ముస్లిం ఓట్లన్నీ టీఎంసీకే : కాబోయే సీఎం సంచలన వ్యాఖ్యలు | Entire Muslim vote went to TMC will work for Hindus says Suvendu Adhikari | Sakshi
Sakshi News home page

ముస్లిం ఓట్లన్నీ టీఎంసీకే : కాబోయే సీఎం సంచలన వ్యాఖ్యలు

May 6 2026 1:03 PM | Updated on May 6 2026 1:16 PM

Entire Muslim vote went to TMC will work for Hindus says Suvendu Adhikari

నన్ను గెలిపించింది హిందువులే..టీఎంసీ ఖతం :  సువేందు అధికారి

 ఇక మమతా బెనర్జీ రాజకీయ సన్యాసం తీసుకోవాలి

పశ్చిమ బెంగాల్‌లో అఖండ విజయం తరువాత బీజేపీనేత కాబోయే ముఖ్యమంత్రిగా భావిస్తున్న సువేందు అధికారి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నందిగ్రామ్‌, భవానిపూర్, రెండింటిలోనూ విజయం సాధించిన తరువాత ముస్లిం ఓటర్లనుద్దేశించి  ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం కలవరం  రేపుతోంది.

నందిగ్రామ్‌లో తన గెలుపునకు హిందూ ఓటర్ల బలమైన మద్దతే కారణమని సువేందు అధికారి పేర్కొంటూ, తృణమూల్ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈసారి తాను దాదాపు పదివేల ఓట్ల తేడాతో ఎన్నికల్లో గెలిచాననీ,  ఇవన్నీ హిందువుల ఓట్లేనని  వారే తనను మళ్లీ గెలిపించారన్నారు.ఇది హిందుత్వ విజయం..అక్కడ ముస్లిం ఓట్లన్నీ టీఎంసీకే వెళ్లాయి,  కనుక తనకు  ఓటేసిన నందిగ్రామ్ హిందువుల కోసం పనిచేస్తానంటూ వ్యాఖ్యానించారు. 

 "హిందూ EVM అంటే బీజేపీ, ముస్లిం EVM అంటే TMC" అని అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యానించారు. ఇక మమతా రాజకీయ సన్యాసం  తీసుకోవాలిన, ఆమెను ప్రజలు తిరస్కరించారని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు  ఈ అవినీతి, కుటుంబ ఆధారిత పార్టీకి ఎలాంటి సిద్ధాంతం లేదు. టీఎంసీ 24 గంటల్లో నాశన మవుతుంది, అంతమైపోతుందన్నారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా మేనిఫెస్టోలో  హామీ ఇచ్చిన పనులను పూర్తి చేస్తామని హామీ వచ్చారు. 

 

కాగా గతంలో కూడ  బీజేపీ నినాదమైన 'సబ్కా సాథ్, సబ్కా వికాస్'ను పక్కనపెట్టి, "మనతో ఉండేవారికే మనం తోడుంటాం"(జో హమారే సాథ్, హమ్ ఉన్కే సాథ్) అనే నినాదాన్ని పాటించాలని పిలుపునిచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుండి వెళ్లగొడతామని, అలాగే "బంగ్లాదేశీ ముస్లిం చొరబాటుదారులను" తొలగించాలని ఆయన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 

ఇదీ చదవండి: 'దళపతి' 10th మార్క్స్‌ వైరల్‌, విజయ్‌ విద్యార్హత ఏంటి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement