జగిత్యాల: యాసంగి ధాన్యం కొనుగోలుకు ప్రణా ళిక సిద్ధం చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమా ర్ అన్నారు. కలెక్టరేట్‌లో రైస్‌మిల్లర్లు, అధికారులతో బుధవారం సమీక్షించారు. జిల్లాలో 4.83 లక్ష ల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉ న్నందున ఆ మేరకు ఏర్పాట్లు చేయాలన్నారు. మొ త్తం 435 కేంద్రాలు ఏర్పాటు చేయాలని, మిల్లర్లు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొన్నారు. లా రీ యజమానులు వాహనాలను సిద్ధం చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ మాట్లాడుతూ.. కేంద్రాల్లో ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. కొనుగోళ్లకు ఏర్పాట్లు చేశామని కలెక్టర్ తెలిపారు.
వయోవృద్ధుల సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం
వయోవృద్ధుల సంక్షేమం, భద్రత ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. ఉద్యోగుల తల్లిదండ్రుల పరిరక్షణ– పర్యవేక్షణ బిల్లు ఆమోదం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞత సభ ఏర్పాటు చేశా రు. ఉద్యోగులు తమ వయోవృద్ధుల సంరక్షణ బాధ్యత తీసుకోవాలని, తల్లిదండ్రుల అవసరాలు తీర్చేందుకు వేతనం నుంచి 15శాతం లేదా.. రూ.10 వేలను కేటాయించి వారి బ్యాంక్ ఖాతాల్లో జమచేయాల్సి ఉంటుందన్నారు. తల్లిదండ్రుల సంరక్షణలో నిర్లక్ష్యం చూపితే చర్యలు తప్పవన్నా రు. ఫిర్యాదు స్వీకరించిన 60 రోజుల్లోపే సమస్య పరిష్కరించేలా కమిటీ ఉంటుందన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ బిల్లు సమాజానికి అవసరమన్నా రు. వయోవృద్ధుల కోసం జగిత్యాలలో ఏర్పాటు చేసిన సదన్ భవనానికి ప్రహరీ నిర్మించాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ బిల్లును సమర్థవంతంగా అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.


