రష్యాలో ఎంబీబీఎస్: 10 వేల సీట్లు.. ఫుల్ స్కాలర్‌షిప్స్! | Dreaming of MBBS Russia Opens Doors with 10,000 Seats | Sakshi
Sakshi News home page

రష్యాలో ఎంబీబీఎస్: 10 వేల సీట్లు.. ఫుల్ స్కాలర్‌షిప్స్!

May 13 2026 1:23 PM | Updated on May 28 2026 11:45 AM

Dreaming of MBBS Russia Opens Doors with 10,000 Seats

కోయంబత్తూరు: డాక్టర్ కావాలనేది మీ లక్ష్యమా? అయితే మీకు ఒక అద్భుతమైన వార్త. విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థుల కోసం రష్యా రెడ్ కార్పెట్ పరిచింది. వేలాది సీట్లు, ఆకర్షణీయమైన స్కాలర్‌షిప్‌లు, అత్యంత తక్కువ ఫీజులతో 2026-27 విద్యా సంవత్సరానికి ఒక భారీ అవకాశాన్ని ముందుకు తెచ్చింది.

కోయంబత్తూరులో రష్యన్ ఎడ్యుకేషన్ ఫెయిర్
భారతీయ విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మక రష్యన్ ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఏకంగా 10,000 ఎంబీబీఎస్ సీట్లను కేటాయించారు. దీనికి సంబంధించి మే 15న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తమిళనాడులోని కోయంబత్తూరులో గల హోటల్ గ్రాండ్ రీజెంట్‌లో ‘ఆల్-ఇండియా రష్యన్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2026’ జరగనుంది. చెన్నై రష్యన్ హౌస్ డైరెక్టర్, వైస్ కాన్సుల్ అలెగ్జాండర్ డోడోనోవ్ మాట్లాడుతూ.. 60 ఏళ్లుగా భారతీయ విద్యార్థులకు రష్యా అత్యుత్తమ వైద్య విద్యను అందిస్తోందని, విదేశీ మెడికల్ ఎడ్యుకేషన్‌కు రష్యానే ఎప్పటికీ మొదటి ఛాయిస్ అని అన్నారు.

ఫీజుల మోత లేదు... విరివిగా స్కాలర్‌షిప్‌లు
రష్యాలో వైద్య విద్యకు ప్రభుత్వ భారీ సబ్సిడీలు అందిస్తుండటంతో ఫీజులు చాలా తక్కువగా ఉంటాయి. ఏడాదికి కేవలం రూ.3.5 లక్షలతో ప్రారంభమయ్యే అత్యంత తక్కువ ఫీజులతో ఇక్కడ చదువుకోవచ్చు. అంతేకాకుండా, ఈ ఏడాది 200 మంది భారతీయ విద్యార్థులకు రష్యా ప్రభుత్వం బ్యాచిలర్, మాస్టర్, పీజీ ప్రోగ్రామ్‌ల కోసం 100 శాతం స్కాలర్‌షిప్‌లను అందించనుంది. ప్రస్తుతం రష్యాలోని సుమారు 30 యూనివర్సిటీల్లో 25,000 మంది భారతీయులు చదువుతున్నారు. అక్కడ ప్రదానం చేసే ఎండీ (ఎండీ)డిగ్రీ, భారతదేశంలోని ఎంబీబీఎస్ (ఎంబీబీఎస్‌)తో పూర్తిగా సమానం.

అర్హతలు.. స్పాట్ అడ్మిషన్లు
ఈ కోర్సులు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంఎస్‌)తాజా నిబంధనలకు అనుగుణంగా పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. కనీసం 50శాతం మార్కులతో ‘నీట్’ పాసైన వారు అర్హులు. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ విద్యార్థులకు 40శాతం మార్కులు సరిపోతాయి. ఐఈఎల్టీఎస్ వంటి ఇతర ఎలాంటి ఇంగ్లీష్ ఎంట్రన్స్ టెస్ట్‌లు అవసరం లేదు. వోల్గోగ్రాడ్, కజాన్, పీరోగోవ్ తదితర ఏడు ప్రముఖ వర్సిటీలు పాల్గొంటున్న ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్‌కు ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదు. అర్హులైన విద్యార్థులకు అక్కడికక్కడే స్పాట్ అడ్మిషన్లు లభిస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement