breaking news
Jagtial
-
ప్రాణం తీసిన ప్రేమ పంచాయితీ!
క్రైమ్: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలో పట్టపగలు యువకుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన కలకలం రేపింది. ప్రేమ వ్యవహారం కారణంగానే ఈ హత్య జరిగినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కిషన్రావుపేట గ్రామానికి చెందిన చల్లూరి మల్లేశ్ (30) కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన ఒక యువతితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు. ఈ విషయంలో యువతి బంధువులు అనేకసార్లు మల్లేశ్‌కు నచ్చజెప్పారు. రెండు కుటుంబాల మధ్య గొడవలు, కొట్లాటలు జరిగాయి. ఈ క్రమంలో మల్లేశ్ జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. అతనిపై రౌడీషీట్ కూడా నమోదైంది. అయినప్పటికీ మల్లేశ్ ప్రవర్తనలో మార్పు రాలేదు. మల్లేశ్ గతంలో హార్వెస్టర్ నడిపించగా.. ఈ గొడవల నేపథ్యంలో హార్వెస్టర్ అమ్మేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. గురువారం ఉదయం కూడా మల్లేశ్ సదరు యువతి ఇంటికి వెళ్లి గొడవ చేసినట్లు సమాచారం. యువతి తండ్రికి ఫోన్ చేసి దుర్భాషలాడినట్లు తెలిసింది. ఈ క్రమంలో యువతి బంధువులు విసిగిపోయారు. ఇంటి నుంచి ద్విచక్రవానంపై బయలుదేరిన యువకుడిని వెంబడించి వెల్గటూర్ మండల కేంద్రంలోని పెద్దవాగుపై విచక్షణారహితంగా కొట్టి ఆటోలో తీసుకెళ్లి కోటిలింగాల రోడ్డులోని పాత వైన్స్ వెనకాల కత్తులతో పొడిచి చంపినట్లు స్థానికులు చెబుతున్నారు. మృతుడి తల్లిదండ్రులకు నలుగురు కూతుళ్లుకాగా మల్లేశ్ ఒక్కడే కుమారుడు. -
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి
జగిత్యాలటౌన్: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రజినీకాంత్ డిమాండ్ చేశారు. గురువారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. అధికారంలోకొస్తే విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని చెప్పి ఇప్పుడు నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. రూ.8వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరారు. విద్యాశాఖకు మంత్రి లేకపోవడంతోనే ఈ దుస్థితి నెలకొందన్నారు. సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించి వసతులు కల్పించాలని కోరారు. జిల్లాకేంద్రంలోని ఎస్కేఎన్ఆర్ జూనియర్ కళాశాలలో అదనపు గదులు, మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మించాలన్నారు. జిల్లా కన్వీనర్ చందు, రాకేష్, చంటి, నిఖిల్, అనూష, ప్రవళిక తదితరులు పాల్గొన్నారు. -
పల్లెల్లో స్థానిక సందడి
● జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాలు ఖరారు ● పెరిగిన రెండు ఎంపీపీ, రెండు జెడ్పీటీసీ స్థానాలు ● 1,123 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుజగిత్యాలరూరల్: స్థానిక సంస్థల ఎన్నికలు మూడు నెలల్లో పూర్తిచేయాలని హైకోర్టు ఆదేశాలు.. ఎంపీటీసీ, జెడ్పీటీసీల స్థానాల సంఖ్యను ప్రభుత్వం ఖరారు చేయడంతో గ్రామాల్లో ఎన్ని కల సందడి మొదలైంది. జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాలతోపాటు, పోలింగ్ కేంద్రాల వివరాలను కూడా గురువారం విడుదల చేయడంతో ఎన్నికల ప్రక్రియకు ప్రభుత్వ యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. 2024 జనవరి 31న సర్పంచ్, జూలై 4న ఎంపీటీసీల పదవీ కాలం ముగిసిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి పల్లెల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. జిల్లాలో 20 జెడ్పీటీసీ, 20 ఎంపీపీ స్థానాలు జిల్లాలో గతంలో 18 జెడ్పీటీసీ, 18ఎంపీపీ స్థానాలు ఉండేవి. కొత్తగా భీమారం, ఎండపల్లి మండలాలు ఏర్పాటు కావడంతో రెండు స్థానాలు పెరిగాయి. తాజాగా 20 జెడ్పీటీసీ, 20 ఎంపీపీ, 216 ఎంపీటీసీ స్థానాలకు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించనుంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికారులు ప్రక్రియ మొదలుపెట్టారు. జిల్లాలో ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్పీటీసీల పునర్విభజన ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. గతంలో జిల్లాలో 214 ఎంపీటీసీ స్థానా లు ఉండగా.. జగిత్యాల అర్బన్ మండలం ధరూ ర్ గ్రామంలో ఎంపీటీసీ 2వ స్థానం ఏర్పడింది. ఎండపల్లి మండలం ముంజంపల్లి గ్రామంలో మరో ఎంపీటీసీ స్థానాన్ని నూతనంగా ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం 216కు చేరింది. మొదలైన ఎన్నికల వేడి స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న నాయకుల్లో నూతన ఉత్తేజం నెలకొంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరుగనున్నాయి. జెడ్పీటీసీలు అందరు కలిసి జెడ్పీచైర్మన్‌ను ఎన్నుకోనుండగా.. ఎంపీటీసీలందరూ కలిసి ఎంపీపీని ఎన్నుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు జిల్లాల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేయనున్న నేపథ్యంలో ఎన్నికల కోలాహలం గ్రామాల్లో మొదలైంది. 42శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కోసం ఆర్డినెన్స్‌ను పంపించింది. గవర్నర్ ఆమోదం తర్వాత రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిచేసి ఎన్నికల హెడ్యూల్ విడుదల చేయనున్నారు. రిజర్వేషన్ల విషయం ఆందోళనకు గురిచేస్తున్నా.. స్పష్టత వచ్చాక ఎలా వ్యవహరించాలనే దానిపైనా అంచనాలు రూపొందించుకుంటున్నారు. మొత్తం గ్రామపంచాయతీలు 385 మొత్తం ఓటర్లు 6,02,236మొత్తం ఎంపీటీసీ స్థానాలు 216జెడ్పీటీసీ స్థానాలు 20ఎంపీపీ స్థానాలు 20ఎన్నికలకు సిద్ధం ప్రభుత్వ ఆదేశాల మేరకు జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాట్లు పూర్తి చేశాం. ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేస్తే సిద్ధంగా ఉన్నాం. జిల్లాలో గతంలో కంటే రెండు జెడ్పీటీసీ, రెండు ఎంపీపీ, రెండు ఎంపీటీసీ స్థానాలు పెరిగాయి. 1123 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల కోసం సిద్ధం చేశాం. గౌతంరెడ్డి, జెడ్పీ సీఈవో -
జంక్షన్ నాలాలను శుభ్రం చేయాలి
● అక్రమ నిర్మాణదారులకు నోటీసులు జారీ చేయాలి ● కలెక్టర్ సత్యప్రసాద్జగిత్యాల: అక్రమ నిర్మాణదారులకు నోటీసులు జారీ చేయాలని, జంక్షన్ నాలాలను ఎప్పటికప్పుడు శుభ్రపర్చాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జిల్లాకేంద్రంలోని పలు వార్డులను గురువారం పరిశీలించారు. మురికినీరు సక్రమంగా వెళ్తోందా లేదా గమనించారు. అక్రమ కట్టడాలు ఏమైనా ఉంటే నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. నీటి పారుదల శాఖ, రెవెన్యూ శాఖలు సమన్వయంతో అక్రమ కట్టడాలకు కోర్టు ద్వారా నోటీసులు జారీ చేయాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని మేజర్ జంక్షన్ నాలాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని ఆదేశించారు. ధరూర్ కెనాల్ వద్ద రోడ్డు ప్రమోషన్ అయిన దానిని పరిశీలించి పలు సూచనలు చేశారు. ముఖ్యంగా చింతకుంట చెరువు నీరు బయటకు వెళ్లేందుకు నాలాలను క్లీనింగ్ చేయడంతో పాటు చెట్లు, ముళ్ల పొదలను తొలగించాలన్నారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా వ్యర్థ నివారణ, డ్రెయినేజీలు, వాగులు ప్రభుత్వ భూములను శుభ్ర పర్చాలన్నారు. రామాలయం పక్కనున్న ప్రభుత్వ భూములైన పెద్దనాలా, ఎస్సారెస్పీ కాలువపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ప్రైవేటు భూముల యజమానులు తమ భూముల్లోని ముళ్ల చెట్ల పొదలను తొలగించకపోతే జరిమానాలు విధించి ఆ మొత్తం డబ్బుతో శుభ్రత చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు కన్పించేలా కార్యచరణ, పర్యవరణ పరిశుభ్రత చూడాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ స్పందన, నీటిపారుదల శాఖ ఈఈ ఖాన్, తహసీల్దార్ రాంమోహన్ పాల్గొన్నారు. -
బల్దియా గాడిన పడేనా..?
● ప్రక్షాళనకు అధికారుల శ్రీకారం ● వివిధ విభాగాల సిబ్బంది మార్పు ● అవినీతి ఆరోపణల నేపథ్యంలో నిర్ణయం ● తీరు మారాలంటున్న మున్సిపాలిటీ ప్రజలుజగిత్యాల: జిల్లాకేంద్రమైన జగిత్యాల మున్సిపాలిటీలోని ప్రతి విభాగంలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి విభాగంలో ఏళ్ల తరబడి పాతుకుపోయిన సిబ్బందిని ఇతర శాఖలకు మార్చుతూ చర్యలు తీసుకుంటున్నారు. ప్రతిశాఖలో పనిచేస్తున్న కొంత మంది సిబ్బంది అవినీతికి తెరలేపుతున్నట్లు ఆరోపణలు రావడం.. కొన్ని విభాగాల్లో అవినీతి యథేచ్ఛగా జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ సీరియస్‌గా తీసుకున్నారు. ము న్సిపాలిటీని గాడిలో పెట్టేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రత్యేకంగా సమావేశమై మున్సిపాలిటీలో ప్రతీదీ సక్రమంగా నిర్వహించేలా చూడాలని, ఎలాంటి అక్రమాలు జరిగినా సహించేది లేదని హెచ్చరించినట్లు సమాచారం. ఈ మేరకు అధికారులు ఏయే విభాగాల్లో ఏళ్ల తరబడి సిబ్బంది పాతుకుపోయారో గుర్తించి వారిని ఇతర సెక్షన్లకు బదిలీ చేస్తున్నారు. మున్సిపాలిటీలో అతి ముఖ్యమైన విభాగం రెవెన్యూ. ఈ విభాగంలోనే అత్యధికంగా ఆరోపణలు వచ్చాయి. ఇటీవల ఓ భూమికి సంబంధించిన కేసులో ఇక్కడ గతంలో పనిచేసిన కమిషనర్, ఆర్వో భూ వివాదంలో జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సంఘటన జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏడాది క్రితం టౌన్‌ప్లానింగ్ విభాగంలోని టీపీవో ఓ ఇంటి నిర్మాణానికి సంబంధించి లంచం తీసుకుంటుండగా ఏసీబీకీ చిక్కాడు. ఆయనతోపాటు ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి కూడా పట్టుబడ్డాడు. మరోవైపు శానిటేషన్ విభాగంలోనూ అనేక ఆరోపణలు వచ్చాయి. దీంతో అందులో పనిచేస్తున్న సిబ్బందిని ఇతర విభాగాలకు పంపించారు. శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న అధికారులను ఇంజినీరింగ్ సెక్షన్‌కు మార్పు చేశారు. ఇంజినీరింగ్ సెక్షన్లో పనిచేస్తున్న కొంత మందిని టౌన్‌ప్లానింగ్ విభాగానికి బదిలీ చేశారు. ఇలా ప్రతీశాఖలో కొన్నేళ్లుగా పనిచేస్తున్న వారిని గుర్తించి ప్రక్షాళన చేస్తున్నారు. పాతుకుపోయిన సిబ్బంది మున్సిపాలిటీలో కొందరు అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, రెగ్యులర్ ఉద్యోగులు ఏళ్ల తరబడి పనిచేస్తున్నారు. మున్సిపాలిటీలోని ప్రతి విభాగంలో ఏళ్ల తరబడి పనిచేయడంతో అందులో లొసుగులు తెలుసుకుని అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఎవరైనా ప్రజలు ఏ విషయంపైన దరఖాస్తు చేసుకుంటే దళారుల మధ్యనే కొనసాగుతున్నట్లు ఆరోపణలున్నాయి. కొందరు పారిశుధ్య విభాగానికి వెళ్లాల్సిన పీహెచ్ వర్కర్లు కూడా ఆఫీసులోనే తిష్ట వేసినట్లు ఆరోపణలున్నాయి. ప్రత్యేక దృష్టి మున్సిపాలిటీలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో శానిటేషన్‌పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఆఫీసుల్లో పనిచేస్తున్న పీహెచ్ వర్కర్లను వెంటనే విధుల్లోకి పంపించాలని ఆదేశించారు. మున్సిపాలిటీలో ఎలాంటి అవినీతి జరిగినా ఊరుకునేది లేదని హెచ్చరించినట్లు తెలిసింది. కీలకశాఖల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కొన్ని కీలక శాఖల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగులున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇటీవలే మున్సిపాలిటీకి సుమారు 69 మంది వార్డు ఆఫీసర్లు రావడంతో వారికి సైతం బాధ్యతలు అప్పగించినప్పటికీ మరిన్ని విభాగాల్లో సైతం కొనసాగుతున్నట్లు సమాచారం. వీరు పారిశుధ్య ప్రణాళిక అమలు, వ్యర్థాలను వేరు చేయించడం, మురికికాలువలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవడం, ప్రభుత్వ, ప్రైవేటు మార్కెట్లు, మటన్, చికెన్ స్టాండ్లు, కబేళాలు చక్కగా శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్లాస్టిక్ నియంత్రణ, హరితహారం, వీధిదీపాల పర్యవేక్షణ, నీటి సరఫరా పర్యవేక్షణ చాలా బాధ్యతలున్నాయి. వీటిని చేయడంతో పాటు, వార్డుల్లో మరిన్ని పనులను వారికి అప్పగిస్తున్నట్లు తెలిసింది. సిబ్బంది మార్పుతోనైనా పాలన గాడిన పడేనా అని స్థానికులు చర్చించుకుంటున్నారు. -
● లేకుంటే రైతులతో కలిసి ఉద్యమిస్తాం ● జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత
రాయికల్: ఎస్సారెస్పీ నుంచి వెంటనే నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని, లేకుంటే ఉద్యమిస్తామని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. మండలంలోని అల్లీపూర్లోగల ఎస్సారెస్పీ కెనాల్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. రైతు ప్రభుత్వమని చెప్పుకుంటున్నా.. రైతులు ఇబ్బంది పడుతుంటే ఏ ఒక్క నాయకుడికీ చలనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో కాలువలు, చెరువులు, కుంటలు జలకళ సంతరించుకుని రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా ఉండేదని గుర్తుచేశారు. ఆమె వెంట పార్టీ మండల అధ్యక్షుడు బర్కం మల్లేశ్, పట్టణ అధ్యక్షుడు ఎలిగేటి అనిల్, కో–ఆర్డినేటర్ తురగ శ్రీధర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ దొంతి నాగరాజు, ఏఎంసీ మాజీ చైర్మన్ ఎనగందుల ఉదయశ్రీ, నాయకులు రత్నాకర్‌రావు, మహేశ్‌గౌడ్, సాయికుమార్, మహేందర్, అనుమల్ల మహేశ్, జాన గంగాధర్, సాగర్‌రావు పాల్గొన్నారు. ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయండి -
● మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
ధర్మపురి: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దినేశ్ ఆధ్వర్యంలో గురువారం అభినందన సభ ఏర్పాటు చేశారు. మంత్రితోపాటు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. బీసీల రిజర్వేషన్లపై తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే ఉలుకుపలుకు లేదన్నారు. సామాజిక వర్గం బాగుకోసం అందరం కృషి చేయాలే తప్ప ప్రజల ఆగ్రహాలకు గురికావద్దని సూచించారు. బీసీల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గొప్పదని, బీసీలకు బీఆర్ఎస్ చేసిందేమిటో చెప్పాలని ఎమ్మెల్సీ అద్దంకి డిమాండ్ చేశారు. మాజీమంత్రి జీవన్‌రెడ్డి, పీసీసీ వైస్ ప్రెసిడెంట్ అనిల్, మినరల్ డెవలప్మెంట్ చైర్మన్ అనిల్, రుద్ర సంతోష్, నాయకులు తదితరులున్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ చారిత్రకం -
బ్యాంక్ ఖాతాలపై నజర్!
● మెటా సూత్రధారులు, నిర్వాహకుల అకౌంట్లపై ఆరా ● చొప్పదండిలో ఎన్ఆర్ఐల నుంచి భారీ వసూళ్లు ● ఇంకా ఫిర్యాదుకు వెనకాడుతున్న బాధితులు ● రాజకీయంగా ఒత్తిడి తెస్తున్న నలుగురు సీఐలుసాక్షి ప్రతినిధి, కరీంనగర్: మెటా క్రిప్టో కరెన్సీ పేరిట జరిగిన కుంభకోణంపై కేంద్ర, రాష్ట్ర నిఘా సంస్థలు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నాయి. మెటా ఫండ్ పేరిట దాదాపు రూ.100 కోట్ల వరకు జనాల నుంచి వసూలు చేసిన ఉదంతంలో సూత్రధారులు, నిందితులు, అనుమానితులపై కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు నిఘా పెంచాయి. మెటా ఫండ్‌లో దాదాపు రూ.100 కోట్ల వరకు వసూలు చేసిన సూత్రధారి లోకేశ్ దేశం దాటి థాయ్‌లాండ్ వెళ్లిన ఘటనలో అతన్ని కరీంనగర్‌కు పరిచయం చేసిన మాజీ కార్పొరేటర్, ప్రకాశ్ అనే ప్రైవేటు ఉపాధ్యాయుడు, రమేశ్, రాజు వివరాలను నిఘాసంస్థలు సేకరించాయి. వీరిలో కొందరిపై క్రిమినల్ హిస్టరీ, చెక్‌బౌన్స్ కేసులు ఉన్నట్లు గుర్తించాయి. వీరి బ్యాంక్ ఖాతాల వివరాలు సేకరిస్తున్నారు. మెటా ఫండ్ ప్రారంభానికి ముందు.. తరువాత వీరి బ్యాంకులో లావాదేవీల వివరాలు సేకరిస్తున్నారు. వీరితోపాటు మాజీ కార్పొరేటర్‌కు సన్నిహితంగా ఉండే బీజేపీ బడా నేత బ్యాంక్ ఖాతాలపైనా కేంద్రం సంస్థలు నిఘా పెట్టాయి. అనుమానాస్పద లావాదేవీలు ఏమైనా ఉన్నాయా? అని ఆరా తీస్తున్నాయి. చొప్పదండిలో ఎన్ఆర్ఐల విలవిల చొప్పదండి నియోజకవర్గంలో పలువురు చోటా బడా లీడర్లు క్రిప్టో వ్యవహారంలో చక్రం తిప్పుతున్నారు. గ్రామస్థాయి ప్రజాప్రతినిధులుగా కొనసాగుతూ.. అమాయకుల నుంచి రూ.లక్షలు వసూలు చేశారు. అందులో ఓ మాజీ ప్రజాప్రతినిధి చాలా తెలివిగా.. కేవలం ఎన్ఆర్ఐలనే లక్ష్యంగా చేసుకున్నాడు. మూడు నెలల్లో భారీ లాభాలు ఉంటాయని నమ్మబలికి రూ.కోట్లు వసూలు చేశాడు. తీరా ఇప్పుడు మెటాఫండ్ మూతబడటంతో వారంతా గగ్గోలు పెడుతున్నారు. వారంతా ఇండియాకు రాలేరు, ఇక్కడికి వచ్చి కేసులు గట్రా అంటే పాస్‌పోర్టు, వీసాలకు ఇబ్బందిగా మారుతుందని అతన్ని నిగ్గదీయాల్సింది పోయి.. బ్రతిమాలుకుంటుండటం విశేషం. ఈ బలహీనతతోనే నిర్వాహకులు రూ.కోట్లు కొల్లగొట్టినా దర్జాగా తిరగగలుగుతున్నారు. అదే సమయంలో ఉమ్మడి జిల్లాలో లాఅండ్ఆర్డర్లో పనిచేస్తున్న నలుగురు సీఐలు తమ బినామీలతో భారీగా డబ్బులు పెట్టారు. వారంతా ఇప్పుడు లోకేశ్ అతని మిత్రగణంపై రాజకీయంగా తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. కొత్తపల్లి పీఎస్, టూటౌన్, రూరల్ పరిధిలో పిటిషన్లు వచ్చినా పోలీసులు పట్టించుకోకపోవడంతో లోకేశ్ రూ.100 కోట్లతో థాయ్‌లాండ్ పారిపోయాడని బాధితులు వాపోతున్నారు. అప్పుడే స్పందించి ఉంటే లోకేశ్ దేశం దాటకుండా ఉండేవాడని వాపోతున్నారు. ఆయా ఠాణాల్లో ఫిర్యాదులు చేసిన పిటిషనర్లను ఇప్పటికై నా విచారిస్తే.. పెద్ద కుంభకోణం వెలికి తీసిన వారవుతారని సీనియర్ పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు. గోవాలో బెదిరింపులు వాస్తవానికి మెటా ఫండ్ నిర్వాహకుడిగా చెబుతున్న లోకేశ్ గతేడాది మాజీ కార్పొరేటర్‌తోపాటు రమేశ్, రాజు, ప్రకాశ్‌లను గోవా తీసుకెళ్లాడు. వీరందరినీ అక్కడ లోకేశ్ పదుల సంఖ్యలో బౌన్సర్లతో ప్రైవేటు గెస్ట్ హౌజ్‌లోకి తరలించాడు. అక్కడ వీరంతా మెటా కార్యకలాపాలు నిలిచిపోయాయి, లాభాలు రావడం లేదు, డబ్బులైనా వెనక్కి ఇవ్వాలని ఇన్వెస్టర్లు వేధిస్తున్నారని లోకేశ్‌ను నిలదీశారు. దానికి లోకేశ్ తీవ్రంగా స్పందించి.. నష్టాలకు మనమంతా బాధ్యులమేనని బాండ్ పేపర్లపై సంతకాలు పెడితే.. డబ్బులు ఇస్తానని బెదిరించే యత్నం చేశాడు. ఊరు కాని ఊరిలో పార్టీ అంటే వెళ్లిన వీరంతా అక్కడ లోకేశ్ బెదిరింపులకు దిగడంతో హతాశయులయ్యారు. తమను చంపినా తాము సంతకాలు పెట్టమని, పెడితే లీగల్‌గా ఇరుక్కున్న వారిమవుతామని అతనితో వాదించి ఎలాగోలా అక్కడ నుంచి బయటపడి కరీంనగర్‌కు చేరుకున్నారు. తీరా కరీంనగర్‌కు వచ్చాక.. తమకున్న పరిచయాలతో కేసులు కాకుండా అన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు. అదే సమయంలో బలహీనులను బెదిరింపులకు గురిచేస్తూ.. బలవంతులకు మాత్రం బాండ్ పేపర్లు, చెక్కులు రాసిస్తున్నారు. -
కొండగట్టు అభివృద్ధికి సహకరించండి
మల్యాల: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఆలయ ఈఓ శ్రీకాంత్‌రావు, స్థానాచార్యులు కపీంద్ర, ఉప ప్రధాన అర్చకులు లక్ష్మణప్రసాద్, చిరంజీవ స్వామి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆలయానికి వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్ కోసం అటవీ భూమి కేటాయించాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన బండి.. ఆలయ అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. వారి వెంట ఆలయ అధికారులు చంద్రశేఖర్, హరిహరనాథ్ పాల్గొన్నారు. నృసింహుడిని దర్శించుకున్న ఎమ్మెల్సీ దంపతులుధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామిని గురువారం ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ దంపతులు, బల్మూరి వెంకట్ దర్శించుకున్నారు. ముందుగా వారికి ఆలయం పక్షాన స్వాగతం పలికారు. అర్చకులు వేద మంత్రోచ్ఛరణల మధ్య పూజలు చేశారు. ఆలయ చైర్మన్ జక్కు రవీందర్, ఈవో శ్రీనివాస్ స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు అందించారు. రాయికల్ బల్దియాకు వన్‌స్టార్ రేటింగ్రాయికల్: స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్‌లో బల్దియా ఓడీఎఫ్ నుంచి ఓడీఎఫ్ ప్లస్‌గా గ్రేడింగ్ సాధించింది. రాష్ట్రస్థాయిలో 38వ ర్యాంక్‌తోపాటు, వన్‌స్టార్ రేటింగ్ పొందినట్లు మున్సిపల్ కమిషనర్ మనోహర్‌గౌడ్ తెలిపారు. పారిశుధ్య కార్మికులు, సిబ్బంది కృషితోనే ఈ గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు. ఆపరేటర్ సతీశ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. గ్రేడింగ్‌తో బల్దియాకు అదనపు నిధులు విడుదలవుతాయని తెలిపారు. పారిశుధ్య కార్మికులకు అందని రెయిన్కోట్లురాయికల్: రాయికల్ బల్దియాలో 24మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. వారికి వర్షాకాలంలో ప్రభుత్వం నుంచి రెయిన్కోట్లు, గ్లౌసులు ఇప్పటికీ చేయకపోవడంతో గొడుగు లు పట్టుకుని చెత్త సేకరిస్తున్నారు. ఏటా కార్మి కులకు ప్రభుత్వం నుంచి యూనిఫాం, సామగ్రి అందించాల్సి ఉంటుంది. కానీ ఏడాదిగా మంజూరు కాలేదు. మున్సిపల్ కమిషనర్ మనోహర్ స్పందించి కార్మికులకు రెయిన్కో ట్లు పంపిణీ చేయాలని కోరుతున్నారు. ఈ–పాస్ మిషన్ ద్వారా ఎరువులు విక్రయించాలిసారంగాపూర్: ఈ–పాస్ మిషన్ ద్వారానే రైతులకు ఎరువులు విక్రయించాలని జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్ అన్నారు. బీర్‌పూర్‌లోని సింగిల్‌విండో గోదాంలో ఎరువుల నిల్వలు, రి కార్డులు పరిశీలించారు. అక్కడున్న రైతులతో మాట్లాడారు. ఎరువులు సక్రమంగా అందుతున్నాయా.. తెలుసుకున్నారు. మండలంలోని ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. రైతులకు తప్పనిసరిగా రశీదు ఇవ్వాలని సూచించారు. ఆయన వెంట మండల వ్యవసాయాధికారి ప్రదీప్‌రెడ్డి, విండో సీఈవో అయ్యోరి తిరుపతి, ఏఈవో రాజ్‌కుమార్ ఉన్నారు. -
బీసీల ఆర్డినెన్స్ ఎన్నికల స్టంటే..
జగిత్యాల: బీసీల ఆర్డినెన్స్ కేవలం స్థానిక ఎన్నికల స్టంట్ మాత్రమేనని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. బీసీల పక్షాన నిలిచి న్యాయం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. రూ.వెయ్యి కోట్లు కేటాయించిందన్నారు. అన్ని కులాల వృత్తులకు ఊతమిచ్చిందన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఏం చేశారో చెప్పాలన్నారు. గంగపుత్రులు, రజక, నాయీబ్రాహ్మణులనూ మోసం చేస్తోందన్నారు. నాయకులు గంగాధర్, మల్లేశం, ప్రవీణ్‌గౌడ్, శంకర్, రాజన్న, మల్లారెడ్డి, గంగాధర్ పాల్గొన్నారు. -
పల్లైవెద్యం.. ఆరోగ్యం భద్రం
మెట్పల్లి రూరల్: గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. ఉచితంగా సేవలు అందుతుండడంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఒక్కో కేంద్రానికి ప్రతిరోజు సగటున 25 నుంచి 40 మందికి పైగా ప్రజలు వస్తున్నారు. ఈ కేంద్రాలతో దూర ప్రాంతాలకు వెళ్లే ఇబ్బందులు తప్పాయని, ఆర్థిక భారం తగ్గిందని గ్రామీణులు చెబుతున్నారు. 14 రకాల వైద్య పరీక్షలు.. 106 రకాల మందులు ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల్లో పలు రకాల వైద్య పరీక్షలు చేయడంతో పాటు మందులు ఉచితంగా అందిస్తున్నారు. మెట్పల్లి మండలంలో 23 గ్రామాలు ఉన్నాయి. ఇందులో వేంపేట, వెల్లుల, మెట్లచిట్టాపూర్, కొండ్రికర్ల, ఆత్మకూర్ గ్రామాల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాలకు వైద్య సేవల కోసం చుట్టుపక్క గ్రామ ప్రజలు కూడా వస్తున్నారు. రక్తం, మూత్ర పరీక్షలతోపాటు మరో 14 రకాల వైద్య పరీక్షలు చేస్తున్నారు.ర్యాపిడ్ కిట్ల ద్వారా అక్కడే పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు.. ఫలితాన్ని వెంటనే చెబుతున్నారు. నిర్ధారణ అయిన రోగానికి చికిత్స అందిస్తూ.. 106 రకాల మందులు ఇస్తున్నారు. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారి ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చూసుకుంటున్నారు. గతంలో ఈ ఆరోగ్య కేంద్రాల్లో ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు మాత్రమే ఉండేవారు. 2022–23 ఈ కేంద్రాలను ప్రభుత్వం ఆప్‌గ్రేడ్ చేసి వైద్య సదుపాయాలను మెరుగుపరిచేందుకు వైద్యులను నియమించింది. ఎంబీబీఎస్, బీఏఎంఎస్, నర్సింగ్ ఆఫీసర్ల్ను కేంద్రాలకు పంపించింది. ప్రస్తుతం వారంతా కేంద్రాల్లో నిత్యం అందుబాటులో ఉంటూ వైద్యసేవలు అందిస్తున్నారు. ఎన్‌క్వాస్ గుర్తింపు గతంలో మెట్పల్లి మండలం ఆత్మకూర్ ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రానికి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. జాతీయ నాణ్యత హామీ ప్రమాణాల గుర్తింపు (నేషనల్ క్వాలిటీ ఎష్యూరెన్స్ స్టాండర్డ్స్–ఎన్‌క్వాస్) వరించింది. వైద్య సేవలు, పరిశుభ్రత, పచ్చదనం, రోగుల సంతృప్తి స్థాయి, ఆసుపత్రికి వచ్చే వారి పట్ల సిబ్బంది మెలిగే తీరు, క్షేత్రస్థాయిలో అందుతున్న సేవలపై కేంద్ర బృందం ఆరా తీసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా 84 శాతం గ్రేడ్ పాయింట్ల చోటు కల్పించింది. సొంత భవనాలు పూర్తయితే మేలు.. ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలకు పలుచోట్ల సొంత భవనాలు లేక ఇతర భవనాల్లో నిర్వహిస్తున్నారు. నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయి. పనుల్లో జాప్యం జరుగుతోంది. కొత్త భవన నిర్మాణాలు పూర్తయితే మరిన్ని సౌకర్యాలు కల్పించడంతోపాటు వైద్య సేవలను పెంచవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన సేవలు ఎంబీబీఎస్, బీఏఎంఎస్, నర్సింగ్ వైద్యులు ఉచితంగా వైద్య పరీక్షలు, మందులు పంపిణీ సేవలపై సంతోషం వ్యక్తం చేస్తున్న ప్రజలు -
ప్రమాదమని తెలిసినా..
గురువారం శ్రీ 17 శ్రీ జూలై శ్రీ 2025జగిత్యాల: అధికారులకు పట్టింపులేకపోవడం, స్కూల్ యాజమాన్యాలు శ్రద్ధ చూపకపోవడంతో విద్యార్థులు ఆటోలు, వ్యాన్లలో ప్రమాదకరస్థితిలో స్కూళ్లకు వెళ్తున్నారు. ఆటోలు, వ్యాన్ల డ్రైవర్లు కొందరు సామర్థ్యానికి మించి విద్యార్థులను తరలిస్తున్నారు. జిల్లాకేంద్రంలో ఈ పరిస్థితి విపరీతంగా ఉంది. ఏదైనా అనుకోకుండా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారో అధికారులకే తెలియాలి. పైగా కొన్ని ఆటోలు, వ్యాన్లు కాలం చెల్లినవి కావడంతో పిల్లలకు ప్రమాదం పొంచి ఉంది. ఈ విషయంలో అధికారులతోపాటు తల్లిదండ్రులు కూడా పిల్లల భద్రతపై స్పందించాల్సిన అవసరం ఉంది. న్యూస్‌రీల్ -
ఎమ్మెల్యే వర్సెస్ మాజీమంత్రి
● మంజూరు పత్రాల పంపిణీలో గందరగోళంజగిత్యాలరూరల్: జగిత్యాల రూరల్ మండలంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బుధవారం నామమాత్రంగా పట్టాల పంపిణీ చేపట్టారు. నియోజకవర్గంలో ఇందిరమ్మ కమిటీల్లో ఒక్కో గ్రామానికి ఆరుగురు సభ్యులను నియమించారు. ఇదులో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ వర్గంలో ముగ్గురు, మాజీమంత్రి జీవన్‌రెడ్డి వర్గంలో ముగ్గురికి కమిటీలో చోటు కల్పించారు. అయితే బుధవారం పంపిణీ చేసిన ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో అధికారులు ఎమ్మెల్యే నియమించిన కమిటీ సభ్యులకు మాత్రమే సమాచారం అందించారు. కార్యక్రమానికి 10 నిమిషాల ముందు జీవన్‌రెడ్డి వర్గ కమిటీ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో వారంతా ఎంపీడీవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మోతె గ్రామంలో ఎమ్మెల్యే నియమించిన కమిటీ సభ్యులు ఎంపిక చేసిన వారికి మంజూరు పత్రాలు రాగా.. మాజీమంత్రి జీవన్‌రెడ్డి నియమించిన కమిటీ సభ్యులు సూచించిన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు రాకపోవడంపై కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కమిటీ సభ్యులకు సకాలంలో సమాచారం ఇవ్వకపోవడంపై ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శులపై కమిటీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకటి రెండు రోజుల్లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. -
వైద్య సేవలు బాగున్నాయి
ఆరోగ్యం బాగాలేనప్పుడు ఊరిలోని దవాఖానాకు వస్తా. ఇక్కడ పరీక్షలు చేసి అందుకు తగిన మందులు ఉచితంగా ఇస్తున్నారు. వైద్య సేవలు బాగున్నాయి. మా ఊళ్లోని చాలా మంది కూడా ఇక్కడికే వచ్చి డాక్టర్‌కు చూయించుకుంటున్నారు. – లక్ష్మీనారాయణ, మెట్లచిట్టాపూర్ మంచి వైద్యం అందిస్తున్నాం ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలను మెరుగ్గా అందిస్తున్నాం. అనారోగ్య సమస్యలు ఉన్న వారు చాలా మంది కేంద్రాలకు వస్తున్నారు. వారికి కావాల్సిన చికిత్స చేయడంతోపాటు ఉచితంగా మందులు అందజేస్తున్నాం. – ఎలాల అంజిత్‌రెడ్డి, వైద్యాధికారి -
సీఎంఆర్ అప్పగింతలో జాప్యం
జగిత్యాలరూరల్: రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగించి. తిరిగి మిల్లర్ల నుంచి సీఎంఆర్ రూపంలో సేకరిస్తుంది. బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగిస్తుంది. అయితే జిల్లాలో మిల్లర్లు ప్రభుత్వం నుంచి తీసుకున్న ధాన్యానికి సంబంధించిన బియ్యాన్ని మాత్రం తిరిగి అప్పగించలేదు. జాప్యం చేస్తున్న మిల్లర్లపై చర్యలు తీసుకునేందుకు అధికార యంత్రాంగం వెనుకడుగువేస్తోంది. బియ్యం అప్పగించకుండా జాప్యం చేస్తున్న మిల్లులకు ఇటీవల సివిల్సప్లై అధికారులు ధాన్యం కేటాయించలేదు. అయితే రాజకీయ ఒత్తిడి తెచ్చి ధాన్యం కేటాయించుకున్నారు. జిల్లాలో ప్రభుత్వానికి ఈనెల 27 వరకు 28 మంది రైస్‌మిల్లర్లు 25,448 మెట్రిక్ టన్నుల బియ్యం అప్పగించాల్సి ఉంది. ఇప్పటి వరకు 55 మంది రైస్‌మిల్లర్లు 100 శాతం బియ్యాన్ని అప్పగించారు. 2023–24కు ధాన్యం కేటాయింపు జిల్లాలో 2023–24కు గాను యాసంగిలో ప్రభుత్వం 4,05,477 టన్నుల ధాన్యం సేకరించింది. దానిని 23 మంది రైస్‌మిల్లర్లకు కేటాయించగా ఇప్పటివరకు 2,75,349 టన్నుల బియ్యం అప్పగించాల్సి ఉండగా.. 2,49,901 టన్నులు అప్పగించారు. ఇప్పటివరకు 55 మంది రైస్‌మిల్లర్లు 100 శాతం బియ్యాన్ని అప్పగించగా.. 28మంది రైస్‌మిల్లర్లు 25,448 టన్నుల బియ్యాన్ని అప్పగించాల్సి ఉంది. ఈనెల 27 వరకు అప్పగించకపోతే డిఫాల్టర్లుగా ప్రకటించే అవకాశం ఉంది. డిఫాల్టర్లుగా తేలిన మిల్లర్లకు వచ్చే సీజన్లో ధాన్యం కేటాయించరు. బియ్యం అప్పగించేలా చూస్తున్నాం – జితేంద్రప్రసాద్, డీఎం ప్రభుత్వ ఆదేశాల మేరకు 55 మంది రైస్‌మిల్లర్లు వందశాతం బియ్యం అప్పగించారు. మరో 28 మంది ఈనెల 27 వరకు 25,448 టన్నుల బియ్యం అప్పగించాల్సి ఉంది. కలెక్టర్, అదనపు కలెక్టర్ మిల్లర్లతో సమావేశమై బియ్యం అప్పగించేలా చర్యలు చేపడుతున్నారు. మిల్లర్ల వద్ద 25,448 టన్నుల ధాన్యం బియ్యం అప్పగింతకు ఈనెల 27చివరి తేదీ -
వెనుకబడిన వర్గాలకు అండగా కాంగ్రెస్
జగిత్యాలటౌన్: సామాజికంగా వెనుకబాటుకు గురవుతున్న వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని, అందులో భాగంగానే బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిందని మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఇందిరాభవన్‌లో బుధవారం విలేకరులతో మాట్లాడారు. 42శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపి వంద రోజులు దాటిందని గుర్తు చేశారు. కేంద్రం తాత్సారం చేస్తుండటంతో ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిందన్నారు. బీసీ బిల్లుకు మద్దతు తెలిపిన బీజేపీ రాష్ట్ర నాయకులు కేంద్రంలోని తమ ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించాలన్నారు. ఏ బిల్లుౖపైనెనా మూడు నెలల్లో రాష్ట్రపతి నిర్ణయం తీసుకోకుంటే అది అమలు అయినట్టేనన్న సుప్రీంకోర్టు తీర్పును గుర్తు చేశారు. నాయకులు బండ శంకర్, గాజుల రాజేందర్, గాజంగి నందయ్య, ధర రమేష్, పిప్పరి అనిత, ముంజాల రఘువీర్, గుండ మధు, లైశెట్టి విజయ్, నేహాల్ తదితరులు ఉన్నారు. -
అసంపూర్తిగా వంతెన పనులు
రాయికల్: మండలంలోని రామాజీపేట బతుకమ్మ వాగు, మైతాపూర్ గ్రామాల మధ్య హైలెవల్ వంతెన నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉండటంతో వర్షకాలంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మైతాపూర్ వంతెన నిర్మాణం కోసం రూ.2.91 కోట్లు, రామాజీపేట వంతెన నిర్మాణం కోసం రూ.1.40 కోట్లు మంజూరైనప్పటికీ కాంట్రాక్టర్‌కు సకాలంలో బిల్లులు రాకపోవడంతో రెండేళ్లుగా పనులు నిలిచిపోయాయి. వంతెన నిర్మాణానికి సైడ్‌వాల్స్, బీటీరోడ్డు నిర్మాణం వంటి పనులను నిలిపివేశారు. చేసిన పనులల్లో సైతం నాణ్యత లోపించడంతో కంకర తేలుతోంది. ఈ వంతెన మీదుగా ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తరుచూ ప్రయాణం చేస్తున్నా.. పనులపై మాత్రం చొరవ చూపించడం లేదని ప్రజలు అంటున్నారు. ఆర్అండ్బీ అధికారులు స్పందించి యుద్ధప్రతిపాదికన అన్ని పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వాహనదారులకు ఇబ్బందులు పట్టించుకోని ఆర్అండ్బీ అధికారులు -
మోటార్లకు కెపాసిటర్లు బిగించుకోవాలి
కథలాపూర్: రైతులు తమ వ్యవసాయ మోటార్లకు కెపాసిటర్లు బిగించుకోవాలని ట్రాన్స్‌కో ఎస్ఈ సుదర్శనం అన్నారు. మండలకేంద్రంలో ట్రాన్స్‌కో అధికారులు పొలంబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. మోటార్ల వద్ద ఇనుపడబ్బాలు కాకుండా ఫైబర్‌వి బిగించుకోవాలన్నారు. ఇనుప డబ్బాలతో విద్యుత్ షాక్ వచ్చే ప్రమాదముందన్నారు. సిరికొండ శివారులో నిర్మిస్తున్న 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను పరిశీలించారు. త్వరగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. ట్రాన్స్‌కో టెక్నికల్ డీఈ గంగారాం, మెట్పల్లి డీఈ మధుసూదన్, ఏడీఈ రఘుపతి, ఏఈలు దివాకర్‌రావు, భూమేశ్వర్, సబ్ ఇంజినీర్ నవీన్ పాల్గొన్నారు. విద్యుత్ ప్రమాదాలు తగ్గించాలి కోరుట్ల రూరల్: విద్యుత్ ప్రమాదాల నివారించి.. మెరుగైన విద్యుత్ సరఫరా చేయాలని ఎస్ఈ అన్నారు. పట్టణంలో కోరుట్ల, మేడిపెల్లి, కథలా పూర్ మండలాల విద్యుత్ సిబ్బందితో బుధవారం సమీక్షించారు. ప్రమాదాలు పొంచి ఉన్న ప్రాంతాలను గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ట్రాన్స్‌కో ఎస్ఈ సుదర్శనం -
పోచమ్మకు బోనాలు
జగిత్యాలటౌన్: జిల్లాకేంద్రంలో మేరు సంఘం మహిళలు బుధవారం పోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించారు. శోభాయాత్రలో పోతురాజుల విన్యాసాలు, ఒగ్గుడోలు కళాకారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. మేరు సంఘం మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్‌కు కుక్కలుమెట్పల్లి: పట్టణంలోని 19, 24, 26వార్డుల్లో బుధవారం యానిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వీధి కుక్కలను పట్టుకున్నారు. సుమారు 20కుక్కలకు ఏడో వార్డులో ఉన్న యానిమిల్ బర్త్ కంట్రోల్ సెంటర్‌కు తరలించారు. అక్కడి వాటికి శస్త్ర చికిత్స చేయించి తిరిగి వదిలిపెడుతామని ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ విష్ణు తెలిపారు. కుక్కల నియంత్రణలో భాగంగా నెలరోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. పండ్ల తోటలపై ఆసక్తి పెంచుకోవాలిధర్మపురి: రైతులు వరికి ప్రత్యామ్నాయంగా పండ్ల తోటలపై ఆసక్తి పెంచుకోవాలని డీఆర్డీవో రఘునందన్ అన్నారు. మండలంలోని జైన, మగ్గిడి గ్రామాల్లో బుధవారం పర్యటించారు. రెవెన్యూ, కమ్యూనిటీ ప్లాంటేషన్లను పరిశీలించారు. వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మొక్కలు నాటేందుకు అనువైన స్థలాలను ఎంచుకోవాలన్నారు. వడ్డీలేని రుణాలపై అవగాహన కల్పించాలని, మహిళాసంఘాల సభ్యులు వా టిని వినియోగించుకునేలా చూడాలని సూచించారు. ఎంపీడీవో రవీందర్, ఏపీవో సుజన్, హెచ్ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 222 మంది ఉపాధ్యాయుల సర్దుబాటుజగిత్యాల: ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందించాలన్న ఉద్దేశంతో ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో మొత్తం 222 మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండి ఉపాధ్యాయులు లేని చోట కొత్తవారిని నియమించామని డీఈవో రాము తెలిపారు. కొంతమంది పోస్టింగ్ ఉన్న చోటే ఉంటామని, తాము వెళ్లలేమని చెప్పినట్లు తెలిసింది. అనారోగ్య కారణాలతో కొందరు సర్దుబాటును వ్యతిరేకిస్తున్నారని సమాచారం. 27న జగిత్యాలకు మంద కృష్ణ జగిత్యాలటౌన్: ఆసరా పింఛన్లు పెంచాలనే డిమాండ్‌తో ఆగస్టు 13న హైదరాబాద్‌లో నిర్వహించతలపెట్టిన వికలాంగుల మహాగర్జన సభను విజయవంతం చేసే లక్ష్యంతో ఈనెల 27న జిల్లా కేంద్రంలో సన్నాహక సదస్సు ఉంటుందని, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ హాజరు కానున్నారని జిల్లా అధ్యక్షుడు దుమాల గంగారాం తెలిపారు. సదస్సును విజయవంతం చేయాలని వికలాంగులను కలిసి ఆహ్వానించారు. -
‘ఇందిరమ్మ’ పనుల్లో వేగం పెంచాలి
మల్లాపూర్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు త్వరగా నిర్మాణాలు చేపట్టాలని, వారికి అన్ని విధాలా ప్రోత్సాహం అందించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మండలంలోని చిట్టాపూర్‌లో నిర్మాణ పనులను బుధవారం పరిశీలించారు. గడువులోపు నిబంధనల మేరకు పనులు పూర్తి చేసుకునేలా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. లబ్ధిదారులతో మాట్లాడి ఇబ్బందులున్నాయా అని ఆరా తీశారు. గ్రామపంచాయతీ, హెల్త్ సబ్ సెంటర్ పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. సాతారం, సిరిపూర్‌లో పర్యటించారు. ‘పది’ ఫలితాల్లో జిల్లా ముందుండాలి పదో తరగతి ఫలితాల్లో జిల్లాను మొదటిస్థానంలో నిలిపేలా విద్యార్థులను ఇప్పటి నుంచే సన్నద్ధం చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. సాతారం పాఠశాలలో విద్యాబోధన, డిజిటల్ తరగతులపై అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన బోధన అందించాలని, వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఆయన వెంట మెట్పల్లి ఆర్డీవో శ్రీనివాస్, హౌసింగ్ పీడీ ప్రసాద్, తహసీల్దార్ రమేశ్‌గౌడ్, ఎంపీడీవో శశికుమార్‌రెడ్డి, ఎంపీవో జగదీష్ పాల్గొన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ -
మంచి అవకాశం
జగిత్యాల సహకార సంఘానికి ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్‌గా గుర్తింపు రావడం మంచి పరిణామం. నాబార్డు నిధులు అందించే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులకు సేవలు అందించే అవకాశం ఉంటుంది. – పత్తిరెడ్డి మహిపాల్ రెడ్డి, సొసైటీ చైర్మన్, జగిత్యాల అభివృద్ధికి ఆస్కారం జిల్లాలోని 16 సహకార సంఘాలను ఎఫ్పీఓలుగా గుర్తించారు. ఎఫ్పీఓలకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నందున రాబోయే రోజుల్లో అత్యధిక నిధులు విడుదల చేసే అవకాశం ఉంటుంది. – మనోజ్‌కుమార్, జిల్లా సహకార అధికారి -
పరిశోధనలు కేరాఫ్ పొలాస
జగిత్యాలఅగ్రికల్చర్: జగిత్యాలరూరల్ మండలంలోని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం వ్యవసాయ పరిశోధనలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఇక్కడి శాస్త్రవేత్తలు వరిలో కొత్తకొత్త రకాలను రూపొందిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 500 రకాలపై పరిశోధనలు చేస్తున్నారు. కొత్త విత్తనాల ఆవిష్కరణలో భాగంగా వాటి రకం..? దిగుబడి ఎలా ఉంటుంది..? తెగుళ్లను ఎలా తట్టుకుంటుంది..? అనే విషయాలను పరిశీలిస్తుంటారు. దేశంలోని 500 వరి రకాలపై దేశంలోని వ్యవసాయ యూనివర్సిటీల నుంచి సేకరించిన దాదాపు 500 వరి రకాలపై పొలాసలో పరిశోధనలు చేస్తున్నారు. ఆయా రాష్ట్రాల నుంచి సేకరించిన విత్తనాలను నారుగా పోసి.. ఒక్కో పంటకాలాన్ని పరీక్షిస్తుంటారు. ఆయా రకాలను ఒక్కో చదరపు మడిలో నాటు వేస్తారు. ఏ రకం విత్తనం దిగుబడి ఎక్కువగా ఇస్తుంది..? ఏ రకం విత్తనం చలి, తెగుళ్లను తట్టుకోవడం లేదు..? తదితర విషయాలను శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా పరిశీలిస్తుంటారు. అలాగే ఏ రకం విత్తనాన్ని మరే రకం విత్తనంతో సంకరీకరణం చేసి అధిక దిగుబడినిచ్చే కొత్త రకం విత్తనాన్ని తయారు చేయవచ్చనే అంశంపై ప్రతిరోజు శాస్త్రవేత్తలు పరిశీలిస్తుంటారు. ఏ రకంలో తాలు గింజలు ఎక్కువగా వచ్చాయి..? గింజల బరువు ఎలా ఉంటుంది..? అనే విషయాలపై ప్రత్యేకంగా నివేదిక తయారు చేసి, ఆయా శాస్త్రవేత్తలతో చర్చిస్తుంటారు. చాలా జాగ్రత్తగా పరిశీలన ఉదాహరణకు: పశ్చిమబెంగాల్లో అధిక దిగుబడి వచ్చిన విత్తనంలో.. ఇక్కడ ఎలాంటి దిగుబడులు వచ్చాయి..? ఇక్కడి వాతావరణాన్ని ఏ మేరకు తట్టుకుంటుంది..? అనే విషయాలను తెలుసుకుంటారు. ప్రధానంగా ఇక్కడి వాతావరణాన్ని తట్టుకున్న రకాలపై మళ్లీ రకరకాల పరిశోధనలు చేస్తుంటారు. ఒక రకం విత్తనం మరో రకం విత్తనంతో కలవకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. చివరి పుప్పొడి నుంచి గింజ దశకు మారే సమయంలో కవర్లు చుడుతుంటారు. గాలికి ఒక రకం పుప్పొడి మరో రకంపై పడకూడదని అలా చేస్తుంటారు. నారు పోసే సమయంలో గుర్తులు.. నారు పోసే సమయంలో గింజలు మట్టిలో వేసిన తర్వాత కట్టెను పాతి దానిపై ఓ గుర్తు(అంకెలు) పెట్టుకుంటారు. నారు పెరిగిన తర్వాత ఏరకమో తెలుసుకునేందుకు ఇలా చేస్తుంటారు. కొన్ని రకాల గింజలు నల్లగా.. మరికొన్ని రకాల గింజలు తెల్లగా.. ఇంకొన్ని గోధుమ రంగులోనూ ఉంటాయి. ఆయా రకాల గింజలు దొడ్డుగా ఉంటున్నాయా..? సన్నగా ఉంటున్నాయా..? మధ్యస్థంగా ఉంటున్నాయా..? అనే విషయాలు తెలుసుకుంటారు. శాస్త్రవేత్తలు రోజువారీ డైరీలో భాగంగా ప్రతి విత్తనం లక్షణాలను రాసుకుంటారు. పంట కోత కోసిన తర్వాత ఏ రకం గింజలను ఆ రకం ప్యాకెట్లలో భద్రపరుస్తారు. అవి మూల విత్తనంగా పనిచేస్తాయని వరి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వివిధ రకాల పరిశోధనల అనంతరం అన్ని తెగుళ్లు, పురుగులను తట్టుకునే విత్తనాలను తయారు చేస్తారు. వరి రకాలపై శాస్త్రవేత్తల పరిశోధనలు పకడ్బందీగా విత్తనాల రూపకల్పన విత్తనాల రూపకల్పనకు కేరాఫ్ పొలాస వరి రకాల రూపకల్పనకు కేరాఫ్‌గా పొలాస పరిశోధన స్థానం నిలుస్తోంది. ఇక్కడ అన్ని రకాల విత్తనాలను పరిశీలించిన తర్వా త ఏ రకం విత్తనాన్ని మరే రకం విత్తనంతో సంకరీకరణం చేస్తే అధిక దిగుబడినిచ్చే కొత్త రకం విత్తనం వస్తుందో చూస్తాం. – హరీశ్‌కుమార్ శర్మ, పరిశోధన స్థానం డైరెక్టర్ ఎలాంటి రకమో తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా అన్ని రకాల విత్తనాలు సేకరించి ముందుగా పరిశోధన స్థానంలో నాటుతాం. ఒక పంటకాలంపాటు పరీక్షిస్తాం. ఆ రకం విత్తనాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయనే విషయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తాం. మన వాతావరణాన్ని ఆయా రాష్ట్రాల విత్తనాలు ఎలా తట్టుకుంటున్నాయనే విషయాలు కూడా తెలుసుకుంటాం. – శ్రీనివాస్, వరి శాస్త్రవేత్త, పొలాస -
గంజాయి విక్రయిస్తున్న యువకుడి అరెస్ట్
కొడిమ్యాల: కొడిమ్యాల మండలంలోని అప్పారావుపేట సమీపంలో అనుమానాస్పదస్థితిలో కనిపించిన ఓ యువకుడిని ఎస్సై సందీప్ తన సిబ్బందితో అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద తనిఖీలు చేయగా.. 125 గ్రాముల గంజాయి పట్టుబడింది. నిందితుడిని పూడూరు గ్రామానికి చెందిన మొట్ట రమేశ్గా గుర్తించారు. నాగపూర్‌లో గుర్తు తెలియని వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసినట్లు నిందితుడు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. గ్రూప్స్‌కు ఉచిత శిక్షణకరీంనగర్: కరీంనగర్ జిల్లా బీసీ స్టడీ సర్కిల్లో గ్రూప్– 1, గ్రూప్– 2, గ్రూప్– 3, గ్రూప్– 4, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ల పరీక్షలకు ఉచిత కోచింగ్‌ను ఆగస్టు 25నుంచి ప్రారంభించనున్నట్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ మంతెన రవికుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 150 రోజుల పాటు నిర్వహించనున్న ఈ కోచింగ్‌లో ఎంపికై న అభ్యర్థులకు నెలకు రూ.1000 స్టైఫండ్ అందిస్తామన్నారు. అర్హులైన ఉమ్మడి కరీంనగర్ జిల్లా (జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్) నిరుద్యోగ భ్యర్థులు సంబంధిత వెబ్సైట్లో ఈ నెల 16 నుంచి ఆగస్టు 11 వరకు దరఖాస్తు చేసుకోవాలని డైరెక్టర్ సూచించారు. అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి తల్లిదం డ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతంలో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల లోపు కలిగి ఉండాలన్నారు. డిగ్రీలో అత్యధికశాతం మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎంపిక విధానం ఉంటుందన్నారు. వివరాలకు ఫోన్ నంబరు 0878–2268686ను సంప్రదించాలని సూచించారు. బైక్ నుంచి రూ.లక్ష చోరీ సుల్తానాబాద్(పెద్దపల్లి): బైక్‌లో ఉంచిన రూ.లక్ష నగదును దొంగలు చోరీ చేశారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. గట్టెపల్లి గ్రామానికి చెందిన బండ నర్సయ్య సుల్తానాబాద్ పట్టణంలోని ఎస్పీఐ నుంచి రూ.లక్ష డ్రా చేసుకున్నాడు. ఆ సొమ్మును బైక్‌లో పెట్టుకుని ఫెర్టిలైజర్ దుకాణంలో యూరియా కొనుగోలు చేశాడు. ఆ తర్వాత పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లి పెట్రోల్ పోయించాడు. ఆయా ప్రాంతాల్లో ఫోన్ పే ద్వారా చెల్లింపులు చేశాడు. అయితే, యూరియా కొనుగోలు చేసే సమయంలో తన ద్విచక్ర వాహనం కొంతదూరంలో ఉందని, ఇంటికి వెళ్లి అప్పు తీర్చేందుకు వాహనంలోంచి డబ్బులు తీసేందుకు యత్నింగా కనిపించలేదని బాధితుడు లబోదిబోమన్నాడు. ఈ విషయాన్ని బ్యాంకు అధికారులకు సంప్రదిస్తే.. సీసీ ఫుటేజీ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అనంతరం బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
గడ్డిమందు తాగి వ్యక్తి ఆత్మహత్య
కోరుట్లరూరల్: పట్టణానికి చెందిన అరిసె గంగ నర్సయ్య (59) సోమవారం రాత్రి గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్సై చిరంజీవి తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం అరిసె గంగనర్సయ్యకు మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో తలకు దెబ్బ తగలడంతో అప్పటినుంచి మతి మరుపుతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి గడ్డి మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించగా కుటుంబసభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. మృతుడి కుమారుడు అరిసె రాజేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్టు ఎస్సై చిరంజీవి తెలిపారు. విద్యుత్ షాక్‌తో కార్మికుడు మృతిమెట్పల్లి: పట్టణంలోని ఆరపేట శివారులో మిషన్ భగీరథ పైపులైన్ పనుల వద్ద కరెంట్ షాక్ తగిలి బయ్యని నవీన్‌కుమార్ (28) అనే కార్మికుడు మృతి చెందాడు. ఎస్సై కిరణ్‌కుమార్ కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా సర్జల్పూర్కు చెందిన నవీన్‌కుమార్ కొంతకాలంగా ఓర్సు ఏడుకొండలు అనే కాంట్రాక్టర్ వద్ద పని చేస్తున్నాడు. ప్రస్తుతం ఆరపేట శివారులో భగీరథ పైపులైన్ పనులు చేపట్టాడు. మంగళవారం అక్కడ పైపులకు వెల్డింగ్ చేస్తుండగా నవీన్‌కుమార్ ప్రమాదవశాత్తు జారి పక్కనే ఉన్న కరెంట్ స్విచ్ బోర్డుకు తగిలాడు. షాక్ తగిలి కింద పడ్డాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. 18న జాబ్ మేళాకరీంనగర్: జిల్లాలోని నిరుద్యోగ యువతి, యువకులకు కరీంనగర్‌లోని కృషి విజ్ఞాన్ ఫెర్టిలైజర్లో ఉద్యోగాలు కల్పించుటకు ఈనెల 18న జిల్లా ఉపాఽధి కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వై.తిరుపతిరావు ఒక ప్రకటనలో తెలిపారు. కృషివిజ్ఞాన్ ఫర్టిలైజర్ సంస్థలో సెల్స్ ఎగ్జిక్యూటివ్, ఫీల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్, హెచ్ఆర్, ఆఫీస్ బాయ్ 60 పోస్టులు ఉన్నాయని, పోస్టులకు 10వ తరగతి, డిగ్రీ, ఎంబీఏ, బీఎస్సీ అగ్రికల్చర్, డిప్లొమా ఆపై చదివిన ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులని తెలిపారు. 19– 35 సంవత్సరాలోపు ఉండాలని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఉదయం 11 గంటలకు సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో జిల్లా ఉపాఽధి కార్యాలయంలో తమ పేరు నమోదు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 9666100349, 9963177056 నంబర్లను సంప్రదించవచ్చునని పేర్కొన్నారు. కిరాణషాపులో దొంగతనంఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని గొల్లపల్లి గ్రామంలోని కిరాణదుకాణంలో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డట్లు ఎస్సై రాహుల్‌రెడ్డి తెలిపారు. బైరి నరేశ్ గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయం వద్ద కిరాణ దుకాణం నిర్వహించుకుంటున్నాడు. మధ్యాహ్నం వేళ భోజనం చేసేందుకు ఇంటికి వెళ్లి తిరిగి వచ్చి చూడగా దొంగతనం జరిగినట్లు గుర్తించాడు. దుకాణంలోని కౌంటర్ నుంచి రూ.3వేలు, ఆలయానికి చెందిన మూడు ఇత్తడి చెంబులు, ఇత్తడి తాంబూలం చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మెడికల్ షాప్ యజమాని రిమాండ్వేములవాడ: మైనర్ బాలికకు గర్భస్రావం(అబార్షన్) అయ్యేలా మందులు విక్రయించిన మెడికల్‌షాప్ యజమానిని రిమాండ్‌కు తరలించినట్లు వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి మంగళవారం తెలిపారు. ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి తెలిపిన వివరాలు. సిరిసిల్లకు చెందిన ఓ యువకుడు ప్రేమ, పెళ్లి పేరుతో మైనర్ బాలికను శారీరకంగా వాడుకుని గర్భవతిని చేశాడు. గర్భస్రావం కావడానికి సిరిసిల్ల పట్టణానికి చెందిన గీతాంజలి మెడికల్ షాప్ యజమాని నల్లా శంకర్ మందులు ఇచ్చాడు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వగా బాలికకు గర్భస్రావమైంది. కేసు నమోదు చేసి సదరు యువకుడిని మే 30న రిమాండ్‌కు తరలించారు. చట్ట వ్యతిరేకంగా మైనర్ బాలికకు గర్భం పోవడానికి మందులు ఇచ్చిన గీతాంజలి మెడికల్ షాప్ యజమాని శంకర్‌ను ఈనెల 12న రిమాండ్‌కు తరలించారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
గతి తప్పిన పల్లె ప్రగతి
జగిత్యాలరూరల్: కాంగ్రెస్ పాలనలో పల్లె ప్రగతి గతి తప్పిందని, ఎక్కడ చూసినా పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. జగిత్యాల రూరల్ మండలం రఘురాములకోటలో నాయకులు, కార్యకర్తలతో కలిసి శ్రమదానం చేశారు. గ్రామంలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించారు. అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకొచ్చినప్పటి నుంచి స్థానిక సంస్థలు నిర్వీర్యమయ్యాయని, కనీసం చెత్తతీసే పరిస్థితి లేదని, అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని తెలిపారు. తమ శ్రమదానంతోనైనా అధికారులకు కనువిప్పు కలగాలన్నారు. అవగాహన లేని సీఎం రేవంత్‌రెడ్డి పాలనతో గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కేసీఆర్ హయాంలోనే నెరవేరిందన్నారు. నాయకులు ఆనందరావు, ప్రవీణ్‌గౌడ్, తిరుపతి, రాజన్న, శంకర్, చిత్తారి స్వప్న, కమలాకర్‌రావు, హరీశ్, ధర్మయ్య, రాజేందర్, భాగ్యలక్ష్మీ, రమ, తేజ పాల్గొన్నారు. -
శీత్లా భవానీ వేడుకలు
సారంగాపూర్: మండలంలోని మ్యాడారంతండా గిరిజన గ్రామంలో మంగళవారం శీత్లాభవాని వేడుకలను బంజారాలు ఘనంగా నిర్వహించారు. గ్రామ శివారుల్లోని అటవీప్రాంతంలో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు ఊరేగింపుగా వెళ్లి ఏడుగురు అమ్మవార్లకు బోనాలను సమర్పించారు. గ్రామస్తులు డప్పు చప్పుళ్ల మధ్య అమ్మవార్లకు గొర్రెలు, మేకలను బలి ఇచ్చి ప్రసాదాలను సమర్పించారు. కార్యక్రమంలో ట్రాన్స్‌కో ఏడీఈ జవహర్లాల్ నాయక్, మాజీ జెడ్పీటీసీ భూక్య సరళ, మాజీ సర్పంచ్ భూక్య అరుణ్, మాజీ ఎంిపీటీసీ భూక్య లావణ్యరాథోడ్, రాష్ట్ర బంజారా సంఘం నాయకులు భూక్య దశరథ్‌నాయక్, నాయకులు పాల్గొన్నారు. -
‘ఇందిరమ్మ’ పనులు వేగవంతం చేయాలి
జగిత్యాల/గొల్లపల్లి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అ న్నారు. మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులపై సమీక్షించారు. ఇళ్లు మంజూరైన వారందరూ వెంటనే పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్మాణాలు ప్రారంభించిన వారు నిర్దేశిత గడువులోపు, నిబంధనలకు అనుగుణంగా పనులు చేపట్టేలా చూడాలన్నారు. స్పెషల్ ఆఫీసర్లు సందర్శించి పరిశీలించాలని పేర్కొన్నారు. వివిధ కారణా లతో పనులు ప్రారంభించలేకపోయిన లబ్ధిదారుల ను కలిసి ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం గు రించి వివరించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లత, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి ఆర్డీవో లు మధుసూదన్, జివాకర్‌రెడ్డి, శ్రీనివాస్, హౌసింగ్ పీడీ ప్రసాద్ పాల్గొన్నారు. అంతకుముందు పెగడపల్లి మండలం నంచర్ల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. గ్రామాల్లో శానిటేషన్‌పై అధికారులకు పలు సూచనలు చేశారు. తహసీల్దార్ రవీందర్, ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు, ఎంపీవో మహేందర్, ప్రత్యేకాధికారి శంషేర్‌అలీ, పంచాయతీ కార్యదర్శి నవీన్ ఉన్నారు. ● కలెక్టర్ సత్యప్రసాద్ -
మహిళాశక్తి సోలార్ ప్లాంట్ల పరిశీలన
జగిత్యాలరూరల్/గొల్లపల్లి: మహిళలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఇందిర మహిళాశక్తి కింద సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోందని ఐకేపీ నాన్ డీపీఎం నారాయణ అన్నా రు. జగిత్యాలరూరల్ మండలం తాటిపల్లి, గొల్లప ల్లి మండలం నందగిరిలో ఏర్పాటు చేస్తున్న సౌర విద్యుత్ తయారీ యూనిట్‌ను ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. పెగడపల్లి మండలం నందగిరిలో రెవెన్యూ శాఖ అప్పగించిన స్థలంలో రెడ్కో ఆధ్వర్యంలో యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. ఒక్కో ప్లాంట్ విలువ దాదాపు రూ.3 కోట్ల వరకు ఉంటుందన్నారు. జిల్లా ఏపీఎం కోల శ్రీనివాస్‌చక్రవర్తి, ఏపీఎం ఓదెల గంగాధర్, సీసీ పొడేటి గంగారాం, అభ్యుదయ, చైతన్య గ్రామైక్య సంఘాల అధ్యక్షులు బక్కశెట్టి నర్సమ్మ, వడ్లూరి లక్ష్మీ, వీవోఏలు సురేశ్, హారిక, సమైక్య స భ్యులు మ్యాకల రాధ, బూర్గుల సునీత పాల్గొన్నారు. -
బిల్లులు రాక మాజీ సర్పంచ్ భర్త ఆత్మహత్యాయత్నం
గంగాధర(చొప్పదండి): పదవీకాలంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు రాకపోవడంతో, తీసుకొచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయని కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మిదేవిపల్లి మాజీ సర్పంచ్ భర్త పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికుల వివరాల ప్రకారం.. లక్ష్మిదేవిపల్లి గ్రామానికి తాళ్ల విజయలక్ష్మి గత జనవరి వరకు సర్పంచ్‌గా కొనసాగారు. తన పదవీకాలంలో గ్రామంలో అభివృద్ధి పనులు చేసేందుకు రూ.12లక్షలు అప్పు తీసుకొచ్చారు. పనులు పూర్తిచేసి, రికార్డులు చేయించి, బిల్లులు పెట్టినా నిధులు మంజూరు కాలేదు. పదవీకాలం ముగిసినా బిల్లులు రాలేదు. తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయని విజయలక్ష్మి భర్త రవి ఆవేదన చెందాడు. సోమవారం సాయంత్రం పురుగుల మందుతాగాడు. కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతున్నాడు. మంగళవారం చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ బాధితుడిని పరామర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాజీ సర్పంచులకు పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
గ్రామగ్రామాన వైద్య పరీక్షలు
ఇబ్రహీంపట్నం: జిల్లాలోని గ్రామగ్రామాన వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ అన్నారు. స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. శిబిరాన్ని సందర్శించిన ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 15వరకు శిబిరాలు కొనసాగుతాయన్నారు. ఇప్పటివరకు 68 గ్రామాల్లో పరీక్షలు చేసినట్లు తెలిపారు. బీపీ, షుగర్, టీబీ, హెచ్ఐవీ, హైపటైటీస్, సుఖవ్యాధుల పరీక్షలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వైద్యాధికారులు నవీన్‌కుమార్, సీహెచ్‌వోలు విజయభాస్కర్, సుల్తానా, టీబీ సూపర్వైజర్ ఆంజనేయులు, సీహెచ్ఎన్ హేమలత, హెచ్‌ఈవో కృపాకర్, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు పాల్గొన్నారు. కొండగట్టులో భక్తుల రద్దీమల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయ స్వామి వారి ఆలయం మంగళవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు.. స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అంతరాలయం విస్తరణతో భక్తులు ప్రత్యేక దర్శనం టికెట్లు కొనుగోలు చేశారు. తద్వారా ఆలయ ఆదాయం పెరిగిందని అధికారులు తెలిపారు. ఆర్యవైశ్యుల గోరింటాకు ఉత్సవాలురాయికల్: పట్టణంలోని వాసవీమాతా ఆలయంలో ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఆషాఢమాసం గోరింటాకు ఉత్సవాలను నిర్వహించారు. మహిళలు అమ్మవారిని అలంకరించి పూజలు చేశారు. గోరింటాకు పెట్టుకున్నారు. కార్యక్రమంలో పట్టణ అ ధ్యక్షురాలు జిల్లా లావణ్య, ప్రధాన కార్యదర్శి సిద్దంశెట్టి స్వప్న, కోశాధికారి అయిత మాధవి, మండల అధ్యక్షుడు ఎలగందుల వీరేశం పాల్గొన్నారు. ‘ఉత్తమ’ గడువు పొడిగింపుజగిత్యాల: జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులకు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 17వరకు గడువు పొడిగించినట్లు డీ ఈవో రాము తెలిపారు. ఎంఈవోలు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు జాతీయస్థాయి అవార్డు కోసం అర్హత గల అన్ని కేటగిరీలు గల ఉత్తములు NATIO NALAWATOTEACHEQ.EDUCATIO N.GO V.I N లో అప్లోడ్ చేసుకోవాలన్నారు. వైద్య సిబ్బందితో జిల్లా వైద్యాధికారి సమావేశంసారంగాపూర్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందితో జిల్లా వైద్యాధికారి ప్రమోద్ మంగళవారం పీహెచ్సీలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీజనల్ వ్యాధులు, టీబీ ముక్త్భారత్ అభియాన్, ఎన్సీడీ స్క్రీనింగ్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరిగేలా చూడాలని సూచనలు చేశారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి రాధారెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. దివ్యాంగులు హాజరుకావాలిజగిత్యాల: సహాయ ఉపకరణల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులు బుధవారం ఉదయం 10 గంటలకు ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో కలెక్టరేట్ ఆడిటోరియంలో హాజరుకావాలని సంక్షేమ అధికారి బోనగిరి నరేశ్ తెలిపారు. జిల్లా స్క్రీనింగ్ కమిటీ ద్వారా పరిశీలన, ధ్రువీకరణ ఉంటుందని పేర్కొన్నారు. -
ఎఫ్పీవోలుగా పీఏసీఎస్‌లు
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీసీఎస్) రైతులకు సేవలు అందించడంలో మంచి గుర్తింపుపొందాయి. రైతులను సంఘటితం చేసి.. మరిన్ని సేవలు అందించేందుకు నాబార్డు సంస్థ విశేష కృషి చేస్తోంది. ఇందుకోసం జిల్లాలో అభ్యుదయ సహకార సంఘాలుగా పేరుగాంచిన 16 సహకార సంఘాలను ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్‌గా గుర్తించాయి. ఈ మేరకు ఎంపిక చేసిన సంఘాలకు నాబార్డు సంస్థ తొలి విడత నిధులు విడుదల చేసింది. నిధులను మంగళవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహకార సంఘాలకు అందించారు. గుర్తింపు పొందిన సంఘాలివే.. జిల్లాలో 71 సహకార సంఘాలు ఉన్నాయి. ఇందులో 16 సంఘాలకు ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్‌గా గుర్తింపు లభించింది. ఇందులో జగిత్యాల, రాయికల్, మల్యాల, కొడిమ్యాల, నంచర్ల, గొల్లపల్లి, వెల్గటూర్, జైన, ధర్మపురి, మల్లాపూర్, మెట్పల్లి, భూషన్‌రావుపేట, బీర్పూర్, సారంగాపూర్, పైడిమడుగు, ఇబ్రహీంపట్నం సంఘాలు ఉన్నా యి. ఇప్పటివరకు ఆయా సహకార సంఘాలు రైతులకు రసాయన ఎరువులు, విత్తనాలు అందించడం, పంట రుణాలు అందిస్తూ వ్యవసాయానికి చే దో డువాదోడుగా నిలుస్తున్నాయి. ఏటా రెండు సీజన్లలోనూ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయి. రైతుల సంఘటితం కోసం.. రైతులను సంఘటితం చేసి.. పంట ఉత్పత్తులను నేరుగా మార్కెటింగ్ చేసి, మంచి ఆదాయం పొందడం ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ల ప్రధాన ఉద్దేశం. విత్తనం నుంచి రసాయన ఎరువులు, పురుగుమందులను దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా కంపెనీల నుంచి కొనుగోలు చేసి తక్కువ ధరకు రైతులకు అందించాల్సి ఉంటుంది. సంఘాన్ని నడిపేవారిలో రైతులను ఒకతాటిపై తీసుకెళ్లే నాయకత్వ లక్షణాలు ఉండాల్సి ఉంటుంది. ప్రధానంగా సేవా చేయాలనే సంకల్పం ఉంటే ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ద్వారా ఎన్నో అద్భుతాలు చేయవచ్చు. రైతులు పండించే ప్రతి ఉత్పత్తిని నేరుగా అమ్మకుండా ఉప ఉత్పత్తులుగా తయారు చేసి సంఘం బ్రాండ్ పేరుతో విక్రయించి లాభాలను పొందే అవకాశం ఉంది. నాబార్డు సహాయం నాబార్డు సంస్థ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ను నిలదొక్కుకునేలా ఆర్థిక సహాయం చేయనుంది. సంఘాలు భారీ బడ్జెట్‌తో చేపట్టే రైస్‌మిల్లులు, గోదాంల నిర్మాణానికి తక్కువ వడ్డీతో రుణాలు ఇవ్వనుంది. నాబార్డు సంస్థ సహకారసంఘాలే కాకుండా ప్రతి గ్రామంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తుంది. ఎఫ్ఓలు నిర్వహించే వారికి సంఘాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై శిక్షణ ఇవ్వడంతోపాటు ఇప్పటికే ఎఫ్ఓలుగా విజయం సాదిస్తున్న సహకార సంఘాల క్షేత్ర సందర్శనకు తీసుకెళ్లనున్నారు. ఆయా పంటల మార్కెటింగ్ తీరుతెన్నుల గురించి సంఘ సభ్యులకు వివరించనున్నారు. జిల్లాలో ఇప్పటికే ఉద్యానశాఖ ద్వారా 20 వరకు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఉండగా.. మరో 10 వరకు రైతు ఉత్పత్తిదారుల ప్రొడ్యూసర్ కంపెనీ కింద ఉన్నాయి. జిల్లాలో 16 సంఘాలు ఎంపిక తొలి విడత నిధుల పంపిణీ మంత్రి చేతులమీదుగా అందజేతజైన పీఏసీఎస్‌కు చెక్కు పంపిణీ ధర్మపురి: జైన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఎఫ్‌పీవో (ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్)కు వ్యవసాయ సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రూ.3.16 లక్షల చెక్కును అందించారు. చెక్కును పీఏసీఎస్ చైర్మన్ నరేశ్ హైదరాబాద్‌లో అందుకున్నారు. ఎఫ్‌పీవో ఏర్పాటుకు సహకరించిన మంత్రి లక్ష్మణ్‌కుమార్, జిల్లా సహకార అధికారి మనోజ్‌కుమార్‌కు నరేష్ కృతజ్ఞతలు తెలిపారు. -
● అక్రమ దందాలపై కఠినంగా వ్యవహరిస్తున్న అధికారులపై కన్నెర్ర ● నేతల ఒత్తిళ్లతో చర్యలు తీసుకుంటున్న ఉన్నతాధికారులు
మెట్పల్లి: విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహరించే అధికారులకు ఇబ్బందులు తప్పడం లేదు. వాస్తవానికి ఉన్నతాధికారులు అలాంటి వారిని ప్రోత్సహించాలి. కానీ.. కొంతకాలానికే బదిలీ వేటు వేస్తుండడం విమర్శలకు దారితీస్తోంది. మెట్పల్లి ప్రాంతంలో ఇటీవల జరిగిన ఇద్దరి అధికారుల బదిలీ స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ ఇద్దరు మామూళ్లకు దూరంగా ఉంటూ.. అక్రమదందాల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ వచ్చారు. అయినప్పటికీ ఇక్కడ బాధ్యతలు చేపట్టిన ఏడాది లోపే వారికి బదిలీని బహుమతిగా ఇచ్చి పంపించారు. సమర్థవంతమైన విధులు నిర్వర్తించినా.. ● గతేడాది జూన్‌లో మెట్పల్లి సీఐగా నిరంజన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పని చేస్తున్న సమయంలో ఆయన మామూళ్లకు దూరంగా ఉన్నారు. ● అక్రమ దందాలపై కాస్త కఠినంగానే వ్యవహరించారు. ఇసుక, గంజాయి, రేషన్ బియ్యం అక్రమంగా తరలింపు వంటి వాటిపై నిఘా పెట్టి పెద్ద సంఖ్యలో కేసులు నమోదు చేశారు. అసాంఘిక శక్తుల ఆట కట్టించారు. ● ఆయన సర్వీసులో అప్పటివరకు చూపిన ప్రతిభకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం మెట్పల్లిలో విధులు నిర్వర్తిస్తున్నప్పుడే ఇండియన్ పోలీస్ మెడల్‌కు ఎంపిక చేసింది. ● వీటన్నింటిని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ఉన్నపళంగా బదిలీ చేశారు. ఇసుక దందాపై కన్నెర్రనే కారణమా..? ● మెట్పల్లి మండలంలో రీచ్ లేకపోవడంతో ఇసుక దందా అంతా అక్రమంగానే సాగుతోంది. ● ప్రభుత్వం అక్రమ రవాణాను అరికట్టాలని ఆదేశాలివ్వడంతో తహసీల్దార్ శ్రీనివాస్ ఈ విషయంలో కాస్త కఠినంగా వ్యవహరించారు. ● కేసులు నమోదు చేయడంతోపాటు పెద్ద ఎత్తున డంప్‌లను స్వాధీనం చేసుకొని వేలం వేశారు. ● తహసీల్దార్ తీరుతో అక్రమ దందాకు అవరోధాలు ఏర్పడడంతో సోమవారం అకస్మాత్తుగా కలెక్టరేట్‌కు బదిలీ చేశారు. ఫలించిన రాజకీయ ఒత్తిళ్లు.. ● ఈ ఇద్దరి అధికారులను బదిలీ చేయడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే ప్రచారం ఉంది. ● అధికారులు నిజాయితీగా వ్యవహరించడం కొందరి నాయకులకు ఇబ్బందిగా మారడంతో తమ పలుకుబడిని ఉపయోగించి బదిలీ చేయించారనే చర్చ నడుస్తోంది. ● పోస్టింగ్, బదిలీలకు రాజకీయ నేతల సిఫార్సులు తప్పనిసరిగా మారడంతో ఉన్నతాధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందనే వాదనలు వినిపిస్తున్నాయి. -
నిరుపేదకు పెద్ద కష్టం
● వినాయకుడి విగ్రహం జరుపుతుండగా ప్రమాదం ● విగ్రహం మీదపడి దెబ్బతిన్న మెడ నరాలు ● అచేతన స్థితిలో ఆస్పత్రిలో యువకుడు ● ఆపరేషన్‌కు రూ.10లక్షలు అవసరం ● ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు వీణవంక: వారిది పేద కుటుంబం. తల్లిదండ్రులకు చేదోడుగా ఉండాలని నిర్ణయించుకున్నాడా యువకుడు. ఇంటికి దూరమైనా వినాయక విగ్రహాల తయారీ పనుల్లో కూలీగా చేరాడు. విగ్రహం జరుపుతుండగా ప్రమాదశాత్తు మీద పడటంతో మెడనరాలు దెబ్బతిని ఆస్పత్రి పాలయ్యాడు. కాళ్లు, చేతులు పనిచేయక, అపస్మారక స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆపరేషన్‌కు రూ.10 లక్షలు అవసరం కాగా.. ఆ పేద కుటుంబం దిక్కుతోచని ిస్థితిలో ఉండిపోయింది. బాధిత కుటుంబం వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతిగల్ గ్రామానికి చెందిన సుద్దాల రవీందర్– శారద దంపతులకు ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. రవీందర్ గీత కార్మికుడు. కుటుంబానికి ఆయనే ఆధారం. ఈ పరిస్థితుల్లో చిన్న కొడుకు అజయ్(26) కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు మూడేళ్లుగా వరంగల్ జిల్లా పరకాలలో వినాయక విగ్రహాల తయారీకేంద్రంలో కూలీగా పనిచేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం వినాయకుడి విగ్రహం జరుపుతుండగా, ప్రమాదవశాత్తు విగ్రహం అజయ్ మెడపై పడింది. మెడ నరాల కింద ఉన్న బొక్క విరిగిపోయింది. నరాలు చచ్చుపడిపోవడంతో కాళ్లు, చేతులు పని చేయక ఆపస్మారకస్థితిలోకి వెళ్లాడు. వెంటనే హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్య ఖర్చులు, ఆపరేషన్‌కు రూ.10 లక్షలు అవుతుందని వైద్యులు తెలుపడంతో బాధిత కుటుంబం అప్పులు చేసి ఇప్పటికే రూ.4 లక్షలు ఖర్చురచేశారు. ఇంకా రూ.6లక్షలు అవసరం కావడంతో దిక్కుతోచన స్థితిలో ఉన్నారు. చేతిలో చిల్లిగవ్వ లేదని, పూట గడవడమే కష్టంగా ఉందని అజయ్ తండ్రి రవీందర్ కన్నీరుమున్నీరయ్యాడు. దాతలు సాయం అందించి, అజయ్‌ని కాపాడాలని వేడుకుంటున్నాడు. ఎవరైనా సాయం చేయాలనుకుంటే 97013 14308, 81067 62881 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కోరుతున్నారు. -
చిన్నారిపై అఘాయిత్యం?
తిమ్మాపూర్: రేణికుంట గ్రామంలో 8 ఏళ్ల చిన్నారిపై గుర్తుతెలియని వ్యక్తి అఘాయిత్యానికి యత్నించడం కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం.. బాలిక ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా.. గుర్తుతెలియని వ్యక్తి సమీపంలో ఉన్న పొదల్లోకి లాక్కెళ్లాడు. బాలిక కేకలు వేయడం, పక్కనే ఉన్న ఆమె అన్న కూడా అరవడంతో చుట్టుపక్కలవారు అక్కడికొచ్చారు. దీంతో అగంతకుడు బాలికను వదిలేసి పరారయ్యాడు. చుట్టుపక్కలవారు పట్టుకునే ప్రయత్నం చేసినా దొరకలేదు. ఆ అగంతకుడు గ్రామస్తుడా లేక సమీప రైస్‌మిల్లులో పని చేసే వ్యక్తా అనేది బాలిక గుర్తుపట్టలేకపోతోంది. బాలికను కిడ్నాప్ చేయడానికి లాక్కెళ్లాడా లేక అత్యాచారానికా అనేది తెలియడం లేదు. అయితే బాలిక కుటుంబం పేదవారు కావడంతో కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికీ ఉండదని, అత్యాచారం కోసమే లాక్కెళ్లాడని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఎస్సై శ్రీకాంత్గౌడ్ని ఈ ఘటనపై వివరణ కోరగా.. విచారణ చేస్తున్నామని, ప్రాథమికంగా కిడ్నాప్ కోసం ప్రయత్నాలు చేసి ఉండొచ్చని అన్నారు. అత్యాచారమా? కిడ్నాప్‌నకు యత్నమా? -
దేశాన్ని ప్రమాదంలోకి నెడుతున్న బీజేపీ
● సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య గోదావరిఖని: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో భయానక పరిస్థితులు కల్పిస్తోందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య విమర్శించార. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బిహార్ లాంటి రాష్ట్రాల్లో దాడులు మొదలయ్యాయన్నారు. ఇది దేశమంతా విస్తరించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీకి ఓట్లు వేయని వారిని పౌరులుగా రుజువు చేసుకోవాలంటున్నారని, ఇది చాలా ప్రమాదకరమైన వాతావరణమన్నారు. ఇప్పటికే ఆ పార్టీకి ఓట్లు వేయరనే కారణంతో అనేకరాష్ట్రాలోని చాలామంది పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించారని, ఇప్పుడు బిహార్‌లో కూడా అదే జరుగుతోందని అన్నారు. దేశ పౌరులుగా రుజువు చేసుకోవడానికి బర్త్ సర్టిఫికేట్లేక అస్సాంలో 19 లక్షల మంది కోర్టుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. ఇదేపద్ధతి దేశం మొత్తం అమలు చేస్తే 2కోట్ల మంది పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగిస్తారని తెలిపారు. రాష్ట్రంలో యూరియా కోసం రైతులు క్యూలో నిలబడాల్సివస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదన్నారు. యూరియా నిల్వచేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. బీఆర్ఎస్ పాలనలో గురుకులాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడూ అదే ఉందన్నారు. దేవరకొండలో ఫుడ్ ఇన్ఫెక్షన్తో సుమారు 40 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారని తెలిపారు. నాయకులు వై.యాకయ్య, ముత్యంరావు, వేల్పుల కుమారస్వామి, ఎ.మహేశ్వరి, ఎం.రామాచారి, మెండె శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఇసుక అక్రమార్కులపై ఉక్కుపాదం
కరీంనగర్‌రూరల్: కరీంనగర్‌రూరల్ పోలీసులు ఇసుక అక్రమార్కులపై ఉక్కుపాదం మోపారు. మంగళవారం అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 11 ట్రాక్టర్లను పట్టుకున్నారు. 11మంది ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లపై కేసు నమోదు చేసికోర్టులో హాజరుపరిచారు. కరీంనగర్‌రూరల్ సీఐ నిరంజన్‌రెడ్డి వివరాల మేరకు.. సుల్తానాబాద్ మండలం గొల్లపల్లి మానేరు వాగునుంచి ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న ఆరు ట్రాక్టర్లను మొగ్ధుంపూర్ శివారులో ఎస్సై నరేశ్ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. గొల్లపల్లికి చెందిన కొత్తూరి రమేశ్, వంశీ, దర్శనాల మహేశ్, రాజు, బేతి సునీల్‌రెడ్డి, ఎలవేణి రమేశ్‌బాబును అరెస్టు చేశారు. చేగుర్తి మానేరు వాగునుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ఐదు ట్రాక్టర్ల యజమానులు, డ్రైవర్లు దుర్గం చంద్రమోహన్, ఎల్కపల్లి నవీన్, శీలం సురేశ్, పోతర్ల క్రాంతికుమార్‌ను బొమ్మకల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మొత్తం 11మంది యజమానులు, డ్రైవర్లను కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఇసుక అక్రమ రవాణాదారులపై చట్టప్రకారం కఠిన చర్యలు చేపడుతామని హెచ్చరించారు. 11 ట్రాక్టర్లు పట్టివేత.. యజమానులపై కేసు -
పశువులకు సీజనల్ వ్యాధుల ముప్పు
● ముందస్తు టీకాలు వేయించాలంటున్న పశువైద్యులు ● రైతులకు అవగాహన కల్పిస్తున్న పశువైద్యాధికారులు మెట్‌పల్లిరూరల్: వర్షాకాలంలో చిరుజల్లులు, చిత్తడి నేలలు పాడి పశువుల్లో పలు రోగాల వ్యాప్తికి కారణమవుతాయి. కలుషిత నీరు, ముసురుతున్న ఈగలు, దోమలు, పచ్చిక అనారోగ్యానికి గురిచేస్తాయి. వ్యాధుల బారిన పడిన పశువులను కాపాడుకోవడం రైతులకు గగనంలా మారుతుంది. ఈ క్రమంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు పశువైద్యులు. పశువులకు సోకే వ్యాధులు వర్షాకాలంలో పశువులకు గాలికుంటు, గొంతువాపు, నీలినాలుక, పెస్టిస్ దిస్ పైటెటిస్ రూమినెంట్స్(పీపీఆర్), షీప్‌పాక్స్(అమ్మోరు), చిటుకు వ్యాధులు సోకుతాయని వైద్యులు చెబుతున్నారు. ● గాలికుంటు వ్యాధి ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలకు కలిగే అంటువ్యాధి. ఇది పశువుల నుంచి మనుషులకూ సోకుతుంది. పశువుల నోటినుంచి చొంగ కారుతుంది. పశువుల ఉష్ణోగ్రత 104 నుంచి 106 డిగ్రీల వరకు ఉంటుంది. నోటిలో పుండ్లు ఏర్పడి మేత సరిగా తినక నీరసంగా ఉంటుంది. పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది. దూడల్లో ఇలాంటి లక్షణాలు కనిపించకుండానే చనిపోతాయి. నివారణ చర్యలు వ్యాధి నిరోధక టీకాను 6 నుంచి 8 వారాల పైబడిన దూడలకు మొదటి మోతాదు వేయాలి. 4 నుంచి 6 నెలల వయస్సులో బూస్టర్ మోతాదు ఇప్పించాలి. టీకాను ఏటా ఇప్పిస్తే వ్యాధిని నివారించవచ్చు. వ్యాధి సోకిన పశువును ముందుగా మంద నుంచి వేరుచేయాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. ● నీలినాలుక వ్యాధి వ్యాధి సోకిన సమయంలో జ్వరం, నోటిలో పుండ్లు, నాశికరంధ్రం, కాళ్ల గిట్టలు, నాలుక, పేగుపొరల్లో శోధం లాంటి లక్షణాలు ఉంటాయి. పశువు జ్వరంతో ఉంటుంది. నాలుక వాచిపోయి నీలిరంగుగా మారుతుంది. న్యూమోనియా లక్షణాలు కనిపిస్తూ శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ముక్కు నుంచి జిగురు లాంటి ద్రవ పదార్థం కారుతుంది. కాలిగిట్టల దగ్గర ఎర్రగా వాచడం, ఆకలి మందగించడం, మెడ భాగంలో వాపుగా ఉండడం, ముక్కు, కంటి నుంచి నీరు, నోటి నుంచి లాలాజలం కారుతుంది. నివారణ చర్యలు పశువులను వైద్యుడి వద్దకు తీసుకెళ్లి చికిత్స అందించాలి. ఐదు రోజుల పాటు యాంటీబయాటిక్ టీకాలు వేయించాలి. సులభంగా జీర్ణమయ్యే గంజి లాంటి పదార్థాలు, ఓఆర్ఎస్వంటి ద్రావణాన్ని తాగించాలి. అవసరమైన విటమిన్స్, మినరల్స్ ఇంజిక్షన్లు ఇప్పించాలి. దోమలు రాకుండా తెరలు వాడాలి. ● అమ్మోరు మేకలు, గొర్రెల్లో ప్రాణాంతకమైన అంటువ్యాధి. జ్వరం, జెనరలైజ్డ్ పాక్ లీజన్స్తో ఎక్కువశాతం చనిపోతాయి. తీవ్రమైన జ్వరం ఉంటుంది. చర్మంపై బొబ్బలు ఏర్పడి శరీరమంతా వ్యాపిస్తాయి. చూడి గొర్రెల్లో గర్భస్రావం అవుతుంది. శ్వాసకోస ఇబ్బందితో గొర్రెలు, గొర్రె పిల్లలు ఎక్కువగా చనిపోతుంటాయి. ఆహరం, నీరు తీసుకోకుండా నీరసిస్తాయి. నివారణ చర్యలు వ్యాధి సోకిన పశువులను మంద నుంచి వేరు చేయాలి. మూడు నెలలు నిండిన గొర్రెలకు షీప్‌పాక్స్ వ్యాక్సిన్ మి.లీ ఇస్తే వ్యాధి రాకుండా నివారించవచ్చు. ఒకసారి టీకా ఇస్తే మూడేళ్ల వరకు ఈ వ్యాధి రాకుండా ఉంటుంది. ● చిటుకు వ్యాధి మేకలు, గొర్రెల్లో వచ్చే ప్రాణాంతకమైన వ్యాధి. ఏడాది లోపు గొర్రెలకు సోకుతుంది. వర్షాకాలంలో లేత గడ్డిని మేయడంద్వారా జీర్ణం కాక చనిపోతాయి. విరోచనాలు, కండరాలు కొట్టుకోవడం, శ్వాసకోస ఇబ్బందులు, కోమ వంటి లక్షణాలు ఉండి గంట వ్యవధిలోనే చనిపోతాయి. నివారణ చర్యలు ఎక్కువగా మేయకుండా కొంతమేర పొట్ట ఖాళీగా ఉండేలా చూడాలి. వైద్యుల సూచనతో ఎంటెరోటాక్సెమియా వ్యాక్సిన్‌ను సమయానికి వేయించాలి. గొంతువాపు వ్యాధి ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలకు వచ్చే ప్రాణంతకమైన వ్యాధి. దీనిని గురక వ్యాధి అని కూడా పిలుస్తారు. జూన్ నుంచి అక్టోబర్ మధ్య ఎక్కువగా సోకుతుంది. పశువుల ఉష్ణోగ్రత 104 నుంచి 105 డిగ్రీల వరకు ఉంటుంది. గొంతు వాచడం, తరచూ దగ్గుతుండడం, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. నీరసంగా ఉంటుంది. పాల దిగుబడి తక్కువవుతుంది. ఆర్నెళ్లు పైబడిన పశువుల్లో కంటే చిన్న దూడల్లో ప్రాణాంతకంగా ఉంటుంది. పెద్ద వాటిలో ఈ వ్యాధి వచ్చినప్పటికీ తీవ్రత తక్కువగా ఉంటుంది. నివారణ చర్యలు పశువులను మంద నుంచి వేరుచేయాలి. స్వచ్ఛమైన నీరు, పోషకాలున్న ఆహారం, గాలి అందేలా చూడాలి. వర్షకాలానికి ముందే మే, జూన్‌లోనే గొంతువాపు టీకాలు వేయించాలి. ఆర్నెళ్లకు ఒకసారి వేయించాలి. జాగ్రత్తలు తప్పనిసరి పశువుల పెంపకంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. పశువైద్యుల సూచన మేరకు టీకాలు వేయించాలి. పశువుల కొట్టాలు పరిశుభ్రంగా ఉంచాలి. పశువులకు వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ చర్యలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. – కొమ్మెర మనీషా, పశువైద్యాధికారి, మెట్పల్లి -
ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
● డీఈవో రాము జగిత్యాల: ఆన్లైన్ మోసాలపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని డీఈవో రాము అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని విద్యార్థులకు కామిక్ రచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైటెక్ యుగంలో సైబర్, అబ్యూస్, ఆన్లైన్ గేమింగ్‌తో మోసాలు చోటుచేసుకుంటున్నాయని, వీటిపై అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో కామిక్ రచన పోటీలను సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని వివరించారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందించారు. రంగపేటకు చెందిన భవిత ప్రథమ, రాఘవపేట జెడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థిని ధనలక్ష్మీ ద్వితీయ, ధర్మపురి జెడ్పీహెచ్ఎస్ విద్యార్థి హర్షవర్దన్‌కు మూడో బహుమతి అందుకున్నారు. కార్యక్రమంలో జిల్లా సమన్వయాధికారి కొక్కుల రాజేశ్ ఉన్నారు. -
కానరాని ‘చెత్త’శుద్ధి
● బయోమైనింగ్ ఉన్నాట్లా.. లేనట్లా..? ● ఎక్కడికక్కడ పేరుకుపోతున్న చెత్త ● ఇబ్బంది పడుతున్న ప్రజలు చేయని బయోమైనింగ్ డంపింగ్‌యార్డు సమీపంలో ఉన్న ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్న ఉద్దేశంతో గత ప్రభుత్వంలో బయోమైనింగ్ ప్లాంట్ నిర్మించేందుకు టెండర్లు నిర్వహించారు. రాష్ట్రస్థాయిలో టెండర్ ప్రక్రియ చేశారు. జగిత్యాల మున్సిపాలిటీలో నిర్మల్‌కు చెందిన ఓ ఏజెన్సీ వారు దక్కించుకున్నారు. దాదాపు రూ.5 కోట్ల నిధులు మంజూరయ్యాయి. కానీ బయోమైనింగ్ పూర్తిస్థాయిలో చేపట్టడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జగిత్యాల మున్సిపాలిటిలో రోజుకు సుమారు 60 టన్నుల చెత్త వెలువడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో తడి 20 టన్నులు, పొడి చెత్త 15 టన్నులు, హజోర్డస్ 4 టన్నులు, శానిటరి వేస్ట్ టన్ను, మిక్స్డ్ వేస్ట్ 20 టన్నులు వెలువడుతుందంటున్నారు. డంపింగ్‌యార్డులో టెండర్ పూర్తయినప్పటి నుంచి బయోమైనింగ్ ప్రారంభమైనప్పుడు 1,44,692 టన్నుల చెత్త ఉంటే బయోమైనింగ్ ద్వారా 89 వేల టన్నులు బయోమైనింగ్ చేయగా.. ఇంకా 44 శాతం ఉంది. ఇంకా పూర్తిస్థాయిలో కాలేదు. బయోమైనింగ్ పూర్తిగా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.5 కోట్లు వెచ్చించినప్పటికీ పూర్తిస్థాయిలో కాకపోవడం విమర్శలకు తావిస్తోంది. దాదాపు నిత్యం 60 టన్నులు వెలువడుతుండడంతో బయోమైనింగ్ చేయకపోవడంతో ఇంకా పేరుకుపోతూనే ఉంది. గతంలో టెండర్ పొందిన వారు 44 శాతం చేయాల్సి ఉంది. అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో బయోమైనింగ్ చేపడితేనే ఇబ్బందులు ఉండవని పేర్కొంటున్నారు. బయోమైనింగ్‌పై ఆరోపణలు బయోమైనింగ్‌పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల జరిగిన మున్సిపల్ సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. రూ.5 కోట్లు వెచ్చించినప్పటికీ పూర్తిస్థాయిలో కాకపోవడమేంటని ప్రశ్నించారు. వాస్తవంగా బయోమైనింగ్ చేశాక అందులో వెళ్లిన సన్నపు మట్టిని వ్యవసాయదారులు, ప్లాస్టిక్ గ్లౌస్లు, ఇతర ఫ్యాక్టరీలకు తరలించాల్సి ఉంటుంది. అలాగే సీఎన్జీ వేస్ట్ (మట్టి, గోడలకు సంబంధించిన) మున్సిపాలిటీలో ఎక్కడైతే గుంతలు ఉన్నాయో అక్కడ పోయాల్సి ఉంటుందని మున్సిపల్ అధికారులే పేర్కొంటున్నారు. కానీ అది మచ్చుకు కన్పించడం లేదన్న ఆరోపణలున్నాయి. బయోమైనింగ్ ద్వారా చెత్త నిల్వలను కనుమరుగు చేయాలని అధికారులు భావించినా.. సమస్య తీవ్రతరంగా మారింది. కాలుష్య కోరల్లో కాలనీలు డంపింగ్‌యార్డుల్లో నిత్యం పొగలు అంటుకుని ఆ కాలలన్నీ కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నాయి. నిబంధనల ప్రకారం చెత్తను కాల్చకూడదు. ఆ పొగ వస్తే మనుషుల గుండె, ఊపిరితిత్తులపై ప్రభావం పడుతుంది. మనుషుల ఆరోగ్యంతోపాటు పర్యావరణాన్ని దెబ్బతీసే కాలుష్య కారకాల్లో పీఎం 2.5, పీఎం 10 నైట్రోజన్ ఆకై ్సడ్, సల్ఫర్ యాకై ్సడ్ ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. నర్సింగాపూర్ ప్రాంతంలో డంపింగ్‌యార్డు వద్ద డబుల్బెడ్రూం ఇళ్లు, న్యాక్ కేంద్రాలు ఆనుకునే ఉండటం, ఆ డంపింగ్‌యార్డులో బీడీ, సిగరేట్ పడేస్తున్నారో.. ఇతర కారణాలతోనో తెలియదు కానీ నిత్యం మంటలు అంటుకున్నాయి. అధికారులు చర్యలు తీసుకోవాలని ఆ కాలనీవాసులు కోరుతున్నారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్‌ను ఫోన్లో వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. స్పందించలేదు. జిల్లాకేంద్రంలో నిత్యం వెలువడే చెత్త : 60 టన్నులు తడి చెత్త : 20 టన్నులు పొడి చెత్త : 15 టన్నులు హజోర్డస్ : 4 టన్నులు శానిటరి వేస్ట్ : టన్ను మిక్స్డ్ వేస్ట్ : 20 టన్నులు జగిత్యాల: జిల్లాకేంద్రంలోని డంపింగ్‌యార్డులో చెత్త పేరుకుపోవడంతో నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. పట్టణ శివారులోని నూకపల్లి ప్రాంతంలో చెత్త పడేసేందుకు డంపింగ్‌యార్డును ఏర్పాటు చేశారు. తడి, పొడి చెత్తను వేర్వేరు చేయాలని అవగాహన కల్పిస్తున్నా.. ఆశించిన మేరకు ఫలితం కనిపించడం లేదు. తడి, పొడి చెత్త వేరు చేయాలని నిబంధనల్లో స్పష్టంగా ఉన్నప్పటికీ డంపింగ్ యార్డుల్లో పడేయడం, దానికి అగ్గి రాజుకోవడంతో అటు పొగ, ఇటు దూళి సమస్యతో ఆ సమీపంలోని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డంపింగ్‌యార్డులో ఉన్న కంపోస్ట్ ఫిట్లుగానీ, పొడి వనరుల కేంద్రంగానీ, నిరుపయోగంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ డంపింగ్ యార్డులో పొడి వ్యర్థాలు గుట్టలుగుట్టలుగా పేరుకుపోవడంతో పరిసర ప్రాంతాల ప్రజలు కాలుష్యం, దుర్వాసనతో ఇబ్బందులకు గురవుతున్నారు. -
ప్రజావాణికి 41 దరఖాస్తులు
● జిల్లావ్యాప్తంగా తరలివచ్చిన బాధితులు ● అర్జీలు స్వీకరించిన కలెక్టర్ సత్యప్రసాద్ జగిత్యాలటౌన్: కలెక్టరేట్లోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి బాధితులు తరలివచ్చారు. వివిధ సమస్యలపై 41మంది అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ సత్యప్రసాద్ అర్జీలు స్వీకరించారు. వాటిని పరిశీలించిన కలెక్టర్ మాట్లాడుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ బీఎస్.లత, జగిత్యాల, మెట్పల్లి ఆర్డీవోలు పులి మధుసూదన్‌గౌడ్, శ్రీనివాస్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఎల్ఆర్ఎస్ అమలు చేయడం లేదు జగిత్యాల రూరల్ మండలం చల్గల్ శివారులోని సర్వేనంబర్ 817/1లోగల మా సొంత భూమికి ఎల్ఆర్ఎస్ రుసుం చెల్లించడానికి దరఖాస్తు చేసుకున్నాం. చల్గల్ కార్యదర్శి మోఖాపైకి వచ్చి సర్వే నిర్వహించి ఫొటోలు కూడా తీసుకున్నారు. ఆన్లైన్ పోర్టల్‌లో పెండింగ్ చూపిస్తోందని రుసుం తీసుకోవడం లేదు. ఎల్ఆర్ఎస్ చెల్లించి భూమిని క్రమబద్ధీకరించుకునేలా చర్యలు తీసుకోండి. ఉద్యోగం ఇప్పిస్తానని మోసం మాది పెద్దపల్లి జిల్లా తిప్పన్నపేట గ్రామం. మా చెల్లులి కుటుంబం జగిత్యాలలో నివాసం ఉంటోంది. అదే ఇంటి డాబాపై అద్దెకు ఉండే దుబ్బాక తిరుపతి జగిత్యాల కలెక్టరేట్లో ఉద్యోగం చేస్తున్నానని పరిచయం చేసుకున్నాడు. కలెక్టర్‌తో కలిసి ఉన్న ఫొటోలను చూపాడు. మా కుమారుడికి పెద్దపల్లి కలెక్టరేట్లో డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.1.30లక్షలు తీసుకున్నాడు. దుబ్బ గట్టయ్యకు అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తానని రూ. 80వేలు తీసుకున్నాడు. ఇప్పుడు స్పందించడం లేదు. మోసపోయామని జగిత్యాల కలెక్టరేట్లో వాకబు చేయగా.. అలాంటి వ్యక్తి ఇక్కడ ఉద్యోగం చేయడం లేదని తెలిసింది. ఉద్యోగం పేరుతో మోసం చేస్తున్న వ్యక్తిని పట్టుకుని మాకు న్యాయం చేయండి. అక్రమ పట్టాతో నీడ లేకుండా చేశాడు బర్దీపూర్ గ్రామ పరిధిలోని 5.13 ఎకరాల ప్రభుత్వ భూమిని డి–1 దొంగ పట్టాతో రమేశ్ అనే వ్యక్తి అక్రమంగా రిజిస్టేషన్ చేసుకున్నడు. బర్లు, గొర్లకు నిలువ నీడ లేకుండా అయ్యింది. మా గ్రామ బర్లు, గొర్లు మేపుకునే సర్వే నంబర్ 376/2లోని 5.13 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇదే మండలంలోని కేశాపూర్ గ్రామానికి చెందిన రమేశ్ 2018లో ఎల్‌ఆర్‌యూపీ ద్వారా అక్రమంగా పట్టా పొందాడు. అడిగితే మాపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నడు. పంచాయతీ లెక్కలు తేల్చండి బుగ్గారం పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై లెక్కలు తేల్చాలని, నిందితులపై చర్యలు చేప ట్టే వరకు సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నిక చేయొ ద్దు. పంచాయతీలో రూ.కోటికి పైగా నిధుల దుర్వినియోగం అయ్యింది. ప్రత్యేక చొరవ చూపి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోండి. -
‘ఇందిరమ్మ’ లబ్ధిదారులను గోసపెట్టొద్దు
ఇబ్రహీంపట్నం: ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులను అధికారులు గోస పెట్టవద్దని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మండలకేంద్రంలోని రైతువేదికలో సోమవారం 129 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరుపత్రాలు అందించారు. లబ్ధిదారులకు వెంటవెంటనే బిల్లులు చెల్లించాలని, కొందరు పంచాయతీ కార్యదర్శులు కావాలని ఇబ్బందికి గురిచేయడం సరికాదని సూచించారు. తాను కేసీఆర్‌ను కలిసినప్పుడు ఎస్సారెస్పీ పరిస్థితిపై ఆరా తీశారని, ఆయన ఆరోగ్యం బాగాలేకున్న రైతుల కోసం పనిచేసే వ్యక్తి కేసీఆర్ అని గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఎరువుల కొరత ఎప్పుడూ రాలేదని, ఇప్పుడు రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఇన్చార్జి ఎంపీడీవో రామకృష్ణ, మండల ప్రత్యేకాధికారి నారాయణ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ నోముల లక్ష్మారెడ్డి, మాజీ కో–ఆప్షన్ సభ్యుడు ఎలేటి చిన్నారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ● కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ -
మహాగణపతికి పూజలు
ధర్మపురి: సంకటహర చతుర్థి సందర్భంగా ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయంలోని మహాగణపతికి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు పాలెపు ప్రవీణ్‌శర్మ మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారికి ఉపనిషత్తులతో అభిషేకం, హారతి, మంత్రపుష్పం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు తదితరులున్నారు. మెట్పల్లి తహసీల్దార్ బదిలీమెట్పల్లిరూరల్: మెట్పల్లి తహసీల్దార్ శ్రీనివాస్ బదిలీ అయ్యారు. సెప్టెంబర్‌లో ఇక్కడికి బదిలీపై వచ్చిన ఆయనను కలెక్టరేట్లో సూపరింటెండెంట్‌గా బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు. శ్రీనివాస్ సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ఉండగానే బదిలీ అయినట్లు ఆయనకు సమాచారం అందింది. బదిలీ విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయిన ఆయన.. ప్రజావాణి నుంచి మెట్‌పల్లిలోని ఆయన కార్యాలయానికి చేరుకుని వెంటనే రిలీవ్ అయ్యారు. ఆ సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు. ఆయన ఇక్కడికొచ్చిన 11నెలలకే బదిలీ చేయడం రెవెన్యూవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన స్థానంలో మల్యాల తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వర్తిస్తున్న నీతను ఇన్చార్జిగా నియమించారు. బాధ్యతలు స్వీకరించిన హరీశ్ కుమార్ శర్మజగిత్యాలఅగ్రికల్చర్: పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం డైరెక్టర్‌గా హరీశ్ కుమార్ శర్మ నియామకం అయిన విషయం తెల్సిందే. ఆయన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు డైరెక్టర్‌గా పనిచేసిన శ్రీలతను యాదాద్రి భువనగిరి డాట్ సెంటర్‌కు బదిలీ చేశారు. రాజేంద్రనగర్‌లో పనిచేస్తున్న హరీశ్‌కుమార్ శర్మను ఇక్కడకు బదిలీ చేశారు. -
ఎండుతున్న నారుకు బిందెలతో నీళ్లు
● మరమ్మతుకొచ్చిన ట్రాన్స్ఫార్మర్ ● కరెంట్ లేక నీరుపెట్టని రైతు ● స్పందించిన మంత్రి అడ్లూరి గొల్లపల్లి: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుకు రావడంతో ఓ రైతు నారుమడి ఎండిపోయింది. దీంతో సదరు రైతు నారుమడికి బిందెలతో సోమవారం నీళ్లు పోయించాడు. ఈ ఘటన మండలంలోని రంగదామునిపల్లిలో చోటుచేసుకుంది. తిర్మాలాపూర్‌కు చెందిన ఓ రైతుకు విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్ ఐదురోజుల క్రితం మరమ్మతుకు వచ్చింది. విద్యుత్ అధికారులు దానిని మరమ్మతుకు పంపించారు. వర్షాలు లేకపోవడం.. ట్రాన్స్ఫార్మర్ను సకాలంలో తెప్పించకపోవడంతో నారు ఎండుతోంది. దానిని కాపాడుకునేందుకు సదరు రైతు తన కుటుంబసభ్యులతో బిందెలతో నీరు తెప్పించి చల్లించాడు. దీనిని గమనించిన కాంగ్రెస్ నాయకుడు జెల్ల అనిల్‌కుమార్ విషయాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన స్పందించి విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. విద్యుత్ సిబ్బంది రెండుగంటల వ్యవధిలో ట్రాన్స్ఫార్మర్ బిగించారు. దీంతో రైతు తన నారుమడికి మోటార్ సహాయంతో నీరు పెట్టాడు. -
● నెలకు సుమారు రూ.15 కోట్ల వ్యాపారం ● 10 నుంచి 15 శాతం వడ్డీ వసూళ్లు ● తెల్లపేపర్లు, ఓపెన్ చెక్కులపై సంతకాలు
జగిత్యాలక్రైం: జిల్లావ్యాప్తంగా వడ్డీ వ్యాపారం జోరుగా సాగుతోంది. వాహనాల యజమానులు రిజిస్ట్రేషన్ పత్రాలు తాకట్టు పెట్టి వడ్డీ వ్యాపారుల నుంచి అప్పు తీసుకుంటున్నారు. సమయానికి డబ్బులు అందక అప్పు చెల్లించడంలో జాప్యమైతే తాకట్టు పెట్టుకున్న వ్యక్తులు ఆ వాహనాలను అద్దెకిస్తూ సంపాదిస్తున్నారు. ఓపెన్ చెక్కులు.. తెల్లపేపర్ల సంతకాలు అధిక వడ్డీకి అప్పు ఇస్తున్న వ్యాపారులు తీసుకున్న వారినుంచి ఓపెన్ చెక్కులు, తెల్లపేపర్లపై సంతకాలు తీసుకుంటున్నారు. జాప్యం జరిగితే చెక్కులు, పేపర్లు చూపిస్తూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారు. వాహన పేపర్లు కూడా తాకట్టు పెడుతున్న సమయంలో వాహనం మార్పు కోసం రవాణాశాఖకు అవసరమైన 29, 30 ఫారంపై కూడా ముందే సంతకాలు తీసుకుంటున్నారు. కార్లు, ట్రాక్టర్లు, ఇతర వాహనాలు తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నవారు బాకీ చెల్లించకుంటే వడ్డీ వ్యాపారులు ఆ వాహనాలను ఇతర ప్రాంతాల్లో అద్దెకిస్తూ నెలనెలా డబ్బులు సంపాదిస్తున్నారు. – జిల్లాకేంద్రంలోని పోచమ్మవాడకు చెందిన ఓ వ్యక్తి సాధారణ ప్రజలకు వాహనాలు, బంగారం, భూ డాక్యుమెంట్లు తాకట్టు పెట్టుకుని 10 నుంచి15 శాతం వడ్డీ వసూలు చేస్తున్నాడు. వడ్డీ తీసుకున్న వ్యక్తుల నుంచి ఓపెన్ చెక్కులు, తెల్లపేపర్లపై, వాహనాన్ని మార్పు చేసుకునేందుకు ఫారం 29, 30 మీద సంతకాలు తీసుకుంటున్నాడు. డబ్బు చెల్లించని వారిని వేధించడంతోపాటు, వారికి తెలియకుండానే వాహనాలను మార్పు చేసుకుంటున్నాడు. – జిల్లా కేంద్రంలోని బైపాస్‌రోడ్‌లో ఓ వ్యక్తి ద్విచక్ర వాహనాలు, భూమి, కార్లు తాకట్టు పెట్టుకుని సుమారు రూ.2 కోట్ల మేర అప్పు ఇచ్చాడు. రూ.10 నుంచి రూ.15 వరకు వడ్డీ వసూలు చేస్తున్నాడు. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం వ్యాపారులు అధిక వడ్డీ వసూలు చేసినా, వాహనాలు, బంగారం, భూములు తాకట్టు పెట్టుకుని అప్పులు ఇవ్వడం చట్ట విరుద్ధం. అధిక వడ్డీ వసూలు చేసినా.. ఇబ్బందులకు గురిచేసినా.. డబ్బులు చెల్లించిన తర్వాత తిరిగి వాపస్ ఇవ్వకున్నా ఫిర్యాదు చేస్తే వ్యాపారులపై చర్యలు చేపడతాం. – రఘుచందర్, జగిత్యాల డీఎస్పీ -
తీన్మార్ మల్లన్నపై ఫిర్యాదు
● ఆడబిడ్డను అగౌరవిస్తే ఊరుకోం ● జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావవసంత జగిత్యాలరూరల్: ఆడబిడ్డలను అగౌరవపరిస్తే ఊరుకునేది లేదని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆడబిడ్డను అవమానించడం సరికాదన్నారు. బీసీల కోసం పోరాటం చేస్తున్న కవితపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కవిత పోరాటాన్ని బీసీలు స్వాగతిస్తుంటే తీన్మార్ మల్లన్న చీము, నెత్తురు లేనట్లు మాట్లాడడం సరికాదని, వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు మారంపెల్లి రాణి, సాయి ఉదయ, బీఆర్ఎస్ నాయకులు అనురాధ, లక్ష్మి, రజియా, నజియా, భాగ్యలక్ష్మి, సునీత పాల్గొన్నారు. -
ఈ–పాస్ యంత్రాలకు కొత్త స్కానర్లు
● రేషన్ షాపుల్లో సులువుగా బియ్యం పంపిణీ కథలాపూర్: రేషన్ షాపుల్లో బియ్యం పంపిణీలో అవాంతరాలు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో పంపిణీకి ఉపయోగించే ఈ–పాస్ యంత్రాల్లో స్కానర్ల మార్పిడికి సివిల్ సప్లయ్ అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పుడు రేషన్ డీలర్లు వినియోగిస్తున్న ఈ పాస్ యంత్రాలకు కొత్త స్కానర్లను అమర్చే ప్రక్రియ చేపడుతున్నారు. 520 రేషన్ షాపులు జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి. అలాగే 385 గ్రామాలున్నాయి. పట్టణాలు, గ్రామాల్లో ఉంటున్నవారికి 520 రేషన్ షాపుల ద్వారా బియ్యం పంపిణీ చేస్తున్నారు. ప్రతినెలా రేషన్‌షాపుల నుంచి బియ్యం పంపిణీ చేస్తుండగా.. యంత్రాలు మొరాయించడం, టెక్నికల్ సమస్యలతో కొన్ని సందర్భాల్లో గంటలతరబడి లబ్ధిదారులు దుకాణాల్లో నిరీక్షిస్తున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఉన్నతాధికారులు ఈ–పాస్ యంత్రాల్లో స్కానర్లను మార్చాలని నిర్ణయించారు. జూన్‌లో మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయడంతో ఆగస్టు వరకు రేషన్ దుకాణాల్లో పంపిణీ ప్రక్రియ ఉండదు. ఈ వ్యవధిలో స్కానర్లను మార్చి కొత్త వాటిని అమరిస్తే పంపిణీకి మరింత సులువుగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రతీ మండలకేంద్రానికి టెక్నీషియన్లను ఉన్నతాధికారులు పంపించి ఆయా గ్రామాల్లోని రేషన్‌డీలర్లు మండలకేంద్రాలకు యంత్రాలతో వచ్చేలా ఆదేశాలు జారీ చేశారు. ఈ నెలఖారులోగా ఈ పాస్ యంత్రాల్లో కొత్త స్కానర్లు అమర్చాలనే లక్ష్యంతో ఉన్నట్లు జిల్లా సివిల్ సప్లయ్ అధికారి జితేందర్‌రెడ్డి తెలిపారు. తరచూ మొరాయిస్తుండటంతో కొత్త స్కానర్లు.. రేషన్ డీలర్లకు సుమారు ఐదేళ్ల కిందట మంజూరు చేసిన ఈ–పాస్ యంత్రాలకు స్కానర్ల సమస్య తలెత్తిన విషయాన్ని సివిల్ సప్లయ్ అధికారులు గుర్తించారు. రేషన్ షాపుల్లో బియ్యం పంపిణీ చేసే సమయంలో వేలిముద్ర త్వరగా స్వీకరించకపోవడం, రెండు మూడు సార్లు వేలిముద్ర పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పంపిణీలో జాప్యం జరుగుతోంది. స్కానర్ సక్రమంగా పనిచేయకపోవడంతో బ్లూటూత్ సమస్యలు తలెత్తాయి. ఏకంగా ఈ పాస్ యంత్రాల్లోని స్కానర్లను మార్చితే సమస్యలుండవని అధికారులు, టెక్నీషియన్లు భావించారు. ఈ పరిస్థితుల్లో మార్పు చేసిన యంత్రాలు త్వరగా వేలిముద్రలు స్వీకరిస్తున్నాయని అధికారులు అంటున్నారు. అయితే యంత్రాల్లో డిస్ప్లే, కీ ప్యాడ్ పనిచేయకపోవడం, బ్యాటరీ సమస్యలు కొన్ని రేషన్‌షాపుల్లో తలెత్తుతున్నాయని డీలర్లు వాపోతున్నారు. స్కానర్లతోపాటు ఇతర పరికరాలు మార్చాలని రేషన్ డీలర్లు కోరుతున్నారు. నెట్ లేకున్నా మిషన్ పనిచేయాలి ప్రభుత్వం రేషన్ షాపులకు అందించిన ఈ–పాస్ యంత్రాలు నెట్ సౌకర్యం ఉంటేనే పనిచేస్తాయి. ఇప్పటికి కొన్ని గ్రామాలకు సిగ్నల్, ఇంటర్నెట్ సౌకర్యం సరిగా లేదు. ఆ గ్రామాల్లో లబ్ధిదారులకు రేషన్ సరుకులు పంపిణీ చేయాలంటే డీలర్లకు ఇబ్బందిగా ఉంది. నెట్ లేకున్నా రేషన్ సరుకులు లబ్ధిదారులకు అందించడానికి యంత్రాలు పనిచేసేలా కొత్త టెక్నాలజీ పరికరాలు రేషన్ డీలర్లకు అందించాలి. – సింగారపు చిన్నయ్య, రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర నాయకులు. -
మారుమోగిన నృసింహుడి నామస్మరణ
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయం నారసింహ నామస్మరణతో మారుమోగింది. ఆదివారం సెలవు దినం సందర్భంగా భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు. ముందుగా గోదావరిలో పవిత్ర స్నానాలు ఆచరించారు. దాడి సరికాదుకథలాపూర్: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై జాగృతి నాయకులు దాడి చేయడం దారుణమని మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడు చెదలు సత్యనారాయణ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో మాట్లాడారు. జాగృతి అధ్యక్షురాలు కవిత బీసీ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని బీసీలకు అన్యాయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఓసీ కుటుంబానికి చెందిన కవిత బీసీల ఉద్యమంలో పాల్గొనడంలో అర్థం లేదన్నారు. రాష్ట్రంలో అధిక జనాభా ఉన్న బీసీలు ఏకమైతే రాజకీయంగా దెబ్బతింటామనే భావనలో కవిత ఉన్నారన్నారు. ప్రజాస్వామ్య దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ ప్రతి ఒక్కరి సొంతమని, మల్లన్న కార్యాలయంపై దాడులకు పాల్పడటం జాగృతి నాయకులకు తగదన్నారు. ‘కోట’కు నివాళి ఇబ్రహీంపట్నం: పద్మశ్రీ అవార్డు గ్రహీత విలక్షణ నటుడు మాజీ ఎమ్మెల్యే కోట శ్రీనివాస్‌రావు మృతి చెందడంతో ఆదివారం మండలంలోని వేములకుర్తిలో సినీ ఆర్టిస్ట్‌లు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో సినీ ఆర్టిస్టులు భరత్‌కుమార్, రమేశ్, ప్రభాకర్, ఇంద్రయ్య, సురేందర్, రాజేశ్, కై లాశ్ పాల్గొన్నారు. దేశ ప్రజలకు అంబేడ్కర్ ఆరాధ్యనీయుడు జగిత్యాలటౌన్: ప్రజలందరూ స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో జీవించడానికి కారణమైన అంబేడ్కర్ దేశ ప్రజలందరికీ ఆరాధ్యనీయుడయ్యారని ద్యావర సంజీవరాజు అన్నారు. ప్రతీ ఆదివారం అంబేడ్కర్ స్మరణలో భాగంగా ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (డిక్కీ)ఆధ్వర్యంలో జగిత్యాల తహసీల్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్‌ను ప్రతినిత్యం స్మరించుకోవడం మనందరికి దక్కిన గొప్ప అదృష్టమన్నారు. ప్రజలందరికి సమాన హక్కులు కల్పించిన రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఆశయాలు, రాజ్యాంగాన్ని సైతం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కేవలం ఆదివారమే కాదు ప్రతి రోజు అంబేడ్కర్‌ను స్మరించుకోవాలన్నారు. కార్యక్రమంలో డిక్కీ జిల్లా అధ్యక్షుడు నల్ల శ్యాం, రవీందర్రావు, అనంతుల కాంతారావు, పులి నర్సయ్య, మద్దెల నారాయణ,పల్లె రవి, అంబేడ్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు. నేడు వైస్ చాన్స్‌లర్ రాక జగిత్యాలఅగ్రికల్చర్: మండలంలోని పొలాస వ్యవసాయ కళాశాలకు సోమవారం వ్యవసాయ వర్శిటీ వైస్ ఛాన్స్లర్ అల్దాస్ జానయ్య రానున్నారు. కోరుట్లలో వ్యవసాయ విద్య విద్యార్థులను పొలాస వ్యవసాయ కళాశాలకు బదిలీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిణి, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, వ్యవసాయ వర్శిటీ డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డాక్టర్ కె.ఝన్సీరాణి, వ్యవసాయ వర్శిటీ డీన్ ఆఫ్ స్టూడెంట్ ఆఫైర్ వేణుగోపాల్‌రెడ్డి పాల్గొననున్నారు. -
మల్చింగ్ సాగు బాగు
● కూలీల కొరతకు చెక్ ● షీట్ల కోసం దరఖాస్తుల స్వీకరణ జగిత్యాలఅగ్రికల్చర్: వర్షాలతో పంట చేలల్లో కలుపు మొక్కలు పెరిగి రైతులకు ఇబ్బందిగా తయారవుతాయి. కూలీలు దొరకకపోవడంతో.. పంటను మించి కలుపు మొక్కలు పెరిగి తీవ్ర నష్టం చేస్తున్నాయి. కొంతమంది రైతులు కలుపుతీయించినా లాభం లేదంటూ పంటనే వదిలేస్తున్నారు. ఈ నేపథ్యంలో కలుపు మొక్కలు రాకుండా మల్చింగ్ షీట్‌ను ఉపయోగిస్తున్నారు రైతులు. జిల్లాలో 1.50లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటలు జిల్లాలో సుమారు 1.50 లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగవుతున్నాయి. ఇందులో ప్రధానంగా మొక్కజొన్న 43 వేల ఎకరాలు, పసుపు 35వేలు, కంది 5వేలు, పెసర మూడు వేలు, పత్తి 20వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఇటీవలి వర్షాలకు కలుపు మొక్కలు విపరీతంగా పెరిగాయి. వాటి నివారణకు గడ్డిమందులు పిచికారీ చేసినా వర్షాల కారణంగా పెద్దగా ప్రభావం చూపలేదు. దీంతో తుంగ, గరకవంటి కలుపు మొక్కలు ఎక్కువయ్యాయి. ఈ లోపే నాట్లు మొదలవడంతో కలుపు తీయాలా.. వద్దా అనే పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. వేధిస్తున్న కూలీల కొరత పంటల్లో కలుపు తీయించేందుకు రైతులు కూలీల కోసం తిరుగుతున్నారు. రోజుకు రూ.300 నుంచి రూ.400 వరకు ఇస్తామన్నా.. కలుపుతీతకు రావడం లేదు. మొక్కజొన్న వంటి పంటలకు మొదటి దఫా రసాయన ఎరువులు వేయలేకపోతున్నారు. మల్చింగ్ షీట్‌ను ఉపయోగిస్తున్న రైతులు రెండేళ్లుగా వర్షాలు ఉండటం, కలుపు సమస్య పెరగడంతో కొంత మంది అభ్యుదయ రైతులు కలుపు మొక్కల నివారణకు మల్చింగ్ షీట్‌ను ఉపయోగిస్తున్నారు. కూలీలకు పెట్టే ఖర్చుతో మల్చింగ్ షీట్‌ను కొనుగోలు చేస్తున్నారు. సాగు భూమిని బోజెలుగా తయారు చేసి, వాటిపై మల్చింగ్ షీట్‌ను పరుస్తున్నారు. షీట్‌కు రంధ్రాలు చేసి వాటిలో మొక్కజొన్న, కంది వంటి విత్తనాలు నాటుతున్నారు. ఈ పద్దతిని ఎక్కువగా కూరగాయల సాగుకు ఉపయోగించేవారు. ప్రస్తుతం కూలీల సమస్యతో విసిగిపోయిన రైతులు ఖర్చు ఎంతైనప్పటికీ మొక్కజొన్న, పసుపు వంటి పంటలకు కూడా ఉపయోగిస్తున్నారు. జిల్లాలో 312 ఎకరాల్లో సబ్సిడీపై మల్చింగ్ షీట్లు ఎంఐడీహెచ్ పథకం కింద మల్చింగ్ షీట్‌కు ఉద్యానశాఖ రాయితీలు అందిస్తోంది. ఎకరాకు రూ.8వేల వరకు సబ్సిడీ ఇస్తున్నారు. జిల్లాలో 312 ఎకరాల వరకు అర్హులైన రైతులకు మల్చింగ్ షీట్ ఇచ్చే అవకాశం ఉంది. ఆసక్తి గల రైతులు పట్టాదారు పాస్ పుస్తకం, అధార్ కార్డు, బ్యాంకు పాస్ పుస్తకం జిరాక్స్‌లతో ఉద్యానశాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే అధికారుల క్షేత్ర పరిశీలన చేసి రైతులకు సబ్సిడీ అందించనున్నారు. రైతులందరికీ మల్చింగ్ షీట్ ఇవ్వాలి మల్చింగ్ షీట్‌ను అడిగిన ప్రతి రైతుకు ఇవ్వాలి. సాధారణంగా కూరగాయల, పండ్లతోటలతో పాటు ఆరుతడి పంటల్లో కలుపు మొక్కల సమస్య తీవ్రంగా ఉంటుంది. సబ్సిడీపై ఇస్తే చాలా మంది రైతులు ప్రతి పంటకు మల్చింగ్ షీట్ వేస్తారు. – బండారి వెంకటేష్, పెంబట్ల, సారంగాపూర్ దరఖాస్తు చేసుకోవచ్చు మల్చింగ్ షీట్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం. ఈ ఏడాది జిల్లాలో 312 ఎకరాల వరకు మల్చింగ్ షీట్‌ను సబ్సిడీపై ఇవ్వనున్నాం. మల్చింగ్ షీట్‌ను జాగ్రత్తగా వాడుకుంటే 3నుంచి4 పంటలకు వస్తుంది. కలుపు మొక్కలకు చెక్ పెట్టవచ్చు. – శ్యాంప్రసాద్, జిల్లా ఉద్యానశాఖాధికారి -
నాణ్యత డొల్ల.. ఆరోగ్యం డీలా..!
● హోటళ్లలో తాండవిస్తున్న అపరిశుభ్రత ● ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న యజమానులు ● ప్రజారోగ్యాన్ని పట్టించుకోని అధికారులు ● ప్రజలకు నాసిరకం ఆహారం తినిపిస్తున్న నిర్వాహకులు జగిత్యాల: జిల్లాలోని పలు హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లలో అపరిశుభ్రత తాండవిస్తోంది. మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగిన నూనెలోనే మళ్లీమళ్లీ ఆహార పదార్థాలను తయారు చేస్తూ విక్రయిస్తున్నారు. మున్సిపల్ అధికారులు ఎప్పుడోసారి మొక్కుబడిగా తనిఖీ చేయడంతో నిర్వాహకుల ఇష్టారాజ్యంగా మారింది. గ్లాసులు కడిగిన నీటిలోనే మళ్లీ కడగడం, టిఫిన్ ప్లేట్లను కూడా అదే నీటిలో కడగడం చేస్తున్నారు. కనీసం వంట గదులైనా శుభ్రంగా ఉండడం లేదు. అపరిశుభ్ర వాతావరణంలో చేసిన ఆహార పదార్థాలనే ప్రజలకు అంటగడుతున్నారు. అసలే వానాకాలం.. ఆపై సీజనల్ వ్యాధులు జిల్లాలో సుమారు 500 హోటళ్లు, టిఫిన్ సెంటర్లు ఉన్నాయి. వివిధ అవసరాల కోసం పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు హోటళ్లలోనే తింటుంటారు. అల్పాహారం, భోజనం కోసం టిఫిన్ సెంటర్లు, హోటళ్లు, రెస్టారెంట్లను ఆశ్రయిస్తారు. ఈనేపథ్యంలో హోటళ్ల నిర్వాహకులు పాత్రలను ౖపైపెనే శుభ్రం చేస్తూ వినియోగదారులకు ఆహార పదార్థాలను వడ్డిస్తున్నారు. వంటగదుల్లో బొద్దింకలు, ఈగలు, బల్లులు స్వైర విహారం చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. వంట చేసే మాస్టర్లు, సర్వర్లు ఆఫ్రాన్స్, క్యాప్‌లు, గ్లౌస్లు ధరించాల్సి ఉంటుంది. కానీ, ఇవి మచ్చుకు కూడా కన్పించవు. భోజనం చేసే ప్రాంతంలో మాత్రం ప్రజలను ఆకట్టుకునేలా శుభ్రంగా ఏర్పాట్లు చేస్తారు. ప్రస్తుతం వానాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశముంది. మున్సిపల్ అధికారులు తనిఖీలు చేపట్టి హోటళ్ల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. నాసిరకం ఆహార పదార్థాలు జిల్లా కేంద్రంలోని కొన్ని హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో నకిలీ నూనె, నాసిరకం ఆహార పదార్థాలు వినియోగదారులకు వడ్డిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవానికి ఒకరోజు వినియోగించిన నూనె మరోరోజు వినియోగించకూడదు. కానీ.. కొన్ని హోటళ్లు కోళ్ల వ్యర్థాలు, జంతువుల కళేబరాలు, ఎముకల నుంచి తయారుచేసిన నూనెలు వాడుతున్నట్లు ఆరోపణలున్నాయి. భోజనం తయారుచేసే ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలి. వినియోగదారులు మిగిల్చిన ఆహారాన్ని వెంటనే పడేయాలి. ఆహార పదార్థాలు, మాంసం మిగిలితే నిల్వ చేయకూడదు. ఏరోజుకారోజు ఆహార పదార్థాలు వడ్డించాల్సి ఉండగా అసలు ఎక్కడా ఆ నిబంధన పాటించడం లేదు. అటు మున్సిపల్ అధికారులు, ఇటు ఆహార భద్రత అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో నిర్వాహకులు ఆడిందే ఆటగా మారింది. కొందరు నిర్వాహకులు నిబంధనలు గాలికొదిలేస్తూ ప్రజారోగ్యాన్ని పణంగా పెడుతున్నారు. తనిఖీలు చేస్తాం హోటళ్లలో పరిశుభ్రత పాటించాలి. నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం. భోజన ప్రియులకు నాణ్యమైన ఆహారం అందించాలి. ప్రతీరోజు తనిఖీలు చేపట్టేలా చర్యలు తీసుకుంటాం. – స్పందన, మున్సిపల్ కమిషనర్ -
బీసీలను మోసం చేస్తున్న ప్రభుత్వం
జగిత్యాల: కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోందని, 42శాతం రిజర్వేషన్ ఇస్తామని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన ప్రభుత్వం.. కేంద్రం ఆమోదిస్తేనే అమలవుతుందని తెలుసుకోలేకపోవడం విడ్డూరంగా ఉందని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తమిళనాడులో రెండుసార్లు ఆర్డినెన్స్ ఇచ్చినా అమలు కాలేదని, రాష్ట్రప్రభుత్వ తీరు బీసీలను మభ్యపెట్టేందుకేనన్నారు. యూరియా కొరతతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. కేసీఆర్ హయాంలో 4 లక్షల టన్నుల గోదాముల నిర్మాణం చేపట్టి ఎరువులు అందించారని, పల్లెప్రగతి ద్వారా అన్ని గ్రామాలకు ట్రాక్టర్లు అందించి పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారని, ఇప్పుడు సిబ్బందికి వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. పెండింగ్ బిల్లుల కోసం సర్పంచులు అసెంబ్లీ, సచివాలం ముట్టడి చేపట్టి కేసుల పాలయ్యారుగానీ.. బిల్లులు మాత్రం తెచ్చుకోలేకపోయారని తెలిపారు. రైతుభరోసా కొంతమందికే ఇచ్చారని, రూ.500 బోనస్‌కు మంగళం పాడారని పేర్కొన్నారు. దళితబంధు రూ.12 లక్షలు ఇస్తామని రూపాయి ఇవ్వలేదన్నారు. యువవికాసం బోగస్ అన్నారు. పెన్షన్ల పెంపు, తులం బంగారం ఏమైందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ.. పచ్చి అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకొచ్చిందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, నాయకులు రమణారావు, లోక బాపురెడ్డి, హరిచరణ్‌రావు పాల్గొన్నారు. రాష్ట్రంలో యూరియా కొరత పల్లెల్లో కుంటుపడిన పారిశుధ్యం మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ -
అడుగంటిన వరదకాలువ
కథలాపూర్: ఎస్సారెస్పీ వరదకాలువలో నీరు అడుగంటడంతో మండలంలోని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏటా మాదిరిగానే వర్షాలు కురుస్తాయని భావించిన రైతులు నార్లు పోసుకున్నారు. రైతులు వరదకాలువ నీటితో పొలాన్ని సిద్ధం చేశారు. వర్షాలు కురవకపోవడంతో వరదకాలువలో నీరు అడుగంటింది. దీంతో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం రివర్స్ పంపింగ్ ద్వారా వరదకాలువకు నీరు వదిలితేనే తాము వరి నాట్లు వేసే అవకాశం ఉందని, లేకుంటే నార్లు ముదిరిపోయే ప్రమాదముందని అంటున్నారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు చొరవ చూపి వరదకాలువలోకి నీరు వదలాలని కోరుతున్నారు. వ్యాక్సిన్‌తో గర్భాశయ క్యాన్సర్‌కు చెక్జగిత్యాల: సర్వైకల్ క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన్‌తో చెక్ పెట్టవచ్చని ఐఎంఏ అధ్యక్షుడు హేమంత్ అన్నారు. శనివారం ఐఎంఏ హాల్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో రోజురోజుకూ క్యాన్సర్ మరణాలు పెరిగిపోతున్నాయని, సర్వైకల్ క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఐఎంఏ ప్రధాన కార్యదర్శి ఆకుతోట శ్రీనివాస్‌రెడ్డి, గైనకాలజీ అసోసియేషన్ కార్యదర్శి శ్రీలత, కోశాధికారి సుధీర్‌కుమార్, ఒడ్నాల రజిత, పద్మరాథోడ్ పాల్గొన్నారు. సీపీఆర్‌పై అవగాహన తప్పనిసరికోరుట్ల: సీపీఆర్‌పై ప్రథమ చికిత్స నిర్వహించే ఆర్ఎంపీ, పీఎంపీలకు అవగాహన తప్పనిసరిగా ఉండాలని ఐఎంఏ సెంట్రల్ కమిటీ సభ్యుడు వై.అనూప్ రావు అన్నారు. పట్టణంలోని ఓ ఆసుపత్రిలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్ఎంపీ, పీఎంపీలకు సీపీఆర్‌పై శిక్షణ నిర్వహించారు. ఇటీవల గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయని, సీపీఆర్ విధానం ద్వారా గుండెకు రక్తప్రసరణ అందించి ప్రాణాలను రక్షించవచ్చని పేర్కొన్నారు. నిత్యం ప్రజల మధ్య ఉండే ఆర్ఎంపీ, పీఎంపీలు తమ పరిధికి మించి వైద్యం చేయరాదని అన్నారు. కార్యక్రమంలో ఐఎంఏ కోరుట్ల అధ్యక్షుడు రేగొండ రాజేష్, కార్యదర్శి జగదీశ్వర్, అన్వేశ్, సమీర్, ఆర్ఎంపీ, పీఎంపీ అధ్యక్షుడు సందా శ్రీపతి, సిద్దిక్ అలీ, తదితరులు పాల్గొన్నారు. -
ఆకతాయిల ఆగడాలకు చెక్
● మహిళల భద్రతకు షీ టీమ్‌లు ● అవగాహన కల్పిస్తున్న పోలీసులు ● ఫిర్యాదు చేస్తే సత్వరమే చర్యలుజగిత్యాలక్రైం: జిల్లాలో విద్యార్థినులు, మహిళలకు భద్రత కల్పించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షీటీం చక్కగా పనిచేస్తున్నాయి. వేధింపులకు పాల్పడుతున్న ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్టు వేస్తున్నాయి. ప్రత్యేకంగా జనసంచారం ఉన్న చోట మఫ్టీలో తిరుగుతూ నిందితులను పట్టుకుంటున్నాయి. రద్దీ ప్రాంతాలు, బస్టాండ్లు, విద్యాసంస్థల పరిసర ప్రాంతాల్లో షీటీం పోలీసులు మఫ్టీలో ఉంటున్నారు. జగిత్యాల, మెట్పల్లి సబ్ డివిజన్ల పరిధిలో షీ టీం పోలీసులు ఆ శాఖ పనితీరుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి వంటి పట్టణాలు, మండల కేంద్రాల్లోని బస్టాండ్ కళాశాలలు, పాఠశాలలో అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుత తరుణంలో మహిళలు అన్ని రంగాల్లో పోటీపడి పనిచేస్తున్నారు. తాము పనిచేస్తున్న రంగాల్లో ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్నారు. అయినా వారికి ఆకతాయిల వేధింపులు తప్పడం లేదు. భద్రతకు ప్రాధాన్యం మహిళలు, విద్యార్థుల రక్షణకు షీటీం బృందాలు నిరంతరం కృషిచేస్తున్నాయి. తమకు వచ్చిన ఫిర్యాదులను స్వీకరిస్తూ ఆకతాయిల ఆగడాలను వీడియో రికార్డ్ చేయడంతోపాటు కొన్ని సందర్భాల్లో కేసులు నమోదు చేస్తున్నారు. జగిత్యాల, మెట్పల్లి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో 20 మండలాల్లో షీ టీం బృందాలు పనిచేస్తున్నాయి. టీమ్‌లో ఎస్సై స్థాయి అధికారితో పాటు మహిళ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు ఉంటారు. అవగాహన సదస్సులు ఆకతాయిలు వేధిస్తే వెంటనే షీటీంకు సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. చీటింగ్‌పై పోలీసు శాఖ అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. జిల్లావ్యాప్తంగా జనవరి నుంచి ఇప్పటివరకు 43 చోట్ల అవగాహన సదస్సులు నిర్వహించారు. వేధింపులకు గురిచేసే ఆకతాయిలు ఎక్కువగా సంచరించే 172 అడ్డాలను గుర్తించారు. ఇప్పటి వరకు 28 ఫిర్యాదులు రాగా.. ఐదు కేసుల నమోదుతోపాటు, 35 మందిపై ఈపెట్టీ కేసులు నమోదు చేసి.. 46 మందికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అసభ్యకరంగా ప్రవర్తిస్తే డయల్ 100 లేదా 87126 70783కి వాట్సాప్ నంబర్లో సంప్రదించాలని పోలీసులు సూచిస్తున్నారు. కార్యక్రమాలు విస్తృతపరచాలి షీటీం పోలీసులు అవగాహన కార్యక్రమాలు మరింత విస్తృత పర్చాల్సిన అవసరం ఉంది. అప్పుడే మారుమూల గ్రామీణ ప్రాంత మహిళలు, విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ధైర్యంగా ముందుకు వస్తారు. షీటీం పోలీసుల అవగాహన సదస్సలు బాగున్నాయి. – మారు సత్తమ్మ, మహిళా సంఘం అధ్యక్షురాలు, జగిత్యాల ధైర్యంగా ఫిర్యాదు చేయాలి బస్టాండ్, పాఠశాలలు, కళాశాలల వద్ద మహిళలను వేధించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. పాఠశాలలు, కళాశాలల వద్ద షీటీమ్ ఫోన్ నంబర్లు తెలిసేలా ఏర్పాటు చేశాం. ఆకతాయిల వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు నిర్భయంగా ముందుకు రావాలి. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. – అశోక్‌కుమార్, ఎస్పీ -
ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు
కొత్తగా రెండు జగిత్యాల: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా అధికారులు ప్రక్రియ ప్రారంభించారు. జిల్లాలో ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్పీటీసీల పునర్విభజన పూర్తి చేశారు. జిల్లా ఏర్పడినప్పుడు 18 మండలాలు ఉండగా.. తాజాగా భీమారం, ఎండపల్లి మండలాలు ఆవిర్భవించారు. ఈ రెండు చోట్ల జెడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రతి మండలంలో ఐదుకు తగ్గకుండా ఎంపీటీసీ స్థానాలు ఉండాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు చేశారు. కొత్తగా ఏర్పడిన ఎండపల్లి మండలంలో ఏడు ఎంపీటీసీ స్థానాలు ఉన్నప్పటికీ అదనంగా ఒకటి కొత్తగా కలిపారు. అలాగే జగిత్యాల అర్బన్‌లో నాలుగు ఎంపీటీసీ స్థానాలు ఉండగా అదనంగా మరొకటి ఏర్పాటు చేశారు. గతంలో జిల్లావ్యాప్తంగా 214 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. ప్రస్తుతం 216కు చేరాయి. తాజాగా 216 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. పెరిగిన జెడ్పీటీసీ స్థానాలు జిల్లాలో గతంలో 18 జెడ్పీటీసీ స్థానాలు మాత్రమే ఉండేవి. కొత్తగా భీమారం, ఎండపల్లి మండలాలు ఏర్పడడంతో 20 మండలాలు అయ్యాయి. ఈ క్రమంలో అక్కడ కూడా జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ లెక్కన జిల్లాలో 20 జెడ్పీటీసీలు, 20 ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఇప్పటికే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని సూచనప్రాయంగా తెలియజేయడంతో ఎన్నికల వేడి ప్రారంభమైంది. ఎంపీటీసీల పునర్విభజన షెడ్యూల్ ప్రకటించడంతో జిల్లాలో ముందుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలే జరుగుతాయని భావిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో బూత్‌లెవల్ అధికారులకు ఎస్కేఎన్ఆర్ కళాశాలలో శిక్షణ ఇచ్చారు. బీఎల్వోల యాప్ ద్వారా ఓటర్ల నమోదు చేపట్టారు. అధికారులు పోలింగ్ బూత్‌ల పరిశీలన చేసి అన్ని ఏర్పాట్లు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల వేడి స్థానిక సంస్థల పదవీకాలం ముగిసి దాదాపు ఏడాదిన్నర గడుస్తున్నా.. ఎన్నికల నిర్వహించకపోవడంతో నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరుగనున్నాయి. జెడ్పీటీసీలు అందరు కలిసి జెడ్పీ చైర్మన్‌ను ఎన్నుకోనుండగా.. ఎంపీటీసీలందరూ కలిసి ఎంపీపీని ఎన్నుకుంటారు. ప్రభుత్వం త్వరలోనే రిజర్వేషన్లు ఖరారు చేయనున్న నేపథ్యంలో గ్రామాల్లో ఎన్నికల కోలాహలం మొదలైంది. మండలాల వారీగా ఎంపీటీసీ స్థానాలు బీర్పూర్ : 6 భీమారం : 6 బుగ్గారం : 6 ధర్మపురి : 13 ఎండపల్లి : 8 గొల్లపల్లి : 13 ఇబ్రహీంపట్నం : 12 జగిత్యాల రూరల్ : 16 జగిత్యాల : 5 కథలాపూర్ : 13 కొడిమ్యాల : 12 కోరుట్ల : 12 మల్లాపూర్ : 15 మల్యాల : 14 మేడిపల్లి : 9 మెట్పల్లి : 14 పెగడపల్లి : 13 రాయికల్ : 14 సారంగాపూర్ : 7 వెల్గటూర్ : 8 ఎంపీటీసీ స్థానాల పునర్విభజన తుది జాబితా విడుదల జిల్లాలో మొదలైన ఎన్నికల వేడి జిల్లాలో గ్రామపంచాయతీలు : 385 31–01–2025 ప్రకారం ఓటర్లు : 6,02,236 జెడ్పీటీసీ స్థానాలు : 20 ఎంపీపీ స్థానాలు : 20ప్రక్రియ చేపట్టాం జిల్లాలో గతంలోనే ప్రక్రియ పూర్తయినప్పటికీ నూతనంగా మరో రెండు ఎంపీటీసీలు, కొత్త మండలాలు కావడంతో రెండు జెడ్పీటీసీలు ఏర్పడ్డాయి. అక్కడ మండలాల వారీగానే ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ కల్పించాం. – గౌతమ్‌రెడ్డి, జెడ్పీ సీఈవో -
అమ్మ, అక్క పార్థివదేహాలు
నేత్ర, అవయవదానంతోపాటు దేహదానంపై కాళోజీ నారాయణరావు మరణించినప్పుడు అవగాహన వచ్చింది. దీంతో 2003లో వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీకి నా శరీరాన్ని దానం చేస్తానని రాసి ఇచ్చాను. మా అమ్మ, అక్క కూడా ముందుకు వచ్చారు. అమ్మ 2014లో మరణించగా కరీంనగర్‌లోని చల్మెడ మెడికల్ కాలేజీకి, అక్క 2023లో మరణిస్తే వరంగల్ మెడికల్ కాలేజీకి వారిద్దరి దేహాలను దానం చేశాం. నా నిర్ణయాన్ని గౌరవించి నా భార్య నిర్మల కూడా దేహదానానికి అంగీకారాన్ని తెలిపింది. – సురేశ్‌బాబు, ఎన్టీపీసీ రిటైర్డ్ ఉద్యోగి, గోదావరిఖని అవగాహన పెరిగింది నేత్ర, అవయ, దేహదానాలపై కరీంనగర్ ఉమ్మడి జిల్లా ముందుంది. ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. సదాశయ ఫౌండేషన్ ఏర్పాటు చేయడానికి స్ఫూర్తి నా సోదరుడు అశోక్‌కుమార్. 2006లో హార్ట్ ఎటాక్‌తో మరణించగా, ఆయన ఆశయం మేరకు నేత్రదానంతోపాటు, పార్థీవదేహాన్ని కాకతీయ మెడికల్ కాలేజీకి దానం చేశాం. మాది సంప్రదాయ వైష్ణవ కుటుంబం. మా కుటుంబం సానుకూలంగా ఉన్నా బంధువర్గం నిరాకరించి గొడవకు దిగారు. తమ్ముడి ఆశయం నెరవేర్చడానికి అందరూ అంగీకరించేలా నచ్చజెప్పి చేశాం. – టి.శ్రవణ్‌కుమార్, జాతీయ అధ్యక్షుడు, సదాశయ ఫౌండేషన్ -
వేర్వేరు కారణాలతో ముగ్గురు రైతుల మృతి
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ముగ్గురు రైతులు వివిధ కారణాలతో దుర్మరణం చెందారు. ఒకరు గుండెపోటుకు గురైతే.. మరొకరు వ్యవసాయ బావిలో పడగా.. ఇంకొకరు నీటిగుంతలోపడి ప్రాణాలు విడిచారు.బతుకుపోరులో ఆగిన గుండె తంగళ్లపల్లి(సిరిసిల్ల): పశువులను మేతకు తీసుకెళ్లిన రైతు గుండెపోటుకు గురై చికిత్స పొందుతూ మృతిచెందిన ఘ టన తంగళ్లపల్లి మండలం బస్వాపూర్‌లో శుక్రవారం చో టుచేసుకుంది. రైతు అనవేని దేవయ్య(55) ఈనెల 6న పశువులను మేపేందు కు గ్రామ శివారుకు తీసుకెళ్లాడు. ఈక్రమంలోనే గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే దేవయ్యను సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి కరీంనగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా స్టంట్ వేశారు. కానీ దేవయ్య కోమాలోకి వెళ్లడంతో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశాడు. మృతుడికి భార్య లక్ష్మి, కూతురు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. వ్యవసాయబావిలో పడి.. శంకరపట్నం(మానకొండూర్): లింగాపూర్ గ్రామానికి చెందిన అంతం బాపురెడ్డి(55) బంధువులు వ్యవసాయబావి పూడిక తీస్తుండగా వెళ్లి పక్కనే ఉన్న మరోబావి లో అదుపు తప్పి పడిపోయా డు. క్రేన్ పనులు, సమీపంలో వరి నాటు వేస్తున్న కూలీలు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సాయంతో బాపురెడ్డి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి భార్య భాగ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం హుజూరాబాద్ ఆస్పత్రికి తరలించారు. నీటిగుంతలోపడి.. ఓదెల(పెద్దపల్లి): గుంపుల గ్రామానికి చెందిన రైతు దాసరి మురళి(50) ప్రమాదవశాత్తు గుంతలోపడి మృతిచెందాడు. పంట పొలానికి నీరు పెట్టేందుకు శుక్రవారం మురళి సైకిల్‌పై వెళ్లాడు. సాయంత్రం తిరిగి ఇంటికి వస్తుండగా రోడ్డు పక్కనున్న నీటిగుంతలో పడి ఊపిరాడక చనిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసునమోదు చేసుకున్నారు. -
నలుగురికి మేలు జరగాలని..
కోరుట్లటౌన్: ‘మనం చచ్చినా, బతికినా నలుగురికి మేలు జరగాలి. అదే చిన్ననాటి నుంచి ఆశయం. టీచర్ ఉద్యోగం వచ్చినప్పటి నుంచి పది మందికి సాయం చేయాలనే తపనతో కొనసాగిన. రిటైర్డ్ అయ్యాక సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తున్న. ఆఖరికి చనిపోయినా నలుగురికి ఉపయోగపడాలి’. అని అంటున్నాడు కోరుట్లకు చెందిన రిటైర్డ్ టీచర్ వోటారికారి చిన్నరాజన్న. మరణానంతరం అవయవదానం చేయాలన్న ఉద్దేశంతో పదేళ్ల క్రితం సదాశయ ఫౌండేషన్ నిర్వాహకులను సంప్రదించి అంగీకారపత్రం తీసుకున్నారు. అవయవదాతలు పునర్జన్మ ఇచ్చినవారవుతారని పేర్కొన్నారు. – చిన్నరాజన్న -
ధన్యజీవులు
కోల్‌సిటీ(రామగుండం)/ిసరిసిల్లకల్చరల్: అస్తమిస్తూ వెలుగునిస్తున్నారు. మట్టిలో కలవకుండా మరో ప్రాణాన్ని బతికిస్తున్నారు. ఓ మనిషిగా మరణించి కుటుంబ సభ్యులకు కడుపు కోత పెట్టినా.. మరో వ్యక్తిలో సజీవంగా బతికే ఉంటున్నారు. అవయవదానంతో మరొకరికి పునర్జన్మనివ్వడమే కాకుండా.. వారూ పునర్జన్మను ఎత్తుతున్నారు. వేలల్లో అవయవ దానాలు సదాశయ ఫౌండేషన్ సంస్థ ద్వారా నేత్ర, అవయవ, శరీర, చర్మదానాలతోపాటు, సమాజహితానికి తోడ్పడే అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 1,500 నేత్రదానాలు, 90 వరకు అవయవ, 150 వరకు దేహదానాలు చేయగా, 1,600 వరకు అవయవదానాలపై అవగాహన సదస్సులు నిర్వహించారు. దీంతో సుమారు 50,000 మందికి పైగా మరణానంతరం నేత్ర, అవయవ, దేహదానాలకు స్వచ్ఛందంగా అంగీకారం తెలుపడం గమనార్హం. అవయవదాతలకు గౌరవం దక్కాలి మరణాంతరం నేత్ర, అవయవ, దేహదానాలు చేస్తున్న దాతలకు గౌరవం కల్పించాలని సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు కొంతకాలంగా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తున్నారు. అవయవదానాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టం చేయాలని, అవయవ దానం చేసిన కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తున్న తరహాలోనే తెలంగాణలో కూడా అందించాలని కోరుతున్నారు. ముందుకొచ్చిన ప్రిన్సిపాల్ కుటుంబం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కనకశ్రీ విజయ రఘునందన్ అరుదైన త్యాగానికి శ్రీకారం చుట్టారు. తనతో పాటు సతీమణి, తండ్రిని దేహదానానికి ఒప్పించి తమ అభ్యర్థన పత్రాలను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు అందజేశారు. రఘునందన్ స్ఫూర్తిగా మరి కొంత మంది దేహ, అవయవ దానానికి ముందుకు వస్తున్నారు. జిల్లాలో దేహదానానికి సంబంధించిన ఇలాంటి గుర్తింపు తెచ్చుకున్న తొలి కుటుంబం రఘునందన్‌దే కావడం విశేషం. -
మట్టిలో కలిసిపోకుండా..
ఓదెల(పెద్దపల్లి): ఓదెల మండలం గుంపుల గ్రామానికి చెందిన తుమ్మ రామకృష్ణ అనారోగ్యంతో ఇటీవల మృతిచెందగా అతడి కిడ్నీలు, కాలేయం దానం చేశారు. మృతుడి భార్య నిర్మల, కూతురు ప్రవళిక, కుమారుడు పృథ్వీరాజ్, కుటుంబసభ్యుల సమక్షంలో సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దానం చేశారు. ఓదెల గ్రామానికి చెందిన అయిలు మల్లేశ్ ఇటీవల రోడ్డుప్రమాదంలో మృతిచెందగా, అతడి కళ్లను భార్య రాధిక, కుటుంబసభ్యులు సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దానం చేశారు. అలాగే ఓదెల మండలం అబ్బిడిపల్లె గ్రామస్తులంతా అవయవదానానికి ముందుకొచ్చి జిల్లా కలెక్టర్‌కు అంగీకారపత్రం అందజేశారు. -
ప్రభుత్వ పాఠశాలలో ఐఐటీ పాఠాలు
ఇల్లంతకుంట(మానకొండూర్): ఇల్లంతకుంట మండలం గాలిపల్లి, ఇల్లంతకుంట, రేపాక, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలు స్కూల్ కనెక్ట్ ప్రోగ్రామ్‌లో భాగంగా మద్రాస్ ఐఐటీతో భాగస్వామ్యం అయ్యాయని ఆయా పాఠశాలల హెచ్ఎంలు పావని, ప్రేమలత, రేవతీదేవి శుక్రవారం తెలిపారు. ఈమేరకు మద్రాస్ ఐఐటీ ఈమెయిల్ ద్వారా తమకు సమాచారం అందినట్లు తెలిపారు. పాఠశాల, ఉన్నతవిద్య మధ్య అంతరాన్ని తగ్గించడం లక్ష్యంగా ఐఐటీ మద్రాస్ సెంటర్ ఫర్ అవుట్ రీచ్ అండ్ డిజిటల్ ఎడ్యుకేషన్(కోడ్) ద్వారా స్కూల్ కనెక్ట్ ప్రోగ్రాం ప్రారంభించినట్లు పేర్కొన్నారు. తమ పాఠశాలలోని విద్యార్థులకు ఆన్లైన్లో మద్రాస్ ఐఐటీ ఏరోస్పేస్, ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ వంటి పది రకాల కోర్సులు 8 వారాల వ్యవధితో నామమాత్రపు రుసుంతో అందించనున్నట్లు వివరించారు. 10వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్లో ఆగస్టు నుంచి రెండు నెలలపాటు ఈ కోర్స్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇల్లంతకుంటలో మూడు హైస్కూళ్లు ఎంపిక -
40 సెకండ్లు.. 118 మూలకాలు
● పీరియాడిక్ టేబుల్ కంఠస్థం ● బాలుడి అద్భుత ప్రదర్శన ● మెమోరీ చాంపియన్ అవార్డు సాధన కరీంనగర్‌కల్చరల్: కరీంనగర్‌కు చెందిన కనపర్తి మనవేంద్ర రసాయన శాస్త్రంలోని 118 మూలకాల పేర్లు, వాటి అటామిక్, మాస్ నంబర్లను 40 సెకన్లలోనే కంఠస్థంగా చెప్పి శ్రీఅమేజింగ్ మైండ్ ప్రెజంటేషన్ ఇన్ కెమిస్ట్రీశ్రీ రికార్డు సాధించాడు. ఈ అద్భుతమైన ప్రదర్శన యూఎస్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు కావడం విశేషం. నగరంలోని ఫిలింభవన్‌లో శుక్రవారం కనుపర్తి మనవేంద్రను సన్మానించి సర్టిఫికెట్ అందజేశారు. జిల్లా కేంద్రంలోని చేంజ్ మెమొరీ అకాడమీ శిక్షణలో ఉన్న మనవేంద్ర.. వివేకానంద స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. డాక్టర్ వేణుకుమార్ నేతృత్వంలో మెమొరీ ఫైలింగ్ టెక్నిక్స్ ద్వారా శిక్షణ పొందాడు. గతంలోనే ఈ బుడతడు జాతీయస్థాయి మెమొరీ చాంపియన్‌షిప్ సాధించాడని ట్రైనర్ వేణుకుమార్ గుర్తుచేశారు. ఈ ఘనతకు గుర్తింపుగా శ్రీసూపర్ మెమొరీ చాంప్శ్రీ అవార్డు పొందిన మనవేంద్రను తల్లిదండ్రులు శతి – మురళి అభినందించారు. విద్యార్థి ప్రతిభను వెలికితీస్తున్న డాక్టర్ వేణుకుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అకాడమీ ట్రైనర్లు తిరుపతి, హరీశ్ కుమార్, అశోక్ సామ్రాట్, నోముల రాజకుమార్, ఈశ్వర్, కిశోర్ పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ అంగన్వాడీ టీచర్ మృతి
వీర్నపల్లి(సిరిసిల్ల)/సిరిసిల్లటౌన్: రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం మద్దిమల్లతండాలో ప్రమాదవశాత్తు గాయపడిన అంగన్వాడీ టీచర్ మాజోజు స్వరూప(52) చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. స్థానికులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు. మద్దిమల్ల గ్రామానికి చెందిన మాజోజు స్వరూప తండాలోని అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తుంది. నిత్యం అక్కడికి వెళ్లి వస్తుంటుంది. ఈనెల 8న విధులు ముగించుకొని ఇంటికి నడుచుకుంటూ వస్తుండగా బైక్‌పై ఎక్కించుకున్న వ్యక్తి మార్గమధ్యలో అఘాయిత్యానికి పాల్పడేందుకు యత్నించాడు. అతని నుంచి తప్పించుకునే క్రమంలో బండి పై నుంచి పడిపోవడంతో తీవ్రంగా గాయపడింది. గమనించిన స్థానికులు 108 వాహనంలో ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఐదు రోజులుగా చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచింది. మృతురాలి కుమారుడు విష్ణుసాగర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మణ్ తెలిపారు. అంగన్వాడీ టీచర్ మృతి విషయాన్ని తెలుసుకున్న కలెక్టర్ దహన సంస్కారాల కోసం రూ.20వేల చెక్కును అందజేశారు. అఽఘాయిత్యాలు నిలువరించాలి ఐసీడీఎస్ కార్యకర్తలపై అఽఘాయిత్యాలను ప్రభుత్వం నిలువరించాలని అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు ఎదురుగట్ల మమత కోరారు. మద్దిమల్లతండా అంగన్వాడీ టీచర్ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విధుల్లో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కడారి రాములు, కాంగ్రెస్ కార్యకర్త కల్లూరి చందన, అంగన్వాడీ టీచర్లు శాంత, సరోజన, మంజుల, అన్నపూర్ణ, వనజ, శోభ తదితరులు పాల్గొన్నారు. కన్నీరుపెట్టుకున్న అంగన్వాడీలు నిందితుడిని శిక్షించాలని డిమాండ్ -
టీచర్ చెప్పిన పాఠం స్ఫూర్తి
సింగరేణి స్కూల్లో 8వ తరగతి చదువుతున్నప్పు అవయవదానంతో ఇతరులకు పునర్జన్మ ఇవ్వొచ్చని బయాలజీ టీచ్చర్ చెప్పిన మాటలు, టీచర్ కూడా అవయవదానానికి అంగీకరించడం నాకు స్ఫూర్తిని చ్చాయి. ఇటీవలే నాకు 18 ఏళ్లు నిండాయి. ఈనెల 4న సింగరేణి స్కూల్ టీచర్ శశికళ సమక్షంలో నేత్ర, అవయవదానం చేయడానికి అంగీకారం తెలుపుతూ సదాశయ ఫౌండేషన్‌కు రాసి ఇచ్చాను. మా అమ్మ కూడా నా నిర్ణయాన్ని మెచ్చుకుంది. నాతోపాటు అమ్మ కూడా అవయవదానం చేయడానికి అంగీకారం తెలిపింది. – శివగణేశ్, డీఎంఎల్టీ స్టూడెంట్, గోదావరిఖని అమ్మ నేత్రాలను.. రామగుండం మేయర్ పదవిలో ఉన్నప్పుడు అవయదానాలపై చాలా అవగాహన సదస్సుల్లో అతిథిగా పాల్గొన్నాను. మరణించిన వారి నేత్రాలు, అవయవాలను దానం చేసినట్లు సదస్సుల్లో కుటుంబ సభ్యులు చెబుతుంటే చాలా ప్రేరణ కలిగింది. అప్పుడే నా మరణాంతరం అవయవదానం చేస్తానని అంగీకారపత్రాలపై సంతకాలు చేసిన. మా అమ్మ మరణిస్తే ఆమె నేత్రాలను దానం చేయించా. నేత్ర, అవయదానాలకు సెలబ్రెటీలు, అన్నివర్గాల యువత ముందుకు రావాలి. – కొంకటి లక్ష్మీనారాయణ, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు -
రూ.18.71 కోట్ల సీఎంఆర్ మాయం
సుల్తానాబాద్‌రూరల్/సుల్తానాబాద్: రైతుల వద్ద కొనుగోలు చేసి సీఎంఆర్(మర ఆడించేందుకు)కు కేటాయించిన ధాన్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలించి విక్రయించి సొమ్ము చేసుకుంటున్న రైస్‌మిల్లుల పన్నాగాన్ని సివిల్ సప్లయ్, టాస్క్‌ఫోర్స్ అధికారులు బట్టబయలు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి శివారులోని సాయి మహాలక్ష్మీ, సౌభాగ్యలక్ష్మీ రైస్‌మిల్లుల యజమానులు తమకు కేటాయించిన ధాన్యాన్ని 5 లారీల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తుండగా టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీ ప్రభాకర్సాదేశాల మేరకు అధికారులు గురువారం పట్టుకొని పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా శుక్రవారం జిల్లా సివిల్ సప్లయ్ అధికారి శ్రీనాథ్ రైస్‌మిల్లుల్లోని ధాన్యం ప రిశీలించి విచారణ చేపట్టారు. ఆయన మా ట్లాడుతూ, రెండు రైస్‌మిల్లులకు 2023–2024 సంవత్సరంలో యాసంగి ధాన్యం సీఎంఆర్ కోసం కేటాయించగా సాయి మహాలక్ష్మీ మిల్లులో 61, 65,305 క్వింటాళ్లు, సౌభాగ్యలక్ష్మీ మిల్లులో 10,800 క్వింటాళ్ల ధాన్యంలో వ్యత్యాసం వచ్చిందన్నారు. దీని విలువ(ఎకానమిక్ కాస్ట్) ప్రకారం సుమారు రూ.18.71కోట్లు ఉంటుందని తెలిపారు. ప్రభు త్వం కేటాయించిన ధాన్యాన్ని ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న యజమాని మారుతిపై 6ఏ కేసు నమోదు చేశామన్నారు. లారీల్లో ధాన్యం ఎక్కడికి తరలించారనే దానిపైనా లోతుగా విచారణ చేస్తున్నట్లు డీఎస్వో తెలిపారు. ధాన్యం తరలిస్తున్న ఐదు లారీలను పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ సిబ్బంది విచారణ చేపట్టిన జిల్లా సివిల్ సప్లయ్, టాస్క్‌ఫోర్స్ అధికారులు -
తాగి వాహనాలు నడిపిన 45 మందికి జైలు
వేములవాడ: మద్యం సేవించి వాహనాలు నడిపినా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా జైలు శిక్ష, జరిమానాలు తప్పవని వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ హెచ్చరించారు. ఇటీవల డ్రంకెన్‌డ్రైవ్ టెస్టుల్లో పట్టుబడిన వారికి పోలీస్‌స్టేషన్ ఆవరణలో శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు. ర్యాష్‌గా లారీ నడిపిన వ్యక్తికి 20 రోజుల జైలు, రూ.10వేల జరిమానా విధించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 45 మందికి జైలుశిక్షతోపాటు జరిమానా విధిస్తూ వేములవాడ జూనియర్ సివిల్ జడ్జి ప్రవీణ్‌కుమార్ తీర్పు వెల్లడించారు. అనంతరం డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీల్లో దొరికిన వారితో ట్రాఫిక్ ఆర్ఎస్సై రాజు ఆధ్వర్యంలో ఇంకెప్పుడు మద్యం సేవించి వాహనాలు నడపమని ప్రతిజ్ఞ చేయించారు. ర్యాష్ డ్రైవింగ్ చేసిన లారీ డ్రైవర్‌కు 20 రోజుల జైలు 24 మందికి జరిమానా -
చట్టబద్ధత తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి
కరీంనగర్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎంపీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడిల కుమార్‌గౌడ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్, సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్‌లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం కరీంనగర్‌లోని టవర్‌సర్కిల్‌లో వాల్‌పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడారు. ఎన్నికలకు ముందు చెప్పిన కామారెడ్డి డిక్లరేషన్, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్ చట్టబద్ధత కల్పిస్తామని నమ్మబలికి కాలయాపన చేస్తూ బీసీలను మోసం చేయడమే అన్నారు. పార్టీలకు అతీతంగా ఈనెల 15న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద బీసీల మహా ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుప్ప ప్రకాశ్, తమ్మన్నగారి సంగన్నచ సిద్దగోని శ్రీనివాస్, వల్లూరి వీరేశ్, నవీన్, సాగర్, రాజేశ్, మేకల కనకయ్య తదితరులు పాల్గొన్నారు. -
తండ్రి స్ఫూర్తితో..
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): రామగుండం కా ర్పొరేషన్ యైటింక్లయిన్‌కాలనీకి చెందిన దాసారపు మో హన్ గత డిసెంబర్లో అనా రోగ్యంతో మృతిచెందాడు. కుటుంబ సభ్యులు అతడి నే త్రాలు, దేహాన్ని ‘సిమ్స్’కు దానం చేశారు. సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంస్మరణ సభలో బాధిత కుటుంబానికి అభినందన పత్రం అందజేశారు. ఈసందర్భంగా మోహన్ చిన్న కూతురు అశ్విని తన మరణానంతరం దేహదానం చేసేందుకు అంగీకారం తెలుపగా, పలువురు ఆమెను అభినందించారు. ఈసందర్భంగా అశ్విని మాట్లాడుతూ, తన తండ్రి చెప్పిన విధంగా మనిషి మరణించిన తర్వాత అవయవాలు మట్టిలో కలిసిపోకుండా పది మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో దేహదానం చేసేందుకు ముందుకొచ్చానని పేర్కొన్నారు. -
ధన్యజీవులు!
● అపురూప త్యాగం దేహదానం ● వైద్య విద్యార్థులకు పాఠ్య పుస్తకం ● అవయవదానంతో పునర్జన్మ ● నేత్రదానంతో మరో ఇద్దరికి చూపు ● ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న అవగాహన‘భగవంతుడి కోసం కళ్లు పెకిలించి ఇచ్చిన భక్త కన్నప్ప... గురు దక్షిణ కోసం బొటనవేలిని కోసి ఇచ్చిన ఏకలవ్యుడు... దానంగా తొడకోసిచ్చిన శిబిచక్రవర్తి వీరంతా గొప్పవాళ్లయితే... ప్రస్తుత సమాజంతో లక్షలు, కోట్లున్నా కొనలేని.. కొనడానికి విలువకట్టలేని తమ నేత్రాలు, అవయవాలు, పార్థీవ దేహాలను దానం చేయడానికి ముందుకు వస్తున్న కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని కొందరు వ్యక్తులు ధన్యజీవులు’.. పరోపకారమే ఇదమ్ శరీరమ్.. అని సంపూర్తిగా నమ్మి తాము పుట్టిందే పరులకు ఉపకారం చేయడానికనుకొని మనసా.. వాచా.. కర్మ.. అని ఆచరించేవారు జీవించినంత కాలం ఇతరులకు సేవచేయాలని కోరుకోవడం సాధారణమైన విషయం. జీవం పోయిన తర్వాత కూడా ఇతరులకు ఉపయోగపడడమే గొప్ప విషయం.మనం మరణించినా.. బతకవచ్చు. మన కళ్లు ఈలోకాన్ని చూస్తాయి. మన గుండె లబ్‌డబ్ అంటూ కొట్టుకుంటోంది. మన ఊపిరితిత్తులు శ్వాసను అందిస్తాయి. కిడ్నీలు శుద్ధి చేస్తూనే ఉంటాయి.. ఇదంతా శరీరంలోని అవయవ దానంతోనే సాధ్యమవుతుంది. కేవలం అవగాహన లేక అనేక మరణాలు మట్టిపాలు, నిప్పుపాలు చేస్తున్నారు. ఇంకొకరికి దానం చేస్తే, వారి ఆయుష్షు పెంచవచ్చు. బ్రెయిన్‌డెడ్‌తో అవయవ దానం చేస్తే కనీసం ఎనిమిది మందికి పునర్జన్మ ఇవ్వొచ్చు. నేత్రదానంతో ఇద్దరి జీవితాల్లో వెలుగులు పంచవచ్చు. మళ్లీ మన కళ్లు ఈ లోకాన్ని చూడొచ్చు. దేహదానం చేస్తే.. మెడికో స్టూడెంట్స్‌కు పాఠ్యపుస్తకం కావచ్చు. వారి పరిశోధనకు దోహదపడవచ్చు. ఈ దానాలపై కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో అవగాహన పెరుగుతోంది. దానం చేయడానికి అంగీకారాన్ని ప్రకటించడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు.స్ఫూర్తి -
రెండురోజులు భగీరథ నీటి సరఫరా నిలిపివేత
జగిత్యాల: మెట్పల్లి మండలం వెంకట్రావ్పేట గ్రామ సమీపంలో మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీ కారణంగా జిల్లాలో రెండురోజుల పాటు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు భగీరథ గ్రిడ్ డివిజన్ ఇంజనీరింగ్ అధికారి శేఖర్‌రెడ్డి తెలిపారు. పైప్‌లైన్ మరమ్మతు కారణంగా ఈనెల 12,13 తేదీల్లో నీటి సరఫరా ఉండదన్నారు. జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గంలోని (వెల్గటూర్, ధర్మారం, ఎండపల్లి మండలాలను మినహాయించి) మున్సిపాలిటీలకు భగీరథ నీటిని నిలిపివేయడం జరుగుతుందని, ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. -
విద్యుత్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి
సారంగాపూర్(జగిత్యాల): పొలాల వద్ద విద్యుత్ సమస్య తలెత్తినప్పుడు సంబంధిత అధికారులు, సిబ్బంది దృష్టికి తీసుకెళ్తే ప్రమాదాలకు తావుండదని సీజీఆర్ఎఫ్ (కన్జుమర్ గ్రీవెన్స్ రీఅడ్రెస్సల్ ఫోరం) చైర్పర్సన్ నారాయణ అన్నారు. శుక్రవారం బీర్పూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో బీర్పూర్, సారంగాపూర్, రాయికల్ మండలాల విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదికలో పాల్గొని మాట్లాడారు. జిల్లాలో నీటి వనరులు పుష్కలంగా ఉన్నందున పంటల సాగు బాగా ఉందని, రైతులు తమ పొలాల వద్ద కొత్తగా మోటార్లు ఏర్పాటు చేసుకుంటే దానికి అనగుణంగా డీడీలు చెల్లించాలని, దీంతో ట్రాన్స్ఫార్మర్లపై లోడ్ పెంచడానికి అవకాశం ఉంటుందన్నారు. వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లిస్తే మరింత మెరుగైన సరఫరా ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నారు. తాను వచ్చిన దారిలో పొల్లాలో పోల్స్ వంగి ఉన్నాయని, వాటిని సరిచేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో టెక్నికల్ మెంబర్ రామకృష్ణ, ఫైనాన్స్ మెంబర్ లకావత్ కిషన్, ఫోర్త్ మెంబర్ రాజాగౌడ్, ఎస్ఈ సుదర్శన్, అకౌంట్స్ అధికారి తిరుపతి, డీఈ రాజిరెడ్డి, ఏడీఈ సింధూశర్మ, ఏఈలు శ్రీనివాస్, ప్రవీణ్, నవీన్, రాజేశం, సిబ్బంది, పాల్గొన్నారు. పరిష్కార వేదికలో లైన్ల షిఫ్టింగ్ 2, కొత్త ట్రాన్స్ఫార్మర్లు 2, మరో 6 దరఖాస్తులు రాగా వాటిని పరిష్కరించారు. -
పుష్పాలంకరణ
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి అనుబంధ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం స్వా మివారికి క్షీరాభిషేకం చేసి పూలతో అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో అర్చకుడు శ్రీనివాసాచార్యులు లక్ష్మీహవన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు త రలివచ్చి స్వామివారలను దర్శించుకున్నారు. సమయపాలన పాటించాలిజగిత్యాల: అధికారులు సమయపాలన పాటించాలని అదనపు కలెక్టర్ లత అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని వివిధ శాఖల కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెండింగ్ ఫైల్స్ వెంటనే పరిష్కరించాలన్నారు. ఏవో హకీమ్ తదితరులు ఉన్నారు. నాణ్యమైన విద్య నందించాలి ధర్మపురి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పౌష్టికాహారంతో పాటు నాణ్యమైన విద్య అందించాలని అదనపు కలెక్టర్ బీఎస్ లత అన్నారు. శుక్రవారం ధర్మపురిలోని మైనార్టీ గురుకుల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా అని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. వర్షంతో గదుల్లోకి నీరు చేరి కొంత ఇబ్బంది అవుతుందని విద్యార్థులు తెలుపగా సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం పాఠశాలలో నిర్వహించిన మాక్ పోలింగ్‌లో పాల్గొన్ని ఓటు వేశారు. ఇన్చార్జి తహసీల్దార్ సుమన్, ఎంపీడీవో రవీందర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్ జ్యోతి తదితరులున్నారు. కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించాలిజగిత్యాల: జనాభా పెరుగుదలతో ఇబ్బందులు తలెత్తుతాయని, కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించాలని డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ అన్నారు. శుక్రవారం ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్లకార్డ్స్‌తో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనాభా పెరుగుతుంది కానీ ఆర్థిక వనరులు తరిగిపోతున్నాయని, దీంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఒకరు లేదా ఇద్దరిని కని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలన్నారు. వైద్యులు సైతం ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. డెప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్, డాక్టర్ సంతోష్, స్వాతి, చైతన్యరాణి తదితరులు పాల్గొన్నారు. చట్టబద్ధత తర్వాతే ఎన్నికలు నిర్వహించాలిజగిత్యాల: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ చట్టబద్ధత తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. ఈనెల 15న నిర్వహించే చలో హైదరాబాద్ బీసీల మహాధర్నా పోస్టర్‌ను శుక్రవారం జిల్లా కేంద్రంలో ఆవిష్కరించి మాట్లాడారు. బీసీల రిజర్వేషన్‌కు చట్టబద్ధత కల్పిస్తామని, వారి ఓట్ల ద్వారా గద్దెనెక్కి కాలయాపన చేయాలని, మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్ ద్వారా రాజ్యాంగ సవరణ చేయించి బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు, 9వ షెడ్యూల్డ్‌లో చేర్చడం ఒక్కటే పరిష్కారం అన్నారు. 33 శాతం రిజర్వేషన్లలో బీసీ మహిళలకు అవకాశం ఇవ్వాలన్నారు. పార్టీలకతీతంగా ఈనెల 15న ఇందిరపార్క్ వద్ద నిర్వహించే ధర్నాకు హాజరుకావాలని కోరారు. నాయకులు కుమార్, దేవి రవీందర్, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆరుదశాబ్దాల ఎస్కేఎన్ఆర్
● ఎందరో ప్రముఖులు చదువుకున్న కళాశాల జగిత్యాల: ఒకప్పుడు జగిత్యాల ఎస్కేఎన్ఆర్ కాలేజీలో సీటు దొరకాలంటే ఎంపీ, మంత్రి, ఎమ్మెల్యే లెటర్ ఉండాల్సిందే. 1965లో ఏర్పాటైన ఈ కాలేజీ 60వ వసంతంలోకి అడుగిడింది. జ గిత్యాలకు చెందిన ప్రముఖుడు కాసుగంటి లక్ష్మీనా రాయణరావు ధర్మపురి రోడ్లో 32.07 ఎకరాల స్థలాన్ని కొని ప్రభుత్వ కళాశాలకు విరాళంగా ఇచ్చారు. అన్ని కోర్సులు.. సువిశాలమైన ప్రాంతంలో ఉన్న ఈ కళాశాలలో విద్యార్థులకు అన్ని కోర్సులు ఉన్నాయి. బీఏ, బీఎం, బీఎస్సీ, బీకాం, ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లిష్, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీసీఏతో పాటు, జిల్లాలో హెల్ప్‌లైన్ ఇంజనీరింగ్, పాలిసెట్ హెల్ప్‌లైన్ సెంటర్ కూడా ఉంది. నిరుద్యోగ అభ్యర్థుల కోసం బీసీ స్టడీ సర్కిల్ సైతం ఏర్పాటు చేశారు. 26 మంది లెక్చరర్స్ బోధన చేస్తున్నారు. డిజిటల్ లైబ్రరీ ఎస్కేఎన్ఆర్ కాలేజీలో ప్రస్తుతం 605 మంది చదువుకుంటున్నారు. ఇందులోని డిజిటల్ లైబ్రరీ విద్యార్థులకు ఎంతో ఉపయోకరంగా ఉంది. దీనిలో పురాతన, ప్రస్తుత హైటెక్ యుగానికి సంబంధించిన బుక్స్ ఉన్నాయి. ఇటీవలే ఈ కళాశాలకు న్యాక్ బీ గ్రేడ్ లభించింది. అలాగే అన్ని వసతులతో కూడిన జిమ్ సైతం ఏర్పాటు చేశారు. 32 ఎకరాల్లో రకరకాల చెట్లతో గ్రీనరి ఏర్పాటు చేయగా, గతంలో రూ.5 లక్షల అవార్డు సైతం ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవలే రూ.50 లక్షలతో వాకింగ్‌ట్రాక్, కళాశాల ఎదుట ఓపెన్‌జిమ్ ఏర్పాటు చేశారు. వేడుకలకు సన్నాహాలు కళాశాల ఏర్పడి 60 ఏళ్లు పూర్తి కావడంతో వేడుకలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, ఎమ్మెల్సీ రమణతో పాటు చాలా మంది ప్రముఖులు ఈ కాలేజీలోనే చదువుకున్నారు. వేడుకలకు సీఎం రేవంత్‌రెడ్డిని ఆహ్వానించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. హాస్టల్ వసతి ఉంటే.. 32 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ కళాశాలలో అటాచ్డ్ హాస్టల్ ఉంటే ఇంకా విద్యార్థుల సంఖ్య పెరిగేది. ఉన్నతాధికారులు స్పందించి హాస్టల్ వసతి ఏర్పాటు చేస్తే కార్పొరేట్ కళాశాలల కన్నా బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి జగిత్యాల: జగిత్యాల ఎస్కేఎన్ఆర్ కళాశాల 60 ఏళ్ల ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, ఎమ్మెల్సీ ఎల్.రమణ అన్నారు. శుక్రవారం కళాశాలను సందర్శించి మాట్లాడారు. పూర్వ విద్యార్థులు కళాశాల అభివృద్ధికి తమవంతు సహాయ సహకారాలు అందించాలన్నారు. ఉత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డిని ఆహ్వానిస్తామని పేర్కొన్నారు. ప్రిన్సి పాల్ అశోక్ మాట్లాడుతూ, కళాశాలలో హాస్టల్ వసతి, ఆడిటోరియం భవనం, నూతన పోస్ట్‌గ్రాడ్యుయేషన్ కోర్సులు ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుందన్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్, రాజు, సాయిమధుకర్, గోవర్ధన్, సురేందర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కాళోజీ స్ఫూర్తితో..
కోల్‌సిటీ(రామగుండం): స్వాతంత్య్ర సమరయోధులు, గొప్ప కవి కాళోజీ నారాయణరావు తన మరణానంతరం శరీరాన్ని కాకతీయ మెడికల్ కాలేజీకి దానం చేశారు. వారే నాకు స్ఫూర్తి. నాతోపాటు నా భార్య కూడా మా మరణాంతరం మెడికల్ కాలేజీలకు మా శరీరాలను దానం చేస్తామని ప్రకటించాం. కాల్చడమో, పూడ్చడమో చేయకుండా వైద్య విద్యార్థుల అధ్యయనం కోసం పార్థివ దేహాలను దానం చేయడానికి ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలి. గత నెల 15న మా ఇద్దరి పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ఇంట్లో పెద్ద సభ ఏర్పాటు చేసి, అందరికీ నేత్ర, అవయవ, దేహదానంపై అవగాహన కల్పించాం. – ఎల్.రాజయ్య, రిటైర్డ్ ఎంఈవో, గోదావరిఖని అమ్మ కళ్లను దానం చేశాం ధర్మపురి: మాది జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నాగారం. అమ్మ చెలుముల చిన్నలక్ష్మి గుండె సమస్యతో బాధపడుతూ 2016లో మృతి చెందింది. ఆమె కళ్లను సజీవంగా ఉంచడం కోసం మృతిచెందిన కొద్ది నిమిషాల్లోనే లయన్స్‌క్లబ్ వారికి దానం చేసినం. దేశంలో కళ్లు లేనివారు ఎంతో మంది ఉన్నారు. వారికి ఉపయోగపడతాయి. అన్ని దానాల కంటే అవయవ దానం గొప్పది. – చిలుముల లక్ష్మణ్ -
కాంగ్రెస్‌తోనే సామాజిక న్యాయం
● మాజీ మంత్రి జీవన్రెడ్డిజగిత్యాలటౌన్: సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యమని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం జిల్లా కేంద్రంలో నాయకులు సంబరాలు నిర్వహించారు. ఇందిరాభవన్ నుంచి తహసీల్ చౌరస్తా వరకు ర్యాలీ తీసి, అంబేడ్కర్ విగ్రహానికి నివాళి అర్పించారు. ఈసందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ, రాహుల్‌గాంధీ ఆలోచన విధానం, డెడికేషన్ కమిషన్ సిఫార్సుల మేరకు బలహీనవర్గాలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి నివేదించడం జరిగిందన్నారు. కానీ, బీసీ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరి ప్రకటించలేదన్నారు. దేశం ప్రపంచంలో అగ్రగామిగా నిలవడానికి అంబేడ్కర్ రాజ్యాంగమే కారణమన్నారు. నాయకులు కొత్త మోహన్, బండ శంకర్, కల్లెపెల్లి దుర్గయ్య, గాజుల రాజేందర్, పుప్పాల అశోక్, ఎలిగేటి నర్సయ్య, బొడ్డు లక్ష్మణ్, చందా రాధాకిషన్, ముంజాల రఘువీర్ ఉన్నారు. -
అన్ని వసతులు
కళాశాలలో విద్యార్థులకు సరిపడా అన్ని మౌలిక వసతులున్నాయి. కొత్త కోర్సులతో పాటు, డిజిటల్ లైబ్రరీ, దోస్త్, హెల్ప్‌లైన్, టాస్క్ సెంటర్లు సైతం ఉన్నాయి. అనుభవజ్ఞులైన లెక్చరర్లు ఉన్నారు. 60 ఏళ్లు పూర్తి చేసుకోవడం ఎంతో అభినందనీయం. – అశోక్, ఎస్కేఎన్ఆర్ కళాశాల ప్రిన్సిపల్ గొప్ప కళాశాల ఒకప్పుడు ఈ కళాశాలలో సీటు దొరకాలంటే ఎంతో ప్రయత్నం చేయాల్సి ఉండేది. 32 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కాలేజీలో గ్రీనరే కాకుండా మౌలిక వసతులన్నీ ఉన్నాయి. విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుంది. ఎన్‌సీసీతో పాటు, లైబ్రరీ, ఇలా ఎన్నో ఉన్నాయి. – సంజయ్‌కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే గుర్తుకొస్తున్నాయి ఈ కళాశాలలో గతంలో చదువుకున్న రోజులు గుర్తుకువస్తున్నాయి. కాలేజీని మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించుకునేలా చూస్తాం. – రమణ, ఎమ్మెల్సీ -
సామాజిక రుగ్మతలపై సంధించిన అస్త్రం ‘మథనం’
జగిత్యాల: సమాజంలోని సామాజిక రుగ్మతలపై సంధించిన అస్త్రం మథనం పుస్తకమని సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల అన్నారు. జగిత్యాలకు చెందిన కళాకారుడు ఎములవాడ మహిపాల్ రచించిన మథనం కవితాసంపుటిని ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని ప్రతిఒక్కరూ చదవాలన్నారు. భవిష్యత్‌లో మరిన్ని అద్భుతమైన సాహిత్య పుస్తకాలు రాయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కళాకారులు విజయ్, క్రాంతి పాల్గొన్నారు. కానిస్టేబుల్‌పై మహిళ ఫిర్యాదు జగిత్యాలక్రైం: తనను కానిస్టేబుల్ బండపల్లి ప్రసాద్ ప్రేమ వివాహం చేసుకుని మోసం చేయడంతోపాటు మరో యువతితో ఇటీవల కనిపించకుండా పోయాడంటూ సారంగాపూర్ మండలం బీర్పూర్ గ్రామానికి చెందిన కస్తూరి భావన జగిత్యాల డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. భావన జగిత్యాలలో హాస్టల్లో ఉన్న సమయంలో ఒకసారి డయల్ 100కు కాల్ చేసింది. ఆ సమయంలో పరిచయమైన కొడిమ్యాల మండలం శ్రీరాములపల్లికి చెందిన బండపల్లి ప్రసాద్ అనే కానిస్టేబుల్ మాయమాటలు చెప్పి ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. కొద్దిరోజులు తనతో కాపురం చేసి.. కొన్నాళ్లుగా మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం మల్యాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో కనిపించకుండాపోయాడని, అతడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. గోదావరి తీర గ్రామాలు అప్రమత్తం ధర్మపురి/సారంగాపూర్: ధర్మపురి, బీర్పూర్ మండలాల్లోని గోదావరి తీరం వెంట ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ధర్మపురి తహసీల్దార్ సుమన్, బీర్పూర్ ఎస్సై ఎస్.రాజు ఆయా గ్రామాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీర్‌పూర్‌లోని చిన్నకొల్వాయి, రేకులపల్లి, కమ్మునూర్ గ్రామాల్లో పర్యటించిన ఎస్సై.. ఎగువన ఉన్న కడెం ప్రాజెక్టులోకి భారీ వరద వచ్చి చేరుతోందని, ఏ క్షణమైనా ప్రాజెక్టు గేట్లు ఎత్తి గోదావరిలోకి వదులు తారని, ప్రజలు గోదావరిలోకి పశువులు, గొర్రెలను మేపేందుకు వెళ్లవద్దని సూచించారు. పంటల సాగుపై అవగాహనజగిత్యాలఅగ్రికల్చర్: రావెఫ్ విద్యార్థులు పంటల సాగుపై క్షేత్రస్థాయిలో అవగాహన పెంచుకున్నారు. వ్యవసాయ వర్సిటీ మాజీ ఈఆర్సీ సభ్యుడు శ్రీరామ్ రెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ అగ్రికల్చర్ విద్యార్థులు కొడిమ్యాల మండలం రామకృష్ణాపూర్‌కు చేరుకున్నారు. రైతులు సాగు చేస్తున్న పంటలతోపాటు సాగు పద్ధతులు తెలుసుకున్నారు. కొండాపూర్ మైసమ్మ చెరువుకు కాలువల ద్వారా నీటి సరఫరాపై వర్సిటీ సలహా మండలి మాజీ సభ్యుడు వెల్ముల రాంరెడ్డి వివరించారు. మాజీ ప్రిన్సిపాల్ లక్ష్మణ్, విద్యార్థినులు శృతి, ప్రణీత, శ్రావణి, దీప్తి, హరిణి పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సు, లారీ ఢీ: తప్పిన ప్రమాదంమెట్పల్లి: పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై గురువారం రాత్రి ఆర్టీసీ బస్సు, లారీ ఢీ కొన్నాయి. నిర్మల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఒంగోలు వెళ్తూ.. మెట్పల్లి బస్‌స్టేషన్‌లో ఆగింది. ప్రయాణీకులతో జగిత్యాల వైపు బయలుదేరిన బస్సు.. ఔట్ గేట్ నుంచి జాతీయ రహదారి పైకి వెళ్లగానే ఓ లారీ వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సు అద్దాలు పగిలిపోయి ముందు భాగం దెబ్బతింది. ప్రయాణికులు, సిబ్బందికి ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దెబ్బతిన్న వాహనాన్ని బస్‌స్టేషన్‌కు తరలించి నిర్మల్ డిపోకు సమాచారమందించారు. అక్కడి అధికారులు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా మరో బస్సును పంపించారు. -
యూరియా అతి వినియోగంపై ఆందోళన
జగిత్యాలఅగ్రికల్చర్: స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో ఆహార ధాన్యాల ఉత్పత్తి సరిగ్గా లేక.. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్లం. హరితవిప్లవం రావడంతో అధిక దిగుబడినిచ్చే కొత్త విత్తనాలు రైతులకు అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా దిగుబడులు పెరిగాయి. అదే సమయంలో అధిక దిగుబడి ఇచ్చేందుకు రైతులు రసాయన ఎరువులు వేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో తక్కువ ధరకు దొరికే యూరియాను రైతులు అధికంగా వాడుతున్నట్లు వ్యవసాయశాఖ నివేదికల్లో తేలింది. యూరియా మోతాదును మించి పంటలకు వాడుతున్నారని స్వయంగా కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి జేపీ.నడ్డా ప్రకటించడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో ఒక్క వానాకాలం సీజన్లో సాగుచేసిన పంటలకే 13,843 టన్నుల యూరియా అవసరం. ఈ మేరకు జిల్లాలో మార్చి వరకు 7607 టన్నుల యూరియా ఉండగా.. ఏప్రిల్‌లో 4248 టన్నులు, మేలో 1257 టన్నులు, జూన్‌లో 470 టన్నులు, జూలైలో 261 టన్నులు రావాల్సి ఉండగా.. రాష్ట్రానికి రావాల్సిన యూరియాపై కేంద్రం కోత విధిస్తోంది. దీంతో జిల్లాకు అంతంతమాత్రంగానే యూరియా వచ్చింది. ఇక రానున్న రోజుల్లో దొరుకుతుందో..? లేదో..? అని రైతులు అవసరం లేకున్నా నిల్వ చేసుకుంటున్నారు. ప్రస్తుతం యూరియా దొరకకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఏ మొక్కకై నా నత్రజని, భాస్వరం, పొటాష్ అవసరం. నత్రజని యూరియా రూపంలో లభిస్తుంది. భాస్వరం సింగిల్ సూపర్ పాస్పేట్, డైఅమ్మోనియం పాస్పేట్ (డీఏపీ)ను రైతులు వినియోగిస్తారు. దాదాపు 85 శాతం డీఏపీని కెనాడ, రష్యా, అమెరికాతో పాటు జోర్డాన్, మొరాకో వంటి దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం. ముడి పొటాష్‌ను సైతం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. అవసరాన్ని మించి వినియోగం శాస్త్రవేత్తల సూచనల ప్రకారం పంటలకు సాధారణంగా 4ః2ః1 నిష్పత్తిలో నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి పోషకాలు అందించాల్సి ఉంటుంది. కానీ.. రైతులు ప్రస్తుతం 7.2ః2.9ః1 నిష్పత్తిలో వాడుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. రసాయన ఎరువులు అధికంగా వాడే పంజాబ్‌లో 18.6ః 5.4ః1 నిష్పత్తితో మరింత ఎక్కువగా వినియోగిస్తున్నారు. అందుకే పంజాబ్‌లో పర్యావరణంతోపాటు ఆహార పదార్థాలు కూడా కాలుష్యంతో నిండిపోయి క్యాన్సర్ రోగులు పెరిగిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. యూరియా వినియోగం పెరగడం.. పోషకాల సమతుల్యత లోపించడం, సేంద్రియ ఎరువుల వాడకం తగ్గడం, పంటల సాంద్రత పెరగడం, పంటల సరళిలో మార్పులు రావడం, పంట పొలాల్లో కార్బన్ లోపించడం వంటి కారణాలతోనే భూముల్లో జింక్ లోపం ఏర్పడుతోంది. వేపపిండితో మేలు.. యూరియా వాడినప్పుడు విధిగా వేప పిండిని 5ః1 నిష్పత్తిలో అంటే 5 కిలోల యూరియాలో కిలో వేపపిండిని కలిపి వాడితే భూమికి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. పంటలకు చీడపీడల ఉధృతి తగ్గుతుంది. యూరియా నీటిలో కొన్నాళ్లపాటు నిలువ ఉండి.. మొక్కలకు అవసరమైన సమయంలో అందిస్తుంది. పచ్చిరొట్ట అయిన జనుము, జీలుగ, పిల్లిపెసర, అలసంద వంటి పంటలను వేసిన భూమిలోనే రసాయన ఎరువుల వినియోగం తక్కువగా ఉంటుంది. వేసవి పంటల అనంతరం పొలంలో గొర్రెలు, మేకలు, పశువుల మంద ద్వారా పోషకాలు అధికంగా లభిస్తాయి. ఆయా పంటల్లో రసాయన ఎరువులను భూసార పరీక్షలకు అనుగుణంగా వాడాలి. నేల, వాతావరణ పరిస్థితులను బట్టి రసాయన ఎరువులను పొదుపుగా వాడటం మంచిది. మోతాదులో వాడాలని కేంద్ర ప్రభుత్వ సూచన సేంద్రియ ఎరువులకు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్రాలకు సూచన యూరియా కొరత లేకుండా చూడాలి జిల్లాలో యూరియా కొరత లేకుండా చూడాలి. యూరియా అధికంగా వాడుతున్నారనే సాకుతో యూరియా కోటాను తగ్గించడం చేయవద్దు. పంటల దశలను బట్టి యూరియా సరఫరా చేయాలి. – బందెల మల్లయ్య, రైతు సంఘం నాయకుడు, చల్గల్ యూరియాను నిల్వ చేయొద్దు జిల్లాలో యూరియా అందుబాటులోనే ఉంది. అవసరం లేకున్నా తీసుకెళ్లి ఇళ్లలో నిల్వ చేయవద్దు. పంటల పెరుగుదలకు అనుగుణంగా యూరియా సరఫరా చేస్తాం. యూరియాతో పాటు సేంద్రియ ఎరువులను కూడా వాడాలి. – భాస్కర్, జిల్లా వ్యవసాయాధికారి -
ప్రాణం తీసిన భూ తగాదా
● వరుసకు అన్నపై తమ్ముడిపై దాడి ● ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి ధర్మపురి: భూతగాదాలో గొడవ పడి వరుసకు అన్న అయిన రవిపై తమ్ముడు కత్తితో దాడి చేయడంతో మృతిచెందాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని దోనూర్‌కు చెందిన గొళ్లెన రవి, నాగరాజు అన్నదమ్ముల కొడుకులు. వారి మధ్య కొంతకాలంగా ఇంటిస్థలం విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల రవికి ఇందిరమ్మ ఇల్లు మంజూరుకాగా నిర్మాణం చేపడుతున్నాడు. గురువారం ఇంటి స్థలం విషయంలో ఇరువురి మధ్య గొడవ జరగగా నాగరాజు రవిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రవిని చికిత్స నిమిత్తం జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. తాటిచెట్టుపై నుంచి పడి గీతకార్మికుడికి గాయాలు మెట్‌పల్లిరూరల్: తాటిచెట్టుపై నుంచి కింద పడి గీతకార్మికుడికి గాయాలయ్యాయి. మెట్పల్లి మండలం ఆత్మకూర్ గ్రామానికి చెందిన చిలివేరి సత్యనారాయణ తాటిచెట్టుపై కల్లు తీస్తుండగా ప్రమాదవశాత్తు జారి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం మెట్‌పల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నాడని బంధువులు తెలిపారు. -
‘ఓటుకు నోటు’ ముద్దాయిని సీఎం చేశారు..
మల్లాపూర్: ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన ముద్దాయిని కాంగ్రెస్ పార్టీ సీఎంను చేసిందని, దొంగ చేతికి ఇంటి తాళాలు ఇవ్వడంతో 18 నెలలుగా రేవంత్ రెడ్డి రాష్టాన్ని అధోగతి పాలు చేస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ అన్నారు. గురువారం జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ ఎల్.రమణ, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం రేవంత్‌రెడ్డికి రాష్ట్రంపై అవగాహన లేక కేసీఆర్, కేటీఆర్‌ను దూషించడమే పనిగా పెట్టుకున్నారని, ప్రతిసారీ సవాల్ చేస్తూ.. పారిపోతున్నారని విమర్శించారు. ఆయన సవాల్‌ను స్వీకరించిన కేటీఆర్ చర్చకు రమ్మంటే రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తోకముడిచిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలపై పథకాల మత్తుమందు చల్లి కాంగ్రెస్ అధికారం చేపట్టిందని, పాలన చేతకాక నంబర్‌వన్‌గా ఉన్న రాష్ట్రాన్ని ఆగం చేసిందని తెలిపారు. కేటీఆర్, బీఆర్ఎస్ ప్రజల కోసం రాజీలేని పోరాటం చేస్తుంటే ఈ–ఫార్ములా, ట్యాపింగ్ కేసులు, కమిషన్ల పేరిట విచారణలతో ప్రభుత్వం కుట్రపూరితంగా వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం రేవంత్ పాలనలో విద్యా వ్యవస్థ నాశనమైందని, గురుకులాల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారని తెలిపారు. విద్యార్థులకు భరోసా కల్పించడంలో విఫలం కావడంతో పాటు బాధితులను పరామర్శించి ఆదుకునేవారే కరువయ్యారని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా హోంమంత్రిగా ఉన్నందునే పోలీసులు ఆక్రమ కేసులతో వేధిస్తున్నారని, బీఆర్ఎస్ పార్టీ పోరాటాలతోనే వీటిని ఎదుర్కొంటోందన్నారు. ప్రస్తుత పాలనపై ప్రజల్లో అంగీకారం లేదని, రాబోయే ఎన్నికల్లో ప్రజలే సమాధానం చెబుతారని పేర్కొన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జెడ్పీ మాజీ చైర్మన్ దావ వసంత, మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, ఖానాపూర్ బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్య జాన్సన్‌నాయక్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. దొంగ చేతికి ఇంటి తాళాలు ఇవ్వడంతో రాష్ట్రం ఆధోగతి పాలు పథకాల మత్తు మందు చల్లి కాంగ్రెస్ అధికారం చేపట్టింది ప్రజల తరఫున బీఆర్ఎస్ నిలదీస్తున్నందునే అక్రమ కేసులు, విచారణలు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ -
ఇటిక్యాలలో జిల్లా అదనపు మొదటి జడ్జి పూజలు
రాయికల్: గురుపౌర్ణమి సందర్భంగా మండలంలోని ఇటిక్యాలలోగల సాయిబాబా ఆలయ ంలో గురువారం జిల్లా అదనపు మొదటి జడ్జి నారాయణ పూజలు చేశారు. సాయప్ప చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ హిమవంతరావు, గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. కొండగట్టులో హనుమాన్ చాలీసా పారాయణంమల్యాల: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని గురువా రం శ్రీలలిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 116మంది మహిళలు హనుమాన్ చాలీసా, హనుమాన్ పారాయణం నిర్వహించారు. లింగాష్టకం, విష్ణుసహస్రనామస్తోత్రం, అన్నపూర్ణ స్తోత్రం లలిత సహస్రనామ పారాయణం చేశా రు. లలిత సేవా ట్రస్టు ఫౌండర్ విశ్వనాథుల రమే శ్, డైరెక్టర్ కొట్టె ప్రేమలత, ఉమాలక్ష్మీ, వనజ, పులి రవి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మొక్కలు సంరక్షించాలిజగిత్యాలరూరల్: మొక్కల సంరక్షణపై దృష్టి సారించాలని ఎకాలజికల్ సొల్యుషన్స్ సభ్యులు శ్రీనివాస్, ప్రవీణ్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం పొరండ్లలో హరితహారం కింద నాటిన మొక్కలను ఐవోఆర్ఏ ఎకనాలజికల్ సొల్యుషన్స్ న్యూఢిల్లీ వారు పరిశీలించారు. పైలెట్ ప్రాజక్ట్ కింద ఎంపిక చేయబడిన గ్రామాల్లో మొక్కల సంరక్షణకు ప్రత్యేక నిధులు వెచ్చించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్లాంటేషన్ మేనేజర్ నరేశ్, ఏపీవో గంగలక్ష్మణ్, పంచాయతీ కార్యదర్శి కిరీటి, టీఏలు సువర్ణ, వెంకటేశ్, శైలజ పాల్గొన్నారు. హోదా మరిచి.. జనంతో కలిసి..వెల్గటూర్:మంత్రి అయినా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు అడ్లూరి లక్ష్మణ్ కుమార్. మండలకేంద్రానికి గురువారం వచ్చిన ఆయన ఓ హోటల్ వద్ద ఆగారు. అక్కడ అందరితో కలిసి టీ తాగా రు. ప్రజల సమస్యలు అడిగి తెలుసున్నారు. సామాన్యుడిలా జనంతో కలిసి పోయిన మంత్రిని చూసి స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారుల పొలంబాటమల్లాపూర్: విద్యుత్ అధికారులు గురువారం పొలంబాట పట్టారు. రైతుల వద్దకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మండలంలోని గుండంపల్లిలో ఎన్పీడీసీఎల్ డీఈ మధుసూద న్ పర్యటించారు. ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజ్ పోయినపుడు సిబ్బందికి సమాచారం ఇవ్వాలని హితవుపలికారు. తీగలు వేలాడకుండా మధ్యమధ్య స్తంభాలు వేస్తామన్నారు. కొత్త కనెక్షన్లను సత్వరం జారీ చేస్తామన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఏడీఈ మనోహర్, రాఘవపేట ఏఈ సంతోష్, రైతులు పాల్గొన్నారు. మేడిపల్లిలో..మేడిపల్లి: డీఈ గంగారాం ఆధ్వర్యంలో సిబ్బంది భీమారం మండలకేంద్రంలో పొలంబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యుత్ ప్రమాదాలపై రైతులకు అవగాహన కల్పించారు. మన్నెగూడెం ఏఈ అశోక్, సబ్ ఇంజినీర్ హరిప్రసాద్, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. -
కొత్త లైన్లు ఏర్పాటు సంతోషం
సారంగాపూర్ అడవిలో చెట్లు పడి కరెంట్ నిలిచిపోయేది. అటు పొలాలకు కరెంట్ లేక.. పంటలకు ఇబ్బంది కలిగేది. ఇళ్లలో దోమల బెడదతో తట్టుకోలేకపోయేవాళ్లం. రాత్రిపూట బయట అడుగుపెట్టడం కష్టంగా ఉండేది. అధికారులు కొత్తగా చేపట్టిన నేరెళ్ల లైన్‌తో సమస్య లేకుండా తీరుతుంది. – పురుమల్ల నగేష్‌రెడ్డి, సారంగాపూర్ చాలా ఏళ్ల సమస్య తీరింది మేం 40 ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యకు విద్యుత్ అధికారులు ఇప్పుడు పరిష్కరిస్తున్నారు. కొత్త లైన్లతో ఒక లైన్ నుంచి కరెంట్ రాకున్నా.. మరో లైన్ ద్వారా విద్యుత్ సరఫరా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు పొలాలకు నీరు పెట్టేందుకు ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు ఆ సమస్య తీరుతుండడం ఆనందంగా ఉంది. – న్యారబోయిన రాజేశం, సారంగాపూర్ కొత్త లైన్ ప్రారంభిస్తాం నేరెళ్ల నుంచి ఏర్పాటు చేస్తున్న 33 కేవీ విద్యుత్ లైన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఉన్నతాధికారుల సహకారంతో మరో 15 రోజుల్లో ఈ లైన్ నుంచి విద్యుత్తు సరఫరా ప్రారంభిస్తాం. కొత్త లైన్ల ఏర్పాటుతో సారంగాపూర్, బట్టపల్లి, నాయికపుగూడెం, పోతారం గ్రామాలకు విద్యుత్ అంతరాయం ఉండదు. – ప్రవీణ్, ఏఈ, సారంగాపూర్ -
భగీరథ నీటి సరఫరా నిలిపివేత
● వెంకట్రావ్పేట వద్ద పగిలిన పైపు ● వారం రోజులుగా అక్కడ లీకేజీలు ● మరమ్మతు చేపట్టడంలో అధికారుల నిర్లక్ష్యంమెట్పల్లి: పట్టణంలోని వెంకట్రావ్పేట వద్ద జాతీయ రహదారి పక్కనున్న మిషన్ భగీరథ పైపు గురువారం పగిలింది. దీంతో పెద్ద ఎత్తున నీరు వృథాగా పోయింది. వారం క్రితం అక్కడ లీకేజీలు ఏర్పడ్డాయి. అప్పటి నుంచి మరమ్మతు చేపట్టడంలో అధికారులు నిర్లక్ష్యం చూపుతూ వస్తున్నారు. తాజాగా పైపు ఒక్కసారిగా పగలడంతో నీరు జాతీయ రహదారి మీదుగా దిగువన ఉన్న ఖాళీ స్థలాల్లోకి భారీగా వచ్చి చేరింది. రోడ్డుపై నీటి ప్రవాహంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది. నీటి ఉధృతి తగ్గిన తర్వాత రాకపోకలు కొనసాగాయి. సంఘటనా స్థలాన్ని మున్సిపల్ కమిషనర్ మోహన్, ఇంజినీరింగ్ అధికారులు పరిశీలించారు. ప్రధాన పైపులైన్ పగలడంతో శుక్రవారం నుంచి జిల్లాకు నీటి సరఫరా నిలిచిపోయే అవకాశం కనిపిస్తోంది. -
ప్రత్యామ్నాయ లైన్లతో.. విద్యుత్ సమస్యకు చెక్
● నాలుగు గ్రామాలకు తీరనున్న విద్యుత్ సమస్య ● నేరెళ్ల నుంచి రూ.53 లక్షలతో పనులు ● 11 కిలోమీటర్ల 33 కేవీ విద్యుత్తు లైన్ ఏర్పాటు ● లక్ష్మీదేవిపల్లి రోడ్డు వెంట పాత లైన్పునరుద్ధరణ సారంగాపూర్: మండలకేంద్రంతోపాటు.. పోతా రం, బట్టపల్లి, నాయికపుగూడెం గ్రామాలకు 40 ఏళ్లక్రితమే విద్యుత్ సౌకర్యం ఉంది. అయితే చిన్నపాటి వర్షం పడినా.. గాలివీచినా సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడుతోంది. అటవీప్రాంతం కావడంతో విద్యుత్ పునరుద్ధరణకు చాలా సమయం పడుతోంది. దీనిని అధిగమించడానికి విద్యుత్ అధికారులు శ్రీకారం చుట్టారు. నాలుగు గ్రామాల సమస్య తీర్చడానికి ప్రస్తుతం ఉన్న రెండు 33 కేవీ లైన్లకు అదనంగా మరో రెండు లైన్లు వేస్తున్నారు. ● మండలంలో మొత్తం 18 గ్రామాలు ఉన్నాయి. ● సారంగాపూర్, లక్ష్మీదేవిపల్లి, రేచపల్లి గ్రామాల్లో 33 కేవీ సబ్స్టేషన్లు ఉన్నాయి. ● సారంగాపూర్ సబ్‌స్టేషన్ కింద సారంగాపూర్, నాయికపుగూడెం, పోతారం, బట్టపల్లి గ్రామాలకు విద్యుత్ సరఫరా అవుతోంది. ● జగిత్యాల మండలం పొలాస మీదుగా తిప్పన్నపేట, హైదర్పల్లి నుంచి సారంగాపూర్, రేచపల్లి, లక్ష్మీదేవిపల్లి సబ్స్టేషన్లకు విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ● సారంగాపూర్‌లోని 33/11 కేవీ సబ్‌స్టేషన్‌కు వచ్చే లైన్ మూడు కిలోమీటర్ల మేర పూర్తిగా అటవీప్రాంతంలో ఉంది. ● వానవచ్చినా.. ఈదురుగాలులు వీచినా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి అటవీప్రాంతంలో లైన్లు తెగిపోతున్నాయి. ● విద్యుత్ వైర్లపై చెట్లు పడి స్తంభాలు విరిగిపోతున్నాయి. ● విద్యుత్ పునరుద్ధరణకు విద్యుత్ సిబ్బంది రాత్రి పూట ఇబ్బంది పడుతున్నారు. ● ఇలా గంటల తరబడి వర్షంలో శ్రమించాల్సి వస్తోంది. ● ఏటా వర్షాకాలం, వేసవిలో ఈ సమస్య తరచూ ఉత్పన్నమవుతోంది. ప్రత్యామ్నాయ లైన్లతో చెక్ ● సారంగాపూర్, బట్టపల్లి, పోతారం, నాయికపుగూడెం గ్రామాలకు విద్యుత్ సమస్య ఉండకూడదన్న ఆలచోనతో ఆ శాఖ రూ.53లక్షలతో ధర్మపురి మండలం నేరెళ్ల నుంచి సారంగాపూర్ సబ్‌స్టేషన్‌కు అదనంగా మరో 33 కేవీ లైన్ ఏర్పాటుకు ప్రతిపాదించింది. ● మూడు నెలల క్రితం పనులు ప్రారంభించింది. ● 11 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేస్తున్న 33 కేవీ లైన్ నేరెళ్ల నుంచి నేరుగా సారంగాపూర్ సబ్‌స్టేషన్‌కు చేరుతుంది. ● విద్యుత్ శాఖ కన్స్ట్రక్షన్ డీఈఈ ఆధ్వర్యంలో పనులు వేగంగా సాగుతూ.. పూర్తి కావచ్చాయి. ● ఈ నెలఖరులోగా నేరెళ్ల లైన్‌కు కనెక్షన్ ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నారు.. మూడో లైన్ పునరుద్ధరణ.. ● నేరెళ్ల నుంచి కొత్త లైన్ నిర్మాణం పూర్తికాగా.. లక్ష్మీదేవిపల్లి నుంచి సారంగాపూర్‌కు రోడ్డు వెంట గతంలో వేసిన పాత లైన్‌ను పునరుద్ధరిస్తున్నారు. ● దీని ద్వారా సారంగాపూర్ సబ్‌స్టేషన్‌కు మూడు లైన్లు సిద్ధమవుతున్నాయి. ● నాలుగు గ్రామాలకు ఏ ఒక్కక్షణం కూడా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. -
రూ.140 కోట్లతో అభివృద్ధి పనులు
జగిత్యాల: జగిత్యాల బల్దియాలో రూ.140 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. బల్దియా కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ బీఎస్.లత ఆధ్వర్యంలో గురువా రం అధికారులతో సమీక్షించారు. పట్టణంలో విలీన ప్రాంతాలకు రూ.20 కోట్లు, తాగునీటికి రూ.32 కోట్లు, అమృత్ స్కీం కింద రూ.38 కోట్లు మంజూరయ్యాయని, వాటితో పనులు ఎలా చేపట్టాలో ప్రణాళిక రూపొందించాలని సూచించారు. 15వ ఆర్థిక సంఘం, ఎల్ఆర్ఎస్, స్టాంప్ డ్యూటీ, ఇతర పనులపై ఆరా తీశారు. అర్బన్ హౌసింగ్ కాలనీ, డబుల్బెడ్రూం ఇందిరమ్మ కాలనీలో చేపట్టాల్సిన వసతులకు అంచనాలు రూపొందించాలన్నారు. డ్రైనేజీ, పైప్లైన్ల విషయలంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని, వర్షాకాలం దృష్ట్యా దోమల నివారణ చర్యలు చేపట్టాలన్నారు. రెవెన్యూ, శానిటేషన్ అధికారులు పకడ్బందీగా పనిచేయాలని పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ స్పందన, ఏఈలు చరణ్, అరుణ్, రెవెన్యూ, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. పల్లెదవాఖానాలతో మెరుగైన వైద్యం జగిత్యాలరూరల్: గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఆయుష్మాన్ ఆరోగ్య దవాఖానాలు నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే అన్నారు. ఆయుష్మాన్ ఆరోగ్య దవాఖానాల నిర్మాణాలు, రూ.25 లక్షల ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో నిర్మించే సీసీరోడ్డు పనులకు భూమిపూజ చేశారు. -
ప్రభంజనం
వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కొన్నిచోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. సాయంత్రం ఈదురుగాలులు వీస్తాయి. 7పట్టణ ప్రాంతాల్లో పెరిగిన జనాభా పట్టణం 1991 2001 2011 కరీంనగర్ 1,48,583 2,05,653 2,61,185 జగిత్యాల 67,591 85,521 96,460 రామగుండం 2,14,384 2,36,600 2,58,644 సిరిసిల్ల 50,048 65,314 77,550 కోరుట్ల 40,080 54,012 66,504సాక్షి,పెద్దపల్లి: దేశ ప్రగతికి, పతనానికి ప్రధాన కారణమైన జనాభా ఇప్పుడు ప్రపంచాన్నే భయపెడుతున్న అతిపెద్ద సమస్య. జనాభా తగ్గుదలపై ప్రభుత్వాలు ఆందోళన చెందుతుండగా, మారిన జీవనశైలితో పిల్లలను కనేందుకు ఆసక్తిచూపని దంపతుల సంఖ్య పెరుగుతోంది. ఒక్కరు ముద్దు.. ఇద్దరు హద్దు.. ఇకపై వద్దంటూ ఒకప్పుడు ప్రభుత్వాలే ముమ్మరంగా ప్రచారం చేయగా, నేడు వీలైనంత మందిని కనండని ప్రభుత్వాలే వేడుకుంటున్నాయి. ఉమ్మడి జిల్లాలో జనాభా పెరుగుదల కనిపిస్తుండగా, మరణాలు సంఖ్య గణనీయంగా తగ్గాయి. పెరిగిన జనాభా విద్య, ఉపాధి అవకాశాల కోసం పట్టణాలకు వలసపోతుండడంతో పల్లె చిన్నబోతుంది. పంట పొలాలు కనుమరుగై ఆకాశ హార్ామ్యలు వెలుస్తున్నాయి. కరీంగనర్, రామగుండం కార్పొరేషన్‌తో సహా జిల్లాకేంద్రాలుగా మారిన మున్సిపాలిటీలు, పంచాయతీల నుంచి మున్సిపాలిటీలుగా మారుతుండటం పట్టణాలకు వలసపోతున్న జనాభాకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. నియంత్రణతో అడ్డుకట్ట జనాభా పెరుగుదల అభివృద్ధికి ఆటంకమన్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను అమలు చేసింది. అయినా 1952 నుంచి 1975 ఎమెర్జెన్సీ కాలం వరకు విపరీతంగా పెరిగింది. ఎమెర్జెన్సీ తర్వాత 1976లో ప్రకటించిన జాతీయ జనాభా విధానం అనుగుణంగా వివాహ వయస్సు పెంచడం, ఆర్థిక ప్రోత్సాహకాలు, మహిళ అక్షరాస్యత పెంపుతో జనాభా తగ్గుదల నమోదైంది. అయితే ఇటీవల కరోనా సమయం అనంతరం జనాభా స్థిరీకరణపై ప్రభుత్వాలు దృష్టిసారించాయి. పట్ణణీకరణే ప్రధాన సమస్య జిల్లాల విస్తరణ, కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుతో ఉఫాది, సౌకర్యవంతమైన జీవనం కోరుతూ ప్రజలు నగరం బాట పడుతున్నారు. కొత్త జిల్లాలుగా ఏర్పాడిన పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల కేంద్రాల్లోనూ పట్టణీకరణ వేగం పుంజుకుంటోంది. ప్రభుత్వ వైద్యం, విద్యా సదుపాయాలను మెరుగుపరుస్తుండడం, కొత్త కట్టడాల నిర్మాణం పెరుగుతుండడంతో వివిధ వర్గాలకు ఉపాధి లభిస్తోంది. దీంతో ఆయా కేంద్రాల్లో జనాభా పెరుగుదల కనిపిస్తోంది. దీంతో మున్సిపాలిటీల్లో జనాభా ఒత్తిడి పెరుగుతుంది. ఆయా జనాభాకు అనుగుణంగా ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించడం సవాలుగా మారుతుంది. పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా వసతుల కల్పనపై ప్రత్యేక చొరవ చూపిస్తేనే సమస్యలు తీరనున్నాయి.పెరిగిన జననాలు జనన, మరణాలను అధికారికంగా నమోదు చేసే సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం–2021 నివేదిక ఆధారంగా 2021లో జిల్లాలో నమోదైన జననాలను విడుదల చేసింది. ఈ నివేదిక ఆధారంగా చూస్తే 43,345 జనాలు ఉండగా, మరణాలు 26,757 నమోదయ్యాయి. మెడికల్ వసతులు పెరగడం కారణంగా తెలుస్తోంది.1)ప్రస్తుతం సమాజంలో పేరేంట్స్ ఎంతమంది పిల్లలు కావాలనకుంటున్నారు?ఎ)ఒక్కరు బి)ఇద్దరు సి)ముగ్గురు అంతకన్నా ఎక్కువ15% 32.0/25.0గరిష్టం/కనిష్టం -
సీఎంకు తెలంగాణపై కమిట్మెంట్ లేదు
● బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలే ప్రజలకు జనతా గ్యారేజ్ ● నాయకులు, కార్యకర్తలను వేధిస్తే ఐక్య పోరాటాలు ● స్థానిక సంస్థల్లో అన్ని స్థానాలూ గెలుచుకుందాం ● కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావుమల్లాపూర్: సీఎం రేవంత్‌రెడ్డికి తెలంగాణ పట్ల కమిట్మెంట్ లేదని, ఆయనలో కంటెంట్ కూడా లేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. మండలకేంద్రంలో గురువారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర నాయకులు ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్, ఎమ్మెల్సీ ఎల్.రమణతో కలిసి ప్రారంభించారు. అనంతరం కార్యకర్తలతో సమావేశమయ్యా రు. బీఆర్ఎస్ పాలనలో నంబర్‌వన్‌గా ఉన్న రాష్ట్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి అవినీతిమయం చేశారని విమర్శించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కాంగ్రెస్ నాయకులు అందినకాడికి దోచుకుంటున్నారన్నారు. పథకాల లబ్ధిదారులను డబ్బు ల కోసం బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులను భయపెట్టి, ప్రలోభాలకు గురిచేసి కాంగ్రెస్‌లోకి చేర్చుకుంటున్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలతో కలిసి పనిచేద్దామన్నారు. అధి కార పార్టీ నాయకుల దాడులు, వేధింపులకు దిగితే తామే నిలబడి కోట్లాడుతామని భరోసా ఇచ్చారు. అర్హులకు ఏ పథకం అందకున్నా.. కలెక్టరేట్‌ను ము ట్టడిద్దామన్నారు. జెడ్పీ మాజీ చైర్మన్ దావ వసంత, మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, ఖానా పూర్ బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్య జాన్సన్‌నాయక్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు బండి లింగస్వామి, మాజీ జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ కాటిపెల్లి సరోజన, మాజీ వైస్ ఎంపీపీ నాగేష్ పాల్గొన్నారు. గురుకులం పాఠశాలను సందర్శించిన ప్రవీణ్కుమార్మెట్పల్లి: పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకులాన్ని ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ ఎమ్మెల్యేతో కలిసి సందర్శించారు. పాఠశాలలో సమస్యలపై సిబ్బంది, విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ కోతలతో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు వివరించగా.. తానే స్వయంగా జనరేటర్‌ను సమకూరుస్తానని ఎమ్మెల్యే తెలిపారు. -
దుర్గంధ భరితం
మురికి కూపం..జగిత్యాల: జిల్లా కేంద్రంలో డ్రైనేజీ వ్యవస్థ అత్యంత దారుణంగా ఉంది. యావర్‌రోడ్ నుంచి కొత్తబస్టాండ్, తహసీల్ చౌరస్తా వరకు రెండు కిలోమీటర్లు ఉంటుంది. ఎప్పుడో నిర్మించింది కావడంతో అక్కడక్కడ కూలిపోయింది. అందులోనే ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతరత్రా వస్తువులన్నీ పడేస్తున్నారు. వర్షం పడితే రోడ్డంతా చెరువును తలపిస్తోంది. సమీపంలోని షాపులు, ఇళ్లలోకి మురికినీరు చేరుతోంది. వర్షం తగ్గినా.. మురికినీరు మాత్రం ఎటూవెళ్లలేని పరిస్థితి. కొత్తబస్టాండ్ నుంచి వచ్చే డ్రైనేజీ తహసీల్ చౌరస్తా వద్ద మెయిన్‌రోడ్ రోడ్డ్ వద్ద మలుపు తిరుగుతుంది. అక్కడ గతంలో పైపులు వేశారు. అవి పూర్తిగా బ్లాక్ కావడంతోనే నీటి ప్రవాహం సరిగా సాగడం లేదంటున్నారు స్థానికులు. ఆ పైపులు తవ్వాలంటే యావర్‌రోడ్‌ను మూసివేయాల్సి వస్తుంది. దీంతో అధికారులకు ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. మురికినీటిలోనే సావాసం యావర్‌రోడ్‌లో దాదాపు 50 నుంచి 70వరకు షాపులు, వెనుకవైపు ఇళ్లు ఉన్నాయి. మురికినీరంతా రోడ్డుపై నుంచి ఇళ్లలోకి చేరుతోంది. వర్షంపడితే బురద కొట్టుకొస్తోంది. బయటకు పంపిద్దామన్నా.. ఎటూ వెళ్లలేని పరిస్థితి. వాసన భరించలేకపోతున్నామని, వంట చేసుకోలేక.. భోజనం తినలేక.. మరోచోటికి వెళ్లలేక అందులోనే కాలం వెల్లదీస్తున్నామని చెబుతున్నారు.ఈ సమస్యపై కలెక్టర్‌కు ప్రజావాణిలో కాలనీవాసులు, షాపుల నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. వారం గడిచినా ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదు. ఈ చిత్రం తహసీల్ చౌరస్తాలోని డ్రైనేజీ. నీరు నిలిచిపోయి సమీపంలోని మూడునాలుగిళ్లలోకి వెళ్తోంది. ఇంటి యజమానులు నీటిని తొలగించాలని చూసినా సాధ్యపడడం లేదు. భరించలేని దుర్గంధం మధ్యే కాలం వెల్లదీస్తున్నారు. ఇంట్లో ఉండరాదు.. బయటకు వెళ్లరాదు ఎక్కడ చూసినా డ్రైనేజీ నీరే.. దుర్వాసన మధ్యే సహవాసం రోగాల పాలవుతున్న ప్రజలు చోద్యం చూస్తున్న అధికారులు ఇది యావర్రోడ్లోని ఓ ఇంటి ఆవరణ లోకి చేరిన మురికినీరు. మురికికాలువలన్నీ బ్లాక్ కావడంతో ఎటూ వెళ్లక ఇక్క డే నిలిచి ఉంటోంది. భారీ వర్షం పడితే నీరు ఇంటి లోపలికి చేరుతోందని ఆ ఇంటి యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం జిల్లాకేంద్రంలోని యావర్‌రోడ్. సమీపంలోని డ్రైనేజీని శుభ్రం చేయకపోవడంతో అక్కడకక్కడ కూలిపోయింది. కాలువ ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయింది. మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తుండడంతో సమీపంలోని షాపులు, ఇళ్లలోకి చేరుతోంది. ఆ వాసన భరించలేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీని శుభ్రం చేయాలని అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదంటున్నారు స్థానికులు.ఉండలేకపోతున్నాం నేను బుక్‌స్టాల్ పెట్టుకున్నాను. వాస్తవానికి యావర్‌రోడ్డు రద్దీ ప్రాంతం. ప్రజలు చాలామంది రావాలి. కానీ.. దుర్గంధంతో ప్రజలు ఇక్కడికి రావడం లేదు. ఇప్పుడిక్కడ వ్యాపారం చేసుకోలేని పరిస్థితి నెలకొంది. వర్షం పడితే మురికినీరంతా షాపులోకి వస్తోంది. మా పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉంది. అధికారులు స్పందించాలి. – సతీశ్, జగిత్యాల ఇది జిల్లాకేంద్రంలోని ఓ ఇల్లు. వారి ఇంటి సందులోకి వెళ్లాలన్నా.. బురద తొక్కుకుంటూ.. మురికినీరు దాటాల్సిందే. ఇంట్లో ఉన్నవారు బయటకు వెళ్లాలన్నా మురుగులోంచి నడవాల్సిందే. నీరంతా వంటగది, బెడ్రూంలోకి చేరుతుండడంతో ఇంట్లో ఉండలేకపోతున్నారు. ఇక్కడ ఎటుజడ్ బజార్ షాపు ఉండేది. పాన్టేలాతోపాటు వివిధ షాపులున్నాయి. ఈ మురికినీరంతా షాపుల్లోకి వెళ్లడంతో భరించలేక మూసివేశారు. అత్యధిక రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో మురికినీరు ఎటూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. స్థానికులు రోగాల పాలవుతున్నారు. ఎటైనా ఓ వైపు మురికినీరు తరలించేలా చూడాలని షాపుల యజమానులు కోరుతున్నారు. -
అన్ని వర్గాల సంక్షేమానికి కృషి
జగిత్యాల: అన్నివర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని, పట్టణ అభివృద్ధికి ఎళ్లవేళలా కృషి చేస్తానని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో బుధవారం అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బల్ది యాకు రూ.50కోట్లు, డబుల్‌బెడ్ రూం ఇళ్లకు రూ.20 కోట్లు మంజూరయ్యాయని, రూ.4 కోట్లతో మార్కెట్ నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు మహిళాసంఘాల ద్వారా రూ.లక్ష రుణం ఇచ్చే అవకాశం ఉందని, దీనిని వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో కమిషనర్ స్పందన, మున్సిపల్ మాజీ చైర్మన్ నాగభూషణం, కోరుట్ల కాంగ్రెస్ ఇన్చార్జి నర్సింగరావు, అడువాల జ్యోతి, సుధాకర్, శంకర్, అల్లె గంగసాగర్, పద్మజ, ధర్మరాజు, సమిండ్ల శ్రీను పాల్గొన్నారు. ● ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ -
దుర్వాసన భరించలేకున్నాం
దుర్వాసన భరించలేకపోతున్నాం. మేం ఇక్కడ కొన్నేళ్లుగా బుక్‌స్టాల్ నిర్వహిస్తున్నాం. ప్రారంభంలో చాలా మంది వచ్చారు. ఇప్పుడు దుర్గంధం కారణంగా ఎవరూ రావడం లేదు. దోమలు విపరీతంగా ఉంటున్నాయి. అధికారులు స్పందించి మురికికాలువ నీరు బయటకు వెళ్లేలా చూడాలి. – నాగేంద్రప్రసాద్, జగిత్యాల టైలరింగ్ నడుస్తలేదు నేను టైలరింగ్ చేసుకుంటాను. డ్రైనేజీ పక్కనే నా షాపు ఉంది. మురికినీరు షాపులోకే రావడంతో టైలరింగ్ చేసుకోలేకపోతున్నాను. దోమలతోపాటు.. దుర్గంధం రావడంతో షాపులో గంటసేపు కూడా ఉండలేని పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి. – లక్ష్మణ్, జగిత్యాల చర్యలు తీసుకుంటున్నాం సమస్య మా దృష్టికి వచ్చిన రెండు రోజుల్లోనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. డ్రైనేజీ బ్లాక్ కావడంతో నీరు ఎటూ వెళ్లడం లేదు. ఈ సమస్యను ఇటీవలే స్థానికులు మా దృష్టికి తీసుకొచ్చారు. మురికినీరు వెళ్లేలా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటాం. – స్పందన, మున్సిపల్ కమిషనర్ -
భక్తులకు సదుపాయాలు కల్పించండి
సారంగాపూర్: ఉత్తర తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరున్న దుబ్బరాజన్న ఆలయంలో భక్తులకు మరిన్ని వసతులు కల్పించేందుకు కృషిచేస్తానని మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. ఆలయ రెనోవేషన్ కమిటీ సభ్యులు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. ఆలయానికి నిత్యం వందలాది మంది భక్తులు వస్తుంటారని, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో లక్షలాది మంది పాల్గొంటారని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ద్వారా ఆలయ అభివృద్ధికి మరిన్ని నిధులు విడుదల చేయిస్తానని వెల్లడించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో అనూష, పాలకవర్గ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ఇంటర్ బోర్డు డిప్యూటీ సెక్రటరీగా వెంకటేశ్వర్రావుమెట్పల్లి: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేసిన రావులపల్లి వెంకటేశ్వర్రావు ఇంటర్ బోర్డు డిప్యూటీ సెక్రటరీగా పదోన్నతి పొందారు. బుధవారం కళాశాల సిబ్బంది, విద్యార్థులు ఆయనను ఘనంగా సన్మానించారు. ప్రిన్సిపాల్‌గా కళాశాలకు ఆయన అందించిన సేవలను కొనియాడారు. ఇన్చార్జి ప్రిన్సిపాల్ చిలకమారి శ్రీనివాస్, సీనియర్ ఉపన్యాసకులు కొక్కుల గంగాధర్ తదితరులున్నారు. లేబర్ కోడ్ల అమలు నిలిపివేయాలిజగిత్యాలటౌన్: కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు లెల్లెల బాలకృష్ణ డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బుధవారం జిల్లాకేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. కార్మిక సంఘాలు లేని దేశాన్ని పెట్టుబడిదారులకు బహుమతిగా ఇవ్వడమే కేంద్ర ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోందన్నారు. లేబర్ కోడ్ల ద్వారా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్‌మెంట్‌ను చట్టబద్ధం చేసి రెగ్యులర్ ఉద్యోగుల భద్రతకు ముప్పు తెచ్చిందన్నారు. ఏఐటీయూసీ నాయకులు ఎండీ.ముక్రం, సుతారి రాములు, సీఐటీయూ జిల్లా కన్వీనర్ పుప్పాల శ్రీకాంత్, ఇందూరి సులోచన, కోమటి చంద్రశేఖర్, చింత భూమేశ్వర్, మెయిజ్ భాయ్, ఖాజా మొయినుద్దీన్, లక్ష్మి, సీపీఐ జిల్లా కార్యదర్శి వెన్న సురేశ్, మల్యాల సురేష్ తదితరులు ఉన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధికి కృషిజగిత్యాలరూరల్: మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి రఘువరణ్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం అంతర్గాంలో మహిళాశక్తి సంబరాలు నిర్వహించారు. మహిళాసంఘాల్లో చేరని వారుంటే గుర్తించి చేర్పించాలన్నారు. 16నుంచి 18 ఏళ్లలోపున్న బాలికలు, 60 ఏళ్లు దాటిన వృద్ధులను ప్రత్యేక సంఘాల్లో చేర్పించాలన్నారు. సదరం ధ్రువీకరణ పత్రం ఉన్న దివ్యాంగుల సంఘాన్ని నాలుగు రకాలుగా విభజించాలని సూచించారు. వడ్డీ లేని రుణాలు, మైక్రోఎంటర్ప్రైజెస్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, పాడి గేదెల యూనిట్లకు రుణాలు అందించనున్నట్లు వెల్లడించారు. ఏపీవో ఓదెల గంగాధర్, సీసీ గంగారాం, వీవోఏలు విజయ, పావని, అధ్యక్షురాలు మానస, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి
● గోదావరి పుష్కరాలకు ధర్మపురి క్షేత్రాన్ని తీర్చిదిద్దుతా ● రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎరువుల కొరత రానీయం ● ‘దిశ’ కమిటీ సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ జగిత్యాల: జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. గోదావరి పుష్కరాల వరకు ధర్మపురి క్షేత్రాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. కలెక్టరేట్లో బుధవారం జిల్లా అభివృద్ధి (దిశ)పై సమీ క్షించారు. సాగు, తాగునీరు, విద్య, వైద్యం, వ్యవసాయంపై అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. జిల్లాలో అధిక శాతం మంది వ్యవసాయం ఆధారంగా జీవిస్తున్నారని, సా గునీటికి ఇబ్బంది రాకుండా ఇరిగేషన్ అధి కారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూ చించారు. ఎరువుల కొరత రానీయొద్దని, అధికా రులందరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధికి సీఎంతో మాట్లాడి నిధులు తెచ్చే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. కొత్త డిగ్రీ కళాశాల, స్టడీ సర్కిల్‌కు నిధులు మంజూరు చేస్తానన్నారు. జగి త్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ మాట్లాడు తూ.. కొండగట్టు అంజన్న ఆలయంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, మంత్రి చర్యలు తీసుకోవాలని కోరారు. మెడికల్ కళా శాలలో సౌకర్యాలు కల్పించాలన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ మాట్లాడుతూ.. మ న ఊరు – మన బడి కార్యక్రమానికి సంబంధించిన పెండింగ్ పనులకు నిధులు మంజూ రు చేయాలని కోరారు. వర్షకాలం నేపథ్యంలో మున్సిపల్ అధికారులు పట్టణాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, వరద డ్యామేజీ పనులను సత్వరమే పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎల్.రమణ మాట్లాడుతూ జగిత్యాలలోని డబుల్బెడ్రూం ఇళ్ల వద్ద సౌకర్యాలు కల్పించాలని, వీధి దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. కొత్తబస్టాండ్ నుంచి పాతబస్టాండ్ వర కు రోడ్డు వెడల్పు చేయాలన్నారు. ఎస్కేఎన్ఆర్ కళాశాల ఏర్పాటై 60 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో వజ్రోత్సవాలు నిర్వహించేలా చూడాలన్నారు. అన్ని అంశాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. కా ర్యక్రమంలో కలెక్టర్ సత్యప్రసాద్, అదనపు క లెక్టర్ లత, ఆర్డీవో మధుసూదన్ పాల్గొన్నారు. -
క్రిప్టో పాపాలు కోకొల్లలు!
బాధితులు ముందుకు రావాలి సాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్ కేంద్రంగా వెలుగుచూసిన మెటా క్రిప్టో దందా రోజుకో మలుపు తిరుగుతోంది. వాస్తవానికి ఇందులో జరుగుతున్న మోసాలపై బాధితులు నగరంలోని పలు ఠాణాల్లో ఇప్పటికే ఫిర్యాదులు చేసినా.. పోలీసులు పట్టించుకోకపోవడంతో పాపాల పుట్ట ఆలస్యంగా బద్దలవుతోంది. తొండ ముదిరి ఊసరవెల్లిగా మారినట్లు.. మెటా ఫండ్ పేరుతో మొదలైన క్రిప్టో దందా.. రెండు నెలలకే మెటా ప్రో అని పేరు మార్చుకుంది. అదేంటంటే సాంకేతిక మార్పులు అని సర్దిచెప్పారు. ఇక మొత్తం వ్యవహారంలో నగరంలోని ఓ టింబర్ డిపో యజమాని, ఓ మొబైల్‌షాప్ ఓనర్, ఓ మాజీ కార్పొరేటర్ ముగ్గురు రూ.కోట్లలో అమాయక ప్రజల నుంచి రూ.కోట్లు వసూలు చేశారు. ఇక ఈ వ్యవహారంలో కీలక సూత్రధారి లోకేశ్ ఏపీకి చెందిన వాడని కొందరు, ఆయన పూర్వీకులు సిద్దిపేటకు చెందిన వారని మరికొందరు బాధితులు చెబుతున్నారు. వీరంతా పథకం ప్రకారం.. అమాయక ప్రజలకు డబ్బులు రెట్టింపు అవుతాయని ఆశ చూపించి..వారి నుంచి రూ.కోట్లు వసూలు చేసి ఇపుడు ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారు. పట్టించుకోని పోలీసులు.. నగరంలోని తీగలగుట్టపల్లి సమీపంలోని ఓ టింబర్ డిపోయజమాని, కోర్టు సమీపంలోని ఓ మొబైల్ షాప్ యజమాని, మాజీ కార్పొరేటర్ ముగ్గురూ ఒకే సామాజికవర్గం. వీరు అంతా కలిసి లోకేశ్‌ను కరీంనగర్‌కు పలుమార్లు తీసుకువచ్చి.. టింబర్ డిపోలో సమావేశాలు నిర్వహించి.. కేవలం మూడు నెలల్లో డబ్బులు రెట్టింపు చేస్తామని నమ్మబలికి రూ.లక్షలు వసూలు చేశారు. ఒక దశలో ఓ కస్టమర్ కోసం వేములవాడ వెళ్లి మరీ రూ.16 లక్షలు ఒత్తిడి చేసి తీసుకున్నారు. శామీర్‌పేటలోని రిసార్ట్‌లో పలు సమావేశాలు పెట్టారు. వాటికి ప్రముఖ యూట్యూబ్ ఇన్ఫ్లూయెన్సర్, అరబ్‌షేక్ వేషధారణలో ఉన్నవారిని తీసుకువచ్చి పెట్టుబడులు ఆకర్షించారు. అక్కడి ఆర్భాటాలు, బౌన్సర్ల హడావుడి, హంగామా చూసిన పలువురు బుట్టలోపడి వారు అడిగినంత చెల్లించారు. బదులుగా అందరికీ మొబైల్లో యాప్ వేసిచ్చి డిజిటల్ డాలర్లు ఇచ్చామని చేతులు దులుపుకున్నారు. సరిగ్గా రెండు నెలల తరువాత బాధితులంతా మోసపోయామని గ్రహించారు. ఈ వ్యవహారంపై టూ టౌన్లో, త్రీ టౌన్లో బాధితులు పిటిషన్లు ఇచ్చినా.. అవి కేసుల దాకా పోలేదు. – గౌస్ ఆలం, కరీంనగర్ సీపీ లోకేశ్‌ను పదే పదే కరీంనగర్‌కు తీసుకువచ్చి.. మొబైల్‌షాప్ యజమాని, టింబర్ డిపో ఓనర్లు రూ.కోట్లల్లో వసూలు చేశారు. ఇందుకోసం జ్యోతి నగర్‌లోని ఓల్డ్ డీఐజీ కార్యాలయంలో ఓ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ నుంచే మెటా క్రిప్టో ఆపరేట్ చేస్తున్నారు. పేరుకు క్రిప్టో కరెన్సీ అని చెబుతున్నప్పటికీ వాస్తవానికి ఇది మల్టీ లెవల్ మార్కెటంగ్ తరహాలోనే తమను మోసం చేశారని బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ విషయమై బాధితులు నెమ్మదిగా బయటికి వస్తున్నారు. తమకు నిందితులు ఇచ్చిన ఫ్రాంసరీ నోట్లు, చెల్లని చెక్కులు తదితరాలను ‘సాక్షి’కి పంపుతున్నారు. నేరుగా సీపీకే ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీనిపై సీపీ గౌస్ ఆలం కూడా సీరియస్‌గానే ఉన్నారు. బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే... తప్పకుండా కేసు నమోదు చేసి చర్యలు చేపడతామని భరోసా ఇస్తున్నారు. మెటా ఫండ్‌తో మొదలై మెటాప్రో అవతారం ఎదురుతిరిగిన బాధితులకు చెల్లని చెక్కులు జారీ ‘సాక్షి’కి చెక్కులు, ప్రామిసరీ నోట్లు పంపుతున్న బాధితులు టింబర్ డిపో, మొబైల్‌షాప్ యజమానులు, మాజీ కార్పొరేటర్ కీలకం అరబ్‌షేక్‌లు, యూట్యూబ్ ఇన్ఫ్లూయెన్సర్లను చూపి పెట్టుబడులు -
అడవిపై గొడ్డలి వేటు
రాయికల్: చెట్లు పెంచాలి.. అడవులను రక్షించా లి.. హరితవనానికి కృషి చేయాలి.. ఇది ప్రభుత్వ విధానం. కానీ.. అందుకు విరుద్ధంగా రాయికల్ రేంజ్‌లోని కొంత మంది అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. అటవీశాఖ అధికారుల ఉదాసీనతతో భారీ చెట్లను నరికి రాత్రి వేళల్లో కలపను తరలిస్తున్నారు. రాయికల్ రేంజ్ పరిధిలో రాయికల్, మల్లాపూర్ మండలాలు ఉన్నాయి. ఇక్కడ సుమారు 11 వేల హెక్టార్లలో అటవీ విస్తీర్ణం ఉంది. రాత్రిపూట కలపను అక్రమంగా తరలించేందుకు కొంతమంది స్మగ్లర్లు అటవీశాఖ సిబ్బందిని మచ్చిక చేసుకుంటున్నారు. వారి అండదండలతో ఉదయం పూట చెట్లను నరుకుతూ.. రాత్రి సమయంలో గుట్టుచప్పుడు తరలిస్తున్నారు. పర్యవేక్షణ లోపంతో.. రాయికల్ రేంజ్ పరిధిలోని దావన్‌పల్లి, వస్తాపూర్, బోర్నపల్లి, చింతలూరు, కొత్తపేట, వీరాపూర్, పోరుమల్ల, అయోధ్య, ఆలూరు అటవీ ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఉదయం చెట్లను నరికేస్తూ కలపను రాత్రులపూట ద్విచక్ర వాహనాల ద్వారా జగిత్యాల, కోరుట్ల, రాయికల్‌కు తరలిస్తున్నారు. బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, చౌకీదార్ కనుసన్నల్లోనే ఈ వ్యవహారం అంతా నడుస్తోందని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. అటవీశాఖలో సిబ్బంది కొరత.. చెక్‌పోస్టులు లేక రవాణా రాయికల్ రేంజ్ పరిధిలో 15 బీట్లు ఉన్నాయి. ఒక్కో బీట్‌కు ఒక్కో బీట్ ఆఫీసర్ ఉండాలి. కేవలం ఆరుగురు బీట్ ఆఫీసర్లు మాత్రమే ఉన్నారు. ఐదుగురు సెక్షన్ ఆఫీసర్లకు నలుగురు మాత్రమే ఉన్నారు. మొబైల్ పార్టీ సెక్షన్ ఆఫీసర్ పోస్టు పూర్తిస్థాయిలో ఖాళీగా ఉంది. కలప రవాణా నియంత్రణ కోసం బోర్నపల్లి, దావన్‌పల్లి, జగిత్యాలలో చెక్‌పోస్టులను అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాల్సి ఉండగా.. అనుమతులు రాకపోవడంతో అక్రమ రవాణాదారులు ఇదే అదునుగా భావించి గోదావరితీరమైన బోర్నపల్లి నుంచి మల్లాపూర్ మండలానికి నిర్మల్ జిల్లా కడెం తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. మూడు చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపించినప్పటికీ అటవీశాఖ నుంచి అనుమతులు రాకపోవడం.. కొత్త సిబ్బందిని నియమించకపోవడంతో ఉన్న వారితోనే నెట్టుకురావాల్సి వస్తోంది. సిబ్బందిపై పనిభారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీఎఫ్‌వో స్పందించి కలప అక్రమ రవాణా నియంత్రణకు సరిహద్దుల ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించాలని అటవీ ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. కలపను తరలిస్తున్న స్మగ్లర్లు అటవీశాఖను వేధిస్తున్న సిబ్బంది కొరత రాయికల్ రేంజ్లో కనిపించని చెక్‌పోస్టులు రాత్రివేళ వాహనాలపై తరలిస్తున్న అక్రమార్కులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అటవీశాఖ అధికారులుఅక్రమ రవాణా చేస్తే చర్యలు అడవిలో చెట్లు నరకడం నేరం. కలపను తరలించడం.. చెట్లు నరికివేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. రాత్రివేళ పెట్రోలింగ్ చేపట్టి అక్రమార్కులపై కేసులు నమోదు చేస్తాం. ఎవరైనా కలప రవాణా చేస్తే సమాచారం అందించాలి. పేర్లు గోప్యంగా ఉంచుతాం. ఉన్నతాధికారుల అనుమతులు రాగానే చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తాం. – భూమేశ్, ఎఫ్ఆర్వో -
శ్మశానవాటికలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తారా?
పెద్దపల్లిరూరల్: రాఘవాపూర్ శివారులోని ప్రభుత్వ స్థలంలో అప్పన్నపేట ప్రాథమిక సహకార సంఘం ఏర్పాటు చేసే సోలార్ ప్లాంట్ స్థలం కేటాయింపు వివాదాస్పదమైంది. శ్మశానవాటిక కోసం వినియోగించుకుంటున్న స్థలంలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడమేమిటని గ్రామస్తులు ప్రశ్నించారు. ఈమేరకు మంగళవారం చదును పనులను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. అంత్యక్రియల కోసం వినియోగిస్తున్న స్థలంలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు సరికాదన్నారు. పనులను నిలిపివేయించిన గ్రామస్తులు.. ఆ తర్వాత కలెక్టరేట్‌కు తరలివెళ్లారు. అడిషనల్ కలెక్టర్ వేణును కలిసి వినతిపత్రం అందజేశారు. శ్మశానవాటికలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకోవాలని వారు కోరారు. రాఘవాపూర్‌లో గ్రామస్తుల నిరసన స్థలం మార్చాలని అధికారులకు ఫిర్యాదు -
‘ఎల్లంపల్లి’పైనే ఆశలు
● వరదనీటిని ఒడిసి పట్టుకుంటేనే ప్రయోజనం ● రెండేళ్లుగా నిలిచిపోయిన కాళేశ్వరం ఎత్తిపోతలు రామగుండం: దశాబ్దకాలంగా తాగు, సాగునీటి రంగంతో పాటు పారిశ్రామిక అవసరాలకు క్రమంగా పెరుగుతున్న నీటి వినియోగం మూలంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినా అనతికాలంలోనే నీటి నిల్వలు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా రెండేళ్లుగా కాళేశ్వరం జలాలను ఎల్లంపల్లిలోకి ఎత్తిపోసే ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో వివిధ అవసరాలకు ఎల్లంపల్లి జలాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపధ్యంలో ఏటా వర్షాకాలంలో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యానికి చేరే క్రమంలోనే ఎల్లంపల్లికి ఎగువన ఉన్న రిజర్వాయర్లను నింపుకునేలా నీటిపారుదలశాఖ అధికారులు ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తున్నారు. దీంతో కాళేశ్వరం ఎత్తిపోతలతో పని లేకుండానే గతేడాది అధికారులు ప్రత్యేక చొరవతో వరద నీరు సముద్రంలో కలవకుండా ఏడాది మొత్తం అప్రమత్తంగా ముందస్తు ప్రణాళికతో అన్ని అవసరాలను ఎల్లంపల్లితోనే పూర్తి చేసుకోవడం గమనార్హం. ప్రాజెక్టు వివరాలు.. ఎల్లంపల్లి పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 148.00 మీటర్ల ఎత్తులో 20.175 టీఎంసీలు. నీటి పారుదలశాఖ అధికారులు ఆదివారం తెలిపిన వివరాల మేరకు 8.66 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాగా ఇదే రోజు గతేడాది కేవలం 4.80 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతలతో నింపుకునే రిజర్వాయర్లు ● లోయర్ మానేర్ డ్యాం 24.034 టీఎంసీల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ రిజర్వాయర్‌ను ఏటా ఎల్లంపల్లి జలాలతో నింపుకోవడం జరుగుతోంది. ● రంగనాయకసాగర్ రిజర్వాయర్ మూడు టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. ● శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 80.5 టీఎంసీలు నీటి సామర్థ్యం కలిగి ఉంటుంది. ఎస్సారెస్పీ నుంచి కాకతీయ కెనాల్ ద్వారా 9.68 లక్షల ఎకరాలు, సరస్వతీ కెనాల్ 34వేల ఎకరాలు, లక్ష్మి కెనాల్ నుంచి 21వేల ఎకరాలకు సాగునీరందిస్తుంది. వీటితో పాటు ఇతరత్రా తాగునీటి అవసరాలను తీర్చుతుంది. ● మిడ్‌మానేర్ రిజర్వాయర్‌కు 27.55 టీఎంసీల సామర్థ్యం ఉంది. ● కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్‌కు 15 టీఎంసీల సామర్థ్యం కలిగి ఉంది. ● కొమురవెల్లి మల్లన్నసాగర్ 50 టీఎంసీల వరద నీటిని ఎల్లంపల్లి ఎత్తిపోతల ద్వారా నింపుకునే సామర్థ్యం కలిగి ఉంది. -
ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యాయత్నం
మేడిపల్లి: మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన గోడిశెల గట్టయ్య ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం.. గట్టయ్యకు ఇద్దరు కొడుకులు. ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉంటున్నారు. భార్యకు లోకజ్థానం తక్కువ. మరోవైపు ఆర్థిక ఇబ్బందులు. ఈ క్రమంలో మనస్తాపంతో ఆదివారం ఉదయ క్రిమిసంహారక మందు తాగాడు. స్థానికులు అతడిని వెంటనే జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. మంగళవారం ఉదయం ఇంటికి చేరిన ఆయన సాయంత్రం సమయంలో మల్యాల మండలం కొండగట్టు ప్రాంతంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. కేకలు వేయడంతో స్తానికులు గమనించి మంటలు ఆర్పి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు గట్టయ్యను కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
ముగిసిన డీడీఎన్ ఆలయాల ఎంపిక పరిశీలన
కరీంనగర్ కల్చరల్: ప్రతీగ్రామంలో ఒక ఆలయానికి నిత్యం దీపదూపాలు నిర్వహించాలనే ఉద్దేశంతో 2007లో వైఎస్సార్ హయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం డీడీఎన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. కొత్తగా ఉమ్మడి జిల్లాలోని ఆలయాలకు దూపదీప నైవేద్య పథకం వర్తింపజేసేందుకు దేవాదాయశాఖ మే1న నోటిపికేషన్ జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలో 317 దరఖాస్తులు రాగా.. ఎంపిక పరిశీలన ఇటీవలే ముగిసింది. ప్రతి తీ జిల్లాలో దేవాదాయశాఖ త్రిసభ్య కమిటీతో చర్చించి, సభ్యులతో సంతకాలు చేయించి, ఆమోదం పొందిన తరువాత జాబితాను దేవాదాయశాఖ కమిషన్ కార్యాలయానికి పంపించనున్నారు. ఉమ్మడి జిల్లా దేవాయశాఖ సహాయ కమిషనర్, ఎండోమెంట్ ఇన్స్పెక్టర్లు, ఇద్దరు సీనియర్ ఈవోలు, రెగ్యులర్ అర్చకుల నుంచి ఒకరు, డీడీఎన్ అర్చకుల నుంచి ఇద్దరు కమిటీగా దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆలయ నిర్మాణం చేపట్టి 15ఏళ్లు పూర్తయ్యిందా..? డీడీఎన్ నిబంధనల మేరకు ఉన్నాయా అని పరిశీలించారు. ‘డీడీఎన్ ఆలయాల ఎంపిక పరిశీలన ముగిసింది. ప్రతీ జిల్లాలో దేవాదాయశాఖ త్రిసభ్య కమిటీ సంతకాల స్వీకరణ తరువాత జాబితా దేవాదాయ కమిషనర్‌కు పంపిస్తాం’ అని దేవాదాయశాఖ ఉమ్మడి జిల్లా సహాక కమిషనర్ నాయిని సుప్రియ వివరించారు. ఉమ్మడి జిల్లాలో డీడీఎన్ దరఖాస్తుల వివరాలు జిల్లా ప్రస్తుత వచ్చిన ఆలయాలు దరఖాస్తులు కరీంనగర్ 256 100 పెద్దపల్లి 153 69 రాజన్న సిరిసిల్ల 167 42 జగిత్యాల 322 106 మొత్తం 898 317 -
మరణించినా.. నలుగురికి చూపునిచ్చారు
కోల్‌సిటీ(రామగుండం): రామగుండం పోలీస్ కమిషరేట్ పరిధిలో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు చనిపోయారు. వారి నేత్రాలను దానం చేసి, నలుగురికి చూపు ప్రసాదించి ఆదర్శంగా నిలిచాయి వారి కుటుంబాలు. గోదావరిఖని ఓల్డ్ అశోక థియేటర్ సమీపంలోని సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి కడారి చంద్రయ్య(61), ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. విషాదంలో ఉన్న ఆయన కుటుంబసభ్యులు.. చంద్రయ్య నేత్రాలను దానం చేయడానికి ముందుకు వచ్చారు. గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రి(జీజీహెచ్)లో మంగళవారం ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ ప్రదీప్ నాయక్ సహకారంతో నేత్రాలను సేకరించి హైదరాబాదుకు తరలించారు. అలాగే స్థానిక విలేజ్ రామగుండానికి చెందిన అంబాడి రాజశేఖర్(55) ఈనెల 7న రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడు. ఇంటి పెద్దను కోల్పోయిన దుఃఖంలో కూడా కుటుంబ సభ్యులు ఆయన నేత్రాలుదానం చేసేందుకు ముందుకు వచ్చారు. జీజీహెచ్‌లో టెక్నీషియన్ సహకారంతో నేత్రాలను సేకరించి హైదరాబాదుకు తరలించారు. మృతుల కుటుంబాలను సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, గౌరవ అధ్యక్షుడు సానా రామకృష్ణారెడ్డి, ముఖ్య సలహాదారులు నూక రమేశ్, కార్యదర్శి భీష్మాచారి, ప్రచార కార్యదర్శి వాసుతోపాటు రామగుండం లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఎల్లప్ప, కార్యదర్శి సారయ్య, కోశాధికారి రాజేందర్, మాజీ అధ్యక్షుడు పి.మల్లికార్జున్ అభినందించారు. రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి కళ్లు దానం చేసిన రెండు కుటుంబాలు అభినందించిన సదాశయ ఫౌండేషన్, లయన్స్ క్లబ్ -
మరోచోట ఏర్పాటు చేయాలి
శ్మశానవాటిక స్థలంలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పా టు చేయడం సరికాదు. ప్లాంట్ ఏర్పాటు పనుల్లో శవాల ఎముకలు బయటపడ్డాయి. ఇది మా మనోభావాలను దెబ్బతీయడమే. మరోచోట ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలి. – మర్కు లక్ష్మణ్, బీఆర్ఎస్ నేత ఉన్నతాధికారులు చొరవ చూపాలి శ్మశానవాటిక స్థలాన్ని చదును చేసే పనులు విరమించుకోవాలి. అంత్యక్రియలు జరిపేందుకు వినియోగిస్తున్న స్థలంలో సోలార్ పవర్ ప్లాంట్ నిర్మించాలనే యోచన సరికాదు. ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకోవాలి. – తాడిచెట్టి శ్రీకాంత్, రాఘవాపూర్ ప్రభుత్వ స్థలంలోనే ఏర్పాటు కొందరు గ్రామస్తులు సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు మా దృష్టికి వచ్చింది. శ్మశానవాటికలో కాకుండా రెవెన్యూ అధికారులు నిర్ధారించిన హద్దుల్లోనే సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాం. – శ్రీమాల, జిల్లా సహకారశాఖ అధికారి -
మద్యానికి బానిసై యువకుడి ఆత్మహత్య
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని చీర్లవంచలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు.. చీర్లవంచకు చెందిన గంగు శ్రీనివాస్ (22) మద్యానికి బానిసై ఏ పని చేయక తిరుగుతూ ఉండేవాడు. సోమవారం రాత్రి గ్రామ శివారులోని డంపింగ్ యార్డులో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉపేంద్రాచారి తెలిపారు. అనారోగ్యంతో వృద్ధురాలు..ఇల్లందకుంట: మండలంలోని మర్రివానిపల్లి గ్రా మానికి చెందిన కాటిపల్లి అమృతమ్మ(70) అ నారోగ్యంతో జీవితంపై విరక్తిచెంది వ్యవసాయబావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇల్లందకు ంట ఎస్సై క్రాంతికుమార్ వివరాల ప్రకారం.. అ మృతమ్మ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. జీవితంపై విరక్తితో సోమవారం ఇంట్లోంచి బయటకు వెళ్లింది. రాత్రయినా ఇంటికి రాలేదు. కుటుంబసభ్యులు మంగళవారం చుట్టుపక్కల వెతుకుతుండగా.. గ్రామశివారులోని ఓ వ్యవసాయబావిలో మృతదేహం లభించింది. త నతల్లి అనారోగ్యంతో బాధపడుతోందని, జీవి తంపై విరక్తితో ఆత్మహత్య చేసుకుందని అమృతమ్మ కొడుకు రవీందర్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. జిల్లాలో నాలుగు సోలార్ పవర్ ప్లాంట్లు పెద్దపల్లిరూరల్: జిల్లాలో పీఎం కుసుమ్ పథకం ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. మహిళా స్వశక్తి సంఘాలు, రైతులు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సా హం అందించాలని నిర్ణయించారు. వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాలు ముందుకు రావడంతో నాలుగు చోట్ల ఏర్పాటుకు చేసేందుకు అధికారులు ప్రతిపాదించారు. అందుకు అవసరమైన ప్రభుత్వ స్థలాలను గుర్తించి హద్దులు నిర్ణయించడంతో పనులు చేపట్టారు. పెద్దపల్లి మండలం అప్పన్నపేట సహకార సంఘం ఆధ్వర్యంలో రాఘవాపూర్‌లో ఒకటి, మండల కేంద్రమైన కాల్వశ్రీరాంపూర్‌లో మరోటి, మంథని మండ లం గుంజపడుగులో ఇంకోటి, ధర్మారం మండలం దొంగతుర్తిలోనూ సహకార సంఘం ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు అనుగుణంగా స్థలాల చదును పనులు ప్రారంభించారు. రెడ్కో నోడల్ ఏజెన్సీ పర్యవేక్షణలో.. జిల్లాలో ఏర్పాటు సోలార్ పవర్ ప్లాంట్ల పనులు టీజీ రెడ్కో నిర్మాణ సంస్థ పర్యవేక్షణలో జరగనున్నాయి. తక్కువ ఖర్చుతో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు గల అవకాశాలపై నివేదిక అందించాలని ఇటీవల జరిగిన సమీక్షలో కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ప్లాంట్ల నిర్మాణం, నిర్వహణకు ఒప్పందం చేసుకునేందుకు పకడ్బందీగా మార్గదర్శకాలను సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. ఒక్కో మెగావాట్ ఉత్పత్తి లక్ష్యం.. పీఎం కుసుమ్ పథకం ద్వారా ఏర్పాటు చేస్తున్న సోలార్ పవర్ ప్లాంట్‌ను దాదాపు నాలుగెకరాల స్థలంలో ఏర్పాటు చేస్తారు. ఇందులో ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. ఈ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సోలార్ పవర్ ప్లాంట్లలో ఉత్పత్తి చేసే విద్యుత్‌ను ఎన్పీడీసీఎల్కు విక్రయించి ఆదాయాన్ని ఆర్జించనున్నట్టు జిల్లా సహకార శాఖ అధికారి శ్రీమాల తెలిపారు. -
35 ఏళ్లుగా సాయి సేవలో..
● ట్రస్ట్, దాతల సహకారంతో అభివృద్ధి వేములవాడ: పట్టణంలోని మార్కండేయనగర్లో 1990 లో నిర్మించిన సాయిబాబా ఆలయానికి 35 ఏళ్లుగా సేవలందిస్తూ భక్తులు, స్థానికుల మన్ననలు పొందుతున్నా రు. ట్రస్టీలు, దాతల సహకారంతో 35 ఏళ్లు పూర్తిచేసుకు ని రూ.3 కోట్లతో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఈనెల 10న నిర్వహించే గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ట్రస్టీలు ప్రణాళికలు సిద్ధం చేశారు. 1990లో బాబా గుడి పునాది మార్కండేయనగర్లో 1990లో అప్పటి సర్పంచ్ ప్రతాప చంద్రమౌళి ఆధ్వర్యంలో పాలకమండలి లేఅవుట్ స్థలాన్ని సాయిబాబా సంస్థాన్‌కు అప్పగించింది. షిరిడీ సాయిబాబా సేవాసంస్థాన్ ట్రస్ట్ పేరుతో ఏర్పడిన ఈ సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా అప్పటి వార్డు సభ్యుడు వారాల దేవయ్యను ఎన్నుకున్నారు. 1993లో ఆలయ నిర్మాణం పూర్తయింది. భక్తుల రద్దీ పెరగడంతో ఆలయం ఇరుకుగా మారింది. దీంతో దాతల సహకారం, ట్రస్టీల ప్రోత్సాహంతో ఇప్పటివరకు రూ.3 కోట్లు ఖర్చుచేసి 2011లో నూతన భవనం నిర్మించుకున్నారు. ట్రస్టీల సేవానిరతి ఎలాంటి పారితోషికం లేకుండా 35 ఏళ్లుగా ఆలయంలో ఉచితంగా భక్తులకు సేవలందిస్తున్నారు. వ్యవస్థాపక అధ్యక్షుడిగా వారాల దేవయ్య, ట్రస్టీలుగా గంప రాజేందర్, కూర రమేశ్, కోనమ్మగారి నాగరాజు, బండారి కుమార్, రైకనపాట శ్రీనివాస్, గంప గౌరిశంకర్, నాగుల యాదగిరి, ఎంబేరి నర్సయ్య, పీచర రవీందర్రావు, టి. కృష్ణస్వామి, తొగరి వెంకటేశ్ కొనసాగుతున్నారు. ట్రస్టీలు చేస్తున్న సేవలు గుర్తించిన పలు సంస్థలు అవార్డులు ప్రకటించాయి. 2009లో తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మప్రచార పరిషత్‌లో వేములవాడ సాయిబాబా ఆలయం నుంచి వారాల దేవయ్యను ఎంపిక చేశారు. -
ముగిసిన పోలీస్ డ్యూటీమీట్
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంగా జరిగిన రాజన్న జోన్‌స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ మంగళవారం ఘనంగా ముగిసింది. ఇందులో ఆరు విభాగాల్లో పోటీలు నిర్వహించారు. విజేతలుగా నిలిచిన వారిని వరంగల్‌లో జరగనున్న రాష్ట్రస్థాయి డ్యూటీమీట్‌కు పంపించనున్నారు. విజేతలకు సీపీ గౌస్ ఆలం పతకాలు అందించారు. సైంటిఫిక్ ఎయిడ్స్ టు ఇన్వెస్టిగేషన్ విభాగంలోని ఫోరెన్సిక్ సైన్స్ రాతపరీక్షలో గంగాధర ఎస్సై వంశీకృష్ణ బంగారుపతకం సాధించారు. క్రైం ఇన్వెస్టిగేషన్, క్రిమినల్ చట్టాలు విభాగంలో సిద్దిపేట కమిషనరేట్‌లోని రాయపోల్ ఎస్సై రఘుపతి, మెడికల్ లీగల్ టెస్ట్‌లో చొప్పదండి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎ.ప్రదీప్ కుమార్, లిఫ్టింగ్ అండ్ ప్యాకింగ్ ఆఫ్ ఎగ్జిబిట్స్ పరీక్షలో కామారెడ్డి ఎస్సై ఆంజనేయులు, ఫింగర్ ప్రింట్ సైన్స్‌లో కరీంనగర్ కమిషనరేట్‌కు చెందిన ఎస్సై యూనస్, క్రైంసీన్ ఫొటోగ్రఫీ పరీక్షలో కామారెడ్డి జిల్లాకు చెందిన ఎస్సై ఆంజనేయులు, పోలీస్ పోట్రైట్ పరీక్షల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన కానిస్టేబుల్ ప్రసన్న కుమార్ బంగారు పతకం సాధించారు. యాంటీ సాబెటేజ్ చెక్‌లోని గ్రౌండ్సర్చ్లో కరీంనగర్ కమిషనరేట్‌కు చెందిన కానిస్టేబుళ్లు వి.సంతోష్, వి.వెంకటేశ్, రూంసెర్చ్లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన కానిస్టేబుళ్లు ఎం.శ్రవణ్ కుమార్, జి.కిరణ్‌కుమార్, వెహికల్సెర్చ్లో సిద్దిపేట కమిషనరేట్‌కు చెందిన కానిస్టేబుల్ బి.శ్రీనివాస్, ఎం.శంకర్ బంగారు పతకం సాధించారు. యాక్సెస్ కంట్రోల్లో మెదక్ జిల్లాకు చెందిన కానిస్టేబుళ్లు ఎం.దుర్గాప్రసాద్, కె.సిద్ధిరాములు, డాగ్‌స్క్వాడ్ కాంపిటీషన్లోని ట్రాకింగ్‌లో సిద్దిపేట కమిషనరేట్‌కు చెందిన కానిస్టేబుల్ జి.శంకర్, నార్కోటిక్ విభాగంలో సిద్దిపేట కమిషనరేట్‌కు చెందిన కానిస్టేబుల్ పి.అజయ్, ఎక్స్‌ప్లోజివ్‌లో సిద్దిపేట కమిషనరేట్ కు చెందిన డాగ్ హ్యాండ్లర్ పి.వెంకటేశ్ బంగారు పతకం, కంప్యూటర్ అవేర్నెస్ కాంపిటీషన్లో మెదక్ జిల్లాకు చెందిన కానిస్టేబుల్ ఎస్.సతీశ్‌కుమార్, ఆఫీస్ ఆటోమేషన్‌లో సిద్దిపేట కమిషనరేట్‌కు చెందిన కానిస్టేబుల్ యూ.భాస్కర్, ప్రోగ్రామింగ్ ఎబిలిటీలో కరీంనగర్ కమిషనరేట్‌కు చెందిన ఫోరెన్సిక్ ల్యాబ్ కానిస్టేబుల్ జి.సంతోష్ కుమార్ బంగారు పతకం పొందారు. పోలీస్ ఫొటోగ్రఫీ విభాగంలో మెదక్ జిల్లాకు చెందిన ఎం.శ్రీధర్‌గౌడ్, వీడియోగ్రఫీలో మెదక్ జిల్లాకు చెందిన కానిస్టేబుల్ శ్రీధర్ గౌడ్‌కు బంగారు పతకాలు వచ్చాయి. అడిషనల్ డీసీపీలు వెంకటరమణ, భీంరావు, ఏసీపీలు విజయ్ కుమార్, వేణుగోపాల్ పాల్గొన్నారు. విజేతలకు పతకాలు అందించిన సీపీ గౌస్ ఆలం -
గొప్పనేత వైఎస్సార్
● మాజీ మంత్రి జీవన్‌రెడ్డి జగిత్యాల టౌన్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి గొప్ప నేత అని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి కొనియాడారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా జిల్లాకేంద్రంలోని ఇందిరాభవన్‌లో కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం మాట్లాడుతూ.. జగిత్యాల జిల్లాతో వైఎస్సార్‌కు ఎనలేని మమకారం ఉందని, అందుకే జిల్లాకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. నాచుపల్లిలో జెఎన్టీయూ, కోరుట్లలో వెటర్నరీ కళాశాల, జగిత్యాలలో పండ్ల మార్కెట్ ఆయన చలవే అన్నారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. -
మీ సేవ.. మరింత చేరువ
కరీంనగర్ అర్బన్: కాగిత రహిత పాలనగా సేవలందిస్తున్న మీసేవ మరిన్ని సేవలకు వేదికవుతోంది. ఇప్పటికే పలు రకాల ప్రయోజనాలు అందిస్తుండగా రెండు నెలల క్రితం తొమ్మిది రకాల సేవలను పొందుపర్చారు. తాజాగా మరో రెండు రకాల సేవలను ప్రజలకు అందుబాటులోకి తేవడం స్వాగతించదగ్గ పరిణామం. ప్రస్తుతం మీ సేవ కేంద్రాలు రెవెన్యూ, పురపాలిక, పంచాయతీరాజ్ తదితర శాఖల సేవలు అందిస్తూ పలు ధ్రువీకరణ పత్రాల జారీతో ఎన్నో రకాల ప్రయోజనాలు అందిస్తోంది. తాజాగా రిజిస్ట్రేషన్ శాఖ జారీ చేసే వివాహ ధ్రువీకరణ, వ్యవసాయేతర భూముల మార్కెట్ విలువ ధ్రువీకరణ పత్రాలను మీసేవ ద్వారా పొందే వెసులుబాటు కల్పించింది. పౌరుల పేరు మార్పిడి, ఆదాయ, కుల తదితర ధ్రువీకరణ పత్రాలు, లోకల్ క్యాండిడేట్, స్టడీ గ్యాప్ సర్టిఫికెట్, మైనారిటీ ధ్రువీకరణ, క్రీమిలేయర్, నాన్ క్రీమిలేయర్, మార్కెట్ విలువ, ఖాస్రా, పహాణీల వంటి పాత ధ్రువీకరణ పత్రాలు, ఆర్వోఆర్–1(బి) సర్టిఫైడ్ కాపీలు పొందొచ్చు. అప్లికేషన్ కాగితాలతో కార్యాలయాలకు వెళ్లకుండా మీ సేవలోనే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోగా సర్టిఫికెట్లు పొందవచ్చని అధికారులు వివరించారు. ● వివాహ ధ్రువపత్రం పొందడం తేలిక వివాహమైన నూతన దంపతులకు వివాహ ధ్రువపత్రం తప్పనిసరి. సదరు ఎలా పొందాలో తెలియక చాలా మంది ఇబ్బందులు పడేవారు. ఏజెంట్లను సంప్రదించి రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్తుండేవారు. బ్రోకర్లు వేలకు వేలు దండుకుని ఇబ్బందులకు గురిచేస్తుండగా పలువురు అన్ని పత్రాలకు తామే బాధ్యులమంటూ ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ ప్రయాస లేకుండా వివాహ ధ్రువీకరణ పత్రం అవసరం ఉన్నవారు మీ సేవ కేంద్రం ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. దళారులకు అస్కారం లేకుండా ఆన్లైన్ ద్వారా సర్టిఫికెట్ జారీ చేయనున్నారు. ● కావాల్సినవి ఏంటంటే.. వధూవరులిద్దరి ఆధార్ కార్డులు, ఎన్నికల సంఘం జారీ చేసిన ఓటరు ఐడీ కార్డు తదితర గుర్తింపు పత్రాలు. వయసు రుజువు కోసం పదో తరగతి మెమో. రెండు కుటుంబాలకు చెందిన వివాహ ఆహ్వాన పత్రికలు, పెళ్లికి సంబంధించిన రెండు ఫొటోలు. ముగ్గురు సాక్షులకు చెందిన గుర్తింపు పత్రాల జిరాక్స్ ప్రతులు. ● మార్కెట్ విలువ పత్రాలు పొందొచ్చు గృహ నిర్మాణాలు, ఇతర బ్యాంకు రుణాల కోసం వ్యవసాయేతర భూములకు మార్కెట్ విలువ ధ్రువపత్రాలు తప్పనిసరిగా అవసరం. గతంలో వీటిని రిజిస్ట్రేషన్ శాఖలో మ్యానువల్‌గా అందించేవారు. ఇప్పుడు వాటిని సైతం మీ సేవ ద్వారా అందించనున్నారు. ● త్వరలో ఇసుక బుకింగ్ కూడా.. ఇసుక అక్రమ తరలింపునకు అడ్డుకట్ట వేసే దిశలో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందుకు ‘మీ సేవ’ను వినియోగించుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇసుక అవసరమైన వారు మీ–సేవ కేంద్రాల ద్వారా స్లాట్ బుక్ చేసుకుని తెప్పించుకునే వెసులుబాటు కల్పించనుంది. కొత్తగా మరో రెండు సేవలు -
ప్రజావాణికి అర్జీల వెల్లువ
● దరఖాస్తులు స్వీకరించిన అదనపు కలెక్టర్ లత ● వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలుజగిత్యాలటౌన్: కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి బాధితులు తరలివచ్చారు. వారి నుంచి అదనపు కలెక్టర్ లత అర్జీలు స్వీకరించారు. 39 మంది దరఖాస్తు చేసుకోగా.. వాటిని పరిశీలించిన లత సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జగిత్యాల, మెట్పల్లి ఆర్డీవోలు మధుసూదన్‌గౌడ్, శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు. -
కుటుంబాన్ని ఆదుకోండి
నా భర్త రేవల్ల రవీందర్‌గౌడ్ ఉపాధి కోసం ఇజ్రాయిల్ దేశం వెళ్లాడు. అనా రోగ్యంతో బాధపడుతు న్న ఆయనను ఇటీవల జరిగిన ఇజ్రాయిల్, ఇరా న్ యుద్ధం సందర్బంగా బంకర్లో ఉంచగా సరైన వైద్యం అందక అక్కడే చనిపోయాడు. అప్పులు, పేదరికంతో ఉన్న మా కుటుంబం మరింత కష్టాల్లో పడింది. నా కొడుకు మంజునాథ్ దివ్యాంగుడు (చెవిటి, మూగ) కావడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. నా కుమారుడికి ఏదైనా ఉపాధి కల్పించండి. – రేవెల్ల విజయలక్ష్మి, జగిత్యాల ప్లాట్లకు హద్దులు చూపండి 2009లో ఇందిరమ్మ పథకం కింద కొడిమ్యాల శివారులోని సర్వేనంబర్ 411, 412లోగల భూమిని 193 ప్లాట్లుగా చేసి మాకు పట్టాలు ఇచ్చారు. ఇందులో 40ప్లాట్లకు హద్దులు చూపించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాం. కోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని అప్పటి కలెక్టర్‌ను సంప్రదించగా విచారణ జరిపి మా 40 ప్లాట్లతోపాటు మొత్తం 92 ప్లాట్లకు హద్దులు నిర్ణయించారు. ఆ స్థలంలో కొనుగోలు కేంద్రం నిర్వహించడంతో హద్దులు చెరిపివేయబడ్డాయి. తిరిగి హద్దులు ఏర్పాటు చేయించండి. – కొడిమ్యాల ప్రజలు పరిహారం ఇప్పించండి మాది కొడిమ్యాల మండలం పూడూరు. మా గ్రామం మీదుగా వెళ్తున్న జాతీయ రహదారి 563 భూసేకరణలో నష్టపోయిన గౌరాపూర్, నాచుపల్లి, నూకపల్లి, రాజారం, పోతారం గ్రామాల ప్రజలకు పరిహారం మంజూరు చేశారు. పూడూరు బాధితులకు పరిహారం ఇప్పటికీ అందలేదు. జగిత్యాల ఆర్డీవోను సంప్రదిస్తే ఫైల్ నేషనల్ హైవే ప్రాజెక్టు డైరెక్టర్ వద్ద పెండింగ్‌లో ఉందని తెలిపారు. ఆ ఫైల్‌ను క్లియర్ చేసి పరిహారం ఇప్పించండి. – వెల్ముల రాంరెడ్డి, పూడూరు ఆస్తులు గుంజుకుని అనాథను చేశాడు నా భర్త రామగిరి రాములు. మాకు సంతానం లేక ఆలూరుకు చెందిన సురతాని శంకర్‌రెడ్డిని దత్తత తీసుకున్నాం. నా భర్త 16ఏళ్ల క్రితం చనిపోయాడు. అప్పటినుంచి శంకర్‌రెడ్డిని అన్నీ నేనై పెంచాను. నా భర్త పేరిట జగిత్యాల మండలం మోరపల్లిలో ఉన్న ఐదు గుంటల స్థలాన్ని శంకర్‌రెడ్డి నాకు తెలియకుండానే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించగా నా పోషణతోపాటు అన్ని ఖర్చులు భరిస్తానని చెప్పి ఇప్పుడు పట్టించుకోవడం లేదు. నా పోషణ భరించేలా చర్యలు తీసుకోండి. లేకుంటే నా ఆస్తి నాకు తిరిగి ఇప్పించి ఆదుకోండి. – రామగిరి రాజేశ్వరి, ఆలూరు -
దేవాదాయశాఖలోకి మల్లన్న ఆలయం
● 2021లో దేవాదాయశాఖ నుంచి మినహయింపు ● తాజాగా ఆలయ నిర్వహణను ఆధీనంలోకి తీసుకున్న అధికారులుమెట్పల్లి రూరల్: మెట్పల్లి మండలం పెద్దాపూర్ మల్లన్న స్వామి ఆలయాన్ని దేవాదాయశాఖ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దాదాపు పదేళ్ల క్రితమే దేవాదాయశాఖలో ఆలయం విలీనమైనా.. గ్రామస్తుల అభ్యంతరాలు, విన్నపాలతో అప్పటి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. 2021 నుంచి మూడేళ్లపాటు మినహాయింపు ఇచ్చిన ప్రభుత్వం.. సమయం పూర్తికావడంతో ఆలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. ఇందుకోసం ఈవోతోపాటు 8 మంది సిబ్బందిని ఉన్నతాధికారులు నియమించారు. పదేళ్ల క్రితమే దేవాదాయశాఖలోకి.. పెద్దాపూర్ మల్లన్న స్వామి ఆలయాన్ని పదేళ్ల క్రితమే అప్పటి ప్రభుత్వం దేవాదాయశాఖలో విలీనం చేసింది. ఏళ్ల తరబడి గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ) ఆధ్వర్యంలో నిర్వహణ సాగిన ఈ ఆలయం దేవాదాయశాఖలో విలీనం చేయడంపై గ్రామస్తులు వ్యతిరేకించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ప్రభుత్వ పెద్దలను కలిసి దేవాదాయశాఖ నుంచి తప్పించాలని విన్నవించారు. ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. 2021 తర్వాత దేవాదాయశాఖ నుంచి తప్పించాల్సిందేనని మళ్లీ స్థానిక ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తేవడంతో దేవాదాయశాఖ చట్టం సెక్షన్ 15, 29 ప్రకారం మూడేళ్ల పాటు మినహాయింపు లభించింది. దీంతో మొన్నటి వరకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలోనే ఆలయ నిర్వహణ, వ్యవహారాలన్నీ కొనసాగాయి. ప్రస్తుతం మినహాయింపు సమయం ముగియడంతో మల్లన్న స్వామి ఆలయాన్ని సోమవారం అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. హుండీ ఆదాయం లెక్కింపు.. మల్లన్న స్వామి ఆలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న దేవాదాయశాఖ అధికారులు హుండీ ఆదాయాన్ని లెక్కించారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన జాతర ద్వారా రూ.18,13,095 సమకూరింది. 66 గ్రాముల మిశ్రమ బంగారం, 7.170 కిలోల మిశ్రమ వెండి వచ్చింది. గ్రాములు వచ్చింది. -
రైతులకు తీరిన విద్యుత్ కష్టాలు
జగిత్యాలరూరల్: జగిత్యాల రూరల్ మండలం సోమన్‌పల్లి రైతులకు విద్యుత్ కష్టాలు తీరాయి. ట్రాన్స్ఫార్మర్ లేకపోవడం.. స్తంభాలు లేకపోవడం.. విద్యుత్ వైర్లు లాగక పోవడంతో రైతులు ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో ‘రైతులకు విద్యుత్ కష్టాలు’ శీర్షికన ‘సాక్షి’ ఈనెల 7న కథనం ప్రచురించింది. ఆ కథనానికి స్పందించిన ట్రాన్స్‌కో అధికారులు సోమన్పల్లిలోని మందోట వద్ద కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ను తొలగించి కొత్త ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు. ఏడాదిన్నర క్రితం విద్యుత్ కనెక్షన్లు మంజూరు పొందిన రైతులకు కొత్త స్థంబాలు వేయించారు. విద్యుత్ వైర్లు లాగి రైతులకు విద్యుత్ సరఫరా చేశారు. లూజ్‌వైర్లను గుర్తించి కొత్త స్తంభాలను ఏర్పాటు చేసి లైన్లను సవరించారు. దీంతో సోమన్‌పల్లి గ్రామ రైతులు ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచాలి
జగిత్యాల: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో వైద్య శాఖ అధికారులతో సమీక్షించారు. 50శాతం కన్నా తక్కువగా ప్రసవాలు చేయించిన ఆస్పత్రులపై దృష్టి సారించి 90 శాతం జరిగేలా చూడాలని ఆదేశించారు. ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీల సంఖ్య చాలా తక్కువగా ఉందని, పనితీరు మెరుగుపర్చుకోవాలని ఆదేశించారు. వచ్చే మూడు నెలల్లో కచ్చితంగా 90 శాతం పెరగాలని ఆదేశించారు. గర్భిణులను గుర్తించి వారికి మోటివేషన్ చేయాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్, డెప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్, జైపాల్‌రెడ్డి, రవీందర్ పాల్గొన్నారు. బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలుజగిత్యాలక్రైం: బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. సోమవారం తన కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 11 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. రేపు ‘దిశ’ కమిటీ సమావేశంజగిత్యాల: జిల్లా అభివృద్ధి సమన్వయ మానిటరింగ్ కమిటీ (దిశ) సమావేశం కలెక్టరేట్లో ఈనెల 9న నిర్వహించనున్నట్లు గ్రామీణాభివృద్ధి అధికారి రఘువరణ్ తెలిపారు. చైర్మన్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆధ్వర్యంలో ఉదయం 10.30 గంటలకు సమావేశం ఉంటుందని, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారని తెలిపారు. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ఇన్చార్జిగా అద్దంకి దయాకర్కరీంనగర్ కార్పొరేషన్: ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ నియమితులయ్యారు. గ్రామస్థాయి నుంచి జిల్లా వరకు పార్టీని సంస్థాగతంగా పునర్నిర్మాణం చేయడంలో భాగంగా ఉమ్మడి జిల్లాలకు పార్టీ ఇన్చార్జిలను నియమిస్తూ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. జిల్లాకు చెందిన బీసీ సంక్షమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మెదక్ ఉమ్మడి జిల్లాకు, రాష్ట్రసంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను వరంగల్ ఉమ్మడి జిల్లా పార్టీ ఇన్చార్జిగా నియమించారు. మళ్లీ బీఆర్ఎస్దే అధికారంకోరుట్ల: రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీయేనని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. పట్టణంలోని బిలాల్పూర 21వ వార్డులో 100 మంది మైనార్టీలు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సంజయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగరేయాలన్నారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజేష్, మాజీ కౌన్సిలర్లు సజ్జు, సత్యం పాల్గొన్నారు. అంతకుముంద అల్లమయ్య గుట్ట వద్ద ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్యే తనిఖీ చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు రానీయొద్దు మెట్‌పల్లిరూరల్: విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకులాన్ని సోమవారం సందర్శించారు. పాఠశాల పరిసరాలు, తరగతి గదులు, భోజనం పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజ నం అందించాలని సూచించారు. సీజనల్ వ్యా ధులు ప్రబలే అవకాశం ఉండడంతో పరిసరాలను శుభ్రం చేయించాలన్నారు. -
కోరుట్ల: చిన్నమ్మా.. ఎంత పని చేశావమ్మా!
కోరుట్ల: పట్ణణంలో శనివారం రాత్రి హత్యకు గురైన ఆరేళ్ల బాలిక హితాక్షి కేసు కొత్త మలుపు తిరిగింది. చిన్నారిని ఆమె చిన్నమ్మే హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ప్రస్తుతం కథలాపూర్ పోలీస్ స్టేషన్లో నిందితురాలు మమతను విచారిస్తున్న పోలీసులు, ఇవాళ.. లేదంటే రేపు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. కోరుట్ల ఆదర్శనగర్ పాప హత్య కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. శనివారం సాయంత్రం హితిక్ష అనే ఐదేళ్ల పాప అదృశ్యం కాగా, ఆమె తండ్రి ఫిర్యాదుతో ఈ ఘోర హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. ఇంటిపక్కనే బాత్రూమ్లో విగతజీవిగా పాప మృతదేహాం లభించగా.. గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. పలు కోణాల్లో బృందాలుగా పోలీసుల విచారణ చేపట్టి అనుమానంతో పలువురిని ప్రశ్నించారు. ముందుగా మృతదేహం దొరికిన ఇంటి యజమానిని అనుమానించినా.. అతడికి ఈ హత్యతో సంబంధం లేదని నిర్ధారించుకున్నారు. అయితే తోటికోడలు పెత్తనం సహించలేకే మమత ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. హత్యలో ఒక్కరే ఉన్నారా..? మరెవరైనా పాలుపంచుకున్నారా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆదర్శనగర్‌కు చెందిన సోదరులు ఆకుల రాము, లక్ష్మణ్‌లకు నవీన, మమతతో వివాహమైంది. నవీన, మమత అక్కాచెల్లెళ్ల కూతుళ్లు. రాము, నవీన దంపతులకు కుమారుడు వేదాంశ్, కూతురు హితాక్షి (6) ఉన్నారు. రాములు ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశం వెళ్లాడు. లక్ష్మణ్, మమత దంపతులకు ఇద్దరు కూతుళ్లు. నాలుగు నెలల క్రితం మమత ఆన్లైన్లో బెట్టింగ్‌కు పాల్పడి రూ.18 లక్షలు పోగొట్టుకున్నట్లు సమాచారం. దీనిపై కోరుట్ల పోలీస్‌స్టేషన్‌లో సైబర్‌క్రైం కేసు నమోదైంది. వారి కుటుంబంలో కొద్దికాలంగా గొడవలు కూడా జరుగుతున్నాయి. ఇంట్లో నవీనకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆమెపై మమత ద్వేషం పెంచుకున్నట్లు తెలిసింది. శనివారం ఉదయం వేదాంశ్, హితాక్షిని స్కూల్‌కు పంపిన నవీన.. ఆడపడుచుతో కలిసి షాపింగ్‌కు వెళ్లింది. ఇంట్లో అత్తతోపాటు మమత మాత్రమే ఉంది. సాయంత్రం స్కూల్ నుంచి పిల్లలు రాగానే మమత వారితో కలిసి పెద్దపులుల వేషధారణలు చూసేందుకు వెళ్లింది. అదే సమయంలో తన వెంట కూరగాయలు కోసే కత్తి, మొక్కలు కత్తిరించే కట్టర్‌ను తీసుకెళ్లినట్లు సమాచారం. సమీపంలోని ఇంటికి గేటు, బాత్రూంకు తలుపు లేకపోవడం.. సదరు ఇంటి యజమానికి ఆ ఏరియాలో కొంత వివాదాస్పదుడిగా పేరు ఉండటంతో ఆ ఇంటిని హత్య కోసం ఎంచుకున్నట్లు సమాచారం. రాత్రి 7.30 గంటల సమయంలో ముగ్గురు పిల్లలను ఇంటికి పంపిన మమత.. హితాక్షిని సదరు ఇంట్లోకి తీసుకెళ్లి గొంతుపై కత్తితో కోసి, కట్టర్‌తో మెడ, గొంతు చుట్టు కత్తిరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హితాక్షి చనిపోగానే హడావుడిగా ఇంటికి తిరిగి వెళ్లిన మమత.. రక్తం మరకలు ఉన్న దుస్తులు మార్చుకొని వాటిని వాషింగ్ మెషీన్లో వేసి, అందరితోపాటు హితాక్షి కోసం వెతికినట్లు తెలిసింది. హితాక్షి మృతదేహం దొరకగానే నవీనతో కలిసి ఆస్పత్రికి వచ్చిన మమత అక్కడ బోరున విలపించడం గమనార్హం. -
‘ఇందిరమ్మ’కు దూరమవుతున్న నిరుపేదలు
● ఇళ్ల నిర్మాణాలకు అంగీకరించని అటవీశాఖ ● నాయకపుగూడెం ప్రజల విచిత్ర పరిస్థితి ● ఏళ్లు గడుస్తున్నా పూరి గుడిసెల్లోనే నివాసం ● సొంతింటి కోసం ఎదురుచూస్తున్న 62 కుటుంబాలు ● ప్రజాప్రతినిధులు చొరవ చూపాలంటున్న స్థానికులు సారంగాపూర్: బీర్పూర్ మండలం కండ్లపల్లి పరిధిలోని నాయికపుగూడెం ప్రజల పరిస్థితి విచిత్రంగా మారింది. ఇక్కడి ప్రజలు ఏళ్లతరబడి పూరి గుడిసెల్లోనే నివాసముంటున్నారు. వారి కోసం ప్రభుత్వం విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసింది. రూ.20 లక్షలతో పాఠశాల నిర్మించింది. అంగన్వాడీ కేంద్రం కూడా కొనసాగుతుంది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. అత్యంత పేదలైన నాయికపుగూడెం గ్రామానికి కూడా ఇళ్లు మంజూరవుతాయని ఎదరుచూశారు. కానీ.. అటవీశాఖ ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వకపోవడంతో సుమారు 62 కుటుంబాలు ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. తామేం పాపం చేశామని తమను ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. కండ్లపల్లి నాయికపుగూడెం బీర్పూర్ మండల కేంద్రానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో కండ్లపల్లి నాయికపుగూడెం ఉంటుంది. ఇ క్కడ 300పైనే జనాభా ఉంటుంది. ప్రాథమిక పాఠశాలకు ఇక్కడ పక్కా భవనం ఉంది. అందులోనే అంగన్వాడీ కేంద్రం కూడా కొనసాగిస్తోంది. రేషన్‌బియ్యం కోసం కండ్లపల్లికి కాలినడకన వెళ్లాల్సిందే. ఇక్కడ సుమారు 62 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. అత్యంతపేదలైన వీరు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు. పథకం కింద రూ.6లక్షలు వస్తే ఇళ్లు నిర్మించుకుంటామని, తమ ఇబ్బందులు తప్పుతాయని గిరిజనులు ఆశగా ఎదురుచూశారు. దీనికి అనుగుణంగా అధికారులు ఇంటింటా సర్వే నిర్వహించి అందరూ ఇందిరమ్మ ఇళ్లకు అర్హులని నిర్ధారించారు. అటవీశాఖ అభ్యంతరం 62 గిరిజన కుటుంబాలు ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం చేసుకుంటామని చెప్పడంతో అధికారులు 62 మంజూరుకు నిర్ణయించారు. అయితే వీరు నివాసం ఉంటున్న భూమి అటవీశాఖ పరిధిలోని రిజర్వ్‌ఫారెస్ట్ కింద వస్తుందని, ఇక్కడ ఇళ్లు నిర్మాణం చేయడానికి వీలు లేదని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇళ్ల మంజూరుకు లబ్ధిదారుడి ఫొటో క్యాప్చరింగ్ చేయాల్సి ఉండగా, అటవీశాఖ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఎల్–1 ఫాంలోకి చేర్చలేదు. ఇది గిరిజనుల ఇళ్ల నిర్మాణ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ప్రజాప్రతినిధులను కలిసిన గిరిజనులు తమకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, అటవీశాఖతో మాట్లాడాలని పేర్కొంటూ గిరిజనులు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, మాజీ మంత్రి జీవన్‌రెడ్డిని కలిసి తమ సమస్యను వివరించారు. మాజీ సర్పంచ్ మహంకాళి రాజన్న పంచాయతీ రాజ్, గిరిజన శాఖ మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను మంత్రి సీతక్క ఆదేశించారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ చొరవ చూపాలని గిరిజనులు కోరుతున్నారు. తాటిపత్రిలు కప్పుతున్నాం వర్షాకాలం వస్తే ఇంటిమీద తాటిపత్రిలు కప్పుతున్నాం. గుడిసెల్లో ఉండడంతో విష పురుగులు, పాముల భయంతో వణికిపోతున్నాం. ప్రభుత్వం మాపై దయచూపాలి. ఇందిరమ్మ ఇళ్లకు అటవీశాఖ నుంచి అనుమతి ఇప్పించాలి. – గోపి రాజవ్వ, నాయికపుగూడెం -
అరుణాచలానికి ఆర్టీసీ బస్సు
కోరుట్ల ఆర్టీసీ డిపోలో ప్రారంభించిన బస్సు కోరుట్ల: తమిళనాడులోని అరుణాచలం దర్శనానికి వెళ్లేందుకు భక్తుల కోసం ఆర్టీసీ కోరుట్ల డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్సును ప్రారంభించారు. ఈ బస్సు మంగళవారం కోరుట్ల నుంచి సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరి కరీంనగర్, హైదరాబాద్, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ మీదుగా పదో తేదీన అరుణాచలం చేరుకుంటుందని డిపో మేనేజర్ మనోహర్ తెలిపారు. అదేరోజు తిరుగు ప్రయాణమై జోగులాంబ అమ్మవారి దర్శనం అనంతరం తిరిగి కోరుట్లకు చేరుకుంటుందన్నారు. టికెట్ ధర పెద్దలకు రూ.5వేలు, పిల్లలకు రూ. 3,800 ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నృసింహుడి సన్నిధిలో మంత్రి అడ్లూరి పూజలుధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆలయం పక్షాన ట్రస్టుబోర్డు చైర్మన్ జక్కు రవీందర్, ఈవో శ్రీనివాస్ స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది తదితరులున్నారు. శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో తులసి అర్చనమల్యాల: తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకొని మండలంలోని లంబాడిపల్లిలోగల శ్రీపద్మావతి సహిత ప్రసన్న శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో కోటి తులసి అర్చన నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులకు మరాటి సత్తయ్య, భక్తులు పాల్గొన్నారు. ఘనంగా మహాలక్ష్మి బోనాలుకోరుట్లరూరల్: మండలంలోని చిన్నమెట్పల్లి గ్రామంలో ఆదివారం మహాలక్ష్మి అమ్మవారికి బోనాలు సమర్పించారు. మహిళలు బోనాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. డప్పుచప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. వీడీసీ చైర్మన్ నాగులపెల్లి జైరెడ్డి, వైస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సంగెపు అశోక్, సభ్యులు పాల్గొన్నారు. -
నిధుల గోల్‌మాల్‌పై పదేళ్లుగా పోరాటం
● ప్రజావాణిలోనూ దొరకని పరిష్కారం ● రికవరీ కోసం అధికారుల చుట్టూ ఒకేఒక్కడు జగిత్యాలటౌన్: సుమారు పదకొండేళ్ల క్రితం.. 2014లో గోదావరి పుష్కరాల సందర్భంగా ధర్మపురి మేజర్ గ్రామపంచాయతీ(ప్రస్తుతం మున్సిపాలిటీ)లో రూ.పదిలక్షల నిధులు పక్కదారి పట్టాయని, దీనిపై విచారణ చేయాలని అదే పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ అజ్మత్ అలీ అలుపెరుగని పోరాటం చేస్తున్నాడు. పలుసార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, నామమాత్రంగా విచారణ చేస్తూ.. నిందితులకు అండగా నిలుస్తూ.. కలెక్టర్‌ను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని, కలెక్టర్ చొరవ తీసుకుని నిధుల గోల్‌మాల్‌పై చర్యలు తీసుకోవాలని అలీ కోరుతున్నాడు. అలీ కథనం ప్రకారం.. 2014లో గోదావరి పుష్కరాల సందర్భంగా ధర్మపురిలో నిర్వహించిన వేడుకలకు శానిటేషన్ ఖర్చులకంటూ ప్రభుత్వం రూ.పదిలక్షల సర్పంచ్ పేరిట విడుదల చేసింది. సదరు డీడీని పంచాయతీ బీఆర్జీఎఫ్ ఖాతాలో జమచేసింది. సర్పంచ్ కుమారుడు సంగి రాజశేఖర్ పేరున రూ.5.49లక్షలు, మిగిలిన నిధులు మరో నలుగురి పేరిట డ్రా అయ్యాయి. ఆడిట్ రిపోర్టులో అధికారులు అభ్యంతరకర ఖర్చుగా తేల్చారు. ఆ నిధుల లెక్క తేల్చాలంటూ అజ్మత్‌అలీ 2015లోనే అప్పటి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. నాటి నుంచి నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలని డీపీవో, ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తూనే ఉన్నాడు. పొసగని లెక్కలు.. సరిపోని రికార్డులు రూ.పది లక్షల వినియోగంపై రికార్డులో పలు అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఆడిట్ అధికారుల నివేదిక చెబుతోంది. క్యాష్‌బుక్‌లో నమోదు చేసినవిధంగా ఓచర్లు, బిల్లులు, చెల్లింపుల రశీదులు, ఎంబీ రికార్డులు లభ్యం కాలేదంటున్న ఆడిట్ అధికారుల అభ్యంతరాలు నిధులు పక్కదారి పట్టాయనే అజ్మత్‌అలీ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఉన్నాయి. సంగి రాజశేఖర్ పేరిట రూ.5.49 లక్షలు చెల్లించడం అనుమానాలకు తావిస్తోంది. ఆధారాలు, ఆరోపణలతో అలీ అధికారులకు ఫిర్యాదు చేసినా అప్పుడు ఇప్పుడు అన్నారని, తాజాగా అవినీతే జరగాలేదని అంటున్నారని కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. -
మామిడిపై అనాసక్తి
● 40 ఏళ్లవి కావడంతో నరికేస్తున్న రైతులు ● మూడేళ్లుగా ధరలు అంతంతే ● ఆదాయం రాకపోవడంతో తొలగింపు జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలోని చాలా ప్రాంతాల్లోని మామిడి తోటలు 30 నుంచి 40 ఏళ్లవి కావడంతో సరైన దిగుబడి ఇవ్వడం లేదు. మరోవైపు మూడేళ్లుగా వాతావరణంలో మార్పులతో తెగుళ్లు, పురుగుల విజృంభనతో మామిడి అనుకున్న స్థాయిలో రావడం లేదు. సరైన ఆదాయం రాక రైతులు తోటలను తొలగించి ఆయిల్ పాం, వరి వంటి ఇతర పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. మరికొందరు చెట్లను కొంతభాగం కట్ చేసి కాపు కోసం వేచి చూస్తున్నారు. 45 వేల ఎకరాల్లో మామిడి సాగు జిల్లాలో దాదాపు 45 వేల ఎకరాల్లో మామిడి తోటలు సాగులో ఉన్నాయి. ఎక్కువగా బంగినపల్లి, దశేరి, హిమాయత్ రకాలున్నాయి. ఏటా 1.50 లక్షల టన్నుల దిగుబడి వస్తుంది. ఏడాది పొడవునా మామిడి యాజమాన్యంలో భాగంగా కొమ్మల కత్తి రింపు, దుక్కి దున్నడం, ఎరువులు వేయడం, పురుగుమందులు పిచికారీ చేయడం వంటి పనులకు ఎకరాకు రూ.60వేల నుంచి రూ.70 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. మామిడి సీజన్ ప్రారంభంలో కిలో రూ.60 నుంచి రూ.70 ఉంటున్న ధరలు మా మిడి కాయలు మార్కెట్‌కు వచ్చే వరకు కిలో రూ. 20 నుంచి రూ.30కి పడిపోతున్నాయి. ఫలితంగా మామిడి సాగుకు రైతులు పెడుతున్న పెట్టుబడికి.. వస్తున్న ఆదాయానికి పొంతన ఉండటం లేదు. ఏపుగా పెరిగి...దిగుబడి తగ్గుతుండటంతో.. మామిడి యాజమాన్యంపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన లేక చెట్లచుట్టూ పక్కనున్న కొమ్మలను కత్తిరించి.. పైకి ఉన్న కొమ్మలను అలాగే వదిలేశారు. పైకి ఉన్న కొమ్మలు విపరీతంగా పెరిగాయి. ఆ కొమ్మలకు మందులు పిచికారీ చేయాలన్న.. కాయలు తెంపాలన్న కష్టంగా మారింది. ఇలాంటి తోటల్లో సూర్యరశ్మి తగలక తెగుళ్లు, పురుగులు ఆశించి తీవ్ర నష్టం చేస్తున్నాయి. మరోవైపు జిల్లాలో భూగర్భజలాలు 2.42 మీటర్ల లోతులోనే ఉండటంతో చాలా ప్రాంతాల్లో మామిడి తోటల నుంచి నీరు బయటకు వెళ్లడం లేదు. తేమ ఎక్కువగా ఉండి పూత రావడం లేదు. వరి క్వింటాల్‌కు రూ.2,380 ఉండటం.. కేజీవీల్స్‌తో దున్నించడం, హార్వెస్టర్లతో కోయించడం, ఎకరాకు 30 క్వింటాళ్లకు పైగా దిగుబడి రావడం, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లోనే కొనడంతో రైతులు ఎక్కువగా మామిడి తోటలను నరికేసి వరి పంట వైపు దృష్టి పెడుతున్నారు. ప్రభుత్వ స్పందన అంతంత మాత్రమే పండ్లతోటలు పెంచే రైతులకు ఉద్యానశాఖ ద్వారా ప్రభుత్వం గతంలో అనేక రాయితీలు వర్తింపజేసేవి. మామిడి కొమ్మలు కత్తిరించేందుకు కట్టర్లు, రంపాలు సమకూర్చేవి. ఇప్పుడు పరికరాలు ఏమీ ఇవ్వడం లేదు. సాధారణంగా జగిత్యాల మామిడికి మంచి రుచి, నాణ్యత ఉంటుంది. అపెడా ఆధ్వర్యంలో విదేశాలకు ఎగుమతి చేస్తామని, మహిళా సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా మామిడిని సేకరించి, సూపర్ మార్కెట్ల ద్వారా అ మ్ముతామని ప్రభుత్వం ఏటా చెపుతున్నా.. ఆచరణలోకి రావడం లేదు. దళారులు మామిడి మార్కె ట్లో ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తున్నప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడంతో రైతులకు ఆదాయం రాక తోటలను తొలిగించే పరిస్థితి ఏర్పడుతోంది. ఏటా కొమ్మలు కత్తిరిస్తాం జిల్లాలో చాలామంది మామిడి తోటలు నరికేస్తున్నారు. నేను చెట్ల కొమ్మలను ఏటా కట్ చేయిస్తాను. దిగుబడి వచ్చినా రేటు రాకపోవడం మామిడి రైతులకు పెద్ద సమస్యగా ఉంది. ప్రభుత్వం మామిడి కొనుగోళ్లపై ప్రణాళిక తీసుకవచ్చి రైతులకు న్యాయం చేయాలి. – దన్నపునేని వెంకటరమణ, సింగరావుపేట తోటలను నరికేయొద్దు మామిడి తోటలను పూర్తిగా నరికేయొద్దు. కొమ్మలను ప్రూనింగ్ చేస్తే చెట్టు ఎక్కువ దిగుబడి ఇస్తుంది. చాలామంది రైతులు మామిడి తోటలను పెంచుతున్నారు. యాజమాన్య పద్ధతులు పాటించడం లేదు. పూత సమయంలో మందులు పిచికారీ చేస్తున్నారు. – శ్యాం ప్రసాద్, జిల్లా ఉద్యానశాఖాధికారి -
తాతాల నుంచి ఇక్కడే ఉంటున్నాం
తాతలకాలంగా ఇక్కడే ఉంటున్నాం. వర్షకాలంలో బిక్కుబిక్కుమంటు గడుపుతున్నాం. వేసవిలో అగ్ని ప్రమాదాలతో గుడిసెలు కాలిపోయి సర్వస్వం కోల్పోయాం. నాలాగా చాలామంది గూడెంలో ఉన్నారు. ఇళ్లు నిర్మించుకునే అవకాశం ఇవ్వాలి. – పెరుమళ్ల మల్లవ్వ, నాయికపుగూడెం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించాం. ఎల్–1 ఫాం నింపడానికి ఫొటోల కోసం వెళ్తే అటవీ శాఖ అధికారులు రిజర్వ్ ఫారెస్టుగా పేర్కొనడంతో ముందుకు వెళ్లలేకపోతున్నాం. వారికి ఎలా న్యాయం చేయాలనే దానిపై కలెక్టర్ పరిశీలిస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు నడుచుకుంటాం. – లచ్చాలు, ఎంపీడీవో -
పొదుపు.. అభివృద్ధి
● వీధి వ్యాపారుల సంఘాల ఏర్పాటు ● బ్యాంకు నుంచి లింకేజీ రుణాలు ● చర్యలు తీసుకుంటున్న అధికారులు ● సాధికారత సాధించే దిశగా అడుగులు జగిత్యాల: మున్సిపాలిటీల్లో ఉన్న వీధి వ్యాపారుల పొదుపు సంఘాలను ఏర్పాటు చేసేందుకు మెప్మా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మహిళాసంఘాలకు మాత్రమే పొదుపు సంఘాలు ఉండేవి. తాజాగా చిరువ్యాపారాలు చేసుకునే పురుషులకు కూడా జాతీయ పట్టణ ఉపాధి పథకం కింద పొదుపు సంఘాలు (కామన్ ఇన్ట్రెస్ట్ గ్రూప్స్) ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే చిరు వ్యాపారం చేసుకుంటున్న మహిళలు మహిళాసంఘాల్లో పొదుపు చేసుకుంటున్నారు. కానీ పురుషులకు ఎలాంటి అవకాశాలు లేవు. తాజాగా వారికి కూడా గ్రూప్స్ ఏర్పాటు చేసి వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ పొదుపు సంఘాల ద్వారా వ్యాపారులు ప్రతినెలా పొదుపు చేసుకుని బ్యాంకుల నుంచి రుణాలు పొందే అవకాశం ఉంది. కొనసాగుతున్న సర్వే.. జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి, రాయికల్ మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ బల్దియాల్లో అనేక మంది చిరు వ్యాపారులు ఉన్నారు. వీరంతా చిన్నచిన్న వ్యాపారులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నాయి. ఇలాంటి వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా ప్రభుత్వం ఆర్థికంగా చేయూత ఇచ్చేందుకు నిర్ణయించింది. ఇందులోభాగంగా వీధివ్యాపారుల కోసం సర్వే కూడా చేస్తున్నారు. ఈ ఐదు మున్సిపాలిటిల్లో 173 పొదుపు సంఘాలను ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో ఆ దిశగా మెప్మా అధికారులు సర్వే చేసి గ్రూప్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆర్పీల సహాయంతో పట్టణంలో సర్వే చేస్తున్నారు. ఇప్పటికే వీరికి గుర్తింపు కార్డులు కూడా అందించారు. నెల రోజుల్లోపు సంఘాలను ఏర్పాటు చేసి వారికి వ్యాపారాల్లో చేయూతనందించేలా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా తోపుడుబండ్లు, సంచారం, నడుచుకుంటూ వెళ్లి వ్యాపారం చేసుకునేవారిని గుర్తించనున్నారు. మహిళాసంఘాల మాదిరిగానే వీరు కూడా ఒక్కో సంఘంలో 10–12 మంది సభ్యులుగా ఉంటారు. వీరందరికీ మొదట బ్యాంకుల్లో ఖాతాలు తీయించి అనంతరం పొదుపు చేయించి లింకేజీ రుణాలు అందిస్తారు. కరోనా సమయంలో వీధి వ్యాపారుల జీవనం రోడ్డున పడటంతో పీఎం స్వనిధి కింద రుణాలు అందజేశారు. మొదట విడత రూ.10 వేలు, రెండో విడతలో రూ.20 వేలు, మూడో విడతలో రూ.50 వేల చొప్పున ఎంపిక చేసి వారికి రుణాలు అందించారు. ఆ కిస్తీలు ఇప్పటికీ చెల్లిస్తున్నారు. ప్రస్తుతం ఆ రుణాలతో చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే వారికి ఎంతో తోడ్పటు కలిగింది. కానీ తాజాగా వీటిని నిలిపివేశారు. ప్రస్తుతం ఈ గ్రూపులను ఏర్పాటు చేసి వారికి ఆర్థిక చేయూతనందించేలా చర్యలు చేపడుతున్నారు. మొదట గ్రూపులను ఏర్పాటు చేసిన అనంతరం వారికి బ్యాంక్ లింకేజీ రుణాలు ఇప్పించి మరింత పెద్ద వ్యాపారాలు చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎంపిక చేసిన అనంతరం వారికి శిక్షణ ఇవ్వనున్నారు. ఇవే కాకుండా పొదుపు సంఘాల్లో చేరిన ప్రతి సభ్యునికి రూ.2 లక్షల బీమా సౌకర్యం సైతం కల్పించనున్నారు. తప్పనున్న వడ్డీ వ్యాపారుల బెడద గతంలో చిరువ్యాపారులు ఎక్కువ శాతం ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు తీసుకునే వారు. నిత్యం అప్పు ఇచ్చిన తర్వాత నిత్యం డైలీ ఫైనాన్స్ కింద వసూలు చేసేవారు. ఇలా వారు చేసిన కష్టమంతా వారికే పోయేది. ప్రభుత్వం ఈ పీఎం స్వనిధితో పాటు, పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి బ్యాంక్ లింకేజీ రుణాలు అందించడం ద్వారా వారికి ఎలాంటి ఇబ్బందులూ ఉండకపోవడంతో పాటు వ్యాపారాల్లో సాధికారత సాధించే అవకాశం ఉంది. బల్దియా గ్రూపులలక్ష్యం వీధివ్యాపారులు జగిత్యాల 70 6,825 కోరుట్ల 44 4,188 మెట్పల్లి 38 3,713 ధర్మపురి 11 982 రాయికల్ 10 924 మొత్తం 173 16,632 గ్రూపులతో మేలు వీధివ్యాపారులతో పొదుపు సంఘాలను ఏర్పాటు చేయిస్తున్నాం. వీరికి ఎంతో మేలు జరుగుతుంది. సంఘంలో పొదుపు చేసుకుని అనంతరం బ్యాంకుల ద్వారా రుణం పొందవచ్చు. కుటుంబాలను పోషించవచ్చు. – శ్రీనివాస్, మెప్మా ఏవో -
కోరుట్ల చిన్నారి కేసులో బిగ్ ట్విస్ట్... సొంత పిన్నే..!
సాక్షి, జగిత్యాల జిల్లా: కోరుట్ల పట్టణం ఆదర్శనగర్ చిన్నారి హత్య కేసులో ట్విస్ట్ నెలకొంది. పాప సొంత పిన్నే హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిన్న(శనివారం) సాయంత్రం సమయంలో హితీక్ష అనే ఐదేళ్ల పాప అదృశ్యమవగా.. పాప తల్లీ నవీన పోలీస్ ష్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇంటిపక్కనే బాత్రూమ్లో విగతజీవిగా పాప మృతదేహం లభ్యమైంది. గుర్తు తెలియని వ్యక్తులు గొంతుకోసి హత్య చేశారు.పలు కోణాల్లో విచారణ చేపట్టిన పోలీసులు.. పలువురిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశం వెళ్లిన పాప తండ్రి రాములు.. హుటాహుటీన అక్కడా నుంచి బయలుదేరారు. పాప సొంత పిన్ని మమతనే హత్య చేసినట్టు ప్రాథమిక సమాచారం. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ స్వయంగా రంగంలోకి దిగారు. హితీక్ష కుటుంబసభ్యుల్లో కొందరిని ప్రశ్నించిన పోలీసులు.. కుటుంబ కలహాలే హత్యకు దారితీసినట్లుగా అనుమానిస్తున్నారు. సిసీ టీవీ, సెల్‌ఫోన్ లోకేషన్ వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఇప్పటివరకు 40 మందిని పోలీసులు విచారించారు.శనివారం సాయంత్రం 5 గంటలకు హర్షిత స్కూల్ నుంచి ఇంటికి వచ్చి సమీపంలో పెద్దపులుల ఆటలు సాగుతుండటంతో వాటిని చూసేందుకు చుట్టుపక్కల పిల్లలతో కలిసి వెళ్లింది. కొంత సేపటి తరువాత ఇంటికి వచ్చి నానమ్మతో కాలం గడిపినట్లు సమాచారం. ఆ తరువాత సాయంత్రం 7.30 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్తున్నట్లు సీసీ కెమెరాలో రికార్డయింది. ఆ తరువాత కనిపించకుండా పోయింది.సుమారు గంటన్నర పాటు వెతికిన తల్లిదండ్రులు రాము–నవీనలు తమ కూతురు కనిపించడం లేదని 8.30 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆ తర్వాత పోలీసులు చుట్టుపక్కల ఇండ్లలో బాలిక కోసం వెతుకుతున్న క్రమంలో సమీపంలోని ఓ ఇంట్లోని బాత్రూంలో బాలిక మెడకోసి చంపినట్లుగా గుర్తించారు. బాత్రూం మొత్తం బాలిక రక్తంతో నిండిఉండగా మృతదేహాన్ని అక్కడి నుంచి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.బాలిక మృతదేహం దొరికిన ఇంటికి చెందిన వ్యక్తిని కొడిపెల్లి విజయ్‌గా పోలీసులు గుర్తించారు. విజయ్ భార్య దూరంగా ఉంటున్నట్లుగా సమాచారం. ఆ ఇంట్లో విజయ్‌తో పాటు అతని అన్నదమ్ముల కుమారులు ఉన్నట్లుగా సమాచారం. అయితే విజయ్ ఎక్కడున్నాడని ఆరా తీసిన పోలీసులు సెల్‌ఫోన్ ద్వారా అతనితో మాట్లాడితే వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉన్నట్లుగా చెపుతున్నట్లుగా సమాచారం.విజయ్ నర్సంపేటలో ఉంటే బాలిక మృతదేహం అతని ఇంట్లోని బాత్రూంలోకి ఎలా వచ్చిందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా బాలిక పెద్దపులులకు భయపడి సమీపంలోని ఇంట్లోని బాత్రూంలోకి వెళ్లగా అక్కడ కాలు జారి నల్లాపై పడితే మెడకు గుచ్చి వదిలించుకునే ప్రయత్నంలో బాలిక మెడ కోసినట్లుగా మారిందా? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. -
ప్రతి మంగళవారం జాతరే!
జగిత్యాల జిల్లా: మంగళవారం వస్తే చాలు.. ఆ ఆలయంలో భక్తుల సందడి ఉంటుంది. ఆ రోజు జరిగే జాతరకు భక్తజనకోటి తరలి వస్తుంది. ఆ విశిష్ట ఆలయం మెట్పల్లి మండలం వెల్లుల గ్రామంలో ఉంది. ఇక్కడి ఎల్లమ్మ తల్లి ఆలయం వద్ద ప్రతి మంగళవారం జరిగే జాతరకు విశేషంగా భక్తులు తరలి వస్తున్నారు. గ్రామ శివారులో రహదారి పక్కనే చెట్టు రూపంలో ఉన్న ఈ ఆలయానికి.. ఇటీవలి కాలంలో భక్తుల తాకిడి పెరిగింది. ప్రతి మంగళవారం ఇక్కడ జాతర జరగడం విశేషం. ఇక్కడి ఎల్లమ్మకు ఎన్నో మహిమలు ఉన్నాయని భక్తులు విశ్వసిస్తుంటారు. ప్రతి వారం జరిగే జాతరకు చుట్టు పక్కల గ్రామాల నుంచే కాకుండా.. ఇతర జిల్లాలు, మహారాష్ట్ర నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. సుమారు 300 ఏళ్ల క్రితం.. ఎక్కడైనా ఆలయంలో దేవుడు, దేవత ఉండడం.. భక్తులు పూజిస్తుండటం సహజం. కానీ ఇక్కడ చెట్టునే దైవంగా భావించి పూజలు చేస్తున్నారు. మెట్పల్లి మండలం వెల్లుల గ్రామ శివారులోని ఒక చెట్టు కింద.. సుమారు 300 ఏళ్ల క్రితం ఎల్లమ్మ తల్లి వెలసింది. ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయం వద్ద ప్రతి మంగళవారం జాతర జరుగుతోంది. ప్రతి వారం జరిగే జాతర సందర్భంగా మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా వివిధ జిల్లాలు, మహారాష్ట్ర నుంచి తరలి వస్తున్నారు. అమ్మవారికి బెల్లం, పుటా్నలు, కల్లు సమరి్పంచి కోళ్లు, పొట్టేళ్లను బలిస్తున్నారు. కుటుంబ సమేతంగా వంటలు చేసుకొని సహపంక్తి భోజనం చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే జనాలతో ఈ ప్రాంతమంతా ప్రతి మంగళవారం సందడిగా మారుతుంది. బావినీటితో స్నానం ఆరోగ్యకరం ఎల్లమ్మ ఆలయానికి వచ్చే భక్తులు అక్కడి బావి నీటితో స్నానం చేస్తారు. ఈ బావిలోని నీటితో స్నానం చేస్తే చర్మవ్యాధులు తొలగిపోతాయని నమ్మకం. పురాతన కాలం నుంచి వస్తున్న ఈ ఆచారాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న తర్వాత.. తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో భక్తులు బావిలోని నీటిని వెంట తీసుకెళ్తారు. పంటలు వేసే ముందు అమ్మవారిని దర్శించుకొని వెళ్తే బాగా పండుతాయని రైతులు నమ్ముతుంటారు. దేవాదాయశాఖ పరిధిలోకి.. సుమారు 40 ఏళ్లుగా వీడీసీ ఆధ్వర్యంలో కొనసాగిన ఎల్లమ్మ ఆలయాన్ని కొన్ని నెలల క్రితం ప్రభుత్వం దేవాదాయశాఖలోకి విలీనం చేసింది. దీంతో ప్రతి మంగళవారం జరగనున్న జాతర రోజు దేవాదాయశాఖ అధికారులు అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపడుతున్నారు. మరోవైపు భక్తుల సంఖ్య పెరగడంతో ప్రతి మంగళవారం మెట్పల్లి–వెల్లుల రహదారిలో వాహనాల సంఖ్య సైతం పెరిగింది. దీంతో పోలీసులు సిబ్బందిని ఏర్పాటు చేసి రాకపోకలు సాఫీగా జరిగేలా చూస్తున్నారు. -
కోరుట్లలో ఐదేళ్ల బాలిక గొంతు కోసి హత్య
జగిత్యాల జిల్లా: కళ్ల ఎదుట ఆడుకుంటున్న ఉన్న..అమ్మాయి అకస్మాతుగా కనిపించకుండా పోయింది. బాలిక ఆచూకీ కోసం వెతుకుతున్న క్రమంలో సమీపంలోని ఓ ఇంట్లో విగతజీవిగా కనిపించింది. బాత్రూంలో బాలిక హర్షిత మెడ కోసి దారుణంగా చంపిన వైనం ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టించింది. కోరుట్లలోని ఆదర్శనగర్‌లో నివాసముండే ఆకుల రాము–నవీన దంపతుల కూతురు హర్షిత(6) హత్య స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. పెద్దపులులు చూసి వచ్చి...శనివారం సాయంత్రం 5 గంటలకు హర్షిత స్కూల్ నుంచి ఇంటికి వచ్చి సమీపంలో పెద్దపులుల ఆటలు సాగుతుండటంతో వాటిని చూసేందుకు చుట్టుపక్కల పిల్లలతో కలిసి వెళ్లింది. కొంత సేపటి తరువాత ఇంటికి వచ్చి నానమ్మతో కాలం గడిపినట్లు సమాచారం. ఆ తరువాత సాయంత్రం 7.30 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్తున్నట్లు సీసీ కెమెరాలో రికార్డయింది. ఆ తరువాత కనిపించకుండా పోయింది. సుమారు గంటన్నర పాటు వెతికిన తల్లిదండ్రులు రాము–నవీనలు తమ కూతురు కనిపించడం లేదని 8.30 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆ తర్వాత పోలీసులు చుట్టుపక్కల ఇండ్లలో బాలిక కోసం వెతుకుతున్న క్రమంలో సమీపంలోని ఓ ఇంట్లోని బాత్రూంలో బాలిక మెడకోసి చంపినట్లుగా గుర్తించారు. బాత్రూం మొత్తం బాలిక రక్తంతో నిండిఉండగా మృతదేహాన్ని అక్కడి నుంచి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హత్యా..ప్రమాదమా?బాలిక మృతదేహం దొరికిన ఇంటికి చెందిన వ్యక్తిని కొడిపెల్లి విజయ్‌గా పోలీసులు గుర్తించారు. విజయ్ భార్య దూరంగా ఉంటున్నట్లుగా సమాచారం. ఆ ఇంట్లో విజయ్‌తో పాటు అతని అన్న, తమ్ముల కుమారులు ఉన్నట్లుగా సమాచారం. అయితే విజయ్ ఎక్కడున్నాడని ఆరా తీసిన పోలీసులు సెల్‌ఫోన్ ద్వారా అతనితో మాట్లాడితే వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉన్నట్లుగా చెపుతున్నట్లుగా సమాచారం. విజయ్ నర్సంపేటలో ఉంటే బాలిక మృతదేహం అతని ఇంట్లోని బాత్రూంలోకి ఎలా వచ్చిందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా బాలిక పెద్దపులులకు భయపడి సమీపంలోని ఇంట్లోని బాత్రూంలోకి వెళ్లగా అక్కడ కాలు జారి నల్లాపై పడితే మెడకు గుచ్చి వదిలించుకునే ప్రయత్నంలో బాలిక మెడ కోసినట్లుగా మారిందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద బాలిక మృతికి కారణాలు అంతుచిక్కడం లేదు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఎస్పీ అశోక్‌కుమార్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. -
పల్లె ముంగిట వైద్య సేవలు
● మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ● ఆరవెల్లిలో పల్లె దవాఖానా ప్రారంభంపెగడపల్లి: పల్లె దవాఖానాలతో ప్రజల ముంగిటకు వైద్య సేవలు తీసుకొచ్చామని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. మండలంలోని ఆరవెల్లి గ్రామంలో కలెక్టర్ సత్యప్రసాద్‌తో కలిసి ఆయూష్మాన్ భారత్ పల్లె దవాఖానా నూతన భవనాన్ని శనివారం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ వైద్యరంగాన్ని పటిష్టం చేసేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీల భర్తీ చేపడుతున్నామని, మందుల కొరత లేకుడా చూస్తున్నామని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని రూ.10లక్షలకు పెంచామన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం మద్దులపల్లికి చెందిన దివ్యాంగుడు మనోజ్‌కుమార్‌కు స్కూటీ అందించారు. డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, డీడబ్ల్యూఓ నరేశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాములు గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఖాదీ ప్రతిష్టాన్‌పై ‘విజిలెన్స్’
● సంస్థ వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు ● వివాదాల నేపథ్యంలో విచారణకు ఆదేశించిన ప్రభుత్వం ● రెండు రోజులుగా వివరాలు సేకరిస్తున్న అధికారులు మెట్పల్లి: ఎంతో ఘన కీర్తి కలిగిన మెట్పల్లి ఖాదీ గ్రామోద్యోగ్ ప్రతిష్టాన్ను వివాదాలు చుట్టుముడుతున్నాయి. సంస్థలో జరుగుతున్న వ్యవహారాల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీటిపై నియోజకవర్గానికి చెందిన ఓ కాంగ్రెస్ ముఖ్య నేత కొంతకాలం క్రితం ప్రభుత్వ పెద్దలను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో వారు విచారణ జరిపి నివేదికను అందించాలని విజిలెన్స్ విభాగాన్ని ఆదేశించారు. ప్రస్తుతం ఆ విభాగం అధికారులు రంగంలోకి దిగి క్షేత్ర స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. భూముల అమ్మకం నుంచి మొదలు.. ● మెట్పల్లి ఖాదీ ప్రతిష్టాన్‌కు పట్టణంలోనే కాకుండా పలు ప్రాంతాల్లో స్థిరాస్తులు ఉన్నాయి. ● ఇందులో నుంచి పూడూరు, కిసాన్‌నగర్‌లో ఉన్న స్థలాలను విక్రయించారు. ● ఆ భూములను తక్కువ ధరకు విక్రయించి.. భారీగా లబ్ధి పొందారని ఆ సమయంలో పాలకవర్గంలోని ముఖ్యులపై ఆరోపణలు వెల్లువవెత్తాయి. ● పూడూరులో స్థానిక ప్రజలు అమ్మిన భూములను వెనక్కి తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అనుమతి లేకుండా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం.. ● పట్టణంలో ఖాదీ ప్రతిష్టాన్‌కు సుమారు 14ఎకరాల భూమి ఉంది. సంస్థకు ఆదాయం సమకూర్చుకోవడం కోసం కొంత భూమిలో మూడేళ్ల క్రితం సుమారు 200 గదులతో కూడిన కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించారు. ● దీనికి మున్సిపల్ నుంచి అనుమతులు తీసుకోలేదు. రాజకీయ ఒత్తిళ్లతో ఆ సమయంలో అధికారులు చర్యలు తీసుకోకుండా మిన్నకుండిపోయారు. ● ఆ కాంప్లెక్స్‌లోని గదులను అద్దెకిచ్చి ప్రయోజనం పొందుతున్న ప్రతిష్టాన్.. మున్సిపల్‌కు ఏటా ఆస్తి పన్ను కూడా చెల్లించడం లేదు. ● ప్రతిష్టాన్ పాలకవర్గం తీరుపై మున్సిపల్‌కు రూ.లక్షల్లో నష్టం వాటిల్లుతోందని అధికారులు చెబుతున్నారు. సమీకృత మార్కెట్‌కు గ ‘లీజు’ ఒప్పందం ● సమీకృత మార్కెట్ నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వ స్థలం స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో మున్సిపల్ అధికారులు ఖాదీకి చెందిన 20 గుంటల స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. ● ఇందుకు ప్రతినెలా రూ.1.50లక్షల అద్దె చెల్లింపు.. తర్వాత రెండేళ్లకోసారి పది శాతం పెంపునకు అంగీకరిస్తూ 2021 మార్చి 21న మున్సిపాలకవర్గం తీర్మానం చేసింది. ● ఆ అద్దె చెల్లింపు 2022 ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చేలా ఒప్పందం జరిగింది. ● 2021 జూన్‌లో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మార్కెట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. నిధుల కొరతతో అవి ఇప్పటికీ పూర్తి కాలేదు. ● అయినా అద్దె చెల్లించాలంటూ ఖాదీ సంస్థ మున్సిపాలిటీకి నోటీసులు ఇస్తూ వస్తోంది. ఇప్పటివరకు అద్దె బకాయిలు రూ.అర కోటికి పైగానే ఉన్నట్లు తెలిసింది. ● మున్సిపల్ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మార్కెట్ నిర్మాణం పూర్తయి అందులో వ్యాపారాలు మొదలైన తర్వాత వచ్చే ఆదాయంతో అద్దె చెల్లింపు జరిగేలా ఒప్పందం చేసుకోవాల్సి ఉండగా.. అందుకు భిన్నంగా పాలకవర్గం, అధికారులు నిర్ణయం తీసుకోవడం విమర్శలకు దారి తీసింది. ● ఆ ఒప్పందంతో ఖాదీకి లాభం కాగా.. మున్సిపాలిటీకి భారీగా నష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రంగంలోకి విజిలెన్స్ అధికారులు ● ఖాదీ ప్రతిష్టాన్ వ్యవహారాల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఓ కాంగ్రెస్ నేత చే సిన ఫిర్యాదుతో ప్రభుత్వం స్పందించి విచారణకు ఆదేశించింది. ● రెండు రోజులుగా విజిలెన్స్ అధికారులు పట్టణానికి వచ్చి ఖాదీ, మున్సిపల్ నుంచి వివిధ కోణాల్లో వివరాలు సేకరిస్తున్నారు. ● ప్రధానంగా అనుమతి లేకుండా కాంప్లెక్స్ నిర్మించినప్పటికీ చర్యలు చేపట్టకపోవడం, సమీకృత మార్కెట్ లీజు విషయంలో నిబంధనల ప్రకారం వ్యవహరించకపోవడం వంటి వాటిపై విజిలెన్స్ అధికారులు దృష్టి సారించినట్లు తెలిసింది. ● మొత్తానికి ఖాదీ ప్రతిష్టాన్‌కు సంబంధించిన వ్యవహారాలపై సాగుతున్న విజిలెన్స్ విచారణతో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందోనన్నది ఆసక్తిగా మారింది. -
ఆధునిక హంగులతో పెద్దాపూర్ ‘గురుకులం’
మెట్‌పల్లిరూరల్: ఏళ్ల నుంచి సమస్యలతో కొట్టుమిట్టాడిన మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకులం పాఠశాల నేడు ఆధునిక హంగులతో కళకళలాడుతోంది. కొంతకాలంగా వివిధ కారణాలతో సమస్యలు ఎదుర్కొన్న పాఠశాల ప్రస్తుతం పూర్తిగా మార్పు చెందింది. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా వసతులు మెరుగుపర్చారు. భద్రతపై దృష్టి సారించారు. కొత్త భవనంలోని కొన్ని గదుల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. మిగిలిన గదులను వసతి, ఇతర అవసరాలకు వినియోగించుకుంటున్నారు. గతంలో ఇక్కడ జరిగిన ఘటనల దృష్ట్యా భద్రతపై దృష్టిసారించిన అధికారులు.. నిధులు వెచ్చించి పనులు చేయించారు. గురుకులం పరిసరాల్లో సీసీ వేయించారు. చుట్టూ సోలార్ ఫెన్సింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పరిసరాలను ఎప్పటికప్పడు శుభ్రం చేయిస్తున్నారు. సుమారు రూ.60 లక్షలు వెచ్చించి గురుకుల పాఠశాలను బాగు చేయించారు. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు
కలెక్టర్ సత్యప్రసాద్ ధర్మపురి: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే వారికి మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం సందర్శించారు. ఆస్పత్రిలో సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. పైఅంతస్తులో జరుగుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. డెంగీ, మలేరియాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. గోదావరి వరదలతో కలుగుతున్న నష్టాలపై ఆరా తీశారు. ఈ సారి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల కొత్త భవనం కోసం నివేదికలు పంపించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇన్చార్జి తహసీల్దార్ సుమన్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి తదితరులున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి జగిత్యాల: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని కలెక్టర్ అన్నారు. హౌసింగ్ అధికారులతో సమావేశమయ్యారు. లబ్ధిదారులు నిర్ణీత గడువులోపు నిబంధనల మేరకు పనులు పూర్తి చేసుకోవాలన్నారు. అధికారులు వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలన్నారు. అడిషనల్ కలెక్టర్ లత, హౌసింగ్ డీఈ భాస్కర్, డీఆర్డీఏ పీడీ రఘువరణ్, డీపీవో మదన్మోహన్ పాల్గొన్నారు. అంతకుముందు కరీంనగర్ జిల్లా సమగ్ర రైతు సహకార సంస్థ ప్రతినిధులు కలెక్టర్ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో చేపట్టబోయే ఐఎఫ్సీవో కార్యక్రమాలపై ఆయనకు వివరించారు. ఐఎఫ్సీవో ప్రాజెక్ట్ మేనేజర్ స్వప్నరెడ్డి, మేనేజర్ రమ్యశ్రీ, లహరి, లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈవీఎం గోదాముల తనిఖీ జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంప్‌లో గల ఈవీఎం గోదాంను కలెక్టర్ పరిశీలించారు. ఈవీఎంల భద్రతపై ప్రతినెలా తనిఖీ ఉంటుందన్నారు. -
బైపాస్ పనుల్లో కదలిక!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి జిల్లా ప్రజలంతా ఎప్పుడెప్పుడా అనిఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పెద్దపల్లి బైపాస్ రైల్వేలైన్ విషయంలో శుభవార్త. ఇప్పటికే పూర్తయిన ఈ రైల్వేలైన్‌ను కాజీపేట– బల్లార్ష ప్రధాన లైన్‌తో కనెక్ట్ చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఈమేరకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వాస్తవానికి ఇంటర్‌లాకింగ్ పనులు మార్చి నెలాఖరు నాటికి పూర్తి కావాల్సింది. మే నెలాఖరు నాటికి బైపాస్ రైల్వేలైన్ అందుబాటులోకి రావాల్సింది. ఆ సమయంలో కరీంనగర్–తిరుపతి రైలుకు పెద్దపల్లి స్టాప్ కూడా ఎత్తేశారు. ఇక రైలు పెద్దపల్లికి వెళ్లకుండా నేరుగా.. బైపాస్ మీదుగా జమ్మికుంట వైపు వెళ్లేది. కానీ.. అపుడు ఎదురైన పలు సాంకేతిక కారణాలతో పనుల్లో కాస్త జాప్యం చోటుచేసుకున్నట్లు సమాచారం. కానీ... ప్రధాన లైన్‌కు 1.78 కి.మీల పొడవైన పెద్దపల్లి బైపాస్ లైన్‌ను కలపడం అంత సులువేం కాదు. ఢిల్లీ మార్గం కావడంతో అనేక రైళ్లను గంటలపాటు నిలపాల్సి ఉంటుంది. చా లా రైళ్లను దారి మళ్లించాల్సి ఉంటుంది. వేలాది కుటుంబా ల ప్రయాణాల్లో ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకే అధి కారులు ఈ వ్యవహారంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. రైళ్ల రద్దీ తక్కువ ఉన్న రోజున కనీసం 2 నుంచి 3 గంటల్లో ప్రధాన మార్గాన్ని బైపాస్ మార్గంతో కలిపేలా ప్రణాళికలు రూపొందించారు. దీనిని ఆమోదిస్తూ.. సికింద్రాబాద్‌లోని దక్షిణమధ్య రైల్వే కేంద్ర కార్యాలయం నుంచి షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది. ఈనెల 7వ తేదీ దక్షిణ మధ్య రై ల్వే జీఎం పర్యటన ఉంది. ఆయన పర్యటన అనంతరం బై పాస్ మార్గం అనుసంధానం షెడ్యూల్‌పై స్పష్టత రానుంది. ఆర్వోబీ కష్టాలు అన్నీ ఇన్నీ కావు.. కరీంనగర్ పట్టణంలోని తీగలగుట్టపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో నిర్మిస్తున్న రైల్వే ఓవర్‌బ్రిడ్జి (ఆర్వోబీ) పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు ప్రారంభించిన ఏడాదిలో పూర్తి చేస్తామని చెప్పుకున్నా.. ఆ మేరకు పురోగతి పనుల్లో కనిపించడం లేదు. ఈ మధ్య పిల్లర్ల పనుల్లో వేగంపెంచారు. ఇపుడున్న రైల్వే గేటు ప్రాంతంలో పిల్లర్లు నిర్మించాల్సిన నేపథ్యంలో రైల్వేగేటును పక్కకు మార్చారు. ఈ క్రమంలో చొప్పదండికి వెళ్లే క్రమంలో కుడివైపునకు తిరిగే క్రమంలో రోడ్డు చాలా ఇరుకుగా ఉంది. చొప్పదండి నుంచి కరీంనగర్‌కు వచ్చే దారిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఇటు అపోలో వరకు, అటు తీగలగుట్టపల్లి అమ్మగుడి వరకు వాహనాలు బారులు తీరి, ట్రాఫిక్ జాములతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. రోజుకు కనీసం 10 నుంచి 15 సార్లు గేట్లు పడటం, ఈ కష్టాలకు వానలు తోడవటంతో స్థానికుల కష్టాలు రెట్టింపయ్యాయి. స్కూలు బస్సులు, చిరువ్యాపారులతోపాటు ముఖ్యంగా అంబులెన్స్‌లో వచ్చే అత్యవసర రోగులు ఈ మార్గంలో రెట్టింపైన ట్రాఫిక్ కష్టాలతో అవస్థలు పడుతున్నారు. వాస్తవానికి రైల్వే స్టేషన్‌కు అవతల నుంచి కిసాన్ నగర్ మీదుగా రైల్వే అండర్‌పాస్ మార్గం ఉంది. దాన్ని అందుబాటులోకి తీసుకురావడంలో ట్రాఫిక్ పోలీసులు, బల్దియా, ఇతర ఉన్నతాధికారులు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మూడు నెలల నుంచి సాగుతున్న పనులు రేపు కాజీపేట–బల్లార్ష మార్గంలో జీఎం పర్యటన? ఇంటర్‌లాకింగ్ పనులకు ఇంకా విడుదల కాని షెడ్యూల్ కొనసాగుతున్న కరీంనగర్ ఆర్వోబీ పనులు నరకం చూస్తున్నామని ప్రజల ఆవేదన -
ఓటరు నమోదు పారదర్శకంగా చేయాలి
రాయికల్: ఓటరు నమోదు ప్రక్రియను బూత్ లెవల్ అధికారులు పారదర్శకంగా చేయాలని జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో బూత్‌స్థాయి అధికారుల శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆగస్టులో నిర్వహించే ఓటరు నమోదు ప్రక్రియలో నూతన ఓటరు నమోదు, ఓటరు జాబితా సవరణ వంటి అంశాలపై పూ ర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. బీ ఎల్వోలు పారదర్శకంగా వ్యవహరించాలని, స కా లంలో పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ నాగార్జున, ఎంపీడీవో చిరంజీ వి, ట్రైనర్లు రాజశేఖర్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు గురుకులం విద్యార్థులుమల్యాల: మండలంలోని తాటిపల్లి బాలికల గురుకులం విద్యార్థులు జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ కనబరిచి.. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ మానస, పీఈటీ మధులిక తెలిపారు. గురుకులానికి చెందిన ఎ.హర్షిత్ అండర్–14 లాంగ్‌జంప్ విభాగంలో, జి.హారిక అండర్–12 లాంగ్‌జంప్ విభాగంలో ఈనెల 6న హన్మకొండలో జరగనున్న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొననున్నారు. విద్యార్థులను ప్రిన్సిపాల్, పీఈటీ, ఉపాధ్యాయులు అభినందించారు. భగీరథ లీకేజీలకు మరమ్మతులపై నిర్లక్ష్యం మెట్పల్లి: పట్టణంలోని వెంకట్రావ్పేట వద్ద జాతీయ రహదారి పక్కన రెండు రోజుల క్రితం భగీరథ పైపులైన్‌కు లీకేజీలు ఏర్పడి భారీగా నీరు వృథాగా పోతుంది. దీనివల్ల అటు వైపు వెళ్లే వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాంతంలో తరుచుగా పైపులైన్‌కు లీకేజీలు ఏర్పడుతున్నాయి. అధికారులు మరమ్మతులు చేపడుతున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోతుందని సింగిల్ విండో చైర్మన్ కొమిరెడ్డి తిరుపతిరెడ్డి విమర్శించారు. లీకేజీలు ఏర్పడకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. -
అను‘బంధం’ దూరమై..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అవ్వ..అయ్య..అన్న..తమ్ముడు..వదిన..మరదలు..అక్క..బావ.. పిల్లలు.. ఇలా అందరూ కలిసి ఉన్న ఉమ్మడి కుటుంబాలు పల్లెల్లో గతంలో కనిపించేవి. ఒక్క పూటకు అందరికీ భోజనాలు సరిపోవాలంటే పెద్ద గంజులో అన్నం, కూర వండి కలిసి తినేవారు. ఆ ఇళ్లలో నిత్యం పండుగ వాతావరణం కనిపించేది. కుటుంబంలో ఎవరికై నా అనారోగ్యం వస్తే అందరూ దగ్గర ఉండి ధైర్యం చెబుతూ వ్యాధి తగ్గే వరకు చుట్టూ తిరుగుతూ ప్రతీ క్షణం బాగోగులు చూసుకునేవారు. కానీ నేడు భార్య, భర్త, పిల్లలు చాలు అంటున్న కుటుంబాలే ఎక్కువగా ఉంటున్నాయి. ఎలక్ట్రిక్ కుక్కర్లో అన్నం.. ప్రెషర్ కుక్కర్లో కూరలు వండుకొని ఎవరికీ తీరినప్పుడు వారు తినేసి ఉద్యోగం, ఉపాధిబాట పడుతున్నారు. జ్వరమొచ్చినా.. జలుబు వచ్చినా పరామర్శించే వారు కరువవుతున్నారు. మనోధైర్యం చెప్పేవారు కనిపించడం లేదు. ఫలితంగా చిన్నపాటి సమస్యలకే ఇంట్లో గొడవలు పెట్టుకోవడం.. అవి కాస్త తీవ్రమైతే ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. పెనవేసుకునే ఉమ్మడి బంధం ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలుగా ఉన్నప్పుడు భార్యభర్తల మధ్య పొరపచ్చాలు వస్తే పెద్దలు సర్ది చెప్పేవారు. దీంతో సమస్య అక్కడికక్కడే పరిష్కారమయ్యేది. కానీ నేడు హితబోధ చేసే పెద్దలు దగ్గర ఉండకపోవడంతో దంపతుల మధ్య చిన్నపాటి గొడవలకే మనస్పర్థలకు పోతూ విడిపోవాలనే ఆలోచన లేదంటే లోకం నుంచే వెళ్లిపోవాలనే దురాలోచనతో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లోనే బంధాలు.. అనుబంధాలు బలహీనమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పలువురు సీనియర్ సిటిజెన్స్ తాము గడిపిన ఉమ్మడి కుటుంబాల నాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఇప్పటి పరిస్థితులను చూస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కుటుంబాలు కనుమరుగు మారిన పరిస్థితుల్లో చిన్నకుటుంబాలుగా జీవనం రక్తసంబంధీకుల మధ్య అడ్డుగోడలు ఉద్యోగం, ఉపాధి వేటలో ఇతర ప్రాంతాలకు.. గతాలను నెమరువేసుకుంటున్న నాటితరం -
కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్న బీజేపీ
కరీంనగర్: కేంద్రంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ అవినీతికి పాల్పడ్డ వారికి అండగా ఉంటూ కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్నారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. శనివారం కరీంనగర్‌లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అవినీతి పరులు విదేశాల్లో డ్యాన్స్‌లు చేస్తుంటే మోదీ ప్రభుత్వం, రాజ్యాంగం, చట్టాలు ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నించారు. ఆపరేషన్ కగార్ పేరుతో దుర్మార్గపు చర్యలకు పాల్పడుతుందని, సమాజం కోసం పోరాడుతున్న వారిని హతమార్చడం అన్యాయమని అన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడిచిందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకు అందించాల్సి అవసరముందన్నారు. అర్హులైన వారందరికీ ఇండ్లు ఇవ్వాలని ఈనెల 15లోపు జిల్లాలోని అన్ని నియోజక వ ర్గాల శాసన సభ్యులకు వినతిపత్రాలు అందిస్తామ ని తెలిపారు. ఈ సమావేశంలో కార్యవర్గ, కౌన్సిల్ సభ్యులు బోయిని అశోక్, కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, టేకుమల్ల సమ్మయ్య, పైడిపల్లి రాజు, బ్రామండ్లపెల్లి యుగేందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆధునిక హంగులు.. సౌకర్యాలు
● సింగరేణిలో డబుల్, ట్రిపుల్ బెడ్రూం క్వార్టర్లు ● అధికారులకు 143, కార్మికులకు 860 క్వార్టర్లు ● 1,003 క్వార్టర్లకు రూ.450 కోట్లు కేటాయింపు గోదావరిఖని(రామగుండం): సంస్థవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులకు ఆధునిక హంగులతో క్వార్టర్లను నిర్మించేందుకు యాజమాన్యం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జీప్లస్ వన్ పద్ధతిలో అధికారులకు ట్రిపుల్ బెడ్రూం, కార్మికులకు డబుల్ బెడ్రూం నిర్మించనున్నారు. ఈమేరకు సింగరేణి బోర్డు ఆమోదం పొందింది. అధికారులు, ఉద్యోగుల 1,003 క్వార్టర్ల నిర్మాణానికి రూ.450కోట్లు కేటాయించింది. గోదావరిఖని, శ్రీరాంపూర్, భూపాలపల్లి, మణుగూర్ ప్రాంతాల్లో క్వార్టర్లను నిర్మించనుంది. శిథిలావస్థకు చేరిన క్వార్టర్లు సింగరేణి విస్తరించిన ప్రాంతాల్లో కార్మికుల కోసం 50 ఏళ్ల క్రితం టీవన్టైపు, డీ టైపు పేరుతో పైకప్పు సిమెంట్ రేకులతో క్వార్టర్లను నిర్మించింది. సింగిల్ బెడ్రూం, హాలు, కిచెన్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం పురాతన క్వార్టర్లు కార్మికులకు ఏమాత్రం సరిపోవడం లేదు. ఐటీ ఇంజినీర్లు, పలు ప్రాంతాల్లో ఉన్నతస్థాయి విద్యను అభ్యసించిన కార్మికుల పిల్లలు ఇక్కడకు వస్తే ఉండేందుకు చాలా కష్టపడాల్సి వస్తోంది. ఈక్రమంలో క్వార్టర్ పక్కనున్న స్థలంలో షెడ్డు, అదనపు నిర్మాణం చేపట్టినా ఏమూలకూ సరిపోవడం లేదు. గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాలు, రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ మేరకు సంస్థలో నూతన క్వార్టర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈక్రమంలో పలు ఏరియాల్లో పాత క్వార్టర్లను తొలగించి వాటిస్థానంలో నూతనంగా క్వార్టర్లను నిర్మించేందుకు యాజమాన్యం నిర్ణయించింది. ఆధునిక పద్ధతిలో విశాలంగా.. సింగరేణిలో అధికారులకు మిలీనియం ఏబ్లాక్ పద్ధతిలో 35 క్వార్టర్లు, మిలీనియం బీబ్లాక్ విధానంలో 108 క్వార్టర్లు ఖరారు చేసింది. ఉద్యోగులు, సూపర్వైజర్ క్యాడర్ కోసం మిలీనియం సీబ్లాక్ పద్ధతిలో 300 క్వార్టర్లు, వర్క్‌మెన్ల కోసం మిలీనియం డీబ్లాక్ 560 క్వార్టర్లు నిర్మించనున్నారు. గతంలో నిర్మించిన ఎండీటైపు క్వార్టర్ల మాదిరిగా ప్రతీ బ్లాక్‌లో గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ సౌకర్యం కల్పించనున్నారు. క్వార్టర్ల కోసం యాజమాన్యం టెండర్ ప్రక్రియ సిద్ధం చేసింది. త్వరలో టెండర్ల ద్వారా క్వార్టర్ల నిర్మాణ పనులను కాంట్రాక్టర్‌కు కేటాయించనున్నారు. ఆధునిక హంగులతో.. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఆధునిక సౌకర్యాలు, హంగులతో కార్మికులకు డబుల్ బెడ్రూం, అధికారులకు ట్రిపుల్ బెడ్రూంలు నిర్మించేందుకు నిర్ణయించాం. జీప్లస్ వన్ విధానంలో నిర్మాణాలు కొనసాగుతాయి. రూ.450కోట్లు వెచ్చించేందుకు బోర్డు అనుమతి లభించింది. – ఎన్.బలరాం, సీఎండీ, సింగరేణి ప్రాంతం అధికారులు కార్మికులు వ్యయం (రూ.కోట్లలో) గోదావరిఖని 36 282 133 శ్రీరాంపూర్ 39 410 193 భూపాలపల్లి 22 60 45 మణుగూరు 46 108 79 -
తల్లీ, కొడుకుల ఆదర్శ నిర్ణయం
● మరణానంతరం నేత్ర, అవయవాల దానంకు అంగీకారం ● కూతురు పుట్టిన రోజున స్ఫూర్తిదాయకమైన సందేశం కోల్‌సిటీ(రామగుండం): ‘అమ్మా... నేను చనిపోయాక నేత్ర, అవయదానం చేయ్యాలని నిర్ణయించుకున్న...’ అని కొడుకు తన మనసులోని మాటను తల్లికి చెబితే... ఇదేం పిచ్చి ఆలోచన అంటూ వద్దని వారించలేదు తల్లి. మంచి నిర్ణయం బిడ్డాని భుజం తట్టింది. నేను కూడా నీలెక్కనే నేత్ర, అవయదానం చేస్తానంటూ తల్లి కూడా ముందుకు వచ్చింది. తనకు పాఠాలు చెప్పిన టీచ్చర్ సమక్షంలో ఆ ఆదర్శ కొడుకు, తన తల్లితో కలిసి అంగీకార పత్రాలను సదాశయ ఫౌండేషన్‌కు సమర్పించారు. గోదావరిఖని పవర్‌హౌజ్ కాలనీలో నివాసం ఉంటున్న కాంపెల్లి స్వామి, జయ దంపతుల కుమారుడు శివగణేశ్. డిప్లామోఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ(డీఎంఎల్టీ) కోర్సు చేస్తున్నాడు. మరణానంతరం మనిషి నేత్రాలు, అవయవాలను దానం చేస్తే పలువురికి పునఃర్జన్మ ఇవ్వొచ్చని భావించాడు. విషయాన్ని తనకు చదువు చెప్పిన టీచర్ శశికళకు తెలిపాడు. తన సోదరి ప్రియాంక పుట్టినరోజు సందర్భంగా శనివారం శివగణేశ్ తన తల్లితో కలిసి నేత్ర, అవయవదానం చేయడానికి అంగీకారాన్ని ప్రకటించారు. వారి నివాసంలోనే అంగీకార పత్రాలపై సంతకాలు చేసి, సదాశయ ఫౌండేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి సీహెచ్.లింగమూరికి శశికళ టీచర్ సమక్షంలో సమర్పించారు. వారికి ఆర్గాన్ డోనర్కార్డులతోపాటు అభినందన పత్రాలను అందజేశారు. తల్లీ, కొడుకు తీసుకున్న నిర్ణయం పలువురికి ఆదర్శనీయమని సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్, గౌరవ అధ్యక్షులు సానా రామకృష్ణారెడ్డి, ముఖ్య సలహాదారులు నూక రమేశ్ కార్యదర్శి భీష్మాచారి, ప్రచార కార్యదర్శి కే.ఎస్.వాసు, రామగుండం లయన్స్ క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఎ.ఎల్లప్ప, సారయ్య, కోశాధికారి రాజేందర్ అభినందించారు. -
ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తివేసేందుకు కుట్ర
కరీంనగర్: రాష్ట్రంలో పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయకుండా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేవేసేందుకు కుట్ర చేస్తోందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి అన్నారు. శనివారం కరీంనగర్‌లోని గణేశ్‌నగర్‌లో గల బద్దం ఎల్లారెడ్డిభవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పెండింగ్ బకాయిల విడుదలపై పూటకో మాట మాట్లాడుతూ విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని అన్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ విద్యాసంస్థలు చేస్తున్న ఫీజుల దోపిడీ అరికట్టకుండా ప్రైవేట్ విద్యాసంస్థలకు ప్రభుత్వం వత్తాసు పలుకుతుందని తెలిపారు. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి రామరావు, వెంకటేష్, మచ్చ రమేశ్, జిల్లా ఆఫీస్ బేరర్స్ కేశబోయిన రాము యాదవ్, కనకం సాగర్ తదితరులు పాల్గొన్నారు. -
సీనియర్ పాత్రికేయుడి హఠాన్మరణం
సిరిసిల్లటౌన్: సీనియర్ పాత్రికేయుడు గర్దాస్ ప్రసాద్(43) శనివారం తెల్లవారు జామున హఠాన్మరణం చెందారు. వివిధ సంస్థల్లో పదేళ్లుగా పనిచేసిన ఆయన సిరిసిల్ల నియోజకవర్గం టీవీ 9 కంట్రిబ్యూటర్‌గా నాలుగేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంట్లో ఉదయం గుండెపోటుకు గురికాగా కుటుంబ సభ్యులు సిరిసిల్ల జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచనలతో కరీంనగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందారు. ప్రసాద్‌కు భార్య రేవతి, కూతుళ్లు సంజన(19), సిరిచందన(16), కొడుకు శివేంద్ర(11) ఉన్నారు. సంతాపాలు..ఆర్థిక సాయం ప్రసాద్ మృతిపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ సంతాపం ప్రకటించారు. రూ.50వేల ఆర్థికసాయాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందజేశారు. రాష్ట్ర రవాణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ రూ.25వేలు, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్ రూ.10వేలు అందజేశారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు రూ.50వేల ఆర్థికసాయాన్ని పార్టీ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగరావు చేతుల మీదుగా అందజేశారు. ప్రెస్‌క్లబ్‌లో అధ్యక్షుడు, కార్యదర్శి ఆకుల జయంత్‌కుమార్, ఆడెపు మహేందర్ ఆధ్వర్యంలో సీనియర్ పాత్రికేయులు కరుణాల భద్రాచలం, టి.వి.నారాయణ, వూరడి మల్లికార్జున్, ప్రెస్‌క్లబ్ కార్యవర్గం, పాత్రికేయులు నివాళి అర్పించారు. -
ముఖంపై పౌడర్ చల్లి బంగారం చోరీ
రాయికల్: పట్టణంలోని కేశవనగర్‌కు చెందిన వెల్మ రాధ ముఖంపై పౌడర్ చల్లి నాలుగున్నర తులాల బంగారం ఎత్తుకెళ్లిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. కేశవనగర్‌కు చెందిన రాధ మధ్యాహ్నం వేళ ఒంటరిగా ఉంది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు గమనించి రాధ వద్దకు వచ్చి ముఖంపై పౌడర్ చల్లారు. ఆ మత్తులో రెండు తులాల కడెం, రెండున్నర తులాల చైన్ ఆగంతులకు ఇచ్చేసింది. కాసేపటికి తేరుకున్న బాధితురాలు లబోదిబోమంది. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై సుదీర్‌రావు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాఫ్తు చేస్తున్నట్లు తెలిపారు. రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్యరామడుగు: దేశరాజ్‌పల్లి గ్రామ శివారులో శనివారం మధ్యాహ్నం దేశరాజ్‌పల్లి గ్రామానికి చెందిన బోడిగె నర్సయ్య(60) అనే వ్యక్తి గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. నర్సయ్య కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ వెలిచాలలోని అనాథ ఆశ్రమంలో జీవనం సాగించినట్లు చెప్పారు. ఇటీవల గ్రామానికి వచ్చిన నర్సయ్య అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ శనివారం గ్రామ శివారులో ఉన్న రైలు పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడినట్లు వివరించారు. జగిత్యాల వైపు నుంచి కరీంనగర్ వెళ్తున్న గూడ్స్ రైలు కింద పడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వెంటనే గూడ్స్ రైలు సిబ్బంది పోలీసులకు సమాచారమందించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
జమ్మికుంట: మున్సిపల్ పరిధి ఫ్లైఒవర్ బ్రిడ్జిపై 2 బైకులు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. జమ్మికుంట టౌన్ సీఐ రామకృష్ణ వివరాల ప్రకారం.. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన జోడు కుమార్(27) మున్సిపల్ పరిధిలోని అబాది జమ్మికుంటలోని బంధువుల ఇంట్లో ఫంక్షన్‌కు వెళ్లి శుక్రవారం అర్ధరాత్రి బైక్‌పై వస్తున్నాడు. మున్సిపల్ పరిధి కొత్తపల్లి ఫ్లైఒవర్ దిగువకు వస్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న రామన్నపల్లి గ్రామానికి చెందిన పురెల్ల మధుకర్ అనే వ్యక్తి అజాగ్రత్తగా అతివేగంగా బైక్‌తో ఢీకొట్టాడు. డివైడర్‌పై పడి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తల్లి సమ్మక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. చికిత్స పొందుతూ మృతిపెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం కనగర్తి గ్రామానికి చెందిన నందయ్య (68) ఒంటరి తనం భరించలేక గతనెల 27న ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడని రూరల్ ఎస్సై మల్లేశ్ పేర్కొన్నారు. నీటి సంపులో పడి బాలుడు..వేములవాడఅర్బన్: రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చింతాల్ఠాణాలోని లింగంపల్లి రవి–స్వప్న దంపతుల కుమారుడు లింగంపల్లి రిషి(6) శనివారం ప్రమాదవశాత్తు నీటి సంపులోపడి మృతి చెందాడు. శనివారం పాఠశాలకు సెలవు కావడంతో రిషి ఇంటి వద్దే ఉన్నాడు. ఈక్రమంలో ఆడుకుంటూ వీరి ఇంటి పక్కన కొత్తగా నిర్మిస్తున్న గుర్రం బాలకిషన్ ఇంటి వద్ద గల నీటి సంపులో పడి మృతిచెందాడు. విద్యుత్‌షాక్‌తో రైతు..పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన చింతల రమేశ్ (49)అనే రై తు శనివారం పొలంమడికి నీరు పెట్టేందుకు ఉపక్రమిస్తుండగా విద్యుత్‌షాక్‌తో అక్కడికక్కడే మరణించాడు. పొలం దున్నేందుకు వీలుగా మడిలో నీరు నింపేందుకు విద్యుత్ మోటారును ఆన్‌చేసే సమయంలో ఈ ప్రమాదానికి గురైనట్లు రూరల్ఎస్సై మల్లేశ్ పేర్కొన్నారు. మృతుడికి భార్య సంధ్య, కుమారులు ప్రశాంత్, పవన్‌కుమార్ ఉన్నారు. కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. -
అప్పుడే బాగుండేది
మేము ఇద్దరం, మా పిల్లలు న లుగురు.. వారి పిల్లలతో కలిసి ఉండేవాళ్లం. మా మనుమలు, మనుమరాండ్లు పెద్దగా అ య్యే వరకు కలిసి ఉన్నాం. ఆ కాలంలో అందరం ఒకే ఇంట్లో ఆనందంగా ఉండేవాళ్లం. రాత్రి పూట క లిసి భోజనం చేసేవాళ్లం. ఇంట్లో ఎవరికీ కష్టం వచ్చి నా పెద్దమనిషి ముందు ఉండి నడిపించేవారు. రా త్రయితే ఇంటి ముందర మా గల్లీలో ఉన్న వాళ్లంతా చేరి మాట్లాడుకునేవాళ్లం. ఇప్పుడు అందరూ టీవీ లు చూస్తూ ఇళ్లలోనే ఉంటున్నారు. పక్కింటి వారిని కూడా మాట్లాడించే పరిస్థితులు లేవు. ఆ రోజులే బాగుండేవి. – నిమ్మ మల్లమ్మ, నారాయణపూర్ కలిసిమెలిసి ఉండేవాళ్లం మేము ఐదుగురం అన్నదమ్ములం. అందరం ఒకే ఇంట్లో కలిసి ఉండేవాళ్లం. మా అందరికీ పెళ్లిళ్లు అయి, పిల్లలు కలిగే వరకు కూడా మా పెద్ద ఇంట్లోనే కలిసి ఉన్నాం. రాత్రయితే అందరం కలిసి భోజనం చేసేవాళ్లం. భోజనం సమయంలో మా ఇంట్లో రోజూ పండుగ వాతావరణం కనిపించేది. ఉద్యోగం, ఉపాధి, పిల్లలు చదువుల దృష్ట్యా ఇతర ప్రాంతాలకు వెళ్లడం.. ఒకే ఊరిలో ఉన్న విడివిడిగా ఉండిపోతున్నాం. అప్పటి రోజులు ప్రేమానురాగాలతో బాగుండేవి. – లద్దునూరి తిరుపతి, నారాయణపూర్ ఎవరి పనిలో వారు బిజీ ఎనుకటి రోజులే బాగుండేవి. ఇద్దరు కొడుకులు, ఒక కూతురుతో కలిసి ఉన్న జ్ఞాపకాలను మర్చిపోలేం. ఉమ్మడి కుటుంబానికి మించిన ఆనందం మరొకటి లేదు. పండుగ వచ్చిందంటే అందరం ఒక చోట చేరితే ఇల్లంతా సందడిగా ఉండేది. కొడుకులు, కోడళ్లు, కూతురు, అల్లుడు.. వారి పిల్లలతో రోజులు గడిచిపోయేది. ఇప్పుడు ఎవరికి వారు వేరుగా ఉండడంతో రోజుల తరబడి కలుసుకోవడం లేదు. అప్పటి రోజులు మళ్లీ వస్తే బాగుండు అనిపిస్తుంది. – ముంజ ఎల్లయ్య, ఇల్లంతకుంట -
స్నేహితురాళ్లు అవమానించారని ఇంజినీరింగ్ విద్యార్థిని..
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామానికి చెందిన కాటిపల్లి నిత్య(21) తన స్నేహితులు కళాశాలలో, హాస్టల్లో మానసికంగా వేధించారని, క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల వివరాల ప్రకారం.. నిత్య హైదరాబాద్‌లోని రిషి ఉమెన్స్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. అదే కళాశాలలో చదివే వైష్ణవి, సంజన కొద్ది రోజులుగా చదువులో వెనుకబడ్డావని, హేళన చేస్తూ తీవ్ర మానసిక ఇబ్బందులకు గురిచేశారు. మనస్తాపానికి గురై ఈనెల 1న ఇంటికి వచ్చింది. 2వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డిమందు తాగింది. కుటుంబ సభ్యులు జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా వైద్యుల సూచనతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతిచెందింది. మృతురాలి తండ్రి కాటిపల్లి తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై సదాకర్ తెలిపారు. -
మొక్కలు నాటి సంరక్షించాలి
జగిత్యాల/జగిత్యాలఅగ్రికల్చర్/జగిత్యాలటౌన్: మొక్కలను నాటడంతో పాటు సంరక్షించడం ప్రధానమని కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. అంతర్జాతీయ సహకార సంవత్సరం–2025 సందర్భంగా జగిత్యాల సహకార సంఘంలో శుక్రవారం వనమహోత్సవం నిర్వహించారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ ఏక్ పేడ్ మా కే నామ్ పేరిట సహకారశాఖ మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. జిల్లాలోని అన్ని సహకార సంఘాల్లో ఒకేరోజు 2,500 మొక్కలు నాటామని జిల్లా సహకారాధి కారి మనోజ్‌కుమార్ తెలిపారు. ఆర్డీవో మధుసూధన్, జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్, సంఘ అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు. రోశయ్యకు నివాళి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య జయంతిని కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ సత్యప్రసాద్ రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. వ్యాధులు ప్రబలకుండా చూడాలి ప్రతి మున్సిపాలిటీలో వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. అమినీబాద్లో శుక్రవారం పర్యటించా రు. కూలర్లు, వాడి పడేసిన పాత టైర్లు, కొబ్బరిబొండాలు, ప్లాస్టిక్ గ్లాసులు వంటివి పరిసరాల్లో ఉండకుండా చూడాలని ఆదేశించారు. నీరునిల్వ ఉన్న చోట ఆయిల్‌బాల్స్ వేయాలన్నారు. డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్, ఆర్డీవో మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ స్పందన పాల్గొన్నారు. సీఎంఆర్ బకాయిలు వెంటనే చెల్లించాలి సీఎంఆర్ బకాయిలు వెంటనే చెల్లించాలని కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. రా, బాయిల్డ్ రైస్‌మిల్లర్లతో సమావేశం అయ్యారు. సీఎంఆర్ చెల్లింపులు ఈనెల 27తో ముగుస్తున్నాయని, నిర్ణీత గడువులోగా మిల్లర్లు చెల్లించాలని ఆదేశించారు. లేకుంటే చర్యలు తీసుకుంటామన్నారు. అదనపు కలెక్టర్ లత, డీఎస్వో జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు. నాణ్యమైన భోజనం అందించాలి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పురాణిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇన్చార్జి డీఈవో సత్యనారాయణ, అర్బన్ తహసీల్దార్ రాంమోహన్ పాల్గొన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ -
రెండు పోస్టులు.. ఒక్క అధికారి
మల్యాల: ఓ వైపు కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం వద్ద బందోబస్తు పర్యవేక్షణ.. మరోవైపు మండలంలోని 19 గ్రామాల నుంచి వచ్చే ఫిర్యాదుదారుల సమస్యలపై క్షేత్రస్థాయి పరిశీలన.. ఇంకో వైపు ఆలయానికి, మండలానికి వచ్చే అధికారులు, ప్రజా ప్రతినిధుల ప్రొటోకాల్ నిర్వహణ.. పెట్రోలింగ్, ఇతర కేసుల దర్యాప్తుతో పని ఒత్తిడి ఉంటుందని మల్యాల పోలీసుస్టేషన్‌కు గతంలో ఇద్దరు ఎస్సైలను కేటాయించారు. కొన్నాళ్ల పాటు కొనసాగగా.. తరువాత ఒక్క ఎస్సైతోనే నెట్టుకొస్తున్నారు. దీంతో సత్వర సేవలు అందక మండల ప్రజలు స్టేషన్ వద్ద పడిగాపులు కాస్తున్నారు. రెండో ఎస్సై పోస్టు ఉన్నా లేనట్టే అన్నచందంగా మారిందని పేర్కొంటున్నారు. బాధితుల పడిగాపులు.. మండలంలో 19 గ్రామాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఉండడంతో మల్యాల మండల పోలీస్‌స్టేషన్‌కు గతంలో ఇద్దరు ఎస్సైలను కేటాయించారు. ఆలయానికి వచ్చే భక్తులు, ప్రముఖుల భద్రత కోసం రెండో ఎస్సైకి విధులు కేటాయించేవారు. మండలంలోని సగం గ్రామాలతోపాటు ప్రొటోకాల్ విధులు నిర్వర్తించేవారు. కొన్నాళ్లు రెండో ఎస్సై కొనసాగగా.. ఐదేళ్లుగా ఒక్క రే ఎస్సై విధులు నిర్వహిస్తున్నారు. సదరు అధికారి జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధుల ప్రొటోకాల్, క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్తుండడంతో ఫిర్యాదుదారులు రోజంతా స్టేషన్ వద్ద ఎస్సై కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాబాస్ దృష్టిసారించాలి మల్యాల పోలీస్‌స్టేషన్‌పై జిల్లా పోలీస్‌బాస్ దృష్టిసారించాల్సిన అవసరం ఉందని మండల ప్రజలు కోరుతున్నారు. పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొండగట్టు ఆలయం, ప్రముఖుల పర్యటనలు, తరచూ జరుగుతున్న నేరాల పర్యవేక్షణతో ఉన్న ఒక్క ఎస్సైకి భా రం పడుతోందని అంటున్నారు. రెండో ఎస్సై పోస్టు ను తక్షణమే భర్తీ చేయాలని కోరుతున్నారు. ‘ప్రస్తు తం సిబ్బంది కొరత ఉంది. కొత్త అధికారులు రాగా నే మల్యాల పోలీసుస్టేషన్‌కు రెండో ఎస్సైని నియమిస్తాం’ అని ఎస్పీ అశోక్ కుమార్ వివరించారు. మల్యాల పోలీస్‌స్టేషన్‌లో రెండో ఎస్సై లేక ఇబ్బంది గంటల తరబడి పడిగాపులు కాస్తున్న ఫిర్యాదుదారులు ప్రొటోకాల్, ఫీల్డ్ ఎంకై ్వరీలతో ప్రస్తుత ఎస్సై బిజీబిజీ -
గోరింట పూసింది
అంజన్నకు వరదపాశం వైభవంగా బోనాలు7జిల్లాకు తేలికపాటి వర్ష సూచనజగిత్యాల అగ్రికల్చర్: జిల్లాలో రాబోయే ఐదురోజుల్లో అతి తేలికపాటి నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ శాస్త్రవేత్త బి.శ్రీలక్ష్మి తెలిపారు. పగటి ఉష్ణోగ్రతలు 29–32 డిగ్రీల సెల్సియస్‌గా, రాత్రి ఉష్ణోగ్రతలు 25–26 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. గాలిలో తేమ ఉదయం 79–84శాతం, మధ్యాహ్నం 56–63శాతం నమోదయ్యే అవకాశముందన్నారు. అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, పిడుగులు, 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.మల్లాపూర్/మల్యాల: ఆషాఢమాసంలో గోరింటాకు సందడి కనిపిస్తోంది. మహిళకు ఎంతో ఇష్టమైన గోరింటాకును పెట్టుకుంటూ.. సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మల్లాపూర్ మోడల్ స్కూల్లో శుక్రవారం గోరింటాకు మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. టీచర్లు, విద్యార్థినులు చేతులకు గోరింటాకు పెట్టుకుని సందడి చేశారు. మల్యాలలో ఉషోదయ మండల సమాఖ్య ఆధ్వర్యంలో గోరింటాకు సంబురాలు నిర్వహించుకున్నారు. స్థానిక సెర్ప్ కార్యాలయంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు ఆమని ఆధ్వర్యంలో వీవోఏలు రెండు చేతులకు గోరింటాకు పెట్టుకొని సంబురాలు చేసుకున్నారు.మల్యాల: వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ మల్యాల మండలం ముత్యంపేటలో రైతులు శుక్రవారం వరదపాశం నిర్వహించారు. గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో స్వామివారికి బిందెలతో జలాభిషేకం చేశారు. దిగువ కొండగట్టు వద్ద విగ్రహం వద్దకు వెళ్లి, బెల్లంతో కూడిన వరదపాశం నైవేద్యంగా సమర్పించారు. మాజీ సర్పంచ్ బద్దం తిరుపతిరెడ్డి, పాక్స్ డైరెక్టర్ సంత ప్రకాశ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.ఇబ్బంది లేకుండా చూస్తాం వ్యర్థాలు తొలగించాలి మున్సిపాలిటీల్లో 100 రోజుల కార్యాచరణలో భాగంగా డ్రైనేజీలు, వాగులు, ప్రభుత్వ భూములలో సీల్టు తొలగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని నాలాలను శుక్రవారం పరిశీలించారు. గోవిందుపల్లి కాలనీ, గంజ్‌రోడ్, శంకులపల్లిలో ఉన్న నాలాలను వెంటనే శుభ్రపర్చాలని ఆదేశించారు. ప్రైవేటు భూ ముల యజమానులు తమ భూ ముల్లోని ముళ్లపొదలను తొలగించకపోతే జరిమానాలు విధించి ఆ డబ్బుతో శుభ్రం చేయాలన్నారు. కలెక్టర్ వెంట కమిషనర్ స్పందన, ఆర్డీవో మధుసూదన్ పాల్గొన్నారు.ప్రధాన మురుగు కాలువలు పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. 100 రోజుల ప్రణాళికలో భాగంగా నాలాలోని చెత్తాచెదారం తొలగించడం జరిగింది. పూర్తిస్థాయిలో తీయించేలా చర్యలు తీసుకుంటున్నాం. వర్షకాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూస్తాం.– స్పందన, మున్సిపల్ కమిషనర్ -
నాలా.. ఇలా ఉంటే ఎలా?
● జిల్లాకేంద్రంలో ప్రమాదకరంగా నాలాలు ● సిల్టు తీయరు.. పిచ్చిమొక్కలు తొలగించరు ● ఏ కాలువ నీరు ఎటు వెళ్తుందో తెలియని పరిస్థితి ● ఇళ్లలోకి నీరు చేరుతోందని ఆవేదన ● జగిత్యాల ప్రజలకు ముంపు ముప్పు ● తక్షణ చర్యలు తీసుకోవాలని వేడుకోలుజగిత్యాల: జిల్లాకేంద్రంలోని ప్రధాన నాలాలు ప్రమాదకరంగా మారాయి. పిచ్చిమొక్కలు పెరగడం, సీల్టు తీయకపోవడంతో వర్షం కురిస్తే డ్రైనేజీ పొంగి మురుగునీరు ఆయా కాలనీల్లోని ఇళ్లలోకి చేరుతోంది. ఏ కాలువ నీరు ఎటు నుంచి వెళ్తోందో తెలియని పరిస్థితి. వర్షాకాలానికి ముందే చర్యలు చేపట్టాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా భారీ వర్షాలు కురిస్తే డ్రైనేజీలు పొంగే ప్రమాదం ఉందని పట్టణ ప్రజలు అంటున్నారు. గంజ్‌రోడ్ నుంచి వెళ్లే నాలా 2 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. నాలా పరిసరాల్లోని ప్రజలు దుర్గంధం, దోమలు, పందులు, ఈగలతో ఇబ్బంది పడుతున్నారు. చింతకుంట నుంచి వచ్చే అతిపెద్ద నాలా శంకులపల్లి కాలనీ వరకు వెళ్తుంది. పిచ్చిమొక్కలు, తుంగ పెరగడంతో కాలువ కన్పించని పరిస్థితి నెలకొంది. జాంబాగ్ ప్రాంతంలో ఉన్న కాలువ ప్రజల కు ఇబ్బందికరంగా మారింది. వెంకటాద్రినగర్‌లోని కాలువ పొంగినప్పుడు కాలనీవాసులు వరద తగ్గే వరకు జగిత్యాలకు రాలేని పరిస్థితి నెలకొంది. గంజ్‌రోడ్, గోవిందుపల్లి, మోతె, చింతకుంట చెరువు సమీపంలో నాలాల వెంట రక్షణగోడ లేకపోవడంతో చిన్నపిల్లలు, మహిళలు అటుగా వెళ్తే అందులో పడే పరిస్థితి నెలకొంది. వర్షాకాలం నేపథ్యంలో ప్రత్యేక నిధులతో నాలాల్లో సీల్టుతీసి, మరమ్మతు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఇది జిల్లా కేంద్రంలోని చింతకుంట నుంచి వచ్చే ప్రధానమైన నాలా. శంకులపల్లి వరకు ఉంటుంది. పూర్తిగా పిచ్చిమొక్కలతో నిండిపోవడంతో పాటు వ్యర్థాలు పడేయడంతో కుంటను తలపిస్తోంది. శంకులపల్లి ప్రాంతంలో పొలాలు ఉండటంతో డ్రెయినేజీ నీరంతా పొలాల్లో పారుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిచ్చిమొక్కలు తొలగించాలని కాలువ వెంట ఉన్న కాలనీవాసులు కోరుతున్నారు. ఇది గోవిందుపల్లి ప్రాంతంలోని ధరూర్ నుంచి వచ్చే పెద్ద కాలువ. వర్షం వచ్చిందంటే నాలా ఉప్పొంగి పట్టణంలోని వెంకటాద్రినగర్‌కు రాకపోకలు స్తంభించిపోవాల్సిందే. ఈ కాలువలో పిచ్చిమొక్కలు పెరుగుతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు, చిరిగిన పరుపులు, బీరువాలు, పాతవస్తువులన్నీ ఇందులోనే పడేస్తున్నారు. ఫలితంగా వర్షం కురిస్తే నాలా పొంగి ఇళ్లలోకి మురుగునీరు చేరుతోంది. ఇది కూడా గంజ్ నుంచి వెళ్లే ప్రధానమైన నాలా. సిటీ మధ్యలో ఉంటుంది. కొన్ని చోట్ల కాలువకు రక్షణగోడ లేకపోవడంతో వర్షాకాలంలో నాలా పొంగితే ప్రమాదాలు జరిగే అవకాశముంది. సీల్టు తీయకపోవడం, పిచ్చిమొక్కలు అత్యధికంగా ఉండటంతో కాలువ వెంట ఉండేకాలనీవాసులు దోమలతో సావాసం చేస్తున్నారు. ఇది గంజ్రోడ్లోని నాలా. పూర్తిగా సీల్టుతో నిండిపోవడంతో మురికినీరు ఎటూ వెళ్లలేని పరిస్థితి. కాలువ సిటీమధ్యలో ఉండడంతో వర్షం పడితే డ్రైనేజీ పొంగి ఇళ్లలోకి నీరు చేరుతోందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీల్టు తీసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దు
● ఎస్పీ అశోక్‌కుమార్ ఇబ్రహీంపట్నం: విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దని, పోలీసుస్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని ఎస్పీ అశోక్‌కుమార్ సిబ్బంది కి సూచించారు. ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌ను శుక్రవారం తనిఖీ చేశారు. డీఎస్పీ రాములు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. గౌరవ వందనం స్వీకరించిన అనంతరం పోలీస్ కీట్లను పరిశీలించారు. స్టేషన్లో రికార్డులు, కేసుల నమోదు వివరాలు, క్రైం వివరాలపై ఆరా తీశారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్క నాటారు. సీఐ అనిల్‌కుమార్, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కోరుట్ల ఎస్సైలు అనిల్, రాజు, శ్రీధర్ పాల్గొన్నారు. రోశయ్యకు నివాళి జగిత్యాలక్రైం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి, ఆర్థిక మంత్రిగా రోశయ్య ఘనత సాధించారని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో రోశయ్య జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్లు కిరణ్‌కుమార్, వేణు, ఐటీకోర్ ఇన్స్పెక్టర్ రఫీక్‌ఖాన్, ఫింగర్ ప్రింట్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ పాల్గొన్నారు. -
దొడ్డి కొమురయ్యకు నివాళి
జగిత్యాలటౌన్: తెలంగాణ ప్రజల తెగువ, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కణిక దొడ్డి కొమురయ్య అని అదనపు కలెక్టర్ బీఎస్.లత కొనియాడారు. దొడ్డి కొమురయ్య వర్ధంతిని శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి సునీత, మైనార్టీ అధికారి ఆర్ఎస్.చత్రు పాల్గొన్నారు. జగిత్యాలలోని 1వ వార్డులో ఉన్న దొడ్డికొమురయ్య విగ్రహానికి జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అద్యక్షుడు ముసిపట్ల లక్ష్మీనారాయణ తదితరులు నివాళి అర్పించారు. రైతు సేవల్లో సహకార సంఘాలు కీలకం కథలాపూర్/మల్లాపూర్: రైతులకు సేవలందించడంలో సహకార సంఘాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని జిల్లా సహకార అధికారి మనోజ్‌కుమార్, జిల్లా ఆడిట్ అధికారి సత్యనారాయణ పేర్కొన్నారు. అంతర్జాతీయ సహకార సంవత్సరం సందర్భంగా సహకార సంఘాలు అందిస్తున్న సేవలపై శుక్రవారం కథలాపూర్, మల్లాపూర్ జెడ్పీ పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. రైతులకు తక్కువ వడ్డీతో రుణాలు అందించి పంటల పెట్టుబడికి ప్రోత్సాహం ఇస్తున్నామని వివరించారు. రైతులతోపాటు వ్యాపారులకు రుణాలు ఇస్తున్నామన్నారు. అనంతరం విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేశారు. పాఠశాలల ఆవరణలో మొక్కలు నాటారు. ఎంఈవోలు శ్రీనివాస్, దామోదర్‌రెడ్డి, మల్లాపూర్ తహసీల్దార్ రమేశ్‌గౌడ్, ఎంపీడీవో శశికుమార్‌రెడ్డి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలి మల్యాల: విద్యార్థుల హాజరు శాతాన్ని పెంపొందించడంతోపాటు, సబ్జెక్టులవారీగా సామర్థ్యాన్ని పరీక్షిస్తూ, వారి భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దాలని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి బొప్పరాతి నారాయణ సూచించారు. మల్యాలలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను శుక్రవారం సందర్శించారు. అధ్యాపకుల హాజరు రిజిస్టర్లు, కార్యాలయ రికార్డులు పరిశీలించారు. తరగతి గదుల్లో విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, క్రమశిక్షణతో చదువుతూ భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోవాలని సూచించారు. అధ్యాపకులు విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తూ, వారిలోని సృజనాత్మకతకు పదును పెట్టాలని పేర్కొన్నాఇన్చార్జి ప్రిన్సిపాల్ జి.వాణి, అధ్యాపకులు అత్తినేని శ్రీనివాస్, మహమ్మద్ నవాబ్, వేనపెల్లి సంధ్య, లైబ్రేరియన్ సంపత్‌కుమార్ పాల్గొన్నారు. మహిళా సంఘాల అభ్యున్నతికి కృషి జగిత్యాలరూరల్: రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల అభ్యున్నతికి కృషి చేస్తోందని డీఆర్డీ ఏ పీడీ రఘువరణ్ పేర్కొన్నారు. జగిత్యాల రూరల్ మండలం చల్గల్ గ్రామంలో ఇందిర మహిళ శక్తి పెట్రోల్‌బంక్ స్థలాన్ని శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల అభివృద్ధికి ఇందిర మహిళా శక్తి కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ఈ క్రమంలో జిల్లా మహిళా సమైక్యకు పెట్రోల్‌బంక్ మంజూరైందన్నారు. సెర్ఫ్ సీఈవో, కలెక్టర్ ఆదేశాల మేరకు స్థలాన్ని పరిశీలించడం జరిగిందన్నారు. పెట్రో ల్ బంక్‌ను పూర్తిగా మహిళా సంఘ సభ్యులే నిర్వహిస్తారని, అందుకోసం జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలాన్ని గుర్తించడం జరిగిందన్నారు. రూరల్ తహసీల్దార్ శ్రీనివా స్, జిల్లా సెర్ఫ్ ఏపీడీ సునీత, పెట్రోల్‌బంక్ ప్ర తినిధి హర్షవర్దన్, డీపీఎం విజయభారతి, ఏపీఎం గంగాధర్, సీసీ గంగారాం పాల్గొన్నారు. -
అప్పుడే ఎరువుల కొరత..!
● జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో దొరకని యూరియా ● మరికొన్ని ప్రాంతాల్లో లభించని డీఏపీ ● ఎరువుల కోసం ఎగబడుతున్న రైతులు జగిత్యాలఅగ్రికల్చర్: పంటల సాగు పూర్తిస్థాయిలో ప్రారంభంకాకుండానే రైతులను ఎరువుల కొరత వేధిస్తోంది. పంటలకు వినియోగించే రసాయన ఎరువుల కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. జిల్లాలోని ఇబ్రహీంపట్నం వంటి కొన్ని ప్రాంతాల్లో యూరియా కొరత ఏర్పడితే.. మేడిపల్లి, సారంగాపూర్ వంటి మరికొన్ని ప్రాంతాల్లో డీఏపీ కొరత రైతాంగాన్ని వేధిస్తోంది. మొక్కజొన్న, వరి సాగు చేస్తున్న రైతులు ఎరువుల కోసం సింగిల్ విండో కేంద్రాలు, ఆగ్రోస్ సేవా కేంద్రాలు, ప్రైవేట్ దుకాణాల వద్ద గంటల తరబడి బారులు తీరుతున్నారు. దీనిని అదునుగా చేసుకుంటున్న వ్యాపారులు అధిక రేట్లకు విక్రయించే పనిలో పడ్డారు. 4.14 లక్షల ఎకరాల్లో పంటల సాగు జిల్లాలో సుమారు నాలుగు లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయి. వరి 3.10లక్షల ఎకరాలు, మొక్కజొన్న, పసుపు, కంది, పెసర వంటి ఆరుతడి పంటలను లక్ష ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ప్రస్తుతం మొక్కజొన్నకు మొదటి దశ కింద యూరియా వేయాల్సిన అవసరం ఉంది. యూరియా సింగిల్ విండో కేంద్రాల్లో అందుబాటులో లేదు. ప్రస్తుతం వరి నాట్లు వేస్తున్నందున తొలిదశ డీఏపీ అవసరం. ఆ ఎరువు కూడా అందుబాటులో లేదు. ఇతర కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నా.. రైతులు డీఏపీ వాడేందుకే మొగ్గుచూపుతారు. కొరత అంటూ వదంతులు వానాకాలం సీజన్లో జిల్లాకు 40,351 టన్నుల యూరియా, 7,768 టన్నుల డీఏపీ అవసరమని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. అయితే యూరియా 7వేల టన్నులు, డీఏపీ వెయ్యి టన్నులు మాత్రమే జిల్లాకు వచ్చింది. దీంతో రానున్న రోజుల్లో ఎరువులు దొరుకుతాయో.. లేదో.. అన్న సంశయంతో రైతులు ఒక్కసారిగా ఎగబడుతున్నారు. గతేడాది జూన్ వరకు 4138.669 టన్నుల యూరియా అమ్ముడుపోగా.. ఈ ఏడాది జూన్ వరకే 7,641.460 టన్నులు అమ్ముడు పోయిందంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. కొంతమంది రైతులు ప్రస్తుతం అవసరం లేకున్నా.. నిల్వ చేసుకుంటున్నారని, ఫలితంగా అక్కడక్కడ కృత్రిమ కొరత ఏర్పడుతోందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. గతేడాది గొల్లపల్లి మండలంలో 27.315 టన్నులు అమ్మగా.. ఈ ఏడాది ఇప్పటివరకే 284.050 టన్నులు అమ్ముడుపోయింది. మల్లాపూర్, మెట్పల్లి, మేడిపల్లి, కోరుట్ల, కథలాపూర్, ఇబ్రహీంపట్నం, బీర్పూర్, బుగ్గారం, మల్యాల, పెగడపల్లి మండలాల్లో అత్యధికంగా రసాయన ఎరువులు వినియోగిస్తున్నట్లు తేలింది. కోత పెడుతున్న ప్రభుత్వం రైతులు పంటలకు అవసరం లేకున్నా.. రసాయన ఎరువులు వాడుతున్నారని గుర్తించిన కేంద్రం ఆ మేరకు కోత పెడుతోంది. ఫలితంగా క్షేత్రస్థాయిలో కొరత ఏర్పడుతోంది. మరోవైపు ఎరువుల భారం రైతులపై పడకుండా సబ్సిడీ ఇస్తోంది. 50 కిలోల డీఏపీ బస్తాకు రూ.1350, యూరియా రూ.300 చొప్పున అందిస్తోంది. డీఏపీకి ఉపయోగించే ముడి పదార్థాలను సౌదీఅరేబియా, చైనా, మొరాకో, రష్యా, జోర్డాన్ నుండి దిగుమతి అవుతోంది. మార్క్‌ఫెడ్ ద్వారా సొసైటీలకు.. మార్క్‌ఫెడ్ సంస్థ ద్వారా జిల్లాలోని 51 సొసైటీలకు రసాయన ఎరువులు అందుతాయి. ఎరువుల కంపెనీలు 50శాతం మార్క్‌ఫెడ్‌కు.. మరో 50 శాతం ప్రైవేట్ డీలర్లకు ఇస్తోంది. అయితే ప్రైవేట్ డీలర్లకు వెళ్లే యూరియా, డీఏపీ ఎక్కడికి పోతుందో అనే దానిపై స్పష్టత లేదు. ప్రైవేట్ వ్యాపారులు రవాణా..హమాలీ ఖర్చులు చూసుకుని ప్రభుత్వం నిర్ణయించిన ధరకంటే బస్తాపై రూ.50 నుంచి రూ.100 వరకు అధిక రేటుకు విక్రయిస్తున్నారు. సొసైటీల ద్వారా ప్రభుత్వ ధరకే రసాయన ఎరువులు విక్రయిస్తుండటంతో ఎక్కువ మంది రైతులు ఎగబడుతున్నారు. వచ్చింది 450 బస్తాలు.. ఇచ్చింది 150 మందికి. ఇబ్రహీంపట్నం: మొక్కజొన్న పంటకు మొదటి దశ యూరియా వేయాల్సిన సమయం రావడం.. ఎరువు కొరతగా ఉండడంతో ఇబ్రహీంపట్నంలో రైతులు అయోమయానికి గురవుతున్నారు. గురువారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి 450 బస్తాలతో లారీ లోడ్ వచ్చింది. విషయం తెలుసుకున్న రైతులు ఉదయమే వచ్చి యూరియా కోసం వచ్చి ఎగబడ్డారు. ఒక్కో రైతుకు మూడు బస్తాల చొప్పున 150 మంది రైతులకు పంపిణీ చేశారు. సుమారు 70 మంది రైతులు యూరియా దొరక్కపోవడతంఓ వెనుదిరిగి వెళ్లారు. ఈ ఏడాది 50 శాతం యూరియానే కేంద్రం సరఫరా చేస్తుందని సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైతులు యూరియా కోసం ఎగబడుతున్నారు. యూరియా కోసం రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, రెండు రోజుల్లో మరో 40 టన్నుల యూరియా సొసైటీకి వస్తుందని ఏవో రాజ్‌కుమార్ తెలిపారు. ఎరువులు సరఫరా చేయాలి నాట్లు వేస్తున్నాం. డీఏపీ దొరకడం లేదు. ప్రైవేట్ వ్యాపారులు అధిక రేటుకు విక్రయిస్తున్నారు. డీఏపీ వేయకుంటే వరి సరిగా కుదురుకోదు. మొక్కజొన్నకు మొదటి దశ కింద యూరియా వేయాల్సి ఉంది. అది కూడా సరిగ్గా దొరకడం లేదు. – చీటేటి జీవన్ రెడ్డి, తొంబర్రావుపేట ఎరువుల కొరత లేదు జిల్లాలో ఎరువుల కొరత లేదు. తప్పుడు సమాచారంతో.. అవసరం లేకున్నా రైతులు కొనుగోలు చేసి నిల్వ చేస్తున్నారు. సీజన్‌ను బట్టి.. నెలవారీగా జిల్లాకు రసాయన ఎరువులు వస్తాయి. మిర్చి, వరి, మొక్కజొన్నకు యూరియాను మోతాదు మించి వాడుతున్నారు. – భాస్కర్, జిల్లా వ్యవసాయాధికారి -
జ్వర బాధితులకు డెంగీ పరీక్షలు నిర్వహించాలి
● కలెక్టర్ సత్యప్రసాద్ రాయికల్: వర్షాకాలంలో జ్వరంతో బాధపడుతున్న వారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో తప్పనిసరిగా డెంగీ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ సత్యప్రసాద్ వైద్యులను ఆదేశించారు. మండలంలోని బోర్నపల్లి, ఇటిక్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనులను పరిశీలించారు. రాయికల్ ఆస్పత్రిని తని ఖీ చేశారు. రోగుల వార్డులోకి వెళ్లి వైద్యసేవలపై ఆరా తీశారు. వైద్యులంతా సమయపాలన పాటించాలని సూచించారు. పరీక్షల కిట్లు అందుబాటులో లేకపోతే జిల్లాకేంద్రం నుంచి తెప్పించుకోవాలని కోరారు. రాయికల్ ఆస్పత్రిలో త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సూపరిండెంట్‌కు సూచించారు. ఆయన వెంట వైద్య విధాన పరిషత్ కో–ఆర్డినేటర్ రామకృష్ణ, తహసీల్దార్ నాగార్జున, ఎంపీడీవో చిరంజీవి, కమిషనర్ మనోహర్‌గౌడ్, ఆస్పత్రి సూపరిండెంట్ శశికాంత్‌రెడ్డి పాల్గొన్నారు. టీబీ చికిత్స అందించాలి జగిత్యాల: టీబీ వ్యాధి ఉన్న వారిని గుర్తించి చికిత్స అందించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. టీబీ ముక్త్భారత్ అభియాన్‌లో భాగంగా సీజనల్ వ్యాధులపై కలెక్టరేట్లో సమీక్షించారు. ప్రతిరోజు డ్రైడే పాటించాలని, ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు ఉంటే తొలగించాలన్నారు. లోతట్టు ప్రాంతాలు, వరదలతో బాహ్యా ప్రపంచానికి సంబంధాలు తెగి పోయే ప్రాంతాలను గుర్తించి చర్యలు చేపట్టాలన్నా రు. గర్భిణులను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ప్రతిరోజూ ఫాగింగ్ చేయించాలని ఆదేశించారు. డీఎంహెచ్‌వో ప్రమోద్ మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 296 ఫాగింగ్ మిషన్లు, 336 హ్యాండ్పంపులు ఉన్నాయని, 31 వేల ఆయిల్‌బాల్స్ తయారు చేశామని, క్లోరినేషన్ చేయిస్తున్నామని తెలిపారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ పాల్గొన్నారు. -
దుబ్బరాజన్న ఆలయానికి రెనోవేషన్ కమిటీ
సారంగాపూర్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన దుబ్బరాజన్న ఆలయానికి దేవాదాయశాఖ 11 మంది సభ్యులతో రెనోవేషన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు గురువారం దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీ సభ్యులుగా కోండ్ర రాంచంద్రారెడ్డి, వాసం శ్రీనివాస్, కొలపాక రవి, పంగ కిష్టయ్య, పిన్నం సత్యనారాయణ, మానుక గంగమ్మ, రంగు శంకర్, మతులాపురం శంకర్, చెట్ల శేఖర్, సూర సత్యనారాయణరెడ్డి, ఉరుమడ్ల పోశాలు నియమితులయ్యారు. ఈ కమిటీ ఏడాది పాటు కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తమ నియామకానికి కృషిచేసిన దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, మాజీ మంత్రి జీవన్‌రెడ్డికి కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
ఇందిరమ్మపై ధరాభారం!
● ఒక్కసారిగా పెరిగిన నిర్మాణ సామగ్రి ధరలు ● ఇందిరమ్మ పథకం మొదలవగానే పెంచిన వ్యాపారులు ● సగటున ప్రతీ ఇంటిపై రూ.55 వేలకుపైగా భారం ● ప్రభుత్వం విడుదల చేసేది రూ.5 లక్షలు ● ఇంటి నిర్మాణానికి కావాల్సింది కనీసం రూ.10 లక్షలు ● స్థిరంగా కొనసాగుతున్న సిమెంట్, ఇసుక ధరలు సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఇందిరమ్మ ఇంటిపై ధరాఘాతం అశనిపాతంలా మారింది. సామాన్యుడికి సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన సంక్షేమ పథకంపై ధరల పెరుగుదల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇందిరమ్మ ఇళ నిర్మాణ సామగ్రికి అమాంతం డిమాండ్ ఏర్పడింది. ఇదే అదనుగా నిర్మాణ సామగ్రి ధరలు పెంచేశారు. ఇందిరమ్మ ఇళ్లు అంటే ఇపుడున్న నిబంధనల ప్రకారం.. 600 నుంచి 800 చదరపు అడుగుల మేర నిర్మించుకునే అవకాశం ఉంది. ప్రతీ నియోజకవర్గానికి 3500 చొప్పున లబ్ధిదారులను ప్రభుత్వం ఎంపిక చేసేందుకు సిద్ధపడటాన్ని దళారులు అదనుగా తీసుకున్నారు. ఫలితంగా ప్రతీ ఇంటి నిర్మాణం మీద అదనపు భారం పడనుంది. ప్రతీ ఇంటిపై రూ.55 వేలకుపైగా భారం... ఇందిరమ్మ ఇంటికి నిర్మాణ సామగ్రి కీలకం. కట్రౌతు ట్రాక్టర్ ట్రిప్పుకు రూ.1200, కంకర ట్రిప్పుకు రూ.1000, రూ.స్టీలు టన్నుకు రూ.2000, ఇసుక ట్రిప్పుకు రూ.1000, మొరం ట్రిప్పుకు రూ.200 చొప్పున ధరలను అమాంతంగా పెంచేశా రు. ఈ నిర్మాణ సామగ్రి లేకుండా ఏ ఇల్లూ పూర్తికా దు. సగటున చూసుకుంటే ప్రతీ ఇంటిపై తక్కువలో తక్కువ రూ.55 వేల నుంచి రూ.60 వేల పైచిలుకు భారం పడుతోంది. సిమెంట్ ధరలు పెరుగుతాయని అని ప్రచారం ఊపందుకుంది. దీన్ని వ్యాపారులు, అటు వినియోగదారులు కొట్టిపారేస్తున్నారు. ఇప్పట్లో సిమెంటు ధరలు పెరిగే సూచనలేమీ కనిపించడం లేదు. అయితే, స్థానికంగా లభించే నిర్మాణ సామగ్రిపైనే వ్యాపారులు, దళారులు, మధ్యవర్తులు ధరలు పెంచి ప్రజల అవసరాలను సొమ్ము చేసుకుంటున్నారు. వాస్తవానికి ప్రతీ లబ్ధిదారునికి ప్రభుత్వం రూ.5లక్షల వరకు ఆర్థిక సాయం చేస్తోంది. కానీ, వాస్తవ పరిస్థితుల కారణంగా ఆ ఖర్చు రూ.10 లక్షల వరకు వెళ్తోంది. జిల్లా ఇందిరమ్మ ఇళ్ల మంజూరైనవి లబ్దిదారుల బేస్మెంట్ స్లాబ్‌లెవల్ దరఖాస్తుల సంఖ్య సంఖ్య స్థాయి కరీంనగర్ 2,04,504 8,219 8,219 742 129 జగిత్యాల 1,99,965 7,601 7,601 209 30 పెద్దపల్లి 1,63,000 9,421 6,018 542 42 రాజన్నసిరిసిల్ల 1,26,124 7,826 7,826 317 90 మొత్తం 6,93,593 33,067 29,664 1,810 291సామగ్రి గతం ప్రస్తుతం పెరిగింది కట్రౌతు(ట్రిప్పు) రూ. 2,700 రూ. 3,900 రూ.1,200 కంకర(ట్రిప్పు) రూ. 2,500 రూ. 3,500 రూ. 1,000 ఐరన్(టన్ను) రూ. 55,000 రూ. 57,000 రూ. 2,000 ఇసుక(ట్రిప్పు) రూ. 2,500 రూ. 3,500 రూ. 1,000 మొరం(ట్రిప్పు) రూ. 1,000 రూ. 1,200 రూ. 200 -
గోరింటా పండింది..
జగిత్యాలటౌన్/కోరుట్ల: జిల్లాకేంద్రంలో సేవాభారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాల్మీకి ఆాసంలో.. కోరుట్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం గోరింటాకు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. వాల్మీకి ఆవాసంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ పొందుతున్న మహిళలు, యువతులు, సేవాభారతి కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆషాఢమాసంలో గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తోందని, మహిళలు ఇన్ఫెక్షన్లకు గురికాకుండా పనిచేస్తుందని తెలిపారు. స్వప్న, రమ, స్రవంతి, స్వరూప, కవోష్ణ, కవిత, వర్షిని, వైష్ణవి, కోరుట్లలో గోరింటాకు ప్రాముఖ్యతను ఉపాధ్యాయులు వివరించారు. -
పాలన వైఫల్యంతో ప్రజలకు ఇబ్బందులు
మల్లాపూర్: కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. మండలంలోని చిట్టాపూర్‌లో ఎంపీ ల్యాడ్స్ రూ.5లక్షలతో బోర్వెల్ నిర్మాణానికి భూమిపూజ చేసి ప్రోసిడింగ్ అందించారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనపై దృష్టి సారించకుండా బీఆర్ఎస్ను దూషించడమే పనిగా పెట్టుకున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్, ప్యాక్స్ చైర్మన్ నేరెళ్ల మోహన్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. మత సామరస్యానికి ప్రతీక మొహర్రం కోరుట్ల: మత సామరస్యానికి మొహర్రం ప్రతీకగా నిలుస్తుందని ఎమ్మెల్యే అన్నారు. అయిలాపూర్ దర్వాజ వద్ద పీరీలను దర్శించుకున్నారు. మత సామరస్యంతో హిదూ, ముస్లింలు ఈ పండుగను నిర్వహించుకుంటారని తెలిపారు. పులి వేషధారులతో ఫొటోలు దిగారు. కల్వర్టు నిర్మాణానికి భూమిపూజ ఇబ్రహీంపట్నం: మండలంలోని వర్షకొండ, డబ్బా గ్రామాల మధ్య లోలెవల్ వంతెన స్థానంలో కల్వర్టు నిర్మాణానికి రాజ్యసభ సభ్యుడు సురేష్‌రెడ్డి మంజూరు చేసిన రూ.1.50లక్షల పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఎంపీ నిధులతో తాగునీటి వసతి మెట్పల్లి: పట్టణంలోని 24వార్డులో ఉన్న మసీదు, 17వార్డు కటిక సంఘ భవనాల వద్ద బోర్ల పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. రాజ్యసభ ఎంపీ నిధులు రూ.3లక్షలు బోర్ల ఏర్పాటుకు కేటాయించారని పేర్కొన్నారు. అంబులెన్స్‌లో పురుడు పోసిన 108 సిబ్బందిరాయికల్: మండలంలోని అల్లీపూర్‌కు చెందిన ఆకుల మౌనికకు పురిటి నొప్పులు రావడంతో బంధువులు 108కు సమాచారం అందించారు. రాయికల్ అంబులెన్స్ టెక్నీషియన్ రామ్, పైలట్ మల్లారెడ్డి చేరుకుని ఆమెను జగిత్యాలకు తరలించేందుకు సిద్ధపడ్డారు. మార్గంమధ్యలో పురిటినొప్పులు ఎక్కువై అంబులెన్స్‌లోనే పండంటి మగబిడ్డకు పురుడుపోశారు. అనంతరం తల్లీబిడ్డను జగిత్యాలలోని మాతా శిశు కేంద్రానికి తరలించారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉండడంతో 108 సిబ్బందిని పలువురు అభినందించారు. ఫీజుల దోపిడీని అరికట్టండిజగిత్యాలటౌన్: ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (ఎన్జీవో) రాష్ట్ర అధ్యక్షుడు నక్క గంగారాం అన్నారు. ఫీజుల నియంత్రణపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం డీఈవోకు ఫిర్యాదు చేశారు. ఫీజుల నియంత్రణకు డీఎస్ఆర్సీ సమావేశం ఏర్పాటు చేయాలని, పాఠశాలల అకౌంట్ ఆడిట్, సొసైటీ ట్రస్టుల ఆడిట్లను ఆర్టీవో స్థాయి జుడిషియల్ అధికారుల ద్వారా చేయించాలని డిమాండ్ చేశారు. ఫీజుల వివరాలను పాఠశాల నోటీసు బోర్డుతోపాటు విద్యాశాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని కోరారు. టీచర్లు, సిబ్బంది వేతనాలను నేరుగా వారి ఖాతాల్లో జమ చేయాలన్నారు. నియోజకవర్గ ఇన్చార్జి సంగెపు ముత్తు, పట్టణ అధ్యక్షుడు దేవుసింగ్రాథోడ్, జిల్లా కార్యదర్శి సాతారపు పద్మ తదితరులు ఉన్నారు. పోచమ్మతల్లికి బోనాలు రాయికల్: పట్టణంలోని కేశవనగర్‌లో పోచమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠాపన గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. మహిళలు బోనాలతో పురవీధుల మీదుగా శోభాయాత్ర నిర్వహించారు. పోచమ్మతల్లికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. -
పథకాలను ప్రజల వద్దకు చేర్చాలి
జగిత్యాల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను ప్రజలకు చేర్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. బుధవారం వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి లక్ష్యాలను సాధించాలన్నారు. జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ పనులను పూర్తి చేయాలని సూచించారు. పనుల్లో అలసత్వం వద్దని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ లత, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. సైబర్ నేరాలపై అవగాహన ఉండాలిజగిత్యాలక్రైం: సైబర్ నేరాలు, భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. బుధవారం జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల నుంచి సైబర్ జాగృక్త దివాస్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, యువతకు సైబర్ భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో సైబర్ నేరాలను నివారించడమే లక్ష్యంగా విద్యార్థులు, యువతకు, ప్రజలకు సైబర్ భద్రతపై అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. పిల్లలు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగాం వాడకుండా తల్లిదండ్రుల జాగ్రత్తలు పాటించాలన్నారు. టీబీ ముక్త్ భారత్ దిశగా కృషి చేయాలి మల్యాల: టీబీ ముక్త్ భారత్ దిశగా ప్రతీ ఒక్కరు కృషి చేయాలని జిల్లా ఉప వైద్య,ఆరోగ్య శాఖ అధికారి ఎన్.శ్రీనివాస్ అన్నారు. మల్యాల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ఉప వైద్య,ఆరోగ్య శాఖ అధికారి ఎన్.శ్రీనివాస్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా నమోదైన రోగుల ఆన్లైన్ వివరాల నమోదును పరిశీలించారు. ఆన్లైన్ నమోదు త్వరగా పూర్తి చేసి, ఆరోగ్య సిబ్బంది ఇంటింటా తిరుగుతూ, టీబీ వ్యాధిగ్రస్తులను సకాలంలో గుర్తించాలన్నారు. దీర్ఘకాలికంగా పొడిదగ్గు, జ్వరం, హఠాత్తుగా బరువు తగ్గినట్లయితే టీబీ పరీక్ష చేయించుకోవాలని, కార్యక్రమంలో వైద్యులు మౌనిక, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులు శాసీ్త్రయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి రాయికల్: విద్యార్థులు చదువుతున్న సమయంలో శాసీ్త్రయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని భూ భౌతిక శాస్త్రవేత్త లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారం రాయికల్ మండలం ఇటిక్యాల ఉన్నత పాఠశాలను సందర్శించి మాట్లాడారు. చిన్నతనం నుంచే శాస్త్ర విజ్ఞానాన్ని అలవర్చుకుంటే ప్రతి అంశంపై ఆలోచించే శక్తి పెరుగుతుందన్నారు. సైన్స్ టీచర్లు చెప్పే పాఠశాలను బట్టి పట్టడం కంటే అర్థం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఎం సదాశివ్, సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఖాళీ ప్లాట్లు.. అనేక పాట్లు
జగిత్యాల/మెట్పల్లి: మెట్పల్లి మున్సిపాలిటీలో ఇళ్ల మధ్య ఉన్న ఖాళీ స్థలాలు పెద్ద సమస్యగా మారాయి. సంబంధిత యజమానులు వాటిని శుభ్రంగా ఉంచడంలో నిర్లక్ష్యం చూపుతున్నారు. దీనివల్ల వాటిలో పిచ్చి మొక్కలు దట్టంగా పెరగడమే కాకుండా చాలాచోట్ల వరద నీటి నిల్వతో మురికి గుంటలుగా తయారయ్యాయి. మరోవైపు మున్సిపల్ అధికారులు కూడా వీటి విషయంలో పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్య ఉన్న కాలనీలు ఇవే.. ● బల్దియాలోని హన్మాన్నగర్, బీడీ కాలనీ, సాయిరాంకాలనీ, టీచర్స్ కాలనీ, సిద్ధి వినాయనగర్, బాలకృష్ణనగర్, అర్బన్ హౌజింగ్ కాలనీల్లో వందల సంఖ్యలో ఖాళీ ప్లాట్లు ఉన్నాయి. ఇవి ఎన్నో సమస్యలకు దారి తీస్తున్నాయి. ● ప్రధానంగా వాటిల్లో పిచ్చి మొక్కలు దట్టంగా పెరిగి పాములకు ఆవాసంగా మారుతున్నాయి. అవి ఇళ్ల పరిసరాల్లో సంచరిస్తుండడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ● అలాగే కొన్ని చోట్ల డ్రైనేజీలు లేకపోవడంతో ఇళ్ల నుంచి వచ్చే మురుగు నీరు వాటిల్లోకి వచ్చి చేరుతోంది. దీంతోపాటు వరద నీరు కూడా చేరి నిల్వ ఉండడంతో అవి మురికి కుంటలుగా తయారవుతున్నాయి. ● ఇలాంటి వాటితో దుర్వాసనను వెదజల్లడంతో పాటు దోమల బెడద ఎక్కువై ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ప్రజలు వాపోతున్నారు. చోద్యం చూస్తున్న మున్సిపల్ అధికారులు.. ● ఖాళీ ప్లాట్లతో ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పటికీ అవి మున్సిపల్ అధికారులకు పట్టడం లేదు. ● వాస్తవానికి నిబంధనల ప్రకారం..ఖాళీ ప్లాట్ల యజమానులు వాటిని శుభ్రంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. పిచ్చి మొక్కలు పెరగకుండా.. చెత్తాచెదారం పేరుకుపోకుండా.. మురుగు నీరు నిలిచి ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలి. ● ఈ విషయంలో నిర్లక్ష్యం చూపే వారికి మున్సిపల్ అధికారులు నోటీసులు ఇవ్వాలి. దీనికి స్పందించకుంటే జరిమానా విధించే అవకాశముంటుంది. ● కానీ అధికారులు అలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ● ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశముంది. గతేడాది పెద్ద సంఖ్యలో ప్రజలు జ్వరాల బారిన పడ్డారు. ● కొన్ని రోజులుగా వార్డుల్లో పర్యటిస్తూ పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న అధికారులు.. అపరిశుభ్రతకు కారణమవుతున్న ఖాళీ ప్లాట్లను పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాకేంద్రంలో.. ● జగిత్యాల.. గ్రేడ్–1 మున్సిపాలిటీ.. 48వార్డులు.. లక్షకు పైగా జనాభా ఉన్నా పారిశుధ్యం మాత్రం అస్తవ్యస్తంగా మారింది. ప్రతిరోజూ ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించాల్సిన ఆటోలు, ట్రాక్టర్లు వెళ్లకపోవడంతో చెత్తను ఖాళీ స్థలా ల్లోనే పడేస్తున్నారు. మున్సిపాలిటిలో నాలుగు జోన్లు ఉన్నాయి. వార్డుకో ఆటో, జోన్‌కు మూడు ట్రాక్టర్లు నడుస్తుంటాయి. 48 వార్డులకు అవి సరిపోవడం లేనట్లు తెలుస్తోంది. కన్పించని డంపర్‌బిన్స్ ● ప్రధానమైన చోట్ల డంపర్‌బిన్స్ ఏర్పాటు చేస్తే చెత్త సమస్య ఉండదు. గతంలో ప్రతిచోట డంపర్‌బిన్స్ పెట్టారు. ప్రస్తుతం వాటన్నిటినీ ఎత్తివేశారు. దీంతో ఖాళీ స్థలాల్లోనే చెత్త పడేస్తున్నారు. పట్టించుకోని మున్సిపల్ అధికారులు సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు ఈ చిత్రం మెట్పల్లి మున్సిపల్ పరిధిలోని సిద్ధివినాయకనగర్‌లో ఇళ్ల మధ్య ఉన్న ఖాళీ ప్లాట్లు. వీటిల్లో ఎక్కడికక్కడ దట్టంగా పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. పాముల బెడద ఎక్కువైందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ అధికారులు ఖాళీ ప్లాట్లను శుభ్రం చేసే విషయంలో ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. ఇది జిల్లాకేంద్రంలోని బైపాస్‌రోడ్‌లోని గోవిందుపల్లికి వెళ్లే రహదారి. ఖాళీ స్థలం మొత్తం చెత్తతో నిండిపోయింది. బల్దియా ట్రాక్టర్లు, ఆటోలు రాక డ్రైనేజీలు తీయడం లేదు. చెత్త తీసుకెళ్లకపోవడంతో ఖాళీ స్థలంలోనే పడేస్తున్నారు. పందులు, దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. రాత్రిపూట ఉండలేకపోతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం మెట్పల్లి బల్దియా పరిధిలోని హన్మాన్నగర్లోనిది. ఈ కాలనీ నూతన గృహాల నిర్మాణంతో విస్తరిస్తోంది. ఇందులోనూ అక్కడక్కడ ఉన్న ఖాళీ ప్లాట్లు పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. కొన్ని ప్లాట్లల్లో మొక్కలతో పాటు మురుగునీరు వచ్చి చేరింది. ఈ సమస్యతో పరిసరాలు కంపు కొడుతుండడమే కాకుండా దోమల బెడద ఎక్కువైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది కొత్తబస్టాండ్ సమీపంలోని వాటర్‌ట్యాంక్ సంది. ఇక్కడ కమిషనర్ క్వార్టర్ కూడా ఉంటుంది. ఈ సమీపంలోనే అత్యధిక చెత్త పడేస్తున్నారు. కాలనీ మొత్తం దుర్గంధం వెదజల్లుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది నర్సింగ్ కళాశాల సమీపంలోని ఖాళీ స్థలం. ఇందులో మట్టి, చెత్తాచెదారం పడేస్తున్నారు. దుర్వాసన వస్తోందని కళాశాల విద్యార్థులు పేర్కొంటున్నారు. ఖాళీ స్థలం కావడంతో ఇష్టానుసారంగా ప్లాస్టిక్ వ్యర్థాలు పడేస్తున్నారు. ఇది బైపాస్ ప్రధాన రోడ్. డ్రైనేజీని ఆనుకునే చెత్త వేస్తున్నారు. విరిగిపోయిన కూలర్లు, ఫ్యాన్లు, చెడిపోయిన బెడ్స్, చిని గిన బట్టలు ఇలా అనేక వస్తువులు అక్కడే పడేస్తున్నారు. అటు వైపు వెళ్తేనే దుర్గంధం వెదజల్లుతోంది. మున్సిపల్ అధికారులు స్పందించి అక్కడ చెత్త వేయకుండా చూడటంతోపాటు, డంపర్‌బిన్‌ను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
పేకాటపై సీసీఎస్ పోలీసుల నిఘా
● జిల్లాలో జోరుగా మూడుముక్కలాట ● చేతులు మారుతున్న కోట్ల రూపాయలుజగిత్యాలక్రైం: జిల్లాలో మూడుముక్కలాట జోరుగా సాగుతోంది. పోలీసులు నిఘా పటిష్టం చేసి.. రోజు కోచోట పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసి.. వారి నుంచి నగదు సీజ్ చేస్తున్నారు. నిందితులపై కేసులు నమోదు చేస్తున్నారు. పేకాటతో వారి కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. నిత్యం జూదం కొనసాగుతుండటంతో అనేక కుటుంబాలు ఆర్థికంగా నష్టపో యి ఇ బ్బంది పడుతున్నాయి. కొంతమంది ఆస్తులు, బంగారం తాకట్టు పెట్టి పేకా డుతూ తీవ్రంగా నష్టపోతున్నారు. మామిడితోటలు, అడవుల్లో అడ్డా పేకాట రాయుళ్లకు మామిడితోటలు, అడవులు అడ్డాలుగా మారాయి. కొందరు నిర్వాహకులు కొంత మంది పేకాటరాయుళ్లను మచ్చిక చేసుకుని వారికి విందు, వసతులు ఏర్పాటు చేసి అక్కడికే పిలిపిస్తూ పెద్ద ఎత్తున పేకాట నిర్వహిస్తున్నారు. స్థావరాల వద్ద ఉన్న రహదారులపై రహస్యంగా కాపలా ఏర్పాటు చేసుకుని పోలీసులు వస్తే సమాచారం రాగానే అక్కడి నుంచి పారిపోతున్నా రు. కొంతమంది మహారాష్ట్రలోని అప్పారావుపేట, బోరి, బిరేళీ, గోవా వంటి ప్రాంతాలకు వెళ్లి పెద్ద ఎత్తున పేకాట ఆడుతున్నారు. ఇతర జిల్లాల నుంచి వస్తున్న జూదరులు జిల్లాకేంద్రంతో పాటు పలు మండలాలు, గ్రామాల్లోని అటవీ ప్రాంతాల్లో.. మామిడి తోటల్లో, ఫామ్ హౌస్‌లను వేదిక చేసుకుని పోలీసుల కళ్లు గప్పి పెద్ద ఎత్తున జూదం ఆడుతున్నారు. పోలీసులు జూదంపై కఠిన చర్యలు తీసుకుంటున్నా వారి ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. నిఘా పెంచిన సీసీఎస్ పోలీసులు జిల్లావ్యాప్తంగా సీసీఎస్ పోలీసులతో పాటు, స్థానిక పోలీసులు పేకాటపై ప్రత్యేక దృష్టి సారించారు. పట్టుబడిన, నిర్వాహకుల వివరాలు సేకరిస్తూ సాంకేతికతతో సీసీఎస్ పోలీసులు వారిపై దాడులు చేస్తూ పేకాట రాయుళ్లకు అడ్డుకట్ట వేస్తున్నారు. పారిపోతున్న జూదరులు రహస్య ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో, మామిడి తోటల్లో పేకాట ఆడుతున్న సమయంలో పోలీసులు దాడులు చేయగా, చాలామంది జూదరులు పోలీసుల కళ్లుగప్పి పారిపోతున్నారు. పోలీసులు దొరికిన వారి నుంచి కూపీ లాగడంతో పాటు అక్కడున్న వాహనాలను స్వాధీనం చేసుకుని అసలు నిందితులను గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. ఏడాది కేసులు నిందితులు పట్టుకున్న సొమ్ము(రూ.లలో) 2022 109 536 16,91,045 2023 78 473 18,66,696 2024 89 602 19,40,681 2025 71 447 16,68,520 -
వారాహిమాతకు లక్ష పుష్పార్చన
కోరుట్ల: పట్టణంలోని త్రిశక్తి మాతా దేవాలయంలో వారాహినవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అమ్మవారికి బుధవారం లక్ష పుష్పార్చన చేశారు. కార్యక్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షుడు కట్ట నారాయణ, అధ్యక్షుడు గణేశ్, ప్రధాన కార్యదర్శి శంకర్, కోశాధికారి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ‘సిగాచి’ మృతుల కుటుంబాలకు రూ.కోటి చెల్లించాలిజగిత్యాలటౌన్: హైదరాబాద్ శివారు పాశమైలారం సిగాచి రసాయన పరిశ్రమలో మృతిచెందిన బాధిత కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించేలా చర్యలు తీసుకోవాలని మాజీమంత్రి జీవన్‌రెడ్డి కోరారు. బుధవారం లేబర్ కమిషనర్‌కు లేఖ రాశారు. సిగాజి రసాయన పరిశ్రమలో పేలుడు ఘటన భోపాల్ ఘటనను తలపించిందన్నారు. 46మందికి పైగా మృతి చెందడంతోపాటు పదుల సంఖ్యలో తీవ్ర గాయాలపాలయ్యారని పేర్కొన్నారు. ఘటనపై ప్రత్యేక బృందంతో విచారణ చేపట్టి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కంపెనీ యాజమాన్యంపై హత్యానేరం కింద క్రిమినల్ చర్యలు చేపట్టాలని కోరారు. తెలంగాణ హక్కులపై కేంద్రాన్ని నిలదీస్తాంవెల్గటూర్: తెలంగాణ రావాల్సిన నిధులు, హక్కులపై కేంద్రంపై పోరాటం చేస్తామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. మండలకేంద్రంలో పలువురు బాధితులను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని, ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కమీషన్ల కోసం బనకచర్ల ప్రాజెక్టు నిర్మించి తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకోబోమని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకుంటామని తెలిపారు. సమస్య పరిష్కరించాల్సిన బీజేపీ చోద్యం చూస్తూ కూర్చోవడం సరికాదని, దీనిపై పార్లమెంట్లో నిలదీస్తామన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శైలేందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ గోపిక, నాయకులు తిరుపతి, ఉదయ్, శ్రీకాంత్‌రావు, సందీప్ రెడ్డి, వెంకటేశ్ ఉన్నారు.