
చెన్నై: నీట్ ఫలితాల విడుదలకు సంబంధించి మద్రాస్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఫలితాలను విడుదల చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ.. తదుపరి విచారణ జూన్ 2వ తేదీకి వాయిదా వేసింది. కాగా ఇప్పటికే నీట్ ఫలితాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా స్టే విధించింది.
తమ ఎగ్జామ్ సెంటర్లో విద్యుత్ అంతరాయం కారణంగా.. పరీక్ష సరిగ్గా రాయలేకపోయామని కొంతమంది విద్యార్థులు ఫిటిషన్ దాఖలు చేశారు. పరీక్ష కేంద్రంలో విద్యుత్ అంతరాయం కలిగినప్పుడు, ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేయలేదని వారు పేర్కొన్నారు. దీంతో హైకోర్టు ఫలితాలను నిలిపివేయాలని ఆదేశించింది. ఫలితాలు ప్రస్తుతానికి వాయిదా పడ్డాయి. కాగా రిజల్ట్స్ విడుదలకు సంబంధించిన తేదీపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
2024 - 25 సంవత్సరానికి దేశ వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీలలో ప్రవేశాలకై నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ మే 4న పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు 23 లక్షలమంది అప్లై చేసుకోగా.. 20.8 లక్షలమంది పరీక్షకు హాజరయ్యారు. ఇక ఈ పరీక్ష ఫలితాలు విడుదల కావాల్సి ఉంది.