శాకాహార బాడీబిల్డర్‌గా విదేశీయుడు..! ఏకంగా డబ్ల్యూహెచ్‌ఓ.. | bodybuilder from Israel living in India for 17 years shares his breakfast | Sakshi
Sakshi News home page

శాకాహార బాడీబిల్డర్‌గా విదేశీయుడు..! ఏకంగా డబ్ల్యూహెచ్‌ఓ..

May 6 2026 4:34 PM | Updated on May 6 2026 4:54 PM

bodybuilder from Israel living in India for 17 years shares his breakfast

మన హిందూ సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ ఈ విదేశీయుడిని చూస్తే నిజంగా నోటమాట రాదు. అతడి విధానం, ఆహార్యం అన్ని మనల్ని మంత్రముగ్ధల్ని చేస్తాయి. వామ్మో శారీర దృఢత్వాన్ని, ఆధ్యాత్మిక భక్తితో మిళితం చేసిన ఆ వ్యక్తిని చూస్తే.. సంభ్రమాశ్చర్యాలకు లోనవ్వడం ఖాయం. ఎందుకంటే..

ఇజ్రాయెలీలో జన్మించిన తమల్ కృష్ణ కృపా దాస్ 2009లో భారతదేశానికి వలస వచ్చినట్లు తెలిపారు. ఆయన ప్రస్తుతం పశ్చిమబెంగాల్‌లోని మాయాపూర్‌లో నివశిస్తున్నట్లు తెలిపారు. తాను భారత్‌కి వచ్చి ఇక్కడి హిందూ మతాన్ని అనుసరిస్తూ సనాతన ధర్మాన్ని పాటిస్తున్నట్లు తెలిపారు. అంతేగాదు తన వేషధారణ, ఆహారం తదితరాల గురించి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వీడియోని కూడా షేర్‌ చేశారు. ఆ వీడియోలో తమల్‌ తనకు పోషకాహారం అంటే కేవలం స్థూల పోషకాలే కాదని స్వచ్ఛత, 'భగవంతునికి సమర్పణ' అని చెప్పారు. 

తాను స్వచ్ఛమైన శాకాహార బాడీబిల్డర్‌నని చెప్పారు. తాను సనాతన ధర్మ అనుచరుడిగా అల్పాహారంగా ఏం తీసుకుంటాడో వివరించాడు. తమల్‌ తన రోజులో మొదటి భోజనాన్ని శుభ్రంగా ఉంచడంతో ప్రారంభిస్తాడు. ప్రతీదీ చాలా శుభ్రంగా కడుగుతూ తయారు చేసే విధానం అత్యంత ఆకట్టుకుంటుంది. ఎందుకంటే దుకాణంలో లేదా బయటి నుంచి వచ్చే ప్రతీదానిపై ఎలా దుమ్ము, బ్యాక్టీరియాలతో నిండి ఉంటుందో  సవివరంగా చెప్పాడు. 

పరిశుభ్రతకు మించి.. భోజనం కంటికి అందంగా, ఆధ్యాత్మికంగా ఆరోగ్యకరంగా కనిపించడమే ముఖ్యమని చెబుతుండటం విశేషం. మామిడి, నారింజ, బొప్పాయి, డ్రాగన్ ఫ్రూట్, ద్రాక్షలను చాలా అందంగా అమర్చిన విధానం గురించి వివరిస్తూ..దీనిని దేవునికి సమర్పిస్తున్నాం కాబట్టి చాలా అందంగా పరిశుభ్రంగా తయారు చేయాలని అంటున్నాడు. పెరుగుని చక్కగా తయారు చేయాలి. కప్పులలో గడ్డకట్టిన పెరుగు, పిస్తా అంటే చాలా ఇష్టమని అంటున్నాడు. 

అతడు ఒక్క ముద్ద కూడా తినకముందే పూజ చేసి ఆహారానని భగవంతుడికి నివేదిస్తాడు. తాను ఏం తయారు చేసినా.. భగవంతుడు దానిని స్వీకరించాలని ప్రార్థిస్తాను. అన్నింటికన్నా..ముఖ్యమైన విషయం ఆహారాన్ని తినేముందు భగవంతునికి సమర్పిస్తే ప్రసాదమవుతుంది. అది మనల్ని మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండేలా చేయండంలో సహాయపడుతుందని చెబుతున్నాడు. 

వేషధారణ..
తమల్ తన మెడలో పవిత్రమైన తులసి పూసలను, ధోవతిని (నడుముకు కట్టుకునే వస్త్రం), భుజంపై చాదర్‌ తదితరాలను ధరిస్తాడు. ఆ వస్త్రాలపై తరచుగా సంస్కృత మంత్రాలు లేదా 'హరే కృష్ణ' ముద్రలు ఉంటాయి. అతను ఎక్కువగా గుండు చేయించుకుని చిన్న శిఖతో కనిపిస్తాడు. 
ఆరోగ్యకరమైన ఆహారం వెనుకున్న శాస్త్రం..

డబ్ల్యూహెచ్‌ఓ కూడా..
తమల్ తీసుకునే పండ్లతో నిండిన అల్పాహారం ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సులకు అనుగుణంగా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, సమతుల్య అల్పాహారం ఒక వ్యక్తి రోజువారీ పోషకాహార అవసరాలలో దాదాపు 30 శాతాన్ని తీర్చుతుందట.

WHO మార్గదర్శకాల ప్రకారం: "అల్పాహారం రోజులో మొదటి భోజనం; అందువల్ల, సమతుల్యంగా ఉండేలా కేర్‌ తీసుకోవలి. కనీసం రెండు రకాల పదార్థాలు అందించాలి: ఒకటి ప్రధాన ఆహార పదార్థాలు, మరొకటి ప్రోటీన్. అందువల్ల అల్పాహారంలో కూరగాయలు, పండ్లు తప్పనిసరిగా చేర్చాలి." ఇక్కడ తమల్‌కు, అతని ఆధ్యాత్మిక సాధనతో బలపడిన ఈ పోషకాహార పునాది, అతని ప్రొఫెషనల్ బాడీబిల్డింగ్ కెరీర్‌కు చోదక శక్తిగా పనిచేస్తోంది.

 

(చదవండి: కుమారుడి ఊహించని సర్‌ప్రైజ్‌..! కన్నీళ్లు పెట్టుకున్న తల్లిదండ్రులు)

 

Advertisement
 
Advertisement
Advertisement