సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండించాలి
జగిత్యాలఅగ్రికల్చర్: సేంద్రియ ఎరువులతో కూరగాయలు పండించుకోవాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి కందుకూరి స్వాతి అన్నారు. శుక్రవారం జగిత్యాలరూరల్ మండలం పొలాస రైతు వేదికలో పెరటి తోటల పెంపకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కనీసం కుటుంబం వరకై నా ఇంటి ఆవరణలో కూరగాయలు పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రసాయన మందులతో లేని పోని రోగాలు వస్తున్నాయని చెప్పారు. ఏడీఏ తిరుపతినాయక్ మాట్లాడుతూ, రైతులు సంప్రాదాయ పంటలైన వరి, మొక్కజొన్న కాకుండా ఇతర పంటలవైపు దృష్టి పెట్టాలని సూచించారు. సమావేశంలో సర్పంచ్ మిల్కూరి శేఖర్, ఉప సర్పంచ్ సంగ తిరుపతి, గుల్లపేట ఎఫ్‌పీవో చైర్మన్ దమ్మ గంగారెడ్డి, ఏఈవో హరీశ్ తదితరులు పాల్గొన్నారు.


