ఇండోనేషియాలో ఘోర ప్రమాదం | Sixteen Killed In Bus Tanker Collision On Trans Sumatra Highway | Sakshi
Sakshi News home page

ఇండోనేషియాలో ఘోర ప్రమాదం

May 7 2026 5:25 AM | Updated on May 7 2026 5:25 AM

Sixteen Killed In Bus Tanker Collision On Trans Sumatra Highway

16 మంది సజీవదహనం 

ఇండోనేషియా: ఇండోనేషియాలోని ట్రాన్స్‌–సుమత్రా హైవేపై బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కనీసం 16 మంది సజీవ దహనమయ్యారు. మరో నలుగురు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. సౌత్‌ సుమత్రా ప్రావిన్స్‌లోని నార్త్‌ ముసి రావాస్‌ రీజెన్సీలో ఈ విషాదం చోటుచేసుకుంది. 

లుబుక్లింగావ్‌ నుండి జంబీ నగరం వైపు ప్రయాణిస్తున్న బస్సు నుండి హఠాత్తుగా నిప్పురవ్వలు రావడంతో, డ్రైవర్‌ అదుపు తప్పి వాహనాన్ని కుడివైపు మళ్లించారు. సరిగ్గా అదే సమయంలో ఎదురుగా వచ్చిన ఇంధన ట్యాంకర్‌ వేగంగా ఢీకొట్టడంతో, క్షణాల్లోనే రెండు వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి. మంటల తీవ్రతకు వాహనాలు పూర్తిగా కాలిపోయి, లోహపు తుక్కుగా మారాయి. మృతుల్లో బస్సు డ్రైవర్, 13 మంది ప్రయాణికులు, ట్యాంకర్‌ డ్రైవర్, క్లీనర్‌ ఉన్నారు. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు అంచనా. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement