవ్ చేస్తున్న ఆవుల మురళి నిద్ర వస్తుండడంతో అన్న గోపిని డ్రైవ్ చేయమని కోరాడు. దీంతో అతను కారు దిగి డ్రైవర్ సీటులో కూర్చునేందుకు యత్నిస్తుండగా వేగంగా వెనుక నుంచి వచ్చి బొలెరో వాహనం వీరిని కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో పూర్ణగోపి అక్కడికక్కడే మృతిచెందగా, అతని తల్లిదండ్రులు శ్రీనివాసరావు, నళిని, తమ్ముడు మురళికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. బొలెరోతో ఢీకొట్టిన మహిళ కూడా అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతుడు పూర్ణగోపి తండ్రి శ్రీనివాసరావు ఆర్మీలో పని చేసి రిటైర్ అయ్యారు. బాపట్ల ఏరియా ఆస్పత్రిలో 108 డ్రైవర్‌గా కూడా చాలాకాలం సేవలు అందించారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్ లిఖింపూర్‌లో ఈ రోజు( సోమవారం) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిసైయా-లఖింపూర్ జాతీయ రహదారిపై వ్యాన్, లారీ పరస్పరం ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.లిఖింపూర్ నుండి వ్యాన్ సిసైయా వైపు వ్యాన్ వెళ్తుండగా ఉంచ్‌గావ్, భరేహతా గ్రామాల మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. దీంతో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న డ్రైవర్‌తో పాటు మరో తొమ్మిదిమంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచినట్లు పేర్కొన్నారు. కాగా మరణించిన వారిలో ఏడుగురిని ఇదివరకే గుర్తించామని మరో ముగ్గురిని గుర్తించే అవకాశం ఉందని తెలిపారు.కాగా ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యానాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "లఖింపూర్ ఖేరి జిల్లాలో జరిగిన దురదృష్టకర రోడ్డు ప్రమాదంలో ప్రాణనష్టం జరగడం తీవ్ర విచారకరం, గుండెల్ని పిండేసే ఘటన. మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మరణించిన వారి ఆత్మలకు ఆ శ్రీరాముడు తన దివ్య చరణాల చెంత స్థానం కల్పించాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను." అని ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. అదేవిధంగా ఈ ప్రమాదంపై ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు సైతం ప్రగాఢ సానూభూతి తెలియజేశారు. -
రాంగ్ రూట్లో దూసుకొచ్చిన మృత్యువు
బంటుమిల్లి: కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలంలోని బంటుమిల్లి–గుడివాడ రోడ్డులో పెదతుమ్మిడి మీడియం డ్రెయిన్ వంతెన వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మండలంలోని చినతుమ్మిడి గ్రామానికి చెందిన అక్కచెల్లెళ్ల కొడుకులు వేముల శివయ్య(30), కాగిత అమలేశ్వరరావు(30) ద్విచక్రవాహనంపై వేకువజామున ఆదివారం మార్కెట్‌కు బయలుదేరారు. బంటుమిల్లి వైపు వంతెన దాటిన కొద్ది అడుగుల దూరంలోనే ఎదురుగా వేగంగా వస్తున్న వ్యాన్ వీరి బైక్‌ను ఢీకొట్టి ఈడ్చుకెళ్లడంతో బైక్‌పై ఉన్న శివయ్య, అమలేశ్వరరావు డ్రెయిన్‌లో పడిపోయారు.బైక్ పూర్తిగా ధ్వంసం కాగా, వ్యాన్ కూడా డ్రెయిన్‌లో పడిపోయింది. ప్రమాదంలో శివయ్య అక్కడికక్కడే మరణించగా, అమలేశ్వరరావును ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం దిశమర్రులో చెరువుల వద్ద మేత కట్టలు దించి హనుమాన్ జంక్షన్ వెళ్తున్న వ్యాన్ డ్రైవరు బాలిన సుబ్బారావు మద్యం, నిద్రమత్తులో రాంగ్ రూట్లో వచ్చి బైక్‌ను ఢీకొట్టాడని స్థానికులు తెలిపారు. అక్కడే ఉన్న కొందరు ప్రమాదాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడు శివయ్య తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వ్యాన్ డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలిసింది. చినతుమ్మిడిలో విషాదం ఈ ఘటన చినతుమ్మిడిలో విషాదం నింపింది. మృతులిద్దరూ అక్కాచెల్లెళ్ల కుమారులు కావడంతో రెండు కుటుంబాల వారి రోదనలు మిన్నంటాయి. డ్రెయిన్ వంతెన వద్ద హెచ్చరిక బోర్డులు, స్పీడు బ్రేకర్లు ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, దీనికి ఆర్అండ్బీ అధికారులే బాధ్యత వహించాలని స్థానికులు ఆరోపించారు. -
కాకినాడ రోడ్డుప్రమాదంపై YS జగన్ దిగ్భ్రాంతి
-
విచ్చలవిడి మద్యం అమ్మకాలతోనే ఇలాంటి దారుణాలు
సాక్షి, తాడేపల్లి: మద్యం నియంత్రణలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని.. ఫలితంగా అమాయకుల ప్రాణాలు పోతున్నాయని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఉదయం కాకినాడలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పని ప్రదేశంలో టిప్పర్ ఢీ కొట్టటంపై ఆందోళన వ్యక్తం చేసిన వైఎస్ జగన్.. ప్రమాదంలో ఐదుగురు మహిళా కూలీలు మృతి చెందటం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆయన.. ఘటనకు కూటమి ప్రభుత్వమే కారణమంటూ ధ్వజమెత్తారు. ‘‘టిప్పర్ డ్రైవర్ మద్యం తాగి వాహనం నడిపారన్న వార్త ఆందోళన కలిగించింది. రాష్ట్రంలో రాత్రింబవళ్లు విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. అందుకే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. మద్యం నియంత్రణలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అక్రమ మద్యం విక్రయాలు, పర్యవేక్షణ లోపంతో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు’’ అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. .. ‘‘ఉపాధి హామీ పనులకు వెళ్లే పేద మహిళలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు రావడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. పని ప్రదేశాల వద్ద కనీస భద్రతా చర్యలు లేకపోవడం దురదృష్టకరం. మృతి చెందిన కుటుంబాలకు తక్షణ ఆర్థికసాయం అందించాలి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలి’’ అని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉపాధి పనులకు వెళ్తున్న కూలీలు కొవ్వూరు బ్రిడ్జి వద్ద రోడ్డు దాటుతుండగా టిప్పర్ ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. క్షతగాత్రులను కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మరొకరు మరణించారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. వీళ్లను చీడిగ గ్రామస్తులుగా పోలీసులు నిర్ధారించారు. -
రైతు కూలీలను ఢీ కొట్టిన టిప్పర్.. అక్కడికక్కడే ఐదుగురు మృతి
-
కాకినాడలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి
సాక్షి, కాకినాడ: కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఉపాధి పనుల కోసం వెళ్తున్న కూలీలను టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వారిని చికిత్స కోసం జీజీహెచ్‌కు తరలించారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కాకినాడ రూరల్ కొవ్వూరు బ్రిడ్జి వద్ద టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. బ్రిడ్జి దగ్గర ఉపాధి పనుల కోసం వెళ్తున్న కూలీలపైకి టిప్పర్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. ఉదయాన్నే ఉపాధి పనులకు వెళ్తూ రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా, మృతులను సత్యవతి, కృష్ణవేణి, చిట్టెమ్మ, అన్నవరంగా గుర్తించారు. వీరంతా చీడగ గ్రామానికి చెందినట్టు సమాచారం. -
పెళ్లింట పెను విషాదం
అగనంపూడి: పెళ్లి ముచ్చట్లు తీరకముందే, నూరేళ్ల బంధానికి పునాది పడకముందే నవవధువు అనంత లోకాలకు చేరుకుంది. భర్తతో కలిసి కొత్త జీవితాన్ని ఊహించుకుంటూ పుట్టింటికి వస్తున్న తరుణంలో.. మృత్యువు కారు రూపంలో ఆమెను కబలించింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పెళ్లికుమార్తె తల్లి కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ హృదయవిదారక ఘటన విశాఖ జిల్లా అగనంపూడి ఉక్కు జనరల్ ఆస్పత్రి రోడ్డు ఏలేరు కాలువ సమీపంలో గురువారం జరిగింది. పరవాడ మండలం వాడచీపురుపల్లి ఎస్సీ కాలనీకి చెందిన ఈరుగుల సన్యాసమ్మ కుమారుడు నరసింగరావు (43) వాడచీపురుపల్లి పంచాయతీలో క్లాప్ వ్యాన్ డ్రైవర్.ఆయనకు అగనంపూడి నిర్వాసితకాలనీ కొండయ్యవలసకు చెందిన నడుపూరు పెంటారావు, కనకమహాలక్ష్మిల కుమార్తె రామేశ్వరి (31)తో బుధవారం రాత్రి వివాహం జరిగింది. తిరుగుమరుగుళ్లలో భాగంగా గురువారం నవ వధువు రామేశ్వరి ఇంటికి వెళ్లేందుకు ఆమె భర్త నరసింగరావు, ఆమె తల్లి కనకమహాలక్ష్మి, సోదరి కలిసి కారులో వాడచీపురుపల్లి నుంచి అగనంపూడికి బయల్దేరారు. ఆ కారును నర్సింగరావే నడుపుతున్నాడు. మరికొద్దిసేపట్లో ఇంటికి చేరిపోతారనుకున్న సమయంలో అగనంపూడి ఉక్కు జనరల్ ఆస్పత్రి రోడ్డు ఏలేరు కాలువ సమీపంలో డ్రైవింగ్ సీట్లో ఉన్న నరసింగరావుకు కళ్లు మూతలు పడడంతో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న వీధిలైట్ల స్తంభాన్ని ఢీకొట్టింది. కారు ముందు సీట్లో కూర్చున్న వధువు రామేశ్వరి అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె తల్లి కనకమహాలక్ష్మి కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మరణించింది. సోదరి వరలక్ష్మి, నర్సింగరావు తీవ్రంగా గాయపడ్డారు. రామేశ్వరి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. -
కాళ్ల పారాణి ఆరకముందే కానరాని లోకాలకు నవవధువు
సాక్షి,విశాఖ: వారు పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకొని బంగారు జీవితం గడపాలని కలలు కన్నారు. కానీ ఆ దంపతుల ఆశలు అడియాసలయ్యాయి. నవ వధువు కాళ్ల పారాణి ఆరకముందే రోడ్డు ప్రమాదంలో మృత్యువు ఆమెను కబళించింది. వరుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వధువు, వరుడితో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురికి గాయాలయ్యాయి.పోలీసుల వివరాల ప్రకారం, విశాఖపట్నం జిల్లా అగనంపూడి సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి కారు అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవ వధువు రామేశ్వరి మృతి చెందగా, వరుడు నర్సింగరావు తీవ్ర గాయాలపాలయ్యాడు. కారులో ఉన్న మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని అత్యవసర చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు.బుధవారం రాత్రి 1.58 గంటలకు వాడచీపురు పల్లిలో రామేశ్వరి - నర్సింగరావు వివాహం బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. వివాహం జరిగిన కొన్ని గంటలకే గురువారం అత్తగారిల్లైన అగనంపూడికి బయల్దేరారు. మార్గం మధ్యలో కారు ప్రమాదానికి గురైంది. రాత్రి పెళ్లి, మరుసటి రోజు ప్రమాదంలో వధువు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.ఘనంగా పెళ్లి చేసి కుమార్తెను సంతోషంగా అత్తగారింటికి సాగనంపిన తల్లిదండ్రులు, ఆమె మృతదేహాన్ని చూసి గుండెలవేసిలా రోదిస్తున్నారు. ఈ దృశ్యం స్థానికుల్ని కంటతడి పెట్టిస్తోంది. -
వరుస ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ ఈ బైపాసులు
-
మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి
-
ఔటర్‌పై రోడ్డు ప్రమాదం ఇద్దరు నటుల దుర్మరణం.!
ఇబ్రహీంపట్నం రూరల్: ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఇద్దరు షార్ట్ ఫిల్మ్ యాక్టర్లు దుర్మరణం చెందారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ నోయల్‌రాజ్ తెలిపిన ప్రకారం.. ఏపీలోని నెల్లూరు జిల్లా వేదాయపాలేనికి చెందిన కత్తి భరత్‌కాంత్ (31), గూడ సాయి త్రిలోక్ (31) షార్ట్‌ఫిల్మ్ యాక్టర్లు. శనివారం నెల్లూరు నుంచి కారులో హైదరాబాద్ బయలుదేరారు. ఓఆర్ఆర్ మీదుగా శంషాబాద్ వైపు వెళ్తుండగా.. బొంగ్లూర్ సమీపంలో మితిమీరిన వేగం కారణంగా కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కంటైనర్‌ను ఢీకొట్టింది. కారులోని భరత్‌కాంత్, గూడ సాయి త్రిలోక్ తీవ్రగాయాలతో మృతి చెందారు. -
మహబూబ్‌నగర్‌లో ఘోర ప్రమాదం
సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లాలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రేసింగ్ బైక్, కారు ఢీ కొని ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఒకరు గాయపడగా చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు.పాలకొండ చౌరస్తాలో అర్ధరాత్రి దాటాక ఈ ఘోరం జరిగింది. కారు డివైడర్ దగ్గ యూటర్న్ తీసుకుంటుడగా.. వేగంగా దూసుకొచ్చిన బైక్ ఢీ కొట్టింది. ఈ యాక్సిడెంట్‌తో కారు, బైక్‌లు నుజ్జు నుజ్జు అయ్యాయి. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతులు మహబూబ్‌నగర్ న్యూప్రేమ్ నగర్‌కు చెందిన కుటుంబంగా గుర్తించారు. మృతుల్లో.. ఆర్షియా బేగం(30), MD. ఉజేప (7), MD. అమర్ (2).. హైదరాబాద్‌కు చెందిన బైకర్ యాకుబ్ అఫ్జల్ (25) ఉన్నారు. మరో మృతదేహంపై స్పష్టత రావాల్సి ఉంది. గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బైక్ హర్యానా రిజిస్ట్రేషన్‌తో ఉంది.పోలీసుల నిర్లక్ష్యంతోనే..ఈ ఘటనలో పోలీసుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డులో రాత్రి 11గం. తర్వాత నుంచి తెల్లవారుజాము దాకా బైక్ రేసింగులు జరుగుతున్నాయని.. అటుగా వెళ్లే వాహనదారుల్ని భయానికి గురి చేస్తున్నాయని.. ఎన్ని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని అంటున్నారు. సకాలంలో చర్యలు తీసుకుని ఉంటే.. ఈ ఘోరం జరిగి ఉండేది కాదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విమర్శలపై పోలీసులు స్పందించాల్సి ఉంది. -
సినీ రంగంలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో యువ హీరో మృతి
-
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు షార్ట్ ఫిల్మ్ యాక్టర్ల మృతి
ఇబ్రహీంపట్నం రూరల్: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు షార్ట్ ఫిల్మ్ యాక్టర్లు మృతిచెందారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వేదాయపాలేనికి చెందిన కత్తి భరత్‌కాంత్(31), గూడ సాయి త్రిలోక్(31) అనే ఇద్దరు షార్ట్ ఫిల్మ్ యాక్టర్లు శనివారం సాయంత్రం నెల్లూరు నుంచి కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు. ఓఆర్ఆర్ మీదుగా శంషాబాద్ వైపు వస్తుండగా బొంగ్లూర్ ఎగ్జిట్–12 సమీపంలో కారు డ్రైవర్ అతివేగంగా వెళ్లడంతో అదుపుతప్పి ఎదురెదురుగా వెళ్తున్న కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న కత్తి భరత్‌కాంత్, గూడ సాయి త్రిలోక్‌కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఆదివారం తెల్లవారుజామున 3.20గంటల సమయంలో ఓఆర్ఆర్ పెట్రోలింగ్ అధికారి శ్రీకాంత్ ఇచి్చన సమాచారం మేరకు రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. -
ట్రాఫిక్ ప్రమాదాల్లో రోజుకు 546 మంది మృతి
న్యూఢిల్లీ: నగరాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రతిచోట ఇప్పడు ట్రాఫిక్ అనేది సాధారణంగా మారిపోయింది. వాహనాల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో ట్రాఫిక్ సమస్య కూడా ఎక్కువ అవుతోంది. దీంతో పాటు ప్రమాదాలు కూడా అధికవుతున్నాయి. దేశంలో సగటున ప్రతిరోజూ ట్రాఫిక్ సంబంధిత ప్రమాదాల్లో 546 మంది మరణిస్తున్నారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) తాజాగా వెల్లడించింది. ఏటేటా ఎగబాకుతున్న రోడ్డు ప్రమాదాలతో పాటు ట్రాఫిక్ సంబంధ యాక్సిడెంట్లు కూడా ఎక్కువ కావడం ఆందోళన కలిగిస్తోంది.2024లో ట్రాఫిక్ ప్రమాదాల్లో 1.99 లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఎన్సీఆర్బీ తెలిపింది. 2023తో పోలిస్తే మరణాల సంఖ్య 0.79 శాతం పెరిగిందిని వెల్లడించింది. 2023లో 1.98 లక్షల మంది మరణించారు. ట్రాఫిక్ ప్రమాదాలు కూడా పెరిగాయి. 2024లో 4.95 లక్షల ప్రమాదాలు జరగ్గా, 2023లో 4.91 లక్షల యాక్సిడెంట్లు నమోదయ్యాయి. ట్రాఫిక్ ప్రమాదాలు కారణంగా 2024లో 4.52 లక్షల మంది క్షతగాత్రులయ్యారు.ఆ మూడు రాష్ట్రాల్లోనే ఎక్కువట్రాఫిక్ ప్రమాదాల మరణాల్లో ఉత్తర ప్రదేశ్ (27,071), తమిళనాడు (20,390), మహారాష్ట్ర (19,475) మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. మొత్తం మరణాల్లో ఈ మూడు రాష్ట్రాల్లో 33.6 శాతం నమోదు కావడం గమనార్హం. ఉత్తర ప్రదేశ్‌లో 13.6 శాతం, తమిళనాడులో 10.2 శాతం, మహారాష్ట్రలో 9.8 శాతం మరణాలు సంభవించినట్టు ఎన్సీఆర్బీ తన నివేదికలో పేర్కొంది. ట్రాఫిక్ మరణాలే అత్యధికంప్రమాదాల వివరాల సేకరణలో భాగంగానే ట్రాఫిక్ ప్రమాదాల సమాచారాన్ని కూడా ఎన్సీఆర్బీ సేకరించింది. దేశవ్యాప్తంగా సంభవించిన మొత్తం ప్రమాదాల్లో ట్రాఫిక్ సంబంధిత దుర్ఘటనల మరణాలు అత్యధికంగా 42.6 శాతంగా నమోదయ్యాయి. ఆకస్మిక మరణాలు (16.2 శాతం), ఇతర కారణాలు (15.9 శాతం), నీటిలో మునిగిపోవడం (8.6 శాతం), కిందపడటం (5.7 శాతం), విషప్రయోగం (4.6 శాతం), విద్యుదాఘాతం (3.4 శాతం), ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం (1.3 శాతం), ప్రకృతి వైపరీత్యాలు (1.7 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పైవాటిలో ప్రకృతి విపత్తులు మినహా మిగతావి నివారించదగినవి.రైలు ప్రమాదాలు లేవు2024లో నమోదైన 1.99 లక్షల ట్రాఫిక్ సంబంధిత మరణాలలో 88 శాతం (1.75 లక్షలు) రోడ్డు ప్రమాదాల వల్లే సంభవించాయని ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడిస్తోంది. ఈ కాలంలో ఎలాంటి రైలు ప్రమాదం నమోదు కాలేదు. అయితే, రైళ్ల నుంచి పడిపోవడం లేదా రైల్వే ట్రాక్‌లపై ప్రజలను ఢీకొనడం వల్ల 17,029 మంది మరణించగా, రైల్వే ప్రాంగణంలో పేలుళ్లు, అగ్నిప్రమాదాలు వంటి ఘటనల్లో 5,384 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా, రైల్వే క్రాసింగ్‌ల వద్ద జరిగిన ప్రమాదాల్లో 1,888 మరణాలు నమోదయ్యాయి.టూవీలర్ ప్రమాదాలే ఎక్కువరోడ్డు ప్రమాదాల్లో ద్విచక్ర వాహనదారులు (84,599 మరణాలు) ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారు. 25,769 పాదచారులు మరణించారు. కారు ప్రమాదాల్లో 23,739 మరణాలు సంభవించాయి. ద్విచక్ర వాహన ప్రమాదాల్లో అత్యధికంగా తమిళనాడులో 11,786 మంది చనిపోయారు. ఉత్తర ప్రదేశ్‌లో 8,575 మరణాలు నమోదయ్యాయి. ఎస్యూవీ, కారు లేదా జీపు ప్రమాదాల వల్ల యూపీలో అధిక సంఖ్యలో 4,575 మంది మృతి చెందారు.చదవండి: చోరీ వీడియో వైరల్.. కట్ చేస్తే సర్ప్రైజ్! -
ఇండోనేషియాలో ఘోర ప్రమాదం
ఇండోనేషియా: ఇండోనేషియాలోని ట్రాన్స్–సుమత్రా హైవేపై బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కనీసం 16 మంది సజీవ దహనమయ్యారు. మరో నలుగురు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. సౌత్ సుమత్రా ప్రావిన్స్‌లోని నార్త్ ముసి రావాస్ రీజెన్సీలో ఈ విషాదం చోటుచేసుకుంది. లుబుక్లింగావ్ నుండి జంబీ నగరం వైపు ప్రయాణిస్తున్న బస్సు నుండి హఠాత్తుగా నిప్పురవ్వలు రావడంతో, డ్రైవర్ అదుపు తప్పి వాహనాన్ని కుడివైపు మళ్లించారు. సరిగ్గా అదే సమయంలో ఎదురుగా వచ్చిన ఇంధన ట్యాంకర్ వేగంగా ఢీకొట్టడంతో, క్షణాల్లోనే రెండు వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి. మంటల తీవ్రతకు వాహనాలు పూర్తిగా కాలిపోయి, లోహపు తుక్కుగా మారాయి. మృతుల్లో బస్సు డ్రైవర్, 13 మంది ప్రయాణికులు, ట్యాంకర్ డ్రైవర్, క్లీనర్ ఉన్నారు. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు అంచనా. -
ఆర్బీ చౌదరి మృతిపై విశాల్ దిగ్భ్రాంతి
ప్రఖ్యాత సినీ నిర్మాత ఆర్బీ చౌదరి మృతి వార్త సినీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మరణవార్తను షూటింగ్ మధ్యలో విన్న నటుడు విశాల్ తీవ్రంగా కలత చెందారు. విశాల్ తన భావోద్వేగాలను వ్యక్తం చేస్తూ.. జీవితం ఎంత అనిశ్చితమైనది. భారతదేశంలోని అతిపెద్ద నిర్మాణ సంస్థలలో ఆయన ఒకరు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. జీవా, జిథన్ రమేష్, సురేష్, వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి. ఈ విషాదం నుండి కోలుకునే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానని విశాల్ తన సంతాపాన్ని ప్రకటించారు.ఆర్బీ చౌదరి స్థాపించిన సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై అనేక విజయవంతమైన చిత్రాలు నిర్మించబడ్డాయి. ఆయన తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ వంటి భాషల్లో సినిమాలు నిర్మించి దక్షిణ భారత సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానం సంపాదించారు. ఆయన మృతి భారతీయ సినీ రంగానికి తీరని లోటు. ఆర్బీ చౌదరి మరణం పట్ల రజినీకాంత్, పవన్ కల్యాణ్, పృథ్వీరాజ్ సుకుమారన్ తమ సంతాపం వ్యక్తం చేశారు. కాగా ఆర్బీ చౌదరి ఇవాళ రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. -
'ఆయన మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యా..' మెగాస్టార్
ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఆయన మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని ట్వీట్ చేశారు. ఈ ఆకస్మిక, విషాదకరమైన సంఘటన నా హృదయాన్ని కలిచివేసిందన్నారు. ఆయన నాకు చాలా సంవత్సరాలుగా తెలుసని మెగాస్టార్ గుర్తు చేసుకున్నారు. గాడ్ ఫాదర్ మూవీ కోసం ఆర్బీ చౌదరితో కలిసి పనిచేశానని చిరంజీవి తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఆయన ఎందరో ప్రతిభావంతులైన దర్శకులు, నటుల కెరీర్లను తీర్చిదిద్దారని మెగాస్టార్ కొనియాడారు. ఒక నిర్మాతగా ఆయన లెక్కలేనన్ని కథలకు జీవం పోశారని తెలిపారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవను మాటల్లో వర్ణించలేమన్నారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి, మనోధైర్యం కలగాలని కోరుకుంటున్నాన్నట్లు ట్విటర్ ద్వారా సంతాపం ప్రకటించారు. సినీ ప్రముఖుల సంతాపం...ఆర్బీ చౌదరి మరణం పట్ల రజినీకాంత్, పవన్ కల్యాణ్, పృథ్వీరాజ్ సుకుమారన్, విశాల్ తమ సంతాపం వ్యక్తం చేశారు. కాగా.. ఆర్బీ చౌదరి ఇవాళ రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ ఇండస్ట్రీలో చిత్రాలు నిర్మించారు. తెలుగులో రాజా, సూర్యవంశం , సుస్వాగతం, నువ్వు వస్తావని, సంక్రాంతి, నవవసంతం, నిన్నే ప్రేమిస్తా, గోరింటాకు, అన్నవరం, గాడ్ ఫాదర్ లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు నిర్మించారు. సూపర్ గుడ్ ఫిలింస్ నిర్మాణ సంస్థను స్థాపించి సినిమాలు నిర్మించారు. Shocking to hear the news of the demise of the most prolific producer #RBChoudhary sir. Unable to digest this news in the midst of shoot. In a Loss of words. Life is so uncertain. One of the biggest production houses in India. May his soul rest in peace. My deepest condolences… pic.twitter.com/MMPl4PedR6— Vishal (@VishalKOfficial) May 5, 2026 என் அருமை நண்பர் சூப்பர் குட் ஃப்லிம்ஸ் ஆர்.பி. செளத்ரி அவர்கள் தலை சிறந்த தயாரிப்பாளர். அருமையான மனிதர். எத்தனையோ இளம் இயக்குநர்களுக்கு வாய்ப்பளித்து திரையுலகை வாழவைத்தவர்.அவருடைய அகால மரணச் செய்தி எனக்கு பேரதிர்ச்சியையும், மிகுந்த வேதனையையும் அளிக்கிறது.அவர்…— Rajinikanth (@rajinikanth) May 5, 2026 Deeply heartbroken to hear about the sudden and tragic loss of Legendary producer R.B. Choudary garu.I have known him for many years and was recently associated with him on my film “𝐆𝐨𝐝 𝐅𝐚𝐭𝐡𝐞𝐫” through Super Good Films. He has shaped the careers of many talented… pic.twitter.com/8AXgqF5hew— Chiranjeevi Konidela (@KChiruTweets) May 5, 2026


