నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి | - | Sakshi
Sakshi News home page

నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

Apr 2 2026 8:34 AM | Updated on Apr 2 2026 8:34 AM

జగిత్యాలరూరల్‌: అకాలవర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. సారంగాపూర్‌ మండలం అర్పపల్లి, పెంబట్లల్లో అకాల వర్షాలతో నేలకొరిగిన మొక్కజొ న్న, నువ్వు, లక్ష్మీదేవిపల్లిలో బీరతోటలను పరిశీలించారు. నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులకు పరిహారం అందించేలా చూడాలని మంత్రి అడ్లూరిని కోరారు. పంట చేతికొచ్చే సమయానికి ప్రకృతి వైపరీత్యాలతో నష్టం వాటిల్లిందని, వెంటనే పరిహారం ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సూచించారు. పంటల బీమా పథకం అమలు చేసి ఉంటే రైతులకు మేలు జరిగేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement