ఎంతో ఉత్సాహంగా కళకళలాడిన పెళ్లి వేడుక కాస్తా ఉన్నట్టుండి హింసాత్మకంగా మారి పోయింది. మటన్ విందు ఇస్తామని చెప్పి, చికెన్ వడ్డించారనే ఆగ్రహంతో వివాదం మొదలైంది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నారు. బిహార్‌లోని సహర్సా జిల్లా సిమ్రి బక్తియార్‌పూర్ పట్టణంలో ఈ ఘటన జరిగింది.
అసలేం జరిగిందంటే
అధికారుల సమాచారం ప్రకారం బిహార్‌కు చెందిన మహ్మద్ అన్వర్ కుమారుడైన మహ్మద్ అబ్దుల్లా అలియాస్ చాంద్‌కు, మహ్మద్ జావేద్ అలియాస్ మోటో కుమార్తెకు గురువారం మధ్యాహ్నం నిఖా (పెళ్లి) జరిగింది. కార్యక్రమాలన్నీ ప్రశాంతంగా ముగిసాయి. అందరూ మంచి ఆకలితో భోజనాలకు కూర్చున్నారు. అంతే తీవ్ర కలకలం రేగింది. కారణం ఏమిటయ్యా అంటే మటన్ విందు అని చెప్పి చీప్‌గా చికెన్ వడ్డిస్తారా అంటూ మగపెళ్లివారు గొడవకు దిగారు. ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ మాటల యుద్ధం కాస్తా క్షణాల్లోనే పరస్పర దాడులకు దారితీసింది. ఈ ఘర్షణలో దాదాపు ఒక డజను మందికి పైగా గాయపడ్డారు.

मटन की जगह बना दिया चिकन तो निकाह बन गया मैदान ए जंग,
मियाँ Vs बीवी के तरफ़दारों की भिड़ंत में कई बाराती-घराती घायल,
बिहार के सहरसा में बख्तियारपुर की घटना प्रदेश में आई चर्चा में,
मोहम्मद इरफ़ान, आसिफ व अन्य पुलिस से लगा रहे इंसाफ की गुहार.#Bihar #Saharsa @SaharsaPolice pic.twitter.com/XrOFS8kkAb— Sudarshan News (@SudarshanNewsTV) July 10, 2026
ఇదీ చదవండి : 20 రోజుల్లోనే కొడుకు, తండ్రిని కోల్పోయాను : న్యాయం చేయండి!
కత్తులు, కర్రలతో దాడి
ఈ ఘర్షణకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అందులోని ఒక క్లిప్‌లో కొందరు వ్యక్తులు అతిథులపై కర్రలతో దాడి చేయడం, ఒక వ్యక్తి ఏకంగా కత్తి పట్టుకుని బెదిరించడం కనిపించింది. పెళ్లికూతురు కుటుంబ సభ్యులే తమ బరాత్‌లపై దాడి చేశారని పెళ్లికొడుకు తరఫు వారు ఆరోపించారు. ఈ గొడవలో గాయపడిన వారిని వెంటనే సిమ్రి బక్తియార్‌పూర్ సబ్-డివిజనల్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
ఇదీ చదవండి: ఆటోమొబైల్ దిగ్గజం వోక్స్‌వ్యాగన్ వినూత్న ప్రయోగం : 100 గొర్రెలతో..!


