రెండేళ్ల పాలనలో అనేక సంక్షేమ పథకాలు | - | Sakshi
Sakshi News home page

రెండేళ్ల పాలనలో అనేక సంక్షేమ పథకాలు

Feb 5 2026 7:28 AM | Updated on Feb 5 2026 7:28 AM

రెండేళ్ల పాలనలో అనేక సంక్షేమ పథకాలు

రెండేళ్ల పాలనలో అనేక సంక్షేమ పథకాలు

● ఎన్నికల ప్రచారంలో మంత్రి ‘అడ్లూరి’

ధర్మపురి: కాంగ్రెస్‌ రెండేళ్ల పాలనలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. ధర్మపురి బల్దియా ఎన్నికల ప్రచారంలో మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో నాలుగు అమలుచేశామని, మిగిలిన రెండు త్వరలోనే తీరుస్తామని తెలిపారు. 2018 ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధర్మపురి ఆలయ అభివృద్ధికి రూ.500 కోట్లు మంజూరు చేస్తానని మాట తప్పారని, యాదాద్రిని అభివృద్ధి చేశారే తప్పా ధర్మపురికి రూపాయి ఇవ్వలేదని తెలిపారు. పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్‌ చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలకు తెలుసున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి సాధ్యమన్నారు. ముందుగా ఇంటింటా ప్రచారం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement