ఉద్యోగం లేదు, ఎలాంటి వేతనం లేదు..!దర్జాగా స్విట్జర్లాండ్‌లో.. | Indian woman shared how she lived in Switzerland for 6 months without a job | Sakshi
Sakshi News home page

ఉద్యోగం లేదు, ఎలాంటి వేతనం లేదు..!దర్జాగా స్విట్జర్లాండ్‌లో..

Jul 10 2026 2:44 PM | Updated on Jul 10 2026 2:48 PM

Indian woman shared how she lived in Switzerland for 6 months without a job

ఎలాంటి ఆదాయం లేకుండా ఏ ఒక్క పని కాదు కదా..బయటికి కాలు కదపడం కూడా కష్టమే. అలాంటిది ఈ మహిళ ఏకంగా అత్యంత ఖరీదైన స్విట్జర్లాండ్‌ దేశంలో బేషుగ్గా బతికేస్తోందామె. కార్పొరేట్‌ ఉద్యోగం లేకుండా అలాంటి దేశంలో నివశించడం అంటే..అత్యంత హాస్యాస్పదం, నమ్మశక్యం కానీ విషయం. కానీ ఈ భారత సంతతి మహిళ హ్యాపీగా లైఫ్‌ని లీడ్‌ చేస్తున్న ఉదంతం వింటే..ఔనని అంగీకరిస్తారు. మరి ఆమె దాన్ని ఎలా సాధ్యం చేసిందంటే..

భారత సంతతి మహిళ స్నేహ గౌర్‌ తాను కార్పొరేట్‌ ఉద్యోగం లేకుండా ఆరు నెలలపాటు స్విట్జర్లాండ్‌లో ఎలా గడపగలిగిందో పంచుకుంది. చాలామందికి ఆర్థిక భద్రత అనేది పూర్తికాలపు ఉద్యోగంతో ముడిపడి ఉంటుంది. కానీ ఒక భారతీయ కంటెంట్‌ క్రియేటర్‌ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దేశాలలో ఒకటైన స్విట్జర్లాండ్‌లో ఏ కంపెనీలో పనిచేయకుండానే ధీమాగా స్పెండ్‌ చేస్తోంది. అంతకుముందు తాను ఒక కార్పొరేట్‌ ఉద్యోగంలో నెలకు సుమారు రూ. 45,000 సంపాదిస్తున్నప్పటి నుంచి తన ప్రయాణం ప్రారంభమైందని అన్నారు. డిగ్రీ సంపాదించడం, జీతం తీసుకోవడం, ఉద్యోగం సంపాదించడం,తదుపరి ప్రమోషన్‌ పొందడం వంటివే అతిపెద్ద విజయాలుగా భావించానని చెప్పుకొచ్చింది. 

కానీ కాలక్రమేణ స్వేచ్ఛగా బతకడమే అసలైన జీవితం అని తెలిసి వచ్చింది. ముఖ్యంగా తాను ఎక్కడ నివశించాలో ఎంచుకునే స్వేచ్ఛ, ప్రయాణించే స్వేచ్ఛ, నచ్చిన విషయాలపై పనిచేసే స్వేచ్ఛ ఉంటేనే లైఫ్‌ అని గ్రహించానని అంటోందామె. అందుకే స్పానిష్‌ నేర్చుకోవడంపై పెట్టుబడి పెట్టి..చివరికి ఆ నైపుణ్యమే తన జీవిత గమనాన్ని మార్చేసిందని చెబుతోంది. ఆ భాష ఆమెకు స్పెయిన్‌కు వెళ్లడానికి, అంతర్జాతీయ అనుభవాన్ని పొందడానికి ఉపకరించిందని పేర్కొంది. 

అదే క్రమంగా ప్రపంచవ్యాప్తంగా కనెక్ట్‌ అయ్యేందుకు అవకాశాలు కల్పించింది. ఏళ్ల తర్వాత ఆ నైపుణ్యాన్ని ఒక వ్యాపారంగా మార్చుకున్నట్లు వెల్లడించింది. అలా క్రమంగా తన ఆదాయ మార్గాలను విస్తరింపచేయడంతో శాలరీపై ఆధారపడాల్సిన అవసరం రాలేదంటోంది. అందువల్లే తనకు స్విట్జర్లాండ్‌కు వెళ్లినప్పుడూ కంపెనీ జీతంపై ఆధారపడలేదని అంటోంది. జస్ట్‌ ఒక ల్యాప్‌టాప్‌, రిమోట్‌ టీమ్‌ సరిపోయాయని చెబుతోంది. 

కొన్నిసార్లు మన జీవితాన్ని మార్చేది కేవలం ప్రమోషన్‌ కాదని అది ఒక నైపుణ్యం కూడా అంటూ పోస్ట్‌ని ముగించింది. అందుకు సంబంధించిన వీడియో తోపాటు క్యాప్షన్‌లో గౌర్‌ ఇలా రాసుకొచ్చారు. ‘ఆఫీసు లేదు.. బాస్ లేరు.. అనుమతి అంతకన్నా అవసరం లేదు’ అయినా స్విట్జర్లాండ్‌ హాయిగా నిద్రపోగలను అని రాసి మరి వీడియోని పోస్ట్‌ చేసింది. అలాగే తాను స్పెయిన్‌లో ఉన్నప్పుడే ఒక వ్యవస్థను రూపొందించుకున్నానని, అది తనకు నచ్చిన చోట నివశించే స్వేచ్ఛను అందించిందని తెలిపింది. నిజంగా సాధించదగిన స్వేచ్ఛ అంటే ఇదే అని చెబుతుండటం విశేషం. 

 

(చదవండి: 14 ఏళ్ల వయసులో టాయిలెట్‌ క్లీనింగ్‌.. ఇప్పుడేమో మార్స్‌ మిషన్‌కు లీడర్‌!)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement