అనారోగ్యంతో తెలంగాణ ఉద్యమకారుడి మృతి | - | Sakshi
Sakshi News home page

అనారోగ్యంతో తెలంగాణ ఉద్యమకారుడి మృతి

Apr 2 2026 8:34 AM | Updated on Apr 2 2026 8:34 AM

జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, జేఏసీ నేత ఎన్నమనేని శ్రీనివాస్‌రావు (65) అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం రాత్రి మృతి చెందారు. శ్రీనివాస్‌రావు తెలంగాణ సాధన కోసం అనేక ఉద్యమాలు చేశారు. మొదటిసారి తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేయించి పట్టణంలోని కొత్తబస్టాండ్‌ చౌరస్తాలో ఏర్పాటు చేయించారు. ఆయన మృతిపట్ల పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

జగిత్యాల పరిధిలో యువకుడు ఆత్మహత్య

జగిత్యాలక్రైం: జగిత్యాలరూరల్‌ మండలం అంతర్గాం గ్రామానికి చెందిన మునుగురి పవన్‌ (26) మంగళవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పవన్‌ ఇంటర్‌ పూర్తి చేసి పోలీస్‌ కానిస్టేబుల్‌ కోసం కోచింగ్‌ తీసుకుని పరీక్ష రాశాడు. జాబ్‌ రాకపోవడంతో ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తూ ఉన్నత చదువులు చదువుతున్నాడు. పరీక్షల్లో ఫెయిల్‌ అవుతున్నానన్న మనస్తాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. పవన్‌ తండ్రి లింగయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ ఎస్సై ఉమాసాగర్‌ తెలిపారు.

యూనిఫాంలో మద్యం సేవించిన కానిస్టేబుల్‌

మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి జయంతి సందర్భంగా విధులు నిర్వర్తించేందుకు వచ్చిన ఓ కానిస్టేబుల్‌ బెల్ట్‌షాపులో మద్యం సేవించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దిగువ కొండగట్టులోని ఓ బెల్ట్‌షాపులో కానిస్టేబుల్‌ యూనిఫాంలోనే మద్యం సేవించడం చర్చనీయాంశమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement