breaking news
Jagitial District News
-
కుటుంబ సభ్యుల చెంతకు వృద్ధురాలు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం చెగ్యాం గ్రామానికి చెందిన పోతురాజుల గంగవ్వ(75) గాంధారీ ఖిల్లా దర్శనానికి వచ్చి తిరుగువెళ్లే క్రమంలో అటవీ ప్రాంతంలో తప్పిపోయింది. కుటుంబ సభ్యులు పోలీస్, అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా.. గురువారం రాత్రి అటవీ క్షేత్రాధికారి సంతోష్ ఆదేశాల మేరకు గాంధారిఖిల్లా అటవీ ప్రాంతంలో గాలింపు చర్యల్లో భాగంగా జంతువుల కదలికల కోసం ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాకు గంగవ్వ ఫొటో చిక్కింది. దీంతో నిర్ధిష్టమైన ప్రణాళికతో పోలీస్, అటవీ అధికారులు మరింతగా గాలింపు చేపట్టగా రాత్రి 9 గంటల ప్రాంతంలో సఫారీ 1వ గేట్ వద్ద గంగవ్వను గుర్తించారు. అనంతరం వృద్ధురాలిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
ఆలయ భూమి వివాదాస్పదం
కోరుట్లరూరల్: మండలంలోని అయిలాపూర్ హామ్లేట్ గ్రామం కిషన్రావుపల్లె శివారులోని మారెమ్మతల్లి ఆలయ స్థలం వివాదాస్పదంగా మారింది. గ్రామ శివారులో ఓ వ్యక్తికి సంబంధించి 72 ఎకరాల స్థలం ఉండగా, కొన్నేళ్ల క్రితం అందులో నుంచి 25 ఎకరాలు కిషన్రావుపల్లె వాసులు, 12 ఎకరాలు అయిలాపూర్ గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు చేశారు. గీత కార్మికులు 12 ఎకరాల నుంచి 9 ఎకరాలు ఇటీవల ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి విక్రయించారు. రియల్టర్ ఆ స్థలాన్ని చదును చేసే పని ప్రారంభించగా, అందులో మారెమ్మతల్లి ఆలయం ఉందని, జేసీబీతో తొలగించారని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. కూల్చిన ఆలయాన్ని పునర్నిర్మించాలని మారెమ్మతల్లి ఫ్లెక్సీ, జెండాలు పెట్టి ఆందోళన చేపట్టారు. కాగా, ఆ స్థలంలో ఏ ఆలయం లేదని గ్రామస్తులు కావాలని వివాదం సృష్టిస్తున్నారని గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ లక్ష్మీనారాయణ, రెవెన్యూ అధికారులు వివాదాస్పద స్థలాన్ని పరిశీలించి గ్రామస్తులు, గీతకార్మికులతో మాట్లాడారు. ఇరు వర్గాలు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సముదాయించారు. కాగా పునర్నిర్మించే వరకు ఆందోళన కొనసాగిస్తామని గ్రామస్తులు పేర్కొన్నారు. -
గ్యాస్ మాటున గుండెపోటు
నగరంలోని మంకమ్మతోటకు చెందిన రమేశ్(40) ఉదయం లేవగానే చాతిలో మంటగా అనిపించింది. మొదట గ్యాస్ సమస్య అనుకున్నప్పటికీ ఎంతకీ తగ్గకపోవడంతో ఆసుపత్రికి వెళ్లి పరీక్షలుచేయించుకోగా ఒక వాల్వ్ బ్లాక్ అయినట్లు వైద్యులు తెలిపారు. వెంటనే స్టంట్ వేశారు● అతి పెద్ద కిల్లర్‌గా మారిన హార్ట్ ఎటాక్ ● కరీంనగర్లో పెరుగుతున్న కేసులు ● నడక, వ్యాయామంతో నివారించే అవకాశం ● జీవనశైలి, ఆహార మార్పులు తప్పనిసరి ● ముందు జాగ్రత్త మేలంటున్న వైద్యులుకరీంనగర్: ఛాతీలో మంటగా ఉంది. గ్యాస్ అయి ఉంటుంది. అజీర్ణం వల్ల నొప్పి వస్తోంది.. అంటూ చాలామంది నిర్లక్ష్యం చేసే లక్షణాలు కొన్ని సందర్భాల్లో గుండెపోటుకు సంకేతాలు కావచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్యాస్ అని అనుకుని ప్రతి ఛాతీ నొప్పిని నిర్లక్ష్యం చేయకూడదు. అదే సమయంలో ప్రతి నొప్పి గుండెపోటే అని భయపడాల్సిన అవసరం కూడా లేదని చెబున్నారు. అనుమానం వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించడం ద్వారా ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు అంటున్నారు. గుండెపోటు చికిత్సలో శ్రీగోల్డెన్ అవర్శ్రీ అత్యంత కీలకం. ముఖ్యంగా 35 ఏళ్లు దాటిన వారిలో జీవనశైలి మార్పులు, ఒత్తిడి, మధుమేహం, రక్తపోటు, ధూమపానం వంటి కారణాలతో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని చెబుతున్నారు. యువతలో పెరుగుతున్న ముప్పు ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన వారిలో ఎక్కువగా కనిపించే గుండె సంబంధిత సమస్యలు ఇప్పుడు 25 నుంచి 45 ఏళ్ల వయసు వారిలో కూడా నమోదవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఉద్యోగ ఒత్తిడి, నిద్రలేమి, ఫాస్ట్‌ఫుడ్ అలవాట్లు, వ్యాయామం లేకపోవడం, అధిక బరువు వంటి కారణాలు ఇందుకు కారణం అవుతున్నాయి. గ్యాస్.. గుండెపోటు లక్షణాలు గ్యాస్ లేదా అజీర్ణం వల్ల సాధారణంగా కడుపు ఉబ్బరం, తేపులు, భోజనం చేసిన తర్వాత అసౌకర్యం, గొంతు వరకు మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు మందులు తీసుకుంటే లేదా విశ్రాంతి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. గుండెపోటు సమయంలో ఛాతీ మధ్య భాగంలో బిగుతుగా లేదా నొక్కుతున్నట్లుగా నొప్పి ఉండవచ్చు. ఆ నొప్పి చేతులు, భుజాలు, మెడ, దవడ లేదా వీపుకు వ్యాపించవచ్చు. అధిక చెమటలు పట్టడం, వికారం, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్ర నీరసం వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. ముఖ్యంగా మధుమేహ రోగుల్లో నొప్పి తక్కువగా ఉన్నప్పటికీ గుండెపోటు ఉండే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రికి... ఛాతీలో 15 నుంచి 20 నిమిషాలకు పైగా కొనసాగే నొప్పి, ఒత్తిడి అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎడమ చేయి, మెడ, దవడకు వ్యాపించే నొప్పి అధిక చెమటలు పట్టడం, వికారం, వాంతులు తీవ్రమైన బలహీనత లేదా తల తిరగడం ఈ లక్షణాలు కనిపిస్తే సమీప ఆసుపత్రికి వెంటనే వెళ్లి ఈసీజీ, 2డి ఎకో వంటి పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. -
బడికి బస్‌పాస్
దూరం నెలవారీ మూడు నెలలకు (కిలోమీటర్లు) రుసుము(రూ.లో) 5 275 650 10 425 1,070 15 500 1,400 20 650 1,775 25 725 2,075 30 800 2,300 35 875 2,450 ● కరీంనగర్ ఆర్టీసీ డిపోల్లో ప్రత్యేక కౌంటర్లు ● అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచన కరీంనగర్‌టౌన్: కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు టీజీఎస్ ఆర్టీసీ బస్‌పాసులు అందిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని 11 డిపోల పరిధిలో విద్యార్థులకు ఉచిత, రాయితీ బస్సు పాసులు పంపిణీ చేస్తున్నారు. విద్యాసంస్థలకు బస్సుల్లో ప్రయాణించే విద్యార్థులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని అధికారులు సూచించారు. బస్‌పాస్‌ల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. 35 కిలోమీటర్ల పరిధి వరకే పన్నెండేళ్లు దాటిన బాలురు, ఇంటర్, డిగ్రీ, ఇతర కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు 35 కిలోమీటర్ల పరిధిలో రాయితీ బస్‌పాస్‌లు మంజూరు చేస్తారు. ప్రయాణ దూరాన్ని బట్టి పాస్ రుసుం నిర్ణయిస్తారు. పాస్ గుర్తింపు కార్డు కోసం అదనంగా రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. పన్నెండేళ్లలోపు బాలురు జిల్లా పరిధిలోని పల్లెవెలుగు బస్సుల్లో 20 కిలోమీటర్ల వరకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న అర్హులైన విద్యార్థులు పాఠశాల బోనాఫైడ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో సమీపంలోని బస్సుపాస్ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పాస్ జారీకి రూ.50 గుర్తింపు కార్డు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. బాలికలు ఆధార్ కార్డు ఆధారంగా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం కొనసాగుతుండగా, బాలురకు బస్ పాస్ పథకం ద్వారా ప్రయాణ భారం తగ్గనుంది. ప్రైవేటు విద్యాసంస్థలకు డీడీ రూపంలో ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు రాయితీ బస్సు పాస్‌లు అందించాలంటే ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలు టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించిన వార్షిక రుసుం డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాలి. అనంతరం సంస్థలకు ప్రత్యేక యూజర్ నేమ్, పాస్వర్డ్ కేటాయించి విద్యార్థుల దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేస్తారు. అర్హులైన విద్యార్థులు ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. -
తిరుపతి–కరీంనగర్ రైలు వేళల్లో మార్పు
రామగుండం: తిరుపతి – కరీంనగర్ మధ్య నడిచే బై వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు(12761) వేళల్లో స్వల్ప మార్పులు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు. ప్రతీ బుధ, శనివారాల్లో తిరుపతి నుంచి రాత్రి 8.05 గంటలకు బయలుదేరాల్సిన రైలు ఇకనుంచి 7.50గంటలకేల బయలుదేరనుందని, అక్టోబర్ 10వ తేదీ నుంచి ఇది అమలులోకి వస్తుందని వివరించారు. ముందస్తు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తించాలని సూచించారు. తీర్థ యాత్రల ప్రత్యేక టూర్ ప్యాకేజీవిద్యానగర్(కరీంనగర్): బోనాల పండుగా సందర్భంగా హైదరాబాద్‌లోని ఆలయాల దర్శనం కోసం ఈనెల 9 ఆదివారం ప్రత్యేక టూర్ ప్యాకేజీ లగ్జరీ బస్సు సర్వీస్ ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ కరీంనగర్–1 డిపో మేనేజర్ ఐ. విజయమాధురి తెలిపారు. ఆదివారం ఉదయం 3.30 గంటలకు కరీంనగర్ బస్టాండ్ నుంచి ఈ బస్సు సర్వీసు బయలుదేరి నిమిషాంబిక టెంపుల్, అష్టలక్ష్మి టెంపుల్, పెద్దమ్మ టెంపుల్, ఇస్కాన్ టెంపుల్, జగన్నాథ టెంపుల్, చిలుకూరు బాలజీ టెంపుల్ సందర్శన అనంతరం అదే రోజు రాత్రి కరీంనగర్ చేరుతుందని ఆమె పేర్కొన్నారు. పెద్దలకు రూ.1300, పిల్లలకు రూ.975 టికెట్ ఉంటుందని వివరించారు. వివరాలకు 73828 49352, 9959225920 ఫోన్ నెంబర్లలో సందప్రదిచాలని సూచించారు. బావిలోపడి వృద్ధురాలి మృతి సుల్తానాబాద్‌రూరల్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామానికి చెందిన అసరి మల్లమ్మ(83)శుక్రవారం ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలోపడి మృతి చెందింది. ఎస్సై చంద్రకుమార్ కథనం ప్రకారం.. మల్లమ్మకు నాలుగేళ్లుగా మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో అటుఇటు తిరుగుతుండేది. శుక్రవారం ఇంటిసమీపంలోని వ్యవసాయబావి వైపు వెళ్లాగా అందులో ప్రమాదవశాస్తు పడి మృతి చెందింది. ఆమె కొడుకు రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు. ఇద్దరు నిందితుల అరెస్ట్మల్యాల: నకిలీ ఇంటి పన్ను రశీదు తయారు చేసిన కేసులో ఇద్దరిని అరెస్టు చేశామని ఎస్సై సందీప్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. మల్యాల మండలం సర్వాపూర్ గ్రామానికి చెందిన ఆకుల నగేశ్, బాసోజి అనిల్, అరుణ్ సర్వాపూర్ గ్రామ పంచాయతీకి చెందిన నకిలీ రశీదును తయారు చేశారు. అధికారిక రబ్బర్ స్టాంపులు, ముద్రలతో ప్రభుత్వ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేశారు. మండల పంచాయతీ అధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఇద్దరిని అరెస్టు చేశామని, మరో నిందితుడు పరారీలో ఉన్నాడని ఎస్సై తెలిపారు. అదృశ్యమైన బాలిక బంధువులకు అప్పగింత జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం కండ్లపల్లి గ్రామంలోని మోడల్స్కూల్లో 7వ తరగతి చదువుతున్న బాలిక ఈనెల 5న అదృశ్యం కాగా, తండ్రి ఫిర్యాదు మేరకు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు విచారణ వేగవంతం చేసి సీసీ పుటేజీ ఆధారంగా బాలిక మధ్యప్రదేశ్ వెళ్లినట్లు గుర్తించారు. దీంతో అక్కడి రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో మఽ ద్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ రైల్వేస్టేషన్లో బాలికను గుర్తించి జగిత్యాలలో ఉన్న కు టుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడించారు. మ ధ్యప్రదేశ్, జగిత్యాల రూరల్ పోలీసుల సమన్వయంతో బాలిక ను గ్వాలియర్ జిల్లా వా చిపుర గ్రామానికి చెందిన పెద్దనాన్న బల్వీర్‌కు అప్పగించారు. బాలికను తల్లిదండ్రుల వద్దకు తీసుకురావడానికి అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. రేషన్ బియ్యం పట్టివేత పెద్దపల్లి: పేదలకు పంపిణీ చేయాల్సిన పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారని పెద్దపల్లికి చెందిన పలువురు పౌరులు కలెక్టర్‌కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఈనెల 6న రాత్రి ఎల్లమ్మ చెరువు ప్రాంతంలో సుమారు 35 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని వాహనంలో తరలిస్తుండగా అడ్డుకుని తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. అయినా, వారు స్పందించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం డయల్ 100 నంబరుకు సమాచారం ఇవ్వగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బియ్యం లోడుతో ఉన్న వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు వారు తెలిపారు. పట్టుబడిన బియ్యం, వాహనాన్ని స్వాధీనం చేసుకుని చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారులు కలెక్టర్‌ను కోరారు. -
ఎరువుల పంపిణీలో ప్రభుత్వ విఫలం
జగిత్యాలరూరల్: రైతులకు విద్యుత్ సరఫరా, ఎరువుల పంపిణీలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సారంగపూర్ మండల కేంద్రంలో మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావం గురించి వాతావరణ శాఖ హెచ్చరించినా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని ఎగువకు తరలిస్తే కేసీఆర్‌కు పేరు వస్తుందని కుట్రపూరితంగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. అల్పపీడన ప్రభావంతో రైతుల్లో కొంచెం ఆశలు చిగురించాయని, పూర్తిస్థాయిలో సాగు చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. తెలంగాణ ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 24 గంటల విద్యుత్ ఇచ్చారని, ప్రస్తుతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి పరిస్థితి మళ్లీ పునరావృతం అయిందన్నారు. శ్రీశైలం జలాశయంలో 900 మెగావాట్ల విద్యుత్ ఉత్పిత్తి చేసే అవకాశం ఉండేదని, ఇప్పుడు కేవలం 100 మెగావాట్ల ఉత్పత్తి చేస్తున్నారని, ఇంకా 800 మెగావాట్ల ఉత్పాదన చేయకపోవడంతో రాష్ట్రంలో విద్యుత్ కొరత ఏర్పడుతుందన్నారు. 800 మెగావాట్లు ఉత్పత్తి చేస్తే పోతిరెడ్డిపాడుకు నీళ్లు వెళ్లవని, ఇది మొత్తం చంద్రబాబు డైరెక్షన్లో నడుస్తుందని ఆరోపించారు. సత్యం రావు, తేలు రాజు, రాంచంద్రారెడ్డి, గంగన్న, యశ్వంత్, పూర్ణచందర్‌రెడ్డి, మధు పాల్గొన్నారు. -
ఉత్తుత్తి స్కానింగ్
● తప్పుల తడకగా రిపోర్ట్లు ● నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నిర్వాహకులు ● డీఎంహెచ్‌వోకు బాధితుడి ఫిర్యాదుజగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన గంగాధర్ సతీమణికి కిడ్నీ సమస్య ఉండటంతో జిల్లా కేంద్రంలోని బైపాస్‌రోడ్‌లో గల ఓ డయాగ్నోస్టిక్ కేంద్రానికి వెళ్లారు. ఆ సెంటర్లో సిటీక్యూబ్ స్కానింగ్ చేయించగా, నో ఎవిడెన్స్ ఆఫ్ రినాల్ కాల్యుకులేషన్ (కిడ్నీలో రాళ్లు లేవు) అని రిపోర్ట్ వచ్చింది. ఆమె తీవ్రమైన నొప్పితో బాధపడగా, అదేరోజు గొల్లపల్లి రోడ్‌లోని మరో డయాగ్నోస్టిక్ సెంటర్లో స్కానింగ్ చేయించారు. అందులో కుడి కిడ్నీలో 7.3 మి.మీ పరిమాణంలో రాయి ఉందని నిర్ధారించారు. అనంతరం వైద్యుల సూచనలతో చికిత్స చేయించి రాయిని తొలగించారు. కాగా, తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన స్కానింగ్ నిర్వాహకులను అడుడగా, నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. డీఎంహెచ్‌వోకు ఫిర్యాదు చేశారు. రిపోర్ట్లలో తప్పులు జిల్లా కేంద్రం.. చాలా మంది వైద్య చికిత్సల నిమిత్తం జగిత్యాలకు వస్తుంటారు. ఏదైనా ప్రమాదం జరిగినా, కిడ్నీల్లో నొప్పి వచ్చినా, బ్రెయిన్ సమస్య ఉన్నా వ్యాధిని బట్టి స్కానింగ్ సెంటర్లకు రాస్తుంటారు. ఇక్కడి వరకు బాగానే ఉన్న తప్పుడు రిపోర్ట్‌లతో సామాన్యులు ఇబ్బందులకు గురవుతున్నారు. స్కానింగ్ సెంటర్లపై వైద్యశాఖ నిఘా పెట్టకపోవడం, తనిఖీలు చేయక వారు ఆడిందే ఆటగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వేలల్లో ఫీజులు జిల్లాలో సుమారు 70కి పైగానే స్కానింగ్ సెంటర్లున్నాయి. వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్న సెంటర్లలో ఎవరి రిపోర్ట్ నమ్మాలో, ఎవరిది నమ్మకూడదో తెలియని పరిస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతాలవారే ఎక్కువగా రావడం, వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు అందినంత దోచుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. చిన్నపాటి స్కానింగ్‌కు రూ.3 వేలకు పైగా ఉంటుంది. వైద్యశాఖ అధికారులు పూర్తిస్థాయిలో తనిఖీలు చేయడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. గతంలో స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు ఆరోపణలు రావడం, తనిఖీల్లో కొన్ని ఆస్పత్రుల్లో అనుమతి లేని యంత్రాలు ఉన్నట్లు గుర్తించిన సంఘటనలున్నాయి. నిబంధనలు పాటించాలి స్కానింగ్ సెంటర్లపై నిఘా పెట్టాం. నిబంధనల ప్రకారం నిర్వహించాలి. రోగులను ఇబ్బందులకు గురిచేయొద్దు. ముఖ్యంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేయకూడదు. ఏదైనా సమస్యపై స్కానింగ్ సెంటర్లపై ఫిర్యాదు చేస్తే విచారణ చేపడతాం. – జైపాల్‌రెడ్డి, డెప్యూటీ డీఎంహెచ్‌వో -
రోడ్డు ప్రమాదంలో కూలీ మృతి
ముత్తారం: పెద్దపల్లి జల్లా ముత్తారం మండలం కేశనపల్లిలో శుక్రవారం ఓ హోటల్ వద్ద ఆగి ఉన్న డీసీఎం వ్యాన్‌ను ఢీకొన్న ప్రమాదంలో భవన నిర్మాణ రంగ కూలీ అక్కడకక్కడే మృతి చెందాడు. గోదావరిఖనికి చెందిన జాడి రాజేందర్ ముత్తారంలో ప్రభుత్వ ఆస్పత్రి భవన నిర్మాణంలొ పనిచేయడానికి వచ్చాడు. ముత్తారం నుంచి గోదావరిఖనికి తిరుగు ప్రయాణంలో కేశనపల్లి వద్ద ప్రమాదవశాత్తు ద్విచక్ర డీసీఎం వ్యాన్‌ను ఢీకొని చనిపోయాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై సుధాకర్ తెలిపారు. -
అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య
బోయినపల్లి(చొప్పదండి): ఆర్థిక ఇబ్బందులతో బోయినపల్లి మండల కేంద్రానికి చెందిన బొటుకు మహేశ్(34) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై ఎన్.రమాకాంత్ తెలిపిన వివరాలు. మహేశ్ కూలీ పనులు చేస్తూ జీవనోపాధి పొందేవాడు. మహేశ్ తండ్రి నందయ్య గతంలో మృతిచెందాడు. కొద్ది నెలులుగా అప్పులు ఎక్కువ అయ్యాయి. ఈక్రమంలో ఆర్థిక ఇబ్బందులు భరించలేక తన ఇంట్లోనే దూలానికి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహేశ్‌కు భార్య నవ్య, ఇద్దరు కుమారులు లోకేశ్(6), అశ్విత్(4) ఉన్నారు. మృతుడి తల్లి బొటుకు లక్ష్మి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
కోరుట్ల/మెట్పల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన స్వయం సహాయక పథకాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు అన్నారు. ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజనలో మంజూరైన చెక్కులను శుక్రవారం పట్టణంలోని మున్సిపల్ ఆవరణలో గల మెప్మా భవనంలో మున్సిపల్ చైర్పర్సన్ తిరుమల వసంతతో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పేద కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. కమిషనర్ రాఘవేంద్ర, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తిరుమల గంగాధర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మెట్పల్లి పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన చెక్కులు అందించారు. అంతకు ముందు బోనాల వేడుకలను పురస్కరించుకొని మహాలక్ష్మీ ఆలయంలో పూజలు చేశారు. వన మహోత్సవంలో భాగంగా ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు. మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, డీఎస్పీ రాములు, సీఐ సురేశ్‌బాబు, ఎస్సై కిరణ్‌కుమార్, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు రైసుద్దీన్ పాల్గొన్నారు. అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ కరీంనగర్‌స్పోర్ట్స్: హన్మకొండలోని జేఎన్ స్టేడియంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర 12వ యూత్ అండర్ 18 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించారు. 12 సంవత్సరాల కేటగిరీలో 60 మీటర్ల పరుగు విభాగంలో 48 మంది క్రీడాకారులు పాల్గొనగా, నూరైన్ ప్రతి భ కనబరిచి స్వర్ణ పతకం సాధించింది. ఈ సందర్భంగా జిల్లా అథ్లెటిక్స్ సంఘం బాధ్యులు నూరైన్ను అభినందించి భవిష్యత్‌లో మరి న్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. -
వరదకాలువలో ఎల్లంపల్లి నీళ్లే
కథలాపూర్(వేములవాడ): ప్రస్తుతం వరదకాలువలో ప్రవహిస్తున్నవి ఎల్లంపల్లి ప్రాజెక్టు నీళ్లే అని, కాళేశ్వరం నుంచి వచ్చిన నీళ్లు కాదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం కథలాపూర్ మండలం దుంపేట శివారులో ఎస్సారెస్పీ వరదకాలువ నీటిలో పూజలు చేశారు. అనంతరం ఇందిరమ్మ మైనారిటీ మహిళ యోజన కింద మంజూరైన రూ.50 వేల చెక్కులను ఇద్దరికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ, వరదకాలువలో నీళ్లు వస్తుండటంపై కొందరు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. భవిష్యత్‌లో ఎన్డీఎస్ఏ సూచనలకు అనుగుణంగా కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగంలోకి తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, కాంగ్రెస్ జిల్లా ప్రధానకార్యదర్శి కాయితి నాగరాజు, పీసీసీ సభ్యుడు తొట్ల అంజయ్య, చెదలు సత్యనారాయణ, సర్పంచులు శేఖర్, రవి, రాజగంగారాం, నాయకులు ఎండీ హఫీజ్, అజీమ్, హరిప్రసాద్, రాజారెడ్డి, స్వామిరెడ్డి, అశోక్, నరేశ్, బాలు పాల్గొన్నారు. చెక్కులు పంపిణీ మేడిపల్లి: చిన్నారుల సంక్షేమమే సమాజ అభివృద్ధికి పునాది అని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మేడిపల్లి, భీమారం మండలాల్లో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. భీమారం మండలం రంగపూర్ వరద కాల్వ వద్ద గంగమ్మ తల్లికి పూజలు చేశారు. -
కేంద్రం విధానాలపై పోరాటం
ఇబ్రహీంపట్నం: కేంద్రం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి చెన్న విశ్వనాధం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 6 నుంచి 14 వరకు జరుగనున్న ప్రచారయాత్రలో భాగంగా శుక్రవారం ఇబ్రహీంపట్నం మండలకేంద్రం కొత్త బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ వరకు ప్రచారయాత్ర నిర్వహించారు. కేంద్రం విధానాలతో పెట్రోల్, డీజిల్, నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలకు భారంగా మారిందన్నారు. పెరిగిన ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. నాయకులు సుతారి రాములు, ఎండీ ఉస్మాన్, రాజన్న, వంశీ, రమేశ్, ఎన్నం రాధ, శాంతమ్మ, ఫిర్దోస్ పాల్గొన్నారు. -
గిట్టుబాటు లేని సర్వే
కోరుట్ల: 1930లో రూపొందించిన గ్రామాల టిఫ్పన్లు, కాస్రా నకలు కాపీలు కాలం చెల్లిపోవడంతో ఇటీవల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో భూవివాదాల సమస్యలు తీవ్రమవుతున్నాయి. దీనికి తోడు ఇదివరకు విలేజ్ మ్యాప్‌లు, భూముల హద్దుల నిర్ధారణ లేని గ్రామాల్లోనూ కొత్తగా మ్యాప్‌ల తయారీకి భూముల రీసర్వే చేసి భూధార్ నంబర్ల కేటాయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ పనులు జనవరిలో మొదలుపెట్టారు. ఈ పనుల కింద జిల్లాలో ప్రతీ మండలానికి 3 గ్రామాల చొప్పున మొత్తం 90 గ్రామాలు ఎంపిక చేశారు. వీటిలో 70 గ్రామాలు ఇదివరకు విలేజ్మ్యాప్ ఉన్నవే కాగా.. 20 గ్రామాల్లో కొత్తగా విలేజ్ మ్యాప్ రూపొందించాల్సి ఉంది. ఆయా గ్రామాల్లో ప్రస్తుతం రీసర్వే కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. సర్వే కోసం జిల్లాలోని 10 మంది ప్రభుత్వ సర్వేయర్లతో పాటు 196 మంది లైసెన్స్ సర్వేయర్లను నియమించారు. వీరు ఆరు నెలలుగా నిర్ధారించిన గ్రామాల్లో రీసర్వే పనులు కొనసాగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కొలతల కోసం 70 నుంచి 80 జీపీఎస్ సర్వే సిస్టమ్ మిషన్లు కావాల్సి ఉండగా కేవలం 30–40 మిషన్లు ఉండటంతో కొలతల నిర్ణయించడం ఇబ్బంది కలుగుతోంది. దీనికి తోడు మధ్య ఇతరత్రా సర్వేలు రావడం, రెగ్యులర్‌గా భూముల కొలతలకు వచ్చే దరఖాస్తులను పరిశీలించాల్సి రావడంతో రీ సర్వేలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఎకరాకు రూ.60 మాత్రమే జిల్లాలోని ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రభుత్వ సర్వేయర్లకు అనుసంధానంగా ఇటీవల ప్రభుత్వం నుంచి శిక్షణ పొందిన లైసెన్స్ సర్వేయర్లు జీపీఎస్ సిస్టమ్‌తో భూ హద్దుల కోసం రీసర్వే నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ భూములు, ఇళ్ల స్థలాలు, హద్దుల నిర్ణయానికి లైసెన్స్ సర్వేయర్లకు ఏలాంటి రుసుము చెల్లించడం లేదు. కేవలం పట్టా భూములకు మాత్రమే ఎకరాకు రూ.60 చొప్పున ఇస్తున్నారు. రోజూ ప్రభుత్వ సర్వేయర్‌తో కలిసి ఇద్దరు లైసెన్స్ సర్వేయర్లు ఎంపిక చేసిన గ్రామంలో 15 నుంచి 20 ఎకరాల మేర కొలతలు చేస్తున్నారు. దీంతో వారికి రోజుకు రూ.900 నుంచి రూ.1,200 వరకు గిట్టుబాటు అవుతున్నాయి. ఈ డబ్బులను ఇద్దరు లైసెన్స్ సర్వేయర్లు పంచుకోవాల్సి ఉండటంతో ఒక్కో సర్వేయర్‌కు రోజుకు రూ.500–600 మాత్రమే వస్తున్నాయి. ఈ డబ్బుల్లోనే కొలతలు చేయాల్సిన గ్రామాలకు వెళ్లాల్సిన ట్రావెల్ చార్జీలు సైతం ఉంటాయి. ట్రావెలింగ్ ఖర్చులు పోగా ఒక్కో సర్వేయర్‌కు కేవలం రూ.300– 400 మాత్రమే వస్తున్నాయి. ఈ లెక్కన ప్రతీ నెలా వారికి కేవలం రూ.10 వేల నుంచి 12వేలు మాత్రమే వేతనం వస్తున్నట్లు లెక్క. ఈ చిన్నపాటి వేతనానికి పొద్దంతా కష్టపడి రీసర్వే కార్యక్రమం ముగించడానికి అవస్థలు పడుతున్నారు. వేతనాలు తగు రీతిలో పెంచి కష్టానికి తగిన ప్రతిపలం ఇవ్వాలని లైసెన్స్ సర్వేయర్లు కోరుతున్నారు. ‘హోటల్లో పనిచేసే కార్మికుడికి రోజూ రూ.800 వరకు చెల్లిస్తున్నారు. వ్యవసాయ కార్మికుడికి ఎంత తక్కువ అనుకున్నా రోజుకు రూ.1,200– 1,500 వరకు గిట్టుబాటు అవుతున్నాయి. ఇదేమి చిత్రమో కానీ.. భూములు సర్వే చేయడానికి లైసెన్స్ పొంది నైపుణ్యం ఉన్న సర్వేయర్లకు మాత్రం సర్కార్ ఒక్క రోజుకు కేవలం రూ.400–600 మాత్రమే లెక్కకట్టి ఇవ్వడం విడ్డూరంగా తోస్తోంది’. -
నేడు వెలవెల
నాడు మిలమిల..పట్టణ సుందరీకరణలో భాగంగా రెండేళ్ల క్రితం పట్టణ ప్రగతి నిధుల నుంచి సుమారు రూ.30లక్షలు వెచ్చించి జయశంకర్ విగ్రహం నుంచి బస్ డిపో, కొత్త బస్టాండు మీదుగా యావర్‌రోడ్డు డివైడర్ల మధ్య.. కొత్త బస్టాండ్ నుంచి మంచినీళ్ల బావి వరకు సెంట్రల్ లైటింగ్ పోల్స్‌కు కలర్‌ఫుల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. మొదట్లో జిగేల్ మంటూ మెరిసిన లైట్లు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. బల్దియా అధికారులు లక్షలాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన లైట్లు రెండేళ్లకే వెలగకపోవడంతో ప్రజల సొమ్ము రోడ్ల పాలు అయిందంటూ పట్టణ వాసులు విమర్శిస్తున్నారు. – జగిత్యాలటౌన్ -
తొలగించిన ప్రతీ పేరును పరిశీలించాలి
జగిత్యాల: తొలగించిన ప్రతి పేరును బీఎల్వోలు పరిశీలించాలని, జిల్లాలో 89.50 శాతం ఓటర్ల డిజిటలైజేషన్ పూర్తియిందని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, బీఎల్వోలతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో మొత్తం 7,21,032 మంది ఓటర్లలో ఇప్పటి వరకు 6,45,737 మంది ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజ్ పూర్తయిందన్నారు. డిజిటలైజేషన్ ప్రక్రియలో 13,885 మంది మరణించిన ఓటర్లు, 47,142 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారినవారు, 2482 మంది గుర్తించలేని ఓటర్లు, 11,234 మంది ఇప్పటికే ఇతర ప్రాంతాల్లో నమోదైన ఓటర్లను గుర్తించినట్లు చెప్పారు. జిల్లాలో సుమారు 43 వేల మందికి ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించినా మ్యాపింగ్ లింక్ అందుబాటులో లేక వారికి నోటీసులు జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల సంఘం నిర్ధేశించిన 12 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదైనా ఒకటి సమర్పిస్తే వారి పేర్లను ఓటరు జాబితాలో చేర్చుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. ఈనెల 17న ముసాయిదా ఓటరు జాబితాను ప్రదర్శిస్తామని, సెప్టెంబర్ 16 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరించి, అక్టోబర్ 19 నాటికి ఓటరు జాబితా విడుదల చేస్తామన్నారు. అదనపు కలెక్టర్ లత తదితరులు పాల్గొన్నారు. ప్రత్యామ్నాయ పంటలు వేయండి జగిత్యాలఅగ్రికల్చర్: ఎల్‌నినో ప్రభావంతో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వర్షాలు తగ్గు ముఖం పట్టే అవకాశం ఉందని కలెక్టర్ సత్యప్రసాద్ ప్రకటనలో తెలిపారు. వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఎల్‌నినో తీవ్రమయ్యే అవకాశం ఉందని, రైతులు వరికి బదులు ప్రత్యామ్నయ పంటలు సాగు చేయాలని సూచించారు. జిల్లాలో మొత్తం 1010 చెరువులకు 268 చెరువులు మాత్రమే పూర్తిగా నిండినట్లు పేర్కొన్నారు. గతేదితో పోల్చితే జిల్లాలో భూగర్భజలాల నీటి మట్టం ఇప్పటికే సగటున 1.12 మీటర్లు తగ్గినట్లు తెలిపారు. ఎస్సారెస్పీ నుంచి తాగునీటి విడుదలకే అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. రైతులు వరికి బదులు తక్కువ నీటి అవసరం ఉన్న కందులు, పెసర, మినుములు, ఆముదం, జొన్న, సజ్జ, మొక్కజొన్న పంటలను వేయాలని సూచించారు. -
హామీలకే పరిమితం
జగిత్యాల: జిల్లాలోని 20 మండలాలు, ఐదు మున్సిపాలిటిలతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ తదితర జిల్లాలకు జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ప్రధాన కేంద్రంగా మారింది. జిల్లాలోని జాతీయ రహదారులపై ప్రమాదాలు జరిగితే క్షతగాత్రులను జగిత్యాల జనరల్ ఆస్పత్రికి తీసుకొస్తుంటారు. ఇక్కడ ట్రామాకేర్ యూనిట్ లేక ప్రథమ చికిత్స చేసి కరీంనగర్, హైదరాబాద్‌కు రిఫర్ చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో వారానికి 10–20 రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇక్కడి ఆస్పత్రిలో మౌలిక వసతులు లేక రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి సరైన చికిత్స అందడం లేదు. మొదటి గంట గోల్డెన్ అవర్ ట్రామా కేర్ యూనిట్ అందుబాటులో ఉంటే రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవారికి తక్షణమే చికిత్స అందిస్తే బతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయాన్ని గోల్డెన్ అవర్ అంటారు. ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణం వైద్య సాయం అందించాలని ప్రతీ ఆస్పత్రిలో ట్రామాకేర్ యూనిట్ ఏర్పాటు చేయాలని గతంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ, ఇప్పటి వరకు జిల్లాలోని ఏ ఆస్పత్రిలో ట్రామా కేర్ యూనిట్ ఏర్పాటు చేయలేదు. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని జగిత్యాల ఆస్పత్రిలో సెంటర్ ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. అమలుకు నోచుకోని ట్రామాకేర్ గత ప్రభుత్వ హయాంలో జిల్లా ప్రజాప్రతినిధులు ట్రామాకేర్ యూనిట్ ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో స్థలాన్ని సైతం పరిశీలించారు. కానీ, అమలుకు నోచుకోలేదు. సెంటర్ ఏర్పాటు చేస్తే ప్రత్యేక సిబ్బంది కావాల్సి ఉండటంతో ముందుకు రానట్లు తెలిసింది. ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా వైద్య వ్యవస్థపై సమావేశం జరిగింది. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మెడికల్ కళాశాల పనులతో పాటు, జనరల్ ఆస్పత్రిలో వెల్నెస్ సెంటర్, ట్రామా సెంటర్ ఏర్పాటు చేయాలని కోరగా, మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈసారైనా కార్యరూపం దాలుస్తుందని ప్రజలు భావిస్తున్నారు. -
రైలు రాకపాయె!
పదేళ్లు ఐపాయె..గోపాల్రావుపల్లి.. అనుపురం మధ్య ప్రారంభమైన రైల్వే వంతెన పనులుసాక్షిప్రతినిధి, కరీంనగర్ ●: ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులు హైదరాబాద్‌కు రైల్వే ద్వారా రాకపోకలు సాగించేందుకు కొత్తపల్లి– మనోహరాబాద్ రైల్వే ప్రాజెక్టు పనులు ప్రారంభించి 10 ఏళ్లు పూర్తయ్యాయి. 2016 ఆగస్టు 7న అప్పటి సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయించారు. హైదరాబాద్– మనోహరాబాద్– సిద్దిపేట– సిరిసిల్ల– వేములవాడల మీదుగా కరీంనగర్ చేరుకునేలా రూటు డిజైన్ చేశారు. భూసేకరణ, పరిహారం, బడ్జెట్ కేటాయింపుల్లో సమస్యలతో ప్రాజెక్టు రోజురోజుకు జాప్యమవుతోంది. రాజధాని హైదరాబాద్– పాత కరీంనగర్ జిల్లాకు కనెక్టివిటీ పెంచాలన్న ఉద్దేశంతో అప్పటి సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టుకు పెద్దపీట వేశారు. తొలి ఐదేళ్లు వచ్చే నష్టాలను భరించేందుకు కేంద్రాన్ని ఒప్పించి మరీ ప్రాజెక్టును పట్టాలెక్కించారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లా ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. 17 స్టేషన్లతో 151 కిలోమీటర్ల దూరం మేర విస్తరించిన ఈ ప్రాజెక్టుకు ఆరంభ వ్యయం రూ.1,167 కోట్లు కావడం గమనార్హం.కొత్తపల్లిలో 3 గుంటలు సేకరణకొత్తపల్లి రైల్వేస్టేషన్ వద్ద ఇటీవల ఓ ఆశ్చర్యమైన ఘటన చోటు చేసుకుంది. స్టేషన్ సమీపంలో నిర్మించిన సీసీ రోడ్డు కోసం రైల్వేకు అప్పగించేందుకు కరీంనగర్ రెవెన్యూ అధికారులు భూసేకరణ జరిపి భూమి అప్పగించారు. ఇటీవల తాము అప్పగించిన భూమి కన్నా మూడు గుంటల భూమి అధికంగా రైల్వే కోసం వినియోగించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో వారికి పరిహారం ఇవ్వాలని పాత ఆర్డీవో మహేశ్వర్ నిర్ణయించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఆ మూడు గుంటల భూమి కోసం నిబంధనల ప్రకారం.. ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చారు. త్వరలోనే మొత్తం 3 గుంటల భూమికి మార్కెట్ రేటు ప్రకారం.. పరిహారం చెల్లించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.పెరగనున్న కనెక్టివిటీఈ ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి జిల్లావాసులకు రాజధానితో కనెక్టివిటీ పెరగడంతోపాటు వేములవాడ, కొమురవెల్లి, కొండగట్టు, ధర్మపురి వంటి పుణ్యక్షేత్రాలకు రాజధాని నుంచి భక్తులు పెరుగుతారు. కొత్తపల్లి– మనోహరాబాద్ హైదరాబాద్ డివిజన్ పరిధిలోకి వస్తుంది. భవిష్యత్తులో ఉత్తరతెలంగాణలో హైదరాబాద్ సికింద్రాబాద్ డివిజన్లకు కీలకమైన రూట్‌గా మరింత ప్రాధాన్యం దక్కించుకోనుంది. సిరిసిల్ల, సిద్ధిపేట, జగిత్యాల జిల్లాలకు పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులను ఇటు హైదరాబాద్ అటు, మహరాష్ట్ర వైపు తరలింపు సులభతరంగా మారుతుంది. కొండగట్టు పరిసరాల్లోని రేర్ ఎర్త్ మెటల్స్ గనుల తవ్వకం మొదలై, ఎగుమతులనాటికి రైల్వే లైన్ అందుబాటులోకి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించాలి
జగిత్యాల: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ లత అన్నారు. శుక్రవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రతీ శాఖకు అప్పగించిన బాధ్యతలను పూర్తి చేయాలని, వేదిక, పతాకావిష్కరణ, పరేడ్, ముఖ్య అతిథి సందేశం అన్ని ఏర్పాట్లు చూసుకోవాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరవేసేలా చూడాలన్నారు. హెడ్‌కానిస్టేబుళ్లకు పదోన్నతిజగిత్యాలక్రైం: జిల్లాలో పనిచేస్తున్న నలుగురు హెడ్‌కానిస్టేబుళ్లకు ఏఎస్సైలుగా, ఓ కానిస్టేబుల్‌కు హెడ్‌కానిస్టేబుల్‌గా శుక్రవారం పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటెలిజెన్స్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వావిలాల గంగాధర్, ట్రాఫిక్‌లో పనిచేస్తున్న గణేశ్, కొడిమ్యాల పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న కనకయ్య, ఎస్బీలో పనిచేస్తున్న శంకర్‌కు హెడ్‌కానిస్టేబుల్ నుంచి ఏఎస్సైలుగా పదోన్నతి లభించింది. జగిత్యాల రూరల్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న జి.కిరణ్‌కుమార్ హెడ్‌కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందారు. పదోన్నతి పొందిన వారిని ఎస్పీ అశోక్‌కుమార్ అభినందించారు. ఎస్సారెస్పీలో 39.707 టీఎంసీలుజగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి మట్టం శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు 39.707 టీఎంసీలకు చేరుకుంది. ఎస్సారెస్పీ నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 8,334 క్యూసెక్కుల వరద మాత్రమే వస్తుండగా, 973 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తల్లిపాలే శిశువుకు వరంజగిత్యాల: తల్లిపాలే శిశువుకు వరమని మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి అన్నారు. శుక్రవారం పట్టణంలోని 42వ వార్డులో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల్లో పాల్గొన్నారు. పుట్టిన వెంటనే శిశువుకు తల్లిపాలు అందించాలన్నారు. తల్లి, శిశు సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. ఐసీడీఎస్ సీడీపీవో జయప్రద, మెడికల్ ఆఫీసర్ కృష్ణకుమారి, రాజశ్రీ, మమత, వాణి, జయశ్రీ, పద్మ పాల్గొన్నారు. చెత్తను విభజించి ఇవ్వాలి ప్రతి ఇంటి నుంచి చెత్తను నాలుగు రకాలుగా విభజించి ఇవ్వాలని మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి అన్నారు. శుక్రవారం మహిళ సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడంలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. కౌన్సి లర్లు, మహిళసంఘాల సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో తేలికపాటి వర్షాలుజగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో రాబోయే ఐదు రోజుల్లో అతితేలిక పాటి నుంచి తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పొలాస వ్యవసాయ స్థానం వాతావరణ శాస్త్రవేత్త బి.శ్రీలక్ష్మి తెలిపారు. ఈనెల 8న జిల్లాలో అక్కడక్కడ బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, 9న గంటకు 14–18 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 31–32, రాత్రి ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతాయని, గాలిలో తేమ ఉదయం 85–8 శాతం, మధ్యాహ్నం 54–4 శాతం మధ్య ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. -
తెలంగాణ స్ఫూర్తి ప్రదాత జయశంకర్
● ఎస్పీ అశోక్‌కుమార్ జగిత్యాలక్రైం: తెలంగాణ భావజాల వ్యాప్తికి తన జీవితాన్ని అంకితం చేసిన స్ఫూర్తి ప్రదాత జయశంకర్ అని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయాలను కొనసాగించడమే మనం ఇచ్చే నివాళి అన్నారు. అడిషనల్ ఎస్పీ చేతన్ నితిన్, డీఎస్పీ పురుషోత్తంరెడ్డి, ఏవో శశికళ, సిబ్బంది పాల్గొన్నారు. తల్లిపాలతో రోగనిరోధక శక్తి ● జిల్లా సంక్షేమాధికారి భాస్కర్ మల్యాల: తల్లిపాలతో పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుందని, పుట్టినప్పుడే పిల్లలకు ముర్రుపాలు తాగించాలని జిల్లా సంక్షేమాధికారి భాస్కర్ అన్నారు. మల్యాల మండలకేంద్రంతోపాటు మద్దుట్ల గ్రామంలో గురువారం తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం, అన్నప్రాసన చేశారు. భాస్కర్ మాట్లాడుతూ.. తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు. సర్పంచులు బొట్ల జయ ప్రసాద్, సంకూర్తి తిరుపతి, సీడీపీవో వీరలక్ష్మీ, బాలింతలు, గర్భిణులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 38.799 టీఎంసీలకు ఎస్సారెస్పీ నీటిమట్టంజగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం గురువారం సాయంత్రం 6 గంటల వరకు 38.799 టీఎంసీలకు చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 14,446 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలకు 38.799 టీఎంసీలకు చేరిందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు నుండి 974 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. రౌడీషీటర్లపై నిఘా పెంచాలి జగిత్యాలక్రైం: శాంతిభద్రతల పరిరక్షణ కోసం రౌడీషీటర్లు, హిస్టరీషీట్లలో ఉన్న వారిపై నిఘా పెంచాలని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో రౌడీ, హిస్టరీ, సస్పెక్ట్ షీట్ల నిర్వహణ, తరచూ నేరాలకు పాల్పడే వ్యక్తులపై తీసుకునే చర్యలపై పోలీసు అధికారులతో గురువారం సమీక్షించారు. అవసరమైన సందర్బాల్లో బైండోవర్ చేయాలన్నారు. అనుమానాస్పద అల్లర్లలో ప్రమేయమున్న వారిని ప్రతినెలా పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి వివరాలు తీసుకోవాలన్నారు. డీఎస్పీలు పురుషోత్తం రెడ్డి, రాములు, రవికుమార్, సీఐలు సుధాకర్, కరుణాకర్, రాం నర్సింహారెడ్డి, రాజ్‌కుమార్, సురేష్‌బాబు, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు అల్లీపూర్ విద్యార్థులురాయికల్: మండలంలోని అల్లీపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన బట్టు అనన్య, ఆర్.రాహుల్, శిరీష రాష్ట్రస్ధాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై నట్లు ఫిజికల్ డైరెక్టర్ కృష్ణప్రసాద్ తెలిపారు. హన్మకొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని పేర్కొన్నారు. విద్యార్థులను హెచ్ఎం పోరండ్ల కిరణ్, సర్పంచ్ ఎంబారీ గౌతమి, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు. -
జయశంకర్ ఆలోచన.. కేసీఆర్ ఉద్యమంతోనే రాష్ట్ర సాధన
జగిత్యాలటౌన్: జయశంకర్ ఆలోచన, కేసీఆర్ ఉద్యమంతోనే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కల సాకారమైందని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. జయశంకర్ జయంతి సందర్భంగా జిల్లాకేంద్రంలోని కరీంనగర్ రోడ్డులోగల ఆయన విగ్రహానికి నివాళి అర్పించారు. జయశంకర్ ఆలోచనలే తెలంగాణ ఉద్యమానికి పునాదులు వేశాయన్నారు. బీఆర్ఎస్ నాయకులు అయిల్నేని వెంకటేశ్వర్రావు, వొల్లం మల్లేశం, కోరుకంటి రాము, తోట హరీష్, గాజుల రాజేందర్, దుర్గయ్య, రమేశ్ రావు, విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు తొగిటి గంగాధర్, ఇల్లెందుల పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. ముందుగా సామాజిక సమరసత జిల్లా అధ్యక్షుడు చిట్ల గంగాధర్ తదితరులు జయశంకర్‌కు నివాళి అర్పించారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత -
పనులు నాణ్యతతో పూర్తిచేయాలి
జగిత్యాల: జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులను పూర్తి చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. గురువారం అధికారులతో సమావేశమయ్యారు. గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, కిచెన్ షెడ్లు, మరుగుదొడ్లు, పాఠశాల భవనాలు పూర్తి చేయాలని ఆదేశించారు. ఓపెన్ స్కూల్ సువర్ణావకాశం పాఠశాల స్థాయిలో చదువుకు దూరమై.. చదువుకోవాలని ఉన్న యువతకు ఓపెన్‌స్కూల్ మంచి అవకాశమని కలెక్టర్ అన్నారు. ఓపెన్ స్కూల్ సొసైటీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరపత్రాన్ని ఆవిష్కరించారు. డీఈవో రాము, ఓపెన్ స్కూల్ సొసైటీ ఉమ్మడి జిల్లా కో–ఆర్డినేటర్ రామడుగు రవీందర్, నక్క రాజు, రవీందర్ పాల్గొన్నారు. టెట్ మెటీరియల్ వినియోగించుకోవాలి టెట్ మెటీరియల్ వినియోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు. స్టేట్ టీచర్స్ యూనియన్ రూపొందించిన టెట్ స్టడీ మెటీరియల్ ఆవిష్కరించారు. 2028 ఆగస్టు 31 లోపు ఉపాధ్యాయులు టెట్ పాస్ అవ్వడం తప్పనిసరి అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మెటీరియల్ రూపొందించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బైరం హరికిరణ్, శివ రామకృష్ణ, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి మచ్చ శంకర్, ఉపాధ్యక్షుడు రవీందర్, జిల్లా సైన్స్ అధికారి రాజశేఖర్ ఉన్నారు. ప్లాస్లిట్ వ్యర్థాల యూనిట్ పనులు పరిశీలన మల్యాల: ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణతో పర్యావరణ పరిరక్షణ మెరుగుపడుతుందని కలెక్టర్ అన్నారు. మల్యాలలో మల్యాల, కొడిమ్యాల, పెగడపల్లి మండలాలకు సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్‌ను గురువారం పరిశీలించారు. యూనిట్ ఏర్పాటుకు అవసరమైన యంత్రాలను కొనుగోలు చేయాలని, పనులు నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు. బేలింగ్ యంత్రం, ష్రెడర్ యంత్రం, లిఫ్టింగ్ కార్ట్, వేయింగ్ యంత్రాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వివరించారు. గ్రామాల్లో ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ, వర్గీకరణ, రీసైక్లింగ్ సమర్థవంతంగా నిర్వహించడం సాధ్యమన్నారు. ఎంపీడీవో స్వాతి, తహసీల్దార్ శ్రీనివాస్, సర్పంచులు బొట్ల జయప్రసాద్, బల్మూరి పాపారావు, పీఆర్ అధికారులు, ఆర్ఐ తిరుపతి, రాణి, నాయకులు పాల్గొన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ -
జేఎన్టీయూలో ముగిసిన ఏఐ శిక్షణ
కొడిమ్యాల: మండలంలోని జేఎన్టీయూ (నాచుపల్లి)లో టాస్క్, ఐబీఎం, ఎడ్నెట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీటెక్ మూడో సంవత్సరం ఈసీఈ, సీఎస్ఈ, ఐటీ విద్యార్థులకు నిర్వహించిన మూడు రోజుల ఏఐ క్వాంటమ్ కంప్యూటింగ్ శిక్షణ ముగిసింది. శిక్షణలో ఐబీఎమ్, ఎడునెట్ మాస్టర్ ట్రైనర్ పి.అజయ్ రెడ్డి ఏఐ మోడలింగ్, ఐబీఎం బీవోబీ టూల్, రాగ్ ఆధారిత సాంకేతికతపై వివరించారు. విద్యార్థులు క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రాజెక్టులను ప్రదర్శించారు. కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు అందించారు. ప్రిన్సిపాల్ నరసింహ మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతికరంగాల్లో నైపుణ్యాలు విద్యార్థుల ఉపాధి అవకాశాలను పెంచుతాయని తెలిపారు. టీపీవో సతీష్ కుమార్ మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈవీ సాంకేతికతపై శిక్షణజేఎన్టీయూలో ఈఈఈ విభాగం ఆధ్వర్యంలో మ్యాథ్‌వర్క్స్ ఇండియా, ఆర్కాస్ ఇన్ ఇండియా సంస్థల సహకారంతో మ్యాథ్ల్యాబ్, సిమ్యులింక్ ఆధారిత విద్యుత్ వాహన సాంకేతికతపై రెండురోజుల శిక్షణ శిబిరం గురువారం ప్రారంభమైంది. థర్డ్, ఫోర్తియర్ బీటెక్ విద్యార్థులకు నిర్వహిస్తున్న ఈ శిక్షణను కళాశాల ప్రిన్సిపాల్ ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఈఈఈ విభాగాధిపతి సి.రాధాచరణ్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. జీవో 1,181 ఉపసంహరించుకోండి జగిత్యాలటౌన్: మున్సిపాలిటీల్లో ఔట్సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు, డ్రైవర్లు, వర్క్ ఇన్స్పెక్టర్ల వేతనాలను తగ్గిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 1181ని ఉపసంహరించుకోవాలని మాజీమంత్రి జీవన్‌రెడ్డి కోరారు. ఈమేరకు గురువారం సీఎంకు లేఖ రాశారు. ఇప్పటికే చాలీచాలని వేతనాలతో జీవితం నెట్టుకొస్తున్నారని తెలిపారు. మార్కెట్ ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఆక్రమించి.. సాగుచేసి
మెట్‌పల్లిరూరల్: జిల్లాలోని ప్రభుత్వ భూములు యథేచ్ఛగా ఆక్రమణలకు గురవుతున్నాయి. రెవెన్యూ, అటవీ, ఎస్సారెస్పీ భూములను అడ్డుఅదుపులేకుండా ఆక్రమించి అందులో పంటలు సాగు చేసుకుంటున్నారు. ఆయా స్థలాలకు హద్దులు లేకపోవడంతో ఆగడాలకు అంతులేకుండా పోతోంది. వందలాది ఎకరాల అన్యాక్రాంతమవుతున్నా కాపాడే వారు లేకపోవడం ఆక్రమణదారులకు కలిసి వస్తోంది. భూ ఆక్రమణలపై ఏదైనా ఫిర్యాదు వస్తే ఆ సమయంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకుంటున్న అధికారులు విచారణకే పరిమితమవుతున్నారు. విచారణలో ఆక్రమణలకు పాల్పడిన వారి వివరాలు తెలిసినప్పటికీ.. వారిపై ఎలాంటి చర్యలకూ ఉపక్రమించడంలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు.. విచారణకే పరిమితం.. మెట్పల్లి మండలం మెట్లచిట్టాపూర్, రంగారావుపేట, ఆత్మకూర్, తదితర గ్రామాల్లో ప్రభుత్వ భూముల ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. వీటిపై అదేస్థాయిలో అధికారులకు ఫిర్యాదులు కూడా వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో అధికారులు విచారణ చేస్తున్నారు. కానీ బహిర్గతమైన విషయాలపై దృష్టి సారించడంలేదు. వెరసి ఆక్రమణదారులు రెచ్చిపోవడం.. ప్రభుత్వ భూములు కనుమరుగైపోవడం పరిపాటిగా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెట్పల్లి మండలం మెట్లచిట్టాపూర్ శివారులో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైనట్లు గ్రామస్తులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దాదాపు 50 ఎకరాల వరకు భూమి కబ్జాకు గురైనట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారం ఈ ఒక్క గ్రామంలోనే కాదు.. దాదాపు జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురైనట్లు అధికారులకు వరుస ఫిర్యాదులు వస్తుండడం గమనార్హం. ప్రభుత్వ భూములపై అక్రమార్కుల కన్ను హద్దులు లేకపోవడంతో అడ్డూఅదుపులేకుండా కబ్జా ఆక్రమణల్లో రెవెన్యూ, అటవీ, ఎస్సారెస్పీ భూములు -
కోత పెట్టొద్దు.. పొట్ట కొట్టొద్దు
● ఔట్సోర్సింగ్ సిబ్బంది జీతాల్లో కోత ● ఆందోళనలో ఉద్యోగులుజగిత్యాల: జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న డ్రైవర్, కంప్యూటర్ ఆపరేటర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్ల వేతనాలు తగ్గిస్తూ జారీ అయిన 69జీవోపై సిబ్బందిలో ఆందోళన మొదలైంది. ఇప్పటికే వేతనాలు తగ్గించినట్లు ఐఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో నమోదు చేయడంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి, రాయికల్ మున్సిపాలిటీల్లో కంప్యూటర్ ఆపరేటర్లు 15 మంది, వర్క్ ఇన్స్పెక్టర్లు 18 మంది, డ్రైవర్లు 78 మంది పనిచేస్తున్నారు. కంప్యూటర్ ఆపరేటర్లకు రూ.23,750 వేతనం ఇవ్వగా.. రూ.4250 తగ్గించి రూ.19,500, వర్క్ ఇన్స్పెక్టర్లకు రూ.23,750 ఉండగా.. రూ.7,150 తగ్గించి రూ.16,600, శానిటరీ ఇన్స్పెక్టర్లకు రూ.23,750 ఉండగా, రూ.7,150 తగ్గించి రూ.16,600, డ్రైవర్లకు రూ.19,500 ఉండగా రూ.2900 కోత పెట్టి రూ.16,600 చేశారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమకు వేతనాలు తగ్గించడం ద్వారా కుటుంబంపై పెను ప్రభావం పడుతుందంటున్నారు. మున్సిపాలిటీల్లో డ్రైవర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, వర్క్ ఇన్స్పెక్టర్ల సేవలు చాలా అవసరం. ఏళ్ల తరబడి పనిచేస్తున్న వీరికి వేతనాలు పెంచాల్సింది పోయి తగ్గించడంపై విమర్శలు వస్తున్నాయి. స్పెషల్ ఆఫీసర్‌కు వినతి వేతనాల తగ్గించడం ద్వారా తమ కుటుంబాలపై ఆర్థిక ప్రభావం పడుతోందని, తమను ఆదుకోవాలని కోరుతూ జిల్లా స్పెషల్ ఆఫీసర్, అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్, మున్సిపల్ కమిషనర్ సత్యప్రణవ్‌కు ఔట్ సోర్సింగ్ సిబ్బంది వినతిపత్రం అందించారు. విద్యుత్ పునరుద్ధరణజగిత్యాలరూరల్: సారంగాపూర్ మండలం బట్టపల్లిలో వారం క్రితం ఈదురుగాలులు, వర్షాలకు విద్యుత్ స్తంభాలు విరిగి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నాట్లు వేసిన పొలాలు ఎండిపోతుండటంతో ‘కరెంట్ లేక ఎండుతున్న పొలాలు’ శీర్షికన ‘సాక్షి’ బుధవారం కథనం ప్రచురించింది. స్పందించిన ట్రాన్స్‌కో ఏఈ శ్రీనివాస్ సిబ్బందితో విద్యుత్ స్తంభాలు వేసి కరెంట్ పునరుద్ధరించారు. -
ఎవరూ ఖాళీగా ఉండొద్దు
జిల్లాలో నిరుద్యోగ సమస్య చాలా ఉంది. ఉద్యోగాలు కావాలని ప్రజావాణికి వస్తున్నారు. ప్రభుత్వ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కావాలని ఆశిస్తున్నారు. కానీ ప్రభుత్వ పథకాలను వినియోగించుకుని స్వయం ఉపాధి సాధించాలి. ఆ దిశగా యువకుల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని ప్రణాళిక సిద్ధం చేశాం. యువకులు ఎవరూ ఖాళీగా ఉండొద్దు. వారి కోసమే జాబ్‌మేళాలు నిర్వహిస్తూ.. ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పిస్తున్నాం. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఉద్యోగావకాశాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తున్నాం. – నిర్మల, జిల్లా ఉపాధి కల్పన అధికారి -
ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలి
కొడిమ్యాల: విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా.. స్వయంగా స్టార్టప్ కంపెనీలు పెట్టే స్థాయికి చేరుకోవాలని జేఎన్టీయూ (హైదరాబాద్) వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కిషన్‌కుమార్ రెడ్డి అన్నారు. మండలంలోని జేఎన్టీయూ (నాచుపల్లి)లో బీటెక్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు 20వ ఓరియంటేషన్ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన కిషన్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల విద్యాప్రస్థానం ఇంటర్ తర్వాత నుంచే ప్రారంభమవుతుందని, ఎలాంటి సంకోచం లేకుండా ప్రశ్నలు అడిగి కొత్త విషయాలు నేర్చుకునే అలవాటు పెంచుకోవాలని సూచించారు. భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, గణితం, ఆంగ్ల భాషలో బలమైన పునాది అవసరమని, ఆంగ్ల భాషపై పట్టు సాధించాలని సూచించారు. పాఠ్య, సహపాఠ్య, పాఠ్యేతర కార్యక్రమాలు, ఏఎస్ఎస్ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనాలని వివరించారు. మత్తుపదార్థాలకు దూరంగా ఉంటూ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేలా కృషి చేయాలని సూచించారు. జేఎన్టీయూ(హెచ్) విద్యార్థులు స్థాపించిన 70 స్టార్టప్‌లలో 40నుంచి 50 శాతం గ్రామీణ ప్రాంతాల విద్యార్థులవేనని తెలిపారు. థర్డియర్, ఫోర్త్ఇయర్ విద్యార్థులు రెండు నెలల విరామాన్ని ఇంటర్న్‌షిప్, పరిశోధన, ప్రాజెక్టు పనులకు వినియోగించుకోవాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ నరసింహ మాట్లాడుతూ.. జేఎన్టీయూ(హెచ్) పరిధిలోని అన్ని కళాశాలల్లో ఒకే సిలబస్, ఒకే మూల్యాంకన విధానం అమలులో ఉందని, ప్లేస్మెంట్ డ్రైవ్‌లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వైస్‌చాన్సలర్ చొరవతో ఈ ఏడాది కళాశాలకు 400 కంప్యూటర్లు వచ్చాయన్నారు. విద్యార్థులు గ్రంథాలయం, ప్రయోగశాలలు, ప్లేస్మెంట్ శిక్షణ, ప్రాజెక్టు పనులను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. ఏఐ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ కళాశాలకు స్వయం ప్రతిపత్తి హోదా, న్యాక్గుర్తింపు, ఏ బీఏ అక్రిడిటేషన్ సాధించడం గర్వకారణమన్నారు. మొబైల్ ఫోన్ల దుర్వినియోగానికి దూరంగా ఉండి సృజనాత్మకతను పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. సీఆర్సీ చైర్మన్ సురేష్ శ్రీపాద ఓరియంటేషన్ ఉద్దేశాన్ని వివరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. -
అనుమతిలేని పనులు
మెట్పల్లి: మెట్పల్లి మున్సిపాలిటీలో ప్రధానమైన పెద్ద చెరువును సుందరీకరించడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రత్యేక నిధులు మంజూరయ్యాయి. ఆ నిధులతో ఎనిమిది మీటర్ల వెడల్పు, సుమారు రెండు కిలోమీటర్ల మేర వాకింగ్ ట్రాక్‌కు అనుకూలంగా ఉండేలా కట్టను నిర్మించారు. నీటి ప్రవాహానికి కట్ట కోతకు గురి కాకుండా ఇరువైపులా రాళ్లతెట్ట ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అక్కడ మరికొన్ని పనుల కోసం కేంద్రప్రభుత్వ అమృత్ 2.0 పథకం కింద సుమారు రూ.3కోట్లు కేటాయించింది. జంగిల్ క్లియరెన్స్, కట్ట నిర్మాణం, లైటింగ్, యోగాకేంద్రం వంటి పనులు చేపట్టాల్సి ఉంది. ఎన్ఓసీ పొందకుండానే.. కట్టకు గండితో మత్స్యకారులకు నష్టం అటు నోటీసు..ఇటు పోలీసులకు ఫిర్యాదు అమృత్ నిధులతో పెద్ద చెరువు సుందరీకరణకు శ్రీకారం జల వనరుల శాఖ అనుమతి లేకుండానే పనుల కొనసాగింపు నిబంధనలు పట్టించుకోని పబ్లిక్ హెల్త్ శాఖ అధికారులు మత్తడి తొలగించి కట్ట ఏర్పాటుపై విమర్శలు చెరువుకు గండి కొట్టడంపై పోలీసులకు ఫిర్యాదు మౌఖిక అనుమతితో పనులు చెరువు వద్ద కట్ట నిర్మాణానికి జల వనరుల శాఖ అధికారులు ఎనోవోసీ ఇవ్వడం కుదరదన్నారు. వారు మౌఖికంగా ఇచ్చిన అనుమతితో పనులు మొదలుపెట్టాం. వచ్చిన నిధులు లాప్స్ అయ్యే అవకాశం ఉండడంతో గత్యంతరం లేక పనులు ప్రారంభించాం. మత్తడి స్థానంలో ఏర్పాటు చేసిన కట్టను తొలగిస్తాం. అక్కడ తిరిగి మత్తడి నిర్మిస్తాం. – నాగేశ్వర్రావు, మున్సిపల్ డీఈ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం మత్తడి స్థానంలో ఏర్పాటు చేసిన కట్టకు గండి కొట్టిన విషయమై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. గండి కొట్టడం ద్వారా మత్స్యకారులకు నష్టం జరిగింది. విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాం. – అనురాగ్, ఏఈ, జలవనరుల శాఖ -
కోరుట్లలో సైబర్ జాగృతి దివస్
● అప్రమత్తత కీలకం ● ఎస్పీ అశోక్‌కుమార్ కోరుట్ల: సైబర్ నేరాలపై అప్రమత్తత కీలకమని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. కోరుట్లలో బుధవారం నిర్వహించిన సైబర్ జాగృతి దివస్‌లో సదస్సులో పాల్గొన్నారు. స్మార్ట్‌ఫోన్ రాకతో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని, గుర్తు తెలియని యాప్‌లు వినియోగిస్తే మోసపోయే ఆస్కారం ఉందన్నారు. సీబీఐ, ఇన్‌కంటాక్స్, పోలీస్‌ల పేరిట మోసాలు జరుగుతున్నాయని, ఆయా శాఖల అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్లు, వీడియో కాల్స్‌తో సంప్రదింపులు చేయబోరని తెలిపారు. కష్టపడకుండా డబ్బులు రావని, ఆన్లైన్ గేమ్‌లతో ఇబ్బందులు తప్పవన్నారు. అందమైన అమ్మాయిలు పేరిట మేసేజ్‌లు వచ్చే అవకాశం ఉందన్నారు. రైతులు యూరియా సబ్సిడీ పేరిట జరిగే మోసాలపై జాగ్రత్తగా ఉండాలన్నారు. సైబర్ మోసాలకు గురైన వారు వెంటనే ఫిర్యాదు చేయాలని, ఆలస్యం చేస్తే డబ్బుల రికవరీ కష్టతరంగా మారుతుందని, వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలన్నారు. అడిషనల్ ఎస్పీ నితిన్చేతన్, మెట్పల్లి డీఎస్పీ రాములు, కోరుట్ల సీఐ లక్ష్మణ్‌కుమార్, ఎస్సైలు పాల్గొన్నారు. ముందస్తు నిర్ధారణతో క్షయ నివారణ రాయికల్: ముందస్తు నిర్ధారణ పరీక్షలతో క్షయవ్యాధి నివారణ సాధ్యమని డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ అన్నారు. మండలంలోని అల్లీపూర్ ఆరోగ్య కేంద్రంలో బుధవారం డిజిటల్ మొబైల్ ఎక్స్‌రే మిషన్ ద్వారా క్షయ నిర్ధారణ శిబిరం నిర్వహించారు. దగ్గు, జ్వరం, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలుంటే వెంటనే తెమడ పరీక్షలు చేయించుకోవాలన్నారు. నూతన ఎక్స్‌రే మిషన్‌తో గ్రామీణ ప్రాంతాల్లోనూ వెంటనే వ్యాధి నిర్ధారణ చేస్తున్నట్లు తెలిపారు. శిబిరంలో 45 మందికి పరీక్షలు చేశారు. సర్పంచ్ ఎంబారి గౌతమి, వైద్యాధికారి సతీష్ కుమార్, ఎంఎల్‌హెచ్‌పీ సుప్రియ, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిష్కరించాలి
● అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్ కొడిమ్యాల: ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి.రాజాగౌడ్ అన్నారు. మండలంలోని పూడూరులో వచ్చిన దరఖాస్తుల పరిశీలించారు. నిబంధనల మేరకు దరఖాస్తులను పరిష్కరించాలని, ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా చూడాలని, అవసరమైన సమాచారాన్ని చేరవేయాలని అధికారులను ఆదేశించారు. ఎంపీడీవో భగవాన్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్ భూమిని స్వాధీనం చేసుకోండిజగిత్యాలటౌన్: యాజమాన్య హక్కులు లేకున్నా.. కిబాలా పేరుతో పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ఔట్లెట్ కోసం కేటాయించినట్లు చెబుతూ ఇతర వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న జిల్లాకేంద్రంలో రూ.కోట్లు విలువ చేసే మున్సిపల్ భూమిని స్వాధీనం చేసుకోవాలని మాజీమంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులకు బుధవారం ఫిర్యాదు చేశారు. 1960కి ముందు దారం వీరమల్లయ్యకు పట్టణంలోని సర్వే నంబర్ 138లోని 20గుంటల భూమిని కేటాయించినట్లు చెబుతున్నా.. నాలుగు గుంటల్లోనే పెట్రోల్, డీజిల్ విక్రయిస్తూ.. మిగతా 16గుంటలను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారని తెలిపారు. వీరమల్లయ్యకు ఎలాంటి యాజమాన్య హక్కులు లేకున్నా ఆయన వారసులమని చెప్పి 16గుంటలు విక్రయించారని తెలిపారు. ఆక్రమణదారులపై మున్సిపల్ అధికారులు కోర్టును ఆశ్రయించగా.. యాజమాన్య హక్కులు లేకున్నా నివాసం ఉంటున్నట్లు కోర్టును నమ్మించారని తెలిపారు. ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తల్లిపాలే బిడ్డకు తొలి టీకా పెగడపల్లి: తల్లిపాలు బిడ్డకు తొలి టీకా వంటివని వైద్య ఆరోగ్యశాఖ ఇమ్యూనైజేషన్ అధికారి నరేంద్ర అన్నారు. మండలంలోని ఆరవెల్లి అంగన్వాడీ కేంద్రంలో బుధవారం నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల్లో పాల్గొన్నారు. బిడ్డ పుట్టిన వెంటనే తల్లి ముర్రుపాలు పట్టాలని, ఆ పాలు నవజాత శిశువుకు సహజ రక్షణ కవచంలా పని చేస్తాయని తెలిపారు. బిడ్డకు అవసరమైన పోషకాలు అందులో పుష్కలంగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఉప్పులంచె భవాని, ఐసీడీఎస్ సూపర్వైజర్ మహేశ్వరి, అంగన్వాడి టీచర్లు సత్య, శంకరమ్మ, తల్లులు, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు. అనంతరం నరేంద్ర ఆరోగ్య కేంద్రంలో రికార్డులు పరిశీలించారు. వైద్యాధికారి నరేశ్, సీహెచ్‌వో సందీప్, సూపర్వైజర్లు శ్రీని వాస్, జగదీశ్, జ్యోతి, సిబ్బంది పాల్గొన్నారు. ఐటీఐలో ప్రవేశాలకు నోటిఫికేషన్ జగిత్యాల: ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో ద్వితీయ దశ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైందని ఐటీఐ ఏటీసీ సెంటర్ ప్రిన్సిపల్ గంట్యాల రవీందర్ తెలిపారు. కొత్తగా దరఖాస్తులు చేసుకునే వారు వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలని, మొదటి దశ దరఖాస్తు చేసుకుని సీటు పొందనివారు తిరిగి నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. వారు వాకిన్ ప్రవేశాలకు హాజరు కావచ్చని తెలిపారు. ఆన్లైన్లోనే దరఖాస్తు తప్పనిసరి అని, వెబ్సైట్లో ఖాళీ సీట్ల వివరాలు అందుబాటులో ఉంచామని, తమకు నచ్చిన ట్రేడ్, కళాశాలలో ఖాళీ ఉంటే ప్రవేశం పొందవచ్చని పేర్కొన్నారు. ఈనెల15 వరకు పొందిన ప్రవేశం తుది ఫైనల్ అని, తర్వాత రెండో అవకాశం, మార్పు ఉండదని తెలిపారు. వెబ్సైట్లో దరఖాస్తు చేసుకుని ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో ధరూర్ క్యాంప్‌లోని ప్రభుత్వ ఐటీఐలో హాజరు కావాలని సూచించారు. -
ఈనెల 11 వరకు ‘దోస్త్’కు దరఖాస్తులు
జగిత్యాల: ఎస్కేఎన్ఆర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిగ్రీ అడ్మిషన్లకు ఈనెల 11 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రిన్సిపల్ ఇందిరాదేవి తెలిపారు. 12వరకు వెబ్ఆప్షన్ల ద్వారా కళాశాలలు, కోర్సులు ఎంపిక చేసుకోవచ్చని, 14న సీట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలన్నారు. సీట్ల కేటాయింపు ఈనెల 22న ఉంటుందని, బీఎస్సీ ఫిజికల్ సైన్స్, బీఎస్సీ లైఫ్ సైన్స్, బీకాం కంప్యూటర్స్ అప్లికేషన్స్, బీఏ ఇంగ్లిష్ మీడియం, బీఏ తెలుగు మీడియం కోర్సులు అందుబాటులో ఉన్నాయని వైస్ ప్రిన్సిపల్ ఆడెపు శ్రీనివాస్, దోస్త్ కో–ఆర్డినేటర్ సాయిమధుకర్, రాజు, గోవర్దన్, శ్రీనివాస్ తెలిపారు. నిబంధనల మేరకు నిర్ణయంజగిత్యాల: ఎన్‌హెచ్–563 విస్తరణలో భూములు కోల్పోతున్న రైతులకు సంబంధించి నిబంధనల మేరకు నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. రైతులతో బుధవారం సమావేశమయ్యారు. బాధితుల పరి హారానికి సంబంధించి 189 కేసులపై విచారణ చేపట్టామన్నారు. భూ యజమానుల తరఫున న్యాయవాదులు వాదనలు విన్పించారని తెలిపారు. ఆర్డీవోలు మధుసూదన్, జివాకర్‌రెడ్డి, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ హారిణి, సూపరింటెండెంట్ ఉదయ్‌కుమార్ పాల్గొన్నారు. చికిత్స పొందుతూ యువకుడి మృతిఇబ్రహీంపట్నం: మండలంలోని వర్షకొండలో గతనెల 30న స్కూల్ వ్యాన్ ఢీకొని గాయపడిన సల్వల రాజేశ్ (28) చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. వర్షకొండ గ్రామానికి చెందిన రాజేశ్ తన ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. మెట్‌పల్లికి చెందిన ఓ ప్రైవేటు పాఠశాల వ్యాన్ పిల్లలను దింపి వస్తోంది. మూలమలుపు వద్ద ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో రాజేశ్ తలకు తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే అతడిని నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. రాజేశ్ 25రోజుల క్రితమే సౌదీ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. అతడి తల్లి నర్సు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గణేశ్‌పల్లికి చెందిన వ్యక్తి..జగిత్యాలరూరల్: సారంగాపూర్ మండలం గణేశ్‌పల్లి పోతారం గ్రామానికి చెందిన యాకసిరి సుబ్రహ్మణ్యం (29) అప్పుల బాధతో ఈనెల 3న పురుగుల మందు తాగాడు. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. మృతుడి కళ్లను కుటుంబ సభ్యులు ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి దానం చేశారు. మృతుడి భార్య గంగజల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై గీత తెలిపారు. కార్యక్రమంలో ఎల్వీప్రసాద్ కంటి ఆస్పత్రి టెక్నీషియన్ ప్రవీణ్, ఎస్సై గీత, ఫోరెన్సిక్ డాక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఐటీఐ విద్యార్థి ..మల్యాల:ప్రమాదవశాత్తు నోట్లోకి గడ్డిమందు వెళ్లి ఐటీఐ విద్యార్థి మృతి చెందినట్లు ఎస్సై ఎస్.సందీప్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని గొర్రెగుండం గ్రామానికి చెందిన ఎడ్ల లచ్చయ్య, మమత కుమారుడు మనోహర్(18) ఐటీఐ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గత నెల 12న పొలంలో గడ్డిమందు పిచికారి చేసే సమయంలో నోట్లోకి వెళ్లడంతో తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. వెంటనే జగిత్యాల అక్కడి నుంచి నిమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మద్యానికి బానిసై..మల్యాల: నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీకి చెందిన మతిన్ (39) మద్యానికి బానిసై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎస్సై సందీప్ కథనం ప్రకారం.. నూకపల్లి డబుల్ బెడ్ రూం కాలనీలో నివాసం ఉంటున్న మతిన్ భార్య హీనతబుస్సం కుటుంబ కలహాలతో పుట్టింటికి వెళ్లి అక్కడే నివసిస్తోంది. మతిన్ మానసికంగా కుంగిపోయి, మద్యానికి బానిసయ్యాడు. బుధవారం తన ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. మతిన్ తల్లి కమర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
విద్య, వైద్యంపై ఫోకస్
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమా అగ్రవాల్ విద్యా, వైద్యంపై దృష్టి పెడుతున్నారు. గురుకులాలు, హాస్టళ్లు తరచూ తనిఖీ చేస్తున్నారు. పిల్లలతో కలిసి భోజనం చేస్తున్నారు. వారితో కలిసి పాఠాలు వింటున్నారు.. బోధి స్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసేవలను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రోగులతో మాట్లాడుతూ వైద్య సేవలపై ఆరా తీస్తున్నారు. ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలని ఆమె ఆదేశిస్తున్నారు. కలెక్టర్ చొరవతో రాష్ట్రంలోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జిల్లా అగ్రస్థానంలో ఉంది. – సిరిసిల్ల -
● ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిపాలనలో నారీశక్తి ● ఉన్నతాధికారులుగా ప్రజలకు సేవలు ● ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపిస్తున్న 50 మందికిపైగా అధికారిణులు
మహిళా అధికారులు పాలనలో తమ సత్తా చూపిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో వివిధ విభాగాల అధిపతులుగా ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ముందుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కీలకమైన ప్రభుత్వశాఖలు, న్యాయస్థానాలు, రెవెన్యూ, పోలీసు, సంక్షేమ విభాగాలు సమర్థులైన మహిళా అధికారుల చేతుల్లో కొనసాగుతున్నాయి. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లుగా చిత్రామిశ్రా, గరీమా అగ్రవాల్ ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. అత్యంత కీలక హోదాల్లో 50 మందికి పైగా మహిళలు సత్తా చాటుతున్నారు. వందలాది మంది ఉద్యోగులకు మార్గనిర్దేశం చేస్తూ, లక్షలాది మంది ప్రజలకు సేవలందిస్తూ.. కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూ పరిపాలనలో ఆదర్శంగా నిలుస్తున్నారు. -
ఎరువులన్నింటికీ ఒకటే యాప్
గొల్లపల్లి: కేంద్ర ప్రభుత్వం ఎరువుల పంపిణీ విధానంలో కీలక మార్పులు తీసుకొచ్చింది. ఇప్పటివరకు కేవలం యూరియాను మాత్రమే యాప్ ద్వారా పంపిణీ చేస్తుండగా.. ఇక నుంచి అన్ని రకాల కాంప్లెక్స్ ఎరువులకూ వర్తింపజేయడానికి కేంద్రం కొత్త యాప్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్‌ను తీసుకువస్తోంది. ఎరువుల కొరత, బ్లాక్ మార్కెటింగ్ అరికట్టడంతోపాటు రైతులు క్యూలో నిలబడే ఇబ్బందులను తప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎరువుల కొనుగోళ్లకు డిజిటల్ విధానంలో ఎరువులను ఆన్లైన్లో బుక్ చేసుకునేందుకు కొత్త యాప్ రైతుల ముందుకు తేనుంది. ఇప్పటివరకు యూరియా బుకింగ్ కోసం వినియోగిస్తున్న ‘ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్’ స్థానంలో ప్రైమరీ ఫెర్టిలైజర్ సేల్ (ఎఫ్ఎఫ్ఎస్) పేరుతో తీసుకొస్తున్నారు. దీని ద్వారా యూరియాతో పాటుగా రైతుకు అవసరమైన డీఏపీ, పొటాష్ వంటి కాంప్లెక్స్ ఎరువులన్నీ బుకింగ్ చేసుకుని కొనుగోలు చేసేలా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అవకాశం కల్పిస్తున్నది. ఒక కేంద్రంలో అన్ని రకాల ఎరువులు అందుబాటులో లేకపోతే వేర్వేరు ఎరువులకు వేర్వేరు డీలర్లను ఎంపిక చేసుకునే సౌకర్యాన్ని కూడా యాప్‌లో కల్పించారు. కొత్త యాప్ ద్వారా ఎరువులు పొందాలంటే ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా ఆధార్ నంబర్‌కు లింక్ అయిన ఫోన్ నంబర్ తప్పనిసరిగా ఉండాలి. లేకుంటే ఎరువులు బుక్ చేసుకునే అవకాశం ఉండదు. అయితే క్షేత్రస్థాయిలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూమి ధ్రువీకరణతో.. ఎరువుల కొనుగోలు సులభం చేసేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న యాప్‌ను స్మార్ట్‌ఫోన్ కలిగిన ప్రతిఒక్కరూ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఆపై భూమి విస్తీర్ణాన్ని ధ్రువీకరించుకుని రైతు ఆధార్ నంబర్‌గానీ, రైతు రిజిస్ట్రేషన్ నంబర్ గానీ నమోదు చేస్తే ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత రైతుకున్న భూమి సర్వే నంబర్ల వారీగా కనిపిస్తుంది. ఆయా సర్వే నంబర్లలో ఏయే పంట సాగు చేశారో నమోదు చేయాలి. ఎరువు, పరిమాణం నమోదు చేయాలి. తనకు అవసరం ఉన్న ఎరువు ఏ రిటైలర్ షాపులో ఉన్నదో ఎంచుకోవాలి. రైతు స్వయంగానా లేదా మరొకరి కోసమా ధ్రువీకరించాలి. సంప్రదింపుల కోసం ఫోన్ నంబర్‌ను నమోదు చేయాలి. అప్పుడు క్యూఆర్ కోడ్ వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్‌ను తీసుకుని ఎంచుకున్న రిటైలర్ వద్దకు వెళ్లి ఎరువులు తీసుకోవాల్సి ఉంటుంది. యాప్ వినియోగంపై శిక్షణ కొనసాగుతోంది. కొన్ని జిల్లాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. అక్కడ వస్తున్న సమస్యలకు అనుగుణంగా మార్పులు చేర్పులు ఉంటాయి. రైతులు ఇప్పుడే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎరువుల దుర్విని యోగం జరగకుండా కేవలం వ్యవసాయ రంగాని కి మాత్రమే అందించేందుకు ప్రభుత్వం యాప్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈనెల 13 నుండి మన జిల్లాలో ప్రారంభమవుతుంది. – భాస్కర్, డీఏవో -
ఆమె సంతకం
● మహిళా అధికారులు.. పాలనలో ఆదర్శమూర్తులు ● ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 50కి పైగా అధికారిణులు ● అభివృద్ధి.. సంక్షేమంలో పరుగులు ● ఆదర్శంగా నిలుస్తున్న లేడీబాస్లు ఒక ఇంటిని చక్కదిద్దడమే కాదు, ఒక జిల్లాను, పరిపాలనా వ్యవస్థను ఎంత సమర్థంగా నడిపించగలరో మహిళా అధికారులు చేసి చూపుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, పారదర్శక పరిపాలన, సంక్షేమ పథకాల అమలు, న్యాయసేవలు, అభివృద్ధి కార్యక్రమాల్లో దూసుకెళ్తున్నారు. సేవాభావం, నాయకత్వపటిమతో కొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న మహిళా అధికారులు నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ‘కలలు కనండి... కష్టపడండి... నాయకత్వం వహించండి’ అనే నమ్మకాన్ని బలపరుస్తున్నారు. -
ఎక్కువ మంది మహిళలు ఉండడం సంతోషకరం
కరీంనగర్‌అర్బన్: కలెక్టర్ చిత్రామిశ్రా పాలనలో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఒక మహిళ అధికారిగా ఆమె దిశానిర్ధేశం బాగుంది. ఎక్కువ సంఖ్యలో మహిళలే అధికారులుగా ఉండటం సంతోషకర పరిణామం. ప్రజలకు మరింత సేవ చేయాలనే కాన్ఫిడెన్స్ పెరిగింది. సహచరుల సహకారం, ఉన్నతాధికారుల మార్గదర్శకత్వం నాకు ప్రేరణగా నిలుస్తాయి. – షర్మిళ, కరీంనగర్ ఆర్డీవో మహిళా అధికారిగా పనిచేయడం.. సమాజంలో మార్పు తీసుకురావడానికి లభించిన గొప్ప అవకాశం. మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వద్ధులు, ట్రాన్స్‌జెండర్స్ సంక్షేమం కోసం పనిచేయడం ఎంతో ఆత్మసంతృప్తినిస్తుంది. ప్రతీ సవాలును ధైర్యంగా ఎదుర్కొంటూ.. అర్హులైన ప్రతీ లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేయడమే నా ప్రధాన లక్ష్యం. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం, వారి సమస్యలకు పరిష్కారం చూపడం నా ఉద్యోగంలో అత్యంత విలువైన అంశం. – సరస్వతి, జిల్లా సంక్షేమాధికారి, కరీంనగర్ పరిపాలనలో లభిస్తున్న అవకాశాలు, బాధ్యతలు మాపై మరింత జవాబుదారీతనాన్ని పెంచుతున్నాయి. ప్రజలకు పారదర్శకంగా, వేగవంతంగా సేవలు అందించడమే మా ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం ప్రతీ రంగంలో మహిళలు రాణిస్తున్నారు. కుటుంబ, పరిపాలన బాధ్యతలను సమర్థంగా నిర్వహించగలమని నిరూపిస్తున్నారు. ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, అంకితభావం ఉంటే ఏ లక్ష్యాన్నైనా చేరుకోవచ్చు. మహిళా సాధికారత అంటే సమాజంలో సానుకూల మార్పునకు నాయకత్వం వహించడం. ఆ దిశగా ప్రతి మహిళ ముందుకురావాలి. – అరుణశ్రీ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, పెద్దపల్లి -
విద్యార్థులు కష్టపడి చదవాలి
కోరుట్లరూరల్:విద్యార్థులు ఉన్నత లక్ష్యాల సాధనకు కష్టపడి చదవాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మండలంలోని మాదాపూర్, మోహన్‌రావుపేట ఉన్నత పాఠశాలలు, పట్టణ శివారులోని బీసీ వెల్ఫేర్ గురుకులాన్ని బుధవారం తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. తల్లిదండ్రుల కష్టాలను గుర్తించి క్రమశిక్షణతో చదువుకుంటే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని పేర్కొన్నారు. సమస్యలుంటే తన దృష్టికి తేవాలన్నారు. హెచ్ఎం, బీఆర్ఎస్ నాయకులు దారిశెట్టి రాజేష్, సర్పంచులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
సేవ చేయడం సంతృప్తినిస్తుంది
జగిత్యాలజోన్: జిల్లా ప్రధాన న్యాయమూర్తి పోస్టు ఒక్క ఉద్యోగంగా కాకుండా, కక్షిదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నామనే తృప్తి మిగులుతుంది. ఓ వైపు ఉ ద్యోగం.. మరో వైపు కుటుంబ బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తుండటంతో హ్యాపీగా గడిచిపోతుంది. మహిళా అధి కారులుగా ఆఫీసు పనుల్లో ఎంత ఒత్తిడికి గురైనా.. ఆ భావం మన ముఖంపై కనిపించొద్దు. చిరునవ్వుతోనే చాలా సమస్యలు పరిష్కరించవచ్చనేది నా అభిప్రాయం – సి.రత్న పద్మావతి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జగిత్యాల కుటుంబ సహకారంతో ఉన్నత స్థానానికి ఎది గాను. మనం ఏ రంగంలో ఉన్నా అందులో ఉన్నత స్థానానికి ఎదగాలన్న కాంక్ష ఉండాలి. మహిళలు ఉద్యోగం.. కుటుంబ బాధ్యతలకు సమన్యాయం చేస్తున్నారు. కుటుంబంతోపాటు సమాజాన్ని అధ్యయనం చేస్తుండడంతో మరింత మెరుగ్గా బాధ్యతలు నిర్వహించే అవకాశం ఉంటుందనేది నా అభిప్రాయం. – జి.సునీత–రవీందర్‌రెడ్డి, జిల్లా మొదటి అదనపు జడ్జి, జగిత్యాల ఓ వైపు జడ్జీగా ఉద్యోగానికి, మరోవైపు కుటుంబానికి తగిన ప్రాధాన్యం ఇస్తాను. కోర్టులో జరిగిన విషయాలను ఇంట్లో, కుటుంబ విషయాలను కోర్టుల్లో మాట్లాడుకునే పరిస్థితి ఉండదు. ఎక్కడి బాధ్యతలు అక్కడే నిర్వర్తించుకోవాలి. మహిళా అధికారులుగా అనుకున్న లక్ష్యాలను సాధించి శభాష్ అనిపించుకోవాలి. – ఆర్.లావణ్య, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి, జగిత్యాల -
అందాల కొండగట్టు
మల్యాల: జగిత్యాల జిల్లా కొండగట్టులోని శ్రీఆంజనేయస్వామి ఆలయం పరిసరాలు, ప్రకృతి సోయగాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. కొండపైకి వెళ్లే దారిలో రోడ్డుకిరువైపులా ఎత్తుగా.. ఎటు చూసినా పచ్చదనంతో కూడిన చెట్లు అలరిస్తున్నాయి. కొండలరాయుడి సన్నిధి నుంచి లోయలు.. గుట్టలు, పెద్ద పెద్ద బండరాళ్లు స్వామివారిని దర్శనానికి వచ్చే భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ● ఆకట్టుకుంటున్న కొండలు..లోయలు.. ● ప్రకృతి ఒడిలో పరవశించిపోతున్న భక్తులు -
ఇళ్లు కూలిన బాధితులకు అండగా ఉంటాం
● జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ జగిత్యాలరూరల్: వర్షాలకు ఇళ్లు కూలిపోయిన బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. సారంగాపూర్ మండలం పెంబట్లకు చెందిన పస్తం రమేశ్, స్వప్న ఇల్లు ఇటీవల కూలిపోగా.. వారికి తక్షణ సహాయం కింద రూ.1.20 లక్షలు మంజూరు చేయిస్తానని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని తెలిపారు. ఆయన వెంట సర్పంచ్ రాధ, తహసీల్దార్ వహిద్, ఎంపీడీవో నీరజ, ఎంపీవో సలీం, సింగిల్ విండో చైర్మన్ మల్లారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. డబుల్బెడ్రూంల వద్ద వసతులు కల్పించాలి జగిత్యాల: డబుల్బెడ్రూం ఇళ్ల వద్ద పూర్తిస్థాయి వసతులు కల్పించాలని ఎమ్మెల్యే అన్నారు. హౌసింగ్ అధికారులతో సమీక్షించారు. ఇందిరమ్మ రెండో విడత రెండువేల ఇళ్లు మంజూరయ్యాయని, రేకులషెడ్డు ఉన్న వారికి స్లాబుకు రూ.2లక్షల మంజూరుకు అవకాశం ఉందని, గుడిసెలో ఉన్న వారికి మొదటి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఇందిరమ్మ కాలనీ వసతుల కల్పనకు రూ.20 కోట్లతో ప్రతిపాదనలు పంపించామన్నారు. కాలనీలో పాఠశాల, అర్బన్ హెల్త్ సెంటర్, మెయిన్‌రోడ్, కమ్యూనిటీ హాల్ స్థల సేకరణ చేయాలన్నారు. డీఈ సత్యనారాయణ పాల్గొన్నారు. ప్రజా ఫిర్యాదులపై తక్షణం స్పందించాలి మెట్పల్లి: పజా ఫిర్యాదులకు తక్షణమే స్పందించాలని ఎస్పీ అశోక్‌కుమార్ సూచించారు. పట్టణంలోని పోలీస్‌స్టేషన్ మంగళవారం తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి స్థానిక అధికారులకు పలు సూచనలు చేశారు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడానికి ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. గ్రామాలకు కేటాయించిన సిబ్బంది వద్ద ఆయా గ్రామాల పూర్తి సమాచారం అందుబాటులో ఉండాలన్నారు. విజిబుల్ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వడంపై దృష్టి సారించాలన్నారు. ఆయన వెంట డీఎస్పీ రాములు ఉన్నారు. -
ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి
ఇబ్రహీంపట్నం: తాను డాక్టర్ అయినా.. ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యానని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌కుమార్ అన్నారు. మండలకేంద్రంలోని కేజీబీవీ, జెడ్పీ ఉన్నత పాఠశాలను మంగళవారం తనిఖీ చేశారు. ఇప్పుడు చదువుకునేందుకు పాఠశాలలు, హాస్టళ్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ.. కష్టపడి చదివిస్తున్నారని, వారి కలలను నెరవేర్చాలని విద్యార్థులకు సూచించారు. తనను యూకేజీ సమయంలోనే హాస్టల్లో వేశారని, కష్టపడి చదివి డాక్టర్ అయ్యానని తెలిపారు. పిల్లలకు పెడుతున్న భోజనం పరిశీలించి, వారితో కలిసి భోజనం చేశారు. ఉన్నత పాఠశాలలో విద్యార్థులు తయారు చేస్తున్న రోబోటిక్స్ గురించి అడిగి తెలుసుకున్నారు. సైన్స్ ల్యాబ్ భవనాన్ని నాణ్యతతో చేయించాలని ఏఈ శశికుమార్‌ను ఆదేశించారు. సర్పంచు బద్దం గోపి, తహసీల్దార్ వరప్రసాద్, ఎంపీడీవో గణేశ్, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ రజిత, ఉపసర్పంచు రమేశ్ పాల్గొన్నారు. -
రైస్‌మిల్లులపై విజిలెన్స్ దాడులు
జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లాలోని రైస్‌మిల్లులకు ప్రభుత్వం అప్పగించిన ధాన్యం మాయం కావడంపై రాష్ట్ర విజి లెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేస్తూ కొరడా ఝులిపిస్తున్నారు. మల్లాపూర్ మండలం మొగి లిపేట శివారులోని ఏఆర్ఎస్ మిల్లుల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ ఎస్పీ బసవరెడ్డి, డీఎస్పీ సీతారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం తనిఖీలు చేపట్టారు. సాయంత్రం వరకు కొనసాగిన ఈ తనిఖీల్లో రూ.45 కోట్ల విలువైన సుమారు 18,560 టన్నుల ధాన్యం మాయమైనట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ దాడుల్లో డీఎస్వో జితేందర్‌రెడ్డి, తహసీల్దార్ రాంచంద్రం, ఎస్సై అనిల్ పాల్గొన్నారు. రైస్‌మిల్లర్లలో ఆందోళన గత బుధవారం జగిత్యాల రూరల్ మండలం తక్కళ్లపల్లి శివారులోని రైస్‌మిల్లుల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేపట్టి రూ.87.89 కోట్ల ధాన్యం మాయమైనట్లు గుర్తించి మూడు రైస్‌మిల్లుల యజమానులు నలుగురిపై రూరల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే మొగిలిపేట శివారులోని ఏఆర్ఎస్ రైస్‌మిల్లులో తనిఖీ చేసి సుమారు రూ.45 కోట్ల ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. అధికారుల తనిఖీలతో ధాన్యం లేని రైస్‌మిల్లర్లు మిల్లులకు తాళాలు వేసుకుని ఫోన్లు స్విచ్ఛాఫ్ పెట్టుకుని రహస్య ప్రాంతాలకు వెళ్లిపోతున్నట్లు సమాచారం. మరో రెండుమూడు రోజుల పాటు మిల్లుల్లో అధికారులు తనిఖీలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. రేపు సామాజిక న్యాయ తెలంగాణ సాధన సభమెట్పల్లి: బీసీలకు 50శాతం రిజర్వేషన్ల సాధనకు హైదరాబాద్‌లో ఈనెల 6న తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో సామాజిక న్యాయ తెలంగాణ సాధన సభ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి చిట్నేని రఘు తెలిపారు. ఈ మేరకు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సభకు సంబంధించిన పోస్టర్లను మంగళవారం ఆవిష్కరించారు. జనాభాలో అధిక శాతం ఉన్న బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. పలువురు యువకులు ఆయన సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. చెట్లపల్లి సుఖేందర్, లింగంపల్లి సంజీవ్, రేండ్ల రాజన్న, అజార్, ప్రశాంత్, ముఖీమ్ తదితరులున్నారు. -
అంగన్వాడీల్లో కొలువుల జాతర
జగిత్యాల: అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీల భర్తీకి శ్రీకారం చుట్టారు. జిల్లాలో 64 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేశారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ పోస్టులకు నోటిఫికేషన్ రావడంతో అర్హులకు అవకాశం లభించనుంది. జిల్లాలోని నాలుగు ప్రాజెక్ట్‌లలో 1085 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. టీచర్ల పోస్టుల భర్తీ అనంతరం ఆయాలను నియమిస్తామని సంక్షేమాధికారి ఆడెపు భాస్కర్ తెలిపారు. అర్హతలు ఎంపిక విధానం ధ్రువీకరణ పత్రాలు ఐసీడీఎస్ ప్రాజెక్టు అంగన్వాడీ టీచర్ పోస్టులు ధర్మపురి 16జగిత్యాల 22మల్యాల 12మెట్పల్లి 14మొత్తం 64 -
వరంగల్‌కు దారేది?
సాక్షిప్రతినిధి,కరీంనగర్: చత్తీస్ఘడ్– తెలంగాణ– మహారాష్ట్ర రాష్ట్రాలను కలుపుతూ వేస్తున్న జాతీయ రహదారి– 563 నిర్మాణంలో కరీంనగర్ రూరల్ మండల పరిధిలోని ఇరుకుల్ల జంక్షన్ వద్ద అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్‌హెచ్– 563 వరంగల్– కరీంనగర్ సెక్షన్ రోడ్డు, హైదరాబాద్– రామగుండం రాజీవ్ రహదారి ఒక్కచోట కలుస్తున్నాయి. ఎన్‌హెచ్ 563 ఎలివేటేఎడ్ హైవే కావడంతో కింద నుంచి రాజీవ్ రహదారి వెళ్తుంది. ఈ హైవే నిర్మాణంతో కరీంనగర్‌లోకి భారీ వాహనాలు రాకుండా ఇరుకుల్ల నుంచే వరంగల్‌వైపు వెళ్తాయనుకున్నారంతా. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. ఇక్కడ జగిత్యాల వైపుగా వెళ్లేందుకు అనుకూలంగా కనెక్టివిటీ ఉన్నా.. వరంగల్ వైపు వెళ్లేందుకు కనెక్టివిటీ లేదు. వాస్తవానికి ఎన్‌హెచ్ 563 రోడ్డు ఇంకా నిర్మాణంలోనే ఉంది. ప్రస్తుతం ఇరుకుల్ల వరకు అందుబాటులోకి వచ్చింది. వాహనాలు వరంగల్ వైపు వెళ్లేందుకు ఎలాంటి ర్యాంపు నిర్మించకపోవడంతో కరీంనగర్ వరకు ప్రయాణించి తీగల వంతెన, మానకొండూరు మీదుగా ఎన్‌హెచ్– 563 ఎక్కుతున్నాయి.పెద్దపల్లి పారిశ్రామిక ప్రాంతం నుంచి నిత్యం వేలాది లారీలు ఆంధ్రప్రదేశ్, చత్తీస్ఘఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా వైపు ప్రయాణిస్తుంటాయి. బసంత్‌నగర్ సిమెంట్ ఫ్యాక్టరీ, సింగరేణి బొగ్గు, ఎన్టీపీసీ బూడిద, మంథని ఇసుక, వ్యవసాయ ఉత్పత్తులను తరలించే లారీలు నిత్యం కరీంనగర్– వరంగల్– విజయవాడ మధ్య తిరుగుతుంటాయి. పెద్దపల్లి నుంచి బయల్దేరిన వాహనాల్లో కొన్ని హైదరాబాద్ వైపు వెళ్లగా, మెజారిటీ వరంగల్ మీదుగా వెళ్తుంటాయి. మెడికల్ ఎమర్జెన్సీ కోసం ఎంజీఎం వెళ్లే వారు ఇదే దారిని ఎంచుకుంటారు. ఇరుకుల్ల వద్దకు రాగానే అందరికీ ఎన్‌హెచ్–563 హైవే శిఖరంలా దర్శనమిస్తోంది. కానీ, ఎలివేటెడ్ హైవేను ఎలా ఎక్కాలో అర్థం కాక అయోమయానికి గురవుతున్నారు. కొంతదూరం సర్వీసు రోడ్డుమీద ప్రయాణించినా ఇరుకుల్ల వాగుతో రోడ్డు మూతపడుతోంది. -
విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించాలి
జగిత్యాల: విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇన్స్పైర్ మానక్ పోస్టర్‌ను మంగళవారం ఆవిష్కరించారు. విద్యార్థుల్లో పరిశోధన దృక్పథం, సృజనాత్మకత, పర్యావరణ బాధ్యతలను పెంపొందించడంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. ప్రతి పాఠశాల నుంచి విద్యార్థుల వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలు వెలికితీసి ప్రోత్సహించాలన్నారు. ప్రేరణ మానక్‌లో ఆరో తరగతినుంచి 12వ తరగతి వరకు విద్యార్థుల వినూత్న ఆవిష్కరణలను గుర్తించి ఆగస్టు 30లోగా వందశాతం నామినేషన్లు పూర్తి చేయాలన్నారు. డీఈవో రాము, సైన్స్ అధికారి రాజశేఖర్ పాల్గొన్నారు. ఈవీఎంల వద్ద భద్రత ఉండాలి ఈవీఎం గోదాంల వద్ద భద్రత ఉండాలని కలెక్టర్ అన్నారు. ధరూర్ క్యాంప్‌లోని ఈవీఎం గోదాంలను పరిశీలించారు. అదనపు కలెక్టర్ లత, ఆర్డీవో పాల్గొన్నారు. గడువులోపు పనులు పూర్తి చేయాలి మల్లాపూర్: పంచాయతీ భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ అన్నారు. మల్లాపూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి ఓపీ, ఐపీ సేవలు, ల్యాబ్, మెడికల్ ఫార్మసీ, ఐపీ రికార్డులు పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. పాతదాంరాజుపల్లిలో పంచాయతీ భవనాన్ని నాణ్యతతో పూర్తిచేయాలని ఆదేశించారు. వాల్గొండలో రూ.3కోట్లతో చేపట్టబోయే పుష్కరఘాట్లు, రహదారి పనులను పరిశీలించారు. వాల్గొండ శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం వరకు బైపాస్ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. మెట్పల్లి ఆర్డీవో నరసింహరావు, డీఎంహెచ్‌వో సుజాత, పీఆర్ ఈఈ లక్ష్మణ్‌రావు, డీఈ అన్వర్, తహసీల్దార్ రాంచందర్, ఎంపీడీవో శ్రీకాంత్ పాల్గొన్నారు. -
ఎస్సారెస్పీకి 22,222 క్యూసెక్కుల ఇన్ ఫ్లో
జగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి మంగళవారం సాయంత్రం ఆరు గంటల వరకు 22,222 క్యూసెక్కుల వరద వస్తోంది. నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలకుగాను 34.577 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు నుంచి 934 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ఎమ్మార్పీకే ఎరువులు విక్రయించాలిపెగడపల్లి: ఎమ్మార్పీ ధరలకే ఎరువులు విక్రయించాలని డీఏవో భాస్కర్ డీలర్లను ఆదేశించారు. మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలను ఏవో శ్రీకాంత్‌తో కలిసి మంగళవారం తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలు, స్టాక్ రిజిష్టర్లు, ధరల వివరాలను పరిశీలించారు. రైతులకు తప్పనిసరిగా రశీదు ఇవ్వాలని సూ చించారు. పురుగుల మందులు, నకిలీ విత్తనా లు విక్రయిస్తే లైసెన్స్ రద్దు చేసి క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. రైతువేదికలో నిర్వహించిన రైతునేస్తం కార్యక్రమంలో పాల్గొన్నారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకు ని పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు. మొక్కజొన్న, కందులు, పెసలు, మినుములు, నువ్వులు వంటి సాగునీటి ఆధారిత ఆరుతడి పంటలు సాగు చేయడం ద్వారా తక్కువ నీటితో మంచి దిగుబడులు సాధించవచ్చన్నారు. శిలీంధ్రాలతో ఎండుతున్న మొక్కజొన్నమెట్పల్లిరూరల్: భూమిలోని శిలీంధ్రాలతోనే మొక్కజొన్న పంట ఎండిపోతోందని కరీంనగర్ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు రాంప్రసాద్, రజనీకాంత్ అన్నారు. మెట్పల్లి మండలం వెల్లుల గ్రామంలో పలువురు రైతుల మొక్కజొన్న పంటను పరిశీలించారు. ఆకులు ఎండిపోయి తెగుళ్ల బారిన పడినట్లు గుర్తించారు. భూమిలోని శీలింధ్రం కారణంగానే పంట ఎండిపోతోందని పేర్కొన్నారు. నివారణకు ప్రొపికొనోజోలు, వాలిడోమైసిన్ 2 మిల్లీలీటర్ల మందును లీటర్ నీటిలో కలిపి మొక్క మొదలు తడిచేలా వేర్ల వద్ద పిచికారీ చేయాలని సూచించారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఏవో దీపిక, ఏఈవో మమత, రైతులు పాల్గొన్నారు. నేడు జేఎన్టీయూలో ఓరియంటేషన్కొడిమ్యాల: మండలంలోని జేఎన్టీయూ(నాచుపల్లి)లో బీటెక్ ఫస్టియర్ విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహిస్తామని యాజమాన్యం తెలిపింది. ముఖ్య అతిథిగా జేఎన్టీయూ(హైదరాబాద్) ఉపకులపతి ప్రొఫెసర్ కిషన్ కుమార్‌రెడ్డి హాజరై ఉపాధి అవకాశాలు, విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ వికాసంపై సూచనలు చేస్తారని పేర్కొంది. ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు, కళాశాల సిబ్బంది పాల్గొనాలని కోరింది. చిట్టాపూర్‌లో బోనాల సంబరాలుమల్లాపూర్: మండలంలోని చిట్టాపూర్‌లో ప్రాథమిక పాఠశాలలో మంగళవారం బోనాల సంబరాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు బోనాలతో సందడి చేశారు. పోతరాజు వేషధారణలో ఆకట్టుకున్నారు. హెచ్ఎం మోల్కియోరెడ్డి మాట్లాడుతూ.. బోనాల పండుగను పల్లెలు, పట్టణాల్లో వైభవంగా జరుపుకొంటున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులు కుంట భూమేశ్వర్, బెజ్జారపు వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తల్లిపాలు అమృతం
గొల్లపల్లి: మాతృత్వం ఒక అద్భుతమైన అనుభూ తి. నవమాసాలు మోయడంతోపాటు బిడ్డకు ఈ లోకాన్ని పరిచయం చేశాక మరింత భద్రంగా కాపాడుకోవడం ప్రధానం. శిశువుకు ఎంత మంచి పోషకాలు అందితే అంత దృఢంగా ఉంటారు. అయితే ఆ పోషకాలు ఒక్క తల్లిపాలలో మాత్రమే లభి స్తాయి. పిల్లల ఎదుగుదల, సంపూర్ణ ఆరోగ్యానికి తల్లిపాలే అమృతంతో సమానం. ఉరుకులు, పరుగులు జీవితంలో చాలామంది తల్లులు పిల్లలను కా స్త నిర్లక్ష్యం చేస్తున్నట్లు కనిపిస్తోంది. మరికొందరు తల్లులు కొన్ని అపోహలతో పిల్లలకు పాలు ఇవ్వడానికి వెనుకంజ వేస్తున్నారు. ఇలాంటి వారిలో అవగాహన కోసమే ఐసీడీఎస్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తోంది. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు వైద్య, ఆరోగ్య శాఖ ఏటా ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు వివిధ కార్యక్రమాల ద్వారా తల్లులకు అవగాహన కల్పిస్తోంది. తల్లిపాలలో ఉండే పోషకాలు.. ఇతరత్రా అంశాలను పరిశీలిస్తే.. అమృతధార ‘ముర్రుపాలు’ ప్రసవం సాధారణమైనా.. (నార్మల్), సిజేరియన్ అయినా సరే బిడ్డ పుట్టిన వెంటనే పాలు పట్టడం అత్యంత ఆవశ్యకం. ముర్రుపాలలో అనేక పోషకాలు ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే చిన్నారికి లభించే తొలి వ్యాక్సిన్. పాలల్లో విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి బిడ్డకు అవసరమైన క్యాలరీలను అందించడమే కాకుండా రోగనిరోధక శక్తిని కొండంత పెంచుతాయి. ఆర్నెళ్ల వరకు.. బిడ్డ పుట్టినప్పటి నుంచి 6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే తాగించాలి. తర్వాత తగిన ఆహారంతోపాటు రెండేళ్ల వరకు పాలు ఇస్తే శిశువుకి సంపూర్ణ రక్షణ లభిస్తుంది. తల్లిపాలు చాలారోజులు తాగిన పిల్లల్లో శారీరక శక్తితో పాటు మానసిక వికాసం, మెదడు ఎదుగుదల అద్భుతంగా ఉంటాయి. డయేరియా, న్యుమోనియా, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. భవిష్యత్తులో క్యాన్సర్, గుండెజబ్బులు, అలర్జీ, ఆస్తమా, డయాబెటిస్ వంటి సమస్యలు రాకుండా అడ్డుకట్ట వేస్తుంది. ఎముకలకు అవసరమైన కాల్షియం నిల్వ లను పెంచి, శరీరాన్ని బలంగా మారుస్తుంది. తల్లికీ మేలే.. బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల శిశువుకే కాదు.. తల్లికి కూడా ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. పాలు పట్టించడం వల్ల ప్రసవానంతరం తల్లి ఆరోగ్యం త్వరగా మెరుగుపడుతుంది. రోజుకు 8 నుంచి 12సార్లు పిల్లలకు పాలు పట్టించాలి. తల్లి తగినంత విశ్రాంతి తీసుకుంటూ.. ఎక్కువ నీరు తాగుతూ, బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి -
ఇంటికి చేరకముందే కబళించిన మృత్యువు
● ఇంటికి చేరకముందే కబళించిన మృత్యువు ● స్నేహితుడితో కలిసి రోడ్డు దాటుతుండగా ప్రమాదం ● గుర్తు తెలియనివాహనం ఢీకొని కాంట్రాక్ట్ కార్మికుడి మృతి జ్యోతినగర్: పెద్దపల్లిలోని తమ బంధువుల ఇంట ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్న ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుడు కోండ్ర లింగమూర్తి(42) ఎఫ్‌సీఐ క్రాస్‌రోడ్డు రాజీవ్ రహదారిపై ఆదివారం అర్ధరాత్ర జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో నివసిస్తున్న కోండ్ర లింగమూర్తి ఎన్టీపీసీలోని సీహెచ్‌పీ విభాగంలో హౌస్‌కీపింగ్ పనులు చేస్తున్నాడు. ఆదివారం పెద్దపల్లిలో తమ బంధువుల ఇంటిలో జరిగిన కార్యక్రమానికి హాజరై రాత్రి శ్రీరాంపూర్ బస్సులో వెళ్తున్నాడు. ఎఫ్‌సీఐ క్రాస్‌రోడ్డులోని తన స్నేహితుడు ముల్కల శ్రవణ్‌కుమార్‌ను కలుసుకునేందుకు అక్కడికి రాగానే బస్సు దిగాడు. ఇద్దరూ కలిసి రోడ్డు దాటుతుండగా గోదావరిఖని వైపు నుంచి వచ్చిన గుర్తుతెలియని వాహనం అతివేగంతో లింగమూర్తిని ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అతడిని శ్రవణ్‌కుమార్‌తోపాటు గోదావరిఖని గంగానగర్‌కు చెందిన కారుడ్రైవర్ కలవేని అనిల్ వెంటనే గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో మృతి చెందాడు. మృతుడి సోదరుడు కోండ్ర నర్సయ్య ఫిర్యాదు మేరకు ఏఎస్సై బుచ్చిన్నాయుడు కేసు నమోదు చేశారు. కుటుంబసభ్యుల అంగీకారంతో సదాశయ ఫౌండేష్న్ ఆధ్వర్యంలో టెక్నీషియన్ ప్రదీప్ మృతుడి నేత్రాలను సేకరించి హైదరాబాద్‌కు పంపించారు. మృతుడికి భార్య స్వర్ణలత, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు భూమల్ల చందర్, కార్మికులు సంతాపం తెలిపారు. శ్రీరాంపూర్‌లో జరిగిన అంత్యక్రియలకు హాజరయ్యారు. -
బావిలో పడ్డా బతికారు
బాలికను బయటకు తీసుకొస్తున్న స్థానికులుబైక్పడిన వ్యవసాయ బావిఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో సోమవారం ఓ బైక్ అదుపుతప్పి పడిపోయింది. ఆ శబ్దాదనికి సమీప పొలాల్లో పనిచేస్తున్న రైతులు వెంటనే వచ్చి దానిపై ప్రయాణిస్తున్న ఇద్దరు విద్యార్థినులు, బైక్ నడిపించే వ్యక్తి ప్రాణాలు కాపాడారు. స్థానికుల కథనం ప్రకారం.. తొలిఏకాదశి సెలవులు ముగియడంతో సుల్తానాబాద్ మండలం కనుకులకు చెందిన అనవేని సతీశ్ తన కూతురు అరణ్య(ఎనిమిదో తరగతి), చెల్లెలి కూతురు ఆరాధ్య(తొమ్మిదో తరగతి) కాల్వశ్రీరాంపూర్‌లోని కేజీబీవీకి తీసుకెళ్లేందుకు సోమవారం తన బైక్‌పై ఇద్దరి తీసుకుని బయలు దేరాడు. కొలనూర్ శివారులో ఎదురుగా మరోబైక్ రావడంతో దానిని తప్పించబోయి అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లారు. ఇదేసమయంలో వ్యవసాయ పనులు ముగించుకొని ఇళ్లకు వస్తున్న రైతులు, కూలీలు ఆశబ్దాన్ని గుర్తించి వెంటనే అక్కడకు వచ్చి ముగ్గురినీ బయటకు తీశారు. గాయాలపాలైన ఆరాధ్య, అరణ్యను ఆస్పత్రికి తరలించారు. సతీశ్ సురక్షితంగా బయటపడ్డాడు. అయితే, గాయాలపాలైన విద్యార్థినులు రోదించడం కలచివేసింది. -
అవగాహన కల్పిస్తున్నాం
బిడ్డకు రెండేళ్లు వచ్చేవరకు తల్లిపాలు తాగించడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. శిశువుకు సరిపడా పాలు పడేందుకు గర్భిణిగా ఉన్నప్పటి నుంచే పాలు, గుడ్లు, తాజా కూరగాయలు తీసుకోవాలి. వారోత్సవాల్లో భాగంగా ఈ విషయాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. – భాస్కర్ జిల్లా సంక్షేమ అధికారి సరైన ఆహారం ముఖ్యం గర్భం దాల్చినప్పటి నుంచే మహిళ పోషకాహారం తీసుకోవాలి. తగిన జాగ్రత్తలు పాటిస్తే పసిపాపలకు డబ్బా పాల అవసరమే రాదు. పుట్టిన వెంటనే బిడ్డకు తప్పని సరిగా ముర్రుపాలు తాగించాలి. అప్పుడే బిడ్డ సంపూ ర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. – డాక్టర్ స్నేహ, ప్రొఫెసర్, ప్రభుత్వ వైద్య కళాశాల, జగిత్యాల -
బైక్ నంబరు మార్చేసుకున్నారు
● నకిలీ నంబరుతో తిరిగి పట్టుబడ్డారు పెద్దపల్లిరూరల్: రోడ్లపై తిరిగే బైక్ నంబర్లను టాంపరింగ్ చేసి ట్రాఫిక్ పోలీసులు విధించే చలాన్ల నుంచి తప్పించుకునేందుకు కొందరు యత్నిస్తుంటే.. ఇంకొందరు ఏకంగా వాహన నంబరునే మార్చేసుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం పెద్దపల్లిలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన వాహన తనిఖిల్లో నకిలీ నంబరు(టీఎస్ 19ఏ 9821)తో హెచ్ఎఫ్ డీలక్స్బైక్ తిరుగుతున్నట్టు గుర్తించి దానిని స్వాధీ నం చేసుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో ఇదే నంబరుగల బైక్ హైదరాబాద్‌లో ఉన్నట్టు తేలింది. ఇక్కడి ట్రాఫిక్ పోలీసులు చలాన్ విధిస్తే ఆ నంబరు యజమాని సెల్‌ఫోన్‌కు మెసేజ్‌లు వెళ్తున్నాయి. నకిలీ నంబరు వినియోగిస్తున్న పెద్దపల్లిలోని కొంతంవాడకు చెందిన వీరేశంపై కేసు నమోదు చేశారు. ఈబైక్ య జమాని ఓ వ్యాపారి వద్ద కుదువపెట్టగా.. సదరు వ్యాపారి ఇలా బోగస్ నంబరుతో తిరిగాడని వీరేశం పోలీసులకు వివరించినట్టు తెలిసింది. -
చిన్న గాయం.. పెద్ద ప్రమాదం
● పంజా విసురుతున్న సెల్యులైటిస్ ● ఉమ్మడి కరీంనగర్లో రోగుల ఉక్కిరిబిక్కిరి ● మూడేళ్లుగా తీవ్రమవుతున్న ముప్పుకరీంనగర్: ఒకప్పుడు అరుదుగా కనిపించిన సెల్యులైటిస్ ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆందోళనకరస్థాయికి చేరుకుంది. మూడేళ్లుగా కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ ఏడాదిలో మరింత వేగంగా కేసులు నమోదవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. జనరల్ సర్జరీ విభాగం ఉన్న ఆస్పత్రుల్లో సెల్యులైటిస్ బాధితులు చికిత్స పొందుతుండడం పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తోంది. కొందరు మందులతో కోలుకుంటుండగా, మరికొందరికి చీము పేరుకుపోవడంతో శస్త్రచికిత్సలు చేయాల్సి వస్తోంది. మధుమేహం, రక్తప్రసరణ లోపాలు, పాదాల పగుళ్లు, చిన్న గాయాలను నిర్లక్ష్యం చేయడం, పరిశుభ్రత లోపించడం వంటి కారణాలతో ఈ వ్యాధి ఎక్కువగా విజంభిస్తోందని వైద్యలు చెబుతున్నారు. తొలిదశలో చర్మ సమస్యగా కనిపించే ఈ ఇన్ఫెక్షన్ను చాలామంది నిర్లక్ష్యం చేయడంతో తీవ్రస్థాయికి చేరుకుని శస్త్రచికిత్స అవసరమయ్యే పరిస్థితులు పెరుగుతున్నాయి. ఈ లక్షణాలు ప్రమాదకరం... సెల్యులైటిస్ అనేది చర్మంతో పాటు చర్మం కింద ఉన్న మదుకణజాలంలో ఏర్పడే తీవ్రమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ప్రారంభ దశలోనే చికిత్స తీసుకుంటే పూర్తిగా నయం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చర్మం ఎర్రగా మారడం, వాపు వేగంగా పెరగడం, భరించలేని నొప్పి, ప్రభావిత భాగం వేడిగా అనిపించడం, జ్వరం, వణుకు, చర్మం బిగుసుకుపోవడం, చీము ఏర్పడటం, నడవడంలో ఇబ్బంది, ఈ లక్షణాలతో పాటు మధుమేహం కూడా ఉంటే వెంటనే శస్త్రచికిత్స నిపుణుడిని సంప్రదించాల్సి ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే... సెల్యులైటిస్‌ను నిర్లక్ష్యం చేస్తే ఇన్ఫెక్షన్ లోతైన కణజాలానికి వ్యాపించి నెక్రోటైజింగ్ సాఫ్ట్ టిష్యూ ఇన్ఫెక్షన్, సెప్సిస్, గ్యాంగ్రీన్ వంటి ప్రాణాంతక సమస్యలకు దారితీయవచ్చు. కొందరిలో చీము పేరుకుపోవడంతో ఇన్సిషన్ అండ్ డ్రైనేజీ శస్త్రచికిత్స అవసరమవుతుంది. దీనిని గుర్తించేందుకు సీ–రియాక్టివ్ ప్రోటీన్, టోటల్ ల్యూకోసైట్ కౌంట్, అల్ట్రాసౌండ్ పరీక్షలు, చీము ఉంటే కల్చర్ పరీక్ష ద్వారా ఏ బ్యాక్టీరియా కారణమో గుర్తిస్తారు. చీము వస్తోందని స్వయంగా నొక్కడం, కోయడం, ఇంటి చిట్కాలతో కాలయాపన చేయడం ప్రమాదకరం. ఇన్ఫెక్షన్ పెరిగితే ఒక్కోసారి కాలుకూడా తీసి వేయాల్సి వస్తుంది. -
ద్విచక్ర వాహనాల దొంగల అరెస్టు
● రూ.25 లక్షల విలువ గల 28 బైక్‌లు స్వాధీనం ● వివరాలు వెల్లడించిన వరంగల్ సీపీ శ్వేతవరంగల్ క్రైం: వరుసగా ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న దొంగలను సీసీఎస్, కేయూ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత తెలిపారు. సోమవారం సాయంత్రం కమిషనరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. బైక్‌ల చోరీలు చేసిన తరువాత నిందితులు అనంతరం చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్నట్లు ఆమె తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో నమోదైన కేసుల్లో బైక్‌ల రికవరీ కోసం సెంట్రల్ జోన్ డీసీపీ కవిత ఆధ్వర్యంలో అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకుని నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. మంచిర్యాల ఎన్టీపీసీ కాలనీకి చెందిన దొంతుల ప్రశాంత్ కుమార్, మంచిర్యాల జిల్లా జైపూర్ గ్రామానికి చెందిన దుర్గం సాయి కార్తీక్ సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ద్విచక్ర వాహనాలను చోరీ చేసినట్లు తెలిపారు. తనిఖీల సమయంలో నిందితులు ప్రయాణిస్తున్న బైక్‌ను స్వాధీనం చేసుకుని విచారించగా నిందితులు వివిధ ప్రాంతాల్లో దాచిపెట్టిన వాహనాల వివరాలు వెల్లడించినట్లు తెలిపారు. కేయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని మునిపల్లి గ్రామం, ఎల్కతుర్తి శివారులో 28 బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ పేర్కొన్నారు. వాహనాల చోరీలు ఇలా... నిందితులు వరంగల్ పోలీస్ కమిషనరేట్‌తోపాటు పలు జిల్లాలో వాహనాల చోరీలకు పాల్పడినట్లు సీపీ తెలిపారు. వరంగల్ కమిషనరేట్‌లో–8, కరీంనగర్ కమిషనరేట్‌లో –9, రామగుండం కమిషనరేట్ పెద్దపల్లిలో –3, సిద్దిపేట కమిషనరేట్‌లో –2 హైదరాబాద్ కమిషనరేట్‌లో–3, రాచకొండ కమిషనరేట్‌లో –1, భూపాలపల్లి జిల్లాలో –2 మొత్తం 28 బైక్‌లు చోరీ చేసినట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో హనుమకొండ ఏసీపీ నరసింహరావు, సీసీఎస్ ఏసీపీ సదయ్య, కేయూ ఇన్స్పెక్టర్ సుంకరి రవికుమార్, సీసీఎస్ ఇన్స్పెక్టర్లు రాఘవేందర్, హరికృష్ణ, రామకృష్ణ, సిబ్బందిని సీపీ అభినందించారు. -
రాజన్నకు బంగారు గొలుసు
వేములవాడ: పట్టణంలోని బ్రహ్మంగారివీధికి చెందిన విద్యాసాగర్–సురేఖ దంపతులు రాజన్నకు రూ.3.50 లక్షల విలువైన బంగారు గొలుసును సోమవారం ఆలయ ఈవో రమాదేవి, అధికారులకు అందజేశారు. దాతలకు దేవస్థానం తరఫున అధికారిక రసీదును జారీ చేసి విరాళం స్వీకరించారు. ఆలయ డీఈవో నవీన్‌కుమార్, ఉద్యోగులు పాల్గొన్నారు. రూ.30 లక్షలు వెచ్చించినా దక్కని ప్రాణంకథలాపూర్(వేములవాడ): మండలంలోని ఇప్పపెల్లికి చెందిన అతికెం ధనుంజయ్(55) రోడ్డు ప్రమాదంలో గాయపడి.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. ధనుంజయ్ గతేడాది నవంబర్ 11న బైక్‌పై పెట్రోల్‌బంక్‌కు బయల్దేరాడు. రోడ్డు దాటుతుండగా కారు వచ్చి ఢీకొట్టింది. తలకు తీవ్రగాయాలైన ఆయనను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. సుమారు 8 నెలలపాటు ఆసుపత్రిలో చికిత్స పొందగా రూ.30 లక్షల వరకు ఖర్చయినట్లు బంధువులు తెలిపారు. అయినప్పటికీ పరిస్థితి విషమించి సోమవారం రాత్రి మృతిచెందినట్లు పేర్కొన్నారు. ధనుంజయ్‌కి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికిరణ్ తెలిపారు. కానిస్టేబుల్ రాసలీలలు.. సస్పెన్షన్ముస్తాబాద్(సిరిసిల్ల): ఓ మహిళతో కానిస్టేబుల్ రాసలీలలపై జిల్లా పోలీస్ అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ముస్తాబాద్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్, ఓ మహిళతో చనువుగా ఉన్నాడు. సిద్దిపేట జిల్లా రాజక్కపేట శివారులో సదరు మహిళతో కానిస్టేబుల్ సన్నిహితంగా ఉండగా గమనించిన రైతు వీరిని ప్రశ్నించాడు. పంట పొలాల్లో ఈ పాడు పనిలేమిటని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో కానిస్టేబుల్ సదరు రైతును బెదిరించడంతో.. ఆ వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియో జిల్లా పోలీస్ అధికారులకు చేరడంతో క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. అయితే ఈ వీడియో పక్షం రోజుల క్రితం తీసిందని చర్చ సాగుతోంది. బాధ్యతాయుతమైన వృత్తిలో ఉంటూ వివాహేతర సంబంధం కొనసాగించడంపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సదరు కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విధి నిర్వహణలో ఉంటు హద్దులు మీరి ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదిలా ఉండగా ముస్తాబాద్ ఠాణాలో గతంలో పనిచేసిన మరో ఇద్దరు కానిస్టేబుళ్ల అక్రమ వ్యవహారాలపై కూడా విచారణ సాగుతున్నట్లు సమాచారం. మూడోసారి మింగేసిన మద్యం మత్తు పెద్దపల్లి: మద్యం మత్తులో ఇప్పటికే రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించిన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామానికి చెందిన ముత్యాల రాజగోపాల్(36) మూడోసారీ యత్నించడంతో చనిపోయాడు. కుటుంబ సభ్యులు వ్యవసాయ పనులకు వెళ్లి సోమవారం సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా చనిపోయి కనిపించడంతో బోరుమన్నారు. మద్యం తాగొద్దని కుటుంబ సభ్యులు వినక పోగా.. ఆ మత్తులో రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబసభ్యులు వారించడంతో బతికిపోయాడు. కానీ, మద్యం మానేయలేదు. సోమవారం మద్యం తాగి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మత్తులో ఉరివేసుకుని చనిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి తండ్రి కుమారస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై చంద్రకుమార్ తెలిపారు. -
వాహిని షాపింగ్‌మాల్ ప్రారంభం
మంచిర్యాలటౌన్: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఇక్బాల్ అహ్మద్‌నగర్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన వాహిని షాపింగ్‌మాల్ సోమవారం సినీనటి క్రితిశెట్టి జ్యోతి ప్రజ్వలన చేయగా, ఓంప్రకాశ్ జాజు చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సినీనటి క్రితి శెట్టి మాట్లాడుతూ.. వాహిని షాపింగ్‌మాల్‌లో వైరెటీ చీరలు, చిన్న పిల్లల బట్టలు, మెన్స్‌వేర్ చాలా వైరెటీలు ఉన్నాయన్నారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు ఉన్నా వాహిని షాపింగ్ మాల్లో షాపింగ్ చేయాలని కోరారు. వాహిని షాపింగ్ మాల్లో కస్టమర్లకు మంచి ఆఫర్లను అందిస్తున్నామని, ఈ అవకాశాన్ని నగర, జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ యజమాని వేముల వెంకటేశ్వర్లు, శ్రీకాంత్, అనిల్, ప్రశాంత్, శ్రీనివాస్, విష్ణు, వేణుగోపాల్ జాజు, నవనీత్ బంగ్, శ్రీరామ్ జాజు, దేవరాజు, నాగరాజు, నటరాజ్, నందరాజ్, కొమురవెల్లి రవితేజ, గాజుల అరుణ్ పాల్గొన్నారు. -
పాఠశాలల్లో గ్రంథాలయాలు
కథలాపూర్: సెల్‌ఫోన్, కంప్యూటర్ యుగంలో విద్యార్థుల్లో క్రమంగా పుస్తక పఠనం అలవాటును పునరుద్ధరించడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందుకోసం ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. జిల్లాలో మొదటి దశ కింద 18 ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటు చేయనుంది. ఎంపికై న బడుల్లో గ్రంథాలయం నిర్వహణకు తొలుత రూ.15వేలను పాఠశాల కమిటీ పేరిట నిధులు జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఏర్పాట్లు పూర్తి చేసి గ్రంథాలయం నిర్వహిస్తే ప్రతినెలా రూ.వెయ్యి చొప్పున అందించనున్నారు. గ్రంథాలయాల్లో కథలు, జీవితచరిత్రలు, సైన్స్, సాహిత్యం, పోటీ పరీక్షలు, బాల సాహిత్యం పుస్తకాలు అందుబాటులో ఉంటాయని గ్రంథాలయం శాఖ అధికారులు తెలిపారు. ఎంపికై న జెడ్పీ హైస్కూళ్లు ఇవే.. కథలాపూర్ మండలంలో కథలాపూర్, అంబారిపేట, బీర్పూర్ మండలంలో తుంగూర్, జగిత్యాల రూరల్ మండలంలో పొరండ్ల, జగిత్యాల పట్టణంలో పురాణిపేట, ఓల్డ్ హైస్కూల్, మేడిపెల్లి మండలంలో కొండాపూర్, మల్లాపూర్ మండలంలో వీవీ.రావుపేట, మెట్పల్లి పట్టణంలో బాలికల, బాలుర పాఠశాల. కోరుట్లలో బాలుర, ప్రభుత్వ పాఠశాల, రాయికల్ మండలంలో భూపతిపూర్, అల్లీపూర్, రాయికల్ బాలికల పాఠశాల, వెల్గటూర్ మండలంలో వెల్గటూర్, ధర్మపురిలో బాలికల పాఠశాల, గొల్లపల్లి మండలంలో చిల్వకోడూర్ పాఠశాలలు ఎంపికయ్యాయి. గ్రంథాలయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రాథమిక స్థాయి నుంచే చదవడంపై దృష్టిసారించాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గ్రంథాలయాల ఆవశ్యకతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. పోటీ పరీక్షలకు అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. – శంకరయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి -
గ్రామపాలన బలోపేతం
జగిత్యాలరూరల్: గ్రామ పాలన వ్యవస్థను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి 45 రోజులకు ఒకసారి ఎంపీడీవో కార్యాలయాల్లో సాధారణ సర్వసభ్య సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం సంబంధిత అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. 2024 జూన్ 24న పాలకవర్గ సభ్యుల పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు పరిషత్ సమావేశాలు నిర్వహించలేకపోయారు. గతంలో ఎంపీపీ అధ్యక్షతన ఎంపీడీవో ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశం ఏర్పాటు చేసేవారు. జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు హాజరయ్యేవారు. పరిషత్ సభ్యుల పదవీకాలం ముగియడంతో మండలాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించి పాలన కొనసాగిస్తున్నారు. అధికారులను నియమించినప్పటికీ సమావేశాలు మాత్రం నిర్వహించలేదు. ఈ క్రమంలో అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేసి.. అనంతరం ప్రతి 45 రోజులకోసారి నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంక్షేమం, సమస్యలపై చర్చ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన పథకాల అమలు, గ్రామాలవారీగా నెలకొన్న సమస్యలపై సభ్యులు చర్చించనున్నారు. గ్రామాల్లో నెలకొన్న ప్రధాన సమస్యలు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కీలక సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి తీసుకునే నిర్ణయాలపై తీర్మానాలు చేస్తారు. వీటితో పాటు అధికారుల తీరుపై ప్రశ్నిస్తారు. ఫలితంగా గ్రామ పరిపాలన వ్యవస్థ బలోపేతం అయ్యే అవకాశాలు ఉంటాయి. పరిషత్ సభ్యులు లేకుండా .. సాధారణంగా మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షతన కోరం సభ్యులతో నిర్వహిస్తారు. ప్రస్తుతం పరిషత్ సభ్యులు లేకుండానే సమావేశం నిర్వహించనున్నారు. మండల ప్రత్యేక అధికారి తప్పనిసరిగా హాజరు కావాలి. జిల్లా వ్యాప్తంగా 20 మండలాల పరిధిలో 385 గ్రామపంచాయతీలు ఉన్నాయి. మండల కేంద్రాల్లో నిర్వహించే సమావేశాలకు ఆయా గ్రామపంచాయతీల సర్పంచులు హాజరుకానున్నారు. జిల్లాలోని అన్ని మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రతి 45 రోజులకోసారి మండలస్థాయి అధికారులు, సర్పంచులతో సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మండల పరిషత్ సమావేశాలు ఇప్పటికే నిర్వహణ కొనసాగుతోంది. – మదన్మోహన్, జిల్లా పంచాయతీ అధికారి -
నృసింహాలయంలో మంత్రి అడ్లూరి పూజలు
ధర్మపురి: శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఆదివారం పూజలు చేశారు. ముందుగా మంత్రికి ఆలయం పక్షాన పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి శేషవస్త్రం కప్పి తీర్థ ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎస్.దినేష్, సూపరింటెండెంట్ అలువాలు శ్రీనివాస్ తదితరులున్నారు. ఘనంగా సంకటహర చతుర్థిధర్మపురి: సంకటహర చతుర్థి సందర్భంగా ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి అనుబంధం శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని మహాగణపతికి ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితులు పాలెపు ప్రవీణ్‌కుమార్ మంత్రోచ్ఛరణలతో స్వామివారికి అభిషేకం, హారతి, మంత్రపుష్పం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. బీఆర్ఎస్ హయాంలోనే వ్యవసాయానికి ప్రాధాన్యం వెల్గటూర్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే వ్యవసాయం, సాగునీటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని, వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని మాజీమంత్రులు కొప్పుల ఈశ్వర్, తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. మండలంలోని కోటిలింగాల పుణ్యక్షేత్రంలో శ్రీపార్వతికోటేశ్వర స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ పరిశీలించారు. రాష్ట్రం ఏర్పడక ముందు కూడా గోదావరి ప్రవహించిందని, అప్పటి ప్రభుత్వాలు ప్రాజెక్టులు ఎందుకు నిర్మించలేదో తెలపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక వ్యవసాయం, నీటిపారుదల రంగానికి ప్రాధాన్యత ఇచ్చి.. ఎల్లంపల్లిని కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా రీడిజైన్ చేసి.. గోదావరి జలాలను రాష్ట్రమంతా అందించారని గుర్తు చేశారు. కాళేశ్వరం పూర్తికాకముందు ఎల్లంపల్లి కేవలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మాత్రమేనని, కాళేశ్వరం అనేక రిజర్వాయర్లు, పంప్‌హౌస్‌లు, కాలువల కలయిక అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎల్.రమణ, మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, దాసరి మనోహర్ రెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్లు తుల ఉమ, దావ వసంత, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఎస్సారెస్పీకి తగ్గిన వరదజగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు తగ్గుముఖం పట్టింది. ఆదివారం సాయంత్రం ఆరు గంటల వరకు 19,457 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు నీటిమట్టం 1091 అడుగులకు ప్రస్తుతం 1074.60 అడుగులుగా ఉంది. నీటి నిల్వ 80.5 టీఎంసీలకు 31.918 టీఎంసీలకు చేరింది. -
మహాపురాణ ప్రవచనం
కోరుట్ల: పట్టణంలోని వాసవీ కల్యాణ మండపంలో ధర్మప్రచార సమితి ఆధ్వర్యంలో అష్టాదశ మహాపురాణ ప్రవచన జ్ఞానయజ్ఙంలో భాగంగా ఆదివారం మహాపురాణ ప్రవచన సప్తాహం నిర్వహించారు. శృంగేరి శారదాపీఠం ఆస్థానపౌరాణికులు, గర్రెపల్లి మహేశ్వర శర్మ ప్రవచనాలు ఇచ్చారు. కాంతిని ప్రసాదించి కాపాడే సూర్య భగవానుడే ప్రత్యక్ష దైవమన్నారు. ధర్మ ప్రచార సమితి అధ్యక్షుడు మంచాల జగన్, అయ్యప్ప ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు చిద్రాల నారాయణ, బట్టు హరికృష్ణ, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పడిగెల శ్రీనివాస్, నిర్వాహకులు మంచాల రాజలింగం పాల్గొన్నారు. -
వానాకాలం గట్టెక్కినట్టే..!
హమ్మయ్యా.. జగిత్యాలఅగ్రికల్చర్: ఎల్‌నినో ప్రభావంతో వారం క్రితం 52శాతం లోటు వర్షపాతం ఏర్పడగా.. వేసిన పంటలు పండుతాయో..లేదోనన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. అలాంటి తరుణంలో మూడు రోజుల క్రితం కురిసిన వర్షాలు రైతులకు భారీగా ఊరటనిచ్చాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు లోటు నుంచి 21 శాతం అధిక వర్షాపాతానికి చేరింది. చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండి మత్తళ్లు దూకాయి. సాధారణ వర్షపాతం 451.1 మిల్లీమీటర్లు జూన్ ఒకటో తేదీ నుంచి ఆగస్టు 2 వరకు జిల్లా సాధారణ వర్షపాతం 451.1 మిల్లీమీటర్లు కాగా.. ఇటీవల కురిసిన వర్షాలతో 547 మిల్లీమీటర్లకు చేరింది. ఈ లెక్కన ఏకంగా 21 శాతం అధిక వర్షపాతం నమోదైంది. అయితే గొల్లపల్లి మండలంలో 8 శాతం, భీమారంలో 7, ఇబ్రహీంపట్నంలో 2, కథలాపూర్‌లో ఒక శాతం ఇంకా లోటుగానే ఉంది. వెల్గటూర్ మండలంలో 87శాతం, బుగ్గారంలో 55, సారంగాపూర్‌లో 54, ఎండపల్లిలో 45, ధర్మపురిలో 37, బీర్పూర్లో 33, మల్యాలలో 34, రాయికల్‌లో 26, మేడిపల్లిలో 21శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. మల్లాపూర్‌లో 18, జగిత్యాల రూరల్‌లో 12, జగిత్యాలలో 8, కోరుట్లలో 6, మెట్పల్లిలో 4, కొడిమ్యాలలో 8 శాతం చొప్పున సాధారణ స్థాయి వర్షపాతం నమోదైంది. పొదుపుగా వాడుకుంటే రెండు పంటలకు నీరు మూడు రోజులు కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు, బావులు జలకళను సంతరించుకున్నాయి. ప్రస్తుతం ఉన్న నీటిని పొదుపుగా వాడుకుంటే ఈ వానాకాలంతోపాటు యాసంగి పంటలకు కూడా సరిపోయే అవకాశం ఉంది. అయితే చాలా చెరువుల్లోని నీటిని ఇష్టారాజ్యంగా పొలాలకు వదులుతుండటంతో యాసంగి నాటికి నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉంది. వరదకాలువలో 0.5 టీఎంసీ నీరు మల్యాల: మొన్నటివరకు చుక్కనీరు లేని వరదకాలువ ఎత్తిపోతలతో జలకళ సంతరించుకుంది. ఎగువన ఉన్న ఎస్సారెస్పీని నింపేందుకు తవ్విన ఈ వరదకాలువ మల్యాల మండలంలో 60వేల ఎకరాలకు ఆధారమవుతోంది. వరదకాలువలో ఆరు కిలోమీటర్ల దూరం సుమారు 0.5 టీఎంసీ నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నీటితో వానాకాలం గట్టెక్కనుంది. ఎస్సారెస్పీలో నీరు లేనప్పుడు రివర్స్ పంపింగ్ ద్వారా ప్రాజెక్టు నింపేందుకు చేపట్టిన ఈ పథకం కాలువ పొడువునా ఉన్న మండలాల్లోని పంటలకు జీవం పోస్తోంది. రామడుగు గాయత్రి పంప్‌హౌస్ నుంచి వరదకాలువలో నీటిని ఎత్తిపోస్తుండడంతో గ్రావిటీ ద్వారా రాంపూర్ పంప్‌హౌస్‌కు.. అక్కడి నుంచి ఎత్తిపోతల ద్వారా రాజేశ్వరరావుపేట పంప్‌హౌస్‌కు నీరు చేరనుంది. అనంతరం ముప్కాల్ వరకు వరదకాలువలో నీటిని నిల్వ చేయనున్నారు. ఇక్కడి ప్రాంత రైతలందరం వరదకాలువపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్నాం. మొన్నటివరకు కాలువలో చుక్కనీరు లేకపోవడంతో అయోమయంలో పడిపోయాం. ఇప్పుడు భారీ వర్షాలు కురవడం.. కాలువలోకి ఎత్తిపోతలు ప్రారంభం కావడంతో పంటలు సాగు చేసేందుకు సిద్ధమవుతున్నాం. వరదకాలువలో నీటి నిల్వ చేయడం ద్వారా వానాకాలం పంటలకు ఢోకా లేదు. – ముద్దం శ్రీనివాస్, రైతు, నూకపల్లి -
బల్దియా ఆస్తులు ఇక డిజిటల్
జగిత్యాల: బల్దియాలకు స్థిరాస్తులు సర్వసాధారణం. అలాంటి ఆస్తులను గుర్తించి గవర్నమెంట్ ల్యాండ్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఎల్ఐఎస్), డబుల్ ఎంట్రీ అక్రువల్ బెస్ట్ అకౌంటెంటింగ్ సిస్టమ్ (డీఈఏబీఏఎస్)లో తప్పనిసరిగా నమోదు చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లాకేంద్రంలో శ్రీరామ థియేటర్ చౌరస్తాలో బల్దియాకు క్వార్టర్స్, బిల్డింగ్స్, రైతుబజార్ ఉన్నాయి. కొత్తబస్టాండ్ సమీపంలో ఖాళీ స్థలాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు ఉన్నాయి. ఇలా ఆస్తులు ఎక్కడెక్కడున్నాయో గుర్తించి నమోదు చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందులో కొన్ని ఖాళీ స్థలాలు ఆక్రమణలకు గురికాగా.. మరికొన్ని కనుమరుగయ్యాయి. అలాంటి వాటిపై దృష్టి సారిస్తే ప్రభుత్వ స్థలాలు అనేకం బయటకొచ్చే అవకాశాలున్నాయి. జిల్లాలోని కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి, రాయికల్ మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆస్తుల నమోదుకు చర్యలు మున్సిపాలిటీల స్థిరాస్తి వివరాలను జీఎల్ఐఎస్, డీఈఏబీఏఎస్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలన్న ఆదేశాల మేరకు అధికారులు అప్రమత్తమయ్యారు. మున్సిపాలిటీల్లో కొన్ని ఆస్తులు కనుమరుగుకాగా.. మరికొన్ని కబ్జాకు గురయ్యాయి. మున్సిపల్ ఆస్తులను గుర్తించి డిజిటల్ రూపంలో నమోదు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కమిషనర్ల పరిధిలో ఉన్న భూములు, భవనాలు, తదితర ఆస్తుల వివరాలు గుర్తించి ధ్రువీకరించి నమోదు చేయాల్సి ఉంటుంది. మున్సిపల్ ఆస్తుల రిజిస్టర్ కూడా భౌతికంగా, డిజిటల్ రూపంలో నిర్వహించడంతోపాటు ఏటా ఏప్రిల్‌లో సరిచూసుకోవాలని ఆదేశాలు వచ్చాయి. ఆస్తుల నమోదు, మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయకుంటే చర్యలు తీసుకుంటామని కూడా ఆదేశాలు వచ్చాయి. ఈ విషయంలో నిత్యం పర్యవేక్షించాలని ఆర్డీఎంఏకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. మున్సిపల్ స్థిరాస్తులకు సంబంధించి జీఎల్ఐఎస్, డీఈఏబీఏఎస్‌లో డేటాబేస్‌లో నమోదు చేసేలా ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నాం. త్వరలోనే ప్రారంభించి మున్సిపల్ ఆస్తులను గుర్తించి నమోదు చేసి మ్యాపింగ్ పూర్తి చేస్తాం. – సత్యప్రణవ్, మున్సిపల్ కమిషనర్ -
కాకతీయ వర్సిటీ పాఠ్యాంశంగా ‘బతుకు తాడు’
జగిత్యాలటౌన్: జగిత్యాలరూరల్ మండలం హన్మాజిపేటకు చెందిన గీత కార్మికుడు, రచరు ుత శ్రీనివాస్‌గౌడ్ రాసిన బతు కుతాడు నవలను కాకతీయ యూనివర్సిటీ తెలుగు పాఠ్యాంశంగా పొందుపరిచారు. 2026 –27 విద్యాసంవత్సరానికి ఎంఏ తెలుగు ద్వితీయ సంవత్సరం నాలుగో సెమిస్టర్ మూడో పేపర్‌గా నవల ఎంపిక కావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తన సాహిత్యంపై అంబేడ్కర్, ఉస్మానియా వర్సిటీ ఆధ్వర్యంలో పరిశోధనలు చేసినట్లు తెలిపారు. నవలను పాఠ్యాంశంగా ఎంపిక చేసిన వర్సిటీ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. రాజేశ్వర్రావుపేట పంప్‌హౌస్ నుంచి ఎత్తిపోతలు మెట్పల్లి రూరల్: మండలంలోని రాజేశ్వర్రావుపేట పంప్ హౌస్ నుంచి ఆదివారం ఎత్తిపోతలను అధికారులు ప్రారంభించారు. ఎల్లంపెల్లి నుంచి వరదకాలువకు నీటి విడుదల చేయగా రాజేశ్వర్రావుపేట పంప్‌హౌస్‌కు చేరుకున్నాయి. అధికారులు మోటార్లను ఆన్ చేయడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
మిల్లర్ల అక్రమాలు.. విజిలెన్స్‌తో బట్టబయలు
జగిత్యాలరూరల్: ప్రభుత్వం రైతుల నుంచి ఐకేపీ, డీసీఎంఎస్, మెప్మా కొనుగోలు కేంద్రాల ద్వారా కొని జిల్లాలోని రైస్‌మిల్లర్లకు సామర్థ్యాన్ని బట్టి అధికారులు ధాన్యం కేటాయించారు. మిల్లర్లు ధాన్యాన్ని బియ్యంగా మార్చి తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. కానీ.. కొంతమంది మిల్లర్లు ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు విజిలెన్స్ దాడుల్లో వెలుగుచూస్తోంది. సకాలంలో అప్పగించని బియ్యం 2024–25 యాసంగి పంటకు సంబంధించిన ధాన్యం తీసుకున్న 69 మంది రైస్‌మిల్లర్లు సీఎంఆర్‌కు 79,395 టన్నుల బియ్యం అప్పగించాల్సి ఉంది. కానీ వారు బియ్యం అప్పగింతలో జాప్యం చేస్తున్నారు. అలాగే 2025–26 వానకాలంలో 119 మంది మిల్లర్లు సీఎంఆర్‌కు 1,76,951 టన్నుల బియ్యం అప్పగించాల్సి ఉంది. దీనికి కొంత గడువు ఉన్నా.. చాలామంది అధికారుల ఆదేశాలు బేఖాతరు చేస్తూ నిర్లక్ష్యం వహిస్తున్నారు. 2025–26 యాసంగిలో 116 మంది మిల్లర్లు సీఎంఆర్‌కు 3,11,251 టన్నుల బియ్యం అప్పగించాల్సి ఉంది. దీనికి కూడా కొంత గడువు ఉండగా, బియ్యం సేకరణలో కొంత జాప్యం నెలకొంది. వెలుగు చూస్తున్న నిజాలు వాస్తవానికి బియ్యం బకాయి ఉన్న మిల్లర్లకు ధాన్యం కేటాయించొద్దు. అయితే కొందరు మిల్లర్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ నుంచి నేరుగా ఆదేశాలు తెచ్చుకుని ధాన్యం కేటాయింపు చేయించుకున్నారు. వారిలోని కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. మిల్లుల్లో కనిపించని ధాన్యం జిల్లాలో 2024 నుంచి 2025–26 యాసంగికి సంబంధించిన ధాన్యం మిల్లర్లకు కేటాయించగా.. ధాన్యాన్ని సీఎంఆర్ అప్పగించాల్సి ఉంది. కానీ 20 శాతం మంది రైస్‌మిల్లర్లు ప్రభుత్వం నుంచి వచ్చిన ధాన్యాన్ని విక్రయించుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.సకాలంలో బియ్యం అప్పగించాలి ధాన్యం తీసుకున్న మిల్లర్లు నిబంధనల ప్రకారం సీఎంఆర్ అప్పగించాలి. అక్రమాలకు పాల్పడితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు డిఫాల్టర్‌గా ప్రకటించి ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. – జితేంద్రప్రసాద్, జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ -
కలెక్టరేట్ వేదికగా స్నేహం చిగురించి..
కరీంనగర్ అర్బన్: కరీంనగర్‌లోని కలెక్టరేట్లో రెవెన్యూ విభాగంలో పనిచేసే నాయబ్ తహసీల్దార్ నేరేళ్ల కిషన్, భూపాలపల్లి జిల్లా మల్హర్రావు మండల తహసీల్దార్ కుంబాల రవికుమార్, మైన్స్‌లో నాయబ్ తహసీల్దార్(ఎపిక్) భూషణబోయిన రాకేశ్‌కుమార్, వెల్ది ప్రభుత్వ వైద్యశాలలో సీనియర్ అసిస్టెంట్ ఎడ్ల వసంత్, నిజామాబాద్ జిల్లా రూరల్ నాయబ్ తహసీల్దార్ వినయ్‌సాగర్ 2012లో కరీంనగర్ కలెక్టరేట్లో ఉద్యోగులే. జూనియర్ అసిస్టెంట్లుగా ఉన్నప్పుడే చిగురించిన వీరి స్నేహం కష్టసుఖాల్లోనూ తోడునీడగా నిలుస్తోంది. ఉద్యోగ రీత్యా మొదలైన స్నేహం ఆదర్శంగా నిలుస్తోంది. -
వసతుల కల్పనకు ప్రాధాన్యం
● రూ.74 లక్షలతో కరెంట్ తీగల షిఫ్టింగ్ ● ప్రజా ప్రభుత్వంలో నిరుపేదలకు సంక్షేమం ● మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్గొల్లపల్లి: ధర్మపురి నియోజకవర్గంలో విద్యుత్ వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తెలిపారు. గొల్లపల్లి మండలంలో రూ.74 లక్షల వ్యయంతో 11 కేవీ, 33 కేవీ విద్యుత్ తీగల షిఫ్టింగ్ పనులకు శ్రీకారం చుట్టామన్నారు. మండలకేంద్రంలో సంబంధిత అధికారులతో శనివారం పనులను ప్రారంభించారు. విద్యుత్ వ్యవస్థ బలోపేతం కోసం ప్రభుత్వం రూ.4 కోట్లు మంజూరు చేస్తే.. ఒక్క గొల్లపల్లి మండలానికే రూ.2.3 కోట్ల నిధులు కేటాయించామన్నారు. విద్యుత్ లైన్ల షిఫ్టింగ్ పనులను నాణ్యతతోపే పూర్తి చేయాని సూచించారు. అనంతరం 75 మందికి రూ.25.63 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ నల్ల నీరజ, గ్రంథాలయ చైర్మన్ సంగనభట్ల దినేష్, ఏఎంసీ చైర్మన్ బీమ సంతోష్, విద్యుత్ శాఖ ఎస్ఈ బి.సుదర్శనం, డీఈఈ గంగారాం, ఏడీఈ వరుణ్ కుమార్, ఏఈ రాకేష్ కుమార్, ఉపసర్పంచ్ జి.బుచ్చిరెడ్డి, సబ్ ఇంజినీర్లు పాల్గొన్నారు. ప్రతి ఎకరాకూ సాగు నీరు వెల్గటూర్: సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరానికీ నీరు అందిస్తామని మంత్రి తెలిపారు. మండలంలోని స్తంభంపల్లిలోని చెరువును పరిశీలించారు. వర్షాలకు చెరువు ప్రమాదకరంగా మారడంతో శాశ్వత రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్తంభంపల్లి లిఫ్ట్, చెరువు మత్తడి, తూముల వెడల్పు పనులకు రూ.5లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శైలేందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ తిరుపతి, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు. -
ఖైదీల్లో మార్పు రావాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్న పద్మావతి జగిత్యాలజోన్: జైలు జీవితంతో ఖైదీల్లో మార్పు రావాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతి సూచించారు. జగిత్యాల స్పెషల్ సబ్ జైలును శనివారం సందర్శించారు. క్షణికావేశంలో చేసిన తప్పులకు జైలుకు వస్తున్నారని, బయటకు వెళ్లిన తర్వాత మార్పు తెచ్చుకుని సమాజంలో ఉన్నతంగా ఎదగాలని తెలిపారు. మొదటి అదనపు జిల్లా జడ్జి జి.సునీత మాట్లాడుతూ నేరమయ జీవితానికి అలవాటుపడితే కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయన్నారు. న్యాయ సేవా సంస్థ కార్యదర్శి, సబ్ జడ్జి నాగేశ్వర్ రావు మాట్లాడుతూ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. జైలర్ మొగిలేషు, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కటుకం చంద్రమోహన్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ విజయ్‌కుమార్, రమాదేవి పాల్గొన్నారు. రాంపూర్ పంప్‌హౌస్ ఎత్తిపోతలు ప్రారంభంమల్యాల: ఎల్లంపల్లి పంప్‌హౌస్ నుంచి నంది, గాయత్రి పంప్‌హౌస్ ద్వారా నీటిని మధ్యమానేరు, వరదకాలువకు ఎత్తిపోస్తున్న విషయం తెల్సిందే. తాజాగా మండలంలోని రాంపూర్ పంప్‌హౌస్ వద్ద అధికారులు మోటార్లను ఆన్ చేసి కాలువలకు ఎత్తిపోస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు పంప్‌హౌస్‌ను సందర్శించి కుంకుమపూజ, హారతి ఇచ్చి సంబురాలు చేసుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ బద్దం తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బత్తిని శ్రీనివాస్‌గౌడ్, నక్క అనిల్, గ్యాదం కుమార్, నాయకులు నల్ల తిరుపతిరెడ్డి, మరాటి సత్తయ్య, కొల్లూరి గంగాధర్, మ్యాక లక్ష్మణ్, దిండు ప్రవీణ్, కంచర్ల లక్ష్మణాచారి, కటుకం వినయ్‌కుమార్, పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకుఎంపికధర్మపురి: మండలంలోని మగ్గిడి సోషల్ వెల్ఫేర్ విద్యార్థులు ఇటీవల నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ రమేశ్ తెలిపారు. జిల్లా కేంద్రంలో జూలై 24న నిర్వహించిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌లో రాణించారు. పరుగు పందెంలో ఎం.రితిక్ 60 మీటర్లు, ఎం.రిషి 400మీటర్లు, విఘ్నేష్ 600మీటర్లు, టి.రిషి 200 మీటర్లు, ఆర్.మణి ప్రతిభ చూపారు. బి. హర్షవర్దన్ షాట్‌ఫుట్‌లో ప్రతిభను కనబర్చాడు. విద్యార్థులను ప్రిన్సిపాల్ అభినందించారు. ఇబ్రహీంపట్నం విద్యార్థి ఇబ్రహీంపట్నం: మండలకేంద్రంలోని పీఎంశ్రీ జెడ్పీ ఉన్నత పాఠశాల తొమ్మిదో తరగతి వి ద్యార్థి బి.జశ్వంత్ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ (జావెలెన్త్రో) పోటీలకు ఎంపికయ్యాడు. హెచ్ఎం రాజన్న మెడల్ అందించి అభినందించారు. పీడీ రాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎస్సారెస్పీకి 83,956 క్యూసెక్కుల ఇన్ ఫ్లోజగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి శనివారం సాయంత్రం 6 గంటల వరకు 83,956 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ప్రాజెక్టు నీటిమట్టం 1091 అడుగులకు ప్రస్తుతం 1072.9 అడుగులకు చేరింది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 80.5 టీఎంసిలకు, ప్రస్తుతం 28.541 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు నుంచి 822 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాకతీయ కాలువకు 300 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. -
‘సకుటుంబ’ స్నేహితులు
కోరుట్లటౌన్: కోరుట్ల పట్టణానికి చెందిన గుర్రాల అమరేందర్, తడుక వెంకటరమణ, శ్రీపతి రమేశ్, జోగిన్‌పెల్లి కృష్ణమోహన్‌రావు, ఖాందేశి ఉత్తమ్‌కుమార్, తిరుమల శ్రీధర్, రాచకొండ వెంకటేశ్, జిల్లా ధనుంజయ్, మండలోజు నరేందర్, రుద్రంగికి చెందిన రానవేని శ్రీనివాస్, వెగ్యారపు చంద్రశేఖర్, ఆకుల గంగాధర్ చిన్నతనం నుంచి స్నేహితులు. వీరు వివిధ ప్రాంతాల్లో వృత్తి, ఉద్యోగరీత్యా కొనసాగుతున్నా ప్రతినెల 10వ తేదీన గత 26ఏళ్లుగా కలుసుకుంటున్నారు. ప్రతి స్నేహితుడి పెళ్లిరోజు ఆరు గ్రాముల బంగారం కానుకగా ఇస్తున్నారు. మూడేళ్లకోసారి సకుటుంబ సమేతంగా తీర్థయాత్రకు వెళ్లి తమ అనుబంధాలను కాపాడుకుంటున్నారు. -
విద్యార్థులు ఉన్నత లక్ష్యం కోసం తపించాలి
జగిత్యాలజోన్: విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని.. ఆ మేరకు కష్టపడాలని జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి నాగేశ్వర్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలసదన్‌ను శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. విద్యార్థులు క్రమశిక్షణతోపాటు చట్టాల పట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు. సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని కోరారు. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కె.చంద్రమోహన్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ విజయకృష్ణ, అనురాధ పాల్గొన్నారు. -
ఆత్మబంధువు!
స్నేహ బిందువు.. జగిత్యాల: స్నేహబంధం చాలా గొప్పది. ఓపెన్‌గా మాట్లాడుకోవడం, ఏ సమస్య ఉన్నా చెప్పుకోవడం ఒక స్నేహితులతోనే ఉంటుంది. నా బెస్ట్ ఫ్రెండ్ కడలి జయకృష్ణ. బీటెక్ పూర్తయ్యాక అమెరికాలో స్థిరపడదామని అనుకున్న. జయకృష్ణ వాళ్ల అక్కయ్య ఢిల్లీలో సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నారు. ఆ సమయంలో జయకృష్ణ నన్ను ఐఏఎస్‌కు ప్రిపేర్ కావాలని సూచనలు ఇచ్చాడు. అమెరికాకు వెళ్లకుండా ఢిల్లీ వెళ్లి జయకృష్ణ వాళ్ల అక్కయ్య ప్రోత్సాహంతో సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యా. ఐఏఎస్ రావడంలో ఒకింత జయకృష్ణ పాత్ర కూడా ఉంది. జయకృష్ణ ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. నిత్యం ఫోన్లో మాట్లాడుకుంటాం. – సత్యప్రసాద్, కలెక్టర్, జగిత్యాలసప్తగిరికాలనీ(కరీంనగర్): ఒకప్పుడు స్నేహమంటే ఒకే బెంచ్, ఒకే వీధి, ఒకే ఊరు. ఇప్పుడు స్నేహమంటే ఒకే స్క్రీన్, ఒకే గ్రూప్, ఒకే వీడియో కాల్. కాలంతో పాటు మనుషులు మారారు. స్నేహం కొత్త రూపం దాల్చింది. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్, టెలిగ్రామ్ నేటితరం జీవితంలో నిజమైన దోస్త్‌గా మారాయి. చిన్ననాటి స్నేహితులను మళ్లీ కలిపే వేదికగా, కొత్త పరిచయాలకు పునాదులుగా మారుతున్నాయి. సోషల్ మీడియా ప్రపంచాన్ని అరచేతిలోకి తీసుకొచ్చింది. పుట్టినరోజు శుభాకాంక్షలు, జ్ఞాపకాల ఫొటోలు, రీయూనియన్లు.. ఇవన్నీ డిజిటల్ వేదికలతో సాధ్యమయ్యాయి. వాట్సాప్‌లో వచ్చిన ఒక మెసేజ్‌తో రక్తదానం చేసిన స్నేహితులు, క్రౌడ్ ఫండింగ్ ద్వారా రూ.లక్షలు సేకరించి వైద్యం చేయించినవారు.. వరదలు, ప్రమాదాల సమయంలో తమ ప్రాణా లను సైతం ఫణంగా పెట్టి స్నేహితులను కాపాడిన ఘటనలు నిజమైన స్నేహానికి నిర్వచనాలు.బంధంగా పుట్టకపోయినా.. అనుబంధంగా రూపుదిద్దుకుని.. కలిసిన సమయం నుంచి.. కడదాకా నీడనిచ్చేదే స్నేహం..! అమ్మ జన్మనిస్తే.. నాన్న జీవితాన్ని ఇస్తాడు.. స్నేహితుడు బతుకుదారి చూపుతాడు..!! బుడిబుడి అడుగులతో మొదలయ్యే స్నేహం జీవిత చరమాంకం వరకు కొనసాగుతుంది. బడిబాటతో ముడిపడి.. జీవితంలో స్థిరపడే వరకు వెన్నంటే నడుస్తుంది. ఒకసారి ఫ్రెండ్ అనుకుంటే జీవితకాలం కష్టసుఖాల్లో తోడుగా నిలుస్తారు. అందుకే స్నేహమంటే రెండక్షరాల పదమే కాదు.. రెండు హృదయాల బంధం.. ఈ ప్రపంచంలో స్నేహితులు లేని వ్యక్తి ఉండరంటే అతిశయోక్తి కాదు. అలాంటి ఫ్రెండ్షిప్కు మారుపేరుగా నిలుస్తున్నారు ఉమ్మడి జిల్లావాసులు.. ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్నారు. ఒకేచోట చదువుకుని.. ఒకే వృత్తిలో కొనసాగుతున్నారు. రాజకీయాల్లో బిజీగా ఉన్నా.. స్నేహితులూ ముఖ్యమంటున్నారు. పలువురు తమ స్నేహానికి గుర్తుకు నెలకోసారి కలుసుకుంటున్నారు. ఆదివారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా కథనం.సిరిసిల్ల: సిరిసిల్లకు చెందిన ప్రముఖ వైద్యులు పి.పెంచలయ్య, ఎన్.వి.రమణరావు, పి.చంద్రశేఖర్ 42ఏళ్ల కిందట మెడిసిన్ చదువుతున్న రోజుల్లో కర్నూల్ మెడికల్ కాలేజీలో స్నేహితులయ్యారు. ముగ్గురు పుట్టి పెరిగిన జిల్లాలు వేరైనా ప్రభుత్వ డాక్టర్లుగా సిరిసిల్లలో స్థిరపడ్డారు. కడపకు చెందిన పెంచలయ్య, నెల్లూరు జిల్లా సర్వేపల్లి మండలం నిడిగుంటపాలెం చెందిన రమణరావు, నెల్లూరు పట్టణానికి చెందిన చంద్రశేఖర్‌కు ఎంబీబీఎస్ కాలేజీ ఫంక్షన్లో స్నేహం కలిసింది. పెంచలయ్య, చంద్రశేఖర్ 1993లో, 1995లో రమణరావు సిరిసిల్లకు వచ్చారు. ఇప్పుడు సర్జన్‌గా పెంచలయ్య, ఆర్థోపెడిక్‌గా రమణరావు, డీఎంహెచ్‌వోగా చంద్రశేఖర్ మంచి గుర్తింపు పొంది ఉద్యోగ విమరణ చేశారు.ఇల్లంతకుంట: ఇల్లంతకుంట పాఠశాలలో ఒకే బెంచీపై కూర్చుని 10వ తరగతి వరకు చదువుకున్న ఇద్దరు మిత్రులు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా కొనసాగుతున్నారు. ఇల్లంతకుంట మండలం ముస్కానిపేట గ్రామానికి చెందిన గుర్రం సందీప్ రెడ్డి, మల్లారం గ్రామానికి చెందిన సింగిరెడ్డి రమణారెడ్డి పదోతరగతి వరకు కలిసి చదువుకున్నారు. గుర్రం సందీప్‌రెడ్డి 2002లో ఉపాధ్యాయుడిగా ఎంపికై , పెద్ద లింగాపూర్‌లో పనిచేస్తున్నాడు. సింగిరెడ్డి మనోహర్‌రెడ్డి 2005లో ఉపాధ్యాయుడిగా ఎంపికై స్కూల్ అసిస్టెంట్‌గా సిద్దిపేట జిల్లాలో పనిచేస్తున్నాడు. ఇప్పటికీ వీరిద్దరి మధ్య స్నేహం కొనసాగుతోంది. -
నా బెస్ట్ ఫ్రెండ్ పృథ్వీరాజ్ చవాన్
సిరిసిల్ల: నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు.. బెస్ట్ ఫ్రెండ్ ఎవరని చెప్పడం కష్టమే. మహారాష్ట్రలో నా బెస్ట్ ఫ్రెండ్ పృథ్వీరాజ్ చవాన్ ఉన్నారు. మేం 14 ఏళ్లుగా స్నేహితులం. నా కాలేజీ రోజుల్లో రూమ్మేట్. అనుకోకుండా ఓ సారి అనారోగ్యం బారిన పడ్డారు. ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయిస్తే కేన్సర్‌గా తేలింది. ఆ సమయంలో నేను అతనికి, అతని కుటుంబానికి అండగా నిలబడ్డాను. అప్పుడు ఐపీఎస్ కాలేదు. కానీ రూ.6లక్షల వరకు ఆర్థిక సాయం అందించాను. పృఽథ్వీరాజ్ చవాన్ ఇప్పుడు కేన్సర్ నుంచి కోలుకున్నారు. సినీ పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఇప్పటికీ మేం ఫోన్లో మాట్లాడుకుంటాం. – మహేశ్ బి గితే, ఎస్పీ, రాజన్న సిరిసిల్ల -
అనారోగ్యంతో మహిళ ఆత్మహత్య
జగిత్యాలక్రైం: జగిత్యాల అర్బన్ మండలం మోతె గ్రామానికి చెందిన తోకల సమత (29) శనివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు.. రాయికల్ మండలం రామాజీపేటకు చెందిన సమతకు మోతె గ్రామానికి చెందిన తోకల మహేశ్‌తో వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె సంతానం. కొద్దికాలంగా సమత అనారోగ్యంతో బాధపడుతోంది. జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. సమత తల్లి ఆర్మూరి లక్ష్మీరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. గంజాయి విక్రయించిన ఇద్దరికి ఏడేళ్ల జైలుజగిత్యాలజోన్: గంజాయి విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడిన ఇద్దరికి ఏడేళ్ల చొప్పున జైలు, రూ.10వేల చొప్పున జరిమానా విధిస్తూ జగిత్యాల మొదటి అదనపు జడ్జి జి.సునీత శనివారం తీర్పు చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ నర్సయ్య కథనం ప్రకారం.. 31 అక్టోబర్ 2023న రాయికల్ మండలం అల్లీపూర్ ఎస్సారెస్పీ కాలువ సమీపంలో పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో అదే మండలం ఒడ్డెలింగాపూర్‌కు చెందిన బోదాసు సతీష్‌కుమార్, జగిత్యాల రూరల్ మండలం అంతర్గాంకు చెందిన బెక్కం రేవంత్ అలియాస్ బిట్టు స్కూటీపై జగిత్యాల నుంచి రాయికల్ వైపు వెళ్తున్నారు. పోలీసులకు అనుమానాస్పదంగా కనబడటంతో తనిఖీ చేశారు. స్కూటీలో గంజాయి ప్యాకెట్లు కనిపించింది. వాటిని అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేశ్లాపూర్ గ్రామానికి చెందిన మేస్రం నాగనాథ్ నుంచి కొని తెచ్చినట్లు చెప్పారు. అప్పటి ఎస్సై అజయ్ ముగ్గురు నిందితులు సతీష్‌కుమార్, రేవంత్, నాగనాథ్పై కేసు నమోదు చేశారు. అప్పటి సీఐ అరీఫ్అలీఖాన్ నిందితులను కోర్టులో హాజరుపర్చారు. కోర్టు మానిటరింగ్ అధికారులు ఎం.కిరణ్‌కుమార్, బి.రాజు, కె.నరేష్ సాక్ష్యాలను చూపడంతో సతీష్‌కుమార్, రేవంత్‌కు ఏడేళ్ల జైలు, ఒక్కొక్కరికి రూ.10 వేల జరిమానా విధించారు. నాగనాథ్పై కేసు నిరూపణ కాకపోవడంతో నిర్దోషిగా ప్రకటించారు. మంజూరైన కోర్టులకు నిధులు ఇప్పించండిధర్మపురి: మంజూరైన అదనపు కోర్టులకు ప్రభుత్వం నుంచి నిధులు ఇప్పించాలని బార్ అసోసియేషన్ న్యాయవాదులు శనివారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. జిల్లా కేంద్రంలోని కోర్టుల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో న్యాయవాదుల సూచన మేరకు హైకోర్టు ఇటీవల ఫ్యామిలీ, అదనపు జుడిషియల్ కోర్టులను మంజూరు చేసింది. వాటికి అవసరమైన నిధులు విడుదల చేయకపోవడంతో కోర్టుల ఏర్పాటులో జాప్యం జరుగుతోంది. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్ర నర్సయ్య, ప్రధాన కార్యదర్శి అందె మారుతి, ఉపాధ్యక్షుడు సత్యం, సీనియర్ న్యాయవాది రాచకొండ శ్రీరాములు పాల్గోన్నారు. -
ఆస్పత్రిలో బయోమెట్రిక్ ఏర్పాటు చేయాలి
రాయికల్: ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు సమయపాలన పాటించాలని, తప్పనిసరిగా అటెండెన్స్ బయోమెట్రిక్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యసేవలు, ఓపీ సేవలు, ల్యాబ్ రికార్డ్స్, మందుల నిల్వను పరిశీలించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మలేరియా, డెంగీ వంటి వైరల్ ఫీవర్లు ప్రబలే అవకాశం ఉందని, మందులు అందుబాటులో ఉంచుకునేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రిలో తాగునీటి సమస్యతోపాటు, పారిశుధ్య వ్యవస్థ సరిగా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి పునరావృతం కావొద్దని జిల్లా కో–ఆర్డినేటర్ రామకృష్ణకు సూచించారు. అనంతరం ఉప్పుమడుగులోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. అక్కడి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆలూరు గ్రామంలో నిర్మిస్తున్న వీవో భవనం, రాజనగర్ గ్రామంలో కల్వర్టు, వీరాపూర్‌లో అంగన్వాడీ కేంద్రం పనులను పరిశీలించారు. ఈనెల 30లోపు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. తహసీల్దార్ నాగార్జున, ఎంపీడీవో చిరంజీవి, మెడికల్ ఆఫీసర్ సతీశ్, జిల్లా ఆస్పత్రి కో–ఆర్డినేటర్ రామకృష్ణ, ఆస్పత్రి సూపరింటెండెంట్ శశికాంత్‌రెడ్డి, డీఈవో రాము పాల్గొన్నారు. -
రైతుబజార్ మెయిన్ గేటుకు తాళం
జగిత్యాల: జిల్లా కేంద్రంలో రైతుబజార్‌ను కొద్దిరోజుల క్రితం వినియోగంలోకి తెచ్చారు. అప్పటివరకు రైతుబజార్ ముందున్న రోడ్డుపైనే రైతులు కూరగాయలు విక్రయించారు. అక్కడ ఆస్పత్రి, కాలేజీ తదితర ఉండటంతో ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. దీంతో వ్యాపారులను రైతుబజార్‌లోకి పంపించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ప్రజలు రైతుబజార్ వెనుక వైపు నుంచే వెళ్లి కొనుగోలు చేసుకోవాలని మెయిన్ గేటు మూసివేశారు. ఫలితంగా ముందు వైపు నుంచి వస్తున్న ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. వెనుక వైపు రూటు చాలా మందికి తెలియదు. గేటు ఎందుకు మూశారో తెలియని పరిస్థితి నెలకొంది. -
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రోళ్లవాగు నీరు వృథా
జగిత్యాలరూరల్: ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రోళ్లవాగు నీరు వృథాగా పోతోందని, గేట్లు బిగించడంలో అధికారులు విఫలం కావడంతో రైతులు, మత్స్యకారులు నష్టపోతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. బీర్‌పూర్‌లోని రోళ్లవాగును జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి శనివారం పరిశీలించారు. రోళ్లవాగు సామర్థ్యం 0.25 టీఎంసీ కాగా.. కేసీఆర్ ఒక టీఎంసీకి పెంచారని గుర్తు చేశారు. యాసంగి సీజన్లోనే గేట్లు అమరుస్తామని చెప్పిన అధికారులు ఇప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. దీంతో వర్షాలకు వచ్చిన నీరు వృథాగా పోతోందన్నారు. దీనికి స్థానిక ఎమ్మెల్యే, మంత్రి బాధ్యత వహించాలన్నారు. రైతులకు 24 గంటల విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తాటిపర్తి చంద్రకృష్ణారెడ్డి, మాజీ జెడ్పీటీసీ కొల్ముల రమణ, మాజీ ఎంపీపీ మసర్థి రమేశ్, సుమన్, సుభాష్‌యాదవ్, సత్యంరావు, జితేందర్యాదవ్, ముక్క శంకర్, ఆకుల రమేశ్, వీరేశ్, ఆకుల రాజిరెడ్డి, తేలు రాజు, రిక్కల ప్రభాకర్, చిక్కుల రవి, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. కారును ఢీకొన్న ఆటో.. ఒకరికి తీవ్రగాయాలుజగిత్యాలక్రైం: జగిత్యాలరూరల్ మండలం తాటిపల్లి శివారులో జగిత్యాల–నిజామాబాద్ ప్రధాన రహదారిపై కారును ఆటో ఢీకొనడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. కరీంనగర్‌కు చెందిన వ్యక్తి తన ఆటోలో బ్లాంకెట్స్ విక్రయించేందుకు బయల్దేరాడు. కారు నిజామాబాద్ వైపు వెళ్తుండగా ఆటో డ్రైవర్ వేగంగా వచ్చి ఢీకొనడంతో ఆటో నుజ్జునుజ్జయ్యింది. కారు కూడా దెబ్బతింది. ఆటో డ్రైవర్‌కు స్వల్పగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. -
తీర ప్రాంతం.. వరద భయం
ధర్మపురి: వర్షాకాలం వచ్చిందంటే చాలు గోదావరి తీరప్రాంత వాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడుపుతారు. వరదలతో ఏటా లక్షలాది రూపాయల ఆస్తి నష్టం జరుగుతోంది. ధర్మపురి పట్టణ అభివృద్ధికి రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా వరద ముప్పును నియంత్రించడంలో అధికారులు, పాలకులు విఫలమయ్యారనే ఆరోపణలున్నాయి. కడెం నుంచి వచ్చే వరదతో.. ఏటా జూలై, ఆగస్టు నెలల్లో గోదావరి ఉగ్రరూపమై తీరప్రాంత వాసులను వరదతో ముంచేస్తోంది. కడెం ప్రాజెక్టు నుంచి వచ్చే వరదతో మండలంలోని ఆరెపెల్లి, దొంతాపూర్, జైనా, రాజారం దమ్మన్నపేట, ధర్మపురికి వరద పోటెత్తుతుంది. దీంతో గోదావరి ఒడ్డునున్న పంట పొలాలు, విద్యుత్ మోటార్లు, స్తంభాలు నీట మునిగి కోట్లాది రూపాయల ఆస్తి నష్టం సంభవించిన ఘటనలున్నాయి. వరదలతో నష్టపోయిన ప్రాంతాలు.. గోదావరి వరద పోటెత్తడంతో ధర్మపురిలోని మంగలిగడ్డ, బ్రాహ్మణ సంఘం, సంస్కృతాంధ్ర కళాశాల, సంతోషిమాత, రామాలయం, బోయవాడ, విద్యుత్ సబ్‌స్టేషన్ నీటిలో మునిగిపోతుంటాయి. వీటితో పాటు వరద ఇళ్లలోకి చేరి వస్తువులు కొట్టుకుపోవడం, సామగ్రి నానిపోయి తీవ్ర ఆస్తి నష్టం సంభవిస్తుంది. గతంలో వరదలతో నష్టపోయిన ముంపు ప్రాంతాలను అధికారులు గుర్తించినా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ప్రతిపాదనలోనే కరకట్ట నిర్మాణం ధర్మపురి తీరప్రాంత వాసులను వరద ముప్పు నుంచి కాపాడేందుకు గతంలో కరకట్ట నిర్మాణం కోసం సర్వే చేసి గాలికొదిలేశారు. కరకట్టను గోదావరిలోని హనుమాన్ గడ్డ నుంచి కింద నున్న మహాలక్ష్మి ఘాట్ వరకు 2 కి.మీ పొడవు నిర్మించేందుకు సర్వే చేపట్టారు. రూ.4 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. కాగా, కరకట్ట నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితమైంది. -
మెట్పల్లిలో ఆర్డీడీ విచారణ
● టీపీవోపై వచ్చిన లంచం ఆరోపణ ● ఉన్నతాధికారులకు చేరనున్న నివేదికమెట్పల్లి: మెట్పల్లి బల్దియాలో టౌన్‌ప్లానింగ్ అధికారిగా పనిచేసిన రాజేంద్రప్రసాద్‌పై వచ్చిన లంచం ఆరోపణలపై ఆ విభాగం వరంగల్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ వందనం శనివారం మెట్‌పల్లికి వచ్చి విచారణ చేపట్టారు. పట్టణంలోని ఆదర్శనగర్‌కు చెందిన జగ్గుల లావణ్య తమ ఇంటిపై మరో అంతస్తు నిర్మాణం కోసం రాజేంద్రప్రసాద్, ఔట్సోర్సింగ్ ఉద్యోగి లింబాద్రి రూ.2లక్షల లంచం తీసుకుని నకిలీ అనుమతి పత్రాలు ఇచ్చారని గతంలో ప్రజావాణిలో కలెక్టర్ సత్యప్రసాద్‌కు ఫిర్యాదు చేసింది. ఫోన్‌పే ద్వారా వారికి చెల్లించినట్లు ఆధారాలు అందించింది. పరిశీలించిన ఆయన టీపీవో అవినీతికి పాల్పడ్డారని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చి జూన్ 16న ఆయనను సస్పెండ్ చేస్తూ.. లింబాద్రిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశౠరు. పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించారు. ఈ మేరకు ఆర్డీడీ మెట్‌పల్లికి వచ్చి మున్సిపల్ కార్యాలయంలో రాజేంద్రప్రసాద్, లింబాద్రి, లావణ్య నుంచి వేర్వేరుగా వివరాలు సేకరించారు. లావణ్య ఇంటిని సందర్శించి ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను పరిశీలించారు. నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తానని, వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని ఆర్డీడీ తెలిపారు. టీపీవోను ఉద్యోగం నుంచి తొలగించాలి ఇంటి నిర్మాణ అనుమతులకు లంచం కోసం వేధింపులకు గురిచేసిన రాజేంద్రప్రసాద్ విషయంలో ఉన్నతాధికారులు సస్పెండ్‌కే పరిమితం కాకుండా ఆయనను ఉద్యోగం నుంచి తొలగించాలని లావణ్య కోరింది. ఇల్లు తన పేరిట లేకున్నా.. నోటీసులు ఇచ్చి అప్పటి కమిషనర్ మోహన్, రాజేంద్రప్రసాద్, లింబాద్రి బ్లాక్మెయిల్ చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆర్డీడీకి పూర్తి వివరాలు అందించానని, మరొకరికి ఇలా జరగకుండా ఉన్నతాధికారులు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. -
వైద్య సదుపాయాల విస్తరణకు కృషి
జగిత్యాల: వైద్య సదుపాయాల విస్తరణకు కృషి చేస్తానని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. పట్టణంలోని మోతె కార్యాలయంలో 80 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.80లక్షల విలువైన చెక్కులను శనివారం అందించారు. మెడికల్ కళాశాలలో 800 పడకలు అందుబాటులో ఉండేలా కృషి చేస్తున్నానన్నారు. డిప్లోమో ఇన్ ఈసీజీ, డయాలసిస్ ట్రైనింగ్, పారామెడికల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. త్వరలోనే వెల్నెస్ సెంటర్ ఏర్పాటవుతుందన్నారు. ట్రామా సెంటర్ రానుందన్నారు. డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, బండ శంకర్, గట్టు సతీశ్, నాగభూషణం పాల్గొన్నారు. శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయాభివృద్ధికి కృషి రాయికల్: రాయికల్ మండలం భూపతిపూర్‌లోని శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయాభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. స్వామివారి ఆలయ కమిటీ చైర్మన్‌గా ఎన్నికై న జక్కుల చంద్రశేఖర్, కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను కలిశారు. గుర్రం భావన, మహేందర్, సింగిల్ విండో మాజీ చైర్మన్ శేఖర్‌రెడ్డి, ఉపసర్పంచ్ సంజీవాచారి, కమిటీ సభ్యులు దిలీప్, జక్కుల సాగర్, మహేందర్, నాగరాజు, అర్చకులు వెంకటకృష్ణ, ప్రదీప్ పాల్గొన్నారు. అవయవదానంతో ఆరుగురి జీవితాల్లో వెలుగుకొడిమ్యాల: మండలంలోని పూడూరుకు చెందిన పొన్నం మల్లేశంగౌడ్ (59) మరణానంతరం చేసిన అవయవదానం ఆ రుగురు జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. మూడురోజుల క్రితం అస్వస్థతకు గురైన మల్లేశంను చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించగా, వైద్యులు బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారించారు. దీంతో భార్య రేణుక, కుమారులు భార్గవ్, భరత్ స్వచ్ఛందంగా అవయవదానానికి అంగీకరించి ఆదర్శంగా నిలిచారు. గోరింటాకు వేడుకల్లో గంగవ్వజగిత్యాలటౌన్: పట్టణంలోని వాల్మీకి ఆవాసం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రంలో శనివారం నిర్వహించిన గోరింటాకు వేడుకల్లో మై విలేజ్‌షో, బిగ్‌బాస్ ఫేం గంగవ్వ, చందు పాల్గొని సందడి చేశారు. గోరింటాకు పండుగ అనాదిగా వస్తున్న సంప్రదాయమని, ఆరోగ్యరీత్యా ఎంతో ఉపయోగకరమైనదని పేర్కొన్నారు. న్యాయవాది భీమనాతిని ఉమాదేవి, ఆర్ఎస్ఎస్ విభాగ్ ప్రముఖ్ భానుచందర్, కౌన్సిలర్ బోయినిపల్లి ప్రశాంత్‌రావు, సేవాభారతి జిల్లా అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, సభ్యులు శ్రీనివాస్, సంపూర్ణాచారి, మధుకర్, సత్యం తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ -
కూరగాయల పంటలకు తీవ్ర నష్టం
జగిత్యాలఅగ్రికల్చర్: ఎడతెరిపి లేకుండా రెండురోజులు కురిసిన వర్షాలకు కూరగాయల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో కూరగాయలు మార్కెట్‌కు రాక వినియోగదారులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. రైతులు ఎక్కువగా సాగు చేసిన టమాట, బీర, సోర, వంకాయ, కొత్తిమీర, పాలకూర వంటి పంటలకు తీవ్ర నష్టం జరిగింది. 130ఎకరాల్లో టమాట, 200ఎకరాల్లో బీర, సోర, కాకర, 40 ఎకరాల్లో వంకాయ, 60ఎకరాల్లో బెండ, మరో 90 ఎకరాల్లో ఆకు కూరలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. వానాకాలం సీజన్ అయిన జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కూరగాయలకు డిమాండ్ ఉంటుంది. మార్కెట్ డిమాండ్‌ను అనుసరించిన కొందరు రైతులు మేలో కూరగాయల విత్తనాలు నాటారు. కలుపు రాకుండా మల్చింగ్ పేపర్ వేశారు. అన్నిరకాల యాజమాన్య పద్ధతులు పాటించడంతో పంట ఏపుగా పెరగడంతో రైతులు సంతోషించారు. పూతను దెబ్బతీసిన వర్షాలు కూరగాయల పంటల్లో పూత నుంచి కాత మొదలవుతున్న తరుణంలో వచ్చిన వర్షాలు కూరగాయల పంటలను దెబ్బతీశాయి. ఫలితంగా రైతుల ఆశలు ఆడియాసలయ్యాయి. కూరగాయల తోటల్లో నీరు నిలిచి, మొక్కలు పసుపు పచ్చగా మారాయి. ఈదురుగాలులకు పూత రాలిపోయింది. వేర్లు కుళ్లిపోయి మొక్కలు చనిపోయాయి. చేతికి వస్తుందనుకుంటున్న తరుణంలో వర్షాలు పడడంతో పెట్టుబడి కూడా రాదని రైతులు అంటున్నారు. పెరుగుతున్న రేట్లు జిల్లాలో సాగు చేసిన కూరగాయలు మార్కెట్‌కు రాకపోవడంతో మహారాష్ట్రలోని నాందేడ్, చిత్తూరు జిల్లాల నుంచి టమాటలు దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఫలితంగా టమాట కిలో రూ.30 వరకు పలుకుతోంది. సోరకాయ రూ.20, బీర రూ.80కి చేరింది. కాకర కిలో రూ50 నుంచి రూ.60, వంకాయలు రూ.40 నుంచి 50 వరకు ఉంది. పాలకూర, తోటకూర వంటివి మార్కెట్లో దొరికే పరిస్థితి లేదు. మిర్చి కిలో రూ.50 నుంచి 60కు చేరింది. -
పూత దశలో దెబ్బ
వానాకాలం సీజన్లో మంచి రేటు వస్తుందని ఎకరం బీర సాగు చేస్తున్న. కాత దశకు చేరుకుంటున్న తరుణంలో ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. నీరు తోటలో నిలిచి పూత రాలిపోయింది. మొక్కలు పసుపు పచ్చగా మారాయి. దాదాపు రూ.50వేల వరకు నష్టం వాటిల్లింది. – మెక్కోండ రాంరెడ్డి, అలూరు, రాయికల్ మం నీరు నిల్వతోనే ఇబ్బంది కూరగాయల పంటలు ఎక్కువగా నీటిని తట్టుకోవు. రెండు, మూడు రోజులు నీరు నిల్వ ఉంటే భూమి నుంచి ఆహారాన్ని తీసుకోక మొక్కలు వడలిపోయి, చనిపోతాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతోనే కూరగాయల పంటలకు ఇబ్బంది కలిగింది. – కట్ట లత, ఉద్యాన శాఖాధికారి, జగిత్యాల -
యువతకు శుభవార్త
నిరుద్యోగులకు ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ఒక శుభవార్త. యూనిఫాం జాబ్ కోరుకునే ప్రతి అభ్యర్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రణాళికతో రాత పరీక్ష కోసం చదవడంతో పాటు శారీరక దృఢత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలి. మంచి ఆహార అలవాట్లతో ఈవెంట్స్ సులభంగా సాధించవచ్చు. సెల్ఫోన్లు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. పోలీస్ ఉద్యోగాలకు మా అకాడమీలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. – ఎర్రంశెట్టి మునీందర్, చైర్మన్, సాన్వీ డిఫెన్స్ అకాడమీ, రేకుర్తి -
రోడ్లు, కల్వర్టులను పునరుద్ధరించాలి
ధర్మపురి: భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. ధర్మపురితో పాటు మండలంలోని నర్సయ్యపల్లె– కొత్త కొరండ్లపల్లె మధ్య దెబ్బతిన్న రోడ్డు, కల్వర్టు, ఆకసాయిపల్లె– నాగారం మధ్య కోతకు గురైన రోడ్డును శుక్రవారం పరిశీలించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో మధుసూదన్, సంబంధిత అధికారులు తదితరులున్నారు. శాశ్వత రక్షణ చర్యలు చేపట్టాలి వెల్గటూర్(ధర్మపురి): మండలంలోని స్తంభంపల్లి చెరువుకు శాశ్వత రక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. ఇటీవల మండలంలో 175.7 మి.మీర్ల భారీ వర్షం కురవడంతో చెరువులో భారీగా వరద చేరింది. చెరువు తూముకు ఆనుకుని గతంలో ఏర్పడిన సింక్‌హోల్‌లో అప్పడు ఇసుక బస్తాలతో తాత్కాళిక చర్యలు చేపట్టారు. ప్రస్తుత వర్షాలకు బస్తాలు కొట్టుకుపోయి ప్రమాదం జరుగుతుందేమోనని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేయగా, సింక్‌హోల్ ప్రాంతాన్ని కలెక్టర్ పరిశీలించారు. పర్యవేక్షించారు. చెరువు భద్రతకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాగా, శుక్రవారం సాయంత్రం నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టడంతో చెరువుకు వరద పూర్తిగా తగ్గింది. దీంతో చెరువు కట్ట, తూముకు ఎలాంటి ముప్పు లేదని అధికారులు స్పష్టం చేశారు. తహసీల్దార్ శేఖర్, ఎంపీడీవో వెంకట్‌ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రణాళికతో సన్నద్ధం కావాలి
పోలీస్ ఉద్యోగం ఉపాధి మాత్రమే కాదు. సమాజ సేవకు లభించే గౌరవప్రదమైన వేదిక. అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా చదవడంతో పాటు శారీరక దారుఢ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. రోజువారీ వ్యాయామం, రన్నింగ్, క్రమశిక్షణతో కూడిన సాధన, మాక్ టెస్టులు విజయానికి కీలకం. సోషల్ మీడియా, వదంతులను నమ్మకుండా అధికారిక నోటిఫికేషన్‌లోని నిబంధనలను పూర్తిగా అధ్యయనం చేయాలి. సరైన మార్గదర్శకత్వంతో సిద్ధమైతే ఈ అవకాశాన్ని ఉద్యోగంగా మార్చుకోవచ్చు. – ఎన్.వెంకట్‌రెడ్డి, డ్రీమ్ డిఫెన్స్ అకాడమీ కరస్పాండెంట్, కరీంనగర్ -
జగిత్యాల
33.0/25.0శనివారం శ్రీ 1 శ్రీ ఆగస్టు శ్రీ 20267గరిష్టం/కనిష్టంఅప్రమత్తంగా ఉండాలి జగిత్యాలరూరల్: విషజ్వరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డెప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామంలో విష జ్వరాలపై ఇంటింటా సర్వే చేపట్టారు. ఎమ్మెల్యేను కలిసిన ఎస్ఈజగిత్యాలరూరల్: జిల్లా రోడ్లు, భవనాల శాఖ ఎస్ఈగా బాధ్యతలు స్వీకరించిన హరిచందర్ శుక్రవారం ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు.వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు వీస్తాయి. -
ఎన్నాళ్లిలా..
జగిత్యాల: జిల్లా కేంద్రంలో చాల్లా ఏళ్ల క్రితం 4–5 ప్రధాన నాలాలు నిర్మించగా శిథిలావస్థకు చేరాయి. పాలకులు మారుతున్నా వాటి గురించి పట్టించుకునే వారు కరువయ్యారు. ముఖ్యంగా పట్టణంలోని గంజ్నాలా సుమారు 2 కి.మీ ఇళ్లను ఆనుకునే ఉంటుంది. దీని రక్షణ గోడలు కూలిపోయి శిథిలావస్థకు చేరడంతో చిన్నారులు, మహిళలు, వృద్ధులు అందులో పడే ప్రమాదముంది. వర్షాలు బాగా కురిస్తే పలుచోట్ల నాలా నీళ్లు ఇళ్లలోకి చేరుతోంది. అలాగే పొన్నాల గార్డెన్స్ నుంచి చింతకుంట చెరువు వరకు ఉన్న నాలా పిచ్చిమొక్కలు, ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయింది. చింతకుంట మత్తడి నుంచి సలీమా గార్డెన్స్ వరకు ఉన్న నాలా సక్రమంగా లేక రెండురోజులు కురిసిన వర్షానికి స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. జేసీబీలతో చెత్తాచెదారం తొలగించడంతో నీళ్లు సాఫీగా వెళ్లాయి. మరో నాలా నర్సింగ్ కళాశాల నుంచి గోవిందుపల్లికి వెళ్లే రోడ్డు వరకు ఉంటుంది. ఇది మోతె వాగులో కలుస్తోంది. ఈ నాలా చాలా వరకు కబ్జాకు గురవడంతో సమీపంలోని ఇళ్లలోకి వరద చేరుతోంది. కబ్జామయం జిల్లాకేంద్రంలోని ప్రధాన నాలాలు, డ్రెయినేజీలు, శిఖం భూములు కబ్జాకు గురయ్యాయి. అయినా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. జగిత్యాల డివిజన్ కేంద్రంగా ఉన్నప్పుడు ధరూర్ వాగును కబ్జా చేసి ఇళ్లు, ఇతర నిర్మాణాలు చేపట్టగా అప్పటి సబ్‌కలెక్టర్ శశాంక అక్రమ కట్టడాలను కూల్చివేసి వాగును పునఃనిర్మించారు. ప్రస్తుతం మళ్లీ కొద్దిపాటి కబ్జాలకు గురికావడంతో వాగు నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. అలాగే భవానినగర్, కృష్ణానగర్, విద్యానగర్‌లో నాలాలపై షాపులు, నివాసాలు కట్టడంతో 12 ఫీట్ల కాలువలు 2–3 ఫీట్లుగా మారాయి. టవర్‌సర్కిల్ ప్రాంతంలో డ్రెయినేజీలపై నిర్మాణాలు చేపట్టడంతో ఇళ్లలోకి మురికినీరు వస్తుందని ఆ ప్రాంతవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని వాపోతున్నారు. రక్షణ గోడలు నిర్మించాలి పట్టణంలోని నాలాలను విస్తరించి, రక్షణ గోడలు నిర్మిస్తే ముంపు ముప్పు ఉండదు. కాలువల్లో షిల్ట్, పిచ్చిమొక్కలు తొలగించడానికి అధికారులు నిధులు కేటాయిస్తున్నారు కానీ రక్షణ గోడలకు కేటా యి ంచడం లేదు. ఇప్పటికై నా నాలాలను విస్తరించి గో డలు నిర్మించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. విస్తరణకు నోచుకోని నాలాలు రక్షణ గోడలు లేక పొంచి ఉన్న ముప్పు పట్టింపులేని అధికారులు -
ఎస్సారెస్పీకి 61,111 క్యూసెక్కుల ఇన్ ఫ్లో
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాకు సాగు, తాగు నీరు అందించే శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు 61,111 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు నీటి మట్టం 1,091 అడుగులకు గాను 1,070 అడుగులకు చేరింది. అలాగే, నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలకు 23.308 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువకు 300, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆవిరి రూపంలో 291 క్యూసెక్కులు వృథా అవుతోంది. నిధులు మంజూరు చేయించాలికోరుట్ల/కోరుట్లరూరల్: మండలంలోని కల్లూర్–సర్పరాజ్‌పూర్ గ్రామాల మధ్య వాగుపై హైలెవల్ వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, కలెక్టర్ సత్యప్రసాద్‌ను కోరారు. శుక్రవారం వంతెనను ఎమ్మెల్యే పరిశీలించారు. వాగు ప్రవాహానికి వంతెనపై భగీరథ పైపులు కొట్టుకుపోవడంతో ప్రజలు నీటికోసం ఇబ్బంది పడే పరిస్థితి ఉందని కలెక్టర్‌కు ఫోన్ ద్వారా వివరించారు. పైపులను వెంటనే పునరుద్ధరించాలని పేర్కొన్నారు. సర్పంచ్ నత్తి రాజ్‌కుమార్, నాయకులు వనతడుపుల అంజయ్య తదితరులు పాల్గొన్నారు. బీర్పూర్లో 140.3 మి.మీ వర్షంజగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో రెండురోజులు గా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా సాధారణ వర్షపాతం 437.4 మి.మీ కాగా, భారీ వ ర్షాలతో 544.0 మి.మీ చేరింది. శుక్రవారం ఉదయం 8 గంటల వరకు బీర్పూర్ మండలంలో అత్యధికంగా 140.3 మి.మీ వర్షపాతం నమోదు కాగా, ఇబ్రహీంపట్నం 60.5, మల్లాపూర్ 65.8, రాయికల్ 77.5, సారంగాపూర్ 110.7, ధర్మపురి 95.0, బుగ్గారం 107.0, జగిత్యాలరూరల్ 74.5, జగిత్యాల 65.7, మేడిపల్లి 71.4, కోరుట్ల 56.6, మెట్పల్లి 77.1, కథలాపూర్ 64.1, కొడిమ్యాల 79.2, మల్యాల 80.8, పెగడపల్లి 65.8, గొల్లపల్లి 83.2, వెల్గటూర్ 129.1, ఎండపల్లి 99.7, బీమారంలో 59.8 మి.మీ నమోదైంది. జిల్లాలో సగటున 83.2 మి.మీ వర్షం కురిసింది. బట్టపల్లి శివారులో కొట్టుకుపోయిన రోడ్డుజగిత్యాలరూరల్: భారీ వర్షాలకు సారంగాపూర్ మండలం బట్టపల్లి శివారు చింతలపల్లి సమీపంలో బతుకమ్మ ఒర్రె ప్రవాహానికి రోడ్డు కొట్టుకుపోయింది. మరమ్మతు చేపట్టాలని సర్పంచ్ మర్రిపల్లి అశ్విని కోరారు. పొలాల్లో ఇసుక మేటలు ధర్మపురి: మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో మండలంలోని దమ్మన్నపేట, రాజారం, జైనా, దొంతాపూర్ గ్రామాల్లోని పంటపొలాల్లో ఇసుక మేటలు వేశాయి. దీంతో బాధిత రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుచున్నారు. ఇళ్లు మంజూరు చేయాలిజగిత్యాలరూరల్: బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి అన్నారు. జగిత్యాల రూరల్ మండలం పొరండ్లకు చెందిన సింగారపు రవి ఇల్లు ఇటీవల వర్షాలకు కూలిపోగా శుక్రవారం పరిశీలించి ఆర్థికసాయం అందజేశారు. రెవెన్యూ అధికారులు బాధితులను గుర్తించి సత్వరమే వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలన్నారు. జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ హరిచరణ్‌రావు, నాయకులు పాల్గొన్నారు. -
యూనిఫాం పిలుస్తోంది!
ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న యువతకు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీజీఎస్ఎల్ పీఆర్బీ) తీపి కబురు తీసుకొచ్చింది. కొన్ని నెలలుగా పోలీసు కొలువు కోసం ఎదురుచూస్తున్న యువత తాజా నోటిఫికేషన్‌తో సాధనను కఠినం చేశారు. పోలీస్ విభాగంలో మల్టీజోన్–1లో ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, రాజన్న సిరిసిల్ల– రాజన్న జోన్), జగిత్యాల– బాసర జోన్, పెద్దపల్లి– కాళేశ్వరం జోన్ పరిధిలోకి వస్తాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో వివిధ విభాగాల ఎస్సై, కానిస్టేబుళ్ల ఖాళీలకు కలిపి మొత్తం 1,061 పోస్టులు భర్తీ చేయనుంది.(ఇందులో రామగుండం కమిషనరేట్‌లోని మంచిర్యాల జిల్లా పోస్టులు కూడా ఉన్నాయి.) ఈ నేపథ్యంలో ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనే వివరాలతో ‘సాక్షి’ కథనం. – సాక్షిప్రతినిధి,కరీంనగర్ -
కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటాం
రాయికల్: రాయికల్ పట్టణాభివృద్ధి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని మున్సిపల్ చైర్మన్ కట్కం రవి అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ అధ్యక్షతన సాధారణ సమావేశం నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో వార్డుల్లో నీటిని తొలగించేందు కు మోటార్లను వినియోగిస్తామని, అవసరమైన చోట్లలో జేసీబీలతో పారిశుధ్య పనులు చేపడతామ ని పేర్కొన్నారు. అభివృద్ధి పనుల కాంట్రాక్టు పొందిన కొందరు పనులు చేపట్టడం లేదని కౌన్సిలర్లు సమావేశం దృష్టికి తీసుకెళ్లగా.. వారిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ మనోహర్‌గౌడ్‌ను ఆదేశించారు. పట్టణంలో తైబజార్ పెట్టకపోవడంతో మున్సిపల్ ఆదాయానికి నష్టం వాటిల్లుతుందని కౌన్సిల్లో చర్చించారు. అనంతరం 11 అంశాలకు గాను 10 అంశాలను ఏకగ్రీవంగా తీర్మానించారు. సమావేశంలో కౌన్సిలర్లు తోపారపు ప్రశాంతి, రాకేశ్‌నాయక్, వేముల మౌనిక, పల్లికొండ గంగాధర్, పుర్రె శ్రీధర్, కల్లెడ చిన్నధర్మపురి, కో–ఆప్షన్ సభ్యులు వల్లకొండ మహేశ్, సుదవేని లత, ఇర్ఫాన్ అలీ పాల్గొన్నారు. -
స్తంభించిన జనజీవనం
తుమ్మెనాల వద్ద తెగిపోయిన రహదారిధర్మపురి పుష్కరఘాట్ల సమీపంలో గోదావరి ఉధృతిధర్మపురి: ఎడతెరిపి లేని వర్షంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగాయి. ఆకసాయిపల్లె సమీపంలో జాతీయ రహదారిపై లోలెవల్ వంతెన నీటమునిగింది. తుమ్మెనాల నుంచి సాలపల్లె మీదుగా ధర్మపురికి వచ్చే రహదారి తెగిపోయింది. పట్టణంలోని పలు వార్డుల్లో శిథిలావస్థకు చేరిన ఇళ్లను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. పుష్కరఘాట్ల సమీపంలోకి ప్రవాహం చేరుకుంది. ప్రమాదపుటంచున స్తంభంపల్లి పెద్దచెరువు వెల్గటూర్: మండలంలోని స్తంభంపల్లి పెద్దచెరువు మత్తడి దూకుతోంది. గతేడాది బుంగ పడగా.. తాత్కాలిక చర్యలు చేపట్టారు. తాజాగా కట్టపై ఒత్తిడి పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కట్టకు ప్రమాదం జరిగితే వెంకటాపూర్, కుమ్మరిపల్లి, వెల్గటూర్, కోటిలింగాలపై ప్రభావం పడే అవకాశం ఉందని అంటున్నారు. ముత్యాల పోచమ్మ చుట్టూ డ్రైనేజీ నీరు గొల్లపల్లి: మండలకేంద్రంలోని ముత్యాల పోచమ్మ ఆలయంతోపాటు శ్రీకాలభైరవ సహిత స్వయంభు అష్టభుజ దుర్గాదేవి ఆలయం చుట్టూ డ్రైనేజీ నీరు చేరింది. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో దర్శనానికి భక్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. డ్రైనేజీ నీటి కారణంగా దోమలు పెరిగి, టైపాయిడ్, మలేరియా వంటి వైరల్ ఫీవర్ వచ్చే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిలిచిన రాకపోకలు రాయికల్: మండలంలోని భూపతిపూర్, మైతాపూర్, కుమ్మరిపల్లిలోని లోలెవల్ వంతెనలపై ఉధృతంగా వర్షపునీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. రాయికల్ పట్టణంలో లోతట్టు ప్రాంతాలను మున్సిపల్ చైర్మన్ కట్కం రవి, తహసీల్దార్ నాగార్జున, ఎంపీడీవో చిరంజీవి, ఎస్సై సుధీర్‌రావు, ఎంపీవో సుష్మ పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేశారు. మైతాపూర్ కల్వర్టుపై పడిపోయిన చెట్టును తహసీల్దార్, ఎంపీడీవో స్వయంగా తొలగించారు. -
కొల్వాయిలో 146.8 మి.మీ వర్షం
జగిత్యాలఅగ్రికల్చర్: అల్పపీడన ప్రభావంతో రెండురోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో ప్రజలు ఇళ్ల నుంచి నుండి బయటకు వెళ్లలేకపోయారు. బీర్పూర్ మండలం కొల్వాయిలో 146.8 మి.మీ వర్షం నమోదైంది. ఎండపల్లి మండలం గుల్లకోటలో 108.8, వెల్గటూర్‌లో 107.5, సారంగాపూర్‌లో 105.8, బుగ్గారం మండలం సిరికొండలో 104.3, ధర్మపురి మండలం బుద్దేశ్‌పల్లిలో 101.3, గొల్లపల్లిలో 81, మల్యాలలో 80.5, జగిత్యాల రూరల్ మండలం పొలాసలో 79.8, రాయికల్ మండలం అల్లీపూర్లో 79.5, మెట్పల్లిలో 78.5, కొడిమ్యాల మండలం తిర్మలాపూర్‌లో 73, మల్లాపూర్‌లో 72.8, మేడిపల్లిలో 68, జగిత్యాలలో 64, కథలాపూర్‌లో 56.3, కోరుట్ల మండలం అయిలాపూర్‌లో 55.3, ఇబ్రహీంపట్నం మండలం గోదూర్‌లో 53.5, పెగడపల్లిలో 53.5, భీమారం మండలం గోవిందారంలో 52 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఎస్సారెస్పీకి 72,452 క్యూసెక్కుల ఇన్ ఫ్లోజగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు గురువారం సాయంత్రం ఆరు గంటల వరకు ఎగువ ప్రాంతాల నుంచి 72,452 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. అవుట్ ఫ్లో 751 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టులో 18.131 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాకతీయ కెనాల్‌కు 300 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే కడెం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండడంతో 16 గేట్లను ఎత్తి గోదావరిలోకి వదిలారు. -
రెండోరోజూ అదే జోరు..
● లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం ● భయంభయంగా ప్రజలు ● పొర్లుతున్న వాగులు, కుంటలు ● పలుచోట్ల నిలిచిపోయిన రాకపోకలుజగిత్యాల: అల్పపీడన ప్రభావంతో జిల్లాలో రెండోరోజు కూడా భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి. సదర్మాట్ బ్యారేజీకి సుమారు 10వేల క్యూసెక్కుల నీరు వస్తుండడంతో మూడు గేట్లను ఎత్తి అదేస్థాయిలో నీటిని దిగువకు విడుదల చేశారు. కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్‌కుమార్ సదర్మట్ బ్యారేజీని పరిశీలించారు. జిల్లాకేంద్రంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. జగిత్యాల చుట్టూ ఉన్న ఐదు చెరువుల నాలాలు పిచ్చిమొక్కలతో నిండిపోవడంతో వరదనీరు ఇళ్లను ఆనుకుని ప్రవహిస్తోంది. మోతె వాగుకు వరద ఉధృతి పెరగడంతో వెంకటాద్రినగర్ బ్రిడ్జి మునిగిపోయింది. కండ్లపల్లి చెరువు సమీపంలో ఉన్న ప్రజల ఇళ్లలోకి నీరు చేరింది. వారిని మున్సిపల్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బైపాస్‌రోడ్ సమీపంలో మ్యాన్‌హోల్స్ ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాకేంద్రంలో శిథిలావస్థలో ఉన్న ఇళ్లను కూల్చివేస్తున్నారు. మెట్పల్లిలో భారీ వర్షం మెట్‌పల్లిరూరల్: బుధవారం రాత్రి నుంచి మోస్తరు వర్షంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. గురువారం పొద్దంతా ముసురు పెట్టడంతో జనజీవనం స్తంభించింది. వెల్లుల, చెర్లకొండాపూర్‌లో రెండు పాత ఇళ్లు కూలిపోయాయి. వాటిని తహసీల్దార్ నీత, ఎంపీడీవో మహేందర్, ఆర్ఐ సంధ్యారాణి, సర్పంచ్ లాస్య పరిశీలించారు. అల్లూరి సీతరామరాజు తండా శివారు లోలెవల్ బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఎస్సై కిరణ్‌కుమార్ నీటి ఉధృతిని పరిశీలించారు. ఉధృతంగా గోదావరి, పెద్దవాగు మల్లాపూర్: బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు మల్లాపూర్ మండలవ్యాప్తంగా 10.8 సెంటీమీటర్ల వర్షం కురిసిందని ఏఎస్వో శ్రీనివాస్ తెలిపారు. గోదావరి, పెద్దవాగు ఉధృతంగా ప్రవహించాయి. తహసీల్దార్ రాంచందర్, ఎస్సై అనిల్, ఎంపీడీవో శ్రీకాంత్, ఎంపీవో మహేశ్వర్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు నీటి ప్రవహాన్ని పరిశీలించారు. మల్లాపూర్‌లో మోడల్ స్కూల్ రోడ్డు నీటమునగడంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. స్కూల్ రోడ్డు నీటమునగడంతో బాలికల హాస్టల్ నైట్‌వాచ్‌మన్ సత్యనారాయణ నీటిలో చిక్కుకున్నారు. సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, ఉపసర్పంచ్ గడ్డం సోమరెడ్డి స్పందించి అతడిని క్షేమంగా రోడ్డు దాటించారు. కల్లూర్ లోలెవల్ వంతెన పరిశీలనకోరుట్లరూరల్: మండలంలోని కల్లూర్–సర్పరాజ్‌పూర్ మధ్య పెద్ద వాగుపై ఉన్న లోలెవల్ వంతెనను కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్‌కుమార్‌తో పరిశీలించారు. వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. హైలెవల్ వంతెనకు ప్రతిపాదనలు పంపించాలని ఆర్అండ్బీ ఏఈ లక్ష్మీకాంత్‌కు సూచించారు. ఆర్డీవో జీవాకర్‌రెడ్డి, తహసీల్దార్ కృష్ణ చైతన్య, సీఐ లక్ష్మీనారాయణ, సర్పంచులు నత్తి రాజ్‌కుమార్, చిట్నేని లత ఉన్నారు. -
ముందస్తు చర్యలు చేపట్టండి
జగిత్యాల/ఇబ్రహీంపట్నం: భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలని, రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ సరఫరాపై నిరంతర పర్యవేక్షించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. గురువారం తహసీల్దార్లు, ఎంపీడీవోలు, బల్దియా కమిషనర్లతో సమావేశమయ్యారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని, గోదావరి నీటిమట్టాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ముంపునకు గురయ్యే గ్రామాలు, కాలనీల్లో పర్యటించాలని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. పునరావాస కేంద్రాలను గుర్తించి విద్యుత్, ఆహారం, వైద్యం, పారిశుధ్యం సక్రమంగా ఉంచాలన్నారు. నాలాలు బ్లాక్ కాకుండా చూడాలని బల్దియా కమిషనర్లను ఆదేశించారు. హెచ్చరిక బోర్డులు తప్పనిసరి అనంతరం కలెక్టర్ ఇబ్రహీంపట్నం మండలం యామపూర్, ఫకీర్‌కొండాపూర్ మధ్య తెగిపోయిన తాత్కాలిక రోడ్డును ఎస్పీ అశోక్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. వాగుల్లో ప్రవాహం పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రమాదకర ప్రాంతాల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులకు సూచించారు. యామపూర్, ఫకీర్‌కొండాపూర్ మధ్య నిలిచిపోయిన బ్రిడ్జి పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకొవాలని యామపూర్ సర్పంచు నాగయ్య కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. ఆయన వెంట డీఎస్పీ రాములు, తహసీల్దార్ వరప్రసాద్, ఎంపీడీవో గణేష్, ఎంపీవో రామకృష్ణరాజు, ఫకీర్‌కొండాపూర్ సర్పంచ్ తోట రమేశ్ ఉన్నారు. -
రహదారులపై పడిపోయిన చెట్లు
జగిత్యాలక్రైం: ఈదురుగాలులకు జాతీయ రహదారులు, ఇతర రోడ్లపై బుధవారం రాత్రి చెట్లు కూలిపోయాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని చెట్లను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. బుగ్గారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని గంగాపూర్‌లో రహదారిపై చెట్టు కూలిపోగా తొలగించి రాకపోకలను క్లియర్ చేశారు. పెగడపల్లి–రామడుగు రహదారిపై చెట్టు కూలిపోగా బ్లేడ్ ట్రాక్టర్ సహాయంతో తొలగించారు. కొండగట్టు మండలం రాజారం సమీపంలో రెండు చెట్లు కూలిపోయాయి. భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని, చెట్లు కూలిపోయినా.. విద్యుత్ స్తంభాలు లేదా ఇతర అడ్డంకులు కనిపిస్తే సమీప పోలీస్‌స్టేషన్, లేదా డయల్ 100కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. -
చెరువులు, కుంటలకు జలకళ
జగిత్యాలఅగ్రికల్చర్: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు జలకళను సంతరించుకున్నాయి. మొన్నటి వరకు ఎల్‌నినోతో దిగులు పడిన రైతులకు ప్రస్తుత వర్షంతో చెరువులు నిండడంతో పంటలపై ఆశలు చిగురిస్తున్నాయి. యాసంగి కూడా గట్టెక్కే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు. జిల్లాలో నీటి పారుదల శాఖ కింద 1226 చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలు ఉన్నాయి. వీటి కింద 81,322 ఎకరాల ఆయకట్టు ఉంది. 939 చెరువులు ఉండగా వాటి కింద 55,332 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో 100ఎకరాలకు పైగా ఆయకట్టు చెరువులు 107 ఉన్నాయి. వంద ఎకరాల లోపు ఉన్న చెరువులు 832 ఉన్నాయి. ఈ చెరువులన్నీ వర్షాలు కురిసినప్పుడు.. లేకుంటే ఎస్సారెస్పీ నీటితో నింపాల్సిందే. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు దాదాపు 90 శాతం చెరువులు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. కొన్ని చెరువులు అలుగు పోస్తున్నాయి. ఆ నీరంతా వాగుల ద్వారా దిగువకు వెళ్తోంది. గుల్లపేట, తక్కళ్లపల్లి వంటి ప్రాంతాల్లో వాగులపై చెక్ డ్యాంలు నిర్మించినప్పటికీ పెద్దగా నీరు నిలిపే పరిస్థితి లేదు. పెంబట్ల వంటి చాలా చెరువుల్లో పూడిక పేరుకుపోవడంతో కొద్దిపాటి వర్షానికే నిండుతున్నాయి. కొన్ని చెరువులు ఆక్రమణలకు గురవడంతో నీటి సామర్థ్యం భారీగా తగ్గిపోతోంది. -
ఇళ్లు కూలిన బాధితులను ఆదుకోవాలి
జగిత్యాలరూరల్: ఇళ్లు కూలిపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీమంత్రి జీవన్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత కోరారు. సారంగాపూర్ మండలం పెంబట్ల, కోనాపూర్ గ్రామాల్లో నీటమునిగిన లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. అదే గ్రామంలో ఇల్లు కూలిపోయిన పస్తం స్వప్న, పరమేశ్, దుర్గేశ్ ఇళ్లను పరిశీలించారు. ఆర్డీవో, తహసీల్దార్లతో ఫోన్లో మాట్లాడి బాధితులకు పరిహారం అందించాలని, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తేలు రాజు, సర్పంచ్ ఆకుల రమేశ్, నాయకులు శ్రీనివాస్, అలీం, జనార్దన్, వెంకటేశ్, వేణు, మల్లయ్య పాల్గొన్నారు. జగిత్యాలరూరల్ మండలం పొరండ్లకు చెందిన సింగారపు రవి ఇల్లు బుధవారం రాత్రి కూలిపోగా వారి కుటుంబాలను దావ వసంత పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. ఆమె వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆనందరావు, నాయకులు గంగారెడ్డి, తోట మహేశ్, శేఖర్, మల్లేశంగౌడ్, లింగయ్య, సన్నిత్, చందు, రాము పాల్గొన్నారు. -
నిధులు మంజూరు చేయాలి
వట్టిమల్ల నుంచి నిమ్మపల్లికి, కోనరావుపేట మండలకేంద్రానికి వెళ్లాలంటే ఇదే మూలవాగు పైనుంచే వెళ్లాలి. వాగుపై గతంలో నిర్మించిన వంతెన కొట్టుకుపోయింది. తాత్కాలికంగా మరమ్మతులు చేస్తున్నా వర్షాలకు మళ్లీ కొట్టుకుపోతుండడంతో రవాణాకు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు స్పందించి రవాణా కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపాలి. – గుండా వెంకటేశ్, వట్టిమల్ల సర్పంచ్రవాణాకు ఇబ్బంది మండలంలోని మూలవాగుపై వంతెనల నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరయ్యాయి. జిల్లాస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన రాహిత్యంతో ఎస్డీఎఫ్ నిధులను రద్దు చేశారు. దీంతో ఏటా వర్షాకాలంలో రవాణాకు ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పటికై నా వంతెనల కోసం నిధులు మంజూరు చేయాలి. –బడుగు లక్ష్మణ్, మాజీ సర్పంచ్ మామిడిపల్లి -
తాత్కాలిక మరమ్మతులతోనే సరి
కోనరావుపేట: మండలంలోని మూలవాగుపై గతంలో నిర్మించిన కాజ్‌వేలు భారీ వర్షాలకు కొట్టుకుపోవడంతో రవాణా కష్టాలు ఎదురవుతున్నాయి. కాజ్‌వేల స్థానంలో వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరైనా ప్రారంభానికి నోచుకోవడంలేదు. మండలంలోని మామిడిపల్లి–నిజామాబాద్, వెంకట్రావుపేట – బావుసాయిపేట, వట్టిమల్ల – నిమ్మపల్లి మధ్య ఉన్న మూలవాగుపై రవాణా కష్టాలు నిత్యకృత్యమవుతున్నాయి. వర్షాలు పడితే మూలవాగు ప్రవాహానికి రాకపోకలు నిలిచిపోయి, సంబంధాలు తెగుతున్నాయి. పలుగ్రామాల ఇబ్బందులపై అప్ప టి నాయకుడు, ప్రస్తుత ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అప్పటి రోడ్లు భవనాల శాఖ మంత్రి జీవన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా మూడు వంతెనలు మంజూరుచేశా రు. ఐదేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఈవంతెనలు కొట్టుకుపోయి, మళ్లీ రవాణా వ్యవస్థ దెబ్బతింది. స్థానిక పాలకులు తాత్కాలిక మరమ్మతులు చేపట్ట డం, వర్షాలకు కొట్టుకుపోవడం పరిపాటి అయింది. రద్దయిన రూ.52 కోట్ల నిధులు.. గత కొన్నేళ్లుగా ప్రజలు ఇబ్బందులు పడుతుండగా త ప్రభుత్వం ఈవంతెనల నిర్మాణానికి రూ. 52 కోట్లు మంజూరు చేసినట్లు ప్రకటించినా టెండర్లు అవుతున్నాయని చెప్పిన అధికారులు ఆ నిధులన్నీ రద్దయ్యాయని తెలుపుతున్నారు. తమ రవాణా కష్టాలు తప్పవని గ్రామీణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
అథ్లెటిక్స్ సందడి
● 1న గరంలో కిడ్స్ చాంపియన్‌షిప్స్‌తో పాటు అండర్– 18 జిల్లా ఎంపికలుకిడ్స్ విభాగంలో ఉదయం 8.30 గంటలకు క్రీడాకారులు రిపోర్ట్ చేయాలి. 9 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయి. కిడ్స్ విభాగంలో అండర్–6, 8, 10, 12 బాలురు, బాలికలకు రన్నింగ్, స్టాండింగ్ లాంగ్‌జంప్, షాట్‌పుట్, బ్యాక్ త్రో పోటీలు నిర్వహిస్తారు. అండర్–14, 16, 18, 20 విభాగాలతో పాటు ఓపెన్ కేటగిరీలో బాలురు, బాలికలు, పురుషులు, మహిళలకు జావెలిన్ త్రో పోటీలు నిర్వహిస్తారు. అండర్ 18 విభాగంలో కిడ్స్, జావెలీన్ త్రో ఎంపికలతో పాటు అండర్–18 బాలురు, బాలికల జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహిస్తారు. ఇందులో 100, 200, 400, 1000 మీటర్ల రన్నింగ్, హర్డిల్స్, హైజంప్, లాంగ్‌జంప్, షాట్‌పుట్, డిస్కస్, జావెలిన్, రేస్‌వాక్, హెప్టాథ్లాన్ ఈవెంట్లలో పోటీలు నిర్వహించనున్నారు. జిల్లాస్థాయి ఎంపికల్లో పాల్గొనే ప్రతి క్రీడాకారుడు రూ.150 ప్రవేశ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఆగస్టు 7న హన్మకొండ జేఎన్ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. పోటీల్లో పాల్గొనేవారికి సర్టిఫికెట్లు, విజేతలకు మెడల్స్, మెరిట్ సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు మహిపాల్ తెలిపారు. కరీంనగర్‌స్పోర్ట్స్: పరుగులో వేగం, జావెలిన్‌లో గురి, క్రీడాస్ఫూర్తిలో విజయం... ఇవే ఒక అథ్లెటిక్ చాంపియన్‌ను తీర్చిదిద్దే ఆయుధాలు. గ్రామీణస్థాయి నుంచి జాతీయస్థాయి వరకు ప్రతిభను వెలికితీసి యువ అథ్లెట్లకు ఉన్నత వేదిక కల్పించాలనే లక్ష్యంతో కరీంనగర్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆగస్టు 1న జాతీయ జావెలిన్ దినోత్సవం, కిడ్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్, అండర్ 18 జిల్లా ఎంపికలను ఒకే వేదికపై నిర్వహిస్తోంది. ఆగస్టు 1 కరీంనగర్‌లోని రీజినల్ స్పోర్ట్స్ స్కూల్ మైదానంలో 5వ జాతీయ జావెలిన్ దినోత్సవం, 1వ కిడ్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌తో పాటు 12వ రాష్ట్ర యూత్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ అండర్ 18 జిల్లా జట్టు ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు నందెల్లి మహిపాల్, సుమన్ కల్యాణ్ తెలిపారు. ప్రవేశ రుసుం జిల్లా సంఘం భరిస్తుంది జిల్లాస్థాయి ఎంపికల్లో ప్రతిభ కనబర్చి ఆగస్టు 7న హన్మకొండ జేఎన్ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యే క్రీడాకారుల రూ.300 రాష్ట్ర ప్రవేశ రుసుంను జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషనే భరిస్తుంది. చిన్నారుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు కిడ్స్ అథ్లెటిక్స్, జావెలిన్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాం. జిల్లాలోని ప్రతి యువ క్రీడాకారుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – నందెల్లి మహిపాల్, జిల్లా అథ్లెటిక్ సంఘం అధ్యక్షుడు -
మూడు రెస్క్యూ బృందాలు
జగిత్యాలక్రైం: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణకు జగిత్యాల జిల్లా పోలీసులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉన్నారని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. గురువారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇబ్బందులు తలెత్తితే సంరక్షణకు మూడు ప్రత్యేక రెస్క్యూ బృందాలను సిద్ధంగా ఉంచామన్నారు. లోతట్టు ప్రాంతాలు, రహదారుల వద్ద పరిస్థితులను పర్యవేక్షిస్తూ అవాంచనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రత చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. బృందాలకు లైఫ్ జాకెట్లు, తాళ్లు, రెస్క్యూ కిట్లు, ఇతర ప్రత్యేక భద్రత పరికరాలు అందుబాటులో ఉంచామన్నారు. -
రైస్‌మిల్లుల్లో విజిలెన్స్ అధికారుల తనిఖీ
జగిత్యాలక్రైం: రాష్ట్ర పౌరసరఫరాల శాఖ విజి లెన్స్ అధికారులు రైస్‌మిల్లుల్లో తనిఖీలు చేపట్టారు. గురువారం ఉదయం జిల్లాలో మూడు రైస్‌మిల్లుల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. జిల్లాకు చెందిన రైస్ మిల్లర్లు ఇటీవల ప్రభుత్వం టెండర్ల ద్వారా విక్రయించిన ధాన్యం తీసుకుని డబ్బులు జా ప్యం చేయడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు రైస్ మిల్లుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. తాళం వేసిన ఇంట్లో చోరీకి యత్నంజగిత్యాలక్రైం: పట్టణంలోని హౌసింగ్‌బోర్డు రామాలయం వెనుక తాళం వేసి ఉన్న కడారి సత్యనారాయణరావు ఇంట్లో గుర్తుతెలియని దొంగలు చోరీకి యత్నించారు. సత్యనారాయణరావు బుధవారం మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి పని నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లాడు. రాత్రి గుర్తుతెలియని దొంగలు తాళం పగులగొట్టి ఇంట్లోకి వెళ్లి చోరీకి యత్నించారు. గురువారం మధ్యాహ్నం స్థానికులు బాధితుడికి సమాచారం అందించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై కుమారస్వామి తెలిపారు. దొంగతనం జరిగిన ప్రాంతాల్లో ఫింగర్‌ప్రింట్స్ సేకరించారు. స్వగ్రామానికి యువకుడి మృతదేహంచొప్పదండి: దేశాయిపేట గ్రామానికి చెందిన పులిపాక బాబు(30) ఇటీవల దుబాయిలో మృతిచెందగా.. గురువారం మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. కొన్నేళ్లుగా బాబు దుబాయికి వెళ్తున్నాడు. అక్కడ జూలై 7న గుండె సంబంధిత అనారోగ్యంతో మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడికి పెళ్లి కాలేదు. చేతికొచ్చిన కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బాబుకు సోదరి ఉందని, ప్రభుత్వపరంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. జేఎన్టీయూలో ‘రెడ్రాబ్’ ఉచిత శిక్షణ కొడిమ్యాల: మండలంలోని జేఎన్టీయూ (నాచుపల్లి)లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ రె డ్రాబ్ ఏఐ శిక్షణ ఇచ్చేందుకు గురువారం ఒ ప్పందం కుదుర్చుకుంది. విద్యార్థులు, అధ్యాపకులు, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ విభాగానికి ఆర్నెళ్లపాటు రెడ్రాబ్ ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. విద్యార్థులకు ఏఐ ఆధారిత రెజ్యూమ్ బిల్డింగ్, జాబ్ మ్యాచింగ్, ఇంట ర్వ్యూ ప్రిపరేషన్, ఉ ద్యోగార్హత స్కోరింగ్ వంటి సేవలు అందుబా టులోకి రానున్నాయి. అధ్యాపకులకు పరిశోధ న, అసెస్మెంట్ రూపకల్పన, ప్లేస్మెంట్ అధి కారులకు హెచ్ఆర్ బృందాలతో నేరుగా అనుసంధానమయ్యే అవకాశాలు కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కళాశాల పూర్తిస్థాయి ‘ఏఐ రెడీ క్యాంపస్’గా రూపుదిద్దుకోనుందని కళాశాల ప్రిన్సిపాల్ నరసింహ, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ బి.సతీశ్ కుమార్ తెలిపారు. వర్షానికి కూలిన ఇల్లు ఫెర్టిలైజర్‌సిటీ: రామగుండం కార్పొరేషన్ 21 డివిజన్ వీర్లపల్లిలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జంజిరాల నరసమ్మకు చెందిన రేకుల షెడ్డు పూర్తిగా కూలిపోయింది. భర్త శంకరయ్య మృతి చెందడంతో ఒంటరిగానే జీవిస్తోంది. కొడుకు ఆంధ్రప్రదేశ్‌లో ఉంటున్నాడు. ఇల్లు కూలిపోవడంతో దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటూ రోదిస్తోంది. -
చోరీ కేసులో నిందితురాలు అరెస్ట్
కరీంనగర్ రూరల్: తీగలగుట్టపల్లిలో జరిగిన రూ.26 లక్షల నగదు చోరీ కేసులో మరో నిందితురాలు ఆడెపు రేష్మాను గురువారం కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ప్రధాన నిందితుడు తగరం శంకర్‌ను రిమాండ్‌కు తరలించారు. తీగలగుట్టపల్లి రైల్వేస్టేషన్లో అనుమానస్పదంగా సంచరిస్తున్న రేష్మాను అదుపులోకి తీసుకున్నారు. శంకర్‌తో కలిసి ఫారెస్ట్ అధికారి శ్రీనివాస్ ఇంట్లోకి ప్రవేశించి బాత్రూమ్లో ప్లాస్టిక్డ్రమ్లో దాచిన సుమారు రూ.26 లక్షల నగదును అపహరించినట్లు అంగీకరించింది. శంకర్‌ను అరెస్ట్ చేయడంతో భయపడిన రేష్మా చంద్రాపూర్ వెళ్లేందుకు గురువారం రైల్వేస్టేషన్‌కు రావడంతో పట్టుకున్నారు. కేసులో మిగిలిన అంశాలపై దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. -
గుండెపోటుతో రైతు మృతి
కరీంనగర్‌రూరల్: కరీంనగర్ మండలం మొగ్ధుంపూర్‌లో గురువారం గుండెపోటుతో బండి అంజయ్య(50)అనే రైతు పొలంలోనే మృతిచెందాడు. స్థానికుల కథనం మేరకు భార్య కొమురమ్మతో కలిసి అంజయ్య ఉదయం 11గంటలకు పొలం వద్దకు వెళ్లాడు. పనులు పూర్తి చేసుకుని మధ్యాహ్నం 3.30గంటలకు ఇంటికి బయల్దేరాడు. కొంతదూరం నడిచిన అంజయ్యకు ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో పొలంలోనే పడిపోయాడు. భార్య కొమురమ్మ కేకలు వేయడంతో స్థానిక రైతులు వచ్చారు. చికిత్స నిమిత్తం కరీంనగర్లో ఆటోలో తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్యతోపాటు ముగ్గురు కూతుర్లు ఉన్నారు. పారిశుధ్య కార్మికుడు.. రాయికల్: రాయికల్ బల్దియాలో వాటర్ లైన్‌మన్‌గా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగి భీమయ్య (50) గుండెపోటుతో గురువారం మృతిచెందాడు. మున్సిపల్ చైర్మన్ కట్కం రవి అంత్యక్రియల నిమ్తితం రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఆయన వెంట కౌన్సిలర్లు గంగాధర్, రాకేశ్‌నాయక్, నాయకులు తురగ శ్రీధర్‌రెడ్డి, భూమేశ్, రాము, అనిల్, నాగరాజు పాల్గొన్నారు. -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
జగిత్యాలరూరల్: భారీవర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. బుధవారం సాయంత్రం జగిత్యాలరూరల్ మండలం అనంతారం, గుల్లపేటలో వాగు ప్రవాహాన్ని పరిశీలించారు. రెవెన్యూ, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అధికారులు ముందస్తు అనుమతి లేకుండా కార్యాలయాలను విడిచి వెళ్లొద్దన్నారు. నీటి ముంపు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ హకీం, ఎంపీడీవో రమాదేవి, ఆర్ఐ శంషోద్దీన్ పాల్గొన్నారు. -
ఇంత‘లా’ హడావుడి దేనికి..?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: శాతవాహన యూనిర్సిటీ లా ఆరో సెమిస్టర్ పరీక్షల నిర్వహణలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఆగస్టు మూడో తేదీ నుంచి ఆరో సెమిస్టర్ పరీక్షలు అంటూ బుధవారం సాయంత్రం షెడ్యూల్ ప్రకటించిన వర్సిటీ అధికారులు న్యాయ విద్యార్థుల నెత్తిన పిడుగేశారు. ఈ సెమిస్టర్ సెకండ్ ఇంటర్నల్ 31వ తేదీన, మరునాడు ఆగస్టు 1న మూట్ కోర్ట్ ప్రాక్టీస్ షెడ్యూల్ గత వారమే విడుదలైంది. అయితే, విద్యార్థులు ఇంకా పరీక్ష ఫీజు కడుతూనే ఉన్నారు. జూలై 31 వరకు విద్యార్థులకు, ఆగస్టు 1వ తేదీన పరీక్షలకు ఆన్లైన్లో ఫీజు గడువు విధించారు. వాస్తవానికి ఆగస్టు 1 శనివారం రాత్రి 12 గంటల వరకు ఆన్లైన్లో చెల్లింపులకు అవకాశమిచ్చారు. అదే ఆగస్టు 3న ఉదయం 10 గంటల నుంచి ఆరో సెమిస్టర్ తొలి పరీక్ష నిర్వహించనున్నారు. యూనివర్సిటీ అధికారులు కనీసం విద్యార్థులకు ఊపిరి తీసుకునే సమయం కూడా ఇవ్వకుండా షెడ్యూల్ ఖరారు చేసిన విషయం తీవ్ర వివాదం రేపుతోంది. సెంటర్ ఎక్కడ..? హాల్‌టికెట్ ఎలా? శనివారం సాయంత్రం వరకు పరీక్ష ఫీజు కట్టించుకునేలా షెడ్యూల్ విడుదల చేసిన అధికారులు, సోమవారం ఉదయం 10 గంటలకు పరీక్ష పెట్టడంపై విద్యార్థులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. తాము హాల్ టికెట్ ఎక్కడ తీసుకోవాలి..? సెంటర్ ఎక్కడ? అన్న కనీస విషయాలు తెలసుకునే వీలు లేకుండా పరీక్షకు షెడ్యూల్ విడుదల చేయడంపై విద్యార్థులు బిత్తరపోతున్నారు. కేవలం 24 గంటల్లో హాల్‌టికెట్లు ఎలా విడుదల చేస్తారు? ఎలా పంపిణీ చేస్తారు? అన్న విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. వాస్తవానికి ఇంటర్నల్ పరీక్షలు పూర్తయిన కనీసం వారం నుంచి 15 రోజుల వ్యవధి అనంతరం సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాలి. కానీ, అధికారులు ఈ విషయాల గురించి కనీసం ఆలోచించనట్లుగా స్పష్టమవుతోంది. ఈ విషయమై శాతవాహన వర్సిటీ పరీక్షల కంట్రోలర్ సురేశ్‌ను సంప్రదించగా.. ఎల్ఎల్ఎం కౌన్సెలింగ్‌కు విద్యార్థులు సిద్ధంగా ఉండాలని పలు న్యాయకళాశాలలు, విద్యార్థుల నుంచి అనేక వినతులు వచ్చిన నేపథ్యంలో పరీక్షల ఆల్మోనాక్ (విద్యా వార్షిక ప్రణాళిక)ను మార్చి మరీ ముందుకు జరిపినట్లు వివరణ ఇచ్చారు. మరోవైపు పరీక్షలు ముందుకు జరపడంపై తమకు అభ్యంతరం లేకున్నా.. కనీసం హాల్ టికెట్ తీసుకునే సమయం, పరీక్ష కేంద్రం తెలుసుకునే వ్యవధి అయినా ఇవ్వకపోవడంపై న్యాయ విద్యార్థులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. -
పోలీసులు అప్రమత్తంగా ఉండాలి
వరద ప్రాంతాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ కూలిన ఇంటి వద్ద బాధితులు జగిత్యాలక్రైం: భారీ వర్షాలపై పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. వరద ప్రాంతాలను అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. ప్రజలు వాగులు, వంకల వద్దకు వెళ్లొద్దని సూచించారు. లోతట్టు ప్రాంతాలు, కల్వర్టులు, నీరు నిలిచే ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని టెలికాన్ఫరెన్స్ ద్వారా పోలీసు అధికారులు, సిబ్బందికి సూచించారు. వరద ప్రాంతాల్లో తాత్కాలిక హెచ్చరిక బోర్డులు, బారీకేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. నాలుగు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు సమాచారం అందించాలన్నారు. పెంబట్లలో కూలిన ఇల్లు సారంగాపూర్ మండలం పెంబట్ల, కోనాపూర్‌కు చెందిన పస్తం స్వప్న ఇల్లు భారీ వర్షానికి కూలిపోయింది. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. పోలీసుల సూచనలు... ● ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ దిగవద్దు ● చేపల వేటకు చెరువులు, వాగులు, నదుల వద్దకు వెళ్లవద్దు ● నీట మునిగిన కల్వర్టులు, వంతెనలు, వాగులను దాటే ప్రయత్నం చేయవద్దు ● విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన తీగలను ముట్టుకోవద్దు ● రైతులు విద్యుత్ తీగలు, నీటి ప్రవాహంపై అప్రమత్తంగా ఉండాలి ● శిథిలావస్థలో ఉన్న, కూలిపోయే ఇళ్లలో ఉండొద్దు ● మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దు ● సెల్ఫీ, రీల్స్ కోసం జలపాతాల వద్దకు వెళ్లవద్దు -
నిలిచిన రాకపోకలు
జగిత్యాలరూరల్: వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం ఊరటనిచ్చింది. వాగులు పొంగి పొర్లుతున్నాయి. జగిత్యాల రూరల్ మండలం అనంతారం శివారు జాతీయ రహదారి మీదుగా వాగు ఉధృతిగా ప్రవహించింది. పోలీసులు, రెవెన్యూ అధికారులు అప్రమత్తమై రాకపోకలు నిలిపివేయించారు. రూరల్ సీఐ సుధాకర్, ఎస్సై ఉమాసాగర్, ఎంపీవో రవిబాబు అనంతారం రోడ్డ్యాం వద్ద వరద పరిస్థితిని పరిశీలించారు. పెర్కపల్లి–హన్మాజీపేట గ్రామాల మధ్య ఉన్న బొల్లెవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పొరండ్ల, రంగపేట వైపు వెళ్లే రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లు ఉంచారు. -
రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలి
రాయికల్: రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలని మాజీమంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి అన్నారు. పట్టణంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని తరలించే అవకాశం ఉన్నప్పటికీ సీఎం రేవంత్‌రెడ్డి భేషజాలానికి పోతున్నాడని విమర్శించారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేవుడి దయతో కురిసిన వర్షానికి రైతులు పంటల సాగుకు సిద్ధమవుతున్నారని, ఈ క్రమంలో యూరియా, డీఏపీ వంటి మందుల కొరత లేకుండా చూడాలని కోరారు. ప్రభుత్వం స్పందించి 24 కరెంట్ అందించాలన్నారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, నాయకులు తాటిపర్తి చంద్రకృష్ణారెడ్డి, బర్కం మల్లేశ్, గోపి రాజిరెడ్డి, కొయ్యడి మహిపాల్‌రెడ్డి, హరీశ్‌రావు, శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు. -
శిక్షణకు పలువురు కౌన్సిలర్ల డుమ్మా
మెట్పల్లి: స్థానిక సంస్థల్లో పాలనకు సంబంఽధించిన వివిధ అంశాలపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి మెట్పల్లి బల్దియా కౌన్సిలర్లు పలువురు డుమ్మా కొట్టారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సగానికి పైగా కౌన్సిలర్లు గైర్హాజరుకావడం చర్చనీయాంశమైంది. కొత్తగా ఎన్నికై న కౌన్సిలర్లు, కో–ఆప్షన్ సభ్యులకు మున్సిపల్ చట్టాలు, పాలన, నిధుల వినియోగం, అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలు, ప్రజాప్రతినిధుల బాధ్యతలపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం శిక్షణను ఏర్పాటు చేసింది. ఇందుకు హైదరాబాద్‌కు వెళ్లడానికి ప్రయాణం, ఇతర ఖర్చుల కింద ఒక్కొక్కరికి రూ.2వేల చొప్పున అధికారులు అందించినట్లు సమాచారం. ఎంతో ప్రాధాన్యమున్న ఈ శిక్షణకు కొందరు కౌన్సిలర్లు దూరంగా ఉండడం విమర్శలకు తావిస్తోంది. 26 మంది కౌన్సిలర్లు, ముగ్గురు కో–ఆప్షన్ సభ్యులు కలుపుకొని 29మంది ఉంటే.. కేవలం 11మందే శిక్షణకు వెళ్లినట్లు తెలిసింది. ఖర్చుల కింద మాత్రం డబ్బులు అందరికీ ముందుగానే ఇచ్చినట్లు సమాచారం. ఘనంగా సినారె జయంతిజగిత్యాల: జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి 99వ జయంతి వేడుకలను కళాశ్రీ ఈశ్వరమ్మ సాహితీపీఠం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కళాశ్రీ అధినేత రాజు మాట్లాడుతూ సినారె సాహితీరంగంలో చెరగని ముద్ర వేసుకున్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో సాహితీవేత్తలు జమున, అనిత, లక్ష్మీ, లావణ్య, కవిత, శ్రీనివాస్, గంగాధర్ పాల్గొన్నారు. -
ఎస్సారెస్పీకి స్వల్ప ఇన్ ఫ్లో
జగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు స్వల్పంగా ఇన్ ఫ్లో వస్తోంది. బుధవారం సాయంత్రం వరకు 3500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. అవుట్ ఫ్లోగా 751 క్యూసెక్కులుగా ఉంది. గతేడాది జూలై 29 నాటికి ప్రాజెక్టు నీటిమట్టం 1075 అడుగులు, 32.897 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుతం 1065 అడుగులు, 16.545 టీఎంసీలుగా ఉంది. కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో నిండే అవకాశం ఉందని, ఏ క్షణమైనా గేట్లు ఎత్తి గోదావరిలోకి వదిలే అవకాశం ఉందని ప్రాజెక్టు ఇంజినీర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. గోదావరి తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు, మత్స్యకారులు, గొర్రెల కాపరులు నది వైపు రావద్దని సూచించారు. ధర్మపురి వద్ద పెరుగుతున్న గోదావరి మట్టంధర్మపురి: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ధర్మపురి వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. వరద ప్రవాహాన్ని మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి సిబ్బందితో కలిసి పరిశీలించారు. పశువుల కాపరులు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని సీఐ రాంనర్సింహారెడ్డి సూచించారు. పుణ్యస్నానాలకు వచ్చే భక్తులు లోనికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కోరుట్లలో లోతట్టు ప్రాంతాలు జలమయంకోరుట్ల/కోరుట్ల రూరల్: కోరుట్ల పట్టణంతోపాటు వివిధ గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలూ పొంగి ప్రవహించాయి. ముత్యాలవాడ, ప్రకాశం రోడ్, రథాల పంపు ఏరియాలు వాగును తలపించాయి. పెద్దవాగు ప్రవాహాన్ని మున్సిపల్ కమిషనర్ రాఘవేంద్ర, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తిరుమల గంగాధర్ పరిశీలించారు. డిజిటలైజేషన్ 88.43శాతం పూర్తిజగిత్యాల: ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ జిల్లాలో 88.43 శాతం పూర్తయిందని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం హేతుబద్ధీకరణ ప్రక్రియ పూర్తి చేశామని, లోపాలను వెంటనే సరిదిద్దుతున్నామని పేర్కొన్నారు. కోరుట్ల నియోజకవర్గంలో 87.74 శాతం, జగిత్యాలలో 85.63శాతం, ధర్మపురిలో 92.06 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందన్నారు. ఆర్డీవోలు మధుసూదన్, జివాకర్‌రెడ్డి, తహసీల్దార్లు పాల్గొన్నారు. జాతీయ పురస్కారం అందుకున్న మహేశ్వర శర్మరాయికల్: పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు చెరుకు మహేశ్వరశర్మ ఢిల్లీలో జాతీయ విశేష పురస్కారాన్ని బుధవారం కేంద్రమంత్రి భూపతిరాజ్, శ్రీనివాస్‌వర్మ, రాజ్యసభ సభ్యుడు బంగారు లక్ష్మణ్ చేతులమీదుగా అందుకున్నారు. సాహిత్యంలో ఆయన సేవలకు గుర్తింపు లభించింది. మహేశ్వర శర్మను ఉపాధ్యాయులు అభినందించారు. -
ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేయాలి
జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత జగిత్యాలరూరల్: ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేయాలని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. సారంగాపూర్ మండలం లక్ష్మీదేవిపల్లె, ధర్మనాయక్ తండాలో వందశాతం ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిన సందర్భంగా బీఎల్వోలు స్వప్న, శ్యామల, ఆదిలక్ష్మీని సన్మానించారు. బీఎల్వోలు అంగన్వాడీ బాధ్యతలు, ఎస్ఐఆర్ ప్రక్రియను బాధ్యతతో పూర్తి చేయడం అభినందనీయమన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తేలు రాజు, ప్యాక్స్ మాజీ చైర్మన్ సాగి సత్యంరావు, నాయకులు సాంబారి గంగాధర్, ఉపేందర్, వోడ్నాల జగన్, మహిపాల్, జలందర్, ఆనంద్‌రెడ్డి, శ్రీనివాస్, రాజేశ్వర్‌రెడ్డి, సుమన్ పాల్గొన్నారు. -
జాతీయ వేదికపై కరీంనగర్ కెరటాలు
● నేషనల్ టేబుల్ టెన్నిస్ బరిలో జిల్లా క్రీడాకారులు ● ఆగస్టు 16 నుంచి 23 వరకు కాన్పూర్‌లో పోటీలుఢిల్లీ, డయ్యూడామన్, తమిళనాడులో జరిగిన ఎస్జీఎఫ్ జాతీయ పోటీల్లో మూడుసార్లు పాల్గొన్నాను. పతకం సాధించలేదు. ఈ సారి తప్పకుండా పతకం సాధిస్తా. టేబుల్ టెన్నిస్‌లో దేశానికి ప్రాతినిథ్యం వహించడమే నా లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతిరోజూ సాధన చేస్తున్నా. – ఎల్లా అవనిరెడ్డి రాష్ట్రస్థాయి పోటీల్లో జరిగిన టేబుల్ టెన్నిస్ పోటీల్లో మూడుసార్లు పాల్గొన్నాను. చీఫ్ మినిస్టర్స్ కప్‌లో 3వ స్థానం సాధించాను. జిల్లాస్థాయి పోటీల్లో 19 పతకాలు గెలుచుకున్నాను. ప్రస్తుతం జరుగనున్న పోటీల్లో పతకం సాధించడమే నా లక్ష్యం. – కటికిరెడ్డి అద్వికనాథ్ కరీంనగర్‌స్పోర్ట్స్: కరీంనగర్ క్రీడాకారులు జాతీయస్థాయిలో సత్తా చాటడానికి సిద్ధమయ్యారు. స్థానిక కేహెచ్ఆర్ స్పోర్ట్స్ అకాడమీకి చెందిన టేబుల్ టెన్నిస్ ఆటగాళ్లు వచ్చే ఆగస్టులో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగే నేషనల్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్–2026కు రాష్ట్ర జట్టు తరఫున ప్రాతినిథ్యం వహించేందుకు ఎంపికయ్యారు. ఆగస్టు 16 నుంచి 23వ తేదీ వరకు ఈ పోటీలు జరగనున్నాయి. ఇందుకోసం క్రీడాకారులు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం సుమారు ఐదు గంటల పాటు కఠినమైన సాధన చేస్తున్నారు. -
గిరి ప్రదక్షిణం.. స్వామి నామస్మరణం
మల్యాల: కొండగట్టు గిరి ప్రదక్షిణ.. వందమందితో ప్రారంభించిన కార్యక్రమం.. నేడు పది వేల భక్తులకు మించింది. భక్తులు పాదయాత్ర చేస్తూ.. స్వామివారి నామస్మరణతో ప్రదక్షిణలో పాల్గొంటున్నారు. బుధవారం నిర్వహించే కొండగట్టు 43వ గిరి ప్రదక్షిణలో రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొననున్నారు. ముత్యంపేటలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ గిరి ప్రదక్షిణ ప్రతి పౌర్ణమి రోజున నిర్వహిస్తున్నారు. 2023లో చిలుకూరి బాలాజీ ఆలయ అర్చకులు సురేశ్ ఆత్మారాం పౌర్ణమి రోజున దిగువ కొండగట్టులోని ఆంజనేయస్వామి విగ్రహం ఎదుట కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. జగిత్యాల, కరీంనగర్ జిల్లాల నుంచి భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొనేందుకు ప్రతి పౌర్ణమికీ తరలివస్తున్నారు. దారికిరువైపులా ఎత్తైన చెట్లు, పక్షుల కిలకిల రావాల మధ్య ప్రకృతిని ఆస్వాదిస్తూ ముందుకెళ్తున్నారు. గిరి ప్రదక్షిణదారిని అభివృద్ధి చేసేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ముందుకొచ్చారు. అటవీ ప్రాంతంలో సుమారు 3.5కిలోమీటర్ల దూరం కొనసాగే ప్రదక్షిణలో భక్తులు సేదతీరేందుకు బెంచీలు, తాగునీటి సౌకర్యం, కంచె ఏర్పాటు చేసేందుకు అంచనాలు రూపొందించారు. పాల్గొనున్న మంత్రి, ఎమ్మెల్యే 43వ గిరి ప్రదక్షిణ.. వరుణపూజలో మంత్రి పొన్నం, ఎమ్మెల్యే సత్యం పాల్గొనున్నారు. ఉదయం ఆరు గంటలకు దిగువ కొండగట్టులో ప్రారంభమయ్యే ఈ ప్రదక్షిణలో పాల్గొన్న అనంతరం వర్షాలు కురవాలని పూజలు చేయనున్నారు. మంత్రి పొన్నం, వేలాదిమంది భక్తులు తరలిరానుండడంతో ప్రదక్షిణ దారిని ఎమ్మెల్యే మంగళవారం పరిశీలించారు. భక్తులు ఇబ్బంది పడకుండా రహదారిని జేసీబీతో చదును చేయించారు. -
అవినీతి ఆరోపణలు.. పోస్టింగ్‌కు పైరవీలు
మల్యాల: కొండగట్టులోని శ్రీఆంజనేయస్వామి వారి సొమ్మును స్వాహా చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొని.. ఇతర ఆలయానికి వెళ్లిన అధికారులు స్థానిక నేతల అండతో మళ్లీ కొండగట్టులో పోస్టింగ్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. కొంతమంది అధికారులు, అర్చకులు చేయి కలిపి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న సిబ్బందికి వత్తాసు పలుకుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొండగట్టులో ప్రస్తుతం పనిచేస్తున్న ఇద్దరు ఉన్నతాధికారులు, ఓ జూనియర్ అసిస్టెంట్, మరో సీనియర్ అసిస్టెంట్‌పై తప్పుడు ఆరోపణలు చేయిస్తూ.. బదిలీ చేయించేందుకు ప్రజాప్రతినిధులకు వినతిపత్రం సమర్పించినట్లు తెలిసింది. గతంలో అక్రమాలకు పాల్పడడంతోపాటు అంజన్న నిధులు పక్కదారి పట్టించారనే ఆరోపణలు ఎదుర్కొని, సస్పెన్షన్‌ను తప్పించుకునేందుకు మరో ఆలయానికి బదిలీపై వెళ్లిన అధికారులు మళ్లీ కొండగట్టులో పోస్టింగ్ కోసం రాజకీయ నాయకులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు సమాచారం. కొండగట్టులో ఏళ్ల తరబడి పాతుకుపోయిన ఉద్యోగులు తమ అవినీతికి అడ్డుగా ఉన్న అధికారులను తప్పించేందుకు తప్పుడు ఆరోపణలతో రాజకీయ నాయకులను తప్పుదోవ పట్టిస్తూ.. అడ్డు తొలగించుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది. కొండగట్టు అంజన్న సొమ్ము రూ.52లక్షలు స్వాహా కేసులో ఆరోపణలు ఎదుర్కొని మరోచోటుకు బదిలీపై వెళ్లిన ఇద్దరు ఉన్నతాధికారులు, మరో సీనియర్ అసిస్టెంట్ కొండగట్టులో తిరిగి పోస్టింగ్ కోసం ముమ్మర ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. అంజన్న నిధుల గోల్‌మాల్‌పై చర్యలకు ఆదేశాలు.. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో 2022–23లో నిధుల గోల్‌మాల్‌పై బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ ఆర్నెళ్ల కిత్రం దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అక్రమార్కులపై సస్పెన్షన్ వేటు వేసే అవకాశం ఉన్నప్పటికీ అధికారులు ఇంక్రిమెంట్లలో కోత పెట్టి వదిలేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2022–23లో టెండర్ల సొమ్ము రూ.52 లక్షలు ఆలయ ఖాతాలో జమ చేయాల్సి ఉండగా.. సొంతానికి వాడుకోవడంతో అప్పటి సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసచారిని సస్పెండ్ చేశారు. ఏఈవో, సూపరింటెండెంట్‌కు నోటీసులు ఇచ్చి బదిలీ చేశారు. నిధుల గోల్మాల్ నిర్ధారణ కావడంతో సదరు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆర్నెళ్ల క్రితం దేవాదాయ శాఖ ఆదేశాలు జారీచేసింది. తాజాగా అదే అధికారులు కొండగట్టులో మళ్లీ పోస్టింగ్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కొండగట్టుకు వచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు గతంలో అంజన్న నిధుల గోల్‌మాల్‌పై చర్యలకు ఆదేశం ఇంక్రిమెంట్ల కోతతో సరిపెట్టిన వైనంకొండగట్టు ఆలయ నిధుల గోల్‌మాల్‌లో ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులకు కొండగట్టులో పోస్టింగ్ ఇవ్వలేదు. ఆలయ నిధుల గోల్‌మాల్‌లో అధికారుల పాత్ర నిర్ధారణ కావడంతో చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు వచ్చిన మాట వాస్తవమే. ఈ మేరకు సదరు అధికారుల ఇంక్రిమెంట్లలో కోత పెట్టేందుకు షోకాజ్ నోటీసులు జారీ చేశాం. వారి వివరణ తీసుకున్నాం. న్యాయసలహా ప్రకారం చర్యలు తీసుకుంటాం. కమిషనర్ ఆదేశాల మేరకే బదిలీలు జరుగుతున్నాయి. – అంజనారెడ్డి, కొండగట్టు ఆలయ ఈవో -
ఫొరెన్సిక్ సైంటిస్ట్‌గా హరీశ్
గొల్లపల్లి: సామాన్య కుటుంబం నుంచి వచ్చి.. పట్టుదలతో చదివి తెలంగాణ ఫొరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో శాసీ్త్రయ అధికారి (సైంటిఫిక్ ఆఫీసర్)గా మండలకేంద్రానికి చెందిన చెవులమద్ది హరీశ్. ఈ మేరకు డీజీపీ చేతులమీదుగా హైదరాబాద్‌లో నియామకపత్రం అందుకున్నారు. మండలకేంద్రానికి చెందిన చెవులమద్ది రామవ్వ, నర్సయ్య దంపతుల కుమారుడు హరీశ్ జేఎన్టీయూ (హైదరాబాద్) నుంచి పీహెచ్డీ పట్టా పొందారు. ఇటీవల తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన నియామక ప్రక్రియలో ప్రతిభ చాటారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదన్నారు. తనకు అండగా నిలిచిన తల్లిదండ్రులు, గురువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులకు కతజ్ఞతలు తెలిపారు. హరీశ్‌ను కుటుంబ సభ్యులు, గొల్లపల్లి గ్రామస్తులు అభినందిస్తున్నారు. రానున్న ఐదు రోజులు మోస్తరు వర్షాలుజగిత్యాలఅగ్రికల్చర్: రానున్న ఐదురోజుల్లో జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పొలాస వ్యవసాయ పరిశోదన స్థానం వాతావరణ శాస్త్రవేత్త బి.శ్రీలక్ష్మీ తెలిపారు. 29, 30తేదీల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, 31 నుంచి ఆగస్టు రెండు వరకు బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. ఘనంగా కుజదోష నివారణ పూజలుధర్మపురి: శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ ప్రాంగనంలోని యాగశాలలో మంగళవారం కుజదోష నివారణ పూజలను ఘనంగా నిర్వహించారు. కుటుంబ కలహాలు, వాస్తుదోశాలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు అర్చకుల మంత్రోచ్ఛరణల మధ్య ప్రత్యేక పూజలు శారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. హైపటైటిస్పై అప్రమత్తంగా ఉండాలిజగిత్యాల: హైపటైటిస్పై జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ అన్నారు. మెడికల్ కళాశాల వద్ద మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైపటైటిస్తో కాలేయంలో వాపులు, కామెర్లు, కాలేయ పనితీరు తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయని, జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదం ఉండదన్నారు. కార్యక్రమంలో మెడికల్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ సుభాష్, డాక్టర్లు శ్రీనివాస్, రాజేందర్, నరేందర్, ప్రవీణ్ పాల్గొన్నారు. దిగుబడినిచ్చే పంటలు సాగు చేయాలిధర్మపురి: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తక్కువ నీటి వినియోగం అయ్యే పంటలు సాగు చేయాలని జిల్లా ఉద్యానవనశాఖ అధికారి కట్ట లత సూచించారు. ధర్మపురిలోని రైతు వేదిక కార్యాలయంలో మంగళవారం మండలంలోని వివిధ గ్రామాల రైతులకు ఆయిల్ పాం, పండ్లు, కూరగాయల సాగుపై అవగాహన కల్పించారు. మల్బరీ, ఉల్లి, కూరగాయలు, పండ్లు సాగు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఉద్యానవన శాఖ హెచ్‌ఈవో వంశీకృష్ణ, అర్చన, రాజ్‌కుమార్, రైతులు తదితరులున్నారు. -
అంతర్జాతీయంగా రాణిస్తా
హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీల్లో మూడు సార్లు పాల్గొన్నా. పతకాలు సాధించలేదు. జాతీయ పోటీలకు ఎంపిక కావడం ఆనందంగా ఉంది. టేబుల్‌టెన్నిస్‌లో అంతర్జాతీయస్థాయిలో ప్రాతినిథ్యం వహించేలా ఎదగడం నా లక్ష్యం. – అన్విక్ష్ నందన్ జాతీయ పోటీలకు ఎంపిక కావడం ఆనందంగా ఉంది. తప్పకుండా పోటీల్లో రాణిస్తాను. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర ర్యాంకింగ్ టోర్నమెంట్లో రాణించాను. భవిష్యత్‌లో గొప్ప క్రీడాకారిణిగా మారాలని ఉంది. – ఎ.అనన్య -
ప్రత్యేక శిక్షణలో కౌన్సిలర్లు
జగిత్యాల:నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ నిర్వహించారు. ఇందులో జగిత్యాల బల్దియా కార్యవర్గం పాల్గొంది. మున్సిపల్ పాలన, పట్టణాభివృద్ధి, ప్రజాప్రతినిధుల బాధ్యతలు, స్థానిక సంస్థల పరిపాలన, ప్రభుత్వ పథకాల అమలు, మున్సిపల్ సేవల పెరుగుదల, పట్టణ ప్రణాళిక, ఆర్థిక నిర్వహణ అంశాలపై కౌన్సిలర్లకు అవగాహన కల్పించారు. చైర్పర్సన్ సమిండ్ల వాణి మాట్లాడుతూ శిక్షణ ద్వారా ప్రజాప్రతినిధుల సామర్థ్యాలు మెరుగుపడి ప్రజలకు నాణ్యమైన సేవలందించేందుకు తోడ్పడుతుందన్నారు. -
ఎల్ఆర్ఎస్ అంతంతే..
జగిత్యాల: అక్రమ ప్లాట్లు.. లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఎల్ఆర్ఎస్ పథకానికి జిల్లాలో స్పందన కరువైంది. ఈనెల 31లోపు ఫీజు చెల్లిస్తే 25 శాతం రాయితీ కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఎవరూ పెద్దగా ముందుకు రాలేదు. క్రమబద్ధీకరణకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దరఖాస్తులు తీసుకున్నప్పటికీ పరిష్కరించడంలో జాప్యం చేసింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ అవకాశం ఇచ్చింది. ఇప్పటికీ రెండుమూడు సార్లు అవకాశం ఇచ్చినప్పటికీ ఎల్ఆర్ఎస్కు పెద్దగా స్పందన రావడం లేదు. ఈనెల 31తో గడువు ముగుస్తున్నప్పటికీ జిల్లాలో ఇంకా అనేకం పెండింగ్‌లోనే ఉన్నాయి. దరఖాస్తుదారుల్లో చాలామంది ఇళ్ల నిర్మాణం చేపట్టుకోక ప్లాట్ల క్రయవిక్రయాలు చేపట్టారు. అధికారుల నిర్లక్ష్యమో.. దరఖాస్తుదారులు పట్టించుకోకపోవడమోగానీ పథకం ఆశించిన తీరులో ముందుకు కదలడం లేదు. కొన్ని దరఖాస్తులు వచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో అధికారులు పట్టించుకోకపోవడం, ప్రొసీడింగ్స్ జారీలో తీవ్ర జాప్యం జరుగుతుండడం ఇబ్బందికరంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో ఫీజు అధికంగా ఉండటంతో ప్రజలు ముందుకు రావడం లేదని సమాచారం. ప్రభుత్వం 25 శాతం రాయితీ కల్పించినప్పటికీ పట్టించుకోవడం లేదు. దరఖాస్తుల పరిశీలనలు ఎల్–1, ఎల్–2, ఎల్–3 దశల్లో చేపడుతున్నారు. మూడు దశల్లో ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ శాఖలు పర్యవేక్షించాల్సి ఉంటుంది. అన్ని వివరాలు సక్రమంగా ఉంటేనే అధికారులు ప్రొసీడింగ్ జారీ చేస్తారు. పొడిగింపు ఉండేనా..? జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి, రాయికల్ మున్సిపాలిటీలుగా ఉన్నాయి. వీటి పరిధిలో ఎల్ఆర్ఎస్కు సుమారు 27,483 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో కేవలం 2435 మాత్రమే అప్రూవ్ అయ్యాయి. ఈనెల 31 వరకు ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లిస్తే 25 శాతం రాయితీ లభిస్తుంది. ఒకవేళ 31 దాటితే మొత్తం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఇప్పటికే రెండు విడతల్లో అవకాశం కల్పించింది. దరఖాస్తు చేసుకునేందుకు మరో అవకాశం కల్పిస్తుందో లేదో తెలియని పరిస్థితి. ఒకవేళ ఎల్ఆర్ఎస్ పథకాన్ని పొడిగిస్తే అధికారులు పూర్తిస్థాయిలో ప్రచారం చేస్తే తప్ప పథకం ఆశించినస్థాయిలో ముందుకు కదలదు. ఎల్ఆర్ఎస్ పకడ్బందీగా అమలు చేస్తే ఇటు ము న్సిపాలిటీలు, అటు గ్రామపంచాయతీలకు ఫీజుల రూపంలో ఆదాయం లభించే అవకాశం ఉంది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల వివరాలు వచ్చిన దరఖాస్తులు 27,483అప్రూవ్ అయినవి 2,435రిజెక్ట్ చేసినవి 441పెండింగ్ 24,607గ్రామపంచాయతీలు వచ్చిన దరఖాస్తులు 11,512అప్రూవ్ అయినవి 990రిజెక్ట్ అయినవి 2పెండింగ్ 10,520 -
హామీలు అమలు చేయండి
జగిత్యాలటౌన్: ఎన్నికల్లో యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని మాజీమంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి సీఎంకు లేఖ రాశారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేస్తామని, అనంతరం ఏటా లక్ష ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించి అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ మూడేళ్లు గడుస్తున్నా అమలు చేయడంలో విఫలమైందన్నారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ప్రాధాన్యతాక్రమంలో క్రమబద్ధీకరించి ఉద్యోగ భద్రత కల్పిస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని సూచించారు. రెవెన్యూ శాఖలో తొలగించిన కంప్యూటర్ ఆపరేటర్లను విధుల్లోకి తీసుకోవాలని సూచించారు. రాజీవ్ యువ వికాసం ఒక్కరికీ అమలు చేయలేదని, వెంటనే యువతను ఆదుకోవాలని లేఖలో కోరారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంరాయికల్: రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఆత్మ చైర్మన్ కాటిపల్లి గంగారెడ్డి అన్నారు. మంగళవారం రాయికల్ మండలం అల్లీపూర్ రైతు వేదికలో 100 ఎపిసోడ్స్ వరకు హాజరైన బండారి వెంకటేశ్, ఏఈవో రమ్య, పూడూరి రాజేశ్‌ను సన్మానించారు. ఈ సీజన్లో వర్షాలు అనుకూలంగా కురవకపోవడంతో రైతులు ప్రభుత్వం ప్రకటించిన పంటలు పండించాలని కోరారు. బబ్బర్లు, కందులు వంటివి సాగు చేయడం ద్వారా అధిక లాభం వస్తుందన్నారు. సర్పంచ్ ఎంబారి గౌతమి, జిల్లా అధికారి భాస్కర్, సింగిల్ విండో చైర్మన్ రాజలింగం, ఏవో ముక్తేశ్వర్, పశువైద్యాధికారి నరేశ్, ఏఈవోలు రమ్య,సౌందర్య, స్రవంతి, నరేశ్, మతయ్య పాల్గొన్నారు. -
చెట్టును ఢీకొన్న ఆర్టీసీ ఈవీ బస్సు
మెట్పల్లి: డ్రైవర్ నిర్లక్ష్యంతో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ సంఘటనలో 8 మంది ప్రయాణకులు గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. ఆర్టీసీ వరంగల్ డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు మంగళవారం ఉదయం 3.30 గంటల సమయంలో నిజామాబాద్ నుంచి బయల్దేరింది. ఆ సమయంలో బస్సులో 12 మంది ప్రయాణికులు ఉన్నారు. ఉదయం ఐదు గంటలకు మెట్పల్లి సమీపంలోకి రాగానే.. ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ వద్ద అదుపు తప్పి జాతీయ రహదారి పక్కన ఉన్న చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో బస్సులో ఉన్న షౌకత్ అలీ, పంకజ్, అక్షయ్, నదీమ్, ఖదీర్, రాజు, జుబేర్, ప్రవీణ్ గాయపడ్డారు. వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం కొందరిని జగిత్యాలకు తరలించారు. డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతోనే ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. గాయపడ్డ ప్రయాణికులు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం 8 మంది ప్రయాణికులకు గాయాలు -
వైద్య కళాశాల హాస్టల్ పూర్తి చేయాలి
జగిత్యాల: జిల్లా కేంద్రంలో మెడికల్, నర్సింగ్ కళాశాల, పారామెడికల్ కోర్సులు తేవాలని ఎమ్మెల్యే సంజయ్ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను హైదరాబాద్‌లో కోరా రు. జిల్లాకేంద్ర ఆస్పత్రిలో మందులు స్టాక్ ఉంచాలని, రేడియాలజీ విభాగాన్ని ఆస్పత్రి పరిధిలోకి తీసుకురావాలని కోరారు. రూ.235 కోట్లతో నిర్మిస్తున్న 450 పడకల ఆస్పత్రి, వైద్య కళాశాల హాస్టల్ త్వరగా పూర్తి చేయాలని కోరారు. పాతబస్టాండ్ వద్దగల ఆస్పత్రిలో వెల్నెస్ సెంటర్ ఏర్పాటుకు రూ.2 కోట్లు మంజూరు చేయాలని కోరారు. ట్రామా సెంటర్ ఏర్పాటుకు సహకరించాలన్నారు. ఆస్పత్రులను బలోపేతం చేయాలి కోరుట్ల: కోరుట్ల, మెట్పల్లి ఆసుపత్రుల్లో సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహను కోరారు. హైదరాబాద్‌లో నిర్వహించిన వైద్య ఆరోగ్య సమీక్ష సమావేశంలో పాల్గొని నియోజకవర్గంలోని ఆస్పత్రుల సమస్యలను మంత్రికి వివరించారు. రెండు ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులను బదిలీ చేయొద్దని, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని వినతిపత్రం సమర్పించారు. స్పెషలిస్ట్, స్టాఫ్‌నర్స్, పారామెడికల్, సాంకేతిక పరిపాలని సిబ్బందిని నియమించాలని కోరారు. కోరుట్ల ఆస్పత్రికి కొత్త భవనం ఉన్నా.. సరైన పరికరాలు, సిబ్బంది కొరతతో రోగులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. -
ప్రైవేట్ పాఠశాల వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ అద్దె బస్సు
జగిత్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని యావర్‌రోడ్‌లో.. అటవీశాఖ కార్యాలయం సమీపంలో కృష్ణానగర్ వైపు వెళ్తున్న ప్రైవేటు పాఠశాల వాహనాన్ని ఆర్టీసీ అద్దె బస్సు మంగళవారం ఉదయం ఢీకొంది. కృష్ణానగర్‌కు చెందిన ఓ ప్రైవేటు వాహనం 20 మంది విద్యార్థులతో కొత్తబస్టాండ్ నుంచి కృష్ణానగర్ వైపు వెళ్తోంది. అదే సమయంలో పాతబస్టాండ్ నుంచి కొత్తబస్టాండ్ వైపు వెళ్తున్న ఆర్టీసీ అద్దె బస్సు అతివేగంగా వెళ్లి ఢీకొంది. ఈ ఘటనలో వాహనంలో ఉన్న ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. నిత్యం రద్దీగా ఉండే యావర్‌లో సంఘటన జరగడంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అక్కడ ఉన్న వారంతా చిన్నారులను చేరదీశారు. ప్రైవేట్ వాహన డ్రైవర్, జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేటకు చెందిన చక్రాల సుదర్శన్ ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవర్ మారంపల్లి నరేశ్‌పై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై సుప్రియ తెలిపారు. ఇద్దరు విద్యార్థులకు గాయాలు -
ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి
కోరుట్ల రూరల్: ఎల్‌నినోతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులను ప్రత్యామ్నాయ పంటలు సాగు వైపు వెళ్లాలని కలెక్టర్ బి.సత్యప్రసాద్ అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం సమీక్షసమావేశం నిర్వహించారు. రైతులకు పంటల వైవిధ్యంపై అవగాహన కల్పించాలని, చిరుధాన్యాలు, ఆరుతడి పంటలు సాగు చేసేలా చూడాలని సూచించారు. తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం పైడిమడుగు గ్రామంలో వీవీజీ రాంజీ పథకం కింద జలసిరిలో భాగంగా ఫాం పాండ్లు, ఇంకుడుగుంతలు, బోర్ రిచార్జీ పనులకు భూమిపూజ చేశారు. జోగిన్‌పల్లిలో వీవో భవనాలు, అంగన్వాడీ భవన పనులను పరిశీలించి పూర్తి చేయాలని ఆదేశించారు. డీఆర్డీవో రఘువరన్, ఆర్డీవో జీవాకర్ రెడ్డి, తహసీల్దార్ కృష్ణ చైతన్య, ఎంపీడీవో, సర్పంచులు భూమేశ్వర్, బద్దం తిరుపతి రెడ్డి, ఆర్ఐ శ్రీనివాస్ యాదవ్, సర్పంచులు పాల్గొన్నారు. -
ఫంక్షన్‌కు వెళ్లి.. రైల్వే ట్రాక్ వద్ద శవమై..
మెట్‌పల్లిరూరల్: మెట్పల్లి మండలం సత్తక్కపల్లి శివారులో రైలు ఢీకొని ఒకరు మృతి చెందారు. మంగళవారం సాయంత్రం సమయంలో గ్రామ శివారులోని రైల్వే ట్రాక్ వద్ద ఓ వ్యక్తి మృతదేహం ఉన్నట్లు స్థానికులు ఇబ్రహీంపట్నం పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం గాండ్లపేటకు చెందిన మామిడి రాజగంగారాం(60)గా గుర్తించారు. రాజగంగారాం కమ్మర్పల్లి సమీపంలోని నాగాపూర్‌లో ఓ ఫంక్షన్ వచ్చినట్లు సమాచారం. అక్కడ మధ్యాహ్నం నుంచి కనిపించలేదు. కుటుంబసభ్యులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. చివరకు రైల్వే ట్రాక్ పక్కన శవమై కనిపించడంతో కుటుంబంలో తీరని విషాదం నింపింది. ఘటనపై విచారణ చేపడుతున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి వేములవాడరూరల్: వేములవాడ రూరల్ మండలం నాగాయపల్లి గ్రామంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన చెట్టిపల్లి శ్రీకాంత్ (38) మంగళవారం ఓ ఇంట్లో కరెంట్ పనులు చేస్తుండగా అకస్మాత్తుగా కింద పడిపోయాడు. వెంటనే వేములవాడలోని ప్రైవేటు ఆసుపత్రికి, అక్కడి నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. మృతుడికి తల్లి రాజేశ్వరి ఉన్నారు. ఈ ఘటనపై ఎస్సై వెంకట్రాజంను వివరణ కోరగా, శ్రీకాంత్ ఫిట్స్‌తో మృతిచెందాడని, ఇప్పటి వరకు మృతుడి బంధువుల నుంచి ఏలాంటి ఫిర్యాదు రాలేదన్నారు. దీనిపై విచారణ జరిపి కేసు నమోదు చేస్తానని తెలిపారు. బండరాయి మీద పడి కూలీ మృతిమానకొండూర్: గంగిపల్లి గ్రామ శివారులో రెడ్డి కొమురయ్య(52) అనే కూలీ పని చేస్తుండగా.. ప్రమాదవశాత్తు బండరాయి మీద పడి బావిలోనే దుర్మరణం చెందాడు. గంగిపల్లి గ్రామ శివారులో కొండపల్కల గ్రామానికి చెందిన బాపురెడ్డి వ్యవసాయ బావిలో పూడిక తొలగింపు పనులు క్రేన్ సహాయంతో చేపట్టారు. బావిలోకి దిగిన కొమురయ్య తోటి కూలీలతో పని చేస్తున్న సమయంలో క్రేన్ బకెట్(డబ్బా) నుంచి బండరాయి జారి అతడి తలపై పడింది. తీవ్ర గాయాలతో కొమురయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. మానకొండూర్ సీఐ పి.శ్రీలత ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బావి నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబానికి నష్ట పరిహారం ఇస్తేనే మృతదేహాన్ని కరీంనగర్‌కు తరలించాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేయగా.. వారికి నచ్చజెప్పి న్యాయం చేస్తామని సీఐ మృతదేహాన్ని కరీంనగర్‌కు తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉండగా.. అందరికీ వివాహమైంది. నీటి సంరక్షణే ధ్యేయంగా జలసిరికథలాపూర్: నీటి సంరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం జలసిరి కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని డీపీవో మదన్మోహన్ అన్నారు. మండలంలోని సిరికొండ శివారులో సర్పంచ్ రవి పంట చేను వద్ద ఫాం పాండ్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశముందని, తక్కువ నీరు అవసరమయ్యే పంటలు సాగు చేయాలన్నారు. వీబీజీ రాంజీ పథకంలో భాగంగా ఇంకుడు గుంతలు, నీటిగుంటలు, ఊటకుంటలు తవ్వి చుక్క నీరు వృథా చేయవద్దని కోరారు. ఎంపీడీవో శంకర్, ఎంపీవో ప్రదీప్, ఏపీవో కొమురయ్య, సర్పంచ్ ముదాం రవి, ఏఎంసీ డైరెక్టర్ ఎండీ.హఫీజ్, ఉపసర్పంచ్ మల్లయ్య, కార్యదర్శి సౌజన్య, నాయకులు రాజు, రేహన్, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి విక్రేతల అరెస్ట్
● 120 గ్రాముల గంజాయి స్వాధీనం జగిత్యాలక్రైం: జగిత్యాల శివారు మోతె శ్మశానవాటిక ఎదురుగా గంజాయి విక్రయిస్తున్న నలుగురిని పట్టుకుని కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. మంగళవారం నిందితులను అరెస్ట్ చూపారు. పట్టణ శివారు లింగంపేటకు చెందిన జవ్వాజి తేజ, హౌసింగ్‌బోర్డుకు చెందిన గజ్జెల అజయ్, లక్ష్మీపూర్‌కు చెందిన ఆలకుంట్ల గణేశ్, తులసీనగర్‌కు చెందిన ఏళ్ల మనోజ్ ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి వెళ్లి 120 గ్రాముల గంజాయి కొనుక్కుని వచ్చి మోతె శ్మశాన వాటిక వద్ద విక్రయిస్తున్నారు. వారిని పట్టణ ఎస్సై సుప్రియ పట్టుకుని 120 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై కుమారస్వామి పాల్గొన్నారు. ఒకరి అదృశ్యంకరీంనగర్క్రైం: నగరంలోని సు భాష్‌నగర్‌కు చెందిన రామగిరి శ్రీకాంత్ (37) అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు త్రీ టౌన్ పో లీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మానసిక సమస్యతో బాధపడుతూ చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అతను ఈ నెల 23 నుంచి కనిపించడం లేదు. శ్రీకాంత్ ఎత్తు 5.4 అడుగులు, తెలుపు వర్ణం, గుండ్రని ముఖం కలిగి ఉండగా, తలకు శస్త్రచికిత్స చేసిన మచ్చ ఉందని తెలి పారు. ఆచూకీ తెలిసిన వారు కరీంనగర్–3 టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
టీఆర్ఎస్ చీఫ్ కవిత వాహనానికి వరుస చలాన్లు
తంగళ్లపల్లి(సిరిసిల్ల) : టీఆర్ఎస్ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రయాణిస్తున్న టీఎస్09ఈయూ6666 నంబర్ గల కారుపై భారీ స్థాయిలో ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్న విషయం శ్రీసాక్షిశ్రీ పరిశీలనలో వెలుగులోకి వచ్చింది. ఈ వాహనంపై 25 చలాన్లు నమోదై ఉండగా, మొత్తం రూ.21,875 చెల్లించాల్సి ఉంది. జిల్లాలు దాటినా ఆగని ఉల్లంఘనలు తెలంగాణ పబ్లికేషన్స్ పేరిట రిజిస్టరైన ఈ కారు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ప్రయాణించిన సమయంలో నిబంధనలు ఉల్లంఘించినట్లు ఈ చలాన్ డేటా స్పష్టం చేస్తోంది. ఓవర్ స్పీడింగ్: ఎంవీ యాక్ట్ సెక్షన్ 184 ప్రకారం.. నిర్ణీత వేగ పరిమితి కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించినందుకు నిజామాబాద్ (ఇందల్వాయి), కరీంనగర్ (నుస్తులాపూర్), సిద్దిపేట, కామారెడ్డి (అడ్లూర్), మెదక్ (చేగుంట), రామగుండం, హైదరాబాద్ (పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే) వంటి ప్రధాన రహదారులపై అత్యధికంగా రూ.1,000 చొప్పున ఫైన్లు విధించారు. ఫ్యాన్సీ నంబర్ ప్లేట్లు: మోటార్ వాహనాల నిబంధనలకు విరుద్ధంగా నంబర్ ప్లేట్ కలిగి ఉన్నందుకు హైదరాబాద్, మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో పలుమార్లు రూ.200 చొప్పున చలాన్లు వేశారు. అక్రమ పార్కింగ్: రహదారిపై వాహనాల రాకపోకలకు అడ్డంకిగా వాహనాన్ని నిలిపినందుకు సైబరాబాద్ (నార్సింగి) పరిధిలోనూ జరిమానా పడింది. సాధారణ వాహనదారులపై నిబంధనల పేరుతో కఠినంగా వ్యవహరించే పోలీసులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖుల వాహనాల విషయంలోనూ అదే రీతిలో చలాన్లను వసూలు చేస్తే బాగుంటుందని సామాన్యులు కోరుతున్నారు. పెండింగ్ ఫైన్ రూ.21,875 -
అక్కాచెల్లెళ్ల అద్భుత ప్రతిభ
రాయికల్: మండలంలోని మైతాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్న అక్కాచెల్లెళ్లు కడ దీక్షిత, హర్షిణి మూలకాలు చెప్పి రికార్డు సృష్టించారు. ఎనిమిదో తరగతి చదువుతున్న దీక్షిత నిత్యం సాధన చేసి చూడకుండా.. తక్కువ సమయంలో మూలకాల పేర్లు రికార్డ్ నెలకొల్పింది. ఆమె పీరియడిక్ టేబుల్లోని 118 మూలకాలను 25 సెకన్లలో చెప్పి ఇతరుల పేరిట ఉన్న రికార్డ్‌ను అధిగమించింది. దీక్షత ప్రతిభను గుర్తించిన ఇంటర్నెషనల్ బుక్ ఆఫ్ రికార్డ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థలు ‘ఫాస్టేస్ట్ చైల్డ్ టు రియాక్టివ్ ఆల్ ది ఎలిమెంట్స్ ఆఫ్ పీరియాడికి టేబుల్ పేరిట రికార్డ్ నమోదు చేసి ప్రశంసపత్రాలు, మెడల్స్ అందించారు. ఇదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న హర్షిణి 42 సెకన్లలో పీరియడిక్ టేబుల్‌ను చూడకుండా చదివి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరు నమోదు చేసుకుంది. రికార్డ్స్ నెలకొల్పిన ఇద్దరు అక్కాచెల్లెళ్లను కలెక్టర్ సత్య ప్రసాద్, అదనపు కలెక్టర్ రాజగౌడ్, డీఈవో రాము అభినందించారు. హెచ్ఎం మోహన్‌రెడ్డి, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో రికార్డులు సాధించామని దీక్షిత, హర్షిణి తెలిపారు. మైతాపూర్ జిల్లా పరిషత్ విద్యార్థినుల ఘనత అభినందించిన కలెక్టర్ -
క్రీడాప్రాంగణంలో శవం పూడ్చివేత
సైదాపూర్: ఆరెపల్లిలోని తెలంగాణ గ్రామీణ క్రీడాప్రాంగణంలో మంగళవారం శవాన్ని పూడ్చివేసిన ఘటనతో క్రీడాకారులు, గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. గ్రామానికి చెందిన లొల్లేటి భిక్షపతి మృతిచెందగా.. మృతదేహాన్ని ఆరెపల్లి తెలంగాణ గ్రామీణ క్రీడాప్రాంగణంలోనే పూడ్చేశారని గ్రామస్తులు, క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడే శ్మశాన వాటిక ఉన్నా.. కాల్చ కుండా ఎదురుగా ఉన్న క్రీడాప్రాంగణంలో పూడ్చేశారు. ఈ ఏడాది వర్షాల్లేక.. చెరువులోకి నీరు రాక మైదానం ఆటలకు అనుకూలమైంది. నెల రోజులుగా ఈ క్రీడాప్రాంగణంలో సైదాపూర్, వెన్కెపల్లి, జాగీర్పల్లి, రాంచంద్రాపూర్, ఎలబోతారం, వెన్నంపల్లి గ్రామాలతోపాటు మానకొండూర్ నియోజకవర్గం నుంచి కూడా క్రీడాకారులు వచ్చి క్రికెట్ టోర్నమెంట్, క్రీడలు నిర్వహించుకున్నారు. మండలంలో ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడాప్రాంగణాల్లో ఎక్కడ ఆట స్థలం లేదు. కేవలం ఆరెపల్లి క్రీడాప్రాంగణంలో మాత్రమే మైదానం ఉండడంతో.. మైదానాన్ని చదును చేసుకొని రోజూ క్రీడలు నిర్వహించుకుంటున్నారు. పంచాయతీ అధికారులు, పాలకులు చర్యలు తీసుకొని క్రీడాప్రాంగణాన్ని వినియోగంలోకి తేవాలని గ్రామస్తులు, క్రీడాకారులు కోరుతున్నారు. -
రేవంత్ రెడ్డి వచ్చిన్నుంచే కరెంట్ సరిగా ఉండట్లే..!
మెట్‌పల్లిరూరల్: రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటినుంచే కరెంట్ సరిగ్గా ఉండడంలేదు.. ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు పోతుందో తెలియక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మెట్పల్లి మండలంలోని వెల్లుల సర్పంచ్ తిరుపతి అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో గ్రామాల అభివృద్ధిపై మంగళవారం సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. పలు శాఖల అధికారులు వారివారి శాఖలపై వివరించారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచ్‌లు గ్రామాల్లోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికార పార్టీ సర్పంచ్ తిరుపతి కరెంట్ సమస్యపై వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కరెంట్ సమస్య ఉందని, గ్రామాల్లో స్తంభాలు వేయడం లేదని, ఎవరికి చెప్పినా పట్టించుకోవడంలేదని తెలిపారు. ఈ వ్యాఖ్యలను గమనించిన ఆర్డీవో నర్సింహారావు కల్పించుకుని సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యుత్ అధికారులకు సూచించారు. ఆర్డీవో మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి అందరూ సహకరించాలని, సమస్యలుంటే త్వరగా పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. తహసీల్దార్ నీత, ఎంపీడీవో మహేందర్, వైద్యాధికారి అంజిత్‌రెడ్డి, ఏవో దీపిక, పశువైద్యాధికారి అశ్విని, సర్పంచ్‌లు, కార్యదర్శులు పాల్గొన్నారు. -
అభ్యుదయ రైతుకు సన్మానం
కొడిమ్యాల: ఆభ్యుదయ రైతు, వ్యవసాయ వర్సిటీ సలహా మండలి మాజీ సభ్యుడు కొడిమ్యాల మండలం పూడూరుకు చెందిన వెల్ముల రాంరెడ్డిని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మంగళవారం హైదరాబాద్‌లో ఘనంగా సన్మానించారు. రాంరెడ్డి 78 ఏళ్ల వయసులోనూ వ్యవసాయం చేస్తున్నారు. అన్ని పంటలపై వ్యవసాయ విద్యార్థులకు క్షేత్ర స్థాయిలో పాఠాలు భోదిస్తున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తల పరిశోధనల్లోనూ చేదోడు, వాదోడుగా ఉంటున్నారు. రైతులకు సంబంధించి వ్యవసాయ పరిశోధన స్థానం, రైతు వేదికల్లో ఇలా ఎక్కడ.. ఏ కార్యక్రమం జరిగిన పాల్గొని సాగులో తన అనుభవాలు వివరిస్తున్నారు. రైతు సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తూ.. పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నారు. రైతు వేదికలు, రైతునేస్తం ద్వారా ఆయా పంటలపై ప్రభుత్వం ఇప్పటివరకు 100 ప్రత్యక్ష ప్రసారాలు నిర్వహించగా.. పాల్గొన్న ఆయన రైతుల కష్టాలను ఏకరవు పెట్టాడు. వృద్ధాప్యంలోనూ వ్యవసాయాభివృద్ధికి కృషి చేస్తూ.. నేటి యువతరానికి మార్గదర్శకంగా నిలుస్తున్న ఆయనను మంత్రితోపాటు అగ్రివర్సిటీ వైస్ చాన్సలర్ అల్దాస్ జానయ్య, హర్టికల్చర్ వైస్ చాన్సలర్ దండె రాజిరెడ్డి, ఉద్యానశాఖ కమిషనర్ యాస్మిన్ బాషా సన్మానించారు. మండల కేంద్రంలో నిర్వహించిన రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా ఏవో జ్యోతి ఆరుతడి పంటల సాగుపై రైతులకు వివరించారు. విత్తనమేళా నిర్వహించి కందులు, కూరగాయల విత్తనాలు అందించారు. మండల ఉద్యాన అధికారి మంజూవాణి మాట్లాడుతూ ఆయిల్ పాం , కూరగాయల సాగు చేయాలని కోరారు. ఎఈవోలు శ్రీలత, గ్రీష్మ, హెచ్‌ఈవో అనిల్, అభ్యుదయ రైతులు పాల్గొన్నారు. -
ఆర్టీవో చలాన్ పేరుతో సైబర్ మోసాలు
● ఓపెన్ చేయొద్దని పోలీసుల సూచన వేములవాడ: సైబర్ మోసాలు రోజుకో తీరున జరుగుతున్నాయి. షాపింగ్‌పై డిస్కౌంట్లు, బంపర్‌డ్రా వచ్చిందంటూ ఇన్నాళ్లు మోసాలకు పాల్పడ్డ సైబర్ నేరస్తులు తాజాగా మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడిందంటూ వాట్సాప్‌లో ఆర్టీవో పేరట మెసేజ్‌లు పంపుతున్నారు. ఆ టెక్ట్స్ ఫైల్‌ను ఓపెన్ చేస్తే బ్యాంక్ ఖాతాలోని డబ్బులు ఖాళీ అవుతుండడంతో వేములవాడ పట్టణంలో సోమవారం వైరల్‌గా మారింది. పట్టణానికి చెందిన సురేష్‌కు ఆదివారం ఈ మెసేజ్ రాగా.. ఓపెన్ చేయడంతో ఖాతాలోని డబ్బులు ఖాళీ అయ్యాయి. తాను మోసపోయానని గ్రహించిన సురేష్ స్థానికంగా ఉన్న సోషల్‌మీడియా గ్రూప్‌లలో ఇలాంటి మెసేజ్ వస్తుందని అలర్ట్ చేశారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930లో ఫిర్యాదు చేయాలని స్థానిక పోలీసులు సూచిస్తున్నారు.వ్యాట్సాప్లలో వచ్చే ఆర్టీవో చలాన్ ఇదే -
జోరుగా మానేరు రివర్ ఫ్రంట్ పనులు
సాక్షిప్రతినిధి,కరీంనగర్ ●: కరీంనగర్ జిల్లా కేంద్రానికి తలమాణికంగా మారుతుందని చెప్పుకుంటున్న మానేరు రివర్‌ఫ్రంట్ (ఎంఆర్ఎఫ్) కోసం మరింత భూమి అవసరమైంది. తాజాగా నదికి ఎడమవైపున 8.05 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం రూ.410 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టును నీటిపారుదల, పర్యాటక శాఖ సంయుక్తంగా చేపట్టాయి. ఇందులో రూ.300 కోట్ల వరకు నీటిపారుదల శాఖ భరించగా, మిగిలిన నిధులను పర్యాటకశాఖ వెచ్చించనుంది. గుజరాత్‌లోని సబర్మతీ నదీ తీరం స్ఫూర్తిగా గత ప్రభుత్వం మానేరు తీరాన్ని అభివృద్ధి చేయాలని ఈ ప్రాజెక్టును చేపట్టింది. నదికి రెండు వైపులా కాంక్రీట్ గోడలు నిర్మించి తీరాన్ని రెండువైపులా పర్యాటపరంగా అభివృద్ధి చేయాలన్న తలంపుతో చేపట్టిన మానేరు రివర్‌ఫ్రంట్ పురోగతి ప్రభుత్వం మారిన కొన్ని నెలల తర్వాత పర్యావరణ, ఇతర సాంకేతిక సమస్యల కారణంగా నెమ్మదించింది. ఇటీవల ఈ ప్రాజెక్టుకు జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ ప్రాధాన్యం ఇవ్వడంతో పనులు తిరిగి వేగం పుంజుకున్నాయి. రూ.40 కోట్ల చెల్లింపునకు సిద్ధం ఎడమవైపు (నగరం వైపు) 8.05 ఎకరాల స్థలం అవసరం అయింది. నదీతీరం వైపు తవ్వేందుకు స్థలం కావాల్సి వచ్చింది. ఈ మేరకు తొలుత అధికారులు నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కానీ, ఎంత స్థలం కావాలి అన్న విషయంలో పలు సాంకేతిక సవాళ్లు ఎదురయ్యాయి. దీంతో తొలిదశలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు అంతా సిద్ధమైనా.. ఆఖరు నిమిషంలో నోటిఫికేషన్ విడుదల కాకుండా నిలిచిపోయింది. చివరికి రెవెన్యూ డిపార్ట్మెంట్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విషయాన్ని కొలిక్కి తీసుకురావడంతో 8.05 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేశారు. అలా గే.. ఈ మొత్తం భూమికి యజమానులకు దాదాపు రూ.40 కోట్ల వరకు వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లా మంత్రులంతా పనులపై ఆరా తీస్తుండటంతో భూసేకరణకు అధికారులు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. తొలి దశలో 82శాతం పనులు పూర్తి.. మానేరు రివర్ ఫ్రంట్ మొదటి దశలో 3.75 కిలోమీటర్ల వరకు, రెండో దశలో 6.25 కిలో మీటర్ల మేర ఇరువైపులా అభివృద్ధి చేయనున్నారు. మానేర్ రివర్ ఫ్రంట్‌లో 12 నుంచి 13 అడుగుల లోతు వరకు నీరు నిల్వ ఉంటుంది. స్పీడ్ బోట్లు, క్రూజ్ బోట్లు పర్యాటకులకు ఆకర్షణగా ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఢిల్లీకి చెందిన ఐఎన్ఎస్ కన్సల్టెన్సీ మానేర్ రివర్ ఫ్రంట్ పనులు చేపడుతోంది. తొలిదశ పనుల్లో ఇప్పటి వరకు 82 శాతం పూర్తయ్యాయి. 3.75 కి.మీ ప్రొటెక్షన్ వాల్లో ఎడమవైపు 3.5 కి.మీ మేర, కుడివైపు 3.25 కి.మీ మేర గోడ నిర్మాణం అయిపోయింది. మరో 250 మీటర్ల మేర పనులు పెండింగ్ ఉన్నాయి. ప్రొటెక్షన్ వాల్స్‌కు ఇరువైపులా మట్టితో నిర్మించిన కట్ట పనులు కూడా పూర్తయ్యాయి. మొత్తంగా రూ.277 కోట్లను నీటిపారుదల శాఖ పనులకోసం వెచ్చించింది. ఇందులో భాగంగా తీగల వంతెన పక్కన నిర్మించనున్న చెక్ డ్యాం పనులు దాదాపు పూర్తయ్యాయి. వీటికి బిగించేందుకు అధికారులు గేట్లు కూడా తీసుకువచ్చారు. ఈ గేట్లతోనే మానేరు రివర్‌ఫ్రంట్‌లో నీటిని నియంత్రించనున్నారు. ఇటీవల కలెక్టర్ చిత్రా మిశ్రా సైతం మానేరు రివర్ ఫ్రంట్ విషయంలో సమీక్ష నిర్వహించారు. భూ సేకరణ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని, బ్యూటిఫికేషన్ వర్క్స్, రైలింగ్, గార్డెనింగ్ వంటి అభివృద్ధి పనులపై ప్రత్యేక దష్టి సారించాలని సూచించారు. ఇరిగేషన్, టూరిజం కార్పొరేషన్, రెవెన్యూ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి, ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. -
తక్కువ బరువున్న పిల్లలకు బాలామృతం
అంగన్వాడీ కేంద్రంలో ప్రతినెలా చిన్నారుల బరువు, ఎత్తు కొలిచి నమోదు చేస్తున్నాం. తక్కువ బరువు ఉన్న చిన్నారులను గుర్తించి బాలామృతం ప్లస్ అందిస్తున్నాం. గుడ్లు, పాలు క్రమం తప్పకుండా ఇస్తూ, తల్లి పాల ప్రాధాన్యంపై తల్లులకు అవగాహన కల్పిస్తున్నాం. – రమ, అంగన్వాడీ టీచర్ శ్రీరాములపల్లి కౌన్సెలింగ్, వైద్య సేవలు అందిస్తున్నాం పోషకాహార లోపం ఉన్న పిల్లలకు అదనపు పౌష్టికాహారం ఇస్తున్నాం. వైద్య, ఆరోగ్యశాఖతో సమన్వయం చేసుకుని ప్రత్యేక చికిత్స, కౌన్సెలింగ్ కల్పిస్తున్నాం. గర్భిణులు, బాలింతలు అవగాహన పెంచుకుని పిల్లలకు సరైన ఆహారం అందించాలి. – భాస్కర్, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ అధికారి -
రైతుబజార్లోనే కూరగాయలు విక్రయించాలి
జగిత్యాల: జిల్లాకేంద్రంలోని రైతుబజార్లో రైతులెవరూ కూరగాయలు విక్రయించడం లేదు. ప్రధాన రోడ్డుపైనే విక్రయిస్తుండడంతో వాహనదారులు, ఆస్పత్రులకు వచ్చేవారు, వాకర్స్‌కు ఇబ్బందికరంగా మారింది. ఈ విషయమై తరచూ మున్సిపల్ కార్యాలయానికి ఫిర్యాదులు వెల్లడంతో శాశ్వత పరిష్కారం దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. రైతుబజార్లోపల గద్దెలు, చెత్తాచెదారం తొలగించారు. పోలీసుల సహకారంతో మున్సిపల్ కమిషనర్ సత్యప్రణవ్, కౌన్సిలర్లు రైతులందరినీ రైతుబజార్ లోపలికి పంపించారు. ఇక నుంచి అక్కడే విక్రయించాలని ఆదేశించారు. పేద విద్యార్థికి ఉచిత ఇంజినీరింగ్ సీటు తిమ్మాపూర్/ముస్తాబాద్: ఆ తల్లి చివరి కోరిక నెరవేరింది. ఆర్థిక ఇబ్బందులతో కొడుకును ఇంజినీరింగ్ చదివించలేకపోతున్నానని ఆ మాతృమూర్తి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనకు ‘సాక్షి’ అక్షర రూపం ఇచ్చింది. ‘సాక్షి’లో వచ్చిన కథనానికి కరీంనగర్‌లోని జ్యోతి ష్మతి కళాశాల యాజమాన్యం స్పందించింది. మానవత్వంతో ఆ తల్లి చివరి కోరికను నెరవేర్చింది. ముస్తాబాద్ మండలం ఆవునూరుకు చెందిన బండి లావణ్య 15 రోజుల క్రితం కొడుకు ఇంజినీరింగ్ చదువుకు ఫీజు చెల్లించలేకపోతున్నానని మనోవేదనతో ఆత్మహత్యకు పాల్పడింది. లావణ్య భర్త రవీందర్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. ఈ సంఘటనపై సాక్షి ఈనెల 24న ‘చితికి పోతున్నారు’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది. జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాల యజమాని జువ్వాడి సాగర్రా వు స్పందించారు. వికాస్‌కు జ్యోతిష్మతి కళాశాలలో పూర్తి ఉచిత బీటెక్ ప్రవేశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. నాలుగేళ్లపాటు హాస్టల్ వసతి కూడా ఉచితంగా అందిస్తానని హామీ ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులు ఏ విద్యార్థి భవిష్యత్తుకు అడ్డంకి కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వికాస్.. చైర్మన్ జువ్వాడి సాగర్‌రావు, సెక్రటరీ జువ్వాడి సుమిత్‌సాయిలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్తులు బైరి శ్రీనివాస్‌గౌడ్, ఆశాగౌడ్, సావిత్రి తదితరులు సాగర్‌రావు, సుమిత్‌సాయిలకు, సాక్షికి కృతజ్ఞతలు తెలిపారు. -
చైన్‌స్నాచింగ్‌కు విఫలయత్నం
● మహిళ కేకలు వేయడంతో పరారైన ఆగంతకుడుబోయినపల్లి(చొప్పదండి): కిరాణ స్టోర్‌లో ఉన్న మహిళ మెడలోంచి బంగారు చైన్ లాగేందుకు ఓ ఆగంతకుడు యత్నించగా.. మహిళ కేకలు వేయడంతో పరారయ్యాడు. వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాకలో కొండం విజయ తన కిరాణ దుకాణంలో ఒంటరిగా ఉంది. మొదట హెల్మెట్ ధరించిన ఓ గుర్తుతెలియని వ్యక్తి బైక్‌పై వచ్చి సిగరెట్ కొనుగోలు చేసి వెళ్లాడు. అనంతరం అదే వ్యక్తి మళ్లీ వచ్చి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాగేందుకు ప్రయత్నించగా ఆమె ప్రతిఘటించింది. గట్టిగా కేకలు వేయడంతో ఆగంతకుడు పరారయ్యాడు. బాధితురాలు కొండం విజయ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. -
పిల్లల్లో ఎదుగుదల లోపం
గొల్లపల్లి: జిల్లాలో చిన్నారుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. రేపటితరం ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో అంగన్వాడీ కేంద్రాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా. క్షేత్రస్థాయిలో ఫలితాలు మాత్రం శూన్యంగా కనిపిస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణలోపం, సిబ్బంది నిర్లక్ష్యం, తల్లిదండ్రుల అవగాహనరాహిత్యం కలిసి చిన్నారులను పోషకాహారలోపం వైపు నెడుతున్నాయి. అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరు ఎదుగుదల లోపంతో.. తక్కువ బరువు, తక్కువ ఎత్తుతో నీరసించిపోతున్నారనే నిజం జిల్లావాసులను కలవరపెడుతోంది. మహిళా, శిశు సంక్షేమశాఖ తాజాగా నిర్వహించిన సర్వేలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎదుగుదల లోపం జిల్లాలోని 2,328 మంది చిన్నారుల్లో ఎదుగుదల లోపం కనిపించింది. వీరిలో 2,075 మంది మధ్యస్థ, 253 మంది తీవ్ర లోపంతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. ఇది దీర్ఘకాలికంగా కొనసాగితే భవిష్యత్తులో శారీరక సామర్థ్యం, మెదడు వికాసం, చదువులో ప్రతిభ దెబ్బతింటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తక్కువ బరువు ఎత్తుకు తగిన బరువు లేని చిన్నారులు 2,829 మంది ఉన్నారు. వీరిలో 2,075 మంది మధ్యస్థంగా, 754 మంది తీవ్ర తక్కువ బరువుతో ఉన్నారు. దీనివల్ల రోగనిరోధక శక్తి తగ్గి పిల్లలు తరచూ రోగాల బారిన పడుతున్నారు. పోషకాహార లోపం మొత్తం 2,343 మంది పోషకాహార లోపంతో కొట్టుమిట్టాడుతున్నారు. వీరిలో 2,076 మంది మధ్యస్థ, 253 మంది తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. పట్టణాల్లో కన్నా.. మెట్పల్లి, కోరుట్ల, ధర్మపురి, జగిత్యాలరూరల్ మండలాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం, గర్భిణులు, బాలింతల్లో రక్తహీనత. తల్లిపాల ప్రాధాన్యతపై అవగాహన లేకపోవడం, సమతుల్య ఆహారం అందకపోవడం, అంటువ్యాధులు వ్యాపించడం దీనికి ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. తల్లి గర్భంతో ఉన్నప్పటి నుంచే పోషకాహారం అందించడం ద్వారా సమస్యను కాస్త అదుపులో ఉంచే అవకాశముందంటున్న వైద్యులు. అప్పుడే పుట్టిన బిడ్డకు తొలి ఆరు నెలలపాటు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టాలి. ఆరు నెలల తర్వాత నాణ్యమైన అనుబంధ ఆహారం ఇస్తూ, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి.జిల్లా వివరాలు అంగన్వాడీ కేంద్రాలు 1,065 ఐదేళ్లలోపు చిన్నారులు 60,958 పరీక్షించిన చిన్నారులు 60,680 ఎత్తుకు తగిన బరువు లేనివారు 2,328 వయసుకు తగ్గ ఎత్తు లేనివారు 2,285 పోషకాహార లోపం ఉన్నవారు 2,343 -
తుపాకుల కలకలం
జగిత్యాలక్రైం: ఇలాంటి ఘటనల్లో తుపాకులే ప్రాధాన్యంగా కనిపిస్తుండడం సంచలనం రేకెత్తిస్తోంది. జిల్లాలో రియల్ ఎస్టేట్, బడా వ్యాపారులతోపాటు కొందరు భూ వివాదాల్లో గన్‌కల్చర్ ప్రదర్శిస్తుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గతంలో సంవత్సరానికో తుపాకుల కాల్పుల ఘటనలు పోలీసులకు సవాల్‌గా మారాయి. తొమ్మిదేళ్లలో ఏడు సంఘటనలు 2017 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో ఏడు తుపాకుల సంఘటనలు చోటుచేసుకున్నాయి. నక్సల్స్ ప్రాబల్యం పూర్తిగా తగ్గిన అనంతరం తుపాకులు వెలుగుచూస్తుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. చాలామంది బడా వ్యాపారులు, రియల్ఎస్టేట్ వ్యాపారులు, రౌడీషీటర్లు మారణాయుధాలు వాడుతుండటం చర్చనీయాంశంగా మారింది. మారణాయుధాలు ఉంటే చర్యలు ప్రజలు ఎవరు కూడా మారణాయుధాలు కలిగి ఉండరాదు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటాం. అనుమానితులు కన్పించినా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి. పోలీసు శాఖ ప్రజల భద్రతకు నిరంతరం పనిచేస్తుంది. – అశోక్‌కుమార్, ఎస్పీ -
నేడు నేరెళ్లకు కల్వకుంట్ల కవిత
● బాధితులకు తెలంగాణ రక్షణ సేన చీఫ్ పరామర్శ ● న్యాయపోరాటానికి అండగా ఆర్థికసాయంసాక్షిప్రతినిధి,కరీంనగర్: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత నేరెళ్లలో పర్యటించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో సంచలనం రేపిన నేరెళ్ల ఘటన బాధితులను పరామర్శించేందుకు ఆమె వస్తున్నారు. 2017లో పోలీసుల థర్డ్ డిగ్రీలో తీవ్రంగా గాయపడి 9 ఏళ్ల పాటు అనేక ఇబ్బందులు పడి ఇటీవల కన్నుమూసిన గంధం గోపాల్ కుటుంబ సభ్యులను కవిత మంగళవారం ఉదయం 10.30 గంటలకు పరామర్శిస్తారు. కొంతకాలం క్రితం నేరెళ్ల బాధితులు కవితను కలిసి తమ గోడు చెప్పుకోగా వారికి అన్నివిధాల అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. వారి న్యాయపోరాటానికి కొంత సాయం అందించారు. నేరెళ్ల దురాగతంలో భాగస్వాములుగా ఉన్న వారికి న్యాయపరంగా శిక్షపడే వరకు బాధితులకు వెన్నంటి ఉంటానని కవిత భరోసా ఇచ్చారు. అందులో భాగంగానే మంగళవారం ఆమె బాధితుల కుటుంబాలతో మాట్లాడుతారు. ఘటన నేపథ్యం మిడ్ మానేరు రిజర్వాయర్‌లో ముంపునకు గురయ్యే మానేరునదిలో ఇసుక తవ్వకాలకు 2017లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అప్పటి నేతలు మానేరు నది నుంచి పెద్దఎత్తున ఇసుక తీసి లారీల్లో హైదరాబాద్ తరలించి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నారు. ఇసుక తరలిస్తున్న లారీలతో సిరిసిల్ల ప్రాంతంలో అనేక ప్రమాదాలు జరిగాయి. 2017 జూలై 2న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల వద్ద ఇసుక లారీ ఢీకొని నేరెళ్లకు చెందిన రైతు బదనపు భూమయ్య చనిపోయారు. భూమయ్య మరణంతో భగ్గుమన్న గ్రామస్తులు నేరెళ్లలో ఇసుక లారీలను తగులబెట్టారు. ఈ ఘటనకు బాధ్యులుగా గ్రామానికి చెందిన 8 మందిని పోలీసులు అరెస్ట్ చేసి వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. కరీంనగర్ జైలుకు తరలించిన తర్వాత 8 మంది బాధితుల్లో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్ల పరిశీలనలో థర్డ్ డిగ్రీ విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటి పోలీసుల చిత్ర హింసల నుంచి బాధితులు ఇప్పటికీ కోలుకోలేదు. నేరెళ్ల బాధితుల్లో ఒకరైన గంధం గోపాల్ ఇటీవల మృతిచెందారు. మరో బాధితుడు పెంట బాణయ్య కిడ్నీల సమస్యతో బాధ పడుతున్నాడు. మిగతా వారు తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. -
బిల్లులు ఇప్పించండి
మల్లాపూర్ మండలంలోని సాతారం ఉన్నత, రేగుంట జెడ్పీ, ప్రాథమిక పాఠశాలలు, పల్లె దవాఖానా పనులు పూర్తి చేశాం. బిల్లులు పెండింగులో ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. రెండేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న. – రంగు రామాగౌడ్, కాంట్రాక్టర్. రేగుంట రెవెన్యూ భూములు కాపాడండి మా గ్రామం పక్కనే ఉన్న నడికుడను ముంపు గ్రామంగా గుర్తించారు. గ్రామస్తులకు 1976 డి1 పట్టాలు, నక్షాల ప్రకారం భూమి కేటాయించారు. రీసర్వే సందర్భంగా నడికుడ గ్రామస్తులు తప్పుడు డి1 పట్టాలు, తప్పుడు నక్షా ప్రకారం సర్వే చేయాలని అధికారులను బలవంతం చేస్తున్నారు. నడికుడ, రాఘవపేట మధ్య ఉన్న రెవెన్యూ భూమిని కొందరు అక్రమంగా పట్టా చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. – రాఘవపేట గ్రామస్తులు, మల్లాపూర్ మండలం -
ఎస్సీ కార్పొరేషన్ రుణసాయంపై విచారణకు కలెక్టర్ ఆదేశాలు
కోరుట్ల: ఇంటర్వ్యూలు లేకుండా ఎస్సీ కార్పొరేషన్ రుణసాయానికి లబ్ధిదారులను ఎంపిక చేసిన విషయమై కలెక్టర్ సత్యప్రసాద్ విచారణకు ఆదేశించారు. ఎస్సీ కార్పొరేషన్ కింద ఇచ్చే సబ్సిడీ రుణాల ప్రక్రియ తప్పుదారి పట్టిందంటూ కోరుట్లకు చెందిన చిత్తారి శ్రీనివాస్, ఆనంద్, సాయిలు, రమేశ్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ‘ఉత్తుత్తి ఇంటర్వ్యూలు’ శీర్షికన ‘సాక్షి’ ఈనెల 21న కథనం ప్రచురించింది. ఈ కథనంతో కొంతమంది దరఖాస్తుదారులు ప్రజావాణిలో అధికారులకు తమ గోడు వెల్లబోసుకున్నారు. ఎస్సీ కార్పొరేషన్ రుణసాయం ఇంటర్వ్యూలకు అధికారులెవరూ రాలేదని, కోరుట్ల మున్సిపల్ అటెండర్లు అప్లికేషన్ ఫారాలు తీసుకుని వెళ్లిపోమ్మన్నారని ఆరోపించారు. కేవలం గంటలోపే 58 మందిని ఎలా ఇంటర్వ్యూ చేస్తారని ప్రశ్నించారు. ఇంటర్వ్యూలు లేకుండా కొంతమంది తమకు నచ్చిన వారిని ఎంపిక చేయడం అన్యాయమన్నారు. నిబంధనలు ఉల్లంఘించి ఎంపిక చేసిన లబ్ధిదారులను రద్దు చేయాలని కోరారు. స్పందించిన కలెక్టర్ విచారణ చేపట్టి వాస్తవాలు తేల్చాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీని ఆదేశించారు. -
సీ్త్రనిధి రుణాలతో ఆదాయం పెంచుకోవాలి
జగిత్యాల: మహిళా సంఘాల సభ్యులు సీ్త్రనిధి రుణాలతో ఆదాయం పెంచుకోవాలని, ఆ దిశగా సీ్త్రనిధి, సెర్ప్ సిబ్బంది అవగాహన కల్పించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కలెక్టరేట్లో సీ్త్రనిధి, సెర్ప్ అధికారులతో సమావేశమయ్యారు. జిల్లా టార్గెట్ చేరుకోవాలని, బకాయిలు లేకుండా చూడాలని, డిజిటల్ పద్ధతి ద్వారా లావాదేవీలు జరిగేలా చూడాలని పేర్కొన్నారు. మైక్రోఫైనాన్స్ బారిన పడకుండా గ్రామీణ, పట్టణ ప్రాంత రైతులకు అండగా సీ్త్రనిధి సంస్థను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. డీఆర్డీవో రఘువరణ్, డీఏవో భాస్కర్, అధికారులు పాల్గొన్నారు. జలసంరక్షణలో భాగస్వామ్యం కావాలిమల్యాల: జలసంరక్షణలో అందరూ భాగస్వామ్యం కావాలని డీపీవో మదన్ మోహన్, ఎంపీడీవో స్వాతి అన్నారు. మండలకేంద్రంలో జలసిరి కార్యక్రమంపై ఈజీఎస్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, వ్యవసాయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డీపీవో మాట్లాడుతూ గ్రామాల్లో నీటి సంరక్షణపై రైతులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఇంకుడుగుంతలు, బోర్వెల్ రీచార్జ్ పెద్ద ఎత్తున చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీవో ఆమని, ఏపీవో శ్రీనివాస్, ఈజీఎస్ ఈసీ మనోజ్ పాల్గొన్నారు. టీఆర్ఎస్ కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి రఘుమెట్పల్లి: తెలంగాణ రక్షణ సేన కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జిగా డాక్టర్ చిట్నేని రఘును నియమించారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోమవారం ప్రకటన విడుదల చేశారు. బీజేపీలో ఉన్న రఘు, పలువురు నాయకులు ఇటీవల కవిత సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల నుంచి టీఆర్ఎస్ తరఫున రఘు పోటీ చేస్తారని కవిత ఇప్పటికే ప్రకటించారు. తాజా గా ఆయనను ఇన్చార్జిగా నియమించడంపై పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాసుపత్రిలో వైద్యుడి భార్య ప్రసవంకోరుట్ల: పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వై ద్యుడిగా పనిచేస్తున్న ము ఖ్రం తన భార్య సోఫియా కు జగిత్యాల ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం చేయించి ఆదర్శంగా నిలిచారు. తన భార్య ప్రసవానికి సహకరించిన వైద్యులు శైలజ, తిరుమల, సాయి, మహేష్, నరేష్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో పూర్తిస్థాయి ప్రసూతి సౌకర్యాలు ఉన్నాయన్న విషయాన్ని తెలియజేయాలన్న ఉద్దేశంతోనే తాను తన భార్యకు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేయించినట్లు తెలిపారు. తనకు కొడుకు జన్మించినట్లు తెలిపారు. ఎత్తిపోతల పనులు పూర్తి చేయాలిధర్మపురి: మండలంలోని ఆరెపల్లి, కొల్వాయిలో ఎత్తిపోతల పనులను త్వరితగతిన పూర్తి చేసి సాగునీరందించాలని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. సాగునీరు రావడం లేదని రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం జైనాలో ఆయన ఏర్పాటు చేయించిన అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వివిధ గ్రామాల్లో మృతిచెందిన బాధిత కుటుంబాలను పరామర్శించారు. కార్యక్రమంలో డీసీఎమ్మెస్ మాజీ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు అయ్యోరి రాజేశ్, ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులున్నారు. -
జీవన్‌రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదం
జగిత్యాల/జగిత్యాలఅగ్రికల్చర్: మొన్న కేసీఆర్‌ను తిట్టి నేడు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న జీవన్‌రెడ్డి తీరును చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. బోర్నపల్లి, జగన్నాథపూర్ బ్రిడ్జి విషయంలో మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం ఇస్తే జీవన్‌రెడ్డికి ఏం బాధ అన్నారు. 2012లోనే బోర్నపల్లి బ్రిడ్జికి రూ.కోటి మంజూరయ్యాయని చెప్పిన ఆయన.. ఆ నిధులు ఏమయ్యా యో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నందయ్య, ఆత్మ చైర్మన్ గంగారెడ్డి, ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ వాణి పాల్గొన్నారు. ఎల్‌నినో ప్రభావం ఉన్నందున రైతులు వరి సాగు చేయొద్దని తెలిపారు. పొలాస రైతు వేదికలో విత్తనమేళా నిర్వహించారు. తక్కువ కా లంలో చేతికొచ్చే పంటలు సాగు చేయాలన్నారు. -
గోవును జాతీయ జంతువుగా ప్రకటించండి
గోవులను హతమార్చొద్దు. జాతీయ జంతువుగా ప్రకటించాలి. ఆవులను రక్షించాలని దేశవ్యాప్తంగా సంతకాలు సేకరిస్తున్నారు. జిల్లా ప్రజల తరఫున ప్రభుత్వానికి విన్నవించండి. – హిందూ ఐక్యవేదిక ప్రతినిధులు అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయండి జగిత్యాలరూరల్ మండలం తిమ్మాపూర్ శివారు సర్వే నంబర్ 77/4లో 20గుంటల స్థలాన్ని ఇమ్మడి లచ్చయ్య నుంచి మా తాత మెరుగు దేవయ్య 1989లో కొన్నాడు. పట్టా చేయాలని కోరితే వాయిదా వేస్తూ వచ్చాడు. ఇటీవల ఆ భూమిని ఆయన కుమారుడు ధర్మయ్య పేరిట రిజిస్ట్రేషన్ చేశాడు. ఆయన మరో వ్యక్తికి విక్రయించి పట్టా చేశాడు. ఆ రిజిస్ట్రేషన్‌ను రద్దు పరిచి మాకు న్యాయం చేయండి. – మెరుగు ఉమేశ్, తిమ్మాపూర్ -
మోటార్లకు మరమ్మతు చేపట్టండి
జగిత్యాలరూరల్: బీర్పూర్ మండలం కొల్వాయిలో ని ఎత్తిపోతల మోటార్లకు మరమ్మతు చేపట్టాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. కొల్వాయిలోని ఎత్తిపోతల పథకాన్ని సోమవారం పరిశీలించారు. మోటార్లు కాలి నీటి సరఫరా కావడం లేదని రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లగా ఇరిగేషన్ ఎస్ఈ, డీఈతో ఫోన్లో మాట్లాడారు. ఏడాది కాలంగా మరమ్మతు చేయక పోవడం అధికారుల నిర్లక్ష్యమన్నారు. నీరు ఉండి పంటలు పండించుకోలేని దుస్థితి రాకుండా చూడాలని కోరారు. ఈనెల 31లోగా కమ్మునూర్, మంగేళ పంపుసెట్ల ద్వారా నీరు అందించాలన్నారు. -
ఎరువుల బ్లాక్ మార్కెట్‌ను అరికట్టండి
యూరియా, డీఏపీ, ఇతర ఎరువులను కొందరు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. డీఏపీ ధర రూ. 1350ఉంటే డీలర్లు రూ.1950కి విక్రయిస్తున్నారు. ఎల్‌నినోతో రైతులు ఇబ్బంది పడుతుంటే కొందరు ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. – జెడ్పీ, మున్సిపల్ మాజీ చైర్పర్సన్లు దావ వసంత, భోగ శ్రావణి అర్హులకు న్యాయం చేయండి మెట్లచిట్టాపూర్లోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకులంలో టీజీటీ, పీజీటీ అతిధి పోస్టుల నియామకాలను రద్దు చేసి, అవకతవకలకు పాల్పడిన ఆర్సివో, డీసీవోలపై చర్యలు తీసుకోండి. గెస్ట్ టీచర్ పోస్టులకు జూలై 8న డెమో నిర్వహిస్తామని ప్రకటించిన అధికారులు చిట్టాపూర్ గురుకులంలోని టీజీటీ మ్యాథ్స్, పీజీటీ మ్యాథ్స్ పోస్టులకు ఎలాంటి ప్రకటనా చేయకుండానే నియమించారు. వాటిని రద్దు చేసి అర్హులకు న్యాయం చేయండి. – సుంకెట విజయ్, మెట్పల్లి -
అధైర్య పడకండి.. అండగా ఉంటా..
మల్యాల: తల్లి మరణంతో దిక్కుతోచని స్థితిలో పడిన మండలంలోని తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన నలుగురు ఆడపిల్లలకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అండగా నిలిచారు. ఇప్పటికే ఆ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం అందించిన ఆయన.. సోమవారం ఇద్దరు చిన్నారులను గురుకులం పాఠశాలలో చేర్పించారు. తక్కళ్లపల్లికి చెందిన బూత్కూరి శారద, కనకయ్యకు కృష్ణవేణి, త్రివేణి, నీలవేని, మాహాన్విత కూతుళ్లు. కనకయ్య ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లివస్తున్నాడు. తల్లి శారద కూలీగా పనిచేస్తూ కూతుళ్లను చదివిస్తున్నాడరు. కృష్ణవేణి హైదరాబాద్‌లో బీటెక్ రెండో సంవత్సరం, త్రివేణి ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో బీటెక్ మొదటి సంవత్సరం, నీలవేని తక్కళ్లపల్లి జెడ్పీ పాఠశాలలో పదో తరగతి, మహాన్విత ఏడో తరగతి చదువుతోంది. శారద అనారోగ్యంతో ఇటీవల చనిపోగా.. వారు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వారికి రూ.20వేలు అందించారు. ఇద్దరిని గురుకులంలో చేర్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు కలెక్టర్‌తో మాట్లాడి గురుకులంలో సీట్లు కేటాయించేలా చూశారు. సోమవారం తక్కళ్లపల్లికి వెళ్లి నలుగురు పిల్లలకు నూతన వస్త్రాలు అందించారు. నీలవేణి, మహాన్వితను తన వాహనంలో తాటిపల్లి బాలికల గురుకులానికి తీసుకెళ్లి అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేయించారు. నలుగురు ఆడపిల్లల చదువు, భవిష్యత్‌కు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. అలాగే గురుకులం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ప్రిన్సిపాల్ మానస, తాటిపల్లి సర్పంచ్ మెట్పల్లి లత, తక్కళ్లపల్లి మాజీ సర్పంచ్ మరాటి లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బత్తిని శ్రీనివాస్‌గౌడ్, మాజీ మండల అధ్యక్షుడు దొంగ ఆనంద రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చెవుల మద్ది శ్రీనివాస్, ఇట్టిరెడ్డి అంజిరెడ్డి, నేరెళ్ల సతీశ్ రెడ్డి, పాల్గొన్నారు. -
‘సర్దుబాటు’లో ఇష్టారాజ్యం
జగిత్యాల: జిల్లాలో ఇటీవల చేపట్టిన ఉపాధ్యాయుల సర్దుబాటు ఇష్టారాజ్యంగా మారాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాలల్లో ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎక్కడైతే సబ్జెక్ట్ టీచర్లు లేరో అక్కడ నియమిస్తూ.. సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో నిబంధనలు పక్కనపెట్టి ఇష్టారాజ్యంగా సర్దుబాటు చేపట్టారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు సిఫారసుల ఆధారంగా పలు పాఠశాలల్లో సర్దుబాట్లు జరిగినట్లు ఉపాధ్యాయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అవసరమైన పాఠశాలకు ఉపాధ్యాయులను పంపకుండా అనుకూల ప్రాంతాలకు సర్దుబాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కొందరు ఉపాధ్యాయులను సమీప ప్రాంతాలకు తీసుకురాగా.. మరికొందరిని నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ దూరంలో ఉన్న పాఠశాలలకు పంపించినట్లు సమాచారం. జిల్లాలో చాలా పాఠశాలల్లో అవసరానికి మించిన ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ కొన్ని చోట్ల ఈ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఏ ప్రతిపాదికన ఉపాధ్యాయులను ఎంపిక చేశారు..? ఏ పాఠశాలలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి..? వంటి అంశాలపై స్పష్టత లేకపోవడంతో ఉపాధ్యాయ వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి టీచర్ల సర్దుబాటును పారదర్శకంగా చేపట్టాలని ఉపాధ్యాయ సంఘ నాయకులు కోరుతున్నారు. -
ఎస్ఐఆర్ ముమ్మరం
జగిత్యాల: ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ కార్యక్రమం జిల్లాలో ముమ్మరంగా సాగుతోంది. ఆగస్టు 3 వరకు గడువు ఉన్నప్పటికీ ఎన్యుమరేషన్ పత్రాలను బీఎల్వోలకు వెంటనే అందించాలని అధికారులకు పేర్కొంటున్నారు. గడువు సమీపిస్తున్న కొద్ది ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారాలు అందిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 92.84 శాతం పూర్తయింది. ఇంకా 7.16 శాతం పూర్తి కావాల్సి ఉంది. ఈనెల 24తో ముగియనుండగా.. ఓటర్ల నుంచి స్పందన రాకపోవడంతో ఆగస్టు 3 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. డిజిటలైజేషన్ మాత్రం ముమ్మరంగా చేస్తున్నారు. మున్సిపాలిటీల్లో కొంత ఆలస్యం అవుతున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం చకచకగా ముందుకెళ్తున్నారు. దాదాపు అన్ని మండలాల్లో 90 శాతానికి పైగానే పూర్తయింది. ఇప్పటికే రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు ఈ సర్ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. మొదట కొంత ఇబ్బందులు పడినప్పటికీ తర్వాత నెమ్మది నెమ్మదిగా పుంజుకుంది. కొన్ని చోట్ల 100 శాతం పూర్తి కావాలన్న ఉద్దేశంతో ఎన్యుమరేషన్ ఫారాలు నింపినా, నింపకున్నా ఇచ్చేశారు. దీంతో పని మళ్లీ మొదటికొచ్చింది. అధికారులు ఇలా అయితే ఓటు ఉండదని, కచ్చితంగా ఫారం నింపి ఇవ్వాలని పేర్కొనడంతో తెలియని వారు తెలిసిన వారి వద్దకు వెళ్లి మరీ నింపి ఇచ్చేందుకు ఆసక్తి చూపారు. అంతేకాక మండలాల్లో అక్కడక్కడ అవగాహన కేంద్రాలను ఏర్పాటు చేసి కొంత మంది నింపి ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. వలస ఓటర్లు సైతం వారి పేర్లు నమోదు చేసుకున్నారు. సుదూర ప్రాంతంలో ఉన్న వారు కొందరు మాత్రం రాకపోవడంతో అక్కడే ఓటరు నమోదు చేసుకున్న వారు ఉన్నారు. గ్రామాల్లోని వివిధ పోలింగ్ కేంద్రాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియ వందశాతం చేరే అవకాశాలు ఉన్నాయి. పట్టణాల్లోనే ఎన్యుమరేషన్ ఫారాలు తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదని తెలిసింది. అత్యధిక మంది ఉండటం, ఒక వార్డులో ఉన్న వారివి మరో వార్డులో ఉండటంతో వారు ఎక్కడ ఫాం ఇవ్వాలో తెలియడం లేదు. కొంతమందికి ఇప్పటి వరకు ఫారాలు అందలేదు. వారు ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. గడువు మళ్లీ పెంచే అవకాశాలు లేవని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే మున్సిపాలిటీల్లో రాజకీయ నాయకులు, కౌన్సిలర్లు ప్రతి ఓటరును కలుస్తూ ఓటరు నమోదు చేసుకోవాలని పేర్కొంటున్నారు. పట్టణాల్లో వందశాతం నమోదయ్యేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. -
ఎస్ఐఆర్లో పాల్గొనేలా చూడాలి
మల్లాపూర్: అర్హులైన ప్రతి ఓటరు ఎస్ఐఆర్లో వివరాలు అందించేలా చూడాలని సహకార కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులకు ఆదివారం అవగాహన కల్పించారు. ఎస్ఐఆర్ ఆగస్టు 3తో ముగుస్తుందని, అప్పటివరకు ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు మాట్ల సోమయ్య, నాయకులు సిరిపురం రవీందర్, కోటగిరి ఆనంద్‌గౌడ్, మరిపెల్లి మల్లయ్య, గొట్టిపడత రమేష్, ఎర్ర భూమయ్య, బోదాసు నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కోరుట్లలో ఉద్యోగుల బైక్ ర్యాలీకోరుట్ల: సీపీఎస్ రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్నే అమలు చేయాలని కోరుతూ టీఎస్సీపీఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ డిమాండ్ చేశారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్‌తో అన్ని జిల్లాల్లో నిర్వహిస్తున్న జనజాగరణ యాత్ర ఆదివారం కోరుట్లకు చేరింది. ఈ సందర్భంగా ఉద్యోగ, ఉపాద్యాయులు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా స్థితప్రజ్ఞ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కొత్త పెన్షన్ విధానాన్ని దర్దు చేసి పాత విధానాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు విరమణ సమయం పెరుగుతున్నప్పటికీ పెన్షన్ భద్రత లేకపోవటం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. డివిజన్ అధ్యక్షుడు సాయిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వాల శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు మ్యాన పవన్, గడ్డం వెంకటేశ్, అంజన్న, చంద్రకాంత్, జిల్లా అధ్యక్షుడు గంగాధరి మహేశ్, కోకిల కృష్ణ, రాజు పాల్గొన్నారు. వాగ్దేవి పురస్కారానికి మహేశ్వర శర్మ రాయికల్: జాతీయ వాగ్దేవి పురస్కార్ అవార్డుకు పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నంత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు చెరుకు మహేశ్వర శర్మ ఎంపికై నట్లు జాతీయ తెలుగు సారసత్వ పరిషత్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేశిరాజు రాంప్రసాద్ తెలిపారు. మహేశ్వరశర్మ తెలుగు సాహిత్యంలో చేసిన సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈనెల 28న న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో కేంద్రమంత్రుల చేతులమీదుగా అవార్డు అందుకోనున్నారు. -
● పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి ● రక్షిత మంచినీటినే తాగాలి ● డీఎంహెచ్‌వో సుజాత
పొరండ్లలో అదుపులోకొచ్చిన జ్వరాలుజగిత్యాల రూరల్: గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణపై దృష్టిసారిస్తే వ్యాధులను అరికట్టవచ్చని డీఎంహెచ్‌వో సుజాత అన్నారు. జగిత్యాలరూరల్ మండలం పొరండ్లలో విష జ్వరాలతో ఇద్దరు చిన్నారులు మృతి చెందిన విషయం తెల్సిందే. దీంతో ఆదివారం గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇంటింటా సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విషజ్వరాలు వ్యాపించకుండా వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. వర్షకాలం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పారిశుధ్య నిర్వహణ, రక్షిత మంచినీటి బావిలో క్లోరినేషన్ తప్పనిసరి అని పేర్కొన్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, జ్వరాలు వస్తే వైద్యులను సంప్రదించాలన్నారు. పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సందర్శించి రోగులకు అవసరమైన మందులు పంపిణీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ శ్రీనివాస్, ప్రోగ్రాం ఆఫీసర్లు అర్చన, నరేంద్ర, రాజేందర్, మండల వైద్యాధికారి సౌజన్య, సర్పంచ్ నక్క హరీశ్, ఉప సర్పంచ్ ముద్దం మల్లేశం గౌడ్, పంచాయతీ కార్యదర్శి కృష్ణ చైతన్య పాల్గొన్నారు. వ్యాధులు ప్రబలకుండా చూడండి గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. పొరండ్లలో విషజ్వరాలతో మరణించిన చిన్నారుల కుటుంబాలను ఆదివారం పరామర్శించారు. జగిత్యాల మాతాశిశు ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న వారితో మాట్లాడారు. గ్రామంలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని సందర్శించారు. విషజ్వరాలతో మరణించిన చిన్నారుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.10లక్షల ఆర్థికసాయం అందించాలని కోరారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్రావు, నాయకులు రాధాకిషన్‌రావు, శ్రీనివాస్ రెడ్డి, గంగారెడ్డి, శేఖర్, సతీశ్, రాము, విష్ణు పాల్గొన్నారు. ముందస్తు చర్యలు చేపట్టాలి విషజ్వరాలు ప్రబలకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. పొరండ్లలో ఇటీవల ఇద్దరు చిన్నారులు విషజ్వరంతో మృతి చెందగా.. వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. సింగిల్ విండో చైర్మన్ పత్తిరెడ్డి మహిపాల్ రెడ్డి, నాయకులు గంగారెడ్డి, మహేశ్, లింగన్న, బాలు, శ్రీను, రాము, పవన్ పాల్గొన్నారు. చిన్నారులకు వైద్య పరీక్షలు చేస్తున్న వైద్యులు బాధితులకు మందులు అందిస్తున్న సిబ్బంది -
ఇక రేషన్ స్మార్ట్‌కార్డ్
గొల్లపల్లి: ప్రజా పంపిణీ వ్యవస్థలో కొత్త పద్ధతికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు వినియోగంలో ఉన్న కాగితపు లామినేషన్ రేషన్‌కార్డుల స్థానంలో అత్యంత ఆధునికమైన, ఆకర్షణీయమైన పీవీసీ స్మార్ట్ కార్డుల పంపిణీకి సర్వం సిద్ధమైంది. లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందించడంతోపాటు పంపిణీ వ్యవస్థలో పూర్తిస్థాయి పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లాకు కేటాయించిన కార్డులన్నీ ఇప్పటికే చేరుకోవడంతో పౌర సరఫరాల శాఖ యంత్రాంగం పంపిణీకి సంబంధించి ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. చెరగవు.. చిరిగిపోవు ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 3.53లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి. వాటి స్థానంలో కొత్త స్మార్ట్‌కార్డులు జారీ చేయనున్నారు. ఇవి ఏటీఎంకార్డుల తరహాలోనే ధృడంగా ఉండటంతోపాటు సుదీర్ఘకాలం మన్నికగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. కార్డుల్లో లబ్ధిదారుడి పూర్తి సమాచారం, కుటుంబ సభ్యుల వివరాలు, ప్రత్యేక గుర్తింపు సంఖ్యను డిజిటల్ రూపంలో నిక్షిప్తం చేస్తారు. కార్డు నీటిలో తడిచినా.. ఎంతకాలం వాడినా వివరాలు చెరిగిపోవడం లేదా కార్డు చిరిగిపోవడం వంటి సమస్య ఉండదు. బహుళ ప్రయోజనాలు ఈ స్మార్ట్ కార్డు కేవలం నెలానెలా బియ్యం, సరుకులు తీసుకోవడానికి మాత్రమే పరిమితం కాదని అంటున్నారు అధికారులు. భవిష్యత్తులో ప్రభుత్వం అమలు చేసే వివిధ రకాల సంక్షేమ పథకాలకు ఈ కార్డునే ప్రామాణికంగా ఉపయోగించనున్నారు. కుటుంబ వివరాల ధ్రువీకరణతో పాటు ప్రభుత్వ సేవలను వేగంగా పొందడానికి ఈ కార్డు సహాయపడనుంది. పంపిణీకి ఏర్పాట్లు పూర్తి జిల్లాకు ఇప్పటికే 2.80లక్షల స్మార్ట్‌కార్డులు చేరుకున్నాయి. వాటిని పంపిణీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు వేగవంతం చేసింది. ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు రాగానే నియోజకవర్గాలు, మండలాల వారీగా రేషన్ దుకాణాలు లేదా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి లబ్ధిదారులకు వీటిని అందజేస్తారు. రేషన్ దుకాణాలు 595 కొత్తకార్డులు 45,103 పాత కార్డులు 3,07,897 లబ్ధిదారులు 9,99,109 ప్రతినెలా బియ్యం పంపిణీ 6300 టన్నులు స్మార్ట్ కార్డుల రాకతో పీడీఎస్ వ్యవస్థలో అక్రమాలకు శాశ్వతంగా తెరపడనుంది. బోగస్ కార్డులకు అడ్డుకట్ట పడనుంది. డిజిటల్ వివరాల ఆధారంగా లబ్ధిదారుల గుర్తింపు సులభతరం కానుంది. డూప్లికేట్, బోగస్‌కార్డులను సులభంగా ఏరిపారేసే అవకాశం ఉంది. ప్రభుత్వానికి లబ్ధిదారుల సమగ్ర వివరాల నిర్వహణ మరింత సులభంగా, వేగవంతంగా మారనుంది. జిల్లాకు అవసరమైన స్మార్ట్‌రేషన్ కార్డులు ఇప్పటికే చేరుకున్నాయి. ప్రభుత్వం నుంచి అధికారిక ఆదేశాలు అందిన వెంటనే మండలాల వారీగా, పారదర్శకంగా పంపిణీ ప్రక్రియను ప్రారంభిస్తాం. మన్నికగా ఉండే ఈ కొత్త కార్డులు భవిష్యత్తులో ఇతర ప్రభుత్వ సంక్షేమ ఫలాలను పొందేందుకు లబ్ధిదారులకు ఎంతో ఉపయోగపడతాయి. – జితేందర్ రెడ్డి, సివిల్ సప్లై అధికారి -
పోలీస్‌పై పొలిటికల్ పడగ
కోరుట్ల: ఖద్దరు నేతల వ్యవహారం ఖాకీలకు శాపంగా పరిణమిస్తోంది. పోస్టింగ్‌ల కోసం నేతలను పోలీసులు ఆశ్రయించడం సహజం. కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో ఓ నేతను ఆశ్రయించి పోస్టింగ్ పొందితే మరో నేతకు కంటగింపుగా మారే పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో కీలక నేతల మధ్య విభేదాలు పోలీసులను కొన్ని సందర్భాల్లో ఇరకాటంలో పడేస్తున్న వైనం కలవరం రేపుతోంది. కొంతకాలంగా జిల్లాలో ఈ పరిస్థితి కొట్టొచ్చినట్లు కనిపించడం గమనార్హం. రెండు రోజుల క్రితం ఓ ఎస్సై సస్పెన్షన్ వ్యవహారంలోనూ ఈ తీరు కనిపించిందన్న చర్చ పోలీసువర్గాల్లో వినిపిస్తుండడం గమనార్హం. నేతల తఖరారు.. జిల్లాలో ఏడాదిన్నర కాలంగా నేతల మధ్య విభేదాలు పోలీసుల పోస్టింగ్‌లు, పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఏడాదిన్నర క్రితం జిల్లా కేంద్రంలో ఓ డీఎస్పీ విషయంలో అప్పుడు అధికార పార్టీలో ఉన్న ఇద్దరు నేతల మధ్య తీవ్ర విబేధాలు వచ్చాయి. ఆ సమయంలో జగిత్యాల డీఎస్పీ ఒకరు బదిలీ కాగా.. ఇటీవల పార్టీ మారిన అప్పటి అధికార పార్టీ నేత తీవ్రంగా పరిగణించి ఆ పోస్టింగ్‌ను రద్దు చేయించారు. కొత్తగా వచ్చిన డీఎస్పీ కేవలం ఒక్కరోజు మాత్రమే జిల్లా కేంద్రంలో పనిచేశారు. ఆ తరువాత పాత డీఎస్పీ యథాస్థానంలోకి వచ్చి విధులు నిర్వహించారు. జిల్లా కేంద్రంలో సదరు నేతల మధ్య విబేధాలతో కొంతమంది సీఐలు, ఎస్సైలు ఇదే రీతిలో పోస్టింగ్ సమస్యలతో అవస్థలు పడ్డారు. ప్రస్తుతం ఓ కీలక నేత పార్టీ మారడంతో పరిస్థితి ఎంతో కొంత సద్దమణిగినట్లు కనిపిస్తోంది. ఇదే రీతిలో జిల్లాలోని నిజామాబాద్ సరిహద్దు ప్రాంతంలోని ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ బదిలీ అయ్యారు. ఇలాగే మరికొన్ని సర్కిళ్లలోనూ ఆయా ప్రాంతాల కీలక నేతలకు నచ్చని పోలీసు అధికారులు తక్కువ కాలం పనిచేసి పోస్టింగ్‌లు వదులుకుని వెళ్లిపోయారు. పనితీరుపై ఒత్తిళ్లు జిల్లాలో కీలకంగా ఉన్న జగిత్యాల, జగిత్యాల రూరల్, టౌన్, ధర్మపురి, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్, ఇబ్రహీంపట్నం, మల్యాల వంటి పోలీస్స్టేషన్ల పోస్టింగ్‌ల కోసం జోరుగా పైరవీలు సాగుతున్నాయి. ఆయా ఠాణాల్లో క్రైం రేట్ అధికంగా ఉండటంతో పాటు నేర సంఘటనలు ఎక్కువగానే జరుగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో నేతలకు చెందిన నియోజకవర్గ కీలక నేతలతో పోస్టింగ్‌లు పొందినప్పటికీ ఆయా పోస్టింగ్‌లను కాపాడుకోవడంపైనే దృష్టి సారించేసరికి నేరాల నియంత్రణపై పట్టు జారిపోతోంది. దీనికి తోడు కీలక నేతల అనుయాయుల ఒత్తిళ్లు.. ఠాణాల్లో ఎక్కువ సంఖ్యలో వచ్చే ఫిర్యాదులు.. తక్కువ సంఖ్యలో ఉన్న సిబ్బంది ఫలితంగా వాటి పరిష్కారం చేసే దిశలో ఎదురయ్యే సమస్యల మధ్య పోలీసులు కొంతమేర తప్పటడుగులు వేయాల్సిన దుస్థితి నెలకొంది. వీటి ఫలితంగానే ఇటీవల కాలంలో రౌడీషీటర్లు, నిందితులపై నిఘా తగ్గిపోయి కోరుట్ల, మెట్పల్లి, జగిత్యాల కీలక సర్కిళ్లలో హత్య సంఘటనలు, చోరీలు, దొంగతనాలు పెరుగుతుండటం గమనార్హం. -
భూ వివాదాలతో రావొద్దు..!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా కలెక్టర్.. పోలీసు విభాగానికి మధ్య దూరం రోజురోజుకూ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. భూ సమస్యలకు సంబంధించిన ఎలాంటి వివాదాలూ తమ వద్దకు తీసుకురావద్దని జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల ఎదుట పోలీసులు బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ బోర్డులు గమనించకుండా వెళ్లిన వారికి ప్రజావాణి లేదా రెవెన్యూ విభాగానికి వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. దీంతో చేసేది లేక బాధితులు ప్రజావాణి బాట పడుతున్నారు. వాస్తవానికి కోర్టు పరిధిలో ఉన్న అంశాలు, ఆస్తి పంపకాలు, అద్దె గొడవలు, సివిల్ వివాదాల విషయాల్లో పోలీసులు కలగజేసుకోరు. కానీ.. ఈ వివాదాల నేపథ్యంలో ఏవైనా గొడవలు, కొట్లాటలు, ఇతర హింసాత్మక చర్యలు తలెత్తితే మాత్రం వారి జోక్యం అనివార్యం. ఇటీవల పెద్దపల్లి డీసీపీ కూడా ఎలాంటి భూవివాదాల్లోనూ పోలీసులు జోక్యం చేసుకోకూడదని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని ఠాణాల ఎదుట ఈ బోర్డులు వెలిశాయి. నాటి వివాదమే కారణమా..? ఇటీవల రెవెన్యూ, పోలీసు శాఖలతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా పలువురు పోలీసులు దారి తప్పుతున్నారని, ఎవరు ఏమేం చేస్తున్నారో తనకు అంతా తెలుసని, ప్రతీ ఒక్క పోలీసు అధికారి అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డిపార్ట్మెంట్ అధికారులకు హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కలెక్టర్ పోలీస్ శాఖకు నేరుగా హెచ్చరికలు జారీ చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కలెక్టర్ హెచ్చరికలను డిపార్ట్మెంట్లోని కొందరు స్వాగతించగా.. మరికొందరు విభేదించారు. విశ్వసనీయ సమాచారం మేరకు మెజారిటీ పోలీసులు కలెక్టర్ తీరుపై అసంతప్తిగానే ఉన్నా.. బయటకు వెల్లడించడం లేదు. ఈ నేపథ్యంలోనే పోలీసు శాఖలో రెవెన్యూ విభాగానికి చెందిన భూ సమస్యల ఫిర్యాదులు తీసుకోకూడదంటూ పెద్దపల్లి డీసీపీ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. నిబంధనల ప్రకారం నడుచుకుంటున్నామే తప్ప.. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో బోర్డులు ఏర్పాటు చేయలేదని పోలీసులు అధికారులు స్పష్టంచేస్తున్నారు. పోలీసు శిక్షణకు పరస్పర దూరం రెవెన్యూ, పోలీసు విభాగాల మధ్య దూరం లేదని పైకి చెబుతున్నా.. వారి చర్యలు మాత్రం మరోలా కనిపిస్తున్నాయి. ఇటీవల జిల్లాలో పోలీసు ఉద్యోగార్థుల కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో శిక్షణ ప్రారంభించారు. గోదావరిఖనిలో జరిగిన కార్యక్రమానికి రెవెన్యూ అధికారులు కనిపించలేదు. అదే పెద్దపల్లిలో జరిగిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి పోలీసు విభాగం నుంచి ఎవరూ పాల్గొనలేదు. ఈ రెండు కార్యక్రమాల్లో సంబంధిత విభాగాలు పాల్గొనలేకపోవడానికి కారణం సమాచార లోపమా..? లేక రెండు విభాగాల మధ్య పెరుగుతున్న దూరమా..? అనే విషయంపై ఎవరూ స్పష్టతనివ్వడం లేదు. మొత్తానికి రెండు విభాగాల మధ్య రోజురోజుకూ దూరం పెరుగుతోందని జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో మాత్రం చర్చ మొదలైంది.


