జమ్మూలో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు టెర్రరిస్టులు హతం | Two terrorists killed in encounter in Jammu | Sakshi
Sakshi News home page

జమ్మూలో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు టెర్రరిస్టులు హతం

Feb 22 2026 3:25 PM | Updated on Feb 22 2026 9:13 PM

Two terrorists killed in encounter in Jammu

జమ్మూకశ్మీర్‌లోని  కిష్వార్తా జిల్లాలోని మారుమూల ప్రాంతంలో  భద్రతా బలగాలకు తీవ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. సైన్యం జరిపిన  కౌంటర్ టెర్రర్ ఆపరేషన్‌లో ముగ్గుర ఉగ్రవాదులు హతమయినట్లు తెలుస్తోంది. జమ్మూలోని. మృతిచెందిన ఉగ్రవాదులు పాకిస్థాన్‌లోని జైష్-ఎ-మహమ్మద్ ఉగ్రసంస్థతో సంబంధం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే మృతిచెందిన ఉగ్రవాదుల నుండి ఏకే-47 రైఫిల్స్‌తో పాటు మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

అయితే దేశంలోకి ఉగ్రవాదుల ప్రవేశాన్ని ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదని అధికారులు అన్నారు. వేట కొనసాగుతుందని శాంతికి భంగం కలిగించే వారికి ఎట్టిపరిస్థితుల్లో భారత్‌లో ఆశ్రయం దొరకదని ఆర్మీ అధికారులు తెలిపారు. కాగా ఇటీవల జమ్మూకశ్మీర్ ప్రాంతంలో భద్రతా బలగాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితుల్లో సరిహద్దులోకి ప్రవేశించకుండా ఆధునాతన డ్రోన్లు నిఘా కెమెరాలతో పహారా కాస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో ముగ్గురు ముష్కరులను భద్రతా బలగాలు  కాల్చి చంపినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ జమ్మూ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్లలో దాదాపు ఆరుగురు టెర్రరిస్టులు హతమైనట్లు అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement