క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లిన స్విట్జర్లాండ్‌ | Switzerland Edge Colombia On Penalties To Reach First World Cup Quarterfinal Since 1954, Check More Details Inside | Sakshi
Sakshi News home page

క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లిన స్విట్జర్లాండ్‌

Jul 8 2026 8:09 AM | Updated on Jul 8 2026 9:59 AM

Switzerland kick Columbia out of world cup and fly to quarter finals

ఫిఫా వరల్డ్‌కప్‌లో స్విట్జర్లాండ్ జట్టు చరిత్ర సృష్టించింది. 2026 ఎడిషన్‌ రౌండ్‌ ఆఫ్‌ 16లో కొలంబియాపై పెనాల్టీ షూటౌట్‌లో 4-3 గోల్స్‌ తేడాతో గెలిచి, 72 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. కెనడాలోని వాంకూవర్‌లో జరిగిన ప్రీక్వార్టర్ పోరులో నిర్ణీత 90 నిమిషాలు, అదనపు సమయం ముగిసే వరకు ఇరు జట్లు గోల్ చేయలేకపోవడంతో మ్యాచ్ 0-0తో సమంగా ముగిసింది. అనంతరం జరిగిన పెనాల్టీ షూటౌట్‌లో స్విస్ జట్టు  నెగ్గి చరిత్ర సృష్టించింది.

షూటౌట్‌లో కొలంబియా తరఫున డేవిన్సన్ సాంచెజ్ కొట్టిన పెనాల్టీ క్రాస్‌బార్‌ను తాకగా, కుచో హెర్నాండెజ్ తీసిన షాట్‌ను స్విస్ గోల్‌కీపర్ గ్రెగర్ కోబెల్ అద్భుతంగా అడ్డుకున్నాడు. చివరగా రూబిన్ వర్గాస్ విజయవంతంగా పెనాల్టీని గోల్‌గా మలచడంతో స్విట్జర్లాండ్ క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. క్వార్టర్ ఫైనల్లో స్విట్జర్లాండ్ డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాతో తలపడనుంది.

ప్రపంచకప్‌లో స్విట్జర్లాండ్ ఒకే టోర్నీలో రెండు నాకౌట్ మ్యాచ్‌లు గెలవడం ఇదే తొలిసారి. 1954లో స్వదేశంలో జరిగిన ప్రపంచకప్ తర్వాత మళ్లీ క్వార్టర్ ఫైనల్ చేరడం కూడా ఇదే మొదటిసారి. మరోవైపు 2014 తర్వాత రెండోసారి క్వార్టర్ ఫైనల్ చేరాలన్న కొలంబియా ఆశలు అడియాశలయ్యాయి. 2018లో ఇంగ్లండ్ చేతిలో పెనాల్టీ షూటౌట్‌లో ఓడిన కొలంబియా, ఈసారి కూడా అదే విధంగా నిష్క్రమించింది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement