గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: శు.చతుర్దశి ఉ.6.27 వరకు, తదుపరి పౌర్ణమి, నక్షత్రం: ఉత్తర సా.3.45 వరకు, తదుపరి హస్త, వర్జ్యం: రా.12.32 నుండి 2.14 వరకు, దుర్ముహూర్తం: ప.11.28 నుండి 12.26 వరకు, అమృత ఘడియలు: ఉ.8.24 నుండి 10.03 వరకు.
సూర్యోదయం : 5.59
సూర్యాస్తమయం : 6.08
రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
మేషం... శ్రమ ఫలిస్తుంది. నూతన విద్య, ఉద్యోగయత్నాలు కలిసివస్తాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి. వాహనయోగం.
వృషభం.... కుటుంబసభ్యులతో వివాదాలు. ధనవ్యయం. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. శ్రమతప్పదు. విద్యార్థులకు ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.
మిథునం.... వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.
కర్కాటకం.... దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఆహ్వానాలు అందుతాయి. పనుల్లో పురోగతి. సంఘంలో విశేష గౌరవం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.
సింహం..... పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
కన్య..... దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆలయాలు సందర్శిస్తారు. విందువినోదాలు. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
తుల.... మిత్రులతో వివాదాలు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యభంగం. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. అనుకోని ప్రయాణాలు.
వృశ్చికం...... కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు. శుభకార్యాలకు హాజరవుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆస్తిలాభం.
ధనుస్సు... ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. భూములు, వాహనాలు కొంటారు. విద్యార్థులకు అనుకూలం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
మకరం..... పనులు ముందుకు సాగవు. ఆర్థికంగా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. బంధువులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. సోదరులతో ఉత్తరప్రత్యుత్తరాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.
కుంభం.. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో వివాదాలు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన.
మీనం... కొత్త పనులకు శ్రీకారం. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. ఇంటాబయటా ప్రోత్సాహం. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.


