breaking news
NEET
-
‘చలో సంసద్’ హింసపై ఐదుగురితో హైపవర్ కమిటీ
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: నీట్ ప్రశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా ‘చలో సంసద్’ర్యాలీ చేపట్టిన విద్యార్థులపై పోలీసులు బలప్రయోగానికి, తీవ్ర అణచివేతకు పాల్పడ్డారనే ఆరోపణలు, పోలీసు సిబ్బందిపై దౌర్జన్యం జరిగినట్లు వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు సుప్రీంకోర్టు ఉన్నత స్థాయి(హైపవర్డ్) కమిటీని ఏర్పాటు చేసింది. ఐదుగురు సభ్యులతో కూడిన ఈ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి నేతృత్వం వహిస్తారు. పంజాబ్–హరియాణా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రవిశంకర్ ఝా, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శైలేందర్ కౌర్, సీబీఐ మాజీ డైరెక్టర్ రిషికుమార్ శుక్లా, మేఘాలయ మాజీ డీజీపీ ఎల్.ఆర్.బిష్ణోయ్ ఈ కమిటీలో సభ్యులుగా నియమితులయ్యారు. గత నెలలో ఢిల్లీలో విద్యార్థులు చేపట్టిన ‘చలో సంసద్’ర్యాలీ సందర్భంగా జరిగిన హింసాకాండపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం హైపవర్ కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి నేతృత్వంలో గురువారం హైపవర్డ్ కమిటీని ఏర్పాటు చేసింది. నైపుణ్యం, అనుభవం ప్రాతిపదికగా.. నైపుణ్యం, అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. నిరసన సమయంలో జరిగిన సంఘటనలను సమగ్రంగా అంచనా వేయడంలో కమిటీ సిఫార్సులు కోర్టుకు సహాయపడతాయని విశ్వాసం వ్యక్తం చేసింది. కమిటీ అన్ని అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేసి, కోర్టుకు మధ్యంతర నివేదికలను సమర్పిస్తుందని వెల్లడించింది. జస్టిస్ సుభాష్ రెడ్డికి విశేష అనుభవం న్యాయ రంగంలో జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డికి విశేషమైన అనుభవం ఉంది. జమ్మూకశ్మీర్‌లో ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణ, ప్రాథమిక హక్కులపై వచ్చిన అనురాధ భాసిన్ కేసుతోపాటు కీలక రాజ్యాంగ ధర్మాసనాల్లో సభ్యుడిగా వ్యవహరించారు. తెలంగాణలోని మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం కామారం ఆయన స్వస్థలం. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1980లో న్యాయవాదిగా ఎన్రోల్ చేసుకున్న ఆయన రాజ్యాంగం, సివిల్, క్రిమినల్ వ్యవహారాల్లో పలు కేసులు వాదించారు. 2002 డిసెంబర్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా, 2004 జూన్‌లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016 ఫిబ్రవరిలో గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2018న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపికైన తొలి తెలంగాణ వ్యక్తి జస్టిస్ సుభాష్రెడ్డే కావడం విశేషం. 2022 జనవరి 4న పదవీ విరమణ పొందారు.హైపవర్ కమిటీ దర్యాప్తు చేసే అంశాలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల మొదటి రోజు జూలై 20న కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో చేపట్టిన ‘చల్ సంసద్’ర్యాలీ సందర్భంగా తీవ్ర హింస చెలరేగింది. శాంతియుతంగా ప్రారంభమైన నిరసన రణరంగంగా మారింది. విద్యార్థులు బారికేడ్లను బద్దలుకొట్టి పార్లమెంట్ వైపు దూసుకెళ్లారు. వారిపై పోలీసులు లాఠీచార్జి చేయడమేగాక బాష్పవాయువు గోళాలను, పెల్లెట్ గన్లను ప్రయోగించినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ హింసకు సంబంధించి పార్లమెంట్ స్ట్రీట్, కన్నాట్ ప్లేస్ పోలీసుస్టేషన్లలో పలు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. హత్యాయత్నం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం వంటి అభియోగాలపై పలువురు నిరసనకారులపై కేసులు పెట్టారు. ఈ నేపథ్యంలో హైపవర్ కమిటీ పలు అంశాలపై దర్యాప్తు చేయనుంది. → మహిళా నిరసనకారుల భద్రత: మహిళా నిరసనకారులను లక్ష్యంగా చేసుకుని జరిగిన హింస, వేధింపులు, అసభ్యకర ప్రవర్తన ఆరోపణలపై అధ్యయనానికి కమిటీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. → పోలీసుల అతి బలప్రయోగం: పోలీసులు, భద్రతా సిబ్బంది అతి బలప్రయోగం వల్ల నిరసనకారులకు తీవ్ర గాయాలు కావడం, ఆ చర్యలకు దారితీసిన వరుస ఘటనలు, వాటికి బాధ్యులు ఎవరు, బలప్రయోగంలో చట్టాలు, నిబంధనలు ఉల్లంఘించారా? అనే కోణంలో కమిటీ పరిశీలిస్తుంది. → ఆయుధాల వాడకం: ఎలాంటి ముందస్తు హెచ్చరికలు చేయకుండా పెల్లెట్ గన్లు ప్రయోగం, ఎలక్ట్రిక్ లాఠీలు ఉపయోగించడం, లాఠీచార్జీలు, బాష్పవాయువు ప్రయోగంపై కమిటీ విచారణ జరుపుతుంది. → యూనిఫాం నిబంధనలు: నిరసనకారులను అరెస్టులు చేసేటప్పుడు లేదా బలప్రయోగం చేసేటప్పుడు పోలీసులు, భద్రతా సిబ్బంది సరైన యూనిఫాం, దానిపై కనిపించే విధంగా నేమ్ప్లేట్లు ధరించారా లేదా అనేది పరిశీలిస్తుంది.→ బాధితులకు పరిహారం: గాయపడిన విద్యార్థులకు, పోలీసు సిబ్బందికి మధ్యంతర పరిహారం అందించే అంశాన్ని కూడా కమిటీ పరిశీలిస్తుంది. -
మాకు NEET వద్దు.. అమిత్ షా తో CM విజయ్
-
పోలీస్ చర్యపై దర్యాప్తుకు హైపవర్ కమిటీ
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ ఉదంతంలో పార్లమెంట్ ఎదుట నిరసన వ్యక్తం చేసేందుకు చలో సంసద్ ర్యాలీగా దూసుకొచ్చిన విద్యార్థులను పోలీసులు బాష్పవాయుగోళాలతో అడ్డుకుని లాఠీచార్జ్ చేసి విచక్షణారహితంగా చితకబాదారన్న ఆరోపణలపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది. పార్లమెంట్ సాక్షిగా ఉద్యమకారులపై ఢిల్లీ పోలీసుల అతి బలప్రయోగం ఆరోపణల్లో నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు అత్యున్నతస్థాయి(హైపవర్) కమిటీని ఏర్పాటుచేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని ధర్మాసనం మంగళవారం ప్రకటించింది. పోలీసుల అత్యుత్సాహంతో వందలాది మంది గాయాలపాలయ్యారని, ఈ ఘటనలో పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పలు పిటిషన్లను సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి మోహనల బెంచ్ విచారించి పై విధంగా ఆదేశాలిచ్చింది. సుప్రీంకోర్టులో, హైకోర్టులో పదవీవిరమణ చేసిన న్యాయమూర్తులు, మాజీ డీజీపీ, మాజీ సీబీఐ డైరెక్టర్లను సభ్యులుగా ఎంపికచేస్తూ హైపవర్ కమిటీని ఏర్పాటుచేస్తున్నట్లు బెంచ్ తెలిపింది. ర్యాలీలో బాధితులుగా మారిన ఉద్యమకారులు నేరుగా ఈ కమిటీని సంప్రదించి తమ ఫిర్యాదులు, ఆరోపణలు తెలియజేయవచ్చు. కమిటీ ఇచ్చే సిఫార్సులను కోర్టు పరిశీలిస్తుంది. తగు చట్టబద్ధమైన నిర్ణయాలను మేం తీసుకుంటాం’’అని ధర్మాసనం తెలిపింది. ‘‘ఉద్యమిస్తున్న మహిళలతో పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని, లైంగికంగా వేధించారని వస్తున్న ఆరోపణలపైనా కమిటీ దర్యాప్తు చేయనుంది. ఉద్యమకారిణులను ఆన్లైన్లో వేధించిన ఉదంతాలు, సోషల్‌మీడియా ద్వారా బెదిరించిన ఘటనలనూ, మహిళా కార్యకర్తలు చేసిన ఫిర్యాదులనూ హైపవర్ కమిటీ పరిశీలిస్తుంది. పరీక్షార్థుల ఉద్యమంతో సంబంధం ఉన్న ప్రతి కోణంలోనూ కమిటీ దర్యాప్తు కొనసాగుతుంది. ఈ ఉదంతంలో నేరస్తులుగా తేలిన వారిపై కఠిన శిక్షలుంటాయి. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన వారిని గుర్తించేందుకు జూలై 20వ తేదీనాటి ఘటనాస్థలి ఫొటోలు, వీడియోలు, సీసీటీవీ ఫుటేజీలను హైపవర్ కమిటీకి ఢిల్లీపోలీసులు అందజేయాలి’’అని ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను సీజేఐ సూర్యకాంత్ ఆదేశించారు. వాళ్లకెంతో భవిష్యత్ ఉంది.. ఈ సందర్భంగా విద్యార్థులపై మోపిన కేసులను ధర్మాసనం ప్రస్తావించింది. ‘‘ఇది విద్యార్థుల జీవితాలకు సంబంధించిన విషయం. అక్రమ ఎఫ్ఐఆర్లను తొలగించాల్సిన సమయమిది. రాజ్యాంగంలోని 19వ అధికరణం ప్రకారం నిరసన తెలిపే హక్కు విద్యార్థులు, పరీక్షార్థులకు ఉంది. అనవసరంగా విద్యార్థులపై మోపిన ఎఫ్ఐఆర్లను తొలగించే హక్కు రాజ్యాంగంలోని 142వ అధికరణం ప్రకారం సుప్రీంకోర్టుకు ఉంది’’అని ధర్మాసనం గుర్తుచేసింది.కేసుల మాఫీపై సొలిసిటర్ జనరల్ తుషార్ అభ్యంతరం వ్యక్తంచేశారు. ‘‘ఆ రోజు ఆందోళనల్లో 2,800 మంది అసాంఘీక శక్తుల పాత్ర ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వాళ్లకు నేర చరిత్ర ఉంది. జూలై 20న సంసద్ ర్యాలీ ఉద్రిక్తతకు దారితీయానికి వీళ్లే కారణం. వీళ్లను గుర్తించేందుకు ఫేíషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ, నిఘా సాధనాలను ఉపయోగించాల్సి వచ్చింది’’అని తెలిపారు. దీనిపై కోర్టు స్పష్టతనిచ్చింది. ఫేíషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ, నిఘా, ప్రైవసీ అనే అంశాలు ఈ కేసులో ఉల్లంఘనకు గురయ్యాయా లేదా అనేవి కమిటీ నిర్ణయించదు. కోర్టు నిర్ణయిస్తుంది’’అని ధర్మాసనం స్పష్టంచేసింది.సమర్ధించుకున్న ఢిల్లీ పోలీసులు విద్యార్థుల నిరసనల సందర్భంగా పోలీసులు అతిగా బలప్రయోగం చేశారన్న ఆరోపణలను ఢిల్లీ పోలీసులు తోసిపుచ్చారు. ఈ మేరకు సుప్రీంకోర్టుకు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సచిన్ శర్మ కౌంటర్ అఫిడవిట్ సమరి్పంచారు. ‘‘ఆరోజు జంతర్‌మంతర్ వద్ద 30,000 మందికిపైగా నిరసనకారులు గుమిగూడారు. సంసద్ ర్యాలీకి అనుమతి లేదు. విద్యార్థులను నియంత్రించేందుకు సుమారు 5 వేల మంది పోలీసు సిబ్బంది విధుల్లో ఉన్నారు. బారికేడ్లు తోసేసి పార్లమెంట్ దిశగా దూసుకొస్తున్న నిరసనకారులను నిలువరించగా తోపులాట జరిగింది.ఈ ఘటనలో 240 మందికిపైగా పోలీసులు గాయపడ్డారు. 200 మంది పౌరులు, నిరసనకారులు సైతం గాయపడ్డారు. ఉద్యమంలో సంఘవిద్రోహ శక్తులు, నేరచరితులు చొరబడ్డారు. వీరిలో 2,873 మందిపై గతంలోనే క్రిమినల్ కేసులు ఉన్నాయి’’అని పోలీసులు తెలిపారు. నిరసనల సమయంలో సాధారణ దుస్తుల్లో లాఠీలతో కనిపించిన పోలీసు సిబ్బందికి సంబంధించిన వీడియోలపై కూడా ఢిల్లీ పోలీసులు వివరణ ఇచ్చారు.ఇలా సాధారణ దుస్తుల్లో పోలీసులను గుంపుల్లో కలిపి విధులు నిర్వహించడం చట్టవిరుద్ధం కాదని, అసాధారణమైన చర్య కూడా కాదని పేర్కొన్నారు. పార్లమెంట్, రాష్ట్రపతిభవన్, సేవా తీర్థ్, కర్తవ్యభవన్, ఇతర కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర మంత్రుల అధికారిక నివాసాలున్న ఆ ప్రాంతంలో అవాంఛనీయ ఘటన జరక్కుండా తాము సరైన నిర్ణయమే తీసుకున్నట్లు పోలీసులు తమ చర్యను సమర్ధించుకున్నారు. -
కేంద్రం దిద్దుబాటు చర్యలు.. ఎన్టీఏలో 50 మందికి ఉద్వాసన
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకమైన నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ ఉదంతం, లక్షలాది మంది విద్యార్థుల ఆందోళనలతో కేంద్ర విద్యా శాఖలో కదలిక మొదలైంది. కీలకమైన పరీక్షల నిర్వహణ బాధ్యతలు చూసుకునే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)లో ముఖ్యమైన అధికారులు సహా మొత్తంగా ఇప్పటిదాకా 50 మంది సిబ్బందిని తొలగించింది. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంతో పాటు.. ఇటు తాజాగా మూడు రీటెస్ట్లకు ఎన్టీఏ సిద్ధం కావడంతోనే ఈ దిద్దుబాటు చర్యలకు దారి తీసింది.ఉన్నతావిద్యా విభాగ అధికారులతో నూతన విద్యామంత్రి ప్రల్హాద్ జోషి సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించిన సందర్భంగా ఎన్టీఏ ఈ వివరాలను బహిర్గతంచేసింది. నీట్–యూజీలో ఇంగ్లిష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్ట్ పేపర్లలో తప్పులు దొర్లాయని ఫిర్యాదులు వెల్లువెత్తడంతో సెపె్టంబర్ 9 నుంచి మళ్లీ రీ–ఎగ్జామ్ నిర్వహిస్తామని ప్రకటన వెలువడిన మరుసటి రోజే ఉన్నతవిద్యాశాఖ కార్యదర్శి, ఎన్టీఏ డైరెక్టర్ జనరల్, ఇతర సీనియర్ ఉన్నతాధికారులతో మంత్రి ప్రల్హాద్ జోషి సమావేశమై పరీక్షల నిర్వహణలో సంస్కరణలపై కీలక ఆదేశాలిచ్చారు. ఎన్టీఏలో ఇకపై కొత్తగా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్, సీఐఎస్ఓ, టెస్టింగ్ సెక్యూరిటీ జనరల్మేనేజర్, ఆర్ అండ్ డీ, సైకోమెట్రిక్స్లో జనరల్ మేనేజర్ తదితర కీలక పదవుల్లోకి అత్యంత వృత్తి నైపుణ్యమున్న వ్యక్తులను నియమించాలని నిర్ణయించారు. ఈ పదవుల్లోకి నియామక ప్రక్రియను ఆరంభించినట్లు విద్యాశాఖ తెలిపింది. ఈ వివరాలను విద్యాశాఖ తర్వాత తన ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్చేసింది. మూడు సబ్జెక్ట్ పరీక్ష ప్రశ్నాపత్రాల్లో చాలా తప్పులు దొర్లడం, అవే ప్రశ్నలు పదేపదే అడగడంతో విమర్శలు వెల్లువెత్తడంతో నష్టనివారణ చర్యల్లో భాగంగా 50 మందిని ఎన్టీఏ తొలగించిందని వార్తలొచ్చాయి. యుద్ధ ప్రాతిపదికన సంస్కరణల అమలుసైబర్ సెక్యూరిటీ, సైకోమెట్రిక్స్, ప్రశ్నపత్రాల రూపకల్పన, ఇతర ప్రత్యేక విభాగాల్లోకి అవసరమైతే ప్రైవేట్ రంగం నుంచి నిపుణులను నియమించుకోనున్నారు. ప్రశ్నల ఎంపిక మొదలు ప్రశ్నాపత్రాల రూపకల్పన, డిజైన్, ముద్రణ, నిఘా, నిల్వ, రవాణా తదితర కీలక విభాగాలన్నింటిలో సంస్కరణలు తీసుకురానున్నారు. క్వశ్చన్ పే పర్ల కోసం ప్రత్యేకంగా గదుల కేటాయింపు, వాటిని భద్రపరిచే కంప్యూటర్ వ్యవస్థలకు ఇంటర్నెట్ లాంటి ఎలాంటి బయటి వ్యవస్థలతో అనుసంధానం లేకుండా చూసుకోవడం, సబ్జెక్ట్ నిపుణులు, సిబ్బంది విధుల్లో ఉన్నప్పుడు వ్యక్తిగత మొబైల్, పెన్‌డ్రైవ్, ల్యాప్‌టాప్ వంటి డిజిటల్ ఉపకరణాలను స్వా«దీనంచేసుకోవడం వంటి చర్యలను యుద్ధ ప్రాతిపదికన అమలుచేయనున్నారు. ఎన్టీఏ పరిధిలో జరిగే అన్ని ఎగ్జామ్‌లకు సంబంధించిన సమగ్ర స్థాయి ఆడిటింగ్‌తోపాటు ఎప్పటికప్పుడు నివేదికలను సమీక్షించనున్నారు. -
51 ఏళ్ల వయసులో ఎంబీబీఎస్ సీటు..!1992లోనే..
చదువుకోవాలి, కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన ఉన్నవారికి వయసు ఎన్నడూ అడ్డంకి కాదని పలువురు నిరూపిస్తున్న ఘట్టాలు చూశాం. అంతేగాదు క్షణికావేశంలో కోరుకున్న కోర్సు చదవలేకపోయామనో, అనుకున్నది సాధించలేకపోయామనో జీవితాలను అంతం చేసుకునే యువతకు కనవిప్పు కలిగించేలా స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తాజాగా అలాంటి కోవలోకి చెన్నైవాసి చేరారు. పైగా ఆయన దివ్యాంగుడు, చక్కగా మరో రంగంలో కెరీర్ నిర్మించుకుని రిటైర్మెంట్ తీసుకునే వయసుకి వచ్చేశారు. అయినా తన చిరకాల కోరికను నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తూ..యువతకు స్ఫూర్తిని రగిల్చారు. ఆయనే చెన్నైకి చెందిన 51 ఏళ్ల సురేష్ కుమార్. తమిళనాడులోని నాగపట్నం జిల్లా వేలంకన్ని నివాసి అయిన సురేష్ 1992లో 12వ తరగతి పూర్తి చేశారు . అప్పటి నుంచి ఆయనకు మెడిసిన్ చదవాలనే కోరిక ప్రబలంగా ఉండేది. అయితే అప్పట్లో మెడిసిన్ సీటు దక్కించుకోలేకపోయాడు. అదీగా కుటుంబ ఆర్థిక పరిస్థితి రీత్యా ఫార్మకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తిచేశాడు. ఆ తర్వాత ఎంబీఏ, రెండు పీహెచ్చ్డీలు పూర్తిచేసి డాక్టరేట్ అందుకున్నారు. ప్రస్తుతం ఆయన డయాగ్నోస్టిక్స్ పరిశ్రమలో పనిచేస్తున్నారు. నీట్లో సీటు సాధించాడు ఇలా..2022లో, సుప్రీంకోర్టు మెడికల్ అడ్మిషన్ల వయోపరిమితిని తొలగించిన తర్వాత కుమార్ నీట్ యూజీ పరీక్షకు హాజరయ్యాడు. కానీ దానిని చేధించలేకపోయాడు. అయితే 2026లో 18 నెలల ప్రిపరేషన్ తర్వాత మళ్లీ మెడికల్ ప్రవేశ పరీక్షకు ప్రయత్నించాడు. ఈసారి 192 మార్కుల సాధించి పీడబ్ల్యూడీ కోటా కింద చెన్నైలో నాగపట్నం ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు సాధించాడు. పూర్తి సమయం పని చేస్తూనే, సురేష్ కుమార్ మెడికల్ ప్రవేశ పరీక్షకు ప్రిపరేషన్ కొనసాగించాడు. అతను తరచుగా రాత్రి 10 గంటల నుంచి అర్థరాత్రి వరకు ప్రిపరేషన్ సాగించినట్లు తెలిపాడు. తనకు అర్థంకానీ జీవశాస్త్రాన్ని కొడుకు అర్థమయ్యేలా బోధించినట్లు వివరించారు. అలాగే గత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేసి తన ప్రిపరేషన్ సామర్థ్యాన్ని ట్రాక్ చేసుకున్నట్లు వెల్లడించారు. తనకు జరిగిన రోడ్డు ప్రమాదం కారణంగానే వైద్య విద్య అభ్యసించాలనే కోరిక మరింత పెరిగిందని అన్నారు. పదవీవిరమణ వయసులో ఇలా కాలేజ్‌కి వెళ్లి చదువుకోవాలన్న తన ఆశయానికి భార్య దుర్గ, కుటుంబం పూర్తి మద్దతు ఇచ్చిందని చెప్పారు. తన భార్య ఉపాధ్యాయురాలని చెప్పారు. ఇక తనకు ఎనిమిది, పది చదువుతున్న ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం తాను తన 72 ఏళ్ల తల్లితో కలిసి జీవించాలని యోచిస్తున్నట్లు తెలిపారు. తనకు సీటు కేటాయించిన మెడికల్ కాలేజ్ ఏడు కి.మీల దూరంలో ఉందని అందుకని సైకిల్‌పై వెళ్లాలని భావిస్తున్నట్లు తెలిపారు. కాగా, తమిళనాడు ప్రభుత్వం చెన్నైలోని మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో స్పెషల్ కేటగిరీ అభ్యర్థులకు ఆఫ్‌లైన్ కౌన్సెలింగ్ నిర్వహించింది. అందులో స్పోర్ట్స్ కేటగిరీ కింద 15 సీట్లు, మాజీ సైనికుల పిల్లలకు 11, పీడబ్ల్యూడీ కేటగిరీ కింద 224, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 7.5% కోటా కింద 614 సీట్లతో ఆఫ్‌లైన్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది.(చదవండి: పాట పాడినందుకు విధుల నుంచి తొలగించారు..! ఇవాళ ఏకంగా..) -
వాయిదాల సమావేశాలు ముగిశాయి!
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్, అయోధ్య రామాలయ విరాళాల చోరీపై నిరసనలు, నినాదాలు, అధికార, విపక్షాల మధ్య వాగ్వాదాలు, సవాళ్లతో దద్దరిల్లిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. ఉభయ సభలు గురువారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈసారి వర్షాకాల సమావేశాలు దాదాపు నిష్ఫలంగా మిగిలిపోయాయి. రాజ్యసభ, లోక్‌సభల్లో ఉత్పాదకత కనిష్ట స్థాయికి పడిపోయింది. ఎలాంటి చర్చ లేకుండానే బిల్లులను నిమిషాల వ్యవధిలోనే ఆమోదించడం గమనార్హం. నిత్యం పార్లమెంట్లో ప్రతిష్టంభన నెలకొనడం, సభలు పదేపదే వాయిదా పడడం పరిపాటిగా మారింది. ఇందుకు ప్రతిపక్షాలే బాధ్యత వహించాలని అధికార పక్షం తేలి్చచెప్పింది. అధికార పక్ష వైఖరి వల్లే వర్షాకాల సమావేశాలు స్తంభించిపోయాయని ప్రతిపక్ష ఎంపీలు మండిపడ్డారు. ప్రధానమంత్రి గానీ, హోంమంత్రి గానీ ఒక్కసారి కూడా సభా కార్యకలాపాలకు హాజరుకాకపోవడం ‘అపూర్వం’ అని ఎద్దేవా చేశారు. ఒక్క బిల్లుపైనే ఉభయ సభల్లో చర్చ పార్లమెంట్ 25 రోజులపాటు సమావేశం కాగా, లోక్‌సభ 19 శాతం పనితీరును నమోదు చేసింది. రాజ్యసభలో అది 39 శాతంగా నమోదైంది. వర్షాకాల సమావేశాల్లో లోక్‌సభలో 12, రాజ్యసభలో 12 బిల్లులు ఆమోదం పొందాయి. అయితే, కేవలం ‘పబ్లిక్ ఎగ్జామినేషన్(అక్రమ పద్ధతుల నివారణ) సవరణ బిల్లు–2026’పై మాత్రమే ఉభయ సభల్లోనూ చర్చలు జరిగాయి. ఇతర బిల్లులు పెద్దగా చర్చకు నోచుకోలేదు. పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో విద్యార్థులు చేపట్టిన నిరసనలపై పోలీసుల దమనకాండ, అయోధ్య రామమందిర విరాళాల అపహరణపై ఉభయ సభల్లో తీవ్రస్థాయిలో రగడ జరిగింది. విద్యార్థులపై పోలీసుల దాడి పట్ల ప్రభుత్వం సమాధానం చెప్పాలని, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు నిలదీశాయి. ప్రతిపక్షాల నినాదాలు, వాదోపవాదాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉభయ సభల కార్యకలాపాలకు ప్రతిరోజూ అంతరాయం కలిగింది. పార్లమెంట్ భవనం ప్రధాన ద్వారం వద్ద ప్రతిపక్షాలు నిత్యం నిరసన వ్యక్తంచేశాయి. అదే ప్రదేశంలో అధికార ఎన్డీఏ ఎంపీలు కూడా నిరసనకు దిగారు. కనీసం రెండు సందర్భాల్లో ఇరు వర్గాలు ముఖాముఖి తలపడ్డాయి. నీట్ పేపర్ లీక్ విషయంలో విద్యార్థుల నుంచి ఒత్తిడి పెరగడంతో.. పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగానే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. స్పీకర్ తేనీటి విందుకు విపక్షాల గైర్హాజరు లోక్‌సభ నిరవధిక వాయిదా పడిన తర్వాత స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేసిన సాంప్రదాయ తేనీటి విందును కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పారీ్టలు బహిష్కరించాయి. ఈ కార్యక్రమానికి విపక్షాల నుంచి డీఎంకే నాయకురాలు కనిమొళి హాజరయ్యారు. స్పీకర్ చాంబర్లో జరిగిన తేనీటి విందులో ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇతర సీనియర్ నాయకులు, మంత్రులు పాల్గొన్నారు. రాజ్యసభలో చైర్మన్ ఏర్పాటు చేసిన తేనీటి విందులో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత సోనియా గాంధీతో సహా ప్రతిపక్ష నాయకులు పాల్గొన్నారు. ఈసారి కీలక బిల్లులపై విస్తృత చర్చలు జరగకపోవడంతో ప్రభుత్వం అసంతృప్తిగా ఉన్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షాల వైఖరిలో మార్పులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.సభ గౌరవాన్ని నిలబెట్టాలి: రాధాకృష్ణన్ రాజ్యసభలో చివరి రోజు జీరో అవర్, ప్రశ్నోత్తరాలను రద్దుచేశారు. గనులు, ఖనిజాల(అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించారు. అనంతరం చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ మాట్లాడారు. ఈ సమావేశాల సమయంలో సభా కార్యకలాపాలకు అంతరా యం కలిగిన తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. సభ్యులు ఈ మహోన్నత సభ గౌరవాన్ని నిలబెట్టాలని, భారత ప్రజాస్వామ్య అత్యున్నత సంప్రదాయాలకు అనుగుణంగా తమ పార్లమెంటరీ బాధ్యతలను నిర్వర్తించాలని సూచించారు. జూలై 20న ప్రారంభమైన వర్షాకాల సమావేశాల్లో, అంతరాయాల కారణంగా ఉత్పాదకత కేవలం 39 శాతంగా ఉన్నప్పటికీ, 12 బిల్లులు ఆమోదం పొందడం లేదా వెనక్కి పంపడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశాలు నిరంతర గందరగోళం, తరచూ అంతరాయాలతో నిండిపోయి, సభా కార్యకలాపాల ను పదేపదే పట్టాలు తప్పించడం విచారకరమని అన్నారు. విలువైన సభా సమయం వృథా కావడం వల్ల జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై అర్థవంతమైన చర్చ, వాదోపవాదాలు జరగలేదని వెల్లడించారు. మనమందరం సమష్టిగా సభా కార్యకలాపాల్లో పాల్గొని, విలువైన సూచనలు ఇచ్చి, అర్థవంతమైన చర్చలు జరిపి ఉంటే పరిస్థితులు కచి్చతంగా భిన్నంగా ఉండేవని వ్యాఖ్యానించారు. వందేమాతరం అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. లోక్‌సభలో వందేమాతరం ఆరు చరణాల ఆలాపన లోక్‌సభ గురువారం ఉదయం ప్రారంభమైన వెంటనే జాతీయ గీతం వందేమాతరంలోనిమొత్తం ఆరు చరణాలను వినిపించారు. లోక్‌సభ చరిత్రలో జాతీయ గీతాన్ని పూర్తిగా వినిపించడం ఇదే మొదటిసారి. ఆ తర్వాత స్పీకర్ ఓం బిర్లా సభను నిరవధికంగా వాయిదా వేశారు. సభ పనితీరు, ఉత్పాదకతను వివరిస్తూ సాధారణంగా చేసే ముగింపు ప్రసంగాన్ని స్పీకర్ చదివి వినిపించలేదు. చివరి రోజు కూడా సభలో ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ బిగ్గరగా నినాదాలు చేశారు. ప్రధాని మోదీ, మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ తదితరులు హాజరయ్యారు. అంకెల్లో సభ→ వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభ మొత్తం 37 గంటల 49 నిమిషాలు మాత్రమే పనిచేసింది. 39.17 శాతం ఉత్పాదకత నమోదయ్యింది. → మొత్తం 285 స్టార్డ్ ప్రశ్నలను లేవనెత్తారు. 380 జీరో అవర్ సమర్పణలు, 380 ప్రత్యేక ప్రస్తావనలు ఉన్నాయి. వాటిలో 16 ప్రశ్నలు, 52 జీరో అవర్ సమర్పణలు, 93 ప్రత్యేక ప్రస్తావనలను మాత్రమే పరిగణనలోకి తీసుకోగలిగారు. → లోక్‌సభ 19 రోజులు సమావేశమైంది. కేవలం 15 గంటల 36 నిమిషాలపాటు పని చేసింది. ఉత్పాదకత గత రెండు దశాబ్దాల్లో అత్యల్పంగా 19 శాతమే నమోదు కావడం గమనార్హం. -
‘వాయిదాల’ పార్లమెంటు!
పార్లమెంటు వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారైనప్పుడు నీట్ ప్రశ్నపత్రం లీక్ ఉదంతం ఈ స్థాయిలో సభను ముంచెత్తుతుందనీ, వరస గందరగోళ దృశ్యాలతో మొత్తం కార్యకలాపాలే స్తంభించిపోతాయనీ, వాయిదాలతోనే గడిచిపోతుందనీ ఎవరూ ఊహించి వుండరు. నిరవధిక వాయిదా అనంతరం సమావేశాల తీరుతెన్నులెలా ఉన్నాయో చెప్పటం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వంతు. ఆ శాఖను నిర్వహిస్తున్న కిరణ్ రిజిజు లోక్‌సభ 19 శాతం, రాజ్యసభ 39 శాతం కాలాన్ని వినియోగించుకో గలిగాయని ప్రకటించారు. ఇలా జరగటం కొత్తేమీ కాదు. చట్టసభలు నిర్దేశించుకున్న లక్ష్యానికీ, సాధించిన ఫలితానికీ పొంతన లేకపోవటం మనకు రివాజే. దీనికి భిన్నంగా మన పార్లమెంటు సక్రమంగా పనిచేసిందంటే, సంతృప్తికరంగా చర్చలు సాగాయంటే ఆశ్చర్యపడాలి. యూపీఏ హయాంలో 2010లో పార్లమెంటు శీతాకాల సమావేశాల వ్యవధిలో కేవలం 5 శాతం మాత్రమే పనిచేసింది. రాజ్యసభ అయితే కేవలం 2 శాతం! ఆ రికార్డును అధిగమించిన సమావేశాలు ఇంతవరకూ లేకపోవటం జనం అదృష్టం. సమావేశాల కాలానికి ఎప్పుడూ ఏదో సమస్య ఊడిపడటం, అధికార విపక్షాలు పరస్పర కలహాలు తప్పడంలేదు. ఇలా వాయిదాల పరంపరతో ప్రభుత్వ పక్షం కీలకమని భావించిన బిల్లుల్ని మూజువాణి ఓటుతో ఆమోదింపజేసుకోవటం అసలు సమస్య. యూపీఏ హయాంలో లోక్‌సభలో 20 బిల్లులపై కేవలం అయిదంటే అయిదే నిమిషాలు చర్చ జరిగింది. ప్రజల తలరాతల్ని నిర్ణయించే అనేక నిర్ణయాలు ఈ తోవన చట్టాలుగా మారుతున్నాయి. ఇందులో లక్షల కోట్ల విలువైన ఆర్థిక బిల్లులు కూడా ఉంటున్నాయి. ప్రశ్నోత్తర సమయం, జీరో అవర్ వంటివి కొట్టుకుపోతున్నాయి. క్రమశిక్షణాయుత ప్రవర్తనతో ప్రజల్లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై విశ్వాసాన్ని పెంచాల్సినవారే అందుకు విరుద్ధమైన సందేశం పంపుతున్నారు. విపక్షంలో ఉండగా బీజేపీ ఏం చేసిందో, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అలాగే చేయాలనుకుంది. ఈ క్రమంలో కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అవుతున్నది. సమావేశాల ఆరంభం రోజున కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిర్వహించిన ‘ఛలో పార్లమెంటు’ ఊహించని పరిణామాలకు దారితీసింది. అసలు సమావేశాల్లో సగభాగం దాని చుట్టూనే తిరిగింది. ఆవిర్భవించిన కొన్ని నెలలకే సీజేపీ ఒక అసాధారణ పరిణామానికి కారణం కావటం దాని ప్రత్యేకత. కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవినుంచి తప్పుకోవాల్సివచ్చింది. బీజేపీ అధికారంలోకొచ్చిన ఈ పన్నెండేళ్లలోనూ విపక్షాలన్నీ కట్టగట్టుకుని ఒక్కటైనా ఇలా కేంద్రంపై ఒత్తిడి తేలేకపోయాయి. టీఎంసీ ఎంపీలు కొందరు బీజేపీలోకి ఫిరాయించటం, ఇండియా కూటమినుంచి డీఎంకే వైదొలగటం విపక్షాలను నైతికంగా దెబ్బతీసే పరిణామాలు. రంగంలో సీజేపీ లేనట్టయితే విపక్షాలు నిస్తేజంగా, నిస్సహాయంగా దిక్కుతోచని స్థితిలో పడివుండేవి. తమ ఉద్యమా నికి ప్రధాన విపక్షంగా కాంగ్రెస్ తోడ్పాటు అందించకపోయినా జెన్ జీ ఆ పార్టీకి చేసిన ఉపకారమిది. సమావేశాల రెండో భాగంలో కాంగ్రెస్ కాస్త మేల్కొని ప్రధాని నివాసం ఎదుట ధర్నాకు దిగింది. జెన్ జీ ప్రస్తావించని పెల్లెట్ల అంశాన్ని ప్రధాన సమస్యగా మార్చింది. కోల్పోయిన ప్రతిష్ఠను కొద్దో గొప్పో కాపాడుకునే ప్రయత్నం చేసింది. రోడ్లపైకొచ్చి ఆందోళన చేస్తే తప్ప చట్టసభలకు తమ సమస్యలు పట్టబోవన్న అభిప్రాయం జనంలో కలగటం మంచి పరిణామమేనా అన్నది పార్టీలు ఆలోచించుకోవాలి. అది శాంతియుత ఆందోళనా, హింసాత్మకమా అన్న విచక్షణలేకుండా ప్రతి సమస్యనూ పోలీసులే పరిష్కరిస్తారన్న అభిప్రాయంతో ఉంటే ఏమవుతుందో జంతర్ మంతర్ నిరూపించింది. సమస్యల్ని చూసే కోణంలోనూ పార్టీల ద్వంద్వప్రవృత్తి వెల్లడవుతోంది. ఢిల్లీలో జెన్ జీ ఉద్యమంపై మొదట్లో అభాండాలేసిన బీజేపీ, సంఘ్ పరివార్ సంస్థలు తమ తప్పిదాన్ని గుర్తించాయి. జార్ఖండ్ ఆందోళనలో చురుగ్గా పాల్గొంటున్నాయి. మంచిదే. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన డీఎస్సీ అవకతవకలపై మాత్రం ఈ సంస్థలు నోరెత్తవు. సాక్షాత్తూ అభ్యర్థులే గోడు వినిపిస్తున్నా బుకాయింపులే. ఇలాంటి వైఖరులే పార్టీల నిజాయితీని ప్రశ్నార్థకం చేస్తాయి. మొత్తానికి వర్షాకాల సమావేశాల తీరుతెన్నులపై అన్ని పక్షాలూ ఆత్మవిమర్శ చేసుకోవాలి. భవిష్యత్తులో ఈ పరిస్థితి తలెత్తకుండా ఏం చేయవచ్చునో ఆలోచించుకోవాలి. -
లోక్‌సభలో కొనసాగిన ప్రతిష్టంభన
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో చివరి దశలోనూ ప్రతిష్టంభనకు తెరపడలేదు. నీట్ పేపర్ లీకేజీపై నిరసనకు దిగిన విద్యార్థులపై పోలీసుల దమనకాండ పట్ల ప్రభుత్వం సమాధానం చెప్పాలని లోక్‌సభలో ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. బుధవారం ఉదయం సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ప్రారంభించారు. ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తంచేశారు. కేంద్ర హోంమంత్రి సభకు రావాలని డిమాండ్ చేశారు. స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. అధికార పక్షంతో ప్రతిపక్షానికి భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ సభ సజావుగా సాగాలని దేశం కోరుకుంటోందని అన్నారు. నిరసనలు, నినాదాలతో సభ ప్రతిష్టను దెబ్బతీయడం సరైంది కాదని సూచించారు. సభలో కార్యకలాపాలకు సహకరించాలని, చర్చలో పాల్గొనాలని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు.అయినప్పటికీ ప్రతిపక్షాలు వినిపించుకోకపోవడంతో సభను మధ్యా హ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత ప్రతిపక్ష సభ్యుల నినాదాల మధ్యే ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లును జేపీసీ పరిశీలనకు పంపించే తీర్మానాన్ని ఆమోదించారు. ప్రతిపక్షాల నినాదాలు ఆగకపోవడంతో సభ కొద్దిసేపు వాయిదా పడింది. మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి ప్రారంభమైంది. ‘గనులు, ఖనిజాల బిల్లు’ను ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదించారు. ప్రతిపక్షం పారిపోకూడదు: రిజిజు నీట్ పేపర్ లీక్‌తోపాటు విద్యార్థుల నిరసనపై తక్షణమే చర్చను ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దీనికి సంబంధించి కేంద్ర హోమంత్రి అమిత్ షా ఇప్పటికే స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి హోంమంత్రి సిద్ధంగా ఉన్నప్పుడు, చర్చ నుంచి ప్రతిపక్షం పారిపోకూడదని అన్నారు. జార్ఖండ్‌లో విద్యార్థుల నిరసనల అంశాన్ని అధికార ఎన్డీయే సభ్యులు లేవనెత్తడంతో సభలో ఉద్రిక్తత నెలకొంది. దాంతో సభను గురువారం ఉదయం 11 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అంతకుముందు ఉదయం లోక్‌సభలో ప్రశ్నోత్తరాలు మూడు నిమిషాల కంటే తక్కువ సమయంలోనే ముగిశాయి. జూలై 20న వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఒక్కరోజు కూడా ప్రశ్నోత్తరాలు పూర్తిగా జరగలేదు. విద్యార్థుల నిరసనలు, అయోధ్య రామాలయ విరాళాల చోరీ వంటి అంశాలపై ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య కొనసాగుతున్న ఘర్షణ కారణంగా ఈసారి వర్షాకాల సమావేశాలకు పూర్తిగా అంతరాయం ఏర్పడింది. -
అమిత్ షా ‘లెక్చర్’ మాకొద్దేవద్దు
న్యూఢిల్లీ: పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చే ‘లెక్చర్’వినాలన్న ఆసక్తి ప్రతిపక్షానికి లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తేల్చిచెప్పారు. అభూత కల్పనలు, ఊకదంపుడు ఉపన్యాసాలు తమకు అక్కర్లేదని పేర్కొన్నారు. విద్యార్థుల నిరసనలపై చర్చకు సిద్ధంగా ఉన్నట్లు అమిత్ షా చేసిన ప్రకటనపై రాహుల్ బుధవారం స్పందించారు. అమిత్ షా ఇమేజ్ బెలూన్ ఇప్పటికే పగిలిపోయిందని అన్నారు. అందులో గ్యాస్ నింపడానికి ఆయన చివరి నిమిషంలో ప్రయతి్నస్తున్నారని ఎద్దేవా చేశారు. నీట్ పేపర్ లీక్‌పై నిరసనకు దిగిన విద్యార్థులపై పెల్లెట్ గన్లతో కాల్పులు జరపాలని ఎవరు ఆదేశించారో తెలుసుకోవాలని యువత కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. విద్యార్థులపై కాల్పులు జరపాలని అమిత్ షా ఆదేశించి ఉంటే ఆయన బాధ్యుడవుతాడని, ఒకవేళ ఆదేశించకపోతే ఆయన అసమర్థుడని తేల్చిచెప్పారు. ఏది ఏమైనా అమిత్ షా రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ బుధవారం మీడియాతో మాట్లాడారు. అమిత్ షాతో చర్చ జరపడానికి తమకు ఏమాత్రం ఆసక్తి లేదన్నారు. ‘‘విద్యార్థులపై ఎవరు కాల్పులు జరిపారు? కాల్పులు జరపాలని ఎవరు ఆదేశించారు? విద్యార్థుల్లో ఒకరిని అంధుడిని చేసింది ఎవరు? ఒక విద్యార్థి చెవిలో ఎవరు కాల్చారు? లాఠీలు, మేకులతో కూడిన కర్రలతో విద్యార్థులను కొట్టాలని ఎవరు ఆదేశించారు? అనేది తెలుసుకోవాలని కోరుతున్నాం. అందులో మాత్రమే మాకు ఆసక్తి ఉంది. పిల్లలపై కాల్పులు జరపాలని అమిత్ షా ఆదేశాలు ఇచ్చారా లేదా? ఒకవేళ ఇచ్చి ఉంటే ఆయన బాధ్యుడు కాబట్టి రాజీనామా చేయాలి. ఒకవేళ ఇవ్వకపోతే అసమర్థుడు కాబట్టి రాజీనామా చేయాలి’’అని పేర్కొన్నారు. తాను మాట్లాడుతుండగా అంతరాయం కలిగించినందుకు విలేకరులపై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా మాట్లాడేటప్పుడు కూడా ఇలాగే చేస్తారా? అని ప్రశ్నించారు. అమిత్ షాలో అంత ప్రత్యేకత ఏముంది? ఆయన ముందు ఒక ఎలుకలాగా ఎందుకు నిల్చుంటారు? అని విలేకరులను నిలదీశారు.మౌనమే ఆయన అంగీకారం జార్ఖండ్‌లో విద్యార్థుల నిరసన విషయంలో తాను మౌనంగా ఉండడం లేదని రాహుల్ గాంధీ అన్నారు. ‘‘విద్యార్థులపై జరిగే ఏ విధమైన హింసనైనా సమరి్థంచబోమని విలేకరుల సమావేశంలో స్పష్టంగా చెప్పాను. నేను మౌనంగా లేను, బహిరంగంగానే ఈ విషయాన్ని చెబుతున్నాను’’అని వివరించారు. అనంతరం తన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్‌ను ‘ఎక్స్’లో రాహుల్ షేర్ చేశారు. ‘‘ఒక వ్యక్తికి నిజం చెప్పే ధైర్యం లేనప్పుడు, అతని మౌనమే అతనికి బదులుగా మాట్లాడుతుంది. అమిత్ షా మౌనమే ఆయన వ్యక్తంచేస్తున్న అంగీకారం’’అని ఉద్ఘాటించారు. -
అన్ని అంశాలపై చర్చకు సిద్ధం
న్యూఢిల్లీ: నీట్ పరీక్షకు సంబంధించిన అన్ని అంశాలపై పార్లమెంట్లో చర్చకు సిద్ధంగా ఉన్నానని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తేల్చిచెప్పారు. విద్యార్థుల నిరసనలు, ఇతర అంశాలపై చర్చ కోసం లోక్‌సభ స్పీకర్‌కు అధికారికంగా లేఖ సమర్పించాలని ప్రతిపక్షాలకు సవాలు విసిరారు. చర్చ ప్రారంభమైన తర్వాత అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తానని తెలిపారు. చర్చలో పూర్తిగా పాల్గొంటానని వెల్లడించారు. బుధవారం పార్లమెంట్ ప్రాంగణంలో అమిత్ షా మీడియాతో మాట్లాడారు. చర్చలో పాల్గొనాలా లేక పార్లమెంట్లో గందరగోళం సృష్టించాలా అనేది ఇప్పుడు ప్రతిపక్షం చేతిలోనే ఉందని వ్యాఖ్యానించారు. మధ్యాహ్నం 2 గంటలలోపు స్పీకర్‌కు లేఖ సమర్పించాలని ప్రతిపక్షాలకు సూచించారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు ఏ రకమైన చర్చలకైనా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం దాచడానికి ఏమీ లేదని తెలిపారు. తాను చర్చ నుంచి పారిపోతున్నానంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై అమిత్ షా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘అదృశ్యం’, ‘పారిపోయినవారు’వంటి పదాలు భారతదేశ ప్రజా, పార్లమెంటరీ చర్చల్లో ఇటీవలి కాలంలోనే వినిపించడం మొదలయ్యాయని పేర్కొన్నారు. జూలై 20న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి తాను క్రమం తప్పకుండా వచ్చి పార్లమెంట్ భవనంలోని తన ఛాంబర్లో కూర్చుంటున్నానని, ప్రతిపక్షం మాత్రం ఉభయ సభలనూ పనిచేయనివ్వడం లేదని విమర్శించారు. సభలో కార్యకలాపాలను విపక్షాలు సాగనివ్వనప్పుడు ఎవరైనా లోపలికి వెళ్లడంలో ఇక అర్థం ఏమిటని ప్రశ్నించారు. నీట్ వ్యవహారానికి సంబంధించి విద్యార్థుల నిరసనలు సహా అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఇప్పటికే ప్రకటించారని అమిత్ షా గుర్తుచేశారు. పార్లమెంట్లో అన్ని అంశాలపై చర్చిద్దామని ప్రతిపక్షాలకు సూచించారు. కానీ, వారు(విపక్షాలు) అసలు చర్చ జరగాలని కోరుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పుడు నిజంగా ఎవరు పారిపోతున్నారో ప్రజలే నిర్ణయించుకుంటారని తేల్చిచెప్పారు. అంతేకాకుండా ప్రతిపక్షం ఎందుకు చర్చ జరగాలని కోరుకోవడం లేదనే అంశంపై చర్చించడానికీ సిద్ధంగా ఉన్నాననివివరించారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ విద్యార్థుల నిరసనలపై చర్చ కోసం ప్రతిపక్షాలను సంప్రదించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కోరారు. సభలో అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ మేరకు బుధవారం స్పీకర్‌కు లేఖ రాశా రు. -
‘నీట్ పీజీ పరీక్ష కేంద్రం’ మెసేజ్‌ల గందరగోళం
సాక్షి, హైదరాబాద్: నీట్ పీజీ–2026 పరీక్ష రాసే వైద్య విద్యార్థులను జాతీయ వైద్య విజ్ఞాన పరీక్షల బోర్డు (ఎన్బీఈఎంఎస్) సాంకేతిక సమస్య గందరగోళానికి గురిచేసింది. ఆగస్టు 11న పరీక్ష కేంద్రం వివరాలను అభ్యర్థులకు తెలియజేయగా.. తెలంగాణకు చెందిన పలువురు విద్యార్థులకు ఇతర రాష్ట్రాల్లోని నగరాల పేర్లతో ఎస్ఎంఎస్లు, ఈ–మెయిల్ రావడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. అయితే అధికారిక పోర్టల్‌లో అభ్యర్థి ఖాతాలోకి వెళ్లి పరిశీలించగా తెలంగాణలోనే పరీక్ష నగరం కేటాయించినట్టు కనిపించడంతో ఊపిరి పీల్చుకున్నారు. నీట్ పీజీ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆగస్టు 11న పరీక్ష రాసే ‘నగరం’వివరాలను తెలియజేయాలని ఎన్బీఈఎంఎస్ ముందుగానే ప్రకటించింది. అందులో భాగంగా మంగళవారం అర్ధరాత్రి పలువురికి ఎస్ఎంఎస్లు, ఈ–మెయిల్ వెళ్లాయి. తెలంగాణలో ఉండి, దరఖాస్తు సమయంలో ఎంపిక చేసుకున్న రాష్ట్రాలకు సంబంధం లేని నగరాల పేర్లు రావడంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. కొందరికి తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఇతర రాష్ట్రాల నగరాల పేర్లు వచ్చినట్లు అభ్యర్థులు సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు. హాల్‌టికెట్ వచ్చేది 27న ప్రస్తుతం విడుదల చేసింది కేవలం పరీక్ష రాసే నగరం సమాచారం మాత్రమే. ఇది హాల్‌టికెట్ కాదు. అసలు పరీక్ష కేంద్రం పూర్తి చిరునామా, ఇతర వివరాలతో కూడిన అడ్మిట్ కార్డులను ఆగస్టు 27న విడుదల చేయనున్నట్టు ఎన్బీఈఎంఎస్ షెడ్యూల్లో పేర్కొంది. నీట్ పీజీ పరీక్ష ఆగస్టు 30న కంప్యూటర్ ఆధారిత విధానంలో ఒకే రోజున నిర్వహించనున్నారు. నీట్ పీజీ సిటీ స్లిప్ విడుదల నీట్ పీజీ–2026 ప్రవేశ పరీక్షకు సంబంధించిన పరీక్ష నగర సమాచార స్లిప్ (సిటీ ఇంటిమేషన్ స్లిప్)ను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) బుధవారం విడుదల చేసింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ natboard. edu.inలో తమకు కేటాయించిన పరీక్ష నగరాన్ని తెలుసుకోవచ్చు. పోర్టల్‌లో సరైన సమాచారం.. అనంతరం మరో ఎస్ఎంఎస్ ఎస్ఎంఎస్లు వచ్చిన తర్వాత అభ్యర్థులు రాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఎన్బీఈఎంఎస్ అధికారిక పోర్టల్‌లోకి వెళ్లి తమ వివరాలను పరిశీలించారు. అక్కడ మాత్రం తాము నివసిస్తున్న రాష్ట్రంలోనే పరీక్ష నగరం కేటాయించినట్టు పలువురికి కనిపించింది. ఈ గందరగోళంపై ఎన్బీఈఎంఎస్ బుధవారం వివరణ ఇచ్చింది. సాంకేతిక సమస్య కారణంగా కొందరు అభ్యర్థులకు ఎస్ఎంఎస్ల ద్వారా తప్పుడు ‘పరీక్ష నగరం’సమాచారం వెళ్లిందని తెలిపింది. -
నీట్ యూజీతో ఆగలేదు.. నీట్ పీజీలోనూ అవే తలనొప్పులు!
న్యూఢిల్లీ: నీట్ పీజీ-2026 పరీక్షా నగరాల కేటాయింపులో తీవ్ర గందరగోళం తలెత్తింది. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్)విడుదల చేసిన సిటీ ఇంటిమేషన్ స్లిప్పుల్లో సాంకేతిక లోపాల కారణంగా అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎస్ఎంఎస్ ద్వారా వచ్చిన సమాచారానికి, అధికారిక పోర్టల్ లో చూపించిన నగరాలకు పొంతన లేకపోవడంతో వైద్య విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఆగస్టు 30న జరగనున్న నీట్ పీజీ-2026 పరీక్ష కోసం ఎన్బీఈఎంఎస్ సోమవారం నాడు సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను విడుదల చేసింది. అభ్యర్థులు ప్రయాణ ఏర్పాట్లు చేసుకునేందుకు వీలుగా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు ఎస్ఎంఎస్ లు పంపడంతో పాటు అప్లికెంట్ లాగిన్ ద్వారా వివరాలు అందుబాటులో ఉంచారు. అయితే ఎస్ఎంఎస్లో ఒక నగర పేరు వచ్చిందని, అధికారిక పోర్టల్ చూస్తే మరో నగరం కేటాయించినట్లు ఉందని సోషల్ మీడియా వేదికగా విద్యార్థులు వాపోయారు. కొందరికి గుజరాత్ లో ఉంటే మణిపూర్ కేంద్రంగా చూపించగా, మరికొందరికి కోరుకున్న నగరాలు కాకుండా పూర్తిగా వేరే రాష్ట్రాలు కేటాయించారు.ఈ వ్యవహారంపై ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (ఫైమా) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అభ్యర్థుల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించి, ఏ సమాచారాన్ని నమ్మాలో బోర్డు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈ సాంకేతిక లోపంపై స్పందించిన ఎన్బీఈఎంఎస్ బోర్డు సాంకేతిక కారణాల వల్లే కొందరికి తప్పుగా పరీక్షా నగరాల సమాచారం వెళ్లిందని తెలిపింది. ఆ తర్వాత సరైన వివరాలతో అభ్యర్థులకు ఈమెయిల్స్, ఎస్ఎంఎస్లు పంపామని వెల్లడించింది. అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా కేవలం అధికారిక వెబ్‌సైట్‌లోని పోర్టల్‌లో ఉన్న వివరాలనే ప్రామాణికంగా తీసుకోవాలని సూచించింది.ఇది కూడా చదవండి: ‘అయోధ్య’ సీఈవో ఇంటర్వ్యూలో.. ‘మందు కొడతారా?.. శాకాహారులా?’ -
విజయ్ సర్కార్ కీలక తీర్మానం.. బీజేపీ వాకౌట్
చెన్నై: టీవీకే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్‌కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం చేసింది. దీంతో సభ నుంచి బీజేపీలు ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. నీట్ కారణంగా విద్యార్థుల దృష్టి స్కూల్ చదువు నుంచి కోచింగ్లపైకి మళ్లుతోందని మంత్రి అరుణ్‌రాజ్ అన్నారు. భారీ ఫీజులు వసూలు చేసే కోచింగ్ సెంటర్లను నీట్ ప్రోత్సహిస్తోందంటూ మంత్రి ఆరోపించారు.నీట్ అనేది సామాజిక న్యాయం, సమానత్వం, రాష్ట్ర హక్కులకు విరుద్ధంగా ఉందని మంత్రి అరుణ్‌రాజ్ పేర్కొన్నారు. పేపర్ లీక్‌లు, విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం వంటి అంశాలను అరుణ్‌రాజ్ ప్రస్తావించారు. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన విజయ్.. టీవీకేను బలమైన రాజకీయ శక్తిగా నిలబెట్టేందుకు అడుగులు వేస్తున్నారు. యువత, విద్యార్థులు, రాష్ట్ర హక్కులు వంటి అంశాలను ప్రధాన అజెండాగా విజయ్ సర్కార్ ముందుకెళ్తుంది. నీట్ వ్యతిరేకతను బలంగా వినిపించడం ద్వారా విద్యార్థుల్లో, యువ ఓటర్లలో తన పార్టీకి స్థానం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.కాగా, డ్రగ్ రహిత తమిళనాడు కార్యక్రమంలో సీఎం విజయ్ పాల్గొన్నారు. డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా ఆయన ప్రతిజ్ఞ చేశారు. విద్యార్థులతో కలిసి డ్రగ్ ఫ్రీ ఫ్లైడ్జ్ చేసిన సీఎం విజయ్.. డ్రగ్స్ వాడొద్దు.. సన్నిహితులు వాడుతుంటే ఊరుకోవద్దు.. డ్రగ్స్ ఫ్రీ తమిళనాడు కోసం అంతా కృషి చేద్దామంటూ పిలుపునిచ్చారు. -
నీట్ పేపర్ లీక్: ‘రసాయనశాస్త్రం’తో నమ్మించి..
న్యూఢిల్లీ: నీట్ (యూజీ) ప్రశ్నపత్రం లీకేజీ ఉదంతానికి సంబంధించి జాతీయ పరీక్షల మండలి (ఎన్టీఏ) డైరెక్టర్ విశ్వజిత్ కుమార్ సహా 17 మంది అధికారుల వాంగ్మూలాలను సీబీఐ తన చార్జ్‌షీట్‌లో పొందుపరిచింది. ఢిల్లీలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో జూలై 28న దాఖలు చేసిన ఈ చార్జ్‌షీట్‌లో మొత్తం 360 మంది సాక్ష్యాలను పేర్కొన్నారు. నీట్-యూజీ పేపర్ల తయారీ ప్రక్రియ ఏప్రిల్ 5 నాటికే పూర్తయిందని, మే 3న పరీక్ష జరగగా.. లీక్ కారణంగా మే 12న రద్దు చేసి జూన్ 21న రీ-టెస్ట్ నిర్వహించినట్లు విశ్వజిత్ కుమార్ సీబీఐకి వెల్లడించారు.ప్రశ్నపత్రాలు రూపొందించే నిపుణుల ఎంపికలో ఎలాంటి అప్రతిష్ట లేని వారికే ప్రాధాన్యత ఇచ్చామని, అయితే రసాయన శాస్త్రానికి చెందిన ఒక సీనియర్ నిపుణురాలు ప్రైవేట్ కోచింగ్ తరఫున తరగతులు నిర్వహిస్తున్నట్లు గుర్తించి తాను ఆరా తీసినట్లు ఆయన తెలిపారు. ఎన్టీఏలో ఆమెకున్న మంచి పేరు కారణంగానే తాము అనుమానించలేదని వివరించారు. కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో ఉండే నిపుణులు ఎవరూ మొబైల్స్, పెన్నులు, కాగితాలు లోపలికి తీసుకెళ్లడానికి వీలే లేదని, అయితే నిపుణులను క్షుణ్ణంగా తనిఖీ (ఫ్రిస్కింగ్) చేసే విధానం ఎందుకు నిలిపివేశారనేదానికి తనకంటే ముందే ఉన్న పద్ధతినే కొనసాగించినట్లు ఆయన తెలిపారు.మరోవైపు ఎన్టీఏ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ వద్ద నిపుణుల రాకపోకలపై ఎలాంటి తనిఖీ వ్యవస్థ లేదని నీట్ కన్సల్టెంట్ శిల్పి శర్మ సీబీఐకి తెలిపారు. కేవలం ప్రవేశ ద్వారాల వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డులు మాత్రమే వారిని ప్రశ్నిస్తారని పేర్కొన్నారు. ఎన్టీఏ భవనంలోని ఒకటో అంతస్తులో 110 సీసీటీవీ కెమెరాలు ఉన్నప్పటికీ, రికార్డింగ్ నిల్వ సామర్థ్యం కేవలం 25 రోజులు మాత్రమే ఉండటం, సీసీటీవీ కంట్రోల్ రూమ్ సరిగ్గా లేకపోవడం వంటి భద్రతా లోపాలను సీబీఐ దర్యాప్తులో గుర్తించింది. ప్రశ్నలను కాగితపు చిట్టీలపై రాసుకోవడం, కొందరు వాటిని జ్ఞాపకం ఉంచుకుని హోటల్ గదుల్లో నోట్ చేసుకోవడం వంటి పద్ధతుల ద్వారా బయటకు తరలించినట్లు తేలింది.ఇది కూడా చదవండి: ఇందిర హత్య కేసు దోషి కుమారునికి ‘పంజాబ్’ టికెట్! -
ఉద్యమం.. ఉద్రిక్తం
రాంచీ: దేశ రాజధానిలో నీట్ లీకేజీ ఉదంతంపై విద్యార్థుల సారథ్యంలో కొనసాగిన ఉద్యమం చివరకు పోలీసుల లాఠీచార్జ్‌తో ఉద్రిక్తంగా ముగియగా అదే బాష్పవాయుగోళాల ప్రయోగాలు, రక్తసిక్తమైన విద్యార్థులు, ప్రభుత్వ వ్యతిరేక నినాదాల దృశ్యాలు సోమవారం జార్ఖండ్ రాజధానిలో పునరావృతమయ్యాయి. జార్ఖండ్ పబ్లిక్ సరీ్వస్ కమిషన్(జేపీఎస్సీ), జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిటీ(జేఎస్ఎస్సీ)ల్లో సంస్కరణలు కోరుతూ, అక్రమాలమయమైన గత పోటీపరీక్షలను రద్దుచేయాలన్న డిమాండ్లతో ఉద్యమిస్తున్న ఆందోళనకారుల నిరసన ఉద్రిక్తంగా మారింది. సోమవారం పాత అసెంబ్లీ ప్రాంగణం నుంచి కొత్త అసెంబ్లీ భవనం దాకా ‘విధాన్ సభ మార్చ్’గా బయల్దేరిన వేలాది మంది విద్యార్థులు, పరీక్షార్థులు త్రివర్ణపతాకాలు, ప్రభుత్వ వ్యతిరేక నినాదాల ప్లకార్డులు చేతబూని న్యాయంకోరుతూ అసెంబ్లీకి సమీపప్రాంతానికి చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. జగన్నాథ్ ఆలయ రోడ్డులో చివరి అంచె బ్యారీకేడ్లను పరీక్షార్థులు బద్దలుకొట్టేందుకు యతి్నంచగా పోలీసులు జలఫిరంగులను ఎక్కుపెట్టారు. మెరుపులా దూసుకొస్తున్న నీటి ఉదృతికి తడుస్తున్నా విద్యార్థులు అలాగే ముందుకు కదలడంతో పోలీసులు బాష్పవాయుగోళాలను ప్రయోగించారు. అయినాసరే పరీక్షార్థుల నుంచి ప్రతిఘటన పెరగడంతో పోలీసులు లాఠీలకు పనిజెప్పారు. లాఠీచార్జ్‌లో చాలా మంది పరీక్షార్థులు గాయపడ్డారు. చిన్నా పెద్దా, అమ్మాయిలు అనే తేడా లేకుండా తలలు పగలగొడుతూ పోలీసులు ఇష్టమొచి్చనట్లు చితకబాదారని రక్తసిక్తమైన ఉద్యమకారుడు పీయూశ్ కుమార్ సోనీ చెప్పారు. బారీకేడ్లను విజయవంతంగా దాటిన కొందరు ఉద్యమకారులు అసెంబ్లీ గేటు నంబర్ 1 వద్ద బైఠాయించి నిరసన చేపట్టారు. ‘‘శాంతియుతంగా నిరసన చేపడుతున్న మాపై లాఠీల వర్షం కురిపించారు. రక్తమోడుతున్నా ఉద్యమపంథాను వీడేదేలేదు. హేమంత్ సోరెన్ సారథ్యంలోని ప్రభుత్వం పరీక్షార్థుల డిమాండ్లను అస్సలు పట్టించుకోవట్లేదు. ఇన్నిసార్లు చర్చలు జరిపినా సానుకూలంగా స్పందించలేదు. అందుకే అసెంబ్లీ మార్చ్‌కు సిద్ధపడ్డాం’’అని ఉద్యమనేతలు స్పష్టంచేశారు. ‘‘ఈరోజే సీఎం హేమంత్ పుట్టినరోజు. బర్త్‌డే రోజు బహుమానాలు ఇస్తారనుకుంటే లాఠీదెబ్బలే గిఫ్ట్‌గా ఇచ్చారు. మా డిమాండ్లు నెరవర్చేదాకా ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. లాఠీచార్జ్‌తో పోలీసులు శారీరక దెబ్బకొట్టగలరేమోగానీ మా ఆలోచనలను దెబ్బతీయలేరు’’అని ఉద్యమనేతలు ప్రకటించారు. బల ప్రయోగం.. బాష్పవాయుగోళాలు.. నిరాహారదీక్షలు, ఉద్యమం ఆరంభమై 16 రోజులు గడిచినా చర్చల్లో ఎలాంటి పురోగతి కని్పంచకపోవడం, డిమాండ్లకు ప్రభుత్వం ఒప్పకోకపోవడంతో సోమవారం ఉదయం 10.30 గంటలకు ధుర్వాలోని ఓల్డ్ అసెంబ్లీ కాంప్లెక్స్ నుంచి వేలాదిగా ఉద్యమకారులు ర్యాలీగా బయల్దేరారు. 9 రోజులుగా నిరాహారదీక్ష చేస్తూ పది కేజీల బరువు తగ్గిన ఉద్యమనేత దేవేంద్రనాథ్ మహతో సైతం అంబులెన్స్‌లో అసెంబ్లీ వైపుగా కదిలారు. జేఎస్ఎస్సీ పరీక్షల్ని రద్దుచేయాలి. సీబీఐ విచారణ జరపాలి. జేఎస్ఎస్సీపై దాడులకు సీఐడీ ఎందుకు జంకుతోంది? అన్న ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఉద్యమకారులు ముందుకు కదిలారు. నాలుగు కిలోమీటర్ల ఈ మార్గంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఇండియన్ రిజర్వ్ బెటాలియన్, జిల్లా పోలీసులు, క్విక్ రెస్పాన్స్ టీమ్ బృందాలు మొహరించాయి. ఒక్కో బారీకేడ్‌ను దాటుకుంటూ పరీక్షార్థులు మందుకొచ్చేకొద్దీ వాళ్లను పోలీసులు నిలువరించే ప్రయత్నంచేశారు. ఈ క్రమంలో తొలుత వాగ్వాదం జరిగింది. శానససభలో మా డిమాండ్లు విని్పంచకపోతే న్యాయం ఎలా జరుగుతుంది? అని పోలీసులతో ఉద్యమకారులు వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో తోపులాట జరగడంతో పోలీసులు జలఫిరంగులను ప్రయోగించారు. అయినాసరే ఉద్యమకారులు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు తొలత టియర్‌గ్యాస్ షెల్స్‌ను, తర్వాత లాఠీలను ప్రయోగించిచారు. తమపై విద్యార్థులు రాళ్లదాడి చేయడంతోనే లాఠీచార్జ్ చేయాల్సి వచి్చందని రాంచీ సిటీ ఎస్పీ పరాశ్ రాణా చెప్పారు. నిరననకారుల దాడిలో నలుగురు పోలీసులు తీవ్రంగా గాయపడినట్లు ప్రకటించారు. చర్చల పర్వం కొనసాగుతుండగా ర్యాలీ చేపట్టడమేంటని ప్రభుత్వం అసహనం వ్యక్తంచేసింది. 98 శాతం డిమాండ్లకు ఒప్పుకున్నాసరే ఉద్యమపంథాను ఎందుకు వీడట్లేరని ప్రభుత్వం నిలదీసింది. అయితే 13 పరీక్షల్ని రద్దుచేయాలంటే కనీసం మూడు పరీక్షలకే ఒప్పుకున్నారని, జేపీఎస్సీ, జేఎస్ఎస్లో సంస్కరణల ఊసే ఎత్తేట్లేరని, సీబీఐ విచారణకు ప్రభుత్వం సాహసించట్లేదని ఉద్యమకారులు ఆరోపించారు.జేపీఎస్సీ మాజీ చైర్పర్సన్ అరెస్ట్ జార్ఖండ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై జేపీఎస్సీ మాజీ ఛైర్పర్సన్, 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఎల్.ఖియాంగ్టేను సోమవారం జార్ఖండ్ సీఐడీ అధికారులు అరెస్ట్‌చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామాచేశాక గత ఏడాది ఈయనను ప్రభుత్వం జేపీఎస్సీ ఛైర్‌పర్సన్‌గా నియమించింది. గత నెలలో ఈయనను సీఐడీ నాలుగుసార్లు ప్రశ్నించింది. ముగ్గురు జేపీఎస్సీ సభ్యులు రాజీనామాచేశాక ఒత్తిడి పెరగడంతో జూలై 22న ఖియాంగ్టే తన పదవికి రాజీనామా చేయడం తెల్సిందే. ఖియాంగ్టే అరెస్ట్‌తో ఈ ఉదంతంలో అరెస్టుల సంఖ్య ఇరవైకి పెరిగింది.రంగంలోకి ఈడీ.. ఇన్ని రోజులు ఈ ఉదంతంలో సీఐడీ కేసు నమోదుచేసిన దర్యాప్తుచేస్తుండగా సోమ వారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రంగంలోకి దిగింది. సీఐడీ నమోదుచేసిన ఎఫ్ఐఆర్ను ఆధారంగాచేసుకుని మనీ లాండరింగ్ కోణంలో మరో కేసును ఈడీ నమోదుచేసి దర్యాప్తు ఆరంభించింది. ఈ కేసుతో సంబంధం ఉన్నవారందరికీ సమన్లు జారీచేసి పిలిపించి ప్రశ్నించనుంది. అవసరమైతే అరెస్ట్లుచేసే ఆస్కారముంది. జార్ఖండ్ జనరల్ గ్రాడ్యుయేట్ కంబైన్డ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అక్రమాల్లో నిగ్గుదేల్చేందుకు విద్యార్థులు సీబీఐ దర్యాప్తుకోరుతుంటే ఈడీ రంగంలోకి దిగడం గమనార్హం. ఐసీయూలో మహతో సోమవారం అసెంబ్లీ మార్చ్‌లో పాల్గొన్న మహతోను తీవ్ర అనారోగ్యం కారణంగా తోటి ఉద్యమకారులు ఆస్పత్రిలో చేర్పించారు. మహతో గత 9 రోజులుగా నిరాహారదీక్ష చేస్తూ 10 కేజీలకుపైగా బరువుతగ్గడం తెల్సిందే. రక్తంలో చక్కర స్థాయిలో బాగా పడిపోయాయని, ఆయన ఆరోగ్యపరిస్థితి ‘క్లిష్టమైన’స్థాయికి పడిపోయిందని రాంచీలోని ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. రాంచీ సదర్ ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స చేస్తున్నామని మెడికల్ ఆఫీసర్ నాన్సీ ప్రియా తెలిపారు. అయితే లాఠీచార్జ్ వేళ మహతోనూ పోలీసులు కొట్టారని అతని సహాయకుడు పంకజ్‌కుమార్ వెల్లడించారు. -
పేపర్ లీక్ కావడంతో మనస్థాపానికి గురై మేఘన ఆత్మహత్య
-
‘నీట్’లో 640.. అయినా ప్రభుత్వ సీటు గల్లంతు
వడకంచెరి: కేరళలోని వడకంచెరికి చెందిన నీట్-యూజీ(NEET-UG) 2024 అభ్యర్థి అంజలి ఎస్ ప్రవేశ పరీక్షలో 640 మార్కులు సాధించినప్పటికీ, ప్రభుత్వ మెడికల్ సీటు పొందలేకపోయానని, ప్రస్తుతం ప్రైవేట్ కాలేజీలో ఏటా రూ. 10 లక్షలు చెల్లించి చదువుకోవాల్సి వస్తోందని ఆరోపించారు. పరీక్షలో జరిగిన అక్రమాల వల్లే తనకు ఈ దుస్థితి దాపురించిందని ఆమె వాపోయారు. కాగా ఈ ఏడాది పరీక్షల నిర్వహణలో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని అంజలి ఆరోపించారు.తాము ముందుగా అంచనా వేసిన ర్యాంకులు, లభ్యత ఉన్న సీట్ల ఆధారంగా ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు ఖాయమని ఎంతో ధీమాగా ఉన్నామని, కానీ అనూహ్యంగా ప్రభుత్వ సీటు రాకపోవడంతో ప్రైవేట్ యాజమాన్య కోటాలో చేరాల్సి వచ్చిందని, దీనివల్ల తమ కుటుంబంపై తీవ్రమైన ఆర్థిక భారం పడిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ఈ వైఫల్యానికి కారణమైన బాధ్యులు స్పందించి, నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి శనివారం ఈ-మెయిల్ ద్వారా వినతిపత్రం పంపినట్లు అంజలి వెల్లడించారు. నీట్-2024 పరీక్షల వివాదాలు, గ్రేస్ మార్కుల కేటాయింపు వంటి అంశాలు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలకు దారితీసిన సంగతి తెలిసిందే.ఇది కూడా చదవండి: రష్యా నుంచి భారత్‌కు రైలు.. కొత్త కారిడార్ ప్లాన్? -
తిరుపతిలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
తిరుపతి సిటీ: నీట్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన తిరుపతిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుపతి ఎస్వీ నగర్‌కు చెందిన సాయి మేఘన (18) తల్లిదండ్రులు కూలీలు. తమ కుమార్తెను డాక్టర్‌గా చూడాలనే ఆకాంక్షతో వారు ఆమెను కష్టపడి చదివించారు. దానికి ప్రతిఫలంగా సాయిమేఘన ఇంటర్ బైపీసీలో ఉత్తమ మార్కులు సాధించి తిరుపతిలోని ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో నీట్ లాంగ్‌టర్మ్ శిక్షణ తీసుకుంది. ఈ ఏడాది మే లో జరిగిన నీట్ పరీక్ష రాసింది. అందులో 499 మార్కులు వచ్చాయి. అయితే నీట్ పేపర్ లీక్ కావడంతో ఎన్టీఏ మళ్లీ పరీక్ష నిర్వహించగా అందులో ఆమెకు 390 మార్కులే వచ్చాయి. దీంతో డాక్టర్ కావాలనుకున్న ఆమె ఆశ నిర్వీర్యమైందనే మనోవేదనతో 10 రోజుల క్రితం సాయిమేఘన ఆత్మహత్య చేసుకుంది. కానీ కుటుంబీకులు ఈ విషయాన్ని బయటకు చెప్పుకోలేక మదనపడుతూ ఆదివారం కర్మక్రియలు నిర్వహించారు. అక్కడికి పలువురు ఎస్ఎఫ్ఐ నేతలు వచ్చి నివాళులర్పించిన సమయంలో అసలు విషయం బయటపడింది. దీంతో సాయిమేఘన కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని ఎస్ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు. -
‘జెన్‌జీ’ని తప్పుదోవ పట్టించారు.. రాజీనామాపై ధర్మేంద్ర ప్రధాన్
సంబల్పూర్: నీట్ పేపర్ లీకేజీ వివాదంలో తన పదవికి రాజీనామా చేయడంపై మాజీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. నీట్ పేపర్ లీకేజీలో జెన్‌జీని తప్పుదోవ పట్టించారని.. అందులో తాను బాధితుడినయ్యానని వ్యాఖ్యానించారు.సంబల్పూర్లో జరిగిన పద్మ అవార్డు గ్రహీతల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. నీట్ పేపర్ లీక్ వివాదం ముదిరిన తీరును చూస్తే కొంతమంది వ్యక్తులు జెన్‌జీని తప్పుదోవ పట్టించే ప్రయత్నించినట్లు స్పష్టమవుతోంది. విద్యార్థుల అసంతృప్తిని రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు వాడుకోవాలని చూశారు.అందుకే యువత ఆకాంక్షలను గుర్తించి, వారి ఆందోళనలను పరిష్కరించాలని తాను స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరినట్లు ఆయన వెల్లడించారు. ఇందులో నా వ్యక్తిగత గౌరవానికి నేనెప్పుడూ ప్రాధాన్యత ఇవ్వలేదు. మోదీ నా ప్రతిపాదనకు అంగీకరించి, ఆ తర్వాత స్వయంగా ఆయనే పిల్లలతో మాట్లాడారు అని పేర్కొన్నారు.జులై 25న సమర్పించిన తన రాజీనామా లేఖలోని అంశాలను ఆయన గుర్తుచేశారు. ఈ ఆందోళనలను దేశ వ్యతిరేక శక్తులు తమ స్వార్థానికి వాడుకోకుండా ఉండటానికి, దేశ ఐక్యతను కాపాడటానికి, విద్యార్థుల భవిష్యత్తు చట్టపరమైన చిక్కుల్లో పడకుండా చూసేందుకే తాను మంత్రి పదవిని వదులుకున్నట్లు స్పష్టం చేశారు. మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు తేలడంతో ప్రభుత్వం వెంటనే స్పందించిందని, దర్యాప్తును సిబిఐకి అప్పగించి, వివాదాస్పద పరీక్షను రద్దు చేసి జూన్ 21న తిరిగి నిర్వహించిందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. -
CBI సంచలన రిపోర్టు CBI NEET పేపర్ లీక్ చేసింది ఆ ముగ్గురే..!
-
‘నీట్’ లీక్: పరీక్షకు కొన్ని గంటల ముందే..
తిరువనంతపురం: నీట్ యూజీ-2026 ప్రశ్నాపత్రం లీకేజీ ఉదంతంలో సీబీఐ దర్యాప్తు పలు కీలక విషయాలను వెలుగులోకి తెచ్చింది. ఢిల్లీ నుంచి కేరళలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీ హాస్టల్ వరకు డిజిటల్ ఆధారాల ఆధారంగా ఈ అక్రమ నెట్‌వర్క్‌ను దర్యాప్తు సంస్థ ఛేదించింది. వాట్సాప్, టెలిగ్రామ్ యాప్‌ల ద్వారా ప్రశ్నపత్రాలు రాష్ట్రాల సరిహద్దులు దాటి, పరీక్షకు కొన్ని గంటల ముందే కేరళలోని అదూర్ (పతనంతిట్ట) విద్యార్థులకు చేరినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు.రాజస్థాన్‌లోని సికార్‌కు చెందిన ఓ కోచింగ్ ఇన్స్టిట్యూట్ మాజీ విద్యార్థి, కేరళలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీ హాస్టల్లో తన రూమ్మేట్కు లీకైన పీడీఎఫ్ ఫైళ్లను పంపడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. సుమారు 450కి పైగా పరిష్కరించిన ప్రశ్నలతో కూడిన ఈ పత్రాలను పరీక్షకు ముందు రోజు విద్యార్థులకు అందించారు. మధ్యవర్తులు ఫోన్‌పే ద్వారా రూ. 30,000 వసూలు చేసి ఈ ప్రశ్నాపత్రాలను చేరవేశారు. సికార్ కేంద్రంగా పనిచేస్తున్న ‘ఆర్కే ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ’ ఈ లీకేజీకి ప్రధాన కేంద్రమని, అక్కడి నుంచి దళారుల ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు చేరాయని తేలింది.ఈ భారీ లీకేజీకి మూల కారణం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నియమించిన పూణేకు చెందిన ముగ్గురు సబ్జెక్ట్ నిపుణులే. ఢిల్లీలోని ఓఖ్లాలో ఉన్న ఎన్టీఏ భవనంలో ప్రశ్నపత్రాల తయారీ, అనువాదాల సమయంలో భద్రతా లోపాలను నిందితులు తమకు అనుకూలంగా మలుచుకున్నారు. చిన్న చీటీలు, చేతితో రాసుకున్న నోట్స్ లేదా జ్ఞాపకశక్తి ద్వారా ప్రశ్నలను బయటికి తీసుకువచ్చారు. నిపుణులు, విద్యార్థుల కదలికలను గుర్తించేందుకు పూణేలోని ఒక నివాస సముదాయం విజిటర్ యాప్, మొబైల్ లొకేషన్ డేటాను సీబీఐ ఫోరెన్సిక్ ఆధారాలుగా ఉపయోగించింది. ఢిల్లీలో జరిగిన నిబంధనల ఉల్లంఘనలను కేరళలోని లబ్ధిదారులతో అనుసంధానించడంలో ఈ డిజిటల్ ఆధారాలు కీలకంగా మారాయి.ఇది కూడా చదవండి: శ్రీదేవితో రహస్య వివాహం నుంచి భార్య బెదిరింపుల వరకు.. -
ఆ ముగ్గురే సూత్రధారులు
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టిఏ)కు చెందిన ముగ్గురు సబ్జెక్టు నిపుణులు పి.వి.కులకర్ణి(కెమిస్ట్రీ), మనీషా సంజయ్ హవల్దార్(ఫిజిక్స్), మనీషా గురునాథ్ మంధారే(బోటనీ, జువాలజీ) కీలక సూత్రధారులు అని సీబీఐ తేల్చిచెప్పింది. ఈ మేరకు ఢిల్లీ కోర్టులో తాజాగా 94 పేజీల చార్జిషీట్ దాఖలు చేసింది. కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో ప్రశ్నపత్రాల అనువాదం లేదా పునరనువాదం సమయంలో రఫ్ వర్క్ (ప్రాథమిక పని) కోసం ఈ ముగ్గురు నిపుణులకు ఖాళీ కాగితాలను అందించినట్లు విచారణలో తేలింది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు పి.వి.కులకర్ణి రసాయన శా్రస్తానికి సంబంధించిన మొత్తం 135 ప్రశ్నలను, వాటి సమాధానాల ఆప్షన్లను చిన్న కాగితం ముక్కలపై క్లుప్తంగా రాసుకుని, వాటిని రహస్యంగా బయటకు తీసుకెళ్లాడని చార్జ్‌షీట్‌లో సీబీఐ అధికారులు వెల్లడించారు. ఢిల్లీ ఎన్టీఏ ఆఫీసులోని కాన్ఫిడెన్షియల్ సెక్షన్లోకి ప్రవేశించేటప్పుడు లేదా నిష్క్రమించేటప్పుడు సబ్జెక్టు నిపుణులను తనిఖీ చేయడం గానీ, సోదా చేయడం గానీ జరగలేదని తెలియజేశారు. కులకర్ణి సులభమైన కొన్ని ప్రశ్నలను కంఠస్థం చేసి, తన హోటల్ గదికి తిరిగి వచ్చిన తర్వాత వాటిని ఒక కాగితంపై రాసుకున్నాడని పేర్కొన్నారు. సీబీఐ చార్జిషీట్లో ఇంకా ఏం ప్రస్తావించారంటే.. నిందితులకు కలిసొచ్చిన పరిస్థితులు ఎన్టిఏలో బోటనీ పేపర్‌ను ఇంగ్లిష్ నుంచి మరాఠీ భాషలోకి అనువాదకురాలిగా, జువాలజీ పేపర్ పునరనువాదకురాలిగా పనిచేసిన మనీషా మంధారే ఆ రోజు తన పని ముగించుకుని హోటల్ గదికి తిరిగి వచ్చిన తర్వాత ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల్లో సంబంధిత పేరాలను మార్క్ చేసేవారు. ఆయా సబ్జెక్టులపై ఆమెకు ఉన్న దశాబ్దాల అనుభవంతో నీట్ ప్రశ్నలను ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకంలోని సంబంధిత అంశాలతో సులభంగా అనుసంధానించగలిగారు. మార్క్ చేసిన పేరాల ఆధారంగా ఆయా ప్రశ్నలు, వాటి జవాబులను గుర్తించారు. ఇక ఫిజిక్స్ ప్రశ్నల అనువాదకుడిగా పనిచేసిన మనీషా సంజయ్ హవల్దార్ రోజువారీ పని ముగించుకుని ఢిల్లీలోని తన బసకు తిరిగి వచ్చిన తర్వాత ప్రశ్నలను క్లుప్తంగా రాసుకునేవారు. ఎన్టీఏ కార్యాలయంలో సీసీటీవీ లైవ్ ఫీడ్‌ను పర్యవేక్షించడానికి ప్రత్యేక కంట్రోల్ రూమ్ లేకపోవడం నిందితులకు బాగా కలిసొచ్చింది. వారి నిర్వాకం ఎవరి దృష్టికీ రాలేదు. నీట్ పేపర్లోని తుది ప్రశ్నలు ఆయా నిపుణుల నుంచి మధ్యవర్తులకు, సమన్వయకర్తలకు చేరాయి. అభ్యర్థులతో సంప్రదింపులు కోచింగ్ ఇన్స్టిట్యూట్లు, కన్సల్టెన్సీలను నడిపించే తేజస్ హర్షద్‌కుమార్ షా, డాక్టర్ మనోజ్ భగవాన్రావ్ షిరూరే, శివరాజ్ మోతేగాంకర్, ధనంజయ్ నివృత్తి లోఖండే, శివరాజ్ రఘునాథ్ మోతేగాంకర్లకు నీట్ ప్రశ్నలు చేరాయి. ఈ మొత్తం ప్రక్రియలో చివరి దశగా రాజస్తాన్‌లోని శుభమ్ మధుకర్ ఖైర్నార్, మంగిలాల్ బివాల్, దినేష్ బివాల్, వికాస్ బివాల్, హరియాణాలోని యశ్ యాదవ్ ద్వారా నీట్ అభ్యర్థులకు చేరాయి. శుభమ్ మధుకర్ ఖైర్నార్ డబ్బు కోసం అభ్యర్థులతో సంప్రదింపులు జరిపాడు. సెక్యూరిటీ కోసం వారి విద్యా పత్రాలు, ఖాళీ చెక్కులను సేకరించాడు. మధ్యవర్తులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వ్యవహారం చక్కబెట్టాడు. మంగిలాల్ బివాల్ మొబైల్ ఫోన్ నుంచి సేకరించిన ఆడియో ఫైళ్లు ఈ కుట్రకు సంబంధించిన ప్రణాళికను బట్టబయలు చేశాయి. -
నీట్ కోచింగ్ విద్యార్థిని ఆత్మహత్య
పెనమలూరు: విజయవాడ సమీపంలోని కానూరులో ఓ ప్రైవేట్ కాలేజీ హాస్టల్లో ఉంటూ నీట్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థిని మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ సందీప్ తెలిపిన మేరకు.. హైదరాబాద్‌కు చెందిన కంతేటి వైష్ణవి (19) కానూరులోని శ్రీభారతి ఇనిస్టిట్యూట్‌లో నీట్ లాంగ్‌టర్మ్ కోచింగ్‌లో చేరింది. కానూరులో ఉండటం ఇష్టం లేకపోవటంతో తండ్రి అరవింద్ ప్రశాంత్ రెండు వారాల క్రితం వైష్ణవిని ఇంటికి తీసుకెళ్లి నచ్చజెప్పి తిరిగి కానూరు కాలేజీ హాస్టల్‌కు తీసుకొచ్చారు. తనను ఇంటికి తీసుకు వెళ్లాలని.. ఇక్కడ ఉండటం ఇష్టం లేదని, వైష్ణవి మళ్లీ తల్లిదండ్రులకు ఫోన్లో చెప్పింది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుంది. -
నా కల సొంతూరికి సర్పంచ్: అభిజీత్ దీప్కే
న్యూఢిల్లీ: నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణలపై దేశ రాజధానిలో విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహించిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తనకు ఎలాంటి రాజకీయ ఆశయాలు లేవని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని హింగోలి జిల్లాకు చెందిన తన స్వగ్రామం సంతుక్ పింప్రికి సర్పంచ్‌గా సేవలందించడమే తన నిజమైన కల అని ఆయన పేర్కొన్నారు. ఏబీపీ న్యూస్‌తో మాట్లాడుతూ రాజకీయాల్లోకి ప్రవేశించే ఉద్దేశం తనకు లేదని దీప్కే తెలిపారు. తన రాజకీయ ఆశయం కేవలం గ్రామాభివృద్ధి మాత్రమేనని, అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించింది పదవుల కోసం కాదని స్పష్టం చేశారు.బాల్యంలో తాను చూసిన గ్రామీణ పరిస్థితులే తనలో ఈ ఆలోచనను బలపరిచాయని ఆయన వెల్లడించారు. తన సొంతూళ్లో పాఠశాలల దుస్థితి, మౌలిక వసతుల లేమి తనను కలిచివేశాయని చెప్పారు. గ్రామంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరచడంతో పాటు, ఒక ఆసుపత్రిని నిర్మించడమే తన లక్ష్యమని వివరించారు. తాము ఏర్పాటు చేసిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) రాజకీయ పార్టీగా కాకుండా, ఒక రాజకీయ ఒత్తిడి గ్రూప్‌గా పనిచేస్తుందని దీప్కే ప్రకటించారు. ప్రజా సమస్యలను మరింత ప్రభావవంతంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ఇలాంటి సంఘాలు ఎంతగానో దోహదపడతాయని అభిప్రాయపడ్డారు. నీట్ ఆందోళనల నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఆగస్టు 5న ఛత్రపతి శంభాజీనగర్‌లోని ఆయన నివాసంలో సీజేపీ కీలక సమావేశం జరగనుంది.ఇది కూడా చదవండి: ప్రశ్నపత్రాల లీకేజీ ముఠా గుట్టు రట్టు -
మోదీజీ.. సారీ!
న్యూఢిల్లీ: నీట్ ప్రశ్నపత్రాల లీకేజీపై జరిగిన నిరసన ప్రదర్శనల్లో ప్రధాని మోదీని దుర్భాషలాడిన బాలిక ఒకరు క్షమాపణలు చెబుతూ చేసిన వీడియో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇతరుల ప్రభావానికి లోనై తాను అలా మాట్లాడానని, పోస్టు చేసింది కూడా తాను కానని, తన వయసు పదిహేనేళ్లు మాత్రమేనని శనివారం విడుదలైన వీడియోలో ఒక బాలిక చెబుతూండటం కనిపించింది. అయితే ఈ వీడియో అసలుదా? కాదా? అన్నది తాము నిర్ధారించలేదని పీటీఐ స్పష్టం చేయడం గమనార్హం. ప్రధాని మోదీ ఒక ఇన్స్టాగ్రామ్ రీల్లో మాట్లాడుతూ తప్పుదారి పట్టిన పిల్లలు కొందరు తనను దుర్భాషలాడారని, వారిని క్షమించి సరైన మార్గంలో పెట్టాల్సిన అవసరముందని వ్యాఖ్యానించిన కొంత సమయానికే క్షమాపణలు కోరుతున్న బాలిక వీడియో విడుదల కావడం గమనార్హం. బాలిక ఆ వీడియోలో మాట్లాడుతూ... ‘‘జూలైలో ఫ్రెండ్స్‌తో కలిసి కన్నాట్‌ప్లేస్‌కు వెళ్లా. అక్కడ కొంతమంది ప్రధానిని తిడుతూ, అభ్యంతరకరమైన భాష వాడుతూ కనిపించారు. వాళ్లు నన్ను ప్రభావితం చేశారు. తమ మాటలను రిపీట్ చేయాల్సిందిగా ప్రోత్సహించారు. దాంతో నేను కూడా వారిలా మాట్లాడాను’’ అని చెప్పింది. ‘‘నేనిప్పుడు తలెత్తుకోలేకపోతున్నాను. దేశం మొత్తాన్ని, ప్రతి ఒక్కరిని నన్ను క్షమించమని కోరుతున్నా’’ అని కూడా ప్రార్థించినట్లు ఆ వీడియోలో ఉంది. ‘‘ఇదే తన తొలి, చివరి తప్పిదమని, ఇలాంటి పని ఇంకోసారి చేయను’’అని వివరించింది. ప్రధానిని తిడుతూ చేసిన వీడియో ఆధారంగా పోలీసులు ఇప్పటికే ఒక కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. నోయిడాలో ఆ వీడియోపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు కాగా... అది ఆ తరువాత ఢిల్లీకి బదిలీ అయ్యింది. -
'అలాంటి వారికి మార్గనిర్దేశం చేయాలి': ప్రధాని మోదీ పిలుపు
భారత ప్రధాని నరేంద్ర మోదీ మరో వీడియో రిలీజ్ చేశారు. నీట్ పేపర్ లీక్ అంశంపై మరోసారి మాట్లాడారు. జంతర్‌మంతర్‌లో ఏం జరిగిందో దేశ ప్రజలంతా చూశారని అన్నారు. నిరసనలో కొందరు అసభ్యకరమైన పదాలు వాడారని అన్నారు. తనను అసభ్య పదజాలంతో దూషించారని తెలిపారు. అయినప్పటికీ అందరినీ తాను క్షమించానని ప్రధాని మోదీ వెల్లడించారు. సరికొత్త భారత్ కోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దామని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. తప్పుదోవ పట్టిన వారికి మార్గనిర్దేశం చేయాలని ప్రధాని సూచించారు. కాగా.. నీట్ పేపర్ లీక్ కావడంతో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన చేపట్టింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగింది. ఈ నిరసనను కొన్ని రాజకీయ పార్టీలు అవకాశంగా మార్చుకున్నాయి. కాంగ్రెస్‌తో పాటు పలు ప్రతిపక్ష నాయకులు ఢిల్లీలో హంగామా చేశారు. చివరికీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ప్రధాని మోదీ విద్యార్థులను ఉద్దేశించి వీడియోలు రిలీజ్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఇవాళ మరో వీడియో సందేశమిచ్చారు. Abuses never solve anything. Let’s guide the misguided. Let’s work together. Let’s work for Bharat. pic.twitter.com/yAePG60KYL— Narendra Modi (@narendramodi) July 31, 2026 -
'పేపర్ లీక్ గ్యాంగ్‌లను వదిలే ప్రసక్తే లేదు'.. పీఎం మోదీ స్ట్రాంగ్ వార్నింగ్
పేపర్ లీక్ గ్యాంగ్‌లను వదిలిపెట్టే ప్రసక్తే లేదనిస ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అందుకే పార్లమెంట్లో యాంటి పేపర్ లీక్ బిల్ పాస్ చేశామని వెల్లడించారు. ఈ మేరకు ప్రధాని మోదీ సోషల్ మీడియాలో మరో వీడియో రిలీజ్ చేశారు. పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు కొనసాగుతాయని నరేంద్ర మోదీ తెలిపారు. విద్యార్థుల జీవితాలతో ఆటలు ఆడేవారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. వికసిత్ భారత్ దిశగా ముందుకు సాగుదామని ఆయన పిలుపునిచ్చారు. కాగా.. ఈ ఏడాది నీట్ పరీక్ష పేపర్ లీకైన సంగతి తెలిసిందే. ఈ పరీక్షను దేశవ్యాప్తంగా మరోసారి నిర్వహించారు. ఈ పేపర్ లీక్‌పై కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనకు దిగింది, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టారు. సీజేపీ చీఫ్ అభిజీత్ దిప్కే ఆధ్వర్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. దీంతో నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం యాంటి పేపర్ లీక్ బిల్‌ను తీసుకొచ్చింది. ఈ బిల్లుకు లోక్ సభ కూడా ఆమోదం తెలిపింది. Parliament passes a Bill that makes our examination system more robust! pic.twitter.com/OEvLKXoUaf— Narendra Modi (@narendramodi) July 30, 2026 -
‘నీట్’ లీకేజీని మించి ‘డీఎస్సీ’ మెగా స్కామ్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ– 2025 ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో భారీస్థాయిలో అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని వైఎస్సార్ సీపీ ఎంపీలు ఢిల్లీ వేదికగా ఎండగట్టారు. దేశంలో ‘నీట్’ లీకేజీ కంటే మెగా డీఎస్సీ అతిపెద్ద కుంభకోణ మని ధ్వజమెత్తారు. డీఎస్సీ పరీక్షల నిర్వహణ, ప్రశ్న పత్రాల భద్రత, మెరిట్ జాబితా, స్పోర్ట్స్ కోటా నియా మకాల్లో పారదర్శకతను పూర్తిగా దెబ్బ తీశారని మండిపడ్డారు. మొత్తం వ్యవహారంపై సీబీఐ లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో సమగ్ర దర్యాప్తు జరి పించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తన పదవికి రాజీనామా చేయాలని రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు, లోక్‌సభ ఎంపీలు డాక్టర్ మద్దిల గురు మూర్తి, డాక్టర్ గుమ్మా తనూజారాణి డిమాండ్ చేశా రు. బుధవారం ఢిల్లీలోని ఏపీ భవన్లో వైఎస్సార్సీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడారు. పరీక్షల నిర్వహణ వ్యవస్థలో పనిచేసిన వ్యక్తే అత్యున్నత ర్యాంకులు సాధించడం ప్రశ్నపత్రాల లీకేజీకి నిదర్శనమన్నారు. ప్రశ్నపత్రాల డిజిటల్ యాక్సెస్ ఎవరి నియంత్రణలో ఉంది? ప్రశ్నపత్రం ఎంతమందికి చేరింది? లీకైన ప్రశ్నపత్రంతో ఎంతమంది పరీక్ష రాశారు? ఎంత మొత్తంలో డబ్బు చేతులు మారింది? అనే అంశాలపై ఇప్పటివరకు ఎలాంటి దర్యాప్తు జరగలేదని ఎంపీలు విమర్శించారు. పారదర్శకతకు సమాధి..పరీక్షల నిర్వహణ ఎలా జరుగుతుందో డిస్ట్రిక్ డెవలప్ మెంట్ ఆఫీసర్‌గా పనిచేసిన తనకు తెలుసని ఎంపీ గొల్ల బాబూరావు చెప్పారు. ప్రశ్నపత్రాల రూపకల్ప న, పరీక్షల నిర్వహణ బాధ్యతలు డీఎస్సీ కన్వీనర్ ఆధ్వర్యంలో జరగాల్సి ఉండగా కన్వీనర్‌ను పూర్తిగా పక్కనపెట్టి ఆ బాధ్యతలను ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌కు అప్పగించారన్నారు. దీంతో పరీక్షల నిర్వహణలో పార దర్శకత దెబ్బతిన్నదన్నారు. పేపర్స్ తయారీ, ప్రింటింగ్, డిజిటైజేషన్.. ప్రతి దశ లోనూ అవుట్సోర్సింగ్ వ్యక్తుల్ని పెట్టి భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. 2019–24 మధ్య వైఎస్ జగన్ హయాంలో ఎటువంటి ఆరోపణలు, అవకతవ కలకు తావులేకుండా పారదర్శకంగా 1.50 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు. కొన్ని సంఘాల సర్టిఫికెట్లతో అసాధారణ నియామకాలు..నీట్ పేపర్ లీకేజీ కంటే మెగా డీఎస్సీ పెద్ద కుంభకోణ మని ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజారాణి పేర్కొన్నారు. స్పోర్ట్స్ కోటా జీవోలను రద్దు చేసి కొత్త నిబంధనలు తీసుకురావడం, పోస్టుల కేటాయింపులో అవకతవ కలు చోటు చేసుకున్నాయని చెప్పారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన ప్రతిభావంతులైన క్రీడాకారులను పక్కనబెట్టి కేవలం పాల్గొన్న వారికి ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించారని విమర్శించారు. కొన్ని క్రీడా సంఘాలు జారీ చేసిన సర్టిఫికెట్ల ఆధారంగా అసాధారణ సంఖ్యలో నియామకాలు జరిగాయ న్నారు. సాఫ్ట్‌బాల్ అసోసియేషన్‌కు టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అధ్యక్షుడిగా ఉండగా, జూడో అసోసియేషన్‌కు నారా లోకేశ్‌కు బంధువైన విశాఖ ఎంపీ భరత్ గౌరవాధ్య క్షుడిగా ఉన్నారని గుర్తు చేశారు. ఇదే సంఘాల నుంచి జూడోలో 39 మందికి, సాఫ్ట్‌బాల్‌లో 38 మందికి సర్టిఫికెట్లు జారీ కావడంనియామకాలపై తీవ్ర అను మానాలు కలిగిస్తోందన్నారు. డీఎస్సీ బాధితులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, వైఎస్ జగన్ నేతృత్వంలో పోరాడతామని, ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు. జీవో నెం.3 అమలుపై ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టి స్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు కేవలం 6 శాతమే ఉద్యోగాలు ఇచ్చిందని విమర్శించారు. లోకేశ్ రాజీనామా చేయాలి..మెగా డీఎస్సీ 2025 నియామక ప్రక్రియపై సీబీఐ లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వ ర్యంలో స్వతంత్ర విచారణ జరిపించాలని ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి డిమాండ్ చేశారు. నిరుద్యోగులు, డీఎస్సీ అభ్యర్థులకు జరిగిన అన్యాయంపై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నాయకత్వంలో రాష్ట్ర స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు నిరంతర పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పార్లమెంట్, శాసనసభ, శాసనమండలి, మీడియా వేదికలపై డీఎస్సీ స్కామ్‌కు సంబంధించిన ఆధారాలను బయట పెట్టామన్నారు. దాదాపు 3.5 లక్షల మంది నిరుద్యోగులు పరీక్ష రాసి 16 వేల ఉద్యోగాల కోసం పోటీ పడితే మొత్తం నియామక ప్రక్రియనే అధికార పార్టీకి అనుకూలంగా మార్చారని ఆరోపించారు. 2012 నుంచి అమలులో ఉన్న జీవో నంబర్ 74తో పాటు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పక్కనపెట్టి ఎంపిక చేసిన వారికి ఉద్యోగాలు కల్పించేందుకే జీవో నంబర్–4, జీవో నంబర్–47 తీసుకొచ్చారని మండిపడ్డారు. స్పోర్ట్స్ కోటాలో దాదాపు 384 మందికి పరీక్ష లేకుండానే ఉద్యోగాలు కట్టబెట్టిన తర్వాత మళ్లీ జీవో నంబర్–25, జీవో నంబర్–56 ద్వారా పాత నిబంధనలను అమలు చేయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలు చెల్లిస్తే టీచర్ ఉద్యోగం ఇప్పిస్తామని బేరం పెడుతూ సోషల్ మీడియాలో ఓ వాయిస్ రికార్డు వైరల్ అయిందని ఎంపీ డాక్టర్ గురుమూర్తి పేర్కొన్నారు. దీనిపై ఫిర్యాదు చేసినా దర్యాప్తు ముందుకు సాగకపోవడం వెనుక ఎవరి ఒత్తిడి దాగి ఉంది? అని నిల దీశారు. నీట్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసి నట్లుగానే డీఎస్సీలో అవకతవకలపై విద్యాశాఖ మంత్రి నారా లోకే‹శ్ కూడా రాజీనామా చేయాలని స్పష్టం చేశారు. -
విద్యార్థులను హింసించే హక్కు ఎవరిచ్చారు
న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నీట్ పేపర్ లీక్‌పై ఆందోళనకు దిగిన విద్యార్థులను కఠినంగా అణచివేయాలంటూ పోలీసులకు ఆదేశాలిచ్చారని ఆరోపించారు. నిరసనకారులపై పోలీసుల అరాచకాలు, కాల్పులకు అమిత్ షా ఆమోదం తెలిపారని మండిపడ్డారు. పేపర్ లీక్ సవరణ బిల్లుపై బుధవారం లోక్‌సభలో జరిగిన చర్చలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. బీజేపీని, ఆ పార్టీ మద్దతుదారులను పరోక్షంగా ఎద్దేవా చేశారు. ఇందుకోసం మూడు వర్గాలను ప్రస్తావించారు. విద్యార్థులు, తమకు అంతా తెలుసని భావిస్తూ దేవుడిలా నటించేవారు, ఆ రెండో వర్గమే సాక్షాత్తూ దేవుడని నమ్మే అంధభక్తులు ఉన్నారని విమర్శించారు. హోంమంత్రి అమిత్ షా భయపడుతున్నారని, అందుకే ఈ రోజు సభకు రాలేదని రాహుల్ అన్నారు. విద్యార్థులపై హింసకు పాల్పడే హక్కు అమిత్ షాకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఆయన మన విద్యార్థుల శరీరంలోకి పెల్లెట్లను(తుపాకీ గుళికలను) దించారని రాహుల్ ధ్వజమెత్తారు. దేశంలో విద్య నేడు ఖరీదైన వ్యాపారంగా, విద్యా వ్యవస్థ క్రూరంగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు. ఆర్ఎస్ఎస్ గుప్పిట్లోకి విద్యా వ్యవస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)పై కూడా రాహుల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. విద్యా వ్యవస్థను ప్రభావితం చేస్తూ, విద్యార్థులకు ఏమి బోధించాలనే దానిని ఆ సంస్థే నిర్దేశిస్తోందని ఆరోపించారు. విద్యా వ్యవస్థ ఆత్మను ఆర్ఎస్ఎస్ తన గుప్పిట్లోకి తీసుకుందని చెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్ ఎప్పుడూ విద్యా శాఖను నడపలేదని, ఆ పని చేసింది ఆర్ఎస్ఎస్ మాత్రమేనని ఆక్షేపించారు. విద్యార్థుల అసలైన శత్రువు ఆర్ఎస్ఎస్ అని విమర్శించారు. అన్‌పార్లమెంటరీ పదం తొలగింపు కొంతమంది విద్యార్థులతో జరిపిన సంభాషణ యువత విద్య, జ్ఞానాన్ని ఎలా చూస్తుందనే దానిపై తనకు ఒక అవగాహన కల్పించిందని రాహుల్ అన్నారు. విద్యారి్థగా ఉండడం అంటే ఏమిటని తాను ఒక విద్యారి్థని అడిగానని చెప్పారు. అంటే కళాశాల లేదా పాఠశాలలో చదువుకోవడం, పుస్తకాలు చదవడం అని అర్థమా? అని అడిగితే.. విశాలమైన దృక్పథం, విశాలమైన హృదయం కలిగినవారే విద్యార్థి అని ఆమె సమాధానమిచ్చారని పేర్కొన్నారు. ‘‘విద్యార్థి అంటే తనకు అన్నీ తెలియవని అంగీకరించే వ్యక్తి. తనకు తెలిసిన విషయాల స్థానంలో కొత్త జ్ఞానం వచ్చి చేరుతుంది. విశ్వం నిరంతరం పరివర్తన చెందుతూ ఉంటుందని అతనికి తెలుసు. జ్ఞానం కూడా నిరంతరం మారుతూ ఉంటుందని అతను అర్థం చేసుకుంటాడు. విద్యారి్థకి ఉండాల్సిన అత్యంత ముఖ్యమైన లక్షణం వినమ్రత అని ఆమె అన్నారు’’అని రాహుల్ వెల్లడించారు. తమకు అన్నీ తెలుసని భావించే మరో వర్గం గురించి కూడా ఆమె వివరించారని పేర్కొన్నారు. ‘‘తమకు అన్నీ తెలుసని కొందరు వ్యక్తులు దృఢంగా నమ్ముతారు. విశ్వం స్థిరమైనదని, జ్ఞానం తమ అంతరంగం నుంచే ఉద్భవిస్తుందని వారు భావిస్తారు. వారు అహంకారంతో ఉంటారు. వారు ఇతరుల మాట వినరు, సత్యాన్ని గౌరవించరు’’అని చెప్పారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ ఉపయోగించిన ఒక పదంపై స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యారి్థని తనతో చెప్పిన మాటలనే సభలో ప్రస్తావించానని, సభలోని ఏ సభ్యుడినీ ఉద్దేశించి అనలేదని రాహుల్ బదులిచ్చారు. రాహుల్ ఉపయోగించిన అన్‌పార్లమెంటరీ పదాన్ని రికార్డుల నుంచి తొలగించాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కోరారు. దాంతో స్పీకర్ ఆ పదాన్ని తొలగించారు. ఎన్డీయే సభ్యుల తీవ్ర అభ్యంతరం సభలో రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల పట్ల అధికార ఎన్డీయే సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. అరుపులు కేకలతో సభ దద్దరిల్లింది. దాంతో సభను రెండుసార్లు వాయిదా వేయాల్సి వచి్చంది. రాహుల్ అబద్ధాల పుట్ట అంటూ బీజేపీ ఎంపీలు ఎదురుదాడికి దిగారు. ఆధారాల్లేకుండా ఆరోపణలు చేస్తున్నారని, అందుకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సైతం జోక్యం చేసుకున్నారు. ఇక్కడ చర్చ జరుగుతున్నది అమిత్ షాపై కాదని అన్నారు. ఆరోపణలకు ఆధారాలు చూపించాలని రాహుల్‌కు సూచించారు. -
మెగా డీఎస్సీ స్కామ్‌పై జెన్‌జీ వార్!
సాక్షి, అమరావతి: ‘నీట్’ పేపర్ లీకేజీపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జెన్‌జీ యువతరం ఉవ్వెత్తున ఉద్యమించిన రీతిలోనే.. మెగా డీఎస్సీ 2025లో అక్రమాలపై బాధిత అభ్యర్థులు, నిరుద్యోగ యువత చంద్రబాబు సర్కారుపై పోరాటాన్ని ఉధృతం చేసేందుకు సన్నద్ధమైంది. మెగా డీఎస్సీ నియామక ప్రక్రియను అక్రమాలు, అవినీతిమయంగా మార్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలనే డిమాండ్ సర్వత్రా వెల్లువెత్తుతోంది. డీఎస్సీలో అక్రమాలను ఆధారాలతో సహా పలుమార్లు బయటపెట్టినా స్పందించకుండా లోకేశ్ ఇంకా సవాళ్లు విసరడం సిగ్గు చేటని బాధిత అభ్యర్థులు మండిపడుతున్నారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, లోకేశ్ రాజీనామా చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి బకాయిలు వెంటనే చెల్లించాలనే డిమాండ్లతో ఈనెల 31 నుంచి భారీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని, అప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం దిగిరాకుంటే ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని నిరుద్యోగులు, డీఎస్సీ బాధిత అభ్యర్థులు స్పష్టం చేస్తున్నారు. మెగా డీఎస్సీలో అక్రమాలకు ఎన్నో ఉదంతాలున్నాయని గుర్తు చేస్తున్నారు. మెగా డీఎస్సీలో అక్రమాల పర్వం.. మెగా డీఎస్సీ 2025 ప్రక్రియ మొదలు పెట్టగానే అంతకు ముందు మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో నియమితుడైన కన్వీనర్‌ను తొలగించి మరో అధికారిని పెట్టుకున్నారు. డీఎస్సీ కన్వీనర్‌ను పక్కన పెట్టి అధికారాలను కేంద్రీకరించారు. ప్రశ్నాపత్రం తయారు చేసే ఎస్సీఈఆర్టీ కన్వీనర్నే పరీక్షలు నిర్వహించే డీఎస్సీ కన్వీనర్‌గా నియమించారు. అక్కడే అక్రమాలకు బీజం పడింది. వైఎస్ జగన్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసి కొత్త సంతకాలతో, కొత్త తేదీలతో మరో నోటిఫికేషన్ ఇచ్చారు. గోప్యంగా ఉండాల్సిన ప్రశ్నాపత్రాల తయారీ ప్రక్రియను, అప్ లోడింగ్‌ను, డిజిటలైజేషన్‌ను పూర్తిగా ఎస్సీఈఆర్టీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అప్పగించారు. ఇందులో ఒకడైన నవీన్ జిల్లా టాపర్‌గా వచ్చాడు. అతడి నియామకాన్ని రద్దు చేసి ఆ తర్వాత రెండో మెరిట్ లిస్ట్ ఇచ్చారు. మెరిట్ లిస్ట్ ఎందుకు పెట్టలేదు? డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌ను భ్రష్టు పట్టించడానికి లోకేశ్ విద్యాశాఖను వాడుకున్నారని అభ్యర్థులు పేర్కొంటున్నారు. కలెక్టరేట్లో ప్రదర్శించాల్సిన మెరిట్‌లిస్ట్ ఎందుకు పెట్టలేదు? టాప్ ర్యాంకర్‌గా వచ్చిన నవీన్‌ను తీసేసి రెండో లిస్ట్ ఎందుకు విడుదల చేశారు? మెరిట్ లిస్ట్ నుంచి నవీన్‌ను ఎందుకు తీసేశారో కోర్టుకు కూడా చెప్పకుండా వాయిదాలు ఎందుకు తీసుకుంటున్నారు? అని నిలదీస్తున్నారు. స్పోర్ట్స్ కోటాలో దొడ్డి దారిన అమ్మేశారు.. స్పోర్ట్స్ కోటా కోసం జీవో 74 ఉండేది. అప్పుడు 2 శాతం కోటాలో ఉద్యోగాలు ఇచ్చేవారు. ఆటల్లో నైపుణ్యంతో పాటు టెట్, డీఎస్సీ క్వాలిఫై కావాలి. లోకేశ్ మంత్రి కాక ముందు ఈ నిబంధన ఉండేది. డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే రోజే అంటే 2025 ఏప్రిల్ 19న ప్రకటన చేయటానికి గంట ముందు స్పోర్ట్స్ కోటా కొత్త జీవో 4 ఇచ్చారు. అదే సమయంలో జీఏడీ జీవో 47 ఇచ్చింది. అందరితోపాటు సమానంగా విద్యార్హతలు అక్కర్లేదు, టెట్, డీఎస్సీలు రాయాల్సిన పని లేదని పేర్కొంది. మెగా డీఎస్సీ పూర్తయ్యాక స్పోర్ట్స్ కోటాలో మళ్లీ మార్పులు చేస్తూ జీవో 56 జారీ చేశారు. దొడ్డి దారిన టీచర్ల ఉద్యోగాలు అమ్ముకుని, 26 రోజుల్లోనే జీవోలు ఇచ్చి, మళ్లీ జీవోలు మార్చేశారు. జాతీయ స్థాయి గోల్డ్ మెడల్ వచ్చిన దుర్గయ్యకు ఇవ్వకుండా, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్న వారికి ఉద్యోగం ఇచ్చేశారు. అడ్డగోలుగా సర్టిఫికెట్లు.. వాటితో ఉద్యోగాలు కూన రవికుమార్ అధ్యక్షుడిగా ఉన్న ఏపీ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ద్వారా 38 మంది టీచర్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. లోకేశ్ తోడల్లుడు భరత్ అధ్యక్షుడిగా ఉన్న జూడో సంఘం ఇచ్చిన సర్టిఫికెట్ల ఆధారంగా 39 మంది ఉద్యోగాలు తెచ్చుకున్నారు. పార్టిసిపేషన్ సర్టిఫికెట్లతోనే ఈ ఉద్యోగాలు ఇచ్చారు. డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చి, బేరసారాల్లో దొరికిపోయినా ఇంకా బుకాయిస్తున్నారు. ఆధారాల్లో ఫోన్ నంబర్ కనిపిస్తున్నా.. ఎఫ్ఐఆర్లో అనుమానితుడని చెప్పి తప్పించేస్తున్నారు. దీని వెనుక ఎవరున్నారో లోకేశ్ తేల్చాలి. ఎవరూ లేకపోతే పోలీసులు ఎందుకు దీనిపై విచారణ జరపడం లేదు? సీబీఐ విచారణ జరగాల్సిందే: పేర్ని నానిడీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరగాల్సిందేనని, దానిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందేనని వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) డిమాండ్ చేశారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి లోకేశ్ మెగా డీఎస్సీలో అవకతవకలపై సమాధానం చెప్పకుండా వైఎస్ జగన్ ఇంటి గేటు బయట నిలబడ్డా! పిలిచాను! ఆయన రాలేదు! అని సొల్లు కబుర్లు చెప్పడం ఎందుకని ప్రశ్నించారు. మంగళగిరిలోనో, పునాదిపాడులోనో దాతలు ఇచ్చిన డబ్బులతో స్కూల్ కడితే విద్యాశాఖను మార్చినట్లు అవుతుందా అని ప్రశ్నించారు. ‘రమ్మీ, పేకాటకు కూడా ఉద్యోగాలు ఇచ్చేస్తారా? వీటిపై ప్రశ్నిస్తే శ్రీకాకుళం జిల్లాలో నాపై కేసు పెట్టారు. ఆ కేసు పెట్టిన పోలీసులు పశ్చాత్తాప పడే రోజు వస్తుంది’ అని పేర్కొన్నారు.ఈ ప్రశ్నలకు బదులేది..?1. ప్రశ్నపత్రాల తయారీతోపాటు పరీక్షల నిర్వహణ బాధ్యత కూడా ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌కే అప్పగించడం పారదర్శకతకు పాతర కాదా?2. ప్రశ్నల తయారీ, అప్లోడింగ్, డిజిటల్ నిర్వహణ లాంటి అత్యంత గోప్యమైన పనులను ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు అప్పగించడం పేపర్ లీకేజీకి పునాది కాదా?3. ఔట్సోర్సింగ్ ఉద్యోగి పురమ నవీన్ సోషల్ స్టడీస్‌లో కృష్ణా జిల్లా టాపర్‌గా, టీజీటీ తెలుగు పరీక్షలో జోన్ 2లో ఆరో ర్యాంకర్‌గా నిలిచాడు. ప్రశ్నపత్రాల వ్యవస్థలో పనిచేసిన వ్యక్తికే టాప్ ర్యాంకులు రావడం పేపర్ లీకేజీని నిర్ధారిస్తోంది. ఆ తర్వాత నవీన్‌కు ఉద్యోగం ఇవ్వకుండా మెరిట్ లిస్టు నుంచి పేరు తొలగించారు. డేటాను మాయం చేసి కాల్‌లెటర్ కూడా పంపలేదు. దీనిపై హైకోర్టులో కేసు నడుస్తోంది. డిజిటల్ యాక్సెస్ ఎవరి చేతుల్లో ఉంది? ప్రశ్నపత్రం ఎంతమందికి చేరింది? లీకైన పేపర్‌తో ఎంతమంది పరీక్ష రాశారు? ఎంత డబ్బు చేతులు మారింది? వీటిపై విచారణ ఏది?4. జీవో నంబర్ 74 ప్రకారం స్పోర్ట్స్ కోటా 2 శాతంగా ఉండేది. ఇతర అభ్యర్థులతో సమానంగా అన్ని అర్హతలు కలిగి, సంబంధిత పోస్టుకు పరీక్ష రాయడం తప్పనిసరి. కానీ డీఎస్సీ 2025లో జీవో నంబర్లు 4, 47 ద్వారా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు పరీక్షను ఎత్తివేశారు. కోటాను 2 శాతం నుంచి 3 శాతానికి పెంచారు. స్పోర్ట్స్ కోటా పోస్టులు భర్తీ చేయగానే జీవో నంబర్లు 4, 47ను రద్దు చేసి, పోటీ పరీక్షను మళ్లీ తప్పనిసరి చేస్తూ జీవో నంబర్ 56 జారీ చేశారు.మొదట ఇచ్చిన జీవోలు సరైనవే అని అనుకున్నప్పుడు మళ్లీ వాటిని రద్దుచేస్తూ జీవోలు ఎందుకు తెచ్చారు? అంటే.. తమవారితో పోస్టులు నింపడానికి గేట్లు తెరిచి, పని పూర్తికాగానే మళ్లీ మూసేశారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులను పక్కనపెట్టి.. ఇంటర్ కాలేజీ, ఇంటర్ యూనివర్సిటీ, ఇంటర్ డిస్ట్రిక్ట్ పోటీల్లో పాల్గొన్న సర్టిఫికెట్ ఉంటే చాలు ఉద్యోగాలు ఇచ్చేశారు. కొన్ని క్రీడా సంఘాల నుంచి అసాధారణ సంఖ్యలో సర్టిఫికెట్లు చూపించి నియామకాలు చేపట్టారు. 5. సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్.. జూడో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు, లోకేశ్ తోడల్లుడు, విశాఖపట్నం ఎంపీ భరత్ జూడో నుంచి 39 మందికి, సాఫ్ట్‌బాల్ నుంచి 38 మందికి స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ఇచ్చారు. క్రీడా సంఘాలకు నాయకత్వం వహించేది అధికార పార్టీ నేతలే. సర్టిఫికెట్లు ఇచ్చేదీ వారే. ఇక పారదర్శకత ఎక్కడుంది?6. ఆర్చరీలో జాతీయ స్థాయి గోల్డ్ మెడలిస్ట్ దుర్గయ్యను 1 : 1 పద్ధతిలో పిలిచి, సర్టిఫికెట్లు పరిశీలించిన తర్వాత కూడా ఉద్యోగం ఇవ్వలేదు. మరోవైపు జిల్లా, యూనివర్సిటీ స్థాయిలో కేవలం పాల్గొన్న వారికి ఉద్యోగాలు ఇచ్చారు. జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్స్ సాధించిన క్రీడాకారుడిని పక్కనపెట్టారు.7. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు బేరసారాలు చేసినట్లు ఆడియో, వీడియో ఆధారాలు బయటకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లోగోను వాట్సాప్ డీపీగా పెట్టుకున్న ఓ వ్యక్తి.. అభ్యర్థితో ఉద్యోగం కోసం బేరసారాలు జరిపారు. వీడియోలో ఫోన్ నంబర్ స్పష్టంగా కనిపించినా ఎఫ్ఐఆర్లో పేరు నమోదు చేయకుండా ‘అనుమానిత వ్యక్తి’గా మాత్రమే పేర్కొన్నారు. బలమైన సెక్షన్లు పెట్టకుండా నామమాత్రపు కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్‌పై వదిలేశారు. ఇది కుంభకోణం వెనుక పెద్దల ప్రమేయానికి రుజువు కాదా? -
‘‘రష్యాలో 4 నెలలుగా ఉన్నా.. నీట్ నిరసన కేసులో నా పేరు పెట్టారు’’
పట్నా: దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనలకు సంబంధించిన కేసులో తన పేరు చేర్చారని తెలుసుకుని ఆశ్చర్యానికి గురయ్యానని బిహార్‌కు చెందిన ఓ యువకుడు చెప్పాడు. బిహార్‌లోని కిషన్‌గంజ్‌కు చెందిన మహ్మద్ సదాఖత్ తాను గత 4 నెలలుగా రష్యాలో ఉన్నానని పేర్కొన్నాడు.“జూలై 24న నీట్ లీక్‌కు వ్యతిరేకంగా ఎల్‌ఆర్‌పీ చౌక్ వద్ద నిరసన జరిగింది. ఆ కేసులో బహదూర్‌గంజ్ అడ్మినిస్ట్రేషన్ నా పేరు చేర్చింది. నేను గత 4 నెలలుగా రష్యాలో ఉన్నాను” అని సదాఖత్ చెబుతూ ఓ వీడియో పోస్ట్ చేశాడు.“నేను రష్యాలో ఉండడంతో నా పేరును అక్కడి నుంచి తొలగించాలని అడ్మినిస్ట్రేషన్‌ను కోరుతున్నాను. అలా చేస్తే వారికి రుణపడి ఉంటాను” అని అతడు కోరాడు. అతడి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నప్పటికీ దాని ప్రామాణికతను స్వతంత్రంగా ఇప్పటివరకు ఏ మీడియా కూడా నిర్ధారించలేకపోయింది.పోలీసులు ఏమన్నారు?కిషన్‌గంజ్ పోలీసు సూపరింటెండెంట్ హరి మోహన్ శుక్లా స్పందిస్తూ... వైరల్ వీడియోలోని వ్యక్తిపై కేసు నమోదైందా? లేదా? అన్న విషయాన్ని ధ్రువీకరించలేదు, ఖండించలేదు. సదాఖత్ వీడియోపై అడిగిన ప్రశ్నకు హరి మోహన్ స్పందిస్తూ.. “నిరసనలకు సంబంధించిన ఏవైనా ఫిర్యాదులు ఉన్నవారు పోలీసులను సంప్రదించవచ్చు. పరిష్కారం పొందవచ్చు” అని చెప్పారు.బిహార్ పోలీసుల అధికారిక ఎక్స్ ఖాతా గతంలో ఈ వైరల్ వీడియోపై స్పందిస్తూ, విషయాన్ని పరిశీలిస్తామని తెలిపింది. అయితే ఆ పోస్టు ఇప్పుడు కనిపించడం లేదు. తొలగించినట్టు తెలుస్తోంది.విద్యార్థులపై కేసులు ఉపసంహరించనున్న ప్రభుత్వంముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరి నేతృత్వంలోని బిహార్ ప్రభుత్వం... నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన అన్ని కేసులను ఉపసంహరించనున్నట్టు ప్రకటించింది. ఢిల్లీలో ప్రారంభమైన సీజేపీ ఆందోళనలు చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారితీశాయి.రాష్ట్ర హోం శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. జూలై 26 ఉదయం 6 గంటల కంటే ముందు జరిగిన ఘటనలకు సంబంధించి నమోదైన “అన్ని ఎఫ్ఐఆర్లు, ఫిర్యాదులు, షోకాజ్ నోటీసులు” ఉపసంహరించాలనే నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ కేసుల్లో అరెస్టైన వారందరినీ వెంటనే విడుదల చేయాలని కూడా నోటిఫికేషన్లో పేర్కొన్నారు.मोहम्मद सदाकत 4 महीने से रूस में हैं। बिहार पुलिस ने स्टूडेंट प्रोटेस्ट में उनके खिलाफ भी FIR दर्ज कर दी है !! pic.twitter.com/jEDqWs27ck— Sachin Gupta (@Sachingupta) July 29, 2026 -
యాంటీ పేపర్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
సాక్షి,ఢిల్లీ: యాంటీ పేపర్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓట్లతో యాంటీ పేపర్ లీక్ బిల్లు పాసమైంది. పరీక్షల నిర్వహణ, పలు సంస్కరణలు చేపడుతూ బిల్లు రూపకల్పన జరిగింది. బిల్లు ఆమోదం తర్వాత రేపటికి లోక్‌సభ వాయిదా పడింది. కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) అమెండ్మెంట్ బిల్లు, 2026 (యాంటీ పేపర్ లీక్ బిల్లు) పోటీ పరీక్షల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు అత్యంత కఠినమైన నిబంధనలను ప్రతిపాదిస్తోంది. ఇటీవల జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వివాదాలు, దేశవ్యాప్త నిరసనల నేపథ్యంలో ఈ సవరణ బిల్లును కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు కూడా పాసయ్యింది. పేపర్ లీకేజీలు, కాపీయింగ్, ఇతర అక్రమాలకు పాల్పడే వ్యక్తులకు కనీసం 5 ఏళ్ల నుండి గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. అలాగే గరిష్ట జరిమానాను రూ.10 లక్షల నుండి రూ.50 లక్షల వరకు పెంచారు.పేపర్ లీక్ చేసే వారికి కనీసం 7 ఏళ్ల జైలు శిక్ష,రూ.10 కోట్ల వరకు భారీ జరిమానా విధిస్తారు. అక్రమాలకు పాల్పడినట్లు రుజువైతే సదరు నిందితులు లేదా సంస్థల ఆస్తులను జప్తు చేసే అధికారం కూడా ఈ బిల్లు కల్పిస్తుంది.పరీక్షలు నిర్వహించే ఏజెన్సీలు తప్పు చేస్తే రూ.5 కోట్ల వరకు జరిమానా విధించడంతో పాటు, ఆయా సంస్థలను 8 ఏళ్ల పాటు బ్లాక్‌లిస్ట్‌లో పెడతారు.పేపర్ లీక్ కేసులను వేగంగా తేల్చడానికి ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తారు. కేసు దర్యాప్తును 2 నెలల్లోగా (60 రోజులు) పూర్తి చేయాలి. చార్జ్‌షీట్ దాఖలు చేసిన 3 నెలల లోపే కోర్టులు తీర్పును వెలువరించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా జరిగే ఇటువంటి పరీక్షల మోసాలను విచారించడానికి కేంద్రం ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను రంగంలోకి దించుతుంది. ఈ చట్టం దేశంలోని అన్ని ప్రధాన కేంద్ర నియామక, ప్రవేశ పరీక్షలకు వర్తిస్తుంది. ఈ కొత్త బిల్లులో దాదాపు 15 రకాల చట్టవిరుద్ధమైన చర్యలను నేరాలుగా గుర్తించారు.క్వశ్చన్ పేపర్లు లేదా ఆన్సర్ కీ లీక్ చేయడం.ఓఎంఆర్ షీట్లను ట్యాంపరింగ్ చేయడం.నకిలీ అడ్మిట్ కార్డులు సృష్టించడం లేదా ఫేక్ వెబ్సైట్లు నడపడం.ఒకరి బదులు మరొకరు పరీక్ష రాయడం కంప్యూటర్ నెట్‌వర్క్‌లను హ్యాక్ చేయడం వంటి అంశాలునన్నాయి. -
అమిత్‌షా ఆదేశాల ప్రకారమే దాడులు.. రాహుల్
సాక్షి, ఢిల్లీ: పేపర్ లీక్‌పై ఏం జరిగిందో ప్రభుత్వానికి తెలియాలంటే బీజేపీ ఎంపీలు వారి పిల్లలను అడగాలని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. యాంటీ పేపర్ లీక్ బిల్లుపై లోక్‌సభలో చర్చ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడారు. నీట్ పేపర్ లీక్‌పై విద్యార్థులు శాంతియుత నిరసన చేపట్టారని అన్ని పార్టీలు విద్యార్థులు ఆందోళనను గౌరవించాలన్నారు. ఢిల్లీ వీధుల్లో జరిగింది నిరసన కాదని అది భావప్రకటన స్వేచ్ఛని రాహుల్ గాంధీ కేంద్రాన్ని దుయ్యబట్టారు.విద్యావ్యవస్థ క్రూరంగా మారిపోయింది. విద్యను ప్రైవేటీకరించారు. విద్యను ఆరెస్సెస్మయం చేశారు. ఇది యూపీఏ పాలన.. మా మంత్రి రాజీనామా చేయరని మరో మంత్రి రాజ్‌నాథ్ అన్నారు. ధర్మేంద్ర ప్రదాన్‌ను విద్యాశాఖ మంత్రి అని మేం అనుకోలేదు. దేశంలో విద్యాశాఖను ఆరెస్సెస్నడిపిస్తోంది. దేశంలోని అన్ని యూనివర్సిటీలకు ఆరెస్సెస్ మనుషులే వీసీలుగా ఉన్నారు ఉన్నారు.భయాన్ని దాటుకుని విద్యార్థులు పోరాటం చేశారు. విద్యార్థులపై దాడికి హోం మంత్రే ఆదేశాలు ఇచ్చారు. విద్యార్థులపై పెల్లెట్స్ దాడికి హోం మంత్రే కారణం. నీట్‌పై చర్చ జరుగుతున్న సమయంలో హోం మంత్రి ఇప్పుడు ఇక్కడ ఎందుకు లేరు?. ఆయనకి ఇక్కడ కూర్చునే ధైర్యం లేదు. ఆయన భయంతో వణికిపోతున్నారు. పోలీసుల చర్యపై విద్యార్థులకు అమిత్ షా క్షమాపణలు చెప్పాలి అని రాహుల్ డిమాండ్ చేశారు.రిజిజు అభ్యంతరంకాగా రాహుల్ ప్రసంగంపై దుమారం చెలరేగింది. ఆయన చేసిన ‘ఇడియట్స్’ వ్యాఖ్యలతో ఎన్డీయే ఎంపీలు ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ వ్యాఖ్యలపై అని పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు అభ్యంతరం వ్యక్యం చేశారు. అన్ పార్లమెంటరీ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను కోరారు. ఆ సమయంలో స్పీకర్ ‘హుందాగా వ్యవహరించాలి’ అని సభ్యులను ఉద్దేశించి సూచించారు. రాహుల్‌వి తప్పుడు ఆరోపణలన్న కిరెన్ రిజిజు.. ఆధారాల్లేకుండా ఆయన ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. ‘‘విద్యార్థుల పేరుతో అనుచిత వ్యాఖ్యలు సరికాదు. హోం మంత్రే ఆదేశాలు ఇచ్చారని ఎలా అంటారు. రాహుల్ క్షమాపణలు చెప్పాలి’’ మంత్రి డిమాండ్ చేశారు. -
ప్రకాష్ రాజ్‌ను చేపలకు ఆహారంగా వేస్తా: బీజేపీ ఎమ్మెల్యే
ఉడుపి: ప్రముఖ నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్ రాజ్‌కు కర్ణాటకలోని ఉడుపికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే యశ్పాల్ సువర్ణ సంచలన హెచ్చరికలు జారీ చేశారు. కళాకారుల మదిలో విషబీజాలు నాటడం మానుకోవాలని, లేనిపక్షంలో అరేబియా సముద్రంలో చేపలకు ఆహారంగా మారుస్తామని ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించారు.ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఇటీవల 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థి నిరసనలో ప్రకాశ్ రాజ్ పాల్గొని, కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాలను తీవ్రంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో యశ్పాల్ సువర్ణ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జంతర్‌మంతర్ వద్ద జరిగిన నీట్ నిరసనలో పాల్గొన్నవారు అసలైన విద్యార్థులు కారనీ, వారి నేపథ్యాన్ని పరిశీలిస్తే నిజాలు బయటపడతాయని పేర్కొన్నారు.ఇలాంటి రాజకీయాలు కొనసాగితే బీజేపీ కార్యకర్తలు తగిన రీతిలో స్పందిస్తారని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆ జిల్లాకు చెందిన వీ. సునీల్ కుమార్‌తో సహా పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు 'ఇండియా' కూటమి నేతలైన రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాదవ్ తదితరుల ముఖాలతో ఉన్న బొద్దింకల ప్లకార్డులపై క్రిమిసంహారక మందు పిచికారీ చేయడం గమనార్హం.ఇది కూడా చదవండి: కంగనాకు గట్టిగా ఇచ్చిపడేసిన ప్రముఖ సింగర్! -
నీట్ పేపర్ లీక్ కేసు: 13 మందిపై నేడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ
ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ కీలక ముందడుగు వేసింది. ఈ కేసులో మొత్తం 13 మంది నిందితులపై సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. చార్జ్‌షీట్‌లో ఉన్న నిందితుల్లో ముగ్గురు ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) సబ్జెక్ట్ నిపుణులు ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది.సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో యశ్ యాదవ్, మంగీలాల్ బివాల్, దినేశ్, వికాస్, శుభమ్, ధనుంజయ్, ప్రహ్లాద్ సహా మొత్తం 13 మంది పేర్లు ఉన్నాయి. ప్రశ్నపత్రం లీక్‌కు సంబంధించిన కుట్ర, ప్రశ్నపత్రాల అక్రమ సేకరణ, పంపిణీ తదితర అంశాలపై సీబీఐ విస్తృతంగా దర్యాప్తు జరిపి ఈ చార్జ్‌షీట్‌ను సమర్పించింది. ఈ కేసును నేడు ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణకు తీసుకోనుంది. చార్జ్‌షీట్‌పై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఇదే సమయంలో కేసులో మరికొంతమందిపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం. -
ఎంబీబీఎస్ అడ్మిషన్లకు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: నీట్ యూజీ–2026లో అర్హత సాధించిన వేలాది మంది విద్యార్థులు ఎంబీబీఎస్ అడ్మిషన్ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేశవ్యాప్తంగా 15 శాతం అఖిల భారత కోటా (ఏఐక్యూ) సీట్ల భర్తీకి సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఆ వెంటనే తెలంగాణలో 85 శాతం రాష్ట్ర కోటా సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (కేఎన్ఆర్యూహెచ్ఎస్) నోటిఫికేషన్ జారీ చేయనుంది. దీంతో అడ్మిషన్ల ప్రక్రియకు రంగం సిద్ధమవుతోంది.తెలంగాణ ప్రస్తుతం దేశంలో అత్యధిక ఎంబీబీఎస్ సీట్లు కలిగిన రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది. ప్రభుత్వ, ప్రైవేట్, కేంద్ర ప్రభుత్వ వైద్య కళాశాలలను కలిపి ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో 10 వేలకుపైగా ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉండనున్నాయి. సీట్లు పెరిగినా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పోటీ మాత్రం ఏమాత్రం తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. హైదరాబాద్ కాలేజీలకు జాతీయ స్థాయిలో పోటీ గత ఏడాది కౌన్సెలింగ్‌ను పరిశీలిస్తే ఉస్మానియా, గాంధీ, బీబీనగర్ ఎయిమ్స్, కాకతీయ వంటి ప్రముఖ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకే సీట్లు లభించాయి. ఈ కళాశాలల్లో సీట్ల కోసం జాతీయ స్థాయిలో పోటీ ఉంది. కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ఆన్లైన్ దరఖాస్తులు, ధ్రువపత్రాల పరిశీలన, రాష్ట్ర మెరిట్ జాబితా, వెబ్ ఆప్షన్ల నమోదు, సీట్ల కేటాయింపు ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది.అందువల్ల విద్యార్థులు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా అవసరమైన అన్ని ధ్రువపత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నీట్ ర్యాంక్ కార్డు, అడ్మిట్ కార్డు, టెన్త్, ఇంటర్‌మార్కుల మెమోలు, బదిలీ ధ్రువపత్రం, స్టడీ, నివాస ధ్రువపత్రాలు, కులం, ఆదాయం, ఈడబ్ల్యూఎస్ తదితర రిజర్వేషన్ పత్రాలు వర్తిస్తే వాటిని స్కాన్ చేసి సిద్ధంగా ఉంచుకోవడం మంచిదని చెబుతున్నారు. -
లోక్‌సభలో పేపర్‌లీకేజీల బిల్లు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక నీట్ వంటి కీలక పోటీపరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలతో ఉద్యమించిన విద్యార్థిలోకాన్ని శాంతింపజేసేందుకు, లీకేజీ నేరగాళ్ల వెన్నులో వణుకుపుట్టేలా అత్యంత కఠిన శిక్షలు, అత్యధిక జరిమానాలతో నూతన చట్టానికి తుదిరూపునిచ్చి సంబంధిత బిల్లును మోదీ సర్కార్ సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ప్రభుత్వ పరీక్షలు(అక్రమ పద్ధతుల నివారణ) సవరణ బిల్లు,2026ను ప్రధానికార్యాలయానికి సహాయ మంత్రి అయిన జితేంద్ర సింగ్ సోమవారం లోక్‌సభలో విపక్షాల నిరసనల మధ్యే ప్రవేశపెట్టారు. బిల్లు ప్రతిపాదించేముందు నిబంధనల ప్రకారం సీనియర్ విపక్ష సభ్యులైన సౌగతా రాయ్(టీఎంసీ), మనీశ్ తివారీ(కాంగ్రెస్), ఎన్కే ప్రేమచంద్రన్(ఆర్ఎస్పీ)లను బిల్లుపై మాట్లాడాల్సిందిగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కోరారు. దానికి వాళ్లు ముందుకురాకపోవడంతో ఇక బిల్లును ప్రవేశపెట్టాలని సహాయమంత్రి జితేంద్రను స్పీకర్ కోరడంతో ఆయన బిల్లును సభముందుకు తెచ్చారు. వెంటనే స్పీకర్ మాట్లాడారు. ‘‘ప్రభుత్వ పరీక్షలను పటిష్టంగా నిర్వహించేందుకు తెస్తున్న బిల్లు ఇది. మీరు నినాదాలు ఆపేసి బిల్లుపై చర్చలో పాల్గొంటే బాగుంటుంది. చర్చ వేళ మీరు ఇచ్చే సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోనుంది’’ అని స్పీకర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం, దాని ఏజెన్సీలు నిర్వహించే పబ్లిక్ ఎగ్జామ్‌లో అవకతవకలకు పాల్పడే వాళ్లను ప్రత్యేక చట్టాల కింద శిక్షించేందుకు మోదీ సర్కార్ 2024లో పబ్లిక్ ఎగ్జామ్(ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) చట్టం తెచ్చింది. యూపీఎస్సీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వేస్, బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ పరీక్షలు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇతర ప్రభుత్వ సంస్థలు చేపట్టే పరీక్షల పేపర్లను లీక్‌చేసే వాళ్లను, ముఠాలను ఈ చట్టనిబంధనల కింద శిక్షిస్తున్నారు. తాజాగా నీట్ లీకేజీ ఉదంతం, విద్యామంత్రిగా ధర్మేంద్ర రాజీనామా డిమాండ్లు, విద్యార్థి నిరసనోద్యమంలో మోదీ సర్కార్ చట్టసవరణ చేస్తూ కొత్త బిల్లును తేవడం తెల్సిందే.బిల్లులో ఏముంది? → అక్రమ పద్దతులను అనుసరిస్తూ పోటీపరీక్షల ప్రశ్నపత్రాలను వ్యక్తిగతంగా లీక్‌చేసిన నేరగాళ్లకు కనిష్టంగా ఐదేళ్లు, గరిష్టగా పదేళ్ల శిక్ష పడేలా బిల్లులో ప్రతిపాదనలు పొందుపరిచారు. ఈ నేరగాళ్లకు రూ.50 లక్షల వరకు జరిమానా విధిస్తారు. → వ్యక్తిగతంగా కాకుండా ముఠాగా ఏర్పడి వ్యవస్థీకృత నేరం చేసిన వాళ్లకు గరిష్టంగా ఏడేళ్ల జైలుశిక్ష విధించేలా బిల్లులో ప్రతిపాదనలు చేర్చారు. వీళ్లకు గరిష్టంగా రూ.10 కోట్ల జరిమానా విధిస్తారు. → 2024లో అమల్లోకి వచ్చిన పాత చట్టం ప్రకారం పేపర్ లీకేజీ వ్యక్తిగతం నేరగాళ్లకు మూడు నుంచి ఐదేళ్ల జైలుశిక్ష విధించేవారు. వ్యవస్థీకృత నేరగాళ్లకు గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష, రూ.1 కోటి జరిమానా విధిస్తారు. వీటిని పెంచుతూ సవరణ బిల్లును తెచ్చారు.→ లీకేజీ సంబంధిత కేసుల సత్వర విచారణ కోసం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏదైనా సెషన్స్ కోర్టును ఫాస్ట్‌ట్రాక్ కోర్టుగా ఏర్పాటుచేయాలని కొత్త బిల్లులో ప్రతిపాదించారు.→ కేసును రోజువారీగా కోర్టులో విచారిస్తూ, ఆ కేసులో నేరాభియోగం(చార్జ్‌షీట్) దాఖలైన మూడు నెలల్లోపు కేసు విచారణ ముగించాలని బిల్లులో ప్రతిపాదించారు. కేసు తీవ్రత దృష్టా అవసరమైతే ప్రత్యేక టాస్క్ఫోర్స్నుఏర్పాటుచేయొచ్చు.→ పరీక్షల నిర్వహణ కోసం అవసరమైతే ఇతర విభాగాల సాయం తీసుకోవచ్చు.→ పరీక్ష కేంద్రాలు, పరీక్షార్థుల తనిఖీ, బయోమెట్రిక్ నమోదు, భద్రతా ప్రమాణాలు, సీట్ల కేటాయింపు, ప్రశ్నపత్రాల కూర్పు, పేపర్ల లోడింగ్, ఇని్వజిలేషన్లకు సంబంధించి కొత్త నిబంధనలు,ప్రమాణాల రూపకల్పనకు సంబంధించి బిల్లులో ప్రతిపాదనలుచేశారు→ పేపర్ లీక్ చేయడం, ఓఎంఆర్ షీట్ ట్యాంపరింగ్, నకిలీ వెబ్సైట్ల రూపకల్పన, నకిలీ ఐడీ కార్డులను జారీచేయడం ఇలా 15 అనైతిక చర్యలను నేరాలుగా పేర్కొన్నారు. నేడు చర్చ! వరసబెట్టి వాయిదాలపర్వంతో ముగుస్తున్న లోక్‌సభ సెషన్లో తొలిసారిగా మంగళవారం సుదీర్ఘ చర్చ జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) చట్ట సవరణ బిల్లు–2026 ను మంగళవారం లోక్‌సభో చర్చించనున్నారు. చర్చ కోసం అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను స్పీకర్ బిర్లా ఒప్పించడంతో చర్చ సాధ్యంకానుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సభలో బిల్లుపై ఏడు గంటలపాటు చర్చించే వీలుంది. -
కోచింగ్ కేంద్రాల కథేంటి?
సాక్షి, హైదరాబాద్ : ప్రైవేటు కోచింగ్ సెంటర్లపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెట్టింది. ఆ కేంద్రాల సమగ్ర వివరాలు సేకరిస్తోంది. రాష్ట్రాల నుంచీ నివేదికలు కోరింది. ముఖ్యంగా నీట్, జేఈఈ కోచింగ్ కేంద్రాలపైనే ఎక్కువ దృష్టి పెట్టాలని సూచించింది. నీట్ పేపర్ లీక్ వ్యవహారం జాతీయ స్థాయిలో కుదిపేయడంతో లీక్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ మొదలు పెట్టాయి. ఈ క్రమంలో కోచింగ్ కేంద్రాల పాత్ర ఉందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిఘా వర్గాలు ఇచ్చిన ఈ సమాచారంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మూలాల్లోకి వెళ్లి దర్యాప్తు చేయాలని భావిస్తునట్టు తెలుస్తోంది. కేంద్రం కోరిన వివరాల సేకరణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్రానికి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇప్పటికే ప్రాథమిక సమాచారం సేకరించామని, మరింత లోతుగా వివరాలు రాబట్టే ప్రయత్నంలో ఉన్నట్టు చెప్పారు. రూ. 62 వేల కోట్ల వ్యాపారం.. దేశవ్యాప్తంగా 7 కోట్లకుపైగా విద్యార్థులు ఏదో రకమైన కోచింగ్ తీసుకుంటున్నారు. ఇందులో ఒకటవ తరగతి నుంచి పోస్టు–గ్రాడ్యుయేషన్, నీట్, జేఈఈ వంటి ప్రొఫెషనల్ కోర్సుల పరీక్షలకు కోచింగ్ తీసుకునే వాళ్లున్నారు. కొన్ని సంస్థలు ఆన్లైన్లో, మరికొన్ని ఆఫ్‌లైన్‌లో కోచింగ్ వ్యాపారం చేస్తున్నాయి. వీటి వ్యాపారం రూ. 62 వేల కోట్ల వరకూ ఉంటుందని కేంద్రం జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. మరో రెండేళ్లలో ఈ వ్యాపార సామ్రాజ్యం రెండింతలు పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ సహా పలు రాష్ట్రాల బోర్డ్ పరీక్షలకు, జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్, నీట్ వంటి పోటీ పరీక్షలకు కోచింగ్ కేంద్రాలే కీలకం. వీటితో పాటు వృత్తిపరమైన సీఏ, సీఎస్, క్యాట్, గేట్‌కూ కోచింగ్ షరామామూలే. యూపీఎస్సీ, రైల్వే, బ్యాకింగ్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు కోచింగ్ కేంద్రాలే శరణ్యం. ఈ నేపథ్యంలో కోచింగ్ కేంద్రాల మధ్య విపరీతమైన పోటీ వాతావరణం నెలకొంటోంది. లీకుల వెనుక లాలూచీ..: కోచింగ్ కేంద్రాలకు విద్యార్థుల ర్యాంకులే పెద్ద ప్రచార సాధనం. ఈ పబ్లిసిటీ కోసం అవి ఎంత దూరమైనా వెళ్తున్నాయనేది నిఘా వర్గాల సమాచారం. ఈ క్రమంలో పరీక్ష విధానంలో కీలక భూమిక పోషిస్తున్న ప్రభుత్వ సంస్థల్లోని వారిని లోబర్చుకుంటున్నాయి. వారి ద్వారానే పేపర్ లీక్‌లకు తెర తీస్తున్నాయి. ఇండియాటుడే గత ఏడాది నిర్వహించిన సర్వే ప్రకారం 2019 నుంచి 2024 వరకూ 19 రాష్ట్రాల్లో 65 ప్రధాన పరీక్షల్లో పేపర్ లీక్ అయిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రతి ఘటన వెనుక కోచింగ్ కేంద్రాల ప్రమేయం ఉన్నట్టు దర్యాప్తు సంస్థలు ప్రాథమికంగా నిర్థారించాయి. పూర్తి స్థాయి విచారణలో మాత్రం సాక్ష్యాలను తారుమారు చేయడంలో, కీలక సాక్ష్యాలు దర్యాప్తు సంస్థల చేతికి అందకుండా చేయడంలో కోచింగ్ కేంద్రాలు విజయం సాధిస్తున్నాయి.ఫలితంగానే దర్యాప్తు ముందుకు కదలడం లేదు. పూర్వాపరాలే ఆధారమా? రాష్ట్రాలను కేంద్రం పలు అంశాలపైవివరాలు కోరింది. కోచింగ్ కేంద్రాల్లో చేరుతున్నవాళ్ల డేటాను విశ్లేషించాలని సూచించింది. ఎంతమంది చేరుతున్నారు? ఎంత చెల్లిస్తున్నారు? వాళ్లు ఏయే ర్యాంకులు సాధిస్తున్నారు? పేపర్ లీక్ ఆరోపణలు వచ్చిన సంవత్సరాల్లో ప్రధాన ర్యాంకులు పొందిన వారి వివరాలు ఏమిటి? వాళ్ల అకడమిక్ బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అనే వివరాలు కోరింది. దీనిద్వారా అకడమిక్‌గా మార్కులు తక్కువ వచ్చినా, కోచింగ్ ద్వారా ర్యాంకులు ఎలా వచ్చాయనే కోణంలో దర్యాప్తు చేయాలనేది కేంద్రం ఆలోచన. దీంతోపాటు కోచింగ్ కేంద్రాల యజమానుల ఆర్థిక లావాదేవీలపై దృష్టి పెడుతున్నారు. ఎన్ని సంవత్సరాల్లో ఎన్ని కోట్లు సంపాదించారనేది తెలుసుకుంటారు. దీంతో పాటు సర్వర్ల ద్వారా పరీక్ష సమయంలో కోచింగ్ కేంద్రాలు పంపిన సందేశాలు.. పత్రాలను విశ్లేషించాలని కేంద్రం సూచిస్తోంది. మరోవైపు కోచింగ్ కేంద్రాలు నిర్వహిస్తున్న వ్యక్తులు, వాళ్ల నేపథ్యంపై కూడా వివరాలు కోరింది. -
నీట్ కంటే పెద్ద సమస్య... డీలిమిటేషన్!
దేశమంతా ఈరోజు నీట్, పేపర్ లీకులు, విద్యార్థుల ఆందోళనలు, రాజకీయ విమర్శల గురించే మాట్లాడుతోంది. ఇవన్నీ చిన్న విషయాలు కావు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ప్రతి అంశం ప్రధానమైనదే. కానీ ఒక ప్రశ్న మనమందరం వేసుకోవాలి. దేశ రాజకీయాల భవిష్యత్తును, బహుజన సమాజం రాజకీయ వాటాను, దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యాన్ని రాబోయే యాభై సంవత్సరాల పాటు నిర్ణయించబోయే అంశం నీటా? లేక డీలిమిటేషన్, మహిళల రిజర్వేషన్, కులగణనా? ఈ ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెబితే, అసలు జాతీయ చర్చ జరగాల్సింది పార్లమెంట్ ముందుకు రానున్న ఈ రాజ్యాంగ సంబంధిత అంశాల గురించే అని అర్థమవుతుంది.దక్షిణాది రాష్ట్రాల ఆందోళనప్రజల దృష్టి ఒకవైపు మళ్లిన సమయంలో మరోవైపు దేశ రాజకీయ నిర్మాణాన్ని ప్రభావితం చేసే నిర్ణయాలు నిశ్శబ్దంగా ముందుకు సాగడం భారత రాజకీయాల్లో కొత్త విషయం కాదు. అందుకే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బహుజన సమాజం మరింత లోతుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నియోజక వర్గాల పునర్విభజనను చాలామంది కేవలం సరిహద్దులు మార్చే సాంకేతిక ప్రక్రియగా భావిస్తారు. వాస్తవానికి అది రాజకీయ అధికా రాన్ని తిరిగి పంచే ప్రక్రియ. రాజ్యాంగంలోని 81, 82, 170 అధికర ణాల ప్రకారం జనాభా ఆధారంగా లోక్‌సభ, శాసనసభ స్థానాలను పునర్విభజన చేయాలి. 1976లో వచ్చిన 42వ రాజ్యాంగ సవరణ, 2001లో వచ్చిన 84వ రాజ్యాంగ సవరణల కారణంగా ఈ ప్రక్రి యను 2026 తర్వాతి జనగణన వరకు వాయిదా వేశారు. ఇప్పుడు ఆ గడువు ముగుస్తోంది.ఇక్కడే దక్షిణాది రాష్ట్రాల ఆందోళన మొదలవుతోంది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ, ప్రజారోగ్యం, విద్య రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచాయి. అదే కారణంగా వాటిలో జనాభా పెరుగుదల తగ్గింది. ఇప్పుడు జనాభానే ప్రధాన ప్రమాణమైతే, ఈ రాష్ట్రాల లోక్‌సభ ప్రాతినిధ్యం సాపేక్షంగా తగ్గి, ఉత్తర భారత రాష్ట్రాల ప్రాధాన్యం పెరుగుతుంది. దేశ ప్రయోజనం కోసం అమలు చేసిన విధానాల ఫలితంగా రాజకీయంగా నష్టపోవడం సమంజసమా అనే ప్రశ్నకు దేశం సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది.కులగణనే కీలకంఇదే సమయంలో మహిళల రిజర్వేషన్ అంశాన్ని కూడా విడిగా చూడలేం. మహిళలకు శాసనసభల్లో, పార్లమెంటులో ఎక్కువ ప్రాతి నిధ్యం రావాలనే లక్ష్యాన్ని దేశంలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు సమర్థిస్తున్నాయి. అయితే మరో ప్రశ్నను విస్మరించకూడదు. ఆ స్థానాల్లో ఎవరు గెలుస్తారు? ఇప్పటికే రాజకీయ, ఆర్థిక, సామాజికంగా బలంగా ఉన్న వర్గాలకు చెందిన మహిళలే అధికంగా ఎన్ని కయ్యే పరిస్థితి ఏర్పడితే– బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రైస్తవ మహిళలకు నిజమైన అవకాశాలు ఎంతవరకు లభిస్తాయి? అందుకే బీసీ సంఘాలు చాలాకాలంగా మహిళల రిజర్వేషన్లో ఓబీసీ మహిళలకు ప్రత్యేక వాటా ఉండాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం కనిపించడం లేదు.ఈ చర్చలో కులగణన కీలకమైన అంశంగా మారుతుంది.దేశంలో పేదరికం లెక్కలు ఉన్నాయి. నిరుద్యోగం లెక్కలు ఉన్నాయి. రైతుల గణాంకాలు ఉన్నాయి. కానీ వివిధ సామాజిక వర్గాల నిజమైన జనాభా ఎంత అన్న సమాచారం లేకుండానే రాజకీయ ప్రాతినిధ్యాన్ని ఎలా పునర్నిర్మించగలం? అందుకే అనేక సామాజిక న్యాయ ఉద్యమాలు ముందుగా కులగణన, తరువాత డీలిమిటేషన్ అనే క్రమాన్ని సూచిస్తున్నాయి. సుప్రీంకోర్టు కూడా పలు తీర్పుల్లో సామాజిక న్యాయానికి సంబంధించిన నిర్ణయాలు గణాంక ఆధారాలపై ఉండాలని పేర్కొంది.డీలిమిటేషన్, మహిళల రిజర్వేషన్, కులగణన – ఈ మూడు అంశాలు విడివిడిగా కనిపించినా వాస్తవానికి అవి ఒకే గొలుసులోని మూడు కడియాలు. ముందుగా కులగణన, తరువాత డీలిమిటేషన్, ఆ తరువాత మహిళల రిజర్వేషన్ అమలు జరిగితేనే సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయం జరిగే అవకాశముందని అనేక సామాజిక న్యాయవాదులు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో రాజకీయ ప్రశ్న కూడా ముందుకు వస్తోంది. దేశవ్యాప్తంగా ప్రజల దృష్టి నీట్ వంటి తక్షణ సమస్యలపై కేంద్రీకృతమవుతున్న సమయంలో, రాజ్యాంగపరంగా అత్యంత కీలకమైన డీలిమిటేషన్, మహిళల రిజర్వేషన్, కులగణన వంటి అంశాలపై తగినంత ప్రజా చర్చ జరుగుతోందా? దీనిపై భిన్నాభి ప్రాయాలు ఉండవచ్చు. కొందరు ఒకేసారి రెండు అంశాలపై పోరాటం చేయవచ్చని చెబుతారు. మరికొందరు తక్షణ రాజకీయ అంశాలు దీర్ఘకాల రాజ్యాంగ చర్చలను వెనక్కి నెట్టే ప్రమాదం ఉందని వాదిస్తారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది ప్రజలే. కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, జాతీయ ఉద్యమాలు తమ ప్రాధాన్య క్రమంలో దక్షిణాది రాష్ట్రాల ప్రత్యేక ఆందోళనలకు తగిన స్థానం ఇవ్వకపోవచ్చు. ఇది ఒక రాజకీయ విశ్లేషణ మాత్రమే; దీనిపై విస్తృత ప్రజాస్వామ్య చర్చ అవసరం.అడగాల్సిన ప్రశ్నలునీట్లో అవకతవకలు జరిగితే మళ్లీ పరీక్ష నిర్వహించవచ్చు. ఒక మంత్రి రాజీనామా చేయవచ్చు. ఒక ప్రభుత్వం ఎన్నికల్లో ఓడి పోవచ్చు. కానీ డీలిమిటేషన్ ద్వారా లోక్‌సభలో రాష్ట్రాల ప్రాతి నిధ్యం మారితే, మహిళల రిజర్వేషన్ అమలు వల్ల రాజకీయ నాయకత్వ నిర్మాణం మారితే, వాటి ప్రభావం ఒక్క ఎన్నికతో ముగిసి పోదు. అది తరతరాల పాటు కొనసాగుతుంది. అందుకే ఈరోజు దేశం ముందు ఉన్న అసలు ప్రశ్న నీట్ కాదు; భారత ప్రజాస్వామ్యంలో రాజకీయ ప్రాతినిధ్యం ఎలా ఉండాలి అన్నదే.భారత రాజ్యాంగ పీఠిక సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ప్రతి పౌరుడికి హామీ ఇస్తుంది. ఆ న్యాయం కేవలం ఎన్నికలు జరగడంలో కాదు; సమాజంలోని అన్ని వర్గాలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం ఉండటంలో ఉంది. అందుకే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు, క్రైస్తవులు, ఇతర బహుజన వర్గాలు మూడు ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం కోరాలి: ముందు కులగణన జరుగుతుందా? డీలిమిటేషన్‌కు ఏ ప్రమాణాలు అమలు చేస్తారు? మహిళల రిజర్వేషన్లో బహుజన మహిళలకు న్యాయమైన ప్రాతినిధ్యం ఎలా కల్పిస్తారు?దేశ రాజకీయాల దిశను మార్చేది ప్రతిరోజూ వార్తల్లో కనిపించే వివాదాలు కావు. రాజ్యాంగంలో జరిగే మార్పులే. అందుకే బహుజన సమాజం ఈ చారిత్రక దశలో అప్రమత్తంగా ఉండాలి. రేపటి తరాల రాజకీయ భవిష్యత్తు ఈరోజు తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. నేడు మనం ఏ ప్రశ్నలు అడుగుతున్నా మన్నదే రేపటి భారత ప్రజాస్వామ్య స్వరూపాన్ని నిర్ణయిస్తుంది.డా‘‘ జె.పూర్ణచంద్ర రావువ్యాసకర్త ఐపీఎస్(రిటైర్డ్), మాజీ డీజీపీ; జాతీయ కోఆర్డినేటర్ ఏపీ– తెలంగాణ, అల్ ఇండియా బీఎస్పీ -
అసలు సమస్య NEET కాదు.. ఆర్జీవీ సంచలన ట్వీట్!
విద్యారంగంలో ప్రస్తుతం అనేక సమస్యలు కనిపిస్తున్నాయి. ఎగ్జామ్ పేపర్ లీక్స్, పరీక్షల రద్దు, విద్యార్థుల ఒత్తిడి, ఆత్మహత్యలు వంటి అంశాలు తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. ఇవన్నీ.. విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. ఈ తరుణంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) సంచలన ట్వీట్ చేశారు. ప్రస్తుత సమస్య నీట్ (NEET) కాదు, అసలు సమస్య ఏఐ (AI) అని పేర్కొన్నారు.విద్య అంటే..గతంలో విద్య అంటే.. ఒక వ్యక్తికి అవసరమైన జ్ఞానాన్ని అందించి, ఉద్యోగానికి సిద్ధం చేయడం. డాక్టర్, ఇంజనీర్, లాయర్ వంటి వృత్తులకు కావాల్సిన విషయాలను నేర్చుకుని, ఒక స్థిరమైన జీవితాన్ని గడపడం అనేది చాలామంది లక్ష్యంగా పెట్టుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు వేగంగా మారుతున్నాయి.ఒకప్పుడు సమాచారం పొందడం కష్టంగా ఉండేది. పుస్తకాలు, ఉపాధ్యాయులు, అనుభవజ్ఞుల ద్వారా మాత్రమే జ్ఞానం లభించేది. కానీ ఈ రోజు ఏదైనా సమాచారం కావాలంటే.. ఇంటర్నెట్, ఏఐ వంటి వాటిమీద ఆధారపడుతున్నారు. పెరిగిన టెక్నాలజీ కారణంగా.. ప్రపంచంలోని సమాచారం మన చేతుల్లోకి వచ్చేసింది. అయితే ఈ సమాచారంలో నిజమైన అంశాలు మాత్రమే కాకుండా.. తప్పుడు సమాచారం కూడా ఉంటుందని ఆర్జీవీ పేర్కొన్నారు.పుస్తక జ్ఞానం మాత్రమే సరిపోదుఏఐ అనేది కేవలం సమాచారాన్ని అందించడానికి మాత్రమే కాకుండా.. మనుషులు చేసే అనేక పనులను వేగంగా చేయగల స్థాయికి చేరుకుంటోంది. రాయడం, విశ్లేషించడం, కోడింగ్ చేయడం, డిజైన్ చేయడం వంటి పనుల్లో ఏఐ దూసుకెళ్తోంది. దీంతో భవిష్యత్తులో విద్యార్థులకు కేవలం పుస్తక జ్ఞానం మాత్రమే సరిపోదనే అభిప్రాయం బలపడుతోంది. దీన్నిబట్టి చూస్తే రానున్న రోజుల్లో ఏఐ తీవ్రత ఎలా ఉంటుందో అంచనా వేయడం చాలా కష్టమవుతుంది.NEET is not the issue A I isNEET leaks, cancelled exams, student suicides might leave bodies on the floor and parents screaming which might seem brutal in the way the system is being injuredAI does not wound the system.It rips its throat out.For centuries education had one…— Ram Gopal Varma (@RGVzoomin) July 27, 2026అందుకే.. విద్యార్థులు పుస్తక జ్ఞానంతో పాటు.. కొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకునే సామర్థ్యాన్ని పెంచుకోవాలని రామ్ గోపాల్ వర్మ అన్నారు. ఒకప్పుడు బాగా చదువు.. మంచి ఉద్యోగం సంపాదించు.. జీవితాంతం భద్రంగా ఉండు అనే ధోరణి ఉండేది. కానీ ఏఐ యుగంలో ఎప్పుడు ఉద్యోగం పోతుందో కూడా తెలియదు.ఉద్యోగాలు పోతాయా?ఇంజనీరింగ్, మెడిసిన్, లా, సీఏ, ఎంబీఏ వంటి కోర్సులు చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తుపై కూడా చర్చ జరుగుతోంది. ఏఐ వల్ల కొన్ని పనులు ఆటోమేట్ అయ్యే అవకాశం ఉంది. అయితే దీని అర్థం ఈ రంగాల్లో ఉన్న ఉద్యోగాలు పూర్తిగా పోతాయని కాదు. కానీ ఆ రంగాల్లో పనిచేసే విధానం మారుతుంది. ఏఐని తమకు అనుకూలంగా ఉపయోగించుకునే వారికి ఎక్కువ అవకాశాలు లభించే అవకాశం ఉంది.ఈ మార్పులను దృష్టిలో పెట్టుకుని విద్యా వ్యవస్థ కూడా మారాల్సిన అవసరం ఉంది. విద్యార్థులకు ఏఐని ఎలా ఉపయోగించాలి, దానితో కలిసి ఎలా పని చేయాలి, సరైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలి వంటి నైపుణ్యాలను తప్పకుండా నేర్పించాలి. తల్లిదండ్రులు కూడా పిల్లల భవిష్యత్తును కేవలం ర్యాంకులు, మార్కులు, డిగ్రీలతో మాత్రమే అంచనా వేయకుండా, వారు మారుతున్న ప్రపంచానికి ఎంతగా సిద్ధంగా ఉన్నారో చూడాలి.ఇదీ చదవండి: కియోసాకి వ్యూహం.. రియల్ ఎస్టేట్‌లోకి ఎంట్రీ! -
విద్యాశాఖ మంత్రులు రాజీనామా చేయాలి.. ఇన్ని రాష్ట్రాల్లో నిరసనలు
కేంద్ర విద్యామంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు విద్యార్థి సంఘాలు పంజాబ్, ఝార్ఖండ్, కేరళ, కర్ణాటక రాష్ట్రాల విద్యామంత్రులు రాజీనామా చేయాలన్న డిమాండ్‌ను మరింత ముందుకు తీసుకెళ్తున్నాయి. ప్రశ్నపత్రం లీక్ అంశం ఒక్క పరీక్షకే లేదా ఒక్క రాష్ట్రానికే పరిమితం కాలేదు. రాష్ట్ర స్థాయిలో జరిగే ఎన్నో పరీక్షలతో ఈ విషయం ముడిపడి ఉంది. ఈ నేపథ్యంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రశ్నపత్రం లీక్ అంశంపై నిరసనలు కొనసాగుతున్నాయి.లక్నోలోని విశ్వవిద్యాలయాల విద్యార్థులు భారీ నిరసన చేపట్టనున్నట్లు ప్రకటించారు. ప్రశ్నపత్రం లీక్ ఘటనల్లో బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యామంత్రి రాజీనామా చేశారని, ఇలాంటి ఆరోపణలు వచ్చిన రాష్ట్రాల్లో కూడా విద్యాశాఖ మంత్రులు అదే విధంగా బాధ్యత వహించి, వారు కూడా తమ పదవులకు రాజీనామా చేయాలని నిరసనకారులు అంటున్నారు.పంజాబ్‌లో రెండుసార్లు నిర్వహించిన ప్రభుత్వ నియామకాల అంశంపై కూడా రాజకీయ వేడి పెరిగింది. పంజాబ్‌లో కాంగ్రెస్, బీజేపీ, శిరోమణి అకాలి దళ్ పార్టీలు భగవంత్ మాన్ ప్రభుత్వాన్ని ప్రశ్నాపత్రం లీక్ అంశంపై నిలదీస్తున్నాయి.పంజాబ్‌లో వరుసగా పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అవుతున్నాయని, హైటెక్ పద్ధతిలో అక్రమాలు జరుగుతున్నాయని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. రాష్ట్రంలో ఎలాంటి ప్రశ్నపత్రం లీక్ జరగలేదని, సమయానికి నకలు మాఫియాను బయటపెట్టామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఫార్మసీ విభాగం, వ్యవసాయ శాఖకు చెందిన రెండు కేసుల చుట్టూనే ఈ వివాదం కొనసాగుతోంది. ఈ కేసుల వల్ల పంజాబ్ ప్రభుత్వంపై విమర్శలు పెరుగుతున్నాయి.ఫార్మసీ ఆఫీసర్ పరీక్ష: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 454 ఫార్మసీ ఆఫీసర్ల నియామకానికి ఇటీవల బాబా ఫరీద్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నిర్వహించిన పరీక్షలో సుమారు 7,000 మంది అభ్యర్థులు పాల్గొన్నారు. పరీక్ష ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే స్పెషల్ కౌంటర్ ఇంటెలిజెన్స్, పోలీసుల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఫరీద్కోట్, ఫిరోజ్‌పూర్, కోట్ కపూరా పరీక్ష కేంద్రాలపై దాడులు చేశాయి.ఈ ఘటనలో 28 మంది అభ్యర్థులతో పాటు మొత్తం 35 మందిని అదుపులోకి తీసుకున్నారు. అభ్యర్థులు తలపాగా, సాక్స్, లోదుస్తుల్లో చిన్న బటన్లు, వైర్లెస్ బ్లూటూత్ పరికరాలు దాచుకుని వచ్చారు. ఫిరోజ్‌పూర్‌లోని ఒక పరీక్ష కేంద్రం నుంచి పెన్ కెమెరాతో ప్రశ్నపత్రాన్ని స్కాన్ చేసి వాట్సాప్ ద్వారా బయటకు పంపారు. అక్కడ హరియాణా, రాజస్థాన్ నుంచి నిర్వహిస్తున్న కంట్రోల్ రూమ్ ద్వారా అభ్యర్థులకు సమాధానాలు చెబుతున్నారు.ఈ ముఠా ఒక్కో అభ్యర్థి నుంచి 3.5 లక్షల నుంచి 13 లక్షల రూపాయలు వసూలు చేస్తోందని సమాచారం. దీన్ని నేరుగా ప్రశ్నపత్రం లీక్, వ్యవస్థ వైఫల్యంగా పేర్కొంటూ రాష్ట్ర ఆరోగ్యమంత్రి, విద్యామంత్రి రాజీనామా చేయాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తోంది. ఇది పరీక్షకు ముందు జరిగిన ప్రశ్నపత్రం లీక్ కాదని, పరీక్ష ప్రారంభమైన తర్వాత రియల్ టైమ్‌లో జరిగిన హైటెక్ లీక్ అని, దాన్ని సమయానికి గుర్తించి అడ్డుకున్నామని పంజాబ్ పోలీసులు, అధికారులు చెబుతున్నారు.వ్యవసాయ అభివృద్ధి అధికారి నియామక పరీక్షలో వివాదంవ్యవసాయ, రైతు సంక్షేమ శాఖలో వ్యవసాయ అభివృద్ధి అధికారి నియామక పరీక్షపై చాలా కాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ పరీక్ష ప్రశ్నపత్రం ముందుగానే లీక్ అయిందని ప్రతిపక్షం, ముఖ్యంగా శిరోమణి అకాలి దళ్, కాంగ్రెస్ ఆరోపిస్తున్నాయి. పంజాబ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఈ పరీక్షలో ప్రశ్నపత్రం సెట్లు లీక్ అయ్యాయని, తర్వాత విషయాన్ని దాచిపెట్టేందుకు అసాధారణంగా గ్రేస్ మార్కులు ఇచ్చారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ పరీక్షపై పారదర్శక విచారణ జరిపి, మళ్లీ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ పట్టభద్రులు, యువ అభ్యర్థులు నిరసనలు చేపట్టారు. ఇవేగాక, పలు రాష్ట్రాల్లో ప్రశ్నపత్రాల లీకేజీలు జరిగాయి. ఆయా రాష్ట్రాల్లోనూ విద్యా శాఖ మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. -
'నీట్' వైరల్ గర్ల్.. ఇన్ స్టాతో రూ.10 లక్షల సంపాదనా?
నీట్ పేపర్ లీకేజీ విషయమై కొన్నిరోజుల క్రితం వరకు దేశవ్యాప్తంగా ఎంతలా విద్యార్థి నిరసనలు జరిగాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ ప్రధాన్ రాజీనామా చేయడంతో అంతా సద్దుమణిగింది. అయితే గత బుధవారం ముంబైలో నిరసన జరుగుతున్న టైంలో పోలీస్ వ్యాన్ని అడ్డుకుని ఓ అమ్మాయి తెగ వైరల్ అయిపోయింది. ఆమెనే రియా యాదవ్. ఈమె నటి, మోడల్ అయిన ఈమె వైరల్ ఫొటోని సెలబ్రిటీలు కూడా షేర్ చేశాడు. అయితే తనకొచ్చిన ఫేమ్‌ని క్యాష్ చేసుకునేందుకు ఇన్‌స్టాలో సబ్స్క్రిప్షన్ మొదలుపెట్టిందని, ఏకంగా రూ.10 లక్షల వరకు సంపాదించేసిందని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. ఈ వ్యాఖ్యలు ఆమె చెవినపడేసరికి ఘాటుగా స్పందించింది.(ఇదీ చదవండి: నటుడు చనిపోయిన 16 ఏళ్లకు సొంతింటి కల సాకారం)'ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ ద్వారా నేను ఎలాంటి ఆదాయం పొందలేదు. చెప్పాలంటే ఇప్పటికే వచ్చిన ఆదాయాన్ని స్వీకరించేందుకు నా బ్యాంక్ ఖాతాని కూడా ఇన్ స్టాకి కనెక్ట్ చేయలేదు. నిజాలు తెలుసుకోకుండా నాపై విమర్శలు చేస్తున్నవారు.. జీవితంలో ఏదైనా సాధించకుండా ఇతరులపై ఆరోపణలు చేయడం సులభమే. నాపై విమర్శలు చేస్తున్న వారిలో ఒక్కరూ నాతో ప్రత్యక్షంగా మాట్లాడలేదు. ఎలాంటి పరిచయం కూడా లేదు''ఈ విషయంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. నాపై లేదా మరెవరిపైనా నెగిటివ్, సైబర్ వేధింపులకు సంబంధించిన పోస్టులు కనిపిస్తే వాటిని రిపోర్ట్ చేయండి. పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతే ఓ అభిప్రాయం ఏర్పరుచుకోండి. పౌరుల హక్కుల కోసం నిలబడటంతో పాటు తోటి పౌరుల పట్ల బాధ్యతతో వ్యవహరించడం కూడా అంతే ముఖ్యం. నేను తీసుకున్న వైఖరి ఉద్దేశం అదే. సత్యమేవ జయతే' అని రియా యాదవ్ పోస్ట్ పెట్టింది.రియా యాదవ్ ఎవరు?రియా యాదవ్ నిరసనకారిణి మాత్రమే కాదు. నటి, మోడల్, వ్యాపారవేత్తగా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. ఈమె సోషల్ మీడియా ప్రొఫైల్ ప్రకారం.. మ్యూజిక్ వీడియోల్లో నటించింది. చేతితో తయారు చేసే దుస్తుల కోసం 'రిహియాసత్' పేరుతో ఓ వ్యక్తిగత బ్రాండ్ కూడా నిర్వహిస్తోంది. మొన్నటివరకు రూ.140 నెలవారీ రుసుముతో సబ్స్క్రిప్షన్ ఉంచిన ఈమె.. ఇప్పుడు విమర్శలు రావడంతో దానిని పూర్తిగా తొలగించింది.(ఇదీ చదవండి: చెన్నైలో 'జన నాయగన్' షోలకు బ్రేక్.. కారణమేంటంటే?) View this post on Instagram A post shared by ʀʜɪʏᴀ ʏᴀᴅᴀᴠ (@rhiyaahir) -
పరిష్కారమా... కొత్త సవాలా?
2026 ‘నీట్’ ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలు దేశవ్యాప్తంగా ఆందో ళనకు దారితీశాయి. ఫలితంగా పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది నుంచి నీట్‌ను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)గా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే ప్రశ్నాపత్రాన్ని కాగితం నుంచి కంప్యూ టర్కు మార్చడమే సమస్యకు శాశ్వత పరిష్కారం కాదని గుర్తించాలి. అసలు సమస్య పరీక్షా విధానంలో కాదు, ప్రశ్నపత్రాల గోప్యత, భద్రత, జవాబుదారీతనం వంటి వ్యవస్థాగత లోపాల్లో ఉంది. అంతర్జాతీయ అనుభ వాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.ప్రపంచంలోనే అతిపెద్ద ప్రవేశ పరీక్షలలో ఒకటైన చైనా గావ్కావ్, దక్షిణ కొరియా సీఎస్ఏటీ ఇప్పటికీ పేపర్–పెన్సిల్ విధానంలోనే అత్యంత కట్టు దిట్టమైన భద్రతతో విజయవంతంగా నిర్వహిస్తున్నాయి. దీనివల్ల పరీక్షా విధానం కంటే పటిష్టమైన భద్రతా వ్యవస్థ, పారదర్శకత, క్రమశిక్షణే విశ్వస నీయ పరీక్షలకు పునాది అని స్పష్టమవుతోంది. నీట్‌ను కంప్యూటర్ ఆధారిత పరీక్షగా నిర్వహిస్తే, కోట్లాది మంది విద్యార్థులను ఒకే సమయంలో పరీక్షించడం సాధ్యం కాదు. అందువల్ల బహుళ షిఫ్టులు తప్పనిసరి అవుతాయి. జేఈఈ మెయిన్‌లో కనిపించినట్లుగా వివిధ షిఫ్టుల్లో ప్రశ్న పత్రాల క్లిష్టతలో తేడాలు రావడం, నార్మలైజేష¯Œ పై వివాదాలు తలెత్తడం వల్ల సమాన ప్రతిభ కలిగిన విద్యార్థులకు కూడా అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల శాట్, జీఆర్ఈ వంటి పరీక్షల్లో ఉపయోగించే ఐటమ్ రెస్పాన్స్ థియరీ వంటి శాస్త్రీయ మనో కొలమాన పద్ధతులను అధ్యయనం చేసి అమలు చేయడం మరింత సముచితం.కంప్యూటర్ ఆధారిత పరీక్షల్లో మరో ప్రధాన సవాలు డిజిటల్ అంతరం. పట్టణ విద్యార్థులతో పోలిస్తే గ్రామీణ, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల విద్యార్థులకు కంప్యూటర్ వినియోగం, ఆన్లైన్ పరీక్షల అనుభవం తక్కువగా ఉండే అవకాశం ఉంది. వైద్య విద్య వంటి అత్యంత కీలకమైన ప్రవేశ పరీక్షలో సాంకేతిక పరిజ్ఞాన పరిచయం విద్యార్థి ప్రతిభను ప్రభావితం చేయకూడదు. కాబట్టి ఆన్లైన్ విధానాన్ని అమలు చేయాలంటే ముందుగా దేశవ్యాప్తంగా సమాన డిజిటల్ మౌలిక సదుపాయాలు, శిక్షణ, మాక్ పరీక్షలు అందుబాటు లోకి తీసుకురావడం అత్యవసరం. పరీక్షపై నమ్మకాన్ని పునరుద్ధరించడం. ప్రశ్నాపత్రాల భద్రతను అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లడం, లీకేజీలకు పాల్పడిన వారిపై వేగంగా కఠిన చర్యలు తీసుకోవడం, అత్యవసరం. కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన పరీక్షల్లో సంస్కరణలు హడా వుడిగా కాకుండా సమగ్ర ప్రణాళికతో చేపట్టాల్సిన అవసరం ఉంది.– ఏటూరి శేఖర్ శర్మ, విశ్రాంత జిల్లా విద్యాశాఖాధికారి -
ఆగని ‘నీట్’ బలవన్మరణాలు.. జాబితాలో..
న్యూఢిల్లీ: ‘నీట్ యూజీ’పేపర్ లీక్, పరీక్షా విధానంలోని లోపాల కారణంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేద్ర ప్రధాన్ రాజీనామా చేయగా, సమస్యల పరిశీలన కోసం ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేశారు. అయితే, పరీక్షా వివాదాలు, మానసిక ఒత్తిడి కారణంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్న విషాదకర ఘటనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మహారాష్ట్రలోని అహిల్యానగర్‌కు చెందిన అంకితా సాంగ్లే అనే విద్యార్థిని రీ ఎగ్జామ్‌లో తక్కువ మార్కులు రావడంతో, మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఇదే రకమైన మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్న పలువురు విద్యార్థుల వివరాలు ఇలా ఉన్నాయి.ప్రదీప్ మేఘవాల్ (రాజస్థాన్): జుంఝును జిల్లాకు చెందిన 22 ఏళ్ల ఈ యువకుడు, మే 2026లో నీట్ యూజీ పరీక్ష రద్దు కావడంతో సీకర్‌లో ఆత్మహత్య చేసుకున్నారు.ఋతిక్ మిశ్రా (ఉత్తర ప్రదేశ్): లఖింపూర్ ఖేరీకి చెందిన 21 ఏళ్ల ఈ విద్యార్థి, పరీక్షలో గందరగోళం, మానసిక ఒత్తిడి కారణంగా బలవన్మరణానికి పాల్పడ్డారు.సిద్దార్థ్ హెగ్డే (గోవా): 17 ఏళ్ల ఈ విద్యార్థి మే 2026లో నీట్ పరీక్ష రద్దయిన తర్వాత తీవ్ర మనోవేదనతో ప్రాణాలు తీసుకున్నారు.భాగ్యశ్రీ (కర్ణాటక): కలబుర్గికి చెందిన 18 ఏళ్ల ఈ విద్యార్థిని పీయూసీ బోర్డు పరీక్షలో 92 శాతం మార్కులు సాధించినప్పటికీ, నీట్ ఆందోళనలతో మే 2026లో బలవన్మహత్వానికి పాల్పడ్డారు.అంశిక పాండే (ఢిల్లీ): ఆదర్శ్ నగర్ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల ఈ పరీక్షార్థిని మానసిక ఒత్తిడి కారణంగా ప్రాణాలు విడిచిపెట్టారు.ఉమేష్ మాలీ(రాజస్థాన్): సీకర్‌లో నీట్ ప్రిపరేషన్ చేస్తున్న ఈ 22 ఏళ్ల యువకుడు జూన్ 15న ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నారు.రేణు మీణా (రాజస్థాన్): అన్వర్ జిల్లాకు చెందిన 18 ఏళ్ల ఈ ప్రతిభావంతురాలైన విద్యార్థిని జూన్ 2026లో నీట్ వివాదాల కారణంగా ప్రాణాలు తీసుకున్నారు.రియా కుమారి థాపా (ఉత్తరాఖండ్): డెహ్రాడూన్‌కు చెందిన 23 ఏళ్ల ఈ అభ్యర్థి జూన్ 2026లో పేపర్ లీక్ ఆందోళనలతో ఆత్మహత్యకు పాల్పడ్డారు.శివానీ యాదవ్ (ఉత్తర ప్రదేశ్): లక్నోకు చెందిన 17 ఏళ్ల విద్యార్థిని పరీక్ష రద్దు, వివాదాలతో ఆత్మహత్య చేసుకున్నారు.కహాన్ పటేల్ (గుజరాత్): అహ్మదాబాద్‌కు చెందిన 17 ఏళ్ల ఈ విద్యార్థి జూన్ 18, 2026న అపార్ట్మెంట్ పైనుంచి దూకి ప్రాణాలు వదిలారు.ఆకాంక్ష చతుర్వేది (మధ్య ప్రదేశ్): మౌగంజ్ జిల్లాకు చెందిన 18 ఏళ్ల ఈ విద్యార్థిని నాగ్‌పూర్‌లో ఆత్మహత్య చేసుకున్నారు.రీమా బేగం (అస్సామ్): 21 ఏళ్ల ఈ నీట్ అభ్యర్థి జూన్ 2026లో మానసిక ఒత్తిడితో ప్రాణాలు విడిచారు.అవంతిక మౌర్య (మధ్య ప్రదేశ్): ఇండోర్‌కు చెందిన 21 ఏళ్ల ఈ విద్యార్థిని అనుమానాస్పద రీతిలో భవనంపై నుంచి పడి మృతి చెందారు.జతిన్ కుమార్ (ఉత్తర ప్రదేశ్): ఘజియాబాద్‌కు చెందిన 22 ఏళ్ల ఈ విద్యార్థి జూన్ 2026లో ఆత్మహత్యకు పాల్పడ్డారు.ఎస్. గోపిక (తమిళనాడు): సేలం జిల్లాకు చెందిన 19 ఏళ్ల ఈ విద్యార్థిని జూన్ 19, 2026న రీ-టెస్ట్ ఒత్తిడితో ప్రాణాలు విడిచారు.షేక్ సనా (తెలంగాణ): హైదరాబాద్‌కు చెందిన 19 ఏళ్ల ఈ విద్యార్థిని జూన్ 21, 2026న జరగాల్సిన రీ-నీట్ పరీక్షకు సరిగ్గా ఒక్క రోజు ముందు ఆత్మహత్య చేసుకున్నారు.వెత్రియానందం (తమిళనాడు): హోసూర్ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల విద్యార్థి జూన్ 2026లో పరీక్షా వివాదాల కారణంగా ప్రాణాలు తీసుకున్నారు.సిమ్రన్ (హర్యానా): హిసార్‌కు చెందిన 19 ఏళ్ల ఈ విద్యార్థిని జూన్ 21, 2026న పునఃపరీక్షకు ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.రోషిణి (తమిళనాడు): ధర్మపురి జిల్లాకు చెందిన 19 ఏళ్ల ఈ విద్యార్థిని జూన్ 2026లో పరీక్షా ఒత్తిడి కారణంగా బలవన్మహత్వానికి పాల్పడ్డారు.అంకితా సాంగ్లే (మహారాష్ట్ర): అహిల్యానగర్ జిల్లాకు చెందిన 19 ఏళ్ల ఈ విద్యార్థిని నీట్ పరీక్షలో తక్కువ మార్కులు వచ్చిన కారణంగా ప్రాణాలు కోల్పోయారు.ఇది కూడా చదవండి: ‘జంతర్ మంతర్’ లవ్ స్టోరీ.. తలకు గాయంతో వివాహం! -
ఎన్డీఏ పాలనలో విద్యాశాఖ వివాదాలు
భారతదేశ విద్యా వ్యవస్థను అత్యున్నత శిఖరాలకు తీసుకువెళ్లాల్సిన కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ గత పదేళ్లలో ఎన్నడూ లేనివిధంగా తీవ్ర వివాదాలు, కుదుపులకు లోనైంది. ఎన్డీఏ ప్రభుత్వ పన్నెండేళ్ల పాలనా కాలంలో నలుగురు వేర్వేరు మంత్రులు ఈ కీలక బాధ్యతలను నిర్వర్తించినప్పటికీ, వారిలో ముగ్గురు కనీసం మూడేళ్లు కూడా పదవిలో కొనసాగలేకపోయారు. కేవలం ధర్మేంద్ర ప్రధాన్ మాత్రమే ఐదేళ్ల పూర్తి కాలం పని చేసినప్పటికీ, చివరికి ‘నీట్’ పరీక్షల లీకేజీలు, చెలరేగిన దేశవ్యాప్త నిరసనల సెగతో ఆయన కూడా తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. 2014 నుంచి ఇప్పటివరకు విద్యాశాఖను చుట్టుముట్టిన సంచలన వివాదాలివే..మారిన పేర్లు.. రద్దయిన ఎఫ్‌వైయూపీ2014 మే 26 నుంచి 2016 జూలై 5 వరకు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఇప్పుడు విద్యా మంత్రిత్వ శాఖ) బాధ్యతలు చేపట్టిన స్మృతి ఇరానీ హయాంలో పలు సంచలన నిర్ణయాలు వెలువడ్డాయి. ఆమె పదవీకాలంలో తీసుకున్న అతిపెద్ద నిర్ణయాలలో ఢిల్లీ విశ్వవిద్యాలయంలో అమలవుతున్న నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ (ఎఫ్‌వైయూపీ) రద్దు చేయడం ఒకటి. దీనివల్ల విద్యార్థి, ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అయితే ఇదే సమయంలో జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)ముసాయిదా రూపకల్పనకు శ్రీకారం చుట్టడంతో పాటు, నేషనల్ ఇన్స్టిట్యూషనల్ రేంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్)ను ఆమె ప్రారంభించారు.జేఎన్‌యూ వివాదాలు, రోహిత్ వేముల ఆత్మహత్యస్మృతి ఇరానీ పదవీకాలం అనేక రాజకీయ తుఫాన్లకు కేంద్రబిందువుగా మారింది. జేఎన్‌యూలో చెలరేగిన భారీ నిరసనలు, నాటి విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ అరెస్టు దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించాయి. ఈ పరిణామాలపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. అలాగే 2016 జనవరిలో చోటుచేసుకున్న రోహిత్ వేముల ఆత్మహత్య ఉదంతం ప్రభుత్వంపై తీవ్ర నైతిక ఒత్తిడి తెచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో 2016 జూలైలో ఆమెను విద్యాశాఖ నుంచి తప్పించి జౌళి శాఖకు బదిలీ చేశారు.ఐఐఎంలకు స్వయంప్రతిపత్తి.. ఎన్టీఏ ఏర్పాటుస్మృతి ఇరానీ తర్వాత విద్యాశాఖ బాధ్యతలు చేపట్టిన ప్రకాశ్ జవదేకర్ 2016 జూలై 5 నుంచి 2019 మే 30 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆయన హయాంలో ప్రవేశపెట్టిన ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)యాక్ట్-2017’ ద్వారా ఐఐఎం సంస్థలకు మరింత స్వయంప్రతిపత్తి లభించింది. అలాగే దేశవ్యాప్తంగా ప్రవేశ పరీక్షల నిర్వహణను ఒకే గొడుగు కిందకు తెచ్చే ఉద్దేశంతో ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ’ (ఎన్టీఏ)ను ఆయన ఏర్పాటు చేశారు. అయితే ఆ తర్వాతి కాలంలో నీట్ పేపర్ లీక్ అంశంలో ఇదే ఎన్టీఏ తీవ్ర విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది.నో డిటెన్షన్ పాలసీ రద్దు.. సీబీఎస్ఈ పేపర్ లీక్జవదేకర్ హయాంలో విద్యా హక్కు చట్టానికి సవరణ చేసి, ఐదు, ఎనిమిది తరగతుల్లో పిల్లలను ఫెయిల్ చేయకుండా పై తరగతులకు పంపే ‘నో డిటెన్షన్ పాలసీ’ని రద్దు చేశారు. అయితే 2018లో సీబీఎస్ఈ బోర్డు పరీక్షల పేపర్ లీక్ కావడంతో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ తీవ్ర విమర్శలపాలైంది. అంతేకాకుండా, జియో ఇన్స్టిట్యూట్కు ‘ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్’ హోదా కట్టబెట్టడం కూడా పెద్ద వివాదానికి దారితీసింది.నిశాంక్ హయాంలో జాప్యమైన కీలక నియామకాలు2019లో ప్రకాష్ జవదేకర్ స్థానంలో డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ విద్యామంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన హయాంలో 2020 జూలైలో నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)ఆమోదం పొందడం ఒక మైలురాయిగా నిలిచినా, దాని రూపకల్పనలో సింహభాగం అంతకుముందే పూర్తయింది. అయితే ఆయన కాలంలో జెఎన్యూ, బీహెచ్‌యూ, ఢిల్లీ వర్సిటీ వంటి ప్రముఖ కేంద్ర విశ్వవిద్యాలయాలకు నెలల తరబడి వైస్‌చాన్సలర్ల నియామకాలు జరగలేదు. అలాగే ఐదు ఐఐటీ సంస్థలకు పూర్తిస్థాయి డైరెక్టర్లను నియమించడంలో తీవ్ర జాప్యం జరిగింది. అనారోగ్య కారణాలరీత్యా ఆయన 2021 జూలైలో పదవికి రాజీనామా చేశారు.ధర్మేంద్ర ప్రధాన్ రాక.. జాతీయ స్థాయిలో సంక్షోభాలురమేష్ పోఖ్రియాల్ నిష్క్రమణ తర్వాత విద్యాశాఖ పగ్గాలు చేపట్టిన ధర్మేంద్ర ప్రధాన్ సుదీర్ఘకాలం పదవిలో కొనసాగినప్పటికీ, ఆయన కూడా వివాదాల నుంచి తప్పించుకోలేకపోయారు. ఎన్సీఈఆర్టీ సిలబస్ మార్పులు, పాఠ్యాంశాల తొలగింపు వంటి అంశాలపై మేధావులు, విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలు రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నాయంటూ బీజేపీ పాలనలో లేని రాష్ట్రాల నుంచి తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి.‘నీట్’ తుఫాన్.. పదవిని కోల్పోయిన మంత్రిధర్మేంద్ర ప్రధాన్ హయాంలో ‘నీట్-యూజీ’ ప్రవేశ పరీక్షలో తలెత్తిన పేపర్ లీక్ కుంభకోణం, గ్రేస్ మార్కుల వివాదం దేశవ్యాప్తంగా విద్యార్థులను రోడ్డెక్కేలా చేశాయి. సుప్రీంకోర్టు జోక్యం, సీబీఐ దర్యాప్తు వరకు వెళ్లిన ఈ వ్యవహారం ఎన్టీఏ విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేసింది. పరీక్షల మాఫియా అంతుచూస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ, దేశవ్యాప్తంగా చెలరేగిన తీవ్ర నిరసనలు, ఆందోళనల కారణంగా ధర్మేంద్ర ప్రధాన్ చివరకు తన విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.ఇది కూడా చదవండి: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామా.. ఎక్కడంటే.. -
లోకేశ్.. మీ సంగతేంటి!?
సాక్షి, అమరావతి: కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ కూడా రాజీనామా చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ ఎప్పుడు రాజీనామా చేస్తారంటూ యువత ఆయన్ను ప్రశ్నిస్తోంది. విద్యా శాఖలో ముఖ్యంగా డీఎస్సీ నిర్వహణలో చోటుచేసుకున్న పరిణామాలకు బాధ్యత వహిస్తూ లోకేశ్ తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్ష పార్టీలు, నిరుద్యోగ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్న అక్రమాలపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో అర్హతలు, రిజర్వేషన్లకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు, వివిధ ఉత్తర్వుల మధ్య ఉన్న వ్యత్యాసాలను ప్రస్తావిస్తూ నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. పతకాలు సాధించిన వారిని కాదని, కేవలం పాల్గొన్న వారికి పోస్టులు ఎలా కట్టబెట్టారని విస్తుపోతున్నారు. నియామక ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, భారీ కుంభకోణం జరిగిందని తూర్పారబడుతున్నారు. ఇందుకు సాకులు చెప్పకుండా లోకేశ్ బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంతో డీఎస్సీ నియామకాల్లో తలెత్తిన వివాదాలను పోలుస్తూ సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది.లోకేశ్ తన వైఫల్యాన్ని అంగీకరించి పదవి నుంచి తప్పుకోవాలని కొందరు డిమాండ్ చేస్తుండగా.. ఆయన రాజీనామా చేయకపోతే రాష్ట్రంలోనూ నిరసనలు ఉధృతమవుతాయని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘కాక్రోచ్లు ఏపీలోనూ కదంతొక్కుతాయి’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. మరోవైపు.. లోకేశ్‌ను కాపాడటానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను రంగంలోకి దించి ఈ అంశాన్ని డైవర్ట్ చేస్తారేమోనని చంద్రబాబు ప్రభుత్వంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. -
లోకేశ్.. మీరు రాజీనామా చేయరా?
సాక్షి, అమరావతి: నీట్ యూజీ–2026 ప్రశ్నపత్రం లీక్ అయిందని తేలిన వెంటనే మే 3న నిర్వహించిన పరీక్షను కేంద్రం రద్దు చేసింది. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించి నిందితులను కటకటాలపాలు చేసింది. లీక్‌కు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించాలని జెన్ జీ దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టడంతో కేంద్రం దిగొచ్చింది. యువత ఆకాంక్షలను గౌరవిస్తూ ప్రధాన్‌తో మంత్రి పదవికి రాజీనామా చేయించింది. నీట్ పేపర్ లీకేజీని తలదన్నే రీతిలో రాష్ట్రంలో సాగిన డీఎస్సీ–2025 కుంభకోణం పక్కా సాక్ష్యాధారాలతో రుజువైనా చంద్రబాబు ప్రభుత్వం మసిపూసి మారేడుకాయ చేసింది.డీఎస్సీ ప్రశ్నపత్రాల రూపకల్పన నుంచి నియామకాల వరకు జరిగిన గోల్‌మాల్‌పై ఆధారాలు కళ్లెదుటే కనిపిస్తున్నా, బాబు ప్రభుత్వం మాత్రం బాధ్యత వహించక పోవడంపై ఏపీ జెన్ జీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నీట్ తరహాలోనే డీఎస్సీ స్కామ్‌పై చంద్రబాబు ప్రభుత్వం నిష్పక్షపాత విచారణకు ఎందుకు ఆదేశించలేదని నిలదీస్తోంది. సీబీఐ వంటి థర్డ్ పార్టీ దర్యాప్తు సంస్థలతో విచారణ చేస్తే అక్రమాలన్నీ వెలుగు చూస్తాయని నినదిస్తోంది. రాష్ట్రంలో డీఎస్సీ అభ్యర్థులకు జరిగిన అన్యాయానికి, నష్టానికి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి లోకేశ్ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తోంది. ప్రధాన్‌ను స్ఫూర్తిగా తీసుకుని వెంటనే లోకేశ్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఏపీ జెన్ జీ పట్టుపడుతోంది. లీక్‌ను కప్పిపుచ్చే యత్నం 16 వేల టీచర్ పోస్టుల భర్తీ కోసం చంద్రబాబు ప్రభుత్వం డీఎస్సీ–2025 నిర్వహించింది. ప్రశ్నపత్రం రూపకల్పన నుంచే డీఎస్సీ స్కామ్‌కు బీజం వేసినట్టు జరిగిన తతంగం స్పష్టం చేస్తోంది. ప్రశ్నపత్రం రూపకల్పన, ఆన్లైన్లో అప్లోడ్ చేయడంలో కీలకంగా వ్యవహరించిన ఔట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్ డీఎస్సీ సోషల్ స్టడీస్ పరీక్షల్లో కృష్ణా జిల్లా టాపర్‌గా నిలిచాడు. టీజీటీ పరీక్షలో జోన్–2లో ఆరో ర్యాంక్ సాధించాడు. ప్రశ్నపత్రాలు సిద్ధం చేయడంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి టాప్ ర్యాంకర్‌గా నిలిచాడని తెలిస్తే డీఎస్సీ పేపర్ లీక్ బట్టబయలు అవుతుందని ప్రభుత్వమే లీక్‌ను కప్పిపుచ్చే ప్రయత్నానికి పూనుకుంది.నీట్ పేపర్ ఎన్టీఏ ప్యానెల్ సభ్యుల నుంచి లీక్ అయినట్టే ఏపీ డీఎస్సీ ప్రశ్నపత్రం తయారైన దగ్గరే లీక్ అయిందని స్పష్టం అవుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఎందుకు స్వతంత్ర విచారణ చేపట్టలేదని, లీకైన పేపర్ ఎంత మందికి చేరిందో ఎందుకు గుర్తించలేదని డీఎస్సీ అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. నవీన్ వెనుక ఉన్న పెద్ద తలకాయలను ఎందుకు వదిలేశారని చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. మరోవైపు 1ః1 ప్రాతిపదికన సరి్టఫికెట్ల వెరిఫికేషన్‌కు పిలిచి, అన్నీ సక్రమంగా ఉన్నాయని ప్రకటించాక కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా అనేక మంది ప్రతిభావంతులకు వెన్నుపోటు పొడిచారు. నియామక ఉత్తర్వుల జారీలోను అర్హులకు అన్యాయం చేస్తూ ప్రభుత్వం అక్రమాలకు తెరలేపింది. ఇలా నష్టపోయిన అభ్యర్థులు పక్కా ఆధారాలతో తమకు జరిగిన అన్యాయాన్ని కళ్లకు కట్టినట్టు వివరిస్తున్నారు. డీఎస్సీ–2025 ప్రక్రియ ముగియగానే స్పోర్ట్స్ కోటాలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎత్తివేస్తూ ఆయా శాఖలు నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని జారీచేసిన జీవో నెం.23 బేరసారాల సాక్ష్యాలు బయటపడ్డా గప్‌చుప్ స్పోర్ట్స్ కోటా డీఎస్సీ అంటూ దేశ చరిత్రలో గతంలో ఎన్నడూ లేనటువంటి మెగా స్కామ్ ఏపీలో చోటు చేసుకుందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడానికి ముందే స్కామ్ పాలసీలో భాగంగా జీవో 4.. 47 ప్రభుత్వం తెచ్చింది. రాత పరీక్ష, అసలు డిగ్రీనే లేకుండా టీచర్ పోస్టులను కట్టబెట్టే దగాకోరు విధానానికి చంద్రబాబు ప్రభుత్వం తెరలేపింది. జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో బంగారు పతకాలతో సత్తా చాటిన వారిని కాదని చంద్రబాబు బంధువు ఎంపీ భరత్, టీడీపీ ఎమ్మెల్యే కూన రవి వంటి వారు చైర్మన్లుగా ఉన్న క్రీడా సంఘాలు జారీ చేసిన పార్టిసిపేషన్ సర్టిఫికెట్ల ఆధారంగా తమ వాళ్లకు టీచర్ పోస్టులు ఇచ్చేసుకున్నారు.ఈ నేపథ్యంలో ఒక్కో పోస్టుకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలు డిమాండ్ చేసిన ఆడియో, వీడియో సాక్ష్యాలు బయటపడ్డాయి. జిల్లా, కాలేజ్, విశ్వవిద్యాలయం, రాష్ట్ర స్థాయి పోటీల్లో పతకాలు గెలవకపోయినా, కేవలం పోటీల్లో పాల్గొన్నారనే సరి్టఫికెట్లతో టీచర్ ఉద్యోగాలు ఇచ్చేశారు. ఇలా స్పోర్ట్స్ కోటా డీఎస్సీ అంతా స్కామ్‌గా మారినట్లు కళ్లెదుటే సాక్ష్యాలు, నష్టపోయిన అభ్యర్థులు కనిపిస్తున్నా, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం తేలుకుట్టిన దొంగలా వ్యవహరిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.స్పోర్ట్స్ కోటా డీఎస్సీ పోస్టులు అమ్మకానికి పెట్టినట్టే నీట్ ప్రశ్నపత్రంలోని ప్రశ్నలను నిందితులు అమ్మకానికి పెట్టారు. ఈ క్రమంలో వాట్సప్ గ్రూప్‌లు, డిజిటల్ ఆధారాలతోనే సీబీఐ నిందితులను పసిగట్టి జైలుపాలు చేసింది. ఇదే రీతిలో టీచర్ పోస్టుల అమ్మకానికి బేరసారాలాడిన వ్యక్తుల ఫోన్ నెంబర్, ఆడియో రికార్డింగ్‌తో సహా పక్కా ఆధారాలున్నా చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు విచారణ చేపట్టలేదని నిరుద్యోగులు నిలదీస్తున్నారు. ఈ వ్యవహారంపై నిష్పపక్షపాత విచారణ చేపడితే ప్రభుత్వంలోని పెద్ద తలకాయల బండారం బయట పడుతుందని జీవో 4.. 46 రద్దు చేసి అక్రమాలను ప్రభుత్వమే కప్పి పెట్టేందుకు పూనుకుందని యువత విమర్శిస్తున్నారు. జీవితాలతో చెలగాటంవైద్య విద్యలో ప్రవేశాలకు సంబంధించిన అర్హత పరీక్ష విషయంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యత, జవాబుదారీతనంతో వ్యవహరించింది. ఏపీలో మాత్రం లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థుల కల అయిన డీఎస్సీని రాష్ట్ర ప్రభుత్వం తన స్వార్థం కోసం వాడుకుంది. డీఎస్సీ స్కామ్ గురించి ప్రజల్లో చర్చకు వచి్చనప్పుడల్లా డైవర్షన్ రాజకీయం చేస్తోంది. నిరుద్యోగ అభ్యర్థుల సందేహాలు, ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పలేక అవాస్తవాలతో అసలు విషయాన్ని దాటవేస్తోంది. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం.. లేదా ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి హామీతో గద్దెనెక్కి స్కామ్‌ల డీఎస్సీతో చంద్రబాబు సర్కారు తమ భవిష్యత్‌తో చెలగాటం ఆడిందని నిరుద్యోగులు నిప్పులు చెరుగుతున్నారు. -
పంజాబ్ పరీక్షలో అక్రమాలపై సీజేపీ పోరాటం
న్యూఢిల్లీ: పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చేపట్టిన ఆందోళన విజయవంతం కావడంతో ఆ పార్టీ తదుపరి కార్యాచరణపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. పంజాబ్‌లో జరిగిన పరీక్షలో అక్రమాలపై పోరాటం చేపట్టాలని చాలామంది ఆ పార్టీని కోరుతున్నారు. దీనిపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తాజాగా స్పందించారు. భవిష్యత్తు కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. జంతర్‌మంతర్ వద్ద పోరాటం నిన్ననే ముగిసింది కాబట్టి తమకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. తదుపరి పోరాటం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. ఢిల్లీలో విద్యార్థులపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఏ ఒక్క విద్యార్థిపైనా కేసులు నమోదు చేయకూడదని తేల్చిచెప్పారు. పంజాబ్‌లో 454 మంది ఫార్మసీ అధికారుల నియామకం కోసం బాబా ఫరీద్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ జూలై 19న నిర్వహించిన పరీక్షలో వ్యవస్థీకృత పద్ధతిలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సీఎం భగవంత్ మాన్ సమాధానం చెప్పాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. -
పరీక్షల సంస్కరణలపై కేంద్రం కీలక నిర్ణయం
ఢిల్లీ: పరీక్షల సంస్కరణలపై కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమాల నివారణే లక్ష్యంగా పలు సంస్కరణలు తీసుకురావడానికి కేంద్రం సన్నద్ధమైంది. పరీక్షల సంస్కరణలపై ఉన్నత స్థాయి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది కేంద్రం. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు నరేంద్ర మోదీ. ‘ పరీక్షల సంస్కరణలపై ఉన్నతస్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాం. సాంకేతిక నిపుణుడు నందన్ నీలేఖని నేతృత్వంలో హైపవర్డ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాం, పరీక్షల విశ్వసనీయతపై ఇచ్చే ఈ నివేదికను అమలు చేస్తాం. లీక్‌లకు పాల్పడిన వారిని జైల్లో పెట్టాం. రేపు పార్లమెంట్లో కఠిన చట్టాలను తీసుకొస్తాం. పోటీ పరీక్షల నిర్వహణలో పారదర్శకతతో పాటు అక్రమాల నివారణే లక్ష్యం సంస్కరణలు తీసుకురాబోతున్నాం. విద్యార్థుల భవిష్యత్ కోసం నిరంతరం చర్యలు తీసుకుంటున్నాం. కఠిన నియమాలతో కొత్త చట్టం తీసుకొస్తున్నాం. వీలైనంత ఎక్కువగా టెక్నాలజీని ఉపయోగిస్తాం’ అని తెలిపారు.HIGH POWERED TASK FORCE on examination reforms under the leadership of Shri Nandan Nilekani constituted.@NandanNilekani pic.twitter.com/mMpmPdIEL5— Narendra Modi (@narendramodi) July 26, 2026 -
ఆత్మహత్య చేసుకున్న నీట్ అభ్యర్థి తల్లి భావోద్వేగభరిత కామెంట్స్
నాగ్‌పూర్: నీట్ పేపర్ లీక్‌లపై దేశవ్యాప్తంగా భారీ నిరసనలు చెలరేగిన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం (జులై 25న) రాజీనామా చేశారు. అయితే, దాంతో ఏమి సాధిస్తారని నీలమ్ చతుర్వేది అనే మహిళ ప్రశ్నించారు. ఆమె కూతురి పేరు ఆకాంక్ష చతుర్వేది. ఆమె 18 ఏళ్ల నీట్ అభ్యర్థి. ఈ ఏడాది నీట్ పరీక్ష రద్దు అయిన తర్వాత తీవ్ర మనోవేదనకు గురై, మే 20న నాగ్‌పూర్‌లో ఆత్మహత్య చేసుకుంది.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన నేపథ్యంలో నీలమ్ చతుర్వేది మాట్లాడుతూ... ప్రభుత్వం తీసుకునే ఏ చర్యా తన కూతురిని తిరిగి తీసుకురాలేదని, అయినా ఆమెకు న్యాయం జరగాలని మాత్రమే కోరుకుంటున్నానని చెప్పారు. పేపర్ లీక్ నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఉద్యమానికి తాము మద్దతు ఇస్తున్నామని, కానీ రాజీనామాతో బాధ్యత ముగిసిపోదని అన్నారు."ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో మేము సంతృప్తి చెందలేదు. విద్యార్థుల నిరసనకు మా మద్దతు కొనసాగుతుంది. పేపర్ లీక్‌కు పాల్పడిన వారికి ఉరిశిక్ష విధించాలి" అని ఆమె డిమాండ్ చేశారు.తండ్రికి రెండు సార్లు గుండెపోటు మధ్యప్రదేశ్‌కు చెందిన ఆకాంక్ష.. నీట్ పరీక్షకు ప్రిపరేషన్ కోసం కుటుంబంతో కలిసి నాగ్‌పూర్‌కు వెళ్లింది. పరీక్ష సన్నద్ధత కోసం ఓ కోచింగ్ సంస్థలో చేరింది. మే 3న నీట్ పరీక్ష రాసిన ఆకాంక్ష, పరీక్ష బాగా జరిగిందని చెప్పిందని ఆమె తల్లి గుర్తుచేశారు. అయితే పరీక్ష రద్దు అయిన తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకుందని తెలిపారు."ఆకాంక్ష తండ్రికి ఇప్పటికే రెండు సార్లు గుండెపోటు వచ్చింది. ఆయనకు పక్షవాతం కూడా వచ్చింది. ఇప్పుడు మా బాధ్యత ఎవరు తీసుకుంటారు? నా కుమార్తె బతికి ఉంటే అన్నీ చూసుకునేది" అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆకాంక్ష తన చేతిరాతతో రాసిన ఆత్మహత్య లేఖలో తాను ఎదుర్కొన్న తీవ్ర మానసిక భారాన్ని వివరించింది."అమ్మా, నాన్నా... మీ కుమార్తె బాగా చదివి డాక్టర్ అవుతుందని మీరు నమ్మారు. కానీ మరోసారి నీట్ పరీక్ష రాసే ధైర్యం నాకు లేదు. మొదటి ప్రయత్నంలో మంచి మార్కులు వస్తాయని నమ్మకం ఉండేది. ఇప్పుడు మళ్లీ అంతే బాగా రాస్తాననే నమ్మకం లేదు. అమ్మా, నాన్నా... నన్ను క్షమించండి. నేను అన్నీ నాశనం చేశాను" అని ఆమె లేఖలో రాసింది.కుటుంబ సభ్యుల మాటల్లో, కుమార్తె చదువు కోసం ఆమె తండ్రి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొద్ది భూమిలో వ్యవసాయం చేస్తూనే, నాగ్‌పూర్‌లో వంటమనిషిగా పని చేసి కుటుంబ ఖర్చులు, కోచింగ్ ఫీజులు భరించారు.ఆకాంక్ష మామ జగదీశ్ ప్రసాద్ చతుర్వేది మాట్లాడుతూ.. పరీక్ష రాసి ఇంటికి వచ్చినప్పుడు ఆమె చాలా సంతోషంగా కనిపించిందన్నారు. మొదట 650కు పైగా మార్కులు వస్తాయని ధైర్యంగా చెప్పిన ఆమె, పేపర్ లీక్ విషయం తెలిసిన తర్వాత తీవ్ర మనోవేదనకు గురై, తినడం తగ్గించి, ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడటం మానేసిందని తెలిపారు. "ఇలా జరుగుతుందని మేమెప్పుడూ ఊహించలేదు" అని ఆయన అన్నారు. -
నీట్ తరహాలో ఏపీ డీఎస్సీలో అక్రమాలు
సాక్షి,తిరుపతి: రాష్ట్రంలో డీఎస్సీ పరీక్షల నిర్వహణలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని తిరుపతి, చిత్తూరు జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.ఆదివారం తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. యువత తిరగబడితే ఎలాంటి పర్యవసానాలు ఉంటాయో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన విద్యార్థి పోరాటాలు నిరూపించాయని భూమన గుర్తుచేశారు. దేశంలో నీట్ పరీక్షల తరహాలోనే ఏపీలో డీఎస్సీ పరీక్షల్లోనూ అడ్డగోలు అక్రమాలు జరిగాయని ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పచ్చి అబద్ధాలు చెప్తూ.. డీఎస్సీలో ఒక్కో పోస్టును రూ.30 లక్షలకు అమ్ముకున్నారని, చివరికి స్పోర్ట్స్ కోటా పోస్టులను కూడా వదలకుండా విక్రయించారని ధ్వజమెత్తారు.కోట్లాది రూపాయలు దండుకుంటూ లోకేష్ రాష్ట్ర విద్యావ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారని విమర్శించారు. తప్పు చేయడం కంటే అవినీతికి పాల్పడటం అత్యంత ప్రమాదకరమని, అందుకే నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవి నుంచి లోకేష్ తప్పుకోవాలని స్పష్టం చేశారు. డీఎస్సీ అక్రమాల వల్ల నష్టపోయిన నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు భూమన కరుణాకర్ రెడ్డి ఈ సందర్భంగా ప్రకటించారు. -
కాక్రోచే అనుకుంటే.. కదం తొక్కింది!
ఒక్క మాట.. మహోద్యమంగా మారింది. ‘కాక్రోచ్’ పుట్టుకకు కారణమైంది.. ఈ ఏడాది మే 16న దేశ అత్యున్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ యాదవ్ చేసినట్టుగా చెబుతున్న వ్యాఖ్య ఒకటి వైరల్ అయిపోయింది. దేశంలోని నిరుద్యోగ యువత బొద్దింకల్లా (కాక్రోచ్) మారారని సీజేఐ వ్యాఖ్యానించినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారమైంది. తన ఉద్దేశం అది కాదని సీజేఐ తరువాత చెప్పుకున్నారు అది వేరే విషయం. కానీ...యువతను బొద్దింకలతో పోల్చారన్న విషయం.... మహారాష్ట్రలో పుట్టి, పుణేలో జర్నలిజం చదువు చదివి.. అమెరికాలోని బస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్‌పై పీజీ చేస్తున్న 30 ఏళ్ల అభిజిత్ దీప్కేకు అంతగా రుచించలేదు.అప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేసిన అనుభవం ఉండటమో ఇంకో కారణమో తెలియదు కానీ... సీజేఐ వ్యాఖ్యపై వ్యాఖ్యానిస్తూ.... ‘‘బొద్దింకలన్ని ఒక్కటైతే ఏమవుతుంది?’’అని వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. ఇది కాస్తా జెన్–జీ గుండెలను నేరుగా తాకింది. ఇంకేముంది... రికార్డు సమయంలో లక్షల మంది ఫాలోవర్లు సిద్ధమైపోయారు. కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్ విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది. ఎంతగానంటే... ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అని చెప్పుకుంటూ వచి్చన భారతీయ జనతా పార్టీ ఫాలోవర్ల సంఖ్యను కూడా మించిపోయేంత! యువతలోని ఈ జోష్ అభిజిత్ కూడా ఊహించి ఉండకపోవచ్చు. కానీ... అప్పటికే నీట్ పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారంలో తలపట్టుకుని ఉన్న కేంద్రం మే 21న మారు పరీక్ష నిర్వహిస్తున్న నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ హ్యాండిల్‌ను స్తంభింపజేసింది. ఇంకేముంది అగ్గి రాజుకుంది! మద్దతుదారులు ‘Cockroach is Back’’, పేరుతో కొత్త హ్యాండిల్‌ను సృష్టించడం, గంటల్లోనే 280,000 కంటే ఎక్కువమంది ఫాలోవర్లు చేరిపోవడం చకచకా జరిగిపోయాయి. ఎక్స్ హ్యాండిల్ పునరుద్ధరణకు ఢిల్లీ హైకోర్టును నిరాకరించడం (మే 29వ తేదీ)తో ఇరుపక్షాల్లోనూ పంతం పెరిగినట్టు అయ్యింది. ఈ లోపుగానే ఒక పక్షం కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులపై రకరకాల ముద్రలు వేయడం మొదలుపెట్టారు.ఎక్కడో విదేశాల్లో ఉన్న వ్యక్తి ఇక్కడ ఉద్యమాలు నడపడం ఏమిటని అభిజిత్‌ను ప్రశ్నించారు. వీటన్నింటికీ సమాధానంగా జూన్ మొదటి వారంలో అభిజిత్ దేశానికి తిరిగి వచ్చారు. ఆ వెంటనే జూన్ ఆరవ తేదీన నీట్ ప్రశ్న పత్రాల లీకేజీకి సంబంధించి విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌తో నిరసనకు దిగారు. కొన్ని రోజుల తరువాత లడాఖ్ విద్యావేత్త, ఇంజినీర్ సోనమ్ వాంగ్‌చుక్ కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతివ్వడం, ఆమరణ నిరాహార దీక్షకు దిగడం జరిగిపోయాయి. వాంగ్‌చుక్ సుమారు 26 రోజులపాటు నిరాహార దీక్ష చేసిన తరువాత కోర్టు ఆదేశాల మేరకు ఆయన్ను ఆసుపత్రికి తరలించడం, ఆ తరువాత రెండు రోజులకు అంటే జూలై 20న కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన చలో సంసద్ ర్యాలీలో పోలీసుల లాఠీచార్జితో జెన్–జీ మొత్తం ఏకమైంది. ఈ దశలో కేంద్రం కూడా ఒక మెట్టు దిగి కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలతో సంప్రదింపులు మొదలుపెట్టింది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ వీడియో సందేశమిస్తూ... ప్రశ్న పత్రాల లీకేజీలు జరక్కుండా కఠిన చర్యలు తీసుకుంటామని నిందితులకు మూడు నుంచి పదేళ్ల జైలు శిక్ష, పది కోట్ల రూపాయల వరకూ జరిమానా విధిస్తామని ప్రకటించారు. అయినా సరే.. అభిజిత్ దిప్కే వర్గం మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోనే ఉద్యమం ఆగుతుందని కుండబద్దలు కొట్టారు. దీంతోపాటు నీట్ ప్రశ్న పత్రాల లీకేజీ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని, ఛలో సంసద్‌లో విద్యార్థులపై లాఠీలు ఝళిపించిన పోలీసులపై చర్యలు, విద్యార్థులపై ఎలాంటి కేసులు పెట్టకూడదన్న షరతులు పెట్టాయి. రెండు దఫాల చర్చల తరువాత ప్రధాన్ రాజీనామా మినహా మిగిలిన షరతులకు ఓకే చెప్పింది. అయినప్పటికీ ప్రధాన్ రాజీనామాపై కాక్రోచ్ జనతా పార్టీ పట్టు వీడలేదు. దీంతో ఎట్టకేలకు జూలై 25న ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచి్చంది. దీంతో ఉద్యమమైతే సమసింది కానీ... ముందేం జరుగుతుంది అన్నది మాత్రం వేచి చూడాల్సిన విషయం! – సాక్షి, నేషనల్ డెస్క్ -
నారా లోకేశ్ పదవికి రాజీనామా చేస్తారా? లేదంటే..: వైఎస్ జగన్
తాడేపల్లి: నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేసిన ఆందోళనల వల్ల కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది మంది నిరుద్యోగులతో ముడిపడిన డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యతవహిస్తూ మంత్రి నారా లోకేశ్ కూడా రాజీనామా చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. దీనిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎక్స్‌లో చంద్రబాబును ప్రశ్నించారు.‘‘నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నైతికత, బాధ్యతాయుతమైన జవాబుదారీతనానికి ప్రతీకగా నిలుస్తోంది.ఇప్పుడు ఇదే ప్రశ్నను మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా అడుగుతున్నాం. దాదాపు 3.5 లక్షల మంది టీచర్ అభ్యర్థుల భవిష్యత్తును ఫణంగా పెడుతూ, డీఎస్సీ పరీక్ష నిర్వహణలో జరిగిన అంతులేని అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ, రాష్ట్రంలో అదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో విద్యా శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేశ్ తన పదవికి రాజీనామా చేస్తారా? లేక అదే ఎన్డీఏ ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే ప్రమాణాలు, విలువలు, జవాబుదారీతనానికి పూర్తిగా పాతర వేస్తూ, సీఎం చంద్రబాబు నాయుడు తన కొడుకు పదవిని కాపాడుకుంటారా?’’ అని వైఎస్ జగన్ నిలదీశారు. Taking moral responsibility for the NEET paper leak, Union Education Minister Dharmendra Pradhan ji resigned, setting a benchmark for political accountability under the NDA Government.We now ask the same question in Andhra Pradesh. Will Education Minister Nara Lokesh of the NDA…— YS Jagan Mohan Reddy (@ysjagan) July 25, 2026 -
నీట్ పేపర్ లీక్ వెనుక AI... ఇంటర్ మానేసిన కుర్రోడు.. ప్రతి ఒక్కరూ చూడాల్సిన వీడియో..!
-
2018 తర్వాత, ఇలా రిజైన్ చేసిన తొలి కేంద్ర మంత్రి ఈయనే
సాక్షి,న్యూఢిల్లీ: సీజేపీ ఆందోళనల నేపథ్యంలోఎట్టకేలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీమానా లేఖను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందించారు. అలాగే తన లేఖ కాపీని మంత్రి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. అయితే ధర్మేంద్ర రాజీనామాకు దారితీసిన పరిస్థితులతో పాటు, 2018లో లైంగిక వేధింపుల ఆరోపణలతో అప్పటి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రాజీనామా అంశం ఇపుడు నెట్టింట హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద, దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు దేశ వ్యతిరేక శక్తుల చేతిలోకి వెళ్లకుండా చూడటం, జాతీయ ఐక్యతను కాపాడటం తన బాధ్యత. భారతీయ విద్యార్థుల భవిష్యత్తు సుదీర్ఘ న్యాయపరమైన చిక్కుల్లో పడకూడదని, వారు ప్రశాంతంగా తమ చదువులపై, భవిష్యత్తుపై దృష్టి పెట్టాలనే ఉద్దేశంతోనే గౌరవ ప్రధానమంత్రికి తన రాజీనామా లేఖను సమర్పించాను అని ధర్మేంద్ర ప్రధాన్ తన లేఖలో పేర్కొన్నారు. మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ హయాంలో ఒక మంత్రి ప్రజల లేదా విపక్షాల నిరసనల కారణంగా రాజీనామా చేయడం అత్యంత అరుదైన పరిణామం. గత చరిత్రను పరిశీలిస్తే, 2018 తరువాత అప్పటి కేంద్ర సహాయ మంత్రి ఎమ్జే అక్బర్ తన పదవికి రాజీనామా చేశారు.ఇదీ చదవండి: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, నెక్ట్స్ విద్యాశాఖ మంత్రి ఎవరు? 2018 ఎమ్జే అక్బర్మోదీ హయాంలో వివాదాలు ఎదురైనప్పటికీ మంత్రులు రాజీనామా చేయరని, ప్రభుత్వం అహంకారంతో వ్యవహరిస్తుందని విపక్షాలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. అయితే #MeToo ఉద్యమంలో పలువురు మహిళా జర్నలిస్టులు లైంగిక వేధింపుల ఆరోపణలతో 2018లో కేంద్ర సహాయమంత్రిగా ఎమ్జే అక్బర్ రాజీనామా చేశారు. తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చిన అక్బర్, "ఆరోపణలు వైరల్ ఫీవర్లా మారాయి" అని వ్యాఖ్యానించారు. అయితే, వ్యక్తిగత హోదాలో కోర్టులో న్యాయపోరాటం చేసేందుకే మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు అప్పట్లో ప్రకటించారు.కాగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల ఉద్యమానికి, పరీక్షల వ్యవస్థలో సంస్కరణల కోసం జరుగుతున్న పోరాటానికి ఒక మైలురాయిగా నిలిచింది ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP), విద్యార్థి సంఘాలు చేపట్టిన సుదీర్ఘ నిరసనలకు ఈ రాజీనామా ఒక పెద్ద విజయంగా భావిస్తున్నారు. -
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, నెక్ట్స్ విద్యాశాఖ మంత్రి ఎవరు?
సాక్షి,న్యూఢిల్లీ: నీట్ అవకతవకలపై సీజేపీ, విద్యార్థులు గత 23 రోజులుగా చేపట్టిన ఉద్యమం విజయం సాధించింది. వీరి ప్రధాన డిమాండ్ అయిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో దేశవ్యాప్తంగా యువతలో ఆనందోత్సాహలు నెలకొన్నాయి. నీట్ పరీక్షల నిర్వహణలో ఎదురైన వివాదాలు, విద్యార్థుల ఆందోళనల నేపధ్యంలోఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ రాజీనామా నేపథ్యంలో ఆయన స్థానంలో విద్యాశాఖను ఎవరు చేపట్టబోతున్నారు, ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉండబోతోంది అనే అంశాలపై చర్చ తీవ్రమైంది.కొత్త విద్యామంత్రి ఎవరనే దానిపై ఇంకా నిర్ణయం రాలేదు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం కొత్త పేరును ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ లోపుగా ప్రధానమంత్రి సాధారణంగా ఒక సీనియర్ క్యాబినెట్ మంత్రికి ఆ శాఖను అదనపు బాధ్యత (Additional Charge) కింద అప్పగిస్తారు. విద్యాశాఖ బాధ్యతలను ఏదైనా సీనియర్ క్యాబినెట్ మంత్రికి అదనపు బాధ్యతగా అప్పగించవచ్చు లేదా ఆదివారం సాయంత్రం నాటికి కొత్త నియామకం ఉత్తర్వులు రావచ్చని భావిస్తున్నారు. మరోవైపు రాజీనామా అనంతరం ప్రభుత్వం వెంటనే పూర్తిస్థాయి కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగనుందని మరో అంచనా. సినియర్ క్యాబినెట్ మంత్రులకు అదనపు బాధ్యతలను మన్సుఖ్ మాండవీయ, జ్యోతిరాదిత్య సింధియా, లేదా భూపేందర్ యాదవ్, జ్యోతిరాదిత్య సింధియా లాంటి సమర్థవంతమైన పాలనా అనుభవం ఉన్న సీనియర్లకు అదనపు బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే తరువాత విద్యాశాఖ మంత్రి పదవిని స్వయంగా ప్రధానమంత్రే స్వీకరిస్తారా? లేక సీనియర్ మంత్రి నితిన్ గడ్కరీ, లేదా ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్‌కి అప్పగిస్తారా అనే వాదన కూడా వినిపిస్తోంది. ఫడ్నవీస్‌కు పిలుపుమరోవైపు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఢిల్లీ పెద్దలనుంచి పిలుపు రావడం మరింత ప్రధాన్యతను సంతరించుకుంది. ఫడ్నవీస్‌తో పాటు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే కూడా ఢిల్లీకి బయలుదేరినట్టు తెలుస్తోంది. అలాగే మేధావి, విద్యావంతుడైన ఫడ్నవీస్ విద్యా శాఖమంత్రిగా అర్హుడని శివసేన ఉద్ధవ్ ఠాక్రే ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించడం విశేషం. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు, విద్యాశాఖలో కీలక సంస్కరణల నేపథ్యంలో ప్రత్యా మ్నాయంగా, విద్యాశాఖలో ప్రస్తుతం ఉన్న సహాయ మంత్రుల్లో (జయ్ చౌదరి లేదా సుకాంత్ మజుందార్) ఒకరికి స్వతంత్ర హోదా (Independent Charge) ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న అంచనా. విద్యాశాఖను తాత్కాలికంగా ఎవరికి అప్పగిస్తారు? లేదా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారనే దానిపై రాష్ట్రపతి భవన్ నుంచి అధికారిక ప్రకటన వచ్చేదాకా సస్పెన్స్ తప్పదు. -
వీడియోలు కాదు, యాక్షన్ కావాలి : రాహుల్ గాంధీ విమర్శలు
సాక్షి, న్యూఢిల్లీ: నీట్ అవకతవకలపై దేశ రాజదాని నగరం న్యూడిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ,విద్యార్థులు ఆందోళన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా విడుదల చేస్తున్న వీడియోలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వీడియోలు కాదు, విద్యార్థులపై కోరుతున్న డిమాండ్లపై చర్యలు కావాలి అంటూ ఎద్దేవా చేశారు. ఢిల్లీలో దాడికి గురైన విద్యార్థులకు ప్రధాని మోదీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.23 రోజులుగా నిరాహార దీక్ష చేసిన విద్యార్థులతో కలిసి మీడియాతో మాట్లాడిన రాహుల్ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యా వ్యవస్థ అవినీతికి ప్రతీక అని విమర్శించారు. ఆయనను వేరే శాఖకు మార్చడం కాకుండా, ప్రభుత్వం నుంచే పూర్తిగా తొలగించాలని (మంత్రివర్గం నుండి తీసేయాలని) విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారన్నారు.మోదీ రాత్రివేళల్లో చేసే వీడియో సందేశాలను ప్రస్తావిస్తూ విద్యార్థులకు ప్రధాని హామీలు, వీడియోలు వద్దని, తక్షణ చర్యలే కావాలని స్పష్టం చేశారు.मोदी जी, करोड़ों छात्रों का भविष्य बर्बाद करने के बाद अब आधी रात की Reel से उनका वक़्त बर्बाद मत कीजिए।प्रधान बर्ख़ास्त। दोषियों पर कार्रवाई। छात्रों से माफ़ी।इससे कम कुछ भी मंज़ूर नहीं। pic.twitter.com/RWrLLDD0WC— Rahul Gandhi (@RahulGandhi) July 25, 2026 అలాగే ఆందోళన బాట పట్టిన విద్యార్థులపై లాఠీచార్జ్, పెల్లెట్ ప్రయోగం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గాయపడిన ఒక విద్యార్థిని చూపిస్తూ... విద్యార్థులపై దాడికి బాధ్యులైన వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. విద్యార్థులే ఈ దేశపు భవిష్యత్తు అని మోదీ దేశానికి గతం అని గతం ఎన్నటికీ భవిష్యత్తును ఓడించలేదని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా AISA ప్రతినిధి నేహా బోరా మాట్లాడుతూ, రాహుల్ గాంధీతో విద్యా వ్యవస్థపై చర్చలు జరిపినట్లు తెలిపారు. కాగా నీట్ 2026 పేపర్ లీకేజీ అంశంపై విద్యార్థులను ఉద్దేశించి మోదీ గురువారం అర్ధరాత్రి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో మరో సెల్ఫీ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. -
నా నిజాయితీని నిరూపించాలా? విమర్శలకు వాంగ్ చుక్ ఘాటు రియాక్షన్
-
సీజేపీ ఆందోళన ఎఫెక్ట్.. మెట్రోస్టేషన్లుక్లోజ్.. నెట్ కట్
-
నీట్ లీకేజీ రచ్చ.. హీరోయిన్ జ్యోతిక ఆసక్తికర పోస్ట్!
నీట్ పేపర్ లీక్ వివాదం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు సినీ తారలు సైతం మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పటికే సల్మాన్ ఖాన్, అదితిరావు హైదరీతో పాటు పలువురు సినీ తారలు విద్యార్థులకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తాజాగా దక్షిణాది స్టార్ హీరో సూర్య సతీమణి, హీరోయిన్ కూడా విద్యార్థుల ఆందోళనకు తన మద్దతు తెలిపారు. నీట్ పేపర్ లీక్‌కు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇన్‌స్టాలో ఒక పోస్ట్ పెట్టారు.‘నేను విద్యార్థులు, దేశ భవిష్యత్తు తరపున నిలబడతా. నేను ప్రజాస్వామ్య భారతదేశానికి మద్దదు ఇస్తున్నా. విద్యా వ్యవస్థలో సంస్కరణలు రావాలని కోరున్నా. తల్లులుగా మా పిల్లలను ‘సోనమ్ వాంగ్‌చక్, అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్‌లా గా పెంచాలని కోరుకుంటున్నాం. జెన్ జీ చేస్తున్న పోరాటం చూసి గర్వంగా ఉంది. భయం లేకుండా ఉద్యమం చేస్తున్న సీజేపీకి ధన్యవాదాలు. జైహింద్’అని జ్యోతిక తన ఇన్‌స్టా ఖాతాలో రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Jyotika (@jyotika) -
యువతకు ధన్యవాదాలు మోదీ మరో వీడియో వైరల్
-
మారని తీరు..సాగని సభలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు వరుసగా ఐదో రోజూ ఉభయసభల ప్రతిష్ఠంభనతోనే ముగిశాయి. నీట్ ప్రశ్న పత్రం లీకేజీ వ్యవహారంపై వెంటనే చర్చ చేపట్టాలని, విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ సహా ఇండియా కూటమి సభ్యులు పట్టుబట్టడంతో లోక్‌సభ, రాజ్యసభల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. పేపర్ లీక్‌పై ప్రభుత్వం చర్చకు సిద్ధమని ప్రకటించినా, ముందుగా ప్రధాన్‌ను తొలగించాల్సిందేనంటూ ప్రతిపక్షం పట్టుబట్టింది. విపక్ష ఎంపీల ఆందోళనలతో పలుమార్లు వాయిదా పడింది. ఉభయసభలను చివరకు సోమవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు. చర్చను అడ్డుకుంటుంది మీరే: కిరణ్ రిజిజు లోక్‌సభ శుక్రవారం తొలి వాయిదా అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి ప్రారంభం అయ్యాక సైతం విపక్షాలు ప్రధాన్ రాజీనామాకు పట్టుబడుతూ నినాదాలతో సభను హోరెత్తించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు దీనిపై స్పందిస్తూ.. ప్రభుత్వం మొదటి నుంచీ నీట్ అంశంపై చర్చకు సిద్ధంగా ఉందని, ప్రతిపక్షమే షరతులు విధిస్తూ సభను నడవనివ్వడం లేదని విమర్శించారు. ప్రధాని మోదీ ఇప్పటికే నీట్ విషయంలో దేశానికి హామీ ఇచ్చారని, నీట్లో జరిగిన అవకతవకలు, ప్రశ్న పత్రం లీక్‌లను అరికట్టేందుకు కఠిన చట్టం తీసుకొస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. ఇదే సమయంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేరును నేరుగా ప్రస్తావిస్తూ, ‘మీరు మీ పార్టీ సభ్యులను ఒప్పించండి. సభను అడ్డుకోవడం మాని దేశ యువతకు సంబంధించిన ఈ కీలక అంశంపై చర్చ జరగనివ్వండి. పార్లమెంట్ సమయాన్ని వృథా చేయొద్దు’అని విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ విపక్ష ఎంపీల నిరసనలు సద్దుమణగలేదు. ప్రతిపక్ష సభ్యులు ‘విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి’అంటూ నినాదాలు కొనసాగించడంతో సభను సోమవారానికి వాయిదా వేశారు రాజ్యసభలో వందేమాతరం బిల్లు.. రాజ్యసభలోనూ విపక్షాలు నిరసనలు కొనసాగాయి. పేపర్‌లీకేజీ డిమాండ్‌తో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీచార్జి చేయడం, మంత్రి ప్రధాన్ రాజీనామా చేయకపోవడంపై ప్రతిపక్ష నేత ఖర్గే ప్రస్తావించిన కొద్దిసేపటికే తీవ్ర గందరగోళం నెలకొని, సభ వాయిదా పడింది. మధ్యాహ్నం తర్వాత రాజ్యసభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ‘జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక (సవరణ) బిల్లు–2026‘ను ప్రవేశపెట్టారు. జనగణమనతో సమానంగా వందే మాతర గీతానికి చట్టపరమైన రక్షణ కల్పించడమే ఈ బిల్లు ఉద్దేశమని తెలిపారు. అయితే ఈ బిల్లును సీపీఎం తీవ్రంగా వ్యతిరేకించింది. సీపీఐ సభ్యుడు సంతోష్ కుమార్ విద్యార్థుల ఉద్యమం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ బిల్లును తీసుకొచ్చారని విమర్శించారు. అనంతరం ప్రతిపక్ష నిరసనలు కొనసాగడంతో రాజ్యసభను సోమవారానికి వాయిదా వేశారు.ప్రధాన్ తొలగింపే మొదటి షరతు: రాహుల్ మంత్రి రిజిజు ప్రకటన అనంతరం పార్లమెంట్ వెలుపల రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించకపోతే ప్రభుత్వంతో చర్చల్లో పాల్గొనబోమని స్పష్టం చేశారు. ‘విద్యార్థుల డిమాండ్లు మూడున్నాయి. అవినీతిపరుడైన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించడం. విద్యార్థులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవడం. ప్రధానమంత్రి విద్యార్థులకు క్షమాపణ చెప్పడం... ఈ మూడు డిమాండ్లు నెరవేర్చకుండా ఎలాంటి చర్చ జరగదు’అని తేల్చి చెప్పారు. -
అణచివేయాలని చూస్తే ప్రభుత్వాన్ని తొక్కేస్తారు
సాక్షి, హైదరాబాద్: ‘ప్రధాని మోదీ ఎవరితో పెట్టుకోకూడదో వారితోనే పెట్టుకున్నారు. యువతరం సీబీఐ, ఈడీ దాడులకు భయపడే రకం కాదు.. వారి స్వరం మారుతోంది. శ్రీలంకలో ఈ యువతరమే ప్రభుత్వాన్ని పాతరవేసింది. తమ హక్కుల కోసం పోరాడుతున్న యువతరాన్ని తీవ్ర వాదులు, దేశద్రోహులు పాకిస్తానీలంటూ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఆగ్రహంతో ఉన్న యువత స్వరాన్ని అణచివేయాలని చూస్తే మీ ప్రభుత్వాన్ని ఒక్కో మెట్టు ఎక్కి తొక్కుతారు..’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హెచ్చరించారు. ఢిల్లీలో విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం అణిచివేతకు, దాష్టీకానికి పాల్పడుతోందని విమర్శిస్తూ భారత్ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (బీఆర్ఎస్వీ) శుక్రవారం ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో కేటీఆర్ ప్రసంగించారు. ‘లీక్ ఇన్ ఇండియా’గా మార్చేశారు.. ‘ఏ రాజకీయ నాయకుడి అండ లేకున్నా దేశ నలుమూలల నుంచి వేలాది మంది ఢిల్లీ జంతర్ మంతర్‌కు తరలి వస్తున్నారు. యువత ఆగ్రహం కేవలం నీట్ పేపర్ లీక్‌కు సంబంధించినదే కాదు. 12 ఏళ్లుగా కేంద్రంలోని బీజేపీ చేస్తున్న మోసాలు, ద్రోహాలపై వారు మండిపడుతున్నారు. పాలనను పక్కదోవ పట్టిస్తూ మతం పేరిట ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పుకుంటున్న తీరును యువత అర్ధం చేసుకుంది. మేకిన్ ఇండియా అడిగితే ‘లీక్ ఇన్ ఇండియా’ను ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం నుంచి యువతరం జవాబుదారీతనాన్ని కోరుకుంటోంది. విద్యార్థులకు జరుగుతున్న నష్టాన్ని చూడలేక బీఆర్ఎస్ చేపట్టిన నిరసన వెనుక ఎలాంటి రాజకీయం లేదు.ఇద్దరు పిల్లలకు తండ్రిగా విద్యార్థులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిరసనలో పాల్గొంటున్నా. యువతరం ప్రధాన మంత్రి కుర్చీనో, కేంద్ర మంత్రి పదవినో అడగడం లేదు. తమకు న్యాయం చేసి, భవిష్యత్తును కాపాడమని అడగడంలో అన్యాయం ఏముంది? మీడియా మద్దతు లేకున్నా సోషల్ మీడియా అండతో జెన్ జీ యువత దేశాన్ని కదిలిస్తోంది. 50 ఏళ్ల క్రితం ‘జీనాహైతో మర్నా సీఖో.. కదం కదం పర్ లడ్నా సీఖో’అంటూ తెలంగాణ గడ్డ మీద నుంచి ఒక యువకుడు ఇచ్చిన నినాద బలంతో దేశ యువత ప్రస్తుతం పోరాడుతోంది..’అని కేటీఆర్ అన్నారు. భవిష్యత్తు నిర్మాతలు మేల్కొన్నారు.. ‘రష్యా ఉక్రెయిన్ యుద్దాన్ని ఆపినట్లు చెప్పుకున్న ప్రధాని ఢిల్లీలో పిల్లల మీద జరుగుతున్న దాడిని ఎందుకు ఆపడం లేదు? మోదీకి వ్యతిరేకంగా గొంతు విప్పితే నొక్కేసే ప్రయత్నం చేస్తూ మీడియాను అడ్డుపెట్టుకుని వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. ఈ దేశ భవిష్యత్తు నిర్మాతలు మేల్కొన్నారు. మీడియాతో ఎజెండాను సెట్ చేసే రాజకీయం ఇకపై నడవదు. కాక్రోచ్లు ఢిల్లీలో దండయాత్ర చేస్తున్నాయి. పిల్లలు గర్జిస్తుంటే విశ్వ గురువు నోరు విప్పడం లేదు. ‘పరీక్షా పే చర్చా’అంటూ ప్రసంగాలు చేసే ప్రధాని ప్రశ్నపత్రాల లీక్‌లకు సమాధానాలు చెప్పాలి. విద్యార్థుల డిమాండ్ మేరకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. విద్యార్థులపై దాష్టీకానికి పాల్పడి అక్రమ కేసులు నమోదు చేయడంపై క్షమాపణ చెప్పడంతో పాటు పోలీసు కేసులను వెనక్కి తీసుకోవాలి. రేప్ కేసుల్లో నిందితులుగా ఉన్న కేంద్ర మంత్రులు కుమారులకు బెయిల్ సులభంగా వస్తోంది కానీ పేపర్ లీక్‌లపై ప్రభుత్వం నుంచి సమాధానం ఎందుకు రావడం లేదో బీజేపీ నేతలు చెప్పాలి. రాజకీయ ఎజెండాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. ఢిల్లీలో యువత, విద్యార్థులు చేస్తున్న పోరాటాన్ని పా ర్టీల జెండాలు, ఎజెండాలతో కలుషితం చేయొద్దు. ఎజెండాను హైజాక్ చేసే ప్రయత్నాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలి. స్వతంత్రంగానే మీ ఎజెండా మేరకు మీ ఉద్యమాన్ని కొనసాగించండి. పా ర్టీలతో కలిసి మీరు కొట్లాడితే మిమ్మల్ని ఆయా పార్టీల ఏజెంట్లు అని మీ ఉద్యమాన్ని, మీ డిమాండ్లను బలహీనపరిచే ప్రమాదం ఉంది. మీకు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. విద్యార్థులు, యువతకు అవసరమైన సమయంలో కేసీఆర్ వెంట నిలుస్తారు. కేంద్రం దిగి వచ్చే దాకా విద్యార్థులకు అండగా ఉంటాం..’అని కేటీఆర్ చెప్పారు. నేను తప్పు చేస్తే నిరూపించి ఉరితీయించు ‘పేపర్ లీక్ అంశంపై రేవంత్‌రెడ్డి నాపై దు్రష్పచారం చేస్తున్నారు. నేను తప్పు చేస్తే నిరూపించి నన్ను ఉరి తీయి. నేను మోదీని ప్రశి్నస్తే రేవంత్‌రెడ్డి అనే కేడీకి కోపం ఎందుకు వస్తోంది? ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఢిల్లీలో కొట్లాడుతుంటే నల్లమల పులిని అని చెప్పుకునే రేవంత్ పిల్లిలా కొడంగల్‌లో దాక్కున్నాడు. రేవంత్ కూతురునో, మనవడినో ఢిల్లీలో పిల్లలను కొట్టినట్లు కొడితే ఆయన ఊరుకుంటాడా. దేశమంతా మోదీ, ధర్మేంద్ర ప్రధాన్‌ను ప్రశి్నస్తుంటే రేవంత్ మాత్రం కేటీఆర్, కేసీఆర్‌ను విమర్శిస్తున్నాడు..’అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన యువత బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ, ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, దేవిరెడ్డి సు«దీర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, పార్టీ నేతలు ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. -
నిరసనలపై విచారణ 27న రెండు పిల్స్‌పై విచారిస్తాం
న్యూఢిల్లీ: జంతర్‌మంతర్‌లో విద్యార్థులపై పోలీసుల దాష్టీకంపై ఈ నెల 27న విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు శుక్రవారం ప్రకటించింది. ఈ అంశంపై దాఖలైన రెండు వేర్వేరు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారణ చేస్తామని ఛీఫ్ జస్టిస్ సూర్యకాంత్ యాదవ్ జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహనలతో కూడిన బెంచ్ తెలిపింది. ‘‘విద్యార్థులపై పోలీసులు అతిగా బలం ఉపయోగించారు’’అని, ఇది రోజూ జరుగుతున్నందున అత్యవసరంగా విచారణ జరపాలని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ ప్రస్తావించగా సీజేఐ స్పందించారు. నీట్ పరీక్ష పత్రాల లీకేజీలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ నెలరోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జూలై 20వ తేదీన నిర్వహించిన ‘ఛలో సంసద్’ర్యాలీలో పోలీసులు విద్యార్థులపై లాఠీలతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో పలువురు గాయపడగా పోలీసుల చర్యను గర్హిస్తూ జూలై 22న ఢిల్లీ హైకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయ. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు కేంద్రం, ఢిల్లీ పోలీసుల స్పందనను కోరింది. పోలీసుల చర్యకు సంబంధించిన అన్ని రికార్డులను, సీసీటీవీ ఫుటేజ్‌లను భద్రపరచాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. మీడియాది అతి నిర్లక్ష్యం: సీజేఐ ఛలో సంసద్ సందర్భంగా విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్ అంశంపై సత్వర విచారణను తాను నిరాకరించినట్లు వచ్చిన వార్తలను సీజేఐ సూర్యకాంత్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. ఆ అంశంపై ఎలాంటి రిట్ పిటిషన్ దాఖలు కాలేదని, ఒక రిప్రెజెంటేషన్ మాత్రమే అందిందని ఆయన శుక్రవారం వ్యాఖ్యానించారు. తమ కేసులను అత్యవసరంగా లిస్ట్ చేయాలని న్యాయవాదులు కోరుతున్న సమయంలో సీజేఐ మాట్లాడుతూ ‘‘రెండు రోజులుగా పిటిషన్ ఫైల్ అయినట్లు తప్పుడు ప్రచారం జరుగుతోంది. మీడియా అన్ని రకాల బాధ్యతల నుంచి తప్పించుకని చీఫ్ జస్టిస్ ఆ పిటిషన్‌ను లిస్ట్ చేసేందుకు నిరాకరించారని తప్పుడు రిపోరి్టంగ్ చేస్తోంది’’అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఆ రోజు ఉదయం పదిగంటల వరకూ ఒక్క కాగితమూ దాఖలు కాలేదు. ఒక రిప్రజెంటేషన్ మాత్రమే.. మిశ్రానో ఇంకెవరో పంపారు. దాన్ని రిట్ పిటిషన్‌గా ఎలా పరిగణిస్తా’’అని ప్రశ్నించారు. బుధవారం ఒక న్యాయవాది విద్యార్థులపై లాఠీఛార్జ్ విషయమై అత్యవసర విచారణ జరపాలని సీజేఐని కోరుతూ.. ‘‘పోలీసుల అకృత్యాలపై నా దగ్గర వీడియోలున్నాయి.... కేసు రేపు (గురువారం) లిస్ట్ చేయగలిగితే... విద్యార్థులు ఉన్నారు’’అని విన్నవించారు. అయితే సీజేఐ ఈ విజ్ఞప్తిని తిరస్కరించడంతోపాటు కేసులు ప్రస్తావించే సమయంలో వీడియోలు చూడలేమని స్పష్టం చేశారు. విద్యార్థులను బాగా కొట్టారని న్యాయవాది తెలపగా.. ‘‘మా సమయం వృథా చేయవద్దు. మేము వీడియోలు చూడదలచుకోలేదు’’అని ఘాటుగా సమాధానమిచ్చారు. -
భగ్గుమన్న విద్యార్థులు
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: ‘నీట్’ నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యంపై నిరసన ర్యాలీలు.. ఎన్టీఏ రద్దు... ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద యువత దీక్షలకు మద్దతుగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి, యువజన సంఘాలు నిర్వహించిన విద్యాసంస్థల బంద్ ప్రశాంతంగా జరిగింది. ప్రైవేట్ విద్యాసంస్థలు, ఇంజనీరింగ్, ఐటీఐ తదితర వృత్తివిద్యా కళాశాలలు దాదాపుగా మూతపడ్డాయి. విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ పిలుపుతో స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి. కేంద్ర మానవ వనరుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. నీట్ లీకేజ్‌తో దేశంలో సుమారు 24 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని మండిపడ్డాయి. మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయంలో ఫార్మసీ పరీక్షలను నిలిపివేయడంతో పోలీసులు అక్కడికి చేరుకుని యూనియన్ నాయకులను బందరు రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఒంగోలు కలెక్టరేట్ వద్ద బైఠాయించి నిరసన తెలుపుతున్న విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. అమలాపురం, కాకినాడ, రాజమహేంద్రవరం, రాజానగరంలో విద్యార్థులు ధర్నాలు చేపట్టారు. పలుచోట్ల ద్విచక్ర ర్యాలీలు నిర్వహించారు.అనంతపురంలోని కేఎస్ఆర్ ప్రభుత్వ బాలికల పాఠశాల వద్ద విద్యార్థి, యువజన సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పుట్టపర్తిలోని గణేష్ కూడలిలో ఉరితాడుతో నిరసన తెలిపి దున్నపోతుకు వినతిపత్రం అందజేశారు. కడపలో పాఠశాలల వద్ద విద్యార్థి సంఘాలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పత్తికొండలో పీటీఎం సమావేశాలను విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. కాగా, విద్యార్థుల న్యాయమైన పోరాటంపై ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ నిందలు వేసి తప్పుడు ఆరోపణలు చేయడాన్ని విద్యార్థి, యువజన సంఘాలు తీవ్రంగా ఖండించాయి. -
నీట్ నిరసనల్లో బిగ్‌ట్విస్ట్.. 400 మంది క్రిమినల్స్ ?
సాక్షి, ఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనలపై ఢిల్లీ పోలీసులు కీలక ప్రకటన చేశారు. జూలై 20 నుండి జూలై 24 మధ్య జంతర్ మంతర్ దాని పరిసర ప్రాంతాలలో నేర చరిత్ర ఉన్న సుమారు 400 మంది వ్యక్తులను ఢిల్లీ పోలీసుల ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ గుర్తించినట్లు తెలిపారు. వీరిలో కొందరికి జూలై 20న జరిగిన హింసాత్మక ఘటనలు, విధ్వంసంతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.నీట్ లీకేజ్‌పై నిరసనలతో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జులై 20 న భారీగా హింస చేలరేగిన సంగతి తెలిసిందే. తాజాగా పోలీసులు దానిపై విచారణను ముమ్మరం చేశారు. ఆ రోజున జరిగిన హింసాత్మక ఘటనల్లో నేరస్థులకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు గుర్తించిన నేర చరిత్ర కలిగిన వ్యక్తులలో సాహిల్, మనోజ్ కుమార్, రూబల్ సాహిల్ సైఫీ ఉన్నారు. నిరసన సమయంలో వీరు ఏవైనా వ్యవస్థీకృత ముఠాలలో భాగస్వాములుగా ఉన్నారా లేదా అనే అంశాన్ని పోలీసులు తనిఖీ చేస్తున్నారు.పార్లమెంట్ వర్షాకాల సమావేశాల మొదటి రోజున, 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) చేపట్టిన 'చలో సన్సద్' మార్చ్‌లో వేలాది మంది నిరసనకారులు పాల్గొన్నారు. విద్యా సంస్కరణలు చేపట్టాలని మరియు పరీక్షల్లో అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. హై-సెక్యూరిటీ జోన్‌లోని బారికేడ్లను బద్దలు కొట్టడానికి నిరసనకారులు ప్రయత్నించడంతో జూలై 20న హింస చెలరేగింది. తాజాగా దీనిపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. -
రాజీనామాకు నో... పేపర్ లీక్ తో ధర్మేంద్ర ప్రధాన్ కు లింకా?
-
NTAపై కేంద్రం కీలక ప్రకటన.. 47మందిని తొలగిస్తూ ఉత్తర్వులు
సాక్షి,న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ అంశంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో విద్యాశాఖలో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్టీఏ నుంచి 47మందిని తొలగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పనితీరుపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు, పలు విద్యార్థి సంఘాలు ఢిల్లీలో ఆందోళనలను ఉధృతం చేసిన నేపథ్యంలో ఈ చర్యలకు శ్రీకారం చుట్టింది.పరీక్షా పత్రాల లీక్ ఆరోపణలు, పరీక్షల నిర్వహణలో పారదర్శకత, సంస్కరణల కోసం పెరుగుతున్న డిమాండ్ల నేపథ్యంలో ఎన్టీఏ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి బలోపేతం చేయాలని కేంద్రం నిర్ణయించింది. దేశంలో జేఈఈ , నీట్ సహా సుమారు 20 జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలను ఎన్టీఏ నిర్వహిస్తోంది. -
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా? చేయరా?
కేంద్రం, సీజేపీ మధ్య చర్చలు కొలిక్కిరాలేదు.. కేంద్రం ముందు మూడు డిమాండ్లు ఉంచిన సీజేపీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని పట్టుబడుతోంది. ప్రధాన్ రాజీనామాపై రేపటి వరకు కేంద్రం గడువు కోరింది. ప్రధాన్ రాజీనామా చేసేవరకు ఉద్యమం ఆగదని సీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు. డిమాండ్లపై రేపు మధ్యాహ్నం వరకు వేచి చూస్తామన్న సీజేపీ.. జంతర్‌మంతర్‌లో ఆందోళనలు కొనసాగుతాయని పేర్కొంది.అయితే.. ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తప్పించే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని ప్రభుత్వ వర్గాల సమాచారం. సమస్యలకు రాజీనామా పరిష్కారం కాదని.. జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ)లో ఉన్న లోపాలను సరిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్‌కు పూర్తి మద్దతుగా నిలుస్తోందని, ఆయన రాజీనామా చేసే పరిస్థితి లేదని తెలుస్తోంది.ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. మంత్రి రాజీనామా నిర్ణయం సులభమే.. కానీ దాంతో సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించదని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజలు స్పష్టమైన ప్రజా తీర్పు ఇచ్చారని.. ఆ బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తామని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా, నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.ఈ నిరసనలకు నాయకత్వం వహిస్తున్న జనతా పార్టీ (సీజేపీ) ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. మంత్రి పదవికి రాజీనామా చేసే వరకు తమ ఆందోళనలను విరమించబోమని పార్టీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. అయితే, ప్రభుత్వం మాత్రం సమస్యల మూలాలను పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది.జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ)లో ఉన్న లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా రాజకీయంగా దుమారం రేపుతున్న నేపథ్యంలో, ఒకవైపు ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతుండగా, మరోవైపు వ్యవస్థలో సంస్కరణలు చేపట్టి పరీక్షల నిర్వహణను మరింత పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు చెబుతోంది. -
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సస్పెన్స్ ఒకరోజు గడువు కోరిన కేంద్రం
-
మీ పోరాటానికి నా సెల్యూట్: డైరెక్టర్ శేఖర్ కమ్ముల
నీట్ పేపర్ లీకేజీపై జెన్ జీ చేస్తోన్న పోరాటంపై టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల స్పందించారు. మీ పోరాటానికి నా సెల్యూట్ అంటూ కొనియాడారు. నీట్ పేపర్ లీక్ కి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా.. నీట్ పేపర్ లీక్ వలన ఆత్మహత్య చేసుకున్న పిల్లల కుటుంబాలకి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మళ్లీ ఇలాంటివి జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచించారు. ఏ ప్రభుత్వమైనా ఇవన్నీ అడక్కుండా చేయాల్సిన పనులని అన్నారు. ఈ చిన్న డిమాండ్లు సాధించుకోడానికా లక్షల మంది పిల్లలు లాఠీ దెబ్బలు తిని రక్తమోడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తిండీతిప్పలు మాని దెబ్బలకి ఓర్చుకుని, రాత్రనకా పగలనకా ఉద్యమిస్తున్నారని ప్రశంసించారు. పిల్లలు అకౌంటబిలిటీ అడుగుతున్నారు.. వారి ఆవేదనలో న్యాయం ఉందని తెలిపారు. ప్రభుత్వం వాళ్ల మాట వినాలి.. వాళ్లకి భరోసా ఇవ్వాలి. వాళ్ల స్ఫూర్తిని గెలిపించాలని శేఖర్ కమ్ముల కోరారు. మన పిల్లలు గెలిస్తే దేశం గెలిచినట్టు...మన పిల్లలు గెలిస్తే మనం బ్రతికినట్టు.. ప్రజలు గెలిస్తే ప్రభుత్వాలు గెలిచినట్టు.. అని సందేశమిచ్చారు. డియర్ జెన్ జీ.. మీరు చేస్తున్న ఈ పోరాటానికి చేతులెత్తి దణ్ణం పెడుతున్నా.. మీకు సెల్యూట్ చేస్తున్నా అంటూ ఫేస్ బుక్‌లో శేఖర్ కమ్ముల పోస్ట్ చేశారు. -
అస్సలు సోనమ్ వాంగ్ చుక్ ఎవరు? : అభిజిత్ దీప్కే
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ అంశంపై దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఉద్యమం ఇప్పుడు కొత్త రాజకీయ మలుపు తిరిగింది. ఈ పోరాటానికి అసలు నాయకత్వం ఎవరిది? ఉద్యమ క్రెడిట్ ఎవరికి దక్కాలి? అనే అంశాలపై రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమించడంపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.అస్సలు సోనమ్ వాంగ్‌చుక్ ఎవరు? ఆయన దీక్ష విరమిస్తే ఉద్యమం ఎందుకు ఆగాలి? అంటూ అభిజిత్ దీప్కే ప్రశ్నించారు. ఈ ఉద్యమం ఏ ఒక్క వ్యక్తికి సంబంధించినది కాదని, దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ప్రజా ఉద్యమమని స్పష్టం చేశారు.వాంగ్‌చుక్ దీక్ష విరమించడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే తమ పోరాటం మాత్రం ఆగదని అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు. ఈ ఉద్యమం కేవలం సోనమ్ వాంగ్‌చుక్‌ది కాదు. నాది కాదు. అలాగే ఏ రాజకీయ పార్టీది కూడా కాదు. ఇది విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కొనసాగే ప్రజా ఉద్యమం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు జంతర్‌మంతర్‌లో మా ఆందోళన కొనసాగుతుంది’ అని ఆయన వెల్లడించారు.వాంగ్‌చుక్ నిర్ణయం సరైంది కాదుఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ సోనమ్ వాంగ్‌చుక్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ మాట్లాడుతూ.. వాంగ్చుక్ను సామాజిక కార్యకర్త అన్నా హజారేతో పోల్చారు. అన్నా హజారే ఓ దశలో ఉద్యమం తర్వాత మౌనంగా వహించినట్లే ఇప్పుడు వాంగ్‌చుక్ కూడా అదే దారిలో నడుస్తున్నారు’అని వ్యాఖ్యానించారు.విద్యార్థుల ప్రతినిధులు లేకుండానే ప్రభుత్వ ప్రతినిధులతో మూసి తలుపుల వెనుక సమావేశమై వ్యక్తిగత ఒప్పందం కుదుర్చుకున్న తర్వాతే వాంగ్‌చుక్ దీక్షను విరమించారని మసూద్ ఆరోపించారు. ఏ హామీల ఆధారంగా, ఏ పరిస్థితుల్లో దీక్ష విరమించారో దేశ ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. రాజకీయ ప్రయోజనాల కోసం సోనమ్ వాంగ్‌చుక్ వంటి నిష్కళంక పర్యావరణవేత్తపై కాంగ్రెస్ అనవసర ఆరోపణలు చేస్తోందని బీజేపీ నేతలు మండిపడ్డారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ స్వయంగా వాంగ్చుక్ను కలిసి ప్రభుత్వ చర్యలను వివరించారని, పేపర్ లీకేజీలపై కఠిన చట్టాలు, ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటు వంటి అంశాలపై స్పష్టమైన హామీలు ఇచ్చిన తర్వాతే ఆయన గౌరవప్రదంగా దీక్షను విరమించారని బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ తెలిపారు.అయితే ఈ వివాదాల మధ్య అభిజిత్ దీప్కే చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు ప్రధాన చర్చగా మారాయి. ఒక వ్యక్తి నిర్ణయంతో ఉద్యమాలు ముగిసిపోవని, ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. దీంతో నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం కేవలం పరీక్షల అవకతవకల అంశంగానే కాకుండా రాజకీయ పరంగా కూడా మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
కాంగ్రెస్ కుట్రలపై కిషన్ రెడ్డి రియాక్షన్
-
150 పిజాలు, రూ. 75 వేలు : జంతర్ మంతర్‌లో మానవత్వపు పరిమళాలు
న్యూఢిల్లీ: నీట్ (NEET) పేపర్ లీక్ వివాదంపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థుల కోసం నాగాలాండ్‌కు చెందిన ఒక వ్యక్తి చేసిన వినూత్నసహాయం సోషల్ మీడియాలో పలువురి హృదయాలను గెలుచుకుంది. ఏకంగా 150 పిజాలు ఆర్డర్ చేసి, ఆకలిగా ఉన్నవారికి ఇవ్వండి అంటూ మానవత్వాన్ని చాటుకున్న వైనం విశేషంగా నిలుస్తోంది.నాగాలాండ్‌కు చెందిన 'ఝా-లౌ' (Zha-Lhou) అనే వ్యక్తి సుమారు 2,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఊరి నుంచే డొమినోస్ యాప్ ద్వారా 150 "చీజ్ బర్స్ట్" (Cheese Burst) పిజాలను ఆర్డర్ చేసి నేరుగా జంతర్ మంతర్‌కే డెలివరీ చేయించారు. జులై 22న కొరియన్ స్వీట్ చిల్లీ, ఫార్మ్‌హౌస్ రకాలకు చెందిన పిజాలకు మొత్తం బిల్లు రూ. 67,734.18 అయింది. మరో రూ. 5,000 విలువైన బిస్కెట్లను కూడా ఆర్డర్ చేశారు.పిజాలు డెలివరీ చేయడానికి వచ్చిన డెలివరీ బాయ్ ఈ ఆర్డర్ ఎవరికి ఇవ్వాలి? అని ఫోన్ చేసి అడగ్గా, అక్కడ ఇంకా ఆహారం తినకుండా ఆకలితో ఉన్న విద్యార్థులు ఎవరైనా సరే, వారికి ఇచ్చేయండి అని ఝా-లౌ చెప్పారు.అంతేకాదు ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించడం వైరల్‌గా మారింది. "నేను నాగాలాండ్‌లో ఉన్నాను, వేలాది మంది విద్యార్థులు మంచి భవిష్యత్తు, న్యాయమైన విద్యా వ్యవస్థ కోసం జంతర్ మంతర్ వద్ద పోరాడుతున్నారు. ప్రత్యక్షంగా అక్కడ ఉండలేకపోయాను, కాబట్టి నా వంతుగా నేను చేయగలిగిన చిన్న సహాయం ఇది" అని ఆయన తన ఇన్స్టాగ్రామ్ (@adiespoems) ఖాతాలో పేర్కొన్నారు.ఇదీ చదవండి: ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించేదాకా, చర్చల ప్రసక్తే లేదు : రాహుల్ గాంధీఅంతేకాకుండా, ప్రశంసల కోసం తాను ఈ పోస్ట్ పెట్టలేదని, ఇతరులకు కూడా తమకు తోచిన రీతిలో సహాయం చేసేందుకు ప్రేరణగా ఉంటుందని మాత్రమే షేర్ చేశానని తెలిపారు. ఆ తర్వాత విద్యార్థుల కోసం మరో రూ. 5,000 విలువైన బిస్కెట్లను కూడా ఆర్డర్ చేసినట్లు ఆయన వెల్లడించారు.ఇదీ చదవండి: ఐఫోన్ రాలేదు, ఆయిల్ వచ్చింది.. కట్ చేస్తే రూ. 1.81 లక్ష -
GEN Zతో పెట్టుకున్నావ్.. యువతకు పొట్టు పొట్టు ఆకలి ఉంది..
-
ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించేదాకా, చర్చల ప్రసక్తే లేదు : రాహుల్ గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ: నీట్ వ్యవహారంలో చర్చలపై లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల ప్రధానమైన మూడు డిమాండ్లను నెరవేర్చేవరకు చర్చలు జరిపే సమస్యే లేదని తేల్చి చెప్పారు. సభలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చేసిన ప్రకటనపై రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమస్యపై సభలో తాను స్పందించాలనుకున్నప్పుడు తన మైక్ లాగేసుకున్నారని విమర్శించారు. అలాగే విద్యార్థుల డిమాండ్స్ ప్రకారం నీట్ పేపర్ లీక్‌కు బాధ్యుడు, అవినీతిపరుడైన విద్యాశాఖ మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని, విద్యార్థులపై దాడి చేసి కొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని, ప్రధాని విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాన్‌ను తొలగించే వరకు చర్చలుండవంటూ ప్రతిపక్షం వైఖరిని స్పష్టం చేశారు. ఈ తీవ్ర వాదోపవాదాల మధ్య సోమవారానికి లోక్‌సభ వాయిదా పడింది.ఇదీ చదవండి: నీట్ ఆందోళనలకు సుప్రీంకోర్టు లాయర్ల మద్దతు, రాజ్యాంగ ప్రవేశిక పఠనం #WATCH | Delhi: "...the students have three demands: 1) Corrupt Education Minister has to go, 2) Action against those who attacked students and beat them up, 3) PM should apologise to the students. These are the 3 conditions. We are not going to have any conversation, any… pic.twitter.com/3KrKv60CIL— ANI (@ANI) July 24, 2026 -
NEET పేపర్ లీక్ పై మోదీ సంచలన వీడియో
-
బూటు కాళ్లతో తన్ని.. పిడిగుద్దులు గుద్ది..
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జిని ఖండించడంతోపాటు నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యతగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, యువజన సంఘాలు విజయవాడలో చేపట్టిన చలో లోక్‌భవన్ కార్యక్రమం గురువారం ఉద్రిక్తంగా మారింది. విద్యార్థి సంఘాలు ఆందోళనకు పిలుపునివ్వడంతో ముందస్తుగా పోలీసులు లోక్‌భవన్‌కు వెళ్లే మార్గాలన్నింటినీ దిగ్బంధించారు. మ్యూజియం రోడ్డు, బందరు రోడ్డులో అడుగడుగునా బారికేడ్లు ఏర్పాటుచేశారు. పోలీసులు భారీగా మోహరించారు.శాంతియుతంగా ర్యాలీ చేస్తూ లోక్‌భవన్‌కు వెళ్తున్న విద్యార్థులను అడుగడుగునా అడ్డుకున్నారు. అయినా అన్ని ఆటంకాలను అధిగమించి విద్యార్థులు, యువకులు భారీగా మ్యూజియం రోడ్డు నుంచి బందరు రోడ్డుకు చేరుకోవడంతో పోలీసులు అవాక్కయ్యారు. వారిని అడ్డుకునేందుకు తీవ్రంగా యత్నించారు. అయినా విద్యార్థులు బారికేడ్లను నెట్టుకుంటూ లోక్‌భవన్‌కు వెళ్లేందుకు బందరు రోడ్డు వెంట పరుగులు తీశారు. దీంతో పోలీసులు వారి వెంటపడ్డారు. ఈ సమయంలో పోలీసులు, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది.సివిల్ దుస్తుల్లో ఉన్న కొందరు పోలీసులు విద్యార్థులను రోడ్డుపై పడేసి కాలర్లు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లారు. వారిపై పిడిగుద్దులు కురిపించారు. రోడ్డుకేసి కొడుతూ బూటుకాళ్లతో తన్నారు. విద్యార్థినులు, యువతులపైనా విచక్షణారహితంగా దాడిచేశారు. దీంతో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. కొందరు సొమ్మసిల్లి పడిపోయారు. ఒకరిద్దరు పోలీసులు విద్యార్థి సంఘాల కండువాలు కప్పుకుని మరీ విద్యార్థులపై దాడికి పాల్పడడం గమనార్హం. ఏఎస్సై రవికుమార్ ఓ విద్యార్థిపై దాడి చేయడంతో మిగిలిన విద్యార్థులు ఆయనను అడ్డుకున్నారు.రోడ్డుపై బైఠాయింపు అనంతరం.. విద్యార్థి సంఘాల ప్రతినిధులను లోక్‌భవన్‌కు తీసుకెళ్తామని, గవర్నర్ అపాయింట్మెంట్ ఇప్పిస్తామని పోలీసు అధికారులు నమ్మబలికారు. అయితే, అపాయింట్మెంట్ ఇప్పించే వరకు వెనక్కు వెళ్లేది లేదంటూ మ్యూజియం రోడ్డులో విద్యార్థులు భైఠాయించారు. గంట తర్వాత గవర్నర్ అపాయింట్మెంట్ దొరకలేదని, వెనక్కు వెళ్లిపోవాలని పోలీసులు చెప్పడంతో పరిస్థితి మరోసారి ఉద్రిక్తంగా మారింది. లోక్‌భవన్‌కు వెళ్లేందుకు విద్యార్థులు ముందుకు కదిలారు. దీంతో ఆగ్రహించిన పోలీసులు మరోసారి వారిపై దాడి చేశారు. ఈడ్చిపడేస్తూ మ్యూజియం రోడ్డులోకి నెట్టేశారు.పోలీసుల దాడిని విద్యార్థులు ప్రతిఘటించారు. పోలీసుల తీరు, చంద్రబాబు సర్కారు వైఖరిపై విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కె. ప్రసన్నకుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వలరాజు, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు భాస్కర్ తదితరులు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా శుక్రవారం జరపతలపెట్టిన రాష్ట్ర బంద్‌ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. -
రాజకీయ మనుగడ కోసమే అరాచకాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఇటీవల జరిగిన ప్రవేశపరీక్షల పత్రాల లీకేజీలను అడ్డుపెట్టుకొని కాంగ్రెస్, వామపక్ష పారీ్టలు రాజకీయ మనుగడ కోసం అరాచకాలకు పాల్పడుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. విద్యార్థులను కవచంగా వాడుకుంటూ దేశ వ్యతిరేక శక్తులు, తుక్డే గ్యాంగులతో కలిసి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయని ఆరోపించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ షహీన్‌బాగ్ తరహాలో దేశంలో అలజడి సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. నీట్ లీకేజీపై తక్షణ చర్యలు తీసుకున్నాం... నీట్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో 17 మందిని సీబీఐ అరెస్టు చేసిందని కిషన్‌రెడ్డి వెల్లడించారు. పబ్లిక్ ఎగ్జామినేషన్ చట్టం ద్వారా దోషులకు కఠిన శిక్షలు పడేలా ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ద్వారా విచారణ జరిపిస్తామని ప్రధాని హామీ ఇచ్చారన్నారు. రెండోసారి పకడ్బందీగా పరీక్ష నిర్వహించామని.. విద్యార్థులంతా సంతోషంగా ఉన్నారని కిషన్‌రెడ్డి చెప్పారు. ప్రతిపక్షాలకు దమ్ముంటే పార్లమెంటులో ప్రజాస్వామ్యబద్ధంగా చర్చకు రావాలని కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. టెన్త్ పేపర్ లీకైనప్పుడు రేవంత్ రాజీనామా చేయలేదేం? గతంలో కాంగ్రెస్ హయాంలో ఎన్నో ప్రశ్నపత్రాల లీకేజీలు జరిగినా ఏనాడూ బాధ్యత వహించని నేతలు, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వ రాజీనామాను డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాహుల్ గాంధీ, రేవంత్‌రెడ్డిలకు రాజీనామాలు అడిగే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. 2025లో టెన్త్ పేపర్ లీక్ అయినప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్‌రెడ్డి ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. 2026లో జగిత్యాలలోని జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో బీఎస్సీ పేపర్ లీక్ అయినప్పుడు కాంగ్రెస్ మంత్రులతో రాజీనామా చేయించారా అని నిలదీశారు. దీనిపై సమాధానం చెప్పాకే రేవంత్‌రెడ్డి నీట్ వ్యవహారంపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. -
కొడంగల్‌లో ధర్నా రాజకీయ నాటకం
సాక్షి ప్రతినిధి, వరంగల్: నీట్ పరీక్ష ఉదంతంపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా ప్రధాని నరేంద్రమోదీ పేరును ప్రస్తావించడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఈ విషయంపై రాజ్ భవన్ ముందు ధర్నా చేయాల్సిందిపోయి కొడంగల్‌లో ధర్నా చేయడం రాజకీయ నాటకమేనన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు, మంత్రులు హైదరాబాద్‌లో ధర్నా చేస్తే ఆయన కొడంగల్‌కు పోయి అక్కడ ధర్నా చేయడం ఏంటని ప్రశ్నించారు. ‘మోదీ అంటే రేవంత్‌కు భయం. ఆయన పగలు కాంగ్రెస్‌తో ఉంటాడు. రాత్రయితే బీజేపీతో కలుస్తాడు..’అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌కు ఒక మూట ఇస్తే బీజేపీకి రెండు మూటలు పంపుతున్నాడని ఆరోపించారు. సీఎంపై ఉన్న పాత కేసులను బీజేపీ ప్రభుత్వం తోడుతుందనే ఉద్దేశంతోనే ప్రధాని పేరును కూడా పలకడానికి భయపడుతున్నాడని విమర్శించారు. గురువారం హనుమకొండ జిల్లా మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్.. మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. బొగ్గు కుంభకోణంలో ఎవరున్నారో అందరికీ తెలుసు ‘ఇది మూటలు పంపే పాలన. ప్రజలకు ఉపయోగపడే ఏ పని రేవంత్ చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండి అమృత్ పథకం, ఇతర కాంట్రాక్టులను తన బంధువులకు ఇప్పించుకుంటున్నారు. బొగ్గు కుంభకోణంలో ఎవరున్నారో అందరికీ తెలుసు. ఆయన బామ్మర్ది సృజన్‌రెడ్డికి మేలు జరిగే విధంగా వ్యవహరించారు. కన్నెపల్లి నుంచి ఎందుకు లిఫ్ట్ చేయరు? బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన పనులేవీ కాంగ్రెస్ హయాంలో పూర్తి చేయడం లేదు. ఆ పనులు పూర్తి చేస్తే మాకు పేరొస్తుందని సీఎం భయపడుతున్నారు. దేవాదుల నుంచి నీటిని లిఫ్ట్ చేసినప్పుడు కన్నెపల్లి నుంచి ఎందుకు నీటిని పంపిణీ చేయరు? కన్నెపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేయకుండా తాము ఆపలేదని, అది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు ఇప్పటికే ప్రకటించారు..’అని కేటీఆర్ అన్నారు. నాలుగు పార్టీలు మారి హరీశ్‌రావుపై ఆరోపణలా? ‘హరీశ్‌రావు పార్టీ మారరు. బీఆర్ఎస్ పార్టీ లోనే తన పుట్టుక, చావు అని ఇప్పటికే పలుమార్లు హరీశ్‌రావు ప్రకటించారు. అయినా ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు. హరీశ్‌రావుపై నాలుగు పార్టీలు మారిన రేవంత్‌రెడ్డి కామెంట్ చేయడం విడ్డూరంగా ఉంది. ఎవరితోనూ పొత్తులుండవు.. రాబోయే ఎన్నికల్లో ఎలాంటి పొత్తులు ఉండవు. కవిత అంశంపై కూడా వ్యక్తులుగా కాకుండా వ్యవస్థలుగానే మాట్లాడతాం. కేసీఆర్ దయవల్లే మేమంతా ఉన్నాం. వచ్చే ఎన్నికల్లోపు నియోజకవర్గాల పునర్విభజన జరగొచ్చు. రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు 179 వరకు పెరిగే అవకాశం ఉంది. పునర్విభజన వల్ల నా నియోజకవర్గం మారే అవకాశం ఉంది. అధికారంలో ఉన్నప్పటికంటే ప్రతిపక్షంలో ఉండటమే నాకు ఎక్కువ సంతృప్తినిస్తోంది.ప్రజా సమస్యలపై అంశాల వారీగా ఉద్యమాలకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఇప్పటికే రైతులు, నిరుద్యోగులతో సమావేశాలు నిర్వహించాం. త్వరలో ఇతర వర్గాలతో కూడా సమావేశాలు చేపడతాం. నిరుద్యోగం, యువత సమస్యలు, రైతుల ఇబ్బందులపై బీఆర్ఎస్ మరింత దూకుడుగా పోరాటాలు కొనసాగిస్తుంది. అలాగే వచ్చే ఏడాది పాదయాత్ర కూడా చేస్తా. త్వరలోనే తేదీలు, వివరాలు ప్రకటిస్తాం. విద్యార్థుల ఆగ్రహం మోదీపైకి మళ్లింది.. దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష అంశంపై విద్యార్థుల ఆందోళనలు పెరుగుతున్నాయి. మొద ట కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను లక్ష్యంగా చేసుకున్న విద్యార్థులు ఇప్పుడు నేరుగా ప్రధాని మోదీని ప్రశ్నిస్తున్నారు. దేశంలో యువత, నిరుద్యోగుల్లో పెరుగుతున్న అసంతృప్తే దీనికి కారణం. మోదీ ప్రభుత్వం ఎవరితో పెట్టుకోవద్దో వారితోనే పెట్టుకుంది..’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సీఎం పదవి వారసత్వ హక్కు కాదు.. ‘ఈసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మీరు సీఎం అవుతారా? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు.. సీఎం పదవి అనేది వారసత్వ హక్కు కాదని కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన నాయకుడు, రాష్ట్ర సాధకుడు.. కేసీఆర్ కుమారుడిగా, ఈ తెలంగాణ బిడ్డగా రాష్ట్ర సాధన పోరాటంలో మమేకం అయినందుకు గర్వపడుతున్నానంటూ భావోద్వేగానికి గురయ్యారు. పదవులు ప్రజల అభీష్టం మేరకు వస్తాయని, ప్రజలు ఏది కోరుకుంటే అదే అవుతుందని అన్నారు. -
సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష విరమణ
సాక్షి, ఢిల్లీ: పర్యావరణ వేత్త సోనమ్‌వాంగ్‌చుక్ నిరాహార దీక్ష విరమింపచేశారు. గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ సమక్షంలో పండ్ల రసం తాగి దీక్షను విరమించారు. నీట్ లీకేజ్‌లపై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని గత 26 రోజులుగా సోనమ్ వాంగ్ చుక్ నిరహార దీక్ష చేస్తున్నారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించింది. ఈ నేపథ్యంలో ఆయన దీక్ష విరమించారు. ఈ కార్యక్రమంలో ఆయన భార్య గీతాంజలి అంగ్మో కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "నా దీక్షను విరమించినందుకు సంతోషంగా ఉంది. ఈ పోరాటంలో సహకరించిన అందరికీ, నా వెన్నంటి ఉన్న భార్య గీతాంజలికి నా ధన్యవాదాలు" అని తెలిపారు. దేశంలో విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని మరియు ప్రశ్నాపత్రాల లీకేజీలపై ప్రభుత్వం జవాబుదారీతనం వహించాలని డిమాండ్ చేస్తూ జూన్ 28న ఆయన ఈ నిరాహార దీక్షను ప్రారంభించారు.కాగా కొద్దిసేపటి క్రితమే ప్రధాని మోదీ ప్రకటన విడుదల చేశారు. భవిష్యత్తులో పేపర్ లీకేజ్‌లు కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు సోమవారం కేబినేట్ భేటీలో కీలక బిల్లు ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఒక వీడియో విడుదల చేశారు.మరోవైపు ఆయనకు మద్దతుగా కాక్రోజ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలు తీవ్ర ఉద్రిక్తకరంగా మారాయి. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలై పరిస్థితులు ఉద్రిక్తకరంగా మారిన సంగతి తెలిసిందే. -
నీట్ పేపర్ లీకేజ్‌పై మోదీ కీలక ప్రకటన
సాక్షి, ఢిల్లీ: నీట్ లీకేజ్‌పై నిరసనలు తీవ్ర తరమవుతున్న వేళ ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు కేంద్ర కేబినేట్లో పేపర్‌లీక్‌పై చర్యలు తీసుకుంటామన్నారు. పేపర్ లీకెజ్‌లపై కఠిన చర్యలు తీసుకునేలా నిర్ణయాలుంటాయని తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.ఈ వివరాలను మోదీ స్వయంగా వెల్లడించారు.రీఎగ్జామ్ తర్వాత విద్యార్థులు సంతోషంగా ఉన్నారని విద్యాసంవత్సరం వృథా కాకూడదని తిరిగి పరీక్ష నిర్వహించామని మోదీ తెలిపారు. లక్షలాది మంది విద్యార్థుల హృదయాలను పేపర్ లీకేజ్‌లు గాయపరిచాయన్నారు. పరీక్ష విధానంలో సంస్కరణలు తెస్తామని తెలిపారు. ఈ మేరకు సోమవారం సభలో ప్రత్యేక బిల్లును ప్రవేశపెడతామని తెలిపారు. అదేవిధంగా నీట్ పేపర్ లీక్ బాధ్యులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో వీడియో విడుదల చేశారు. More strict actions against paper leaks to come in tomorrow’s Cabinet! pic.twitter.com/NRysBukk5U— Narendra Modi (@narendramodi) July 23, 2026 -
వాటర్ కానన్ ప్రయోగించిన పోలీసులు.. తడుస్తూ విద్యార్థుల డ్యాన్స్
న్యూఢిల్లీ: నీట్ ప్రశ్నపత్రం లీక్‌పై బిహార్ రాజధాని పట్నాలో నిరసన తెలిపిన విద్యార్థులు ఉద్రిక్త పరిస్థితిని వైరల్ సీన్‌గా మార్చారు. తీవ్ర ఎండ ఉందంటూ వాటర్ కానన్ వాడాలని పోలీసులను వారు కోరగా.. నీళ్లు చల్లిన వెంటనే విద్యార్థులు నీళ్లలో తడుస్తూ డ్యాన్స్ చేశారు.భారత విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పరీక్షల అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజ్ భవన్ వైపు ర్యాలీగా వెళ్లిన విద్యార్థులను గాంధీ మైదాన్ సమీపంలో, గవర్నర్ నివాసానికి దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో పోలీసులు బ్యారికేడ్లతో అడ్డుకున్నారు.వైరల్ అయిన నిరసన దృశ్యాలువైరల్ వీడియోలో విద్యార్థులు పోలీసులతో, "సార్.. వాటర్ కానన్ లేదా? చాలా వేడిగా ఉంది" అని చెప్పడం వినిపించింది. పోలీసులు నీళ్లను విద్యార్థులపై ప్రయోగించారు. వెంటనే అక్కడి నుంచి తప్పుకోకుండా విద్యార్థులు అదే చోట డ్యాన్స్ చేశారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అయ్యాయి. Bihar is not for beginners..बिहारी होना इतना आसान नहीं है बौस। आंदोलन कुचलने के लिए बिहार पुलिस वाटर कैनन से पानी की बौछार कर रही है । बिहारी लोग झूम झूम कर रेनडांस का मजा ले रहे हैं। pic.twitter.com/x9Tcjj5hO2— Dr. Om Sudha (@dromsudhaa) July 23, 2026మరో వైరల్ వీడియోలో విద్యార్థులు పోలీసుల తాడుతో తాడు థగ్ ఆఫ్ వార్ ఆడినట్టు కనిపించారు. ఇంకో వీడియోలో పోలీసులు నిరసనకారులను అడ్డుకునేందుకు పెట్టిన బ్యారికేడ్లను కొందరు ఎత్తుకుని పరుగెత్తారు. మరో ఘటనలో గేటు బోల్టులు తీసేసి దాన్నే తీసుకెళ్లినట్టు వార్తలు వచ్చాయి.ఈ వీడియోలపై సామాజిక మాధ్యమాల్లో జోకులు, మీమ్స్ వెల్లువెత్తాయి. "ఇది జంతర్ మంతర్ కాదు బాబూ... ఇది బిహార్" అనే అని కామెంట్లు చేశారు. కొందరు ఈ దృశ్యాలను హోలీ పండుగతో పోల్చారు. నిరసనకు అంతరాయం కలిగించేందుకు ఓ బీజేపీ నాయకుడు అక్కడికి వచ్చారు. ఆయన చేతిలో ఉన్న జెండాను చూసి గుర్తించిన విద్యార్థులు దాడి చేశారు. తర్వాత పోలీసులు అక్కడికి చేరుకుని ఆ బీజేపీ నాయకుడిని రక్షించారు. CJP Protest Reaches Patna, Bihar 😳 | Biharis Joined Like Never Before!#cjp #cjpprotest pic.twitter.com/hKIua7GfUy— TrendSpark (@ZENLOOP008) July 23, 2026 Bihari On Top#BiharStudentProtest #BiharProtest #PatnaProtest #StudentsProtest #StudentRights #NEET2026 #NEETPaperLeak #JusticeForStudents #BiharStudents #Patna pic.twitter.com/5KyKD0MDVO— JaanVerse (@jaanverse) July 22, 2026 why is bihar police playing tug of war with protesters 😭😭???? pic.twitter.com/0OmP20Q1gY— PrinCe (@Prince8bx) July 23, 2026 -
సీజేపీపై వివాదాస్పద పోస్ట్ : ఎవరీ ఇన్‌స్టా స్టార్ సోనియా
నీట్ (NEET) పేపర్ లీకేజీకి నిరసనగా కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో విద్యార్థులు పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ ఆందోళనలో రక్షణ విధులు నిర్వహించిన RAF (రాపిడ్ యాక్షన్ ఫోర్స్) అసిస్టెంట్ కమాండెంట్ సోనియా సెహ్రావత్ సోషల్ మీడియా పోస్ట్‌పై వివాదం రేగింది.ప్రభుత్వ అధికారులు సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు, రాజకీయ వ్యాఖ్యలు చేయకూడదనే నిబంధనలను ఆమె ఉల్లంఘించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.హర్యానాకు చెందిన ఈ అధికారిణికి ఇన్‌స్టాగ్రామ్‌లో 6 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఫ్యాషన్, ఫిట్నెస్, ఆధ్యాత్మికత , బైక్ రైడింగ్‌కు సంబంధించిన అనేక గ్లామరస్ రీల్స్, పోస్టుల ద్వారా ఆమె నెట్టింట సందడి చేస్తూ ఉంటారు. ఇన్‌స్టా స్టార్ గా ఎప్పుడూ వైరల్ అవుతుంటారు. తాజాగా సీజేపీ ఆందోళనపై ఒక చనిపోయిన బొద్దింక ఫోటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ "తమను తాము బాగుచేసుకోలేని వారు, దేశాన్ని బాగు చేయాలనుకుంటున్నారు" అని క్యాప్షన్ ఇవ్వడం ఆగ్రహాన్ని తెప్పించింది. ఈ పోస్ట్‌పై తీవ్ర విమర్శలు రావడంతో ఆమె దానిని తొలగించారు. CJP స్పందిస్తూ, పోలీసుల హింసను సమర్థిస్తూ నిరసనకారులను బొద్దింకలతో పోల్చడం దారుణం. అయినా బొద్దింకలు ఎప్పటికీ చనిపోవు అంటూ ఎక్స్ వేదికగా సీజేపీ కౌంటర్ ఇచ్చింది.ఇదీ చదవండి: రూ. 20 లక్షలు ఖర్చు పెళ్లికి అవసరమా? నెట్టింట తీవ్ర చర్చసోషల్ మీడియా పోస్ట్ ద్వారా సర్వీస్ నిబంధనల ఉల్లంఘించారని నిపుణులు పేర్కొన్నారు. అంతేకాదు యూనిఫామ్ ఉన్న ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా వాడకూడదనే నియమం ఉన్నప్పటికీ, ఆమె తన '3star_Sonia' అకౌంట్లో యూనిఫామ్ ఫోటోనే ఉంచడం గమనార్హం. అయితే సీజేపీ నిరసనల్లో తనకు గాయాలయ్యాయని సోనియా మీడియాకు తెలిపారు. విద్యార్థుల మధ్యలో కొందరు అల్లరి మూకలు, వ్యతిరేక శక్తులు చొరబడి తమపై రాళ్లు, గాజు సీసాలు, చెప్పులు విసిరారని, మహిళలను కాపాడే ప్రయత్నంలో తన చేతికి దెబ్బతగిలి కట్టు పడిందని ఆమె పేర్కొన్నారు. ఇదీ చదవండి: డ్రగ్స్ కేసు పెడతా.. జీవితాలను నాశనం చేస్తా : పోలీస్ బెదిరింపు వీడియో వైరల్ -
ఇతను ఎవరు? సీజేపీ ర్యాలీలో ఇంతగా వైరల్ అయ్యాడేంటి?
న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసనలకు చెందిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ సమయంలో వార్తల్లో నిలిచిన వారిలో ఢిల్లీకి చెందిన కంటెంట్ క్రియేటర్ నకుల్ ధుల్ ఒకరు. నిరసన స్థలం నుంచి ఆయన విడుదల చేసిన భావోద్వేగ వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో 'చలో సంసద్' ర్యాలీ సమయంలో పోలీసుల చర్యలో తనతో పాటు తన స్నేహితులపై దాడి జరిగిందని నకుల్ ఆరోపించారు.నకుల్ ధుల్ ఎవరు?నకుల్ ధుల్ ఢిల్లీకి చెందిన డిజిటల్ క్రియేటర్. సామాజిక అంశాలు, విద్య, యువత సమస్యలు, సమకాలీన పరిణామాలపై వీడియోలు రూపొందిస్తుంటారు. ప్రజా విధానాలు, విద్యా అంశాలు, పౌర సమస్యలపై అభిప్రాయాలు, లైవ్ రిపోర్టింగ్, వ్యక్తిగత అనుభవాలు పంచుకుంటూ మంచి గుర్తింపు సంపాదించారు. ఆయన వీడియోలు ఎక్కువగా ప్రజా విధానాలు, విద్య, పౌర అంశాలపై ఉంటాయి. సామాజిక, రాజకీయ పరిణామాలను దగ్గరగా గమనించే ప్రేక్షకులకు ఆయన సుపరిచితుడు.ఎందుకు ట్రెండింగ్‌లో ఉన్నారు?ఇటీవల ఢిల్లీలో జరిగిన 'చలో సంసద్' నిరసన నుంచి నకుల్ ఒక వీడియో షేర్ చేయడంతో ఆయన ట్రెండింగ్‌లోకి వచ్చారు. ఆ వీడియోలో.. పార్లమెంట్ వైపు సాగిన నిరసనలో పోలీసులు తీసుకుంటున్న చర్యలో భాగంగా తనతో పాటు తన స్నేహితులను కొట్టారని ఆయన ఆరోపించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వేగంగా వ్యాపించింది. చాలామంది ఆయనకు మద్దతు తెలుపుతూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.నకుల్ చేసిన ఆరోపణలకు స్వతంత్రంగా ధ్రువీకరణ జరగలేదు. ఆయన ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు ప్రత్యేకంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అయితే, నిరసనకారులు హెచ్చరికలను పట్టించుకోకుండా నిషేధాజ్ఞలను ఉల్లంఘించారని, దూకుడుగా వ్యవహరించారని, అందువల్ల వారిని చెదరగొట్టే చర్యలు తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు.నటి అయేషా ఖాన్‌కు ఏమైంది?నిరసనలో పాల్గొనకముందే, నినాదాలు చేయకముందే నటి, మోడల్, కంటెంట్ క్రియేటర్ అయేషా ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాను సాయంత్రం 4 గంటలకు తన స్నేహితులతో కలిసి నిరసన స్థలానికి చేరుకున్నానని ఆ నటి తెలిపారు. తాను మాట్లాడకముందే, నిరసనలో పాల్గొనకముందే, ఆ ప్రాంతంలో నిరసన చేయడానికి అనుమతి లేదని ఓ పోలీసు అధికారి చెప్పారని ఆమె ఆరోపించారు."బతా దిజియే దూస్రా ఔర్ క్యా రాస్తా హైం? (దయచేసి మరో మార్గం ఏమిటో చెప్పండి?)" అని ప్రశ్నించానని అయేషా తెలిపారు. సమాధానం చెప్పే బదులు పోలీసులు తనను, తన స్నేహితులను పోలీసు వాహనంలోకి ఎక్కాలని కోరారని ఆమె ఆరోపించారు.కాగా, విద్యా రంగంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు, ముఖ్యంగా నీట్ ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలు, జవాబుదారీతనం, విద్యా సంస్కరణల డిమాండ్లతో ఈ నిరసనలు మొదలయ్యాయి.ఈ ఉద్యమానికి కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నాయకత్వం వహిస్తోంది. విద్యా వ్యవస్థలో సంస్కరణలు చేపట్టాలని, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంట్ వైపు ర్యాలీ జరిగిన సమయంలో నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. నిషేధాజ్ఞలను ఉల్లంఘించి దూకుడుగా వ్యవహరించారని ఢిల్లీ పోలీసులు చెబుతుండగా, లాఠీచార్జి, టియర్ గ్యాస్ వాడారని నిరసనకారులు ఆరోపించారు.గత కొన్ని రోజులుగా షబానా ఆజ్మీ, వేదాంగ్ రైనా, అనుపమ్ ఖేర్, ప్రకాశ్ రాజ్ సహా పలువురు ప్రముఖులు విద్యార్థులకు మద్దతు ప్రకటించారు. మంగళవారం నిరసనకారులు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులను కలిసినా ఉద్యమం కొనసాగుతోంది. -
ప్రధాన్ రాజీనామాకు విపక్షాల పట్టు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకమైన నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ అంశంలో విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు విపక్షాలు పట్టుబట్టడంతో పార్లమెంట్ సమావేశాల మూడో రోజూ ప్రతిష్టంభన నెలకొంది. ఢిల్లీలో విద్యార్థుల నిరసనలపై పోలీసుల దాష్టీకం, ప్రధాన్ రాజీనామా డిమాండ్ అంశాలపై అధికార–ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాలతో సభా కార్యక్రమాలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. ప్రభుత్వం నీట్ అంశంపై చర్చకు సిద్ధమని ప్రకటించినప్పటికీ, ముందుగా ప్రధాన్ రాజీనామా చేయా లని ప్రతిపక్షం పట్టుబట్టడంతో లోక్‌సభ, రాజ్యసభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. ఉభయ సభల ఆరంభానికి ముందే నీట్‌పై చర్చ కోరుతూ కాంగ్రెస్ ఎంపీలు కేసీ వేణుగోపాల్, హిబి ఈడెన్ లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు. నల్ల దుస్తులు ధరించి లోక్‌సభకు హాజరైన విపక్షాల ఎంపీలు బిగ్గరగా నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగడంతో లోక్‌సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదావేశారు. లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి మొదలయ్యాక కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ మాట్లాడారు. నీట్‌పై తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చించాలని పట్టుబట్టారు. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. ‘విద్యార్థుల భవిష్యత్తు మా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం. నీట్ పేపర్ లీక్, పరీక్షల పారదర్శకత, ప్రభుత్వం తీసుకున్న చర్యలపై సమగ్రంగా చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం’అని తెలిపారు. చర్చ ఏ తేదీన నిర్వహించాలనేది స్పీకర్ ఆధ్వర్యంలో అన్ని పార్టీలతో సంప్రదించి నిర్ణయిస్తామని చెప్పారు. దీనిపై సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ జోక్యం చేసుకున్నారు. విద్యార్థుల లాఠీచార్జ్ ఉదంతంపై ప్రధాని సభలో ఎందుకు ప్రకటన చేయలేదు? అని నిలదీశారు. ‘‘ఈ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తీరా చర్చిద్దామంటే ముందుగా ధర్మేంద్ర మంత్రి పదవికి రాజీనామాచేయాలనే కొత్త షరతు పెడుతున్నారు. అమలుసాధ్యంకాని షరతులు పెట్టి చర్చకు కాంగ్రెస్ మోకాలడ్డుతోంది’’అని రిజిజు విమర్శించారు. -
పోలీసు రాజ్యం నడవదు
సాక్షి, హైదరాబాద్/నాంపల్లి: ప్రజాస్వామ్య భారత్‌లో పోలీసు రాజ్యం నడవదని, విద్యార్థులు, యువకుల ఆందోళనలకు కేంద్ర ప్రభుత్వం తలొగ్గక తప్పదని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ స్పష్టం చేశారు. లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆత్మఘోషకు కారణమైన నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఉదంతాన్ని ఈ దేశం మర్చిపోదని వ్యాఖ్యానించారు. నీట్ ఘటనపై నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జిని నిరసిస్తూ ఢిల్లీలోని ప్రధాని నివాసం ముందు శాంతియుత ఆందోళన చేస్తున్న లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ అరెస్టుకు నిరసనగా ఏఐసీసీ పిలుపు మేరకు బుధవారం టీపీసీసీ ఆధ్వర్యంలో ‘చలో లోక్ భవన్’కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. దేశంలో నియంత పాలన సాగుతోందని మండిపడ్డారు. ప్రశ్నపత్రం లీక్ చేసి 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌ను అంధకారం చేసిన మోదీ ప్రభుత్వం సిగ్గులేకుండా ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కేకుట్ర చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న రాహుల్‌గాం«దీతోపాటు ఇతర విపక్ష ఎంపీలను అరెస్టు చేయడం దారుణమన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని, ఈ ఉదంతంపై పార్లమెంటు సమావేశాల్లో సమగ్ర చర్చ జరపాలని డిమాండ్ చేశారు. సంకెళ్లు వేసుకుని నిరసన.. ఆందోళనలో భాగంగా మహేశ్‌గౌడ్, మంత్రి పొంగులేటి, విప్ బల్మూరి వెంకట్, ఎమ్మెల్యే దానం నాగేందర్, రోహిణ్‌రెడ్డితోపాటు పలువురు కార్పొరేషన్ చైర్మన్లు చేతులకు సంకెళ్లు వేసుకుని ఇందిరమ్మ విగ్రహం ముందు కూర్చుని నిరసన తెలియజేశారు. అనంతరం నెక్లెస్‌రోడ్డులోని ఇందిరమ్మ విగ్రహం వద్దకు భారీస్థాయిలో చేరుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి లోక్‌భవన్ వైపునకు దూసుకెళ్లే యత్నం చేశారు. అయితే, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. మహేశ్ గౌడ్, మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మహ్మద్ అజహరుద్దీన్, వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే నవీన్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, టీపీసీసీ నేతలను అదుపులోకి తీసుకుని నాంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు ఎంఏ ఫయీమ్, మెట్టు సాయికుమార్, నూతి శ్రీకాంత్, దీపక్‌జాన్, జంగా రాఘవరెడ్డి, టీపీసీసీ నేతలు బండి రమేశ్, నీలం మధు, చనగాని దయాకర్, ఫహీం ఖురేషీ, పిడమర్తి రవితోపాటు పార్టీ అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. అదుపులోకి తీసుకున్న అనంతరం మంత్రులు, కాంగ్రెస్ నేతలను నాంపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించగా, వారు స్టేషన్లోనే బైఠాయించి నల్ల కండువాలు ధరించి నిరసన తెలియజేశారు. సుమారు రెండు గంటల పాటు అక్కడే బైఠాయించారు. వీరిని పరామర్శించేందుకు పెద్దఎత్తున కాంగ్రెస్ శ్రేణులు నాంపల్లి పీఎస్‌కు చేరుకున్నారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అనంతరం సొంతపూచీకత్తుపై నేతలను విడుదల చేశారు. -
చర్చలకు సిద్ధం: సీజేపీ
న్యూఢిల్లీ: నెల రోజులుగా ఉద్యమబాటలో పయనిస్తున్న తాము ఇకపై చర్చల బాటలో ముందుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) గురువారం ప్రకటించింది. పోటీ పరీక్షల్లో అక్రమాలకు సత్వరం చరమగీతం పాడాలంటూ ఉద్యమపంథాలో వెళ్తున్న తాము ప్రస్తుతం ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని సీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ తెలిపారు. ‘‘చర్చలకు మోదీ సర్కార్ సుముఖంగా ఉందని బుధవారం ఉదయం కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా సమాచారమిచ్చారు. ఆయన అధికార నివాసంలో చర్చలకు రావాలని ఆహా్వనంపలికారు. అయితే అధికారిక నివాసాల్లో చర్చలకు మేం సిద్ధంగా లేము. జంతర్‌మంతర్‌లో ప్రజాకోర్టు ఇప్పటికే కొలువుతీరి ఉంది. ప్రజలు వచ్చినట్లు మంత్రులూ ఇక్కడికొచ్చి చర్చిస్తే బాగుంటుంది. ఉద్యమం ఇలాగే కొనసాగుతుంది’’అని దాస్ చెప్పారు. ‘‘మనందరం విద్యావంతులమే. జంతర్ మంతర్‌లో భద్రత పరంగా ఏమైనా సమస్యలు తలెత్తవచ్చు అని ప్రభుత్వం భావిస్తే దీక్షాస్థలికి బదులుగా మరేదైనా తటస్థ వేదికపై చర్చలకు మేం సిద్ధంగా ఉన్నాం. చర్చలకు మేం రెడీ అని ఎప్పుడో చెప్పాం. చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారం కనుగొనడం ఉత్తమమైన ప్రక్రియ. అయితే అర్థరహిత చర్చలకు మా ఉద్యమంలో చోటేలేదు. నిరసనకారుల డిమాండ్ల సాధనకు కృషిజరిగేలా ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ముందుకురావాలి. మా డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం ఏ మేరకు సంసిద్ధంగా ఉందనేదే ఇక్కడ అసలు విషయం. ఎందుకంటే కాలం చాలా విలువైంది. ఇంకా వేలాది మంది జంతర్మంతర్లోనే ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. రెండ్రోజుల క్రితంనాటి పోలీసుల లాఠీచార్జ్, ఉద్యమకారుల ప్రతిఘటన ఉదంతంలో విద్యార్థులపై పోలీసులు ఎలాంటి కేసులు మోపకూడదు. ఉద్యమం ఉధృతమవుతోంది. ఢిల్లీ నుంచి ఉద్యమం గోవా, ముంబై, జైపూర్‌లకు పాకింది. ఇది సహజంగానే జాతీయస్థాయి ఉద్యమంగా రూపాంతరం చెందింది’’అని దాస్ వ్యాఖ్యానించారు. -
విద్యార్థులు ఉగ్రవాదులు కాదు
న్యూఢిల్లీ: భారతదేశ విద్యా వ్యవస్థను మోదీ ప్రభుత్వం నాశనం చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. విద్యార్థుల డిమాండ్లు పూర్తిగా చట్టబద్ధమైనవని, వాటిపై రాజీ పడటానికి ఆస్కారం లేదని తేల్చిచెప్పారు. విద్యార్థుల పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నీట్–యూజీలో అవకతవకలు జరిగాయని, దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేయడం లేదని నిలదీశారు. నిరసనకు దిగిన విద్యార్థులు ఉగ్రవాదులు కాదని.. వారు కేవలం నిష్పక్షపాతమైన విద్యా వ్యవస్థ కావాలని కోరుతున్నారని చెప్పారు. పరీక్షల్లో అక్రమాల వల్ల నష్టపోయిన వారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాల్సిందేనని పేర్కొన్నారు. విద్యార్థులపై దాడికి బాధ్యులైన ప్రతి ఒక్కరినీ జవాబుదారీగా చేయాలన్నారు. రాహుల్ గాంధీ బుధవారం ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దేశంలో విద్యా వ్యవస్థ రిగ్గింగ్‌కు గురైందని, అది సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం ‘చలో సంసద్’ నిరసన సందర్భంగా విద్యార్థులపై పోలీసుల దాడికి సంబంధించిన వీడియోను రాహుల్ ప్రదర్శించారు. ప్రభుత్వం, పాలకులు భయాందోళనలో ఉన్నారని, అందుకే విద్యార్థులను, ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ ఇంకా ఏం మాట్లాడారంటే.. విద్యార్థుల డిమాండ్లు నెరవేర్చాలి..‘‘ప్రధానమంత్రి నివాసం వద్ద మంగళవారం శాంతియుత నిరసనలో పాల్గొన్న నన్ను బలవంతంగా ఈడ్చేశారు. భౌతిక దాడి చేశారు, నిర్బంధించారు. అవన్నీ నేను లెక్కచేయను. అవి చాలా చిన్న విషయాలు. ప్రజల ఆకాంక్షలను వ్యక్తం చేయడమే నా పని. ఇప్పుడున్న విద్యా వ్వవస్థ వల్ల పేదలు ఇబ్బంది పడుతుండగా, ధనవంతులు పేపర్ లీక్‌లతో పరీక్షల్లో ఉత్తీర్ణులవుతున్నారు. ఈ పరిస్థితి కచ్చితంగా మారాలి. విద్యార్థులు లేవనెత్తిన మూడు డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. విద్యార్థులపై దాడి చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి. విద్య పేరిట దోచుకుంటున్నారు మన విద్యార్థులకు ఇలా ఎందుకు జరుగుతోంది అన్నదే ప్రశ్న. భద్రతా దళాలు వారిపై ఆయుధాలు గురిపెట్టడానికి, దాడి చేయడానికి విద్యార్థులు చేసిన తప్పేంటి? వారు ఈ దేశం తమకు ఇవ్వాల్సిన వాటిని కోరుతూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు. న్యాయబద్ధమైన విద్యా వ్యవస్థ కావాలని అంటున్నారు. విద్యా వ్యవస్థలో లోపాల వల్ల పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంతులేని ఒత్తిడికి గురవుతున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా వ్యవస్థల్లో ఒకటిగా పేరుగాంచిన మన విద్యా వ్యవస్థ నేడు లోపాలమయంగా మారిన సంగతి అందరికీ తెలుసు. గత దశాబ్ద కాలంలో 152 సార్లు ప్రశ్నపత్రాల లీకేజీలు జరిగాయి. కానీ, ఒక్కరికి కూడా శిక్ష పడలేదు. విద్యా వ్యవస్థ వైఫల్యం కారణంగా 7.5 కోట్ల మంది విద్యార్థులు ప్రభావితమయ్యారు. సమాజంలో ఒక వర్గం వ్యక్తులు మన విద్యా వ్యవస్థను, విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నారు. మన దేశంలో కుటుంబాలు విద్య కోసం చేసే వార్షిక వ్యయం రూ.1.32 లక్షల కోట్లు. ఇది రూ.1.4 లక్షల కోట్ల విద్యా బడ్జెట్‌కు దాదాపు సమానం. విద్య పేరిట కుటుంబాలను దోచుకుంటున్నారు. దేశంలో తయారీ రంగం మూతపడింది, పరిశ్రమల్లో అవకాశాలు లేవు, కార్పొరేట్ ఉద్యోగాలు లేవు. ఇక మిగిలిన ఏకైక మార్గం ప్రభుత్వ ఉద్యోగం మాత్రమే. అవి కూడా దక్కకుండా విద్యావ్యవస్థను ధ్వంసం చేశారు’’ అని రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు.జితేంద్ర సింగ్ గురించి చర్చ అనవసరం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తనపై చేసిన వ్యాఖ్యలను రాహుల్ గాంధీ కొట్టిపారేశారు. జితేంద్ర సింగ్‌ను ‘అప్రస్తుత వ్యక్తి’గా అభివరి్ణంచారు. నీట్–యూజీపై చర్చకు రాహుల్ తొలుత అంగీకరించి, తర్వాత మాట మార్చారని, ప్రధాని మోదీ రాజీనామా చేయాలంటూ పట్టుబట్టారని జితేంద్ర సింగ్ మంగళవారం ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై రాహుల్ బుధవారం స్పందించారు. ‘‘జితేంద్ర సింగ్ తనకు నచ్చిన ఎలాంటి విషయాన్నైనా ఊహించుకోవచ్చు. అలా ఊహించుకోవడానికి ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఉంది. దాని గురించి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు’’అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి ఆరోపణల గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. ఆయన గురించి చర్చ నిరర్థకమని పేర్కొన్నారు. పది రెట్లు దాడి చేసినా ఐ డోంట్ కేర్ ప్రతి ప్రభుత్వంలోనూ నాయకత్వం మానసికంగా కుప్పకూలిపోయే సమయం వస్తుంది. ఇప్పుడు అదే జరిగింది. పోలీసులు నాతో ఎలా ప్రవర్తించారనేది నాకు అనవసరం. నేను పట్టించుకోను. నాతో ఐదు రెట్లు దారుణంగా ప్రవర్తించినా పట్టించుకోను. విద్యా వ్యవస్థపై, పత్రాల లీకేజీలను అరికట్టడంపై, పిల్లలకు చెల్లించాల్సిన ఖర్చులపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. నా విషయంలో నచ్చింది చేసుకోండి. ఐదు రెట్లు కాదు కదా పది రెట్లు దాడి చేసినా ఐ డోంట్ కేర్. పోలీసులు నాతో ప్రవర్తించిన తీరువల్ల ఎన్నో విషయాలు నేర్చుకుంటాను. దెబ్బలు తినడం నాకు అలవాటే. అది సమస్యేమీ కాదు. ఇప్పుడంతా బాగానే ఉంది. ఒకటి రెండు దెబ్బలు తినడం పెద్ద విషయం కాదు. ఇంకా ఎన్నో దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉన్నాను. పోలీసులు నన్ను ఈడ్చుకెళ్లి అక్కడి నుంచి తొలగించారు. అయితే, ఈ ప్రభుత్వాన్ని తొలగించమని నా చెవిలో చెప్పారు. ఆ భావన వారిలో ఉంది. జరిగిన దానిపై పోలీసులు కూడా సంతోషంగా లేరు. విద్యార్థులపై దాడి చేయడం దేశ భవిష్యత్తుకు వ్యతిరేకమైన నేరమని వివేకవంతులైన కొందరు పోలీసు సిబ్బంది భావిస్తున్నారు. నిరసనకారుల్లో తమ పిల్లలను చూసుకుంటున్నారు. -
పోరాటాన్ని హైజాక్ చేయకండి.. నీట్ నిరసనలపై సల్మాన్ ఖాన్ పోస్ట్!
సాక్షి, ఢిల్లీ: రాజధాని ఢిల్లీలో జరుగుతున్న పేపర్ లీక్ ఆందోళనలపై బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ స్పందించారు. నీట్ పేపర్ లీక్ నిరసనలకు తన పూర్తి మద్దతును ప్రకటించారు. ఈ ఆందోళనలో పాల్గొంటున్న విద్యార్థుల పోరాటం స్ఫూర్తిధాయకం అని అభినందించారు. అదే సమయంలో ఈ వివాదాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దని ఈ ఉద్యమాన్ని "హైజాక్" చేయవద్దని పరోక్షంగా విపక్షాలకు చురకలంటించారు.ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజ్‌పై సీజేపీ నేతృత్వంలో నిరసనలు జరుగుతున్న తీవ్ర ఉద్రిక్తకరంగా మారాయి. ఈ నేపథ్యంలో సీజేపీ నిరసనలకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. తాజాగా సినీస్టార్ సల్మాన్ ఖాన్ సైతం విద్యార్థులకు తన మద్ధతును ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇన్‌స్టా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు.సల్మాన్ తన పోస్ట్‌లో " ఈ సమస్య విద్యార్థులకు, విద్యా వ్యవస్థకు మధ్య ఉన్నది, దీనిని రాజకీయంగా హైజాక్ చేయకూడదు, దీని ఘనత మన దేశ విద్యార్థులకే దక్కాలి, ప్రభుత్వం కూడా వారికి పూర్తి మద్దతు ఇచ్చి విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఇది ఇరుపక్షాలకూ లాభదాయకమైన పరిస్థితి. సానుకూల నిర్ణయం కోసం ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను. చదువుకోవాలనుకునే మీ అందరినీ దేవుడు ఆశీర్వదించుగాక," అని ఆయన రాశారు.ఈ సందర్భంగా తన చిన్ననాటి ఫోటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. దేశంలో విద్య ఒక 'ఫ్యాషన్ ట్రెండ్'గా మారితే, విదేశాల నుంచి విద్యార్థులు భారత్‌కు చదువుకోవడానికి వస్తారని తెలిపారు. కాగా నీట్ నిరసనలకు ఇదివరకే బాలీవుడ్ ప్రముఖులు ఓమీ వైద్య, జీనత్ అమన్, నసీరుద్దీన్ షా, రత్న పాఠక్ షా, అభయ్ డియోల్, సోనాక్షి సిన్హా, రితేష్ దేశ్‌ముఖ్ వంటి ప్రముఖులు మద్దతు ప్రకటించారు. -
నీట్ ఆందోళనలపై కేంద్రం కీలక ప్రకటన
సాక్షి,న్యూఢిల్లీ: నీట్ ప్రశ్నాపత్రం లీక్ అంశాన్ని రాజకీయ మైలేజ్ కోసం ఉపయోగించొద్దని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ప్రతిపక్షాలకు సూచించారు. పేపర్ లీకేజీ ఘటనలను రాజకీయాలకు అతీతంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు.కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా పలు పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకైన ఘటనలు జరిగాయని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో ఇంటర్, పదో తరగతి పరీక్షలతో పాటు పంజాబ్‌లో గ్రూప్-డీ పరీక్ష, అలాగే కేరళ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కూడా పేపర్ లీకేజీ ఘటనలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు.అలాంటి సందర్భాల్లో పెద్దగా ప్రాధాన్యం ఇవ్వని ప్రతిపక్షాలు, ఇప్పుడు నీట్ లీక్ అంశాన్ని మాత్రమే ఎందుకు హైలైట్ చేస్తున్నాయని జేపీ నడ్డా ప్రశ్నించారు. ఈ ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని విమర్శించారు.నీట్ అంశంపై పార్లమెంట్లో సమగ్ర చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఎంతసేపైనా చర్చించేందుకు మేము సిద్ధం. సమస్యలకు పరిష్కారం పార్లమెంట్లో చర్చ ద్వారానే లభిస్తుంది. చర్చలకు పార్లమెంట్‌కు మించిన వేదిక మరొకటి లేదు’ అని జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. -
10 ఏళ్లలో 152 పరీక్షల పేపర్లు లీక్.. వారిలో ఒక్కరికీ శిక్షపడలేదు
-
కేంద్ర సర్కారు ముందు రాహుల్ గాంధీ 3 డిమాండ్లు
న్యూఢిల్లీ: విద్యార్థులపై అమానుషంగా లాఠీఛార్జ్ చేశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. న్యూఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో 152 సార్లు పేపర్లు లీకేజ్‌లు జరిగాయని తెలిపారు. అన్ని సార్లు పేపర్ లీకేజీలు జరిగితే ఒక్కరికి కూడా శిక్ష పడలేదని చెప్పారు. నిరసనలు తప్ప విద్యార్థులు చేసిన నేరం ఏంటని నిలదీశారు. దేశంలో విద్యా వ్యవస్థను నాశనం చేశారని ఆరోపించారు. ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఎన్డీఏ సర్కారు పబ్లిక్ సెక్టార్లను ప్రైవేటీకరిస్తోందని చెప్పారు.3 డిమాండ్లు కేంద్ర సర్కారు ముందు రాహుల్ గాంధీ మూడు డిమాండ్లు పెట్టారు. ‘‘కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, విద్యార్థులపై దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి, విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలి’’ అని అన్నారు. "అందరికీ స్పష్టంగా కనిపిస్తున్న విషయం ఏంటంటే, ఒకప్పుడు ప్రపంచంలో అత్యుత్తమ విద్యా వ్యవస్థల్లో ఒకటిగా పేరొందిన మన విద్యా వ్యవస్థ ఇప్పుడు అక్రమాలతో నిండిన వ్యవస్థగా మారింది. గత 10 ఏళ్లలో 152 ప్రశ్నాపత్రాల లీక్‌లు జరిగాయని మనకు తెలుసు. లెక్క వేస్తే నెలకు దాదాపు ఒకటి చొప్పున జరుగుతున్నట్టే. దీని ప్రభావం 7.5 కోట్ల మంది విద్యార్థులు, వారి కుటుంబాలపై పడింది. వీరంతా మధ్యతరగతి, పేద కుటుంబాలకు చెందినవారు. కష్టపడి సంపాదించిన డబ్బును పిల్లల చదువు కోసం ఖర్చు చేస్తున్నారు. చివరికి వారి ఆశలను పూర్తిగా అవమానిస్తున్నారు.ఇందులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒక్కరికీ శిక్ష పడలేదు. అంటే కొందరు వ్యక్తులు లేదా ఒక వర్గం మన విద్యా వ్యవస్థను, దేశంలో అత్యంత విలువైన సంపదైన విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఏం చేసింది? ఒక్క శిక్ష కూడా పడలేదు. వ్యవస్థ అక్రమాలతో నిండిపోయిందన్న విషయం ఒక్కటే కాదు, అది సామాన్య ప్రజలకు అందని స్థాయిలో ఖరీదుగా కూడా మారింది.ఈ గణాంకం ప్రతి యువకుడికి తెలుసు. కానీ భారత ప్రభుత్వం మాత్రం తెలుసుకోలేకపోతోంది. ఒక పరీక్ష రాసే కుటుంబాలు ఖర్చు చేస్తున్న మొత్తం, కేంద్ర ప్రభుత్వం విద్య కోసం కేటాయిస్తున్న మొత్తం బడ్జెట్‌కు దాదాపు సమానం.ప్రజల నుంచి పన్నులు వసూలు చేసిన తర్వాత, పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఖర్చు చేసే నిధినే విద్యా బడ్జెట్ అంటారు. అది రూ. 1.4 లక్షల కోట్లు. అదే సమయంలో, ప్రతి ఏడాది నీట్ పరీక్ష రాసే కుటుంబాలు కలిపి రూ.1.32 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాయి.ఇది ఆ కుటుంబాల నుంచి జరుగుతున్న బహిరంగ దోపిడీ తప్ప మరొకటి కాదు. అంత డబ్బు ఖర్చు చేయించిన తర్వాత ప్రశ్నపత్రం లీక్ అయిందని చెబుతున్నారు. అంటే మొత్తం వ్యవస్థ అక్రమాలతో నిండిపోయింది. యువత వీధుల్లోకి రావడానికి ఇదే రెండో కారణం. అది పూర్తిగా సరైన కారణం" అని అన్నారు. -
ఆందోళనలు కాదు.. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇలా చేయండి: రాజ్‌నాథ్
న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం దేశ యువతను "రాజకీయ సాధనంగా" వాడుకుంటున్నాయని ఆరోపించారు.ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సహా పలు సంఘాలు చేపట్టిన నిరసనలపై రాజ్‌నాథ్ సింగ్ స్పందిస్తూ.. "ఢిల్లీలో కొనసాగుతున్న నిరసనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మన దేశ విద్యార్థులు, యువతను రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ సాధనంగా వాడాలని కొందరు ప్రయత్నించడం అత్యంత దురదృష్టకరం. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో మా ప్రభుత్వం విద్యార్థులు, యువత ఆశయాలు నెరవేర్చడానికీ, వారి సంక్షేమానికీ పూర్తి నిబద్ధతతో పని చేస్తోంది" అని అన్నారు."మన విద్యార్థుల ప్రతి ఆందోళనను వినడం, పరిష్కరించడం మా బాధ్యత. భారత యువత చైతన్యవంతులు, పరిణతి ఉన్నవారు, వివేకం ఉన్నవారు. ఇలాంటి తప్పుదారి పట్టించే ప్రయత్నాలను వారు అర్థం చేసుకుంటారని, అభివృద్ధి, ప్రగతి, దేశ నిర్మాణం దిశగా అడుగులు వేస్తారని నాకు పూర్తి విశ్వాసం ఉంది" అని తెలిపారు.ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని ఇండి కూటమి సృష్టించిన రాజకీయ పరిస్థితిగా రాజ్‌నాథ్ సింగ్ అభివర్ణించారు. "ఎవరికీ అన్యాయం జరగకుండా చూడటానికి, ముఖ్యంగా విద్యార్థులు, యువతకు న్యాయం జరిగేలా చూడటానికి మేము పూర్తి నిబద్ధతతో ఉన్నాం. కొందరు ప్రతిపక్ష నేతలు విద్యార్థుల్లో కృత్రిమంగా సృష్టిస్తున్న ఆగ్రహం, అసంతృప్తి ప్రజలను, ముఖ్యంగా పిల్లలు, యువతను తప్పుదారి పట్టించే విఫల ప్రయత్నం అని నేను భావిస్తున్నాను. యువత భావోద్వేగాలు, ఆందోళనల పట్ల మేము పూర్తి సున్నితత్వంతో ఉన్నాం. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రతి అంశంపై అర్థవంతమైన చర్చకు ప్రభుత్వం సిద్ధమని పలుసార్లు స్పష్టం చేసింది" అని చెప్పారు.పార్లమెంట్లో ప్రభుత్వ దృష్టికి తీసుకురండి వీధుల్లో ఆందోళనలు చేయడం కంటే పార్లమెంట్లో చర్చలో పాల్గొనడం మంచిందని ప్రతిపక్షాలకు సూచించారు. "ప్రజాస్వామ్యానికి సంబంధించిన అంశాలు చర్చించాల్సిన స్థలం పార్లమెంట్. అక్కడ ప్రతిపక్షాలకు తమ అభిప్రాయాలు వెల్లడించే పూర్తి స్వేచ్ఛ ఉంది. సమస్యలను పార్లమెంట్లో కాకుండా వీధుల్లో పరిష్కరించాలని ప్రతిపక్షాలు ప్రయత్నించడం సరైంది కాదని నేను భావిస్తున్నాను" అని అన్నారు.ప్రతిపక్షాలు సభ సజావుగా జరిగేలా సహకరించాలని రాజ్‌నాథ్ సింగ్ కోరారు. "ప్రతిపక్షాలు నిజంగా చిత్తశుద్ధితో ఉంటే, కొనసాగుతున్న వర్షాకాల సమావేశాల నిర్వహణకు ఆటంకం కలిగించకుండా, చర్చించాలనుకున్న అంశాలన్నింటినీ పార్లమెంట్లో ప్రస్తావించి సభ, ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలి" అని అన్నారు. -
ధర్మేంద్ర రాజీనామా చేయాల్సిందే సభ సాక్షిగా ఖర్గే డిమాండ్
-
‘నీట్’ న్యూస్ పేపరా?.. బీజేపీ ఎంపీ నవ్వులపాలు!
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఢిల్లీలో నీట్ పేపర్ లీక్‌పై జరుగుతున్న నిరసనల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నీట్ పరీక్షా పత్రాన్ని పొరపాటున ‘వార్తాపత్రిక’ (న్యూస్‌పేపర్) అని అనడంతో సోషల్ మీడియాలో ఆయన తీవ్ర ట్రోలింగ్‌కు గురవుతున్నారు.నీట్ పేపర్ లీకేజీ కేసులో పట్టుబడిన 13 మంది నిందితులకు అత్యంత కఠినమైన శిక్ష విధించాలని రవికిషన్ డిమాండ్ చేశారు. పిల్లల భవిష్యత్తుతో ఎవరూ ఆటలాడుకోకుండా ఉండేలా అత్యుత్తమ లాయర్లను నియమించి వారికి కఠిన శిక్ష పడేలా చూడాలన్నారు. అయితే ప్రసంగిస్తున్న సమయంలో ఆయన నీట్ పరీక్షను ‘న్యూస్‌పేపర్’ అని తప్పుగా సంబోధించారు. ఈ చిన్న పొరపాటే సోషల్ మీడియాలో వైరల్ కావడానికి కారణమైంది.Meet Ravi Kishan, an MP and “Sansad Ratna” awardee.Yet he thinks NEET is a newspaper.So this is where we are:Students spend years preparing for NEET.Families spend lakhs.Careers hang in the balance.And an elected MP does not even know what the exam is.Maybe before… pic.twitter.com/dQeBJELjqi— Cockroach Party of India (@Cockroach4India) July 22, 2026 -
చర్చల్లో ట్విస్ట్! కేంద్రానికి CJP కొత్త కండిషన్
న్యూఢిల్లీ: నీట్ ఆందోళనల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్రంతో చర్చలకు తాము సిద్ధమేనని చెబుతూనే.. కాక్రోచ్ జనతా పార్టీ కొత్త కండిషన్ పెట్టింది. తాము వాళ్ల దగ్గరకు వెళ్లబోమని.. చర్చలకు ప్రభుత్వమే ముందుకు రావాలని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా జంతర్ మంతర్‌కు వచ్చి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.“ప్రభుత్వం చర్చలు జరపాలనుకుంటే మా వద్దకే రావాలి. మా షరతులకు అంగీకరించాలి” అని అభిజీత్ దీప్కే పేర్కొన్నారు. ప్రభుత్వ వైఖరిలో మార్పు రావాలని, అహంకారాన్ని పక్కన పెట్టాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్ ఆరోపణలపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌పై వెనక్కి తగ్గేది లేదని CJP తేల్చిచెప్పింది. తమ ప్రధాన డిమాండ్ నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపింది.జంతర్ మంతర్‌లోనే, లేకుంటే..సీజేపీ ప్రతినిధి ఆశుతోష్ రంకా మాట్లాడుతూ.. చర్చలు జరపాలంటే తటస్థ ప్రదేశంలో లేదా జంతర్ మంతర్‌లోనే నిర్వహించాలని అన్నారు. తమ డిమాండ్ల విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. ఇటీవల కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో జరిగిన చర్చలపై కూడా సీజేపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ ప్రతినిధులను నడ్డా నివాసంలో గంటల తరబడి కూర్చోబెట్టి సమయం వృథా చేశారని అభిజీత్ దీప్కే ఆరోపించారు.చర్చలకు సిద్ధమన్న కేంద్రంమరోవైపు, నిరసనకారులు చర్చలకు వస్తే ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వర్గాలు వెల్లడించాయి. అయితే చర్చల విషయంలో బాధ్యతను ప్రభుత్వం నిరసనకారులపైనే ఉంచినట్లు తెలుస్తోంది.జూలై 20న CJP చేపట్టిన పార్లమెంట్ మార్చ్ సందర్భంగా ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పోలీసులు బలప్రయోగం చేశారని CJP ఆరోపించగా.. నిబంధనలు ఉల్లంఘించడంతోనే చర్యలు తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. అయితే ఆ సమయంలోనే జేపీ నడ్డాను కలిసిన సీజేపీ ప్రతినిధులు.. మూడు డిమాండ్లతో వినతి పత్రం సమర్పించారు. వాటిని పరిశీలించి నిర్ణయం తెలియజేస్తామని చెప్పిన కేంద్రం.. ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో సీజేపీ–కేంద్ర ప్రభుత్వం మధ్య రెండో దఫా చర్చల అంశం కీలకంగా మారింది. ఎవరు ముందడుగు వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. -
సీజేపీ ఆందోళన.. కత్రినా కైఫ్ మీద ఈ విమర్శలేంటి?
ఢిల్లీలో సీజేపీ ఆధ్వర్యంలో గత కొన్నిరోజుల నుంచి విద్యార్థి నిరసనలు జరుగుతున్నాయి. నీట్ ప్రశ్నాపత్రం లీక్ విషయమై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని వీళ్లు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యార్థులే పోరాడుతుండగా తాజాగా ప్రతిపక్షాలు కూడా వీళ్లతో కలిసి చేరాయి. ఈ విద్యార్థి ఉద్యమానికి బాలీవుడ్ నటీనటులు షబానా ఆజ్మీ, ప్రీతి జింటా, రితేష్ దేశ్ ముఖ్, సోనూసూద్, సోనాక్షి సిన్హా తదితరులు తమ సంఘీభావం తెలిపారు. అయితే దీనికి ఏ మాత్రం సంబంధం లేని కత్రినా కైఫ్ మీద ఇప్పుడు పలువురు విమర్శలు చేస్తున్నారు.(ఇదీ చదవండి: ప్రభాస్‌తో కత్రినా.. సందీప్ రెడ్డి ఏం ప్లాన్ చేశాడు?)కత్రినా కైఫ్ అభిమాని ఒకరు 'కేథలిక్ ఫ్యాన్స్' అని ఓ ఫ్యాన్ పేజీ రన్ చేస్తున్నాడు. దీనికి దాదాపు 70 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పుడు ఈ పేజీ కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు సదరు పేజీ అడ్మిన్ ప్రకటించాడు. చిన్నప్పటి నుంచి కత్రినాకు అభిమానినని, అలాంటిది భారతీయ విద్యార్థులకు సంబంధించిన కీలక అంశంపై ఆమె స్పందించకపోవడం తీవ్ర నిరాశకు గురి చేసిందని సదరు అడ్మిన్ వెల్లడించాడు.మేము మీకు కష్టకాలంలో అండగా నిలిచాం. కానీ భారతీయుల కోసం ముఖ్యంగా విద్యార్థుల కోసం ఒక్క మాట కూడా మీరు మాట్లాడలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం మీకు లేదు. అందుకే మిమ్మల్ని అన్‌ఫాలో చేస్తున్నా. ఈ ఫ్యాన్పేజీని కూడా మూసివేస్తున్నా అని సదరు అడ్మిన్ పేర్కొన్నాడు. ఈ విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కొందరు సదరు పేజీ అడ్మిన్‌కి సపోర్ట్ చేస్తుండగా మరికొందరు మాత్రం కత్రినాకు మద్దతిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు ఉన్నట్లే, స్పందించకపోయే హక్కు కూడా ఉంటుందని గుర్తుచేస్తున్నారు. ప్రతి సామాజిక, రాజకీయ అంశంపై సెలబ్రిటీలు తప్పనిసరిగా స్పందించాల్సిన అవసరం లేదని వారు చెబుతున్నారు.(ఇదీ చదవండి: రూ.251 ఫోన్ స్కామ్ గుర్తుందా? ఈ కాన్సెప్ట్‌తో ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ తెలుగు సిరీస్) -
నిరసనలకు మమత మద్దతు.. అవసరమైతే వస్తానని ప్రకటన!
కోల్‌కతా: నీట్ (NEET) పేపర్ లీకేజీ ఉదంతంపై దేశ రాజధానిలో విద్యార్థులు, నిరసనకారులు చేపట్టిన ఆందోళనలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మద్దతు ప్రకటించారు. అవసరమైతే తాను స్వయంగా ఢిల్లీకి వెళ్లి నిరసనలో పాల్గొంటానని ఆమె తెలిపారు. ప్రదర్శనకారులపై ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరును, పోలీసుల అణచివేతను ఆమె తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వంపై, పోలీసుల దౌర్జన్యాలపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష నేతలు ఆందోళనలు చేపట్టారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేతో సహా పలువురు సీనియర్ నేతలు ప్రధానమంత్రి నివాసం వెలుపల ధర్నా నిర్వహించారు. ఈ నిరసనల నేపథ్యంలో పోలీసులు వారిని ఈడ్చుకెళ్లి అదుపులోకి తీసుకున్నారు. తదనంతరం కాంగ్రెస్ ఎంపీలందరూ నల్లటి దుస్తులు ధరించి పార్లమెంటుకు హాజరయ్యారు.‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఆధ్వర్యంలో వేలాది మంది జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. దీనిని అణచివేసేందుకు పోలీసులు లాఠీచార్జీ చేయడంతో పాటు బాష్పవాయువును ప్రయోగించారు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుండగా, ఆయనతో చర్చలు జరపాలని అన్నా హజారే కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. -
రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి ఘాటు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిగా రాహుల్ తన చర్యలతో రాజ్యాంగ గౌరవాన్ని దెబ్బతీశారని ఆరోపించారు.బుధవారం పార్లమెంట్ ఆవరణలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ నివాసం సమీపంలో ప్రతిపక్షాలు నిర్వహించిన నిరసనపై స్పందించిన గిరిరాజ్ సింగ్.. రాహుల్ గాంధీ తీరుపై మండిపడ్డారు. ఆయన చర్యలు అత్యంత ప్రమాదకరమైన ఉద్దేశాలను ప్రతిబింబిస్తున్నాయని వ్యాఖ్యానించారు.‘‘రాజ్యాంగ పదవిలో ఉంటూ రాహుల్ గాంధీ తన చర్యలతో రాజ్యాంగ గౌరవాన్ని దెబ్బతీశారు. ఆయన ప్రవర్తన చాలా ప్రమాదకరమైనది’’ అని గిరిరాజ్ సింగ్ అన్నారు. ఇతర దేశాల్లో జరిగిన పరిణామాలను అనుసరిస్తూ భారత్‌లో అశాంతి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని రాహుల్‌పై ఆరోపణలు చేశారు. ప్రధాని నివాసం సమీపంలో నిరసన చేపట్టడం బాధ్యతారాహిత్యమైన చర్యగా అభివర్ణించారు.VIDEO | Delhi: On Congress leaders’ protest at 7, LKM, Union Minister Giriraj Singh (@girirajsinghbjp) says, “By holding a constitutional office, he (Rahul Gandhi) has torn apart the dignity of the Constitution through his actions. His conduct reflects a very dangerous intention.… pic.twitter.com/j68qjxjiha— Press Trust of India (@PTI_News) July 22, 2026ఇదే సమయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపైనా గిరిరాజ్ సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. వీరు ప్రజాస్వామ్యాన్ని అనుసరించడం లేదని, “అర్బన్ నక్సల్స్‌గా మారుతున్నారు” అంటూ వ్యాఖ్యానించారు. నిరసనల పేరుతో దేశంలో అశాంతి సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.‘‘ప్రధాని నివాసం సమీపంలో ఆందోళన చేయడం చాలా బాధ్యతారాహిత్యం. అక్కడ ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగి ఉంటే.. లేదంటే ఎవరైనా ప్రమాదకర వస్తువులు విసిరి ఉంటే పరిస్థితులు తీవ్రంగా ఉండేవి’’ అని మంత్రి వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని తాను భావిస్తున్నట్లు గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదని అన్నారు.ఇదే సమయంలో సీజేపీ నిరసనలపై కూడా కేంద్ర మంత్రి విమర్శలు చేశారు. ఆందోళనల పేరుతో విద్యార్థులను ముందుపెట్టి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు, ప్రతిపక్షాలు మాత్రం విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసనలు చేస్తున్నామని చెబుతున్నాయి. సీజేపీ ఆందోళనలు, రాహుల్ గాంధీ నిరసనల నేపథ్యంలో కేంద్రం–విపక్షాల మధ్య రాజకీయ వివాదం మరింత ముదురుతోంది. -
విజయ్.. ఒక దెబ్బకు రెండు పిట్టలు!
నీట్ వివాదం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్న వేళ.. తమిళగ వెట్రి కళగం అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మరోసారి తన వైఖరిని స్పష్టం చేశారు. నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేయాలన్నదే తమ పార్టీ విధానమని ప్రకటించారు. కేవలం పరీక్ష నిర్వహణలో లోపాలు, పేపర్ లీక్‌లు వంటి అంశాలను సరిదిద్దితే సరిపోదని.. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష విధానాన్నే పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారాయన. అయితే ఈసారి ఆయన టార్గెట్ కేవలం నీట్ మాత్రమే కాదని అనిపిస్తోంది.ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో టీవీకే కీలక ప్రకటన చేసింది. వైద్య విద్య ప్రవేశాలపై నిర్ణయాలు తీసుకునే పూర్తి అధికారం రాష్ట్రాలకు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం విద్య రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితా (Concurrent List)లో ఉంది. అంటే కేంద్రం, రాష్ట్రాలు రెండూ దీనిపై చట్టాలు చేయవచ్చు. అయితే విద్యను రాష్ట్ర జాబితా (State List)లోకి మార్చాలని టీవీకే కోరుతోంది.ఒకవేళ దీనికి రాజ్యాంగపరమైన అడ్డంకులు ఉంటే.. మధ్యంతర పరిష్కారంగా రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు కల్పించే ప్రత్యేక విధానం తీసుకురావాలని సూచించింది. TVK అభిప్రాయం ప్రకారం.. స్థానిక పరిస్థితులు, విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా వైద్య విద్య విధానాలను రాష్ట్రాలే రూపొందించుకునే అవకాశం ఉండాలి.కేంద్రంపై విమర్శ.. డీఎంకేపై కౌంటర్విజయ్ తాజా ప్రకటనలో రాజకీయ వ్యూహం స్పష్టంగా కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నీట్ విధానాన్ని వ్యతిరేకించడం ద్వారా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసిన టీవీకే.. అదే సమయంలో తమిళనాడులో ప్రధాన ప్రత్యర్థి అయిన డీఎంకేపైనా ప్రశ్నలు సంధించింది.2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో డీఎంకే అధికారంలోకి వస్తే నీట్‌ను రద్దు చేస్తామని(చేయిస్తామని) హామీ ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీ అమలు కాలేదని టీవీకే విమర్శించింది.“మేమే నీట్‌ను రద్దు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేసే రాజకీయాలు చేయం” అంటూ పరోక్షంగా డీఎంకేను టార్గెట్ చేసింది టీవీకే. ఒకే అంశంతో అటు కేంద్ర విధానాన్ని వ్యతిరేకిస్తూ.. ఇటు డీఎంకే హామీలను ప్రశ్నించే వ్యూహాన్ని విజయ్ అనుసరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.పాత వివాదమే.. కొత్త రాజకీయ రంగుతమిళనాడులో ఈ అంశం కొత్తది కాదు. వైద్య విద్య ప్రవేశాల్లో జాతీయ స్థాయి పరీక్ష అవసరమా? లేదంటే రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలా? అనే చర్చ చాలాకాలంగా కొనసాగుతోంది. నీట్‌ను వ్యతిరేకించేవాళ్లు.. గ్రామీణ ప్రాంతాలు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ విధానం ప్రతికూలంగా మారుతోందని వాదిస్తున్నారు. కోచింగ్ వ్యవస్థకు ప్రాధాన్యం పెరిగి, సామాన్య కుటుంబాల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. మరోవైపు అనుకూల వర్గాలు మాత్రం దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశాల్లో ఒకే ప్రమాణం ఉండేందుకు జాతీయ స్థాయి పరీక్ష అవసరమని వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజా పేపర్ లీకేజీ వివాదం.. తమిళనాడు చర్చను మళ్లీ తెరపైకి తెచ్చింది.విజయ్‌కు రాజకీయంగా కీలకమా?సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన విజయ్.. టీవీకేను బలమైన రాజకీయ శక్తిగా నిలబెట్టే ప్రయత్నంలో ఉన్నారు. యువత, విద్యార్థులు, రాష్ట్ర హక్కులు వంటి అంశాలను ప్రధాన అజెండాగా తీసుకుంటున్నారు. తమిళనాడులో విద్య, సామాజిక న్యాయం అంశాలు ఎప్పటి నుంచో కీలక రాజకీయ అంశాలు. ఈ నేపథ్యంలో నీట్ వ్యతిరేకతను బలంగా వినిపించడం ద్వారా విద్యార్థుల్లో, యువ ఓటర్లలో తన పార్టీకి స్థానం పెంచుకునే ప్రయత్నంగా ఈ అడుగును చూస్తున్నారు.NEET రగడ.. పొలిటికల్ గేమ్‌గా మారుతుందా?ఇప్పటివరకు నీట్ వివాదం ప్రధానంగా పరీక్షా విధానం, లీక్‌లు, సంస్కరణల చుట్టూ తిరిగింది. కానీ తమిళనాడులో మాత్రం ఇది కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, రాజకీయ ఆధిపత్య పోరుగా మారే అవకాశం కనిపిస్తోంది. విజయ్ తాజా వైఖరి చూస్తే.. నీట్ అంశాన్ని కేవలం విద్యా సమస్యగా కాకుండా రాజకీయ చర్చగా మార్చే ప్రయత్నం కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా.. NEET వ్యతిరేకతతో కేంద్రంపై విమర్శలు, డీఎంకేపై ఎదురుదాడి.. రెండింటినీ ఒకేసారి సాధించే వ్యూహంతో విజయ్ ముందుకు సాగుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
నీట్ లీక్.. రాజీనామా కచ్చితంగా చేయాలా??
ఒక పరీక్ష.. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్.. కోట్లాది కుటుంబాల ఆశలు. అలాంటి పరీక్షా వ్యవస్థలో చిన్న లోపం జరిగినా దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. మరి దేశంలోనే అతిపెద్ద ప్రవేశ పరీక్షల్లో ఒకటైన నీట్-యూజీలో ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలు వచ్చినప్పుడు బాధ్యత ఎవరిది? లీక్‌కు పాల్పడిన వ్యక్తులదా? లేక ఆ వ్యవస్థను పర్యవేక్షిస్తున్న మంత్రిదా?..నీట్-యూజీ పేపర్ లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న వేళ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ అటు నిరసనకారులు, ఇటు ప్రతిపక్షాల నుంచి బలంగా వినిపిస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ డిమాండ్‌ను తోసిపుచ్చుతోంది. ప్రశ్నపత్రం లీక్‌కు కారణమైన వారిపై చర్యలు తీసుకున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని, పరీక్షా వ్యవస్థలో మున్ముందు ఈ తరహావి జరగకుండా సంస్కరణలు చేపడుతున్నామని చెబుతోంది.అయితే ఇక్కడ అసలు ప్రశ్న.. ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేయాలి?. ఆయనేమైనా పేపర్ లీక్ చేశారా?. ఆయనపై ఎలాంటి ఆరోపణలు లేవు కదా అని!. కానీ.. తన శాఖ పరిధిలో ఇంత పెద్ద స్థాయిలో వ్యవస్థాపరమైన వైఫల్యం చోటుచేసుకున్నప్పుడు నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం ఉండదా? అంటూ ఇంకోవైపు కూడా ఒత్తిడి నెలకొంది.నైతిక బాధ్యతా?.. పెద్ద మాటే!రాజకీయాల్లో “నైతిక బాధ్యత” అనేది చట్టపరమైన నేరంతో సమానం కాదు. ఒక మంత్రి స్వయంగా తప్పు చేశారని నిరూపణ కాకపోయినా.. తన శాఖలో జరిగిన తీవ్రమైన వైఫల్యానికి బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకోవడం అనే సంప్రదాయం భారత రాజకీయాల్లో గతంలో కనిపించింది. అయితే కాలంతో పాటు ఈ సంప్రదాయంపై అభిప్రాయాలు మారాయి. ప్రస్తుతం ప్రభుత్వాలు సాధారణంగా.. “తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవడం, దర్యాప్తు పూర్తి చేయడం, వ్యవస్థను సరిదిద్దడం”నే బాధ్యతగా చెబుతున్నాయి. ఇదే నీట్ వివాదంలోనూ కేంద్రం వాదన.గతం ఏం నేర్పింది మరి?నీట్ వ్యవహారంలో మరో కీలక ప్రశ్న కూడా తెరపైకి వస్తోంది. 2024లోనూ నీట్-యూజీ నిర్వహణపై తీవ్ర వివాదం చెలరేగింది. ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలు, గ్రేస్ మార్కుల వివాదం, పరీక్షా విధానంపై అనుమానాలు దేశవ్యాప్తంగా ఆందోళనలకు దారితీశాయి. ఆ సమయంలోనూ కేంద్ర విద్యాశాఖపై ప్రశ్నలు వచ్చాయి. అప్పుడు ధర్మేంద్ర ప్రదానే మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ నీట్ వ్యవస్థపై నమ్మకం దెబ్బతినడంతో.. “గత వివాదాల నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకున్నారు? వ్యవస్థలో లోపాలు ఎందుకు పునరావృతమవుతున్నాయి?” అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.మరోవైపు నీట్ వివాదాల నేపథ్యంలో కొందరు విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని, ఆందోళనలకు లోనై అఘాయిత్యాలకు పాల్పడ్డారని విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఇలాంటి సమయంలో.. పరీక్షా వ్యవస్థపై విశ్వాసాన్ని తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు చెబుతున్నారు.అయితే కేంద్రం వాదన మాత్రం భిన్నంగా ఉంది. లీకో, అవకతవకలో.. పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవడం, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా సంస్కరణలు తీసుకురావడమే అసలు బాధ్యత అని ప్రభుత్వం చెబుతోంది.గతంలో నైతిక బాధ్యతతో పదవి వదిలిన నేతల గురించి తెలుసా?.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ తప్పుకున్న వీళ్లు పేర్లు ఇప్పుడు తెరపైకి వచ్చాయి మరి!. లాల్ బహదూర్ శాస్త్రి..స్వతంత్ర భారత రాజకీయ చరిత్రలో నైతిక బాధ్యతకు తొలి ఉదాహరణగా తరచూ ప్రస్తావించే పేరు లాల్ బహదూర్ శాస్త్రి. 1956లో తమిళనాడులోని అరియలూరు వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రమాదానికి శాస్త్రి ప్రత్యక్షంగా కారణం కాదు. అయినప్పటికీ రైల్వే మంత్రిగా శాఖ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశారు. అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తొలుత ఆయన నిర్ణయాన్ని అంగీకరించకపోయినా.. శాస్త్రి పట్టుదలతో చివరకు రాజీనామాను ఆమోదించారు.టీటీ కృష్ణమాచారి..1958లో వెలుగులోకి వచ్చిన ముండ్రా కుంభకోణం కేంద్ర ప్రభుత్వాన్ని కుదిపేసింది. ఎల్ఐసీ పెట్టుబడుల వ్యవహారంలో వచ్చిన ఆరోపణలు, ఆర్థిక శాఖపై వచ్చిన విమర్శల నేపథ్యంలో అప్పటి ఆర్థిక మంత్రి టీటీ కృష్ణమాచారి రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొన్నారు. ఈ వ్యవహారంలో తన శాఖపై వచ్చిన బాధ్యతను స్వీకరిస్తూ ఆయన పదవికి రాజీనామా చేశారు. ఇది కూడా నైతిక బాధ్యతకు ఉదాహరణగా చెప్పబడుతుంది.మాధవరావ్ సింధియా.. 1992లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమాన ప్రమాదం అనంతరం పౌర విమానయాన శాఖ మంత్రి మాధవరావ్ సింధియా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. ప్రమాదానికి ఆయన ప్రత్యక్ష కారణం కాకపోయినా.. శాఖ మంత్రిగా వ్యవస్థాపరమైన లోపాలకు బాధ్యత వహించడం రాజకీయాల్లో నైతిక ప్రమాణంగా నిలిచింది.నితీశ్ కుమార్.. గైసాల్ రైలు ప్రమాదం1999లో పశ్చిమ బెంగాల్‌లోని గైసాల్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. వందలాది మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అప్పటి రైల్వే మంత్రి నితీశ్ కుమార్.. ప్రమాదానికి తాను ప్రత్యక్ష కారణం కాకపోయినా, రైల్వే శాఖ మంత్రిగా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు.జార్జ్ ఫెర్నాండెజ్..2001లో తెహల్కా నిర్వహించిన ‘ఆపరేషన్ వెస్ట్ ఎండ్’ స్టింగ్ ఆపరేషన్ రక్షణ శాఖలో అవినీతి ఆరోపణలకు దారితీసింది. ఈ వ్యవహారంపై తీవ్ర రాజకీయ దుమారం రేగడంతో అప్పటి రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ రాజీనామా చేశారు. తర్వాత ఆయన తిరిగి కేంద్ర మంత్రివర్గంలోకి వచ్చినప్పటికీ.. ఆ సమయంలో రక్షణ శాఖపై వచ్చిన ఆరోపణలకు రాజకీయ బాధ్యత వహించిన ఘటనగా ఇది నిలిచింది.ప్రతి వైఫల్యానికి రాజీనామా జరిగిందా?అలా ఏం జరగలేదు. భారత రాజకీయ చరిత్రలో ప్రతి పరిపాలనా వైఫల్యానికి మంత్రి పదవి వదిలిన సందర్భాలు లేవు. అనేక సందర్భాల్లో ప్రభుత్వాలు దర్యాప్తులు, కమిటీలు, సంస్కరణలతో ముందుకు వెళ్లాయి. అందుకే ఇప్పుడు నీట్ వివాదంలోనూ రెండు వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం వాదన ప్రకారం.. లీక్‌కు పాల్పడిన వ్యక్తులు గుర్తించబడ్డారు. అరెస్టులు జరిగాయి. దర్యాప్తు కొనసాగుతోంది. ఒక నేరానికి పాల్పడిన వ్యక్తుల చర్యలకు మంత్రిని నేరుగా బాధ్యుడిని చేయడం సరైన విధానం కాదని కేంద్రం చెబుతోంది.మరోవైపు ఆందోళనకారులు, ప్రతిపక్షాల వాదన మాత్రం వేరుగా ఉంది. దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్షపై విద్యార్థులు, తల్లిదండ్రుల విశ్వాసం దెబ్బతిన్నప్పుడు.. వ్యవస్థకు నాయకత్వం వహిస్తున్న మంత్రి నైతిక బాధ్యత తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.నీట్ వివాదం.. అసలు పరీక్ష ఎవరికంటే?నీట్ లీక్ వివాదం చివరకు ఒక మంత్రి పదవి ప్రశ్నకే పరిమితం కాదు. దేశంలోని పరీక్షా వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని తిరిగి ఎలా నిర్మిస్తారు? భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి భరోసా ఇస్తారు? అన్నదే అసలు సవాల్. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా? లేదా అన్నది రాజకీయ నిర్ణయం. కానీ “ఒక వ్యవస్థ విఫలమైతే.. దాని అధిపతి ఎంతవరకు బాధ్యత వహించాలి?” అనే పాత ప్రశ్నను నీట్ వివాదం భారత రాజకీయాల్లో మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. ::వెబ్ ప్రత్యేకం -
పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా
పార్లమెంట్ వర్షకాల సమావేశాలకు సంబంధించి అప్డేట్స్.. -
నిరసనలకు వెళ్లలేదు.. ర్యాంక్ కొట్టాడు!
నీట్ పేపర్ లీక్ వివాదం, విద్యా సంస్కరణలు.. అలాగే నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్లతో ఆందోళనలు కొనసాగుతున్న వేళ.. ఓ టాపర్ మాత్రం భిన్నమైన నిర్ణయం తీసుకున్నాడు. తోటి విద్యార్థుల్లా నిరసనల్లో పాల్గొనడం కంటే.. మళ్లీ పరీక్ష రాసి ర్యాంక్ కొట్టడంపైనే ఫుల్‌గా ఫోకస్ పెట్టాడు. అంతేకాదు ఆ ప్రయత్నంలో విజయమూ సాధించాడు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. అతని స్పందన ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.NEET-UG 2026 రీ ఎగ్జామినేషన్‌లో ఆల్ ఇండియా ర్యాంక్-2 సాధించిన పంషుల్ బన్సల్ తన విజయ రహస్యాన్ని వెల్లడించాడు. పేపర్ లీక్ వ్యవహారానికి వ్యతిరేకంగా ఆ సమయంలో దేశవ్యాప్తంగా పలువురు విద్యార్థులకు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో.. నిరసనకు ఎందుకు వెళ్లాలి? దాని బదులు ఇంట్లో చదువుకుని స్కోర్‌ను మెరుగుపరుచుకోవచ్చు కదా అని తాను అనుకున్నానని చెబుతున్నాడు. మొదట నేనూ బాధపడ్డా..ఢిల్లీ గ్రేటర్ కైలాష్‌లోని కేఆర్ మంగళం వరల్డ్ స్కూల్ విద్యార్థి అయిన పంషుల్.. మొదటి NEET పరీక్ష రద్దు కావడంతో తొలుత తీవ్ర నిరాశకు గురయ్యాడట. "మొదట బాధగా అనిపించింది. నేను బాగా రాశానని, మెడికల్ సీటు వస్తుందని అనుకున్నాను. కాసేపటికి దీనినే మరో అవకాశం లాగా మార్చుకోవాలనుకున్నా. ఆ ఫలితం ఆధారంగా నా పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని నిర్ణయించుకున్నాను" అని తెలిపాడు.706 నుంచి 715 మార్కులకు..నీట్ మొదటి పరీక్షలో పంషుల్ 706 మార్కులు సాధించాడు. అయితే రీ ఎగ్జామినేషన్‌లో అతని స్కోర్‌ను 715 మార్కులు. ఎగ్జామ్‌లో 99.9999 పర్సంటైల్‌తో ఆల్ ఇండియా రెండో ర్యాంక్ సాధించాడు. ఈ విజయంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ అభినందనలు కూడా తెలియజేశారు. అదనంగా లభించిన సమయాన్ని కొత్తగా చదవడానికి కాకుండా.. తన పాత ప్రణాళికనే మరింత క్రమశిక్షణతో కొనసాగించానని చెప్పాడు. "నా షెడ్యూల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ఇదే రొటీన్‌ను కొనసాగించాను. చివరి నెలన్నరలో చేయగలిగినంత కష్టపడ్డాను. మిగతాది దేవుడిపై వదిలేశాను" అని పంషుల్ తెలిపాడు.నిరసనలపై నో కామెంట్NEET పేపర్ లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఇప్పుడు నిరసనలపై తన అభిప్రాయం చెప్పాలని అడిగినప్పుడు.. పంషుల్ స్పందించేందుకు నిరాకరించాడు. "దానిపై నేను వ్యాఖ్యానించను" అని స్పష్టం చేశాడు.#NDTVExclusive | "I thought of the situation as an opportunity to improve my score. So I thought, why should I go to the protest? Instead I could be studying at home and improving my skill and score": NEET UG 2026 topper Panshul Bansal to NDTV's @ShivAroor on #IndiaMatters pic.twitter.com/G8c7O2KXHn— NDTV (@ndtv) July 21, 2026పేపర్ లీక్ తర్వాత రీ ఎగ్జామ్అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన NEET-UG పరీక్షను తొలుత మే 3న నిర్వహించారు. అయితే ప్రశ్నపత్రం లీక్ ఆరోపణల నేపథ్యంలో మే 12న పరీక్షను రద్దు చేశారు. అనంతరం జూన్ 21న భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య రీ ఎగ్జామ్ నిర్వహించి.. జులై 16న ఫలితాలు ప్రకటించారు.అయితే పంషుల్ బన్సల్ విజయ ప్రయాణంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు తన లక్ష్యంపై దృష్టి పెట్టి ర్యాంక్ సాధించిన అతని కృషిని పలువురు ప్రశంసిస్తుండగా.. మరోవైపు NEET వివాదంలో ఆందోళన చేస్తున్న విద్యార్థుల పరిస్థితులను కొందరు గుర్తు చేస్తున్నారు.పంషుల్ వంటి సౌకర్యాలు ఉన్న విద్యార్థులకు మరో అవకాశం లభించడం ఒక కోణమైతే.. గ్రామీణ, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులకు పరీక్షా వ్యవస్థలోని లోపాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆందోళనకారులు చెబుతున్నారు. పేపర్ లీక్ వ్యవహారం ఇప్పటికే ఒత్తిళ్లతో ఉన్న విద్యార్థుల్లో అసంతృప్తికి చివరి కారణంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
గళమెత్తిన విద్యార్థి, మేధోవర్గం
-
నీట్ అర్హుల జాబితా
సాక్షి, అమరావతి: నీట్ యూజీ–2026 రాష్ట్ర అర్హుల జాబితాను మూడు, నాలుగు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. ఏటా నీట్ ఫలితాలు వెలువడిన తర్వాత హెల్త్ యూనివర్సిటీ ప్రతినిధి ఢిల్లీ వెళ్లి నీట్ అర్హుల జాబితాతో కూడిన హార్డ్ డిస్క్ ను తీసుకువస్తారు. కానీ, ఈ ఏడాది నుంచి రాష్ట్రాల వారీగా అర్హుల జాబితాను మూడు, నాలుగు రోజుల్లో వెబ్సైట్లో విడుదల చేస్తామని వర్సిటీ అధికారులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. -
పేపర్ లీకేజీ... ఘోరమైన పాపం
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన నీట్–యూజీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా స్పందించారు. ప్రశ్నపత్రాలను లీక్ చేయడం ‘ఘోరమైన పాపం’గా అభివర్ణించారు. ఈ పాపానికి ఒడిగట్టినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు. యువత భవిష్యత్తుతో ఆటలాడితే ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టంచేశారు. మంగళవారం పార్లమెంట్ లైబ్రరీ భవనంలో ‘మంగళ్ మిలన్’పేరిట జరిగిన ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో తమ కూటమి ఎంపీలను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు. పేపర్ లీక్ అనేది పార్టీల రాజకీయాలకు సంబంధించిన అంశం కాదని.. జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశమని వెల్లడించారు. ఈ జాఢ్యాన్ని అంతం చేయడానికి కేంద్రం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలతో ఆప్యాయత, అనురాగంతో సన్నిహిత సంబంధాలు కొనసాగించాలని, యువత విశ్వాసాన్ని పొందాలని ఎన్డీయే ఎంపీలకు సూచించారు. ‘మంగళ్ మిలన్’ముగిసిన అనంతరం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడారు. మోదీ ప్రసంగం వివరాలను వెల్లడించారు. ప్రశ్నపత్రం లీక్ అయినట్లు వార్తలు రాగానే ప్రభుత్వం తక్షణమే స్పందించిందని, 13 మందిని అరెస్టు చేసి జైలుకు పంపిందంటూ ప్రధానమంత్రి చెప్పారని వెల్లడించారు. ఈ సమావేశం ఎంతో ఫలప్రదంగా సాగిందని, ప్రధాని అనేక ముఖ్యమైన అంశాలపై మాట్లాడారని రిజిజు పేర్కొన్నారు. యువతతో ఎంపీలు మమేకం కావాలి విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకుండా ‘నీట్’పునఃపరీక్షకు ప్రాధాన్యతనిచి్చ, దానిని విజయవంతంగా నిర్వహించి, ఫలితాలను ఎటువంటి జాప్యం లేకుండా ప్రకటించినట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి పేపర్ లీక్‌లు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ విద్యార్థులకు అండగా ఉంటుందన్నారు. దేశ ప్రయోజనాలకు సంబంధించిన కీలకమైన అంశంలో రాజకీయాలు చేయడం తగదని పేర్కొన్నారు. యువత విశ్వాసాన్ని పొందాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా యువతతో మమేకం కావాలన్నారు.వారి ప్రయోజనాల పరిరక్షణ కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించాలని చెప్పారు. నీట్ పేపర్ లీకేజీలో ప్రమేయం ఉన్నవారికి కఠిన శిక్ష పడేలా చూసేందుకు అత్యంత సమర్థులైన న్యాయవాదులను రంగంలోకి దించినట్లు గుర్తుచేశారు. దోషులను శిక్షించాలని, పేపర్ లీకేజీలు జరగకుండా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఉద్ఘాటించారు. విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరగకూడదని అన్నారు. వారిని తప్పుదోవ పట్టించడం సులభమే అయినప్పటికీ సరైన మార్గంలో నడిపించడం మాత్రం కష్టమని వ్యాఖ్యానించారు. వారు మంచిమార్గంలో నడిచేలా చూడడం మనందరి బాధ్యత అని స్పష్టంచేశారు. రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ, యువత భవిష్యత్తు కోసం అందరూ కలిసికట్టుగా పని చేయాలన్నారు. ఎఫ్‌టీఏలతో దేశానికి లాభం అలాగే గత కొన్ని నెలల్లో దేశం సాధించిన విజయాల మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇటీవల అనేక దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల(ఎఫ్‌టీఏ) గురించి ఎన్డీయే ఎంపీలకు వివరించారు. ఈ ఒప్పందాలతో మన రైతాంగానికి, మన దేశానికి లాభమే తప్ప ఎలాంటి నష్టం జరగదన్నారు. దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. దేశ శ్రేయస్సు కోసం జీవితంలోని ప్రతి క్షణాన్నీ అంకితం చేయాలని ఎంపీలను కోరారు. ‘‘దేశమే ప్రథమం, దేశ పురోగతి, సంక్షేమం కోసం మనం నిరంతరంకృషి చేయాలి’’అని పిలుపునిచ్చారు. కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన సభ్యులకు ప్రధానమంత్రి అభినందనలు తెలియజేశారు. ‘‘ప్రధాన సేవక్ (ప్రధాని మోదీ) శరీరంలోని ప్రతి అణువూ, ఆయన సమయంలోని ప్రతి క్షణమూ పిల్లల భవిష్యత్తు కోసమే అంకితం’’ అని బీజేపీ ‘ఎక్స్’లో పోస్టు చేసింది. -
రాహుల్ గాంధీ ధర్నాపై కేంద్ర సర్కారు సమాధానం ఇదే..
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వద్ద కాంగ్రెస్ నిరసనకు దిగిన నేపథ్యంలో ఎంపీ రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడిన విషయం తెలిసిందే. లోక్ కల్యాణ్ మార్గ్‌కు చేరుకుని రాహుల్ గాంధీతో ఆయన చర్చించారు. ఆ సమయంలో కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్ కూడా అక్కడే ఉన్నారు.దీనిపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ట్వీట్ చేస్తూ... "కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆయనతో పాటు ఉన్న సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు తమ మద్దతుదారులతో కలిసి అక్బర్ రోడ్ సమీపంలో ఒక్కసారిగా ధర్నాకు కూర్చున్నట్టు తెలిసింది.ఈ సీనియర్ ప్రతినిధి బృందానికి ఉన్న గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని, వారితో చర్చించేందుకు కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్‌తో కలిసి నన్ను ప్రభుత్వం స్వయంగా అక్కడికి పంపింది. ఆ ప్రదేశం ధర్నాలకు అనువైనది కాదని, అక్కడ ధర్నా చేయడం వల్ల ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని చెబుతూ, ధర్నాను విరమించాలని రాహుల్ గాంధీని కోరాం.ప్రభుత్వం నీట్‌కు సంబంధించిన అన్ని అంశాలు, దానికి సంబంధించిన ఉద్యమంపై పార్లమెంట్లో చర్చకు అంగీకరిస్తే తాను వెంటనే ధర్నా విరమిస్తానని రాహుల్ గాంధీ చెప్పారు. కొన్ని క్షణాల్లోనే ప్రభుత్వ అత్యున్నత నాయకత్వం అనుమతి తీసుకున్న తర్వాత, ఆయన డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించిందని, నీట్‌కు సంబంధించిన అన్ని అంశాలు, దానికి సంబంధించిన ఉద్యమంపై పార్లమెంట్లో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాహుల్ గాంధీకి హామీ ఇచ్చాం.ఈ సమాచారం రాహుల్ గాంధీకి తెలియజేయగానే, దీనికే తాను అంగీకరించనని, కేంద్ర విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించాలని హామీ ఇవ్వాలని కూడా కోరారు. ఇప్పుడు తనకు రెండు డిమాండ్లు ఉన్నాయని, ఒకటి పార్లమెంట్లో చర్చ, రెండోది కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా అని చెప్పారు.ఇంతకుముందు చర్చ మాత్రమే కోరారని గుర్తు చేయగా, ఇప్పుడు తన డిమాండ్లు మారాయని చెప్పారు. ఇంత త్వరగా మాట మార్చడం తనలాంటి సీనియర్ నేతకు తగదని వినయంగా వివరించే ప్రయత్నం చేయగా, అది తన ప్రత్యేక హక్కు అని చెప్పారు.ఈ ప్రదేశం ధర్నాకు అనువైనది కాదని హోం కార్యదర్శి వివరించే ప్రయత్నం చేయగా, తాను ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోవడం కూడా తన ప్రత్యేక హక్కేనని సమాధానం ఇచ్చారు. రాహుల్ గాంధీ లాంటి సీనియర్ నేత, ప్రతిపక్ష నాయకుడు తన మాట నుంచి వెనక్కి తగ్గడం దురదృష్టకరం. అది ప్రజాస్వామ్య ప్రమాణాలకు విరుద్ధం.నీట్‌కు సంబంధించిన అన్ని అంశాలు, దానికి సంబంధించిన ఉద్యమంపై పార్లమెంట్లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీనికి భిన్నంగా, ఈ తీవ్రమైన అంశంపై నిబంధనల ప్రకారం అధికారిక చర్చ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదు. రాహుల్ గాంధీ ప్రవర్తన ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా లేదు" అని జితేంద్ర సింగ్ తెలిపారు. -
హైదరాబాద్‌ను తాకిన ఢిల్లీ సెగ
సాక్షి,హైదరాబాద్: ఢిల్లీ కాక్రోచ్ జనతా పార్టీ సెగ హైదరాబాద్‌కు తగిలింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఛలో లోక్ భవన్‌కు పిలుపునిచ్చాయి. దీంతో విద్యార్థులు ప్రెస్‌క్లబ్ నుంచి లోక్ భవన్‌కు బయల్దేరారు. మరోవైపు రాహుల్‌గాంధీ చర్చలపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ట్వీట్ చేశారు. పార్లమెంట్లో చర్చిస్తామంటే రాహుల్ గాంధీ ధర్నా విరమిస్తామని అన్నారు. పార్లమెంట్లో చర్చించేందుకు సిద్ధమని చెప్పా.ఐతే ఆయన వెంటనే డిమాండ్ మార్చారు. పార్లమెంట్లో చర్చ జరపడమే కాదు.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చర్చించాలని మాత్రమే అన్నారు కదా అని ప్రశ్నిస్తే.. మా డిమాండ్లు మారాయని రాహుల్ సమాధానం ఇచ్చారు. ప్రతిపక్ష నేత వెంటవెంటనే మాట మార్చడం సరికాదు’ ట్వీట్లో పేర్కొన్నారు. -
సీజేపీ ప్రొటెస్ట్‌లో విద్యార్థినులపై పోలీసుల అసభ్య వైఖరి : నెట్టింట దుమారం
నీట్ పేపర్ లీక్, విద్యాశాఖమంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామా, ఆత్మహతల్యకు పాల్పడ్డ నీట్ విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయలు నష్ట పరిహారంలాంటి డిమాండ్స్‌లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ‘సంసద్ చలో’ మార్చ్ (పార్లమెంట్ మార్చ్) సందర్భంగా పోలీసులు ఉద్యమ కారులపై విరుచుకుపడ్డారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై స్వయంగా పోలీసులే రాళ్లు రువ్వడం, లాఠీలతో విరుచుకుపడటం లాంటి ఘటనలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహాన్ని రగిలించాయి. ముఖ్యంగా మహిళా నిరసనకారులు, విద్యార్థినుల, పోలీసుల వైఖరి, ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. మహిళలు, విద్యార్థినుపై పోలీసులు వారిపై అమానుషంగా ప్రవర్తించారని ప్రతిపక్షాలు, ఉద్యమకారులు ఆరోపణలు చేశారు. కొంతమంది విద్యార్థినుల ప్రైవేట్ పార్ట్స్‌పై కావాలనే దాడిచేశారని సోషల్ మీడియాలో దుమారం రేగింది. ఇదేనా బేటీ బచావ్ అంటూ పలువురు మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియోపై దేశవ్యాప్తంగా మహిళల భద్రత మరియు ప్రజాస్వామ్య హక్కులపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. బాధ్యులపై పోలీసు అధికారులపై కఠిన చర్యలుతీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు.मोदी सरकार का नारी सम्मान स्वयं देखिए।भाजपा को नारी केवल तब अच्छी लगती जब वह लाडली बहन योजना का धन लेके इनको वोट करे।जहां नारी अपने अधिकारों की बात करती है तब इनकी लाठी चलती है।#AAPHelplineForStudents#JointVenture#CJPProtestUpdate#OmegaStockWatch pic.twitter.com/EtLuNW368H— Cockroach Janta Party,Kanpur (@CJPknp) July 21, 2026నిరసనకారులను, విద్యార్థినులను పోలీసులు బలవంతంగా లాగి, వాహనాల్లోకి ఎక్కించే క్రమంలో పలువురు మహిళల దుస్తులు చిరిగిపోయాయని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్, CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆరోపించారు. అనుమతి లేకుండా మార్చ్ నిర్వహిస్తున్నారనే నెపంతో పోలీసులు శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేశారని, బాష్పవాయువు ప్రయోగించి బాలికలపై తీవ్రంగా విరుచుకుపడ్డారని నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్బంధంలో ఉన్న సమయంలో కొందరు పోలీసు అధికారులు మహిళలను తీవ్రమైన అసభ్య పదజాలంతో దూషించారని ఒక మహిళా ఉద్యమకారిణి ఆరోపించింది. The Delhi Police intentionally attacked the private parts of girls, this is a shameful act by the police. Responsible police officer should be dismissed. pic.twitter.com/1g1gtCXgYQ— The Dalit Voice (@ambedkariteIND) July 21, 2026ఇదీ చదవండి: ఉద్యోగిని పెర్ఫామెన్స్ బాలేదని పెయిడ్ లీవ్ : కంపెనీకి భారీ క్రేజ్అయితే ఈ ఆరోపణలపై పోలీసులు వివరణ ఇచ్చారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నందున ఢిల్లీ పరిసరాల్లో ఆంక్షలు ఉన్నాయని, నిరసనకారులు అనుమతి లేకుండా పార్లమెంట్ వైపు దూసుకుపోవడానికి ప్రయత్నించారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. నిరసనకారులలో కొందరు పోలీసులపైకి రాళ్లు రువ్వారని, ఆ క్రమంలో గుంపును చెదరగొట్టడానికి కనీస బలప్రయోగాన్ని మాత్రమే ఉపయోగించామని స్పష్టం చేశారు. నెట్టివేతలు, బారికేడ్ల పైనుంచి పడిపోవడం మరియు తొక్కిసలాట లాంటి పరిస్థితుల వల్లే నిరసనకారులకు గాయాలయ్యాయని, కావాలని ఎవరిపై దాడి చేయలేదని పోలీసులు అధికారికంగా ప్రకటించారు. ఇదీ చదవండి: ఒకే కాన్పులో నలుగురు అమ్మాయిలు : 10 సీటర్ కారు కావాలి -
‘‘ఆ ఫొటోలో ఉన్నది నా కూతురు.. ఆమె గొంతుకగా నిలుస్తా’’
కార్గిల్ యుద్ధ వీరుడు రాజేశ్ మాల్‌కు తన కూతురు కెరీర్లో బాగా రాణించాలన్న ఆశ ఉండేది. కానీ గత నెల ఆయన కల ఛిన్నాభిన్నమైంది. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో నివసిస్తున్న ఆయన 23 ఏళ్ల కూతురు, నీట్ అభ్యర్థిని రియా కుమారి థాపా ఆత్మహత్య చేసుకుంది. ఆమె తన తల్లిదండ్రులకు "ఐ లవ్ యూ" అని మాత్రమే రాసి లేఖను పెట్టింది.ఆ ఘటన తర్వాత తన కూతురు ఫొటోను చేతిలో పట్టుకుని రాజేశ్ మాల్ పోరాటం చేస్తున్నారు. సోమవారం న్యూఢిల్లీలో జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఆ ర్యాలీలో పాల్గొన్న వారి మాటలను ప్రభుత్వం పట్టించుకోలేదని పీక్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు."ప్రభుత్వాన్ని జవాబుదారీగా నిలబెట్టే నిరసనలు ఎక్కడ జరిగినా నా కూతురు ఫొటోను తీసుకెళ్తాను. వారు విన్నా వినకపోయినా నా కూతురి గొంతుకగా నేనే నిలుస్తా" అని ఆయన చెప్పారు.రాజేశ్ మాల్ 1999 కార్గిల్ యుద్ధ వీరుడు. ఆయన ఉత్తరాఖండ్‌కు చెందినవారు. సోమవారం జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు జరిగిన సీజేపీ ర్యాలీలో పాల్గొన్నారు. ఆయన కూతురు రియా కుమారి థాపా, డెహ్రాడూన్‌కు చెందిన 23 ఏళ్ల నీట్ అభ్యర్థిని. ఆమె జూన్‌లో ఆత్మహత్య చేసుకుంది.తన కూతురు ఫొటోను చేతిలో పట్టుకుని, ఆమె విషాద గాథను రాజకీయ నాయకులతో ఒకే వేదికపై పంచుకుంటూ న్యాయం కోరుతున్నారు. ఈ నెల ప్రారంభంలో జంతర్ మంతర్‌లో జరిగిన సీజేపీ నిరసనలోనూ పాల్గొన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కూడా కలిశారు.విద్యార్థుల మరణాలపై ప్రభుత్వం ఇప్పటివరకు కనీసం విచారం కూడా వ్యక్తం చేయలేదని రాజేశ్ మాల్ నిరాశ వ్యక్తం చేశారు. "ఇప్పటివరకు ప్రభుత్వం కనీసం విచారం కూడా వ్యక్తం చేయకపోవడమే అత్యంత విషాదకరం" అని అన్నారు. సోమవారం వేలాది మంది పాల్గొన్న నిరసన, తన కూతురితో పాటు ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులందరికీ నివాళి అని చెప్పారు. ఆమె కూతురి ఫొటో నిరసన ప్రదర్శన వద్ద ఉంది. ఆ ఫొటోలో ఉన్నది తన కూతురేనని అన్నారు."ప్రభుత్వం వినకపోయినా ఇంతమంది నిరసనకు రావడం గొప్ప విషయం. అందుకే నేను ఇక్కడ ఉన్నాను. బహుశా దేశం మేల్కొంటుంది. బహుశా ఆయన (ధర్మేంద్ర ప్రధాన్) రాజీనామా చేస్తారు" అని అన్నారు.ఇంట్లో రియా ఆత్మహత్య రియా జూన్ 16న ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. ఆమె గదిలో ఆత్మహత్య లేఖ దొరికింది. "ఐ లవ్ యూ మమ్మీ, పాపా. ఎవరి తప్పూ లేదు" అని ఆమె హిందీలో రాసినట్టు సమాచారం.చదువులో ఆశించిన విజయం రాకపోవడం వల్ల కలిగిన నిరాశే ఆమె ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోందని సీనియర్ పోలీసు అధికారి అంకిత్ కందారి తెలిపారు. వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత-ప్రవేశ పరీక్ష (నీట్) మే 3న జరిగింది. ప్రశ్నపత్రం లీక్ ఆరోపణల నేపథ్యంలో ఆ పరీక్ష రద్దైంది. జూన్ 21న మళ్లీ పరీక్ష నిర్వహించారు. పలువురు నీట్ అభ్యర్థులు ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పార్లమెంట్ ముట్టడి ర్యాలీ చేపట్టడంతో విద్యార్థులు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చారు. ఢిల్లీలోని మధ్య ప్రాంతాల్లో నిరసనకారులు, పోలీసుల మధ్య పలుచోట్ల ఘర్షణలు జరిగాయి. View this post on Instagram A post shared by PEEK TV (@peektv_in) -
నీట్ సెగలు: ధర్మేంద్ర ప్రదాన్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా?
నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా రాజకీయ వేడిని పెంచుతోంది. విద్యార్థులు.. కాక్రోచ్ పార్టీ తరఫున ఆందోళనలు, ప్రతిపక్షాల విమర్శలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్లతో ఢిల్లీ రాజకీయాలు హీటెక్కాయి. ఈ వివాదం మధ్యలో నిలిచిన ధర్మేంద్ర ప్రదాన్ రాజకీయ నేపథ్యం ఏమిటి? బీజేపీలో ఆయనకు ఉన్న ప్రాధాన్యత ఎంత? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.నీట్ పరీక్ష నిర్వహణలో లోపాలకు నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రదాన్ పదవి నుంచి తప్పుకోవాలని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) సహా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయన్ని తప్పించే సంకేతాలు కనిపించడం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఎన్టీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నీట్ లీక్ వ్యవహారంపై స్పందిస్తూ.. పరీక్షా పత్రాల లీకేజీని ‘ఘోర పాపం’గా అభివర్ణించారు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వివాదంలో ఉన్న ధర్మేంద్ర ప్రదాన్ నేపథ్యం మరోసారి చర్చకు వచ్చింది.తండ్రి కేంద్ర మంత్రిధర్మేంద్ర ప్రదాన్ 1969 జూన్ 26న ఒడిశాలోని తాల్చేర్‌లో జన్మించారు. ఆయన తండ్రి దేవేంద్ర ప్రదాన్ కూడా బీజేపీ సీనియర్ నాయకుడు. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. తండ్రి రాజకీయ వారసత్వం ఉన్నప్పటికీ.. ధర్మేంద్ర ప్రదాన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విద్యార్థి దశలోనే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న ఆయన.. ఆర్ఎస్ఎస్ అనుబంధ విద్యార్థి సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)లో చురుకుగా పనిచేశారు. అక్కడి నుంచి ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రయాణం బీజేపీ యువమోర్చా, పార్టీ సంస్థాగత బాధ్యతల వరకు సాగింది.వ్యూహకర్తగా.. బీజేపీలో క్రమంగా ఎదిగిన ధర్మేంద్ర ప్రదాన్ 2004లో తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూ జాతీయ రాజకీయాల్లో తన స్థానం బలపర్చుకున్నారు. ఎన్నికల నిర్వహణ, పార్టీ విస్తరణ వ్యూహాల్లో ఆయనకు మంచి అనుభవం ఉంది. పలు రాష్ట్రాల్లో బీజేపీ ఎన్నికల బాధ్యతలు నిర్వహించిన ఆయన.. పార్టీ అధిష్ఠానం దృష్టిలో నమ్మకమైన నాయకుడిగా ఎదిగారు.మోదీ ప్రభుత్వంలో కీలక మంత్రిగా..2014లో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధర్మేంద్ర ప్రదాన్‌కు కీలక బాధ్యతలు దక్కాయి. పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రిగా పనిచేసిన ఆయనకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఇంధన రంగంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఉజ్వల యోజన అమలును కేంద్రం ఆయన శాఖకు చెందిన ముఖ్య విజయాల్లో ఒకటిగా పేర్కొంది. ఆ తర్వాత 2021లో ఆయనకు కేంద్ర విద్యాశాఖ బాధ్యతలు అప్పగించారు. జాతీయ విద్యా విధానం (NEP) అమలు, విద్యా రంగంలో సంస్కరణలపై ఆయన దృష్టి పెట్టారు.నీట్ వివాదమే ఇప్పుడు అతిపెద్ద పరీక్షవిద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే నీట్ పరీక్షలో పేపర్ లీక్ ఆరోపణలు తెరపైకి రావడం ధర్మేంద్ర ప్రదాన్‌కు అతిపెద్ద రాజకీయ సవాల్‌గా మారింది. పరీక్ష నిర్వహణలో లోపాలకు బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు కేంద్రం మాత్రం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుందని చెబుతోంది. లీక్ వ్యవహారంలో నిందితులను అరెస్టు చేశామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పరీక్షా వ్యవస్థను మరింత పటిష్ఠం చేస్తామని స్పష్టం చేస్తోంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించిన వివరాల ప్రకారం.. నీట్ లీక్‌లో నిందితులపై చర్యలు తీసుకున్నామని, విద్యార్థుల భవిష్యత్‌కు నష్టం కలగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ప్రధాని పేర్కొన్నారు.Birthday wishes to Union Minister Shri Dharmendra Pradhan Ji. He is making commendable efforts towards the implementation of the National Education Policy, which seeks to make India a hub for knowledge, learning and innovation. Praying for his long and healthy life.@dpradhanbjp— Narendra Modi (@narendramodi) June 26, 2026బీజేపీలో ఎందుకు కీలకం?ధర్మేంద్ర ప్రదాన్‌ను బీజేపీలో కీలక వ్యూహకర్తల్లో ఒకరిగా భావిస్తారు. పార్టీ సంస్థాగత వ్యవహారాలు, ఎన్నికల నిర్వహణలో ఆయనకు ఉన్న అనుభవం అధిష్ఠానం దృష్టిలో ప్రత్యేక స్థానం కల్పించింది. ఒడిశాకు చెందినప్పటికీ.. ఆయన రాజకీయ ప్రస్థానం రాష్ట్ర స్థాయిని దాటి జాతీయ స్థాయికి చేరింది. మోదీ-షా నాయకత్వానికి సన్నిహితంగా ఉండే నేతల్లో ఆయన పేరు తరచూ వినిపిస్తుంది. అందుకే ప్రస్తుత నీట్ వివాదం నేపథ్యంలో ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి పెరుగుతున్నా.. ఇప్పటివరకు బీజేపీ నాయకత్వం ఆయనకు మద్దతుగా నిలుస్తున్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ముందున్న అసలు సవాల్ఒకవైపు విద్యార్థుల ఆందోళనలు.. మరోవైపు ప్రతిపక్షాల రాజకీయ ఒత్తిడి.. ఇంకోవైపు దేశవ్యాప్తంగా పరీక్షా వ్యవస్థపై తగ్గిన నమ్మకాన్ని తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత.. ఇవన్నీ ఇప్పుడు ధర్మేంద్ర ప్రదాన్ ముందున్న సవాళ్లు. మంత్రి పదవి కొనసాగుతుందా? లేదా?? అన్నది రాజకీయ నిర్ణయంపై ఆధారపడి ఉన్నప్పటికీ.. కోట్లాది విద్యార్థులు నమ్మే పరీక్షా వ్యవస్థను తిరిగి బలోపేతం చేయడం ఆయన ముందున్న అసలు పరీక్షగా మారింది.కుటుంబ నేపథ్యం.. వ్యక్తిగత జీవితంధర్మేంద్ర ప్రదాన్ భార్య పేరు మృదులా ప్రదాన్. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ.. కుటుంబాన్ని రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంచుతూ, ఎక్కువ సమయం పార్టీ మరియు ప్రభుత్వ బాధ్యతలకే కేటాయించే నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ల ప్రకారం ధర్మేంద్ర ప్రదాన్‌కు చర, స్థిరాస్తులు ఉన్నాయి. బ్యాంకు డిపాజిట్లు, పెట్టుబడులు, ఆస్తుల వివరాలను ఆయన ఎన్నికల సంఘానికి సమర్పించే అఫిడవిట్లలో క్లియర్‌గా వెల్లడించారు. -
నీట్ వివాదంపై మోదీ కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పరీక్షా పత్రాలను లీక్ చేయడం ‘ఘోర పాపం’ అని అభివర్ణించిన ఆయన.. విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. పార్లమెంట్ సమీపంలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనలు కొనసాగుతున్న వేళ.. ఎన్టీయే (NDA) పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నీట్ అంశాన్ని ప్రధాని ప్రస్తావించారు. ఈ సమావేశం అనంతరం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మీడియాకు వివరాలు వెల్లడించారు.‘తప్పు చేసిన వారిని వదిలిపెట్టం’నీట్ పేపర్ లీక్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని ప్రధాని పేర్కొన్నట్లు కిరణ్ రిజిజు తెలిపారు. లీక్‌కు పాల్పడిన వారిని గుర్తించి అరెస్టు చేశామని.. ఇప్పటివరకు 13 మంది నిందితులు జైలులో ఉన్నారని వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్‌కు నష్టం కలిగించే ఇలాంటి చర్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని ప్రధాని స్పష్టం చేసినట్లు తెలిపారు. నిందితులపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని ఆదేశించారని.. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు గట్టి చర్యలు అవసరమని పేర్కొన్నట్లు చెప్పారు.విద్యార్థుల ప్రయోజనాలే ప్రాధాన్యంనీట్ వంటి ప్రతిష్ఠాత్మక పరీక్షల్లో విద్యార్థుల విశ్వాసాన్ని కాపాడటం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని ప్రధాని పేర్కొన్నారు. విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకున్నామని.. పరీక్ష నిర్వహణలో పారదర్శకత, భద్రత మరింత పెంచాల్సిన అవసరం ఉందని చెప్పినట్లు రిజిజు వెల్లడించారు. లీక్ కారణంగా రద్దైన నీట్-యూజీ పరీక్షకు ప్రభుత్వం రీ-ఎగ్జామ్ నిర్వహించిందని.. పరీక్షను విజయవంతంగా పూర్తి చేసి ఫలితాలను కూడా నిర్ణీత సమయంలో ప్రకటించామని తెలిపారు.పరీక్షా వ్యవస్థలో మార్పులపై దృష్టిపరీక్షా పత్రాల లీకేజీ వంటి ఘటనలు దేశ విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పరీక్షల నిర్వహణ విధానంలో మరింత పటిష్ఠమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని సూచించారు. పరీక్షల భద్రత, పారదర్శకతపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు.ఎన్టీయే భేటీలో పలు అంశాలపై చర్చఎన్టీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నీట్ వివాదంతో పాటు పార్లమెంట్ సమావేశాలు, ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం మంత్రి కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారని తెలిపారు.నీట్ పేపర్ లీక్ వ్యవహారం నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నిస్తోంది. ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. మంత్రి తప్పుకోవడం లేదా కేంద్రం ఆయనను తప్పించడం జరిగే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని సీజేపీ స్పష్టం చేసింది. విద్యా వ్యవస్థలో తక్షణ సంస్కరణలు అవసరమని పేర్కొంటూ.. తమ డిమాండ్లను కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు కూడా అందజేసింది. ఆ డిమాండ్లపై కేంద్రం నుంచి ఇంకా స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. ఇదే సమయంలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ కూడా సీజేపీ నిరసనలపై స్పందించారు. యువత సమస్యలను ప్రభుత్వం వినాలని, నీట్ వ్యవహారంలో బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. -
‘నీట్’ ఆందోళనలపై హేమామాలిని వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: నీట్-యూజీ (NEET-UG) 2026 పేపర్ లీక్ వివాదంపై రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయడం అర్థరహితమని బీజేపీ ఎంపీ హేమామాలిని చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర దుమారం రేపాయి. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప, నిరసనలతో ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆమె అభిప్రాయపడ్డారు. విద్యారంగానికి, యువతకు మోదీ ప్రభుత్వం ఎప్పుడూ అండగా నిలిచిందని ఆమె సమర్థించారు. #WATCH | Monsoon session of Parliament | Delhi: BJP MP Hema Malini says, “If there is a problem, it should be discussed properly. Protesting in this manner won't achieve anything. As for the country's youth and the education system, our Modi government has always stood by them… pic.twitter.com/4HQqf90fqk— ANI (@ANI) July 20, 2026అయితే ఆమె వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. శాంతియుతంగా నిరసన తెలిపే ప్రాథమిక హక్కును కాలరాసేలా మాట్లాడటం సరికాదని దుయ్యబట్టారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తరుణంలో ఈ వివాదం రాజకీయంగానూ వేడెక్కింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్లు జోరందుకున్నాయి. మరోవైపు, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జ్ చేయడంతో పాటు భారీగా మోహరించారు. పరీక్షల వ్యవస్థను పారదర్శకంగా మార్చడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని విపక్షాలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
లోక్ సభ మధ్యాహ్నం 2 వరకు వాయిదా
న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల రెండవ రోజు (మంగళవారం) లోక్‌సభ సమావేశాలు ప్రారంభమైన కొద్ది నిమిషాలకే వాయిదా పడ్డాయి. సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వంపై నినాదాలు చేస్తూ, ఆందోళనకు దిగడంతో, స్పీకర్ ఓం బిర్లా సభను వాయిదా వేయక తప్పలేదు. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి తలెత్తడంతో సభ మధ్యాహ్నం 12 వరకు వాయిదాపడింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి సభలో గందరగోళం కొనసాగుతోంది. మంగళవారం లోక్‌సభలో విపక్ష సభ్యుల ఆందోళనలు, నినాదాల హోరు మధ్య సభ రెండుసార్లు వాయిదా పడింది. సజావుగా సభను నిర్వహించేందుకు స్పీకర్ ఓం బిర్లా, ప్రిసైడింగ్ అధికారి సంధ్యా రాయ్ చేసిన విజ్ఞప్తులను విపక్షాలు పట్టించుకోలేదు. సభ్యులు శాంతియుతంగా చర్చల్లో పాల్గొనాలని కోరినా, విపక్ష సభ్యులు నినాదాలు ఆపకపోవడంతో తొలుత మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల వరకు సభను వాయిదా వేశారు. సభా కార్యకలాపాలు ప్రారంభం కావడానికి ముందే ‘ఇండియా’ కూటమి నేతలు సమావేశమై వ్యూహంపై చర్చించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్లమెంటరీ పార్టీ సోనియా గాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. పరీక్ష పత్రాల లీకేజీలు, జంతర్‌మంతర్ వద్ద జరిగిన ఆందోళనలు తదితర అంశాలపై చర్చించాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు నిరసనలు వ్యక్తంచేశాయి. నీట్ పేపర్ లీకేజీ అంశంపై ప్రతిపక్షాలు సభలో నినాదాలు చేస్తూ నిరసనలు తెలిపాయి. పార్లమెంట్ వెలుపల వేలాది మంది నిరసనకారులు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మార్చ్ నిర్వహిస్తున్నారు. నిన్న (సోమవారం) సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) సవరణ బిల్లు ప్రవేశపెట్టారు. అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తుల గరిష్ట సంఖ్యను 33 నుండి 37కి పెంచేందుకు ఉద్దేశించిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అలాగే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పాటు, ప్రాణాలు కోల్పోయిన 20 మందికి పైగా నీట్ అభ్యర్థుల కుటుంబాలకు రూ.1 కోటి నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో ప్రతినిధులు సమావేశమయ్యారు. పార్లమెంట్లో ప్రతిపక్షాల నినాదాలు, హంగామా కొనసాగడంతో సభ పలుమార్లు వాయిదా పడింది. నిరసనకారులపై పోలీసుల వైఖరిని ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. పలువురు ఎంపీలు కూడా ఈ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. -
తొలి రోజే దుమారం
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజు సమావేశాలు విపక్షాల నినాదాల హోరులో కొట్టుకుపోయాయి. ఎలాంటి చర్చలు జరగకుండానే లోక్‌సభ, రాజ్యసభలు సోమవారం అర్ధా్ధంతరంగా ముగిసి మంగళవారానికి వాయిదాపడ్డాయి. ప్రతిష్టాత్మక నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ, అయోధ్య రామ మందిరంలో కోట్ల రూపాయల విరాళాల చోరీ, జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులపై లాఠీచార్జ్ తదితర కీలకాంశాలపై చర్చ చేపట్టాలంటూ విపక్ష పార్టీల నేతలు పట్టుబట్టడంతో పార్లమెంట్ ఉభయసభల్లో తొలిరోజే ప్రతిష్టంభన నెలకొంది. ‘ఇండియా’కూటమి నేతల ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఉభయసభలు హోరెత్తిపోయాయి. తామిచ్చిన వాయిదా తీర్మానాలపై చర్చ కు విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో లోక్‌సభలో ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ సమయం వృథాగా ఖర్చయిపో యాయి. సభాకార్యకలాపాలకు విపక్ష సభ్యులు అడ్డుతగలడంతో లోక్‌సభ, రాజ్యసభలు తలో ఆరుసార్లు వాయిదాపడ్డాయి. ఉభయ సభాపతులు ఇరుసభలను మంగళవారానికి వాయిదావేశారు. ఆరంభం నుంచే అట్టుడికిన లోక్‌సభ.. ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభమైన వెంటనే మరణించిన మాజీ ఎంపీలకు నివాళులు అర్పించారు. అనంతరం స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు వివిధ అంశాలపై చర్చ కోరుతూ వెంటనే నినాదాలు చేశారు. సభ నినాదాలతో నడవదని, సభ్యులు తమ స్థానాల్లో కూర్చొని సభా కార్యక్రమాలకు సహకరించాలని స్పీకర్ బిర్లా విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ కాంగ్రెస్, ఎస్పీ, ఆర్జేడీసహా పలు ప్రతిపక్ష సభ్యులు తమ స్థానాల్లోంచి లేచి ముందుకొచ్చి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. నినాదాలతో లోక్‌సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ ఓం బిర్లా సభ్యులను శాంతించాలని మరోమారు కోరారు. అయినప్పటికీ ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలు కొనసాగడంతో మొదట మధ్యాహ్నం 12 గంటల వరకు సభను వాయిదా వేశారు. అనంతరం తిరిగి ప్రారంభం అయ్యాక విపక్షాల ఆందోళన కొనసాగడంతో వాయిదాల పర్వం కొనసాగి, చివరికి సభ మంగళవారానికి వాయిదా పడింది. రాజ్యసభలోనూ వాయిదాల పర్వం.. రాజ్యసభలో పత్రాల సమర్పణ, నూతన సభ్యుల ప్రమాణస్వీకారం, మృతిచెందిన సభ్యులకు సంబంధించిన సంతాప తీర్మానాల అనంతరం సభా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వెంటనే రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ అంశాన్ని ప్రస్తావించారు. ‘‘జంతర్‌మంతర్‌లో నిరసన తెలుపుతున్న విద్యార్థుల గొంతు ప్రభుత్వం నొక్కేస్తోంది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన సమస్యపై చర్చ జరగాల్సిందే. జంతర్‌మంతర్‌లో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ప్రభుత్వం బలప్రయోగం, లాఠీఛార్జి చేస్తోంది. వారి గొంతును అణచివేస్తోంది’’అని ఖర్గే అన్నారు. ఖర్గే వ్యాఖ్యలపై అధికార కూటమి ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ మధ్యాహ్నం 12 గంటల వరకు సభను వాయిదావేశారు. తర్వాత సభ మొదలైనా పరిస్థితి అలాగే కొనసాగింది. జంతర్‌మంతర్‌లో విద్యార్థులపై లాఠీచార్జ్ చేసిన పోలీసులపై చర్య తీసుకోవాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. అయోధ్యలోని రామమందిరంలో కోట్ల రూపాయల విరాళాలను చోరీచేసిన ఉదంతంపై చర్చ జరపాలని పట్టుబట్టారు. ఈ డిమాండ్లు, నినాదాల నడుమ సభ మంగళవారానికి వాయిదా పడింది. లోక్‌సభ ముందుకు జడ్జీల బిల్లు.. ఇంతటి నినాదాల హోరులోనూ ప్రభుత్వం లోక్‌సభలో ఒక బిల్లును విజయవంతంగా ప్రవేశపెట్టింది. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు గతంలో జారీచేసిన ఆర్డినెన్స్ స్థానంలో రూపొందించిన బిల్లును లోక్‌సభలో న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టారు. -
MBBSలో రిజర్వేషన్లు.. కోర్టుకు 71 ఏళ్ల నీట్ అభ్యర్థి
లక్నో: నీట్ పరీక్షలో వృద్ధులకు రిజర్వేషన్ ఇవ్వాలంటూ లక్నోకు చెందిన అభ్యర్థి అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. 71 ఏళ్ల వయసులో నీట్ యూజీ పరీక్ష రాసిన అత్యంత వృద్ధ అభ్యర్థి అశోక్ బహార్, మెడికల్ సీట్ల భర్తీలో సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకంగా 1శాతం రిజర్వేషన్ కోటా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు చెందిన అశోక్ బహార్ అనే 71 ఏళ్ల వృద్ధుడు ఇటీవల జరిగిన నీట్ యూజీ పరీక్షకు హాజరయ్యారు. చదువుకోవడానికి వయసుతో నిమిత్తం లేదని నిరూపిస్తూ, తన డాక్టర్ కలని నెరవేర్చుకునేందుకు ఆయన ఈ ప్రయత్నం చేశారు. అయితే, కేవలం పరీక్ష రాసేందుకు అవకాశం ఇస్తే సరిపోదని, వృద్ధులకు కూడా వైద్య కళాశాలల్లో సీట్లు దక్కేలా 1శాతం ప్రత్యేక కోటా కేటాయించాలని కోరుతూ ఆయన అలహాబాద్ హైకోర్టులోని లక్నో బెంచ్‌లో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. నేషనల్ మెడికల్ కమిషన్,సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నీట్ పరీక్ష రాయడానికి గరిష్ట వయోపరిమితి లేదు. వయసు అడ్డుకాదన్నప్పుడు, సీట్ల భర్తీలోనూ సీనియర్ సిటిజన్లకు న్యాయం జరగాలని ఆయన వాదించారు. నీట్ ప్రవేశాల్లో వికలాంగులు, మాజీ సైనికుల పిల్లలు, క్రీడాకారులకు ప్రత్యేక రిజర్వేషన్లు లేదా ప్రయోజనాలు కల్పిస్తున్నప్పుడు, సీనియర్ సిటిజన్లను ఎందుకు విస్మరిస్తున్నారని పిటిషనర్ ప్రశ్నించారు.ఈ విషయమై అంతకుముందే మే, జూన్ నెలల్లో ఆయన కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించారు. అయితే అక్కడ ఎలాంటి స్పందన రాకపోవడంతోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. వైద్య రంగంలో సరికొత్త చర్చదేశంలో వైద్య విద్యకు విపరీతమైన పోటీ ఉన్న తరుణంలో ఈ డిమాండ్ జాతీయ స్థాయిలో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. సాధారణంగా యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వైద్య సీట్లను కేటాయిస్తారు. అయితే, వృద్ధాప్యంలో కూడా చదువుకోవాలనే ఆకాంక్ష ఉన్నవారికి సమాన అవకాశాలు కల్పించాలా వద్దా అనే చట్టపరమైన ప్రశ్న ఇప్పుడు కోర్టు ముందుకు వచ్చింది. అలహాబాద్ హైకోర్టు ఈ పిటిషన్‌పై జూలై 21న విచారణ జరపనుంది. -
సోనమ్ వాంగ్చుక్కు కొండంత అండగా..
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సామాజిక ఉద్యమకారుడు, పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ సాగిస్తున్న దీక్ష 21వ రోజుకు చేరుకోగా.. ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండడంతో నిన్న (శనివారం) ఉదయం బలవంతంగా ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే.. ఆయన నిరసనలో గీతాంజలి జె ఆంగ్మో కీలక పాత్ర పోషిస్తున్నారు. మూడు వారాలుగా నిరాహార దీక్ష చేసిన వాంగ్చుక్కు ఆమె నిరంతరం అండగా నిలిచారు. వాంగ్చుక్ను పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించినప్పటికీ, ఆయన ఆశయాల కోసం ఆమె ముందుండి పోరాడుతున్నారు.గీతాంజలి జె ఆంగ్మో ఎవరు? ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏమిటనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తుంది. సోనమ్ వాంగ్‌చుక్ గతంలో రెబెక్కా నార్మన్ అనే అమెరికన్ మహిళను వివాహం చేసుకోగా.. గీతాంజలి ఆయనకు రెండవ భార్య. ఆమె సామాజిక పారిశ్రామికవేత్త, విద్యావేత్త. సోనమ్ వాంగ్‌చుక్‌తో కలిసి ఆమె స్థాపించిన 'హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్, లడఖ్' కో-ఫౌండర్‌గా ఆమె దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆమె హెచ్ఐఏఎల్ సంస్థకు వ్యవస్థాపక సీఈఓ, డీన్‌గా వ్యవహరిస్తున్నారు. హిమాలయ ప్రాంతాల్లోని ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం, పర్యావరణ అనుకూల క్యాంపస్‌ల నిర్మాణం, సోలార్ హీటెడ్ భవనాల రూపకల్పన వంటి వాటిపై ఈ సంస్థ పనిచేస్తుంది. 2021లో భారత సైన్యం కోసం ప్రత్యేకంగా సోలార్ హీటెడ్ టెంట్లను కూడా ఈ సంస్థ అభివృద్ధి చేసింది.ఒడిశాలోని బాలాసోర్‌లోని ఓ పంజాబీ కుటుంబంలో జన్మించిన గీతాంజలి.. ఫకీర్ మోహన్ యూనివర్సిటీ నుండి ఫిజిక్స్‌లో గ్రాడ్యుయేషన్, భువనేశ్వర్‌లోని ప్రముఖ జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. డెన్మార్క్‌తో పాటు విదేశాల్లో దాదాపు 15 ఏళ్ల పాటు కార్పొరేట్ రంగంలో పనిచేసిన ఆమె.. ఆ తర్వాత భారత్‌కి తిరిగి వచ్చి పారిశ్రామికవేత్తగా మారారు. పూషన్, షాంఘై పవర్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, హెలియోస్ బుక్స్ వంటి పలు సంస్థలను స్థాపించారు.గీతాంజలి కేవలం విద్యావేత్త మాత్రమే కాదు.. వేదాంతం, భగవద్గీత బోధించే ఆధ్యాత్మిక అన్వేషకురాలు. ప్రతిష్టాత్మక 'చెవెనింగ్ ఫెలో' అయిన ఆమె, భారత ప్రభుత్వం నుండి 'వుమెన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా' జాతీయ అవార్డును అందుకున్నారు. వీటితో పాటు ఆమె కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించారు. ఒడిస్సీ, రష్యన్ బ్యాలెట్ నృత్యాలలో ప్రవేశం ఉంది. నాకంటూ ఒక స్వార్థ జీవితం కాకుండా.. సమాజం కోసం ఒక గొప్ప ఆశయంతో బతకాలని అనుకున్నాను. ఒక విద్యా సదస్సులో సోనమ్ వాంగ్చుక్ను కలిసినప్పుడు నా ఆలోచనలకు తగ్గ తోడు దొరికిందనిపించిందంటూ ఆమె గతంలో ఇంటర్వ్యూలో తెలిపారు. సాధారణంగా లో-ప్రొఫైల్ మెయింటైన్ చేసే గీతాంజలి.. భర్తకు కష్టం వచ్చిన ప్రతిసారీ కొండంత అండగా నిలబడ్డారు. గత ఏడాది లడఖ్‌కు రాష్ట్ర హోదా, రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో చేర్చాలనే డిమాండ్‌తో జరిగిన నిరసనల సమయంలో నలుగురు మరణించగా.. వాంగ్చుక్ను ప్రభుత్వం జాతీయ భద్రతా చట్టం (NSA) కింద నిర్బంధించిన సంగతి తెలిసిందే.ఆ కష్టకాలంలో గీతాంజలి సుప్రీంకోర్టును ఆశ్రయించి, రాష్ట్రపతి జోక్యాన్ని కోరుతూ లేఖ రాశారు. దాదాపు 170 రోజుల సుదీర్ఘ పోరాటం తర్వాత వాంగ్‌చుక్ విడుదలయ్యారు. ఐదు నెలల పాటు వారానికి రెండు సార్లు కేవలం 60 నిమిషాల ములాఖత్ కోసం ఆమె పడిన శ్రమ అంతా ఇంతా కాదు. ఇప్పుడు నీట్ పేపర్ లీకేజీ నిరసనల్లో కూడా ఆమె భర్త ఆశయాన్ని భుజానకెత్తుకున్నారు.ఆసుపత్రిలో ఉన్నప్పటికీ తన భర్త దీక్షను విరమించలేదని.. కేవలం ఉప్పు, నీరు మినహా మరేమీ తీసుకోవడం లేదని గీతాంజలి స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులు లేదా ఆయనను పర్యవేక్షిస్తున్న వైద్యుల అనుమతి లేకుండా ఆయనకు ఎలాంటి ద్రవాలను ఇవ్వకూడదని ఆమె నొక్కి చెప్పారు. అంతేకాకుండా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో సోమవారం చేపట్టే పార్లమెంట్ మార్చ్‌కు తానే నాయకత్వం వహిస్తానని ప్రకటించారు. ఒకవేళ సోనమ్ వాంగ్‌చుక్ ఈ మార్చ్‌లో పాల్గొనలేకపోతే.. ఆయనకు ప్రతినిధిగా నేనే ముందుండి దీనిని నడిపిస్తానంటూ ఆమె తేల్చి చెప్పారు. -
వాంగ్‌చుక్ దీక్ష భగ్నం!
న్యూఢిల్లీ: సామాజిక ఉద్యమకారుడు, పర్యా వరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ నిరవధిక నిరాహార దీక్షను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. నీట్–యూజీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో దోషులను కఠినంగా శిక్షించాలని, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చే యాలన్న డిమాండ్‌తో దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆయన సాగిస్తున్న దీక్ష 21వ రోజుకు చేరుకోగా, ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండడంతో ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు శనివారం ఉదయం బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా దీక్షా వేదిక వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులను అడ్డుకొనేందుకు వాంగ్‌చుక్ మద్దతుదారులు ప్రయత్నించారు. వాంగ్‌చుక్‌తోపాటు జూన్ 28న నిరాహార దీక్ష ప్రారంభించిన ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్(ఏఐఎస్ఏ) సభ్యులు నేహా, అమీన్, మనీష్ ను సైతం అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా సాధ్యం కాలేదు. ముగ్గురూ యథాతథంగా దీక్ష కొనసాగిస్తున్నారు. మరో వైపు వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే నిరాహార దీక్ష ప్రారంభించారు. జంతర్‌మంతర్ వద్ద ఆయనపై ఓ మహిళ సిరా చల్లడం సంచలనాత్మకంగా మారింది. వాంగ్‌చుక్ దీక్షను భగ్నం చేయడాన్ని కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తదితరులు తీవ్రంగా ఖండించారు. వాంగ్‌చుక్ నిరాహార దీక్షను విరమించలేదని, ఆసుపత్రి నుంచే దీక్షను కొనసాగిస్తారని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ‘ఎక్స్’లో పోస్టుచేసింది. నాటకీయ పరిణామాలు వాంగ్‌చుక్ దీక్షను భగ్నం చేసే విషయంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనకు ఒక్కరోజు ముందే కేంద్ర హోంశాఖ ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీశ్ గోల్చాను ఆకస్మికంగా తప్పించి, ఆయన స్థానంలో అనురాగ్ కుమార్‌ను నియమించింది. కొత్త కమిషనర్ వెంటనే తన కార్యాచరణ ప్రారంభించారు. శుక్రవారం రాత్రి పోలీసు అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. శనివారం తెల్లవారుజామున సిబ్బందితో సహా హాజరు కావాలని ఆదేశించారు. ‘పార్లమెంట్ వర్షాకాల సమావేశాల భద్రతా సన్నాహాల‘పేరుతో పోలీసులు ఉదయం 5 గంటలకు జంతర్‌మంతర్ వద్దకు చేరుకున్నారు. దీక్షలు జరుగుతున్న ప్రాంతంలో మొబైల్ ఫోన్ జామర్ ఏర్పాటు చేశారు. సాధారణ దుస్తుల్లో ఉన్న పోలీసులు దీక్షా వేదిక చుట్టూ తెల్ల దుప్పట్లు ఏర్పాటు చేసి వాంగ్చుక్ను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. ఈ దృశ్యాలను ఎవరూ ఫోన్లలో చిత్రీకరించకుండా తెల్ల దుప్పట్లను అడ్డంగా పెట్టారు. పోలీసులను అడ్డుకునేందుకు నిరసనకారులు మానవహారంగా నిలిచారు. అయినప్పటికీ దాదాపు ఐదుగురు పోలీసులు వాంగ్చుక్ను బలవంతంగా అంబులెన్స్‌లోకి చేర్చి, వెంటనే సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. కోర్టు ఆదేశాల మేరకే వాంగ్చుక్ను ఆసుపత్రిలో చేర్చామని, ఆయనకు వైద్య చికిత్స కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నగరంలోని కీలక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. చికిత్సకు అంగీకరించేలా కౌన్సెలింగ్ చికిత్సకు వాంగ్‌చుక్ నిరాకరిస్తున్నారని డాక్టర్లు చెప్పారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని చికిత్సకు అంగీకరించేలా కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్, ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్, ఇతర ఔషధాలను తీసుకోవడానికి నిరాకరించారని పేర్కొన్నారు. ఈ మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. 59 ఏళ్ల వాంగ్‌చుక్ 20 రోజులుగా ఘనాహారం తీసుకోలేదు. ఆరోగ్యం క్షీణించింది. ప్రస్తుతం స్పృహలోనే ఉన్నారని వైద్యులు తెలియజేశారు. అలాగే నాడి, రక్తపోటు, ఆక్సిజన్ స్థాయిలు స్థిరంగా ఉన్నాయని, డీహైడ్రేషన్ లక్షణాలు కనిపించాయని వివరించారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చికిత్సకు అంగీకరించేలా ఒప్పించాలని వాంగ్‌చుక్ కుటుంబ సభ్యులను డాక్టర్లు కోరారు. అసత్యం, హింస మోదీ ప్రభుత్వ సిద్ధాంతాలు: కాంగ్రెస్ జంతర్ మంతర్ వద్ద నిరసనలో పాల్గొంటున్న సోనమ్ వాంగ్చుక్ను అక్కడి నుంచి తరలించడంపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని అత్యంత అప్రజాస్వామిక రాజకీయ పార్టీ పాలించడం సిగ్గుచేటు అని పేర్కొంది. ‘‘గంగా నదిని కాపాడేందుకు 111 రోజుల పా టు ఆమరణ నిరాహార దీక్ష చేసిన ప్రొఫెసర్ జి.డి. అగర్వాల్‌ను, హరియాణాకు చెందిన ఒలింపిక్ రెజ్లర్లను, దేశానికి అన్నం పెట్టే 750 మంది రైతులు, దళితులు, ఆదివాసీలను, పరీక్షా పత్రాల లీకేజీ బాధితులైన 25 మంది విద్యార్థులను, వారి కుటుంబాలను ఈ నియ ంతృత్వ ప్రభుత్వం వదిలిపెట్టలేదు’’అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా గొంతెత్తితే దేశద్రోహిగా లేదా పరాన్నజీవిగా ముద్ర వేస్తారని మండిపడ్డారు. ‘‘ఈ రోజు జంతర్‌మంతర్ వద్ద జరిగిన సంఘటన మన ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై మరో మరక’’అని ‘ఎక్స్’లో పోస్టుచేశారు. అహింసాత్మక నిరాహార దీక్షలో ఉన్న వాంగ్చుక్ను జంతర్ మంతర్ నుంచి తొలగించడం ముమ్మా టికీ తప్పేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆక్షేపించారు. అసత్యం, హింస నేడు మోదీ ప్రభుత్వ సిద్ధాంతాలుగా మారాయని ఆరోపించారు. విద్యార్థుల సమస్యలపై పోరాటం సాగించకుండా ఏ రకమైన బలప్రయోగం కూడా అడ్డుకోలేదని తేల్చిచెప్పారు. ఖండించిన విపక్ష నేతలు వాంగ్చుక్ను నిరసన స్థలం నుంచి తరలించడాన్ని పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ నేత సచిన్ పైలట్, సీపీఎం నాయకురాలు బృందా కారత్, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్, ఎంపీలు సంజయ్ సింగ్, మనీష్ సిసోడియా, ఎన్సీపీ(ఎస్పీ) నేత శరద్ పవార్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్æయాదవ్, డీఎంకే ఎంపీ కనిమొళి, శివసేన(ఉద్ధవ్) నాయకుడు ఆదిత్య ఠాక్రే తదితరులు తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా సాగుతున్న పోరాటాన్ని బలప్రయోగంతో అణచి వేయాలనుకోవడం దారుణం అంటూ మండిపడ్డారు. దీక్షలో నేను కూడా పాల్గొంటా: భగవాన్ దీప్కే పాకిస్తాన్ పౌరులు కాకుండా.. భారతీయ పౌరులైన విద్యార్థుల పట్ల మన ప్రభుత్వం ఇంతటి నిర్దయతో ఎలా వ్యవహరించగలదని అభిజిత్ దీప్కే తండ్రి భగవాన్ దీప్కే ప్రశ్నించారు. జంతర్‌మంతర్ వద్ద తన కుమారుడు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో విద్యార్థులు నిరవధిక నిరాహార దీక్షలు చేస్తు న్నారని చెప్పారు. ఎవరైనా చనిపోయే వరకు ప్రభుత్వం వేచి చూస్తుందా? అని ప్రశ్నించారు. విద్యార్థులు లేవనెత్తిన డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తన కుమారుడు చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షలో తాను కూడా పాల్గొంటానని తేల్చిచెప్పారు. వెంటనే డిశ్చార్జి చేయాలి: గీతాంజలి తన అనుమతి లేకుండా వాంగ్చుక్కు ఎలాంటి చికిత్స అందించవద్దని ఆయన భార్య గీతాంజలి జె.ఆంగ్మో అన్నారు. తన భర్తను ఆసుపత్రి నుంచి వెంటనే డిశ్చార్జి చేయాలని కోరారు. వైద్య సంరక్షణలో పారదర్శకత లోపించిందని ఆరోపించారు. ఈ మేరకు సఫ్దర్‌జంగ్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్‌కు లేఖ రాశారు. వాంగ్‌చుక్ మెడికల్ రిపోర్టుల కాపీలు తనకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిపై నమ్మకం సన్నగిల్లడం, చికిత్సలో పారదర్శకత లోపించడం వంటి కారణాలను ప్రస్తావిస్తూ ఆయనను తమ కుటుంబం ఎంపిక చేసుకున్న ఆసుపత్రికి తరలిస్తామని స్పష్టంచేశారు. వాంగ్‌చుక్ ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని తెలియజేశారు. జూలై 20న తలపెట్టిన పార్లమెంట్ మార్చ్ కచ్చితంగా జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు. అయితే, మెడికల్ రిపోర్టులు ఇచ్చేందుకు సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి నిరాకరించింది. అభిజిత్ దీప్కేపై సిరాతో దాడి మరోవైపు తాను నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నట్లు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ప్రకటించారు. జంతర్‌మంతర్ వద్ద ఓ మహిళ దీప్కేతో మాట్లాడుతూ తన చేతిలో ఉన్న సిరాను ఆయనపై చల్లడంతో ఒక్కసారిగా నిరసనలు మిన్నంటాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆమె వివరాలు, దాడికి గల కారణాలు ఇంకా వెల్లడికాలేదు. ఢిల్లీ పోలీసులు తనపై దాడి చేసి అదుపులోకి తీసుకున్నారని, జంతర్‌మంతర్ నిరసన ప్రాంగణంలోకి అనుమతించ లేదని దీప్కే ఆరోపించారు. ఈ చర్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఎవరు ఎంతగా అణచివేసినా తమ ఉద్యమం కొనసాగుతుందని, ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేసింది. -
ఓవర్ టు ఢిల్లీ!
భారతదేశ చరిత్ర ఇప్పుడొక ప్రమాదకరమైన మలుపును తీసుకునేందుకు సన్నద్ధమవుతున్నదనే హెచ్చరికలు వినబడు తున్నాయి. ఆ మలుపు తీసుకుంటే ప్రజాస్వామిక అధ్యాయానికి ముగింపు పలికినట్టేనని, రాజ్యాంగబద్ధ పాలనకు తిలోదకాలు వదిలినట్టేనని కొందరు మేధావులు గళం విప్పుతున్నారు.వందలాది సంవత్సరాల భారతీయ వైవిధ్య సహజీవనం ధ్వంస మౌతుందనీ, బహుళత్వ సౌందర్యం భగ్నమవుతుందనీ, భిన్న త్వంలో ఏకత్వ సందర్శనకు బదులు బలవంతపు ఏకీకరణ ప్రత్యక్షమవుతుందనీ కొన్ని వైతాళిక స్వరాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ గొంతుకలకు సంప్రదాయ మీడియా మైకులు పెద్దగా సమకూరడం లేదు. ఫలితంగా ‘ఆవాజ్’ దద్దరిల్లడం లేదు. కానీ, మూగబోవడం కూడా లేదు. అటువంటి వేనవేల స్వరాల్లోని ఒక భా‘స్వరం’ పేరు సోనమ్ వాంగ్‌చుక్.లదాఖ్ పర్వత ప్రాంతీయుడైన సోనమ్ ఒక ఇంజినీర్. స్వయంగా పాఠశాలలు స్థాపించి, విద్యారంగ సంస్కరణలకు నడుం కట్టినవాడు. సమాజానికి ఉపయుక్తమయ్యే వైజ్ఞానిక ఆవిష్కరణలు చేసినవాడు. తన ఆవిష్కరణలకు పేటెంట్ కోర కుండా సమాజానికి అంకితం చేసి ప్రజాస్వామిక ప్రియత్వాన్ని చాటుకున్నవాడు. లదాఖ్ ప్రజల అస్తిత్వ ఆకాంక్షలకు పోరాట రూపమైనవాడు. ఈ నేపథ్యాన్ని గమనించినప్పుడు సోనమ్ వాంగ్‌చుక్ తాజా నిరాహారదీక్ష వెనుక వేరే రాజకీయ ప్రయోజ నాలున్నాయని కొందరు చేస్తున్న ఆరోపణలు ఎంత అసంగతమైనవో అర్థమవుతుంది. భారతదేశంలో విద్యారంగం నానా టికీ సంక్షోభంలో కూరుకుపోతున్నదనే అభిప్రాయం రాజకీయ పరమైనది కాదు. విజ్ఞులైన దేశ ప్రజలందరూ ఆందోళన చెందు తున్న ఒక చేదు నిజం. పోటీ పరీక్షల వ్యవస్థ స్కామ్‌ల పుట్టగా మారిందన్నది కూడా అంతే నిజం.ఒకటా, రెండా? ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ పన్నెండేళ్లలో పోటీ పరీక్షల అవకతవకలకు సంబంధించి 158 ఉదంతాలు రికార్డయ్యాయి. అంతకు ముందు యూపీఏ హయాంలోనూ ఈ దరిద్రం లేకపోలేదు. 2005 నుంచి 2014 వరకు అరవైకి పైగా అవకతవకల కేసులు నమోద య్యాయి. కోట్లాదిమంది యువతీ యువకుల భవిష్యత్తుతో ఆడుకున్న దురంతాలివి. టీచర్ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న లక్షలాదిమంది యువతీయువకుల కలలను ఏపీ సర్కార్ నిర్వహించిన డీఎస్సీ పరీక్ష ఎలా భగ్నం చేసిందో ఇటీవల బైటపడింది. ఈ ఏడాది నిర్వహించిన నీట్ పరీక్షలో ప్రశ్నాపత్రాల లీకేజీ బయటపడటం వల్ల దాదాపు ఇరవైమంది తెలివైన విద్యార్థులు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై ఏర్పడిన కాక్రోచ్ జనతా పార్టీ ఈ అంశంపై ఢిల్లీలో ఆందోళనకు పిలుపునిచ్చింది.విద్యారంగ సంస్కరణలపై ఎలుగెత్తుతున్న సోనమ్ వాంగ్ చుక్ సహజంగానే ఈ ఆందోళనలో భాగం పంచుకోవాలని నిర్ణయించుకొని ఉంటారు. జంతర్‌మంతర్‌లో ఆయన నిరాహార దీక్షకు కూర్చొని మూడు వారాలు గడిచినా కేంద్రం నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. నీట్ పరీక్షల వైఫల్యంతో పాటు సీబీఎస్ఈ పరీక్షల అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది ఆందో ళనకారుల ప్రధాన డిమాండ్. ధర్మేంద్ర ప్రధాన్‌తో సోనమ్‌కు గానీ, ఆందోళనకారులకు గానీ వ్యక్తిగత వైరమేమీలేదు. కానీ లక్షలాదిమంది విద్యార్థుల జీవితాలను సంక్షోభంలోకి నెట్టిన ఘటనపై జవాబుదారీతనాన్ని వారు డిమాండ్ చేస్తున్నారు. నిజమే కదా, ప్రజాసమస్యలకు బాధ్యత వహించకుండా, జవాబుదారీతనం లేకుండా ప్రభుత్వాలు వ్యవహరిస్తే అది ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది? పరీక్షల వ్యవహారంపై జవాబుదారీతనానికీ, బాధ్యత వహించడానికీ కేంద్ర సర్కార్ మొండిగా నిరాకరించింది. సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష ఇరవై ఒకటో రోజున హైకోర్టు ఆదేశాలు పాటిస్తున్నామంటూ పోలీసులు బల వంతంగా ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. కేంద్రంతో పాటు చాలా రాష్ట్ర ప్రభుత్వాల్లో జవాబుదారీ తనం ఇప్పుడు కనిపించడం లేదు. ప్రజాస్వామికవాతావరణం కూడా క్రమంగా కనుమరుగవుతున్నది. పౌరహక్కులకు న్యాయ స్థానాల నుంచి కూడా పూర్తి రక్షణ లభించడం లేదు. లాఠీ రాజ్యం అమల్లోకి వచ్చింది. ఆధిపత్య భావజాలం అన్నిరంగాలను, అన్ని వ్యవస్థలను పట్టి కుదిపేస్తున్నది. భిన్నాభి ప్రాయాలు, ఆలోచనలపై బుల్డోజర్లు నడుస్తున్నాయి. ఆధిపత్య భావజాలాన్ని ఆధారసహితంగా హేతుబద్ధంగా ఎదుర్కొనేగొంతుకలపైకి బండబూతులతో వందమంది దండెత్తుతున్నారు. సోషల్ మీడియాలోకి ఫాసిజం చొరబడింది. ప్రధాన స్రవంతి మీడియా సర్కార్ల పెంపుడు మీడియాగా మారిపోయింది. వాంగ్‌చుక్ దీక్ష సందర్భంలో మన జాతీయ మీడియా ప్రభుభక్తినే చాటుకున్నది. పదిహేనేళ్ల కిందట జంతర్‌మంతర్‌లో జరిగిన అన్నా హజారే దీక్షను ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాము. జాతీయ దినపత్రికలన్నీ రోజుల తరబడి జంతర్‌మంతర్‌ను పతాక శీర్షికల్లో నిలబెట్టాయి. టీవీ ఛానెళ్లు రాత్రింబవళ్లూ కెమెరా లను అక్కడే పాతేసి కార్యక్రమాలు నడిపాయి. ఇప్పుడువాంగ్చుక్ దీక్షకు మాత్రం మొహం చాటేశాయి. ఆనాటి కవ రేజీలో పదోవంతు కూడా దక్కలేదు. ‘త్రీ ఇడియట్స్’ అనే సూపర్ హిట్ సినిమాకు వాంగ్‌చుక్ జీవితమే ఆదర్శమని ప్రచారం జరగడంతో ఆయన ఇమేజ్ పెరుగుతుందని గ్రహించి డ్యామేజీ కంట్రోల్‌కు జాతీయ చానెళ్లు ప్రయత్నించాయి. అమీర్ ఖాన్‌ను రంగంలోకి దించి సినిమాకు ముందు వాంగ్‌చుక్ ఎవరో తమకు తెలియదని చెప్పించారు. అమీర్ ఖాన్ చెప్పింది పచ్చి అబద్ధమని రుజువు కావడానికి కొన్ని గంటలు కూడా పట్టలేదు. ఈ ఎపిసోడ్‌తో మరోసారి రుజువైన అంశం మన దేశంలో మీడియాకు స్వేచ్ఛ లేదని, అది సర్కారీ పెద్దలకు పెంపుడు జీవిగా మారిపోయిందని! దేశ రాజకీయ చరిత్రలో అయోధ్య రామమందిరానికున్న ప్రాధాన్యత ఏమిటో తెలిసిందే కదా? భారతీయ జనతా పార్టీని అధికార పీఠానికి చేరువ చేసిన ఆలయమిది. అటువంటి ఆల యానికి ఇంటిదొంగలే కన్నం వేస్తే మీడియాలో ఎంత రచ్చ జరిగి ఉండాలి! కానీ, అదో చిన్న వార్తే అయిపోయింది. ఆంధ్రాలో అధికార పార్టీ నాయకుడు ఒక మహిళను నడివీధిలో చితకబాదితే పెంపుడు మీడియాలో ఆ వార్తకు చోటు దక్కలేదు. పోలీస్ లాకప్ చిత్రహింసలకు వరసగా ప్రాణాలు పోతున్న ఘటనలు ఏపీ వ్యాప్తంగా జరుగుతున్నాయి. కేరళలో పోలీసు కస్టడీలో ఉన్న రాజన్ మరణిస్తే యావత్ భారతదేశం అట్టుడికి పోయిన రోజులు గుర్తుకొస్తున్నాయి. ముఖ్యమంత్రి కరుణాకరన్ తన పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. మణిపూర్ అనే రాష్ట్రం ఈ దేశంలోనే ఉన్నదనే సంగతిని కూడా నేటి జాతీయ మీడియా మరిచిపోయినట్టుంది. ఒక మతాన్ని టార్గెట్ చేసి 250కి పైగా ప్రార్థనాలయాలను నేలమట్టం చేస్తే, మనుషుల్ని సజీవ దహనం చేస్తే, ఊచకోత కోస్తే రెండు వర్గాల ఘర్షణలు గానే అప్రధానంగా రిపోర్టయ్యాయి. సోషల్ మీడియాలో ప్రభుత్వ విధానాలను విమర్శించే వాళ్లపై ఆంధ్ర సర్కార్ దమన నీతిని ప్రదర్శిస్తున్నది. విచ్చలవిడిగా అక్రమ అరెస్టులు చేస్తు న్నారు. లాకప్‌లలో చిత్రహింసలు పెడుతున్నారు. పౌర హక్కు లకు సంబంధించిన ఇటువంటి వార్తలకు మీడియాలో చోటు దొరకడం లేదు. బెంగాల్, బిహార్లలో కూడా ఇటువంటి ఘటనలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. దేశ చరిత్ర ఒక ప్రమాదకరమైన మలుపులో ఉన్నదని కొందరు మేధావులు ఆందోళన చెందడం, జంతర్‌మంతర్‌లో వాంగ్‌చుక్ ఆందోళన, ప్రభుత్వాలు స్వయంగా పౌరహక్కుల హననానికి పూనుకోవడం, ఫోర్త్ ఎస్టేట్ పెంపుడు మీడియాగా మారిపోవడం – వేర్వేరు విషయాలు కాదు. దేశ రాజకీయ వ్యవస్థ గమనానికి సంబంధించిన సూచికలు. ప్రభుత్వాల అప్రజాస్వామిక ధోరణి, మీడియా నిష్క్రియాపరత్వం ఈ గమనాన్ని సుగమం చేసే బాటలు. అధికార పీఠంపై ఉన్న బీజేపీ మాతృసంస్థ ఆరెస్సెస్ ఎజెండా ఈ గమనానికి చోదకశక్తిగా దేశంలోని కొన్ని వర్గాలు అనుమానిస్తున్నాయి. దేశంలోని ప్రధాన ప్రతిపక్షం ఎంతటి అసమర్థ స్థితిలో ఉన్నప్పటికీ అధికార రథం ఎంచుకొన్న గమనం నిరాటంకం మాత్రం కాదని జంతర్‌మంతర్ చెబుతున్నది. బలంగానో, బలహీనంగానో ప్రతిఘటన ఉండి తీరుతుందని చెబుతున్నది.భారత రాజ్యాంగం పుట్టినప్పుడే వ్యతిరేకించిన ఆరెస్సెస్‌కు ఇప్పుడు అవకాశం దొరికింది కనుక దాన్ని నిర్వీర్యం చేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తుందని ఆ సంస్థ వ్యతిరేకులు శంకి స్తున్నారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమా వేశాల్లో ఆ దిశగా కొన్ని అడుగులు పడే అవకాశమున్నదని వారు భావిస్తున్నారు. ప్రధానమైన ముందడుగు ఇప్పటికే ‘సర్’ కార్య క్రమంతో మొదలైంది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం కాస్త సమగ్ర తొలగింపు కార్యక్రమంగా మారిందనే విమర్శలు కొత్తవి కావు. ఈ విమర్శలకు ఆధారాలు కూడా ఉన్నాయి. పది రాష్ట్రాల్లో పూర్తయిన ‘సర్’లో ఐదున్నర కోట్ల ఓట్లను తొలగించారు. ఇందులో సింహభాగం ఒక వర్గం వారేనని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అన్ని ఆధారాలు సమర్పించి అప్పీల్ చేసుకుంటే ఓటుహక్కును పునరుద్ధరిస్తా మని హామీ ఇచ్చారు. బెంగాల్లో 27 లక్షల మంది తాము స్థానిక పౌరులమనే ఆధారాలు సమర్పిస్తే వారిలో కొన్ని వందల కేసులనే ఇప్పటిదాకా పరిష్కరించారట. ఈ లెక్కన మిగిలిన వారికి ఎన్ని దశాబ్దాల తర్వాత మోక్షం కలగాలి?బిహార్‌లో తొలగించిన 60 లక్షల ఓట్లలో ఐదువందలమందిని ‘విదేశీయులు’గా తేల్చారట. అందులో 350 మంది బిహారీలను పెళ్లి చేసుకున్న నేపాలీ అమ్మాయిలు. నేపాల్‌లో ఉండే మధేశీ తెగ ప్రజలు బిహార్‌లో సరిహద్దు ప్రాంతంలో కూడా ఉంటారు. ఈ మధేశీ ప్రజల పెళ్లి సంబంధాలు కొన్ని శతాబ్దాలుగా కొనసాగుతున్నాయి. ఇన్ని వందల ఏళ్ల చరిత్రను ఎప్పటికి తవ్వితీస్తారో చూడాలి! ఇప్పుడు మిగిలిన రాష్ట్రాల్లో ‘సర్’ కార్యక్రమం నడుస్తున్నది.హైదరాబాద్‌లో 30 శాతం ఓటర్లు ఇప్పటికీ మ్యాపింగ్ కాలేదట. అయ్యే అవకాశం కూడా లేదు. నిరక్షరాస్యులు, బతుకుదెరువు కోసం వలసపోయే పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు, మైనారిటీలు ఎక్కువసంఖ్యలో ఈ కార్యక్రమం వల్ల ఓట్లు కోల్పోయే పరిస్థితి కనిపిస్తు న్నది. ఈ వర్గాల ఓట్లు తగ్గితే నష్టమెవరికో, లాభమెవరికో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.‘టార్గెటెడ్’ ఓటర్ల తొలగింపునకు అవసరమయ్యే సాకులు కూడా ఈ కార్యక్రమంలో దండిగానే ఉన్నాయి. 2002 జాబి తాతో సరిపోలకపోయినా, అందులో అచ్చుతప్పులు గమనించినా ఓటు హక్కును తృణీకరించవచ్చు. అప్పీల్ చేసుకుంటే ఎప్పటికి న్యాయం జరుగుతుందో చెప్పలేము. ‘సర్’ ద్వారా ఓటు హక్కును కోల్పోయిన వారికి బెంగాల్, బిహార్లలోసంక్షేమ పథకాల వర్తింపును కూడా నిలిపేశారనీ వార్తలు వస్తు న్నాయి. ఇప్పటికే ఆధార్, పాస్‌పోర్ట్‌తో సహా ఏ కార్డూ పౌర సత్వానికి సూచిక కాదని అధికారులు చెబుతున్నారు. సరికొత్త ఓటర్ ఐడీ మాత్రమే పౌరసత్వానికి రుజువని చెబితే పరిస్థితి ఏమిటి? అలా జరగదని సుప్రీంకోర్టు చెబుతున్నది. కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన ఏ ఆదేశాన్ని ఎన్నికల సంఘం గానీ, ప్రభుత్వం గానీ పాటించింది? పౌరసత్వం ఉన్నవారికి మాత్రమే రాజ్యాంగంలో ఆర్టికల్ 19 కింద ఉన్న భావప్రకటనా హక్కు, సమావేశ స్వేచ్ఛ... వంటి ఆరు హక్కులు వర్తిస్తాయి. ఈ పౌర హక్కులు న్నప్పుడే అక్రమ నిర్భాంధాలకు గురి చేస్తున్న రాజ్యంలో అవి లేనివారి పరిస్థితి ఏమిటి?రేపటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో కొన్ని రాజకీయ బిల్లులు కూడా ఉండొచ్చని తెలుస్తున్నది. వాటిలో రెండు ప్రమాదకరమైన బిల్లులు కూడా కనిపిస్తున్నాయి. అందులో ఒకటి అధికార పదవుల్లో ఉన్నవారు 30 రోజులపాటు జైలుకెళ్లి వస్తే పదవిని కోల్పోతారనే 130వ రాజ్యాంగ సవరణ బిల్లు. ఇందులో న్యాయమూ లేదు, నైతికతా లేదు, రాజ్యాంగ బద్ధతా లేదు. కేవలం ప్రత్యర్థి రాజకీయ పార్టీ నేతలను వేధించి చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి ఉద్దేశించింది మాత్రమే అనే విమర్శలు వినిపిస్తున్నాయి. బిల్లులో ప్రధానిని కూడా చేర్చిన ప్పటికీ, ఏ దర్యాప్తు సంస్థ ప్రధానమంత్రిని అరెస్టు చేస్తుంది? కేవలం ముఖ్యమంత్రులపైకే కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పే అవకాశం ఉంటుంది? దర్యాప్తు సంస్థలు అరెస్టు చేసినంత మాత్రాన, అభియోగాన్ని న్యాయస్థానంలో రుజువు కాకుండా పదవి కోల్పోవడమేమిటి? ఇది ప్రతిపక్షాల మీద చట్టబద్ధమైన దాడి. అలాగే ‘ఒక దేశం ఒక ఎన్నిక’ కూడా రాజ్యాంగ ఫెడరల్ స్వభావం మీద ప్రత్యక్ష దాడిగానే న్యాయ నిపుణులు భావి స్తున్నారు. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే సవరణ చట్టాలు చెల్లుబాటు కావని గతంలో సుప్రీంకోర్టు పలుమార్లు చెప్పింది. ఈ రెండు బిల్లులూ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీసేవే. అయినా ఇవి చట్టరూపం దాలిస్తే... వీటికి తోడుగా ‘సర్’ కోటాలో కొన్ని కోట్లమంది ఓటు హక్కు కోల్పోతే... సమానత్వం, లౌకికత్వం, స్వాతంత్య్రం పునాదుల మీద నిర్మితమైన రాజ్యాంగబద్ధ పాలనకు ప్రమాదం దాపురించినట్టే. పారాహుషార్!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
వాంగ్‌చుక్ దీక్ష భగ్నం : ఎట్టకేలకు స్పందించిన రాహుల్‌గాంధీ
సాక్షి,న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో నీట్ (NEET) పరీక్షలో జరిగిన అక్రమాలపై జవాబుదారీతనం కోరుతూ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 20 రోజులకు పైగా జరుగుతున్న నిరసనలు, సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ తరలింపుపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఎట్టకేలకు స్పందించారు. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వ ప్రధాన విధానాలపై విమర్శలు గుప్పించారు.గత 20 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్చుక్ను నిరసన స్థలం నుండి బలవంతంగా తరలించి, ఆసుపత్రికి తీసుకెళ్లిన కొద్ది గంటలకే రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. అసత్యం, హింసలే మోదీ ప్రభుత్వ ప్రధాన సూత్రాలు అంటూ ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. అహింసా మార్గంలో నిరాహార దీక్ష చేస్తున్న వాంగ్చుక్ను బలవంతంగా తరలించడం తప్పు అంటూ శనివారం ట్వీట్ చేశారు.The core tenets of the Modi government are Asatya and Hinsa.The removal of Sonam Wangchuk ji from Jantar Mantar while he was on a non-violent hunger strike is wrong.Paper leaks, the rising cost of education, and student suicides are critical issues for India’s future. No…— Rahul Gandhi (@RahulGandhi) July 18, 2026 విద్యార్థుల సమస్యలపై రాహుల్ గాంధీ వరుస ట్వీట్లలో స్పందించారు. ఎంతటి బలప్రయోగం చేసినా, ఈ సమస్యలను లేవనెత్తకుండా భారతదేశ విద్యార్థులను గానీ, వారిని ప్రేమించి విశ్వసించే మనల్ని గానీ ఎవరూ ఆపలేరన్నారు. దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సవాళ్లలో పేపర్ లీక్‌లు, పెరిగిపోతున్న విద్యా ఖర్చులు, విద్యార్థుల ఆత్మహత్యలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సమస్యలపై గళమెత్తే భారతదేశ విద్యార్థులను లేదా వారికి మద్దతుగా నిలిచే వారిని ఆపలేరని ఆయన స్పష్టం చేశారు. తద్వారా వాంగ్‌చుక్ నిరసనకు కాంగ్రెస్ పార్టీ మద్దతును చాటారు. रिया के पिता, राजेश जी बेटी को खोकर इस तरह टूटे कि उन्हें देखने वाले हर शख़्स की आँखें भर आईं।यह सिर्फ़ एक परिवार का दर्द नहीं। पेपर लीक ने ऐसे कई परिवारों से उनका बच्चा छीन लिया।हर नाम के पीछे एक माँ है, एक पिता है - जिनके लिए अब कोई कल नहीं।इस System को नए सिरे से बनाना… pic.twitter.com/wCGC5lleh1— Rahul Gandhi (@RahulGandhi) July 18, 2026అలాగే తన కుమార్తెను కోల్పోయిన బాధలో రియా తండ్రి రాజేష్ ఎంతో కుంగిపోయారనీ, ఆయనను చూసిన ప్రతి ఒక్కరి కళ్లలోనూ నీళ్లు తిరిగాయన్నారు. ఇది కేవలం ఒక కుటుంబం పడుతున్న వేదన మాత్రమే కాదు. ప్రశ్నపత్రం లీకేజీ ఘటన ఇలాంటి అనేక కుటుంబాల నుండి వారి పిల్లలను దూరం చేసింది. ప్రతీబాధితుడి వెనుక ఒక తల్లి, ఒక తండ్రి ఉంటారు, కానీ వారికి ఇక రేపు అనే ఆశ లేకుండా పోయింది. ఈ వ్యవస్థను మొదటి నుండి పునర్నిర్మించాల్సి ఉంది. పిల్లలకు ఒత్తిడి కాకుండా భద్రత లభించాలి, అలాగే తల్లిదండ్రులకు కన్నీళ్లు కాకుండా, వారి త్యాగానికి తగిన ప్రతిఫలం దక్కాలని రాహుల్ తెలిపారు. అంతకు ముందు గురువారం, కాంగ్రెస్ పార్టీ ఈ డిమాండ్లకు బహిరంగంగా మద్దతు పలికింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌ను పునరుద్ఘాటిస్తూనే, దీక్షను విరమించాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) కేసీ వేణుగోపాల్ వాంగ్చుక్ను కోరారు.కాగా జంతర్ మంతర్ వద్ద గత 20 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్చుక్ను శనివారం ఉదయం సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. నిపుణులైన వైద్యుల సలహా మేరకు, హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆయనను ఆసుపత్రికి మార్చినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. అలాగే జంతర్ మంతర్ వద్ద ఉన్న నిరసనకారులు తమ ఆందోళనను విరమించి, ఆ ప్రాంతాన్ని శాంతియుతంగా ఖాళీ చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. జూన్ 28 నుండి వాంగ్‌చుక్ నిరవధిక నిరాహార దీక్షలో ఉన్నారు. గత మూడు వారాలుగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. దీక్ష ప్రారంభమైనప్పటి నుండి ఆయన దాదాపు 9.5 కిలోల బరువు తగ్గారని, బీపీ, బ్లడ్ షుగర్ స్థాయిలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వైద్యులు శుక్రవారం తెలిపారు.ఇదీ చదవండి: వాంగ్‌చుక్ దీక్ష భగ్నం : ఎట్టకేలకు స్పందించిన రాహుల్గాంధీమరోవైపు వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలించిన తర్వాత, సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తాను నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. వాంగ్ చుక్‌ను తరలించినప్పటికీ ఈ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: రూ. 1.4 కోట్ల జాక్‌పాట్ : నిద్రలేమే వరంలా మారింది -
తల్లి పనిమనిషి, తండ్రి అకాలమరణం : నీలూ నీట్ సక్సెస్ స్టోరీ
లక్నో: లక్నోలోని గోమతి నగర్‌కు చెందిన డిగ్దిగా గ్రామానికి చెందిన నీలు సకాలంలో వైద్య చికిత్స అందించే స్థోమత లేకపోవడంతో చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది..అత్యంత బాధాకరమైన ఆ క్షణమే ఆమె జీవితానికి కొత్త లక్ష్యాన్ని చూపించింది. నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (NEET) ఉత్తీర్ణత సాధించి తన సాకారం వైపుగా తొలి అడుగు వేసింది.నీలు 8వ తరగతి చదువుతున్నప్పుడే తండ్రి మరణించడంతో వారి కుటుంబ ఆర్థికపరంగా చాలా ఇబ్బందులు పడింది. అయితే, ఈ కష్టాలు, నష్టాలు ఆమెను ఆమెను కృంగ దీయలేదు. వైద్యం అందక పేదరికం వల్ల ఎవరూ తమ ప్రియమైన వారిని కోల్పోకూడదనే లక్ష్యంతో డాక్టర్ కావాలని ఆమె నిశ్చయించుకుంది. మరోవైపు కుటుంబానికి ఏకైక సంపాదనపరురాలైన ఆమె తల్లి, ఆసుపత్రి లోనూ, ఇటు గృహ సహాకురాలిగా పనిచేస్తుంది. కూతుళ్ల చదువును మాన్పించి, వారికి పెళ్లిళ్లు చేయమని బంధువులు, ఇతరులుఎంత ఒత్తిడి చేసినా బిడ్డల్ని చదివించేందుకు నిర్ణయించుకుంది.తండ్రి మరణంతో సంకల్పంఆర్థిక ఇబ్బందుల కారణంగా తన తండ్రికి సరైన వైద్యం అందించలేకపోయామని, చివరికి అనారోగ్యంతో కన్నుమూశారని నీలు చెప్పింది. పేదరికంతో సరైన చికిత్స అందించలేక నాన్నను కోల్పోయాను. అందుకే పేదరికం వల్ల మరే కుటుంబం కూడా ఇలాంటి నష్టాన్ని అనుభవించకూడదని ఆ రోజే తాను డాక్టర్ కావాలని నిర్ణయించుకున్నాను అని నీలు తెలిపింది. అట్టడుగు వర్గాల బాలికల కోసం స్టడీ హాల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (SHEF) నడుపుతున్న ప్రేరణ బాలికల పాఠశాలలో నీలు తన విద్యను ప్రారంభించి, ఆ తర్వాత 11, 12 తరగతుల కోసం స్టడీ హాల్ పాఠశాలలో స్కాలర్షిప్ సంపాదించింది. కష్టపడి చదివి నీట్లో ఉత్తీర్ణత సాధించి తన కల వైపు మొదటి పెద్ద అడుగు వేసింది. పట్టుదలతో చదివి నీట్ పరీక్షను విజయవంతంగా క్లియర్ చేసింది. ఈ ఏడాది సిబిఎస్ఇ క్లాస్ 12 బోర్డు పరీక్షల్లో నీలు 94 శాతం మార్కులు సాధించింది. . ప్రస్తుతం ఎంబీబీఎస్ (MBBS) సీటు సాధించేందుకు సిద్ధ మవుతోంది. భవిష్యత్తులో కార్డియాలజీ (గుండె జబ్బుల విభాగం) లో స్పెషలైజేషన్ చేసి, ఆర్థికంగా వెనుకబడిన రోగులకు సరసమైన ధరకే వైద్యం అందించాలని ఆమె లక్ష్యంగా పెట్టుకుంది.నీలు అకడమిక్ ప్రతిభను గుర్తించి ఆమెకు ప్రతిష్టాత్మకమైన 'వహానీ స్కాలర్షిప్' లభించింది. దేశవ్యాప్తంగా వేలాది మంది దరఖాస్తు చేసుకోగా, కేవలం 50 మంది మాత్రమే ఎంపికైన తుది జాబితాలో నీలు చోటు దక్కించుకుంది. ఈ స్కాలర్షిప్ ఆమె వైద్య విద్యకు అయ్యే ట్యూషన్ ఫీజులు, ఇతర ఖర్చులను భరిస్తుంది.స్ఫూర్తిగా నిలిచిన నీలుస్టడీ హాల్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ ఊర్వశి సాహ్ని మాట్లాడుతూ... సరైన అవకాశాలు, సాయం లభిస్తే విద్యార్థులు తమ పూర్తి సామర్థ్యాన్ని నిరూపించుకోగలరని చెప్పడానికి నీలు విజయమే నిదర్శనమని అన్నారు. స్కూల్ ప్రిన్సిపాల్ మీనాక్షి బహదూర్ కూడా నీలును ఎంతో కష్టపడే, పట్టుదల గల విద్యార్థిగా అభివర్ణిస్తూ, ఆమె విజయం ఎంతో మంది యువతులకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.ఇదీ చదవండి: రూ. 1.4 కోట్ల జాక్‌పాట్ : నిద్రలేమే వరంలా మారింది -
‘నీట్’లో ఇటుక బట్టీ కార్మికుడి పిల్లల జయకేతనం
నవాదా: బీహార్‌లోని నవాదా జిల్లా, పక్రిబరావాం ప్రాంతానికి చెందిన రివ రంజన్ కుమార్ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ఇటుక బట్టీలో పనిచేస్తూ, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ, తన పిల్లలు రితేష్ కుమార్, రిచా కుమారీలను ఉన్నత చదువులు చదివించాలన్న తండ్రి పట్టుదల ఫలించింది. ఇద్దరూ ఈ ఏడాది జరిగిన ‘నీట్ యూజీ 2026’ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి వైద్య విద్యకు అర్హత సాధించారు.తొలి ప్రయత్నంలో విఫలమైనా వెనకడుగు వేయకుండా, రెండో ప్రయత్నంలో కోటాలో శిక్షణ పొంది ఈ విజయాన్ని సొంతం చేసుకున్నారు. రితేష్ కుమార్ 720 మార్కులకు గానూ 655 మార్కులు సాధించి 1160 ఆల్ ఇండియా ర్యాంకును కైవసం చేసుకోగా, రిచా కుమారి 622 మార్కులతో 4685వ ర్యాంకును సాధించారు. తల్లి శోభా కుమారి ప్రోత్సాహం కూడా తోడవడంతో వారు డాక్టర్లు అయ్యేందుకు సిద్ధమయ్యారు. వీరి విజయం అందరిలో స్ఫూర్తిని నింపుతోంది. ఇదే జిల్లాకు చెందిన ఆయుష్ భలోటియా ఆల్ ఇండియా స్థాయిలో నాలుగో ర్యాంకు సాధించి బీహార్ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు.ఇది కూడ చదవండి: ‘మందు కొట్టి మొగుడిని చావగొడతా’ -
ఆటో డ్రైవర్ కొడుకు.. ఇకపై డాక్టర్ బాబు!
గోరఖ్‌పూర్: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన 23 ఏళ్ల విశాల్ తివారీ ఆర్థిక ఇబ్బందులను అధిగమించి నీట్ పరీక్షలో 720కి 605 మార్కులు సాధించి తన పట్టుదలను నిరూపించుకున్నారు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించే తండ్రి సంతోష్ తివారీ, గృహిణి అయిన తల్లి రాధికా తివారీ తమ కుమారుడి లక్ష్యం కోసం ఎంతగానో శ్రమించారు. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ విశాల్ చదువుకు ఆటంకం కలగకుండా చూశారు.2022లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విశాల్, మొదట్లో స్వయంగా చదువుకున్నా విజయం దక్కలేదు. అనంతరం కుటుంబ సభ్యుల సహకారంతో కోచింగ్ తీసుకుని, నాలుగో ప్రయత్నంలో ఈ ఘనత సాధించారు. వివాహం జరిగి, ఒక కుమారుడు ఉన్నప్పటికీ బాధ్యతలను భుజాన వేసుకుని, మరోవైపు హోమ్ ట్యూషన్లు చెబుతూ చదువును కొనసాగించారు. ఉదయం కోచింగ్, సాయంత్రం ట్యూషన్లు, రాత్రి వరకు లైబ్రరీలో చదువుతూ విశాల్ కఠిన క్రమశిక్షణను పాటించారు. ఇంజనీర్ కావాలనుకున్న విశాల్, తన పెద్దనాన్న సలహాతో వైద్య వృత్తిని ఎంచుకున్నారు. ఇప్పుడు వైద్యుడిగా స్థిరపడి, తన తండ్రికి కారు కొనివ్వాలనేదే తన చిరకాల స్వప్నమని విశాల్ తెలిపారు. ఈ విజయం ఎంతో మంది విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తోంది.ఇది కూడా చదవండి: 15 నిమిషాల ఓవర్టైమ్కీ డబ్బులిచ్చే వింత దేశం! -
500 వీక్లీ టెస్ట్‌లు, 108 గ్రాండ్ టెస్ట్‌లు రాశా..
హనుమకొండ: ‘నాకు కార్డియాక్ సర్జన్ కావాలని ఉంది. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ప్రవేశం పొందడమే లక్ష్యంగా నీట్ పరీక్షకు ప్రిపేర్ అయ్యా. మొదటిసారి నిర్వహించిన నీట్ పేపర్ లీక్ వల్ల రద్దయినప్పటికీ మనోధైర్యం కోల్పోకుండా మరింత పట్టుదలతో చదివా. కష్టానికి తగిన ఫలితం లభించింది’అని నీట్–యూజీ 2026 ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 13వ ర్యాంక్ సాధించిన వీరయ్యగారి సహ్యూ తెలిపాడు. వరంగల్‌కు చెందిన డాక్టర్ వీరయ్యగారి రమాకాంత్, డాక్టర్ శ్రీదేవి దంపతుల కుమారుడైన సహ్యూ తన నీట్ ప్రిపరేషన్ గురించి శుక్రవారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడాడు.వివరాలు అతని మాటల్లోనే.. ‘మొదటిసారి నీట్ పరీక్ష సులువుగా ఉంది. రెండోసారి మాత్రం కఠినంగా ఉంది. అయినా సబ్జెక్ట్‌పై ఉన్న పట్టుతో అవలీలగా రాశా. నీట్ పరీక్షకు ముందు 108 సార్లు గ్రాండ్ టెస్ట్‌లు రాశా. దీంతోపాటు వీక్లీ పరీక్షలు 500కుపైగా రాశా. ఈ పరీక్షల ద్వారా నా ప్రతిభకు పదును పెట్టడంతోపాటు సమయపాలన అలవర్చుకున్నా.‘నా తండ్రి రమాకాంత్ తన గురువైన ప్రముఖ సర్జన్ వేదుల సత్యనారాయణమూర్తి సేవలను పదేపదే గుర్తుచేసేవారు. ఆయన గురించి గొప్పగా చెప్పేవారు. అది విన్నప్పుడల్లా నేను డాక్టర్ కావాలని లక్ష్యం నిర్దేశించుకున్నా.దీంతోపాటు వైద్యులైన నా తల్లిదండ్రుల స్ఫూర్తితో నేను కూడా డాక్టర్ కావాలనుకున్నా. నేను ప్రత్యేకంగా ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. ఎస్ఆర్ కాలేజీలో ఇంటర్ చదువుతూనే నీట్ పరీక్షకు సిద్ధమయ్యా. కాలేజీలో అధ్యాపకుల నుంచి మంచి సహకారం లభించింది. నేను ఈ ర్యాంకు సాధించడంలో తల్లిదండ్రులు, ఎస్ఆర్ కాలేజ్ అధ్యాపకుల ప్రోత్సాహం ఎంతో ఉంది’అని సహ్యూ వివరించాడు. -
ఆన్సర్ కీ చూసుకొని మనస్థాపంతో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
ఫరీదాబాద్‌లో నీట్ (NEET) పరీక్ష ఫలితాల ఆందోళనతో ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదాన్ని నింపింది. 18 ఏళ్ల నీట్ అభ్యర్థిని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసిన ఆన్సర్ కీ ఆధారంగా తన మార్కులను అంచనా వేసుకుంది. వైద్య విద్యా ప్రవేశ పరీక్ష (NEET-UG) లో తాను ఆశించిన స్థాయి కంటే మార్కులు తక్కువగా రావడంతో తీవ్ర మనస్తాపానికి గురై, 16వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.పోలీసుల ప్రకారం, మరణించిన విద్యార్థినిని ధన్వితగా గుర్తించారు. ఫరీదాబాద్, సెక్టార్ 87లోని రాయల్ హిల్స్ సొసైటీలో దాన్విత తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది. గురువారం మధ్యాహ్నం సమయంలో తాను నివసిస్తున్న టవర్ A1 నుంచి పక్కనే ఉన్న టవర్ A2 పైకప్పు (Roof) పైకి వెళ్లి అక్కడ నుండి కిందకు దూకేసింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.తన అంచనాల కంటే చాలా తక్కువగా ఉండటంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైందని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. భవనం పైనుండి దూకడానికి ముందు చెప్పులు విప్పి, మొబైల్ ఫోన్, చేతి బ్రాస్లెట్ , కళ్లజోడును అక్కడున్న గోడపై భద్రంగా ఉంచి ఈ నిర్ణయం తీసుకుందని సొసైటీ నివాసితులు ఆవేదన వ్యక్తంచేశారు.ఇదీ చదవండి: తొలి హైడ్రోజన్ రైలు : దీని ప్రత్యేకతలివే!కాగా ధన్విత కుటుంబం ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందినది. వీరు కొంతకాలంగా ఈ హౌసింగ్ సొసైటీలో నివసిస్తున్నారు. ఈ సంఘటన జరిగినప్పుడు విద్యార్థి తల్లి విజయవాడలో ఉండగా, ఆమె తండ్రి కోటేశ్వర్, ఒక ప్రైవేట్ కంపెనీలో ఉన్న సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నట్టు సమాచారం. ఇదీ చదవండి: ఆ రూ. 40 వేలతోనే : రామమందిర్ విరాళాల గోల్మాల్ గుట్టు -
నీట్ రీఎగ్జామ్ ఫలితాలు విడుదల
-
21న ఎన్డీఏ కీలక సమావేశం
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ, అయోధ్య విరాళాల చోరీ, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్న నేపథ్యంలో, దీన్ని తిప్పికొట్టాలని అధికారపక్షం ఎన్డీఏ సిద్ధమవుతోంది. ఈనెల 21న అత్యంత కీలకమైన పార్లమెంటరీ సమావేశం నిర్వహించనుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల (జూలై 20 నుంచి ఆగస్టు 13) సందర్భంగా ఈ భేటీ జరగనుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మోదీ ప్రభుత్వం తన శాసన, పరిపాలనాపరమైన ఎజెండాను నిర్దేశించడానికి ఎన్డీఏ సమావేశం దోహదం చేయనుంది. జోరుగా ప్రచారం సాగుతోన్న కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంశం కూడా ఈ ఎజెండాలో అన్నింటి కంటే ముఖ్యంగా ఉంటుందనే ఊహగానాలు సాగుతున్నాయి. ప్రతిపక్ష పారీ్టల్లో ఇటీవల వచ్చిన చీలికలు, పెరిగిన సంఖ్యాబలం నేపథ్యంలో తమ ప్రతిష్టాత్మక బిల్లులను ఆమోదింపజేసుకోవడమే లక్ష్యంగా ఎన్డీఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ సన్నద్ధతలో భాగంగానే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఈనెల 17న ఎన్డీఏ మంత్రుల వ్యూహాత్మక సమావేశం జరగనుంది. అలాగే, 19వ తేదీన అఖిల పక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆ బిల్లును గట్టెక్కించేందుకు.. ఏప్రిల్ జరిగిన బడ్జెట్ సమావేశాల్లో మూడింట రెండొంతుల మెజారిటీ లేకపోవడంతో వీగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు (నియోజకవర్గాల పునరి్వభజన, మహిళా రిజర్వేషన్ల బిల్లు)ను కొన్ని మార్పులతో తిరిగి ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. లోక్‌సభ స్థానాల సంఖ్యను దాదాపు 850కి పెంచడం, అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా 50 శాతం సీట్లు పెంచేలా ప్రతిపాదన తేవడం ద్వారా ప్రాంతీయ పారీ్టల మద్దతు కూడగట్టాలని భావిస్తోంది. ఇటీవల టీఎంసీలోని 20 మంది ఎంపీలు నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ)గా చీలిపోయి ఎన్డీఏకి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే శివసేన (యూబీటీ) నుంచి ఆరుగురు లోక్‌సభ ఎంపీలు షిండే వర్గంలో చేరారు. రాజ్యసభలో ముగ్గురు టీఎంసీ ఎంపీలు, ఏడుగురు ఆప్ ఎంపీలు బీజేపీలోకి చేరారు. ఈ కొత్త సమీకరణలతో పార్లమెంటు ఉభయ సభలలో బలం పుంజుకున్న ఎన్డీఏ ఈసారి 131వ రాజ్యాంగ సవరణ బిల్లును గట్టెక్కించాలని చూస్తోంది. -
నీట్ రీఎగ్జామ్ ఫలితాలు విడుదల
దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న నీట్ యూజీ రీఎగ్జామ్-2026 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) గురువారం రాత్రి ప్రకటించింది. వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ పరీక్షకు 20లక్షల మంది విద్యార్థులు హాజరు కాగా.. రికార్డు స్థాయిలో 11.21 లక్షల మంది అర్హత సాధించారు.పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ స్కోర్‌కార్డులను అధికారిక వెబ్సైట్ neet.nta.nic.in నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది.అమ్మాయిలదే పైచేయి!ఈ ఏడాది నీట్ ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. మొత్తం అర్హత సాధించిన వారిలో 58 శాతం కంటే ఎక్కువ మంది మహిళా అభ్యర్థులే కావడం విశేషం.టాప్ స్కోరర్లు వీరే..ఈ ఏడాది పరీక్షలో 720 మార్కులకు గానూ అత్యధికంగా 715 మార్కులు సాధించి ఆర్యన్ గుప్తా(పంజాబ్), పాన్షుల్ బన్సాల్(హర్యానా) సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అదేవిధంగా 19 మంది విద్యార్థులు 700 కంటే ఎక్కువ మార్కులు సాధించారు.కేటగిరీల వారీగా పరిశీలిస్తే.. జనరల్ కేటగిరీలో 2.91లక్షల మంది క్వాలిఫై కాగా.. ఓబీసీ ఎన్‌సీఎల్‌లో 5.12లక్షలు, ఎస్సీ 1.59లక్షల మంది, ఎస్టీ 63,716మంది, జనరల్ ఈడబ్ల్యూఎస్ 95,026, పీడబ్ల్యూబీడీ 3666, పీడబ్ల్యూడీ 303మంది క్వాలిఫై అయ్యారు. కాగా నీట్ పరీక్షను తొలుత మే 3న నిర్వహించారు. అయితే ప్రశ్నపత్రం లీక్ అవ్వడంతో జూన్ 21న మరోసారి దేశ వ్యాప్తంగా రీ-ఎగ్జామ్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా మొత్తం 20లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. -
ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు : వాంగ్‌చుక్ భావోద్వేగ సందేశం
సాక్షి, న్యూఢిల్లీ: నీట్ అవకతవకలు, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాలాంటి డిమాండ్లతో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) ఆరోగ్య పరిస్థితిపై ఢిల్లీ హైకోర్టు గురువారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పౌరుల ప్రాణం చాలా విలువైనది. వారి ప్రాణాలు కాపాడటానికి అధికారులు అన్ని ప్రయత్నాలు చేయాలంటూ హైకోర్టు స్పష్టం చేసింది. సోనమ్ వాంగ్‌చుక్ ప్రాణాలను రక్షించడానికి అవసరమైన అన్ని రకాల వైద్య సహాయాలు అందించాలని ఆదేశించింది. ఆయన ఆరోగ్య పర్యవేక్షణ నిమిత్తం ప్రభుత్వ వైద్యులను నియమించాలని కేంద్రాన్ని ఆదేశించింది.ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) చేపట్టిన నిరసనల్లో భాగంగా వాంగ్‌చుక్ చేస్తున్న నిరాహార దీక్ష 19వ రోజుకు చేరుకుంది. బీపీ, షుగర్ ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. వాంగ్‌చుక్ ఇప్పటికే 8.5 కిలోల బరువు తగ్గారు. దీంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ సందర్భంగా దాఖలైన పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడంతోపాటు, కీలక ఆదేశాలను జారీ చేసింది.ఇదీ చదవండి: కీలక ఫెడ్ పదవులు : రఘురామ్ రాజన్, మరో ఇద్దరు భారతీయ నిపుణులుఇప్పటిదాకా ప్రైవేట్ వైద్యులు వాంగ్చుక్కు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. అయితే ఇకపై ప్రతిరోజూ కేవలం ప్రభుత్వ వైద్యుల చేతే క్రమబద్ధమైన తనిఖీలు చేయించాలని, అవసరమైతే వైద్యపరంగా జోక్యం చేసుకోవాలని కోర్టు ఆదేశించింది. పౌరుల ప్రాణాలు చాలావిలువైనవి, వారిని కాపాడేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కోరింది. సోనమ్ వాంగ్‌చుక్ ప్రాణాలను కాపాడటానికి అవసరమైన చర్యలన్నీ చేపట్టండి అని కేంద్రానికి హైకోర్టు ఆదేశించింది. రానున్న 48 గంటల్లో ఆయన దీక్ష విరమించకపోతే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడవచ్చని బుధవారం దాఖలైన ఒక పిటిషన్‌పై కోర్టు ఈ విచారణ చేపట్టింది.I’m Not in good shape but not so bad either...Rather than asking me to break my fast please join me on 20th July... Peaceful March to the Parliament.#cockroachjanataparty #jantarmantar #cjpprotest #chalosansad pic.twitter.com/QZ6VyxVMAR— Sonam Wangchuk (@Wangchuk66) July 15, 2026సోనమ్ భావోద్వేగ వీడియోమరోవైపు కోర్టు ఉత్తర్వులకు కొన్ని గంటల ముందు సోనమ్ వాంగ్‌చుక్ ఒక భావోద్వేగ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. సీనియర్ రాజకీయ నాయకులు దీక్ష విరమించాలని కోరుతున్నప్పటికీ,దీక్ష విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుండి స్పందన రాకుండా వెనక్కి తగ్గితే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు. తాను నీరస పడినప్పటికీ, గుండె, ఇతర అంతర్గత అవయవాలు ఇంకా బాగానే ఉన్నాయి. ఇంకా కొన్ని రోజులు నడవ గలను అన్నారు. ఈ సందర్భంగా జూలై 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరగబోయే నిరసనలో ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సమస్యను ఎంపీల దృష్టికి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.కాగా NEET-UG వంటి పోటీ పరీక్షల పేపర్ లీకేజీల వ్యవహారంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని లేదా ఆయనను తొలగించాలని, అలాగే ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం చెల్లించాలనే డిమాండ్స్‌తో అభిజీత్ నేతృత్వంలోని సీజేపీ ఆందోళనకు దిగింది. ఈ ఉద్యమానికి మద్దతుగానే సోనమ్ వాంగ్‌చుక్ ఈ దీక్షకు దిగిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: మూడో పెళ్లి : ఫత్వా, లవ్ జిహాద్ ఆరోపణలపై స్పందించిన ఆమీర్ -
Wangchuk: ఏదైనా జరిగితే కేంద్రానిదే బాధ్యత!
ప్రముఖ విద్యావేత్త, పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్ష 18వ రోజుకు చేరుకోవడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దాదాపు 9 కిలోల బరువు కోల్పోయిన ఆయన ప్రస్తుతం 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఏ క్షణమైనా ఆయన పరిస్థితి విషమించొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వాంగ్చుక్కు ఏదైనా జరిగితే అందుకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తీవ్ర హెచ్చరిక చేసింది.రాజ్యసభ సభ్యుడు సాకేత్ గోఖలే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు బహిరంగ లేఖ రాస్తూ.. వెంటనే వాంగ్‌చుక్‌తో చర్చలు జరపాలని, విద్యార్థుల ఆందోళనను ప్రభుత్వం వినాలని కోరారు. ఆయనకు ఏదైనా జరిగితే మాత్రం ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. ఇదిలా ఉండగా.. వాంగ్చుక్కు రాజకీయ మద్దతు క్రమంగా పెరుగుతోంది. పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ ఫోన్లో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. టీఎంసీ ఎంపీలు మహువా మొయిత్రా, సాగరికా ఘోష్ జంతర్‌మంతర్‌కు వెళ్లి సంఘీభావం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా మద్దతు ప్రకటించకపోయినప్పటికీ.. ఆ పార్టీ సీనియర్ నేత శశి థరూర్ వాంగ్చుక్కు బహిరంగ లేఖ రాస్తూ.. దీక్షను విరమించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే నిరసనకారులతో చర్చలు జరపాలని ప్రభుత్వానికి సూచించారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ (ఎస్పీ), సీపీఎం, సీపీఐ తదితర పార్టీలు కూడా ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించాయి. ఇటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఆయనకు సంఘీభావం తెలుపుతున్నారు. అసలు ఈ దీక్ష ఎందుకు?జూన్ 28 నుంచి ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద వాంగ్‌చుక్ నిరాహార దీక్ష చేస్తున్నారు. నీట్ (NEET), సీబీఎస్ఈ (CBSE) పరీక్షల్లో జరిగిన అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు, పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న లోపాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆయనతో పాటు నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్షల వ్యవస్థలో సమూల సంస్కరణలు తీసుకురావాలని కోరుతున్నారు. అయితే వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్షపై కేంద్రం ఇప్పటిదాకా స్పందించలేదు. అయితే మొదటి నుంచి ఈ ఉద్యమాన్ని కేంద్రం రాజకీయ ప్రేరేపితమని అభివర్ణిస్తూ.. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నిరసనకారులను "అశాంతి సృష్టించే శక్తులు"గా వ్యాఖ్యానించారు. ఎవరీ సోనమ్ వాంగ్‌చుక్?లడఖ్‌కు చెందిన సోనమ్ వాంగ్‌చుక్ ప్రముఖ ఇంజినీర్, విద్యావేత్త, పర్యావరణవేత్త. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా సంస్కరణలకు కృషి చేసిన ఆయనకు 2018లో ప్రతిష్ఠాత్మక రామన్ మెగసెసే అవార్డు సైతం లభించింది. హిమాలయ ప్రాంతాల్లో నీటి సంరక్షణ కోసం రూపొందించిన 'ఐస్ స్తూపాలు' ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఆయన జీవితం, ఆలోచనల ఆధారంగానే బాలీవుడ్ చిత్రం '3 ఇడియట్స్'లోని ఫున్సుఖ్ వాంగ్డూ పాత్ర(అమీర్ ఖాన్ పోషించిన పాత్ర) రూపుదిద్దుకుంది. ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆయన చేపట్టిన ఈ నిరాహార దీక్ష దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వాంగ్‌చుక్ ఆరోగ్యంపై ఆయన భార్య గీతాంజలి ఆంగ్మో కూడా ఆందోళన వ్యక్తం చేశారు. లడఖ్‌లో గతంలో 21 రోజుల పాటు నిరాహార దీక్ష చేసినప్పటికీ అక్కడి చల్లటి వాతావరణం కారణంగా ఇంతగా బలహీనపడలేదని, ఢిల్లీలోని వేడి, తేమ వల్ల శరీరంపై తీవ్ర ప్రభావం పడుతోందని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఉప్పు, నీటితోనే దీక్ష కొనసాగిస్తున్నారని.. వైద్యుల సూచనలు ఉన్నప్పటికీ వెనక్కి తగ్గే ఆలోచన లేదని వెల్లడించారు. ఇదిలా ఉండగా.. వాంగ్‌చుక్ ఆరోగ్యం మరింత క్షీణించకుండా బలవంతంగా ఆహారం అందించాలని, దీక్ష విరమింపజేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ఓ ప్రజాహిత వ్యాజ్యం (పిల్) కూడా దాఖలైంది. అయితే తాను స్వచ్ఛందంగా చేపట్టిన నిరాహార దీక్షను కొనసాగిస్తానని వాంగ్‌చుక్ స్పష్టం చేస్తున్నారు. -
‘ఫున్సుఖ్ వాంగ్డూ’ చనిపోవడం ఇష్టం లేదు : 3 ఇడియట్స్ నటుడి భావోద్వేగం
నీట్ (NEET) పరీక్ష లీక్, ఇతర పరీక్షల నిర్వహణలో అక్రమాలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలు 25వ రోజుకు చేరుకున్నాయి. ఈ ఉద్యమానికి మద్దతుగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ పరిరక్షకుడు సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోంది. దీనిపై '3 ఇడియట్స్' సినిమాలో 'చతుర్' పాత్రతో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటుడు ఓమి వైద్య తీవ్ర భావోద్వేగంతో స్పందించారు.ఓమి వైద్య భావోద్వేగ విజ్ఞప్తి‘ఫున్సుఖ్ వాంగ్దూ’( వాంగ్ చుక్) చనిపోవడం నాకు ఇష్టం లేదు అంటూ సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్షపై ఎవరూ స్పందించడం లేదంటూ సోషల్‌మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు తన మద్దతును ప్రకటించిన ఓమి బాలీవుడ్ ఐకానిక్ సినిమాతో ఉన్న సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ మూవీలో ఆమీర్ ఖాన్ పోషించిన 'ఫున్సుఖ్ వాంగ్డూ' పాత్ర నిజ జీవితంలో సోనమ్ వాంగ్‌చుక్ స్ఫూర్తితో రూపొందించిందేనని సినీ ప్రేమికులకు గుర్తు చేశారు.సోషల్ మీడియాలో పంచుకున్న ఒక భావోద్వేగ వీడియోలో ఓమి వైద్య మాట్లాడుతూ, "నాకు ఫున్సుఖ్ వాంగ్దూ చనిపోవడం ఇష్టం లేదు" అంటూ ఆవేదనవ్యక్తం చేశారు. గతంలో తాను వాంగ్చుక్ను కలిశానని, ఇంజనీర్‌గా, ఆవిష్కర్తగా, విద్యా సంస్కర్తగా ఆయన చేసిన కృషి ఎంతో అద్భుత మైందని కొనియాడారు. View this post on Instagram A post shared by Omi Vaidya (@omivaidya_official)ప్రస్తుతం వాంగ్‌చుక్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆయన చాలా రోజులుగా నిరాహార దీక్షలో ఉన్నారు, దీంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ క్షీణిస్తుండటం చాలా ఆందోళనకరమైన విషయమని పేర్కొన్నారు. రాజకీయ అభిప్రాయాలకు అతీతంగా ప్రజలు దీనిని చూడాలన్నారు. ఆయనతో ఏకీభవించినా, ఏకీభవించకపోయినా, ఒక మేధావి చనిపోవడం తనకు అస్సలు ఇష్టం లేదని వైద్య పేర్కొన్నారు. వాంగ్‌చుక్ చేసిన పనుల గురించి చదివి, ఆయన సందేశాన్ని అందరికీ షేర్ చేస్తూ అవగాహన పెంచాలని ఆయన ప్రజలను కోరారు.ఇదీ చదవండి: రూ. 2 కోట్ల బంగారం పేస్ట్ : తమిళనాడు జంట అరెస్ట్క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యంవాంగ్చుక్ దీక్ష 17వ రోజుకు చేరుకోవడంతో, ఆయన కండరాల క్షీణతను ఎదుర్కొంటున్నారని, తీవ్రమైన నొప్పితో బాధ పడుతున్నారని CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తెలిపారు. తాజా హెల్త్ అప్డేట్స్ ప్రకారం, వాంగ్‌చుక్ 8 కేజీలకు పైగా బరువు తగ్గారు. బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోతూ ఉంది. దీంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. పలువురు విజ్ఞప్తి చేసినప్పటికీ ఆయన దీక్షను విరమించడానికి నిరాకరించారు "నా దీక్షను విరమించమని నన్ను అడగకండి. కనీసం చర్చలు జరపడానికి కూడా ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదో వారిని అడగండి" అని వాంగ్‌చుక్ అన్నట్లు దిప్కే పేర్కొన్నారు.ఆమీర్‌పై విమర్శలుమరోవైపు బాలీవుడ్లో 3 ఇడియట్స్ మూవీ ద్వారా కోట్లు రూపాయలు దండుకున్న ఆమీర్ ఖాన్ మూడో పెళ్లి సంబరాల్లో మునిగి తేలుతూ, రియల్ ‘ఫున్సుఖ్ వాంగ్దూ’ గురించి పట్టించుకోవడం లేదంటూ తీవ్ర విమర్శలు వెల్లువెతుతున్నాయి.కాగా 59 ఏళ్ల సోనమ్ వాంగ్‌చుక్ జూన్ 28న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ చేపట్టిన నిరసనలో చేరారు. అప్పటి నుండి ఆయన నిరవధిక నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. ఈ నిరవధిక దీక్షలో ఉన్న వాంగ్చుక్ను నటులు ప్రకాష్ రాజ్, నసీరుద్దీన్ షా, రత్నా పాఠక్ షా, రచయిత్రి అరుంధతీ రాయ్, ఆర్థికవేత్త జయతి ఘోష్, టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా కూడా ఆయన పోరాటానికి మద్దతు పలికారు. -
నీట్, జేఈఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌లో భారీ మార్పులు?!.. కేంద్రం కీలక నిర్ణయం..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మెడికల్, ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్, జేఈఈ వంటి ప్రవేశ పరీక్షల విధానంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని గణనీయంగా తగ్గించే లక్ష్యంతో, ఇకపై అడ్మిషన్ల మెరిట్ జాబితాలో క్లాస్ 12 బోర్డు పరీక్షల మార్కులకు 50 శాతం వెయిటేజీ కల్పించాలని కేంద్ర విద్యాశాఖ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.ఇటీవలి కాలంలో పరీక్షల నిర్వహణలో ఎదురైన పేపర్ లీకేజీలు, మూల్యాంకన లోపాలు వంటి తీవ్రమైన వివాదాల నేపథ్యంలో, ప్రస్తుతం ఉన్న పరీక్షా విధానంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేవలం ఎంట్రన్స్ పరీక్షల మార్కులే కాకుండా, బోర్డు పరీక్షల మార్కులకు కూడా సమాన ప్రాధాన్యత లభిస్తుంది. ఎంట్రన్స్ పరీక్షల సిలబస్‌ను పాఠశాల పాఠ్యప్రణాళికకు అనుగుణంగా మార్చడం ద్వారా విద్యార్థులు కోచింగ్ సెంటర్లపై ఆధారపడటాన్ని తగ్గిస్తారు. విద్యార్థులు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఏడాదిలో ఒకటి కంటే ఎక్కువసార్లు పరీక్ష రాసే అవకాశం కల్పిస్తారు. పేపర్ లీకేజీల రిస్క్‌ను పూర్తిగా తగ్గించడానికి, క్రమంగా అడాప్టివ్ ఆన్ డిమాండ్ కంప్యూటర్ ఆధారిత పరీక్షల వైపు మళ్లనున్నారు.ప్రస్తుత విధానం ప్రకారం, మెడికల్, ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు పూర్తిగా నీట్, జేఈఈ ఎంట్రన్స్ స్కోర్లపైనే ఆధారపడి జరుగుతోంది. బోర్డు పరీక్షలు కేవలం అర్హత సాధించడానికి మాత్రమే పరిమితమయ్యాయి. ఈ క్రమంలో విద్యార్థుల్లో పెరుగుతున్న మానసిక ఒత్తిడిని తగ్గించడానికి,అనధికారిక విద్యాసంస్థల వ్యాప్తిని, కోచింగ్ సంస్కృతిని అరికట్టడానికి విద్యాశాఖ నియమించిన తొమ్మిది మంది సభ్యుల ఉన్నత స్థాయి కమిటీ ఈ కీలక సిఫార్సులను సిద్ధం చేసింది. ఈ కమిటీ తన తుది నివేదికను త్వరలోనే ప్రభుత్వానికి సమర్పించనుంది. -
ఆగస్టు 30న నీట్ పీజీ
సాక్షి, అమరావతి: దేశంలో మెడికల్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నీట్ పీజీ – 2026 పరీక్షను ఆగస్టు 30న నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (ఎన్బీఈ) నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు ఆన్లైన్లో బుధవారం నుంచి ఈ నెల 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. పరీక్ష కేంద్రాల సమాచారం ఆగస్టు 11న ప్రకటిస్తారు. సెప్టెంబర్ 30న ఫలితాలు వెల్లడించనున్నారు. -
ఢిల్లీలో వాంగ్‌చుక్ నిరాహార దీక్ష
న్యూఢిల్లీ: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ ముందుగా ప్రకటించిన విధంగానే ఆదివారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరాహార దీక్ష ప్రారంభించారు. నీట్ పేపర్ లీకేజీకి కేంద్రమే బాధ్యత వహించాలని, విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. వాంగ్‌చుక్ దీక్షకు కాక్రోచ్ జనతా పార్టీ మద్దతు తెలిపింది. ఆ పార్టీ కూడా 20వ తేదీ నుంచి ఇదే వేదికపై నీట్ పేపర్ లీకేజీపై ఆందోళన కొనసాగిస్తుండటం తెల్సిందే. దీక్ష ప్రారంభించడానికి ముందుగా వాంగ్‌చుక్, సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేతో కలిసి రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అనంతరం జంతర్‌మంతర్‌లో నిరసన స్థలిలో అంతా కలిసి రెండు నిమిషాలు మౌనం పాటించారు. వందల సంఖ్యలో హాజరైన విద్యార్థులు, యువకులు తరలివచ్చి వాంగ్‌చుక్ దీక్షకు మద్దతు ప్రకటించారు. -
‘ధర్మేంద్ర ప్రధాన్‌జీ హ్యాపీ బర్త్‌డే’ : సీజేపీ అభిజీత్ దీప్కే
సాక్షి,న్యూఢిల్లీ: ‘నీట్’ సహా పలు ఇతర పరీక్షల్లో జరిగిన అక్రమాల నేపథ్యంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేస్తున్న నిరసన కొనసాగుతోంది. ఈ క్రమంలో శుక్రవారం ధర్మేంద్ర ప్రధాన్ పుట్టిన రోజు కావడంతో ఆయన రాజీనామా చేయాలంటూ సీజేజీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు.పుట్టిన రోజు శుభాకాంక్షలు ధర్మేంద్ర ప్రధాన్.. మీరు వెంటనే రాజీనామా చేయాలని వాల్‌పోస్టర్‌పై రాసి తన నిరసన వ్యక్తం చేశారు. ఆ సందేశం రాసిన తర్వాత ‘ధర్మేంద్ర ప్రధాన్ జీ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మాకో చిన్న సహాయం చేయండి. రాజీనామా చేయండి. పుట్టినరోజు కానుకగా మేమే మీకు రాజీనామా పత్రాన్ని పంపిస్తాం. మీరు దానిపై కేవలం మీ వేలిముద్ర వేస్తే సరిపోతుంది’ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Happy Birthday @dpradhanbjp, please resign! pic.twitter.com/djLcewkQch— Abhijeet Dipke (@abhijeet_dipke) June 25, 2026 -
28 నుంచి జంతర్‌మంతర్‌లో నిరాహార దీక్ష
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేని పక్షంలో ఈ నెల 28వ తేదీ నుంచి ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరాహార దీక్ష చేపడతానని ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ గురువారం ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్‌లో ఒక వీడియోను ఆయన పోస్ట్ చేశారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చేపడుతున్న నిరసనలకు ప్రభుత్వం నుంచి స్పందన కోసం ఈ నెల 27వ తేదీ వరకు ఎదురుచూస్తానన్నారు. విద్యారంగంలో జవాబుదారీతనం, తన సొంత లద్దాఖ్ పర్యావరణం, సంస్కృతి, అక్కడి ప్రజల సంక్షేమానికి సంబంధించిన విషయాలలో జవాబుదారీతనం అనే రెండు కీలక అంశాలపైనే తన దృష్టి ఉందన్నారు. విద్యను ప్రభావితం చేసే నిర్ణయాల్లో పౌరులకు స్థానం ఉండాలని, అలాగే పర్యావరణ పరిరక్షణ, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకునే విషయాల్లో లద్దాఖ్ ప్రజల అభిప్రాయాలకు విలువివ్వాలని వాంగ్‌చుక్ స్పష్టం చేశారు. శనివారం కల్లా ఈ రెండింటిపై స్పందన రాకపోతే, సీజేపీ నాయకులతో కలిసి నిరాహార దీక్షకు కూర్చుంటానన్నారు. -
నీట్ నిర్వహణ భేష్.. ప్రధాని ప్రశంస
ఢిల్లీ: నీట్ పునఃపరీక్ష విజయవంతంగా నిర్వహించారని ప్రధాని మోదీ విద్యాశాఖను కొనియాడారు. బుధవారం నిర్వహించిన కేబినేట్ సమావేశంలో వారికి అభినందనలు తెలిపారు. నీట్ ప్రక్రియ 'హోల్-గవర్నమెంట్' విధానాన్ని ప్రదర్శించిందని, మంత్రులు మరియు అధికారుల సమిష్టి కృషిని ఆయన ప్రశంసించారు.కేబినేట్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ "పరీక్ష సజావుగా, చిత్తశుద్ధితో" నిర్వహించబడింది. ప్రణాళిక అమలులో తమ మంత్రులు తమ బాధ్యతలు నిర్వహించారు. భవిష్యత్తులో సైతం ఇదే విధంగా సమన్వయ విధానాన్ని అనుసరించాలి". అని ఆయన అన్నారు. అంతా కలిసి పనిచేస్తే ఏలాంటి సమస్యనైనా అధిగమించవచ్చని నీట్ మరోసారి రుజువుచేసిందన్నారు.ప్రధాని అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, నీట్ పునఃపరీక్ష నిర్వహించిన విధానాన్ని వివరించారు. పలు మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు,విభాగాలు సమన్వయంతో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.కాగా నీట్ పునఃపరీక్ష జూన్ 21న దేశవ్యాప్తంగా 5,440 కేంద్రాలలో,విదేశాల్లోని 14 కేంద్రాలలో నిర్వహించారు. ఈ పరీక్షకు 20 లక్షలకు పైగా అభ్యర్థుల హాజరయ్యారు.కాగా గత నెల మే 3న నిర్వహించిన నీట్ యూజీ (NEET UG) పరీక్ష క్వశ్చన్ పేపర్ లీక్ నేపథ్యంలో కేంద్రం రద్దు చేసింది. "గెస్ పేపర్" పేరుతో లక్షల రూపాయలకు ప్రశ్నపత్రాలు అమ్ముడయ్యాయని, లీకేజీ నెట్వర్క్ సోషల్ మీడియా ద్వారా విస్తరించిందని దర్యాప్తులో తేలడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. -
డైపర్ల విరాళాల ఉద్యమం చేపట్టిన కాక్రోచ్ జనతా పార్టీ
న్యూఢిల్లీ: ‘నీట్’ పేపర్ లీకేజీ వ్యవహారం దేశ రాజధానిలో తీవ్ర దుమారం రేపుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన ప్రదర్శనలు మంగళవారంతో నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో, పేపర్ లీకేజీలపై తమ నిరసనను మరింత ఉధృతం చేసేందుకు ఆందోళనకారులు ‘డైపర్ ఏ డే కీప్స్ లీక్స్ అవే’ (రోజుకో డైపర్ లీకేజీలను అడ్డుకుంటుంది) అనే నినాదంతో ఒక వినూత్నమైన ‘డైపర్ల విరాళాల ఉద్యమాన్ని’ ప్రారంభించారు. జంతర్ మంతర్ వద్దకు వచ్చే వారు ఒక డైపర్‌ను తీసుకొచ్చి, దానిపై మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్‌ను రాసి ఇవ్వాలని, వాటిని విద్యాశాఖ మంత్రికి అందజేస్తామని నిరసనకారులు ప్రకటించారు.ఉధృతమవుతున్న ఆందోళనలు గత శనివారం మధ్యాహ్నం ప్రారంభమైన ఈ ధర్నా కార్యక్రమం రేయింబవళ్లు కొనసాగుతోంది. భారీగా పోలీసులు మోహరించినప్పటికీ, విద్యార్థులు, మద్దతుదారులు రాత్రి వేళల్లో కూడా నిరసన స్థలంలోనే బస చేస్తున్నారు. సోమవారం రాత్రి, నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల స్మారకార్థం జంతర్ మంతర్ వద్ద కొవ్వొత్తులతో భారీ ప్రదర్శన నిర్వహించారు. తొలుత పోలీసులు ఈ కొవ్వొత్తుల ప్రదర్శనకు అనుమతించలేదని, ఆ తర్వాత అనుమతి లభించిందని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తెలిపారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు ఈ పోరాటం ఆగేది లేదని నిరసనకారులు స్పష్టం చేశారు.పరీక్షా కేంద్రాలకు కొన్ని నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను రీ-టెస్ట్ రాయడానికి అనుమతించకుండా అధికారులు కఠినంగా వ్యవహరించారని, కానీ ఇంత పెద్ద పేపర్ లీకేజీకి కారణమైన వారిపై మాత్రం చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని అభిజీత్ దిప్కే తీవ్రంగా విమర్శించారు. తప్పు చేసిన వారిని వదిలేసి, అమాయక విద్యార్థులను అధికారులు వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆదివారం జరిగిన రీ-టెస్ట్‌కు హాజరైన పలువురు నీట్ అభ్యర్థులు కూడా ఈ నిరసనల్లో పాల్గొని తమ చేదు అనుభవాలను పంచుకున్నారు. పరీక్షా విధానంలో పారదర్శకత తీసుకురావాలని డిమాండ్ చేస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా జంతర్ మంతర్ వద్దకు వచ్చి విద్యార్థుల బాధలను ఆలకించాలని వారు విజ్ఞప్తి చేశారు.తనిఖీల వివాదం – పోలీసుల వివరణఈ నిరసనల్లో ఎస్ఎఫ్ఐ, ఐసా, ఏఐఎస్ఎఫ్ వంటి వామపక్ష విద్యార్థి సంఘాలు కూడా పాల్గొన్నాయి. విద్యార్థుల కోసం నిరసన స్థలంలోనే ఒక ఉచిత గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. కాగా, ధర్నాలో పాల్గొనకుండా విద్యార్థులను అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు వారి ఆధార్ కార్డులను, చిరునామా వివరాలను సేకరిస్తున్నారని అభిజీత్ దిప్కే ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను ఢిల్లీ పోలీసులు పూర్తిగా ఖండించారు. తాము జంతర్ మంతర్ వద్ద ఎలాంటి ఆధార్ తనిఖీలు చేపట్టలేదని, అటువంటి వివరాలేవీ సేకరించలేదని, ఆ ఆరోపణలన్నీ వాస్తవ విరుద్ధమని పోలీసులు స్పష్టం చేశారు. -
టెలిగ్రామ్ సేవలు పునఃప్రారంభం
సాక్షి, ఢిల్లీ: దేశంలో టెలిగ్రామ్ సేవలు మళ్లీ పునఃప్రారంభమయ్యాయి. జూన్ 21న జరిగిన నీట్ రీఎగ్జామ్ రీత్యా భద్రతా కారణాలతో టెలిగ్రామ్ సేవలను జూన్ 22వరకూ టెలిగ్రామ్ యాక్సెస్ తాత్కాలికంగా కేంద్రం నిలిపివేసింది. ఎగ్జామ్ ముగియడంతో సేవలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. అదే విధంగా ఈ నెల 30 వరకు టెలిగ్రామ్‌లోని ఎడిట్ ఆఫ్షన్ తొలిగింపు కొనసాగనుంది. పేపర్ లీక్ మోసాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.జూన్ 21న నీట్ ఎగ్జామ్ ప్రశాతంగా ముగిసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారిక గణాంకాల ప్రకారం పునఃపరీక్షకు దేశవ్యాప్తంగా 20 లక్షల కంటే ఎక్కువ మంది విద్యార్థులు హజరైనట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో నీట్ పరీక్షను దాదాపు 3.65 లక్షల మంది విద్యార్థులు రాశారు. కొన్ని ప్రాంతాలలో విద్యార్థులు సమయానికి రాకపోవడంతో విద్యార్థులను పరీక్ష కేంద్రాలలోకి అనుమతించలేదు. దీంతో వారు పరీక్షకు అనుమతించాలని తీవ్రంగా విలపించారు. ఇలాంటి చిన్న చిన్న ఘటనలు మినహా ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది -
NEET ఎగ్జామ్ మిస్.. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది?
సాక్షి,బెంగళూరు: కర్ణాటకలో నీట్ పరీక్షపై రాజకీయ దుమారం రేగింది. బెంగళూరులో కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీ కారణంగానే ముగ్గురు విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మీడియా ఎదుట వాపోయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఆదివారం జరిగిన ఈ సంఘటన విద్యార్థులు, తల్లిదండ్రులు, రాజకీయ పార్టీల మధ్య పెద్ద చర్చకు దారితీసింది. నిన్న దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులు నీట్ యూజీ రీ-టెస్ట్ రాసినట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. అయితే బెంగళూరులో కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీ కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి, పరీక్షా కేంద్రాలకు చేరుకోవడంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైంది. విద్యార్థులు 1.30 గంటలకు రిపోర్ట్ చేయాలని విద్యాశాఖ సూచించింది. కానీ ట్రాఫిక్ పెరగడంతో తల్లిదండ్రులు బైక్‌లను ఫుట్‌పాత్‌లపై నడిపే పరిస్థితి వచ్చింది. చివరికి ముగ్గురు విద్యార్థులు ఆలస్యంగా చేరుకోవడంతో పరీక్షకు అనుమతి ఇవ్వలేదు. వారు గేటు ఎక్కి లోపలికి వెళ్లాలని ప్రయత్నించినా, నిర్వాహకులు గేట్లను మూసివేశారు.అయితే తల్లిదండ్రులు కాంగ్రెస్ ర్యాలీని తప్పుబట్టారు. 7 కిలోమీటర్ల దూరం సాధారణంగా 20 నిమిషాల్లో పూర్తవుతుంది. కానీ ర్యాలీ కారణంగా 35 నిమిషాలకుపైగా పట్టింది. పిల్లల భవిష్యత్తు కోసం ర్యాలీలు నగర బయట జరగాలి అని ఓ తండ్రి అసహంన వ్యక్తం చేశారు. మరొకరు రాహుల్ గాంధీ విద్యార్థుల కోసం కోటాకు వెళ్లారు. కానీ ఆయన పార్టీ ర్యాలీ వల్ల నలుగురు విద్యార్థులు పరీక్ష మిస్సయ్యారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? అని ప్రశ్నించారు.ఈ ఘటనపై బీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ‘కాంగ్రెస్ అధికార దాహం కోసం ఎంత వరకు దిగజారుతుంది?’ అంటూ వీడియోను షేర్ చేశారు. దీనికి కాంగ్రెస్ మంత్రి ప్రియాంక్ ఖర్గే ‘కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదు. గత దశాబ్దంలో 89 పేపర్ లీకులు జరిగాయి’ అని ప్రతిస్పందించారు.కాంగ్రెస్ నేత బీకే హరిప్రసాద్ ‘కొంతమంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని విన్నాను. వారికి కలిగిన అసౌకర్యంపై విచారం వ్యక్తం చేస్తున్నాను. కానీ బీజేపీ పాలనలో కూడా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దానికి వారు క్షమాపణ చెప్పారా?’అని ప్రశ్నించారు. జేడీఎస్ అధినేత హెచ్డీ కుమారస్వామి ఈ ఘటనను ప్రభుత్వానికి అవమానకరమైన పరిణామంగా అభివర్ణించారు.Bengaluru, Karnataka: A parent of one of the students says, "Rahul Gandhi, D.K. Shivakumar, and even the Commissioner of Police, Bengaluru, do not seem to be concerned. Rahul Gandhi went to Kota for the cause of students, right? But because of his party's function today, four… https://t.co/1ixZBqPcRc pic.twitter.com/No3W5edKEb— IANS (@ians_india) June 21, 2026 -
కోడింగ్ టు ప్రిస్క్రిప్షన్: సత్తా చాటిన ‘ఆకృతి @ 32’
కలలు కనడానికి వయసుతో నిమిత్తం లేదని, సంకల్పం బలంగా ఉంటే ఎంతటి కఠినమైన లక్ష్యాన్నైనా సాధించవచ్చని నిరూపించారు ముంబైకి ఆకృతి గోయల్. ఇంజనీరింగ్ పూర్తి చేసి, మంచి జీతంతో ఉద్యోగం చేస్తున్నప్పటికీ.. డాక్టర్ కావాలనే చిన్నప్పటి కల ఆమెను నిద్రపోనివ్వలేదు. 32 ఏళ్ల వయసులో ఇంకా పెళ్లి కాలేదనే హేళనలను, ‘ఈ వయసులో ‘నీట్’ రాస్తారా?’ అనే మాటలను లెక్కచేయకుండా, కేవలం 10 నెలల కఠోర ప్రిపరేషన్‌తో నీట్ (NEET UG) పరీక్షను క్రాక్ చేసి సరికొత్త రికార్డు సృష్టించారు ఆకృతి గోయల్.బిట్స్ పిలానీ నుండి ఎంబీబీఎస్ వైపు అడుగులుఆకృతికి చిన్నతనం నుంచే మెడిసిన్ వైపు మక్కువ ఉన్నప్పటికీ, కొన్ని పరిస్థితుల వల్ల ఇంజనీరింగ్ దిశగా వెళ్లాల్సి వచ్చింది. ఆమె ప్రతిష్టాత్మక ‘బిట్స్ పిలానీ’లో ఎంఎస్సీ ఎకనామిక్స్, బిటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్‌లో డ్యూయల్ డిగ్రీ పూర్తి చేశారు. చదువు తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్లకు వెళ్లకుండా, స్వయంగా ఇంటర్వ్యూల ద్వారా స్టార్టప్‌లలో ఉద్యోగాలు సంపాదించారు. ఆ తర్వాత ‘హీలోఫీ’ అనే స్టార్టప్‌లో లీడర్షిప్ పాత్రను పోషిస్తూ, నేరుగా సీఈఓతో కలిసి మిలియన్ డాలర్ల ప్రాజెక్టులను విజయవంతంగా హ్యాండిల్ చేశారు.ఉద్యోగానికి గుడ్ బై.. సమాజం నుండి అవహేళనలువరుసగా లేట్ నైట్ షిఫ్టులు, విపరీతమైన పని ఒత్తిడి కారణంగా 2020 జనవరిలో ఆకృతి అనారోగ్యానికి గురయ్యారు. ఆ తర్వాత కోవిడ్ లాక్డౌన్ సమయంలో ఆమె తన ఉద్యోగాన్ని వదిలేసి, మళ్లీ డాక్టర్ కావాలనే తన చిన్ననాటి కల వైపు అడుగులు వేశారు. అయితే, 30 ఏళ్లు దాటిన ఆకృతి ఉద్యోగం వదిలేసి పరీక్షలకు సిద్ధమవడాన్ని చుట్టుపక్కల వారు తప్పుపట్టారు. ‘ఈ వయసులో పెళ్లి చేసుకోకుండా నీట్ ప్రిపరేషన్ ఏంటి?’ అంటూ ఎగతాళి చేశారు. కానీ ఆ విమర్శలనే ఆమె తన విజయానికి ఇంధనంగా మార్చుకున్నారు.10 నెలల కఠోర దీక్ష.. 676 మార్కులతో..దాదాపు 10 ఏళ్ల తర్వాత మళ్లీ పుస్తకాలు పట్టడం ఆకృతికి అంత సులువు కాలేదు. తొలుత ఆన్లైన్లో ఉచిత బయాలజీ క్లాసులు వింటూ, రోజుకు 10 గంటల చొప్పున చదవడం ప్రారంభించారు. కేవలం 10 నెలల ప్రిపరేషన్ కాలంలో ఆమె 100 కి పైగా మాక్ టెస్టులు రాశారు. 2021లో నీట్ ఫలితాలు విడుదలైనప్పుడు, ఆమె 676 స్కోరుతో, ఆల్ ఇండియా లెవెల్లో 1,118వ ర్యాంకు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ఆమె హిందూ రావు మెడికల్ కాలేజీ(ఢిల్లీ)లో ఎంబీబీఎస్ చదువుతూ, సరికొత్త జీవితాన్ని ప్రారంభించారు. -
పరీక్షకు కొద్ది గంటల ముందు ‘నీట్’ అభ్యర్థి ఆత్మహత్య
ఘజియాబాద్: దేశవ్యాప్తంగా నేడు (ఆదివారం) నీట్ యూజీ పరీక్ష జరుగుతోంది. ఈ పరీక్షకు కొద్ది గంటలముందు ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ‘నీట్’కు సిద్ధం అవుతున్న 22 ఏళ్ల ఒక యువకుడు తన ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. మరణానికి కొద్ది నిమిషాల ముందు సదరు విద్యార్థి తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన ఒక వీడియో క్లిప్ ఇప్పుడు ఈ కేసులో అత్యంత కీలకంగా మారింది.మొబైల్ వీడియోలో సంచలన నిజాలుఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లా విజయ్ నగర్ నివాసి అయిన జతిన్ కుమార్ అనే యువకుడు నీట్-యూజీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాడు. అయితే, అతడు తన గదిలో విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తులో భాగంగా జతిన్ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులకు అందులో ఒక వీడియో క్లిప్ లభ్యమైంది. తాను చనిపోవడానికి కొద్దిసేపటి ముందే జతిన్ దానిని రికార్డ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ వీడియోలో.. ఆదివారం జరగబోయే నీట్ పునఃపరీక్ష గురించి తనకు ఎలాంటి ఒత్తిడి లేదని ఆ యువకుడు స్పష్టం చేయడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ వాస్తవికతను, డిజిటల్ ఆధారాలను ఫోరెన్సిక్ బృందాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి.అర్ధరాత్రి వరకు చదువుకుని.. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం అర్ధరాత్రి దాటే వరకు జతిన్ తన గదిలో చదువుకుంటూనే ఉన్నాడు. తీరా శుక్రవారం ఉదయం నిద్ర లేపేందుకు వెళ్లిన బంధువులకు అతడు అపస్మారక స్థితిలో కనిపించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న కోత్వాలి నగర్ పోలీసులు, గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఒక ఉరితాడు వేలాడుతూ ఉండటాన్ని, జతిన్ మృతదేహం కింద పడి ఉండటాన్ని గమనించారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉపాసన పాండే ఈ కేసుపై స్పందిస్తూ.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని, అన్ని కోణాల్లోనూ లోతుగా విచారణ జరుపుతున్నామని వెల్లడించారు.యూపీలో వరుస విషాదాలుమే 3న జరిగిన నీట్-యూజీ పరీక్షలో పేపర్ లీకేజీ ఆరోపణలు రావడంతో, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆ పరీక్షను రద్దు చేసి సీబీఐ విచారణకు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ గందరగోళ పరిస్థితులు విద్యార్థులను తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేస్తున్నాయి. కేవలం ఘాజియాబాద్‌లోనే కాకుండా, లక్నోలో కూడా 17 ఏళ్ల ఒక విద్యార్థిని మంగళవారం తన గదిలో ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది. మే 3 పరీక్షలో మంచి మార్కులు సాధించి, సీటు వస్తుందనే నమ్మకంతో ఉన్న ఆ విద్యార్థిని పరీక్ష రద్దు కావడంతో తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లిపోయిందని ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. -
ముగిసిన నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్
నీట్ యూజీ అప్డేట్స్ముగిసిన రీ-ఎగ్జామ్నీట్ యూజీ (NEET-UG) 2026 పునఃపరీక్ష ముగిసింది మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు పరీక్ష జరిగిందికొనసాగుతున్న పరీక్షకొనసాగుతున్న నీట్ యూజీ (NEET-UG) 2026 పునఃపరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు పరీక్షపెన్ అండ్ పేపర్ విధానంలో నీట్ యూజీనీట్ యూజీ ప్రారంభం దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన నీట్ యూజీ (NEET-UG) 2026 పునఃపరీక్ష నేటి (జూన్ 21, ఆదివారం) మధ్యాహ్నం 2 గంటల ప్రారంభమైంది. అత్యంత రహస్యంగా, కట్టుదిట్టమైన రక్షణ వలయంలో ప్రశ్నపత్రాలను స్థానిక పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాల పహారా మధ్య పరీక్షా కేంద్రాలకు సురక్షితంగా తరలించారు. దేశంలోని 551 నగరాలతో పాటు విదేశాల్లోని 14 కేంద్రాలలో మొత్తం 22.79 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నారు. పరీక్షను అత్యంత పారదర్శకంగా, ఎలాంటి అక్రమాలకు తావులేకుండా నిర్వహించేందుకు నేషనల్... టెస్టింగ్ ఏజెన్సీ భారీ భద్రతా ఏర్పాట్లను చేసింది. దేశవ్యాప్తంగా 5,440 పరీక్షా కేంద్రాల్లోని 95,000 కంటే ఎక్కువ గదుల్లో 1.38 లక్షలకు పైగా సీసీటీవీ కెమెరాలను అమర్చారు. వీటిని జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో కంట్రోల్ రూమ్‌ల ద్వారా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు.మాల్‌ప్రాక్టీస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత విశ్లేషణ, పరీక్షా కేంద్రాల్లో 51,000 కంటే ఎక్కువ జామర్లు, బయోమెట్రిక్ తనిఖీలు మరియు ఫేస్ అథెంటికేషన్ (ముఖ గుర్తింపు) ప్రక్రియలను అమలు చేస్తున్నారు. హై-సెన్సిటివిటీ మెటల్ డిటెక్టర్ల ద్వారా అభ్యర్థులకు క్షుణ్ణంగా తనిఖీలు (ఫ్రిస్కింగ్) చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తారు. అభ్యర్థులు తమతో పాటు అడ్మిట్ కార్డ్, చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడీ కార్డ్, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలను తప్పనిసరిగా తీసుకురావాలని ఎన్టీఏ ముందే సూచించింది. -
నీట్ రీ-ఎగ్జామ్: నాగ్‌పూర్, అహిల్యానగర్, లాతూర్‌లలో టైట్ సెక్యూరిటీ
ముంబై: గత దఫాలో చోటుచేసుకున్న పేపర్ లీకేజీ ప్రకంపనల నేపథ్యంలో, నేడు (ఆదివారం) దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్-యూజీ పునఃపరీక్షకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మహారాష్ట్రలో మునుపెన్నడూ లేని విధంగా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నీటీ యూజీ వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన నాగ్‌పూర్, అహిల్యానగర్, లాతూర్ తదితర ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. పరీక్షలు పూర్తి పారదర్శకంగా, ఎలాంటి అక్రమాలకు తావులేకుండా నిర్వహించేందుకు పోలీసులు, కేంద్ర రిజర్వ్ పోలీస్ బలగాలు, సీసీటీవీ కెమెరాలతో కూడిన గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఎలాంటి భయాందోళనలు లేకుండా పరీక్షకు హాజరుకావాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పిలుపునిచ్చారు.నాగ్‌పూర్‌లో ఉచిత ప్రయాణం నాగ్‌పూర్‌లోని 30 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 12,512 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద తనిఖీలు ముమ్మరం చేయడంతో అక్కడ దాదాపు ‘పోలీస్ క్యాంప్’ వాతావరణం తలపిస్తోంది. అభ్యర్థుల గుర్తింపును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. మరోవైపు, విద్యార్థులకు రవాణా ఇబ్బందులు కలగకుండా నాగ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ తమ ‘ఆప్లీ బస్’ సర్వీసుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించింది. అడ్మిట్ కార్డ్ చూపించి విద్యార్థులు ఈ ఏసీ బస్సుల్లో పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్నారు.అహిల్యానగర్లో సీఆర్పీఎఫ్ పహారాఅహిల్యానగర్ జిల్లాలో మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5:15 గంటల వరకు జరిగే ఈ పరీక్ష కోసం 12 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ 5,385 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ప్రశ్నపత్రాల రవాణాలో ఎలాంటి లోపాలు జరగకుండా స్థానిక పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు. పరీక్షా కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకున్నారు. అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యేక వైద్య బృందాలను కూడా అందుబాటులో ఉంచారు.లాతూర్‌లో తగ్గిన కేంద్రాలు గత వివాదాల దృష్ట్యా లాతూర్ జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. పర్యవేక్షణను మరింత బలోపేతం చేయడం కోసం పరీక్షా కేంద్రాల సంఖ్యను గతేడాది ఉన్న 34 నుండి ఈసారి 24కి తగ్గించింది. ఇక్కడ సుమారు 14,000 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. జిల్లా కలెక్టర్ స్వయంగా పరీక్షా కేంద్రాలను సందర్శించి భద్రతను సమీక్షించారు. పరీక్షల నిర్వహణను పర్యవేక్షించడానికి డ్యూటీ మేజిస్ట్రేట్లు, రాష్ట్ర అబ్జర్వర్లను ప్రత్యేకంగా నియమించారు. -
ఈ రోజే నీట్ రీఎగ్జామ్.. కట్టుదిట్టమైన భద్రత
ఈ రోజు జరగనున్న నీట్ రీఎగ్జామ్‌కు ఎన్టీఏ దేశ వ్యాప్తంగా అత్యంత పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసింది. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని పేర్కొంది. పరీక్షలు ఎటువంటి అక్రమాలు జరగకుండా నిరంతరం పర్యవేక్షించేందుకు 1.38 లక్షల సీసీటీవీ కెమెరాలు మానటరింగ్ చేయనున్నట్లు పేర్కొంది.అదేవిధంగా ఏఐ ఆధారిత సీసీటీవీలు, 51,311 జామర్లతో ఎలక్ట్రానిక్ పరికరాల నియంత్రణ చేపట్టనుంది. మరోవైపు తెలుగురాష్ట్రాల్లో నీట్ రీఎగ్జామ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో 2.95 లక్షల మంది నీట్ పరీక్ష రాయనున్నారు.వీరికోసం ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఏపీలో 65,790 మంది అభ్యర్థులు ఎగ్జామ్ రాయనున్నారు. పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 185 కేంద్రాలు ఏర్పాటు చేశారు.కాగా దేశవ్యాప్తంగా ఆదివారం జరగనున్న నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) రీ-ఎగ్జామ్ కేవలం 22 లక్షల మంది విద్యార్థులు రాయనున్నారు. కాగా మే 3న జరిగిన పరీక్ష పేపర్ లీక్ కావడం, ఆ తర్వాత పరీక్షను రద్దు చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి, నిరసనలకు దారితీసింది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్లు కూడా వచ్చాయి. అయితే, ఈ ఘటనపై కేంద్రం విచారం వ్యక్తం చేస్తూనే... తాము పారదర్శకతకే ప్రాధాన్యత ఇచ్చామని స్పష్టం చేసిందిదీంతో ఈ పరీక్ష వైద్య విద్యార్థులకే కాకుండా, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక పెద్ద అగ్నిపరీక్షగా మారింది. మే నెలలో జరిగిన మొదటి విడత పరీక్షలో పేపర్ లీకేజీ వివాదం చెలరేగడంతో, కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి నిలబెట్టుకోవడానికి కేంద్రం ఈసారి సర్వశక్తులూ ఒడ్డుతోంది.పరీక్ష సమయాలు పరీక్ష సమయం మధ్యాహ్నం 2:00 గంటల నుండి సాయంత్రం 5:15 గంటల వరకు పరీక్ష జరగనుంది.దివ్యాంగులకు మినహాయింపు: అదనపు సమయానికి అర్హులైన దివ్యాంగ విద్యార్థులకు సాయంత్రం 6:20 గంటల వరకు సమయం కేటాయించారు.రిపోర్టింగ్ సమయం: విద్యార్థులు ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల లోపు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని NTA స్పష్టం చేసింది. -
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర యూజీ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ యూజీ)–2026 పునఃపరీక్ష ఆదివారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేస్తారు. ఈ గడువుకు నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. కాగా, మే 3న నిర్వహించిన నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయిన నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో పునఃపరీక్ష నిర్వహణ పట్ల తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ సారైనా పరీక్షను సక్రమంగా నిర్వహిస్తారా? లేదా? అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఉత్పన్నమవుతోంది. కట్టుదిట్టమైన ఏర్పాట్లు పెన్ను, పేపర్(ఆఫ్‌లైన్) విధానంలో దేశవ్యాప్తంగా 551, విదేశాల్లోని 14 నగరాల్లో నీట్ పునఃపరీక్షను నిర్వహిస్తున్నామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) వెల్లడించింది. జాతీయ స్థాయిలో 22.79 లక్షల మంది విద్యార్థులు నీట్ రాయనున్నారు. మన రాష్ట్రంలోని 27 నగరాలు, పట్టణాల్లో ఏర్పాటు చేసిన 185 కేంద్రాల్లో 65,790 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 1,500 మంది కేంద్ర, రాష్ట్ర పోలీస్ బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేశారు. శనివారం ఈ కేంద్రాలన్నింటిలో నీట్ మాక్ డ్రిల్ కూడా నిర్వహించారు. ఆదివారం ప్రశ్నాపత్రాలను పోలీస్ భద్రతతో కేంద్రాలకు తరలించనున్నారు. అదే విధంగా పరీక్ష కేంద్రాల వద్ద నిషే«ధాజ్ఙలు అమలు చేయనున్నారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తారు. దివ్యాంగ విద్యార్థులకే అదనపు సమయం అదనపు సమయం దివ్యాంగ విద్యార్థులకేనని శనివారం ఎన్టీఏ ప్రకటించింది. దివ్యాంగ విద్యార్థులు సాయంత్రం 6.20 గంటల వరకూ పరీక్ష రాసుకునే అవకాశాన్ని ఎన్టీఏ కల్పించింది. అయితే ఈ అదనపు సమయం కేటాయింపుపై విద్యార్థుల్లో గందరగోళం నెలకొందని, ఆ విషయంపై ఎన్టీఏ మరోమారు స్పష్టతనిచ్చింది. కొందరు సాధారణ విద్యార్థుల అడ్మిట్ కార్డుల్లో అదనపు సమయం కాలమ్ దగ్గర ‘వై’ అని ముద్రించి ఉండటంతో గందరగోళం నెలకొందని, ఆ కాలమ్ దగ్గర ‘వైఈఎస్’ అని ముద్రించిన దివ్యాంగ విద్యార్థులకు మాత్రమే అదనపు సమయం కేటాయింపు ఉంటుందని వెల్లడించింది. శనివారం రాత్రి ఏడు గంటల వరకూ కూడా కొందరు అభ్యర్థులు అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోలేదని, వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా వాట్సాప్‌కు అడ్మిట్ కార్డులు పంపామని ఎన్టీఏ తెలిపింది.‘నీట్’కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయండి: సీఎస్రాష్ట్రంలో ఆదివారం నిర్వహించనున్న నీట్ యూజీ–2026 రీ ఎగ్జామ్‌కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఆదేశించారు. సీఎస్ తన క్యాంపు కార్యాలయం నుంచి శనివారం నీట్ పరీక్ష ఏర్పాట్లపై సమీక్షించారు. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరీక్ష నిర్వహణను పర్యవేక్షించాలని చెప్పారు. దివ్యాంగ విద్యార్థులకు పరీక్ష రాసేందుకు అదనంగా గంట సమయం ఉంటుందని, ఈ విషయాన్ని అధికారులు పరిగణనలోకి తీసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని ఫొటోస్టాట్ షాపులు, సైబర్ కేఫ్‌లు, కోచింగ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా పెట్టాలని, నిషేధ ఆజ్ఞలను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. సోషల్ మీడియాలో పేపర్ లీకేజీ వంటి వదంతులు సృష్టించేవారిపై నిఘా ఉంచి సకాలంలో తగిన చర్యలు తీసుకోవాలన్నారు.నిబంధనలు ఇవే..డ్రెస్ కోడ్: విద్యార్థులు తేలికపాటి దుస్తులు ధరలించాలి. పూర్తి చేతులు(ఫుల్ స్లీవ్స్) చొక్కాలు, ఉన్ని దుస్తులు ధరించే విద్యార్థులు తనిఖీల కోసం పరీక్ష కేంద్రానికి నిర్ణీత సమయానికన్నా ముందే చేరుకోవాలి. సంప్రదాయ, మతపరమైన విశ్వాసాలకు సంబంధించిన వస్తువులను ధరించేవారు క్షుణ్ణంగా తనిఖీలు చేయడానికి వీలుగా కేంద్రంలో చాలా ముందుగానే రిపోర్ట్ చేయాలి. కేవలం స్లిప్పర్స్, ఎత్తు తక్కువ ఉన్న చెప్పులు మాత్రమే ధరించాలి. పరీక్ష కేంద్రంలోకి అనుమతించేవి: అడ్మిట్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజు ఫొటో, ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు (ఆధార్, పాన్, వంటి ధ్రువీకరణపత్రాలు), ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ మాత్రమే అనుమతిస్తారు. నిషేధిత వస్తువులు: మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, ఎల్రక్టానిక్ పరికరాలు, క్యాలిక్యులేటర్లు, ఇతర కాగితాలను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. -
ఒత్తిడితో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
మియాపూర్ (హైదరాబాద్): నీట్ రీ ఎగ్జామ్‌కు సిద్ధమవుతున్న విద్యార్థిని చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మియాపూర్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. మియాపూర్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ వివరాలు తెలిపారు. వైఎస్ఆర్కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన షేక్సనా నీట్ ఎగ్జామ్‌కు సిద్ధం అవుతోంది. తండ్రి ఉద్యోగ రీత్యా కువైట్‌లో ఉంటుండగా, పది రోజుల కిందట షేక్ సనా తల్లి అబ్బునిసా సొంతూరికి వెళ్లింది. దీంతో సనా తన ఇద్దరు చెల్లెళ్లు ఇంట్లో ఉంది.శనివారం చదువుకునేందుకు షేక్ సనా తన గదిలోకి వెళ్లి సాయంత్రం అయినా బయటకు రాకపోయేసరికి ఆమె చెల్లెళ్లు గది తలుపులు తెరిచి చూడగా ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకొని కనిపించింది. స్థానికుల సహాయంతో కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందింది.‘తల్లిదండ్రులను మెప్పించలేకపోతున్నా.. భయం, ఒత్తిడి, ఆత్మవిశ్వాసం కోల్పో యి బాధపడుతున్నాను. చదువులో కుటుంబ అంచనాలను అందుకోలేకపోతున్నా. గత పరీక్షల్లో వైఫల్యం కారణంగా బాధపడుతున్నా. నా బాధను ఎవరితో పంచుకోవాలో తెలియదు’అని సూసైడ్ నోట్లో పేర్కొంది. -
నేడే నీట్ రీఎగ్జామ్
సాక్షి, హైదరాబాద్: దేశంలో వైద్యవిద్య ప్రవేశాల భవిష్యత్‌ను నిర్ణయించే నీట్–యూజీ 2026 రీ ఎగ్జామ్ ఆదివారం జరగనుంది. గత నెల 3వ తేదీన నిర్వహించిన పరీక్ష.. పేపర్ లీక్, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో రద్దు కావడంతో దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు మరోసారి పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నేడు నీట్ రీఎగ్జామ్ నిర్వహిస్తోంది. తెలంగాణలో సుమారు 73 వేల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పెన్–పేపర్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. దేశంలోని 551 నగరాల్లోని 5,440 కేంద్రాలతోపాటు విదేశాల్లోని 14 నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పేపర్ లీక్‌తో రద్దు... ఎన్టీఏపై విమర్శల వెల్లువ గత నెల 3న జరిగిన నీట్‌కు ముందు వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో ప్రశ్నపత్రం బయటకు వచ్చినట్టు కేంద్ర దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. జీవశాస్త్రం, రసాయన శాస్త్రానికి చెందిన అనేక ప్రశ్నలు ముందుగానే సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టినట్టు ఆరోపణలు రావడంతో పరీక్ష సమగ్రత దెబ్బతిన్నదని ఎన్టీఏ నిర్ధారించింది. దీంతో పరీక్షను పూర్తిగా రద్దు చేసి రీఎగ్జామ్ నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో ఎన్టీఏ పరీక్షల నిర్వహణ విధానంపై పలు విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు కూడా కొనసాగుతోంది. ఈసారి ఎలాంటి వివాదాలకు తావులేకుండా ప్రభుత్వం పూర్తిస్థాయిలో భద్రతా చర్యలు చేపట్టింది. ప్రశ్నపత్రాల తయారీలో పాల్గొనే నిపుణులను రహస్య ప్రదేశాలకు తరలించి డిజిటల్ కమ్యూనికేషన్‌పై పూర్తిగా ఆంక్షలు విధించారు. ప్రశ్నల బ్యాంకును విస్తరించడం, ప్రశ్నపత్ర రూపకల్పనలో ఎక్కువ మంది నిపుణులను భాగస్వామ్యం చేయడం, గోప్యతా నిబంధనలను కఠినతరం చేయడం వంటి చర్యలు తీసుకున్నారు. పకడ్బందీ ఏర్పాట్లు చేశాం : ఎన్టీఏ నీట్ రీఎగ్జామ్ అత్యంత పారదర్శకంగా, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శనివారం వెల్లడించింది. 95,000లకు పైగా పరీక్ష గదుల్లో మొత్తం 1,38,560 సీసీటీవీ కెమెరాలను అమర్చారు. లైవ్ ఫీడ్లను జాతీయ, ఆయా రాష్ట్ర స్థాయిలో వర్చువల్‌గా పర్యవేక్షిస్తారు. ఎల్రక్టానిక్ అక్రమాలను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా 51,311 జామర్లను ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్ష గదికి ఇద్దరు ఇన్విజిలేటర్లు ఉంటారు. అభ్యర్థుల తనిఖీకి 38,795 మంది సిబ్బందిని, బయోమెట్రిక్ వెరిఫికేషన్‌కు 48,448 మందిని రంగంలోకి దించారు. ఈసారి బయోమెట్రిక్ సిబ్బందిని రెట్టింపు చేయడమే కాకుండా ఫేస్ అథెంటికేషన్ సదుపాయాన్ని కూడా కల్పించారు. సాంకేతిక సమస్యల తక్షణ పరిష్కారానికి ప్రతి కేంద్రంలో ఒక సెంటర్ సిస్టమ్స్ ఆఫీసర్ అందుబాటులో ఉంటారు. పరీక్షా కేంద్రాల్లో సుమారు 6,700 మంది అబ్జర్వర్లు విధుల్లో ఉండగా, 100 మందికి పైగా వర్చువల్ అబ్జర్వర్లు కేంద్ర కార్యాలయం నుంచి నిరంతరం లైవ్ సీసీటీవీ ఫుటేజీని పర్యవేక్షిస్తారు. ఈ ఫుటేజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టూల్స్‌తో విశ్లేíÙంచి, ఎక్కడైనా తేడాలు ఉంటే వెంటనే గుర్తిస్తారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల పనితీరు, విద్యుత్ బ్యాకప్, వైద్య సదుపాయాలు, అత్యవసర పరిస్థితుల నిర్వహణపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా మాక్‌డ్రిల్ రీ ఎగ్జామ్‌కు ముందు శనివారం దేశవ్యాప్తంగా మాక్‌డ్రిల్ నిర్వహించారు. రాష్ట్రంలో కూడా ఎంపిక చేసిన అన్ని పరీక్ష కేంద్రాల్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. పరీక్ష కేంద్రాల్లో భద్రతా వ్యవస్థలు, ప్రశ్నపత్రాల రవాణా, అభ్యర్థుల ప్రవేశ ప్రక్రియలను పరీక్షించారు. ప్రశ్నపత్రాల భద్రత కోసం జిల్లా యంత్రాంగాలు, పోలీసు బలగాలు, ఎస్కార్ట్ బృందాలు కలిపి రెండు లక్షల మందికి పైగా సిబ్బందిని రంగంలోకి దించారు. పేపర్ లీకేజీలకు సోషల్ మీడియా వేదికలు ఉపయోగించారనే ఆరోపణల నేపథ్యంలో టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. నీట్ రీ ఎగ్జామ్ ప్రశ్నపత్రం లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని ఎన్టీఏ ఖండిస్తూ, విద్యార్థులు వదంతులను నమ్మొద్దని సూచించింది. అనుమానాస్పద సమాచారం, నకిలీ పేపర్లపై ఫిర్యాదులకు ప్రత్యేక పోర్టల్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే నీట్ రీ ఎగ్జామ్ ఎన్టీఏ విశ్వసనీయత, దేశంలోని అత్యంత కీలక ప్రవేశ పరీక్షల పారదర్శకతకు అగ్నిపరీక్షగా మారింది. -
‘ఎన్టీఏ అబుదాబి’ నిర్వాకంపై రాహుల్ నిప్పులు!
న్యూఢిల్లీ: వైద్య విద్య ప్రవేశ పరీక్ష ‘నీట్’ (NEET) నిర్వహణ తీరుపై మరోసారి తీవ్ర దుమారం రేగింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) చేసిన ఒక పొరపాటు ఒక విద్యార్థి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడమే కాకుండా, దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. నాగ్‌పూర్‌కు చెందిన ఒక విద్యార్థికి రీ-ఎగ్జామ్ సెంటర్ ఏకంగా విదేశాల్లో (అబుదాబి) కేటాయించడంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శనివారం కేంద్ర ప్రభుత్వంపై, ఎన్టీఏపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నాగ్‌పూర్‌కు చెందిన ఒక విద్యార్థి నెల రోజులుగా ఎంతో కష్టపడి నీట్ రీ-ఎగ్జామ్ కోసం సన్నద్ధమయ్యాడు. అయితే పరీక్షకు సరిగ్గా ఒక్కరోజు ముందు అతను తన అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోగా, అందులోని పరీక్షా కేంద్రం చూసి షాక్‌కు గురయ్యాడు. ఆ విద్యార్థికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ‘అబుదాబి’లో సెంటర్ కేటాయించారు. ఈ ఉదంతంపై రాహుల్ గాంధీ ఎక్స్ ‘ఎక్స్’ వేదికగా తన ఆవేదన వ్యక్తం చేస్తూ, ఎన్టీఏ పనితీరును తప్పుపట్టారు. అసలు ఇలాంటి ఘోరమైన తప్పు ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. ‘విద్యార్థి ఉన్న నగరంలోనే ఒక పరీక్షా కేంద్రాన్ని సరిగ్గా కేటాయించలేని విద్యా వ్యవస్థకు, ఇలాంటి అత్యున్నత స్థాయి పరీక్షలను నిర్వహించే హక్కు ఎక్కడిది?’ అని ప్రశ్నించారు.విద్యార్థుల, వారి తల్లిదండ్రుల సహనాన్ని ఎన్టీఏ పరీక్షిస్తోందని ఆయన మండిపడ్డారు. ఇటీవల తాను కోటాలో విద్యార్థులను కలిసి వారి బాధలను పంచుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ, ప్రస్తుత విద్యా వ్యవస్థ యువతను పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. దేశంలోని ప్రస్తుత పరిస్థితిని విమర్శిస్తూ.. ‘ఇది నిజమైన విద్యా వ్యవస్థ కాదు, ఇది ఒక తరానికి చెందిన డబ్బును, సమయాన్ని, మానసిక ప్రశాంతతను నిలువునా దోపిడీ చేసిందన్నారు. పిల్లల భవిష్యత్తుతో జూదం ఆడటం ఇకనైనా ఆపాలని కేంద్ర ప్రభుత్వానికి హితవు పలికారు. దేశంలోని విద్యార్థులకు బాధ్యతాయుతమైన, సమాధానం చెప్పే విద్యా వ్యవస్థ, పరీక్షా యంత్రాంగం అవసరమని ఇందుకోసం తాము పోరాడి తీరుతామని రాహుల్ గాంధీ హెచ్చరించారు.ఇది కూడా చదవండి: ‘నీట్’ మరో షాక్: ఒడిశా విద్యార్థినికి 1500 కి.మీ దూరంలో సెంటర్!


